tel-40
tel-40
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
సరే తిక్కన తెలంగాణా వాడు కాదు అనుకుందాం వాదన కోసం , అయినా సరే రుద్రమ్మ ఉంది గా ! ఇప్పుడు నాకు అర్ధం కానిది తెరాస వాళ్ళ గోల ఏంటి అని . . రాష్ట్రానికి , ఒక మంచి తెలుగు పాటకీ లంకె ఎందుకు అని . . ఇందులో కించపరచడం ఎలాగా లేదు . . పోనీ కొమరం భీం లాంటి వీరుల గురించి లేదు అంటారా ? ! అలా అయితే , మధ్య కోస్తా , ఉత్తర కోస్తా ల పరిస్థితి ఏంటి ? నాకు నన్నయ , రాజ రాజ నరేంద్రుడు , అల్లూరి సీతారామ రాజు , వంశధార , నాగావళి ఇంకా చాలా కావాలి పాట లో . . కనీసం ఇలాగైనా కాస్త తెలుగు పలుకుతారు పిల్లలు అనుకుంటే , ఈ పుడకలు ఏంటి మధ్యలో ! వీళ్ళ లాంటి obviously blatant , stupid fellows నోరు ఎలా మూయించాలో నాకు అర్ధం కాదు . జరుగుతున్న ఈ ఒక్క మంచి పని కూడా వీళ్ళ వల్ల జరక్క పొతే , అంత కంటే దారుణం ఇంకొకటి ఉండదు . . ఇప్పటికే కొంత మంది సన్నాయి నొక్కులు మొదలెట్టారు … " తెలుగు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా స్కూళ్ళ లో " అంటూ … ఏం , వందేమాతరం అర్ధం తెలిసే పాడామా చిన్నప్పటి నుంచి ? ? రాష్ట్రం లో ఉన్నందుకు తెలుగు కి ఓ 2 నిమిషాలు కేటాయిస్తే కొంపలేం మునిగిపోవు … .
తన మనోభావాలనీ , సిద్ధాంతాలనీ రీమాన్ ఎలా ప్రభావితం చేసేడో అయిన్‌స్టయిన్ ఇలా చెబుతాడు : " … రీమాన్ ఏకాకిలా జీవితం గడుపుతూ ఎవ్వరికీ అర్థం కాకుండా ఉండిపోయినా , విశ్వాకారానికి రూపులు దిద్దటంలో అతని మేధోత్పత్తి విజ్ఞుల హృదయాలని జయించింది . . " . ఈ ప్రశంసకి ప్రేరణ కారణం 28 ఏళ్ళ రీమాన్ గోటింగెన్ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు ' క్షేత్రగణితపు ప్రాతిపదికల పై వ్యాఖ్యానం ' ( " On the hypotheses on which geometry is based " ) అన్న అంశం పై ఇచ్చిన ప్రసంగం . ఈ ప్రసంగంలో రీమాన్ ఎన్నో కొత్త భావాలని ప్రవేశపెట్టేడు ; ' స్థలం ' ( space ) లేదా ' అంతరాళం ' అన్న మాటకి కొత్త భాష్యం చెప్పేడు .
తగిన వ్యూహం తో ముందుకెళితే ప్రథానమంత్రి పదవి ఓ లెఖ్ఖలోది కాదు - - మన పీవీ , సోనియా చూపిన మార్గాలెలాగూ వున్నాయి !
కథ చాలా బాగుంది . కాస్త పెద్దగా రాస్తే బాగుండేది . ఇలాంటి కథలు ఇంకా రాయాలని కోరుకుంటున్నాం .
హైదరాబాద్ : పార్టీ సీమాంధ్ర నాయకులకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్లాస్ పీకారు .
మా ప్రేమలూ అనుబంధాలూ వేరు . మీలా మిగతా కుటుంబ సభ్యుల కష్టనష్టాలను పట్టించుకోకుండా మా కుటుంబ వ్యవస్థ ఉండనివ్వదు . మనసులో అనుకుంటూ బాబ్ గదివేపు నడిచింది . * * * శనివారం పొద్దున్నే నిదర లేపుతూ ఫోన్ .
రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ ఒకటవ తారికున ఈ స్కీం లాంచ్ చేస్తుంది . నిజంగానే వృద్దుల పాలిట వరమే . నానాటికి క్షీణిస్తున్న రక్త భందాలు , పెరిగిపోతున్న వృద్దాశ్రమాలు ఒకరకంగా " నిర్లక్ష్యం " చేయబడుతున్న మన సీనియర్ సిటిజన్స్ కొరకి రూపొందించిన కార్యక్రమం .
గోవిందరాజులు వెయిటర్ను పిలిచి , " మేమిక్కడ సిగరెట్ కాలుస్తాం . ఏసి ఆఫ్ చేయ్ కాసేపు " అన్నాడు .
మీ వాణ్ణి బకరా చేసేసారుగా పాపం ! ఓ లేత ప్రేమికుణ్ణి బలి తీసుకున్నారు
పాలకవర్గాలు ముందు మనకు ఏమని చెప్పారు ? మనల్ని ఎటు తీసుకెళతామని చెప్పారు ? అటుపిమ్మట వాస్తవంగా ఎటు తీసుకెళ్ళారు ? గమనించండి . మొదట్లో " అస్పృశ్యులకు మాత్రమే రిజర్వేషన్లు " అన్నారు . " అదీ పదేళ్ళే " అన్నారు . తరువాత వాటిని శాశ్వతం చేసేశారు . అస్పృశ్య పక్షపాతులమనే ముద్రపడి మిహతావారు వోట్లు వేయరేమోననే శంక పుట్టగానే " వెనకబడిన తరగతులు " ( BCs ) అనే కొత్త పదబంధాన్ని కనిపెట్టారు . అలా మఱికొంతమందికి రిజర్వేషన్లు ఇచ్చారు . ఆ తరువాత కొద్ది దశాబ్దాలకు OBC ( Other Backward Castes ) , MBC ( Most Backward Castes ) అనే విభజనల్ని సృష్టించారు . ఇక్కడ జనం గ్రహించని మతలబు ఏంటంటే - ఆనాడు రిజర్వేషన్ ఇవ్వకుండా ఈనాడు ఇన్ని దశాబ్దాల అనంతరం OBC , MBC అంటున్నారంటే ఇంతకాలమూ ఈ OBC , MBC జనాల నోట్లో మట్టి కొట్టామని ఒప్పుకుంటున్నట్లే కదా ! ఎస్సీల్ని ఉద్ధరించడం అయిపోయిందనా , బీసీల్ని సృష్టించారు ? లేదా బీసీల్ని ఉద్ధరించడం అయిపోయిందనా , ఓబీసీల్నీ , ఎమ్బీసీల్నీ సృష్టించారు ? ఇంకా ఎన్నెన్ని విభజనల్ని సృష్టించబోతున్నారు సమాజంలో ? వీటి ద్వారా ఇంక ఎంతమందిని ఉద్ధరించబోతున్నారు ? ఎలా మనల్ని మాయలో ముంచెత్తబోతున్నారు ? ఇవన్నీ పూర్వకాలంలో లేవు కదా ? వీరు పెట్టిన పేర్ల ననుసరించి జనం వాటిల్లో ఇమిడిపోయి చతికిలబడిపోవాలని ప్రయత్నించడం చూస్తూంటే బాధగా ఉంది . ఇవి తరతరాల నుంచి ఉన్నట్లు మాట్లాడడం వింటూంటే ఇంకా బాధగా ఉంది . మనం రిజర్వేషన్లని నిర్మమం ( detached ) గా ఒక తటస్థ , ఐకాంతిక దృగ్విషయం ( innocuous stand - alone phenomenon left to itself ) గా పరికించినప్పుడు అవి బాధాకరం కావు . ఎందుకంటే ఏ కాలపు సమాజమూ నూటికి నూఱుశాతం న్యాయబద్ధమైనది కాదు . ఏ కుర్చీనైనా ఎవడో ఒకడితో భర్తీ చేయాల్సిందే రిజర్వేషన్ ద్వారానో , ప్రతిభ ద్వారానో ! ఎంత గొప్పగా చదివినా అందులో జీవితానికి పనికొచ్చేది ౧౦ - ౨౦ శాతమూ , లౌక్యం ౮౦ శాతమూ గనుక ప్రతిభలేనివారు కూడా ఈ రోజుల్లో ఉద్యోగాలు చేయగలరు . కానీ వీటితో జఱుగుతున్న అల్పన్యాయం కంటే వీటి సహాయంతో తెలివిగా జఱుగుతున్న మోసమూ , వ్యవస్థాగతంగా భారీయెత్తున పాడుచేయబడ్డ మన దేశప్రజల మనస్తత్త్వమూ - ఇవే ఎక్కువ బాధాకరం . ఎంతగా పాడు చేయబడ్డారంటే , ఎంతో మేధావులూ , సంఘసేవకులూ , త్యాగమూర్తులూ అయిన ప్రముఖులకు సైతం వీటిల్లోని అతార్కికత్వానికి వ్యతిరేకంగా ఎలుగెత్తడానికి దమ్ములు లేనంతగా ! ( ఇంకా ఉంది )
స్పష్టత కోసం ఇక్కడే ఒక విషయం చెప్పాలి . కవిత్వంలో క్లుప్తత సాధించదగిన గుణమే . అయితే నియత సంఖ్యాక పాదాలలోనే కవిత్వాన్ని కుదించాలనే నియమం పెట్టుకోనక్కర లేదు . తీసుకున్న వస్తువును బట్టి అది మినీ కవిత్వమో , మిడీకవిత్వమో , మాక్సీకవిత్వమో , దీర్ఘకావ్యమో అవుతుంది . కానీ ఫ్యాషన్ కోసం మినీ కవిత్వం , దీర్ఘకావ్యం రాయనక్కరలేదు . వస్తుగౌరవాన్ని బట్టి కవితారూప పరిమాణం ఉంటుంది . " వేసవి వాన " లో రవిశంకర్ కవిత్వం పరిమాణం పంచుకోవడం అవసరమైన పరిణామం .
( ఆధునిక యుగంలో నిక్లాస్ వర్త్ ( Niklaus Wirth ) అనే స్విస్ కంప్యూటర్ శాస్త్రవేత్త ఓ చిన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని రూపొందించి దానికి పాస్కల్ ( Pascal ) అని పేరు పెట్టాడు . ఈ మధ్యదాకా యూనివర్సిటీలలో ప్రోగ్రామింగ్ నేర్పడానికి ఈ భాషనే వాడేవాళ్ళు . ప్రోగ్రామింగ్ భాషలని రూపొందించిన కృషికి గుర్తింపుగా వర్త్ కి 1984 టూరింగ్ అవార్డు ఇచ్చారు . )
చాలా బాగుంది ఠపా అక్షరాలను కలిపి చదివేయటం ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లా యాసలో కనపడుతుంది . రామచంద్రపురం ఊరిని రాంపురం అని అనటం మరీ బాగుంటుంది . ఇలాంటి వన్నీ వంశీ తనకధల్లో చక్కగా రికార్డు చేసి పెట్టాడు . చిన్న ఉదాహరణ : మా వూరిలోని ఒక థియేటర్ పేరు వీరేశ్వరా . దాన్ని మేం చిన్నప్పుడు ఈరేస్ఫరా అని పలికేవాళ్లం . అదే మాటను అచ్చు అలానే వంశీ ఒక కధలో వాడటం ఆశ్చర్యాన్ని కలిగించింది . మీరు చెప్పిన మాటలనన్నింటినీ మేమూ అలాగే పలికేవాళ్లం . బొల్లోజు బాబా
జర్నలిస్టులందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చేలా చూస్తానని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి మానుగుంట మహీధరరెడ్డి హామీ ఇచ్చారు . సోమవారం జిల్లా పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి స్పష్టమైన హామీ వచ్చేలా ప్రయత్నిస్తానన్నారు . శనివారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్ ) జిల్లా మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు . సభకు సీనియర్ జర్నలిస్టు ఐహెచ్‌వీ పాండురంగారావు అధ్యక్షత వహించారు .
వాడి పేరేమిటో అనవసరం . అత్యవసరంగా వాడికి కొంత పెద్ద మొత్తం లోనే డబ్బు కావలసి వచ్చింది . కాలనీలో తొమ్మిదింటి పైన మగవాళ్ళుండరనీ , ఆడవాళ్ళని బెదిరించి నగలు లాక్కోవడం సులభమనీ లెక్కగట్టాడు . ఓ ఇల్లాలు కిరాణాకొట్టుకు వచ్చి తిరిగి వెళ్తోంది . ముద్దాయి ( ? ) గమనించాడు . ఆమెను తాను వెంబడిస్తున్నట్లు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ దూరం నుంచే ఆమెను వెంబడించి ఆమె ఇంట్లో కెళ్ళిన తరువాత తలుపు తట్టి రేషన్ కార్డులు పంపిణీ చేసే రెవెన్యూ బంట్రోతునని చెప్పుకున్నాడు . ఆమె లోపలికొచ్చి కూర్చోమంది .
రిచర్డ్ ఫేన్మేన్ ప్రపంచ ప్రసిధ్ధ భౌతిక శాస్త్రవేత్త . ఆయన 1965 లో భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి గెలుచుకొన్నారు . ఆయన సైన్స్ , మతం గురించి ఇచ్చిన ఉపన్యాసాలు ఇక్కడ ఉన్నాయి ఆంగ్లం లో . ఇది కొంచెం పెద్ద డాక్యుమెంట్ . తీరిక చేసుకొని అప్పూడప్పుడూ చదవ వచ్చు .
" కథకుడుగా కొండలరావు " అనే శీర్షికన నండూరి రామ్మోహన రావుగారు ర్రవి కొండలరావు గారి ద్విశత చిత్రోత్సవ అభినందన సంచికలో ( 1983 ) ఒక వ్యాసం రాసేరు . అందులో రావి కొండలరావు గారి " ముమూర్ష " , " దిదృక్ష " , " చంద్రశేఖరుని కథ " మరియూ " స్నేహం " కథల గురించి క్లుప్తంగా సమీక్షించేరు రామ్మోహన రావు గారు .
ఏవిటీ , నా బ్లాగ్ కనిపించటం లేదా : ) ' సెవెన్ జాస్మిన్ హైట్ ' నుంచి ' సెవెన్ లోటస్ హైట్ ' కి తగ్గితే తప్ప నేను కనిపించను మరి . ఈ కామెంట్ లోంచి వచ్చేయండి . అయినా అక్కడ ఏంలేదుగా .
అలాగే నాకు " తత్వ శాస్త్రం " గురించి తెలుసుకోవాలని ఆసక్తి గా వుంది . దయచేసి తెలుపగలరు .
- ఇవికాక , ఆయన గురించి మరిన్ని పిట్టకథలున్నై గుహా గారి వ్యాసంలో . అంతా చదివాక - నాయుడు గారికి వీరాభిమానినై , ఇలా టపా రాస్తున్నా అనమాట . క్రికెటర్ గానే కాక , వ్యక్తిగా , ప్రత్యేకం - అద్భుతమైన ఫిట్నెస్ ఉన్న వారిగా - ఆయనది ఎంతో స్పూర్తి వంతమైన జీవితం . ఈయన గురించి పుస్తకాలేమైనా వచ్చి ఉంటే , ఇక్కడ ఓ వ్యాఖ్య రాయగలరు . క్రికెట్ నాకు పరిచయం చేసిన అద్భుత వ్యక్తుల్లో నాయుడు గారిని చేర్చేసుకున్నాను ఇవాళ .
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయి : ప్రణబ్ ముఖర్జీ
ఆ రోజు ఆదివారం . రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కువ లేదు . కారు నెమ్మదిగా నడుపుతున్నాను . మా బావ మరిది బెంగుళూరు నుండి వస్తున్నాడు . వెళ్లి రిసీవ్ చేసుకోవాలి . చల్లని గాలి మొహానికి తగులుతూ ఉంటే చాలా హాయిగా ఉంది . నెమ్మదిగా కారులోని పాటల పెట్టెలో ఎఫ్ఫెం రేడియో ట్యూన్ చేశాను . ఎవరో యాంకర్ చాల హుషారుగా లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలో చెపుతోంది . పక్కవాళ్ళ కోసం బ్రతకకుండా మనకోస౦ మనం జీవించాలని తెలుగు ఇంగ్లీష్ హిందీ కలిపిన భాషలలో చెపుతోంది . మధ్యలో చెప్పడం ఆపి కాలర్ సిధ్ధంగా ఉన్నారు ముందు ఫోన్ చూద్దాం అంటూ ఫోన్ బటన్ నొక్కింది . యాంకర్ : హలో ! గుడ్ మార్నింగ్ అవతలి వ్యక్తి : గుడ్ మార్నింగ్ యాంకర్ : మీ పేరు ? వ్యక్తి : గురుతు పట్టలే ? యాంకర్ : ( వయ్యారంగా ) లేదు కదా ! వ్యక్తి : మరి గొంతును బట్టి ఎవరు మాట్లాడుతున్నారో చెప్పేస్తా అంటావ్ ? యాంకర్ : నీ లాటి గొంతులే ముగ్గురికుంటై వ్యక్తి : మరి పేర్లు చేప్పుకో యాంకర్ : సుధీర్ ? వ్యక్తి : కాదు కదా ? యాంకర్ : రాకేశ్ ? వ్యక్తి : కాదు యాంకర్ : పోనీ నీ పేరులోని మొదటి అక్షరం చెప్పు నేను పేరు చెప్పేస్తా వ్యక్తి : వి యాంకర్ : ఆ దొరికిపోయావ్ విజయ్ విజయ్ : అబ్బో బాగానే పట్టవు యాంకర్ : హాయ్ విజయ్ హౌ ఆర్ యు ? విజయ్ : ఫైన్ . నువ్వెట్లా ఉన్నావ్ ? యాంకర్ : నేను బాగానే ఉన్నాను విజయ్ . అవును నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది ? విజయ్ : అదా అస్తమాను సతాఇస్తాది . నా వైపే చూడట్లే యాంకర్ : అమ్మాయిల మనసు అర్ధం చేసుకోవాలి బాబు . కొత్త అమ్మాయి మరొకరిని పటాయించు . విజయ్ : నువ్వట్లే చెపుతావు . నీ ఫోన్ నంబెర్ చెప్ప రాదు ? యాంకర్ : ఏఁ నన్ను పటాయిస్తావ ? ( నువ్వుతూ ) విజయ్ : లేదు కొద్దిగా ట్రై చేస్తా యాంకర్ : అబ్బ ఆశ . విజయ్ నీకో క్లూ ఇస్తాను అమ్మాయిలని ఎలా కన్విన్స్ చేయాలో . అది ఫాలో అయిపో . విజయ్ : ఆ చెప్పు . యాంకర్ : మంచి గిఫ్ట్ తీసుకొని ఆ అమ్మాయి కి కనిపించాలా దూరంగా తిరుగుతూ ఉండు . కొన్ని రోజులకి ఆ అమ్మాయి తప్పక నువ్వంటే ఇష్టపడుతుంది . సరేనా ? ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పలేదు ? విజయ్ : సమ్పంగి యాంకర్ : ముద్దుపేరా ? విజయ్ : అవును . యాంకర్ : అసలు పేరు ? విజయ్ : అమ్మో చెప్పను . అందరికి తెలిసి పోతుంది యాంకర్ : ఆమె ఏఁ చేస్తూ ఉంటుంది ? విజయ్ : మా క్లాస్మేటు యాంకర్ : ఇక నేను చెప్పినట్లు చేస్తూ ఉండు విజయ్ . బెస్ట్ అఫ్ లక్ విజయ్ : ఇక నుండి మీ స్టూడియో దగ్గిర కూడా తిరుగుతూ ఉంటాను . యాంకర్ : విజయ్ నువ్వు చాల ఖతర్నాక్ . ఓకే విజయ్ థాంక్స్ ఫర్ కాలింగ్ . బై బై రేడియో స్విచ్ ఆఫ్ చేశాను . అదీ మాటర్ . మనం అన్ని రంగాల్లో చాల ముందు ఉన్నాము . అమ్మాయిలని ఎలా ట్రాప్ చేయాలో కౌన్సలింగ్ కూడా ఇస్తున్నారు . తస్మాత్ జాగ్రత్త ! !
అప్పుడే సాయంకాలమైంది . సూర్యాస్తమయం చేరువైంది . సంవత్సరం కిందట ఉజ్వలంగా ఉదయించిన ప్రజారాజ్యం సూర్యుడు , కాంగ్రెసు తుప్పల్లో కుంకబోతున్నాడు . పాపం చిరంజీవి ! హీరో కావాలనుకున్నవాడు మొన్నటి ఎన్నికల్లో జీరో అయ్యాడు . ఇప్పుడు కాంగ్రెసు పంచన చేరి , నిదానంగా వంత పాత్రలు వేసి , ఎప్పుడోకప్పుడు హీరో కాకపోతానా అని చూస్తున్నట్టున్నాడు . కాంగ్రెసుతో పెట్టుకుంటున్న ఈ పొత్తు కారణంగా ఒక్కటి మాత్రం స్పష్టం . . ఒకవేళ ఈ పొత్తే గనక 2014 ఎన్నికలలోనూ కొనసాగినా , లేక ఈలోగా ప్రజారాజ్యం కాంగ్రెసులో మునిగిపోయినా . . కాంగ్రెసు చేస్తే తప్ప ఇక అతడు హీరో కాలేడు . పాపం చిరంజీవి !
జిల్లాలోఁ మైనార్టీశాఖ అవినీతి అధికారులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలఁ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు శ్యామ్ , . . ఇంకా
ఉదా ; abcd . . చదువుతూ R వద్ద ఆపితే అందరూ R తో మొదలయ్యే పేరు , స్థలం , జంతువు , వస్తువు రాయాలి .
శ్రీకాంత్ కథానాయకుడుగా ప్రముఖ దర్శకుడు నీలకంఠ దర్శకత్వంలో మేక మీడియా పతాకంపై శ్రీకాంత్ సోదరుడు అనీల్ నిర్మించిన చిత్రం ' విరోధి ' . ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పుపొంది విజయాన్ని సొంతం చేసుకొంది . ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించిన సందర్బంగా ఈ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ జరుపుకొన్నారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాంత్ మాట్లాడుతూ తొలిసారిగా మా బ్యానర్ లో విడుదలైన సినిమా ఘన విజయాన్ని సాదించడం చాలా సంతోషంగా వుంది . . . .
రాష్ట్ర పొలిటీకల్ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన వంటవార్పు కార్యక్రమం ఎంతో ఆహ్లాద కరంగా , ఆనందోత్సవాల మధ్య తెలంగాణ వాదుల నినాదల్లతో దద్దరిల్లింది . మండల కేంద్రంలోని అంబేద్కర్ ఛౌరస్తాలో మండల జేఏసీ నాయకులు జి . కుర్మయ్య , మంగివిజయ్ , శ్రీనివాస్‌గౌడు , పులేందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల జేఏసీ నాయకులతో పాటు విధ్యార్ధి జేఏసీ నాయకులు , ఉద్యోగ , ఉపాధ్యాయ , కార్మిక , కర్షక , వివిధ యువజన సంఘాల నాయకులతో పాటు తెలంగాణా వాదులు సుమారు 1000 మంది పాల్గోన్నారు . ఈసందర్భంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ధూంధాంలో విదేశీయులు సైతం నృత్యం చేయడం తెలంగాణ వాదం ఎంత బలమైనదో రుజువవుతుందని జేఏసీ నేతలు పేర్కొన్నారు . ఈసందర్భంగా తెలంగాణ ఎమ్మేల్యేలు రాజీనామాలు చేయకుండా సమైక్యాంధ్ర పాటపాడుతున్న ఎమ్మేల్యేల ప్లేక్సీలను చెప్పులతో కోడుతూ పిండప్రధానం చేశారు . ఈ వంటవార్పు కార్యక్రమాన్ని కొల్లాపూర్ ఎమ్మేల్యే , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్షించి తన సంఘీభావం ప్రకటించారు .
నరేశ్ నున్నా , ముచ్చట పడడానికి , పిచ్చను పడడానికి తేడా ఉన్నప్పుడు , రాము గారు " సోదరీమణి " అని అంటారేమోనని తెగ కంగారు పడిపోవడం దేనికి ? నువ్వు జీవ రసాయనిక క్రియ గురించే మాట్లాడుతున్నావ్ . తప్పు లేదు . కానీ , ఆ క్రియలోంచి మాత్రమే మాట్లాడడమేమిటి ? హార్మోన్లతో స్పందిస్తాం , ఆలోచించలేం . ఆలోచించడానికి వేరే పదార్థం ఉంది . దాన్ని నువ్వు హార్మోన్లతో ఉతికి ఆరేస్తున్నావ్ . ఏంటీ బాధ ? అందం గురించి నువ్వు స్పందిస్తుంటే . . ఆనందంగా ఉండాలి కాని , నాకు జాలి కలుగుతుందేమిటి ? - పసునూరు శ్రీధర్ బాబు
" సరే నాకూ పంచండి " అన్నాను . " కానీ ఇదే చివరి సారి , మళ్ళీ అడగవద్దు , నాకిష్టం లేదు ముందే చెప్తున్నా " ముఖ్యంగా మా ఆవిడవైపు చూసి చెప్పాను .
ఇదే చిత్రంలో శ్రీశ్రీ , ఆరుద్రలిరువురూ తమ రచనగా గొప్పగా చెప్పుకున్న ' సదసత్కళా ' అనే సీసపద్యం చాలా చక్కనిది . రాజా పాడిన ఈ పద్యం ఒక చిత్రకవిత్వమే . ఇందులో మొదటి పాదం ' స ' తో మొదలయి , ' స ' తో ముగుస్తుంది , రెండవ పాదం ' రి ' తో , మూడవది ' గ ' తో , అలాగే మిగిలినవి .
14ఎఫ్‌ను తొలగించకుండా పరీక్ష జరిపితే ఊరుకునేది లేదని టీఎన్జీవో కూడా హెచ్చరించింది . తెలంగాణలో 14ఎఫ్ వివాదం మొదలవగా … సీమాంధ్రలో జీవో 91 ఎప్పటి నుంచో రగులుతోంది . వెటరినరీ అసిస్టెంట్ సర్జన్‌ల పోస్టులకు గతంలో రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా పరిగణించేవారు . ఈ పద్ధతిని మార్చేసి , వీటికి జోనల్ వ్యవస్థను అమలు చేస్తూ ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 91ను జారీ చేసింది . దీనివల్ల తాము నష్టపోతామంటూ సీమాంధ్రకు చెందిన విద్యార్థులు కొన్నాళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు . ఇది … ఉద్యోగ పర్వం !
' క్యాటిల్ ' అంటే , మచ్చికయిన , పాలిచ్చే జంతువులు అని అర్థం అనుకుంటా .
ఈసరసోక్తి కావ్యమొకఁడిమ్ముల సంస్కృతభాష నచ్చుగాఁ జేసిన నట్ల వీఁడు మఱి చేయుట యేటిది యంచుఁ జెప్పగాఁ జేసి యనాదరం బురక చేయకుఁడీ విలుకాఁడు తూఁటుగా నేసిన నందె పాఱ మఱి యేసినవానిద సూటిగావునన్ .
జిల్లా వేపాడ మండలం వావిలపాడు పంచాయతీ సంజీవమెట్టలో భవన నిర్మాణ పనులు చేసేందుకు శుక్రవారం వెళ్లారు . షేక్ నాగూరు ఇంటిపై పిట్టగోడ కడుతుండగా , ఇంటిపైనున్న 11 కెవి విద్యుత్‌వైర్లు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు . పెంటయ్యకు తల్లిదండ్రులు రాములమ్మ , దేముడు , భార్య అప్పలనర్సమ్మ , ఇద్దరు ఆడపిల్లలు ఇంద్ర ( 7 ) , మౌనిక ( 2 ) ఉన్నారు . భర్త మృతితో పిల్లలను ఎలా పెంచాలని భార్య అప్పలనర్సమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది . కార్మికురాలు పద్మకు భర్త ఈశ్వరరావు , కుమార్తె శిరి ( 6 ) , కుమారుడు పవన్ ( 2 ) ఉన్నారు . విషయం తెలుసుకున్న ఆయాగ్రామస్తులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు . పొట్టకూటి కోసం కూలి పనులకు వచ్చిన వారు మృతి చెందడంతో తీవ్రంగా విలపించారు . సంఘటనా స్థలాన్ని సిఐ ఆర్ . గోవిందరావు , ఎస్‌ఐ కన్నారావు పరిశీలించారు . మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్ . కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు . మృతుల కుటుంబాలను ఆదుకోవాలని సర్పంచి గండి వెంకటరావు , కొత్తపల్లి సర్పంచి కోరారు .
జర్మనీ లోని బెర్లిన్ గ్రంధాలయంలో ఆర్యభట్ట రచించిన " దశగీతిక " గ్రంధం అందుబాటులో ఉంది . వృద్ధ సిద్ధాంతం , వశిష్ట సిద్ధాంతం గ్రంధాలు " మకెంజీ కలెక్షన్ " భాగంగా సౌలభ్యమవుతున్నాయి . ఈ ఉపలబ్ద ప్రమాణ గ్రణాల ఆధారంగా భారతీయ ఖగోళ శాస్త్రం , గణిత శాస్త్రం , విశ్వ శాస్త్రం , కాల శాస్త్ర రంగాలు ఎంత అభివృద్ధి చెంది ఉన్నాయో విశ్లేషించ కండానే తెలుస్తోంది .
వారకన్యక యని నీవు కేరవలదు దీనితో నాకు నేస్తంబు పూన జేసి కడకమై నాడిమళ్ళ వేంకటమనీషి దీనితల్లిని విషయించు దృష్టికలన
అప్పుడు గొంతు విప్పాడు రాఘవరెడ్డి ' ' గోవిందరావూ ! ' ' అన్నాడు . ' ' కళను చూపాలని పచ్చినారు . నాగ్గూడా సంతోషంగా ఉంది . బొమ్మలాట ఆడించాల . ఇప్పటి తరానికి దానిరుచి చూపించాల … . నేను ఓకే . . నాక్కూడా ఆట చూడాలని ఉంది … . నా సహకారం మీకు ఎల్లవేళలా వుంటుంది … . అయితే ఇప్పుడొక ఇబ్బంది పచ్చిపడింది … . ' '
డియర్ క్రిష్ణా రావూ ! ఓ నెలక్రితం పుట్టిన నా మూడో మనవడు ( కూతురుకి రెండో కొడుకు ) కొంచెం నలతగా వుండడం వల్ల ఆంధ్ర జ్యోతి చదవడం తటస్థించ లేదు . బహుశా మీరన్నది చాగల్లు పంచదార కార్ఖానా / బ్యాంక్ ఆఫ్ ఇండియా ల గురించి అనుకుంటా - - అవునా ? తప్పకుండా వ్రాస్తాను . నేను అనుకున్నది కాక పోతే , కొంచెం వివరాలు అందించండి . విజృంభిస్తాను ! సరేనా ?
సీతారామారావులాంటి వ్యక్తులు లోపల ఎంతటి విపరీతమైన ఆలోచనలున్నా , వాటిని అంత త్వరగా బహిరంగం చెయ్యరు . అందులోనూ తాను నియంత్రించలేని వాళ్ళ దగ్గర . వీళ్ళకు ప్రజల దృష్టిలో ఔన్నత్యం చాలా ముఖ్యం . ఎరుకలి దృష్టిలో తన ఔన్నత్యాన్ని ప్రదర్శించుకోవడానికి కూతుర్ని కొడతాడు కానీ , ఎరుకలితో మాట్లాడి నిజ నిర్ధారణ చేయడం అతనికి చిన్నతనం . అలాంటి వాడు బహిరంగంగా వెకిలి నవ్వులు నవ్వడం , నిజాలైనా బహిరంగంగా నిష్కర్షగా మాట్లాడడంలాంటివి చెయ్యలేడు . ఆ సన్నివేశాల్లో సీతారామారావు కేవలం ఉన్మాదేనేమోననిపించక తప్పదు . కానీ నా దృష్టిలో ఇవి రచనలో చోటు చేసుకున్న చిన్న లోపాలు మాత్రమే .
10 , 10 , 15వ డివిజన్లలో ఉన్న స్థానిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శంభునిపేటలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షలను శ్రామిక మహిళ కన్వీనర్ జిల్లా కన్వీనర్ కాసు మాధవి ప్రారంభించారు . ఈ దీక్షల్లో సిఐటియు నగర కార్యదర్శి బోగి సురేష్ , డివైఎఫ్‌ఐ ఉపాధ్యక్షులు జాన్‌పాల్ , కెఎన్‌ఆర్‌ఎఫ్ నగర నాయకులు పసునూరి రమేష్ , సిఐటియు నగర నాయకులు కె జోసఫ్ , కెఎన్‌ఆర్‌ఎఫ్ నాయకులు జి రాజేశ్వర్‌రావు , ఐద్వా నాయకులు వేల్పుగొండ మయూరి , కెవిపిఎస్ నాయకులు జన్ను రాజు , సిఐటియు నాయకులు కె కమలాకర్ , కెవిపిఎస్ నాయకులు కె ప్రభాకర్ కూర్చున్నారు . ఈ దీక్షలను కెఎన్‌ఆర్‌ఎఫ్ నగర ఉపాధ్యక్షులు మెట్టు శ్రీనివాస్ సందర్శించారు .
