tel-7
tel-7
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
చాలారోజుల తరువాత ఇవాళ టి . వి . లో అందమైన అనుభవం సినిమా చూసాను . అప్పట్లో గొప్ప మ్యూజికల్ హిట్ ఈ సినిమా . కమలహాసన్ , జయప్రద , రజనీకాంత్ ఇందులో ప్రధాన పాత్రలు . మాములుగానే నాకు అప్పట్లో కమలహాసన్ అంటే పిచ్చ అభిమానం . ఈ సినిమా పాటలు గూడ బాగుండటంతో ఎప్పుడు చూసినా ఈ పాటలే వింటూ వుండేదాన్ని . అన్నీ కంఠతా కూడా వచ్చేవి ( అప్పట్లో ) . 1979లో విడుదలైందనుకుంటా ఈ సినిమా . ఎం . ఎస్ విశ్వనాథన్ సంగీతం . బాలు , సుశీల , జానకి , ఎల్ . అర్ . ఈశ్వరి పాడారు . ఇందులో " అందమైన అనుభవం " అని ఒక పాట ఉంటుంది . ఈ వాక్యం తప్పితే మిగతా పాట అంతా హమ్మింగే , బాగుంటుంది . ఆ సంవత్సరమే కమలహాసన్ ది సొమ్మొకడిది సోకొకడిది సినిమా కూడ వచ్చింది , అందులో కూడా పాటలు బాగుంటాయి . ఈ సినిమాలో రజనీకాంత్ ది అంత ప్రాధాన్యత లేని పాత్ర అయినా గుర్తుండిపోతుంది . ఇందులో తన ఊతపదం శివశంభో . జయప్రద మాత్రం ఈ సినిమాలో తను మాములుగా కనిపించేంత అందంగా కనిపించదు . బహుశా హేరుస్టైలు , డ్రెస్సు కారణం కావచ్చు . చివర్లో తన డైలాగు - - - - " చావు కూడా ఒక అందమైన అనుభవమే " అప్పట్లో అర్థం కాలేదు కానీ ఇప్పుడు నిజమే కదా అనిపిస్తుంది . పాటలు మాత్రం అన్నీ ఆణిముత్యాలు అనవచ్చు ( నా వరకు ) . కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు . . వెర్రెక్కి ఉన్నోళ్ళు . . . . ఈ పాట అప్పట్లో మంచి పాపులర్ పాట . ఇంకా ఇందులో హలో నేస్తం బాగున్నావా , నువ్వే నువ్వమ్మా నవ్వుల పువ్వమ్మా , శంభో శివశంభో , ఆనంద తాండవమే పాటలు కూడా చాలా బాగుంటాయి . మొన్నీ మద్య హాపీడేసు పాటలు వింటుంటే అందులో సాయోనార అని ఒక పాట వస్తుంది , అది విని ఈ సినిమాలోని సాయొనారా పాటని తలుచుకున్నాను , అంతలోనే ఈ రోజు తేజ వాడు సినిమానే వేసాడు . అన్నట్లు నిన్ననే చందమామ సినిమాలోని పాటలు శ్రద్దగా విన్నాను , అన్నీ బాగానే అనిపించాయి , పర్వాలేదు . కానీ పంటి కింద రాళ్లలాగా అక్కడక్కడ తెలుగు ఉచ్చారణా దోషాలు . ముఖ్యంగా " నాలో ఊహలకు నాలో ఊసులుకు అడుగులు నేర్పావు " పాట పాడిన గాయనీమణి ఎవరో తెలియదు కానీ నేర్పావు అన్న మాటలో పావుని పావుకిలో లో పావులా ఉచ్చరిస్తుంటే చెవులలో సీసం పోసుకోవాలినిపించింది . మరీ భాషని ఇంతలా చావగొట్టాలా అనిపించింది ! ! ! ! !
ఎందుకంటారా మా యింటిలో అందరూ ఈ నీట్ నెస్ కోసమై నా వల్ల పీడింపబడుతున్న బాధితులన్నమాట . అదేమి పాపమో , భగవంతుడు నన్ను ఇలా ఎందుకు పుట్టించాడో నాకు తెలీదు , ఇలా అంటే , ఎందుకేమిటీ మమ్మల్ని పీడీంచేందుకే అని టక్కున సమాధానం చెబుతారు . అసలు ఈ శుభ్రత అన్నది కూడా ఒక రోగమని అంటారట . అదంతా నాకు తెలీదు కాని పనిమనిషిని పెట్టుకోకుండా నేనే పనులు చేసుకుంటాను . చిన్నయిల్లే కదా , చీపురుతో తుడవడం , తడిబట్టతో తుడవడం , గిన్నెలు తోముకోవడం , బట్టలు ఉతుక్కోవడం , అన్ని చేసుకోవడం , నడుంనొప్పికి మందులేసుకోవడం , మూవ్ రాసుకోవడం , బయటనుంచి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోమనడం , కాళ్ళు సరిగా తుడుచుకొని రమ్మనమనడం , హయిగా రోజూ ఇస్త్రి బట్టలు వేసుకోమ్మనమనడం , అన్నం తిన్న తరువాత , కంచంచుట్టూ పడ్డ మెతుకులు , ఓపిగ్గా కూరలోంచి ఏరిన పచ్చిమిర్చి , అల్లం , కరివేపాకు పక్కనే వున్న చిన్నగిన్నెలో వేయమనడం , అవి డస్టుబిన్ లో వేసి కంచం వాష్ బేసిన్ లో పెట్టమనడం , సోఫాలలో కూర్చున్నపుడు కుషన్లు వాటి చోటులోనే వుంచండీ అనడం , ముఖ్యంగా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ సోఫా మీద వేస్తారే వెనక్కాల అవీ పూర్తిగా కిందకిపడిపోయేలా కూర్చోవడం , సెంటర్ టేబుల్ మీద పెట్టినవి తీసిచేతిలో పట్టుకోవడం , కర్టెన్లకి చేతులు తుడిచేయడం , పుస్తకాలు చదివి వాటిని అలాగే బోర్లా పెట్టెయడం , లేకపోతే పేజి మడతపెట్టేయడం , మంచంమీద తరగడాలు అటూ ఇటూ పడేయడం , యిదుగో యిలాంటి విషయాల్లోనే వస్తుందినాకూ మా యింట్లో వాళ్ళకీను - - - -
బాష రాకపోతే వ్యాపారం కష్టమే . తాడేపల్లిగూడెం సంతకి చత్తీస్ గఢ్ నుంచి కూడా చింత పండు వస్తుంది . శ్రీకాకుళం మార్కెట్ కి బళ్ళారి మార్కెట్ నుంచి కూడా ఉల్లిపాయలు వస్తాయి . దండకారణ్యం , బళ్ళారి ప్రాంతాలలో కూడా తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి . హిందీ రాని ఆంధ్రా వ్యాపారికి డిల్లీకో , పంజాబ్ కో సరుకు ఎక్స్పోర్ట్ చెయ్యమంటే చెయ్యడం కష్టమే .
ప్ర : మీకు " మొపాసా " అంటే చాలా ఇష్టమని చెప్పారు కదా . ఎపుడూ ఆ స్ఫూర్తితో కథలు రాయటానికి ప్రయత్నించలేదా ? కవిత్వమొక్కటే ఎందుకు రాస్తారు ?
ఆశ్రయం కోసం వెతుకుతున్న చాతకాలకి ఆ ఆహ్వానం పరమానందాన్ని కలిగించింది . కాని ధీరులు సర్వకాల సర్వావస్థలయందు తమ స్వాభావిక సద్గుణాలను విడిచిపెట్టరు . " ఈ వృక్షం మొదటి స్వాతి వాన చినుకులతోనేనా పుట్టినది ? " అని అడిగి కాదు అని తెలుసుకోని ముందుకుసాగిపోతున్న ఆ చాతకాల దీక్ష చూసి విభ్రాంతిచెంది " ఔరా ! " అని ముక్కున వ్రేలిడికొని చూశారా పిల్లలూ దీక్షా రూపం అని కళ్ళతోనే సైగచేసి బోధించింది తల్లి పక్షి పిల్లలకు .
" పదిహేడుగురు తల్లులు / కదలకుండా కిటికీల వద్ద నిల్చోని కంటనీరు పెడుతున్నరు / కాళరాత్రి తెలంగాణలో కటిక చీకటిని పూసింది " ( ఉద్యమ గీతాలు - పుట . 158 )
ఆర్య , సందర్భము లేని వాఖ్యను ప్రచురిస్తున్నందుకు క్షమించగలరు . ఈ తెలుగు బ్లాగు లోకములో మేము కూడా ఒక చర్చా వేదికను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము . ఈ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని రాజకీయాలు ఉన్నాయో , తెలుగు బ్లాగు లోకములో కూడా అన్ని రాజకీయాలు ఉన్నాయని మేము భావిస్తున్నాము . మీరు ఎప్పుడన్నా ఈ తెలుగు బ్లాగు లోకములో చర్చా వేదిక కావాలంటే మా బ్లాగు ఉపయోగించుకోవచ్చు . మా దగ్గర స్వేచ్చ బాగా ఎక్కువ . మేము చాలా లిబరల్ . మీరు ఎప్పుడన్నా , ఎవడితో అయినా కెలుకుడు ( వాదన ) మొదలు పెట్టాలి అనుకుంటే మా బ్లాగుని ఉపయోగించుకోగలరు . మేము కావాల్సిన ఫ్యూయల్ అందించగలము . మా బ్లాగు http : / / appi - boppi . blogspot . com / ఇట్లు , సదా మీ సేవలో , మీ అప్పి - బొప్పి
ఒక గొప్ప నాయకుడు కెన్నడి . అనుమానం లేదు , కాక పోతే తన చిరకాల స్నేహితమైన క్లింటన్ ను వదిలి ఒబామా ను సమర్ధించినప్పుడు కొంచం ఆశ్చర్య మేసింది , ఈ రోజు బోస్టన్ నగర వీధుల్లోకి ఆఖరి సారి గా వస్తున్నాడు అని NPR లో చెపుతుంటే అదోలా అనిపించింది , ఎన్ని సార్లు వచ్చి వుంటాడు ఆయన , ఎంత అనుభవం ఎన్ని జ్ఞాపకాలు , ఆలోచనలు ఐపోయింది కదా ఆ శకం అని . ఏమి చెయ్యలేము అనుకోండి . కాలానికి ఐతే ఎదురీదలేము కదా
1944లో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన భువనగిరిలో జరిగిన సభ యువతను ఉత్తేజపరిచింది . పోరాటంలోకి దుమికేటట్లు చేసింది . ఈ ప్రభావంతోనే తిరునగరి రామాంజనేయులు పోరాటంలోకి వచ్చి పాట రాశారు .
ఇలా మనం అన్నీ ఒక్కోటిగా పరిగణలోకి తీసుకునే కొద్దీ వాటి ప్రభావం పెరుగుతుంది ( భూమి ఆకర్షణ దాదాపు 10 కదా మరి ) . అంటే ఎక్కడో వున్న గ్రహాల కన్నా మన చుట్టు ఉన్న పరిసరాల ప్రభావమే మన మీద ఎక్కువ ఉన్నప్పుడు , వీటిని పరిగణలోకి ఎందుకు తీసుకొనరు జాతకంలో ?
అన్నట్లు , మీరు ఇక్కడ ఇచ్చిన ఎంపీ3 లంకె పని చేయడం లేదు !
" పందొమ్మిదవ శతాబ్దపు చివరి భాగానికి తెలుగులో ముద్రణ బాగా అమలులోకి వచ్చింది . అయితే అచ్చుయంత్రం కేవలం ఒక సౌకర్యంగా , ఒక మంచి ఉపకరణంగా ఉండి వూరుకోబోవడం లేదు . అది అక్షరాస్యులైనవారి సాహిత్యాన్నంతటినీ సమూలంగా మార్చివెయ్యబోతోంది . పద్యం వినేవారికి బదులు చదువుకునేవారు ఏర్పడబోతున్నారు . పైకి చదివే అలవాటు అవసరం అయిపోబోతోంది . కావ్యానికి సామాజిక ఆస్వాదన పోయి , వైయక్తిక ఏకాంతంలో పుస్తకాలు చదువుకునేవారు ఏర్పడబోతున్నారు . పుస్తకాలు సులభంగా దొరుకుతాయి కాబట్టి పద్యాలు ధారణ చెయ్యవలసిన అవసరం ఇక వుండదు . కవిత్వం రాయడానికి కాగితాలూ కలాలూ వచ్చాయి కాబట్టి నోటితో పద్యరచన చెయ్యడం అనవసరం . తెలుగుసాహిత్య రంగంలో దాదాపు వెయ్యేళ్ళు గొప్పకళలుగా భావించబడినవి రెండు - నోటితో పద్యం రచించడం , అది మళ్ళీ నోటితో పదిమంది ముందు రాగయుక్తంగా చదవడం . ఈ రెంటికీ కాలదోషం పడుతున్న సందర్భంలో ఆ పరిస్థితి మీద ఒక అసంకల్పిత ప్రతీకారచర్య లాగా వచ్చింది తిరుపతివెంకట కవులతో ఆరంభమయిన ఆశు ( అవధాన ) కవిత్వం . "
భూసేకరణ జరుగుతున్నది 1894 నాటి భూసేకరణ చట్టం కింద . ఆ చట్టం ' ప్రజా ప్రయోజనం ' పేరుతో ప్రజల భూములనూ , ఇతర స్థిరాస్తులనూ సేకరించే అధికారం ప్రభుత్వానికిస్తుంది . అయితే ఏ అవసరం కోసమైతే భూమి సేకరిస్తున్నారో అది ' ప్రజా ప్రయోజనం ' కిందకి వస్తుందా , ఒకవేళ వచ్చినా మీ భూమికాక వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అనే విషయంలో అభ్యంతరం చెప్పే , ప్రత్యామ్నాయాలనూ సూచించే అవకాశం మీకు ఉంది . వాటి గురించి ఆలోచించమనీ , అభ్యంతరాలకు జవాబు చెప్పమనీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టగల అవకాశమూ మీకు ఉంది . Read the rest of this entry »
మన పవిత్ర పుణ్య భూమి అయిన భారతావనిలో యెందరో మహానుభావులు ఉండేవారు -
మీ సలహా వినడానికి బాగానే ఉంది . అమ్మా , ఇప్పుడైతే ఒకే కంప్యుటర్ కాబట్టి , రోజులో ఎంతో కొంత సేపైనా నాకు అది ఇచ్చి , ఎదో వండి పారేస్తూంది . ఆవిడకు విడిగా కంప్యుటర్ ఇస్తే నేను ఏ కర్రీ పాయింట్ నో నమ్ముకోవాలి ! !
12 అట్ల ఆ డిమాండ్స్ డే - మే డే ఒక బ్లాక్ డేగ నగర చరిత్రల నిలిచిపోయింది . తెల్లారి మే రెండున జంటనగరాలల్ల సంపూర్ణ హర్తాల్ , బంద్ జరిగింది . ఆ రోజు కూడా మళ్లీ అల్లర్లు జరిగినై . ఆ రోజు రాత్రి సికింద్రాబాద్‌ల జేమ్స్ స్ట్రీట్ నుండి ఓల్డ్ ఘాస్‌మండీకి పోతున్న పోలీసు వ్యాన్ మీద ఇద్దరు యువకులు బాంబులు విసిరితే ఒక జవాను అక్కడికక్కడే మరణించినాడు . వ్యాన్‌ల ఉన్న మిగిలిన వారు గాయపడినారు . నరేందర్ [ . . . ]
తను మాట్లాడిన రెండే రెండు మాటలు ఎటువంటి ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయో చూసేసరికి ఒక్కసారిగా నిలువు నీరయిపోయింది ఆమె .
వీటన్నింటికి కారణం మనకు ఆంగ్లంపై వున్న మక్కువనుకుంటున్నారా ? కానే కాదు . తల్లి తండ్రులు అంతకన్నా కాదు . అస్తవ్యస్తంగా వున్న విద్యా వ్యవస్థ , అరకొర జీతాలతో బతుకుతున్న ఉపాధ్యాయులు … అసలు తమకే సరిగా విద్య రాని ఉపాధ్యాయులు దీనికి ప్రధాన కారణం .
చెప్పడం నాకు ఇష్టం లేకపోయినా ఇంగ్లీషు సాహిత్యలో కీట్సు , షెల్లీ ల కవిత్వాన్ని ప్రచురణకర్తలూ . . సమీక్షకులూ ఎలా నిర్లక్ష్యం చేసారో వారి జీవితకాలంలో ఆయా కవులు ఎలా నిరాదరించబడ్డారో . . వెంకటేశ్వరావుగారికి తెలియదని నేను అనుకోను . అలాంటి రివ్యూదారులు ఒకలాంటి వాళ్ళైతే మరొకరకం . . చెత్తకవిత్వాన్ని పైకెత్తుకునే రివ్యూదారులూ . . అనువాదకులూను . ఉత్తమ కవులని పక్కకు పెట్టి వారి వారి వ్యక్తిగత కారణాలకి గానూ నాసిరకం రచయితలని ముందువరసలో చూపించిన పనిని అన్ని కాలాల్లోనూ పత్రికలూ చేసాయి . విమర్శకులూ చేసారు . అనువాదకులూ చేసారు . చేస్తున్నారు .
హాంకాంగ్‌లో డిస్నీల్యాండ్ , బుద్ధుని ఆలయాలూ , చారిత్రక ప్రదేశాలూ . . ఇలా చూడాల్సినవి చాలా వున్నాయి .
చాల చిన్ని సూచనలే కాని దైనందిన జీవితంలో ఎలా నేర్పుగా , సుఖంగా ఉండొచ్చొ చెప్పడనికి కొన్ని ఉదాహరణలు . .
తాడేపల్లిగారు చెప్పినదానితో నూఱు శాతం ఏకీభవిస్తున్నా . భాషాపరంగా చెయ్యవలసినదానికి ఆయన , ఇంకా ఈ రకంగా చేస్తే భాషకు ఉపయోగం ఉన్నది అన్న ఆలోచన ఉన్నవాళ్లు ఓ మార్గం చూపిస్తే అలాటి మార్గాలు తెలియని ఆ సాఫ్టువేరు ఇంజనీర్లు ఆ మార్గం పట్టుకొని తమతో పాటూ ఇంకా చాలామందిని ఆవైపుగా తీసుకెళ్లగలిగే పని చేయగలిగేవాళ్లూ చాలామందే ఉన్నారని ఈ భవదీయుడి అభిప్రాయం . కాబట్టి ఓ బ్లూ ప్రింటు సిద్ధం చెయ్యండి గురూగారూ . వీలు చిక్కించుకుని జనాలని తోలుకొచ్చి , ఆ తోలువలిచే బాధ్యత నెత్తికెత్తుకోడం పెద్దపని కాదనే నా నమ్మకం .
ఇక్కడీ జీవితమే అందంగా , ఆకర్షణీయంగా ఉంటుందని అమాయకంగా దాన్ని నమ్మించారు .
కిరానా ఘరానా మృదుత్వానికి పేరుపొందినది కాగా ఆగ్రా ఘరానా గానం బలవత్తరంగా , దూకుడుగా , రూక్షంగా ఉంటుంది . ఖంగుమని మోగే గొంతుతో ఎలుగెత్తి పాడుతున్న గాయకుడి బలమైన గమకాల విన్యాసాలతో సాగే పాటకు ఇది అనువైన శైలి . ఈ సంప్రదాయంలో గ్వాలియర్ పోకడలు కొన్ని మిగిలి ఉండడంతో కృతికి కొంత ప్రాధాన్యత ఉంటుంది . లయలోని గతులపై ( లయకారీ ) శ్రద్ధ పెట్టడం కూడా కనిపిస్తుంది . అందుచేత " అ " కారంలో కాకుండా , కృతిలోని సాహిత్యాన్నే లయబద్ధంగా మార్చి పాడడం ఈ శైలిలోని ప్రత్యేకత .
ముర్రే : వింబుల్డన్ చరిత్రలో బ్రిటన్‌ది ఒక ప్రత్యేకత . మొట్టమొదటి వింబుల్డన్ ఛాంపియన్ విజేత బ్రిటన్‌కు చెందిన ఫ్రెడ్ పెరీది . ఇది జరిగి ఇప్పటికి 75 సంవత్సరాలు కావస్తోంది . తాజాగా బ్రిటన్ ఆశలను నెరవేర్చే ఆటగానిగా వరల్డ్ నెంబర్ 4 స్థానంలో ఉన్న ఆండీ ముర్రే భుజాల మీదుంది మూడు సార్లు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ఫైనలిస్ట్ ఆండీ రాడిక్‌ను క్వీన్స్ సెమీఫైనల్లో 6 - 3 , 6 - 1 స్కోరుతో ముర్రే ఓడించాడు . ఫ్రెంచ్ ఓపెన్ సందర్భంగా చీలమండల గాయంతో మైదానానికి దూరమై సత్తా లోపించిందని అంతా అనుకుంటున్న సయమంలో అది అపోహని రుజువు చేశాడు .
నిత్యానంద , రంజిత ఫిర్యాదులతో సన్ టీవీ , దినకరన్ , నక్కీరన్పై కేసు
తిలక్ రాసిన ' గోరువంకలు ' ఛందోబధ్ధ కవిత్వ సంకలనం నుండి కొన్ని పద్యాలు ఈమాట పాఠకులకోసం …
లక్ష్మణుడు వదలి వెళ్ళిన సీతను వాల్మీకి మహర్షి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు . యమునా తీరంలోని మహర్షులు రాముడి వద్దకు వచ్చి లవణుడనే రాక్షసుడు బాధిస్తున్నాడని మొరపెట్టుకున్నారు . రాముడు శత్రుఘ్నుని పిలచి లవణాసురుని చంపమని పంపాడు . శత్రుఘ్నుడు వెళుతూ దారిమధ్యలో వాల్మీకి ఆశ్రమంలో తన వదిన సీత ఇద్దరు మగపిల్లలను కన్నదని విని సంతోషించాడు . లవణాసురుని పట్టణమైన మధూపఘ్నం చేరుకుని లవణాసురునితో తలపడి అతన్ని సంహరించాడు . తరువాత ఆ యమునా తీరంలో మధుర అనే సుందర నగరం నిర్మించాడు .
ఇరవై నాలుగ్గంటల్లో మూడు సార్లు మేరు సమాన ధీరుని సాక్షాత్కారం భలే విచిత్రంగా జరిగింది . మాయామాళవ గౌళ రాగం , ఆది తాళం , త్యాగరాజ కృతి మేరు సమాన ధీర , వరద , రఘు వీర , జూతము రారే , మహా . . మేరు సమాన సార సార వయ్యారపు నడలును నీరద కాంతిని నీ ఠీవినీ . . మేరు సమాన అలకల ముద్దును , తిలకపు తీరును తళుకు చెక్కిళ్ళచే తనరు నెమ్మోమును గళమున శోభిల్లు కనక భూషణములు దళిత దుర్మానవ , త్యాగరాజార్చిత . . మేరు సమాన తన ఇష్టదైవమైన శ్రీరాముని సౌందర్యాన్ని వర్ణించే కృతుల్లో త్యాగరాజు పరవశంతో ఒళ్ళు మరిచిపోతాడేమో ననిపిస్తుంది . ఇటువంటి పరవశమే నను పాలింప ( మోహన ) , బాల కనక మయ చేల ( అఠాణా ) , అలక లల్ల లాడగ ( మధ్యమావతి ) వంటి కృతుల్లోనూ కనిపిస్తుంది . అవును మరి , ఆయన మనోనేత్రానికి విందు చేస్తున్నది సాక్షాత్తూ శ్రీరామచంద్రుడే . ఆహా ! ఏమి ఆ మహానుభావుని వీర శృంగార రూపము ? ఎటువంటి ఉపమానాలు , ఉత్ప్రేక్షలు సరిపోతాయి ఆ రూపాన్ని వర్ణించడనికి ? మేరు సమాన ధీరుడు , ఆపన్నులకు వరదుడు , రఘు వీరుడు , నీల మేఘ శ్యాముడు . . ఆ నడకలో వయ్యారమేవిటి , ఆ ముంగురుల ముద్దేవిటి , తిలకం తీర్చిన తీరేవిటి , జోడద్దాల్లా మెరిసిపోతున్న చెక్కిళ్ళ తళుకేవిటి , ఆ ఆభరణల మెరుపులేవిటి . . అబ్బబ్బ . . చెప్పనలవి గాదనుకో . పోనీ ఇంత అందంగా ముద్దుగా ఉన్నాడంటే బాలుడనో , ఆడంగి వాడనో అనుకునేవు , పొరబాటు సుమా ! దుర్మానవుల్ని దండించిన వాడు , త్యాగరాజార్చితుడు , ఈ మేరు సమాన ధీరుడు ! వొట్టి మాటలేం సరిపోతాయి ఆ సౌందర్యాన్ని చెప్పేందుకు ? అక్కడే ఉంది త్యాగరాజు కృతుల్లో తమాషా అంతా . . మాటల్లో చెబుతున్నదాని ఫలితాన్ని వెయ్యింతలు అతిశయింప చేస్తూ స్వర గతుల శిఖరాలమీది కెక్కించి , సంగతుల జలపాతాల్లోకి దూకించి , మూర్చనల సెలయేళ్ళ వెంబడి పరిగెత్తించి మనసుని ఒక్ఖ ఊపు ఊపేస్తాడు . చివరికి మనం చేతులెత్తి దణ్ణం పెట్టి " స్వామీ , అర్ధమైంది , మీరేం వర్ణిస్తున్నారో మాకు అర్ధమైంది " అనేలా చేస్తాడు . మాయామాళవగౌళలో ఒక సన్నటి విషాదపు జీర ఉంటుంది . కానీ ఆ విషాదపు ఛాయ ఈ కృతిలో ఎక్కడా లేశమాత్రం కూడా వినిపించదు . అంతా సౌందర్యమే , అంతా ఆనందమే . బాల కనకమయ చేల కృతిలో కీర్తిస్తున్నది బాల రాముణ్ణి . . అందుకే ఆ కృతిలో ఒక కుర్రతనపు ఉత్సాహం గంతులు వేస్తుంటుంది . తానెంతగానో ఎదురు చూడగా , వేడుకోగా తన దేవుడు కరుణించి కనిపించాడే అన్న ఒక తత్తరపాటు కనబడి , కరిగి నీరైపోతున్న భక్తుడి గొంతు వినిపిస్తుంది ననుపాలింప కృతిలో . ఈ కృతిలో అటువంటి మనోవికారాలేమీ లేవు . ఎదురుగా ఉన్నది మేరు సమాన ధీరుడైన రాముడు . మేరు పర్వతం పర్వతాలన్నిటిలోకీ ఎత్తైనదీ , పెద్దదీ , పవిత్రమైనది కూడా . పల్లవిలోనే ఆ మేరువుని తలుచుకుంటూ , మళ్ళీ మళ్ళీ ఆ ధీరత్వాన్ని మననం చేసుకుంటూ త్యాగయ్య పాట పొడుగునా ఒక ఉదాత్త గంభీర భావాన్ని పలికిస్తాడు . ఎవరెస్ట్ శిఖరాన్ని కానీ , కైలాస శిఖరాన్ని కానీ దర్శించిన వారికి కలిగే అనుభూతి కలిగిస్తాడు . నిన్న పొద్దున ఆఫీసులో ఏవో ఇంజనీరింగు డ్రాయింగులతో కుస్తీ పడుతున్నాను . చేతికి దొరికిన కేసెట్టొకటి ( నా దగ్గరున్న భారతీయ సంగీతమంతా ఇంకా కేసెట్ టేపుల్లోనే ఉంది ) వాక్ మేన్‌లో తగిలించి వింటున్నాను . ఎప్పుడో 1995లో క్లీవ్‌లాండ్లో ఆరాధనోత్సవ సందర్భంలో హైదరాబాదు సోదరులు ( డి . రాఘవాచారి , డి . శేషాచారి ) చేసిన కచేరి . హాలులో చేతులో వాక్‌మేన్ రికార్డరుతో స్పీకరు ముందు కదలకుండా కూర్చుని నేనే రికార్డు చేసుకున్నానది . మూడో పాటగా కొద్ది పాటి ఆలాపనతో పాడారు . ఈ సోదరులతో పెద్ద తలకాయనొప్పి ఇన్నాళ్ళైనా వాళ్ళకి సాహిత్యం నోటికి రాకపోవడం . . పుస్తకం చూస్తూ పాడ్డంలో పల్లవిలోనూ అనుపల్లవిలోనూ పడవలసిన నాలుగు సంగతులు ఎగిరిపోయినై . ఏదో , పాడేశాం అన్నట్టు ముగించారు . ఇంతలో మా అక్కయ్య చాట్‌లోకి వచ్చింది . ఏం చేస్తున్నావే అంటే చెన్నై సంగీత సభల కచేరీలు వింటున్నానంది . ఈవిడ హాయిగా ఉద్యోగానికి శలవ పెట్టేసి చెన్నైలో మకాం వేసింది కాబోలునని నాకు ఒక్క క్షణం భలే అసూయ కలిగింది . ఇంతలో అసలు విషయం చల్లగా చెప్పింది - ఎవరో పుణ్యాత్ములు ఈ సీజనులో జరిగిన కచ్చేరిలు చాలా వాటిని తమ గూట్లో పెట్టారని , తను ( మా అక్క ) ఊరు కదలకుండానే హాయిగా అన్నీ వింటోందని . సంగీతప్రియ నిర్వాహకులకు ఆ సరస్వతీ కటాక్షం సంపూర్ణంగా కలుగుగాక అని మనసులో అనుకుని చాట్ కట్టేసి ఆ గూడు తెరిచాను . మా అక్క రికమెండేషను మీద మొదట TNS కృష్ణ కచేరీ నొక్కాను . ఈ పిల్లగాడు ప్రముఖ విద్వాంసులు , పద్మభూషణ బిరుదాంకితులు శ్రీ మదురై టి ఎన్ శేషగోపాలన్ గారి కుమారుడు . మిత్రులెవరో చెప్పారు IIM alumnus అని . ఎంత చక్కగా పాడాడో ! ఆ ఎత్తుగడ , మెరుపుల్లాంటి భృగాలు గుప్పించడం , ఆ పద్ధతంతా అచ్చంగా వాళ్ళ నాన్న పోలికే . ఈ సభలో ఆయనకూడా ఉండి ఉంటే తప్పకుండా ఆ తండ్రి " పుత్రోత్సాహము " అనుభవించే ఉంటారు . ఉచ్చారణ కూడా చక్కగా స్పష్టంగా ఉంది . ఎటొచ్చీ తండ్రి బాణీని , కొండొకచో గొంతుని కూడా గుడ్డిగా అనుసరించడం కాక , త్వరలో తన స్వంత స్వరాన్ని అభివృద్ధి చేసుకుంటే మంచి గాయకుడిగా రాణిస్తాడు . ఆ వయసులో తండ్రి చేసినట్టే గొంతు వాడకంలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తోంది . దాన్ని కాస్త కంట్రోల్లో పెట్టుకోవాలి , లేకపోతే అన్యాయంగా అపస్వరాల పాలవుతాడు . అవన్నీ సరే గానీ ఈ పాట మాత్రం భలే గొప్పగా పాడాడు . మూడోది నా అభిమాన గాయకుడు సంజయ్ సుబ్రహ్మణ్యనం KSGSలో చేసిన కచేరి . విపులమైన ఆలాపనతో ముఖ్యాంశంగా పాడాడు . ఈయనకి కొంచెం మాటలు తేల్చేసే అలవాటుంది , కానీ నా అభిమాన గాయకుడు కదా , అందుకని క్షమించేశా ! తాజాకలం : ఇప్పుడే తెలిసిన వార్త . శ్రీ శేషగోపాలన్ గారికి చెన్నై మ్యూజిక్ ఎకాడెమీ వారు ఈ సంవత్సరం సంగీతకళానిధి బిరుదు అందించారట . కర్ణాటక సంగీత విద్వాంసులకి ఇది భారత రత్న కంటే అరుదైన , విలువైన సత్కారం . బిరుదు స్వీకరిస్తున్న శేషగోపాలన్ గారిని ఈ వారపు సరస్వతీపుత్రులు చిత్రంలో చూడవచ్చు .
