tel-46
tel-46
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
మీకు తెలుసా ? అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఒక రోజు ముందుగా మాయావతి - ' ఒబామా మాజిక్ ' ను ఇండియాలో సృష్టించగలరేమో అని - ప్రధాన వార్తా పత్రికల్లో వ్యాసాలు వచ్చాయి . ఒబామా కీ - మాయావతి కీ సామ్యం ఏమిటంటే - ఇద్దరూ వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినవారు . పైగా ' దళిత ' అనే పదానికి భారత దేశంలో చాలా విలువ ఉంది . ఒక ' దళిత ' రాష్ట్రపతి + ఒక ' దళిత ' ప్రధన మంత్రి అనే ప్రమాణాలు సృష్టించడం ఇంకా ఉంది . కుల మతాలకు అతీతంగా , బాగా చదువుకున్న , వివేచన ఉన్న రాజకీయ ' నాయకులు ' మనకూ ఉన్నారు . కానీ మనమే దానికి తగినట్టు ఎదగలేదు . భారత దేశానికి ముందు ఉన్న చాలెంజెస్ - అతి ఘోరమైన జనాభా విస్ఫోటన - దీని కారణంగా బీదరికం , అవిద్య ! పైగా సామాజికంగా కులం , మతం లాంటి పాతుకుపోయిన విషయాలు ! మనకి తప్పకుండా మంచి నాయకత్వం కావాలి . కానీ శశి థరూర్ చెప్పినట్టు - ఉదాహరణ కు - మనకి ఇందిరా గాంధీ ప్రధాని కావాలని ఉందనుకోండి - తప్పకుండా , ఆవిడ పార్టీ కి చెందిన అభ్యర్ధినే , తను గూండా అయినా , దొంగ వెధవ అని తెలిసినా . . మన నియోజక వర్గానికి నాయకుడిగా ( ప్రతినిధి గా ) ఎన్నుకుంటాం . ఇలా - బోల్డంత మంది గూండాలు - ఆవిడ ని గెలిపించాలనుకునే వాళ్ళు , ఎన్నుకోవడం వల్ల ఎన్నుకోబడతారు . ఈ మధ్యనే సోమ్నాథ్ చటర్జీ కూడా మన దేశ ప్రజలకు తమ ప్రతినిధుల పని తీరు నచ్చకపోతె Re - call చేసే సౌలభ్యం ఉండాలని సూచించారు . పని లో పని గా ఇంకో కొసరు కధ కూడా చెప్తాను - ఒబామా , క్లింటన్ ల మధ్య జరిగిన పోరు ( లాంటిది ) లో క్లింటన్ ని ఓడించేందుకు ఒబామా కి మన ' హనుమాన్ ' సాయం చేసాడని ఇక్కడ తెగ చెప్పుకున్నారు . అపుడే , ' హనుమాన్ ' ను పోలిన దేవుడి బొమ్మ ని ఒబామా ఎప్పుడూ పట్టుకుని తిరిగుతారనీ , అందుకే ఒబామానే గెలుస్తారనీ ( అధ్యక్షుడి గా ) - అపుడే టెలివిజన్ లో చెప్పేసారు . ఇంతకీ మీకీ సంగతి తెలుసా ? ( జై హనుమాన్ ) . : D
హైదరాబాద్ : గిరిజన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దానం నాగేందర్‌కు గిరిజన సంక్షేమశాఖ మంత్రి పసుపులేటి బాలరాజు లేఖ రాశారు . గిరిజన ప్రాంతాల్లో ముందస్తు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని మంత్రి లేఖలో కోరారు . గిరిజన ప్రాంతాలకు 108 , 104 సేవలను విస్తరించాలని ఆరోగ్య , 108 సర్వీసుల శాఖ మంత్రి పితాని వెంకటేశ్వరరావుకు కూడా మంత్రి లేఖ రాశారు .
కాంగ్రెస్ , జగన్ వర్గం రెండుగా విడిపోయిన దరిమిలా రాష్ట్రంలో అతి పెద్ద పార్టీ తెలుగుదేశమేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు . తమకు ఎవరితోనో కలవాల్సిన ఖర్మ పట్టలేదని అసెంబ్లీ ఆవరణలోని తన కార్యాలయంలో స్పష్టం చేశారు . ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకున్న బలానికి ఒక సీటే రావాల్సి ఉందని , బోనస్‌గా మరో రెండు సీట్లు అదనంగా లభించాయని చెప్పారు . సీట్లు రావడం ఆనందమే కానీ ఈ ఎన్నికల్లో వ్యవస్థ నాశనమైందన్న బాధ కలుగుతోందన్నారు . " జగన్ [ . . . ]
" ఏం జరుగుతుంది ఇక్కడ అని " గద్దించాడు పోలీసు ఆఫీసర్ .
అనానిమస్ గారు , మీరన్నది అర్థమయ్యింది . ఇది అచ్చుతప్పు కాదు , అచ్చమైన తప్పే ! దాహకరున్ అని వేస్తే తెలుగు ప్రత్యయం " ను " వచ్చి దాహకరునుష్ణ అని సంధి చేసుకోవాలి . దాహకర ఉష్ణ తీక్ష్ణ కరధార అని సిద్ధసమాసం చేసుకుని గుణసంధి చేస్తే సరిపోతుందనుకుంటాను . ఆ రకంగా మార్చాను . తప్పు చూపినందుకు ధన్యవాదాలు . మీరిలా అనామకులుగా ఉండిపోవడం బాగులేదు : - ) దయచేసి మీరెవరో చెప్తారా ? రాజేష్ గారు , నెనరులు . ఊదంగారు , నెనరులు . ఏడాదిన్నర కిందటి పద్యాలని గుర్తుచేసారు ! మళ్ళీ అవన్నీ చదివి ఆనందించాను . మీ సీసం గురించి అక్కడే మాట్లాడతాను : - )
ఈ దేహం కలిసిపోయే లోపు ఎప్పుడో , ఎక్కడో వాడు కన్పించి , " బాగున్నారా మాష్టారూ " అంటాడు . అంతకుమించింకేం కావాలీ జీవితానికి . హేట్సాఫ్ .
అంతెందుకు , మహిళా పోలీస్ స్టేషన్‌లో మగ ఎస్ . ఐ . ని నియమించిన ఘటన విజయనగరంలో జరిగింది . ఈ విషయం పై అధికారులని అడిగితే తెలియక అలా చేశామని సమాధానం చెప్పారు .
కాంగ్రెస్సుకి ఆసరా అయినా ఇంతమంది ఎం పిఈ లు ఒక్క రాష్ట్రంలోనే వుంటే ఎప్పటికయినా సమస్యే అని పనిలో పనిగా దూరాలోచన , దురాలోచనతో కూడిన విభజించు పాలించు ఎత్తుగడనేమో . మొన్నటిదాకా సోనియా వ్యవహార దక్షత మీద కాస్తో కూస్తో గౌరవం వుండేది . పొరపాట్లు అధిష్ఠానానికి కూడా సహజం పోనీ చేసిన పొరపాటు సవరించుకుంటారేమో S R C అంటూ కాలయాపన ఎత్తుగడ వేస్తారేమో అని ఆ గౌరవాన్ని కాస్త పెండింగులో పెట్టాను . కానీ తెలుస్తున్న వార్తలను బట్టి ఇతర సీనియర్ నాయకులు అది సూచించినా అమ్మగారు విండం లేదట . ఒకటి రెండు రోజుల్లో ఈ ఆగ్రహావేశాలని చల్లార్చిన ఘనకీర్తిని మూటగట్టుకొని తను తీసుకున్న నిర్ణయం అమలు చేయాల్సిందేనన్న మంకుపట్టుమీద వుందంట .
Tag lines : మార్గదర్శి పై కక్ష లేదు - - కె . రోశయ్య అందుకే డిపాజిటర్ల డబ్బులు రాకుండా మాకు చేతనయినంత సహాయం చేస్తున్నాం . పత్రికా స్వేచ్చను గౌరవిస్తా - - కె . కేశవరావు అందికే మాకు తెలియకుండా ఎవరో జారీ చేసిన 938 జివో ని ఆపివేశాం
కొంతకాలంగా తెలుగు బ్లాగ్లోకంలో జరిగుతున్న రెండు పరిణామాల గురించి నా మాటగా చెప్పే ప్రయత్నం ఇది . మొదటి విషయం . . నా మీద జరుగుతున్న దాడి . రకరకాల రూపాల్లో జరుగుతున్న ఈ దాడి వల్ల నాకు చీమకుట్టినట్టైనా లేదనే చెప్పాలని ఉంది , కానీ అది నిజం కాదు . నాకు చాలానే బాధ కలిగింది . ఎందుకంటే , నేనూ చీమూ నెత్తురూ , సిగ్గూ శరమూ ఉన్న మనిషినే . పోనీ సమాధానం చెబుదామంటే , రాసినవారు నా బ్లాగులో రాయలేదు . ఎక్కడో రాసినవైనా , నేనేదో నాకు అర్హతలేని గౌరవం పొందేస్తున్నాను అన్న ఒక గుడ్డి కడుపు మంట ఆక్రోశం తప్ప ఆ రాతల్లో చర్చించేందుకూ , సమాధానం ఇచ్చేందుకూ సరుకేమీ లేదు . ఎందుకొచ్చిన వెధవ పీడ , నేను కూడా బ్లాగు మూసేస్తాను , నేను మూసేసినంత మాత్రాన బ్లాగ్లోకానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అని కూడా ఆలోచించాను . నేను కొన్ని నిర్దిష్టమైన ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని బ్లాగు మొదలు పెట్టాను . అవి నెరవేరుతున్నాయి . నాకెంతో తృప్తినీ ఇస్తున్నాయి . ఎవరో కడుపుమండిన వాళ్ళ కోసం నేను బ్లాగు మూసేసే ప్రసక్తే లేదు . నా ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది . చిగిర్చే చెట్టుకి ఎగిరే పిట్ట ఆదర్శం . పత్రాల్ని విదిల్చి పైకెగరాలని ప్రయత్నం . కదలక మెదలక కప్పులు మూసుకుని నిద్రపోయే క్షుద్రగృహాలకు అతీతంగా ఎదుగుతుంది . అందుకనే శీతాకాలం ఎత్తివచ్చినా భీతి చెందదు చెట్టు . వీపులపై మ్యాపులతో పత్రాలన్నీ నిశ్శబ్దంగా ధాత్రికి దిగివచ్చి సామాన్యమైన మట్టితో సారూప్యం పొంది మ్యాపుల్లోని రహస్య మార్గాల గుండా చేరుకుని వృక్షశిఖరాన్ని ; చలిమూకని చావుదెబ్బ తీస్తాయి . . . అని రాశారు కవి ఇస్మాయిల్ చిగిర్చే చెట్టు అనే కవితలో . ఆ చిగిర్చే చెట్టు నా బ్లాగు !
శ్రీశ్రీ కవితలకు బాపూ గీసిన బొమ్మల సంకలనం ఈమాట పాఠకులకోసం ప్రత్యేకంగా .
" వాడొక కీలుబొమ్మ వాడొక దిష్టిబొమ్మ వాడు ప్రపంచ విఫణి వీధుల్లో రాష్ట్రాన్నే తాకట్టు పెట్టేవాడు వాడు అంకుల్ శామ్ చెప్పుల్లో చేతులు పెట్టి తలకిందులుగా నడవాలని ప్రయత్నించేవాడు " ( ఒక తైనాతీ మరియు మాయల ఫకీరు , పి . లోకేశ్వర్ ) అని మనపై పెత్తనం చేస్తున్న కీలుబొమ్మ ప్రభుత్వం ' కీ ' ఎక్కడ వుందో కనిపెట్టినవాడు తెలంగాణ కవి . జూకంటి జగన్నాథం కవిత్వమంతటా స్థానికత ఉట్టి పడుతూ ప్రపంచీకరణ విషప్రభావాలను వ్యతిరేకించే లక్షణం కొట్టొచ్చినట్టు కనపడుతుంది . ప్రపంచీకరణ దుష్ప్రభావాల గురించి తెలంగాణ స్థానీయత నుంచి బలంగా మాట్లాడిన కవి ఆయన . ' వాస్కోడిగామా డాట్ కామ్ ' కన్నా ముందు నుంచే ఆయన దీన్ని తన కవిత్వ దృక్పథంగా ఎంచుకున్నారు .
సెల్ఫ్ మోటివేషన్ , పంతం , పట్టుదల వీటితో దేన్నైనా సాధించవచ్చు . ఏమా కథ ? నేనీమధ్య నా నడక ట్రెండ్ లేక పా౨టర్న్ మార్చాను . ఇంతకమునుపు గంటకి 3 . 5 లేక 3 . 6 మైళ్ళ వేగంతో నడిచేవాణ్ణి . ఈ మధ్య ఇలా చేస్తున్నా - నడిచే అరగంటో లేక నలభైనిమిషాల్లో మొదటి ఐదు నిమిషాలు వార్మ్ - అప్ . మిగతా ముఫై నిమిషాల్లో , మొదటి పదినిమిషాలు గంటకి 4 . 1 మైళ్ళ వేగంతో , తర్వాతి పదినిమిషాలు 4 . 0 మైళ్ళ వేగంతో , చివరి పదినిమిషాలు 3 . 9 మైళ్ళ వేగంతో నడవటం మొదలెట్టా . ఇన్క్లినేషన్ 1 పెడతా . ఈ పా౨టర్న్ వల్ల నా వర్కౌట్ అయ్యేప్పటికి షుమారుగా 280 కేలరీలు ఖర్చు ఔవుతున్నాయి . నిన్న ఇలా చేసా గోల్ 45 నిమిషాలు మొదటి ఐదు నిమిషాలు వార్మ్ - అప్ తర్వాతి పది నిమిషాలు 4 . 1 మైళ్ళ వేగంతో తర్వాతి పదినిమిషాలు 3 . 2 మైళ్ళ వేగంతో , ఇన్క్లినేషన్ 10 తర్వాతి పదినిమిషాలు 3 . 3 మైళ్ళ వేగంతో , ఇన్క్లినేషన్ 9 చివరి పదినిమిషాలు 3 . 4 మైళ్ళ వేగంతో , ఇన్క్లినేషన్ 8 అంటే కొండ ఎక్కిన ఎఫెక్ట్‌తో నడిచాను . దానివల్ల నా టోటల్ వర్కౌట్ అయ్యేప్పటికి ఖర్చుచేసిన కేలరీలు 420 . బ్రదరూ , కావాల్సింది మోటివేషన్ . నీ మీద నీకు నమ్మకం , * నేను నడవగలను * అనే ఓ నమ్మకం , నడవాలి అనే పంతం . మొదటి పదినిమిషాలు బానే అయ్యింది . ఇన్క్లినేషన్ పెంచా . బాడి అబ్బా , ఆపరా , వెళ్దాం ఇక అని గోల మొదలెట్టింది . నీ ఎన్కమ్మ , నడువ్ అని నడిపించా . చెమట కక్కాను . మూడొ పదినిమిషాలు బుద్ధి తన అసలు రూపం చూపింది . ఇక పద అంది . నో అన్నా . మంచీళ్ళు కావాలి నాకు అంది . అరవమాక అన్నా . షూ లేస్ ఊడింది చూసావా ఇక ఆపు అంది . ఏంపర్లేదు నడువ్ అన్నా . బీట్ ది క్రాప్ బడ్ , దేన్నైనా నువ్వు చేయాలి అనుకుంటే , నువ్వు తప్పక చేయగలవు . కానీ ఎప్పుడూ ? ఆ కసి , పంతం పెంచుకున్నప్పుడు . నిజంగా నువ్వు చేయగలవు . బీట్ ది క్రాప్ బడ్ . . . .
గమనిస్తారా ? పొరపాటా ? కాదా ? సమాధానం చెబితే , అప్పుడు నా రెండో ప్రశ్న అవసరమైతే ఆడుగుతాను .
భోగులాహారించు భుక్తి కన్నుల జూచి పరమపేదలు దుఃఖపడని చోటు సాంఘికాచార పంచాస్యగర్జనమున బెదరక జ్ఞానంబు పెరుగుచోటు జాతివైషమ్య రాక్షస పదాహతి చేసి కందక కళలు పెంపొందుచోటు పరిపాలక క్రూరతర కరాసికి లొంగి పోక స్వేచ్ఛాలక్ష్మి పొదలుచోటు
41 అఙ్గే నాఙ్గం ప్రతను తనునా గాఢతప్తేన తప్తం సాస్రే ణాశ్రుద్రుత మవిరతోత్కణ్ఠ ముత్కణ్ఠ్ఠితేన ఉష్ణోచ్ఛ్వాసం సమధికతరోచ్ఛ్వాసినా దూరవర్తీ సఙ్కల్పై ్తౖసెర్విశతి విధినా వైరిణా రుద్ధమార్గః
RK & WP , ఇదేదో రెండు ఆగ్ల నిఘంటువులు తమ పాండిత్యం చూపించుకోవటానికి పోట్లాడుతున్నట్టు వుంది : ) విషయమేమిటో గాలికి ఒదిలేశారు . మధ్యలో ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషనొక్కడు , ' నాట్ ఓన్లీ బట్ ఆల్సో ' లాగా ! వీళ్ళంతా తమ ఇంగ్లీషు దురద తీర్చుకోవడానికి తెలుగు బ్లాగుల్లో పడ్డారెందుకా అని ఆలోచన చేస్తున్నా . ఏమంటారు - బ్లాగు బాబ్జీ , బెండు , జ్ఞానేశ్వర్లు ? : ) )
ఏలూరు : కృష్ణా జిల్లానుండి , తూర్పుగోదావరి జిల్లాకు ఆక్రమంగా రవాణా అవుతున్న 136 క్వింటాళ్ల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు గురువారం ఏలూరులో పట్టుకున్నారు . బియ్యం విలువ 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది . ప్రజాపంపిణీ వ్యవస్థ కింద మంజూరైన ఈ బియ్యాన్ని లారీలో కృష్ణా జిల్లా విస్సన్నపేట నుంచి రవాణా చేస్తున్నారు . సమాచారం అందున్న జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధికారి కె . రంగాకుమారి సిబ్బందితో కలిసి దాడి చేశారు . ఏలూరు బైపాస్ రోడ్డులో లారీని [ . . . ]
సాని - పాప కథలో ఆమెను అరాధిస్తున్నాడనీ తెల్సి కూడా ఆమెను పెళ్ళి చేసుకుంటానని ముందుకొచ్చిన మనిషి దూషించి పంపివేసి , ' నిజం చెప్పటం కన్నా అబద్ధం మేలు ' అననుకొని , మామూలు మనిషై పోతుంది .
భానుసమాన , విన్ భరనభారలగంబులఁ గూడి విశ్రమ - స్థానమునందుఁ బద్మజయుతంబుగ నుత్పలమాలయై చనున్ - వేములవాడ భీమకవి ( రేచన ) , కవిజనాశ్రయము ( 102 ) ( పాదాల విరుపు - పద్మజ - నవ బ్రహ్మలు )
వావ్ … అద్భుతం . ఇలాంటి వారికి నిజంగానే హాట్సాఫ్ . ఇంకెంతో మందికిది స్పూర్థిదాయకం కావాలి .
మనం రోజూ చాలా తెలుగు పత్రికలు , బ్లాగులు చదువుతుంటాం . కానీ అవన్నీ గుర్తుంచుకోవటం పెద్ద సమస్య . దీన్ని అధిగమించటం కోసం నేను ఈ తెలుగు ఉపకరణ పట్టీ తయారు చేశాను . దీన్ని వ్యవస్థాపితం చేసుకుని మీరు కూడలిని శోధించగలరు , తెలుగు సైట్లకు వెళ్ళగలరు , తెలుగు పత్రికలు , కూడలి మరియు లేఖినిని దర్శించగలరు .
ఇలా నేను వ్రాయడం కూడా అసాంఘీకమే అయితే నేను తీవ్రవాదినే . రాజకీయ నాయకుల లెక్కన ఏది జరిగినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని సమాధాన పరచుకుంటూ బ్రతికేయ్యమంటే , ఇంతటి దుర్ఘటన సమయంలో నా వల్ల కాదేమో . ఎవ్వరైనా మనల్ని మోసం చేయ్యడం ద్వారా డబ్బు నష్టపోతే ఎదో విధంగా తిరిగి సంపాదించుకోవచ్చు . అన్యాయంగా ఎవ్వరైనా నా ఇల్లు కబ్జా చేసి నన్ను ఇంట్లోనుంచి తరిమి వేస్తే వేరే ఇంట్లో చేరుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాడి తిరిగి ఆ ఇంటిని దక్కించుకోవచ్చు . మాన ప్రాణాలకు ముప్పు కలగనంత వరకూ ఏదో విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించో లేక లంచాలిచ్చి పోలీసులను పట్టుకునో మన పనులు చేయించుకోవచ్చు . విజయవాడలో పరిక్ష హాలులో ప్రాణాలు తీసిన మనోహర్ ఇప్పుడు చక్కగా మూడు పూటల తిండి తింటూ రకరకాల పుస్తకాలు చదువుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపేస్తున్నాడే ! !
తస్లీమా : తన దేశం , భాష మీద అపార ప్రేమ , మానవత్వం మీద విపరీత నమ్మకం , హింస మీద అసహ్యంతో అత్యంత నిర్భీతిగా రాసే ఒక రచయత్రి . కుహానా లౌకిక వాదాలను చీల్చి చెండానికి వీరనారి . అసలయిన లౌకిక వాదానికి భారత్ లో చోటుందని , కలకత్తాలో తనకు , తన భాషకూ చోటుందని ఆశతో మన దేశ పౌరసత్వాన్ని గత కొన్నేళ్ళగా అర్ధిస్తున్నది . మన నాయకులకు ఆమె అస్సలు కనపడరు . ఆమె విన్నపాలు వినపడవు . ఆమె మీద దాడి చేసిన వెధవలకు అసలు శిక్ష కూడ పడదు . తోటి రచయత్రి అరుంధతీ రాయ్ , మేధా పాట్కర్ లాంటి షో - ఉమన్ లకు ఆమె విషయం అస్సలు ఒక వస్తువు కానే కాదు . అవును మరి , ఆమె మన పార్లమెంటు మీద దాడి చేసుంటే బాగుండేది . కనీసం భారత్ లో తన కోసం ర్యాలీ తీసే గుంపు ఒకటి దొరికేది కదా . . . . ఇప్పుడు తాజాగా మన ప్రభుత్వం సెలవిచ్చిందేమిటంటే . . . ఆమెకు ఇష్టం లేకుంటే దేశం విడిచి వెల్లొచ్చంట . ఆమె ఎప్పుడైనా ఇష్టం లేదని చెప్పిందా ? ఏమిటీ ద్వంద్వ ప్రమాణాలు ?
కానీ ఆరుగురు నాయకు ల్ని బలిదానమిచ్చిన పౌరహక్కుల సంఘం అనే సంస్థ అనేక భౌతిక దాడులను , బెదిరింపులను , అధిగమించి ముందుకు వెళుతున్న విషయం వీళ్లకు స్ఫురణకు రాకపోవడమే విచిత్రం . తరతరాలుగా అగ్రకుల భూస్వామ్య పాలక వర్గాలకు వ్యతిరేకంగా గ్రామస్థాయిలో దళిత , ఆదివాసీ , మహిళా హక్కుల కోసం , ఆత్మగౌరవం కోసం అనేక పోరాటాలు జరుగుతున్నా యి . అవి ఏవీ జరగనట్టు హక్కుల ఉద్యమానికి ఆది - అంతం బాలగోపాలే అని వ్యాఖ్యానించడం బాలగోపాల్ మనస్తత్వానికి పూర్తి వ్యతిరేకం . ఈ వింత పోకడ ఇప్పటి వరకూ పార్లమెంటరీ పార్టీల నాయకులు మరణించిన సందర్భాలలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు పొగడ్తలలో కనిపిస్తూ ఉండేది .
ఇన్ని పుస్తకాలొచ్చి ఒళ్ళో వాలితే అది అదృష్టం కాక మరేమిటవుతుందమ్మా , చోద్యం కాకపోతేనూ ! హాయిగా ఇష్టమైన పుస్తకం చదువుకోవడంలొ మునిగి ఉన్నపుడు ఇంద్రుడొచ్చి స్వర్గానికి బిజినెస్ క్లాస్ టికెట్ ఇచ్చి రమ్మన్నా " చేయి ఖాళీ లేదు , రేపు రా పో " అని పంపేస్తా ! మీ అదృష్టానికి అభినందనలు
ఏ గానం విన్నా మనసు కోరుతుంది ఒ గాయనిలా పాడాలని ఏ నాట్యం చూసినా తనువు పులకిస్తుంది నాట్య మయూరి లా ఆడాలని ఏ చిలిపి చేతలు చూసినా మనసు ఊహిస్తుంది కన్నెలామారిపోవాలని ఏవి లేని రాని తీరని మోడుకి రాదిక ఈ జన్మకి ఈ ఆనందలహరి
వేశ్యలకన్నా కడు హీనమైన జీవితం గడిపే ' ఆడబాప ' లని పరిచయం చేసిన నవల దాశరధి రంగాచార్య ' చిల్లర దేవుళ్ళు . ' సాయుధ పోరాటానికి పూర్వపు తెలంగాణాని కళ్ళముందు ఉంచిన ఈ నవల , ఆ కాలంలో ఆ ప్రాంతంలో అమలులో ఉన్న ' ఆడబాప ' ఆచారాన్ని అద్దంలో చూపించింది ' వనజ ' పాత్ర ద్వారా . తెలంగాణా లోని ఓ చిన్న పల్లెటూళ్ళో ఠీవిగా నిలబడ్డ దేశముఖ్ రామారెడ్డి గడీ ( భవంతి ) లో ఆడబాప వనజ , పుట్టుకతోనే దురదృష్టాన్ని వెంట తెచ్చుకున్న స్త్రీ .
సత్కర్మానుష్ఠానము వలన విశుధ్ధాంత : కరణుడైన పురుషునికి భగవత్తత్వ సాక్షాత్కారము కలుగును . వాని వలననే కాలము పరాజితమగును .
ఇక రెండవ ప్రశ్న , ఈ ప్రవాహగుణం కేవలం ఛందోబద్ధమైన పద్యాలకి మాత్రమే ఎందుకు వర్తిస్తుంది , వచన కవిత్వానికి మాత్రం ఇది అందం కాదా అన్నది . వచన కవిత్వం శబ్దసౌందర్యాన్ని తృణీకరించి వెలసిన రూపం . కాబట్టి అటువంటి కవిత్వానికి ధారతో పని లేదు . సూటిగా మనసుని తాకడమే దీని ధ్యేయం . అంచేత భాష పాఠకునికి ఎంత సన్నిహితంగా ఉంటే అంత గుణం .
పనిలేక చేస్తున్న పనులివి అని కొందరు తీర్మానించేసినా , " ఆఫీసులో పని ! కాస్త ఈ ఆర్టికల్ టైపు చేసిస్తావా ? " , " పుస్తకంలో వేయడానికి ఆర్టికల్స్ లేవు , మీకేమన్నా రాయడానికి వీలు పడుతుందా ? " , " రేపు ఊరెళ్తున్నా . ఇవ్వాళ వంట్లో బాలేదు . అక్కడికెళ్ళి , అది తెచ్చిపెట్టాలి . " - ఇలా అడిగీ అడగ్గానే సాయం చేసే స్నేహితులు . గంటలకొద్దీ లాప్‍టాప్ మీదున్నా విసుక్కోని ఇంట్లో వాళ్ళు .
ఇలాగే ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని పరిశీలించి సరి చేస్తే కవిత తప్పకుండా బాగుంటుంది . పవన్
సెప్టెంబర్ మాసం ప్రవేశించింది . మళ్లీ ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అనుకుంటూ ముసలోళ్లు గుండెల్ని అరచేతులతో పట్టుకొని గొణుక్కుంటున్నారు . రెండు రోజుల్నుండి ఎడతెరిపి లేని గాలివాన దుమారం . ముచికుందమ్మకు సిగమొచ్చింది . పురానాపూల్ కట్ట మైసమ్మకు కోపమొచ్చింది . అనంతగిరి పద్మనాభ స్వామి కొండలల్ల నుండి ముచికుంద గండిచెరువు మీదకు విరుచుకుపడింది . ఆ దెబ్బకు గండిచెరువు తాళలేక లంగర్‌హౌజ్ , అత్తాపురం , హైదర్‌గూడెం , ముష్క్ మహల్ , జియ్యోరుగూడెంలను ( నేటి జియాగూడ ) ముంచేస్తూ పాత వాలాద్రి మీదకి దూకి సవారీ చేసింది . పాత వాలాద్రి వెల్లువలో పూచిక పుల్లగా మునిగిపోయింది .
కొకు అలా ఎందుకు రాశాడు ? సాధారణంగా రచయితలు తమ రచనలని అందరూ చదవాలని కోరుకోటమే కాక అవి కలకాలం నిలవాలనుకుంటారు . అందుకు భిన్నంగా ఏ రచయితలూ వెలిబుచ్చని ఈ అభిప్రాయాలకి కారణాలు ఏమిటి ? ఈ ప్రశ్నకి రెండు రకాలుగా భాష్యం చెప్పుకోవచ్చు . మొదటిది నిజాయితీగా తన రచనలను దాటి పాఠకులు ఎదగాలని రచయిత కోరిక . ఇందులో రచయిత విశాల హృదయం , తన రచనలకున్న పరిమితులు తెలుసుకున్న విశిష్ట వ్యక్తిగా కొకు కనపడతాడు . రెండవది కొంచెం వ్యంగ్యంగా , కొంటెగా చెప్పుకొనే భాష్యం . నా రచనలను దాటి పాఠకులుగా మీరు ఎదగటం కష్టం . నేనేదైతే నా కాలంలో సమస్యలను నా రచనల్లో పెట్టానో , ఆ సమస్యలు తరవాత తరాలకు కూడా అనుభవంలోకి వస్తాయి ! అవి దాటి మీరు బయట పడనంత కాలం , నా రచనలకి కూడా ఉన్న ఒకే ఒక్క ప్రయోజనం ఇంకా మిగిలే ఉంటుంది .
ఆర్‌బిఓల పనిని స్థాయీ సంఘం చూస్తుంది . స్థ్థాయీ సంఘాలు చేసిన చర్చలపై జనరల్ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుంటుంది . ఆర్‌బిఓలు డేటాను సేకరించడం , వాటిని ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేసి ప్రజలకు చేరవేయడం , వివిధ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రతిపాదనలను పరిశీలించి సమీకృత ప్రణాళికను రచించడం , భారీ ప్రాజెక్టుల అమలును సమీక్షించే పనులు చేపడ్తాయి . అన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటే భారీ ప్రాజెక్టుల నిర్మాణం కూడా ఆర్‌బిఓలు చేపట్టవచ్చని కమిషన్ సూచించింది . ఆయా రాష్ట్రాల మద్య తలెత్తిన వివాదాలను ఆర్‌బిఓయే పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది . అలా సాధ్యం కానపుడే ఆ వివాదాన్ని జాతీయ జలవనరుల సమితికి గాని , ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేందుకై కేంద్రానికి గాని ఆయా రాష్ట్రాలు పంపవచ్చు అని కమిషన్ అభిప్రాయపడింది .
పంకజం పోయి ఏడాది తిరక్కుండానే బుల్లెబ్బాయి హార్టెటాకొచ్చి పోయాడు . ఆకాశం వారి మేడని ఎవరో కొనుక్కున్నారు . బుల్లెబ్బాయి బ్రతికున్నన్నాళ్ళూ ఎవరికీ అమ్మడానికి ఒప్పుకోలేదు . అలాని అతని దగ్గర డబ్బున్నా తనూ కొనలేదు . పంకజం గుర్తుగా అనుకున్నాడో ఏమో ఆ ఇంటిని అమ్మకం పెడదామని మద్రాసులో ఉన్న పంకజం అన్నగారు చాలా ప్రయత్నించి విఫలమయ్యాడు .
మన పరిసరాలలో ఉన్న ప్రాథమిక బలాలన్నిటికన్న ఈ గురుత్వాకర్షణ బలం వైనం మనకి ముందుగా అర్ధం అయింది . ఎందుకంటే దీని ప్రభావాన్ని మనం ప్రతిరోజూ అనుభవిస్తున్నాం కనుక . నూటన్ తర్వాత ఇరవైయ్యవ శతాబ్దపు ఆరంభంలో అయిన్‌స్టయిన్ ఈ సిద్ధాంతాన్ని కొద్దిగా సవరించి మెరుగులు దిద్దేడు . నూటన్ విశ్వంలో ఉన్న ఏ రెండు వస్తువులైనా ఎంత బలంతో ఆకర్షించుకుంటాయో లెక్క కట్టటానికి ఒక సూత్రం ఇచ్చేడు తప్ప ఆ రెండు వస్తువులు ఎందుకు , ఎలా ఆకర్షించుకుంటాయో చెప్పలేదు . అదేదో దైవ దత్తమైన లక్షణంలా ఒదిలేసేడు . అయిన్‌స్టయిన్ వచ్చి ఈ వెలితిని పూరించేడు . ఒక స్థలకాల సమవాయంలో గరిమ ఉన్న ఒక వస్తువుని ప్రవేశపెట్టినప్పుడు , తలగడ మీద బుర్ర పెట్టినప్పుడు తలగడ లొత్త పడ్డట్లు ఆ స్థలకాల సమవాయం లొత్త పడుతుందనిన్నీ , ఆ లొత్త చుట్టుపట్ల ఉన్న చిన్న చిన్న వస్తువులు ఆ లొత్త లోకి దొర్లినప్పుడు పెద్ద గరిమ గల వస్తువు చిన్న గరిమ గల వస్తువుని ఆకర్షించినట్లు మనకి భ్రాంతి కలుగుతుందనిన్నీ అయిన్‌స్టయిన్ చెప్పేరు . దీనినే సాధారణ సాపేక్ష సిద్ధాంతం ( General Theory of Relativity ) అంటారు .