కనీసం ఆ రోజు వాకపల్లి వెళ్లిన గ్రేహౌండ్స్ పోలీసులు ఎవరనేది కూడా అధికారులు వెల్లడించకపోవడం చూస్తే ప్రభుత్వానికి ఆదివాసీలంటే ఎంత చులకన భావం వున్నదో అర్థ్ధం అవుతున్నదని విమర్శించారు . వాకపల్లి ఘటనలో దోషులు అరెస్టు అయ్యేంత వరకూ ఆందోళన కొనసాగించాలని , అందుకు తమ పూర్తి మద్దతు వుంటుందని బాలగోపాల్ ప్రకటించారు . జిల్లా పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు టి . శ్రీరామమూర్తి , మానవ హక్కుల వేదిక జిల్లా ప్రతినిధి వి . కృష్ణ , తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి చిట్టినాయుడు తదితరులు శిబిరంలో పాల్గొన్నారు .
చేసి సురసుందరీ కరోశీరతాల వృంత చలితాంత కుంతల విలసదింద్ర కులవధూటీ లలాటికా కుంకుమంబు బదిల పఱుప చక్రంబ నీ భరము కాదె .
' నేస్తం ! నేను అతి త్వరలోనే మన వూరు వస్తున్నాను ' .
ఇప్పుడు దీనినే యూనిఫైడ్ కమ్యూనికేషన్ అని అన్ని కంపెనీలూ అడ్వర్టైజ్ చేసుకుంటున్నాయి . అంటే కంపెనీలకు కావలసిన అన్ని టెక్నాలజీలనూ ఇస్తామని , అన్నీ తమ దగ్గరున్నాయని చెప్పటం అన్నమాట . ఉదా : మామూలు టెలీఫోన్ కాల్స్ , కాల్ సెంటర్ లాంటి సొల్యూషన్ , వాయిస్ మెయిల్ , వీడియో , కాంఫరెన్సింగ్ ఏం కావాలంటే అది అన్నీ దొరుకుతాయని చెప్పడం .
నజభజజల్‌జరేఫలు పెనంగి దిశాయతితోడఁ గూడినన్ ద్రిజగదభిస్తుతా బుధనిధీ విను చంపకమాలయై చనున్ - వేములవాడ భీమకవి ( రేచన ) , కవిజనాశ్రయము ( 107 ) ( పాదాల విరుపు - దిశా - దశ దిశలు )
చిన్న వూరవటం వల్లన చాలా మందికి అక్కడ ఒకరికొకరు పేర్లతో సహా పరిచయం . అందులోనూ ఆ ప్రాంత ప్రజల ప్రేమ వర్ణనాతీతం . పెద్దగా బాదరాబందీలు లేని జీవితం , కాలుష్యం లేని తోటలు , ప్రవాసం ( అండమాను దీవులు ) వెళ్లిన కుటుంబ సభ్యులు . ఇవే వారి జీవితం . అంతర్లీనంగా నక్సలిజం కూడా వుంటుంది . మనకు కనిపించదు , కనపడనివ్వరు కూడా ( అచ్చం సిందూరం సినిమాలానే ) . మనం ఏ తోటలో నుంచి వెళ్లినా ఆదరంగా పలకరిస్తారు . వీలైతే ఒక రెండు కొబ్బరి బోండాలు తాగమని బలవంతం చేస్తారు . అక్కడ జీడి పళ్లు ఎవరూ పెద్దగా తినరు . ఒక పెద్ద గోతిలో కుప్పలుగా ఎర్రని , తియ్యని జీడిపళ్లను పోస్తారు . అవి పశువులు తింటాయన్నమాట . మాకు జీడి పళ్లు కొనుక్కు తినటం అలవాటు కాబట్టి , అక్కడ అలా గోతిలో పారేస్తుంటే మనస్సు చివుక్కుమనేది . మనం ఆ పళ్లు తినే జీవులని తెలిసి మాకు దోరగా , ఎర్రగా వుండే జీడి పళ్లు ఇచ్చేవారనుకోండి . అక్కడ మనం ఎన్ని పళ్లయినా కోసుకు తినవచ్చు . జీడిపిక్కలు మాత్రం చెట్ల దగ్గరే పడెయ్యాలి . అది మాత్రం ఒక రూలు . దారికి రెండు వైపులా వుండే మొగిలి పొదలు చాలా గుబులు పుట్టిస్తాయి . ఎందుకంటే అవి పాములకు మంచి ఆవాసం . కాకపోతే మొగలి పువ్వుల సువాసన మాత్రం అద్భుతంగా వుంటుంది . ఆ పువ్వుల రేకులను అల్లి మరలా పువ్వులా చేసుకొని ధరిస్తారు . మొగలి పొదల మధ్యలో అక్కడక్కడా సీతాఫలం చెట్లు తప్పనిసరిగా వుంటాయి . నేను నా స్నేహితులతో సీతా ఫలం పళ్ల వేటకు తరచుగా వెళ్లేవాడిని . ఒక పది , పదిహేను పెద్ద పళ్లు దొరికాక , దగ్గరలో ఒక మొగలిపొద దగ్గరలో మాలో ధైర్యం కాస్త వున్నోడు ఒక గొయ్య తవ్వి అందుకో ఆ పళ్లను పోసి , ఇసుక పోసి కప్పి , పైన ఏదో కొండ గుర్తు పెట్టేవాడు . మరుచటి రోజు వచ్చేసరికి ఘుమఘుమ లాడే సీతాఫలం పళ్లు తయారుగా వుండేవి . స్కూలు ఇంటర్వల్ ( సాయింత్రం ) ఇవ్వగానే మేము ఈ ఫలాల స్నాక్స్ తినటానికి దగ్గరలో వున్న తోటల్లోనికి పరారయ్యేవాళ్లం .
ఓ రోజు అభీ రాము ని సెకండ్ షో సినిమాకి లాక్కు పోయాడు . ఆ రోజు లెక్కల మాస్టరిచ్చిన హోంవర్క్ ఇంక అవ్వలా . రాము సినిమా చూస్తున్నా అతని మనసు హోం వర్క్ చెయ్యలేదన్న టెన్షన్ లో పడింది . సినిమా లో రాజేంద్రప్రసాదు జోకులకి పైకి అందరితో పాటు ఇకిలించాడేకానీ , లోపల గుండె పీచు పీచు మని పీకుతోనే ఉంది . ఆ రాత్రి ఒంటి గంటకి ఇంటికొచ్చిన తరువాత దీపపు వెలుగులో కూర్చొని లెక్కల మాస్టరు ఇంటికిచ్చిన లెక్కలు చేశాడు . అయితే , మరసటి రోజు అభీ గాడు మాత్రం ఏ మాత్రం తొణకకుండా , " నిన్న రాత్రి మా డాడీ మమ్మల్ని పెళ్ళికి తీసుకు పోయారు సార్ . . హోంవర్క్ చెయ్యటం కుదర్లేదు . . " అని చెప్పి తప్పించుకున్నాడు .
అన్నా ! అమెరికాలో ఉండేవాళ్ళకు అమెరికా బెస్టు అన్నట్టు . భారతదేశంలో ఉన్నావారికి ఇదే మంచిదన్నట్టు . -
సముద్రం స్వేచ్ఛను దోచుకుంటున్న స్వామ్యభావంపై సముద్రంతో కలిసి సంఘర్షణకు దిగాను
హైదరాబాద్ : రాష్ట్రంలో సంక్షేమ హస్టల్ విద్యార్ధులకు సరైన పౌష్టికాహారం అందించడానికి రోజువారీ భత్యాన్ని పెంచాలని శాసనసభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి . దీనికి ప్రభుత్వం స్పందించకపోవడానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ , వామపక్షాలు , భారతీయ జనతా పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి . ప్రజారాజ్యం పార్టీ , తెలంగాణారాష్ట్ర సమితి మాత్రం నిరసన తెలిపాయి . ఈ అంశంపై తెలుగుదేశం ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహం మాట్లాడుతూ వసతి గృహాల్లో విద్యార్దులు ఆకలితో అల్లాడిపోతున్నారని అన్నారు . సరైన ఆహరం లభించక అనారోగ్యాల పాలవుతున్నరని చెప్పారు . [ . . . ]
చీరాలలో దిగిన డిఆర్‌ఎం తొలుత రైల్వే పార్శిల్ కార్యాలయాన్ని , టిక్కెట్ కౌంటర్‌ను పరిశీలించారు . కౌంటర్‌లోని బిల్లింగ్ డిస్‌ప్లే పనిచే యకపోవడం గమనించి వాటిని తట్టి పనిచేస్తాయోమనని గమనిం చారు . అవి పని చేయకపోవడంతో సిబ్బందిని కారణమడిగారు . ఖం గుతిన్న బుకింగ్ సిబ్బంది డిస్‌ప్లేలు సక్రమంగా పనిచేస్తాయని , విద్యు త్ కోత వల్ల అవి ప్రస్తుతం పని చేయడం లేదని తెలిపారు . దీంతో బ్యాటరీలు ఏర్పాటు చేసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు . అ నంతరం సైకిల్ స్టాండ్‌లో వాహనాలకు షెడ్డు లేకపోవడంతో రెండు సైకిల్ స్టాండ్‌లపై ఆరా తీశారు . ఆవరణలో గుంటలు ఉండడం గమ నించి , అలా ఎందుకు వదిలేశారంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు . అనంతరం స్టేషన్ మొత్తం కలయ తిరిగారు . వృ ద్దుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ పనితీరు గమనించేందుకు ప్రయత్నించిన డిఆర్‌ఎంకు భంగపాటు ఎదురైంది . లిఫ్ట్ పనిచేయకపోవడంతో సిబ్బందిపై డీఆర్ ఎం ఆగ్రహం వ్యక్తం చేశారు . లిఫ్ట్ పనిచేయకపోవడానికి కూడా విద్యుత్ కోత కారణమని సిబ్బంది నుండి సమాధానం రావ డంతో ఆయన అగ్గిలం మీద గుగ్గిలం అయ్యారు . శ్లాబు పె చ్చులూడి పోతున్న ప్రయాణీకుల విశ్రాంతి గదిని గమనించి సదరు కాంట్రా క్టర్ పైచ ర్యలు తీ సుకోవా లని , వెంట నే నోటీసులు పంపాలని ఆదే శించారు . అనంత రం రైల్వే రికార్డుల ను పరిశీలించారు . డీఆ ర్‌ఎంతో పాటు డిసి ఎం రమేష్‌బాబు , సెక్యూరిటీ కమి షనర్ సంజయ్‌కుమార్ మిశ్ర , సీ నియర్ డిఎంఇ కృష్ణమూర్తి , సీనియ ర్ డిఇఇఎం కోఆర్డినేషన్ విక్రమ్ గుప్తా , సీనియర్ డిఎఫ్‌ఎం శ్రీనివాసరావు , రాజభా షా ధికారి చిరంజీవి , సీనియర్ డిఇఎన్ డి . ప్రసాదరావు , సీనియర్ డిఇ నాగేంద్రప్రసాద్ , సీనియర్ డిఇఇ రాధోడ్ , చీఫ్ టిసి భాస్కరరావు , తదితరులు పాల్గొన్నారు .
అని నిరుత్సాహపడే చేదుపాట , ' వేళకాని వేళలో , లేనిపోని వాంఛలతో ' ఎందుకు ప్రాకులాడుతావని తనను తానే ప్రశ్నించుకునే దేనికొరకు అన్న కవిత మొదలైనవి ఎప్పుడైనా తాత్కాలికంగా నిరాశకు లోనైనప్పుడు రాసినవై ఉండాలి . అప్పటి మానసికస్థితిని ప్రతిభావంతంగా ఆవిష్కరించటంలోనే శ్రీశ్రీ కవిత్వ పటిమ మనకు తెలుస్తుంది . ఇటువంటి కవితలలో తలమానికమనదగిన కవిత ' కేక ' .
కొన్ని రోజుల క్రితం మా పక్క వీధిలో ఒకటే అరుపులు , కేకలు , ఏడ్పులు , ఆర్తనాదాలు . . . ఏమయ్యింది ? అనుకుంటూ కంగారుగా , ఆతృతగా బాల్కనీలోకి పరుగెత్తికెళ్లాను . ఒకతను ఏడుస్తూ . . . ఓ పది సంవత్సరాల అబ్బాయిని చేతులపై మోసుకెళ్లటం నాకు కంటబడింది . అతడి వెంట చాలామంది గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వెళ్తున్నారు . కిందికి పరుగెత్తుకెళ్లి . . . పక్కింటి మామిని ఏమయ్యింది ? అని అడిగాను . నిండా పదేళ్లు కూడా లేవు ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పింది . ఆ మాట విన్న నేను ఒక్కసారిగా షాక్ తిన్నాను . ఇంత చిన్నబ్బాయి సూసైడ్ చేసుకున్నాడా అని . . . ? కాసేపటి తరువాత తేరుకున్న నేను . . . ఎందుకు ? అని మళ్లీ ఆమెనే అడిగాను . ఇంకా ఏమీ తెలియలేదు , కనుక్కుని చెబుతానుండండి అని అంది . ఆ చిన్నపిల్లాడి రూపం కళ్లముందు కదలాడుతూనే ఉంది . నాకేమీ పాలుబోలేదు . అసలు ఎలా జరిగింది ? అని మామిని అడిగాను . స్కూలుకెళ్లిన పిల్లాడు మధ్యాహ్నమే ఇంటికొచ్చేశాడు . వాళ్ళ అమ్మ కట్టి ఇచ్చిన పెరుగన్నం తినేసి మేడమీది గదిలోకెళ్ళాడు . ఏమనుకున్నాడో ఏమో కిటికీ ఊచలకు వాళ్ళమ్మ చీరను బిగించి తన మెడకు ఉరి వేసుకున్నాడు . ఆ అబ్బాయి ఎప్పుడూ మేడమీది గదిలో ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి ఎవరికీ అనుమానం రాలేదట . ఒకటి రెండుసార్లు వాళ్ల అక్క పైకి వెళ్లి కిటికీ పక్కన మెడకు చీరను బిగించుకున్న తమ్ముడిని చూసి అలా ఆడుకోకూడదురా , తప్పురా అంటూ మందలించి కిందికి వెళ్లిపోయిందేగానీ సరిగా గమనించలేదు . మధ్యాహ్నం మెడకు ఉరి బిగించుకున్న ఆ పిల్లాడిని సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో చూశారు . ఎంతసేపు ఆడుకుంటావు కిందికి రారా అంటూ అక్క ఎంత పిలిచినా ఆ అబ్బాయి కిందికి రాలేదు , పలకడం లేదు . ఏమైంది అనుకుంటూ ఆ అమ్మాయి వచ్చి చూడగా . . నాలుక బయటపెట్టి , కనుగుడ్లు పైకి తేలేసి కనిపించాడు ఆ అబ్బాయి . భయంతో కిందికి పరుగెత్తి కెళ్లిన ఆ అమ్మాయి వాళ్ల అమ్మకు విషయం చెప్పి పైకి తీసుకెళ్లగా . . . కొడుకు నిర్జీవంగా కనిపించాడు ఆ తల్లికి . అయినా బతికే ఉంటాడన్న చిన్ని ఆశతో చుట్టుప్రక్కల వారిని పిలిచి హాస్పిటల్‌కు పరుగులెత్తింది ఆ తల్లి . హాస్పిటల్‌లో డాక్టర్ ఆ అబ్బాయిని పరీక్షించి మధ్యాహ్నమే చనిపోయాడని చెప్పాడు . ఇంతలో తండ్రికి విషయం తెలిసి హాస్పిటల్‌కు పరుగెత్తాడు . అప్పటికే బిడ్డను ఏడుస్తూ తీసుకొస్తున్న భార్య చేతుల్లోంచి తీసుకుని గుండెలు బాదుకుంటూ తీసుకొస్తున్నాడు . ఇదండీ జరిగింది అని చెప్పింది మామి . ఆ చిన్న పిల్లాడికి ఏం కష్టమొచ్చింది ? ఎందుకు ఉరివేసుకోవాలనుకున్నాడు ? అని మళ్లీ ఆమెనే అడిగాను . ఏమోనండీ అందరూ దుఃఖంలో ఉన్నారు . ఇంకా ఏమీ తెలియడం లేదని చెప్పిందామె . తరువాత కొన్ని రోజులకు ఆ పిల్లాడు ఉరి వేసుకున్న కారణం తెలిసి అవాక్కయ్యాను . స్కూల్లో ఏదో కారణం చేత వాళ్ల మిస్ అందరి ముందూ తిట్టిందట . ఆ అవమాన భారాన్ని తట్టుకోలేని ఆ పిల్లాడు ఉరిపోసుకున్నాడు . అప్పటిదాకా , స్కూల్లో అందరికంటే ఫస్ట్ వచ్చే తమ కొడుకు మార్కులు తక్కువ వచ్చినందుకో , లేదా ఎప్పుడైనా తాము తిట్టినందుకో మనసు కష్టపెట్టుకుని ఇలా చేశాడనుకున్నారు ఆ పిల్లాడి తల్లిదండ్రులు . అయితే ఆరోజు స్కూల్లో మధ్యాహ్నం మిస్ తిట్టినందుకు అంతపని చేశాడని తెలిసిన తల్లిదండ్రులు కాసేపు ఆమెని కోపగించుకున్నా , ఏం చేసినా తమ కొడుకు ఇక తిరిగి రాడని ఊరకున్నారు . అయ్యో . . . ! చిన్న పిల్లాడిని కోపగించుకుని తన చావుకు కారణమయ్యాయనని ఆ మిస్ కూడా పశ్చాత్తాపంతో ఏడుస్తూ , పిల్లాడి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పింది . ఇక్కడ ఎవరిని తప్పుబట్టాలో నాకు అర్థం కావడం లేదు . తప్పు చేసినప్పుడు దండించిన టీచర్‌దా ? లేదా చిన్నపాటి అవమానాన్ని కూడా భరించలేని ఆ పిల్లాడిదా . . ? అదలా ఉంచితే . . . చిన్నపిల్లలు సహజంగానే సున్నిత మనస్కులై ఉంటారు . వారికి సాధ్యమైనంత సున్నితంగానే తప్పొప్పులను తెలియజేయాలే గానీ , కోపంగా తిట్టి చెబితే మాత్రం గాయపడతారు . గాయపడినవారు కొంతమంది మర్చిపోయినా . . . మరికొంతమంది మరీ సున్నిత స్వభావం కలిగిన పిల్లలు పైన చెప్పిన పిల్లాడిలాగే బలవన్మారణాల దారిలోకి వెళ్లిపోతారు . కాబట్టి . . . ప్రియమైన తల్లిదండ్రులారా , విద్యాబుద్ధులు నేర్పే గురువుల్లారా . . . ! చిన్నారి పసిమొగ్గలను వసివాడి పోనీయకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరి చేతుల్లోనే ఉంది . కఠినమైన మాటలు , భాషతో చిన్నారి మనసులను గాయపడనీయకుండా సున్నితంగా వారికి తప్పొప్పులను తెలియజెప్పుదాం . . . . ! చిన్నారులను కాపాడుకుందాం . . . ! !
ప్రపంచ సినీ చరిత్రలో అదొక ఓ మరపురాని రోజు . ఆస్కార్ అవార్డులకి ధీటుగా ఛీత్కార్ అవార్డులు ఇవ్వాలని ఆస్కార్ కమిటీ నిర్ణయించిన రోజు . ఛీత్కార్ జ్యూరీ మెంబర్లు అందరూ యూరోపులో కలిసి మీటింగ్ జరిపి ఆ మీటింగ్ మినిట్స్ పత్రికలకి విడుదల చేసారు . ప్రైజ్ మనీ అక్షరాలా 50 మిలియన్ యూరోలు . కేవలం ఒకే ఒక్క క్యాటగిరీలో పోటీ , అత్యుత్తమ ప్రేక్షక హింస వీరుడు పోటీలు నేరుగా సెమీస్ నుంచి మొదలవుతాయి గ్లోబుకి రెండువైపుల నుంచి అంతిమంగా ఇద్దరేసి మాత్రమే ఎంపిక చేయబడతారు అర్హతలు : నటనతో సంబంధం లేకుండా సినిమాల్లో నటించిన వాడై ఉండాలి బుర్రున్న వాడు చేయని , ప్రేక్షకులు ఊహించలేని ఫీట్లతో బుర్రల్ని తిన్న అనుభవం నటన చూసి ప్రేక్షకులకి పిచ్చెక్కాలి విజేతల ఎంపిక : ఎలిమినేషన్ పద్ధతిలో పోటీ జరుగుతుంది . ప్రపంచవ్యాప్తంగా పోటీలు ప్రత్యక్షప్రసారం అవుతాయి . ఆసియా పసిఫిక్ నుంచి లోకల్ ఛీత్కార్ ఛాప్టర్ ( ఛీచా ) తరఫున ఇద్దరిని నామినేట్ చేసారు . ఒకరు భలేకృష్ణ , మరొకరు గజనీ . ప్రైజ్ మనీ చూసిన తర్వాత వీళ్ళు కూడా పెద్దగా వ్యతిరేకత వ్యక్తం చెయ్యకుండా పోటీలకి సిద్ధం అయ్యారు . వీరిద్దరి గురించి ఆసియా పసిఫిక్ మొత్తంలో ఉన్న పలుకుబడి చూసి ఎవ్వరూ ఎదురు నిలబడే ధైర్యం చేయలేకపోయారు . వీళ్ళ సంగతి తెలియని ఇతర దేశాల వాళ్ళు అనేకమంది పిచ్చిమొహాల్లాగా పోటీల్లో డబ్బు వదుల్చుకుని పాల్గొనటానికి అప్లై చేసుకున్నారు . భలేకృష్ణ , గజనీల తురుపుముక్కలు ఒకటి రెండు చూసి , ఎన్ని జన్మలెత్తినా అంత దరిద్రంగా నటించలేని వాళ్ళ జీవితం మీద వాళ్ళకే అసహ్యం వేసి అప్లికేషన్లు ఉపసంహరించుకున్నారు . కానీ ఉన్నట్లుండి చివర్లో భలేకృష్ణకి పోటీగా హోమన్ బాబు ( హోబా ) , గజనీకి పోటీగా జివయకాంత్ ( జికా ) వచ్చి తాము నటనలో వీళ్ళ కన్నా చాలా అధ్వాన్నం కాబట్టి తమనే నామినేట్ చెయ్యాలని గోల చేయటం మొదలెట్టారు . ఛీచా : ఏందయ్యా మీ గోల ? నామినేషన్ అయిపోయింది . మీరు కూడా హింసవీరులే గానీ , వాళ్ళకన్నా మీరు పెట్టే హింస కాస్త లోరేంజ్ హింసయ్యా . మేము చూస్తున్నది నాణ్యమైన హింసవీరుల కోసం . మీరు డిస్క్వాలిఫై అయిపోయారు , వెళ్ళండయ్యా . హోబా : ఒరేయ్ అరిస్తే చరుస్తా , చరిస్తే కరుస్తా , కరిస్తే నరికేస్తా . నాకేం తక్కువరా గూట్లే , హిట్ సినిమా కొట్టి ఏడు ఏళ్ళవుతోంది . నాకన్నా హింసవీరుడెవర్రా ? రేయ్ మర్యాదగా నన్ను సెలక్ట్ చెయ్యండిబే . జికా : అవునవును , నన్ను కూడా సెలెక్ట్ చేసి పూడ్చండి . నన్ను మా వాళ్ళు ద్రవిడభలేకృష్ణ అని ముద్దుగా పూడుస్తారు . నన్ను సెలక్ట్ చెయ్యాల్సిందే . లేకుంటే నేనిక్కడే సచ్చి పూడుస్తా . ఛీచా : ఓర్నాయనో , మీరు ఛండాలంగా నటించరనెవడన్నాడయ్యా , కానీ పాయింట్ అదికాదు . మీరెవరో మీ ప్ర్రాంతపోళ్ళకి తప్ప మరో ప్రాంతపోడికి తెలియదు . మరి ఆ పెద్ద హింసవీరుల పాపులారిటీ మొత్తం దేశానికి కాదు కాదు ప్రపంచానికే తెల్సయ్యా . పెద్ద పెద్ద హిందీ తలకాయలే విషయం అర్ధంచేసుకుని పక్కకి తప్పుకున్నయ్ వాళ్ళని చూసి . మీరేందయ్యా నస . . . ఓయ్ సెక్యూరిటీ , ఈ క్వాలిటీ నటుల్ని బయటకి లాగి పారెయ్యండి , మాకు అనవసరంగా టైమ్ వేస్ట్ . . . . సెక్యూరిటీ వాళ్ళొచ్చి హోబా మరియు జికా ఇద్దరినీ ఎత్తి అవతల పడేసారు .
తన తల్లిదండ్రులను సేవించుకునే మహద్భాగ్యం తనకు కల్గినందుకు ఎంతో సంతోషిస్తున్నాడు శ్రవణుడు . పూర్వ జన్మ పుణ్య ఫలం వల్లనే తనకు అంత మంచి బుద్ధి కలిగిందనీ , తనకు తెలియకుండానే క్షణికావేశంలో తాను ఎందుకు అలా ప్రవర్తించాడో అర్థం కాలేదు శ్రవణుడికి . అలా ఎందుకు తల్లిదండ్రులను కావడి దిగి నడవమన్నాడో తెలియక సతమతమయ్యాడు . తనలో స్వార్థం ఎందుకు చోటుచేసుకుందో అర్థం కాలేదు శ్రవణుడికి .
ఇది ఒక అద్భుత యజ్ఞ్ఙం . కుక్క పిల్లా , సబ్బు బిల్లా కాదేదీ అక్షరానికి అనర్హం . . . మెదక్ జిల్లా లో ఈ మంత్రంతో శంఖం పూరించిన విశ్వనాథుల భీమాచారి మాష్టారు అక్షరాలను దిద్దటానికి పలకొక్కటే మార్గం కాదంటున్నారు . ముగ్గులు , దీపాలు , గోవులు , కరడాలు , జంతికలు . . . ఏవైనా , ఎక్కడైనా , ఏ రూపంలో అయినా మీరు అక్షరాన్ని సృష్టించి పూజించవచ్చునంటున్నారు . దీనినే అక్షర దశ తంత్రం అంటున్నారు .
సెయింట్ పాల్ ఆ వాక్యంలోని తర్కాన్ని గుర్తించాడో లేదో కాని అదే వాక్యం రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా తార్కిక గణితాన్ని ప్రభావితం చేసింది . పై వైరుధ్యాన్ని ఈ చిన్న వాక్యం ద్వారా గ్రహించవచ్చు : " ఈ వాక్యం అబద్ధం " అన్నది నిజమైతే , తన గురించి తను చెప్పుకున్నది నిజమన్న మాట ; మరి తన గురించి తను ఏం చెప్తున్నది ? తను అబద్ధమని ! పోనీ , ఈ వాక్యం అబద్ధం అనుకుందాం . అంటే తనను గురించి తను చెప్తున్నది అబద్ధం ; ఆ మాటేగదా ఆవాక్యం చెప్పేది . అంటే ఆ వాక్యం నిజం !
అక్కిరాజు ఉమాకాంతం గారిది హద్దుమీరిన అవహేళన అన్న మీ మాటలు అంతగా నచ్చలేదు . యే కొంచెం సూటిగావున్నా అది హద్దులు మీరిందనా కొలబద్ద ? కట్టమంచివారికంటే అక్కిరాజుగారిలో నాకు నిజాయితీ , ఆవేదనా కనపడుతుంది . శ్రీశ్రీ మాటల బట్టి జూస్తే కవులకు అక్కిరాజుగారి పాండిత్య భయమేగానీ ఆయన ఆవేదన కనబడలేదులా వుంది . అంటే ఆయా కవులకి కవిత్వవీరత్వం , పాండిత్యభీరుత్వమని తీర్మానించవొచ్చుగదా ! లేదూ ఆయన చేత విమర్శింపబడ్డవారందరూ కవిపండితులే అనుకొంటే ఆయన విమర్శలని దీటుగా ఎదుర్కొంటూ యేల గ్రంధాలు , వ్యాసాలు వెలయించలేదు ? " ఆ మహాపండితుడి ఆక్షేపణలకు సమాధానమ ఎవరేం చెప్పగలరు ? మరింత ఉత్సాహంతో , పట్టుదలతో నవ్యకవితారీతులను ప్రచారం చేయడమే ఆయనకు చెప్పగల సమాధానమని మేమనుకొన్నాం " అని కృష్ణశాస్త్రిగారు భారతి రజతోత్సవ సంచికలో రాసినట్టు శ్రీ పేర్వారం జగన్నాధం గారు రాసారు . " మేమనుకొన్నాం " అన్న పదం నాకెందుకో " మూక మనస్తత్త్వా " న్ని గుర్తుకుతెచ్చింది . వొక్క పండితుడి " అవహేళన " కి మూక ప్రచారం స్థాయిలో సమాధానమివ్వాలని అంతమంది కలిసి తీర్మానించడమే సాక్షి అక్కిరాజుగారిది అవహేళనతో కూడిన విమర్శ కాదని . సంపూర్ణంగా భారతీయతత్వ చింతనతో విమర్శించిన అక్కిరాజుగారిని కట్టమంచివారి సరసన కట్టివేయడం మనసుకి కష్టంగా వుంది .