పై అజ్ఞాత వేరే వాళ్ళ ఒంటేలు సంగతి తరవాత గాని ముందు నీ రొంటి సంగతి చూడు ముందు ఈడ కంపు కోడతంది
హైదరాబాద్ , జూలై 12 : ఆస్తుల వివరాలు వెల్లడించాలంటూ ప్రభుత్వం ఇచ్చిన నోటీసుపై సత్యసాయి ట్రస్టు స్పందించింది . ముందుగా తమకు నోటీసు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదంటూ సాయి ట్రస్టు వ్యాఖ్యానించినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో , సాయి ట్రస్టు ప్రతినిధులు ప్రభుత్వం అడిగిన మొత్తం వివరాలను సోమవారం అందించడం గమనార్హం . కొన్ని కిలోల బరువున్న పెద్ద పెద్ద ఫైళ్లను ట్రస్టు తరఫున అక్కడి ఆర్ధిక సలహాదారు స్వయంగా సచివాలయంలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి రమణాచారికి అందించారు . సభ్యుల ఫోన్ నంబర్ల నుంచి స్థిర చరాస్తుల వరకూ అన్ని వివరాలు కావాలంటూ ఇటీవల ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే . పది రోజుల్లో అన్ని వివరాలు సమర్పించాలని ప్రభుత్వం కోరగా , నాలుగు రోజుల అదనపు గడువు తీసుకుని ట్రస్టు వివరాలు అందించింది . ఈ వివరాలను ట్రస్టు కార్యదర్శి చక్రవర్తి సంతకంతో పంపించారు . కాగా వారు సమర్పించిన వివరాలను అన్ని కోణాల్లో అధ్యయనం చేసేందుకు కనీసం వారం పది రోజుల సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి . సత్యసాయి బాబా మరణించిన తరువాత ట్రస్టుపై అనేక విమర్శలు రావడం , ట్రస్టు సంపద తరలిపోతోందన్న ఫిర్యాదులు రావడం , కొడిగొండ చెక్‌పోస్టు వద్ద 35 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం తెలిసిందే . ఈ సొమ్ము ట్రస్టుకు సంబంధించినదేనంటూ అనంతపురం జిల్లా పోలీసులు వెల్లడించడంతో ట్రస్టు కార్యకలాపాలపై పలు అనుమానాలు తలెత్తాయి . ట్రస్టు కార్యక్రమాలపై దర్యాప్తు చేయించాలని వివిధ రాజకీయ పక్షాల నుంచి కూడా డిమాండ్లు రావడంతో చివరకు ప్రభుత్వం ట్రస్టుకు నోటీసులు జారీ చేస్తూ అన్ని వివరాలను పది రోజుల్లో అందించాలని ట్రస్టు కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు . ట్రస్టు పరిస్థితి , రోజు వారీ కార్యక్రమాలను నిర్వహించేందుకు ట్రస్టుకు సంక్రమించిన అధికారాలు , బ్యాంకు ఖాతాలు , పెట్టుబడులు , నిధుల బదిలీ , విదేశాల నుంచి వచ్చే విరాళాలకు సంబంధించి ప్రధాన వనరులు , గత ఐదేళ్లకు సంబంధించిన ఆర్ధిక గణాంకాలు , రికార్డులు , విదేశీ విరాళాలపై రిజర్వ్ బ్యాంకుకు , కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన వివరాలు , ఆదాయ పన్నుల శాఖకు సమర్పించిన రికార్డులు , తాజా ఆడిట్ వివరాలు , ఆడిటర్ల వివరాలు , వారి చిరునామాలు , ఫోన్ నంబర్లతో సహా అనేక అంశాలపై వివరాలు కావాలంటూ ప్రభుత్వం నోటీసులో స్పష్టం చేసింది . ఈ నేపథ్యంలో సోమవారం వివరాలను ప్రభుత్వానికి ప్రత్యేక ప్రతినిధి ద్వారా ట్రస్టు అందజేసింది . ట్రస్టు సమర్పించిన వివరాలు ఎంతవరకు వాస్తవమైనవి , అవి సక్రమంగా ఉన్నాయా ? లేదా ? అన్న అంశాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర అధికారులు సిద్ధమవుతున్నారు . వారు సమర్పించిన ఫైళ్లు ఎక్కువగా ఉండటంతో వాటిని అధ్యయనం చేసేందుకు మరికొంత సమయం పడుతుందని , తరువాతే వివరాలు చెప్పగలమని అంటున్నారు . ఇందులో ఆస్తులు , ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన అంశాలపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి . ట్రస్టుకు కొన్ని రాయితీలు ప్రకటించిన నేపథ్యంలో ట్రస్టు కార్యకలాపాలపై చర్యలు తీసుకునే అంశంపై పూర్తి అధికారాలు ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటాయని కొంతమంది అధికారులు వాదిస్తుండగా , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక సడలింపులు లభించిన నేపథ్యంలో జోక్యం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని మరికొందరు అధికారులు సంశయాన్ని వ్యక్తం చేస్తున్నారు . అయితే తెగించి ప్రభుత్వం నోటీసు ఇవ్వడం , దానికి కొద్ది జాప్యంతోనైనా ట్రస్టు స్పందించడంతో తాత్కాలికంగా ఈ చర్చకు తెరపడినట్టు కనిపిస్తోంది .
ఫలాపేక్షగలవానిచేతగాని , మఱియు అహంకారముతో గూడినవానిచేగాని అధిక ప్రయాసకరమగు కర్మ మేది చేయబడుచున్నదో , అది రాజసకర్మయని చెప్పబడినది .
చాన్నాళ్ళ క్రితం " రొటీను వెరైటీ " అని ఒక టపా రాసుకున్నా . అందులో రాసుకున్న నిర్ధారణ , నా విషయంలోనే ఇంత సత్యమని మాత్రం నేనస్సలు అనుకోలేదు . ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన మూడు వారాల శలవ రానూ వచ్చింది , ఐపోనూ ఐపోయింది . నేను ఈ శలవల్లో చేసేద్దామనుకున్న ఘనకార్యాలు మాత్రం , ఫ్లారిడాకి వెకేషను ట్రిప్పు వెయ్యడం తప్పించి , ఒక్కటంటే ఒక్ఖటి కూడా చెయ్యలేదు ! బయణ్ణించి ప్రేరణలూ వత్తిళ్ళూ లేకుండా ఘనకార్యాలు సాధించాలి అనుకునే వారికి చాలా క్రమ శిక్షణా , మనోనిగ్రహమూ ఉండాలి సుమా . నాకవి లేవని మరోసారి అనుభవంలోకి వచ్చింది . : ( సరే పోన్లే , ఏమీ చెయ్యని ఖాళీ సమయం కూడా అప్పుడప్పుడూ కాస్త అనుభవిస్తూ ఉండాలి అని సర్ది చెప్పుకుని , మళ్ళీ రేపణ్ణించీ ( ఇది ఆది వారం సాయంత్రం రాస్తున్నా ) రొటీనుకి రెడీ ఐపోతున్నా . మనం పెద్దగా ప్రయాస పడపోకుండానే కొత్త సంవత్సరం వచ్చేసింది , దానంతట అదే . కొత్త సంవత్సరం అనగానే ఠంచనుగా జరిగే జాతర . . ప్రతిజ్ఞలు . . అదే , న్యూ యియర్ రిసొల్యూషన్స్ . మొన్నెవరో మన బ్లాగర్లే అన్నారు . . New year resolutions are like government rules . . they are made to be broken అని : ) ఈ జ్ఞానోదయం నాకు ఎప్పుడోనే కలిగి ఈ ప్రతిజ్ఞలు చెయ్యడం మానేశా . కానీ , మొన్నటి జనవరి 1 కి ముందు ఒక రోజు రేడియోలో . . అసలు ప్రతిజ్ఞలు చేసుకోని వారితో పోలిస్తే , ప్రతిజ్ఞ చేసుకున్న వారు అధిక శాతంలో తమ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు . . అని ఒక ప్రముఖ మానసిక శాస్త్రవేత్తగారు చెప్పారు . ఉదాహరణకి ఒక జనాభాలో అందరూ బరువు తగ్గాలి అని అనుకుంటున్నారు , కానీ అందులోంచి ఒక వంద మంది మాత్రం కొత్త సంవత్సరంలో బరువు తగ్గాలి అని ప్రతిజ్ఞ చేసుకున్నారు అనుకోండి . ఈ వందమందిలోనూ సుమారు 43 - 46 మంది తమ లక్ష్యాన్ని చేరుకుంటున్నారట . ప్రతిజ్ఞ తీసుకోని మిగతా జనాభాలో లక్ష్యాన్ని చేరుకునేది 4 శాతం మించదుట . సరే ఐతే . . జయమ్ము నిశ్చయమ్మురా , ప్రతిజ్ఞల్ చేసుకొమ్మురా అని నేనూ ఎడా పెడా ప్రతిజ్ఞలు చేసి పారేశాను . కొత్త సంవత్సరంతో పాటు పుట్టింది పుస్తకం . నెట్ . . కొత్త సంవత్సరం ఐతే మనం శ్రమపడకుండానే పుట్టేసింది గానీ , ఈ సైటుకి పురుడు పోసేందుకు చాలా మంది చాలా శ్రమ పడ్డారు . వారం రోజులైనా వయసులేని ఈ బుజ్జి పాప అప్పుడే బోల్డన్ని మంచి మంచి వ్యాసాల్తో ముస్తాబై పోయి అలరారుతోంది . పుస్తక ప్రేమికులందరికీ ఒక మంచి ఆకర్షణగా ఎదుగుతుంది అనడంలో ఏం సందేహం లేదు . తెలుగు బ్లాగులనే మానస సరోవరంలో పుట్టిన ఇంకో జాతి కమలం ఈ పుస్తకాల గూడు . ఈమాట కొత్త సంచిక విడుదలైంది . ఓ లుక్కెయ్యండి . 1956 నించీ 2006 వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రని సమీక్షించుకుంటూ ఒక సమాచార , విశ్లేషణా గ్రంధం వెలువడింది . దీన్ని సెంటర్ ఫర్ డాక్యుమెంటేషన్ రిసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ ( CDRC ) వారు ప్రచురించారు . ఆంగ్లంలో , 568 పేజీలతో . . చరిత్ర , వ్యవసాయం , పరిశ్రమలు , మౌలిక సౌకర్యాలు , సామాజిక పరిణామాలు , విద్యా వైద్యా రంగాలు . . ఇత్యాది విషయాలపై , సుమారు నలభై విశ్లేషణాత్మక వ్యాసాలు , అనేక పట్టికలతో . . దేశంలో ఏం జరుగుతోంది అని , ఆషామాషీగా కాకుండా కొంచెం సీరియస్ గా పట్టించుకునే వాళ్ళందరి దగ్గరా ఉండాల్సిన పుస్తకం . మేలు ప్రతి రూ 895 . విద్యార్ధి ప్రతి రూ 225 . reachcdrc at yahoo dot com లేదా 040 - 6684 3495 ద్వారా కాపీలు పొందవచ్చు . హైదరాబాదు పుస్తకాల పండగలో మన బ్లాగర్లు ధనధన లాడించేశారు . ఆదివారం ( జనవరి 4 ) సాయంత్రం విజయవాడ పుస్తకాల పండగలో జరిగిన చిన్న ప్రదర్శన కూడా విజయవంత మైందని మా మామగారు చెప్పారు . ఎంతో శ్రమపడి ఈ విజయానికి కారకులైన అందరికీ పేరుపేరునా అభినందనలు . మరి ఇక్కణ్ణించి ఎక్కడికి ? ఇంకేమైనా చెయ్యగలమా మనం ? ఈ వేడి చల్లారకుండానే మన భవిష్యత్ ప్రణాళిక నిర్మించుకుందాం రమ్మంటున్నారు చదువరి గారు ఈతెలుగులో . మీ గొంతు కూడా కలపండి అక్కడ .
రెండెకరాల పొలానికి కంపనాటి కంచె కట్టుకున్నారు . జింకల , అడవి పందుల బెడదకు రక్షణ కవచం . కోడు కొట్టుకన్న కొత్త సాగు , వానదేవుడు కరుణిస్తే మంచి పంటే రావాలి మరి . కొత్తూరు రెడ్డి విత్తనానికి కావలసిన ముడిసరుకు , సేద్యానికి ఎడ్లు , యారముట్లు యంగమునికి సమకూర్చాడు . అంతో ఇంతో కూలీనాలీ చేసి కూడబెట్టుకున్న దాపరికం రెడ్డి దగ్గరే జమగా ఉంది . పాలేరునాటి యంగముని సేవల్ని రెడ్డి మరిచిపోలేదు . రెడ్డి భార్య సావిత్రికి రెండు మూడు చీరెలు తొడిగి విడిసినవి ఇచ్చింది . ఏనుగు పడుకున్నా గుర్రమెత్తు అంటారు . సావిత్రికి ముక్కుకు , చెవులకు సరుకు ఈ ఆమని కరుణిస్తే కొనిపెట్టాలని యంగముని మనసులో ఉంది . ఇరుసాలు మడకతో దున్ని మూల ఏసరబెట్టి గొర్రుదోలి , గుండకపాసి , మానుతో చదునుచేసి గుట్టతల్లికి సారల చీరె చుట్టినట్టు కనసొంపుగా సేద్యంచేసి తొలకరి వానలకు వేరుశనగ పంట పెట్టాలని యంగముని ఎదురుచూపు .
మీరు మరిన్ని రుచి కలిగిన పద్యాలని పరిచయం చెయ్యండి . మీకు నా అభినందనలు .
రాజు అనేవాడు ఎలా ఉండాలో రాయలవారు ఒక రాజుగా చెప్పడంలో ఏమీ విశేషము లేదు . ఐతే ఆ వర్ణనామాధురి అధ్బుతం . పై మూడు పద్యాల తర్వాత ఇంకా తెలుసుకోవాలంటే . . నీతి సారంలో ప్రతాపరుద్రుడు ఏమంటాడో చూద్దాము .
హితుఁడై , పలికించెడు స్నే - హితుఁడై , యలరించు సన్నిహితుఁడై నిలిచెన్ బతనమయెన్ గొడ్డలితో నతి వేదన నేడ్చుచుంటి నా తరుగిరికై 8
మిగిలిన భాగం అలా మేము గుర్రం బండీ మీద కొంత కాలం స్కూలుకి వెళ్ళేం . మహేశ్వరం మావయ్య పూలరంగడిలా సెంట్లు పూసుకుని హుషారుగా ఉండేవాడు . అతను తన భార్యతో కాక కాలవ గట్టు మీద వేరే ఇంట్లో ఉండేవాడు . ఆ వేరే ఆమెని బీబమ్మ అనేవాళ్ళు . ముస్లిం స్త్రీ అన్నమాట . మహేశ్వరం మావయ్య తన ఇంట్లో తన భార్యతో కాక బీబమ్మతో ఎందుకుండేవాడో అర్ధమయ్యే వయసు కాదు . కానీ హుషారుగ బండి నడపడం , మమ్మల్ని బండి లో ఎక్కించుకోవడం , మళ్ళి జాగ్రత్తగా తీసుకురావడంతో అతనంటే మాకు చాలా ఇష్టంగా ఉండేది . అతను తన భార్యను పట్టించుకోకపోవడమే కాక బాగా కొట్టేవాడని చెప్పుకునేవారు . ఇప్పుడు తలచుకుంటే అతనంటే అసహ్యంగా అనిపిస్తుంది కానినా చదువు కొనసాగడంలో , చదువు నా జీవితంలో తెచ్చిన మార్పులో అతని పాత్ర కూడా ఉందని ఖచ్చితంగా ఒప్పుకుంటాను . ఆ గుర్రం బండి , మహేశ్వరం మవయ్య అంటే అందుకే ఒకలాంటి అభిమానం . ఆడవాళ్ళ పట్ల జరిగే అమానుషాలు , దుర్మార్గాలూఎలా ఉంటాయో వాటి స్వరూపం ఆ రోజుల్లో అర్ధమై ఉంటే నేనతని బండి ఎక్కేదాన్ని కాదు . ఓ సారి మా బండి అదుపు తప్పి కాలువలో పడిపోయింది . నాకేమీ దెబ్బలు తగల్లేదు కానీ భారతి స్ప్రుహ తప్పి పడిపోయింది . మా పుస్తకాలన్నీ నీళ్ళల్లో పడిపోయాయి . చాలా రోజులవరకు మాకు పుస్తకాలు దొరకలేదు . " హిందు " లో మ్యూజింగ్స్ చదవగానే నాకిదంతా గుర్తుకొచ్చింది . దాదాపు నలభై ఏళ్ళనాటి మాట .
మోడి గుజరాత్ ని ఈ విధంగా ముందుకు నడిపిస్తుంటే …
తను కదిల్తే కారులో కూడ కదలిక కనపడొచ్చు . ఆ ట్రక్ లో వాళ్ళు తమ ప్రయత్నం విరమించుకుని పారిపోవచ్చు .
లింకన్ ఈసారి " నిను వీడని నీడను నేనే " అని నవ్వుతున్నట్లు అనిపించింది . పాటల్లా కూడా నవ్వొచ్చని అప్పుడే అర్థమైంది . అలా కళ్ళార్పకుండా అంత సేపు అతను ఎలా నన్ను తదేకంగా చూడగలుగుతున్నాడో అర్థం కాలేదు నాకు . కానీ , అతన్ని అడగాలన్నా , అటకాయించాలన్నా , పలకరించాలన్నా - ఏమి చేయాలన్నా కూడా నాలోని ఏ భాగమూ కదలడంలేదు . పక్షవాతం వచ్చినట్లు అయిపోయింది నాకు . స్నేహ లేస్తే లింకన్ నన్ను వదుల్తాడు అనిపించింది ఎందుకో గానీ . నేను లేపలేకపోతున్నా గనుక త్వరగా పొద్దున్నైతే బాగుండు అనిపించింది . పైగా . . దయ్యాలు పగళ్ళు కనబడవంటారు కదా . ఇతను వెళ్ళిపోతాడేమో అనుకున్నా .
ఎలాగూ అదే ఫీల్డ్‌లో వున్నాడు గనక ఉత్సాహపడ్డాడు . " మందగ్గర బోలెడు మంది హీరోయిన్
నియో రియలిసం అనే ఒక ప్రక్రియ చలన చిత్రాలల విషయంలో వింటూ ఉంటాం . దీని గురించి అంతర్జాతీయంగా చర్చించినప్పుడు ఎక్కువగా ఇటలీ గురించి కూడా వింటూ ఉంటాం . మన దేశం గురించి మాట్లాడినప్పుడు బిమల్ రాయి 1953 లో తీసిన ' దో బీఘా జమీన్ ' గురించి చెప్పకుండా ఉండలేము . ఈ చిత్రానికి ఎన్నో కీర్తి కిరీటాలున్నాయి . వాటి గురించి తరువాత చెప్పుకోవచ్చు . తెర తీద్దాం … ~ ~ ~ * * * ~ ~ ~ భూమిని తాకట్టు పెట్టిన చిన్న రైతు శంభు ( బల్రాజ్ సాహ్ని ) . జమీందారు దగ్గరకు వచ్చి ఒక పారిశ్రామిక వేత్త ఆ భూమిని ఎంచుకుని ఫాక్టరీ కడతానని చెబుతాడు . ఆ భూమిని ఇపించేందుకు శంభూని కోర్టుకి ఈడ్చి మూడు నెలలలో డబ్బు కట్టకపోతే భూమి వేలం అవుతుందని తేలుస్తాడు జమీందారు . డబ్బు సంపాదించేందుకు కోల్కటాలో శంభు , తన పిల్లవాడితో పడు కష్టాలు చిత్రం యావత్తూ కమ్ముకుంటాయి . చివరకు శంభు ఆ భూమిని వదులుకోవాల్సి వస్తుంది . ఇదేమి సినిమా ? నిజమే ! జాగ్రత్తగా ఆలోచిస్తే దర్శకుడు చూపించదలచుకుంది చాలా గొప్ప విషయం . భూమిని వదలను అని ఒక రైతు చెప్పి దేనికైనా సిధ్ధ పడటం . రెండు - అతని కుటుంబం ఇందులో అతని వెంటే నిలబడటం . మూడు , ఉన్న వాళ్ల ప్రపంచం ఎంత పీడించినా లేని వారి జగత్తు అతన్ని కలుపుకుని అడుగడుగునా సహాయం చేయటం . ఈ లేనివారి ప్రపంచం చూపించినప్పుడు అందులోని క్రౌర్యం కూడా బాధాకరంగా ముందుకొస్తుంది . కానీ అందులోనే మానవతా విలువలు కనిపిస్తూ ఉంటాయి . చివరకు ఒక కుటుంబం భూమిని వదులుకున్నా కుటుంబం గానే ప్రక్కగా వెళ్లిపోతుంది . శంభు తండ్రి ' భూమి పోతే ఏమయింది ? ఈ ప్రపంచం అంతా మన భూమే , ఆకాశమంతా మన ఇంటి పైకప్పే ' అని చాటుతాడు . కుటుంబం లోని బంధాలు అంత గొప్పవి . అది తెలిసిన వారికే ' వసుధైవ కుటుంబకం ' అనేది అర్థమవుతుంది . ~ ~ ~ * * * ~ ~ ~ చిత్రం వెనుక చిత్రీకరణలోని ఒక మర్మం దాగి ఉంది . ప్రారంభంలో ఒక కరవు పరిస్థితి , వెంటనే ఒక వాన జల్లు , జనంలో ఉత్సాహం , ఆ తరువాత శంభు సమస్య … ఇది సరళి . భూమి నాకేమిచ్చింది అని రైతు అడగడు . భూమి తల్లి . మనలను కని మోసే తల్లి . మనం భూమికి ఏమిచ్చామనేది అందరం వేసుకోవలసిన ప్రశ్న . అన్ని పోరాటాలూ భూమి కోసమే , రాజ్యం కోసమే ! ఇందులో పోరాడిన ప్రతివాడూ గెలుస్తాడు . పోరాటమే గెలుపు ! కొన్ని దృశ్యాలు కదిలిస్తాయి . బల్రాజ్ సాహ్నీ తోపుడు బండీని గుర్రం బండీతో సమానంగా వేగం చేయమని ఆసామి పోరటంతో పరుగులు తీసి పడిపోతాడు . విషయానికి అద్దం పట్టే ఘటనతో కథనాన్ని ముందుకు తోసుకుపోయినప్పుడు చరిత్ర లేచి నిలబడుతుంది , దటీస్ ప్రెసెంటేషన్ ! డబ్బులు లేనప్పుడు తండ్రి కడుపులో బాలేదు అని తినాం మానెస్తాడు . చిన్న పిల్లవాడు కూడా బయటకు తినటానికి వెళ్లినట్లే వెళ్లి నాకూ కడుపులో బాలేదని ఊరుకుంటాడు … శంభు భార్య ( నిరుపా రాయి ) భర్తకు ఉత్తరం వ్రాయిస్తున్న దృశ్యం ఎంతో సున్నితంగా చిత్రీకరించాడు దర్శకుడు . ఈటలీ చిత్రం ' ద బైసకల్ థీఫ్ ' లోని తండ్రీ కొడుకుల ఉదంతం బట్టి ప్రభావితమయినట్లు బిమల్ రాయి చెప్పి యున్నాడు . ప్రస్తుతం మన దేశం తన జి . డి . పీలో వ్యవసాయ రంగం ప్రాముఖ్యత తగ్గించుకుంటూ పోయి ఇతర రంగాలలోకి దూకేసింది . ఒక సారి ఈ చిత్రం చూసి ఆలొచించవలసిన అవసరం ఉందనిపించింది . ఆర్థిక విధానాల సంగతి ప్రక్కన పెడితే కనీసం భూమి పట్ల మనం చేస్తున్న అమానుషం , కాలుష్యం , దిగజారిన కుటుంబ వ్యవస్థలు , మరుగున పడ్డ విలువలు … ఇవన్నీ కరవులో భాగాలు అని బాధ పడవలసి వస్తుంది … ~ ~ ~ * * * ~ ~ ~
తర్వాత కిన్నెర నాట్యం , కిన్నెర గానం ఉన్నవి . మూడింటిలోనూ కొద్ది లయభేదంతో ఒకటే చందస్సు . నడకలు విసురుగా ఉండడంవల్ల నాట్యం బరువుగా తోస్తున్నది . కిన్నెర సంగీతంలో సమమైన తూకం కుదురిందని చెప్పవచ్చును . ఆమ్రేడితాల తరచుదనం నడకల్లోకంటే నృత్యంలోఎక్కువ రాణించదేమో ! ఒకే భావాన్ని సమర్ధుడైన కవి విసుగు పుట్టించకుండా ఎంతవరకు విస్తరించగలడో వీటిలో ప్రదర్శించబడ్డది . ఆంధ్రత్వం కుంభించుకున్న ఈ కవికి కిన్నెర జలదేవతల వెంట సాగిపోతే ఉన్నప్పుడు ; ' తెలుగు పాటలవెంట తీపి తోచిం ' దంటే ఆశ్చర్యం లేదు . కిన్నెర ప్రసరిస్తుంటే ' తెలుగు పిట్టలు ఒళ్ళు తెలియక పాడినై ! ' అట . ఏటికిన్నెర పాట ఎగిరెగిరి మిన్నందినప్పుడు ' తెలుగు వెలుగులు క్రమ్మె నేమో ' నట .
జనవరిలో పుట్టిన మా మనవడు చి . అగస్త్య తో కలిపి నాకు ' నవరత్న మాల ' తయారుచేయడానికి కారణం తనే కదా ! అసలు పెళ్ళే అవుతుందా అని అనుకున్న నాకు సమాజంలో ఓ స్థానం కలిగింది ఈవిడవల్లేగా . అయినా పాపం ఎవరుచెప్పినా ఫలానా ఫణిబాబు గారూ అంటారే కానీ తను ఓ ' అన్ సంగ్ హీరోయిన్ ' గానే ఉండిపోతుంది . అసలు విజయమంతా ఆవిడదే .
పెద్దమనిషి తన టోపీతీసి , తన మెడచుట్టూ ఉన్న పంచరంగుల శాలువా విప్పాడు . పెళ్ళయినవాళ్ళకు వారి భార్యలు అలాటి శాలువలు ఇవ్వటమేగాక వాటిని ఎట్లా కప్పుకోవాలో కూడా ఒకటికి పదిసార్లు చెబుతారు . బ్రహ్మచార్లకు ఈ సహాయం ఎవరు చేస్తారో నేను సరిగా చెప్పలేను , ఈశ్వరుడికే తెలియాలి .
వరంగల్ జిల్లాలోని రఘునాధ పల్లిలో నిన్న జరిగిన ఘటనలో ఓ యువకుడిని గ్రామస్థులు కాల్చి చంపిన వైనంలో నాకు తప్పేమీ కనబడలేదు . ఇలా ఆలోచించడం ఓ తీవ్రవాది ఆలోచిస్తున్నట్లు ఉంటే , నేనూ తీవ్రవాదినే . నిజమే , ఆ అబ్బాయి తప్పు చేసి ఉండవచ్చు , అయినంత మాత్రాన అతనికి ఇంత పెద్ద దండన వెయ్యడం అనే హక్కుని గ్రామస్థులు తమ చేతిలోకి తీసుకోవడం అనేది భరతీయ న్యాయ వ్యవస్థకు విరుద్దమే అని మీరంటే నా దగ్గర అందుకు ఎటువంటి స్పందన లేదు అలాగే వారి చర్యను సమర్దించేందుకు కావలసిన సరైన సమాధానం నా వద్ద లేదు . న్యాయ వ్యవస్థ పై మనకు ఉన్న గౌరవాన్ని తుంగలో తొక్కి న్యాయాన్ని తేల్చి శిక్షని విధించే హక్కుని తమ చేతుల్లోకి తీసుకున్నారు అంటే , దాని వెనకాల
నాయుడు గారు " పీపుల్స్ ఫ్రెండ్ " , " ఫెలో వర్కర్స్ " అను ఆంగ్ల పత్రికలకు సంపాదకత్వం వహించి సాంఘిక సమస్యల మీద ఉత్తేజకరమైన వ్యాసాలు వ్రాశారు .
' ఈయప్పే తన్నెందుకో చులకనగా చూస్తున్నాడు . ఎవరైనా తన పెళ్ళి విషయం ఎత్తితే తిక్కలోడి పంచాయితీగా కొట్టిపారేస్తున్నాడు . '
మాకు కూడా మీతో అలలపొడుగు కలిసింది . పనిలో పని - డెలివరీ హెడ్డుని ప్రసూతి తలకాయ చేసి పారేసి ఉండాల్సింది . శబాసో !
1929లో మిసిసిపీ పశ్చిమ తీరంలోనే మొట్టమొదటదైన ఆకాశహర్మ్యం ( స్కైస్క్రాపర్ ) ఫోషే టవర్ నిర్మాణం జరిగినది . జంటనగరాల అత్యంత ఎత్తైన నాలుగు ఆకాశహర్మ్యాలు మిన్నియాపోలీసులో ఉన్నాయి . ప్రస్తుతం వీటిలో ఖచ్చితంగా ఎత్తైనది ఏదో నిర్ణయించడంలో కొంత వివాదాలు ఉన్నాయి . మిన్నసోటా వాసులను విచారిస్తే చాలామంది ఐ డి ఎస్ సెంటర్ ఎత్తైనది అంటారు చాలా ఆధారాలు కారణంగా 225 సౌత్ సిక్స్ స్వల్పంగా , ఐ డి ఎస్ సెంటర్ కంటే ఎత్తైనదని భావిస్తున్నా 2005 ప్రారంభంలో ఐ డి ఎస్ సెంటర్ అగ్రభాగంలో ఉన్న 16 అడుగుల వాష్ గ్యారేజ్ తో చేర్చి అత్యంత ఎత్తైన భవనంగా గుర్తింపబడింది . ఐ డి ఎస్ సెంటర్ ఎత్తు 792 అడుగులు . 225 సౌత్ సిక్స్ స్వల్పంగా మరియు వెల్స్ ఫార్గో సెంటర్ ల మధ్య భేదం ఎత్తులో ఒకటి లేక రెండు అడుగులు మాత్రమే . ఐ డి ఎస్ పైన ఉన్న సమాచార గోపురం ( కమ్యూనికేషన్ టవర్ ) మిన్నియాపోలిస్ లోనే ఎత్తైనది అయినా నగరపురాలలో దీనికంటే ఎత్తైన టవర్స్ ఉన్నాయి .
ఆఖరి పల్లవి : మంగళవధువౌ గోదాదేవి పరిణయమాడెనులే రంగనాథుని ప్రణయదేవియై దేవేరిగ నిలిచెనులే !
అవునండి సుజాత గారు . మోసం , నేరం , ( అది కూడా నిరక్షరాస్యులని ) చేసే వారిని ఉతక్కుండా ఉండలేను .
అబ్బాయ్ ఇంకా ఎండమావులేంటి ? అది ఎప్పుడో చిన్నప్పటి కథ కదా ? అద్సరేగాని ఎలా ఉంది ? బాబాయ్
Update సమయం తెల్లవారి 3 : 15 . జూలార 60 గేట్లు తెరిచేసారు అట . శ్రీశైలం లో నీటి ప్రవాహం ఇప్పుడు 891 అడుగులకి చేరుకుంది ! ! ! ! శ్రీశైలం గరిష్ట ఎత్తు 885 అడుగులు . దేవుని మీద భారం వేసి సైట్ నుండి వెళ్ళిపోయారట ఇంజనీర్లు .
పంజాబ్ : డేవిడ్ హస్సీ , గిల్‌క్రిస్ట్ , దినేశ్ కార్తీక్ , చావ్లా , అభిషేక్ నాయర్ , ప్రవీణ్ , స్టువర్ట్ బ్రాడ్ , ర్యాన్ హారిస్ .
" బానే వుంది వినడానికి ! అయితే రేపు నన్ను కూర్చో బెట్టి , అభిషేకం చేస్తారన్న మాట , నువ్వూ , పిల్లలూ ! " అంది నవ్వుతూ .
అక్క కరిష్మాకి , నాకూ అమీర్ ఖాన్ కలిసొచ్చిన హీరో అనుకుంటా . ' రాజా హిందూస్తానీ ' కోసం అమీర్ కు జంటగా నటించిన అక్క అప్పుడు ఇదే అవార్డు తీసుకుంది . ఇప్పుడు నేను . ' త్రీ ఇడియట్స్ ' లో నన్ను సాధ్యమైనంత సహజంగా చిత్రీకరించారు . అమీర్ , నిజజీవితంలో ఎలా వుండటానికి . . . . .
