tel-5
tel-5
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
ప్రతిష్టాన నగరపు పొలిమేరల్లో గుడిసెలు వేసుకుని జీవించే దొమ్మరి కుటుంబానికి చెందిన నడివయసు స్త్రీ ఆమె . మాధవుడి జతగాడు సాంబశివుడికి తల్లి .
. . తుమ్మచెట్టు గాటులోంచి కారే జిగురులా కనుగుడ్ల మీదకు జారుతుంది పచ్చి నిద్ర - పగలంతా రోడ్లమ్మట నడిచి నడిచి అలసిన కాళ్ళు కళ్ళల్లో ముడుచుకుంటయ్ మోకాళ్ళు మడచి - మూసిన పుస్తకంలా మాట్లాడని పెదాలు ముసిరిన ఆలోచనల్నుంచి వూపిరి తీసే బెల్లం ముక్క . కణతల్లో తంత్రుల్ని వదిలేసి వాయిద్యకారులు రెప్పల సందుల్లోంచి నిష్క్రమిస్తారు - నా దేహాన్ని వేలాడదీసే నా స్వప్నాల దూది చిత్తర్వుల్లోకి సరీసృపాలై మళ్ళీ వస్తారు తెల్లని శూన్యంలోకి తలకిందులుగా పడిపోతున్నప్పుడు గాభరాగా అందుకుని [ . . . ]
పదహారవ శతాబ్ది వాడైన పింగళి సూరన్న కళాపూర్ణోదయము , ప్రభావతీ ప్రద్యుమ్నము అనే రెండు కావ్యాలని రాశాడన్న విషయం మీ అందరికీ తెలిసినదే ! కట్టమంచి రామలింగారెడ్డి గారు 1899 లో వ్యాస రూపముగా అనేక సాహితీసభలలో చదివి , తరువాత 1914 లో కళాపూర్ణోదయ ప్రభావతీప్రద్యుమ్న విమర్శగా " కవిత్వతత్త్వ విచారము " అనే పేరుతో రెండువందలపైచిలుకు పేజీలలో పుస్తకము ప్రచురించారు . 1932 లో ఈ పుస్తకాన్ని ఆంధ్ర విశ్వకళాపరిషత్తు వారు ప్రచురించారు .
ఇది చాలా సున్నితమయిన అంశం యుగాల దాదాపు అన్ని దేశాలలోను , మతము , సంసృతి లోను పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు ఎందుకంటే అది ఇంత గా ఆవయసు లో తెలుసుకోకపోవటం వలన వచ్చేనస్టమేమి లేదు ఎందుకంటే ఇది ప్రకృతి సహజసిద్దం గా ఆ జ్ఞానం ఇస్తుంది , ఒక వేళ ఇది మంచిదే అయినా ఒక వ్యక్తి నైతికంగా , ఉన్నత వ్యక్తితంతో ఎదగటానికి ఇది ఎంతవరకు ఉపయోగం ?
నేను ఇండియా వెళ్ళినప్పుడు విజయవాడ నవోదయా లో కొనుక్కున్నాను . నవోదయా రామ్మోహన్రావుగారు , చక్కగా కబుర్లు చెప్పి ( పుస్తకాలు చూస్తున్న మాతో ( నేను , మా తమ్ముడు ) , విజయవాడ పాత రోజులు , పాత పరిచయస్తులు గురించి మా నాన్నగారితో ) , అడిగిన పుస్తకాలే కాక వేరే రికమండేషన్లు చూపించారు . నేను అంతకుముందు ఇంట్లోనూ అక్కడ ఇక్కడ దొరికినవి చదవటమే , తెలుగు పుస్తకాలు ఇంట్రెస్ట్‌గా కొనుక్కోవటం అదే మొదటిసారి .
ఉదాహరణకి ఈ సంపాదకీయంలో మొట్టమొదటి వాక్యం తీసుకోండి . ఎక్కడెక్కడ కామాలు పెట్టడం అవసరమో , ఎక్కడ అనవసరమో నిర్దేశించే పుస్తకం లేకపోవడం వలన , నా ఇష్టమైన చోట నేను విరామచిహ్నాలు పెట్టుకుంటాను . దీనిని పరిష్కరించే ఎడిటర్ తనకు తోచినచోట తాను విరామచిహ్నాలని పెడతాడు . నా వాక్యనిర్మాణ సరళి , దాని విమర్శ కాసేపు మరిచిపోదాం . నా మొదటి వాక్యంలో ఎక్కడా విరామ చిహ్నాలు పెట్టకపోతే వాక్యం చదివి అన్వయం చేసుకోవడం ఎంత కష్టమో ఆలోచించండి .
[ మీకు గత 24 గంటలలో రెండు వేర్వేరు అకౌంట్లనుండి ఈ మెయిళ్ళు పంపాము . మీ ఇన్‌బాక్సులో అవి లేకపోతే మీ మెయిల్ సెట్టింగ్స్ తనిఖీ చేసుకోగలరు . అలానే మీ బల్క్ లేదా స్పాం ఫోల్డరులలో కూడా . మీరు పైన ఇచ్చిన రెండు అడ్రసులలో రెండవది పని చేయుటలేదు . మీ రీడిఫ్ అడ్రస్సుకి పంపిన మెయిళ్ళు ఏమీ తిరిగిరాలేదు . మీరు - editors [ AT ] eemaata . com ( [ AT ] స్థానంలో @ వుంచి ) అడ్రసు కు మెయిలు పంపి మమ్మల్ని " సంప్రదించ " గలరు . ఇదే మీ ఉద్దేశమని మాకు తోస్తున్నది . మీ ప్రతీ మెయిలుకీ మేము వెంటనే రిప్లై ఇస్తూనే వుంటాము . మీకు అవి అందకపోతే మీ మెయిల్ అడ్మినిస్ట్రేటర్లను సంప్రదించండి . - సం ]
అయ్యా . సాయి ప్రవీణ్ గారు . . నాకు 25 వేలు ఇచ్చే ప్రొడ్యుసర్ దొరికాడు . . మనక్రిష్ణ గారు ఎమీ మాటాడటం లేదు . .
" రావొచ్చు పోవచ్చు , రొయ్యలమ్ముకోవచ్చు " ఇది రాష్ట్రం విడిపోతే సమైక్యవాదులు ప్రచారం చేసేటట్లు కొంపలేం అంటుకుపోవు , రాష్ట్రాల విభజన అనేది ఒక సాధారన రాజ్యాంగబద్దమయిన ప్రక్రియ అని చెప్పడానికి గోరేటి వెంకన్న సరలమయిన భాషలో రాసిన పాట . సీమాంధ్రలో కూడా ఎంతోమంది మెచ్చిన ఈపాటను సహోదరుడు రాజేష్ ( బహుషా సీమాంధ్ర ప్రాంతం వాడే ) ఒక బ్లాగులో కామెంటుగా రాశాడు . ఇది చూసిన ఒకతోటి బ్లాగరు వెంటనే పాటలో ప్రతిపదార్థాల ఈకలు పీకుతూ తమ అతితెలివిని ప్రదర్శిస్తూ ఒక టపా వేశారు . వారు రాసిన ముక్కలు : " నీ ఇడ్లిబండి అడ్డజాగా నీవే నిలుపుకోవచ్చు " అలా అన్నారు కదా అని సంతోష పడేరు ! " పచ్చళ్ళ బేరాలు జేసిపత్రికల ఓనర్లయితిరి " ఎదిగితే ఇలానూ ఏడ్చారు మరి ! అంటే మన బతుకులెప్పుడూ ఇడ్లీ బండి పెట్టుకునే దగ్గరే ఉండాలి . ఎదిగితే ఓర్వలేము అని చెప్పకనే చెప్పారు . సాంబారు సన్నాసిది కూడానూ . పచ్చ్ళ్ళబేరాలు నిజాయితీగా జేసి పత్రికవోనర్లయితే సంతోషమే గానీ పక్కోడి కడుపుగొట్టి అసైండ్ భూములనూ , మధ్యలో కొన్ని మధ్యతరగతి జీవుల ప్లాటులనూ దర్జాగా తనలో కలుపుకుంటే చూసి మెచ్చుకునే పెద్దమనసు మాకు లేదు మరి . రోజూ ఇదే పెద్దమనిషి పచ్చళ్ళబాగోతాన్ని మరో సీమాంధ్ర పత్రిక ఎండగట్టినప్పుడు అది ఏడుపులాగా కనబడదు , తెలంగాణ గాయకుడు చెబితే మాత్రం వోర్వలేనితనం . ఇదే మన ద్వంద్వ విధానం , మన నిజాయితీ , మన ఆదర్శం మరి . " ఒక్కతల్లి బిడ్డలమని ఒప్పుకుంటమే నిజము " అలా అన్నారు కదా అని సంతోష పడేరు ! " అన్నదమ్ములు ఇద్దరుంటే ఆస్థి పంచుకోరా జెప్పు " అసలు దృష్టి ఆస్తుల మీదే అని అందంగా చెప్పారు . అంటే హైదరాబాదంతా మాదే . విపరీత అర్ధాలు , పెడవాదనలలో అందెవేసిన చెయ్యికి ఆస్థి పంచుకోరా అంటే ఆస్థిలాక్కున్నట్టు వినిపిస్తుంది . విడిపోతే ఆస్థులు పంచుకుంటారు , ఎలా పంచుకోవాలనేది నిపుణులు నిర్నయిస్తారు . కలిసుంటే అప్పనంగా కాజేసేవాడు మాత్రం ఎప్పటికీ పంచుకోవడానికి ఒప్పుఓడు , ఎందుకంటే విడిపోతే వచ్చేది సగం , ఇప్పుడు అనుభవించేది మొత్తం . అందుకే చల్లకొచ్చి ముంతదాచుతూ ఉంటారు . హైదరాబాదు న్యాయంగా తమకు దక్కదని తెలుసు కాబట్టి పంపకాల లెక్కలడగరు , విడిపోవడానికి వీల్లేదంటూ దర్జన్యం చేస్తారు . మీకు దిగువకి చుక్క నీరు వదలం ( సాగరు , డెల్టా చివరి భూములకి ఇంతవరకూ నీళ్ళు రాకున్నా దోపిడీనే ) . అంటే ఇప్పటిదాక ఎగువప్రాంతాలకు చుక్కనీళ్ళుకూడా ఇవ్వడంలేదని ఒప్పుకున్నారు . రాష్ట్రాలు విడిపోతే వాటాలు కేంద్రప్రభుత్వబోర్డు నిర్ణయిస్తుందని తెలియదా , ఇప్పుడు ఎగువన ఉన్న రాష్ట్రాలు చుక్కనీళ్ళు వదలట్లేదా ? ఒకవేళ వదలకపోతే దేశానికి ఒక కేంద్రం , సుప్రీం కోర్టు అన్ని గొడ్డుపొయినయా ? అయినా మన వితండవాదం మాత్రం ఇలాగే కొనసాగిస్తాం . ఇప్పటిదాకా హైదరాబాదులో పెట్టిన ఉమ్మడి సొత్తంతా అప్పనంగా మాదే . మీ ఎదుగుదల ఇక్కడే వదిలేసి మరో చోట ఇడ్లీ బండి పెట్టుకోమని సలహా కూడా ఇచ్చారు . ఉమ్మడిసొత్తో , తెలంగాణ సొత్తో మొత్తం యాభై ఏల్లలో రెండుప్రాంతాలలో వచ్చిన ఆదాయం , ఖర్చులు లెక్కేస్తే తెలుస్తుంది , అంత తొందరెందుకు ఆవిషయంపై నిపుణులు జూసుకుంటరు , అయినా నువ్వింకా ముంతదాచడం మానకపోయి సమైక్యరాగం పాడుతుంటె లెక్కలెట్లదేలుతయ్ ? బతకనీకి వచ్చినోడిని భాయి భాయిగా సూస్తం " ఇలా అన్నారని సంతోషించేరు ! ౧౯౬౯ లో నల్లగొండ పట్టణం నట్టనడిన రంగాచార్యులకి పట్టిన గతే నీకూ అని కవితాత్మకంగా చెపారుగా ! ఔరా , యాభై ఏల్లలో ఒక్క సంఘటన మాత్రం భూతద్దంలో పెట్టి చూపిద్దాం . ఎంతమంది మీవోల్లు తెలంగాణ పల్లెపల్లెల లేరు , ఎన్ని సంఘటనలు జరిగినయి ? మీదగ్గర మావోల్లుంటె ఏమిజరుగునో రాజోలిబండ మూడుసార్లు కూల్చివేసిన ఘనులకు తెలవదా ? ఒకన్యాయమైన డిమాండుకోసం ఉద్యమిస్తున్న ప్రజలను వందలకొద్ది అన్యాయంగ కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్న దౌష్ట్యం కనపడలేదా ? మెజారిటీ ఉంటే చాలు , నీతీనియమాలు లేకుండా మాదాష్టీకం చేస్తాం ప్రభుత్వమయినా , బ్లాగులయినా అని నిరూపిస్తూ వీరు ఇలాంటి చెత్తవ్రాతలు రాస్తూనే ఉంటారు , వెంటనే పనికిమాలిన Snkr గాడిలాంటివారు వెటకారాలు చేస్తూనే ఉంటారు . కేవలం మెజారిటీతో అబద్దాన్ని నిజమని నిరూపిస్తారు .
వేంకటరత్నము ముదుసలి గుమాస్తా మాటలవలనం గొంత తెలివికలవాడయినందున నాతడు తన భార్య మనసును ద్రిప్ప యత్నించెను గాని , యాతని ప్రయత్నము వలన లేశమైనను లాభము కలుగలేదు . మీరు మిక్కిలి యాతని మాటలను వినినప్పటినుండియు విజయలక్ష్మి మనమన దిగులొందినందున నామె శరీరము వడకసాగెను . కోపాతిశయమువలన గన్ను లెఱ్ఱబాఱి వానిలో నుండి జలమురాదొడగెను . ఇట్టి కోపావేశమునందును నామె యితడు నా పతి యితనిని దండించు యుక్తము కాదను సంగతి మఱిచినది కాదు . కాని , యిట్టి సమయం మనముపేక్ష చేసినచో నీతడు దుర్నడవడిలో బ్రవేశించి చెడిపోవనిగాన నట్లు కాకుండ జేయుట కర్తవ్యమని తెలిసినది గాన నామెయూరకుండక కొంచెమావేశము తెచ్చుకొని ఈ నోటు తమరు న్యాయముగా సంపాదించి యుండరని నేనిదివఱకే యనుమానపడితిని . మీరిట్లు చేయుట హేతువేమి ? నేనెన్నడైన నగల కనిగాని బట్టల కనిగాని మిమ్మల్నింబ్బంది పెట్టితినా ? పిల్లలయిన దబానేదేని తెచ్చుటకై కచ్చే చేసిరా ? అందువలన మీకా దుర్భుద్ధి పుట్టెనా ? అందువలననే మీకీ బుద్ధి పుట్టియున్న నేను మీ పాదాల సాక్షిగా జెప్పెదను . నేనెన్నడిక యడుగను . పిల్లలనయిన నడుగనివ్వను . మా యందునుగ్రహించి మీరిట్లు చేయవలదు . సంగతి యొరులెఱుగజాలరని మీరనెదరు . గాని సర్వసాక్షియగు పరమేశ్వరుని మోసపుచ్చి మీరీ కార్యము చేయగలరా ? ఇట్లు చేసి ఆపై మీ మనసు బూర్వము వలె స్వస్థముగా నుండునా ? కష్టపడి సంపాదించుకొనిన పది రూపాయిలను సుఖముగా దినినటుల నీ దొంగసొమ్మునుదినగలమా ' దానిని మనము ముట్టినపుడెల్ల నిది మీరు విశ్వాసదోషమువలనే సంపాదించితిమన్నననోదేవ మనసు దెప్పుచుండదా ? పరమేశ్వరా ! తండ్రీ ఈ కార్యమును ఖానుపుటకు నేను శక్తురాలనుగాకున్నాను . నాకీ దరిద్రములో గలుగుచున్న పరమానందమిక దొరుకజాలదు గదా ! యని యామె దు : ఖము నాపుకొనలేక యేడువసాగెను . దానింగని తెలివి తెచ్చుకొని వేంకటరత్నము దు : ఖింపుచున్న తన సతిని దగ్గఱకు దీసికొని యక్కున జేర్చుకుని సతీ తిలకమా ! నీ సద్భోధవలన నామనమునందలి యజ్ఞానాంధకారము తొలగెను . నేనింక దుష్కార్యమెన్నటికిని జేయను . మ్నము దరిద్రములో నుండియు సద్గునముచేత గలుగునానందనముననుభవించెదము . ఆహా ! నాకిట్టి సచ్చరితయగు కాంత లభించినందునే కదా నేనొక గొప్ప పాపమునుండి విడుదల గంటిని . మత్ప్రాణ సమానమా ! నీకు విజయలక్ష్మియనిన నామమెంతయు దగియున్నది . నీవు నిజముగా నేడు విజయముబొందితివి . లోకులందఱు లక్ష్మీపూజ చేయుచుండగా నా దగ్గర పూజించుటకు లక్ష్మి లేదని గడియ క్రింద నేను జింతింపుచుంటిని . నా దగ్గర నీరూపముతో బ్రత్యక్షలక్ష్మియే యుండగా నాకాలోహమయలక్ష్మితో బ్రయోజనమేమి ? నేడు నేనీ లక్ష్మినే పూజించెదను . అని వేంకటరత్న మా స్వర్ణాలంకారహీనమైన సద్గుణాలంకారయగు విజయలక్ష్మినిం దమాలింగము చేతం బూజించెను . ' ఆ సమయమునందు విజయలక్ష్మి కత్యానందము కలిగినందున నామె దేహము తెలియక భర్త భుజముపై నొరిగెను . తాను తన పతిని నిష్కారణముగా తూలనాడితినని యామె కదిఖ దు : ఖము కలిగెను . కొంత వడికా సాధ్వీమని తెలివి తెచ్చుకుని మీరట్లు చెయ్యరు గదా ? ఇది నిజమేనా ? యని యడిగెను . వేంకటరత్నము వెంటనే నిజముగా జెయ్యనని మరల యామెను గౌగిలించుకొని నమ్మబలికెను . అప్పుడామె లేచి యాతని పాదములను గట్టిగా బట్టుకొనియెను . తన భర్త యేదోయొక గొప్ప సంకటము నుండి విడువబడిన తనకు లభించినట్లామెకుందోచెను . వేంకటరత్న మామెను లేవనెత్తగా సిద్ధాంత కరణులగు నా దంపతులు మిగతా రాత్రిని సుఖనిద్రలో గడిపిరి .
మా ఉద్దేశము కొనసాగితే , పెద్ద మనుష్యులు వ్రాసే సభ్య భాష దేశమంతా క్రమక్రమముగా వ్యాపించి విద్యాబోధనకు కావలసిన సులభసాధన మేర్పడుతుంది . పామరులకు సులభమైన వాఙ్మయము పుట్టుతుంది . వక్తలకూ వాచకులకూ తగిన భాష కుదురుతుంది . మనము ఇంగ్లీషు నేర్చుకొని వ్రాస్తూ ఉన్నట్టే మన దేశమందు కాపురమున్న ఇంగ్లీషువారున్ను ఇతరులున్ను మన భాష నేర్చుకొని మన భాషలోనే వ్రాసి గాని నోటను చెప్పిగాని మనకు హితోపదేశము చేయవచ్చును . భాషలో ఐక్యమువల్ల దేశమునకు రాష్ట్రమునకు ఎంతబలము కలుగునో చరిత్ర చదివిన వారికీ రాష్ట్రము ఏలేవారికీ తెలుసును . వాదుకలో ఉన్న భాషవల్ల కలిగే ఇన్ని లాభములు విడిచి , వాడుకలో లేనిదీ , కొద్దిమంది పండితులకు మాత్రమే సాధ్యమయినదీ , ప్రాచీన భాష వ్రాతలలో వాడడము వ్యర్థప్రయాసము కాదా ? ఈ ఆచారము ఏ దేశములోనూ లేదు . మన దేశమందయినా పూర్వము లేదు . మన తాతలనాడు లేదు . మన తండ్రులనాడు లేదు . ఈ ఒక్క తరములోనే ఈ వైపరీత్యము , ఈ ఉత్పాతము పుట్టినది . ఈ విషయము ముందు ముందు మేము విపులముగా చర్చించ దలచుకొన్నదే ; గాని ఇక్కడ సూచనగా మాత్రము చెప్పినాము .
అందరితోపాటు ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్‌ను , ప్రముఖ కవి , ' తెరవే ' అధ్యక్షుడు నందిని సిధ్ధారెడ్డిని సైతం ఘనంగా సన్మానించాలని కెసిఆర్ నిర్ణయించారు . అయితే తెలంగాణ వచ్చే వరకు ఈ సన్మానాలకు , సత్కారాలకు దూరంగా ఉండాలని తాము నిర్ణయించుకున్నందున సత్కారాన్ని అందుకోలేమని సున్నితంగా తిరస్కరించారు . కెసిఆర్ చూపించిన అభిమానం , తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ఆదరణను సాదరంగా స్వీకరిస్తామని వారు ప్రకటించారు .
కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల ప్రణాళికలో తెలంగాణా రాష్ట్రానికి అనుకూలమని పేర్కొంది . అది రాత్రి కి రాత్రి తీసుకున్న నిర్ణయమా ? సోనియాగాంధీ తెలంగాణలో తెలంగాణాకు అనుకూలంగా మాట్లాడిన మాటలన్నీ రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం ఫలితమా ? రాత్రి కి రాత్రి తీసుకున్న నిర్ణయం వల్లనే ఆనాటి రాష్ట్ర పతి అబ్దుల్ కలాం పార్లమెంటులో తెలంగాణా కు అనుకూల ప్రకటన చేసారా ? రాత్రి కి రాత్రి తీసుకున్న నిర్ణయం వల్లనే 2004 లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణా అంశాన్ని కామన్ మినిమం ప్రో గ్రాం లో పెట్టి సాక్షాత్తూ ప్రధాన మంత్రి చేత ప్రకటింప జేసారా ? రాత్రి కి రాత్రి తీసుకున్న నిర్ణయం వల్లనే ప్రణబ్ ముఖర్జీ కమిటీ ని వేసారా ? రాత్రి కి రాత్రి తీసుకున్న నిర్ణయం వల్లనే 2009 డిసెంబర్ 9 న చిదంబరం తెలంగాణా ప్రక్రియ మొదలు పెడుతున్నట్టు ప్రకటించారా ? శ్రీ కిచ్న కమిటీ కూడా రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం ఫలితమేనా ? ? ? అప్పటి నుంచీ ఎన్ని రాత్రులు గడచి పోయాయి ? ఇంకా ఎన్ని రాత్రులు కావాలి తుది నిర్ణయం తీసుకునేందుకు ? ఇంత బాధ్యతా రాహిత్యంగా మాట్లాడటం , తెలంగాణా పట్ల ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించడం ౧౨౫ సంవత్సరాల ఘన చరిత్ర వున్న కాంగ్రెస్ పార్టీ కే చెల్లింది . ఇంకా ఎంతకాలం ఈ దుర్మార్గం ? ? ? ? ? ? ? ? ? ఎటు దారి తీస్తుంది ఇది ? ? ? ? ? ?
ఇందుమూలాన వాళ్ళు విఫలులయ్యారు . జీవిత సామస్త్యాన్ని అర్ధం చేసుకోటానికి బుద్ధి మాత్రమే చాలదు . సమస్త మానసిక శక్తులతో అంటే కరుణా , ప్రేమా , భావనా మొదలైన వాటితోనూ , సమస్త అస్తిత్వంతోనూ అంటే మనస్సు , పంచేంద్రియాలూ కలిసిన ఒక చైతన్యంతోనూ దీన్ని అవగాహన చేసుకోవలసి ఉంది . ఒక్క కవి లేదా రచయితకు మాత్రమే ఇది సాధ్యమౌతుంది . ఎందుకంటే ఇది వారి ప్రత్యేక పద్ధతి ; సృజనాత్మక పద్ధతి . ఇక్కడే హేతువాదులైన మార్క్సిస్టులకూ , దార్శనికులైన ( visionary ) కవులకూ భేదం . వాళ్ళ అవిటి పరికరాలతో మార్క్సిస్టులు వైఫల్యం చెందారంటే ఆశ్చర్యం లేదు . కనక కాఫ్కాకూ , చలానికీ అర్ధమైనంతగా ప్రపంచం కమ్యూనిస్టులకు అర్ధం కాలేదంటే ఆశ్చర్యం లేదు .
డబ్బులు వస్తయ్యేమో , ఫామిలీలు చాలా మంది సినిమాకు వచ్చి ఉండినారు . ఇదో సమస్య ఈ మాస్ సినిమాల గొడవలో పడి ఫామిలీలు చూసే సినిమాలు తియ్యడమే మర్చిపొయినారు .
అన్నీ అరేంజ్ చేసాక , అందరూ కలిసి కొద్దిసేపు మళ్ళీ ఇండియా , అమెరికా లైఫ్ కంపేర్ చేసుకుంటూ , తమ తమ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ వున్నది , ఈ మధ్య పిల్లల చదువులు ఎలా వున్నాయి , పిల్లలని అమెరికాలోపెంచడం మంచిదా , ఇండియాలో బాగా పెరుగుతారా లాంటివన్నీ మాట్లాడుతుంటే , రాధిక భోజనాలు చేస్తూ మాట్లాడుకోవచ్చు అని చెప్పింది .
అక్షర భేదాల సంఖ్య ( గురు - లఘువులు ) 2 . ఇది స్థిరాంకం . పాదంలో అక్షరాల సంఖ్య 1 నుంచి 26 వరకూ ఉండొచ్చు . 26 అక్షరాలకు మించి పాదాలున్న లయగ్రాహి ( 30 ) , లయవిభాతి ( 34 ) , లయహారి ( 37 ) వంటి వృత్తాలను పేర్కొనటాన్ని బట్టి చూస్తే పాదంలో అక్షరాల సంఖ్య మీద గరిష్ఠ పరిమితి విధించటం ప్రాచీనుల ఉద్దేశం కాదని ఊహించవచ్చు . కాని , 26 అక్షరాల సంఖ్య వరకు మాత్రమే పేర్లు పెట్టారు . అంతకు ఎక్కువ ఉండటాన్ని వారు నిషేధించలేదు . ఒక్కో ఛందస్సులో అక్షరక్రమాల సంఖ్య 2n ( 2 to the power of n ) అనే గణిత సూత్రం మీద ఆధారపడి ఉంటుంది . పాదంలో ఎన్ని అక్షరాలుంటే అన్నిసార్లు అక్షరభేద సంఖ్యను క్రమంగా రెట్టిస్తూ పోతే పాదంలో అక్షరక్రమాల సంఖ్య వస్తుంది . అదే ఒక్కో ఛందస్సులో పుట్టే వృత్తాల సంఖ్య . పాదోత్పత్తి విభాగం చేసే పని ఇది . ఈ పద్ధతిలో , పాదంలో అక్షరాల గరిష్ఠ సంఖ్య 26 అయితే 13 , 42 , 17 , 726 అక్షరక్రమాలు ( ఇదే మొత్తం సమవృత్త సంఖ్య కూడా ) సాధ్యమవుతై . విషమ వృత్తాలను పరిగణిస్తే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది .
కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు ; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు : డీలక్స్ టెంప్లేట్స్
@ ఇన్నయ్య గారు స్పందించినందుకు నెనర్లు . ఆ కారణం చేత మనుషుల మధ్య నమ్మకం సడలిపోయి చర్చలు జరగడం లేదు అనిపిస్తుంది ఆలోచిస్తే . నా రెండో పరిశీలనకు కూడా మీ ఆలోచనని జోడిస్తారని ఆశిస్తున్నాను . ఆయా ఉద్యమాలను గమనిస్తే , ముందు భౌగోళికంగా ఆ ప్రాంతాలలో బలం పుంజుకుని ఆ ప్రాంతపు నాయకుల బలమైన నాయకత్వంలో ఆంధ్ర ప్రదేష్ అంతటా వ్యాపించాయి . హేతువాదాన్ని , మానవతా వాదాన్ని జీవన సారంగా చేసుకుని ముందుకు సాగే మీరు కూడా ఆ ప్రాంతానికి చెందినవారే కావడం ఇక్కడ యాదృచ్చికమే అవ్వొచ్చు . ఇక్కడ ప్రాంతాల వారీగా విడగొట్టి చూడటం నా ఉద్దేశం కాదు . కానీ అన్ని ఉద్యమాలకి ఆ డెల్టా ప్రాంతమే కేంద్ర బిందువు అవ్వడం నన్ను ఆలోచింపచేస్తుంది . . .
నందునింటను జేరి నయము మీరంగ చంద్రవదనలు నీకు సేవ చేయంగ .
కోటి : ( వినోదంగా ) ఏసు ప్రభువుని పట్టించేవేటివై బాబూ ! నీకు మన భగవద్గీతలూ పురాణాలూ పనికొచ్చేయి కావేటి … ? ఆ జానీ గాడితోటి కవుల మీటింగులంట తిరగడం మానీసి నేను చెప్పినట్టు ఆ ఋషికొండ లేఅవుటు మీద ఫోకస్ చేసేవంటే … ( ఛాలెంజ్ చేస్తున్నట్టు చెయ్యి పెట్టి ) నెష్టియర్ ఈ పాటికో పెద్ద పండుగల నాటికో నువ్వూ నేనూ చెరుకో టాటా సూమో కొనుక్కోక పోతే నా పేరు కోటీశ్వర్రావు కాదు నేన్నీ బావనే కాను …
ఎడ్లకు గడ్డి లేదు . కంకులన్నీ అయిపోయినాక సొప్ప కోసుకుందామని సేటుకు కలిసాడు ధర్మయ్య .
