tel-38
tel-38
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
మీ వాఖ్యలకు కృతజ్ఞతలు . రాధిక గారూ , మీకొచ్చినఆలోచనే నాకూ వచ్చింది . మోసపోయానా - 3 అని పెడదామనే అనుకున్నా . ఎందుకో ఇదొక కాలేజీ జ్నాపకం అనిపించి , మరియు ఇలా సీరియల్లా మోసపోయిన కథనాలు చదివి నన్నెక్కడ చవట దద్దమ్మ అనుకుంటారో అని కూడా భయపడి అలా పేరు పెట్టా !
( మహబూబ్‌నగర్ - ఆన్‌లైన్ ప్రతినిధి ) మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి పోలేపల్లి సెజ్ నిర్వాసితుల అంశం కూడా ప్రధాన సమస్యగా మారనున్నది . ఈ స్థానం నుంచి 16మంది సెజ్ బాధితులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయడం సంచలనంగా మారింది . పాలకులు , రాజకీయ పార్టీలు తమకు న్యాయం చేయనందుకు నిరసనగానే తాము ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించినట్లు బాధితులు వివరించారు .
" మనిషి కాలానికి లోబడి ఉంటే , కాలం పిరమిడ్స్‌కి లోబడి ఉంటుంది " - అరబ్ నానుడి .
కామేశ్వర రావు గారు : ఇదే . మీరన్న వివరణే నేను చదివాను . ఆంధ్రప్రభలో ఈ శీర్షిక వచ్చేది . అయితే ఈ వివరణ , సనత్ చెప్పిన విషయమూ ఇక్కడ పొసగట్లేదు , మీరన్నట్లు .
అప్పటిదాక కొడుకుగురించి చెప్తూ మెటికలు విరుస్తున్న ఆవిడ , అదేదో నేను అడగకూడనిది అడిగినట్లు . . " కాయలో పత్తి కాయలో వుంది , పిల్లలు చూస్తే ఇంక చిన్నవాళ్ళు ( తల్లికి తన కూతురు పిల్లల తల్లి అయినా చిన్నవాళ్ళుగా కనపడడం అంటే ఇదేనేమో ) అప్పుడే నీకు జీవితాలు , అర్ధాలు , పరమార్ధాలు ఏవిటీ ? విడ్డూరం కాకపోతేనూ , పిచ్చి ప్రశ్నలు వేయకలా , " అంటూ నన్ను దులిపేసీ , యధావిధిగా తన సీతమ్మవారి కష్టాలు ఏకరువు పెట్టడంలో నిమగ్నమయ్యింది . ఇక్కడ మూమెంట్ ఆఫ్ క్లారిటీ లేదంటార ? పిల్లలమీద తల్లి ప్రేమ , మూమెంట్ ఆఫ్ క్లారిటీ కాదా ?
పైపద్యములోని అలంకారములు శ్లేష , స్వభావోక్తి . శివానందలహరి అనే కావ్యకన్యకను అందుకొనుమని శివుని ప్రార్థిస్తూ వ్రాసినది ఇది . ఇందులో కన్యకకు అన్వయించు విధముగా , కావ్యమునకు అన్వయించు విధముగా పదములను ఆచార్యులు వాడినారు .
కాని , భాష లోకంలో వస్తువే . ఎటొచ్చీ , మామూలుగా , కవులు కాని వాళ్ళు లోకం ద్వారా భాష తెలుస్తుందనుకుంటారు . ఆ మాట మనందరికీ నిజమే . కాని , కవికి భాష ద్వారా లోకం తెలిసే ఒక ప్రత్యేక స్థితి వుంది . అంటే , భాషే లోకాన్ని తయారుచేస్తుందని తాత్వికుడికి ఆలోచన వల్ల తెలిస్తే , కవికి ఆచరణ వల్ల తెలుస్తుంది . భాష లేకపోతే లోకజ్ఞానం లేదనీ భాషాతీతంగా లోకాన్ని గ్రహించలేమనీ తాత్వికుడు బోధపరుచుకుంటే , కవికి ఆ సంగతి ఒక ప్రత్యేక రకమైన కవిత్వం చేసేటప్పుడు అనుభవంలోకి వొస్తుంది .
కాళ్ళకింద నల్లటితివాచీలా పరుచుకున్న రోడ్డు తలపై నల్లకలువలా విరిసిన గొడుగు - నడిచినంతమేరా ఆయనతో సంభాషించేవి .
గుంటూరు , ( వి . వి ) : తెలంగాణ ప్రజా ప్రతినిధుల రాజీనామాలకు లొంగి కేంద్ర ప్రభుత్వం వారికి అనుకూలంగా ప్రకటన చేస్తే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్‌ను . . . ఇంకా చదవండి
ఇప్పటికీ అప్పుడప్పుడూ , ఎప్పుడన్నా , పొరపాట్న స్పృహలోకొస్తే చందనగంధం , చంద్రతుషారం అనుకోకుండా గుర్తొస్తే
' ' ఆంధ్రులారంభించని ఉద్యమాలే లేవు . అయితే జయప్రదంగా కొనవరకూ సాగించబడినవి మాత్రం చాలా తక్కువ . ఏమూలైనా ఒక కొత్త పని ఆరంభించబడిందంటే ఆంధ్రుడికి ఉద్రేకం కలుగుతుంది . అంతటినుంచీ ఆ ఉద్యమమే జీవిత పరమావధి అనుకొని దానిమీద తన శక్తినంతా వినియోగిస్తాడు ఆంధ్రుడు . ఈలోగా మరొకటివస్తే దాల్లోకి దూకుతాడు తానిదివరకు చేస్తున్న పనిని వదిలిపెట్టి . ఈ చాంచల్యానికి ప్రతిఫలం ఒక పనీ పూర్తికాకపోవటమే . ' ' అంటారు విఖ్యాత చరిత్రకారులు మారేమండ రామారావుగారు ' ప్రబుద్ధాంధ్ర ' పత్రిక ఏప్రిల్ 1934 సంచిక ( 158 పేజి ) లో రాసిన ' ఆంధ్రుల కర్తవ్యం ' అనే వ్యాసంలో . ' ఆంధ్రుడంటే ఎవరో , అతనికుండే గౌరవమేమిటో , ఇతర రాష్ట్రీయులతో సరిపోల్చి చూస్తే అతనికుండే స్థానమేమిటో తెలియని రోజుల్లో కొమర్రాజు లక్ష్మణరావుగారూ , చిలుకూరి వీరభద్రరావుగారూ ఆంధ్రుని చరిత్రను నిర్మించి , ఆంధ్రునికి ఆత్మజ్ఞానమూ , ఆత్మవిశ్వాసమూ కలుగచేశారు . . . ఇంతలో గ్రంథాలయోద్యమం , భాషా వివాదం , అసహాయోద్యమం బయల్దేరాయి . అంతవరకూ మేజాబల్లమీద వుండి నిత్య పారాయణార్హమైన ఆంధ్రుల చరిత్రని మూలకి విసిరేసి , నడుముకట్టి ఈ కొత్త వుద్యమాల్లోకి దూకేసినందుకు ' ఆంధ్రుల మీద అంత చికాకు కలిగింది రామారావుగారికి . స్వతహాగా తాను చరిత్రకారుడైనందువల్ల ' ఆంధ్రుల చరిత్ర ' కు ఆదరణ తగ్గడం చూసి మారేమండవారికి మనస్తాపం కలగడం సహజమే . కాని ఆయన అతిముఖ్యమైన ఇంకో విషయాన్ని ఈ సందర్భంలో పేర్కొనడం మరచిపోయారు . ఆ సమయాన ఆంధ్రుడు మూలకి విసిరేసింది ' ఆంధ్రుల చరిత్ర ' ను మాత్రమే కాదు . దాని ప్రేరణతో రూపుదిద్దుకున్న ఆంధ్రోద్యమాన్ని కూడా . అన్నిటికంటే పెద్ద నష్టం దానివల్ల . ఆంధ్ర రాష్ట్రం , ఆంధ్ర సంస్కృతి , ఆంధ్రుల ప్రయోజనాల పరిరక్షణ వంటి అంశాల్లో ముక్కోటి ఆంధ్రుల మనోభీష్టాన్ని ప్రతిబింబించే ఏకైక సంస్థ ' ఆంధ్ర మహాసభ ' . అది చేయవలసిన వాటిలో అనివార్యంగా రాజకీయ పోరాటం కూడా ఉన్నా రాజకీయాలతో దానికి పనిలేదు . ఏ ఒక రాజకీయ సంస్థతోనూ అది కొంగుముడివేసుకుని తిరగాల్సిన అవసరం అసలే లేదు . ఎంత గొప్పదైనా , దానిని నడిపించేవారు ఎంతటి మహనీయులైనా - అలా ఒక రాజకీయ శిబిరంతో మమేకమవడం విశాల ఉద్యమానికి హానికరం . కాని మహా మేధావులైన మన నేతలకు అలాంటి ఐహిక విషయాలేవీ పట్టలేదు . మోహన్‌దాసు గాంధీగారొచ్చి సత్యాగ్రహ వేణువు ఊదగానే అలనాటి వ్రేపల్లె గోపికల్లా మైమరచి ఎక్కడి ఉద్యమాలనక్కడ వదిలిపెట్టి కాంగ్రెసు బృందావనానికి బిలబిలలాడుతూ పరుగులు తీశారు . 1920 డిసెంబరు నాగపూర్ కాంగ్రెసులో ' శాంతియుత , చట్టబద్ధ మార్గాల్లో స్వరాజ్య సాధన కాంగ్రెసు లక్ష్యం ' గా ప్రకటించడం , ' సహాయ నిరాకరణ ' ఆయుధంతో సంవత్సరంలో స్వరాజ్యాన్ని సాధించి తీరుతానని గాంధీ మహాత్ముడు శపథం చెయ్యటం ఆంధ్రులకు గొప్ప ఉత్తేజానిచ్చింది . అది మొదలు ' అసహాయం ' వారికి ప్రాణం , ప్రణవం అయిపోయింది . తాము అసహాయవాదులం కనుక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు బ్రిటిషు సర్కారు సహాయాన్ని అర్ధించటం కూడా ' అసహాయ ' స్ఫూర్తికి అపచారంగా ఆంధ్ర నేతాశ్రీల బుద్ధికి పొడగట్టింది . వారి ఆలోచనలో , కార్యాచరణలో ' ఆంధ్రమాత ' అదృశ్యమై ఆ స్థానాన్ని కూడా భారతమాతే పూర్తిగా ఆక్రమించింది . స్వరాజ్యమే ఏకైక ధ్యేయమైంది . ఆంధ్ర రాష్ట్రంలాంటి పాత డిమాండ్లు పక్కకి తప్పుకున్నాయి . ఈ సంగతి చెబితే ' మంచిదేకదా ? అందులో తప్పేముంది ? ' అంటారు ఎవరైనా . నిజమే ! ఎప్పుడైనా , ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రాంతంకంటే దేశం ముమ్మాటికీ గొప్పది . మనం మొదట భారతీయులం . ఆంధ్రులమైనా , మరొకరమైనా ఆ తరవాతే . మొత్తం దేశమే దాస్యశృంఖలాల్లో బంధించబడి ఉన్నప్పుడు పారతంత్య్రపు చెరనుంచి భరతమాతను ఎలా విముక్తి చెయ్యాలన్నదే ఈ గడ్డమీద పుట్టిన ప్రతి ఒక్కడూ మొట్టమొదట ఆలోచించవలసింది . 1857 స్వాతంత్య్ర పోరాటాన్ని తెల్ల రక్కసులు కర్కశంగా అణచివేసి , విడవకుండా సాగిన చిన్నాపెద్దా తిరుగుబాట్లూ విఫలమై దిక్కుతోచని స్థితిలో దేశవాసులు కొట్టుమిట్టాడుతున్న సమయాన దేవదూతలా ఒక మహాత్ముడు అరుదెంచి సత్యాగ్రహ మంత్రాన్ని ఉపదేశించి , సహాయ నిరాకరణ దివ్యాస్త్రాన్ని అందించి , వాటిని నిష్ఠగా నమ్మితే ఏడాదిలోనే స్వరాజ్యం తథ్యమని ప్రకటిస్తే . . . అంతకంటే ఏమికావాలి ? మిగతా వ్యాపకాలూ , వ్యవహారాలూ అన్నీ వదిలి , ఇతర లక్ష్యాలన్నీ విడిచి జాతి విముక్తి మహాలక్ష్యసాధనకోసం స్వరాజ్యశ్రేణుల్లో కలిసి , అదృష్టంకొద్దీ దొరికిన మహానాయకుడు చెప్పినట్టు చెయ్యటాన్ని మించిన గొప్ప కర్తవ్యం ఏముంటుంది ? ఉండదు . ఉండదుగాక ఉండదు . అందరూ అలాగే అనుకున్నారు . స్వతహాగా ఆవేశపరులు కనుక ఆంధ్రులు ఇతరులకంటే ఎక్కువ అనుకున్నారు . ఎక్కడైనా ఒక కొత్త పని ఆరంభించబడిందంటే ఆంధ్రుడికి ఉద్రేకం కలుగుతుందనీ , అంతటినుంచీ ఆ ఉద్యమమే జీవిత పరమావధి అనుకుని దానిమీద తన శక్తినంతా వినియోగిస్తాడనీ మారేమండ రామారావుగారు అన్నారు కదా ? ! ఈ ఘట్టంలోనూ సరిగ్గా అదే జరిగింది . మేరలేని ఉత్సాహంతో , అతులిత కార్యదీక్షతో ఆంధ్రులు రంగంలోకి దూకి గాంధీ ఉపదేశాన్ని తు . చ . తప్పక అమలుజరిపారు . మహోద్యమాలను నిర్మించారు . మహోదాత్తంగా పోరాడారు . ప్రతిసారీ - ఘోరంగా మోసపోయారు ! 1920 ' ల్లో గాంధీగారు నడిపారనుకునే ' సహాయ నిరాకరణ ఉద్యమం ' లో ఉజ్వల ఘట్టాలనదగ్గవి ఇండియా మొత్తంమీద ముఖ్యంగా మూడు . మూడూ ఆంధ్ర దేశాన ఆంధ్రులు నడిపినవే . ఒకటి - చీరాల పేరాల పోరాటం . రెండు - పలనాడు పుల్లరి సత్యాగ్రహం . మూడోది - పెదనందిపాడు పన్నుల నిరాకరణ మహోద్యమం . మూడింటికీ ప్రేరణ గాంధీబోధే . మూడింటిని నడిపినవారూ నికార్సయిన గాంధీ భక్తులే . మూడూ నడిచినవి ముమ్మాటికీ గాంధీ పంధాలోనే . ఏం లాభం ? మూడిటినీ నట్టేట నిలువునా ముంచినవాడు మహాత్మాగాంధీగారే ! అది ఎలా జరిగింది అన్నది వెనకటి ' మన మహాత్ముడు ' వ్యాస పరంపరలో వివరంగా చూశాం . వాటిని చదవనివారు , చదివినా మరపునపడ్డవారి ఎరుకకోసం వాటి ముఖ్య విశేషాలు చప్పున సింహావలోకన చేద్దాం . గుంటూరు జిల్లాలోని చీరాల , పేరాల గ్రామాలను కలిపి ప్రత్యేక మున్సిపాలిటీ చేయాలని 1919లో మద్రాసు ప్రభుత్వం సంకల్పించింది . అది ఆ గ్రామాల ప్రజలకు ఇష్టంలేదు . మున్సిపాలిటీ అయినందువల్ల భరించలేని పన్నుల బాదుడే తప్ప ఊరికి ఉపయోగం సున్న . చీరాల వాస్తవ్యుడైన దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు ఎన్ని విన్నపాలు చేసినా , ఊరి జనమంతా వద్దుమొర్రో అంటున్నా సర్కారువారు పట్టుబట్టి 1920 జనవరి 12న కొత్త మున్సిపాలిటీ ఏర్పాటుచేశారు . చిల్లర దుకాణాలవారి మీద , ఆఖరికి వీధుల్లో తిరిగే తోపుడుబండ్ల వ్యాపారులమీదా భారీ సుంకాలు మోపి , ఇళ్లపన్నులు విపరీతంగా పెంచి కడతారా చస్తారా అని నిర్బంధించసాగారు . గాంధీని దైవంగా తలిచే దుగ్గిరాల గాంధీ బోధనే ఆచరణలోపెట్టి పన్నులు చెల్లించవద్దని ప్రజలను కోరాడు . వారూ వల్లె అన్నారు . పన్నులు కట్టనివారి ఆస్తులు జప్తుచేశారు . ఎంతోమందిని జైలుకూ పంపారు . ప్రజలు ఎంత శాంతంగా ఉన్నా ప్రభుత్వ దమనకాండ రోజురోజుకూ పెరగడంతో గోపాలకృష్ణయ్య ఏమి చేయాలో పాలుపోక గాంధీగారినే సలహా అడిగాడు . మున్సిపాలిటీ ఇష్టం లేకపోతే ఊళ్లో ఉండాలని ఏముంది ? మున్సిపల్ సరిహద్దుల అవతలికి పోయి నిరసించవచ్చుగదా అని మహాత్ముడు ప్రశస్తమైన ఉపదేశం చేశాడు . బాగుంది అలాగే చేద్దాం అనుకున్నారు ఊరి జనం . ఊరు వదిలిపోయేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఆంధ్ర దేశ సంచారంలో భాగంగా స్వయానా మహాత్ముడే 1921 ఏప్రిల్ 6 రాత్రి చీరాలలో అడుగుపెట్టాడు . తనమీద అచంచల భక్తివిశ్వాసాలతో , తానిచ్చిన సలహామేరకు సొంత గడ్డమీద మమకారం చంపుకుని , కొంపాగోడూ వదిలి , ఊరిబయట పాకల్లో బతకడానికి సిద్ధమైన జనాన్ని చూసి సంతోషించి ' మీకేమీ భయంలేదు , నేనుంటా మీ వెంట ' అని భరోసా ఇచ్చాడా ? లేదు .
. . , . , . . , . Rama killed Ravana అంటే active voice . Ravana was killed by Rama అంటే passive voice . అంతే పదో తరగతి పెద్ద పరీక్షల దాక అదే active voice , passive voice . అయినా ఇంగ్లీష్ నేర్చుకోవటనికి అన్నట్టు ఎవరు చదివారు కనుక , ఎంతసేపు మార్కుల గొడవే . పదో తరగతిలో 500 పైన మార్కులు రాకపోతే ఇంక అంతే . వాడ్ని పురుగుని చూసినట్టు చూస్తారు . ఇది చాలదన్నట్టు , పదో తరగతి సంక్రాంతి సెలవల దగ్గర్నుండే ఇంటర్ కాలేజీల వాళ్ళు తయారయ్యే వాళ్ళు . 500 దాటితే ఎంత ఫీజు తగ్గిస్తారో 510 దాటితే ఎంత తగ్గిస్తారో . . చెప్పి చిన్న మెదడులో బోలెడంత టెన్షన్ పెట్టించేవాళ్ళు . ఇప్పుడయితే పరిస్థితి చెయ్యి దాటిపోయింది . పదో తరగతిలో 600కి 650 మార్కులొస్తేనే శ్రీచైతన్యలో కాని , నారాయణలో కాని ఇంటర్ చదవగలరు పిల్లలు . పదో తరగతి దాకే ఇంగ్లీషు చదివేది . ఇంటర్ లో ఇంగ్లీష్ ఉన్నాకాని చదవనిచ్చేవాళ్ళు కాదు . ఇంక " స్కోరింగ్ సబ్జెక్ట్ " అయిన సంస్కృతం సంగతి అయితే చెప్పనవసరం లేదు . ఎంతసేపు లెక్కలు , ఫిజిక్స్ , కెమిస్ట్రీ అంతే . ఒకసారి మా చైతన్య కాలేజీలో రాత్రి 10 . 30కి స్టడీ అవర్ లో నేను మా వార్డెన్ కి ఇంగ్లీష్ చదువుతూ ఎర్రచేతులతో పట్టుపడ్డాను . అంతే తెల్లారి మా పెద్దసార్ దగ్గర నాకు అరగంట క్లాస్ . జీవితంలో ఏద్దన్నా సాధించాలంటే integration , trignometry , బెంజీన్ రింగు ఎంత ముఖ్యమో నాకు కళ్ళు తెరిపించి , మళ్ళీ ఇంగ్లీష్ పుస్తకం ముట్టుకోనని నాతో రాతపూర్వకంగా రాపించుకొని అప్పుడు లెక్కల క్లాస్ కి పంపించాడు . కాబట్టి నా ఇంగ్లీష్ active voice , passive voice దగ్గరే ఆగిపోయింది . ఇంక ఇంజనీరింగులో మనము ఏది చదివాము కనుక ఇంగ్లీష్ చదవడానికి . నాలాంటి వాళ్ళందరికి GRE , TOEFLరాసేటప్పుడు అర్ధమవుతుంది ఇంగ్లీష్ అంటే active voice , passive voice మాత్రమే కాదు , ఇంకా బోలెడు ఉన్నాయని . కాబట్టి అద్యక్షా ! నేను చెప్పేదెంటంటే తెలుగు , సంస్కృతం , లెక్కలు , ఫిజిక్స్ , కెమిస్ట్రీ , ఇంకా నాకు అర్ధం కాని జంతు శాస్త్రం . . . అన్ని చదువుకోవాలి , కాని వాటితోపాటు ఇంగ్లీష్ కూడ చదువుకోవాలి / నేర్చుకోవాలి .
ముత్తుస్వామి దీక్షితార్ పై పశ్చిమదేశ సంగీత ప్రభావం కూడా వుంది . దీక్షితార్ అన్నయ్య బాలుస్వామి కచేరీల్లో పక్క వాయిద్యంగా వయులిన్ వాడకాన్ని ప్రవేశ పెట్టాడు . ఎత్తియపురం రాజాస్థానం ద్వారా బ్రిటీషు పాలకుల పరిచయంతో పాశ్చాత్య సంగీతం తెలిసింది . తెలుగులో నిఘంటువు కూర్చిన సి . పి . బ్రౌన్ కి అంకితమిస్తూ 1832లో ముత్తుస్వామి దీక్షితార్ కొన్ని కృతులు స్వరపరిచాడు . అప్పటికి సి . పి . బ్రౌన్ చిత్తూర్ జిల్లాకి కలక్టర్ గా పనిజేసేవాడు . ఈ కృతుల వివరాలూ , ఈ విషయమూ సంగీత సంప్రదాయ ప్రదర్శినిలో ఉన్నాయి . పశ్చిమ సంగీతాధారంగా దీక్షితార్ ' నొట్టు స్వరములు ' అనేవి స్వరపరిచాడు . ఇంగ్లీషులో నోట్ కాస్తా తమిళంలోకి నొట్టుగా తర్జుమా అయ్యింది . శంకరాభరణంలో ' సంతతం పాహిమాం ' , ' రామ జనార్ధన ' వంటి నొట్టుస్వర గీతాల్లో కర్ణాటక సంగీతంలో ఉండే గమకాలుండవు . ముత్తుస్వామి దీక్షితార్ సుమారు 400 పైగా కృతులు 120 రాగాల్లో స్వరపరిచాడు . ఈ రాగాలన్నీ వేంకటమఖి సంప్రదాయాన్ననుసరించి వాడుకున్నవే తప్ప కొత్త రాగాలు కావు .
60 మిలియన్లకు పైగా విక్రయాలు … దీపావళి తర్వాత మూడు నెలల కాలంలో అహ్మదాబాద్ లోని పాతబస్తీలో నివసించే గాలిపటాల తయారీదారులు పతంగుల ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తారు . ఇక సం క్రాంతి పండుగ రోజుల్లో అహ్మదాబాద్‌లో దాదాపు పది వేల మంది గాలిపటాలను తయారుచేస్తుంటారని ఇక్కడి జమ ల్‌పూర్‌లోని స్టార్ పతంగ్ యజమాని టి . ఎ . షేక్ అన్నారు . పండుగ సీజన్‌లో తాము 1 . 5 మిలియన్ల గాలిపటాలను త యారుచేస్తామని చెప్పారు . ఈ సీజన్ మూడు నెలల కా లంలో అహ్మదాబాద్‌లో 60మిలియన్లకు పైగా పతంగుల విక్రయాలు జరుగుతాయని ఆయన వివరించారు .
చక్రవాకం సీరియల్ అయిపోయిందనే ఒక శుభవార్త మీ బ్లాగు చదవడం వల్ల నాకు తెలిసింది . చాలా సంతోషంగా ఉంది . ధన్యవాదాలు .
ముమ్మారు అన్నా ముమ్మిడి అన్నా మూడు సార్లు అని అర్థం కదా , మరి ముమ్మిడివరం అంటే మూడు సార్లు వరం అని అర్థమా ? దేవుడి దగ్గర మూడు వరాలు పుచ్చుకుందికేనేమో ముమ్ముడివరంలో బాలయోగి వెలిసేడు .
తెలుగు యూనీకోడ్‌లో పీడీఎఫ్ 995 ఫైళ్ళను తెలుగు యూనీకోడ్ MSWord ఫైళ్ళుగా మార్చేందుకేదైనా software ఉందా ?
సినిమా అన్నది మనిషికి ఆహ్లదం కలిగించడానికి , బయట ప్రపంచాన్ని కొద్ది సేపు మర్చిపొవటానికి ఒక చక్కని టానిక్ లాంటిది . ఆటువంటి సినిమా ఈనాడు రాంగొపాల్ వర్మ లాంటి వాళ్ళ కబంధ హస్తాల్లొ చిక్కి విలవిల లాడుతొంది . మంచిరోజులు వస్తాయని ఆశించడం మినహ ప్రస్తుతం ఛేయగలిగింది ఇంకేమీ లేదు అనిపిస్తొంది అండి .
విజయవాడలో రాస్తారోకో జరిగింది . సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ , నూజివీడు , తిరువూరు , అవనిగడ్డ , పెడన , బంటుమిల్లిలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి రైతులు ఎడ్లబండ్లపై తరలివచ్చారు . అవనిగడ్డలో రైతు సంఘం రాష్ర అధ్యక్షుడు వంగల సుబ్బారావు నాయకత్వం వహించగా , పెడన , బంటుమిల్లిలో టిడిపి నేత కాగిత వెంకట్రావు పాల్గొన్నారు . ఎన్‌హెచ్ - 9 జాతీయ రహదారిపై కంచికచర్ల , నందిగామ , చిలకల్లు వద్ద రాస్తారోకో జరిగింది . గుంటూరుజిల్లా పెదకాకాని వద్ద లోక్‌సభ నరసరావుపేట సభ్యుడు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి చేశారు . మంగళగిరి , పొన్నూరు , బాపట్ల , సత్తెనపల్లి , రేపల్లె , మాచర్ల , పిడుగురాళ్ల , చిలకలూరిపేట ప్రాంతాలతోపాటు అన్ని మండల కేంద్రాల్లోనూ రైతులు పూనుకుని రహదారులను దిగ్బంధించారు .
అసలు రాజకీయ నాయకులకి కావల్సింది పదవే , పదవి కాకుండా ప్రజసేవకి రాజకీయాల్లోకి యెందుకొస్తారు ? ? తరువాత , ఎదో ఒక్క రోజు నిరాహారదీక్ష చేసి , ఇంక నా వల్ల కాదబ్బ , నేను ఇంటికిపోయి నిద్రపోవాలనో , నేను అర్జెంటుగా సి . యం . ఐపొవాలి నాకు ఓట్లు వేసెయ్యండనో కాకుండా , గట్టిగా చేసాడు . విజయశాంతి పొద్దున జైల్ కి వెళ్ళి , బెయిల్ తిసుకోను అని సాయంకాలానికి తిరిగి రాలేదు , మమత ఓ రెండు రోజులు నిరాహార దీక్ష చేసి మానేయలేదు . వాళ్ళే ఇది చేస్తే మొదటి రొజే బెయిల్ తీసుకోని సాయంకాలానికి ఇంటికి తిరిగొచ్చేవారు , గట్టిగా చేసి జనాల మనసు దోచాడు , మిగతావారు కుడా చూసి నేర్చుకుంటే మన గౌరవం అన్నా నిలబడుతుంది
ఈ విధంగా భగవంతుడు లేడని , ఆత్మ లేదని , వేదం పరమ నయవంచకుల గ్రంథమని , పాప పుణ్యాలు లేవని , స్వర్గ నరకాదులు లేవనీ చాటి చెప్పింది .
నాగరాజా గారు నా మనస్సులో ఉన్నది చెప్పేశారు . రావణాసురుడికి పది తలలు అంటే . . . దశ వికారాలు ఉన్నవాడని కూడా అన్వయించుకోవచ్చు . ఏమైనా రామాయణ , మహాభారతాలలో పిండిలో ఉప్పంత నిజమైనా ఉండకపోదు . మనకే అంతా తెలుసు అని మనకు తెలియని విషయాలలో ఒక నిర్ణయానికి రావడం సరికాదు .
ప్రత్యేక తెలంగాణ విషయంలో అన్ని రాజకీయ పార్టీలూ ఒకేరకంగా ద్రోహం చేస్తున్నప్పటికీ , మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నప్పటికీ కొందరు తెలంగాణవాదులు ప్రదర్శిస్తున్న ఉత్సాహంలో ఈ చిత్తవృత్తే కనబడుతున్నది . అసందర్భపు ప్రకటనలను , తెలంగాణ వ్యతిరేక భావనలతో నిండి ఉన్న ప్రకటనలను కూడ ఆ చిత్తవృత్తి వల్లనే ఆహ్వానిస్తున్నట్టున్నారు .
పార్లమెంటులో తెలుగుకు ప్రాచీనా హోదా గురించిన ప్రశ్న అడిగి సమాధానం వినే సమయమొచ్చినప్పుడు పత్తాలేకుండా పోయిన సభ్యురాలి గురించి చదివినప్పుడు నవ్వొచ్చింది . మనకేదో చేసేస్తున్నట్లు కనపడటమంటే ఎంత తపనో వీళ్లకి ! ఏ ఉద్దేశ్యంతో అన్నాడోగానీ , ' మనవాళ్లుత్త వెధవాయలోయ్ ' అని గిరీశం మహాశయుడన్నది మనవాళ్ల భాషాభిమానం విషయంలో మాత్రం పచ్చి నిజం . అరవ వాళ్లని చూసి మా భాషకి కూడా ప్రాచీన హోదా ఇవ్వమని కేంద్రాన్ని దేబిరించే బదులు రాష్ట్రం లోని అన్ని బళ్లలోనూ ( అంటే . . ప్రభుత్వ , ప్రైవేటు , తెలుగు , ఇంగ్లీషు , ఉర్దూ . . అన్ని రకాల బడులు ) పదో తరగతి దాకా తెలుగు బోధన తప్పని సరి చెయ్యటానికి రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డేంటి ? అసలు , ఎవరో ప్రాచీన హోదా ఇస్తే మన భాషకొరిగేదేంటి ? అయితే గియితే , ఆ పేరుతో కొన్ని కోట్ల రూపాయల నిధులు వస్తాయి - అవీ ఏ రాజకీయుడి బంధుగణానికో సంతర్పణమే . కేంద్రాన్ని అడుక్కునే పని లేకుండా తెలుగుని నిజంగా ఉద్ధరించే మార్గాలు సవాలక్ష ఉండగా అవన్నీ పక్కనబెట్టి ప్రాచీన హోదా గురించి ఈ రచ్చ ఎందుకు ? రాష్ట్రంలో తెలుగు మిణుకు మిణుకు మంటుంటే పట్టించుకోకుండా పరాయివాళ్లు మన వెలుగులు గుర్తించటంలేదని ఏడవటమేంటి ? ప్రభుత్వం సంగతి పక్కనబెడితే , ప్రైవేటు మీడియాలో తెలుగు ఎంత శుద్ధంగా అమలవుతుంది ? ఈనాడు , ఆంధ్రజ్యోతి లాంటి ఒకట్రెండు తప్ప మిగతా దినపత్రికల్లోగానీ , వార పత్రికల్లోగానీ రాసే తెలుగులో తెలుగెంత ? టి . వి . ఛానళ్లు మరీ ఘోరం . యాంకరమ్మలు వంకర మాటలతో ఇటు తెలుగుని , అటు ఇంగ్లీషుని రెంటినీ నరికి పాతరేస్తున్నా ఆయా కార్యక్రమాల దర్శక నిర్మాతలు కిమ్మనరెందుకో ! సినిమాల విషయం ఇక చెప్పక్కరలేదు . మొన్నటి దాకా హిందీ నాసికా గాయకాగ్రేసరుల ధాటికి ముక్కలు చెక్కలయిన పాటలనే విని తరించే వాళ్లం . ఇప్పుడు కొత్తగా డబ్బింగ్ రంగంలోకి కూడా పంజాబీ భామలు ప్రవేశించి చంపేస్తున్నారు ! మరో వంక తమిళ దర్శకుల సమూహం ' పెద్ద పుడింగువా ' , ' పోడా మచ్చీ ' లాంటి పదాలను విరివిగా తెలుగులోకి చొప్పించేసి మన భాషని సుసంపన్నం చేసేస్తుంది . తెలుగుకి సంబంధించి ఇలాంటి చిన్నా పెద్దా సమస్యలు బోలెడన్ని ఉన్నాయి . వేరే వాళ్లు మనభాషని గుర్తించటలేదని బాధపడటం ఆపి ముందు తెలుగు వాళ్లు తెలుగుపై అభిమానం పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చెయ్యటం మంచిది .