బ్లాగులో సొంత విషయాలు రాయ కూడదు అని గఠ్ఠిగా నిర్ణయించుకుని ఆ మాట మీదనే నిలబడి , వంగోని , కూచోని , పడుకొని వుంటున్న ఏకైక వ్యక్తిని నేనే . ఒక్క టపా పొస్టు చేసే ముందు నుండి పోస్టు అయిపోయేంతవరకు మాత్రం కొంచెం వెసులు బాటు కల్పించే దయార్ద కరుణామయుడైన ఏసు ప్రభువును , అడిగిన వెంటనే వరాలిచ్చే ఈశ్వరుడను , అడిగినోళ్ళందరికి ఇందిరమ్మ గృహాలిచ్చే అభినవ సర్ ఆర్థర్ కాటన్ దొర వై . ఎస్ . ను కూడా నేనే . ఈ మధ్య ఏది బ్లాగదామనిపించినా పెద్ద బుడ్డోడు చిన్న బుడ్డోడు చుట్టూనే తిరుగుతోంది . చంద్ర బాబు దగ్గుతూ " గర్జించు రైతూ . . గాండ్రించు రైతూ " అని గర్జించినప్పుడు , కాంగ్రేసు సమావేశాల్లో " రావబ్బా . . . రాహూలూ . . . రావబ్బా . . . " అని పాడుతూ రాహూల్ గాంధిని పిలుస్తున్నప్పుడు , దేవేగౌడ నిద్దర్లోంచి లేచి " చూ మంతర్ " అని యడుయూరప్ప కుర్చీ లాగేసి మళ్ళీ గురక పెట్టినప్పుడు కూడా అవుడియాలు రావడం లేదు . ఏమిటా అని ఆలోచిస్తే ఒక్క విషయం అవగతమైంది . ఈ మధ్యనే ఇక్కడి తెలుగు సంఘంలో నాలుగేళ్ళు పని చేసి స్టాన్ ఫోర్డు యూనివర్సిటీ లో ఎం . బి . ఏ . కన్నా ఎక్కువ అనుభవం సంపాదించి దీపావళి తారాజువ్వలాగా ఎగిరి అందులో మందు అయిపోయాకా భూమ్మీద కొచ్చా . మామూలుగా ఆఫీసులో గోళ్ళు గిల్లుకోవడం అయిపోయాకా సాయంత్రాల్లో మరియు శనాదివారాలో ఆ పని మీద కాళ్ళు గిల్లు కునే వాడిని . ఇప్పుడు ఆ పన్లు లేనందువల్ల లుంగీ కట్టుకుని ఇంట్లో బుడ్డోళ్ళని ఆడించే పన్లో వుంటున్నా . అమెరికా చలి కొంపల్లో లుంగీ లేంటి షరాయిలేసుకోకుండా అంటే కొన్ని శాల్తీలంతే గోదాట్లో , చౌడేపల్లి చెరువులో ఎన్ని సార్లు ఈదినా మారవు . గతం : లైఫ్ బాయ్ ఎక్కడ వుందో ఆరోగ్యం అక్కడ వుంది … ట్రిల్ . . ట్రిల్ . . లైఫ్బాయ్ … ట్రిల్ . . ట్రిల్ . . అడ్వర్టైజ్మెంట్ అదయినా నేను భారత్ లో వున్నంత కాలం పియర్స్ సబ్బు , క్లోజప్పు పేస్టు వాడే వాడిని . పియర్స్ సబ్బేమో " ఆనాటికి ఈనాటికి కొందరి చర్మ సౌందర్యం ఒక్కటే . కారణం . . . పేర్స్ . . . పేర్స్ . . " అంటుంది . యాదృచ్చికంగా అందులో చిన్న బుడ్డోడు బార్అనగాలేదా ( / ) బుడ్డిది వుంటుంది బార్అనగాలేదా ( / ) వుంటాడు . నేనేమో ఫ్రీ కరంటుకు పడి పోయిన రైతు లాగా చర్మ సౌందర్యం అలాగే వుంటుందని వాడా . మర్మం అర్థమయ్యేలోగా ఎఫెక్టేమో అంతః సౌందర్యానికి వచ్చింది . బహుశా " సీతయ్య " సినిమాలో హీరో కూడా ఈ సబ్బే వాడుంటాడు . ( ఈ వాక్యం పైన చెప్పిన లుంగీకి సంబంధించినది . లింకిక్కడెందుకుందంటే నేను బ్లాగులు సరీగా రాయటం కుదరలేదని తెలుగు సినిమా రైటర్ బార్ అనగా మరియూ ఎడిటర్ ని నియమించుకొన్నా . అతను ఇచ్చిన సలహాలు తు . చ . తప్పకుండా పాటిస్తున్నా . అలా పాటించకపోతే టపా ఫ్లాపని హెచ్చరించాడు . ఎడిటింగ్ లేకుండా చెప్పాలంటే ఇంకో మాట కూడా అన్నాడు . " నువ్వీ జన్మకు బాగు పడవు " అని . ముందు మాటకు ఈ మాటకు లింకేంటని అడిగితే తెలుగు ఎడిటర్ ని అవమాన పరుస్తావా ? వెళ్ళి మైసమ్మ ఐ . పి . ఎస్ . సినిమా చూడు లేక పోతే నేనే చూపిస్తా అని బెదిరించాడు . ) క్లోజప్ ఫార్ క్లోజ్ అప్స్ … . ఇక క్లోజప్పు పేస్టు కొస్తే రెండు వారాలు తిరక్కనే క్లోజు అయిపోయేది . మా రూమ్మేట్లు కాలేజీ బిగినింగ్ అప్పుడు వాళ్ళూర్లో సెట్టంగట్లో కొనుక్కొచ్చిన కోల్గేట్ పేస్టు మాత్రం అట్లాగే వుండి ఎండాకాలం లీవుల్లో వాళ్ళూరికి పొయ్యేటప్పుడు తీసుకుని వెళ్ళి పోయేవాళ్ళు . మళ్ళీ కాలేజీ తెరిచినప్పుడు అదే పేస్టు తో వచ్చే వాళ్ళు . ఏమన్నా అడిగితే కొత్త పేస్టు అని చెప్పేవాళ్ళు . అదే పేస్టు కాలేజి చివరి రోజు ఆటోగ్రాఫ్ లో సంతకం పెట్టించుకునే రోజు వరకు వచ్చేది రిలే రన్నింగ్ లో స్టిక్కు లాగా . నా క్లోజప్పు పేస్టు చివరికొచ్చినప్పుడు దాన్ని తీసుకొని రోడ్డు రోలరు డ్రైవరు తో మాట్లాడి ట్యూబులో నుండి వచ్చే దాంట్లో చెరి సగం అని డీల్ మాట్లాడుకొని రోలరు తో ట్యూబు ను తొక్కించి పేస్టు బయటికి లాగే వాళ్ళు . కొత్తగా వచ్చిన రూమ్మేట్లు కూడా సాయంత్ర మైతే చాలు మొహమ్మీద నోరు పెట్టి " హా . . హా " అని " వాసనొస్తుందా " అని కనుక్కొని మరీ బాత్రూం లో దూరి డోర్ గట్టిగా క్లోజ్ చేసి క్లోజప్ సంహారం చేసే వాళ్ళు . వాళ్ళకు పాత రూమ్మేట్లు ఇన్స్పిరేషన్ అని ఆటోగ్రాఫ్ బుక్కులో రాసినప్పుడు కానీ నా గంట మోగ లేదు . జీవితంలో ఒక్క సారన్నా " క్లోజప్ దాతా సుఖీభవ " అని దీవించలేదు కృతఘ్నులు . పియర్స్ సబ్బు రుద్దుకునే వాళ్ళు కాదు అని మాత్రం అర్థం అయింది ఎందుకంటే వాళ్ళు నాలాగా సీతయ్యలు అయిపోలేదు . కొస మెరుపు ఏంటంటే నా రిన్ / డెట్ సబ్బు కూడా వాడే వాళ్ళు కాదు . కారణం జానా రెడ్డి ని అడిగినా తడుము కోకుండా చెప్పేస్తాడు . వాళ్ళు ఉతికిన బట్టలు వేసుకునే వాళ్ళు కాదు . ఐరన్ బాక్సు మాత్రం పాంట్లకు , చొక్కాలకు , బనీన్లకు వాడే వాళ్ళు . వాళ్ళు ఇస్త్రీ చేసిన తరువాత ఐరన్ బాక్సుని విమ్ పౌడర్ తో కడిగి వాడే వాడిని . మళ్ళీ వర్తమానం : చిన్న బుడ్డోడికి పైన మూడు పళ్ళు కింద మూడు పళ్ళు వచ్చాయి . వాడికి కోల్గేట్ పేస్టు చూపించగానే ఆరు పళ్ళూ బయట బెట్టి " పే . . పే . . " అని ముడ్డి ఊపుకుంటూ వచ్చేస్తాడు . ఇంకా క్లోజప్పు పేస్టు అలవాటు చెయ్యలేదు . పేస్టు మాత్రమే నోట్లో పెట్టు అని అరిచేంతలోపే బ్రష్షు మీద పేస్టు పెట్టి వాడి నోట్లోకి తొయ్యబడుతుంది . వాడు అలా బ్రష్షుతో పేస్టు చప్పరించినప్పుడల్లా రవితేజా లాగ కళ్ళద్దాలు పెట్టుకుని కుడి వైపుకి చూస్తూ " గుర్తుకొస్తున్నాయి … గుర్తుకొస్తున్నాయి . . బాత్రూములో ఏ మూలనో పెట్టిన క్లోజప్పేస్టు . . రూమ్మేట్లు బొక్కిన రోజులు గుర్తుకొస్తున్నాయి . . " అని పాడు కుంటూ వుంటా . పెద్దోడేమో పేస్టు నోట్లో పెట్టుకుని " వన్ . . టూ . . త్రీ . . " అని పద్దాకా లెక్క పెట్టుకుని తోముకుం ( తిం ) టాడు . ఆ లెక్కలకర్థం పైకి పది సార్లు , కిందకి పది సార్లు , అడ్డంగా పది సార్లు , నిలువుగా పది సార్లు తోమాలన్నమాట . కాలెజీలో క్లోజప్పయితే ఇప్పుడు కోల్గేటా అని పెళ్ళయిన వాళ్ళను అడక్కూడదు . చంద్ర మోహన్ సినిమాలు బాగా చూడాలంతే .
ఈ రాశివారికి మే నెల 8 వరకు గురుడు సప్తమమున తామ్రమూర్తి తర్వాత అష్టమమున తామ్రమూర్తి . శని నవంబరు 15 వరకు జన్మమున లోహమూర్తి . తర్వాత ద్వితీయమున తామ్రమూర్తి . రాహుకేతులు జూన్ 6 వరకు 4 - 10 రాశులలో తామ్రమూర్తులు . తర్వాత 3 - 9 రాశులలో సువర్ణమూర్తులు . వేధగోచారముచేత గురుడు సంవత్సరం అంతా పాపి . కాని శని మాత్రం సంవత్సరం అంతా శుభుడు . రాహువు జూన్ 6 నుండి శుభుడు , కేతువు అక్టోబర్ 10 వరకు శుభుడు . ఈ స్థితి వేధగోచారములు పరిశీలించగా ఈ రాశివారికి జూన్ నుండి మంచి అభివృద్ధి సాధ్యం అవుతుందనీ , అయినా పట్టుదలతో నిరంతరంగా కష్టించి పనిచేయడం మాత్రం తప్పదనే స్పష్టం అవుతున్నది . ఈ దృష్ట్యా ఆరోగ్యం దెబ్బతినకుండానూ , పరధ్యానం కారణంగా రోడ్డు ప్రమాదాలకు గురికాకుండానూ జాగ్రత్తపడవలసి ఉంటుంది . ఉద్యోగాలలో తోటివారివల్ల ఏవో చిక్కులూ చికాకులు ఎదురవుతూనే ఉంటాయి . కాని వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా మీరు అభివృద్ధిని సాధిస్తూ పెద్దల మెప్పును పొందుతూ ముందుకు సాగగలుగుతారు . వివాహాది శుభకార్య ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి . కొందరికి విదేశీ యాత్రకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి ఏదో కారణాన రద్దు అయిపోవడం జరగవచ్చు .
ఇంకొన్ని బాపట్ల జ్ఞాపకాలు ఇంజనీరింగ్ కాలేజి రాకతో బాపట్లలో ఇళ్ళ మార్కెట్టు మీద తీవ్రమైన వత్తిడి వచ్చింది . పేరుకి మునిసిపాలిటీయే కానీ అదొక గ్లోరిఫైడ్ పల్లెటూరుగా ఉండేది ఆ రోజుల్లో . చాలా కాలంగా ఉన్న ఏజీ కాలేజి , ఆర్ట్సు కాలేజి జనాభా ఇంచుమించు అందరూ అక్కడ ఇళ్ళు కట్టుకుని స్థిరపడిపోయారు . ఇంజనీరింగ్ కాలేజి హాస్టలు ఇంకా నిర్మాణ దశలోనే ఉంది . అంచేత తొంభై శాతం విద్యార్ధులు ఊళ్ళో అద్దెకి ఉంటూండే వాళ్ళు . దాంతో అద్దె ఇళ్ళకి గిరాకీ విపరీతంగా పెరిగిపోయింది . చాలామంది స్టూడెంట్సు ఉండటం ఊరివాళ్ళకి అలవాటై " బ్రహ్మచారులకి అద్దెకివ్వం " అనేవాళ్ళు కాదు గానీ , అసలు ఇళ్ళు ఖాళీగా కనబడేవి కావు . మాకు ఆ పోర్షను దొరకటమే గగనమై పోయింది . మేము ఆ ఇంట్లో ప్రవేశించేప్పటికి అప్పుడే వారం పది రోజులుగా కాలేజి నడుస్తోంది , క్లాసులకి వెళ్ళొస్తున్నాం . ఆ ఇంట్లో వెనకాల దొడ్డిలో ఒక ఉప్పు నీళ్ళ బావి మాత్రం ఉండేది , మంచి నీళ్ళ వసతి లేదు . మరెలాగ అని ఇంటివాళ్ళని అడిగితే తాము పక్క వీధిలో ఉన్న పబ్లిక్ కుళాయి నించి రెండేసి బిందెలు తెచ్చుకుంటామని చెప్పారు . పాపం ఆడవాళ్ళే అక్కణ్ణించి తెచ్చుకుంటుంటే మగ ధీరులం , మనం ఒక కూజాడు నీళ్ళు తెచ్చుకోలేమా అని మాకు మేమే ధైర్యం చెప్పుకున్నాం . ఆ రోజు కూజా కొనుక్కొచ్చుకున్నాం . మర్నాడు పొద్దున్నే లేచి నోట్లో బ్రష్షు పెట్టుకుని , మొదటిసారి నా వంతుగా కూజా పట్టుకుని పక్క వీధి పంపు దగ్గిర కెళ్ళాను . వేషం వేరే చెప్పక్కర్లేదుగా . . లుంగీ , జుబ్బా , భుజాన ఒక తువాలు , కాళ్ళకి హవాయి చెప్పులు . మామూలుగా ఏ పబ్లిక్ కుళాయి దగ్గరైనా కనిపించే సీనే ఈ కుళాయి దగ్గిర కూడా . . అప్పటికే ఒక అరడజను మంది అమ్మలక్కలు కుళాయి చుట్టూ గుంపుగా రణగొణధ్వనులుతో మాట్లాడుకుంటూ , కొండొకచో పోట్లాడుకుంటూ , బిందెల్లో , తప్పేలాల్లో , బక్కెట్లలో నీళ్ళు నింపుకుంటున్నారు . కూజా కింద పెట్టి , బ్రష్షుని నవుల్తూ " కిం కర్తవ్యం " అని ఆలోచనలో పడ్డాను . ఇంతలో ఒక పుణ్యాత్మురాలు నా దుస్థితిని గమనించి , " రండి బాబూ " అని మిగతా స్త్రీలని అదిలించి కుళాయి దగ్గర చోటు చేసింది . మనసులోనే ఆవిడకి దణ్ణం పెట్టుకుని , గబగబా పంపు దగ్గిరే మొహం కడిగేసుకుని , కూజా పంపుకింద పెట్టి అటూ ఇటూ చూస్తూ నిలబడ్డా . సరిగ్గా కుళాయి కి ఎదురుగా వీధికి అవతలి పక్క ఒక పెద్ద రెండంతస్తుల మేడ ఉంది . పై అంతస్తులో ఇంటికి ముందు కొంత జాగా ఓపెన్ టెరేస్ లాగా ఉంది . ఆ జాగాలో పిట్ట గోడ వెంబడి ముగ్గురు కాలేజీ వయసు అమ్మాయిలు నిలబడి దంతధావనం చేస్తున్నారు . నైటీలు వేసుకుని ఉన్నారు . మరీ అలా పొద్దున్నే అమ్మాయిల్ని చూడ్డం మర్యాద కాదు అనుకుంటూనే కొంచెం చూశాను . ఒక డౌటొచ్చింది . . ఇంచుమించు ఒకే వయసున్న ముగ్గురమ్మాయిలు ఒకే ఇంట్లో ఎలా ఉన్నారబ్బా అని . ఇంకాసేపట్లో ఇంకో డౌటొచ్చింది వీళ్ళ మొహాలు ఎక్కడో చూసినట్టున్నాయే అని . ఆ గుర్తొచ్చింది . . వీళ్ళని కాలేజిలో చూశాను . . అంటే . . వీళ్ళు మా కాలేజి విద్యార్ధినులు . ట్యూబులైటు వెలిగింది . ఆ మేడ ఇల్లు కాదు . . మా కాలేజీవారు ఊళ్ళో అద్దెకి తీసుకున్న ఆడపిల్లల హాస్టలు . అంతే , ఒక్క వుదుటున కూజా పట్టుకుని పరుగున ఇంటికొచ్చి పడ్డాను . నా అనుమానాన్ని మా ఇంటి ఓనరు నివృత్తి చేశాడు . . కుళాయి కెదురుగా ఆ మేడ మా కాలేజి ఆడపిల్లల హాస్టలే ! చచ్చాం . ఇప్పుడెలా ? మేమున్న ఇంటెదురుగా ఒక ముచ్చటైన డాబా ఇల్లుంది . వాళ్ళింట్లో మంచినీళ్ళ పంపుందని ఓనరు చెప్పాడు . అడగందే అమ్మైనా పెట్టదు గదా , అడిగి చూద్దాం అనుకుని ఆ సాయంత్రం ఎదురింటికి వెళ్ళి తలుపు తట్టాను . ఇంటాయన ఇంట్లోనే ఉన్నాడు . " మేం మీ ఎదురింట్లో కొత్తగా అద్దెకి దిగాం . మీరు అనుమతిస్తే మీ ఇంట్లో రోజూ ఒక కూజాడు నీళ్ళు పట్టుకుంటాం " అని చాలా మర్యాదగా అడిగాను . ఆయన రౌడీ వెధవని చూసినట్టు నన్నొక డర్టీలుక్కేసి , " లేడీసుంటారండీ . వీలుకాదు " అనేశాడు . హమ్మ ఎదురింటాయనా , మీ ఆడలేడీసుని మేమేం కొరుక్కు తినంలే బాబూ అని మనసులోనే తిట్టుకుని , చేసేదేం లేక పైకొక వెర్రి నవ్వు నవ్వి వెనక్కి వచ్చేశా . నేనూ నా రూమ్మేట్లూ మా వరండాలో సెటిలై , తలా ఒక సిగిరెట్టూ ముట్టించి బుర్రకి పదును పెట్టాము . ఈ మంచి నీళ్ళ సమస్య చాలా క్లిష్ట సమస్య అయి కూర్చుంది . వాళ్ళు మొదట్లో నా ఎడ్వంచర్లు చూసి నవ్వినా , ఆడపిల్లల హాస్టలు ముందున్న పబ్లిక్ కుళాయికి లుంగీలో ( పోనీ పేంటు షర్టులో ఐనా ) వెళ్ళి నీళ్ళు పట్టుకు రావడానికి వాళ్ళకీ ధైర్యం చాల్లేదు . ఇంతలో మా ఓనరు కొడుకు ( నాకు డేవిడ్ బూన్ అని బిరుదిచ్చినవాడే ) తన వానర సైన్యంతో కొబ్బరి మట్ట క్రికెట్ మొదలెట్టాడు . వాళ్ళ ఆట చూస్తుంటే ఐడియా వచ్చింది - నీళ్ళు తేవడానికి ఈ పిల్లగాణ్ణి నియోగిస్తే ! ఇంట్లో చేరి ఒక రోజేగా ఐంది , ఇంకా వాడికి మేం మేస్టర్లమనే భయం ఏర్పడలేదు . అందుకని పిలవంగానే వచ్చాడు . నెలకి పది రూపాయలిస్తే పొద్దున్నే వాడు పబ్లిక్ కుళాయి నించి మాకొక కూజా నీళ్ళు తెచ్చేందుకు ఒప్పందం కుదిరింది . ఆ తరవాత వాడు ఎక్కడ మేం చదువు చెప్పేస్తామో అని మొహం చాటేసినా , పాపం మంచి నీళ్ళు మాత్రం క్రమం తప్పకుండా తెచ్చేవాడు . నెలనెలా డబ్బులకి మాత్రం వాళ్ళమ్మని పంపేవాడు . అలా మాకు ఆ తొమ్మిది పది నెల్లపాటు నీటి సమస్య తీరింది . కొసమెరుపు 1 : నెమ్మది మీద తెలిసిన విషయం , ఎదురింటాయనకి ఇద్దరు పెళ్ళి కావలసిన కూతుళ్ళున్నారు . పాపం ఆయన భయం ఆయనది . కొసమెరుపు 2 : సందుమొగలోనో , పెద్ద బజారులోనో ఎదురింటాయన ఎదురుపడుతూనే ఉండేవాడు గానీ ఎప్పుడూ పలకరించిన పాపాన పోలేదు . మాకు మాత్రం ఏం తక్కువని మేమూ ఎప్పుడూ మాట్లాడలేదు . ఇలా ఉండగా కొన్ని నెలలు గడిచాక మా డిపార్టుమెంటు మేస్టారొకాయనకి పెళ్ళైంది బాపట్లలోనే . మేం కూడా వెళ్ళాం . అక్కడ ఎదురింటాయన ఆడపెళ్ళివారి తరపున మర్యాదలు చేస్తూ కనబడ్డాడు . మాతో ఉన్న సీనియర్ మేస్టర్లు మమ్మల్ని పరిచయం చేశారు . అప్పుడర్ధమైంది ఆయనకి మేం స్టూడెంట్లము కాదూ , లెక్చరర్లమని . పెళ్ళినించి వచ్చేస్తూంటే చెప్పాడాయన . . కావలసినప్పుడు వాళ్ళింట్లో మంచి నీళ్ళు పట్టుకోవచ్చనీ .
అంటే , అలాంటి ప్రచురణలు చెయ్య వద్దు అనికాదు , కానీ ప్రచురించేటప్పుడు కొంచం ధైర్యాన్ని కూడ దీసుకుని ప్రచురించండి . అందరూ ఒకేలాగా ఉండరు అలాగే ఒకె లాగా ఆలోచించరు , అందుకని మన మనః శాంతిని కొల్లగొట్టే వారు చేసే సకల ప్రయత్నాలను గంగ పాలు చేసేయ్యండి . అంతే కానీ మీ ప్రపంచాన్ని దూరం చేసుకోకండి .
మద్యపానీయాలూ , కాఫీ , టీ , సాఫ్టుడ్రింకులు , చాకొలెట్ , వగైరావి శరీరపోషణకవసరంకాని ఆహారవస్తువులు . వీటి తయారీకని ద్రాక్ష , కాఫీ , టీ , చాకొలెట్ తోటలు పెంచడానికి ఎంతోభూమిని మనం ప్రకృతినుంచి ఆక్రమించుకున్నాం . ఈ వస్తువుల వాడకం పెరిగేకొద్దీ ఇంకా ఎక్కువ భూమి మానవాక్రమణక్రిందకు వస్తుంది . ఇలాంటి పదార్ధాల వాడకం తగ్గించుకోవడం ప్రకృతిరక్షణకు సహాయం అవుతుంది .
జులై 3 , 2010 రాసినది సనారాజు | విచిత్ర చిత్రాలు | అభిప్రాయములు
3 . సుజాత : ( గడ్డిపూలు ) వీరి బ్లాగులోఉన్న విషయవైవిధ్యం నన్నాకట్టుకుంది . ఒక persobalsed శైలి వీరి సొంతం . ఎంత సీరియస్ acedemic / science విషయం రాసినా , అది వారు రాసినట్టే ఉండటం ఆ బ్లాగు అందం .
హిందూధర్మంలో దేవాలయాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది . అసలు ఈ దేవాలయమంటె ఏమిటి ? ఈ దేవలయాలు ఎందుకు ? అన్న ప్రశ్నలు తలెత్తినప్పుడు , ' దేవానాం దేవస్య వా ఆలయా అని సమధానమిచ్చారు మన ఋషిపుంగవులు . దేవాలయం ప్రార్థన కోసం , పూజ కోసం , దేవతావిగ్రహాలను , ఇతర ఆరాధ్య వస్తువులను ప్రతిష్టించి , వాటి రక్షణకోసం కట్టించిన కట్టడమే దేవాలయమని అన్నారు . అందుకే మనవాళ్ళూ దేవలయాన్ని సప్తసంతానాలలో ఒకటిగా పేర్కొన్నారు . కొడుకు లేక కూతురు , తటాకం , కావ్యం , విధానం , ఆలయం , వనం , భూదేవస్థాపనం అనేవి సప్తసంతానాలుగా చెప్పబడ్డాయి . దేవాలయన్ని దేవగృహం , దేవగార , దేవాయతనం , దేవకులం , మందిరం , భవనం , స్థానం , దేవస్థానం , వెష్మం , కీర్తనం , హర్మ్యం , విహారం అని , విమానం , ప్రాసాదం అని పిలవడం జరుగుతోంది .
తర్వత వెబ్సైట్లోకి ప్రవేశించి రిజిస్టర్ చేసుకోవాలి . అది సాధరణంగా ఒక సెక్యూరిటీ మెయిల్ ఐడి ని అడుగుతుంది . అందుకు మీకున్న ఏదో ఒక మెయిల్ ఐడిని అక్కడ టైప్ చెయ్యాలి . ఉదాహరణకి ఫ్లిక్కర్ కి యాహూ అకౌంట్ తో యాక్సెస్ చెయ్యవచ్చు .
రోహిణీప్రసాద్ గారేమంటారో నాకు తెలీదుగానండీ . . అదేంటోగానీ , " కవి " అన్న పదం లోని ఆకర్షణ అలాంటిదనుకుంటాను . . చాలామందికి తాము " కవులం కాబోలు " అనే భ్రమ ఒకటి వుంటుంది . తీరా పేరు వచ్చేసరికి దాన్ని నిజమే అని వాళ్ళు నమ్మడం మొదలు పెడతారు . పేరు వల్ల వచ్చే అతిశయం ఒకటి వుంటుంది పైగా . అందువల్ల వాళ్ళకి వాస్తవాన్ని చెప్పే వాళ్ళు ఎవరూ వుండరు చాలసార్లు . మన బాలమురళి గారి " వాగ్గేయకారితనం " కూడ అలాంటిదే . ఆయన వాగ్గేయకారుడు అని అనుకుంటున్నాడు . నమ్ముతున్నాడు . ఏంచెయ్యగలం .
కంకులు ముదిరినయి . బుక్కే తట్టయినయి . భయానికి రాత్రి పగలు కావలి కాస్తున్నారు భార్యాభర్తలు . రాత్రిపూట ఒకనాడు ఒడ్డుమీది నుంచి జారిపడ్డడు ధర్మయ్య . దవాఖాండ్లకు పైసలు గావాలె . అడుగకముందే అప్పు ఇచ్చాడు సేటు . దెబ్బ చిన్నదే కాబట్టి రెండు మూడు రోజుల్లోనే కోలుకున్నాడు .
సా : ఇక నీకు దేవాలయాలుండవు . పూజలూ పునస్కారాలూ ఉండవు . ఇక మిమ్మల్ని తలచేవారే ఉండరు .
మనిషి జీవిస్తూనే ఉన్నాడు . కాని , ఎలా ! ! ! తన జీవితం సుఖమయం చేసే సాధనాలు శోధిస్తూ . . . ఈ పరిశోదన నాటికీ , నేటికీ కొనసాగుతూనేఉంది . శాంతియుతంగా , సులభంగా , నిశ్చింతగా జీవించటానికి మార్గాలు , ఆ నాటి రాతియుగం మానవుడు . . . నేటి అణుయుగం మానవుడూ వెదుకుతూనే ఉన్నారు . కృత్రిమంగా ఎన్నెన్నో సాధనాలు కనిపెడుతూనే ఉన్నాడు . కాని దేనికి ! ! ! కేవలం నాలుగ్గోడల మధ్య బందీ కాకుండా ఎగిరిపోవాలనే . ఎన్నో కొత్త విషయాలు శోధించాలన్న ఉత్సాహమే , మానవుడ్ని చంద్రమండలం వరకూ తీసుకెళ్ళింది . అచిరకాలంలోనే ఈ మానవుడి తెలివి తేటలు , ఇంకా . . . ఇంకా . . విస్తరిస్తున్న విశ్వంతోపాటు దూసుకెల్తూనే ఉన్నాయి . ఇంత ప్రగతి సాధిస్తున్న , అదే మానవుడు . . . తన అహంకారంతో అధ : పాతాళానికి పడిపోతున్న సంగతి మాత్రం తెలుసుకోలేక పోతున్నాడు . అంతులేని ఈ బ్రహ్మాండ భాండంలో పరమాణు తుల్యుడైన మానవుడెక్కడ ? అతనికీ అహంకారమెందుకు ? సహజత్వాన్ని కృత్రిమంతో కలిపి నాశనం చేస్తున్నాడు . అన్నీ కృత్రిమాలే . . . ప్రేమా , అభిమానం , అనురాగం అన్నీ మేడిపండుపై మెరుగులే . గులాబీ కెంపుల అందాన్ని చూసి ఆనందించి అందుకోబోతే , చేతికి పెంకుల గులాబీ తగులుతుంది గట్టిగా . అప్పుడు కానీ అది కృత్రిమ గులాబీ అని తెలియటంలేదు . మన ఆనందం అంతా కేవలం దూరంగా ఉన్నంతవరకే . . . . సంఘీభావమే లేకపోతే మానవునికి ఆకాశంలోకి ఎగరటం సాధ్యమా ? అతని తెలివి పెరిగి తారాపధాన్ని అందుకొనేదా ? కానీ వ్యక్తిగతమైన విషయాల్లో మాత్రం , ఒకరితోఒకరు ఏకీభవించలేకపోతున్నారు . తన సంతోషం , సుఖం , అభివృద్ధి కోసం మరొకరి వినాశనానికి ఎన్నో కుతంత్రాలు ఉపయోగిస్తున్నాడు . ప్రస్తుతం ఇటువంటి అహంకారమే మనుషుల్లో ఎక్కువగా పాతుకుపోయి కనిపిస్తోంది . విజ్ఞాన శాస్త్ర పథంలో ఇతరులకు తోడ్పడి , సహకరించే మానవుని నైజం స్వవిషయాల్లో స్వార్ధపరత్వంతో నిండిపోతోంది . ఈ అహంకారం పోయిననాడే మానవుడు సంపూర్ణత్వాన్ని సాధించాడనిపిస్తుంది . పురాణకాలంలో దేవదానవుల జాతిభేదమే వారిలో యుద్ధాలను ప్రేరేపించింది . ఆ కాలంలో జన్మత : శతృవులుగా ఉండి ఒకరినుంచి ఒకరు రక్షించుకోటానికి యుద్ధాలు చేసేవారు . చివరికి ఈ నాటికి మిగిలింది మాత్రం మనుషులే ! ! ! ఇప్పుడు కేవలం ఒక్కరే అవటం మూలంగా ఎవరితో పోట్లాడాలి ! తమ శక్తి సామర్ధ్యాలు ఎవరిమీద చూపించాలి ? ఎవరిని జయించాలి ? అన్నది అర్ధం కావటంలేదు . అందుకని మానవులే మానవులపై తమతమ ప్రభావాలు చూపించుకోవాలని , ఒక ప్రాంతపు ప్రజలు ఇంకోప్రాంతపు ప్రజలని లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు . ఏ దేశ చరిత్ర పుటలు తిరగేసినా తేటతెల్లమయ్యేది ఈ విషయమే . . . వీరు మన పూర్వీకులు , ప్రత్యక్షంగా నీవు నా ఆధీనంలో ఉండాలి , లేకపోతే నా శతృవైన నీకు నాకు ఫలానా సమయంలో , ఫలానా చోట యుద్ధం జరుగుతుంది , అని ప్రకటించుకొని , ముఖాముఖి పోరాడుకొని , బలాబలాలు తేల్చుకునే వారు . ఒక విధంగా ఆ పద్ధతే నయమేమో ! ! ! కాని , ఈ నవీన కాలంలో . . . అణుయుగంలో , మానవుడు విశ్వంలోకి ఎగిరెగిరి పోతున్న ఈ సమయంలో , తన శతృవులెవరు . . అన్నది ఒక సమస్యగా పీడిస్తోంది . మిత్రులలాగా సంచరిస్తూ వెన్నుపోటు పొడిచే వారొకరైతే . . . వీరు మన హితైషులు కారు అని తెలుసుకునే లోపలే భష్మం చేసేసే వారొకరు . అధికారం అనే ముల్లుకర్రతో పొడిచే వారొకరైతే , ఆశలు కల్పించి రంగుల వలలోకి రప్పించి ఉచ్చులు బిగించేవారొకరు . పైకి మటుకు అందరూ పెద్ద మనుషులే , సంస్కారవంతులే ! ! ! ! ఇటువంటి వారిని గుర్తుపట్టటమే కష్టమైతే , ఇంక వీరికి దూరంగా మసలటం అన్నది ఎలా సాధ్యం ? పదవి . . . అనే తన గొడుగును చేతిలో ఉంచుకొని , తన వారిని మాత్రమే ఆ నీడలో ఉంచి , పరులకు నీడలేకుండా చేయటమే తమ ధ్యేయంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు . అందరూ అలాంటి వారేకాకపోయినా , కొందరైనా ఉన్నారు . చెదపురుగులు ఎన్ని ఉంటాయి . అవి ఎంత హాని కలుగచేస్తాయి ? వాటిని గుర్తుపట్టటం అందరికీ సాధ్యమా ? ఎవరికో . . . ఎక్కడో తప్ప సామాన్యంగా ఇలాంటివి కనిపించవు . ఇలాంటి పెద్దమనుష్యులను ఎలా గుర్తుపట్టాలి . ఒకవేళ గుర్తుపట్టినా . . . మనమేం చేయగలం ? అటువంటి ప్రయత్నాల్లో మాడిపోవటమేనా చివరికి దక్కే ఫలితం ? ఈ ఆధునిక మానవుడు నాగరికత అనే వలువలను అధిక సంఖ్యలో ధరించాడు . విజ్ఞాన శాస్త్ర వినువీధిలో విహరిస్తున్నాడు . దశావతారాల్లో అయినా , " Organic evolution " చూపగల మేధా సంపన్నుడు . మరి నైతికంగా , సాంఘీకంగా సాధించిన ప్రగతి ఎంత ? ఇప్పటి వరకు సాధించాను అనుకొన్న ప్రగతి ఎండమావేనా ? తాను జీవితపుటెడారిలో , ఒయాసిస్ వైపుకు పురోగమించాననుకొన్న సమయంలో . . . అది కేవలం ఎండమావేనా ? ఆ ఎండమావి చాటున దాక్కున్న అమానుషత్వమనే ఈ భయంకర ఎడారిని చూడగలితే . . . . ఇప్పుడు కూడా బ్రహ్మదేవుడు , మానవులకు " శతృవు " ని సృష్టించి వీరే నీ శతృవు అని చూపించేసి ఉంటే బాగుండేదేమో ! ! ! " కవిని మాత్రం సూర్యునితో ఖచ్చితంగా పోల్చవచ్చు ఏడువన్నెలు జీర్ణించుకొని ఏకవర్ణం చిమ్ముతాడు " " ప్రమిదలో మినుకు మినుకు మనే తైల దీపం అంటుంది , నా చేతనైనంత సాయపడతాను ప్రభూ " ! ! ! అని - - - - ఠాగూర్ . * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
మాట్లాడుతు బాలి ఒక జోకు చెప్పేరు . గురువు దగ్గిర విద్యను పూర్తి చేసుకున్న ఒక శిష్యుడు ఇరవై స౦వత్సరాలు తపస్సు చేసి నీటి మీద నడవడ౦ నేర్చుకున్నడుట . గురువు దగ్గిరకొచ్చి గురువర్యా నేను తపశ్శక్తితొ నీటి మీదన డవడ౦ నేర్చుకున్నాను . ఈ నది ఆవలి వడ్డు కి ఇప్పుడు నేను సులువుగా వెళ్లిపోగలను అని చెప్పాడుట . దానికి గురువు ఓరి నీ మొహ౦ మ౦డా ! ఇదు నిమిషాలలొ పడవలో వెళ్లిపోయే పనికి ఇరవై స౦వత్సరాలు వృధా ఛేసావుకదా అని తిట్టి ప౦పి౦చాడుట . చేసినపనికి , నేర్చుకున్న కళకి సార్ధక౦ ఉ౦డాలి . పలువురు మెచ్చాలి అన్నది నా ఉద్దేశ్య౦ అన్నారు బాలి . బాలి బొమ్మలు తెలుగు సా౦ప్రదాయాన్ని పల్లె వాతావరణాన్నిచక్కగా ప్రతిబి౦బిస్తాయి . ఆయన పెరిగిన వాతావరణ౦ కూడా అలాటిదే . " మా అమ్మ పేరు అన్నపూర్ణ , నాన్న పేరు లక్శణరావు . అమ్మ చక్కగా పాడేది . రాత్రిపూట ఆ౦జనేయ ద౦డక౦ మొత్త౦ చదివి ఇక పడుకో౦డి . తెల్లవార్లూ ఆ౦జనేయుడు మన చుట్టూ తిరుగుతూ మనకి కాపలా ఉ౦టాడు , దెయ్య౦వచ్చినా దొ౦గోడు వచ్చినా చ౦పేస్తాడు అని అనేది . మే౦ ప్రొద్దుట లేస్తూనే రాత్రి ఆ౦జనేయుడు వచ్చడా అని ఆడిగేవాళ్ల౦ . ఈ రాత్రి మీకు చూపిస్తాలే అని అమ్మ అనేది . అవి రె౦డొ ప్రప౦చ యుద్ద౦ చివరి రోజులు . మా నాన్న మిలటరీ లోనే కదా ఉద్యోగ౦ . మా అమ్మ , మాకు ధైర్య౦ చెపుతూ తాను ధైర్య౦ పొ౦దేది . మా నాన్న ను౦డి ఉత్తరాలు వచ్చేవి . ఇటలీ , సి౦గపూర్ ల ను౦డి వచ్చేవి . కొన్నాళ్లకు మా నాన్నగారు ఊటీ లోని వెల్లి౦గ్టన్ తీసుకువెళ్లి పోయారు . అక్కడ మరో స౦త్సరానికి మా నన్నగారు చనిపోయారు . మళ్లీ మేము అనకాపల్లిలోని మా మామయ్య ఇ౦టికి వచ్చేసాము . మా అమ్మ దుఖ్ఖ్హ౦తో మా నాన్నకుస౦భ౦ధి౦చిన మిలిటరీ పెట్టెలని ఒక పన్నె౦డేళ్లపాటు తెరవలేదు . దానిలొ మిలటరీ ఉన్ని బట్టలు , ఫొటోలు కాగితాలు పెన్నుఉన్నాయి . ఇవి కాక అరలో చైనా రన్గు కేకు , బ్రష్ లు ఉన్నాయి . ఇ౦కా ఒక పైయిటి౦గు ఉన్నాయి . దానిలోచెట్లూ , కొ౦డలూ , అడవులూ , సన్నని బాటలో సైకిలు తొక్కుతున్న వ్యక్తి ఉన్నాయి . ఇవన్నీ నాలోపరోక్ష౦గా బీజాలు నాటాయి . ఇ౦తలో ప్రభుత్వ ఉద్యోగ౦ వచ్చి౦ది . జీవన బృతికి తప్పదుకదా ! ఉద్యోగ౦ చేస్తూ౦డగానే ఆ౦ధ్రజ్యోతి విజయవాడ ను౦డీ పిలుపు వచ్చి౦ది . శ౦కర్రావు పేరు బాలి గా మారడ౦మిగిలి౦ది మీకు తెలిసి౦దే . బొమ్మలు వేయడ౦లో నాకు పరిపూర్ణమైన ఆన౦ద౦ విజయ౦ లభి౦చాయి .
