Text view
tel-27
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
నువ్వెళ్ళి పోయాక అన్నీ అలాగే ఉన్నాయి , ఏమీ మారలేదు . అదే నా బాధ .
ఇప్పటికే చాలా మంది బ్లాగులకు ఈ డైరెక్టరీకి ఐదు నుండి పదికి పైగా హిట్లు వెళ్ళినాయి , కనుక మీరు కూడా మీ బ్లాగు ఇక్కడ కలిపి మరో కొంత మందికి చేరుకుంటారు అని ఆశిస్తున్నాము .
నువ్వు ట్యాంకుబండమీద ఉన్న రాతి విగ్రహాలను కూల్చినందుకు నేను బాదపడ . అంత మోజుంటే వాటిని రాయల సీమ మీదున్న కెనాలు పక్కనో , క్రిష్ణా బరాజి పక్కనో పెట్టుకుంట . వాటిని పెట్టుకోవడానికి ఒక జాగా గావాలె . అది హైదరాబాదైతే ఏంది , విజయవాడైతే యేంది . ఫరక్ లేదు . ప్రత్యేక తెలంగానాకు అంగీకరించ కుండా సీమాంద్రులు తెలంగానావారితో శత్రుత్వాన్ని పెంచుకుంటున్నరని సెబుతున్నవ్ , విడిపోయి అన్నదమ్ముల్లా బతుకుదం అంటున్నవ్ . కాకపోతే ఇక్కడ ఇంకో ముచ్చట మరిచినవ్ . శత్రుత్వం సీమాంద్రులేకాదు తెలంగాణవారు కూడా పెంచుకుంటున్నరు , హైదరాబులో సీమాంద్రుల వాటాను విస్మరించి . కాబట్టి జల్దీ వాటాల విషయం తేల్చి శతృత్వం తగ్గించుకోవచ్చుగా ?
అనుభవించేవాళ్లు అనుభవిస్తూనే వుంటారు - - మనమూ ' అనుభవిద్దాం ' మరి !
బాగున్నాయండీ కబుర్లు ఎప్పటిలానే , ఆఫ్ఘను హిందుస్తానీ సంగీతం గురించి నేను మొదటి సారి వినడం good to know .
మదనపల్లె : చిత్తూరు - కడప జిల్లాల సరిహద్దుల్లోని పెద్దమండ్యం , చిన్నమండ్యం , తంబళ్ళపల్లె ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు . మావోయిస్టుల కదలికలు ఉన్న ప్రాంతం కావడంతో ముందుజాగ్రత్తగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి . సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈనెల 23న పెద్దమండ్యం మండలంలోని కలిచెర్లకు వస్తున్నారు . ఆ రోజు మధ్యాహ్న 2 గంటల నుంచి 4 . 30 వరకు జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు . భద్రతా ఏర్పాట్లలో భాగంగా పోలీసులు మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించారు . రెండు రోజులుగా 5 [ . . . ]
అట్ట మీది బొమ్మ కోసం రాతలు రాసి , గీతలు గీసిచ్చిన తమ్ముడు ఏలె లక్ష్మణ్‌కు బహుత్ బహుత్ షుక్రియా . అలనాటి లక్ష్మణుడు రాజ్యాన్ని ఏలకున్నా ఈనాటి లక్ష్మణుడు చిత్రప్రపంచాన్ని ' ఏలే ' లక్ష్మణ్‌గా అవతరిస్తాడని ఆశిస్తూ … . .
సంస్కృతాన్ని కానీ , పాలీ ని కానీ , ప్రాకృతాన్ని గానీ ఇప్పుడు ఎవరూ ఎందుకు బతికించుకో లేక పోయేరు .
కవిత్వకళ సంగీతకళ కంటే ఏమీ తేలిక కాదు . సగటురకం సంగీతం పంతులు సరిగమల మీద పెట్టేంత శ్రమనైనా నువ్వు కవిత్వం మీద పెట్టకుండా విద్వాంసుల్ని మెప్పించగలననుకోకు .
ha ha మొదట్ట్లో ఇలాగే ఉంటుంది క్రమం క్రమం గా అలవాటు తగ్గుతుంది , నా పోస్ట్ లు గమనిస్తే మొదట్లో వారానికి రెండు చొప్పున తెగ రాసేసేదాన్ని , ఇప్పుడు నెలకోసారి రాయాలన్నా బద్దకం : )
రాసిన వాడు విహారి , రాసిన సమయం 11 : 44 AM 2 వ్యాఖ్యానాలు ఈ టపాకి లంకెలు
అరేయ్ ఏటినీగోల ఆ , ఆవు మాంసం నాకిట్టం . అదే కావాలి . అరేయ్ వద్దన్నాగా . సదుకో , ఎదవ , జెల్లకాయేస్తా హా ! ! నువ్వేమో కందిపప్పు తినచ్చు , నేను ఆవుని తినకూడదా ? అరేయ్ , తంతా నిన్ను . బుర్రతక్కువ వెధవ . పాల దిగుబడి తగ్గిందట్రా ఆఅ , అంతే , అట్టైతే బఱెల్ని వధించటం బ్యాన్ చేయచ్చుగా అబే గధె ! ! కర్ణాటకలో ఆవులెక్కువరా సన్నాసి ఐయే మాత్రం కందిపప్పు బ్యాన్ చేస్తే నువ్వు ఊర్కుంటావా ఓరేయ్ తిక్క సన్నాసి , కందిపప్పు తినే శాతం ఎంత , ఆవులు తినేవాళ్ళ శాతం ఎంత , ఎల్కేజీకి తక్కువ యూకేజి కెక్కువ . ముయ్ [ కందిపప్పుని తినేటోళ్ళు కేవలం బేపనోళ్ళని కొందరి భావని . అట్టాంటోళ్ళంజూసి సింతిస్తున్నా . ]
ఈనాటి పరుగు పందెపు ప్రపంచంలో వివిధ రకాలైన కాలుష్యాలతో , అసభ్యకర నాగరికతతో , స్వార్థరాజకీయాలతో పెద్దా - చిన్నా అనే తేడా లేక నైతిక విలువలు పతనమయ్యాయి . తల్లిదండ్రులు , గురువులపైన వినయ విధేయతలు , భక్తిశ్రద్ధలు మృగ్యమైనాయి . సుఖం మరిగి ఆర్థిక జీవన వ్యాపారంలో ధనార్జనే ధ్యేయంగా సొంత లాభంకోసం మానవుడు వెంపర్లాడుతున్నాడు . ఈ కంప్యూటర్ , ఇంటర్నెట్ యుగంలో మనుషులు యంత్రాల్లాగా తయారై , మనసులు మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ' ' సమకాలీన తెలుగు గ్రామాలను ' ' సింహావలోకనం చేస్తే … .
సత్యసాయి బాబా మంచి నీటి పథకం , సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ , యూనివర్సిటీ , కాలేజీలను స్థాపించి , ప్రజల నుండి సేకరించిన డబ్బును . . ఇంకా
నాటి నీలం సంజీవరెడ్డి మొదలుకొని నేటి వై . ఎస్ . రాజశేఖర రెడ్డి వరకు ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించినది రాయలసీమ ప్రాంత నాయకులే కదా ? వారి ప్రాంత ప్రగతిని మరిచిపోయినందుకు నాయకులను నిలదీయవలసిన అవసరం రాయలసీమ ప్రాంత ప్రజలకు ఉంది . కాని ఇదంతా మరిచిపోయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఎందుకు కాలు అడ్డు పెడుతున్నారో వారికే అర్థం కావాలి . రాయలసీమ ప్రాంతం రాళ్లతో నిండిపోయి , కరువుతో ఎండిపోయి ఉందన్న వాస్తవాన్ని అందరు గుర్తిస్తారు . కాని ఆ రాళ్లనే దేవుళ్లుగా మలచుకొని , ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి భక్తులను ఆకర్షిస్తూ , ధనం సంపాదిస్తున్న శ్రీశైలం , తిరుపతి , శ్రీకాళహస్తి , మంత్రాలయం , పుట్టపర్తి , హర్స్‌లీహిల్స్ , బ్రహ్మంగారి మఠం , అవుకు , అహోబిలం , కాణిపాకం , లేపాక్షి మొదలైన వాటిలోనుండి ఎవరికి ఎంత ఖర్చు పెడుతున్నారో రాయలసీమ నాయకులకు , పాలకులకు మాత్రమే తెలుసు . ఏనాడు కూడా వాటా అడిగే పాపానికి తెలంగాణ ప్రజలు దిగజారలేదు . దేవాలయాల పేరుతో కోట్లాది రూపాయలను సమీకరించి రాయలసీమ ప్రాంతం వారు మాత్రమే ఉపాధి సౌకర్యాలను పొందుతున్నారని తెలంగాణ ప్రజలు ఏనాడు బాధపడలేదు .
అల్లాహ్ యొక్క నిదర్శనాలు స్వయంగా మనలో మరియు ఈ సమస్త సృష్టి యొక్క ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్నాయి . ఆయన యొక్క మహోన్నత్వాన్ని మరియు అత్యున్నతమైన వివేకాన్ని గుర్తించటం కొరకు తమ జ్ఞానాన్నీ మరియు తెలివితేటలనూ వినియోగించమని ఖుర్ఆన్ లో అనేక చోట్ల అల్లాహ్ ఆదేశించినాడు .
మరో పది రోజుల్లో ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి . ఆర్టీసీ చార్జీలు 10 % పెంచనున్నట్లు సమాచారం . దీంతో చార్జీల ధరలు 2 నుంచి 5 రూపాయల వరకు పెరగనున్నాయి . చార్జీల పెంపకం ద్వారా ఆర్టీసీకి 500 కోట్ల రూపాయల లాభం రానుంది . డిజిల్ తో పాటు ఆర్టీసీ ఉద్యోగుల డీఏ కూడా పెరగడంతో చార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు .
బ్రహ్మి కి పెళ్లై ఏడేళ్ళు అయిపోయింది అందుకే రిమ్మ తెగులు పుట్టింది . భార్యని పట్టించు కోడం మానేసి చాల రోజులై పోయింది . ఆమె కూడా అంతే ఎప్పుడూ laptop పెట్టుకుని తన పనేదో తాను చేసు కుంటూ ఉంటుంది . . బాబు చిన్నవాడు కావడం తో రాత్రి 8 కే నిద్ర పోతాడు . ఇంక బ్రహ్మి రాత్రి రెండు దాక నెట్ మిద పడి ఒకటే చాటింగ్ , హిమాని అతని జీవితం లో ఒక నిశి రాత్రి నెటిజెన్ గ rediff chatలో పరిచయం అయి అక్కడి నుంచి యాహూ మెస్సెంగెర్ దాక ఎదిగింది . కానీ అంతకంటే ముందుకి పోలేక పోతున్నాడు ఫోనే నెంబర్ ఇవ్వదు . హైదరాబాద్ లోనే సాఫ్టువేరు ఇంజనీరు తనలాగే ఏ కంపెనీ నో తెలియదు . కానీ ఇద్దరి భావాలూ ఒకటే . భగవంతుడు యెంత అన్యాయం చేస్తుంటాడు , హిమాని ని తన జీవితం లో భార్య గా పెట్టకుండా ఆ పిచ్చి పార్వతిని పడేసాడు . హిమాని చాట్ లో యెంత రొమాంటిక్ గా వుంటుంది . గంటలు నిమిషాల్లా గడిచి పోతాయి . ఏమన్నా సరే తనిచ్చిన హింట్స్ తో రేపు saturday తనని కని pettali . tankbund కి మార్నింగ్ 11 కి వచ్చి 5 మినుట్స్ లో వెళ్లి పోతానని చెప్పింది అంతే అ 5 నిమిషాల లో నేను తానెవరో కని పెట్టి నే వెళ్లి మాట్లాడ గలగాలి . ఏంటో ఉత్సాహం తో నిద్ర పట్టడం లేదు బ్టహ్మికి . తన రెండు నెలల కృషి ఫలించే క్షణాలు దగ్గరి కొచ్చేశాయి . ఎన్నాళ్ళో వేచిన హృదయం దూరం గా రేడియో లో పాట . ట్యాంక్ బండ్ కి పదింటికే వచ్చేసాడు . వేమన విగ్రహం దగ్గర తిష్ట వేసాడు . తాను వస్తుందా వస్తే అందం గా వుంటుందా ఎక్కడకి తీసుకెళ్ళాలి ? ఏంటో ఇంట టెన్షన్ తన పెళ్లి చుపులప్పుడు కూడా ఇంట పద లేదు , ఖర్మ ఇప్పుదేవరన్న చుస్తే ? అబ్బ అసలు ఎ వెదవ తెన్సిఒన్స్ లేకుండా నెట్ లో సరదాగా చాట్ చేసుకోవడం లో ఉన్నా హాయి యి రియాల్టీ షో లో లేదేమో అనిపిస్తోంది . కళ్ళ ముందు భార్య బాబు గుర్తో చ్చారు , ఛి వద్దు నే తప్పటడుగులు వెయ్యను బుడి బుడి అడుగులు వేస్తున్న నా బాబు సాక్షిగా అనుకుంటూ కళ్ళలో నిల్లు తుడుచుకుని వెనక్కి దిరిగి పోయాడు . ఆ రాత్రి తన పార్వతి ని దగ్గర గా తీసుకుని ప్రేమ గా మాట్లాడుతుంటే అబ్బ మీరు నెట్ లోనే కదన్దొఇ నిజ జీవితం లో కూడా ప్రేమ ముర్తులే మీ హిమాని సాక్షి గా అంటు పాతవాటి నవ్వుతోంది . అంతే తన పార్వాతే హిమాని . మనసు ఆనందం తో బరువెక్కింది బుడి బుడి అడుగుల బుజ్జిగాడు పడి పోకుండా మంచం ఎక్కుతున్నాడు .
ప్రజాస్వామ్యం - మార్క్సిజం సమాజ విజ్ఞానం నుంచి మనం చివరి ఉదాహరణ చర్చిద్దాం . సమాజ సిద్ధాంతానికి సంబంధించి మార్క్సిజాన్ని శాస్త్రీయమైందిగా భావిస్తున్నారు . గతి తార్కిక పదార్థవాదం అనే ప్రకృతి సిద్ధాంతం నుంచీ దీని రూపొందించారు . ఈ విధమైన ఆలోచనను తమకాలంలోని వైజ్ఞానిక సామాజిక వాస్తవాల దృష్ట్యా , మార్క్స్ , ఏంగిల్స్ లు అనేక సంవత్సరాల కృషితో పెంపొందించారు . వీరిద్దరూ వాస్తవాల విషయంలో విజ్ఞాన ఖనులుగా భావించబడ్డారు . అయితే ఆ వాస్తవాలన్నీ అంత ఉపయోగకరమైనవి కాదు . మార్క్స్ , ఏంగిల్స్ లు వైజ్ఞానిక పద్ధతిలో శిక్షణ పొందినవారు కారు . జర్మన్ తత్వవేత్త హెగెల్ ప్రభావం కింద మార్క్స్ ఉన్నారు . కేవల భావం అనే పేరిట గతితార్కికాభివృద్ధి దృష్ట్యా ప్రపంచంలోని భిన్న సంఘటనలను వ్యాఖ్యానించడానికి హెగెల్ పూనుకున్నాడు . హెగెల్ పద్ధతిని అనుసరించి మార్క్స్ కు , ఏంగిల్స్ కు ఉన్న మోజు వల్ల వారు , వారి కాలంలోని పదార్థ విజ్ఞానం , గణితశాస్త్రాన్ని కూడా వక్ర భాష్యంలో చిత్రీకరించారు . కాని గతితార్కిక పదార్థవాదం వంటి దోష పూరితమైన ప్రకృతి సిద్ధాంతం నుంచి సామాజిక సిద్ధాంతాన్ని రూపొందించవచ్చునా లేదా అనే విషయాన్ని అలా ఉంచుదాం . కాని గతి తార్కిక పదార్థవాదం వంటి దోష పూరితమైన ప్రకృతి సిద్ధాంతం నుంచి , రాబట్టిన సామాజిక సిద్ధాంతం ఏదీ కూడా సరైంది కావడానికి వీలులేదు . ( సోవియట్ శాస్త్రజ్ఞులూ , విజ్ఞాన తత్వవేత్తలు కూడా గతితార్కిక భౌతిక వాదం పట్ల ప్రస్తుతం ఏదో మొక్కుబడిగానే గౌవరం చూపుతున్నారు . ఈ విషయం సరళమైన విమర్శకు సిడ్నీ హుక్ రాసిన డైలెక్టికల్ మెటీరియలిజం అండ్ సైంట్ ఫిక్ మెథడ్ చూడవచ్చు . ఈ విషయంలో ఐన్ స్టిన్ కూడా తనతో ఏకీభవిస్తున్నట్లు హుక్ పేర్కొన్నారు . ) మార్క్సిజం అంచనా వేసిన అనేక ప్రధాన ప్రాతిపదికలు దారుణంగా , దోష పూరితాలని రుజువయ్యాయి . పారిశ్రామికీకరణ పెంపొందే కొద్దీ బూర్జువావర్గం తప్ప సమాజంలో మిగిలిన వారందరిలోనూ పేదరికం ధోరణి పెరిగిపోతుందని మార్క్స్ అంచనా వేశాడు . బూర్జువావర్గం మాత్రం కొద్దిమందే అయినా బాగా సంపన్నులుగా పెరిగి పోతారన్నారు . దీని ఫలితంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలలో కమ్యూనిస్టు విప్లవం వస్తుందని మార్క్స్ అంచనా వేశారు . విప్లవానికి సంరక్షకులుగా కార్మిక వర్గం ముందు నడుస్తుందన్నాడు . కార్మిక వర్గ నియంతృత్వం ద్వారా పెట్టుబడిదారీ వర్గాలకు భిన్నమైన వారికి అధికారం సంక్రమించటానికి విప్లవం తోడ్పడుతుంది . పెట్టుబడిదారులు తప్ప మిగిలిన వారందరూ రాజకీయ ఆర్థిక స్వేచ్ఛను అనుభవించేటట్లు కార్మిక వర్గం జాగ్రత్త వహిస్తుందన్నారు . సంధికాలం అనంతరం ( ఇదెంతకాలం ఉంటుందో మార్క్స్ సూచించలేదు . పెట్టుబడిదారీ అవశేషాలు తొలగిపోవటానికి వీలుగా రెండు తరాలు ఉంటుందని అంచనా వేసుకోవచ్చు ) . రాజ్యం హరించిపోవడానికి నాంది పలుకుతుంది . ఆస్తి యాజమాన్యం ఉన్న వర్గాలంటూ ఏమీ లేవు గనక ఎవరికీ ఒత్తిడి చేయవలసిన పనిలేదు . ఎవరినీ దోపిడీచేసే అవకాశం లేదు . ఈ అంచనాలన్నీ దోషపూరితమని రుజువయ్యింది . కమ్యూనిస్టులు తొలుత రష్యాలోనూ , తరవాత తూర్పు ఐరోపాలోనూ , పిమ్మట చైనాలోనూ విప్లవాన్ని తెచ్చారు . ఇవన్నీ పారిశ్రామికంగా వెనకబడిన దేశాలే . ( చెకోస్లోవేకియా ఇందుకు మినహాయింపు ) తూర్పు ఐరోపాలో విప్లవంలాగే ఎక్కడ కూడా కుట్రతో తప్ప మార్క్స్ కలలు గన్నట్లు ప్రజావిప్లవం రాలేదు . పశ్చిమ ఐరోపా , ఉత్తర అమెరికాలలాగ ఈ దేశాలు సంపన్నమైనవి కావు . కమ్యూనిస్టేతర దేశాలలో పారిశ్రామికీకరణాభివృద్ధి వల్ల ప్రజలలో పేదరికం పెరగలేదు . పైగా ఆర్థిక సమానత్వాలు తగ్గిపోయి , కార్మికుడు సమాజంలో ఆత్మ గౌరవం గల సభ్యుడుగా