tel-31
tel-31
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది . మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి , మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి . ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని , ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృతసంజీవనీ మంత్రమని పిలువబడుతోంది .
" ఊరి చివర " కవిత్వం మీద ఇంకా చర్చలు సాగుతూండగానే , పుస్తకం డాట్ నెట్ లో " దీప్తిధార " సి . బి . రావు గారు మరో సమీక్ష రాశారు . రావు గారికి ధన్యవాదాలు . ఆయన సమీక్ష నించి కొన్ని " మెచ్చు " తునకలు : - అఫ్సర్ కవితలు భావకవిత్వం కాదు చదువుతూ మధుర ఊహలలో తేలిపోవటానికి . అవి మనస్సుకు పదును పెట్టే చిక్కుముళ్లు . కవితను చదువుతూ చిక్కుముళ్లను విడదీస్తూ కవి ఏమి చెప్తున్నాడనే విషయం తెలుసుకోవటానికి మనస్సుకు పనిపెట్టాల్సిందే . భావ కవితలు , సులభ వచన కవితలు , ఉద్వేగ పరిచే కవితలు చదివే వారికి ఈ కవితలు ఒక పట్టాన అంతుచిక్కక అయోమయంలో పడవేసే ప్రమాదముంది . అందుకు సిద్ధం కాని వారు ఈ కవితలకు దూరంగా వుండవచ్చు . - అఫ్సర్ కవితలలో రసాస్వాదన తక్కువే . అఫ్సర్ కవితలలో కొన్నింటిలో దాదాయిజం ( Dadaism ) ఛాయలు కనిపిస్తాయి . దాదా ఏమిటి ? కళలు లో ఉండే రసానికి ( aesthetics ) దాదాయిజం వ్యతిరేకం . దాదాయిజం బూర్జువా శక్తుల రాజ్యకాంక్షకు , యుద్ధ ప్రీతికి వ్యతిరేకి . దాదా కళలలో గందరగోళం , తర్కానికి అందని ఆలొచనలు కూడా కనిపిస్తాయి . - ఆంధ్రదేశాన ఎందరో కవుల కవితలు ఎవరూ పట్టించుకొక చీకటిలో అలమటిస్తున్న కాలంలో , అఫ్సరీకులకు ( అఫ్సర్ కవితలు ) పెక్కు విమర్శకులుండటం ఆ కవితా వైశిష్టమనే చెప్పాలి . చివరగా అఫ్సర్ కవిత్వం ఎందుకు చదవాలి ? అఫ్సర్ కవితలకు అభిమానులు , నిరసన గళం వినిపించే విమర్శకులూ ఏక కాలంలో ఎలా వున్నారు ? అఫ్సర్ కవిత్వం లో ఉంది అయోమయమేనా ? అఫ్సర్ కవిత్వానికి అభిమానులు , విమర్శకులు ఇచ్చే కితాబుల్ని ఎలా నమ్మటం ? ఈ ప్రశ్నలకు అఫ్సర్ బ్రాండ్ కవిత్వం చదివి పాఠకుడే ఒక నిర్ణయానికి రావల్సి ఉంది . పూర్తి సమీక్ష కోసం www . pustakam . net చూడండి .
" మీరు మరీ విడ్డూరంగా మాట్లాడకండి . . మా అన్న కొడుకు రాంబాబు . వాడేం పెద్ద తెలివైనోడా . . అమెరికా వెళ్ళి హాయిగా ఉద్యోగం చేసుకోవడం లేదూ ? వాడికిచ్చినోళ్ళు మనోడికివ్వరా ? ఆరునెల్ల క్రితం వాడికి పిల్లనివ్వడానికే రానివాళ్ళు , ఇప్పుడు ఇరవై లక్ష లిస్తామంటున్నారు . . మనోడికి ఉద్యోగం లేకపోయినా పిల్లనిస్తామని బోలెడు మంది అడుగుతున్నారు . . వీడొక్క సారి అమెరికా వెళ్ళాడంటే … ఇంకేమన్నా ఉందా ! "
ఒకానొక రేడియో ఉద్యోగి " మీకెంతమంది రిసీవర్లు ? ఎంత మంది ట్రాన్స్మిటర్లు ? " అని మరొక వ్యక్తిని ప్రశ్నించాడు . ఆయనగారి ఉద్దేశంలో ఆ వాక్యానికర్థం : " మీకెంత మంది మగ పిల్లలు ? ఎంత మంది ఆడ పిల్లలు ? "
నీ ప్రయత్నం బాగుంది సోదరా . ఇది తెలంగాణా వాదుల మనోభావాలకు భిన్నంగా ఉండటం చేత వారు ఆగ్రహించే అవకాశం ఉంది - తస్మాత్ జాగ్రత్త !
దగ్గరగా జరిగి " నీ వళ్ళంతా కొత్తిమీర వాసన " అని చెవి మీద ముద్దు పెట్టుకొన్నాడు . అవే అల్లరి పెదాలు . సాయంత్రం నాగమ్మత్త ఇంటికి వెళితే . . గాని నాకు అర్థం కాలేదు నేనంటే ఎంత ప్రేమో . . ఎన్ని చీరలు . . ఎన్ని కానుకలు . .
నేనొక పుస్తకాన్ని . నా ఫేరు … . ఎందుకు లెండి , ఇపుడు నేనొక పనికిరాని పుస్తకాన్ని . ఆంధ్రభాషలో అనర . . .
" నిఘంటువులో అర్థాలు అర్థాలు కావు జీవన వేదాలకు భాష్యాలు లేవు "
చిత్రము 3 : అష్టముఖిలో ఘన చతురస్రము ( Cube in an octahedron ) మీరు త్రిరావృత్త ( 120 డిగ్రీల భ్రమణము ) అక్షముగుండా చూస్తున్నారు . అష్టముఖికి ఉన్న ఎనిమిది సమభుజ త్రిభుజాకారములో ఉండే ఉపరితలాల కేంద్రములలో పిన్నులను గుచ్చి ఉన్నాను . నాలుగేసి పిన్నులున్న బిందువులను కలిపితే ఘనచతురస్రము యొక్క ఉపరితలమైన చదరమును చూడ వీలవుతుంది . పై త్రిభుజము ఎక్కువ ఎత్తులో ఉంది . మూడు వైపులా వేళ్లాడే మూడు త్రిభుజాలు దీనికి కింద ఉంటాయి . అన్నిటికన్న కింద ఉన్న త్రిభుజపు కేంద్రములో ఉన్న పిన్ను మొనను చూడగలరు . దానినుండి పైకి లేచే మూడు త్రిభుజాల మధ్య ఉండే పిన్నుల మొనలను కూడ చూడవచ్చు . సమచతురస్రముల కేంద్రముల ద్వారా చతురావృత్త అక్షము ( 90 డిగ్రీల భ్రమణము ) పోతుంది . త్రిభుజాల అంచుల మధ్యబిందువు ద్వారా ద్విరావృత్త అక్షము ( 180 డిగ్రీల భ్రమణము ) పోతుంది . ఆ యా ఇరుసులతో ఆ యా డిగ్రీల భ్రమణమును కొనసాగిస్తే ఘనాకారములలో మార్పు ఉండదు . అది సామ్యరూపము లేక సౌష్ఠవము యొక్క సారాంశము .
కూడా నాకు అవసరం లేదు . కేవలం నా మనశ్శాంతి కోసం , నేను రాత్రులు నిద్ర మేలుకుని జీవిత
నాథూరామ్ గాడ్సే హత్యా స్థలంనుండి పారిపొయ్యే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు , అతన్ని నిర్భంధించి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్ళారు . అక్కడ DSP సర్దార్ జస్వంన్త్ సింగ్ మొదటి సమాచార నివేదిక ( First Information Report ) తయారు చేసాడు . న్యాయ స్థానాలలో తగిన విచారణ అనంతరం నాథూరామ్ గాడ్సేను అతనికి హత్యలో సహకరించిన నారాయణ ఆప్టేలను 1949 నవంబరు 15న ఉరి తీసారు .
ఇటీవలనే కంట పడిందీ పద్యం . అనేక కారణాల వల్ల ఇది నాకు చాలా నచ్చింది . చదివి మీకేమనిపిస్తోందో చెప్పండి . చాతనైతే ఎవరు రాసి ఉంటారో ఊహించొచ్చు . * * * * రిస్క్ తీసుకుంటాను . మొదటి పెగ్గు మొగుడు సీసాలో ఉన్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను సాయంత్రం రొట్టెలోకి తైలం లేక నేను రోడ్డెక్కిన సమయానికి తను నిండుసీసాతో ఇల్లు చేరుకుంటాడు జరగబోయేదేవిటో నా జ్ఞానదంతం సలపరించి చెబుతుంది సోడాకోసం లోపలికొచ్చి అనవసరంగా నవ్విపోతాడు గోడ మీద తెగకావిలించుకుని దిగిన హనీమూన్ ఫోటో వింత చూస్తూ వుంటుంది సత్యనారాయణవ్రతం మాదిరి సరంజామా సిద్ధం చేసుకుని ఎంతో తన్మయంతో సీసా మూత తిప్పుతాడు బుసబుసబుసా మైకం గ్లాసులోకి దూకుతుంది శూన్యంలోకి ఛీర్స్ కొట్టి ఒక గుక్క తాగుతాడు అఫ్కోర్స్ ! ఎంత తొందరలో ఉన్నా గానీ ఛీర్స్ మర్చిపోడు పిల్లల కళ్ళకి గంతలు కట్టడం ఎలాగా అని నేను దారులు వెదుకుతూ వుంటాను ఈ చెవి మాట ఆ చెవికి వినబడదు ఎందుకంటే రెంటికీ మధ్య జానీవాకర్ ఉంది అన్నట్టు నీ కొత్త చెప్పులు ఇంకా కరుస్తున్నాయా ? వాడి ప్రశ్న కరిచినా తప్పదు కదా , వాటితోనే కాపురం చేస్తున్నా ! నా జవాబు . రెండో పెగ్గు మొగుడు సీసాలో ఉన్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను మూతి ముందుకు చాపి రెండో పెగ్గు అందుకుంటాడు హోంవర్కు మానేసి స్కేళ్ళతో బాదుకుని ఏడుస్తున్న పిల్లల తిక్క కుదరడం కోసం టీవీలో హారర్ సినిమా పెడతాను కళ్ళు తేలేసి ముగ్గురూ అక్కడే పడివుంటారు . ఇంట్లో ఈ సంత నాకొద్దు - గరిట విసిరి కొడతాను నీ యిల్లు కాదిది , నా యిల్లు - ధడాల్న తలుపు మూస్తాడు నీ యమ్మ నీ యక్క నీ యబ్బ మృదు సంభాషణ జరుగుతుంది ఈ బూతు మాట ఆ బూతు మాటకి ఆనదు ఎందుకంటే ఇద్దరి నాల్కల మీదా ఒకే ఉప్పు తిన్న రోషం వుంది ఏ తప్పూ లేకూండా మా ఇద్దరి అమ్మ అక్క అయ్యలు వాళ్ళ వూళ్ళల్లో శీలం పోగొట్టుకుని నిలబడతారు తెగకావిలించుకుని దిగిన హనీమూన్ ఫోటో భయంతో గోడని కరుచుకుంటుంది మూడో పెగ్గు ఇల్లంతా నిద్రకు జోగుతూ వుంటుంది వున్నాడో పోయాడో చూడ్డం కోసం లోపలికి వెడతాను పొట్ట చీల్చిన మిర్చీ బజ్జీ మాదిరి ప్రాణనాథుడు పొర్లుతూ వుంటాడు తిండికి రమ్మని భుజం తట్టి చెబుతాను చెప్పుల్ని మొగుడితో పోలుస్తావా ఎంత పొగరు - అంటూ చెయ్యి విసురుతాడు అదే చేతిని వెనక్కి విరిచి గోడకేసి కొడతాను ఈ దెబ్బ మాట ఆ దెబ్బకి చాలదు ఇద్దరి మీదా ఒకే బ్రాండు సిగరెట్టు పొగ గొడుగు పట్టి వుంటుంది నాలుగో పెగ్గు కళ్ళు నిద్రపోతున్నా నేను మెలకువగానే వుంటాను చెప్పుల్ని మొగుడితో కరిపిస్తావా ఎంత పొగరు సీసాభూతం మొరుగుతూ వుంటుంది మొరిగి మొరిగి మూలాలు తెగి పడేట్టు వాంతి చేస్తాడు తెమడ తెమడగా అతని వ్యక్తిత్వం ఉట్టిపడుతుంది పైజమా తడిసి ప్రభుత్వం మడుగు కడుతుంది మొగుడు సీసాలో ఉన్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను సిద్ధంగా వున్న నీళ్ళ బక్కెట్టు నెత్తిన దిమ్మరించగానే ఇటు సర్కారూ అటు జానీవాకరూ ఒకర్నొకరు తోసుకుంటూ తూములోకి పరిగెడతాయి ఈ తూములో మాట ఆ తూముకి వినిపించదు రెండింటి మీదా ఒకే మంత్రి వాగ్దానం అట్టకట్టి వుంటుంది తెగకావిలించుకుని దిగిన హనీమూన్ జంట తటాల్న విడిపోయి ఇంకెవరితోనో లేచిపోతారు మొగుడు సీసాలో ఉన్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను * * *
మహానేత మనసా వాచా ఆచరించి చూపించిన సంక్షేమ పథాన్నే జెండాగా మార్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ … అదే ఎజెండాతో తొలి ప్లీనరీ సమావేశాలకు సిద్ధమయింది . శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు ఇక్కడి ఇడుపులపాయలో జరిగే ఈ సమావేశాలు … పార్టీ గౌరవాధ్యక్షురాలు , వైఎస్సార్ సతీమణి విజయమ్మ ప్రారంభోపన్యాసంతో మొదలుకానున్నాయి . మహానేత మరణానంతరం సామాన్యుడికి ఒక్కొక్కటిగా దూరమయిపోతున్న సంక్షేమ పథకాల కోసం ఏ వ్యూహం అనుసరించాలి ? వైఎస్సార్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండటంతో పాటు … వాటిని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ పరంగా ఏం చేయాలి ? అనే అంశాలు తొలిరోజైన శుక్రవారం ప్రధానంగా చర్చకు రానున్నాయి . ఆర్థిక , సామాజిక , సంక్షేమ రంగాలపై తొలిరోజు జరిగే చర్చలో … భూమిని నమ్ముకున్న రైతుకు వ్యవసాయాన్ని లాభసాటి చేయటంతో పాటు రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికీ వైద్యం , విద్య అందించేందుకు పార్టీ ఎలాంటి డిమాండ్లు చేయాలి ? వాటి సాధనకు ఎలా ఉద్యమించాలనే అంశాలపై చర్చ సాగుతుందని పార్టీ వర్గాలు తెలియజేశాయి .
వీటి ముఖ్య ఉద్దేశమల్లా ఒకటే . కేవలం మెదడులో అకస్మాత్తుగా మెదిలే కొన్ని భావాలను బలహీనతలుగా చేసుకుని కొందరు మతం పేరుతో మోసాలు చెయ్యడం జరుగుతోంది . కనక మెదడులో ఇటువంటి అయోమయం అప్పుడప్పుడూ ఎందుకు కలుగుతోందో సామాన్య ప్రజలకు తెలియజెయ్యడం అవసరం . ముఖ్యంగా మన దేశంలో చేతబడులూ , మంత్రగాళ్ళ మీద నమ్మకాలు ఎక్కువ . కనీసం చదువుకున్నవారైనా నిజానిజాల గురించి ఆలోచించగలిగితే కొంత ప్రగతిని సాధించినట్టే . మెదడులో ఏదో కారణం చేత కలిగిన భౌతికమైన అలజడికీ , దేవుడున్నాడన్న నమ్మకానికీ సంబంధమేమీ లేదని తెలుసుకోవడం చాలా ముఖ్యం . ఈ పరిశోధనలవల్ల కొన్ని మానసిక రుగ్మతలకు నివారణ కూడా కలగవచ్చు . ఇది మందులు లేకుండా మెదడుకు తగిన ప్రేరణలిచ్చి సాధించవచ్చు . గత వ్యాసంలో చెప్పినట్టుగా ఎపిలెప్సీవల్లనూ , మాదక ద్రవ్యాలవల్లనూ కూడా కొన్నిఆధ్యాత్మిక భావనలు కలుగుతాయి .
అర్జెంటీనా ఎంతసేపటికీ ఎడంచేతివైపునుండే ఎటాక్ చేస్తోంది . జెర్మనీ గోల్ కీపర్ ఎడంచేతివైపు హ్యాపీగా ఇల్లుకట్టుకూర్చున్నాడు .
రాష్ట్రంలో కౌలు రైతుల సంక్షేమానికి ప్రత్యేక ఆర్డినెన్స్ ప్రవేశపెట్టి , రుణార్హత కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎన్ . కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు . తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కౌలు రైతుల గుర్తింపు కార్డుల పంపిణీని ఆదివారం ఆయన ప్రారంభించారు . రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడుకు చెందిన వై . ఏసురత్నం అనే కౌలుదారును పిలిచి తొలి రుణగుర్తింపు కార్డును సిఎం అందజేశారు . ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు . ఈ ఆర్డినెన్స్ కౌలు రైతులకు రక్షణగా , భూ యజమానికి భద్రతగా ఉంటుందని అన్నారు . రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచిగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు . ' సాగు రైతుకు రక్షణ హస్తం ' అని ఈ పథకానికి నామకరణం చేశామన్నారు . ' రాష్ట్రంలో 26 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తాం . తొలుత ఈ ఏడాది ఆరు లక్షల మందికి ఇస్తాం . తూర్పు గోదావరి జిల్లాలో తొలి విడతగా 66 వేల మందికి కార్డులు పంపిణీ చేస్తున్నాం . ఈ గుర్తింపు కార్డు వల్ల కౌలుదారునికి సబ్సిడీపై ఎరువులు , విత్తనాలు , రుణాలు అందుతాయి . గుర్తింపు కార్డులు తదితర అంశాలపై ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసే ఆలోచన ఉంది . రాష్ట్రంలో అనేక ఆటుపోట్లు తలెత్తినా కేంద్రాన్ని ఒప్పించి రెండు వేల కోట్ల ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇచ్చాము . ఖరీఫ్ రుణాల వడ్డీ మాఫీ కింద ఈ ఏడాది రూ . 650 కోట్లు రాష్ట్రానికి ఖర్చవుతుంది . తూర్పు గోదావరి జిల్లాకే రూ . 38 కోట్ల వడ్డీ మాఫీ వర్తించింది . ' అని ఆయన వివరించారు . మద్దతు ధర కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్టు ఆయన తెలిపారు . గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే అని కొందరు రైతులు చెప్పడం బాధ కలిగిస్తోందని , ఆ పని ఎవ్వరూ చేయొద్దని సిఎం రైతులను కోరారు . ప్రతి గింజా కొంటాం . . జిల్లాలో 70 నుంచి 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరగాల్సి ఉందని అధికారులు చెబుతున్నారని , ప్రతి గింజా కొనుగోలు చేయాలని ఎఫ్‌సిఐకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు సిఎం తెలిపారు . 25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వల ఎగుమతులకు కేంద్ర అనుమతి కోరుతున్నామని చెప్పారు . కేంద్రం కనీసం 10 లక్షల మెట్రిక్ టన్నులకు అనుమతి ఇవ్వొచ్చని చెప్పారు . దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని 28 సంక్షేమ పథకాల అమలుకు బిల్లులు పెట్టిన వెంటనే నిధులు విడుదలయ్యేలా గ్రీన్ ఛానల్ పథకాన్ని ప్రవేశపెట్టామని , రూ . 1 , 500 కోట్లతో ఇందిర జల ప్రభ , పావలావడ్డీ ద్వారా డ్వాక్రా సంఘాలకు రూ . 520 కోట్లు ఇవ్వాల్సి ఉందంటూ సిఎం హామీల వర్షం కురిపించారు . ఆర్డినెన్స్‌లో మార్పులకు సిద్ధం : రఘువీరారెడ్డి కౌలు రైతుల గుర్తింపు కోసం తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌లో మార్పులకు సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ శాఖ మంత్రి ఎన్ . రఘువీరారెడ్డి అన్నారు . ఆర్డినెన్స్ వల్ల భూ యజమానికి ఏ హానీ ఉండదన్నారు . ' తుపాన్ల వల్ల పంటలు కోల్పోయిన వారికి ప్రభుత్వం రూ . 1 , 800 కోట్లు సబ్సిడీ ఇచ్చింది . మీలో ఎవరికైనా అందిందా ' అని ప్రశ్నించారు . లేదని సభికులు ప్రతి సమాధానం ఇవ్వడంతో అందుకే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చామని అన్నారు . సభకు అధ్యక్షత వహించిన ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి మాట్లాడుతూ భూ సంస్కరణలు తీసుకొచ్చి పేదలను ఆదుకునేందుకు సీఎంకృషి చేస్తున్నారని తెలిపారు . ఈ సభలో కేంద్ర మంత్రి ఎంఎం పళ్ళంరాజు , రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్ , తోట నరసింహం , జెడ్‌పి ఛైర్మన్ సిహెచ్ . వేణు , ఎంపి హర్షకుమార్ , ఎంఎల్‌ఎలు , ఎంఎల్‌సిలు పాల్గొన్నారు .
1 . సాంకేతిక శాస్త్రం మనుషుల్ని మార్చేస్తుంది . చాలామంది దృష్టిలో విజ్ఞానం అంటే సాంకేతికశాస్ర్తమే . ఇందులో ఆశ్చర్య పడవలసిందేమీ లేదు . మన జీవితవిధానంలో సాంకేతిక శాస్త్రం తెచ్చిన మార్పులు అలాంటివి . విజ్ఞానం లేకుండా ఆధునిక సాంకేతిక శాస్ర్తం ఊహించలేం . అయితే , సాంకేతిక శాస్త్రమే విజ్ఞానం కాదు . విజ్ఞానం చేసే పని జ్ఞానాన్వేషణే . సిద్ధాంతానికీ అన్వయానికీ ఉన్న సంబంధమే విజ్ఞానానికీ , సాంకేతిక శాస్ర్తానికీ ఉంది . విజ్ఞాన సిద్ధాంతాలను ఆచరణలో పెడితేనే సాంకేతిక శాస్త్రం తలెత్తుతుంది . ఉదాహణకు విద్యుదయస్కాంత తరంగాలు విజ్ఞానంలో భాగం . వీటి నియమాలను చూపే రేడియో , సాంకేతిక శాస్త్రంలో భాగం . ఈ ఉదాహరణ వల్ల మామూలు వ్యక్తి దృష్టిలో విజ్ఞానం అంటే సాంకేతికశాస్ర్తం ఎందుకైందో తెలుస్తుంది . సాంకేతిక శాస్త్రంలో మెరుగుదల ప్రభావాలు ఎవరికైనా కనిపిస్తాయి . విజ్ఞానసిద్ధాంతంలో ఉత్తరోత్తరాగాని అది స్పష్టపడలేదు . ఇలా చెబుతున్నామంటే , మానవజీవితంపై సాంకేతిక శాస్త్రం ప్రభావం అశ్రద్ధ చేయదగిందని గాని , కృత్రిమం అనిగాని అర్థంగాదు . ఆ మాటకొస్తే అది తెచ్చిన మార్పుల ప్రాధాన్యం చాలా ప్రగాఢమైంది . మానవుడి భౌతిక , సాంస్కృతిక రంగంపై ఈ ప్రభావం ఎంతగా ఉన్నదంటే , ఆధునిక సాంకేతిక శాస్త్ర యుగారంభానికి పూర్వం జీవితం ఎలా ఉండేదో ఊహించడానికి చాలా ప్రయత్నం కావాలి . ఈ మార్పులు రెండు విధాలుగా ఉన్నాయి . చాలా మార్పులు మంచికే దోహదం చేశాయి . అశోకుడు , అలెగ్జాండర్ , అక్బర్ , మొదటి ఎలిజిబెత్ కాలంతో పోల్చి చూస్తే , సాంకేతిక మార్పుల వల్ల మానవజీవితం సంతోషంగానూ , భద్రతతోనూ ఉందనవచ్చు . అయితే కొన్ని మార్పులు మానవస్వేచ్ఛకూ , మానవ ఉనికికీ భంగం కల్పించేవిగా పరిస్థితులను సృష్టించాయి . మంచిచెడుల పట్టికను చూస్తే ఆధునిక సాంకేతికశాస్ర్త ఫలితాలు ఇప్పటివరకూ చెడుకంటే , చాలా మంచినే సమకూర్చి పెట్టినట్లు స్పష్టమౌతుంది . ఈ నిర్ణయాన్ని కొంత వివరించడం మంచిది . నేడు విజ్ఞానం వల్ల చెడు ఫలితాలు వచ్చాయని వింటున్నాం . యంత్రానికి మానవుడు లొంగిపోయా డంటున్నారు . మానవ సంబంధాలలో లలితమైనవన్నీ వ్యాపార లక్షణాలుగా మారాయంటున్నారు . కొద్దిమంది చేతుల్లో అనూహ్యమైన వినాశక శక్తిని అందించిందంటున్నారు . కనక గత మూడువందల సంవత్సరాలలో జీవితాన్ని ఎలా విజ్ఞానం మార్చి వేసిందో సింహావలోకనం చేయడం ఉపయోగకరంగా ఉంటుంది . అటువంటి సింహావలోకనం వల్ల విజ్ఞానం మానవజీవితంపై చూపిన ప్రభావాన్ని తులనాత్మకంగా అవగాహన చేసుకోవడానికి తోడ్పడుతుంది . అంతే గాక , సాంకేతికశాస్త్రం కంటే విజ్ఞానం చాలా ప్రభావాన్ని చూపుతుందని గ్రహించవచ్చు . మానవజీవితంపై విజ్ఞాన ప్రభావం మూడు విధాలుగా ఉంటుంది . 1 . సాంకేతికం , 2 . సాంస్కృతికం , 3 . తాత్వికం , విజ్ఞానం మానవుడికి ఏం చేసిందో ఈ మూడు కోణాలలో పరిశీలిద్దాం . .
చిన్నప్పుడు . . . . . అంటే . . . చాలా చిన్నప్పుడు . . . ఈ ఎక్కాలు ఎవడు కనిపెట్టారు రా బాబు . . . అని అనుకుంటున్నప్పుడు . . . నాకు పుట్టిన రోజు అంటే చాలా సరదా ఇంకా ఇష్టం ఉండేది . చక్కగా కొత్త బట్టలు వేసుకోవచ్చు . బోల్డన్ని చాక్లెట్లు తినేయవచ్చు . ఎంత అల్లరి చేసినా ఆ రోజు ఏమీ అనరు . ( తర్వాతి రోజు పుట్టిన రోజు నాడు అల్లరి చేసినందుకు తిట్టేవారనుకోండి . . అది వేరే విషయం . . అలాంటివి మీరు అడగకూడదన్నమాట )
జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదైన మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్ ఎం . దానకిశోర్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు . మంచాల , ఇబ్రహీంపట్నం , యాచారం , కందుకూరు , మహేశ్వరం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సోమవారం ముఖ్యమంత్రి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో దానకిశోర్ విజ్ఞప్తి చేశారు . ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీవర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని ఈ నెల 15 లోపు పంపిణీ చేయాలనిఆదేశించారు . వ్యవసాయ [ . . . ]
" లేదక్కా . . బయలుదేరలేదు . . మరళా వర్కుందని మా మేనేజరు ఫోన్ చెస్తే కళ్యాణ్ స్టేషన్లోనే దిగిపోయి వెనక్కువెళ్ళిపోయాను . . నిన్నంతా ఆఫీసులో బిజీ బిజీగావుండి మీకు ఫోన్ చెయ్యలేకపోయాను . . మళ్ళీ ఎప్పుడొచ్చేది ఫోన్ చేసి చెప్తాలే " , అని దిగాలుగా మొహంపెట్టి . . ఫోన్ కట్ చేసాడు కిరణ్ . " ఛ . . , కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఎంతపని చేసింది . . " , అని తలపట్టుకన్నాడు . . " ఏంచేస్తాం మళ్ళా చచ్చినట్టు . . తిరుగుప్రయాణమే . . ఇక్కన్నుండి మళ్ళీముంబయి పోవాలి . . అంటే మళ్ళీ కోణార్క్ ఎక్స్ ప్రెస్సే గతి . . ఓరిదేవుడో . . . " , అని నీరసంగా ఫ్లాట్ఫామ్ నుండి ఎంక్వైరీ కౌంటర్ వైపు నడిచాడు కిరణ్ .
ఆమె నన్ను ప్రేమించింది . ఒకోసారి నేను కూడా తనను . తదేకంగా చూసే ఆమె విప్పారిన కళ్ళను ప్రేమించకుండా ఎలా ఉండగలను .
టెలిఫోన్లు , రేడియోలు , టీవీలు , కంప్యూటర్లు వంటి యంత్రాలు ఫోన్ కాల్స్ , టెలివిజన్ , రేడియో , ఇంటర్నెట్ , ఈ మెయిల్ వంటి ప్రసారాలని నిర్వహించే పద్ధతిని స్థూలంగా అర్ధం చేసుకుంటే , ఆ అవగాహన సృజనల ప్రసారాన్ని అర్ధం చేసుకోడానికి ఉపయోగపడుతుంది . ఒకదానితోనొకటి సంభాషించగలిగే ప్రసార యంత్రాలన్నీ ఎలాగయితే ఒకే తరగతికి చెందిన యంత్రాలో , ఒక సృజనను సృజించీ , చదివీ , విశ్లేషించే మనుషులందరూ అలాగే ఒకే తరగతికి చెందిన ' కవులే ' . పాఠకుడు , సంపాదకుడు , విమర్శకుడు - వీళ్ళందరూ కూడా కవి ఒకసారి సృష్టించిన ' కావ్యా ' న్ని ( text ) తమ మనోరంగం మీద ఇంకోసారి పున : సృష్టి చేస్తున్నారు . అంచేత , ఫోన్ కాల్ చేసే యంత్రం , వినే యంత్రం ఎలాగయితే రెండూ ఫోన్లే అయినట్టు , వీళ్ళందరూ కూడా కవులే . అయితే సృజనకారుడు ప్రదాత ( transmitter ) , పాఠకుడు , విమర్శకుడు ఇలాంటి వాళ్ళందరూ గ్రహీతలు ( receivers ) . సృజనశీలి ఎలా సృష్టిస్తున్నాడన్న మొదటి ప్రశ్నకు ప్రదానం , అంటే transmission ఒక నమూనాగా ఉపయోగపడుతుంది . అలాగే పాఠకుడు సృజనను ఎలా స్వీకరిస్తున్నాడన్న మూడవ ప్రశ్నకు గ్రహణం ( reception ) నమూనాగా పనికొస్తుంది . స్థూలంగా ఇవి రెండూ ఒకటే మౌలికమైన ప్రక్రియను ఒకదానికొకటి వ్యతిరిక్తమైన దిశల్లో , అంటే reverse orderలో బింబ ప్రతిబింబాల్లాగా నిర్వర్తిస్తాయి . అంటే అంతశ్చేతనలో చెదురుమదురుగా , అనైక్యంగా ఉన్న అనేక స్పందనల్ని సృజనకారుడు బహిశ్చేతనలో అందిపుచ్చుకుని , ఐక్యతను కల్పించి ఒక పాఠంగా ( text ) వెలయించేది బింబమయితే , ఆ పాఠాన్ని చదువుకొని , ముందు తన బహిశ్చేతనలో మళ్ళీ నిర్మించుకొని , మననం చేసుకొని అంతిమంగా తన అంతశ్చేతనలోకి , వ్యక్తిత్వంలోకి జీర్ణం చేసుకొనే ప్రతిబింబక్రియ పాఠకుడు చేస్తున్న పని . ఇవి రెండూ కూడా పుర్తికావడానికి కొన్ని రోజులు , నెలలు , ఏళ్ళూ పట్టవచ్చు . బలమైనవిగా పాఠకుల మీద ముద్రవేసి వాళ్ళని కుదిపేసే సృజనలు జీర్ణమయ్యే ప్రక్రియ ఏళ్ళకొద్దీ జరుగుతుందనేది మనందరి అనుభవంలోని విషయమే .
