Text view
tel-36
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
తెలిసితెలియనివి వ్రాయడంలో కొంత మంది ఎక్స్‌పర్ట్‌లు . విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన వేయి పడగలు నవలని గొప్ప నవలని పొగిడింది . వేయి పడగలు నవలపై రంగనాయకమ్మ గారు వ్రాసిన విమర్శలు ఆమె చదివినట్టు లేదు . 2009 మార్చ్ , ఏప్రిల్ నెలలలో వార్త ఆదివారం బుక్‌లెట్‌లో ' చలం నవలావలోకనం ' అనే శీర్షిక వచ్చేది . ఆ శీర్షికలోనే రంగనాయకమ్మ గారు చలం రచనలలోని స్త్రీ పాత్రలకీ , విశ్వనాథ & బాపిరాజు రచనలలోని స్త్రీ పాత్రలకీ మధ్య ఉన్న తేడా చక్కగా వివరించారు . తాపీ ధర్మారావు గారి రచనలైనా ఆమె చదివి ఉంటుందనుకోను . ధర్మారావు గారు రచనలు వ్యవస్థీకృత సంప్రదాయాలని ధిక్కరించే విధంగా ఉంటాయి . మామూలు సంప్రదాయ దృష్టితో చూస్తే అతని రచనలు అర్థం కావు .
8 స్వామి ఇంటికి చేరుకొనేసరికి ఇంట్ల ' భూకంపం ' వచ్చినంత పరిస్థితిని గమనించాడు . క్రిందటి రాత్రి స్వామి ఇంటికి రాకపోయేసరికి ఇల్లంత అతలాకుతలం అయిపోయింది . పోలీసులు అరెస్టు చేసి జైల్ల పడేసినారేమో , కాకపోతే ఏదైనా టక్కర్ అయ్యి దెబ్బలు తగిలి దవాఖాన్ల పడిండేమో అని అమ్మ ఏడుపులు . అరుపులు . నెత్తి కొట్టుకొని క్రింద నేలపై పడిపోయింది . స్వామి గురించి భయమేందోగని బాపుకు అమ్మను సముదాయించడమే కష్టమైపోయింది . ' నా కొడుకును సక్కగ ఇంటికి తీసుకు రాకపోతివో నీ ముందే నా [ . . . ]
నా గుండెలపై తన అంచుల చేతులాన్చి నన్ను వంగదీయాలని చూస్తుంది నాకు అలవాటులేని సిగ్గుని మప్పుతుంది ఏదో కంగారు పిట్టలా నా చుట్టూ తిప్పుతుంది .
మధపూర్ లో రెంట్ కు ఆఫీస్ స్పేస్ కావలెను అద్దెకు కమర్షియల్స్
రోహిణీ ప్రసాదు గారూ , మీ " కిట్టించడం " అన్నపదప్రయోగం వల్ల ఇంత చర్చ . త్యాగరాజ కీర్తనల్లో సాహిత్యం శాతం తక్కువే . సంగీతానికే పెద్దపీట . అయినా మంచి సాహిత్యం సృష్టించేడు . త్యాగరాజుని సాహితీకారుడుగా ఎవరూ , మిగిలిన సాహితీస్రష్టలతో కంపేర్ చేయరు . కీర్తనలు రాసిన వాళ్ళలో త్యాగరాజు నెం . 2 .
అయ్యో సునీత గారు లాభం లేదండి మీరు మర్చిపోయారు : ) ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇలాంటి సందర్భాలలో రోడ్ల అంచున ( ప్రత్యేకం గా చిన్న మురుగు కాలువల పక్కన ) బోర్డర్ లాగా పోస్తారు కదా ?
" కాని , అభ్యంతరం చెప్పకుండానే లొంగిపోయిన అమ్మాయిని ' లూజ్ కారెక్టర్ ' అని అపార్థం చేసుకునే మనస్తత్వమే అబ్బాయికి ఉంటే అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి అతను వెనుకంజ వేయవచ్చు . "
నేను పెట్టిన లింకు నచ్చినందుకు ధన్యవాదాలు . ఇంక టైం మానేజ్మెంటు విషయానికొస్తే , నాకేమైనా పనా పాటా ? ' ఇంటి పనులన్నీ చేస్తూంటారు … ' ఈ వాక్యం మా ఇంటావిడ చూసిందంటే ' ఇదన్నమాట మీరు క్రియేట్ చేసికున్న ఇమేజ్ ' అంటూ నన్ను కోప్పడేస్తుంది . మరీ ఇలాటివి వ్రాసి నన్ను ఇరుకులో పెట్టడం ఏమైనా బావుందా ?
సుజాత గారూ , పిల్లల పునరావాసానికి ఒక పథకం మన ప్రభుత్వం దగ్గర రెడీగా ఉంది . వాటిని రెసిడెన్షియల్ బ్రిడ్జి కోర్సు స్కూళ్ళు అంటారు . శవాల మీద మరమరాలు ఏరుకునే ఈ వ్యవస్థలో వీటి నిర్వహణ ఒక పెద్ద బోగస్ . 10 మంది పిల్లలు ఉన్నారంటే 100 మందిని చూపుతారు . ఇదో పెద్ద వ్యాపారం మళ్ళీ . ఇక్కడా వాటిని నిర్వహించేది , స్వచ్చంద సంస్థలు కావడం దురదృష్టకరం . వున్న కొద్ది మంది పిల్లలకు సరిగ్గా తిండి పెట్టి చావరు . ఆ మధ్య వాటికి ఎవరైనా అప్ప్లై చేసుకొండని నోటిఫికేషన్ చూశాను . మా మిత్రుడు ఒకరిని అడిగాను . జీవని తరఫున అప్లికేషన్ వేద్దామా అని . అంత పని చేయవద్దు . నీకు అది సరిపడనిది . అది గలీజు వ్యవహారం అని సలహా ఇచ్చాడు . ఇక చెప్పండి . ఎక్కడికి ఈ విద్యా వ్యవస్థ ప్రక్షాళనం అవుతుంది ? మహేష్ గారూ , పిల్లల్ని ముందుగా - చదివే యంత్రాలుగానూ , భవిష్యత్తులో డబ్బులు సంపాదించే సాధనాలుగానూ చూస్తున్న తల్లిదండ్రులలో మార్పు రావాలి . ఇంతింత టెన్షన్లు పెట్టి పిల్లల్ని చదివించే అవసరం లేదు అని ఒక్కసారి వాళ్ళు తెలుసుకుంటే కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీల పునాదులు కదులుతాయి . మీరు చెప్పిన వాతావరణం పాఠశలల్లో సృష్టిస్తే అద్భుతాలు జరుగుతాయి . కానీ అది 100 % అసాధ్యం మన వ్యవస్థలో .
నా జవాబు ) ఏముంది , సింపుల్ . . సాక్ష్యాలు పోయ్యాయంటే ఒక్క మాటతో అబద్దాన్ని ఱుజువు చెయ్యాల్సిన అవసరం ఉండదుగా ! ! ఓ ! ! చెప్పడం మరిచాను , పోయ్యాయనుకున్న 698 వీడియోలలో ఓ వంద వరకూ దొరికాయంట . ఎక్కడనుకున్నారు వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని పెర్త్ అనే నగరంలోని కర్టైన్ అనే యూనివర్సిటీలోని ఫిజిక్స్ పాఠాలు చెప్పే ఓ పెద్ద సెమినార్ హాల్ యొక్క కుర్చీల సీట్ల క్రింద ! ! ఇక్కడ మరో విషయాన్ని తెలియజేయ్యాలి . ఈ సెమినార్ హాల్ చాలా కాలంగా మూత పడి ఉందంట . అయినా నాకు అర్దం కాక అడుగుతాను అస్సలీ సెమినార్ హాల్ ని ఎందుకు మూసేసినట్లు ? ష్ . . ఇక్కడ మీరు ప్రశ్నలు అడగకూడదు .
గల్ఫ్‌లోని అన్ని దేశాలు పూర్తిగా ఇస్లామిక్ రాజ్యా లు కాగా అందులో కొన్ని కఠోర మత నిబంధనలు పాటిస్తుండ గా మరికొన్ని ఉదారంగా వ్యవహరిస్తున్నాయి . ఇస్లామిక్ దేశమైనప్పటికీ మొత్తం గల్ఫ్‌లో కువైట్ ఒక అభ్యుదయ భావాలు కలిగిన దేశంగా పేరొందినా ఈ దీపావళి సందర్భం గా కువైట్ పోలీసులు ప్రవర్తించిన అమానుష చర్య అనేక ప్రశ్నలను సంధించింది . ఒమాన్‌లోని , యుఎఇ ( దుబాయి ) లోని మందిరాలు మినహా గల్ఫ్‌లో ఎక్కడ కూడా హిందువుల ఆలయాలు లేవు . ఒక గుజరాతీయ సింధీ వ్యక్తి నిర్వహణలో ఉన్న దుబాయిలోని ఇరుకయిన మందిరాన్ని విస్తరించడానికి కూడా ప్రభుత్వం అంగీకరించడం లేదు . ఇక విశాల సౌదీ అరేబియాలో కనీసం దేవుళ్ల చిత్రపటాలను కూడా తీసుకరావడం కూడా నిషే ధం . ఈ పరిస్థితులలో హిందూ ధార్మిక అభిరుచి కలిగిన కొందరు ఇళ్లలో గోప్యంగా సామూహిక ప్రార్థనలు జరుపుకోవడం మినహా మరే మార్గం లేదు . కొన్నాళ్ల క్రితం దుబాయిలోని జుమేరియాలో గణేష్ నిమజ్జనం చేయడానికి ప్రయత్నించిన కొంత మంది యువకులను దుబాయి పోలీసులు అదుపులోకి తీసుకుని హెచ్చరించి వదిలిపెట్టారు . ప్రపంచంలోని ఎత్తయిన భవనాలలో ఒకటైన బుర్జ్ అల్ ఖలీఫా పైకప్పుపై బతుకమ్మ ఆడాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రయత్నించారు . ధార్మిక కారణాల వల్ల కుదరలేదు . అందుకే హిందూ పండుగలను ఒక సాంఘిక లేదా సాంస్కృతిక కార్యక్రమంగా జరుపుకోవల్సి వస్తుంది . ఈ నేపథ్యంలో దుబాయిలో దసరాకు ముందు జరుపుకునే దాండియా ఉత్సవాలు ప్రముఖమైనవి . అయితే అందులో కేవలం సంపన్న వర్గాలు మాత్రమే పాల్గొంటారు . ఈ ఏడాది నుంచి హైదరాబాద్‌లోని ఒక ప్రఖ్యాత క్లబ్ యజమాని గుజరాతీ వ్యాపారస్తులతో కలిసి దాండియాను భారీ వ్యయంతో కూడిన ఉత్సవంగా మార్చారు . కువైట్‌లో కూడా ఉన్నత ఉద్యోగాలు చేసే సంప న్న ప్రవాస భారతీయులు నివసించే సాల్మీయాలోని టైటానిక్ నివాస సముదాయంలో గత కొద్ది కాలంగా దీపావళి పండుగను ఆర్భాటంగా , ఉల్లాసంగా జరుపుకుంటున్నారు . మొత్తం కువైట్‌లో ఈ ఒక్క ప్రదేశమే సురక్షితం కావడంతో రానురాను దీని ప్రాధాన్యం పెరిగి అనేక భారతీయ కుటుంబాలు టైటానిక్ నివాస సముదాయానికి వచ్చి టపాకాయలు కాల్చడం , పిల్లలతో ఆనందం పొందుతున్నారు . ప్రతిసారి అలా సంప న్న భారతీయులు టైటానిక్ కాంప్లెక్స్‌లో టపాకాయలు కాల్చుతూ పండుగను సంబరంగా జరుపుకుంటున్నారు . దీనికి ప్రత్యేకంగా అధికారుల నుంచి అనుమతి కూడా ఉంది . రాత్రి 9 గంటల వరకు కార్యక్రమాన్ని ముగించాలనే షరతుతో అనుమతి ఇచ్చారు . ఈ రకంగా అన్యమతస్తులు పండుగను నిర్వహించుకోవడం కొంతమంది కువైట్ జాతీయులకు మింగుడుపడలేదు . అందుకే ఈసారి దాన్ని ఎలాగై నా భగ్నం చేయాలనే పథకం రచించారు . ఈ మేరకు అనుమతి లేకుండా బాణాసంచా పేల్చుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే సాయుధ పోలీసు బలగాలు వచ్చి దీపావళి జరుపుకుంటున్న 18 మందిని అరెస్టు చేశారు . 22 నిమిషాల గడువు ముగిసిన తర్వాత అంటే రాత్రి 9 గంటల 22 నిమిషాలకు పోలీసులు టైటానిక్ సముదాయంపై దాడి చేశారు . ఉగ్రవాదుల దాడులకు వెళ్లినట్టుగా 16 ప్రత్యేక వాహనాలలో వచ్చిన స్థానిక పోలీసులు , ప్రత్యేక బలగాలు పెద్ద తోపులాట తర్వాత భవన సముదాయంలోకి ప్రవేశించారు . అరెస్టు అయిన వారిలో అయిదుగురిని మరుసటి రోజు విడుదల చేయగా , మిగిలిన వారిని నాలుగు రోజుల తర్వాత విడుదల చేశారు . ఈ సంఘటన కువైట్‌లో పెద్ద దుమారం రేపింది . భారతీయ ఎంబసీ తీరుపై అనేక విమర్శలు వచ్చినప్పటికీ ఎక్కడ కూడా ఎంబసీ దీనిపై నోరు విప్పలేదు . కువైట్ జనాభాలో విదేశీయులు మెజారిటీ సంఖ్యలో ఉండగా అందులో భారతీయులు అగ్రగణ్యులు కాగా , అందులో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు . అయినా ప్రభుత్వ తీరు సమంజసంగా లేదు . అంతకు ముందు కువైట్‌లోని ఒక స్టేడియంలో శ్రీలంకకు చెందిన సింహాళీయులు తమ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు . దీనికి కువైట్ ప్రభుత్వం అనుమతించింది కూడా . సభలో శ్రీలంక రాయబారితో సహా ఆ దేశానికి చెందిన అనేకమంది ఉన్నతాధికారులు , దౌత్యవేత్తలు వేదికపై ఉండగా ఒక్కసారిగా పోలీసులు స్టేడియంలోకి ప్రవేశించి కార్యక్రమాన్ని ముగించారు . కార్యక్రమ నిర్వహణకు తమకు అనుమతి ఉందని చెప్పినా శుక్రవారం నమాజు సమయంలో లౌడు స్పీక ర్ల ద్వారా పాటలు పాడడం భావ్యం కాదంటూ మొత్తం కార్యక్రమాన్ని ముగించారు . దీంతో వేలాది మంది నిరాశతో వెనక్కి మళ్లారు . 2003లో కువైట్‌లో భారతీయ రాయబారిగా వచ్చిన స్వష్ పవన్ సింగ్ స్థానికంగా ఉన్న ఒక గురుద్వారకు వెళ్లిన కొద్ది రోజులకు అక్రమంగా అనుమతి లేకుండా దాన్ని నిర్మించారని కువైట్ అధికారులు దాన్ని కూలగొట్టారు . ముస్లింలలో షియా వర్గానికి చెందిన బోహ్రా తెగకు చెందిన ప్రవాస భారతీయులు , పాకిస్థానీలకోసం మసీదు నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కువైట్ మంత్రి తన పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది . క్రైస్తవ మతానికి సంబంధించి కొన్ని చర్చీలు ఉన్నప్పటికీ దాన్ని విస్తరించడానికి కూడా స్థానికుల నుంచి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి . మొత్తం గల్ఫ్ కూటమిలో కువైట్ ప్రగతిశీల , స్వేచ్ఛా వాతావరణం కలిగిన దేశం గా పేరొందింది . దుబాయి కంటే కూడా కువైట్‌లో స్వేచ్ఛ ఎక్కువ అని పేరున్నా , ఇస్లామేతర ధార్మిక విషయాలకు సంబంధించిన ఈ సంఘటనలు చూస్తే బాధ కలుగుతుంది . ఆర్థికంగా , మౌలిక వసతుల కల్పన విషయంలో గల్ఫ్ గణనీయమైన అభివృద్ధి సాధించింది . అయినప్పటికీ ధార్మిక విషయాలలో మాత్రం ఇంకా ఇస్లామిక్ మత ఛాందవాదం ముసుగులో ఉంది . ( ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి )
మన వంట గదిలో నెలకు సరిపడా కావలిసిన పచారి సరుకులు దాచుకోవటానికి
ఈ సవాల్ తప్పని ఎవరైనా రుజువు చేస్తే పదవికి రాజీనామా చేయటమేకాక రాజకీయ సన్యాసం చేస్తానని ఆయన ప్రకటించారు . 1991 నుంచి ప్రారంభమైన నేత కార్మికుల ఆత్మహత్యలు రాజశేఖర్‌రెడ్డి , రోశయ్య , కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి రెండువేలకు చేరుకున్నాయని చెప్పారు . తాను పదవీ బాధ్యతలను చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి , పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అందించిన మద్దతుతో నేత కార్మికులకు 312 కోట్ల రుణాన్ని మాఫీ చేసినట్లు తెలిపారు . రుణ మాఫీ సాయం ఇప్పటికీ ఎవరికైనా అందకపోతే వారు తనకు తెలియచేయాలని ఆయన కోరారు . నేత కార్మికులను ఆదుకునే చర్యలలో భాగంగా కేంద్రం ప్రకటించిన ప్రత్యేక పాకేజీ వల్ల రాష్ట్రానికి 387 కోట్ల సాయం లభించిందని అన్నారు . చేనేత శాఖ బడ్జెట్ వైఎస్ , రోశయ్యల హయాంలో 85 కోట్లయతే ఇప్పుడు 297 కోట్లకు పెరిగిందని తెలిపారు . చేనేత రంగానికి కేటాయించిన నిధులు ఇతర పథకాల అమలుకు మళ్లించే అవకాశం లేకుండా గట్టి చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు . 2004లో విధానసభలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని బలం ఇచ్చిన ప్రజలు 2009 ఎన్నికలలో ఇరవై ఐదు శాతం సీట్లకు గండికొట్టి లోక్‌సభకు ఎక్కువ స్థానాలను ఇవ్వటానికి ప్రధాన కారణం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వంపై ఉన్న నమ్మకమేనని అన్నారు . 2014లో జరిగే ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ప్రజల నమ్మకాన్ని , విశ్వాసాన్ని మరింతగా చూరగొనాల్సిన అవసరం ఉందని ఆయన నిష్కర్షగా చెప్పారు .
ఊపిరి సలపని పనుల్లో ఉండి అసలు బయటి లోకంలో ఏం జరుగుతోందో తెలియని స్థితిలో ఉండగా , ఏదో పనికి సంబంధించిన సమాచారం కోసం జాలంలో ప్రవేశిస్తే , ఈ దిగ్భ్రాంతి కలిగించే వార్త . ఆయనకి వ్యక్తిగతంగా కానీ , ఆయన ప్రభుత్వ విధానాలకి కానీ నేను అభిమానిని కాదు . కానీ ఆయన క్షేమంగా ఉన్నారనీ , తిరిగొస్తారనీ మనసారా కోరుకుంటున్నా . వయ్యస్ మరొక బాలయోగి , మరొక రాజేష్ పైలట్ కారని ఆశిస్తున్నా . ఐనా ఎందుకో మనసు కీడు శంకిస్తోంది . చంద్రబాబు మీద అలిపిరి దాడి నేపథ్యంలో నల్లమల అడవుల్లో ప్రభుత్వ జాగిలాలు సృష్టించిన అలజడి ఫలితాల్ని ప్రయక్షంగా చూశాను . ఒకేళ నిజంగానే వయ్యస్ కి ఏమన్నా అయితే ఇక నల్లమలలో రగులుకునే దారుణ మారణహోమం . . ఆ అమాయక ప్రజల క్షేమం కోసమైనా ఆయన క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటున్నా .
అజ్ఞాత , 26 ఫిబ్రవరి 2011 1 : 58 : 00 ఉ GMT + 05 : 30 : మీ వ్యాఖ్య సత్యాన్వేషికి కూడానా ? : ) " దేశంలో ఇదొక్కటే రాష్ట్రం విడిపోవడం లేదు . గతంలో చాలా రాష్ట్రాలు విడిపోయాయి . " - ఔనౌను , చాలా రాష్ట్రాలు విడిపోయి , తమ దారిన తాము పోయి , తమ రాజధానిని తాము ఏర్పాటు చేసుకుని తమ బతుకేదో తాము బతుకుతున్నారు . ' మీరు అభివృద్ధి చెందిపోయారం ' టూ అవతలోడి మీద పడి యాడవలేదు . ' మేం పోతాం , మేం పోతాం ' అని అన్నారేగానీ , ' మీరు పోండి , మీరు పోండి ' అంటూ ఉద్యమాలు చెయ్యలేదు . ద్రోహులు , దోపిడీదార్లంటూ తిడుతూ ఛీత్కరించలేదు . " దేశంలో అత్యంత ధనవంత రాజకీయ నాయకులు మీ సీమాంధ్రలోనే ఉన్నారన్న నిజం గుర్తుంచుకోండి . " - ఉంటే ఏంటంట ? వాళ్ళు జనాన్ని దోచుకునే ఎదగారు , కాదన్ను . ఇంతకీ మీ బాధేంది ? మీ రాజకీయ నాయకులు అలా సంపాయించుకోలేదనా ? ' రండి , మీరు మమ్మల్ని ఇంకా బాగా దోచుకోండి ' అంటూ వాళ్ళని ఆహ్వానించండి . ఇప్పుడు మిమ్మల్ని ఎవడు కాదన్నాడు ? " మీరు అనుకొనే సమైఖ్యాంధ్ర లో తెలంగాణా కూడా భాగమే కదా . . . మరి అలాంటప్పుడు తెలంగాణా వారంటే ద్వేషం చూపెట్టడం మీ కుంచితత్త్వమే కదా " - ద్వేషం చూపెడుతున్నది మేం కాదు , తెవాదులు . చూపెట్టడమే కాదు , అబద్ధాలు తెగ చెప్పి ప్రజల మనసులనూ విరిచారు . కోస్తా సీమల ప్రజలను ద్రోహులంటూ నోటికొచ్చిందల్లా వాగారు . " మీ నాయకులంటారు మాకు భాష రాదని , సంస్కృతి లేదని . . . " - ఆపండిక ఈ తెరాస మార్కు ప్రచారాలు . " మరి మమ్మల్నెందుకు పట్టుకొని వేళాడుతున్నారు గబ్బిలాల్లా . . . . " - ఇదిగో ఇట్టా తిక్కగా మాట్టాడే ఇక్కడిదాకా తెచ్చుకున్నారు మీరు . ఈ తెవాద నాయకులు మీకు నేర్పించిందిదే ! ' ఇదిగో ఇంకాస్త ద్వేషం తాగు , ఇంకో గుక్క విషం మింగు ' అంటూ వాళ్ళు పోస్తూంటే , ' ఇంకాస్త పొయ్యండి , ఇంకాస్త పొయ్యండి ' అంటూ దోసిళ్ళతో తాగారు . తాగి ఇలా వాగుతున్నారు , తూగుతున్నారు . " హైదరాబాద్ ను సీమాంధ్రులు ఎంత అభివృద్ధి ( ? ) చేశారో అందరికి తెలుసు . మీరన్నట్టుగా హైదరాబాద్ అభివృద్ధి చెందితే దేశంలో అది ఏ 2 లేక 3వ స్థానంలో ఉండాలి కానీ లేదే . . . మీరు కలిసే నాకు దేశంలో ఏ స్థితిలో ఉందో నేడు కూడా ఆస్థితిలో ఉంది . . . . " - ముందిలాంటి తెరాస మార్కు ఆలోచనలు మానెయ్యండి . అప్పుడు మాటలు కూడా తేటపడతై . " కొంచెం తెలివితో ఆలోచించండి మూర్ఖత్వంతో కాదు . . . " - మీరు మాత్రం అణుమాత్రపు తెలివిని కూడా వాడబాకండి , ఉన్న ఆ రవ్వంత తెలివి కాస్తా అరిగిపోద్ది . మూర్ఖత్వాన్ని మాత్రం వాడుతూనే ఉండండి , లేకపోతే అది పొంగి పొర్లి పోగల్దు . ఇప్పుటికే అది పొరలు పొరలుగా పేరుకుపోయి , అట్టలు కట్టి దిబ్బలేసుకుపోయింది . " పాలి కొట్లాట కాదు ఉద్యమం అంటే . . . నిజంగా తెలంగాణపై అభిమానం లేకపోతే ఇన్ని వందల మంది తమ ప్రాణాలర్పిస్తారా . . . ? ? ? " - మీ కోసం ప్రాణాలర్పించిన వాళ్ళ మీద సానుభూతి చూపిద్దాం , చూపించాలి . కానీ ఆ ఆత్మహత్యలను వాడుకుని , జనాన్ని బ్లాక్ మెయిలు చేసి , ఆ అమాయకుల ప్రాణాలను సొమ్ము చేసుకుందామనుకునే వాళ్ళతో మాత్రం జాగర్తగుండాలి . ఈ ఆత్మహత్యలు ఆ నాయకుల చేతిలోని ఆయుధాలు . ఎన్ని ఆయుధాలుంటే అంత ఎక్కువగా బ్లాక్ మెయిలు చెయ్యొచ్చు . కానివ్వండి . మాస్ హిస్టీరియా సృష్టించండి , కుర్రాళ్ళని ఇంకా ఇంకా రెచ్చగొట్టండి . మరిన్ని ఆత్మహత్యలు . . మరిన్ని ఆయుధాలు . . మరింత బ్లాక్ మెయిలు .
ఇలా అనిపించిన ఇంకో సందర్భం , ఢిల్లీ లోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలోని ' ఎన్ ఆర్ సీ ఫర్ ప్లాంట్ బయోటెక్నాలజీ ' విభాగం డైరెక్టర్ గా పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త ఆనందకుమార్ తో 08 - 03 - 2010 ప్రచురించబడ్డ ఇంటర్వ్యూ !
ఓకసారి పరమానందయ్యగారికి సూది అవసరమొచ్చింది . ఆయన శిష్యులను పిలిచి సూది తీసురమ్మని చెప్పారు . శిష్యులంతా బజారుకి సూదికోసం బయలుదేరారు . సూది కొన్నాక వాళ్ళకు ఒక అనుమానం కలిగింది . " ఈ సూదిని ఎవరు తీసుకెళ్ళి గురువుగారికివ్వాలి ? " అందరూ " నేను . " … . " . నేను " . . అంటూ పోటి పడ్డారు .
ఢిల్లీ , జూన్ 30 : ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి గురువారం ఉదయం సమావేశమయ్యారు . తెలంగాణ అంశం , 14 ఎఫ్ పై వారు చర్చించినట్లు తెలుస్తోంది . ప్రాణహిత - చేవెళ్ల , పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం .
ప్రజాప్రతినిధుల రాజీనామాల నేపథ్యంలో ఆందోళనలు మరింత ఉధృతమవుతాయన్న నిఘా వర్గాలు నివేదికలు , పోలీసు శాఖ విజ్ఞప్తుల దృష్ట్యా మరో 50 కంపెనీల అదనపు కేంద్ర బలగాల కోసం ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది . తమిళనాడు , కర్ణాటకల నుంచి కొన్ని బలగాలను రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి . రాష్ర్టంలోని 37 కంపెనీల బలగాలకు అదనంగా ఇటీవలే మరో 35 కంపెనీలను కేంద్రం పంపింది . సీమాంధ్ర జిల్లాల్లోనూ ముందు జాగ్రత్తగా ఇప్పటికే మరో 15 కంపెనీలను మోహరించారు . 48 గంటల బంద్ నేపథ్యంలో బుధవారం తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పోలీస్ కమిషనర్లు , ఎస్పీలతో డీజీపీ దినేశ్‌రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని , అదనపు బలగాలను మోహరించాలని ఆదేశించారు . ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు . రాజధానిలో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ అన్నారు .
సంవత్సరం క్రిందట ప్రచురితమైన " అమెరికా తెలుగు కథానిక 9వ సంకలనం ( ప్ర . ప్ర . : అక్టోబర్ 2006 ) " లో మహేష్ శనగల రాసిన " గుగ్గుళ్ళమ్మ గుడి " అనే కథ ఒకటి ఉంది . ఆ కథలో గూగులు , బ్లాగుల విశ్వరూపం మనక్కనిపిస్తుంది . కథ చెప్పే టోన్ lighter vein లో ఉంటుందనుకోండి , కానీ ఆ కథలో గొల్లపల్లె నుంచి అమెరికాకెళ్ళిన గీతమ్మ అనే పెద్దావిడొకామె తిరిగొచ్చాక తన గ్రామప్రజలందరికీ గూగులు , బ్లాగులు పరిచయం చేసి వాళ్లందరిచేత సొంతబ్లాగులు ప్రారంభింపజేసి , గ్రామ గూగుల్ సమితి ప్రారంభించి గ్రామస్థులకు అవసరమైన అన్నిరకాల సమాచారాన్ని గూగుల్తో లాక్కొచ్చి గ్రామపోర్టల్లో గుదిగుచ్చి , " బడ్డీకొట్లో బ్లాగు " స్కీము ద్వారా గృహహింస నుంచి పంచాయితీ అక్రమాల దాకా అన్నిటినీ జరిగిన తక్షణమే గ్రామస్థుల బ్లాగుల్లో ఏకిపారేయిస్తూ గ్రామస్వరూపాన్నే మార్చేస్తుంది . దాంతో గ్రామస్థులంతా కలిసి గూగుల్ని ఒక గుడిలో ప్రతిష్టిస్తారు . అదే గుగ్గుళ్ళమ్మ గుడి . ఆ గుడిలో దేవుడి బదులు శక్తివంతమైన వాయిస్ ఇంటర్ఫేస్ ఉన్న మాట్లాడగలిగే కంప్యూటరును ప్రతిష్టిస్తారు . ఏటేటా గుగ్గుళ్ళమ్మ జాతర వైభవంగా చేస్తారు . ఊరిపేరు గుగ్గుళ్ళపల్లెగా మారుతుంది . పఠనము ను కొనసాగింపుము & కుడి కోనపు వ్యాఖ్య ;
ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఏర్పడింది . కనీస సౌకర్యాలతో పాటు కేంద్ర కార్యాలయానికి స్థలం కూడా లేకపోవడంతో పాలన సరిగా సాగలేదు . శిబిరాల కింది నుంచి పాలన సాగించాల్సి వచ్చింది . పైగా 15 కోట్ల లోటు బడ్జెట్ కూడా ఉంది . రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఉంది .
E ! మ్యాగజైన్ దీనిని Movies to watch before you Die అనే పట్టికలో మూడో స్థానంలో చేర్చిందంటే ఈ సినిమా స్థాయి అర్ధం అవుతుంది . అంతే కాక Times దీనిని All Time Top 100 సినిమాలలో చేర్చింది .
మండువేసవి కాలం ముంగిట ఉంది . . కంప్యూటర్ ముందు కూర్చుంటే ఒంట్లోంచి వెచ్చటి ఆవిర్లు వస్తుంటాయి . ఓ కోక్ బాటిల్ పిసికి అందుబాటులో chiilled గా ఉంటే ఎలా ఉంటుంది ? USB ఫ్రిజ్ మీ కోరికని తీరుస్తుంది . ముచ్చటగా ఓ కోక్ టిన్ పట్టే సైజ్ లో ఉండే ఈ ఫ్రిజ్ ని మీ పిసి యొక్క USB పోర్ట్ కి కనెక్ట్ చేసుకోవచ్చు . దీని ప్రత్యేకతలు :
2009 లో ఇలా దాతృత్వం కోసం కేటాయించబడ్డ సొమ్ము దాదాపు 3 , 487 . 12 కోట్లకి చేరుకొందట !
పె ట్రోల్ ధరలను నిరసిస్తూ వైజాగ్‌లో చేసిన దీక్ష విజయవంతం అయ్యిందని , రాబోయే రోజుల్లో ప్రాణహిత , చేవెళ్ల , పోలవరం ప్రాజెక్టుల కోసం చేపడుతున్న పాదయాత్రతో జగన్ ప్రజలకు మ రింత చేరువ కాబోతున్నారన్నారు . కాంగ్రెస్ పా ర్టీకి ఎనలేని సేవచేసిన దివంగత మహానేత వైఎ స్ సతీమణిని , ఆయన కుమారుడిని పార్టీ నుం చి బయటకు వెళ్లేలా అధిష్టానం చేసిన కుట్రతో దేశంలో ఆపార్టీని ప్రజలు అసహ్యంచుకుంటున్నారన్నారు . జగన్‌వైపు వెళ్లకుండా ఎమ్మెల్యేలు , ఎంపీలకు ఆశలు కల్పిస్తున్న కాంగ్రెస్‌కు ప్రజల మద్దతు కరువైందన్నారు . విజయమ్మ , జగన్ పు లివెందుల , కడప ఉపఎన్నికల్లో గెలిచి దేశ చరి త్రనే మార్చబోతున్నారన్నారు .