వంశ చరిత్ర రాయడానికి చెయ్యాల్సిన పరిశోధన సాకుగా దేశదేశాలు తిరిగాడు . ఆ పర్యటనలని తన మేధోగత విషయాలకై వాడుకున్నాడు . కాని ఆ వంశ చరిత్ర రాయడమన్నది ఒక గుదిబండగానే తయారయ్యింది . రాజు లండన్ వెళ్ళినా లైబ్‌నిట్జ్‌ని హానోవర్ లోనే ఉండి తమ వంశచరిత్ర పూర్తి చెయ్యాలని ఆదేశించాడు . రాణి మరణం తర్వాత ఆదరణా తగ్గింది . చివరకి చనిపోయినపుడు సెక్రటరీ కి మించి అంత్యక్రియలకి హాజరైన వాళ్ళు లేరు ! తను స్థాపించిన అకాడెమీల నుండి ఎవరూ రాలేదు . చనిపోయిన యాభై ఏళ్ళ దాకా సమాధిని ఎవరూ అలంకరించిన పాపాన పోలేదు . " దేశానికే ఆభరణం లాంటివాడు , ఒక అనామకుడిగా మరణించాడు . "
ఒకప్పుడు వెయ్యి రూపాయల్లోనే అన్ని ఖర్చులూ పోగా ఇంకా కొంత డబ్బు దాచుకునేవాడిని . . ఇప్పుడు ఎంత వస్తే అంత ఖర్చు అన్నట్లుంది . . అసలు చేతిలో పైసా ఉండడంలేదు . ఒక్కొక్కసారి అనుకునేవాళ్ళం ఫలానా అతనికి నెలకు ఇంత సంపాదిస్తున్నాడంట . . ! , అంత డబ్బు ఎలా దాస్తాడో అని . . కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది . . ఎంత సంపాదించాం , ఎలా సంపాదించాం అని కాదు . . సంపాదించినది ఎంత తెలివిగా ఖర్చుచేస్తున్నాం అన్నది ముఖ్యం అని . వచ్చే డబ్బును బట్టి మన ఆలోచనలు కోరికలు ఉంటాయి . ఒకప్పటి రెండు రూపాయల బ్లేడు . . ఇప్పుడు రెండువందల రూపాయల జిల్లెట్ మ్యాక్ త్రీ షేవర్ అవుతుంది . మాములుగా తినే తిండి కాస్తా అనారోగ్యకరమైనదిగా తోస్తుంది . . చిన్న హొటల్స్ లో తిండి మాని కాస్ట్లీ రెస్టరెంట్ల మీద పడతాం . అందరూ త్రాగే మంచినీళ్ళు మంచివి కాదన్న అనుమానం మొలకెత్తి ఫిల్టర్డ్ వాటర్ బాటిల్స్ కొనుక్కుని త్రాగుతాం . కాస్త దూరానికే . . " ఆటో . . ! " , అని చక్కగా . . కడుపులో చల్ల కదలకుండా . . పనులు కానిస్తాం . నాలుగేసి జతల బూట్లు , రకరకాల దుస్తులు . . నైట్ డ్రస్సులు , పార్టీ వేర్ . షాపింగ్ వేర్ . . మార్నింగ్ వేర్ ఇలా అన్నీ బ్రాండడ్ వాటిపై కన్ను పడుతుంది . చీప్ వాటిపై చీప్ లుక్స్ వేస్తాం . అనవసరమైన షాపింగులు . . అవసరంలేకున్నా వస్తువులు వచ్చిపడతాయి ఇంటికి . మనకి ఇష్టముండక పోవచ్చు కానీ చూసే వాళ్ళకోసం ఈ ఖర్చులు అవీనూ . ఇదే టాపిక్ వచ్చింది నా కొలీగ్ కి నాకు ఒకసారి . . అతని పుట్టిన రోజుకని బట్టలు తీసుకోవడానికి బయలుదేరాం . వెళ్ళి చూసాకా అన్నీ రెండువేలు మూడువేలూనూ . . నేనన్నా " నాకు ఊరికే డబ్బులు వచ్చినా ఇంత ఖరీదైనవి కొనబుద్దికాదు బాబు . . " , అని . . " నేనూ అంతే … అలాగే అలోచిస్తా . . ఎంతైనా మిడిల్ క్లాసు మనస్తత్వాలుకదా ! ! " , అన్నాడు . . నవ్వుకున్నాం ఇద్దరూ . " కానీ ఆఫీసులో అందరూ కాస్ట్లీగా ఉంటున్నారు . నేను ఈసారి ట్రై చేద్దామని చూస్తున్నా " , అని నాలుగువేలు పెట్టి కొనుక్కున్నాడు బట్టలు . ఆరోజు చూసిన ఒక జీన్స్ భలే నచ్చింది నాకు . . ఒకసారి వేసి చూసుకున్నా . . చాలా బాగుంది . ఎలాగైనా తరువాత సారి కొనుక్కోవాలని నిర్ణయించా . కానీ ఖరీదు ఆలోచిస్తే పదిహేనువందలు . . బ్రాండెడ్ మరి . అమ్మో అనిపించింది . . మనసుకి సర్ది చెప్పి ఈ సారికి ట్రై చేద్దాం అనిపించింది . తరువాతనెల ఇంటికి పంపగా . . . , అన్ని ఖర్చులూ పోగా . . ఇంత , అనవసరపు ఖర్చులు మానేయాలి , మొత్తం ఇంత మిగల్చాలి అని లెక్కవ్రాసుకున్నా . మళ్ళీ ఒకసారి ఆలోచించా . . అంత డబ్బు ఎందుకూ అని . . మాములివి ఐతే . . అటువంటి జీన్స్ . . రెండు , మూడు దాకా కొనుక్కోవచ్చు . . వట్టి బ్రాండు కోసం అంత అవసరమా అనిపించింది . సరే ఈసారి ట్రై చేద్దాం ఇప్పుడు ఖర్చుచేయకపోతే మరి ఎప్పుడు చేస్తాం అని నిర్ణయం చేసేసా . తరువాత రోజు ఉదయం ఆఫీసుకురాగానే చెప్పేసా కొలీగ్ కి . . ఈ రోజు సాయంత్రం నేరుగా షాపింగ్ కి వెళుతున్నాం అని . సరే అన్నాడు . సాయంత్రం అయ్యింది . అతనికి ఏదో పనితగిలింది . . నేను పోన్ చేస్తా అప్పుడు బయలుదేరదాం అన్నాడని నేను వెయిట్ చేస్తున్నా . ఫోన్ మ్రోగుతుంది . . హెడ్ పోన్స్ పెట్టుకుని లౌడ్ సౌండుతో పాటలు వినడం వలన నా ఫోన్ రింగు వినపడలేదు నాకు . నా ప్రక్క సీటతను నన్ను తట్టి , ఫోను అని సైగ చేసేసరికి , తేరుకుని రిసీవర్ తీసా . ఏదో బ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం అట నాకు వద్దు అని చిరాకుగా పెట్టేసా . మళ్ళీ కొంతసేపటికి ఇంకొక పోను . గోవా ట్రిప్ లక్కీ డ్రా తగిలింది మీకు ఫ్రీ టికెట్స్ ఇస్తున్నాం . కానీ కండీషన్ ఐతే మీరు మ్యారీడ్ అయ్యివుండాలి అని . . ఫ్రీ గోవా ట్రిప్ కోసం నేనెక్కడ పెళ్ళిచేసుకునేది అని , నో , అన్నా . మళ్ళీ ఐదునిముషాల తరువాత మరొక ఫోను . . ఈ సారి చిరాకుగా తీసా రిసీవర్ … " కెన్ ఐ స్పీక్ టు శ్రీనివాస్ ప్లీజ్ " , అంది అవతలివైపు ఆడగొంతు . " యా స్పీకింగ్ . . " , అన్నా కాస్త సీరియస్ గా . . " సార్ వి ఆర్ ప్రమ్ CRY " , అని అన్నది ఆమె . " నో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ . . " , అని . . పోన్ పెట్టేయబోతున్నా . " నో సార్ . . " , అంటూ మొత్తం వివరంగా చెప్పింది . CRY అంటే " CHILD RIGHTS AND YOU " అని , డొనేషన్స్ కోసం ఫోన్ చేసాను అని . ఎనిమిది వందలు డొనేట్ చేస్తే . . ఒక పిల్లాడికి సంవత్సరం పాటు విద్యకోసం ఉపయోగిస్తారు అని . . ఇంకా రకరకాల విరాళాల వివరాలు చెప్పిందామె . నేను సైట్ అడ్రస్ , ఎలా పే చేయాలి . . అది కరెక్టుగా CRYకి చేరుతుందని నేను ఎలా నమ్మగలను లాంటి వివరాలు అడిగి తెలుసుకున్నా . కొద్దిరోజుల్లో మా ఏజంట్ వస్తాడు కంపెనీకి . . చెక్ ఇవ్వండి ఇంట్రస్ట్ ఉంటే అని అంది . సరే అని ఫోన్ పెట్టేసా . షాపింగ్ కి బయలుదేరా . . ఆ కాస్ట్లీ షాప్ కి వెళ్ళలేదు . . వేరే దాంట్లో ట్రై చెద్దామన్నా . . " ఏ . . ఎదైనా ఖర్చులు తగిలాయా మళ్ళీ " , అని నవ్వుతూ సరే ! అన్నాడు మా కొలీగ్ … ఇక్కడ కూడా బ్రాండెడ్ లాంటి జీన్సే కొన్నా . . అదే పదిహేనువందలు పెట్టి . కానీ ప్యాంటు ఖరీదు ఏడువందలు . . CRYకి ఎనిమిదివందలు చెక్ వ్రాసిచ్చా . నేను బ్రాండడ్ జీన్స్ వేసుకోకపోతే ఇప్పుడు దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదనిపించింది . కానీ ఆ డబ్బులు చిల్డ్రన్ ఫండ్ కి ఇచ్చి నేను CRY అనే బ్రాండడ్ కంపెనీ జీన్స్ వేసుకున్నట్లే ఫీలయ్యా . వెల కట్టలేనిది విద్య అంటారు . చదువుకున్నవాడికి ఖచ్ఛితంగా చదువు విలువ తెలుసుంటుంది . దేశానికి ఎంతో చేయాలనుకుంటాం . . ఈ బిజీ జీవితంలో మనకు కావలసినవి కొన్ని మనం చేసుకోలేకే నలిగి పోతుంటాం . మన దగ్గరున్న విద్యను వేరొకనికి మనం ప్రత్యక్షంగా బోధించే సమయమూ వుండదు కూడా . అలా చేస్తున్న సంస్ధలకైనా చేయూతనిద్దాం . పరోక్షంగా చేస్తున్నందుకు తృప్తి పడదాం . - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ఇది చదివినవాళ్ళలో ఒక్కరైనా ఈ CRY బ్రాండు ( ఆ పేరుమీద ఏ కంపెనీ లేదని మనవి , ఉన్నా దానికి ప్రమోషన్ మాత్రంకాదు ) వస్తువులను వినియోగిస్తారని ఆశిస్తూ పూర్తి వివరాలకు ఈ లింకు చూడండి . . Cry Donation
కల " అనేకాంశాలతో నాకు చాలా అనుబంధంవుంది . కలను బ్లాగమన్నవారికి నెనరులు " కల " అనేకాంశాలతో నాకు చాలా అనుబంధంవుంది . నా నిద్రలో కలలునా యవన కాలపు కలలునా జీవిత కలలు . . . ఒక భాగమైతేకలలు ఎలావస్తాయనే ప్రశ్నశాస్త్రీయ విశ్లేషణలుఅద్యాత్మిక విశ్లేషణలు ( బైబిలులో కలలకు చాలా . . మరొక భాగమైతేకలలు కనమనివాటిని వాస్తవీకరించుకోడానికి కృషిచేయమనే " అబ్దుల్ కలాం " చాలావిషయాలు నాలో ఒక్కసారిగా పొంగుకొస్తున్నాయి . కానీ సమయమే సరిపోవటంలేదుఎదో ఉడతా భక్తిగా నా ప్రయత్నం .
ఈ దేశంపై గౌరవమున్న ప్రతి వ్యక్తి . ఈ ధర్మాన్ని అభిమానించే ప్రతి పౌరుడూ ఈ సంస్కృతిని సజీవం చేసేందుకు తన శాయశక్తులా కృషిచేయాలి . అంతకు మించి వ్యక్తి జీవితానికి మరో పరమార్థం లేదు . ప్రస్తుత సమయంలో భౌతిక పోరాటాలలో సాధించే విజయం కన్నా ఈ మానసిక పోరాటంలో విజయం సాధించటం ముఖ్యం . ఈ ధర్మమే మన దేశానికి ఆత్మగౌరవం , ఆత్మవిశ్వాసం . ' ఈ దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచి , ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపటం కన్నా పవిత్రమైన పని మరొకటి లేదు . ' విశ్వనాథ శర్మ గారి మాటలు వివేకానంద చెవుల్లో ప్రతి ధ్వనిస్తున్నాయి .
ఎదిగి పుష్పించి ఫలభరితమయ్యి చివరకు ఎండుటాకులా రాలి పడే మానవ దేహం ¬ … మరణమంటే ఇంత మాత్రమే అనీ కాదు బతుకు దీపంలాగే చావు వాకిలీ ఇదీ అని చెప్పజాలం
హైదరాబాద్ నగర శివార్లలో , చెట్లు ఏపుగా పెరిగి అడివిలా ఉన్న ప్రాంతం … తాటాకులతో కట్టిన చిన్న పాకలో . . నేల మీద పడుకుని మూలుగుతున్నాడు రాజేశ్ . పెరిగిన గడ్డంతో చూస్తే అతన్ని ఎవరూ పోల్చుకోలేనంతగా మారిపోయాడు . నెల క్రితం ఒకడిని చంపుతున్నప్పుడు ఎదురు తిరిగాడు . వాడు బాగా బలంతో ఉన్నాడు ; ఆ ప్రయత్నంలో రాజేశ్‌కి బాగా గాయాలయ్యాయి . అప్పటి నుండి ఆ తోపు దాటి భయటకు రావడం లేదు . తను ఎప్పుడు కోలుకుని మేధం మళ్ళీ మొదలు పెడదామా అన్న కసి , కోపం , ద్వేషం ఆ కళ్ళతో కనిపిస్తున్నాయి . ఆవేదనతో పక్కకు చూసాడు . పాకకి ఓ మూల తను పోగుచేసిన ట్యాగ్‌లు పడి ఉన్నాయి . వాటి పక్కనే నెత్తురెండిపోయిన కొడవలి జారబెట్టి ఉంది ; దాహం తీర్చే నెత్తుటి వాన చుక్క కోసం ఆబగా చూస్తున్న రాకాసి నాలుకలా …
ఏమి గొంచు వచ్చెనేమి తా గొనిపోవు పుట్టు వేళ నరుడు గిట్టువేళ ధనము లెచటి కేగు తానెచ్చటికేగు ?
ఎప్పుడో ఇక్కడా , ఇక్కడా టైపు చేసిన మహానుభావుల కవితలు , మరళా కట్ యండ్ పేష్టు చేస్తున్నాను
అలాగే , " అమ్మ " అన్న పదానికి చైనీస్ భాషలో వాడే పదం " మా " , బాస్ఖ్ భాషలో పదం " అమ " , వెస్టిండీస్ లో కోబన్ తెగ వారు మాట్లాడే భాషలో పదం " అమ్మీ " . అంతమాత్రం చేత ఈ భాషలకు తెలుగు భాషకు సంబంధం ఉందని చెప్పలేము . ఈ పదాలలో సామ్యతకు మౌలికమైన వివరణ ఉంది . పసి పిల్లలు మాటలు నేర్చుకునే వయస్సులో కొన్ని రకాల ధ్వనులను మాత్రమే ఉచ్ఛరించగలుగుతారు . పెదవులతో తేలికగా ఉచ్ఛరించగలిగే / ప / , / ఫ / , / బ / , / భ / , / మ / ( ఓష్ఠ్యాలు ) శిశువులు మొట్టమొదట పలకగలిగే ధ్వనులు . అచ్చులలో తేలికగా పలికే అచ్చు / అ / . అందుకనే పసిపిల్లలు పలికే మొదటి పదం మనకు " అమ్మ " అనో " మా " అనో వినిపిస్తుంది . ఆ మొట్టమొదటి పదాన్ని తల్లికి ఆపాదించడం సహజం కాబట్టే ప్రపంచ వ్యాప్తంగా మ - కారంతో కూడిన తల్లి పదం . అదే విధంగా అన్ని భాషలలో వేర్వేరు అర్థాలలో కనిపించే పాపా , మామా , బాబా , దాదా , తాతా , నానా అన్న పదాలు . ఈ శైశవ పదాలలో కనిపించే సామ్యతను , సార్వజనీనతను కూలంకషంగా చర్చించి , వివరించిన భాషాశాస్త్రవేత్త జాకబ్‌సస్ [ 5 ] .
అన్నీ సంకలిని లను నా బ్లాగ్ లో చూపించడానికి ఎవరికన్నా అభ్యంతరం ఉన్న యెడల 14 వ తారీఖు ఉదయం 6 గంటల లోపల నాకు తెలియ చేయండి
అయినా నా వెఱి కాకపోతే , నేను బ్లాగితే మాత్రం జనాలు మారతారా పెడతారా . . ఆ విషయాని ప్రక్కనపెట్టి అసలు విషయానికి వద్దాం . చదువు ఎగ్గొట్టి జులాయిగా తిరుగుదాం అనుకునే యువతరానికి మఱో ఆయుధం . ఎలాగో కాలేజీ అయ్యిన తరువాత మంచి ఉధ్యోగం వచ్చిందా లేదా అని మనల్ని వేపుకు తినే వాళ్ళు ఎలాగూ ఉంటారు , అదే ఫైల్ అయ్యామనుకోండి అప్పుడూ తిడతారు . అంటే పాస్ అయ్యినా తిట్లే అలాగే ఫైల్ అయ్యినా తిట్లే . . అలాంటప్పుడు చక్కగా ఫైల్ అయ్యి మంచి ఉద్యోగం తెచ్చుకున్నాం అనుకోండి అప్పుడు మనం రిటన్లో వాళ్ళని తిట్టోచ్చు కదా . . అందుకని చదువు సంధ్యా వద్దు . . చక్కగా లైఫ్ ఎంజాయ్ చెయ్యండి . మరి ఉధ్యోగం మాట అంటారా . . అదిగో అక్కడికే వస్తున్నా . .
ఇక్కడ మీరు గమనించాల్సిన విషయమేమిటంటే , ఒక్క బ్లాగు పోస్టులు మాత్రమే కాకుండా , పోస్టు స్పందనలు కూడా మీరు నియంత్రించవచ్చు . ఇలా నియంత్రించేటప్పుడు ప్రతీ పోస్టుకీ స్పందనలు విడివిడిగా ఇవ్వవచ్చు లేదా అన్ని స్పందనలను కలగలిపి ఒక ఫీడ్ మాదిరిగా ఇవ్వవచ్చు . అంతే కాకుండా , ఇవేమీకాకుండా , ఫీడ్ బర్నర్ ద్వారా మీ బ్లాగుకి ఒక లంకె ఏర్పరుచుకునే అవకాశమూ ఇక్కడ ఉంది . నా సలహా ఏమిటంటే , మీకు పైన చూపిన తెరపట్టులో అన్ని సౌలభ్యాలకు నేను " Full " అని ఉంచాను కావున నాకు ఫీడ్ బర్నర్ వారి అవసరం లేదు . మీరు కనుక మీ బ్లాగు సెట్టింగ్స్ పైన చెప్పినట్లు లేనట్లైతే మఱోసారి మీ బ్లాగు సెట్టింగ్స్ అన్నింటినీ ఒక్కసారి సరి చూసుకోండి లేదా నాకు ఒక విధ్యుల్లేఖ వ్రాయండి , స్పందిస్తాను .
ఆపైన క్షణం కూడా ఆలస్యం చేయలేదు శ్యామ్‌సుందర్ . వాసంతి చేతిని వదిలించుకొని వింటినుంచి వెలువడిన బాణంలా వంతెనమీదికి పరుగు తీశాడు .
కవులు వాళ్ళ తృప్తి కోసం కవిత్వం రాసుకుంటారని ఎక్కడో చదివిన గుర్తు . అదేమో కాని , మంచి కవులు అనుకోకండా చదువరికి కూడా తృప్తినిస్తారు . కారణం : జీవితంలో బోలెడు సందిగ్ధాలు . తేలిగ్గా విశదపరచలేని సందిగ్ధాలు . ఈ సందిగ్ధాలే కవిత్వానికి ప్రేరణ . కవి తన పరిభాషలో ఈ సందిగ్ధాలకి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాడు . అయితే , కవి చెప్పే ఏ సమాధానమూ కవికి , చదివేవాడికీ పూర్తి తృప్తి నివ్వదు . అందుకనే ఎప్పటికప్పుడు కవి కొత్తకొత్త మాటలు , కొత్తకొత్త ప్రతీకలూ తయారుచేసుకుంటాడు , కవిత్వం కోసం . ఎన్నెన్నో ఉపమానాలు , ఉత్ప్రేక్షలూ , పెల్లుబుకి పైకొచ్చినా , కవికి అసంతృప్తే మిగులుతుంది . ఎందుచేత ? తన కల్పనకీ , తను కవితలో ఉద్దేశించినదానికీ మధ్య గండి పెరిగిపోతోందనే భావన వస్తుండటంచేత . నిజం చెప్పాలంటే , నిజమైన కవి సర్వదా చీకటిలో తడుముకుంటూనే ఉంటాడు . అఫ్సర్ ఈ కోవకి చెందిన మంచి కవి . డిసెంబర్ 2000 లో ప్రచురించిన ' వలస ' కవితాసంకలనం చివర ' నాస్థలకాలాల్లోకి … ' అన్న స్వగతంలో అఫ్సర్ ఇలా రాసుకున్నాడు : " కవిత్వం వొక గమ్యం కాదు . అదెప్పుడూ ఒక మజిలీ మాత్రమే . అనివార్యమైన భావాల వుప్పెన ముంచెత్తడమే కవిత్వం . … ప్రవాహం కవిత్వ లక్షణం . గమ్యం చేరానన్న తృప్తిలో కవిత్వం లేదు . ప్రవాహ గమనమే కవిత్వం . " ఇందులో కవితలన్నీ 1990 - 2000లలో రాసినవి . పదేళ్ళ తరువాత ప్రచురించిన ' ఊరి చివర ' ( డిసెంబర్ 2009 ) కవితాసంకలనాన్ని సమీక్షించడానికి ' వలస ' ని ప్రస్తావించ వలసిన అవసరం ఉన్నదనిపించింది నాకు . ఎందుకు అన్న ప్రశ్నకి ఈ సమీక్షే సంజాయిషీ చెప్పుతుందనుకుంటాను . పాత సంకలనం ' వలస ' నుంచి , 9 జూలై 1993లో రాసిన నాలుగు మాటలు అన్న పద్యం చూడండి . ఉండచుట్టి పారేసిన కాయితాల్లాంటి చిత్తుపదాలమధ్య వొకానొక భావావశేషం మంచుపర్వతంలా - ఎప్పటికీపగలని మంచులో కూరుకుపోయిన పదసమూహాన్ని నేను . తలుపులు మూతపడి వున్నాయి పెదవుల్లా . సమాధిలోకి వెళ్ళిన పదం పునర్జన్మించదు వేళ్ళు తెగిపోయాయి తలుపుతట్టలేను శవపేటికకు ప్రాణం పోయాలా ? అదృష్టవంతులు కొందరు , మాటలమీదే మళ్ళీమళ్ళీ బతుకుతుంటారు మాటలకే రక్తాన్ని అద్దుతుంటారు రక్తాన్ని నమ్ముకున్నవాణ్ణి వొట్టీదేహాన్నిమాత్రం అమ్ముకోలేను . … కొత్త సంకలనం ' ఊరి చివర ' లో రాసిన రెండంటే రెండు మాటలు ( 2004 ) అన్న కవిత చూడండి : … వుండచుట్టి పారేసిన కాయితాలు కొన్ని ఆలోచనల భ్రూణ హత్యల మరకలు చిత్తుపదాల శిధిలాలమధ్య వొకానొక భావశేషం ఎంతలెక్కపెట్టినా శూన్యమే శేషం . … తలుపులు మూతపడి వున్నాయి పెదవుల్లా పదం సమాధిలోకి వెళ్ళింది పునర్జన్మ వుందో లేదొ ? … అదృష్టవంతులు కొందరు వాళ్ళమాటలు బతికి బయట పడ్దాయి నామాట దేహం విడిచిన వస్త్రం . నాదో ప్రాణాంతక జనన యుద్ధం . వాయిదా వెయ్యలేను ఇలాగేలే అని వుండలేను . ఈ రెండు కవితలలో ముఖ్యంగా మొదటి చరణాలలో వాడిన మాటలే మళ్ళీ వాడినట్లుగా కనిపించినా , రెండవ కవితలో ' భ్రూణ హత్యల మరకలు ' ( blood stains from fetal killing ) అన్న ప్రతీకతో భావతీవ్రత హెచ్చింది . అయినా , తను చెప్పదలచుకున్నది ఇంకా తృప్తికరంగా చెప్పలేకపోయినందుకు కవికి కసి పెరిగింది . సమాధిలోకి వెళ్ళిన పదానికి పునర్జన్మ లేదు ; నైరాశ్యం . రెండవ కవితలో పదం ఆపలేని నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తుంది . రెండు కవితల్లోనూ , నేను ఇంతకుముందు చెప్పినట్టుగా , కవి నిర్దిష్టమైన సమాధానం కోసం చీకటిలో తడుములాడుకుంటున్నాడు . మంచికవికి ఇది అనివార్య పరిస్థితి . కొత్తగా వచనకవిత్వం రాస్తున్న వాళ్ళు ఇలాంటి ప్రతీకల త్రాణ గుర్తించడం మంచిది . ' ఊరిచివర ' లో ' వొకానొక అసందర్భం ' ( 2009 ? ) కవిత చూడండి : చిత్రిక పట్టని ఒకేఒక్క గరుకు పదం కోసం చూస్తున్నా శవానికి సైతం కనుముక్కుతీరు చూసే సౌందర్య పిశాచాల మధ్య . అలంకారాలన్నీ వొలుచుకున్న మాటకోసం చూస్తున్నాను నిఘంటువుల్ని కప్పుకొని గాఢ నిద్రిస్తున్న భాషలో . ' చిత్రికపట్టని ఒకేఒక్క గరుకు పదం కోసం , అలంకారాలన్నీ వొలుచుకున్న మాటకోసం ' కవి అన్వేషిస్తున్నాడు . తమాషా ఏమిటంటే మాటలని అతి జాగ్రత్తగా చిత్రికపడుతూ , అలంకారాలు వాడుతూనే ' మాటకోసం ' వెతుకుతున్నాడు . ఈ చిత్రికతోటే సంగీతానికి వేదనతో కూర్చిన రంగురంగు మాటల బొమ్మలు వేస్తాడు అఫ్సర్ . ఈ పని చెయ్యి తిరిగిన కవులే చెయ్యగలరు . 1987లో సైగల్ పాట మీద కవిత ఇప్పటికీ నాకు నచ్చే కవితే . … కిటికీతెరల కుచ్చుల్ని పట్టుకు జీరాడుతుంది దిగులుగా నీ పాట చిగురాకు కొనపై మంచు బిందువు మరణ వేదన … అతనే వినిపించక పోయినా అతని పాట వినిపిస్తుంది మెల్లగా కదిలి తుఫానై చుట్టుముడుతుంది జ్ఞాపకంలా నడుస్తున్న నిన్ను వెంటాడి వేధిస్తుంది రాత్రిలోంచి రాలిపడ్డ స్వప్నంలా ! సైగల్ పాటల్లో విషాదం , వేదనా వినిపిస్తాయి . సైగల్ పాట దిగులుగా కిటికీ తెరకుచ్చుల్ని పట్టుకు జీరాడుతుంది అనే మాటల బొమ్మ విషాదాన్ని చిత్రిస్తుంది . సైగల్ లేడు ; అతని పాట ఉంది . అతని పాట విన్న తర్వాత , అది తుఫానులా జ్ఞాపకం వస్తుంది ; రాత్రివచ్చిన కలలా వేధిస్తుంది . సైగల్ పాటలో వేదన అంతా అఫ్సర్ మాటలల్లో చూపించాడు ; తెరమీద బొమ్మలాగా ! ఊరి చివర సంకలనంలో వాయులీనమవుతూ … ( 2004 ) అన్న కవితలో ఈ క్రింది భాగం చూడండి ! కవిత చివర ఇచ్చిన ఫుట్‌నోట్‌లో వివరాలు విపులంగా లేకపోవడం ఈ కవితకి జరిగిన అన్యాయం . ఈ పొరపాటు జరగటానికి సంపాదకుల అశ్రద్ధే కారణం ! ( ఫుట్‌నోట్‌లో ఉన్న వాక్యం : రెండు సింఫనీల అనుభవం తర్వాత , వొకటి మామూలుగానే బీతోవెన్‌ది . రెండోది స్టాలిన్ కాలంలో వసంత మేఘాలమీదుగా తిరుగుబాటుని ఆలపించిన వయొలిన్ ) . అయినప్పటికీ , స్టాలిన్ కాలంలో రష్యాలో జరిగిన హత్యాకాండ , అణిచివేతలూ చదివినవాళ్ళకి కవితలో ప్రతీకలు స్పష్టంగానే ప్రతిధ్వనిస్తాయి . వయొలినిస్టు ఎవరో తెలిస్తే సహృదయుడైన పాఠకుడికి సానుభూతి పెరుగుతుంది . … ఊపిరి పీల్చడం నేరం తన చప్పుళ్ళే మార్మోగాలి చెట్లకి చిగుళ్ళు పుడితే నేరం ఆకుపచ్చగా విచ్చుకుంటే శిక్ష చివరికన్నీ ఇనపగజ్జెలే కావాలి ఇనప మాటలే వినిపించాలి . అప్పుడింక వయిలిన్ లోపలి ధ్యానానికి తుఫాను భాష నేర్పుతుంది దాచేసిన నిప్పంతా సుతిమెత్తని కమాను లోంచి కార్చిచ్చు . ఎంత చిత్రం ! వయొలిన్ నినాదమవుతుంది , వసంతం గర్జిస్తుంది , అంటూ ముగుస్తుంది కవిత . ఒకరొట్టె ముక్కా , ఒక దేశమూ , వొక షెహనాయీ … ( 2009 ? ) అన్న కవితలో , ఆమె కడుపులో ( ఫాతిమా ) ఏమూలనో దాచేసుకున్న శోకాన్ని నువ్వు షెహనాయీ లోకి వొంపినప్పుడు అనుకున్నానా , నాచరిత్ర అంతా వొకానొక కలత కల అని ! … ఇది చిక్కని కవిత . ఈ కవితలో మహ్మద్ ప్రవక్త , ఫాతిమా కల , కర్బలా కథని బిస్మిల్లాఖాన్ షెహనాయీలోకి అనువదించడం ఫుట్ నోట్లుగా సూచించారు . కాని వీటి పూర్వకథలు , కవితలో వాడిన ప్రతీకల ప్రత్యేకత తెలిస్తే ఈ కవితని అనుభవించడం సులువు . సంకలన సంపాదకుడు ఈ పని చెయ్యకపోవడం మరొక పెద్ద లోపం ! ఇక , తెలంగాణా 2002 అన్న కవిత గురించి . ఇది ఒక విచిత్రమైన కథనం . తెలంగాణా / ఆత్మ కథనం . సంకలనంలో ఏకైక బృహత్కవిత . పదహారు ఖండికలలో అసంతృప్తుల రాజకీయం , మైనారిటీ పేదల ఆవేదన , ' అణచబడ్డ ' వర్గాల ఆర్తనాదం , పోరాటం , తిరుగుబాటు వగైరా … అంతాకలిపి మొత్తం పదకొండు పేజీలు . ఇంతకుముందు ఈ సంకలనాన్ని సమీక్షించిన వాళ్ళు , విమర్శలు రాసిన వాళ్ళూ అంతగా ఈ కవిత ప్రస్తావన తెచ్చినట్టు లేదు . ' ఇది రాజకీయ కవిత , మనకెందుకులే ' , అన్న ధోరణిలో కప్పదాటు వేశారేమో ! ఈ కవిత గురించి నాలుగు మాటలు చెప్పకుండా నేను ఉండలేను . … కదులుతున్న ఉరికంబం నా వూరు సూర్యచంద్రుల్ని వెలేసిన ఆకాశం నాది నా చుట్టూ వీచే గాలి అధికారం విసిరిన ఉచ్చు … మదరసాల పిట్టగోడలు