తలుపు తీసి చూసిన వెంటనే మెరుపు వేగంతో మొహాల మీద రంగులు ఎవరో పులిమేస్తున్నారు . నిద్రలోనుంచి మొత్తం తేరుకుని చూస్తే మా రాజు గాడు . వాడు తెళ్లారే సరికి మరో కోతి పనుల స్పెషలిష్టు అమర్ , మిగతా వాళ్లను వేసుకుని మా మీదకు దండయాత్రకు వచ్చాడన్న మాట . మాకు జరిగిన సత్కారమే మిగిలిన వారికి జరిగిందనటానికి వాళ్ల మొహాల్లో కనిపిస్తున్న అతి ఆనందం తెలుపుతుంది . అదీ కాక మమ్మల్ని త్వరగా తయారు కమ్మని ఆదేశాలు జారీ అయ్యాయి . కష్టం మీద కాలకృత్యాలు తీర్చుకుని , ఒక పనికి రాని టీ - షర్టు వేసుకుని ఆ గుంపులో పడి రోడ్డు మీద పడ్డాం . రోడ్ల మీద ఎక్కడ చూసిన తెగ హడావిడిగా రంగులు జల్లుకుంటూ తిరుగుతున్నారు . అలా వెళ్తూ మా బెంగాలీ ఫ్రెండు సౌరవ్ భౌమిక్ ఇంటికి వెళ్లాం … వాడి సుడి బాగుండి ఎక్కడికో తెలియని ప్రదేశానికి అజ్ఞాతంలోనికి వెళ్లిపోయాడు . వాడికి ఎవరయినా ఉప్పందించారో ఏమో మరి .
మా తమ్ముడు యెనిమిదో క్లాసులో వుండగా , శంకర్ , చోటూ అని ఇద్దరన్నదమ్ములు మా నాన్నగారిదగ్గర చదువుకోడానికి వచ్చేవారు . శంకర్ యేడో క్లాసులో , సన్నగా , కొంచెం పొడుగు అనిపించేలా వుండేవాడు . చోటూ అయిదో క్లాసులో , బొద్దుగా , గుండులా వుండేవాడు . సాయంత్రం వచ్చి , చదువుకొని , రాత్రి మా యింట్లోనే ఆరుబయటో , వీధి గది లోనో పడుకొని , పొద్దున్నే వెళ్ళేవారు . వీళ్ళిద్దరినీ మా మామగారు సరదాగా ' లవకుశులు ' అనేవారు .
విశాలాంధ్ర , ప్రజాశక్తి దినపత్రికలా ? ఈ మధ్యనే సాక్షికి పోటీగా మొదలయ్యాయా శర్మ గారూ ? వీటిని ఎవరు చదువుతారు శర్మ గారు ?
( బాలిగారితొ కబుర్లు గత వార౦ కొన్ని సా౦కేతిక కారణాలవల్ల కుది౦చవలసి వచ్చి౦ది . ఆయన , బ్లాగులొ ప్రచురణ నిమిత్త౦ ఇచ్చిన బొమ్మలు కూడా పూర్తిగా ఉ౦చడ౦ కుదరలేదు . ఇక్కడ మిగిలిన భాగాన్నివ్రాస్తున్నాను )
ఈ వింత రాగాలన్నీ జన్య రాగాలే . సప్త స్వరాలయిన స , రి , గ , మ , ప , ద , ని రాగం యొక్క ఆరోహణా అవరోహణల్లో ఖచ్చితంగా వున్న రాగాలని మేళ కర్త రాగాలంటారు . వీటి సంఖ్య 72 . ఈ మేళ కర్త రాగాలనుండి పుట్టిన రాగాలని జన్య రాగాలంటారు . అంటే ఆరోహణా , అవరోహణల్లో ఒకటీ లేదా రెండు స్వరాలు వర్జితం కావచ్చు , కొన్ని అదనంగా ఉండచ్చు . ఈ జన్య రాగాలకీ అనేక విభజనలున్నాయి . అదంతా సంగీత శాస్త్రంలో చెబుతారు . త్యాగరాజు కృతులు వెలుగు చూసీ , వాటిపై సంగీతకారుల పరిశోధన చేసే వరకూ ఈ వింత రాగాల గురించెవరికీ తెలీదు . త్యాగరాజు శిష్యులక్కూడా ఈ రాగాల జనక రాగాలు తెలిసుండకపోవచ్చని అందరూ భావిస్తారు . త్యాగరాజు తదనంతరం ప్రతీ కృతినీ తీసుకొని వాటి స్వరస్థానాలు బట్టీ , కటపయాది చక్రం ( మేళ కర్త రాగాల చట్రం ) అనుసరించి వాటి జనకరాగాలు ఇవీ అని నిర్ధారించారు . ఒక్కో సారి ఒకే కృతి రెండు కటకాల్లో వచ్చిన ప్రమాదం కనిపించింది . ఉదాహరణకి ' రాగ సుధారస పానము ' అనే కృతి ఆందోళిక రాగంలోనూ , మయూరధ్వని రాగం క్రిందా ఉన్న ప్రతులు , 1900 కాలంలో లభించాయి . ఇలా వేర్వేరు రాగాల పేరుతో ఒకే కృతి ఉండడంతో ఏది సరైనదో చెప్పడం కష్టమయ్యింది . ఏది ప్రామాణికంగా తీసుకోవాలా అని సంగీత కారులు చర్చించారు . చివరకి వాలాజపేట వెంకట రమణ భాగవతార్ భద్రపరచినదే సరైనదని నిర్ధారించారు . ఎందుకంటే ఇతనే ఎక్కువ కృతులు భద్రపరిచాడు . అంతే కాకుండా సుమారు 40 ఏళ్ళు పైగా వెంకట రమణ భాగవతార్ త్యాగరాజుతో గడిపాడు . అలా ' రాగ సుధారస పానము ' కృతి ఆందోళిక రాగం క్రిందే లెక్క కట్టారు .
అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై భాస్కర్ దర్శకత్వంలో కె . నాగబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు . అద్భుతమైన లొకేషన్లు , చక్కటి చిత్రీకరణ , పాత్రల్లో ఒదిగే నటీనటులు . . . కానీ ఎక్కడో ఏదో మిస్ . . . దాంతో . . . చేసిందంతా వృధా . ' మగధీరుడు ' ని లవర్ బారుగా చూపించే క్రమంలో
నాగఫణిశర్మ న్యూజెర్సీ శతావధాన పద్యాలు చాలా మంది చూసి ఉంటారు . కనక అప్పటి దత్తపదుల్ని కాస్త పరిశీలిద్దాం . మొదటిది గణపతి , గణపతి , గణపతి , గణపతి అనే నాలుగు పదాల్తో వినాయకుడి మీద చంపకమాల చెప్పమనేది . ఇది ఇచ్చిన పృఛ్ఛకులెవరో కరుణాసముద్రులు . ఈ పదాల్లో ఏ మాత్రం కష్టం లేకపోవటమే కాకుండా అసందర్భమైనవి కూడా లేవు . ఇలాటి దత్తపదులు ఆశువు అలవాటున్న వాళ్ళు అవలీలగా సాధించగలరు . ఇలాటివి ఎప్పుడో అవధాని అదృష్టం బాగుండి తగుల్తాయి . ఐనా కొంతమంది అవధాన్లు " కుప్పుస్వామయ్యర్ మేడ్‌డిఫికల్ట్ " లాగా కావాలని తేలిక పదాల్తోనైనా వాళ్ళకి వాళ్ళే పరీక్ష పెట్టుకుని non - trivial పూరణలు చేస్తారు . న్యూజెర్సీ సందర్భంలో నాగఫణిశర్మ అలా చెయ్యకుండా తేలిగ్గా లాగించేశాడు . కాని మిగిలిన దత్తపదులు ఇలాటివి కావు . వాటి సంగతి చూద్దాం .
గ్రామాల్లో పనులు లేని సమయం లో కూలీలకు ఉపాథికి భరోసా ఇవ్వడానికి ఈ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ పథకం ప్రవేశపెట్టారు . దీని వుద్దేశ్యం కూలీలకు ఉపాథి దొరకని రోజుల్లో , ప్రభుత్వం కనీసం 100 రోజులపాటు తనే పని కల్పించి , వారికి కూలీ చెల్లిస్తుంది . మంచి పథకమే కదూ ? విచిత్రమల్లా , ఈ పథకం యెక్కడా సరిగా అమలు కావడం లేదు . ఉదాహరణకి , ఓ మండలం లో గత యేడాది 293 పనులు యెంపిక చేస్తే , ఒక్కపనీ ఇప్పటివరకూ ప్రారంభం కాలేదట . మళ్ళీ ఈ యేడాది మరో 353 పనులు యెంపిక చేశారట . మరి ఇటీవల అదనపు సం యుక్త కలెక్టర్ గా వచ్చిన ఎం . వి . శేషగిరిబాబు , ఈ పనులన్నీ వెంటనే ప్రారంభించి పూర్తి చెయ్యాలని అదేశాలు ఇచ్చి , వాటి అమలుకోసం ప్రతి రోజూ సమీక్షిస్తూ , క్రింది అధికారుల సెల్ ఫోనులకి ఫోన్లు చేస్తున్నారట . ప్రస్తుతం ఆ మండలం లో కూలీలకు పుష్కలం గా ఉపాథి దొరుకుతోందట - - ముమ్మరం గా జరుగుతున్న వ్యవసాయ పనుల వల్ల . మరి మండల స్థాయి , గ్రామ స్థాయి అధికారులు యేం చేస్తారు ? ఆ పనుల్లో వున్నవారినే వేటాడి , కొంతమందిని బ్రతిమలాడి , యెక్కువ డబ్బులిస్తామని చెప్పి , కొన్ని పనులు ప్రారంభింప చేశారట . అవి పూర్తయ్యేదెప్పుడో ? గణాంకాలు మాత్రం , ఈ నెలలో ఇన్ని పనులు ప్రారంభించాం అంటూ ప్రభుత్వానికి చేరి పోయాయి ! పథకాలు వర్థిల్లు గాక !
ముందు ఆ విషయం మీద దర్యాప్తు చెయ్యడానికి ఈవోగారిచేత నియమితుడైన డీయెస్పీ గారి ఫోన్ కోసం ప్రయత్నించారు కానీ " సాంకేతిక " కారణాలతో లైన్ కట్ అయ్యింది .
వివేకానంద ఏమీ మాట్లాడలేదు . ఎందుకంటే సమస్యను సృష్టించిన దశరథ రామయ్యనే సమస్యకు పరిష్కారం కూడా చెప్తాడని వివేకానందకు తెలుసు . ఆ పరిష్కారంతో అతనికి ఏదో లాభం ఉండి తీరుతుందనీ వివేకానందకు తెలుసు . ఎందుకంటే ఆ లాభం కోరే దశరథ రామయ్య ఈ సమస్యను సృష్టించి ఉంటాడు .
ఇది నా ఇష్టాంశాలలో ఒకిటి : ) - - - - - - - - - - రోజు - హిందీ ( పెర్షియన్ ) దినము - సంస్కృతం ( తెలుఁగు ) { దిన్ - హిందీ } పొద్దు - అచ్చతెలుఁగు మొన్నో పొద్దు , ఒక సినిమాలో " ఈ పొద్దు నాకు చాలా సంతోషంగా వుండాదీ " అనే మాట విన్న నాకూ చాలా సంతోషం వేసింది . పొద్దు అంటే అసలు అర్ధం సూర్యుడు ( సంస్కృతం ) అనుకోండి . ఒకనాడు నేను సాయంత్రం పొలాన సూర్యుని పోటో తీస్తుంటే , " పొద్దుని తీత్నారా అండీ " అని ఒకడు అడిగేసరికి , నా పోటోకన్నా , నీ నుడికారం బాగుందయ్యా అనుకున్నాను మనసులోఁ . అలానే నెల ( నెలబాలుడు , నెలవంక ) అంటే చంద్రుడన్న మట , మన తెలుఁగులో దీన్ని అంతగా వడకపోయినా , మలయాళ కన్నడాలలోఁ చంద్రుని పేరు తింగళు ( తింకళు ) . తింగళు అంటే మాసం కూడా . " ఇరడు తింగళా అయిత్తప్పా , ననగే సంబళ కొట్టిల్ల కంపెనీ అవరు " . ఇద్దరు చంద్రుళ్లు వచ్చిపోయాయఁట , వీడి తస్సాగొయ్యా అనుకొనేవాడిని : ) - - - - - - - - - చంద్రమానంలో 354 . సౌర్యమానంలో 356 . 25 . . , మఱి నక్షత్రమానం అని ఇంకోటి వుంది కదండి అందులోనో . . ? ( సౌర్యమానం కంటే ఒక రోజు ఎక్కువో తక్కవో వుంటుందనుకుంట ) . - - - - - - - - - - - - - నిశితంగా ఆలోచిస్తే ఇది పూర్తిగా నిజం కాదు . ఎందుకంటే ఒక చోట ఉదయించిన స్థలంలో మళ్ళా ఉదయించటానికి అర్ధ సంవత్సరం చాలు . ఇంకా నిశితంగా ఆలోచిస్తే , ఇది కూడా నిజం కాదు . కొన్ని చోట్ల ఎనిమిది నెలలు , నాలుగు నెలలూ పట్టవచ్చు . ఈక్వేటరు దగ్గర ఆఱారు నెలలు పట్టవచ్చు . కొన్ని చోట్ల పన్నెండు , సున్నా నెలలు పట్టవచ్చు . ఈ విషయం మీకు తెలుసుననుకోండి . ఊరికినే చదువర్ల కోసం . - - - - - - - - - - - - - అన్నట్టు మనదేశంలో వారాలు బైబిలు పుట్టక ముందే వుందనుకుంటగా , హోరములు ( hour ) వుంటాయి , వాటికి అధిపతులుంటారు . ఒక దినమున మొదటి హోరాధిపతి ఎవరైతే వారి పేరిట ఆ దనము ఏర్పడుతుందని , నేను పలు ఛానళ్ళలో చూసి తెలుసుకున్నాను . మీ రాకేశ్వర
" శ్రీనివాస్ చెప్పింది కరెక్టే అనిపిస్తున్నది ప్రస్తుతానికి జాఫర్ నీకేమైనా అభ్యంతరాలుంటే తరువాత చెప్పు . మన పీ పీ గారికి ఏమైనా ఉన్నాయేమో ముందు అడగనీ . "
నేను పిల్లలని ఎప్పుడైనా కొడితే మా అమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకునేది . నువ్వు కొట్టావు కదామ్మా మమ్మలిని చిన్నప్పుడు అంటే ఇప్పుడు మీది బాధ్యతతో వున్న ప్రేమ , మాది బాధ్యత లేని ప్రేమ , అందుకే కష్టం అనిపిస్తుంది అనేది . ఇప్పుడు నేను నాన్నమ్మను అయినాక ఆ మాటల్లో నిజం తెలుస్తోంది . బాగా వ్రాశారు .
ఒక్క చందమామ తప్ప అన్నీ చూశా . అన్నీ ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైన్మెంట్లే . తెలుగు సినిమాని సినిమాలాగే చూడాలి . ఇలాగే ఓ నెల రోజుల పాటు అన్ని సినిమాలు చూసేస్తే జన జీవన స్రవంతి లో కలిసిపోతారు . తరువాత సినిమాలలో కొన్ని సీన్లు తప్ప సినిమా అంతా బావుంటుంది లేదా కొంత సినిమా తప్ప సీన్లన్నీ బావుంటాయి . దీన్నే ధనాత్మక దృక్పథం అంటారు . - - విహారి
పచ్చటి తోటలు , పొలాలకు పెట్టింది పేరు కోనసీమ . అయితే , ఇటీవల తరచుగా ఓఎన్‌జీసీ , గెయిల్‌కు చెందిన గ్యాస్ పైపులైన్లు లీకై , అవి ' బ్లో ఔట్లు ' గా మారుతుండటం కోనసీమ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది . భూ అంతర్భాగంలో నిర్మిస్తున్న పైపులైన్లలో నాణ్యతా ప్రమాణాలు , జాగ్రత్తలు పాటించకపోవడం ప్రమాదాలకు మూల కారణంగా మారింది . ముఖ్యంగా పంట పొలాలు , తోటలు , జనావాసాల మధ్య నుంచి వేస్తున్న గ్యాస్ పైపులైన్లు ప్రమాదాలకు గురయినప్పుడు ఆ ప్రాంతమంతా మంటలు , పొగ వ్యాపించి పచ్చదనాన్ని కబళించడమే కాక , జీవనోపాధిని కూడా దూరం చేస్తోంది . ఆయిల్ మంటలు వ్యాపించడంతో ఆ చుట్టు పక్కల ఉన్న కోనసీమలోని చాలా ప్రాంతాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి . దాని ప్రభావంతో పర్యావరణం కూడా దెబ్బతిని రైతులకు , సామాన్య ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి . ఇటీవల కడలి శివారులోని తూర్పుపాలెంలో సంభవించిన బ్లో ఔట్ ఎంత నష్టాన్ని కలుగజేసిందో తెలిసిందే . కాబట్టి , ఇప్పటికైనా ప్రభుత్వం కోనసీమను బ్లో ఔట్‌ల ముప్పు నుంచి కాపాడి , ప్రజలకు తగు నష్ట పరిహారాన్ని అందించాలని మనవి . బొంతు శ్రీనివాస్ పెదపట్నం లంక , తూర్పుగోదావరి జిల్లా మసకబారుతున్న ' చరిత్ర ' ! జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించి 125 సంవత్సరాలు నిండిన సందర్భంగా దేశంలోనూ , రాష్ట్రంలోనూ ఆ పార్టీ నాయకులు ఘనంగా ఉత్సవాలను జరుపుకున్నారు . మన రాష్ట్రంలో జరిగిన ఉత్సవాల్లో కాంగ్రెస్ తులసిమొక్క వంటిదని నాయకులు పోటీలు పడి కీర్తించారు . అయితే , స్వాతంత్య్రోద్యమంలో భాగంగా రూపొందిన నాటి జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించిన ఛాయలైనా నేటి పార్టీలో మిగిలేలా నాయకులు ప్రవర్తిస్తున్నారా ? అన్నది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి . దేశంలో మరే ఇతర పార్టీకీ లభించని కీర్తి , ప్రతిష్టలు ఆనాటి మహానుభావుల త్యాగాల చరిత్రతో లభిస్తున్నాయన్న స్పృహ ఎంత మంది నాయకుల్లో ఉందన్నది ప్రశ్నార్థకమే ! మరోవైపు , కేంద్రంలో పీకల్లోతు అవినీతిలో కూరుకుపోతున్న వైనం యావత్ దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది . ఒకే కుటుంబానికి చెందిన వారు దశాబ్దాలుగా పార్టీ పగ్గాలను కైవసం చేసుకోవడం కూడా ఆ పార్టీకి కళంకంగానే భావించాలి . ప్రజల కష్టాలను , పార్టీ కార్యకర్తల మనోభావాలను ఏ మాత్రం పట్టించుకోని నాయకులే ప్రధాన స్థాయి నేతలుగా కొనసాగడం , ఆనాటి జాతీయ నాయకుల త్యాగాలను కించపరచడంగానే భావించాలి . ఈ వాస్తవాన్ని ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది . సి . విజయవంశీ కోరుకొల్లు , కృష్ణా జిల్లా
హే ! జగన్నాధా ! మావూళ్ళొ మాఇంటికి కుడి చేతి వేపున వేనుగొపాలస్వామి ఆలయం , ఎడమ వేపున శివాలయం వుండేవి . గొపాలస్వామీఅలయానికే మేము తరచుగా వెల్తూ వుండే వాళ్ళము . అప్పుడు గొపాలస్వామి ఆలయం అంటే గొపాలస్వామి విగ్రహం ఒక్కటే వుండేది . వుండేవాడేమొ గుర్తులేదు . విశాలంగా , పరిశుభ్రంగా వుండే ఆవరణగణపతి లోఅలయం వుండేది . దేముడి మెళ్ళొ వేసే దండలకొసం , పూజకొసం పూలు వెతుక్కొకుండాఅవరణలొనే పూలచెట్లు పుష్కలంగా పూస్తూ వుండేవి . పారిజాతాలు , మల్లెలు , గన్నేరులు , పొగడపువ్వులు పూసేవి . పొగడపువ్వు ఆకారంలొ పెద్దదికాదు , బ్రహ్మాండమైన రంగు వుండదు . వాసన మాత్రం దూరదూరాలకు సాగిపొయి నాసికాపుటాల్నిపలకరించి , నేనిక్కడే వున్నా , రండి అని ఆహ్వానించేవి . సాయంత్రం వేళ గుడికి వెళ్ళి నేలమీద రాలిన పొగడపూలు కళ్ళు విచ్చుకొని వెతుక్కొనిమాలకట్టి జడలొ తురుముకొనేవాళ్ళం . ఇంకొన్ని ఇంటికి తెచ్చుకొనేవాల్లం . పుస్తకాలలొ , బట్టల మడతల్లొ , కొబ్బరినూనె సీసాలొ వేసే వాళ్ళం . అన్ని పొగడ వాసనలు వెద జల్లుతూ వుండేవి . ఆలయానికివెళ్ళిపూజారిగారి దగ్గర తీర్ధం తీసుకొని , ఆయన పేఆఆత్తిన ప్రసాదం తిని , చెమ్మచెక్కలాడుకొని దీపం పెట్టే సమయానికి ఇంటికి చేరుకొనే వాళ్ళము .
ఆ జన్మలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరుకోమంటే నేను తెలివి తక్కువగా నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను . నీవు ముందు ముందు తీరుతుందన్నావు . అప్పటినుంచీ నీ నామస్మరణ చేస్తూ నీ కోసం ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నాను . నాయింటికి వచ్చి నా కోరిక నెరవేర్చావు . ధన్యుడిని స్వామీ ! నాలో శక్తి క్షీణిస్తోంది . జీవితేచ్చ నశిస్తోంది నా అపచారము మన్నించి నన్ను కాపాడు . నీవే తప్ప నితః పరంబెరుగను ' అని పరిపరి విధాల ప్రార్థించాడు .
శ్రీలంక లో తమిళపులి ' వేలుపిళ్ళై పిరభాకరన్ ' పట్టుబడడానికి సమయం దగ్గరకొచ్చిందంటున్నారు ! శాంతికాముకులకీ , తీవ్రవాద వ్యతిరేకులకీ చాలా సంతోషం గా వుంటుంది ! మన దేశం లో తమిళ రాజకీయులకి చాలా బాధగా వుంటోది ! మరి పిరభాకరన్ యెందుకు దెబ్బ తిన్నాడు ? ఒకటే సమాధానం - యే దేశమైనా తన సార్వభౌమత్వానికి సవాలు యెదురైతే , సహించలేదు , సహించ కూడదు ! భౌగోళికం గా , చారిత్రకం గా ఒక దేశం లో వుంటూ , సాంస్కృతిక కారణాలవల్లొ , మత సంబంధమైన కారణాలవల్లొ , వేరే దేశం గా విడిపోతామంటే అది విపరీతం ! పైగా దానికి యెంచుకున్న పద్ధతి మరీ ముఖ్యం ! తెల్లవాడి ' విభజించి పాలించు ' జిత్తులకి తలొగ్గకుండా , కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యానికి తొందరపడకుండా వుంటే , ' రెండు డొమీనియన్లు ' కి అంగీకరించకుండా వుంటే , మన పక్కలో బల్లెం - పాకిస్థాన్ తో మనకీ పాట్లు వుండేవి కాదు ! 1948 లో పాక్ ని నియంత్రించడానికి జనరల్ కరియప్పకి అవకాశమిచ్చి వుంటే , కాంగ్రెస్ అతి నమ్మకంతో ఐక్యరాజ్య సమితికి పోకుండా వుంటే , మన కాశ్మీర్ సమస్యే వుండేదికాదు ! తరవాత , 1965 , 1971 యుద్ధాల గురించీ , ప్రభుత్వం నిర్వాకం గురించీ ముందే మాట్లాడుకున్నాం ! భుట్టో మన దేశం మీద ' వెయ్యేళ్ళ పవిత్ర యుద్ధం ' ప్రకటించడానికి కూడా ఈ సూత్రమే కారణం ! ఇక పద్ధతులకి వస్తే , తమిళ పులి యెంచుకున్నది - సాయుధ పోరాటం ! అదీ ముక్కుపచ్చలారని పిల్లలతో ! ఇంకా తీవ్రవాదాన్ని నమ్ముకోవడం ! రాజకీయం కోసం అప్పటిదాకా ' ఈళం ' కి మద్దతు ఇచ్చిన రాజీవ్ , మధ్యలో తెడ్డు జాపినట్టు ' ఐ పీ కే ఎఫ్ ' పేరుతో జొరబడి , చివరకి హత్య చెయ్యబడ్డాడు ! ఇక వాళ్ళ ప్రధాన మంత్రుల్నీ వదల్లేదు వాళ్ళు ! హత్యలూ , హత్యా ప్రయత్నాలూ సాగించారు ! వాళ్ళ ప్రభుత్వం యెన్ని సార్లు చర్చలకోసం చెయ్యి సాచినా , యేదో వంకతో దాన్ని తిరస్కరించడం , కాల్పుల విరమణని పాటించకపోవడం లాంటివి కోకొల్లలు ! చివరికి ' అల్టిమేట్ డెస్టినీ ' కి చేరక తప్పదు కదా ? ఇది ప్రతీ ఉద్యమానికీ , ఉద్యమ నాయకునికీ , ప్రభుత్వాలకీ , విద్రోహులకీ ఓ గుణపాఠం కావాలి ! అయితే బాగుండును ! పీ ఎస్ : - ఇప్పుడే అందిన వార్త - - కరుణానిధి చిదంబరం మీదా , చిదంబరం మన్మోహన్ సింగ్ మీదా , మన్మోహన్ సోనియా మీదా , సోనియా భారత ప్రభుత్వం మీదా తెచ్చిన వత్తిడి ఫలితంగా , భారత ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వం మీద తెచ్చిన వత్తిడి ఫలించి , ఆ ప్రభుత్వం ' కాల్పుల విరమణ ' ప్రకటించిందట ! కరుణ తన ' నిరాహార దీక్ష ' విరమించారట !
ఇప్పటి వరకు నేను చూసిన తెలుగు అక్షరరూపాల లోపాలకు విరుగుడు కనగొనటంలో సఫలమైయ్యాను . అవేంటంటే హల్లుతో అంతమయ్యే పరభాషా పద భాగాలలో హలాంతం విడిగారావటం దీనికి లోహిత్ ఫాంటులో దోషం కారణం . పోతన2000 ఫాంటుతో సరి అవుతుంది . ఋత్వము వేరే వత్తు తర్వాత వస్తే , ముందు ఋత్వం వచ్చి తరువాత వత్తు రావడం . దీనికి విరుగుడు పాంగోలో కోడు సరిచేసిపెట్టాను . ఇది కొన్నాళ్లలో విడుదలవుతుంది .
" ఆంధ్రా వాళ్ళు సొరకాయ అంటారు , తెలంగాణా వాళ్ళు ఆనపకాయ అంటారు . " : - ఇతనెప్పుడైనా ఉత్తరాంధ్ర మొహం చూస్తే కదా తెలిసేది . మా వైపు సొరకాయ అంటే ఎవడికీ అర్ధం కాదు , ఆనపకాయ అనే వాడుతారు . అయినా కూరగాయ పేర్లు కూడా వివాదాస్పదం చెయ్యటం ఒక పరాకాష్ట . ఆల్ప్స్ పర్వతాలలో పుట్టిన టొమేటో పండుకు రామ ములగ పండు అని ఓ జమాన కాలం నుంచి పేరు . . . మరి కె . సి . ఆర్ బజారుకు వెలితే ఏ పదం వాడుతాడో ? తెలంగాణా కూరగాయలపై ఆధిపత్యం వహిస్తున్న ఈ యూరోపియన్ కూరగాయల్ని తరిమేద్దాం అంటాడేమో !
భలే చెప్పారు కదా మీ ముగ్గుల అనుభవాలు . మీకు కూడా హాప్పీ హాప్పీ న్యూ ఇయరూ ఇంకా బోల్డన్ని సంబరాలు
చదివిన తర్వాత అలా స్థబ్ధుగా ఉండిపోయాను . దీనికి ఎటువంటి వాఖ్య రాయాలో కూడా అర్ధం కావడం లేదు . కొత్తపాళీ గారు అన్నట్లు నిజంగా ఇదో కొత్తకోణం నీ కవితల్లో . ఇంతవరకు రాసినవి ఒకెత్తు అయితే ఇది ఇంకోఎత్తు . నా ఉద్దేశ్యం ప్రకారం కవిత చదివిన పాఠకునికి ఆ కవిత ఒకరకమైన ఆవేశమో , ఆర్ద్రతో , ఆలోచనో కలిగిస్తే ఆ కవిత యొక్క జన్మ సార్ధకమయినట్లే . ఈ కవిత పై మూడింటిని పాఠకులకు అందిచ కలిగేలా ఉంది . ముఖ్యంగా చివరి లైన్లు చాలా బావున్నాయి . కాకపోతే " విసర్జించి " అన్న పదాన్ని నేనెందుకో సరిగ్గా అన్వయించుకోలేక పోతున్నాను . ఆ పదం మార్చగలిగే ఛాన్సు ఉంటే మార్చగలవేమో ఒకసారి చూడమని మనవి .
వుడుత కొట్టిన జామ కాయ కాకెంగిలి చేసుకు నాతో పంచుకుతిన్న కామేశానివా ?
కేంద్ర ప్రభుత్వం మళ్లీ డీజిల్ , కిరోసిన్ , గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచింది . ఇప్పటికే అధిక ధరలతో సతమతమవుతున్న . . . ఇంకా చదవండి
మురళిగారూ . . మీకు నా కృతజ్ఞతలు తప్పు గుర్తించినందుకు , ఒరు ఉరు పుంజరి లింక్ ఇచ్చినందుకూ . పొరపాటున ఈగ అని రాసాను , ఇప్పుడు సవరించాను . నాకు కూడా మీరు చెప్పిన కధలు చాలా ఇష్తం ( ఇవి చాలా బాగా నచ్చినవి ) . అరటిపువ్వు కధలో అరటిపువ్వునీ , ఆధ్యాత్మికతనీ పోల్చి పోలికలు చెప్పడం బావుంటుంది . కధాపరంగా అదీ , పెళ్ళీ కొద్దిగా వీక్ అనే చెప్పాలి . సౌమ్య గారూ . థాంక్ యూ . మీరె చెప్పిన కధలే నాకు కూడా చాలా ఇష్టం . మీరు చెప్పిన వాటిల్లో అన్నీ చదవలేదు . ఈ సారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి . మీరు ఈ పుస్తకాలగురించి పరిచయం రాయండి . బావుంటుంది .
హైదరాబాద్ , జూలై12 ( వాస్తవం ) : వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై ప్రాథమిక విచారణకు ఆదేశించి రాష్ట్ర హైకోర్టు మంగళవారం షాక్ ఇచ్చింది . రెండు వారాలలో తమకు సీల్డ్ కవర్‌లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది . ఈ కేసులో ప్రభుత్వ శాఖలన్నీ విధిగా సిబిఐకి సమాచారం అందించాలని , ప్రతివాదులు సహకరించాలని ఆదేశించింది . కాగా విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది . అయితే హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని వైయస్ జగన్ నిర్ణయించుకున్నారు . జగన్ ఆస్తులు అక్రమ ఆర్జనంటూ మంత్రి శంకరరావు రాసిన లేఖను హైకోర్టు తనంత తానుగా విచారణకు స్వీకరించింది .
అదేంటీ జయ అలా అనేసేరు , నచ్చటానికి కొలమానాలేమున్నాయి . నా మటుకు మీరు బాగా రాస్తారు అనిపిస్తుంది . అదేదో కమర్షియల్ లో చెప్పినట్లు సూటి గా సుత్తి లేకుండా : - ) సాహిత్య వల్లి ప్రసన్న శారద కరుణ మీ మీద పూర్తి గా వుంది . మీరేమి అనుమానాలు పెట్టుకోకండీ మరి .
అబద్ధంకనే అబద్ధాల పిల్లల్లా గుడ్డివాడు గోతిలో పదేపదే అదేపనిగా పడిపోయినట్టుగా ఈ దేశ చరిత్రలో జరిగిందే మళ్ళీ మళ్ళీ జరూరుగా జరుగుతూనే వుంది
తీర్మానాలు : పెండింగ్‌లో ఉన్న ఎస్సీ , ఎస్టీ , బిసి విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ . 18వేల కోట్లు విడుదల చేయాలని , పాఠ్యపుస్తకాలను , దుస్తులను వెంటనే సరఫరా చేయాలని , పెరిగిన ధరలకనుగుణంగా హాస్టల్ విద్యార్థుల మెస్ , కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని , యూనివర్శిటీలో చోటుచేసుకున్న అవినీతిపై విచారణ జరపాలని , సక్సెస్ పాఠశాలలకు నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలని , ప్రారంభం కాని ఎస్సీ , ఎస్టీ , బిసి కళాశాలల హాస్టళ్లను ప్రారంభించాలని పలు తీర్మానాలు చేశారు .