ట్రైన్లోవున్నామన్న విషయమే మర్చిపోయేంత మొద్దునిద్రనుండి లేచాడు కిరణ్ . కిందకు తొంగి చూస్తే సీట్లలో ఎవరూలేరు . . ఇదేంటి అంతా ఎక్కడకుపోయారు . . ఏస్టేషనైవుంటుంది . . అనుకుని కిందకు దిగి చూస్తే ఫ్లాట్ఫాం కూడా దగ్గరలో కనబడలేదు . . అటు ఇటూ రైళ్ళు ఆగివున్నాయి . . మధ్యలో కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఆపాడు . . టైము చూస్తే ఆరయ్యింది . . అలా ముందుకు నడుచుకుంటూ ఫ్లాట్ఫాం వైపు నడిచాడు కిరణ్ . . అక్కడ ఎదురుగా వున్న స్టేషన్ బోర్డు చూసి . . ఒక్కసారిగా షాక్ తిన్నాడు . . ఇదేంటి ఇది భువనేశ్వర్ స్టేషనా ? . అప్పుడే ఎలా వచ్చేసాను ఇక్కడికి . . మరి నిన్న వాచ్ చూసుకుంటే ముప్పయొకటో తారీఖూకదా చూపించింది . . అవును కదా ! . మరి ఇంత త్వరగా ఎలాగబ్బా . . అని బుర్రగోక్కున్నాడు . . అయినా ఏప్రిల్ నెలలో ముప్పయొకటో తారీఖేంటీ . . . నా వాచ్ నన్నే ఫూల్ ని చేసిందే . . అని ట్యూబ్ లైట్లా వెలిగిన బుర్రకి అప్పటికి అర్ధమయ్యింది . . నిజం తెలుసుకున్న కిరణ్ అక్కడే వున్న బెంచి పైన కూలబడిపోయాడు .
గురుత్వాకర్షణ శక్తి గురించి కలిగిన ఆలోచన వెనకాల ఓ మహానుభావుడైన సర్ ఐజక్ న్యూటన్ ఆలోచనా విధానం మనకు ఓ ఉదాహరణ . ఈ మహాను భావుడు విపరీతంగా ఆలోచించలేదు కానీ వైవిధ్యభరితమైన కొత్త కోణాన్ని సృజించారు . అంతే కాని ప్రకృతి కి విరుద్దమైన ఆలోచన చేసి ఎయిడ్స్ లాంటి రుగ్మతకు రూపం పొందించలేదు . ఎకే 47 సృష్టికర్త కూడా ఇలాంటి మారణాయుధాన్ని ఎందుకు కనుగొన్నానా అని విలపించాడు . న్యుక్లియర్ బాంబ్ కనుక్కొవడమెందుకు ఆ తరువాత అనుభవించడం ఎందుకు .
From : Samuel Raj Sent : Mon 12 / 27 / 2010 9 : 36 AM To : Hari Prasad Reddy Devana Subject : నేను చెప్పుడి ముక్కలు నీ చెవిన వేసుకోనుడి దేవన గారికి , నేను శామ్యూల్ రాజు . గుర్తుపట్టారా ? . రెండు నెలల క్రితం మనం రాజాం - విశాఖపట్టణం బస్సులో కలిశాం . కండక్టర్ మనకు ఇవ్వాల్సిన చిల్లర లేక ఒక ఐదు రూపాయలను మన ఇద్దరిని పంచుకోమన్నాడు . అప్పుడు పరిచయం అయ్యాం . మీ ఈమెయిలు id తీసుకున్నాను . మీరు టచ్ లో ఉండమన్నారు . గడిచిన రెండు నెలలు లో నా జీవితం లో ఎన్నో మార్పులు జరిగాయి . అవి మీతో పంచుకోవడానికే ఈ ఈమెయిలు . ప్రభు కుమారుని పిలుపు . నేను ఎప్పుడు అయోమయం లో ఉండేవాడిని . ఈ సారి మాత్రం పెద్ద అయోమయం లో పడ్డా . అంటే బీరువాలో ఉతికిన బట్టల బదులు మాసిన బట్టలు పెట్టడం కాదు . నిజంగానే పెద్ద confusion . నేను పాపినేమో అని ఒక డౌట్ , కాదేమో అని కూడా ఒక డౌట్ . పంజాగుట్ట సెంటర్ లో Men ' s Corner అనే షాపులో ఆరు జతల జాకీ underwear లు షాప్ - లిఫ్ట్ చేయబోయి పట్టుబడిన మా కజిన్ జేమ్స్ రాజు అన్ని వేల మైళ్ళు దాటి నా అయోమయం పోగొట్టడానికి రాజాం వచ్చాడు . ఒక స్వస్థత సువార్త నన్ను అవహించిందేమో అని అనిపించింది . జేమ్స్ రాజు నన్ను పరిశిలించి నేను ఒక పాపపు మంచు తెరలో వున్నాను అన్నాడు , నన్ను ఇంటి దగ్గర వున్న లూథరన్ చర్చి కి తీసుకెళ్ళి ప్రార్థన చేయించాడు . తను పాపి కాదు ఇంతవరకు ప్రభు చెంతకు వెళ్ళని నేను పాపి అన్నాడు . అర నిముషం లో చర్చి కొలను లో నాకు బాప్టిజం ఇవ్వబడింది . నాకు ఒక లాగ అయ్యి మరో జన్మ ఎత్తినట్లు అనిపించింది . ఈ విషయం తెలిసి నా అన్న డేనియల్ రాజు చిందులు వేశాడు . కోపం లో ఏవేవో అన్నాడు . " o ప్రభువా , నీకు తెలియంది ఏముంది , సతాను మా అన్న చేత అలా చెడు పలుకులు పలికిస్తున్నాడు , అతడిని పాపి అని ఎంచి నీ గాయ పడిన హస్తముతోటి క్షమించుడి " . చర్చి పాస్టర్ రేవెరెండ్ జాషువ చాల మంచి ప్రభు సేవకుడు . జీసస్ ని నా వ్యక్తిగత పరిరక్షకుడిగా నేను అంగీకరిస్తే నా పాపములన్ని పోవునని , మరియు నా అయోమయం కూడా పోవునని చెప్పాడు . డేనియల్ రాజు మాత్రం ఆగ్రహం తో ఊగిపోతూ " శామ్యూల్ నువ్వు కేథలిక్కు ఆసుపత్రి లో పుట్టావ్ , కేథలిక్కు గానే ఉంటావు , అంతే . ఈ విషయం లో ఎటువంటి మార్పు లేదు , ఆ జేమ్స్ రాజు గాడు దేన్నీ నమ్ముతాడో నాకు అనవసరం . " అని అన్నాడు . అస్సలు నాకు ఈ జేమ్స్ రాజు faith ఏంటో తెలియదు , ఏదో పెంతకస్తు , మెథడిస్టు , అంగ్లికాన్ అయ్యి ఉండొచ్చు . మళ్ళి మా అన్న " పోపు ఒక evil , సాతాను " అని కూడా అన్నాడు . " o ప్రభువా , నీకు తెలియంది ఏముంది , సతాను మా అన్న చేత అలా చెడు పలుకులు పలికిస్తున్నాడు , అతడిని పాపి అని ఎంచి నీ గాయ పడిన హస్తముతోటి క్షమించుడి " . అది మొదలు చర్చి పాస్టర్ రేవెరెండ్ జాషువ నుంచి డైలీ sms ' s లు , ఈమైల్సు , లెట్టర్లు రావడం మొదలైంది . చర్చి కి ప్రతి ఆదివారం రమ్మని , పర్ణశాలల పండుగలలో ఉండమని , స్వస్థత కూటములలో చేరమని , బైబిల్ స్టడీ క్లాసుకి రమ్మని , , , , , ఇలా వత్తిడి పెరుగుతోంది . మా అన్న నన్ను జాగ్రత్తగా కాపలా కాస్తున్నాడు . ఇంతలో ఒక ఆదివారం పెద్దగా డ్రమ్ముల శబ్దం వినిపించింది . కిటికీ లోంచి చూస్తే చర్చి పాస్టర్ రేవెరెండ్ జాషువ మరియు ఐదుగురి బృందం బ్యాండు వాయిస్తోంది . అప్పుడు చర్చి పాస్టర్ రేవెరెండ్ జాషువ బిగ్గరగా " శ్యామ్యుల్ నువ్వు దేవుని నుంచి పారిపోవచ్చు కాని ఆ దేవుడు నీ నుంచి పారిపోడు " అని అరిచాడు . చేసేదేమీ లేక మా అన్న డేనియల్ రాజు ద్వారము తెరిచి యుంచేను . చర్చి పాస్టర్ రేవెరెండ్ జాషువ నా చేతిలో పరిశుద్ద గ్రంధము వుంచి " హోలీ ఘోస్ట్ నీ వైపు పోరాటం చేస్తుంది . నీవు మాత్రం ఆ దేవకుమారుని నీ హృదయం లో నిల్పుకోనుడి " అని చెప్పాడు . ఎక్కడ వున్నారు ఈ జార స్త్రీలు ? ? ? ? మా వూరు రాజాం . నా జీవితమంతా అక్కడే గడిచింది . రెండు నెలలుగా నేను Holy Christ Almighty Lutheran Church కి ప్రతి ఆదివారము వెళుతున్నాను . చర్చి పాస్టర్ రేవెరెండ్ జాషువ ఎప్పుడు నన్ను ఈ జార స్త్రీల గూర్చి హెచ్చరించే వాడు . యువజనుడైన నేను ప్రభు మార్గములో వుండగా ఈ జార స్త్రీలు నన్ను లోబర్చుకొని సాతాను దారి లో పడవేయుదరని చర్చి పాస్టర్ రేవెరెండ్ జాషువ నన్ను రోజు భయపెట్టేవాడు . నాలో ఈ జార స్త్రీల పైన ఆసక్తి మొదలైంది . మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు . its జస్ట్ a curiosity అన్న మాట . నేను ఎంత వెదికినా జార స్త్రీలు కనబడే వారు కాదు . వారు ఎలా ఉంటారో అని వారిని చూడాలని ఆసక్తి మాత్రమే . చర్చి పాస్టర్ రేవెరెండ్ జాషువ చెప్పిన వివరాల ప్రకారం వారు పేస్ కి రంగు పులుముకొని , లేసుల డ్రస్సు వేసుకొని , కొంచెం నగ్నంగా , మాంసాహారము వాసన వచ్చే సెంటు వేసుకొని వుంటారు అన్నాడు . నేను మా వూర్లో చీపురపల్లి రోడ్డు , పాలకొండ రోడ్డు , శ్రీకాకుళం రోడ్డు అన్ని వెతికా . ఎక్కడా ఈ జార స్త్రీలు కనబడలేదు . నాకు రాజాం లో కొంతమంది స్త్రీలు తెలుసు కాని వారెవరు ఈ జార స్త్రీలు కారు . చర్చి పాస్టర్ రేవెరెండ్ జాషువ చెప్పిన పోలికలు లేవు వారికెవరికీ . చికెన్ షాపు owner ఎసురాజు కి ఒక కూతురు మేరీ వుంది . చర్చి కి వచ్చేకొంత మంది అంటిస్ మేరీ మంచిది కాదు అని అనుకోవడం విన్నా . తన దగ్గర మాంసాహార వాసన వస్తుంది కాని జార స్త్రీ కాదు . తనది రింగుల జుట్టు . చాల బాగుంటుంది . నేను తనతో మాట్లాడడానికి ట్రై చేసిన ప్రతి సారి నన్ను avoid చేస్తుంది . ఇక నన్ను లోబర్చుకోవడం మాట మర్చిపోండి . చర్చి పాస్టర్ రేవెరెండ్ జాషువ చెప్పినట్టు తను ఖచ్చితంగా జార స్త్రీ కాదు . క్షామం , అంతర్యుద్దం వలన ఆకలితో మల మల మాడుతున్న 3 మిల్లియన్ల నైజీరియన్ల కోసం మేము ౩౦ వేల బైబిల్స్ పంపే మహా కార్యక్రమం పాస్టర్ రేవెరెండ్ జాషువ ఆధ్వర్యం లో అమెరికా వారి లివింగ్ లైట్స్ మినిస్ట్రిస్ సహకారం తో చేశాము . ఆ కార్యక్రమం కోసం నేను నైజీరియ కి వెళ్లాను . అక్కడ కూడా నాకు ఈ జార స్త్రీలు కనబడలేదు . జార స్త్రీల కోసం నా అన్వేషణ ఆపలేదు . పలాస వెళ్లాను , టెక్కలి వెళ్లాను , పాలకొండ వెళ్లాను , , , ఎక్కడా నాకు ఈ జార స్త్రీలు కనబడలేదు . ఇదే విషయం చర్చి పాస్టర్ రేవెరెండ్ జాషువ తో చెప్పాను , ఆయన ఎంతో చికాకు తో ఈ జార స్త్రీలు పెద్ద సిటిల్లోనే వుంటారు అని చెప్పాడు . YMCA మీటింగ్ అని చెప్పి జార స్త్రీలు కనబడతారేమో అని వైజాగ్ వెళ్లాను . వైజాగ్ లో చాల మంది స్త్రీలు కనబడ్డారు , కొంతమంది బస్సులో వెళుతున్నారు , కొంతమంది నడిచి వెళుతున్నారు , ఇంకొంతమంది స్కూల్ కి పిల్లలను తీసుకవెలుతున్నారు . నిజం చెప్పాలంటే వారు ఒక్కరు కూడా నా వైపు కన్నెత్తి చూడలేదు . వారెవరు జార స్త్రీలు కాదు . ఏమో ఈ చర్చి పాస్టర్ రేవెరెండ్ జాషువ చెప్పినట్టు ఈ జార స్త్రీలు చెడ్డవారు కాదేమో ? . ఏమో ఒక్క జార స్త్రీ అయిన కనబడితే చర్చి కి తీసుకొనిపోయి తన చెయ్యి నా చేతి లో వేసుకొని దగ్గర గా ప్రార్థన చేయిస్తే మంచిగా మార్చవచ్చు కదా . offcourse some రిస్క్ involved ఇన్ this , buts its ఓకే . I ' ll bet I could resist a loose woman , no problem , if I could ever find one . Sometimes , I imagine myself resisting as many as three or four at a time . అబ్రహం ని దేవుడు ఇలా అజ్ఞాపించాడు " నా పైన నమ్మకముంటే నీ కొడుకుని నా కోసం త్యాగం చెయ్యి " . అప్పుడు అబ్రహం కొడుకుని ఇవ్వడానికి సిద్దపడినప్పుడు దేవుడు " నువ్వు టెస్ట్ పాస్ అయ్యావు " అన్నాడు . ఆ దేవుడు నాకు కూడా ఇద్దరు లేక ముగ్గురు జార స్త్రీలను ఇచ్చి నా నమ్మకాన్ని టెస్ట్ చెయ్యాలి . ఖరీదైన కార్లలో సగం సగం డ్రస్సులు వేసుకొని chrome pub కి వచ్చే చెడు స్త్రీలో , james raaju దగ్గర వున్న hot - rod magazines లో వున్న ముగ్గురు లేక నలుగురు జార స్త్రీలనో దేవుడు నాకు ఇచ్చి చూడాలి . నేను ఎప్పటికి i will be in ది path of righteous అని proove చేసుకుంటా . కొత్త పాస్టర్ రేవెరెండ్ యెహోవ . Holy Christ Almighty Lutheran Church కి కొత్త పాస్టర్ రేవెరెండ్ యోహోవా వచ్చాడు . నిజం చెప్పాలంటే నాకు అతను నచ్చలేదు . పాత పాస్టర్ రేవెరెండ్ జాషువా retirement డిన్నర్ నుంచి ఈ కొత్త పాస్టర్ రేవెరెండ్ యోహోవా కు నా హృదయం లో స్థానం కల్పించాలని ఎంతే ట్రై చేసినా అవట్లేదు . నాకు అతని మీద ఎంత మాత్రం నమ్మకం లేదు . పాత పాస్టర్ జాషువా prayer లో పిల్లలను కుడి వైపు నుంచి ఎడం వైపు కి తిప్పేవాడు . కాని ఈ కొత్త పాస్టర్ రేవెరెండ్ యోహోవా ఎడం వైపు నుంచి కుడి వైపు పిల్లలను తిప్పుతున్నాడు . ఇంకొక ఆదివారం సిని ఆర్కెస్ట్రా వారితో చర్చి లో బృంద గానం చేయించాడు . దేవుని గృహం లో సిని ఆర్కెస్ట్రా వారా ? ? . చర్చి పత్రికలో కార్టూన్లు కూడా వేయిస్తున్నాడు . ఇంకొక ఆదివారము చేతిలో బిగ్ బజార్ ఆఫర్ పాంప్లెట్ దాచుకొని " ఈదినమున మార్పు కోసం మన ప్రార్థనను తొందరగా ముగిద్దాం " అన్నాడు . ప్రభు సేవకుడైనప్పటికి షాపింగ్ ముఖ్యమా ? . ఇంకొక ఆదివారం టెన్నిస్ షు వేసుకొని చర్చి వచ్చాడు . క్రిస్టమస్ ముందు దినము లిస్టు ప్రకారం మా ఇంటికి ముందు రాకుండా ఆ మేరీ ఇంటికి వెళ్ళాడు . ఐదో తరగతి పిల్లలకు బైబిల్ స్టడీ సందర్భంగా సహనం కోల్పోయి " hell is not a pogo channel " అని అరిచినంత పని చేశాడు . " ఆ దేవుని సన్నిధి లో మీరు అల్లరి చేస్తే మీరు నరకానికి పోతారు . నరకం పోగొ ఛానల్ కాదు . ఇక్కడ దేవుని శబ్దము విధిగా పటించుము " అని పిల్లలను ఉద్దేశించి చెప్పాడు . వారు వినే మూడులో లేరు . మార్కర్లు విసిరేసుకుంటూ , పుస్తకాలు చించుతూ , పెన్సిల్ల తో పొడుచుకుంటూ అల్లరి చేస్తూనే వున్నారు . ఆగ్రహం తో యెహోవా " బాలకులార మీకు నిజంగా నరకం అంటే ఏంటో తెలియదు , " Hell is a place of blackest darkness with smoke and unquenchable fire . Matthew 24 : 51 says , ' He will cut him to pieces and assign him a place with the hypocrites , where there will be weeping and gnashing of teeth " . ఇప్పుడు చెప్పండి మీకు నరకం పోగొ చానెల్ లాగ కనబడుతుందా . . . అని ప్రశ్నించాడు . చిన్న పిల్లలను బోర్ కొట్టించే వారి పైన చర్య తీసుకునే మాదిరిగా ఒక చట్టం వుంటె బాగుండేది . ఒక దినము నేను పరిశుద్ద గ్రంధము చదువుతుండగా " ఇన్ Jeremiah 17 : 4 , in which God says , నాలో ఆగ్రహం రగిలించకు . శాశ్వతమగు నా అగ్రహాపు అగ్ని లో నీవు దహించు కొని పోతావు . అదే ఇంకొక పుట లో " Jeremiah 33 : 14 , in which God says , " నా కోపం అశాశ్వతము " . ఈ contradiction అండ్ flaw ఇన్ లాజిక్ గూర్చి కొత్త పాస్టర్ రేవెరెండ్ యోహోవా ని అడిగితే " scholars are scrambling to explain the strange paradox : అని చెప్పి తప్పించుకొన్నాడు . ఐ మిస్ పాస్టర్ రేవెరెండ్ జాషువ . దేవన గారి కి ఇక వుంటాను . నీ రాకపోకల యందు ఆ యెహోవా నీకు తోడై ఉండును . ఆమెన్
ప్రసిద్ధ తెలుగు filmmaker ( దీనికి తెలుగు పదం ఏమిటో ) శ్రీ ఎల్వీ ప్రసాద్ జీవిత చరిత్రను " వెండితెర వరప్రసాదం " పేరుతో నవ్య వారపత్రిక వారు ధారావాహికంగా ప్రచురిస్తున్నారు . మార్చి 17 సంచికతో మొదలయ్యింది . రచయత ఓలేటి శ్రీనివాస భాను . ఎందరికో స్పూర్తినిచ్చే ఆయన జీవితం గురించి తెలుసుకోవడం ఇప్పుడు మరింత సుళువు . ఎందుకంటే , ఇప్పుడు నవ్య వారపత్రిక onlineలో లభ్యం : http : / / www . navyaweekly . com / ( మరో మంచి విషయమేమిటంటే online ప్రచురణ మార్చి 17వ సంచికతోనే మొదలయ్యింది ) .
హైదరాబాద్ రాజధాని కాబట్టే , తెలుగు సమాజం లో ని క్రీమీ లేయర్ అక్కడికి చేరుకుంది . ఈ మానవ వనరుల వలననే ప్రభుత్వాలు పెట్టుబడులను ఆకర్షించాయి . తెలంగాణా ఖనిజ వనరుల వలన ఆంధ్ర పెట్టుబడి దారులు ఎంత బాగుపడ్డరో సంఖ్యలతో సహా చెబితే బాగుండేది . ఖనిజ వనరులు సీమ లోనూ , కొన్ని కోస్తా జిల్లాలలోనూ కూడా బాగానే ఉన్నాయి . పెట్టుబడి అంటేనే , దోపిడీ . . ఈ దోపిడీ కి బై ప్రొడక్ట్ గా కొన్ని ఉద్యోగాలు వస్తాయి . పెట్టుబడి దారులలో మీ పెట్టుబడిదారులూ , మా పెట్టుబడిదారులు ఉండరు . మీ / మా మన మనసులోనే ఉంటుంది . తెలంగాన పెట్టుబడి దారులు తెలంగాణ ను ఉధ్ధరించాలి అనుకోరు . పెట్టుబడి దారులు కూడా ప్రజలే . తెలంగాన పెట్టుబడి దారులు తెలంగాన వారి కి ముద్దైతే ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర వారికి ముద్దు . మామూలు జనాలలోనె కొంతమంది సంపాదించి పెట్టుబడిదారులౌతారు . కాబట్టీ ఆంధ్ర పెట్టుబడి దారులను ఆంధ్ర ప్రజలనుంచీ వేరు గా చూడనవసరం లేదు . ఆంధ్ర పెట్టుబడి దారులకు మీరు వ్యతిరేకమైతే ఆంధ్ర ప్రజలకు కూడా వ్యతిరేకమే ! అలానే ఆంధ్ర రాజకీయ నాయకులను కూడా ఆంధ్ర ప్రజలు వోట్లు వేసి గెలిపించుకొన్నారు . ఆంధ్ర పాలకులను తిట్టినట్లైతే మొత్తం ఆంధ్ర ప్రజలను తిట్టినట్లే ! సమైక్యాంధ్ర నినాదం ఏ కొందరు పెట్టుబడిదారుల వలనో వచ్చిందనుకొంటే మీరు ఊహలలో బతుకుతున్నారు . దిసెంబర్ తొమ్మిది ప్రకటన తరువాత , ఆంధ్ర లో ఆటో వారి నుంచీ , కూలి వారినుంచీ అన్ని వర్గాలప్రజలూ ఈ ఉద్యమం లో పాల్గొన్నారు . దీనికి ముఖ్య కారణం , ఆంధ్ర ప్రజలకు కొత్తగా హైదరాబాద్ తో ఏర్పడిన అనుబంధం . దాదాపు ప్రతి కుటుంబం నుంచీ ఒకరన్నా హైదరాబాద్ లో ఉంటున్నారు . అలాంటి హైదరాబాద్ ని కోల్పోవటం అనే దానికి ప్రతిస్పందన గా ఉద్యమం జరిగింది . . మళ్ళీ జరుగుతుంది . " ఎడతెగని సమస్యకు సీమాంధ్ర ప్రజల సానుకూలత ఖచ్చితంగా పరిష్కారం చూపెడుతుంది . " పెట్టుబడిదారులూ , నాయకులూ కూడా ప్రజలలో భాగమే ! నాయకులు ప్రజల ప్రతినిధులు . వారిని మీరు దోపిడీ దారులూ , దొంగలూ అని ఉద్యమం మొదలుపెట్టారు . ఇప్పుడు వారి సానుకూలత మీకు ఎందుకు కావలసి వచ్చింది ?
కం . తెలుగుకి ఆంగ్లం దట్టిం చి లేతవంకాయకూర చికెనుకెబాబుల్ కలగలిపి తిన్న రీతిని పలకకపోతె మనభాష అర్థమవదుగా . ఆ . వె . పంది బురదలోన పొర్లుతూంటేజూచి ఆహ ! బురద యెంతొ హాయిగొలుపు నంటు దొర్లినాము ఆంగ్లపంకమునందు పందులం పరాయివారికన్న . ఆ . వె . వారిభాష నేర్చి వారిసంస్కృతినేర్చి వొరగబెట్టెదేన్ని ? ఓరి శుంఠ ! వారిమాయలోన దూరి పరాయివై పోయినావు నీవు పూర్తిగాను . తే . గీ . అమ్మవంటి భాషనెటుల వదలినావు మేలుకొనుము నీవిపుడైన మేలుసేయ లేకపోయినచో నీకులేదు ముక్తి కనుక సేవచేయ నడుముకట్టు యిపుడు .
@ మురళి : > > ఎప్పుడో మిమ్మల్నీ వెండి తెర మీద చూసేస్తామన్న మాట . . < < భలే జోకుతారండీ మీరు . ఇంకా నయం ఇప్పుడే నా ఆటొగ్రాఫ్ ఇచ్చెయ్యమనలేదు సినిమా వాళ్ళతో మాట్లాడాలనీ , వాళ్ళని చూడాలనీ ఎప్పుడూ అనిపించదు కానీ విశ్వనాధ్ గారంటే వల్లమాలిన అభిమానం వల్ల అలా అనిపించింది . పైగా అవకాశం వుందికదా అని మరికొంత ఆశ పుట్టింది . @ నేస్తం : మీ ఫ్రెండ్ చెప్పిందంతా అబద్ధం . . . అబద్ధం . . . . అబద్ధం ( అయినా వ్యక్తి గతంగా ఆయనకి ఏ పిచ్చున్నా అది మనకి అనవసరం దాన్ని తెరమీద చూపించనంతవరకూ మనం అభ్యంతరం చెప్పకూడదు అని నా అభిప్రాయం ) చెప్పులు కుట్టే వాడినీ , చేపలు పట్టేవాడిని హీరోలని చేసి ఎంతో ఉదాత్తంగా ఆ పాత్రలు మలిచి ఎప్పటికీ మన మనసుల్లో గుర్తుండిపోయేలా చేసారాయన . శ్రమైక జీవన సౌదర్యం ఎంతందంగా చూపిస్తారు . నాకు సరిగా చెప్పటం రాదుకానీ నా వరకూ నాకు , కొన్ని వృత్తుల పట్ల కొందరు వ్యక్తుల పట్లా గౌరవం పెరిగింది విశ్వనాధ్ సినిమాలవల్లే . @ మైత్రేయి : ధన్యవాదాలు
ఒకటి కలిసింది ' ఈ - టీవీ ' , ' ఈ - టీవీ 2 ' , ' టీవీ 5 ' , ' ఈనాడు ' , ' ఆంధ్రజ్యోతి ' , ' సూర్య ' ల గుంపుకు . ఈ ఛానెల్ ను ఏకంగా ప్రారంభం నుంచే బాబు కి అంకితం ఇచ్చినట్లున్నారు . ఇన్ని రకాల మీడియా వాళ్ళు అండగా ఉంటే ఏమైనా చేయొచ్చు అనో , లేక ఇంకో ఆయిదేళ్ల తర్వాత అధికారం జలగ లాగా పట్టుకుంటుందనో లేక ఇలాంటి పక్షపాత ధోరణి తో కూడుకొని ఉన్న ఛానెల్స్ చూస్తున్న జనాల అమాయకత్వం చూసో కానీ ఎక్కడ చూసినా బాబే వినూత్నంగా తెగ నవ్వుతూ ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు ఈ ఛానెల్ వెబ్సైట్ లో . మొత్తానికి రాజశేఖరరెడ్డి పోయినప్పటి నుంచి కొత్త ఉత్సాహం వచ్చినట్లుంది బాబు అండ్ కో కి . ఇక సీట్లు ఆశిస్తున్న వాళ్లంతా ఇప్పటినుంచే గాంబ్లింగ్ మొదలు పెడుతున్నారు . ఏదో ఒక రకంగా భవిష్యత్తు లో లాభ పడటానికి ఇప్పటినుంచే బాబు కి సహకరిస్తున్నారు . మరి ఈ ఛానెల్ ప్రారంభం వెనుక ఎలాంటి మతలబులున్నాయో . సాక్షి కి ఈనాడు అండ్ కో కి తేడా ఏంటంటే ఒకడు దొంగ రూపం లో ఉన్న దొంగ , ఇంకొకడు మంచి వాడి రూపంలో ఉన్న దొంగ . దీనిలో రెండో వాడి వల్లే నష్టం ఎక్కువ . కొత్త ఛానెల్ కానీ వార్తా పత్రిక గాని వస్తుంటే ఏ పార్టీ వారిదో ఆ ఛానెల్ అని అడగాల్సి వస్తుంది చివరికి . సరే ఇవన్నీ ఎప్పుడూ ఉండేవేలే కానీ , ఇన్ని తెలుగు న్యూస్ ఛానెల్స్ వల్ల తెలుగు వచ్చిన వారికి కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడుతున్నాయి కాబట్టి వీళ్లకి నా అభినందనలు .
ఉదాసీనత నింపుకున్న మా కళ్లలోకి గోడ మీది చిత్ర పటాలు తదేకంగా చూస్తున్నాయి .
ఏమైనా మేథ్యూ విషయంలో కిరణ్ చూపించిన అవగాహన , ఆత్మ స్థైర్యం తనకే ఆశ్చర్యం కలిగించాయి . మాట్ తో పరిచయమైన ఈ మూడు నాలుగు నెలల్లోనే వాళ్ళకి బాగా స్నేహం కుదిరి పోయింది . అప్పటి తన బెస్ట్ ఫ్రెండ్ బ్రయన్ తనని వెలేసినట్టు చూస్తాడని తెలిసి కూడా వాడు మేథ్యూతో స్నేహం చెయ్యడం … నిజంగా వండర్ ఫుల్ . ఇవ్వాళ్ళ మార్టిన్ లూథర్ కింగ్ డేకి స్కూలుకి శలవైనా , ఆ మహానుభావుడి జ్ఞాపకార్థం బడివాళ్ళు నిర్వహిస్తున్న ఫమ్క్షన్ కి మాట్ నీ కిరణ్ నీ బళ్ళో దింపి తను డ్యూటీ కొచ్చాడు . జస్ట్ నాలుగు నెల్ల క్రితం ఆఫ్రికన్ అమెరికన్ల గురించి రేషియల్ స్లర్స్ విసిరిన కారణంగా డిటెన్షన్ పాలైన కిరణ్ , ఈ రోజు వేడుకల్లో మాట్ తో కలిసి స్టేజ్ మీద కింగ్ గారి ' ఐ హావె డ్రీమ్ స్పీచ్ చదివే స్థాయికి ఎదగటం తనకి నిజంగా గర్వం కలిగించింది . ఈ వెధవ డ్యూటీ లేకపోతే తనుకూడా ఆ ఆడిటోరియంలో వుండేవాడు . ఈ పాటికి వాళ్ళ స్పీచ్ అయిపోయుంటుంది .
ఒక ఉపాయం ఏమిటంటే రెండవ ప్రపంచయుద్ధపు రోజులలోలా ఉక్కు పెన్నీలు తయారు చెయ్యటం . లేదా 1857 లో చేసినట్లు చెయ్యటం . మనకి పూర్వం ఇండియాలో దమ్మిడీలు , ఠోలీలు ఉన్నట్లు 1857 లో అమెరికాలో అర్ధ పెన్నీలు ఉండేవి . అర్ధ పెన్నీ ఆ రోజులలో చెలామణీలో ఉన్న అతి చిన్న నాణెం . దాన్ని వాడుక లోంచి తొలగించేరు . అలాగే పెన్నీని ఇప్పటి వాడుక లోంచి తీసేస్తే ఎలాగుంటుందంటారు ?
జయ గారూ ! ' వరుడు ' గండంనుంచి మమ్మల్ని రక్షించినందుకు శతకోటి వందనాలు .