సిగ్గుపడ్డాయి నేను పుట్టినప్పుడు యే భాషలో యేడ్వాలో నవ్వాలో తెలియక కళ్ళకింద నవ్వుని పాతుకుంది అమ్మ . ఇలా సాగిపోతుంది ఈ బృహత్కవిత . పోలిక సమంజసం కాకపోయినా , ఎందుకో ఖాదర్ మొహియుద్దీన్ పుట్టుమచ్చ ( 1991 ) గుర్తుకొస్తుంది . ఆ కవితలో ఇంతకన్నా సూటిగా తన పుట్టుక గురించి చెప్పుకున్నాడు : ' ఒక కట్టుకథ నన్ను కాటేసింది … / నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదైవుంది నాపేరు … ' అంటూ ! … అన్నీ నానోటిదాకా వచ్చి వెళ్ళిపోయినవే మరి ! చివరికి స్వాతంత్ర్యం కూడా ! … నా పంద్రాగస్టు ఓ పెద్ద వెక్కిరింత కాదూ ! అందరూ మూడురంగుల జెండాలు ఎగరేస్తున్నప్పుడు నా శరీరం ఒకేఒక్క నెత్తుటిరంగులో తలకిందులుగా ఏ చెట్టుకొమ్మకో వేలాడుతోంది ఆగస్టు 15ని , స్వాతంత్ర్యదినోత్సవాలని , జాతీయ జెండానీ వామపక్షీయులు - ముఖ్యంగా అతివాద వర్గం వాళ్ళు , ఒకానొకప్పుడు దిగంబర కవులూ ఇంతకన్నా ఎక్కువగా హేళన చేస్తూ రాసారు . ఇది అతివాద రాజకీయ కవులని ప్రేతంలా వెంటాడుతున్న ఒక పాత ఫేషన్ . అఫ్సర్ లాంటి తాత్విక కవుల కలం నుంచి ఇలా రావటం చిరాకేస్తుంది . సరిగ్గా ఇదే ధోరణిలో వలస సంకలనం లో ' అగర్ జిందో మె హై , ' ( 25 అగస్టు 1998 ) అన్న కవిత . నిస్సహాయధోరణిలో మొదలై , మధ్యలో అఫ్సర్ - బ్రాండ్ ప్రతీకలతో ఉత్తేజపరిచి , చివరికి స్వాతంత్ర్యదినం , జాతీయజెండా , జాతీయగీతాలంటూ విషాద పరిహాసంతో ముగుస్తుంది . చూడండి : ఏ చరిత్రాలేని నాకు చరిత్ర పాఠం ఒక్కటే భలే ఇష్టం ; … నాచరిత్ర పాఠాలు నేను మరిచిపోలేని పాత పద్యాలు … … గొంతులోనే విరిగిపోయిన పద్యపాదాలమీద ఎప్పుడూ మోగే బెత్తానికి నాచరిత్ర తెలుసు నాకాలం తెలుసు నేను తెలుసు ఈ పద్యంలో చివరిపాదం వొట్టి కొయ్యకాలేనని తెలుసు వందేమాతరంలో నాతరం లేదు జణగణమణలో నా జనం లేరు కంఠనాళాలు తెగిపోయాయి నా గొంతు జెండాలా పూరా విచ్చుకోదు నా ఆగస్టు పదిహేనులన్నీ స్మశాన వాటికలోనే … ఆఖరి చరణంలో మొదటి రెండు లైనులతో పద్యం అంతం అయితే ఎంత అందంగా ఉండేదో ఆలోచించండి . ' వందేమాతరం ' లో తన తరం లేకపోవడం , ' జనగణమణ ' లో తన జనం లేకపోవడం ; ఇటువంటి వాక్యాలు చదవడానికి - అమెరికన్ భాషలో చెప్పాలంటే - ' క్యూట్ ' గా ఉంటాయి , అంతే ! పుస్తకాలమ్ముకునేవాడు వెనక అట్టమీద బ్లర్బ్ లో వేసుకోడానికి పనికి రావచ్చు . మరొక్క విషయం . వియత్నాం యుద్ధం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో , ఆ యుద్ధానికి వ్యతిరేకంగా ముమ్మరంగా ప్రచారంచేసిన పాటకురాలు జోన్ బాయెజ్ ( Joan Baez ) అమెరికన్ జెండాని నిరసిస్తూ ( అంటే వియత్నాం యుద్ధానికి వ్యతిరేకత స్ఫురింప జేస్తూ ) ఒకసారి " ఏ జాతీయ జెండా కూడా ఆ జాతి ప్రజల ఆశయాలన్నింటికీ , అభిలాషలన్నింటికీ అద్దంపట్టదు " , అని అన్నది ! How True ! ఇంతకన్నా క్లుప్తంగా బల్లేల్లా పొడిచే మాటలు ఏ నిరసన వాదుల రాతల్లోనూ నాకు కనిపించలేదు . యెప్పుడూ ఓ నల్లబూటు కాలు నా శరీరాన్ని కసిదీరా నలుపుతూ వుంటుంది … అణిగిపోయిన దేహాలకు నలిగిపోయిన కంఠాలకు పోరాటం సిద్ధాంతంకాదు , బతుకు పాఠం ! … నేనే నిషిద్ధమయ్యాను నా అడుగులకింద గూఢచారి నేత్రాలు మొలిచాయి . మళ్ళీ మరొకసారి ఖాదర్ మొహియుద్దీన్ రాసిన ' పుట్టుమచ్చ ' కవిత గుర్తుకొస్తుంది . ఇదే వరసలో సాగిన ఈ కవిత చివరకి , హైటెక్ , డాలర్లు … అణిచివేయబడటం ( ? ) ఇంకా … ఇంకా … ఆక్రోశం . ఇంతకీ ఇక్కడ ఎవరు ఎవర్ని అణిచేసారు ? ఈ అణిచివేయబడడం ఒక్క మైనారిటీలకే పరిమితమయ్యిందా ? పేదరికానికి , మైనారిటీ మెజారిటీ మతాల ఊసుంటుందా ? ఇలాంటి ' అసంబద్ధపు ' ప్రశ్నలు వెయ్యటం బహుశా అమాయకత్వం కింద జమ కట్టబడవచ్చు . చివరకి కవి ఎదురుతిరిగి నిలబడి , నువ్వు చూపిస్తున్న దృశ్యంలో బొమ్మని కాను నువ్వు ఆడిస్తున్న మాటల్లో మాటని కాను నేను మాట్లాడిస్తానింక నేను ఆడిస్తానింక నీ కాగితాల మీటలకింద నిక్కీ నీలిగి కూర్చుండను … అని హామీ / శపథం చేస్తాడు . ఎవరికి ఎదురుతిరిగి నిలబడడం ? ' ఎప్పుడో పుట్టిన ప్రశ్నకి సానబడుతున్నా , కొడవలికిలా ' అని ముగుస్తుంది కవిత . ఒక్క మాటలో చెప్పాలంటే , ఇది పెద్ద గందరగోళం కవిత . వచన కవిత్వాన్ని చదివించేవి , చదువరిని కదిలించేవి , కవితకి ప్రాణం పోసి బతికించేవీ మెటఫర్లు . మోటుబడ్డ కవితావస్తువు మంచి మంచి మెటఫర్లనన్నింటినీ అణగదొక్కేస్తుంది . ఇది నిజం . సరిగ్గా అదే జరిగింది , ఈ కవితలో ! ఒక చారిత్రక సత్యం ఇక్కడ చెప్పవలసిన అవసరం ఉన్నది . అధికారంలో కొచ్చిన వర్గం ఏదో మిషతో వేలకువేల గొంతుల్ని మాట్లాడకముందే నొక్కేసి , నిర్దాక్షిణ్యంగా మిలియన్లకొద్దీ పౌరులని హత్యలు చేసిన ఖ్యాతి , ఘనత ఒక్క స్టాలిన్‌కి , ఒక్క మావోకీ దక్కింది . ' అణిచివేయబడ్డ వర్గాల ' ప్రతినిధులుగా కవితలు రాస్తున్నామనుకునే కవులు , రష్యన్ కవయిత్రి ఆనా ఆఖ్మతోవా రాసిన ' రెక్వీమ్ ' ( requiem ) అనే కవిత కాస్త జాగ్రత్తగా చదివితే , రాజకీయ కవితలు , ఉద్యమ కవితలూ ఇంత గందరగోళంగా రాయవలసిన అవసరం ఉండదనిపించక మానదు . వీరుడి శిరస్సు ( 2007 ) అనే కవిత : ఇది యుద్ధవ్యతిరేక కవిత . ఫుట్ నోట్‌లో అంకిత వాక్యం ఆధారంగా ఈ కవిత బహుశా ఇరాక్ తో అమెరికా చేస్తున్న అన్యాయపు / అధర్మపు యుద్ధానికి నిరసనగా రాసిందై ఉండాలి . ఇది కేవలం నినాద కవిత . నినాదాలకి ప్రాధాన్యం ఇచ్చే కవితల్లో మాటలు చెప్పే బొమ్మలు నినాదాలకింద మరుగునపడిపోతాయి . కేకలు మాత్రమే మిగులుతాయి . ( ఈ మధ్యకాలంలో కేకలు , నినాదాలూ లేని యుద్ధవ్యతిరేక కవిత , ఒకేఒక్క కవిత - నా దృష్టిలోకి వచ్చిన వచన కవిత - జి . యస్ . రామ్మోహన్ రాసిన ' యుద్ధప్రభుస్తోత్రము ' ఈ కవిత మీద వ్యాఖ్య ఈమాట , సెప్టెంబర్ 2005 లో మూడు ప్రార్థన పద్యాలు అన్న వ్యాసంలో చూడవచ్చు . ) తెలిసిందికదా , ఇప్పుడు వొక ధిక్కారం తలతెగనరకడానికి ఎన్నెన్ని వ్యూహాలు కావాలి ! తెగిపడిన ప్రతితలా సలసల మరిగే నెత్తుటి నగరం ! … ఎన్ని వందల అబద్ధాల కట్టుకథల కళేబరాలు ! ఎన్ని అబద్ధాలు కలిస్తే వొక చరిత్ర ! … యిక యీ క్షణం వొట్టి మొండేలు కూడా వీరవిహారం చేస్తాయి నెత్తుటి కడవలై ! ' అయం స రశనోత్కర్షీ … ' తో మొదలై , ' ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం ' వరకూ , ఎటువంటి పోరాటాలయితేనేం ? పోరాటాల్లో ఆహుతైన వాళ్ళ చేతులు , తలలూ , కళేబరాలూ మానవ చరిత్ర కథనం చెబుతూనే ఉన్నాయి . నినాదాలు యుద్ధాలు ఆపవని చరిత్ర పదేపదే ఘోషిస్తోంది . సరే , ఇక్కడ నా ఘోష ఆపి , అఫ్సర్ కవితల్లోకి చూద్దాం . సగమే గుర్తు ( 2004 ) అన్న కవిత చూడండి ; ఈ కవిత కాస్త romanticగా మొదలై , అనుభూతి కవితగా నడిచి ఆఖరికొచ్చేసరికి ఆవేదన చురుక్కుమనిపిస్తుంది . వానది వొక్కటే భాష ఎప్పుడయినా ఎక్కడయినా , దేహం పిచ్చుక సందేహ స్నానాలకింద తడుస్తూ . … ఎన్ని వానలు చూళ్ళేదని ? మళ్ళీ ప్రతీ వానా అదేదో కొత్త వాసనేస్తుంది . … వాన ఇప్పుడింకా ఆగకపోతే బావుణ్ణు జొన్న రొట్టె కాలుతోంది వొంటి సెగలమీద . పై కవితని ' కురిసీ కురవని ' ( 1997 ) అనే పాత కవితతో పోల్చి చూడండి : ఎప్పటిదో తెలీదు ఎక్కడిదో తెలీదు తడపటం వొక్కటే తెలుసు వానకి . లోపలంతా రాత్రంతా అలా కురుస్తూనే వున్నా ఏకధారగా . ఆ మధ్యాన్నపు వానా ఇలాగే కురిసీ కురవని నీ లాగే గాయకుడు మిగిల్చి వెళ్ళిన నిశ్శబ్దంలా వాన సుదీర్ఘ మౌనానికి నిరసనలా వాన ఇవాళింక తెరిపి లేదు . ఈ ఆఖరి నాలుగు పాదాలూ అచ్చంగా కవిత్వం . చిన్నచిన్న మాటలు అతి జాగ్రత్తగా వాడటం అఫ్సర్ కి తెలుసు . పద్యం ఆఖర్న పాఠకుడి మనస్సుకి ఒక కుదుపు ఇస్తాడు . ఇది అఫ్సర్ ప్రత్యేకత . ' మూడో యామం ' ( 2001 ) కవిత ఒక మంచి ఉదాహరణ . … చరిత్రకారుడి చేతివేళ్ళని తెగనరికి కొత్త గతాన్ని తిరగరాస్తాయి ఫత్వాలు ఫత్వాలకు రంగుతేడాల్లేవు కూల్చే చేతులకు సరిహద్దులూ లేవు అనంత కాలాల పగలకు వొక్కక్షణికోద్రేకమే సమాధానం . … అన్ని మరణాలూ మట్టిలో కరిగే దేహాలు కావు నిప్పులో లీనమయ్యే క్షణికాలు కావు రాలిన రక్తమాంసాల్ని కలిపి కుట్టుకొని మళ్ళీ సిద్ధమవుతాడు సూర్యుడు కొత్తదినచర్యకి . అలాగే , ' శ్రీనగర్ లో మొహర్రం ' ( 2009 ? ) లో , బక్కపలచటి బ్యురాక్రాట్లా మైదానంలోంచి ఎగురుకుంటూ వస్తాడు యముడు వీడెప్పుడూ వన్ వే పాసింజెర్ కదా … తొలకరివాన కొండల్ని తలబాదుకుని ఏడుస్తుంది వితంతువులు చేతులారా గాజులు పగలగొట్టుకుంటున్నట్టు . ( మూలం : ఆగా షాహిద్ ఆలీ ) . మూలం చెప్పకపోయినా పరవాలేదు . ఈ ఒక్క చరణం కవిత్వం . ఎవరికైనా , ప్రేమతోనే ! అన్న మరొక కవితలో , నేపథ్యాల రణగొణ ధ్వనులెందుకులే , పద్యాల మధ్య రాజకీయనినాదాల హోరెందుకులే , అన్నీ మర్చిపోయిన జాతికి నీతివాక్యాల ముక్తాయింపులెందులే , అని అంటూనే అఫ్సర్ నినాద కవితలు రాసాడు . బహుశా అతని నిరంతర ప్రయాణంలో ఒక మజిలీ కావచ్చు . కవితా ప్రవాహంలో ఒక మలుపు కావచ్చు . దుఃఖ బహిష్కృతుడికి ఏ దిగులూ లేదు దేహాన్ని విస్తరించుకోవడం తప్ప ! నువ్వేమిటో నీపద్యమే చెబుతుంది ! తెగిన నీ పద్య పాదానికి కట్టు కట్టలేను , క్షమించు , నల్ల పలకతో వుమ్మితో కాదు అన్నీ తుడుచుకో నెత్తుటితో ! మళ్ళీ రాయ్ పిచ్చి గీతల మధ్య అ ఆలు వెతుక్కో అప్పటికీ నీకునువ్వు దొరక్కపోతే ఓ పిల్లాడి చేతిలో బొమ్మవై పో ! వాడి ఆట్లో కాసింత ఆనందపు తునకవై పో ! అప్పుడింక కొత్త మాట రాయ్ ! దీనికి తోడుగా , ' వలస ' లోంచి మరొక కవిత చెప్పకండా ఉండలేను . ఆకుపచ్చని ఆకాశం ( 27 అక్టోబర్ 2000 ) అన్న కవితలో , ఒక రెక్క అలా తెరిచివుంచు నీలోకీ నిశ్శబ్దంలోకీ . ఒక దుఃఖాన్ని అలాతెరిచే వుంచు రెప్పలకింద పచ్చగా . … అప్పుడప్పుడు కాసింత గోరువెచ్చగా నీ చీకటిగదిలోకి ప్రవహించే గాలిని కాసేపు వుండివెళ్ళమని చెప్పు . … యుద్ధసేన తరుముకొస్తున్నప్పుడు ఏదో ఒక మూల రవంత నిశ్శబ్దాన్ని కురవనీ అన్ని విషాదాల్ని అన్ని చీకట్లనీ తుడిచి దూదిపింజలా ఎగుర్తున్న మబ్బు వెంట నడవనీ రెప్పలకింద ఆకాశం ఎలా వుంటుందో ఇప్పుడైనా తెలిసిందా ? అఫ్సర్ నిరంతర ఆశావాదా ? ఉల్లాసకరమైన నిరాశావాదా ? అదేమో కాని , అఫ్సర్ కవి . లేబుళ్ళు అనవసరం . ఈ సంకలనంలో అందమైన కవితలు చాలా ఉన్నాయి . వాటన్నింటి గురించీ ప్రస్తావించడానికి వీలు పడదు . వాటిలో కొన్ని : యిక్కడేదో వొక జాంచెట్టు . . , అవునా మైక్ ? , సరిగంగ స్నానం , డెజావూ , ఒక సూఫి సాయంత్రం , వగైరా . వలస సంకలనం చివర్న రాసుకున్న స్వగతంలో అఫ్సర్ తనగురించి ఇలా చెప్పుకున్నాడు : " … నేనొక విచ్చిన్నమైన వాస్తవికతని . నేను స్త్రీని . నేను దళితుణ్ణి . నేను మైనారిటీని . నేనొకమూడో ప్రపంచాన్ని . చివరికి నేనొక మనిషిని అని సొంత ఉనికిని చెప్పుకోవాల్సిన స్థితిలో పడ్డ సంక్లిష్ట అంతరంగాన్ని . … నేను ఏకవచనం కాదు . అనేక వచనం . " ఆఖరిగా నా మాట . అఫ్సర్ కవితా సంకలనం ' ఊరిచివర ' , తెప్పించుకొని చదవండి . 119 పేజీల్లో 48 కవితలున్నాయి . మంచి కవిత్వాన్ని ఆస్వాదించిన అనుభూతి మిగులుతుంది . సంపాదకుడు గుడిపాటి ఒక పరిచయం , యన్ . వేణుగోపాల్ మరో పరిచయం - వెరసి పదిహేను పేజీల పరిచయవ్యాసాలు రాసారు . అఫ్సర్ కవితలని ఆస్వాదించడానికి ఈ రెండు పరిచయ వ్యాసాలూ అనవసరం . ( ఊరి చివర , అఫ్సర్ కవితా సంకలనం - డిసెంబర్ 2009 . సంపాదకుడు : గుడిపాటి . పాలపిట్ట ప్రచురణలు . Rs . 60 / - . $ 5 . 00 . దొరికేచోటు : Palapitta Books , # 16 - 11 - 20 / 6 / 1 / 1 , 403 Vijayasai residency , Saleemnagar , Malakpet , Hyderabad - 500 036 . )
వాక్చాతుర్యం పునాదికాదు . ఏ ఉపాసనా వరంతో ఆ కవిత్వ శబ్దమైత్రి అలవడిందో తెలియదు . ఎచ్చోటా శబ్దకాలుష్యం కానరాదు . ఆమె Poetic Concerns ఏవో - ఈ సంపుటిలోని " పచ్చనిగీతం " చదివాక నాకుతెలిసింది . ఆమె ప్రకృతి ఆరాధన నిసర్గంకాదు . సృష్టినుండి , సమధర్మం నుండి దూరంగా జరిగిపోతూ తన సహజ విధిఅయిన సాత్విక గుణాన్ని విసర్జించి , రజస్తమో గుణ చీకటిదారులు పట్టిన మానవుడికి హెచ్చరికగా యీ పచ్చటి గీతం . ఉపనిషత్ సారాంశాన్ని ఈ శతాబ్దపు యాంత్రిక మానవుడికి తల్లి ఉగ్గుపాలలాగా - యీ పచ్చని గీతం .
చంపకమాల . నను సతతంబు భక్తిని ననన్యముగా భజియించు భక్తుఁడే గుణము లతిక్రమింపఁ గలుగున్ , సమభావ సమన్వితుండగున్ , ననుఁగన నర్హుఁ డౌ నతఁడె ; నా ప్రతిబింబ స్వరూప తేజుఁ , డ య్యనఘుఁడె , బ్రహ్మభావ మలరారి విముక్తిని గాంచు ఫల్గునా ! ౨౫
/ నా బాధల్లా ఇంత మంది గద్దలు ముందుండగా , ఒక ముద్ద మీద సెటైర్లు అవసరమా ? / ఎందుకు అవసరం కాదు అని ? ! ఇదీ మామూలు గద్ద / ముద్ద కాదు రాబందువు కాదా అని ! ! ఈ రాబందువును ఎందుకు అనకూడదు ? గద్దలను , కాకులనే మాత్రమే ఎందుకు అనాలి అని ! ! : ) )
రాజకీయేతర నేరాలు చేసేందుకు క్లాన్‌ను వ్యక్తులు ఒక ముసుగుగా ఉపయోగించుకున్నారు , రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాలు వారిపై చాలా అరుదుగా చర్యలు తీసుకున్నాయి . ధర్మాసనాల్లోకి ఆఫ్రికా సంతతికి చెందిన అమెరికన్లు అడుగుపెట్టకుండా అడ్డుకున్నారు . హత్యా నేరాల్లో , అన్ని - తెల్లజాతీయుల ధర్మాసనాలు కు క్లక్స్ క్లాన్ సభ్యులపై దాదాపుగా ఎన్నడూ అధికారిక నేరారోపణలు నమోదు చేయలేదు . నేరారోపణలు మోపబడిన అరుదైన సందర్భంలో కూడా , ధర్మాసనాలు శిక్షలు పడేవిధంగా వ్యవహరించేవి కాదు . ధర్మాసనంలోని సభ్యులు స్థానిక క్లాన్ సభ్యుల ప్రతీకార చర్యలకు భయపడేవారు .
< < మనం ఎదైనా choice చేసుకున్నాం అనుకోండి , మనతో ప్రమేయం లేకుండా మన mind ఆ choice ని సమర్దించే ప్రయత్నంలో సకల మార్గాలను కనుగొంటుంది > > . .
$ విశ్వరూప్ గారు అర్ధవంతమైన చర్చ ఇది . ఇలాంటివి మరిన్ని జరిగి వాస్తవాలు వెలుగులోకి రావాలని ఆశిద్దాం . ఆక్టోపస్ తనకున్న ఎనిమిది కాళ్ళలో ఒకదాని బుర్రనయినా వాడాలని చేసిన వృధాప్రయత్నం కెవ్వుతీతం ; ) ) . ఇక కె . టీ . ర్ గారి వ్యాఖ్యలు చాలా నింపాదిగా నిమ్మళంగా ఉండి నిర్మాణాత్మకంగా ఉన్నాయి . అభినందనలు వారికి _ / \ _
శంకర కరుణాక రా నిశం కర ధృత శర భక్త వశంకర ధనుజవ నిశ్శంక రసిక త్యాగరాజ ( దేవ )
అబౌట్ మీ లోని వాక్యాలు : " కాకిలా అరిచి , గీ పెట్టి గోల చేయరని ఆశిస్తున్నాను . ఏమైనా ఉంటే మనం మనం శాంతియుతంగా పరిష్కరించు కుందాం . " పై పదాలు మాత్రం శాంతియుతంగా లేవు చక్రవర్తి గారూ ! ఎంత అశాస్త్రీయ , పాక్షిక విమర్శలు చేసేవాల్లనైనా కాకులతో పోల్చడం సరికాదు . సభ్యతా కాదు ! సరిదిద్దుకుంటే బాగుంటుంది . - ప్రభాకర్ మందార , హైదరాబాద్
మనుజులలో అట్టివానికంటె నాకు మిక్కిలి ప్రియము నొనర్చువాడెవడును లేడు . మఱియు నాకు మిక్కిలి ఇష్టుడైనవాడు ఈ భూలోకమున మఱియొకడు కలుగబోడు .
కూర్చో , కూర్చో అంతకోపవెందుకు . నామీద కోపవొస్తే నాకేం పరవాలేదు . కానీ మందుమీద కోపవొచ్చి దాన్ని మధ్యలోనే వదిలిపోతే , చాలా నష్టం మనకి . సురకి అవమానం జరిగితే , ఇంద్రుడికి అవమానం జరిగినట్టే . ఇంద్రుడికి అవమానం జరిగితే , దేవతలందరికీ అవమానం జరిగినట్టే . ఆ తర్వాత మనకి నరకం తప్ప స్వర్గలోక ప్రాప్తి వుండదు . అందువలన ముందరా పెగ్గు పూర్తిచెయ్ . చాలా , చాలా విషయాలు , మన విషయాలు నీకూ నాకూ తప్ప మరో నరమానవుడికి తెలియవు . అవేం అంత గొప్ప విషయాలు కావు , అంత అసహ్యమైన రహస్యాలు కావు . కాకపోతే నీకూ నాకూ మాత్రవే అర్థవయ్యే విషయాలు , నీకూ నాకూ మాత్రవే అర్థవున్న విషయాలూ . అంత మాత్రంచేత మన మధ్య వున్న ఈ సంబంధం , స్నేహవనే ఈ సంబంధం బ్రతుకులో వుండే మరే ఇతర సంబంధాలకంటే కూడా గొప్పదేం కాదు . రేపు నా ఖర్మ కాలి నే పోతే , నీకూ నాకూ వున్న ఈ ఇంత గొప్ప స్నేహం నా పిల్లలకి నన్ను తిరిగియ్యదు . నిజవే , నిజవే , నీకు వీలైన సహాయం , వీలుకానిది కూడా చెయ్యాలనే చూస్తావ్ . నాకా నమ్మకవుంది . నా పిల్లలకీ , నా పెళ్ళానికీ లక్షమంది స్నేహితులు , ప్రాణ స్నేహితులుండొచ్చు . ఐనా నా పెళ్ళానికి మొగుడుండడు , నా పిల్లలకి నాన్నుండడు . అబ్బయా , శంకర్రెడ్డీ , మనిషి బ్రతుకులో వుండే ఏ సంబంధం , ఏ సంబంధంకన్నా గొప్ప కాదు నాయనా . దేని ప్రత్యేకత దానికుంది . దేని స్థానం దానికుంది . దేని గొప్ప దానికుంది . స్నేహవనేదాన్ని చాలా పెంచేసి . దాన్ని అన్నిటికీ కొలబద్దను చెయ్యకు . మీ మధ్యనుండే స్నేహం వలన కాదు మీ ఇల్లు సంతోషంగా వుండేది , మీ మధ్య నుండే వొకరి మీదోకరికి వుండే ప్రేమ వలన . నీ పెళ్ళాం పిల్లలతో , మీ అమ్మా , నాన్నలతో , నీ అన్నదమ్ములూ , అక్కచెళ్ళెళ్ళతో వుండేది స్నేహంకాదు . ఏ సంబంధంలోనైనా అది బలపడటానికి కారణం , ఆ రిలేషన్‌షిప్లో వుండే ప్రత్యేకవైన ప్రేమతోపాటూ వుండాల్సింది , కొంచెం ఎదుటిమనిషిని అర్థం చేసుకునే గుణం , కొంచెం ఓపెన్ నెస్ , కొంచెం కోపం తెచ్చుకోని ఓపిక , సంతోషంగా వుండాలనే ప్రయత్నం , సంతోష పెట్టాలనే కోరిక , కొంచెం స్వార్థం , కొంచెం నిస్వార్థం ఇంకా ఇట్లాటివే సవా లక్ష గుణాలు . ఏరకవైన సంబంధాలైనా సరే , స్నేహంతోపాటూ , ఆ గుణాల్లో ఎన్నుంటే ఆ సంబంధం అంత బాగుంటుంది . వాళ్ళకీ , వాళ్ళకి సన్నిహితులైన వాళ్ళకీ , అందరికీ . లే ! లేసి అక్కడింకో బాటిలుంది పట్రా . ఎట్లా నీకీరోజు ఆంటీ చేతులో అక్షింతలు తప్పవ్ .
ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర ప్రాంతంలో ఛానెల్ స్విచింగ్ ఎక్సర్సైజ్ లో భాగంగా " వనిత " ఛానెల్ ని చేరాను . బ్లాక్ అండ్ వైట్ పాట వస్తూ ఉండటంతో ఆగాను . తీరా చూస్తే అది బెంగాలీ పాట ! ఏదోలే , ఆకాలం బెంగాలి సినిమాలు మనం ఎప్పుడన్నా చూస్తామా ఏమిటీ ? అన్న ఉద్దేశ్యంతో ఛానెల్ మార్చలేదు . పాట ఎక్కడో విన్నానే అనుకున్నా . ఒక లైను ముగుస్తూ ఉండగా అర్థమైంది - " నా హృదయంలో నిదురించే చెలీ " పాట అని . ఈ పాట వినని వారుంటే , వారి కోసం , ఇది ఆరాధన ( 1963 ) తెలుగు సినిమా లోనిది . ఓహ్ ! ఈ పాట కూడా మన సొంత ట్యూన్ కాదా ! అన్న నిరాశ కలిగింది . మన నుండే వాళ్ళు కాపీ కొట్టి ఉండొచ్చు కదా , అన్న ఆలోచనన్నా నాకు రాకపోవడం నా దురదృష్టం . ఇదివరలో ఇలానే ఓసారి ఓ డిస్కషన్ బోర్డులో " మనసున మనసై " ( డాక్టర్ చక్రవర్తి సినిమా పాట ) బెంగాలీ మూలం వీడియో చూసి ఉండటం కూడా దీనికి దోహదం చేసి ఉండొచ్చు .
ప్రతిపాదన : బీమా సవరణ బిల్లు , ఎల్‌ఐసి బిల్లు , పెన్షన్ అభివృద్ధి అథారిటీ బిల్లులను ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెడతారు .
అంతా నాదేననుకొంటే లేదే చింత అంతా నాకే అనుకొంటేనే చిక్కంతా
వాసంతికి ముందు ఆశ్చర్యమూ , వెను వెంటనీ బాగా కోపమూ వచ్చేశాయి . ఐనా నడివీధిలో ఉన్నామన్న సంగతి గుర్తించుకుని నిదానంగానే , " కృష్ణా , నీతో కొంచెం వివరంగా మాట్లాడాలి . ఇలా వీధిలో కాదు . అటు సెంట్రల్ పార్కులో కెళ్దాం పద ! " అంది . ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మౌనంగానే కొద్ది సేపట్లో సెంట్రల్ పార్కు చేరారు . నిర్మానుష్యంగా వున్న ఓ మూల బెంచీ మీద కూర్చున్నారు . వాసంతి కృష్ణ వేపుకి తిరిగి కూర్చుని మొదలు పెట్టింది . " చూడు కృష్ణా , నీరజని ఇదే మొదటి సారి నువ్వు చూడ్డం . తన గురించీ , తన ఫేమిలీ గురించీ నీకు ఇంతకు ముందేమీ తెలియదు . ఐనా కేవలం పది నిమిషాల పరిచయంలోనే నీరజ వేల్యూస్ గురించి అంత హీనమైన అభిప్రాయం . . నీకెలా అసలు అలాంటి ఆలోచన వచ్చిందో నాకర్థం కావటల్లేదు . " " వెల్ , ఒకళ్ళ కేరెక్టర్ ఎలాంటిదో గ్రహించడానికి వాళ్ళ జీవితమంతా తెలియక్కర్లేదు . సరైన సందర్భంలో పది నిమిషాలు . . ఊహు , ఒక్క నిమిషం చాలు . . తెలిసి పోవడానికి . ప్రవర్తనకి పునాది చిన్నతనంలోనే పడుతుంది . తన మొగుడు కాని ఒక మొగాడితో . . ఒక తెల్లతోలు గాడితో . . అలా విచ్చలవిడిగా విరగబడుతున్న ఆ పిల్ల తీరు . . ఆమె పెంపకం ఎలాంటిదో చెప్పకనే చెబుతోంది . " " మొదట , ఆ పిల్లకో పేరుంది నీరజ ! రెండో విషయం , తను నాకు చిన్నప్పణ్ణించీ బెస్ట్ ఫ్రెండ్ తన పేరెంట్స్ కూడా నాకు బాగా తెలుసు . వాళ్ళెవ్వరి గురించీ నీ దగ్గర్నించి నేను నేర్చుకోవాల్సిన పని లేదు . "
నా పేరు తాడిమేటి రాజారావు . మా నాన్నగారి పేరు విశ్వనాథం . అమ్మ పేరు రాజేశ్వరి . అక్క పేరు గాయత్రి . నేను పశ్చిమ గోదావరి జిల్లా " పెనుగొండ " అనే గ్రామం లో పుట్టాను . Intermediate వరకూ నా చదువు మా గ్రామం లోనే సాగింది . తరువాత B . Tech R . E . C Nagapur లోనూ , M . Tech IISc Bangalore లోనూ పూర్తి చేసాను . ఫ్రస్తుతం San Jose , California లో Cisco Systems లో Software Engineer గా పనిచేస్తున్నాను . నా అర్ధాంగి పేరు వసుంధర .