ప్రకృతిలో శక్తి ఎల్లెడలా వ్యాపించి ఉంటుంది . ఇది అనేక రూపాలలో ఉంటుంది . ఉష్ణశక్తి , విద్యుచ్ఛక్తి , స్థితిశక్తి , గతిశక్తి , కాంతిశక్తి , యాంత్రికశక్తి మొదలైనవి . ఐతే ఈ శక్తులన్నింటికీ మూలం ఒకటే . ఒకే శక్తి వివిధ రూపాలు పొందినది . ఒక రూపంలో ఉన్న శక్తి మరో రూపంలోకి మారుతూ ఉంటుంది . ఏ రూపంలో ఉన్న శక్తి ఎంత పరిమాణంలో ఉన్నా , మొత్తం శక్తి యొక్క పరిమాణం మాత్రం స్థిరం . అది పెరగటం కానీ తగ్గటం కానీ జరగదు . శక్తిని కొత్తగా సృష్టించలేము . ఉన్న శక్తిని రూపుమాపలేము . మొత్తం శక్తి యొక్క పరిమాణం ఎల్లప్పుడూ స్థిరం . బహురూపాలలో ఉండే శక్తిని కేవలం ఒక రూపంలో నుండి మరో రూపంలోకి మాత్రమే మార్చగలం . ఇదే . రాజయోగం కూడా ఈ శక్తి నిత్యత్వ నియమాన్ని అనుసరించే నిర్మించబడినది . మనసు ద్వారా జగత్తులో ఎల్లెడలా పరివ్యాప్తమై ఉన్న శక్తిని ఆవాహన చేసి ఆ శక్తిని మనకు కావలసిన మరో శక్తి రూపంలోకి మార్చుకుంటాం . ఈ విధంగా మనస్సు ద్వారా శక్తిని ఆవాహన చేసే విధివిధానాలను వివరించేదే రాజయోగం . యశస్సు , సంపద , విజయం , అధికారం , భోగం ఇత్యాది రాజయోగలక్ష్యాలు శక్తి యొక్క వివిధ రూపాలే . శక్తి ఆవాహనా సాధనమైన మనస్సుకూడా శక్తి యొక్క రూపమే . అలాగే విధి కూడా శక్తి స్వరూపమే . అంటే మనస్సు ద్వారా ఆవాహన చేయబడిన శక్తిని రాజయోగ లక్ష్యాలైదింటిలో మనకు కావలసిన రూపానికి లేక రూపాలకు మార్చుకుంటాం . శక్తి ఆవాహన చెందిన బలీయమైన మనస్సుతో చేసిన సంకల్పాలకు విధిరూపంలో ఉన్న శక్తి అనుకూలత చెంది , ఆ సంకల్పాలు విజయవంతం అవటంతో మనకు రాజయోగ లక్ష్యాల రూపంలో ఉన్న యశోసంపదాది శక్తి రూపాలు సమకూరతాయి . మనస్సు ద్వారా శక్తిని ఆవాహన చేసి దానిని ఏ విధంగానూ రూపాంతరం చెందించని పక్షంలో అది తపశ్శక్తిగా మనలోనే ఉంటుంది . ప్రాచీన భారతంలోని ఋషులు ఈ విధంగానే తపశ్శక్తిని ఆర్జించేవారు . దానిని అనుభవింపదగిన భౌతికరూపాలలోకి మార్చుకోకుండా నిరాడంబరజీవన విధానంతో కాపాడుకుని అవసరాన్ని బట్టి తగిన సమయంలో లోకకళ్యాణార్ధమే వినియోగించేవారు . అసురులు అలాకాక తాము ఆర్జించిన తపశ్శక్తిని మితిమీరిన భోగాలకు , దుష్ట కార్యాలకు , పరపీడనకు వినియోగించి చివరకు శక్తి అంతా క్షీణించి , తిరిగి ఆ శక్తి స్వరూపమే అయిన విధి చేతిలోనే వంచితులై పతనమయ్యేవారు . విధిని గురించి నాస్తికుల వద్ద ప్రస్తావిస్తే ఇంతవరకూ దైవంతోనే వేగలేకపోతున్నాం మళ్ళీ ఈ విధి ఒకటా అని పరిహసిస్తారు . పాజిటివ్ గా అయితే కొందరు ఈ విధిని ' అదృష్టం ' అంటారు . కొందరు ' కలసిరావడం ' అంటారు . అదే నెగెటివ్ గా అయితే కొందరు దీనిని ' దురదృష్టం ' అంటారు . కొందరు ' ఖర్మ ' అంటారు . మరికొందరు ' తలరాత ' అంటారు . ఎవరు ఏమన్నా మానవాతీతంగా దైవం తరువాత ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే దైవంకన్నా కూడా ఎక్కువగా మానవజీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉన్న అంశంగా మనం ఈ విధిని గుర్తించవచ్చు . ఈ విధి శక్తి స్వరూపం . మానవుడు ఐహికంగా ఔన్నత్యాన్ని సాధించాలన్నా లేక ఇహలోక జీవితంలో ఏ విధమైనటువంటి విజయాన్ని సాధించాలన్నా కూడా ఈ విధి అనుకూలించినపుడు మాత్రమే చేయగలడు . విధి సహకారంలేనపుడు మానవుడు చిన్న విషయంలో కూడా విజయాన్ని సాధించలేడు . ఈ విధి మానవుడిని అందలాలు ఎక్కిస్తుంది ; అదఃపాతాళానికి అణగద్రొక్కుతుంది . యశోవంతుణ్ణీ చేస్తుంది ; అనామకుణ్ణి చేస్తుంది . అంతులేని భోగాలలో ముంచిలేపుతుంది ; చిత్రవధ చేసి చంపుతుంది . అనేక మహత్తర విజయాలనందిస్తుంది ; ఇసుమంత సామర్ధ్యం లేని నిర్వీర్యుణ్ణి చేస్తుంది . కుబేరుణ్ణి చేస్తుంది ; కుచేలుణ్ణీ చేస్తుంది . పండితుణ్ణి చేశ్తుంది ; పరమశుంఠనూ చేస్తుంది . ఐతే ఇవేవీ కూడ యాదృచ్ఛికంగా జరగవు . మన యెడల విధియొక్క ఆగ్రహానుగ్రహాల ననుసరించి మాత్రమే జరుగుతాయి . దీనివలననే మనం ఈ విధిని కాళి , చండి , దుర్గ మొదలైన శక్తి రూపాలలో పూజిస్తుంటాము . అంటే ఇంతకు ముందే చెప్పినట్లుగా ఇది ఒక రకంగా శక్తి ఉపాసన . దైవారాధనకు , శక్తి ఉపాసనకు ఉన్న తేడాను మనం ఈ విధంగానే గుర్తించాలి . మన యెడల ప్రసన్నమైన విధి మనకెన్నో వరాలను ఇస్తుంది . ప్రధానంగా మన సంకల్పాలు విజయవంతమయ్యే రూపంలోనే అదంతా ఉంటుంది . ఈ విధంగా కొన్ని సాధనల ద్వారా విధిని ప్రసన్నం చేసుకోవచ్చు . శాక్తేయులు చేసే శక్తి ఆరాధన మరియు తాంత్రికులు చేసే క్షుద్ర సాధనలవంటివి కావు ఇవి . సామాన్యజనులందరూ ఆచరించదగిన అతి సాధారణమైన ఆచరణలు . ఈ సాధనలను వివరించేదే రాజయోగం .
మనకంటే చిన్న , అమాయక , నిస్సహాయ జీవులను ఇంత అమానుషంగా చిత్రహింసలకు గురిచేసి , తద్వారా తయారైన ఉత్పత్తులను వాడడం ఎంత వరకు సమంజసం ? సగటు వాడకం దారునికి ఈ విషయాలు చాలా వరకు తెలియవు . అసలు సౌందర్య సాధనాల తయారీదార్లు ఆశ చూపినట్లు ఫలితాలు ఉండవన్న విషయమూ తెలియదు . వాడిన తర్వాత కూడా ఆశించిన ఫలితం కనబడక పోతే , తప్పు తమదనే అనుకుంటారు తప్ప సదరు ఉత్పత్తి ఉత్తుత్తిదని అనుకోరు . సౌందర్యాభిలాష సర్వత్రా , లింగ భేదంతో నిమిత్తం లేకుండా ఉందన్నది వాస్తవం . తమ డబ్బు , తమ చర్మం , తమ ఇష్టం అనుకుంటే ఇబ్బంది లేదు కానీ , అటువంటి తమ ఇష్టానికి కొన్ని జంతువులు చిత్రహింసలకు గురవుతున్నాయన్న విషయాన్ని గ్రహించాలి . మానవత్వంతో మసలుకోవాలి . మన సౌఖ్యం కోసం బలవుతున్న అల్ప జీవులపై కాస్త కరుణ , జాలి , సానుభూతి చూపించాలి . అవి జంతువులైనందుకు కాకపోయినా కనీసం మనం మనుషులమైనందుకైనా .
నిదరోతున్నా పడుకుంటున్నా . . ప్రియా నీకోసం కలకంటున్నా . . . టిరి టిరి టీన్ . . టీట్టీటిరిడీన్ టిరి టిరి టీన్ . . టీ ట్టీ టిన్ టిరి టిరి టీన్ . . టీట్టీటిరిడీన్ టీటిట్టి టిరి టిడిన్ [ అటు వెళ్తున్నా ] ఎపుడో ఆ దేవుడు రాసాడు . . నువ్వు నా గమ్యానివని . . . అపుడే నా గుండే ఫిక్స్ అయింది నువ్వు నా ప్రియసఖివని . . . టిరి టిరి టీన్ . . టీట్టీటిరిడీన్ టిరి టిరి టీన్ . . టీ ట్టీ టిన్ టిరి టిరి టీన్ . . టీట్టీటిరిడీన్ టీటిట్టి టిరి టిడిన్ [ అటు వెళ్తున్నా ] అదిగో ఆ కళ్ళల్లోని అందం . . . ఎవరికి ఉంటుందని . . అదిగో ఆ నడక చూస్తే . . . ఆ హంసైనా కుళ్ళుకుంటుందని . . టిరి టిరి టీన్ . . టీట్టీటిరిడీన్ టిరి టిరి టీన్ . . టీ ట్టీ టిన్ టిరి టిరి టీన్ . . టీట్టీటిరిడీన్ టీటిట్టి టిరి టిడిన్ [ అటు వెళ్తున్నా ] ఎపుడైనా మీ బాబు అంటాడు . . . . నేను వీడితో నీ పెళ్ళి చేయనని . . అపుడే నువ్వు అంటావు . . . ఈ పోకిరే నాకు కావాలని . . టిరి టిరి టీన్ . . టీట్టీటిరిడీన్ టిరి టిరి టీన్ . . టీ ట్టీ టిన్ టిరి టిరి టీన్ . . టీట్టీటిరిడీన్ టీటిట్టి టిరి టిడిన్ [ అటు వెళ్తున్నా ] నాకు చాలా సరదాగా అనిపించిందీ పాట . . " కాకి పిల్ల కాకికి ముద్దమ్మా ! అందుకే నీకు నచ్చింది " అన్నాడు . . అవునేమో అనుకున్నా . . అయినా సరే ! ఒకసారి మీ అభిప్రాయం కూడా చెప్పండి స్పోర్టివ్ గా నే తీసుకుంటాము . . : - ) * * * * * note : రాసిన పేపర్లు ఇక్కడ ఉంచుదామంటే స్కానింగ్ ఎదో ప్రాబ్లం చూపిస్తోంది . . కుదిరినప్పుడు ఆ పేపర్ ఇక్కడ ఉంచుతాను .
ఏనుగుల గుంపుల వంటి సమూహాలతో ద్రుపదుడు , తన బంధు , మిత్ర , హితులతో మహా భుజశక్తి గల పోరాట వీరులతో విరాటరాజు , మహా సైన్యంతో యాదవరాజు సాత్యకి , వీర ప్రసంగాలు చేస్తూ చేకితానుడు అనుసరించారు .
అన్వర్ గారు " " శీర్షికతో ఏప్రిల్ ఆరవ తేదీన వేసిన పోష్టు చూసి నాకు కలిగిన చిలిపి ఆలోచన " " . . . ఆయన గీసిన డ్రాయింగ్‌ని ఫొటోషాప్‌కి పట్టుకెళ్లి ఇలా ట్రై చేసాను . . . అంతే !
ఇంతకీ , మన రాష్ట్రం లో ఈ కార్యక్రమానికి " టెండర్లు పిలవడం " మాత్రమే పూర్తయ్యిందట - - మిగతాదంతా నత్తనడకే !
భారతదేశంలో , ఆ రోజు కాలెండర్లో 1969 వ సంవత్సరం జులై నెల 20 చూపిస్తోంది . అలాగే సరిగ్గా అదే రోజు అమెరికా చెరిత్రలో ఓ నాటకానికి తెరదించే ప్రయత్నం మొదలైంది . ఆనాటి యావత్ అమెరికా ప్రజలనే కాకుండా ప్రపంచ జనాభానే మభ్య పెట్టి ఆకాశానికి నిచ్చెనను వేసి చంద్రునిపై అమెరికా అంతరిక్ష వ్యామగోములైన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మరియు బజ్ అల్ డ్రిన్ పాదం మోపిన ( అబద్దపు ) నాటకాన్ని అత్యంత రసవత్తరంగా నాసా రచించడమే కాకుండా రెండున్నర గంటలు ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీల ద్వారా ఆనాటి జనాభా చెవులలో క్యాబేజీ అంత పూలు పెట్టి మరీ చూపించే సాహసం చేసిందంటే , అది విని పుస్తక పుటల ద్వారా చదువుకుని వారు చెప్పిందే వేదంగా తలచి తప్పుడు సమాచారాన్ని జీర్ణించుకో . . అంటే నేనేమన్నా టాటా డుకొమో వాడటం లేదనుకుంటున్నారా . .
మహా కవి రచనలలో ప్రముఖ స్థానము గడించిన ఈ తాంబూలము
కిరణ్ హ హ్హ అవును జయహో దగ్గర కి వచ్చేసరికి చాలా మంది ఇలానే గట్టిగా పాడేవాళ్ళం happy independence day రావు గారు మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు : )
బుట్టలవాడి భార్య : పది వేల బుట్టలట ! ఎవరిక్కావాలి , పదివేల బుట్టలు ! మనం ఇప్పుడు బ్రతుక్కోవటం లేదూ ?
చేయవు . వేరు చేయనప్పుడు కూడా అవి ఎండ పడేప్పుడు కిరణజన్య సంయోగక్రియ జెరిగేప్పుడు మాత్రమే ఆక్సిజన్ విడుదల చేస్తాయి . నిజానికి అవి రాత్రిపూటల్లో కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తాయి . ఇలా బలవంతపు కారణాలు వెతుక్కునేకంటే , అవి ఆకుపచ్చగా కంటికి ఇంపుగా ఉంటాయని చెప్పుకోవటం సముచితంగా ఉంటుంది .
సుమారు అరవై ఏళ్ళనుంచి అమెరికా ఇరాక్ లోను , ఆఫ్ఘనిస్తానులోనే కాకుండా , మధ్యప్రాచ్య దేశాలన్నిటిలోను తన ప్రభుత్వానికి అనువయిన ప్రభుత్వాలు స్థాపించాలని తహతహ పడుతూ ఉన్నది . " అనువైన " అంటే అసలు అర్థం ఏమిటి ? పశ్చిమాన ఉన్న తెల్ల దేశాలతో స్నేహయుతంగా ఉండడం ; రాజకీయాల్లోమధ్యే మార్గంగా ఉండడం ; తమ వ్యాపారానికి వ్యవహారాలకి అడ్డుపడకండా ఉండడం ; - ఆపైన ముస్లిం తీవ్రవాదులని అణిచిపెట్టి ఇజ్రాయల్ తో " శాంతి " యుతంగా ఉండే ప్రభుత్వాలు ఉండడం అని అర్థం ! ఈ పరంగా సాధ్యా సాధ్యాలు బేరీజు వేసుకొని చర్చించేముందు మధ్యప్రాచ్యపు పాత చరిత్ర నేర్పిన పాఠాలు తరచి చూడటం మంచిది .
ఇంట్లో కొత్తగా శాటిలైట్ టీవీ పెట్టించడంతో మాటీవీలో సూపర్ సింగర్ ఫైవ్ చూడ్డం మొదలెట్టాను . మరికొన్ని కార్యక్రమాల్ని కూడా రుచి చూసినా , నన్ను కొద్దిగా ఆకట్టుకున్న కార్యక్రమం ఇదొకటే . ముందొక డిస్క్లెయిమరు . నేను సాధారణంగా టీవీ చూడను . 2000 సంవత్సరంలో మానేశాను టీవీ చూడ్డం . అందుకని ఇటు అమెరికను ఐడల్ లాంటి కార్యక్రమాలు గానీ అటు పాడుతాతీయగా , వాయిస్ ఆఫ్ యూత్ , సూపర్ సింగర్ - ఇవేవీ చూసిన వాణ్ణి కాదు . మేము కనెక్షను పెట్టించేప్పటికే సీజను మొదలైపోయి కొన్ని ఎపిసోడ్లు జరిగిపోయాయి . ఆ తరవాతెప్పుడో యూట్యూబులో ఆ తొలి ఎపిసోడ్లు కొన్ని చూశాను . ముందుగా ఏంకర్ సాగర్‌నీ , అటుపైన టీం లీడర్లు ఐదుగుర్నీ పరిచయం చెయ్యడం కొంచెం అతి చేశారు . ఇది గనక నేను మొదట టీవీలోనే చూసి ఉంటే కచ్చితంగా ఈ కార్యక్రమం పట్ల శ్రద్ధ కలిగి ఉండేది కాదు , తరువాతి ఎపిసోడ్లని శ్రద్ధగా చూసేవాణ్ణి కాదు . అదలా మిస్సవడం మంచిదే అయింది . కాన్సెప్టు ఈ కాన్సెప్టు నాకు బాగా నచ్చింది . పోటీదారులు ఎవరికి వాళ్ళు టెన్షనుతో కూర్చోవడం , తమ వంతొచ్చినప్పుడు పాడి వెళ్ళిపోవడం కాకుండా ; ఐదు టీములు . ఒక్కోదానికీ కొంత ప్లేబాక్ అనుభవం కలిగిన ఒక లీడర్ , ఇద్దరు ఔత్సాహిక గాయకులు . ముగ్గురు న్యాయ నిర్ణేతలలో కోటి , చంద్రబోస్ రెండేసి టీములకి , గాయని సునీత ఒక టీముకీ మద్దతు నివ్వడం ( ఇలా జడ్జీలు పోటీదారులకి మద్దతు నివ్వడంలోని ఆంతర్యం నాకు అర్ధం కాలా . దీన్ని గురించి ఇంకొంచెం తరవాత ) . రౌండ్లు కూడా కొంచెం వినూతనంగా ఉన్నాయి . టీములుగా పాల్గోవడాన్ని బాగా ఉపయోగించుకునేట్టు రూపొందించారు . టీం లీడర్ల సోలో , జూనియర్ల సోలో , యుగళ గీతాలు , ముగ్గురూ కలిసి పాడిన బృంద గానాలు ; రకరకాలుగా - - మొత్తమ్మీద బాగా రుచికరంగా కార్యక్రమం రూపొందిందని చెప్పుకోవచ్చు . నేను సినిమాసంగీతాన్ని ఎప్పుడూ పెద్దగా పట్టించుకున్న వాణ్ణి కాను . పాతపాటలైతే ఆకాలంలో ఇష్టమున్నా లేకున్నా జనరంజని వినీవినీ ఏదో కొంత గుర్తుండిపోయాయి . కానీ గత ఇరవై ఏళ్ళలో వచ్చిన సినిమాపాటలైతే బొత్తిగా మనసుకి హత్తుకోలేదు . సినిమాలు విరివిగా చూస్తూనే ఉన్నా , ఎవరన్నా మిత్రులు పాట వినమన్నప్పుడు పాటలుకూడా అప్పుడప్పుడూ వింటూ ఉన్నా , ఏ పాటా ఇది బాగుంది అని నా దృష్టిని ఆకర్షించలేదు , అసలు ఇదో సంగీతమనే ఎప్పుడూ అనిపించలేదు . తీరా ఈ ప్రోగ్రాములో ఈ యువతీయువకులు పాడుతూ ఉంటే విన్నప్పుడు ఈ కొత్త పాటల్లో కూడా సంగీత విశేషాలు బాగున్నాయి , ఇది నిర్లక్ష్యం చెయ్యాల్సిన విషయం కాదు అని ఒక కనువిప్పయింది . ఇది నేనసలు ఎదురుచూడని పరిణామం . రేండం ఆలోచనలు టీం లీడర్లు ఐదుగురికీ ( గీతామాధురి , శ్రావణభార్గవి , శ్రీకృష్ణ , కృష్ణచైతన్య , దీపూ ) గొంతులు చాలా బావున్నాయి . ఐదూ విలక్షణమైన గొంతులు . కానీ సెమీఫైనల్సు లోనూ , ఫైనల్సులోనూ , ఒకటి రెండు చోట్ల బాగా పాడేరు గానీ , వీళ్ళు పాడగలిగినంత గొప్పగా పాడలేదనిపించింది . ప్రిలిం రౌండ్సులోనే , బహుశా కొంచెం రిలాక్స్‌డ్ గా ఉన్నారేమో , హాయిగా గొంతులు విప్పి పాడారు . జూనియర్లలో అమ్మాయిల గొంతుల్లో అస్సలు పరిపక్వత లేదు . కొంత మజ్జాగతమైన టేలెంటు ఉన్నది గానీ , ఈ ఐదుగురూ ఇంకా బాల సాధకావస్థలోనే ఉన్నారని నాకనిపించింది . జూనియర్లలో అబ్బాయిల గొంతులన్నీ విలక్షణంగా ఉన్నాయి . రేవంత్‌ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి . ఈ అబ్బాయి ఏది పాడినా ( తప్పులు పాడినప్పుడూ , అక్కడక్కడా సాహిత్యం మర్చిపోయినప్పుడూ కూడా ) నాకు చాలా నచ్చేసింది . ధీరజ్ కూడా , ముఖ్యంగా రాక్ ( rock ) బాణీలో ఉన్న పాటల్ని చాలా బాగా పాడాడు . ఈ అబ్బాయిలు ఐదుగురూ త్వరలో ప్లేబాక్ గాయకులుగా మనకి కనిపిస్తారు , సందేహం లేదు . జడ్జీలు కూడా నాకు బాగా నచ్చారు . కోటి పెద్దతరహాగా అందర్నీ ప్రోత్సహించిన తీరు బాగుంది . తప్పులెంచాల్సి వచ్చిన చోట సాహిత్య పరమైన తప్పుల్ని ఎక్కువగా చంద్రబోస్ , సంగీత పరమైన తప్పుల్ని సునీత వదలకుండా పట్టుకున్నారు . పాడుతున్నది సీనయర్లైనా , లేక జరుగుతున్నది ఫైనల్స్ అయినా , తప్పు తప్పే అన్నట్టు , మృదువుగానే , మనసు నొచ్చుకోకుండానే , ఐనా కచ్చితంగా తమ విమర్శని వినిపించారు . సునీత మాట్లాడే గొంతుకూడా నాకు చాలా నచ్చింది . ఆవిడ మాట్లాడుతుంటే హాయిగా అలా ఎంతసేపైనా వింటూ ఉండొచ్చు . ఆవిడ చాలా గొప్ప ప్లేబాక్ సింగరని విన్నాను గానీ ఆవిడ ఈ వేదిక మీద పాడిన పాటలు నాకు పెద్దగా నచ్చలేదు . చంద్రబోస్ అద్భుతంగా పాడతారని తెలుసుకోవడం ఒక రివెలేషన్ . వ్యాఖ్యలు చెప్పేప్పుడు ఈయన వీలున్నచోటల్లా ఏదో ఒక పదవిన్యాసం చెయ్యడం ( ఉదా . స్వ - రాకింగ్ ) కూడా సరదాగా ఉంది . ఈ కార్యక్రమం మొత్తానికీ అస్సలు చలించని పునాదిలాగా ఉండి ఆద్యంతమూ అత్యుత్తమ స్థాయిలో పని చేసిన వారు ఆర్కెస్ట్రా సభ్యులు . అందరూ చాలా గొప్పగా చేశారు కానీ , వేణువు వాయించిన ఆయన్నీ , కీబోర్డ్స్ వాయించిన ఇద్దరినీ ప్రత్యేకంగా అభినందించాలి . కార్యక్రమం నడుస్తుండగా పార్టిసిపెంట్లూ , జడ్జీలూ ఈ వాద్య బృందానికి అభినందనలు చెప్పుకున్నారు గానీ , కనీసం ఒక్కసారైనా వీళ్ళని పేరుపేరునా పరిచయం చేసి ఉండాలిసింది . అది చెయ్యకపోవడం పెద్ద లోపం . ఏంకర్‌గా , సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తమ్ముడూ , స్వయంగా గాయకుడూ సాగర్ , కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించాడు . అతనికి ఏంకరింగ్ కొత్త కావడం వల్లనూ , అతను సహజంగా పెద్ద మాటకారి కాకపోవడం వల్లనూ ( కనీసం నాకలా అనిపించింది ) కొంచెం వొద్దికగా చేశాడు . తామే పెద్ద పిస్తా అనుకునే ఏంకర్ల దెబ్బ ఆల్రెడీ రుచి చూశాను మరి కొన్ని కార్యక్రమాల్లో . వాటితో పోలిస్తే సాగర్ కొత్తదనం ఫ్రెష్గా అనిపించింది . చివరి ఎపిసోడ్లలో ఎవరెవరో స్పెషల్ గెస్టులు రావడం మొత్తానికి కొంచెం చిరాకు కలిగించింది . ఒక పక్కన గాయనీ గాయకులు ఈ హడావుడికి కొంత తడబడినట్టు అనిపించింది . ఇంకో పక్క కేమెరా అతను పిచ్చ పట్టినట్టు మాటిమాటికీ ఈ గెస్టుల మొహాలు క్లోజప్ చూపించడం - వాళ్ళేమో ఏంటో నెర్వస్ గా అటూ ఇటూ కదుల్తూ ఉండడం . అప్పటికి ఆరేడు వారాలుగా ఈ కార్యక్రమం చూడ్డం ఒక హాయైన అనుభవంగా ఉన్నది కాస్తా చివర్లో తన ఫోకస్ కోల్పోయి కంగాళీ అవకతవగ్గా తయారైంది . ది సింగింగ్ పార్టీ అని టేగ్ లైన్ పెట్టుకున్నందుకు కేవలం ఇంకో పాటల పోటీ లాగా కాకుండా ఆద్యంతం నిజంగానే ఒక పార్టీలాగా , సరదాగా , హాయిగా , అలరిస్తూ , ఆహ్లాదం కలిగిస్తూ జరిగింది కార్యక్రమం .
నారాయణ గారి భుజాన్ని ' సెభాష ' ని తట్టారట . ఆ కారణంగా అప్పట్లో కొన్నాళ్ళు , వారు నడుం నొప్పితోనూ , భుజం నొప్పితోనూ తీయని బాధననుభవిస్తూ అరుగు వైపు రాలేక పోయారట .
శ్రీశైలం మల్లన్నను సేవిస్తే చాలును చింతలన్ని తొలగిపోయి జీవితమే విరబూయును ।
ఏమిటీ దారుణం ? ? ఎందుకీ మారణహోమం ? ? ఏం చేస్తుందీ ప్రభుత్వం ? ? ఏమీ చేయలేని నిస్సహాయత ఎందుకు ? ? బ్రతుకు భీభత్సం చేయడమే లక్ష్యమా ? ? తీవ్రవాద చరిత్రలోనే అతి దారుణమయిన సంఘటన జరిగిన రోజుగా , ఈ రోజు చరిత్రలో నిలిచిపోవడం ఖాయం . తీవ్రవాదములోనే ఒక వినూత్న పద్దతిని ప్రవేశపెట్టి , జనాన్నిభయ భ్రాంతులకి గురి చేసే సంఘటన . పోలీసు జీపులోనుంచి యథేచ్ఛగా కాల్పులు జరిపిన తీవ్రవాదం . హాస్పిటల్ల మీద బాంబులు విసరడం . ఇవన్నీ తలుచుకుంటేనే వెన్నుపూసలోంచి సన్నగా భయం పుట్టుకొచ్చి ఒళ్ళంతా వణుకుతుంది . ఏ పని మీద దృష్టి పెట్టలేకపోవడం , ఏది చేసినా ఈ దారుణమే గుర్తురావడం , మనస్సు పడే అవేదన ఎవరికి చెప్పను . చెప్పడానికి మాటలు కూడా రావట్లేదే ? ? అయ్యో భగవంతుడా , ఏమిటయ్యా నీ లీలలు . . ఇంతా జరుగుతుంటే ఎక్కడున్నావయ్యా ? ? పూర్వ జన్మ పాపం అని సరిపెట్టుకుందామంటే మనస్సొప్పుకోవట్లేదేమయ్యా ? ? కరాచీ నుంచి బోటులో తీవ్రవాదులు రావటం ఏమి విచిత్రం ? ? అంత సులువుగా బోటులో ఆయుధాలేసుకొనెచ్చేసారే , ఇక ఈ దేశంలో భద్రత ఎక్కడుంది . ఇదేదో గోలకృష్ణ సినిమాలలోనే జరుగుతుందనుకున్నాను కాని , నిజంగా జరగుతుందని కలలో కూడా అనుకోలేదే . ఏ చానల్ చూసినా ఈ కుల మత విచక్షణ చేసి మృతులను విడదీయడేమిటీ . అందరూ ఐక్యంగా ఉండాల్సిన సమయంలో ఏమి ఈ లెక్కలు స్వామీ ? ? మానవత్వం అని ఒకటుందనే మర్చిపోయినట్టున్నారే ? ? ఒక పక్క ఆర్థిక సంక్షోబంలో దేశం , ప్రపంచం కొట్టి మిట్టాడుతుంటే మధ్యలో తీవ్రవాదం నేనూ ఉన్నానని పలకరిస్తోందా ఏమిటీ ? ? హయ్యో ఏమి ఈ బాధ , తట్టుకోలేకున్నానే . ఇలా భయపెట్టడమే తీవ్రవాదులు లక్ష్యమైతే వారి కోరిక నెరవేరినట్టే . ఎంతో దూరాన ఉన్న నాకే ఇంత భయం వేస్తుంటే , అక్కడ ఉన్న జనం ఇంకెంత భయపడుతున్నారో . ఏంటో మొదలెట్టి , ఏదో చెప్పి , ఎలా ముగిస్తున్నానో నాకే అర్థం అవ్వట్లేదు . ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలకు కొరత లేకుండా చూడాలని ఆ పరమాత్మకి దణ్ణం పెట్టుకోవడం తప్ప నేనేమి చెయ్యగలను . ఈ నిస్సహాయతని చూస్తే నా మీద నాకే అసహ్యం వేస్తోంది .
ఆ మేరుగిరిపై ఇంద్రాది దేవతలుంటారు . కొండ సానువుల్లో బ్రహ్మసరస్వతులు , పార్వతీపరమేశ్వరులు విహరిస్తుంటారు .
తెల్లబోయి చూస్తున్న వినాయకుడిని జాలిగా చూస్తూ , " సెలవు , " అన్నది సిధ్ధి .
ఆది ఈ ఇరయ్యెనిమిదిన సార్ ! ( గూట్లోంచి పెళ్ళి కార్డ్ , పెన్ను తెచ్చి , ఒక కార్డ్ మీద రాసి క్రిష్ణకిచ్చి ) ఇదా కార్డు ! తప్పకుంట రావాలి !
ఈ పరిస్థితి ఇప్పటికే కనిపిస్తూ ఉంది . మా చిన్నప్పుడు మా చిన్నపల్లెలోనే వందల్లో పశువులుండేవి , నేడు పదుల సంఖ్యలోకి చేరాయి . అన్ని పల్లెల్లోనూ ఇదే పరిస్థితి .
వాళ్ళు రాకపోవడం బీబమ్మకు సంతోషంగా ఉంది . చాంద్‌కు సంతోషంగా ఉన్నా లోలోపల భయంగా ఉంది . ఇద్దరూ ఇంట్లకూ బయటకు తిరుగుతున్నారు . అడుగుల చప్పుడైతే ఇమామ్ అనుకుని చూస్తున్నారు . గురక వినిపిస్తే షాదుల్ అనుకుని ఉల్కిపడుతున్నారు .
ప్రభగారు , బహుశా అవి తక్కువగా చదివిన టపాలు అయ్యుంటాయి . కనుక్కుని చెప్తాను . క్రైటీరియా అంటే ఏ విభాగంలో మీరనేది . హారంలో ఏ విభాగం కూడా manual గా జరగదు .