చీన ధర్మశాస్త్రాల్లో ఎనిమిది రకాల వివాహాల గుఱించి చెప్పారు . బ్రాహ్మం , దైవం , ఆర్షం , ప్రాజాపత్యం , గాంధర్వం , ఆసురం , రాక్షసం , పైశాచికం అని ! వీటిల్లో బ్రాహ్మానికీ , దైవానికీ , ప్రాజాపత్యానికీ మధ్య పెద్దగా తేడా లేదు . మామగారు వరుణ్ణి రప్పించి మంచిమాటలు చెప్పి కన్యాదానం చేయడం అన్నమాట . ఒక గోమిథునాన్ని గానీ , రెండు ఎద్దుల్ని గానీ అల్లుడి దగ్గఱ పుచ్చుకుని పిల్లనిచ్చి పెళ్ళిచేయడం మటుకు ఆర్షం . " ఇవి యజ్ఞయాగాదుల కోసం " అన్నారు గనక దీన్ని ఓలి ( కన్యాశుల్కం ) అనడానికి లేదు . పిల్ల తరఫువారికి అడిగినంత డబ్బిచ్చి పెళ్ళి చేసుకోవడం ఆసురం . ఇది కన్యాశుల్కం కిందికొస్తుంది . పెద్దల సమ్మతి లేకుండా వధూవరులు ఒకఱినొకఱు ఇష్టపడి , పెళ్ళికి ముందే సంబంధం ఏర్పఱచుకొని , ఆ తరువాత కన్యాదాత , మంత్రాలూ , పురోహితుడూ మొదలైనవేమీ లేకుండా పెళ్ళి చేసేసుకొని భార్యాభర్తలం అయ్యామనుకోవడం గాంధర్వం . ఈ కాలపు లివిన్ సంబంధాల్నీ , ఇంకా కొన్నిరకాల ప్రేమపెళ్ళిళ్ళనీ గాంధర్వం అనుకోవచ్చు , అమ్మాయికీ , ఆమె తరఫువారికీ ఇష్టమున్నా లేకపోయినా వారిని కొట్టి , చంపి , ఆమెని బలవంతంగా ఎత్తుకొచ్చి చేసుకోవడం రాక్షసం . అమ్మాయి మత్తులో ఉన్నప్పుడు గానీ , నిద్రపోతున్నప్పుడు గానీ ఆమెను చెఱిచి , పెళ్ళి చేసుకోవడం పైశాచికం .
తొందరగా ఇంటికి చేరుకోవాలని ఎవరికైనా ఉంటుంది . ఆ ఆకర్షణ వెనక ఆరాటం గృహోన్ముఖం . బహుశా నైట్‌డ్యూటీ మీద వచ్చిన మొదటి తెలుగు కవిత నైట్‌అవుట్ . అలాగే విమానయానం మీద ఉడాన్ కూడా . బాధ , ఒంటరితనం , ఉద్వేగాలు , వయస్సు , జన్మ వత్తాంతం , వ్యక్తిగతమే కావచ్చు . వాటిని అందరివిగా చేయటంలో రవిశంకర్ ప్రఙ్ఞ అడుగడుగునా కనిపిస్తుంది .
పౌష్టికాహారలోపాన్ని మార్కెట్లు తీవ్రతరం చేస్తున్నాయి . ఆహారాన్ని రసాయినీకరణ చేయడం , ఆహారం , పోషకవిలువల భద్రతకు బయోటెక్నాలజీని వినియోగించడం వంటివి వివాదాస్పద అంశాలు . ఐఎన్‌జిఓ ప్రతిపాదించిన పథకాన్ని భారతదేశం పరిశీలించాల్సిన అవసరం లేదు .
తేటగీతి . ఆరుమాసమ్ము లౌ నుత్త రాయణమ్ము , శుక్ల పక్ష మగ్నిర్జ్యోతి చొప్పుగనుచు , మరణ మొందిన జ్ఞానులు తిరిగిరారు , బ్రహ్మ కల్పాంతమున బ్రహ్మ భావమంది . ౨౧
స్కాట్లాండు లోని గ్లాస్కో విశ్వవిద్యాలయం ఆచార్యులు సైమన్ చార్స్లీ , ఆంధ్రప్రదేశ్ లో దళితుల గురించి చేస్తున్న ప్రస్తుత పరిశోధనలో సాహిత్య విషయలకు సంబంధించి దార్ల వెంకటేశ్వరరావు సహకరిస్తున్నారు .
తరువాత ఓ మ్యాంగో జ్యాస్ , ప్లమ్ కేక్ , టైగర్ బిస్కట్ చిన్న ప్యాకెట్ ఇచ్చారు .
ఆదిలాబాద్ : రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 27నుంచి నవంబర్ 1 వరకు జిల్లాలో నిరసన , విద్రోహ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా జేఏసీ నిర్ణయించింది . ఈ మేరకు స్థానిక టీఎన్‌జీవో భవనంలో చైర్మన్ మామిడి నారాయణ అధ్యక్షతన జిల్లా జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించారు . తెలంగాణ విద్రోహదిన సందర్భంగా వారం రోజుల పాటు జరిగే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సమావేశం నిర్ణయించింది . ఈ మేరకు సమావేశం పలు తీర్మానాలను సైతం ఆమోదించింది . జేఏసీలోనూతన సంఘాలు [ . . . ]
ఐదు రోజులు గడిచాక రాజమ్మ ఇంట్లో జొరబడి ఎవరో ఆమెను చావ చితక కొట్టారు పోలీసులకు కంప్లైంట్ చేద్దామని అనుకుంది గానీ భయపడి పోయింది ఇదంతా నర్సిగాడే చేయించాడని రాజమ్మ కు అనుమానం కానీ ఏమి చేయలేని పరిస్తితి కాళ్ళు రెండు విరగ్గొట్టారు , తలపై పెద్ద గాయమైంది . ఈ పరిస్తితుల్లో మళ్లీ నర్సిగాడినే పిలిపించింది ఏమి తెలియనట్టే నర్సి గాడు మళ్లీ రాజమ్మ ను కలిసాడు రాజమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకొంది , నర్సి గాడు ఆమెను వోదార్చాడు " నువ్ రెస్ట్ తీసుకో నేను చూసుకుంటా " అన్నాడు అప్పటినుంచి వ్యాపారం మొత్తం తనే చూసే వాడు కంపనీలో అమ్మాయిలు పాత బడి పోవటం తో కొత్త అమ్మాయిల కోసం వేట మొదలు పెట్టాడు పద్దెనిమిది లోపు అమ్మాయిలయితే కస్టమర్లు ఎక్కువగా వచ్చేవాళ్ళు తన దగ్గర వున్ననలుగురు అమ్మాయిలు పాతిక దాటినవారే నలుగురిని పిలిచి తలా ఐదు వందలు ఇచ్చాడు కంపెనీ కి ఎలాంటి వాళ్ళు కావాలో వివరించాడు " మోస పుచ్చో , మభ్య పెట్టో , ఉద్యోగం చూపుతామని చెప్పో , పెళ్లి చేస్తామని చెప్పో , సినిమాల్లో వేషాలు ఇప్పిస్తామని చెప్పో అమ్మాయిలను కంపెనీకి చేర్చాలి ఇవాల్టి నుంచి ఆ పనిలో వుండండి , మంచి గుంటలను తెస్తే మరిన్ని డబ్బులిస్తా " అన్నాడు అందరు వెళ్లి పోయారు " కుర్రపిల్లలు అయితే డబ్బులే డబ్బులు " రాజమ్మకు తన ప్లాన్ ఏమిటో చెప్పాడు రాజమ్మ మురిసిపోయింది , ప్రేమతో నర్సిగాడిని దగ్గరకు లాక్కుంది . దాడిలో తగిలిన గాయాల నుంచి రాజమ్మ కొంచెం కోలుకుంది రాజమ్మ వయసు నలభై పైనే వుంటుంది వయసులో వుండగా పెద్ద ఎత్తున వ్యాపారం చేసింది ముప్పయి దాటాక పెళ్లి ఆలోచన కల్గింది కానీ ఎవరు ముందుకు రాలేదు కొన్నాళ్ళు తానంటే ఇష్టపడే మరిది తోనే సంబంధం పెట్టుకుంది ఆ విషయం తెల్సి చెల్లెలు గొడవకు దిగింది ఆ తర్వాత ఒక కాలేజి స్టూడెంట్ ని దగ్గరకు తీసింది వాడు కొన్నాళ్ళు ఉండి రాజమ్మ దగ్గర డబ్బు కొట్టేసి పారిపోయాడు ఆ పిదప వచ్చిన వాడే నర్సి గాడు చిన్నతనం నుంచి కష్టాలు , ఆతర్వాత వృత్తి లోకి దిగి డబ్బు యావే జీవితం గా గడిపింది ప్రేమకు నోచుకోని మనిషిగా మిగిలింది ఇప్పుడు డబ్బుకి కొదవ లేదు కానీ ప్రేమే కరవు అప్యాయం గా పలకరించే వాళ్ళేలేరు బంధువులున్నారు గానీ డబ్బు కోసమే వస్తారు రాజమ్మ బలహీనతలను బాగా గ్రహించాడు నర్సిగాడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాడు అంతే రాజమ్మ బుట్టలో పడిపోయింది రాజమ్మ కు తెలియకుండా అక్కడ వున్న అమ్మాయిలను వాడుకుండేవాడు ఇటు రాజమ్మ తోను సంబంధాలు కొనసాగించాడు ముంతాజ్ ని చేసుకున్నాక ఇద్దరికీ కొంచెం చెడింది వయసులో తనకంటే పదేళ్ళు చిన్నోడు అయిన నర్సిగాడు పూర్తిగా తనతోనే వుండాలని రాజమ్మ కోరిక
ఐదులో మా ప్రైవేటు పంతులు గారు - లక్ష్మీనారాయణ గారు - కూడా ఇలా చెంపదెబ్బలు వేయించేవారు . చెంపదెబ్బ కొట్టాల్సినపుడు ఓ పద్య భాగం చదివేవారు . . " భట్రాజును ఇట్రమ్మని నిట్రాదికి నిలువదీసి కొట్రా ఒక చెంపదెబ్బ శిరీషుకుమారా " అని చదివేవారు . పద్యంలో ఎవరి పేరు వచ్చిందో వాడి చేత మిగతావాళ్ళకు చెంప వాయింపు కార్యక్రమం ఉండేది .
నపుపు మరియు తెలుపు దుస్తులు ధరించిన జపనీస్ పెళ్లి కూతురు మరియు పెళ్లి కొడుకు .
డిసెంబర్ తొమ్మిదో తేదీనాటి ప్రకటన గురించి ప్రస్తావించేవారు , డిసెంబరు ఇరవైమూడో తేదీనాటి ప్రకటన గురించి కూడా గుర్తుంచుకోవాలని ఆయన అంటున్నారు . తెలంగాణ ఇవ్వడానికి ఈ మాటలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయని అర్థం అవుతుంది . అలాగే కేంద్ర మంత్రి , పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ అజాద్ పదిహేను రోజుల క్రితం తెలంగాణ అంత తేలికకాదని చెప్పారు . అలాగే హైదరాబాద్‌లో తెలంగాణ నేతలంతా కూర్చుని రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ప్రకటించిన తర్వాత కూడా హైదరాబాద్‌లోనే ఉన్న గులాం నబీ అజాద్ మళ్లీ తెలంగాణపై అదంత తేలికకాదని చెప్పారు . ఇది తెలంగాణ నేతలకు కోపం తెప్పించింది . దాంతోనే జానారెడ్డి ఇంటివద్దకు కెసిఆర్ వచ్చి నాలుగు గంటలు చర్చలు జరిపినప్పుడు ఈ అంశాలన్నీ ప్రస్తావనకు వచ్చాయి . చివరికి టిఆర్‌ఎస్‌ను విలీనం చేయడానికి ఒప్పుకుంటారా అని కెసిఆర్‌ను అడిగి జానారెడ్డి ఒప్పించారు . అయితే అధిష్టానం కెసిఆర్‌ను నమ్మజాలమని చెప్పారట . ఆ తర్వాత రాజీనామాలు పూర్తి చేసుకుని తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధులు ఢిల్లీ చర్చలకు వెళ్లారు . అక్కడ అసలు విషయం అర్థం అవడానికి వీరికి ఎంతో సమయం పట్టలేదు . గులాం నబీ అజాద్‌తో చర్చలలో ఏకంగా రాజీనామాలు ఆమోదించడానికి అభ్యంతరం లేదని , టిఆర్‌ఎస్ మద్దతుతో గెలవాలని మీరు భావిస్తున్నారా అని , అలా చేయదలచుకుంటే అది మీ ఇష్టం అని కూడా గులాం నబీ అజాద్ స్పష్టం చేయడం కాంగ్రెస్ నేతలకు ఇబ్బంది కలిగించింది .
ఇంక , పరుపులూ , దిళ్లూ నించి , ఎఫ్ ఎం సీ జీ లవరకూ , ఎలెక్ట్రానిక్ వుత్పత్తులవరకూ అన్నీ యెంతెంత పెద్ద ప్లాస్టిక్ కవర్లలో అమ్మబడుతున్నాయో అందరికీ తెలుసు ! ప్రతీ బడ్డీ కొట్టులోనూ దండలు , దండలుగా వ్రేళ్లాడే వక్కపొడి , గుట్కా ( ఈమధ్య సుప్రీం కోర్టు వీటిమీద కళ్లెర్రజేసింది ! ) షాంపూ , కేశతైలం , లేస్ , బింగో , హల్దీరామ్‌స్ , ఇంకా స్థానిక వుత్పత్తులు - - పచ్చళ్లూ , అప్పడాలూ , జంతికలూ , చెగోడీలూ , పప్పుచెక్కలూ - - లాంటివాటిగురించి చెప్పనఖ్ఖరలేదు .
కళారంగానికీ , రాజకీయానికీ , సివిల్ సర్వీసెస్ దొరబాబులకి పూర్తిగా సంబంధాలు తెగిపోయిన రోజున తప్ప వీటి వైపు తలకాయ ఉన్న కళారాధకుడెవరూ వెళ్లకూడదు అనుకున్నాను . పరేడ్ గ్రవుండ్స్ ప్రక్కన ఒక కోతులను అడించే కుర్రాడు ఖంజీరా పట్టుకుని పాడుతున్నాడు . వాడు వేస్తున్న దరువుకి పట్టుకున తలనొప్పి కాస్తా వెళ్లిపోయింది . ' గరీబ్ క యె ఖేల్ హై , గరీబ్ కె సాథ్ హీ ఖేల్ హై . రంగ్ బినా ఎక్ హోలీ హై , నౌరంగోంకీ ఝోలీ హై , భూఖ్ కి దునియా … ప్యాస్ కి దునియా … భూఖ్ కి దునియా , ప్యాస్ కి దునియా , భూఖ్ అవుర్ ప్యాస్ క మేల్ హై భాయి … గరీబ్ క యే ఖేల్ హై … '
మొదటిది MyBlogLog . ఇది ఇప్పుడు Yahoo acquire చేసేసిందనుకోండి . ఇది బ్లాగులకోసం ఉద్దేశించినది . దీనిని ఉపయొగించడానికి ఆ వెబ్ సైట్ లో ఒక account సృష్టించి , మన వెబ్ సైట్ లో చిన్న code snippet పెడితే చాలు . ఇక అది మన బ్లాగులకు సంబంధించి ఎన్నో వివరాలు సేకరిస్తుంది . ఎలాంటివంటే మన బ్లాగుకి ఎక్కడ నుంచి visitors వస్తున్నారు ( ఉదాహరణకి కూడలి , తేనెగూడు , తెలుగుబ్లాగర్స్ మొదలయిన aggregators లాంటివన్నమాట . ) , వారు ఏ links మీద click చేస్తున్నారు . ఏ పోస్టులు అంటే ఆసక్తిగా చదువుతున్నారు , ఏ టాగ్స్ అంటే ఇష్టం లాంటివి అన్నమాట . అదే కాక మన బ్లాగు నుంచి ఎక్కడ కి వెళుతున్నారు లాంటివన్నమాట ( outgoing links ) . కాకపోతే ఉచితంగా ఇచ్చే సర్వీసులో వీటి మీద restrictions ఉన్నాయి . మొదటి పది రిజల్ట్స్ మాత్రమే మనకు చూపిస్తాయి వంటివి .
భళా పెద్దాయన మీ సర్వే బాగుంది . మీలాంటి వారు ఆత్మహత్యలు చేసుకున్న వారి వివరాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతాల వారిగా అభివృద్ధిని కూడా సేకరించి జతపరిచి ఉంటే ( కాకి లెక్కలు కాక స్వేతపత్రంలా ) అప్పుడు తెలంగాణా ఆవశ్యకత గురించి ఆలోచించేవారు ఇలాంటి ఆత్మహత్యలు ఇక ఉండవు . ఇక్కడ నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నా , తెలంగాణ వాదం ఎంత వరకు సమంజసం ? అభివృధి లో వెనకబాటు తనం అంటూ అభివృద్ధి కొరకు పోరాటం అంటున్నారు . సీమంధ్రులు తెలంగాణను దోచుకుంటున్నారు అంటున్నారు . మరి సామాన్య ప్రజలు దోచుకుంటున్నారు అనటంలో ఎంత నిజం వున్నది ప్రతి ప్రసంగం లో సీమంధ్రులు మా నీరు మా మన్ను దోచుకుంటున్నారు అంటున్నారు . ఏనాడు మీరు అభివృద్ధి కొరకే పోరాడలేదు విభజన కొరకు మాత్రమే పోరాడుతున్నారు . అభివృద్ధి కీలక పాత్రగా అందించిన ప్రత్యేక జీవోలు ప్రత్యేక ప్యాకేజీలు సరిగా అమలు కానపుడు వాటికొరకు మీరు చేసిన పోరాటాలు ఎంత ఘాటుగా ఉన్నేయో ఆత్మ విమర్శ చేసుకోండి ? ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యమాలు , ప్రత్యేక జీవోలు ప్రత్యేక ప్యాకేజీల ఫై ప్రభుత్వం అలసత్వం చేసిన సందర్భాలలో చేసివుంటే . ఈరోజు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు కద .
132 . వీరగోని పెంటయ్య కరీంనగర్ వాసి . కథాభిమాని . స్వయంగా కథకుడు . వీరి కథలు ఆహ్వానం , సృజన లాంటి పత్రికల్లో అచ్చయ్యాయి . ఎవరి రక్షకులు , ఊర పిచ్చుకలు , పోరుపెట్టి … , సమ్మవ్వ తల్లి , రేపురా అనే కథలు వీరి ఆలోచనల్ని పట్టిస్తాయి . వీరి కథలు కొన్ని అలభ్యాలు .
ఆ ఉద్యమం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తలెత్తినప్పటికీ అనతి కాలంలోనే తెలంగాణ ప్రాంతమంతా విస్తరించింది . విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా ప్రభుత్వోద్యోగులు , ప్రతిపక్ష సభ్యులు ప్రత్యక్ష చర్యకు దిగుతామని హెచ్చరించారు . ఉద్యోగులు పెన్ డౌన్ వంటి సమ్మెలకు దిగారు . అన్ని వర్గాలవారు ఉద్యమంలోకి వచ్చారు . కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి రాజకీయ నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి దిగారు . మదన్ మోహన్ , మల్లికార్జున్ , విబి రాజు , పులి వీరన్న వంటి నాయకులు ఉద్యమంలోకి వచ్చారు .
తంజావూరు రాజ్య ఆస్థాన వైణుకులుగా వీణ కాళహస్తయ్య ఉండే వారని మంచాళ జగన్నాధ రావు గారు ( త్యాగరాజ కీర్తనలు పుస్తకం లో ) రాసారు . కానీ ఈ విషయాన్ని వెంకట రమణ భాగవతార్ కానీ , ఆయన కొడుకు కృష్ణ భాగవతార్ కానీ , మనవడు కె కె రామస్వామి కానీ ఎక్కడా ప్రస్తావించలేదు . వీరేకాదు , తరువాత త్యాగరాజు జీవిత చరిత్ర రాసిన పి . సాంబమూర్తి గారు కూడా ఎక్కడా ఈ సంగతే రాయలేదు ( The Great Composers Vol . I & II ) . కాబట్టి మంచాల జగన్నాధ రావు రాసిన దానికి ఆధారం ఏమిటో స్పష్టంగా తెలీదు . అది ఊహో లేక వాస్తవమో చెప్పలేం .
హైదరాబాదు అనగానే అందరికి గుర్తుకొచ్చేది . . జనవరిలో జరిగే ఎగ్జిబిషను . . దాంతోపాటు గత నాలుగయిదు సంవత్సరాలుగా అంతే ప్రాచుర్యాన్ని పొందుతున్న మరో ప్రదర్శన హైదరాబాదు పుస్తక ప్రదర్శన . మరి ఈ సారి పుస్తక ప్రదర్శనకి ఎంతమంది బ్లాగర్లు వస్తున్నారు ? అక్కడ e - తెలుగు స్టాలు కూడా ఏర్పాటు చేసారు . ఆసక్తి . . . ఉత్సాహం ఉన్న బ్లాగర్లు , బ్లాగేతరులు e - తెలుగు స్టాలుకి వచ్చి అంతర్జాలంలో తెలుగు గురించి , వికీపిడియా గురించి , బ్లాగుల గురించి , అంతర్జాల పత్రికల గురించి తెలుసుకోవచ్చు . . . . . . . వీటి గురించి తెలిసినవాళ్లు అక్కడకి వచ్చే సందర్శకులకి వీటి గురించి వివరించవచ్చు . వలంటీర్లుగా రాదలుచుకున్న వాళ్లు కశ్యప్ ( 9396533666 ) ( 9030365266 ) గారిని కాని , దూర్వాసుల పద్మనాభం గారిని కాని సంప్రదించవచ్చు . ఈ శనివారం ( 19 / 12 / 09 ) సాయంత్రం ఐదు గంటలకి వాక్ ఫర్ బుక్సు కార్యక్రమం కూడా ఉంది . ఉత్సాహవంతులు ఇందులో పాల్గొనవచ్చు . దీన్ని కేంద్ర మానవవనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుపాటి పురందరేశ్వరి గారు ప్రారంభిస్తారు . శనివారం ( 19 వ తేది ) , ఆదివారం ( 20 వ తేది ) , మరియు సోమవారం ( 21 వ తేది ) మహిళా బ్లాగర్లు ఎవరయినా రాదలుచుకుంటే రావచ్చు .
లాంటి షడ్జమ , పంచమ వర్జ ప్రయోగాలు ఈ రాగానికి ఎంతో అందాన్నిస్తాయి .
బాబా గారు , మీరు మా అందరి మాట మన్నించి ఆ వ్యాఖ్యను టపాగా మార్చండి . . . . ప్లీస్ .
కుప్పుసామయ్యరు మేడ్డిఫికల్టు - 1 కుప్పుసామయ్యర్ మేడ్డిఫికల్టు - 2 కుప్పుస్వామయ్యరు మేడ్డిఫికల్టు - 2 కుప్పుస్వామయ్యర్ మేడ్డిఫికల్ట్ - 2 ఆశ చావక , మళ్ళీ కొద్ది మార్పుచేర్పులతో వెతికాను . ఇంకోటి దొరికింది . " కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్ట్ " - ( ముందు 109 అని చెప్పింది , తరవాత 10 అని చూపించింది . ఏంటో మరి ! )
ఈ వేళ ఓ టెలివిజన్ చానెల్ " కలర్స్ " లో ఓ మంచి ప్రోగ్రాం చూశాను " ఇండియా గాట్ టాలెంట్ " అని . దానికి శేఖర్ కపూర్ , కిరణ్ ఖేర్ , సోనాలి బెంద్రే జడ్జీలు . అన్నిరకాల టాలెంట్లనీ ప్రదర్శిస్తున్నారు . చాలా బాగుంది . మాములుగా ఉండే వాటికన్నా భిన్నంగా ఉంది . శని , ఆది వారాలు రాత్రి 9 . 00 గంటలకి , వీలుంటే చూడండి .
వేసవిలో కనిపించే సహజ దృశ్యాలన్నిటినీ ఒక దానికొకటి గుదిగుచ్చి ఒక అద్భుతమైన ఊహ చెయ్యడం ఈ పద్యంలో మనం చూడవచ్చు . కారుచిచ్చు , ధూళినిండిన సుడిగాలులు , ఎండిపోయిన పెద్ద పెద్ద బావులు - ఇవన్నీ వేసవిలో కనిపించే దృశ్యాలే కదా !
లాం ముఖం ఎర్రబడింది . " అదంతా డెడ్ లాంగ్వేజీ , డెడ్ కల్చరూరా ! నా మీద రుద్దుదామని చూసారు " విసుగ్గా అన్నాడు . అమెరికా వచ్చిన మేధావిగద . . అమ్మానాన్నల్ని విశ్లేషించడం అలవాటు చేసుకున్నాడు .
ఎక్కడికెళ్ళినా పిన్ని గారిని ఎందుకు తీసికెళ్ళరూ అనకండి . మొన్న ఆంధ్ర సంఘానికెళ్ళిన రోజు , మా అగస్థ్య తో కాలక్షేపం . ఈవేళ నవ్య తో కాలక్షేపం . ఏం లేదూ , ఈ వాతావరణ మార్పులు ( పగలంతా ఎండా , రాత్రంతా చలీ ) , మనకే జ్వరం వచ్చినట్లుంటుంది , పాపం చిన్న పిల్లలకెలా ఉంటుందీ ? అదీ కారణం .
" మా వారికి , అప్పటికీ ఇప్పటికీ ఏ డబ్బులు గుర్తువుండవు కాని , నాకిచ్చినవి మాత్రము గుర్తు వుండి తీసేసుకునేదాకా తోచదు ! " : - ) : - ) మీ అత్తగారికి , మీకూ అభినందనలండీ . . దాచినందుకు ఆవిడకి , సద్వినియోగం చేసినందుకు మీకు . .
6 . అపవిత్ర సమీకరణలు - అగ్రకులస్థులు ఎన్నికలకోసం ముస్లిములను వలలో వేసుకోవడమ గురించి .
ఒకసారి చూడండి . మీరూ ఓ వ్యాసం రాయండి . మీ ఊరి గురించో , మీకు తెలిసిన గొప్ప వ్యక్తి గురించో , ఓ సంఘటన గురించో , చరిత్రో , సైన్సో . . ఏదైనా రాయొచ్చు . . పూర్తి తెలుగులో . మీకు దాని అవసరం ఉంది . మీ అవసరం అక్కడ చాలా ఉంది .
ఎపినేఫ్రైన్ , హెపారిన్ , ఇన్సులిన్ ( హ్యుములిన్‌నొవోలిన్ ) వంటి కొన్ని మందులు తల్లి పాలలోకి వెళ్ళవు , అందువల్ల ఈ మందులు శిశువుకు సురక్షితమైనవే అవుతాయి . మిగతా చాలా మందులు తల్లి పాలలోకి వెడతాయి , కాని సాధారణంగా , చాలా స్వల్ప పరిమాణంలో మాత్రమే పాలలో కలుస్తాయి . అయితే , కొద్ది మోతాదులోనే అయినా , కొన్ని మందులు శిశువుకు హాని కలిగించవచ్చు , . మరికొన్ని మందులు పాలలో కలిసినా , శిశువు వాటిని చాలా కొద్దిగానే జీర్ణంచేసుకుంటుంది కాబట్టీ , శిశువుకు ఇబ్బందేమీ వుండదు . ఉదాహరణ : జెంటామైసిన్ , కెనామైసిన్ , స్ట్రెప్టో మైసిన్ , టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయోటిక్స్ . డాక్టర్ల సలహా తీసుకోకుండా నేరుగా మందుల దుకాణాలలో కొనుక్కునే చాలా మందులు ఈ విషయంలో సురక్షితమైనవే . ఇందుకు మినహాయింపు : జలుబు , దగ్గు మందులలో , ఎలర్జీ మందులలో , విరేచనాల మందులలో , నిద్రపట్టడానికి వాడే మందులలో వుండే ఎలర్జీని నయంచేసే ఔషధ పదార్థాలు ( యాంటీ హిస్టామిన్స్ ) ; ఇంకా దీర్ఘకాలంపాటు , ఎక్కువ మోతాదులో తీసుకుంటే హానికర సూక్ష్మక్రిమి నిరోధకాలైన ( శాలిసైలేట్స్ ) యాస్ప్రిన్ , మొదలైనవి .