" అయ్యయ్యో … ఆ అయ్యోరి చేతులు విరిగిపోనూ … గొడ్డును బాదినట్టు బాదేశాడు . అసలు వాడికి అంత ధైర్యం ఎక్కడినించి వచ్చింది ? " వెన్నముద్దలో ఏదో ఆకు పసరు కలిపి మాధవుడి వంటి మీది వాతలకు అంటిస్తూ వాపోయింది చిలకమ్మ .
ఈ పరిణామాలు , నాయకుల బహిరంగ వాఖ్యానాలూ ఎలా వున్నాయంటే ప్రజల ప్రాపు కోసం ఎవ్వరూ ప్రాకులాడక్కర లేదు , అధినేత్రి కరణ కురిస్తే చాలనుకుంటున్నారు . ఇది ఎంతవరకూ వెళుతోందంటే ప్రజాస్వామ్యపు మూలాన్నే కూలగొట్టేవరకు ! నిజానికి తన నియోజక వర్గపు మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని ఆ నియోజక వర్గ ప్రథినిధి మోయాలి . తన పార్టీ మెజారిటీ ప్రథినిధుల అభిప్రాయాన్ని ఆ పార్టీ అనుసరించాలి . కానీ అంతా తల్లకిందులు ! చివరికి ఇప్పటి తరం ఈ తల్లకిందుల ఎవ్వారమే అసలైనదిగా భావించేటట్లు ఇది ముదిరిపోయింది .
మెదటిగా . . e - తెలుగు స్టాల్ ఒకటి పుస్తక ప్రదర్శనలో పెడుతున్నారని తెలిసిన తరువాత నా మదిలో మెదలిన
ఇవికాక అక్కడ బాంబు వుంది ఇక్కడ బాంబు అని పోలీసులకు కాల్ చేసే వాళ్ళు . ఆలాంటి వాళ్ళను కనిపెట్టి సరైన శిక్ష విధిస్తే ఇలాంటివి జరగకుండ ఆపగలం . ఒకవేళ ఇలాంటివి జరిగితే ఇక్కడి ప్రభుత్వం ఎంత కఠినంగ చర్యలు తీసుకొంటుంది అనే దానికి ఒక ఉదాహరణ .
అయితే , నా స్నేహితుడు నన్ను అక్కడికి తీసుకెళ్ళాక కానీ అర్థం కాలేదు ఆ వంతెన ప్రత్యేకత . నేను మెష్ అనుకున్నది - కొన్ని వందల తాళాల గుత్తుల సమాహారం !
రావణుడు సీతముందు అశోకవనంలో ప్రగల్భాలు చెప్పుకుంటున్నప్పుడు తానే " సొంత డబ్బా " కొట్టుకొన్న ఘట్టం ఇది .
శ్రీ అక్కిరాజు ప్రసాద్ అనే పేరు ఎక్కడో విన్నట్లుందే . . . హైదరాబాదు ఒరాకిల్ లో పని చేస్తున్నారా ?
' ' గాంధీగారు ఏమి బీజం వేశారోగాని . . . ప్రకాశంగారిలో ఉన్న దోషములేవో కనిపెట్టడమే నాడారుగారి కార్యక్రమంగా మారింది . ఇంతేగాక ఆంధ్రులకు ప్రాముఖ్యం కలగడం తీవ్ర భాషావాదులైన తమిళ సోదరులు కొందరికి నచ్చలేదు . నాయకుని ఎన్నికయిన మరునాటినుంచి సంతోషం చేత ప్రకాశంగారిని అభినందించడానికి తెలుగు జిల్లాలలోంచి , ముఖ్యంగా గోదావరి , కృష్ణ , గుంటూరు జిల్లాలనుంచి వచ్చి ఫోర్టు సెంట్ జార్జితో సచివాలయం నిండుగా మెండుకునే ప్రేక్షక తరంగాలు - ఒక నూతన ఆంధ్రత్వాన్ని , పూర్వం వెంకటాద్రి నాయకుడు ఇచ్చిన స్థలంలో అతడే అప్పుగా ఇచ్చిన డబ్బుతో కట్టిన కోటకు కలగజేశాయి . ఆంధ్రులు ఒక మూల ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్న సమయంలో , ఈ విధంగా చెన్న నగరాన్ని తెలుగు వాతావరణంలో ముంచి వేయడం ఏమి బాగుంది ? ఇందుకు కారణం - కామరాజనాడారుగారు , రాజాజీ విడిపోవటమే గదా ! కనుక ఎలాగైనా వారిద్దరు మనసులు మార్చుకుని ఏకం కాకుంటే , ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యేవేళ చెన్నపట్నం ఆంధ్రపట్నంగా మారిపోతుందనే భయం కలిగి వారిని కలపడానికి సర్వయత్నాలు సాగించారు . రాజాజీ కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అయినది మొదలు ఈ స్నేహం గట్టిపడింది . కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీ ( సంవిధాన నిర్ణాయక సభ ) సమావేశాలు , వీరిరువురూ పదే పదే కలుసుకోవడానికి అవకాశాలు కలిగించాయి . రాజాజీ , నాడారుగారలు గడుసువారు గనుక - కళావెంకటరావు , గోపాలరెడ్డి వర్గాలను , తాము భాషాద్వేషాలకు అతీతులని అంటూ తమతో కలుపుకున్నారు . ఈ విధంగా ప్రకాశంగారికి కాంగ్రెసులోనే ఎదురుపక్షం నెలనెలకూ గట్టిపడింది . వీరికి తోడుగా ప్రకాశంగారి సాహసోపేత ప్రజాహిత పథకాలవల్ల ఆర్థికంగా దెబ్బతిన్న వారంతా ఏకమయ్యారు . ' నా జీవిత యాత్ర ' , అనుబంధ ఖండము , తెనే్నటి విశ్వనాథం , పే . 570 , 571 తరవాత పరిణామాలు చకచకా జరిగాయి . 1947 ఫిబ్రవరి 28న పార్టీ మీటింగులో ముప్ఫైమంథి సంతకాలుపెట్టి ప్రకాశంమీద విశ్వాసరాహిత్య తీర్మానానికి నోటీసిచ్చారు . అప్పట్లో ఏడాదికొకసారి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిని ఎన్నుకునేవారు . ఒకసారి ఎన్నుకున్నాక సంవత్సరం మధ్యలో అవిశ్వాస తీర్మానానికి నిబంధనలు ఒప్పుకోవని ప్రకాశం ఖండితంగా చెప్పాడు . ఎలాగూ నెలరోజుల తరవాత వార్షిక ఎన్నిక జరగవలసే ఉన్నది కదా , అంతదాకా ఓపిక పట్టకుండా మధ్యలో ఈ అక్రమ తీర్మానమెందుకు ? కావాలంటే ఆ ఎన్నికనే కాస్త ముందుకు జరుపుదాం అని ఆయన సూచించాడు . వ్యతిరేకులు వినలేదు . ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలంటూ సమావేశం ఆధికారికంగా ముగిశాక పోటీ సమావేశం పెట్టి ఒమాండూరు రామస్వామి రెడ్డియార్‌ని నాయకుడిగా ఎన్నుకున్నామన్నారు . అధిష్ఠానవర్గం పరిశీలకుడిగా వచ్చిన శంకరరావు దేవు అక్కడే ఉన్నా ఆ అక్రమ తతంగాన్ని ఆపలేదు . ఆ తరవాత , అక్రమాన్ని సక్రమం చేయాలన్న బుద్ధి అధిష్ఠానానికి పుట్టింది . కాంగ్రెసు వర్కింగు కమిటీని కొలువుదీర్చి చెన్నపట్నానికి వెళ్లి కొత్త నాయకుడిని ఎన్నిక చేయించే డ్యూటీని కాంగ్రెసు అధ్యక్షుడు జె . బి . కృపలానీకి అప్పగించారు . ఆయన మద్రాసు పోయి , వర్కింగు కమిటీ మిమ్మల్ని బర్తరఫ్ చేసిందని అబద్ధమాడి , ప్రకాశంచేత రాజీనామా చేయించాడు . పదవికోసం పాకులాడేవాడిని కానని నిరూపించుకోవడానికి రాజీనామా చేసినట్టే - తన బలం రుజువు చేసుకోవడానికి ప్రకాశం మళ్లీ నాయక స్థానానికి పోటీచేశాడు . అది 1947 మార్చి . ఇంకో ఐదు నెలల్లో బ్రిటిషు గ్రహణం వదిలి దేశంలో స్వతంత్ర భానుడు ఉదయించబోతున్నాడు . రాజ్యాంగ వ్యవస్థ , రాజకీయ వ్యవస్థల్లో వౌలిక మార్పులు రాబోతున్నాయి . తరతరాలుగా తెలుగువారు కోరుకుంటున్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్మడి మద్రాసు రాష్ట్రంనుంచి వేరుచేయించుకోవడానికి అదే సరైన అదను . ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రుడు ముఖ్యమంత్రిగా ఉండటంకంటే ఆ సమయాన కోరదగిన అదృష్టం ఇంకొకటి లేదు . ఆ సంగతి మహామేధావులు , మహాజ్ఞానులు అయిన మన నాయకమణులకు తెలుసు . అయినా ప్రజాప్రయోజనాలకంటే , రాష్ట్ర అవసరాలకంటే దిక్కుమాలిన రాజకీయ కక్షలు , ఈర్ష్యలే వారికి ప్రధానమయ్యాయి . తెలుగు రాజకీయ పెద్దలు కొందరు సిగ్గు , ఎగ్గు లేకుండా అరవ ఆసాములతో చేతులు కలిపి , ఆంధ్రకేసరి మంత్రివర్గాన్ని సంవత్సరం తిరగకుండా జయప్రదంగా పడగొట్టి , అధికారాన్ని పళ్లెంలోపెట్టి అరవలకు తిరిగి అప్పగించి ధన్యులయ్యారు . ఇక్కడో సందేహం కలగొచ్చు . తెలుగువాళ్లకు తలలు కలవక కొట్లాడుకుని అధికారాన్ని జారవిడుచుకుంటే . . . ముఠా రాజకీయాల పర్యవసానంగా మెజారిటీ కోల్పోయి ప్రభుత్వం పతనమైతే దానికి గాంధీగారినీ , కాంగ్రెసు అధిష్ఠాన్నీ నిందించడం ఎందుకు ? రాజకీయాలు కప్పలతక్కెడలా తయారైనప్పుడు పైవారు మాత్రం ఏమి చేయగలరు ? వారినీ వీరినీ అడిగి లాభం లేదు . వీటికి జవాబు దుష్టరాజకీయం వాతపడ్డ ప్రకాశం చెబితేనే బాగుంటుంది . తాను ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది , తన ప్రభుత్వ పతనానికి పుణ్యం కట్టుకున్నదెవరు అన్నదానిమీద 1947 మార్చి 25 , 26 తేదీల్లో మద్రాసు శాసనసభలో ప్రకాశంగారు ఏకధాటిగా రెండురోజులు మాట్లాడారు . ఆ సందర్భంలో ఆయన అన్న మాటలివి : ' ' నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను . ఎప్పుడూ , ఎవరో కొందరు పెద్దలతో నాకు తగాదాలు వస్తూనే ఉండేవి . . . సంవత్సరంకింద అంటే 1946 మార్చి 30న ఆంధ్ర ప్రాంతంనుంచి ఒక గౌరవసభ్యుడు చెన్న రాష్ట్రంలోగల రాజకీయ పరిస్థితులను గురించి అధిష్ఠానవర్గంలో ఉన్నత స్థానం వహించిన ఒకరితో చెప్పడానికి స్వయంప్రతినిధిగా వెళ్ళారు . పోటీపడుతున్న ముగ్గురు నాయకులలో నన్ను తప్పించి , తక్కిన ఇద్దరూ చేతులు కలుపుకొనే లాగున అధిష్ఠానవర్గంవారు చేయవలసిందిగా గట్టిగా కోరారు . నాకు ఎదురుగా ఇప్పుడు కూచున్న ఒకరు ( బెజవాడ గోపాలరెడ్డి ) తాను తనపై వేసుకున్న దౌత్యం సఫలమయిందని అక్కడినుంచి రాజాజీకి ఒక ఉత్తరం కూడా వ్రాశారు . ఆ ఉత్తరంలో గాంధీగారు తనతో హృదయపూర్వకంగా అన్ని సంగతులూ మాట్లాడారనీ , అయితే తనకు మాత్రం ఏ స్థానమూ చూపించలేదనీ కూడా అందులో వ్రాశారు . ' ' తరువాత నాయకుని ఎన్నికలో ప్రతిక్షణమూ అధిష్ఠానవర్గంవారు అతిగా జోక్యం కల్పించుకుంటూ వచ్చారు . అయినప్పటికీ , ఇప్పుడు ఎన్నికైన రామస్వామిరెడ్డిగారిని ఆహ్వానించినట్టే అప్పట్లో నన్నూ మంత్రివర్గం ఏర్పాటుచేయడానికి గవర్నరు ఆహ్వానించడం జరిగింది . ' ' నేను నాయకుణ్నిగా ఎన్నికైన తర్వాత ప్రతివర్గం నాయకుణ్ని మంత్రివర్గం ఏర్పాటుచేయడానికి నాకు సహాయం చేయవలసిందని కోరాను . . . ( ఒక సభ్యుడిని చూపుతూ ) ఆ గౌరవ సభ్యునితో నేను చాలాసేపు ఆ విషయం చర్చించాను . వారివర్గం వారు అప్పటికి మంత్రివర్గంలో చేరదలచుకోలేదని చెప్పినారు . తర్వాత రెండవ వర్గంవారితో మాట్లాడాను . వారు ఇచ్చిన పేర్లలో ఒకటి తప్ప తక్కినవాటిని నేను అంగీకరించాను . . . ఆ రోజున నా బాధలు ఆరంభమయినాయి . ఆ పేరు అంగీకరించకపోవడానికి నాకొక కారణముండేది . ' ' పది నెలలదాకా మా కార్యక్రమాలు సవ్యంగానే నడిచాయి . ఇప్పుడు ఈ విశ్వాస రాహిత్యమన్న భావమెలా వచ్చింది ? ' ' నా జీవితయాత్ర , టంగుటూరి ప్రకాశం , పే . 576 - 578 ప్రకాశంగారు ఇంకా ఇలా అన్నారు : This thing happened in Delhi . All these things were organised in Delhi ; all these plans were launched in Delhi . Some friends . . . were wired for ; Those who were active in Delhi , came down here . Their votes and their groupings produced this wonderful result . . . Is this the conduct of ordinary human beings , to remove one man from his office . . . by so much combination , so much conspiracy , so much intrigues . . . ? Sir , . . . to be told enough to stand and say , " " Even though you are the High Command , we can not follow you ; we have got our own judgment ; you are wrong ; we will fight against you when you are in the wrong ? ' ' Sir , we did so on the first occasssion . At the second time , we had not the strength . These 116 friends who voted against me are strong people . . . I have been carrying with such friends all these twenty six years . . . [ Quoted in History of Andhra Movement . G . V . Subbarao , Vol . II . PP 357 - 359 ]
జ్యోతిష్కుడు ఒక క్లూ లేక హింటు ఇస్తాడు . జాతకుడు దాన్ని పూర్తి చేస్తాడు . ఆ పూర్తి చెయ్యడంలో తాను జ్యోతిష్కుడికి ఎంతో సమాచారం తిరిగి ఇస్తాడు . తనగురించి తానే చెప్పుకుని ప్రశ్నలు వేస్తాడు . ఆ ప్రశ్నల్లోనే చాలా సమాచారం ఉంటుంది . వివాహానికి సంబంధించిన సమస్య ఏమైనా ఉందా అని జ్యోతిష్కుడంటే , వెంటనే పెళ్ళైన దగ్గరనుంచీ మొత్తం కథ అంతా చెప్పుకొచ్చేస్తాడు . చివరికి మా అవిడకి విడాకులిమ్మంటారా అని అడుగుతాడు . అతడు చెప్పే సమాచారమంతా తనకు తెలియకుండానే జ్యోతిష్కుడు గ్రహిస్తాడు . ఓహో , సప్తమాధిపతి నీచ రాశిలో పడి కుజ సమాగమం చెందాడు . ప్రస్తుతం వాడి దశ నడుస్తోంద ' అనుకుని , ప్రస్తుతం బాగుండదయ్యా , ఒక్క ఏడాది ఓపికపట్టి చూడు అంటాడు . లేదా కుజ జపమో ఏదో చేయించుకోమంటాడు . అలా కాక మొదట ఇచ్చిన హింటుకి , అబ్బే లేదండీ , నా భార్యతో ఏమీ ఇబ్బందులు లేవు , మామగారితోనే అని జాతకుడన్నాడనుకోండి . జ్యోతిష్కుడు ఫలితాలు చెప్పే దిశ మారుతుంది . ఓహో , సప్తమాధిపతి కుజ సమాగమంలో ఉన్నాడు కాబట్టి ఆ కుజుడు మామగారు అని మనసు చెప్తుంది నిశ్శబ్దంగా . వీళ్ళ ఆవిడమీద మామగారి ప్రభావం ఎక్కువగా ఉంది అనిపిస్తుంది . కొంతకాలం మీ ఆవిడని వాళ్ళ పుట్టింటికి దూరంగా ఉండేలా చూసుకో , ఈ కుజ దశ అయ్యేవరకూ అని సలహా ఇస్తాడు .
నెలకి ఒకసారైనా ఇద్దరూ కలిసి ఏదైనా రెస్టారెంటుకో … మంచి హోటల్‌కో వెళ్లాలి . అక్కడ ఆమెకు ఇష్టమైనదానినే మీరు కూడా ఆర్డర్ ఇచ్చి … ఇద్దరూ ముచ్చట్లు చెప్పు కుంటూ కాలక్షేపం చేయాలి .
కృష్ణా , తుంగభద్ర , హంద్రీ తధితర జీవనధులతో సస్యశ్యామలమై శ్రీశైలం , అహోబిలం , మహానంది , యాగంటి వంటి పుణ్యక్షేత్రాలతో పుణ్యభూమిగా , వజ్రాలు , రత్నాలు , ఇనుము , బైరటీస్ , సున్నపురాయి వంటి అపార ఖనిజ సంపద కలిగియున్న ఈ జిల్లాను రత్నగర్బగా కూడ చెప్పుకునేవారు .
ఇటువంటి ఇఫెక్ట్‌లు సినీగీతాల్లో చక్కగా వాడుకుంటారు . ఇలా సన్నివేశాన్నీ , సందర్భాన్నీ బట్టి సంగీతదర్శకులు రకరకాల తాళవాయిద్యాలని విడిగానూ , కలిసికట్టుగానూ ఉపయోగించుకుంటారు . జానపదగీతాల్లో ఢోలక్ , కర్ణాటకసంగీత లక్షణాలకు మృదంగం వాడతారు . ఆధునికసంగీతంలా అనిపించడానికి రకరకాల డ్రమ్స్ ఉపయోగిస్తారు . ఈరోజుల్లో వందలరకాల ధ్వనులు పలికించగల ఆక్టాపాడ్స్ ( Octapads ) ఉన్నాయి . ఏ పారిజాతములీయగలనో వంటి కొన్ని పాటలు పద్యాల్లాగా లయ , తాళం లేనివిగా ఉంటాయి .
అందరు ఇలా అలోచిస్తే ఎప్పుడో పరిస్థితి బాగుపడేదనిపిస్తుంది . ఎవడైనా బుద్ధి + ఎద్దు ఉన్నవాడు ఆ పరిశ్రమలో అడుగుపట్టేంత వరకు ఈ ఘోరకలి తప్పదేమో . . .
నా పేరు అప్పారావు నెను భవిస్యత్ లొ ఎలాంతి జాబ్ వున్త్ంది
పద్మ గారూ , బాండువిడ్తు సమస్య ఇంకా లేదు . బొత్తాలన్నీ వాటివాటి సైట్లలోనే ఉంటే ( ఇప్పుడున్నట్లు ) , అవి ప్రతీసైటుకి లోడు అవ్వాల్సిన అవసరం ఉండదు . ఎవరికి వారు వాటిని వారివారి సైట్లలో పెట్టుకుంటే వాటిని అందరి బ్లాగులకీ ఒక్కొక్కసారి విహరిణి ( browser ) దిగుమతి చేసుకోవాల్సివస్తుంది . విహారీ , మీ బ్లాగులో ప్రస్తుతం statcounter ఎక్కువ టైము తీసుకుంటుంది . చార్టులు మీకు పంపిస్తా .
నలకూబరమణిగ్రీవులు పరమశివుని ప్రియసఖుడైన కుబేరుని పుత్రులు . వారు చాలా ధనగర్వముతో ఉండేవారు . రుద్రానుచరులై కూడా ఒకసారి వారు అతి పవిత్రమైన కైలాసపర్వతములోని ఒక సుందర ఉద్యానవనములో స్త్రీలతో కూడి వహారము చెసినారు . మదోమత్తులై వారుణి అను మదిరను పానముచేసినారు . వారు పద్మవనములో ఉన్న గంగలో జలక్రీడలాడ సాగినారు . అప్పుడు పరమపూజ్యుడైన నారదమహర్షి వారి పురాకృత సుకృతమువలన అక్కడికి వచ్చాడు . నారదుని చూసి ఆ దేవతాస్త్రీలు లజ్జితులై వెంటనే వస్త్రములు ధరించారు . కానీ మదిర ప్రభావములో ఒళ్ళు మరచిపోయిన ఆ కుబేరపుత్రులు వస్త్రములను ధరించలేదు .
కామేశ్వరరావు గారూ ! ! చాలా బాగున్నదండీ . ఊరించి ఊరిచి చెప్తూండడం చూస్తూంటే విశ్వనాథ వారి ప్రభావం మీ మీద ప్రస్ఫుటం గా ఉన్నట్టు కనిపిస్తోంది . అవధానం విసేషాలతో మీ తర్వాతి టపాలు ఎప్పుడెప్పుడా అన్నట్టు ఎదురుచూస్తున్నాం . ఇంతకీ గరికపాటివారి సహస్రభారతి ( కాకినాడలో సహస్రావధానం ) లో మీరు పాల్గొన్నారా ? ఎందుకడుగుతున్నా అంటే , దోగ్ధ్రీ ధేనువు సమస్యా పూరణం అప్పుడు విన్నట్టు గుర్తు . నా పుస్తకాల్లో ఎక్కడొ రాస్కుంట్టు కూడా గుర్తు . కనిపిస్తే / గుర్తొస్తే మళ్ళీ రాస్తా . . . సనత్ కుమార్
వెంకటేశ్వర్లుగారు అయిదో తరగతీ ఆరో తరగతీ ఇప్పటి ప్రకాశం జిల్లా ముఖ్యపట్టణమైన ఒంగోలులో చదివారు . ఆ రోజుల్లో ప్రకాశం జిల్లా అనే పేరు లేదు . ఆ పట్టణం కూడా గుంటూరులాగానే కృష్ణా జిల్లాలో భాగంగా ఉండేది . ప్రకాశం జిల్లాలో దక్షిణ ప్రాంతం నెల్లూరు జిల్లాలో భాగంగా ఉండేది . మొత్తం మీద కోస్తా ఆంధ్రలో విశాఖపట్నం నుంచి నెల్లూరు దాకా నాలుగే జిల్లాలు . ( రెండు గోదావరి జిల్లాలు లేవు , ఒక్కటే ) ఆ రోజుల్లో ఒంగోలు ఇప్పటంత పెద్ద పట్టణం కాదు . బస్‌స్టాండు దాటితే ఊరు ఉండేది కాదు . సంతపేటలోనయితే పగలు కూడా దొంగలు కొట్టేలా ఉండేదిట పరిస్థితి . నిజానికి దేశమంతా అలాగే ఖాళీగా ఉండేది . ఎందుకంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ జనాభా కేవలం 2 కోట్ల 40 లక్షలు మాత్రమే కనుక . వెంకటేశ్వర్లుగారు ఆరో క్లాసు చదివింది అక్కడి A . B . M . హైస్కూల్‌లో . అది ఇప్పుడు కాలేజి అయింది . ఆ స్కూలు ఆ రోజుల్లో వందెకరాలకంటే ఎక్కువ స్థలం కలిగి ఉండేదిట . అసలు ఇప్పటి ఒంగోలు పట్టణ విస్తీర్ణంలో సగం భూమి ఆ రోజుల్లో " ధారా " కుటుంబానికి చెందిన Estate అట . సదరు ధారావారికి ఆ ఊళ్ళో మొన్నమొన్నటి దాకా ఒక పొగాకు క్యూరింగ్ ఫ్యాక్టరీ కూడా ఉండేది . దాన్ని ఆ వంశానికి చెందిన చిట్టచివరి వారసుడైన ధారా శంకరశాస్త్రిగారు ఇటీవలే ( 1998 ప్రాంతంలో ) 10 కోట్ల రూపాయలకి అమ్మేశారని తెలుస్తోంది . శంకరశాస్త్రిగారు ఇంకా ఉన్నారో , లేరో తెలియడంలేదు . శంకరశాస్త్రిగారి తండ్రిగారైన ధారా గోపాలకృష్ణయ్యగారు ఒంగోలు పట్టణానికి ఏకధాటిగా 16 సంవత్సరాల పాటు మునిసిపల్ చైర్మన్‌గా పనిచేశారని వెంకటేశ్వర్లుగారు చెప్పేవారు . ఒంగోలులో వైదిక బ్రాహ్మలకీ నియోగి బ్రాహ్మలకీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది . ఒక వైదీకి పేరు ఏదైనా వీథికి పెడితే వెంటనే మునిసిపల్ కౌన్సిల్‌లో మర్నాడు హోరాహోరీ యుద్ధం . మళ్ళీ ఒక నియోగి పేరు ఇంకో వీథికి పెడుతూ మునిసిపాలిటీ నిర్ణయం ప్రకటిస్తేనే ఆ గొడవ సద్దుమణిగేది . అలా పోటాపోటీగా పెట్టిన వైదీకి నియోగి పేర్లతో ఒంగోలు నిండిపోయింది .
ఆధునిక పాశ్చాత్య కవిత్వ ధోరణులని తెలుగువాళ్ళకు పరిచయం చేసిన ముఖ్యులలో శ్రీశ్రీ ఒకడు . శ్రీశ్రీ మొత్తం చేసిన అనువాదాలు ఎన్నో నాకు తెలియదు కాని అందులో చాలా భాగం ' ఖడ్గ సృష్టి ' లో సంకలితమయ్యాయి . ఆ తర్వాత వచ్చిన ' మరో ప్రస్థానం ' లో కూడా కొన్ని అనువాదాలు ఉన్నాయి . ఇవన్నీ కలిపి సుమారు అరవై కవితలు . ఈ అనువాదాలను పరిశీలించడం ద్వారా కవిగా శ్రీశ్రీ వ్యక్తిత్వాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకొనే అవకాశం ఉంది . కవిత్వానువాదంలోని మంచి చెడ్డలనూ మెళకువలనూ గ్రహించడానికి కూడా ఈ అనువాదాలు ఉపయోగపడతాయి . ఈ దృష్టితో శ్రీశ్రీ అనువాదాలపై నా కొద్దిపాటి పరిశీలనను ఇప్పుడీ వ్యాసంలో వివరించే ప్రయత్నం చేస్తాను .
అమ్మో ! ఎంతమాట ? మిమ్మల్ని మర్చిపోవటమేమిటి ? అంటూ గబుక్కున పరుగెత్తుకుంటూ వెళ్ళి బుల్లి బక్కెట్టులో నీళ్ళుతెచ్చి బుడిగి బుడిగి మని వాళ్ళని నీళ్ళలో ముంచి , నెత్తిపై నీళ్ళు కుమ్మరించి గంధం బొట్టూ పెట్టి , పూలతో ముస్తాబు చేసి . . . . . . . . హడావుడిలో పడి మిమ్మల్ని నిర్లక్ష్యం చేశాను అంటూ గోముగా నేచెప్పే స్వచ్చమైన సారీ . .
సీ . రామ చంద్రకు , అనిల్ బిశ్వాస్ కు శాంతా రాం కూ రఫీ పాడే విధానం నచ్చదు . వారి దృష్టిలో ఏడ్చేపాటలో గాయకుదు ఏడుస్తూ పాదాల్సిన అవసరం లేదు . అందుకే ఎప్పుడయితే మహేంద్ర కపూర్ రంగ ప్రవేసం చేశాడో వారు మహేంద్ర కపూర్ ను ఆహ్వానించారు . అవకాశాలిచ్చారు .
తరవాత వేరే కార్డు వస్తుంది . దాని రంధ్రాలను బట్టి నిలువుపోగులు లేస్తాయి . ఈ విధంగా ప్రతి అడ్డపోగుకీ ఓ కార్డు ఏ నిలువుపోగులు లేపాలో తెలిపి బ్రహ్మాండమైన బాణీలని అల్లే వీలు కలుగుతుంది . పైన ఉన్న జాకర్డ్ బొమ్మ జాకర్డ్ మగ్గంతో అల్లినది అంటే ఆశ్చర్యం కలగక మానదు !
' ఆ దేశంలో చట్టం తన పని తను చేసుకుపోతుంది , దొంగలు వాళ్ల పని వాళ్లు చేసుకుపోతారు . ఒకరి పనిలో ఒకరు జోక్యం చేసుకోరు ' అనేది మన వ్యవస్థకున్న ఒకానొక వ్యంగ్య నిర్వచనం . ఎన్నికల కమిషన్ హెచ్చరికలనూ , వాటిని లెక్కచేయని రాజకీయ నాయకుల ధైర్యాన్నీ కూడా ఈ కోణంలోనుంచే అర్ధం చేసుకోవాలేమో .
రంగులు దిరిగిన గుమ్మడు లం గలిగిన పంటపొలములం గన నంతన్ బంగరుకుండలసిరి నిం డం గలిగిన బొక్కసంబుడంబున మించెన్ .