చక్కెెర కుంభకోణాలు : 1993లో భారత ఆహార సంస్థ కోర్కె మేరకు 6 లక్షల టన్నుల చక్కెర దిగుమతి కోసం రూ . 300 కోట్ల విలువ గల గ్లోబల్ టెండర్‌లను పిలిచాడు . నాటి ఆహార శాఖా మంత్రి కల్పనాథ్ రారు చక్కెర మిల్లు యజమానుల ప్రయోజనాలను కాపాడడానికి టెండర్లు పిలిచినా ఆహార శాఖ కార్యదర్శి అశోక్ చంద్రసేన్‌ను మందలించి దిగుమతులు జరుగకుండా అడ్డు పడ్డాడు . దిగుమతును అడ్డు కోవడం ద్వారా మంత్రి మిల్లు యజమానులతో కుమ్మక్కయ్యాడు . స్థానికంగా చక్కెర ధర కిలో రూ . 1 . 75 పెంచడం వల్ల ప్రజలపై రూ . 230 కోట్ల భారం పడింది . తిరిగి 2010లో కేంద్ర వ్యవసాయశాఖా మాత్యులు శరద్‌పవార్ నేతృత్వంలో దేశీయ పంచదారను కిలో రూ . 14 చొప్పున ఎగుమతి చేసి రూ . 28ల చొప్పున దిగుమతులు చేసుకున్నారు . ప్రతి ఎగుమతి - దిగుమతి సందర్భంగా కుంభకోణాలు కొనసా గుతూనే ఉన్నాయి .
ఈ దొంగతనాలకు ఇంకో కారణం కూడా వుంది . అంగడి యజమానులు మమ్మల్ని రెచ్చగొట్టేవాళ్లు . మేం దొంగతనం చెయ్యడానికే వస్తామని నమ్మేవాళ్లు . ఇండియన్లు అంగడిలోకి వెళితే యజమానో , సేల్సుమ్యానో గద్దల్లా గమనిస్తూ వుంటారు . చేతులు కట్టుకుని , రెండు అడుగుల దూరంలో నిలబడి చూస్తూ వుంటారు . ఏదైనా వస్తువు ఏరుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటే , వెంటనే పక్కన నిలబడి , " ఏమైనా సహాయం కావాలా ? " అని అడుగుతారు . సహాయం చెయ్యాలని వాళ్ల మనసుల్లో ఏకొశానా వుండదు .
స్త్రీ పురుషుల మధ్య , వివిధ వర్గాల మధ్య , తరాల మధ్య , మనుషుల మధ్య ఇంకా ఎన్నో గోడలున్నాయి . వీటికి మూలం మన కర్మలోనో , మానవుడికి అతీతమైన మరో శక్తిలోనో వున్నాయనే నమ్మకాలున్నాయి . అవి వున్నంతకాలమూ కుటుంబరావు రచనలకి ప్రయోజనం ఉంది . ఆ గోడలు కూలినపుడు , వాటితోపాటు ఆయన రచనలూ కాలగర్భంలో కలిసిపోతాయి . అప్పుడు కుటుంబరావు కన్నా ఎక్కువగా సంతోషించే వాళ్ళుండరు .
రాష్టస్థ్రాయి తెలుగు కథా రచయితలనందరినీ ఒకేవేదికపైకి తీసుకువచ్చే ఉద్దేశ్యంతో ఓ వెబ్సైట్ కూడా ఆయన ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది . హిమగిరి అంత ఎత్తుకు ఎదిగిన ఆయన ఖ్యాతిపర్వంలో మంచుబిందువంత మనం తెలుసుకునేదంతా … ' నేలవిడిచి సామును చేయను … నేను నమ్మిందే నమ్మకంగా చేస్తా ' నంటారు … విముక్తి - పెద్ద కథానికల సంపుటి , కస్తూరి - గొలుసు కథానికల సంపుటి , పే ( చీ ) జీ కథలు ( సింగిల్ పేజీ కథలు ) , ఈ ' కాలమ్ ' కథలు ( కాలమ్ … కథలు ) , వయసు కథలు - ( ఒకే అంశంతో కూడినవి ) ఇలాంటి సాహిత్య వినూత్న ప్రక్రియలెన్నో రాంబాబు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు . అలాగే ఉస్మానియా యూనివర్సిటీ ఎం . ఏ . లో నాలుగు శతాబ్దాల నగరం , కథానికా సదస్సు , కొత్త కథానిక , కథన రంగం వంటి రాంబాబు రచనలు పాఠ్యాంశాలుగా , విద్యార్థుల పరిశోధనాంశాలుగా కొనసాగడం విశేషం .
మందు మంత్రంబులను నీలమనుజవరుని లోలు గావించి కలధనం బోలి లాగి పిదప జోగిగ గావించి మదముడించి తెత్తు మీసన్నిధి నా ప్రతిజ్ఞ వినుడు
ప్రతీ చాదస్తం దేవుడే ఏదో ఒక రూపంలో గోకుడే పుట్టుకతోనే పుట్టునీపుండు అగపడక అంతరంగాననుండు ( ఇంకా … )
మీ కంప్యూటర్లో ఎంత మెమరీ ఉన్నా , ఎంత శక్తివంతమైన కంప్యుటర్ అయినా ఒకేసారి పలు అప్లికేషన్ ప్రోగ్రాములను సుదీర్ఘ కాలం పాటు ఓపెన్ చేసి పెట్టడం వల్ల సమయం గడిచేకొద్దీ పనితీరు నెమ్మదిస్తుంది . అలాంటప్పుడు కంప్యుటర్ ని రీస్టార్ట్ చేస్తేనే తిరిగి ఊపండుకుంటుంది . ఇలా స్లో అయినప్పుడు రీస్టార్ట్ చేసే అవసరం లేకుండా ఒ చిట్కా పాటించవచ్చు . డెస్క్ టాప్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసి New > Shortcut అనే ఆప్షన్ ని ఎంచుకుని Type the location of the item బాక్స్ లో క్రింది కమాండ్ ఉన్నదున్నట్లు టైప్ చేయండి . % windir % system . 32 \ rundll32 . exe advapi32 . dll , ProcessIdleTasks ఇప్పుడు Next అని ప్రెస్ చేసి ఆ షార్ట్ కట్ కి Memory Cleaning లేదా మీకు నచ్చిన పేరు ఇవ్వండి . ఇకపై సిస్టం స్లో అయిందని భావించినప్పుడల్లా ఈ షార్ట్ కట్ ని ఉపయోగించండి . మెమరీలో మొండిగా కూర్చున్న టాస్క్ లు , త్రేడ్ లు క్లోజ్ చేయబడి మెమరీ ఫ్రీ చేయబడుతుంది .
అసలు మ్యాచ్ ఫిక్సింగులలో ఈ తెల్లకోటు కుర్రాళ్ళకు కూడా వాటాలు రావటం మొదలుపెట్టాయా ?
నమస్తుభ్యం వసుప్రదే శ్రీసారసపదే రసపదే సపదే పదే పదే ॥ భావజజనకప్రాణవల్లభే సువర్ణాభే భానుకోటిసమానప్రభే భక్తసులభే । సేవకజనపాలిని శ్రితపఙ్కజమాలిని కేవలగుణశాలిని కేశవహృత్కేళిని ॥ శ్రావణపౌర్ణమీపూర్వస్థశుక్రవారే చారుమతీప్రభృతిభిఃపూజితాకారే । దీనజనసంరక్షణనిపుణకనకధారే । భావనాభేదచతురే భారతీసన్నుతవరే । కైవల్యవితరణపరే కాఙ్క్షితఫలప్రదకరే ॥ * * * వసుప్రదే సారసపదే రసపదే సపదే పదే పదే శ్రీవరలక్ష్మి తుభ్యం నమః ॥ పదే పదే సపదే ॥ శ్ర్యుత్తమగుణశోభితా చ వరదా చాసౌ లక్ష్మీశ్చ శ్రీవరలక్ష్మీ । నమస్తుభ్యం తే నమః । వసూః ధనధాన్యసంతానసౌభాగ్యాదీన్ ప్రదదాతీతి వసుప్రదా । సారసమివ పద్మమివ పదమఙ్ఘ్రిః యస్యాస్సా సారసపదా । రసః శోభా యస్యాః పదే గమనే సా రసపదా । సం జ్ఞానం పం రక్షణాం దాతీతి సపదా । అత్ర జ్ఞానరక్షణే దేహీతి చార్థః । పదే పదే సదా సర్వత్ర ॥ శ్రీవరలక్ష్మీ , సమస్తసౌభాగ్యాలనూ ఇచ్చే తల్లీ , కమలములవంటి పాదములు కలదానా , అడుగులయందు అందము కనబరచుదానా , ఎల్లప్పుడూ జ్ఞానాన్నీ రక్షణనీ ఇచ్చుదానా , నీకు నమస్కారము . భావజస్య మన్మథస్య జనకః పితేతి భావజజనకః విష్ణుః తస్య ప్రాణవల్లభా ప్రియవధూః ఇతి భావజజనకప్రాణవల్లభా । సువర్ణ ఇవ ఆభా రుచిః కాన్తిః యస్యాస్సా సువర్ణాభా । భానూనామాదిత్యానాం కోటిః భానుకోటిః మానే గణనే సమేతి సమానా భానుకోటిభిః సమానా ప్రభా కాన్తిః యస్యాస్సా భానుకోటిసమానప్రభా । భక్తానాం అనాయాసేన లభ్యేతి భక్తసులభా । సేవకజనాన్ భృత్యగణాన్ పాలయతీతి సేవకజనపాలినీ । శ్రితేభ్యః నతేభ్యః పఙ్కజైః పద్మైః కలితాం మాలాం యా ధార్యతే సా శ్రితపఙ్కజమాలినీ । కేవలాః అనితరసాధ్యాః గుణాః యస్యాం సా కేవలగుణశాలినీ । కేశవస్య విష్ణోః హృత్కేళినీ మానసోల్లాసినీతి కేశవహృత్కేళినీ ॥ మన్మథుడి తండ్రియైన విష్ణుమూర్తికి ప్రియురాలా , బంగారు మేనిఛాయ కలిగినదానా , కోటిసూర్యులకు మేటియైన కాంతి కలదానా , భక్తసులభురాలా , సేవకజనులను ప్రీతితో పాలించుదానా , సరోజమాలికను ధరించినదానా , అనితరసాధ్యమైన గుణసంపత్తి కలదానా , కేశవునికి మానసోల్లాసము కలిగించుదానా . . . శ్రీవరలక్ష్మీ , నీకు నమస్కారము . శ్రావణమాసే పౌర్ణమీతిథ్యాః పూర్వం సమీపే స్థితే శుక్రవారే శ్రావణపౌర్ణమీపూర్వస్థశుక్రవారే । ఏతస్మిన్ దినే । చారుః మనోజ్ఞా మతిః యస్యాస్సా చారుమతీ ఏతావత్ సర్వాభిశ్చ చారుమతీప్రభృతిభిః పూజితః సేవితః ఆకారః మూర్తిః యస్యాస్సా చారుమతీప్రభృతిభిఃపూజితాకారా । దేవాదిభిః గురుగుహేన సుబ్రహ్మణ్యేన చ సమర్పితః మణిమయహారః యయా ధార్యతే సా దేవాదిగురుగుహసమర్పితమణిమయహారా । దీనజనానామకిఞ్చనానాం సంరక్షణార్థం కనకం హేమం ధారేవ వృష్టీవ ప్రదానే నిపుణా చతురా ఇతి దీనజనసంరక్షణనిపుణకనకధారా । భావనానాం చిత్తవృత్తీనాం భేదనే నిరోధే చతురా నిపుణేతి భావనాభేదచతురా । భారత్యా వాణ్యా సన్నుతా బహుధా స్తుతా వరా ఉన్నతా శక్తిః భారతీసన్నుతవరా । కైవల్యం మోక్షం వితరణే దానే పరా నిమగ్నా కైవల్యవితరణపరా । కాఙ్క్షితం కామితం ఫలం ప్రదాయకః కరః వరదహస్తః యస్యాస్సా కాఙ్క్షితఫలప్రదకరా ॥ శ్రావణపౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారమునాడు ( వరలక్ష్మీవ్రతము చేసికొనే రోజు ) చారుమతులైన సువాసిన్యాదులచే పూజించబడుదానా , గురుగుహాదులచే ఈయబడిన మణిహారమును ధరించుదానా , దీనులను రక్షించుటయందు నిపుణురాలా , చిత్తవృత్తులను నిరోధించుటయందు చతురురాలా , సరస్వతిచే కొనియాడబడినదానా , కైవల్యాన్నిచ్చేదానా , కామితఫలములను ఒసగు వరదహస్తము కలదానా . . . శ్రీవరలక్ష్మీ , నీకు నమస్కారము . * * * గురుగుహముద్రాఙ్కితా ముత్తుస్వామిదీక్షితస్య కృతిరియం శ్రీరాగరూపకతాళాభ్యాం గీయతే ॥
గొరుసు జగదీశ్వరరెడ్డి గారు రాసిన చీడ , గజ ఈతరాలు , బతుకుగోస , ఖాయిలా బతుకులు వంటి కథలు కథా ప్రియులందరూ చదవలసిన కథలు . ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వలన ఏర్పడిన అనర్థాలు , చితికిన కుటుంబాలనే కాక తను కూర్చున్న కొమ్మను తనే నరుక్కునే మనిషి బాధ్యతారాహిత్యాన్ని , స్వార్థాన్ని కూడా రచయిత స్పష్టంగా చూపిస్తాడు ఈ కథల్లో . ముఖ్యంగా చీడ , జగదంబ జంక్షన్ కథలు రచయిత చూపించిన జీవితం పరంగా , తెలుగులోని ఏ గొప్ప కథలకు తీసిపోని కథలుగా నిలిచాయి .
ఆనంద కుమార్ - - బీటీ ప్రకృతి ఇచ్చిన వరం అనీ , ఇది అభివృధ్ధి చెందడానికి లక్షల యేళ్ళు పట్టింది అనీ ఇది మనుషులకీ , పశువులకీ హాని చేస్తుందని జరుగుతున్న ఆందోళనలు చేయిస్తున్న స్వచ్చంద సంస్థలు వాటికోసం డబ్బు ఖర్చు పెట్టడం తప్పనీ అంటూ , తన మాటల్ని తానే ఖండించుకుంటూ మాట్లాడిన వైనాన్ని గమనించండి .
ఎవరైనా కాళ్లు , చేతులు కొట్టుకుంటేనే , కిందపడిపోతేనే వారు ఫిట్స్‌తో బాదపడు తున్నారు అనుకుంటాం . ఇలా అందరికి జరగదు . ఫిట్స్ లక్షణాలు ఎలా ఉంటాయంటే . . . . ఉన్నట్లుండి చేస్తున్న పని ఆపి 20 నుంచి 30 సెకన్లు బొమ్మలాఉంటారు . ఈ సమయంలో వీరిని పలకరించినా మాట్లాడరు . ఏమైందని అడిగితే నాకేంమైందని ఎదురు ప్రశ్న వేస్తారు . ఏమీ గుర్తుండదు . మనం గమనించాల్సిందే . ఆ సమయంలో వీరు చేతులు నలపడం , మింగినట్లు చేయడం , మూతి చప్పరించడం చేస్తుంటారు . చూసే వారికి ఎందుకిలా చేస్తున్నారనుకుంటారు . కానీ ఫిట్స్ అని తెలుసుకోలేరు . ఇలా అస్తమానం చేస్తుంటే ఫిట్స్ అని అర్థమవుతుంది . ఈ క్రమంలో కాళ్లు , చేతులు కొట్టుకుంటారు . ఇది ఫిట్స్ సంబంధించేమోనని భావించి వైద్యున్ని సంప్రదించాలి .
గాడ్రెజ్ కంపెనీ తన ఆఖరి టైప్ రైటర్ ఫ్యాక్టరీని కూడా మూసేసిందే ?
తర్వాత టెంత్ ఫేయిల్ అయ్యాను . మళ్ళీ పరీక్ష రాసి పాస్ అయిన . పేదరికం అలా వెంటాడుతూనే ఉంది . ఇంటర్మీడియట్ చదవాలి . డబ్బుల్లేవు . చదువుకోవాలని బాగ ఇష్టం ఉంది . టెంత్ మొదటి సారి రాసి ఫేయిల్ అయ్యి తర్వాత పరీక్ష రాసి పాస్ అయ్యాక నా ఆలోచన చదువు వైపు మళ్ళింది . మనమెందుకు ఫేయిల్ అవుతం . మనమెందుకు తక్కువ ఉండాలే దీనిలో . చదువుల కూడా ఇంటరెస్టు తీసికొంటే బాగ చదవొచ్చు కదా అనే ఆలోచన మొదలయ్యింది . దానికి తోడు నాకు హైదరాబాదు కు పోవాలి అనే పెద్ద కోరిక ఉండేది . హైదరాబాదుల చదువుకోవాలని పెద్ద ఇష్టం . అమ్మ కు చెప్తే అమ్మ నాన్నకు చెప్పింది . ' ఎట్లరా ' అన్నడు నాన్న . అమ్మ దగ్గర కమ్మల జత , కడియాలు ఉండె . అవి రెండు తీసికొచ్చి నా కిచ్చింది . అందుకే నేనో పాటలో రాసిన . ' కడియాలు కమ్మలమ్మి కొడుకుల చదివించినాను మంచంలో ఉండి వాళ్ల మంచి చెడ్డ చెప్ప పోతే ఆడోళ్ళకు తెల్వదే మమ్మీ అని లెక్కే చెయ్యరైరి ఆడిదాన్నిరో నేను ఆడి దాన్ని ఈడ ఎవ్వరికి కాని దాన్ని నేను ఏడి దాన్నిరో ' అని రాసి నప్పుడు ఈ కడియాలు కమ్మలు అనేవి మా అమ్మ నాకిచ్చినవే . అంటే ఒక రచయిత తన జీవితాన్నే తన రచనకు సబ్జక్టు గా మార్చుకుంటడు అనే దానికి ఉదాహరణ - మీ రన్నారు కద ఒక రచయిత తన జీవితాన్ని తన రచనలో ప్రతిఫలిస్తే గొప్ప ఫైర్ ఉంటుందని - అది స్పష్టంగా చూడొచ్చు నా అనేక పాటల్లో . ఆ మొత్తం అమ్మితే నాకు నూటపదో నూట ఇరవయ్యో రూపాయలు వచ్చినయి . అవి తీసుకోని హైదరాబాదుకు వచ్చేసిన .
నీల వర్ణమందు నిగనిగలాడుచున్ మెరసిపోవుచుండె మిలమిలమిల … ' జల్లెడ ' గొనియున్న సరిక్రొత్త రూపమ్ము ! నవ్య శిల్పికి అభినందనములు ! ! - డా . ఆచార్య ఫణీంద్ర
రాజా నచ్చడమా ! అస్తమానూ అదే పని . అలా అని మాట్టాడ్డు . . వింటాడు .
ఆమెకి తన గత జీవితం అంతా ఒక్కసారిగా కళ్ళముందు మెదిలింది . అలాటి బతుక్కి ఇలాటి చావా ?
ఇటువంటి ఆదర్శ ప్రపంచం ఉందని అంగీకరిస్తే నైతిక విలువలు విశ్వజనీనంగానూ , కేవలమయినవి గానూ , కాలానికీ , ప్రదేశానికీ సాంఘిక , సాంస్కృతిక పరిసరాలకూ సంబంధం లేకుండానూ ఉంటాయని ఒప్పుకోవాలి . ఈ విలువలను కొన్ని సూత్రాలద్వారా రూపొందించారు . ఆ సూత్రాలు వాస్తవిక ప్రపంచంతో సంబంధం లేనివి . మానవుడి స్వేచ్ఛనూ గౌరవాన్నీ గుర్తించని సూత్రాలే . అవి వ్యక్తి వికాసం , ఆనందంతో నిమిత్తం లేకుండా ఈ విలువలు ఉంటాయన్న మాట . పరోక్షంగానైనా , అనుభవానికి గురిచేయకుండా , ఈ సిద్ధాంతానికి సంబంధించిన మూల సూత్రాలున్నాయి . ఇందులో వాస్తవాలకు చోటు లేదు . ద్రష్ట మాటలే ప్రమాణాలు . ఈ పంథాకు తార్కిక ఫలితం ఏమిటంటే , మానవజీవితానికి సంబంధించిన అన్ని రంగాలలోనూ సిద్ధాంతపరమయిన నియంతృత్వం ఉంటుందన్నమాట . ప్లేటోకు ఈ విషయం తెలుసు . అయినా సరే అది అవాంఛనీయమని అతడు భావించలేదు . అలౌకిక సూత్రాల నుంచి విలువలకు రూపెందిస్తే మారుతున్న మానవ పరిస్థితులకు సంబంధం లేకుండా ఈ విలువలు దిగజారిపోయే ప్రమాదం ఉంది . భారతదేశంలో ఇటువంటి నైతిక సిద్ధాంతం కొత్తకాదు . వివాహంతో నిమిత్తం లేకుండా ఒక స్త్రీ బిడ్డను కంటే , తల్లిగానూ , పౌరురాలుగానూ ఆమె ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ , చాలామంది భారతీయులు , అటువంటి స్త్రీని అవినీతి పరురాలుగానే ఇంకా భావిస్తున్నారు . ఒక బ్రాహ్మణుడు ఎంత పెడితుడైనప్పటికీ , తోటివారికి నిస్వార్థంగా ఎంత సేవచేసినప్పటికీ , అతడు గనక మాంసాన్ని తింటూ , మద్యపానం సేవిస్తే సనాతనుల దృష్టిలో అతడి గుణాలెందుకూ పనికి రాకుండా పోతాయి . తనను తాను బలిచేసుకోవటమే ధర్మంగానూ , సమాజంలో ఆధిపత్యం వహిస్తున్న ప్రమాణాలను పాటించటమే మంచి ప్రవర్తనగానూ భావిస్తున్నారు . సత్యం , సుందరం , మంచితనం అనేవాటికి అధిభౌతిక అర్థాలు సమకూర్చారు . మానవులందరికీ మార్గదర్శకులమంటూ కొందరు బయలుదేరి చెబుతున్నారు . నైతిక విలువలను వివేచనాత్మక విశ్లేషణకు , ప్రాపంచిక అనుభవానికి గురిచేయకుండా , పురోహితుడి బోధనలాగ మార్చి వేశారు . మానవుడి ఆశలు , కోర్కెలతో నిమిత్తం లేకుండా గుడ్డిగా బయటివారి పెత్తనానికి లోబడి , విలువలను అంగీకరించాలంటున్నారు . నైతిక అన్వేషణ ఇలా వక్రమార్గాన పడటానికి , సమస్యను రూపొందించటం లోనే కీలకం ఉంది . వ్యక్తుల మధ్య సంబంధంగా నీతిని గ్రహించే బదులు , మానవుడి మనుగడ ప్రయోజనానికి ఇదొక పునాది అన్నట్లు భావించారు . మానవుడి జీవితానికి లక్ష్యం అనేది , జీవితంలో గాక వెలుపల ఎక్కడో ఉన్నదని , ముందే ఏర్పరచుకున్న ఒక భావన వల్ల , ప్రారంభదశలోనే వక్రమార్గం పట్టించారు . ప్లేటో దృష్ట్యా శాశ్వతమైన ప్రపంచభావానికి చేరువగా రావడమే సమాజ వ్యవస్థ అనిపించుకుంటుంది . హిందువుల ననుసరించి ఈ లోకంలో వ్యక్తి మనుగడ చాలించి మోక్షాన్ని పొందటమే లక్ష్యం . ఆ రెండు సందర్భాలలోనూ వ్యక్తికి స్వతహాగా ఏమీ విలువలేనట్లు పరిగణించారు . ఫలితంగా నీతి శాస్త్రమనేది అలౌకిక అన్వేషణగా మారింది . సమాజంలో ఉన్న వ్యక్తి సమస్యలకూ , ఆ సక్తులకూ ఏమాత్రం శ్రద్ద వహించలేదు . నైతిక అన్వేషణకై ఉద్దేశించిన విధానమే దాని పద్ధతిని కూడా నిర్ణయించింది . లక్ష్యం అలౌకికమైంది కాబట్టి విజ్ఞానంతో ఏమాత్రం సంబంధం లేకుండా పోయింది . వాస్తవాలనూ , అనుభవాన్నీ దృష్టిలో పెట్టుకొని నైతికపరమైన అన్వేషణచేస్తే ఆమోదయోగ్యం కాకుండా పోయింది . అనుసరించవలసిన పద్ధతిలో అంగీకారం లేనందున అన్వేషణా ఫలితాలను ఆమోదిస్తారనుకోటం ఒట్టి ఆశే .
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకేముందే
వెనుతిరిగి రూమ్‌గా చెప్పుకునే తన రేకుల కిందికి వచ్చేశాడు రవిబాబు . రెండు గుప్పిళ్ళు మాత్రమే వున్నయ్ బియ్యం . పావు లీటరు కంటే కొంచెం తక్కువగానే వుంది స్టౌవ్‌లో కిరోసిన్ . కుండలోవున్న నీటితో బియ్యాన్ని కడిగి , స్టవ్ మీద పడేశాడతను . ఎండిపోవడానికి సిద్ధంగా వున్న రెండు ఉల్లిపాయల్ని , మిరపకాయల్ని కూడా వేసి కొంచెం ఉప్పును కలిపాడు . ఇరవైనిమిషాల తరువాత తయారైన సంకీర్ణ పదార్థాన్ని ప్లేటులోకి వంపుకుని , కొంచెం కొంచెంగా ఆరగించాడు .
చిలిపి ప్రశ్న - తిక్కజవాబు డాక్టర్ కు ఇష్టమైన వాడు ఎవరు ? జేబునిండా డబ్బులు , ఒంటి నిండా జబ్బులు ఉండేవాడు . సేకరణ : సుచరిత
సినిమా తీసిన తర్వాత కంటే సినిమా ప్రకటనతోనే సంచలనాలు సృష్టించడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య . తాజాగా ఆయన దృష్టి మరియా సుసైరాజ్ పై పడింది . ఇటీవల సంచలనం సృష్టించిన నీరజ్ గ్రోహర్ హత్య ఆధారంగా ' నాట్ ఎ లవ్ స్టోరీ ' పేరుతో ఓ సినిమా తీయనున్నట్టు వర్మ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు . ఇందులో సంచలనం లేకపోయినా . . . సదరు హత్య కేసులో మూడేళ్ల పాటు జైలులో ఉండి ఇటీవల బయటకు వచ్చిన కన్నడ నటి మరియా సుసైరాజ్ తన చిత్రంలో నటిస్తారని ప్రకటించడం కలకలం రేపింది . ఈ వ్యవహారంపై శివసేన , మహారాష్ట్ర నవ నిర్మాణ సేన భగ్గుమన్నాయి . వర్మకు వ్యతిరేకంగా భాజపా యువమోర్చా కార్యకర్తలు ముంబైలోని వర్మ కార్యాలయం ముందు ప్లకార్డులతో ఆందోళనకు దిగారు . నేరగాళ్లతో సినిమా తీసేవాళ్లు కూడా నేరగాళ్లే నంటూ నినాదాలు చేశారు . పోలీసులు జోక్యం చేసుకుని వారిని అదుపులోనికి తీసుకున్నారు .
వేయి పడగలతో మీ పర్సనల్ టచ్ బాగుంది . నేనింకా చదివే ధైర్యం చెయ్యలేదు .
నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు ? నా యిచ్ఛయే గాక నాకేటి వెరపు ? కల విహంగమ పక్షముల దేలియాడి తారకామణులలో తారనై మెరసి మాయమయ్యెదను నా మధురగానమున ! నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు ?
ఈ భాషాసమస్య ప్రజల నుంచి వచ్చినది కాదని అందఱూ గ్రహించే రోజు రావాలి . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుభాష పట్ల తన విధ్యుక్త కర్తవ్యాల్ని పూర్తిగా విస్మరించడం మూలాన ఏర్పడిన భాషాసంక్షోభం ఇది . ప్రపంచంలో ఏ భాషైనా ప్రభుత్వ ఆదరణతోనే బతికి బట్టకడుతుంది . అమెరికాలో ఇంగ్లీషైనా , అరేబియాలో అరబ్బీ అయినా ! ! కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం పీకల్లోతు మైనారిటీ వోట్ బ్యాంక్ రాజకీయాల్లో మునిగి ఆ బాధ్యతని పూర్తిగా గాలికొదిలేసింది . పరాయి రాష్టాలనుంచి దిగుమతి అవుతున్న అయ్యేయెస్ లూ , ఐపీయెస్ లూ తెలుగువాళ్ళ ప్రభుత్వంలో తెలుగు అధికారభాషగా అమలు కాకుండా అడ్డుపడుతున్నారు . అంతా కలిసి కావాలని పైనుంచి తెలుగుని తొక్కేస్తూ ప్రజల్లో మార్పొచ్చిందని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు . అసలు తెలుగుని జన్మలో చదవకుండానే డిగ్రీలు సంపాదించడానికి వీలు కల్పించే ఒక అపూర్వ వ్యవస్థని , ప్రపంచంలో ఎక్కడా లేని విచిత్ర విద్యావ్యవస్థని ఆంధ్రప్రదేశ్ లో సృష్టించారు . కొద్దిమంది నాన్ - తెలుగువాళ్ళని చూపించి అందఱికీ తెలుగు నుంచి మినహాయింపు ఇచ్చేస్తున్నారు . ముఖ్యంగా ఇంగ్లీషు మీడియమ్ పాఠశాలలవాళ్ళకి ! అలా తోక ( భాషా మైనారిటీలు ) కుక్కని ( రాష్ట్రంలోని మెజారిటీ తెలుగుజాతిని ) ఆడించే విడ్డూరపు వాతావరణం కల్పించారు . - - తాడేపల్లి
నా మాటని వాడు పలికే తీరులోనే పలకాలంట ? నా రాతని వాడు నిర్ధేశించిన వ్యాకరణంలోనే వ్రాయాలంట ?
ఒక డాక్టర్ ( ప్రొఫెసర్ ) ఒక యూనివర్సిటీలో ఒక గౌరవ డిగ్రీని పుచ్చుకునేందుకు బయలుదేరుతాడు . దారిలో రకరకాల అనుభవాలు , ఆత్మ పరిశోధన , విచిత్రమైన కలలు ఇలాంటివి చోటు చేసుకుంటాయి . ఇందులో ఒక బుధ్ధిజీవి యొక్క యాత్ర గణనీయమైనది . సినిమా ఎత్తుగడ గొప్పది . ఒక గౌరవ డిగ్రీ తిసుకునేందుకు వెళుతూ తన గతాన్నీ , తన అలోచనలనీ ఆ ప్రయాణంలో కూడా వచ్చిన పాత్రలను మేళవించుకుని తన చివరి రోజులలో రాబోయే మృత్యువు అనే పతాక సన్నివేశాన్ని ఆవిష్కరిస్తాడు ఆ ప్రొఫెసర్ , పాటుగా దర్శకుడు .
వారినుండి ప్రజల్ని రక్షించే బదులు , లంచాల వల్ల , వారికే కొమ్ము కాసింది అక్కడి రక్షణ వ్యవస్త .
( , ఏలూరు ) ఐదవ నెంబరు జాతీయ రహదారిపై ఏలూరు సమీపంలోని దుగ్గిరాల వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు . మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి . విజయవాడ నుంచి రాజమండ్రి వెళుతున్న సిమెంటులోడు లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపు తప్పి రోడ్డు మార్జిన్‌లోని రివాల్వింగ్ వాల్‌ను ఢీ కొని బోల్తా పడింది . ఈ సంఘటనలో లారీపై ప్రయాణిస్తున్న తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామానికి చెందిన పెదపూడి చినఅప్పారావు ( 30 ) , పెదపూడి వేగులమ్మ ( 25 ) , పెదపూడి జ్యోతి ( 9 ) , పెదపూడి చిన్నారి ( 3 ) , పెదపూడి రాజేష్ ( 5 ) లు అక్కడికక్కడే మృతి చెందారు . డ్రైవర్ బల్లిరెడ్డి అప్పలరాజు , క్లీనర్ బల్లిరెడ్డి సాంబతో సహా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సమీపంలోని జి కొత్తపల్లి గ్రామానికి చెందిన పెదపూడి గోపి ( 25 ) , పెదపూడి లక్ష్మి ( 22 ) , గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన పెదపూడి అప్పారావు ( 40 ) , పెదపూడి రత్నం ( 32 ) , పెదపూడి రాణి ( 17 ) లు తీవ్రగాయాలపాలయ్యారు . క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు . వీరంతా నాలుగుమాసాల క్రితం ఇటుకబట్టీ పనుల నిమిత్తం ప్రకాశం జిల్లా అద్దంకి వెళ్ళారు . కూలి పనులు ముగించుకుని సొంతగ్రామాలకు ప్రయాణమై లారీ ఎక్కారు . ఏలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .
నవ్వటమా ? మానటమా ? శేషప్ప అయ్యరుకి వచ్చినపాటి ఇంగ్లీషు నాక్కూడా వచ్చుంటే , నేను కనీసం పదహారణాల తెలుగువాణ్ణయి ఉండుంటే , పై మకుటంలో అడిగిన ప్రశ్నని to laugh , or not to laugh అన్న ధోరణిలో ఇంగ్లీషులోనే అడిగి ఉండేవాడిని . నా చిన్నతనంలో రాజు గారు , గాజు పెంకు కథ చెప్పి , చివరికి వచ్చేసరికి " కథ కంచికి , మనం ఇంటికి " అనకుండా " తీస్తే మంట , తియ్యకపోతే తంట ! " అంటూ ముగించేవాడిని . " ఆ గాజు పెంకు ఏమిటి ? అది ఎక్కడ గుచ్చుకుంది ? " అని నన్ను అడగి ఇరకాటంలో పెట్టకండి . మీరు కుశాగ్రబుద్ధులు కనుక ఊహించుకోగలరు . ఇంతకీ నవ్వటమా ? మానటమా ? అని కదూ అడిగేను . నవ్వితే మంట , నవ్వకపోతే తంట ! అన్నట్లు నవ్వటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి . నేను అమెరికా వెళ్ళిన కొత్తలో లైబ్రరీ మెట్లు ఎక్కుతూ ఉంటే అట్నించి దిగుతూ ఉన్న ఒక తెల్లమ్మాయి నన్ను చూసి ఒక చిరునవ్వు నవ్వింది . నేను డంగైపోయి , " అయితే ఈ అమ్మాయి నన్ను ప్రేమించెస్తోందంటావా ? " అని పక్కనున్న అచ్యుతరావుని అడిగేను . " లోపలికి పద , చెబుతాను " అన్నాడు లోపల లోన్ డెస్క్ దగ్గర మరొక అమ్మాయి ఉంది . ఆ అమ్మాయి కూడ నన్ను చూసి కిచ కిచ మంది . " ఇదిగో ఈ అమ్మాయి కూడ నవ్వుతోంది కదా . నిన్ను ప్రేమిస్తోందో ఏమిటో ! ఓ సారి సినిమాకి వెళదామా అని అడిగి చూడు " అన్నాడు అచ్యుతరావు , ముసి ముసి నవ్వులు నవ్వుతూ . ఈ రెండో అమ్మాయి పాత కాలపు హిందీ సినిమా తార తున్ తున్ లా ఉంది . అమెరికాలో నవ్వు ఒక పలకరింపులాంటిదిట . అని నాకేం తెలుసు ? అందుకని నేను కూడా ఎవ్వరినైనా చూసినప్పుడు నవ్వటం అలవాటు చేసుకున్నాను . అదే నా కొంప ముంచింది - ఇండియాలో ఇండియాలో నవ్వరుట ! అని నాకేం తెలుసు ? ఆమాత్రం తెలియకపోతే ఎందుకు పనికొస్తావురా ? అన్నాడు అన్నయ్య . ఎయిర్ పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టంస్ వాళ్ళ మొహాలు చూడలేదుట్రా ? మహాభారత యుద్ధంలో అన్నదమ్ములు కొట్టుకు చావలేదూ ! ఎందుకుట ? సూదిమొన మోపినంత భూమి కోసం అయితే ఈ సోది అంతా రాసి మిమ్మల్ని ఎందుకు ఇలా నస పెడతాను ? ద్రౌపది నవ్విందిట . మయసభలో మడుగులో పడ్డ మన దుర్యో అన్నని చూసి నవ్విందిట . " నన్ను చూసి నవ్వెదవే , వన్నెల దొరసానీ ? " అంటూ మండిపడి , " నీ భరతం పడతానుండు " అని పెద్దన్న భారత యుద్ధానికి కాలు దువ్వేడని ఒక కథ ఉంది . అదండి , పద్దెనిమిది అక్షౌణీలు కొట్టుకు చావటానికి కారణం . ( తెలుగువాళ్ళు - ఆంధ్రావోళ్ళు కాదు - మనం , తెలుగోళ్ళం కౌరవుల పక్షంలో పోరాడేమని మరవకండి ) . ఒక నాడు జిన్నా అన్న మాటకి నెహ్రూకి నవ్వు వచ్చిందిట . అదండి పాకిస్తాను పుట్టి మనకి పక్కలో బల్లెం అవటానికి కారణం . ఇప్పుడు ఆంధ్రోళ్ళు , తెలంగణోళ్ళు " యూ హౌ మచ్ అంటే యూ హౌ మచ్ " ( నువ్వెంత అంటే నువ్వెంత ) అని తగువాడేసుకుంటున్నారు కదా . ఈ కురుక్షేత్రంలో ఉభయ సైన్యాల మధ్యనీ రధాన్ని ఆపి ఏమిటి చెయ్యాలో తోచక బిక్కచచ్చిపోయి నేను నిలబడి ఉంటిని గందా . భోజనం చెయ్యనని భీష్మించుకుని కూర్చున్న ఒక కురువృద్ధుడిని ఒక అంపశయ్య మీద పడుక్కోబెట్టి , సవ్యసాచిలా వైద్యుడు పక్కని నిలబడి ఊషర జలం ( సేలీను ) ఎక్కిస్తూంటే ఇటు ఆంధ్రాలోనూ , అటు తెలంగాణాలోనూ ప్రజలు రధాలకి నిప్పెట్టి హాహాకారాలు చేస్తున్నారు కదా . " ఈ నవభారత యుద్ధం " లో పద్దెనిమిది అక్షౌణీల రూపాయలకి పైనే నష్టం వచ్చి ఉంటుంది . హైదరాబాదులో బస్సులని నడిపితే వాటిని తగలెట్టెస్తున్నారు . నడపకపోతే ఆదాయం నష్టం వస్తోంది . నడిపితే మంట , నడపకపోతే తంట . ఎందుకు వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారా అని నాకు ఉన్న కొద్ది అవస్థాపక సౌకర్యాలనీ ( infrastructure అండీ , మరేమీ కాదు ) ఉపయోగించి చిరు పరిశోధన చేస్తిని గందా . చెయ్యగా తెలిసుకున్నది ఏమిటంటే … శ్రీనాధుడు నవ్వేడుట . అదిట ఈ బంధ్‌కీ , రస్తా రోకోలకీ కారణం ! ఒఠ్ఠి నవ్వటమే అయితే అంత బాధ కలిగేది కాదుట ; వెటకారం కూడా చేసేడుట - వీళ్ళని చూసి . వేళ్ళని చూసి ? ఈ తెలంగణోళ్ళని చూసి . శ్రీనాధుడు ఎందరెందరినో చూసి నవ్వేడు . వేటకారాలు చేసేడు . నది ఒడ్డున ఉన్న నాయురాళ్ళని చూసి కన్ను గీటేడు . అది అతని స్వయంబు . అయినా నాకు తెలియక అడుగుతాను . శ్రీనాధుడు వీళ్ళని ఏమన్నాడుట ? " వీళ్ళు ఒఠ్ఠి అనాగరికులు . వీళ్ళకి వేడి వేడి అన్నంలో గడ్డ పెరుగు వేసుకుని , మాగాయ టెంకని గీరుతూ తినటం కూడ తెలీదు . సజ్జన్నం , జొన్న రొట్టెలు తినే అనాగరికులు " అన్నాడుట . హారి భడవల్లారా . శ్రీనాధుడు అన్నది మిమ్మల్ని కాదు . మరైతే ఎవరిని ఉద్దేశించి అన్నాడు ? ఎవ్వరిని ఉద్దేశించి అంటే ఏమిటి గాని , ఇదేదో అయిదు వందల ఏళ్ళ క్రితం మాట . దాన్నిప్పుడు కెలకటం ఎందుకు ? ఎలా మరిచి పోతామండీ . ముందు శ్రీనాధుడు . తరువాత నైజాము నవాబు , ఇప్పుడు ఈ ఆంధ్రాఓళ్ళు . ఈ విషయాలన్నీ ఆలోచించే భారత ప్రభుత్వం ఒక హుకుం జారీ చేసిందిట . ఎప్పుడూ , ఎక్కడా ఎవ్వరిని చూసి నవ్వొద్దని . అదండి మన ఇమ్మిగ్రేషన్ వాళ్ళు ముడుచుకున్న మూతులు పెట్టుకుని ధుమధుమలాడుతూ ఉండటానికి కారణం ! వాళ్ళని నవ్వించటానికి ప్రయత్నించకండి . మీ రస్తా రోకో చేసెయ్యగలరు .
చూడగానే ఏ సినిమా గురించో అర్ధం అయ్యే ఉంటుంది . ఏంటి అయ్యేది రెండూ వేరే వేరే సినిమాలకు సంబందించినవి అంటారా ఐతే మీరు గ్రేట్ . నిజమే " అరుంధతి " , " నేను దేవుడిని " ఈ రెండు సినిమాల గురించే రాద్దాం అనుకున్నాను . జనరల్ గా నేను సమీక్షలు చదవను ( అప్పుడప్పుడూ తప్ప ) . ఇక మా శశి ప్రతి సినిమా కి రివ్యూ చదువుతాడు . అలాగని రివ్యూలని అధారం చేసుకుని సినిమాలు చూస్తాడనుకుంటే పప్పులో కాలేసినట్టే . తను అధమం విడుదలైన ప్రతి సినిమా చూస్తాడు . అలాంటిది " నేను దేవుడిని " చూసావా అని అడిగితే సౌండ్ లేదు , ఏమంటే సినిమా చూడలేమంట , రివ్యూ రాసినతనే వాంతి చేసుకున్నాడట , నేను చూడను అన్నాడు . నిజంగానే చూడలేదు కుడా . మా వాడు చూడను అన్నాడంటే ఏదో పెద్ద కధే ఉండి ఉంటుంది అని నేను పోయిన శుక్రవారం తిన్నగా శశికళ దియేటర్ కి వెళ్ళి సెకండ్ షో చూసి వచ్చాను . ఆ తర్వాతి ఆదివారం అంటే నిన్న అనుకోకుండా అరుంధతి కి వెళ్ళాడం జరిగింది . ఇక అప్పుడు మొదలైంది నా ఆత్మ సంఘర్షణ . అదేంటి అరుంధతి ఆహా , ఒహో అన్నారే ! బ్లాగ్లోకంలో ఒక్కరు తప్ప అంతా ఆ సినిమా ని నెత్తికేంటి , బ్లాగుల కెత్తుకున్నారే ! అలాంటిది నాకేంటి ఈ సినిమా పరమ దరిద్రంగా కనిపిస్తుంది . అలాగే నేను దేవుడిని బాలేదన్నారే , కానీ ఇదేమో నాకు చాలా బాగా నచ్చింది . ఎందుకా అని ఆలోచించగా కొన్న్ని విషయలు కనిపించాయి . 1 ) బహుశా బాల సినిమాలో అఘోరాలంటే దైవ ప్రతిరూపాలుగా , దేహానికి ప్రాణానికి మధ్య గిజగిజలాడే ఆత్మకి మోక్షాన్ని ప్రసాదించే వాళ్ళుగా చూసి అరుంధతి లో వాళ్ళని క్షుద్రోపాసకులుగా , నీచమైన చేతబడులు , బాణామతులు చేసేవాళ్ళుగానూ చూపించడం వల్లనేమో అనిపించింది . కానీ అలోచించగా ఇంకా చాలా క ( అ ) నిపించాయి . నేను ఎక్కడో ఒక పుస్తకంలో అఘోరాలను గురించి చదివాను ( బహుశా యండమూరి అనుకుంటా ) . దానిలో వాళ్ళు కాల స్వరూపులని , దేనికి కట్టుబడని వాళ్ళని రచయిత చెప్తే కామోసనుకున్నాను . 2 ) అరుంధతి సినిమా అంతా రక్తం , విపరీతమైన రక్తం . అదేంటో అంత రక్తం చూసినా జుగుస్స కలుగలేదు కానీ వాస్తవ జీవితాన్ని చూస్తే ( చూపిస్తే ) మాత్రం జుగుస్సాకరంగా ఉందనడం హాస్యాస్పదమనిపించింది ( ఈమాట రాసేటప్పుడు నా మిత్రుడన్నమాట : " బట్టలు విప్పి రికార్డింగ్ దాన్స్ చేస్తే చూడగలం కానీ , బట్టలు లేని వాళ్ళు రోడ్డు పక్కన పడి ఉంటే చూడలేం కదరా ఇదీ అంతే " ) . మొదటినుండీ మనకు ఒక అలవాటు ఉంది అదుగో పులి అంటే ఇదిగో తోక అనే అలవాటు . చూడబోతే ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగిందేమో అనిపిస్తోంది . ఒకడు ఈ సినిమా చూస్తే కళ్ళు తిరిగుతాయి అంటే ఇదో నాకు తిరుగుతున్నాయి అని పదిమంది అంటే వందమందికి అలా అనిపించడంలో అసందర్భమేముంది ? అయినా బాలకి బుద్దుండాలి ప్రజలు తాము కుందేళ్ళకోసం కొండలెక్కలేకా , పారాషూట్ లేసుకుని పాకిస్తాన్ కి వెళ్ళలేకా సినిమాలకి వస్తారు తప్ప గుడ్డివాళ్ళని , కుంటివాళ్ళని మూగవాళ్ళని చూడడానికి కాదనీ ,
కొత్త ఉజ్జోగంలోకి వెళ్లి ఓనమాలు నేర్చిహమ్మయ్య చాల్లే తెలిసిన ఈ అక్షరాలతో బండి నడిపించేద్దాం అనుకుంటూ కులాసాగా బ్లాగులు బుక్కులు చదువుకుంటు గడిపేస్తున్న నాకు ఈ ప్రత్యెక అధికారం నన్ను ఉక్కిరిబిక్కి చేసేస్తుంది : - ( . ఒక ప్రక్క అనుకోకుండా వచ్చిన అవకాశం అని ఆనందపడిన ఈ జవాబుదారీతనం నన్ను ఊపిరి పీల్చుకోనియడం లేదు .
నెల్లూరులో ఫిబ్రవరి 20న జరిగిన దళితమహాసభ రాష్ట్ర విభజనకు తమ మద్దతు ప్రకటించింది . దళిత మహాసభ ఫౌండర్ కత్తి పద్మారావు అధ్యక్షతన జరిగిన ఈ దళితమహాసభ రాష్ట్ర విభజనకోసం ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనారిటీలు కలిసి ఉద్యమనిచాలని పిలుపునిచ్చింది . సమైఖ్య రాష్ట్రంలో దళితులకు న్యాయం జరగడంలేదు , కేవలం కొన్ని అగ్రకులాలవారే ఆధిప్త్యం చేస్తున్నారు , దళితులపై దాడులు మానడంలేదు . రాష్ట్ర విభజన జరిగితేనే దళితులకు న్యాయం జ్రుగుతుందని వారు స్పష్టం చేశారు . సమీక్యాంధ్ర JAC దళితమహాసభ వారిని విభజనకు మద్దతు ఇవ్వొద్దని కోరినా , వారు పట్టించుకోలేదు . ఇందుకు సంబంధించిన వార్తను డెక్కన్ క్రానికల్‌లో ఇక్కడ చూడవచ్చు . తెలుగు మీడియా మాత్రం దళితమహాసభ గురించి ఎక్కడ ప్రస్తావించినట్లు లేదు . ఇప్పటికే బీసీ నాయకుడు ఆర్ . క్రిష్నయ్య అధ్యక్షతలోని బీసీ ఐక్యవేదిక తెలంగాణాకు మద్దతు ప్రకటించింది . సీమాంధ్రకు చెందిన దళిత , బీసీ ఎంపీలు , ఎమ్మెల్యేలు , మంత్రులు చాలామంది ఇప్పటికే బహిరంగంగా విభజనకు మద్దతు ఇవ్వగా కొంతమంది మద్దతు ఇస్థున్నా ఇంకా బయటపడట్లేదు . విభజన కోరుతున్న సీమాంధ్ర నాయకులలో బొత్సా సత్యనారాయణ , హర్షకుమార్ , మోపిదేవి వెంకటరమణ ప్రముఖులు . సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణాలోనయినా , సిమాంధ్రలోనయినా అగ్రకులాలదే అద్ధిపత్యం . సమైఖ్య రాష్ట్రంలో పెద్ద నెట్‌వర్క్‌తో బలంగా ఉన్న దోపిడీ వ్యవస్థను ఎదిరించడం కష్టం , చిన్నరాష్ట్రాలయితేనే సులువు అనేది వీరి వాదన . చిన్న రాష్ట్రాలను కోరిన అంబేద్కర్ ఆశయం కూడా ఇదే ధోరణిలో ఉంది . ఎనభై శాతం ఉన్న దళిత , బీసీలు సీమాంధ్రలో తెలంగాణాకు మద్దతు ఇస్థుండగా మరి సమిఖ్యవాదం ఎవరికోసం ? ఇరవై శాతం మించని అగ్రకులాలకోసమేనా ?
ధర కెంధూళులు కృష్ణరాయల చమూధాటీ గతిన్ వింధ్య గ హ్వరముల్ దూరగ జూచి , తా రచట కాపై యుండుటన్ చాల న చ్చెరువై యెర్రని వింత చీకటులు వచ్చెం జూడరే యంచు వే సొరిదిం జూతురు వీరరుద్ర గజరా ట్శుద్ధాంత ముగ్ధాంగనల్
మీ పోస్ట్ లు అన్ని చదివానండి . మనసుకి చాల హాయిగా ఉంది . . నన్ను నేను ఎక్కడో చదువుకుంటున్నట్లు ఉంది . . సూపర్ గా రాస్తున్నారు మీరు
" ఇక జుబ్లీ హిల్స్ మారాజుల సంగతి . పాపం వాళ్ళ ఇళ్ళని కూడా కూల్చారు కదా ! మీరు చదివారో లేదో … ఆ ఇళ్ళు పడగొట్టడానికి ముందు … ఆ ఏరియానంతా కమర్షియల్ జోన్ గా డిక్లేర్ చేసింది గవర్నమెంటు . ఒకే అంతస్తు ఉన్న ఇళ్ళు ఇప్పుడు మూడు నాలుగంతస్తులూ , కమర్షియల్ కాంప్లెక్సులూ కట్టుకోవచ్చు . అంటే , నాలుగు వందల గజాల స్థలంలో ఓ వంద గజాలు పోయినా , మిగిలిన మూడు వందల గజాలకీ కొత్త పర్మిట్ల కారణంగా పెరిగిన ధర అంతకంటే చాలా ఎక్కువన్న మాట . వాళ్ళ బ్లాక్ మనీ చూడు ఎంత భద్రంగా ఉందో . వాళ్ళుపోగొట్టుకునే బ్లాక్ మనీని మార్కెట్లోంచే వాళ్ళు సంపాదించుకుంటారు . మా పరిస్థితి అదికాదు . "
మీ ప్రయాణంలో పదనిసలు బాగున్నాయి . ముచ్చటగా మూడు బ్లాగులు వ్రాస్తున్నారన్నమాట . Keep it p .
బయటకొచ్చాక సత్తిరాజు నెత్తీ నోరూ బాదుకుంటూ " ఏంది సూర్యం ! ఈ కేసిలా చచ్చింది . ఆధారాలిచ్చాను కదరా ! ఆఖరికా ప్రకాశరావుకీ పాతికవేలిచ్చాను . పరువు పోయింది కదయ్యా ! " అంటూ ఏడ్చాడు .
మనిషి అత్యాశకు అంతు లేకుండా పోతోంది . అది ఖుర్జ్ ఖలీఫా ఎత్తుకి ఎదిగిపోతోంది . మరి ఇలాంటపుడు సమతౌల్యం కోసం స్టెప్ తీసుకోవలసింది ప్రకృతేగా ! ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎంతటి అభివృద్ధీ ఏమీ చేయలేక తోక ముడవాల్సిందే అని ఈ సునామీ నిరూపించింది . అయినా , జపాన్ ప్రజల స్థితి తల్చుకుంటే హృదయం భారమైపోతోంది . కష్టించి పని చేసే వాళ్ళు , క్రమ బద్ధ జీవితానికి అలవాటు పడ్డవాళ్లు . . . . ఇవాళ దిక్కు లేని పక్షుల్లా . . . . ! కనీసం ఇలాంటపుడైనా ' ఏమిటో జీవితాలు " అని ఆలోచించేలా చేస్తున్నందుకు ఈ ఉత్పాతాలకు థాంక్స్ చెప్పుకోవాలో , కళ్ళ ముందే నగరాలు సైతం నేలమట్టమై జనాలు భూస్థాపితం అయినందుకు దుఃఖించాలో తెలీని స్థితి ! ఏ వెలుగులకీ ప్రస్తానం . . . . అని ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే !
నమస్కారం , మీరు వ్రాసిన ఈ టపా నాకు ఎన్నో అనుభూతులను గుర్తుకుతెచ్చింది . మనం బాధపడాల్సిన విషయం మరొకటి వుండి . కనీసం మనకు ఈ రాయబార పద్యాలు , గజేంద్ర మోక్ష హరికధలూ చూసే అవకాసమయినా వుంది . అసలు భయపడవలసినది ముందున్నది - - ఇప్పటికే పద్యం అంటే ఏమిటో తెలియని పరిస్థితి వచ్చేసింది . ఇంక ఈ గజేంద్ర మోక్షం , హరి కధలు , బుర్ర కధలు సంగతి సరే సరి . కానీ మీ శైలి బహు అందం గా వున్నది . " నేనెరిగిన తెలుగుదనం " అన్న ఈ పేరు దీనికి అందం గా అమరింది . ఒక్కసారి నా బాల్యం లోకి నన్ను తీసుకుని వెళ్ళారు . నేను చూసిన పల్లెటూరు , టౌన్ వాతావరణం ఒక్క సారి కళ్ళ ముందు మెదిలింది . ఒక కోన ప్రాణం తో కొట్టుకుంటున్న ఆ పల్లెల్లోని తెలుగుదనం ఈ కార్పొరేట్ సంస్కృతికి ఎప్పుడు కోదేక్కుతుందో అన్న ఆలోచనతో , కేవలం మీ ఈ టపా చదివి , ఒక్క సారి పల్లెకి పోయి వాడడం అన్న వుద్దేశం తో టికెట్టు కొనేసాను . పండగ కి పల్లెకి పోయి వద్దాం అని . ఇంతటి స్పందన ని కలిగించింది అని చెప్పటానికే మీకు వ్రాస్తున్నాను . వీలయితే నా బ్లాగ్ ని కూడా ఒక సారి పరికించి తప్పొప్పులు తెలియజేయగలరు . భవదీయుడు సతీష్ యనమండ్ర
జగన్ గండికోట రహస్యం విప్పాడు : తెలంగాణపై వై . ఎస్ . ఆర్ . కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్‌రెడ్డి చెప్పిన వైఖరి గురించి విలేఖరులు ప్రశ్నించగా బొత్స నవ్వుతూ ఆయన గండికోట రహస్యం కనుగొన్నట్లుగా ఉందని అన్నారు . తెలంగాణపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని జగన్ చెప్పారని అది అందరికీ తెలిసిందేనని చెప్పారు . జగన్ తన పార్టీ వైఖరి చెప్పాలని లేదా వైఖరి లేదనైనా చెప్పాల్సిందన్నారు . జగన్ ప్లీనరీకి కాంగ్రెస్ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు , ఇద్దరు ఎంపిలపై చర్య తీసుకోరా అని ప్రశ్నించగా , వారిలో పరివర్తన వస్తుందేమోనని చూస్తున్నామని సమాధాన మిచ్చారు . ఈ విషయంలో తమకంటూ ఒక ప్రణాళిక ఉందని దానికను గుణంగా నడుచుకుంటామన్నారు .
మళ్లీ బాంబులు , ఈసారి డిల్లీ లో , మరి కొంతమంది ప్రాణాలు గాలి లో కలిసి పోయాయి , మరి కొంత మందికి ప్రాణాలు పోతే బాగుండేది అనే పరిస్తితి . అయ్యో అనుకొంటాము , మనకు తెలిసిన వాళ్ళు ఆ ఊర్లో ఉంటే ఫోన్ చేసి వాళ్ళ క్షేమం తెలుసుకొంటాము . నాలుగు రోజు లకు మర్చి పొతాము . కానీ మన ప్రభుత్వాలు , మన నాయకులు ఏంచేస్తున్నారు . మన లాగే అయ్యో పాపం చని పోయారా ? అనుకోని ఒక వ్రాసి పెట్టుకొన్న సందేశం చదవగాని పని అయి పోతుందా ? మన కోసం ఏమీ చెయ్యలేని ప్రభుత్వాలు మన కెందుకు ? ఇలాంటివి జరుగుతున్నపుడు నేను ప్రస్తుతం సింగపూర్ లో ఉంటున్నాను కాబట్టి ఇక్కడి పరిస్తితుల తో పోలిక చేసుకోవాల్సి వస్తుంది . ఇక్కడి ప్రభుత్వం మేము ప్రజల కొసం పని చెస్తున్నాము అనే భరొసా ప్రతి క్షణం కలిగిస్తుంది . ఇలాంటి పరిస్థితులలొ ప్రజలు ఎమి చెయ్యాలి , ప్రభుత్వానికి ఇలాంటి వాటిని ఎదుర్కొంటానికి ప్రజల భాగస్వామ్యం ఎంత అవసరం అనేది స్పష్టంగా తెలియజేస్తుంది . ఫ్రతి రొజు రైళ్ళలొ ఈ సమాచారం తొ వీడియో చుపిస్తుంటారు .
దళితులను కులం పేరుతో పిలిస్తే కేసులు పెడతారనే భయంతో అగ్రవర్ణాలకు చెందిన వారు వరంగల్ జిల్లాలో మాల , మాదిగల పేర్లను యంత్రాల పేర్లుగా మార్చారు . వరంగల్ నడిబొడ్డున గల కాకతీయ యూనివర్సీటీ ప్రాంతంలో మాల , మాదిగలను రెండు పేర్లతో ఉచ్చరిస్తున్నారు . మాదిగ కులానికి చెందిన వ్యక్తిని సైకిల్ అంటారు . సైకిల్ అంటే మాదిగ అనే పదానికి మూడు అక్షరాలు ఉన్నాయి కాబట్టి అలా పిలుస్తున్నారు . మాల అంటే రిక్షా అంటారు . రిక్షాకు రెండు అక్షరాలు ఉంటాయి కాబట్టి . ఇలా ఉచ్చరిస్తూ దళితుల్ని హీనంగా చూస్తున్నారు . ఈ విషయం చర్చకు వచ్చిన క్రమంలో పెత్తందారులు ' మిమ్మల్ని కులం పేరు పెట్టి పిలిచామా ' అంటూ తప్పించుకుంటున్నారు . ఇప్పటికీ కాకతీయ యూనివర్సీటీ ప్రాంతంలో యంత్రాల పేర్లతోనే రిక్షా ఏరియా , సైకిల్ ఏరియా , రిక్షాగాడు , సైకిల్ గాడు అంటూ ఉచ్చరిస్తున్నారు . ఈ విషయంలో అక్కడ ఉన్న దళితులకు తెలిసినప్పటికీ ఏం చేయలేని పరిస్థితి .
నాలుగైదేళ్ళ క్రితం ఒక లోకల్ టివీ చానల్ లో ఈ సినిమా చూసాను . నాకు చాలా నచ్చింది . ఈ మధ్యన ఒక షాప్ లో సిడీ దొరికింది . సినిమా పేరు " सॊचा ना था . . .
మంచికథ , కథనం లేకుండా ఎవరెంత చేసినా వృధా ప్రయాసేనని ఈ చిత్రం విషయంలో కూడా మరోసారి రుజువయ్యింది . సాంకేతికంగా ఎంతబాగున్నా , మంచి స్క్రీన్ ప్ . . .
ఇదంతా గుర్తొచ్చి నగేష్ మీద మరింత కోపం వచ్చింది . తనకి ఉద్యోగం దొరక్కపోతే మాత్రం భార్యని ఇలాంటి దిక్కుమాలిన పనులకు పంపిస్తాడా ? పాపం , అందుకే ఆమె నన్ను తప్పించుకు తిరగడానికి నానా అగచాట్లు పడుతోంది . నా అనుమానాన్ని తొలగించుకోటానికి ఆమె దగ్గరకు వెళ్ళి ఎక్సక్యూజ్ మీ , మీరు మా ఫ్రండ్ నగేష్ భార్య శోభనే కదా ! అన్నాను . ఆమె నా వంక అదోలా చూసి " శోభా ? ! మీరు పొరబడుతున్నట్లున్నారు . మనిషిని పోలిన మనుషులు లోకంలో ఏడుగురుంటారంటారు … సారీ , మేం ఇలా గెస్టులతో మాట్లాడితే - మా మేనేజరు గారు కోప్పడతారు " అంటూ అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోయింది .
అసలు ఆరోజుల్లో ఆంధ్రభూమిలో యండమూరి తులసీదళం సస్పెన్సుకి ఏమీ తగ్గలేదుగా ! brilliant narration . ఉపజాతుల్లో ప్రాసయతి వాడకం గురించి మీ అబ్సర్వేషను బాగుంది . మొదటిపాదంలో అలా వాడితే , మిగతా పాదాల్లో కూడా వాడడం వల్ల ఒక సొంపైన శబ్దసౌందర్యం అబ్బుతుంది .
రోజూ నడిచే దారే అయినా ఏదో తేడాగా , చాలా అసౌకర్యంగా , దిగాలుగా ఉంది . నాకే అర్థం కావడం లేదు . ఎందుకలా ఉందో , ఆలోచించేందుకు నేను మరోలా ఉండాల్సి వచ్చింది . అయినా ఫర్వాలేదు , దీన్నేదో చేధించాల్సిందే అనుకుంటూ ముందుకు నడుస్తున్నాను . ఇంతలో కాలికి చల్లగా తగిలింది . హమ్మయ్య . . . గుర్తొచ్చేసింది , గుర్తొచ్చేసింది . ఇందాకటి నా అసౌకర్యానికి , దిగులుకు కారణమేంటో కనిపెట్టేశాను . దీన్ని కనిపెట్టేందుకు కుస్తీలేం పడలేదండీ . . . బురదలో నా కాళ్లు కూరుకుపోయేసరికి బాగా గుర్తొచ్చేసింది . వారం రోజుల నుంచి వర్షాలు పడుతుండటం , రోడ్లన్నీ బురద శోభను సంతరించుకోవటమే ఇందాకటి దిగులు వెనుకనున్న ఓ గొప్ప కారణం . అబ్బా . . . వర్షం , బురద గురించి ఈమె ఇంతగా బాధపడాలా . . . అనుకుంటున్నారు కదూ . . . నాకు తెలుసు . మీకేంటండీ ఎలాగైనా అనుకుంటారు . బాధలు పడుతుండేది మేమే కదా . . ! అసలే వర్షాలు పడక , నీటి కొరతతో నానా అవస్థలు పడుతుంటే . . . వర్షం వచ్చినందుకు మీరు బాధపడుతున్నారా . . . ? అంటూ తీసిపారేయకండి . అక్కడే ఉంది అసలు విషయమంతా . . . వర్షం వస్తే . . సంతోషపడనివారు ఎవరుంటారు చెప్పండి . నాకు కూడా వర్షం అంటే చాలా ఇష్టం . . . కానీ ఈ వర్షంలో , చాంతాడులా నిలిచిపోయిన ట్రాఫిక్‌లో ఆఫీసుకు వెళ్ళటమంటేనే కష్టం . ఈ గండాలను ఎలాగోలా దాటుకుని ఆఫీసుకు చేరుకునేటప్పుడు ఏమాత్రం పట్టించుకోకుండా తమ దారిన తాము వెళ్లిపోయే వాహనదారులంటేనే పరమ చిరాకు . వాళ్ల మానాన వాళ్లు వెళ్ళిపోతే . . మీకొచ్చిన కష్టమేంటి అంటారేమో . . . వాళ్లు అలా వెళ్తే నాకు మాత్రం చిరాకెందుకు వస్తుంది చెప్పండి . కానీ అలా జరగలేదే . . . ఈరోజు ఉదయం టైమయిపోయిందని , అసలే హడావిడిగా ఆఫీసుకు బయల్దేరి నడుస్తుంటే . . . పక్కగా ఓ వాహనం వెళ్లింది . రోడ్డునిండా నీళ్లే . . . కాస్తంత నెమ్మదిగా వెళ్తే వాళ్ల సొమ్మేం పోతుంది . ఒక్కసారిగా వేగంగా రావడం , నీళ్లన్నీ నాపైన పడటం జరిగిపోయింది . అలాంటప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి . నా అదృష్టం కొద్దీ ఆ నీళ్లలో బురద అంతగా లేకపోవడం వల్ల కాసేపటికి ఎలాగోలా డ్రస్సు ఆరిపోయింది . అదే బురదనీళ్లయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి . ఈ అనుభవం నా ఒక్కదానికి మాత్రమే కాదు , మీలో చాలామందికి కలిగే ఉంటుందని అనుకుంటున్నాను . వర్షాలప్పుడు నీళ్లలో వాహనాలను నడపటం వల్ల వచ్చే చిక్కులు కొన్నయితే . . . బస్సులో వెళ్తూ , వెళ్తూ రోడ్డుకు అటూ ఇటూ వెళ్లేవారిని పట్టించుకోకుండా , బస్సుల్లోంచి ఉమ్మటం లాంటివి మరికొన్ని . ఈ మధ్యే నేనో పేపర్లో చదివానండి . పాపం ఓ కొత్త దంపతులు , కొత్త బట్టలు కట్టుకుని పవిత్రంగా గుడికెళ్లి అర్చన చేయించుకుని బైక్‌లో వస్తోంటే . . . బస్సులోంచి పాన్ పరాగ్ వేసుకున్న వ్యక్తి ఎవరో తుపుక్కున ఉమ్మేశాడట . పాపం నోట్లో ఎంత సేపటి నుండి ఉమ్మి ఉంచుకున్నాడో ఆ మహానుభావుడు . . . గాలిలో తేలుతూ ఉమ్మి పక్కనే ఉన్న ఆ కొత్త దంపతులను పావనం చేసేసిందట . మీ జీవితంలో మరిచిపోలేని అనుభవాలను మాతో పంచుకోండి అనే శీర్షికలో ఆ కొత్త దంపతులు రాసిన పై విషయాన్ని చదవగానే నాకు చాలా బాధేసింది . పవిత్రంగా గుడికెళ్లి వస్తోన్న మాకు కాసేపట్లోనే ఆ పవిత్రత దూరమై , ఆ స్థానంలో ఉమ్మినవాడిపై అసహ్యం పుట్టుకొచ్చిందని రాశారు వారు . వర్షాలప్పుడు వాహనాలు ఎగజిమ్మిన నీటితో పావనమైనవారు కొందరైతే , పైన చెప్పుకున్నట్లుగా బస్సుల్లోంచి ఉమ్మి పడి పావనమైనవారు మరికొందరు . . . ఇలా ఎందరో ఉన్నారు . . . కాబట్టి . . . ప్రియమైన వాహనదారుల్లారా . . . ! పాన్‌పరాగ్ లాంటివి ఉమ్మివేసే ప్రబుద్ధుల్లారా . . . ! కాసేపు ఆలోచించండి . వేగంగా వెళ్తున్న మీరు కాసేపు మెల్లగా బండిని నడపటం వల్ల మీకొచ్చిన నష్టమేమీ లేదు . అలాగే పాన్‌పరాగ్ మహానుభావుల్లారా . . . కాస్త అటూ , ఇటూగా చూసి , ఎవరూ లేనప్పుడు ఉమ్మడం వల్ల మీకు కూడా నష్టం లేదు . మీరు ఇలా చేయడం వల్ల మాలాంటి వారికి వచ్చే నష్టాలు ఏమీ ఉండవు . అప్పుడందరం హ్యాపీగా ఉండొచ్చు . " అందరం హ్యాపీగా ఉన్నప్పుడే . . . ఆల్ హ్యాపీస్ . . . " ఏమంటారు . . . ?