ఆదరం పొందాడు . కమ్యూనిస్టు దేశాలలోని కార్మిక నియంతృత్వం . ఇతర నియంతృత్వాలు తగ్గిపోయి , కార్మికుడు సమాజంలో ఆత్మ గౌరవం గల సభ్యుడుగా ఆదరం పొందాడు . ప్రజలపై అధికారం చెలాయించే నియంతృత్వంగా తయారయింది . ప్రజలపై అధికారం చెలాయించగల హక్కు లభించడం , దానిని వీరు ఇష్టం వచ్చినట్లు , అమానుషంగా వాడటం జరిగింది . సోవియటే రష్యాలో మూడు తరాల అనంతరం కూడా నియంతృత్వం పట్టుసడలే ధోరణిగానీ , రాజ్యం హరించుకుపోయే లక్షణాలుగాని కనిపించలేదు . అక్కడ పెట్టుబడిదారీ అవశేషాలు ఏమాత్రం లేవు కూడా . ( సోవియట్ యూనియన్ తరవాత విచ్చిన్నమై , కమ్యూనిజం అధికారాన్ని కోల్పోయింది ) . జ్యోతిష్యంలాగే మార్క్సిజం కూడా పరీక్షకు గురి అయ్యే ప్రమాణాన్ని అన్వయించనందున , వైఫల్యాలతో సర్దుకుపోతోంది . ప్రతివైఫల్యానికి ఏదో ఒక సాకు ఉంటుంది . సోషల్ డెమోక్రట్ల విద్రోహచర్య , కార్మిక వర్గ అపరిపక్వత , వామపక్ష సెక్టీరియనిజం మొదలైనవి పేర్కొంటారు . ఇవన్నీ , సంఘటనలు జరిగిపోయిన తరవాత అన్వేషించే సాకులే . సిద్ధాంతం మాత్రం లోగడవలె ఇప్పుడు కూడా నిస్సారమైందే . పదజాలాన్ని మాత్రం సంపన్నం చేశారు . విధేయులుగా ఉండేవారు సంతోషించారు . కృశ్చేవ్ దోషాలను బయటపెట్టినప్పుడూ , మావోదురాక్రమణ చేసినప్పుడూ మూఢ విశ్వాసులమత్తు వదిలిపోయింది . ప్రాపంచిక అనుభవానికీ , విజ్ఞానానికీ మార్క్సిజం పనికిరానిదన్నప్పుడు , పరీక్షించడానికి తగిన ప్రమాణాలు ఈ సిద్ధాంతానికి అన్వయించవనే అర్థం . ఆచరణలో మాత్రం మార్క్సిజం అమానుష , సామాజిక ఫలితాలకు దారితీసింది . చరిత్రలో ఎన్నడూలేనంతగా భారీ ఎత్తున ఈ అమానుష కృత్యాలు జరిగాయి . మానవజాతికి ఇది చాలా ప్రధానమైన విషయం . అయితే మార్క్సిజం యొక్క వైజ్ఞానిక స్థాయిని నిర్ణయించటానికి ఈ విషయాలు సందర్భ సహితాలు కావు . మానవుడిని గురించి గాని , విశ్వం గురించి గాని ఇదే తుది సత్యమంటూ ప్రజాస్వామ్యం దేనినీ పేర్కొనదు . స్వేచ్ఛ , వ్యక్తి , గౌవరం , మనుషులలోని అంతర్యంలోనూ , పరిసరాల దృష్ట్యా ఎంతతేడా ఉన్నప్పటికీ మానవులందరినీ సమానంగా గుర్తించడం , ఇతరులతో సహకరిస్తూ సంపూర్ణ జీవితాన్ని గడపడం అనేవాటిని ప్రజాస్వామ్యం ప్రధానంగా స్వీకరిస్తుంది . ఇటువంటి విలువలను సాధించడానికి ఉత్తమోత్తమ సామాజిక వ్యవస్థను కనుక్కొనే పంథాను ప్రజాస్వామ్యం నమ్ముతుంది . అటువంటి మార్గం ప్రాపంచికానుభవంతో కూడిందేగాక , తాత్కాలికం కూడా . ప్రతివ్యక్తి కూడా ఈ విలువలను క్రమంగా సాధ్యమైనంత మేరకు సాధించ కుంటూ పోతాడు . అటువంటి సామాజిక క్రమాన్ని సాధించుకోడానికి ఏదీ ఉత్తమ పద్ధతి అని పరిశీలిస్తాడు . ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనేది కీలకమైన విలువ . సమాజంలోని వ్యక్తి మాత్రమే స్వేచ్ఛను సాధించగలడు . కనక ప్రజాస్వామ్యం అందరికీ ఓటు హక్కు కోరుతుంది . స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు కావాలంటున్నది . తమ ప్రతినిధులుగా ఉండదగనివారిని అధికారం నుంచి తొలగించే హక్కు వారికి ఉండాలంటుంది . ఆర్థికంగా అసమానత్వాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తే , రాజకీయ సమానత్వం అనేది కేవలం ఆటగామాత్రమే ఉంటుంది . అటువంటప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆర్ధికాధికారాన్ని వికేంద్రీకరించాలని ప్రజలు కోరారు . ఉత్పత్తి సాధనాలను జాతీయం చేయడం ద్వారా దీనిని సాధించవచ్చునని తొలుత భావించారు . ఆర్థిక స్వేచ్ఛను కోరిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గ్రేట్ బ్రిటన్ లో లేబర్ పార్టీని అధికారంలోకి ఎన్నుకోగా , వారు జాతీయీకరణతో ప్రయోగం చేశారు . కాని ప్రజాస్వామిక , కమ్యూనిస్టు దేశాలలో జాతీయీకరణ ప్రయోగం కనువిప్పుకలిగించింది . జాతీయీకరణకంటే , ఆర్థిక రంగాన్ని అదుపులో పెట్టడం వల్ల అనుకున్నవి సాధించవచ్చునని తేలింది . జాతీయకరణ వృధా అనీ , చికాకుకలిగించే పద్ధతి అని రుజువైంది . కమ్యూనిస్టు దేశాలన్నిటిల్లోనూ రాజకీయాధికారానికి ఆర్థికాధికారం తోడు అయింది . జాతీయకరణ వల్ల కలిగిన ఫలితమే ఇదంతా , ఒక పక్కన ప్రభుత్వానికి విపరీతాధికారాలుండగా , మరొక పక్క పౌరడు బానిస స్థాయికి దిగజారాడు . ఈ అనుభవం నుంచి ప్రజాస్వామ్యం గుణపాఠం నేర్చుకుంది . కనుక పిడివాదం లేని పంథాను అనుసరించాలని ప్రజాస్వామ్యం చెబుతుంది . సోషలిజంపై తీవ్రచర్చ జరిగింది . ప్రాశ్చాత్య ప్రపంచంలో ఇది ఇంకా మారు మ్రోగుతూనే ఉంది . దీని ఫలితంగానే 20వ శతాబ్దపు సోషలిజం అనే సిద్ధాంతం వెలువడింది . ( సోషలిస్ట్ యూనియన్ ప్రచురించిన ట్వంటియత్ సెంచరీ సోషలిజం చూడండి . పెంగ్విన్ బుక్స్ ) మార్క్సిజం ఇంకా జాతీయకరణనే పట్టుకువేలాడుతోంది . ముందుగా రూపొందించిన చట్రంలో వాస్తవాలను ఇమడ్చాలని ప్రయత్నిస్తున్నది . అనుభవాన్ని బట్టి సిద్ధాంతాన్ని స్వచ్ఛందంగా మార్చుకోవాలనుకోవడం లేదు . వైజ్ఞానిక సిద్ధాంతాన్ని అన్వయించడానికి గాను కొన్ని ఉదాహరణలు పరిశీలించాం . ఇది ఇతర విషయాలకు వర్తింపజేయవచ్చు . కులం , ఏకపక్షంగా నిరాయుధీకరణ , సమిష్టివ్యవసాయక్షేత్రాలు , శాంతి ప్రయోజనాల సాధన , పారిశ్రామికీ కరణకు పథకాలు - ఇత్యాదులను పరిశీలించవచ్చు . ఇవన్నీ ఎక్కువ స్వేచ్ఛను , వ్యక్తి సంక్షేమాన్ని కోరేవే . ఇటువంటి ప్రతిపాదనలు చేసిన వారి స్వేచ్ఛను , వ్యక్తి సంక్షేమాన్ని కోరేవే . ఇటువంటి ప్రతిపాదనలు చేసిన వారి ఉద్దేశాలను ప్రశ్నించకుండానే , ఏ మేరకు ప్రయోజనాన్ని సాధించామో పరిశీలించవచ్చు . అలా చేయడానికి గాను అనువైన వాస్తవాలను ఎక్కడ , ఎలా కనుక్కోవడమో వ్యక్తికి తెలియాలి . ఇందుకు తగిన శ్రమ చేయాలి . ఎలాంటి అరమరికలు లేకుండా నిష్పాక్షికంగా అన్వేషణ చేసే ధోరణి అలవరచుకోవాలి . అనేకమంది వ్యక్తులు ఈ విధమైన కృషి చేస్తే తప్ప , ప్రజాస్వామ్యానికీ మానవ విలువలకూ భద్రతలేదు . సంపన్నమైన సుసంఘటిత సమాజాలలోనూ ఇదే పరిస్థితి ఉంది . మనసమాజం సంపన్నమూ కాదు , సుసంఘటితమూ కాదు .
చిన్నప్పుడు గుడి చాలా చిన్నగా ఉన్నట్టు గుర్తు , 1986 తర్వాత చూస్తే చాలా పెద్దగా బాగా కట్టారు అనిపించింది . . ఎప్పుడూ జనాలతో కళ కళ లాడుతుంటుంది గుడి , కదండీ ! ?