ఇమామ్ ఆ మాట ఎత్తడమే లేదు షాదుల్‌ను చేతపట్టుకుని మౌనంగానే నడుస్తున్నాడు .
About Author నా గురించి చెప్పడానికి ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది " జాక్ అఫ్ అల్ ట్రేడ్స్ మాస్టర్ అఫ్ నన్ " సరిగ్గా సరిపోతుంది . . . . ఏది తెలిదు అని ఉండదు కాని ఎందులోనూ గొప్ప ప్రావీణ్యం ఉండదు . టెక్నాలజీ అంటే ప్రాణం . . బ్లాగ్గింగ్ హాబీ . . పాడటం అలవాటు . . . చదవటం వ్యసనం . . . సినిమా అంటే పిచ్చి . . అంతే నా గురించి : - )
మూడో అన్నయ్య విష్ణుమూర్తి సంగతే వేరు . వాడు పూర్తిగా కలల లోకం కాపురస్తుడు . ఊహా లోకపు విహారి . నాన్న ఎప్పుడూ వాణ్ణి " కలల కమల నయనా " అని పిలుస్తుండే వాడు . మిలట్రీ ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నా వాడు ఎప్పుడూ , వొడ్డు మీద కుర్చీలో కూర్చుని , ఎదురుగా ఉధృతంగా పరవళ్ళు తొక్కుతూ , ప్రవాహం లాగా సాగిపోయే జీవితాన్ని తన్మయత్వం తో చూస్తూ ఉన్నట్టే ఉంటాడు .
పోనీ ఒకసారి బయటకు వెళ్ళి తిరిగివద్దామని వెళ్ళాను . వామ్మోయ్ ఆ ట్రాఫిక్కేమిటండి బాబూ , రోడ్లూ అధ్వాన్నంగానే ఉన్నాయి , దానికి సాయం లైట్లు ఎక్కడా కనిపించవు . ఎందుకొచ్చిన గొడవరా బాబూ , ఏ స్కూటరు క్రిందైనా , బస్సు క్రిందైనా పడితే ' టి . వీ ' లో ' బ్రేకింగు న్యూస్ ' లో నా పేరు వచ్చేస్తుందేమో అని భయ పడ్డాను . ( నా పెన్షనర్ ఐ . డి . కార్డు ఎప్పుడూ జేబులోనే ఉంటుంది ! ) . మొత్తానికి భాగ్యనగర ట్రిప్పు ఏ ఒడుదుడుకులూ లేకుండా పూర్తయింది .
లయబద్ధమైన ప్రతి అడుగూ అహంభావాన్ని దూరం చేస్తూ విలయమే ఆవహించినట్టు స్వయంగా సమర్పితమౌతూ అప్రయత్నంగా అన్యోన్యత నాహ్వానిస్తూ అనాలోచితంగా అధిదేవుని కంకితమౌతూ …
నా మరణశయ్య పక్కనుండి నువ్వెళుతున్నప్పుడు వో పుష్ప గుఛ్చాన్ని వుంచుతావేమోనని ఆరాటపడ్డాను . నీ స్పర్శతో పునరుజ్జీవనడవుతాననే ఆశతో నీ వైపు దీనంగా చూశాను . నీ కన్నీటి స్పర్శ నన్ను అమరుణ్ణి చేస్తుందని నీ కంటి నుండి వొక్క చుక్కైనా రాలుతుందేమోనని నిస్తేజంగా నీ వైపు చూశాను . జాలిలేని నీ హృదయాన్ని యింకా యింకా కోరుకోవడం మృత్యువుని నా దగ్గిరనుంచి యింకా యింకా దూరం చేస్తోంది . నాకు వూపిరాడకుండా వుంది యీ సగం చావుతో . నాకింక పొద్దు పొడవని గాఢమైన నిద్ర ఎపుడు లభిస్తుంది ? !
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » జశ్వంత్ బహిష్కరణను కోరుకోలేదు : అద్వానీ
అద్భుతమైన వర్ణన . మొన్న వర్షాలను చూసి నేను హైదరాబాదునుండే మన రైతన్నల కష్టాలు తీర్చేంతగా ఈ వర్షాలు కురిస్తే బాగుండును అని మనసులో ఎన్ని సార్లు అనుకున్నానో . ఇప్పుడు మీ టపా చదివాకా నమనసు కాస్త కుదుట పడుతోంది . మనందరి ప్రేమా వృధాపోదు . అన్నదాతా సుఖీ భవ . . . . : )
నాకు సమాచారాన్ని చేర వెయ్యలేదన్న ఒకే ఒక్క కారణం చేత eతెలుగుకి దూరంగా ఉంటున్న నాకు ప్రవాస యానం చేసే అవకాశం రావడం చేత కొంత కాలం మన మిత్రులందరినీ వదిలి ఉండ వలసి వచ్చింది . ఇదిగో ఈ సమయంలోనే తీగను కదిపారు నా ( మన ) కు తెలిసిన బ్లాగు ప్రపంచంలో వయ్యస్సు రీత్యా కురు వృద్దులు దూర్వాసుల పద్మనాభం గారు . వయస్సులో పెద్ద వారైనా చెలాకీగా వారు చేసే పనులు వారి వయస్సుని ఏ మాత్రం ప్రతి బింబించవు .
ఇప్పుడు అహ్లువాలియా " జనాలదగ్గర యెక్కువ డబ్బు వుంటే , ప్రతిరోజూ కూరగాయలు కొంటారు , పాలూ , పాల వుత్పత్తులూ యెక్కువగా వినియోగిస్తారు - - అందుకే ఆహర ద్రవ్యోల్బణం 16 . 37 శాతానికి పెరిగింది - - ఇప్పుడు కొంచెం తగ్గింది " అంటున్నాడు .
మనకు " పుస్తకాలు చదవటం bore " , ప్రాచీన కళలైన " సాంప్రదాయక సంగీతనృత్యాలు slow " వంటి ఎన్నో అభిప్రాయాలు రోజూ వినిపిస్తూనే ఉంటాయి . ( వినపడటంలేదు అంటే దానికి అర్థం మన కూడా వీటి గురించి ఆలోచించటమూ , చర్చించటమూ మానేసామని ! ) అదేంటో … ఈ అభిప్రాయాలు వెలువరించిన వాళ్ళు ఒక్క పుస్తకమైనా మనసు పెట్టి చదివారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ! కర్ణాటక సంగీత సంప్రదాయంలో స్వరపరచిన ఒక్క తిల్లానా అయినా విన్నారా అనిపిస్తుంది " మన సంగీతం slow " అన్న మాట వింటే ! త్యాగరాజు కాలంలోనూ పాశ్చాత్య సంగీతపు సమాదరణ ఉండేదని , స్వయంగా ఆయనే కొన్ని కృతులని పాశ్చాత్య రీతుల ప్రభావంతో స్వరరచన చేసారని సదరు " విమర్శకు " లకు తెలియదు కాబోలు ! పాశ్చాత్యపు సంగీతం ఆదరించారు కనుక కర్ణాటక సంగీతం వినమనటంలేదు … కానీ , ఒకటి విని నచ్చినంత మాత్రాన రెండోది తప్పు అనుకోవటం శోచనీయం !
ఈ జ్ఞాపకాలు రాస్తుంటే నిజం గానే నా జీవితం ఇంత వర్ణభరితం గా గడిచిందా అనిపిస్తోంది . ఇంకా జీవితం . . . పూర్తిగా చదవండి
ఎంత మధురమైన జ్ఞాపకాలైనా … . . భరించలేకపోతే తప్ప అవి నీవని తెలియలేదు
ఙ్ఞాన ప్రసూనాంబ గారు : వీరు చేసిన పూర్ణాలు ఇంకా నా శృతి పధంలోంచి జారుకోలేదంటే నమ్మండి . మేము తింటామని తలచి కష్టపడి ఇంటి నుంచి చేసి తీసుకు వచ్చారంటే , వీరి ఆప్యాయతను ఏ శిఖరానితో పోల్చాలో నాకు అర్దం కావటం లేదు . వీరు చేసిన పూర్ణాలకు ముక్తాయింపు నేను , నాకు తోడుగా పైన ఉదహరించిన రమణిగారు వీరికి సరి సమానంగా మరో బ్లాగరు సుజాత గారు పోటీ పడి మరీ ఆ డబ్బను ఖాళీ చేసామనుకోండి . బ్లాగు ముఖంగా వీరికి మరోసారి భన్యవాదములు అలాగే మరో విన్నపము . . మనం ఇంకొక సారి కలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను . ఏమంటారు ? అదేనండీ కలవడానికి వచ్చినప్పుడు మీరెలాగో ఒట్టి చేతులతో రారు కదా . . చక్కగా వచ్చేటప్పుడు ఆ పూర్ణాలేవో చేసి తెస్తారు కదా . . వాటి గురించి మనం అప్పుడు చర్చించు కుందాం . ఏమంటారు . . ఏమి అనకండి , ఎప్పుడు కలుస్తున్నామో నాకు ఒక్కడికే మైల్ చెయ్యండి , లోకానికి తెలిసందనుకోండి నా వాటా పూర్ణాలు కొట్టేస్తారు . ( ఇక్కడ వ్రాసిన వాళ్ళందరిలో వీరి గురించే ఎక్కువ ప్రస్తావించడం వెనుక పూర్ణాలే కారణం కాదని గమనించాలి )
జ్యోతిర్గణ్న ప్రకారం ప్రళయం సంభవించడానికి 42స౦ . ల సమయం ఉంది , అంటే 2052 - లో కాని ప్రళయం రాదనీ గమనించాలి . / జయదేవానంద శాస్త్రి - చెన్నై - ౧౭ .
సంచీ . . నా ఫేవరెట్ టాపిక్ . వివిధ సంచుల్తో నా అనుబంధాన్ని నేనూ రాస్తా త్వరలో ! ఫణిబాబుగారూ , ఇన్స్పిరేషన్‌కి నెనర్లు !
ఈ నాయకత్వం మార్పుతో తెలుగుదేశం పార్టీ జెండా మారకుండానే దిక్కు మారిపోయింది . నినాదాలు మారకుండానే విధానాలు మారిపోయాయి . కనబడకుండానే పార్టీని శాసించే ప్రయోజనాలు , శక్తులు మారిపోయాయి . పునాదిగా నిలిచిన సామాజికవర్గాలలో గతంలో ప్రాబల్యంలో ఉండిన ఒకటి రెండు అగ్రవర్ణాలు , కొన్ని వెనుకబడిన కులాలు యదాతథంగా ఉంటూనే , వారిలోకూడ నయాసంపన్నులదే పైచేయి అయింది . ఆర్థికంగా చూసినప్పుడు తెలుగునేలలో వేళ్లు ఉన్న నయాసంపన్నులతో పాటు విదేశాలలో స్థిరపడిన నయాసంపన్నులు , దేశదేశాల బడాసంపన్నులు జమిలిగా పార్టీని నిర్దేశించే స్థితి వచ్చింది . మొత్తంగా పార్టీ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాలలో అక్రమంగా వందలకోట్లు కూడబెట్టుకున్న రాజకీయ నాయకుల , కాంట్రాక్టర్ల , వ్యాపారుల , పైరవీకారుల , మధ్యవర్తుల వర్గం ప్రాచుర్యంలోకి వచ్చింది . డబ్బు , సాంకేతిక విధానాల సహాయంతోనే రాజకీయాలు నడపవచ్చుననే , ప్రజలు అవసరంలేదనే ఒక దురభిప్రాయం పార్టీ అగ్రనాయకత్వంలో ప్రబలింది . ఒకవైపు తెలంగాణ ఆకాంక్షలు , మరొకవైపు నూతన ఆర్థిక విధానాల వల్ల ఎదుర్కొటున్న ఇబ్బందులగురించి ఆక్రోశాలు మిన్నంటుతుంటే పార్టీకి అవన్నీ వినబడనేలేదు . రాజకీయంగా చూసినప్పుడు కొత్తరక్తం పార్టీలోకి రావడం ఆగిపోయింది . పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి , కొత్త ఆలోచనలకు , అధినేతకు భిన్నమైన ఆలోచనలకు స్థానం లేకుండా పోయింది . ఈ విధంగా ప్రజలకు దూరమైన ఆలోచనలలో , ఆచరణలో ఉన్నందుకు , కొనసాగినందుకు తెలుగుదేశం 2004 ఎన్నికలలో భారీ మూల్యమే చెల్లించవలసి వచ్చింది .
తిలక్ పద్యం గొంతుక పెద్దది . తిలక్ దేవుడు దూరంగా వున్నాడు . అందుకే ' దేవుడా ! ' అనడం . పద్యం కోరేది కూడా ' రక్షించు నా దేశాన్ని ' అని . ' నా ' అని ఏకవచనం వాడినా ఇది మన కర్థమయ్యేది ' మా ' అనే . ( నా దేశం అనే మాటలో ' నా ' , ఆంగ్ల సంప్రదాయపు ఫలితం . తెలుగులో , మా ఇల్లు , మా అమ్మ , మా నాన్న మొదలైన మాటల్లోలా ఉమ్మడి ఆస్తులుగా పరిగణించబడే వాటికన్నిటికీ బహువచనం ' మా ' వాడటమే అలవాటు . ఆ ఇంటికి తానొక్కడే యజమాని అయినా , ఆ తల్లికీ , తండ్రికీ తానొక్కడే కొడుకయినా సరే , ' మా ' వాడటమే తెలుగు పద్ధతి . అయినా , కవితా సందర్భ బలం వల్ల ఈ పద్యంలో ' నా ' ఎబ్బెట్టుగా వినిపించదు ) . పద్యంలో తరవాత వచ్చే మాటలన్నీ హేళనతో నిండినవీ , నిందల్లా వినిపించేవీ . గంభీరమైన నడకతో కూర్చినవి ఈ మాటలు :
ఏమో నాకు తెలీదు . నాకు పెట్టుడు పేర్లు , లేబిల్సూ అంటే చిరాకు . కవులెవరూ కూడబలుక్కుని రాయరు , రాజకీయ కవులు తప్పించి .
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ మృతికి అమెరికాలోని తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ ( తెనా ) సంతాపం ప్రకటించింది . తన జీవిత ఆకాంక్ . . .
నాకు ఇద్దరు తమ్ముళ్లని చెప్పాను కదా . అంతకు ముందు అమ్మా , నాన్న పనికి పోయేవాళ్ళు . చిన్న తమ్ముడు పుట్టాడు . అమ్మ బాలింత . అమ్మ కూడా పనికి పోతేకానీ మాకు కడుపులు నిండేది అంతంతమాత్రమే . అందుకని అమ్మ స్థానంలో సెలవుల్లో నేను నాన్న వెంట పనికి పోయేవాడిని . అప్పుడు నేను ఎనిమిది పరీక్షలు రాశాను . వేసవి సెలవులు , 20 ఏళ్ళనాటి సంగతి ఇది . ఆ రోజు పొద్దున్నే సద్ది తాగినాం . ఇంట్లో బియ్యంలేవు . నాన్న నేనూ రెండు మైళ్ళ దూరంలో ఉండే పల్లెకు పనికి పోయినాం . మధ్యాహ్నం అన్నం లేకుండా పని చేసినాం . కడుపునిండా నీళ్లు తాగినాం … . సాయంత్రం వాళ్లు ఇరవై రూపాయలు ఇచ్చారు . ఆ డబ్బు నేను డ్రాయర్ జేబులో పెట్టుకున్నాను . ఇద్దరం ఇంటికి వచ్చినాం . కాళ్లుచేతులు ముఖం కడుక్కున్నా . రెండు కేజీల బయ్యం . రెండు రూపాయలకు నూనె , రెండు రూపాయలకు కందిపప్పు , చింతపండు , ఉప్పు తెమ్మని చెప్పింది అమ్మ . సంచి తీసుకుని అంగడికి బయలుదేరుతూ జేబులో చేయిపెడితే డబ్బులేదు . కంగారుగా పరిగెత్తుతూ మేము పని చేసిన పల్లెకు వెతుక్తుంటా వెళ్ళాను . కనిపించలేదు . తిరిగి వస్తున్నాను . నాన్న సగం దోవలో ఎదురు వచ్చాడు . బాలింత అమ్మ , తమ్ముళ్లు . . పస్తులు . . అన్నీ తలచుకుని వెక్కిళ్లు పెట్టి ఏడ్చాను . నాన్న సముదాయించాడు .
నన్ను ఆరాధిస్తున్న కళ్ళ తడిని పసిగట్టలేని పొరలేవో కమ్మేస్తూనే వున్నాయి .
బహుమనీ సూల్తానులు , బీజాపూర్ ఆదిల్ షాహీలు , మొగల్ చక్రవర్తులు , అసఫ్ జాహీలు , నిజాం అలిఖాన్ వంటి సూల్తాను పాలకుల ఆధీనంలో సుమారు 150 ఏళ్ళు కర్నూలు జిల్లా ఉండింది . క్రీ . శ 1800 ప్రాంతంలో సీడెడ్ జిల్లాలో ఒకటిగా కర్నూలు బ్రిటిషు పాలనలోకి వచ్చింది .
హన్నా ! అభినవ అంబేద్కర్ మా మందా గారిని అంత మాట అంటారా . . . ఇది ప్రపంచ ప్రజలందరికి అగమానం ! అయినా అరికాలులో వున్న మందా గారి మెదడు మోకాలిలో వుందని రాయటానికి ఎంత ధైర్యం !
ఆ శిలాశాసనాన్ని చదవగానే భట్టికి సంభ్రమాశ్చర్యాలు కలిగాయి . తన ' అన్న విక్రమాదిత్యుడు అట్టి సాహస కార్యాన్ని తప్పక నెరవేర్చగలడు ' అనుకున్నాడు . తాము ఆశించినదే ఎదురుగా ఉన్నట్లు తోచి భట్టికెంతో ఆనందం కలిగింది . భట్టి దేవాలయంలోకి ప్రవేశించి , అక్కడ గల మహంకాళికా దేవిని అర్చించాడు . మనో వాక్కాయ కర్మల , ఇష్టపూర్తిగా పూజాదికాలు నిర్వహించాడు . కోవెలలో అమ్మవారి కంటి చూపుకు ఎదురుగానే , సరోవరం ఉండటాన్ని , దాని మధ్యలో త్రిశూలం ఏ ఆధారమూ లేకుండానే నిలిచి ఉండటం గమనించాడు . అది అమ్మవారి మహిమగా గ్రహించాడు . దేవీ కోవెలలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని , కన్యాపురానికి తిరుగు ప్రయాణమయ్యాడు . నగరం చేరి , తనకు అన్న , రాజూ అయిన విక్రమాదిత్యుడి దగ్గరి కెళ్ళి , వినయంగా నమస్కరించాడు . భట్టిని చూడగానే విక్రమాదిత్యుడికెంతో సంతోషం కలిగింది . ప్రేమాప్యాయతలతో భట్టిని కౌగిలించుకున్నాడు . " నా ప్రియమైన తమ్ముడా , భట్టీ ! నీవు నన్ను కంటికి రెప్పవలె కాపాడు ఆత్మబంధువవు . నీ విక్కడ నుండి వెడలి ఆరుమాసాలు గడిచినవి . మనం ఆశించినట్లుగా ఏదైనా ప్రదేశాన్ని కనుగొన్నావా ? " అని అడిగాడు . " అన్నా ! కనుగొంటిని " అన్నాడు భట్టి . సవిస్తరంగా తాను చూచిన ప్రదేశాన్ని , దేవీ ఆలయాన్ని , శిలా శాసనాన్ని కళ్ళకు కట్టినట్లుగా వివరించాడు . విక్రమాదిత్యుడికి ఎంతో ఆనందమూ , ఉత్సాహమూ కలిగాయి . వెంటనే అక్కడికి వెళ్లాలని నిశ్ఛయించుకున్నారు . తమ అనుచరులలో ఒక సమర్దుడిని ఎంపిక చేసి , కన్యాపుర రాజ్యపు బాగోగులు చూడవలసిందిగా ఆదేశించారు . ఒక పుణ్య తిధినాడు , సుముహుర్తం చూసుకుని భట్టి విక్రమాదిత్యులిద్దరూ మారువేషాలు ధరించి వింధ్యాటవికి ప్రయాణ మయ్యారు . దట్టమైన అందమైన అరణ్యాలని , కొండకోనలని , వాగు వంకలనీ దాటుకుంటూ వెళ్ళారు . దుర్గమారణ్యాలలో ప్రయాణిస్తూ . . . ప్రకృతి రమణీయతనీ , వన్యమృగ సంచారాన్ని ఎంతగానో ఆనందించారు . కొన్ని దినాల ప్రయాణానంతరం , ఇద్దరూ వింధ్య పర్వత ప్రాంతాన్ని , గుణవతీ నదీ తీరాన్నీ చేరారు . ఉత్సాహంగా మహంకాళీ దేవీ పురాతన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు . పుష్కరిణిలో స్నానమాచరించి , దేవళంలోకి ప్రవేశించారు . విక్రమాదిత్యుని చూసి , మహంకాళి దేవి ఎంతో ప్రసన్నురాలైంది . గోవు తన వత్సలని చూసినట్లుగా , తల్లి తన బిడ్డలని చూసినట్లుగా మహంకాళి దేవి , భట్టి విక్రమాదిత్యులని వాత్సల్యంతో చూసింది . విక్రమాదిత్యుని సాహస లక్షణాలని చూసి ' ఈతడి చేత ఇక్కడ నగరాన్ని నిర్మింప చేయాలని , పురాతన ఆలయానికి ప్రాభవం తేవాలనీ ' సంకల్పించింది . విక్రమాదిత్యుని సామర్ధ్యమందుకు తగినదో కాదో పరీక్షింపనెంచి , అదృశ్య రూపంలో భట్టి విక్రమాదిత్యుల వెంట నడిచింది . దేవళంలోని దేవీ మూర్తికి పూజాదికాలు , సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి , భట్టి విక్రమాదిత్యులు సరోవరం దగ్గరికి చేరారు . విక్రమాదిత్యుడు శిలాశాసనాన్ని మరోసారి చదివాడు . సరస్సు మధ్యలో ఆధార రహితంగా , నీటిపై నిట్టనిలువుగా నిలిచి ఉన్న త్రిశూలాన్నీ , సరస్సు పైకి వ్యాపించి ఉన్న మర్రి కొమ్మలకు వ్రేలాడుతున్న ఏడు ఉట్లనీ పరీక్షగా చూశాడు . ఆధారరహితమైన త్రిశూలాన్ని చూసి " తమ్ముడా ! భట్టి ! నీటిలో ఈ త్రిశూలము ఆధారము లేకనే ఎట్లు నిలిచి ఉన్నది ? " అని అడిగాడు . భట్టి " మహారాజా ! గుడిలోని దేవికి ఎదురుగా నున్నది గనుక , ఆ తల్లి మహిమతోనే అది అట్లు నిలిచి ఉన్నదని తలంచుచున్నాను " అన్నాడు . విక్రమాదిత్యుడి కది చూసి ఎంతో ఉద్వేగమూ , భక్తి పరవశమూ కలిగాయి . శిలా శాసనం మీద వ్రాసి ఉన్న సాహస కార్యము చేసి తీరాలన్న పట్టుతల కలిగింది . ఒకవేళ దేవీ దర్శనము పొందలేక , ప్రాణాలు కోల్పోయినా పోయేదేం లేదనిపించింది . మరోసారి భక్తిగా సరోవరంలో పుణ్యస్నానమాచరించి , గుడిలోని తల్లిని స్మరించుకున్నాడు . భట్టిని వటవృక్షము మొదలులో నిలబడమని చెప్పాడు . వృక్ష రాజానికి నమస్కరించి చెట్టెక్కాడు . ఒర నుండి కత్తి తీసి నోటబెట్టి , చెట్టు కొమ్మలపైని ఉట్ల దగ్గరికి చేరాడు . విక్రమాదిత్యుడికి తాను చేయబోయే సాహసకార్యం ఎంత ప్రమాదకరమైనదో తెలుసు . అయితే , అందుకు రెట్టింపుగా , విక్రమాదిత్యుని మనస్సు , మహంకాళి దేవిపై భక్తితోనూ , నమ్మకంతోనూ నిండిపోయింది . కళ్ళు నిగిడ్చి ఏడు ఉట్లని పరిశీలించాడు . అవి ఒకే కొమ్మకు వరుసగా లేవు ; ఒక్క వేటులో తెగ వెయ్యటానికి ! వర్తులా కారంలో ఉన్నాయి . విక్రమాదిత్యుడు " తమ్ముడా భట్టి ! ఈ ఏడు ఉట్లునూ ఒకే తాటికి కట్టిలేవు . ఒకే వరుసలోనూ లేవు . వలయాకృతిలో అమర్చబడ్డాయి . ఒక్క వేటుతో వీటిని తెగ వేయిటెట్లు ? ఆలోచించి ఉపాయం చెప్పు ! " అన్నాడు . అప్పటికే భట్టి దానిని పరిశీలనగా చూస్తున్నాడు . అతడికీ చిక్కు అర్దమయ్యింది . " అన్నా ! నీ కుడిపాదమును ఒక ఉట్టిపై ఉంచి , దాని ప్రక్కనున్న ఉట్టిని ఎడమ చేత బట్టుకొనుము . ఊయల ఊగినట్లుగా , కుడివైపుకు ఊపు తెచ్చుకొనిన , అవి గుండ్రముగా తిరిగి పురి ఎక్కగలవు . అప్పుడు ఏడు ఉట్లు తాళ్ళు పెనవేసుకుపోయి , ఏక తాడు వలె బలంగా , గట్టిగా కాగలవు . అప్పుడు కత్తితో , ఒక్కవేటుతో వాటిని తెగనరక వచ్చును . తెగిన ఉట్లు నీటిని చేరక ముందే , తల్లక్రిందులుగా త్రిశూలము పైకి దూకుము . ఆపైన దేవీ కృప ! " అన్నాడు . విక్రమాదిత్యుడు మరోమారు ఉట్లను పరిశీలనగా చూశాడు . గుండెల నిండా ఊపిరి పీల్చుకుని సాహస క్రియకు పూనుకున్నాడు . కొన్నిలిప్తల పాటు కాళీ మాతని స్మరించాడు . శ్రద్ద , పట్టుదల కలగలిపి , ఒక ఉట్టిపై కుడిపాదము నుంచాడు . దాని ప్రక్కన గల మరియొక ఉట్టిని ఎడమ చేత బట్టుకుని , శరీరాన్ని కుడివైపుకు వంచి , ఒక్క ఉదుటున ఊపు తెచ్చుకున్నాడు . రంగుల రాట్నము తిరిగినట్లుగా ఉట్లు తిరిగి , ఏడు తాళ్ళూ పెన వేసుకు పోయి పురి ఎక్కాయి . విక్రమాదిత్యుడు ఆ ఏక తాటిని , కత్తితో ఒక్క వేటున తెగ వేశాడు . మరుక్షణమే తాను తల్లక్రిందులుగా త్రిశూలము పైకి దూకాడు . ఉట్లు నీటిని చేరక మునుపే అతని శిరస్సు త్రిశూలాన్ని తాకింది . భట్టి ఇదంతా రెప్పవాల్చక , ఊపిరి పీల్చక చూస్తున్నాడు . విక్రమాదిత్యుడి శిరస్సు త్రిశూలాన్ని తాకిన క్షణాన , భట్టి కళ్ళ ముందు పెద్ద మెరుపు మెరిసినట్లయ్యింది . ఆ వెలుగుకతడు కళ్ళు మూసుకున్నాడు . క్షణం తర్వాత కళ్ళు తెరిచి చూస్తే . . . అతడి ముందు ట్రిశూలమూ లేదు , విక్రమాదిత్యుడి దేహమూ లేదు . ~ ~ ~ ~ ~ ~
( ఇందులో ప్రాసాక్షరమైన న - కారానికి బదులు ల - కారము ఉపయోగిస్తే అర్థము మారదు . )
ఇవ్వాళ మన సహ బ్లాగరు , యోగి అ . క . అ అష్టావక్ర తన పెన్నులోని ఇంకు మొత్తాన్ని వొంపేస్కుంటున్నా అన్నాడు . అలా వోంపేస్తే పెన్ను రాయదుకదా అన్నా , పాళీ ఇరగ్గొట్టా అన్నాడు , ఇకరాయదుగా అన్నా , ఇకరాయాల్సిన అవసరం లేదు అన్నాడు , చివరాఖరి కాయితం కాక పోయినా ఉన్న రీము కాయతాల్ని మూటగట్టి అటక మీద పెట్టేసా అన్నాడు , ఇక పెన్నుతో పని లేదు అన్నాడు . నాకర్ధంగాలా ! ! దేనికీ అన్నా ? నా బ్లాగుని మూసేస్తున్నా అన్నాడు . సరే ఇదే నీ చివ్వరాకరి నిర్ణయమా బ్లాగుమీన అన్నా . అవునూ అన్నాడు . ఇలా జెప్పాను : సోదరా ! ! హుం ! ! ఏమి చెప్పనూ ? ఇదే నీ నిర్ణయం ఐతే ఇక నువ్వు పొడుగుచేతుల చొక్కాలు వేస్కోవాల్సిన అవసరం లేదు , దేనికంటే మేధావుల్ని ఎదిరించడానికి కండలపైకి ఇక చొక్కా మడుచుకోవాల్సిన పనిలేదు . కళ్లు బైర్లు కమ్మేలా మేధావులు రాసిన ఠావుల కొద్దీ కతల్ని చదవాల్సిన పనిలేదు . ఏమైనా , ఒక నిర్ణయం , ఒకే నిర్ణయం , ఒకే మాట , ఒకే బాట . ఇక మేధావుల్లారా మీ మీ మేధావితనాన్ని కలుగుల్లోంచి బయటకి తీసి దులుపుకోండి . ఒక వెల్తురు బ్లాగ్లోకంనుండి నిష్క్రమిస్తున్నాడు . మీరిక ఆకాశం మీదకి ఉమ్మేస్స్కోవాల్సిన పనిలేదు , నక్కల్లా ఊళళు పెట్టాల్సిన పనీలేదు మరో ఖడ్గం వచ్చేదాకా . మీ కళ్లని ఇంక చల్లబర్చుకోండి , మగ్గు బీరుతో లేక ఓ చెత్త పోస్టుతో . అదిగో పొద్దుపొడుస్తున్నాడు సూరీడు మరో కొత్త వెలుగుతో , మరో కొత్త ఖడ్గాన్ని తయ్యార్చేయ్యటంకోసం , మరో కొత్తవెలుగుని నింపడంకోసం - మే యువర్ బ్లాగ్సోల్ రెస్ట్ ఇన్ పీస్
ఆ తరువాతరోజు సరాసరి వేంకటేశ్వర స్వామి దర్శనానికే . అక్కడే అలా వుంటే , ఇక్కడెలా వుంటుందో అని భయపడ్డాం . అసలు , వీళ్ళు చెత్తన్నార రూల్స్ పెట్టి , దర్శన ఎలా కష్టంగా చెయ్యాలా అని ఆలోచిస్తారు . ఎలాగూ , క్యూలో తోపుడే . ముసలీ ముక్కా అందరిని తోస్తారు . అసలు మీకు తెలుసా ? ఈ దేవస్థానం వాళ్ళని చూసే జనం కూడా తోపుడు నేర్చుకున్నారు . మనం ఎంత పరిగెట్టినా , మన వెనకాలొచ్చి మరీ తోస్తారు వాళ్ళు . కాని , మొదటి సారి దర్శనం చాలా బాగా జరిగింది . గుడి లోపలికి వచ్చేసరికి ఎక్కవగా తోపుడు లేకుండా నే అయిపోయింది .
కేప్ టౌన్‌లోని పబ్లిక్ ప్రైమరీ మరియు సెకండరీ పాఠశాలలు వెస్టర్న్ కేప్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంటు చేత నడపబడతాయి . ఈ జిల్లా శాఖ ఏడు జిల్లాలో విభజించబడి ఉంది ; వీటిలో నాలుగు " మెట్రోపోల్ " జిల్లాలు - మెట్రోపోల్ సెంట్రల్ , నార్త్ , సౌత్ , మరియు ఈస్ట్ - ఇవి నగరం యొక్క అనేక ప్రాంతాలను కలిగి ఉంటాయి . [ 43 ] కేప్ టౌన్‌లో అనేక మతపరమైన మరియు మతసంబంధం కాని ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి .
" నన్నేం చేయమంటావు , తనే కావాలని వెళ్ళిపోతే ? తిరిగి రావడం , రాకపోవడమన్నది తన ఇష్టం ! "
ఈ ఉద్యమం సమాజంలోని అసమానతలను వ్యతిరేకించింది . అన్ని కులాలకు సమాన ప్రతిపత్తిని కల్పించింది . అయితే స్త్రీ విషయంలో పురుషునితో సమాన హోదాను కల్పించినా స్త్రీని భోగ్య వస్తువుగా భావించిన మత విధానాలు మనకు ఆశ్చర్యాన్ని , బాధను కలిగిస్తాయి .