జొన్నన్నం తిని బతికి గుంటూరు వాసులు ఇప్పుడు తెలంగాణా నీటి వనరులు కొల్ల గొట్టి సన్నన్నం తినే స్తాయికి చేరి మనల్ని జొన్నన్నం తినే స్తాయికి దిగ జార్చిండ్రు . సారూ . . . జొన్నన్నం తినే స్తాయి గానీ , పత్తి పురుగుల రైతుల ఆత్మహత్యలు గాని , తెలంగాణాలో తీవ్రమైన ఫ్లోరైడు సమస్య గానీ మీ రాజకీయనాయకుల పుణ్యమే ! మీరు ఎన్ని తెలంగాణా ఊర్లను ఈ సమస్యలనుంచి బయట పడేసారు ? ఎన్ని ఊర్లకు మీ ఖర్చుతో టాంకర్లతో నీరు అందిచారు ? గుంటూరులో జొన్నన్నం తింటారని ఇప్పటి వరకూ తెలియదు . మీరు ఇంకొకటి తెలుసుకోవాలి . రాయలసీమలో ఇప్పటికి సంకటి తిని పడుకునే ఊర్లు వేల కొలది ఉన్నాయి . కోస్తాలో గంజి తాగి బతికే కుటుంబాలు లక్షలున్నాయి . వారికి జొన్నలు పండవు , సన్నన్నం దొరకదు . . . మీ రాజకీయ నాయకులిచ్చే ముక్కిపోయిన బియ్యం డీలరు తినేస్తాడు .
ఇంద్రజిత్తు మాటలకు కలత పడిన లక్ష్మణుండు , మారు మాటాడక శిబిరమునకేగి అన్నగారికి జెప్పెను . " ఇంద్రజిత్తునకును నాకును భేదమేమున్నది ? నీ ధర్మ వర్తనము నన్ను కాపాడుచున్నది . రావణుని దుర్మార్గము ఇంద్రజిత్తును కాల్చినది గాని అతగాని త్యాగమునకు వేరర్థమే లేదా ? యుద్ధమున నేనోడిపోయియుండినచో నా గతియునూ అంతియే గదా " అనెను . ఆ మాటలకు చిరునవ్వు నవ్వి శ్రీరాముడు , " ఓయీ లక్ష్మణా , ఈ జన్మలన్నీ కర్మానుసారములని నీవెరుంగవా ? మనకు లభించు సోదరులు , బంధువులు అన్ని బంధములూ కర్మానుసారములే అని శాస్త్రములు పల్కుటలేవా ? " అని ఊరడించెను . లక్ష్మణుని మనసెరిగిన శ్రీరాముడు తమ్ముని ఆనందపరచనెంచి ఇంకా ఇట్లనెను " ఇంతటి విజయుడవయి యుండి ఇట్లు ఖేద పడుట నేచూడలేను . ఇంద్రజిత్తునకు మరణానంతరము వరమిచ్చు చున్నాను . అతగాడు అదృశ్యరూపుడై తన మాయాజాలమును కలియుగాంతమున ప్రయోగించగలందులకు నేనవకాశము నిచ్చు చున్నాను . ఏ భవ బంధములూ , బాధ్యతలూ లేని మాయావి తన శక్తులనెట్లుపయోగించనెంచునో చూచెదము " .
జగిత్యాల లో చిరంజీవి అన్న ఈ మాటలను మరో సారి విని చదివి అప్పుడు చెప్పండి చిరంజీవి తెలంగాణా ప్రజలకు మిత్రుడో శత్రువో . . . " " కేంద్రం గనక ప్రతిపాదిస్తే ప్రజారాజ్యం దానికి సానుకూలంగా స్పందిస్తుందని మరీమరీ చెప్తున్నాను . ఇంతకంటే ఇంకేమి ' ' క్లారిటీ ' ' కావాలి ? నిజంగా మనందరికీ ఆ తెలంగాణా కావాలి అని అందరూ అనుకుంటే గనక కేంద్రం దగ్గర పెద్ద ' ' సౌండ్ ' ' చేద్దాం . పెద్ద ' ' శబ్ధం ' ' చేద్దాం . మీ గొంతు అక్కడ వినపడేలాగా చేద్దాం . కేంద్రం నిర్ణయం . . . కేంద్రం నిర్ణయించాలి . అది మీ దాకా చెప్పక - ఇక్కడి వాళ్లేదో చేయడం లేదు . . . చేయడం లేదు అంటే . . . కేంద్రం నిజంగా - వాళ్లకి చిత్తశుద్ధి వుంటే . . . మన అభీష్టానికి అనుకూలంగా వాళ్లు నిర్ణయం తీసుకుని . . . వాళ్లు ప్రతిపాదిస్తే గనక మనం సానుకూలంగా స్పందిస్తాం . . . ! మనం అడ్డుగా వుండం ! ! మనం స్వాగతిస్తాం ! ఎందుకంటే ప్రజాభీష్టానికి నేను ఎప్పుడూ తలవంచే మనిషిని ! మీ ప్రజాభీష్టాన్ని నేను శిరసావహిస్తాను ! స్వాగతిస్తాను ! ! ఎందుకంటే ప్రజాభీష్టానికి నేను ఎప్పుడూ తలవంచే మనిషిని ! మీ ప్రజాభీష్టాన్ని నేను శిరసావహిస్తాను ! స్వాగతిస్తాను ! ! జగిత్యాల నడిబొడ్డులో వుండి . . . జనం మధ్యలో వుండి . . . చెప్తున్నాను . . . . చిరంజీవి . . . ప్రజారాజ్యం కేంద్రం ప్రతిపాదనకు ఎట్టి పరిస్థితిలో అడ్డుగా వుండదు ! వుండదు ! ! వుండదు ! ! ! తుది నిర్ణయం మాత్రం కేంద్రందే ! కేంద్రం దానికి సానుకూలంగా స్పందించాలి ! ! కేంద్రం స్పందించి ప్రతిపాదిస్తే మాత్రం ఈ చిరంజీవి . . . . మీ చిరంజీవి . . . . మీ ప్రజారాజ్యం . . . దానిని ఎట్టి పరిస్థితిలో అడ్డుకోదు . . . ! అడ్డుకోదు . . . ! ! అడ్డుకోదు . . . ! ! ! అని చెప్తున్నాను . కొంతమంది ఈ తెలంగాణా వాదం అనే ఓడను . . . తెప్పను ఎక్కి అవసరం తీరిపోగానే తెప్ప తగలబెట్టే రకంగా తయారవుతున్నారు ! ! మరికొంతమంది ఓడ ఎక్కిని తరువాత ఓడ మల్లన్న అంటున్నారు . ఓడ దిగిన తరువాత బోడి మల్లన్న అంటున్నారు ! ! ఇలాంటి అవమానాలకు గురయ్యే కదా మీ ' ' ఆత్మ గౌరవం ' ' దెబ్బతింది ? ! కనుక - మీ ఆత్మగౌరవానికి ప్రథమ పీట వేస్తాం ! సామాజిక న్యాయానికి , సామాజిక తెలంగాణాకి ప్రథమ పీఠం వేస్తాం ! ! " " ChiranjiviJaiTelanganaSpeech
ఓ అంతా కవులే , అ ఆ ఇయ్యీలయిన రాని యంబ్రహ్మలె , మే - మూ ఋషులం అంటూ ఛీ ఎంతటి సిగ్గు చేటు సిరిసిరిమువ్వా
@ Chandana : సరిగ్గా ఇలాంటి సమాధానం చెప్పకూడదనే నా అవస్థ అంతానూ ! ! నాకు ఇండియాలో వెజిటేరియన్లు ఉంటారు అని చెప్పాలని ఉంది కానీ , కొన్ని కులాల వాళ్ళే ఉంటారు అని చెప్పడం ఇష్టం లేదు . ఎందుకంటే , అది వర్తమానంలో అసత్యం కనుక .
ఇరవై ఏడేళ్ళ యువకుడు జమైకా బీచ్ లో సంతోషంగా మార్గరీటా తాగుతూ తన పక్క నున్న అమ్మాయి అందాలను తనివి తీరా చూసుకుంటూ ఉల్లాసంగా మాట్లాడుతున్నాడు . అక్కడి రిసార్ట్ కు విచ్చేసిన అతిధులందరిలోనూ ఎక్కువ టిప్ ఇచ్చే వారెవరైనా వున్నారంటే అతనే . అతని పేరే విజయ్ వల్లభ్ . ఆంధ్ర దేశంలో పుట్టిన వాడు . తన కున్న ఇంగ్లీషు పరిజ్ఞానంతో అక్కడ వున్న అందరిని బొల్తా కొట్టించేస్తున్నాడు . ఆ రిసార్ట్ లో పని చేసే యువతులందరూ అతనికి సపర్యలు చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు అతనితో చనువుగా మెలుగుదామా అని పరితపించి పోతున్నారు . సాయంత్రమయిన తరువాత ఒక యువతి ఒయ్యారాలు ఒలక బోసుకుంటూ ఇంకో పెగ్గు మార్గరీటా అతని గ్లాసులో పోసి అతను ఎలాంటివాడో ఎంత సంపన్నుడో కనుక్కోవాలని ప్రయత్నం మొదలు పెట్టింది . " హాయ్ స్వీటీ , మే ఐ నొ యువర్ హాబీస్ " అంది . " ఐ లైక్ టూ బీ స్మార్ట అండ్ విన్ ఎవ్రీవన్ " అన్నాడు విజయ్ . " ఓ నాటీ ! ఐ వుడ్ లైక్ టూ నొ యువర్ బ్యాక్ గ్రవుండ్ ప్లీజ్ " అంది మత్తు కళ్ళతో ఇంకో గ్లాసు మందు అతని నోట్లో పోస్తూ . అప్పటికే మైకం లో వున్న ఆ యువకుడు చెప్పడం మొదలు పెట్టాడు . * * * * * * నేనొక సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన వాడిని . అందరిలాగే ఎన్నో ఆశలతో చదువుకోవాలి ప్రయత్నించాను . తెలివి తేటలు ఎన్ని వున్నా కొన్ని సామాజిక పరిస్థితులవల్ల నా చదువు డిగ్రీ మధ్యలో ఆగిపోయింది . అప్పుడే ఒక ధనవంతుల ఇంట్లో పని చెయ్యడానికి అవకాశం వచ్చింది . ఆ ఇంట్లో నేను ఒక పని మనిషి , డ్రైవరూ తప్ప ఎవరూ వుండే వాళ్ళు కాదు . అప్పుడప్పుడూ పార్టీలు జరిగినప్పుడు వుండే సందడి తప్ప మిగతా సమయాల్లో ఎవరూ వుండేవాళ్ళు కాదు . ఆ ఇంట్లో యజమానికి అన్ని ఆధునిక వసతులూ వుండేటివి . ఎవ్వరూ లేక పోవడం వలన నాకు అక్కడ వున్న కప్యూటరే మంచి స్నేహితుడయింది . రోజూ దాని ద్వారా ఎంతో విజ్ఞానాన్ని సంపాదించాను . ఇంటెర్నెట్ చాట్ ద్వారా ఎంతో మంది తో పరిచయం ఏర్పడింది . సరిహద్దులు చెరిగి పోయాయి . భాషలు అడ్డు రాలేక పోయాయి . అంతా గ్లోబలైజేషన్ మహిమ . ఇలాంటి పరిస్తితులలో మొదలైంది రియల్ ఎస్టేట్ హవా . ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా ఆకాశాన్నంటిన భూముల ధరల గురించి మాట్లాడుకోవటం మొదలయింది . పట్టుమని పది వేలు కూడా లేని ఎకరం భూమి రాత్రికి రాత్రే కోట్లలో పలకడం సర్వ సాధారణమయి పోయింది . ఇలాంటి పరిస్తితులను నాకనుకూలంగా మార్చుకోవాలని నేను , చాట్ల ద్వార పరిచయమయిన ఇతర యువకులతో కలిసి ఒక పకడ్బందీ వ్యూహాన్ని తయారు చేశా . తలా కొంత డబ్బు సేకరించి ఒక అంతర్జాతీయ బిజినెస్ సంస్థ ను నెలకొల్పాను . దానికి కావాల్సిన ఏర్పాట్లనీ ఇండియాలో నేనే చూసుకున్నాను . హవాలా ద్వారా డబ్బులు ఇండియాకు చేరాయి . పథకం ప్రకారం తరువాత చెయ్యవలసిన పనులు ఇక్కడి రాజకీయనాయకులతో పరిచయం పెంచుకోవడం . ఆ పని చెయ్యడానికీ , రిజిస్టరు చేసిన సంస్థకు పబ్లిసిటీ ఇవ్వడానికీ మంచి సహకారం లభించింది . ఇండియాలో కాస్త అభివృద్ది చెందుతున్న పట్టణాలను , నగరాలను ఎంచుకుని ఆ చుట్టుపక్కల వున్న భూములనన్నింటిని తక్కువ ధరలకు బినామీ పేర్లతో కొనుగోలు చేసి రిజిస్టర్ చేసేశాను . తరువాత మొదలయింది జగన్నాటకం . ఓ మాంచి ముహూర్థం చూసుకుని జర్మనీ నుండి జర్మన్ లు నలుగురు , జపాన్ నుండి జపనీయులు ముగ్గురు , స్విట్జర్ల్యాండ్ నుండి ముగ్గురు , అలా ప్రతి దేశం నుండి కొంత మంది విజిటర్ వీసాల మీద ఒక్కో వారం గ్యాప్ తో ఇండియాకు వచ్చారు . రోజూ వారి అద్దె తో ఒక హెలికాప్టర్ మాట్లాడుకున్నాము . ఒక్కో దేశం వారు ఇండియాలో దిగగానే వారు చెయ్యవలసిన పనల్లా కోట్లూ సూట్లు వేసుకుని వాళ్ళ దేశాల్లోని ప్రముఖ కంపెనీల లోగోలు పెట్టుకొని హెలికాప్టర్ లో అంతకు ముందే మేము కొన్న ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ల్యాండ్ అయ్యి వాళ్ళ బాషలో ఏదో రీసెర్చ్ చేస్తున్నట్టు మాట్లాడుకోవడమే . అది చూసిన ఆ అమాయక జనాలు అక్కడ ఎదో పెద్ద కంపెనీ పెడుతున్నట్టు భ్రమపడి పోయేవాళ్ళు . వాటిని బల పరచడానికి ఆ రెండో రోజే కొన్ని ప్రభుత్వ వాహనాల్లో అంటే అంబాసిడర్ కారూ , మారుతీ జీప్ లో అక్కడ పని చేసే రెవెన్యూ సిబ్బందిని తీసుకెళ్ళి వాళ్ళ చేత ఆ చెట్లూ పుట్లను పరిశీలింపచేసి పెద్ద మందు పార్టీ ఇచ్చేవాడిని . ఇది చాలు అక్కడి వాళ్ళకు ఏదో జరిగిపోతుందన్న భావన కలిగించడానికి . ఒక దేశం వాళ్ళు వచ్చి వెళ్ళిన తరువాత ఇంకో దేశం వాళ్ళు హెలికాప్టర్ లో అక్కడికి వెళ్ళి భూముల్ని కొండల్ని కొలిచేవాళ్ళు . ఓ వారం తిరిగేసరికి ఆ చుట్టు పక్కల భూములు రెండు మూడు వందల రెట్లు పెరిగిపోయేవి . నేను కొన్న భూములను ఆ మాయ ధరలకు అమ్మేసి చేతులు దులుపేసుకునేవాడిని . ఒక్కో చోట పెట్టిన ముప్పై నలభై లక్షల ఖర్చుకు కొన్ని కోట్లు వచ్చేవి . అలా కనీసం ఇరవై చోట్ల సృష్టించిన కృత్రిమ డిమాండ్ల తో నా బ్యాంక్ ఖాతాలు కొన్ని వందల కోట్లు చేరుకున్నాయి . ఇప్పుడు నాకున్న డబ్బుతో ఇండియాలో వున్న అధికారులను , మంత్రులను నా గుప్పిట్లో వుంచుకున్నా . నేను చేసింది తప్పు అని నిరూపించడానికి ఎవరి దగ్గరా ఏ ఆధారాలు లేవు . * * * * " ఓహ్ స్వీటీ ! అంత డబ్బు పెట్టుకుని ఏ స్విట్జర్ల్యాండో పోకుండా ఇక్కడికెందుకొచ్చావ్ " " అంది బుగ్గలతో అతని బుగ్గలు నొక్కుతూ . " ఇక్కడ ఎదో సరదాగ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ చూసి ఓ నలభై రోజులు గడిపి వెళ్దామనుకున్నా . కానీ మా ' టీం ఇండియా ' ఇలా ' డాం ఇండియా ' అవుతుందని ఊహించ లేక పోయా . ఇలా అవుతుందని ముందే వూహించి వుంటే ఓ ఇరవై కోట్లు పడేసి ఏ బాంగ్లా దేశ్ నో శ్రీ లంకనో కొని పడేసి వుండేవాడిని . ఎంతయినా నాక్కూడా కొంచెం దేశ భక్తి వుంది " అన్నాడు విజయ్ . " ఓ యువ్ ఆర్ సొ పేట్రియటిక్ , ఐ లవ్ యూ " అంటూ అతన్ని హత్తుకు పోయింది .
పెద్ద పొట్టతో శయనాగారం వేపు నడుస్తున్న భర్తని చూసి , " భుజించడం అయింది . ఇక శయనించడం తరువాత అంశం ! " అంది వెటకారంగా సుబ్బలక్ష్మి .
మిత్రమా తెలుగు బ్లాగులలో కధల గురించి మాత్రమే మాట్లాడే ఈ అద్బుతప్రపంచాన్ని ఇప్పుడే చూస్తున్నాను . అభినందనలు మరోలా అనుకోవద్దు . పేరు ఎబ్బెట్టుగా ఉంది . అలోచించండి . రసదృష్టిని పాడుచేస్తున్నట్లు అనిపిస్తుంది .
ఈ " అనువాదం " ఉద్దేశం నారికేళపాకంగా పేరుపడ్డ ఈ కావ్యాన్ని మా పాఠకులకు వీలైనంత ఆసక్తికరంగా అందజెయ్యటం . అందువల్ల చాలా వర్ణనలు వదిలెయ్యటం జరిగింది . కాని కొంచెం రుచి చూపించటం కోసం మొదట్లో విలిబుత్తూరు , మధురల వర్ణనల్ని కొంతవరకు ఇస్తున్నాను . ఐతే మూలాన్ని శ్రీ వేదం వెంకటరాయశాస్త్రి సంజీవనీ వ్యాఖ్యతో చదవటాన్ని మించింది లేదు . ఎన్నో వింతవింత ప్రయోగాలు , అద్భుతమైన భావచిత్రాలు కనిపిస్తాయి ఈ కావ్యంలో . కనుక రసజ్ఞులకు ఈ " అనువాదం " కేవలం తొలిమెట్టుగా మాత్రం ఉపయోగపడుతుందనీ , మన కావ్యాల్ని స్వయంగా చదువుకోవాలనే కోరికని కలిగించి ప్రోత్సహిస్తుందనీ భావిస్తున్నా .
మూడేళ్లంటే ఇరవయ్యొకటి కాదు . త్రీ ఫింగర్స్ కూడా కాదు . త్రీ ఇయర్స్ . మూడు చెవులు కాదు భాయియోఁ అవుర్ బెహెనోఁ . మూడు ఏడాదులన్న మాట . ఎప్పటికి ? నిన్నటికి . దేనికి ? ఈ బ్లాగులు గిలకటమూ అదీ నేను మొదలెట్టి . ఐతే ఏంటిష ? టిష లేదూ , త్రిష లేదూ . ఊకినే . సింహావలోకనం , మరో వసంతం అంటూ సంవత్సరం నిండినప్పుడల్లా ఆ ఏడాదిలో ఏం పొడిచేసిందీ రాసేసి మీ అసుంటోళ్ల మొహానేసే అలవాటొహటి జేసుకున్నాం గదా . మీరూ ఏఁవనుకోకండా చదివేసి పెద్దరికంగా ప్రోత్సహించేస్తన్నారు గదా . మరి , మీరు మళ్లీ పెద్దరికం జూయించే అవకాశమియ్యాలా వద్దా ? అంచాత కొంత సొంత డబ్బా నింపిన సోదన్న మాట .
పై శ్లోకం చదివి త్యాగరాజ కృతులు వింటే అందులో తాత్పర్యం సులభంగా తెలుస్తుంది . త్యాగరాజు నిజంగా సరస్వతీ పుత్రుడన్న విశ్వాసం కలుగుతుంది . అలా స్వీయ సంగీతంలో స్వీయ సాహిత్యాన్ని నింపి గానం చేసే వాళ్ళని వాగ్గేయకారులన్నారు . కేవలం స్వరపరచడమే కాదు సాహిత్యమూ కూర్చాలి . తమ సొంత గొంతులో ఆ రెంటినీ నింపాలి . ఈ మూడూ వచ్చిన వాళ్ళు చాలా తక్కువమందే ఉంటారు . త్యాగరాజు అసలుసిసలైన వాగ్గేయకారుడు . ఆయనే కాదు , ఆయన శిష్యుల్ని కూడా చాలామందినీ వాగ్గేయకారులుగా మలిచాడు . ఆయన శిష్య పరంపరలో వీణ కుప్పయ్యర్ , వెంకటరమణ భాగవతార్ , మనచంబువాది వెంకట సుబ్బయ్యర్ , పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ , ఇలా ఎంతో మంది వాగ్గేయకారులుగా రాణించారు . చిత్రం ఏంటంటే , శిష్యుల్లో చాలామంది మాతృభాష తమిళం అయినా అందరూ గురువుననుసరించీ , తెలుగులోనే కృతులు రచించారు .
' ఒప్పుల కుప్పా వయారి భామా - గూట్లో ముక్కురాయ్ నీ మొగుడు సిపాయ్ ' అని చమత్కారంగా పాడుకంటూ అమ్మాయిలు ఆడుకొనే వారు .
చీకటిని రెండు చేతులతో బలంగా తోసుకుంటూ ఎంతదూరం వచ్చేసానూ ! బాగుంది ఈ నవతరం సిక్స్ పేక్ హృదయ ఘోష .
మా టీములో " మా ఇంటికొస్తే మాకేం తెస్తారు , మీ ఇంటికొస్తే మాకేం పెడతారు " టైపులో ఓ సోది సాంప్రదాయం వుంది . కొత్తవాళ్ళంతా పాతవాళ్ళతో కల్సిపోవాలంటే పార్టీ ఇచ్చి తీరాలట . పార్టీ ఇచ్చి మరీ కొత్త పోగొట్టేసుకుని పాతబడిపోయి పని మొత్తం నెత్తిన రుద్దించుకోవడానికి నేనేమైనా చిన్నదాన్నా . . ? చితకదాన్నా . . ? కాదు కదా . . . అయినా సరే ఏమాత్రం భయ్యం , బత్తి లేకుండా వాళ్ళంతట వాళ్ళే అలుసు , బచ్చలి పులుసు తీసేసుకుని పార్టీకి మాంచి ( ? ) ముహూర్తం పెట్టేసారు . * * * డబ్బులు , మబ్బులు , సబ్బులు ఎక్కువ కాలం వుండవు . అలాంటి అశాశ్వతమైన వాటి కోసం అనవసర హైరానా పడితే మాత్రం లేనిపోని జబ్బులు వస్తాయి . జరగాల్సింది జరగక మానదు . వదలాల్సింది వదల . . కా . . మానదు . అందుకే వదిలించుకోవడాన్ని , విదిలించుకోవడాన్ని కూడా ఆనందంగా ఆస్వాదించగలగాలి . అదే జీవిత పరమార్ధం . ఇదే ఈ విద్యా అమ్మాజీ ఉపదేశం . సందేశం . ఆదేశం . పాటించండి . సంతోషంగా జీవించండి . * * * అసలే నా సబ్బుల ఫిలాసఫీకి నేనే ఏకైక ఫాలోయర్నాయే . . అందుకే బుద్దిగా బిల్లు విషయం మర్చిపోయి , పార్టీ పేరుతో పని ఎగ్గొట్టి షికారుకెళ్ళడం , రెస్టారెంటులో పీకల దాకా మెక్కడం , తిని తిరిగి అలిసిపోయి ఆఫీసుకొచ్చి సీట్లో అడ్డంగా పడి నిద్దరోవడం . ఇలా మంచి మంచి ఊహల గుంపుని ఆస్వాదిస్తున్నాను . వాటిని చెదరగెడుతూ మా టీం లీడ్ వచ్చాడు . " శ్రీవిద్యా , మన టీములో ముగ్గురికి కార్లున్నాయి . మేము పదిమందిమి రెండు కార్లలో ఇరుక్కుని , సర్దుకుని , కష్టపడి రెస్టారెంటుకి వచ్చేస్తాము . నువ్వు , చందూ ( ఇంకో అమ్మాయి ) మాత్రం విశాలంగా , ఫ్రీగా ఇంకో కారులో రండే . " అనగానే ఆ మాకోసం వాళ్ళు చేస్తున్న " త్యాగానికి " మా మనసు కరిగి నీరై వరదగా మారి మా ఆఫీసుని ముంచేయ్యబోతుంటే " సీనియర్ మేనేజర్ మీటింగు నుంచి బైటకి రాగానే , ఆయనతో కల్సి వచ్చేయండే . . ఇంచక్కా ( ! ) " అని బాంబు పేల్చాడు . ఆ ఇమానమంత ఇశాలమైన కారు " SM " దా . . ? ఆయనతో రావాలా . . ? అంతే దెబ్బకి కరిగిన మనసు గబ గబా భయంతో బిగుసుకుపోయింది . ఇశాలం ట్రాపులో అంత దారుణంగా ఇరుక్కుపోయాక ఏం చేస్తాం . . ? ఆయన కోసం మా ఎదురుచూపులు ఫలించి , ఆయన లోపల చర్చలు ముగించేసరికి , ఓ గంట మా కళ్ళ ముందే కర్పూరంలా కరిగిపోయింది . ఈ పెద్దతలకాయలు వున్నాయే , వాటికి మాలాంటి బుడ్డి తలకాయల మనసు ఎప్పటికీ అర్ధం కాదు . ఎంత సేపు పని . . పని . . పని . . . హు . . కారు దగ్గరికెళ్ళగానే , మా టీం మొత్తం కల్సికట్టుగా మా కోసం త్యాగం చేసేసిన ఆ అద్భుతమైన కళాఖండాన్ని చూడగానే కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు అర్జెంటుగా టపా టపా రాలిపోయాయి . ఆ కారు బంగారు , మా మేనేజరు గారి నాన్నగారిదట . మారుతీ కంపనీ వారి మొదటి మోడలట . ఏది పట్టుకుంటే , ఏది ఊడిపోతుందో అని భయంభయంగా డోరు తీసి చా . . లా . . జాగ్రత్తగా లోపల కూర్చున్నాను . అవసాన దశలో వున్న సీట్లు , కారు పార్టులు , నట్లు , బోల్టులు అన్నిటినీ తనివితీరా మళ్ళీ మళ్ళీ చూసాను . రేప్పొద్దున్న దీన్ని ఏ లండన్ మ్యూజియంలోనో పెట్టేసారనుకోండి . అప్పుడు చూడ్డానికి మన ఆర్ధిక పరిస్థితులు అనుకూలించకపోవచ్చు . అందుకే ఇప్పుడే ఫ్రీగా చూసేసాను . ఎన్ని తెలివి తేటలో కదా . . ! దిష్టి కొట్టకండే . . ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు కారు హుషారుగా వెళ్తుంది . కానీ . . కానీ . . ఆరిపోయే దీపానికే వెలుగెందుకు ఎక్కువ . . ? తుఫాను ముందు ఎందుకంత ప్రశాంతత . . ? డబ్ . . డబా . . డబా . . డబ్ . . కచా . . ఇచా . . లబా . . టకాల్ . . డిమేల్ . . డబా . డబా . . . . . ఎందుకంత డబడబలాడించుకుంటూ బండిని నడుపుతావని పక్కనున్న స్కూటరోడుని చిరాగ్గా చూసాను . ఆ సంగీతం మీ పుష్పక విమానం నిర్వాకమే తల్లీ అని నా వంక ఇంకా . . . బోల్డంత చిరాగ్గా చూసాడు . ఇంక నాన్న గారి బుజ్జిముండ డబడబలు భరించలేక ఒక పక్క కారుని ఆపి , ఏదో ఒకటి చేద్దామని చూసి ఇంకేమీ చెయ్యలేక ఆటో కోసం ఎదురు చూపులు మొదలెట్టాము . ఈలోపు మా SM ఒక పేద్ద బండరాయిని తీసాడు . హ్హా . . హ్హా . . హెహ్హే . . . నువ్వు నాకు నచ్చావులో బ్రహ్మానందం కారుని ఎవ్వరూ ఎత్తుకెళ్ళకుండా ఇంజన్ని రాయితో కొట్టడం గుర్తొచ్చింది . కానీ ఎప్పట్లానే మా అంచనాలని తల్లక్రిందులు చేస్తూ ఆ రాయి తీసుకుని సూటిగా మా వైపుకి వస్తున్నాడాయన . పగలకి ప్రతీకరాలకి సమయమా ఇదీ . నేను చెప్పిన పని చెయ్యను , సాకులు చెప్పి పని ఎగ్గొడ్తాను , పని చేస్తున్నట్టు ఏక్ట్ చేస్తాను . చేసిన కూసింత పని కూడా సవ్యంగా చెయ్యను . అంతమాత్రానికే బండరాయితో బుర్ర పగులగొట్టేస్తారా . . ? మాళ్ళీ నా అంచనాలని తలక్రిందులు చేస్తూ ఆ రాయి తీసుకెళ్ళి వెనక టైరుకి అడ్డంగా పెట్టారు , నాన్న గారి చిట్టికొండని ఎవ్వరూ గుద్దేయకుండా . . నాకు మల్లే తెలివితేటలు ఎక్కువ ఆయనక్కూడా . . అక్కర్లేనపుడు బస్సులు , ఆటోలు బొయ్యి బొయ్యిమంటూ హారన్ మోగించుకుంటూ రయ్యిరయ్యిమని తెగ తిరగేస్తాయి . ఆ రోజు మాత్రం రోడ్డు మీద మేము ముగ్గురం , చుట్టూ చెట్లు , గుట్టలు తప్పితే వేరే ఒక్క పిట్ట కూడా లేదు . ఈ లోపు ఏ దేవదూతలో పంపినట్టు భాషాలో రజినీలా , ఆటో డ్రైవర్లో నాగార్జునలా , హీరోలకే హీరోలా ఒక ఆటోవాడు వచ్చాడు . బంజారాహిల్స్ వస్తావా అని అడిగాము . మమ్మల్ని చూసాడు అసహనంగా . ఆగి వున్న కారుని చూసాడు ఆరాగా . మా మెళ్ళో వేళ్ళాడుతున్న ఐడెంటిటీ బిళ్ళలని చూసాడు ఆశ్చర్యంగా . . . వెంటనే ఏదో అర్ధమైనవాడిలా తల ఊపుతూ వంద అన్నాడు చిరునవ్వులు చిందిస్తూ . . రెండు సందులకి వందేమిటి నాయనా అన్నాము . అంత దగ్గరయితే నడిచివెళ్ళండి అన్నాడు మీళ్ళో బిళ్ళలని తీక్షణంగా చూస్తూ . . ఛీ ఛీ ఈ మెళ్ళో బిళ్ళల బదులు పాములేసుకుని తిరగడం నయం . చేసేదేమీ లేక నీవే మాకు దిక్కిప్పుడు అని గాట్టిగా మొక్కి , ఆటోలో కూలబడి అయ్యవారికి వంద దక్షిణగా సమర్పించుకున్నాము . అయినా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంటే ప్రతీవాడికీ లోకువే . . పది రూపాయల సరుక్కి వంద లాగుతారు . మనలో మన మాట ఆఫీసు బయట ఆ బిళ్ళేసుకుని ఫొజులు ఇవ్వమాకండే . పర్సు ఖాళీ అయిపోతుంది జాగ్రత్త . అలా పడుతూ లేస్తూ కాళ్ళీడ్చుకుంటూ నీరసంగా రెస్టారెంటుకెళ్ళేసరికి మా ముందెళ్ళిన పదిమంది మస్తుగా కుమ్మేసి , ఆవలించుకుంటూ , ఈగలు తోలుకుంటూ సొల్లు కొట్టుకుంటూ మాకోసం ఎదురు చూస్తున్నారు ( ? ? ) . ఎంత రెండు గంటలు లేట్ అయితే మాత్రం మాకోసం ఆగకుండా తినేస్తారా . . ? నా హృదయం తీవ్రంగా గాయపడింది . ఆ తిక్కలో కసి కసిగా అక్కడున్నవన్నీ ఊడ్చి తినేద్దామని ఆవేశంగా ప్లేట్ తీసుకుని ఫీల్డులోకి దూకాను . తీరా చూస్తే ఏమున్నాయి అక్కడ , నా తలకాయ్ . టమాటా తొక్కులు , దోసకాయ ముక్కలు , క్యాబేజీ తొక్కలు , నిమ్మకాయ చెక్కలు . ఇవ్వన్నీ రైతుబాజార్లో సరసమైన ధరలకి దొరుకుతాయిగా . . ఇంకోపక్క క్యాలీ ఫ్లవర్ పుల్సు , కుక్కగొడుగుల పులావు , చల్లారిపోయిన చపాతీలు . ఏం తినాలో తెలియక , అస్సలు తినే ధైర్యం లేక , అలా అని తినకుండా వుండలేక నోర్మూసుకుని పెరుగన్నం పెట్టుకొచ్చాను . బిల్లులో నా వాటా గుర్తు తెచ్చుకుంటూ , గుడ్లనీరు కక్కుతూ , వెక్కుతూ పెరుగన్నం బలవంతంగా కుక్కుకుంటుంటే అర్ధమయ్యింది నాకు . జూనియర్లుగా వున్నపుడు ర్యాగింగ్ చేసారని ఏడ్చి , సీనియర్లయ్యాక వాళ్ళే మళ్ళీ ర్యాగింగ్ ఎందుకు చేస్తారో . . . . ! హ్హి హ్హీ . . రాబోయే కొత్తవాళ్ళు పార్టీ ఇవ్వడానికి నా స్వహస్తాలతో మాంచి మూహుర్తం పెట్టడం నా భవిష్య దర్శినిలో దివ్యంగా , మనోహరంగా కనిపిస్తుంది మరి .