చదువరి గారు , మీరు మన ప్రధాని కి నిజంగానే ఈ క్రింది అడ్రస్ కి మెయిల్ చెయ్యచ్చు . pmh7rcr @ pmo . nic . in manmohan @ sansad . nic . in , presidentofindia @ rb . nic . in soniagandhi @ sansad . nic . in advanilk @ sansad . nic . in , btw . . మీరు only ప్రధానికి పంపినా ఒక copy . . madam కి వెల్తుంది : ) he kept filters like that . ఇక , మీ బ్లాగు లోని కామెంట్లకు స్పందించకూడదనే అనుకుంటూనే మొదలుపెట్టా . ఎందుకంటే నాకు అర్ధవంతం గా వివరించేంత నేర్పు తక్కువ . మొదటగా . . ఇక్కడ ఎవరో అన్నారు , పాపం మన మన్మోహనుడు కీ ఇస్తే ఆడతాడని . శుద్ద తప్పు . ఇప్పటివరకు నిజమైన కాంగ్రెస్ వాదులు , ఇంకా కమూనిస్టులు కూడా ఇవ్వటానికి సాహసించని స్టేట్మెంట్లు ఇచ్చాడు . ఉదాహరణకి , దేశవనరుల మీద తొలి హక్కు మైనారిటీలకే ఉండాలిట . తర్వాత వివరణలు ఏవో ఇచుకున్నారు లెండి . కాని అది ఉద్దేశ్యపూర్వకంగా ఇవ్వలేదు అంటే వారి అమాయకత్వానికి జాలి పడటం మాత్రమే మనం చెయ్యగలం . ఇంకేమన్నారంటే , హనీఫ్ ఆస్ట్రేలియా లో అరెస్ట్ అయినప్పుడు ఈయన నిద్రలేని రాత్రులు గడిపాడుట . ఇలాంటిదే కొంధమాల్ గురించిన వ్యాఖ్య కూడా . మరి ఇన్ని టెర్రరిస్టుల దాడులు జరుగుతుంటే ఈ మహానుభావుడికి నిద్ర ఎలా పడుతుందో ? అసలు ఇలాంటివి ఓట్ల కోసం ఇచ్చే పబ్లిక్ స్టేట్మెంట్లు లే అనుకుంటే పొరపాటు . ఎందుకంటే , ఇటీవల పోలిస్ ఉన్నతాధికారుల మీటింగ్ లో ఉగ్రవాద కేసుల్లో విచారణ చేసేప్పుడు చాలా జాగ్రత్తలు ( హద్దులు ) సూచించాడుట . వాళ్ళ ఆత్మస్థైర్యం తగ్గేలా ఉన్నాయవి . ఇది ఇటీవల NDTV ఇంటర్వూ లో అరుణ్ సౌరీ ఆధారాలతో సహా వెలిబుచ్చిన వాస్తవాలు . లంకె దొరకలేదు , ఇక్కడ ఇద్దాం అంటే . . ఇంక , నిన్న అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసి మాట్లాడుతూ అసలు భారతదేశంలో ' ఇస్లామిక్ ఉగ్రవాదం ' బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాతే మొదలైంది అన్నాడు . ఇంతకన్నా ఋజువులు ఏం కావాలి ? ఇది ' ఇస్లామిక్ ఉగ్రవాదం ' అనటానికి ? ఒకవేళ అతను చెప్పింది తప్పే అయితే ఏ ఒక్కరైన ఖండిస్తారేమో వేచి చూద్దాం . తాడేపల్లి గారు కరక్ట్ గా చెప్పారు , యే ఉగ్రవాది తనకి అన్ని మతాలు సమానం అనుకుంటున్నాడు ? ఇస్మాయిల్ గారు . . చెప్పగలరా ? మీరు 1000 చెప్పినా ఇది ఖచ్చితం గా ఇస్లాం మతం అడ్డుపెట్టుకొని సాగుతున్న మారణహోమమే . దీనికి ఇంకో ఉదాహరణ , పట్టుబడ్డ ఉగ్రవాది , తమకి భారత్ , అమెరికా , బ్రిటన్ , ఆస్ట్రేలియా దేశాలు ఇస్లాం కి శత్రుదేశాలు అని ప్రభోదించేవారని . ఇక్కడ ఎవరూ ముస్లిం మతస్థులంతా ఉగ్రవాదులు అనలేదు . కాని ప్రస్తుతం ప్రపంచం / భారతదేశం లో జరుగుతున్న ఈ దురాగతాలకి 80 శాతం ఇస్లాం కి వక్రభాష్యం చెప్పటం , దాన్ని విరివిగా ఫాలో అవ్వటం వల్లే జరుగుతుంది . ఇస్మాయిల్ గారు , మీ వాదనలో ఇంకొక కోణం నాకు ఎప్పటికీ అర్ధం కాదు , మూలాలు వెతకాలని . . నేను చదివిన అన్నిచోట్లా ఈ మాట అనేవాళ్ళు తగులుతారు , కాని ఇప్పటివరకు ఎవ్వరూ ఈ మూలాలేంటో , దానికి ఉగ్రవాదం ఏ విధమైన పరిష్కారమో అర్ధవంతంగా వివరించలేదు . ఎందుకంటే , అసలు మూలాలనేవే లేవుకాబట్టి . నా వరకు నేను హింస ని తక్కువ చేసి చూపేందుకు , ఉదారవాదులు ప్రయత్నిస్తున్న ఒక నాటకం గానె భావిస్తా , పదే , పదే మూలాలు అని చెప్పటం . . ఇదొక మితవాదుల ఉగ్రవాదం . కాకపోతే ఏంటి ? ఉగ్రవాదులు దాన్ని సాకు గా చెప్పరంటే అర్ధం ఉంది . . నిజాలు తెల్సిన వాళ్ళు , విద్యావంతులు కూడ అదే పాటా ? పోని , ఇది మతం వల్ల కాదు , నిరక్షరాస్యత , ఆర్ధిక అసమానతల వల్ల అనుకుంటే , ఈ దేశంలో దళితులకి కన్నా ముందు ఎవ్వరికీ అలా మారే అవసరం ఉండకూడదు . దేశాన్ని 400 ఏళ్ళు పైగా పాలించిన ఒక మతం వారు , వాళ్ళని అణగద్రొక్కారని భావించటమా ? ఒక్కసారి ఆ సుల్తానుల పాలన గుర్తు చేసుకుంటే , భారత చరిత్రలో ఇస్లాం రాజుల పాలన ఎటువంటి పరిణామాలకి దారితీసిందో తెలుస్తుంది . సరే , ఒకవేళ నిజంగా ప్రభుత్వాలు అలా అసమానతలు చూపిస్తున్నాయి అనుకుంటే , చాలా మంది విప్లవోద్యమాలు బాట పట్టి , నక్సలిజం లో చేరారు . ప్రభుత్వాలకి వ్యతిరేకం గా పోరాడారు . ఇలా బాంబ్ బ్లాస్ట్లతో భయోత్పాతాలు సృష్టించట్లా . . నిరక్ష్యరాస్యత కారణం అయితే యాహూ లో పని చేసే ఉద్యోగులకి ఏం అవసరమండి ఇలాంటి కార్యక్రమాలు చెయ్యటానికి ? మళ్ళీ మీరు వస్తారు , ఒకళ్ళని చూపించి అంతా అంతే అంటునారు అని . . కాదు , ఆ ఒకళ్ళు అలా చెయ్యటానికి కూడా ఇస్లామే కారణం అయింది అని చెప్పటానికే . మీరు నమ్మినా , నమ్మకపోయినా , ఇది మతం వల్ల / మతం పేరుతో జరుగుతుందే . . లేదంటే , శ్రీలంక లోని ఏల్టీటీఇ ఉగ్రవాదం తీసుకోండి . అక్కడ మనకి మతం అనే విషయమే కనపడదు . ఇక్కడ నేను ఏల్టీటీఇ చేసేదాన్ని సమర్ధించట్లేదు . కేవలం ఇక్కడ చేసె దానికి ఇస్లాం ని వాడుకుంటున్నారని చెప్పే ప్రయత్నమే . " ముస్లిం , ముస్లిం అంటూ దాన్ని భూతం గ చూపిస్తునారు " . . . అసలు ముస్లిం మతాన్ని భూతం గా చూపించటం వల్ల ఉగ్రవాదం తలెత్తిందా ? లేక ఉగ్రవాదుల్లో ఎక్కువ ముస్లింలు ఉండటం వల్ల దాన్ని భూతం గా చూస్తున్నారా ? ఆలోచించుకోవాలి . ఇక ముస్లిం జనాభ విషయం లో కూడా మీతో నేను విభేదిస్తాను . దేశ విభజన అప్పుడు 12 % ఉన్న ముస్లింలు ఇప్పుడు 20 % పైగానే ఉన్నారు , కొన్ని చోట్ల ఈ సంఖ్య 35 % వరకు ఉంది . మీకు తెలియకపోతే ఒక బహిరంగ రహస్యం చెప్పనా ? ఈ స్థాయి లో లేకపొతే ఇంత జరగదు , వీళ్ళు ఒక సైజబుల్ ఓటుబ్యాంకు గా మారారు , అందుకే తస్లీమా పై దాడి కి దిగినా , నడి బజారులో తుపాకీ పేల్చినా ఏమి అనరు . దురదృష్టమేంటంటే , ప్రభుత్వాలు 1 ) ఇటువంటి వారిపై చర్య తీసుకోకుండా , ఆఫ్జల్ గురు ని ఉరి తీయకుండా 3 ) మంత్ర్లి వెళ్ళి జైలు నించి విడుదలైన ఉగ్రవాదిని పరామర్శించిరవటం 4 ) అక్రమ చొరబాటు దారులపై చర్య తీసుకోకపొవటం వంటి వాటిని ముస్లిం అనుకూల నిర్ణయాలు గ చూపించటం , నిజమే అని వీళ్ళు అధికారాన్ని అప్పగించటం . ఈ దేశంలో ముస్లిం లీగ్ ని మంత్రిత్వం లో తీసుకున్న పార్టి సెక్యులర్ , ఒక మతానికి ప్రత్యేక శ్రద్ద కూడదన్న పార్టి కమ్యునల్ . అసలు చదువుకున్న వారి ఆలొచనలు కూడా ఎల ఉన్నాయంటే , ఇక్కడ చదువరి గారు , ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడిటే , కొందరేమో ముస్లింలని అన్నట్లు భావిస్తునారు . : (
ధ్యాంక్స్ గురువుగారు … నా పాటల లింక్ అభిమానంతో ఇక్కడ ఇచ్చినందుకు . .
2 . తడి లేకుండా శుభ్రంగా ఉన్న బట్టపై కడిగిన పుదీన ఆరేయాలి .
నా భావం మీకు అర్ధం అయినట్లు లేదు నేను గైం బాగుండదనో లేక పోతే దానిని వాడకూడదనో చెప్పటం లేదు . నేను కూడా దానిని వాడుతున్నాను . కాక పోతే ఒక్క జీటాక్ కోసమే . అన్ని ఒక్క చోటే వాడాలంటే ఉపయోగించే ట్రిలియన్ అనే మెసెంజర్ పది సంవత్సరాల క్రితం నుంచే వున్నది . మీరు దానిని కూడా ఒక్క సారి వాడి చూడండి .
ఇస్లాం వేరు , ఇస్లామీయత్వం వేరు అవుతుందా ? తీవ్రవాదాన్ని సమర్ధించే ఇస్లామీయులది ఇస్లామీయత్వం అని అనవచ్చా ? యూదులు వేరు . యూదుత్వం వేరు అనవచ్చా ? యుద్ధానికి దిగే యూదులది యూదుత్వమవుతుందా ? క్రైస్తవము వేరు , క్రైస్తవత్వము వేరు అవుతుందా ? మత యుద్ధాలకు దిగే క్రైస్తవులను క్రైస్తవత్వం అనవచ్చా ?
మీ డ్రైవర్ గురించి చదువుతున్నంతసేపు రాంగోపాల్ వర్మ సినిమాలోని కారెక్టర్ లా అనిపించాడు . మొత్తానికి తొందరగానే వదిలించుకుని బయటపడ్డారన్నమాట .
రోజులో సగం సమయం అతను స్టాక్‌ల వెంట తిరుగుతూ గడుపుతాడు . రోజుకు కనీసం అరడజను ట్రేడ్స్ చెయ్యకపోతే అతనికి ఆనందం కలగదు . క్రితం అర్నెలల్లోనూ కలిసి తన నిర్విరామ స్టాక్ మార్కెట్ కార్యకలాపాలకు గాను అతనికి వచ్చింది యాభై వేల డాలర్ల నష్టం ! అతను కొన్న వెంటనే యాహూ నలభై పాయింట్లు పడిపోయింది . దాంతో తిక్కరేగి దాన్ని అక్కడికక్కడే అమ్మేసి షార్ట్ చేసిన ఈబే యాభై పాయింట్లు పెరిగింది . ఈలోగా యాహూ కూడా ఓ నూట డెబ్భై పాయింట్లు పెరిగిందనుకోండి , అది వేరే విషయం . అతను కొన్న నాలుగు నెల్ల పాటు ఎటూ వెళ్ళకుండా చదికిల పడి కూర్చున్న సన్ మైక్రో అమ్మిన మర్నాటి నుంచి ఏదో పూనకం వచ్చినట్టు పెరిగి యిప్పటికి అతను అమ్మిన కన్నా డెబ్భై మూడు పాయింట్ల ఎత్తున ఉంది . ఇవేళ పొద్దున అతను కొన్న ఓ ఇంటర్‌నెట్ ఐపీవో అక్కడి నుంచి ఓ పాతిక పాయింట్లు పెరిగి అమ్ముదామా అని ఆలోచిస్తూండగానే ఆ పాతికా గాక మరో ముప్ఫై పాయింట్లు పడిపోయింది . అదింక కొన్న చోటికి యీ జన్మలో వస్తుందో రాదో ! ఇవన్నీ తల్చుకుంటూ అతను చిరాగ్గా ఉండగా స్టాక్‌బ్రోకర్ నుంచి మార్జిన్‌కాల్ వచ్చింది ! మూడు రోజుల్లో పదిహేను వేలు అందకపోతే తన ఇష్టం వచ్చిన వాటిని అమ్మేసి సొమ్ము చేసుకుంటానని బెదిరించాడు వాడు !
కొన్ని అరుదైన సందర్భాల్లో , ఈమాట పాఠకులని తమ అభిప్రాయం విషయమై సంప్రదించవలసి వస్తుంది . పాఠకులు " ఉత్తుత్తి ఈమెయిలు " ఉపయోగించినప్పుడు సంప్రదించే వీలు లేక ఆ అభిప్రాయం తిరస్కరించబడే అవకాశం ఉంది .
బాగుంది మీ విహారం . . . అలా మన కోసం మనం గడపగలగటం నిజంగా ఓ వరమే ! తారామండల పూలు . . బాగుంది పేరు . మేము వీటిని పున్నాగ పూలు అంటాం . నిన్ననే మా కాలనిలో చెట్ల కింద పరుచుకున్న ఈ పూలని చూసి చిన్నప్పుడు వాటితో అల్లుకున్న జడలు హారాలు గుర్తుకొచ్చాయి . . మీరు మళ్లీ అల్లేసుకున్నారుగా ! వీటి వాసన కూడా చాలా బాగుంటుంది . కాడలనుండి తేనె పీల్చటం . . రేకులతో బుడగలు చెయ్యటం . . అబ్బా మళ్ళీ పిల్లలమయిపోతే ఎంత బాగుంటుందీ !
నాలుగు సంవత్సరాల తరువాత కాని ఇద్దరికీ హైదరాబాదులో మళ్ళీ కలవడం కుదరలేదు . చాలా లావు అయిపోయానని సుజాత ఒకటే గొడవ , రాధిక ఇలా ఎలా మెయిన్ టెయిన్ చేస్తుందో అని మెచ్చుకోవడం . రాధిక మాత్రం , హైదరాబాదులో రెండు హాస్పిటళ్లలో పొద్దున్నా , సాయంత్రం పని చేస్తే నువ్వు కూడా నాలాగ పీక్కుపోవడానికి ఒక్క నెల చాలు అని నవ్వేసింది .
చాలా బావుందండి . . . మొన్నీమధ్య ఒక కధ చదివాను . . దాంట్లో కూడా ఇదే . . ఐతే కధ కాస్త సీరియస్ గా సాగింది . . మీది చదువుతుంటే నవ్వొస్తోంది . .
మందు తాగేసి పడి ఉన్నాడట . రాజు హాస్పిటల్ నుంచి డిస్‌ఛార్జ్
" నాకు నేను వొక ముస్లిం గా కనిపించడం 1990లోనే మొదలయ్యింది - యానాం వెళ్ళి వచ్చాక , " యానాం వేమన ఏమనే . . . " కవిత రాశాక " - ఏమిటా సందర్భం ? చెప్పదగినదే అయితే చెప్పండి . ఆ అస్తిత్వపు ఎరుక ఆలోచనల్లోనుండి కవిత్వంలోకి విస్తరించడం కూడా అప్పుడే మొదలయిందా ?
శ్రీనివాస్ గారు , క్షమించాలి . . ఏదో వ్యాఖ్యలు అయితే పెట్టేశాను కానీ , తరువాత కొంచెం ఎక్కువ అయిందేమో అనిపించింది . అందుకే డిలీట్ చేశాను . . మరోలా అనుకోకండి . . : ) )
అక్కసు పట్టలేక పోయాడు . ' ' ఈ నా కొడుకులు సెప్పేదేందిరా ! గొల్లోల్లు తప్ప రెడ్లెవురూ మీసాలు పెట్టుకోకూడదనా ! ' ' గట్టిగా అన్నాడు ఆయన .
ఒక పోలీసు ఆపినాడు హెల్మెట్ కిదర్ హై ? అని అర్ద గంట ఆపి ఐదు వందలు ఫైను వేసి వదిలినాడు
ఏడాది గడిచిపోయింది . బుల్లిభూషయ్య మళ్ళీ రాజధానికొచ్చాడు , అన్నయ్యనీ , చెన్నయ్యనీ కలవడానికి .
విసిగి విరక్తిచే తెలుగు వీధులలో నొక పిచ్చివానిగా మసలిన రెడ్డిరాజు మునిమాన్యుడు వేమన యాశుధారగా విసరిన కావ్యముల్ శ్రవణపేయముగా ప్రతిశబ్ద మీనెడిన్ దెసల నలంతి పోలికల తీయదనంబున భావసంపదన్
డక్కన్ క్రానికల్ పత్రిక లో ఈ యువజంట గురించి చదివినప్పటి నుండీ వీరి గురించి రాద్దామనుకుంటున్నా . ఇప్పుడు వీడియో పొస్ట్ చేసి జరిగినదాన్ని కళ్లకు కట్టారు .
శుభ్ర - జ్యోథ్స్నా - పులకిత - యామినీం ఫుల్ల - కుసుమిత - ద్రుమదళ - శోభినీం సుహాసినీం సుమధుర - భాషిణీం సుఖదాం వరదాం మాతరం | |
కందము . అవివేక , మూఢ భావ మ్మవకార్యము , మంద బుద్ధి , అలసత్వము , బు ట్టువ గనుచు తమోగుణమున , వివృతములై మోహమునఁ దపింపగ జేయున్ . ౧౩
కూరగాయలతో అలంకరించిన దేవాలయం : శాకంబరి ఉత్సవాల్లో భాగంగా పెద్దమ్మ తల్లి దేవాలయం లోపల అనేక రకాల కూరగాయలతో అలంకరించారు . అలంకరించిన కూరగాయలను పూజల అనంతరం భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుందని దేవాలయం నిర్వాహకులు తెలిపారు . శాకంబరి ఉత్సవాలు 3 రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయన్నారు .
మన తెలుగు బ్లాగుల్లో కొన్ని అంశాలు పూర్తిగా మిస్ . ఆటలు , Man Worship ( in an objectivistic way ) . అలా మిస్ అయిన అంశాలు ఈ మధ్య అంటే గత ఆరునెలల కాలం లో ఒకటి అయినా వచ్చాయి . గోదా కళ్యాణ మహోత్సవ సందర్భం గా నేను సృజన వల్లిక గారిని చేసిన interview ఇది . వీసా పనుల్లో ఎంతో బిజీ గా unnaa ఉన్నా వీలున్న సమయం లోనే నాతో చాట్ చేశారు . ఆవిడతో మాట్లాడిన తరువాత అమ్మాయిలూ ఇలా ఉంటే ఎంత బావున్ను అని అనిపించింది . Experience the energy .
ఈ అక్షరాలని అన్ని సైట్లలోనూ వాడవచ్చు . అయితే , ఆ సైట్లకి యూనికోడ్ తోడ్పాటు ఉండాలి . పెద్ద సైట్లన్నీ ప్రస్తుతం యూనికోడుకి అనుకూలంగానే ఉన్నాయి .
· కథా వస్తువు డయస్పోరా కథల్లోని కథావస్తువు సామాజిక స్పృహతో కూడుకున్నది . అయితే ఈ స్పృహ కలిగేది ఆ రచయిత ఉంటున్న కొత్త సమాజం గురించి . ఈ సందర్భం లో సామాజిక స్పృహ అంటే ఇదివరకు మనం చెప్పుకున్న అర్ధం అనగా , వర్గ వ్యవస్థ గురించీ , పీడిత వర్గాల సమస్యల గురించీ అని కాకుండా , తన చుట్టూ ఉన్న సమాజాన్నీ , అందులో తాననుభవిస్తున్న జీవితాన్నీ , అర్ధం చేసుకోవాలనే తపన అని అర్ధం చేసుకోవాలి . ఇక్కడ మనం గమనించవలసిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే , వేరు వేరు దేశాలలో ఉండే డయస్పోరా వారి అనుభవాలు విభిన్నంగా ఉంటాయి . కాబట్టి , వారు రాసే రచనలూ , వారు ఎదుర్కొనే సమస్యలూ కూడా విభిన్నంగానే ఉంటాయి .
' ' అట్లంటే ఎట్లమ్మా ! ఏదొక అవస్థపడి పెండ్లాం పిల్లోల్ల సాక్కోవాలి . బొమ్మలాట గాల్లంతా బొమ్మలమ్ముకనే బతుకుతున్నారా ? బిందెల వ్యాపారమో … కూలి పనులో . . ఏదొక పని … ' ' చెబుతూ చిన్నగా నిట్టూర్చాడు .
లేచి డ్రస్సింగ్ టేబిల్ ఎదురుగా బల్లమీద కూర్చుని హేండ్ మిర్రర్ లో మొహం చూసుకుంది , పరిశీలనగా . ముందు కళ్ళూ , ముక్కు , నోరు , … ఈ చెంప , ఆ చెంప , పెదాలు తడుపుకుని మళ్ళీ నోరు . తరవాత మెడనీ మెళ్ళో ముత్యాల గొలుసునీ జడ వచ్చి మెడ మీంచి గుండెల మీద పడటాన్నీ స్టడీ చేసింది . ఉన్నట్టుండి హెయిర్ క్లిప్ తీసి పడేసి జుట్టంతా విడిగా పరచుకుని మళ్ళీ అద్దంలోకి చూస్తూనే ఇటు తిరిగి ' చూడు ! ఈ hair style ! ' అంది .
' మీరు పాత అలవాట్లు మర్చిపోవాలి . ఇక్కడ డబ్బులు ఉండవు ' . ' అవును కదా , మర్చేపోయాను . మరి నీ శ్రమకి ప్రతిఫలంగా ఏమివ్వాలి ? ' ' ఏమివ్వక్కరలేదులే . రెండ్రోజులు మటుకు ఉండడానికి , తిరగడానికి అంతా ఫ్రీయే . అంతకన్నా ఎక్కువ ఉంటానంటే మాత్రం వలంటరీ వర్కు చేయాల్సి ఉంటుంది . ' ' చాలాబాగుందోయ్ మీ పద్ధతి ' మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు అనుమాన్లు .
దీంతో రాష్ట్రప్రభుత్వం ముందున్న రెండు జటిల సమస్యలు పరిష్కారమైనాయి . ఒకటి కే సీ ఆర్ దీక్ష విరమించడం , రెండు తెలంగాణా ఉద్యమంలోకి ప్రవేశించిన రోశయ్య గారు చెప్పిన అసాంఘిక శక్తుల ఆట కట్టించడం . అయితే ప్రతిసారీ ఎలక్షన్స్ లో చక్కగా ఉపయోగపడే బంగారు గుడ్డు పెట్టే బాతులాంటి తెలంగాణా సమస్యను పరిష్కరించాల్సిన అవసరమొచ్చింది . అంతే , అన్ని పార్టీల నేతలూ ఒక్కసారి ఉకిక్కి పడ్డారు . Read the rest of this entry »
డేవిడ్ హిల్బర్ట్ 1862లో కోనిగ్స్‌బర్గ్ ( ఇప్పటి కలినిన్‌గ్రాడ్ , రష్యా ) నగరంలో పుట్టాడు . నీతిశాస్త్రాన్నీ , విజ్ఞాన శాస్త్రాన్నీ సమన్వయపరచడానికి కృషి చేసిన ప్రముఖ జర్మన్ తత్వవేత్త ఇమాన్యుయల్ కాంట్ ( Immanuel Kant ) పుట్టింది కూడా కోనిగ్స్‌బర్గ్ లోనే . కాంట్ తరవాత 138 ఏళ్ళకి పుట్టినా , హిల్బర్ట్ కాంట్ వల్ల ఎంతో ప్రభావితుడయ్యాడు . అలాగే హిల్బర్ట్ సిద్ధాంతాలని ఎంతగానో వ్యతిరేకించిన బ్రోవర్ కూడా కాంట్ వల్ల ప్రభావితుడైనవాడే .
అప్పుడెప్పుడో మరిచిపోయిన కల జెండా అయి ఎగరడం చూస్తున్నా . అద్భుతంగా వుందిసార్ ఈ వ్యక్తీకరణ . . ఇలా అనొచ్చా అని చాలాసేపు అనుకొని సారేమన్న అనుకోని అని ధైర్యం చేసా .
" మొత్తం ఊరే అట్ల తయారయిందే . ఒక్కడు పని సక్కగ జెస్తలేడు . ఎప్పుడు కొట్లాటలే . ఉన్న భూమిని దున్నుకోక , కైకిలి సాతగాక , లచ్చిగాడు తాగి తాగి సావలేదా నిరుడు . " అని తుర్పిబాయి , ముగించింది . తుర్పి మాటలు విన్న బుచ్చయ్యకు గుండెలో రాయి పడ్డట్టయింది .
రాజు గారికి చాలరొజులుగా మీ వ్యాసాలు చదివె వీలు దొరకలెదు . prajakala కు ధన్యవాదాలు . భందారు శ్రీనివాస రావు
నియమబద్ధంగా పాఠశాలకు వెళ్ళి ' ఫస్ట్ ర్యాంకు ' లు తెచ్చుకోకపోయినా ఎంతోమంది సుప్రసిద్ధులయ్యారు . తాము వెళ్ళిన మార్గంలో మరికొందరు నడిచేలా స్పూర్తినిచ్చారు . వారు మార్కులు సరిగా రాలేదని , ర్యాంకుల పట్టికలో తమ పేరు లేదని ఏనాడూ చింతించలేదు . ఏ విషయంపై తమకు ఆసక్తి ఉందో గమనించారు . ఆ రంగంలో ఉన్నతస్థానం పొందేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో నిర్ణయించుకున్నారు . వాటిని పట్టుదలతో అమలుపరిచి చరిత్రపుటల్లో తమకంటూ కొంత స్థలాన్ని కేటాయించుకున్నారు . పరీక్షల్లో పలుమార్లు విఫలుడైన ఐనస్టీన్ , చిన్నప్పుడే చదువు మానేసిన ఎడిసన్ , కంప్యూటరే తనలోకమని నమ్మిన బిల్ గేట్స్ , ప్రాథమికస్థాయిలోనే బడి ఒదిలి సంగీతపు ఒడి చేరిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ , . . . ఇలా చెప్పుకుంటూ వెళితే ఎందరో మహానుభావులు జీవితంలో విజయం ఎలా సాధించవచ్చో సగర్వంగా చాటుతున్నారు . ఇంతకీ ' మార్కులు ' మన ప్రతిభను వెల్లడిచేయవా ? అని ప్రశ్నించుకుంటే . . . . అవి మన విషయజ్ఞానాన్నే తెలుపుతాయి . విషయజ్ఞానం తెలివితేటల్లో భాగమేకాని అదే సర్వస్వం కాదు . కానీ , నేడలా భావించడంలేదు . మార్కులు పొందితే చాలు . . . జ్ఞానవంతులు , తెలివిగలవారిగా మారిపోయినట్లేనని ప్రచారం సాగుతుండడం ఎంతో విచారకరం . ఇలాంటి అసంబద్ద నమ్మకాలవల్లనే ఎలాగైన నూటికి నూరు మార్కులు సంపదించాలన్న కాంక్ష మీలో పెరిగిపోతోంది . మీ తల్లిదండ్రులు కూడా దానికి తగ్గట్టు ఒత్తిడి చేస్తున్నారు . వచ్చిన అత్యధిక మార్కుల్ని పక్కనబెట్టి రాని స్వల్పమార్కులకై మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు . ఒకటి రెండు మార్కులు తగ్గినంత మాత్రాన ఏమాత్రం చింతించవద్దు . తల్లిదండ్రులకు కూడా నచ్చజెప్పేందుకు ప్రయత్నించండి . మీకు ఏ రంగంలో ఆసక్తి ఉందో వారికి తెలపండి . వీలున్నంతవరకు ఆ రంగంలో అభివృద్ది చెందేందుకు శిక్షణ ఇప్పించమనండి . మనం ఇష్టం పెంచుకుంటున్న రంగంలో మన ఆసక్తిని , ప్రతిభను కొలిచేందుకు అభిరుచి , వైఖరి పరీక్షలు ( ఆప్టిట్యూడ్ , ఆటిట్యూడ్ టెస్ట్ ) ఉంటాయి . వాటిలో పాల్గొని మన అవగాహన ఎంత ఉందో అంచనా వేసుకోవచ్చు . మార్కుల్ని మరిచిపొమ్మన్నాం కదా . . . అని పాఠ్యాంశాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది . మనం కోరిన రంగంలో అభివృద్ధి సాధించాలంటే పాఠ్యాంశాల పరిజ్ఞానం ఎంతో అవసరం . గురువు బోధించే పాఠాలను పూర్తి ఏకాగ్రతతో వింటే నూటికి తొంబై శాతం మీకు గుర్తుంటుంది . చూడకుండా చెప్పడం , వ్రాయడం ద్వారా ఆ పాఠాలు మన మెదడులో శాశ్వతంగా గుర్తుంటాయి . ఇక ప్రశ్న ఎంత తికమకపెట్టేలా ఉన్నా సుళువుగా వ్రాసి ఎక్కువ మార్కులు పొందొచ్చు . మార్కులు తగ్గితే తరువాయి దఫా పరిక్షల్లో పెరిగేందుకు కృషి చేయాలేగాని . . . . కుంగిపోవడం , నిరాశ చెందడం విజ్ఞత కాదు . మీ ఆసక్తిని మీరు ప్రశ్నించుకోండి . . . అందులో కృషి చేయండి . పూర్తిగా మార్కుల్నే పట్టుకు వేలాడితే మార్కులే మిగులుతాయి . మనం సాధించే ప్రగతి ఏమీ ఉండదు .
ఇక భావగణాల విషయం . భావగణ విభజనలో వ్యాకరణాంశాల పాత్రను సంపత్కుమార పూర్తిగా నిరాకరించలేదని గుర్తించాను . ఆ పాత్ర ఎంతవరకు అన్నదాంట్లోనే మా ఇద్దరికీ అభిప్రాయ భేదం . వ్యాకరణ సంబంధాలకీ , భావాంశాలకీ ఏకైక సంబంధం ఉందని నా అభిప్రాయం . సంబంధాన్ని పూర్తిగా నిరాకరిస్తే అర్థబోధలో వ్యాకరణాంశాలకు పాత్ర లేదనాల్సి ఉంటుంది . అందువల్ల సంపత్కుమార మధ్యే మార్గాన్ని ఎన్నుకుని కొంతవరకు మాత్రం ఉంటుందంటున్నారు . కాదు పూర్తిగా ఉంటుందని నా వాదం . దీనికి ఉపపత్తిగా వారు భావగణాలంటున్న వాటిని నేను వ్యాకరణ గణాలుగా నిరూపించాను . సంపత్కుమార తన వాదాన్ని నిలబెట్టుకోవాలంటే వ్యాకరణ సంబంధాలు పాదవిభజనకు ఎక్కడ లేవో నిరూపించాలి . కనీసం ఆ ' కొంతవరకు ' అనేది ఎంతవరకో స్పష్టంగా చెప్పాలి . ఇది సాధ్యమనుకోను . భావగణాలని వారనుకుంటున్న వాటికి , వ్యాకరణానికి అంత విడదియ్యరాని సంబంధం ఉంది . అయితే భావస్పూర్తి ప్రధానం గాని వ్యాకరణ సంబంధాలు ప్రధానం కాదంటారు సంపత్కుమార . ఈ సందర్భంలో అర్థాలంకార ప్రసక్తి తీసుకొచ్చారు . అర్థాలంకారాలను వ్యాకరణాలంకారాలు అని అనాల్సి ఉంటుందా ? అని అడుగుతున్నారు . అనక్కర్లేదు , అనగూడదు అని సమాధానం . ఒక అలంకారాన్ని ఒక కవి సంస్కృత శ్లోకంలో వాడినా , తెలుగు పద్యంలో వాడినా , గద్యంలో వాడినా , చిన్న పద్యంలో వాడినా , పెద్ద వాక్యంలో వాడినా , సంహృత వాక్యంలో వాడినా , ఒక వాక్యంలో వాడినా , భిన్న వాక్యాల్లో వాడినా ఒక అలంకారం అదే అలంకారం అవుతుంది . అలంకారాల్లో పాదవిభజన లేదు . శబ్దరూప ప్రాధాన్యం లేదు . వాక్యవ్యవస్థను బట్టి అలంకారం మారదు . కాని , వీరి భావగణాలు అట్లా మారకుండా ఉంటయ్యా ? మారకుండా ఉండని పద్ధతిలో భావగణాల్ని నిర్వచించారా ? ఎంతకీ భావస్ఫూర్తిని బట్టి , భావాన్ని బట్టి అనేగాని అంతకన్నా స్పష్టమైన నిర్వచనం ఇవ్వటం లేదు . ఇప్పటి వ్యాసంలోనైనా ఈ వాక్యాలు చూడండి : ' భావగణం ఏకపదంగా ఉంటుందా ? బహుపదంగా ఉంటుందా ? అన్నప్పుడు అక్కడ ఉపయుక్తమైన పదాల స్థితి అంటే ఏకపదం భావాంశ స్ఫోరకమైతే ఏకపదమే భావగణం . బహుపదాల సమష్టి భావాంశ స్ఫోరకమైతే ఆ సమష్టే భావగణం . భావాన్ని స్ఫురింపజేసే పదాల స్థితి అంటే ఇది . ' - దీన్ని బట్టి భావగణం ఏమిటో నాకర్థం కావటం లేదు . ఈ వాక్యాల్నుంచి భావగణ స్వరూపాన్ని గ్రహించలేని నా అశక్తతను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను . ఇంతకన్నా స్పష్టంగా భావగణ స్వరూపాన్ని వివరించటం కుదరదంటే చేసేదేమీ లేదు .
అన్వర్ గారు " " శీర్షికతో ఏప్రిల్ ఆరవ తేదీన వేసిన పోష్టు చూసి నాకు కలిగిన చిలిపి ఆలోచన " " . . . ఆయన గీసిన డ్రాయింగ్‌ని ఫొటోషాప్‌కి పట్టుకెళ్లి ఇలా ట్రై చేసాను . . . అంతే !