" ఇంకా లేదు . నీకు రెండు గంటలు టైం ఉంటే మనం అలా బయటికి వెళ్దాం . వీలవుతుందా ? " వాసు గొంతులో అభ్యర్థన .
ఆంగ్ల బ్లాగులలో ఒకటో రెండో తెలుగు జాబులు వ్రాసిన బ్లాగులు = 33 సుమారుగా 20 శాతం
సాధారణంగా పొదుపుగా బౌలింగ్ చేసే జహీర్ ఖాన్ తన చివరి రెండు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చాడు . అతడు పది ఓవర్లలో 60 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు . అతడు వేసిన శ్రీలంక ఇన్నింగ్స్ చివరి ఓవర్ చివరి నాలుగు బంతుల్లో పెరీరా 16 పరుగులు చేసాడు . ఇందులో రెండు బౌండరీలు , ఒక సిక్సర్ ఉన్నాయి . ఈ ఓవర్‌లో జహీర్ మొత్తం 18 పరుగులు ఇచ్చాడు . కులశేఖర 30 బంతుల్లో ఒక బౌండరీ , ఒక సిక్సర్‌తో 32 , పెరీరా తొమ్మిది బంతుల్లో ఒక సిక్సర్ , మూడు బౌండరీలతో 22 పరుగులు చేసారు . శ్రీలంక ఇన్నింగ్స్‌లో వీరిద్దరే రెండు సిక్సర్లు కొట్టారు . అంతకుముందు టాప్ ఆర్డర్‌లో ఎవరూ సిక్సర్ కొట్టలేదు . జయవర్ధనే స్కోరులో 13 బౌండరీలున్నాయి . చివరి ఐదు ఓవర్లు మ్యాచ్ గతిని మార్చివేసాయి . ఈ ఓవర్లలో శ్రీలంక బ్యాట్స్‌మెన్ విజృంభించగా భారత్ బౌలర్లు లైన్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయలేకపోయారు . ఈ చివరి ఓవర్లలో మినహా భారత్ బౌలింగ్ బాగానే ఉంది . శ్రీశాంత్ షరా మామూలుగా విఫలమయ్యాడు . ఎనిమిది ఓవర్లలో 52 పరుగులిచ్చాడు . ఆశిష్ నెహ్రా స్థానంలో జట్టులో చేరిన శ్రీశాంత్ నిరాశపరిచాడు . శ్రీలంక బ్యాట్స్‌మెన్ క్రీజ్ వద్ద నిలదొక్కుకోవడానికి మాత్రమే అతడు దోహదం చేసాడు . అశ్విన్‌ను కాకుండా శ్రీశాంత్‌ను జట్టులోకి తీసుకోవడంలో ధోనీ పొరపాటు చేసాడనే అనిపించింది . బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ టోర్నమెంట్ ఆరంభమ్యాచ్‌లో సైతం శ్రీశాంత్ విపరీతంగా పరుగులిచ్చాడు . తొలి మ్యాచ్ తరువాత శ్రీశాంత్‌కు ఈ మ్యాచ్‌లో మాత్రమే అవకాశం లభించింది . యువరాజ్ సింగ్ మరోసారి భారత జట్టును ఆదుకున్నాడు .
( గమనిక : ' మానవాళికి అంతిమ శత్రువు కాపిటలిజమే ' అనబడు గత టపాలోని అంశానికి ఇది కొనసాగింపు ) ఏకధృవ ప్రపంచం - నయా దోపిడి తరువాతి దశ సోవియట్ పతనానంతర దశ . ఇది కాపిటలిజం యొక్క నాల్గవ మరియు అంతిమ దశ . ఈ దశలో కాపిటలిజానికి కమ్యూనిస్టు భయం తొలగిపోయింది . ఈ దశకు కూడా అమెరికానే నాయకత్వం వహిస్తున్నది . అయితే ఈ సారి తానొక్కటే అగ్రరాజ్యంగా ఏకధృవ ప్రపంచానికి మకుటం లేని మహారాజుగా మారింది . కమ్యూనిస్టు భీతి తొలగిన పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ దశలో సంస్కరణల పేరుతో తిరిగి నయా దోపిడీ విధానాలను తెరపైకి తెస్తున్నది . ఈ సంస్కరణల వలన పేదవారు యధావిధిగా దోపిడీ పాలౌతుంటే బూర్జువా సామాజిక శక్తులు , ఇతర మధ్య తరగతి వర్గం ఎనలేని లాభాలను పొందుతున్నాయి . మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో సామాజిక మైన ఉత్పత్తి వనరులను , మౌలిక సదుపాయాలను బూర్జువా వర్గం అభివృద్ధి చేస్తుంది . ఎందుకంటే ఈ వ్యవస్థ సామాజిక ప్రయోజనాలను మాత్రమే ఉద్దేశించినది కనుక . కానీ అలా అభివృద్ధి చేసిన సామాజిక వనరులను బూర్జువా వర్గాలు తమ స్వంత ఆస్థిగా మార్చుకుంటాయి లేదా తమ స్వలాభం ఉన్నపుడే అలా అభివృద్ధి చేస్తాయి . ఆ అభివృద్ధిని చూపి అదే దేశాభివృద్ధి అంటుంది . ఆ ఉత్పత్తి వనరులలో ఉద్యోగాలను వ్యక్తి ప్రయోజనం గా చూపుతుంది . కానీ పెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యక్తి ప్రయోజనం కల్ల . ఇద్దరికి ఉద్యోగాలు లభిస్తే పది మంది బ్రతుకులు వీధిన పడుతుంటాయి . సామ్యవాద ఉద్యమ ఫలితంగా ఇప్పుడు కొల్లదారీ బూర్జువా వర్గం బాహాటమైన దోపిడీ విధానం మానుకున్నది . అంత మాత్రాన అది వ్యక్తి ప్రయోజనం కొరకు పాటుపడుతున్నదనీ . . ఈ వ్యవస్థలో వ్యక్తి ప్రయోజనం నెరవేరుతున్నదనీ అనుకోవటం మూర్ఖత్వమే . ప్రత్యేక ఆర్థిక మండళ్ళ కొరకు పేదల పంటపొలాలను గుంజుకొనే ధైర్యం ఈ బూర్జువా వర్గానికి సామ్యవాద సిద్ధాంతపు ఓటమి వల్లనే వచ్చింది . ప్రపంచ బ్యాంకు మార్గదర్శకత్వాలతో కడుతున్న సాగునీటి ప్రాజెక్టులు వందలాది ఎకరాల పంటపొలాలను , వేలాదిమంది సామాన్య ప్రజలు నివసిస్తున్న గ్రామాలను , పల్లెలను ముంపునకు గురిచేస్తుంటే అది బూర్జువా వర్గానికి మేలు చేసే ఉత్పత్తి వనరుల అభివృద్ధింగానే ఉంటుంది తప్ప వ్యక్తి ప్రయోజనం దిశగా అవి జరగటంలేదు . రోడ్డుమార్గాలవంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి సైతం కొల్లదారీ బూర్జువా వర్గం యొక్క ప్రయోజనాలను ఉద్దేశించినవే . ఈ అభివృద్ధి జరగాల్సిందే . కానీ వ్యక్తి అందుకొరకు బలికాకూడదు . ఎందుకంటే సరైన వ్యవస్థలో సమాజం యొక్క అభివృద్ధితో పాటు వ్యక్తి సైతం ప్రయోజనం పొందుతాడు . కానీ ప్రస్తుత భారతదేశంలో ఇంతటి సామాజిక అభివృద్ధి జరుగుతున్నా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి . ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ ఆత్మహత్యలు కూడా జరుగుతూనే ఉన్నాయి . ఇందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే మరి ఇంకెందరు చావలేక బ్రతకలేక దుర్భర దారిద్ర్యంతో అల్లాడుతున్నారో కదా ! ఈ విధంగా కాపిటలిజం చరిత్రలో జరిగే మార్పులకనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త అవతారాలు ఎత్తటం వలనే నేటికీ స్థిరంగా నిలబడి తనకన్నా పురోగామి అయిన కమ్యూనిజాన్నే ఓడించగలిగినది . ప్రస్తుత దశ కాపిటలిజం యొక్క అంతిమ దశ . ఈ దశ మీద పోరాడే మానవుడు తన అంతిమ రాజకీయ , సామాజిక వ్యవస్థను నిర్మిస్తాడు . కాపిటలిజం యొక్క ఈ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకునే మానవుడు దాన్ని శాశ్వతంగా అంతమొందించే వ్యూహాన్ని రచించాలి . అపుడు మాత్రమే మానవుడు తన చిరకాల స్వప్నాన్ని - వ్యవస్థలోని మూడు అంగాలూ సమానంగా ప్రయోజనం పొందే రాజకీయ , సామాజిక వ్యవస్థను - సాకారం చేసుకోగలుగుతాడు … ( సశేషం )
" మామూలు జనంలోనే కొంతమంది ఎక్కువ సంపాదించి పెట్టుబడుదారులు అవుతారు " అనడం కరెక్టయితే మిగతావారి కంటే వారెక్కువ ఎలా సంపాదిస్తారు ? అది అందరికీ అందుబాటులో ఉంటే మిగతా వారి ఎక్కువ ఎందుకు సంపాదించలేకపోతారు ? పెట్టుబడిదారులు అనడం అంటే వారి వద్ద తమ అవసరాలన్నీ తీర్చుకున్నాక ఇంకా పెట్టుబడి పెట్టగల డబ్బు మిగిలిందని అర్ధం . పెట్టుబడి పెట్టగల డబ్బంటే అది కోట్లలోనే ఉంటుంది . లక్షల మిగులు పెట్టుబడిగా పనికి రాదు . అది చిన్న షాపులు పెట్టుకుని కుటుంబ అవసరాలు గడుపుకోవడానికి పనికోస్తుందేమో గాని పెట్టుబడి అని పిలవడానికి సరిపోయిన మొత్తం కాదు . ఈ రోజుల్లో కొన్ని కోట్లు కూడా సరిపోదన్నది పక్కన బెడదాం .
మెడికల్ క్యాంప్ కి వచ్చే వారిలో ఆడవారు ఎక్కువే . ఇలా వచ్చేవారు దాదాపు 90 శాతం కూలి పనికి వెళ్ళేవారే అయి ఉంటారు . తక్కిన వారు ముసలి వారు , చిన్నపిల్లలూ నూ . ఈ ఆడవాళ్ళలో చాలా మంది సమస్యలకు మూలం - సరైన ఆహారం లేకపోవడం లేదా , వారి శక్తి కి మించిన బరువులు ఎత్తడమే . దీనికి పరిష్కారమంటూ బలానికి ఏవో మాత్రలు ఇచ్చినా కూడా వారికి చివరగా " సరిగా తినండి , మరీ శక్తికి మించిన పని చేయకండి " అని చెబుతూ ఉంటారు వాలంటీర్లు , డక్టరూ .
బట్టలు తగులబడుతున్నాయ్ ! మన గ్రామాలలో బాణామతి , చేతబడి , దయ్యాలు , భూతాలు , పిశాచాలు , హస్తలాఘవాలు ఇంకా ఎన్నో జనాన్ని పట్టి పీడిస్తున్నాయి . వీటి ఆధారంగా ప్రజలను ఏడిపించే మంత్రగాళ్ళు , భూతవైద్యులు , గ్రామవైద్యులు ఉండనేవున్నారు . అలాంటి వారికి విపరీతమైన గౌరవం యిస్తూ , వారంటే భయపడుతూ వుండడంతో , వారు యింకా వ్యాపారం చేస్తున్నారు . ఉన్నట్లుండి యింట్లో బట్టలనుండి నిప్పు వస్తుంది . ఆరుబయట ఆరవేసిన వస్త్రాలు అంటుకొని నిప్పు రాజుతుంది . ఇంకేముంది ? ఆ సంఘటన చుట్టూ కథలు అల్లుతారు . శాంతి చేయించమంటారు . కొన్నాళ్ళు యిల్లు పాడుబెట్టమంటారు . ఎవరో చేతబడి చేయించారంటారు . దోషం పోవడానికి ఏమేమి చెయ్యాలో చెబుతారు . ఇంటి బయట బట్టలు ఆరేయండి . పచ్చ ఫాస్ఫరస్ ఒక పాలు , కార్బన్ డైసల్ఫైడు ఆరు పాళ్లు కలపండి . కొద్దిగా బట్టలపై చల్లండి అలా చల్లింది ఆరగానే కాసేపట్లో నిప్పు అంటుకొంటుంది . ఇంట్లో అలమరలో పెట్టిన దుస్తులలోనూ యీ ద్రావకం చల్లవచ్చు . యింటిలోని వారిని ఏడిపించడానికి ఇలాంటి పనులు రహస్యంగా చేస్తుంటారు . జాగ్రత్తగా కనిపెడితే ఎవరు చేస్తున్నదీ అర్థమవుతుంది . సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు , మూలకారణం పరిశీలించకుండా , మతపరమైన మూఢనమ్మకాల వలన భూతవైద్యుల్ని , సోది చెప్పేవారిని పిలుస్తుంటారు .
నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంట . ప్రపంచ వ్యాప్తంగా సగటున మగవాడు సంపాయించే ఒక రూపాయికీ అదే పని చేస్తున్న స్త్రీ సంపాదన అక్షరాలా అరవైమూడు పైసలుట . . ఫెమినిస్టులూ , ఫెమినిస్టులు కానివాళ్ళూ , అసలు ఫెమినిజం ఎందుకూ అనేవాళ్ళూ , ఫెమినిస్టులు లోకాన్ని పాడుచేస్తున్నారనే వాళ్ళూ ఈ సందర్భంగా అసలు మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఆలోచించాల్సిందే . ఈ లేండాఫ్ మిల్కండ్ హనీ లో ఈ మధ్యన , ఇటువంటి జీతం తేడాల గురించి స్త్రీలు తమ కంపెనీమీద కేసు పెట్టొచ్చు అని హక్కు ఇస్తూ కాంగ్రెస్ వారు బిల్లు ప్రవేశ పెడితే , ఇది వ్యాపార సంస్థలకి గొడ్డలిపెట్టు అన్నకారణంగా ఆ బిల్లుని సమాధిచేశారు . మొన్నీ మధ్యన ఎవరో చలం నవల మైదానంలో నాయిక రాజేశ్వరి గురించి రాశారు . ఆ రచనాకాలంలో పరిస్థితులు అని ఏదో రాశారు . మన సాంఘిక పరిస్థితులు , స్త్రీలు కానీ పురుషులు కానీ , ఆ నవలారచనాకాలం కంటే ఏం పెద్ద గొప్పగా పురోగమించలేదని , అభివృద్ధిచెందలేదనీ సవినయంగా మనవి చేసుకుంటున్నా . పనిలో పనిగా ఈ విషయం కూడా మనవి చేసుకుంటున్నా . . చలాన్ని గురించీ , చలం రచనల్ని గురించీ గొంతెత్తి మాట్లాడే , చలం నా ఆదర్శం అని చెప్పుకునే వారిలో తొంభైతొమ్మిది శాతం మందికి అసలు చలం ఏంటో అణువంతకూడా ఐడియా లేదు . కొడవటిగంటి కుటుంబరావు రచనా సర్వస్వాన్ని విరసం పది సంపుటాలుగా విడుదల చేస్తోంది . మొదటి సంపుటం విడుదలైంది . ఇందులో అన్నీ కథలు ఉన్నాయి . 463 పేజీలు . 200 రూపాయలు . ప్రతులకు సి . ఎస్ . ఆర్ . ప్రసాద్ గారిని సంప్రదించ వచ్చు . ఎడ్రసు , సి - 132 , శ్రీనివాసనగర్ కాలనీ , గుంటూరు - 522 006 , ఫోను 98854 46750
ఏడాదిలో ఒక గృహస్థుకు సరఫరా చేసే సబ్సిడీ సిలిండర్లను నాలుగు నుంచి ఆరుకు మాత్రమే పరిమితం చేయాలన్న అంశంపై . . ఇంకా
అదే కాకుండా ప్రతీ ఆధరువూ కలపడం మొదలెట్టగానే , మళ్ళీ నేతి జారీలతో వడ్డనే !
మొదట్నించీ చూసుకుంటూ వద్దాం . మొదటగా మనకు తెలిసిన సీతారామారావుకి వంశమూ , గౌరవమూ , సమాజాల స్పృహ ఉన్నది . అతను ఆలోచిస్తున్న తీరు , అతని మనోభావాలూ మనకేమి కొత్తగానో , విపరీతంగానో అనిపించవు . మొట్ట మొదటి అనుమానం మనకొచ్చేది సీతారామారావు ఉద్యోగం పోయిన పద్ధతిలో . పద్దుపుస్తకంలో ఒక బొమ్మ గీస్తాడు . ఆ బొమ్మ కూడానూ చిన్న పిల్లలు గీసినట్టే ఉంటుంది . మేనేజరు తిడతాడు . సీతారామారావు వెకిలిగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ మా మామ , మా మామ , అని ఇకిలిస్తూ , మీసాలు . . పోలీసు మీసాలు అంటూ గెంతులు వేస్తాడు . ఈ సన్నివేశం అంతా ఒక్కసారి ఊహించుకోండి . వాడు గీసిన ఆ బొమ్మ చూడండి . ఇది నిజంగా ఒక అసమర్థుడు ప్రవర్తించే , ప్రవర్తించగలిగే తీరేనా ? ఆలోచించండి . ఆ తర్వాత నా ఉద్యోగం మా మామ వల్లే పోయింది అని అంటుంటాడు కానీ అప్పటికి మామ మీదే కాక ప్రపంచం మీదే కోపం ఉంది అతనికి . మామ మీద ఒక అసమర్థుని కసి కంటే ఒక ఉన్మాదpu chAయ ఎక్కువగా కనిపిస్తుంది ఈ సన్నివేశంలో .
ఒక్కటి కాదు రెండు కాదు ఐదు బ్రహ్మ కమలాలు నిన్న రాత్రి మా ఇంట్లో ఒక్కటి కాదు రెండు కాదు ఐదు బ్రహ్మ కమలాలు / వెన్నెల పుష్పాలు పరిమళాలు వెదజల్లుతూ ఒకేసారి పూసాయి . అబ్బ ! అంత ఘాటైన పరిమళం ఏ పువ్వు నుంచి వెలువడ్డం చూడలేదు . మీకోసం కొన్ని ఫోటోలు పంపుతున్నాను .
ఇంక పత్రికలవాళ్లు చెప్పిన కారణాలే చెపుతూ , సమస్యా పరిష్కారాలు సూచిస్తూ , పండగ చేసుకొంటున్నారు . వాళ్ల రాతల ప్రకారం , ప్లాస్టిక్ నిషేధంలో చెన్నై మొదటి స్థానం లో వుందట . రెండో స్థానం బెంగుళూరుదట . అసలు వీళ్లకీ సమాచారం యెవరిస్తారో ?
విశ్లేషకులే లేకపోతే సినిమా అనే కళకు నిండుతనమూ చేకూరదు , అలాగే
అభిప్రాయాలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు . పవన్ గారి అభిప్రాయంలో ఉన్న అంశాలగురించి నా ఆలోచనలని చర్చావేదికలో పెట్టాను . అక్కడ అనువాదాల గురించి మరింత వివరంగా విస్తృతంగా చర్చించుకుందాం . బాబాగారి సందేహాలకి కూడా అక్కడ చర్చలో భాగంగా నా అభిప్రాయాలని వివరిస్తాను .
ఈ మధ్య కాలంలో నా జీవితంలో జరిగిన కొన్ని అనూహ్య పరిణామాలలో ఒకటి , BoSF అనే గుంపులో చేరడం . BoSF అంటే Birds of Same Feather . ఏది జరిగినా మన మంచికే అనే సూక్తిని నమ్మే నేను , ఈ గుంపులో చేరిన తరువాత చాలా భాధాకరమైన వార్తలే వింటూ వస్తున్నాను . వాటిలో ఒకటి ఈ క్రిందనున్న వీడియో కూడా . ఇంతటి చేదు విషయాలను విన్నప్పుడల్లా నాకళ్ళు అసంకల్పితంగా వర్షాన్ని కురిపిస్తోంటే , ఈ గుంపులో చేరడం ఏవిధంగా మంచో నాకు అర్దం కావడం లేదు . ప్రస్తుతానికి ఏడవడం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోతున్నాను . కానీ ఏడిస్తే మాత్రం సరిపోతుందా ! ! ఏమో ! ! తెలియదు . . . తెలిసినదల్లా ఒక్కటే . . భాధపడటం .
పొయ్యి మండుతలేదు . వెదురు బొంగుతో ఊదుతున్నాడు ఇమామ్ . చాంద్ మాటలకు అతని గుండె బరువెక్కింది . బలంగా ఊదుతూ బరువును దించుకునే ప్రయత్నం చేస్తున్నాడు .
ఎంతో ఉత్సాహంగా ' కవిత ' లను ప్రోత్సహించాం . ఉద్విగ్నత , బావసాంద్రత ఏ విధంగా వుంటే పాఠకులను చదివించగలమో తీరూ - తెన్ను చూపే కవితలను అందించాం . లబ్ద ప్రతిష్ఠుల కవితావాహినులే మమ్ములను ముంచెత్తుతున్నాయి గాని , మా ప్రయత్నం అంతగా సఫలం కాలేదనే అంగీకరిస్తున్నాము .
కనకదాసు దేవరనామగళను మాత్రమే కాక నళ చరిత్రె , మోహన తరంగిణి కావ్యాలను కూడ వ్రాసినాడు . మోహనతరంగిణి నుండి ఒక రెండు పద్యాలు ఇక్కడ ఉదహరిస్తాను . ఇవి సాంగత్య ఛందస్సులో ఉన్నాయి ( సీసంలో చివర ఒక సూర్య గణము తప్పిస్తే సాంగత్యం వస్తుంది ) .
జగన్నాధ రావు గారి చదువు పుస్తక పఠనంతో ఆగిపోలేదు . మంచి అభిరుచులు సృజించుకున్నారాయన . ఆయనకీ నాకూ సామాన్యమైన అభిమాన విషయాలు చాలా ఉన్నాయి . పద్మరాజు గారి కథలు మొదలైనవి . ఇదోరకమైన బంధుత్వం మాకు .
ఆ వెన్నెల రాత్రి ఇమామ్‌లో ఎన్నో ఆలోచనల్ని కలిగిస్తుంది . షాదుల్‌తో ఏ ఊరు బయలుదేరాలన్నా వెన్నెల రాత్రినే ఎన్నుకునే వాడు . షాదుల్‌కు కూడా వెన్నెలంటే ఇష్టం . ఎంత దూరమైనా అలసట , ఆయాసం లేకుండా నడిచేది . వెన్నెలలో ఆడుకునేది .
5 . పిండిని చిన్న చిన్న ఉంటలుగా చేసుకొని , చేతికి మధ్య లో పెట్టుకొని చిన్నగా వత్తి , నూనె లో వేయాలి .
ఆరోజు తర్వాత సుభాష్ సలహా పాటించడంలో ఆలస్యం చెయ్యలేదు . కారున్న తర్వాత చెడిపోతుంది . ఈ సారి పోలీసు స్టేషన్ దగ్గరో , ఫోన్ బూత్ దగ్గరో చెడిపోతుందని గారంటీ లేదు . అందుకని నా మొదటి మొబైలు ఎరిక్‌సన్ , కొత్తగా వచ్చిన ఏర్టెల్ వాళ్ళ సిం కార్డ్ కోసం డబ్బు పోయాల్సివచ్చింది . అయినా దాన్నొక ఇన్షూరెన్స్ ఖర్చులా అనుకోక తప్పలేదు .
కోడి కొక్కొరోకో అన్నా … కాకి కావ్ . . కావ్ . . అన్నా … కూటికోసం కూలి తప్పదు ! గుండె మండిపోతున్నా . . మనసు కరిగి పోతున్నా … నవ్వు కోసం నువ్వు తప్పవు ! ఈ యాంత్రిక జీవన ఎడారిలో … సుఖ మరీచికలు ఎన్ని వున్నా . . ఆత్మీయ ఒయాసిస్ నీ మైత్రి !
వానా కాలంలో అందరి బాధలు ఒక రకంగా వుంటే ఇంటి ఇల్లాలు బాధలు ఇంకో రకంగా వుంటాయంట ! ఇల్లిల్లు తిరిగి ఎలాగో ఇంత నిప్పు కణిక తెచ్చినా అది రాజు కునేందుకు ఎండుగడ్డి , రగులుకునేందుకు ఇంటి వాసాలు కావాలి . అన్నం ఒక పట్టాన వుడికి చావదు . ఉడికినా ఇల్లంతా అలుముకున్న పొగతో సుఖంగా భోజనం చేయడం కుదరదు . వేళ కాని వేళ వచ్చిన అతిధి దేవుళ్ళకే తొలి బంతి బొటా బొటిగా సరిపోతుంది . చివరగా తినే ఆడంగులు మళ్ళి పాపం వండుకోవాల్సిందే ! ఆ క్షణంలో నెయ్యి గుడ్డలు , కొయ్య సమానులు కూడా వంట చెరుకు క్రిందే చెల్లి పోతుంటాయాంట ! అర్ధాకలితో లేచి అంట్లు , ఎంగిలి గిన్నెలు ఎత్తు కోవటాలు ! కాస్త నడుం వాలుద్దామనుకోగానే కట్టుకున్న వాడు వచ్చి మర్నాటి అనుపాకాలను గూర్చి ఆరాలు మొదలు పెడతాడు - ఇదంతా ఈ కాలం లో ఏదో మారు మూల పల్లెలో జరిగే తిండి తంతు అనుకొనేరు . . ఐదొందల ఏళ్ల క్రిందటే దక్షిణా పథాన్నంతా ఏక చ్చత్రంక్రిందకి తెచ్చి రామరాజ్యం సాగించాడని మనమందరం మొన్నీ మధ్య దాకా పట్టాభిషేకోత్సవాలు పెట్టుకుని మరీ మురిసిపోయిన రాయలు వారి కాలం నాటి భోజన విశేషాలే ! రాయలు వారే స్వయంగా కళ్ళతో చూసి ఒప్పుకుంటున్నట్లు ఇదంతా తన ఆముక్త మాల్యద మహా కావ్యంలో రాసుకున్నారు . ఉన్న స్వాతంత్ర్యం పోయి మళ్ళా వచ్చి ఆరు దశాబ్దాలు దాటిపోతున్నా జనం భోజన కష్టాలు తీరలేదని చెప్పటానికే ఇంతలా చెప్పుకొచ్చింది . కష్టాలు తీరలేదు కదా . . ఇబ్బందులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోయాయి . రెండు వేళ్ళు మూడు పూటలా నోట్లోకి పోవాలంటే ఏదో సామెత చెప్ప్పినట్లు పెట్టి పుట్టాలి . రాను రాను పరిస్థితులు అంత దుర్బరంగా తయారవుతున్నాయి . రాజ్యాంగం పందొమ్మిదో అధికరణం ప్రసాదిస్తున్న స్వేచ్చ , వాక్సభా స్వాతంత్ర్యాలు వగైరా వగైరా అనుభవించాలంటే ముందుగా పౌరుడనే జీవుడు ఇంత కడుపుకు నిండుగా తిని బ్రతికుండాలి కదా ! అందుకే పందికొక్కులు పెత్తనం చేసే ఈ రాజ్యం లో మనుషులకు కూడా ఆహార హక్కు వుండి తీరాలని ప్రజల హక్కుల కోసం నిత్య పోరాటం చేసే ఓ ప్రజా సంఘం సర్వోన్నత న్యాయస్థానం దాక పోయి పదేళ్లుగా పోరాడుతూనే వుంది . ఈ పోరాట నేపథ్యం తెలిస్తే బుద్ధి వున్నవాడెవడికైనా మైండ్ బ్లాకవడం ఖాయం . జైపూర్ నగర శివార్లలో ని భారత ఆహార సంస్థ మూసివున్న గిడ్డంగుల బయట ఆరుబయలు లో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ టార్పాలిన్ కవర్ల క్రింద మొక్క మొలిచిన కోట్లాది ధాన్యపు రాసులోక వైపు . . . . గోదాములకయిదారు కిలో మీటర్ల దూరంలోని గ్రామాలలో తినడానికి చాలినన్ని తిండి గింజలు లేక వంతుల వారీగా తినడమనే వింత పద్ధతిని కనిపెట్టి అమలుచేస్తున్న దరిద్ర నారాయణుల గుంపింకో వైపు . ఉన్న తిండి గింజలు అందరికి అందుబాటులో ఉండాలంటే కుటుంబంలోని ప్రతి వారూ వారానికి ముడు రోజులు . . . రోజుకి రెండు వందల గ్రాములకు మించి తినరాదన్న విషాద తీర్మానం చేసుకున్నాయా గ్రామాలు . జన సంక్షేమాన్ని చూడాల్సిన ప్రభుత్వ పక్షం , ప్రజల పక్షాన నిల్చి పోరాడవలసిన ప్రతిపక్షాలు పార్లమెంటులో ఇలాంటి దారుణ పరిస్థితులకి కారణం మీరంటే మీరని జనంఅన్నం ముద్దలతో బంతులాట ఆడుకుంటున్నాయి ! సర్వోన్నత న్యాయస్థానమే పూనుకుని విచారణ జరుగుతున్న ఈ పదేళ్లలో జన హితాన్ని దృష్టిలో వుంచుకొని మధ్య మధ్య ఉపాధి హామీ పథకాలనీ , ప్రజా పంపిణి వ్యవస్థ లోపాలనీ , బడిపిల్లలకు మధ్యాహ్న భోజన సదుపాయాలనీ , సమగ్ర శిశుపథకమనీ , అంగన్వాడి వ్యవస్థ పటిష్టతలంటూ తలంటుతూ వుండకబోతే సామాన్యుడికి ఈ మాత్రమయిన కబళం దొరికే దారి వుండేదా ? అనుమానమే ! గోదాములలో ముక్కి పోతున్న బియ్యాన్ని అలా పందికొక్కుల పాలు చేసే బదులు బీదాబిక్కీకి ఉదారంగా పంచి పెట్టవచ్చు గదా ! అంటూ ఆదేశం లాంటి సూచనను అంత లావు సర్వోన్నత న్యాయస్థానం చేసినా . . . ముక్కుతూ మూలుగుతూ ఏదో ముక్కి పోయిన బియ్యాన్ని చౌక ధరల దుకాణం లో దిగువాదాయ వర్గాలవారికిచ్చే ధరకి తప్ప ఇవ్వటానికి . . ఠాట్ . . . లేదు పొమ్మని మొండికేసిన మన మన్మోహన్ సింగు గారి సర్కారుని నమ్మేదెలా ! " తిండి గింజలను పేదలకు పంచే బదులు కుళ్ల బెడుతున్న భారత దేశం " అంటూ తాటికాయంత అక్షరాలు పెట్టి మరీ ఓ ప్రముఖ వార్తా పత్రిక వెలుగులోకి తెచ్చిన పచ్చి నిజాలను వింటే నిజంగా మన ప్రజా ప్రభుత్వాలు ఎంత ఘనంగా వెలిగిపోతున్నాయో అర్ధమవుతుంది . కొన్ని కోట్ల లక్షల టన్నుల తిండి గింజలు ప్రభుత్వ ఆహార గిడ్డంగుల ముందు బాహాటంగా ఏ రక్షణా లేకుండా నెలల తరబడి అలా ఎండా వానలకు మగ్గి పోతున్నాయి . వున్న ధాన్యం కుళ్ళి కంపు కొడుతున్నా ఆహార సంస్థ బియ్యం సేకరణ మాత్రం నిరాటంకంగా అలా కొనసాగుతూనే వుంది ! ఏడాదికేడాది పెరుగుతూ వస్తున్న ఆ కుళ్ళు ధాన్యం ప్రస్తుతం విలువ మార్కెట్ లెక్కల ప్రకారం చూసుకున్నా 17000 వేల కోట్ల రూపాయలకు తగ్గదని ఒక అంచనా . ఈ చెత్తను సేకరించే దానికి ఎఫ్ . సి . ఐ ఏడాదికి 15000 కోట్లు ఖర్చు చేస్తున్నది అని విన్న వారికి తుగ్లక్ రాజ్యం తిరిగి మళ్ళా వచ్చిందా అన్నా అనుమానం రాకుండా ఎలా వుంటుంది ? ప్రతి ఏటా ప్రళికాసంఘం గోదాముల నిర్మాణానికి వేలాది కోట్ల రూపాయలు నిధుల రూపంలో విడుదల చేస్తున్నా సేకరించిన బియ్యం ఇలా వీధులలో టార్పాలిన్ కవర్ల క్రింద ముక్కి పోవటాన్ని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఎండగట్టినా గాని . . . ఈ పిచ్చిపుల్లయ్యల పనులకు ది ఎండ్ పడే దారి కనబడటం లేదు ! అలా గోదాములలో ముక్కిపోతున్న బియ్యంతో ఫ్రాన్స్ లాంటి ఒక పెద్ద దేశాన్ని ఏడాది పాటు ఉచితంగా పోషించవచ్చని . . . మరీ మనకంత మనసొప్పక పోతే మన దేశంలోనే 15 కోట్ల మందికి రోజుకో పూట కడుపు నింపొచ్చని ఓ పెద్దమనిషి పాపం వాపోయాడు . చిన్నారులలో సగం మంది పౌష్టికాహార లోపాలతో బాధ పడుతున్న దేశం మనది . దుర్భర దారిద్ర్యంలో సహారా ఎడారి దేశాలకన్నా వెనకబడి వున్న ఘనమైన అభివృద్ధి మనది . అగ్ర రాజ్యంగా ఎదగటానికి , అణుశక్తి సామర్థ్యం లో సూపర్ పవర్ దేశాలనన్నింటిని దడ దడ దాటి ముందుకెళ్ళాలని , వేగవంతమయిన అభివృద్ధి సాధనలో అమెరికా చైనా లకే పాఠాలు చెప్పాలని వువ్విళ్ళు వూరే మనం ఐక్యరాజ్య సమితి భద్రతాసమితిలో సభ్యత్వం కోసం ఆరాటపడే ముందు గొప్పలకు పోయి అన్నేసి కోట్లు పోసి కామన్ వెల్త్ గేములు ఆడించేందుకు చూపించిన అత్యుత్సాహం లో ఒక్క శాతమన్నా దేశ పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ఆహార హక్కును ఆచరణలో సుసాధ్యం చేసేటందుకు చూపించితే ఎంత బాగుణ్ణు ! అప్పుడే గదా ఏటేటా మన జరుపుకొనే ప్రపంచ ఆహార దినోత్సవాలకి ఒక పరమార్ధం సృష్టించి నట్లయేది ! అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనాసంస్థ ప్రతి ఏడు తయారు చేసే అన్నార్తుల సూచిక ప్రకారం " అన్నమో రామచంద్రా ! " అని ఒక్క ముద్ద కోసం అల్లల్లాడే 88 దేశాల జాబితా లో అన్నింటి కన్నా అట్ట డుగున పడి వున్నది ఘనమయిన మన ' అన్న గర్భే ' నన్న సంగతి మర్చి పోకుండా వుంటే మంచిది . ప్రజా సంఘాలు డిమాండ్ చేసాయనో , పత్రికలు వార్తలు రాసి ఎండగడుతున్నాయనో , సుప్రీం కోర్ట్ మొట్టి కాయలు వేసిందనో , శరద్ పవార్ గారూ సెలవిచ్చారానో , సోనియమ్మ సలహా ఇచ్చిందనో , మోహన్ సింగు గారూ మెచ్చుకున్నరానో కాదు . . . సర్కారు ఆహార హక్కు కల్పించ వలసింది . ఈ సహజ ధాన్యాగారం లో పుట్టిన పుణ్యానికి ప్రతి పౌరుడికి కనీసం రోజు కొక్క పూటయినా రెండు వేళ్ళు నోటికందే విధంగా చర్యలు తీసుకోనంత కాలం ఎన్ని ప్రపంచ ఆహార దినోత్సవాలు ఎంత ఆర్భాటంగా జరుపుకున్నా మాములు జనానికి జరిగే మేలు సున్నా ! గింజ గింజ మిద తినేవాడి పేరు రాసి వుంటుందని హిందీ లో సామెత . మరి ఆ ధాన్యపు గిడ్డంగుల ముంగిలి లో ముక్కిపోయి తినడానికి పనికి రాకుండా పోతున్న గింజల మీద తిండి దొరకక ప్రాణాలు పోయే ఎంత మంది నిర్భాగ్యుల పేర్లు రాసి వున్నాయో ! మానవత్వం వున్న వారందరూ వెంటనే స్పందించ వలసిన అవసరాన్ని ఈ ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భమయినా గుర్తు చేస్తే బాగుణ్ణు . - కర్లపాలెం హనుమంత రావు15 - 10 - 2010
నీ ఒంటిపై నా ఒండు పెదాలతో పెట్టిన ముద్దు వాగై ఎన్ని వంకలు దిరిగిందో . .