విహారి గారు . మీ కల కలర్ ఫుల్ గా అద్భుతంగా వుంది . కామెడి బాగా పండింది . కడుపుబ్బ నవ్వించింది . ముఖ్యంగా . . . కండలు తిరిగిన మీ బాడి . . . కండ కండ పై మీ లో రగులుతున్న కోరికలు . . . భలే వున్నాయి . ప్రొద్దున్నే చక్కని ఆహ్లాదాన్ని అందించారు . అభినందనలు . విచిత్రంగా నేను కూడా ఇట్లాంటి కల కు సంబంధించిన రచననే ' మంత్రాలు . . చింతకాయలు . . గాలి మేడలు ' అనే పేరుతొ నా బ్లాగు లో ఇందాకే పోస్టు చేశాను . ఎంత కాకతాళీయమో .
పైలట్ తాపీగా విషయాన్ని ఇలా ప్రకటించాడు . " ధైర్యవంతులు , సాహసికులైన ప్రయాణికులారా ! మీరు ప్రయాణిస్తున్న విమానం యొక్క రెండు ఇంజన్‍లలో ఒకటి ఇప్పుడే పనిచెయ్యటం మానేసింది . రెండవది కూడా అతి తొందరలో ఆగిపోవచ్చు . అందువల్లన మనం మధ్యలోనే ఎక్కడో విమానాన్ని దింపెయ్యటం తప్పని సరి . ప్రస్తుతం నేను ఒక పేరు తెలియని ద్వీపం మీద క్రాష్ లాండింగ్ చెయ్యబోతున్నాను . మీరు మీ శేష జీవితాన్ని ఈ ద్వీపం పైనే గడపటానికి సిధ్ధపడండి . ఎందుకంటే ఇది ఎవ్వరికి తెలియని ద్వీపం మరియు మన రేడియో పాడయ్యింది కూడా . . "
కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ ( కెపిసిఎల్ ) పోర్టు నుండి దూర ప్రాంతాలకు కంటైనర్ ట్రాఫిక్‌ను అందించేందు కోసం కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( సిఒఎన్‌సిఒఆర్ - కొంకర్ ) తో ఒప్పందం కుదుర్చు కుంది . దీనికి సంబంధించి ఇరు సంస్థలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి . కొంకర్ రైల్వే శాఖ ఆధీనంలో పని చేస్తూ మినిరత్నం హోదా కూడా కలిగి ఉంది . కెపిసిఎల్ వద్ద ఈ నెలలో కంటైనర్ టర్మినల్ ప్రారంభం కాగానే కెపిసిఎల్ - కొంకర్ సంయుక్తంగా కంటైనర్ రవాణాకు అనుగుణమైన రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి .
అది ఒక ఆఫీసు చేంబర్ . విశాలమయిన ఆ గదిలో , అతి పెద్దదయిన ఒక టేబుల్ కి అటు వైపున కూర్చుని వున్న మనిషి మమ్మల్ని చూసి తలపంకించాడు . " ఇతనేనా ? " అన్నాడా వ్యక్తి నన్ను ఆపాదమస్తకం పరీక్షగా చూస్తూ . " అవును సార్ ! " నమ్రతగా జవాబిచ్చాడు శీను . తలుపు దగ్గరిగా వెయ్యమని సైగ చేసాడా వ్యక్తి . " పని గురించి చెప్పావా ? " " లేదు సార్ . మీరే చెబితే బాగుంటుందని . . " డోర్ మూస్తున్న శీను గొణిగాడు . " ఊఁ ! కూర్చోండి . " సూటిగా నా కళ్ళలోకి చూసాడు ఆ వ్యక్తి . అతని చూపులు చాలా తీక్షణంగా వున్నాయి . ఇంటరాగేషన్ సమయంలో పోలీసులు చూసే చూపులు అచ్చం అలాగే ఉంటాయి , నిర్దోషులను సైతం భయపెట్టేలా .
అని ఎప్పటికప్పుడు కొత్త కొత్త బ్లాగులు బర బర , చిర బర బ్లాగేయాలని ఉంటుంది నాకు . కాని ఎలా ? నేను కొత్తపాళీ గారు అప్పుడెప్పుడో ఇచ్చిన " తెల్లకాగితం " అనే కథాంశానికి ఇన్ని రోజులకి బుర్ర వెలిగింది కాని ఇప్పుడు ఆ కథని బ్లాగులో రాస్తే అందరు తిడతారని నా కథని టపా కట్టించేసా . ఇంక రెండో కథాంశం " షేర్ ఆటో " కి ఇంకొక ఆరునెలలకి కాని అవుడియా రాదనుకుంట ! అన్నట్టు ఈ సందట్లో పడి అసలు విషయం మర్చిపోయాను . నా బ్లాగు ఈ మధ్యే మొదటి పుట్టినరోజు జరుపుకుంది .
ఇది రాశాను అని నన్ను కరుడుగట్టిన హిందుత్వవాది క్రింద జమ కట్టకండి , నాకు తెలిసింది చెప్పాను .
మీ ఙ్ఞాపకాలెంత గిలిగింతలు పెట్టాయో . . ఒక్కసారి చిన్ననాటి ఆటలన్నీ గుర్తుకొచ్చేలా చేసారు . మీకూ , మీ కుటుంబసభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు . . . . .
క్రిందటి సంవత్సరం జులై నెలలో ఏడవ తారీఖున నేను పూజ్యనీయులైన నన్నయపై ఒక పుట వ్రాసాను . ఆ తరువాత కొంతకాలానికి ఆ పుటని నేను పునఃపరిశీలించాను . అప్పుడు నాలో నాపై కలిగిన ఆలోచనలు , భావనలు , స్పందనలు , వగైరా వగైరా నన్ను ఆత్మావలోకనం చేసుకునేటట్టు చేసాయి . అలాంటి ఆత్మావలోకనం లోంచి ఉద్బవించినదే ఈ పుట . మరి మీ ఆలోచనలేమిటో సెలవివ్వండి
నిష్పాక్షికంగా ఆలోచిస్తే దీనికి ప్రభుత్వం , పౌరసమాజం , ప్రతిపక్షం బాధ్యత వహించవలసి ఉంటుందన్న విషయం అవగతమవుతుంది . దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం , కాంగ్రెస్ అసమర్థత అనేది వ్యక్తమవుతుంది . అది ఏమిటో చూద్దాం . గతంలో ప్రధానిపై సం క్షోభ సమయాల్లో మాయమవుతారు అనే ఆరోపణ ఉండేది . ఇప్పుడు సోనియా , రాహుల్ కూడా అటువంటి సమయాల్లో మాయమవుతున్నారు . అందుకు మారుగా ఎప్పుడూ అసంతృప్తితో ఉండే దిగ్విజయ్ సింగ్‌ను అందరిపైనా బురదచల్లేందుకు వినియోగిస్తున్నారు . రామ్ దేవ్‌పై చర్యకు బాధ్యత వహించడానికి ఎవరూ ముందుకు రాకపోవడం ప్రభుత్వ పిరికితనాన్ని , సంకుచితత్వాన్ని బట్టబయలు చేస్తోంది . ఇందుకు మరో ఉదాహరణ చైనా బ్రహ్మపుత్ర నదీజలాల విషయంలో చర్యలకు పాల్పడుతోందన్న ఆధారాలు ఉండగా మన విదేశాంగ మంత్రి మరో దిశగా చూస్తూ దేశాన్ని తప్పుదోవ పట్టించడం మనకు తెలిసిందే . ఒక నెల రోజుల క్రితం రాహుల్ గాంధీ , దిగ్విజయ్ సింగ్ మాయావతి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విరుచుకుపడి తీవ్ర విమర్శలు చేశారు . అవి అవాస్తవాలని ఆ తర్వాత వెల్లడయిం ది . ఇటువంటి సందర్భంలో ఈ చుక్కాని లేని నావ వంటి ప్ర భుత్వానికి పౌర సమాజం సభ్యులు ఆదేశాలు జారీ చేయడంలో ఎ టువంటి ఆశ్చర్యం లేదు .
ఒక నెలవంక తోచి విజ యోత్సవ కాంతులు సంతరిమ్పగా ఒక చిరుగాలి వీచి పువు లోగిట పుప్పొడి జిమ్మి పోవగా ఒక సెలయేరు పెల్లుబికి ఒడ్డుల గజ్జెలు సందడిమ్పగా ఒక కవితానుభూతి యెద నొక్కులు దిద్దుర వెంకటేశ్వరా !
ఘంటసాల జీవించి ఉన్న కాలంలో , ఒక ప్రముఖ రచయిత , సంగీత విమర్శకుడు శ్రీ ఘంటసాల పై రాసిన వ్యాసం ఒకటి ఈ పుస్తకంలో ఉంది . అందులో ఒక విషయం " ఈమాట " పాఠకులకోసం యథాతథంగా ఇస్తున్నాను . " ఘంటసాల సృష్టించిన అనేకానేక పాటలనుంచి ఉదాహరణలు ఇవ్వటం సాధ్యంకాదు . నన్ను బాగా ఎఫెక్టు చేసిన ఒక ఉదాహరణ ఇస్తాను . " పెళ్ళిచేసి చూడు " అన్న సినిమాలో ' ఏడుకొండలవాడ వెంకటా రమణా ' అన్న పాటకు " చక్రవాకం " రాగం వాడటంలో నాకు ఘంటసాల జీనియస్ అంతా కనిపించింది . ఆ పాటలో లేని జాలి ఒకటి ఆ సన్నివేశంలో ఉంది . ఇందుకు , దానికి ముందు నడిచిన సన్నివేశం చాలా తోడ్పడింది . ఆ పాటే ఇంకో రాగంలో ఉన్నట్టయితే , ఆ పాటకున్న విలువ 90 శాతం ఎగిరిపోయి ఉండేది ! "
అమ్మ నిద్ర పోతున్నట్టుంది . అమ్మ అప్పుడు ఆకాశం లో సగంలా ఉంది . మూసిన ఆవిడ కనురెప్పల వెనకాలా , నెరసిన ఆవిడ జుట్టు కింద ఉన్న మెదడులోనూ నిక్షిప్తమైపోయిన పరమ రహస్యం అయిన భావాలేమిటో … మా కెవ్వరికీ తెలీవు .
కుంభకోణాలు చోటుచేసుకోడానికిగల ఆర్థిక , రాజకీయ పరిస్థితులు పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతర్భాగమై ఉన్నాయి . అందులో సంస్కరణలు వచ్చిన తరువాత కుంభకోణాలు పెద్దఎత్తున సాగుతున్నాయి . ఉపాధి హామీ పథకం , ఆరోగ్యశ్రీ , ఇర్రిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలు , రహదారుల నిర్మాణం , ఔటర్ రింగురోడ్డు నిర్మాణం , ఇందిరమ్మ ఇళ్ళ నిర్మా ణం , భూసేకరణ సందర్భంగా కుంభకోణాలు , రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో ప్రముఖుల పాత్ర , సహకార బ్యాంకులలో వందలకోట్ల డిపాజిట్లు కాజేయడం , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిం చిన రాయితీ పథకాల్లో నగంగా సాగుతున్న కుంభకోణాలు … . వీటి బాధ్యుల్లో అత్యధిక శాతం పాలకపక్షంలోనే కొనసాగుతున్నారు . కుంభకోణాలతో వేలకోట్లు ఆర్జించి వ్యాపారాలు వెలగబెట్టడంతో బాటు రాజకీయ రంగంలో కూడా ఎన్నికవుతున్నారు . వీరిపై ఎలాంటి అనర్హతా పడడం లేదు .
ఋగ్వేదములోని ౧టి మణ్డలములో ౮౯వ సూక్తములోని ౧టి ఋక్కు : ఆ నో భద్రాః క్రతవో యన్తు విశ్వతో೭దబ్ధాసో అపరీతాస ఉద్భిదః । దేవా నో యథా సదమిద్వృధే అసన్నప్రాయువో రక్షితారో దివేదివే । । * * * ఇప్పుడు ఆ నో భద్రాః క్రతవో యన్తు విశ్వతః అన్న వాక్యానికి అర్థం గమనిస్తే : ౧ ఋగ్వేదముపై వ్రాయబడిన సాయణాచార్యభాష్యం ప్రకారం - - నో೭స్మాన్ క్రతవో೭గ్నిష్టోమాదయో మహాయజ్ఞా విశ్వతః సర్వస్మాదపి దిగ్భాగాదా యన్తు ఆగచ్ఛన్తు . కీదృశాః క్రతవః . భద్రాః సమీచీనఫలసాధనత్వేన కల్యాణా భజనీయా వా . నః మనను , క్రతవః అగ్నిష్టోమము మొదలైన మహాయజ్ఞములు , విశ్వతః అన్ని దిక్కులనుండి , ఆ యన్తు వచ్చునుగాక ( వచ్చి రక్షించునుగాక ) . ఎలాంటి క్రతువులు ? భద్రాః మంచి ఫలములను సాధింపజేయటంద్వారా కల్యాణములైనవీ కొలవదగినవైనవీ ఐన క్రతువులు . ౨ క్రియతే క్రతుః అని అమరకోశంలో క్షీరస్వామికృతభాష్యం . ఈ ప్రకారంగా చూస్తే మంచి చేతలు అన్న అర్థం కూడ తీసుకోవచ్చు . అప్పుడు భద్రములైన ( భద్రములైన ) చేతలు ( క్రతవః ) అన్నివైపులనుండి ( విశ్వతః ) మనకు ( నః ) వచ్చునుగాక ( ఆ యన్తు ) . క్ఌప్తంగా , మనకు మంచి జఱుగుగాక అని అర్థం . ౩ ఇదే వాక్యానికి స్వామి వివేకానంద చెప్పిన అర్థం " మంచి ఆలోచనలు నలుదిశలనుండీ మనకు కలుగునుగాక " అని .
" ఇదా నన్ను సంతోషపెట్టడం ? మీ బర్త్‌డే అని చెప్పి , మీ కిష్టమైన పని చేస్తే మీరు సంతోషపడ్డారు . ఈ రోజు నా బర్త్‌డే అని చెప్పి , మీ కిష్టమైన పని చేస్తూ , మళ్ళీ మీరే సంతోషపడుతున్నారు . ఇందులో నా సంతోషం ప్రసక్తి ఏదీ ? ఇదెక్కడి న్యాయం మన స్నేహంలో ? " సూటిగా అడిగాను .
కుంభ రాశి : ఇంటిలోని పెద్ద వారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి . కాలేయానికి సంబంధించి ఇదివరకు అనారోగ్యానికి గురి అయిన వారు తగు జాగ్రత్తలు వహించాలి . ఇంటిలో కొన్ని మార్పులు చేస్తారు . వస్తారనుకున్న బంధువులు రాకపోవచ్చు ! అధికారులతో కొన్ని విషయాలను చర్చిస్తారు . దుర్గా సూక్తం చదవండి .
మీ మాట పోనీవ్వకుండా ఇదుగో బరాకా కవితల్లో సరళంగా వుండి నాకు నచ్చిన ఒక కవిత - పేరు ' కాబా ' ముస్లింలు అందరూ ప్రపంచంలో ఏ దేశంలో వున్నా - జీవితంలో ఒక సారి మక్కా లో కాబా మందిరాన్ని దర్శించాలని కోరుకుంటారు . ( హజ్జ్ యాత్రికులు వెళ్ళేది ఇక్కడికే ) . ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా నమాజ్ చేసేటప్పుడు కాబా వైపు తిరిగి కూర్చుంటారు . అంత లోతుగా - ధార్మిక జీవితానికి ముడి పడి వున్న కాబాని విమోచనకి ఒక ప్రతీకగా వాడటం ఇవాళ కొంత వింతగా అనిపిస్తే అది అలుముకున్న మౌఢ్యానికి తార్కాణం తప్ప మరేమీ కాదు . ఉర్దూ - హిందూస్తానీ అభ్యుదయ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ కూడా హమ్ దేఖేంగే హమ్ దేఖేంగే అనే కవితలో ఇదే పని జంకూ గొంకూ లేకుండా వాడేస్తాడు . బెనజీర్ భుట్టో ని మొదటి సారి గెలిపించుకున్నప్పుడు - ఇక్బాల్ బానో ఈ పాటనే పాడగా వేలాది జనం గొంతు కలిపి పాడిన సంఘటనని చాలా మంది రికార్డు చేశారు . ఒక నియంతని ( జియా వుల్ హక్ ) ధిక్కరించి ప్రజలు గొంతు విప్పితే వింటూంటే మనకీ కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయి . ]
వంకరపోయిన నోరు , రెప్ప పడని ఒక కన్ను ముఖాకృతి వికృతంగా గుర్తుపట్టలేని విధంగా కదలకుండా నిలిచిపోయిన కుడి చెయ్యీ కాలూ , మూగవోయిన గొంతు
మరణం గురించి మాట్లాడేటప్పుడు మరొక విషయం కూడా చెప్పుకోవాలి . మనిషి ఏనాటికైనా మరణాన్ని జయిస్తాడనే ఆశ , నమ్మకం శ్రీశ్రీకున్నాయి . దేవుడి స్వగతం అనే కవితలో
దేశ భాషలందు తెలుగు లెస్స - కౌముది జులై సంచికలోని నా వ్యాసం
కాని అంతర్జాలం ( ఇంటర్నెట్ ) ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చేసింది . ఇంతవరకు ఆ కుగ్రామంలో ఏ పని చేయాలన్నా ఇంగ్లీషు మాత్రమే ఉపయోగింపబడేది . కాని ఇది ఒకప్పటి మాట . ఇప్పుడు ఇంటర్నేట్‌లో తెలుగు విస్తృతంగా వ్యాపించింది అని గర్వంగా చెప్పుకోగలం . తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించింది అని మురిసిపోయాం , గర్వపడ్డాం . సాంకేతిక పరిజ్ఞానం త్వరితగతిని అభివృద్ధి చెందుతున్న కారణంగా తెలుగుకు ఆధునిక హోదా లభించింది అని ఘంటాపదంగా చెప్పుకోవచ్చు . ఎటువంటి ఉద్యమాలు , నినాదాలు లేకుండానే నేడు వెబ్ ప్రపంచంలో తెలుగు వెలిగిపోతుంది .
వెంకట్‌గారూ , అటువంటిదేమీ లేదండీ . ప్రశ్న అడిగేసి సమాధానం రీడర్స్‌కి వదిలేస్తే different గా వుంటుందని రాశా .
@ ప్రణీత స్వాతి గారు , చాలా రోజుల తర్వాత కనిపించారండీ . . . చాలా చాలా థాంక్సండీ మీ సపోర్ట్‌కి , ప్రోత్సాహానికి . . . నా బ్లాగు బండిని ఇప్పటిదాకా నడిపించుకువచ్చానంటే అది మీలాంటి పెద్దల ఆశీర్వాదమే . . . @ వేణు మీరు కూడా నన్ను పాస్ చేసేసారన్నమాట . . థాంక్యూ . . : ) నేను ఈ కథని ఓ మూడు , నాలుగు నెలల క్రితమే రాసుకున్నా ఎవరికైనా చూపించి , కొన్ని కరెక్షన్స్ చేసి ప్రచురిద్దామనుకున్నానండి . . . అయితే ఎవరికి చూపించాలో తెలీక ( ఆ టైంలో మన మురళి గారు కూడా బిజీగా ఉన్నారు ) అలా వాయిదా వేసేసుకుంటూ వచ్చి , నాకు నేనుగా కొన్ని తోచిన కరెక్షన్స్ చేసుకుని పబ్లిష్ చేసేసాను ఇప్పుడు . . . ఈ సారి మాత్రం ఏదైనా రాస్తే మీ సూచనని తప్పక పాటిస్తాను . . @ మాలా గారు , థాంక్సండి . . @ చిన్నిగారు , ఈ కథని పబ్లిష్ చేసినపుడు మీరే గుర్తొచ్చారండీ . . . నా ప్రతీ టపాకి ఉ కమెంట్ ద్వారా మీరు చాలా ఎంకరేజ్ చేసారు . . . ఎప్పటికీమర్చిపోలేను . . . ఈ రోజు ఈ మాత్ర్రం ధైర్యంగా కథ రాసానంటే మీలాంటి వారి వల్లే . . . థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ . . . ఐ మీన్ ఇట్ . . అవునండీ . . రాంగోపాల్ వర్మ మొన్న సాక్షిలో వచ్చే ఆర్టికల్లో ఇంచుమించు మా నెరజాన అనుభవంలాంటిదే చెప్పాడు . . అది ఆయన బ్లాగులో చాలా రోజుల క్రిందటే రాసుకున్నాడని నా ఫ్రెండ్ చెప్పాడు . . . కాలేజీరోజుల్లో కొద్దిమందికైనా అలాంటి అనుభవం ఉంటుందేమోనండీ . . .
గత సంవత్సరంలో తెలుగు బ్లాగుల పరిచయం ఓ వరమయితే , MAD పరిచయం , అందులో పాల్పంచుకునే భాగ్యం కలగడం మరో వరం . అది మన వల్ల కాదు అనో , అది చేయాల్సింది మనం కాదు అనో , వ్యవస్థే అలా వుందనో నిట్టూరుస్తూ కూర్చోవడమో చేయకుండా , " నేనూ ఓ సమిధనవుతాను . . " అంటూ ప్రతి ఒక్కరూ చేయివేస్తే అది తప్పకుండా Make a Differece . కొత్త సంవత్సరం ఏ పార్టీ ఎలా చేయాలి ? ఎవరెవరిని పిలవాలి ? ఏఏ వంటలు తినాలి ? ఏ సినిమాకు వెళ్ళాలి అనే ప్రశ్నలు వేసుకోకుండా MAD సభ్యులు చలికి రోడ్లపక్కన కప్పుకోవడానికి కూడాలేకుండా వున్న నిరుపేదలకు ఏమి చేయగలం అని ఆలోచించారు . కొత్త సంవత్సరపు తొలిరోజుని పొద్దు పొడవక ముందే దుప్పట్ల పంపిణీతో ప్రారంబించారు .
" మా గ్రూపు వాళ్ళు లిటరసీ పెంచడంపై డిస్కస్‌చేస్తున్నారు . కానీ వాళ్ళ ఆలోచన ప్రకారం లిటరసీ పెంచడం జరగని పని అని నా ఉద్దేశ్యం " అన్నాడు .
కడప , ఫిబ్రవరి26 ( వాస్తవం ) : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప జిల్లా నుంచి వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని వైయస్ జగన్ వర్గం నిర్ణయించింది . జగన్ వర్గానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి , ఆదినారాయణ రెడ్డి , తదితర శాసనసభ్యులు శనివారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు . ఉప ఎన్నికల్లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయలక్ష్మిపై వివేకానంద రెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేయకూడదని , అందుకుగాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా వివేకానంద రెడ్డి ఎన్నికయ్యేలా చూస్తామని వారు చెప్పారు .
" ఎదో నవ్వాలన్నట్లు నవ్వే ఆమె నవ్వును తట్టుకోలేకపోయాడతను . . . " ఈ వాక్యాన్నిబట్టిచూస్తే ఇప్పుడు " అతడు " ముంబైనుండి భాగ్యనగరానికి వచ్చి ఉన్నట్టుగా తెలుస్తోంది , నిజమేనా ; - ?
ఏదైనా విషయాన్ని తమ కళ్ళద్వారా చూచి నమ్మేవారిని చార్వాకులు అని అంటాము . ఉదాహరణకి భారతీయ సంసృతి ప్రకారం ఏదైనా తప్పు జరిగినప్పుడు , ఆ తప్పుని చేస్తున్న వారు ఆ తప్పుని చేస్తున్నప్పుడు చూసిన సాక్షులు కావాలి . అలా సాక్షం ఉన్నప్పుడే నిజ్జంగా ఆ తప్పు జరిగినట్లు మన రాజ్యాంగం తీర్పునిస్తుంది . ఈ విధంగా చార్వాకులు అనే వారు ఎవ్వరంటే , చక్రవర్తి అనేవాడు ఈ పోస్ట్ వ్రాసాడు అని అంటే , చక్రవర్తి వ్రాస్తున్నప్పుడు నేను చూడలేదు కాబట్టి నేను నమ్మను అనేవారి . ఒకవేళ చక్రవర్తి నిజ్జంగా ఈ పోస్టు వ్రాస్తున్నప్పుడు వీరు చూచి ఉంటే , అప్పుడు వీరు నమ్ముతారు అన్నమాట .
" నువ్వు ఏం చేసినా నా చేత మాట్లాడించలేవు … . ఈ వాచీ ఆధారంగా నన్నేదో దొంగగా నిరూపించాలని చూస్తున్నావు . . ఇది నాకు నిన్న సాయంకాలం రోడ్డుమీద దొరికింది … " అంత బాధలోను , వెక్కిరింపుగా మాట్లాడకుండా ఉండలేకపోయాడు సుక్కూర్ .
డన జగంబుల మిగుల ప్రఖ్యాతి గాంచె ధరణిధవ దత్త వివిధోపదా విధా స మార్జిత శ్రీ వినిర్జిత నిర్జరాల యేశ్వరుడు తిమ్మభూపతి యీశ్వరుండు
పైగా తెలుగు , తమిళ మార్కెట్‌లతో పోల్చితే . . చాలా చిన్న మార్కెట్ కలిగిన కన్నడలోనూ సినిమా చేసి ఉన్న ఇలియానాకు రెండు కోట్లు రెమ్యూనరేషన్ అన్నది అభూత కల్పనగా పలువురు భావిస్తున్నారు .
ఆమె ఇంటి ముందర ఎప్పుడు వెలగని వీధి దీపం . . ఆ రోజే వెలగడం . .
వో లీటర్ కిరోసిన్ తో పులి కరిగిపోతుంది మెకం మేకై ఏ ఏనాది సుబ్బడుగానో , చాంద్‌భాషా గానో మిగిలిపోతుంది నిన్నటి పులి కోరలు చాస్తూ కడుపుని రగిలిస్తూ కడుపులోనో , కళ్ళలోనో , కట్టుకున్న దాని గుండెలోనో కడుపున పుట్టిన బిడ్డల కంఠంలోనో ఆకలిగా , ఆర్తిగా , కన్నీళ్ళాగా , కడుపుమంటగా మిగిలిపోతుంది మరో అక్టోబరొస్తుంది , మళ్ళా పులి మనసుకెగబాకుతుంది
అలాగా అంటావ్ శ్రీను ? సరే నేను మా కుర్రోళ్ళని కనుక్కొని ఆ తరువాత కామెంటుతా
అదిరిపోయింది త్రుష్ణ గారు . . ఈ పేజి ప్రింట్ తీస్కొని పెట్టుకున్నా . . నాకు అన్నిటికన్న ధనియాల ( simple ) చారు . . నిమ్మకాయ చారు బాగా ఇష్టం . . మేము చారు కొంచెం తియ్యగా కొంచెం పుల్లగా తింటాం . . అందుకని కొంచెం బెల్లం లేక పంచదార వేస్కుంటాం . .
ఇక్కడ ఏమైంది చూడండి . అప్పటికే అభివృద్ధి చెంది పలుకుబడి పొందిన పెట్టుబడుదారుల్లో దాదాపు అంతా సీమాంధ్ర వారే ఉన్నారు . బ్రిటిస్ పాలనలో అందిన కొన్ని ఫలితాలు ఆ ప్రాంతం వారికి అలా కలిసి వచ్చినందున వారు ముందు వరసలో ఉండగలిగారు . దానితోపాటు కొత్తగా పెట్టుబడిదారులుగా ముందుకు వస్తున్నవారు కొత్తగా అవకాశాలు అంది పుచ్చుకున్న తెలంగాణ వారే అధికంగా ఉన్నారు . ఇప్పటికే అభివృద్ధి సాధించిన వారు , సీమాంధ్ర నుండి కొత్తగా అభివృద్ధి చెందుతున్నవారిని కూడా అడ్డుకుంటారని ఇక్కడ ముఖ్యంగా గమనించాలి . వారికి ప్రాంతాల తేడాలు ఉండవు . కానీ కొత్తగా అభివృద్ధి చెందిన పెట్టుబడుదారులు అధికంగా తెలంగాణ వారు కావడంతో , వారి ఎదుగుదలకు అడ్డుపడుతున్న వారు ప్రధానంగా సీమాంధ్ర వారు కావడంతో ఈ ప్రాంతీయ తేడాను తెలంగాణ వారు వినియోగించదలిచారు . నేనిక్కడ చెప్పదలుచుకున్నదేమంటే తెలంగాణ పెట్టుబడిదారులు కొత్తగా అభివృద్ధి చెందుతూ , తమ అభివృద్ధికి ఆటంకంగా కనిపిస్తున్న ఇతర ప్రాంతాల పెట్టుబడిదారుల అడ్డు తొలగించుకోవడానికి ప్రాంతీయ తేడాలను వినియోగించుకోదలిచారు . అంటే ఇక్కడ ప్రాంతాల వెనుకబాటుతనమే ప్రధానం కాదు . ప్రధానమైనది కొత్తగా అభివృద్ధిలోకి వస్తున్న పెట్టుబడుదారులకు ఎదురవుతున్న ఆటంకాలు ప్రధానం . ఆ ఆటంకాలను తొలగించడానికి వాళ్ళు ప్రాంతీయ విభేధాలను ఉపయోగించుకుంటున్నారు . ఆవిధంగా తెలంగాణ సమస్య ముందుకొచ్చింది . తెలంగాణ కేవలం ప్రజల సమస్యే అయితే దానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల మద్దతు ఉండేది కాదు . ఆ సమస్య తమ అభివృద్ధికి కూడా ఆటంకంగా ఉంటూ , తమ ఆటంకాలు తోలగడానికి ఒక గొప్ప మార్గంగా కనిపిస్తున్నందున దాన్లోకి వారు కూడా దుమికి తమ చేతుల్లోకి తీసుకున్నారు .