తాతారావుకు ఎప్పట్నుంచో కారుకొనాలని తెగమోజు . సిన్న సిన్న కార్లను సూసినప్పుడల్లా . . " ఇదా . . ఎదవది . . నాలుగు లచ్చలు , ఇది కారేంటి . . జవ్వాది అంజిగాడి కిళ్ళీకొట్టు డబ్బాలా ఉంది . . కొంటేగింటే . . ఏబైలచ్చలు పెట్టి బెంజు కొనాలిగానీ . . . , డబ్బాకార్లలో ఏముంటాదబ్బాయ్ దర్జా . . " అని అందరిదగ్గరా సెబుతుండేవోడు . ఊళ్ళోవున్న కుర్రగాళ్ళతో ఎప్పుడూ వాదనకు దిగి " బెంజును మించిన కారు పెపంచంలోనే లేదు , నాకు మీసాలు రానప్పుడ్నుండీ సూత్తన్నాను , నాలుగు మార్లు ఢిల్లీలో కార్ల ఎగ్జిబిషనుక్కూడా ఎల్లాను . . . , నా కళ్ళముందే బోకుల్లా తిరిగిన మీ బాబులంతా కొయిటాసొమ్ములు సంపాయించీ బాగా బలిసీ . . నిక్కర్లుమానేసి పేంటులేసుకునొచ్చిన పిల్లిమిసరకాయల్లారా . . నాకుసెప్తారేంట్రా . . మీరా ? " , అని అన్నిఇసయాల్లోనీ అందరికంటే ఎక్కువ తనకే తెలుసునని సెప్పుకుంటంలో తాతారావుని మించినోడు ఉభయగోదారిజిల్లాల్లో ఎవడూ ఉండుండడు . పైకి " అవునురోయ్ . . తాతారావుగారు సెప్పిందే కరెష్టురా . . " , అని తలలాడించినా . . సాటుకెళ్ళి " ఛీ ఈ ఎదవ నోట్టో నోరుపెట్టినా కుక్కనోట్లో నోరుపెట్టినా ఒకటే . . " అనంతా తిట్టుకెళ్ళిపోయేవోరు . . , తనేమీఇన్లేదన్నట్టు . . తానుపట్టుకున్న కుందేలి నాలుగు కాళ్ళను ఎనక్కి కట్టేసి . . అసలు కాళ్ళేలేవు అని ఋజువుచేసే తత్వం తాతారావుది . అలాని ఊరిజనం పట్టించుకోకండా తిరిగే ఆసామాసి మనిషిగాదు తాతారావు . పచ్చింగోదారి జిల్లా నిడదోలూ , కానూరు , ఉండ్రాజరం చుట్టుపక్కలున్న ఊళ్ళలో మెరక . . పల్లం . . బీడు . . మాగానిల్తో కలుపుకుని . . మొత్తం ఇరవై ఎకరమూ . . సఖినేటిపల్లిలో ఐదారుసోట్ల ఎటుసూసినా ఐదెకరాల ఏకముక్కకి తక్కువగాకండా అత్తోరు కట్నంగా ఇచ్చిందాంతో కలుపుకుంటే … సుమారు ఏభై ఎకరముంటాది తాతారావుకి . సఖినేటిపల్లిలో కాల్వగట్టుకి ఆనుకునున్న అరెకరంనేలలో బంగాళాపెంకుటిల్లు . . డూప్లెక్సు హౌసూ . . . చుట్టూ గెదెల సావిడీ . . , మంచి పెసాంతమైన వాతావరణంలో ఎండపొడ కూడా తాక్కుండా చుట్టూరా కొబ్బరిచెట్లతో కప్పేసుంటాది తాతారావు ఇళ్ళు . ఎప్పుడో ఇల్లరికపల్లుడుగా వచ్చేసి ఇక్కడే స్తిరపడిపోయిన తాతారావు , ఆ వూరి స్తితిమంతుల్లో వొకడుగావటం వల్ల , అతని బలం , బలగం చూసి బయపడేవోళ్ళు ఎక్కువే ఉన్నారావూళ్ళో . పిల్లాజెల్లాలేకపోయినా . . ఎప్పుడూ ఒక ఇరవై ముప్పై మంది పొలాళ్ళో పనిచేయటానికి చేతికిందుండే పనోళ్ళు . . నలబైదాకా ఉండే పాడావులు , గేదెల్నీ సూసుకోటానికి పదిమంది పాలేళ్ళు . . . ఇష్టాన్సారంగా చిర్రుబుర్రులాడిపోతా ఎగరటానికి . . తిట్టింది పట్టానికీ . . . తిండికి వంట్టానికీ అన్నట్టుండే . . ఇంటావిడ జయమ్మ . . ఈళ్ళందరితోనీ కళకళ్ళాడిపోతుంటాది ఆ ఇంటి పరిసరపాంతాలు . ఎంగిలిచేత్తో కాకినిదిల్చితే ఎక్కడ తినేసి బల్సిపోద్దో , తనకి ఎక్కడ పుణ్యమొచ్చేద్దోని ఊర్లో ఎవడిగొడవా పట్టించుకోకండా . . ఉండే తాతారావు , కాకులు కావు కావుమనకుండానే . . పొద్దుపొడవకుండానే లేచి ఇంటి గుమ్మానికి ఎడంపక్కనుండే ఖాలీత్తలంలో గుబురుగా పెరిగి . . పూతతో పిటపిటలాడుతున్న గున్నమామిడిచెట్టుకింద . . దారేపోయే వాడు కనబడే ఇదంగా పడక్కుర్చీ ఏసుకుని . . కాలుమీదకాలేసుకుని వచ్చిరాని తెలుగు కూర్చుకుంటా పేపరు సదువుతా . . . లంకపొగాకు సుట్ట నోట్టోపెట్టుకుని . . ఊరిసివరున్న ఆరుమిల్లోల్ల రైసుమిల్లు పొగ్గొట్టంలా పొగొదుల్తా కనబడ్డకుర్రోన్ని కేకేసి . . రాములోరి గుడిపై మైకుసెట్టులాంటి వాయిసుతో ప్రశ్నలమీద ప్రశ్నలేసి కుల్లబొడిసేసే తాతారావు ఇంటి సందులోకి రావాలంటే అందరూ బెంబేలెత్తిపోతుంటారు . మూన్నెళ్ళకోసారి మగతాలకిచ్చేసిన పచ్చింగోదారి పొలం పనులు సూసుకుంటానికని పదిపదిహేనురోజులు ఊళ్ళోలేనప్పుడు తప్ప తాతారావు కబుర్లబాధ పల్లేక ఆ దొడ్లో పిట్టకూడా వాలటానికి భయపడిపోతుంటాయి . ఒకేళ తప్పుజారో . . మరిసిపోయో ఎవడైనా ఆ ఈదిలోకొచ్చి తాతారావు కంటికి సిక్కాడా అంతే సంగతులు . . పిలిస్తే ఎల్లాల్సిందే . , ఎళ్ళామా ఊళ్ళోవోళ్ళ రాజకీయాలు కాన్నించి రాసలీలలొరకూ . . , గుళ్ళో రాంభజనలు కాన్నించి . . . పేటలో రచ్చబండ ఇషయాలవరకూ మెరకీది . . పల్లపీది ఇషయాలన్నీ . . ఏది బుర్రలోకొత్తే అది గుచ్చి గుచ్చి అడిగి మొత్తం కనుక్కునే దాకా ఇడిసిపెట్టడు . ఒకేళ ఎవరైనా " తెల్దండే . . ! " , అన్నారా . . " ఏరా . . ఇయ్యన్నీ తెల్సుకోకండా ఏం సెక్రాలు దొర్లించేత్తున్నావురా తొత్తుకొడకానీ . . " , లాంటి తిట్లు తినాల్సొస్తాదేమోనని నోటికొచ్చింది సెప్పేసి బయటపడేటోళ్ళు కొందరైతే . . . ఆడనుండి ఈడకీ ఈడనుండి ఆడకి . . టాపిక్సులు మార్సేసి ఎదోటిమాటాడేత్తా బోల్తాకొట్టించేసేటోళ్ళు కొందరు . ఇలా అందరి బుర్రల్లోవున్నాగుంజును బుర్రకొట్టకుండా బుర్రగుంజు తిన్నట్టు తినేత్తా కాలచ్చేపం చేసేత్తుంటాడు తాతారావు . ఓరోజు బాగా పొద్దుగూకినేల . . . వారంరోజులకితమే పుట్టి . . నల్లగా నిగనిగలాడిపోతావున్న పెయ్యిదూడ . . పడతాలేత్తా కట్రాడుక్కట్టేసిన తల్లిపొదుగులో పాలుకుడవటానికి ఎల్తున్న సమయంలో . . పాలేరు ఈరిగాడు . . గోదారిలంకల్లో మడిచేలు తొక్కుకుంటా రంకేసుకొచ్చే నల్లాంబోతులాగా పరిగెత్తుకుంటా ఏసిన రంకెకి బెదిరిపోయి . . పాకలోంచి దొల్లుకుంటా పక్కనున్నపేడగుట్టపై పడిపోయింది . పరుగుతీసి తీసి . . ఒక్కమారు బ్రేకేసిన చెఱుకు ట్రాట్టరులాగా ఊగిపోతా తాతారావు కూర్సున్న పడక్కుర్చీ దగ్గర ఆగి . " అయ్యగారో . . ! మన బెంజుకారొచ్చేసిందంటండే . ఇప్పుడే పల్లపీదిలోఉండే ఎమ్మర్వో ఎంకటేస్వర్లుగారబ్బాయి సర్సాపురంనించీ . . పంటిమీద వత్తా చూసారంటండే . . , కారుమీదేనేమోననీ . . ఆరిని ఇవరం అడగ్గా . . సఖినేటిపల్లి తాతారావుగారింటికే దెలిబరీ ఇస్తన్నాం . . . ఇంకో అరగంటలో వచ్చేత్తందాని . . కాతంత ఆయనకి సొప్తారాని మీకు సొప్పమని సొప్పేరంటండే . . . " , అని ఆయాసపడిపోతా చెప్పేడు పాలేరు ఈరిగాడు . అదియిన్న తాతారావు మీసంమెలేసి తొడగొట్టినంతపనిచేసి , జారిపోతున్న పంచెను ఎగ్గట్టి . . ఉక్కసారిగా పడలక్కుర్సీలోంచి లేసి " పదరా ఈరిగా . . సరంజామా చెయ్యాలి . . మొత్తం ఈ గోదారిపక్క గామాల్లో అందరికీతెలిసేటంత . . దుమ్ములేచిపోవాలా . . ఎంత ఖర్సైనా పర్లేదు . . నువ్వు ఆ పన్లోవుండు . . " , అని ఈరిగాడికి పురమాయించాడు . . . " ఒరే పాపిగా . . . ! , మనింటికి . . జనాలొత్తున్నారో . . ఆ మూలమొక్కలెక్కే . . . ఓ ఇరవై కొబ్బరిబొండాలు దించరా . . . దావతకే . . " అని ఇంటెనకాలా గడ్డికోత్తున్న పాలేరు పాపాన్నకి పనొప్పజెప్పేడు . కాసేపటకి . . ఊరుఊరంతా ఇటేపే నడిసొచ్చేత్తన్నారేమో అన్నట్టు . . చింతపిక్కరంగున్న ఇ - క్లాసు బెంజికారు ఎనకాల సంక్రాతి పెద్దపండుగరోజు తోటల్లోకోడిపందాలు సూడ్డానికి పరుగెత్తుకొత్తొన్నట్టు గుంపులుగుంపులుగా జనాలొచ్చేత్తన్నారు . కొబ్బరిసెట్లనీడా . . మద్దెమద్దెన ఎండా . . పడతా … సేపలేటకెళ్ళొచ్చి . . అప్పుడే గోదారొడ్డుకు సేరుకున్న ఏటపడవలాగా తళతళా మెరిసిపోతావొత్తన్న పడవంతకారుని సూసిన తాతారావూ . . , ఇంటిబయట పెహారీగోడవతల సెట్లకింద నీడల్లో పొదుగుడు కోడిపెట్టల్లా కునుకుతా నిలబడ్డ సంబరాల్లోల్లకి మొదలెట్టండ్రా అన్నట్టు . . సైగచేసేడు . . , అంతే అప్పట్దాకా పెసాంతంగా వున్న ఆ పెదేసం . . అంతరేది లక్ష్మీనర్సింసామి తీత్తంలో సంబరాల్లాగా . . సెలరేగిపోయిన పులిడాస్సులు . . . బుట్టబొమ్మలూ . . సన్నాయి మేళాలోల్ల . . . సిందులాటల్తో మోతెత్తిపోయింది . . అలా ఓ అరగంటగడిసాకా , ఊరసెరువులో ఖజానా బాతీదుకుంటా వత్తాంటే తూటుమొక్కలు సైడైపోయి తప్పుకున్నట్టుగా తప్పుకున్న జనాల్లోంచొచ్చిన కారు . . రైయ్యిమంటా . . వొచ్చి గున్నమామిడి చెట్టునీడనాగింది . ఆ కార్లోంచి బెంజికారు సింబలున్న సూట్లేసుకుని . . దొరల్దిగినట్టుగా . . నలుగుదిగేరు . తెల్లబట్టల్లో మిలమిలా మెరిసిపోతా . . మెల్లెపూలసెంటుకొట్టుకుని . . , ఫాండ్స్ పౌడ్రు మెడనిండా తెల్లతెల్లగా కనిపించేలా రాసుకుని . . పదేళ్ళకీ . . పచ్చకుందనాల్లా మెరిసిపోతున్న బంగారుంగరాలూ . . మెడలో దున్నపోతు కాళ్ళకి బంధమేసేంత లావున్న చెయినూ ఏసుకుని . . బెంజికారును చూసి . . ఆనందంపట్టలేక భూమికి అడుగున్నర ఎత్తులో గాల్లోతేలతా . . నిలబడ్డ తాతారావును చూసి ఈయనే కారుకొన్న పెద్దమనిషి అననుకుని . . " నమస్తే సార్ . . తాతారావుగారంటే మీరేనా అని . . " , అడిగాడు ఆ నలుగుర్లో ఒకతను . " అవునమ్మా నేనే . . . , ఒరే . . కుర్చీలేసే . . . బొండాలుకొట్టి పట్రండ్రా . . " , అని పనోళ్ళని కేకేసి . . " కాళ్ళుకడుక్కుందిరిగానీ . . రండే ! " , అని పెళ్ళికొచ్చిన మొగపెళ్ళోళ్ళమల్లే ఆహ్వానించాడు తాతారావు . వచ్చినోళ్ళు . . కాళ్ళుకడుక్కుని . . చెట్టుకింద కుర్చీల్లో కూర్చుని బొండాలుతాగటం మొదలుపెట్టాకా . . . " ఏంటండే . . . అసలు ఇన్పర్మేషన్ లేకుండానే పపించేసేరో . . . ? , పంపేదానికి రోజు ముందు సెప్పమని బుక్కుచేసినప్పుడు సెప్పేనండే . . " , అన్నాడు తాతారావు . . అందులో ఒకతనకి దగ్గరగా కుర్చీలాక్కుని కూర్చుంటా . . . " లేదుసార్ . . నాలుగురోజులనుండీ మీరిచ్చిన ఫోన్ నెంబర్లకు ట్రైచేస్తున్నామండీ , మీకు ఇన్ఫామ్ చేద్దామని . . , కానీ ఏనెంబరుకు కలవలేదండీ . . " , అని వినయంగా చెప్పాడు ఒకతను . " ఆయ్ . . అలాగాండే . . . ల్యాండేమో . . మొన్న కొబ్బరితీతలో కమ్మడిపోయి తెగిపోయిందండే . . . , ఇంకా బాగవలేనట్టుందండే . . . , ఇకపోతే సెల్ నెంబరు సరిగ్గా సిగ్నలుండిచావదండే . . , అయ్యయ్యో . . ఫోనుచేసిచేసి . . బాగా ఇబ్బంది పడిపోయింటారండే . . . " , అని తెగ బాధపడిపోయాడు తాతారావు . " అదేంలేదుసార్ . . . బాగాలేటయిపోతుందని . . డెలివరీచేసేసాం సార్ " , అని . వేరేఅతను చెప్పాడు . . " మంచిపనిచేసారండే . . , ఇలా తెలీకోకండా వత్తానే బాగుందండే . . " , అని మీసాలు దువ్వుకుంటా నవ్వాడు తాతారావు . ఇంగిలీషులో ఎమన్నామాటాడే అవసంమొత్తాదని . . ముందుగానే ఊహించిన తాతారావు . . ఆవూల్లోనే బోర్డస్కూల్లో పనిచేస్తున్న ఎంకటరత్నం మాస్టార్ని పిలిపించుకొచ్చి . . ఎనకే నిలబెట్టుకున్నాడు . కారుగురించి దాని మెయింటేనెన్సు గురించి చెబుతుంటే . . అదిచూసి బాగా గుర్తుపెట్టుకోండి . . అన్నట్లు ఎనకున్న ఎంకటరత్నం మాస్టారేపు తిరిగి సైగచేత్తావున్నాడు . కారున్జూసి . . ఉబ్బితబ్బిబ్బైపోయిన తాతారావుని . . వూరువూరంతా పొగడ్తలత్తో ముంచేసి . . ములగసెట్టెక్కించేసి . . , పెద్దపార్టీ ఇవ్వాలంటూ బుట్టలోపడేసేరు . ఇక ఆవారంచివర్లో జనాలపట్టుమీద ఊరిసివర కొబ్బరితోటలో బోజనాలు , సంభరాలు , రికాడ్డింగు డ్యాన్సులు ఏర్పాటుసేయించేడు . . తాతారావు . పెద్దొరసనాటుకోడి మాసం , ఏటమాసం . . చించినాడ నుండి గుడ్డిపీతలు , బొమ్మిడాయిలూ . . రావలు . . పులస లాంటి . పదేను రకాల నాన్ వెజ్ ఐటమ్సుతో ఏర్పాటుసేసిన భోజనాలు తినీ . . , సంబరాలు సూసి జనాలు తెగ సంబరపడిపోయారు . . , " ఒకాడపిల్లపెళ్ళిసేసినంత ఘనంగా చేసార్రా తాతారావుగోరా . . " , అని ఎటుసూసినా సుట్టుపక్కనున్న అయిదు గ్రామాలకు తగ్గకుండా మహా ఇంతగా సెప్పుకున్నారు . . ఓరోజు అంతరేది గుళ్ళో కారుకు పూజ్చేయిద్దామని రాములోరి గుళ్ళో పూజారి శర్మగారిచేత ముహుర్తం పెట్టించి . . కారేసుకుని అంతరేది బయలుదేరిన తాతారావు . . కూడా పాలేరు ఈరిగాడిని ఎక్కించుకున్నాడు . " అయ్యగోరో . . . సీట్లేంటండే . . . దూదిపింజల్లా మెత్తమెత్తగా ఉన్నాయే . . భలేగుందండే బాబో . . . " , అని ఈరిగాడనేసరికి . . మీసంమెలేసి " మంరేంటనుకున్నావ్ బెంజికారంటే . . " , అన్నాడు తాతారావు . తాతారావుకి డ్రైవింగు కొత్తేమీకాదు . . పెద్దపెద్దగడ్డిమోపులూ . . చెరుకూ ఏసుకుని . . గతుకులరోడ్డుల్లోకూడా తొనక్కుండా ట్రాట్టరునడిపిన అనుభవముంది . . , సొంతంగా కారులేకపోయినా . . కొత్తగాకనిపించిన కారులన్నీ నడిపిచూసినోడె . . కాకపోతే . . ఇంకా అలవాటుగాని కొత్తకారు కావటంతో కొంచెం ఊపుపులుగా లాగిస్తున్నాడు . . , టర్నింగుల్లో రోడ్డు మార్చిను దాటేసి పొలాల్లోకి పోనిచ్చేత్తా . . ఒక్కోసారి ఎక్కవ తిప్పేసి వేరేపక్కి దూకించేత్తావున్నాడు . . ఇదంతా గమనించిన . . ఈరిగాడు . . " అయ్ బాబోయ్ అదేటండే . . తిరక్కుండా దూకేత్తాందా . . నన్నడిగితే ఈ పడవంతకారుని తిప్పటం చానాకష్టమండే . . . మొన్న కొయిటానుండొచ్చిన గిరిగి పద్దనాబం మనవడు ఆలుటోనో ఎటోనంటండే . . లక్కపిడతంత వుందండే . . కోరో , గొబ్బిరిగాయలతీతకి ఓరోజు పొలందగ్గరకి ఆ బండిమీదే తీస్కెల్లేడండే . . పొలాల్లోవుండె పచ్చ మిడద్దూకినట్టు దూకి . . . సిన్న సిన్న సందుల్లోగూడా తిరిగేత్తందండే . . అదా . . . " , అన్నాడీరిగాడు . . యమాసీరియస్ గా బండినడుపుతున్న తాతారావొంకే చూత్తా . " ఓరి . . సన్నాసెదవా . . ! ! , రెండున్నర లచ్చలకారుకీ . . . ఏబైలచ్చలకారుకి పోలికేంట్రా . . . దీంతో అలాంటియ్యి ఇరవైముప్పైగొనచ్చు . . . , అయినా సింవాసనం మీదున్న కుక్కకేం తెలుత్తాదిరా ఇలువా . . . , దిన్నే పవరు స్టీరింగంటారు . . ఇంత దిప్పితే . . అంత దిరుగుద్దు . . నాకింకా అలవాటుగాక దూకేత్తందిగానీ . . , అలవాటవ్వాలా . . . అప్పుడుదెలుత్తాది . . నా సామిరంగా . . , దీని ఎవ్వారమేంటో . . , అయినా . . కూడా నిన్నేక్కించుకురాటం . . నాదేబుద్దక్కువా . . . రా . . " , అని చెడామడా తిట్టేసరికి . . ఈరిగాడు నోరుమూసేస్కుచ్చున్నాడు . ఓపక్క తిట్లు తిడతానే ఉన్నాడు . . ఓ పక్క సీరియస్గా కారు తోల్తానే వున్నాడు . . కారుఅటుదిప్పుతా ఇటుదిప్పుతా ఊపుపులుగా లాగిత్తానే వున్నాడు . . తాతారావు . కాలవమొగ రోడ్డు పెదవొంపుదగ్గరికొచ్చే సరికీ పెద్ద గేదెలమంద అడ్డొచ్చింది . . " ఎవడ్రీడా ఎదవ ఈ మందనంతా ఇక్కడెక్కిచ్చాడా . . " , అని తిట్టుకుంటానే . . , కుప్పనూర్పుల్లో ట్రాట్టర్ స్టీరింగు తిప్పినట్టు . . స్టీరింగు మీదకంటా పడిపోయి మొత్తం మట్టానికి తిప్పేసేడు తాతారావు . . బండి గేదెల్ని తప్పించుకుని . . వొక్కసారిగా . . ఎడంవైపున్న బోదెలోకి దూకబోయింది . . , అదేకంగార్లో . . బ్రేకనుకుని . . ఎక్షెలేటర్ మీదకాలేసి . . లోనకంటా తొక్కేసేడు . . సినిమాల్లో రేసుకారు దూకినంత దూకుడుగా . . పంట కాల్వ దూకి . . అవతలున్న కొబ్బరితోటలోకి ఎగిరి . . . ఓ చెట్టుమొదల్ని దబేలుమంటా గుద్దేసింది . ఆ సౌండు మొత్తం సఖినేటిపల్లంతా ఇనబడిపోయింది . .
ఏప్రిల్ 16 నాడు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన పోలేపల్లి సెజ్ బాధితులు మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటముల్ని నిర్దేశించే అవకాశం ఉందని " సూర్య " దినపత్రిక మే 9 నాడు ఒక కథనం రాసింది .
@ మాధురి , మీలాగే మరొకరు కూడా చదవడం మొదలు పెట్టి ఇన్ని తప్పులేమిటి అని పక్క న పెట్టేశారు . ఏం చెప్పమంటారు నాకష్టాలు . తప్పులు దిద్దుకుని , మరోసారి చూసుకుని ఇ - బుక్ గా ప్రచురించడానికి వీలవుతుందేమో చూస్తాను ఒక నెలరోజులు టైమివ్వండి .
ఇంకో రెండు ఫర్లాంగులు పోయిన తర్వాత సడెన్‌గా ఒక సందులో అతనికి కనిపించింది ఒక కారు . నడుస్తూ నడుస్తూ ఏదో ట్రబుల్ ఇచ్చింది కాబోలు , బానెట్ ఎత్తి చికాకుగా ఇంజన్‌వంక చూస్తున్నాడు ఓనర్ .
" ఏవండీ ! ఇది విన్నారా ? రావులపాలెం పెళ్ళికి వెళ్ళొస్తూ , ట్రాక్టరు బోల్తా కొట్టి ఆ ముసలమ్మ కుటుంబం మొత్తం చనిపోయారట . వాళ్ళు చచ్చి పోలేదండీ . ఆ సత్తిరాజే చంపించాడనీ అందరూ అనుకుంటున్నారు . నాకూ సత్తిరాజు మీదే అనుమానంగా వుంది . వాడు ఎంతకయినా తెగిస్తాడని అందరూ అంటారు . వాడో రాక్షసుడు . ఈ ఉసురు వాడికీ , వాడి కుటుంబానికీ తగలక మానదు . " ఆవేశంగా అంది .
మీకు ఇవన్నీ రీసెర్చి చెయ్యడానికి యెలా కుదురుతుందో ? వూరుకొంటే , మనుషుల్ని కూడా బీటీ చేస్తారేమో అనిపిస్తుంది . నిజం గా అలా చేసినా జనాభా తగ్గుతుందేమో ! చీల్చి చెండాడండి గురూగారూ .
ఒక మార్పు కోసం ఎప్పుడైనా నాకు చనిపోవాలని ఉంటుంది . అనాదిగా పరిచితమైన ఒక చల్లటి వెలుగులో ఐక్యమైపోవాలని ఉంటుంది .
ప్రేమ పందిట్లో పెళ్లి ప్రేమ , ఆకర్షణతో మొదలయి , చిలిపిగా ఉరకలేసి , అపురూపంగా ఓ రూపాన్ని సంతరించుకుని , బాధ్యతల నడుమ నలిగి , గాంభీర్యాన్ని ఆపాదించుకుని , మనసు పొరల అడుగున , నిక్షిప్తమైనట్టు భ్రమ కలిగించి , జీవితాన్నంతా ఆక్రమించి , మలి వయసులో , మమతల వెల్లువను కురిపించే , ప్రేమ పందిట్లో ముడిపడిన , పెళ్లి … . .
ఈనాటి భాషాసమస్యలకు , కొంత శాస్త్ర విశ్లేషణతో , పరిష్కారాల కోసం అన్వేషించే వ్యాసాలను రాబట్టగలిగితే ఈ ప్రత్యేక సంచికకు సాఫల్యత సిద్ధించినట్టే .
సందర్భం - రావిశాస్త్రి స్మారక సాహితీ నిధి పురస్కారం . వేదిక - సుందరయ్య విజ్ఞాన కేంద్రం - హైదరాబాదులో బాగ్‌లింగంపల్లి ప్రాంతం .
జడ్చర్ల గ్రామీణం , న్యూస్‌టుడే : ' నేను పోలేపల్లి పీనుగను మాట్లాడుతున్నా ' పుస్తకాన్ని విప్లవ రచయితల సంఘం నాయకులు వరవరరావు ఆవిష్కరించారు . సోమవారం జడ్చర్ల మండలం పోలేపల్లిలో సెజ్ బాధిత రైతులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు . ఇందులో పోలేపల్లి బాధితుల కథనాలు ఉన్నాయి . కార్యక్రమంలో గీతాంజలి తదితరులు పాల్గొన్నారు . అనంతరం మొదటిసారిగా పోలేపల్లిని సందర్శించిన వరవరరావు గ్రామంలో పర్యటించి బాధితులతో మాట్లాడారు .
లేదు , బహుశా తెలుగు సాహిత్యంలో ఆధునిక భావాలు , చారిత్రక దృష్టి నిలిచినన్నాళ్లు హరి నిలిచే ఉంటాడు . హరి చిరస్థాయిగా నిలుస్తాడనేది మిత్రుల పవిత్రకోరికో , అమరత్వ కాంక్షకు చిహ్నమో కాదు . తన స్నేహం వల్ల , తన స్వభావంవల్ల , తన రచనలవల్ల , తన మాటలవల్ల వందలాది , వేలాది సాహితీమిత్రులలో మిగిల్చిపోయిన జ్ఞాపకాలలో , చతురోక్తులలో , లోతయిన విశ్లేషణలో హరి చిరకాలం నిలిచే ఉంటాడు . జీవితకాలంలో తనదంటూ ఒక పుస్తకం అచ్చు వేయకపోయినప్పటికీ కొన్ని వందలపేజీల సాహిత్య విమర్శ , సాహిత్య చరిత్ర , సినిమా విమర్శ రాసి ఉన్నాడు గనుక , మరికొన్ని వందలపేజీలు అనువాదం చేసి ఉన్నాడుగనుక హరి ఆ రచనలలో నిలిచేఉంటాడు . ఎందరో సాహిత్యజీవుల నిత్యజీవితాల్లో భాగమయ్యాడు గనుక , వారి ఆలోచనలకు పదునుపెట్టాడు గనుక ఏదో ఒక సందర్భంలో మళ్లీ మళ్లీ గుర్తుకొస్తూనే ఉంటాడు .
ramani " మనమీద నమ్మకమే మనల్ని నిలబెట్టేది . ఈ సంపాదకీయం నన్నో పోస్ట్ రాసేలా ఉసిగొల్పుతోంది . " * * * * * ఇక్కడ నేను దైవ దూషణ చయడంలేదు . . పెద్దలు విజ్ఞులు గమనిచవలెను . . నా బుఱ్ఱలో చిక్కుకుని ఉన్న అనేకానేక ప్రశ్నలకి , సమాధానాలు దొరకక . . ఇక ఆలోచించడం మానేసి . . . పోస్ట్ రాస్తున్నాను .
విద్యాసాగర్ ఆ అప్లికేషన్ ని నింపి , గురువు గారి చేత సంతకం చేయించుకున్నాడు . మళ్ళీ యాభై మైళ్ళు వెనక్కి నడిచి తన గ్రామాన్ని చేరుకునే సరికి బాగా అలిసిపోయాడు . కానీ తన గురువు గారికి ఉద్యోగం లభిస్తుందన్న ఆనందం మాత్రం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది . ఆ ప్రిన్సిపల్ మాత్రం కుర్చీ లో కూర్చుని మారు మాట్లాడలేకపోయాడు . అసలీ విద్యాసాగర్ లాంటి మనుషులు ఈ భూమ్మీద ఇంకా ఉన్నారా ? అని ఆశ్చర్యపోయాడు .
ఆశాభోస్లే తెలుగులో ఎన్నిపాటలు పాడిందోగాని , నేను విన్నది మాత్రం ఇది . సినిమా - చిన్ని కృష్ణుడు సంగీతం - పంచందా ( ఆర్ . డి . బర్మన్ ) పాడినవారు - ఆశా తాయి , మరియూ బాలు . రాసిన వారు - వేటూరి సినిమా దర్శకత్వం - జంధ్యాల ఆశా : జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం సాగనీ పయనం కల ఇల కౌగిలించేచోట కల ఇలా కౌగిలించేచోటా జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం సాగనీ పయనం కల ఇల కౌగిలించేచోట కల ఇలా కౌగిలించేచోటా ఏది భువనం ఏది గగనం తారా తోరణం ఈ చిగాగో సియర్స్ టవరే స్వర్గ సోపానమూ ఏది సత్యం ఏది స్వప్నం డిస్నీ జగతిలో ఏది నిజమో ఏది మాయో తెలియని లోకమూ బాలు : బ్రహ్మ మానస గీతం మనిషి గీసిన చిత్రం చేతనాత్మక శిల్పం మతి కృతి పల్లవించే చోట మతి కృతి పల్లవించే చోట ఆశా : జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం సాగనీ పయనం కల ఇల కౌగిలించేచోట కల ఇలా కౌగిలించేచోటా ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్ఛా జ్యోతులూ , ఐక్య రాజ్య సమితిలోన కలిసే జాతులూ ఆకసాన సాగిపోయే అంతరిక్షాలు ఈ మయామీ బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యమూ బాలు : సృష్టికే ఇది అందం దృష్టికందని దృశ్యం కవులు రాయని కావ్యం కృషి ఖుషి సంగమించే చోట కృషి ఖుషి సంగమించే చోట ఆశా : జీవితం సప్త సాగర గీతమ్ వెలుగు నీడల వేదం సాగనీ పయనం కల ఇల కౌగిలించేచోట కల ఇలా కౌగిలించేచోటా ఈ పాట బాగుంటుంది . అయితే , ఆశా కొన్ని పదాలని ఖూనీ చేసింది . ఒకచోట కౌగిలించే చోట ని కోగిలంచే చోట అని పాడింది . జంధ్యాల వారు ఇలా ఎందుకుచేరబ్బా ? నా చిన్న మట్టి బుర్రకి కొన్ని చరణాలు అర్ధంకాలా అవి . ఇక్కడ వినండి ఈ పాటని :
తిరుమల వెంకన్నకు దాదాపు 11 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయి . [ 2 ] శ్రీవారికి 12వ శతాబ్ది నుంచే రాజులు విశేషంగా కానుకలు సమర్పించారని ఆలయంలోని శాసనాధారాల ద్వారా తెలుస్తోంది . విజయనగర రాజుల కాలం ( 1450 ) లో శ్రీవారికి ఆభరణాల వెల్లువ ప్రారంభమైంది . ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయులు పాలించిన 21 ఏళ్లు ( 1509 - 1530 ) [ 2 ] స్వర్ణయుగమేనని చెప్పవచ్చును . తిరుమల ఆలయాన్ని ఏడుసార్లు సందర్శించిన శ్రీకృష్ణ దేవరాయలు విశేష కానుకలతో స్వామివారి భాండాగారాన్ని స్వర్ణమయం చేశాడు . శ్రీకృష్ణ దేవరాయలు 10 - 02 - 1513న శ్రీవారి ఆలయాన్ని సందర్శించి కెంపులు , పచ్చలు , వజ్రాలు , నీలాలు , మాణిక్యాలు , వైఢూర్యాలు , గోమేధికాలతో పొదిగిన వజ్రకిరీటాన్ని కానుకగా సమర్పించాడు . 2 - 5 - 1513 న నవరత్నఖచిత ఉడుధార , స్వర్ణఖడ్గం , నిచ్చెన కఠారి , రత్నఖచిత మరో చిన్న కత్తి , నవరత్నాలు పొదిగిన కంఠహారం , భుజకీర్తులు , 30 తీగల పతకం కానుకగా సమర్పించాడు . [ 2 ] తంజావూరు రాజులు పాండ్యన్ కిరీటాన్ని కానుకగా సమర్పించారు . రాజులు పోయినా . . . మహ్మదీయ రాజ్యం , బ్రిటిష్ పాలన , మహంతుల శకం , ప్రస్తుతం ప్రజాస్వామ్య భారతంలో పాలక మండళ్ల వ్యవస్థ ఇలా ఆలయ నిర్వహణ పలు పుంతలు తొక్కినప్పటికీ కాలమాన పరిస్థితులతో నిమిత్తం లేకుండా స్వామి వారికి కానుకల వెల్లువ పెరుగుతూనే ఉంది .
వీళ్ళ గురించి ముందే తెలుసు కాబట్టి ఎవ్వరైనా తెలిసిన పోలీసు చేత చెప్పిస్తే వింటాడు కదా అని ప్రయత్నిస్తే , సదురు పోలీసు కుక్క కూడా ఇదే చెప్పింది . మనకు వాళ్ళతో గొడవ వద్దు కానీ అడిగింది ఇచ్చేయ్ మనకు ఎప్పుడైనా అవసరం పడితే చేస్తాడు , అని సమాధానమిచ్చింది . ఎంతైనా ఓ గూటి పక్షులే కదా వీరంతా అనుకుని అనువుగాని చోట అధికుల మనరాదని సమర్దించుకుని అడిగినంత ఇచ్చి మెల్లగా జారుకున్నాను .
ఆఫ్రికన్ - అమెరికన్ అట్లాంటావాసులు 1973 లో జరిగిన మొదటి ఆఫ్రికన్ - అమెరికన్ ఎన్నికతో పెరుగుతున్న రాజకీయ ప్రభావాన్ని ప్రదర్శించారు . ఇరవయ్యవ శతాబ్దం చివరినాటికి వారు నగరంలో ప్రముఖస్థానం పొందారు కానీ , ఉపనగరీకరణ , పెరుగుతున్న ధరలు , వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ మరియు కొత్తగా వలస వచ్చినవారు నగరంలో వారి శాతాన్ని 1980 లో అత్యధికంగా ఉన్న 69 శాతం నుండి 2004 లో 54 శాతానికి తగ్గించాయి . శ్వేత ప్రజల రాకతో పాటు లాటినోస్ మరియు ఆసియన్లు వంటి కొత్త వలస ప్రజలు చేరడంతో నగర జనాభాలో మార్పులు చోటు చేసుకున్నాయి . [ 24 ]
1 . ఇందులో సవరించవలసినవి / మార్చవలసినవి చాలా ఉన్నాయి . అసలు మొదలు పెట్టకుండా , అవి అన్నీ చేయటం కష్టం . కాబట్టి , ముద్ర ని ప్రారంభించేస్తున్నాను . మీ సలహాలు / సూచనలు తెలియచేయండి .