ఓ పెద్దమనిషి పాపం , నిలుచున్నవాళ్ళలో ఒకణ్ణి , ' మీరు ఇక్కడ దిగుతారా ? ' అనడిగాడు - లేదు అంటే , కొంచెం జరగమనే వుద్దేశ్యం తో . దానికి అతని సమాధానం - ' నేనే కాదు - ఇంకో అయిదువందల మంది దిగుతారు . రైలు ఐదు నిమిషాలు ఆగుతుంది - అప్పుడే అందరూ దిగాలి ! ' అని .
" ఇంట్లో టిఫిన్ చేసి చాలా రోజులైంది గదా , ఇవ్వాళ్ళ డిన్నర్‌కి ఎటైనా బైటికెళ్దా మనుకున్నా , అంత దాకా ఇది ఉపశమనం అనుకో ! " అన్నాను చిరునవ్వుతో . " కారు బ్రేకులు సరిగ్గా పని చేస్తున్నయ్యా ? " అనడిగా , తను పకోడీలు నంచుకుంటూ బీరు సేవిస్తుండగా . " ఆ , ఆ , బానే వుంది . " అన్నాడు . " నిన్న డాన్సు పోతే పోయింది , పాపం , ఆ సర్వీస్‌స్తేషన్లో కూర్చుని నువ్వు మంచి బాస్కెట్‌బాల్ గేమ్ మిస్సయినట్టున్నావే . " అన్నా చాలా కేషువల్‌గా . గోపాల్ మొహంలో చిన్న కలవరపాటు ఒక్క క్షణంలో అలలాగా దొర్లిపోయింది . సర్దుకుని , " అవునుట , ఇవ్వాళ్ళ ఆఫీస్‌లో విన్నాను . నీకెప్పణ్ణించీ బాస్కెట్‌బాల్ మీద ఇంట్రస్టు ? " అని ఎదురు ప్రశ్న వేశాడు . ' ఐ సీ ' అనుకున్నా . బాసు ఇంకా దాచిపెట్టాలనే చూస్తున్నాడన్న మాట . ఇక బ్రహ్మాస్త్రం వెయ్యాల్సిందే . కాసేపు అదీ ఇదీ మాట్లాడి సడన్‌గా మాట మార్చి , " నీకు చాలా థేంక్స్‌చెప్పుకోవాలి , డార్లింగ్ నిన్న డ్రైక్లీనింగ్‌పికప్ చేసుకున్నందుకు . ఇవ్వాళ్ళ మా స్పాన్సర్లతో మీటింగుకి సరైన డ్రెస్ లేదే అని విచార పడ్డాను పొద్దుట . తీరా క్లోజ్సెట్‌లో చూస్తే డ్రైక్లీన్ చేసిన బ్లేజర్‌వుంది . థేంక్యూ సో మచ్ " అన్నా , తన దగ్గరగా జరిగి బుగ్గ మీద ముద్దు పెడుతూ .
కానీ అదే విషయాన్ని ఇంకో సంగీతకారుడు బలపరచడం చూసి ఉండబట్టలేక రాస్తున్నాను .
సమస్త కర్మములను ఎల్లప్పుడును చేయుచున్నవాడైనను కేవలము నన్నే ఆశ్రయించువాడు ( శరణుబొందువాడు ) నా యనుగ్రహము వలన నాశరహితమగు శాశ్వత మోక్షపదమును పొందుచున్నాడు .
" ఐతే ఇప్పుడేం చెయ్యాలి ? అనం పన్నెండు మందిమి . గురువుగారు కాక శిష్యులం పన్నెండుమందిమి . "
1998 లోనో 99లోనో - సరిగ్గా గుర్తులేదు - ఒక స్నేహితురాలి ప్రోద్బలంతో ఒక గురువారం సాయంత్రం ఏన్ ఆర్బర్ లో ఒక యోగా తరగతికి వెళ్ళాను . ఆ తరగతిని నడుపుతున్నది ఒక తెల్లావిడ . బార్బరా లిండర్మన్ . మొదటగా చూడగానే గౌరవభావం కలిగించే రూపం . తెలుపూ నలుపూ సమపాళ్ళలో కలగలిసి రింగులు తిరిగి పొట్టిగా కత్తిరించుకున్న జుట్టు . పెద్ద ఫ్రేమున్న కళ్ళద్దాలు . ఎంతో దయతో స్నేహపూర్వకంగా చూసే కళ్ళు . చక్కని చిరునవ్వు . మృదువైన గొంతు . పొడుగ్గా సన్నగా రివటలాంటి శరీరం . మొదటిసారి వస్తున్నారా , మీరు ఇండియా నించి అల్లే వుందే , చాలా సంతోషం . మీరిది ఆనందిస్తారని ఆశిస్తాను అంటూ ఆహ్వానించారు . మాకు చోటు చూపించారు . చూస్తుండగానే ఆ హాలు కొంచెం చోటు కూడా మిగలకుండా నిండిపోయింది . నాకు తరవాత తెలిసింది , ఆ గురువారపు తరగతి ఆ ఊరి మొత్తానికీ చాలా పాప్యులర్ అని . ఆ మొదటి తరగతి అనుభవం ఎలా జరిగిందో నాకిప్పుడు గుర్తు లేదు . కానీ ప్రతి గురువారం నేనా తరగతికి హాజరవటం మొదలు పెట్టాను . నెమ్మది మీద ఆమె నడిపే బుధ శుక్ర వారాల ఉదయపు తరగతులకి కూడా వెళ్ళటం సాగించాను . ఇది నేను 2002 లో ఆ నగరం వదిలిపెట్టే వరకూ సాగింది . బార్బ్ గురువారపు తరగతి చాలా చిత్రమైనది . దాని పేరు Poses to Sacred Music . సుమారు గంటన్నర క్లాసు ఐదారు విభాగాలుగా సాగేది . ప్రతి విభాగానికీ ఒక పాటో , కొన్ని పాటల వరుసో నేపధ్య సంగీతం . అన్నిటికంటే తమాషా ఏవిటంటే మూణ్ణెల్లకోసారి ఈ sacred music మారిపోయేది . ఒక మూణ్ణెల్లు హిందూ భజనలు . ఒక మూణ్ణెల్లు కిరస్తానీ భజనలు . మూడో క్వార్టరులో ముస్లిము భజనలు ( ఔను ఉన్నాయి , వింటానికి చాలా బావుంటాయి కూడా ) . చివరు మూణ్ణెల్లూ , వివిధ మతాల భజనలు ( టిబెటను బౌద్ధము , నేటివ్ అమెరికనుల ప్రార్థనలు , ఆఫ్రికను ప్రార్థనలు , ఇలా ) . మారిన సంగీతానికి తగ్గట్టు విన్యాసంలో కొద్దిగా మార్పులు చేసేవారుగాని , మొత్తమ్మీద ప్రోగ్రాము ఒకలాగానే ఉండేది సంవత్సరం పొడుగునా . చివరి ఐదు నిమిషాలు శవాసనం . మా శరీరాల్ని మనసుల్ని విశ్రమింప చెయ్యటానికి తన మెత్తటి గొంతుతో సూచనలు చెపుతూ మమ్మల్ని ఆ అంతర్లోకంలోకి చేరవేసేవారామె . మళ్ళీ అంతే మృదువుగా మాట్లాడుతూ ఆ యోగనిద్రలోంచి మేలుకొలిపి ఆ వారంలో తనకి తోచిన ఒక మంచి ఆలోచనో , లేక ఎక్కడన్నా చదివిన / విన్న కొటేషనో , మనసుకి ఉత్తేజం కలిగించే మాటలు చెప్పేవారు . ఆమె ఏ ఒక్క మతాన్ని గుడ్డిగా నమ్మి అనుసరించినట్టు కనపడదు . ఆమెని బౌద్ధ గురువుల ఉపన్యాసాలు , ధ్యాన కేంద్రాల్లో చూశాను , హిందూ కీర్తన సభల్లో చూశాను , క్రిస్మసు టైములో యూనిటేరియన్ యూనివర్సలిస్టు చర్చి కార్యక్రమాల్లో చూశాను . యోగము , దయ , మానవత్వమూ ఆమె నమ్మి ఆచరించిన ముఖ్యసూత్రాలు . బార్బ్ తరగతిలో యోగవిన్యాసాలు ఒక అనుభవమైతే , ఆమెతో పరిచయం , సాహచర్యం , ఆమె దయని ప్రత్యక్షంగా చూస్తూ దాని ఫలితాలు అనుభవిస్తూ ఉండడం , ఆమె ద్వారా పరిచయమైన ఇతర అద్భుతమైన వ్యక్తులు , ఆమె ప్రోద్బలంతో మేము హాజరై ఎంతో ఆనందించిన అనేక కార్యక్రమాలు . . అవ్యాజంగా ఆమెకి మా మీద కలిగిన వాత్సల్యం - మాటల్లో వర్ణించలేను . బార్బరా లిండర్మన్ ఫిబ్రవరి 24న స్వర్గస్తులైనారని ఇవ్వాళ్ళే తెలిసింది . 72 ఏళ్ళు . అమెరికాలో ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్న స్త్రీ పోవలసిన వయసు కాదు . ఒకటనిపిస్తుంది - అల్లకల్లోలమవుతున్న ఈ ప్రపంచానికి ఒక దిక్కూ తెన్నూ చూపించడానికి ఆ పైవాడికి ఇలాంటి సమర్ధులైన స్త్రీల అవసరం అర్జంటు అనిపించి పిలిపించుకున్నాడేమో నని .
టెలిఫోన్ , కంప్యూటర్ వంటి యంత్రాల్లో ఈ ప్రక్రియలు చాల ఖచ్చితమైన ప్రసార అనుక్రమణికల్ని అనుసరించి జరుగుతాయి . ఉదాహరణకు కంప్యూటర్లో బొమ్మలు తెరమీద రూపించే క్రమం అంచెలంచెలుగా Graphics Pipeline అన్న ఖచ్చితమైన పద్ధతిని అనుసరించి జరుగుతుంది . అలాగే టెలిఫోన్లు మనం ఫోన్ నెంబరు నొక్కిన మొదలు అవతలి మనిషి మన మాటల్ని వినే వరకు ఆ అంచెలన్నీ Communications Event Flow అని ఒక ఖచ్చితమైన క్రమాన్ని అనుసరించి జరుగుతాయి . ఈ అంచెలు ( steps ) - 1 . ఫోన్ నెంబరు నొక్కడం ; 2 . మాటలు సృష్టించిన శబ్దతరంగాలకు మైక్రోఫోన్ స్పందించడం ; 3 . ఈ స్పందనల్ని మైక్రోఫోన్ విద్యుత్ప్రకంపనలుగా , సంఖ్యలుగా మార్చడం ; 4 . సంఖ్యల సంకేతాలు టెలిఫోన్ తీగెల్లోంచి ఇంకెంతమందివో ఇతరుల ఫోన్ కాల్స్‌తో కలసి ప్రయాణం చేసి అవతలి మనిషి ఫోన్‌ని చేరుకోవడం ; 5 . గ్రహీత ఫోన్లో ఈ అంచెలన్నీ దీన్ని తిరగేసిన క్రమంలో ( reverse order ) మళ్ళీ జరిగి చివరికి అతను ఆ మాటల్ని వినడం - ఇలా వివరించి చెప్తారు . వీటిలో ఒక్కొక్క అంచెలోని సూక్ష్మాల్ని , అంటే inner mechanicsను విశ్లేషించడానికి వాటి event flowని మళ్ళీ అనేక అంచెలుగా విడదీసి పరిశీలిస్తారు . సృజనశీలి యంత్రం కాదు . కాని అతని అంతరంగంలో ఒక కంప్యూటరు వంటి మెదడు , ఆ పైన ఒక ఆదిమ వానరం అనదగిన జాంతవ ప్రకృతి , ఆ పైన నాగరికుడు , మర్యాదస్తుడు , సంస్కారి అనదగిన ఒక మనిషి - వీళ్ళు ముగ్గురూ ఉన్నారు . ఈ ముగ్గురి స్వభావాలు , అవసరాలు , ప్రవర్తన ఇవి సృజనల ప్రసారాల్ని అర్ధం చేసుకోడానికి పనికొస్తాయి .
ఎప్పటిలాగే తెల్ల మంచు చీరని కట్టుకొని ఈ నగరం క్రొత్త సంవత్సరం కోసం ముస్తాబవుతుంది
శ్రీకాకుళం : జిల్లా కేంద్రంలో ఎఫ్ . ఎం . రేడియో స్టేషన్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి . ప్రముఖ కార్పొరేట్ సంస్థ దీన్ని ఏర్పాటుచేసేందుకు ముందుకువచ్చింది . ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఎఫ్ . ఎం . స్టేషన్లను ఏర్పాటుచేసిన ఈ సంస్థ ఇప్పుడు తన కార్యకలాపాలను శ్రీకాకుళంలాంటి పట్టణాలకు విస్తరించాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇక్కడ రేడియో కేంద్రం ఏర్పాటవుతోంది .
@ శిశిరా , థాంక్యూ . శిశిర పోస్టుల్లో ఎన్ని మంచి విషయాలు తెలుస్తాయో తెలుసా . . . @ హాయ్ హాయ్ శివాని ఇవన్నీ సేవ్ చేసి పెట్టుకుంటానంటే . . . నేను హ్యాపీ హ్యాపీ . . . మరి బోల్డన్ని థాంకూలు కూడా . @ చిన్ని గారు , మిమ్మల్ని చూస్తేనే చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది . మీరు ఇంకా చాలా చాలా ప్రోగ్రెస్ సాధించాలి . అది మేమందరం చూడాలి . మీకు ధన్యవాదాలు . @ సరయు గారు , స్వాగతం . మీ పేరు వింటుంటే మొత్తం రామాయణమే పారాయణం చేసినట్లనిపిస్తోంది . చాలా మంచి పేరు . థాంక్యూ .
అంటే అతను బ్రతికి ఉన్నట్టా లేక చచ్చి దెయ్యమయ్యాడా ?
రాజెంద్ర కుమారు గారు : జ్యోతిగారి షడ్రుచుల్లో కంది పచ్చడి గురించి ఇస్తారట మీ ఆవిడ కి చెప్పండి నేర్చేసుకొంటారు . కాకపోతే కొంచం వేలు నలిగినప్పుడు " రాదే చెలి నమ్మరాదే చెలి " అని పాడుకొనే అవకాశము రానివ్వకండి . ఇంకోటి , నలభీమ పాకం అన్నారు కాని రమణి , జ్యోతి పాకం అనేలేదుగా మగవారికి వంట రాకపోవడం అంటే నలభీములకి ఎంత అన్యాయం చేసినట్లో కదా , మీరు వంటల్లో ఎందులో స్పెషలో కాస్త చెప్పండి . . కొంచం మేము నేర్చేసుకొంటాము . @ రాధికగారు , లలిత గారు , విహారి గారు : నెనర్లు , ఇక కందిపచ్చడి కేర్ ఆఫ్ జ్యోతిగారు షడ్రుచులే .
ప్రవీణ్ , ఇండియా ఆసిస్ మాచే అదిరిపొయింది . ఫైనల్ మాచ్ కూడా అలానే ఉంటే " అదిరిపోతుంది " అనే పదం చిన్నదవుతుంది . ఏమంటారు ?
తలపు గారు , మీరు ఏదన్నా చెప్పదలచు కుంటే నేరుగా ఆ బ్లాగులోనే చెప్పచ్చుకదా . అందుకోసం ఒక టపా రాయడం ఎందుకు . బ్లాగులన్నవి సొంత టపాలు . ఎవరినన్నా ఉద్దేసించి బాధ పెడితేనో లేక కావాలనే కొందర్ని కించపరిచేలా రాస్తేనో అప్పుడు తప్పు పట్ట వచ్చు . అభిప్రాయ బేదాలకు తావు లేకుండా ( ఇంటి విషయాలు , జోకులు , పద్యాలు ) రాసేటప్పుడు వాటిని ప్రశ్నించడానికి లేదు . అలాగే ఎవరు ఏ బ్లాగులో ఎలా విన్నవించుకున్నా అది నచ్చితే సమాదానం ఇవ్వచ్చు లేకపోతే లేదు . ఏది ఏమైనా ఆ బ్లాగు నచ్చితే చూస్తారు లేక పోతే అంతటితో ఆపేస్తారు . అది పెద్ద విషయమేమీ కాదు . నా ఉద్ధేశ్యంలో బ్లాగులన్నవి విషయన్ని పంచుకోవడానికి , సరదాగా సమయాన్ని గడపడానికి ఉపయోగపడతాయి . ఇలా ఇతర బ్లాగుల గురించి ( తీవ్ర మైన అభిప్రాయ బేదాలొస్తే తప్ప ) వ్యంగంగా చెప్పడం ఆరోగ్యకరం కాదనిపిస్తోంది . ఇది నా అభిప్రాయం . నేను కూడా ఎందుకు ప్రతిస్పందించానంటే మీరు రాసిన ఈ టపా నేను ఈ మధ్య రాసిన " ఒక విజ్ఞప్తి " కి సమాధానం లాగా వుంది కాబట్టి . " నా బ్లాగు నా ఇష్టం " అంటే క్షమించండి . ఇక మీ ఇష్టం . - - విహారి .
కాసేపు ఏకాకిలా అనిపిస్తాను . . కాసేపు ఒక్కడినే కాను అని గుర్తు చేసుకుంటాను . . కాసింత నిద్ర . . కాసేపు మెలకువ . . కాస్తంత చీకటి . . అంతలోనే వేకువ . . అన్ని అధ్యాయాలను కూడుకుని ఇదే నా జీవితమని తెలుసుకుంటూ ఉంటాను . తల ఎత్తి పైకి చూసినప్పుడల్లా . . కోరుకునే రేపటి రోజు ఎంతో ఎత్తులో కనపడుతూ ఉంటుంది . . మొదటలో తడపడినా . . నెమ్మది నెమ్మదిగా ఆకాంక్షలకు ఆచరణలను జోడించి నిచ్చెనను తయారు చేసుకుంటాను . . పై పైకి వెడుతుంటాను . . మధ్య మధ్యలో . . ఆశలు ఆంక్షల దెబ్బలు తగిలి జబ్బు పడతాయి . . తిరిగి తేరుకున్నాక తూరుపుని చూస్తాయి . . అటుపై . . అటువైపే పయనిస్తాయి . . పయనపు ప్రారంభంలో ని దూరాలు . . ఆఖరుకు చేరువవుతాయి . . చేరుకున్న శిఖరాగ్రాలు . . చుట్టూ ప్రపంచాన్ని కొత్తగా చూపిస్తాయి . . సాధించిన విజయాలు . . ప్రపంచానికి నన్ను కొత్తగా పరిచయం చేస్తాయి . . . అన్నిటినీ మించి . . నాకు నాపై గల నమ్మకం గొప్ప తృప్తినిచ్చి అభినందిస్తుంది . . * picture credit goes to original photographer and source . It will be removed in case of any objections .
అభినంద " నీ " య " సేవకు " అభినందనలయ్య రాఘవాఖ్యుడ ! నీకున్ శుభ కర సాహిత్యాంశము లభవుడు కరుణించి యొసగు నద్భుత ఫణితిన్ .
చేయి జారిన క్షణం తిరిగిరాదన్న స్పృహ ఉండాలి . ఆ స్పృహతో జాగ్రత్తగా నడుచుకోవాలి . ఒకవేళ జారితే అదొక పాఠం అనుకోగలగాలి .
పద్మవల్లిగారు , ఆ లీడ్ ఇచ్చినందుకు నెనర్లు . కొన్నేళ్ళ కిందట సరిగ్గా ఆ పనే చేశాను , కానీ ఆ ఆకు తీవ్రమైన గమేక్సిన్ వాసన కొట్టి వొండిన పప్పు కూడా పారేశా . ఆ తరవాత మళ్ళీ ఎప్పుడూ కొనే సాహసం చెయ్యలేదు . ఇప్పుడేవన్నా పరిస్థితి మారిందేమో .
" భాష విశాలమైనది , నిత్య ప్రవాహిని . పలు విషయములలో లాక్షణికుల దృష్టి భిన్నభిన్నమయి ఆయా కాలముల ననుసరించి ఆయా లక్షణకర్తల అభిప్రాయములను సమన్వయము చేసుకొనవలసియుండును . వేరువేరు కాలములలో వేరువేరు ప్రాంతములందలి లాక్షణికుల గ్రంథములు - కనీస మీనాటికి లభ్యమగుచున్నంతవరకైన పరిష్కృతములై వెలువడినచో - తెలుగుభాషాచ్ఛందో లేఖన సంప్రదాయములు , మరి వాటి బహుముఖీనత , విశాల ప్రయోగ వైలక్షణ్యము , క్రమపరిణతి మొదలగు పలు విషయములు స్పష్టమగుటకు వీలు కలుగును . "
ఇంత తొందరగా ఈ బ్లాగును అప్ డేట్ చెస్తున్నదుకు దిలీప్ గారికి అభినందనలు . .
స్టిక్కీ పైని " థాంక్స్ " అన్న పదాన్ని చూసేప్పటికి మధు కి పూర్తిగా తెలివొచ్చింది . తనకు చదవడమే కాకుండా వ్రాయడం కూడా వచ్చని తెలిసొచ్చింది . తన వైపు ఎండ్ టేబిల్ మీది పచ్చ రంగు స్టిక్కీ ప్యాడుందని గుర్తొచ్చింది .
ఎంతనుకున్నా సరే ఇలాంటి గమ్మతైన స్నేహితులు , స్మృతులు లేకపోతే నిత్యం సంఘర్షణతో సాగే జీవితం మరీ ఉప్పూ , కారం లేని వంట ( మంట , పెంట కూడా ) అయిపోదూ . అందుకే అందుకోండి హ హా హాసినీ లు జోహార్లు .
కశింకోటలో జరిగిన కౌలురైతుల జిల్లా సదస్సులో మంత్రులు చేసిన ప్రకటనలు , ప్రశంసలు రైతులకు న్యాయం చేసేటట్లులేవని ఎపి రైతు సంఘం అధ్యక్ష , కార్యదర్శులు ఎ . బాలకృష్ణ , కర్రి అప్పారావు , కౌలురైతు సంఘం జిల్లా కన్వీనర్ కె . రామసదాశివరావు అన్నారు . సోమవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో 70 వేల మంది కౌలుదార్లు ఉండగా ప్రభుత్వ అధికారులు కేవలం 14వేల మందిని గుర్తించినట్లు తెలిపారు . వీరిలో కూడా నిబంధనల పేరుతో సగానికి పైగా రుణం వర్తించదని చెప్పటంతో కౌలుదార్లు నిరాశకు గురయ్యారన్నారు . కౌలుదార్లను గుర్తించే ప్రక్రియ ఆగస్టు చివరి వరకూ కొనసాగించి , భూయజమానితో నిమిత్తం లేకుండా కౌలుదార్లకు గుర్తింపు కార్డులివ్వాలని డిమాండ్ చేశారు .
కశ్యప్ గారు : అడగంగానే పుల్లైస్ కొనిచ్చిన వీరిని ముందుగా ప్రస్తావిస్తే ఏదో స్వార్దం అనుకుంటారని తలుస్తూ . . తటపటాయిస్తూ . . ఏది ఏమైనా వీరిని మర్చి పోకూడదని ఇక్కడ . ఎంత చలాకీగా పాలు పంచు కున్నారంటే , వీరిని చూస్తే దీపావళి సీమటపాసు కాయ గుర్తుకు వస్తుంది
హైదరాబాద్ , మార్చి 8 : మహిళాబిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించేలా వత్తిడి తెచ్చేందుకు శాసనమండలిలో మరో పర్యాయం తీర్మానాన్ని ఆమోదించాలని పలువురు ఎమ్మెల్సీలు కోరారు . అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శాసనసభ మంగళవారం సమావేశం కాగానే ఈ అంశంపై మాట్లాడేందుకు చైర్మన్ డాక్టర్ ఎ . చక్రపాణి సభ్యులకు అవకాశం ఇచ్చారు . సాధారణంగా వాయిదాతీర్మానాలపై చైర్మన్ తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ప్రశ్నోత్తరాలను చేపట్టడం ఆనవాయితీ . అయితే ప్రశ్నోత్తరాలను చేపట్టే ముందే సభ్యులు మహిళా దినోత్సవంపై మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు . జాతీయ స్థాయిలో మహిళాబిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించినప్పటికీ , లోక్‌సభ ఆమోదం పొందలేదని పలువురు సభ్యులు గుర్తు చేశారు . అందువల్ల శాసనమండలి తన వంతు బాధ్యతగా ఒక తీర్మానం చేయాలని టిడిపి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి , మసాల పద్మజ , కాంగ్రెస్ సభ్యురాలు మజ్జి శారద , సిపిఎం పక్షం నాయకుడు సీతారాములు , సిపిఐ పక్షం నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు తదితరులు కోరారు . అయితే గతంలో ఈ అంశంపై తీర్మానం చేశామని చైర్మన్ చక్రపాణి ఈ సందర్భంగా గుర్తు చేశారు . మహిళలూ కార్యసాధకులే : ఖాన్ హైదరాబాద్ , మార్చి 8 : మహిళలు అంకితభావం , పని తనంలో పురుషులకన్నా ఏమాత్రం తీసిపోరని నగర పోలీసు కమిషనర్ ఎ . కె . ఖాన్ అన్నారు . అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిసిఎస్‌లోని మహిళా పోలీసు స్టేషన్‌లో మంగళవారం మహిళా జాగృతి కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా ఖాన్ మాట్లాడుతూ , ప్రతి ఒక్కరూ మహిళా హక్కుల కోసం కృషి చేయాలని అన్నారు . నగరంలో త్వరలోనే మరిన్ని మహిళా పోలీసు స్టేషన్లను ప్రారంభిస్తామని చెప్పారు . మహిళలపై జరిగే నేరాలను సాంఘిక నేరాలుగా పరిగణించాలన్నారు . నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న మహిళా సిబ్బందికి మరిన్ని వసతులు కల్పిస్తామన్నారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు సిపి ( కోఆర్డినేషన్ ) అనురాధ మాట్లాడుతూ , కింది స్ధాయి మహిళా సిబ్బంది ప్రతి రోజూ తమ విధుల్లో పోరాటమే చేయాల్సి వస్తోందన్నారు . ఆత్మస్ధైర్యంతో ముందుకెళ్ళి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు . ఈ సందర్భంగా అనురాధను నగర పోలీసు కమిషనర్ సత్కరించారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న సునీతా కృష్ణన్ మాట్లాడుతూ , సమాజంలో చాలా తక్కువ మంది మహిళలు మాత్రమే హక్కులు కలిగి ఉన్నారని , లక్షలాది మంది మహిళలు ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు . రేడియో వ్యాఖ్యాత రతన్‌ప్రసాద్ , నగర పోలీసు అధికారులు , సిసిఎస్ డిసిపి జె . సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Parvati : పార్వతి - - హిందూ సంప్రదాయంలో శక్తిగా , దుర్గగా అర్చింపబడే దేవత . త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు . భవాని , అంబిక , లలిత , అమ్మ , దాక్షాయణి , కాత్యాయిని , గౌరి , భైరవి , అపర్ణ , కాళి , శ్యామ , ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది . వినాయకుడు , కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు . Prahlaadudu : ప్రహ్లాదుడు - భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు . ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు . ఈతడు అసుర రాక్షసుడు అయిన హిరణ్యకశిపుని కుమారుడు . ప్రహ్లాదునకు దమని అనే కన్యతో వివాహము జరిగినది . వీరికి వాతాపి , ఇల్వలుడు అనే కుమారులు కలరు . Parasuraamudu : పరశురాముడు - - శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ( Parasurama Incarnation ) ఆరవది . త్రేతాయుగము ఆరంభములో జరిగినది . అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది . పరశురాముని భార్గవరాముడు , జామదగ్ని అని కూడా అంటారు . జమదగ్ని , రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు . పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి , అజేయ పరాక్రమవంతుడై , ఆయన నుండి అఖండ పరశువు ( గండ్ర గొడ్డలి ) పొంది , పరశురాముడైనాడు . Paraasharudu : పరాశరుడు - - వసిష్టుని మనుమడు . శక్తి పుత్రుడు . ఇతని తల్లి అదృశ్యంతి . పరాశరుడు ఒకనాడు తీర్థయాత్రకు పోవుచు యమునా నదిలో పడవ నడుపుచున్న మత్స్యగంధిని చూచి మోహించెను . ఆమె కన్యాత్వము పాడవకుండా అభయమిచ్చి , శరీరపు దుర్వాసన పోవునట్లు వరం ప్రసాదించి , యమునా నదీ ప్రాంతాన్ని చీకటిగా చేసి ఆమెతో సంగమించెను . వీరికి వ్యాసుడు జన్మించెను . Parikṣit : పరీక్షిత్తు - - అంటే అంతటా దర్శించగలవాడని అర్దము . అభిమన్యుని కుమారుడు . ఇతని తల్లి ఉత్తర . తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ఇతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రము యోగించెను . దాని మూలంగా కలిగిన బాధనోర్వలేక ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్ధించెను . ఆతని కరుణ వలన బాధ నివారణమై శిశువుగా ఉన్న పరీక్షిత్తు బ్రతికెను . ఇతడు ఉత్తరుని కూతురు ఇరావతి ని వివాహము చేసుకొనెను . ఇతని కుమారుడు జనమేజయుడు . Puthana : పూతన - - - ఒక రాక్షసి . బాలకృష్ణుని చే వధించబడుతుంది . Pradyumnudu : ప్రద్యుమ్నుడు - ప్రకృష్టమైన ( అధికమైన ) బలము కలవాడు ( ధ్యుమ్నము : బలము ) . ప్రద్యుమ్నుడు శ్రీ కృష్ణుడి కి రుక్మిణి కి జన్మించన సంతానం . ప్రద్యుమ్నుడి పాత్ర భాగవతం లొ వస్తుంది . శంభరాసురుడు అనే రాక్షుసుడిని సంహరిస్తాడు . మాయవతి ( రతి దేవి ) ఈయన భార్య . PanchavaTi , పంచవటి : రాముడు వనవాస సమయం లో దండకారణ్యములోని ఆశ్రమము పేరు . = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = Visit my Website - > Dr . Seshagirirao - MBBS
చెట్ల బోటిల్ పన్నెండ్రూపాయిలండీ ! ఈ విలేజిలన్నిట్లో బోటిల్డ్ వాటరు కొనుక్కునీ శక్తిలేని జనాలందరికీ కళ్ళజబ్బో ఎముకల వంకరో మిస్ కేరేజిలో ఏదో ఓ రోగం … . పన్లకి పోలేరు . పన్లకెళ్తే గాని తిండికి టికాణా లేదు ! రెండేళ్ళబట్టి పిటిషన్లు పెట్టీ పెట్టీ ధర్నాలు చేసీ చేసీ మొత్తుకుంటే చివరికి ఇప్పటికి ఆల్ పార్టీ పబ్లిక్ హియరింగ్ కి ఒప్పుకున్నారు .