" ఎక్కడ ? ఎక్కడ ? అగ్ని ప్రమాదం జరిగిందెక్కడ ? " ఫైరింజెన్ మీద నుంచి అరిచాడు ఆఫీసర్ . " అగ్ని ప్రమాదం ఏమీ లేదండయ్యా . పొద్దుట్నించీ పంపుల్లో నీళ్ళు రావడం లేదు . నీళ్ళ కోసం అలా పిలిచాం . తలా ఒక బిందెడు నీళ్ళుపోసి పుణ్యం కట్టుకోండి బాబయ్య " బిందెలు చూపుతూ అన్నారు అక్కడున్న వందమంది మహిళలు
రాయుడు . . ఏవరేజి స్టూడెంటు . . ఇంజనీరింగ్ క్యాంపస్ ఇంటర్వూల్లో నెగ్గలేక కొన్నాళ్ళు ఖాలీగా తిరిగేసాడు . . కొన్నాళ్ళు మార్కెటింగని అదని ఇదని . . అక్కడా ఇక్కాడా చిన్న చిన్నఉద్యోగాలు చేసినా తృప్తి చెందలేకపోయాడు . ఫ్రెండ్సందరూ పెద్ద పెద్ద కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో మంచి మంచి సేలరీతో సెటిల్ అయిపోయారు . అదిచూసి తట్టుకోలేకపోయిన రాయుడు ఎలాగైనా తనూ సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాలి . . అప్పుడుగాని ఐదంకెల సేలరీ రాదు , ఈ దరిద్రాలన్నీ వదలవు అని . . అమీర్ పేటలో కట్టిన బ్యానర్లన్నీ చదివేసి కనబడ్డ కోర్సులన్నీ నేర్చేసుకుని . . , పేపర్లో పడ్డ ఇంటర్వూలన్నింటికీ ఎటండ్ అవటానికి సిధ్దమైపోయాడు . ఎక్స్పీరియన్స్ ఎంత అన్న ప్రశ్న దగ్గరకొచ్చేసరికి చెమటలుపట్టేసేవి . చెప్పుకోటానికైతే మూడేళ్ళు ఎక్స్పీరియన్స్ వుంది గానీ . . అండర్ వేర్లదగ్గర్నుండి . . . క్రెడిట్ కార్డులు అమ్మటం దాకా . . లిప్స్టిక్ దగ్గరనుండి నెయిల్ పాలిష్ దాకా అన్నీ అమ్మిన అనుభవాలు కలిపి రెండేళ్ళు రావటంతో , ఎవరోచెప్పిన సలహాతో . . . మొత్తం రెండేళ్ళు నాన్ ఐ . టి అని . . , ఒక సంవత్సరం ఐ . టి ఎక్స్పీరియన్స్ అని రెజ్యూమ్ తయారుచేసి . . ఇంటర్వూలకు వెళ్ళటం మెదలుపెట్టాడు . అతనికి లక్కు కలిసొచ్చి . . ముంబయిలో ఓ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చింది . ఎలాగైతే తనకున్న మార్కెటింగ్ స్కిల్స్ ఉపయోగించి జాబ్లో జాయినైపోయాడు . ఏదడిగినా నేర్చుకున్నప్పటి డెఫినిషన్ చెప్పేసి తెలిసినట్టు కటింగు ఇచ్చేటాలెంటైతే వుందికానీ ఇది చెయ్యి అని ఏదన్నాపనిచ్చేసరికి . . ఒక్క ముక్కకూడా ముందుకు నడవక . . వారాలు వారాలు అలానే వుండిపోయి . . మేనేజరు దగ్గర రోజూ డక్కాముక్కీలు తింటూ కాలం గడిపేస్తున్నాడు . రాయుడికి అప్పటిదాకా కలిసొచ్చిన లక్కు కాస్తా చంఢశాసన ప్రోజెక్ట్ మేనేజర్ రూపంలో బ్యాడ్ లక్ గా మారిపోయింది . పని ఇచ్చి వెనకేనిలబడి ఏం చేస్తున్నాడో చూస్తూ . ఎప్పుడన్నా మంచి ఇస్త్రీ షర్ట్ వేసుకొచ్చిన రోజు ఏదన్నా తప్పుదొరికితే . . . సినిమా హీరోలా మంచి మంచి డ్రెస్సులు వేసుకురావటం కాదు . . పనితనంలో ఉండాలి . . అని అమ్మాయిల ముందు పరువుతియ్యటాలు , పెద్దగాకేకలుపెట్టి అందరికీ వినపడేలా గట్టిగా అరుస్తూ మాట్లాడటం లాంటి వేషాలన్నీ వున్నాయి మేనేజరుకు . అప్పటిదాకా బ్రాండెడ్ జీన్సులు అవి వేసుకుని మంచి స్టైలిష్ క్రాపుతో ఉన్నవాడు కాస్తా సాదాసీదాగా మారిపోయి . . , రాయుడంటేనే మీసం అనిపించేలా పెంచిన మీసం కాస్తా ట్రిమ్ చేసి . . తగ్గించాడు . . ఏంచేస్తే ఎలా ఇరికిస్తాడోనని భయంభయంగా ఆఫీసుకువెళ్ళడం మొదలుపెట్టాడు రాయుడు . అలాగైనా ఎదో వంకపెట్టి తిట్టడం మాత్రం మానలేదు మేనేజరు . కాలేజి రోజుల్లోనూ . . , మార్కెటింగ్ చేసిన రోజుల్లోనూ హిందిని బాగా నూరిపోసుకుని తాగేసిన లాంగ్వేజ్ స్కిల్స్ తో ప్రతీ పని తనే చేసానని చెప్పుకోవటం అలవాటు చేసుకున్నాడు . ఒక్కోసారి టైముబాగుంటే పూలదండలూ . . లేకపోతే ఎవడోచేసిన తప్పులకు చెప్పుదెబ్బలు తింటూవుండేవాడు . అలా కొంతకాలానికి తనకు తెలిసిన తలమాసిన స్ట్రాటజీలన్నీ ఇంప్లిమెంట్ చేసి ఎలాగైతే తప్పించుకునే విద్య అయితే నేర్చుకోగలిగాడు కానీ . . పని మాత్రం నేర్చుకోలేకపోయాడు . . మేనేజర్ని మెప్పించలేకపోయాడు . అలా ఒక సంవత్సరం గడిచేసరికి . . ప్రాజెక్టులో ఒకొక్కడూ వేరే వేరే కంపెనీలకు వెళ్ళిపోవటంతో , కొత్తగా వచ్చిన టీముకు ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో తెలియకపోవటంతో మొత్తం రాయుడినెత్తిమీదే పడిపోయింది . ప్రతీదాంట్లోనూ నువ్వే సీనియర్ వి కదా నువ్వు చేసి వాళ్ళకు చూపించు అనటం మొదలుపెట్టాడు మేనేజరు . ఎవడు చెయ్యకపోయినా రాయుడ్నే సెంటర్ చేసి వంకపెట్టి తిట్టేయడంతో కధేంటిరా ఇ . వీ . వీ సినిమాలోలాగా ఇలా మలుపు తిరిగింది . . అని రాయుడికి పిచ్చెక్కిపోయింది . ఇన్నాళ్ళూ వాడినెత్తిమీద వీడినెత్తిమీద చేతులుపెట్టేస్తే అయిపోయేది . . ఇప్పుడు నానెత్తిమీదే మా మేనేజరు బండచేతులు వేసేస్తున్నాడు బాబోయ్ అని తెగ బాధపడిపోయాడు రాయుడు . ఈ టెన్సన్లన్నిటిని తట్టుకోలేక అరగంటకోసారి కంపెనీ ఎదుటవున్న టీ బండిదగ్గరకు వెళ్ళి ఒక టీతాగటం . . ఒక సిగరెట్టెలిగించడం ఇలా తిండిమానేసి టీలు సిగరెట్టులమీద నడిపేస్తూ . . . రాత్రిళ్ళు సరిగా నిద్రపోకా మొహంలో రకరకాల మార్పులు తెచ్చుకున్నాడు . ఫ్రండ్స్ ఎవరికి చెప్పినా అంతేరా బాధలు అలానే ఉంటాయి ఐ . టి ఇండస్ట్రీ అంటే అనే వాళ్ళేగానీ తను చెప్పేది పూర్తిగా వినేవాడు , సలహా ఇచ్చేవాడు ఎవడూ కనబడలేదు . ఇక ఉద్యోగం . . జీవితం రెండూ విరక్తి కలిగించేసాయి . . . " మరెందుకురా నేను ఐ . టి . లోకి వస్తానన్నప్పుడు ఇవ్వన్నీ ఎవడూ చెప్పలేదు " , అని జనాలపై కసురుకోవటం మొదలెట్టాడు . " వస్తే ఎలాగూ తెలుస్తుంది కదా మళ్ళా ఇంట్రడక్షన్ ఎందుకులే , అయినా చెబితే ఎవరూ వినరూ . . అనుభవలోకొచ్చాకా ఏడుస్తారు . . " , అని అంతా ఏడిపించారు రాయుడ్ని . " ఒరే . . మీ కోడ్ లో బగ్గులు పడా . . , మీ మేనేజరు అర్ధరాత్రి రెండింటికి ఫోన్ చేసి ఆఫీసుకు రమ్మనా . . . , రాసిన కోడ్ సేవ్ చెయ్యకుండానే . . మీ సిస్టమ్లలన్నీ క్రాష్ ఐపోనూ . . . రిలీజ్ రోజున మీ వేళ్ళన్నీ కీ బోర్డ్ సందుల్లో దూరిపోయి గోరుచుట్టులేసెయ్యా . . , లాంగ్ వీకెండ్ వస్తున్న రోజుల్లో మీరు బాత్రుంల్లో వుండగా బయట డోర్ లాక్ పడిపోనూ . . నన్నింత మాటంటార్రా " , అని రకరకాల తిట్లన్నీ తిట్టేసుకుని ఫ్రెండ్స్ తో మాట్లాడటం మానేసాడు . . రాయుడు . ఓ రోజు రోజులాగే టీ బండి దగ్గర టీ తాగుతూ సిగరెట్టు వెలిగించి అప్పుడే తాజాగా మేనేజరు తిట్టిన తిట్లన్నీ ఒక్కసారి రివైండుచేసుకున్నాడు . . . " వెళ్ళి ఆ టీ బండిలాంటిదేదన్నాపెట్టుకోవయ్యా . . ఎందుకిలా ఐ . టి లోకొచ్చి మా ప్రాణాలు తీస్తారు " , అన్న తిట్టు పదే పదే ఎకో శబ్ధంలో చెవుల్లో మారుమోగిపోయింది . " బలిసి కొట్టుకుంటున్న అత్తగారు . . కోడలు జాకెట్టు వేసుకుని తిరిగిందని . . మేం చేసిచ్చిన పనిని మేకప్ చేసి పైవాడికి చూపించుకుంటూ అన్ని సోకులు చేస్తున్నోడివి నువ్వే ఈ ఇండస్ట్రీలో లేగా లేంది నేనుంటే తప్పేంటిరా ? , ఎప్పుడూ ఎక్సెల్ షీట్లో తలపెట్టక్కూర్చునే తలమాసినెదవ్వి . . నీకేం తెలుసురా కోడింగ్ అంటే . . , ఎప్పుడో పాస్కల్ , కోబాల్ ప్రోగ్రాములు చెయ్యటంకాదురా . . లేటెస్ట్ ప్రోగ్రాములు చెయ్యమ్మా . . తెలుస్తుంది . నేను టీ బండి పెట్టుకోటానికైనా పనికొస్తానేమో కానీ ! ! . . నువ్వైతే నా దగ్గర . . . తాగేసిన టీ గ్లాసులు కడగటానికి కూడా పనికిరాని పనికిమాలినెదవా . . " , అని రాయుడు తన మేనజరుపై తిట్టుకున్న తిట్లవేడిని తట్టుకోలేక చేతిలోవున్న టీగ్లాసు భళ్ళున పగిలి ముక్కలైపోయింది . షర్ట్ పై పడిన టీ మరకలుతుడుచుకుంటుంటే . . మషాళా టీలాంటి ఐడియా ఒకటి తట్టింది . . రాయుడికి . . , వెంటనే తన రూమ్మేట్ క్రిష్ కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పి మంచి ప్లాన్ చేసారిద్దరూ కలిసి . . " నన్నింతమాటంటాడా . . ఛీ . . ఈ రోజునుండి ఈ అఫీసులో అడుగుపెట్టను " , అని కోపంలో మెడలోవేలాడుతున్న ఐడెంటిటీ కార్ట్ ట్యాగ్ ను అగ్గిపుల్ల తీసి వెలిగించేసాడు . ట్యాగ్ కాలుకుంటూ మంటలన్నీ మొహంవైపొచ్చేసరికి . . కంగారుగా ట్యాగ్ తీసేసి . . అవతలపడేసి నాలుక్కరుచుకున్నాడు . " అయ్యబాబోయ్ ఇలా కాల్చేసేంత ఆవేశం వచ్చేసిందేంటి . . . అసలే నెలాఖరిరోజులు . . చక్కగా జీతం ఎకౌంటులో పడ్డాకా చెక్కైయొచ్చుకదా ? " , అని సగం కాలిన ఐ . డి కార్డు తుడుచుకుంటూ మనసు మార్చుకుని . . ఇచ్చిన వర్క్ తలచుకుంటూ . . ఆఫీసులోకి బయలుదేరాడు . ఎదురుచూస్తున్న ఫస్ట్ తారీఖు రానే వచ్చింది . . . బ్యాంక్ ఎకౌంట్లో సేలరీ డిపాజిట్ ఎసెమ్మెస్ చూడగానే కంగారుగా ఆఫీసు బయటకు వచ్చేసాడు . . సెల్ ఫోన్ తీసి డయల్ చేసి రూమ్మేట్ క్రిష్ తో విషయం చెప్పాడు . . ఓ గుడ్ . . ఇదే మంచి సమయం . . ఇంక ఆలస్యం ఎందుకు . . ఇచ్చేయ్ అందరికీ షాక్ . . . మీ మేనేజర్ కి స్పెషల్ గా మెయిల్ కూడా పెట్టు . . , గూగుల్ లో వెతికి బాలకృష్ణ మీసం తిప్పుతూ . . తొడకొడుతున్నట్టున్నఇమేజ్ ఎటాచ్ మెంట్ చెయ్యటం మర్చిపోకు . . , నువ్వేం బయపడకు . . . అంతా మన ప్లాన్ ప్రకారమే నడుస్తుంది . . . , నేను నా ప్రాజెక్టుకు కూడా ఇంత మంచి వర్క్ ఫ్లో చార్ట్ తయారుచెయ్యలేదు . . . , నిన్ననే సాధక బాధకాలు అని ఒక డాక్యుమెంట్ చేసాను . . అన్నిటికి మనం సిద్దంగానే వున్నాం . . నేను అన్ని ఎరేంజ్మెంట్స్ చేసేసా కూడా . . . రెపే ముహుర్తంపెడదాం . . అంతా అయ్యాకా ఫోను చెయ్యి . . అని ముగించాడు క్రిష్ . . . ప్లాన్ చెసిన ప్రకారం తన సాఫ్ట్వేర్ ఇంజనీరు జాబ్ కి రిజైన్ చేసేసి అందరికి షాక్ ఇచ్చాడు రాయుడు . . . , రేపట్నుండి నేను రావటంలేదు . . ఈ క్షణం నుండీ నాకూ ఈ ప్రాజెక్టుకీ ఏమీ సంబంధంలేదు . . ఏం పీక్కుంటావో పీక్కో అని స్పెషల్ మెయిల్ చూసి మేనేజర్ షాక్ తిని కూలబడిపోయాడు . . తరువాత రోజు ఎపుడూ ఆఫీసుకు బయలుదేరే సమయానికంటే ఒక గంట ముందుగానే ఆఫిసుకు బయలుదేరాడు రాయుడు . . . వెనకే బైక్ పై క్రిష్ కూడా కుర్చున్నాడు . " మాషాళా చాహా . . అద్రక్చా చాహా . . , గరమ్ గరమ్ వడాపావ్ . . . మిళేలా . . , జై శివసేనా . . జై మాహారాష్ట్ర " అని . . మరాఠీలో రాసివుండి . . పూలదండలతో అలంకరించిన టీబండిని లోకల్ ఎమ్మెల్యేచేత తన ఆఫీసు ఎదురుగానే రిబ్బన్ కటింగ్ చేయించి . . ఓపెన్ చేయించారు రాయుడూ క్రిష్ . . . ఆ రోజునుండీ రాయుడి వ్యాపారం . . మూడొందలు వడాపావ్ లు . . ఆరొందలు మషాళా టీలు అన్నట్టుగా . . . వర్క్ టెన్సన్ . . మేనేజర్ హెరేస్మెంటూ . . ఏమీ లేకుండా దర్జాగా . . పోలీసోడికీ . . . , లోకల్ గూండాలకి , ఎమ్మెల్యేలకీ అమ్యామ్యాలు చదివించుకోగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పున్యమా అని పదిలక్షలు పెర్ ఏనమ్ గా ముందుకు సాగింది .
డాక్టర్ షామల్ ఉద్యోగం మానెయ్య దలుచుకుందేమో . ఆమె భర్తకు ఆరోగ్యం బాగా లేదటగా ? కుతూహలం అందరి మనసులో .
ఈ ముద్రని శ్రీశ్రీ సంతోషంగా స్వీకరించడానికి చాలా కారణాలున్నాయి . అవన్నీ ఈవ్యాసంలో చర్చించడానికి సవకాశం లేదు . కాని శ్రీశ్రీ అనే వ్యక్తి క్లిష్టమైన జమిలి భాగంలో ఒక భాగానికి ఈ ముద్ర చాలా నప్పింది . ఆముద్రని అతనెప్పుడూ తిరస్కరించలేదు . కాని అంతరాంతాల్లో అంగీకరించనూ లేదు .
ఎట్టి రచనలోనైనా " స్వతంత్రత " అనే గుణము వాంఛనీయము , స్తవనీయము . ' విక్టోరియా క్రాసు ' అన్న నవలలో ఈ గుణము ఎంతవరకు ఉన్నదంటే , ఐరోపా సంగ్రామాన్ని కథా వస్తువుగా తీసుకున్నంతవరకు - అంతే ! [ … ] యుద్ధవిశేషాలు పత్రికావార్తలవలె చెప్పబడినవి కాని నవలా చైతన్యముతో కూడుకున్నవి గాలేవు . [ … ] ఒక చిన్న మూలకథకు ఐరోపా యుద్ధాన్ని అంటించగా ఈ నవల ఏర్పడినది . [ … ] గ్రంధకర్త్రి ( ఉపోద్ఘాతము ప్రకారము ) గారు " బహుయోర్పు తోడ నెన్నియో విషయములు సేకూర్చి " రనుట నిర్వివాదాంశము . ఈ నవలను " ఐరోపాయుద్ధ అసమగ్ర చరిత్ర " గా చెప్పవచ్చును . ఇందు అందము కూర్చని అచ్చుమాట అటుండగా , " పుడమోపతి ( పుట 39 ) , తాత్కాలిక వంతెనలు ( 79 ) , సామ్రాజ్య పిచ్చి ( 82 ) " మొదలైన కొన్ని " సమాస తప్పులు " దొర్లినవి . [ … ] ఈ పుస్తకము నందలి భాష సరాసరిగా గ్రాంధికమే . శైలి ఎగుడుదిగుడుగా ఉన్నది [ … ]
దశరథ రామయ్య పాఠశాల పేరుని మార్చాలని ప్రయత్నించాడు . కానీ ఆవిషయంలో సరోజినమ్మ గట్టి పట్టు పట్టటంతో ఆయన ఆటలు సాగలేదు . ' ఈ కాలంలో నలంద , విద్యా భారతి లాంటి పేర్లు పెడితే పిల్లలు రారమ్మా . ఏదో ఓ సెయింట్ పేరుండాలి . కనీసం సెయింట్ సిద్దార్థ అని పెట్టినా పర్లేదు ' అని చెల్లెలిని బ్రతిమిలాడాడు . కానీ ఫలితం లేకపోవటంతో ' పేరులో ఏముందిలే ' అనుకుని ఊరుకున్నాడు .
@ మాలతిని : విరుగుడు సంగతేమో కానీ కాపు ఈ విషయం కనిపెడితే గొరుగుడు ఖాయం . నాకు తెలిసి , వాళ్ల రాడార్స్‌ని ఏ రకంగా intercept చెయ్యటమైనా నేరమే . కాబట్టి ఇటువంటి పరికరాలు / పద్ధతులు వాడేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ వాళ్లకి దొరక్కుండా ఉండటం మరింత ముఖ్యం : - )
ముందే చెప్పినట్లు ఇది కారికేచర్ . మీకు తెలియకుండా మీరు ఇదే భంగిమలో నిలిచి పుస్తకాలు పరిశీలిస్తూ ఉండవచ్చు . వివిధ సాహిత్య ప్రక్రియలకు చెందిన పుస్తకాలను ఎంచుకోండి . కుడి వేపు , ఎడమ వేపు మార్చి మార్చి చూడాల్సిరావడం మతిపోగొట్టే పనే , ఒప్పుకొంటాను . టూరిన్‌వీధుల్లో గుర్రబ్బండ్లు ఇప్పుడు లేవు . ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాక బగ్గీ వాడు తన గుర్రాన్ని చర్నాకోలాతో బాదే దృశ్యం నిన్ను ఇబ్బంది పెట్టదు ఒకప్పటిలా . ఈ పుస్తక ప్రదర్శనలో ఉన్న అన్ని పుస్తకాల్లోని అక్షరాలను మించి పెరిగే ఈ గుంపులకు , ఒక వందేళ్ళ తర్వాత ఎవరి పిచ్చి , అంతగా పట్టక పోవచ్చు . సరే , నేను ఇందాక చెప్పిన చిట్కా ను నీవు అమలులో పెట్టు .
ఖచ్చితంగా చదవగలిగేలా వుంది . నా రాతైతే నాకే అర్థం కాదు !
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆరోగ్యం మెరుగుపడుతోంది . అయన కు కిడ్నీ మార్చాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం . కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ప్రత్యేక చికిత్స నిమిత్తం సింగపూర్ వెళ్ళిన రజనీ . పది , పదిహేను రోజుల్లో చెన్నై తిరిగి రానున్నారు . ఆయన కోలుకుంటున్నారని భారత్ తిరిగొచ్చిన తరువాత రాణా సినిమా షూటింగ్ లో కుడా పాల్గొంటారని ఆయన అల్లుడు తమిళ సినిమా హీరో ధనుష్ వెల్లడించారు . ఆ తర్వాత సినిమాల్లో నటించాలా వద్దా అనే విషయం పై రజనీ యే నిర్ణయం తీసుకుంటారు . వదంతులు నమ్మకుండా , అభిమానులు నిశ్చింతగా ఉండాలని ఆయన కోరారు
ఈ అంకెల గారడి అంతా హంబక్ . . పనిలేని వాళ్ళు వ్రాసుకునే చెత్త రాతలు అని అనుకుందాం అనుకుంటే , నేను బొర్లా పడ్డట్టే . ఎందుకంటే , ఈ సంవత్సరంలో మే నాటికి భారత దేశం నుంచి బయట దేశాలలో పెట్టుబడి పెట్టే నిమిత్తం తరలి వెళ్ళిన ధనాన్ని లెక్కల్లోకి తీసుకుంటే , క్రిందటి సంవత్సరానికన్నా దాదాపు సగానికి పడిపోయి ( అంటే 59 % ) , చూచాయిగా మూడున్నర బిలియన్ డాలర్లకు దగ్గరి దగ్గరగా ( $ 3 . 7b ) ఉంది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు తెలియజేసారంటె , మన భారత దేశం నుంచి బయటకు వెళ్ళాల్సిన పెట్టుబడి ఆగి పోయినట్లే కదా . ఈ విషయాన్ని ఈ వ్యాసంలో చదువుకోంటుంటె , అదే వ్యాసంలో మఱో చోట మొత్తం మీద క్రిందటి సంవత్సరం కన్నా భారతీయులు ఈ సంవత్సరంలో చాలా తక్కువగా పెట్టుబడులు పెడుతున్నారని తెలియజేసే విధానం నాకు అబ్బుర పఱచింది .
" లుక్ , మాకు కావాల్సింది పని చేసే వాళ్ళు మాత్రమే కాదు … మంచి ఫలితాలు చూపే వాళ్ళు కూడా "
మకావులో త్రీస్టార్ నుండి సెవెన్ స్టార్ వరకూ అన్ని రకాల హోటళ్లూ ఉంటాయి . మూడు నుండి ఐదు వేల రూపాయలు పెట్టగలిగితే సౌకర్యవంతమైన సింగిల్ రూములు దొరుకుతాయి .
సిరిసిరి మువ్వ , రుక్కుటేశ్వర శతకాల్లో తెలంగాణా పోరాటం ప్రస్తావనే ఉండే అవకాశం లేదు . తెలంగాణా గురించి రాయదలుచుకుంటే రాయవలసింది శతక పద్యాలలోకాదు . మాత్రా చందస్సున్న గేయాలలోనో , వచన కవితలలోనో రాయాలి . వస్తువుకు తగ్గ రూపాన్ని , శిల్పాన్ని ఎంచుకోవడంలో శ్రీశ్రీ అందె వేసిన చెయ్యి . ఈ శతక పద్యాలు ఎక్కువగా సరదాకు రాసినవి . అయితే కొన్ని పద్యాల్లో హాస్యం , వ్యంగ్యం , విమర్శ , కొన్ని అ భిప్రాలేయాలు లేకపోలేదు .
కర్ణేషు యోగ్యం నవకర్ణికారం చలేషు నీలేష్వలకేస్వశోకం పుషం చ ఫుల్లం నవమల్లికాయాం ప్రయాంతి కాంతిం ప్రమదాజనానాం ( ఋతుసంహారం కాళిదాసు )
" అంటే నాబోటి రచయితల రచనలు ఎవరూ చదవడం లేదన్న మాట , చదవరన్న మాట . మరి నేనెందుకు రాయడమో ? " విధేయుడు - మోహన
నిన్ననే ఎవరో అన్నారు , ' మీ పత్రికకి రచనలు పంపించడం అంటే భయం , ' అని . ' ఎందుచేత ? ' అని ప్రశ్నిస్తే , ' మీరు ప్రతి రచననీ కనీసం ఇద్దరి చేత సమీక్షించి , మార్పులు , చేర్పులూ కూర్పులూ , చేయిస్తారు , అందుకని భయం ! ' . నిజం చెప్పాలంటే , రచయితలకు సమీక్షలంటే భయం ఉండకూడదు . వాటిని ఆహ్వానించాలి . ఎందుకంటే , ఆ సమీక్షల మూలంగా రచన మరింత పరిపుష్టం అవుతుందనే విశ్వాసం ఉండబట్టే మేము ఈ సమీక్షలని ( peer reviews ) ప్రవేశ పెట్టాం . రచయితని , పాఠకులనీ దృష్టిలో పెట్టుకునే ఈ సమీక్షలు చేయడం జరుగుతున్నది . ఇకముందు ఇంతకన్నా శ్రద్ధగా సమీక్షలు చేయడం అవసరమని మేము నమ్ముతున్నాం . ఆషామాషీగా కాకుండా , పత్రికలో ప్రచురితమైన కథలపైన , కవితలపైన , వ్యాసాలపైనా ఇకముందు విమర్శనాత్మకమైన వ్యాఖ్యానాలు వ్రాయమని పాఠకులని కోరుతున్నాం . అటు వంటి లేఖలే ప్రచురించడానికి ప్రయత్నిస్తాం . ఈ ప్రక్రియ పాశ్చాత్యదేశాల్లో సాహితీపత్రికలలో వచ్చే అన్ని రకాల రచనలకే కాక , సంపాదకునికి వ్రాసే లేఖలకు కూడా వర్తింపజేయడం ఆనవాయితీ . అటువంటి పద్ధతే మనకి కూడా అవసరం . అందుకు మీరు సహకరిస్తారని భావిస్తున్నాను . అతిథి సంపాదకీయం లాంటి కొన్ని సరి క్రొత్త శీర్షికల గురించి , ప్రత్యేకసంచికల ప్రచురణ గురించీ ఆలోచనలు సాగుతున్నాయి .
మాలాగారు రెండుకళ్ళు చాలట్లేదు మీ అడవి అందాలు చూడటానికి . . నాకైతే సొగసు చూడతరమా . . . అని వచ్చేస్తోంది గొంతులోనుండి అప్రయత్నంగానే !