ఈ పార్టీ విజయవంతంగా జరగడంలో చాలా మంది సహకారం ఉంది . ముఖ్యంగా నల్లమోతు శ్రీధర్ , కట్టా విజయ్ , పవన్ , సీబీరావు మరియు కృష్ణమోహన్ . మీకు నెనర్లు . వచ్చిన వారందరికీ నా కృతజ్ఞతలు !
" నేను స్నానం చేసి వస్తాను . నా పాదాలు చంపేస్తున్నాయ్ . వెట్ బార్ లోంచి మీకు కావలసిన డ్రింక్ తీసుకోరూ " అని చెప్పి నిసి బాత్ రూమ్ లోకి వెళ్ళింది .
తాంత్యా తోపే , నానాసాహెబ్ హైదరాబాద్ రాజ్యంలో చేసిన ప్రచారం , మక్కామసీదు గోడలపై అంటించిన ఉద్యమ ప్రచార పోస్టర్లు , బ్రిటిష్‌వారిపై ' జిహాద్ ' ప్రకటించిన మౌల్వీల ఆగ్రహం , ఆంగ్లేయులకు మొదటి సాలార్‌జంగ్ అందించిన సహకారం , వెన్నెముక లేని నిజాం అఫ్జలుద్దౌలా కొత్తగా అధికారంలోకి రావడం - ఈ పరిణామాలన్నీ కలిసి హైదరాబాద్‌లో 1857 సన్నివేశాలను రచించాయి . హైదరాబాద్‌లో రాజుకున్న నిప్పు దావానలం కాకుండానే చల్లారిపోయింది . ఉత్తరాదిన భగ్గుమంటున్న తిరుగుబాటుకు దక్షిణ పవనాలు తోడయి ఉంటే బ్రిటిష్ పాలన ఆనాటితోనే ముగిసిపోయి ఉండేది .
ఆదిత్యా మ్యూజిక్ వారు చెమ్మ చెక్క చారెడేసి మొగ్గ , చందమామ రావే జాబిల్లి రావె , గుడు గుడు గుంజం గుండే రాగం , ఒప్పుల కుప్ప వయ్యారి భామ మొదలన వెన్నో కార్టూను చిత్రాలుగా చిత్రికరించారు . వాటిని ఒక తెలుగు ఆయనో ? ఆవిడో ? యూ ట్యూబ్ కెక్కించారు . మచ్చుకు ఈ చిట్టి చిలకమ్మ గీతాన్ని ఇక్కడ చూడండి . చూసి ఆనందించి ప్రతి పిల్లా , పిల్లవాడికి చూపించండి . బాబా బాబా బ్లాక్ షీప్ పాడటంలో తప్పేమి లేదు . దానితో పాటూ ఏనుగమ్మా ఏనుగు తేలీకపోతేనే దారుణం .
ఇవి దంతములకు , చిగుళ్ళకూ ఆరోగ్యాన్నీ , దృఢత్వాన్నీ పరిపోషించే ఆహార పదార్ధాలే !
ఫైట్స్ : అస్సలు బాలేదు . క్లైమాక్స్‌లో స్నేహితుడు చనిపోయినపుడు వచ్చే సీన్ డైరెక్ట్‌గా చత్రపతి సినిమా నుంచి లిఫ్ట్ చేసారు … థట్ టూ విత్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్
మీరన్నారని కాదు గానీ ఈ ఉత్సవాలన బడే ' దినాల ' సంస్కృతి కొంత కాలం క్రితం వరకూ విదేశాల్లోనే వర్ధిల్లేది . ముఖ్యంగా వ్యక్తుల పేరిట దినాలు . అంటే తల్లి దినం , తండ్రి దినం , ప్రేమికుల దినం ( mothers డే fathers డే lovers డే ) వగైరాలు . నేను తప్పు గాక పోతే మొదట ఉపాధ్యాయుల దినం తో ఆరంభం అయిందేమో ఈ వ్యక్తిగత దినాల పండగలు . నా చిన్నప్పుడు ఉపాధ్యాయుల దినం , బాలల దినం మాత్రమే ఉండేవనుకొంటా . ఆ రోజు మట్టుకు ఆ [ . . . ]
మీరిచ్చిన బొమ్మలు చూసి ఆనందించాను . అంతే . కానీ టా౨బ్లెట్స్ అంటే ఏంటో , దాని ఉపయోగమేంటో , లక్షణాలేంటో , ఎప్పుడూ చూసి ఎఱగని మాబోంట్లను కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని విశదంగా వ్రాయగలరని ప్రార్థన .
మార్గోపాన్తే సుమేరోర్నువతి కృతనతౌ నాకధామ్నాం నికాయే వీక్ష్య వ్రీడానతానాం ప్రతికుహరముఖం కింనరీణాం ముఖాని సూతేసూయత్యపీషజ్జడగతి వహతాం కంధరార్ధైర్వలద్భి ర్వాహానాం వ్యస్యతాద్వః సమమసమహరేర్హేషితం కల్మషాణి 48
అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేకదినం - 12 జూన్ పసిచేతులు - పనిమోతలు నాడు - నేడు అదే బాల్యం . . అయితే . . ?
@ మంచు : మంచుగారూ . . . ఎందుకండీ నామీద అంత కక్ష ! నాకు లైసెన్స్ రాదు అన్నమాటేగాని ఒక్కసారి వస్తుంది అన్నారా ? బాబోయ్ ! నాకుగాని లైసెన్సె రాకపోవాలి మిమ్మల్ని బాగా తిట్టేసుకుంటా ! : XX @ Ennela : ఎన్నెలగారు . . . రెండు నెలలు ఆగండీ . . . నేనే కారు నడుపుకుంటూ కెనడా వచ్చెసి మిమ్మల్ని బాగ తిప్పుతా : ) యా ! తప్పకుండా నేర్పిస్తా ! మీరు అడగాలా ? : ) @ బులుసు సుబ్రహ్మణ్యం : బులుసుగారు . . . అది తిట్టా ? పొగడ్తా ? పొగడ్తే అని నేను అనుకుంటున్నా ; ) అవన్ని కొనేముందే లైసెన్స్ ప్రాప్తిరస్తు అని దీవించేయొచ్చుగా గురువుగారు : )
అమూల్యమైన పుస్తక0 విలువ రూ . 50 / - మాత్రమే . శ్రీ సుదర్శన్ గారు , పుస్తక0 కోస0 శ్రీ కాసర్ల నరేశ్ రావు , 10 - 14 - 1870 / 1 , సీతారాం నగర్ , నిజామాబాదు - 503001 అడ్రస్ కి మీ అడ్రస్ తెలియజేస్తూ డబ్బులు ప0ప0డి . నరేశ్ రావ్ గారి ఫొన్ న0 . 9441406252 . కవి 20 సంవత్సరాలుగా ఇంటర్ చదువుతున్న నాటి ను0డి కవిగా మరియు వ్యక్తిగత0గా నాకు మంచి స్నేహితులు . ఆయనలో వున్న ప్రత్యేకతలు - తెలుగు వ్యాకరణ0 మీద మంచి పట్టు , సృజనాత్మకత మరియు ఆశు కవిత్వ0 . సె0ట్రల్ యూనివర్సటీ , హైద్రాబాద్ నుండి పొ0ది్న య0 . ఎ . , తెలుగు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆయన కవితా జీవితానికి ఒక స్పూర్తి మరియు మలుపు . ప్రస్తుత0 ప్రభుత్వ ఊపాద్యాయునిగా పనిచేస్తూ , ప్రతి విద్యార్థికి కనీస0 100 తెలుగు పద్యాలు వచ్చేలా చేసిన / చేస్తున్న కృషి శ్లాఘనీయ0 . ఇటీవల ఈటీవీ - 2 లో ఈ ప్రాజెక్ట్ గురి0చి ప్రసార0 చేయబడి0ది . దీని నుండి స్పూర్తి పొంది , రాష్ట్ర వ్యాప్త0గా అన్ని పాఠశాలలో ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తే , తెలుగు భాష అభివృద్ధి చెందడమే కాక విద్యార్థులకి తెలుగు భాష పట్ల గౌరవ0 చిన్ననాటి ను0డి అలవడి , రాబోయే తరతరాలకి పునదిగా నిలిచిపోతు0ది . దీని ఫలితాలు అనూహ్య0 . ఇదే గనక అమలు ఐతే , మధుర గాయకులు పద్మశ్రీ బాలసుబ్రహ్మణ్య0 గారు చెప్పే మాట " తెలుగు పద్య0 నేర్చుకో0డి - తెలుగు భాషని కాపాడ0డి " తప్పకు0డా నిజమౌతు0ది . దీనికి నా0ది పలికిన శ్రీ కాసర్ల నరేశ్ రావు గారికి అభిన0దనలు . వారి పేరు తెలుగు భాషా చరిత్రలో అజరామర0గా నిలిచి పోతు0ది . తెలుగు భాషాభివృద్ధి కోరుకునే వార0దరూ దీని కోస0 తమవ0తు కృషి చేయవల్సి0దిగా మరియు శ్రీ కాసర్ల నరేశ్ రావు గారికి సహకరించాల్సి0దిగా ప్రార్థన . ఇట్లు ప్రతాప శ్రీ నివాస్ ము0బాయి 9820423224
ఇంతకీ జాతుల్లో గాని , మాత్రా ఛందస్సుల్లో గాని అంతర్నిర్మాణం గణాల్లో చెప్పాలా అక్కర్లేదా అన్నది నా వాదానికి ప్రధానం కాదు . అట్లా చెప్పటంలో ఉన్న సౌలభ్యాన్ని పైన చర్చించాను . రేపటి పరిశోధకులు గణ పద్ధతికన్నా పటిష్ఠమైన ఇంకో పద్ధతిని సూచించవచ్చు . కాని అంతర్నిర్మాణం లేకుండా పద్యం ఉండదు . ఫలాని అక్షరాలు ఫలాని క్రమంలో ఉంటయ్యని గాని , ఫలాని అక్షరం గురువో లఘువో కావాలని గాని , కాకూడదని గాని చెప్పటం పాదంలో అంతర్నిర్మాణాన్ని గురించి చెప్పటమే అవుతుంది . ఈ విషయాన్ని నాగరాజుగారు ( చూ . అనుబంధం ) గుర్తించారు .
" ఇందులో ఎన్ని ఇళ్ళు ఉంటాయిరా ? " బయటికి చూస్తూ అడిగాడు అర్జున్ .
hahaha . . . . చాలా బాగా ఉంది . . . నేను చాల రోజులైంది ఇది చదివి . . . చదువుతుంటే గుర్తు వచ్చింది . . . తమ లో ఉన్న అసంతృప్తి ని పోగొట్టుకోవడానికి అప్పుడప్పుడు ఇలా అత్యంత దగ్గరి వారు కూడా పోట్లాడుకోవాలి . . . అందులో తప్పేమీ లేదు . . . ఇలా తిట్టుకున్నాక . . ఇలా అన్నానేమిటీ అని మన మనస్సులో బాధ మొదలై . . . తిట్టిన మన వారి తో బంధం ఇంకా దృఢమవుతుంది . . . అన్నని తిట్టిన తమ్ముడు తన అసంతృప్తి ని పోగొట్టుకున్నా . . . . బాధని పొంది చావ బోయాడు . . . తన పట్ల తనవారికి కలిగిన కష్టాన్ని దాని స్థాయి ని వారి నోటి ద్వారా తెలుసుకుని ముందు ముందు జాగ్రత్త పడేలా ఈ సంఘటన పురికొల్పింది . . . ముందు ముందు ఎటువంటి ద్వేష భావం లేకుండా అసంతృప్తి పోవాలనుకుంటే ఇలా తిట్టుకోవాలి . . పొగుడుకోవాలి లాంటి ఒక ఒప్పందం పెట్టుకోవాలి అని . . నా అభిప్రాయం . . .
జ్ఞాన పీఠము తెచ్చినారము అంటూ మొన్నీ మధ్యన చంద్రిమ గారు మంచి మేలుకొలుపు పాడారు . అంతకంటే , పట్టు దారాలు పైన చుట్టిన చెర్నాకోలతో ఒక చరుపు చరిచారంటే సరిగ్గా ఉంటుందేమో . అసలేవిటి ఈ జ్ఞానపీట కమామిషూ అని వికీని ప్రార్ధించాను . అనుగ్రహించింది . కేంద్ర సాహిత్య యెకాడెమీ అంటే సరే పోనీ రాజకీయుల పైరవీలే అని సరిపెట్టుకోవచ్చు . మరి ఈ జ్ఞానపీట సంగతేంటి . అదిచ్చేవాళ్ళేమో ఏదో ప్రైవేటు ట్రస్టు వాళ్ళు . అదీనూ ఒక సారికి ఒక్కరికే ఇస్తారు . కీర్తిశేషులైన వాళ్ళకి ఇవ్వరు . ఆంగ్లం తప్ప భారతీయ భాషల్లో ఏ భాషా రచయితకైనా ఇస్తారల్లే ఉంది . 1982 వరకూ ఏదో ఒక ప్రత్యేక కృతి గొప్పతనాన్ని గుర్తించినట్లుగా ఇచ్చేవారట ( విశ్వనాథకి రామాయణ కల్పవృక్షానికి వచ్చిందిట ) . అటు తరవాత ఏ ఒక్క కృతి కోసమో గాక రచయిత సర్వతోముఖ కృషికి గుర్తింపుగా ఇస్తూ వస్తున్నారట . చంద్రిమ గారి బ్లాగులో చర్చలో చెప్పినట్టు ఈ ఎంపికలో ఒక క్రమం ( అంటే సంవత్సరానికి ఒకటి చొప్పున భాషల టైం టేబుల్ ) ఏదీ ఉన్నట్టు లేదు . 2004 దాకా ఇచ్చిన 42 ఎవార్డుల్లో కన్నడ భాషా రచయితలకి ఏడు సార్లొచ్చింది . . హిందీ తమిళ రచయితలకి కూడా అన్ని సార్లు రాలేదు . 1970లో విశ్వనాథ తరవాత 1988లో సినారెకి ఇచ్చారు . మరి అది జరిగి కూడా ఇరవయ్యేళ్ళు నిండుతున్నాయి . అసలీ ఎవార్డులన్నీ పైరవీలే అని పక్కకి నెట్టేయ్యొచ్చు . తెలుగు వాళ్ళకి సాటి తెలుగు వాళ్ళని పైకి తీసుకువచ్చే దృష్టిలేదు అని నిస్పృహ ప్రకటించొచ్చు . మనకివ్వని దాన్ని గురించి మనం ఎందుకులే పట్టించుకోవడం అని ఒక నిట్టూర్పు విడిచి మరిచే పోవచ్చు . కానీ , ఎంత వద్దనుకున్నా , ఇలాంటి ఎవార్డుల వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి . మొట్టమొదటి ప్రయోజనం , మన భాషకీ , మన భాషా సాహిత్యానికీ జాతీయంగా ఒక కొత్త గుర్తింపు వస్తుంది . రెండో గొప్ప ప్రయోజనం , కొంతవరకూ మొదటి దాన్ని వెన్నంటి వచ్చే ప్రయోజనం , ఇలా గుర్తింపు పొందిన రచనలు కొన్నైనా ఇతర భాషల్లోకి , ముఖ్యంగా హిందీలోకి ( జాతీయ ప్రాచుర్యం కోసం ) , ఆంగ్లంలోకీ ( అంతర్జాతీయ ప్రాచుర్యం కోసం ) తర్జుమా అవుతాయి . ఆ అవడం కూడా ఏదో అయ్యాయంటే అయ్యాయి అన్నట్టు కాకుండా , ప్రతిభావంతులైన అనువాదకులతో అనువాదం జరుగుతుంది . ఇది చాలా ముఖ్యమైన , అవసరమైన పరిణామం . అఫ్కోర్సు , రచయితకి ముట్టే ఐదు లక్షల రూపాయల నగదు కూడా , కనీసం ఆ వ్యక్తికి సంబంధించినంత వరకూ , మంచి ప్రయోజనమే అనుకోండి . ఈ సంవత్సరం తెలుగుకి ఇచ్చి తీరతారు అనుకుందాం కాసేపు . అర్హులైన వారెవరున్నారు ? ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారంటే నాకెంతో గౌరవం , అభిమానం . ఆయన ఎక్కువగా సంస్కృతం నించి తెలుగు వచనంలోకి అనువాదాలు , వివరణలు వంటి రచనలు తప్ప , స్వంత రచనలు ఎక్కువగా చేసినట్టు లేరు . కథకుడైన కాళీపట్నం రామారావు మేష్టారు ఒక పక్క , విస్తృతంగా తనకు తెలిసిన సమకాలీన జీవితాన్ని ప్రతిబింబిస్తూ నవలా రచన చేసిన అంపశయ్య నవీన్ మరొక పక్కా కనిపిస్తున్నారు వచన రచనలో . కానీ ఇద్దరి రచనల్లోనూ తెలుగు సాహిత్యాన్ని మౌలికంగా ప్రభావితం చేసిన అంశాలు ఏవీ కనబడవు . అటువంటి ప్రభావం కోంత వరకూ యద్దనపూడి సులోచనారాణి , ఆ తరవాత యండమూరి వీరేంద్రనాథ్ తెచ్చారనుకోవచ్చు . కేవలం పాపులర్ రచయితలు ఐనందుకు వీళ్ళని తీసి పారెయ్యనక్కర్లేదు . యండమూరి నవల్లు ఈ మధ్యన మళ్ళీ చదవడానికి ప్రయత్నిస్తే , ఒక పక్కన కొంత ఆసక్తి రేగుతున్నా , ఇంకో పక్క చాలా చీదరగా అనిపించింది . సీనియర్ కవుల్లో కె . శివారెడ్డి , వేగుంట మోహన ప్రసాద్ కనిపిస్తున్నారు ( శిఖామణికి అంత లేదు ) . . ఇస్మాయిల్ , శేషేంద్ర శర్మ అప్పుడే పోవడం ఈ విషయంలో పెద్ద లోటే . సినీ కవులు వేటూరి , సీతారామశాస్త్రి ఉన్నారు . ఇంకెవరున్నారు ? మీ ఉద్దేశాలు చెప్పండి .
డిసెంబర్ 31 , అర్ధరాత్రి . ప్రపంచమంతా సంబరాల్లో మునిగి తేలుతుంటే నేను మాత్రం ఆఫీస్ లో కూర్చుని ప్రోజెక్ట్ రిలీజ్ కోసం కష్టపడుతున్నా . ఇంతలో అన్నయ్య ఫోన్ చేసాడు . ఏముందన్నయ్యా మా రాకెట్ ఎలా ఎగురుతుందా అని కౌంట్ డౌన్ చేస్తున్నా అన్నాను . మీ సాఫ్ట్ వేరోళ్ళు ఎప్పుడూ ఇంతే అది ఎగురుతూ ఉంటే మీరు కింద ఉండి చప్పట్లు కొడతారు . అలా కాదుగానీ నిన్నే ఎవరెస్ట్ ఎక్కించేస్తా అన్నాడు . అన్నయ్య మీద నమ్మకం ఉన్నా ప్రోజెక్ట్ మీద ఉన్న భయంతో ఈ రోజుకి వదిలెయ్ అన్నాను . కాసేపాగి నాకు అన్నయ్య నుండీ మరలా ఫోన్ వచ్చింది . కానీ మాట్లాడేది అన్నయ్య కాదు . చాలా పరిచయమున్న గొంతు . తెలుగు లోగిళ్ళలో ఏ ఇంటిలో వినిపించిన టక్కున గుర్తుపట్టే గొంతు . ఆర్ధ్రతను , ఆవేశాన్ని , వ్యంగ్యాన్ని , కర్కశత్వాన్ని ఇంకా ఎన్నింటినో అవలీలగా పలికించే గొంతు . కవిత్వాన్ని చదివేప్పుడు తన్మయత్వాన్ని , ఆద్యాత్మికతను ప్రబోదించేప్పుడు నిర్వికారంగా , అప్పుడప్పుడూ చిలిపిగా మనల్ని పలకరించే గొంతు . ఆ గొంతునుండీ వచ్చిన మాటలు " రెండు సంవత్సరాల సంధి కాలాన్ని కలిసి గడుపుదాం వీలయితే రండి " అంతే అంతవరకు నన్ను నేను ఎలా ఆపుకున్నానో తెలియదు . మరుక్షణంలో బయలుదేరేసా . పండితులకి , యోగులకి మాత్రమే అలా అన్యులను అమాంతం గొంతుతో శాసించి పాదాక్రాంతం చేసుకునే శక్తి ఉంటుంది . మరి ఆయన ఓ పండితుడు యోగి రెండూనూ . అయనే భరణి . తెలుగు లోగిళ్ళలో మనందరి తోటరాముడు .
సుమారు నెల్రోజుల క్రితం , అమెరికా అధ్యక్షునిగా బరాకొబామా ఎన్నికైన నేపథ్యంలో చారిత్రక నిర్ణయం అని ఒక టపా రాశాను . ఈ ఆదివారం పొద్దున రేడియోలో అనుభవజ్ఞుడైన వ్యాఖ్యాత యువాన్ విలియమ్స్ అమెరికాలో జాతి సంబంధాల్ని గురించి మాట్లాడుతూ , నేను ఆ టపాలో చెప్పడానికి ప్రయత్నించిన ముఖ్య విషయాన్నే తన విశ్లేషణలో నొక్కి చెప్పడం నాకు చాలా సంతోషం కలిగించింది . భారతీయ సాంప్రదాయ సంగీతం ( దీన్నే కొందరు శాస్త్రీయ సంగీతం అంటారు ) ఆఫ్ఘనిస్తానులో కూడా ప్రాచుర్యం పొందిందని చాలా కొద్దిమందికి తెలుసు . పశ్చిమాన్నుంచి ఇరాను ( పెర్శియా ) ప్రభావం వలన , మత సంబంధాల వలన ఎక్కువగా సూఫీ సంగీతము ప్రాచుర్యం పొందింది అక్కడ . బహుశా ఎప్పుడో మొగల్ చక్రవర్తుల పాలనలో ఇటునించి హిందుస్తాని సంగీత ప్రభావం అక్కడిదాకా చేరి ఉంటుంది . కాల క్రమేణా పోషణ లేక సన్నగిల్లినా అక్కడక్కడా అకస్మాత్తుగా మెరిసి ఆశ్చర్యం కలిగిస్తుంది . నేను ఇక్కడ వివిలో చదువుకునేప్పుడు వివి వారు ఏదో ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని రవిశంకర్ సితార్ వాదన కచేరీ ఏర్పాటు చేశారు . ఆ కార్యక్రమానికి భారతీయ విద్యార్ధులము చాలా మంది స్వఛ్ఛంద సేవకులుగా పనిచేశాము . కచేరీ మొదలై పోయింది . నేనొక ప్రధాన ద్వారం దగ్గర కాపలా ఉన్నాను . ఒక యువకుడు హడావుడిగా టిక్కెట్టు కొనుక్కుని వచ్చాడు . ఇక్కడ కచేరీ మొదలై పోయినాక లోపలికి వెళ్ళనివ్వరు . మొదటి ఐదారు నిమిషాల తరవాత ఒక బుల్లి విరామం ఇస్తారు . . లేటుగా వచ్చిన వారు ఆ సమయంలోనే లోపలికి వెళ్ళొచ్చు . అలా ఈ అబ్బాయి అక్కడ తలుపు దగ్గర నిలబడి పోయాడు . ఆ సమయంలో వాడితో కాసేపు ముచ్చటించాను . అతను ఆఫ్ఘను అనీ , వాళ్ళ కుటుంబంలో హిందుస్తానీ సంగీత ఆస్వాదన వంశ పారంపర్యంగా వస్తున్నదనీ , ఈ కచేరీకి హాజరయ్యేందుకు అతగాడు సుమారు 120 మైళ్ళు డ్రైవు చేసుకుని వచ్చాడని తెలిసి నిర్ఘాంతపోయాను . ఇవ్వాళ్ళ పొద్దున రేడియోలో వినబడిన ఆఫ్ఘను హిందుస్తానీ సంగీతపు తునక మీరూ రుచి చూడవచ్చు . గత వారంలో బుజ్జిగాడు ( ప్రభాస్ , పూరీ ) అనే ఒక యెదవ సినిమా , నిశాంత్ ( అమ్రీష్ పురీ , గిరీష్ కర్నాడ్ , శ్యాం బెనగల్ ) అనే ఆర్టు సినిమా చూశాను . త్రిషాని తెలుగు సినిమాల్లో హీరోయినుగా పరిచయం చేసిన వాణ్ణి జూబిలీహిల్స్ చెక్ పోస్టు దగ్గర కొరత వెయ్యాలి . ఏమాట కామాట ప్రభాస్ నటనలో కాస్త ఇంప్రూవ్ అయినట్టున్నాడు . ఇంక అంతకంటే ఆ సినిమా గురించి చెప్పేందుకు ఏవీ లేదు . నిశాంత్ గురించి చెప్పాలి అంటే చాలానే ఉంది . అది ఇంకో సారి తీరిగ్గా చెబుతా సందర్భోచితంగా . మాకు సుమారు అరవై మైళ్ళ దూరంలో ఉన్న ఏనార్బరు నగరంలో UMS అని ఒక సంస్థ ఉంది . సెప్టెంబరు నెలనించీ మేనెల దాకా రకరకాల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం దీని ప్రధాన కర్తవ్యం . డిసెంబరులో , క్రిస్మసు పందగని పురస్కరించుకుని వీళ్ళు జరిపే ఒకే ఒక కార్యక్రమం మెస్సాయా . . బైబులు లోని వివిధ వాక్యాల సముదాయానికి జెర్మను సంగీత కారుడు హేండెల్ స్వరపరిచిన స్వర సాహిత్య సంకలనం ఇది . క్రీస్తు అవతారాన్ని గురించి ఒక ఆధ్యాతంక స్థాయిలో కథలాగా చెప్పుకొస్తుంది . సుమారు నూట యాభై మంది గాయనీ గాయకులతో కూడిన UMS Choral Union వారు అద్భుతంగా గానం చేసిన ఈ కచేరీని చారిత్రాత్మక హిల్ ఆడిటోరియములో నిన్న రాత్రి విని వచ్చాను . ఒకే ఒక మాట . . అద్భుతం !
3 . ఈమాట సంపాదక వర్గంలో ఉన్న వేలూరి గారి రచనలు తప్ప మిగిలిన వారి రచనలు ఈమాటలో కనపడవేం ? మేం రచనలు చెయ్యం కానీ , మిగిలినవారి రచనల్లో తప్పులు పడతాం అంటే ఎలా ? తెనాలి రామకృష్ణ జీవితంలో జరిగిన సంఘటన గుర్తుకు వస్తోంది . సంపాదక వర్గంలో అందరూ అప్పుడప్పుడు చెయ్యి చేసుకొంటే , అది మిగిలిన రచయిత ( త్రు ) లకి స్పూర్తిగా ఉంటుంది కూడా !
" దానికో చిన్న పరీక్ష ఉంది . దాన్ని ప్రయాగిస్తే మీ ఆవిడకు చెవుడు ఏ మాత్రం ఉందో తెలుస్తుంది " అన్నాడా డాక్టర్ .
విహారి , నిన్ను రమ్మని మర్యాదగా ఆహ్వానం ఇచ్చాముగా , మళ్ళి ఆ పనోడి చెవులు కొరకడమేమిటీ . వాడేమొ పెళ్ళాన్ని పంపుతాననడమేమిటీ . ఈ రాజకీయ నాయకులు ఎవరొచ్చినా చివర్లో చెప్పినట్టు కెసిఆర్ గతే పట్టిస్తాము . అది ఖాయం . ఐతె వస్తున్నావుగా ఈ ఆదివారం మీ ఆవిడ కొంగట్టుకుని . .
జోలపాటలు , లాలి పాటలు మన సంస్కృతి , సంప్రదాయాలకు అద్దం పడతాయ . ఒక తల్లి తన శిశువుకు జోల పాడుతూ సాటిలేని అందచందాల బంగారపు బొమ్మ . అని భావిస్తూ పాప పుట్టుక బంగరు కొడవళ్ళతో కొయ్యాల్సిన బంగారపు పంటగా అభివర్ణిస్తుంది . ఇంత భావ సౌందర్యము , ధ్వని గాంభీర్యము ఉన్నాయి . ఈ రెండు పంక్తుల జోల చరణంలో … ' ఊళ్ళోకి ఉయ్యాల లమ్మవచ్చినవి కొడుకు , కూతుళ్ళ తల్లి ! కొనవె ఉయ్యాల ' ఇద్దరు అప్పజెల్లెళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా ఈ జోల చరణం . ' మన ఊళ్ళో ఉయ్యాల మంచాలు అమ్మేవాడు వచ్చాడు . నీకు కొడుకులు , కూతుళ్ళు ఉన్నారు . ఒక ఉయ్యాల కొనుక్కోరాదుటే ? ' అన్నది ఒక చెల్లెలు తన అక్కతో . ' కొనుక్కోవాలనే ఉన్నది ఒక వెండి ఉయ్యాల . కానీ ఏమిచ్చి కొనమంటావు ? ' అని అడిగింది అక్క . ' వెండిదే మిటే ? ఏకంగా బంగారందే కొనవే . మనకు మంచి పాడి సంపద ఉన్నది . పాలుపోసి కొను ' అన్నది . ఈ పాట పుట్టిన కొన్ని శతాబ్దాల కిందట వస్తు మారకపు పద్ధతి ఉండేది . మరో తల్లి ఏడవకు ఏడవకు ఇటుల నా తండ్రి ! ఏడిస్తె నీ కళ్ళు నీలాలు కారు నీలాలు కారితే నే జూడలేను పాలైన కార్చరా బంగారు కనుల అని తల్లడిల్లి పోతోంది తల్లి . ' ఏడవకురా నాన్నా ! నీవు ఏడుస్తుంటే నీ కళ్ళంబడి నల్లనల్లగా కన్నీళ్ళు వస్తున్నాయి ' . నీలము అంటే నలుపు . అంతేకాదు . విషము అనే అర్థం గూడా వుంది . ' నీవు కార్చే కన్నీరు నాకు విషపుధార చూసినంత భయం పుట్టిస్తోంది . పసిపిల్లలకు కాటుక పెడతారు . అందుచేత కన్నీరు నల్లగా కారటం కూడా సహజమే . ' ఆ నల్లని కన్నీరు చూచి భరించలేను గనుక నీ బంగారు కనులలోంచి పాలను స్రవించరా నాన్నా ' అంటున్నది ఆ అమ్మ . ' చిట్టి ముత్యం పుట్టె సీత గర్భాన స్వాతి వానలు గురిసె సంద్రాల మీద ' - ఒక నిర్మాలాంతఃకరణపు ఇల్లాలి భావన ఇది . బంగారుతల్లి అయిన సీతాదేవి కడుపున ఒక బాబు పుట్టాడు . ఆ శుభ సంఘటన ప్రభావంగా మరెన్నో శుభ సంఘటనలు జరిగాయట . సముద్రాలమీద స్వాతిచినుకులు పడ్డాయట . స్వాతి చినుకులు ముత్యపు చిప్పల్లో పడి ముత్యాలవుతాయి . అంటే సీత కడుపు పండటం చూసిన ప్రకృతిమాత పులకించి పరమానంద భరితురాలై మరెన్నో ముత్యాలను ప్రసవించింది అని ఒక మధురాతి మధుర మహోదాత్త ఊహ . ఒక దీపం వెలిగితే దానితో చాలా దీపాలు వెలుగుతాయి . అనే ఒక సార్వకాలిక సమాహ్లాద సంభరిత వాస్తవికతకు ఇదొక ప్రతిబింబ . ' హాయి - ఓయు ఆపదల గాయి ' అని చాలా జోలపాటలకు ఆరంభ చరణంగా వుంటుంది . ఈ హాయి , ఓయి అనే వాటికి స్ర్తి రూపభావ వ్యక్తిత్వాలను ప్రతిక్షేపించుకుంటే - లేక ఆపాదిస్తే ( పర్సానిఫికేషన్ ) ' హాయమ్మ ' , ' ఓయమ్మ ' అవుతారు . చాలా ఇళ్లల్లోని తోడికోడళ్ళలాగా ఉప్పు - నిప్పుగా ఉంటాయి . ఇలా ఇందులోని మొదటి పంక్తి ఆహ్లాద జనకమయితే రెండో పంక్తి హాస్యభావ సంభరితం . ప్రతి స్ర్తికి తన పుట్టింటి వారి ప్రేమాను బంధాల మీద , ముచ్చట్ల మీద అంతనమ్మకం . అందుకే అంటుంది ' మీ మేనమామలైతే మరిమరీ నిన్ను ముద్దాడతారు ' అని . తన పిల్లడు అంటే తల్లికి ఎంత అబ్బడమో , ఎంత ముచ్చటో తెలుసుకోవాలంటే ఈ పంక్తులు దర్పణాలుగా నిలుస్తాయి . ' మీసాల మీదిదే రోసాల ఎఱుక అబ్బాయి చేతిదే బంగారు గిలక ' - అని జోలపాటలో ఒక చరణం . ఈ చేష్టలు వారి పూర్వీకుల రాజసానికి సంకేతాలు . దాన్ని ఆమె గడుసుగా . మరో ఇల్లాలు ఓయి ఓ ఇల్లాల ! ఓ బాలులార ! మా బాలుడొచ్చాడ మీ తోటి యాడ ? మీ బాలుడెవ్వరో మేమెరుగ మమ్మ ! కాళ్ళగజ్జెల తండ్రి బంగారు బొమ్మ - ఇదొక సంభాషణాత్మకమైన జోలపాట చరణం . తన బాబు ఇంట్లో కనిపించటం లేదు . బుడిబుడి నడకలతో , ఇరుగుపొరుగు ఇళ్ళకు వెళ్ళాడేమో ! ఇరుగింటి ఇల్లాలిని , పొరుగింటి పోరగాళ్ళను అడుగుతోంది . మీ పిల్లడెవరో మాకు తెలియదన్నారు వాళ్ళు . అప్పుడు చెప్తున్నది వాళ్ళకు ఆనవాళ్ళు . తన బాబు కాళ్ళకు గజ్జెలున్నాయట . అదొక గొప్ప . అంతేకాదు . అతగాడు బంగారు బొమ్మట . అంటే మీ కందరికన్న బాగుంటాడు అని ఘనంగా చెప్తోంది - ఇదే ఇందులోని నిసర్గమైన , అందమైన బడాయి . ' చిన్నారి పొన్నారి చిట్టిదాసారి దాసారి నీ మగడు దేశ దిమ్మరి ' ఇది ఒక తమాషా అయిన ఒరవడి చాలామంది తల్లులు . తల్లి తానేమో ఒక ఇంటిపేరు వారి బిడ్డ . తన బిడ్డలేమో మరో ఇంటిపేరు వారి బిడ్డలు . ఆ ఇంటిపేరు వారు , తన ఇంటి పేరు వారు తన పెళ్ళి కారణాన పరస్పరం వియ్యాల వారైనారు . అంటే తన మామగారి ఇంటిపేరు వారందరూ తనకు బావలు , వదినలు , మరుదులు , మరదళ్ళు అవుతారు . అందుకని తన బిడ్డలను ఆటపట్టిస్తూ ఎగతాళిగా , హేళనగా మాట్లాడటం ఒక ముచ్చట . ఇది పల్లెసీమలలో ఇప్పటికీ కనిపిస్తుంటుంది . మరో తల్లి తన పిల్లాడిని ' చిట్టీత పండెరుపు చిలుక ముక్కెరుపు తానెరుపు అబ్బాయి తనవారిలోన ' అని అంటుంది . తన కుటుంబంలో తనబాబే ఎర్రగా , బుర్రగా వుంటాడుట . ఇది దృష్టాంతాలంకారానికి ఒక మంచి దృష్టాంతం . ' చిన్నారివే నీవు చిలకవే నీవు చిగురు మామిళ్ళలో చిన్న కోయిలవు ' - ఇది ఇంకొక కమనీయ కవితా పంక్తి . తన పాప ఆకారంలో అందాల చిలుక . మరి కంఠం విషయంలో మామిళ్ళ చిగుళ్ళతో పసదేరిన పంచమస్వర కోకిల అంటూ తన పాపను ఆకాశానికెత్తుతోంది ఒక తల్లి ఊహల ఊయెల ఊపుల హాయితో . ప్రత్యక్ష పద అర్థం కన్న పరోక్ష భావార్థం హృదయంగమంగా కనిపించేదానే్న ' ్ధ్వని ' అంటారు . ఈ ధ్వని అనేదే అసలు కావ్యాత్మ అంటాడు ఆనంద వర్ధనుడు తన ' ్ధ్వన్యాలోకం ' కావ్యశిల్ప శాస్త్ర గ్రంథంలో ధ్వని సిద్ధాంతానికి సలక్షణమైన , విలక్షణమైన లక్ష్యప్రాయాలుగా శాశ్వతంగా నిలిచేవి మన జోలపాటలు . - శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం
ఓ సిద్ధాంతం నిరూపించడానికి మొదట ఓ ఫార్ములాతో మొదలెట్టి మెట్లు మెట్లుగా క్రమబద్ధమైన సూత్రాలని పాటిస్తూ ఫార్ములాలని మార్చి చివరకి రావలసిన సిద్ధాంతాన్ని రాబడతాము . ఆ క్రమ వరుసలో వున్న ఫార్ములాలని కలిపితే అది ఆ వరుసలోని చివరి ఫార్ములాకి నిరూపణ . ప్రతి ఫార్ములాకి గోడెల్ సంఖ్య ఎలా కనుక్కోవచ్చో పైన తెలుసుకున్నాం . f1 , f2 , f3 , … ఇవి వరుసగా ఆయా ఫార్ములాల గోడెల్ సంఖ్యలని సూచిస్తే , వాటినన్నిటినీ ఈ విధంగా వరుసగా ఉన్న ప్రధాన సంఖ్యలకి ఘాతాంశాలుగా రాసి హెచ్చిస్తే వచ్చే సంఖ్య - 2f1 X 3f2 X 5f3 x 7f4 X … - దానిని ఆ ఫార్ములా వరుస ( నిరూపణ ) గోడెల్ సంఖ్య అంటాం .