అనుకోకుండా కొందరిని కలుసుకుంటుంటాం ; కొన్ని క్రొత్త అలవాట్లు చేసుకుంటుంటాం . మన ఇష్టాలతో పనిలేకుండా , మన ఆశలతో పొంతనలేకుండా , పలు సంగతులు మన జీవితంలో జరిగిపోతుంటాయి . అసలు ఎందుకలా జరుతుందని ఆలోచిస్తే సమాధానాలు దొరకవనే అనుకుంటున్నను .
భాస్కర్ రామరాజు : రేపు ఇదే మంత్రివర్గం - మంత్రివర్గం , కాంగ్రెసుపార్టీ కాదు సుమండీ - ఫలానా గన్నయ్య గారి అబ్బాయి ఇంజనీరింగులో మెకానికలే తీసుకోవాలి , ఎలక్ట్రానిక్సు తీసుకోకూడదు అని తీర్మానం చేసిందనుకోండి . . అప్పుడు కూడా నవీనకాలంలో . . అని స్టేట్‌మెంటిస్తారా ? లేక ఆడెవుడి సంగతో మీకెందుకురా , ముందు మీరు పరిపాలన సంగతి చూడండి అంటారా ? గన్నయ్యగారి అబ్బాయి ఏ బ్రాంచిలో చేరాలనేది , కాంగ్రెసు పార్టీకి ఎవరు నాయకుడిగా ఉండాలనేది మంత్రివర్గానికి సంబంధించినంతవరకు - మంత్రివర్గానికి సంబంధించినంతవరకు - ఒక్ఖటే ! మీరేమంటారు ?
23 . ఆంధ్రభాషకు మాతృకమైన భాష ఏది ? - పైశాచీ భాష
ఐసీ ఇలా చేసిన వేన్నీళ్ళను కూడా చారు అని కొంత మంది ఆంధ్రులు తింటున్నారన్న మాట ! ఇక తెలంగాణాంధ్రులు ఎలా తింటున్నారో అని తలుచుకుంటేనే . . ప్చ్ . . పాపం , గుండె తరుక్కుపోతోంది . : P : )
" యెవరో రావాలి ! నీ హృదయం కదిలించాలి . నీ తీగలు సవరించాలి . నీలో రాగం పలికించాలి . " ( కళ్యాణ్ స్థితిని యెంతబాగా చెప్పాడో చూడండి ! )
అప్పుడు మద్రాసు నుండి వేరవడానికి జరిగిన ఆంధ్ర రాష్ట్రోద్యమానికి , ఇప్పుడు , ఇంతకుముందు జరుగుతున్న తెలంగాణ ఉద్యమాలకు పోలికేలేదు . అప్పుడు ఆంధ్రులు వేరౌతమని చేసిన ఏ ఉద్యమాలకు తమిళులు అడ్డంకులు ఎప్పుడూ స్రుష్నించలేదు . అంతెందుకు స్వతంత్రం వచ్చినంక ఎన్నో రాష్త్రాలు ( ప్రాంతాలు ) పెద్దరాష్ట్రాల్లొ నుండి విడిపోయాయి . ఆరాష్ట్రాల్లొ విడిపోతమని అంధోళనలు / ఉద్యమాలు చేస్తే మన రాష్ట్రంలో మాదిరే అడ్డుకున్నారేమో ఇక్కడ రాస్తున్నవాళ్ళు ఎంక్వైరీ చేసి / పరిశోధనలు చేసి ఇక్కడ రాయండి , నాలాంటి వాళ్ళు అభిప్రాయాలను మార్చుకుంటాము . ఇతర పార్టీల వాళ్ళే కాకుండా సీపీఎం వంటి లెఫ్ట్ పార్టీలు / వ్యక్తులు పలుపనికిరాని , అనుమానాలు రేకెత్తించే భావాలను ప్రచారం చేస్తూ అడ్డం రావడం మాతెలంగాణవాళ్ళు జీర్ణించుకోలేక పోతున్నారు . వేరు కాకుంటే తెలంగాణను ఇంకా దోచుకు తినొచ్చు ననే దురాశతోఉన్న ఇతర పార్టీల వారి మాదిరే సీపీఎం వంటి లెఫ్ట్ పార్టీల వారు భావించడం శోచనీయం . నీళ్ళను ( సాగునీళ్ళు , తాగునీళ్ళు ) , నిధులను , నియామకాలను ( లక్షల ఉద్యోగాలను ) , నిప్పులను ( విద్యుత్తు , బొగ్గు ) ఇంతకు ముందు ( ఏబై ఏండ్లుగా ) తిన్నవి , అనుభవించినవి చాలవు , ఇంకా తిందామనుకుంటున్న / అనుభవిస్తున్న వాళ్ళలో లెఫ్టిస్టులు కూడా ఉండడం తెలంగాణ వాళ్ళ దురద్రుష్టం / దౌర్భాగ్యం . మన పాలకులు ఆంగ్లేయులకంటే దుష్టులని స్వతంత్ర పోరాటాలు మానుకున్నామా ? ఐతే తెలంగాణ పాలక వర్గాలు ప్రాంతేతర పాలక వర్గాలకంటె దుష్టమైనవని కూడా మావాళ్ళనుకోవడం లేదు . కాకుంటే ప్రాంతేతర పాలకుల మోచేతి గుండ జారిపోయే నీళ్ళెందుకు తాగడానికి ఆశ పడాలి వేరైపోయి స్వతంత్రంగనే తాగొచ్చుకదా , అని తెలంగాణ బూర్జువాలలో , పాలకవర్గాలలో కొద్ది మందే అనుకుంటున్నారు . అందుకే తెలంగాణ పాలకవర్గాల వాళ్ళు ఇంకా బయటికి రాకుండా కాంగ్రేసు తె . దే . చంకలకిందనే ఉన్నారు . ఇక్కడ రాసిన వాళ్ళలో ఒక్క రహమతుల్లా గారు రాసిన అభిప్రాయాలు మాత్రమే స్వార్ధం లేకుండా , నిస్పక్షంగ రాసినట్లు గా కనిపిస్తున్నాయి . అందుకు అభినందనలు మరియు క్రుతజ్నతలు .
మా అమ్మాయి పుట్టిన రోజున ఇలాగే అనుకున్నాము . కానీ . . ఇంక రేపు పుట్టిన రోజనగా మా అమ్మాయి ఒకటే ఏడుపు . ' నాకు ఒక్క గిఫ్ట్ లేకుండా చేసారు … ' అని . మేము కొంటాము కదా . . అన్నా . . దాని బాధ అది పడుతూనేఉంది . దానితో ఇంక అలాంటి వి పెట్టుకోలేదు . మీరన్నట్టు ఆ మెచ్యూరిటీ రానంత వరకూ కష్టమే . .
మంచి డిస్కషన్ ! నన్ను చాలా ప్రభావితం చేసిన పుస్థకం WHO MOVED MY CHEESE
హైదరాబాద్ , జూలై 4 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ అధ్యక్షుడు కె . చంద్రశేఖరరావు , ఎంపీ విజయశాంతి రాజీనామాలు చేయాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు . సోమవారం తమ కాంగ్రెస్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం కొండా సురేఖ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఈ మేరకు డిమాండ్ చేశారు .
కం . చదివిన తదుపరి వెంటనె వదలక పద్యముల పైన వ్రాయగ వ్యాఖ్యన్ చదువరి గారికి రాఘవ పదములతో చెప్పు ధన్యవాదము లివియే .
' తెరిచి చూపించు ' , తుపాకీ గొట్టం ఇంకొంచెం ముందుకొచ్చింది . తెరిస్తే మెత్తటి మృదువైన నీలి రంగు గుడ్డ పై పసిడి రంగులో మెరుస్తున్న గిబ్సన్ మాండలిన్ .
రాష్ట్ర రైతాంగం ఎదురుకుంటున్న ప్రకృతివిపత్తులను రాజకీయం చేయకుండా కలిసికట్టుగా అన్నదాతను ఆదుకుందామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విపక్షాలకు విజ్ఞప్తి చేశారు . రబీలో రైతాంగానికి పంట రుణాలు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని ఆయన హామీ ఇచ్చారు . రంగుమారిన , మొలకెత్తిన , తేమ , నూక కొనడానికి నిబంధనలు సైతం సడలించి రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజకు కనీస మద్దతు ధరతో కొనడానికి నిర్ణయం తీసుకుంటున్నాం . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్ర రైతాంగానికి బహిరంగలేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు . రైతాంగానికి చేయూతనిచ్చే విషయంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌ఫవార్ , ఎఫ్‌సిఐ ఛైర్మన్‌తో చర్చించాం . బీమా సొమ్ము కట్టిన రైతులకు పూర్తి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నాం . దీనితోపాటు తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ కూడా చేశాం . ఇప్పటికే 483 మండలాలను వర్ష , వరద ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించాం . ఇందులో మరికొన్ని మండలాలు కూడా చేరే అవకాశం వుంటుంది . ఇప్పటివరకు రైతులకు చెల్లించాల్సిన పాత బకాయిలు రూ . 685 కోట్లు మంజూరు చేశాం . పంట నష్టం , బాధిత రైతాంగం గుర్తింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యుల తీసుకుంటాం . ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఇప్పటికే ప్రధాన మంత్రిని కోరాం . " కఠోర వాస్తవాలు ఇలావుంటే రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి మనో ధైర్యం చెప్పి ఆసరాగా నిలవాల్సిన రాజకీయ పార్టీలు చేస్తున్న నిర్వాకమేమిటి … ? రైతుల పేరిట రాజకీయమే కదా . . ఇవ్వన్నీ మరచిపోయి మన రైతులు భారీ వర్షాలు , తుఫాన్‌ల వల్ల దెబ్బతిని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మళ్ళీ మనరైతుల పేరిట ప్రతిపక్షాలు రాజకీయం చేయడం ఏ రకంగా సమంజసమో మీరే ఆలోచించండి . మళ్ళీమళ్ళీ చెబుతున్నా . . నిరంతరం రైతు సంక్షేమం కోరే రైతు ప్రభుత్వమిది . రైతులకు ఆత్మస్థైర్యం కల్పించే మీ ప్రభుత్వం . మీ కెప్పుడూ … అండగా ఉంటుంది . రైతు సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం నిర్విరామంగా చేస్తున్న కృషిని ఆశీర్వదించండి , అంటూ … ఆయన రైతాంగాన్ని కోరారు . అంతేగాకుండా రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు . వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరుగాలం శ్రమించిన పంట ఫలాలు నీటిపాలు కావడంతో రైతు గుండె చెరువు కాక మరేమౌతుంది మరి . నోటి దగ్గర కూడు చేజారి పోయింది , ఇది నన్నెంతగానో కలచివేసింది . యుపిఏ ఛైర్‌పర్స్‌న్ సోనియా గాంధి , ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రైతాంగానికి ఎనలేని సేవ చేస్తున్న విషయం తెలియంది కాదు . గత 15 మాసాలలో వరుసగా 5 మార్లు సంభవించిన వరదలు , భారీ వర్షాలు , తుఫానుల వల్ల మనం ఎంతగానో దెబ్బతిన్నాము , డిశంబర్ నెలలో వచ్చిన వర్షాలు మరింత బాధను మిగిల్చాయి . రైతు బాంధవుడు , సేద్యం " దండుగ " . . కాదు " పండుగ " అని నిరూపించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన బాట , చెప్పిన మాట మాకు ఆదర్శం . మా ప్రభుత్వ ఆలోచనలు , తీసుకున్న చర్యలన్నీ రైతు సంక్షేమం కోసమే . ఇప్పటికే దాదాపు 28 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం . రూ . 1 , 250 కోట్ల విద్యుత్తు బకాయిలు కూడా రద్దు చేయడం జరిగింది . 2004 - 05 నుండి ఇప్పటివరకు 36 . 5 లక్షల రైతులకు లబ్ధి చేకూరేలా రూ . 2 , 700 కోట్లు పంట భీమా కింద చెల్లించడం జరిగింది . రాష్ట్రంలో 5 . 83 కోట్ల రైతాంగానికి రూ . 1 , 61 , 100 కోట్ల రుణాలు అందజేశాం . రుణమాఫీ కింద 2008 - 09లో 64 లక్షల మంది రైతాంగానికి 11 , 350 కోట్ల లబ్ధి చేకూర్చింది ఈ ప్రభుత్వం . రుణమాఫీ వర్తించని 32 లక్షల మంది రైతాంగంలో ఒక్కొక్కరికి రూ . 5ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రూ . 1 , 600 కోట్ల మేరకు ఆర్థిక సాయం అందించింది . గత ప్రభుత్వ హయాంలో హెక్టారురు రూ . 1500ల ఇన్‌పుట్ సబ్సిడీ ఉండేది . దాన్ని అంచెలంచెలుగా పెంచుతూ రూ . 4 , 500లు చేశాం . ఇప్పుడు జరిగిన నష్టం చూశాక హెక్టారుకు రూ . 6వేలు ఇవ్వాలని నిర్ణయించాం .
మరల మాటుకు నెట్టివేయబడిన మనసులు రేపైనా స్పందించవా ? మానవత్వం పరిమళించదా ?
' ఐతే ఏం ? అమెరికన్ ప్రెసిడెంట్ థియొడోర్ రూస్వెల్ట్ , ఇంకా కొంతమంది పెద్దల పూనిక వల్ల ఈ మెమొరియల్ 1909లో ఏర్పడిపోయింది . కొద్దిగా షెల్లీ , బైరన్‌ల జ్ఞాపికలు కూడా ఇందులో జత పర్చారు . ఎందుకీ మెమోరియల్ ? సుమారు 200ఏళ్ళ నాటి రొమాంటిక్ కవులకు , వారి లిరికల్ పొయెట్రీకి ఇది ఎలాటి గుర్తు ? ' అనుకుంది నిసి .
చినుకు చినుకు చినుకులో . . ఎన్నివేళ చినుకులో . . తళుకు తళుకు మెరుపులో . . వజ్రమంటి తునకలో . . గగనతలమునుండి రాలి . . . పుడమితల్లి ఎదను తాకి . . . స్వాతిముత్యమల్లె మారి . . . చిలిపి నవ్వులో . . వాన చినుకులో . . నేలపరిమళాల నీటిపువ్వులో . . పరవశానపొంగే చిన్ని గువ్వలో . . కళ్ళలో తారలై ఈ సందేవేళలో . . ఇష్టమైన ఇసుకఇంటి గూటిలోన సూదిగుచ్చె చినుకులంటే కోపముందిలే తనువుపైన మత్తుజల్లి తాపమంత ఎదనురేపు జల్లులిపుడు ఇష్టమాయలే కాగితాల పడవతోటి నీటిబుడగలన్ని పేల్చి మరువలేని కేరింతలే నేలపైన చెవినిఆన్చి చినుకు చేయు సవ్వడుల్ని విన్నక్షణము తీపిగురుతులే నా చిన్ననటి జ్ఞపకాలు ఒక్కసారె నన్నుదోచి వయసుమరచి చేయతోచెలే చినుకు చినుకు చినుకులో . . చల్లగాలితోటి వచ్చి నింగివైపు చూడనీని వర్షమంటె చిన్నచూపులే మనసులోన దాగివున్న ఆశకేమొ రెక్కలొచ్చి రివ్వుమంటు ఎగురుతుందిలే బాధలోన నవ్వులోన కనులవెంట చుక్కలోన భేదమిపుడులేనెలేదులే కళ్ళలోన కడలినుండి బాధలన్ని నవ్వులయ్యి చిలిపిజల్లులీవానలే నా చిన్ననటి జ్ఞపకాలు ఒక్కసారె నన్నుదోచి వయసుమరచి చేయతోచెలే చినుకు చినుకు చినుకులో . .
గొబ్బెమ్మలు . . పెద్ద వయసు స్ర్తీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసిన గొబ్బి ళ్ళను ముగ్గుల మధ్యలో పెడతారు . గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళె్ళైన గోపికలకు సంకేతంగా భావిస్తారు . ఈ ముద్దల తలమీద కనిపించే రంగుల పూలరేకులు , పసుపు కుంకుమలు ముతె్తైదువులకు సంకేతం . గోపీ + బొమ్మలు = గొబ్బెమ్మలు అని చెబుతుంటారు పెద్దలు . మధ్య వుండే పెద్ద గొబ్బమ్మ గోదాదేవికి సంకేతం . సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణభక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు . దీనిని సందె గొబ్బెమ్మ అంటారు . గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి , దానిపై గుమ్మ డి పూలతో అలంకారం చేస్తే చాలా అందంగా వుంటుంది .
నవ్వుల పువ్వుల్ని పూయించిన వేసవి శిబిరం కొండవీటి సత్యవతి మే మొదటివారంలో ఓ రోజు ఉదయాన్నే సి . సుజాత ఫోన్ చేసింది . మూసాపేటలోని ఒక మురికివాడలో తాము ఒక వేసవి క్యాంప్ పెట్టబోతున్నామని , నన్నూ రమ్మని ఆ ఫోన్ సారాంశం . అంతేకాదు ప్రముఖ నవలారచయిత్రి యద్దనపూడి సులోచనారాణి తన పేరు మీద ఒక ఫౌండేషన్ ( వై . ఎస్ . ఎస్ . ఆర్ . ఫౌండేషన్ ) ఏర్పరచారని , దానిమీదనే ఈ క్యాంప్ మొదలు పెడుతున్నా మని కూడా చెప్పింది . ఆ క్యాంప్ చూడడానికి వెళ్ళాను నేను . మూసాపేటలో ఓ మారు మూల ఉన్న చిన్న పాఠశాల . అందులో చదివేది అందరూ ముస్లిమ్ పిల్లలే . అక్కడ సులోచనా రాణి , డా | | సునంద , సి . సుజాత ఇంకా కొంత మంది మిత్రులు కలిసారు . మాటల సందర్భంలో తను ప్రిన్సిపాల్‌గా రిటైర్ అయ్యా నని , ఎవరైనా పిల్లలు వుంటే వాళ్ళకు ఆంగ్లం నేర్పాలని ఉందని సునంద అన్నారు . కుందన్‌బాగులో ప్రయత్నం చేద్దాము లెండి అన్నాన్నేను . అలా ఒక చిన్న ప్రయత్నానికి బీజం పడిందక్కడ . ఆ బీజం మొలకౌవుతుందని , చిగురుల్లాంటి పిల్లలలో నేను వేసవి శెలవుల్ని గడుపుతానని అస్సలు అనుకోలేదు . అంతవరకు నాకు అలాంటి ఆలోచనే లేదు . సరే . ఆలోచనను ఆచరణ లోకి తేవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాను . మా ఇంటి ఆవరణలోనే వుండే షమీమ్ , ఆయేషాలని పిలిచి నా ఆలోచన గురించి చెప్పాను . కుందన్‌బాగులో ఎక్కడైనా చిన్న స్థలం దొరికితే మనం సమ్మర్ క్యాంపు పెట్టుకుందామన్నపుడు మా స్కూల్‌లోనే పెడదామన్నారు వాళ్ళు . వాళ్ళతో కలిసి వెళ్ళి వాళ్ళ స్కూల్ వివేకానంద విద్యాలయ చూసొ చ్చాను . బావుంది . ఆ స్కూల్ యజమాని కేంప్ నడుపుకోడానికి ఒప్పుకున్నాడు . ఈ ప్రాంతాన్ని మక్తా అంటారు . మురికివాడ లక్షణాలు పూర్తిగా లేకున్నా మురికివాడ కిందకే వస్తుంది . ఊళ్ళలో పనులులేక , ఉపాధి అవకాశాలు లేక హైదరాబాదుకు వలస వచ్చినవారు ఎక్కువగా వుంటారిక్కడ . ముఖ్యంగా శ్రీకాకుళం లాంటి దూరప్రాంతాలనించి వచ్చినవారు చాలామందే వున్నారు . మామూలుగా వేసవిలో నడిచే ఖరీదైన క్యాంపులకు వెళ్ళగలిగే ఆర్థికస్తోమతలేని పిల్లలు ఇక్కడ చాలామంది వున్నారు . షమీమ్ , ఆయేషాలు సైకిల్ మీద ఆ ప్రాంతమంతా తిరిగి సమ్మర్ క్యాంపు గురించి ప్రచారం చేసారు . కుందన్‌బాగు బంగ్లాలలో పనిచేసే అటెండర్ల పిల్లలకు కూడా కబురు అందించాం . షమీమ్ వాళ్ళు రెండు రోజులు తిరిగి ముప్ఫైమంది పిల్లల్ని పోగేసారు . ఇంకేం స్థలం దొరికింది . పిల్లల్ని కూడేసాం . మే 10న క్యాంప్ ప్రారంభించాలనుకున్నాం . మే పదిన సులోచనారాణి , డా | | సునంద , డా | | వహీదా , సుజాత గార్లు వచ్చారు . ముప్ఫైమంది పిల్లలు వచ్చారు . రకరకాల వయస్సులవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు వచ్చారు . అలా మా క్యాంప్ మొదలైంది . పిల్లలు ఎంతో ఉత్సాహంగా , సంతోషంగా వుండేవారు . ఉదయం తొమ్మిదికి మొదలుపెట్టి పదకొండు , పదకొండున్నర మధ్య ముగించేవాళ్ళం . ఆటలు , పాటలు , డాన్సులు , డ్రాయింగులు నేర్పేవాళ్ళం . సునందగారికి పిల్లలకి ఇంగ్లీషు నేర్పాలని ఉండేది . అయితే పిల్లలు ఎక్కువమంది చిన్నవాళ్ళు అవడంవల్ల కొంచం కష్టంగా వుండేది . పదిరోజుల తర్వాత తనకు వ్యక్తిగత పనులు వున్నాయని ఇక రాలేనని సునందగారు చెప్పి వెళ్ళిపోయారు . ఈ క్యాంప్‌ని ఇరవై నాలుగు రోజులు నడిపాం . పిల్లలకి పాటుల నేర్పడం కోసం నేను పాటలు నేర్చుకున్నాను . భూపాల్ రాసిన పిల్లల పాటల్ని వాళ్ళకి నేర్పాను . ఒక్కసారి చెప్పగానే చకాచకా నేర్చేసుకునేవాళ్ళు . ఇరవైకన్నా ఎక్కువ పాటలు నేర్పాను . వాళ్ళు కాంప్‌కి రాగానే వందేమాతరం , మా తెలుగు తల్లికి పాటలతో మొదలుపెట్టి జణగణమనతో ముగించేవాళ్ళు . ఆరోగ్యంగా వుండడం గురించి , పళ్ళు శుభ్రంగా తోముకోవడం గురించి , అమ్మా నాన్నల్ని , చదువుచెప్పే గురువుల్ని ఎలా గౌరవించాలి , కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఎలా వుండాలో అన్నీ పాటలద్వారా చెప్పేదాన్ని . వాళ్ళు చక్కటి అభినయంతో పాడేవాళ్ళు . మధ్యలో డా | | విష్ణుప్రియ నాతో చేరారు . ఆవిడ , నేనూ కలిసి చివరిదాకా క్యాంప్ నిర్వహించాం . పిల్లలతో ఉత్తరాలు రాయించడం , కథలు చెప్పించడం , బొమ్మలు వేయించడం లాంటివి చేయించాం . బుల్లి కొబ్బరిపిందెలతో , ఆలుముక్కలతో , దొండకాయ ముక్కలతో చక్కగా రథాలు చేసి ఆకులతో పూలతో అలంకరించారు . నా ఫ్రెండ్ భార్గవి ఒక రోజు కేంప్‌కి వచ్చి రంగురంగుల కొవ్వొత్తులు ఎలా తయారు చేస్తారో చూపించి పిల్లల్ని సంభ్రమంలో ముంచెత్తింది . అంతేకాదు తాను తెచ్చిన ప్రమిదల్లో రంగురంగుల వేక్స్‌పోసి , వొత్తిపెట్టి అవి పిల్లలకే ప్రజంట్ చేసినపుడు ఆ పసిముఖాల్లోని ఆనందాన్ని చూసి తీరాల్సిందే ! ఎన్ని రాశుల డబ్బులు పోసినా ఆ ఆనందాన్ని కొనలేం . అనుభవించా ల్సిందే . పిల్లల చేత ఆడించి , పాడించి , బొమ్మ లేయించిన తర్వాత వాళ్ళకి పండ్లు , స్వీట్లు , బిస్కట్‌లు , చాక్‌లెట్ లాంటివి పంచే వాళ్ళం . వాటిని ఆరగించి , సంతోషంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు . ఆ . . . అన్నట్లు ఈ కేంప్‌లో మేము ముగ్గురి పుట్టిన రోజులు కూడా జరిపాం . ఒకరు రిథమ . రెండు రాణి . మూడు శివ . కేకులు కట్ చేసి , ఐస ్‌క్రీమ్‌లు పంచాం . ఇక్కడ శివ గురించి కొంచం చెప్పాలి . ఈ కుర్రాడు సెవెంత్ చదువు తున్నాడు . చాలా తెలివైన , ప్రతిభావంతుడైన కుర్రాడు . నేను నా మిడిమిడి జ్ఞానంతో ఒక గిరిజన నృత్యాన్ని నాలుగు స్టెప్పు లు నేర్పిస్తే వాడు దానిని పద మూడు స్టెప్పు లుగా విస్తరించి , అందరికీ చక్కగా నేర్పాడు . మూడు నాట కాలను వాడే రూపొందించి నటింపచేసాడు . అమ్మాపులి , చెట్టు సాక్ష్యం , అపాయంలో ఉపాయం నాటకాల్లో శివ హీరో . మూడు నాటికలను పిల్లలు చక్కగా ప్రదర్శించారు . కొంతమంది పిల్లలకి జూన్ మొదట వారంలోనే స్కూల్స్ తెరుస్తుండటంతో జూన్ 2న మా క్యాంప్ ముగిద్దామ నుకున్నాం . ముగింపు కార్య క్రమానికి యద్దన పూడి , సునంద , వహీదా , విష్ణు ప్రియ , గీత హాజరయ్యారు . పిల్లలు రంగురంగుల పువ్వుల్లా ముస్తాబై వచ్చారు . రెండు న్నర గంటల పాటు వాళ్ళు నేర్చుకున్న వన్నీ ప్రదర్శించారు . దాదాపు ఇరవై పాటల్ని అభినయం తో పాడి విన్పించారు . హైలెస్సా డాన్సు చేసారు . మూడు నాటికలు ప్రదర్శించారు . వాళ్ళు వేసిన బొమ్మల్ని ఎగ్జిబిషన్‌లాగా పెట్టాము . చివర్లో వాళ్ళ కోసం కొన్న బహుమతుల్ని పంచిపెట్టాము . ఒక టిఫిన్ బాక్సు , వాటర్‌బాటిల్ , కలర్ పెన్సిల్స్ , పెన్సిల్ బాక్సులు పంచాం . అన్నింటిలోను ప్రతిభ కన్పరిచిన శివకుమార్‌కి , రెగ్యులర్‌గా క్యాంపుకి వచ్చిన గిరీష్‌కి మొమెంటోలిచ్చాం . వివిధ పోటీల్లో నెగ్గినవారికి చెస్ , టిన్నికాయిట్ , క్రికెట్‌బాల్ లాంటివి ఇచ్చాం . అగ్గిపెట్టెలో వస్తువులు పెట్టుకురమ్మని చెప్తే ఒక్కొక్కళ్ళు 160 , 150 , 140 బుల్లిబుల్లి వస్తువుల్ని సేకరించిపెట్టారు . అలా ఆటల్తో , పాటల్తో సమ్మర్‌కాంప్ ముగిసింది . ఈ కేంప్‌ని ఆర్గనైజ్ చేసిన సందర్భంగా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను . మనం దేన్నైనా మనస్ఫూర్తిగా మొదలుపెడితే ఏదీ దానిని ఆపలేదు . అలాగే ఏదైనా చెయ్యడానికి డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు . ఇలాంటి క్యాంపులు ఎవరి ప్రాంతంలో వాళ్ళు పెట్టగలిగితే , ఏ సౌకర్యమూ లేని మురికివాడల పిల్లలు కూడా వేసవిశిబిరాల సంతోషాన్ని పొందుతారు . నేను ఈ క్యాంప్ మొదలు పెట్టినపుడు డబ్బు గురించి ఆలోచించలేదు . యద్దనపూడి గారు ఇప్పటికే మొదలుపెట్టారు కాబట్టి వాళ్ళ బానర్‌నే పెట్టాము . దీనిద్వారా భూమిక హెల్ప్‌లైన్ నంబరును ఆ ప్రాంతంలో ప్రాచుర్యానికి తేగలిగాను . క్యాంపు చూడడానికి వచ్చిన కె . బి . లక్ష్మి రూ . 500 / - విరాళం ఇచ్చింది . సునంద కూడా రూ . 500 / - ఇచ్చారు . ఇక శాంతసుందరి గారయితే వెయ్యి రూపాయలిచ్చారు . వహీదా మొదటిరోజునే పిల్లలందరికి పెన్సిల్‌బాక్సులిచ్చింది . విష్ణుప్రియ కలర్ పెన్సిల్స్ , తినుభండారాలు తెచ్చారు . భార్గవి తానే అన్నీ కొనుక్కుని వచ్చి కొవ్వొత్తుల తయారీ చూపించింది . అక్కడికొచ్చిన స్త్రీల కోసం ఫినాయల్ , సబీనా పౌడర్ తయారీలను కూడా చూపించింది . సులోచనారాణి గారు వచ్చినపుడల్లా పండ్లు తెచ్చి పంచేవారు . ముగింపు రోజున పిల్లలకి స్వీట్లు పంచారు . ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే మనం ఓ చెయ్యి వేస్తే పదిచేతులు సహాయంగా వస్తాయని చెప్పడం కోసమే . మనం ఓ అడుగేస్తే , పది అడుగులు మనని అనుసరిస్తాయని నిరూపించడం కోసమే . నేను సాధార ణంగా వేసవిలో ఎటైనా దూర ప్రాంతాలకెళ్ళి గడుపుతుంటాను . అది నాకు చాలా ఇష్టం . అయితే ఈ వేసవిలో నేను ఒక్క రోజు కోసం కూడా హైదరాబాదు దాటి వెళ్ళలేదు . అయితే విహార యాత్రకి వెళ్ళినప్పటికంటే ఎక్కువ సంతోషాన్నే నేను పొందాను . పిల్ల లతో కలిసి ఆడాను , పాడాను , నృత్యాలు చేసాను . ఈ పిల్లలంతా మే పదికి ముందు నాకు అపరి చితులు . కానీ జూన్ 2 నాటికి నాకు చాలా ఆత్మీయులైనారు . ముగింపు రోజున నాకు చాలా దుఃఖ మన్పించింది . పిల్లల్ని వదిలిరావడం కష్టమైంది . మొత్తానికి అనుకోకుండా , ఎలాంటి ప్లానింగు లేకుండా మొదలైన చిన్న ప్రయత్నం విజయవంతంగా ముగిసింది . ఆ పిల్లల ముఖాల్లో నవ్వుల్ని పూయించడమే ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశ్యంగా మొదలై , వాళ్ళ నవ్వుల మధ్యే ముగిసింది . పిల్లల చల్లటి చిరునవ్వులు , వేసవికాలపు సాయంత్రాలు హఠాత్తుగా కురిసే చిరుజల్లుల్లా నన్ను అలరంచి సేదతీర్చాయని గర్వంగా , సంతోషంగా చెప్పగలను .