తెల్లగా తెల్లవారి పోయింది . పక్కింటి డాబా మీద కూరెళ్ళ జోగారావూ భార్యా , ఎదురింటి డాబా మీద మిల్కినస్పెక్ట్రు గారూ వాళ్ళావిడా పిల్లలూ , అక్కిరెడ్డి పాలెం కోరీ లారీ జట్లూ , ఎమ్సెట్ ప్రేవోట్లనుండి ఇళ్ళకి తిరిగి వెళ్తున్న పిల్లలూ అందరూ టీవీ రామాయణ్ లాగ చూస్తున్నారు . దొడ్డ లేచొచ్చి ఇప్పుడు ఇంక సంధి చేసుకుందాము అన్న ధోరణిలోన ' అసలు నేనెంతో సౌమ్యురాల్ని ' అని రూపించేలాగ లోగొంతుకతో , చాలా నెమ్మదిగా " పోనీగాని ప్రెకాషూ చెప్తునాను ఇదీగోటి … . మీ ఆవిడ నన్ను ఎన్ని మాటలన్నాక నేనా మాటన్నాను ? ముసిల్దానా రేవిట్నక్క లాగ రాలి పడిపోతునావు ఇల్లు ఖాళీ చెయ్యన్నీ దిక్కున్న చోట చెప్పుకోవే అన్నాది ! అన్నాది దాన్నే అడుగు అన్నాదో లేదో ? అడగండి పోనీగానీ ఇదీగోటి ! " అని ముందు అందరూ ఈ నిజం తేల్చుకుందాము అన్నట్టు నిలబడింది . ఇసక పంతులుగారు కలగజేసుకుని " లేడీస్ లేడీస్ ఎప్పుడో అనుకున్నదానికి లెక్ఖేటివై ? అవన్నీ అలాగొదిలీయండి ! " అని అవన్నీ ఎలాగ తుడిచి అవతల పడీయొచ్చో చూపించేడు . మళ్ళీ అందరి దృష్టీ ఆతీ ప్రకాష్ మీదకి తిప్పించి " ఇవాళ డిసెంబరు ఏడో తారీఖు ఆదివారం మంచిగా మర్యాదాగా నిన్ను ఖాళీ చెయ్యమనీసి తగుమనుషుల్ని పెట్టుకోని ఇతనొచ్చేడు ! దీనికి నీ సమాధానఁవేటి ? ఖాళీ చేస్తావ ? చెయ్యవా ? ? ఒకటే ప్రశ్నా … ఒకటే సమాధానం ? ! నువ్వు కొళాయి గొట్టల్చూపించీసి లేడీస్ లేడీస్ చేత మాట్లనిపించీసుకున్నంత మాత్రాన … . కాదుండు ముందు నీన్చెప్పీది విను ! నువ్వు కొళాయి గొట్టాలు చూపించీసినంత మాత్రాన కేసు నీకు రైటయి పోతాదనుకుంటే చాలా అమాయకుడివనుకోవాల . మంచి వాడు , మర్యాదస్తుడు , మన ఆతీ గార్డు గారబ్బాయనీసి నీకు రెస్పెక్టిచ్చినందుకు ఆ రెస్పెక్ట నిలబెట్టుకోవాలి ! ఇంతకంటె నీన్నీ గుమ్మాలంటొచ్చి చెప్పవలిసింది లేదు . చేసి చూపించ వలిసింది చూపించీసేక అప్పుడు అమ్మా బాబూ అంటే ఇంకుపయోగం లేదు . ఏ మాటంటావో ఏటో మీ భార్యా భర్తలుభయులూ బాగా ఆలోచించుకోని మరీ అనండి . ఇవాళాదివారం ! ఇంకా ఏడుంపావయ్యింది ! ! మాకెవ్వళ్ళకీ ఏఁవ్హీ తొందరల్లేవు ! చూడు నీ డెష్షను , నీ ఇష్టం ! " అని హెచ్చరించేడు . ఆయన గుంటలు పడిన దుబ్బు మొహం రొయ్య మీసాలు చిన్న కళ్ళు మొహం మీదే ఆడుతుంటే ఆ వాలకం చూసీ వాకట్లో నిలబడ్డ అక్కిరెడ్డి పాలెం జట్టుని చూసీ ఆతీ ప్రకాష్ అమ్ముల పొదిలో అస్త్రాలు అన్నీ అయిపోయినట్లు తడబడుతున్నాడు . అప్పుడు చిన్నమ్మలు కలగచేసుకుని " అయితే వీళ్ళే గనక తగుమనుషులన్న ముక్క నిజఁవే అయితే మరెందుకు మొహమాటం ? ఆ కార్డు చూపించీయండీ ? ! " అని వాళ్ళాయన్ని గద్దించింది . ఆతీ ప్రకాష్ గబ గబా ఇంట్లోకెళ్ళి ఒక L . I . C డైరీ తెచ్చి దాన్లోంచి ఒక జెరాక్స్ కాయితం పైకి తీసి భాస్కర కుమార్ చేతిలో పెట్టి " ఐ హేవ్ సింపుల్ రిక్వష్ట్ ! యూ ప్లీజ్ కైండ్లీ రీడ్ దిస్ ! ! " అని ఆజ్ఞాపించేడు . ఆ కాయితం మీద ఒక పోస్ట్ కార్డు కాపీ చేసుంది . ఆ దస్తూరి ఎంత చించుకున్నా భాస్కరకుమార్‌కి అర్ధం కాక నందగోపాల్ చేతిలో పెట్టేడు . నందగోపాల్ మొహమాటంగా కళ్ళద్దాలు సవరించుకుంటూ కూడబలుక్కుని ఆ కాయితం చదివేడు :
ఈ మద్య సాక్షి పత్రికలో యాడ్స్ ఈనాడు లో కన్నా ఎక్కువ ఉంటున్నాయి . ఎన్ని ఎక్కువ యాడ్స్ ఉంటే ఆ పత్రిక కి అంత ఎక్కువ సర్క్యులేషన్ ఉందని ఒక బండ లెక్క వేసుకోవచ్చు . అతి తక్కువ సమయంలో సాక్షి విజయవంతం ఎందుకైంది అని పరిశీలిస్తే . . దానికి కారణం ఫామిలీ సెక్షన్ అని చెప్పుకోవచ్చు . వార పత్రికలు … Continue reading →
కావ్యజగత్తులో జి . వి . కృష్ణారావు ( 1914 - 1979 ) సాహిత్యంలో రామణీయకతల్ని చూపి , సిద్ధాంతీకరించిన గవిని వెంకట కృష్ణారావు కూచిపూడి ( తెనాలి తాలూకా , గుంటూరు జిల్లా ) కు చెందిన పండిత కవి . ఒరే , జనానికి అర్ధమయ్యేటట్లు రాయమని ఆయన మిత్రుడు ఎలవర్తి రోసయ్య అంటుండేవారు . బి . ఎ . వరకూ చదివిన కృష్ణారావు తెనాలి వి . ఎస్ . ఆర్ . కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా , విజయవాడలో ఆలిండియా రేడియోలో ప్రోగ్రాం డైరెక్టర్ గా ఉద్యోగాలు చేశారు . బి . ఎ . డిగ్రీతోనే పి . హెచ్ . డి . సంపాదించగలిగారు . కళాపూర్ణోదయం ( పింగళి సూరన ప్రబంధ కావ్యం ) పై ఇంగ్లీషులో సిద్ధాంతం రాసి మద్రాసు యూనివర్శిటీకి సమర్పించారు . కొంత తాత్సారం చేసిన ఎగ్జామినర్లు చివరకు డిగ్రీ యిచ్చారు . ఆ సిద్ధాంతాన్ని నేను తెలుగులోకి అనువదించాను . కొన్ని భాగాలు గోలకొండ పత్రికలో ( హైదరాబాద్ నుండి వెలువడేది ) ఆదివారాలు సీరియల్ గా 1962 ప్రాంతాల్లో ప్రచురించారు . 1940 నుండీ జి . వి . కృష్ణారావు మానవ వాద ప్రభావితుడై , ఎం . ఎన్ . రాయ్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు . ఆంధ్రప్రభలో నార్ల వెంకటేశ్వరరావు ఆయన కళాసిద్ధాంత రచనల్ని ప్రోత్సహించారు . రాయ్ రచన తెలుగులో వర్గ సంబంధాలుగా కృష్ణారావు అనువదించారు . ఆయన కావ్య జగత్తు రామణీయకతల లోతుపాతుల్ని చూపింది . కృష్ణారావు గద్యపద్య రచనలు చేశారు . నాటికలు రాశారు . నవలలు కథలు ఎన్నో రాశారు . అందులో కీలుబొమ్మలు మంచి ఆదరణ పొందింది . పాపికొండలు నవల పూర్తి కాకుండానే ఆగిపోయింది . కృష్ణారావు వక్తకాదు . ఆకర్షణీయంగా కాకున్నా ప్రసంగాలు చేసేవాడు . ఆయన జీవితమంతా ఉబ్బసవ్యాధితో ( ఆస్తమా ) తీవ్రబాధ పడ్డారు . చివరి రోజులలో హైదరాబాద్ లో వున్నారు . 1955 నుండీ కృష్ణారావులో నాకు సన్నిహిత పరిచయం వుంది . ఎం . ఎన్ . రాయ్ సిద్ధాంతాలలో ముఖ్యంగా 22 సూత్రాలలో కొన్నిటితో విభేదించినట్లు చెప్పేవారు మానవుడు ప్రాయకంగా హేతువాది ( Man is essentially rational ) అనేది ప్రశ్నార్థకం అనేవారు . నిర్థారితవాదం , స్వేచ్ఛాపూరిత యిచ్ఛ అనేవాటిలో కూడా సందేహాలున్నాయనేవారు . కాని మార్గాంతరాలు సూచించలేదు . కృష్ణారావు బాగా చదివేవారు . అధునాతన పాశ్చాత్య రచయితల్ని బాగా స్టడీచేసేవారు . తెనాలిలో అనేక సందర్భాలలో ఆయనతో కూర్చొని యిష్టా గోష్టి చర్చలు చేశాం . హైదరాబాద్లో యింటికి వెళి పరామర్శ చేసేవాడిని . రాడికల్ హ్యూమనిస్ట్ అధ్యయన శిబిరాలకు వచ్చి కృష్ణారావు ఉపన్యాసాలు చేసేవారు . రచనలు : - Ph . D . Thesis Studies on Kalapoornodayam , విగ్రహ వ్యావర్తిని ( అనువాదం ) , జే గంటలు ( ప్లేటో తత్వం ) , ప్లేటో రిపబ్లిక్ అనువాదం ( ఆదర్శ రాజ్యం ) , వరూధిని , శివరావు , యుగసంధ్య ( కావ్యాలు ) , భిక్షాపాత్ర ( నాటిక ) , బొమ్మఏడ్చింది ( నాటకం ) , ఆదర్శ శిఖరాలు ( నాటికలు ) , కీలు బొమ్మలు ( నవల ) , పాపికొండలు ( నవల ) , రాగరేఖలు ( నవల ) , జఘనసుందరి ( నవల ) , చైత్రరథం ( కథలు ) , వర్గ సంబంధాలు ( ఎం . ఎన్ . రాయ్ రనచ అనువాదం ) .
ఈరోజుల్లో పాశ్చాత్య దేశాల్లో పత్రికా సంపాదకులు మారుపేరుల్లో వచ్చే రచనలుగాని , ఉత్తరాలుగానీ సహించరు . ఒకవేళ వివాదాస్పదమైన రచనైతే , మారుపేరుతో ప్రచురించినా , అసలు పేరు ఎడ్రసూ వగైరా పత్రికకి చెప్పితీరాలి . ఎందుకంటే , మనం రాసింది మనమే రుజువు చేసుకోలేకపోతే , ఆ తరువాత కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుంది .
పిల్లిలా నడుస్తూ దొడ్డిగుమ్మం వరకు వెళ్ళాడు . అక్కడ గొంతుకూర్చున్నాడు . గభాల్న తలను ముందుకు వంచి లోపలికి తొంగి చూశాడు . ఎవరూ కనిపించలేదు గాని పై అంతస్తులో చప్పుళ్ళు వినిపిస్తున్నాయి .
ప్రకృతిలో శక్తి ఎల్లెడలా వ్యాపించి ఉంటుంది . ఇది అనేక రూపాలలో ఉంటుంది . ఉష్ణశక్తి , విద్యుచ్ఛక్తి , స్థితిశక్తి , గతిశక్తి , కాంతిశక్తి , యాంత్రికశక్తి మొదలైనవి . ఐతే ఈ శక్తులన్నింటికీ మూలం ఒకటే . ఒకే శక్తి వివిధ రూపాలు పొందినది . ఒక రూపంలో ఉన్న శక్తి మరో రూపంలోకి మారుతూ ఉంటుంది . ఏ రూపంలో ఉన్న శక్తి ఎంత పరిమాణంలో ఉన్నా , మొత్తం శక్తి యొక్క పరిమాణం మాత్రం స్థిరం . అది పెరగటం కానీ తగ్గటం కానీ జరగదు . శక్తిని కొత్తగా సృష్టించలేము . ఉన్న శక్తిని రూపుమాపలేము . మొత్తం శక్తి యొక్క పరిమాణం ఎల్లప్పుడూ స్థిరం . బహురూపాలలో ఉండే శక్తిని కేవలం ఒక రూపంలో నుండి మరో రూపంలోకి మాత్రమే మార్చగలం . ఇదే . రాజయోగం కూడా ఈ శక్తి నిత్యత్వ నియమాన్ని అనుసరించే నిర్మించబడినది . మనసు ద్వారా జగత్తులో ఎల్లెడలా పరివ్యాప్తమై ఉన్న శక్తిని ఆవాహన చేసి ఆ శక్తిని మనకు కావలసిన మరో శక్తి రూపంలోకి మార్చుకుంటాం . ఈ విధంగా మనస్సు ద్వారా శక్తిని ఆవాహన చేసే విధివిధానాలను వివరించేదే రాజయోగం . యశస్సు , సంపద , విజయం , అధికారం , భోగం ఇత్యాది రాజయోగలక్ష్యాలు శక్తి యొక్క వివిధ రూపాలే . శక్తి ఆవాహనా సాధనమైన మనస్సుకూడా శక్తి యొక్క రూపమే . అలాగే విధి కూడా శక్తి స్వరూపమే . అంటే మనస్సు ద్వారా ఆవాహన చేయబడిన శక్తిని రాజయోగ లక్ష్యాలైదింటిలో మనకు కావలసిన రూపానికి లేక రూపాలకు మార్చుకుంటాం . శక్తి ఆవాహన చెందిన బలీయమైన మనస్సుతో చేసిన సంకల్పాలకు విధిరూపంలో ఉన్న శక్తి అనుకూలత చెంది , ఆ సంకల్పాలు విజయవంతం అవటంతో మనకు రాజయోగ లక్ష్యాల రూపంలో ఉన్న యశోసంపదాది శక్తి రూపాలు సమకూరతాయి . మనస్సు ద్వారా శక్తిని ఆవాహన చేసి దానిని ఏ విధంగానూ రూపాంతరం చెందించని పక్షంలో అది తపశ్శక్తిగా మనలోనే ఉంటుంది . ప్రాచీన భారతంలోని ఋషులు ఈ విధంగానే తపశ్శక్తిని ఆర్జించేవారు . దానిని అనుభవింపదగిన భౌతికరూపాలలోకి మార్చుకోకుండా నిరాడంబరజీవన విధానంతో కాపాడుకుని అవసరాన్ని బట్టి తగిన సమయంలో లోకకళ్యాణార్ధమే వినియోగించేవారు . అసురులు అలాకాక తాము ఆర్జించిన తపశ్శక్తిని మితిమీరిన భోగాలకు , దుష్ట కార్యాలకు , పరపీడనకు వినియోగించి చివరకు శక్తి అంతా క్షీణించి , తిరిగి ఆ శక్తి స్వరూపమే అయిన విధి చేతిలోనే వంచితులై పతనమయ్యేవారు . విధిని గురించి నాస్తికుల వద్ద ప్రస్తావిస్తే ఇంతవరకూ దైవంతోనే వేగలేకపోతున్నాం మళ్ళీ ఈ విధి ఒకటా అని పరిహసిస్తారు . పాజిటివ్ గా అయితే కొందరు ఈ విధిని ' అదృష్టం ' అంటారు . కొందరు ' కలసిరావడం ' అంటారు . అదే నెగెటివ్ గా అయితే కొందరు దీనిని ' దురదృష్టం ' అంటారు . కొందరు ' ఖర్మ ' అంటారు . మరికొందరు ' తలరాత ' అంటారు . ఎవరు ఏమన్నా మానవాతీతంగా దైవం తరువాత ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే దైవంకన్నా కూడా ఎక్కువగా మానవజీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉన్న అంశంగా మనం ఈ విధిని గుర్తించవచ్చు . ఈ విధి శక్తి స్వరూపం . మానవుడు ఐహికంగా ఔన్నత్యాన్ని సాధించాలన్నా లేక ఇహలోక జీవితంలో ఏ విధమైనటువంటి విజయాన్ని సాధించాలన్నా కూడా ఈ విధి అనుకూలించినపుడు మాత్రమే చేయగలడు . విధి సహకారంలేనపుడు మానవుడు చిన్న విషయంలో కూడా విజయాన్ని సాధించలేడు . ఈ విధి మానవుడిని అందలాలు ఎక్కిస్తుంది ; అదఃపాతాళానికి అణగద్రొక్కుతుంది . యశోవంతుణ్ణీ చేస్తుంది ; అనామకుణ్ణి చేస్తుంది . అంతులేని భోగాలలో ముంచిలేపుతుంది ; చిత్రవధ చేసి చంపుతుంది . అనేక మహత్తర విజయాలనందిస్తుంది ; ఇసుమంత సామర్ధ్యం లేని నిర్వీర్యుణ్ణి చేస్తుంది . కుబేరుణ్ణి చేస్తుంది ; కుచేలుణ్ణీ చేస్తుంది . పండితుణ్ణి చేశ్తుంది ; పరమశుంఠనూ చేస్తుంది . ఐతే ఇవేవీ కూడ యాదృచ్ఛికంగా జరగవు . మన యెడల విధియొక్క ఆగ్రహానుగ్రహాల ననుసరించి మాత్రమే జరుగుతాయి . దీనివలననే మనం ఈ విధిని కాళి , చండి , దుర్గ మొదలైన శక్తి రూపాలలో పూజిస్తుంటాము . అంటే ఇంతకు ముందే చెప్పినట్లుగా ఇది ఒక రకంగా శక్తి ఉపాసన . దైవారాధనకు , శక్తి ఉపాసనకు ఉన్న తేడాను మనం ఈ విధంగానే గుర్తించాలి . మన యెడల ప్రసన్నమైన విధి మనకెన్నో వరాలను ఇస్తుంది . ప్రధానంగా మన సంకల్పాలు విజయవంతమయ్యే రూపంలోనే అదంతా ఉంటుంది . ఈ విధంగా కొన్ని సాధనల ద్వారా విధిని ప్రసన్నం చేసుకోవచ్చు . శాక్తేయులు చేసే శక్తి ఆరాధన మరియు తాంత్రికులు చేసే క్షుద్ర సాధనలవంటివి కావు ఇవి . సామాన్యజనులందరూ ఆచరించదగిన అతి సాధారణమైన ఆచరణలు . ఈ సాధనలను వివరించేదే రాజయోగం .
మొదటి మూడు భాగాలలో , హార్డ్ డిస్క్ గురించిన ముఖ్యమైన ప్రాధమిక సమాచారం తెలుసుకున్నాం . ఫైల్ సిస్టం లు అంటే ఇప్పుడు మనకో మంచి అవగాహన ఉంది . ఈ పాఠ్యాంశంలో కాస్త తనువూ , మనసూ శ్రద్ధతో నిమగ్నం చేసి ( అంటే మన వాడుకలో , ఒళ్ళు దగ్గరపెట్టుకుని : ) ) చేయాల్సిన విషయాలు చూద్దాం - అవే , పార్టిషన్లు సృష్టించడం , సైజు మార్చడం , తొలగించడం .
బడా పారిశ్రామిక సంస్థలు , పారిశ్రామికవేత్తలు - ప్రభుత్వ సేవకుల మధ్య రహస్య సంబంధాలు అవినీతికి మూలాలనే విషయాన్ని గుర్తించాలి . వ్యాపార సంస్థలతో సంబంధంగల కేసులను దర్యాప్తు చేసే లోక్‌పాల్ అవినీతి పద్ధతుల ద్వారా ఆ సంస్థలు తీసుకునే లైసెన్స్‌లు , కుదుర్చుకునే ఒప్పందాలు , లీజ్‌లను రద్దు చెయ్యాలి . అటువంటి కంపెనీలను భవిష్యత్తులో ఎటువంటి కాంట్రాక్టులు , లైసెన్స్‌లు పొందకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే అధికారం కూడా లోక్‌పాల్‌కు ఉండాలి . అదేవిధంగా లబ్ధిదారుడు వ్యాపార సంస్థ అయితే కోశాగారానికి వచ్చే నష్టాన్ని ఆ సంస్థ నుండి వసూలు చెయ్యాలని సిఫార్సు చేసే అధికారం లోక్‌పాల్‌కు ఉండాలి . ప్రభుత్వం ఈ సిఫార్సులను మామూలుగా అమోదించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి .
వాసవదత్త అమ్మయ్య ! ఇది వెళ్ళింది . స్వామి పరాయివాళ్ళ పాలయ్యాడు . నాకన్నీ కష్టాలే గదా ! నేనుకూడా మంచమెక్కి పడుకుని నాదుఃఖాన్ని మర్చిపోతాను . ( వెళ్ళిపోతుంది )
బ్రిడ్జ్‌టౌన్ ( బార్బడోస్ ) : వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు తన అవసరం లేదనే వాస్తవాన్ని తాను తెలుసుకున్నానని డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ స్పష్టం చేశాడు . బోర్డు తనతో రాజీ చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ హాస్యాస్పదమైనవన్నాడు .
తమిళంలో ' పుదు - చ్చేరి ' అంటే ' క్రొత్త - ఊరు ' అని అర్ధం . దీనికి సమీపమైన ఫ్రెంచి ఉచ్ఛారణ ప్రకారం దీనిని ఫ్రెంచివారు ' ౌ్కఠఛీజీఛిజ్ఛిటడ ' అని పిలిచారు . ఎప్పుడో పొరబాటున ఆంగ్లంలో ' ఠ ' బదులు ' ' అని వ్రాయడం వల్ల దీనిని ఆంగ్లంలో ' పాండిచ్చేరి ' అని పిలువడం మొదలయ్యిం దని అంటారు . తరువాత అదే పేరు వాడుకలోకి వచ్చిందట . ప్రస్తుతం ఆంగ్లంలో అధికారికంగా ' పుదుచ్చేరి ' అని పేరు మార్చే ప్రయత్నం జరుగుతున్నది .
అనగా అనగా . . . . . అది మౌల్వీ నసీరుద్దీన్ నివసించే ఊరు . ఆ ఊళ్ళోని ఓ కట్టెలు కొట్టుకునే వాడు దాపులనే ఉన్న అడవికి కట్టెల కోసం వెళ్ళాడు . కష్టపడి ఓ పెద్దమోపు కట్టెలు కొట్టాడు . ఎత్తి నెత్తిన పెట్టుకొనేందుకు సాయం అవసరమై చుట్టూ చూశాడు . దారిన పోతున్న ఓ బాటసారి కనబడ్డాడు . " అయ్యా ! కాస్త ఈ మోపు ఎత్తి నానెత్తిన పెట్టుకొనేందుకు సాయం పడతారా ? " అర్ధించాడు కట్టెలు వాడు . " అలాగే ! దానికేం భాగ్యం ! కానీ సాయం చేస్తే నాకేమిస్తావు ? " కళ్ళెగరేస్తూ అడిగాడు బాటసారి . " ఏమి లేదు బాబయ్య ! " యధాలాపంగా జవాబిచ్చాడు కట్టెల వాడు . " మాట తప్పకూడదు సుమా ! " అంటూ కట్టెల మోపు ఎత్తుకోడానికి సాయపడ్డాడు బాటసారి . మోపు నెత్తికెత్తుకొని ఇంటిదారిపట్టాడు కట్టెల వాడు . " ఏమయ్యోయ్ ! నాకిస్తానన్నది ఇవ్వకుండా పోతున్నావు . ఇదేం న్యాయం ? " అంటూ వెంటపడ్డాడు బాటసారి . " నేనేమిస్తానన్నాను బాబయ్య ! ఏమీ లేదనే చెప్పానే ? " అయోమయంగా అడిగాడు కట్టెల వాడు . " ఆ . అదే ! అ ' ఏమిలేదు ' అన్నదాన్నే నా మొహాన పారేస్తే నా దారిన నేపోతా " విసుగ్గా అన్నాడు బాటసారి . " ఏమీ లేని దాన్ని ఎక్కడి నుండి తెచ్చివ్వను బాబయ్య ! " ఘోల్లుమన్నాడు కట్టెల వాడు . " అదంతా నాకు తెలియదు . ' ఏమీ లేదు ' అన్నదాన్ని ఇస్తానన్నావు . మాట తప్పకూడదని ముందే హెచ్చరించాను కూడా . ఏమైనా సరే ! నువ్వు నాకు ' ఏమీ లేదు ' అన్న దాన్ని బాకీ పడ్డావు . నా ' ఏమీ లేదు ' నాకిచ్చేస్తే సరి , లేకపోతే మర్యాద దక్కదు " పెడసరంగా హెచ్చరించాడు బాటసారి . కట్టెల వాడు లబోదిబో మన్నాడు . బాటసారి అతడి వెంటపడి వేధించసాగాడు . అలా గొడవపడు తూనే ఇద్దరు ఊళ్ళోకి వచ్చారు . వారికి నసీరుద్దీన్ తారస పడ్డాడు . " ఏమిటి గొడవ ? " అడిగాడాయన . విషయమంతా చెప్పుకొని బావురుమన్నాడు కట్టెల వాడు . గట్టిగా తన వాదన వినిపించాడు బాటసారి . చిరునవ్వు నవ్వాడు నసీరుద్దీన్ . " కట్టెల మోపు నెత్తికెత్తుకోవడానికి సాయం పడితే ఏమిస్తానన్నాడు ఇతడూ ? " నిర్ధారణ కోసం అన్నట్లుగా బాటసారిని అడిగాడు . గొంతు సవరించుకొని " ఏమిస్తావని నేను అడిగినప్పుడు ఈ మనిషి , ' ఏమీ లేదు ' అన్నాడు . ఆ ' ఏమీ లేదు ' అన్నదే ఇచ్చేయమనండి . నాదారిన నేను పోతాను " మరింత రచ్చచేస్తూ అన్నాడు బాటసారి . " తప్పకుండా నీ దారిన నువ్వు పోదూగాని ! ఇంతకీ ఇప్పటికి ఏమిచ్చాడు ఈ కట్టెల వాడు నీకు ? " ఆరాగా అడిగాడు నసీరుద్దీన్ . " ఏమీ లేదూ . అందుకేగా ఈ గొడవంతా " చిరాగ్గా చెప్పాడు బాటసారి . " మరింకెందుకు గొడవ ? నీ ' ఏమీ లేదు ' అన్నదాన్ని నీకిచ్చేశాడుగా ! " అన్నాడు నసీరుద్దీన్ . అప్పటికే చుట్టుమూగిన జనం ఘోల్లున నవ్వుతూ చప్పట్లు చరిచారు . సిగ్గుతో తలదించుకొన్నాడు బాటసారి . " రక్షించారు బాబయ్య ! " అంటూ కట్టెలు వాడు నసీరుద్దీన్ కి దండం పెట్టెశాడు . ఇదీ కథ ! మరో కమ్మని కథ కోసం వేచి చూడండి .
ఈ విషయం , కొన్ని దశాబ్దాల క్రితమే , పెద్దలచే ( ఇంక్లూడింగ్ మాలతీ చందూర్ ఇన్ ప్రమదావనం - - జవాబులు ) రూఢి చెయ్యబడింది !
ముందుగా - " సత్యజిత్ రాయ్ ఏమిటి ? రచయిత ఏమిటి ? " అని ప్రశ్నించుకుంటున్న వారికోసం కాస్త చరిత్ర . సత్యజిత్ రాయ్ తాత ఉపేంద్రకిశోర్ రాయ్ 1913 లో పిల్లల కోసం బెంగాలీ లో - " సందేశ్ " అన్న పత్రిక మొదలుపెట్టాడు . 1915 ఆయన మరణానంతరం ఆయన కుమారుడు సుకుమార్ రాయ్ దాని బాధ్యతలు స్వీకరించి , సందేశ్ ని సాహిత్య విలువలు నిలుపుకుంటూ , ప్రపంచ జ్ఞానం అందిస్తూ , హాస్యం పాలు సమానంగా అందించే ప్రత్యేకత గల పత్రికగా నిలబెట్టారు . 1923 తరువాత సుకుమార్ రాయ్ మరణం తో సందేశ్ కి కొన్నాళ్ళు కష్టకాలం . 1934 కల్లా పూర్తిగా ఆగిపోయింది . మళ్ళీ 1961 లో సుకుమార్ రాయ్ కుమారుడైన సత్యజిత్ రాయ్ ఈ పత్రిక కు జీవం పోసి మళ్ళీ మునుపటి పేరు తెచ్చాడు . రాయ్ మరణం తరువాత కూడా పత్రిక కొనసాగుతూనే ఉంది . ఇటీవలి కాలం లో ఈ పత్రిక మళ్ళీ 1923 - 34 నాటి పరిస్థితులు ఎదుర్కుంటూ ఉందని వికీపీడియా వ్యాసం చెబుతోంది . రాయ్ రచనల్లో చాలా వరకు మొదట " సందేశ్ " లో వచ్చినవే .