చారిత్రక నవలా చక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారిచే " భారతీయ చరిత్రకు దిద్దిన తిలకం " గా " శాస్త్రీయ ఆయుర్వేద సామాజిక బలవర్థక ఔషధం " గా కీర్తించబడ్డ గ్రంథాన్ని , క్లుప్తంగానన్నా సమీక్షించడానికి నాకు చరిత్రలో డిగ్రీ లేదు సరికదా , కనీసం ఔత్సాహికులకుండాల్సిన పరిజ్ఞానమన్నా లేదు .
వ్యవసాయ వుత్పత్తులకు , జలవనరులు , అతిముఖ్య భూమిక పోషిస్తాయన్న విషయం యెవరూ కాదనలేనిది . ఈవిషయంపై అవగాహనలేకో , మరి అత్యుత్సాహమో కాని , రాష్ట్రం మొత్తానికి చెందవలసిన కేంద్ర ప్రభుత్వ సంస్థలనూ , రాష్త్ర ప్రభుత్వ విభాగాలనూ ఒకే చోట రాజధాని హైద్రాబాద్ లోనే కేంద్రీకరించి ఆ ఒక్క నగరం మాత్రమే అభి వ్రుద్ధి చెందేలా , వారు ఆ రోజున చేసిన విధాన నిర్ణయానికి , యీ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్త్రంలో యీ వుద్రేకాలకూ కక్షలూ కార్పణ్యాలకూ , తమకు తెలియకనే పరోక్షంగా కారణమైన అప్పటి సీమాంధ్ర కు చెందిన ముఖ్యమంత్రుల నిస్వార్ధమైన ఆలోచనలు … యీ రోజున వికటిస్తూ మహోద్రేకాలకు , చీలికల దిశకూ కారణమౌతున్నాయి .
పావుకిలో పేరు మార్చాల్సిందిగా ఈ భారత ప్రభుత్వానికివే నా విన్నపాలు . పావుకిలో అనే దానిని ఇక మీదట కిలో అని పేరు మారిస్తే , కనీసం మధ్య తరగతి ప్రజలు " అబ్బా కిలో టొమేటో ఆరు రూపాయలేనా " అని సంతోష పడతారు .
వాగ్గేయకారుడైన శ్యామశాస్త్రిని పోటీలో ఎదిరించిన కేశవదాసు అనే విద్వాంసుడు వాసావారి వంశస్థుడేననీ , బొబ్బిలి సంస్థానంలో ఉండేవాడనీ సంగీతరావుగారి అభిప్రాయం . వాసావారు ఎన్నో తరాలుగా సంగీతంలో పేరుపొందినవారు . బిలహరి , కల్యాణి , లలిత , నవరోజు మొదలైన రాగాల్లో వారి స్వరపల్లవులు ప్రసిద్ధమైనవట . నవరోజు రాగంలో పెద్ద కీర్తనలు తక్కువ గనక ఒక రేడియో ప్రసంగంలో ప్రొఫెసర్ బులుసు సాంబమూర్తిగారు నవరోజు రాగపరిచయం చెయ్యగా ద్వారం వెంకటస్వామినాయుడుగారు అందులో స్వరపల్లవి వాయించారట . వీటి రచయిత వాసా అప్పయ్య గారట . ఈయనకి సాంబయ్య , కృష్ణమూర్తి అని ఇద్దరు కొడుకులు వీణ విద్వాంసులు . సాంబయ్యగారికి సంతానం లేక తమ్ముడి కొడుకు వెంకటరావును దత్తత తీసుకున్నాడు . ఆదిభట్ల నారాయణదాసుగారు కొంతకాలం ఈ వాసా సాంబయ్యగారికి వీణలో శిష్యుడు . వాసా వెంకటరావుగారు తరవాతి కాలంలో విజయనగరం సంగీత కళాశాలలో వీణ టీచరుగా పనిచేశాడు . ఆయన కొడుకే ప్రసిద్ధ వీణ విద్వాంసుడైన వాసా కృష్ణమూర్తి . ఇదొక తెలుగు సంగీత కుటుంబం . బొబ్బిలి వీణలు గొల్లపల్లిలో తయారయేవట . సర్వసిద్ధి అప్పలస్వామి వీణలకు మంచి పేరుండేది . ధర సుమారు 30 రూపాయలు .
కన్నతల్లి కోరిక కాదనలేని నా చిట్టి హృదయం నయాపైసా కూలి తీసుకోకుండా ఏవి పడితే అవి ఊరికే మోసుకోచ్చే మనేది . . . ఇంత కష్టపడి పక్క ఊరి నుండి స్మగ్లింగ్ చేసుకొస్తుంటే చివరికి నీళ్ళ మగ్గులు , బకెట్లు కూడా కొని తీసుకురమ్మని ఆర్డర్ పడేసేది అమ్మ . . .
భావన గారూ , ఇప్పుడదొకటా ? బాగుంది . & నిహారిక గారూ , నా లాప్ టాప్ దేవుడి పీట కింద దాచానుగా . మీ దొంగకు తెలీదు లెండి . & శ్రీలలిత గారూ , మొన్నటి వరకూ నేనూ అలాంటివెన్నో పాటలు కూనిరాగాలుతీస్తూ చెట్టూ , చేమా చూసుకుంటూ , హాపీగా తిరిగానండి . ఇప్పుడూ వాకింగ్ చేస్తున్నాను , కాకపోతే కింద రోడ్ చూసుకుంటూ !
దిగుబడి పెరగదు - - అన్నాడు . కాని , ఓ మొక్కకి 100 గ్రాముల దిగుబడిని ఇవ్వగల శక్తి వుంటే , బీటీ వల్ల జన్యుబలం పెరగడం వల్ల , పూర్తి స్థాయి దిగుబడి వచ్చి తీరుతుంది - - అంటున్నాడు . ( అంటే వందకి వంద గ్రాములు అన్నమాటేకదా ? ) ఇదెలా సాధ్యం ?
మీకూ మీ అమ్మగారికీ ఓ టన్ను వందనాలు అండి . అసలు ఏ పదో తరగతి చదువుతున్న పిల్లల పుస్తకాలను కొట్టేస్తే తప్ప నేను వాటిని కనుగొనలేను అనుకున్నా ! ! నా అదృష్టం మీ బ్లాగు చూశాను . వీలు పడగానే ' టపా ' యించండి ఆ పద్యాలను . కృతజ్ఞతలు , పూర్ణిమ
సమైక్యాంధ్ర కావాలంటూ మెజార్టీ ప్రజలు శ్రీకృష్ణ కమిటీ దృష్టికి తీసుకెళ్లారని టీడీడీ నేత మైసూరారెడ్డి తెలిపారు . తెలంగాణపై ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ సీీమాంధ్ర ఎంపీలు స్పందించపోవడం దారుణమని ఆయన విమర్శించారు .
వడుపుగా నీటిగుంటల్ని తప్పించుకుంటూ , బండితో ఇల్లు జేరిన ఆ పెద్దరికమూ లేదు
ఏంటో ఈ పెద్దోల్ల మైండ్ సెట్ మారాలి . క్లాస్ లో ఫస్ట్ వస్తేనో , ఎమ్ సెట్ లో వెయ్యి లోపు ర్యాంకు వస్తేనే వాడు తెలివైనావాడు లేకపోతే ఎందుకు పనికి రాడు అన్నట్టు పిల్లల్ని మొదట్నుంచి చిత్రవధ చేస్తుంటారు . మొన్న శనివారం సాయంత్రం నేను మా కాలనీ పార్క్ లో కూర్చున్నాను . పిల్లలందరు ఆడుకుంటున్నారు . భలే సందడిగా ఉంది . కాసేపయ్యాక ఒక పాప వాళ్ళ అమ్మ వచ్చింది . నేను ఇంకాసేపు ఆడుకుంటాను అని మొత్తుకుంటున్నా కాని బరబరా లాక్కేళ్ళింది . ఇప్పుడు ఆ అమ్మాయి ఏమన్నా IAS పరీక్షలకి ప్రిపేర్ అవ్వాలా ? ఆడుకోనివ్వచ్చుకదా . అర్ధం చేసుకోరు . అసలు అమ్మలందరు ఇంతే . మా అమ్మ కూడ ఇంతే . ఎంత నేను బాగా చదవకపోతే మాత్రం అదేదో పెద్ద సమస్య అయినట్టు ఓ తెగ బాధ పడిపోయేది . " మా చిన్నదానికి ఎక్కాలు రావటం లేదు , లెక్కలు సరిగ్గా చెయ్యటం లేదు , ఇంగ్లీషు సరిగ్గా రాయట్లేదు . . " ఇలాంటివన్న మాట మా అమ్మ కష్టాలు . ఆ కష్టాలు విన్నవాళ్ళంతా మా అమ్మని సానుభూతితో , నన్ను విరక్తిగా చూసేవాళ్ళు . మా అమ్మ కూడ అందరిలాగ చీరల గురించి , నగల గురించి , పక్కింటి అమ్మలక్కల గురించి మాట్లాడుకోవచ్చు కదా . వీటన్నింటికన్నా ముఖ్యమైనదా నా చదువు ? ఒకసారి మా అమ్మ మా బుజ్జి మామయ్యకి నా చదువు సంగతి చెప్పి బాధపడింది . ( ఎప్పట్లాగనే , మళ్ళీ అవే డైలాగులు ) ఇంకా నేను తరవాత సీన్ కి ప్రిపేర్ అయిపోయాను . కాని విచిత్రం , బుజ్జి మామయ్య అందర్లా నాకు క్లాస్ ఇవ్వలేదు . అసలు నన్నేమి అనలేదు . పైగా అమ్మతో " నువ్వు చూస్తు ఉండు అక్క , మన పిల్లందరిలోకి అదే బాగా చదువుతుంది " అని అన్నారు . మొదటిసారి నా చదువు గురించి అంత పాజిటివ్ గా మాట్లాడింది బుజ్జి మామయ్యే ! అసలు నేను గట్టిగా పూనుకొని చదవట్లేదు కాని లేకపోతే మామయ్య అన్నట్టు చదవలేక కాదు . మరీ మామయ్య మాటలు సీరియస్ గా తీసుకోని చదివేస్తే ఫస్ట్ ర్యాంకు వచ్చేసే ప్రమాదముందని మర్చిపోయినట్టు యాక్షన్ చేసా . అమ్మో , ఈ పెద్దోల్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి . పోనిలే పాపం బాధపడుతున్నారు కదా అని ఒకసారి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఇంక అంతే . ఎప్పుడు ఫస్ట్ ర్యాంకు రావాలంటారు . కష్టం బాబు వీళ్ళతో . అలా చదువుతూ చదువుతూ నేను నాలుగో తరగతికి వచ్చేసా . ఎండకాలం సెలవుల తరవాత మళ్ళీ బడులు తెరిచారు . అబ్బో ఎండాకాలం సెలవులంటే ఇంకో నరకం . " టచ్ " లో ఉండాలని మా అమ్మ నాతో రోజంతా ఎక్కాలు చదివించేది . నాలుగో తరగతిలో మాకు లెక్కలు చెప్పటానికి మంజుల టీచర్ వచ్చారు . ఆవిడ మా స్కూల్ కి కొత్త టీచర్ . మాములుగా కొత్త టీచర్ అంటే పిల్లలందరికి భలే క్యూరియాసిటి ఉంటుంది . మాకు క్లాస్ టీచర్ కూడ ఆవిడే . మొదటిరోజు క్లాస్ కి రాగానే అందరి పేర్లు అడిగారు . ఎందుకోగాని నాకు ఆవిడ భలే నచ్చేసారు . రెండురోజుల తరవాత , ఒకరోజు క్లాస్ లో నన్ను నిల్చోబెట్టి " నువ్వు ఇప్పట్నుంచి రోజు ఫస్ట్ బెంచిలో కూర్చో " అని చెప్పారు . మాములుగా అయితే మా క్లాస్ లో బాగా చదివేవాళ్ళు , ఫస్ట్ ర్యాంకులోల్లు కూర్చుంటారు ముందు బెంచీల్లో . నాలాగ అతివీర భయంకరమైన ర్యాంకుల్లోల్లంతా వెనకెక్కడో కూర్చునేవాళ్ళు . ఏంటి ఈవిడకి మన టాలెంటు తెలియదా ? ఫస్ట్ బెంచీలో కూర్చోమంటుంది అని అనుకుంటు వెళ్ళి కూర్చున్నాను . అబ్బో టీచర్ నాకు రోజు రోజుకి తెగ నచ్చేస్తున్నారు . ఏంటో నాకు లెక్కలు కూడ తెగ అర్దమవుతున్నాయి . అప్పుడప్పుడు నాతో లెక్కలు బోర్డు మీద కూడ చేయించేవాళ్ళు . లెక్కలు బాగ చెయ్యకపోతే మా టీచర్ బాధపడతారని ఇంట్లో అన్ని ఒకటికి రెండుసారు చేసుకునేదాన్ని . ఎక్కాలు మాత్రం మనవల్ల కాని పని . ఇప్పటికి కూడ మూడు ఐదులెంత అంటే ఒక్క క్షణం ఆలోచించుకుంటాను పదిహేనా , పదహారా అని . కొన్నాళ్ళకి ఫస్ట్ యూనిట్ టెస్ట్ జరిగింది . తరవాత కొన్నాళ్ళకి అసలయిన ఘట్టం , ప్రోగ్రెస్ కార్డులిచ్చారు . ప్రోగ్రెస్ కార్డులిచ్చేటప్పుడు టీచర్ ర్యాంకులు చదువుతూ ఇస్తారు . నా ర్యాంకు చదివినప్పుడు క్లాస్ లో అందరు నన్ను ఎగాదిగా చూసారు . నాకేదో దయ్యం పట్టింది అనుకున్నారు అందరు . స్కూల్ అయిపోగానే నేను గబాగబా ఇంటికెళ్ళాను . నేను వెళ్ళేసరికి నాన్న నిద్రపోతున్నారు . నాన్న మీద పడి కుదిపి నిద్రలేపి ప్రోగ్రెస్ కార్డు చేతిలో పెట్టాను . ఆ , ఇందులో చూడటానికి ఏముందిలే అన్నట్టు ఒకసారి ప్రోగ్రెస్ కార్డు చూసిన నాన్న డంగైపోయారు . ఎప్పుడు ముప్పయ్యో ర్యాంకు , నలభైయో ర్యాంకు చూడటానికి అలవాటు పడిన నాన్నకి ఈసారి నా ప్రోగ్రెస్ కార్డు చూసేసరికి నిద్ర ఎగిరిపోయింది . పొరపాటున వేరే వాళ్ళ కార్డు తెచ్చానేమోనని వెనక్కి తిప్పి " విద్యార్థి పేరు " , " తండ్రి పేరు " అని ఉన్నచోట ఒకసారి చెక్ చేసారు . అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి . అప్పుడు నమ్మకం కుదిరింది నాన్నకి . అప్పుడు నాన్న మొహంలో ఎంత ఆనందం కనిపించిందంటే అబ్బో మాటల్లో వర్ణించలేను . మా అమ్మని పిలిచి " నా చిన్నకూతురికి ఎనిమిదో ర్యాంకు వచ్చింది తెలుసా " అని చెప్పారు . ఇంట్లో అందరు చాలా సంతోషపడ్డారు . మా అక్కకి ఫస్ట్ ర్యాంకు వచ్చినప్పుడు కూడ ఇంత రియాక్షన్ ఇవ్వలేదు . ఆ రోజంతా ఇంట్లో మనకి స్పెషల్ ట్రీట్ మెంటు . అబ్బ వీళ్ళతో చదివినా బాధే , చదవకపోయినా బాధే . తరవాత రోజు ఉదయం నాన్న నాకొక ఫోటో ఆల్బమ్ ఇచ్చారు . నేనందుకున్న మొదటి బహుమతి అది . అంతే ఇంక అప్పట్నుంచి మంజుల టీచర్ కోసం , నాన్న కోసం చదువుతానే ఉండాల్సొచ్చింది . ఇంతా చేసి చదివింది నేనయితే , అమ్మ మాత్రం బుజ్జిమామయ్య అన్న మాట నిజమయ్యింది . మామయ్య అన్నాడు కాబట్టే నువ్వు చదవగలిగావు అని అంటుంది . ఇలా ఇంతమందిని ఇంప్రెస్ చెయ్యాలంటే మాటలా . అసలు నాలుగో తరగతి లెక్కలు ఎంత కష్టమో వీళ్ళకేమి తెలుసు ?
చిక్కని పాలమీద కట్టిన మీగడలో పంచదార కలుపుకుని తింటే ఎంత రుచిగా ఉంటుంది . ఈ మాట వింటుంటేనే నోరూరుతుంది మరి ఆ రుచి , తియ్యదనం భద్రాచల రామదాసుకు శ్రీరాముడి నిర్మలమైన , నీలమేఘ రూపం అనే అమృతాన్ని జుర్రుకున్నట్టుగా ఉంటుందంట . పైగా ఆ మధురర్సాన్ని తన భక్తి అనే పళ్లెంలో సేవావృత్తి అనే దోసిటిలో పోసుకుని జుర్రుకుంటాడంట . అటువంటివాడికి ఏ పరమాన్నము , పాయసము రుచిగా ఉంటుంది .
కంప్యూటర్ ని ఫార్మేట్ చేసిన ప్రతీసారీ విండోస్ ని ఆన్ లైన్ లో ఏక్టివేట్ చేయడం కుదరొచ్చు , కుదరకపోవచ్చు . అలాంటప్పుడు ఇప్పటికే మీ కంప్యూటర్ లో ఏక్టివేట్ అయి ఉన్న ఏక్టివేషన్ సెట్టింగులను బ్యాకప్ తీసుకోవడం తెలిస్తే అవసరం అయినప్పుడు వాటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు . అదెలాగన్నది ఈ వీడియోలో కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ వివరిస్తున్నారు . స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది . ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ [ . . . ]
ఈ మూడు పదాల మూలాలూ , వాని మధ్య సంబంధాలు గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి . [ 4 ] [ 5 ] క్రీ . పూ . 700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము ( ఋగ్వేదములో భాగము ) లో మొదటిసారిగా " ఆంధ్ర " అనే పదం జాతి పరంగా వాడబడింది . కనుక ఇదే మనకు తెలిసినంతలో ప్రాచీన ప్రస్తావన . ఆ తరువాత బౌద్ధ శాసనాలలోనూ , అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది . క్రీ . పూ . 4వ శతాబ్ధిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించినాడు .
బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న పోటి దృష్ట్యా బ్యాంకులు వివిధ సేవలను అందిస్తున్నాయి . అందులో బాగంగా మొబైల్ బ్యాంకింగ్ సర్వీసును స్టేట్ బ్యాంక్ విజయవంతంగా నడుపుతుంది . ఇది చాల సులభం . దీనికి మొదట జీ . పీ . ఆర్ . ఎస్ / సపోర్టు చేసె మొబైల్ కావాలి . క్రింద ఈ సర్వీసు వాడుకోవడానికి చేయవలసిన పనులను దశల వారిగా వివరిస్తాను . . . . . 1 ) మొదట మన మొబైల్ నుండి అని టైపు చేసి 567676 కి ఎస్ . ఎం . ఎస్ చేయాలి . వెంటనే మనకు " యూజర్ ఐడి " మరియు " " లు మెసేజ్ రూపంలో వస్తాయి . 2 ) మన మొబైల్ కి పై రెండింటి తో పాటు మొబైల్ బ్యాంకింగ్ సర్వీసుకు సంబందించిన సాఫ్టువేర్ లింకు కూడా వస్తుంది . సాఫ్టువేర్ ను మొబైల్ లోకి డైరెక్టుగా కాని , లేక కంప్యూటర్ లోనికి గాని , డౌన్ లోడ్ చేసుకుని మొబైల్ లోకి వేసుకుని ఇనిస్టాల్ చేసుకోవాలి . అప్లికేషన్ సాఫ్టువేర్ ను కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేసుకోవడానికి లింక్ : http : / / mobile . . com / / . 3 ) సాఫ్టువేర్ మొబైల్ లోనికి వచ్చిన తరువాత మనకు మొదట వచ్చిన యూజర్ ఐడి తో లాగిన్ అవ్వాలి . తరువాత Settings ను ఎంపిక చెసుకుని " Change Channel > GPRS " ను సెలెక్టు చేసుకోవాలి . ఇపుడు మొదట మెసేజ్ ద్వారా వచ్చిన default ను ఎంటర్ చేయ్యాలి . కనెక్టు అవడానికి మన అనుమతిని అడుగుతుంది YES ను సెలెక్టు చెయ్యాలి . కొద్ది సేపటి తరువాత మల్లీ ను ఎంటర్ చెయ్యమని అడుతుంది . రెండవ సారి ఎంటర్ చెయ్యగానే మన మొబైల్ నుండి ఒక మెసేజ్ పంపుతుంది . దీని ద్వారా మనం download చేసుకున్న అప్లికేషన్ ద్వారా లావాదేవీలు జరపడానికి సిద్దంగా ఉంటుంది . " Your transactions over successful " అనే మెసేజ్ మన మొబైల్ కు వస్తుంది . 4 ) ఈ దశలో మన మొబైల్ హ్యాండ్ సెట్ వాలిడేట్ చెయ్యబడుతుంది . ఇప్పుడు అప్లికేషన్ లొ settings లోనికి వెల్లి , Change సెలెక్టు చేసుకోవాలి . ఇప్పుడు మన పాత default ను ఎంటర్ చేసి దాని కింద కేటాయించిన స్థలంలొ రెండుసార్లు మనకు నచ్చిన ఆరంకెల ( 6 అంకెలు తప్పనిసరి ) కొత్త సెలెక్టు చేసుకొవాలి . ఇది మనం జరిపే లావాదేవీలన్నింటికి అవసరమవుతుంది . ఇప్పుడు మన మొబైల్ కు " Your Handset validation successful " అనే సందేశం వస్తుంది . 5 ) ఇది చివరి దశ . ఇప్పుదు ATM సెంటర్ కు వెల్లి మన అకౌంట్ ను మన మొబైల్ కి జత చెయ్యాలి . ATM దగ్గరకు వెళ్లి కార్డును పెట్టగానే " Mobile Registration " అనే లింకు కనబడుతుంది . దాన్ని సెలెక్టు చేసుకుని " మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ " ద్వారా మన మొబైల్ నెంబర్ ను రిజిస్టర్ చెయ్యాలి . రిజిస్ట్రేషన్ పూర్తి చెయ్యగానే మనకు " Mobile banking registration successful " అని ఉన్న స్లిప్ వస్తుంది . వెంటనే మన మొబైల్ కు మన ఎకౌంటు నెంబర్ తో పాటు mobile రిజిస్ట్రేషన్ అయినట్లు conformation మెసేజ్ వస్తుంది . దీనితో మన మొబైల్ లోనికి బ్యాంకు వచ్చి చేరినట్లే . దీనిద్వారా ఏ మొబైల్ కయినా recharge చేసుకోవచ్చు ( select " Mobile Topup " ) . ఎవరి ఎకౌంటు లోకైనా మన మొబైల్ నుండే డబ్బులు పంపవచ్చు ( Fund transfer > register payee ) . మన ఎకౌంటు లోని బాలన్సు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలుసుకోవచ్చు ( Enquiry sevices > Balance Enquiry or Mini Statement ) . మీరే వాడి చూడండి . . . . . .
@ మహేష్ : > > " చలం ఆడజాతిని ' ఉద్దరించాలని ' అనుకున్నట్లు నాకైతే ఎక్కడా అనిపించలేదు " ఆయన ఏమనుకున్నాడనేది నేను చెప్పలేదు . స్త్రీ స్వేఛ్చ ప్రస్తావనొచ్చినప్పుడల్లా చలం పేరెత్తి ఆ నాటి ఆయన రచనల వల్లే ఈనాడు సమాజంలో స్త్రీలకి ఈ మాత్రం స్వేఛ్చైనా ఉందని వాదించే వాళ్ల గురించి నేనన్నమాటది . ( అదెంత హాస్యాస్పదమైన వాదనో చూడండి . దేశమంతా చలం కారణంగానే వచ్చిందా ఆ సమానత్వమూ , స్వేఛ్చా ? ) . ఆయనేవో తన పెర్వర్షన్స్ బయటేసుకునే రచనలు చేస్తే కొందరు జనాలు వాటిని మహిళాజనోద్ధరణకి మూల సూత్రాలుగా తీర్మానించటం గురించి నా అభ్యంతరమది . > > " అయినా ఆడవారు తేరగా కూర్చుని ఉద్దరింపబడటానికి తయారుగా ఉన్నట్లు భావించడంలో అసలు అర్థమే లేదు " ప్రస్తుత చర్చలో నేను మీతో ఏకీభవించే ఒకే ఒక వాక్యమిది . > > " ఆడదాన్ని ఆడదానిగా గౌరవించడం , అభిమానించడం , ప్రేమించడం కాముకత్వం అని మీరు నిర్ణయిస్తే చలం నిస్సందేహంగా కాముకుడే " భార్యనీ , ప్రేయసినీ ప్రేమించినట్లే కూతుళ్లనీ , మనవరాళ్లనీ కూడా ప్రేమించటం నా దృష్టిలో కాముకత్వమే . వావి వరసల విషయంలో సాపేక్ష సిద్ధాంతం అమలు చేసేంత విశాలభావాలు నాకు లేవు . ఆ మాత్రం కట్టుబాట్లు కూడా లేని సమ సమాజం నాకక్కర్లేదు . అది దారితీసేది అరాచకానికే . ఊహల నుండి వాస్తవంలోకొచ్చి చూడండి . > > " చలం మనుమరాలు ఇంటర్వ్యూలో చెప్పింది తన అనుకోలు ( assumption ) , కానీ చలం ఉద్దేశం ( intention ) అదే అని నిర్ణయించగలమంటారా " పైన మీరే కదా ' ఆడదో మౌన విప్లవం , ప్రతి రోజూ ప్రతి చోటా సమూల మార్పులు తెస్తూనే ఉంటుంది ' అంటూ ఆడాళ్ల శక్తి గురించి నాకు చెప్పారు . తనది ఉత్త ' అనుకోలో ' కాదో తేల్చుకోలేని అమాయకురాలా ఆ చెప్పినావిడ ? ఆవిడేమీ ఆషామాషీ వ్యక్తి కాదు కదా . చలం రచనలు చదివాక , ఆయన గురించి కుటుంబ సభ్యులే అంత వివరంగా చెప్పాకా కూడా ఆయన ఉద్దేశాలకీ , చర్యలకీ benefit of doubt ఇస్తూ కూర్చుంటానంటే నేనేం మాట్లాడగలను ? ఈ విషయమ్మీద ఇదే నా చివరి వ్యాఖ్య .
> ఇక నచకి అన్నట్లు " ప్రపంచంలోని అన్ని భాషలకు కలిపి ఒకే కోడ్ ను తయారు చేసారు > కాబట్టి " అనుకోవచ్చు అలాగే " ఇది అన్ని భాషల కోడ్‌నూ కలిగి వుంది " అనికూడా > అనుకోవచ్చు . నాకయితే రెండవదే నచ్చింది .
ఉరుకులతో పరుగులతో నాకు అతి కొత్తయిన భాషల చప్పుళ్ళతో నేను పోల్చుకోలేని ముఖాల మెరుపులతో సర సరా జారిపోయింది .
" గతంలో కేంద్రం 14 రాష్ట్రాలను ఏర్పాటు చేసింది . ఎప్పుడూ తీర్మానం చేయలేదు . కేంద్రమే ఏకగ్రీవ నిర్ణయంతో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది . అసెంబ్లీలో ఓటింగ్ గెలవడం అంటే ఎప్పటికీ తెలంగాణ సాధ్యం కాదు . చిదంబరం చేసిన డిసెంబర్ 9 ప్రకటనను తానే డ్రాఫ్ట్ చేసినట్లు కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఎక్కడో చదివాను . నిజంగా తెలంగాణ తెచ్చే ఉద్దేశం ఉంటే కేసీఆర్ అలా ఎందుకు డ్రాఫ్ట్ చేస్తారు " అని గోనె ప్రశ్నించారు .
విరోధము , భార్యాభర్తల మధ్య ఎడబాటు , శ్రమతో పనులు నెరవేరుచుండుట , ఏదో ఒక విధముగ సొమ్ము చేతి కందుచుండును .