విషయ సూచిక : 1 . ముస్లింల మొదటి ఖిబ్లా 2 . ముస్లింల ద్వితీయ ఖిబ్లా 3 . ఇవీ చూడండి 4 . మూలాలు 5 . బయటి లింకులు
ఓ గంట తర్వాత , పేకాట పారాయణం కానిచ్చి ఓ అబద్ధానికి మొగుణ్ణి , నిజంగా ఇంటి ముఖం పట్టాను .
తే . నింగి గాలి పటములతో నిండు వేళ గంగిరెద్దులు నర్తనమాడు వేళ గుమ్మముల ముందు ముగ్గులు గొబ్బియమ్మ బార్లు కిలకిల నవ్వెడి పర్వ వేళ
దేశ సార్వభౌమత్వం గురించి బిజెపి చెప్పే కబుర్లన్నీ ఉత్తుత్తివేనన్న మాట . అమెరికా వ్యతిరేకత ఒఠ్ఠి బూటకమేనన్న మాట . ప్రభుత్వం నిరంతరం ఆటంకం లేకుండా కొనసాగేది అని చెప్పడం ద్వారా కాంగ్రెస్ , బిజెపి ల విధానాలకీ తేడా లేదన్న అవగాహన బిజెపికి ఉందన్నమాట . కాశ్మీరు విషయంలో తాను వేసే గావుకేకలన్నీ తాటాకు చప్పుళ్ళేనన్నమాట . బిజెపి నాయకుల మాటలు విని రెచ్చిపోయి మసీదు కూల్చి , ఇటుకలు మోసుకెళ్ళిన హిందూ కార్యకర్తలూ , వింటున్నారా ?
122 . రేగులపాటి కిషన్ రావు కరీంనగర్‌కు చెందిన వీరు ఈ తరం కథలు , స్వామీజీ కథలు అనే కథా సంపుటాలను వెలువరించారు . వ్యావహారిక భాషలో కథ చెప్పడం వీరి శైలి . ప్రేమలు , మూఢ నమ్మకాలు , సామాజిక అంతరాలు , మోసం , విఫల ప్రేమ లాంటివి వీరి కథలకు ఇతివృత్తాలు .
మొదటిసారి హైదరాబాదు తెలుగు బ్లాగరుల సమావేశానికి వెళ్ళాను . అక్టోబర్ 14న , హైదరాబాదులో యూసఫ్‌గూడ కృష్ణకాంత్ పార్క్ . మరి ఈ రోజు తారీఖు - అక్టోబర్ 25 , అప్పుడెప్పుడో బ్లాగరుల మీటింగ్‌కి వెళ్తే … ఇప్పుడు రాస్తున్నానేంటి ? ? ? ఏమి చేయను . అప్పటి నుంచి హైదరాబాదులోనే ఉన్నాను . ఇప్పుడే విజయవాడ వచ్చాను . ఇక విషయానికి వొస్తే … . ఈ మధ్య కాలంలో నేను చేసిన మంచి పనులలో ఇది ఒకటి . : తెలుగు బ్లాగరుల మీటింగ్‌కి వెళ్ళటం .
నా ప్రవర అడిగారు కదా మీరు ? మారుపేర్లతో రాసే అందరినీ కూడా అలా ప్రవర అడిగే సాహసం చెయ్యగలరా , మీరు గానీ , ఈమాట సంపాదకులు గాని ?
@ Sreenivas Paruchuri గారు , నేను పుట్టింది పెరిగింది పల్లెటూరులోనే . మా ఇంటి పక్కనే ముస్లింలు వుండేవారు . నా చిన్నప్పుడు మా ఊరిలో కేవలం రెండే ముస్లిం కుటుంబాలు వుండేవి . కాని వాళ్ళకు వాళ్ళ భాష వచ్చు . వాళ్ళ పిల్లలకు కూడా మొదటగా వాళ్ళ భాషనే నేర్పుతారు . స్థానిక బాష చుట్టూ వున్న సమాజం ఎలాగూ నేర్పిస్తుంది కదా . కాబట్టి వాళ్ళకు రెండు భాషలూ వచ్చు . బహుశా వాళ్ళకు చదవడం , వ్రాయడం తెలియకపోవచ్చు . ఆ అవకాశం వస్తే వాళ్ళు చదవడం , వ్రాయడం నేర్చుకోవడం కూడా నేను చూశాను . అంతే కాని , వాళ్ళు ఏనాడు ఈ భాష నేర్చుకుంటే మాకు ఉద్యోగాలు వస్తాయా , డబ్బులు వస్తాయా అని ఆలోచించలేదు . నేను చాలామంది ముస్లింలను చూశాను . వాళ్ళందరికీ వాళ్ళ భాష వచ్చు . కొత్తగా మతం పుచ్చుకున్న " మైకేల్ జాక్సన్ " లాంటి వాళ్ళను మినహాయిస్తే , ఈ ప్రపంచంలో వున్న ముస్లింలందరికీ వాళ్ళ భాష వచ్చని నా అభిప్రాయం . > > " ఆంగ్లంలోని mother - tongue కి ముక్కస్య ముక్క అనువాదం " . mother - tongue ని తెలుగులోకి అనువదిస్తే వేరే ఏదో అర్థం వస్తుందనుకుంటా . : ) @ సత్యప్రసాద్ గారు , నేను తెలుగులో బ్లాగడానికి , టపాలో మీరు చెప్పినవన్నీ కారణాలే .
నాకు నటించాలని వుంది . కాని నిజ జీవితంలో చేతకావడం లేదు . చిన్నప్పటినుంచి చేతకానిది ఇప్పుడు నేర్చుకుందాం అనుకున్న లెక్కలు నేర్చుకున్నంత కష్టంగా . . .
నిజానికి అలాంటి అవకాశమే రావాలి కాని ( వస్తుందంటారా ? నాకు కాస్త నిరాశావాదం ఎక్కువే ) ఎన్నో పుస్తకాలు చదవాలి చదవాలి అని ఎప్పటికప్పుడు వాయిదా పడ్తోంది . పెళ్ళి కాకముందు బాగా చదివేదాన్ని . ఏళ్ళు గడిచిపోతున్నాయి , చదవాల్సిన పుస్తకాల సంఖ్య పెరిగిపోతోంది . కాబట్టి పక్కన కాలక్షేపానికి ఏ కారం బఠాణీలో పెట్టుకొని తింటూ ఒక్కో పుస్తకం చదవేస్తా . ఎప్పటినుండో ఇంకో చిన్న కోరిక ఉంది . మంచి మంచి ప్రదేశాలు చుట్టి రావాలి ( ప్రపంచం అనేది పెద్ద ఆశే అవుతుంది ) అది కూడా నేను మావారు మాత్రమే . పిల్లలు కూడా వద్దు అనుకొంటాను ( ఎంత స్వార్థమో కదా నాకు ) ఇవేమి కుదరదు కుదరలేదు అంటే ఎప్పటినుండో వేసుకొన్న ప్లాన్ ఏంటంటే ఏ సేవాశ్రమంలోనే చేరిపోయి శేష జీవితం గడిపేయడం .
ఖండన : ఈరోజు జయప్రకాష్ నారాయణ్ గారిపై జరిగిన దాడి అత్యంత దురదృష్టకరం మరియూ గర్హణీయం . మన రాష్ట్ర శాసనసభలో విలువలూ , ఆదర్శాలూ , ఉన్నత భావాలూ కలిగిన వ్యక్తిగా చెప్పబడే జేపీకి ఇలాంటి అవమానం జరగడం అందరికీ అవమానమే . ఇలాంటి సంఘటన తెలంగాణా వాదానికి కూడా నష్టం జరిగించే విషయం . ఇలాంటి ఘటణలవలన ఉద్యమాం ప్రజలలో చులకన అయ్యే అవకాశం ఉంది . చేతనయితే పూటకో మాట చెప్పి చివరికి కేంద్రప్రభుత్వ ప్రకటన రాగానే తెలంగాణా ఏర్పాటుకు అడ్డుపడిన చంద్రబాబుపైనో , లగడపాటి పైనో , జగన్‌పైనో , చిరంజీవిపైనో దాడిచేద్దాం . లేదా తెలంగాణాలో ఉంటూ ద్రోహం చేస్తున్న డీ . శ్రీనివాస్ , జగ్గారెడ్డి లాంటివారిపై దాడి చేద్దాం . తెలంగాణా వచ్చినా రాకపోయినా తెలంగాణా ప్రజలకు కాస్త తృప్తి మిగులుతుంది , జేపీపై ఎందుకు దాడికి దిగడం ? జేపీ తెలంగాణాపై పూటకో మాట చెప్పలేదు , తెలంగాణా ఏర్పాటుకు అడ్డుచెప్పలేదు . దండన : జేపీ గారూ , ఈరోజు మీపై జరిగిన దాడి అత్యంత దురదృష్టకరం . అయితే ఇందులో మీరు ఆత్మ విమర్శ చేసుకావాల్సిన అవసరం కూడా ఉందేమో ఆలోచించండి . ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ప్రతినిధిగా ఉన్న మీరు ఎప్పుడూ ఒక బ్యూరోక్రాట్‌లాగా ఎందుకు వ్యవహరిస్థారు ? మీ మేధావితత్వం ముసుగులో వివక్షను ఎందుకు చూపుతారు ? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ప్రజల మనోభావాల ప్రకారం నడుచుకునే భాద్యత మీకు లేదా ? అలా చెయ్యకపోతే ప్రజానాయకుడికి బ్యూరోక్రాట్‌కు తేడా ఏముంది ? సీమాంధ్రలో ప్రజల రియాక్షన్‌తో సంబంధంలేకుండా నేతలు కృత్రిమ ఉద్యమం తయారు చేసి తెలంగాణాకు అడ్డుపడ్డరు . మీరిక్కడ ప్రజలంతా ఉద్యమిస్తుంటే ఏటికి ఎదురీది మీ నియోజకవర్గం కూడా వెల్లలేని పరిస్థితి తెచ్చుకోవడం ఎంతవరకూ సబబు ? మీరెప్పుడు ఆదర్శాలు వల్లిస్తారు , నీతులు చెబుతారు . అయితే మీ నీతివచనాలలో వివక్ష ఎందుకు ? గత అసెంబ్లీ సమావేశాలలో అన్ని పార్టీలవారూ విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తే ( సీమాంధ్ర ప్రతినిధులతో సహా ) మీరు మాత్రం కేసులు ఎత్తివేయవద్దని వాదించారు . మరి సమైఖ్యాంధ్ర ఉద్యమం పేరుతో కేవలం పదిహేనురోజుల్లో కోట్ల ఆస్థుల ధ్వంసం జరిగినప్పుడు అక్కడ ఎవరిపైనా కేసులు ఎందుకు లేవు , అరెస్టులు ఎందుకు జరగలేదు అని మీరెందుకు ప్రశ్నించరు ? అదే తెలంగాణాలో మాత్రం ఒక్కో విద్యార్థిపై వందలకొద్ది కేసులు ఎందుకు పెట్టారు , ఒకే సమయమ్ళొ వేర్వేరు చోట్ల కేసులు పెట్టడం ఎలా సాధ్యం ? ఈ వివక్ష ఎందుకు అని ప్రశ్నించారా ? మీరు చెప్పింది నిజం : నేరం చేసినట్టయితే కేసులు ఎందుకు ఎత్తివెయ్యాలి ? కానీ ఆ నేరాల్ని నమోదు చెయ్యడంలోనే వివక్ష ఉంటే ఏమి చెయ్యడం ? అంతా చక్కగానే ఉంటే అసలు ఎలాంటి ఉద్యమాల అవసరం లేదు . కానీ ప్రస్తుత వ్యవస్థలో ఏదీ సరిగాలేదు . మీ నీతులు ఎందుకు సెలెక్టివ్‌గా ఉంటాయి ? అధికారాన్ని పూర్తిగా గవర్నర్ హస్తగతం చేసుకుని శాసిస్తుండగా , హోం మినిష్టరు మాటలు ఖాతరు చెయ్యకుండా ఉస్మానియాలో కాల్పులకు ఆదేశాలు ఇవ్వగా అవేవీ పట్టకుండా గవర్నర్ ప్రసంగం విషయంలో మాత్రం నీతి వచనాలు ఎందుకు ? మీరెప్పుడూ చెబుతుంటారు " 21వ శతాబ్దంలో ఉద్యామాలా " అని , మరి 21వ శతాబ్దంలో కూడా ఉద్యమాలు చెయ్యాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా ఆలోచించండి .
అంటే ఏముంది డైరెక్ట్ కనెక్షన్ అన్నాడు . . " మరి ఈ మూడునెలలు కష్టపడి తయారుచేసిన
అది చూస్తుంటే , రేలంగి పాట - - " నీ చెయ్ పైనా , నా చెయ్ క్రిందా . . . . ఇచ్చి పుచ్చుకొను ఋణమే బాబూ " అన్న పాట గుర్తొచ్చింది నాకు ! పొట్ట చింపితే అక్షరమ్ముక్క వుందోలేదో గానీ , పదవుల వల్లే కదా వాళ్లది పై చెయ్యి అయ్యింది !
రాత్రి మెలకువ వచ్చినప్పుడల్లా ఆయన భార్య వీపు మీద విక్స్ రాస్తూనే ఉన్నాడు . ఆవిడ కేదయినా అయితే ఆయన తట్టుకోలేడు . పెరట్లో పిట్టల కిచకిచలతో తెల్లారిందని తెలుస్తోంది . రగ్గులో కూర్చుని ఆయన సమయం ఎంతైయుండచ్చో అంచనా వేసాడు . ' ఆరు గంటలై ఉంటుంది ' అనుకున్నాడు . కిటికీలోంచి గాని , లేదా వాకిలి తలుపు తీసిగాని బయటకి చూడాలని ఆయనకి అనిపించింది . కానీ ఆ ఆలోచనే ఆయన ముసలి శరీరాన్ని వణికించింది . తను కప్పుకున్న రగ్గు జారిపోయినట్లనిపించి , దాన్ని సరిజేసుకున్నాడు .
8 . భూసంస్కరణలు సమర్ధవంతంగా అమలు కావాలంటే రాజ్యాంగంలో ప్రకటించిన లక్ష్యాల కనుగుణంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు రాజకీయ సంకల్పం , చిత్తశుద్ధి అవసరం . భూసంస్కరణల అమలుకు సంబంధించిన వ్యూహానికి వస్తే కేవలం ప్రభుత్వ పాలన యంత్రాంగం మీద ఆధారపడడంవల్ల భూసంస్కరణల చట్టాలను సమర్ధవంతంగా , సఫలవంతంగా అమలు చేయడం సాధ్యంకాదు . నిబద్ధత కలిగిన పాలనా యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం అవసరం . అంటే అవ్యవస్థీకృతంగా ఉన్న పేద రైతులు , వ్యవసాయ కూలీలు చైతన్యవంతంగా వ్యవస్థీకృతమై గ్రామాల్లో వ్యవసాయ సంస్కరణల అమలులో భాగస్వాములు కావడం .
చాలసేపటి తరువాత వచ్చిన సిటిబస్ లొనికి తొసుకుంటు వెళ్ళి , వెంబటే తిరిగి దిగిన ఆసామిని చూచి విషయమేమిటని ఆశ్చ్యర్యంతో అడిగాడు దారినపోయె దానయ్య . దానికి ఆ ఆసామి " మొన్న ఒకరోజున టికెట్ లేకుండా బస్సేక్కానని కండక్టర్ మధ్యలోనే నన్ను బస్ దింపేశాడు . నేను ఉరుకోలేదు , ఈ రోజు వాడికి తగిన శాస్తి చేశాను " అన్నాడు . " ఎమిచేశారు " అన్నాడు దానయ్య . " ఎంచేశానా ! ఈ రోజు టికెట్ కొని కుడా బస్ ఎక్కలేదు " చేప్పాడు ఆసామి
ఏంటీ బ్లాగులో ఎప్పుడూ " ఐ హేట్ యూ " , " పార్టింగ్ నోట్ " అని వ్రాస్తున్నా అని కోపమా ? బ్లాగులో వ్రాసేవన్నీ నా ఫీలింగ్స్ , నా experiences . అందులో కొన్నిసార్లు నీ గురించి వ్రాయొచ్చు కొన్నిసార్లు వేరే వాళ్ళ గురించి కావొచ్చు . కానీ అవేవి వ్యక్తిగతంగా మీ మీద కోపంతో కాదు . My mind is a dark room . అక్కడ నాతో నేనే గొడవపడుతూ ఉంటా . నాతో నేనే వాదించుకుంటూ ఉంటా . అక్కడ ఎవరి మీద కోపంతోనో ద్వేషంతోనో అరవను . నాలో జరిగే struggle severity బట్టి content ఉంటుంది . కోపం అంతా నా ఫీలింగ్స్ మీద లేకపోతే నా fate మీద ఇలా అన్నీ నాతో నేనే .
ఏమిటో ఈ జీవితం ? ఒకరికి మంచి వేరొకరికి చెడు అవుతోంది . . ఒకరి గెలుపు వేరొకరిని ఓటమిపాలు చేస్తోంది . . ఒకరి ఆశ వేరొకరికి నిరాశనే మిగులుస్తోంది . . ఈ రోజు నాకు జరిగిన చెడు . . ఓటమి వలన నిరాశ మిగలడమే . . ! అయితే . . రేపటి రోజు . . నా గెలుపు కూడా వేరొకరికి ఇదే అనుభావాన్నిస్తుంది . . అప్పుడే నాలో ఈ ప్రశ్న జనిస్తోంది . . నాకు మంచి జరిగినట్టా . . ? నేను చెడు చేసినట్టా ? పోటీలకు . . పంతాలకు . . పరుగులు పెట్టీ పెట్టీ . . . స్పృహ ' అనుభూతి ' చెందడాన్ని మర్చిపోయింది . . జీవితపు కధనాన్ని వదిలి అధ్యాయాంతాలకే విలువనిస్తోంది . . లాభ నష్టాల బెరీజులో . . లభామనుకుని . . ప్రతి సారీ నష్టాన్నే జమ చేసుకుంటోంది . . * picture credit goes to original phographer and source . It will be removed in case of any objections .
అగ్రకుల పాలకవర్గాలను ఎదిరిస్తూనే , హిందూత్వ దాడులను ప్రశ్నిస్తూనే , కులాల పేరుతో ఏకమౌతున్న ఉనికిని ఉన్నతంగా ఆకాశపు పెదవులకద్దుకున్న
KAMAL గారు చెప్పింది కరెక్టు . అది నేనెప్పుడో ( చాలా సంవత్సరాల క్రితం ) గమనించాను . ఈనాడు ఆన్‌లైన్ ఎడిషన్‌కి " ఊ " పలకడం రాదు .
" మా కంపెనీలో అకౌంట్స్ ఆఫీసరుద్యోగానికి ఎందరో అనుభవజ్ణులు పోటీ పడుతున్నారు . నేను కృష్ణకు ఉద్యోగాన్నిస్తే అదీ త్యాగమే అవుతుంది . నేనందుకు సిద్ధంగా ఉన్నాను "
ఒక అద్భుత ప్రేమమయగాథ విషాదంగా అంతమవడం … తప్పనిసరిగా తెలుగు పాఠకులకు చేరవలసిన ఉద్వేగభరిత గాథ ఇది .
కొరత / కొర్రు ఒకటే నన్న విషయం తెలిసింది . అనుమానం వచ్చి బ్రౌన్ నిఘంటువు చూసా కూడా . థాంక్యూ సారు .
ఇంకా , 2008 లో ఋణ మాఫీపేరుతో 73 వేల కోట్లు వెదజల్లి , గ్రామీణ పరపతి విధానాన్ని దెబ్బతీశారు - - అని కూడా అందరికీ తెలిసిన విషయాన్నే - - మరోమారు చెప్పారు !
" ఓ యా , మాగ్రూపులో కూడా దేసీ గాళ్ళు పెరిగి పోతున్నారు … ఇట్సె పయిన్ " షర్మ ( శర్మ కాదు , షర్మ )
రమణి గారు , కామెంట్ ద్వారా చాలా చక్కని వివరణ ఇచ్చారు . ధన్యవాదాలు . కేవలం " పెద్దరికాన్ని " ముసుగుగా ధరించి అజమాయిషీ చెయ్యాలనుకునే స్వభావాలను ఉద్దేశించే నేను రాసినది . మీరన్ననట్లు వృద్దాప్యం అనేది రెండవ బాల్యం . మానవతా విలువలు ఉన్న ఏ మనిషీ వృద్ధులను , పెద్దలను వారు ఎలా ప్రవర్తించినా సమర్థించుకోకుండా ఉండలేరు . అది మన బాధ్యత కూడా ! పెద్దలను గౌరవించడం మన సంస్కారం . కానీ పెద్దలు ఇలా ఆలోచించాలి అన్నది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ . మీరు చివరి పేరాలో అన్నట్లు తల్లిదండ్రులనే కాదు ఒక్క సంవత్సరం పెద్ద వయస్సు ఉన్నా తోబుట్టువులు , ఇతరులందరూ తాము వయస్సులో పెద్ద అనే ఫీలింగ్ ఉంటే వారూ తమ పెద్దరికాన్ని ఒక్కోసారి చూపించడానికి ప్రయత్నిస్తుంటారు . వ్యాఖ్య ఇంత వివరంగా రాయడం నాకు నచ్చింది . కారణం రాజకీయాలు , సినిమాలు ఇతర అంశాల గురించి ఎంత చర్చ జరుగుతుందో అనునిత్యం మనకు కళ్లెదుట కన్పించే ఇలాంటి అంశాలపై చక్కని చర్చ జరిగితే చక్కని స్పష్టత వస్తుంది . నేను రాయలేకపోయిన పార్శ్యాలు ఇంకొకరు కామెంట్ లో వ్యక్తపరచవచ్చు . దానివల్ల విషయంపై పరిపూర్ణత వస్తుంది .
ముందుకు పోతే చార్మినార్ డిసిపి పోలీసు కార్యాలయం . లాఠీ తూటా బాయ్‌నెట్ ఇనుపటోపీ బూట్లతోటి ' సర్వాంగ శోభితంగ ' నోరు తెరుచుకుని పాతాళభైరవి సినిమాల రాక్షసుడి గుహలాగ నిలబడి ఉంది . మరో నాలుగు అడుగులు . వరుసగ ఉన్న నాలుగు చక్రాల తోపుడు బండ్ల వ్యాపారస్థులు . " హర్ ఏక్ మాల్ చారానా " అని రిథమిక్‌గ అరుస్తున్నరు . గిరాకీలను పిలుస్తున్నరు . ప్లాస్టిక్ వస్తువులు , ఆడవాళ్ల బొట్లు , పూసల దండలు , రిబ్బన్లు , మొగవాళ్ల మొలదారాలు , తాయెత్తులు , ముంజేతి కడియాలు , ఉంగరాలు , చిన్న పిల్లల రంగు రంగుల లట్టూలు , చెండ్లు ఇంకా లాయిలప్పలు . కళ్లకు కలర్‌ఫుల్‌గ కదిలే ఆ తోపుడు బళ్ల దుకాణాలు . దునియా రంగు రంగీలా బాబూ - దునియా రంగు రంగీలా .
" ధాటీపాటవ చాటు కావ్యరచనోద్యధ్ధోరణీ సారణీ వాటికోద్గతి సత్కవీశ్వరుడు నిత్యంబుం దమున్ వేడగా వీటీఘోటక హాటకాదు లిడ రుర్విన్ నిర్దయాబుధ్ధిచే మాటే బంగరు నేటి రాజులకు రామా ! భక్తమందారమా ! "
మతం అనేది వుండడం వలన మనిషి , దానిష్ కార్టూన్లకి , డావిన్సి కోడ్లకి , బుస్సైన్ గీతలకి చలించి , అల్లర్లు చేస్తున్నాదు అన్నాను . నా వాదన తప్పు అయితే నాకు వివరించు , నేను నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను అన్నా ! నా ప్రశ్నలకి జవాబు లేదు గాని , చిల్లర కోసం నా సహనాన్ని పరిశీలించడమే పనిగా అడ్డగోలు వాదనలు మొదలు పెట్టాడు . అయితే భరద్వాజ కేవలం బుస్సైన్ గీతల పైన మాత్రమె స్పందించాడూ . మిగిలిన విషయాలు నాకు అనవసరం . మిగిలిన మతాలలో వారు మనషులు కాదా అంటె ? వారి విషయం , నాకు అనవసరం అన్నాడు . అప్పుడూ చర్చ హిందు మతం పైన కేంద్రీకృతమయ్యింది . హిందూ మతానికి దిశా నిర్దేఅశాలు చేసె చతుర్వేదాలు కేవలం ఒక వర్గం గుప్పిట్లో వుండడం ఎంత వరకు సమంజసం అని అడిగాను . వాటిని చదవడానికి ఒక అర్హత కావాలి అన్నాడు . సరె ఆ ఆర్హత పుట్టుక తో ఎందుకు నిర్ణయం అవుతుంది ? అని నా ప్రశ్న . ఒక వాల్మికీ వేదాలు చదివె అర్హత సంపాదించిడానికి , ఒక బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన వాడికి కొలమానం ఒకటేనా అని అడిగాను . కాదు కదా సమాధానం లేదు . ఇప్పుడూ అందరు చదవ వచ్చు కదా అన్నాడు . మరి ఇన్నాళ్లు జరిగిన వివక్ష వలన నేటి సమాజం పరిస్థితి ? ఆ చతుర్వేదాలు చదివిన వారిలో అధికులు నేటి కుల వ్యవస్థ కి కారణం కదా ? మరి ఆ చతుర్వేదాలు చదివి వారికి , వారి వలన సమాజానికి కలిగిన లాభం ఏమిటి ? చదివినా అర్ధం చేసుకొలేక పోతె , అర్ధం చేసుకున్నా దానిని ఆచరిచలేక పోతె అటువంటి చతుర్వేదాల వలన ఏమి ప్రయోజనం ?
ఈ చిత్రం క్రితం ఆదివారం చూసాను . ఇది ఈ నెలలొ 5వ ఫ్రెంచి సినిమా . నేను Talk Cinema కి వెళ్ళినపుడు , ఈ చిత్రం మీద అభిప్రాయాలు విన్నాను . ఇది animated చిత్రం . దీనికి Oscar nomination కూడ వచ్చింది . ఇదే పేరుతొ వచ్చిన graphic novel ఆధారంగా తీసిన చిత్రం ఇది . ఫ్రెంచి చిత్రమయిన , కధ ఇరానీన్ . నాకు చిత్రం ఫార్సిలో ఉంటే ఇంకా బావుండేది అనిపించింది . ఈ కధ కాస్త ఇరాన్లోను , కాస్త ఆస్ట్రియాలోను [ . . . ]
విద్య మనిషికి ఙ్ఞాన సంపాదనకు సాధనం , దానిని అత్యధిక సంఖ్యాకులైన శ్రామిక కులాలకు నిషేధించింది మనువాదం . పోనీ వాళ్ళైనా చదువువల్ల లభించవలసిన సంస్కారాన్నైనా సంపాదించారా అంటే అదీ లేదు . చదువున్నా సంస్కారంలేని వాళ్ళగానే మిగిలిపోయారు ఈ కఠోర వాస్తవాన్ని ధర్మన్న నిస్సంకోచంగా ఎత్తిచూపారు .
మహేష్ గారు , ఎక్కడో ఇప్పుడు గుర్తు లేదు కాని , మీరే మీ టపాల్లోనో వ్యాఖ్యల్లోనో అన్నారు - మీరిక్కడ చెప్పేవి బాగా బలంగా మీలో నాటుకున్న ఆలోచనలనీ , మీకు మీ స్వంత అనుభవమైతే కాని , ఇతరులు చెప్పే మాటలవల్ల వాటిని మార్చుకోరనీ . నేనిక్కడ అన్నది అది మనసులో ఉండబట్టే . అలా కాదు ఇతరులు చెప్పే విషయాలబట్టి మీ ఆలోచనలు మార్చుకొనే అవకాశం ఉందంటే మంచిదే . అలాటి సందర్భం ఇంతవరకూ నాకు అగుపడలేదు కాబట్టి ఆ అనుమానాన్ని వ్యక్తం చేసాను . నా అనుమానానికి కొన్ని స్పష్టమైన కారణాలున్నా , అవిక్కడ ప్రస్తావించడం మీపై వ్యక్తిగత దాడిగా తీసుకొనే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని వివరించ దలచుకోలేదు . ఇక , " మతానికికాదు మతమౌఢ్యానికి నేను వ్యతిరేకిని . నాకు సాంప్రదాయక విలువలు నమ్మే మనుషులతో సమస్యలేదు " అన్నారు . అదీ మంచిదే . కానీ మీ ఈ కింద టపాలు ( హిందూ ) మతాన్నీ , సాంప్రదాయిక విలువలనీ మీరు నమ్మే ఆధునిక విలువలతో బేరీజు వేసి వాటిని తక్కువచెయ్యడం కాదా ? అవునని నా కనిపిస్తోంది . కాదంటారా ? వెధవతనంలో సిన్సియారిటీ బుద్దావతారం హిందూమతం Vs సనాతనధర్మం లైంగికత Vs నైతికత : ఒక జెండర్ ధృక్కోణం కాలం చెల్లిన భీష్ములు
దీన్నిబట్టి లయ ప్రధానంగా అక్షరగుణం ( Syllabic Quality ) అనీ , నియతపరిమాణం ( Quantity ) గల గణాలుగా ప్రయోగించటం వలన లయ సిద్ధిస్తుందనీ , దీనికి గణాంతాల దగ్గర విరిచి చదివినా అర్థభంగం కాని విధంగా పదాల కూర్పు ఉండాలనీ తేలుతున్నది . ఒక నియతపరిమాణం గల గణాలు క్రమావృత్తమైనప్పుడే లయ ఉంటుంది . ఈ లక్షణం వచన పద్యంలో ఉంటే , అదే మాత్రా పద్యమవుతుంది . మాత్రా పద్యంలో ఒకే రకపు లయ సాధారణంగా పద్యమంతా ఉంటుంది . వచన పద్యంలో అవసరాన్ని బట్టి భిన్నలయలు ఉండవచ్చునంటే , అది గతులు మార్చిన మాత్రా పద్యమవుతుంది గాని వచన పద్యం కాదు . అంటే పైన వివరించిన పద్ధతుల్లో , లయ ఉన్న పద్యం మాత్రా పద్యమో , తద్వికారమో అవుతుంది తప్ప వచన పద్యం కాదన్నమాట . వచన పద్యంలో స్పష్టమైన అక్షర సంబంధమైన లయ ఉండదని సారాంశం . బహుశా ఇది గుర్తించే కాబోలు విశ్వం ( 1961 ) భావలయనూ , సంపత్కుమార ( 1967 ) భావగణాలనూ ప్రతిపాదించారు . వేరుగా కనిపిస్తున్నా ఈ రెండూ ఒకటే . శబ్ద రూపంలో అక్షరసమూహాల పరిమాణాన్ని బట్టి మాత్రాగణాలుంటై . తద్వారా సాధించిన లయ శబ్దలయ అవుతుంది . దీన్నే అక్షరలయ అని కూడా అనవచ్చు . అది చెవికి వినిపించేది . అర్థంతో నిమిత్తం లేకుండా శ్రోత గుర్తించేది . అట్లా కాకుండా భావగణాల ద్వారా సాధించేది భావలయ . భావగణాలుంటే భావలయ ఉంటుంది . భావగణాలు లేవని నిరూపిస్తే భావలయ సిద్ధాంతం కూడా నిరాసమవుతుంది .
Download XML • Download text