వాళ్ళిద్దఱూ చూడ చక్కనైన అన్యోన్య జంట . పరస్పర ప్రేమ మెండు . పెళ్ళయి అయిదేళ్ళయింది . ఇద్దఱూ లక్షల్లో సంపాదిస్తున్నారు . ఈ అయిదేళ్ళల్లో ఒక పెద్ద యిల్లూ , కారూ కూడా సమకూర్చుకున్నారు . కానీ ఇంతవఱకూ వాళ్ళిద్దఱి మధ్య ' ఏమీ లేదు ' . అందుచేత పిల్లా , పీచూ కూడా ఎవరూ లేరు . అనుకోకుండా వారిదొక DINK family ( Double Income - No Kids ) గా పరిణమించింది . " అదేంటమ్మా ? " అని అడిగితే , " ఆయనకి చేతకావట్లేదు . నేనేం చెయ్యను ? " అని సిగ్గుపడి నవ్వుతుందామె . అలాగని అతనిలో కూడా ఏ లోపమూ లేదు . " ఈ విషయాలు నేనెప్పుడూ ఆలోచించలేదండీ ! నా చదువేదో , నా లోకమేదో , అలాగే బతికేశాను . ఇప్పుడు నాకిందులో పరిజ్ఞానం లేకపోవడం పెద్ద యిబ్బందిగా తయారైంది . " అంటున్నాడతను . మాటల సందర్భంలో , అతన్ని వాళ్ళమ్మగారు చాలా క్రమశిక్షణలో పెట్టి పెంచిందని తెలిసింది . ఎందుకు చెబుతున్నానంటే - విద్యాలయాల్లో లైంగిక విద్య ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది . కొన్ని నెలలుగా దేశంలో ఇదొక వివాదాస్పదమైన అంశంగా మారింది . అవసరమనే వారూ , వద్దనేవారూ తమ తమ కారణాల్ని స్పష్టంగానే చెబుతున్నారు . నేను కూడా ఎటూ తేల్చుకోలేకపోయాను . నెలల తరబడి ఊగిసలాడిన తరువాత లైంగిక విద్యకు అనుకూలంగా వోటు వెయ్యడానికే నిశ్చయించుకున్నాను . అభ్యంతరాలు లేవనెత్తేవారు చెబుతున్న కారణాల్లో ఒకటి - ' అది మన సంప్రదాయం కాదు ' అనేది . ఇది వాస్తవ దూరం . అది మన సంప్రదాయం కాకపోతే సంస్కృత భాషలో వాత్స్యాయన కామసూత్రాలూ , కొక్కోకమూ , రతిరహస్యంలాంటి పుస్తకాలు వెలువడేవే కావు . శోభనానిక్కూడా మంత్రాలున్న దేశం మనది . మానవులు లజ్జాపూర్వకంగా వేటినైతే గుప్తం కావిస్తారో ఆ లైంగిక వ్యక్తిత్వాల్ని శివ - పార్వతీ స్వరూపాలుగా వర్ణించిన సంప్రదాయం మనది . ఇంకా చెప్పాలంటే రతిక్రీడల వర్ణనా విశేషాలున్న కావ్యాలు మన దేశంలోని ప్రాచీన గురుకులాల్లో పాఠ్య పుస్తకాలుగా తరగతి గదుల్లో ఆచార్యుల చేత స్వయంగా బోధింపబడ్డాయి . వాళ్ళు గానీ , వాళ్ళ తల్లిదండ్రులు గానీ వచ్చి ' ఇదేంటి ? బూతుపాఠాలు చెప్పి పాడు చేస్తున్నారు ? " అంటూ ఆచార్యులతో గొడవలకు దిగిన సందర్భాలు లేవు . ఎందుకంటే అలా కొనసాగింది ఒక రోజో , రెండు రోజులో కాదు , వేలాది సంవత్సరాల పాటు ! అలాగే ఖజురాహోలూ , అజంతాలూ , ఎల్లోరాలూ ఉద్భవించేవే కావు . మనం దేన్నయితే చాదస్తం అనుకుంటున్నామో , ఆ చాదస్తం మన పూర్వీకులకు లేదు . సహస్ర నామాల్లోను , అష్టోత్తరాల్లోను మన దేవీదేవతల్ని బహు శృంగార పదజాలంతో వర్ణించారు మన ఋషులు . అలా వర్ణిస్తేనే ఆ దేవతలు ప్రసన్నులవుతారట కూడాను . శృంగారం గుఱించి మాట్లాడ్డం తప్పని కూడా మన పూర్వీకులు భావించి ఉండలేదు . రామాయణంలో " శ్రీరాములవారు ఎలా ఉన్నారు ? " అని శ్రీ అమ్మవారు అడిగినప్పుడు శ్రీ ఆంజనేయులవారు ఇలా అంటారు : " నీ యందలి కామవాంఛతో ఆ శ్రీరామచంద్రమూర్తి ఇంకే విషయమూ ఆలోచించలేకపోతున్నారమ్మా ! " అంటారు . " సీతమ్మవారి ముందు అలా మాట్లాడారా ఆంజనేయులవారు ? " అని ఈ కాలం వారు ఆశ్చర్యపోతారు . మఱి ఈ చాదస్తాలు మన సమాజంలో ఎందుకు ప్రవేశించాయి ? అంటే ఇవి గత వెయ్యేళ్ళుగా మాత్రమే ప్రవేశించాయి . వీటి ప్రవేశానికి కారణం - విదేశీ దండయాత్రలు . వాళ్ళు మన ఆడవాళ్ళని బలవంతంగా ఎత్తుకుపోతూండడం చేత మనం ముందస్తుగా ఆడవాళ్ళని మూసేశాం . ఆ తరువాత శృంగార సమాచారాన్ని కూడా మూసేశాం . అవతలివాళ్ళేమో పరమ మూర్ఖులు . ఒక బొమ్మని గానీ , శిల్పాన్ని గానీ , సంగీతాన్ని , నాట్యాన్ని గానీ భరించలేని , ఆస్వాదించలేని సంప్రదాయం వారిది . వారి మౌఢ్యంతో మనం కూడా పోటీపడ్డానికి ప్రయత్నించాం . " నీ కంటె పెద్ద చవటాయిని నేను " అన్నట్లుగా మనది వాళ్ళకంటే చాదస్త సంప్రదాయమని నిరూపించడానికి పూనుకున్నాం . భక్తి - ఉద్యమాలంటూ హడావిడి చేశాం . ఆ క్రమంలో శైవం , వైష్ణవం అంటూ కొట్టుకు చావడం మొదలుపెట్టాం . అయిదు వేలేళ్ళనాటి ఉపనిషత్తులు బోధించిన పరిశుద్ధమైన అద్వైత మతానికి స్వస్తి చెప్పాం . ఇది దీని అసలు కథ . లైంగిక విద్య లేకపోవడం వల్ల జరుగుతున్న ఘోర , దారుణ నష్టాల గుఱించి తెలియక అభ్యంతరం చెబుతున్నారనిపిస్తుంది . లైంగిక విద్య అంటే ' అదేదో బూతు ' అనుకుంటున్నారు . అవును , బూతులే మఱి . అమాయకమైన తెలుగు మాటల్ని తిట్లకు ఉపయోగించి వాటిని బూతుల బుంగలుగా మార్చిన పాపం మనదే . ఈ దృక్పథం వల్ల శృంగార శాస్త్రానికి తెలుగులో గౌరవనీయ పదజాలమే అభివృద్ధి చెందలేదు . భాష వెనకబడిపోయింది . చెప్పేది చెప్పే విధంగా చెప్పలేకపోతే శృంగారమే కాదు , ఏదైనా బూతే . చెప్పాల్సిన పద్ధతిలో శాస్త్రీయంగా చెప్పినప్పుడు అది బూతెలా అవుతుంది ? మహాకవి వేమన ఒకచోట అంటాడు : కనుక ఏ వయసుకు నేర్పాల్సింది ఆ వయసుకు నేర్పక తప్పదు . మనకు వయసు మళ్ళుతోంది గదా ! అని యువతరపు అవసరాల్ని పట్టించుకోకపోవడం సుతరామూ భావ్యం కాదు . పసి పిల్లలకు అన్నం తినడం నేర్పించినట్లే ఎదిగే వయసులో ఉన్నవారికి ప్రేమపూర్వకమైన శృంగార సంబంధాన్ని నిలబెట్టుకోవడం ఎలానో శిక్షణ ఇవ్వాలి . అది జరక్క పిల్లకాయలు చవకబారు రాతల్నీ , తప్పుడు సాహిత్యాన్ని , అశ్లీల సాలెగూళ్ళనీ ( porno sites ) ఆశ్రయిస్తున్నారు . అక్కడ వాళ్ళు నానా ఛండాలాలు నేర్చుకుంటున్నారు . తఱచుగా లైంగిక భ్రష్టాచారాల్ని ( Sexual perversions ) అధ్యయనం చేస్తున్నారు . వాటిల్లో పశుప్రాయత ( bestiality ) , వావిడికం ( incest ) వగైరా నికృష్టాలూ , దరిద్రాలు కూడా ఉన్నాయి . మఱికొంతమంది శీలహీనురాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రయోగాలు చేస్తూ వంశ నాశనానికి దారి తీస్తున్నారు . శృంగారం ధర్మ శృంగారమనీ , అధర్మ శృంగారమనీ రెండు విధాలుగా ఉంటుంది . మొదటిది మాత్రమే శాంతియుత జీవనానికి హామీ ఇవ్వగలదు . విభిన్నమైన ఆకాంక్షల మధ్య వైరుద్ధ్యాలూ , మానసిక సంఘర్షణలూ లేని స్థితికే శాంతి అని పేరు . ధర్మాధర్మాలు సాపేక్ష పదాలు ( Relative terms ) . చీకటి - వెలుగుల్లాగా ఒకటి లేకుండా మఱొకటి లేధు . అసలు ఏది సక్రమమో తెలిసినప్పుడు గదా , ఏది అక్రమమో తెలిసేది ! మనం ఉన్న పరిస్థితిలో అక్రమమూ తెలియదు , సక్రమమూ తెలియదు . తెలియనివ్వడంలేదు మనం . అంతా మూసి పారేశాం . మఱి పిల్లకాయలు చెడిపోక ఇంకేమవుతారు ? మఱోపక్క తెల్లవాళ్ళలో మాదిరి మన సమాజంలో కూడా విడాకులు పెరిగిపోతున్నాయి . కుటుంబాలు విచ్ఛిన్నమైన కొద్దీ వేశ్యఱికానికి డిమాండు హెచ్చుతుంది . స్త్రీపురుషుల మధ్య అన్ని బంధాల్ని కసిగా తెగ్గొట్ట జూస్తున్న ముదురు సిద్ధాంతాలు పెచ్చరిల్లి పోతున్న మన కాలంలో , పరస్పర ఆకర్షణ తప్ప వారిని కలిపి ఉంచే బంధమేదీ లేదన్న వాస్తవాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే , లైంగిక విద్య ఆ దిశగా ఎంతగా దోహదించగలదో తెలుస్తుంది . నా దృష్టిలో లైంగిక విద్య అంటే కేవలం వాత్స్యాయన కామసూత్రాలు కాదు . ఒక అవలోడనకర్త ( సర్వేయరు ) , ఒక వైద్యుడు , ఒక మనశ్శాస్త్రవేత్త , ఒక తత్త్వవేత్త , ఒక ప్రేమికుడు , ఒక అనుభవజ్ఞుడైన గృహస్థుడు , ఒక అనుభవజ్ఞురాలైన తల్లి - ళ్ళంతా లైంగిక విషయాల్ని ఏ దృష్టితో చూస్తారో ఆ దృక్పథాన్నే ఒక పాఠంగా పిల్లకాయలకు నేర్పడం .
చారిత్రకంగా భారత ఆర్ధిక వ్యవస్థ ఆధారపడిన వ్యవసాయం పాత్ర ప్రస్తుతం తగ్గిపోయింది . ప్రస్తుతం ఇది దేశ స్థూలాదాయంలో 25 % కంటే తక్కువే . ముఖ్యమైన పరిశ్రమలు గనులు , పెట్రోలియం , వజ్రాలు , సినిమాలు , జౌళి , ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ , మరియు హస్త కళలు . భారత్ దేశపు పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా ప్రధాన పట్టణాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి . గత కొన్ని సంవత్సరాలలో సాఫ్ట్‌వేర్ , బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సొర్సింగ్ రంగాల్లో ప్రపంచంలోని పెద్ద కేంద్రాల్లో ఒకటిగా రూపొందింది . 2003 - 2004 లో ఈ రంగాల ఆదాయం 1250 కోట్ల డాలర్లు . చిన్న పట్టణాలు , పల్లెల్లోని ప్రజలకు స్థిరమైన ఉపాధి కల్పించే ఎన్నో లఘు పరిశ్రమలు కూడా ఉన్నాయి . ఏటా దేశాన్ని సందర్శించే విదేశీ యాత్రికులు 30 లక్షల మంది మాత్రమే అయినప్పటికీ , జాతీయాదాయంలో ఈ రంగం పాత్ర ప్రముఖమైనదే . అమెరికా , చైనా , యు . ఎ . ఇ మరియు ఐరోపా సమాఖ్యలు భారత దేశపు ముఖ్య వ్యాపార భాగస్వాములు .
నేనెవరినన్నా ఇన్సల్టు చెయ్యాలంటే వాళ్ళ టేస్టుని యెద్దేవాచేస్తానని సెలవిచ్చాడు మా రాకేస్వరుడు ఈ మధ్యనే ఏదో బ్లాగులో కామెంటుతూ . యేమి సత్యాన్ని ఆవిష్కరించినావయా , నువ్వు రాకు ! అనుకున్నాను . మీరే చూడండి . యెవర్నన్నా కెలకాలన్నా , కోపం తెప్పించాలన్నా ఇంతకన్నా మంచిమార్గం మరోటి లేదు . తన ఫేవరెట్ హీరోనో , బాగా నచ్చిన పాటనో యెవరన్నా వెక్కిరిస్తే లావాలా ఉప్పొంగుతుంది కోపం మనిషికి , తనని యెలాంటి దుర్భాషలాడినా రానిది . ఈ టేష్టు , రుచి , అభిరుచి అనేవున్నాయి చూశారూ , మహా ఇబ్బంది వీటితో . ఒహపక్కన విపులాచ పృథ్వీ , లోకో భిన్న రుచిః అని సంస్కృతంలోనూ , మరొపక్కన డిగుస్టిబస్ నానెస్ట్ డిస్పుటాండం అని లాటినులోనూ నొక్కి వక్కాణించారు గదా . దీన్నే అచ్చ తెలుగులో పుర్రెకో బుద్ధీ , జిహ్వకోరుచీ అని అనువదించి మరీ చెప్పారాయె , మనలాంటి మందమతులకి అర్ధం కాదేమోనని . ఐనా సరే , మనం హేప్పీగా బీపీ పెంచేస్కుని రెచ్చిపోతుంటాం , వాళ్ళ టేష్టంతేలే అని చేతులు దులుపుకుని పోవాల్సిన చోటకూడా . ఒకరు యిప్పటికింకా నావయసు నిండా పదహారే అని మురుసుకుంటే మరొకరు ఓంకారనాదాను సంధానమౌగానమే అని పరవశులవుతుంటారు . ఒకరు మధుబాబు షాడో అడుగుల్లో అడుగులేస్తుంటే మరొకరు రావిశాస్త్రి వియత్నాం విమలతో భేటీ అవుతుంటారు . ఒకరికి డిస్కో మరొకరికి భామాకలాపం , ఒకరికి రాంగోపాల వర్మ మరొకరికి సత్యజిత్ రే , ఒకరికి విశ్వనాథ మరొకరికి శ్రీశ్రీ . . వీరిని చూసి వారు నొసలు చిట్లించడం , వారిని చూసి వీరు జాలిపడ్డం . ఒకరెక్కువా ? మరొకరు తక్కువా ? రుచుల్లో ఎక్కువ తక్కువలా ? తర తమ భేదాలా ? ముమైత్ ఖాన్ ఐటం పాట చూసి పదహారేళ్ళ కుర్రాడు పొందే ఆనందం , వాడి తాత కచేరీలో నేదునూరి గారు పాడుతున్న త్యాగరాజకృతి వింటు పొందే ఆనందం కంటే ఏవిధంగా భిన్నం ? ఏవరిదెక్కువ స్థాయి ఆనందమో తూకమేసి చెప్పగలవారెవ్వరు ? పోనీ ఒకేకళారూపాన్ని ఆస్వాదించడంలోనూ . . ఒకచోట భాగవత కథాగానం జరుగుతోంది . యెవరో మంచి గొంతున్న పౌరాణికులు శ్రావ్యంగా రాగయుక్తంగా చదువుతున్నారు పోతన పద్యాల్ని . " మందార మకరంద మాధుర్యమున దేలు మధుపమ్ము వోవునే మదనములకు " . ఓ బామ్మగారు ఆ గాత్ర మాధుర్యానికే పరవశురాలవుతున్నది . ఒక తాతగారు అందులోని భక్తిభావానికి పులకితులవుతున్నారు . ఒక యువకుడు పద్యంలోని శబ్దాలంకారాలకి సమ్మోహితుడవుతున్నాడు . ఒక పండితుడు రసాస్వాదనలో మైమరిచాడు . ఒక యోగి అందులోని మార్మిక తత్త్వజ్ఞానానికి దాసోహమంటున్నాడు . ఇందులో ఎవరిది హెచ్చు స్థాయి ఆనందం ? రాగతాళాలు యేమీ తెలియకపోయినా , బాలమురళీ గొంతు వినబడితేనే పరవశించిపోయే వారున్నారు . ఆలాపన వినగానే రాగాన్ని పోల్చుకుని , ఆహా వోహో అని ఆనందించే వారున్నారు , అంటకంటే విశేషమేమీ వారికి అంతుపట్టక పోయినా . వారి చెవులకి బాలమురళి పాడినా నేదునూరి పాడినా మోహన రాగమంటే మోహన రాగమే . అలాక్కాదు , రాగాన్ని విశదీకరించడంలో , గాయకుడు ఎలాంటి గమకాలు వాడాడు , ఏ ప్రయోగం బాగా ఫలించింది , ఏ ప్రయోగం కొత్తగా ఉంది , అని తెలిసి అనుభవించే శ్రోత ఉన్నాడు . ముగ్గురూ అదే సంగీతాన్ని అనుభవించి ఆనందిస్తున్నారు . మరి ఆ స్థాయిలో తేడాలేదూ ?
' ' ఏవనుకోకు పెద్దయ్యా , ఎండనబడి రాలేవని పెద్దల బోయినాల నాడు మీ గూడేనికేసి రాలేదు ' ' అని చేతులు నలుపుకన్నాడు సకల .
మీరీ టపాలు మొత్తం అయ్యాక , పుస్తకంగా వెయ్యాలని డిమాండ్ చేస్తున్నా !
ఫ్రేము కొకణ్ణి చంపినట్టు చూపినా మావో సుమారు 25 లక్షలమందిని చంపాడనుకుంటే 1750 గంటల సినిమా తీయాలి . ఆ మావో ఎప్పుడు చచ్చిపోయాడో వ్రాయలేదు రావు గారూ . . కొత్త రవికిరణ్
భారత దేశం రెండు ప్రముఖ భాషా కుటుంబాలకు జన్మస్థానం . అవి , ఇండో - ఆర్యన్ మరియు ద్రావిడ భాషలు . భారత రాజ్యాంగం 22 భాషలను అధికారికంగా గుర్తించింది . కేంద్ర ప్రభుత్వం అధికార కార్యక్రమాలలో హింది , ఇంగ్లీషు భాషలను ఉపయోగిస్తుంది . దేశంలోని రెందు ప్రాచీన భాషలు సంస్కృతం మరియు తమిళం . దేశంలో మొత్తం 1652 మాతృ భాషలు ఉన్నాయి .
మరో మహిళపై ఓ ప్రేమోన్మాది దాడి చేసి హత్య చేసిన వైనం . అదే తంతుగా ఇవ్వాళ్టి లైవ్ ఛానల్స్ అన్నీ ఊదరగొట్టేశాయి . చైనాలో కుర్రాడు చక్కగా తన కిడ్నీనే అమ్ముకుంటే , మనోళ్ళు ఇంకొంచం ముందుకు వెళ్ళి ప్రక్కనోళ్ళ ప్రాణాలు తీస్తున్నారు . అక్కడ పడి ఉన్న శరీరాలను కెమెరాలలో భందించాలనే తాపత్రయం ఆ అమ్మాయిని బ్రతికిద్దాం అన్న విషయంపై పెట్టటం లేదు మన కెమెరా మెన్స్ . ఒక కెమెరా మెన్ వీడియో తీస్తుంటె , మఱోకతను అక్కడ పడి ఉన్న వారిని కెమెరాలో బాగా పడ్డారా లేదా అన్ని వారిని సరి చేస్తుంటాడు . వీరిని చూస్తుంటే అసహ్యం వేస్తుంది .
క్రైస్తవులంతా మానసిక యూదులే . అందులో నాకు అనుమానమేమీ లేదు . నేనేమీ పొఱపడట్లేదు . ఇహపోతే , ఈ దేశాన్ని హిందువుల్లా ప్రేమించే క్రైస్తవుల్ని నేనింతవఱకు చూడలేదు . ఇది నా దురదృష్టమని ఎవరైనా అంటే నేనొప్పుకుంటాను .
2004 సంవత్సరంలో పునుగుల గ్రామానికి మహిళా సంఘం వారు వేపగింజలను క్రష్ ( దంచే ) చేసే యాంత్రాన్ని తెచ్చారు . దీనిని సెంటర్ ఫర్ వరల్డ్ సొలిడారిటి వారి ఆర్థిక సహాకారంతో పంచాయితీ తరపున తేగా , దీని నుండి ఇద్దరు మహిళలకు పూర్తి స్థాయి ఉపాధి దొరికినది .
' వేరే ఏమీ చేయలేక ' ఠ క్కున వచ్చింది సమాధానం . ' నా నరనరాన విద్యాబోధన జీర్ణించుపోయింది . గతంలో కృష్ణాపురంలో ఉండేవాళ్ళం . కృష్ణానదిపై ఆనకట్ట కట్టేటప్పుడు మళ్ళించిన నీళ్ళతో మాగ్రామం మునిగిపోయింది . నా అదృష్టమూ మునిగిపోయింది . ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం మరో ఊళ్ళో స్థిరపడేందుకే సరిపోయింది . పిల్లలను చదివించటం , సంసారాన్ని నెట్టుకురావటంతో జీవితం గడిచిపోయింది . ఊహా తెలిసినప్పటినుంచి శాస్త్రాలు చదవటం , ఎదిగినప్పటినుండీ బోధించటం తప్ప నాకు మరో విషయం తెలియదు . ఎలాగోలా జీవితాన్ని ఈడ్చుకుంటూ వస్తున్నాను . రెక్కలొచ్చి కొడుకులు ఎగిరిపోయారు . వాళ్ళు చేసే ఉద్యోగాలకు వచ్చే డబ్బులతో వాళ్ళ సంసారాలు గడవటమే కష్టంగా వుంది . పుట్టినప్పటి నుంచీ ఇవ్వటమే కానీ పుచ్చుకోవటం తెలియని వాడిని . మాట పడటం అలవాటు లేదు . పొట్ట చేత పట్టుకుని గంపెడంత ఆశతో మీ దగ్గరకు వచ్చాను . '
ప్రస్తుతం బ్యాంకులకి సెలవలెప్పుడో నిర్ణయించడానికి మాత్రమే వుపయోగిస్తున్న " నెగోషియబుల్ ఇన్స్త్రుమెంట్ ఆక్ట్ " వల్ల ఇంకా వూడిపోని రెండో వుపయోగం ఇదొకటి . యెవరైనా తమ ఖాతాలో సరిపోయిన సొమ్ము లేకుండా , చెక్కులు జారీ చేస్తే , అవి బ్యాంకులో ' బౌన్స్ ' అయితే , వెంటనే వారిమీద కోర్టులో కేసు వేసి , తమకి రావలసిన మొత్తాన్నీ , పరిహారాన్నీ కూడా పొందవచ్చు .
ఎందుకంటే కవి ఇప్పటికే విస్తారమైన తన జీవితానుభవంలోంచి అక్కణ్ణించి కొన్నీ ఇక్కణ్ణించి కొన్నీ ఘటనలూ , మాటలూ , పరిసరాలూ , దృశ్యాలూ , అనుభవాలూ , సంభాషణలూ ఇలా సేకరించుకొని , ఎక్కడ అమిరే అంశాన్ని అక్కడ పొదిగి ఇప్పటి తన అంతరంగంలోని సృజన శిల్పపు ప్రతీకను నిర్మించుకుంటున్నాడు . అది ముందు , ప్రధానంగా ఒక కల్పన . ఈ అంశాలన్నీ అతని వాస్తవ జీవితంలోనివే కానక్కర్లేదు . కవి ఊహాశక్తి కొద్దీ ఇవి అతనికి అందుబాటులో ఉన్న కాల్పనిక ప్రపంచాలు , అంటే ఇదివరకు విన్న మాటలు , చదివిన పుస్తకాలు , చూసిన సినిమాలు , చేసిన ఊహలు , కన్న కలలు - వీటన్నీంటినుండి కూడా లభ్యం కావచ్చు . ఉదాహరణకు గారెట్ ( George P . Garrett ) అని అమెరికన్ రచయిత నవలలు Elizabethan Trilogy అని , అవి ఒకటవ ఎలిజబెత్ రాణి వంటివాళ్ళ ప్రాచీన కాలాన్ని , పరిస్థితుల్నీ యదార్ధంగా చూసినవే చెప్తున్నాడా అని పాఠకులు భ్రమించేలా ఉంటాయని పేరు . ( " … a body of work that is so imbued with its subject matter and time as to create the sense that he lived through it all , and had total recall of life in the respective courts of Queen Elizabeth the first , and James the first . " ) ఆయన సమకాలికుడు , కాల్పనిక సృజన అంతర్గత స్వరూపాన్ని పరిశీలించటంలో చాల ఆసక్తిని , ప్రతిభను కనపరిచినవాడు గార్డ్‌నర్ ( John C . Gardner Jr . ) అని ఉండేవాడు . ఆయన కాల్పనిక సృజనకు ఈ కల్పనా చాతుర్యమే ప్రధానమైన అవసరమని ప్రతిపాదించి , అది ఎలా వాస్తవ ప్రపంచాన్నుండే కాక ఇంకెన్నో , అంతకంటే భిన్నమైన , లోతైన ప్రపంచాల్నుండీ ఆవిర్భవించే అవకాశం ఉందో సునిశితంగా చేసిన పరిశీలనలున్నాయి .
నేను రాసిన ఆర్టికల్ గురించి తెలిసి వెంకట్రామయ్య నాతో మాట్లాడ్డం మానేసాడు . వాడి కుటుంబాన్ని బజారు కీడ్చానని , వాళ్ళ అమ్మాయి గురించి తెలిస్తే ఎవడూ పెళ్ళి చేసుకోవడానికి ముందుకు రాడనీ నన్ను చెడామడా తిట్టేడు . ఇహ నా మొహం చూపించద్దని స్నేహాన్ని తెంపేసాడు . నేనూ ఒక మధ్య తరగతి తండ్రినే ! నాకూ ఇద్దరు ఆడపిల్లలున్నారు . కట్నం ఇవ్వందే పెళ్ళి కాదన్న సంగతి నాకూ తెలుసు . వెంకట్రామయ్యకి నచ్చ చెప్పినా వినే స్థితిలో లేడని తెలిసి నేనూ రెట్టించలేదు . వారం క్రితం కొడుక్కి ఉపనయనం చేస్తే నన్ను పిలవలేదు . వాళ్ళ ఆడవాళ్ళు కూడా మాకు తెలుసున్న వాళ్ళందరినీ పిలిచారు కానీ మా ఆవిడ పూర్ణకి బొట్టు పెట్టి పిలవలేదు . పూర్ణ బాధ పడింది . నేనివేమీ పట్టించుకోలేదు .
పరిచయాలయ్యేక శారద అడిగింది , " మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు ? మీది ఆంధ్రాలో ఏ వూరో తెలుసా ? "
ఈ మధ్యనే ( 08 . 10 . 2009 ) హఠాన్మరణం చెందిన మానవహక్కుల నేత కె . బాలగోపాల్‌తో పాటు హైస్కూల్లోనూ , ఆ తర్వాత డిగ్రీలోనూ దాదాపు ఐదారేళ్లు కలిసి చదువుకున్న బాల్య స్నేహితుడు గౌరిపెద్ది వేంకట శంకర భగవాన్ . ప్రస్తుతం ఈయన కడప జిల్లా గ్రామీణబ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా ఉద్యోగ బా « ధ్యతలు నిర్వహిస్తున్నారు . చిన్నతనంలో బాలగోపాల్ జీవనశైలిని , ఆయనతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుంటూ అందిస్తున్న అక్షర నివాళి ఇది .
తెలుగు నేలపై ఉన్నవారికి ఉన్న కట్టుబాట్లూ ఇబ్బందులూ అమెరికాలో తెలుగువారికి ఉండవు అని చెబుతూ , అమెరికాలో ఉండే సాహిత్యాభిమానుల జీవనోపాధి తెలుగు సాహిత్యం కాదు . అందువల్ల ఇక్కడివారు స్వతంత్రంగా తమ భావాలను వెలిబుచ్చడం సాధ్యమయింది . ఈ సాహితీస్వాతంత్ర్యాన్ని ఇక్కడి తెలుగువారు మరింత ఉపయోగించుకొని సాహిత్యానికి ఎలా మేలు చేయగలరో చర్చించారు . " ఏ సిద్ధాంతం కూడా ఏది మంచి సాహిత్యమో , ఏది కాదో చెప్పదు . మన అభిరుచి మాత్రమే మంచి చెడ్డలను గుర్తిస్తుంది . కవిత్వం రెండు రకాలు - ఒకటేమో శబ్దాలంకారాలతో విన్నప్పుడు ఆనందాన్ని కలిగించేది . రెండవదేమో అర్థవంతమైనది , ఆలోచనలను కలిగించేది . కవిత్వంవల్ల వచ్చే పర్యవసానం ఏమిటి ? " ఇలా ఎన్నో అంశాల గురించి చర్చిస్తూ , విమర్శకులకున్న బాధ్యతను గుర్తు చేశారు . ఏ విధంగా , తార్కిక దృష్టితో పరిశీలించేవారు తక్కువై , నిందారోపణలూ , రాజకీయ వాదాల పడికట్టు మాటల చట్రాల లోనే తెలుగునాటి ప్రస్తుత విమర్శ ఉన్నదో వివరిస్తూ , మంచి కవితలను , కథలను , నవలలను గుర్తించడం ద్వారా ఇక్కడి తెలుగువారు సాహిత్య విమర్శకు చేయగల్గిన మేలును ప్రస్తావించారు .
దాన పరుడు యంగళరెడ్డి ధర్మ దేవత బిడ్డడయా పచ్చి కర్వులో పాసము పోసెను బెమ్మ దెవుడే ఆయనయా
" పైన ఆకాశం , కింద భూమి , చుట్టూ నీరు . భూమి బద్దలైనపుడో , నీరు ఉప్పొంగినపుడో మనిషి కాళ్ళ కింద నేలకరిగిపోతుంది . నమ్మినవాళ్ళు , నమ్ముకొన్న ప్రపంచం ఆనవాళ్ళు అన్ని క్షణాల్లో చెదిరిపోయినపుడు , విశాలాకాశం కింద ఒంటరిగా నిలబడ్డప్పుడు జీవితానికి అర్ధం ఏవిటనే ప్రశ్న ముందుకొస్తుంది . మనుషుల మద్య నిరంతరం ఉండే సవాలక్ష అంతరాలు అర్ధం లేనివని అవగాహన ముందుకొస్తుంది " చిన్ని గారు , ప్రస్తుతం ఈపరిస్థితి మన రాష్ట్రానికి చాలా అవసరమనిపిస్తుంది . ఎప్పుడో 2012 లో వచ్చే ప్రళయం ( నిజమైతే ) ఇప్పుడే వస్తే బావుండనిపిస్తోంది . మీ కధాపరిచయం బావుంది .
ఇలా నిల్వ చేసిన సరుకులకి ఆ రోజు సాయంకాలం నేను , గిరి కాపలా కాసేం .
మన ప్రపంచం చూడగలగడం మీద ఎంతగా ఆధారపడుతుందంటే చూపులేనివారు ఈ ఆధునికసమాజంలోకూడా ఎంతో కష్టపడవలసివస్తోంది . అలాంటప్పుడు ప్రాచీనకాలంలో ప్రకృతిశక్తులది పైచెయ్యి అయిన రోజుల్లో ప్రాణులకు కళ్ళు లేకపోవడం చావుతో సమానం అయిఉండాలి . ( చూడలేనివాళ్ళ ప్రపంచం ఎలా ఉంటుందో ఎచ్ . జి . వెల్స్ " నేత్రహీనుల లోయ " అనే తన కథలో అద్భుతంగా వర్ణించాడు . వారి మధ్యకు అనుకోకుండా వచ్చిపడిన ఒక మామూలు మనిషి వారిపై ఆధిపత్యం చలాయించలేకపోగా , చావుతప్పి , అక్షరాలా కన్ను లొట్టపోయినంత పనిజరిగి , బైట పడతాడు .
బస్సు కదిలాక జేబులు చూస్తే కనీసం ఓ సోడా తాగడానికి కూడా డబ్బులు లేవు . ఆ ఎండలో నాలుగు మైళ్ళూ కాళ్ళీడ్చుకుంటూ నడిచి వచ్చాను . వస్తూ వస్తూ ఎంత ఆలోచించినా వాళ్ళు లాడ్జిలో రూము తీసుకొని దిగడాన్ని జీర్ణించుకోలేక పోయాను . ఇందులో మోసం వుండొచ్చేమొ అనుకున్నాను . వాళ్ళు తిరిగి డబ్బు పంపిస్తే నా అనుమానం తీరిపోతుంది కదా అనుకున్నాను . నాకు డబ్బు ఎన్ని రోజులు ఎదురు చూసినా తిరిగి రాలేదు . చివరికి తిరుపతిలో వున్న నా స్నేహితున్ని వాళ్ళిచ్చిన అడ్రసుకు వెళ్ళి రమ్మన్నాను . అక్కడ ఆ అడ్రసు లేదని చెప్పాడు . నాకు డబ్బులు తిరిగి రాలేదు కదా అని నాకు అప్పిచ్చిన నా రూమ్‌మేట్స్ వాళ్ళ డబ్బు తిరిగి ఇవ్వబోతే తీసుకోలేదు .
నృత్యం చేయడంలో నేనభిమానించే వారు ఇంకొకరు . మొత్తానికి గోవిందా , అమితాబ్ . . ఒకరా ఇద్దరా చాలా మంది నటుల కలబోతే నేను " అని చెప్పుకొచ్చారు అమీర్ .
ఢిల్లీ , హర్యాణా , హిమాచల్ , యూపీ , రాజస్థాన్లు తిరిగి , మొన్న 24 న మధ్యాహ్నం 2 - 30 కి తిరిగి సామర్లకోటచేరి , కాకినాడలో ఆ రాత్రి వుండి , మర్నాడు వుదయం బయలుదేరి ఇంటికి వచ్చాము .
మీరు డౌన్లోడ్ ఎక్కడికి చేసారో , అక్కడికి ఒక టెర్మినల్ లో వెళ్లి , ఇలా ముడివిప్పండి .
పొద్దున్న బడి అయిపోగానే , ' యాల గంజి ' కి ఇంటికి వచ్చి , మళ్ళీ రెండో పూట బడికి వెళ్ళాలి .
దొంగ ఐ . డి . లు పెట్టే మలక్ పేట్ లమిడికే గాడికి ఉచ్చ తాగించడం ఈజీయే .