మన శాసనపాఠాల్ని జాగ్రత్తగా చదివితే వాటిల్లో ఎక్కడో ఒక మూల తప్పనిసరిగా ఇలాంటి గద్య ( paragraph ) ఒకటి దర్శనమిస్తుంది . ఇవి తప్పులు చేసేవాళ్ళ సౌలభ్యార్థం ఉద్దేశపూర్వకంగా చొప్పించిన సేఫ్టీవాల్వులేమోనని మనం అనుమానించడానికి అవకాశం లేదు . ఎందుకంటే ఖచ్చితంగా అవి అవే ! మన చట్టాలన్నీ ( రాజ్యాంగంతో సహా ) ఇలాంటి రహస్యమార్గాలతోను , కొన్ని వర్గాల కోసం ఉద్దేశించిన ప్రత్యేకమైన Emergency Exit లతోను నిండిపోయాయి . ఈ మినహాయింపులు మన ఉమ్మడి న్యాయబుద్ధి ( collective sense of justice ) నీ సమానత్వ సూత్రాన్నీ పరిహాస భాజనంగా మార్చాయి . నిజానికి ఈ దేశంలో సమైక్యమూ , సమానత్వమూ , న్యాయమూ అనేవి ఎవరికీ అవసరం లేదు . తన కులమూ , అందులో భాగంగా తానూ బావుంటే చాలు . అదే సమైక్యం . తన కులానికి కొన్ని చట్టబద్ధమైన ప్రత్యేకింపులు ( reservations ) ఉంటే చాలు . అదే సమానత్వం . అదే న్యాయం . ఈ సంకుచితత్వానికి సామాజిక న్యాయం అని పేరు కూడా పెట్టారు . న్యాయమంటూ ఉంటే అది ఇలా మనిషికో రకంగా , కులానికో రకంగా ఉండదు . కుటుంబన్యాయం , సామాజిక న్యాయం రాజకీయన్యాయం , మతన్యాయం అంటూ ఇన్ని రకాల న్యాయాలు లేవు . ఒకవేళ ఉంటే అది న్యాయమే కాదు . కాని ఈ విషయం ఈరోజు ఇక్కడ ఎవరికీ అవసరం లేదు . ప్రపంచచరిత్రలో ఇప్పటి దాకా జఱిగిందేమిటంటే - ఒకఱి కోసం ఉద్దేశించిన సౌలభ్యాల్ని ఇంకొకఱు వాడుకోవడం . " చీమలు పెట్టిన పుట్టలు పాముల కిఱవైన యట్లు " . మన మీటకాలు ( keyboards ) నిజానికి గ్రుడ్డివారి కోసం ఉద్దేశించినవి . కాని వాటిని వాడేవాళ్ళంతా కళ్ళున్నవాళ్ళే . అలాగే సంసార బాధితుల కోసమూ విధుర వితంతువుల కోసమూ ఏర్పఱచిన విడాకుల్నీ , మాఱుమనువు వెసులుబాటునీ చాలావరకూ ఆ బాధలేమీ లేనివాళ్ళే ఎడాపెడా వాడేసుకోవడాన్ని మనం గమనిస్తున్నాం . అలాగే వ్యవసాయరంగంలో బడుగుల కోసం ఉద్దేశించిన ఆదాయంపన్ను మినహాయింపుని కూడా పిడుగుల్లాంటివాళ్ళే వాడుకోవడం జఱిగింది . అలా వాడుకోబడుతుందని ఆ మినహాయింపు ఇచ్చినవాళ్ళకు తెలియదా ? అంటే , ఎందుకు తెలియదు ? భేషుగ్గా తెలుసు . స్వప్రయోజనాల రీత్యా చాలా దూరదృష్టితో చేసిన పని ఇది . ఇందులో ఉన్న కరటక నీతి ఇది - 1 . మనం ( మినహాయింపు ఇచ్చిన పెద్దమనుషులు ) సమీప భవిష్యత్తులో ఆర్థిక అద్భుతాలేమీ సాధించబోవడం లేదు . కాని ఈ లోగా మనకు వోట్లూ సీట్లూ కావాలి . 2 . ఆ వోట్లూ , సీట్లూ మనకే శాశ్వతంగా దఖలైపోవాలి . ఎట్టి పరిస్థితుల్లోను రెండోవాడికి అవకాశం ఉండకూడదు . అంటే మనకొక శాశ్వత వోట్‌బ్యాంక్ ఏర్పడాలి . అందఱికీ మేలు చేస్తామంటే అది ఏర్పడదు . కమ్యూనిస్టులు ఏదైతే చేస్తామంటున్నారో అది మనమే చేసేసి అధికారంలో సుస్థిరంగా పాతుకుపోవాలి . 3 . మెజారిటీ అంటే అధిక జనాభా . మన జనాభాలో ఎక్కువమంది రైతులు . మనమూ రైతులమే . కాబట్టి వారికి పనికొచ్చేదేమైనా చేస్తే చాలు . మిగతా దేశమంతా ఏ దిబ్బలో కొట్టుకుపోయినా ఫర్వాలేదు . 4 . రైతు సమస్యల మీద గతంలో బ్రిటీషువారి మీద ఉద్యమించి అప్పటి ప్రొవిన్షియల్ ప్రభుత్వాల్లో స్థానం సంపాదించాం . ఆ సమస్యల్లో ముఖ్యమైనది పంటల మీద అధిక పన్ను . కాబట్టి ఇప్పుడు కూడా అదే మంత్రం పఠిద్దాం . 5 . పన్ను తగ్గిద్దామా ? వద్దు . అలా చేస్తే మనకంటే ఇంకా తగ్గిస్తామనేవాళ్ళు మనకు పోటీవస్తారు . అసలు ఏకమొత్తంగా పన్నే ఎత్తేద్దాం . అప్పుడు రైతాంగంలో మన ప్రభంజనానికి తిరుగుండదు . 6 . పనిలో పనిగా మనకూ పన్నుండదు . మన నల్లడబ్బంతా రాజమార్గంలో తెల్లబఱచుకోవడానికి ఇది లెస్సగా ఉపకరిస్తుంది . తద్ద్వారా మనకు ఎన్నికల్లో తోడ్పడే జమీందార్లూ , భూస్వాములూ కూడా మనకే శాశ్వతంగా జై కొడతారు . ఈ రకంగా వ్యవసాయం మీద పన్ను లేకపోవడం అనే ఆర్థిక రుగ్మత స్వాతంత్ర్యానంతరం వచ్చిపడ్డదే తప్ప భారతదేశ చరిత్రలో కొన్ని వేల సంవత్సరాలుగా వ్యవసాయం మీద పన్ను ఉంటూనే వచ్చింది . రాజులు బలి - షడ్‌భాగమనే పేరుతో పంటలో ఆఱో వంతుని రైతుల నుంచి వసూలు చేసేవారు . బ్రిటీషువారి పాలనలో ఆ పన్ను శాతం అమానుషమైన స్థాయి ( 40 - 60 శాతం ) కి పెఱిగిపోవడాన్ని కాంగ్రెస్‌పార్టీ స్వాతంత్ర్య పోరాటకాలంలోను , ఆ తరువాతా కూడా పైన చెప్పిన విధంగా తన కనుకూలంగా మలచుకుంది . కాని వ్యవసాయం మీద ఎంతో కొంత పన్నువెయ్యకుండా మనం గ్రామాల్ని అభివృద్ధి చెయ్యలేము . కాబట్టి గ్రామీణ యువకులు ఉగ్రవాదులు కాకుండా నిరోధించనూ లేము . రైతులక్కూడా ఏ సహాయమూ చెయ్యలేము . ప్రీమియమ్ చెల్లించకుండా బీమా ప్రయోజనాన్ని అందించగలమా ? ఇప్పుడు రైతుల పేరు చెబితేనే బ్యాంకుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి - వసూలు కాని వేలాదికోట్ల అప్పులు గుర్తొచ్చి . దానికి తోడు శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తూండడంతో శేఖర్‌దాదా రైతుల అప్పులు మాఫీచెయ్యాలంటూ పాతపల్లవి ఎత్తుకున్నాడు . ఎంతకాలమిలా అప్పులు మాఫీ చేస్తారు ? ఎంతకాలమిలా రైతుల్ని దేశానికి గుదిబండలుగా మారుస్తారు ? ఎంతకాలమిలా రైతుల్ని దేశపు ఆర్థిక వనర్ల పాలిట దోపిడీదార్లుగా రూపొందిస్తారు ? వ్యావసాయిక ఆదాయం మీద పన్ను సరికొత్త ప్రతిపాదన కాదు . గతంలో బలరామ్ జాఖడ్ అనే లోక్‌సభ స్పీకరు ఈ విషయమై పదే పదే ప్రస్తావించి స్పందన లేకపోవడంతో ఊరుకున్నాడు . మన నాయకుల స్వార్థమూ , రైతుల అజ్ఞానమూ పట్టణ ప్రజల ఉదాసీనత్వమూ , ఆర్థికవేత్తల మూర్ఖత్వమూ , ఎఱ్ఱజెండాల ప్రచారమూ - వెఱసి ఈ సంక్షోభానికి కారణం . ఈ రోజు ఇలాంటి ప్రతిపాదనలు చేసేవాళ్ళు రైతుల పాలిట శత్రువులుగా చూడబడతారు . కాని పట్టణ ప్రజల శాతం పెఱిగే కొద్దీ భూమి విలువ అధికమయ్యే కొద్దీ ప్రభుత్వానికి రాజస్వపు ( revenue ) అవసరాలు హెచ్చేకొద్దీ దీని అవసరాన్ని తప్పకుండా అందఱూ అర్థం చేసుకుంటారు . అది 20ఏళ్ళకు కావచ్చు . 40ఏళ్ళకూ కావచ్చు . అయితే వినాయకుడి బొడ్డులో తేలుందనీ , అది కుట్టడం మూలానే మనకు నొప్పిగా ఉందనే నగ్నసత్యాన్ని ఎవఱో ఒకఱు బయటపడి వెల్లడించక తప్పదు .
సంస్కృతంలా కాక , తెలుగులో ( కన్నడంలో కూడా ) పాదాంతములో విరామం లేదు . అందుకే ఒక పాదం మరొక పాదములో చొచ్చుకుపోతుంది . ఒక విధముగా చూస్తే ఈ వృత్తాలన్నీ నియమబద్ధమైన వచనాలే . ఒక్కొక్క పాదంలో పదాలు ఒక్కొక్క విధంగా అమర్చబడిఉంటాయి కనుక ఒక ప్రత్యేకమైన లయ ఉండదు వీటిని పాడేటప్పుడు . ము - కారాంత పదాలు అనుస్వారంతో అంతమవుతాయి కాబట్టి వీటిని చివరి గురువుగా ఎన్నుకోవచ్చు వాడుక భాషలో . విక్రీడితాలను గురించి ( మో - 3 ) , మాలావృత్తాలను గురించి ( మో - 4 ) నేను ఇంతకు ముందు రాసిన వ్యాసాలను ఇక్కడ ఉదహరించడం అవసరమే .
పరలోకాలు నాకు తెలియవు . తన సంతోషమె స్వర్గము తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ .
మహిళ : అవునండీ . . నేనూ చూస్తున్నాను . పాపం . . అవన్నీ స్వయంకృతాపరాధాలు . . ఇలాంటి అత్యాచారాలు చేసే అబ్బాయిలను ఎలా గుర్తించాలి వాళ్ళనుండి ఎలా తప్పించు కోవాలి అనే విషయాలను ఈ తరం అమ్మాయిలు నేర్చుకోవాలి . ఆ పధాంలో ఇవ్వాళ సాక్షి ఆదివారం స్పెషల్ లో మన హైదరాబాద్ అమ్మాయి సానియా మిర్జా ఇంటర్వూని ప్రతీ అమ్మాయి చదవాలి . అందులో ఓ నూతన సంవత్సరం నాడు సానియాకు జరిగిన సంఘటన లో ప్రతీ అమ్మాయికి ఓ మంచి చిట్కా దాగి ఉంది .
ప్రదీపు తీక్షణంగా చూశాడు పార్వతివేపు . " నువ్వు మొదట్నించీ ఇంతే . మీ నాన్నగారు ఏం చెయ్యమంటే అదే . చదువు అంటే చదవడం , లిటరేచరంటే లిటరేచరు . నీకో బుర్ర వుందనీ , దాన్ని నువ్వు ఉపయోగించుకోవచ్చనీ ఎప్పుడయినా తట్టిందా నీకసలు ? " రూక్షణంగా అన్నాడు . కొడుకుమీంచి కళ్లు తిప్పకుండానే .
మనం ఒక బ్లాగ్ మొదలు పెటాం రోజు రాస్తున్నాం కాని వెబ్ ప్రపంచం లో అది ఎలా ఉందొ దాని మంచి చెడు చూడాల్సింది మనమే కదా . . . కానీ ఏది మంచో ఏది చెడో ముంది మనకొక అవగాహన ఉండాలి కదా అందుకే ఇప్పుడు నేను ఇవ్వబోయే వెబ్సైటు లు మీ బ్లాగ్ ని స్ఖున్నంగా విసిదికరిస్తాయి . . . ఎక్కడ పొరపాటు జరిగిందో . . . అక్కడ మీ బ్లాగ్ దారి తప్పుతుందో . . . అనీ కరెక్ట్ గ అనల్య్సె చేసి చ్పుతాయి వెంటనే మనం తిస్కోగాలిగిన చెర్యలు తీస్కుంటే మన బ్లాగ్ ఆరోగ్యం గ ఉటుంది అనమాట . . . ఇక ఆలస్యం ఎందుకు మరి మీ బ్లాగ్ అడ్రస్ ఎంటర్ చేసి గ్రేడ్ ఏంటో క ( . . . )
జాతీయంగా , అంతర్జాతీయంగా ఇ - పరిపాలనను వేర్వేరుచోట్ల గతంలో విజయవంతంగా అమలుచేసిన అనుభవాల ప్రాతిపదికగా జాతీయ ఇ - పరిపాలన ప్రణాళిక ( ఎన్ఇజిపి ) కోసం ఒక మెరుగైన విధానానికి రూపకల్పన చేశారు . ఈ విధానంలో ఈ కింది అంశాలుంటాయి .
ఐన్స్టయిన్ మెదడు మీద జరిగిన పరిశోధనల సారాంశం గురించి చెప్పుకోవాలంటే , ముందు మెదడు లోని ముఖ్య ప్రాంతాల గురించి , కొన్ని ముఖ్యమైన కొండగుర్తుల గురించి చెప్పుకోవాలి . మెదడు కుడి ఎడమగా రెండు అర్థగోళాలుగా విభజించబడి ఉంటుంది . ఒక్కొక్క అర్థగోళం నాలుగు ముఖ్యమైన ప్రాంతాలుగా విభజించబడి ఉంటుంది . అవి - ఫ్రాంటల్ , పెరైటల్ , టెంపొరల్ , ఆక్సిపిటల్ ప్రాంతాలు ( చిత్రం ) . ఇప్పుడు అధ్యయనాల సంగతి చూద్దాం .
పోస్టాఫీసులో ఓ పదిరూపాయలతో దరఖాస్తు కొనుక్కొని , ఫోటోలూ వగైరాలతో పూర్తిచేసి , ఇంకో రెండువందల నలభై రూపాయలు కట్టి , దాఖలు చేస్తే - - ఓ వారం పదిరోజుల్లో పోస్ట్ మేన్ల ద్వారా చిరునామా నిర్ధారణ చేసుకొని , మనకి ఓ కార్డు ఇస్తారట . అది ఓ సంవత్సరం పాటు చెల్లుతుందట . మళ్లీ నవీకరణకోసం నూట నలభై రూపాయలు కట్టాలట . ఇదోరకం కార్డు !
జీవపరిణామం గురించిన సరైన అవగాహన భౌతికవాద దృక్పథానికి తోడ్పడుతుంది . అందుచేత అదేదో జీవశాస్త్రం గురించి ఆసక్తి ఉన్నవారికి మాత్రమే పరిమితమైన విషయం కాదు . అందులోని తాత్విక అంశాలు అందరూ తెలుసుకోదగ్గవే . ఇది పంతొమ్మిదో శతాబ్దంలో మొదలైన సిద్ధాంతం .
ఆ శిలాశాసనాన్ని చదవగానే భట్టికి సంభ్రమాశ్చర్యాలు కలిగాయి . తన ' అన్న విక్రమాదిత్యుడు అట్టి సాహస కార్యాన్ని తప్పక నెరవేర్చగలడు ' అనుకున్నాడు . తాము ఆశించినదే ఎదురుగా ఉన్నట్లు తోచి భట్టికెంతో ఆనందం కలిగింది . భట్టి దేవాలయంలోకి ప్రవేశించి , అక్కడ గల మహంకాళికా దేవిని అర్చించాడు . మనో వాక్కాయ కర్మల , ఇష్టపూర్తిగా పూజాదికాలు నిర్వహించాడు . కోవెలలో అమ్మవారి కంటి చూపుకు ఎదురుగానే , సరోవరం ఉండటాన్ని , దాని మధ్యలో త్రిశూలం ఏ ఆధారమూ లేకుండానే నిలిచి ఉండటం గమనించాడు . అది అమ్మవారి మహిమగా గ్రహించాడు . దేవీ కోవెలలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని , కన్యాపురానికి తిరుగు ప్రయాణమయ్యాడు . నగరం చేరి , తనకు అన్న , రాజూ అయిన విక్రమాదిత్యుడి దగ్గరి కెళ్ళి , వినయంగా నమస్కరించాడు . భట్టిని చూడగానే విక్రమాదిత్యుడికెంతో సంతోషం కలిగింది . ప్రేమాప్యాయతలతో భట్టిని కౌగిలించుకున్నాడు . " నా ప్రియమైన తమ్ముడా , భట్టీ ! నీవు నన్ను కంటికి రెప్పవలె కాపాడు ఆత్మబంధువవు . నీ విక్కడ నుండి వెడలి ఆరుమాసాలు గడిచినవి . మనం ఆశించినట్లుగా ఏదైనా ప్రదేశాన్ని కనుగొన్నావా ? " అని అడిగాడు . " అన్నా ! కనుగొంటిని " అన్నాడు భట్టి . సవిస్తరంగా తాను చూచిన ప్రదేశాన్ని , దేవీ ఆలయాన్ని , శిలా శాసనాన్ని కళ్ళకు కట్టినట్లుగా వివరించాడు . విక్రమాదిత్యుడికి ఎంతో ఆనందమూ , ఉత్సాహమూ కలిగాయి . వెంటనే అక్కడికి వెళ్లాలని నిశ్ఛయించుకున్నారు . తమ అనుచరులలో ఒక సమర్దుడిని ఎంపిక చేసి , కన్యాపుర రాజ్యపు బాగోగులు చూడవలసిందిగా ఆదేశించారు . ఒక పుణ్య తిధినాడు , సుముహుర్తం చూసుకుని భట్టి విక్రమాదిత్యులిద్దరూ మారువేషాలు ధరించి వింధ్యాటవికి ప్రయాణ మయ్యారు . దట్టమైన అందమైన అరణ్యాలని , కొండకోనలని , వాగు వంకలనీ దాటుకుంటూ వెళ్ళారు . దుర్గమారణ్యాలలో ప్రయాణిస్తూ . . . ప్రకృతి రమణీయతనీ , వన్యమృగ సంచారాన్ని ఎంతగానో ఆనందించారు . కొన్ని దినాల ప్రయాణానంతరం , ఇద్దరూ వింధ్య పర్వత ప్రాంతాన్ని , గుణవతీ నదీ తీరాన్నీ చేరారు . ఉత్సాహంగా మహంకాళీ దేవీ పురాతన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు . పుష్కరిణిలో స్నానమాచరించి , దేవళంలోకి ప్రవేశించారు . విక్రమాదిత్యుని చూసి , మహంకాళి దేవి ఎంతో ప్రసన్నురాలైంది . గోవు తన వత్సలని చూసినట్లుగా , తల్లి తన బిడ్డలని చూసినట్లుగా మహంకాళి దేవి , భట్టి విక్రమాదిత్యులని వాత్సల్యంతో చూసింది . విక్రమాదిత్యుని సాహస లక్షణాలని చూసి ' ఈతడి చేత ఇక్కడ నగరాన్ని నిర్మింప చేయాలని , పురాతన ఆలయానికి ప్రాభవం తేవాలనీ ' సంకల్పించింది . విక్రమాదిత్యుని సామర్ధ్యమందుకు తగినదో కాదో పరీక్షింపనెంచి , అదృశ్య రూపంలో భట్టి విక్రమాదిత్యుల వెంట నడిచింది . దేవళంలోని దేవీ మూర్తికి పూజాదికాలు , సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి , భట్టి విక్రమాదిత్యులు సరోవరం దగ్గరికి చేరారు . విక్రమాదిత్యుడు శిలాశాసనాన్ని మరోసారి చదివాడు . సరస్సు మధ్యలో ఆధార రహితంగా , నీటిపై నిట్టనిలువుగా నిలిచి ఉన్న త్రిశూలాన్నీ , సరస్సు పైకి వ్యాపించి ఉన్న మర్రి కొమ్మలకు వ్రేలాడుతున్న ఏడు ఉట్లనీ పరీక్షగా చూశాడు . ఆధారరహితమైన త్రిశూలాన్ని చూసి " తమ్ముడా ! భట్టి ! నీటిలో ఈ త్రిశూలము ఆధారము లేకనే ఎట్లు నిలిచి ఉన్నది ? " అని అడిగాడు . భట్టి " మహారాజా ! గుడిలోని దేవికి ఎదురుగా నున్నది గనుక , ఆ తల్లి మహిమతోనే అది అట్లు నిలిచి ఉన్నదని తలంచుచున్నాను " అన్నాడు . విక్రమాదిత్యుడి కది చూసి ఎంతో ఉద్వేగమూ , భక్తి పరవశమూ కలిగాయి . శిలా శాసనం మీద వ్రాసి ఉన్న సాహస కార్యము చేసి తీరాలన్న పట్టుతల కలిగింది . ఒకవేళ దేవీ దర్శనము పొందలేక , ప్రాణాలు కోల్పోయినా పోయేదేం లేదనిపించింది . మరోసారి భక్తిగా సరోవరంలో పుణ్యస్నానమాచరించి , గుడిలోని తల్లిని స్మరించుకున్నాడు . భట్టిని వటవృక్షము మొదలులో నిలబడమని చెప్పాడు . వృక్ష రాజానికి నమస్కరించి చెట్టెక్కాడు . ఒర నుండి కత్తి తీసి నోటబెట్టి , చెట్టు కొమ్మలపైని ఉట్ల దగ్గరికి చేరాడు . విక్రమాదిత్యుడికి తాను చేయబోయే సాహసకార్యం ఎంత ప్రమాదకరమైనదో తెలుసు . అయితే , అందుకు రెట్టింపుగా , విక్రమాదిత్యుని మనస్సు , మహంకాళి దేవిపై భక్తితోనూ , నమ్మకంతోనూ నిండిపోయింది . కళ్ళు నిగిడ్చి ఏడు ఉట్లని పరిశీలించాడు . అవి ఒకే కొమ్మకు వరుసగా లేవు ; ఒక్క వేటులో తెగ వెయ్యటానికి ! వర్తులా కారంలో ఉన్నాయి . విక్రమాదిత్యుడు " తమ్ముడా భట్టి ! ఈ ఏడు ఉట్లునూ ఒకే తాటికి కట్టిలేవు . ఒకే వరుసలోనూ లేవు . వలయాకృతిలో అమర్చబడ్డాయి . ఒక్క వేటుతో వీటిని తెగ వేయిటెట్లు ? ఆలోచించి ఉపాయం చెప్పు ! " అన్నాడు . అప్పటికే భట్టి దానిని పరిశీలనగా చూస్తున్నాడు . అతడికీ చిక్కు అర్దమయ్యింది . " అన్నా ! నీ కుడిపాదమును ఒక ఉట్టిపై ఉంచి , దాని ప్రక్కనున్న ఉట్టిని ఎడమ చేత బట్టుకొనుము . ఊయల ఊగినట్లుగా , కుడివైపుకు ఊపు తెచ్చుకొనిన , అవి గుండ్రముగా తిరిగి పురి ఎక్కగలవు . అప్పుడు ఏడు ఉట్లు తాళ్ళు పెనవేసుకుపోయి , ఏక తాడు వలె బలంగా , గట్టిగా కాగలవు . అప్పుడు కత్తితో , ఒక్కవేటుతో వాటిని తెగనరక వచ్చును . తెగిన ఉట్లు నీటిని చేరక ముందే , తల్లక్రిందులుగా త్రిశూలము పైకి దూకుము . ఆపైన దేవీ కృప ! " అన్నాడు . విక్రమాదిత్యుడు మరోమారు ఉట్లను పరిశీలనగా చూశాడు . గుండెల నిండా ఊపిరి పీల్చుకుని సాహస క్రియకు పూనుకున్నాడు . కొన్నిలిప్తల పాటు కాళీ మాతని స్మరించాడు . శ్రద్ద , పట్టుదల కలగలిపి , ఒక ఉట్టిపై కుడిపాదము నుంచాడు . దాని ప్రక్కన గల మరియొక ఉట్టిని ఎడమ చేత బట్టుకుని , శరీరాన్ని కుడివైపుకు వంచి , ఒక్క ఉదుటున ఊపు తెచ్చుకున్నాడు . రంగుల రాట్నము తిరిగినట్లుగా ఉట్లు తిరిగి , ఏడు తాళ్ళూ పెన వేసుకు పోయి పురి ఎక్కాయి . విక్రమాదిత్యుడు ఆ ఏక తాటిని , కత్తితో ఒక్క వేటున తెగ వేశాడు . మరుక్షణమే తాను తల్లక్రిందులుగా త్రిశూలము పైకి దూకాడు . ఉట్లు నీటిని చేరక మునుపే అతని శిరస్సు త్రిశూలాన్ని తాకింది . భట్టి ఇదంతా రెప్పవాల్చక , ఊపిరి పీల్చక చూస్తున్నాడు . విక్రమాదిత్యుడి శిరస్సు త్రిశూలాన్ని తాకిన క్షణాన , భట్టి కళ్ళ ముందు పెద్ద మెరుపు మెరిసినట్లయ్యింది . ఆ వెలుగుకతడు కళ్ళు మూసుకున్నాడు . క్షణం తర్వాత కళ్ళు తెరిచి చూస్తే . . . అతడి ముందు ట్రిశూలమూ లేదు , విక్రమాదిత్యుడి దేహమూ లేదు . ~ ~ ~ ~ ~ ~
న్యూయార్కు నుంచి సిన్ సినాటి వెళ్లే విమానం ఎలానో వెతుక్కుని తాపీగా కూర్చున్నానే గానీ " బాగా ఆలస్యం అయిందే " అని మనసులో కొద్దిగా పీకుతూనే వుంది ఎందుకంటే నన్ను రిసీవ్ చేసుకోవటానికి రావాల్సిన వ్యక్తి అసలు వేచి ఉంటాడో లేదో తెలియదు . మొత్తానికి ఆ దేశవాళీ విమానం మెల్లగా డల్లాస్ - ఫోర్ట్ వర్త్ విమానాశ్రయంలో దిగేటప్పటికి రాత్రి పన్నెండు గంటలయ్యింది . డెల్టా వాళ్లకు నా బాగేజీ మిస్ అయిన సంగతి రిపోర్టు చేసి అటు ఇటు చూసాను . విమానాశ్రయం మొత్తం మీద ఒక పది మంది వుంటారేమో . అంత ఖాళీగా వుంది . దగ్గరలో వున్న ఫోన్ నుంచి మా పీ . యమ్ కు ఫోన్ చేద్దామంటే అన్ని ఫోన్లూ క్రెడిట్ కార్డుతో పని చేసేవే . కాసేపు తిట్టుకుని ఎవరైనా నా గురించి లాంజ్ లో వున్నారేమో అని వెతికా … ఒక్కడూ లేడూ . ఎందుకుంటారు ? ఏడు గంటలకు రావాల్సిన విమానం పన్నెండుకు వస్తే .
ఎందుకింత లైను ఉందా అని చిరాకుపడి చూస్తే పాపం ఒక ముసలమ్మ కష్టపడుకుంటూ నడుస్తూ గొణుక్కుంటూ ఆర్డరు ఇస్తున్నది . కౌంటరు కుర్రాడికి బొత్తిగా ఓపిక లేనట్టుంది , చిరాగ్గా మొహం పెట్టి ఆర్డరు వింటున్నాడు . లైనులో మిగిలిన వాళ్ళు కూడా ఈవిడ ఆర్డరు ఎప్పటికయ్యేనా అని విసుగ్గా నిలబడ్డారు . ఎనభై ఏళ్ళ వయసులో ఆ ముసలావిడకి ఎందుకొచ్చిన కష్టం చెప్పండి ? హాయిగా ఇండియాలో ఐతే పిల్లా జెల్లా వండిపెడుతుంటే క్రిష్ణా రామా అంటూ తిని కూర్చుండేది కదా . సరే ఇక ఎంతసేపు ఆవిడకేసి చూస్తాను . చెప్పానుగా తలుపు దగ్గర నిలబడ్డానని , ఆ పెద్దమనిషి కుర్రాళ్ళను ఏదో అడుగుతున్నాడు . " You guys wanna come for a ride tonight ? I will drop you by tommorow " .
అల్లాహ్ ధ్యానంలో మరియు ఖుర్ఆన్ పఠించడంలో నిరీక్షణ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి .
ఐతే , సన్మానాలు చేస్తున్నప్పుడో చేయిస్తున్నప్పుడో చేయించుకునేప్పుడో మాత్రమే పెద్ద పాలెం వాళ్ళని కలిసే రాజుగారికి భజనబృందాల పొగడ్తల బృందగానాల్లో యీ నిరసనలూ యీర్య్షలూ తెలీనేలేదు .
& amp ; # 8212 ; కాజ సురేశ్ ( surkaja @ gmail . com ) ఏ కులము , ఏ మతముర నీది దుడ్డులెన్నిన్నుయ్ ర నీకు ఈ చెక్కలు చాలవురా ఓరి తెలుగోడ యాస బాసల ముక్కలంత అవసరమా , ఓ read more »
ఖ్యాత వృత్తాలు , జాత్యుపజాతుల తరువాత మిగిలిన వాటిలో మహాస్రగ్ధర , లయగ్రాహి , ఉత్సాహ కన్నడమునుండి గ్రహించబడినవి . తరువోజ తెలుగు శాసనాలలో కనిపిస్తుంది . స్రగ్ధర , వనమయూరము , లలితగతి , వసంతతిలకము , భుజంగప్రయాతము , మందాక్రాంత , స్వాగతము , మాలిని , తోటకము సంస్కృత ఛందస్సులో ఉన్నాయి . మిగిలినవి క్రౌంచపదము , మత్తకోకిల , మానిని , లయహారిణి , కవిరాజవిరాజితము , మంగళమహాశ్రీ , మణిగణనికరము . వీటిలో క్రౌంచపదము , మణిగణనికరము , మంగళమహాశ్రీలను గురించి తరువాత చర్చిస్తాను . ఇవి పోగా ఉండేవి మత్తకోకిల , మానిని , కవిరాజవిరాజితము , లయహారిణి . సామాన్యముగా లాక్షణికులు లక్షణాలకు లక్ష్యాలను ఇచ్చేటప్పుడు ముద్రాలంకారాన్ని వాడుతారు అనే విషయాన్ని మనము జ్ఞాపకములో పెట్టుకోవాలి .
హరిణి ఎపðడూ తన మనసుకు నచ్చిన అం శాల్నే ఎన్నుకుంటుంది . అందుకే ఓల్టేజ్‌పై పరి శోధన గావించి విద్యుత్ వినియోగంలో మెళుకువ లను ప్రజలకు వివరి స్తుంది . భవిష్యత్తులో ఆమె అమెరికాలోని కళా శాలలో ఉన్నత విద్యను అభ్యసించాలను కుంటోంది .
సినిమా పాటలు ఎంత మంచివైనా తెరిపి లేకుండా మళ్ళీ మళ్ళీ వింటే బోరు కొట్టేస్తాయి . మా చిన్నతనంలో రఫీ పాడిన మంచి పాటలు బినాకా గీత్‌మాలా వంటి ప్రోగ్రాముల్లో పదే పదే వినిపించి వినేవారికి విముఖత కలిగించడం నాకు గుర్తుంది . శాస్త్రీయసంగీతంలో అలా జరగదు . ఎందుకంటే రాగాల్లోనూ , పాటలోనూ అంతులేని వైవిధ్యం చూపడానికి అవకాశాలుంటాయి . ఆలాపన మొదట్లో కొద్దిపాటి స్వరసంచారం జరుగుతున్నప్పుడు కూడా వినేవారి మనస్సు రాగంలోని ఇతర స్వరాల , సంగతుల గురించి ఆలోచిస్తూ , వాటిని అభిలషిస్తూ ఉంటుంది . ముందుగా ఊహించే ఈ anticipation రాగంపట్ల మన ఉత్కంఠను పెంచి , శ్రద్ధగా వినేలా చేస్తుంది . అందుకనే శాస్త్రీయ సంగీతంపట్ల అభిమానులకు ఉండే విశ్వాసం మతవిశ్వాసమంత బలమైనదిగా అనిపిస్తుంది . ఎక్కువగా , రకరకాల సంగీతం వింటూ ఉన్నవారికి అభిరుచి మెరుగుపడి , అంతకంతకూ మంచి విషయాలను ఆస్వాదించి , ఆనందించడం సాధ్యమౌతుంది .
జాతి సిగ్గుతో తలదించేసుకోవాల్సిన సంగతి మరొకటి దొరికేసింది మనకు . అద్భుతమైన సినిమాలెన్నింటిలోనో నటించి , అమెరికాతో సహా అనేక దేశాల ప్రజలను ఆనంద డోలికల్లో ఓలలాడించిన షారుఖ్ ఖాన్‌ను పేరొందిన నటుడని కూడా చూడక అమెరికా ఇమ్మిగ్రేషనువాళ్ళు రెండు గంటల సేపు ప్రశ్నించారంట . తన పేరును బట్టే తనకీ అవమానం జర్గిందని చెబుతున్నాడతడు . [ మై నేమ్ ఈస్ ఖాన్ అనేది ఖాన్ కొత్త సినిమా పేరంట : ) ] ఎంత అవమానం ! రండి , సిగ్గుతో తలొంచేసుకుందాం .
ఈ రోజంతా ప్రపంచంలో వున్న సర్వ మహిళా జనం అమాయకంగా మురిసిపోయిన రోజు ఇది . ఓహో మీరు అదుర్స్ , మీరు కత్తి , మీరు కమాల్ అని ఈ రోజంతా ఒకటే ఊదర . రకరకాల కంపనీలు మహిళా సాధికార దినోత్సవాలు హడావిడిగా జరిపేసాయి . అందులో కూడా పాల్గొన్న వారంతా సాధికారత సాధించిన వారే . మళ్ళీ వారికి దగ్గులు నేర్పడం ఎందుకో అర్ధం కాదు . ఏదైనా పల్లెటూరుకో , సిటీలో ఏదో గల్ల్లీకి వెళ్లి , అక్కడ అమ్మలక్కలందరికి అవసరమైన సాధికారత గూర్చి చెప్పొచ్చు కదా …
పొద్దున తిన్న పట్టెడు మెతుకులు . అతనికి నీరసంగా వుంది . ఖాళీ కడుపున నాలుగైదుసార్లు నీళ్ళు తాగడం వల్ల కడుపులో తెములుతోంది . డోకొచ్చినట్టుగా ఉంది . ఎంత త్వరగా డబ్బులిస్తే , అంత త్వరగా ఆ చోటు నుంచి దాటుకోవాలని తప్ప , మరో ఆలోచన అతనిలో లేదు . కొద్ది సేపాగి , మనసాగక , దాపు నుంచి వెళ్తోన్న పోలీసతని కేసి చేతులు జోడించి , " దొరెప్పుడొస్తడు , బాంచన్ " అన్నాడు .