" ఆడబ్రతుకే మధురం " అని రేడియో పాడుతున్నది . . . " ఆడబ్రతుకులో వున్న కష్టాలన్నీ ఈపిల్ల నెమరు వేస్తుంటుంది . కిష్టమూర్తి గారి కుటుంబాన్ని మిగిలిన వాళ్ళలాగా కాక చెడిపోయినట్లుగా భావిస్తుంది - ఎందుకంటే ఆయన వాళ్ళావిణ్ణి కొట్టడు . ఆవిడ చదువుకుంది . బాగుంటుందికాని చెడిపోయే ఉంటుంది . రేడియోలో పాట వస్తూనే ఉంటుంది . కథ ఇలా ముగుస్తుంది :
చిత్రం - కంచుకోట సంగీతం - కె . వి . మహదేవన్ సాహిత్యం - ఆచార్య ఆత్రేయ గళం - ఘంటసాల మరియూ పి . సుశీల లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు ఇలా ఉరకలు వేస్తావు నీలో ఉన్నది దాస్తావు ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు లేని దానిని చేస్తావు నాలో ఉన్నది దోస్తావు కొండ వాగుల కొంటె తనాల దూకుడు నీలో ఉంది నల్లని జడలో కరినాగుంది నడకలలో అది కనబడుతుంది లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు కళ్ళు మూసి నిదురపోతే కలలు రాని వేళే లేదు కలలో కొచ్చి కబురులు చెప్పే జతగాడైనా లేడు జతగాడైనా లేడు ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు దోర మాగిన దొండపండు నీ బుగ్గ సిగ్గులో ఉంది మొగిలి రేకుల సొగసూ ఉంది మొన కన్నులలో పదునూ ఉంది లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు వెన్నెలొచ్చినా మంచు కురిసినా వేడి తగ్గటం లేనే లేదు అద్దములోన అందం చూస్తే నిద్దర రానే రాదు నిద్దర రానే రాదు ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు లేని దానిని చేస్తావు నాలో ఉన్నది దోస్తావు
భీమదేవరపల్లి , జూలై 10 ( వి . వి ) : భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జెఎసి కోఆర్డినేటర్ కాశిరెడ్డి ఆదిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు . తెలంగాణపై నాన్చుడు ధోరణి ప్రదర్శింపక నాటి ఉద్యమం మొదలు నేటి ఉద్యమం ఎందరో అమరవీరుల బలిదానాలను అందించిన భారత కమ్యూనిస్టు పార్టీకి ఉందని రాష్ట్రంలోను , కేంద్రంలోను నిక్కచ్చిగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని శ్రీకృష్ణ కమిటీకి తెలిసిచెప్పిన ఘనత సిపిఐదేనని కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో భాగంగా సిపిఐ పార్టీ చేపట్టే కలెక్టర్ ముట్టడి కార్యక్రమానికి ప్రతి ఒక్క తెలంగాణ వాది తరలిరావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ నిరుద్యోగ ఎస్సీ , ఎస్టీ సంక్షేమ సమితి మండల అధ్యక్షులు మాట్ల హరికుమార్ , జెఎసి నాయకులు కుక్కముడి ప్రభుదాస్ , తూముల స్వామి , పౌల్ , రేణిగుంట్ల భిక్షపతి , సుధీర్‌కుమార్ , తదితరులు పాల్గొన్నారు .
ఈ రైలు అంత ప్రీక్వెంట్ కాకపోయినా కనీసం పూణేలో మనల్ని చూడటానికి సంవత్సరానికి ఒకరొచ్చినా తిట్టుకోకుండా వచ్చే అవకాశాముంది . .
జ్ఞాపకముందా ? చేస్తున్న పనిని ఆపి నువ్వు దిక్కులతో చర్చిస్తున్నప్పుడు నాన్నతో చీవాట్లు తిన్నది
మనం జీవితంలో ఏమేం చూచామో , జీవితంలో నుంచి ఏయే అనుభవాలు పొందామో , మనందరికీ ఆసక్తిని కలిగించే ఏయే విషయాలను గూర్చి ఏమని ఆలోచించామో , వాటితో ఎట్లా ప్రభావితులమైనామో - అదంతా రికార్డు చేస్తే సాహిత్యం అవుతుంది . శబ్దాల్లో శతాబ్దాల , సహస్రాబాల పొడుగు మానవ జీవితాన్ని ప్రకటించడమే స్థూలంగా సాహిత్యం . జీవితంతో ఇంత దగ్గరి సంబంధం గల సాహిత్యాన్ని జీవితపు మాలిన్యం అంటకుండా దూరంగా ఊహాలోకంలో స్నానమాడించి , పవిత్రంగా ఉంచడానికి ప్రయత్నించే సాహిత్యకారులు కొందరు అన్ని కాలాల్లో ఉన్నారు . వారితో మనకు ప్రమేయం లేదు . కాడలు , తీగలు , కొమ్మలు , వేళ్ళు , నేల - ఏమీ లేకుండానే వికసించే ఆకాశ కుసుమం వంటి సాహిత్యం మనకు ఉపాధేయం కాదు . ఉదాత్తమైన సాహిత్యంలో ఆధునికమని , ప్రాచీనమని ఏమీ ఉండదు . ఇవి కేవలం కాలాన్ని నిర్ణయించుకోడానికి ఉపయోగపడే శబ్దాలు . వెనుకటి సాహిత్యాన్ని ప్రాచీనమనీ , ఈనాటి సాహిత్యాన్ని ఆధునికమనీ అనుకోవాలి . ప్రతి ఆధునికుడూ నవ్యుడు కానక్కరలేదు . పురాతన రీతిలో వ్రాసే ఈనాటె రచయిత కూడా ఆధునికుడే . అతడు నవ్యుడు కాకపోవచ్చును . Read the rest of this entry »
రవి . . మీ మొదటి పాయింటు . . మీ తీరుకున్నంత సేపు ఖండించండి , ఏం పర్లేదు : ) మీ మిగతా మూడు పాయింట్లకి ఈ టపాలో నా పిలుపుకీ ఏవ్హీ సంబంధం లేదు . కథల పోటీలు ఆపింది ఎవరికో భయపడీ కాదు , బద్ధకం మూలంగానూ కాదు ( మిగతా వాళ్ళంతా కష్టపడి రాస్తుంటే నా బద్ధకానికొచ్చిన ఢోకా ఏం లేదు ) . ఒక్కొక్క పోటీకీ వచ్చిన పదిహేను ఇరవయ్యేసి కథలు చదివేందుకు తీరిక దొరక్క అలా వాయిదాలు పడి , ఆ రాసిన వాళ్ళు ఖాయిలా పడి . . దీన్ని మళ్ళీ కొనసాగిస్తాను ఎప్పుడో . రాయలవారి వేషం నేనైతే ఇప్పటికి పక్కన పెట్టేసినట్టే . ఆ వేషం వేసేందుకు నాకంటే బోలెడు సమర్ధులు ఇప్పుడు బ్లాగ్లోకంలో తగినంత మండి ఉన్నారు . పొద్దు వారు పూనుకుంటే నా ప్రమేయం లేకుండానే భువన విజయం జరిపించవచ్చు . దీపాల రిఫరెన్సు ఏంటో అర్ధం కాలేదు .
రామారావు గారూ ! ! నా ఆ అభిప్రాయాన్ని ఎడిట్ చేసి వేయడం కారణంగా మీకు కలిగిన పొరపాటు అభిప్రాయం మాత్రమే అది . అందుకు నా బాధ్యత ఏమీ లేదు . గమనించండి . నేను మిమ్మల్ని ఒక " విమర్శకునిగా " ఆ నా అభిప్రాయంలో పేర్కోలేదు . నాకు తెలీదు మీరు విమర్శ ఏమన్నా రాసేరని . అభిప్రాయాలు మీరు ఒక పుస్తకం మీద చెప్పినట్టే అందరికీ ఉంటాయి . నా అభిప్రాయం మీకు ఒప్పుదల కాకపోయినంత మాత్రాన దానిని " తిట్టుగా " భావించనక్కరలేదు . నేను పేర్కొన్న అభిప్రాయం అభిప్రాయం మాత్రమే . " తిట్లు " కావు . నేను రాయని అభిప్రాయాలని నాకు ఆపాదిస్తే అందుకు నేను ప్రతిస్పందించనక్కర లేదు . నా భావం వీళ్లకి అర్ధం కాలేదు అనుకుని ఊరుకుంటాను .
ఏ ఉద్యోగంలోనూ శాటిస్ ఫాక్షన్ ఉండడంలేదు . రెండేళ్ళలో నాలుగు ఉద్యోగాలు మారా ! అయినా పరిస్థితిలో మార్పులేదు ! ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ! చదివిన చదువుకు చేస్తున్న ఉద్యోగానికి సంబంధంలేదు . ఇండియాలో ఉపాధి కరవైన వేళ , అమెరికాలో జాబనగానే ఎగిరి గంతేసి వచ్చింది నేనే ! మొదటి అయిదేళ్ళు ఆలోచించే తీరిక లేకుండా , అంతా ఆహా ఓహో అన్నట్లు గడిచింది . అక్కణ్ణుంచి ఎన్నాళ్ళిలా అంటూ మొదలై . . . ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనుకుంటూ మరో రెండేళ్ళు , ఇంకా ఒకే కంపెనీలో కూర్చుంటే లాభం లేదని వేట మొడలెట్టా . కంపెనీ మారినా , టైటిల్ మారినా . . . మనిషి మారలేదు , ఆటని . . . అన్నట్లు చేసే పని పెద్దగా మారలేదు . మళ్ళీ వెదుకులాట , మరో కొలువు ! మరో కొలువు . . . మరో కొలువు ! ఉదయం మా పక్కింటావిడ కనిపించి . . . మళ్ళీ ఉద్యోగం మారావటగా కంగ్రాట్సని వూరుకోకుండా , నీకు వెంట వెంటనే భలే ఉద్యోగాలు దొరుకుతున్నాయే అని ఆశ్చర్య పోయింది . ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే అన్న సామెత గుర్తొచ్చింది . పై మెట్టు ఎక్కే స్కిల్స్ , అనుభవం ఉన్నా , అవకాశపు నిచ్చెన అగుపించడంలేదు . ఇదే మాట ఒక ఫ్రెండ్ తో అంటే , నువ్వు కుదురుగా ఒక చోట పనిచేస్తేగా ఎగప్రాకే అవకాశమొచ్చేది అన్నాడు ! ఇంకెవరైనా ఆ మాట చెబితే , నిజమో కాదో కాస్తన్నా ఆలోచించే వాణ్ణి ! మిత్రుడు , ఎనిమిదేళ్ళుగా ఒకే కంపెనీలో . . . మారని జాబ్ టైటిల్ తో పని చేస్తూ ఉన్నాడు . అలా అని నా స్కిల్స్ లోనో , నా ప్రయత్నాల్లోనో లోపం లేదని కాదు ! ఉంటే ఉండొచ్చు అని ఆలోచిస్తూ పోతే , నా కేమి కావాలో నేనే ఇథమిద్దంగా తెలుసుకోక పోవడం ప్రధాన ప్రతిబంధకంగా కనిపించింది , మిగిలిన లోపాలు ఒకటీ అరా ఉన్నా ! ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు , నేనున్న పరిస్థితుల్లో ఇంకా కొందరున్నారనిపించింది . ఈ సమస్యకు పరిష్కారం - ఇండియా వెళ్ళి అక్కడ ఉద్యోగం వెదుక్కోవడమేనని కొందరి అభిప్రాయం ! అదెంత వరకు ఉపయోగిస్తుందీ అని ప్రస్తుతపు నా ఆలోచన !