ఎవరిదాకో ఎందుకు , నాగురించే తీసుకోండి . . డిగ్రీ చదివేటప్పుడు , గణిత బ్రహ్మ లక్కోజు గారి గురించి తెలుసు . . కానీ , ఈ రోజు ఇంకెవరోగాని చెబితే గుర్తుకి తెచ్చుకోవటం , నా తప్పు కాదా ?
పంచచామరము ఒక అందమైన వృత్తము . పాదమునకు ఎనిమిది ల - గములు గల ఈ వృత్తము తాళయుక్తము , పాడుటకు చక్కగా నుండును . ఇట్టి శిలాఫలకాన్ని చెక్కుట శంకరులవంటి శిల్పాచార్యకవికి కష్టము కాదు గదా ? గణేశపంచరత్నము , కృష్ణాష్టకము , నర్మదాష్టకము , యమునాష్టకములు పంచచామరవృత్తముతో విరాజిల్లుచున్నవి . తన గురువైన గోవిందభగవత్పాదులను నర్మదాతీరములో మొట్టమొదట దర్శించెను . పిదప ఒకనాడు ఇతర సహాధ్యాయులతో ఒక గుహలో అభ్యాసము చేయుచుండగా నర్మదానదిలో వరద వచ్చింది . వరద నీళ్ళు గుహద్వారమును సమీపించింది . ఒక పాత్రను అక్కడ పెట్టి నర్మదానదిని ఆ పాత్రలో వెళ్ళమని నర్మదాష్టకమును ఆశుధారగా చెప్పెను . ఈ నర్మదాష్టకము పంచచామరవృత్తములో నున్నది . చామరకర్ణుడైన విఘ్నేశ్వరునిపై పంచ చామరములను పంచరత్నములుగా ఆచార్యులు వ్రాయుట వృత్తౌచిత్యమును తెలుపుతుంది . క్రింద ఒక ఉదాహరణ -
5 . ఈ పదేళ్ల కవిత్వంలో వచ్చిన మార్పులు ఏమిటని ఎవరయినా అడిగితే ఖచ్చితంగా అనేక నిర్దిష్టవాదాల వైపు ప్రయాణమే . ఏకకేంద్రంలో అనేక కేంద్రాలను దర్శించడం ఇవాల్టి బహుళ వాస్తవం అంటున్నారు అఫ్సర్ , వంశీకృష్ణ . పేచీనే లేదు . చీలుదారులు , ' వేరు ' దారులు ఇవాళ సాహిత్యావరణంలో నోరుగలోళ్లు సృష్టించినవే తప్ప ' పునాది ప్రజానీకం ' లో అంత లోతయిన ' వేర్పాట్లు ' లేవు . చీలుదారులు , వేరుదారులు విశ్వామిత్ర సృష్టే .
" ఒకపక్క కేసీఆర్ జార్ఖండ్ ఉద్యమం పద్దెనిమిదేళ్ళు సాగింది కాబట్టి అప్పుడే తొందరొద్దు , ఉద్యమాన్ని కొనసాగిస్తూ , చందాల దందాలతో , పదవులతో బేరసారాలతో హీరోగా కొనసాగ జూస్తున్నాడు కాబట్టి ఈయనగారి బండారాన్ని తప్పక బయటపెట్టి " ముందు పైన చెప్పిన పని చేసి చూపించండి , ఉద్యమంలోని నిజాయితీ అందరికీ అర్ధంఅవుతుంది , మద్దతు లభిస్తుంది . ఆ kcr గాని నీడలో బ్రతికే JAC తాటాకు చప్పుళ్ళకు , యిలాంటి పారా మిలటరీ ఫలితాలే వుంటాయి .
కథలు నిస్సందేహంగా రచయిత జీవితంలోనించీ , అనుభవాల్లోంచీ , అవగాహనల్లోంచే వస్తాయి . కానీ అవి రచయిత జీవితాన్ని దాటి అతగాడి ( ఆవిడ ) కథగా కాకుండా ' ప్రపంచం ' కథ కాగలిగి నప్పుడే రచయితకి మెచ్యూరిటీ వచ్చినట్టు . ఇది నా మొట్ట మొదటి పరీక్ష కొత్త కథకులకి . " నేను నన్ను దాటి కథ చెప్తున్నానా లేదా " అన్నది తనకి తాను నిజాయితీగా వేసుకోవాల్సిన ప్రశ్న .
నాతో మాట్లడటానికి చాలామంది భయపడతారు . కొంతమంది వితండవాదం అంటారు . ఇంకొంత మంది మొండితనం అంటారు . ఎవరేమనుకుంటే నాకేంటటా ! నాకు నచ్చింది చెప్పడం , నచ్చని దాన్ని తిట్టడం జన్మతః వచ్చిన సుగుణం . దాన్ని మార్చుకోమంటే ఎలా ?
అందరికీ కొత్త ఏడాది శుభాకాంక్షలు . కొత్త సంవత్సరం పేరు ఖర అని తెలిసిన దగ్గర్నుండీ ఏవిట్రా ఈ పేరు కమామిషు అని బుర్ర గోక్కున్నా . కడివెడైననేమి ఖరము పాలు అని వేమన పద్యం తెలుసుగదా ! అంటే గాడిద అన్న మాట . ఖరదూషణులని ఇద్దరు రాక్షసులున్నారు రామాయణంలో . శూర్పణఖ అన్నదమ్ములు . శ్రీరాముడు వారిని సంహరించాడు కాబట్టి ఖరహరుడు , ఖరాంతకుడు అని పేరు పొందాడు . ఆయనకి ఇష్టమైన రాగంగా ఖరహరప్రియరాగం ప్రసిద్ధికెక్కింది . ఖర అంటే పదునైన , వాడిగల అని కూడా అర్ధమున్నదిట . ఈ ఖరవత్సరం శ్రీకరమై అన్నిరకాల అవరోధాలను అశుభాలను వాడిగా ఛేదిస్తూ వడిగా వేడిగా మీమీ లక్ష్యాలదగ్గరకు మిమ్మల్ని చేర్చాలని నా శుభాకాంక్షలు . మార్చి ఇరవై నించీ వసంతారంభం అని లెక్క . మరి తెలుగు ఉగాది కూడా వచ్చేసింది కాబట్టి మరి నిజ్జంగా వసంతం వచ్చెయ్యాలి గద ! గత వారంలో పూర్తిగా మూడు రోజులపాటు పగటి ఉష్ణోగ్రత యాభైలతో దోబూచులాడుతుంటే , అవునుగామోసు అని నమ్మెయ్యడానికి రెడీ అయిపోయాను . నా అమాయకత్వాన్ని పటాపంచలు చేసి వాస్తవాన్ని పరిచయం చేస్తూ ఇవ్వాళ్ళ ఓ బుట్టెడు మంచు కురిసింది . లిబియాలో స్వాతంత్ర్య సమరజ్వాలలు రగులుతూనే ఉన్నాయి , నేటో విమానదాడులు ఆ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి . గద్దాఫీ వారుణాస్త్రాలు పెద్దగా పని చేస్తున్నట్టు లేదు . టూనీసియాలోనూ , ఈజిప్టులోనూ డిక్టేటర్లకి ఉద్వాసన చెప్పే ప్రక్రియ ( ఉద్యమం ? విప్లవం ? ) కొంతలోకొంత శాంతియుతంగా జరిగింది కాని , బహ్రేన్ సౌదీలలో ఉద్యమాన్ని డబ్బుతో కొనేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి . ఎటొచ్చీ లిబియా , యెమెన్ మాత్రం రగులుతున్నాయి . కాష్టం నించి చుట్టముట్టించుకునే అవకాశవాదిలాగా లిబియా చమురు బయటికి ప్రవహించట్లేదని చమురు కంపెనీలన్నీ పెట్రోలు ధరని ఆకాశానికెత్తేసి లాభాలు దండుకుంటున్నాయి . వాలువీధి రేపనేది లేనట్టు నింగికి పాకుతోంది . ఉగాది అనగానే తెలుగు నాట కవిసమ్మేళనాలు జరపడం సాంప్రదాయం . పొద్దు జాలపత్రిక వారి చొరవతో 2008లో సర్వధారి ఉగాదికి మొదటిసారి జాలకవిసమ్మేళనం జరిగింది . 2009లో విరోధి ఉగాదికి అది ఒక కొత్త వరవడిగా ఎదిగి , 2010 వికృతి ఉగాదితో సాంప్రదాయంగా పరిణమించింది . తెలుగు బ్లాగుల ఆవిర్భావంతో జరిగిన ఒక శుభపరిణామమిది . యువమిత్రుడు బ్లాగాడిస్తా రవి అధ్యక్షతన శ్రీఖర ఉగాదికి కూడా విద్వత్కవిసభ సలక్షణంగా అలంకారయుతంగా నవరసభరితంగా జరిగిన తార్కాణాలు కనిపిస్తున్నాయి . బహుశా ఇవ్వాళ్టితో మొదలెట్టి ఆ సభ విశేషాల్ని పొద్దులో ప్రచురిస్తారు . పద్యకవిత్వం మీద ఆసక్తి ఉన్నవారు తప్పక చదవండి .
చవితి అనే మాట చౌతి కి రూపాంతరం . చౌషష్టి 64 , చౌసీతి 84 . చౌదరిలో " చౌ " అంటే నాలుగు అనే అర్థం స్ఫురించదు . నాలుగు దంతాలు ఉన్న ఇంద్రుడి ఏనుగు చౌదంతి . దీన్నే చతుర్దంతి అని కూడ అంటారు . " చౌ " కంటె " చతుర్ " బాగా వాడుకలో ఉంది . చతుర్ముఖుడు చతుర్వేదములకీ కర్త అని నలుగురూ నమ్మే విషయమే . ధర్మ , అర్థ , కామ , మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు . సాలోక్య , సామీప్య , సారూప్య , సాయుజ్యాలు చతుర్విధ ముక్తులు .
పౌర జీవన ప్రమాణ సూచీ ( Life Index ) అనేది అనేక కారణాల మీద అధారపడి వుంటుంది . చక్కని పొందిక కలిగిన సమాజం , ఆరోగ్యకరమైన గాలి , నీరు , శుభ్రత , నాణ్యత కలిగిన సేవలు , ఆర్ధిక సమానతలు , పేదరికం అనే విషయాలు ముఖ్యమైనవి . అయితే ఇవి కాక మరికొన్ని కారణాలు కూడా ఈ సూచీ ని ప్రభావితం చేస్తాయి . అవి మానసిక ఆనందం , ప్రశాంతత , పర్యావరణం , సమాజ చైతన్యం వంటివి . అయితే ఇవన్నీ మన రాజధాని నగరంలో ఎలా వున్నాయి ?
తమను చీమ కుడితే తెలుగు బ్లాగరుల్లో ఒక్కొక్కరూ ఆ విషయాన్ని గురించి తమ తమ బ్లాగుల్లో ఏమని రాస్తారనే ఒక చిలిపి ఊహే ఈ బ్లాగుల పేరడీకి మూలం . మరికొందరు బ్లాగరుల బ్లాగులు , వ్యాఖ్యలపై పేరడీలు త్వరలో . . .
ఆ చంద్రమంత్రి మణికిని పోచాంబారత్నమునకు బుట్టెను బుధ ర క్షాచణుడు మంచనార్యుడు వాచస్పతి సదృశ బుద్ధివైభవుడగుచున్
తెలుగుసేత నాది . టపా కింద టైం పత్రికకి లంకె ఉంది . ఆంగ్లం కావాలంటే అక్కడ చదువుకోవచ్చు .
పక్క సీట్లో ఒక ఫ్రెంచి ముసలతను . ఒక్క ముక్క ఇంగ్లీషు రానట్టుంది . సైగలతో మొత్తానికి తను న్యూయార్క్ వెళుతున్నానని చెప్పాడు . ఆ సైగల భాషతో అలసి పోయి ఇక నిద్ర పట్టేసింది . నిద్ర లేచే సరికి కమ్మని భారతీయ చికెన్ బిరియాని అందించారు . ఔరా ఎయిర్ ఫ్రాన్సు అనుకున్నా …
ఎందుకంటే ఈ మధ్య జగన్ చేస్తున్న పలు దీక్షలకి కాంగ్రెస్ నుంచి దాదాపు గా 25 మంది ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా అతని వెంట నడిచిన సంగతి తెలిసిందే .
ఈరోజు అనగా ఆదివారం , 23 Feb , మా ఊళ్లో శివరాత్రి చేసుకున్నాం . మా గుళ్లో ఈరోజు చాలా కార్యక్రమాల సమాహారం సిద్ధం చేసారు . పొద్దున్నే ఆరుకే కార్యక్రమాలు మొదలు . 8 - 11 గణపతి హోమం 11 - 1 రుద్ర హోమం దేనికి వెళ్దాం అని ఊగిసలాడి , రుద్ర హోమానికి వెళ్దాం అని నిర్ణయించి , కారు తీసా . సరిగ్గా పదకుండింతికి చేరుకున్నా . మాకు గుడి చాలా దూరం , రెండు మైళ్లే . వెళ్లేసరికి హడావిడిగా ఉంది గుడి . అయ్యవారికి అలంకరణ అవీ ఇవీ , కలశపూజా అన్నీ అయ్యాయి . ఇక , హోమానికి మొదలుపెడుతున్నారు . భాస్కరా , రా కూర్చో అన్నారు పూజారి గారు , కోఆర్డినేటరు శాస్త్రిగారు . అందరూ మనకి తెలిసినవారే . ఇక కార్యక్రమం మొదలు . నా జీవితింలో రుద్రహోమం చెయ్యటం ఇదే మొట్టమొదటి సారి . బ్రహ్మాండంగా జరిగింది . రుద్రంలోని ప్రతీ మంత్రంతో ఇలా - ఓం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమ : నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమ : స్వాహా " అంటూ హోమం చెయ్యటం , ఆ మంత్రోఛారణలో నా గొంతూ కలవటం , అయ్యాక , అందరం ముక్తకంఠంతో వెయ్యిఎనిమిది సార్లు శివబీజాక్షరీ జపించటం మరోవైపు ఆమంత్రతోఛారణతో హోమం , అయ్యాక , పూర్ణాహుతి , మహా మంత్రపుష్పం , శాంతిమంత్రం . నారోమాలు నిక్కబొడుచుకున్నాయి ఈరోజు . ఇదంతా నా ఆర్ . సి . యే వాయిస్ రికార్డర్లోకి రికార్డ్ చేసా . కానీ ఎందుకో సరిగ్గా రికార్డ్ కాలా . చివరకొచ్చేసరికి బ్యాటరీ అయిపోయింది . అందరితో పంచుకుందాం అనే నా ఆనందంమీద నీళ్లు జల్లిందీ వాల్మార్టు సరుకు . ఏమైనా , చాలా తృప్తిగా ఉందీరోజు . నా ఫోనుతో తీసిన హోమ గుండం ఇక్కడ పెడుతున్నా . మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు . ఆ భోళాశంకరుని చల్లని చూపులు మనందరిపై ఉండాలని కోరుకుంటా . గమనిక : - http : / / www . geocities . com / yajur . veda / ఈ లింకులో రుద్రం స్వరసహితం లభిస్తుంది .
నా వ్యాఖ్యానం : * మొదట వచ్చిన పాట నాకు తెగ నచ్చింది ( ఈ పాట పుసకంలో ఉందా ? చూసినట్లు గుర్తు లేదే … చూసి పాట అని తిప్పేసానేమో … సినిమాల్లో పాటలొస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్లు ! ) * ఒక్కొక్క గాత్రధారీ అద్భుతంగా చెప్పారు డైలాగులు ! వీళ్ళూఅని ఎన్నలేనంత నచ్చారు నాకు అందరూ . భాగమతి అక్క , అమీర్ - ఇద్దరూ బాగా గుర్తుండిపోయారు … చదివినప్పుడూ , విన్నప్పుడూ . * డైలాగులు చాలా బాగున్నాయ్ ! * కథ చదువుతున్నప్పుడు హీరో కి చంద్రహారంలో రామారావు , హీరోయిన్ కి అనార్కలి లో అంజలీదేవీ గుర్తొచ్చారు . కానీ , నాటకంవింటున్నప్పుడు ఆ గొంతులు ఆ ఇమేజ్ కి మ్యాచ్ కాలేదు * అమీర్ పాత్ర డైలాగులు సరదాగా ఉన్నాయి . * గంట నాటకంలో ఒక్క క్షణం కూడా బోరు కొట్టదు ! * సంగీతం అదీ , చాలా బాగా అమరింది . కరెక్టుగా పుస్తకం చదువుతున్నప్పుడు కదలాడే భావాలే , నాటకం వింటున్నప్పుడూకదలాడాయ్ ! : - )
ఇది ఆంధ్రుల కథ . పేరు చూసి భయపడకండి . ఐతరేయ బ్రాహ్మణం నుంచో శాతవాహనుల నుంచో ఎత్తుకొని ఆంధ్ర జాతి చరిత్రను ఇక్కడ మళ్ళీ తవ్విపోస్తామని ! ఆపని ఇప్పటికే చాలామంది పండితులు చాలా రకాలుగా చేశారు . ఇటీవలి రాజకీయ పరిణామాల పుణ్యమా అని చాలామంది రాజకీయ నాయకులు కూడా పార్ట్‌టైమ్ చరిత్రకారులుగా మారి తమ అవసరానికి తగ్గట్టు వేర్పాటువాదానికి పనికొచ్చేట్టో లేక సమైక్యవాదాన్ని బలపరచే విధంగానో తెలిసీ తెలియని చరిత్రను వండి నివేదికల కంచాల్లో శ్రీకృష్ణ కమిటీకి , పనిలో పనిగా మీడియాకి ఎక్కీ తక్కీ వడ్డించారు . విభజన రేఖకు ఆవంక , ఈవంక బారులుతీరిన కవి , పండిత , మేధావుల సమగ్ర విశే్లషణ సాహిత్యాలు సరేసరి !
ఓరి దుర్మార్గుడా ! రాజ్యాన్ని రాజకుమారిని మోసగిద్దాం అనుకున్నావా ! నీలాంటి దేశద్రోహికి సహాయపడి నేనింకా పాపం మూట కట్టుకోలేను అని అనుకొని అమాంతంగా ఆ బాటసారిని మ్రింగివేశాడు బ్రహ్మరాక్షసుడు . తత్‍క్షణమే పులిగాశాపం పొందిన శిష్యుడు నరరూపంలో ప్రత్యక్షమై " మిత్రమా ! దుష్టుడైన దేశద్రోహిని సంహరించి రాజ్యాన్ని కాపాడిన నిన్ను నన్ను ఆ ధర్మదేవుడు కరుణించినాడు . రా " అంటున్న నూతన మిత్రునితో దివ్యలోకాలు చేరుకున్నాడు బ్రహ్మరాక్షసుడు .
మరుసటి రోజు ఉదయం కొంచెం లేట్గా ఆఫీస్ కి వెళ్ళాను . వెళ్ళగానే పని తర్వాత చేద్దమని , ఈ పేపర్ చదువుతున్నాను . వెనక నుండి మా రివ్యూ టీం లీడర్ వచ్చాడు . ఏం బాబూ బిజినెస్ న్యూస్ చదువుతున్నావా అని అడిగాడు . అవును లీడర్ గారూ , సెన్సెక్స్ ఈ మధ్య డవున్ అవుతోందనుకవొచ్చనుకుంటున్నాను అని నా విశ్లేషణను మొఖం మీద నవ్వు పులుముకుని చెప్పి , కాంప్లిమెంట్ కోసం తలవంచుకుని ఎదురు చూస్తున్నాను . మా టీం లీడర్ గాడు అన్నాడు , నువ్వు అల్రెడీ డవునయిపోయావు బాబూ . నీ మెయిల్ చెక్ చెసుకున్నావా అని అడిగాడు . లేదని చెప్పాను . ఇక మొదలు , వచ్చిందే లేట్ , మళ్ళీ రాగానే కనీసం మెయిల్ కూడా చెక్ చెసుకోకుండా , ఏదో దేశాన్ని ఉద్ద్ధరించేవాడిలాగా పేపర్ ముందేసుకు కూర్చుంటావా అని దిమ్మదిరిగి బొమ్మ కనపడేలాగా చివాట్లు పెట్టిపోయాడు .
@ మురళి మా పాప చదువుతుంటే తనకి జతగా కూర్చుని నిద్రని ఆపుకుంటూఇలా వింటూ పాడుకుంటూ ఇలా రాసుకుంటూ . . . . తెలవారదేమో అనుకుంటూ : - ) @ రాధిక ( నాని ) నాకు ఈ పాట చాలా ఇష్టం అండీ : )
మనదేశంలో కుంభకోణాల చరిత్ర ఈనాటిది కాదు . ఆంగ్లేయుల కాలంలో జరిగిన అవినీతి కార్యక్రమాలకు బ్రిటీష్ పార్లమెంటు చర్చించి బాధ్యులను శిక్షించిన ఘటనలు చరిత్రలో చూశాం . కాని 1947 స్వాతంత్య్రా నంతరం జరిగిన కుంభకోణాలు పాలక వర్గాల కనుసన్నలలో జరిగినవే . నేడు క్రోనీ క్యాపిటలిజం కొనసాగుతున్నది . అందువల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థ నడకే ఒక పెద్ద కుంభకోణంగా మారి పోయింది .
@ రానారె , ఆడియో ఉందిగాని వీడియో లేదు . ఉన్నాకానీ ఎలా పెడతానిక్కడ , నన్ను గుర్తుపట్టెయ్యరూ : - ) @ చదువరి , ఊకదంపుడు , అతని పూరణ ముందు నా పూరణ సూర్యునిముందు దివిటీ అవుతుందని పెట్టలేదు . మీరు మరీ బలవంతం చేస్తున్నారు . . . నా పూరణ : పద్రిచి దురాగ్రహోన్మద దవానలమందున వ్రేల్చి బాలురన్ చిద్రుపలుగా మిగిల్చితివి చిన్నితనూజుల , మానుషత్వమే విద్రిచితివోయి ! నీకు తగవే యిది ? నిన్నననేల నాకు దా నెద్రిచిన కాలమే కడకు నివ్విధి శిక్ష విధించె ద్రోణజా ! అవధానిగారు ఈ " ఎద్రుచు " మొదలైన పదాలు కేవలం " ద్రు " కారం తోనే రావాలని అనుకున్నారు . అందుకే మూడవపాదంలో " ద్రి " కోసం పదాన్ని విడగొట్టారు . కానీ " ఎద్రిచి " వంటి రూపంలో కూడా ( భూతకాలంలో ) వాడవచ్చు .
" రాణీ , నువ్వు నిజానికి రాణిగా ఉండదగవు . నా భార్యగా ఉండేందుకు కావలసిన సౌకుమార్యంగానీ , అందచందాలు గానీ నీలో లేవు . నీలో ఉన్నదంతా వికారమే " అన్నాడొక రాజు భార్యతో . రాణి జవాబిచ్చింది పదునుగా - " రాజా ! నిన్ను నువ్వు ఒక రాజుననుకుంటున్నావు . కానీ నిజానికి మానసికంగా నీఅంత పేదవాడు ఇంకెక్కడా ఉండడు " అని . ఈ మాటలకు రాజుకు ఎక్కడలేని కోపం వచ్చింది . వెంటనే అతను రాజదండాన్ని చేతిలోకి తీసుకొని , దానితో రాణి తలపై మోదాడు బలంగా . ఆ క్షణంలోనే అంత : పుర ప్రధానాధికారి ప్రవేశించి అన్నాడు రాజుతో " భళి భళి మహారాజా ! ఆ దండాన్ని ఈ రాజ్యంలో కెల్లా అతి గొప్ప కళాకారుడు సృజించాడు . నేనేం చెప్పేది , ఏదో ఒకవాటికి చరిత్ర మిమ్మల్ని , మహారాణిని కూడా మరిచిపోతుంది . కానీ తరతరాలకు చెదరని సౌందర్యఖనిగా ఈ రాజదండం మాత్రం నిలచి ఉంటుంది . ఇప్పుడు మీరు దీన్ని మహారాణీవారి రక్తంతో తడిపారు - కాబట్టి అందరూ దాన్ని మరింత గౌరవిస్తారు , మరింతగా గుర్తుచేసుకుటారు " అని .
" నాకేం అర్థం కావడం లేదు . చిన్నవిషయానికే రాధ్ధాంతం చేసుకుని మరీ దూరం పోతున్నారు . పోనీ నేను రానా ? "
అమ్మ కొంగుపట్టుకు తిరిగే పసితనం పోయి అమ్మాయి కొంగు పట్టుకోవాలని ఆరాటపడే కొంటెతనం లో అబ్బాయిలకి చీర ఊహల్లో రెపరెపలాడే ఒక ఇంధ్రధనస్సు . చుడీదార్లు , పట్టు పరికిణీలే కాకుండా అడపదడపా చీరకట్టులో మెరిసిపోయే కన్నెపిల్లలకి చీర ఒక మంత్రదండం . ఎంత మాయగాడైనా ఆ మాయలో పడకుండా ఉండలేడు . తన ప్రేయసి మొదటిసారిగా చీర కట్టుకుని ఏ గుడికో వెళ్ళింది అని తెలిసిన వెంటనే ఆత్రంగా , ఆశగా పరిగెట్టుకుని వెళ్ళి పెరుగుతున్న గుండె వేగాన్ని అదుపులో పెట్టుకుంటూ చూసే నూనూగు మీసాల కుర్రాడ్నే అడగాలి చీరలోని అందం . " సరికొత్త చీర ఊహించినాను . . సరదాల సరిగంచు నేయించినాను " అయినా చూస్తే చీరంతే ఉంటుందిగానీ చెప్పుకుంటూ పోతే ఊరంతవుతుంది .
ఈరు , ఇరు అంటే రెండు , ఇద్దరు అని రెండర్ధాలు ఉన్నాయి . ఈరారు అంటే 12 , ఈరేడు అంటే 14 , ఈరెనిమిది 16 .
మనకు నిజంగా ఈ వాక్యం పై నమ్మకం ఉంటే " ఏదో ఆకాశం వచ్చి మీదపడిపోతోంది , మన సంస్కృతి నశించిపోతోంది , చీడపురుగులని తగలబెట్టాయాలి " , అంటూ ఆవేశపడిపోము . ఈ ఆవేశమే అన్ని అనర్థాలకు మూలదాయకం . " హుస్సేన్ కళాచిత్రాలు మన సంస్కృతిని కించపరుస్తున్నాయి . " , అని ఒకడు . " తస్లీమా నస్రీన్ మా మతాన్ని కించపరుస్తోంది " , అని ఇంకొకడు , ఇలా మనం రెచ్చిపోము .
ఉరన్ నశై ఇ ఉళ్ళం తుణైయాగ చ్చెన్ఱార్ వరల్ నశై ఇ ఇన్నుం ఉళేన్ ( 1263 )
మొన్నో కథ చదివాను : అమెరికాలో తెలుగు వాళ్ళు సత్యనారాయణ వ్రతం ఎంత ఘనంగా - మీగడలతో భోజనం , తాంబూలంతో ఫాటు వెండిగిన్నె ప్రదానం - చేసుకుంటున్నారో , ఒకరింట్లో స్వామి వారొకరు యజ్ఞం ఎలా జరిపించారో చెప్పి , ఇండియాలో లక్ష వత్తుల నోము ఎవరూ చేస్తున్నట్లు లేరు ; అది కూడా ఇక్కడ చూసే భాగ్యం కలుగుతుందేమో అన్నారు .
1973లో , " గ్రోమోర్ " క్రింద ౨౦ రూపాయల నాణేలని రిజర్వ్ బాంక్ విడుదల చేసింది . ముచ్చట పడి సంపాదించి , నాణెం అంటే చిల్లరే కదా అని , అత్యవసర పరిస్థితిలో ఇచ్చి , ప్పుచ్చుకోవడానికి వెడితే అది అప్పటికే చెయ్యి దాటి పోయింది . నేడు " ఈబే " లో ఆఒక్క చిల్లర నాణెం రెండున్నరవేల రూపాయల దాక పలుకుతున్నది ! అదండి , చిల్లర శ్రీ మహలక్ష్మి విలువ ! " అణాకొక బెడకొక " స్టాంపు అని పత్తేదారి నవల ఒకటి ఆరుద్ర వ్రాసారు .
@ ఆనందమానంద మాయె . . . . . . . . . . . . . శ్రీధర్ గారూ నా బ్లాగులో మీ వ్యాఖ్య , నిజంగా " సిరివెన్నెలే " . కురిసింది . ముందు శాస్త్రిగారికి థేంక్సు చెప్పుకోవాలి మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చినందుకు . మీ సూచనని తప్పక పాటిస్తాను . @ " అశ్విన్ బూదరాజు " ఈ పేరు చాలా పరిచయం అయిన పేరులా వుంది . మీరు పేపర్లోను , పుస్తకాల్లోను రాస్తుంటారా ? @ బాబా గారూ , మీరుకూడా ఇంతవరకూ చదవలేదా ? రాస్ట్రమంతా సిరివెన్నెల వీరాబిమానులేకదా , అందుకే ఈ పుస్తకపరిచయం అవసరం అనిపించి రాసాను .
రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చాను . ఆ రోజు రాత్రి పక్క మీద నా భార్య ఇలా అంది - ' ముంబై ట్రిప్ నుండి వచ్చిన ప్రతీసారీ మీరు కొత్తగా , ఫ్రెష్ గా కనపడతారు . ఏదో తెలియని మార్దవం కనపడుతుంది . ' . తనింతలా expressive గా మాట్లాడటాన్ని , లోతుగా విశ్లేషించడాన్నినేను చాలారోజుల తర్వాత గమనించాను . తనని చూస్తూ అప్రయత్నంగా నా ముఖంలో ఒక మందహాసం మెరిసి మాయమయ్యింది .
నిన్నటి తప్పుకు , రేపటి పశ్చాత్తాపానికి , నడుమ నేడు ఆత్మవిమర్శల సంఘర్షణ .
ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రపై వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటి దంపతులపై జగన్ వర్గీయులు మాటలదాడి కొనసాగిస్తున్నారు . . . . .
గురజాడ బ్రిటీషు వారిని కీర్తించాడు అన్నారు . . . బ్రిటీష్ వారు నయవంచకులు , విభజించి పాలించ వారు అన్నారు . . మరి వారు మన దేశాన్ని పరిపాలించక మునుపు ఉన్న రాజులు ఏమి చేస్తున్నారు ? జనాలను నాలుగు ప్రధాన కులాలుగా విభజించి పరిపాలించడానికి కారకులెవ్వరు ? రాజుల పంచన వేల సంవత్సరాల నుంచి బతుకుతున్న ప్రధాన సామజిక వర్గమేది ? సీ . పి బ్రౌన్ ఎవరు ? ఆర్ధర్ కాటన్ ఎవరు ?
అమెరికాలో ప్రవాసం ఉన్న భారతీయుల మనసుల్లో మా మెట్టినిల్లైన అమెరికాని తలుచుకున్నప్పుడల్లా ఎన్నో పరస్పరం విరుద్ధమైన భావాల సంఘర్షణ చెలరేగుతుంది . పైపైన చూస్తే కొన్ని విషయాల్లో చాలా ముచ్చటేస్తుంది . నిత్యావసరాలకి తడుముకోనక్కరలేకుండా సులభంగా పనులు జరగిపోవడం , అధికార్లూ పోలీసులూ ఒక మోస్తరు నిజాయితీతో పని చెయ్యడం , నిత్య జీవితంలో ఒక క్రమశిక్షణ , ఒక క్రమబద్ధత , ఇలాంటివి . ఇంకోపక్కన ఈ దేశంలో కనబడే , అనుభవమయ్యే ప్రకృతి వైవిధ్యం హాయి గొల్పుతుంది , చూసే కళ్ళుంటే , స్పందించే మనసుంటే పులకరింపచేస్తుంది ( మరీ కాంక్రీటు జంగిల్లాంటి నగరాల్లో ఉంటే తప్ప ) . సాంఘిక కోణంలో చూస్తే మన చుట్టూ ఉన్న రకరకాల మనుషులు , రకరకాల సంస్కృతులు , వేషభాషలు , మత పద్ధతులు , భోజనాలు , సంగీత సాహిత్యాది కళలు - ఈ మహాసముద్రంలో ఎన్ని అలలో , ఎన్నెన్ని లోతులో . ఇంకా ఇలా చాలా చాలా . . ఈ అనుభవసాగరాల్ని మధించడం మొదలెడితే ముందుగా పైకొచ్చేది హాలాహలమే . చుట్టూతా వ్యాపించి ఉన్న సంస్కృతి మనది కాదు . మన సంస్కృతినీ మన భాషనీ మన మతాన్నీ మన పద్ధతుల్నీ మింగెయ్యగలదు , నామరూపాల్లేకుండా ఎగరగొట్టెయ్యగల మహా ప్రభంజనం మధ్యలో ఉన్నాం . ఒక చిన్న మైనారిటీగా . పైపెచ్చు మోడల్ మైనారిటీ అనే గుదిబండనోదాన్ని మెడకి కట్టుకుని . మన అస్తిత్వాన్ని కాపాడుకోగలమా ఈ ప్రభంజనంలో ఈ ఝంఝామారుతంలో ? పెద్దమానులను కూల్చు తుపాను గడ్డిపరకను కదల్చదట ! మన చూపు మరి కాస్త విస్తరిస్తే - ఏమేమి కనిపిస్తున్నాయి ? మానవత్వాన్ని కబళించే దురాశ , మనుషులకీ కార్పొరేట్లకీ ఒక్కలాగే , బిలియన్ల ఆస్తుల్ని క్షణాల్లో హూష్కాకీ అని మాయం చేసే వాలువీధి మంత్రజాలం . మేం స్వేఛ్ఛకి ప్రతీకలం అని చెబుతూనే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న పోలీసు జులుం . మాటల్లో చేతల్లో ద్వంద్వ వైఖరులు . ఏదేమైనా అమెరికా ఒక విలక్షణమైన దేశం . అమెరికా జీవితం అదో వింత అనుభవం . నా మెట్టిన దేశానికి జన్మదిన శుభాకాంక్షలు .