@ క్రిష్ - మీ అభిప్రాయం మీది - తప్పకుండా ఉండొచ్చు - ఉండకూడదనలేదు , అలా ఉండటం దురదృష్టం అన్నానంతే : - ) పోస్టు రాయాలని చాలా కాలంగానే అనుకుంటున్నా . ఏడో పుస్తకం విడుదలకి ముందుగా ఆరో పుస్తకాన్ని ఒకసారి తిరిగి పఠిస్తున్నా . అది పూర్తి కాకుండానే ఏడోది వచ్చేసింది . అన్నట్టు అమెజాన్ వాడు వాగ్దానం చేసినట్టు , శనివారమే ఇల్లు చేరింది పుస్తకం . ఇప్పుడు మరి ఏడోది చదివెయ్యాలనే ఉబలాటం . . 759 పేజీలంటే మాటలా ! : - ) సిరీస్ మొత్తమ్మీద - మొదటిది - పుస్తకం చాలా బావుంది . సినిమా చెత్త . రెండోది - పుస్తకం పర్లేదు . సినిమా పర్లేదు . మూడు ( అజకబాన్ ) - పుస్తకం బావుంది . సినిమా చాలా బావుంది . నాలుగు - పుస్తకం బోరు . సినిమా చెత్త . ఐదు - పుస్తకం బావుంది . సినిమా పర్లేదు . ఆరు - పుస్తకం బావుంది . ఏడు - పుస్తకం చాలా బావుంది ట !
నన్ను ఫ్రాంకీ అని పిలిచే స్నేహితుడు రేమాండ్ ఒక్కడే . ఎప్పుడో ఓ జోక్ చెబుతున్నప్పుడు పిలిచాడలా . అంతే అదే పేరు స్థిరపడిపోయింది . నా కోటుని విప్పి పక్కన బెట్టాడు . శూన్యంలోకి చూస్తూ తన ప్రశ్నలకి జవాబులు వెదుక్కుంటున్న మనవడిని చిన్నగా కసిరి గది ఊడవమని చెప్పాడు . ఆ అబ్బాయి ఇబ్బందిగా లేచి , తన కోపాన్ని ప్రదర్శిస్తూ , నేలని గట్టిగా తాటించి లోపలికి వెళ్ళాడు .
కొత్తపాళీ గారు , మీ సిఫారసుకి ధన్యవాదాలు : - ) గత రెండు సంవత్సరాలుగా కవి సమ్మేళనం ప్రత్యక్షంగా చూద్దామనుకుంటున్నది నిజమే . కామేశ్వరరావు గారు , : - ( ~ సూర్యుడు
అన్నపురాసులు ఒక చోట ఆకలిమంటలు ఒక చోట హంసతూలిక లొకచోట అలసిన దేహా లొకచోట ( ఇంకా … )
90 . పి . చంద్ కార్మిక , గిరిజన , రైతాంగ కథలు అనేకం రాసిన పి . చంద్ భూనిర్వాసితులు లాంటి సింగిల్ కాన్సెప్ట్‌తో కథా సంపుటి వెలువరించారు . కరీంనగర్‌కు చెందిన వీరు జులుం అనే కథా సంపుటిని కూడా వెలువరించారు . తెలంగాణాలో చోటు చేసుకున్న ఉద్యమాల పట్ల నిబద్ధత కలిగి అణచివేతకు గురైన వర్గాల పక్షాన నిలిచి కథలు రాశాడు . బొగ్గు గనుల్లో జరుగుతున్న మార్పులను , అన్యాయాలను చిత్రించే కథలను అనేకం రాసాడు .
ఈ కెమేరాలని కీలక స్థానాల్లో పెట్టి , కంట్రోలు రూముకి అనుసంధానం చేస్తారట . అవి వందమీటర్ల దూరం లో వున్నా , వస్తువుని స్పష్టంగా చూపిస్తాయట . యెటుకావాలంటే అటు వీటిని తిప్పుకుంటూ , కంట్రోలు రూము నించే వీటిని నియంత్రించవచ్చట . రాత్రీ , పగలూ , వర్షం , మంచూ యేదైనా , చక్కగా పనిచేస్తాయట .
అది వ్యాఖ్యల ద్వారా తెలుపగలరు . అంతకు మించి నాకు ఏ కుల , రాజకీయ పక్షాల మీద ప్రత్యేక సానుభూతి గాని , అభిమానం గానీ లేదని మనవి చేసుకుంటున్నాను . : - )
ఏమాట కా మాట చెప్పుకోవాలి ఇంటికి రాగానే . . వేడి వేడిగా అన్నం , కూరలు పప్పు అంటూ ఎంత ప్రేమగా వడ్డించేదో అంత ఇష్టంగా తినేవాళ్ళము . ఒక్క ఎమెస్కో వాళ్ళు పుస్తకాల వరద కురిపించేదాక . . . . అదిగో ఆ పుస్తకాలు నవలలు ఇంటికొచ్చాక తెలిసింది ఆకలి బాధ ఎంటో . . అంతకు ముందు అమ్మ పెట్టిన కూరలు వగైరా గాలికెగిరిపోయాయి . . ఆకలి ముందు అవెంత ? మొన్న మొన్నటిదాకా అన్నయ్య , అక్కా , నేను తమ్ముడు కలిసినప్పుడు " అమ్మ అసలు వంట కూడా చేయకుండా ఎలా నవలలు చదివేది కదా " అని . . మా అమ్మ మహా అయితే రెండుసార్లు పోని మూడు సార్లనుకుంటా పుస్తకాలు పట్టుకుని , టైం చూడకుండా వంట మర్చిపోయింది . తరువాత అంటే మేము లంచ్ కని ఇంటికెళ్ళగానే " అయ్యో అప్పుడే 12 . 30 అయ్యిందే . . చూసుకోలేదమ్మా . . " అంటూ అప్పటికప్పుడు తొందరగా అయ్యే టిఫిన్ ఎదో చేసేసి పంపించేది .
పెసరట్టు చెయ్యడానికి ముందుగా కావలసిన దినుసులు , ముదురాకుపచ్చ రంగులో ఉన్న పెసలు , ఓ చారెడు బియ్యం . ఈ పెసలు కోస్తా జిల్లాల్లో పండినవయితే మంచిది . ఏ కీన్యా నుంచో , కొలంబియా నుంచో దిగుమతి అయిన పెసలు కిరసనాయిలు వాసనొస్తాయి . వాటికి రుచీ పచీ ఉండదు .
( తంబోలా కలెక్షన్లు యెంతవచ్చాయో లెఖ్ఖించి , పెద్దాయనతో సంప్రదించి , నిర్వహణ ఖర్చులకి కొంత మినహాయించి , యే ప్రైజ్ కి యెంతో ముందే నిర్ణయించి , ప్రకటిస్తారు . ఈ ప్రైజ్ లలో , జల్దీ ఫైవ్ , మొదటి , రెండవ , మూడవ లైన్లకీ పోగా మిగిలిన దాన్ని కొంచెం పెద్ద మొత్తంగా ' ఫుల్ హౌస్ ' కి కేటాయిస్తారు . )
అప్పుడా బాబు ఏమన్నాడంటే , ' అమ్మా , ఇందులో ఖచ్చితంగా ఏదో మతలబు ఉండే ఉంటుంది . అమెరికా వాళ్ళు ఇవ్వదలచుకున్న యురేనియాన్ని కుక్క ఏమన్నా పాడుచేసిందేమో అని అనుమానంగా ఉంది ' అని .
నిన్న చంద్రలత గారు బ్లాగు పాఠకుల గురించి పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతున్నప్పుడు ఇవి నా ఆలోచనలు .
కోస్తా ఆంధ్రలో లోక్ సత్తా కూడా కమ్మవాళ్ళకి ఎక్కువ టికెట్లు ఇచ్చింది . లోక్ సత్తా గెలవలేదు కానీ కొన్ని చోట్ల కాంగ్రెస్ కి నష్టం వచ్చింది . కమ్మవాళ్ళ జనాభా చాలా తక్కువగా ఉన్న శ్రీకాకుళం , విజయనగం జిల్లాలలో మాత్రం కాంగ్రెస్ గతం కంటే బలపడింది . ప్రజాస్వామ్యం పేరు చెప్పి కుల రాజకీయాలు నడిపే లోక్ సత్తాకి జనం ఎప్పటికైనా బుద్ధి చెపుతారు . లోక్ సత్తా అభ్యర్థులలో దాదాపుగా ఎవరూ గెలవకపోయినా దక్షిణ కోస్తా , హైదరాబాద్ లలో మాత్రం కమ్మవాళ్ళని ప్రభావితం చెయ్యగలిగింది . లోక్ సత్తా తెలుగు దేశం అనుకూల పార్టీ అని చెపితే ఇక్కడ ఒక బ్లాగర్ నమ్మలేదు . నిన్న TV9లో నన్నపనేని రాజకుమారి లోక్ సత్తా పై సానుభూతి చూపుతూ చేసిన ప్రకటనలు చూసినా అతనికి నిజం అర్థమయ్యేదేమో . తెలుగు దేశం , లోక్ సత్తా పార్టీలు ఓడిపోయినందుకు నాకు సంతోషంగా ఉంది .
మనోధర్మ సంగీతంలో కల్యాణి రాగానికి ఒక ప్రముఖ స్థానం ఉంది . అవకాశం వచ్చింది కాబట్టి మనోధర్మ సంగీతం గురించి రెండు మాటలు చెప్పుకోవాలి . శాస్త్రీయ సంగీతం అభ్యాస సంగీతమనీ , మనోధర్మ సంగీతమనీ రెండు విధాలు . ఇందులో మొదటిది గురుముఖంగా నేర్చుకొనే అలంకారాలూ , గీతాలూ , వర్ణాలూ , కృతులు మొదలైనవి ఉంటే , రెండవ విధానమైన మనోధర్మ సంగీతంలో స్వరకల్పన , రాగం , పల్లవి మొదలైనవి ఉదాహరణలుగా చెప్పవచ్చు . ఈ రెండు విధానాలైన సంగీతాలలో కూడా పాండిత్యం సంపాదించినప్పుడే , సంగీతంలో సంపూర్ణతని సాధించగలుగుతారని విద్వాంసుల అభిప్రాయం . మనలో చాలామందికి శాస్త్రీయ సంగీతంలో పరిచయం , ప్రవేశం లేకపోయినా అంతో , ఇంతో సంగీతం మనకి తెలియటానికి కారణం , మనకి తెలియకుండానే మనం మనోధర్మ సంగీతం అభ్యసించడమే ! తేలిక మాటల్లో చెప్పాలంటే , సంవత్సరాల తరబడి సంగీతాన్ని విని , విని వినికిడి అనుభవంతోనే రాగాలు పాడగలిగిన వాళ్ళు మనోధర్మ సంగీత పద్ధతిని పాటిస్తున్నారన్నమాట . సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు పద్మభూషన్‌డా . శ్రీపాద పినాకపాణి గారు మనోధర్మ సంగీతం గురించి చెప్పిన ఈ క్రింది మాటలు ఈసందర్భంలో గుర్తుకు తెచ్చుకోవడం అవసరం .
ప్రపంచంతో రాజీ పడకపోవడం ; దేవుడితో రాజీ పడకపోవడం . ఒకటి బాహ్య మైనది , మరొకటి అంతర్లీనమైనది . అంపశయ్య బయటి ప్రపంచంలో మనిషి చేసినది ; నెత్తురు దేవుడిచ్చినది , మనలోపలి భాగం . ఈ వ్యత్యాసం చూపటంలో గొప్ప విశిష్టత ఉంది .
దగ్గర ఇరవయ్యేళ్ళ వెనక్కి తీసుకెళ్ళారు . మళ్ళీ తరవాణి , చల్దన్నం తినాలన్న కోర్కెని కలిగించారు .
అమెరికాలో ఉంటూ తెలుగులో బ్లాగుతున్న మిత్రులందరికీ నా ప్రత్యేక ఆహ్వానం మా డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పదో పుట్టిన రోజు వేడుకల విషయం మొన్ననే చెప్పాను , చూసే ఉంటారు . ఒక తెలుగు సాహిత్య వేదిక మీద తెలుగు బ్లాగు సాహిత్యానికి పెద్ద పీట వేసి , ఒక సెషను మొత్తం తెలుగు బ్లాగు బాగోగుల చర్చకి కేటాయించడం ఇదే మొదటి సారి . తెలుగు సాహిత్య లోకంలో బ్లాగర్ల సత్తాని చాటి చెప్పేందుకు ఇది మహత్తర అవకాశం . ఇతర తెలుగు బ్లాగర్లని ముఖాముఖీ కలుసుకోవడం అరిసె మీద పంచదార అద్దినట్టు అనుకోండి . బ్లాగర్లే కాక దేశంలో పేరుమోసిన సాహితీవేత్తలెందర్నో కలుసుకోవచ్చు . . ఈ అనుభవానికి ఏం పోలిక చెప్పాలో నాకు అందట్లేదు . . అది అనుభవైక వేద్యం , మీకు చాలాకాలం గుర్తుండే అనుభవం అవుతుందని మాత్రం చెప్పగలను . దేశం నలుమూలల నించీ డిట్రాయిట్ వచ్చేందుకు అనువైన విమాన సర్వీసులు ఉన్నై . ఇక్కడికి చేరాక , హోటాల్లో ఉండలేను అంటే మీ అవసరాన్ని బట్టి , వసతి సదుపాయాల ఏర్పాట్లు కూడా ఉన్నై . సమావేశాలకి ప్రవేశ రుసుము కూడా ఏమీ లేదు . ఇప్పుడే రిజిస్టరు చేసుకోండి . తప్పకుండా రండి .
ప్రసాద్ గారూ , నిజంగా పిచ్చి మనిషికే అని స్పష్టమ్గా తెలుస్తోంది . ఇక్కడ దేవుడి తరువాత దేవుడైనటు వంటి పూజారికి కూడా పిచ్చి బాగా … … … … . . ముదిరింది . ఏదో విదంగా సరిలేని మనిషిని , సరి చేసేందుకే అన్ని విధాలా సరి అయిన మనిషిని దేవుడు స్రుష్టించాడని నమ్ముతా . ఏదో ఒకటి చేద్దామ్ మనమ్ . చెప్పండి . ముందయినా , వెనకయినా సరే మేముంటామ్ .
కృష్ణ : కలియుగంలో వెంకన్న అప్పులన్నా తీరుతాయేమోగాని మనకు పార్టిలు తీసుకునే భాగ్యం లేదనుకుంటానయ్యా . ఇవ్వాల్సినవాళ్ళందరూ ఐసు , నైసు అని పక్కన పెట్టేస్తున్నారు . . . ప్చ్
త్యాగరాజుకి మనవడు పంచాపకేశానికి తంజావూరుకి చెందిన గురువమ్మాళ్‌తో సుమారు 1930 ప్రాంతంలో వివాహం జరిగింది . త్యాగరాజు కూతురూ , మనవడూ త్యాగరాజు ఇంట్లోనే ఉండేవారు . 1943 ప్రాంతంలో పంచాపకేశానికి అనారోగ్యం చేసి చనిపోయాడు . దాంతో త్యాగరాజు వంశం అతనితోనే ఆగిపోయింది .
ఈ సంచికలో ప్రముఖమైన ప్రసంగ వ్యాసం కులదీప్ నాయర్‌ది . అఖండ భారతాన్ని చీలికలవడం కళ్ళారా చూసిన పాత్రికేయుడు - మహాత్ముని చివరి క్షణాలను దగ్గరగా చూడగలిగిన ప్రత్యక్ష సాక్షి - నేటి ప్రసార మాధ్యమాల దుస్థితి - దిగజారుడు తనం గురించి ఆయన ఆవేదన అర్థం చేసుకోవచ్చు . అంతకంటే దారుణం - ఏ దేశ స్వాతంత్ర్యం కోసం - స్వపరిపాలనకోసం అసువులు బాసిస బాపు - ఆశయం ఇప్పటి ప్రజాస్వామ్యపు విపరీత ధోరణులు - వాక్ స్వాతంత్ర్యం పేరుతో మాధ్యమాలు సృష్టిస్తున్న గందరగోళ పరిస్థితులు , అదే దేశాన్ని ఎంత అధోగతికి మళ్లిస్తున్నాయో ఆలోచిస్తే - ' సత్యాగ్రహం ' కలుగుతుంది . ప్రపంచంలో మరోచోట ప్రజాస్వామ్యం కోసం తిరుగుబాట్లు జరుగుతున్నాయి - మన దేశంలో ప్రజాస్వామ్యపు దుష్పరిపాలనపై హజారే లాంటి వాళ్లు తిరుగుబాటు చేయాల్సివస్తోంది !
శ్రీధర్‌కు అటూఇటు పొర్లినా నిద్ర పట్టడం లేదు . . ఎంతసేపూ , ఆ కుక్కే జ్ఞాపకం వస్తోంది . ఆ కుక్క కరవడానికి రాలేదేమో అనిపించింది . కేవలం చెలగాటం ఆడుతుంది . . కుక్కలకు , పిల్లులకు ఇది అలవాటే . . ముద్దు చేయమని కాళ్ళకు మొహం తాకించడం . . ఇంత చిన్నవిషయం కూడా తనకు తట్టలేదు . తనలో ఇంత భయం పేరుకుపోయిందా ? ఇంత బెరుకా ?
అంతా రాసే వాళ్ళే గానీ , ఇతరుల పోస్టులను చదివి వాటిల్లోని వాస్తవాంశాలను గూర్చి ఆలోచించే వారి సంఖ్య తక్కువ !
జగన్ ఓదార్పు యాత్ర రేపటి నుంచి ప్రకాశం జిల్లాలో జరగనుంది . ఆయన రాకకోసం అభిమానులు , కాంగ్రెస్ కార్యకర్తలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు . . . .
మదిలో రగిలే ఆలోచనల ప్రతి పదం ఇక్కడ కదనపు కదం కదం
నల్లని చీకట్లో ఊరంతా మరకకట్టిన వెన్నెల తన గుర్తులు చెరిపేసి చెప్పకుండానే వెళ్ళిపోయింది
ఐతే అక్కడకూడా ఇదే పరిస్తితి అన్నమాట . పెట్రో ధరలు , వెచ్చాల ధరలు అన్నీ సరాసరి aurora borilias వైపు దూసుకు వెళ్తుంటాయ్ . బుష్ కి యెమైనా సాయం కావాలనిపిస్తే YSR ని అడగటానికి మొహమాట పదొద్దని చెప్పండేం . ఒక చిన్న సందేహం . మా వాడు ఒకడు Target systems లో చేస్తున్నాడు . యేమైనా అంటే మా company పెద్ద తురుము company U . S . లో Walmart తరవాత మాదే రాజ్యం అంటుంటాడు . నిజమా ?
కృష్ణశ్రీ గారు ! అధికార పత్రం చూపించటానికి గాయత్రి మంత్రము గవర్నమెంట్ G . O కాదు . జగత్తు అంతటికి మూలాధారమైన వెలుగును ధ్యానము చేయుటకు ఎవరి పరిమిషన్ అక్కరలేదు . గాయత్రి మంత్రములో ఏ పదాలను ఒదలలేదు . జాగ్రత్తగా మనసు వుంచి చదవండి . ఇక గురువు ఎవరికి వందనము చేయాలి అన్నారు . గురువు ఒక్కడే . అతడే సర్వాంతర్యాయైన భగవంతుడు . ప్రత్యక్ష గురువు లేనప్పుడు దైవమునే గురువుగా భావించి ధ్యానించవలేను . ఆ దైవమునే Englishలో " MASTER " అంటారు . Master అంటే స్వామి అని అర్దము . " గురు బ్రహ్మ " మంత్రములో చెప్పబడిన గురువు అతడే . సర్వ జగ్గత్తుకు మూలాధారమైన దైవమే గురువు ద్వారా శిష్యుని అనుగ్రహించుటకు పనిచేస్తాడు . అతడికే వందనము చేయాలి . వ్యక్తము కాని దైవము వ్యక్తము ఐనపుడు వెలుగై వ్యక్తమౌతాడు . అదే మూల ప్రకృతి . అతడు పురుషుడైతే ఆమె ప్రకృతి . ఆమె నుండి సమస్త ప్రకృతి వచ్చింది . కనుక గాయత్రిని స్త్రీగా వర్ణించారు . ఈ మంత్రము ద్వారా ధ్యానము చేసేది ఆ వెలుగునే . విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్రమును సమస్త మానవజాతికి ఇచ్చాడు . అందులో అందరూ వస్తారు . భేదాలు ఎమీలేవు . పండితుల్ని కాక సద్గుగువులనెవరినైనా అడిగి తెలుసుకొన గలరు . ధన్యవాదములు మంగేష్
" అయ్యగారూ మన తోటలో హర్భజన్ సింగులెక్కువయి పోయారు " " ఆ ఉపమానాలేంటి నువ్వేమన్నా హేడెన్ అనుకుంటున్నావా ? హేడెన్ కేదో కొవ్వెక్కి హర్భజన్ ను కలుపు మొక్కంటే నువ్వు కలుపు మొక్కల్ని హర్భజన్ అంటావా ? ఆ మొక్కలు పీకేసి ఆవులకు ఆహారంగా వెయ్యి మంచి పాలిస్తాయి . ఈ మధ్య ఏ పెద్ద హీరో సినిమా రిలీజు కాక పాలాభిషేకాలు ఆగిపోయాయి . ఏదో ఉండవల్లి పుణ్యమా అని ఆవు పాలకు మంచి డిమాండ్ వుంది ఈ సీజన్లో . దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి . అప్పుడెప్పుడో లాలూ ప్రసాద్ రైళ్ళలో పెప్సీకి బదులు మజ్జిగ అమ్మిపెడతా అని తరువాత ఆ ఊసే ఎత్తలా . " " పెప్సీ ఆపించకపోయినా పెళ్ళి కాని ఆడపిల్లలకు రైల్లో ఫ్రీ టికెట్ ఇప్పిస్తున్నాడు కదా . " " దాని కిందే నీకు కొన్ని జిమ్మికులు కనిపించడం లేదు . మామూలు రైళ్ళని ఎక్స్ ప్రెస్ రైళ్ళు అని చెప్పి ఎక్స్ట్రా డబ్బు వసూలు చేస్తున్నాడు గదా . నువ్వు సిగరెట్లు తాగుతావా " " లేదు " " అయితే నీకొచ్చిన నష్టమేమీ లేదు . " " నాలాంటోళ్ళకు డబ్బేమన్న తిరిగొస్తుందా ? " " నువ్వేమన్నా అమెరికాలో పుట్టావా ? అమెరికాలో $ 150K వరకు సంపాదించేవాళ్ళకు బుష్షు $ 1200 . 00 చెక్కిస్తున్నాడు . మన చిదంబరమేమో RS150K వరకు టాక్సు మినహాయింపు ఇచ్చాడు . " " మనమేం ఆర్థిక మాంద్యం లో లేం . అయినా మన అభివృద్ధి శాతం 9 . 5 కదా " " అది అప్పుడు . ఇప్పుడు 8 . 7 శాతం " " వ్యయసాయం లో 3 . 5 వృద్ధి వుంది కదా ? " " ఇప్పుడు 2 . 6 మాత్రమే అందుకే కాబోలు రైతుల కోసం 60 , 000 కొట్ల రూపాయల మాఫీ చేశారు . " " అది కూడా మా తుపాకీ రాముడు జైపూర్ లో రైతు గర్జన చెయ్యబట్టి " " రైతు గర్జన జైపూర్లోనా విజయవాడలోనా ? " " జైపూర్లోనే ? " " మీ తుపాకీ రాముడెవడ్రోయ్ ? ఇదేదో కొత్త పేరు లాగుందే " " అది పొన్నాల లక్ష్మయ్య పెట్టిన పేరు . " " ఎందుకు ? " " రైతులను కాల్చుకు తిన్నాడని పెట్టిన పేరు . " " ఎవరికి ? " " చంద్ర బాబు కు " : : : : : : : : " మనకు బడ్జెట్ లో తుపాకులు ఫ్రీ గా గానీ సప్ప్లై చేసేస్తున్నారా ? " " అలాంటిది నేనెక్కడా చదవ లేదే . అప్పుడో సారి పవన్ కళ్యాన్ చేతిలో , ఇంకోసారి ప్రశాంత్ రెడ్డి చనిపోయినప్పుడు తుపాకుల గురించి విన్నాను తప్ప ఇంకెక్కడా చూడ లేదు . " " గోనె ప్రకాశ రావ్ తనకేదన్న జరిగితే వెళ్ళి మధు యాష్కీ బుర్రకాయ్ ని డాం . . . డాం అని పేల్చేస్తానన్నాడు కదా . " " ఎవరు ఎవరి బుర్రకాయలు పేల్చినా ఏం జరగదు . కాల్చిన తరువాత సరదాగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి బిర్యాని తినేసి వచ్చి ఇంట్లో వున్న కుక్కలకు బిస్కట్లు తినిపించుకుంటూ కాలం గడపోచ్చు . తరువాత అది ఆత్మహత్య అని చెప్పేస్తారు . ఆ చచ్చినోడికి చేతులు లేకపోయినా గొళ్ళేనికి తుపాకీ ఆనించి గొడుగు తో ట్రిగ్గర్ నొక్కాడని నొక్కి వక్కాణించేస్తారు . " " అంతేనా శిక్షలు గట్రాలు వుండవా ? " " వుంటాయి అలా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళను దేవుడు శిక్షిస్తాడట . " " ఈ శిక్షలు గట్రాలు మనకొద్దు గానీ ఏవన్నా సరదా బ్లాగుంటేచెప్పండి " " ఇదిగో ఈ మధ్య వచ్చిన ఈ పావని గారి బ్లాగు చూడు " : : : : : : :
మిత్రులందరికి నా చిన్న మనవి ! ABN లో వచ్చే ప్రోగ్రామ్స్ మంచివో చేడువో నాకు తెలియదు కాని , అతని ఆంగ్లం ఉచ్చారణ మీద comments చాలా దారుణం . ఒక భాష స్పష్టంగా ఎలా ఉచ్చారణ చేయాలని నిబందనలు పెడితే ఎవరు కూడా ఆ భాషను ఆదరించరు , నేర్చుకోలేరు . బొంబాయి లో పనిచేసేటపుడు నా గురువుగారు ఒకసారి ఇలా అన్నారు , మన జాతీయ భాష హిందీ కదా మరి ఆంగ్లం ఇంత త్వరగా మన జాతీయ భాష గా అల్లుకుపోతుంది కారణం ఏమిటని ? దానికి కారణం మనలో ఎక్కువ మంది హిందీ మాట్లాడితే మన మాతృభాష ప్రభావం వల్ల స్పష్టంగా పలకలేము , ఇలా పలకడాన్ని అందరూ హేళన చేస్తారు . కాని ఆంగ్లం మాట్లాడేటపుడు మాతృభాష ప్రభావం ఉన్నా సర్డుకుపోతారు . ఉదా ! మలయాళ మిత్రులు ఆంగ్లం లో ' O ' తో మొదలయ్యే పదాల ఉచ్చారణ ఒకలా ఉంటుంది , అలాగే బెంగాళి , భీహార్ , ఒరిస్సా వారు ' w ' తో మొదలయ్యే పదాల ఉచ్చారణ ఒకలా ఉంటుంది . ఉత్తర భారత దేశంలో మొదట " జై మాతాజీ " అనే వారు కాని ఇపుడు కొంత మంది " జై మాతాది " అనికూడా అంటారు . నా విషయానికి వస్తే నేను అమెరికా లో Speech language pathologist గ speech therapy ఇచ్చేటపుడు నా patients / clients / residents నా ఆంగ్ల ఉచ్చారణ పై ఈ 4 సం . లో complaint లేదు . నా ఉచ్చారణ పై మన Indian మిత్రులు జోక్స్ వేస్తారు . They never insist for American accent . " యంగిస్థాన్ " తెలుగు చానల్ ప్రోగ్రామ్స్ లో ఈ లాంటి చిన్న చిన్న లోపాలు పరవాలేదనిపిస్తుంది . సదరు చానల్ MD రాయలసీమ ప్రాంతం వారు , తప్పక అతని భాష , మరియు ప్రశ్నలు అడిగే తీరులో దాని ప్రభావం ఉంటుంది . ఇక్కడ ఇంకో రెండు విషయాలు చెప్పక తప్పదు , ప్రత్యెక తెలంగాణ వాదానికి ఒకానొక కారణం కూడా భాషయే తెలంగాణ ప్రాంత ప్రజలు తెలుగు ఉచ్చారణను తప్పుబట్టడం లాంటివి ( " అది ఏమిటి vs గదేమిటి " రెండూ ఒకటే అని మరచి ) , HMTv program " తెలంగాణ దశ దిశ " లో దేశపతి శ్రీనివాస్ వాదనను తప్పక చూడండి ( http : / / www . youtube . com / watch ? v = vxaBU3EhYm8 ) . రెండవది కాలానుగుణంగా ఉచ్చారణ లో కొన్ని మార్పులు జరగవచ్చు ( డైరెక్టర్ vs డిరెక్టర్ ) . మొన్ననే జల్లెడ సంకలినిలో " పల్లె భాష " పేరుతొ ఒక వ్యాసం చాలా చక్కగా కొన్ని ఇలాంటి విషయాలు వివరించారు .
దొండ పండు లాంటి ముక్కు దొర గారు దొడ్డ మనసుతో దళితునికి ముఖ్యమంత్రి పదవి అంటే అర్థం చేసుకోక పొతే ఎట్టా ? దొరగారు దరిన కూతురిని మేనల్లుడిని కొడుకుని కథానాయకురాలిని పెట్టుకొని ఉద్యమగాల్లుగా రాళ్ళుగా పెంచి పోషిస్తూ పేరు ప్రతిష్టలు ఇప్పిస్తూ వేరుపడ్డాక పట్టం మాత్రం దళితులకే అంటే ఆ దొడ్డమనసును అర్థం చేసుకోరెందుకు ? దొండ పండు ముక్కు ఉన్నందున చిలక పలుకులనుకొంటే ఎట్టా ? [ … ]
అనంత నక్షత్రాలు , మిణుకు మిణుకు మను మారాము చేయక ఎన్నో ఎన్నో ఎన్నెన్నో వింతలు విశేషాలూ రండి స్వాగతం కలల ప్రపంచంలోకి నేల చాలని వారికి నింగి ఆపలేని వారికి స్వాగతం , సుస్వాగతం = = 2 = =
మరిన్ని లెక్కా పత్రాలు త్వరలో … అంతవరకూ ఈ తెలుగు సముద్రంలో ఈత ట్రై చెయ్యండి , ఒడ్డున ఉండేవారిని సముద్రంలో లాగడమెలాగో ఆలోచించండి .
" అదే జరిగింది గురుదేవా ! మన చంద్రుడు ఒక సామాన్యమైన చెట్టుకొమ్మతో దీని మెడని విరిచేశాడు " ఎంత బిగపట్టుకున్నా అణిగివుండని ఉత్సాహంతో చెప్పింది వారుణి .
" అదేమిటి అలా ఆంటావు ? మనమే వాళ్లని తీర్చి దిద్దాలి . వాళ్లకి మనం నేర్పాల్సినవి చాలా వున్నాయి . మనం కలగజేసుకోకపోతే ముళ్లడొంకలా తయారవుతారు అడ్డూ అదుపూ లేకుండా . అప్పుడు ఆతప్పు ఎవరిది ? "
కరప్ట్ అయిన ఈ క్రింది ఫైల్ ఫార్మేట్లను రిపేర్ చెయ్యవచ్చు :
ఇలా మూడేళ్లు గడిచాయి . సంధ్య అమ్మమ్మ ' ఐద్వా లీగల్‌సెల్ ' కు వచ్చి విషయం చెప్పింది . మనుమరాలి సంసారం సరిదిద్దమని కోరింది . సురేష్‌తో కలిసి జీవించాలనే సంధ్య కోరుకుంటోంది . సభ్యులు సురేష్ కుటుంబాన్ని రమ్మని కబురుపంపారు .
ప్రత్యేక ప్రాంతం కావాలనేది కొందరేనండి , మిగిలిన అందరి మాట , పాట సమైక్యవాదమే . మీ భావ వ్యక్తీకరణ చాలా బావుంది . రాజన్ http : / / naagola . wordpress . com /
నేను నెగెటివ్‍గా ఆలోచించే వారి గురించి ఇక్కడ ప్రస్తావించను . ఇప్పుడు అన్ని లెక్కలు అయినాయి కాబట్టి , ఒక సూటి ప్రశ్న . నిజ్జంగా దేవుడు లేడనుకుంటే , నాకు పోయిన నష్టం ఏమీ లేదు . అదే కనుక దేవుడు లేడనుకున్న తరువాత దైవం ఉంది అని తెలిసందుకోండి అప్పుడు ఆ దైవం విలువ నాకు కలవక పోవడం వలన నాకు ఉండవలసిన విలువ తగ్గిపోయినట్లే కదా ?