ఏమిటో గుంపులో మీ ఉపోద్ఘాతం చదివి మీ నుంచి వచ్చే టపా కోసం చూశా . మీరు వోల్డ్ మాంక్ అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది మీ రేంజ్ చాల పెద్దదని . దానిక్కొంచెం తక్కువగా మూడు బీర్లంటే ఇదేదో మంచి మందు విషయం అనుకుని వచ్చా . నాకయితే ఇలాంటివి ఓ పట్టాన బుర్ర కెక్కవ్ అది నా బుర్ర లెవెల్ లెండి మీ తప్పు కాదు . మనీ సినిమాలో " నేనూ , మా రేణూ , మా ముసలాడు " అనే చిన్నా పాత్ర టైపు నాది : - ) అలాగయితే కామెంటకుండా కీబోర్డు మూసుకుని కూర్చోవచ్చు కాదా అంటే కొన్నింటికి కీ . శే : పీ . వీ . గారి లాగా సమాధానాలు వుండవు . మీ నుంచి రెండో పెగ్గు కోసం అదేంటి నాకూ మందు భాష వస్తోంది ? . . . అదే రెండో టపా కోసం ఎదురు చూస్తా : - ) - - విహారి
చాలా కాలం కిందట ఆదినారాయణ శాస్త్రి గారి పుస్తకం తిరగేస్తూ ఈ పద్యాన్ని చదివి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను . ఆ తర్వాత ఎంతోమంది కవితాభిమానులతో ఈ పద్యం గురించి ముచ్చటించాను . కానీ , ఎవరూ ఎరిగినట్టులేరు ఈ తొలినాటి్ ఉత్పలమాలిక గురించి . అద్దంకి శాసనపద్యం ( తరువోజ ) మీద కొందరు శ్రద్ధ తీసుకుని చిరు పొత్తాన్ని ప్రకటించి ఉన్నారు . అలాగే , ఈ పద్యం గురించి కొంచెం చర్చ జరిపి విస్తృత ప్రచారంలోకి తీసుకు రావలసిన అవసరం ఉంది . నన్నయకు ముందు కవిత్వం లేదు అన్నఅపప్రధను తొలగించవలసి ఉంది . కారణం , మొన్న ప్రాచీన భాష చర్చల్లో తమిళ పండితులు భద్రిరాజు గారి వ్యాసాన్ని ఉటంకించి నన్నయకు ముందు మీరే తెలుగులో కవులెవరూ లేరని సిద్ధాంతీకరించి ఉన్నారు , మరి ఇదెలా సాధ్యం అన్నట్టు పత్రికల్లో చదివాము . మొత్తానికి ప్రాచీన భాష ( లేదా శ్రేష్ఠ భాష ) హోదా లభించింది . అది వేరే విషయం .
పుసాన్ పరిధిలో తిరిగి ఆయుధాలు పొందిన రక్షకులు మరియు వారి ఉపబలాల ముందు KPA సైనికుల సంఖ్య మరియు పేలవమైన సరఫరాతో వెలవెలబోయింది ; UN దళాలు మాదిరిగా , వారికి నౌకా మరియు వైమానిక మద్దతు కరువైంది . [ 9 ] మూస : Rp [ 9 ] మూస : Rp పుసాన్ పరిధి జనరల్ మాక్ఆర్థూర్ , KPA హద్దుల లోపల ఇంచియాన్ వద్ద ఒక త్రివిధ దళ యుద్ధానికి సిఫార్సు చేశాడు . [ 9 ] మూస : Rp జులై 6న , మొదటి కావేర్లీ డివిజన్ కమాండర్ , మేజర్ జనరల్ హోబర్ట్ R . గేకు ఇంచియాన్ వద్ద తన వద్ద సేనలతో త్రివిధ దళ దాడికి ప్రణాళిక రచించాలని ఆదేశించాడు ; 12 - 14 జులైన , 24వ పదాతి దళ విభాగానికి ఉపబలంగా మొదటి అశ్వదళ విభాగం యోకోహామా నుంచి బయలుదేరింది . [ 40 ]
బ్లాగర్లకు సుపరిచితులైన ఒంగోలు శీను గారు జీవనికి 5000 / - విరాళం అందజేశారు . ఆయన ఆధ్వర్యంలో సహాయ అనే స్వచ్చంద సంస్థ నడుస్తోందని మనందరికీ తెలుసు . సహాయ అంధుల కోసం కృషి చేస్తోంది . పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది . శీను గారికి జీవని తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము .
రాము , సీతల పెళ్ళి నిశ్చితార్ధం అయిపోయింది . ఇద్దరూ హైదరాబాదులో software ఉద్యోగం . వాళ్ళ కుటుంబాలు ( అమ్మా , నాన్నలు మటుకు విశాఖపట్టణంలో ) . ఒక weekend ఇద్దరూ విశాఖపట్టణం కలిసి వెళ్తున్నారు . సమయం : 22 : 00 hrs సీత : ఏంటి ఇంత త్వరగా station కి వచ్చారు ? రాము : నేను మామూలుగా రైలు 22 : 30 కి అంటే 22 : 00 కల్లా station కి వచ్చేస్తాను . రాము : సరే . నేను అలా వెళ్ళి water bottle కొనుక్కొని వస్తాను . సీత : సరే ఒక రెండు నిమిషాల తరువాత రాము పరుగెత్తుకుంటూ వస్తాడు . Water bottleతో పాటు చిన్ని చిన్ని గుండెలు ( brittania little hearts ) biscuit packet కూడా తీసుకు వచ్చాడు . సీత : ఎందుకు అలా పరుగెత్తి వస్తున్నారు ? మెల్లగా రావచ్చు కదా ? రాము : మ్ . . అంటే . . నువ్వు ఒక్క దానివే ఉన్నావు కదా . అందుకని . సీత : అయ్యో . . అసలు ఎప్పుడూ నేను ఒక్కదానినే ప్రయాణం చేస్తాను . ఇదే మొదటిసారి ఇంకొకరితో కలిసి వెళ్ళటం . రాము : సరే పద వెళ్ళి రైల్లో కూర్చుందాము . రాము , సీత రైలు ఎక్కుతారు . సీత : side upper side lower book చేసారా ? రాము : అవును . ఇలా అయితే హాయిగా ఎదురు ఎదురుగా కూర్చుని ఎంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చు . అవీ ఇవీ అన్నీ మాట్లాడుకుంటున్నారు . మిగతా ప్రయాణికులు అంతా నిద్రపోయారు కానీ వీళ్ళు మాత్రం మాట్లాడుటూనే ఉన్నారు . ఇంతలో ఒక పెద్ద మనిషి వచ్చి " మీరు కొంచెం మెల్లగా మాట్లాడుకోండి . మా నిద్రను disturb చేస్తున్నారు " . సరే అని రాము , సీత తలుపు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక గంటెసేపు కూర్చి , మాట్లాడుకుని వచ్చి తమ తమ berth ల లో పడుకున్నారు . పెళ్ళైన తొమ్మిది నెలల తరువాత మళ్ళీ రాము , సీత ప్రయాణమయ్యారు . ఇద్దరూ train ఎక్కారు . సీత : ఏ బెర్త్ ? ? రాము : రెండు upper berths book చేసాను ( మనసులో వెధవ నస ఉండదు ) సీత : హమ్ . . . . రాము : సరే water bottle ఇవ్వు . సీత : water bottle లేదు . Stationలో కొందామని అనుకున్నాను . రాము : ముందే చెప్పి ఏడవచ్చు కదా ? ఇప్పుడు చూడు train బయలుదేరడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉన్నది . సీత : మీరు ఇలానే అనుకుంటూ కూర్చుంటే , ఆ 5 నిమిషాలు కూడా ఉండదు . రాము : ( ఛీ ఎధవ బతుకు ) రాము : పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తాడు . ( ఈ సారి నీళ్ళు మాత్రమే . చిన్ని చిన్ని గుండెలు లేవు ) train time అయ్యింది , బయలు దేరింది . సీత ( ఆవిలిస్తూ ) : సరే నేను బాగా అలసిపోయి ఉన్నాను . నేను పడుకుంటున్నాను . రాము : సరే పడుకో . ( కొంచెం సేపు నేను ప్రశాంతంగా ఉండచ్చు ) TC వచ్చి ticket సరి చూసిన తరువాత రాము కూడా నిద్ర పోవడానికి ఉపక్రమించాడు . కానీ ఎంతకీ నిద్ర పట్టడంలేదు . పక్కనే side upper , side lower berth లో ఉన్న జంట మాట్లాడుకుంటున్నారు . ఆ జంట సరేనని , మెల్లగా train తలుపు వైపు వెళ్ళి . . . . . . . . . జీవిత ప్రయాణం అలా సాగిపోతుంటుంది . . . . .
గురివింద గింజ ముందు భాగమంతా ఎర్రగా ఉండి . . . వెనుకవైపున ఓ నల్లటి మచ్చ కలిగి ఉంటుంది . కానీ తన నలుపు సంగతి మర్చిపోయిన అది , ఈ ప్రపంచంలో తనకంటే గొప్ప అందగత్తె లేనే లేదని ఎగిరెగిరి పడుతూ ఉంటుందట . ఈ గురివింద గింజ సామెత తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కానేరదు . అదే విధంగా ఈ గురివింద చందంగా వ్యవహరిస్తూ . . తమలోని లోటుపాట్లను పక్కనపెట్టి , ఇతరులను తప్పుపట్టడమే పనిగా పెట్టుకున్నవాళ్లు మన సమాజంలో కోకొల్లలు . ఇలాంటి వాళ్లు గోతికాడ నక్కల్లాగా కాచుకు కూర్చొని . . . పక్కిళ్లలో , ఎదురిళ్లలో ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు . పాపం . . పొరుగిళ్లలోని జనాలు ఇలాంటి వారి పాల బడ్డారే అనుకోండి , ఇంకేముందీ కథలూ , కాకరకాయలూ , అదనపు మసాలాలూ జోడించి ఒక బ్రహ్మాండమైన స్టోరీని తయారు చేసి ఊరూ , వాడా ఏకం చేసేస్తారు . ఇలాంటి ఇరుగు , పొరుగు వారితో సమస్యలు దాదాపు చాలామందికి అనుభవమయ్యే ఉంటుంది . అలాగని . . . అందరు ఇరుగు , పొరుగువారు పై లిస్టులోని వారేనని జమకట్టడం లేదండోయ్ . . ! ఇలాంటివారూ ఉంటారని మాత్రమే చెప్పదలచుకున్నా . అలాగే . . . కాస్త మంచిగా బ్రతుకుతుంటే చూసి ఓర్వలేని జాబితా కొందరిదయితే , పేరుకు స్నేహితులమని చెప్పుకుంటూ , పక్కనే ఉంటూ బల్లెంలాగా తయారయ్యేవారు కొంతమంది . . . ఇలా రకరకాల వ్యక్తులు మన జీవితాల్లో తారస పడుతుంటారు . ముఖ్యంగా నేను చెప్పదలచుకుంది . . . ఎదుటివారిని కాకుల్లా , గద్దల్లా , పీక్కుతింటూ పైశాచిక ఆనందాన్ని అనుభవించే కొంతమంది మనుష్యరూపంలో ఉండే జంతువులను ( పాపం జంతువులు బాధపడతాయేమో ) ఉద్దేశించి మాత్రమే . అలాంటివారికి మనం తగిన గుణపాఠం నేర్పాలనుకోవడం కుక్కతోకను సరిచేయడం లాంటిదే . అలాగని . . . మన సమాజంలో మంచివాళ్లు , మంచితనం చచ్చిపోలేదు . పైన చెప్పుకున్న అనుభవాలనే గత కొంతకాలంగా ప్రత్యక్షంగా చూస్తుండటంతో ఆవేదన తట్టుకోలేక ఇలా పంచుకుంటున్నా . . . ! మా పక్కింట్లో ఉండే కొంతమంది , ఎదురింట్లో ఉండేవారిని మాటల తూటాలతో , కట్టుకథలతో , అప్పటికప్పుడే అల్లుతున్న స్టోరీలతో ఎలా ఆడుకుంటూ , ఆనందిస్తున్నారో చూస్తే . . భరించలేనంత అసహ్యం వేస్తోంది . ఎవరినయినా మానసికంగా , సామాజికంగా దెబ్బకొట్టాలంటే ఉన్న ఏకైక ఆయుధం . . . " వ్యక్తిగత జీవితాలపై దాడి " అన్న విషయాన్ని బాగా పసిగట్టినట్లున్నారు పై సదరు పక్కింటి పుణ్యాత్ములు . . ఎప్పుడో , ఏదో ఒక సందర్భంలో చిన్న మాట పట్టింపులు వచ్చిన పాపానికి ఎదురింటివాళ్లను ఫుట్‌బాల్ ఆడేసుకుంటున్నారు . " పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనిపించి " నట్లుగా . . . వీరు చేసినదాన్ని కప్పిపుచ్చుకునేందుకు . . . . ఎదుటివారిలో లేని లోపాన్ని క్రియేట్ చేసి , దానికి రోజుకో రకంగా మసాలాలు దట్టించి మరీ . . . మాంచి గమ్మత్తయిన వంటకాలను రోజుకొకటి తయారు చేసి . . . దారినపోయేవాళ్లకు , తెలిసినవాళ్లకు , తెలియనివాళ్లకు . . . ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్లకు , వీళ్లకు అని తేడా లేకుండా ఎవరికంటే వారికి . . . ఉచితంగా , కమ్మగా వడ్డించేస్తున్నారు . పాపం . . అంత మంచి కమ్మటి భోజనం తిన్నవారు ఊరకే ఉంటారా చెప్పండి . వారికి తోచిన మరిన్ని సలహాలు , సూచనలు , మెచ్చుకోల్లు లాంటి . . అన్నింటినీ ఉచితంగా వీరికి ( చేసిన సహాయాన్ని మర్చిపోకుండా ప్రతిసహాయం చేయకపోతే ఎలా మరి . . ? ) ఇచ్చేసి చల్లగా జారుకుంటున్నారు . ఒకరోజు మా ఆయన ఆఫీసుకెళ్లాక , ఇంట్లోకెళ్లి తలుపేసుకోబోతుండగా ఎదురింటి ఆమె పలుకరింపుగా నవ్వింది . నేనూ నవ్వి కుశల ప్రశ్నలు వేశాక . . . మెల్లిగా మా పక్కింటివాళ్ళ ఆగడాల గురించి వాపోయిందావిడ . ఏం చేద్దామండీ . . . వారి పాపాన వాళ్లే పోతారులే అని చెప్పడం మినహా ఏమీ చేయలేక లోపలికి వచ్చేశాను . అలా అన్నానేగానీ , మనసులో మాత్రం పక్కింటోళ్ళు మరీ ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారనుకోగానే చెప్పలేనంత చిరాకేసింది . అయినా వీళ్లు ఎవరికి ఎవరూ ఏమీకారు . సొంత బంధువులూ కాదు , చుట్టాలు కాదు , స్నేహితులు కాదు . . . మరెందుకు ఆ ఎదురింటివారిపై వీరికి ఇంత పగ అని ఎంత ఆలోచించినా అంతుబట్టలేదు . ఇక్కడ ఇంకో గమ్మత్తయిన విషయం ఏంటంటే . . ఎవరైతే వీరి ఆగడాలకు బలవుతున్నారో , అదే ఇంట్లోని కొంతమంది వ్యక్తులు వీరితో సన్నిహితంగా ఉండటం . సన్నిహితంగా ఉండే వ్యక్తుల ద్వారా తెలుసుకున్న చాలా సాధారణ విషయాలను కూడా . . . పై ప్రబుద్ధులు కట్టుకథలల్లేసి , నోటి దురదను తీర్చేసుకుంటున్నారు . వీరికి కావాల్సింది కాలక్షేపం . ప్రతిరోజూ పొద్దు గడవటం . ఏ పనీ లేకుండా ఉంటే బుర్ర ఊరకే ఉంటుందా . . బుర్రకు పని చెప్పాలి కదా . . అందుకే ఇలా విర్రవీగుతుంటారు . ఇలాంటివారిని ఏమనాలో , ఏం పేరు పెట్టాలో నాకైతే బోధపడటం లేదు . మీకేమైనా తెలిస్తే చెప్పరూ . . . !
మాతృక చాలా బాగుంది నాగ్ , బహుశా తెలుగులో సమానర్ధాలు లేవో ఏమో మరి ? మరిన్ని ప్రచురిస్తావని . .
రక్షించు మహాప్రభో అంటే . . . ఎక్కడో దేహంలో దాడి జరిగితే నా కళ్లకు ఎలా కనిపిస్తుంది అని అమాయకంగా అడుగుతాడు . .
రచ్చ తర్వాత రామ్ చరణ్ తేజ ఖైదీగా రాబోతున్నాడని ఫిలింనగర్ వర్గాలంటున్నాయి . ఆల్రడీ ఖైదీ అనే టైటిలి రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది . మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ బ్యానర్లో కె . అచ్చిరెడ్డి నిర్మాతగా ఖైదీ టైటిల్ రిజిస్టర్ అయింది . ఓ మెగా డైరెక్టర్ ఖైదీ … Read more »
" మీ ఇష్టం స్వామీ ! మీకు నేను ప్రతిబంధకం కానని ప్రమాణం చేస్తున్నాను . " గద్గద స్వరంతో అంది ఊర్మిళ .
63 ఉత్పశ్యామి త్వయి తటగతే స్నిగ్ధభిన్నాఙ్గనాభే సద్యఃకృత్తద్విరదరదనచ్ఛేదగౌరస్య తస్య శోభా మద్రేః స్తిమితనయనప్రేక్షణీయాం భవిత్రీ మంసన్యస్తే సతి హలభృతో మేచకే వాససీవ
" మేమూ అంతే . నవీన్ ఫాదర్ పోయి చాలాకాలం ఐంది . ఇంతకీ వనజ అమ్మగారికి ఏమైందండి ? "
ఇంకా ఒక రౌండు పూర్తి కాలేదు షో అంటూ విస్సుగాడు ముక్కలు దించాడు . వీణ్ణి తగలెయ్యా ఇవాళ ఏ నక్కని తొక్కెచ్చాడో షోల మీద షోలు కొట్టేస్తున్నాడ నుకుంటూండగా షెడ్డు డోరు మీద నాలుగు సార్లు ఎవరో కొట్టినట్లు చప్పుడయ్యింది . నాలుగు సార్లు కొడితే మావాడనీ , మూడు సార్లు కొడితే మాకు టీలూ , సిగరెట్లూ అందిచ్చే బడుద్ధాయనీ , అయిదు సార్లు ఆగకుండా కొడితే మావలు దగ్గర్లో ఉన్నారనీ కొండ గుర్తులు . మెల్లగా రేకు డోరు పైకెత్తాం . వచ్చింది సూరిబాబు గాడు . తెల్లటి గ్లాస్గో లాల్చీ , పైజామా వేసుకొని నల్లగా నిగనిగలాడుతూ ప్రత్యక్షమయ్యాడు .
తెలంగాణ నేత నారగోని మరో సారి పార్టీ మారుతున్నారు . తాజా గా తెలుగుదేశం నుంచి రాజీనామా ఇచ్చి జగన్ పార్టీ లో చేరనున్నాడు . మొదట ప్రజారాజ్యం పార్టీ స్థాపించినపుడు బలమైన బీసీ నేతగా పార్టీ లో ఎదిగారు . బీసీ లకి 100 సీట్లు ఇప్పించే ప్రతిపాదన ని చిరంజీవి తో ఇప్పించేందుకు తన వంతు కృషి చేశారు . పార్టీ టికెట్ కోసం ఆశపడి భంగపడ్డ నారగోని , ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక చాలా మంది నాయకుల లాగానే తనూ పార్టీ నుంచి బయటకి వచ్చేశాడు . తర్వాత మళ్ళీ ప్రజారాజ్యం లోకి వచ్చి చేరిన నారగోని " తెలంగాణ " వాదం పైన ఆ పార్టీ తిరుగుముఖం పట్టడంతో మళ్ళీ బయటకి వచ్చేశాడు . తర్వాత తన మజిలీని తెలుగుదేశం తో మొదలుపెట్టారు . అయితే జగన్ కొత్త పార్టీ లో చేరేందుకు అనుకుంటా తెలుగుదేశానికి కూడా గుడ్ బై చెప్పారు . తాజా గా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసురెడ్డి కూడా టిడిపి ని వదిలి పెట్టి … Read more »
ర ఎంసెట్ 75 శాతం + ఇంటర్ గ్రూప్‌లో వచ్చిన 25 శాతం వెయిటేజీ ద్వారా వచ్చిన మార్కుల శాతం ఆధారంగా ఎంసెట్ ర్యాంకులు ఇస్తారు .
ఈ రోజు భారత రెండవ ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి గారి పుట్టిన రోజు . 1904సం . అక్టోబర్ 2వ తేదిన ఉత్తరప్రదేశ్ లోని మొగలాయ్ సరాయ్ గ్రామంలో తండ్రి శారదా ప్రసాద్ రాయ్ శాస్త్రిగారు . గాంధిగారు ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో ను , సత్యాగ్రహము లోను పాల్గొనుటకు ఉత్సాహంగా వుండెవారు . అప్పుడు జైల్లోకూడా స్వాతంత్ర్యము తర్వాత , ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మంత్రివర్గములో గృహ మంత్రిగా పనిచేశాడు . స్వాతంత్ర భరత దేశానికి నెహ్రు మొదటి ప్రదాని , నెహ్రు తరువాత లాలబహదుర్ శాస్త్రిగారు రెండవ ప్రదాని గా ప్రమాణ స్వీకరము చేసారు . ఆయన . 1965 యుద్ధంలో పాకిస్తానును కాళ్ళబేరానికి తీసుకువచ్చాడు . తాష్కెంటు లో పాకిస్తానుతో సంధి చర్చలకు వెళ్ళినపుడు 1966 జనవరి 11 న గుండెపోటుతో మరణించాడు . మరణానంతరం ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది .
మధురమె మధురమే మధురమే ఈ కనులకి కలలు మధురమే సెలయేటికి అలలూ మధురమే నీలాల మేఘం నువ్వై నీ నవ్వే తేనెల వానై నాకోసం వస్తె మధురమే ఆ నన్నె తడిపేస్తె మధురమే మధురమే నీకోసం నే రాసే చిరు పాటైన మధురమే నాకోసం నువ్వు పలికే అరమాటైన మధురమే నీకోసం నే రాసే చిరు పాటైన మధురమే నాకోసం నువ్వు పలికే అరమాటైన మధురమేి లిపిలేని సడి లేని ఆ కన్నుల భాష మధురమే హృదయాన్ని మురిపించె ఆ సాగర ఘోష మధురమే మధుమాసం మధురమే నీ దరహాసం మధురమే ఉంటె నువ్వుంటె ఆ శూన్యం అయినా మధురమే మధురమే మధురమే సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే చెలి నడిచె దారుల్లో మట్టిని తాకిన మధురమే సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే చెలి నడిచె దారుల్లో మట్టిని తాకిన మధురమే ఉదయాన ఉదయించే ఆ సూర్యుడి ఎరుపు మధురమే రేయంత వికసించే ఆ వెన్నెల తెలుపు మధురమే చెక్కిలి నెరుపు మధురమే చెలి కాటుక నలుపు మధురమే రాల్చె కన్ను రాల్చె ఆ కన్నీరైన మధురమే మధురమే మధురమే http : / / www . telugubiz . net / lyrics / satyam1 . html
అవును వారంరోజుల నుండి నాకు తరచూ ఈ బొమ్మ ప్రత్యక్షమవుతుంది . దించుకోండి అని . ఎందుకులే ఇప్పుడు నెట్ బానే పనిచేస్తుందిగా అని పట్టించుకోలేదు . ఇంత కథుందా ? ?
సంచలనాత్మక దర్శకుడిగా పేరు తేచుక్కున్న రాజమౌళి నాని , సమంతా కంబినేషన్ లో " ఈగా " అనే యానిమేషన్ సినిమా చేస్తున్న సినిమా అందరికి తెలిసిందే . కానీ ఇ షూటింగ్ సమయం లో నాని రాజమౌళి దగ్గరనే కుర్చేని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడట ఎకంగా కెమరా యాంగిల్ ఇలాపెడితే బాగుంటుంది అని సీను ఎలాచేబితే బాగుంటుందో రాజమౌళి కి సలహాలు ఇవ్వడం మొదలు పెట్టాడట దాంతో రాజమౌళి ననికి ఎవరిపని వారు చేసుకుంటే చాల బాగుతోంది అని చాల నెమ్మదిగా చప్పదట ఏవిషయం బయటికి పొక్కడం తో చిన్న దర్శకులు అందరు సంచలనాత్మక దర్శకుడిగా పేరు తేచుక్కున్న రాజమౌళికే సలహాలు ఇచ్చాడు అంటే మనసంగతి ఏంటి అందకే నాని తో ఇకమిధ సినిమాలు తీయడం మనకు శ్రేయాస్కరం కాదు అని ఫిలింనగర్ లోని చిన్నదర్శకులు అందరు అంకున్న్తున్నారు . ఇక మీదైన నాని ఒళ్ళు దగ్గరగా పెత్తుకొవలిఅని ఫిలింనగర్ లోని వర్గాల మాటలు ఇక నాని కెరియర్ పరిస్థితి ఏంటో మరి వేచిచ్దల్సిదే .
పుట్టిందేమో భారతదేశంలో , వివాదస్పదమైన చిత్రాలు భారతదేశానికి సంబందించినవి , భారతదేశ పౌరసత్వాన్ని కాదనుకుని వేరేదేశంలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా స్టేట్ మెంట్స్ చేస్తూ భారతీయ సంస్కృతికి ఓ పెద్ద మచ్చలా నిలచిన వ్యక్తి . ఖత్తర్ యొక్క పౌరసత్వాన్ని తీసుకున్న తరువాత ఆఖరిరోజుల్లో భారతదేశానికి దూరంగా గత నాలుగైదేళ్ళ నుంచి అఙ్ఞాత వాశం చేస్తూ అదే పెద్ద గొప్పలా ఫీలై ఆఖరికి యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డ లండన్ హాస్పిటల్లో హృద్రొగంతో మరణించడం నాకైతే పెద్ద భాధగాలేదు . భారత మాతను నగ్నంగా చూపిస్తూ చిత్రాన్ని గీసి దానికి చెత్త కారణాలు వెతుక్కున్న రోజున ఎంత భాధ పడ్డానో ఆ భాదకి ఈరోజున ఉపశమనం కలిగింది .
కృష్ణదేశికాచార్యులు గారూ , మీలాంటి పెద్దలకు చెప్పేంతవాన్ని కాదు . అలాగే మీరు చెప్పిన వుదాహరణలతో విభేదించాల్సిన పనీ లేదు . చందోబద్దమైన పద్యానికి , లయ బద్దమైన గేయానికి , భావ బద్దమైన వచన కవిత్వానికి దేనికున్న విలువ దానికుంది . అలాగే చంధస్సు అన్నది స్వయంభువు అన్నదానితో మీ వుదాహరణలతో నేనేకిభవిస్తాను . ఒక మంచి లయబద్దమైన పాట వింటున్నపుడు కాలు లయబద్దంగా ఎలా కదులుతుందో అలాగే మనసును రంజింపజేసిన భావము కవి నోటిలో చంధోబద్దంగా పద్యాన్ని పలికిస్తుందని మీ వ్యాసమంతా చదివాక తెలుసుకున్నాను . అయితే చంధస్సు , యతి ప్రాసల నియమాలు కవితాకల్పనకు దోహదం చేసే నియమాలనడంతో విభేదించాల్సివస్తోంది . మీరే అన్నట్లు లయ ప్రాధాన్యంగా వుండాలంటే చందస్సు అవసరమే . అయితే భావమే ప్రధానమంటే చందస్సు కాక బావాన్ని కఠినంగా వ్యక్తపరిచే పదాలనే ఎన్నుకోవాలి కదా ! చంధస్సుకు సరిపడలేదనే కారణంచేత సరైన భావాన్ని పలికించే పదాన్ని వదిలివేయడం ఎంతవరకు సబబు ? మీరే చెప్పిన చాలా వుదాహరణల్లో యతి నియమం కోసం ఒకటి రెండు నియమాలు ఆలోచించి ఆ పదభందాలు చేర్చామన్నారు కదా . నాకప్పుడు ఏమనిపించిందంటే ఈ యతి నియమం సంతృప్తిపరచే పదభందం దొరగ్గానే మీలోని కవి మరింత మంచి పదానికై తన శోధనను ఆపివేశాడేమొనని ! ఆ నియమమే లేకుంటే ఇంకెంత భావపుష్టి కలిగిన పదం మీకు దొరికేదో ! ఆవేశంగా ఆశువుగా పదభందాలు దొర్లి automaticగా చంధోబద్దమైన పాదాలు జనిస్తే సరే కానీ యతో , ప్రాసో కలిసిందనే సాకుతో అంతకంటె మంచివైన పదాలను వదిలివేయడం సమంజసం కాదేమొ , లయబద్దమైన కవిత్వమే కావాలనుకుంటే తప్ప ! - ప్రసాద్ http : / / blog . charasala . com
ద్రౌపదికీ హేలీ వ్యాసానికీ పోలికా ! మీరెక్కడికో వెళ్ళిపోయారు కొత్తపాళీగారూ . అత్యాధునిక వ్యాఖ్యానం అంటే అపహాస్యం అని నాకు తెలీదు క్షమించాలి . ద్రౌపది నేను చదివాను . కానీ నాకు అందులో అపహాస్యం కనిపించలేదు . హేలీ వ్యాసంతో నా అభ్యంతరమల్లా " మదర్ థెరెసా నాకు మల్లికా షెరావత్ లాగా నచ్చింది " అన్నట్టున్న అతని శైలి గురించి . అక్కడా అభ్యంతరపెట్టానేగానీ అది " తప్పు " అని చెప్పలేదు . I only expressed my disagreement , never said its wrong .
ఈ రావణ కాష్టం ఈ దేశంలో ఎప్పటికి చల్లారదనే స్పష్టమైన అవగాహనతోనే , ' మరలనిదేల రామాయణంబన్న ' అని తానే ప్రశ్న వేసుకుని ' తినిన అన్నమే తిననియట్లు , చేసిన స్నానమే చేసినయుట్లు ' అని జవాబు చెప్పుకుని రామాయణ కల్పవక్షం రాశారు విశ్వనాథ సత్యనారాయణ . విలీనానికి ముందు నుంచీ , 1952 నుంచీ రగులుతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఎప్పటికి అరిపోదనే స్పష్టమైన అవగాహనతోనే , మొత్తం చదవండి »
దేశ భక్తి రంగుపూసుకొని పదవిని మారణా యుధం గా మార్చి భవిష్యత్ పై విషం చల్లె దుర్మార్గులకు మరణ శిక్ష నౌతాను
ఎందుకో ఈ మాట నిజంగానే చద్ది మూట లాగా అనిపించింది . తినగా తినగా వేము తియ్యనుండు అన్నట్లు , చించగా చించగా ఆ మాటల్లోని భావం మెల్ల మెల్లగా కాలంతోటి అనుభవం లోకి వచ్చింది . ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా నంటే , ఇక్కడి ( అమెరికాలోని ) ప్రజల్ని . . వారి వారి రీతులను గమనించిన తరువాత వీరు కూడా ( ఎక్కువ శాతం . . ) ఈ ఆలోచనతోనే ఉన్నారనిపిస్తోంది . ఈ పుటలో మూడవ పదం గురించి వ్రాద్దామనుకున్నంతలో something - nothing - nonsense విషయమే ఎక్కువై నందున , మరొక పుటలో మళ్ళీ కలుద్దాం . . అంత వరకూ
ఆంధ్ర ప్రదేశ్ ఆవతరణ దినోత్సవం శుభ సంధర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు . అమరజీవి పొట్టిశ్రీరాములు వంటి మహనీయుల అద్భుతమైన త్యాగాల ఫలము మన ఆంధ్ర రాష్ట్రం . వారి త్యాగాలను ఎప్పటికీ కూడా మనము గుర్తుంచుకోవల్సిన ఆవశ్యకత వుంది . వారి త్యాగములకు సార్ధకత చేకూరాలంటే మన తెలుగు వాళందరమూ సమైక్యతతో నిలిచి మన రాష్ట్రాభివృఇద్ధికి కృఇషి చెయ్యాలి . ఈ మధ్య మన రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు తమ తమ స్వలాభపేక్ష కోసం తమలో తాము కలహించుకుంటూ అభివృద్ధి పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి . ఈ రాజకీయ పార్టీలన్నింటికీ నెను చేసె మనవి ఒక్కటే ! రాజకీయాలు , విమర్శలు , రాస్తా రోకోలు , ధర్నాలు అన్నీ ఎన్నికల వరకే పరిమితం చెయ్యండి . ఎన్నికల తర్వాత మీ మీ విభేధాలను పక్కన పెట్టీ ప్రభుత్వాలకు , ప్రభుత్వ అధికారులకు మద్దతు ఇచ్చి అభివృద్ధి పనులను చేయించుకొనండి . మంచి పనులు చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ప్రభుత్వ పధకాల ఆచరణను అడ్డుకోవడం అమానుషం . అది మన గుంతను మనమే తవ్వుకోవడంతో సమానం . పొరుగు రాష్ట్రాలను చూసి మనము ఈ విషయమును నేర్చుకోవాలి . ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవపు స్పూర్తిని మనస్సు నిండా నింపుకొని కుళ్ళు రాజకీయాలకు తావ్వివకుండా , మన రాష్ట్రాన్ని ముక్కలు చేద్దామని యత్నిస్తున్న స్వార్ధపర శక్తులకు దీటుగా జవాబిచ్చి మన రాష్ట్రా సర్వతోముఖాభివృద్ధికి చిత్త శుద్ధితో కృషి చేద్దాం . పోట్టి శ్రీరాములు వంటి అమర వీరులకు మనము ఇవ్వగలిగే అసలైన నివాళి ఇదే ! సమైక్య ఆంధ్ర మాతకు శతకోటి వందనములు .