ఇప్పటివరకు హతులైన వీరుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా నలుగురు , గుజరాత్ లో ఇద్దరు , బీహార్ , ఉత్తరప్రదేశ్ , ఆంధ్రప్రదేశ్ లలో ఒక్కొక్కరు అసువులు బాసారు . చాలా విచిత్రంగా ఈ హత్యలన్నింటి వెనుక మాఫియా , రాజకీయ నాయకుల , కొందరు అధికారుల హస్తముండడం జాతి యావత్తు సిగ్గుపడాల్సిన విషయం . ఇంకా విచిత్రంగా ఈ హత్యకేసులు నడుస్తుండడం గమనిస్తే మనమీద మనకే అసహ్యం వేస్తుంది . చనిపోయిన వారిమీదే తప్పంతా తోసేసి వారికే జరిమానాలు విధించిన మన పోలీసులు , అధికారులు , వారికి వెన్నుదన్నుగా నిలిచే రాజకీయ నాయకులు … కేవలం మనకే సొంతం . అరుణారాయ్ ఏమంటారంటే ఆర్థిక సరళీకరణలు దేశంలో చోటుచేసుకున్న తరువాత దేశంలో కొత్తగా పోగవుతున్న సంపదను గుత్తసొత్తుగా దోచుకోవడానికి రాజకీయ నాయకులు , అధికారులు జరుపుతున్న కుట్రలో సామాజిక ఉద్యమకారులు సమిధలు అవుతున్నారు . ఇలా తమ అక్రమాలను బయటపెడుతున్న వారికి గుణపాఠం చెప్పడానికి కొందరిని చంపడంద్వారా తమ అక్రమాల జోలికి వస్తే ఏమవుతుందో తెలుసుకోమని వారు కొన్ని హెచ్చరికలు చేస్తారు . దీనిద్వారా వారు పంపదలచుకున్న సందేశం ప్రజలకు చేరిపోతుంది . వారి ఆగడాలకు హద్దు వుండదు .
సమాధానం : ఆయన స్వీయానుభవాన్ని చెప్పాడు , ఆయనకు తారస పడ్డ వారి గురించి . మీకట్టి అనుభవం లేదు కదా . .
చిన్నింటా చిన్నమల్లె పూసినాదన్నా ? చిన్న వదినే కోమాండ్ల కన్నదాయన్నా ? పొద్దింటీ పెదమల్లె పూసినాదన్నా ? పెద్ద వదినే కోమాండ్ల కన్నదాయన్నా ?
రోజీ కూడా ఈ లోకస్ట్ వాక్‌కి పెర్మనెంటే అనుకుంటూ వుంటే . . సరిగ్గా ఈ లోకస్ట్ వాక్‌ని ముప్ఫై నాలుగో వీధి ఖండించే చోట . . ఆమె వయసెంతో చెప్పడం కష్టం . . ఇటికలు పరిచిన ఆ ఇంటర్సెక్షన్లో . . వింత వింత డ్రెస్సులేస్కుని . . ఏవేవో విచిత్రమైన బొమ్మలు . . నిజంగా బొమ్మలు కావు , ఏవో సింబల్స్ . . కుట్టిన పేద్ధ నీలం రంగు జెండా పట్టుకుని . . వూపుతూ . . నాట్యం కాని నాట్యమేదో విన్యసిస్తూ . . మధ్య మధ్య గొంతెత్తి పాడుతూ . . మొదట్లో పిచ్చిదేమో అనుకున్నా . ఒకసారి ఆ స్క్వేర్ దాటుతుంటే రోజీ పాట వినపడి , ఏవిటో నని . . మాటల కర్థం వెతుక్కుంటే . . పూర్తిగా అర్థం కాలేదు . కానీ శాంతీ . . పిల్లలూ . . ప్రపంచం . . ఇలాంటి మాటలేవో వినిపించాయి . అలా ఆమె పాట విన్నప్పుడల్లా . . అప్పుడో ముక్కా ఇక్కడో ముక్కా వింటూ . . ఆమె ప్రపంచ శాంతి కోసమూ , బాల కార్మికుల విముక్తి కోసమూ , భూపర్యావరణ రక్షణ కోసమూ కలవరిస్తున్నదని . . ఆ రంగుల కలని వరిస్తున్నదని . . అర్థమైంది . కానీ ఆమే అర్థం కాలేదు . పొద్దున్న లాబుకెళ్ళేటప్పుడూ , మధ్యాన్నం లంచికి పోతుంటేనూ , సాయంత్రాలు ఆ వెధవ కంప్యూటర్నించి కసింత విశ్రాంతి కోసం బయటి కొస్తేనూ , తటస్థించేది . . అదే స్క్వేర్లో . . తనదైన నాట్యం కాని నాట్యం చేస్తూ . . అలాగే వుండిపోతుందా ఆ స్క్వేర్లో . . యుగాంతం వరకూ అనిపిస్తూ . . ఆమె కోరుకునేవేవీ యుగాంత మైపోయినా సూర్యుడు సూపర్ నోవా ఐపోయినా . . జరిగేవి కావు అని గ్రహించిందేమో . అందుకే పిచ్చిది కాదేమోననిపించింది . ఒకానొక సాయంత్రం అదే స్క్వేర్లో నిలబడి , వొంటిమీద గాసొలీన్ దిమ్మరించుకుని ఆరు ఇటికల మీద కాలిన నల్లటి మచ్చగా ఈ లోకస్ట్ వాక్‌లో రోజీ పర్మనెంట్‌గా నిలిచిపోయింది . నిజంగా పిచ్చిదే ! లేకపోతే , తను సజీవంగా కాలిపోతున్నా పట్టించుకోని ఈ వెధవ ప్రపంచం కోసం . . నిండు ప్రాణాలు . . తప్పకుండా పిచ్చిదే !
( ఇటీవల మరణించిన ఆర్ . ఎస్ . రావుగారికి భూమిక నివాళి ) ఆర్ . ఎస్ . రావు మా యూనివర్సిటీ పక్కనే హీరాకుడ్ డ్యాము వుంది . మహానది మీద కట్టిన ఈ ఆనకట్ట స్వాతంత్య్రా నంతర భారతదేశంలో మొట్ట మొదటి బహుళార్ధసాధక ప్రాజెక్టు . కొన్ని వేల ఎకరాలకి నీటి సరఫరా నుండి అనేక ప్రాంతాలకు విద్యుత్ శక్తి సరఫరా దాకా వివిధ ప్రయోజనాలు నిర్వర్తించే ఈ ప్రాజెక్టు మన ఆభివృద్ధికి ఒక ప్రతీక . అయ [ … ]
వాళ్లు తనవైపు చూసిందాకా ఆగి మళ్ళీ మొదలెట్టింది . " జీన్ మోడిఫికేషన్ అద్భుతాన్ని దీనికి జోడిస్తే మీ పాపా ఇంత అందంగా పుడుతుంది . ఎదిగేప్పుడు ప్రతి వయసులో ఖచ్చితంగా మీరు ఇంతకుముందు చూసినట్టే , అంత అందంగానే ఉంటుందని మా హామీ . రేపు మీ పాప తన చుట్టూ ఉన్న ఇంత అందమైన వాళ్ళని చూసి తనూ అలా లేనందుకు కుంగిపోకుండా ఇప్పుడే జాగ్రత్త పడండి . "
బాబాకు మహిమలున్నాయా ? ఉన్నాయంటే ఏ ఇబ్బందీ లేదు . బాబా మహిమల గురించి పుంఖాను పుంఖాలుగా కథలల్లి ఒక గ్రంథాన్నే తయారుచేసి ఒక సైంటిస్టు చేతనో , ఒక డాక్టరు చేతనో ఇంకా వీలైతే ముఖ్యమంత్రి , ప్రధానమంత్రి , రాష్ట్రపతి మొదలగు అధికార అనధికార ప్రముఖుల చేత ముందు మాట రాయించి , వేల కాపీలు అచ్చేయించి సొమ్ము చేసుకోవచ్చు . రాసిందెలా వున్నా నమ్మేవాళ్ళెక్కువ . నమ్మని వాళ్ళలో కూడ ప్రశ్నించే వాళ్ళు తక్కువ . కానీ బాబాకు మహిమలు లేవనాల్సి వస్తేనే కొంత ఇబ్బంది . లాజిక్ కావాలి . అదీకాక మరణించిన వ్యక్తిని గురించి వ్యతిరేకంగా రాయటమేమిటనే ప్రశ్న ఎదురౌతుంది . బాబా మహిమల గురించి గతంలో చాలా విస్తృతంగా చర్చ జరిగింది
ఆ సమయంలోనే నదిలోనుండి బుగ్గలు రావడాన్ని వారు గమనిస్తారు . ఆ నీటి బుగ్గల వెంట విగ్రహ రూపంలో తేలిన స్వామి ఒడ్డుకు వచ్చి నిలబడ్తారు . ప్రజలు ఆనందోత్సాహాలతో జయజయ ద్వానాలు పలికారు . స్వామికి పూజలు జరిపారు . తరువాత స్వామి విగ్రహాన్ని ఒక బండిపైకి ఎక్కించి ఊరేగింపుగా ముందుకు కదిలారు . ప్రస్తుతం దేవాలయం ఉన్న చోటికి బండి చేరుకోగానే బరువెక్కి కదలకుండా నిలిచిపోయింది . ప్రజలు ఎన్ని శక్తి యుక్తులు ప్రదర్శించినా , బండి అంగుళం కూడా ముందుకు కదలదు . దీంతో చేసేదేమీలేక స్రజలు స్వామి వారిని అక్కడనే ఉంచి భోజనముల కోసమని కేతవరం గ్రామానికి వెళ్లిపోగా , వారి వెంట వచ్చిన వడ్రంగి పిచ్చివీరయ్య వీరభద్రస్వామి విగ్రహం దగ్గరే ఉండి పోయాడు .
అన్యాయం ప్రబలమైన చోట న్యాయం కోసం పోరాటం వుంటుంది . రోగం వున్నచోటే నిరోధక వ్యవస్థ ఏర్పడుతుంది . పోలీసు అకృత్యాలైతేనేమి , " స్టేట్ " చేసే అరాచకమైతేనేమి అదెక్కడుంటుందో దానికి వ్యతిరేకంగా పోరాటం కూడా అక్కడ వుంటుంది . మన దగ్గర నక్సలైట్లు వున్నారంటే దానర్థం మనదగ్గర భూస్వామ్య దోపిడీ వుందని . నక్సలైట్లు అప్రతిహత రాజ్య అధికారానికి , అహంకారానికి ప్రతిపక్షంలా వ్యవహరించాలి . ఆవిధంగా బలాబలాల సామ్యం ఏర్పడాలి . కానీ నక్సలైట్ల పోరాటం వాళ్ళ సిద్దాంతానికి కాకుండా ఇతరుల సిద్దాంతాన్ని వ్యతిరేకించడానికో లేక పోలీసుల మీద వ్యక్తిగత పోరాటంగానో పరిణమించింది . ఈ దారితప్పిన పోరాటంలో వాళ్ళు ఎవరికోసమని తుపాకులు పట్టారో వాళ్ళ మీదనే అవి ప్రయోగిస్తున్నారు . ఇన్ఫార్మర్లనో ఇంకొకటో ముద్ర వేసి అచ్చం పోలిసుల మాదిరే వాళ్ళూ ప్రవర్తిస్తున్నారు . వాళ్ళు సిద్దాంతపరంగా పోరాటం చేసినన్నాల్లూ వారికి ప్రజల మద్దతు దొరుకుతుంది గానీ స్వార్థపూరితంగా పోరాటం చేస్తే ప్రజల మద్దతు ఎలా వస్తుంది ? నిజానికి ప్రజల మద్దతు పొందాలంటే వాళ్ళు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికై పోరాటం చేయాలి . ఠాగూర్ లాంటి చిత్రాలే ప్రజలని అంతగా కదిలించగలుగుతూ వుంటే అలాంటి పనిచేసి నక్సలైట్లు మాత్రం ఎందుకు పేరు తెచ్చుకోకూడదూ ? ఇన్ఫార్మర్ అని ఒక పేదవాన్ని చంపేబదులో లేక హత్యకు హత్య బదులని ప్రభుత్వం ఒకన్ని చంపితే వీళ్ళు ఇంకొకన్ని చంపేబదులు ఆ " ఆకుల రాజయ్య " నో లేక అవినీతితో కోట్లు కూడబెట్టిన ఇంకో వుద్యోగినో భయపెట్టో , హతమార్చో న్యాయం కోసం ధర్మం కోసం ప్రజల్లో భీతి కల్పించవచ్చు కదా ? సినిమాల్లో వీరోచిత కార్యాలు చేసి న్యాయం పక్షాన నిలబడే హీరోనే ముఖ్యమంత్రిని చేయగా లేంది ఇలాంటి పనులు నిజ జీవితంలో చేస్తే అధికారంలోకి రావడం నక్సలైట్లకైనా ఇంకో గ్రూపుకైనా ఎంతసేపు ? నాకెందుకో ఈ నక్సలైట్లు అధికారానికి ఇలాంటి రాచమార్గము వుండగా అరాచకమార్గాన్ని ఎన్నుకున్నారనిపిస్తోంది . వీళ్ళు తలుచుకుంటే కాంట్రాక్టర్లని ఇసుక కట్టడాలు నిర్మించకుండా అడ్డుకోవచ్చు . రాజకీయనాయకులు చేసిన వాగ్దానాలను అమలు చేసేటట్లు నిర్బందించవచ్చు . అధికారులను అవినీతిని చేయకుండా ఆపవచ్చు . ఇదంతా నా అత్యాశేమొ !
మిస్టర్ మార్క్ ఫుల్లర్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఎమ్ బిఎ , హార్వర్డ్ లా స్కూల్ విత్ హానర్స్ నుండి జెడి డిగ్రీ పొంది ఉన్నారు . ఆయన ఫి బీటా కప్పాకి సభ్యుడు . మిస్టర్ మార్క్ ఫుల్లర్ ఆయన 1982 స్థాపించిన ఒక సంస్థకు మానిటర్ గ్రూప్ యొక్క ఛెయిర్మన్ అండ్ ఛీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ . ఆ గ్రూప్ ప్రస్తుతం మూడు విభిన్న బిజినెస్ ఏరియాలలో పోటీ పడుతోంది . జనరల్ మేనేజ్ మెంట్ కన్సల్టింగ్ , ప్రిన్సిపాల్ ఇన్వెస్టింగ్ మరియు సాఫ్ట్ వేర్ వంటి ఇంటలిజెంట్ ప్రాడక్ట్స్ . ఛీఫ్ ఎక్జిక్యూటివ్ గా మిస్టర్ ఫుల్లర్ యొక్క బాధ్యతలలో ఓవరాల్ గ్రూప్ స్ట్రాటజీ పర్యవేక్షణ , హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ మరియు ప్రాడక్ట్ అండ్ కంటెంట్ ఇన్నొవేషన్ ఉన్నాయి . ఎంపిక చెయ్యబడ్డ ఖాతాదారులతో సంబంధాల అభివృద్ధి మరియు నిర్వహణలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారు . మిస్టర్ ఫుల్లర్ మానిటర్ యొక్క మిడిల్ ఈస్ట్ ఇనిషియేటివ్ మరియు దాని నేషనల్ ఎకనామిక్ డెవలప్ మెంట్ అండ్ సెక్యూరిటీ ప్రాక్టీస్ కి నాయకత్వం వహిస్తున్నారు . ఆయన గతంలో హార్వర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ గా పనిచేశారు , అక్కడ ఆయన స్ట్రాటజీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ మరియు ఇండస్ట్రీ అండ్ కాంపిటీటివ్ ఎనాలిసిస్ లో కోర్సులు బోధించారు . ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు , ఆటో ఇండస్ట్రీ మరియు అమెరికన్ ఎకానమీపై హార్వర్డ్ యొక్క ప్రాజెక్టుకి కో డైరెక్టర్ గా పనిచేశారు . ఆయన అరవైకంటే ఎక్కువ ఆర్టికల్స్ వ్రాశారు లేదా సహ రచయితగా ఉన్నారు . అతని ఇటీవలి పుస్తకం , జపాన్ యొక్క బిజినెస్ రెనయెసెన్స్ 2005 లో ప్రచురించబడింది . శ్రీ ఫుల్లర్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ కి గవర్నర్ గాను , బెల్మోంట్ హిల్ స్కూల్ ట్రస్టీగాను , న్యూ ప్రాఫిట్ ఇన్కార్పొరేటెడ్ మరియు సెంటర్ ఫర్ ఎఫెక్టివ్ ఫిలంథ్రోపీకి డైరెక్టర్ గాను , హార్వర్డ్ యూనివర్శిటీ యొక్క మేజర్ గిఫ్ట్ స్టీరింగ్ కమెటీ మరియు ది బోర్డ్ ఆఫ్ ఓవర్ సీర్స్ కమెటీ ఆన్ యూనివర్శిటీ రిసోర్స్ మెంబర్ గాను మరియు హార్వర్డ్ యూనివర్శిటీలో ఫేకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ టాస్క్ ఫోర్స్ ఆన్ అకడమిక్ రిసోర్సెస్ మెంబర్ గాను ఉన్నారు .
అజ్ఞాత గారు : నెనర్లండి ! లక్ష్మణ్ గారు : కృతజ్ఞతలండి . శ్రీరాం గారు : నా టపా మీకు నచ్చినందుకు సంతోషమండి ! మమ్మల్ని అర్ధం చేసుకున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు . : ) రిషి గారు : నెనర్లండి ! చిలమకూరు విజయమోహన్ గారు : కృతజ్ఞతలండి . సత్యేంద్ర గారు : నెనర్లండి ! శశి గారు : మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు నెనర్లండి ! భాస్కర్ రామిరెడ్డి : ఎన్నాళ్ళకు భాస్కరుడొచ్చాడు ? భావన గారు : మీ ఫ్రెండ్ రామిరెడ్డి చెబితేనే చెబుతారా ? : ) నీహారిక గారు : నెనర్లండి !
పోయిన వారం నేను కళ్లు చూపించుకోటానికి డాట్టరు దెగ్గరకెళ్లా , ఈ సారి కళ్లద్దాల బదులు కళ్లకతుక్కునే కటకాలు - కాంటాక్ట్ లెన్స్ తీస్కోవాలని ఆలోచించా . " ఈ సారి " ఎందుకంటే , మా బుడ్డోడితో నా కళ్లజోడుకి మంచి అనుభవం . ఇప్పటికీ లాగి అవతలేస్తాడు , లేక వెనకనుంచి వచ్చి ఘట్టిగా కళ్లజోడుని గుంజుతాడు . మరి ఇప్పుడింక ఈ పిల్ల చేతులు పైకి లేపుతున్నది , క్రికెట్టులో అంపైర్లా . డాట్టరుకాడికి ఎళ్లా . కూర్చో బాసు పిలుస్తా అన్నాడు , సరే కూసున్నా , పక్క కుర్సికేసి ఓ లుక్కేసా , ఓ పత్రిక ఉంది అక్కడ . వెంటనే నా బుర్ర దాని వివరాలు బ్లా బ్లా నోట్సేసేస్కుంది . అదేం పత్రికరాబాబు అంటే - Electronic Gaming Monthly . నాకు తెలవదు ఇట్టాంటిదోటుంటదని . దీంట్లో మొట్టమొదటగా నన్ను ఆకర్షించింది గేముల రేటింగులు , అంటే యే యే గేములు యే యే వయసోళ్లకి అని . ESRB అంటే Entertainment Software Rating Board అని . ఇవీ రేటింగులు - E , EC , E 10 + , T , M , AO . E - Everyone EC - Early Childhood E 10 + - Everyone 10 and above T - Teen M - Matured ( 17 + ) AO - Adult Only . మరి RP అని ఉంటేనో అని అడగొచ్చు , RP అంటే - Rating Pending అని . కాబట్టి మీరుకూడా గేములు కొనేప్పుడు తప్పక వీటికోసం చూసి నిర్ణయించుకుని కొనుక్కోండి . ఈ పత్రిక Electronic Gaming Monthly సంగతి ఏంటో చూద్దాం : ఈమాసపత్రిక ఈరోజు రేపటి వీడియోగేమింగ్ కాన్సోళ్ల గురించి , గేముల గురించి , వాటి తయ్యరీదారులతో ముఖాముఖిలు ఇత్యాది వార్తల్ని అందిస్తుంది . మరియూ , గేముల సమీక్షలుని కూడా కూలంకుషంగా అందిస్తుంది . ఆ రోజు పత్రికలో వీటిమీద రివ్యూ చూసా - ఆసాంతం చదవకపోయినా ఓ లుక్కేసా . అవి - Madden NFL 09 NCAA Football 09 Beijing 2008 Alone in the Dark Izuna 2 Guitar Hero Decades కొన్ని గేముల ప్రకటనలు కూడా చూసా అవి : Legendary Rise of the Argonauts Mushroom Men నేను పెద్ద గేమర్ని కాదు . నాదెగ్గర Ages of the Empire , Warcraft , Tzar అనే గేంస్ ఉండేవి . మొన్నీమధ్య brother bear అని ఒకటి కొన్నా మాబుడ్డోడికి . I think he is not yet ready for it . సరే ! గేమింగు కాన్సోల్ అంటే గేము ఆడే పరికరం . అసలు ఎన్ని గేమింగ్ కాన్సోల్స్ ఉన్నయో తెలుసా మీకు ? గేమింగ్ కాన్సోల్స్ లో ప్రస్తుతానికి ఏడోతరం వి నడుస్తున్నాయ్ . 7th Generation Gaming Consoles . అవి - # 1 . మైక్రోసాఫ్ట్ వారి ఎక్స్బాక్స్ మూడొందల అరవై - Microsoft ' s XBOX 360 # 2 . సోని వారి ప్లే స్టేషన్ మూడు - Sony ' s Playstation 3 # 3 . నింటిండో వారి వీ - Nintendo ' s Wii ఇవి కాక పిల్లల్ని చెడగొట్టటానికి ఈ నింటిండో వాడి డీయస్ అని ఒకటి ఉంది . దీనికి అలవాటైతే ఇక అదేలోకం అవుతుంది . అదీ కధ . Happy Gaming .
చాలా మంచి ఆలోచనలు . పక్క ఇంటివాణ్ణి పట్టించుకోని ఈ రోజుల్లో మనది కాని బిడ్డలకి చదువు చెప్పాలనేది గొప్పే . అభినందనలు . రెండు సూచనలు . 1 . Waldorf / Steiner schools గురించి కనుక్కోండి . హైదరాబాదులో ప్రాథమిక స్థాయిలో ఒక బడి ఉంది . వారి వీలుని బట్టి మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు . అలాగే ఋషి వేలీ , ఆరోవిల్ లాంటి బడులు కూడా . వీరందరూ ఒక సంకీర్ణ విద్యా బోధన మీద చాలాకాలంగా పని చేసి కొన్ని పద్ధతుల్ని అభివృద్ధి చేసిన వారు . 2 . మీరెంచుకున్న ధ్యేయాన్ని గురించి అణువణువులో తపన చెందాలి . ఇది తప్పక సాధించాలి అని బలంగా కోరుకోవాలి . ఎందుకు అంటున్నాను అంటే . . ఇటువంటి పనులు చేపట్టినప్పుడు . . నేనేదో ఉద్ధరిస్తున్నాను , చాలా గొప్ప పని చేస్తున్నాను . . అనుకుని చేస్తే అవెప్పుడూ సత్ఫలితాలని ఇవ్వవు . ఇదే నా జీవిత ధ్యేయం అన్నట్టు చేస్తేనే ఫలిస్తాయి .
జల్లెడ ఇప్పుడు వ్యాఖ్యలు కూడా చూపుతుందనిమీకు తెలుసు . ఎక్కువ వ్యాఖ్యలు వచ్చిన కొన్ని టపాలు మీకోసం ఇక్కడ అందజేస్తున్నాము .
తక్షశిల రాజు ' అంభి ' తరవాత జాతికి ద్రోహం చేసినవాళ్లలో మొదటివాడు దేవెగౌడ అయితే , రెండోవాడు దేవీలాల్ ! ( ఈ స్థానాలు యెవరిష్టం వచ్చినట్టు వాళ్లు మార్చుకోవచ్చు ) వాడు మన దేశం లోని " ఋణ క్రమశిక్షణ " ని తన " మాఫీ " పథకం ద్వారా నాశనం చెయ్యకుండా వుండి వుంటే . . . . . ఇలాంటి పరిస్థితులు దాపురించేవి కాదు దేశానికి !
ఈ నిర్ణయం యొక్క సారాంశం స్థూలంగా ఇది : ౧ . తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావవికాసాలకూ , అధికారానికీ కారణం అది ప్రవచించే తెలుగుజాతి సెంటిమెంటు . కాబట్టి ఈ తెలుగుజాతి అనబడే జనాభా మధ్య తద్భిన్నమైన సెంటిమెంటేదైనా ప్రమోట్ చేయడానికి ప్రయత్నించాలి . ఆ కొత్త సెంటిమెంటుతో ఆ జనాభాని అడ్డంగా నిలువుగా చీల్చాలి . అయితే తెలుగు సెంటిమెంటుకు విఱుగుడుగా తాతలనాటి పద్ధతిలో భారత జాతీయవాదం పేరు చెబితే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పప్పులుడకవు . భారతీయ జనతాపార్టీ లాగానే మనం ( కాంగ్రెస్ ) కూడా ప్రాంతీయ సెంటిమెంట్లని ఎగసన దోయడం ద్వారా అనుకున్న ఫలితాల్ని సాధించవచ్చు . అయితే ఈ విషయంలో భా . జ . పా . దూసుకుపోకముందే మనం దూకుడుగా దూసుకుపోవాలి . లేకపోతే మన బదులు భా . జ . పా . నే తెలుగుదేశానికి ప్రత్యామ్నాయమై కూర్చుంటుంది . అది ఇంకా ప్రమాదకరం . ౨ . ఆంధ్రప్రదేశ్ లో ప్యాన్ - తెలుగు సెంటిమెంటుకు దోహదిస్తుందనుకున్న ప్రతిదాన్నీ దూరదృష్టితో సర్వనాశనం చేయాలి . అది తెలుగుజాతి వైతాళికుల స్మృతి కావచ్చు , తెలుగుతల్లి కావచ్చు , ఆఖరికి తెలుగుభాష , తెలుగు మీడియమ్ కూడా కావచ్చు . దేన్నీ వదిలిపెట్టకూడదు . వదిలిపెడితే మన పార్టీకి ఇప్పుడు పట్టిన దుర్గతి శాశ్వతమైపోతుంది . తెలుగుజాతికి సంబంధించిన ప్రతిదాని మీదా చిక్కగా బుఱద జల్లాలి . ఆ సంస్కృతికి గల ఆత్మగౌరవాభిమానాల్ని అలా నాశనం చేసి , అపహాస్యం పాలు చేసి , దానికి ప్రజల్లో దిక్కూమొక్కూ లేకుండా చేసి , సానుభూతి లేకుండా చేసి ఆ ఉమ్మడి వారసత్వం ఆ రాష్ట్రంలో ఎవఱికీ స్ఫూర్తినివ్వని పరిస్థితి తేవాలి . దాన్తో తెలుగుదేశం పార్టీ యొక్క సైద్ధాంతిక పునాదులు మటాష్ . ౩ . తెలుగుప్రజల్లో ప్రస్తుతం ఉన్న ప్రతి చిన్నాచితకభేదాన్నీ రాజకీయ సిద్ధాంతంగా మార్చేసి రాజకీయంగా ఒక విచ్ఛేదకశక్తిలా ఉపయోగించుకోవాలి . ప్రాంతాలవారీగానే కాదు , కులాలవారీగా , మతాలవారీగా చీల్చిపారేసి - అసలు ఏ విధంగానైనా సరే , తెలుగుప్రజల్లో ఐకమత్యమనే మాటే లేకుండా చేసి తెలుగుదేశం స్థానాన్ని మనం పునరాక్రమించుకోవాలి . ఇక్కడొక మతలబుంది . ఈ నిర్ణయం తీసుకొన్నారే తప్ప దీన్ని ఎలా , ఎవఱి ద్వారా అమల్లో పెట్టాలో వారికి మొదట్లో అర్థం కాలేదు . ఇక్కడ గమనించాల్సిన మఱో విషయమేంటంటే - ఈ నిర్ణయంలో - తెలంగాణ నాయకులే కాక ఈనాడు సమైక్యవాద కబుర్లు చెబుతున్న కోస్తా - రాయలసీమ నాయకులు కూడా సంపూర్ణ భాగస్వాములే . తెలుగుదేశం మీది ద్వేషం , అసూయ , కక్ష , కార్పణ్యం - ఇవన్నీ కలిసి తామెలాంటి నీచమైన జాతిద్రోహ కార్యకలాపంలో పాల్గొంటున్నారో తమకే తెలియనంతగా వాళ్ళ బుఱ్ఱకాయల్ని మబ్బు పట్టించేశాయి . అలా మబ్బుపట్టడానికి గల మఱో కారణం - తాము నిజంగా ప్రాంతీయవాదాన్ని ఱెచ్చగొట్టబోవడం లేదనీ , కేవలం అభినయిస్తున్నామనీ , ఈ ప్రాంతీయతా నటన తెలుగుదేశాన్ని గద్దె దింపేంత వఱకేననీ , ఆ తరువాత అధికారంలోకి వచ్చాక పరిస్థితులు తమ అదుపులోనే ఉంటాయి గనుక భయమేమీ లేదనీ వాళ్ళందఱూ మనసులో ఒక మూలన పెట్టుకొన్న భరోసా . లేదా , అప్పటికి వారినలా నమ్మించగలిగారు . ఇంతా చేసి ఆంధ్రరాష్ట్రాన్ని విభజించాలనే ఆలోచన అప్పటికి పైవారిలో ఉందో లేదో తెలియదు . అప్పటి పరిస్థితుల్ని బట్టి , మాటల్ని బట్టి బహుశా లేదనే భావించాల్సి వస్తున్నది . నిర్ణయం తీసుకున్న తరువాత కూడా , దాన్ని వెంటనే అమల్లో పెట్టమని అధిష్ఠానం చేత ఆదేశించబడ్డ తరువాత కూడా ఆ ప్రకారంగా తెలుగుతల్లికి , సంస్కృతికీ , వారసత్వానికీ వ్యతిరేకంగా మాట్లాడడానికి తెలంగాణ నాయకులకు గుండెధైర్యం చాలలేదు . ఎంత స్వార్థపరులూ , అవినీతిపరులూ , అధిష్ఠానవిధేయులూ అయినప్పటికీ కోస్తా - రాయలసీమ నాయకులేమో స్వయంగా తెలుగుజాతి సెంటిమెంటు మనసులో ఏదో ఒకమూల మినుకుమినుకుమంటున్నవాళ్ళు . వాళ్ళూ ధైర్యంగా సాహసించలేక పోయారు . పైగా కోస్తా - రాయలసీమల్లో ప్రాంతీయాభిమానాలకు పెద్దగా విలువ లేదు . ఆ మాటలు మాట్లాడితే ఈనాటికీ అక్కడ జనం పోగవ్వరు . " మన ఏరియా అభివృద్ధి చెందలే " దని చెప్పి ఱెచ్చగొడదామని చూస్తే " సరే , పోనీ , అభివృద్ధి అయినచోటికే వలసపోదాం " అనే తరహా ప్రజలు వాళ్ళు . ఇందుకు సరైన కారణం తెలియదు . అందువల్ల కూడా ఆ నాయకులకు చేతకాలేదు . గతంలో ప్రాంతీయాభిమానాలతో చెన్నారెడ్డి చేత విజయవంతంగా తెలంగాణకి నిప్పెట్టించిన మధురానుభవాన్ని పురస్కరించుకొని ఆ బాధ్యతని తెలంగాణ నాయకుల భుజస్కంధాల మీదనే వేశారు . " మీరొక చోట నిప్పెట్టండి . అది మా ఏరియా దాకా వస్తుంది . అప్పుడు మేం విజృంభిస్తాం " అని ! " సరే " నని ఆంధ్రా నాయకులకు మాటిచ్చారు తెలంగాణ నాయకులు . ఆ ప్రకారం వారు ముందు వ్యూహాత్మకంగా మొదట తెలుగుజాతి కాన్సెప్టు మీదికి నేరుగా అస్త్రాల్ని ఎక్కుపెట్టకుండా కేవలం తెలంగాణ గుఱించి మాట్లాడ్డం మొదలుపెట్టారు . ఈ ప్రత్యేక తెలంగాణ ప్రతిపాదన పైవాళ్ళ నుంచి వచ్చినది కాదనీ , తెలంగాణ నుంచే వచ్చిందనీ ప్రజల్ని నమ్మించడం కోసం - ఈ పైన పేర్కొన్న సమావేశం జఱిగిన కొంతకాలానికి ( క్రీ . శ . ౧౯౯౯ ) రాష్ట్ర కాంగ్రెస్ పార్టీవారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుతూ కాంగ్రెస్ అధిష్ఠానానికి ( అప్పటికి కాంగ్రెస్ ఇక్కడా , అక్కడా కూడా అధికారంలో లేదు ) ఒక మహజరు సమర్పించారు . ఇప్పుడు అరివీర భయంకర సమైక్యవాదులమని జబ్బలు చఱుచుకుంటున్న కోస్తా - రాయలసీమల కాంగ్రెస్ నాయకులు కూడా ఆ మహజరులో సంతకాలు చేశారు , కేవలం తెలుగుదేశం పార్టీ మీది గుడ్డిద్వేషంతో ! అలా చేసినవారిలో వై . ఎస్ . రాజశేఖరరెడ్డి కూడా ఉన్నాడు . ఆ తరువాత చాలా సంవత్సరాలకు ఆ మహజరు గుఱించి ఆయన్ని అడిగితే " అప్పట్లో అందులో ఏముందో చదవకుండానే హడావిడిగా సంతకం పెట్టేశా " నని బుకాయించాడు . ( ఇంకా ఉంది )
ఐతే , అనుభూతి కవిత్వమంతా పదచిత్ర కవిత్వం ( imagist poetry ) కాదు . వేగుంట మోహనప్రసాద్ కొన్ని కవితల్లో పదచిత్రాల ప్రమేయం లేకుండా , ఆత్మ నివేదన ( confession ) పద్ధతిలో , అనగా మనస్సులోనిది ప్రత్యక్షంగా వెళ్ళబోసుకోవటం ద్వారా , ఆ అనుభూతి ఫలితాన్ని సాధించాడు . ఇది అమెరికాలో 1950 ప్రాంతాల naked poetry , confessional poetry లాంటిది .