ఇవాళ నాన్నగారు కన్ను మూసిన రోజు . ఆయనది ఊహించని మరణం . ఆయన అలా మృతశరీరంతో పడివుండడం వొక మాయ అనీ , వున్నట్టుండి మళ్ళీ ఏదో వొక రోజు నవ్వుతూ ఆయన అలా నడుచుకుంటూ వెనక్కి వచ్చేస్తారని చాలా కాలం వొక దిగ్భ్రమలో , భ్రమ లాంటి నమ్మకంతో వుండే వాణ్ని . చనిపోయినప్పుడు ఆయన వయసు 57 ఏళ్లు . అసలు లోకానికి ఏమీ చెయ్యని వాళ్ళు నూరేళ్ళు బతుకుతున్న పాడు కాలంలో అలాంటి వాళ్ళ ఆయుషు అంతా నాన్నగారికి వచ్చేస్తే బాగుండు అని స్వార్ధంగా , క్రూరంగా అనుకుంటూ వుండే వాణ్ని చాలా కాలం ! నా స్పృహా , నా చైతన్యం , నా చదువూ అన్నీ బిక్కచచ్చిపోయిన ఆ మరణానంతర విషాద కాలంలో ! కానీ , మృత్యువుకి నా ఉద్వేగాలేవీ లేవు , తెలియవు కూడా ! అది మనిషిని వొకానొక జ్ణాపకంగా మాత్రమే మిగిల్చే కరకు వాస్తవం ! * నాన్నగారిని తలచుకోగానే ముత్యాల కోవలాంటి ఆయన తెలుగక్షరాలు గుర్తొస్తాయి నాకు . చిన్నప్పటి మా బడి గోడ మీద వొక దినపత్రిక సైజులో నాలుగు పేజీల గోడ పత్రిక " మధురవాణి " గుర్తొస్తుంది . ప్రతినెలా బడిపిల్లల కవితలూ , కథలూ , చిరు వ్యాసాలతో ఆ నాలుగు పేజీలను ఆయనే స్వహస్తాలతో రాసేవారు . ఆ పత్రిక గోడ మీద అతికించిన రోజు మా అందరికీ పెద్ద పండగే ! నాలుగో తరగతి నించి పదో తరగతి పిల్లల దాకా ఆ పత్రికని ఆసాంతం చదివే వారు . అంతే కాదు , ఆ పత్రికలో తమ పేరు చూసుకోవాలని ఉత్సాహపడే వాళ్ళు . స్కూల్ లో నాన్నగారికి ఎంత పేరుండేదంటే - ఆ రోజుల్లో " కౌముదీ పిక్చర్స్ " బానర్ కింద వచ్చే సినిమాలన్నిటికీ నాన్నగారే కథలూ , కవిత్వం రాసేవారని వాళ్ళు అనుకునేవాళ్ళు . " అబ్బే అది నేను కాదురా ! " అని ఆయనెంత చెప్పినా వాళ్ళు వినే వాళ్ళు కాదు . వాళ్ళకి రచయిత అన్నా , కవి అన్నా ఆయనొక్కరే ! చిన్న వూళ్లలో వుండే పెద్ద నమ్మకాల్లో ఇదీ వొకటి ! నాన్నగారు ఇంకా వివరించబోతే , " లేకపోతే , ఆ సినిమా వాళ్ళు " కౌముది " అని మీ పేరెందుకు పెట్టుకుంటారు సార్ ! " అనే వాళ్ళు . కౌముది అనే పేరుతో అప్పటికి నాన్నగారి నవలలు రెండు వెలువడ్డాయి . ఒకటి : కళంకిని , రెండు : విజయ . సుంకర , వాసిరెడ్డితో కలిసి ఆయన అనువదించిన ' రంగభూమి " విశాలాంధ్ర వాళ్ళు అనేక ఎడిషన్లు వేశారు . విశాలాంధ్ర , ఆంధ్రజ్యోతి దినపత్రికలలో ఆయన కవిత్వమూ , కథల అనువాదాలు ఎక్కువగా వస్తున్న కాలం అది . అభ్యుదయ రచయితల సంఘం ఖమ్మం జిల్లా శాఖకి ఆయన అప్పటికే అధ్యక్షులుగా వున్నారు . కమ్యూనిష్టు పార్టీ వారి ఆంధ్రప్రదేశ్ యువజన సమాఖ్య వారి పత్రిక " యువజన " ని సాహిత్య పత్రికగా తీర్చిదిద్దిన సంపాదకవర్గంలో ఆయన వున్నారు . చింతకాని ఖమ్మం జిల్లాలో చాలా చిన్న వూరు . పాసింజరు బండి దిగి అయిదు మైళ్ళు నడిస్తే కానీ , అసలు వూరు రాదు . కానీ , ఆ చిన్న వూరే ఆయన సాహిత్య కేంద్రం అయ్యింది . మా ఇల్లు నిత్యం రచయితలూ , కవుల రాకపోకల్తో సందడిగా వుండేది . ప్రతి నెలా ఎవరినో వొకరిని పిలిచి బడిలో ప్రసంగాలు ఇప్పించే వారు నాన్న . అలా దాశరథి , పెద్దిభొట్ల , హీరాలాల్ మోరియా , కవిరాజమూర్తి ఇలా ఎందరో నేను నాలుగో తరగతిలో వుండగానే ముఖాముఖీ తెలుసు . వాళ్ళ పద్యాలూ , కథలూ మా పిల్లలందరికీ కంఠోపాఠం . ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఉద్యోగంగా ఆయనెప్పుడూ భావించలేదు . ఆయన పేరుకే హిందీ పండిత్ గానీ , తెలుగు , ఇంగ్లీషు పాఠాలు కూడా చెప్పేవారు . వొక్క లెక్కలు తప్ప అన్నీ చెప్పే వారు . ఆ రకంగా విద్యార్ధులందరికీ అందుబాటులో వుండే సార్ అనే పేరుంది . ఏ విద్యార్థి ఎప్పుడు వచ్చినా సమయం చూసుకోకుండా పాఠం చెప్పడానికి సిద్ధమయే వారు . ఆ రకంగా చాలా మంది విధ్యార్ధులకి మా ఇల్లు , మా ఇంట్లో పుస్తకాలు అన్నీ మావే మావే అనే భావం వుండేది . అప్పట్లో బడిపంతులు అంటే ఇప్పటి మాదిరి పెద్ద జీతాలు లేవు . బతకలేని బడిపంతులు అన్నది నిజం ! పైగా , మాది పెద్ద కుటుంబం . అమ్మ తెల్లన్నం వండిందీ అంటే ఆ రోజు పండగో పబ్బమో అయ్యి వుండాలి ! లేకపోతే , జొన్నన్నం , గోంగూర పచ్చడే రోజూ ! లేదంటే , సజ్జ రొట్టెలు ! ఇక కొత్త బట్టల జత ఏడాదికి వొకసారి . చాలా కష్టంగా గడిచేవి రోజులు . కానీ , ఇంట్లో ఏదో వొక ఉత్సాహం నిరంతరం తరగలెత్తినట్టుండేది . చుట్టూ బోలెడు పుస్తకాలు , ప్రతి వారం ఎవరో వొకరు చుట్టాలు , స్నేహితులు ఇంట్లో అతిధులుగా వుండే వాళ్ళు . కబుర్లూ , కథలూ , పాటలూ . . . హోరెత్తినట్టుండేది ఇల్లు . మేం పట్టణం అంటే ఖమ్మం వెళ్ళే దాకా ఆ ఉత్సాహం అలా కొనసాగింది . * చింతకాని నా బాల్యానికి పునాది . నాన్నగారి యువకోత్సాహానికి సంబరం . కవిత్వంలాగా బతకడం అంటే ఏమిటో తెలిసినట్టే వుండేది ఆ కాలంలో అంత పేదరికంలో కూడా ! కానీ , తెలియని వొక దుఖం ఏదో ఆయన లోపల వుండేదనుకుంటా . మారని సమాజం పట్ల ఏదో అసంతృప్తి , ఏదో చేయాలన్న తపన ! బడిని గుడిగా మలుచుకొని అదే ధ్యాసగా బతకడంలో ఆయన ఆ దుఖానికి విముక్తి కనుక్కున్నట్టు అనిపించేది . జీవితం అనే కావ్యంలోసగం వృధసగం వ్యధ . . అని ఆయన ఒక కవితలో రాసుకున్నారు . ఆయన వచనంలో ఆయన నికార్సయిన మార్క్సిస్టు , కానీ కవిత్వంలోకి వచ్చే సరికి ఆయనలోని కాల్పనికుడు ఆ మార్క్సిస్టుని దాటుకుని వచ్చేవాడు . ' రచయితకి స్వేచ్చ వుండాలి , ఎంత కమ్యూనిస్టు అయినా ! " అనే వారు ఆయన . అనేక సంవత్సరాల పాటు పార్టీ కోసం బతికి , సర్వస్వం పార్టీకి ధారపోసి , తన కోసం ఏమీ మిగుల్చుకోలేదు నాన్నగారు . పార్టీ చీలిపోయాక క్రుంగదీసిన నైరాశ్యంలోంచి బయట పడేసరికి ఆయన నిరుద్యోగి . ఆయనే రాసుకున్నట్టు " చిరుద్యోగి , పోనీ , దురుద్యోగి సైతం కాలేని నిరుద్యోగి . " అప్పుడు ఆయనకి హిందీ అనే గడ్డిపోచ దొరికింది . అది పట్టుకుని అలహాబాద్ హిందీ మహావిద్యాలయానికి వెళ్ళి , అక్కడ చదువుకొని , వెనక్కి వచ్చి ఆయన హిందీపండితులుగా చేరారు . అలా ఆయన ఉద్యోగంలోకి కుదురుకునే సరికి నేను నాలుగో తరగతిలో వున్నా . అప్పటికి బడికి పంపే స్తోమతు లేక నన్ను ఉర్దూ క్లాసులకి పరిమితం చేసింది మా అమ్మ . ఆ విధంగా నేను నాలుగో తరగతి దాకా తెలుగు అక్షరముక్క తెలీకుండా పెరిగాను . నాలుగో తరగతి తెలుగు బడిలోకి వచ్చేసరికి నాకు కష్టాలు మొదలయ్యాయి . తెలుగు రాదు , ఉర్దూ మీద మమకారం పోదు . బడిలో అందరూ ఏడిపించడం మొదలెట్టారు . నాకు కచ్చపుట్టింది . మా నాన్నగారి రాతని అనుకరించడంతో నా తెలుగు మొదలయ్యింది . ఆయన నెల రోజులలో నాకు వోనమాలు నేర్పించి , రెండో నెలలోకి వచ్చే సరికి చిన్న కథలు చదివించడం మొదలెట్టారు . ఏడాది తిరిగే సరికి నేను పెద్ద పుస్తకాలు చదవడం మొదలెట్టాను . శ్రీ శ్రీ కవిత్వాన్ని ఇంటా బయటా పాటల కింద మార్చేసి హోరెత్తించే వాణ్ని . అది చూసి , మా హెడ్మాస్టర్ " అరె , ఈ జన్మలో నీకు తెలుగు రాదనుకున్నాను రా ! మొత్తానికి సాధించావ్ ! " అనడంతో నా గర్వ పతాక ఎగిరింది బడిలో ! కానీ , అదంతా నా గొప్పతనం కాదు , పాఠం చెప్పడంలో నాన్నగారి నేర్పరితనమే తప్ప ! " సార్ క్లాసులో ఒక్క సారి చెప్పిన తరవాత షెల్లీ పద్యమయినా నోటికి వచ్చేస్తుంది , పెద్దన పద్యమయినా బట్టీ కొట్టినట్టు వుండిపోతుంది " అని బడిలో విద్యార్ధులు అనే వారు . అందులో ఆశ్చర్యమేమీ లేదు . ఆయన రాస్త్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా వరసగా అయిదుసార్లు అవార్డులు గెలిచి , తరవాత రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు . చివరి రోజుల్లో " అక్షరదీపం " పట్టుకుని మారుమూలల పల్లెలకి వెళ్ళి పాఠాలు చెప్పేదాకా వెళ్లింది ఆయన తపన . చివరికి ఉపాధ్యాయ వృత్తి కోసం తనలోని రచయితని వదులుకున్నారు . ఆయన తరవాతి కాలంలో రాసిన రచనలు కూడా " అక్షరదీపం " వాచకాలూ , కథలూ , పాటలు మాత్రమే ! " నేను ఎప్పటికీ పాఠకుడిని మాత్రమే . చదవడంలో వున్న ఆనందం నాకు రాయడంలో లేదు . అయినా నేను ఉపాధ్యాయుడిని , అంతే ! ఈ రోజు పాఠాలు బాగా చెబితే ఆ రోజుకి నా కల తీరినట్టే , నా లక్ష్యం నెరవేరినట్టే ! " అనే వారు ఎప్పుడూ . కానీ , తెలుగు , హిందీ , ఉర్దూ , సంస్కృతం , ఇంగ్లీషు , అరబ్బీ , ఫారసీ భాషలు చదువుకొని , వాటి సాహిత్యాలని ఆపోసన పట్టిన నాన్నగారు , ఒక మారుమూల పల్లెలో బడిపంతులుగా వుండి , జాతీయస్థాయిలో రచయితలతో స్నేహాలూ , ఉత్తరప్రత్యుత్తరాలూ నడిపిన నాన్నగారు … జీవితాన్ని వొక అక్షర ఉద్యమంగా మలుచుకున్న నాన్నగారు . . . ఇప్పటికీ , ఎప్పటికీ మరణశయ్య మీద ఆయన్ని వూహించలేను ! ఆయన చివరి డైరీలో రాసుకున్న ఈ వొక్క వాక్యం ఎప్పటికీ నా మనసులో వెలుగుతూ వుంటుంది : " అనుభవమే చివరి వెలుగు . ఈ క్షణమే చివరి క్షణం . ఆ వొక్క క్షణమూ సదామణి సదృశ జ్వాలగా వెలుగు " * కౌముది అనే పేరు ఆయన ఎందుకు పెట్టుకున్నారు తెలియదు . ఆయన అసలు పేరు షంషుద్దిన్ , అంటే సూర్యుడు అని . దానికి పూర్తి వ్యతిరేకంగా ఆయన చంద్రకాంతిని ఆశ్రయించి " కౌముది " అని పెట్టుకున్నారు . ఆయనంటే మహాకవి దాశరథికి చాలా ప్రేమ . " కౌముది " అన్న పేరంటే మరీ ప్రేమ . తరచూ ఉత్తరాలు రాసుకునే కాలంలో దాశరథి ఆయనకి ఇలా రాశారు : " ఖమ్మంలో ఎండలు మండిపోతున్నాయని విన్నాను . కానీ రేయెండ మీరుండ నీరసించు మండుటెండ " రేయెండ అంటే రాత్రి కాసే ఎండ అనీ , కౌముది అనీ వేరే చెప్పకర్లేదు కదా !
' పరుచూరి శ్రీనివాస్‌గారు అభ్యంతరం చెపితే తప్పక సోదా చెయ్యవలసిందే సుమా ' అనే భావనతో నేను Edmundo పాడిన పాట దొరికినంతవరకూ విన్నాను . అది త్రిశ్రగతిలో శంకరాభరణం స్కేల్‌లో ఉందన్నమాటేగాని ' వివాహభోజనంబు ' లో ఉన్నట్టుగా అందులో రాక్షసుడికి సరిపోయే ' వికటాట్టహాసం ' లేదు . చప్పగా ఉంది .
రోజూ అందరినీ రకరకాల ప్రశ్నలతో కంఫ్యూజ్ చేసి కంగారుపెట్టే TV9 రజనీకాంత్ ఈరోజు రాంగోపాల్‌వర్మ చేతిలో కంప్లీట్‌గా క్లీన్‌బోల్డయ్యాడు . గంటసేపు జ . . .
" నా కంటే పెద్దగా ఉన్న పక్షులు కూడా ఎగరడం చూశానే … అసలు నేను ఎందుకు ఎగరలేక పోతున్నాను ? నాలో ఏదైనా లోపం ఉందా " అని అనుక్షణం మధనపడుతుండేవాడు .
మహానుభావుడు బలగంగాధర తిలక్ హిందువుల్నందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి గణపతి నవరాత్రులు ప్రారంభిస్తే , ఇంకెవరో కులాలని సంఘటితం చెయ్యడానికి ఈ వన సమారాధనలు ప్రారంభించారు .
మహిళ : నిజమే అనుకోండి . నేను ఇండాక అడిగినట్లు . . ఇలాంటి దినం కావాలని ఏ స్త్రీ అడిగిందో చెప్ప గలరా ! !
" మరి ఇక్కడే వుంటే కనిపించదేం ? " అనడిగాడు గోపీ ఇంకా ఆశ్చర్యపోతూ , అతను తనని ఆట
ఉమదేవిగారు , నెనరులు . ఉమగారు , ఓ మీరు అవధానానికి వచ్చారా ! సోమశేఖర్ గారు , అవునండి IIScనే . రామకృష్ణారావుగారు , మీరు గరికిపాటివారి కన్నా సం " పన్నలు " అయ్యారండి ! : - ) నరసింహగారు , మీరు ఆ ఆడియోని Online వినడం కాకుండా Download చేసుకొని వినడానికి ప్రయత్నించండి . @ శివరామకృష్ణగారు , రెండో పాదం వరకే అనుకుంటే గణాలు సరిపోవు కాని అక్కడితో ఆగాలని లేదు కదా ! మరో సారి గరికిపాటివారి సమాధానంతో పూర్తి పద్యం వినండి . సందేహం తీరుతుంది : - ) ఇంతకీ మీక్కూడా బ్లాగున్నట్టు చెప్పనేలేదేం ? అన్నట్టు మరో విషయం తక్కిన బ్లాగర్లకి చెప్పాల్సింది ఉంది . ఈ శివరామకృష్ణగారే గరికిపాటివారి చేత " నివురు గప్పిన నిప్పు " అనిపించుకునేట్టుగా కావ్య పఠనం ( క్షమించాలి గానం : - ) చేసిన పృఛ్చకుడు .
" బావుంది - కథ … ఇదంతా చూస్తే నవ్వొస్తోంది … . మరీ ప్రతీ దానికీ ఫార్మాలిటీస్ పాటిచండం నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది . . విషయం చెప్పద్దూ . . నేకేదైనా టింకూ చిన్న హెల్ప్ చేస్తే , నువ్వు థాంక్యూ చెబితేనే నాకు మొదటి సారి ఆశ్చర్యం కలిగింది . కొడుకుకి తండ్రి ధేంక్యూ చెప్పడమేమిటి ? ఇంట్లో వాళ్ళకి థాంక్యూలు చెప్పడం , అమ్మా నాన్నలు కొడుకులకి సారీ చెప్పడం . . ఇవన్నీ నాకు కృతకంగా అనిపిస్తున్నాయి … వీళ్ళూ వీళ్ళ కల్చరూనూ . . " రాజారావు కి ఈ తంతు విచిత్రంగా తోచింది .
ప్రతి జీవి పరిపూర్ణత గాంచటం విధాయకం . పర్యవసానం లో ప్రతి ప్రాణి పరిపూర్ణత పొందుతుంది . మన వర్తమాన స్థితి , మన పూర్వ కర్మం , మన పూర్వాలోచనల ఫలితం ; ఇలాగే మన భావి స్థితి ప్రస్తుత కర్మలకూ , భావాలకు ఫలితం . కానీ ఇలా మన భావి స్థితి ని నిర్మించుకోవటం మనలను పరుల సాయం పొందనివ్వక అడ్డదు ; అంతే కాదు , అనేకులకు అలాంటి సాయం అవశ్యం కావలసి వుంది . అది లభించినప్పుడు ఆత్మ శక్తి సామర్ధ్యాలు ఉద్దీపితాలవుతవి . పారమార్ధిక జీవితం ప్రబోధ మందుతుంది . అభివృధ్ధికి చురుకు కలుగుతుంది . చివరకు మానవుడు పావనుడై పరిపూర్ణత పొందుతాడు . ఆధ్యాత్మిక విషయాలను గురించిదాదాపుగా ప్రతి వ్యక్తీ అత్యద్భుతం గా మాట్లాడగలిగీ , అనుష్టానానికి నిజమైన పారమార్ధికాచరణానికీ వచ్చేసరికి , ఎంత శోచనీయం గా వెనుకబడి వుంటామో మనం ఎరుగనిది కాదు . ఈ వ్యత్యాసానికి కారణం . దాన్ని గ్రహించేవాడే శిష్యుడు . ఇలా ఎవరినైనా ప్రేరేపించటానికి గురువు శక్తిని సంక్రమింపచేయగలవాడుగా వుండాలనటం మొదటి విషయం . రెండవది దాన్ని గ్రహించే వ్యక్తి అందుకు అర్హుడై వుండాలి . బీజం సజీవమై వుండాలి ; క్షేత్రం సాగుచేయబడి సిద్ధంగా వుండాలి . ఇవి రెండూ చేకూరితే పారమార్ధిక చింత అనే సస్యం అత్యద్భుతంగా ఫలిస్తుంది . నిజమైన ధర్మ ప్రబోధకుడు ఆశ్చర్యకరమైన శక్తులు కలిగి వుండాలి . శ్రోత కూడా కుశలుడు లభించాలి . ఇలా ఇద్దరూ అద్భుత వ్యక్తులై అసాధారణులైనప్పుడు మాత్రమే దివ్యమైన ఆత్మ ప్రబోధం జరుగుతుంది . ఇలాంటి వారే నిజమైన ఆచార్యులు , నిజమైన శిష్యులు , నిజమైన జీజ్ణాసువులు . ఇతరులందరికీ జిజ్నాస అనేది వట్టి వినోదం , ఆట . వారి లో ప్రబోధం పొందేదీ రవ్వంత కుతూహలం , ప్రజ్వలించేది రవ్వంత వైజ్నానిక పిపాస . అంతే గాని వారు మత ధర్మ దిక్చక్రాంచలమ్ లో నిలబడి వున్నారు . అయినా ఇదీ కొంత ప్రయోజనకరమే ; ఎందుకంటే కాలక్రమాన ఇది నిజమైన పారమార్ధిక జిజ్నాస అనే దాహాన్ని జనింప చేయవచ్చు ; అంతే గాక క్షేత్రం సంసిద్ధమవగానే బీజం వచ్చి పడుతుంది , పడి తీరుతుంది ; ఇది మనకు అగోచరమైన ప్రకృతి శాసనం . ఆంతరంగం లో నిజమైన జిజ్నాస జనించగానే అలాంటి వ్యక్తికి తోడ్పడటానికై జ్నాన ప్రదాత అయిన గురువు కనిపిస్తాడు , కనిపించి తీరుతాడు . తాత్విక తేజాన్ని ఆకర్షించుకునే శక్తి శిష్యుడి లో ధృడమై పరిపూర్ణత నొందగానే దాన్ని సఫలీకృతం చేసే శక్తి క్రమం గా లభించి తీరుతుంది . కానీ భక్తి మార్గాన కొన్ని గొప్ప ప్రమాదాలున్నాయి . ఆచార్యుడి వల్ల తత్వాన్ని గ్రహించే శిష్యుడు తాత్కాలికావేశాన్ని - భావావేశాన్ని - నిజమైన జిజ్నాస గా భ్రమించవచ్చు . మన జీవితాల్లోనే దాన్ని మనం గమనించవచ్చు . మనం ప్రేమించిన వ్యక్తి ఒకడు మరణించటం ఎన్నోసార్లు తటస్థీస్తుంది , మన గుండె పగులుతుంది . సమస్తం నశించిపోతూందని మనకు తోస్తుంది ; అంతకంటే నిత్యమూ ఉన్నతమూ అయినదేదైనా కావాలనిపిస్తుంది . ఇక మనం పారమార్ధికాసక్తులం కావాలని భావిస్తాం . కొన్ని రోజులు గడవగానే ఆ శ్మశాన వైరాగ్య తరంగం సమసిపోతుంది ; ' ఎప్పటి కాలు ఎట్టెట్టే ' అన్నట్లు మళ్ళా పూర్వ స్థితి సంప్రాప్తమవుతుంది . ఇలాంటి క్షణిక భావావేశమే పారమార్ధిక జిజ్నాసగా మనమంతా తరచూ భ్రమపడుతుంటాం . కానీ ఇలా భ్రమపడుతున్నంత వరకూ యథార్థం , నిరంతరం అయిన పారమార్థిక పిపాస కలగదు ; అలాంటి ప్రబోధమొనరించే నిజమైన ఆచార్యుడు లభించడు . కాబట్టి మన సత్యాన్వేషణమంతా నిష్ప్రయోజనమైనదని వాపోవ బుద్ధి మారినప్పుడల్లా , అలా వాపోవటానికి మారు , ఆత్మపరీక్ష చేసుకొని మనకు నిజమైన జిజ్నాస వుందా లేదా అని విచారించటం మన ప్రధమ కర్తవ్యం . అలా చేసినట్లయితే నూటికి తొంభై పాళ్ళు తత్త్వ జ్నానానికి మనకు ఇంకా అర్హత కలుగలేదనీ మన జిజ్నాస నిజమైనదీ కాదనీ వెల్లడవుతుంది . తత్త్వోపదేశం చేసే గురువు విషయం లో ఇంత కంటే గొప్ప ప్రమాదాలున్నాయి . స్వయం గా అజ్నానపంక నిమగ్నులమై వుండీ గర్వాతిరేకం తో సర్వజ్నులమని విర్రవీగుతూ , అంతటితో ఆగక , పరులను తరింప చేయడానికై తమ భుజాలానందివ్వటానికి వెనుతియ్యక , కానన్న వారు కానన్నవారికి నాయకులై చివరకు వారూ వీరూ కలిసి గోతి లో పడుతూంటారు . " మూఢులు అజ్నానాంధకారం లో గోరాడుతూ , మా కంటే ధీరులు లేరని విర్రవీగుతూ , పండితమ్మన్యులై , గుడ్డివారి చేత నడపబడే గుడ్డివారి మాదిరి తొట్రుపాటు చెందుతూ పరిభ్రమిస్తుంటారు . " ప్రపంచం ఇలాంటి పండితమ్మన్యులతో నిండి వుంది . ప్రతి వ్యక్తికీ తాను ఆచార్యుణ్ణి కావాలనే తహతహ ! ప్రతి యాచకుడికీ తాను పదిలక్షలు దానం చేయాలనే ఆవేదన ! ఈ యాచకుల మాదిరే ఈ ఆచార్యులు నిజానికి హాస్యాస్పదులే . ( వివేకానందుడి " భక్తి యోగం " నుంచి . . . . )
ఇక అమెరికాకు వచ్చాక నాలుగైదేళ్ళకు ఒకసారి గానీ కుదరడం లేదు . ఇక్కడికి వచ్చిన ఈ పదేళ్ళలో ఒకే ఒకసారి 2003లో వీలయ్యింది . మళ్ళీ ఇప్పుడు . అప్పుడైతే అయిదు వారాలున్నా . కానీ ఇప్పుడు రెండు వారాలకు మించి కుదరడం లేదు .
నాన్న అమ్మ కోసం చూసి , చూసి పోయేడు . అమ్మ రాలేదు . ఇప్పుడు అమ్మకి ఆ పరిస్థితి రాకూడదు . ఆవిడ కన్న వాళ్ళం … అమ్మా నువ్వు మాక్కావాలి అనాలి . . ఆవిడని బతికించుకోవాలి . ఆ తల్లి పాల ఋణం తీర్చుకోవాలి . ఎవరూ లేని బ్రతుకు ఎంత దుర్భరమో నాకు బాగా తెలుసు .
పాఠశాలల్లో తెలుగు బోధన , తెలుగుభాష మాధ్యమంగా బోధనా ఎంతదిగజారిపోయాయో వేరే చెప్పనక్కర లేదు . అసలు , తెలుగు medium బళ్ళకి వెళ్ళే వాళ్ళు ఎవరు ? ముఖ్యంగా నిరుపేదలు . పోతే , చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో ఇంగ్లీషులో బోధించే ప్రైవేటు పాఠశాలలు అరుదవడం మరోకారణం . కాస్తో కూస్తో డబ్బులున్నవాళ్ళు , వాళ్ళ పిల్లలని పట్టణంలో ఇంగ్లీషు బడికే పంపిస్తున్నారు . ఇదేమీ తప్పు అనటల్లేదు . ఇంగ్లీషు బడిలో చదువుకుంటే , అమెరికా వెళ్ళక పోయినా భారతంలోనే , ఎక్కడో అక్కడ , ఏదో ఒక call centerలో తేలిగ్గా ఉద్యోగం వస్తుందికదా ! 2030 వ సంవత్సరం వరకూ ఈ ఉద్యోగాలకి ఢోకా లేదని కొందరి ప్రముఖుల అంచనా . ఇది వదంతే కావచ్చు ! కానీ , తెలుగు బడిలోనే చదువుకుంటే , చప్రాసీ ఉద్యోగంకూడా రాదుకదా ! ఇది ప్రస్తుత కాలంలో పచ్చి ఆర్థిక సత్యం అని వేరే చెప్పనక్కరలేదు .
చికాగో , ఇల్లినాయిస్ మరియు న్యూ ఆర్లీన్స్ , లూసియానా ల మధ్య నడిచే ఆం ట్రాక్ సిటీ ఆఫ్ న్యూ ఆర్లీన్స్ ద్వారా మెంఫిస్ మరియు టేనస్సీ లోని న్యూబెర్న్ పట్టణాలు కలప బడతాయి .
మా ఇంటావిడ గురించి చెప్పాలంటే చాలా ( అంటే నాలో కాగడా పెట్టివెదికినా కనిపించనివి ) ఉన్నాయి . తనో పేద్ద ' క్రమశిక్షణ ' ఇస్ట్ . ప్రతీదానికీ , అలా మాట్లాడకూడదూ , ఇలా మాట్లాడకూడదూ అంటూ ఊరికే ఊదరకొట్టేస్తుంది . ఇంట్లో అన్నీ వేటి స్థానంలో అవి ఉండాలంటుంది . ప్రతీదీ శుభ్రంగా ఉండాలంటుంది . నా అప్పుఎంతో అడుగుతూంటుంది . ఇంట్లో ఏదైనా ఫంక్షన్ లాటిది జరిగితే , వీళ్ళకు పెట్టాలీ , వాళ్ళకు పెట్టాలీ అంటూ నాచేత ఎవేవో తెప్పిస్తూంటుంది . నేను ఎప్పుడైనా కోపం వచ్చి అరుస్తే సమాధానం ఇవ్వకుండా ' కూల్ ' గా ఉండిపోతుంది . సమాధానం చెప్తేనేకదా నాకూ ఇంకా అరవడానికి అవకాశం వస్తుందీ ( ఏమిటో ఎవరూ అర్ధంచేసికోరూ ! ! ) . ఎప్పుడో జరిగిన సంగతులు అన్నీ గుర్తుపెట్టుకొని , ఛాన్స్ దొరికినప్పుడు ' ర్యాగ్ ' చేస్తూంటుంది . రోజుకో డ్రెస్ మార్చమంటుంది . నాకు చిరాకూ . సరీగ్గా బయటకు వెళ్ళే ముందర సాగతీసుకుంటూ ' ఆ డ్రెస్ మాసిపోయిందేమో , పోనీ మార్చకూడదూ ' అని .
శ్రీకాంత్ వందో చిత్రానికి చేరువయ్యాడు . సైడ్ హీరో క్యారెక్టర్లలో నటిస్తూ హీరోగా ఎదిగిన శ్రీకాంత్ కు ఇవివి చిత్రం " ఆమె " సక్సెస్ నిచ్చి , అతని కెరీర్ ని మలౌపుతిప్పింది . ఆ తర్వాత నటుడిగా కృష్ణవంశీ " ఖడ్గం " లో నిరూపించుకున్నాడు . ఆ చిత్రంలో సీరియస్ పోలీసాఫీసర్ పాత్ర అతనికి మంచి పేరు తెచ్చింది . ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తిపు తెచ్చుకునే అనేక చిత్రాలలో శ్రీకాంత్ నటించాడు . ఇప్పటిదాకా 99 చిత్రాలలో నటించిన శ్రీకాంత్ తాజాగా ఆయన 100వ సిని మాకు సిద్దమయ్యాడు . నటుడిగా తనను విభిన్నంగా చూయించిన కృష్ణవంశీ దర్శకత్వంలో నటించబోతున్నాడు . 2008వ సంవత్సరంలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి నిర్మాత శ్రీకాంత్ భార్య ఊహ కావటం విశేషం .