కృషి అంటూ ఏమీ లేదు కానీ తెలుగు సాహిత్యం మీద ఇష్టం మాత్రం ఎక్కువే . స్కూల్ లో చదివిన నల - దమయంతుల కథ , శకుంతల కథ ఎందుకో మనోఫలకం మీద అలా నిలిచిపోయి ఇంకా ఇంకా చదవాలి అన్న ఇష్టాన్ని కలుగజేసాయి
రేడియోలో ఆ ప్రోగ్రాం నేనూ విన్నాను , చాలా ఆశ్చర్యమేసింది అంత % లో ప్రతిజ్ఞలు నిలబడుతున్నాయంటే ! ప్రతి సంవత్సరమూ నా ప్రతిజ్ఞలు మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నాయి . ఈసారి అయిన చూడాలి ఎంతవరకు నిలబడుతాయో ! మన డెట్రాయిట్లో కుడా ప్రతి DTA సమావేశంలో మనమూ e - తెలుగు లాంటి స్టాలు పెడదామంటారా ? ఇక్కడి వాళ్ళకి బ్లాగుల పరిచయం కలుగుతూ ఉంటుంది , ఏమంటారు ?
కళ్ళు తెరిచాడు . కేరన్ నిద్రలోకి జారుకున్నట్టుంది . మెల్లిగా మంచం దిగి , ఇల్లంతా తిరిగాడు . వాళ్ళు చావలేదేమో , తనలో తనే అనుకున్నాడు . ఫ్రిడ్జ్ లో పాల డబ్బ తీసుకుని , అదెత్తిపెట్టుకుని తాగుతున్నాడు . అదో పాత అలవాటు , పూర్వం మందు కొట్టాలని బలమైన కోరిక కలిగినప్పుడు , చల్లటి పాల రుచి ఆ మంటనార్పేది . ఇప్పుడు పాలు తాగినా , తనకేమీ మంట చల్లారినట్టనిపించలేదు . ఆ కాలుతున్న ఇంటి దృశ్యం , ఆ గొంతు , అతన్ని బాగా భయపెట్టాయి . ఓ దుప్పటి కప్పుకుని , టీ . వీ . లో ఏదో సైన్సు ప్రోగ్రాం వస్తుంటే కళ్ళార్పకుండా చూస్తూ కూర్చున్నాడు . అందులో ఓ ఆవిడ ఓ పిల్లాడి శవాన్ని పరిశీలిస్తోంది . శుష్కించిపోయిన ఆ శవం చూసాక , డీ . జే . గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు . ఉలిక్కి పడి ఒక్క సారి వెనక్కు తిరిగి చూసుకున్నాడు .
ఇలా మ్రుందుకు వచ్చిన వాళ్ళలో నాకు చాలా బాగానచ్చే వాళ్లలో ఒకడైన లారీ ఎలిసన్ కూడా ఉన్నారు . ఈయన స్వతహాగా ప్రపంచం అంతా ఎడ్డెం అంటే వీరు తెడ్డెం అంటారని అందరూ అంటారు . కానీ కొన్ని విషయాలలో ఇలా ప్రపంచానికి ఎదురీదటం మంచిదే అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది . ఇది నిజం కాకపోతే . . ప్రపంచంలోని అన్ని పర్సనల్ కంప్యూటర్లు దాదాపు ఒకే రకమైన ప్రోససర్ మరియు మదర్ బోర్డ్ వంటి నిర్మాణంపై ఏకాభిప్రాయానికి వచ్చి ఆ వైపు అడుగులు వేస్తుంటే , వీరందరినీ కాదని తనదంటూ ఒక హార్డ్‍వేర్ ఆర్కిటెక్చర్ తయ్యారు చేసుకుని , ఈరోజుల్లో ఐఫోన్ దగ్గర్నుంచి మాక్ కంప్యూటర్ వరకూ తనదైన శైలిలో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న మాక్ అధిపతి స్టీవ్ జాబ్స్ ఆలోచన కూడా నిజంకాదు .
తమన్నా బ్యాన్ చేయాలా వద్దా అనే ఆలోచనలో తమిళ చిత్ర పరిశ్రమ పడిందని సమాచారం . కారణం
చివరకు రాందేవ్ దీక్షను విరమింప చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన విశ్వప్రయత్నం విఫలం కావడంతో , తమ మధ్య ఇంకా రాజీ కుదరలేదని , జూన్ నెల నాలుగో తేదీ నుంచి దీక్ష చేస్తానని , ఆయన ప్రకటించారు . " ఏ విధమైన ఒప్పందం రాందేవ్ కు , ప్రభుత్వానికి మధ్య " కుదిరిందో కాని , తమ మధ్య " ఏకాభిప్రాయం కుదురుతోందని " మాత్రం ఒకానొక సందర్భంలో ఆయనన్నారు . అంతా గోప్యమే ! " అవినీతిని నిర్మూలించండి , నల్ల ధనాన్ని వెనక్కి తీసుకురండి " అంటు , ఉద్యమ నినాదాన్ని ఆయన ప్రకటించారు . రాందేవ్ బాబాకు ఎందుకంత ప్రాధాన్యతివ్వాలో కాని , రాందేవ్ తో కేంద్ర మంత్రుల చర్చల పర్యవసానాన్ని సాక్షాత్తు ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కు వివరించే దాకా వెళ్లింది . రాందేవ్ తో చర్చించేందుకు ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్థాయి నాయకుడు తన కోల్ కత పర్యటనను వాయిదా వేసుకున్నారు . మరో మంత్రి వీరప్ప మొయిలీ కూడా మంగళూరు పర్యటనను వాయిదా వేసుకున్నారట . ఇవన్నీ రాందేవ్ బా " సర్కారీ లీలలు " కాక మరేంటి ?
" తీరా విచారిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఈ షిర్డీసాయి గుడులపై అజమాయిషీ చేసే అధికారం , లెక్కలు చెప్పమనే అర్హత లేదని తెలిసింది . అలా ఎందుకు , ఎప్పుడు మినహాయింపు ఇచ్చారో , దీనివెనుక ఏఏ శక్తులు పనిచేశాయో తెలియదు . " వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఎక్సెంప్షన్ ప్రివిలెజ్ తెచ్చుకున్నారు . లాయర్లు , జడ్జిలలో కూడా సాయిబాబా భక్తులు ఉన్నారు .
75 శాతం Dependable flow అంటే 2060 శ . కో . అడుగులకన్నా ఏ జల సంవత్సరంలోనైనా ఎక్కువ నీరు లభించినా , లేక తక్కువ నీరు లభించినా ఈ స్కీంలో మూడు రాష్ట్రాలు ఏ నిష్పత్తిలో ఆ అదనపు నీటిని లేక లోటును పంచుకోవలసి ఉంటుంది అన్న విషయం ఈ స్కీంలో ప్రస్తావించబడింది . అయితే ఈ స్కీం అమలుకోసం ' కృష్ణా వేలీ అథార్టీ ' ఏర్పాటు చేసుకోవాలి . ఆ అథార్టీ ఏర్పాటుకు మూడు రాష్ట్రాలు అంగీకరించాలి లేదా పార్లమెంట్ చట్టం ద్వారా చేయవచ్చు . స్కీమ్ బి అమలు జరిగినా జరగకపోయినా స్కీమ్ ' ఎ ' ఇండిపెండెంటుగా అమలు జరగవచ్చు .
కమల వైపు చూసాను . అమాయకంగా మొహం పెట్టింది . తన చర్యను నేను తప్పు పడతానేమో అన్న ఫీలింగ్ కన్పిస్తోంది .
కులాల వారీ భూ కేంద్రీకరణ : ఈ గ్రామం లో భూమి మొత్తం దాదాపు ఒకే కులం వారి చేతిలో కేంద్రీకృతమై వుంది . గ్రామంలో కమ్మ కులస్థులవి 17 . 74 శాతం కుటుంబాలు మాత్రమే వున్నాయి . కాని వారి వద్ద మొత్తం భూమిలో 83 . 19 శాతం కేంద్రీకృతమై వుంది . అంటే మిగతా కులాలకు చెందిన 82 . 26 శాతం కుటుంబాలకు వున్న భూమి 16 . 81 శాతం మాత్రమే . మరొక వైపున 50 . 15 శాతం కుటుం బాలున్న మాల కులస్తులకు 5 . 43 శాతం భూమి మాత్రమే వున్నది . కమ్మ కుటుంబ సగటు భూమి 8 . 76 ఎకరాలు వుండగా మాల కులస్తుల కుటుం బ సగటు భూమి 20 సెంట్లు మాత్రమే వుంది .
» త్వరలో సునీల్ కూడా ఆ లిస్ట్ లో చేరిపోనున్నాడు . . . ?
అప్పుడప్పుడు మాకు కొన్ని చిట్కాలు చెప్పండి బాసు , మీకు వీలున్నప్పుడు మాత్రమె సుమా
ఇక , నాది మూడో స్వేచ్ఛాగానమన్నమాట . ఇది 1970లో రాశాను . కృష్ణశాస్త్రిగారి స్వేచ్ఛాగానాలకీ , దీనికీ 45 ఏళ్ళ మేరవుంది . ఈ నలభై ఐదేళ్ళలో ప్రపంచం ఎంత మారి వుంటుందో మీరు ఊహించగలరు . పరదేశీయ నియంతృత్వంమీదేకాక , మన సమాజంలో పారంపర్యంగా వస్తున్న ఛాందస , సాంప్రదాయక నియంతృత్వం మీదా , అన్యాయాలపైనా తిరుగుబాటు చేయించిన ఆ జాతీయ పునరుజ్జీవనం ఎప్పుడో చల్లారిపోయింది . ప్రపంచం పూర్తిగా మారిపోయింది . రాజకీయ స్వాతంత్ర్యం సిద్ధించింది కాని , ఆనాటి కలలు పిందెలుగానే రాలిపోయాయి . పాత బానిసత్వాలు వదిలాయనుకుంటే , కొత్త బానిసత్వాలు వచ్చి మనల్ని పెనవేసుకున్నాయి . నిరాశ , నిస్పృహ మళ్ళీ ముసురుకున్నాయి .
మన సమాజం లోని లొన్ని వర్గాలను స్పృశిస్తేనే కథ ఇంత పెద్ద గా అయింది అన్ని వర్గాలనూ కథలో పెడితే అది ఒక నవల స్థాయికి పెరిగేదేమో ! ధన్యవాదాలు సర్ !
అద్భుతం ! ! అని అనుకుంటూ ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందో అనుకుంటూ వెళ్ళింది ఆ అమ్మాయి .
మనం మన సంప్రదాయాన్నీ , మన సంస్కృతనీ ఎలాగైతే పండగలను చేసుకోవాలని ఆరాటపడతామో , అందులో పదోవంతు - " నా దేశం " అన్న భావనలో ఉంటే , ఎందుకు ఈ దినోత్సవాలు ? అన్న విషయం అర్థమౌతుందని నా అభిప్రాయం . స్వతంత్ర్యం అంటే ఏమిటి ? దేశమంటే ఏమిటి ? ఈదేశాన్ని ప్రేమిస్తే తక్కిన దేశాల్ని ద్వేషించాలా ? దేశమా - మానవత్వమా ? అనికాదు , దినోత్సవాలు ద్వార గత స్ముతులను జ్ఞాపకం చేసుకోవడమే . చరిత్ర తెలుసు కొని మన జీవిత విధానము సరియైన మార్గం లో సాగించడమే నా అభిప్రాయము .
మన సమాజంలో నెమ్మదినెమ్మదిగా చోటు చేసుకుంటున్న ఇంకొక పరిణామం వైపు కూడా దృష్టి సారించాల్సి ఉంటుంది . కేవలం ఆడదైనందుకు ఆడదానికి ఒకప్పుడు మగప్రపంచం నుంచి సౌహార్దమూ , జాలీ , క్షమాపణ , సహాయమూ లభించేవి . ఇప్పటికీ లభిస్తున్నాయి చాలావఱకు ! వాస్తవానికి ఆ జాలీ , సానుభూతి ప్రాతిపదికనే మగవాళ్ళు తమకు వ్యతిరేకంగా తామే చట్టాలు చేసుకుని మఱీ ఆడదాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నించారు . దురదృష్టవశాత్తు ఈనాడు మనుషుల వివిక్త , ఆంతరంగిక ( private ) జీవితాల్లో ఆడదాని మీద గౌరవం , సానుభూతీ గట్రా నెమ్మదినెమ్మదిగా నశిస్తున్నాయి . కారణాలు అనేకం . అవన్నీ ప్రస్తావించడానికి ఇది తగుసందర్భం కాదు . అయితే గతానుభవాల్ని బట్టి చూసినప్పుడు ఈనాడు వివిక్తం ( private ) అయినదే ఱేపటికి రాజ్య విధానంగా ( State policy ) మారుతుందేమో ననిపిస్తుంది .
చదవాలనిపిస్తోంది . . . వారం వారం ఆంధ్రుల కథ ఆసక్తికరంగా సాగిపోతోంది . ఆగస్టు మొదటి ఆదివారంలోని 15వ భాగం ' ఎగిరిపోయిన యూనివర్సిటీ ' లో కట్టమంచి రామలింగారెడ్డిగారి స్వార్థం బయటపడింది . అచ్చమైన తెలుగు భాషాభిమాని పైగా సాహిత్యపరుడై కూడా ఆంగ్ల బోధన మాధ్యమానికి ప్రాధాన్యతనివ్వడం ఆశ్చర్యం కలిగించింది . బెజవాడ ఇష్టంలేనంత మాత్రాన యూనివర్సిటీని వైజాగ్ తీసుకువెళ్లడంవల్ల సీమ జిల్లాల విద్యార్థులు ఎంత నష్టపోయారో సిఆర్‌రెడ్డి ఆలోచించలేకపోయాడు . ఆంధ్ర యూనివర్సిటీ బెజవాడ నుండి విశాఖకి తరలిపోవడంలో వున్న మతలబులు అనుచితంగా ఉన్నాయి . ఆంధ్రుల కథ చదువుతున్నప్పుడు ఆనాటి సాహిత్యాన్ని , ఉద్యమ కథనాల్ని మళ్లీమళ్లీ చదవాలనిపిస్తోంది . - మసునూరి శ్రీనివాస్ , మెట్‌పల్లి
అయినప్పటికీ ఆ గానం ఎప్పటికీ అలాగే కొన సాగాలనేలా … . ప్రతి చెవినీ పరవశింప జేసి
బెజవాడ గోపాల రెడ్డి గారి గురించి , సంజీవరెడ్డి గారి గురించి మీరన్నది నిజమే , కానీ ప్రకాశం పంతులు గారికీ కేసీఆర్ కు ఏమాత్రం సంబంధం లేదండీ . . ప్రకశం పంతులు గారు ఒక ఎన్నికల తర్వాత అతిపెద్ద సంకీర్ణానికి లీడర్ గా గవర్నర్ దగ్గరికి వెళ్ళారు అందులో తప్పేమిటో నాకైతే కనిపించడం లేదు . . కానీ కేసీఆర్ కేవలం తన కుటుంబం కోసం తెలంగాణ పాట ఎత్తలేదా ? ? మీకు గుర్తుందో లేదో 2000 - 2001 టైం లో కేసీఆర్ స్వయంగా చెప్పాడు , మా వాళ్ళు రాజకీయాలలో లేరు . . కనుక నాకంటూ స్వార్థం ఏమీలేదు అని . . తర్వాత ఏం జరిగిందో మీకూ తెలుసు . .
గురువుగారూ టైటిల్ లో అచ్చుతప్పు . పిన్నిగారు చూస్తే మీకు రెండు కాఫీల కోత విధించబడుతుంది . జాగ్రత్త మరి .
" సమల్ కర్ చలో మేరే మనువా , యే ఖిలోనా టూట్ జానే వాలీ హై సమజ్‌కర్ దేఖో మేరే మనువా ఏ దునియా రూట్ జానే వాలీ హై "
వేలి ముద్రలు వేసే వాళ్ళు తెలియక అలాంటి వాటిని నమ్ముతారనుకుందాం . తెలిసి , తెలిసి అలాంటి హాస్యాస్పద నమ్మకాల్ని నమ్మే చదువుకున్న మూర్ఖుల కంటే వేలి ముద్రలు వేసే వాళ్ళే నయం కదా . I am not ridiculing illiterates but I am exposing the true color of so called educated people .
హాయిగా నవ్వాలంటే ఏంటా పని చిన్నపిల్లల్లా ? అనే మాటొకటి . హుందాగా ఉండాలి . అలా ఉండకూడదు . ఇలా ఉండకూడదు . ఏంట్రా బాబోయ్ ! అందరూ తలంటినోళ్ళే .
మా పోర్టల్‌లో అనేకచోట్ల ఇతర వెబ్‌సైట్‌లు , పోర్టల్‌లకు లింకులు కనిపిస్తాయి . ఈ లింకులను సౌలభ్యంకోసం పెట్టడం జరిగింది . ఆ వెబ్‌సైట్లలోని సమాచారానికి , దాని వి ¬ శ్వసనీయతకు సీడాక్ బాధ్యత వహించదు . . . వాటిలోని భావాలను సీడాక్ సమర్ధించినట్లుగా చూడకూడదు . ఈ పోర్టల్‌లో లింకులు ఇచ్చినంత మాత్రాన వాటిని మేము సమర్ధించినట్టుగా పరిగణించకూడదు . ఆ లింకులలోని వెబ్‌సైట్‌లు నిరంతరం పనిచేస్తుంటాయని మేం గ్యారంటీ ఇవ్వలేము . . . ఆ లింక్‌ల లోని పేజీల అందుబాటుపై మాకు అదుపు కూడా లేదు .
> > ఇంతలో ' మువ్వ ' అని పేరు కనిపించింది . అరే ఇదేమైనా క్షెత్రయ్య పదాలు రాసిన మువ్వ నా అనుకొని , దాని దారి చూసుకుంటూ వెళ్ళాము . అప్పటికే సాయం కాలము 5 గంటలైంది . గుడి తలుపులు తీస్తూ వున్నారు . అది క్షేత్రయ పదాలు రాసిన మువ్వ గోపాలుని ఆలయమే . ఆ ఊరి పేరు మొవ్వ కదండీ . . ?
చికెను వేపుడు తోడ గ్యాసు షోడా తోడ తెలియు స్వర్గపు జాడ ఓ తూగులయ్య * * *
నా కేంటో ఈ మద్య celolagy వంట బట్టిన ఫీలింగ్ వచ్చేస్తోంది . ఎదుట వాళ్ళు సెల్ తీయడానికి పట్టిన సమయం , వాళ్ళు హలో అన్న విధానం ఆ తర్వాత వాళ్ళ మాటల్లో వణికించే హవా భావ విన్యాసాల బట్టి వాళ్ళే పరిస్తితి లో ఉన్నారో కళ్ళ కి కటినట్టు తెలిసి పోతోంది అదేంటో ? మన నెంబర్ చూడగానే 20 సెకండ్స్ లోనే ఎత్తేసి చెప్పండి అనో హాయ్ అనో ఆప్యాయంగా పలకరిస్తే వాళ్ళు ఫ్రీ గా వునట్టు కాసేపు అస్కు వేసుకో అని అర్ధం . కొంచెం టైం తీసుకుని ఫోన్ ఎత్తి చెప్పండి అంటే తొందరగా ముగించమని అర్ధం . ఫోన్ ఎత్తి హలో హలో అంటూ వినపడనట్టు నటిస్తే వాళ్ళ వాళ్ళు ఎవరో పక్కనే వున్నారని తమరు తర్వాత చెయ్యమని అర్ధం . ఫోన్ ఎత్తి బ్రహ్మానందం స్టైల్లో హల్లా , హల్లా ఎవడో యదవలు ఫోన్ చేసి కూడా మాట్లాడరు అంటే ఆ వ్యక్తీ పాత పగలు తిట్ల రూపం లో తీర్చు కుంటున్నట్టు అర్ధం . మనం రింగ్ చెసినా ఎత్తకుండా , తర్వాత మళ్ళి వాళ్ళు చేసి receprocate చెయ్యక పోయిన నువ్వు నోరుముసుకో రా బాబు అని అర్ధం . మీరెంతో ఆవేశం గా బోల్డు మాట్లాడేయ్యాలి అనుకుంటూ చేసి ఇంకేంటి విశేషాలు అని అడిగితె ఏం లెవ్ అని సమాధానం వస్తే నువ్వు ఫోనే పెట్టారా బాబు అని అర్ధం . ఇంతకీ ఇదంతా రాయడానికి స్పూర్తి ఈ రోజు మద్యానం నాకు కలిగిన అనుభవం . నేను కార్ సేర్విసింగ్ ఇచ్చే షో రూమ్ లో పని చేసే customer కేర్ మేనేజర్ ఒక అమ్మాయి అప్పుడప్పుడు ఫోనే చేసి కార్ ఎలా వుంది ? మళ్ళి సేర్విసింగ్ due ఎప్పుడు లాంటివి చెపుతూ , నా ద్వార తనకి అవసరమైన ( నా ద్వార అంటే ప్రభుత్వ పరంగా అని గమనించ ప్రార్ధన లేనిచో కొంప కోల్లెరగును ) సహాయం అడగడం నేను చేసి పెట్టడం తరచూ గా జరుగుతూ వుంటుంది . ఇదంతా సెల్ ద్వారానే గాని ఈ పని కోసం ఆమె పని గట్టుకుని మరి నా దగ్గరకి తన పని మానుకుని ఎప్పుడు రాదు . పని అయిపోయిందని నేను ఫోనే చేసి చెప్పగానే ప్రపంచం లో ఆనందాలన్ని నేనేదో ఆవిడా దోసిట పోసినంత లెవెల్ లో ధన్యవాదాలు చెప్పి ఎప్పటికన్నా మిమ్మల్ని పర్సనల్ గా కలిసి thx చెప్పుకుంటాను సార్ అంటే భలే వారె ఈ చిన్న దానికే మై ఆప కే అభారి హు టైపు ఎందుకండి ? గుర్తు పెట్టుకుని కార్ సేర్విసింగ్ అప్పుడు ఇంటికి మీ వాడు వచ్చి పిక్ అప్ చేసే ఏర్పాటు ( ఇది ఎవరు రిక్వెస్ట్ చెసినా చేస్తారు ) చెయ్యండి చాలు అంటూ నే ఫోనే పెట్టేస్తూ వుంటా . మళ్ళి తనకి అవసరం వచినప్పుడు , పండగలకి పబ్బాలకి విష్ చెయ్యడానికి చేస్తూ వుంటుంది . అలాంటిది ఈ రోజు ఆమె కి ఫోనే చేసి మీ పని అయ్యింది అని చెపుదామని ట్రై చేస్తే చాల సేపటికి గాని తియ్యలేదు , అది మొదటి ఝలక్ . రెండు ఎత్తగానే గుడ్ మార్నింగ్ సార్ అనేది అది మిస్సింగ్ . ఫోనే ఎత్తి రొప్పుతూ హలో అంది . నేను ఏంటి ఆఫీసు లో లేరా అన్నా ? లేదు సార్ ఆఫీసు లోనే వున్నా అంటే అదేంటి మరి ఆఫీసు లో రొప్పు తున్నారు అన్నా . అన్నాక గాని అందులో విపరీత అర్ధం ఏమన్నా వుందా లేక నేను అదే భావనతో అన్నానా ? ఏమో నాకే తెలీదు . అంటే మెట్లెక్కి దిగా ఇప్పుడే ఖంగారు ఆమె ధ్వని లో ? మీ ఆఫీసు అంతా కిందేగా . ఏంటో నా తొక్కలా ప్రోబింగ్ . thank u సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టనేమో అతి కష్టం మీద మాటలు కూడా దీసుకుని అనట్టు గా అంది ఆమె . చూస్తుంటే నేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టనేమో మీరేదో బిజీ గా వునట్టు వున్నారు నా గొంతులో వ్యంగామేమో ? ఫోనే పెట్టేసా . నా ఆలోచనా విధానం లో తప్పా ? అక్కడ నేను వుహిస్తున్న లాంటి సెన్సిటివ్ విషయం ఏమి వుండక పోయి వుండొచ్చు . మళ్ళి తనే రాత్రి 8 గంటలకి ఫోనే చేసి యధావిధి గా తన ధోరణి లో ధన్యవాదాలు చెప్పుకుంటుంటే నేను వుండ బట్ట లేక ఏంటి మద్యాన్నం మీరు బిజీ నా ? ( నాలో నిద్ర పోతున్న మగ బుద్ది ఆ ప్రశ్న వెయ్యించిన్డి ) . తనేం సమాధానం చెపుతుందా అని చెవులు రిక్కరించి వింటున్న . ఇంతలొ బయ్యి మని రైల్ కూత ఫోన్ లో సార్ నేను బయలుదేరుతున్నా ఇంక ఊరి నించి వచ్చాక ఫోన్ చేస్తా కార్ సేర్విసింగ్ కి పంపండి , హ్యాపీ జర్నీ చెప్పరా సార్ అంటుంటే నా ఆలోచనల్ని తుంచి ఓకే బాయ్ హ్యాపీ జర్నీ అంటూ ఫోన్ పెట్టేసా . తను టాపిక్ divert చేసిందా ? లేక కొన్ని ప్రశ్నలకి సమాధానాలు వుండవా ? నా ప్రశ్నకి సమాధానం అధురా రహ్ గయా .
" ఇలా ఎందుకు చేసావ్ ? ఇప్పుడు చూడూ , గుండు మీద చెట్లు మొలిచి పూలు పూస్తాయి ! ! ఇలా చెయ్యకూడాదు . చిన్నపిల్లలకి హెయిర్ కట్ చెయ్యాలి , గుండు చెయ్యకూడదు . " - సూర్య
కళాపూర్ణోదయంలో సరస్వతీ బ్రహ్మల ప్రణయం వర్ణించబడింది . నిజమే ! ప్రారంభంలో సూరన్న గారు చెప్పిన పద్యం కాస్త జాగ్రత్తగా చదివిన ఎవరికైనా , ఆ తరువాత ఐదవ ఆశ్వాసంలో సర్స్వతీ బ్రహ్మల ' చిత్రప్రణయ సల్లాపము ' ఏ విధంగా అన్వయించుకోవాలో బోధపడుతుంది .
సుప్రసిద్ధ రచయిత కాళీపట్నం రామారావు గారు తెలుగు కథ గురించి సాధికరికంగా రాసిన వ్యాసాలు ప్రసిద్ధమైనవి . వారి అనుమతితో ఈ వ్యాసాలను పునర్ముద్రిస్తున్నాం . ఈ వ్యాసాల వరుసలో ఇది మొదటిది .
మారియోకు చేపలుపట్టడం అంటే మాచెడ్డ చిరాకు . నిజం చెప్పాలంటే తెల్లవారకముందే పక్కమీదినుంచి లేవడమంటే మరీ చిరాకు . అవును గదా , తెలతెలవారేటప్పుడు నిద్ర ఎంత మజాగా ఉంటుంది ! అప్పుడేగదా శాన్ ఆంటోనియో మూవీ థియేటర్ లో తెరమీద కనబడి కళ్లు జిగేలుమనిపించే అమ్మాయిలతో ఎన్నెన్నో సాహసకార్యాలు చేస్తున్నట్టు కలలు కనొచ్చు . అలా మాగన్ను నిద్రలో కనేకలల వల్లనే అప్పుడప్పుడు నిజంగానూ అప్పుడప్పుడు ఉత్తుత్తిగానూ జలుబు చేసిందని చెపుతూ వచ్చాడు . తండ్రి పడవకోసం వలలు తయారుచేసే పని నుంచి తప్పించుకుంటూ వచ్చాడు . దక్షిణాది ద్వీపాల నుంచి వచ్చే లావుపాటి బొంతలమధ్య ముడుచుకుని పడుకుని నిండుగా కలలు కనేవాడు . తన సోమరి స్వప్నగీతాలకు మరింతగా మెరుగు దిద్దుకుంటూ ఉండేవాడు .
పొద్దున్నే టిం రస్సర్ట్ " ఇరాక్ లో ఓడిపోతున్నామా మనం " అని ఒక అసంబద్ధమైన ప్రశ్న అడుగుతున్నాడు వైట్ హౌజ్ అన్ - అఫీషియల్ రిపోర్టరు బాబ్ వుడ్వర్డ్‌ని . అంతే అసంబద్ధంగా " బుష్ ఈ యుద్ధం గెలిచినా , ఇరాక్ దేశాన్ని మాత్రం ఓడిపోవచ్చు " తనదైన శైలిలో చెబుతున్నాడు వుడ్వర్డ్ .
నందుడు తన శృంగారకేళీ వస్త్రాలను విసర్జించి , రాజ వస్త్రాలను ధరించి వచ్చాడు . బయల్దేరుతుండగా సుందరి అతని దగ్గరకు వచ్చింది . త్వరగా రమ్మనమని మరోసారి గుర్తు చేసింది .
21వ శతాబ్ది తొలి యుద్ధ చిత్రం 21వ శతాబ్దంలో హాలీవుడ్ తీసిన అతి గొప్ప యుద్ధసినిమాలలో తొలి చిత్రం ఎనిమీ ఎట్ ది గేట్స్ . నటీనటుల అత్యద్భుత ప్రదర్శన , దానితో పోటీ పడిన స్క్రిప్ట్ , ప్రపంచవ్యాప్తంగా సకల వర్గాల ప్రజలపై అది వేసిన ప్రభావం ఈ సినిమాను కొత్త శతాబ్దిలో చిత్రపరిశ్రమ తీసిన గొప్ప యుద్ధ చిత్రంగా నిలిపింది .
నిజం చెప్పద్దూ ! సరిగా రెండేళ్ళ కిందట , " అమ్మ పోయిందిరా ! " అని తమ్ముడు ఫోనులో చెప్పినప్పుడు కూడా అంత బాధ అనిపించలేదు . " అదృష్టవంతురాలు " అనుకున్నా . అమ్మ రెండేళ్ళు మంచం మీదే గడిపింది , రాచపుండుతో . ఆ రెండేళ్ళూ ఇవాళో , రేపో అన్నట్టుగానే బతికింది . ఎప్పుడు తమ్ముడు పిలిచినా , అమ్మ పోయిందని చెప్పడానికే పిలుస్తున్నాడేమో ననిపించేది .
Muggy is defined as మందారముగా వుండే , వుక్క చేత వుడికే , వుమ్మదముగా వుండే . a * day మందారము వేసుకొని వుక్కచేత వుడకపోసే దినము .
" ఇంతకీ ఇవాళ ఆఫీసులో ఏంజరిగిందంటే … " ఏదో చెప్పబోయింది రాధిక .