మనకి భారత్ లో ఎక్కడ బాంబు పడిన , వెంటనే ఐ . యస్ . ఐ అనే వినిపిస్తుంది / అనిపిస్తుంది . ఇక్కడనుండి మతం పేరుతో పాకిస్థాన్ వైపుకి వెళ్లి అక్కడి యే ల . ఏ . తో లోనో జేరి , మళ్లి వెనక్కొచ్చి అఱాచకాలు సృష్టింస్తుంటారు అనేది మన నమ్మకం , మనకి తెల్సిన నిజం . ఐతే , FlipSide చూస్తే ? దేనికోసమో గూగుల్లో గెలుకుతుంటె ఈ లింకు తగిలింది . చదివి బిత్తరబొయ్య , ఆశ్చర్య పోయా . నాయ్యాళ్లలారా , ఎంతకి తెగించారు అనుకున్నా . వీడి సారాంశం ఏంటంటే , పాకిస్థాన్లో జరిగే బాంబు పేలుళ్లకి కారణం మన రా ( ఆర్ . యే . డబ్ల్యూ - రీసెర్చ్ మరియూ ఎనాలిసిస్ వింగ్ ) మరియూ ఆఫ్ఘన్ ఏజెన్సీల ప్రోద్బలమే అని . వీడంటాడూ , పాకిస్థాని ఇన్వెస్టిగేటర్లు మొత్తానికి ఛేదించారు అని , అది ఇది . ఏదేదో రాశాడు . బాగుంది కధ , ఇటైపు మనం వాళ్లని అటైపు ఆళ్లు మనల్ని , కానీ నిజం ఏంటో ఎవ్వనికీ తెలియదు .
వంశీ గారూ , చాలా ధన్యవాదాలు , ఆచార్యుల వారి వెబ్సైట్ లింకు పరిచయం చేసినందుకు . నేను పైన కామెంట్ రాసింతర్వాత ఇప్పుడే చూసా . . వారి papers ni మిగతా వివరాలనీ . . Now I know who I was talking to . ఔరా . . బ్లాగుల వల్ల ఒక్కోసారి ఎంత అదృష్టం .
ఆమీర్ ఖాన్ | గజనీ | త్రీ ఇడియట్స్ | రాజ్ నీతి
తండ్రీకొడుకులిద్దరూ తలలు బోడి చేయించుకుని , స్నానాలు చేసి పంచెలు కట్టుకుని వచ్చారు .
@ ప్రసాద్ అవునండి బాబు . @ pavan kommireddi కధను నేను వికీపీడియా నుండి తీసి అనువాదించాను . అసలు సృస్టికర్త రాన్ హబ్బార్డ్ . అతను మొదట్లో రాసిన సైన్సు ఫిక్షను నవలలు , బాగా ప్రచారం పొంది , తరువాత ఒక మత్తాన్నే సృస్టించే స్తాయికి ఎదిగి పోయాయి . @ చేతన అయితే మీరు Trapped in the Closet అనే వీడియోను చూడాల్సిందే . ప్రాజెక్టులు చేసామన్నారు , ఏ ప్రాజెక్టులు ? వాళ్ళ Scientology e Meterని ఆదునీకరిస్తున్నారా ఏమిటి ?
ఇది తెలుగునాడి లో కూడా వచ్చింది అంది . . . ఇది చదివి ఇయనకి కాల్ చేస్తే రామనాథ రెడ్డి గారు ఎప్పుడు బిజీ . . .
శ్రీమహావిష్ణువు పాదాలలో గద , శంఖ , చక్రము , ధ్వజము , పద్మము , అంకుశం , వజ్రము మొదలైన శుభప్రదమైన లాంచనములుంటాయి . ఆ స్వామి పాదం క్రింద పెడితే ఆ భూమిపై ఆ గుర్తులు కానవస్తాయన్నమాట . శ్రీకౄష్ణావతారంలో ఆక్రూరుడు మధున నుండి బౄందావనానికి వెడూతుంటే బాలగోపాలుని చరణ చిహ్నాలను చూసి పులకిత గాత్రుడై అక్కడి పాద ధూళితీసి శిరస్సున ధరించినట్లు భాగవతంలో చెప్పబడింది .
అరుణ తండ్రి ని , తమ్ముడిని మావోయిస్టులు చంపిన సంగతి తెలిసిందే . ఆ విషయాన్ని మంత్రి దగ్గర ప్రస్తావించగా " వారు చనిపోయినప్పుడే నేను భయపడలేదు " అని అన్నారు .
ఇది ముష్లిం మతోన్మాదులకు ఫక్తు లెఫ్టిస్టు తరహా సిగ్గులేని సమర్థన . వీళ్ళ దృష్టిలో ముస్లిములది అస్తిత్వవాదం , హిందువులది కాదు - ఎన్నివేలమంది హిందువుల్ని ఉగ్రవాదులు చంపినా సరే , ఇంకెన్ని లక్షల మంది హిందువుల్ని కాశ్మీరు నుంచి వెళ్ళగొట్టినా సరే ! ఇంకెన్ని కోట్లమంది హిందువుల్ని బలవంతంగా మతం మార్చినా సరే ! పాపం ! సంస్కృతీ , సెంటిమెంట్లూ ముస్లిములకే ఉన్నాయి . ఉండాలి . హిందువులకు లేవు , ఉండకూడదు . ఒకవేళ ఉంటే , ఎర్రజెండాలు వాళ్ళ మతాన్ని , దేవుళ్ళనీ గబ్బుపట్టిస్తూ పుస్తకాలు రాస్తారు - ముప్పాళ్ళ రంగనాయకమ్మలాగా !
నమస్కారం . మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి . http : / / samoohamu . com సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను . తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం . మీకు నచ్చిన , మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును ( add @ samoohamu . com ) . సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి . సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది . మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి . దయచేసి మీ సలహను / సూచలను అభిప్రాయాలను దయచేసి info @ samoohamu . com తెలుపండి . మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి . - - ధన్యవాదముతో మీ సమూహము http : / / samoohamu . com
గుడిలో ప్రవేశించి అక్కడే కూర్చున్న ఓ పూజారిగారిని అడిగాను అబిషేకాలు , ఏదయినా పూజ లాంటిదీ వుందా అని ? చాలా ఆలస్యంఅయిపోయిందీ , ఏమీ వుండదని అనుకొంటూ , రుద్రాభిషేకానికి అంటుంటే ఆశ్చర్యంగా వుందా వుంటే యివ్వండీ , ఏమండీ , రుద్రాభిషేకానికి తీసుకోండీ , అంటూ అరిచినంతపని చేసాను . దర్శానానికే కాని ఏ పూజ కి అవకాశం వుండదులే అనుకొని మనసుకి సమాధానపరిచేసుకున్నాను అప్పటికేనూ , అలాంటిది ఆ అవకాశానికి మురిసిపోయి నేను చదివే లలితా సహస్రనామానికి ఫలితం దక్కిందనుకొని మురిసిపోయాను . లోపలికి తీసుకెళ్ళి రెండు పీటలు వేసి మమ్మల్ని కూర్చొమన్నారు , మా మరిది , భార్యా , ఓ పక్కన లోపలేకూర్చున్నారు . వారు చేసుకోలేదులెండి . ఇంకా ఎవరేనా వస్తారేమొ ననుకున్నాను అబ్బె ఎవరూ రాలేదు . మేమేను . అ రోజుకి మాదే ఆఖరి అభిషేకం . చాలా బాగా చేయించారు . రుద్రం , నమకం చమకం చాలా చక్కగా చదివారు . పంచామృతాలు అన్నీమంచిగా యిచ్చి చేయించారు . ( ఒక్కోక్కసారి మరీపొదుపు పాటించేస్తారు కదా ) అనుకోని అదృష్టం యిది . అక్కడున్న అందరు బ్రాహ్మలూ గొంతు కలిపి నమకం చమకం చదువుతుంటే ఆహ్ ! అద్బుతం . మనసారా తృప్తిగా ఆ శంకరుని సేవించుకొని వచ్చాము . ఇంక మా జయ ( తోటికోడలు ) ఎంత మురిసిపోయిందో చెప్పలేను . అక్కయ్యగారు మంచిగా ప్లాన్ చేసారండి అంటూ - -
చాలా రోజులైంది మి టపాలేమి లేవు అనుకునంటున్నానండి . నా మొన్నటి టపాకి మీరు వ్యాఖ్య రాసినప్పుడు కూడా మీ బ్లాగ్ చూడలేదు . . . ఇవాళ మరొ బ్లాగ్ లో మీ కొత్త టపా గురించి చూసి ఇలా వచ్చను . మా మావయ్యలు ఇద్దరు రెండు సార్లు కుక్కల్ని పెంచి అవి చనిపోయినప్పుడు చాలా రొజులు సరిగ్గా అన్నం కూడా తినని రొజులు ఉన్నాయి . అందుకే నాకు ఏవన్నా జంతువులని పెంచికొవాలి అంటె భయం . ఉన్నప్పుడు ఆనందిస్తాము కానీ వేటినయినా కోల్పొయాకా కలిగే బాధని దిగమ్రింగటం కష్టమండీ .
కొన్ని సందర్భాల్లో , కవి వస్తువుతో తాను సంభాషిస్తున్నట్టు రాయటం కూడా కద్దు . ఇటువంటి పద్యాల్లో నువ్వు అంటే , కవి ఉద్దేశిస్తున్నది వస్తువునిగాని , పాఠకుణ్ణి కాదు . లేదా పాఠకుడు తనను తాను వస్తువుగా ఊహించుకుని ఈ పద్యం చదువుకోవచ్చు . ఇక్కడ , పాఠకుడు , వస్తువు ఒక వైపు , కవి మరొక వైపు ఉన్నట్టు మనం భావించుకోవచ్చు .
నష్టాల దిశగా బి . ఎస్ . ఎన్ . ఎల్ నవరత్న కంపెనీగా రూపొందడానికి ఒకప్పుడు వడివడిగా అడు గులు వేసిన ప్రభుత్వరంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు మరో సంవత్సరం కంటే ఎక్కువ కొనసాగడానికి నిధులు లేక ఇబ్బందులు పడుతున్నది . 2000 సంవత్సరంలో సమగ్ర టెలికామ్ కంపెనీగా రూపొందిన ఈ కంపెనీ 2007 నుంచి సమస్యలు ఎదుర్కొవడం మొదల యింది . ప్రభుత్వం తమను దెబ్బతీయడానికి సరైన సమయంలో పరికరాల కొనుగోలుకు అనుమతి ఇవ్వలేదని , అందువల్లనే తాము ఆదా యం కోల్పోయామని బిఎస్‌ఎన్‌ఎల్ కార్మిక సం ఘాలు చెబుతున్నాయి . గత సంవత్సరం బిఎస్ ఎన్‌ఎల్ వద్ద 30వేల కోట్ల నగదు నిల్వలు ఉండేవి . అందులో 83 శాతం తగ్గిపోయి ప్రస్తు తం ఐదువేల కోట్లు నిధులు మాత్రమే మిగి లాయి . ఆదాయం పెరగకపోవడం , ఖర్చు పెరగ డం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది . 3జి స్పెక్ట్రమ్ కొనుగోలుకు బ్రాడ్‌బాండ్ వైర్‌లైస్ స్పెక్ట్రమ్ కొనుగోలుకు కంపెనీ రూ . 18 , 500 ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చింది . 2010 - 11 ఆర్థిక సంవత్స రంలో బిఎస్‌ఎన్‌ఎల్ రూ . 4000 కోట్ల నష్టాన్ని పొందే అవకాశాలు కన్పిస్తున్నాయి . నికర ఆదాయం 12 . 5 శాతం తగ్గి 28వేల కోట్లకు చేరనున్నది . నెలవారీ ఖర్చులను , జీతభత్యాలను లెక్కవేసి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రతినెల కంపెనీకి 300 కోట్ల నుంచి 400 కోట్ల వరకు నష్టం వస్తున్నది . దీనితో తన నగదు నిల్వలు వినియోగించుకొని కంపెనీ ఆ నష్టాన్ని భర్తీ చేస్తున్నది . ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న కొద్ది నెలల్లో కంపెనీ పరిస్థితి అధ్వా న్నంగా మారుతుంది . 2011 - 12 సంవత్సరంలో ఆదాయం పెద్దగా పెరగదని , అయితే నష్టం మాత్రం పదివేలకోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు . బిఎస్‌ఎన్‌ఎల్ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా 2009 - 10 సంవత్సరంలో 1822 కోట్ల నష్టం వచ్చింది . 3జి స్పెక్ట్రమ్ బ్రాడ్‌బాండ్ చెల్లింపుల కోసం 18 , 500 కోట్లు వినియోగించడమేకాకుండా జీతాల హెచ్చింపు , కొత్త పరికరాల కొనుగోళ్లకు నిధులను ఖర్చు పెట్టాల్సివస్తున్నది . నగదు నిల్వలు తగ్గడం వల్ల ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయం కూడా కంపెనీకి తగ్గిపోయింది . కార్యక లాపాల ద్వారా వచ్చే ఆదాయం 27వేల కోట్ల వద్దనే ఆగిపోయింది . గత సంవత్సరం నగదు నిల్వల మీద వడ్డీ రూపంలో నాలుగువేల కోట్లు వస్తే ప్రస్తుతం అది 800 కోట్లకు తగ్గిపోయింది . తమ పరిస్థితిని అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రతినెల 600 కోట్లు బడ్జెట్‌లో కేటాయిం చాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు . బిఎస్‌ఎన్‌ఎల్ ఇటీవల కాలంలో తమ మార్కెట్ వాటా కోల్పోతున్నది . ఇప్పుడు దాని మార్కెట్ వాటా పది శాతానికి చేరుకుంది . కంపెనీకి వచ్చే ఆదాయంలో 42 శాతం వేతనాల కిందే ఖర్చు అవుతున్నది . ప్రతి సంవత్సరం ఈ వేతనాల బిల్లు పదిశాతం పెరుగుతూ వస్తున్నది . ఈ సంవత్సరం ఈ బిల్లు 15వేల కోట్లకు చేరవచ్చు . దీనికి భిన్నంగా ప్రయివేటు కంపెనీలు తమ ఆదాయంలో ఐదు నుంచి ఆరు శాతం మాత్రమే వేతనాల కోసం ఖర్చు పెడుతున్నాయి . గత సంవత్సరం ప్రధాని మన్మోహన్ సింగ్ శామ్ పిట్రోడ నేతృత్వంలో ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి బిఎస్‌ఎన్‌ఎల్ పనితీరును మెరుగు పరిచి లాభాలబాట పట్టించడానికి సూచనలు చేయాల్సిందిగా కోరారు . అయితే ఈ సిఫారసు లు అమలుకాకుండా అప్పటి టెలికామ్ శాఖ మంత్రి ఏ రాజా అడ్డుకున్నారు . ప్రస్తుత టెలికా మ్ శాఖ మంత్రి కపిల్ సిబాల్ బిఎస్‌ఎన్ ఎల్‌ను ఏదోవిధంగా లాభాల బాట పట్టించాలని ప్రయత్నిస్తున్నారు .
అయితే , షూటింగ్ జరుగుతూంటే , ఆయన దగ్గరకు అనేకులు వచ్చి సినిమా దారి తప్పుతోందని చెప్తూ వచ్చారట . కానీ దర్శకుడు పెద్దవాడు . మధ్యలో జోక్యం చేసుకుంటే బావుండదు . అందుకని నిర్మాత ఓపిక పట్టాడు . సినిమా రషెస్ చూస్తూంటేనే అది నడవదని అర్ధమయిపోయింది . కానీ ముందుకు తప్ప వెనక్కు వెళ్ళలేని పరిస్థితి . దాంతో , మొండిగా సినిమా పూర్తిచేసి , విడుదల చేశాడు . అనుకున్నట్టే ఘోరంగా దెబ్బతింది సినిమా . ఆ కాలంలో 50 లక్షలపైగా నష్టం వచ్చింది .
౨౬ ) ఒక వేళ కళ్లలో నిప్పు రవ్వలు పడితే నీళ్లతో కడుక్కుని ఆసుపత్రికి వెళ్లాలి .
తొందరలో ఏమి చేస్తాడో అని ఆ గురుపుత్రునికి అడ్డంగా నిలబడినది ద్రౌపదీదేవి ! ! శ్రీ కృష్ణుడు చతుర్భుజుడై ఱెండు చేతులతో భీమసేనుడిని మిగిలిన ఱెంటితో ద్రౌపదిని వారించి ఇలా ధర్మబోధ చేశాడు " శిశుఘాతకుడూ కిరాతకుడూ అయిన ఈ అశ్వత్థామ ముమ్మాటికీ చంపదగిన వాడే . కానీ గురుపుత్రుడు పైగా విప్రుడు అయినందువల్ల వీనిని చంపకుండా శిక్షించాలి . ఒక వీరునికి తలగొఱగటం కన్నా అవమానకరమైనది ఏదీ లేదు . ఈతని శిరోజాలు ఖండిచి అవమానించి పంపుదాం " . అప్పుడు విశ్వమంతా కొనియాడ తగ్గవాడూ వీరాధివీరుడూ అయిన అర్జునుడు ఆ అశ్వత్థామ శిరోజాలు ఖండించి అతని శిరస్సుమీదనున్న దివ్య ( జ్ఞాన ) మణిని తీసుకుని అవమానించి బయటికి గెంటివేశాడు . అనంతరం చనిపోయిన బంధువులందఱికీ దహన సంస్కారాలు చేశి గంగాతీరములో పొంగిపొఱలే దుఃఖాన్ని దిగమ్రింగుకుని మరణించిన వారికి తిలోదకాలిచ్చారు పాండవులు . తరువాత శ్రీ కృష్ణుడు పాండవులని గాంధారీ ధృతరాష్ట్రులని ఓదార్చినాడు . ఇలా శ్రీ కృష్ణుడు మహాభారత యుద్ధం ద్వారా దుష్టశిక్షణ చేశి భూభారాన్ని దించాడు .
వంకాయ మనకి ముఖ్యమైన కూరగాయ . మన పెరటితోటల్లో పెంచుకునే కూరగాయ ! దాదాపు అన్నికాలాల్లోనూ లభిస్తుంది . సీజన్లో తక్కువ రేటుకే దొరుకుతుంది . అలాంటిదాన్ని బీటీ చేసి , మేమే అమ్ముకుంటాం , మీరు చచ్చినట్టు తినండి ( దీన్ని పశువులమీదకూడా ప్రయోగించం - - మీ పాట్లు మీరు పడండి ! ) అంటే - - వొప్పుకోడానికి మనకన్నా వెఱ్ఱివెధవలు యెవరూ వుండరనుకున్నాడేమో !
ప్రస్తుతం మనం పుస్తకాలని కూడా వెనక్కి పెట్టేసి ఒక సరికొత్త ఇంటర్నెట్టు యుగంలోకి అడుగుపెట్టాము . విద్యార్థికి ఇప్పుడు తరగతి గదిలో కూర్చుని పాఠం నేర్చుకోవలసిన అవసరం లేదు . ఇంటర్నెట్టులో సెర్చి చేసి అనేక విషయాలను తనంతట తానే తెలుసుకోగలుగుతున్నాడు .
ప్రకటన చూసిన నాకు అప్రయత్నంగానే ఎందుకో ఒక్కసారి ముఖంలో చిరునవ్వు మొలిచింది .
ఆంధ్ర ప్రదేష్ లో కొత్త అస్సెంబ్లి ఏర్పడి సమావేశమైంది . పాత కొత్తల కలయికగా సభ్యులు , మంత్రులు వున్నారు . అస్సెంబ్లిలో పాటించావలసిన కనీస విధులు వున్నాయి . వాక్ ఔట్ లు పూర్తిగా మానడం అవసరం . ప్రొటెస్ట్ తెలిపి కూర్చోవాలి . అది రికార్డ్ అవుతుంది . స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి నినాదాలు ఇవ్వడము , కూర్చుండడం మానాలి సమయం పాటించాలి . ప్రశ్నలు సమాధానాలు ఒక గంటలో పూర్తి కావాలి . రూల్స్ పెట్టుకున్నది సబ్యులే అన్నది గ్రహించాలి . సభలొ కూర్చో వాలి . ప్రజలు వో ట్ వేసి పంపారని మరువకూడదు . సభా విషయాలు తెలుసుకునే హక్కు ప్రజలకు వున్నది గనుక పూర్తి గా ప్రసారాలకు అవకాసం వుండాలి . కొత్త సభ్యులకు కనీస ట్రైనింగ్ ఇవ్వాలి . అసెంబ్లి పట్ల గౌరవం పెంచాలి .
ఆ తరవాత నౌషాద్ లీడర్ సినిమాకి మరొకటి చేశాడు . ఘంటసాల కుంతీకుమారిలో పాడిన చివరి పద్యాలు లలిత్ రాగంలోనివే . పై అష్టపది వీటన్నిటితో పోలిస్తే అంత గొప్పగా ఉండదు కాని రాగంమీద రాజేశ్వరరావుకున్న పట్టు మనకు తెలుస్తుంది .
ఇక ఇందిరమ్మ రాజ్యం మీద మంచి వ్యాఖ్యలు పడ్డాయి . ఇందిరమ్మ రాజ్యం అనిచెప్పి అమాయకులను మోసం చెయ్యొచ్చేమో గానీ , ఆ ఇందిరమ్మ గారు ఏలిన చీకటి రాజ్యం , మొండిగా భ్రష్టు పట్టించిన విదేశీ సంబంధాలు , అవివాహితులకు బలవంతపు కుటుంబ నియంత్రణలు , తమిళ తీవ్రవాదులకు పెరటి సాయం తెలిసిన వాడెవడయినా నవ్విపోతాడు . ఇంకా ఇందిరమ్మ వ్యక్తిత్వం మీద ఏవైనా భ్రమలు ఉంటే పుపుల్ జయకర్ ( ఇందిర స్నేహితురాలు ) రాసిన బయోగ్రఫీ చదవాల్సిందే . ఎమ్బీఎస్ ప్రసాద్ గార " పడక్కుర్చీ కబుర్లు " లో చెప్పినట్లు భారత దేశం లో నెహ్రూ కుటుంబ పరిపాలన నెహ్రూ తోనే అంతమయ్యింది . తరువాత నుంచి ఇందిరమ్మ కుటుంబ పాలనే !
టప్ … ఏంటిది ? చినుకులు పడుతున్నాయి . ఏంటో వానాకాలం అయిపోవచ్చిన సమయాన ఇక్కడ రోజూ వర్షం కురుస్తుంది . ఒక చిన్న వర్షం చాలు రోడ్లన్నీ చిత్తడి చిత్తడిగా తయారవడానికి . ఇందాక కురిసిన వర్షానికి ఇప్పటికే రోడ్లన్నీ బురద బురదగా ఎలా ఉన్నాయో . ఇలాంటప్పుడు నడవడానికి భలే ఇబ్బంది . హుప్ … ఈ మాత్రం లాంగు జంపులు చెయ్యాల్సిందే .
కొత్తపాళీగారు . . . . ఈ గొడవలు ఏమిటో నాకు తెలియవుకాని . నా కవితల్ని మీరు చదివి వ్యాఖ్య చేసినప్పుడు గురువు శిష్యురాలిని మెచ్చుకున్న ఫీలింగ్ ఆ ఆనందానికి మమ్మల్ని దూరం చేయకండి సార్ ! !
ఇన్ని సినిమాల మధ్యలో ఒకే ఒక్క సినిమా నా దృష్టిలో లీడర్ ని చూపించిన సినిమా . అది రుద్రవీణ . ఓ వ్యక్తి విప్లవకారుడవడానికి , మొట్ట మొదట సంఘర్షించేది తనతోనే . పేలే లాండ్ మైన్లన్నీ తన గుండేల్లో తానే పేల్చుకుంటాడు మొదటగా . ఆ తర్వాత కుటుంబంతో . ఆ తర్వాత ఊరితో . దానికి ఓ ఉద్యమ రూపం వచ్చాక నాయకు డవుతాడు . చెప్పలేనన్ని త్యాగాలు చేస్తాడు దారిలో .
మూడు చిత్రాల్లో కరీనా వీరోచిత పోరాటాలు ఇప్పుడు హీరోయిన్ లు సినిమాల్లో కేవలం గ్లామర్ కోసమే ఉపయోగపడుతున్నారు తప్ప , వారికి ప్రాధాన్యత లేదనే విషయం అందరికి తెలిసిందే . అయితే కరీనా కపూర్ విషయం మాత్రం అందుకు మినహాయింపు . ఆమె నటిస్తున్న మూడు చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి . శ్రీ రామ్ రాఘవన్ దర్శకత్వం లో ' ఏజెంట్ వినోద్ ' , సిద్దిఖ్ దర్శకత్వంలో ' బాడీ గార్డ్ ' , అనుభవ సిన్హా దర్శకత్వంలో ' రా - వన్ ' లో కరీనా హీరోలతో సమానంగా వీరోచిత పోరాటాలు చేసిందట . ఈ చిత్రాలతో కరీనా ఇమజ్ లో చాలా మార్పు వస్తుందని అంటున్నారు .
ఈ అభిప్రాయం వెనకాల కొన్ని ( నన్ను మఱియు నా ఆలోచనలను సమర్దించుకునే ) వివరాలు . మున్ముందుగా రాజకీయాల గురించి నాకు ఉన్న ఒకే ఒక అభిప్రాయం ఏమిటంటే , అది కాకాపట్టడం చేతనైన వారి వ్యాపారం అని . కనబడ్డ ప్రతీ వాడిని నువ్వు అది పీకావో లేక నువ్వు ఇది పీకావో అని డప్పుకొట్టి , అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ , అవసరం తీరిన తరువాత తొక్కేసే వాళ్ళకు అది ఓ మంచి వృత్తి . ప్రజా సేవ / సామాజిక అభివృద్ది / డాష్ . . డాష్ . . వంటి మాటలు ఉత్తుత్తి ప్రగల్భాలు మాత్రమే . ఇక్కడ కొన్ని విషయాలలో కొంత మందిని మనం విడిచి పెట్టవచ్చు , ఉదాహరణకి లోక్ సత్తా కన్వీనియర్ గారైన జెపీ లాంటి వారిని చాలా విషయాలలో ప్రస్తుత రాజకీయ నాయకులతో పోల్చలేం . కాబట్టి ఇలాంటి వారు ఈ వ్యాపార పరిగణలోకి రారు .
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 66కి చేరింది . వేర్వేరు రాష్ట్రాల్లో తాజాగా 131 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది . ఎక్కువగా మహారాష్ట్రలోనే 35 మరణాలు చోటుచేసుకోవడం గమనార్హం . ఆ తర్వాత కర్ణాటకలో 12 మరణాలు సంభవించాయి . గుజరాత్‌లో ఐదు , తమిళనాడు , ఛత్తీస్‌గఢ్‌లలో మూడుచొప్పున , ఢిల్లీ , కేరళ , రాజస్థాన్ , ఉత్తరాఖండ్ , గోవా , హర్యానాలలో ఒక్కోటి చొప్పున ఈ మరణాలు సంభవించాయి . తాజా కేసులు ఎక్కువగా ఢిల్లీ , కర్ణాటకల్లో నమోదు అవుతుండడం ఆయా రాష్ట్రాల్లో ఆందోళన [ . . . ]
నువ్వింకా ఇక్కడ ఇలా మీ పాప కి . . . husband కి దూరం గా వుండి ఇంత కష్టపడి job ఎందుకు చేస్తున్నావో నాకైతే తెలియట్లేదు . . . హాయిగా అందరూ india వెళిపోయి settle ఐపోవచ్చు కదా అంది తను . నా సంగతి వదిలెయ్యి . . . ఇప్పుడు నా ఏ నిర్ణయం ఒక్క మనసు తో అలోచించి తీస్కునేది కాదు . . . దేనికైనా ఇద్దరి అభిప్రాయాలు కలవాలి . . . దానికి చాలా time పడుతుంది . . . . నువ్వు single . . . ఏ నిర్ణయమైనా నీ ఇష్టం . . . దాని ఫలితం నీదే . . . రోజుకొకసారి india వెళ్దాం పద అంటావ్ కదా . . . హాయి గా వెళ్ళి అమ్మా నాన్నల తో enjoy చెయ్యొచ్చు గా అన్నాను . . . ఎప్పట్లాగే ఒక నవ్వు నవ్వి వూరుకుంది .
కందము అనిశము సేవింతురె ని న్ననఘా యష్టాంగమైన యాయుర్వేదం బున దక్షు లైన వైద్యులు ఘనముగ ననురక్తులై జగద్ధితబుద్ధిన్ . ( ఆయుర్వేదంలో సమర్థులైన వైద్యులు నీకు సేవలు చేస్తున్నారా ? )
" మన బళ్లోనే ! ? మన వూరి పేరు గూడా చెప్పినారా ? " , అన్నాడొక పెద్దమనిషి నమ్మకం లేనట్టు . " వూరేగాదు , మండలం పేరు , జిల్లా పేరు గూడా చెప్పినారు . బోగస్ అయ్యే మాటే లేదు . "
కైలాసాచలసానువాసము వృషస్కంధాగ్రసంస్థాయి త త్ప్రాలేయాచలకన్యకాకుచతటీపర్యంకనిద్రాగతం బాలోలాగ్రజటాతటీఘటితనాకౌకస్సరిత్కంబు దే హాలంకారితలేలిహానము వెలుం గర్చింతు విశ్వేశ్వరా ఇది విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణకల్పవృక్షావతారికయందలి రెండవ పద్యం . కైలాసాచలసానువాసము అనగానే నాకు మొదట తెనాలి రామకృష్ణుని ఉద్భటారాధ్యచరిత్రలోని పద్యం గుర్తొచ్చింది . * * * కైలాస - అచల - సాను - వాసము వృష - స్కంధ - అగ్ర - సంస్థాయి తత్ - ప్రాలేయ - అచల - కన్యకా - కుచ - తటీ - పర్యంక - నిద్రా - ఆగతంబు ఆలోల - అగ్ర - జటా - తటీ - ఘటిత - నాక - ఓకస్ - సరిత్కంబు దేహ - అలంకారిత - లేలిహానము వెలుంగు అర్చింతు విశ్వేశ్వరా సం అంటే సమ్యక్ , బాగుగా . స్థా గతినివృత్తౌ అని ధాతువు , అంటే గమనరహితమైన స్థితి . ప్రాలేయము మంచు . పర్యంకము మంచము . ఓకస్సు అంటే నివాసం . నాకౌకస్సు అంటే స్వర్గము నివాసముగా కల . " ఆలోల " లో లోల కంపిస్తున్న , ఆ స్వల్పత్వాన్ని సూచిస్తుంది . లేలిహానము అంటే పాము ( లేలిహానో ద్విరసనో గోకర్ణః కఞ్చుకీ తథా అని అమరకోశము ) . వెలుంగు అన్న పదం ఇక్కడ కీలకం . నిరాకారస్వరూపంగా అర్చించడమన్నమాట . ఎప్పుడైతే ఇలా నిరాకారస్వరూపంగా తీసుకున్నామో అప్పుడు చెప్పేవన్నీ స్త్రీ - పురుష - నపుంసక - లింగాతీతమైన శివలింగానికి సంబంధించినవౌతాయి కదా . కైలాస పర్వత సానువులందు నివాసమున్నట్టిది . నందీశ్వరునియొక్క భుజములపైన చక్కగా నుండినది . ఆ మంచుకొండ కూతురైన పార్వతీదేవియొక్క పాలిండ్ల ప్రదేశమనే మంచముపై నిద్రను పొందునది . స్వల్పంగా కదులుతున్న జటాజూటపు పైభాగంలో స్వర్గలోకపు నదిని కలిగినట్టిది . దేహాలంకారముగా పామును చేసికొన్నట్టిది . కైలాసపర్వతసానువులలో నివాసముంటూ , పాముని గంగని ధరించి , నందీశ్వరుని అధిరోహించి , పార్వతీదేవిపాలిండ్లపై నిద్రపోయే స్వరూపంగా కనిపిస్తున్న వెలుగువైన విశ్వేశ్వరా ! నిన్ను కొలుస్తాను అని తాత్పర్యం . * * * ఇక్కడ ముందు పద్యంలో మాదిరిగా శివకేశవాభేదం గోచరించదు కానీ , వర్ణనలద్వారా సాకారమైన శివుణ్ణి నిరాకారమైన వెలుగుగా కొలుస్తాను అని చెప్పడంలో వింత అందం ద్యోతకమౌతోంది .
Download XML • Download text