సభ మళ్ళీ స్తంభించి పోయింది . డాక్టర్ బెన్నెట్ తన టై సర్దుకుని , చిన్నగా నవ్వుకున్నాడు . అతనికేం కొత్త కాదు . నిసీ తననూ హాస్పిటల్ నూ అనవసరమైన మాల్ ప్రాక్టిస్ గొడవలు రాకుండా ఎన్నిసార్లు రక్షించలేదు ! నిసీ స్నేహితులు శభాష్ నిసీ ! అనుకున్నారు . మనసులో చప్పట్లు కొట్టుకున్నారు . గుసగుసలాడుతూ మెల్లిగా ఆడిటోరియమ్ లోని అందరూ , బయటకు ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళి పోయారు . *
అదృష్టవంతులు , మగవాళ్ళు బతికి పోయారు . అనుకున్నాను నేను . పీచు జుట్టూ , గుంట కళ్ళూ , పిచ్చి ధోరణీ ! క్రితం పుష్కరం అప్పుడు స్నానం చేసినట్లుంది . ఎవరికి కావాలి ఈ కంపు శరీరం ! ఆ బాబా కే అర్పించుకో - అనుకున్నా .
అటు . . . ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు . . . .
సాధారణంగా చాలామంది కంప్యూటర్ యూజర్స్ ఇమేజ్ లను బ్రౌజ్ చేయడానికి Acd see , Irfan View లాంటి సాఫ్ట్ వేర్ లనుపయోగిస్తుంటారు . కాని ఫోటోషాప్ లో కూడా File Browser ద్వారా మీ కంప్యూటర్ లోని ఇమేజ్ లను బ్రౌజ్ చేసి ఓపెన్ చేయవచ్చు క్రింది విధంగా Window మెనూలో File Browser ను క్లిక్ చేసి మీరు ఓపెన్ చేయాలనుకున్న ఫోటో మీద డబుల్ క్లిక్ చేయటమే
సేనాముఖానికి మూడు రెట్లును ' గుల్మమూ అంటారు . ఇందులో తొమ్మిది రథాలు , తొమ్మిది ఏనుగులు , 27 గుర్రాలు , 45 మంది కాలిబంట్లు వుంటారు . గుల్మానికి మూడు రెట్లు ' గణమూ ఇందులో 27 రథాలు , 27 ఏనుగులు , 81 గుర్రాలు , 135 మంది కాలిబంట్లుంటారు . గణానికి మూడు రెట్లు ' వాహినీ . ఇందులో 81 రథాలు , 81 ఏనుగులు , 2432 గుర్రాలు , 405 మంది కాలిబంట్లు వుంటారు .
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై విచారణ జరపాలంటూ శంకర్రావు రాసిన లేఖను హైకోర్టు సుమెటాగా . . . . . .
మనం మాట్లాడేది తెలుగేనా అని చాలాసార్లు నాకనుమానం వస్తుంది . ఈ అనుమానం వెనక ఓ కారణం ఉంది . ఎప్పుడో రెండు మూడేళ్ళ క్రితం అనుకుంటాను , టీవీలో ఓ కార్యక్రమం . ఒక విషయాన్నిచ్చి ఒక్క ఇంగ్లీషు పదం కూడా లేకుండా తెలుగులో దాని గురించి మాట్లాడాలి . పాపం అందులో పాల్గొనే తెలుగు జనాలు చాలా కష్టపడి ప్రయత్నించేవారు . అయినా అలా చేసి గెలిచేవారి సంఖ్య చాలా చాలా తక్కువ . ఇది చూసాక , నన్ను నేను గమనించడం మొదలుపెట్టాను . అలా చేసినప్పుడు నేను రోజువారీ సంభాషణల్లో ఎన్ని ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడుతున్నానో గమనించేసరికి నాకు మతి పోయినంత పనయ్యింది ! నాకు తెలుగు సాహిత్యమన్నా భాషన్నా చిన్నపట్నించీ కాస్త అభిమానం ఎక్కువే . అలాంటి నేను , సహజంగా మాట్లాడే సంభాషణల్లో ఇన్నేసి ఇంగ్లీషు పదాలు వాడుతునానని తెలుసుకొనేసరికి , చెప్పొద్దూ , చాలా సిగ్గేసింది . ఇంకొంచెం పరిశీలిస్తే , నేను వాడే ఇంగ్లీషు పదాలకి ఇంచుమించు తొంభైశాతం సాధారణ తెలుగు పదాలు ఉన్నాయని కూడా అర్థమయింది ! ఇక నా తలెక్కడపెట్టుకోవాలో నాకే తెలియలేదు . అప్పటినించీ ఓ వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టాను . రోజువారీ సంభాషణల్లో , తెలుగులో మాట్లాడేటప్పుడు తెలుగు పదాలున్నవాటికి ఖచ్చితంగా తెలుగే వాడాలన్నది ఆ వ్రతం . ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే , మొదట్లో ఇది అంత సులభమైన పని అని నేననుకోలేదు . కానీ ప్రయత్నించడం మొదలుపెట్టాక అది చాలా చాలా తేలిక అనిపించింది ! ఇప్పుడు మా ఆవిడా , అమ్మాయి మాట్లాడే తెలుగు కర్ణకఠోరంగా వినిపిస్తోంది నాకు : - ( పాపకి ఇంగ్లీషు రావాలంటే , రోజూ కొంత సేపు ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడమని , మామూలుగా తెలుగులో మాట్లాడేటప్పుడు దాన్లో అనవసరమైన ఇంగ్లీషు పదాలు వాడొద్దనీ , రెండూ కలిపి మాట్లాడితే ఏ భాషా సరిగా రాదనీ నచ్చచెప్పడం మొదలుపెట్టాను . పాపం వాళ్ళు నా ఘోషని కొంతలో కొంత అర్థం చేసుకున్నారనే అనుకుంటున్నాను . మనం మాట్లాడే తెలుగు భాషలో ఇంగ్లీషు పదాలు చోటుచేసుకోడం ఒక సహజ పరిణామం , దాన్ని అడ్డుకోడం మూర్ఖత్వం అనే వాళ్ళు ఉన్నారు . నేను వాళ్ళనడిగే ప్రశ్న ఒక్కటే , ఇది " సహజ " పరిణామమని మీరెందుకనుకుంటున్నారు ? ఎక్కువమందిలో ఇది కనిపించినంత మాత్రాన అది సహజమని అనగలమా ? ఒక్కసారి ఆలోచించండి . మనం మాట్లాడే భాషలో ఇంగ్లీషు పదాలు చొచ్చుకురావడం వెనక రెండు కారణాలు కనిపిస్తాయి . ఒకటి అసంకల్పితం , మరొకటి తెచ్చి పెట్టుకొంటున్న తద్దినం . పరదేశంలోనో , స్వదేశంలోనే అయినా బహుళజాతి సంస్థలలోనో పనిచేస్తున్న వారు రోజంతా మాట్లాడేది ఇంగ్లీషులోనే . ఇది తప్పనిసరి . దీనివల్ల మన ఇతర సంభాషణల్లో కూడా , మనకి తెలీకుండానే ఇంగ్లీషు పదాలు వచ్చేస్తూ ఉంటాయి . కొన్ని కొన్ని సార్లు తీవ్రంగా ఏదైనా చర్చించాలంటే , పూర్తిగా ఇంగ్లీషులోకి వెళ్ళిపోడం కూడా తరచూ జరుగుతూ ఉంటుంది . దీన్ని ఆపడం అంత సులుభం కాదు . అయితే , నాలా తెలుగుభాష మీద ఇష్టం ప్రకోపించినవాళ్ళు ( కొవ్వలివారి పరిభాషలో తెలుగుచేసిన వాళ్ళు ) ప్రయత్న పూర్వకంగానే దీన్ని మార్చుకోవాలి . నేనింతకుముందు చెప్పినట్టు ఇది అనిపించేంత కష్టం కాదు . ఇక తెచ్చిపెట్టుకొంటున్న తద్దినం ఏమిటంటే , ఇలా ఇంగ్లీషు ముక్కలు కలిపి మాట్లాడ్డమే ఈనాటి ఫేషననీ , అలా చెయ్యక అచ్చమైన తెలుగులో మాట్లాడేవాళ్ళు రాతియుగంలో గుహల్లో బతికేవాళ్ళనీ కొంతమందిలో ఒక బలమైన విశ్వాసం మశూచికన్నా ఘోరమైన అంటువ్యాధిలా పాకిపోతోంది . ఇలా మాట్లాడితేనే ఇంగ్లీషు భాష వస్తుందన్న అభిప్రాయం ఇందులో మరో అంశం . వీటికి ముఖ్యమైన వాహకాలు సినిమాలూ , టీవీ ఛానళ్ళూ , మన " కల్చరు " ని పెంచి పోషిస్తున్న ఇతర సాధనాలూను . ఈ అంటురోగాన్ని నివారించడానికి ఎదోఒకటి చెయ్యకపోతే , మన భాష సంకర భాష అయిపోయే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి . మరి మీరేమంటారు ?
చాలామంది ఈ కృతి రచన , స్వరమూ చూసి త్యాగరాజ కీర్తన అని అపోహ పడతారు . పల్లవీ , చరణంలో ముందు పాదాల సాహిత్యం విని త్యాగరాజ కృతిగానే భావిస్తారు . చివరకొచ్చే సరికి త్యాగరాజు ముద్ర కనిపించదు . ' వేంకటేశ ' అనే ముద్ర చివర వినిపించగానే అది ఏ అన్నమాచార్య కీర్తనో అనుకుంటారు . ఈ ' రఘువంశ సుధాంబుధి ' కున్న ప్రాచుర్యం అంతా ఇంతా కాదు . ఇంత ప్రసిద్ధి చెందిన కృతిని స్వరపరిచింది పట్నం సుబ్రమణ్య అయ్యర్ అనే వాగ్గేయకారుడు . సంగీత ప్రియులకి ఈయన పేరు పరిచయమే కానీ , అన్యులకి ఈ పేరు అంతగా తెలీదు .
క్యాన్సర్ కణతికి రేడియేషన్‌తో చికిత్స చేసేటప్పుడు ముఖ్యమైన అవయవాలు దెబ్బతినకుండా జాగ్రత్తపడాలి . మన శరీరంలో మెదడు , ఊపిరితిత్తులు , ఆహారనాళం , మూత్రపిండాలు , వెన్నుపాము , గుండె కీలమైన అవయవాలు . వీటి దరిదాపుల్లో క్యాన్సర్ కణతి ఉన్నప్పుడు రేడియేషన్ ఈ అవయవాలకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి . ఇవి దెబ్బతినకుండా కేవలం క్యాన్సర్ కణతినే లక్ష్యం చేసుకుని రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది . ఐఎంఆర్‌టి ద్వారా ఇది సాధ్యమవుతుంది . 1990 నుంచి ఈ చికిత్స మొదలైంది . 2000 సంవత్సరం నుంచి ప్రాచుర్యం పొందింది . ఇంతకు ముందు శరీరంలో ఒక భాగంలో క్యాన్సర్ కణతి ఉంటే దాని మొత్తాన్ని ఒక బ్లాక్‌గా గుర్తించి రేడియేషన్ ఇచ్చేవారు . ఇప్పుడు మల్టీలీఫ్ కాలమిటర్ , ఐఎంఆర్‌టి వల్ల అవసరం లేని చోట షీల్డ్ చేస్తారు . అంటే అక్కడికి రేడియేషన్ వెల్లదు . కణతికి మాత్రమే రేడియేషన్ వెళ్తుంది . ఫలితంగా సాధారణ కణజాలానికి ఎలాంటి హాని ఉండదు . దీంతో కణతికి అవసరమైన మోతాదులో డోసు ఇవ్వడం వల్ల క్యాన్సర్‌ను ఎక్కువగా నియంత్రించొచ్చు . ఉదాహరణకు ప్రొస్టేట్ క్యాన్సర్‌ను తీసుకుంటే . . . . ఇది కటివలయం ( పెల్విస్ ) వద్ద ఉంటుంది . దీనికి ముందు భాగంలో మూత్రాశయం , వెనక భాగంలో రెక్టం ఉంటుంది . రేడియేషన్‌ను ' సెంటీగ్రే ' తో కొలుస్తారు . రెక్టంకు 6 , 000 నుంచి 6 , 500 సెంటీగ్రే డోసు తట్టుకోగలుగుతుంది . మూత్రాశయానికి 6 , 600 - 7 , 000 సెంటీగ్రే సరిపోతుంది . దీని కన్న ఎక్కువ డోసు రేడియేషన్ ఇస్తే దుష్ప్రభావాలు కలుగుతాయి . మూత్రాశయంలోని రక్తనాళాలు చిట్లి మూత్రంలో రక్తం వస్తుంది . రెక్టంలో కూడా రక్తనాళం కూడా ఉబ్బి , రక్తం చిట్లీ మలంతో కలుస్తుంది . కొన్నేళ్లపాటు ఇలా ఉంటుంది . దీని వల్ల రోగి రక్తహీనతకు గురవుతాడు . 7 , 400 నుంచి 8 , 000 వరకు సెంటీగ్రే డోసు ఇవ్వడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నియంత్రించొచ్చు . కానీ ఇక్కడ డోసు ఎక్కువుంది . ఐఎంఆర్‌టి వల్ల ఈ సమస్యను అధిగమించొచ్చు . వివిధ కోణాల్లో కణతికి డోసు వెళ్తుంది . మూత్రాశయం , రెక్టం ద్వారా వెళ్లే రేడియేషన్ డోసు వాటికి తగ్గ డోసే వెళ్తుంది . ఐఎంఆర్‌టి ద్వారా 20 నుంచి 30 నిమిషాలు పడుతుంది .
ఇందులోకూడ పై పద్యమువలెనే ద్వితీయాక్షరప్రాస గలదు . ఇది గుణకవిజయాదిత్యుని పొగడే శాసనము . శత్రు రాజుల సైన్యమనే పెద్ద మేఘాన్ని తొలగించే పెనుగాలి , రాత్రిని తొలగించే సూర్యుడు , భాగవత జనుల కోరికలను తీర్చు కల్పవృక్షము . అట్టి కరికాల చోళ మహారాజు దోర్దండములకు విజయము సిద్దించుగాక అని దీని అర్థము . మొదటి రెండు పాదములలో యతి కూడ చెల్లుతుంది .
చివరగా అతని అలవాటేమో లాల్ సలాం అని రాసి సంతకం పెట్టాడు .
ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో సమావేశమైన తెలంగాణ జేఏసీ ఈ మేరకు చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం . ఢిల్లీలోని రాష్ట్రపతి ముందు పేరేడ్ నిర్వహించి , జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించి , తద్వారా తెలంగాణ సెంటిమెంట్ ఏ మేరకు ఉందో తెలియజేసి , కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా జేఏసీ ప్రయత్నాలు చేస్తోందని , ఇందుకోసం కార్యాచరణ కూడా రూపొందిస్తున్నట్లు తెలియవచ్చింది . ఈ మేరకు రాజీనామాలు చేసిన ప్రజాప్రతినిధులందరితో సమావేశమై జేఏసీ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం .
" అంజనాచల గర్వ భంజనాచల లీల నీలి వర్ణపు మేని డాలు తనర . . . . . " దీన్ని పూర్తి చెస్తారా ?
తెనాలి , జూలై 12 ( కెఎన్‌ఎన్ ) : రైల్వేస్టేషన్‌లో ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని దక్షిణమధ్య రైల్వే విజయవాడ డిఆర్‌ఎం అనురాగ్ అన్నారు . మంగళవారం స్థానిక రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు ఆయన విచ్చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు సెంట్రల్ రైల్వే చేట్టటం జరుగుతుందని , ప్రయాణీకుల సంక్షేమం కోసం సిబ్బంది చేస్తున్న కృషిని ఆయన అభినందించారు . అదేవిధంగా ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా అధికారులు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు . ప్రయాణీకుల సంక్షేమమే సౌత్‌సెంట్రల్ రైల్వే లక్ష్యమని , రైల్వేస్టేషన్ పరిధిలో ఆర్‌పిఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి , ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని ఆయన అన్నారు . అనంతరం రైల్వేస్టేషన్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించి , అందులో భాగంగా రైల్వేకాలనీని కూడా పరిశీలించి జరుగుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు . అదేవిధంగా ప్రయాణీకులు రైల్వేస్టేషన్‌లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి , రైల్వే ప్రయాణం సాగించాలని ఆయన ప్రయాణీకులకు సూచించారు . ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు సీనియర్ డిసిఎం రమేష్‌బాబు , డిఒఎం జి . వెంకటేశ్వరరావు , సెంట్రల్ డిఎం ప్రసాదరావు , స్థానిక స్టేషన్ మేనేజర్ అమ్మయ్య , డానియేల్‌రాజు , విక్రమ్‌గుప్త , తదితర రైల్వేసిబ్బంది పాల్గొన్నారు .
400కి ( 600 దాకా ఉండవచ్చునని కొద్దిమంది భావన [ 47 ] ) పైగా గుర్తులు వివిధ ముద్రల్లోనూ , పింగాణీ పాత్రలపైనా , ఇంకా కొన్ని వస్తువుల పైనా కనుగొనబడ్డాయి . ధోలవిరా పట్టణానికి లోగడ ఉన్న కోట ద్వారం వద్ద వేలాడదీసిన పలక మీద కొన్ని గుర్తులు ముద్రించబడి ఉన్నవి . సాధారణంగా ఈ శాసనాలు నాలుగు లేదా ఐదు అక్షరాలకు మించవు . వీటిలో చాలా అక్షరాలు చిన్నవిగా ఉన్నాయి . ఒకే తలం మీద చెక్కిన శాసనాల్లో అన్నింటికన్నా పొడవైనది కేవలం ఒక అంగుళం ( 2 . 54 సెం . మీ ) పొడవుండి 17 గుర్తులను కలిగి ఉంది . ఒకే ఘనం పై మూడు తలాల మీద చెక్కిన 26 గుర్తులుగల ఒక శాసనం , ఇప్పటిదాకా లభించిన కృతుల్లోకెల్లా అన్నింటికన్నా పొడవైనదిగా గుర్తించబడింది .
మహాత్మా గాంధీ , వివేకానంద మాటలను సంపూర్ణంగా అర్ధం చేసుకున్నాడు . ఈ దేశ ప్రజలను ధర్మం తప్ప మరేమీ సుషుప్తి నుంచి కదిలించలేదని గ్రహించాడు . రాజకీయాలకు , ధర్మానికీ ముడిపెట్టి విజయం సాధించాడు .
రెండు రోజుల క్రితం ప్రకాశ్ కారత్ మార్క్సిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి హోదాలో ఒక నిజాన్ని మాటాడారు . చైనా మావో ఆలోచనా విధానాన్ని వదిలేసి చాలా రోజులయిందని , దానిని అనుసరిస్తున్న మావోయిస్టు పార్టీ సిధ్ధాంతం అవుట్ డేటెడ్ అని . ఈ మాటలు ఇంతకు ముందు విన్నట్టుంది కదూ ? అదేనండి తనకు తాను ప్రపంచ బాంకు సి . ఇ . ఓగా ప్రకటించుకున్న చంద్రబాబునాయుడూ అదే అన్నాడు . ఈనాడు మరల తమ ఉనికికే ప్రశ్నార్ధకంగా మారిన బెంగాల్ లో తమకు కొరుకుడుపడకుండా వున్న బలీయమైన ప్రజా మద్దతుతో ముందుకు వస్తున్న మావోయిస్టులను చూసి ఓర్వలేక ఈ నిజాన్ని మాటాడాడు . చైనా కేపిటలిస్టు పంథాలో , డెంగ్ ఆలోచనా విధానంలో పూర్తిగా కూరుకుపోయిన వైనాన్ని ఒప్పుకున్నాడు . తామూ అదే విధానంలో కొనసాగుతూ బెంగాల్ లో ప్రజలకు దూరమై పెట్టుబడిదారీ వర్గాన్ని భుజాన మోయడానికి రెడీ అయి ఇంకా మార్క్సిస్టు పార్టీ పేరుతో చెలామణీ కావడం ఎంతవరకు సమంజసం ? ఇందిరమ్మ కొంగు పట్టుకు వేలాడి కొన్నాళ్ళు , సోనియా చెంగు పట్టుకు తిరిగి కొన్నాళ్ళు ప్రజలను పార్లమెంటరీ మురికి కూపంలో ముంచడానికి తమ వంతు సహకారాన్నిస్తూ ఎర్ర ఝెందా నీడలో మోసపు బతుకు బతికే వీళ్ళు ఏమాత్రం క్షమార్హులు కారు . పాలు తాగే తల్లి రొమ్మునే గుద్దే నీచులుగా అధికారంకోసం దేనికైనావెనుకాడని వీళ్ళని ప్రజలు ఇంకెంతో కాలం అంగీకరించరు . వీళ్ళ ఝెండా , ఎజెండా అధికార భాగస్వామ్యం తప్ప వేరుకాదు . కా . లెనిం తీవ్రంగా హెచ్చరించిన ట్రేడ్ యూనియం పోరాటాల ఊబిలో జనాన్ని కూరి పబ్బం గడుపుకోజూస్తున్నారు .
దశరథ రామయ్య ఒళ్ళు మండిపోయింది . ' వందేమాతరం పాట పాడిస్తున్నావట , అది మతపరమైన పాట . దానివల్ల ఇతర మతస్థుల సెంటిమెంట్లు దెబ్బతింటాయి . అదిగో మాకు వేదకాలం వద్దు . ఆధునిక యుగం కావాలి మన ' అభ్యుదయ యువ సంఘం ' సభ్యుల గోలచేస్తున్నారు . ఏం సమాధానం చెప్తావు వాళ్ళకు ? ' దబాయించి అడిగాడు దశరథ రామయ్య .
విశ్వస్వరూపం ( గత సంచిక తరువాయి ) 2 . లెక్కకు అందని సంఖ్యామానం వేమూరి వేంకటేశ్వరరావు అష్టావక్రుడి కథ , రోమహర్షుడి ఉదంతం చదివిన తరువాత సృష్టి , లయ ఎంతో పురాతనమైన సంఘటనలే అని అనిపించకమానదు . ఆధునిక శాస్త్రం దృష్ట్యా కూడ విశ్వం బహు పురాతనమైనది . నిజానికి విశ్వ స్వరూపాన్ని ఆకళింపు చేసుకోవాలంటే ఊహకి అందని దూరాలనీ , ఊహకి అందని కాలాలనీ , ఊహకి అందని సంఖ్యామానాలనీ ఊహించుకోవటానికి అలవాటు పడాలి . ఈ విశ్వం 13 . 7 బిలియను సంవత్సరాల క్రితం పుట్టిందని నేను చెపితే సామాన్యులలో ఎంతమందికి అర్ధం అవుతుంది ? ఈ సూర్య మండలం పుట్టి 4 . 6 బిలియను సంవత్సరాలు అయిందంటే ఎంతమందికి అవగాహన అవుతుంది ? ఈ భూమి పుట్టి 4 బిలియను సంవత్సరాలు అయిందంటే అందరూ ఆకళింపు చేసుకోగలరా ? వేలకీ , లక్షలకీ , కోట్లకీ అలవాటు పడిపోయిన మన ప్రాణాలకి మిలియను , బిలియను ఊహించుకోవటం వీలవుతుందా ? ఇంతకీ కోటి పెద్దదా ? బిలియను పెద్దదా ? అలాగే విశ్వం భ్రూణ దశలో 1E - 35 సెకండ్ల కాలం గడిపిందని నేను అంటే , వివరణ లేకుండా , నా సహాధ్యాయులే అర్ధం చేసుకోలేరు . 1 . పెద్ద పెద్ద సంఖ్యలని లెక్క పెట్టటం పెద్ద పెద్ద సంఖ్యలని ఊహించటమే కాదు , వాటిని లెక్క పెట్టటం కూడ భారతీయులకి వెన్నతో పెట్టిన విద్య . ఉదాహరణకి పెద్ద పెద్ద సంఖ్యలని లెక్కపెట్టటంలో ఉన్న కష్టసుఖాలని ఒకసారి పరిశీలించి చూద్దాం . ఒకటి పక్కన సున్న వేస్తే అది పది . పదిని ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు . మన చేతులకి పది వేళ్లు ఉన్నాయి కదా ! ఒకటి పక్కన రెండు సున్నలు చుడితే అది వంద లేక నూరు . వందని ఊహించుకోవడం కూడ పెద్ద కష్టం కాదు . వంద రూపాయలు ఖర్చు పెడితే ఏమీ రాని ఈ రోజులలో వంద పెద్ద సంఖ్య కానే కాదు . నా చిన్నతనంలో పెళ్లికొడుక్కి నూటపదహార్లు కట్నం ఇచ్చేవారు ! ఒకటి పక్కన మూడు సున్నలు చుడితే అది వెయ్యి . ఇంతవరకు ఒకొక్క సున్న చేర్చినప్పుడల్లా సంఖ్య విలువతో పాటు ఆ సంఖ్య పేరు కూడ మారింది : పది , వంద , వెయ్యి . ఒకటి పక్కన నాలుగు సున్నలు చుట్టటంతో మనం పేర్లు పెట్టే బాణీలో కొంచెం మార్పు వచ్చింది . మునపటిలా 10 , 000 కి మరో కొత్తపేరు పెట్టకుండా " పది " అనే పూర్వ ప్రత్యయం చేర్చి " పదివేలు " అనేసి ఊరుకున్నాం . ఎంతకని కొత్త పేర్లు పెట్టకలం ? మనమే కాదు ఇంగ్లీషు వాడూ ఇదే పని చేసి , " టెన్ , హండ్రెడ్ , థౌజండ్ " అయిన తర్వాత మనలాగే " టెన్ థౌజండ్ " అన్నాడు . కాని ఇంగ్లీషు వాడు మన దేశం రాక పూర్వం దీనిని " మిరయడ్ " అనే పేరుతో పిలచేవాడు . ఒకటి పక్కన ఐదు సున్నలు చుడితే అది లక్ష . దీన్ని హిందీలోనూ , ఇంగ్లీషులోనూ కూడ " లేక్ " అంటారు . పూర్వం గొప్పవాళ్లు లక్షాధికారులు . " వాళ్లింట్లో లక్షలు మూలుగుతున్నాయి ! " అనుకునే వాళ్లం . ఇప్పుడు లక్ష అంటే ఎవ్వరూ ఖాతరు చెయ్యటం లేదు . ఒకటి పక్కన ఆరు సున్నలు చుట్టగా వచ్చిన సంఖ్య పది లక్షలు లేదా మిలియను . అమెరికాలో మిలియను డాలర్లు ఆస్తి ఉంటే మధ్య తరగతిలో కొంచెం పైమెట్టు లో ఉన్నట్లు లెక్క వేసుకోవచ్చు . భారత దేశంలో లక్షాధికార్లకి పట్టిన గతే అమెరికాలో ఈ మిలియనీర్లకి కూడ పడుతోంది . బిలియనీర్లు వచ్చిన తరువాత మిలియనీర్ల ముఖాలు ఎవ్వరూ చూడటం లేదు . ఒకటి పక్కన ఏడు సున్నలు చుడితే అది కోటి . దీన్ని హిందీలో " కరోర్ " అంటారు . ఇదే ఇంగ్లీషులో " క్రోర్ " . ఈ రోజులలో గొప్పవాళ్లు కోటీశ్వరులు , లేదా కరోర్‌పతులు . " వాళ్లింట్లో డబ్బు కోటికి పడగలు ఎత్తింది ! " అనుకునే వాళ్లం . అంత డబ్బుంటే ఆ డబ్బు పాములుగా మారిపోతుందనే కథ నా బాల్యంలో వినేవాడిని . కోటిని ఊహించుకోవడం కొంచెం కష్టం నా బోంట్లకి . ఉదాహరణకి భారతదేశం జనాభా ఉరమరగా 100 కోట్లు ! ఈ వంద కోట్ల ప్రజలని ఒకేసారి చూడలేము కనుక ఈ విషయం ఊహించుకుందికి ఉపయోగపడదు . సాధారణ శకం ( సా . శ . ) 1992 లో ఆంధ్రప్రదేశ్‌లో పుగాకు , సారా వగైరాల అమ్మకం పన్ను ద్వారా వచ్చిన ఆదాయం 840 కోట్ల రూపాయలుట ! ఒకటి పక్కన ఎనిమిది సున్నలు చుడితే వచ్చే సంఖ్యకి మంచిపేరు , నలుగురికీ పరిచయం అయిన పేరు ఏదీ లేదు . పదికోట్లు అనో , దశకోటి అనో , వంద మిలియన్లు అనో అనవచ్చు ; కాని అవి కొత్త పేర్లు కావు . " వెంకట్రావ్ , పెద వెంకట్రావ్ " అన్నట్టు పాత పేర్లనే పునరావృతం చేసేం , అంతే . ఒకటి పక్కన తొమ్మిది సున్నలు చుడితే వచ్చే సంఖ్య వంద కోట్లు లేదా బిలియను . మిలియను ఊహించుకోవటం చేతనయిన వాళ్లకి కూడ బిలియను ఊహించుకోవటం కష్టం . ఈ భూలోకపు జనాభా 5 బిలియనుల పై చిల్లర అంటే ఉపయోగపడుతుందేమో ఆలోచించుకొండి . అసలు ఆధునిక శాస్త్రీయ యుగం మొదలయే వరకు పాశ్చాత్య దేశాలలో పెద్ద పెద్ద సంఖ్యలతో పనే ఉండేది కాదు . బిలియనుతో సామాన్యులకి అవసరం ఏముంటుంది ? కనుక మొన్న మొన్నటి వరకూ పాశ్చాత్య భాషలలో పెద్ద పెద్ద సంఖ్యలకి పేర్లే లేవు . పని ఉంటే కదా పేర్ల అవసరం ? కాని భారతదేశంలో ఏమి పని వచ్చిందో తెలియదు కాని " పెద్ద పెద్ద " సంఖ్యలకే కాదు , " పేద్ద పేద్ద " సంఖ్యలకి కూడ పేర్లు ఉన్నాయి . ఉదాహరణకి ఒకటి తర్వాత 11 సున్నలు చుడితే అది అర్బుదం , 13 సున్నలకి ఖర్వం , 15 సున్నలకి పద్మం , 17 సున్నలకి క్షోణి , 19 సున్నలకి శంఖం , ఇలాగే తరువాయి బేసి సంఖ్యల సున్నలుంటే వాటిని క్రమంగా క్షితి , క్షోభం , నిధి , సరి సంఖ్యలైన సున్నలుంటే వాటి పేరుకి " మహా " తగిలించి మహాపద్మం , మహాఖర్వం , వగయిరా పేర్లు . ఒకటి తర్వాత 27 సున్నలుంటే పర్వతం , 28 పరార్థం , 29 అనంతం . ముప్పయ్ సున్నలుంటే సాగరం , 31 అవ్యయం , 32 అచింత్యం , 33 అమేయం , … భూరి , వృందం , అన్న పేర్లు ఉన్నాయి . ఈ లెక్కలో వృందం తర్వాత ఏమి పేర్లు వస్తాయో ఇదమిత్థంగా తెలియదు కానీ రావణాసురుడి సైన్యం ఎంత పెద్దదో వర్ణిస్తూ వాల్మీకి ఒకటి తర్వాత 55 సున్నలు చుడితే వచ్చే సంఖ్యంత అని చెప్పి దానికి మహౌఘం అని పేరు పెట్టేడు . ఈ పేర్లు భారత దేశంలో వాడుకలో లేవు కానీ వారి దగ్గర ఈ పేర్లు నేర్చుకున్న జపాను వాళ్లు ఇప్పటికీ వీటిని వాడుతున్నారు . మచ్చుకి ఒకటి తర్వాత 80 సున్నలు వేయగా వచ్చిన సంఖ్యని జపాను వాళ్ళు " పుకషీగీ " అంటారు . పుకషీగీ అంటే ఆలోచనకి అందనిది లేదా " అచింత్యం " . ఒకటి తర్వాత 56 సున్నలు వేయగా వచ్చిన సంఖ్యని " కుగాషా " అంటారు . కుగాషా అంటే " గంగా నది ఒడ్డున ఉన్న ఇసకంత " అని అర్థం ట ! భారతీయులు పేర్లు పెట్టటం అంటూ పెట్టేరు కానీ , ఈ పేర్లలో ఒక బాణీ లేకపోతే జ్ఞాపకం పెట్టుకోవటం కష్టం . అప్పుడు ఒకదానికి మరొక పేరు వాడే ప్రమాదం ఉంది . భారతీయ ప్రాచీన గ్రంథాలలో , మచ్చుకి , ఒకటి తర్వాత 12 సున్నలు ఉన్న సంఖ్యని ఒక చోట మహార్బుదం అన్నారు , మరొక చోట న్యర్బుదం అన్నారు . ఇలాంటి ఇబ్బందుల నుండి తప్పించుకుందికి అధునాతనులు ఒక పద్ధతి ప్రవేశపెట్టేరు . ఈ పద్ధతిలో సంఖ్యల పేర్లలో బాణీ ఈ విధంగా ఉంటుంది : పది , వంద , వెయ్యి మామూలే . తరువాత కొత్త పేరు ఒకటి తర్వాత ఆరు సున్నలు చుట్టగా వచ్చిన మిలియను . తరువాత కొత్తపేరు ఒకటి తరువాత తొమ్మిది సున్నలు చుట్టగా వచ్చిన బిలియను . అలా మూడేసి సున్నలు అధికంగా చేర్చినప్పుడల్లా మరొక కొత్త పేరు . ఈ లెక్కని ఒకటి తర్వాత ఆరు సున్నలుంటే మిలియను , తొమ్మిది ఉంటే బిలియను , 12 అయితే ట్రిలియను , 15 సున్నలకి క్వాడ్రిలియను , తదుపరి క్వింటిలియను , అలా . బాగానే ఉందయ్యా ! ఇవన్నీ " లియను " అనే శబ్దంతో అంతం అవుతున్నాయి . కాని ఈ " లియను " ముందుండే పూర్వప్రత్యయం జ్ఞాపకం పెట్టుకోవడం ఎలా ? ఈ పూర్వ ప్రత్యయాలని విడిగా , వరసగా వాటి అర్థాలతో రాసి చూద్దాం . లేటిన్ భాషలో బి రెండు , ట్రి మూడు , క్వాడ్ నాలుగు , క్వింట్ అయిదు , సెక్స్‌ట్ ఆరు , సెప్ట్ ఏడు , ఆక్ట్ ఎనిమిది , నవ్ తొమ్మిది … అలా అలా వెళుతుందీ వరస . ఈ వరస అర్థం ఏమిటంటే మిలియనుని మూలంగా తీసుకుని ఆ మిలియనుని రెండు సార్లు వేసి హెచ్చవేస్తే వచ్చే సంఖ్య బిలియను , మూడు సార్లు గుణిస్తే వచ్చే సంఖ్య ట్రిలియను , నాలుగు సార్లు గుణకారం చెయ్యగా వచ్చింది క్వాడ్రిలియన్ , . . ఆగాలి , కొంచెం ఆగాలి . . ఇక్కడ నేను తప్పేనా చెబుతూ ఉండుండాలి , మీరు తప్పేనా అర్థం చేసుకుని ఉండుండాలి . ఎందుకంటే మిలియనుని రెండు సార్లు వేసి గుణిస్తే ఒకటి తర్వాత 12 సున్నలు వస్తాయి కాని తొమ్మిది రావు . నిజానికి అది నిజమే . బ్రిటిష్ వాళ్ల హయాంలో ఈ ప్రపంచం ఉన్నప్పుడు వాళ్లు అన్నీ తార్కికంగా ఆలోచించి ఒక పద్ధతిలో పేర్లు పెట్టేరు . ఒకటి తర్వాత 12 సున్నలుంటే దానిని బిలియను అనీ , 18 సున్నలుంటే దానిని ట్రిలియను అనీ , అలా అనుకుంటూ వెళ్లమన్నారు . అలాగే వెళ్లేవాళ్లం . తరువాత ఈ అమెరికా వాళ్లు వచ్చేరు . ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి , పైపెచ్చు ఈ అమెరికా వాడి దగ్గర డబ్బు మస్తుగా ఉంది . దాంతో జబ్బశక్తి , గోరోజనం పుంజుకున్నాయి . తన శక్తిని ప్రపంచానికి చాటడం ఎలా ? ఇంగ్లీషువాడు ఎడం పక్కని నడిపితే తను కుడి పక్కన కారు నడుపుతానన్నాడు . ఇంగ్లీషు మాటలకు స్పెల్లింగులు మార్చేస్తానన్నాడు . కొన్నింటికి అర్థాలే మార్చీసేడు . అందుకనే ఈ రోజులలో బిలియను అంటే ఒకటి తర్వాత తొమ్మిది సున్నలే . ట్రిలియను అంటే ఒకటి తర్వాత 12 సున్నలూ , అలాగ వెళుతోంది ఈ బండి . ఈ మార్పు వల్ల వచ్చిన నష్టం ఏమిటంటే పూర్వప్రత్యయాన్ని చూసి ఆ సంఖ్యలో ఎన్ని సున్నలుంటాయో చెప్పడం కష్టం ; బట్టీ పట్టేయాలి అంతే . ఈ పేర్లు ఇంకా ఎంత దూరం వెళతాయి ? మిలియనుని వంద సార్లు వేసి హెచ్చవేస్తే వచ్చే సంఖ్యని " సెంటిలియన్ " అనమన్నాడు బ్రిటిషువాడు . అప్పుడు సెంటిలియన్ అంటే ఒకటి తర్వాత 600 సున్నలు అని ఠకీమని చెప్పగలిగి ఉండేవాళ్ళం . కాని ఈ అమెరికా వాడి సొద వల్ల ఆ సౌలభ్యం పోయి ఒకటి తర్వాత 303 సున్నలు చుడితే అది సెంటిలియన్ అయింది . పాశ్చాత్యుల లెక్కింపు పద్ధతిలో మిలియను , పది మిలియనులు , వంద మిలియనులు , బిలియను , పది బిలియనులు , వంద బిలియనులు , ట్రిలియను , పది ట్రిలియనులు , వంద ట్రిలియనులు , … అంటూ లెక్కపెడతారే , మరి భారత దేశంలో వెయ్యి , పది వేలు , లక్ష , పది లక్షలు , కోటి , పది కోట్లు , అంటూ లెక్క పెట్టి అటుపైన నూరు కోట్లు , వెయ్యి కోట్లు , పదివేల కోట్లు , లక్ష కోట్లు , పది లక్షల కోట్లు . … అంటారెందుకు ? పది లక్షల కోట్ల తరువాత ఏమిటి వస్తుంది ? కోటి కోట్లా ? కోటి కోట్ల తరువాత ? ఇలా పెద్ద పెద్ద సంఖ్యలని లెక్కపెట్టటానికి ప్రస్తుతం తెలుగులో వాడుకలో ఉన్నవి , అందరికీ అర్ధం అయేవి , తర్కబద్ధం అయినవి అయిన మాటలే లేవు . ఉదాహరణకి మన లెక్కింపు పద్ధతి ప్రకారం 300 , 00 , 00 , 00 , 00 , 00 , 000 అనే సంఖ్యని ఏమని పిలవాలి ? అర్బుదాలు , మహా పద్మాలు , శంఖాలు వాడకుండా చెప్పండి చూద్దాం . ఈ ఇబ్బందులని ఇక్కడ పరిష్కరించటానికి బదులు మనం పెద్ద పెద్ద సంఖ్యలని వాడవలసి వచ్చినప్పుడు ఒక మిలియను ( 1 , 000 , 000 ) , పది మిలియనులు , వంద మిలియనులు , ఒక బిలియను ( 1 , 000 , 000 , 000 ) , పది బిలియనులు , వంద బిలియనులు , ఒక ట్రిలియను ( 1 , 000 , 000 , 000 , 000 ) , … అంటూ లెక్క పెడదాం . ఇది అంతర్జాతీయ పద్ధతి కనుక తెలుగులోంచి ఇంగ్లీషులోకి మారినప్పుడు ఇబ్బంది ఉండదు . 2 . కామాలు పెట్టే నియమం మీరు గమనించేరో లేదో ! నేను పాశ్చాత్య పద్ధతిలో సంఖ్యలు రాసేటప్పుడు మూడేసి అంకెలని ఒక గుంపుగా గుప్పించి , వాటిని విడదీస్తూ కామాలు పెట్టేను . ఉదాహరణకి 46 , 520 , 000 అనే సంఖ్యని " నలభయ్ ఆరు మిలియన్ల ఐదువందల ఇరవై వేలు అని పాశ్చాత్య పద్ధతిలో అంటాము . ఇదే సంఖ్యని భారతీయ పద్ధతిలో రాసినప్పుడు 4 , 65 , 20 , 000 అంటూ కామాలతో విడదీసి రాస్తాము . ఈ సంఖ్య ఇప్పుడు నాలుగు కోట్ల 65 లక్షల ఇరవై వేలు అని చదువుతాం . కనుక రాసే పద్ధతికీ , చదివే పద్ధతికీ అన్వయం చూసుకోవాలి . 3 . చిన్న చిన్న సంఖ్యలని లెక్క పెట్టటం అలాగే చిన్న చిన్న సంఖ్యలని వాడవలసి వచ్చినప్పుడు మిల్లీ ( వెయ్యవ వంతు ) , మైక్రో ( మిలియనవ వంతు ) , పికో ( బిలియనవ వంతు ) , అనే పూర్వ ప్రత్యయాలు వాడదాం . అలవాటు చేసుకుంటే అవే అలవాటు అయిపోతాయి . విశ్వశాస్త్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఇంకా చిన్న సంఖ్యల అవసరం వస్తుంది . అప్పుడు మిల్లీ , మైక్రో , పికో , మొదలైనవి సరిపోకపోవచ్చు . 4 . పెద్ద సంఖ్యలని , చిన్న సంఖ్యలని రాసే పద్ధతి పెద్ద పెద్ద సంఖ్యలని , చిన్న చిన్న సంఖ్యలనీ రాసి చూపించటానికి ఒక శాస్త్రీయ పద్ధతి ఉంది . ఈ పద్ధతిని ఘాతీయ పద్ధతి ( exponential notation ) అంటారు . ఈ పద్ధతితో సుఖం ఏమిటంటే సంఖ్యల పేర్ల ముందు వచ్చే పూర్వ ప్రత్యయాలని కంఠస్థం చేసి గుర్తు పెట్టుకోనవసరం లేదు . ఈ ఘాతీయ పద్ధతిని కూడ రకరకాలుగా రాయవచ్చు . ఇక్కడ మనకి అనుకూలమైన పద్ధతి కంప్యూటరు రంగం నుండి అరువు తెచ్చేను . ఉదాహరణకి , 10E1 అంటే 10 ని ఒకసారి వెయ్యటం . 10E2 అంటే 10 ని రెండు సార్లు వేసి గుణించగా వచ్చినది లేదా 100 అని అర్ధం . 10E2 లో ఉన్న 2 ఒకటి తరువాత రెండు సున్నలు ఉన్నాయని చెబుతోందన్నమాట . ఇదే సూత్రం ప్రకారం 10E3 = 1000 , 10E6 = 1 , 000 , 000 = మిలియను . ఇదే ధోరణిలో చిన్న చిన్న సంఖ్యలని కూడ రాయవచ్చు . ఉదాహరణకి 10E - 1 అంటే 1 ని 10 చేత భాగించగా వచ్చిన 0 . 1 . అలాగే 1E - 2 అంటే 1 ని 100 చేత భాగించగా వచ్చిన 0 . 01 . ఇదే సూత్రం ప్రకారం 10E - 3 = 0 . 001 , 10E - 6 = 0 . 000001 . ఈ పద్ధతి ఉపయోగించి కొన్ని విషయాలు చెబుతాను . ఒక సంవత్సరంలో 31 . 7E6 సెకండ్లు ఉన్నాయి . కావలిస్తే లెక్క కట్టి చూసుకొండి . భూమి నుండి సూర్యుడి సగటు దూరం 150E6 కిలోమీటర్లు . ఈ భూమి వయస్సు ఉరమరగా 4 . 6E9 = 4 . 6 బిలియను సంవత్సరాలు . మన సూర్యుడి నుండి మనకి అత్యంత సమీపంగా ఉన్న ఆల్ఫా సెంటారీ నక్షత్రం దూరం 40E12 = 40 ట్రిలియను కిలోమీటర్లు . విశ్వంలో ఉరమరగా 10E22 నక్షత్రాలు ఉన్నాయి ట . విశ్వంలో 10E80 ప్రాధమిక రేణువులు ఉన్నాయని ఒక అంచనా ! మరికొన్ని ఉదాహరణలు ఇస్తాను . మనం చూడటానికి వెలుగు ( లేదా కాంతి ) కావాలి కదా . బొమ్మ గీసినప్పుడు ఈ కాంతిని కిరణాల ( లేదా గీతల ) మాదిరి చూపించినా , నిజానికి కాంతి కెరటాల మాదిరి ఉంటుంది . ఇవి సెకండుకి 600 ట్రిలియను ( లేదా 600E12 లేదా 6E14 ) కెరటాలు చొప్పున వచ్చి మన కంటిని చేరుకుంటాయి , తెలుసా ? ఈ కాంతి సూర్యుడి నుండి మన కంటికి ఎంత జోరుగా ప్రయాణం చేసి వచ్చిందో తెలుసా ? సెకండుకి 3E10 సెంటీమీటర్లు చొప్పున ! ఈ కాంతి కెరటాల శిఖకి , శిఖకి మధ్య దూరం ( దీనినే ఇంగ్లీషులో wavelength అంటారు ) కావాలంటే కాంతి వేగం అయిన 3E10 ని కాంతి కెరటాల జోరు ( frequency ) అయిన 6E14 చేత భాగించటమే . అలా భాగిస్తే 0 . 5E - 4 సెంటీమీటర్లు వస్తుంది . దీనిని 0 . 00005 సెంటీమీటర్లు అని రాయవచ్చు . ఇది సెంటీమీటరులో 20 లక్షో భాగం . ఇంత చిన్న పొడుగు మన కంటికి ఆనదు . అందుకనే కాంతి నిజంగా తరంగమే అయినా మన కంటికి కిరణం లా కనిపిస్తుంది . ఇలా లెక్కలు వేసి చూపిస్తూన్నా ఈ సంఖ్యలని నేనూ ఊహించలేను , నేనూ ఆకళింపు చేసుకోలేను . కాని ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే , క్రమేపీ , మనకి అలవాటు అయిపోయి , మన నైజం గా మారిపోతుంది . ఈ వ్యాసం భౌతిక శాస్త్రంలో పాఠంలా అనిపించినా , ఈ రకం సంఖ్యలు , ఊహలు మనకి కొల్లలుగా ఎదురవుతాయి . ఎప్పుడో ఒకప్పుడు నేర్చుకోవాలి కనుక , అవసరం వచ్చే ముందే నేర్చేసుకుంటే సరిపోతుంది . EXPONENT XX MULTIPLICATION AA WORD NAME 10E2 10 x 10 HUNDRED 10E3 10 x 10 x 10 THOUSAND 10E6 MULTIPLY 6 TENS MILLION 10E12 MULTIPLY 12 TENS TRILLION 10E15 MULTIPLY 15 TENS QUADRILLION 10E18 MULTIPLY 18 TENS QUINTILLION 10E21 MULTIPLY 21 TENS SEXTILLION 10E24 MULTIPLY 24 TENS SEPTILLION 10E27 MULTIPLY 27 TENS OCTILLION 10E30 MULTIPLY 30 TENS NONILLION OR NOVENTILLION 10E33 MULTIPLY 33 TENS DECILLION 10E36 MULTIPLY 36 TENS UNDECILLION 10E39 MULTIPLY 39 TENS DUODECILLION 10E42 MULTIPLY 42 TENS TREDECILLION 10E45 MULTIPLY 45 TENS QUATTUORDECILLION 10E48 MULTIPLY 48 TENS QUINDECILLION 10E51 MULTIPLY 51 TENS SEXDECILLION 10E54 MULTIPLY 54 TENS SEPTENDECILLION 10E57 MULTIPLY 57 TENS OCTODECILLION 10E60 MULTIPLY 60 TENS NOVEMDECILLION 10E63 MULTIPLY 63 TENS VIGINTILLION 10E100 MULTIPLY 100 TENS GOOGOL 10Egoogol MULTIPLY GOOGOL TENS ! GOOGOLPLEX
మీకు రాయడం రాదనీ ఎవరు అన్నారండి బాబు ఇంత బాగా రాసారో . . . లక్క రాజు గారి ది కుడా చాలా చాలా బావుంది
మన తెలుగు పిల్లకాయలకి నా అభినందనలు కూడా అందజేయండి . ఏమిటో తెలుగు మాటాడనివాళ్లు మాటాడ్డం లేదని విచారించడం కంటే . ఇలా నేర్చుకుంటున్నవాళ్లు ఉన్నారని విని ఆనందించడం నయం అని ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది నాకు . మంచి టపా . విశ్వనాథాష్టకం కూడా చాలా బాగుంది .
" ఎవరు పిల్లా ? చుట్టాలా … మీ కనెక్టికట్ బాబాయాల్లా … ? " అని అది ఇష్టంగా చెవులు రిక్కించుకుంటోంది . లేటైపోయిన తమ మధ్యాన్నం సెల్ ఫోన్ కబుర్లకోసం . ఎదురుగా రెడ్ కోసం ఆగుతున్న కార్ ని గుద్దినంత పనై కీచుమని వేన్ ఆపి " ఎవరో ఫాదర్ జోజీ అంట ! తరవాత చేస్తాన్లేవే ! " అని కసురుకుని ఫోన్ పెట్టీసింది . తను ఇదివరకెప్పుడూ గ్రేహౌండ్ బస్ ఎక్కలేదు , బస్ స్టేషన్ కెళ్ళలేదు . సిక్స్త్ స్ట్రీట్ దాటి వెళ్తుంటే ఆ పేటలన్నీ గుడ్డి దీపాలు తుప్పు మట్టి రంగులు పహారా తిరిగే పోలీసు కార్లతో అదొక లాగ భయం వేస్తూ ఉంటాయి . రఘు వాటిని ' నైబర్ హుడ్స్ ' అంటాడు . ' అటు సిక్స్త్ స్ట్రీట్ నైబర్ హుడ్స్ సైడు ఎళ్ళమాక ! ' అని డ్రైవింగ్ నేర్పిన కొత్తల్లోని మాటలు గుర్తొచ్చేయి . మసక వెల్తురు , గోడల మీద రాతలు , బిగ్గరగా నవ్వుకుంటూ నడుస్తున్న నల్ల మనుషుల్ని దాటుకుంటూ బెరుకు బెరుగ్గానే లెఫ్ట్ తీసుకోగానే గ్రేహౌండ్ స్టేషన్ వచ్చేసింది . బష్టేండ్ లా హడావిడే లేదు వరసగా రంపం ముళ్ళలాగ ఫ్లాట్ ఫాంలు , రెండు మూడింట్లో పెద్ద ష్టీల్ డ్రమ్ముల్లాగ మెరుస్తూ ఒళ్ళు చీకటి చేసుకుని నిద్రపోతున్న బస్సులు . కర్ర బెంచీల మీద ఇద్దరు ముణగదీసుకుని పడుకున్నారు . ఒక నల్ల ముసలావిడ బక్క నరాల చేత్తో న్యూస్ పేపర్ విసనకర్రలా విసురుకుంటూ పళ్ళు లేని దవడలు నముల్తూ చెయి తిప్పుకుంటూ తనకి తనే ఏదో చెప్పుకుంటోంది . యూనిఫాం వేసుకుని డ్రైవర్లాగున్న ఒకతను ' ఒర్లేండో టాంపా మయ్యేమీ కోరల్ గేబిల్స్ ఎనీ వన్ ? ' అని ఎవరూ లేరని తెలిసే మొక్కిబడికి పాడుకుంటూ తిరుగుతున్నాడు . చుట్టూ కలయజూసి అద్దాల తలుపుల వారగా చిలక పచ్చ రంగు చెంకీల చీర కట్టుకుని పెద్ద సూట్ కేస్ పక్కన నిలబడిన ఆవిడ్ని చూసి అఖిల సంబరంగా ' Hey ! That ' s అమ్ముమా ' అని మళ్ళీ అంతలోనే ' No ! She ' s not … ! ' అని చల్లారిపోయింది . ఆవిడ పక్కన ఒకబ్బాయి ఏడెనిమిదేళ్ళ వాడు , బేల చూపులు చూస్తూ మోచేతుల్లో గడ్డం పెట్టుకుని పెట్టి మీద కూర్చున్నాడు . పెద్ద గోధుమ రంగు గళ్ళ గళ్ళ కోటు , బంగారు జరీల టై కట్టుకుని జోజప్ప గారు పెద్ద నవ్వు నవ్వుకుంటూ తమవైపే వచ్చేడు . ఉంగరాల గిరజాల జుత్తు . నల్లని నలుపు . దళసరి కింది పెదవి మధ్యన చిన్న చార లాగ గులాబి రంగులో బొల్లి మచ్చ . " మంజులా మీరే కదమ్మ ? తిను … . ? పాపా ? వోహో … . ? ! " అని పలకరించేడు . బుగ్గలు కాయల్లాగ ఎడంగా చేసుకుని నవ్వు మొహం అలాగే పెట్టుకునే ఉండి .
విశ్వంలో చాలా విషయాలు మానవుడి చేతిలో లేవు - So , మానవాతీత శక్తి ఉంది మానవుడి చేతిలో లేకపోవడం అంటే నాకు అర్ధం కాలేదు . మనిషికి తెలియని విశ్వ రహస్యాలు ఎన్నో ఉన్నాయి . అయియే ఒక వెయ్యి సంవత్సరాల ముందు కంటే ఇప్పుడు ఎక్కువ తెలుసు , ఇది ప్రోగ్రెసివ్గా ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది . మనకు తెలియని శక్తి ఏదయినా ఉంటే ఆ శక్తి కాన్షియస్‌నెస్ , ఇంటెలిజెన్స్ , డెసిషన్ మేకింగ్ ఉన్న శక్తి కావాల్సిన అవసరం ఏమిటో మీరు చెప్పగలరా ?
సీడీలుగా ఉన్నాయండి . అప్లోడ్ చెయ్యడమే కొంచెం కష్టం . భాగాలుగా విడగొట్టి యూట్యూబ్ లోకి చెయ్యడం కుదురుతుందేమో చూస్తాను .
నేషనల్ బాప్టిస్ట్ కన్వెన్షన్ మరియు ఆఫ్రికన్ మెథడిస్ట్ ఎపిస్కోపాల్ చర్చ్ వంటి సాంప్రదాయిక ఆఫ్రికన్ అమెరికన్ క్రైస్తవ మత వర్గములు ఈ ప్రాంతంలో బలంగా పనిచేస్తున్నాయి . ఈ చర్చిలు అట్లాంటా యూనివర్సిటీ సెంటర్ లో ఇంటర్ డినామినేషనల్ థియోలాజికల్ సెంటర్ సముదాయమును రూపొందించే పలు బడులను కలిగి ఉన్నాయి .
" సాయంకాలపు చీకటి లోయలోకి దొర్లుకుపోతున్న పగలు ఎన్ని పగళ్ళని మింగిందో ఈ లోయ " అంటారు తాత్వికంగా . .
రామాయణం లొని రావణునికి పది తలకాయలు . కాని బాల్య రావణునికి మాత్రం ఎడు తలకాయలు . ఇది ఎలా సాధ్యం చెప్మా ?
సహజ సిద్ధమైన భౌగోళిక పరిస్థితులు , ఒప్పందాలు ఈ జంట నగర అభివృద్ధిలో పాలు పంచుకున్నాయి . మిసిసీపీ నదీతీరంలో ఇరువైపులా సజసిద్ధంగా ఉన్న రాళ్ళు బండలు ఈ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా చేశాయి . లాంబర్ట్‌స్ లాండింగ్ చుట్టూ సెయింట్ పాల్ విస్తరించింది . సెయింట్ ఆంధోనీ ఫాల్స్‌కి 7 మైళ్ళ దూరంలో ఉన్న లాంబర్ట్‌స్ లాండింగ్ బోట్‌లలో సరుకు దించడానికి , ఎక్కించడానికి అనువైన ప్రాంతంగా మారింది . అనుకూలమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా మిన్నియాపోలిస్ ప్రాంతం మిల్లుల నగరంగా పేరు పొందింది .
అమెరికా కు నిత్యం ఎంతో మంది వెళ్లివస్తున్నారు . అమెరికా లో ఎంత కాలం ఉన్నా అది ఒక పట్టాన అర్థం కాదు . అతి పెద్ద భౌగోళిక స్వరూపం , విభిన్న ఆచారాలు , వాతావరణాలు , భాషలు , సంస్కృతి , అమెరికా అంటే ఏవిటో , అర్థం కాకపోవటానికి కారణాలవుతాయి . అమెరికాను మీకు దగ్గర చెయ్యటానికి , " మీకు తెలియని అమెరికా " అనే కొత్త శీర్షిక ఇన్నయ్య గారు ప్రారంభించబోతున్నారు . " అమెరికా కబుర్లు " నా నుంచి ఉండగలవు . అమెరికా లో ఉండే తెలుగు బ్లాగరులను , పాఠకులను , మీరు ఎక్కడున్నా ( ఏ రాష్ట్రమైనా ) , కలవటానికి గట్టి ప్రయత్నం చేస్తాము . కెనడా , ఉత్తర అమెరికా , కాస్టా రికా దేశ వాసులు మాత్రమే సంప్రదించండి . కలుస్తాము . Jan 2009 చివరి దాకా నేను అమెరికా లో ఉంటాను . ఆసక్తి ఉన్నవారు , మీ వివరాలు పంపండి . అమెరికాలోని తెలుగు బ్లాగర్ల విషయాలు , విశేషాలు కూడా అమెరికా కబుర్లలో ఉండగలవు .
4 . 30 కి శాతవాహన సూపర్ ఫాస్ట్ బండి ఉంది . . అది అందుకోవాలి అని ప్లాన్ . పరీక్ష మొదలయ్యింది . కేవలం 100 ప్రశ్నలు . నాకు ఎందుకో అన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలుస్తున్నాయి . మళ్ళి అనుమానం వచ్చింది . ఈసారి పక్కన ఉన్నవాళ్ళని ఎవ్వరిని అడగటానికి కుదరదు . . హాల్ టికెట్ మళ్ళి చూసుకున్నాను . నేను వచ్చింది కరెక్ట్ ఎక్షామ్ కే . సెంటర్ కి వచ్చేటప్పుడు నేను బస్ లో కండక్టరు కాలు తొక్కిన విషయం గుర్తుకు వచ్చింది . ఆ కండక్టరు కి చెక్కిన పెన్సిల్ ములికి ని బలి ఇచ్చి , మళ్ళి పెన్సిల్ చెక్కుకొని 35 నిముషాలలో అన్ని ప్రశ్నల రింగులకి నల్ల రంగు దిద్ది , ఓ 20 రాని వాటిని ఒక సారి మళ్ళి కండక్టరు కాలు తొక్కినట్లు గా ఫీల్ అయ్యి నాకు కరెక్ట్ అని అనిపించిన ఆన్సర్ ని ఇంకా ఎక్కువ నల్లగా దిద్దేసాను . ఈ ఎక్ష్ట్రా ఎఫ్ఫర్ట్ కు 5 నిముషాలు పట్టింది .
ఇంగ్లీష్ వ్యామోహం … ఇంగ్లీష్ భాష బాగా నేర్చుకుంటే తప్ప ఎవరెైనా మేధా సంపన్నులు కాలేని పరిస్థితి మన దేశంలో నెలకొని ఉంది . ఈ వింత పరిస్థితి ఒక జర్మన్‌కు లేదు . ఒక రష్యన్‌కు లేదు . ఒక ఫ్రెంచి వాడికి లేదు . నార్వేని చూడండి . చిన్నదేశం . దాని జనాభా మన హైదరాబాద్ జనాభా అంత ఉంటుందేమో . ఒక నార్వేనియన్ ఆడమ్‌స్మిత్‌ని చదవా లనుకుంటే ఇంగ్లీషు నేర్చుకొని తీరాలని లేదు . టాల్‌స్టాయ్‌ని చదవడానికి రష్యన్ అక్కర్లేదు . ప్లేటోని చదవాలంటే గ్రీకు నేర్చుకోనక్కర్లేదు .
మన ఆలోచనలని , మనోభావాలని ప్రతిఫలించే మిత్రులని కలవడం ఎంతో ఉత్తేజం కలిగిస్తుంది . ఒట్టినే ప్రతిఫలించడమే కాక , పాత ఆలోచనల్ని ప్రశ్నించ గలవారూ , కొత్త ఆలోచనల్ని రగిలించగలవారూ కూడా అయితే . . మనసూ మెదడూ రెండూ ఆనందంతో తడిసి ముద్దవుతాయి , తృప్తిగా నిట్టూరుస్తాయి . నిన్న అలాంటి భాగ్యం దొరికింది . నెల్లుట్ల వేణుగోపాల్ నాకిదివరకు పరిచయమే . కాకపోతే అప్పుడు అది ముఖ పరిచయం మాత్రమే . సీనియర్ పాత్రికేయుడు , ఆంధ్ర ప్రదేష్ చారిత్రక , రాజకీయ , ఆర్ధిక విశేషాల పై సాధికారిక జ్నానం ఉన్నవాడు , సమకాలీన తెలుగు సృజనాత్మక సాహిత్యాన్ని సైద్ధాంతికంగా సానబెట్టి చూసే విమర్శకుడు , అనేక ప్రపంచ భాషలనించి కథల్నీ నవలల్నీ తెలుగులోకి తర్జుమా చేస్తున్న అనువాదకుడు , కొన్ని సంవత్సరాలుగా రాజకీయ ఆర్ధిక మాస పత్రిక వీక్షణం కి ప్రధాన సంపాదకుడు . తెలుగు బ్లాగ్లోకంలో కడలితరగ బ్లాగరిగా సుపరిచితుడు . ఈయన బహు ముఖ ప్రజ్న నాకు గత మూడు నాలుగేళ్ళలోనే పరిచయమైంది . నిన్న మా డెట్రాయిట్ తెలుగు సాహితీ సమితి సమావేశానికి ఆయన ప్రత్యేక అతిథిగా విచ్చేసినప్పుడు , అనేక సాహిత్య సామాజిక అంశాలను గురించి ఆయనతో ముఖా ముఖీ చర్చించే అవకాశం కలిగింది . వేణు జీవిత భాగస్వామిని , డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ , వనజ కూడా చర్చలో పాల్గొన్నారు . సరే , వేణు ఐతే సమావేశానికి వస్తున్నారని ముందే తెలుసు . ఫలానా మనిషి వస్తాడని ముందు తెలియకుండా అకస్మాత్తుగా ఎదురైతే ఎంత గొప్పగా ఉంటుంది ! అలా కలిసిన మిత్రుడు , నేనెంతో అభిమానించే బ్లాగరుల్లో ఒకడు , జేప్స్ జయప్రకాష్ . ఇక మీదట మా ఊరి పరిసర ప్రాంతాల్లోనే ఉంటున్నామని చెప్పారు . చాలా సంతోషం . జేపీకీ , అతని భాగస్వామిని చైతన్యకీ స్వాగతం .
చైనా కంటే మనం ఎందులో గొప్ప , అని అడిగితే ఠక్కున చెప్పే జవాబు - మనం అతిపెద్ద ప్రజాస్వామ్యం అని . కానీ అబ్రహాం లింకన్ అన్నట్లు " విద్య లేని ప్రజాస్వామ్యం మితం లేని వంచన " . ప్రజాస్వామ్యమనేది పనిచెయ్యాలంటే ప్రజలకి చదువు వచ్చి ఉండాలి . ప్రపంచంలో ఎక్కడా నిరక్షరాస్యులతో ప్రజాస్వామ్యం పనిచెయ్యలేదు . పైకి షోకు చెప్పుకోవడమే కానీ , మనదేశంలో నిజంగా నడుస్తున్నది కులస్వామ్యం . ఒకరకమైన ఫ్యూడల్ రాజ్యం . ప్రజల్లో 100 % అక్షరాస్యత వచ్చేవరకు ప్రజాస్వామ్యపు ఆలోచనలు వారికి అర్థం కావు .
ఇక్కడ మిగిలే 80 TMCలు తెలంగాణకు ఇస్తారనేది ఊహాజనితం . మనకు ఇంకెంతో పవర్ అవసరాలు ఉన్నాయి , ప్రస్తుతం తెలంగాణలో 6 గంటలు కూడా వ్యవసాయానికి పవర్ ఇవ్వట్లేదు . కాబట్టి ఈ900MW అక్కడ వాడొచ్చనేది అర్ధం లేని వాదన , అదొక నీటి బొట్టులాంటిది . ప్రస్తుతానికి తెలంగాణకు ఎంత లాభం , సీమాంధ్రకు ఎంతలాభం అనేవిషయం వదిలేద్దం . మొత్తం సమైక్య రాష్ట్రంలో ఎంతలాభం జరుగుతుంది , దానికోసం ఎంత త్యాగాలు చెయ్యాలి , ఇదే ఖర్చు ఇంకోదగ్గర పెడితే ఎంత లాభం లాంటి విషయాలు ఆలోచిద్దాం . రెండూ చేద్దాం లాంటివి చెప్పి వృధా . ఇప్పటికి ముప్పై ఏల్ల క్రితం ప్రారంభించిన శ్రీరాం సాగర్ , శ్రీశైలం ఏడమకాలువ ప్రాజెక్టులు పూర్తికాలేదు . ముందు వాటికి ఫండ్స్ ఇవ్వాల్ . తరువాత నీల్లు లేని ప్రాంతంలో ప్రాజెక్టులు చేపట్టాలి . మన మేతావి వాదనలాగా మీదగ్గర మేమొచ్చి పరిశ్రమలు పెట్టి సంపాదించుకుని మీప్రాంతానికి జీడీపీ పెంచుతాం , నీల్లన్నీ మేమే తీసుకుంటాం అంటే ఏం లాభం చెప్పండి ?