అయితే , మీరు వాకింగ్ కి వెళ్ళకుండా , పున్నాయి పూలు ఎరుకోకుండా నిద్రపోతున్నరన్నమాట , కార్తి మాసం మొదటిరోజు మీరు చేసుకున్న తీర్మానం ఏమయ్యింది ? ఈరోజేన , అసలు మానేసేర ? ఆ రోజు పోస్ట్ చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను . సరే ! మీ నాగ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయండి .
సుఖపురుషుడు . . . . IPS చేస్తే వచ్చే ఆనందమిదే . ఆమూసిన తలుపు దగ్గర " ఇంధ్ర ధనుస్సు " సినిమాలో కృష్ణ పాడిన పాట " నేనొక ప్రేమ పిపాసిని . . . నీవొక ఆశ్రమ నివాసివి . . . నా దాహాం తీరనిది . . నీ హృదయమ కదలినిది . . తలుపు మూసిన తల వాకిట నే పగలూ రేయి నిలుచున్నా . " పాడుకున్నా . అలా పదహారో సారో ఇరవైరొండోసారో పాడిన తరువాత " పిలిచావా ప్రియతమా " అన్నట్లు చక్కగా తల దువ్వుకుని ముఖానికి పోడరు అద్ది , వున్న మూడు వెంట్రుకలను కుడి వైపు నుండి ఎడమ వైపు వేసుకుని బయటకు వచ్చాడు సారు .
వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి . . గుండెల్లోన చేరావే గంటె కొట్టి . . ఆ నండూరి వరెంకి మళ్ళీ పుట్టి . . కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి
మా ఊళ్ళో నర్సింసోవి ( నరసింహ స్వామి ) తిర్నాల గురించి కొంచెం రాద్దాం అనిపించింది ఈపూట . . . పల్నాడులో ప్రతీ ఊళ్ళో ఏదోక తిర్నాల ఉంటుంది . ప్రతీదానికి ఎవళ్ళోకళ్ళ ఇంటికి సుట్టాలు వస్తనే ఉంటారు . . . కాబట్టి తిర్నాల్లు సానా నిండుగా , హడావిడిగా ఉంటాయి . . అలాంటి జాతికి చెందిందే మా ఈ నర్సింసోవి తిర్నాల . ఐతే ఇక్కడ రాయాల్సిన ఇషయం తిరునాల ఎల జేస్తారు , పిల్లల గోల , చెరుకుగడలు , అవి ఇవి కాదు . . ఒక ప్రత్యేకమైన విషయం . . . అదే . . . నాటకాలు . . తిర్నాలకి ముందు తర్వాత ఆ సీజనులో మాఊరోళ్ళు 90 శాతం సాంఘీక నాటకాలు ఏస్తరు . దీనికి రెండు శిబిరాలు ఉంటాయి . . ఒకటి కమ్మోళ్ళది , ఇంకోటి రెడ్లది . . తతంగం ఏంటంటే , గుంటూరు నుంచి హీరోవిన్లు దిగుతారు వారంరోజుల ముందు . గుంటూరు పద్మ అండు కంపెని , జూనియర్ ఇజకశాంతి అండు కంపెని , గుంటూరు రాధా అండు కంపెని , ఇలా వాళ్ళకి ఫేమస్సు పేర్లు . ఇంక ఆ పటాలం ఊర్లోకి దిగినాక మన కుఱ్ఱకారుకి సందడే సందడి . అప్పుడు స్క్రీన్ ప్లే , కధ అన్ని రాసుకుంటారు లేక రెడీమేడ్ నాటకాలు కోకొల్లలు దొరుకుతాయి , వాట్లోంచి ఒకటి లాక్కుంటారు . ఈ నాటకాల్లో కధకి , నాటకీయతకి పెద్ద విలువ ఉండదు . మరింక దేనికి అంటారా . . డాన్సు , పాటలు , మ్యూజిక్కు , హీరోవిన్ను , హీరో . . అంతే . . ఒక హీరోకి రెండు పాటలు , కొన్ని సార్లు మూడు కూడా ఉండొచ్చు . . ఎవడికి ఎంత జిల ఉంటే అంత . . అంటే 1 పాటకి 1000 , రెండు పాటలకి 2000 అలా పాడుకోవచ్చు . . పాడుకున్నోడికి పాడుకున్నంత అన్నమాట ( కబడ్డి కబడ్డి సిలుమాలోలా - ద్రౌపదీ వస్త్రాపహరనం ఐతే సీరనేనే లాగుత ఇదిగో వెయ్య , ఇదిగో రెండేలు నేను లాగుతా . . అలా ) ఇంక ఒక నాటకానికి పాడుకున్నంత మంది హీరోలు . ఒక శిబిరమ్లో ఒక పాటకి రామిరెడ్డి ఐతే , ఇంకోపాటకి ఎంకట్రెడ్డి . . ఇంకో శిబిరమ్లో సాదినేని రమణ ఒక పాటకి హీరో ఐతే సూదినేని శీను ఇంకో హీరొ . . . అలా ఇంక డాన్సు రిహార్సిల్సు మొదలు పెడతారు . . మనోళ్ళందరూ తొంగిసూట్టం , అలా . అక్కడ హీరోవిన్ని టచింగులు గట్రా మాములే అనుకోండి . లేటు నైటు హీరోవిన్ బస దెగ్గర ఇసుకేస్తే రాలనంతమంది జనం . ఈ హీరోఇన్లు యమ ఫాష్టు . . ఒకపాటలో 5 కోకలు మర్చే వాళ్ళుగూడా ఉంటారు . . కమ్మ శిబిరం వాళ్ళు యన్ . టీ . ఆర్ , బాలయ్య పాటలు ఏసుకుంటే , రెడ్డి శిబిరం వాళ్ళు సూపర్ స్టార్ కృష్ణ పాటలు . ఈ పాటలు పాడతానికి , మ్యూసిక్కు కొట్టటానికి ఇంకో టౄపు . దానికి రిహార్సిల్లు . ఒక నాటకమ్లో 10 పాటలు అలా . . అప్పాట్లో ఫేమస్సు పాటలు . . . అనసూయమ్మగారి అల్లుడు , మంగమ్మగారి మనవడు , ఇలా . . ఇటువైపు . . సింహాసనం , అగ్నిపర్వతం , ఇలా . . కొన్ని సిరంజీవి పాటాలు ఉండేవి అప్పుడప్పుడు . . కమ్మ శిబిరమ్లో మాత్రం పొరబాటున కూడా మిగిల్నోళ్ళ పాటలు ఉండేవి కావి . . . దీంట్లో హైలైటు డవిలాగు ఫోను మోగుతుంది " ట్రింగ్ ట్రింగ్ " హీరో అలా నడ్సుకుంటు వచ్చి ఫోను ఎత్తుతాడు సెప్పాల్సిన డవిలాగు " హల్లో ! ! ఇక్కడ విజయ్ స్పీకింగు ! ! అటు ఎవరు " అని మనోడు " ఈడ విజయ్ పీకింగు అవతలెవడహే "
లినక్స్ మెషిన్‌ను చెడగొట్టటానికి , దానికోసం పని చేయాలి . అదే విండోస్ మెషిన్ ఐతే , దాని మీద పని చేస్తే చాలు - అన్నడు ఓ రచయిత . ప్రస్థుతం , లినక్స్ వైరస్ లు ఇలా మాట్లాడుకోవటానికి తప్ప విండోస్ ను హాని పరిచిన విదంగా ఎందుకు వ్యాప్తి చెందటం లేదు ? మెకాఫీ యాంటీ వైరస్ ప్రాడక్ట్ మ్యానేజర్ క్లార్క్ అన్నరు - " విండోస్ వాడుకరులు ఎక్కువ అందుకే వైరస్ లను వ్రాసే వాళ్ళు దానికోసం వ్రాస్తున్నరు . లినక్స్ మరియూ యాపిల్ వారి మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలు కూడా అంత పాపులర్ అయ్యినప్పుడు వాటి పరిస్థితి కూడా ఇంతే " . ఈ వ్యాఖ్యను పూర్తిగా ఖండించలేం , ఒకొంతు అదీ నిజమే . కానీ పూర్తిగా కాదు . లినక్స్ కు వైరస్ లు లేవనటం లేదు , ఒక సారి 2002 గణాంకాలను చూద్దాం . ఇప్పటికి 10 లక్షలకు పైగా వైరస్ లు విండోస్ కోసం వ్రాయబడ్డాయి . వీటిలో చాలా వరకు విండోస్ వైరస్ లు , తీరని నష్టాన్ని కలిగించాయి . రెండు మూడు మ్యాక్ వైరస్ లు కూడా ఇలానే చేశాయి . కానీ లినక్స్ మరియూ యునిక్స్ వైరస్ లు మాత్రం , వాటిని తయారు చేసిన ల్యాబ్ లకే పరిమితమయ్యాయి . ఒక వేళ లినక్స్ నంబర్ 1 డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టం ఐనా , మ్యాక్ బిజినెస్ అలా అలా పెరుగుతూ పోయినా , ఈ యునిక్స్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టంలకు మైక్రో సాఫ్ట్ ప్రపంచంలో వచ్చిన ముప్పులు రావు . ఎందుకని ? ఐదు కారణాలు ? 1 . వాడుకరుల అర్హతలు : లినక్స్ వైరస్ ఒక కంప్యూటర్ కు వ్యాప్తి చెందాలంటే , అది లినక్స్ లోని ఎక్సిక్యూటబుల్ ఫైల్ కు సోకాలి . ఇలా జరగాలంటే , ఈ యూజర్ కు ఆ ఫైల్ మీద వ్రాయగలిగే అధికారం ఉండాలి . సాధారణంగా యూజర్ కు ఎంత తక్కువ అనుభవం ఉంటే అంత తక్కవ అధికారం ఇవ్వటం జెరుగుతుంది . ఒక వేళ ఆ యూజర్ యొక్క ఫైల్లకు సోకినా , అక్కన్నుంటి వ్యాపించటం కష్టం . ఒక వేళ వ్యాపించినా పూర్తి కంప్యూటర్ కు సోకటం కష్టం . ఇదంతా వరుసగా ముగ్గురు మూడు తప్పులు చేస్తూ పోతేనే . అక్కన్నుంచి మరొక కంప్యూటర్ కు సొకటానికి మరో మూడు పొరపాట్లు పూనుకొని చేయాలి . 2 . ఎక్సిక్యూటబుల్ ఫైళ్ళు ఉండవు : ఓపెన్ సోర్సు ప్రపంచంలో వైరస్ దాగి ఉండటం కష్టం . బైనరీ ఫైల్లకు అంత ప్రాముఖ్యత లేదు . ఈ రెండు కారణాల వల్ల వైరస్ లకు వ్యాపించటం మరీ ఇబ్బందికరం . 3 . రిజిస్టరీ ఉండదు : మామూలుగా విండొస్ లో వైరస్ లు డిలీట్ చేసినా మళ్ళీ రిజిస్టరీ నుండి లోడ్ అవుతాయి . లినక్స్ లో ఈ రిజిస్టరీనే ఉండదు , కాన్‌ఫిగరేషన్ ఫైల్లలో సేవ్ చేసుకుంటుంది . ఇవి సాధారన వాడుకరులకు అందుబాటులో ఉండవు . 4 . ఇంటెర్నెట్ ఎక్స్‌ప్లోరర్ : విండోస్ తో పాటుగా , ఇంటెర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వస్తుంది . ఇది చాలా అసురక్షితమైనదని చాలా రీసెర్చి లలో పేర్కొన్నారు . ఇది మనల్ని ఏమీ అడగకుండానే ఏది పడితే అది ఇంస్టాల్ చేస్తుంది . లినక్స్ తో పాటుగా వచ్చే ఫైర్ ఫాక్స్ ప్రతిదీ మనల్ని అడిగిన తరువాతనే చేస్తుంది . 5 . లినక్స్ అంత ఫేమస్ కాదు కదా ? విండోస్ అత్యంత పాపులర్ డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టం . దానికోసం వ్రాస్తే సులభంగా మరియూ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని హ్యాకర్లు విండోస్ కోసం వైరస్ లు వ్రాస్తారు . అందుకే దానికే వైరస్ లు ఎక్కువ .
ఇరాన్లో మళ్ళీ అసంతృప్తి రాజుకుంటోంది . ఐతే ఈ సారి అది ఎటు తిరుగుతుందో , ఏ గాలి ఎటు వీస్తోందో ఎవరికీ అంతు పట్టకుండా ఉంది . ఇది కేవలం నియంతృత్వాన్ని భరించలేని ప్రజాభిప్రాయపు బలమే అనుకోవడానికి వీల్లేదు . ఎందుకంటే ఇప్పటికీ ప్రజాభిప్రాయాన్ని తమ గుప్పిట్లో పదిలంగా పెట్టుకున్న నియంత ప్రభుత్వాలు బలంగానే ఉన్నాయి ప్రపంచంలో . ఎక్కడన్నా తమకి వ్యతిరేకమైన ప్రజాభిప్రాయం కాస్త బలం పుంజుకుని గొంతెత్తినా , పిడికిలి బిగించినా దాన్ని కర్కశంగా అణిచివేస్తూనే ఉన్నాయి . కేవలం ప్రజాభిప్రాయం మాత్రమే అయితే ఇరాన్ అధినేత కూడా దీన్ని అంత కర్కశంగానూ అణిచివేసే వాడే . ఇది ప్రభుత్వాధికారం చేజిక్కించుకో చూసే వివిధ రాజకీయ శక్తుల ప్రభంజనం అనే అనిపిస్తోంది . బలయ్యేది మాత్రం ప్రజలే . ఈ వారం మరి కొన్ని పండుటాకులు రాలిపోయినాయి . నా వయసు వాళ్ళకి కొరజాన్ అఖీనో ( భారద్దేశంలో కొరజాన్ అక్వినో అనేవాళ్ళం ) బానే గుర్తుండి ఉండాలి . ఎనిమిదో దశకం చివర్లో నియంత ఫెర్డినాండ్ మార్కోస్ ని ఎదిరించి తొలి ప్రజాస్వామిక ఎన్నికల్లో నెగ్గి ఫిలిపీన్స్ అధ్యక్షురాలైంది . అంతకు మునుపు ఎటువంటి రాజకీయ అనుభవం లేని ఈ గృహిణి , ఐదుగురు బిడ్డల తల్లి , తన ఆరేళ్ళ పాలనలో ఎన్నో మిలిటరీ తిరుగుబాట్లని ఎదుర్కుని వమ్ము చేసింది . ఫిలిపీన్స్ లో ప్రజాస్వామ్య పాలనకి పునాది వేసింది . అప్పటి వరకూ అమలులో ఉన్న నియంతృత్వ విధానాలను నిర్మూలించి పాలనలో అనేక సంస్కరణలను ప్రవేశ పెట్టింది . ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యానికీ , శాంతియుత పాలనకీ , స్త్రీ హక్కులకీ ఒక ప్రతీకగా వెలిగింది . అన్నిటికంటే నాకు నచ్చిన విషయం , తన ఆరేళ్ళ పదవీ కాలం ముగియగానే రాజకీయాలనించి విరమించింది . ఒకసారి అధికారం రుచి చూసినాక అలా వొదిలెయ్యగలగడం అందరికీ సాధ్యం కాదు . డెబ్భయ్యారేళ్ల వయసులో కోలన్ కేన్సరు జబ్బుతో గతవారంలో మరణించింది . ఇరవయ్యవ శతాబ్దంలో ఆధునిక నాట్య రంగానికి దిశానిర్దేశం చెయ్యడమే కాక దాని విధిని శాసించిన మహా కళాకారుడు మెర్స్ కన్నింగ్‌హేం తన తొంభయ్యవ ఏట మరణించాడు . నాట్యం అంటే కదలికే , లయ అంటే గుండె చప్పుడే అని నమ్మిన మెర్స్ కదలికని అన్ని రూపాల్లో ప్రేమించి ఆరాధించి ఆధునిక నాట్యాన్ని ఉత్కృష్ట స్థాయికి తీసుకెళ్ళాడు . తాను చక్రాల కుర్చీకి పరిమితమైనా , తొంభయ్యేళ్ళ వయసులోనూ తన డాన్సు కంపెనీ రిహార్సల్సు పర్యవేక్షిస్తూ , అడపాదడపా ఇతర విద్యార్ధులకి నాట్య శిక్షణనిస్తూ తన చివరి ఊపిరిదాకా ఆయన కదులుతూనే , నాట్యం చేస్తూనే ఉన్నాడు . కళకి అంకితమవడం అంటే ఇదేనేమో . నాకు డెమోక్రాట్ల మీద నమ్మకం బొత్తిగా పోతోంది . క్లింటన్ పదవి నెరపిన్నన్నాళ్ళూ , కాంగ్రెస్లో మాది మైనారిటి అని బీదరుపులు అరిచేవాళ్ళు . సరే బుష్ రాజ్యంలో సోదిలోకి లేకుండ పోయారు . చివర్లో కాంగ్రెస్ మీద పట్టు సాధించినా వీళ్ళు ఆ రెండేళ్ళల్లో పీకిందేమీ లేదు . ఇప్పుడు శ్వేతసౌధంలో తమ అధ్యక్షుడే . ఉభయ చట్టసభల్లోనూ తమదే మెజారిటీ . ఇంతవరకూ ఎకనామిక్ స్టిమ్యులస్ బిల్ ( అదీ వాలువీధి బలిసిన పిల్లులకి మేత ) తప్ప వీళ్ళు సాధించినదేమీ కనబడ్డం లేదు . వోలుమొత్తం ఆరోగ్య వ్యవస్థని తిరగా మరగా చేసేస్తా , దున్నేస్తాం అని మొదలెట్టిన యజ్ఞం ఇప్పుడు చల్లబడి చల్లబడి పూర్తిగా నీరుకారిపోయే స్థితికొచ్చింది . ఇంతలో కాంగ్రెస్ రేసెస్ . . హాయిగా అందరూ ఇళ్ళకి పోయారు . ఇప్పుడైనా ప్రజలు ఇంటికొచ్చిన తమ తమ ప్రతినిధులకి ఖడ్గతిక్కన భార్య చేసిన మర్యాద చేసి , కాస్త బుద్ధి చెప్పి మళ్ళి వాషింగ్టన్ కి పంపిస్తారని ఆసిద్దాం . సుమారు రెండేళ్ళ తరవాత థియెటర్లో తెలుగు సినిమా చూశా . మగధీర బానే ఉంది . ఒకసారి చూడచ్చు . చందమామ కాజోల్ అప్పటికంటే వన్నె తేలింది . రాం చరణ్ తేజ కూడా ఇంప్రెసివ్ అనిపించాడు . డేన్సులు బాగా చేశాడు . పాతకాలపు గెటప్ లో బాగున్నాడు ( ఇది అందరికీ నప్పదు ) . విలను నిజంగానే డ్రామా కంపెనీ నాటకం మధ్యలోంచి వేషం తీసెయ్యకుండ వచ్చినట్టున్నాడు . కాస్ట్యూములు , గట్రా బావున్నై . రాజమౌళిగారి బొడ్డు ఫిక్సేషను తీరినట్టుంది . పాటలు పర్లేదు . ఏక్షను సీన్లు కూడా కొద్దిగా మాత్రమే అతి అనిపించాయి . నాకెందుకో ఈ సినిమాలో సింహాద్రి , యమదొంగ ఛాయలు చాలా కనిపించాయి . రాజమౌళిగారు కొంచెం జాగ్రత్త వహించాలి . చివర్లో టైటిల్స్ పడేప్పుడు యూనిట్ సభ్యులందరితో హీరో హీరోయిన్ల పాట మంచి ఐడియా , సరదాగా ఉంది . దీనికి ఇంతకంటే రివ్యూ అనవసరమని ఇక్కడే కబుర్ల లో లాగించేస్తున్నా . ఇద్దరు మిత్రులు బ్లాగంగేట్రం చేశారని ఇటీవలే తెలిసింది . శ్రీ తన తెలుగు సినిమా సైటుద్వారా సినిమా అభిమానులకి చిరపరిచితుడే . ఇప్పుడు తన వ్యక్తిగత మనోభావాల్నీ బ్లాగుతూ మధ్యమధ్య తన కేమెరా చిత్రాలు కూడా మనతో పంచుకుంటున్నారు . శివ మా డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి సభ్యులు , చిరకాల మిత్రులు . బ్లాగు టైటిలు కూడా ఆయన వ్యక్తిత్వానికి తగినట్టు నిరాడంబరంగా పెట్తుకున్నారు . మీరూ ఒక లుక్కెయ్యండి .
మీ వ్యాసం మీరే సంగ్రహించి చెప్పటం కొంతవరకూ అలాగే ఉంది ; )
ఇతని కవిత్వమంతా చదివితే కవిత్వంలో చిక్కదనం తగ్గకుండానే వైశద్యం వైపు విస్తరించుతున్నట్లుగా గ్రహించ గలుగుతాము . అందుకే ఖండికల పరిమాణం తగినంతగా పెరిగింది . ఇతని కవిత్వాన్ని ఎన్నో విధాల వ్యాఖ్యానించవచ్చుగాని ఇతని కవిత్వం చదివే పాఠకునికి కావలసింది వ్యాఖ్యానం కాదు సాలోచన , సావధానం . ఏకాంతంగానూ మరొక తోడుతోనూ మనస్సును ప్రకృతికి సన్నిహితం చేసి చదివితే ఇతని కవిత్వం మనస్సుకు బాగాపడుతుంది . ఇందులో నేను ప్రయత్నించినది అందుకు దిశానిర్దేశం చెయ్యడమే . అక్కడక్కడ ప్రలోభపడి వ్యాఖ్యానించినా పాఠకుడికి దారి చూపించే ప్రయత్నంలో భాగంగానే .
ప్రపంచమంతా డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ గా జరుపుకుంటున్నారు . కాని దీనికి ఆధారాలు ఏమాత్రం లేవని , ఇది అంతకంటే ప్రాచీనమైన వైదికుల " ఉత్తరాయణ పుణ్యకాలం " అనే పండుగ అన్న చేదునిజం బయట పడితే దీనిని ప్రపంచం జీర్ణించుకోగలదా ? జీసస్ క్రీస్ట్ ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియదు . మనలాగా సంవత్సర , మాస , పక్ష , తిథి , వార , నక్షత్రాలను , యోగకరణాలను , హోరను , లగ్నం నుంచి నాడీ లగ్నం వరకూ ఉన్న సూక్ష్మ విభాగాలను లెక్కించి దాన్ని బట్టి జనన కాలాన్నివ్రాసిపెట్టే పద్దతి అప్పట్లో ఆ దేశంలో లేదు . వారికి అంతటి జ్యోతిష్య జ్ఞానమూ లేదు . కనుక ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియదు . అందరూ అనుకుంటున్నడిసెంబర్ ఇరవై అయిదు ఆయన పుట్టిన రోజు కాదు . క్రీస్తు శకం మూడో శతాబ్దం లో ఆయన జనన సమయాన్ని నిర్ధారించి దానిని ఒక పండుగగా జరుపుకోవాలనే ప్రయత్నాలుజరిగాయి . అప్పటికి క్రైస్తవ మతం ఒక రాజామోదం పొందిన మతం గా రూపు దిద్దుకోగలిగింది . యూదుల ప్రాచీన పండుగ అయిన " పెస్టివల్ ఆఫ్ లైట్స్ " అదే సమయంలో వస్తుంది కనుక ఆ కాలపు క్రైస్తవమతాచార్యులు ఆ సమయాన్నినిర్ధారించి ఉండవచ్చు . ఈ పండుగను యూదులు తమకంటే ప్రాచీనమైన వైదిక సంస్కృతి నుంచి తీసుకుని అనుకరించసాగారు . ఎందుకంటే మన పండుగలకు , ప్రకృతికీ , సూర్య చంద్ర గమనాలకూ , అవినాభావ సంబంధం ఉన్నది . మన వైదికపండుగలు విశ్వజనీనమైనవి . ఇవి వ్యక్తులతో ముడిపడినట్టివి కావు . ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం . కాబట్టి ఈ కాన్సెప్ట్ ను యూదులు మననుంచి కాపీ కొట్టి ఉండవచ్చు అని గట్టిగా చెప్పవచ్చు . ప్రాచీన వేద కాలం నాటి పండుగలు ఏ ఒక్క మహాపురుషుని జన్మనో ఆధారంగా తీసుకుని మొదలైనవి కావు . అప్పట్లో వ్యక్తుల పుట్టినరోజులు జరుపుకునే కాన్సెప్ట్ లేదు . అప్పటి పండుగలు అన్నీ విశ్వం లో జరుగుతున్న మార్పులను బట్టి , సూర్య చంద్రుల గమనాలను బట్టి , ఋతువులను బట్టి , సూక్ష్మమైన ఖగోళ పరిశీలనను బట్టి తయారు చేసినవే . ఈ పండుగనే అతి ప్రాచీన కాలం నుంచి మనం " ఉత్తరాయణ పుణ్య కాలం " గా పిలుస్తూ ఉన్నాం . సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణం చేసే సమయాన్ని , ఒంపు తిరిగే సమయాన్ని , ఉత్తరాయణ పుణ్యకాలం అంటూ అది దేవతలకు పగలుగా వేదం చెప్పింది . అది సాయన సిద్ధాంతం ప్రకారం డిసెంబర్ ఇరవై ఒకటి ప్రాంతం లో వస్తుంది . ఈ రోజు నుంచి రాత్రుళ్ళు తగ్గుతూ పగటి నిడివి పెరుగుతూ వస్తుంది . కనుక భారతీయుల ఉత్తరాయణ పుణ్యకాలాన్నే ప్రాచీనయూదులు " ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ " గా లెక్కించి ఉండవచ్చు . దీనినే క్రీస్తు జనన సమయంగా తరువాతి క్రైస్తవులు నిర్ధారించారు . ఎందుకంటే ఈవిధంగా యూదులపండుగ సమయంలో క్రీస్తుజన్మదినం జరపటం మొదలుపెడితే కొన్నాళ్ళకు ప్రాచీనయూదుల పండుగలు మరుగునపడి , క్రిస్మస్ మాత్రమె సమాజంలో మిగులుతుందనే దురూహ దీన్ని మొదలుపెట్టిన వారికి ఉండిఉండవచ్చు . క్రీస్తును సిలువనెక్కించి చిత్రహింస పెట్టిన యూదుల పండుగలను సమాజంలోనుంచి చెరిపివెయ్యాలంటే ఇదొక మార్గం గా అప్పటి వారు ఊహించి ఉండవచ్చు . ప్రస్తుతం అసలైన పండుగ మరుగున పడి , వీరి ఊహే చాలావరకూ చలామణీ అవుతూ ఉండటం చూస్తున్నాం . దీనికి ఇంకొక రుజువు కూడా చరిత్రలో ఉంది . ప్రాచీన ఇరాన్ లో సూర్యుని " మిత్ర " అనే పేరుతొ పిలిచేవారు . వారి కాలెండర్ లోకూడా ఈతేదీన షబే - జాఎష్ - మెహర్ అనే పండుగను జరుపుకుంటారు . ఈ రోజునుంచి పగళ్ళు పెరుగుతూ వస్తాయి . రాత్రుళ్ళు తగ్గుతూ వస్తాయి . సూర్యుని వెలుగు ఎక్కువ అవుతుంది కనుక దీనిని లోకానికి శుభసూచకంగా భావించేవారు . ప్రాచీన ఇరానియన్ దేవత అయిన " మిత్రా " ( సూర్యున ) కు ముఖ్యమైన తేదీ కనుక తరువాతివారు క్రీస్తుజన్మదినంగా దానిని నిర్ధారించి ఉండవచ్చు . వేదం లోని " మిత్రా - వరుణులు " లేక " మైత్రా - వరుణులు " అదే పేర్లతో ప్రాచీన ఇరాన్ లోకూడా మనకు దర్శనం ఇస్తారు . తరువాత ఇస్లాం మతం వచ్చి ఇరాన్ లో పూజింపబడుతున్న వైదిక దేవతలను అందరినీ తొలగించింది అది వేరే సంగతి . మొత్తంమీద జీసస్ ను స్మరించుకుంటూ చేసుకునే ఒక పండుగగా క్రిస్మస్ నిలిచిపోయింది . దానికి డిసెంబర్ ఇరవై అయిదు ఖాయం చెయ్యబడింది . అదే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూ వస్తున్నది . కాని దీనికి మూలం మన పంచాంగంలోని " ఉత్తరాయణ పుణ్యకాలం " అన్న సంగతి , ఇది సూర్య గమనానికి సంబంధించిన పండుగ అనీ , జ్యోతిష్య విజ్ఞానం ఇచ్చిన పండుగ అనీ , ఇదే జీసస్ జనన దినంగా జరుపుకోబడుతున్నదనీ , ఖగోళ పరమైన ఆధారాలు తప్ప దీనికి క్రైస్తవపరమైన ఆధారాలు అస్సలులేవన్న సంగతీ చాలా మందికితెలియదు . అసలు జీసస్ ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియదు దానికి బైబిల్ లో ఎక్కడా రికార్డులు లేవు . భారతీయుల " ఉత్తరాయణ పుణ్యకాలమే " క్రిస్మస్ గా మారి అందరిచేతా ఈపేరుతొ జరుపుకొబడుతున్నది . ప్రపంచం అజ్ఞానమయం అనడానికి , దానిని సత్యం నడపదు , గుడ్డి నమ్మకమే నడుపుతుంది అనడానికి ఇదొక రుజువు . ఈ నమ్మకం మీద కొన్ని వందల కోట్ల డాలర్ల వ్యాపారం ప్రపంచ వ్యాప్తం గా జరుగుతున్నది . కాని ఆ నమ్మకానికే అసలు ఆధారాలు లేవు అన్నది చేదునిజం . నిజాలు అర్ధమయ్యే కొద్దీ " మాయా ప్రపంచం తమ్ముడూ . . . " అని పాడుకోక తప్పదేమో మరి .
ఆకలి ! ఇన్ని పాట్లు పడ్డాక , సాపాటు గుర్తురావటం పరిపాటి . అలసిపోయాను . ఒక మాంచి కాఫీ తాగితే అమృతం కూడా అనవసరం అనిపిస్తుంది . కాఫీ షాపులో అమ్మాయిలెవ్వరూ లేరు ! కాఫీ ? అబ్బా . . చేదు ! పైగా ఆరోగ్యానికి హానికరం . తీయటి , చల్లటి జ్యూస్ ఉందక్కడ . ( = అమ్మాయిలున్నారు . ) ఒక్కటే జ్యూస్ ఉందట . రెండొందలు దొబ్బి , ముదురు ఎరుపు రంగులో ఉన్నదేదో నా మొహాన కొట్టాడు . వాసన చూడగానే , ఆ కంపుకి కడుపులో ఉన్నదంతా కదిలింది . ఒక గుటకేయ్యంగానే కదిలినదంతా బయటకు రావడానికి సిద్ధపడింది . అదక్కడే పాడేసి , రెండు బేక్డ్ సమోసాలు ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాను . ఓ రెండు టేబుళ్ళ దూరంలో కూర్చున్న అమ్మాయిలు ఎందుకో నవ్వుకుంటున్నారు , అప్పుడప్పుడూ నన్ను చూస్తున్నట్టు అనిపించింది . వెంటనే తలను టేబుల్‍లోకి దూర్చేసినట్టు తల దించుకున్నాను . వీళ్ళు చూస్తే ఒక బాధ , చూడకుంటే మరో బాధ . వీడేంటో స్నేక్స్ ఆండ్ లాడర్ పెట్టాడు టేబుల్ మీద . అబ్బో . . డైట్ ఫర్ హెల్త్ స్నేక్స్ ఆండ్ లాడర్ ! కూల్‍డ్రింక్స్ , పిజ్జాలు పాములు . ఇందాక వాడిచ్చిన దిక్కుమాలిన జ్యూస్ , చెప్పులరిగేదాకా నడవడం , ఇవీ నిచ్చెనలు . సమోసాలు వచ్చాయి . . నోటినిండా పెట్టుకొని , కడుపారా తిన్నాను , అక్కడున్న పాముల్నే నమిలి మింగేస్తున్న ఫీలింగ్‍తో .
ఈ పై డబ్బాలోని కోడ్ మీ సైడ్ బారులో అతికిస్తే మీకు క్రింద చూపిన విధంగా అందమైన బొత్తం ప్రత్యక్ష్యం అవుతుంది . దానిని నొక్కితే మీ చదువరులు నేరుగా మహిళా బ్లాగర్ల వర్గానికి వెళ్తారు .
యాత్రల్లో సాగునీటి ప్రాజెక్టులు , మంచినీటి సమస్యలతో పాటుగా , భూమి సమస్యలు , రహదార్లు , ఇందిరమ్మ బిల్లులు , రేషన్‌కార్డులు , పింఛన్లు ప్రధానంగా వెలుగులోకి వచ్చాయి . భద్రాచలం డివిజన్‌లోని అనేక చిన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవకాశాలున్నా ప్రభుత్వం వాటికి నిధులు ఇవ్వకపోవడం వల్ల వ్యవసాయ రంగంలో గిరిజనులు వెనుకబడి ఉన్నారు . డివిజన్‌లో సుమారు 70 వేల ఎకరాల్లో అటవీ భూములను 30 ఏళÊ్ల నుండి సాగు చేస్తున్నా పట్టాలివ్వడం లేదు . అటవీ హక్కుల చట్టం అమలు ఒక ప్రహాసనంగా మారింది . ఇచ్చిన అరకొర పట్టాలు సైతం ఫారెస్టు అధికారులు గిరిజనుల వద్ద నుండి బలవంతంగా లాక్కెళ్తున్నారు .
మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె మా యౌవనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి మ మ్మావల పారవోతురుగదా నరజాతికి నీతియున్నదా ?
తొక్కలో ఎక్స్ ప్రషన్ . . అస్సలు చూపే లేని వారికి ' ఎక్స్ ప్రషన్ ' అంటే ఏమిటో ఎలా తెలుస్తుంది ? ఒక వేళ తెలిసిందనుకుందాం , కళ్ళు లేని వారికి సదురు పాటను పాడిన వారి ఎక్స్ ప్రషన్ ఎలా కనబడుతుంది ? నవ రసాలలోని హాస్యం మరియు విషాదం తప్ప మరేమీ తెలియని అంధులకు మిగిలిన రసాలను ఎలా అర్దం చేసుకుంటారు ? ఒక వేళ అర్దం చేసుకున్నా వాటిల్ని ఇలా వ్యక్తం చేయ్యాలని ఎలా తెలుస్తుంది ? ఈవిడగారు నటించేటపుడు ప్రతీ షాటు ఎన్ని సారు రీటేక్‍లు చేసేదో ఈవిడగారు మర్చి పోయినట్లున్నారు . న్యాయనిర్ణేతగా వచ్చేటప్పటికి ఏమి చెప్పాలో ఏమి చెప్పకూడదో తెలియకుండా . . ఆ స్థానానికి తగ్గ హుందాతనంతో ప్రవర్తించ కుండా ఇలాంటి కామెంట్లు చేస్తే . . పాడాలనే హుషారు ఉన్న గాయకులకు సదురు ' ఎక్స్ ప్రషన్ ' అంటే ఏమిటో తెలియక నిరుత్సాహ పడిపోరా ? ఈ విషయం మన హీ ( జీ ) రోయిన్ గారికి ఎలా తెలుస్తుంది ?
చాప మీద నలుగురు పిల్లల మధ్య తానూ ఓ పిల్ల దానిలా ముడుచుకున్న ముత్తమ్మకు భర్త పిలుపుతో తెలివొచ్చింది గాని , కన్ను విప్పలేకపోయింది .
చిన్నప్పుడు ఏప్రిల్ ఒకటి దగ్గర పడుతోంటే పిచ్చి గుబులుగా ఉండేది . ఒకటేమో ఎవరైనా మనల్ని మోసగించేసి " ఏప్రిల్ ఫూల్ " అని అరుస్తారేమోనని . మోసం చెయ్యటమంటే ఏదో మన డబ్బులో వస్తువులో లాగేసుకుంటారని కాదు . ఈ మోసాలు " నీ చెవి మీద ఏదో పాకుతోంది " దగ్గర్నించి . . " హెడ్మిస్ట్రెసు గారు నిన్ను తీసుకు రమ్మన్నారు . నీకేదో మూడింది " దాకా ఉంటై . మనం తొణక్కూడదు , బెణక్కూడదు . మన తోటి వాళ్ళనీ , చిన్న వాళ్ళనీ బోల్తా కొట్టించడం కంటే మనకంటే పెద్దవాళ్ళని ఓ పిల్లి మొగ్గ వెయ్యించడం అదొక గొప్ప . మా ఇంటి చుట్టుపక్కల నాతో ఆడుకునే వాళ్ళందరూ నాకంటే చిన్నవాళ్ళు - అక్కడ మనకి హీరో వర్షిప్ కాక పోయినా కొంచెం నాయకుడి పొజిషనుండేది . పోయి పోయి ఈ పిల్ల వెధవల చేతిలో ఫూలైపోతే మన పరువేంగానూ ! ఎంత జాగ్రత్తగా ఉన్నా మరీ రోజంతా బిగదీసుకుని ఉండలేం కదా . ఒకసారైతే ఒక గడుగ్గాయి , వెంకటప్పయ్య కొట్లో పాత బొంగరాలు తీసుకుని కొత్తవిస్తున్నారని చెప్పి నన్ను పల్టీ కొట్టించాడు . ఆందోళన కలిగించే రెండో విషయమేంటంటే రోడ్డు మీదా , స్కూల్లో స్కూలైపోయాకా బట్టల మీద సిరా చిమ్మేవాళ్ళు . అప్పుడంతా ఫౌంటెన్ కలాలే ఉండేవి . చిన్న రబ్బరు ఫిల్లర్తో వచ్చే ఈనాటి చైనా హీరో పెన్నులు కాదు , ఒక్కొక్క కలానికీ ఒక ఔన్సుడు సిరా పట్టేంత బానపొట్టలుండేవి . మాకు ఐదో తరగతిలో అనుకుంటా కలాలు వాడటం మొదలైంది . పరిక్షలప్పుడు కూడా సిరా నింపుకోని చాలా మంది పిల్లకాయలు ఆ రోజు మాత్రం కోవటి కొట్టు తెరవంగానే ఐదు పైసలకి కలంనిండా సిరా పోయించుకుని యుద్ధ సన్నద్ధులై ఉండే వాళ్ళు . అది నిజంగా యుద్ధమే ! మనమీదకి వస్తున్న సిరాస్త్రాల్ని తప్పుకుని అవతలి వాళ్ళని ముంచెత్తాలి . ఈ యుద్ధాల్లో ఆడపిల్లలు కూడా వీరోత్సాహంతో పాల్గొనే వారు . ఏదో ఆడపిల్ల కదాని మనం దయతల్చి ఊరుకున్నా వాళ్ళే వెనకనించి వచ్చి ఇంకు చిమ్మేసి విరగబడి నవ్వేవాళ్ళు . ఎవడన్నా హీరో ఆడపిల్ల చేతులో ఇంకు దెబ్బ తిన్నాడంటే వాడింక ఆ రోజుకి జీరోయే . ఈ తతంగమంతా స్కూలైపోయాక మొదలయ్యేది , ఎందుకంటే స్కూలు జరుగుతుండగా ఎవడన్నా ఇట్లాంటి పన్లు చేస్తే హెడ్మిస్ట్రెసు గారి పేంబెత్తంతో వీపు చిట్లబడేది . కానీ స్కూలుకెళ్ళే రోడ్డు మీద వేరే స్కూలు పిల్లలకి మన హెడ్మిస్ట్రెసు గారంటే ఏం భయముండదు గదా . అందుకని స్కూలుకి చేరేదాకా చాలా అప్రమత్తంగా నడవాలన్నమాట . ఒక సంవత్సరం మా స్నేహితుడొకడికి బ్రిలియంటైడియా వొచ్చింది . బంగాళ దుంప చెక్కమీద జాగ్రత్తగా అక్షరాలు చెక్కి దాన్ని ఇంకులో ముంచి printing block లాగా వాడొచ్చని . తగినంత పెద్ద బంగాళ దుంప తేవడం వాడి వొంతు . కొయ్యటానికి కత్తి తేవడం ఇంకోడి వంతు . దానికి పులమటానికి పెన్నుల్లో ఉండే ఇంకు చాలదు కాబట్టి ఇంకు బుడ్డీ తేవడం నా వొంతు . అన్నీ అనుకున్నట్టుగానే జరిగిపోయాయి . ఎట్లాగో రహస్యంగా ఇంటర్వల్లో ఒక చెక్కని తయారు చేశాం . మధ్యాన్నం డ్రాయింగ్ పీరియడ్ కొంచెం ఆట విడుపు . క్లాసులోనే నెమ్మదిగా మా శత్రువర్గపు నాయకుడి వెనక చేరి వాడి వీపు మీద వేసిన ముద్ర . . ఇలా ! మన ఖర్మ కాలి ఆ పూటే మనం ఇంటికి చేరే లోపలే మా నాన్నగారి కలంలో సిరా నిండుకుంది .
" మానవహక్కుల సంఘాలు ఈ చట్టాన్ని తొలగించి , సైన్యాన్ని వెనక్కి పిలవాలని డిమాండ్ చేస్తున్నాయి . " మంచి డిమాండ్ , అలాగే అదే మానవహక్కుల సంఘాలు బలవంతం గా బయటకు గెంటబడిన కాశ్మీరి పండితుల కుటుంబాల గురించి , వాళ్లను తుపాకీలతో , మానభంగాలతో బెదిరించిన శాంతికాముకులయిన ఉగ్రవాదుల గురించి , ఎటువంటి డిమాండ్ లు చేస్తున్నాయో , ఇంతకముందు ఎలాంటి డిమాండ్ చేసాయో చెబ్తారా ? ఓ మరిచేపోయాను , మానవహక్కుల సంఘాలు అంటే , ఉగ్రవాద హక్కుల మరియు నక్సలైట్ హక్కుల సంఘాలు మాత్రమే కదా మన దేశంలో , సారీ .
యౌగంధరాయణుడు ( తనలో ) రుమణ్వంతుడు చాలా కష్టమైన పని చేస్తున్నాడు . రాజు ఎవరిమీద ఆధార పడితే వాళ్ళు ఎక్కువ భారాన్ని మొయ్యవలసి ఉంటుంది . ( పైకి ) ఇప్పుడారాజు మామూలు మనిషి అయ్యాడా ?
శ్రీవిరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు విరోధినామ సంవత్సరం విరుల సౌరభాలందించి విశిష్ట మైన సంపదలందించి విస్త్రుత మైన భావాల నిచ్చి విమల మైన మనసు నిచ్చి విశ్వశాంతి నందించి వీరత్వం , ధీరత్వం విశాల సేవా భావం వినిమయ దాత్రుత్వం నేర్పి వివరంగా బతుకు నడిపే విద్యకు ప్రాధాన్యమిచ్చి విల్లువంచి బాణమేసి విషపు కోరల విరగ గొట్ట్తి వివేకానికి పట్టంకట్టి విఘ్నాలను పారద్రోలి వికృతినామ సంవత్సరం విజయానికి సంకేతంగా విలాసానికి చిరునామాలా వినూత్నంగా నడపాలని వినాయకునిప్రార్ధిద్దాం
ముద్దుపళని రాధికాసాంత్వనము , నాగరత్నమ్మల ప్రేరణతో ఈ మధ్య కాలములో ఒక ఆంగ్ల నవల ( మరియు సిద్ధాంత వ్యాసము ) [ 10 ] కూడా వెలువడినది . ఆమె సంస్కృతములో త్యాగరాజస్వామిపై వ్రాసిన అష్టోత్తరశత నామావళిని విద్యాసుందరి వ్యాసముతో జతచేసిన అనుబంధములో చదువవచ్చును . 1947లో త్యాగరాజు మరణ శతాబ్ది సందర్భముగా నాగరత్నమ్మగారు వ్రాసిన వ్యాసము సాయి బ్రహ్మానందం గొర్తిగారి సౌజన్యముతో ఇక్కడ ప్రచురిస్తున్నాము . ఇందులో త్యాగరాజస్వామి ఆరాధన సందర్భముగా ముచ్చటించబడిన కొన్ని సంఘటనల వివరాలు కూడ హిందూ పత్రికలో లభ్యమవుతాయి ( అ , , ఆ ) . ఆమె తెలుగులో నాటక ఫక్కీలో వ్రాసిన వైకుంఠయాత్ర అనే ఒక చిన్న కథను ( సమదర్శిని , 1931 - 32 ) కూడా మీకు అందజేస్తున్నాము . సంసారికైనా సన్యాసికైనా ఇహలోక వాంఛలను బంధాలనూ విసర్జించడము ఆ విష్ణు భగవానుడు నారదుని ద్వారా సందేశాన్ని పంపినా కూడా జరుగని పని అని హాస్యవ్యంగ్యములతో రాసిన ఆ కథ నాగరత్నమ్మ గారి రచనా ప్రతిభకు ఒక తార్కాణం .
త్యాగయ్యగారికి ఉదయం లేస్తూనే - మేలుకొలుపు పాడడానికి బౌళో , భూపాలమో , ఆ తర్వాత వీధిలోకి ఆయవారం కోసం వెళ్ళినప్పుడు ఆభేరో , కల్యాణో , ఇంటికొచ్చి శిష్యులకి చెప్పడానికి - ఏ తోడో , ఖరహరప్రియో , మధ్యాన్నం భోజనం అయ్యిన తర్వాత విశ్రాంతి కోసం - బిలగరో , బేహగో , సాయంత్రం శ్రీరాగమో , వరాళో , సరస్వతో , రాత్రి రాముడికి పవళింపు సేవకి నీలాంబరి , కాకపోతే కాపి . ఇదీ త్యాగయ్య గారి దైనందిన దిన చర్య . మోజార్ట్ ది కూడా - రమారమీ ఇంతే . ఉదయమో ఓపెరా , మధ్యాన్న మొక స్ట్రింగ్ - క్వార్టెట్టు , సాయంత్రమొక సొనాటా , రాత్రికిక మహత్తరమైన సింఫనీ రాసేసేవాట్ట . మొత్తం సంగీతమంతా - ఏ దిద్దుబాట్లూ , కొట్టివేతలూ , మార్పులూ , చేర్పులూ లేకుండా - రాయటం వీళ్ళిద్దరికీ భగవంతుడిచ్చిన వరం .
కాలాన్ని నా రథం పై విహార , విజ్ఞాన , వికాస యాత్ర చేయిస్తాను . నా మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాను . ' కాలరథమ్ము మీదనె జగత్పతి నిత్యము స్వారి చేయునో ? కాలరథమ్ము చక్రముల ఘట్టన పుట్టుచు రాలుచుండు కెం థూళి కణమ్ములే అగునొ తోచెడి ఈ సకల ప్రజాళియున్ ? ' కాల రహసమున్ తెలియగల్గుటె పుట్టుకకున్ ఫలమ్మొకో ? ( బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు )
ఇది మీకు కూడా వర్తిస్తుంది . లక్కరాజుగారికి మీరెలాంటి సమాధానం ఇచ్చారో మీకు కూడానేను అలాంటి సమాధానమే ఇచ్చాను .
అయితే చషకాన్ని గెల్చుకున్నాక సదరు క్రీడాకారులకు బి . సి . సి . ఐ . ( Board of Control for Cricket in India ) , భారత ప్రభుత్వమూ , కర్ణాటక ప్రభుత్వమూ , ఇంకా ఇతర కంపెనీలూ ఇవ్వజూపుతున్న బహుమానాల గుఱించి తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయాను . కార్ల సార్థవాహం హ్యుండై ప్రతి క్రీడాకారుడికీ ఒక వెర్నా బ్రాండు లగ్సరీ సెడాన్ కారును ఇవ్వజూపగా కర్ణాటక ప్రభుత్వం ఒక్కొక్కఱికీ ౪౪౪ చ . గజాల నివేశనస్థలాన్ని ఇవ్వజూపింది . జట్టు తండేలు ( Team Captain ) ఎమ్ . ఎస్ . ధోనీకి రూ . రెండుకోట్ల నగదు , జట్టులోని ప్రతి ఇతర సభ్యుడికీ కోటి చొప్పున ఇస్తున్నారు . ఇది వారందుకుంటున్న అనునిత్య జీతాల ( regular payments ) కు అదనం . సముద్రంలో వాన కుఱిసినట్లు బాగా సంపాదిం చుకునేవాడికే ఈ సమాజం , ఈ ప్రభుత్వం ఎందుకిలా ఇంకా ఇంకా డబ్బు ధారపోస్తాయో , లేనివాళ్ళకు ఎందుకివ్వరో ఎప్పుడూ అర్థం కాని నిగూఢం ( mystery ) గానే మిగిలిపోయింది . ఆ జట్టులో కొంతమంది సంపాదనపరంగా చాలా గొప్ప ఉన్నతస్థాయికి చెందినవాళ్ళు . సచిన్ టెండూల్కర్ కి అయితే వివిధ ఆకరాల ( sources ) ద్వారా ఏడాదికి సుమారుగా రూ . 550 కోట్ల ఆదాయం ఉంది . సచినంత కాకపోయినా తండేలు ధోనీ కూడా సంపాదనలో తక్కువవాడేమీ కాదు . నేను వాళ్ళనేమీ అనట్లేదు . అందఱిలాగే నేనూ సచిన్ , ధోనీల మెచ్చుకోలరినే . నేను అడుగుతున్నదల్లా " మనం ఇదే డబ్బు ఇతర క్రీడల క్రీడాకారుల మీద ఎందుకు పెట్టడం లేదు ? " అని !
యాహూ తన నూతన యాహూ గ్యాలరీ లో భారతీయ బాషలలో సందేశం పంపుకునే వీలు కల్పించే ప్లగిన్ లను జత చేసింది . జోల్ అనే ఈ ప్లగిన్ వ్యవస్థాపితం చేసుకొనటం వలన మీరు ఇక తెలుగులో హాయిగా తిట్టుకోవచ్చు . .
ఒకానొక కాలంలో ఆయన సిద్ధాంతాల గురించి భారతీయ పండితులు విరివిగా చర్చించుకొనే వారు . సుమారు వేయి సంవత్సరాల క్రితం భారత్‌ను సందర్శించిన అల్ బెరూనీ అనే అరబ్బు పండితుడు ఆయన రచనల్లో ఆర్యభట్టు గురించి ప్రస్తావించాడు . ఆ రచనల్లో ఒకచోట ' ' కురుమ పురానికి చెందిన ఆర్యభట్టు తన పుస్తకంలో మేరు పర్వతం హిమాలయాల్లో సుమారు యోజనం ఎత్తున ఉందని ప్రతిపాదించాడు ' ' అని రాశాడు . దీన్ని బట్టి ఆర్యభట్టు అతను సూత్రీకరించిన కొన్ని సమీకరణాల సాయంతో పర్వతాల ఎత్తును కొలిచాడని అర్థమవుతుంది .
మరొక సమస్య ఏమిటంటే పురుగు మందులను కొనుట కొరకు చేసిన అప్పు . ఈ రుణాల నుండి ఆర్థిక పరిస్థితి వారి చేయి దాటి పోవునట్లయినది . ఈ డబ్బంతా నేరుగా ' సింగిల్ విండో ' లేక ' అన్నింటికి ఒకరే ' అయిన డీలర్ చేతిలోకి వెళ్తుంది . ఈ డీలర్ రైతుల యొక్క కలలను కల్లలు చేస్తుంటారు . ఇతనే విత్తనాలు , ఎరువులు మరియు పురుగు మందులను అమ్ముతుంటారు . ఇతను వీటన్నింటిని రైతులకు రూ | | 3 నుండి 5 అధిక వడ్డీకి ఇస్తుంటారు . రైతుల ఈ అప్పులనే చెల్లించలేని పరిస్థితిలో వుంటే వారి దిగుబడిని ఇతనికే అమ్మాలని ఒప్పందం చేసుకుంటారు . ఈ విధంగా డీలరు మార్కెట్ ధర కంటే తక్కువ ధరలను నిర్ణయించి కొంటారు . వచ్చే సంవత్సరానికి అప్పు ఇస్తాడని వేరే అవకాశం లేక రైతు ఈ తక్కువ ధరకే ఒప్పుకుంటాడు . ఈ విధంగా వీరి జీవిత చక్రం విషవలయమై పురుగు మందుల యొక్క ట్రేడ్ మిల్‌పై వున్నది .
హైదరాబాద్ , జూలై 11 : తెలంగాణ రాష్ట్ర సాధనకు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తేవడంలో భాగంగా త్వరలో నగరం నుంచి ఢిల్లీ వరకూ ' తెలంగాణ రాష్ట్ర స్వాభిమాన్ ' పేరిట
మిరపకాయ్ | రవితేజ | రిచా గంగోపాధ్యాయ | దీక్షాసేథ్
లంఘించాడు . ఆ ఊపులో గేటుకి గుద్దుకోబోయి వెంట్రుక వాసిలో తప్పించుకుని దాన్లో వున్న అనేక
మా ఆవిడ " మనం తప్పు ప్లేసుకి వచ్చామేమో " అంటుంది పైగా చుట్టూ చూసి … కడుపు మండేట్టు . అప్పుడే అంత ముసలాళ్ళ మయిపోయామా అంటాను కసిగా … మా అమ్మాయి పడేసుకున్న ఫోర్క్ కి రెప్లేస్ మెంట్ తేవడానికి పరిగెడుతూ … అది అంతర్జాతీయ సమస్య కాకముందే !
మీ టపా చదువుతూ ఉండగానే , ఈటీవీ " ఆడపిల్ల " సీరియల్ గుర్తొచ్చింది . అందులో కాన్సెప్ట్ మీ అనుభవం లాంటిదే . కొన్ని సంఘఠనలు నిజంగానే ప్రభావాన్ని జీవితాంతం చూపెడతాయి . http : / / sreenyvas . wordpress . com
రెండవ సంపుటి 1966 డిసెంబర్ 8వ తేదీన విజయవాడల జంగాల చిట్టి అనే హోటల్ క్లీనర్‌తోటి ఆవిష్కరిపంచేసినారు . ఈ రెండో సంపుటం మూఢ విశ్వాసాల మీద దొంగ బాబాల మీద పీఠాధిపతులపైన యుద్ధం ప్రకటించింది .
ఇండియాలో బి . జె . పి . , బంగ్లాదేశ్ లో జమాతీ ఇస్లామి మత ఛాందసానికి ప్రతీకలు . ఈ రెండు దేశాల రాజకీయ కార్యాచరణ నించి ' మతం ' అనే పదాన్ని తీసివేయగలిగితే ఎంత బాగుండేది ! కానీ మతం ఎంతలా వేళ్ళూనుకొని పోయిందంటే , బీదబిక్కి సైతం దాని ఉక్కుపిడికిలి నించి తప్పించుకోలేదు .
ఆ తరవాతోరోజు , ఆ పని మనిషి , " మా అమ్మాయి పెద్దమనిషి అయిందటమ్మా ! " అంటే , ఆవిడకి అమాంతం సెలవిచ్చేసి , ' పసుపూ , కుంకం , చీరా , జాకెట్టు గుడ్డా వున్న కవరునిచ్చేసి ' ఆనందిచిన ఆ " మధ్య తరగతి " అమ్మ , క్రింది తరగతి కి చెందిన పని మనిషి చేసిన " ఖర్చులని " చూసి ( విని ) మూర్చపోయినంత పని చేసి " అయ్యో ! అపాత్రదానం చేశానా ? " అనుకుంటుందట !
గురువు గారు : బాబూ , ఐదు నిమిషాల ముందు " ఆదీ అంతం లేని విషయం అసంభవం " అన్నావు … గది లోకి వెళ్ళి వెతికిన తరువాత ఇప్పుడు ఒక వస్తువు ని కనుగొన్నావు . అప్పటికీ ఇప్పటికీ ఈ బాహ్య ప్రపంచం ఏమైనా మారిందా ? … లేదు కదా … మార్పు నీ మనసు లోనే ఉంది . రింగ్ అప్పుడూ ఉంది . . ఇప్పుడూ ఉంది . ఐతే ఇప్పుడు ఆ వస్తువుని చూడటం ద్వారా నీ మనసులో మొదలూ చివరా లేని వస్తువు సంభవించటం పై ఉన్న అపనమ్మకంపోయింది . అదే విధం గా నిష్కామ కర్మ అనేది ఒక ఊహ మాత్రమే అని నీకు అనిపించటానికి కారణం అలాంటి కర్మ నీకు వ్యక్తి గతం గా అనుభవం లోకి రాక పోవటమే . నిత్యం నీవు ప్రతిఫలం ఆశిస్తూ చేసే పనులలోనే ఏదో ఒక పనిని నువ్వు ప్రతిఫలాపేక్ష లేకుండా కూడా చేయగలవు . అది ఏ పని అనేది నీకు వెంటనే తట్టకపోవచ్చును . అయితే ఆ పని ఏదో తెలుసుకోవటం కోసం నువ్వు వెతికి చూడాలి . ఒక సారి దానిని నీవు కనుగొన్న తరువాత అది సంభవమేనని నీకు తెలుస్తుంది .
ఇలాంటి పిచ్చి రాతలను ప్రచారం చేయడం నా ఉద్దేశం కాదుగాని , ఏమాటకామాటే చెప్పుకోవాలి , తాటాకులు తేరగా దొరికాయిగదా అని ఎడాపెడా బరికేస్తే ఎంత నష్టం జరగబోతోమ్దోనని బయం మాత్రం పట్టుకుంది . అయినా అది ఇంగ్లీషులో ఎందుకు అఘోరిమ్చలేదో జుట్టూడేలా బుర్ర గోక్కున్న అర్ధమయ్యి చావలేదు . క్రితం వారం ఆ కవిత చదివినప్పటినుండి ఎంత తన్నుకున్నా చిక్కువీడడం లేదు . ఇవాళ ప్రొద్దున్నే కాపీ తాగుతుండగా ఎదురుగ వున్న # American Educator # పత్రిక అట్టమీద టైటిల్ # Teaching English Language Learners # చూసి ఇదేవితని తిరగేసాను .
ఆ దారి వెంట పోయి గుహలోకి వెళ్ళి ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని తీసుకుని వస్తూంటే ఎవరో వింత మనిషి వచ్చాడని జాంబవతి కేకలు వేసింది .
( ఈ ) ఇక ఎలాగూ తెలంగాణ వస్తోంది కాబట్టి , తెలంగాణలో ప్రత్యర్థుల నిర్మూలనకు కెసిఆర్ పూనుకున్నారు . టిడిపిిని దాదాపుగా తుడిచిపెట్టిన కెసిఆర్ తమను విడిచి పెడతారని కాంగ్రెస్ అధినాయకత్వం భావించడం లేదు . ప్రస్తుతం తెలంగాణలో కెసిఆర్ ప్రభ , కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తెలంగాణ ఇవ్వాలంటే భయపడే రీతిలో వుంది .
అయ్యా కార్తీక మాసం ! ! మొన్నటి సోమవరం , గుడికెళ్ళాం నాయనా . సోమవార పూజ గట్రా అయ్యాక నాయనా , దండవెట్టుకుని , తీర్ధం పుచ్చుకుని ఇంటికిచేరా నాయనా . ఛిల్స్ మొదలైయ్యాయి మహాప్రభో . వణికిపొయ్యా . ఏంటీ ? ఏమైంది ? చలి జరంగా ఉందా ఉన్నట్టుగా ఉంది ఏదీ సూణ్ణీ ? చల్లగానే ఉందే వళ్ళు ఏమో లోపల్లోపల ఉన్నట్టుంది దరమామీట్రీ పెట్టుకుని సూస్కో తొంభైతొమ్మిది పడుకో పాలుతాగి టైలినాల్ ఇవ్వు ఏస్కుని పడుకుంటా అయ్యింది . పొద్దున్నే మళ్ళీ దరమామీట్రీ నోట్లోఎట్టుకుని సూస్కుంటే నూట్రెండు . కళ్ళు బైర్లు కమ్మినై . ఎంటనే డాకటేరుకాడికి పరిగెత్తా . ఏట్రా సిన్నా జొరం ఏదీ సూణ్ణీ సూడు ఏంపర్లేదు , దీన్నే ఇన్ఫ్లుఎన్జా అంటారు . ఆడా ఈడా తిరగమాక . ఈ బిళ్ళలేస్కో . అట్టాగే . ఇక ఇంటికాడా , అవును . సానా మంది చెప్పారు . గుళ్ళో తీర్ధం పుచ్చుకుంటే విరోచనాలు అయినోళ్ళు ఉన్నారు , ఇలా జరాలొచ్చినోళ్ళూ ఉన్నారు , స్టమక్ అప్సెట్ ఐనోళ్ళూ ఉన్నారూ అని . బెదరూ ! ! కాబట్టి జాగరత్త .
బావుంది మీ విశ్లేషణ ! అప్పుడప్పుడూ చేదు తగులుతూ ఉంటే గానీ తీపి విలువ తెలియదు . ఇంకో విషయం ! ఎమ్మెస్ నారాయణ , ధర్మ వరం వేసే లెక్చరర్ , మరియు ప్రిన్సిపాల్ పాత్రల మీద మీరు ఒక టపా రాయలి .