అనుకున్నట్టుగానే ఒబామా హెల్త్ కేర్ స్పీచి దుమ్ము రేగ్గొట్టాడు . . మళ్ళీ అలనాటి ఎన్నికల ప్రచారపు ఒబామాలోని స్పార్కు కనబడింది , వినబడింది . కానీ రాజకీయ వ్యూహాల మోహరింపులో పట్లు అప్పుడే బిగుసుకున్నట్టు ఉన్నాయి . బిగువులు సడలకనో , లేదా ఏదో ఒక బిల్లుని ఆమోదించాలనో హడావుడిలోనో , ఎవరికీ పనికిరాని చెత్త బిల్లుని పాస్ చేసేసి చేతులు దులుపుకుంటారేమోనని కించిత్ భయం లేకపోలేదు . ఏతన్మధ్య జో విల్సన్ గారి కేకలు రామాయణంలో పిడకలవేట . బాస్కెట్‌బాల్ ఆటగాడు మైకెల్ జోర్డన్ని నిన్న హాలాఫ్ఫేంలోకి ఆహ్వానిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మహాసభలో , కార్యక్రమ నిర్వాహకులు అతను చిన్నప్పటినించీ సాధిస్తూ వచ్చిన క్రీడా విజయాల్ని సముచితంగా శ్లాఘిస్తూ చక్కని కార్యక్రమం ఏర్పాటు చెయ్యగా , వచ్చిన మిగతా అతిథులు , పూర్వం అతని సహ ఆటగాళ్ళు , ప్రత్యర్ధులూ , అందరూ సమయోచితంగా అతన్ని ప్రశంసించగా , అసలు పెద్ద మనిషి మాత్రం తానెంత అల్పుడో నిరూపించుకున్నాడు తన స్పీచిలో . ఎప్పుడీ హైస్కూలు దగ్గర్నించీ ఎవరెవరు తనని ఎలా వెనక్కి నెట్టే , తొక్కిపెట్టే ప్రయత్నం చేశారో , వాళ్ళందర్నీ పేరుపేరునా గుర్తు చేసుకుని వెక్కిరించి యెద్దేవా చేశాడు . మైకెల్ . . బాస్కెట్‌బాల్ కోర్టు మీద నువ్వు తిరుగులేని ఆటగాడివి అయుండొచ్చు , కానీ మిత్రమా , వెళ్ళి ఏదన్నా మంచీ మర్యాదా నేర్పించే ట్రయినింగులో చేరమని మా సలహా . . కాస్త హుందాతనం నేర్చుకో ! వొంటి బరువు గురించి మితిమీరిన ఆసక్తి ఉన్న వాళ్ళు ఇక దాన్ని గురించి తప్ప వేరే ఆలోచించరు . రోజుకి పది సార్లు బరువు చూసుకుంటూ ఉంటారు . ఇంతా చేసి నిజంగా బరువు తగ్ఘేందుకు పనికొచ్చే దీర్ఘకాలిక ప్రణాళికలేవన్నా అమలు చేస్తున్నారా అంటే అది మాత్రం ఊండదు . ఎకానమీని గురించి అమెరికను మీడియా హడావుడి సరిగ్గా అలాగే ఉంది . ప్రతీ వార్తా ప్రసారంలోనూ ఏదో ఒక కొత్త ఇండెక్సు పట్టుకొస్తారు . ఒక పాయింటు పెరిగిందనో , పావు పాయింటు తగ్గిందనో చెప్పి , ఇంక ఒక నలుగురు " నిపుణుల్ని " తెచ్చి ఎడతెగని కుస్తీ పడుతూ ఉంటారు . ఎట్లాగైనా ఆ నిపుణుల నోటినించి . . ఇంకేముంది , ఎకానమీ పైకి వచ్చేస్తోండి , ఇహ గాల్లో ఎగరడమే తరువాయి అన్నట్టు ఉంటుంది వీళ్ళ హడవుడి . ఆ నిపుణులు ఎవరన్నా కాస్త బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళైతే , నాయనా , ఇట్లాంటి రిసెషన్ నించి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అని చెబుతారు , ఈ వార్తాలంగర్లు వాళ్ళ మాట వినపడనిస్తేగా . ఈ హంగామా అంతా కాదు గానీ , మొత్తానికి ఎకానమీ ఇంకా దారుణమైన లోతుల్లో పడికొట్టుకుంటున్న సూచనలే కనిపిస్తున్నాయి . ఇన్నేసి వందల బిలియన్ల డాలర్లు స్టిములసించారు . . అదేమి స్టిములుతున్నదో మాట్లాడే నాధుడు మాత్రం కనబడ్డు . స్పానిష్ దర్శకుడు , పెద్రో ఆల్మొడవార్ తీసిన వోల్వెర్ సినిమా చూశాను వారాంతంలో . ఇదివరలో నే చూసిన ఇతని సినిమాలంత గొప్పగా లేదు , కానీ మంచి సినిమానే . మూడు తరాల స్త్రీల మధ్య ఉండే అనుబంధం . . అదీ స్త్రీలకి మాత్రమే సాధ్యమయ్యే అనుబంధం . స్త్రీ పాత్రల పట్ల తన పక్షపాతాన్ని ఆల్మొడవార్ ఈ సినిమాలో ఇంకో మెట్టు పైకి తీసుకెళ్ళాడు - కనిపించే ఒకే ఒక్క మగ పాత్ర రెండు దృశ్యాల్లో మాత్రమే కనిపిస్తాడు . . మిగతా సినిమా అంతా ఆడావాళ్ళ గురించే . ఇతని సినిమాల్లో సాధారణంగా కనిపించే సైకడెలిక్ దృశ్య పరంపర గానీ , కథలో సస్పెన్సు గానీ , ఒక ఆతృతూ హడావుడి గానీ ఇందులో లేవు . సినిమా మొదలవడమే చాలా నింపాదిగా మొదలవుతుంది . కథలో ఆవిష్కరించబడే మలుపులు కూడా , మనల్ని పెద్దగా ఆశ్చర్య పరచక పోగా , ఇలా జరుగుతుందని నాకనిపిస్తూనే ఉంది అన్నట్టుంటాయి . అంతర్జాతీయంగా ఖ్యాతి నార్జించిన స్పానిష్ తార పీనలొపె క్రుజ్ తన నటనలో గొప్ప పరిణతిని కనబరిచింది . పొర్లిపోతున్న పాలకుండలాంటి సెక్సపీల్ వొలకబోస్తూనే , తన మనసునావరించుకుని ఉన్న ఒంటరితనాన్ని , విహ్వలతనీ సూచించడంలో కృతకృత్యురాలయింది . మిగతా నటీమణులు కూడా తగినట్టుగా నటించారు . ఆల్మొడవార్ సినిమా కాబట్టి పనిగట్టుకు చూశాను కానీ కాకపోయుంటే నా దృష్టిని బహుశా ఆకర్షించి ఉండేది కాదు . , పెద్దగా మిస్సయేవాణ్ణి కూడా కాదు . కర్ణాటక సంగీతంలో నాకు బాగా ఇష్టమయిన పాటల్లో ఇదొకటి . . స్వాతితిరునాళ్ గా పేరుపొందిన కులశేఖర మహారాజు రచన . కురంజి రాగం . యూట్యూబులో విహరిస్తుంటే ఈ చక్కటి గానం నన్నాకట్టుకుంది . మీరూ చెవొగ్గండి .
అదే అండి నా బాధ కూడా . . . ఇంకా చాలా మందిది కూడా
' ఇతర గనులలోని గనులన్నీ పూర్తయ్యాక ప్రపంచానికి స్వర్ణదీవిలోని గనులే దిక్కవుతాయి . అప్పుడు అతడిలోని స్వార్థం పడగవిప్పుతుంది . గనులను అడ్డం పెట్టుకొని ప్రపంచదేశాలను తన గుప్పెట్లో పెట్టుకుంటాడు . ఇదీ అతడి దురాలోచన ! అందుకే మనం బొగ్గును స్వర్ణదీవికి అమ్మొద్దు . మన బొగ్గుతో మనమే పరిశ్రమలు నడుపుకుందాం . మన ప్రజలకు పని కల్పిద్దాం . విదేశీ వ్యాపారంలో స్వర్ణదీవికి పోటీ ఇచ్చి రజితదీవిని వజ్రాలదీవిగా మార్చుకుందాం ! ' అంటూ తండ్రికి తన ఆలోచనను వివరించాడు జ్ఞాన వర్మ . అతనితో అంగీకరించి , ఒప్పందం మానుకుని , రజితదీవిని ఆపద నుండి కాపాడాడు ఇంద్రవర్మ .
రంగు రుచి వాసన ఆ పైన పంచేంద్రియాలకీ అందని ఆత్మానుభవాలు ఇంకా పైన వీటన్నిటికీ అతీతమైన అలౌకికానందాలు . . ఎన్నెన్ని ఎన్నెన్ని . . రోజూ నన్ను ముంచెత్తుతున్న ఆ వరదలో మునిగి పోనా తేలిపోనా కొట్టుకు పోనా . . అమ్మని గురించైనా రాయడం సాధ్యమవుతుందేమోగాని మాతృభూమిని గురించి మాత్రం సాధ్యం కాదు . . కనీసం నాకు . రాయడం అంటు వచ్చేప్పటికి ఏదో ఒక దృక్కోణం ఉండాలి - హాస్యమో , ప్రేమో , ద్వేషమో , ఎక్కిరింపో - విజయవాడని గురించి వాటిల్లో ఏ ఒక్క భావాన్నీ కోణాన్నీ ఎంచుకోలేను . ఎవరో మిత్రులు అడిగారు . . మాతృదేశ పర్యటన అనుభవాలు రాయమని . . ఏం రాయను ? కొన్ని విషయాల్లో విజయవాడ ( భారద్దేశం ) చాలా మారిపోయింది . . కొన్ని విషయాల్లో అస్సలు మారలేదు . జరిగిన మార్పు మంచిదో , మార్పు చెందకుండావున్న స్థిరత్వం చెడ్డదో మరి నాకు తెలియదు . కానీ ఉన్న పరిస్థితి మాత్రం ఇది . వూరూ దేశం లాగానే మనుషులూనూ . . కొన్ని విషయాల్లో చాలా మారిపోయారు , కొన్ని విషయాల్లో నలభయ్యేళ్ళ కిందటా ఎలాగో , అలాగే ఉన్నారు . ఒకటి మాత్రం నిజం . . వాళ్ళ ఆప్యాయత . . అభిమానం . . ప్రేమ . . అలాగే ఉన్నాయి , నన్ను తడిపేస్తూనే ఉన్నాయి . పుస్తకం గెటప్ బాగా వచ్చింది , నేను కోరుకున్నట్టుగా . అందరికీ నచ్చుతుందనే ఆశిస్తున్నా . విజయవాడలో అయితే , ఏలూర్రోడ్డు మీదున్న నవోదయలో దొరుకుతుంది . మిగతా వూళ్ళలో వివరాలు కనుక్కుని చెబుతాను . మళ్ళీ కలుద్దాం .
గుండెల మీద చెయ్యేసి చెప్పండి మనది సహనశీలతా ? గుండె నిబ్బరమా ? చేతగాని తనమా ?
నాకు కూడా విజయవాడ అంటే చాలా ఇష్టం . ఆ ప్లేస్ తో నాకు ఎంతో ప్రత్యేక అనుభందం వుంది . నేను చదువుకుంటానికి వున్నప్పుడూ ప్రియదర్శిని హాస్టల్ లో వుండే దానిని బెంజ్ సెంటర్ లో . ఇప్పటీకి నా మనసు ఎప్పుడూ లాగుతూనే వుంటుంది ఆ వూరి మీద . ఫొటో లు బాగున్నాయి . విజయవాడ చూపిస్తాడని కృష్ణ సినిమా కు వెళ్ళేము మేము .
నా పేరు స్టేజి మీద పిలవగానే నా కాళ్ళ లో వణుకు వచ్చేసింది . , నిజానికి నాకు పాటలు , డాన్సులు అందరి ముందు చేయడం కొత్తేమి కాదు . . . మైక్ ముందు ఒంటరిగా స్పీచ్ నాకు కొత్త . మైక్ ముందు అందరిని చూస్తూ బేలగా వుండిపోయాను , మా టీచర్ జడ్జి లు సైగలు చేయడం తో మా అక్క కోసం వేదికను ధైర్యం కోసం . . . ఇక లాభం లేదని మెదడంతా బ్లాంక్ అవ్వుతుండగా గొంతు సవరించు కుని సభకు , ప్రధాన ఉపాధ్యాయునికి నమస్కారాలు చెప్పి ఇలా మొదలెట్టాను " గ్రంధలయములనగా పుస్తకములు బద్రపరుచు స్థలము " అని రెండు సార్లు చెప్పి , అనక ఒక్క ముక్క గుర్తు రాక ఎదురు కూర్చున్న జనాలే మనస్సంతా నిండిపోయి , ఏడుపొచ్చి , నన్ను రక్షించేవారే లేరా ఇక్కడ అని , బేల చూపులు చూస్తున్న నన్ను మా క్లాసు టీచర్ చొరవగా స్టేజి మీద నుండి దిగి పోవడానికి సహాయపడ్డారు .
ఎంత కష్టపడితే డిగ్రీ చేతికొచ్చిందని . మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం . మా తిండి తిప్పల గురించి పెద్దగా ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు .
చనిపోయిన మనిషి మీద కెమికల్స్ పూసి అతని మృతదేహం కొన్ని వారాల పాటు కుళ్ళిపోకుండా చెయ్యొచ్చు కానీ చిక్కి శల్యంలా కనిపించే మృతదేహాన్ని సాధారణ స్థితిలో ఉన్నట్టు కనిపించేలా చెయ్యడం సాధ్యం కాదు .
ఈ సీస పద్యం మంచాల జగన్నాధ రావు రాసిన వ్యాసంలో ఉంది . ఈ తూము నరసింహదాసు త్యాగరాజుని సందర్శించిన కాలం సుమారుగా 1821 లోనని తంజావూరు చరిత్రలో లిఖిత పూర్వకంగా ఉంది . ఈతని ప్రస్తావన త్యాగరాజు జీవిత చరిత్ర రాసినందరి రచనల్లోనూ వుంది . కానీ ఎం . ఎస్ . రామస్వమి అయ్యర్ రాసిన పుస్తకంలో రాసినవి కొన్ని అసంబద్ధంగా ఉన్నాయి . అందులో , నరసింహ దాసు కుటుంబం త్యాగరాజు ఇంట్లో బస చేసినప్పుడు త్యాగరాజు భార్య కమలాంబ వారికి ఎంతో ఆదరాభిమానాలతో ఆతిధ్య మిచ్చిందని రాసారు . ఇది సరి కాదు . అప్పటికే త్యాగరాజు భార్య చనిపోయి పదేళ్ళు దాటింది . బాలాంత్రపు రజనీ కాంతరావు గారి ' ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర ' లో ఈ తూము నరసింహదాసు గురించీ , ఆయన త్యాగరాజుని కలిసిన సందర్భమూ రాసారు . ' తూము నరసింహ దాసు కథ ' అన్న పేరుతో ఆంధ్ర దేశంలో హరికథొకటి ప్రాచుర్యంలో ఉండేది . ఆ కథలోనూ త్యాగరాజ వైభవం గురించుంది .
ఓ . . మర్చిపోయ్యాను . . మన Independent లాంటి వారు ఎవ్వరి మీదా . . అంటే ఎలాంటి ఒక్క బ్లాగు మీద ఆధార పడరుకదా . . ( క్షమించేయ్యాండి సారూ . . ఓ Independent గారూ ) .
మంచి సినిమా . ये जो है ज़िन्दगी లో టిక్కు తల్సానియత్ అనుకుంటా . రెండు ఏళ్ళ చేతులు చాల గొంతులు నొక్కాయి . బాగా చెప్పారు .
త్వరణం ( వేగం దిక్కు ) కాదుగాని , మార్పు ఏ మేరకు జరుగుతుందనేది ప్రధానం . ఆచరణ ప్రధానంగా గల సామాన్యుడికి ఇది చిక్కు సమస్యగా ఉంటుంది . గలీలియో రెండోదశ నుంచి మూడో దశకు పయనించడమేగాక , ఇంకా విజ్ఞానంలో మధ్యకాలాల నుంచి ఆధునిక స్థాయికి రావడాన్ని కూడా ఇది సూచిస్తుంది . ఎఫ్ . ఎఫ్ . సి . నార్త్ రప్ ( తన గ్రంథం ది లాజిక్ ఆఫ్ ది హ్యూమానిటీస్ అండ్ సైన్స్ స్ ( అధ్యాయాలు 2 , 3 , 4 ) లో ) పేర్కొన్నట్లు , విజ్ఞాన పద్ధతిలో మొదటి దశను విశ్లేషణస్థాయి అందాం . రెండో దశను సహజ చారిత్రకస్థాయి అని పిలుద్దాం . చివరి మూడవ దశలను సమిష్టిగా , నిగమన ( Deductive ) రీతిలో ఏర్పరచిన సిద్ధాంతం అని పేర్కొందాం . అందులో విశ్లేషణస్థాయి అంటున్నామంటే సమాచారాన్ని సేకరించడం , పరిశీలన , పరిశోధనల సహాయంతో సందర్భానికి ఉపకరించే సమాచారాన్ని వర్గీకరించడం తప్ప , చేయగలిగింది లేదన్నమాట . ఇది ఆగమనపద్ధతి ( Inductive ) నేటి మనోవిజ్ఞాన స్థాయి ఈ దశలోనే ఉంది . ఈ శతాబ్దారంభంలోని తొలి దశబ్దాలలో జీవశాస్త్రం ఇటువంటి స్థాయిలోనే ఉండేది . అంతమాత్రాన సహజ చారిత్రక స్థాయి అనేది మూడవ , నాలుగవ విజ్ఞాన దశలకంటే తక్కువదనిగాని , అప్రధానం అని గాని భావించరాదు . సహజ చారిత్రక స్థాయి పునాదులు సరిగా ఉంటేనే సిద్ధాంతం ఫలవంతంగా రాగలదని ఆశించవచ్చు . మూడో అంచెలో తలపెట్టే ప్రతిపాదనలో , అంతకు ముందు స్థాయిలో సేకరించిన సమాచారాన్ని వివేచనాత్మకంగా వివరించడానికి ప్రయత్నాలు జరుగుతాయి . ఈ సందర్భంలో వివరణ అంటే , చేసిన ప్రతిపాదన దాని తార్కిక ఫలితాలు కూడా ప్రాపంచిక అనుభవరీత్యా వాస్తవాలే . అంటే విజ్ఞాన సిద్ధాంతానికి ప్రతిపాదన అనేది ఒక మెట్టు అన్నమాట .
నా ఆలోచనలు ఆకాశంలో విహరిస్తే , మీ అర్ధంలేని భయాలు నా ప్రపంచాన్ని చిన్నదిగా చేసాయి . నా వయస్సులోనే ఉన్న అక్కలు , అన్నయ్యలు , బావలు , వదినలు ఎందరో మన భందువుల్లో ఉన్నారు . ఒక్కరోజు ఎవరినీ కలిసే అవకాశం లేదు . మనసు విప్పి మాట్లాడే అవకాశంలేదు . వాళ్ళ భవిష్యత్తు ప్రణాలికలు తెలుసుకోవాలన్న నా కోరిక ఇప్పటికీ తీరలేదు . వాళ్ళు కంప్యూటర్ లో ప్రపంచాన్ని చూస్తుంటే , నేనుమాత్రం ఇల్లే ప్రపంచంగా బ్రతికాను . విశాలమైన మన ఇంటి గదుల్లో ఎంత ఇరుకుగా పెరిగానో నీకు తెలుసా నాన్న .
ఆ రోజు ఆమె రసికజన మనోరంజనం కోసం నృత్యం చేస్తూ చేస్తూ నృత్యం మంచి రసపట్టులో ఉండంగానే హఠాత్తుగా నృత్యాన్ని ఆపి పాలరాతి ప్రతిమలా నిలుచుండిపోయింది . ఆమె కాళ్ల ఘుంఘురూలు మూగోబోయినాయి . డోలక్ , సారంగీలు అర్థాంతరంగా ఆగిపోయినాయి . రసభంగం చెందిన రసిక హృదయాలు ఆ ' రసాభాస ' కు కనుబొమ్మలు ముడిచినాయి . కళ్లెర్ర జేసినై .
ఇక్కడ చలిలో మా పాట్లు మేము పడుతూ , ( మగాళ్లం అరగంటకోసారి కాఫీలు తాగుతూ . . . ఆడవాళ్లు నడవలేక , కాఫీలు తాగలేక అపసోపాలు పడుతూ ) నిరీక్షించాము .
అనంతపురం , కెఎన్‌ఎన్ బ్యూరో : పుట్టపర్తి సత్యసాయి బాబా సెంట్రల్ ట్రస్ట్‌పై వస్తున్న కథనాల నేపథ్యంలో సత్యసాయి బాబా సోదరుని కుమారుడు , సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్ ఎట్టకేలకు ఆదివారం ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు వచ్చి మనసు విప్పారు . పోలీసులకు పట్టుబడ్డ రూ . 35 లక్షలు సత్యసాయిబాబా మహా సమాధి నిర్మాణానికే నని చెప్పారు . భక్తులు నేరుగా వచ్చి , ఇచ్చినందునే వాటిని యజుర్వేద మందిరంలో ఉంచామన్నారు . వీటిపై 12 మంది భక్తులు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు . వాటిలోని అంశాలను కోర్టు చూసుకుంటుందనీ చెప్పుకొచ్చారు . మందిరంలో లెక్క తేలిన రూ . 11 కోట్లు , 98 కిలోల బంగారం , 340 కిలోల వెండి సత్యసాయికి కొరియర్ , పోస్ట్ ద్వారా భక్తులు స్వతహాగా ఇచ్చినవేనని వెల్లడించారు . అంతే తప్ప . మీడియాలో దుష్ప్రచారం జరుగుతున్నట్టుగా వందలు , వేల కోట్ల నగదు , టన్నుల కొద్దీ బంగారం ట్రస్ట్ వద్ద లేదనీ చెప్పుకొచ్చారు . ట్రస్ట్‌కు ప్రపంచ వ్యాప్తంగా భక్తులున్నారంటూ . . వారు ఎప్పుడు విరాళాలు ఇవ్వాలనుకున్నా . . డిడిలు , చెక్కుల రూపంలో ఇచ్చే వారన్నారు . వాటితో ఎంతటి స్థాయిలో అభివృద్ధి పనులు చేసిందీ తెలిసిందేనన్నారు . ఇంత కాలంగా ట్రస్ట్‌పై అనేక అపోహలతో కూడిన దుష్ప్రచారం జరుగుతున్నా . . తాము మీడియా ముందుకు రాలేదన్నారు . ట్రస్ట్‌లోని కొద్ది మంది పెద్దలు ఇచ్చిన సలహానే అందుకు కారణంగా చెప్పారు . ఐతే భక్తుల మనోభావాలను కాపాడడం కోసం , ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు నేడు మీ ముందుకు వచ్చానని తెలిపారు . ట్రస్ట్ ఆధ్వర్యంలో సాగే ప్రతి కార్యక్రమంపై అయిన ఖర్చు , సర్దుబాటు , మిగులు తదితర వాటిపై ప్రతి యేటా ప్రభుత్వానికి ఆడిట్ రూపంలో చట్టబద్ధంగా నివేదిస్తామన్నారు . వ్యక్తిగత స్వార్థముంటే ట్రస్ట్ ఈ స్థాయికి చేరుకునేది కాదనీ స్పష్టం చేశారు . ట్రస్ట్‌లో ఎవరూ అలాంటి వారు లేరన్నారు . మీడియాలో వస్తున్నట్టుగా ట్రస్ట్ సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవనీ కూడా స్పష్టీకరించారు . అవినీతి పరులకు ఇందులో చోటు ఉండదని తేల్చిచెప్పారు . మీ కుటుంబ సభ్యులకు ట్రస్ట్ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని వచ్చిన వార్తల పై వివరణ కోరగా జవాబును రత్నాకర్ దాటవేశారు . ట్రస్ట్‌పై వచ్చిన ఎలాంటి ఆరోపణలకైనా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామనీ . . ప్రభుత్వం ఎప్పుడైనా తమ వద్ద నుంచి ఎలాంటి సమాచారమైనా తీసుకోవచ్చని పేర్కొన్నారు .
ఇంద్రవజ్ర . లేలిహ్యసే గ్రసమానః సమన్తాల్ - లోకాన్సమగ్రాన్వదనైర్జ్వలద్భిః | తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపన్తి విష్ణో | | 11 - 30
ఈ " సెర్ప్ " పోషిస్తున్న పాత్ర యేమిటో స్పష్టం కాలేదు కానీ , " గతంలో తీసుకున్న ఋణ వాయిదాలని స్వ స సం లు యెప్పటికప్పుడు చెల్లించే విధం గా తాను చూస్తాను " అని హమీ యిచ్చిందట .
ఇంతకీ ఒక వెబ్ సైట్ కి ఈ RSS సౌకర్యం ఉందో లేదో తెలుసుకోవడం ఎలా ?
ఇది గొప్ప ప్రయత్నం . నేననుకున్నదీ , చేద్దామనుకున్నదీ , బహుశా కల కన్నదీ అఫ్సరూ , వంశీ కృష్ణా చేసి చూపించారు . కొత్త తరానికి చెందిన ప్రతిభావంతులయిన కవులు , గొప్ప ఊహాశక్తి కలిగిన కవులు , వస్తువులోకి ప్రవేశించి కళా నిర్మాణం చేసే కొత్త తరం కవుల కవిత్వంతో ఈ పుస్తకం తేవడం నన్ను ముగ్ధుణ్ణి చేసింది . నేనెప్పుడూ నా తరం కవులకీ , నా ముందు తరం కవులకీ చెబుతూ వుంటాను , ఈ కొత్త తరం కవుల్నించి మనం నేర్చుకోవాల్సింది చాలా వున్నది …
ఓ మనిషి ముఖకవళికలు , మాటతీరు , నడక , ఓ గంట పరిశీలిస్తే చాలు ఆ మనిషి స్వభావం ఎలాంటిదో చాలావరకు చెప్పవచ్చు . దీనికి కావలిసింది కాస్తంత పరిశీలనా దృష్టి అంతే . మనం చేసే ప్రతి పని మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది . కూర్చునే విధానం , నిలబడే విధానం , నడిచే విధానం , కాళ్ళు చేతులు ఆడించటం , ముఖం చిట్లించటం , ముక్కు చిట్లించటం , తల గోక్కోవటం , నొసలు ముడివేయటం , చేతులమద్య ముఖం పెట్టుకోవటం , గడ్డం కింద చేయి పెట్టుకు కూర్చోవటం , తల ఓ పక్కకో , ముందుకో , వెనక్కో వేలాడేసి కూర్చోవటం , పిడికిళ్ళు బిగించుకుని కూర్చోవటం , బుగ్గమీద చూపుడు వేలు పెట్టుకోవటం , చూపుడు వేలుతో ముక్కు రుద్దుకోవటం , వాలిపోయిన భుజాలు , నిఠారు భుజాలు , ఒక పక్కకి ఒంగిపోయిన భుజాలు , గాలి పీల్చే విధానం , ఇలా మన ప్రతి పని , ప్రతి కదలిక మన వ్యక్తిత్వాన్ని ఎదుటి వాళ్ళకి పట్టిస్తాయి . ఇవి మనం అందరం అసంకల్పితంగా చేసేవే . నాకు డిగ్రీలో ఉన్నప్పటినుండి సైకాలజీ ఒక అంశంగా చదవటం మూలానగానీ ఎందుకైనా గానీ ఎవరైనా కొత్త వ్యక్తులు తారసపడితే వాళ్ళని పరిశీలించటం ఒక అలవాటు అయిపోయింది . అలవాటు కాదేమో అబ్సెషన్ అనవచ్చేమో ! ! చాలామందికి ఈ అలవాటు ఉండే ఉంటుంది . రైల్వే స్టేషన్ , బస్టాండ్ , మార్కెట్ , ఆసుపత్రి , ఎక్కడికి వెళ్ళినా , రైలులో ప్రయాణిస్తున్నా , బస్సులో ప్రయాణిస్తున్నా , ఏం చేస్తున్నా అదే పని . ఆ పరిశీలనలో ఎన్ని అనుభవాలో . కొంతమందిని చూడగానే ఒక విధమైన స్నేహభావం కలుగుతుంది , ఇంకొంతమందిని చూస్తే అబ్బ వీళ్ళని వీళ్ళ కుటుంబసభ్యులు ఎలా భరిస్తున్నారా అనిపిస్తుంది . రకరకాల మనుషులు , రకరకాల మనస్తత్వాలు . అందరిలోకి 60 పైబడ్డ వాళ్ళని చూడటం , వాళ్ళు జీవితం ఎలా గడుపుతున్నారో ఒక అంచనా వేయటం నాకు చాలా ఇష్టంగా వుంటుంది . అంతే కాదు వాళ్ళతో నన్ను నేను పోల్చుకుంటూ ఉంటాను . మనం ఆ వయస్సు వచ్చే వరకు ఉంటే ఎలా ఉంటామా అని ఊహించుకుంటూ ఉంటాను . ముఖ్యంగా రైలు ప్రయాణంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి . ప్రయాణంలో ఇది ఓ మంచి కాలక్షేపం కూడా . ఎవరైనా కొత్త వ్యక్తితో పరిచయం అయినప్పుడు కూడా ఎక్కువగా వాళ్ళ ప్రవర్తన మీదే దృష్టి పెడతాను . ముఖ్యంగా మొదటసారిగా ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఈ పరిశీలన చాలా ఉపయోగపడుతుంది . నేను చెప్పేది శ్రద్దగా వింటున్నాడా లేదా ? నా కళ్ళలోకి కళ్ళు పెట్టి మాట్లాడుతున్నాడా లేదా ? నాతో మాట్లేడటప్పుడు ముఖకవళికలు ఎలా ఉంటున్నాయి ? ఇవన్నీ గమనిస్తూ వుంటాను - - - మొదటిసారితోనే అర్థం అయిపోతుంది ఆ డాక్టర్ దగ్గరికి మనం మరలా వెళ్ళవచ్చా లేదా అన్నది . ఒక్కోసారి ఎదుటి వాళ్ళ ముఖ తీరు , కళ్ళు , నడక , మాట తీరుల్ని బట్టి వాళ్ళని జంతువులతో పోల్చుకుంటూ ఉంటాను . నాకు నేనుగా ఏర్పరుచుకున్న కొన్ని అన్వయాలు . 1 . గంభీరమైన ముఖం , బిగుసుకున్న దవడకండరం , తీక్షణమైన చూపు , వేగవంతమైన కదలికలు , అప్రమత్తత , రాజసం ఉట్టిపడే నడక - - - - - పులి . 2 . గంభీరమైన ఆకారం , కంచు కంఠం , బద్దకంగా వుండే చూపు , భారమైన నడక , ప్రతిదానికి ఇతరుల మీద అధారపడటం - - - సింహం . 3 . సొగసైన గంభీరమైన ఆకారం , చురుక్కుమనిపించే చూపులు , వేగవంతమైన కదలికలు , బహు అప్రమత్తత - - - - చిరుత . 4 . గంభీరమైన భారీ ఆకారం , భీకరమైన కంఠం , మంద్రమైన సొగసైన నడక - - - - ఏనుగు . 5 . ఎప్పుడూ మాట్లాడే నోరు , వేగం , విశ్వాసమైన చూపులు , తీక్షణమైన పరిశీలన - - - కుక్క . 6 . అప్రమత్తత , తత్తరపడే అరమోడ్పు కళ్ళు , క్లుప్తమైన మాటలు , నాజూకుతనంతో కూడిన వేగం - - - - లేడి . 7 . అతి వినయం , కీచు గొంతు , దొంగచూపులు , డొంకతిరుగుడు మాటలు - - - నక్క . 8 . చిన్న అకారం , ముట్టుకుంటే కందిపోయేటంత నాజూకుతనం , చిన్ని స్వరం - - - కుందేలు . 9 . దొంగచూపులు , పక్క చూపులు , నిలకడ లేని మాట , కీచు గొంతు - - - - - పిల్లి . 10 . బక్కచిక్కిన అకారం , నొసలు చిట్లిస్తూ , పళ్ళికిలిస్తూ మాట్లాడటం , అనవసరమైన హావభావాల ప్రదర్శన - - - - కోతి . 11 . బుల్లి ఆకారం , అతి నాజుకుతనం , శ్రావ్యమైన గొంతు , సుతిమెత్తని నడక - - - - చిలుక . 12 . మొరటు ఆకారం , మొద్దు మాట - - - మొసలి . 13 . లొడలొడా వాగుడు , మాట్లాడేటప్పుడు కళ్ళు మూయటం - - - కాకి . ఇది నేను సరదాగా ఓ కాలక్షేపంగా చేసేది . మీరూ ఆలోచిస్తూ ఉంటే మీకూ ఇలాంటివి తడుతుంటాయి కానీ జాగ్రత్త పైకి చెప్పకండి . . . . . .
అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై ముఖ్యమంత్రి కరుణానిధి మరోసారి ఒంటికాలిపై లేచారు . ఆయన సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ , జయలలితపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు . డీఎంకే ప్రభుత్వం చివరి రోజుల్లో వుందని , కరుణ బృందం సెయింట్ ఫోర్ట్ జార్జ్ కోటలోని పాత సచివాలయంలో ఉన్న ప్రధాన ఫైళ్లను దగ్ధం చే స్తోందని , తద్వారా డీఎంకే పాలనలోని అక్రమాల సాక్షాలను నాశనం చేస్తున్నట్లు జయలలిత ఆదివారం ఆరోపించిన విషయం తెలిసిందే . ఈ విషయంపై కరుణానిధి మండిపడ్డారు . కేవలం ప్రజలను తప్పు దోవ పట్టించడానికి మాత్రమే అన్నాడీఎంకే ఇటువంటి ఆరోపణలు చేస్తోందని , ఈ ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కరుణ అన్నారు . see more in www . Andhra Jyothy
" నిన్ను నువ్వు తెలుసుకోగలిగితే , ఇంకెవ్వరినీ వేలెత్తి చూపించవు " అని చాలా సార్లు చదివాం . అది ఎవరైనా పాటిస్తారో లేదో నాకు తెలియదు కానీ , ఎదుటి వాని కులం తెలుసుకోవాలని అనిపించినపుడు మాత్రం " మా - - - - కులం లో ఇలా ఉంటుంది సర్ " . ఆ సందర్భం ఎక్కడినుండి వచ్చిందో , ఎందుకు వచ్చిందో నాకు అర్ధం కాదు . కానీ అకస్మాత్తుగా వచ్చేస్తుంది . ఒక సునామీ వచ్చినట్టు , ఒక ప్రమాదం జరిగినట్టు . ఈ ఆట ఆడడం నా వల్ల కావడం లేదు . నేను కూడా నా పేరు చివర నా కులాన్ని తగిలించేసుకుంటాను . నా శరీరం రంగుని , నా మాటలని , నా దుస్తులని , నేను వాడే వస్తువులని కొన్ని వందల సార్లు scanning చేసి , litmus test లో clear cut results రాక , వాళ్ల అనుమానం , నిజమో కాదో తెలియక , వారు సతమతమవుతూ , నన్ను ఇబ్బంది పెట్టే methodology కి good bye చెప్పేయ్యాలి . ఈ బాధంతా ఎందుకో తెలుసా ?