విశ్వరూప్ గారూ , మీ బ్లాగులో ( http : / / kotiratanalu . blogspot . com / ) " పొయ్యి నువ్వు నీపెద్దపురం కొంప పక్కన శివరాత్రి రోజు గంతులేసుకో పైసలొస్తయి " ఈ ఒక్క మీ వ్యాఖ్య చాలు మీ స్థాయిని నిర్ణయించటానికి . నా వాదనలో డొల్ల ఎత్తి చూపుతానంటే మీకు సదా స్వాగతం .
రాష్ట్రావతరణ దినోత్సవం దగ్గరవుతున్నది … అన్ని నియోజక వర్గాలలో , మరి కొన్ని ముఖ్యప్రదేశాల్లో విగ్రహావిష్కరణకు రంగం సిద్ధమవుతున్నది .
చర్చిపేట పిల్లలంతా కుమారక్కని చూసి అప్పుడే సంవత్సరం కావస్తోంది . తెల్లవారితే క్రిస్మస్ . శారా ఇంట్లో కూడా క్రిస్మస్ వుంది . అయితే పండగలా కాదు . పనిలా ! అజయ్‌శేఖర్ కారల్స్‌కి వెళ్లలేదు . వెలగడం లేదని జాగ్రత్తగా పెంకులు జారకుండా యింటి మీదకెక్కి అక్కడ కర్ర చివర కట్టిన స్టార్ లోపల బల్బు తీసి చూస్తున్నాడు అజయ్‌శేఖర్ . ఫిలమెంట్ పోయింది . ఇంతలో ఇంటిముందు సైకిల్ దిగుతున్న వ్యక్తి కిందికి రమ్మన్నట్టు సైగచేసి పిలిచాడు . అజయ్‌శేఖర్ కిందికి దిగేలోపే అతనిచ్చిన టెలిగ్రాం శారా చేతిలో ఉంది . " కుమారి సీరియస్ , స్టార్ట్ ఇమీడియట్లీ " . కళ్లు బైర్లుకమ్మి ఉన్నచోటనే కూలిపోయింది శారా . చర్చిపేటంతా పరిగెత్తుకొచ్చింది . పది నిమిషాల్లో యింటికి తాళం వేసి అజయ్‌శేఖర్ తెచ్చిన టాక్సీ ఎక్కి గుంటూరు జనరల్ హాస్పటల్‌కి బయలుదేరారు . దుఖ్ఖపు ఆవిరితో టాక్సీలోపలి అద్దాలు చెమ్మగిల్లుతున్నాయి . చీకట్లో నల్లటి తారు రోడ్డు మీద - కడుపు నిండా దుఃఖపు మందుపాతర కూరుకున్న తెల్లని గొర్రెపిల్లలా టాక్సీ గంట తర్వాత గుంటూరు పెద్దాసుపత్రి ముందు ఆగింది .
3 . క్రింద తెలిపిన కమాండును టెర్మినల్ లో టైప్ చేయగానే అన్ని డ్రైవ్ లనూ మౌంట్ చేస్తుంది .
31 ఆద్యే బద్ధా విరహదివసే యా శిఖా దామ హిత్వా శాప స్యాన్తే విగలితశుచా తాం మ యోద్వేష్టనీయామ్ స్పర్శక్లిష్టా మయమితనఖే నాసకృత్సారయన్తీం గణ్డాభోగా త్కఠినవిషమా మేకవేణీం కరేణ
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లో కొద్ది రోజులుగా కార్పొరేటర్లు , అధికారుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది . ఈ మధ్య ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారి ఏకంగా ముఖ్యమంత్రి సమక్షానికే వెళ్ళింది . కార్పొరేషన్ సమావేశం నుంచి కమీషనర్ వాకౌట్ చేయడం మేయర్ ను , కార్పోరేటర్లను , ఎక్స్ అఫీషియో సభ్యులను అవమానించడమేనని సభ్యులు అంటున్నారు . దీనిపై కమిషనర్ క్షమాపణ చెప్పాలని కార్పోరేటర్లు డిమాండ్ చేస్తున్నారు . మరో వైపు కోందరు ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే ఒత్తడి తట్టుకోలేక పోతున్నామని ఉద్యోగులు మండిపడుతున్నారు . నగరంలో అక్రమ కట్టడాలను కూలుస్తుంటే ప్రజాప్రతినిధులు అడ్డకుంటున్నారని , అందుకు నిరసనగా ఉద్యోగులు మూకుమ్మడిగా క్యాజువల్ లీవ్ పెట్టారు . నిజాయితిగా పని చేస్తున్న కమిషనర్ ను కౌన్సిల్ లో అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలనాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నవించారు .
ఈ పవిత్ర మొక్కను ఆజ్టెక్ తెగ వారి భాషలో పెయూటల్ అంటారు . పెయూటల్ అంటే గొంగళి పురుగు . ఈ జముడు మొక్క మీద గొంగలి పురుగు బొచ్చు మాదిరి నూగు వుంటుంది . దీన్ని మా సూ భాషలో పెజూత అంటారు . పెయూట , పెజూత శబ్దాలు దగ్గర దగ్గరగా వినిపిస్తాయి . శబ్దాల మద్య దగ్గరితనం కాకతాళీయం కావచ్చు . మాకు పెయూట్ మొక్క మెక్సికో నుంచి వచ్చిందనడంలో సందేహం లేదు . 1870 లలో కియోవా , కొమాంచె తెగల వాళ్లు ఈ మూలికతో ప్రార్థనలు చేస్తూ ' నేటివ్ అమెరికన్ చర్చి ' అనేదాన్ని రూపొందించారు . ఇప్పుడు అలాస్కా వరకు అన్ని తెగలలో పెయూట్ మతం వ్యాపించి వుంది . రియో గ్రాండ్ తరువాత ఇక ఈ మొక్క కనిపించదు . మేము ఉత్తరాన సరిహద్దు ప్రాంతాలనుంచి మా మూలికలు తెప్పించుకోవాలి . నైరుతి ప్రాంతలో వుంటుంది మా ' పెయూట్ తోట ' .
నిజమే మరి . ఇవాళ తిలక్ లేడు . తిలక్ పాట వుంది . నిజంగా వుంది . జాలిగా హాయిగా వినపడుతూ వుంది . ఇంకా ఇంకా అలా వినబడుతూనే వుంటుంది .
మళ్ళీ ఆ హిందీ ఆవిడే సహాయ పడిందట . " మీ పాపా , మీరూ పకపకా నవ్వారు చాలా సేపు ! " అని చెప్పి .
ఆప్యాయముగ గౌరవాదరంబులతోడ తాతగారూ యంచు దగ్గరయ్యి గురువుగారూ యంచు కూర్చుని కృతులను పాడి మందిరమున భక్తులమయి ఈ క్రొత్త పద్యము ఈ వేళ వ్రాసాను చూడండి అని చూపి స్ఫూర్తి పొంది మనుమలంటూ మీరు మమ్మల్ని ప్రేమతో ఆశీర్వదించగా హాయినొంది మేము తిరిగి వచ్చెడిలోపు మీరు మమ్ము వదిలి తిరిగిరానట్టి త్రోవను చనిరట ! మాకు మంగళంపల్లి రామనరసింహ మూర్తి గారు మీరొక్కరే ! గుర్తులేదె ? మనుమలము బాధ పడమా కనులందు తిరిగెడి నీళ్లు గద్గద స్వరమూ కనలేదో ! వినలేదో ! చనగా కైవల్యపథము జ్ఞప్తికి లేమో !
హాసిని ని ప్రక్కకి తోసేసి ఇద్దరూ ఆపకుండా పలకరింపులు , కష్టసుఖాలు కొనసాగించేస్తున్నారు . జీవితం లో వాగుడు తో తనకే చెక్ పెట్టిన జంటని మొదటసారి చూస్తుంది హాసిని . హాసిని షాకు తట్టుకోలేక మిట్ట మధ్యాహ్నం నడిరోడ్డుమీద కళ్ళు తిరిగి పడబోయింది . ఆకలి వల్లనేమో అని స్వప్న , పవన్ హాసిని ని అన్నపూర్ణా రెస్టారెంటులోకి తీసుకెళ్లారు . చికెన్ బిరియాని తెప్పించుకొని దుమ్ములురిచుకుంటూ , జోకులేసుకుంటూ హాసిని తింటుందో లేదో కూడా పట్టించుకోకుండా మాట్లాడేసుకుంటున్నారు స్వప్న , పవన్ . వారి తిండి చూసిన హాసిని పక్షి జాతి ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో అనుకుంది . వాళ్ళు మాత్రం పరుశరాముడు క్షత్రియ జాతిని నిర్మూలించినట్టు , ఆంధ్రప్రదేశ్ లో కోడీజాతిని నిర్మూలించటమే లక్ష్యంగా తింటూనే ఉన్నారు . అప్పటికే అటూ ఇటూ తిరిగిన సర్వరుకి ఆయాసం వచ్చింది . వండుతున్న వంటవాడికి గుండె నొఫ్ఫి వచ్చింది . ఇక ఆగలేక " మా దగ్గర కోళ్ళు లేవు . మేకలు , గొఱ్ఱెలు మీ దాటికి తట్టుకోలేక పారిపోయాయి . ఇక నేనే మిగిలాను నన్ను తినండి " అని టేబులెక్కి ప్లేటులో కూర్చున్నాడు సర్వరు . వాళ్ళకి ఎంత జాలేసిందంటే అంతజాలేసింది . " పచ్చిమాసం ఎలా తింటాం " అంటూ లేచారు . ఒకగంట తరువాత పవన్ ఇద్దరికి చెప్పి బయల్దేరాడు . హాసిని స్వప్న ని బర బరా ఈడ్చుకొని లాక్కేల్లి అసలు వాడు నీకెలా తెలుసే అని ఆడిగింది . " ఏముందే మొన్న కుటుంబమంతా వచ్చి నన్ను చూసి వెళ్ళారు . పైగా పెళ్ళిచూపుల్లో మూడు రోజులు మా మూడు గేదెలు కష్టపడి ఇచ్చిన జున్నుపాలని జున్ను చేస్తే ముప్పై నిమిషాల్లో ముక్క మిగల్చకుండా మింగేసి నాకు జున్నంటే చాలా ఇష్టం . మీరే చేసారా . బాగుంది . అని ఒక పొగడ్త నా మొహాన పారేసి ఏ విషయం ఇంటికి వెళ్ళాక తెలియజేస్తాం అన్నారు . ఆ రోజు వాడి తిండికి జడుసు కున్న మా అక్క కొడుక్కి జ్వరం పట్టుకొని 10 నిమిషాల్లో 13 విరేచనాలయ్యాయి . ఇంకా గ్లూకోజు బాటిల్లు ఎక్కిస్తూనే ఉన్నారు . ఈ రోజు బిల్లు ఎలాగూ వాడిదే కదా అని ఒకపట్టు పట్టా " అని చెప్పింది స్వప్న . హమ్మయ్య పొరపాటున తను బిల్లు కట్టడానికి కమిటవ్వలేదు అనుకుంది హాసిని .
కొందరు కవులకు అదొకమోస్తరు ఒత్తు అక్షరాలు రాకుండా నీళ్ళవలే సాఫీగా నడుస్తున్న కవిత్వమే కవిత్వమనిపించినట్లు , కొందరికి అందరికీ అర్ధమవుతున్న శబ్దాలే యేరి అదొక మోస్తరు సాఫీగా ఉండాలని వాడుక భాష . ఎవడు వాడే భాష వాడు వ్రాస్తాడు . నేను మా నందమూరులో చిన్నతనంలో నాకు వచ్చిన భాషా , నేను చదువుకోగా నాకు వచ్చిన భాషా రెండూ నాలో కలిసి ఏ పరిణామం పొంది నా నోటివెంట వస్తుందో అది మాట్లాడుతాను . అదే వ్రాస్తాను .
ఇది కోల్‌కతా హౌరాబ్రిడ్జిలా ఉంటుంది . సుమారు రెండున్నర కిలోమీటర్లుండే ఈ బ్రిడ్జి తైపా అనే ఊరిని మకావుని కలుపుతుంది .
ప్రొఫెసర్ కోదండ రాం , స్వామినాథ్‌గౌడ్‌లను పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేయడంతో ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి . వీరిని తక్షణం విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల తరపున డిమాండు చేశారు . ప్రభుత్వం గతంలోనే సహాయ నిరాకరణ జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో చవి చూసిందని , ఈసారి పరిస్థితి అంతకంటె తీవ్రంగా ఉంటుందని ఆయన అన్నారు .
తెలంగాణలో జగన్ యాత్రను ఆడ్డుకోవడాన్ని నిరసిస్తూ . . మాజీ మంత్రి కొండా సురేఖ ఆత్మహత్యకు ప్రయత్నించారు .
అంటే , అలాంటి ప్రచురణలు చెయ్య వద్దు అనికాదు , కానీ ప్రచురించేటప్పుడు కొంచం ధైర్యాన్ని కూడ దీసుకుని ప్రచురించండి . అందరూ ఒకేలాగా ఉండరు అలాగే ఒకె లాగా ఆలోచించరు , అందుకని మన మనః శాంతిని కొల్లగొట్టే వారు చేసే సకల ప్రయత్నాలను గంగ పాలు చేసేయ్యండి . అంతే కానీ మీ ప్రపంచాన్ని దూరం చేసుకోకండి .
రాం చరణ్ కి ఈ విషయం ఎంత తెలుసో తెలీదు కాని , జనాలను మోసం చేయటానికి అలా దిగజారుతారని నేను అనుకోను . ఎందుకంటే అది చాల తేలికగా బయట పడుతుంది కాబట్టి . ఇక పార్టీ సీటు ఆశించిన వాళ్లే తప్పుడు ఆధారాలతో ఇలా టికెట్ సంపాదిస్తే చేసేదెమి లేదు , వచ్చే ఎన్నికల్లో ఇంకొంచెం జాగ్రత్త పడటం తప్ప .
కారు అసలు కదల కుండానే అరుస్తున్న భర్తను చూసి , కంగారుగా , అతనికి ఏమయ్యిందోనని ఆదుర్దాపడుతూ … తాళాన్ని మరింత గట్టిగా తిప్పింది శైలజ . " ప్చ్ . . ఆపమంటూంటే … " అంటూ అతి చిరాగ్గా మొహం పెట్టి , గుడ్లు పెద్దవి చేసి మనిషంతా బిగుసుకుపోవడం చూసిన శైలజ తన తప్పేమిటో తెలీక తాళాన్ని చేత్తో తిప్పుతూ , ఆక్సెలరేటర్ మీద కాలుతో బలంగా నొక్కుతూ … " ఏమైందండి " అనడిగింది .
అందుకే చిన్నపుడు ఇలాటి పనుల ప్రాధాన్యత తెలీక - ఎందుకబ్బా తిండి కోసం ఇన్ని పాట్లు , ఇంత సమయం వృధా అనిపించేది . ఇప్పుడు యాంత్రిక జీవనంలో ఇవే కాస్తో కూస్తొ ఇంధనంగా పని చేస్తాయేమో అనిపిస్తోంది .
ముడుచుకొన్న మెదళ్ళు మీవి కొత్త చూపు చూస్తాయా విరిగిన మీ పాళీల్లోంచి విప్లవాలు పూస్తాయా … లాంటివీ
ప్రభుత్వ రంగ లేదా ప్రైవేటు రంగ సంస్ధలు ప్రారంభించిన మ్యూచువల్ ఫండ్స్ గాని లేదా విదేశీ సంస్ధలచే అభివృద్ది చేయబడుతున్న మ్యూచువల్ ఫండ్స్ గాని అవే నియమ నిబంధనలకు లోబడి నియంత్రించబడతాయి . వీటిలో వేటికీ భేదభావం చూపకుండా సెబి ఈ నియమ నిబంధనలను మ్యూచువల్ ఫండ్స్ కు వర్తింపచేస్తూ , పర్యవేక్షిస్తుంది . ఈ సంస్ధలు అందిస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పధకాలన్నింటికి సంబంధిం చిన నష్టాలు ఒకే రీతిలో వుంటాయి .
ప్రదీప్ గారు , నెనరు అనేది ఉంది నిఘంటువు లో , కానీ నెనర్లు అనే బహువచనం కొందరి సొంత పైత్యమే ! అదేమంటే , తెలుగు వాడుక తప్పు ఐపోతోంది అంటు వాపోవటం ! నెనరు = ప్రేమ , కృతజ్ఞత నెనర్లు = ప్రేమలు , కృతజ్ఞతలు ! నా టపా చదివినందుకు నెనర్లు ( అంతే ప్రేమలా ? కృతజ్ఞతల ? ) ప్రేమలు అనే context లో ఉపయోగించ లేము ఈ పదం . . . కాబట్టి ఈ బహువచన వాడుక తప్పు !
పోలేపల్లి సెజ్ పేరిట పేదల నుంచి ప్రభుత్వం లాక్కున్న భూములను తిరిగి వారికి అప్పగించే వరకు తాము పోరాటాన్ని కొనసాగి స్తామని ప్రజాగాయకుడు గద్ధర్ ప్రకటించారు . తాము చనిపోయినా తమ వారసులకు ఈపోరాటాన్ని అప్పగిస్తామని , ముఖ్యమంత్రి వై . ఎస్ స్వయంగా వచ్చి పేదలకు తిరిగి భూములను అప్పగిస్తున్నట్లు ప్రకటించే వరకు ఎవరు అడొడచ్చినా తమ పోరాటాన్ని మాత్రం ఆపలేరని ఆయన పేర్కొన్నారు . పూర్తిగా చదవండి »
3 . ఇక మూడోది . తెలుగులో రాయొచ్చనీ , రాసేందుకు ఇన్ని ఏర్పాట్లు ఉన్నాయని తెలుగు వారికి తెలియజేయడం . . మనం బాగా వెనకబడి ఉన్నది ఇందులోనే . దానికోసం మార్గాలు చూడాలి . ఏమిటా మార్గాలు ? నాకు తోచినవి ఇక్కడ రాస్తున్నాను .
విజయవాడ , జూలై11 ( వాస్తవం ) : వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డివి ఆచరణ సాధ్యం కాని హామీలు అని , జగన్ హామీలను ప్రజలు నమ్మరని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు . జగన్ మొత్తం దాదాపు అరవై వేల కోట్ల వాగ్దానాలు చేశారని , కుప్పలకొద్ది వాగ్దానాలు ఆచరణ శూన్యమన్నారు . హామీల్లో జగన్ ఆల్ ప్రీ చంద్రబాబు బాటలో పయనిస్తున్నారని అన్నారు . ఇన్నాళ్లూ తెలంగాణ విషయంలో ఏదో చేస్తాడని ఊదరగొట్టిన జగన్ ప్లీనరీలో తనకు తెలంగాణ ఇచ్చే శక్తి లేదు , తెచ్చే శక్తి లేదని చెప్పడం హాస్యాస్పదం అన్నారు .
విత్తనాలకి మొనోశాంటో మీదే ఆధార పడాల్సి వస్తుంది కదా అంటే , బోల్గార్డ్ మాత్రమే మోనోశాంటోవి - - ఇంకా చైనా , ఖరగ్ పూర్ , ధార్వాడ్ , బెంగుళూరు ల నించి కూడా మొత్తం 4 రకాల బీటీ లని తిసుకున్నారట . ఇంకో మూడు రకాలు పరీక్ష దశలో వున్నాయట . మరి ఇవన్నీ యెవరు అమ్ముతున్నారు ? యెప్పటికి అందరికీ అందుబాటులోకి వస్తాయి ?
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎంఎల్‌ఎ ముదునూరి ప్రసాద రాజు అన్నారు . వేములదీవి పడమరలో రూ . 23 లక్షలతో నిర్మించే మినీ లేస్‌పార్కు భవన నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేసు అల్లికలకు దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉందన్నారు . దీనికి అనుగుణంగా లేసు అల్లికల్లో మరింత ప్రావీణ్యం సాధించి లేసు ఉత్పత్తులను పెంచుకోవాలన్నారు . తీర గ్రామాల్లో భవిషత్‌లో తాగునీటి సమస్య తలెత్తకుండా . . .
( ఇలా చెప్పి అతను రెండడుగులు లోపలికి వేసి , అటువైపు తిరిగి సిగరెట్ ముట్టిస్తాడు . లక్ష్మి , నాగేంద్ర వాసుతో తుపాకీ తీసి అతనికి గురిపెట్టమన్నట్టుగా సైగ చేస్తూ ఉంటారు . కాని , వాసు తనవల్ల కాదని మొత్తుకుంటూ ఉంటాడు . లక్ష్మి వాసుకి దగ్గరగా వెళ్ళి , తుపాకీ బలవంతాన అతని చేతుల్లోపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ; అతను resist చేస్తాడు . ఈ గందరగోళంలో తుపాకీ కింద పడుతుంది . వెంటనే , ఆగంతకుడు ఇటువైపు తిరుగుతాడు . )
భారతకవుల తర్వాత ఆలంకారికతే కవిత్వంగా చెలామణి అయిందని రామలింగారెడ్డి గారు భావించారు . మితిమీరిన ఆలంకారికతకు కారణం భావశూన్యత మాత్రమేనని వారు తెగేసిచెప్పారు . తెలుగుకవుల్లో ఈ బలహీనత లేని వారు భారతకవులున్నారు . మన కవుల్లో ఎక్కువమంది పండితులు మాత్రమేననీ వారిలో కార్యోత్సాహమూ , భావప్రాబల్యమూ చాలా తక్కువనీ అన్నారు . అందుచేతనే వారిలో భావనాశక్తి తగినంతగా అభివృద్ధి చెందటానికి అవకాశం లేకుండా పోయిందని రామలింగారెడ్డిగారు " కవిత్వతత్వవిచారం " లో గట్టిగా ప్రతిపాదించారు . అందుచేతనే చాలామంది మన ప్రాచీన కవులు పాండిత్యాన్నీ , ఆలంకారికతనూ ఆశ్రయించారన్నది వారి సిద్ధాంతం . మితిమీరిన పాండిత్య ప్రదర్శనా , ఆలంకారికతా రసదృష్టికి ఎలా ఆటంకాలుగా నిలిచాయో రామలింగారెడ్డి ఈ గ్రంథంలో సోదాహరణంగా నిరూపించారు .
మనస్సులో ఓ మూల గోలజేస్తూనే ఉంది - అపరిపక్వ భావాల కన్నెపిల్ల చేష్టలు కూడా కాదు . ఇంకా చిన్న పిల్లల చేష్టలు చేస్తున్నానేమోనని . అతని ఎదురుగా వెళ్ళి తనెవరో పరిచయం చేసికోవటం కాదు - ఆనాటి స్మృతుల్ని సైతం గుర్తు చేయాల్సిన దుస్థితి కలుగుతుందేమోనని .
ఆధునిక పద్యకవులలో నిస్సందేహంగా ఒక మహోన్నతస్థానాన్ని సొంతంచేసుకొన్న కవి జాషువా . అతని కవిత్వంలోని విస్తృతి , గాఢత , పద్య రచనలోని వాడీ వేడీ అతన్ని గొప్పకవిని చేసాయి . కవికోకిలని చేసాయి . నవయుగ కవిచక్రవర్తిని చేసాయి ! నా కవితావధూటి వదనమ్ము నెగాదిగ జూచి రూపరే ఖా కమనీయ వైఖరుల గాంచి భళీభళి యన్నవారె నీ దేకులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో బాకున గ్రుమ్మినట్లగును పార్ధివచంద్ర ! వచింప సిగ్గగున్ ! అన్న జాషువా ఆవేదన విన్నప్పుడు కరగని హృదయం ఉంటుందా ? అలా అని జాషువా భీరువు కాదు . అతని కవిత్వంలో ఆవేదన ఎంత ఉందో , ఆవేశం తెగింపూ తిరుగుబాటూ కూడా అంతే ఉన్నాయి . గవ్వకుసాటిరాని పలుగాకుల మూక లసూయచేత న న్నెవ్విధి దూరినన్ , నను వరించిన శారద లేచిపోవునే ! ఇవ్వసుధాస్థలిన్ బొడమరే రసలుబ్ధులు , ఘంటమూనెదన్ రవ్వలురాల్చెదన్ , గరగరల్ సవరించెద నాంధ్రవాణికిన్ . అని ప్రతిజ్ఞ పూని , దాన్ని సాధించిన కవి జాషువా . తెలుగుకవిత్వం ఉన్నంతకాలం జాషువా తెలుగువాళ్ళ గుండెల్లో మార్మ్రోగుతునే ఉంటాడనడంలో ఏమాత్రం సందేహం లేదు . ఒకవైపు అచ్చమైన అందమైన అమాయకమైన పసిపాప , మరో వైపు తెలుగుజాతిపై తెలుగుభాషపై ఉప్పొంగే అభిమానం , ఇంకొకవైపు దళితజాతి చైతన్యాన్ని లోకానికి చాటే గబ్బిలం - జాషువా కలానికి అనంత ముఖాలు . అతను రాసిన శ్మశానవాటిక పద్యాలు , ఒక కాలంలో , నోటికి రాని తెలుగువారు అరుదంటే అతిశయోక్తికాదు . పద్యాలలో అభ్యుదయకవిత్వాన్ని రాసినవాళ్ళు మరికొందరున్నా , జాషువా పద్యాలు నా హృదయాన్ని తాకినంతగా మరెవ్వరివీ తాకలేదు . ఈ రోజు అతని వర్ధంతి సందర్భంగా అతన్ని గుర్తుచేసుకోవడం , మనం మరచిపోతున్న తెలుగుదనాన్ని ఒక్కసారి మళ్ళీ గుర్తుచేసుకోవడమే ! మనలోని మానవత్వాన్ని ఒక్కసారి తట్టిలేపడమే ! అతని " తెలుగు వెలుగు " ఖండికలోంచి కొన్ని పద్యాలు . ఒకనాడాంధ్రుని కత్తి శాత్రవ బలవ్యూహాలపై రక్తనా టకమున్ సల్పుట విస్మరింపకుము , గాఢంబైన పాశ్చాత్య శో భకు నీ విప్పుడు లోభివైతివి , ప్రదీప్తంబైన నీ ప్రజ్ఞ నూ రక పోనీక సముద్దరింపుకొను మాంధ్రా ! వీర యోధాగ్రణీ ! బోళావాడవుగాన నీదు విభవంబున్ సత్కళామర్మముల్ జాలా భాగము కొల్ల బెట్టితివి నీ శాస్త్రప్రపంచంబులో మేనెల్లన్ గబళించినారు పరభూమిశాగ్రణుల్ , నేటికిన్ బోలేదేమియు దిద్దుకొమ్ము బలగంబున్ స్వీయ విజ్ఞానమున్ . తలికోట యుద్ధాన నళియ రాయుని వల్ల ప్రిదిలిపోయినది నీ వీరదట్టి మాయనాయకురాలి మారాముడుల చేత శమియించె నీ బాలచంద్రరేఖ బుద్ధిమాలిన చిన్ని పొరపాటుకతమున వితమయ్యె నీ కొండవీటి పటిమ ఉత్సాహయుతమైన యుడుకునెత్తురు లేక ప్రాప్తింపలేదు రాష్ట్ర ధ్వజంబు . పరువు దూలిన నీ యనాదరణ కతన మేటి నీ భాష పొలిమేర దాటలేదు పరుల విజ్ఞానమునకు సంబరము పడక కడగి యొత్తుము నీ వీర కాహళంబు చీనా పెగోడాల సిగమీది పుష్పమై పొడమె నీ రాతిచెక్కడపు చెణుకు అరవ పాటకుల తంబురకు ప్రాణమువోసి కులికె నీ చిన్నారి తెలుగుబాణి హిమవద్గిరులదాక జృంభించి పగవాని తరిమి వెన్నాడె నీ కఱకుటలుగు మొగలు రాజుల సభా భూములనూరేగె నీ జగన్నాథపండితుని పలుకు ఎందు జూచిన నీ యశస్స్యందనములు నడచిపోయిన జాడ లప్పుడును గలవు దిక్తటంబుల యలర నెత్తింపవోయి తెలుగు మన్నీల పరువు నిగ్గుల పతాక !
హొమ్ » జిల్లాలు » మెదక్ » కొత్త ఏడాది వేడుకలకు తగ్గిన మద్యం అమ్మకాలు
రామోజీరావు తన ఈనాడు వందరూపాయల షేరునొ ఒక్కోటి రు . 5 , 28 , 630 / - కు అమ్ముకోగా సాక్షి 10రూపాయల షేరును 350 / - కు అమ్ముకుంటే తప్పేంటి ? " ఇది సాక్షిలో పెట్టుబడులను సమర్ధిస్తూ వైఎస్సార్ అసెంబ్లీలో చెప్పిన సమాధానం , జగన్ సమర్ధీకులు నిత్యం టీవీల్లో కోడై కూసే విషయం , సాక్షి అనేకసార్లు తన పేపర్లో పెట్టుబడులను సమర్ధించుకుంటూ రాసుకున్న విషయం , ఇవ్వాల్టితో సహా . ఇంతకూ ఒకషేరుధర 5 లక్షలు అయితే ఎక్కువ ధర పెట్టినట్టు , రు . 350అయితే తక్కువ ధర పెట్టినట్లా ? ఈ లెక్కన టెక్‌మహింద్రా షేరు ధర 670 , విప్రో షేరుధర 450 కాబట్టి టెక్‌మహింద్రా విప్రోకంటే పెద్ద కంపెనీ అవుతుందా ? ఒక కోటి రూపాయల విలువైన వ్యాపారాన్ని నాలుగు వాటాలు చేస్తే ఒక్కో షేరు ధర 25 లక్షలు , అదే నాలుగు లక్షల వాటాలు చేస్తే ఒక్కో షేరు ధర 25 రూపాయలు . ఈవ్యాపారంలో పావలా వంతు ఎవరికైనా అమాలంటే ఒక్క 25లక్షల షేరు అమ్మినా , లేక లక్ష 25 / - ల షేర్లు అమ్మినా తేడా ఏమీ వుండదు . కాబట్టి షేరు ధర ఎంత అనే వాదన అనవసరం , ఎంత వాటాను ఎంత ధరకు అమ్మాడనేదే అక్కడ ముఖ్యం . మరలాంటప్పుడూ అదేపనిగా అసెంబ్లీలోనూ , టీవీల్లోనూ ఇలా రామోజీ 5లక్షలకు ఒక షేరును అమ్మగా సాక్షి ఒక షేరును 350కి అమ్మితే తప్పేమిటని వాదన ఎందుకు ? రామోజీ తన ఉషోదయా పబ్లికేషన్స్‌లో 26 శాతం వాటాను సుమారు వెయ్యిఖోట్లకు అమ్ముకున్నాడు . ఈలెక్కన ఉషోదయ పబ్లికేషన్స్ మొత్తం విలువ నాలుగు వేలకోట్లు . ఈనాడుకు ఉన్న సర్క్యులేషన్‌కు , లాభాలకు , డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌కూ కలిపి బహుసా అంత విలువ ఉండొచ్చు . సాక్షి ఏ ఇరవైఐదేల్లనుంచో ఉన్న పేపర్ కాదు , ఇప్పుడే మొదలయింది . అందులో వాటాదారులందరికీ వారివారి పెట్టుబడులను బట్టి సుమారు అదే రేషియోలో వాటా రావాలి . కాబట్టి సాక్షి తన పెట్టుబడులను సమర్ధించుకోవాలంటే అందులో తన పెట్టుబడి ఎంత , అందుకు తన వాతా ఎంత , మిగతా వారి పెట్టుబడీ ఎంత , వారి వాటా ఎంత అనే విషయం చెప్పాలి , అంతే కానీ ఇలా అవసరంలేని , ప్రాముఖ్యత లేని షేరు ధరలు మాట్లాడి సమర్ధించుకుంటే ఏం లాభం లేదు . అయితే ఈవిషయంలో మన ముఖ్యమంత్రులూ , మత్రులూ , మీడియా తమ మోసాల్ను కప్పిపుచ్చుకోవడానికి ఎంత చక్కగా , నిస్సిగ్గుగా అబద్దాలను చెప్పి నిజాలను మసిపూసి మారేడుగాయలు చేస్తాయో మాత్రం తెలుస్తుంది . ఇలాంటి చర్చలు జరిగే అసెంబ్లీలో చర్చలకు ఉన్న విలువెంత ? అలాంటి అసెంబ్లీలో విషయాలు చర్చిస్తే ఉపయోగమెంత ?