" ఏమిటోయ్ ? ఎందుకలా మూడీగా ఉన్నావ్ ? ఏం జరిగింది ? " స్నేహితురాలు మోనిక అడిగింది తన క్యూబ్ వైపు వచ్చినపుడు .
దివ్య వాణి గారు , థాంక్ యు సో మచ్ . . . . అసలు ఆ కాలనీలో మేము ఉన్నన్ని రోజులు మా అక్కదే మొదటి బహుమతి . . . మీకు కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు .
ఏమని చెప్పాలి ? నిజానికి నాదగ్గర వున్న మాటలు చాలట్లేదు ఏమి చెప్పడానికీ .
శ్రీ శ్రీ మహా ప్రస్థానం ఇస్మాయిల్ మృత్యు వృక్షం శివారెడ్డి వర్షం వర్షం వేగుంట మోహనప్రసాద్ చితి చింత , సాంధ్య భాష శిఖామణి మువ్వల చేతి కర్ర వై . ముకుందరామారావు మరో మజిలీకి ముందు పసునూరు శ్రీధర్‌బాబు అనేకవచనం తమ్మినేని యదుకుల భూషణ్ నిశ్శబ్దంలో నీ నవ్వులు విన్నకోట రవిశంకర్ కుండీలో మర్రి చెట్టు
శ్రీరాగ గారి సంగతేమో కానీ , మా ఇంటావిడకి చెప్తాను . నాకు ఈ ' తోడు పెట్టే ఎసైన్మెంటు ' తప్పుతుందేమో ! !
" మీ ఇంటికొచ్చినప్పుడు . . చీరా పువ్వులు గాజులూ ఇచ్చేస్తే , ఇక్కడకొచ్చి మా పుట్టింటికెళ్ళొచ్చా అని చెప్పుకుంటా " అంతకన్నానా . మీరు ఎప్పుడొచ్చినా సరే మీకు పుట్టింటి మర్యాదలు , ఆప్యాయతలు , ఆత్మీయతలు గ్యారంటీ
రాజు ఓ బ్రాహ్మణుడా ! నీకంఠం ఎక్కడో విన్నట్టుగావుంది . చెల్లెల్ని పద్మావతి దగ్గర ఉంచిన బ్రాహ్మణుడివి నువ్వేనా ?
అసలు వేశ్యలంటే వాళ్ళ మొఖాల మీద రాసి ఉంటుందని అనుకునేటంత అమాయకుణ్ణి కాదు కాని ఒక ఆడ మనిషి వేష భాషలను బట్టి కొంతవరకూ వాళ్ళ జీవితాలను ఊహించొచ్చేమో అనిపిస్తుంది . ఎంత పెద్ద చదువులు చదివినా కొంతవరకు లోకపుతీరు తెలుసుకోవాలని చెప్తూ ఉండేది మా నాయనమ్మ . మరి కాబోయే డాక్టరుగా అలాంటి ఊహలు నాకు ఉండాలో లేదో అని తర్జన చేసేటంత సమయం ఎన్నడూ చిక్కలేదు . ఎంతసేపటికీ మెడికల్ సీటు ఎలా సాధించాలా అనే తప్ప నాలాంటి మామూలు వాళ్ళకు ఇలాంటివి పట్టవనుకుంటా . లోకపుతీరు తెలిసి మెలగాలంటే మరి మనిషిని బట్టి , వాళ్ళేసుకున్న బట్టలను బట్టి మందులివ్వాలి మరి , రోగాన్ని బట్టికాక . రాను రాను మెకానికల్ పట్నపు బతుకుల్లో మనుషులను విభజించే రీతులు మారిపోయి చాన్నాళ్ళు అయినట్లు తోస్తుంది , కొంతవరకూ పాత వాసనలు పోయినాకూడా అసలు ఇదే మంచిదని ఖచ్చితంగా చెప్పేలా మాత్రం లేదు ఈ తీరు ఎంతయినా .
ఇంకనూ , CBS కొన్ని విజయవంతాలను నిర్మించగలిగింది , వీటిలో కాస్బీ , ది నానీ , మరియు ఎవ్రిబడీ లవ్స్ రేమండ్ ఉన్నాయి మరియు NFLను ( NBC నుండి అమెరికన్ ఫుట్‌బాల్ కాన్ఫరెన్స్ ప్యాకేజీను సొంతం చేసుకుంది ) తిరిగి 1998లో పొందింది .
హైద్రాబాద్ లో స్నో వరల్డ్ అలాంటిదేనండి . కాకపోతే హిమాలయాల ఫీలింగ్ మాత్రమే ఉంటుంది . నేను చార్ ధాం యాత్ర చేసి ఇప్పటికే నాలుగేళ్ళయిపోయింది . అటువంటి ప్రయాణాలు చిన్నప్పుడే బాగా ఎంజాయ్ చేయ గలుగుతాం . దూరాలు నడవాలన్నా , కొండలూ గుట్టలూ ఎక్కాలన్నా , ప్రకృతి అస్వాదించాలన్నా చిన్నప్పుడే కదా ఆ ఓపికలుండేది . ఓపిక లేనప్పుడు ఆయాసాలే కాని అనుభూతి ఏముంటుంది . కేవలం భక్తి కోసం అయితే ఇంట్లోనే ఏ వయసులో నైనా చాలు . అంతే కదా చిన్నిగారు : ) ఇంతకీ బుజ్జులూ ని అమర్నాథ్ యాత్ర చేయించారా లేదా : )
బాగా చెప్పారు . మన దేశంలో ఎంక్వయిరీ కమ్మీషను రిపొర్టు లు వచ్చే లోపు ముద్దాయిలు ముసలి వాల్లయి చనిపోతారు . ఆ తరువాత రిపొర్టు ను పర్లమెంటులో పెట్టాలా వద్దా అనేది మరో డిస్కషన్ . అలా షవ యాత్రలు చేసి వేల మంది చావు కు కారనమయిన అద్వానీ తరువాత హోం మంత్రి అయ్యాడు . ఎప్పుడో బాబర్ చేసిన దానికి , అది కూడా ఎలంటి అధారం లేకుండా ఇప్పటి కట్టడాలను కూల్చడాని సమర్ధించే వాల్లను ఏమనాలి ? ఇలా సమ్ర్ధించే వాల్లు ఉన్నంత వరకూ జనాన్ని రెచ్చ గొట్టే వాల్లు ఉంటారు . ఈ రధ యాత్రలు చేసే వాల్లు వాటి సాకుతో ఓట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తారు , అమాయక వెర్రి జనం రధ యాత్రల్లో ప్రానాలు పోగొట్టుకుంటారు .
మనోహరుడి చెవు బాధ అట్ల వుండంగనే మీది నుండి అమ్మవారు కూడ సోకింది . ఒంటి నిండ పూత పూసింది . ముత్యాల మాదిరిగ ఒళ్లంత తెల్లటి గుండ్రటి పుండ్లు . శరీరం మీద వేలుబెట్ట సందులేదు . మంటలు , మంటలు అని పొర్లుతున్నడు . ఏదో చెట్టు బెరడును ఉడకబెట్టి ఆ కషాయాన్ని ఒంటికి పూస్తే చల్లగుంటదని ఎవళ్లో చెప్పినారు . అట్లనే చేసేసరికి మంటలు ఇంక ఎక్కువై వాడు మరింత అరిచినాడు .
1 . రాష్ట్రంలోని 23 జిల్లాలలో తెలంగాణాలో 10 , ఆంధ్రాలో 9 , రాయలసీమలో 4 వున్నాయి . అందులో తెలంగాణాలో 7 , ఆంధ్రాలో 3 రాయలసీమలో 1 వెనుకబడిన ప్రాంతాలుగా వున్నాయి . అంటే తెలంగాణలో 70 శాతం , ఆంధ్రాలో 35 శాతం , రాయలసీమలో 25 శాతం వెనుకబాటుతనంతో వున్నాయి . 2 . 45శాతం రాష్ట్ర ఆదాయం తెలంగాణ నుంచి వస్తుంది . కానీ ఆ ఆదాయంలో వినియోగించేది కేవలం 28 శాతం మాత్రమే . 3 . తెలంగాణా లో కాలువ నీటి ద్వారా సాగుబడిలోకొచ్చే మొత్తం వ్యవసాయ భూమి కంటే , ఒక్క గుంటూరు జిల్లాలో సాగుబడి చేసే భూమే ఎక్కువ . 4 . నాగార్జున సాగర్ డాం తెలంగాణా ప్రాంతంలోని నల్గొండ జిల్లాలో కట్టబడివుంది . కానీ దాని ద్వారా ఎక్కువ శాతం నీరు కృష్ణా , గుంటూరు జిల్లాలకే ఉపయోగించబడుతుంది . 5 . ఈ డాం నిర్మాణం ముందుగా అనుకున్న చోట కాకుండా , ఇప్పుడున్న ప్రాంతంలో కట్టబడటం వలన , లైం స్టోన్ మైన్స్ పూర్తిగా నాశనం కాబడ్డాయి . నీటికే కాదు చివరికి సహజ వనరులకు కూడా తెలంగాణ నోచుకోలేదు . 6 . నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ వాటర్ సమస్య తరాలబడి తీరలేదు . 7 . ఆంధ్ర ప్రదేశ్ లోకి కృష్ణా , తుంగభద్రా నదులు మహబూబ్ నగర్ జిల్లా ( రాష్ట్రంలోనే అత్యంత పెద్ద జిల్లా ) లోనే ప్రవేశిస్తున్నా , అది ఎప్పుడూ కరువులో కూడా పెద్ద జిల్లా గానే మిగిలివుంది . కారణం అక్కడ ఎటువంటి ప్రొజక్టులుగానీ , నీటి వినియోగానికి ప్రయత్నాలు గానీ లేకపోవడమే . 8 . ఆర్ . డి . ఎస్ ( రాజోలిబండ డైవర్షన్ స్కీం ) అనేది మహబూబ్ నగర్ జిల్లాలోని 85000 హెక్టార్ల భూమి సాగు కోసం కట్టబడితే , రాయలసీమ నేతలు ఆ డాం గేట్లని బద్దలుకొట్టి నీటిని కే . సి . ( కర్నూల్ - కడప ) కెనాల్ కి మళ్ళించారు . ఏమన్నా మిగులు జలాలు వుంటే , మహబూబ్ నగర్ కి పంపిణీ చేయబడుతున్నాయి . 9 . గండిపేట నుంచి సప్లై చేయబడుతున్న 3 టి . ఎం . సి . ల త్రాగునీరు మొత్తం హైదరాబాదు నగరానికి సరిపోతుంది . ప్రతి సంవత్సరం 1700 టి . ఎం . సి . ల నీరు వృథాగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది . 10 . నిజామాబాద్ నుంచి బంగాళాఖాతం వరకూ ఎటువంటి ప్రోజక్ట్ గోదావరి నదిపై కట్టలేదు . ఏదైనా డాం కడితే , తమ భూములకు నీటి సమస్య ఏర్పడుతుందని గోదావరి జిల్లాల నేతల భయం . 11 . గోదావరి నీటిని సరిగ్గా వినియోగించుకోగలిగితే , మన రాష్ట్రం యావత్తు సస్యశ్యామలమై , మనకు ఎప్పటికీ ఆహారధాన్యాల కొరతే లేకుండాపోతుంది . 12 . తెలంగాణ ప్రాంతంలో కొన్ని చోట్ల సంవత్సరానికి ఒక పంట చొప్పున , అతి తక్కువ ప్రాంతంలో రెండు పంటల చొప్పున పండిస్తున్నారు గానీ , ఎక్కువ భూమి మాత్రం సాగులోకి రాకుండాపోతుంది . 13 . తెలంగాణా ప్రాంతంలో , తెలంగాణా ఉద్యోగుల వాటా గురించి 1986 లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్ . టి . రామారావు ' 610 జి . ఓ . ' జారీ చేసినా , ఇంతవరకూ అమలుకు నోచుకోకపోవడం తెలంగాణా పట్ల ఆంధ్రా నేతల పక్షపాత ధోరణికి నిదర్శనం . 14 . మహబూబ్ నగర్ జిల్లాలోని కరువు , కాటాకాల నుంచి తట్టుకోలేక 33 శాతం ప్రజలు బ్రతుకు తెరువు కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు . 15 . కృష్ణా , గుంటూర్ , కడప జిల్లాలలో 25 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు వుండగా , రంగారెడ్డి జిల్లాలో ఒక్క కాలేజ్ కూడా లేకపోవటం వింతేమీ కాదు . 16 . ఆంధ్ర ప్రదేశ్ డైరీ డవలప్ మెంట్ కార్పోరేషన్ రాష్ట్రంలోని రైతుల నుంచి పాలను కొనుగోలు చేస్తుంది . ప్రభుత్వం ఆంధ్రా ప్రాంతంలో లీటరుకు రూ . 24 / - చెల్లిస్తూ , తెలంగాణా ప్రాంతంలో అదే లీటరుకు రూ . 22 / - చెల్లించడం ఏ రకంగా పాడి అవుతుంది . ? ? 17 . తెలంగాణాలో ఒక్క ప్రొజక్ట్ కూడా పూర్తిస్థాయిలో నిర్మాణానికి నొచుకోలేదు . ఆంధ్రా , రాయలసీమలలో ప్రొజక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తవుతున్నాయి .
ఇంక ప్రకాశ్ జీవితాంతం నా కండ్లల్ల కదులుతనే వుంటడు . వాణ్ణి నేనెట్ల మరవను ? ఆ రోజు నా కళ్ల ముందు అంజలీ టాకీస్ చౌరస్తాల నేను ప్రత్యక్షంగ చూసిన మరో దుర్ఘటనను వివరించి ఈ లెటర్ ముగిస్త . ఆ రోజు కాల్పులు జరుగుతున్నప్పుడు సాయంత్రం బజారుకు వచ్చిన అమాయక స్త్రీలందరూ ఆ కాల్పులు , అల్లర్లల్ల చిక్కుకొని , గోడుగోడున ఏడుస్తున్నరు . వారిని ఎట్లన్న రక్షించాలని రాములు అనే 24 ఏళ్ల యువకుడు సాహసంతోటి ముందుకు ఉరకగా పోలీసుల తుపాకీ గుండ్లకు బలియై అక్కడికక్కడే నేలకొరిగినాడు . అతను పాన్ బజార్ నివాసి . సాహసపు సమక్షంల మృత్యువు ఒక లెక్కలకు రాదని నిరూపించి ఊపిరి వదిలినాడు . నా బాధను పంచుకోవటానికే ఈ ఉత్తరం నీకు రాస్తున్న . యాదగిరికి కూడా ఈ దుర్వార్తను చేరవేయగలవు .
ఓ దివ్య వినూత్న జ్యోతి , ఓ స్వరరాగ సుధా మధుర వాణి , ఓ సులలిత సాంగత్య ఝరి అమ్మఒడి . . విచిత్రం కలిసి నా సంకట విరోధికి స్వాగతాలు పలికారు . . ఆడపడచులకు ధన్యవాదాలు . ముగురమ్మలకు ముక్కోటి ప్రణామాలు
ఈ సినిమాలో చివరి సన్నివేశం తో పాటు మయ సభ , హిడింబ పాట ఇలాంటివి తలచుకున్నప్పుడు ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్ , ఆర్ట్ దర్శకుడు కె . వి . రాజు గార్లను మెచ్చుకోకుండా ఉండలేము . ముఖ్యంగా రాజసూయం చివరిలో పురుషసూక్తం వినిపిస్తున్నప్పుడు తీసిన దృశ్యాలు దైవం ఒక ఘటనలోకి వచ్చినప్పుడు ఇలా ఉంటుందేమో అనిపించేలా చిత్రీకరించారు .
" అయ్యో పదెకరాలు . అందులో ఏం పండుతుంది . ఏం తింటారు . " అన్నాడు
ర్థవాహాల సామాజిక బాధ్యత ( Social responsibility of the corporates ) అనేది ఈమధ్యకాలంలో బాగా ప్రచారంలోకొచ్చిన పదబంధం . దీనికి చాలా అర్థాలున్నప్పటికీ ఎక్కువమంది వాడుతున్న అర్థం - వ్యాపార సంస్థలు తమ లాభాల్లోంచి కొంత తీసి సమాజానికి సదుపాయాలు కల్పించే నిమిత్తం వ్యయపఱచాలని ! అంటే వారు తమ ఖర్చుతో స్థానికంగా రోడ్లు వేయడం , బళ్ళు నెలకొల్పడం , ఉద్యానవనాల్నీ , ట్రాఫిక్ ఐల్లెండ్లనీ , రోడ్డు పక్కని మొక్కల్నీ నిర్వహించడం , పేదవారికి ఉచితంగా ఏవో వస్తువుల్ని అడపాదడపా అందించడం గట్రా ! ఇతర అర్థాల్ని పట్టించుకునేవారు సకృత్తు . పర్యావరణానికి భంగం కలక్కుండా , దేశచట్టాలను ఉల్లంఘించకుండా , ఉద్యోగుల ఆరోగ్యాన్నీ , కుటుంబజీవితాన్నీ దెబ్బదీయకుండా , రాజకీయాల్లో వేలు పెట్టకుండా వ్యాపారం చేసుకోవడం మొదలైనవి కూడా సార్థవాహాల సామాజిక బాధ్యతల కిందికే వస్తాయి . అయితే ఈ కడపటివన్నీ మఱుగున పడి పైన చెప్పిన ధర్మసత్రపు కార్యక్రమాలే వాటి సామాజిక బాధ్యతలుగా ప్రచారంలోకి రావడం , ఉద్ద్యోతించ బడడం దేని మూలాన ? అంటే " మన మనస్తత్త్వంలో పాతుకుపోయిన నిరంతర భిక్షాటన ధోరణి మూలాన , మధ్యతరగతివాళ్ళమైన మనలో స్వయంగా ఏ సామాజిక కార్యకలాపానికీ చొఱవ లేకపోవడం మూలాన " అనాల్సి ఉంటుంది . దీనికున్న మఱో కోణం - మన సమాజం కాస్తో కూస్తో ఉన్నవాడి మీద తనకు తెలియకుండానే ఎంతెంత గొప్ప ఆశల పందిరిని అల్లుకుంటుందనేది . అతని దగ్గఱున్న డబ్బులో కనీసం ఒక వెయ్యో వంతైనా తమకు ఊరికే దానం చేసేస్తే తమ అవసరాలన్నీ తీఱిపోతాయి గదా అని చాలామంది ఆలోచన . అంతేతప్ప అతను అలా దానం చేస్తే అందుకోవడానికి తమకున్న అర్హత ఏంటని ఆలోచించరు . అతను ఇప్పుడో , ఇంతకు ముందో ఎన్ని అర్హతల్ని సంపాదిస్తే ఆ డబ్బు అతని దగ్గఱికొచ్చి చేఱిందో అదీ సవిమర్శంగా ఆలోచించరు .
సకల జనావళికి శుభం కలగాలని ఆశిస్తూ . . . జయ జయ జయహే . . . జైహింద్
' లవ్ ఆజ్ కల్ ' హిందీ చిత్రం ఆధారంగా పవన్ కళ్యాణ్ తో జయంత్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ' లవ్ లీ ' కి ఇబ్బంది ఏర్పడింది . సిద్దార్థ హీరోగా ఇటీవల విడుదలైన ' బావ ' లో ' లవ్ ఆజ్ కల్ ' నుండి ప్రధానమైన అంశాలు కాపీ చేశారు . . . .
వాస్తవానికి మార్క్సిజం గొప్పతనం గురించి చెప్పడానికి మాత్రమే ఆవిడ అలా రాశారని గమనించాలి . మార్క్సిజంతో పరిచయం లేకపోయినా అభ్యుదయంగా ఆలోచించేవారూ , మంచి భర్తగా , మంచి భార్యగా , మంచి డాక్టర్ గా , ఇంకా మంచి " ___ " గా ఉన్నవారు , ఉంటున్నవారు చాలామంది ఉన్నారు . ఆ అభ్యుదయ భావాలు , మంచితనానికి మార్క్సిజానికి సంబంధించిన అవగాహన కూడా తోడయితే అటువంటి మంచివారూ , అభ్యుదయ కాముకులూ తన కుటుంబమూ , స్నేహితులతో పాటు సమాజానికి కూడా మరింత ప్రతిభావంతంగా ఉపయోగపడతారని రంగనాయకమ్మగారు ( ఆ మాట కొస్తే మార్క్సిజం చదివినవారు ఎవరైనా సరే ) చెప్పదలుచుకున్నారని గమనించాలి .
ప్రతి చరిత్ర పుస్తకానికి ఇలా వాళ్ళు చెప్పిన మూలగ్రంథాల గురించి ఒక ముందుమాట రాస్తే ఎంత బాగుంటుందో !
అయితే ఇప్పుడు ఆ ప్రోగ్రామును ఆ కంప్యూటర్లో RUN ఎలా చెయ్యాలి . రావు ఎప్పుడు మాతోనే వుండేవాడు . బయటకు వెళితే పాస్‍వర్డ్ మార్చేసి చక్కా పోయేవాడు . కాబట్టి ఒక మంచి అవకాశం కోసం సిద్ధంగా వుండే వాళ్లం . ఒక మంచి ముహూర్తాన ఎందుకో చేస్తున్న పని మధ్యలో రావు గారికి ఇంటి నుంచి ఫోన్ కాల్ వచ్చింది , దాని కోసం అతను ఓనరు గారి పోర్షన్ లోనికి వెళ్ళాడు . దొరికిందిరా ఛాన్సు అని మా ఫ్లాపీ పెట్టి ఆ ప్రోగ్రామ్ ని రన్ చేసాం . టెన్షన్ గా వుంది … అసలు వర్కవుట్ అవుతుందో లేదో అని . ఒక మా వాడి మీద నాకు డౌటు . అసలు ఈ ప్రోగ్రామ్ పని చేస్తుందా లేదా అని . మొత్తానికి ఒక సెకండ్లో RUN అయింది . కానీ ఏమీ జరగ లేదు . అంతా నార్మల్ గా వుంది . Password పోయే వుంటుందని మా ఫ్లాపీ తీసేసి బుద్ధిమంతుల్లా కూర్చున్నాం . ఆ రోజు మా అదృష్టం వలన అతడు మాకు పాస్‍వర్డ్ చెప్పలేదు . మేం చచ్చినా అడగలేదు . అడిగితే ఎక్కడ మరలా కొత్త పాస్‍వర్డ్ పెడతాడో అని భయం : - ) … . . మొత్తానికి మరుసటి రోజు అతను కాలేజీకి వెళ్ళాక మేం కంప్యూటర్ ఆన్ చేసాం .
ఐదో దెబ్బ వేయకముందే గింగిరాలు తిరుగుతూ వచ్చి తగిలింది వారుణి విసిరిన బండరాయి .
SIMD : Single Instruction / Multiple Data అనే పదానికి సంక్షిప్త రూపమిది . వేర్వేరు సమాచారంపై ఒకే ఆపరేషన్లను నిర్వహించే పారలల్ ప్రాసెసర్ ని SIMD పేరుతో పిలుస్తుంటారు .
నా పేరు రాజ నా పుట్టిన తేది 31 - 08 - 78వ సంవత్సరం , ప్లెస్ : పిటాపురం ( ఈస్ట్ గోదావరి ) సమయం : 08 . 45am , నా భవిష్యత్ మరియు నా చదువు గురించి చెప్పండి
అనగా అనగా . . . . . ఒకవూరిలో ఓ పెద్ద మోతుబరి కుటుంబం ఉండేది . తరతరాలుగా ఉమ్మడి కుటుంబం . తాతలు తరం , తండ్రుల తరంతో వెరసి అప్పటికి ఆ కుటుంబంలో 30 మంది దాకా పెద్దవాళ్ళు , 50 మంది దాకా పిల్లవాళ్ళు , గొడ్డూ గోదా , పిల్లా మేకా , పాడిపంట ! పెద్దలోగిలిలో అంతా కలిసే ఉంటారు . అత్తలూ , కోడళ్ళూ అంతా సఖ్యంగా , తోబుట్టువులూ , దాయాదులూ సమైక్యంగా పనులు చేసుకుంటూ సుఖంగా ఉండే వాళ్ళూ . పాడీపంట ఎక్కువే , పిల్ల సైన్యమూ ఎక్కువే కావటంతో వాళ్ళ ఇంట్లో ఎలుకల బాధ మెండుగా ఉండేది . దాంతో పదిపన్నెండు పిల్లుల్ని పెంచేవాళ్ళు . రోజూ పిల్లలతో పాటే ఉదయాన్నే పిల్లులకి కూడా పాలబువ్వా , పెరుగన్నమూ పెట్టేవాళ్ళు . అయితే పండగ రోజున మాత్రం దైవ పూజ అయ్యేదాకా పిల్లలకి కూడా ఏమీ పెట్టరు గదా ! అసలే ఆ రోజుల్లో ఆచారాలు గట్టిగా పాంటించే వాళ్ళయ్యె ! పిల్లలు పెద్దలకి భయపడో , దేవుడి మీద భక్తితోనో ఓర్చుకొనేవాళ్ళు . కానీ పిల్లులు మాత్రం ఆడవాళ్ళ కాళ్ళకి చుట్టుకుంటూ పనులు చేసుకోనివ్వకుండా ' మియ్యాం ' అంటూ వెంటపడేవి . దాంతో పూజయ్యే దాకా పిల్లుల్ని గంపక్రింద కప్పెట్టటం చేసేవాళ్ళు . రాను రాను అదో ఆచారం లాగా పండగ రోజు ఉదయాన్నే పిల్లుల్ని గంపక్రింద కప్పెట్టి పూజ పూర్తయ్యాక విడిచిపెట్టటం చేసేవాళ్ళు . దాంతో వాళ్ళది పిల్లిగంపల వంశం అనే సార్ధక నామం ఏర్పడింది . కాలం గడిచింది . రోజులు మారాయి . ఉమ్మడి కుటుంబం , చిన్న [ న్యూక్లియర్ ] కుటుంబాలయ్యింది . తర్వాతి తరాల్లో ఓ కుటుంబం ముంబాయి అపార్ట్ మెంట్లులో కాపురముంటూ కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగం చేసుకుంటూ బ్రతికేస్తుంది . కానీ తమ ఆచారం ప్రకారం పండగ నాడు పిల్లుల్ని వెదుక్కొచ్చి , గంపల తెచ్చి కప్పిపెట్టటం అంటే చచ్చే చావయ్యిందిట . గంపలు కొని , పండగలయ్యాక పదిలంగా అటకల మీద ఉంచటం , పిల్లుల్ని వెదకటం - ఓహ్ ! భీభత్సం ! చివరకి తెలిసిన వాళ్ళ ' పెట్ ' పిల్లుల్ని అరువు తెచ్చుకోవటం , పిల్లుల్ని పెంచే వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం లాంటి నానా యాతనలూ పడ్డారట . పిల్లుల్ని పెంచుదామంటే భార్యభర్తలిద్దరు ఉద్యోగం చేసే చోట దాన్ని పదిలంగా పెంచనూ లేరు , పోనీ పెంచుదామన్నా అది ప్రక్క వారి అపార్ట్ మెంట్లో ఏదైనా గల్లంతు చేసిందంటే ఆ ' న్యూసెన్సూ ' ' నాన్ సెన్సు ' భరించటం కష్టం . ఇదంతా చెప్పుకొని సదరు గృహస్తూ నిట్టూర్చాడట . ఇదీ కథ ! [ ఈ పిట్టకథ నేను డి . వి . నరసరాజు గారు ఒక రాజకీయ వ్యాసంలో వ్రాయగా చదివాను ] ఆనాడు అవసరం నుండి ఆచారం పుట్టింది . ఆలోచన లేని ఆచరణ ఈ రోజు ఆచారం పేరిట విచారం పుట్టిస్తోంది . లోపం ఎక్కడుంది ? నిశ్చయంగా ` అనాలోచన ' లోనే కదా ? అనాలోచనకి తర్వాతి పరిణామం మూర్ఖత్వమే . మరో కమ్మని కథ కోసం వేచి చూడండి .
త్రివిక్రమ్ అని రాసి చదువరి గారి బ్లాగుకి లంకె ఇచ్చినారే ?
లిటిల్ మాస్టర్ , క్రికెట్ ప్రపంచ రారాజు మన సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు ఈ రోజు . ఏప్రిల్ 24 , 1973 లో జన్మించారు . 37 ఏళ్ళు నిండిన ఎక్కడ తగ్గని స్పీడ్ తో ప్రత్యర్థి గుండెల్లో గుబులు పుట్టిస్తూనే యువ క్రికెటర్లు ఆశ్చర్య పడే రీతిలో ఇప్పటికి మైదానంలో తన విలక్షణమైన బ్యాటింగ్ తో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తున్న మన లిటిల్ మాస్టర్ ఇప్పుడున్న క్రికెటర్లలో ఎవరికీ అందనంత ఎత్తులో వున్నాడు . ఇక రికార్డ్స్ సృష్టించడంలో [ . . . ]
ఓ మనసా ! దుష్ట వాసనలకును , కామములకును చోటు నొసగకుము , పాపబుధ్ధులను వదులుము . నీతియు ధర్మమును వదలక నెల్లప్పుడు అంతరంగమున సదాచార విచారము చేయుచుండుము .
ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం గమనించారా ! ! ఈ ఐదు symbols కూడా హిందీ అక్షరం ' ర ' కి different variants .
పక్కింటికి యేదోపని మీద వచ్చిన సూ ఋ సంస్థ ప్రతినిధిని ఓ అరగంటసేపు నిలబెట్టి , మాక్కూడా అప్పిస్తారా ? అని అడిగి , వాయిదా కన్నా యెక్కువ కట్టెయ్యచ్చుకదా ? మా బరువే తీరిపోతుంది కదా ! వడ్డీ యెంతైనా పరవాలేదు - - కట్టేసేవాళ్ళం మాకేమిటి ! పదో తారీకు దాకా అఖ్ఖర్లేదు - - ఒకటో తారీకు కల్లా కట్టేస్తాం , మరి వెంటనే పని అయిపోతుందా ? అని , రేషన్ కార్డూ , వోటరు కార్డూ జెరాక్సులు తీసుకొని , బ్యాంకులో యెకవుంటు తెరిచి , చెక్కుబుక్కు ఇచ్చేదాకా బ్యాంకువాళ్లని విషయించి , అది పట్టుకొని సూ ఋ సంస్థ దగ్గరకి వెళ్లి , సంతకాలు చేసేసి , వాళ్లిచ్చిన చెక్కు పట్టుకొని మళ్లీ బ్యాంకుకి వచ్చి , మార్చుకొని ఋణం సొమ్ముని అనుభవించడం యెందుకు ?
చాలా బాగా రాసారు . నా చిన్నతనపు రోజులు గుర్తుకి వస్తున్నాయి . సందర్భం వచ్చింది కనుక ( రేపే వరలక్ష్మి వ్రతం ) చెబుతున్నాను . నా చిన్నపుడు , శ్రావణ శుక్రవారం - వరలక్ష్మి వ్రతం చేసుకున్నాక సాయంకాలం చుట్టుపక్కల ఉండే అందరు ఆడవారిని పేరంటానికి పిలవటం నా వంతు . ఆ పని కోసం మధ్యాహ్నం బయలుదేరి ఒక్కో ఇంటికి వెళ్లి కబుర్లు చెప్తూ ఉంటే సాయంకాలం అక్కడే అయిపోయేది . నా కోసం చూసీ చూసీ , మా అమ్మే అన్ని మిగతా పనులు సగం పైనే చేసుకునేది . ఆ తరువాత ఆలస్యంగా మా ఇంటికి వచ్చి మా అమ్మ తో చచ్చే తిట్లు తినడం అస్సలు మరిచిపోలేను . ఇప్పుడు ఈ పండగకి అన్నీ నేనే చేసుకుంటూ ఉంటే . . . ఆడపిల్ల ఉంటే ఎంత బాగుండును . . . అనుకుంటూ ఉంటాను . ప్రతి ఒక్కరికీ చిన్నతనాన్ని గుర్తు చేసినందుకు చాలా ధన్యవాదాలు .