చాలా రోజుల ( నెలల ) తరవాత ఈ వారంతం చక్కటి కళాస్వాదనలో ఆహ్లాదంగా గడిచింది . మెట్టుమెట్టుగా కిందికి దిగిపోతున్న వాతావరణ ఉష్ణోగ్రతకానీ , రెండ్రోజులపాటు మావూరి ఆకాశాన్ని పట్టి విడవని ముసురుగానీ ఈ హాయిని ఇసుమంతయినా తగ్గించలేకపోయాయి . శుక్రవారం సాయంత్రం పనులు తొందరగా చక్కబెట్టుకుని సాయంత్రం ఆరింటికల్లా బయల్దేరాను అరవై మైళ్ళదూరంలో ఉన్న ఏనార్బర్ నగరానికి . శుక్రవారపు సాయంత్రం రద్దీతో గంటంబావు పట్టింది గమ్యం చేరేప్పటికి . మిషిగన్ వివి వారి సంగీత కళాశాలలో మేకింటోష్ థియేటరులో ఏర్పాటయింది కచేరీ . నూటయిరవై మంది మాత్రం పట్టే చిన్న హాలు . విదుషి ఏ . కన్యాకుమారి , శ్రీ ఎంబార్ కణ్ణన్ గార్ల వయొలిన్ యుగళం . ( ఒక కుంటి ప్రశ్న - ఇంగ్లీషులో అయితే సింపుల్‌గా డ్యూయెట్ అనేస్తాం . వాద్య ద్వయాన్ని యుగళం అనొచ్చా ? ) మృదంగం మీద శ్రీ శ్రీముష్ణం రాజారావుగారు , కంజిర మీద ఆయన శిష్యుడు , టొరాంటో నివాసి కార్తీక్ వెంకటరామన్ తాళవాద్య సహకారం . కన్యాకుమారి గారు చిన్నవయసునుండీ మహావిదుషీమణి ఎమ్మెల్ వసంతకుమారి ఆంతరంగిక వాయులీన సహాయకురాలిగా కచేరీలలో పాల్గొంటూ వసంతకుమారి ( అది వారి గురువు జీ . ఎన్ . బాలసుబ్రమణ్యంగారు ధారపోసిన ) బాణీని పుణికి పుచ్చుకున్నారు . వసంతకుమారి కీర్తిశేషులైనప్పటినించీ ఎక్కువగా కదిరి గోపాలనాథ్ గారి శాక్సఫోన్ వాద్యానికి వయొలిన్ సహకారం అందిస్తూ వస్తున్నారు . ఈవిడ స్వంతగా కచేరీలిచ్చినది చాలా తక్కువ . ఎక్కువగా సహకారవాద్యాన్నే అందిస్తూ వచ్చారు . ఈ రోజు కచేరీ ఒక శ్రోతగా నాకు కనువిప్పు - కన్యాకుమారి గారు తన విద్యలో మరో పార్శ్వాన్నే కాదు , ఏకంగా విశ్వరూపం ప్రదర్శించారు ఆ వేదిక మీద . కచేరీ అద్యంతమూ పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో ఉన్నట్టుగా ఉంటూనే ఇదివరకు అనుభవానికి రాని కొత్తవింతల్ని ప్రదర్శించింది . చక్కగా వర్ణంతో మొదలు పెట్టారు నాటకురంజిలో . వెనువెంటనే గణపతి ప్రార్ధన మహాగణపతిం నాటరాగంలో . కృతి చివర సాధారణంగా వచ్చే చిట్టస్వరంతో బాటు అద్భుతమైన చమక్కులతో చమత్కృతులతో కల్పనాస్వరాలను గుప్పించి వదిలారు . నేరుగా క్షీరసాగరశయనా అంటూ కృతిలోకి వెళ్ళిపోయారు దేవగాంధారిలో . దీనికి కూడా కృతిముగిసిన తరవాత రసవత్తరమైన స్వరప్రస్థారం చేశారు . దేవగాంధారి కొంచెం plaintiveగా ఉంటుంది , ఈ కృతిలో మరీను . అట్లాంటిది కన్యాకుమారి చేసిన రూపకల్పనలో plaintive natureని అధిగమించి ఒక తారస్థాయిని చేరాలనే ఉప్పొంగిన ఉద్వేగం కనబడింది - సారీ , వినబడింది . కర్ణరంజని అనే అంతగా పరిచయంలేని రాగంలో ముత్తయ్యభాగవతారి బొత్తిగా పరిచయం లేని కృతి తరవాత , మళ్ళీ ఆలాపన ఏమీలేకుండా నేరుగా కృతి అందుకున్నారు . నా చెవుల్లోని ప్రతీ జీవకణమూ అది శంకరాభరణమనీ , స్వరరాగసుధ అనే త్యాగరాజ కృతియనీ ఘోషిస్తున్నాయి . కానీ నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను - ఏవిటి నిజంగానే ? ఛ , కాదు . అసలు శంకరాభరణం ఆలాపన లేకుండ ఎట్లా వాయిస్తారు ? పోనీ స్వరరాగసుధ కాదేమో . ఏదో ఇంచుమించు అలాగే ఉన్న ఇంకో రాగంలో ఇంకో పాట యేదన్నానేమో ? ఉహు , కాదు . రెణ్ణిమిషాల్లో నిర్ధారణ అవనే అయింది . ఆ పల్లవిలో అలలపై అలలుగా పేరుకుంటున్న సంగతులు , ఆ పాట స్వరరాగసుధ అనే నిర్ధారించేశాయి . ఏవిటబ్బా ఈ వింత ? ఆలాపన లేకుండా ? అయినా మన పిచ్చిగానీ రజతగిరీశుడు నగజకి దెల్పిన స్వరార్ణవ మర్మములను దెలిసిన త్యాగరాజు వెదజల్లే సుస్వరమాయ పరుచుకోడానికి ముందు ఆలాపన అనే అవలంబన కావాలా ? ముఖ్యాంశంగా నటభైరవిలో శ్రీవల్లీ దేవసేనాపతే , బహు విపులంగా , తాళవాద్యాల తని ఆవర్తనం యథావిధే . ఆ పైన ఎన్నెన్నో చిన్నచిన్న కృతులు , కీర్తనలు . . ఆనంద అలలో కొట్టుకుపోతున్నాను . మళ్ళీ తట్టిలేపిన ఒక వినూత్న అంశం . . ఏడు రాగాల మాలికలో గోవింద నామాలు . హ హ హ . . భలే . బహ్లే కాన్సెప్టు ! నీనామమే మాకు నిధియు నిధానము . . ఇంకొక సాహిత్యము కావలెనా ? శ్రీవేంకటేశా గోవిందా వేంకటరమణా గోవిందా . . గోవిందా హరి గోవిందా గోవిందా భజ గోవిందా . . రేవతి , వలజి , మోహన , హిందోళ , నాగస్వరావళి ( రెండు రాగాలు ఇప్పుడు గుర్తు రావట్లేదు ) . . అన్నీ ఐదు స్వరాల ఔడవరాగాలే . . గోవిందా , నీనామ మెంత రుచికరమయ్యా . . అదీనూ సప్తస్వరాలకి ప్రతీకలుగా నిలిచిన ఏడురాగాల్లో కూర్చితే , ఇహ అడుగుతావూ . . మధురాధిపతే , అఖిలం మధురం - మరోమాట లేదు . అటుపైన మధ్యమావతిలో ( ఇదీ ఔడవరాగమే ) భాగ్యదలక్ష్మిని రావించి ( అయ్యవారి వెంటనే అమ్మవారూ రావాలి గద ! ) గబగబా శివరంజనిలో తిల్లానా చూపించేసి పవమానసుతునితో మంగళం పాడించారు . తోడు వచ్చిన మిత్రులందర్నీ యథాస్థానాల్లో దింపి ఇల్లు చేరేప్పటికి పన్నెండున్నర ! ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినవాళ్ళు ఎవరో iCarnatic . org అనగానే కొంచెం ఆశ్చర్యమైంది . మధ్య ఇంటర్వల్లో వాళ్ళే చెప్పారు . కర్నాటకసంగీతంలో గొప్పగొప్ప కచేరీలన్నీ ఎందుకు చెన్నై వాసులకి మాత్రమే లభ్యం కావాలి , ప్రపంచంలో నలుమూలల్ల్లో ఉన్న కర్నాటక సంగీత అభిమానులకి కూడా ఎందుకు అందకూడదు అనే ఉద్దేశంతో మొదలు పెట్టారట ఈ iCarnatic . org . బానే ఉంది ఐడియా . శనివారం ఉదయం కంప్యూటరు మీద ఏదో పనులు చేసుకుంటూ ఉంటే అకస్మాత్తుగా స్ఫురించింది , అరె దసరాల ప్రత్యక్ష కవిసమ్మేళనం ఇవ్వాళ్ళేగద ! పొద్దువారు సాదరంగా పంపిన ఆహ్వానాన్నించి సభాస్థలిలో అడుగుపెట్టాను . అప్పటికే కవితాగానం జోరుగా సాగుతున్నది . అడుగు పెట్తినదే తడవుగా పుంభావసరస్వతుల సాక్షాత్కారం కలిగింది . ఆహా , భలే నిన్నమాపు సంగీత సరస్వతి నేడురేపు సాహిత్య పుంభావ సరస్వతి . భేష్ . తెలుగుపద్యం కామేశ్వర్రావుగారి అధ్యక్షతన సభ కడురమ్యంగా నడుస్తున్నది . నేను కొద్ది సేపు మాత్రం ఉండి . కొన్ని రసవత్తరమైన పూరణలు విని , కవిసభ్యులతోపాటు సరససల్లాపంలో పాలుపంచుకుని నిష్క్రమించాను . కార్యక్రమం మొత్తం పొద్దులో విజయదశమి సందర్భంగా ప్రకటితమవుతుంది . మా స్థానిక భారతీయదేవాలయంలో మరొక వయొలిన్ ద్వయం కచేరీ జరిగింది శనివారం సాయంత్రం . నాపనులు ముగించుకుని నేవెళ్ళేప్పటికి రసకందాయంలో పడుతున్నది . పూర్వికళ్యాణిలో త్యాగరాజస్వామివారి జ్ఞానమొసుగుచున్నారు . అటుపైన ముఖ్యాంశంగా భైరవి రాగంలో ముత్తుస్వామి దీక్షితుల బాలగోపాలుణ్ణి ప్రత్యక్షం చేశారు . భాగ్యశ్రీ ( హిందుస్తానీ వారి బాగేశ్రీ ) లో రాగం తానం పల్లవి . . రసికుల కనురాగమై , రసగంగలో తానమై , పల్లవించింది . మళ్ళీ ఎన్నెన్నో బుల్లి బుల్లి హొయలు సోయగాలు , భారతియార్ పాటలు , కావడి చిందులు . కచేరీ ముగిసినాక తారసపడిన తమిళమిత్రులతో విచారించాను , ఎవరీ యువకులు ? రామలక్ష్మణుల్లా ఉన్నారే ? అరుణ్ రామమూర్తి , శివ రామమూర్తి - లాసేంజిలస్ వాస్తవ్యులు , అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు . . ఆహా ఏమి విద్య , ఎలా నేర్చారయ్యా ? ఎంత చక్కటి సంగీత జ్ఞానం , ఏమా భక్తి ? మాతృదేశాన్నించి పర్యటనలకి వచ్చే వర్ధమాన వాద్యకారుల కెవరికీ తీసిపోకుండా , చక్కటి సమన్వయంతో వాయించారే ! జోహార్ , జోహార్ ! ఈ సంగీత సరస్వతిని ఇలాగే ఆరాధిస్తూ ఇంకా గొప్ప ఆనంద శిఖరాలకు చేరెదరు గాక ! శుభాశీస్సులు చిరంజీవులారా ! ! రాబోవు వారాంతంలో ( అక్టోబరు 9 , 10 ) ఇండియానాపొలిస్‌లో తెలుగు సాహిత్యసదస్సు జరగబోతున్నది . నేను హాజరయి తెలుగుబ్లాగుల సాహిత్య సేవ అనే అంశం మీద ఉపన్యాసం దంచబోతున్నాను . సభ వివరాలు వారి బ్లాగులో . పొద్దులో గిరిధర్ పద్య కావ్యం తప్పక చూడండి .
" హాయ్ ! ఇప్పుడు చాలా బిజీ ఇంకాసేపట్లో ' ఆట ' ప్రోగ్రాం వస్తుంది ఆ టైం కల్లా డిన్నర్ అయిపోవాలి , ఈరోజు గ్రాండ్ ఫినాలె ఏంటీ నువ్వు చూడడం లేదా ? " చకా చకా మాట్లడేస్తూ , బై చెప్పేసింది ఫ్రండ్ .
నేను వరంగల్ లో ఎంటెక్ చదివేటప్పుడు వేయిస్థంభాల గుడిని చాలా సార్లు సందర్శించాను . అది ఒకే డిజైన్ కలిగిన రెండు ఆలయాలు ఎదురెదురుగా ఉన్నట్లు నిర్మించబడి ఉంటుంది . ఒక్కో ఆలయం గోడలపై ఐదువందల స్థంభాలు చెక్కబడి ఉన్నాయి . కానీ వాటిలో ఒక భాగం నేను మొదట్లో అక్కడికి వెళ్ళినప్పుడే ( 2006 లో ) శిథిలావస్థకు చేరుకున్నది . పురావస్తు శాఖ వారు ఎన్‌ఐటీ వరంగల్ లోని కొంత మంది సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ల సాయంతో ఆలయంలోని రాతి స్థంభాలకు ఏదో నంబర్లు వేసి కూల్చివేశారు . ఈ పనిలో చాలా రాతి స్థంభాలు దెబ్బతిన్నాయి కూడా .
ఆంధ్రావాల్లు అంటే ఆంధ్రా పాలకులు . వీరిని ఆంధ్రా వరకు తరిమికొట్టాలి . విద్యార్థులు , పొట్టకూటికి వచ్చిన వాల్లను కాదు .
జాలి పడండి తప్పులేదు . నిజమా . . ఈ విషయం నాకు ఇంత వరకూ తెలియదు . అదీ సంగతి . వ్యాపార దృక్పధంతో నెలకొన్న ప్రాంగణంలో ఉచితంగా ఎందుకు ఇచ్చారా అని ఎంత ఆలోచించినా అర్దం కాని కొన్ని విషయాలు మెల్లమెల్లగా తేట తెల్లమౌతున్నాయి . ఏది ఏమైనా . . ఎలా చేసినా , ఏమి చేసినా వీరి ప్రమేయం కూడా ఉందన్న మాట . ఇదిగో ఇలాంటి వాళ్ళను చూస్తే అనిపిస్తూ ఉంటుంది . . ఏమని అంటారా . . " నిప్పు వీరు రాజేసారు . . మిగతా వాళ్ళు ఆజ్యం పోసారు " అని . ఇంత కాలం eతెలుగు వారికి మరియు పుస్తక ప్రదద్శన యాజమాన్యానికి మధ్య దాగి ఉన్న తెర వెనకాల వ్యక్తి వీరన్నమాట .
రత్నానాం మణ్డనాయ ప్రభవతి నియతోద్దేశలబ్ధావకాశం వహ్నేర్దార్వాది దగ్ధుం నిజజడిమతయా కర్తుమానన్దమిన్దోః యచ్చ ్తౖత్రెలోక్యభూషావిధిరఘదహనం హ్లాది వృష్య్టాశు తద్వో బాహుల్యోత్పాద్యకార్యాధికతరమవతాదేకమేవార్కతేజః 30
దక్కన్ రేడియో విషాదం పాడుతోంది . ఎవరో పోయారన్నట్టు దాని నిండా ఏడుపే . ఎవరు పోయారు ? ఎవరూ పోలేదు . హైద్రాబాద్ సంస్థానం మీద భారత ప్రభుత్వం పోలీసు చర్య చేసి , మూడోనాటికి తన సైన్యాలని హైద్రాబాద్ నడిబొడ్డున దింపింది . ఆ రాత్రే తన గరగరలాడే గొంతుతో నిజాం - ప్రజలను ఉద్దేశించి దక్కన్ రేడియోలో రెండు మూడు నిమిషాలసేపు మాట్లాడాడు . ఏం మాట్లాడినా దాని సారాంశం ఒక్కటే . లొంగుబాటు ! కాని , ఆ లొంగుబాటు ఎంత మంది జీవితాలను ఎలాంటి మలుపు తిప్పనుందో నిజాంకు తెలియదు . ముఖ్యంగా దిలావర్ జీవితం అతలాకుతలం అయిపోయింది . అందుకే అతడు రేడియో వింటూ పిడికిళ్లు బిగించాడు . పళ్లు పటపట కొరికాడు . కళ్ల వెంట వెచ్చటి కన్నీళ్లు కారుస్తూ ' ఒరే . . . నిజాం . . . మా చేత ఇదంతా చేయించి ఇప్పుడు లొంగిపోతావురా ' . . . అని దిక్కులు పిక్కటిల్లేలా కేకవేశాడు . దిలావర్‌కు అన్నెం పున్నెం తెలియదు . అందరిలాగే ఒక సాదాసీదా ఉద్యోగి . కాని , వాళ్ల మాటలూ వీళ్ల మాటలూ విని రజాకార్‌గా మారాడు . 1947లో దేశానికి స్వతంత్రం వచ్చింది . కాని , దేశంలో నిజాం కలవలేదు . పైగా ప్రభుత్వాన్ని ఎదిరించేందుకు , ప్రజలను అణిచేసేందుకు అల్లరిమూకలైన రజాకార్లను ప్రోత్సహించాడు . దిలావర్ లాంటి వాళ్లు - నిజామ్‌కే విజయం . . . హైద్రాబాద్ సంస్థానానికే విజయం . . . . అంటూ వీధుల్లో కరవాలం పట్టుకొని తిరిగారు . ఊళ్ల మీద పడి దోచుకున్నారు . అకృత్యాలు చేశారు . వాళ్ల భావన ఏమిటంటే - ఇదంతా శాశ్వతం . నిజాం శాశ్వతం . తమ వర్గం ఆధిపత్యం శాశ్వతం . కాని కల చెదిరిపోయింది . మహా బలగమైన భారత సైన్యం బూట్ల కవాతు కింద నిజాం కల చిట్లిపోయింది . ఎప్పుడైతే సైన్యం అడుగు పెట్టిందని తెలిసిందో ప్రజలు రజాకర్లను వెతకడం మొదలుపెట్టారు . దొరికినవాణ్ణి దొరికినట్టు నరుకుతున్నారు . ఇది ప్రతీకార సమయం . ఇప్పుడు దొరక్కపోతే మరెప్పుడూ దొరకరు . దిలావర్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు . వెంటనే పారిపోయాడు . నల్లగొండ నుంచి లారీ ఎక్కి హైద్రాబాద్‌లోని తన చిన్ననాటి హిందూ మిత్రుడైన స్వామి ఇంట తల దాచుకున్నాడు . స్వామి తప్ప తనకు దారి లేదు . నలిగిన బట్టలు , మాసిన గడ్డము , ఆకలి కడుపు , దిక్కుతోచని భవిష్యత్తు . . . ఇది దిలావర్ ప్రస్తుత మనఃభౌతిక స్థితి . స్వామికి ఇది ఇరకాటం . తన వర్గాన్ని వేటకుక్కల వలే వేటాడిన రజాకార్‌కు ఆశ్రయం ఇవ్వడమా ? కాని వాడు ఎవడు ? తన స్నేహితుడే ! శరుణుజొచ్చిన స్నేహితుణ్ణి - కాదు , పొమ్మని చెప్పడమా ? స్వామిలోని మనిషే గెలిచాడు . ఒరే . . . దిల్లూ . . . . ఇప్పుడు ఎలారా . . . ఏం చేయబోతున్నావురా . . . స్వామిలోని కరుణ దిలావర్ కోసం పరితపించింది . దిలావర్ ఏమీ మాట్లాడలేదు . మూడురోజుల పాటు మిత్రుడి ఇల్లు వీడలేదు . అప్పుడప్పుడు అతడు దిగులుగా కనిపించేవాడు . మరోసారి వెర్రెత్తినట్టుగా కనిపించేవాడు . బంధువులు , మిత్రులు వాళ్ల ఊళ్లో అతడు ఏమయ్యాడో తెలియక ఆందోళన చెందుతున్నారు . కొందరికైతే అతడు పోయాడనే నమ్మకం . దిలావర్ పెళ్లి విషయంలో మోసపోయాడు . అతడి భార్య చరిత్ర అంత సజావుగా లేదు . కనుక అతడికి ఎవరూ లేనట్టే . నాలుగో రోజు దిలావర్ మారువేషంలో బజారుకు వెళ్లాడు . తనకు కావలసిన కొన్ని ముఖ్యమైన వస్తువులు , బట్టలు కొనుక్కొని వచ్చాడు . మరేవో ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకొని వచ్చాడు . అతడు ఆ క్షణం స్వామి ఆశ్రయాన్ని వదిలి వెళుతున్నాడు . అతడు బహుశా తన జీవితంలో తానెంతో ప్రేమించే మిత్రుణ్ణి మరి కలవకపోవచ్చు . అతడు స్వామిని పిలిచి , ఒక మూట అతడి చేతిలో పెట్టాడు . దాని నిండా నిజాం కరెన్సీ , నగలు , కొన్ని నాణేలు ఉన్నాయి . ఆ మూట దగ్గర పెట్టుకొంటే ఒక తరం గడిచిపోతుంది . దిలావర్ అన్నాడు - స్వామీ . ఇంక సెలవు . నేను పాకిస్తాన్‌కు వెళ్లిపోతున్నాను . చేసిన పాపం చాలు . ఇంకా ఈ డబ్బు కూడా అనుభవించానంటే నరకానికి పోతాను . ఇది లూటీ సొమ్ము . దీని హక్కుదారులు ఎవరో ఎక్కడున్నారో ఇప్పుడు కనిపెట్టడం కష్టం . కనుక దీనిని వాపసు చేయాలనే ఆలోచన నాకు లేదు . దాని వల్ల ఉపయోగం లేదు . నా బంధువులెవరికైనా దీనిని ఇచ్చే ప్రయత్నం చేయవద్దు . వాళ్లు నన్ను , నాకంటే ఎక్కువగా ఈ పాపపు సొమ్మును అసహ్యించుకుంటారు . తీసుకోరు . కాని , నా మనసులో ఏముందంటే , నువ్వు వినవుగాని , ఒక స్నేహితుడిగా ప్రాధేయపడుతున్నాను , కన్నీళ్లతో వేడుకుంటున్నాను , ఇది నువ్వే ఉంచుకో . స్నేహితుడికి ఈ మాత్రం సాయం చేశానన్న తృప్తి నాకు ఉంటుంది . దీనిని వృధాగా పారేయడం కన్నా నీకు ఇవ్వడం మేలు . నా మాట విను . నువ్వు నా ప్రాణాలు నిలబెట్టావు . మీ అమ్మగారు ఈ పగవాడికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చారు . మీ ఇద్దరి రుణం . . . . . . దిలావర్ ఏడుస్తూ మరి వదల్లేక వదల్లేక వెళ్లిపోయాడు . మళ్లీ కనబడలేదు . ఏమయ్యాడో తెలియదు . పాకిస్తాన్ చేరాడో , చేరి అక్కడ బతికి బట్ట గలిగాడో లేదో ! కర్కశమైన కాలం ఆడిన చదరంగంలో ఆ పావు బల్ల మీద ఉండకుండా ఏకంగా నేలకే జారిపోయింది . స్వామి మాత్రం ఆ మూటను తీసుకెళ్లి , కొత్త ప్రభుత్వం తాజాగా నియమించిన అధికారి చేతిలో జాగ్రత్తగా పెట్టాడు , ఎవరి సొమ్ము వారికి అందజేయమని . కాని - మరికొన్నాళ్లకు స్వామికి ఏమి తెలిసిందంటే , కొత్తగా వచ్చిన అధికారులు మూటలు తెరిచి దక్కింది పంచుకుంటూ ఉన్నారని . ఒక పాలకుడు పోయాడు . ఇంకో పాలకుడు వచ్చాడు . అంతే తేడా ! కథ ముగిసింది . పాపం అనే తైలం వేసి దుర్మార్గం అనే దీపం వెలిగిస్తే అది ఎంతకాలం వెలుగుతుంది ? కొంతకాలం . . . ఇంకొంతకాలం . . . బహుశా మరికొంత కాలం . ఆ తర్వాత ఆరిపోక తప్పదు . గుర్తుంచుకోవలసిన సంగతి ఏమిటంటే ఈ దీపం వెలిగినంత కాలం గడిచిన రోజులు ఎక్కడికీ పోవు . చరిత్ర నుంచి మాయమైపోవు . ఎవరో తుడిచినట్టు తుడిచిపెట్టుకుపోవు . జ్ఞాపకాల్లో నిక్షిప్తమవుతాయి . అక్షరాల్లో నిక్షిప్తమవుతాయి . కథల్లో గాథల్లో నిక్షిప్తమవుతాయి . అలా నిక్షిప్తమైన కథే ' యుగాంతం ' . రచయిత నెల్లూరి కేశవస్వామి రికార్డు చేసిన డాక్యుమెంట్ ఇది . రజాకార్ల జీవితాల్లోని మరో ముఖం . నేడు ఆయన లేకపోవచ్చు . కాని కథ ఎక్కడికి పోతుంది ? పాపం వెలిగిన ప్రతిసారీ . . . ఇదిగో ఇలా దర్శనమిస్తూనే ఉంటుంది . - సాక్షి ఫ్యామిలీ నెల్లూరి కేశవస్వామి : గొప్ప రచయితగా కీర్తించి తీరవలసిన తొలితరం తెలంగాణ రచయిత . అన్‌సంగ్ హీరో . వీరు రాసిన ' చార్మినార్ కథలు ' ఒక కాలం నాటి హైద్రాబాద్ జీవితానికి దర్పణాలు . హైద్రాబాద్ ఇంజనీరింగ్ శాఖలో పని చేశారు . ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు పొందారు . 1984లో మృతి చెందారు . నూరేళ్ల తెలుగు కథకు ' సాక్షి ' సలాం send your response to sakshikatha @ gmail . com
మీరు చాలా అదృష్టవంతులు . మామూలుగా నూటికి తొంభై మంది కి నేను చెప్పిన లాంటి అనుభవమే ఎదురౌతుంది . మీరు ఆ మిగిలిన పది మందిలోని వారు . కిప్ ఇట్ అప్ .
అప్పుడు , బ్రహ్మగారు వేంచేస్తారు . హడావిడి మొదలు . . . . . . ' బియ్యం 6 శేర్లు , కొబ్బరి బొండాలు 9 , పసుపూ , కుంఖం , పంచామృతాలు , పువ్వులూ , గంధం , అక్షతలూ , అగ్గిపెట్టె . . . . . ' అంటూ పరుగులు పెట్టిస్తాడు . ( ఇవన్నీ యేర్పాటు చెయ్యడానికి మనం అప్పచెప్పినాయన పాపం వాళ్ల కూతురికి విరోచనాలు అవుతున్నాయని వాళ్లావిడ సెల్లో ఫోన్ చేస్తే , తన ' డెప్యుటీ ' కి ఆ బాధ్యతలు బదలాయించి లగెత్తి వుంటాడు . ఆ డెప్యుటీ ఆయన చెప్పింది పూర్తిగా వినకుండానే , ' అలాగే , అలాగే , అలాగలాగే , నేంచూసుకుంటాను , మీరు వెళ్లి రండీ ' అంటూ ఆయన్ని పంపేస్తాడు . తీరాచేస్తే , యేదెక్కడుందో వీడికి తెలియదు ! )
ఇంతకీ ఇప్పుడు ఏవీఎస్ గారి ప్రస్తావన ఇంత సడన్ గా ఎందుకట ? అనుకుంతున్నారా ?
తెలంగాణా కాంగ్రెస్ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాలు , పదవులే పరమావదిగా వహిస్తున్న అవకాశవాద మౌనం అంతేగాకుండా తెలంగాణా ఉద్యమం బలహీనపడిందని ప్రజలు " అభివృద్ధిని " మాత్రమే కోరుతున్నారని , ప్రజల తెలంగాణా రాష్ట్ర ఆకాంక్షను అవహేళనకు గురి చెయ్యడం వీటన్నింటి వల్లనే కరీంనగర్ ఉప ఎన్నికొచ్చింది . సంకీర్ణ రాజకీయ ధర్మాన్ని మరిచి తెరాసను బలహీనపరిచి తద్వారా తెలంగాణా ఉద్యమాన్ని రూపుమాపాలనే కాంగ్రెస్ దుర్బద్ధి ఫలితమే కరీంనగర్ ఉప ఎన్నిక . దీనిల్ల మేం కూడా రాజకీయంగా నష్టపోతున్నామన్న ఇంగిత జ్ఞానం కూడా కరువయింది మన కాంగ్రెస్ నాయక మన్యులకు . దీంట్లో సందేహమేమి లేదు .
23 సెప్టెంబరు 2008న ఫైర్‌ఫాక్సు 3 . 0 . 2 తెలుగు బీటా విడుదల అయ్యింది . మొజిల్లా నుండి మీరు తెలుగు ఫైర్‍ఫాక్సును తెచ్చుకొని , మీ కంప్యూటరులో స్థాపించుకొండి . మరిన్ని వివరాల కోసం ఫైర్‌ఫాక్సు తెలుగు వికీ చూడండి . కంప్యూటరుపై పూర్తి తెలుగు అనుభూతిని పొంది , మీ అమూల్య సలహాలు , సూచనలు ఫైర్‌ఫాక్సు మెయిలింగు లిస్టు కు ఈమెయిల్ ద్వారా తెలియ చేయండి . 2005 నుండి జరిగిన ఈ కృషిలో 1 . 5 వర్షన్ నుండి పని చేసిన స్వేఛ్చ జట్టు ( సునీల్ ) మరియు , 2 . 0 వర్షన్ చేసిన సి - డాక్ సంస్థ ( రామన్ ) , మరియు 2 . 0 . 0 . 13 మరియు 3 . 0 . 2 తెలుగు అనువాదానికి ముఖ్య కర్త అయిన క్రొత్తపల్లి కృష్ణబాబుకి అభివందనాలు .
మన విద్య వ్యవస్థ అసౌష్టవంగా తయారైనది . ఇంజనీరింగ్ కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు . మిగతా వాటికి ఇవ్వవలసిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు . పిల్లల కారీరు పెద్దలు నిర్దేశిస్తున్నారు . వారిని వారి ఇష్టాలకు వదలడం లేదు . ఐ . ఐ . టి . లోకి వెళ్ళేవారు అందరు ఇంజనీరింగ్ / సైన్స్ అంటె చాలా ఇష్టం ఉండి చేరినవారు కారు . అందులోకి నెట్టబడిన వారే . best minds వాళ్ళ ఇష్టాల వద్దా మత్రమె best గా పని చేస్తాయి . ఎవరు ఎక్కడకు పోవాలొ అక్కడకు పోనిస్తెనె మంచి ఫలితాలు ఉంటాయి . ఇక మన ఐ . ఐ . టి . లు మన గ్రామీణ భారతం పరిగణ లోకి తీసుకున్నట్లు లేవు . పాశ్చ్యాత్య కాపినె . మన ముద్ర లేదు .
వ్యాఖ్యలు రాయడం , అవసరం తీరగానే వాటిని డిలీట్ చేయడం మీకలవాటే అయినా మీరేం రాశారో నాకు గుర్తుంది . " చదివి వ్యాఖ్యలు రాసిన వారంతా " అని రాశారు . పైగా బుర్రలేదని నోటిదూల ప్రదర్శించడం ఒకటి ! మీ విమర్శల్లో ఏమాత్రం పస ఉందో అందరికీ మీరే స్వయంగా మీ వ్యాఖ్యల ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు ! నీతి సూత్రాలు చెప్పేవారందరికీ తమకు అవకాశం రాకపోవడం ఒక కారణం ! సాటి స్త్రీని ( రచయిత్రి ) గురించి చెత్తగా మాట్లాడకూడదనే కనీస సంస్కారం కూడా లేని మీరు నీతులు బోధిస్తూ . . . . . పైగా నీతులు బోధిస్తున్నారని అందరినీ అంటున్నారు !
విజయనగరం జిల్లాలో YSR కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ రెండోరోజు ఓదార్పు కొనసాగుతోంది . . .
జానారెడ్డితో చర్చల సందర్భంగా తెలంగాణ నాయకులు మాడ్లాడుతూ తెలంగాణ సాధనే తమ అంతిమ లక్ష్యమని చెప్పారు . తమపై ఎవరి ఒత్తిడీ లేదని రాజయ్య చెప్పారు . రాజీ పడేదే లేదు , తెలంగాణ సాధించి చూపిస్తాం అని కె . కేశవరావు చెప్పారు . ఈ సమావేశానికి పొన్నం ప్రభాకర్ , కె . కేశవరావు , వివేక్ , కోమటి రెడ్డి , మందా జగన్నాథం , గుత్తా సుఖీందర్ రెడ్డి , బలరాం నాయక్ ప్రభృతులు హాజరయ్యారు ,
క్లాసులో తెలివైనవాడుగా గుర్తింపు వున్న బీదపిల్లవాడు కృష్ణుడు . మంచి మార్కుల ఉన్నా థర్డుఫారమ్‌లో చేర్చించే శక్తిలేక చదువు ఆపెయ్యమంటాడు తండ్రి . తనకు చదువుకోవడం చాలా ఇష్టమని ఎంత బతిమాలినా ఒప్పుకోడు . ఒకరోజు ఇంటిలో ఉన్న కృష్ణుడిని చుట్టలు తెమ్మని డబ్బులు ఇచ్చి పంపిస్తాడు తండ్రి . చుట్టలు కొనడానికి బయలుదేరిన కృష్ణుడు అదే దారిలో ఉన్న తన బడిని చూస్తాడు . బడిలోకి వెళుతున్న తన సహచరులను కలుస్తాడు . వాళ్ళ దగ్గరున్న కొత్త పుస్తకాలను చూస్తాడు . వాటి కొత్తదనపు పరిమళలాలను ఆఘ్రాణిస్తాడు . అంతే వాడికి తాను స్కూలులో చదువుకున్న పాత రోజులన్నీ గుర్తుకు వస్తాయి . ఎలా తాను , తన సహచరులు పోటీ పడి మరీ చదివిందీ గుర్తుకువస్తుంది . దాంతో పాటే తాను ఇప్పుడు చదువుకోలేక పోతున్న విషయమూ గుర్తుకు వస్తుంది కృష్ణుడికి . అంతే దు : ఖమూ తన్నుకు వస్తుంది . దాంతో అలా ఏడుస్తూ ఆ బడిలోనే కూర్చుండి పోతాడు .
Rental car drive చేసుకుంటూ శివరాం Richmond airport నుంచి అపూర్వ కంప్యూటరూ , అరడజను పెట్టెలూ అన్నీ వేసుకుని యూనివర్సిటీకి బయలుదేరాడు . కాలేజీ ఆవరణలోకి ప్రవేశించగానే అక్కడ అంతా చెట్లూ , మంచి వాతావరణం చూసి , " చూశారా , మన Houstonలాగా కాకుండా ఈ వర్జీనియా ఎంత scenicగా ఉందో " అన్నాడు శివరాం .
నిన్న ఆదివారం తో చిన్న పిల్లల అధ్యాయం ముగిసింది . ఏంటో ప్రతి గురు , శుక్ర వారాలు ఈ కార్యక్రం కోసం ఎదురు చూడడం అలవాటు అయ్యింది . ఒక్క సారిగా ఇంత అభిమానాన్ని చూరగొన్న ఈ కూనలు మళ్ళీ పాడరు అన్న విషయం జీర్ణించుకోవడానికి కాస్త సమయం పట్టేలా ఉంది . . అద్రుష్టవశాత్తు బాలు గారి " పాడలని ఉంది " వెనువెంటనే చిన్న పిల్లల అధ్యాయం మొదలు పెట్టడం ఈ రత్నాలకు మర్రిన్ని మెరుగులు దిద్దడమే !
విద్యార్థి జెఎసి , తెలంగాణ వాదుల శాసనసభ ముట్టడి కార్యక్రమాన్ని పురస్కరించుకుని నగర పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది . శాసనసభకు చుట్టూ ఉన్న రహదారులన్నింటినీ సోమవారం ఉదయం నుంచి శాసనసభ సమావేశం వాయిదా పడే వరకు మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు . అలాగే నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ నెల 21 నుంచి 25 వరకు నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ ప్రకటించారు . ఈ ఆంక్షల మూలంగా సభలు , సమావేశాలు , ర్యాలీలు , ప్రదర్శనలు నిర్వహించరాదని ఆదేశించారు . పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని , శాసనసభలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను నిరసిస్తూ విద్యార్థులు , తెలంగాణ వాదులు శాసనసభ ముట్టడికి ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళనకారులు భారీగా సమీకృతమవుతున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు . శాసనసభ వైపునకు వచ్చే రహదారులన్నింటిని మూసివేసి , ట్రాఫిక్‌ను ఇతర రూట్లలో మళ్ళిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు . ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ట్రాఫిక్ ఆంక్షలు సోమవారం సభ వాయిదా పడే వరకు కొనసాగుతాయన్నారు . ఈ 45 రోజుల సమావేశాల్లో ఎప్పుడు తప్పని పరిస్థితి వస్తే అప్పుడు ఇదే తరహాలో నిషేధాజ్ఞలు విధిస్తామని ఆయన తెలిపారు . శాసనసభకు హాజరయ్యే సిబ్బంది , విలేఖరులు , చుట్టుపక్కల ప్రభుత్వ , ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు తమ వద్ద ఉన్న ఐడి కార్డులను తప్పకుండా తీసుకురావాలని , వాటిని చూపించి విధులకు హాజరు కావచ్చని అన్నారు . ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి వచ్చేందుకు సన్నాహాలు చేయడంతో వారిని ఒయు నుంచి బయటకు రాకుండా చుట్టూ పారా మిలటరీ బలగాలను మోహరింప చేశారు . రాజ్‌భవన్ , సచివాలయం ముట్టడి సందర్భంగా కూడా పోలీసులు ఆయా ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరింప చేశారు . నగరంలో ఉన్న భారీ పోలీసు బలగాలను అవసరమైన అన్ని ప్రాంతాలకు తరలించారు . సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ బలగాలను సిద్ధం చేశారు . జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చే ఆందోళనకారుల వాహనాలను శివారుల్లోనే నిలిపి వేసి వారిని అక్కడే ఆపివేసేందుకు సైబరాబాద్ పోలీసులు ఏర్పాట్లు చేశారు .