రామాయణంలో పిడకలవేట నాకిష్టం లేదు . ఇది రామాయణానికి రాయబోయే వ్యాఖ్యానాల్లాంటి మహత్తర కార్యం అసలే కాదు . కాని చాలాసార్లు నాలో కొన్ని ప్రశ్నలు ఉదయించాయి . 1 . రామాయణం వొక్కటే అయితే ( వాల్మీకి ) , మన దేశంలో ( లేక ప్రపంచం మొత్తం మీద అందామా ? ) యిన్ని రామాయణాలు ఎందుకు ప్రాచుర్యంలోకొచ్చాయి ? 2 . సరే వొచ్చాయి , వాల్మీకి రామాయణానికీ ( మూలం ఇదే అనుకుంటే ) , తర్వాత కోకొల్లలుగా వొచ్చిన రామాయణాలకి చాలా వాటిల్లో పోలికలెందుకు కనిపించలేదు ? ఎవరు మార్చారు ? ఎందుకు మార్చారు ? 3 . హైందవ సంస్కృతి చాలా బలీయమైంది . కనుకనే వేల సంవత్సరాలుగా మన జీవితాలు దీనితో పెనవేసుకుపోయాయి . దీని కూకటి వేళ్లు అంత శక్తివంతమైనవి . అది హైందవ సంస్కృతి గొప్పదనమా లేక మన మనస్సుల్లో మనం కట్టుకున్న గొప్ప నమ్మకమా ? 4 . వాల్మీకి రాసిన చాలా విషయాల్ని మన వాళ్లెందుకు దాచి పెట్టారు . అన్నిటినీ కూలంకషంగా ఎందుకు చర్చించలేదు ? హైందవ సంస్కృతి పరిరక్షణకా లేక సంఘ నీతిని కాపాడటానికా ? ' రామాయణంలో అభ్యంతరాలుగా వున్న అన్ని విషయాల్ని ప్రస్తావించనఖ్కరలేదు , కానీ మన నమ్మకాల్ని సడలింపజేయనివీ అయితే చర్చిద్దాం ' అని అంటారా ? ఈ పేజీలో ( ఎడమ వైపు ) పోల్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి .
పొద్దు గడికి స్లిప్పులందించే సుగాత్రిగారు ఎక్కడో స్లిప్పై పోయారు . ఎక్కడవున్నా వచ్చి అటెండెన్సు వేయించుకోవలసిందిగా కోరుతున్నాం . పొద్దెరుగని గడి పిచ్చిగాళ్ళకి ఈ స్లిప్పులభారం తలకెత్తుకోక తప్పేదేముంది ? మొదటి వాయ ఇదిగో . . అడ్డాలు : 1 . సాయం కావాలా ? టైమైపోయిందే ? 32 . అవ్వలు , బువ్వలు , గవ్వలు , రవ్వలు . . టైమింగు కాదు , రైమింగండీ బాబూ ! నిలువులు : 1 . రాజమండ్రి హిష్టరీ ఇది . చిత్రంగా ఉందే ! 4 . దీన్నీ కొద్దిగా సాగదీశామనుకోండి , పిచ్చెక్కిందనుకుంటారు . ఇక విజృంభించండి .
పురాణాలలో లోకం అంతా స్వర్గనరకాలుగానూ , భూమిగానూ విభజించారు . ఇవి ఒకదానిపై ఎకటి ఆధారపడి ఉండగా భూమి అడుగున పాతాళ లోకంలో , ఆదిశేషు వీటన్నిటినీ మోస్తుంది . ఆ సర్పంపై విష్టువు శనించి ఉంటాడు . సూర్యుడు , చంద్రుడు , గ్రహాలన్నీ ప్రత్యేక దేవతలకు నివాసాలు . రాహువు , కేతువులు తరచు సూర్యచంద్రులను కబళిస్తుంటాయి . అప్పుడు గ్రహణా లేర్పడతాయి . కాంతి పుంజాలు వెదజల్లే ఈ నిస్సహాయ దేవతలను రాహు కేతువుల కబంధ హస్తాల నుంచి తప్పించటానికి పూజా పునస్కారాలతో ఎన్నో వస్తువులు సమర్పించుకోవలసి ఉంది . గ్రహణాలే కాక , వరదలూ , కరువు కాటకాలూ , భూకంపాలూ అన్నీ ఏదో ఒక దేవతకు అంటగట్టారు . వాటి ముందు మానవుడు నిస్సహాయుడు . ఆరాధనతో దేవతలను శాంతింపజేయటం , లేదా పూర్తిగా లొంగిపోవడం , కాదంటే , యోగాభ్యాసం , తపస్సు వల్ల కొన్ని శక్తులు సంపాదించటం మాత్రమే మానవుడు చేయగలిగింది . అంతేగాని దైవశక్తి పనిచేసే తీరును , వివేచనాత్మకంగా తెలుసుకొని వాటి బారి నుంచి తప్పించుకోవటం , లేదా మరొక మార్గాన్ని చూడటం అనేది జరగదన్న మాట . నియమ బద్దమైన ప్రకృతి అనే భావన వస్తువులలోగాని , తీరు తెన్నులలో గాని చూడలేక పోయారు . సైన్సు వల్ల నియమబద్దత వచ్చింది . నక్షత్రాలను , గ్రహాలను , దేవతా నివాసాలుగా నేడు అందరు మానవులు నమ్మటం లేదు . దుష్ట దేవతల ప్రయత్నం వల్ల శిష్టమైన వాటిని నాశనం చేయటానికి గ్రహణాలేర్పడుతున్నాయని అందరూ నమ్మటంలేదు . మనం ఇప్పుడు , గ్రహణాలను ఊహించవచ్చు . లోగడ మనలను ఆశ్చర్య పరిచే అనేక సంఘటనలను ఇప్పుడు , గంటలూ , నిమిషాలతో సహా అంచనా వేసి చెప్పవచ్చు . భూమి సూర్యుని చుట్టూ గంటకు 65 వేల మైళ్ళ వేగంతో తిరుగుతున్నదని తెలుసుకున్నారు . దీని కాధారంగా శేషనాగు లేదుగాని , సూర్యుని గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి నిలబడిందని గ్రహించాం . సూర్యోదయం , సూర్యాస్తమయం , సముద్రాల ఆటుపోట్లు , రుతువుల మార్పులు , ఏడాదికొకసారి పక్షులు , చేపలూ వలసపోవడం , నక్షత్రాల , మనుషుల , జీవజాలాల పుట్టుక , చావు కూడా దేవుడు , దేవతవల్ల గాక , అంతర్గతంగా ఉండే నియామాల వల్ల జరుగుతున్నాయి . మానవుడి వివేచనకు ఇవన్నీ అవగాహన అయ్యేవే . తన సాంస్కృతిక పరిణామ భిన్నదశలలో మానవుడు తనను పోలిన దేవుడిని సృష్టించుకున్నాడు . ఈ విషయాలన్నీ తెలియటం వల్ల ఇంతకు ముందెన్నడూ లేనంతగా మానవుడి సృజనాత్మక శక్తి విమోచన పొందింది .
ఇంకేముంది , ఏర్పాట్లు చకచక జరిగిపోయాయి వాళ్ళ వివాహానికి ! అభినవకౌముదినీ , మధురలాలసనీ సమానంగా చూసుకుంటూ ఇద్దరితోనూ ఆనందంగా గడుపుతున్నాడు కళాపూర్ణుడు .
గన్నయ్య ఇన్నయ్య తమ్ముడు కాదు , వాడు మా తమ్ముడు . చిన్నప్పుడు చదువు దొంగ . ఇప్పుడు జాతకాలు చెప్పి పొట్ట పోసుకుంటున్నాడు .
రఘువీర్ డైరెక్ట్ చేసిన నాటకం పేరు ' ఎకనమిక్ హిట్‌మాన్ ' . అసలు అది నాటకమే కాదు . ఒక ఆటోబయోగ్రఫీ . జాన్ పెర్కిన్స్ అనే అమెరికన్ రాసిన " Confessions of an Economic Hitman " అనే ఆత్మకథను తెలుగులోకి కొణతం దిలీప్ ' ఒక దళారీ పశ్చాత్తాపం ' పేరుతో ఐదేళ్ల క్రితం అనువదించారు . ఈ ఐదేళ్ళలోనే అది దాదాపు పదిసార్లు పునర్ముద్రణ పొందింది . ఆ రచయిత జాన్ పెర్కిన్స్ ప్రపంచ బ్యాంకులో అతి కీలకమైన అధికారిగా పనిచేశాడు . అభివృద్ధి చెందని , చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం చేస్తున్నామనే పేరుతో ప్రపంచ బ్యాంక్ ఆయా దేశాలని ఎంత దారుణంగా దోచుకుంటున్నదో వివరించే పుస్తకం ఇది .
ఆరేళ్ళుగా కూడబెట్టిందంతా ఆర్నెలల్లో హరించుకుపోయింది , స్టాక్ మార్కెట్ చావు దెబ్బతో . డబ్బుతో పాటే రోజురోజుకీ పెరుగుతూ వచ్చిన ధీమా కూడా ఎయిడ్స్ రోగిలా ఎండి ఈ మధ్యనే పూర్తిగా బాల్చీ తన్నేసింది . ఎవర్నైనా కళ్ళలోకి చూచి మాట్టాడాలంటే గుండెల్లోంచి వొణుకు పుట్టుకొస్తోంది . " బిన్ లాడిన్ అనుచరుడివి కదా నువ్వు ! " అని ఎవరైనా గట్టిగా దబాయిస్తే కిక్కురుమనకుండా ఒప్పేసుకునేంత పిరికితనం ఆవహించిందతన్ని . " ఎవరికేది ప్రాప్తమో వాళ్ళకదే దక్కుతుంది " అనేది నిత్యపారాయణగా మారింది , భగ్గుమనే మనసు మీద నీళ్ళు పోయటానికి .
2జీ లో , రాజాకి ' నిబంధనలకి దూరంగా యేమీ చెయ్యద్దు ' అని మాత్రమే సలహా ఇచ్చాడట ఆయన . ఆ తరవాతేమి జరిగిందో తనకి తెలియదట . పైగా మీరందరూ " ఆ శెట్టిగారిలా " మాట్లాడితే యెలా ? అని విసుక్కుంటున్నాడట !
అలాగే హిమాలయాలకు వెళ్ళకుండా ప్రజల దగ్గరికి వస్తున్నాడు కాబట్టి , నా దృష్టిలో చిరంజీవే గొప్ప .
యూరోపియన్ , అమెరికన్ సమాజాలలో కూడ అటువంటి మార్పులు జరగడం , ఆ మార్పులలో వైతాళికుల పాత్ర వారి నేపథ్యాల గురించి ఇక్కడ అప్రస్తుతంగాని , భారతీయ సమాజాలలోని వైతాళికుల గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు వారి మధ్య తీవ్రమైన అంతరాలు , సామ్యాలు , భేదాలు , వారిలో ఒక్కొక్కరి ప్రత్యేకతలు ఆశ్చర్యం గొలుపుతాయి . బెంగాలీ సమాజంలోని రాజారామమోహనరాయ్ ( 1772 - 1833 ) , ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ( 1820 - 1891 ) , కేశవ చంద్రసేన్ ( 1838 - 1884 ) , రామకృష్ణ పరమహంస ( 1836 - 1886 ) , ల నుంచి , గుజరాతీగా పుట్టినా ఆర్య సమాజం ద్వారా హిందూ సమాజమంతా ప్రముఖుడైన దయానంద సరస్వతి ( 1834 - 1883 ) , కోస్తాంధ్ర తెలుగు సమాజంలోని కందుకూరి వీరేశలింగం ( 1848 - 1919 ) , రఘుపతి వెంకటరత్నం నాయుడు ( 1862 - 1939 ) , గురజాడ అప్పారావు ( 1861 - 1915 ) ల వరకూ ఈ భారతీయ వైతాళికుల సంప్రదాయం విస్తృతమైనది . సుధీర్ఘమైనది . దానికదిగా ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసినది . అయితే దాదాపుగా ఆయా సమాజాలలోని వైతాళికులందరూ ఒక నిర్ధిష్ట , సంపన్న , విద్యాధిక వాతావరణం నుంచి , ప్రత్యేకమైన అవకాశాలతో వైతాళికులుగా ఎదిగారు . ( 1 ) తమిళ సమాజంలోని సుబ్రహ్మణ్య భారతి ( 1882 - 1921 ) మరాఠీ సమాజంలోని జ్యోతిబాఫూలే ( 1827 - 1890 ) , మలయాళీ సమాజంలోని నారాయణ గురు ( 1856 - 19228 ) వంటి వైతాళికులు మాత్రమే సంపదలోనో , కులంలోనో , అవకాశాలలోనో ఈ సంప్రదాయానికి మినహాయింపు .
పడుపుతనము సోకె బడుగు కన్నియలకు వీరశైవమందు వెఱ్ఱిపుట్టి బసివిరాలితనము పశుపతి మెచ్చునా కోలగొట్ల మాట కోటి తెలుపు
రేగడి విత్తులు - తానా నవలల పోటీలో రూ . 1 , 20 , 000 / - బహుమతి పొందిన తొలి నవల . వ్యవసాయం ఇతివ్రుత్తంగా సాగే ఈ కథలో అంతర్లీనంగా సాగే చిన్న కథలు - సఫలమైన ప్రేమ , విఫలమైన ప్రేమ , అత్త గారితో సర్దుకోలేని కోడలు , ఎవ్వరినీ లెక్క చేయని కొత్త కోడలు , కుటుంబం కోసం హారతి అయ్యే కొడుకు కోడలు , రాబంధువులు , దొరలు , దొంగలు , సారా , రాజకీయాలు . ఏవో కొన్ని తెలుగు నవలలు బహుశా ఈ పరిథిని దాటగలిగాయేమో . వ్యవసాయం గురించి తెలియని వారికి ఏమన్నా ఆసక్తికరంగా వుంటుందేమో కానీ తెలిసిన వారికి ఇది మరో తెలుగు నవల అంతే . ఒక నాటి గ్రామీణ జీవితాన్ని చక్కని సంభాషణలతో ఎలాంటి అసహజత్వం లేకుండా మన ముందు వుంచుతారు రచయిత్రి . ముద్రణా ప్రమాణాలు ముచ్చట పడే లాగ వున్నాయి . అన్ని పుస్తకాలు ఇంతే చక్కగా ముద్రితమైతే బాగుండును . తెలియని పదాలకు అర్థం కింద ఇవ్వటం నిజంగా మెచ్చుకోదగిన మార్పు . తానా నవలల పోటీలో బహుమతి పొందిన మిగతా నవలల చిట్టా ఎక్కడైనా వుందా ? ఈ కింద వాటికి అర్థాలు తెలిస్తే ఎవరైనా చెప్ప మనవి -
రేప్పొద్దున మీరు రోజూ మామూలుగా లేచే వేళకి లేచి కిటికీలోంచి బయటికి తొంగి చూసి . . " ఇంకా తెలవారదేమి ? ఈ చీకటి విడిపోదేమి ? " అనుకునే అవకాశం ఉంది . ఈ నాటి ( ప్రపంచపు పూర్వార్ధంలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ గడచి పోయిన ) రేయి ఈ సంవత్సరానికి సుదీర్ఘమైన రేయి . కాలచక్రభ్రమణాన్ని లెక్కపెట్టుకోవటానికి , ఋతువులూ , కాలాలు , ఇలా ప్రకృతి మనకి అనేక టైం టేబుళ్ళని ఇచ్చింది . ఈ అనంత విశ్వంలో భూమి సూర్యునితో చుట్టూ చేసే వింత నృత్యంలో నాలుగు అడుగులు మార్చి , జూన్ , సెప్టెంబరు , డిసెంబరు నెలల్లో సుమారు 21వ తేదీ ప్రాంతంలో పడతాయి . మార్చి సెప్టెంబర్లలో వచ్చే ఈ దినాలని ఈక్వినాక్సులు అంటారు . ఆ రోజున పగలు , రాత్రి ఇంచుమించు సరిసమానంగా ఉంటాయి . జూన్ లో వచ్చేది వేసవి ( సమ్మర్ ) సాల్స్టిస్ . ఆ దినం సుదీర్ఘమైన పగలు . ఇవ్వాళ్ళ వింటర్ సాల్స్టిస్ - సుదీర్ఘమైన రేయి . కేవలం భూమి - సూర్యుడు సాపేక్ష చలనాల ప్రకారం ఈ వేళ ఆకాశంలో సూర్యుడు దక్షిణోత్తమ బిందువుని స్పృశించి రేపణ్ణించీ ఉత్తరాయణం ప్రారంభిస్తాడు . భారతీయ సౌరమానంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించితే ( మకర సంక్రాంతి ) గానీ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలు కాదు . ప్రాచీన నాగరికత లన్నిటిలోనూ కాలగమనానికి , తద్వారా మన చుట్టూ ప్రకృతిలో వ్యక్తమయ్యే మార్పులకూ చాలా ప్రాముఖ్యత ఉన్నది . కొంత వరకూ అది వారి వారి వ్యావసాయిక జీవితాలతో ముడిపడిన సంబంధాల వల్ల కావచ్చు . ఉదాహరణకి దక్షిణ భారతంలో సంక్రాంతి , పంట చేతికి వచ్చినప్పుడు జరుపుకునే పండుగ . అదే కాక . . ఈ కాలగమనపు చిహ్నాలు నిరంతరం జరుగుతుండే మార్పుకీ , అశాశ్వతత్వానికీ ప్రతీకలు . . మార్పు సహజం . . మార్పుని ఆహ్వానించు , జీవించు . . అనే తాత్త్విక ఆలోచనలు కూడా మన పూర్వికులకి కలిగినయ్యేమో , ఈ రోజుల్ని పురస్కరించుకుని పండుగలు ఏర్పాటు చేశారు . అమావాస్యలూ , పౌర్ణములూ , సూర్య చంద్ర గ్రహణాలూ . . అంతెందుకు రోజూ జరిగే త్రిసంధ్యలు కూడా మనవారికి శక్తిభరిత ముహూర్తాలుగా తోచాయి . ఆయా సమయాల్లో ప్రత్యేక నిష్ఠతో జపతపాలు పూజలు చెయ్యమని సెలవిచ్చారు . ఇక్కడ నేటివు అమెరికను జాతుల వారికి చాలా మందికి ఈ రోజు ఎంతో పుణ్యదినము . ఈ రాత్రి ప్రత్యేకమైన సామూహిక కర్మకాండలు నిర్వహిస్తారు . క్రిస్టియానిటీ ఒక మతంగా యూరపులో ప్రబలక ముందు ఆయా దేశాల్లో బలంగా ఉన్న పేగన్ , కెల్టిక్ ఇత్యాది మతాల్లో కూడా ఈ రాత్రికి చాలా ప్రాముఖ్యత ఉన్నది . అసలు ఏసుక్రీస్తు డిసెంబరు 25న పుట్టాడని ఋజువేమీ లేదూ , అప్పటికి ప్రబలంగా ఉన్న వింటర్ సాల్స్టిస్ పండగని తమ కొత్త మతంలో విలీనం చేసుకోవడానికి మొదటి క్రైస్తవుల ఎత్తు క్రిస్టమసు అని కూడా ఒక వాదం ఉంది . గమనించండి , చర్చిలలోనూ , జానపద కథల్లోనూ కూడా క్రిస్మసు ముందు రాత్రికే . . ప్రాముఖ్యత ఎక్కువ . . క్రిస్మసు దినానికి కాదు !
అయ్యో , ఏదో నా పేరు కనిపిస్తే కాస్త గిలికానుగానీ నిజంగా జవాబు వస్తుందనుకోలెదే ? ఎదేమైనా శుభాకాంక్షలు , నేనైతే వి . వి . రమణ .
శ్రీ రాగ గారూ , పాలు తోడు పెట్టేటప్పుడు ఒక ఎండు మిరపకాయ గానీ , ఒక చింతపండు పరక గానీ వేస్తే పాలు చక్కగా తోడుకుంటాయి .
ప్రేమదాడులనేవి పైకి కనిపిస్తున్న ఒక మంచుకొండ శిఖరాగ్రం ( tip of the iceberg ) మాత్రమే . దాని వెనక చాలా లోతైన సామాజిక , మానసిక పరిణామాలు దాగున్నాయి . ఈ దాడులు చేస్తున్నవారంతా ఎక్కువమంది పాతికేళ్ళ లోపలి వయస్కులు . ఆ వయసులో ఒంట్లో రక్తం కడువేడిగా , బహువేగంగా ప్రవహిస్తూ ఉంటుంది . శృంగారప్రేమకు సంబంధించిన భావాలు చాలా బలీయంగా ఉంటాయి . చాలా శక్తిమంతంగా ఉంటాయి . ప్రియురాలితో అటాచిమెంట్ చాలా అధికంగా ఉంటుంది . ఒక శిశువుకు తన తల్లి పట్ల ఎంత అటాచిమెంట్ ఉంటుందో అలాంటిది యుక్తవయసులో ప్రియురాలితో ఏర్పడుతుంది . ఒక అఱవయ్యేళ్ళవాడికి తాను జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న ఆస్తి ఎంత ప్రీతిపాత్రమో ఒక పాతికేళ్ళవాడికి తాను సంపాదించుకున్న ప్రేయసి అంతకంటే ఎక్కువ అమూల్యమైనది . అందుచేత ఆ వయసు మీఱిన ఖల్వాట వర్గానికి ఈ ప్రేమదాడుల మతలబేంటో బోధపడదు . అందఱినీ కాదనుకొని ఆమెతో కలిసి జీవించడానికీ , ఆమె కోసం ఎవఱినైనా చంపడానికీ , అవసరమైతే ఆమెతో కలిసి చనిపోవడానికీ , ఆమె ద్రోహం చేస్తే ఆమెని కూడా నిలువునా చంపేయడానికీ క్షణాల మీద సిద్ధపడగల దుందుడుకు దూకుడూ , తెగువా ఆ వయసు యువకుల్లో ఉంటుంది . ఇది పురుషశరీరం అనుభవించే జీవితదశాలక్షణం ( Male anatomy phase ) కనుక ఫెమినిస్టులకు , వారి కోవర్టులైన పాత్రికేయురాళ్ళకూ కూడా ఇది సులభంగా బోధపడదు . అది సహజమే . దేవుడు ఆడ శరీరాల్నీ , మగ శరీరాల్నీ ఒకేలా సృష్టిస్తే మనకీ బాధలెందుకు ?
" నువ్వు నిన్న ఇవ్వలేదు . నీకు పది పైసలివ్వక్కర్లేదూ , ఇవ్వనూ " మొండిగా అన్నాడు రామూ . " మరేదగా ఇత్తావా , లాక్కోవంతావా ? " అంటూ గల్లాపెట్టి సొరుగు లాగాడు రావణాసురుడు . ఆ గొడవ వింటున్న మిగిలిన కస్టమర్లు లేచి , రావణాసురుడిని తిట్టారు గల్లాపెట్టి సొరుగు ముట్టుకున్నందుకు . విషయం తేల్చుకోవాలి గానీ , గల్లాపెట్టి సొరుగు ముట్టుకోకూడదూ , కావాలంటే వాళ్ళ నాన్న వచ్చాక చెప్పుకో సంగతి అని వాడిని హెచ్చరించారు .
బాగుంది ! కృష్ణ గారు చెప్పినట్లు కొద్దిగా SPB గారు పాడిన వెర్షన్ ఉంటే లింక్ ఇవ్వండి కొద్ది గా Please .
స్వర్ణకారులు వాడే కొలతలు కనిపించలేదు ఈ వ్యాసంలో , తులం వంటివి ( ఎన్ని వీసాలైతే ఒక తులం ( పాత తులం ) ? జవాబు వ్యాసంలో ఉంది , కానీ క్యాలిక్యులేటర్లకు అలవాటు పడ్డ మన బుర్రలు కొద్దిగా వెతకాల్సొస్తుంది . ) ( గురివింద గింజలతో బంగారం కొలవగా చూసాన్నేను చిన్నప్పుడు , వాటి బరువెంత ? ) .
ఈ సూ ఋ సంస్థలు , రిపేరు చెయ్యబడ్డ గ్రూపులకి బ్యాంకులలో యెంత ఎన్ పీ యే ఋణం వుందో , దానికి తగ్గట్టు ఋణాలని మంజూరు చేసి , బ్యాంకులలో కట్టించేసేవి . బ్యాంకులకి ఎన్ పీ యే రికవరీ జరిగిపోవడం తో పాటు , ఋణ ప్రణాళిక ప్రకారం అదే గ్రూపుకి మళ్లీ ( మొదటి యాభై వేలూ చెల్లించేశారు కాబట్టి ) వాళ్ల పొదుపు మీద ఆథారపడి , కొత్తగా ఒక లక్ష నించీ , 3 లక్షలవరకూ ఋణాలు మంజూరు చెయ్యడం మొదలెట్టాయి - - సభ్యురాళ్లందరికీ తలా పదివేల నించి , 30 వేల వరకూ ! ( వీటిని తిరిగి చెల్లించడానికి 5 సంవత్సరాల వ్యవధిని ఇస్తారు ) ! ఈ డబ్బుతో సూ ఋ సంస్థల అప్పులని తీర్చేసి , నిబంధనల ప్రకారం మళ్లీ వాళ్ల దగ్గరనించి అప్పు తీసుకోవడం మొదలెట్టాయి !
వాషింగ్టన్ డిసి లో ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి ఆర్లింగ్‌టన్ నేషనల్ సెమెటరీ - అమెరికాలోకెల్లా పెద్ద యుద్ధ వీరుల సమాధుల నిలయం . మనదేశంలో ఐతే సమాధుల్ని చూడటానికి టూరిస్టులు వెళ్లటమేంటని ఆశ్చర్యపోతారేమో .
మొట్టమొదట శాస్త్రీయముగా శ్రీశ్రీ రచించిన ఒక రెండు వృత్తాలను ఇక్కడ చెప్పడం సబబు . ' ప్రళయనర్తనము ' లో జగత్తును నీ మూడవ కంటితో తగులబెట్టమని శార్దూలవిక్రీడితములో శివుని అడుగుతాడు -
పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలోఒకటేరాగం అది ఆనందభైరవరాగం . అన్నట్టు " నీనూనె నీనూనె నానూనె నానూనె . నీనునెని నానూనెని నానూనెని నీనూనెని నేనన్నానా నాన్నా . " ఇది మిస్స్ కొట్టినట్టుంది అన్నాయ్ .
ఎలాగైతే పక్కబోగీలో డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో ద్రాక్షతోటలకు పెట్టిన పైపునుండి వస్తున్నట్టుగా వస్తున్న నీటిబొట్టులన్నీపోగుచేసి మెహం కడుక్కుని అరగంట తర్వాత బయటపడ్డాడు . సెల్ ఫోన్ చూస్తే బేటరీ చార్చ్ అయిపోయేలావుంది . . ఇక్కడో సెల్ చార్జర్ పెట్టుకునే ప్లగ్ ఇస్తాడే ఏదబ్బా అని వెతగ్గా ఆ బోగీకి లేదు కానీ వేరే బోగీలో అది వున్న చోట తీర్ధంలో బెల్లంజీళ్ళదుకాణం దగ్గర మూగినట్టుగా మూగి సెల్ చార్జింగ్ చేసేసుకుంటున్నారు . ఫ్రీగా వస్తే ఏదివదలరన్నమాట జనాలు అనిపించింది కిరణ్ కి . ఏం చేస్తాం , ఫోన్ డెడ్ అయిపోతే కష్టం అని అనుకుంటూ అక్కడికివెళ్ళి వెయిట్ చేసాడు .
నేనూ , శర్మగారూ గుడ్లు మిటకరిస్తూ , ఒకర్నొకరు చూసుకుంటూ , గుటకలు మింగుతూ కూర్చున్నాం . అయితే రావుగారిని ఏ సంకోచాలూ బాధించినట్టు లేవు . మా అందర్లోకీ ఆయనే పెద్దవాడవడం మూలానేమో . " ఇదేమిటీ ? " అంటూ ఆయన ఆ డబ్బాని వింతగా చూస్తూ అటూ ఇటూ కదిలించారు . " మీరడిగిందే . " " కానీ ఇదేదో బట్టల మీద స్ప్రే చేసే స్టార్చులాగుందే ? " " అవును . " " భలే జోకు వేశారే ! " అంటూ ఆయన విరగబడి నవ్వేశారు .
మీరున్ రూపురేఖా లావణ్యాలు మార్చినారా ? బాగుంది ! ఎడమవైపు , కుడివైపు ఖాళీ జాగా ఎక్కువ మిగిలిపోతుంది . అలా కాకుండా ఆ జాగాలోకి మన బ్లాగు టపా విస్తరిస్తే బాగుంటుంది .
( ఆయన స్వంతానికి కొనుక్కొన్న " మహీంద్రా మ్యాక్స్ " - - యెంతమందినైనా , యెంత లగేజినైనా భరించేస్తుంది - - సువిశాలంగా వుంటూ . మేము వచ్చేరోజే దాన్ని గ్యారేజ్ కి పంపించారు - - ఇంజన్ వగైరాలు చెక్ చెయ్యమని . అది మర్నాడుగానీ రాదు . వాళ్ల స్కూలుకోసం ఓ ఐదారు బొలేరోలూ , క్వాలిస్ లూ కాంట్రాక్టు క్రింద వున్నాయి . పదో , పదిహేనో బస్సులు కూడా వున్నాయి - - ఒకటి రెండు స్వంతమూ , మిగిలినవి కాంట్రాక్టూ . ఓ పాతికమంది డ్రైవర్లు వుంటారు వాటికన్నిటికీ ! వాళ్లనీ , బళ్లనీ మేనేజ్ చెయ్యడమే కీలకం !
అబ్బ ! చూసినవే ఎన్నిసార్లు చూడమంటారు . నయగరా కెనడా వైనుండీ అమెరికావైపునుండీ కూడా చూసి చూసి విరక్తి వచ్చేసింది . ప్లేసు సారీ వేదిక మార్చండి . జనాలెవ్వరూ లేకుండా సన్మాన సభ పెడతారా ? ఏమిటీ ? మరీ చొద్యంగా !
సుబ్బలక్ష్మికి ఒహటే విసుగ్గా ఉన్నది ! ఈ రోజు కూడా తప్పదేమో , వీడి బెడద . నెలరోజులనుండి ఇదే వరస ఎక్కడకి వెల్తే అక్కడికి వస్తాడు , ఎర్ర గులాబీ ఇస్తాడు , " ఐ లవ్ యూ , డూ యూ లవ్ మీ " అంటాడు నో అంటే వినడు . బాండ్ జేమ్స్ బాండ్ అంటాడు , నవ్వుతాడు , మనిషి బాగానే ఉంటాడు కానీ ఏం లాభం తను ఆల్రెడీ కమిట్ అయిపోయినదాయ , శ్రీ కి తన మనసు ఎప్పుడో ఇచ్చేసినదాయ ! ఇహ లాభం లేదని శ్రీ కి చెప్పినది * * * * * * * * *
వోలేటి గారు , దోపిడీ , అణచివేత ఉన్నంతకాలం ఉద్యమాలు ఉంటాయి , దోపిడీ దారులు ఇక్కడి దొరలయినా , రజాకార్లయినా , మరో ప్రాంతపు ధనిక వర్గాలయినా ఉద్యమానికి అతీతులు కారు . శ్రీకాకుళం వారు , తెలంగాణా వారు కూడా పొట్తకూటికోసం ఇతర ప్రాంతాలకు వలస వెల్లి శ్రమిస్తారు . అలా ఎందుకు వలస వెల్లాల్సి వస్తుందనేదే ఇక్కడ ప్రశ్న . ఉత్తరాంధ్ర వారు కూడా సమైక్య రాష్ట్రంలో తమకు అన్యాయం జరుగుతోందని అంటున్నారు . వారు రాష్ట్రం అడగకపోవడానికి కారణం ఉత్తరాంధ్ర ఒక రాష్ట్రంగా నిలదొక్కుకునే సామర్ధ్యం లేకపోవడమే . మీకు డప్పు కొట్టే కలాకారులమీద చాలా లోకువ ఉన్నట్లుంది , ఇలాంటి లోకువ భావన మానుకుంటే మంచిది . మీరు ముందు ఇక్కడి వనరుల దోపిడీ గురించి మాట్లాడారు , తరువాత తెలంగాణా నాయకులపై పడ్డారు , ఇప్పుడు ప్రజలపై అక్కసు వెల్లగక్కుతున్నారు . ఒక్క విషయాన్ని ముగించి అందులో ఎదుటివారి పాయింటు అర్ధం చేసుకుని ఇంకో విషయంపై మల్లిస్తే బాగుంటుంది . స్వాతంత్రం వచ్చి ఎన్నేల్లయినా ఇక్కడి వారు ముఖ్యమంత్రులుగా ఉన్నది మొత్తంగా ఆరు సంవత్సరాలు కూడా లేదు , ఇక్కడి వారు ముఖ్యమంత్రి అయి ఇక్కడి ప్రాంతాలలో జరిగే అన్యాయాన్ని అరికట్తడానికి ఏదయినా చేద్దామనే లోగా మీవారు కుతంత్రాలు పన్ని గొడవలు సృష్టించి ముఖ్యమంత్రులను దించేస్తారు . ఇందుకు SLBC గురించి చెన్నారెడ్డి , ఉద్యోగాల గురించి పీవీ చేసిన ప్రయత్నాలు , వెంటనే మీనాయకులు వారిని దించి వేసిన ఉదాహరణలు చాలనుకుంటా . పైగా మాప్రాంతం వారు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఒక ప్రాంతానికి ప్రధానమంత్రి , ముఖ్యమంత్రిలాగా పనిచేసే సంకుచితత్వం వారికి లేదు . ఎవరు ముఖ్యమంత్రి అయినా మొత్తం రాష్ట్రం మంచి కొరకు పనిచెయ్యాలి , అలాజరగనప్పుడు విడిపోవడమే సరయినపద్దతి . మీకు అర్ధమయిందని అనుకుంటున్నాను . అర్ధం కానట్లు నటిస్తే చేసేదేం లేదు .