దైవభక్తి ఉంటే దేశసేవ చేద్దామన్న కుతూహలం ఆటోమేటిక్ గా వస్తుందని వాదించే వాడు . పొద్దున్నేలేచి , కాల కృత్యాలు తీర్చుకొని , కాలవొడ్డు దగ్గిర ఆంజనేయస్వామి వారి విగ్రహాన్ని దర్శించుకొని , ఆ విగ్రహంకాలిమీద నూనెలోనాని జిగురుగా కారుతూన్న ఎర్ర సిందూరం నుదిటిమీద , గొంతుకమీదా రాసుకోందే మంచినీళ్ళుకూడా తాగడు . ఆ పని పూర్తి అయ్యింతరువాతే అయ్యరుగారి హోటల్కెళ్ళి సాంబారిడ్లీ లాగిస్తాడు . తీరిగ్గా అరకప్పు కాఫీ అరగంట సేపు తాగుతాడు .
వికలాంగుల సోమ్మును భోంచేస్తున్నప్రబుత్వ ప్రబుద్దులు
నిజం గా కేంద్ర ప్రభుత్వం " కాశ్మీరు సాయిబ్బు బాబులూ - - భారతీయ జన జీవన స్రవంతిలో కలవండి - - మీకు గడ్డాలూ , జుట్టూ మేము వుచితం గా , నెప్పి తెలియకుండా కత్తిరించి పెడతాము ! " అంటూ ఓ పథకం ప్రకటించి , దాని అమలుని అఖిలపక్ష నేతలకి అప్పచెపితే యెంత బాగుంటుంది !
మనకింత సంతోషంగా వుందికదా ! If I am right , వాళ్ళీపాటికి " ఈ దరిద్రులు ఎందుకు గెలిచార్రా ? ఎంత కష్టపడి ఒక ఇష్ష్యూ క్రియేట్ చేశాం " అని తెగ బాధపడుతుంటారు .
హిందోళంగురించి శ్రీ కొడవటిగంటి వ్రాసిన వ్యాసం చాలా ఉపయుక్తంగా ఉన్నది .
గజల్ శ్రీనివాస్ నిజానికి ఒక వేటగాడు . నిజం నమ్మరా ? ఒక్కసారి అతన్ని కలిసి మాట్లాడండి మీకే తెలుస్తుంది . వెంటాడి , వెంటాడి భందిచేవాడ్ని వేటగాడు అనికాక పాటగాడని ఎలా అనుకోమంటారు ? కాకపోతే వేటగాడు ఆయుధంతో వేటాడితే ఈయన తన గాత్రంతో , గజల్‌తో వెంటాడుతారు . అందుకేనేమో ఆయనే అన్నారు " నా గజల్‌కి కత్తికున్నంత పదునుంది కాదంటారా " అని . ఎలా అంటామండీ ఆయన గజల్‌కి రెండు వైపులే కాదు అన్నివైపులా పదునే . ఆ పదును తెలియాలంటే ఆయన స్వరంలో ఆయన సమక్షంలో కూర్చొని వినాల్సిందే . కాదు కాదు నాకు క్యాసెట్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి , పదే పదే మీ వద్దకు రాలేనుగా అన్నా . పదే పదే వెళ్ళలేకపోయినా కాశీ వెళ్తే మాత్రం గంగలో ఒక మునక వేస్తాం . అదే ఇంటిముందు పారితే గుడ్డలుతుకుతాం కాదంటారా అన్నారు . ఏమంటాం నవ్వాపుకోవటానికి , ఆ మాటల్లో లోతైన భావాలను అర్ధంచేసుకుని తేరుకోవటానికే చాలా టైం పట్టింది . ఆయన మాటల్లో మనకి ఆయనలో ఉన్న తత్వవేత్త కనిపిస్తాడు . కానీ అది మన మనస్సులోకి చొప్పించే ప్రయత్నంచేయడు . తన గజల్‌లోని దాగి ఉన్న మర్మాన్ని మాటల్లో అందంగా అరటిపండు తొక్కతీసినట్టుగా వివరించి మన చేతిలో పెడతారు . ఆపైన ఆరగించని వాడు , అరిగించుకోని వాడు శుద్ద వెధవాయి అని నే వేరేగా చెప్పాలా ?
విజయవాడ కర్మక్షేత్రంలో రాజమార్గాలను కాలిమార్గాల్నీ - సర్వే చేసినవాడు - కనకనే " చీకటి " కథలో పాసెంజర్లకోసం వేచివున్న సావిత్రినీ , జలగలాంటి అప్పారావును , కథలో వచ్చే సోషలిస్టు స్వప్నాన్నీ కాపాలికుడిగానే సృష్టించగలిగాడు .
ఈమధ్య నేను ఇటువైపు రాలేకపోడానికి కారణం ఐయీ లో మీ బ్లాగ్ ఓపెన్ చేస్తే వందల కొద్దీ పేజీలు రావడం . . చాలా చాలా ఇబ్బంది పడ్డాను . . ఇప్పుడే ' విహారిణి ' మార్చానండీ . . తొలి ప్రయత్నం చేస్తున్నా . . మీ బ్లాగ్ ప్రయాణం ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా . . కాసేపు నేనూ నా బ్లాగ్ జ్ఞాపకాల్లోకి వెళ్లి వచ్చేశాను . .
" అవును మీరూ … నువ్వు . . . అర్జున్ … అవునా ? " ప్ర శ్నించ బోయి వెంటనే గుర్తు పట్టి అడిగాడు .
గబ్బిలమవయ్యు శివుని లోకంబునందు వలయు కదలిక గలిగించి వచ్చినావు నిశ్చలంబైన కాసారనీరమునను నలతి శిల చాలదే వలయముల దీర్ప
" మీ ఆంధ్రోల్లంతా దోపిడీ దారులు . ఇక్కడినుంచీ దొబ్బేయండి బే ! " " పోతాం గానీ , మీరెవరు ? " " మేం తెలంగానోల్లం . . మా జాతి వేరు , బాస వేరు గోస వేరు యాస వేరు " " కాకతీయుల , రాయల కాలం లో అంతా ఒకటి గా ఉన్నాం కదా , మరి మీరు ఎప్పుడు వేరు పడ్డారు ? " " నిజాం మమ్మల్ని ఏలినప్పుడు , మా బాస లో ఉర్దూ చేరింది . మా గోస మారింది " " అంటే మీ బాస కి ఒక రకం గా నిజామూ , తానీషా , ఆదిల్ షాహీ లు కారణం అన్న మాట . . . ఆ పాలకులు మిమ్మల్ని చాలా బాగా పాలించి ఉంటారే . . వాళ్ళంటే మీకు చాలా అభిమానమనుకొంటా . . ? " " కానే కాదు నిన్నెగిరి తంతం కొడకో నైజాము సరకరోడా అన్నది కూడా మేమే . తెలంగాణా వెనుకబడిపోవటం మొదలుపెట్టింది నిజాం జమానా లోనే . . " " కానీ మీ యాస మీకు వచ్చింది నిజాం వలననే కదా ? " " మా యాసంటే మాకిష్టం . . . నిజాం ని మాత్రం ఎగిరి తంతం " " సరేలే ఎవడి కంపు వాడికిష్టం . . ఇంతకీ శ్రీకృష్ణ కమిటీ కి నువ్వేదో విజ్ఞాపన ఇచ్చావంట కదా ? " " మేం చానా ఎనకా పడిపోయినం . . తెలంగాణ ఇవ్వాలే . . ఈ ఆంద్రోల్లు మమ్ముల్ని దోచుకొంటున్నారు అని ఇచ్చినా . . జై తెలంగాణ ! " " మరి శ్రీకృష్ణ తెలంగాణ ఏమీ వెనక పడలేదని తేల్చి చెప్పినాడు కదా ? " " ఇదంతా ఆంద్రోల్ల కుట్ర . . మేము చానా ఎనకా పడిపోయినం . . ఎనక పడిపోలేదు అన్నవాడెవడినైనా ఎగిరి తంతం . . జై తెలంగాణ . . శ్రీకృష్ణ మల్లీ తెలంగాణ కు అనుకూలం గా రిపోర్ట్ ఇచ్చేదంకా ఘెరావ్ చేస్తం . . జై తెలంగాణ " " ఆంద్రోల్లు మిమ్మల్ని తక్కువ గా చూడటం నిజమేనా ? " " నిజమంటే నిజమే . . అయినా అబే ఆంద్రోల్లకేం తెలుసు . . ఆల్లు ఉద్యమాలంటే సినిమా ఫంక్షన్లనుకొంటరు . . ఉద్యమాలంటే తెలంగాణ బిడ్డలే చెయ్యాలే . . . ఆంద్రోల్లంతా గుంట నక్కలు . . సీమోల్లు గూండాలు " " తెలంగాణ వచ్చినాక అంతా అభివృధ్ధి అవుతుందా ? " " అదంతా నీకెందుకు బే ఆంద్రోడా . . ఛీ పో అంటున్నా పోవేమిరా . . అభివృధ్ధి చెందితే చెందుతం లేకుంటే అన్నల్లో కలుస్తం " " గత యాభై ఏళ్ళుగాఏ విజయవాడ నో డెవలప్ చేసుకొంటే ఈ పాటికి మేము చాలా ముందుండే వాళ్ళం . ఇప్పుడు మా డబ్బూ , శ్రమంతా అంతా హైదరాబాదు లో పెట్టాం . మరి వేరుపడితే హైదరాబాదు లో పెట్టిన దానికి నష్ట పరిహారం ఇస్తారా తెలంగాణ వాళ్ళూ ? " " గత యాభై ఏళ్ళు గా మీ ఆంద్రోల్లు తెలంగాణ ని దోచిందంతా వాపస్ ఇస్తారా ? " ఆంద్రోల్లు తెలంగాణ వాల్లని దోయలేదని కదా శ్రీకృష్ణ చెప్పాడు ? " " వానిష్టమేనా ఏది పడితే అది చెప్పనీకి ? మాకు ఏది ఇష్టమైతే ఆ శ్రీకృష్ణ గాడు అది చెప్పాలే . . లేకుంటే ఉద్యమాలు చేస్తం . . రాళ్ళు రువ్వుతం . . ఇండ్లు తగులబెట్టి కేసులు మాఫీ చేయించుకుంటం . . సినిమా రీళ్ళు తగులపెట్టమని పబ్లిక్ గా టీ వీ ల ల ఫట్వాలు జారీ చేస్తం . . . మా లాయర్లు ఇల్లీగల్ గా జడ్జీల మీదికి దాడి చేస్తరు . . . బిడ్డా ఇయాల్రేపు తెలంగాన పేరు మీద ఏది చేసినా నడిచిపోతది . . . మా లెక్చరర్లు పిల్లలకి రాళ్ళు రువ్వుడు లో పాఠాలు చెప్తరు . . . కానీ మా ప్రొఫెసర్ల జీతాలకు మాత్రం ఏ మాత్రం తేడా రాకూడదు . . వలస ప్రబుత్వం ఇచ్చే జీతాలంటే మా కోదండ రాం అన్నకు చానా ముద్దు . తెలంగాణ లో తిరగ నివ్వం . . . సంక్రాంతికి సెలవలనుండీ రానివ్వం . . వరవర రావు మావోడే , వర్గ పోరాట యోధుడు గద్దరన్న మావోడే , హై కోర్ట్ ల నరసిమ్హా రెడ్డి మావోడే ! మేధావి చుక్కా రామయ్య మా వోడే . . ఆల్లంతా ఉన్నరు మామీద కేసులు ఎత్తివేయించటానికి " " అన్నా . . తెలంగాన కావాలంటే తీసుకో , హైదరాబాదు తెలంగాన ఎట్లవుతదే ? ఇదంతా ముస్లిం కల్చర్ కదా . . వాల్ల బాస వేరు . . వాల్ల గోస వేరు కదా ? " " ఆ తల్వార్ తీసుకు రండిరా భై వీన్ని నరికి పారేయాలి . . . హైదరాబాద్ అంటే ఏమనుకొంటున్నవ్ బే ? తెలంగాణ రైతులందరూ తమ రక్తం , చెమటా నీరు గా చేసి హైదరాబాదు లో ఉన్న పెద్ద పెద్ద పొలాలలో వ్యవసాయం చేసి పంటలు పండించిర్రు బె . . . హైదరాబాదు అనేదే తెలుగు మాట . ఆ మాటకు అర్ధం " తెలంగాణ " అని . ఇంకో సారి ఈ మాట అన్నవంటే నిన్ను ప్రాణాలతో మిగల్నివ్వను . . ఆ " " ఊరుకో అన్నా . . నరుకుడు దాకా ఎందుకు లే ! శ్రీకృష్ణ కలిసి ఉండమన్నాడుకదా . . ఆయన మాట మనమందరం వింటే మంచిది " " ఆడెవడు బే . . . ఆ లంజకొడుకు లగడపాటి గాడు వానికి మంచిగా పైసలు ఇచ్చి ఉంటడు . . అయినా . . . తమ్మీ మమ్మల్ని రెచ్చగొట్టొద్దు . . అసలే మా బుర్ర అరికాలులో ఉంటది . . . ఎర్రగుడ్డ చూసిన ఎద్దులా రెచ్చిపోతం . . సమైక్యాంధ్ర అంటే మామనోభావాలు గాయపడతై . . ఎందుకంటే సమైక్యాంధ్ర ఉద్యమం కృత్రిమ ఉద్యమం . అదేంటి ర భై . . ఆ . . స్పాన్సర్డ్ ఉద్యమం . . . మాదే కరక్ట్ ఉద్యమం . . ఎందుకో ఎరికేనా . . . మా ఉద్యమం ల కలక్షన్లు మస్తుగుంటై . . . స్పాన్సర్డ్ ఉద్యమాలల పైసలు పోవుడే గానీ వచ్చుడు లేదు . . . కాబట్టీ మాదే నికార్సైన , కర్సులేని , కలక్సన్ల ఉద్యమం . . . మేము తెలంగాన అంటే మీరు జర కామోష్ గా కూసుంటే మంచిగుంటది . . . సమజైనదా . . . ? " " లగడపాటిని లంజకొడుకనటం బాగోలేదన్నా . . కొంచెం భాష మంచి గా ఉంటే మంచిదన్నా . . ! " " ఏమిరో నీ కోస్తా అహంకారం . . భాష మాకు నేర్పే వానివా ర నువ్వు . . డేడ్ దమాగ్ గాని లెక్కున్నవ్ . . మా కేసీఆర్ అన్నని అడుగు చెప్తాడు మంచిగ ఎలా మాట్లాడాలో . . ధూత్తెరీ . . సాయం కాలానికి వసూలు చేసుకోవాలే , ఆ ఇయాల కలెక్షన్ ఎంత బే ? . . కాబట్టీ తమ్మీ అదంతా మాకు తెల్వద్ తెలంగానా ఇయ్యాల్సిందే . . . . జై . . జై . . . . జై . జెయ్య్య్య్య్ . . . తెలంగాన . . "
ఇది రొటీన్ జెనెరలైజేషన్‌లాగ ఉంది . చీపురుపల్లె అంటే చీపుర్లు తయారు చేసేవాళ్ళు ఉండే ఊరు కాదు . అది రైస్‌మిల్‌లు ఉన్న ఊరు . బొత్స సత్యనారాయణ వాళ్ళ సొంతూరు చీపురుపల్లి కాదు , వాళ్ళ ఊరు బొబ్బిలి దగ్గర . కెబ్లాసవాళ్ళు ఇలాగే తెలిసితెలియని స్టైల్‌లో చీకాకోలం అడవులు అని వ్రాసారు . నిజానికి మా పట్టణం చుట్టుపక్కల అడవులు లేవు . పట్టణం నుంచి పది , పదిహేను కిలో మీటర్ల దూరం వరకు చిన్న అడవులు కూడా లేవు . ఇక్కడ వ్యవసాయ భూములే ఎక్కువ . అలాంటి జెనెరలైజేషన్స్ వ్రాస్తే నీకూ , ఆ తెలివి తక్కువ కెబ్లాసకీ మధ్య తేడా కనిపించదు .
" భగవంతుని ప్రేమికులు ఏ కులానికీ చెందరు … . ప్రేమ గుణం లేని బ్రాహ్మణుడు , బ్రాహ్మణుడు కాజాలడు . భక్తి ద్వారా అంటరాని వాడు కూడా పరమ పవిత్రుడు కాగలడు . " అహింస మరియు శాఖాహారము : హిందువులు సృష్టి లోని సకల జీవజాతులు జీవించడానికి సమాన హక్కు కలిగివున్నాయని భావించడం వలన అహింసను పరమావధిగా భావిస్తారు . ఈ అహింస అనే పదం ఉపనిషత్తు లలో కనిపిస్తుంది . అంతే కాక మహాభారతం లోను మరియు పతంజలి యోగసూత్రాలలో ఈ పదం గూర్చిన ప్రస్తావన ఉంది .
2 . కూరగాయలు చక్కగా ఉడికి , మీరు అందులో వేసే మసాలాలూ అవీ వాటికి పట్టాలంటే కూరగాయలని తరిగి వండుకోండి .
సృష్టిలీల బహు చిత్రంగా ఉంటుంది . కాలరథం రహదారి పక్కన శాఖోప శాఖలుగా విస్తరించి , దారిన పోతున్న అనేక మంది బాటసారుల బడలిక తీరుస్తూ తనదంటూ ప్రత్యేకత నిలుపుకున్న ఆ మహావృక్షపు శాఖాగ్రచ్ఛాయల దరిదాపుల్లో అప్పుడే మొలకెత్తిన ఓ చిన్ని మొక్క తలెత్తి ఆ మహావృక్షపు ఎత్తును అంచనా వేయడానికి సంకల్పించింది .
శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తమ పద , లయ విన్యాసంతో పరమశివుని మెప్పించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా " సహస్ర భావ పుష్ప మాలిక " గా 1000 గీతాలను వ్రాయ సంకల్పించి , గత పదేండ్లుగా వ్రాస్తూ వచ్చారు . అభిమానుల ప్రోత్సాహంతో తొలి విడతగా 54 గేయాలను " శివ దర్పణం " గా ముద్రించారు . అందలి విశేషాలను పరిశీలిద్దాం .
పొగడ్తలు సహేతుకంగా లేకపోతే ఆ విషయం పాఠకులకి తెలిసిపోతుంది . పొగిడేవాన్ని వంధిమాగధులకింద జతకడతారు . అయితే తెగడ్త సహేతుకంగా లేకపోతేమాత్రం అనాగరికం అనిపించుకుంటుంది .
అనేక మంది ప్రసిద్ధ మరియు ప్రఖ్యాత వ్యక్తులను , ముఖ్యంగా సంగీత మరియు సాహిత్య కళాకారులను మిసిసిపీ రాష్ట్రం అందించింది . ప్రసిద్ధ వ్యక్తుల్లో :
సాహిత్యపేజీల్లో వాదనలతో నిండిన అకవిత్వపు చీకటికి అలవాటు పడిపోయి ఉన్నాం పాఠకులం . ఇలాంటి చక్కని సంకలనాల దీపాలు మరిన్ని వెలిగించేందుకు కవిలో తైలమెప్పటికీ తరగదనే ఆశిద్దాం .