సరసానికైతే పరవాలేదు . లేకుంటే , భార్య భర్తను కొట్టినట్లు , రాబోయే కోడలు , కొడుకుని కొడుతుంది . అత్త గారిని ఆదర్శంగా తీసుకుంటుంది . భర్తలు బహు పరాక్ . . . . : )
యత్ప్రాచ్యాం ప్రాక్చకాస్తి ప్రభవతి చ యతః ప్రాచ్యసావుజ్జిహానా దిద్ధిం మధ్యే యదహ్నో భవతి తతరుచా యేన చోత్పాద్యతేహః యత్పర్యాయేణ లోకానవతి చ జగతాం జీవితం యచ్చ తద్వో విశ్వానుగ్రాహి విశ్వం సృజదపి చ రవేర్మణ్డలం ముక్తయేస్తు 77
' ' తమ ( బిజెపి ) ఐదు మాసాల సంకీర్ణం కుప్పకూలిపోవటానికి బిజెపి బాధ్యురాలు . రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి పదవిని ఆశించి మద్దతు ఉపసంహరించింది . బిజెపి అధికార దాహనికి ఇది ఉదాహరణగా పేర్కొనవచ్చు ' ' అని కిషోర్ చెప్పారు .
మంచి వ్యాసం , మాఊరు అందమైనది అనుకోని వారు ఉంటారా ? అదీ పల్లెలగురించి అయితే వేరే చెప్పాల్సిన అవసరం లేనేలేదు . మా ఊరు జ్నాపకాల మంచి గందం . మాఊరు మరుమల్లెల సౌరభం , ఇంకా చాలా సౌరభాలు , వాసనలు , జ్నాపకాలు చాలా చాలా . . . . మరోసారి అభినందనలు .
ఈ మధ్య ఇండియా వెళ్ళినప్పుడు పిల్లల కథల పుస్తకాలు కొన్ని తెచ్చాను . వాటిలోంచీ మా అబ్బాయికి రోజు రాత్రి పడుకునే ముందు ఒక కథ ( ఒక్కో రోజు - రోజంతా తక్కువ అల్లరి చేస్తే బోనస్ గా రెండో కథ ) చదివి వినిపిస్తున్నాను . వాడు చాలా ఆసక్తిగా వింటున్నాడు . కథ చెప్పనేమోనన్న భయంతో అల్లరి కూడా తగ్గిస్తున్నాడు . కథ మధ్యలోనో , కథ అయిపోయాకో చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతున్నాను . వాటికి వాడు చాలా వరకు మంచి సమాధానాలే ఇస్తున్నాడు . కానీ , వాడు అప్పుడప్పుడూ అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వడం నాక్కొంచెం కష్టంగా ఉంటోంది . ఉదాహరణలు - 1 . ' నక్క తెలివిగా కాకిని పాడమని అడిగింది ' అని చదవగానే , ' తెలివి ' అంటే ఏమిటి అని ప్రశ్న . నాలుగేళ్ళ పిల్లలకు ( మా అబ్బాయి వయసు నాలుగు కంటే తక్కువే ) తెలివి అంటే ఏమిటో , వాళ్ళకు తెలిసిన పదాల్లో , ఉదాహరణలతో ఎలా చెప్పాలి ? 2 . ' నక్క కాకిని మోసం చేసింది ' అన్న దాన్లో ' మోసం ' అంటే ఏమిటి అని అడిగాడు . ఎలా సమాధానమివ్వొచ్చు ? 3 . ' మొసలి , కోతిని చంపి తినాలనుకుంది ' లో - చంపి - లేక చంపడం అన్న దాని గురించి ఎలా చెప్పొచ్చు ? వాడు కథలు ఫాలో కావడం గమనిస్తే - వాడి వయసుకు మించిన పుస్తకాలు ( కథలు ) చదువుతున్నానేమోనన్న సందేహం రావడం లేదు . ఇలాంటి చిన్న చిన్న పదాలకు క్లుప్తంగా , ఆసక్తికరంగా అర్ధాలు చెపితే , పిల్లల పదజాలం పెరుగుతుందని నమ్మకం !
ఇలాంటి విషయాలను చదువుతుంటె , పాపం అమెరికా వాళ్ళు మాత్రమే పిసినారోళ్ళు కదనిపిస్తోంది . ఇలా అమెరికా వారి గురించి వ్రాసినందుకు కించిత్ బాధగా ఉన్నా , ఎక్కడ ఎనిమిది వందల బిలియన్ డాలర్లు ఎక్కడ ఇరవై బిలియన్ డాలర్లు , లేదు కాదు అనుకుంటే , అధికపక్షం ఓ ఎనబై బిలియన్ డాలర్లను బేరీజు వేసుకుంటే , అమెరికా వాళ్ళ గురించి అలా వ్రాయడం పెద్ద విషయం కాదని దానిగురించి నేను అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తోంది .
మన దేశములో తాంబూలం తయారీ అద్భుత కళగా వృద్ధి గాంచినది .
నవనీత్ కౌర్ తెలుగు , తమిళ , మళయాళ భాషలలో కలిపి దాదాపు గా ఓ పదిహేను చిత్రాలు చేసింది .
తనని తాను తిట్టుకోడానికి మాత్రమే అయితే చలం పుస్తకాలు రాసి ప్రపంచం మీద వదిలి నానా దుమారం లేపాల్సిన అవసరం లేదు కదా ! బీడిలు కాల్చేవాడు కాదు గాని ఎప్పుడూ నోట్లో పైపుతో కనబడే ఒకాయన అరవై ఏళ్ళ క్రితం మాటల్లో :
అభివృద్ధి పేరుతో ఆదివాసీల విధ్వంసక ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ అనేక వ్యాసాలు రాయటంతోపాటు ప్రత్యక్షంగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొని ఆదివాసీ ఉద్యమ కార్యకర్తలకు ఉత్తేజాన్ని కలిగించారు . ఆదివాసీల ఉనికిని దెబ్బతీసే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని , ప్రైవేటు భాగస్వామ్యంతో బాక్సైట్ ఖనిజాల కోసం ఆదివాసీ గుండెల్లో గునపాలు గుచ్చుతున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆదివాసీలను ఉద్యమింపచేసారు .
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అన్ని రాజ కీయ పార్టీలకు విదేశాలకు తరలిన నల్లధనమే ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది . విదేశాల నుండి నల్లధనాన్ని వెనక్కి రప్పిం చాలనే దృఢసంకల్పం అన్నిపార్టీల్లో వ్యక్తమయింది . ఆ విధంగా ప్రజలకు హామీ ఇచ్చారు కూడా . ఈ నేపథ్యంలో నల్లధనం వివ రాలను , వెనక్కి రప్పించే మార్గాలను , ఆ దిశగా ఇప్పటి వరకు తీసుకొన్న చర్యలను గురించి చర్చించే వ్యాసమిది . పారిశ్రామిక వేత్తలు , రాజకీయ నాయకులు , అధికారులు , సినిమా నటులు , వ్యాపారవేత్తలు , స్మగ్లర్లు తదితరుల్లో కొందరు పన్నులు ఎగవేయడం , వాణిజ్య లావాదేవీల్లో తప్పుడు లెక్కలు చూపించడం , హవాలా లావాదేవీలు , అవినీతి కార్యౖకమాలకు పాల్పడటం , మాదకద్రవ్యాల అక్రమరవాణా వంటి నేరాలకు పాల్పడి సంపాదించిన సొమ్మును విదేశీ బ్యాంకుల్లో దాచుకోవ డం కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నప్పటికి గత కొన్ని సంవత్స రాలుగా ఈ వ్యవహారం చాలా ఎక్కువగా జరుగుతున్నది . నల్లధనాన్ని అదుపు చేయడానికి ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి కాని ఏ దేశంలోను ఈ ప్రయత్నం సఫలం కాలేదు . ప్రపంచంలోని అన్ని దేశాల్లో నల్లధనం సమాంతర ఆర్థిక వ్యవ స్థగా నడుస్తోంది . ప్రపంచంలోని 70 దేశాల్లో నల్లధనం దాచుకో వడానికి ట్యాక్స్‌హెవెన్స్ ( పన్నులు లేని స్వర్గాలు ) గా ఉపయోగ పడుతున్నాయి . స్విట్జర్లాండ్ లోని యుబిఎస్ , లీప్టెన్ స్టీన్‌లోని ఎల్‌జిటి వంటి కొన్ని బ్యాంకుౖలు నల్లధనాన్ని దాచుకోవడానికి ప్రపంచ ప్రఖ్యాతి చెందినవిగా పరిగణిస్తారు . స్విట్జర్లాండ్ , మారి షస్ , జర్మనీ మరియు ఇతర ట్యాక్స్ హెవెన్ దేశాల బ్యాంకు లకు నల్లధనం ప్రవాహంలా చేరుతున్నది . నల్లధనం నిల్వలను గురించి వివిధ సంస్థలు వివిధ రకాలుగా అంచనా వేశాయి . ఆర్థిక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలోని ఒక్క శాతం సంపన్నుల దగ్గర ప్రపంచ సంపదలో 57 శాతం ఉంది . ట్యాక్స్ జస్టిస్ నెట్‌వర్క్ అనే సంస్థ 2005లో ప్రకటించిన పరిశోధనా ఫలితాల వివరాల ప్రకారం ప్రపంచం మొత్తం మీద ధనవంతులు తమ సంపదలో 11 , 50 , 000 కోట్ల డాలర్లు విదేశీ బ్యాంకుల్లో దాచుకొన్నారు . వాషింగ్టన్ కేంద్రంగా పని చేస్తున్న గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటి ( జిఎఫ్‌ఐ ) సంస్థ ' 2002 - 2006 మధ్య వర్థమాన దేశాల నుంచి అక్రమంగా ఆర్జించిన నిధుల ప్రవాహం అనే అంశంపై 2008 డిసెంబర్‌లో విడుదల చేసిన నివేదిక ప్రతీ ఏడాది లక్షకోట్ల డాలర్ల నల్లధనం ట్యాక్స్‌హెవెన్స్‌కు చేరుతున్నదని తెలుపుతున్నది . ఆర్థిక సహకా రం , అభివృద్ధి చెందిన దేశాల సంఘటన ( ఓఇసిడి ) అంచనాల ప్రకారం ట్యాక్స్‌హెవెన్స్‌లో 17లక్షల కోట్ల నుంచి 115 లక్షల కోట్ల డాలర్లవరకు నల్లధనం పేరుకుపోయి ఉంది . ట్యాక్స్‌హెవెన్ దేశాలకు చేరిన నల్లధనంలో 50 శాతంపైగా ఆసియా దేశాల నుంచి చేరినదే . ఆసియా దేశాల నుంచి తరలిన నల్లధనంలో కూడా అధిక వాటా భారత్‌దే కావటం గమనార్హం . స్విస్ బ్యాం కింగ్ అసోసియేషన్ 2006 నివేదిక ప్రకారం స్విట్జర్లాండ్ లోని బ్యాంకుల్లో అత్యధికంగా నల్లడబ్బు దాచుకొన్న మొదటి ఐదు దేశాల్లో భారతదేశం 1456 బిలియన్ డాలర్లు ( సుమారుగా 72 , 00 , 000 కోట్ల రూ . లు ) , రష్యా 470 బి . డా . , బ్రిటన్ 390 బి . డా . , ఉక్రెయిన్ 100 బి . డా . , చైనా 96 బి . డా . గా ఉన్నాయి . ఈ గణాంకాలను బట్టి చూస్తే భారతదేశానికి చెందిన నల్లధనం మిగతా నాలుగుదేశాల మొత్తంకన్నా ఎక్కువ . ఇతర అంతర్జా తీయ బ్యాంకుల్లో మన సంపద ఇంకా ఎంత ఉందో తెలియాల్సి ఉంది . స్విస్ బ్యాంకుల్లో ఉన్నదని భావిస్తున్న మన దేశ నల్లధనం , మనదేశం విదేశాలకు బాకీ ఉన్నదాని కంటే 13 రెట్లు ఎక్కువ . స్విస్ బ్యాంకుల నుండి మన నల్లధనాన్ని వెనక్కి రాబ ట్టగలిగితే విదేశాలకు ఉన్న అప్పులను తీర్చిన తర్వాత కూడా 12 రెట్ల ధనం మిగిలి ఉంటుంది . మిగిలిన ధనం మీద వచ్చే సాధారణ వడ్డీ కేంద్ర ప్రభుత్వపు వార్షిక బడ్జెట్ కన్నా ఎక్కువ . అంతర్జాతీయ స్వేచ్ఛా విపణిలోని లోపాల వల్లనే ఇంత భారీ మొత్తంలో నల్లధనం విదేశాలకు తరలిపోతున్నది . ఏ దేశమైనా అక్రమార్జన గురించిన లేదా సివిల్ , క్రిమినల్ కేసులకు సంబంధించిన ఖచ్ఛితమైన ఆధారాలు చూపకుండా ఖాతాల వివరాలను బహిర్గత పరి చేందుకు స్విస్‌చట్టాలు , ఓఇసిడి మోడల్ ట్యాక్స్ విధానం అనుమతించవు . అయితే విదేశ ప్రభుత్వాలు నిర్థిష్ట ఆధారాలతో చేసిన అభ్యర్థనలను పరి గణనలోనికి తీసుకొని ఆ ఖాతాల్లోని నిధులను సంబంధిత దేశా లకు పంపడం లేదా స్తంబింపచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి . ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ ఖాతాలో ఉన్న 62 - 40 కోట్ల డాలర్లు , నైజీరియా మాజీ అధ్య క్షుడు సనీ అబాచా ఖాతాలో ఉన్న 45 - 80 కోట్ల డాలర్లు , పెరూ గూఢాచార సంస్థ మాజీ అధిపతి వ్లదిమిరో టారిస్ ఖాతాలో ఉన్న 7 . 70 కోట్ల డాలర్లను స్విస్ ప్రభుత్వం ఆయా దేశాలకు స్వాధీనపరచింది . భోఫోర్స్ కుంభకోణంలో 64 కోట్ల రూపాయల ఖాతాను , హైతీ అధ్యక్షుడు డువాలియర్ ఖాతాను స్తంభింప చేశారు . భారత్‌తో సహా 70 దేశాలతో స్విట్జర్లాండ్ ద్వంద్వ పన్నుల ఒప్పందం కుదుర్చుకొంది . 1995లో కుదిరిన భారత్ , స్విస్ ద్వంద్వ పన్నుల ఒప్పందం ( డిటిఎఎ ) లోని రహస్య నిబంధనలకు సవరణలు జరిగితే పన్నులకు సంబం ధించి ఇరు దేశాల మధ్య సమాచార మార్పిడికి అవకాశం ఏర్ప డుతుంది . అప్పుడు మనదేశ ఖాతాలు వివరాలను స్విస్ ప్రభు త్వం వెల్లడించడానికి అవరోధం ఉండదు . స్విస్ ప్రభుత్వం రహస్య ఖాతాల వివరాలను అందించినప్పటికి అక్కడ ఉన్న మొత్తం నిధులను స్వాధీనం చేసుకొనే అధికారం భారత ప్రభుత్వానికి ఉండదని , కొంత జరిమానా లేదా శిక్షలు మాత్రమే వేయవచ్చని కొందరి అభిప్రాయంగా ఉంది . కానీ ఐర్లండ్ దేశం తమ నల్లధనాన్ని తిరిగి తీసుకుపోవడంలో విజయం సాధిం చింది . తమ దేశంలో కోట్లాది డాలర్ల పన్నుల ఎగవేతకు స్విస్ ప్రమేయం ఉందంటూ అమెరికా ప్రభుత్వం దావా వేయడంతో స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం ఎబిఎస్ అమెరికాకు 78 - 80 కోట్ల డాలర్లు జరిమానాగా చెల్లించింది . అంతేకాక అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ విభాగం చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పం దించిన ఎబిఎస్ ఎజి బ్యాంక్ 4450 ఖాతాల వివరాలను అమెరికాకు అందించింది . ఫ్రాన్స్ , బ్రిటన్ దేశాలు సైతం అమె రికా దారిలో నడుస్తున్నాయి . భారత్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయవలసి ఉంది . ఇటీవల లీచ్‌స్టెన్‌స్టీన్‌లోని ఎల్‌జిటి బ్యాంకు 1500 ఖాతాల వివరాలను జర్మనీకిచ్చింది . భారత్ విజ్ఞప్తి మేరకు రహస్యంగా ఉంచాలనే షరతుతో జర్మనీ ప్రభుత్వం భారత్‌కు కావలసిన సమాచారాన్ని అందించినట్టు తెలిసింది . 15 ఏళ్ళ క్రితం కేంద్ర రెవెన్యూ శాఖ రూపొందించిన జాబితా మరొకటి ఉంది . ఈ రెండు జాబితాల ఆధారంగా భారత్ దౌత్యపరంగా , న్యాయప రంగా చర్యలు చేపట్టవచ్చు . పన్ను ఎగవేతదారుల పేర్లను బహి ర్గతం చేసి విదేశాలకు సహకరించేందుకు ఓఇసిడి ప్రమాణాలను పాటిస్తానని స్విస్ అంటోంది కాబట్టి భారత్ నిర్దిష్ట సమాచా రంతో స్విస్ ప్రభుత్వాన్ని సంప్రదించాలి . ట్యాక్స్‌హెవెన్ దేశా లను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాలు చేయాలి . భారత్ నుంచి స్విట్జర్లాండ్‌కు ఏటా 80 , 000 మంది ప్రయాణం చేస్తుంటారు . అందులో 25 , 000 మంది చాలా తరచుగా వెళ్ళి వస్తుంటారు . వీరి ఆర్థిక లావాదేవీల మీద నిఘా ఉంచాలి . ప్రపంచంలోని ప్రైవేట్ సంపదలో దాదాపు మూడింట ఒక వంతు స్విస్ బ్యాంకుల్లోనే ఉంది . డబ్బు దాచిపెట్టిన వారు ఇతరులకు చెప్పకుండా చనిపోవడం వల్ల కూడా పెద్ద మొత్తంలో సంపద స్విస్ బ్యాంకుల్లో మూలు గుతున్నది . తినడానికి తిండి లేక ఆకలిచావులు సంభవించటం , ఉపాధిలేక యువత నిర్వీర్యం కావటం , ఆర్థిక మాంద్యంతో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్ప కూలటం వంటి దుష్పరిణా మాలను ఆదుకొనే సంపద ట్యాక్స్ హెవెన్ దేశాల బ్యాంకుల్లో మూలుగుతుండటం సమర్దనీయం కాదు . ఈ విధంగా తృతీయ ప్రపంచ దేశాలన్నింటికీ ఆందోళన కలిగిస్తున్న నల్లధనం సమస్యను నిర్లక్ష్యం చేయటం తగదు . స్విస్ బ్యాంకుల్లో తమ దేశస్థుల వివరాల కోసం వచ్చే అభ్యర్థన లను తిరస్కరించడం స్విస్‌కు మేలు చేయదని గతంలో స్విస్ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన రూలింగ్‌ను ఆచరించడం స్విస్ ప్రభుత్వ నైతిక బాధ్యత .
ఈ ప్రకారముగ ' కర్మసమర్పణ ' యోగముతో గూడినవాడవై పుణ్యపాపములు ఫలములుగాగల కర్మబంధములనుండి నీవు విడువబడగలవు . అట్లు విడువబడినవాడవై నన్ను పొందగలవు .
నిన్న ఆఫీసు కి వచ్చాక పనిలో పడ్డాం . ఒంటి గంటకి బోజనానికి వెళ్ళాం . బయట సూర్యుడిని చూస్తే ' దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది ' . అంత అలా ఉంది వేడి . సరే భోజనం చేసి మరల ఆఫీసు కి వచ్చా . కానీ తల అంతా వేడి పట్టినట్లు అయ్యింది దానికి తోడూ కొంచెం శిరోభారం . అలా సాయకాలం అయ్యింది . ఇంటికి బయదేరుదాం అని బండి తీసి కొంచెం దూరం వెళ్ళాం . బండి పంక్త్యర్ అయ్యింది . ' ఇది ఏంటిరా [ . . . ]
పెప్సీ కోలాల్లో పురుగుమందులున్నాయంటే ఏదో ఖాన్ దాదాతో గ్లామర్ ప్రకటనలిచ్చి జనాల గొంతుల్లోకి విషం దింపినట్టు తియ్యతియ్యగా . ప్రభుత్వ పథకాల్లో అవినీతి 90రూపాయలను నూటికి మింగేస్తుందంటే మరో వెయ్యి కోట్లు నజరానాగా ఇచ్చి ముసలి యువ తిలకునితో ప్రకటనలిచ్చి జనాల కొంపా గోడు తవ్వి పారేసి నెత్తిన ఉచిత గొడుగు , కింద ఉచిత చాపా కార్యక్రమానికి తియ్యతియ్యగా స్వీకారం .
నాకు అనిపించినదేమిటంటే , మిత్రుడు కాకపోయినా కనీసం శత్రువు మాత్రం కాదు అని । ముఖ్యముగా మన పాకిస్తానుకు పొరుగువాడు , మనకు చాలా సంస్కృతీపరం దగ్గరవాడు ( ? )
ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గార శివరాత్రి గురించి ఆడుగుతుంది . అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇషటమనీ , ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తనెంతో సంతోషిస్తానని చెబుతాడు . ఆయన చెప్పిన దాని ప్రకారం , ఆ రోజు పగలంతా నియమ నిష్ఠతో ఉపవాసంతో గడిపి , రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో , తర్వాత పెరుగుతో , ఆ తర్వాత నేతితో , ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది . మరునాడు బ్రహ్మవిదులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి . దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు .
ఒక జాతి మనుగడకు భాష అవసరం . భాషలేకుండా బతకడం అసంభవం . ఆ భాష సజీవంగా కొనసాగాలన్నా నిరంతరం దాని గురించి అధ్యయనం జరగాలి . అవసరాన్ని విస్తృత పరచాలి . భాష వినియోగం పెరగాలి . ఎవరికైనా విషయం మాతృభాషలోనే సులువుగా అర్థం అవుతుంది . సమగ్రంగా ఆకళింపుచేసుకొని , అవగాహనపరుచుకోవటానికి వీలవుతుంది . తెలుగు భాషను సజీవంగా ఉంచడం కోసం అనాదిగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి . వీటిలో పీకాక్ క్లాసిక్స్ వారు చేస్తున్నది అద్వితీయమైనది . ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు భాషలోకి తీసుకురావాలన్న వారి ధ్యేయం గొప్పది . విశ్వవిద్యాలయాలు చేయాల్సిన పనిని వీరు తమ భుజస్కంధాలపెై మోస్తున్నారు . ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వంద పుస్తకాలకు పెైగా తీసుకొచ్చారు . తెలుగు భాషా ప్రేమికులంతా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు .
అంతే తీవ్రంగా ' ' వద్దు . వాని భూమివద్దు . మన్ను వద్దు . ఇన్ని రోజులు బతుకలేదా . . ఇప్పుడు బతుకమా … ' ' అన్నాడు ఇమామ్ ఆ మాటలంటున్నప్పడు అతడిగొంతు ఏడుపుతో కూరుకుపోయింది .
అప్పటికి చాల మంది కలుపుకున్న పప్పూ అన్నం తినడమే పూర్తికాదు . ఇంకొంతమందైతే , పలావు పూర్తిగా లాగించి , తరవాత అన్నంలోకి వచ్చే టైము వుందా ? ! అని ఆలోచిస్తూంటారు . కొంతమందైతే , ఆ పప్పూ అన్నంలోనే , ఒక్కో కూరా అద్దుకొని తినేస్తూ వుంటారు - - వదల్లేక , వదల్లేక , మధ్యలో వడియాలు పీక్కుంటూ .
ఆడజనాభా తగ్గడానికి కారణం - తల్లిదండ్రులు ఆడపిల్ల వద్దనుకోవడమేనని భావించబడుతోంది . గర్భంలో ఉన్నది ఆడపిల్లో , మగపిల్లవాడో తెలుసుకునే పద్ధతులు వచ్చినప్పట్నుంచి ఆడభ్రూణాలకు దుర్గతి ప్రారంభమైన మాట వాస్తవం . ఈ పద్ధతులు నాకు తెలిసి గతశతాబ్దంలో ఎనభైలలో - అంటే నా చిన్నప్పుడు వచ్చాయి . అప్పట్లో యామ్నియో సెంటెసిస్ అనేవారు . ఆ విధమైన పద్ధతుల్ని వాడి ప్రసూతిపూర్వ లింగ నిర్ధారణ చెయ్యడాన్ని నిషేధిస్తూ అప్పట్లో ప్రభుత్వం ఒక చట్టం కూడా చేసింది . దరిమిలా అల్ట్రా - సౌండ్ శ్కాన్ ( అతిసూక్ష్మధ్వనుల ద్వారా పరకాయింపు ) పరికరాలు అందుబాటులోకి రావడంతో యామ్నియో సెంటెసిస్‌తో వైద్యులకు అవసరమే తప్పిపోయింది . పర్యవసానంగా ఆ చట్టానికి కాలదోషం పట్టింది . అల్ట్రా - సౌండ్ శ్కాన్‌లని నిషేధించడం సాధ్యం కాదు . ఎందుకంటే అవి బహుళార్థక సాధనాలు . వాటి ద్వారా కేవలం ప్రసూతిపూర్వ లింగ నిర్ధారణే కాక ఇంకా ఎన్నో నిర్ధారిస్తారని విన్నాను . ఈ పరిస్థితుల్లో గర్భస్థ శిశువు యొక్క లింగాన్ని పైకి వెల్లడించడం మీద మాత్రమే ప్రభుత్వం నిషేధం విధించి ఊరుకోవాల్సి వచ్చింది . ఈ నిషేధం ఏమాత్రమూ పని చెయ్యట్లేదని జనాభా లెక్కలు వెల్లడిస్తున్నాయి . చట్టానికి దొఱక్కుండా గర్భస్థ శిశువుల లింగాన్ని తల్లిదండ్రులకు వెల్లడించడం కోసం జనం మఱింత సృజనాత్మక పద్ధతుల్ని ఆవిష్కరిస్తున్నారు . ఉదాహరణకు - గుజరాతులో గర్భవతిని పరీక్షించినాక వైద్యుడు / వైద్యురాలు బయటికొచ్చి " జై శ్రీకృష్ణ " అంటే కడుపులో ఉన్నది మగపిల్లవాడనీ , " జై శ్రీ మహాలక్ష్మి " అంటే ఆడపిల్ల అనీ అర్థం చేసుకుంటారు . ఆ తరువాత శ్రీకృష్ణుడి కోసం శ్రీ మహాలక్ష్మిని చంపేస్తారనుకోండి .
' బాల్ లేదు గీల్ లేదు పో అవతలకి ' అంటూ వాడి మొహం మీదే తలుపేశాను విసురుగా ) .
@ ఆ . సౌమ్య : చాలా థాంక్స్ అండి ఉలవచారు ( పులుసు ) రెసిపీ చెప్పినందుకు . అన్నీ అందరికీ తెలిసినవేనండి . ఒకచోట పెడితే ఎవరైనా " స్టాటర్స్ " కోసం బావుంటుందని చేసిన ప్రయత్నం . . . : ) @ నైమిష్ : హమ్మయ్య . చారుల గురించి కూడా రాయాలా అంటారేమో అని భయపడిపోయానండి . ఇందాకా ఏదో టివీలో మిరియాల చారు ఎలా చేయాలో చెప్తున్నారు . అందుకని కాస్త ధైర్యం వచ్చింది . రేపొద్దున్న ముద్ద పప్పు ఎలా చెయ్యాలో , స్టౌ ఎలా వెలిగించాలో కూడా టివీలో చెప్తారేమో . . . : ) నాక్కూడా చారులో కాస్తంత బెల్లం వేస్తేనే ఇష్టం అండీ . Thankyou for the visit .
కంప్యూటర్ల పరిభాషలో చెప్పాలంటే భగవంతుడనేది ఒక భయంకరమైన డేటాబేస్ . వారేమో భగవంతుడి కార్యాలయంలో చప్రాసీల్లాంటి అధఃశ్రేణికి చెందిన ఉద్యోగులు . మాంసాహార నైవేద్యాల వంటి అల్ప ప్రలోభాలకు లొంగి అక్కడ కొన్ని చిల్లఱ సమాచారాల్ని ఇలా దొంగిలించి ఇలాంటి ఉపాసకులకు లీక్ చేస్తూంటారు . పూర్తి సమాచారం దొఱకనప్పుడు ఆ ఖాళీల్ని తమ ఊహాశక్తితో పూరించి పెద్ద సర్వజ్ఞుల మాదిరి చెప్పేస్తారు . వారిని నమ్ముకుని ఆ జోస్యాల్ని జనం దగ్గఱ అప్పజెప్పిన ఉపాసకులు అభాసుపాలవుతారు . సరే ! వారికా శాస్తి జఱగాల్సిందే ననుకోండి . మఱోపక్క క్షుద్రదేవతల చేతివాటం సంగతి భగవంతుడికి తెలుసు గనుక " అతనికంటె ఘనుడు ఆచంట మల్లన్న " అన్నట్లు వాళ్ళకు పూర్తి సమాచారాలు దొఱక్కుండా చేసి వాళ్ళు పప్పులో కాలు వేయడానికి కావలసినన్ని తొఱ్ఱలు ఏర్పాటుచేసి పెడతాడాయన . ఈ క్షుద్రదేవతల మాంసప్రీతి పలు సందర్భాల్లో శ్రుతిమించి నరమాంస ప్రీతిగా మారుతుంది . అప్పుడవి తమ ఉపాసకుల మాంసాన్నీ , లేదా వారి కుటుంబసభ్యుల మాంసాన్నీ ఆశిస్తాయి . ఈ కేసులో - నాకు పరిచయమైన కొంతకాలానికి ఆ ఉపాసకుడి తండ్రి దుర్మరణం చెందాడు . ఆ ఉపాసకుడు కూడా భయంకరమైన గాయాలతో ఆస్పత్రిలో చేఱాడు . అప్పుడర్థమయింది - అది ఏమాత్రం ఆంజనేయోపాసనో !
రాముడు చలించిపోయాడు . కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి . సీతకు దగ్గరకు తీసుకుని " దేవి ! చెప్పు . నువ్వు ఏం చేయమంటే అదే చేస్తానూ అన్నాడు .
భారతదేశంలో వింధ్యపర్వతాలకు దక్షిణంగా సుమారు 3 , 000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో , దాదాపు 30 నదులతో , కనీసం క్రీ . పూ . 8 , 0006 , 000 సంవత్సరాల నుండి ( పురావస్తు పరిశోధనల ఆధారంగా ) మానవులు నివసించారు నేటి మన ఆంధ్రప్రదేశ్ నేలపై . అందుబాటులో ఉన్న చరిత్ర , సాహిత్యం ఆధారంగా దక్షిణాపథం పేరుతో గుర్తించబడి ( క్రీ . పూ . 1500 ) శాతవాహన రాజ్యస్థాపన ( క్రీ . పూ . 300200 ) వలన ఓ ఆకృతి పొందింది . కనీసం 100 తరాల నిర్దిష్టమైన చరిత్ర , సామాజిక పరిణామ వారసత్వం కలిగి , 1956 నవంబరు 1వ తారీఖున ఓ రాష్ట్రంగా ఏర్పడింది నేటి ఆంధ్రప్రదేశ్ ( 1 ) . బహుజన , బహుముఖ , విస్తృత అభివృద్ధితో సుమారు 3 , 500 సంవత్సరాలుగా కళకళలాడిన సంస్కృతి నేడు అతితక్కువ చరిత్ర , అంతకన్నా తక్కువ తనదైన సంస్కృతి గల ఉత్తరమెరికా ఖండంలో , ప్రవాసంలో ఎలా ఉంది ?
ముందు పోస్ట్ చూసి అబ్బో చాలా పెద్దగా వుందే అనుకున్నాను కాని చదువుతుంటే అప్పుడే ఐపోయిందా అనిపించింది : ) ఐతే బయట ప్రపంచం లోకి అడుగు పెట్టారన్నమాట . ఎంజాయ్ : )
Download XML • Download text