అఫ్సర్ రాయబోయే వ్యాసం కోసం నేను కూడా ఎదురుచూస్తాను . అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రుల జీవితాలూ - సాహిత్య సృష్టి గురించి ఇంతకు మునుపు ఈ మాటలో జరిగిన చర్చల్లో వచ్చిన ప్రశ్నలను దృష్టిలో ఉంచుకుని మరొక్క అడుగు ముందుకు వేయటానికి అనువుగా రాస్తారని ఆశిస్తున్నాను .
ఉత్తమ సహాయ నటుడు : ప్రకాష్ రాజ్ ( బొమ్మరిల్లు ) : - ఎదురులేని వాచకం ఇతని సొత్తు . ఏ సినిమాలో ఉన్నా సరే అతడే హీరో అనిపిస్తాడు .
ఏ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో లాగా అభివృద్ధి జరగడం లేదట . ముఖ్యమంత్రి అంటున్నాడు . ఈ సంగతి తేల్చేందుకు ఏ రాష్ట్రానికైనా సరే వెళ్ళి చూద్దామని సవాలు కూడా చేసాడు . ఇద్దరం కలిసి వెళ్ళి చూసొద్దామని చంద్రబాబును ఆహ్వానించాడు కూడా . మన అభివృద్ధి సంగతి తెలుసుకుని మూర్ఛబోదామని నాకూ ఉంది . కానీ అంతకంటే ముందు చంద్రబాబు , ఇతర ప్రతిపక్షాలు అలా దేశం తిరిగొస్తే ప్రయోజనమేమైనా కలుగుతుందా అని ఆలోచించ దలచాను . ఈమధ్య ఈ జనాలు ఓబులాపురం చూసొచ్చారు . సింగడు అద్దంకి వెళ్ళొచ్చాడు అన్నట్టు . . వీళ్ళూ వెళ్ళారు , వచ్చారు . తెదేపా ' ఏమీ బాలేదు ' అని అంది . . ఏంబాలేదో , ఎందుకు బాలేదో చెప్పలేకపోయింది , మామూలుగానే ! మిగతావాళ్ళు ' ఏంలేదు అంతా బానే ఉంది ' అంటూ జేజేలు కొట్టొచ్చారు . ఆ మాత్రపు ముష్టి పని కోసం ఈ నాయకులంతా పాంట్లు ఎగలాక్కోని ఓబులాపురం దాకా పొయ్యొచ్చారు . అవునులే జీవితంలో మరో రకంగా ' గాలి ' మిషను ( హెలికాప్టరు ) ఎక్కగలిగే వాళ్ళా ! ? ' గాలి ' అబ్బాయి వీళ్ళని చూసి ముష్టి వెధవలని అనుకొని నవ్వుకొని ఉంటాడు . హై . లో కూచ్చుని గనులు లీజుకెలా ఇచ్చారో పరిశీలిస్తే ఇక్కడే తెలిసిపోయేది ఆ లీజు భాగోతం ; కోర్టుకు తెలిసిపోలా ! ! ? వీళ్ళింత చేతకాని వాళ్ళని తెలిసే ముఖ్యమంత్రి వెళ్ళొద్దాం వస్తారా అని చిటికెలేస్తున్నాడు . అసలు మన గొప్ప తెలుసుకొనేందుకు ఎక్కడికన్నా పొయ్యి రావాలా , అనేది నా సందేహం . ముఖ్యమంత్రీ . . అక్కడికెళ్ళి ఏంచేస్తారు ?
ప్రయత్నం అసాధ్యం కాదు , ఆచరణ అనిశ్చయం కాదు . కాని ఏకత్వం , ఐకమత్యం మనలో లేవు . అవి రానంత వరకు ఈ బేధబావనలు తప్పవు . రానున్న యువత సమీవ భవితకి ఉజ్వల శ్రీకారం కట్టాలని ఆశిస్తూ . . .
మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి కలం నుంచి వెలువడ్డ ఆధ్యాత్మిక నవల ఈ పరంజ్యోతి . అనేక ఆధ్యాత్మిక అంశాలతో , కమర్షియల్ నవల లోని ముఖ్యమైన ఎలిమెంట్ అయిన ఉత్కంఠని జత చేసి రాసిన ఈ ఆధ్యత్మిక నవల పరంజ్యోతి లోని చిత్రమైన కథ అన్ని తరహా పాఠకులని సమానంగా అలరిస్తుంది . మరణించిన మనిషి తిరిగి బ్రతుకుతాడా ? అన్నది ఇందులోని ముఖ్యమైన అంశం . చితిదాకా చేరిన మనిషి మళ్ళీ లేచికూచుంటాడా ? అలాంటి మనిషికి సంబంధించిందే ఈ కథ . ఇది ఓ సంస్థానం రాజకుమారుడు విజయ రామరాజు అనే చిన్న రాజావారి కథ . ఇదే ఒక సన్యాసి పరంజ్యోతి కథ కూడా . ఇది ఒక ఆధ్యాత్మిక జీవనానికి చెందిన కథ . నెమలికొండ సంస్థానపు అధిపతి భూపతిరాజు నలుగురి సంతానంలో చివరి వాడుగా అతి గారాబంగా పెరిగి అన్నదమ్ములలో వైషమ్యాలకి కారకుడవుతాడు విజయ రామరాజు . అన్ని దురలవాట్లకు లోనవుతాడు . అతని భార్య అహల్య కూడా అతన్ని భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది . తన సోదరుడు ప్రతాపవర్మ కి తన గోడు వెళ్ళబోసుకుంటుంది . అనేక జబ్బులతో ముదిరిపోయిన రామరాజుని ఇతడు కూడా ద్వేషిస్తూనే ఉంటాడు . రామరాజు సోదరులు , ఇతర ఉద్యోగులు కూడా అతన్ని తట్టుకోలేకపోతారు . తీవ్రమైన జబ్బులతో మంచానపడ్డ అతన్ని ఇంగ్లీష్ వైద్యం కూడా ఏమీ చేయలేదని తేల్చేస్తారు వైద్యులు . అటువంటి సమయంలో అతని మీద విషప్రయోగం జరిగి రామరాజు మరణిస్తాడు . అది విషప్రయోగమనీ తెలియదు , ఎవరు చేసారోకూడా తెలియదు . రామరాజు దహన సంస్కారాలు కూడా జరిగిపోతాయి . ఇది తనకి విషం ఇచ్చి చంపాలని ప్రయత్నించిన వారి మీద ధ్వేషం పెంచుకున్న ఓ వ్యక్తి కథ . " మరణం అంటే నాకు భయంలేదు . ఎందుకంటే నేను జీవించి ఉన్నంతకాలం మరణం నా సమీపంలోకి రాలేదు . అది వచ్చినప్పుడు నేనుండను . ఇంక చావంటే నాకు భయం దేనికి ? " ఓ సందర్భంలో రామరాజు తనతండ్రితో అన్న మాటలివి . కాని మరణం తరువాత కూడా తాను ఉంటాడని , ఆ మాటలు అన్నప్పుడు రామరాజుకి తెలియదు . ఇది సాధ్యమా ? ఆ తరువాత ఎన్నో సంవత్సరాలకి ఓ వ్యక్తి నర్మదా పరిక్రమ లో సన్యాసి పరంజ్యోతి ని చూసి అతను పూర్తిగా రామరాజు పోలికలతో ఉండటంతో ఆశ్చర్యపడి , రామరాజు సోదరి కుముదినీదేవికి తెలియజేస్తాడు . ఆమె ఈ విషయాన్ని తన ఇతర సోదరులకు తెలియజేస్తుంది . వారు ఇతర అధికారులతో చర్చలు జరిపి , చనిపోయి దహనంచేసిన వ్యక్తి తిరిగిరావడం ఎలా జరుగుతుంది , ఇదేదో పొరపాటు అని భావిస్తారు . కాని క్రమంగా అదే సమాచారం చాలామందే పంపటంతో అతనిని వెతికి , వివరాలు తెలుసుకోటానికి ప్రయత్నిస్తారు . ఇక్కడినుంచి , జరిగిన రకరకాల ప్రయత్నాలే కథని అనేక మలుపులు తిప్పి మనల్ని ఏకబిగిన చదివిస్తుంది . ఎన్నోఆధ్యాత్మిక చర్చలు ఈ నవల నిండా ఉన్నాయి . అయినప్పటికీ అది ఇంకా చదవాలి అన్న కోరికని పెంచుతుందే కాని ఎటువంటి నిరాసక్తతను కలిగించదు . కొన్ని చక్కటి ఆధ్యాత్మిక గీతాలు కూడా మనకి ఈ గ్రంధంలో కనిపిస్తాయి . తేలికైన పదాలతో కూర్చిన ఈ పాటలు పాడుకోవాలనిపిస్తుంది . ఈ పాటలొచ్చినప్పుడు మనకే తెలియకుండా మనసులో పాడుకుంటాంకూడా . తమ అనుమానాలు తీర్చుకోటానికి న్యాయస్థానం లో జరిగే అనేక వాదోపవాదాలు కూడా మనకి ఎన్నో కొత్త విషయాలను ఎంతో విపులంగా తెలియ జేస్తాయి . అనేక ఉదాహరణలు కూడా రచయిత మనకి చూపిస్తారు . నర్మద , గోదావరి నదీ తీరాల్లో జరిగే ఈ కథ ఆధ్యాత్మిక పాఠకులని , సాధారణ పాఠకులని సమానంగా ఆకర్షిస్తుంది . ఈ నవలకి ప్రేరణ చాలా సంవత్సరాల క్రితం బెంగాల్ లో జరిగిన ఒక నిజ సంఘటనే . ఇది భారతదేశంలో దీర్ఘకాలం కొనసాగి సంచలనాత్మక తీర్పు నిచ్చిన కేసుగా చాలా ప్రసిద్ధి చెందింది . దీని మీద ఆధారపడి ఎన్నో భాషల్లో సినిమాలు కూడా వచ్చాయి . మే 2010 లో ముద్రించిన ఈ గ్రంధం వెల రూ 100 / - . నవోదయా బుక్ హౌజ్ , సుల్తాన్ బజార్ , హైద్రాబాద్ లో లభిస్తాయి . * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
రసతంత్రులను మీటి సర్వాత్మాన పాత్రలొ లీనమై సభ్య సమాజాన్ని దాటిపోని రచన ఉత్తమరచన అనిపించుకుంటుంది . ద్రౌపది నవలలో ఈ ఉత్తమరచనకు ఆస్కారము లేదని విమర్శించినవారిది కుసంస్కారమనే వారికి నమస్కరించడము తప్ప చేయగలిగిందేమీలేదు . డా . వెన్నావల్లభరావు మొదలైన 19మంది రచయితలు ఆంధ్రజ్యోతి దిన పత్రిక ద్వారా సంయుక్త ప్రకటనలొ ఇది దుష్టసంప్రదాయమని భావప్రకటన స్వేచ్చను అవహేళన చేశారు .
వీడియోని చూసేటప్పుడు మీ నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉన్నదైతే . . 720p , 1080p అనే హై డెఫినిషన్ ( HD ) రిజల్యూషన్లని Youtube Playerలో ఎంచుకుని మరింత హై క్వాలిటీతో వీడియోని చూడొచ్చు .
మా అమ్మాయి చిన్నప్పుడు కథ చెప్పటము ఐపోగానే , " కతం కహానీ " అనేది . మా అబ్బాయి " బాత్ ఖతం బర్ కాస్ బిరియానీ " అనేవాడు . ఇప్పుడూ అంటాడనుకోండి . 100 + 1 = 101 2 + 7 = 27 ఏమిటి ఈ లెక్కలు ? అనుకుంటున్నారా ? 9 చాలా మంచి సంఖ్య అంటారు , నవరత్నాలు , నవగ్రహాలు , అష్టాదశ పురాణాలు , అష్టాదశ శక్తి పీఠాలు , ఇలా . . . ఇలా అన్నమాట . ఐతే ఏంటట ? అవన్నీ మాకూ తెలుసు అంటున్నారా ? అదే నేనూ చెప్పేది . ఏమిటంటే నాకూ నవరత్న మాల వుందిగా ! మావారు , మా అమ్మాయి , మా అబ్బాయి , మా అల్లుడు , మా కోడలు , ఇద్దరు మనవరాళ్ళు , ఇద్దరు మనవళ్ళు , నా మాల లోని నవరత్నాలు . సరే సరే కాని , ఇలా ఒకదానికొకటి పొంతన లేకుండా తిక్క తిక్క గా మాట్ల్లాడుతే మాకెలా అర్ధం అవుతుంది ? అంటున్నారా ? మరి , అంబరాన , ఇంద్ర ధనస్సు ను అందుకున్నంత ఆనందము కలుగుతే , కాస్త ఆ మాత్రం తిక్క రాదేమిటి ? ఓకె , ఓకె చెప్పేస్తున్నాను , ఈ రోజు అనగా 27 , డిసెంబర్ నా " సాహితి " పుట్టిన రోజు . అదీ తొమ్మిది కలిసి వచ్చేట్టుగా , డిసెంబర్ నాకిచ్చిన ఇంకో కానుక . ఇప్పుడు చెప్పండి , డిసెంబర్ ఇంకా 9 సంఖ్య మంచివా ? కాదా ? ఇక పుట్టిన రోజు పాపాయికి బహుమానం ఇవ్వాలిగా ! ముందు 100 ఇద్దామనుకున్నాను . కాని 0 చివర వచ్చేట్టుగా ఇవ్వకూడదు కదా ! పిల్లలకైనా , దేవుడి హుండీ లోనైన 11 , 101 , 1001 ఇలా ఇస్తాముకదా అనుకొని 101 టపాలను బహుకరిస్తున్నానన్నమాట ! అదీ సంగతి . ఈ 101 టపాలు వ్రాసేందుకు సహకరించిన , ప్రోత్సహించిన , చదివిన , మా కుటుంబ సభ్యులకు , గురువులకు , బ్లాగ్ మితృలకు అందరికీ ధన్యవాదాలు . నా గురించి అంతా ఈ నూటొక్క టపాల లో చెప్పేసాను . ఇక చెప్పేందుకు ఏమీ లేదు . " " ఖతం కహానీ " * * * " బాత్ ఖతం బర్ కాస్ బిరియానీ " : - ) ) : - ) ) : - ) )
మీ టపా వ్యంగంగా వుంది . ఆయన భక్తుణ్ణి కాను , ఒకప్పుడు ఆయనపై తిరస్కార భావం వున్న వాడినే . తరువాత తరువాత అర్థమయ్యిందేమంటే ఆయన ఒక్క అనంతపురమే కాదు , కర్నాటక , తమిల్నాడు , చిత్తూరు ప్రాంతాల్లో కూడా రక్షిత మంచినీటి సరఫరా , స్కూళ్ళు , ఆడపిల్లల చదువుకోసం కాలేజీలకు ఆర్థిక సహాయం చేశారు , సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టించారు . నాస్థికవాదులం అని విసుగూ విరామం లేకుండా గంట కొట్టి చెప్పుకునే వాళ్ళు ఎంత మంది అలాంటి మంచి పనులు చేస్తున్నారు అని ఆలోచిస్తే చాలా తక్కువ అనిపించినప్పుడు , నాకు ఆయన పట్ల గౌరవభావం ఏర్పడింది . అలా అని గారడి విద్యలు నమ్మను , అవి ఏదో సరదాగా జనాకర్షణగా తీసుకుంటాను . వైఎస్ఆర్ , సిబిఎన్ వేల కోట్లు తిన్నారు ఏదే తమ సంపాదనలోంచి ఒక్క రూపాయ విదిల్చారా ? ఈ అవినీతి పరులకు రాష్ట్రం మొత్తం విగ్రహాలు పెట్టంగా లేనిది , ఆ మంచి మనిషి ( దేవుడనుకోకున్నా ) ఆరోగ్యం కోసం ప్రార్థిస్తే తప్పేంటి ? అందుకే నమ్మకం లేకున్నా , అనంతపౌరుడిగా కనీసం తెలుసుకోవడం ధర్మమని , చాలా ఏళ్ళ ఆయన్ను చూట్టానికి రెండేళ్ళక్రితం ప్రత్యేకంగా పుట్టపర్తికి వెళ్ళి వచ్చాను , చూశాను . కుగ్రామమైన పుట్టిన వూరిపై ప్రేమతో ప్రశాంతమైన చోటుగా మార్చారు , అక్కడే మరణించాలని కోరుకుంటున్నారు . చాలా మంది ఎక్కడేక్కడినుంచో రిటైరీలు దేశవిదేశీయులు అక్కడ ఇళ్ళు కట్టుకుని ప్రశాంతంగా వున్నారు . ఒక వ్యక్తిగా చూస్తే కూడా , ఓ చదువురాని పల్లెటూరి వ్యక్తి అంత ఎత్తుకు ఎదగడం . . ఆ జీవితం ధన్యమైందా , కాదా ? అని ఒక్క క్షణం ఆలోచిస్తే . . . ఏ కోటికో ఒక్కడు కూడా అరుదే అనిపిస్తుంది . Yes ! I wonder bushy dark hair of this old man ! ; ) : ) A well kept secret indeed ! I agree with Sreekar . / ఆయన ఇచ్చే ఉంగరాలని చైన్లని లింగాలని . . . వ్యతిరేకిన్చేవాడిని . / I am no stupid , I welcome any such golden gifts : P : )
హి హి హి . . . హ హ హా . . . ఏమిటో ఈ రోజంతా కామెడి ఎక్కువ ఐపోయింది రా బాబోయ్ . . . మిమ్ములను ఒక సారి ఆఖరి పోరాటం లో అమ్రేష్ పూరి టైప్ లో " అహం బ్రహ్మసి " అనుకుంటూ దిగి కారెక్కండి అని గద్దించటం తలుచుకుని హి హి హి హ హ హ . . . వుండండీ బాబోయ్ నవ్వి నవ్వి కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి . . . అదే యాధృచ్చికం అంటే దైవ ఘటన అని కూడా అనుకోవచ్చు . . అమెరికా కొత్త కాబట్టి మిమ్ములను చూసి అమ్మోయ్ అనుకుంటుందేమో కాని కొంచం కాలమైతే అనుకోరు లెండి ఇదేమన్నా ఇండియా నా ఏమిటి పూజారి గారు కూడా క్రాఫెట్టుకుని బొట్టు ఐనా లేకుండా తిరగటానికి . గుడికి మా వూర్లో ఐతే అందరు అలానే వస్తారు , శివరాత్రి కి నాకైతే చలి పుట్టి చస్తాను వాళ్ళను చూసి . @ రాణి గారు ఇప్పుడు అంతా మాములై పోయింది కదండి చీర లు కట్టుకుని నగలేసుకుని పేద్ద బొట్లు పెట్టుకుని ఎక్కడకు బడితే అక్కడికి తిరిగేసి రావటం , మా ఆఫీస్ లో ప్రతి శుక్రువారం మేము చూడీదార్ లు వేసుకుని వెళతాము , తెల్ల అమ్మయిలందరు కుళ్ళుకుని చస్తారు ఆ రంగులు పేట్రన్స్ చూసి . . .
ఈ మధ్య నాకు ఎదురైన కొంత మంది యువకులలో ఒకరిద్దరు వారి వారి భవిష్యత్ ప్రణాళికల పరంగా ఏమి అవుతావు అని అడిగితే సినిమా డైరెక్టర్ అవుతా అని చెప్పడం కొంచం విశ్మయానికి గురి చేసినా , ఇలాంటి వాళ్ళని చూస్తే వీరి ఆలోచనలు నిజమే అనిపిస్తుంది . అవును ఒక విషయాన్ని ప్రజెంట్ చెయ్యడానికి అందరూ పెద్ద పెద్ద పేరు మోసిన డైరెక్టర్స్ మాత్రమే అవ్వాల్సిన పనిలేదు . క్రొత్తగా ఆలోచించి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోగల అవగాహన ఉంటే చాలు అని నా అభిప్రాయం . ఇదిగో ఇలా . . వీరు నా స్టేట్‍మెంట్‍కి సాక్షాలు . వీరిలో ఏదో తెలియని ఫైర్ ఉంది . వీరికి చాలా మంచి భవిష్యత్తు ఉంది . మన తెలుగు సినిమా డైరెక్టర్స్ కనుక దీనిని చూస్తే వీళ్ళని పైకిరాకుండా తొక్కేస్తారు . ఈ విడియోలో నాకు మంచి డాన్స్ కనబడింది . . అలాగే వైవిధ్యమైన డైరెక్షన్ కనబడింది . . మరికొంత హ్యూమర్ . . మొత్తానికి హాస్యభరితంగా పాటకు తగ్గట్టుగా ఉంది .
ఈసారి బ్లాగుకి కాస్త సుదీర్ఘమైన విరామమే వచ్చింది ! బ్లాగుకైతే దూరమయ్యాను కాని తెలుగు పద్యానికి కాదు . ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పద్యాన్ని తలుచుకోకుండా రోజే గడవదు . అలా ఈ మధ్య తలచుకున్న పద్యం ఇది : నలదమయంతులిద్దరు మనఃప్రభవానల బాధ్యమానలై సలిపిరి దీర్ఘవాసర నిశల్ విలసన్నవ నందనంబులన్ నలినదళంబులన్ మృదుమృణాలములన్ ఘనసారపాంసులన్ దలిరుల శయ్యలన్ సలిలధారల జందనచారుచర్చలన్ ఇది నన్నయ్యగారి పద్యం . మహాభారతం అరణ్యపర్వంలోది . ప్రసిద్ధమైన పద్యమే . భారతం చదవకపోయినా , కన్యాశుల్కం చదివిన వారిక్కూడా ఈ పద్యం గురించి తెలిసే ఉంటుంది . కరటకశాస్త్రి వెంకటేశాన్ని పద్యం చదవమని అడుగుతాడు . వెంకటేశం , " పొగచుట్టకు " పద్యం ఎత్తుకుంటే గిరీశం అడ్డుకొని ఈ " నలదమయంతులిద్దరు " పద్యం చదవమంటాడు . మొదటి పాదం చదవగానే కరటకశాస్త్రి ఆపి , " మనఃప్రభవానల " అంటే అర్థం చెప్పమంటాడు వెంకటేశాన్ని . గుర్తుకొచ్చిందా ? అరణ్యపర్వంలో వచ్చే అనేక కథలలో నల మహారాజు కథ ఒకటి . ఇది కూడా చాలామందికి తెలిసిన కథే . ఇందులో హంస రాయబారం బాగా ప్రాచుర్యాన్ని పొందింది . నలుడి చేత రక్షింపబడ్డ ఒక హంస , ప్రత్యుపకారంగా దమయంతిదగ్గరకి వెళ్ళి నలుణ్ణి గురించి గొప్పగా చెప్పి , నలునిపై ఆమెకు ఇష్టాన్ని ప్రేరేపిస్తుంది . అలాగే దమయంతి రూపవైభవాన్ని నలునికి చెప్పి అతనిలోని కోరికని పెంపొందిస్తుంది . ఈ హంస రాయబర ఫలితంగా వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి కోరిక కలిగి , విరహితులౌతారు . ఆ విరహ బాధ తగ్గించుకోడానికి నానా తిప్పలూ పడతారు . వాటిని వర్ణించే పద్యం ఇది ! మనఃప్రభవుడు అంటే మనసులో పుట్టేవాడు , మన్మథుడు . మనఃప్రభవానలం - ఆ మన్మథుడికి సంబంధించిన అగ్ని . మన్మథ తాపం అన్న మాట . ఆ మన్మథ తాపంతో బాధింపబడే మనసు కలవాళ్ళయ్యారు ఆ ఇద్దరూ . ఇక్కడ " మనః ప్రభవానల " లో " నః " యతి స్థానంలో ఉంది . కాబట్టి కొంచెం ఒత్తి పలకాలి . అలా అక్కడ , ఆ విసర్గతో కూడిన నకారాన్ని వత్తి పలికినప్పుడు ఆ మన్మథ తాపం మనసుని ఎంతగా దహిస్తోందో చక్కగా తెలుస్తుంది . " దీర్ఘవాసర నిశల్ " - పొడవైన పగళ్ళు కలిగిన రాత్రులు . వాటిని ఎలాగో అలా కష్టపడి గడుపుతున్నారు . ఈ " దీర్ఘవాసరనిశల్ " అనేది భలే అద్భుతమైన ప్రయోగం . చెపుతున్నది రాత్రుల గురించి . ఆ రాత్రులు ఎలాంటివంటే బాగా దీర్ఘమైన పగళ్ళు కలిగినవి . అంటే రాత్రులేమో ఇట్టే గడిచిపోతున్నాయి . పగళ్ళు మాత్రం జీళ్ళపాకంలా సాగుతునే ఉన్నాయని . ఎందుకిలా జరుగుతోంది ? దీనికి రెండు కారణాలు . ఒకటి అసలే విరహ తాపంతో ఉన్నారు . దానికి తోడు పగలు ఎండ వేడి తోడైతే మరి కాలం ఎంత మెల్లిగా కదులుతుంది ! అంచేత ఆ పగళ్ళు అంత దీర్ఘంగా సాగుతున్నాయి . మరొక కారణం - వేసం కాలంలో ( వసంత గ్రీష్మ ఋతువుల్లో ) పగటి సమయం ఎక్కువగా ఉంటుంది . సూర్యోదయం తొందరగా అవుతుంది . సూర్యాస్తమయం ఆలస్యంగా అవుతుంది . అంచేత ఆ కాలంలో పగళ్ళు పొడుగైనవి . కాబట్టి ఈ పదం ద్వారా అది వేసవి కాలమని ధ్వనిస్తోంది . వేసవి కాలం విరహార్తులకి మరింత గడ్డు కాలం కదా ! అంచేత నలదమయంతుల బాధ మరింత తీవ్రంగా ఉన్నదన్న మాట . ఇదంతా " దీర్ఘవాసరనిశల్ " అన్న ఒక్క పదంతో ధ్వనింప జేసాడు నన్నయ్య . అనుభవించ గలిగేవారికి ఇందులోని కవిత్వం అనుభూతమవుతుంది ! సరే ఆ విరహాన్ని తట్టుకోలేక వాళ్ళు పూలదోటల్లోనూ , తామరాకుల మధ్యనా , మృదువైన తామర తూళ్ళ మధ్యనా , కర్పూర ధూళి అలముకొంటూ , పూల శయ్యలమీద విశ్రమిస్తూ , చల్లనీటి ధారలలో తడుస్తూ , చందనాన్ని పూసుకొంటూ గడిపారట - ఆ తాపాన్ని తట్టుకోలేక ! ఇంతకీ ఈ పద్యం ఈ మధ్యన గుర్తుకు రావడానికి కారణం , " దీర్ఘవాసర నిశల్ " అన్న పదం . ఈ మధ్యనే ఆఫీసుపని మీద అమెరికాకి వచ్చాను . అందులోనూ అమెరికాలో పైన కెనడాకి దగ్గరగా ఉండే చోటు . తస్సాదియ్య " దీర్ఘవాసర నిశల్ " అంటే ఏమిటో ఇక్కడకి వచ్చాక తెలిసివచ్చింది ! ఇక్కడ ప్రస్తుతం వేసవి కాలం . ఉదయం అయిదు గంటలకే సూర్యోదయమైపోతుంది ( నేనెప్పుడూ చూడలేదనుకోండి ) . రాత్రి ( ? ) తొమ్మిదయ్యాక సూర్యాస్తమయం ! అంటే ఉదయం అయిదునుంచీ రాత్రి ( ? ) తొమ్మిది దాకా , పదహారు గంటలు పగలే నన్నమాట ! పొడవైన పగళ్ళంటే ఇవి కదూ ! చలికాలం వచ్చిందంటే ఎనిమిదింటి దాకా తెల్లవారదు . సాయంత్రం నాలుగింటికల్లా పొద్దుపోతుంది . ఇంత వైవిధ్యం మన దేశంలో ఉండదు . భారతదేశంలో ఉంటేనే నలదమయంతులకి అవి " దీర్ఘవాసర నిశల్ " అనిపించాయే , అదే వాళ్ళు అమెరికాలో వేసంకాలం గడిపితే మరేమనిపించేదో ! ఐతే ఇక్కడ ఎండకి మన ఎండంత తీక్ష్ణత ఉండదు కాబట్టి కాస్త నయమే : - ) మన సూర్యుడు నిజంగా " ఖరకరుడే " . ఈ సందర్భంలోనే ఆముక్తమాల్యదలోని మరో పద్యం కూడా గుర్తుకు వచ్చింది . అద్భుతమైన ఊహ . రాయలంటేనే ఇలాంటి ఊహలకి పెట్టింది పేరు . పడమరవెట్ట నయ్యుడుకు బ్రాశనమొల్లక కూటిపేదలై బడలిక నూడు నచ్చిలువ ప్రగ్గములన్ రవి యాజ్ఞ మాటికిన్ ముడియిడ బిచ్చుగుంటు రథమున్ నిలుపన్ బయనంబు సాగమిన్ జడను వహించె నాగ దివసంబులు దీర్ఘములయ్యె నత్తఱిన్ వేసం కాలంలో పగళ్ళు ఎంత పొడుగవుతాయో ముచ్చటించుకుంటున్నాం కదా . అలా ఎందుకవి పొడుగవుతాయో అన్నదానికి రాయల వారి ఊహ ఈ పద్యం . పగళ్ళెందుకు పొడుగవుతాయి ? సూర్యుడు ఆకాశంలో తూర్పునుండి పడమరకి మెల్లగా ప్రయాణిస్తాడు కాబట్టి ( ఇది ఊహ కాదు నిజమే ! ) . సూర్యుడెందుకంత మెల్లగా ప్రయాణిస్తున్నాడు ? సూర్యుడు రథమ్మీద కదా ప్రయాణం చేస్తాడు . ఆ రథానికి ఏడు గుఱ్ఱాలు . వాటికి పగ్గాలేమో పాములు . పాములు గాలిని భోంచేస్తాయి . వాటికి వాయుభుక్కులు , గాలిమేపరులు అని పేరు . వేసం కాలంలో పడమటినుండి గాలులు ( ఎదురుగాలులన్న మాట ) బాగా వేడిగా వీస్తున్నాయి . ఎవరైనా వేడన్నం తినగలరు కాని పొగలు క్రక్కుతూ నోరు కాలిపోయేట్టున్న అన్నాన్ని తినగలరా ? లేదుకదా . అంచేత పాపం ఆ పాములకి ఆహారం లేకపోయింది . దానితో నీరసం వచ్చి వడలిపోయాయి . పట్టుతప్పి మాటిమాటికీ ఊడిపోతున్నాయి . వాటిని సరిచెయ్యమని సూర్యుడు చెపుతున్నాడు . సరిచెయ్యడానికి సూర్యుడి సారథి అనూరుడు ( పిచ్చుకుంటు ) మాటిమాటికీ రథాన్ని ఆపవలసి వస్తోంది . అంచేత ప్రయాణం మెల్లగా సాగుతోంది . కాబట్టి పగళ్ళు అంతసేపుంటున్నాయిట ! ఏం ఊహ ! ఇక్కడ అమెరికా సూర్యుడి పాములు మరీ నిస్సతువలై ఉన్నట్టున్నాయి : - ) ఏకంగా పదహారు గంటలపాటు సాగుతోందతని ప్రయాణం !
ఒక్క బిగిని చదివించేరు . " వి వి " అంటే ఏమిటో విడమర్చగలరా ?
మోర్గాన్ స్టాన్లీలో వుద్యోగం పుణ్యమాని నెలరోజులు న్యూయార్క్ నగరం నడిబొడ్డున నెలరోజులు నివాసం వుండే అవకాశం కలిగింది .
మనం ఈ భూమ్మీద నడవటం , నేనిక్కడ రాసింది మీరు చదవటం అన్నవి చాలా పెద్ద అద్భుతాలు . ఏసు తన పెళ్ళిలో నీళ్ళను వైనుగా మార్చడం వంటివి వీటితో పోలిస్తే చిన్న అద్భుతాలు . . . మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నా మెదడుకు ఎక్కడం లేదు !
నిజమే అండీ . . . . తు . గో కి ప . గో కి కూడా మాటలు తేడా ఉంటాయని నాకు తెలియదు . నేను వంశి గారి అన్నిరచనలు చదవకపొయినా కొన్ని ' పసల పూడి కథలు ' . . . ' మా దిగువ గోదావరి కథలు ' చదివాను . నేను గ్రహించిన దాని ప్రకారం మీకు వంశీ గారికి మాటల్లో సారూప్యత కొద్దిగా ఉన్నా . . . వంశీ గారు ఒక దృశ్యాన్ని వర్ణించే తీరు మీ తీరు ఒకేలా ఉన్నయి . అందుకే మీ కథ వంశీ గారి కథల ఉంది అన్నాను : )
Download XML • Download text