రాధిక గారూ , మీ ఈ కవిత మీద నా అభిప్రాయం రాద్దామని అనుకుంటే చాలా సార్లు ఈ బ్లాగ్స్పాట్ నన్ను రాయనివ్వలేదు . ఇప్పటికైనా కుదిరింది . రాస్తున్నా . చాలా రోజుల తరువాత స్పందించిది మీ కవితా హృదయం . చాల చక్కగా వుంది . అప్పుడప్పుడు అనుకుంటూ వుంటా మీలా కవితలు కూడా రాయాలని . రాయలేకపోతే ఏం మీలా కవితలు రాసే వాళ్ళుంటే వాటిని చదువుకుంటూ ఆ ఆశ ని తీర్చుకోవచ్చు . విహారి http : / / vihaari . blogspot . com
కుటుంబ వ్యవస్థ విఛ్చిన్నమైపోతున్న సమాజాలలో ఈ " దినాల " అవసరం చాలా వుంది . మారుతున్న పరిస్థితులదృష్ట్యా , మనకున్న పాశ్చ్యాత్య అనుకరణల ధోరణి నేపధ్యంలో ఇవి ఇక్కడా ప్రవేశించాయి . ఇందులో value judgment కన్నా , ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పిల్లలు ఏంచేస్తున్నారో తెలుసుకుంటే మీ దుగ్ధ కొంచెం తగ్గుతుందేమో ! మాతృత్వానికే కాక పితృత్వానికి కూడా విలువనిస్తూ ఫాదర్స్ డే కూడా జరుపబడుతుంది . కాబట్టి ఈ ఏకపక్ష ప్రేమ మీరు చెప్పినంత దారుణమేమీ కాదు . రోజువారీ అమ్మకష్టాన్ని కేవలం చూసే పిల్లలు , సంవత్సరంలో ఒక రోజు పనిగట్టుకుని ప్రేమ చూపించే ప్రయత్నం చేస్తే అందులో జరిగిపోయే దారుణమేమిటో నాకైతే అర్థం కావటం లేదు . వాళ్ళపిల్లలిచ్చిన గ్రీటింగ్ కార్డుల్ని ఫ్రిజ్ తలుపులకు అంటించి మురిసిపోయిన తల్లులు చాలా మంది నాకు తెలుసు . వారికి ఆ ఆనందంకూడా వద్దంటారా ? తల్లితనాన్ని పొగడటం ద్వారా పిల్లలు కనలేని తల్లుల్ని అవమానిస్తున్నారంటున్నారు . ఇంతకంటే నిర్హేతుకమైన వాదన మరొకటుండదు . తల్లవని ఆడదాన్ని ప్రతిరోజూ ఈ సమాజం , ముఖ్యంగా తోటిఆడవాళ్ళు ఎలాగూ సూటిపోటి మాటలతో సాధిస్తారు . ఈ ఒక్కరొజుతో ఆమె కష్టాలు రెట్టింపైపోతాయని మిగతావాళ్ళ ఆనందాన్ని తృంచేద్దామంటారా ? స్త్రీగర్భం ధరించిన తరువాత కుటుంబం , సమాజం , ప్రభుత్వం ఏఒక్కరోజూ తమ బాధ్యతల్ని నిర్వర్తించిన దాఖలాలు మీకు కనబడలేదన్నారు . దీన్నిబట్టి మీరు ప్రపంచానికి ఎంతదూరంగా వున్నారో తెలుస్తోంది . మరి ఈ బాధ్యతలన్నీ ఎవరు నెరవేరుస్తున్నారు ? మీలాంటి స్త్రీవాదులా , స్వచ్చంధ సంస్థలా లేక పైనున్న దేవతలా ? ఎవళ్ళూ ఏమీ చెయ్యకుండానే మీలాంటివాళ్ళ సంకల్పబలంతో అన్నీ సకరమంగా జరిగి భారతదేశ జనాభా రోజురోజుకీ అభివృద్ధి చెందుతోందా ! గర్భందాల్చిన భార్య మానసిక స్థితి భర్తకికాక ఇంకెవరికి తెలుస్తుంది ? భార్య మానసిక వత్తిళ్ళ ( మూడ్ స్వింగ్స్ ) వలన ఏర్పడే కుటుంబ టెంషన్ భర్తకాక ఇంకెవ్వరు భరిస్తారు ? లేబర్ పెయిన్ సృష్టిలో అత్యంత వేదనభరితమైన బాధ అని తెలీకుండానే అర్బన్ మేల్ బతికేస్తున్నాడనా మీ భావన ? ఇంతా చెప్పి , మళ్ళీ కడుపునిండా పాలివ్వాని క్రూరత్వాల గురించి మధ్యలో చెప్పారు . . . అదెక్కడ్నుంచీ వచ్చింది ? అంటే celebrate చేస్తే ఒక తపొప్పు . . . వీటిమధ్యలో అక్కడక్కడా జరిగే deviations మీద ఫోకస్ లేదని మరో విరుపు . చేసినా తప్పే చెయ్యకపోయినా తప్పే అన్నమాట . " మానవ జాతిని వృద్ధి చేసే మహత్తర కార్యాన్ని భుజాలకెత్తుకుని , ప్రకృతి తనకు మాత్రమే ప్రసాదించిన గురుతర బాధ్యతను ఎంతో నిష్టతో , ఇష్టంతో కొనసాగిస్తున్న సమస్త స్త్రీ జాతికి ప్రపంచం మొత్తం రుణపడి వుంది . " అంటూ మీరూ పనిలోపనిగా మంచుపల్లకీ ఎక్కించేసి . . ఆ తరువాత ఇలా చేసే మగాళ్ళని మాత్రం అటకెక్కించి అగ్గంటిచెయ్యాలంటారు . ఏమిటీ విపరీతం ? మీ ఆలోచనల్లో పొంతన లేదుగానీ , బాణం ఎక్కుపెట్టి స్త్రీవాదులు కానివాళ్ళని చీల్చి చెండాడమంటే మాత్రం పదాలు జాలువారతాయి . ఈ మధ్యనే " అమ్మ " అనే ఒక సంకలనంకూడా బ్లాగుటపాలతో కూర్చబడింది . దాన్నికూడా చదివి మరింత బలంగా ఇంకో టపా రాయండి .
ఆంద్ర వలసవాదం ఆంధ్ర , రాయలసీమల నుంచి వలసలు పెరగడం వల్ల తెలంగాణ జనాభాలో 18 శాతం పెరుగుదల కనిపిస్తుంది . గత 30 ఏళ్లలో హైదరాబాదులోని కాకుండా తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో పలు కాలనీలు వెలిశాయి .
గిరిజనల ఆరోగ్యం విషయంలో ఐటీడీఏ తీరు ఎలా ఉందో ప్రశ్నార్థకంగా మారింది . కేవలం పౌష్టికాహారం పంపిణీ విషయంలో శాఖల మధ్య పారదర్శకత లోపించి చివరకు పౌష్టికాహారం గిరిజనులకు చేరకుండా , ఒక వేళ చేరినా అది తినడానికి వీలులేని స్థితిలో చేరడం దయనీయం . గిరిజన టీబీ పేషెంట్లకు , గర్భిణులకు , బాలింతలకు ఒక పౌష్టికాహారం ప్యాకెట్ చేరడానికి మధ్యలో ఇంత సమయం ఎందుకు పడుతుంది ? పౌష్టికాహారం తయారు అయిన వెంటనే చెంచులకు చేర్చడానికి మధ్య ఉన్న శాఖల మధ్య సమన్వయం కల్పించటానికి ఎటువంటి చర్యలు తీస్కున్నారు ? అసలు ఇలాంటి కార్యక్రమం ఒకటి ఉందని అడవులలో గూడేలలో నివసించే గిరిజనులకు ఎందుకు తెలియటంలేదు ? ఈ కార్యక్రమం పై గిరిజనులకు అవగాహన కల్పించేందుకు ఎంత వరకు ప్రయత్నించారు ? బెనిఫిషరీస్ లిస్టులో పౌష్టికాహారం అందుకోవాల్సిన గిరిజనులకు కనీస సమాచారం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ? ఇలాంటి ప్రశ్నలు గిరిజనుల అభివృద్ధికై ఏర్పాటు చేయబడిన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ అధికారులకు ఏ మాత్రం పట్టవు . పౌష్టికాహారం తయారు చేసి ఇవ్వడం వరకు మాత్రమే తమ బాధ్యత అంటూ చేతులు దులుపుకుంటున్న జీసీసీ అధికారులు , ఈ విషయంలో పీఓపై ఆరోపణలు చేస్తున్న డియం అండ్ హెచ్‌వో , పౌష్టికాహారం చెంచులకు చేరవేయటంలో నిర్ల్యక్ష్యం వహిస్తున్న క్రింది స్థాయి అధికారులు , వీరందరి మధ్య పౌష్టికాహారం చేరని గిరిజనులు . మొత్తానికి నెల నెలా లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ చెంచుల కోసం ప్రవేశ పెట్టిన పౌష్టికాహార పధకం సున్నాగానే మిగిలిపోతుంది .
కామారెడ్డిటౌన్ , జూలై 11 ( కెఎన్‌ఎన్ ) ; కామారెడ్డి పట్టణంలో హౌజింగ్ బోర్డు కాలనీలో సోమవారం మధ్యహ్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయలు అయ్యాయి . ఢి కోన్న కారు నెంబర్ ఎపి28 బిఇ2865గల కామారెడ్డి నుండి దోమకొండ వేళ్తున్న మహేందర్‌రెడ్డి , శోభ హైదరబాద్ నుండి కామారెడ్డికి వస్తున్న భవాణి , బార్గవి , శ్రావణిలకు వీరు ప్రయాణీస్తున్న కారుబ్రేక్ ఫెల్ కావడంతో ఎదురుకుగా వస్తున్న మహేందర్‌రెడ్డి కారును ఢి కోట్టింది . దీంతో భవాణి , బార్గవి , శోభకు తీవ్ర గాయలు అయ్యాయి . చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు . ఈ మేరక కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నమన్నాని పోలీసులు తెలిపారు .
" తల్లి అయి ఉండి ఈ పనేంటి అని ఆలోచిస్తున్నావు కదూ ? " తన మనసులోని మాటని కనిపెట్టినట్లుగా అడిగిన ఆ ప్రశ్నకి ఏమనాలో అర్థం కాలేదు వైష్ణవి కి .