హొమ్ » జిల్లాలు » మెదక్ » స్తంభించిన కొనుగోళ్లు
సూ ఋ సంస్థలు , మేము ఎన్ బీ ఎఫ్ సీ ( నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ) గా రిజర్వ్ బ్యాంకులో రిజిస్టర్ అయ్యాము , నువ్వెవడివిరా కోన్ కిస్కా ? అంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని !
తెలుగునాట నాటకరంగం మనుగడ పరిషత్ నాటకాలపైనే ఆధారపడి ఉంది అన్నది , నాటకరంగ మేధావుల విమర్శకుల , పరిషత్‌లో నాటకాలు ఆడుతున్న అనేక నాటక సమాజ విజ్ఞులు , నటులు , నటీమణులు నిశ్చిత అభిప్రాయం కూడా . ఇది ముమ్మాటికీ సరైనదే అని అందరం అంగీకరించి తీరుదాం . అయితే ఈ విషయంలో చర్చ మరింత నిర్మాణాత్మకంగాను , నాటకరంగ ప్రయోజనాత్మకంగానూ ఆలోచన జరగాల్సి ఉంది . అసలు నాటక సమాజాలు పరిషత్‌ల కోసమే నాటకాలు తయారు చేయడం ఎంతవరకూ సమంజసం . వందలవేల రూపాయలు ఖర్చుపెట్టి , నెలలు సంవత్సరాలు అవిశ్రాంతంగా రాత్రి , పగలు అనకుండా రిహార్సల్స్ వేసి ఒక నాటకాన్ని ప్రదర్శనాత్మకంగా తీర్చిదిద్దడానికి ఆయా నాటక దర్శకులు , రచయితలు , నటీనటులు , ఇతర సాంకేతిక నిపుణులు ఎంతగా శ్రమిస్తారో అందరికీ తెలుసు . అయితే ఇన్ని వ్యయప్రయాసలకోర్చి ఒక నాటకాన్ని పరిషత్‌కు తీసుకు వెళ్ళడానికి ఎన్నిరకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుందో తెలుసు . పరిషత్ జిల్లాలో కాని , ఇతర జిల్లాలో కాని ఇతర రాష్ట్రంలో కాని అయితే అంత దూరం . ఇంతమంది వాయిద్య పరికరాలతో , కళాబృందంతో ఆ నాటకానికి అవసరం అయిన రంగాలంకరణ సామగ్రితో సైతం వెళ్ళి ఆ నాటకాన్ని ప్రదర్శింపచేయాలి . ఇంతచేసి నాటకం కాని , నాటిక గాని ప్రదర్శించిన తరువాత , ఆ నాటక పరిషత్ నిర్వాహకులు నలుగురు , ఐదుగుర్ని పరిషత్ నాటక గుణ నిర్ణేతలుగా నిర్ణయించి , వారు అందుకు సమర్థులు అని వారు విశ్వసించిన వారిని నిర్ణయించి , వారికి ఆ బాధ్యతలు అప్పగిస్తారు . ఆ పరిషత్ మూడు రోజులైనా , నాలుగు రోజులైనా ప్రదర్శనకి అవసరమైన నాటకాలు గాని , నాటికలు గాని ఎన్నివస్తే అన్నింటికి ఈ నలుగురు , ఐదుగురు మాత్రమే గుణనిర్ణయం చేసి తీరుతారు . పరిషత్ నిర్వాహకులు ఎన్ని విభాగాలకు బహుమతులు అందజేయదలుచుకున్నారో , అన్నింటికి ఎంపిక జరుగుతుంది . అంటే ఉత్తమ ప్రదర్శన , ఉత్తమనటుడు , ఉత్తమనటి , ఉత్తమ హాస్యనటుడు , ఉత్తమ కారెక్టర్ నటుడు , ఉత్తమ రచన , ఉత్తమ సంగీతం , రంగాలంకరణ వంటి అనేక విభాగాలకన్నమాట . ఇంతవరకూ బాగానే ఉంది . నాటక రంగంలో అనుభవంగల విజ్ఞులు గమనించాల్సి ఉంది . అసలు నాటక పరిషత్‌లలో గుణ నిర్ణేతలుగా ఉన్నవారికి గుణనిర్ణయం చేసే అర్హత ఉన్నది అనడానికి నిర్దిష్ఠ ప్రమాణాలు ఏమయినా ఉన్నాయా ? అందుకు వారు ఇన్ని నాటకాలు ప్రదర్శించినవారని గాని , ఇన్ని నాటకాలు దర్శకత్వం వహించారని గాని , లేదా ఇన్ని నాటకాలు రచించిన అనుభవం ఉంది అని గానీ లేదా మరే ఇతర అనుభవంతో వీరు నాటకాలకు గుణ నిర్ణయం చేయగలుగుతున్నారు ? లేదంటే అందుకు సంబంధించిన డిప్లమో లాంటి అర్హతలు ఏమైనా ఉన్నాయా ? అన్నది విజ్ఞులు ఆలోచించాలి . అయితే ఇక్కడ ప్రేక్షకులు ఒట్టి ప్రేక్షకులుగానే , మిగిలిపోవాలా ? వారికున్న అర్హతల్లా నచ్చితే చప్పట్లు కొట్టడం , నచ్చకపోతే వౌనం వహించటమేనా ? ఇక్కడ ఇద్దరి బాధ్యత కీలకంగా గమనించాల్సి ఉంది . నాటకాల పరిషత్‌లు నిర్వహిస్తున్నవారు , పరిషత్ నిర్వాహకులైనా , ఒక పరిషత్‌ను నిర్వహించాలి అంటే అదో యజ్ఞంతో సమానమే . రాత్రింబవళ్ళు అనేక మంది కార్యకర్తల శ్రమతోపాటు అందుకు అవసరమయిన ఆర్థిక సహకారాన్ని దాతల నుండి కళాభిమానుల నుండి సమకూర్చడం అంటే సాధారణ విషయం కాదు . అంత కష్టం కాబట్టి చాలా నాటక పరిషత్‌లు మూతపడటం జరిగింది . అయితే ఇక్కడ గమనించాల్సింది . పరిషత్ నిర్వహకులు ఎందుకు నాటక పరిషత్‌లు నిర్వహిస్తున్నారు అనే ప్రశ్న తలెత్తక మానదు . వీరు ఏ నేపథ్యంలో పరిషత్‌ను నిర్వహిస్తున్నారు . ఆ నేపథ్యానికి అనుగుణంగానే అక్కడ ప్రదర్శించే నాటకాలు , నాటికలు , వాటియొక్క ఇతివృత్తులు , అందుకు ఎంపిక కాబట్టి గుణ నిర్ణయకర్తలు , ఎంపిక కాబడతారు అనవచ్చు . వారు నాటకరంగాన్ని బ్రతికించి , నాటకం ద్వారా ఆయా ప్రాంతాల్లోని నాటక ప్రియులకు మంచి సందేశాత్మక నాటకాలను అందించాలన్నది వారి దృఢ సంకల్పం కావచ్చు . లేదా నాటకాల ద్వారా తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవటానికో , చాటుకోవడానికో కావచ్చు . మరికొన్ని పరిషత్‌లలో ఎవరో ఒకరు నాటకరంగ ప్రముఖులు కాలం చేస్తే వారి జ్ఞాపకార్థం పరిషత్‌లు నిర్వహించి వారి జ్ఞాపకాలను పదుగురికి పంచుతారు . వీరి పేరుతో కళాకారులకు , ప్రముఖులకు జ్ఞాపికలు అందజేస్తారు . ఇదో పద్ధతి . ఇక రెండో బాధ్యత గలవారు పరిషత్ నాటకాల కోసం నాటకాలు రాసేవారు , ఆడేవారు , దర్శకులు , రచయితలు , నటీనటులు గమనించాల్సింది . వీరు ఏదైనా ఒక నాటకాన్ని పరిషత్‌కు తీసుకుని వెళ్ళడానికి గల నేపథ్యం ఏమై ఉంటుంది ? అనుకున్నప్పుడు మా నాటకానికి ఉత్తమ ప్రదర్శనగానో , ఉత్తమ నటుడు , నటిగా అవార్డు రావాలన్నవి వారి కోరిక అయి ఉండవచ్చు . లేదా నాటకరంగాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయి , మరనేక వందల ప్రదర్శనలు ఇవ్వటం ద్వారా నాటకాన్ని పదికాలాలపాటు కాపాడుకోవాలనే కోరిక కావచ్చు . వాటన్నిటికంటే ముందు మనకు కనిపించేది అనిపించేది ఏమిటంటే ప్రధానంగా పరిషత్‌కు ప్రదర్శన అర్హత గలిగి , ఉత్తమ ప్రదర్శనగా , ఉత్తమ నటుడిగా , రచయితగా , క్యారెక్టర్ నటుడిగా , హాస్య నటుడిగా గుర్తింపు రావటమే వీరికిగల ప్రధాన ప్రామాణికంగా ఉంటున్నాయి తప్ప అసలు నాటకాలు ఏ ప్రజలకు దూరమైపోతున్నాయో వారికి చేరవలోకి తీసుకెళ్ళాలన్న ధ్యాస , సంకల్పం , తక్కువగా ఉండటం కారణాన్ని వీరు గుర్తించడం లేదు . సన్మానాలు , సర్ట్ఫికెట్లు , బిరుదులు ఈ నేపథ్యంలోనే సాగుతుంది తప్ప వందలాది మంది మనోభావాలను లక్షలాది మంది ప్రజల సమస్యలను ఇతివృత్తంగా ఎంచుకుని ప్రజల ప్రేక్షకుల ఆమోదమే నిజమైన గుర్తింపు అన్న విధంగా ఒక నిర్దిష్ట లక్ష్యం కలిగి ఉన్నప్పుడు మాత్రమే నాటక పరిషత్ నిర్వహకులకు , నాటక ప్రదర్శనలకు నిజమైన గౌరవం దక్కుతుంది . ప్రజలు సైతం బాధ్యత నెరిగిన నాటక కళా ప్రియులుగా నాటకాన్ని బ్రతికించుకోవటం , ప్రజలపైనే ఉన్నది అన్న ఆలోచనలను , ప్రజల్లోకి ప్రజా సమస్యల వ్యక్తీకరణ ద్వారా ప్రదర్శన కలిగి ఉండాలి . అదే విధంగా పరిషత్ నిర్వాహకులు , వారు నియమించుకున్న గుణ నిర్నేతలే కాకుండా ప్రేక్షకుల్ని సైతం గుణ నిర్ణేతలుగా చేయగలిగాలి . అదెలాగంటే మీరు నిర్వహించే పరిషత్‌కి ఎట్లాగూ ఒక సమాచార పత్రాన్ని ముద్రిస్తారు . ప్రతిరోజూ పరిషత్ నిర్వహించే ప్రదేశం వద్ద , ఆ రోజు ప్రదర్శించే నాటికలు , వాటితోపాటు ఆయా నాటకంలోని పాత్రలు , రచయిత , దర్శకుడు , రంగాలంకరణ , నేపథ్య సంగీతం ఎవరెవరో ముద్రించిన పత్రంలో తెలియజేస్తాం . ఏయే కేటగిరీల వారికి ఎన్ని బహుమతులు ఇచ్చేది . అందులో పేర్కొనడం . ఆ విధంగా ప్రేక్షకులు వారు చూసిన నాటకాన్ని వాటిలో వారికి నచ్చిన వాటికి రైటు పెట్టటం గానీ , ఇన్ని రిమార్కులు వేయటం గాని చేస్తారు . ఆ రకంగా చేసిన పత్రాలను మీరు నియమించిన కౌంటర్ దగ్గర ఇచ్చి వెళ్ళిపోతారు . లేదా మరుసటి రోజు ప్రదర్శనకు వచ్చినప్పుడు తీసుకొచ్చి అదే కౌంటర్ వద్ద అందజేస్తారు . ఆ విధంగా ప్రేక్షకుల్ని నాటకంలోని పరిషత్‌లోని కూడా భాగస్వామ్యుల్ని చేసిన వాళ్ళమయినప్పుడు అలాంటి ప్రేక్షకుడు నాటకాన్ని ఆడాలనే కోరిక నాటకాన్ని కాపాడుకోవాలనే బాధ్యత గురైరుగుతాడు . మనం నిజమయిన గుణ నిర్ణేతల చేత నాటకానికి అర్హతల్ని నిర్ణయింపచేసిన వాళ్ళవౌతాము . ఇక్కడ ఒక్క ప్రశ్న తలెత్తక మానదు . ముందు మేము అనేక అనుభవాలుగల వాళ్ళను , గుణ నిర్ణేతలుగా నియమించితే వారికి ఉన్న కనీస అర్హతలేమిటి అన్నప్పుడు ప్రేక్షకుడికి ఏ అర్హత ఉంటుంది అన్న ప్రశే్న . నిజమే ప్రేక్షకుడే నిజమైన గుణనిర్ణేత , ఎందుకంటే నీవు ప్రదర్శిస్తున్న నాటకంతో ప్రజల్ని జాగృతపర్చే సమస్యలు మూలాలు నిండుగా ఉన్నప్పుడు వాటిని సమర్థవంతంగా నాటకీకరించబడినప్పుడు , దానికి స్పందించిన ప్రేక్షకుడు ఇచ్చిన గుర్తుంపే నిజమయిన గుర్తింపు అవుతుంది . అదే నిజమయిన సామాజిక ప్రయోజనం కోరే నాటక కళాపరిషత్‌గా నాటిక సమాజంగా పదికాలాలు మన గల్గుతాయి .
పూర్వం మన దేశాన్ని పరిపాలించిన రాజులలో భోజరాజు సాహిత్యపోషణకి పెట్టింది పేరు . కాళిదాసు ఇతని ఆస్థాన కవే . వీరిద్దరికీ సంబంధించిన ఒక కధ ఇది . వీరిద్దరూ చాలా మంచి స్నేహితులని ప్రసిద్ద్ధి . ఒకసారి ఇద్దరికీ ఏదో సాహిత్య విషయమై వాదం వచ్చి , కాళిదాసు చెప్పాపెట్టకుండా ఎక్కడికో వెళ్లి పోయాడుట .
ఒక తండ్రి పేపరు చదువుకుంటున్నాడు . ఆయన పిల్లవాడు పక్కనే కూర్చుని హోం వర్క్ చేసుకుంటున్నాడు . త్రీ ఇంటు ఫోర్ ద సన్ ఆఫ్ ఎ బిచ్ ఈస్ ట్వెల్వ్ , త్రీ ఇంటు ఫైవ్ ద సన్ ఆఫ్ ఎ బిచ్ ఈస్ ఫిఫ్టీన్ … ఇలా . ఈయనకు చిత్రంగా అనిపించి ఒరే , ఏంటిరా అది , ఎవరు నేర్పారురా అన్నాడుట . ఆ కుర్రాడు మా మేడం చెప్పింది అన్నాడుట . ఇలా కుదరదని ఆయన నేరుగా స్కూలుకే వెళ్లాడు . ప్రిన్సిపాల్ గారు మేడం ని పిలిపించారు . ఆవిడ అంతా విని కాదండీ , నేను చెప్పింది త్రీ ఇంటు ఫోర్ ద సం ఆఫ్ విచ్ ఈస్ ట్వెల్వ్ … ఇలా అని !
@ అనానిమస్ గారూ , అవునండీ " కంటే బ్రాహ్మను " పద్యం మరిచిపోయాను . @ మహేశ్ గారూ , మీరు నాకు తెలిసిన మహేశేనా ? అవును రంతిదేవుడు పాఠం ఉండేది , ఏదో క్లాసులోనేమో . ఈ పద్యం కూడా చేరుస్తాను . @ రావుగారూ , మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు , కాస్త ఆలస్యంగా చెపుతున్నాను క్షమించండి . @ amineniగారూ , " లలనా జనాపాంగ " పద్యానికి తాత్పర్యం ఇక్కడ http : / / chiruspandana . blogspot . com / 2010 / 02 / blog - post_19 . html చదవ వచ్చు . రామాయణ కల్పవృక్షంలో స్వయంవర ఘట్టంలో చాలా పద్యాలున్నాయండీ . మీరు చెపుతున్న పద్యమేమిటి ? రెండేళ్ళ కిందట సీతారామ కల్యాణ ఘట్టంలోని కొన్ని పద్యాలు ఒక టపాగా వ్రాసానిక్కడ http : / / telugupadyam . blogspot . com / 2008 / 04 / blog - post_14 . html . అందులో ఏమైనా ఉందేమో చూడండి . లేదంటే ఆ పద్యమేమిటో చెప్పండి . మూడు రోజుల్లో శ్రీరామనవమి వస్తోంది కదా . ఆ రోజుకి స్మరించుకోవచ్చు .
తెలంగాణ వాదులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చి , తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యమని డిమాండుతున్నారు . అంటే వేరు పడతామంటున్నారు . వేర్పాటువాదులన్నమాట ! కానీ , ' దాన్ని ప్రత్యేకవాదమని అనాలిగానీ , వేర్పాటువాదమని అనకూడదు ' అని పాత్రికేయుడొకాయన చెబుతున్నారు . ఈ ముక్క గతంలో కొందరు రాజకీయులూ అన్నారు . సమాధానం చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు . బ్లాగుల్లోనూ అన్నారు , అప్పుడూ తగు సమాధానాలే చెప్పారు . కాకపోతే ఇప్పుడు అంటున్నది , మేధావి వర్గానికి చెందిన పాత్రికేయుడు . ఏప్రిల్ 4 , ఆదివారం నాడు హెచ్చెమ్ టీవీలో పాల్గొన్న పాత్రికేయులకు ' వేర్పాటువాదం ' అనే మాట తప్పనిపించింది . ఆ మాటను దేశం నుండి విడిపోవాలని కోరితేనే అనాలంట . తెలంగాణ డిమాండును ఆ పేరుతో పిలిస్తే ఉద్యమాన్ని , తెలంగాణ ప్రజల్ని అవమానించినట్టేనంట ! ! ఈ ముక్కలన్నది ఎ . శ్రీనివాసరావు . ఓ పాత్రికేయ మేధావీ . . మీ తెలంగాణ పక్షపాతం చూపించుకోడానికి పదాల అర్థాలను కూడా మార్చేస్తారా ? ఇదిగో , బ్రౌణ్యం ఏం చెబుతోందో చూడండి . . http : / / dsal . uchicago . edu / cgi - bin / romadict . pl ? query = % E0 % B0 % B5 % E0 % B1 % 87 % E0 % B0 % B0 % E0 % B1 % 8D % E0 % B0 % AA % E0 % B0 % BE % E0 % B0 % 9F % E0 % B1 % 81 & table = brown . వేర్పాటు అంటే ప్రత్యేకపడటమే ! దేశం నుంచి విడిపోతారా , రాష్ట్రం నుంచి విడిపోతారా , తండ్రి ఆస్తిని విడగొట్టుకుంటారా , . . అనేవి ఆ పదానికి అనవసరం , దానికి వివక్షలేమీ లేవు . అంచేత , మీ తె . వాద పక్షపాతాన్ని చూపించుకోడానికి మరో పద్ధతిని - మరే పద్ధతినైనా - ఎంచుకోండి . భాషకు కొత్తర్థాలు చెప్పకండి . ' అన్నల్దమ్ముల్లాగా విడిపోదాం ' అనే మాట వినని ఆంధ్రుడున్నాడా ఇవ్వాళ ? ఇది తె . వాదుల ఊతపదం కాబట్టి , దాన్ని వాళ్ళు విచ్చలవిడిగా వాడతారు కాబట్టి ఇప్పుడే పుట్టిన పసిపిల్లాడు కూడా ఈ మాట బారిన పడకుండా తప్పించుకోలేడు . అన్నల్దమ్ములు విడిపోయి ఆస్తులు అప్పులూ పంచుకోడాన్ని ఏర్లు పడటం / వేర్లు పడటం / వేరు పడటం అనే అంటారు . వేరు పడటం అనే మాట తప్పేమీ కాదు , గౌరవహీనమైనదేమీ కాదు . కాకపోతే వేరుపడటం అనే పని ఏమంత ఉదాత్తమైనదేమీ కాదు , అంచేత ఆ మాట ఈ పాత్రికేయుడికి తప్పుగా అనిపించి ఉండొచ్చు . ప్రత్యేకరాష్ట్రం కావాలని అడగడం వేర్పాటే . అలా అడిగేవాడు వేర్పాటువాదే ! తె . వాదుల కోసం దాన్ని మార్చనక్కర్లేదు . ఈ మేధావులు తమ నూత్న తె . వాద మహా విజ్ఞానంతో టీవీ కెమెరాల ముందుకొచ్చి నిష్పాక్షికులమంటూ పోజు కొడుతూ అబద్ధాలు చెప్పుకుపోతూంటారు . మనకు జ్ఞానదానం చేసేద్దామని చూసేస్తుంటారు . పాత్రికేయుడు , ప్రొఫెసరు , ఆచార్యుడు , . . అంటూ తమకో ట్యాగు తగిలించుకు తిరుగుతూంటారు . వీళ్ళు చెప్పే అబద్ధాలు వింటూ , టీవీల లంగర్లు కొందరు పళ్ళికిలించి ఆహా ఓహో అని అంటూంటారు . ఈ కార్యక్రమంలో ఆ లంగరు ' అదేంటండీ ఆ మాట తప్పెలా అవుతుంది ' అని అడగలేదు . లంగరు పని వాళ్ళ చేత వాగించడం వరకేను , సొంత అభిప్రాయాలు చెప్పడం కాదు అని అంటారా . . అది నిజమే , లంగరు వాళ్ళ చేత వాగించాలిగానీ తాను వాళ్ళ అభిప్రాయాలను ఖండించడం లాంటివి చెయ్యకూడదు . మరి అదే లంగరు ఓ పక్కన తిరపతి నుండి ఒక ప్రొఫెసరు గారితో కూడా మాటలు కలిపాడు . మాటల్లో ఆయనేదో చెప్పబోగా , ఈయన కలిగించుకోని ఆయన అభిప్రాయాలను తోసిపుచ్చాడు . ఈ లంగరుకెందుకంత పక్షపాతం ? . . . . . . . . . . . . . . . . నిష్పాక్షిక విశ్లేషకులమని చెప్పుకుంటూ ' వక్రవాణి ' వినిపించే ప్రొఫెసర్లు మనకు కొంతమంది ఉన్నారు . వీళ్ళతో పోలిస్తే , ఈ పాత్రికేయ మేధావులు చాలా నయం . మీరు ఏ టైములోనైనా టీవీ పెట్టండి . . ఏదో ఒక చానల్లో మొహం గంటు పెట్టుకునో , ఎవడో ఒకణ్ణి తిడుతూనో కనిపిస్తారీ వక్రవాణులు . అసలు వీళ్ళు కాలేజీలకి పోయి పిల్లలకు పాఠాలెప్పుడు చెబుతారో అర్థం కాదు . ఇక్కడ మాత్రం లంగర్లకు , తోటి విశ్లేషకులకు క్లాసులు పీకుతూంటారు . ఈమధ్య ఐన్యూస్ లో ఒక చర్చ చూసాను . లంగరు పేరు అంకం రవి . ప్రభాకరు అనే తెరాస నాయకుడు , చక్రపాణి అనే ప్రొఫెసరు : ) , ఈమధ్య కాలంలో ఉస్మానియా ఐకాసలో నాయకుడై ఆ తరవాత టీవీల్లో విశ్లేషకుడైన ఒక విద్యార్థి - ఈ ముగ్గురూ చర్చించేవారు . తెరాస నాయకులు రాజీనామాలు చెయ్యగా ఏర్పడిన ఖాళీల్లోఆత్మహత్య చేసుకున్న కుర్రాళ్ళ కుటుంబీకుల్ని నిలబెట్టాలని ఆ కుర్రాడు ( విద్యార్థి ) అంటున్నాడు . ప్రభాకరు , చక్రపాణీ కలిసి అతగాడి నోరు మూయిస్తున్నారు . ప్రభాకరు చాలా నయం . . నువ్వు అలా మాట్టాడ్డం తప్పు , ఇలా మాట్టాడ్డం తెలంగాణ ఉద్యమానికి చేటు అంటూ మాట్టాడుతున్నాడు . చక్రపాణి మాత్రం ఆ కుర్రాడి నోరు బలవంతానా నొక్కెయ్యాలనే చూసాడు ( ఈయనలో తెలంగాణ పట్ల నిష్పాక్షికత ఎల్లప్పుడూ పొంగి పొర్లుతూ ఉంటుంది ) . ఇలాంటి వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చి చర్చలు పెట్టి తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు అంటూ లంగరు మీద ఆవేశపడి , ఆయాసపడి పోయాడు . ' ఇతణ్ణి మాట్టాడకుండా ఆపుతారా నన్ను వెళ్ళిపొమంటారా ' అని లంగరును బెదిరించాడు . చక్రపాణి , ప్రభాకరు ఆ కుర్రాణ్ణి నానామాటలూ అన్నారు . మరో విద్యార్థి నాయకుడు ఫోనులో చెప్పిన మాటలను పట్టుకుని , నువ్వసలు ఉద్యమంలో పాల్గొననేలేదు , నువ్వు సమైక్యవాదుల తొత్తువు అనే అర్థం వచ్చేలా చిన్నబుచ్చబోయారు . ఇవన్నీ నేరుగా అతణ్ణి అనలేదు , తెలివిగా ఆ ఆర్థం వచ్చేలా మాట్టాడారు . నువ్వసలు తెలంగాణ వాడివే కాదు , ఖమ్మం జిల్లా సరిహద్దుకు చెందిన కృష్ణా జిల్లా వాడివి అనీ అన్నారు . పాపం అతడు సమాధానం చెప్పుకోబోతే మధ్యలోనే అడ్డుపడి నోరు మూయించారు . నేను ఉద్యమంలో పాల్గొని జైలుకు పోయాను , చంద్రబాబు ఇంటిదగ్గర ధర్నా చేసి అరెస్టయ్యాను . అంటూ తన ఉద్యమ నేపథ్యాన్ని చెప్పుకోబోతే చక్రపాణి అరిచేసి నోరు మూయించాడు . ఏంమాట్టాడుతున్నావు నువ్వు అంటూ ఆ కుర్రాణ్ణి బెదిరించబోయాడు . ఆ కుర్రాడు చక్రపాణిని ఎదిరించేందుకు ప్రయత్నించాడు . అయితే చక్రపాణికి దీటుగా రౌడీతనం చెయ్యలేకపోయాడు పాపం ! అంకం రవి ప్రేక్షకుడే అయ్యాడు . ఇదే చక్రపాణి గతంలో ఒక కోస్తా ప్రాంతపు విద్యార్థిపై కూడా జులుం చేసాడు . అప్పుడు నే రాసిన టపా చూడండి . ఇదే చక్రపాణి , నెల్లూరులో హెచ్చెమ్ టీవీ వాళ్ళ దశ దిశ కార్యక్రమంలో కూడా ఇలాంటి ' నిష్పాక్షిక ' వ్యాఖ్యలే చేసాడు . . తెలంగాణ రాజకీయ నాయకులు విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తున్నారు అని వచ్చిన ఆరోపణను ప్రస్తావిస్తూ . . . ' ఎవరో రెచ్చగొట్టినంత మాత్రాన ప్రజా ఉద్యమాలు రావు . ప్రజల్లో సహజంగా ఉప్పొంగిన చైతన్యమే తెలంగాణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది . ' అని చెప్పుకుపోయాడు . కానీ , అదే లెక్క కోస్తా సీమల్లో వచ్చిన ఉద్యమానికి వర్తింపజేయడాయన . కోస్తా సీమల ఉద్యమం , కేవలం నాయకులు చేస్తున్నదేగానీ ప్రజల్లోంచి వచ్చినది కాదని టీవీల్లో చెబుతూంటాడిదే వ్యక్తి ! నిష్పాక్షిక విశ్లేషకులమని చెప్పుకుంటూ , టీవీల ముందు దొంగ కబుర్లు చెబుతూ , వక్రవాణి వినిపించే నిష్పాక్షికుల నోరు మూయించే రోజు ఎప్పుడొస్తుందో ! ఈ మే . . ధావుల వర్గవివక్ష నుండి సామాన్యులకు ఎప్పటికి విముక్తి కలుగుతుందో ! !
అట్లా చాలా రోజులు గడిచాయి గానీ రాజుగారు మాత్రం రోజూ వంకాయ కూరను ఇష్టంగా తింటూనే పోయారు .
" ఫిల్టర్ కాఫీ చెయ్యడం నీ పని " అని చెప్పాడు వరలక్ష్మికి .
మీనా " వెంగమాంబ " గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది .
నలుపు గడి పక్కనే తెలుపు గడి వెలుగునీడల్ని సూచిస్తున్నట్టు నాలుగంచుల మధ్య నాలుగు స్తంభాలాట !
నేటి కాలం లావణ్యతో - ఆడవాళ్ళు మగవాళ్ళతో కలిసి తిరగటంలో , ప్రత్యేకంగా ఆడవాళ్ళే ఎందుకు జాగ్రత్తగా ఉండాలో , ఎలాటి జాగ్రత్తలు వహించాలో , రివర్సు డైలాగులు చెప్పించిన తీరు గమనీయం .
అమ్మఒడి అమ్మవడి అయ్యినప్పుడు , ఒంటేలు వంటేలు ఎందుకు కాడో మౌళి గారు వివరణ ఇవ్వాలి
అది తింగరి మొహం అన్నందుకు నాకు బాదగా లేదు . నేను రాసే టపాలు చదివి ఇది
శేషగిరి చేత సున్నితంగా చెప్పించడామే కాకుండా , గిఫ్టులు తన కుటుంబం వారికే కొనడం , అత్తగారి వైపు వారికెవరికీ కొనక పోవడం వంటివి చేసినట్లు రచయిత్రి వర్ణించడం లోని ఆంతర్యం కొంత సందేహాస్పదమే అవుతుంది . కానీ , శేషగిరి ఏ పనీ చేయకుండా , జయంతి చేత వంట పనులు బలవంతంగా చేయాలని చూడడంలో సమాజంలో మానసికంగా స్థిరపడి పోయిన భావనను చిత్రించగలిగారనుకోవచ్చు . పైగా , ఆధిక్యతను ప్రశ్నించినట్లయితే , వర్తమాన సమాజ పురుషాంకారానికి ప్రతీకగా శేషగిరి రెండవ వివాహం కనిపిస్తుంది . అదీ ఉన్నత చదువు చదవని , ఇంటర్ చదివి మానేసిన , ఉద్యోగం చేయని అమ్మాయిని చేసుకోవడంలో ఆ కోణం కనిపిస్తుంది . సర్దుబాటు లేని జయంతి వివాహాన్ని స్వేచ్ఛకు ఆటంకంగా మార్చుకొంటే , అదే మధ్య తరగతికి చెందిన దమయంతి సర్దుబాటు చేసుకోవడం వల్ల జీవితాన్ని ఆనందమయం చేసుకొంది . గోపాలకృష్ణలో బాహ్య ఆకర్షణ కంటే ఆంతరంగిక సౌందర్యం ఉండటం కూడా కారణమయ్యింది . ' జయంతి , శేషగిరి ' ల మధ్య కొరవడిన సర్దుబాటు , ' దమయంతి - గోపాలకృష్ణ ' ల మధ్య పరస్పరం కలిగి ఉండటం వల్ల , దమయంతి హాఠాత్తుగా చనిపోయినా , మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి కూడా మనస్కరించని స్థితికి గోపాలకృష్ణ చేరుకో గలిగాడు .
Download XML • Download text