పగలు జర్నీలో మన రాష్ట్ర సరిహద్దుల్లో యెక్కడో ఒక ముసలవ్వ ( కనీసం 60 యేళ్లు వుంటాయి ) యెక్కింది - - ఓ పెద్ద బుట్టని ఇద్దరు మగాళ్లు మోసుకొచ్చి , యెక్కించగా . ఆబుట్టలో ఓ ఐదారు వందల కమలాఫలాలు ( సంత్రాలు ) వుంటాయి - - రకరకాల సైజుల్లో , రకరకాల ' పండిన ' స్థితుల్లో . చాకచక్యంగా వాటిని - - ఒకే సైజువి , బాగా పండినవి కొన్నీ , కొంచెం తక్కువ పండినవి కొన్నీ - - ఇలా వేరే ప్లాస్టిక్ కవర్లలో ఓ ఐదేసి చొప్పున సర్దేసి , పట్టుకొచ్చి , " బాబూ ! సంత్రాలు ! ఇరవై రూపాయలకే ! " అంటూ అమ్మొచ్చింది . అప్పటికి ఓ రాత్రీ , ప్రొద్దున్నా ప్రయాణం చేసి , ప్యాంట్రీ కార్ వాడు పెట్టిన టిఫిన్లు తినీ , కాఫీ టీలు తాగీ , జిహ్వ చచ్చిపోయి వున్నారేమో - - అందరూ కొనేశారు . మళ్లీ ఆవిడ రెండో రవుండ్ తిరగడం , మళ్లీ అందరూ కొనెయ్యడం ! మధ్యాహ్న భోజనాలు అయ్యాక కొంత గేప్ . మళ్లీ ఆవిడ , కొంచెం పెద్ద సైజు పళ్లనీ , కొంచెం తక్కువ పండిన వాటినీ ఐదేసి చొప్పున పట్టుకొచ్చి , " బాబూ ! సంత్రాలు ! 15 రూపాయలకే ! " అంటూ వస్తే , మళ్లీ అందరూ . . . . . . హాం ఫట్ ! సాయంత్రం 4 గంటలకల్లా బుట్ట ఖాళీ చేసుకొని , డబ్బులని రొండిలో దోపుకొని , దిగి వెళ్లిపోయిందామె ! నిజంగా , ఆ వయసులో ఆమె కష్టానికీ , తెలివికీ తగిన ఫలితం వచ్చిందా . . . . . . . అంటే . . . . . యేమో ! ఆ పైవాడికే తెలియాలి !
మొదటి వాక్యం నుంచి చివరి వాక్యం వరకూ కథా , కథాంశం అన్న తీగ మీదనే నడవాలి . " పులి తరుముకొస్తున్న వాడు తాను ఎక్కదలుచుకొన్న చెట్టు దగ్గరకి ఎలా పరిగెడతాడో , అలా కథకుడు సూటిగా తన కథాంశం వద్దకు పరిగెట్టాలి " అంటాడు H . G . Wells . అనుభూతి ఐక్యత సాధించడానికి ప్రధానంగా రెండు మార్గాలు . 1 . ఒకే సంఘటనకు పరిమితంగా పాత్రను చిత్రించడం . అంటే కథలో ఒకే పాత్ర , ఒకే సంఘటన ఉండాలని కాదు . కథాంశం ఒకే సంఘటనలో వెలగాలి . 2 . రచయిత ఎన్నుకున్న ప్రధాన సంఘటన , పాత్రలో గుణాత్మకమైన మార్పుకు కారణభూత మయ్యేదిగా ఉండాలి .
యూనియన్ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక విద్యా పధకంలో జోనల్ డైరెక్ట్టర్‌గా పనిచేస్తూ 1988లో పదవీ విరమణ చేసిన తాను ఈ పిహెచ్‌డి సాధించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ . . . తన 50 ఏళ్ల టీచింగ్ ప్రొఫషన్ ఓ కారణమైతే . . ఉద్యోగులు , కార్మికులు తాము అందించిన అనుభవాలు కూడా మరో కారణంగా చెప్పారాయన . వయస్సు పరంగా వచ్చే ఆరోగ్య సమస్యలు తనని వేధిస్తున్నా పిహెచ్‌డి సాధించాలన్న తపనతోనే దీన్ని సవాల్‌గా తీసుకుని తాను చేసిన కృషి ఫలించినందుకు ఆనందంగా ఉందన్నారు . ఏళ్ల తరబడి ఈ డాక్ట్టరేట్ కోసం తాను శ్రమించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని అయినా వాటిని అధిగమించానని చెప్పుకొచ్చారు .
ఇవ్వాళ , ఈ మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు : 1 . ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిషేధించాలి . 2 . విద్యాసంస్థలు ప్రకటనలు జారీ చేయరాదు . 3 . హెల్మెట్లు తప్పనిసరి . 4 . సీటు బెల్టులు తప్పనిసరి . 5 . వాహనం నడుపుతూ సెల్‌ఫోన్లో మాట్లాడితే వెయ్యి రూపాయల జరిమానా . ఇవన్నీ రాష్ట్రప్రభుత్వం చెయ్యాల్సిన పనులు . మరి , వారేం చేస్తున్నట్లో ! ?
వనజాక్షోపము వామలూరుతనయున్ ద్వైపాయనున్ భట్టబా ణుని భాసున్ భవభూతి భారవి సుబంధున్ బిల్హణుం కాళిదా సుని మాఘున్ శివభద్రు మల్హణకవిం చోరున్ మురారిన్ మయూ రుని సౌమిల్లిని దండి ప్రస్తుతుల పేర్కొంచున్ వచశ్శుద్ధికిన్
ఉద్యమం అంత ఉద్ధృతంగా సాగినా ఫలితాన్ని సాధించడంలో ఎందుకు విఫలం అవుతోంది ? అసలు ప్రత్యేక తెలంగాణ సాధనకు గల అడ్డంకులేమిటో ఒకసారి పరిశీలిద్దాం . తరచి తరచి చూస్తే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ బలమే దానికి బలహీనతగా పరిణమించిందని అర్థమవుతుంది . కెసిఆర్‌పై అధికంగా ఆధారపడటం ఉద్యమ గమనానికి ఎంతఅవసరమైందో , లక్ష్యసాధన లో అంతే అడ్డంకిగా నిల్చింది . కారణాలు విశ్లేషిద్దాం .
గత వారంలో ఉత్తర అమెరికా అంతర్జాతీయ కార్ల ప్రదర్శన జరిగింది డెట్రాయిట్లో . 2008లో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నేపథ్యంగా , పెద్ద కార్ల కంపెనీలన్నీ ఇబ్బందుల్లో కూరుకు పోయిన సందర్భంలో 2009 జనవరిలో జరిగిన ప్రదర్శన చాలా కృశించిపోయింది . నిస్సాన్ వంటి కంపెనీలు ప్రదర్శనలో పాల్గొనలేదు . సందర్శకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది . మొత్తం ప్రదర్శన మీద ఒక నిరాశాపూరిత వాతావరణం నెలకొని ఉంది . 2009లో జెనెరల్ మోటర్స్ , క్రైస్లరు కంపెనీలు దివాలా కోర్టులోంచి బయట పడ్డం , కేష్ ఫర్ క్లంకర్స్ ప్రోగ్రాము ఇచ్చిన ఊతం , అమెరికాలోనూ ఇతరత్రా ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతున్న సూచనలు - అన్నీ కలిసి ఈ సంవత్సరం డెట్రాయిట్ ప్రదర్శన కొత్త ఆశల్ని చిగురించిందనే చెప్పుకోవాలి . ప్రదర్శనలో ప్రవేశించగానే ఎదురుగా కనులని ఆకట్టుకునేవి BMW , Audi , Mini Cooper వారి ప్రదర్శనలు . ఈ జెర్మను కంపెనీలు ఎప్పటికప్పుడు గొప్ప ఇంజనీరింగ్ పనితనం కలిగిన కొత్త కొత్త కార్లను మార్కెట్లో విడుదల చేస్తుంటాయి . సరికొత్త Audi స్పోర్ట్స్ కార్ చక్కటి డిజైనుతో పలువురు ప్రేక్షకుల చూపుల్ని ఆకట్టుకుంది . అలాగే Mini Cooper విడుదల చేసిన కన్వెర్టిబుల్ కూడా చాలా మంది అభిమానుల్ని మూటకట్టుకుంది . ముందుకి సాగితే Volvo వారి కార్నర్లో హైబ్రిడ్ టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్న సూచనలు కనబడ్డాయి . హైబ్రిడ్ టెక్నాలజీతో నడిచే కొత్తకార్లని ప్రదర్శించడమే కాకుండా ఆ టెక్నాలజీ లోని అంశాలని అందరికీ అర్ధమయ్యే రీతిలో వివరిస్తూ కొన్ని ఇంజను , గేర్‌బాక్సు మోడల్సుని కూడ ప్రదర్శించారు . ఇవే కాక యూరప్‌లో చాలా పాపులర్ అయిన క్లీన్ డీజిల్ టెక్నాలజీలని కూడా ప్రదర్శించారు . ఇక్కణ్ణించి కుడి పక్కకి తిరిగితే , అక్కడ హాలు నడిమధ్యలో క్రైస్లరు వాళ్ళ ప్రదర్శన ఉంది . ఒకే ఒక్క కొత్త కాన్సెప్టు కారు ఆవిష్కరించారు . మిగతావన్నీ 2010 , 2011 లలో విడుదల కానున్న పేసింజరు వేన్ , సెడాన్ కార్లనే ఎక్కువగా ప్రదర్శించారు . జెనెరల్ మోటర్స్ వారు అతి పెద్ద స్థలాన్ని ఆక్రమించి బ్రహ్మాండమైన ప్రదర్శన ఏర్పాతు చేశారు . రానున్న Buick , GMC , Chevrolet , Cadillac బ్రాండ్లలో అనేక వాహనాల్ని ప్రదర్శించారు . చూపులకి అన్నీ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి . వాటిల్లో పొందుపరిచిన టెక్నాలజీలు కూడా ప్రేక్షకుల్ని బాగానే అకర్షిస్తున్నాయి . ఇవి విడుదలైనాక ఎంతవరకూ మార్కెట్లో విజయం సాధిస్తాయో వేచి చూడవలసిందే . GM ప్రదర్శనలో ఏదైనా వాహనానికి మా చక్రాలు కనబ డతాయేమోనని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూశాను . నా నమ్మకం వమ్ము కాలేదు . ఒక చక్కటి ఎర్రరంగు సిల్వరేడో ట్రక్కుమీద మా క్రోం చక్రాలు ధగధగా మెరుస్తున్నాయి . మిగిలిన వాటిలో ఫోర్డు , టొయొటా కంపెనీల ప్రదర్శనలు అతి పెద్దగా ఉన్నాయి . ఫోర్డు వారు తమ స్థలంలో చాలా విషయాల్ని ప్రదర్శించ ప్రయత్నించడంతో అదంతా చాలా ఇరుగ్గా , వత్తిడిగా తయారయ్యి , మేము ఏదీ సరిగ్గా చూడలేకపోయాము . టొయొటా వాళ్ళ స్టాల్‌లో కొత్త టొయొటా , లెక్సస్ బ్రాండ్ వాహనాలు ప్రేక్షకుల్లో చాలా ఉత్సాహం కలిగించాయి . ముఖ్యంగా పూర్తిస్థాయిలో కరంటుతో నడిచే చిన్న కారు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది . మనకు సాధారణంగా కనబడని వినబడని అతి ఖరీదైన కార్లు . . ఫెర్రారి , టెస్లా , మాసరాటి , లోటస్ ఇత్యాది కంపెనీలు వారు కూడా అక్కడక్కడా ఒక్కొక్క కారుని ప్రదర్శించారు . ఈ కార్లు ఒక్కొక్కటీ కొన్ని లక్షల డాలర్ల ఖరీదు చేస్తాయి . మొత్తమ్మీద ఈ సంవత్సరపు కార్ల ప్రదర్శన డెట్రాయిట్‌లో ఒక కొత్త ఆశని చిగురింపచేసిందని చెప్పుకోవచ్చు .
గురూ గారూ , అచ్చంగా ఒకే పదంలో అర్ధం చెప్పడం నాకు సరిగ్గా రాదు . కానీ , ఏ అర్ధంలో వాడతారో తెలుసు నాకు . మీరడిగిన పదాలతో సొంతవాక్యాలు రాసే ప్రయత్నం చేస్తున్నా ! 1 . పరవళ్ళు - గోదావరి పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది . కొన్ని సినిమా పాటల్లో కూడా ' పరవళ్ళు తొక్కే వయసు ' లాంటి ప్రయోగాలు చేస్తుంటారు . 2 . పొదుగు - కోడి పిల్లల్ని పొదుగుతుంది / ఆవు పొదుగు నుండి పాలు పిండుతారు . 3 . అనువు - వీలు - అనువుగాని చోట అధికులమనరాదు పద్యం ఉందిగా ! 4 . వేకువ - తెల్లవారుజామున 5 . మేలం - మేలమాడటం - ఆట పట్టించడం .
రావుకర్ధం కాలేదు . డబ్బులిస్తూంటే వాళ్ళు తననే చూ సూండడం గమనించి ఇబ్బంది పడ్డాడు . ఎంత
విద్యార్థినీ , విద్యార్థుల మిశ్రమ స్వరాలు కోటికోటి కంఠ కలకల నాదాలలా ప్రతి ధ్వనిస్తున్నాయి .
మనమనుకునేవి అవతలి వాళ్ళు అర్ధం చేసుకోవట్లేదని బాధపడతాం కానీ అదే సమయంలో ఆ వ్యక్తి దేనిగురించి బాధపడుతున్నాడో అనే కనీస ఆలోచన కూడా రాదుకదా ! అదే మనిషిలో ఉన్న మంచి విషయాల్ని చాలా కన్వీనియెంట్ గా స్వీకరించేస్తాం కానీ లోపాల్ని మాత్రం ప్రత్యేకంగా గమనిస్తూ మితిమీరిన గుర్తింపునిస్తూ ఉంటాం ఎన్నోసందర్భాల్లో .
గోసిగుడ్డ సెంగుల్లో … రాలిన పరిగె గింజల్ని ఏరుకో తిరుగాడిన మట్టిలో పరాయితనపు వెక్కిరింపు నేలలోకి పాతుకున్న దర్భగడ్డిలాంటి కాళ్ళు గునపాలతో తొలగిస్తున్న ఆనవాళ్ళు సతలేని బతుకుదోవ సాలుదప్పిన శిరస్త !
ఇతర ప్రమాదాలు బాహ్య శబ్దాల గురించి అవగాహనను తగ్గించడం వల్ల ఏర్పడుతున్నాయి . కొన్ని పరిధుల్లో హెడ్‌ఫోన్స్ యొక్క ఉపయోగాన్ని వాహనాలు నడిపే సమయంలో నిషేధించారు . సాధారణంగా ఒక చెవికే ఇయర్‌ఫోన్ ఉండాలని కొన్ని ఆంక్షలు ఉన్నాయి . బయటి శబ్దం యొక్క పూర్తి ఐసోలేషన్ ప్రమాదకరమైనది . దీనివల్ల వినియోగదారుడు ఒక కార్ హారన్‌ను లేదా ట్రాఫిక్‌లో ఎదురయ్యే అవాంతరాలను గమనించలేకపోవచ్చు . పరిస్థితుల పై అవగాహనను కోల్పోవడం వల్ల దొంగతనాలు కూడా జరగొచ్చు . ముఖ్యంగా రద్దీగా ఉండే వాతావరణాల్లో మరో వ్యక్తికి తగులుతున్న విషయం కూడా గమనించకపోవచ్చు ; ఉదాహరణకు సబ్‌వే స్టేషన్లు .
గమనిక : పోస్ట్ చదివి బుర్ర గోక్కొని కేశాలు ఊడిన ఎడల మీ తల నొప్పి కి బ్లాగు ఓనర్ మరియు బ్లాగు మేనేజ్ మెంట్ బాధ్యత వహించదు hihihi : )
లక్ష్యం : * వాడకందారు యొక్క కంప్యూటర్‌ని తెలుగుకి ( చదవ మరియు రాయగల్గడానికి ) సిద్ధంచేయడం . ( ఈ ఉపకరణం కొద్దిపాటి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారైనా సులభంగా ఉపయోగించేవిధంగా ఉండాలి . )
" నిశ్శబ్దంలో నీ నవ్వులు " తెలుగు సాహిత్యాన్ని ఒక ఊపు ఊపి పదేళ్ళైన సందర్భంగా పుస్తకం . నెట్లో గరికపాటి పవన్ కుమారు గారి సమీక్ష చూసి ఇటొచ్చా . " అరటితొక్క కాలు జారి పడేవాళ్ళ గురించి ఎదురుచూస్తుంది . అగ్గిపుల్ల బుర్ర మండించే వాళ్ళ గురించి బెదురుచూస్తుంది " అబ్బో . . చదివి తరించాల్సిన కవిత్వమే . అనుమానం లేదు . సమీక్షలో గరికపాటి వారు శెలవిచ్చినట్టు హృదయప్రకంపన కాదు . భూకంపమే !
మనము ఒకటో బాగంలో ఇండెక్స్ డాట్ పీహెచ్ పీ గురించి ఓ లూకేసినాము కదా , ఇప్పుడు దానిలో ఉన్న తోక నుండి వెళ్దాము అదే మన wp - blog - header . php
రేపు తిరూ శంకర్ గారి ప్రశ్నకి సమాధానం అసైన్సు పరంగా ఇస్తాడు .
పత్రికలు చదివే చాలామంది పాఠకులు నాలాగే , ప్రత్యేకవైన భాషా , సాహిత్య పరిఙ్ఞానంలేని సాధారణ పాఠకులే . సాధారణ జీవితం ఇచ్చిన కొద్దిపాటి లోకఙ్ఞానం , పాఠశాలల్లోనో , కళాశాలల్లోనో నేర్చుకున్న కొద్దిపాటి శాస్త్ర పరిశీలనా పరిఙ్ఞానం , ఈ రెండిటి కలబోతలోంచి అలవరచుకున్న కొద్దిపాటి తర్కఙ్ఞానం ఇవే మాకున్న అతి సరళవైన logical skills , నిజాన్నిఅబద్దంలోంచి వేరుచైడానికి , తప్పుని వొప్పులోంచి చెరిపేయడానికి . ఐతే ఈ nascent rational attitude lives along with irrational emotional beliefs about race , language , nationality in our minds . తెలుగు ప్రాచీనత మీద ఆంధ్రజ్యోతి లో వచ్చిన ఆ నాలుగు వ్యాసాలు చదివేక మనసుకెంత ఆనందవేసిందంటే , ఎక్కడో కుర్చోని ఎదో చదువుకుంటున్న నా ఏడో తరగతి కుతుర్ని పిలిచి , చదివి వినిపించి , చుశావా , మన తెలుగు జాతి , తెలుగు భాష గొప్పదనం , ఎప్పుడో సుమేరియన్ నాగరికత కాలంలోనే మన roots వున్నయ్ అని డబ్బా కొట్టి మరీ చెప్పెటంత ఆనందం . తర్వాత మళ్ళా నా కుతురుతో కుర్చోని అ తప్పుని సరి చేసుకోవటం సురేష్ రచన చదివేకే సాధ్యపడింది . ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సురేష్ గారి వ్యాసం ఇంతకుముందు వచ్చిన వ్యాసాలమీద విమర్స లేకుండా వొక్క భాషా శాస్త్రం 101 కే పరిమితవైయ్యుంటే బావుండేది అనే అభిప్రాయం ఈమాట అభిప్రాయాల్లో వ్యక్తం కావటం వలనే . మేవు అతి సాధారణ పాఠకులం , మా బుర్రలో వుండే సవాలక్ష తర్కానికి నిలవని నమ్మకాల్ని తొలగించుకొని , ఎక్కడో , మనసులో ఏ ములో నక్కి నిద్రపోతున్న శాస్త్రియ పరిశీలనని నిద్రలేపాలంటే సురేష్ వ్యాసంలో వున్నటువంటి juxtaposition అవసరవని నా ఉద్దేశం .
లండన్ , జూలై 11 ( వాస్తవం ) : హ్యారీ పోటర్ ' హీరో డ్యానియెల్ రాడ్‌క్లిఫ్ తాను భారత్ క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ వీరాభిమానినని తెలిపాడు . సచిన్ ఇంగ్లండ్ పర్యటనకు వచ్చినప్పుడు కలవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నానని రాడ్ క్లిఫ్ డెయిలి లైఫ్‌కు తెలిపాడు . తన స్నేహితులతో పాటు వెళ్లి సచిన్‌ని కలిసి ఆటోగ్రాఫ్ తీసుకుంటామని అన్నాడు . సచిన్ కలవబోతున్నందుకు ఎంతో థ్రిలింగ్‌గా ఫీల్ అవుతున్నాని తెలిపాడు . అతను నిజమైన దిగ్గజం అన్నాడు . రాడ్ క్లిప్ క్రికెట్‌ను ఫాలో అవుతూ ఉంటాడు . 2011 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా అతడు భారత్ వచ్చాడు . త్వరలోనే భారత్‌ను సందర్శిస్తానని పేర్కొన్నాడు . భారత్ గురించి ఎంతో చదివానన్నాడు . ' మిడ్ నైట్స్ చిల్డ్రన్ ' నవలల ద్వారా భారత్ గురించి చాలా విషయాలు తెలిశాయన్నాడు . తన లాంటి వారు క్రికెట్ అభిమానులు అక్కడ ఎంతో మంది ఉంటారని విన్నానన్నాడు . ఈ బ్రిటీష్ నటుడు తనకు అవకాశం వస్తే బాలీవుడ్ సినిమాల్లో నటిస్తానని , కొన్ని హిందీ సినిమాలు కూడా చుశానని అవి ఎంతో ఎంటర్‌టైన్‌గా ఉన్నాయన్నాడు .
కంప్యూటర్ తో , ఇంటర్నెట్ తో కాస్తో కూస్తో పరిచయం ఉన్నవారందరు ఈలేఖలు రాయటం అనేది తప్పని సరిగా చేసి తీరుతారు . లేక పోయినా ఏదో ఒక రకంగా పదాలను టైప్ చెయ్యటం మాత్రం తప్పించుకోలేరు . రోజూ కంప్యూటర్ తోనే సహవాసం చేసే వాళ్ళకు కీబోర్డు వాడటం బాగానే ఉంటుంది గానీ , వయస్సులో పెద్ద వారికి , వికలాంగులకు ఇది చాలా సంకటంగా ఉంటుంది . ఇక తెలుగులో రాయాలంటే చెప్పాలా ?
అంతవరకూ బాగానే వుంది . తరవాత , " అండా దండా వుండాలని , కోదండా రాముని నమ్ముకుంటే , గుండేలేని ' మనిషల్లే ' నిను కొండా కోనల వదిలేశాడా ? " తో వచ్చింది అసలు చిక్కు . దానికి ఆయన సమర్థన - - రాముడు సీతని వదిలినట్టే , హీరోయిన్ వాళ్లాయన ఆవిణ్ణి వదిలేశాడు . హీరోయేమో , ' చూస్తున్నాడూ పైవాడు ' అని రాబోయే కథని చెప్పేస్తాడు - - ఇలా యేదో ! అందులోనే అరణ్యవాసం వగైరాల ప్రస్థావన ! ( అసలు ఆ సినిమాలో హీరోయిన్ ' వృత్తి ' యేమిటో యెవరైనా " ఠక్కున " చెప్పగలరా ? అది కూడా ఆయన చెపితేనే నాకు తెలిసింది . )
గ్లోబలైజేషన్‌కి వ్యతిరేకంగా భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగనంత చర్చ , ఉద్యమాలు మన రాష్ట్రంలో జరిగాయి . గ్లోబలైజేషన్ ప్రక్రియ ఆగలేదు గాని దాని ఫలితాల పట్ల ఒక అవగాహనని ఈ ఉద్యమాలు ఇవ్వగలిగాయనే అనుకొంటున్నాను . తీరా దాని పరిణామాలు తీవ్రరూపం దాల్చాక , అవి మానవ సంబంధాలను , విలువలను తీవ్రంగా ప్రభావితం చేసే స్థాయికి వెళ్ళాక ఈ విషయంపై మన కథకులెందుకో లోతుల్లోకి వెళ్ళలేకపోతున్నారు .
నేను చదువుకునేటప్పుడు కొన్ని క్లాసుల్లో అయితే భయంకరంగా నిద్రొచ్చేది . అందుకే నాక్లాసుల్లో పిల్లలు నిద్రపోతోంటే ఎక్కువ డిష్టర్బ్ చేయను . కానీ ఒక్కోసారి చెప్పాల్సి వస్తుంది . మాసార్లయితే మొహం కడుక్కురమ్మనేవారు . అదే పధ్ధతనిపించి ఒకఅమ్మాయిని అలాచేయమని చెప్పా . ఎంతకీ వెళ్ళదే . అప్పుడు ఇంకో పిల్ల జ్ఞానోదయం చేసింది - మేకప్ పోతుందని వెళ్ళట్లేదని . : )
నానుడులు , లోకోక్తులు అనదగినటువంటివి , అర్ధం అదే అయినా ఇప్పుడు వేరే మాటలలో ప్రయోగంలో ఉన్నటువంటివి , కొన్నైతే అసలు ప్రయోగంలో లేనటువంటివి , మరికొన్ని వేంకటకవి స్వయంగా సందర్భానికి అతికేట్లుగా కల్పించినట్లు అనిపించేటువంటివి , వేణుగోపాల శతకంలో చాలా కనిపిస్తాయి . వాటిల్లో కొన్నిటిని క్రింద చూపడ మైంది :
మన ఆదికవి నన్నయ వ్రాసిన భారతభాగంలో చాలా రకాల చిన్న వృత్తాల్ని ప్రవేశపెట్టాడు . కాని ఎక్కువగా పెద్ద వృత్తాల్ని పోషించాడు . కవిత్రయం తర్వాత వచ్చిన మన పూర్వ , ముఖ్యంగా ప్రబంధ , కవులు కొల్లేటి చాంటాడంత వర్ణనలు చెయ్యాలనే ఉబలాటంకొద్దీ పెద్ద పెద్ద వృత్తాల్ని ఎంచుకోవడం మొదలు పెట్టారు . ఉత్పలమాల ( చంపకమాల ) , శార్దూలం ( మత్తేభం ) , మత్తకోకిల , స్రగ్ధర , మహాస్రగ్ధర , కవిరాజవిరాజితం , మానిని … ఇలా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు సంస్కృత పదాల్ని సంధిస్తూ . ( వీటిలో ఉత్పల , చంపకమాలలే తెలుగుకి సరైన ఛందాలనిపిస్తాయి . ) దానికి తోడన్నట్లుగా క్లిష్టప్రాసలు , యతులు . ఇవన్నీ సంస్కృత పదాలవల్ల సులభంగా సాధ్యం కాబట్టి వాటిని గుప్పించెయ్యడం . ఈ అలవాటు బాగా ప్రబలి లేదా ముదిరి కందం , సీసం , ఆటవెలది , తేటగీతి లాంటి తేలికైన అందమైన దేశీఛందాలకి కూడా అదేగతి పట్టించారు . కొందరు ప్రబంధ కవుల తేటగీతులకీ , భగవద్గీతలో శ్లోకాలకీ తేడా తెలుసుకోవడం కష్టం .
౧ ) మనకు పిల్లలు పుడితే ఎవ్వరెంతకాలం సాకాలి , సాకినందుకు ఎవ్వరు ఎవ్వరికి ఎంత ఇవ్వాలి
ఇక నా మనసుకి పట్టిన మలినాన్ని ఎప్పటికి అప్పుడు ప్రక్షాళనం చేస్తూ ఉండటం మూడో అంశం . మొన్న ఒక రోజు రోడ్ మీద వెళుతూ ఉంటే ఒక భిక్షగాడు చెయ్యి చాపాడు . నేను ఏగంగా నడుస్తూ ఆ అబ్బాయిని చూసి చూడనట్టు వెల్లిపోతున్నను . పక్కనే ఉన్న మా బాబు - ' అమ్మా , డబ్బులు లేవా ? ' అని అడిగాడు . వాడు అడిగింది చాలా చిన్న ప్రశ్న , కాని నాలో చాలా ఆలోచనలు రేపింది . సహాయం చెయ్యడానికి డబ్బులు ఉంటే చాలు కదా … టైం లేకుండా వెల్లిపోవడం , గమనిచకపోవడం ఇలాంటివన్నీ నిజంగా కారణాలు కాదు కదా … . బాల్యం అంటే దేవుడికి దగ్గరతనం . కల్మషం తెలీని పసితనం కాబట్టి - వాడికి అదొక్కటే రీజన్ తట్టింది . నా దగ్గర డబ్బులు ఉండీ వెయ్యకపోవడానికి వేరే ఏ కారణం అక్కర్లేదు అని అలా వాడు నాకు నేర్పాడు . మరో రోజు తేనె పట్టు కధ చెబుతూ , హనీ ఎలా వస్తుందో అంతా చెప్పాను - తేనె టీగలు పువ్వల నుండీ తెచ్చుకుని పట్టులో పెట్టుకుంటాయి - అప్పుడు మనం తీసి ఇలా బోటిల్ లో పోస్తాం అని చెప్పాను . అక్కడితో నా కధ అయిపోఇంది - కాని వాడు ఇంకా ఉంది అన్నట్టుగా - ' అప్పుడు ? ? … ' అని అడిగాడు , ఇంకేముంది - అంతే అన్నాను . మరి వాటికి థాంక్స్ చెప్పవా అమ్మా అని అడిగాడు . నిజమే కదా , వాటి కష్టం దోచుకోవడం ఏదో మన హక్కులా అనుకుని - అవి మన కోసం పుట్టాయి అన్న భావన్ని ఏర్పరుచుకున్నం . కాని , పసి వాడు కదా , వాడికి ప్రకృతి లో అన్ని ప్రాణులు సమానమే . మా ఇంటి పక్క ఉన్న కుక్క పిల్లలకి పాత బిస్కట్లు వేసి , వాడికి మాత్రం కొత్తగ కొన్నవి ఎందుకు పెడతామొ , మా వాచ్ మేన్ వాళ్ళ బాబుకి వాడికి ఉన్నట్టుగా సైకిల్ ఎందుకు లేదో , చలి వేస్తుంటే కుక్క పిల్లలు దుప్పటి ఎందుకు కప్పుకోవో … ఇవన్నీ వాడి చిన్ని బుర్రకి అందని ఆలోచనలు . మనం పెద్ద అవుతున్న కొద్దీ - అంటే దేవుడి కి , సహజత్వానికి దూరంగా జరుగుతూ ఉంటాం . యాంత్రిక జీవితంలో , మ బాబు మాటలు నన్ను చాల ఆలొచింప చేసి - రోజు రోజు కి మలినం అయిపోతున్న బుర్రని ప్రక్షాళనం చేస్తాయి .
దీని అర్థం త్రిభుజం వైశాల్యం దాని భూమి , ఎత్తుల లబ్దంలో అర్థభాగానికి సమానం .
రెడ్డి కుటుంబీకులు అధికారంలో లేకపోతే పూర్వంలా తినడం కుదరదని భయపడుతున్నవాళ్ళు . దీని కంటే రాజశేఖర రెడ్డి ని నమ్ముకున్నవాల్ల్ల్లూ ఆయన కొడుకుని నమ్ముకున్న వాల్ల్ల్లూ భాదపడు తున్నారు అంటె బాగుండెది అని అనుకుంటున్నాను
పాండ్యదేశంలో సోమశర్మ అనే అతను వుండేవాడు . అతని కొడుకు యజ్ఞశర్మ . ఎంత కష్టపడ్డా అతనికి వేదవిద్యలు ఒక్కముక్క ఒంటపట్టలేదని అతను బాధపడుతుంటే , అది మరిపించటానికి అతని తండ్రి నలుగురు గుణవతుల్ని తెచ్చి అతనికి పెళ్ళిచేశాడు . కోడళ్ళందరికీ ఎన్నో ఆభరణాలు , చీరలు , కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చాడు . చివరి దశలో అతను కొడుకుని పిలిచి , కోడళ్ళకు వినపడేట్టు చెప్పాడు " మన వంశాచారం అన్నదానం . ఎలాటి పరిస్థితుల్లోనైనా దాన్ని ఆపకుండా నడుపు . దాని వల్ల నీకు నాలుగు వేదాల వంటి కొడుకులు కలుగుతారు . నా మాట తప్పదు " అని . " అలాగే " నని మాట యిచ్చాడు కొడుకు .
ఇలా చాలా చాలా మాట్లాడుకున్నాక చివరకు ఎలాగో శిల్పి ప్రాణాలతో అడవిలోకి చేరినాడు .
( వాడి రాజ్యం గురించీ , కూతురి గురించే ఇప్పుడే చెప్పేకన్నా , మీ తలకాయలు భద్రంగా చూసుకోండి అని హెచ్చరిస్తూ , వాటి వివరాలు " రేపు చెపుతాను " అని కోటగోడమీద వ్రాస్తున్నా ! )
జూబా , జూలై 9 ( వాస్తవం ) : ప్రపంచపటంపై కొత్త దేశం అవతరించింది . ఆఫ్రికా దేశం సూడాన్ నుంచి విడిపోయి జూబా రాజధానిగా దక్షిణ సూడాన్ ( రిపబ్లిక్ ఆఫ్ సౌత్ సూడాన్ ) ఏర్పడింది . నేడు ( జూలై 9 ) దక్షిణ సూడాన్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు . ఆ వేడుకలకు భారత్ తరఫున ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ హాజరవుతున్నారు . ' అంతర్జాతీయ సమాజం కృషి ఫలించి కొత్త దేశం అవతరిస్తున్న చారిత్రాత్మక సమయంలో ఆ వేడుకల్లో భారత్ పాల్గొనడం సముచితం ' అని అన్సారీ వ్యాఖ్యానించారు . జూబాలో భారత్ 2007లోనే రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది .
తిరుపతి లో ఒకరు గోవిందా అనగానే వెనక వంద మంది అందుకుంటారు అయాచితం గా … ఇక్కడ , , ఎందుకో గానీ గాయకుడు " kamAn ( 5 ) everybody say it " అని అభ్యర్ధిస్తాడు . . అంత వేంకటేశుడి పై సఖ్యత కలవాడికి మిగతావాళ్లతో పని ఏమీ ? వాళ్లు అంటేనేమి ? అనకపోతేనేమీ ?
@ జాబిల్లి ఎందుకమ్మా ముందు పెట్టిన కామెంట్ తీసేసావు . మన సమస్యని అర్ధం చేసుకోవడం , అధిగమించే ప్రయత్నం చేయడం చాలా మంచిది కదా . నీకు అభినందనలు . @ కమల్ గారూ మీ ఆవేదన సరై ందే . సోషల్ సైన్స్ జీవితానికి ఎంత అవసరమో గత పాలకులు మర్చిపోయారు . పిల్లల్లోని సృజనాత్మకతను అర్ధం చేసుకునే వాళ్ళు లేరు . ఎంసెట్ వేట లో ఏమి కోల్పోతున్నారో అర్థమవ్వడం లేదు . జీవితాన్ని మేనేజ్ చేసుకునే కళ , కళలు , సాహిత్యం అన్నీ కోల్పోతున్నారు . తప్పదండి వాళ్ళ దగ్గరికెళ్ళాల్సిందే , అన్నీ మాట్లాడాల్సిందే . @ లలిత గారు ధన్యవాదాలు . పిల్లల సమాధానాలు నాకూ చెంప పెట్టులా తగిలాయి . ఇక్కద ఓ విషయం చెప్పాలి . ఆ మీటింగ్ అయిపోయిన నాలుగు రోజులకి ఆ కాలేజి నుండి ఇద్దరమ్మాయిలు ఫోన్ చేసి మాట్లాడుతూ , హెల్ప్ లైన్ లో వాళ్ళు స్వచ్చందగా పని చెయ్యడానికి ముందుకొచ్హారు . ఇద్దరూ ఆ తర్వాత నా దగ్గరకొచ్చారు . ఆశ్చర్యంగా ఇద్దరూ కూడా బురఖాలేసుకున్న ముస్లిం అమ్మాయిలు . @ బావనా ఈ తరం పిల్లలకి తెలిసిన విషయాల గురించి నేను చర్చించలేదు . శాంకేతికంగా , సాఫ్ట్ వేర్ పరంగా వాళ్ళని మించిన వాళ్ళు లేరు . విష్లేషణా శక్తి అమోఘం . అయితే యంత్రాలకి , వస్తుసముదాయానికి దగ్గరైనంతగా మనుషులకి దగ్గర కాలేకపోతున్నారు . సెల్ఫ్ ఓరియెటేషన్ వల్ల సరైన మానవ సంభంధాలను ఏర్పరచుకోలేకపోతున్నారు . దీన్ని మీరు ఒప్పుకుంటారా ? నా ఆలోచలో తప్పుందా ? @ క్రిష్ణప్రియ నేను రాసిన కాలేజి హైదరాబాద్ నడిబొడ్డున ఉంది . పిల్లలందరూ అలాగే ఉన్నారని అనలేము కానీవాళ్ళ మనులు వికసించే చదువు మాత్రం మనమివ్వడం లేదు . జీవితంలోని భిన్న పార్శ్వాలను వాళ్ళకు చెప్పకపోవడం వాల్లే చిన్న సమస్యకి ఆత్మ హత్యలకి తెగబడుతున్నారు . వస్తు సముదాయం మీద ప్రేమ మనుషుల్ని దూరం చేస్తుంది . నగరాల్లో పిల్లలు " బ్రాండ్ " లకు బందీలు . కాదంటారా ? @ ఓబుల రెడ్డి గారూ మా ఆలోచనలని రుద్దాలని మేము వెళ్ళలేదండీ . వాళ్ళతో మాటామంతీ కోసమే వెళ్ళాము . దాడులకు గురయ్యే అమ్మాయిలు అమాయకులౌ కాదని మీరు బాగానే కనిపెట్టినట్టున్నారు . అమయకులు కాదు కబట్టి దాడులు జరగాల్సినే అన్నట్టుంది మీ వైఖరి . ప్రేమించే హక్కు అందరికీ ఉంటుంది కానీ ప్రేమ పేరుతో వేధించే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు . నో అన్న తర్వాత ఏం జరిగినా అది వేదింపు కిందే వస్తుంది .
తెలంగాణ అంశంపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన నివేదిక సమస్యకు పరిష్కారం చూపకపోగా మరింత జఠిలం చేసిందని మాజీ ఎంపీ హరిరామజోగయ్య పేర్కొన్నారు . ఈ మేరకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఆదివారం ఆయన బహిరంగ లేఖ రాశారు . తెలంగాణలో సహాయ నిరాకరణవల్ల సాధారణ పరిపాలనకు కలుగుతున్న విఘాతం ఇలాగే కొనసాగితే 1969 నాటి పరిస్థితులు పునరావృత్తమయ్యే అవకాశముందనే ఆందోళన వ్యక్తం చేశారు . దీనికి పరిష్కార మార్గంగా జోగయ్య ప్రధానికి కొన్ని సూచనలు చేశారు . ' 2014 నుంచి 2024 వరకు రాష్ట్రానికి సీఎంగా తెలంగాణ వ్యక్తినే నియమించాలి . ఉపముఖ్యమంత్రిగా ఆంధ్రకు చెందిన వ్యక్తిని , మరో దఫా రాయలసీమకు చెందిన వ్యక్తికి అవకాశం కల్పిం చాలి . మూడు ప్రాంతాలకు వేర్వేరుగా ప్రత్యేక అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేసి నిధులివ్వాలి . జనాభా ప్రాతిపదికన మూడు ప్రాంతాలకు వేర్వేరు బడ్జెట్‌ను రూపొందించాలి . ఆరు సూత్రాల ఫార్ములా , 610 జీవోను కచ్చితంగా అమలు చేయాలి . రాష్ట్రానికి రెండో రాజధాని ఏర్పాటుతోపాటు ఆంధ్ర , రాయలసీమలో హైకోర్టు బెంచ్‌లను నెలకొల్పాలి . పోలవరం , ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయహోదా ప్రకటించాలి . లేదంటే రెండో పరిష్కార మార్గంగా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించాలి . సీమాంధ్రలకు పూర్తిస్థాయి రాజధానులు ఏర్పాటయ్యే వరకు ఆయా ప్రాంతాల కార్యకలాపాలను హైదరాబాద్ , సైబరాబాద్ నుంచి జరపాలి . ఇందుకు గరిష్టంగా పదేళ్ల కాలపరిమితిని విధించాలి . మూడు ప్రాంతాలకు నదీజలాల పంపకంపై ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి . సాగునీటి ప్రాజె క్టుల నిర్మాణాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే జరగాలి ' అని సూచించారు . హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా గుర్తించాలని ప్రధానికి రాసిన లేఖలో జోగయ్య గట్టిగా అభిప్రాయపడ్డారు . courtesy - - - - sakshi daily
' కుమార్ ' గారూ . . . " మీకు మీరు ఓ ఆధిపత్య స్థానాన్ని ఆపాదించేసుకోని , . . " " ఒకవేళ మీరు వాళ్ళ కన్నా ఎక్కువ అని , above - allఅని భావిస్తే , అది సిగ్గు పడాల్సిన విషయం . . . " " క్రైసిస్ టైంస్ లో సం యమనం పాటించే గొప్ప వాణ్ణి నేను అనే attitude display చేసే మీరు . . . " " CHADUVARI & OTHERS : PLEASE PROTEST THIS KIND OF INSULTING STATEMENTS FROM Dr ISMAIL . " ఇవి వ్యక్తిగత దాడులు కాకపోతే మరేంటి ? నేనెప్పుడూ నేను గొప్ప అని భుజాలు చరచుకోలేదే ? నా భావాన్ని మీరు మరోలా అర్థం చేసుకొంటే నేనేం చేయను ? చదువరి గారితో ఆపాటి చనువు నాకుంది , నాబ్లాగులో వారు , వారి బ్లాగులో నేను ఈమాత్రం ఎత్తిపొడుపులు చేసుకోవడం సాధారణం . మీ బ్లాగులో చేయలేదే నేనీ వ్యాఖ్యలు . . . అంతలా మీరు రెచ్చిపోవడానికి ! తెలుగు బ్లాగ్లోక ఆదికవి " ఒరెమూనా " చావాకిరణ్ దగ్గర నుండీ అందరితో నాకు సత్సంబంధాలే కానీ ఏనాడు ఓ మాట అనుకొనింది లేదు . నా Personal lifeలో జరిగిన ఎన్నో సంఘటనలకు నా బ్లాగు మిత్రులు సాక్షీభూతాలు . నేను కష్టాల్లో ఉన్నప్పుడు మంచి మాటలతో స్వాంతన కలిగించారు , వెన్ను తట్టి స్ఫూర్తిని రగిలించారు , వీలైతే నా పాత టపాలు తిరగేయండి . . . fyi . . . http : / / krishnadevarayalu . blogspot . com / 2007 / 03 / blog - post_15 . html http : / / krishnadevarayalu . blogspot . com / 2008 / 03 / blog - post_17 . html ఇహపోతే నేను క్రిస్టియనా ? లేక మరోటా ? అనే ధర్మసందేహం వెలిబుచ్చారు చూడండీ అందుకే నా పర్సనల్ లైఫ్ గురించి రాయాల్సి వచ్చింది . That said , ' ఆముక్తమాల్యద ' అని మీ అమ్మాయికి పెరుపెట్టిన మీ సహృదయృతను , సాహిత్యాభిలాషను అభినందించకుండా ఉండలేకపోతున్నాను . నా బ్లాగులో మీ వ్యాఖ్య కింద నా మెయిల్ ఐడి ఇచ్చాను , వీలైతే మెయిలు కొట్టండి మన మధ్య తగవులు ఇక్కడేల ? మీరు దగ్గరే కనుక ఉన్నటైతే ఓ కప్పు కాఫీ తాగుతూ మాట్లాడుకొందాం . @ చదువరి . . . ఇలా మీ బ్లాగును దుర్వినియోగపరచినందుకు క్షమించండి .
అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను , సజ్జనుండు బల్కు జల్లగాను , కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వధా అభిరామ వినురవేమా
కొన్ని వందల సంవత్సరాల క్రితం భూమి సూర్యుని చుట్టు తిరుగుతోందని చెపితే ఎవరూ నమ్మలేదు . ఇప్పుడేమో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోందని జ్యోతిష్యులకి తెలుసు అని వాదిస్తున్నారు . జ్యోతిష్య గ్రంథాలలో గానీ , మత గ్రంథాలలో గానీ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టు ఎక్కడా వ్రాయలేదు . చాలా కాలం క్రితం ఒక టి . వి . చానెల్ లో ఇన్నయ్య గారితోనూ , ఇద్దరు జ్యోతిష్యులతోనూ చర్చా కార్యక్రమం పెట్టారు . భూమి , సూర్యుడు గురించి ఇన్నయ్య గారు ప్రశ్నించినప్పుడు జ్యోతిష్యులు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోందని తమకి తెలుసని , కేవలం నమూనా కోసం సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని జ్యోతిష్యంలో వ్రాయడం జరిగిందని వాదించారు . జ్యోతిష్యం పేరు చెప్పి జీవనోపాధి పొందేవాళ్ళలో నిజాయితీ ఈ రకంగా లోపించి ఉంటుంది .
" ఈ సారి , రవి కనుక నాకు సాలిటేర్ డైమండ్ రింగ్ ఇవ్వకపోతే వాణ్ణి వదిలేస్తా , " ముద్దుగా చెప్పింది సుచి అలియాస్ సుచిత్ర .
రకరకాల రంగురంగుల పక్షులు ఆకు పచ్చగా పరచుకొన్న చెట్లన్నీ హృదయాల్ని ఆరబోసుకొన్నట్టు . . నేనొక్కడినే అందరిలో ఒంటరిగా కాసేపటికి ఆ ఒక్కడు జాడలేడు .
ఈ ఎన్నికల్లో తెరాస చావుతప్పి కన్ను లొట్టబోయిన విధంగా కేవలం రెండు లోక్ సభ , పది అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావలసి వచ్చింది . స్వయంగా కేసీఆర్ కరీంనగర్‌లో 15వేల మెజారిటీతో సరిపెట్టుకోవలసి వచ్చింది . 2009 ఏప్రిల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా తెరాస రెండు పార్లమెంటు , 10 అసెంబ్లీ స్థానాలు సాధించి పేలవమైన పనితీరే కనబరిచింది . జస్టిస్ బి . ఎన్ . శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలకు నిరసనగా ఏడాది తిరక్కుండానే మళ్లీ తెరాస రాజీనామాల బాట పట్టింది . ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఫిబ్రవరిలో రాజీనామా చేయడంతో మళ్లీ ఆర్నెల్లలోగా అనివార్యంగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది . కేసీఆర్ , విజయశాంతి రాజీనామాలపై లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ఎటువంటి నిర్ణయం వెలువడక పోవడంతో ప్రస్తుతానికి సస్పెన్సు నెలకొంది .
> > తాప్సీ అందాల ప్రదర్శనపై పెట్టిన దృష్టి కొంత వరకు తగ్గిస్తే పిల్లలతో కలిసి , పెద్దలు చూడగలిగేలా వుండేది . ఈ వాక్యం నాకు చాలా బాగా నచ్చింది . .
నేను నడిచే శవాన్ని కాకుండా ఉండాలంటే ముందుగా పైటని తగలెయ్యాలి పైటని తగలెయ్యాలి
ఈ నవలలో సరస్వతి కనకం ప్రేమకోసం చేసిందేమీ లేదు . తను అనాకారినని , తననెవరూ ప్రేమించరనే ఆత్మన్యూనతా భావంతో తనకెవరి ప్రేమా పొందే అవకాశం లేదనే నిర్లిప్తత అలవరచుకుంది . కాని ఆమే తన ప్రేమనంతా తన అన్న పిల్లలమీద చూపెట్టి ఆవిధంగా గాఢమైన ఆపేక్ష పెంచుకుంటుంది . ఇదే ముఖ్యంగా కనకాన్ని కట్టేస్తుంది .
చాలా కాలం క్రితం ఒక పిచ్చిపిల్ల ఉండేది . ఆమె తన మొగుడే ప్రపంచంలో అందరికన్నా చాలా గొప్పవాడని నమ్ముతూండేది . ఆమెనొక దుర్మార్గుడు ఎత్తుకెళ్ళాడు . వాడు నిజానికి అప్పటి ప్రపంచం దృష్టిలో ఆమె మొగుడికన్నా అన్ని విధాలా గొప్పవాడు . ఆ విషయం ఆమెకి తెలియజెప్పాలని మనుషుల్ని కూడా ఏర్పాటుచేశాడు . వాళ్ళు అతని గొప్పతనం గురించి చెబుతూ ఆమె బుఱ్ఱ తినేశారు . కాని ఆ పిచ్చిపిల్ల తన మొగుడే అందరి కన్నా గొప్పవాడని బల్ల గుద్ది వాదించింది . తరువాత జరిగిన యుద్ధంలో సమకూడిన విజయం వల్ల ఆమె మొగుడు నిజంగానే గొప్పవాడయ్యాడు . అందరూ అతన్ని దేవుడని కొలవడం మొదలుపెట్టారు . ఆమే గనక మనసు మార్చుకుని ఉంటే అతన్నెవరూ దేవుడుగా కొల్చేవారు కారు . చాలా సంవత్సరాల క్రితం గుజరాతులో ఒక పిచ్చి పిల్లాడు ఉండేవాడు . వాడు శ్రవణకుమారుడి కథ సత్యహరిశ్చంద్రుడి కథ నాటకాలుగా చూసి తానూ అలాగే అవ్వాలని తహతహలాడాడు . ఆ కథలన్నీ నిజమని నమ్మాడు . ఆ ఆదర్శాలు నిజమని నమ్మాడు . ఇప్పుడు ఆ పిల్లాడి పుట్టినరోజు వందలాది దేశాలకు పండుగగా మారింది . అతని శత్రువులు అతనికి పాదాభివందనం చేస్తున్నారు . అతని పేరిట దేశాధినేతలే ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు . అతను ఏ మతాలూ స్థాపించలేదు . ఏ మతాన్నీ సంస్కరించలేదు . ఉన్న మతాన్ని చేతనయినంత ఆచరించి చూపించాడంతే ! అతని తరఫున మాట్లాడ్డానికీ అతని గురించి ప్రచారం చెయ్యడానికీ ఎవరూ లేరు . అయినా అతను ఈరోజు అందరికీ తెలుసు . పిచ్చితనం గెలిచింది . అమాయకత్వం గెలిచింది . ప్రేమ గెలిచింది . అభిమానం గెలిచింది . స్వార్థం ఓడిపోయింది . అతితెలివి ఓడిపోయింది . ద్వేషం ఓడిపోయింది . ప్రపంచంలో అన్ని గొప్పతనాల వెనుకా ఉండేది అమాయకత్వమే . తెలివితేటలు కాదు . ఇది దేవుడి శాసనం . ఇది జీవిత వాస్తవం .
దారిలో ఏదో కొంచెం పెద్దగ్రామాలైన పెరవలీ , కానూరూ తప్పించి , ఎక్కడాఆ లైటు కనిపించదు . అయినా ఆచీకట్లోనే ఈ బస్సులోఉన్న కాలేజీ పిల్లలూ దిగుతారు . పైగా లోడ్ షెడ్డింగ్ ధర్మమా అని గ్రామాలు చాలా చోట్ల కరెంట్ ఉండదు . దూరంగా మిణుకు మిణుకుమంటూ కనిపించే దీపాలూ , అమ్మో , పొద్దుట ఉన్న సంతోషమంతా డిప్రెషన్ లోకి దింపేసిందండి . చాలామంది తల్లితండ్రులు వాళ్ళ పిల్లల్ని విజయవాడ , రాజమండ్రి , కాకినాడ , ఏలూరు లాటి ఊళ్ళలో ఉంచి హాస్టళ్ళలో పెట్టి అంత ఖర్చుపెట్టి ఎందుకు చదివిస్తారో ఇప్పుడు అర్ధం అయింది . ప్రొద్దుటెప్పుడో కాలెజీ కి వెళ్ళి , బస్సులు పట్టుకుని అంతంత చీకటిలో , ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియక , ఆ తల్లితండ్రులు పడే యాతన భరించడంకంటే దూరాభారమైనా హాస్టల్లో పెట్టడమే నయం . ఎక్కడో అక్కడ క్షెమంగా ఉండి చదువుకుంటున్నాడూ అనే సంతృప్తైనా ఉంటుంది . వర్షాకాలం అయితే చెప్పఖర్లెదు , ఆ సన్నటి రోడ్లమీద మన పల్లెవెలుగు బస్సు డ్రైవర్లు ఎలా తీసికెళ్తారో .
ఈ దేవతాసమూహములు నీయందు ప్రవేశించుచున్నవి ( మఱి ) కొందఱు భీతిల్లి చేతులు జోడించుకొని ( నిన్ను ) స్తుతించుచున్నారు . మహర్షులయొక్కయు , సిద్ధులయొక్కయు సమూహములు ( లోకమునకు ) క్షేమమగుగాక ! యని పలికి సంపూర్ణములగు స్తోత్రములచేత నిన్ను పొగడుచున్నారు .
తమ స్వస్థలాలకు వెళ్ళేందుకు గాను కోస్తా , రాయలసీమ ఉద్యోగులకు తెరాస వాళ్ళు కౌన్సెలింగు ( సలహా ఇవ్వడం , నచ్చజెప్పడం ) చేస్తారట . సలహాలు అడిగితేనే ఇవ్వాలి . ఈ ఉచిత సలహాలేంటి ? ఎవరడిగారు ? ఎవరిక్కావాలివి ? వాళ్ళను స్వస్థలాలకు పంపడం ప్రభుత్వం పని . ప్రభుత్వం ఆ పని చెయ్యడం లేదని ఎవరికైనా అనిపిస్తే , పోయి ప్రభుత్వంతో మొరపెట్టుకోవాలి . ఉద్యోగులను వత్తిడి చెయ్యడమేంటి మధ్యలో ? ప్రభుత్వం ఫలానా సుబ్బారావును హై . నుండి గుంటూరో , శ్రీకాకుళమో , చిత్తూరో బదిలీ చేస్తే వెళ్ళి తీరాలి . వెళ్ళకపోతే ఆ ఫలానాపై ప్రభుత్వం చర్య తీసుకుంటుంది . బాబూ వెళ్ళండి ప్లీజ్స్ అంటూ బతిమిలాడతారో , కర్రుచ్చుకుని గెంటుతారో అది ప్రభుత్వం ఇష్టం . ఈ తెరాస వాళ్ళెవరు కౌన్సెలింగు చెయ్యడానికి ? అధికారంలో ఉండి హంగూ ఆర్భాటాల్తో తిరిగే రోజుల్లో వీళ్ళంతా ఏం చేసినట్టు ? తెలంగాణ రాష్ట్రం ఇమ్మని అడుక్కునే రోజుల్లో , కాంగ్రెసు దేవత కటాక్షం కోసం దేబిరించే రోజుల్లో ఈ జీవోలు గుర్తుకు రాలేదా ? అప్పుడేం చేసారో ఈ కౌన్సెలింగు నేతలు ? తెలంగాణాకు అనుకూలంగా అమ్మగారి చేత ఏదో ఒక ప్రకటన చేయించమని దిగ్విజయ్ సింగును ముష్టెత్తుకునే రోజుల్లో ఈ జీవోలను ఏ పరుపుల కింద దాచారు ? ఇవ్వాళ మాత్రం ఈ సలహా దళాన్నొకదాన్ని ఏర్పాటు చేసుకుని ఆఫీసులకెళ్ళి తైతక్కలాడుతున్నారు . జీవోను అమలు చెయ్యకపోతే ప్రభుత్వం మెడలు వంచి చేయించుకోవాలి లేదా చేతులు ముడుచుక్కూచ్చోవాలి . అంతేకానీ , ఉద్యోగులనిలా హింసించడమేమిటి ?
కౌసల్యా కుమార ! నా ఎడ కఠినుడవు కాబోకు ! మున్ను నే చేసిన సేవలన్ని ఎన్నదగినవి రా దొరా ! చిన్న విన్నపమును శ్రీవారు చిత్తగించవలెను మెత్తటి పూవంటి దాన ! ఒత్తిడినిక నస్సలు నే ఓర్చలేను అత్తరి నను జేర్చునపుడు హత్తుకొమ్ము నీ రొమ్ముకు ఒత్తిగిలజాలుదు నే నీ ఒక్కని కౌగిలి యందే .
1 ) తెలంగాణాలో నిజాం నిరంకుశ పాలన 2 ) నల్గొండ జిల్లాలో సాగిన రైతాంగ సాయుధ పోరాటం 3 ) ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించిన విప్లవోద్యమం .
చూసి కూడా తప్పురాశాను - ఆటవెలది చివరి పాదం ఇలా ఉండాలి : మాలి రాడు తగవుమాలి యనుచు . " వర్ణనలకు సీసపద్యం పెట్టింది పేరు . " అన్న మీ మాటకు ఈ పద్యం మంచి ఉదాహరణ .
ఇమామ్ తండ్రి చనిపోయి అప్పటికి సరిగ్గా ఏడాది . తండ్రి చనిపోయిన రోజే తండ్రి తెచ్చుకున్న ఎలుగు చనిపోయింది . తండ్రి చనిపోయి తోడు దూరమై ఎలుగు చనిపోయి బతుకు దెరువు దూరమై పుట్టెడు దు : ఖంతో ఉన్నాడు ఇమామ్ .
గజ్వేల్ , మే 2 : పెద్దాయన చనిపోయినంత మాత్రాన ఆయన ప్రవేశపెట్టిన పథకాలకు నిధుల కొరత రానివ్వమని చిన్ననీటి పారుదల శాఖామంత్రి శ్రీమతి సునితారెడ్డి పేర్కొన్నారు .
ఆంధ్రప్రదేశ్ లో ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి , ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నక్సలైట్లను కాల్చి చంపడానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో డి . జి . పీ వ్యాస్ ఆధర్వంలో " గ్రేహౌండ్స్ " అనే పారామిలటరీ ఫోర్సును మొదలుపెట్టారు . అంతులేని డబ్బు , ఆయుధాలు , అదుపులేని అధికారాలు కట్టబెట్టారు . న్యాయస్థానాలు , చట్టసభలకి జవాబుదారీ లేనీ రాజ్యాంగ యేతర శక్తిగా గ్రేహౌండ్స్ అవతరించింది . ఎన్ని ప్రభుత్వాలు మారిన ఎన్ కౌంటర్ల అనే అణచివేత విధానాన్ని గ్రేహౌండ్స్ పోలీసులతో కొనసాగిస్తున్నారు . అరకులో దుబాయి బాక్సైటు కంపెనీ కోసం , ఎస్ . కోటలో జిందాల్ కంపెనీ కోసం ఆదివాసీలను ప్రభుత్వం నిర్వాసితులను చేస్తోంది . ప్రత్యేక ఆర్థిక మండలు , బహుళ జాతి కంపెనీల కోసం గ్రేహౌండ్స్ , సాల్వాజుడుం పేరులతో స్త్రీలపై లైంగిక అత్యాచారాలు , హత్యలు , దమనకాండ సాగిస్తున్నది . అలనాడు మన్నెంలో స్వాతంత్ర పోరాటకాలంలో బ్రిటిషు దురాక్రమణదారులు దాడులు చేసి గిరిజన గూడెలను , అటవీసంపదను కొల్లగొట్టారు . వేలాది ఆదివాసీలను హత్యచేసారు . నేడు ప్రభుత్వాలు పెంచిపోషిస్తున్న గ్రేహౌండ్స్ పారామిలటరీ శక్తులు గిరిజన గూడేలపై దాడిచేసి , అమాయక ఆదివాసీ మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడుతున్నాయి . ప్రజలచేత ఎన్నుకోబడ్డామనే కాంగ్రెసు ప్రభుత్వం నేరస్థుల కొమ్ము కాస్తుంది . ఇది నిజంగా ప్రజాస్వామమా లేదంటే ప్రజాస్వామిక హక్కులు కాలరాసే ఫాసిస్టు రాజ్యమా అనే ప్రశ్న ఉదయిస్తోంది .
పువ్వులో , యవి పుష్యరాగపు రవ్వలో , యవి రజత వృక్షపు రివ్వలో , యవి ఋతుకుమారికి నవ్వులో , దువ్వల్
పక్కనే సేమ్యాకావిడి తెచ్చి దించుకుంటున్న మస్తాను తాత సకల నవ్వు చూసి ముచ్చటపడ్డాడు . ' ' ఆళ్ళ బాబులాగే ఈడూ మంచి కళైనోడు ' ' అనుకున్నాడు మనసులో .
ఇది ఎక్కువమంది చదువుతున్నారు అన్న వాస్తవం కాక , మీ వ్యక్తిగత అభిప్రాయానికి ప్రాధాన్యత ఉంది . అందరి అభిప్రాయాలని ప్రతిబింబించే ఉత్తమ తెలుగు బ్లాగుల జాబితాని రూపొందిస్తున్నట్టు కాక , మీ తరపున మీకు నచ్చినట్టు ఉత్తమ తెలుగు బ్లాగుల జాబితా రూపొందిస్తున్నట్టు ఆలోచించండి .
జూపాక సుభద్ర నాలుగు రోజులకింద ఒక టీవి ఛానల్ వాళ్లు ఫోను జేసి ' మహిళలు పనిచేసే చోట లైంగిక వేధింపులు ' అనే అంశం మీద చర్చ వుంది రమ్మన్నరు అరే ! యింకా యీ సమస్య మీద కొత్తగా తాజాగా మాట్లాడాల్సి రావడం ఏంటి ? యింకా సమసి పోలేదేంటి అని బాధైంది . అప్పుడెప్పుడో 1995లోనే సుప్రీంకోర్టు ' మహిళలు పనిజేసే స్థలాల్లో లైంగిక వేధింపులను నిరోధిస్తూ కొన్ని సూచనలు కొన్ని [ . . . ]
వీకెండ్ రాసిన మొదటి నాలుగు లైన్లు చదివితే తెలుస్తుంది . < < " హిందువులు మేల్కోవాలి అనే టపా ఒకటి చూశాను . అర్చక , పౌరోహిత వృత్తులలో మనుషుల కొరత ఉంది దాన్ని ఎలాగోలా సరిచెయ్యాలి అనే అసలు విషయం తప్ప మిగతా టపా అంతా చాలా అసందర్భంగానూ , అర్థరహితంగానూ అనిపించింది . అదే విషయం ఆ టపాలో వ్యాఖ్యానిస్తే బ్లాగు రచయిత నా వ్యాఖ్యని ప్రచురించలేదు . " > >
నిత్యం రోడ్ల వెంట మురుగు కాలువల్లో చెత్తకుప్పల్లో ముళ్లపొదల్లో ఇలా ఏదో ఒక చోట ఆడపిల్లల మృతిదేహాలు దర్శనమిస్తున్నాయి . కడుపులో ఉన్నప్పుడు ఆడపిల్లని తెలిస్తే చాలు . . గర్భస్రావాలు చేయించుకుంటున్నారు . ' ఆడ పిల్ల ఆడపిల్లా . . ఆడా పిల్లనటా నేను పాడు పిల్లనటా ఎవరికి గొరగాని పిల్లనటా . . మాకు ఎందుకు ఈ కర్మ ' అని బాలికలు పాటలు పాడుకోవటం ఎంత దారుణమో తెలుస్తోంది . ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న పాశ్చాత్య సంస్కృతిని అద్దం . . .
రామ సేతు గురించి తెలియని వాడు భారతదేశంలో ఎవరూ వుండక పోవచ్చు , మతాలతో సంబంధం లేకుండా . మన పురాణాల ప్రకారం సీత ను రక్షించడానికి రాముడు , వానరసేన సహాయంతో లంకకు కట్టిన వారధి ఈ రామ సేతు . సముద్రంపై తేలే బండలతో కట్టినట్లు చెప్తారు కొంతమంది . ఏది ఏమైతేనేం రామాయణ కాలంలో ( మూడు లక్షల సంవత్సరాల క్రితం ) ఇది కట్టబడింది . ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని పాక్ జలసంధి అని పిలుస్తున్నారు .
పిల్లలు " నాన్నగారు ఫలనాది తీసుకురండి " అని అనడానికి " అమ్మగారు అన్నం పెట్టండి " అని అనడానికి ఎంతో వ్యత్యాసం వున్నట్లుగా వుంది . . . వినడానికే బాగోలేదని అనిపిస్తోంది . . .
ఈ సంకలనం ఒక అమెరికా చౌదరి గారితో ఇద్దరు " ఆంధ్రుల " కమ్మక్కు అట ! డబ్బున్న వాళ్ళందరూ ఇక సంపాదకులు కావచ్చహో ! తెలుగు కథ అమర్ రహే !
గోవిందరావు , అత్తయ్య వాక్యం పూర్తికాక ముందే , " ఇదిగో చూడు అత్తయ్యా ! ఆ అమ్మాయి యం . ఏ . ఎందులో చేసిందో నాకు అనవసరం . బంగారపు బొమ్మ అయితేనేం ? రాతి విగ్రహం అయితేనేం ? ఆవిడ చేస్తున్న ఉద్యోగం సోషల్ వర్కరు ఉద్యోగం . ఇక పోతే , సంగీతంలో ఎంత పాండిత్యం ఉన్న అమ్మాయి అయినా అమెరికా వచ్చి ఏం చేస్తుంది చెప్పు ? ఇంట్లో కూర్చొని త్యాగరాజ కృతులు పాడుకుంటుందా ? సోషల్ వర్కర్లూ , సంగీతవిద్వాంసులూ ఎక్కడ మాత్రం ఎవరిక్కావాలి , చెప్పు ? నువ్వు ఆ అమ్మాయి తాలూకు వాళ్ళకి నేను తప్పకండా వచ్చి చూస్తానని మాట ఇవ్వలేదుగదా ? అలా మాటగనక ఇచ్చి ఉంటే , నువ్వు మరీ బలవంతపెడితే మహుమాటం కోసం , మొక్కుబడిగా ఆ అమ్మాయిని కూడా చూస్తాను , " అని ఒక్క క్షణం అత్తయ్య కేసి ఎగా దిగా చూశాడు . అత్తయ్య తల వంచుకొని , కుడికాలి బొటనవేలుతో నేలమీద సున్నాలు చుట్టుకుంటోది ; ఏం మాట్లాడలేదు . కిమన్నాస్తి . ఒక్క క్షణం ఆగి గోవిందరావు అన్నాడు , " ఏ లెక్కల్లోనో , కెమెస్త్రీ లోనో ఒక బి . యె . డిగ్రీ ఉన్న అమ్మాయి అయితే , అమెరికాలో ఒకటో రెండో ఐ . టి . కోర్సులు చేసుకుంటుంది . అంతే ! వెంటనే ఏదో పనికొచ్చే ఉద్యోగం వస్తుంది . చూడు అత్తయ్యా ! నేను వచ్చే ఆదివారం తిరిగి అమెరికా పోతున్నా . కావాలంటే , రెండు మూడు నెలల్లో మళ్ళీ వస్తాలే ! " అని నిర్మొహమాటంగా చెప్పి టీ . వీ . గదిలోంచి బయటికొచ్చాడు .
Download XML • Download text