కాగల కార్యం గంధర్వులే తీరిస్తే , మిగతా కథ వెండితెరపై చూద్దాం మనం !
ఇటీవల ఒక వారాంతపు యాత్రలో భాగంగా బరాచుక్కి మరియు గగనచుక్కి జలపాతాల నడుమన తలక్కాడు వద్ద కావేరీ నదీ గమన విన్యాస దృశ్యాలు . దర్శించండి .
తల్లీ ! నీబిడ్డ చక్రవర్తికానీ మామూలు వాడుకాదు . " అన్నాడు .
బాబు ఇంట్లో కెసీఅర్ ' మహా ' ముచ్చట్లు హైదరాబాద్ : తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ భేటీ అయ్యారు . భవిష్యత్ కా ర్యాచరణ , పొత్తులపై విధాన నిర్ణయం ప్రకటించే క్రమంలో వీరు భేటీ అయినట్లు పార్టీ వర్గాల ప్రాథమిక సమాచారం . విజయశాంతితో కెసిఆర్ సమావేశానంతరం , తాజాగా జరుగుతున్న వీరి సమావేశం సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరతీసే . .
కవి ఏమంటున్నాడు ? నేను వికృతి స్వరంలో పాడుతున్నాను ఈ సమాజ వికృతాన్ని , దుష్కృతాన్ని , దష్మృత్యాన్ని , దురాగతాన్ని , దుర్మార్గాన్ని అని . .
తరువాత కొత్తగా క్యాన్సర్ తో పోరాడే బీటా గ్లుకన్‌లను పరిగణించలేదు , ఎందుకంటే అవి క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి అని ఐతే ఇతమిద్దంగా తేలలేదు , కానీ క్యాన్సర్‌తో పోరాడగలదు అని మాత్రం ఋజువయ్యింది . ఇంకా పెద్ద ఎత్తున రీసెర్చ్ జరగటం లేదు , అందులోనూ మిగతా గడ్డి పంటల్లో లేకుండా బార్లే , ఓట్స్‌లోనే ఉండటం కుడా సాధ్యపడదు , కానీ వాణిజ్య పరంగా ఐతే మాత్రం ఓట్స్ , బార్లే నుంచే తయారు చేస్తున్నారు . అలాగే నీటిలో కరుగని పీచు , వేరుశనగల్లో ఉండే బిటా గ్లైకో లాంటి పదార్ధాల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి , వాటి గురించి తెలుసుకున్న వాటి కన్నా , తెలుసుకోవలసినదే ఎక్కువ అందుకనే వాటి గురించి ప్రస్తావించలేదు .
హైదరాబాద్ , జూన్ 26 : ఢిల్లీ పీఠం కదిలేలా రైతు ఉద్యమం నిర్వహిస్తామని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హెచ్చరించారు .
అమ్మ తెలంగాణా కన్నీళ్ళ తులాభారమే పతిదినం నీకు ఎక్కడ తప్పిపోయానే నేను నెలపొడుపు చూసినపుడు నన్ను పిలిచినవ కండ్లు తెరిసి నా ముఖమె సూసి నన్నెత్తుకుని read more »
ఇవీ , మిగతా పాత్ర సామానూ , టెంటూ వగైరాలు అన్నీ వ్యానుల్లో సర్దించబడి , ఆ తోట ఖాళీ చెయ్యబడేసరికి రాత్రి 8 . 00 అవుతుంది .
ఉట్టి అంత ఎత్తుకు ఎక్కడం మన సైజు పిలకాయలకు చేత కాదు . అందుకని మామ కూతుళ్ళలో ( అందురూ నాకన్నా పెద్ద వాళ్ళే వయసులోనే కాదు హైటు లో కూడా . . ఒక అమ్మాయి తప్ప ) ఎవురో ఒగర్ని మచ్చిక చేసుకుని వాళ్ళకు ఏందన్నా కావాలంటే అది యాడుందో ( మీరు మరిచిపొయింటే . . . . మనకు జ్ఞాపక శక్తి ఎక్కువ ) మనం చెప్పి ఇంట్లోకి తీసుకుని వచ్చేవాళ్ళం . ఇంకేం . . వాళ్ళు కింద వంగుంటే మనం వాళ్ళ వీపు పైకెక్కి ఆ సట్లోని ఎన్న ముద్ద మీద శ్రీరాముడు ఉడుత వీపు మీద చేతి వేళ్ళతో నిమిరినట్టు నా మూడు వేళ్ళను ఎన్న మీద రాపాడించి దాన్ని నోట్లో కరిగించి మళ్ళీ ఎన్న ముద్ద మీద రాపాడించి . . ( అలా ఓ పది తూర్లు లేక కడుపు నిండేవరకు ఏది ముందు జరిగితే అది ) కిందకు దిగి ఆ వీపు సాయం జెసినోళ్ళకు వాళ్ళ ఋణం బెట్టుకోకుండా వాళ్ళగ్గావాల్సిన సామాన్లు చూపిచ్చే వాణ్ణి . పొద్దున్నే పిండిన పాలను కాసేదానికి మళ్ళీ పొయ్యి బెట్టకుండా వండే పని అయిబొయ్యినంక ఆ పొయ్యి లో పిడకలు యేసి లేదా పొయ్యి లోని నిప్పులు ఆ పక్కకి ఈ పక్కకి తిప్పి ఆ వేడికే పాలు చిక్కగా కాచేవాళ్ళు . ఇట్లా పాల కుండ పొయ్యి మింద బెట్టి బోయినారంటే మనకు పండగే పండగ . అదే మీగడ పండగ . అట్ల పొయ్యి మీద బెట్టిన పాలు చిక్కగా మరిగి మీగడ మందంగా పేరుకును పొయుంటాది . వేలు బెట్టి తీస్తే వేలు కాలుతుంది . . నోరూ కాలుతుంది . అందుకని ఆ పొయ్యి కాడ వున్న చిన్న పుల్లని తీసుకుని ( వాటిని గప్ చీప్ కంపలంటారు ) దాన్ని ఆ సట్టిలో పెట్టి మీగడ మీద కర్ర సాము తిప్పినట్టు తిప్పి మీగడంతా అతుక్కుణ్ణాకా పైకి లేపి నోటితో ఆ మీగడ వేడిని వూదేసి లటుక్కుమని నోట్లే వేసుకుంటే మాయ మయి బొయ్యేది . ఏదీ దొరక్క పోతే లోట తెచ్చుకుని ఆ సట్లో పాలు పోసుకుని ఆ లోటాని తొట్లో నీళ్ళ మీద ఈత కొట్టిచ్చి చల్లగయిపోనంక తాగేసేవాడిని .
వెన్నెల తాగిన నీలి రంగు కళ్లు చంద్రబింబం లాంటి ముఖం చంద్రముఖి ఆమె పేరు ! * ఆమె మళ్ళీ కనిపించింది . నా గుండె మళ్ళీ లయ తప్పింది . ఆమె స్నేహం లభించడం నా జీవితంలో నేనెదుర్చూడని వో గొప్ప వరం . * ఆమె చాలా సార్లు కళ్ళతోనే మాట్లాడేది . యింకాస్సేపు వుంటుందనుకునేంతలో లేచి వెళ్ళిపోయింది . * ఆమెలో చిలిపితనం పాలు యెక్కువ . కళ్ళలో , మాటల్లో అవి యెక్కువగా ప్రతిఫలించేవి . * నా సమక్షంలో ఆమె ముఖంలో అనాచ్చాదిత మెరుపుల్ని చూసేవాన్ని . * నాలో యెన్నో భావాలు చెలరేగేవి . చాలాసార్లు మౌనమే దొర్లేది . * ఆమె అతడిని పరిచయం చేసింది . వాళ్ళిద్దరూ గాఢస్నేహితుల్లా మట్లాడుకున్నారు . * ఆమె కళ్ళలో నా కోసం ఆసక్తికోసం వెతికేవాణ్ణి . ఆ విషయం ఆమె గమనించినట్టు కనిపించేది కాదు . * అతడు చాలా చమత్కారంగా మాట్లాడేవాడు . ఆమె అతనితోనే యెక్కువగా పరాచికాలాడేది . నాకు ప్రాముఖ్యత వున్నట్టనిపించేది కాదు . * ఆమె కళ్ళు ఎప్పుడూ ఉత్సాహంతో మెరుస్తుండేవి . ముఖంలో లీలా మాత్రంగా అతనిపట్ల సాన్నిహిత్యం ద్యోతకమయ్యేది . * ఆమె నవ్వులో విషాదమో లేక నా పట్ల అనురాగమో అర్థం అయ్యేది కాదు . * అతను ఉత్సాహంగా కనిపించేవాడు . నేను దిగాలుగా , బిడియంగా . * ఆమె మాటలు నిగూఢమైన చీకటిలా అనిపించేవి . నాకోసం యేమైనా ప్రేమ దాచుకుందేమోనని నాలో వొక ఆశ * ఆమె గొంతులో యెపుడూ యేదో వొకలాంటి హుషారు తొణికిసలాడినా నాలో యేవో విషాద తంత్రుల్ని మీటేదిగా వుండేది . * అతడి రాక పూర్వం ఆమె నవ్వులో విచారం . నేనా విషయం కదపలేదు . అతడి ఆగమనం ఆమెను సంతోషపరిచేది . * నాలో ఆమె పట్ల ప్రేమ పెల్లుబికేది . అది కాంక్షేమోనని భయపడతాను . * నాలో ఆమెపట్ల ప్రేమ చాలా సంకుచితమనీ నాలో వొక భయం . * నేను వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ నవ్వుతో మాట్లాడుతున్నారు . అతడి కళ్ళలో అయిష్టం . ఆమె కళ్ళలో నవ్వు . * నేనెన్నో విషయాలు చెప్పాలనుకున్నాను . ఆమె ముఖంలో యే భావమూ కనిపించలేదు . యింతలో అతను వొచ్చాడు . నేనూ మౌనం వహించాను . * నా ప్రేమ విషయం వాయిదా వేస్తూ వచ్చాను . హఠాత్తుగా ఆమె చూపులు దయాపూరితంగా అనిపించేవి . * చలికాలపు యెండలంటే ఆమెకు చాలా ఇష్టం . అతడి గురించి ఆమె యెన్నో విషయాలు చెప్పేది . * నేను సెలవు తీసుకున్నాను . అతడు యెందుకో మరింత ఉల్లాసంగా కనిపించాడు . ఆమె ముఖంలో నాకే భావమూ స్ఫురించలేదు . * అతడిని గొప్ప స్నేహితుడిగా వర్ణించేది . హఠాత్తుగా ' మరి నువ్వూ అనుకో ' ' అంటో నవ్వేది . * ఆమె మాటలంటే నాకు చాలా ఇష్టం యెక్కువగా అతడి గురించే ప్రస్తావించినా . * అతడేదో ఖరీదైన బహుమానం యిచ్చాడామెకు . నేను మర్చిపోయానని చెప్పాను . బదులుగా నవ్వి వూరుకుందామె . * అతడిపై నాలో ఎలాంటి భావమున్నా కాని నాపై దయను ప్రసరింపజేసే చూపులు కరువయ్యాయని నాలో కలవరం . * నా ప్రేమ విషయం నాలోనే మరుగున పడిపోయింది . అందమైన కళ్ళున్న ఆమెను బాధ పెట్టడం నాకిష్టం లేకపొయింది . * ఆమె వీడుకోలుగా నవ్వింది వెన్నెల చిలకరించినటు . నా రెప్ప తడిసింది ఆకసం ఏడ్చినటు .
కుటుంబరావు కథలు , నవలల్లో ఉధృతంగా సాగే భావోద్రేక ప్రధానమైన సంఘర్షణలు కానీ , ఆకర్షణీయమైన ఇతర ధోరణులు కానీ కనిపించవు . అందుకే వీరి రచనలు చాలా మందిని ఆకర్షించలేదు అని కొందరు విమర్శకులు అంటారు . వీరి రచనల్లో ఆకర్షణలు ఉండవు . . . కేవలం ఆలోచలు మాత్రమే ఉంటాయి . చదువుతున్నంతసేపూ , తరువాత కూడా పాఠకులను ఆలోచింజేస్తాయి . కొకు కాల్పనిక సాహిత్యశైలి గంభీరంగా సాగే నదీ ప్రవాహం . ఒడిదుడుకుల్లేకుండా సాగే ఈ నదీ ప్రవాహంలో పాఠకుడు ప్రశాంతంగా గమ్యం చేరతాడు . కానీ ప్రయాణం గురించి ఆలోచిస్తాడు .
vbsowmya wrote 3 years ago : మన బ్లాగరు చావా కిరణ్ గారు నేనొక నవల రాసాను , చదివారా ? చదివి మీ అభిప్రాయం చెప్తారా ? అని అడిగినప్పుడు … more →
అలాంటి వున్నతమైన ఆదర్శంతో అనుమతించబడ్డ ఈ వ్యాఖ్యల్ని , తమ మెదడుకి తోచినట్టు , తమ నోటి దురద తీర్చుకోడానికి వుపయోగించడం యెందుకో - - యెవరికి వారు అలోచించుకోవాలి .
సాధారణంగా దేవుడిని నేనేమీ కోరుకోను . మహా అయితే సర్వేజనా సుఖినోభవంతు అని ప్రార్థిస్తా , ఆ సర్వ జనుల్లో నేను , నా కుటుంబం ఎలాగూ వుంటుందికదా అన్న నమ్మకంతో . కానీ ఈ రెండు సంఘటనల తరువాత అనిపిస్తోంది ఆ ప్రార్థన ఒట్టి నాలుక చివరి ప్రార్థనేనా , మనసులోంచి వస్తోంది కాదా అని . ఏమో . ఒక్క విషయం మాత్రం స్పష్టం ఇప్పుడు . యండమూరిది అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు - కనీసం నా విషయంలో .
నల్లనయ్యకే తప్పలేదు నీలాపనిందలు . . హయినా హెంత మాట హన్నారు . . ఈ గడుసరి ఆడువారు : ) ( ఒహ బ్లాగుకాలం లేట్ స్పందిచుటలో )
" ర " అక్షరం ప్రాముఖ్యత : చారిత్రికంగా చూస్తే రామాయణం కధ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నారు . [ ఆధారం కోరబడినది ] . ముఖ్యంగా రామాయణం , రామ నవమిలలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది . " రవి " అంటే సూర్యుడు . ప్రాచీన ఈజిప్టు నాగరికతలో సూర్యుని " Amon Ra " లేదా " Ra " అనేవారు . లాటిన్ భాషలో కూడా " Ra " ప్రత్యయం వెలుగును సూచిస్తుంది .
4 . ఊరు మాత్రం నడిచేందుకు అద్భుతంగా ఉంది . అయితే , ఊర్లో ఎక్కడికక్కడ కనిపించే విగ్రహాలు అవీ ఏమిటో , ఎవరివో … ఇలాంటీవి మాత్రం అర్థమే కాలేదు . ఏ ప్యారిస్ లోనో , బెర్లిన్ లోనో చూసినప్పుడు ఆ పేర్లు తెలిసినవో , విన్నవో ఉన్నాయి - కొన్నైనా ! కనీసం , మనకి తెలీకున్నా , అక్కడ రాసినదాన్ని బట్టి ఏదో ఒకటి అర్థమయ్యేది ఇక్కడ ఒక్కటి కూడా తెలిసిన పేరు లేదు . వీళ్ళేమో పేర్లు తప్ప వేరే ఏమీ రాయలేదు . రాసిన ఒకట్రెండు చోట్లా , వీళ్ళ భాషలో రాసారు . . (
శ్రీరాముడు సీతకొక నవరత్నాలూ పొదిగిన ముత్యాల దండను ఇచ్చాడు . అప్పుడు సీత శ్రీరామచంద్రుని ఇంగితం గుర్తించి ఒకజత గొప్ప విలువైన వస్త్రాలూ , గొప్ప ఆభరణాలూ హనుమంతునకిచ్చింది . అంతటితో తృప్తి తీరక ఆమె తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేతబట్టుకొని ఒకసారి రాముడినీ , మరొకసారి వానరుల్నీ చూడసాగింది . సీత మనసు తెలిసికొన్న శ్రీ రాముడు " జానకీ ! బలమూ , పరాక్రమమూ , బుద్ధీ ఉండి , నీకు అమితానందం కలిగించినవారికి ఆ ముత్యాలసరం ఇమ్ము " అన్నాడు . అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మతల్లి హనుమంతుని చేతిలో పెట్టింది . హారం తో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు .
మురళి గారూ , " నేను చిన్నప్పుడు ముంజెలనీ , వాటిని తినేవాళ్ళనీ కేవలం చూసి సంతోష పడ్డాను " . . అంటే మీరు తినేవాళ్ళు కాదా ? ? ఔరా . . కడు విచిత్రంగా ఉన్నదే : ) ఈతకాయల గురించి త్వరలో వ్రాస్తా ! గోపాల్ గారూ , అవును తాటికాయలు నీళ్లల్లో వేసి ఉంచితే భలే చల్ల చల్లగా బావుంటాయి . మీరు త్వరలో మీ ఊరు వెళ్ళి ముంజకాయలు తినాలని కోరుకుంటున్నాను . Snkr గారు , అవునండి బాగా కండ ఉన్న ఈతకాయలు చిన్న సైజు ఖర్జూరపళ్ళ లాగానే ఉంటాయి . మాది గుంటూరు జిల్లా అండి : )
మా ఇంటావిడకి ఓ ' తీరని కోరిక ' ఉంది . అలాగని ఆవిడ కోరికలన్నీ తీర్చేశానని కాదు , ఎలాగోలా నా చేత శ్రీ విశ్వనాథ సత్యన్నారాయణ గారి Magnum Opus ' వేయి పడగలు ' చదివించాలని . మా ఇంట్లో ఆ పుస్తకం లేదు . ఈవిడ గోల భరించలేక నెట్ లో డౌన్ లోడ్ చేసి ఉంఛాను ఆ మధ్య . తన ప్రయత్నం తను చేసింది , చదివేనా వినిపించాలని , అదేమిటో ఆవిడ చదవడం మొదలెట్టిన ఓ గంటలో నిద్రొచ్చేసేది ! వచ్చిన గొడవల్లా ఏమిటంటే , నాకు ఆ పుస్తకం లోని భాష అర్ధం అయేది కాదు . నాది చాలా low IQ ! నేనేం చెయ్యను దానికి ? నాకర్ధం అవదు మొర్రో అన్నా వదలదు . ఇప్పుడు ఛాన్సు దొరికింది . ఈ మధ్యనే , మా వియ్యపురాలు గారు 1986 లో ప్రచురించిన , 14 th Edition మాకిచ్చారు . ఇంక మా ఇంటావిడ ' కాగల కార్యం గంధర్వులే చేశారు ' అన్నట్లుగా , నా మంచం ప్రక్కనో కుర్చీ వేసికుని , ' ఎలాగా ఈ రెండురోజులూ కదలకూడదుగా , వేయి పడగలు చదువుతాను వినండి ' అంది . వామ్మోయ్ ఈవిడ వదిలేటట్టు లేదురా బాబూ అనుకుని , పైగా వింటున్నానో లేదో చూడ్డానికి మధ్య మధ్యలో ప్రశ్నలోటీ . ఈ గొడవంతా ఎందుకనీ , నేనే ఏదో తిప్పలు పడతాలే , చదవకపోతే తిండి పెట్టడం మానేస్తే , అమ్మో , బయటకు కూడా వెళ్ళలేను ! అని ఆ పుస్తకం చేతిలోకి తీసికున్నాను .
కేవలం " రేషన్ కార్డు " జెరాక్సూ , బ్యాంకు అకవుంట్ పాస్ బుక్కూ , చెక్ బుక్కూ వుంటే చాలు - - యెవరికైనా 14 వేలు గానీ , 30 వేలు గానీ ఋణాలివ్వడం మొదలెట్టాయి . గమనించవలసిన విషయం యేమిటంటే , రేషన్ కార్డు లో " యజమానురాలు , భర్త , మేజరూ , మైనరూ పిల్లల వివరాలూ , ఇంటి చిరునామా " స్పష్టం గా వుంటాయి . ఇక బ్యాంకు పాస్ బుక్ వుందంటే , వాళ్లు " కే వై సీ " నిబంధనలు పాటించకుండా జారీ చెయ్యరుగా ( పాటించే వుంటారు ) అని తలంపు !
నా ఆలోచనను చదివినందుకు గానూ … చదివి అర్థం చేసుకున్నందుకు గానూ . . మీకు నా నెనర్లు .
ధ్వాన్తౌఘధ్వంసదీక్షావిధిపటు వహతా ప్రాక్సహస్రం కరాణా మర్యమ్ణా యో గరిమ్ణః పదమతులముపానీయతాధ్యాసనేన స శ్రాన్తానాం నితాన్తం భరమివ మరుతామక్షమాణాం విసోఢుం స్కన్ధాత్స్కన్ధం వ్రజన్వో వృజనవిజితయే భాస్వతః స్యన్దనోస్తు 63
బాలయ్య మూడు పాత్రల చిత్రం రెండవ షెడ్యూల్ పరుచూరి మురళి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా కుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది . బాలకృష్ణ మూడు పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం అతని బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా ఉంటుందని , వైజాగ్ లో నెల రోజుల షూటింగ్ చేస్తామని - కుమార్ చౌదరి చెప్పారు . తొలి షెడ్యూల్ లో రామ్ లక్ష్మణ్ ల నేతృత్వంలో ఫైట్స్ చిత్రీకరించమని తెలిపారు . ఈ చిత్రానికి సంగీతం కళ్యాణీ మాలిక్ . ఫోటో గ్రఫీ విజయ కుమార్ సి , ఎడిటింగ్ : కోటగిరి .
కడప : ఇనుప ఖనిజంతో బళ్లారి నుంచి వస్తున్న గూడ్స్ రైలు కడప జిల్లా కృష్ణాపురం వద్ద పట్టాలు తప్పింది . ఈ ఘటనలో 15 బోగీలు బోల్తాపడటంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది . రైల్వే అధికారులు చెనై్న నుంచి తెప్పించిన క్రేన్ల ద్వారా మార్గాన్ని పునరుద్దరించేందుకు యత్నిస్తున్నారు . ఓవర్ లోడ్ వలనే ఈ ప్రమాదానికి గల కారణమనఇధికారులు తెలిపారు . అయితే ఈ మార్గం నుంచి వెళ్లె రాయలసీమ ఎక్స్‌ప్రెస్ , వెంకటాద్రి , ముంబాయి - చెనై్న , దాదార్ , చెనై్న , ముంబాయి - కన్యాకుమారి పలు [ . . . ]
నిజం చెప్పాలంటే గత 40 ఏళ్ళుగా హైదరాబాద్ నగరం వికృతమయిపోతోంది . సరస్సులు , చెరువులు అన్నీ ఏమై పోయాయి ? మధుర ఉర్దూ విన్పించడం లేదేమి ? హైదరాబాద్ , తెలంగాణలలో మతోన్మాద రాజకీయాలకు కారణమెవ్వరు ? వక్ఫ్ భూములను కైవసం చేసుకొన్నదెవరు ? తెలంగాణ భాషా సంస్క ృతులను ధ్వంసం చేసిందెవరు ? ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న మొత్తం 50 సెజ్‌లలో 40 ని కేవలం తెలంగాణ జిల్లాల్లోనే ఏర్పాటు చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటి ? వీధి దీపాలనే సక్రమంగా నిర్వహించలేని వారు గ్రేటర్ హైదరాబాద్‌ను ఏర్పాటు చేయడం సబబేనా ? దాని వలన ప్రయోజనమేమిటి ? మన దేశంలో ఏ పౌరుడైనా ఎక్కడికైనా వెళ్ళి స్థిరపడవచ్చు . జీనవోపాధి పొందవచ్చు .
మనం నోట్ ప్యాడ్ ను గానీ , పేజ్ మేకర్ , కాలిక్యులేటర్ వంటి కొన్ని ప్రోగ్రాములు ఓపెన్ చేయడానికి స్టార్ట్ మెనూలోకి వెళ్ళి వాటిని సెలక్ట్ చేసుకోవలసి ఉంటుంది లేదా డెస్క్ టాప్ పై వాటి షార్ట్ కట్లను ఉంచవలసి వస్తుంది . కానీ . . తక్కువ సమయంలోనే వాటిని తెరవడానికి మనం ' రన్ ' ను వాడుకోవచ్చును . రన్ ను స్టార్ట్ మెనూ నుండి తెరవవచ్చు లేదా ( విండోస్ బటన్ + Rను ) ప్రెస్ చేసి కానీ తెరవవచ్చును . కీబోర్డ్ పై ( + Rను ) ప్రెస్ చేసి రన్ విండోలో cmdఅని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే కమాండ్ విండో ప్రత్యక్షమవుతుంది . అలాగే pm65అని ప్రెస్ చేసి ఎంటర్ చేస్తే పేజ్ మేకర్ తెరుచుకుంటుంది . అలాగే winwordఅని ప్రెస్ చేస్తే విండోస్ వర్డ్ ఓపెన్ అవుతుంది . calcఅని ప్రెస్ చేస్తే కాలిక్యులేటర్ ఓపెన్ అవుతుంది . అలాగే ఎక్సెల్ కొరకు excelఅనీ , నోట్ ప్యాడ్ కోరకు notepadఅనీ రన్ లో టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయటం ద్వారా వాటిని సులభంగా తక్కువ సమయంలో అవసరమైన కొన్ని ప్రోగ్రాములను తెరవవచ్చును . ప్రయత్నించండి . . . . .
చాలా చాలా సంతోషమండి ఓపిక గా ఇంత మంచి వ్యాఖ్యానం రాసినందుకు పాట నచ్చినందుకు
రాష్ట్ర విభజనకు వీల్లేదని అఖిలపక్షంలో ఏ పార్టీ చెప్పలేదని , తెలంగాణపై ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీయే నిరాకరిస్తోందన్నారు . ఇది రాష్ట్రంలో తీవ్ర పరిణామాలకు దారితీస్తోందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు . రాజీనామాలు తీవ్రమైనవి కాదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ అనడం . . ఎమ్మెల్యేలు , తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు . తెలంగాణపై తమ పార్టీ వైఖరిని అన్నిచోట్లా స్పష్దం చేస్తూనే ఉన్నామని , బలవంతపు కాపురం అసాధ్యమని , ప్రజలు దీనిపై ఆలోచించుకోవాలని సురవరం కోరారు .
విశాలాంధ్ర వాదం 359 . ఇప్పటి హైదరాబాద్ స్టేట్‌లో ముఖ్యంగా ' విశాలాంధ్ర ' డిమాండును దృష్టిలో పెట్టుకుని తెలుగు మాట్లాడే ప్రాంతాల భవిష్యత్తును పరిశీలించవలసి ఉంది . 370 . ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబరు 1న ఏర్పాటైపోయింది కాబట్టి ఆంధ్రోద్యమ చరిత్ర వివరాల్లోకి మనం వెళ్లవలసిన అవసరం లేదు . నిజానికి , 1953లో జరిగినవి పక్కా ఏర్పాట్లని కొత్త రాష్ట్రంలోని ఆంధ్రులు , ముఖ్యంగా సర్కార్లవారు భావించలేదు . 371 . తెలంగాణ కలిసిన విశాల ఆంధ్ర రాష్ట్రంవల్ల ప్రయోజనాలు ఏమిటంటే - 3 కోట్ల 20 లక్షల జనాభాతో ఒక పెద్ద రాష్ట్రం ఆవిర్భవిస్తుంది . దానికి విశాలమైన జల , విద్యుత్ వనరులు , కావలసినంత ఖనిజ సంపద , విలువైన ముడి పదార్థాలు అమరుతాయి . విశాలాంధ్రకు రాజధాని కావడానికి హైదరాబాద్ , సికిందరాబాద్ జంట నగరాలు అన్ని విధాల తగివున్నందున ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని సమస్య పరిష్కారమవుతుంది . 372 . విశాలాంధ్ర వల్ల ఇంకో లాభమేమిటంటే - కృష్ణా , గోదావరి నదీ జలాల వినియోగం ఒకే కంట్రోలు కిందికి వస్తుంది . భారతదేశంలోని మిక్కిలి ప్రయోజనాత్మక ప్రాజెక్టుల్లో కృష్ణ , గోదావరి ప్రాజెక్టులు ఎన్నదగినవి . వివిధ సాంకేతిక , పాలనాపరమైన కారణాలవల్ల సుదీర్ఘ కాలహరణం తరవాత ఈ ప్రాజెక్టులు డెల్టా ప్రాంతంలో రూపుదిద్దుకున్నాయి . కృష్ణా లోయను గాని , గోదావరి లోయను గాని పూర్తిగా ఏకీకరించడం సాధ్యమయ్యే పనికాదు . కాని - తెలంగాణకున్న ప్రత్యేక రాజకీయాధికార వ్యవస్థను తీసివేయగలిగితే ఈ నదుల ముఖ ద్వారాలలో ఉన్న తూర్పు ప్రాంతాలకు అభివృద్ధి పథకాల్ని రూపొందించడానికి , శీఘ్రంగా అమలుపరచడానికి అవకాశాలుంటాయి . విశాలాంధ్రలో భాగంగా తెలంగాణ ప్రాంతం దీనివల్ల ప్రత్యక్షంగాను , పరోక్షంగాను ప్రయోజనం పొందుతుంది . కాబట్టి ఆ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో చేర్చటం అభిలషణీయం . 373 . కలయికవల్ల ఆంధ్ర , తెలంగాణ ప్రాంతాలకు కలిగే పరస్పర ప్రయోజనాలు తక్కువ కాదు . కరువుకాలంలో తెలంగాణలో ఆహార కొరత ఉంటుంది . ఆంధ్రరాష్ట్రంలో సాధారణంగా మిగులు ఉంటుంది . మిగులు ఉత్పత్తిని తెలంగాణ ఉపయోగించుకోగలుగుతుంది . ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రంలో బొగ్గు నిక్షేపాలు లేవు . తెలంగాణలోని సింగరేణి నుండి ఆంధ్ర ప్రాంతానికి బొగ్గు చేరవేయవచ్చు . ఆంధ్ర రాష్ట్రంలో కలిసినట్లయితే సాధారణ పరిపాలనకు సంబంధించి ఎంతో ఖర్చును తెలంగాణ ఆదాచేయగలుగుతుంది . 374 . విశాలాంధ్ర ఏర్పడాలని ఇటు ఆంధ్రలోనూ , అటు తెలంగాణలోనూ ఎందరో వ్యక్తులు , ఎన్నో ప్రజాసంస్థలు ఎంతోకాలంగా తహతహలాడుతున్నారు . వద్దనడానికి బలమైన కారణాలు లేనప్పుడు విశాలాంధ్ర సెంటిమెంటును మన్నించవచ్చు .
హెమిస్పరెక్టమీ : చిన్నప్పటి నుంచి కాళ్లు , చేతులు బలహీనంగా ఉండి , ఫిట్స్ వస్తుంటే ఈ ఆపరేషన్ చేస్తారు
శేఖర్ గారూ బిలేటేడ్ దీపావళి శుభాకాంక్షలండీ . . నాది కూడా మురళీగారి మాటేనండోయ్ . . ఆలీసం చేసీకండి మరీ . . కొత్త టపాలేట్టీయండీ . .
దీని గురించి చాలా చెప్పాలి . టెక్నిక్ అద్భుతం . అలా కేవలం సంభాషణతోనే ఎంతో భావాన్ని , డెప్త్ తో చెప్పటం , కథని నడిపించటం కష్టం . మనకీ అక్కడే ఉన్నా భావాన్ని కలిగించి , తాను చెప్పిన విషయాన్ని మనకూ అనుభూతింప చేయటం great . Inimitable style .
కాలనీ వాళ్ళం కదా ! పడమట దిక్కున రెండు కిలోమీటర్ల దూరాన ఉన్న ఊరితో మాకట్టే సంబంధాలు ఉండవు . కిరాణాకొట్లు , ఫ్యాన్సీ షాపులు , ఫాస్ట్ ఫుడ్ సదుపాయాలు , పోస్టాఫీసు , లైబ్రరీ మొదలైన వన్నీ కాలనీలోనే ఉన్నాయి .
నేను దాదాపు రెండేళ్లనుండి లినక్స్ ని తెలుగు స్థానికతతో వాడుతున్నాను . అనువాదము మెరుగవుతూ వస్తున్నది . కాని ఆశించినంతమేరకి లేదు . ఎందుకంటే ఏ . . .
Download XML • Download text