ఈ వారం గ్రహస్థితి : రవి కేతువులు కర్కాటకం , బుధుడు కర్కాటక సింహ రాశులు , శని సింహం , రాహువు మకరం , గురువు కుంభం , కుజుడు వృషభం , శుక్రుడు వృషభ మిథున రాశులు , చంద్రుడు కన్య , తుల , వృశ్చిక రాశులు సంచరిస్తారు .
హిందుమతం . వేల సంవత్సరాలుగా , ఎవరెన్ని విమర్శలు చేసినా , ఎంత హేళన చేసినా , ఎన్ని కుట్రలు పన్నినా , ఎన్ని కాలుష్యాలని కలగలిపినా చెక్కుచెదరని హిమవగ్నగం . ఎన్ని నదులు తనలో వచ్చి కలిసినా . . . . ఎన్ని తుఫానులు చెలరేగినా . . . చెలియాలి కట్ట దాటని ధీర గంభీర సాగరం . నిశ్శబ్ధంగా నినదించే సముద్రఘోష వంటిది హిందు సంస్కృతి . అలాంటి సముద్రపు ఒడ్డున కొందరు ఇసుకలో , సముద్రపు అలల నురగలో కొట్టుకు వచ్చిన చిల్లర గవ్వల్నీ , పగిలిన శంఖాల్నీ ఏరుకుంటుంటే . . . మరి కొందరు ఆ ఆనంత జలరాశిలోకి దిగి , ఈతలు కొట్టి , లోతుల్లోకి మునిగి , మంచి ముత్యాలనీ , వెల లేని రత్నాల వంటి నిత్య సత్యాల్నీ అందుకుంటున్నారనీ , ఆస్వాదించి ఆనందిస్తున్నారనీ ' ఉషశ్రీ ' అంటారు . అది నిజం ! సరస్సులోని బురద పూసుకునే వారు కొందరైతే , కలువలు కోసుకునే వారు కొందరు . ఎవరేది చూస్తారు , ఎవరేం చేస్తారు అన్నది ఆయా వ్యక్తుల దృష్టీని బట్టి , దృక్పధాన్ని బట్టి ఉంటుంది . మరోరకంగా చెప్పాలంటే . . . మనం చిన్నప్పుడు అక్షరమాల , గుణింతాలు నేరుస్తాం . ఆ తర్వాత వత్తులూ , చిన్న చిన్నపదాలు మెల్లిగా వాక్యాలు . ఆ తర్వాతే పద్యాలూ , కథలూ , వ్యాకరణాలూ , ప్రబంధాలూ ! గణితమైనా అంతే ! ముందు సంఖ్యలూ , కూడికలూ , తీసివేతలూ , హెచ్చవేతలూ , భాగహారాలు . తర్వాతే ఘాతాంకాలు , సంవర్గమానాలు , ఏది నేర్చినా . ఒకటో తరగతి తర్వాత 2 , 3 , . . . . అలా అలా పదో తరగతి . ఆపైన పీజీల దాకా , ఏ చదువైనా అంతే ! హిందూమతమైనా అంతే ! జనులందరికీ , అన్ని స్థాయిల వారికీ , వారి వారి స్థాయిని బట్టి అందుకునే విద్య వంటిది . ఆయా వ్యక్తుల మానసిక స్థాయిని బట్టి , పరిణతిని బట్టి , జన్మతః వారసత్వంగా వచ్చిన భావ సంపదని బట్టి , హిందూమతాన్ని వారు గ్రహించే తీరు ఉంటుంది . ఎవరైనా ఒకటో తరగతి నుండి పైతరగతుల్లోకి ప్రమోట్ అయినట్లుగా . . . సాధనతో పరిణతిని , పరిపక్వతని పెంచుకుంటూ పోవలసిందే ! అంతేగానీ ఒకటో తరగతి వాడు . తన అజ్జానం కొద్దీనో , తెలియని తనానికి అహంకారాన్ని జోడించుకునో , తన కంటే పై స్థాయి వాడిని నానా మాటలు అంటే ఎలా ఉంటుందో . . . హిందూమతం పైనా , హిందూ మతగ్రంధాల పైనా , విమర్శలు చేయటం అలా ఉంటుంది . దీన్ని సోదాహరణంగా వివరిస్తాను . ముందుగా ఓ ఉదాహరణ చెబుతాను . సూర్యాపేటలో ఎంసెట్ కోచింగ్ సెంటర్ నడుపుతున్న రోజుల్లో , ఓ రోజు క్లాసులో పిల్లలకి Quadrodic equations లో లెక్కలు చేయిస్తున్నాను . ఓ విద్యార్ధి " మేడం ! 73 రావటం లేదండి " అన్నాడు . 73rd Problem అని అతడి ఉద్దేశం . ప్రక్కనే ఆడుకుంటున్న మాపాప [ అప్పటికి ఆమెకి నాలుగున్నరేళ్ళు ఉంటాయి ] " అయ్యో ! 73 రాదా ? 7 వేసి పక్కనే 3 వేయ్యాలి . అంతే ! " అంది . ఆ పిల్లవాడు " అవునమ్మా ! 73 రావటం లేదు " అంటూ అమాయకంగా ముఖం పెట్టి మా పాపని ముద్దు చేసాడు . అందరం ఒకటే నవ్వు కున్నాము . ఆమె పసిది గనుక , అది కళ్ళకు కనబడుతున్న అమాయకత్వంతో కూడిన అజ్ఞనం కనుక , అందరం హాయిగా నవ్వుకుంటాం . అదే అహంకారంతో కూడిన అజ్ఞానంతో అవహేళన చేస్తే , క్రోధంతో అసహనంతో ఉడికి పోతాం . ఆ క్రోధపు స్థాయి కూడా ఆయా వ్యక్తుల్ని బట్టి ఉంటుంది . ఒకోసారి పరిణతి , పరిపక్వత స్థాయి ఎక్కువ ఉన్నవారు , ఉదాసీనంగానో , నిర్లిప్తతతోనో , అలాంటి అవహేళనలని పట్టించుకోరు . ' ఆశుద్దం మీద రాయి వేస్తే చింది మనమీదే పడుతుంది ' అనుకుని తప్పుకుని పోతారు . అయితే . . . అశుద్దాన్ని , అశుద్దాన్ని నలుగురు తిరిగే బాటలో వేసిన వాళ్ళనీ ఉపేక్షించటం కూడా , ఓ పరిమితి [ limit ] దాటితే శ్రేయస్కరం కాదు . దేనికైనా ఓ పరిమితి ఉంటుంది కదా ! అందుకే ' యుక్తాహార విహారస్య ' అన్నది గీత . ఇక్కడో విశేషం ఏమిటంటే - ఇలా అశుద్దాన్ని వెదజల్లే వారి వాదనలనే తప్ప , ఆ వాదనలోని లొసుగుల్ని ఎత్తి చూపే వారి గళాలకి మీడియా మైకు ఇవ్వకపోవటం . అంటే ఫోకస్ చేయకపోవటం . కాబట్టే , రామాయణ విషవృక్షాలకీ , రంగనాయకమ్మలకే వచ్చినంత ఫోకస్ కల్పవృక్షాలకీ , హిందూ మతగ్రంధాల సమర్ధకులకీ వచ్చేది కాదు . ఆ స్థితి ఇప్పుడూ ఉండటం చూస్తునే ఉన్నాం . నిజానికి . . . . ఒకటో తరగతి పిల్లవాడు ఇంటర్ పిల్లవాడి లెక్కల నోట్సులోని Integrals నీ , Partial Derivatives నీ చూసి ' ఇవేం పిచ్చిగీతలు ? ' అంటూ అవహేళన చేస్తే . . . . ? ఇంటర్ పిల్లవాడు ఒకటో తరగతి వాణ్ణి చూసి , తానూ అవిదాటే వచ్చానన్న విషయం మరచి " ఇదేనా నీ స్థాయి ? " అంటూ వెక్కిరిస్తే . . . ? ఫలితం వైషమ్యాలే ! నిజం చెప్పాలంటే - ప్రసాదం కోసం గుడికి వచ్చినా , క్రమంగా మంచివైపుకీ , భగవంతుడి వైపుకీ ఆకర్షించబడతారు అన్నది అన్ని మతాలలోనూ ఉన్న ఆచరణే ! అదే హిందూమతంలో అయితే . . . భాగవతంలోని రాసలీలలు , ఇతిహాసాలలోని స్త్రీ అంగాంగ వర్ణనలు , శృంగార వర్ణనలు కూడా అలాంటివే ! గుడులలో ప్రాకారాల మీదా , గోపురాల మీదా ఉండే శృంగార భంగిమలతో కూడిన శిల్పాలు కాముకులని కూడా గుడుల వైపూ , క్రమంగా దైవం వైపూ ఆకర్షిస్తాయి . అందునా పూర్వపు రోజుల్లో పబ్బులూ , నీలిచిత్రాలూ , బూతుబొమ్మలు చూపే వెబ్ సైట్లూ ఉండేవి కావు కదా ! [ వేశ్యావాటికలున్నా చీకటి మాటున పోవలసిందే ! అదీగాక వేశ్యలని entertain చేసేంత ధైర్యమూ , ధనమూ కూడా , కొందరికే తప్ప అందరికీ ఉండవు కదా ! ] కాబట్టే ' కామి కానివాడు మోక్ష కామికాడు ' అనే సామెత కూడా ఉండింది . ఈ విషయాన్ని స్పష్టపరుస్తూ , భాగవతం చివరిలో , ముసళ్ళ పండుగకు ముందర , శ్రీకృష్ణ నిర్యాణ ఘట్టంలో , తనను చూడ వచ్చిన గోపికలు శ్రీకృష్ణుడితో - గతంలో తామెంతో ఆనందంగా గడపటం గురించి ప్రస్తావించి ఆ భాగ్యం తమకు కరవైందని దుఃఖిస్తారు . గోపికలని ఓదార్చిన శ్రీకృష్ణుడు వాళ్ళకు జ్ఞాన బోధ చేస్తాడు . ఇది ఎలాంటిదంటే - చాక్లెట్ కోసం ఓ పిల్లవాడు మారాం చేస్తున్నాడనుకొండి . మనం ఏం చెప్పినా వాడి చెవికి ఎక్కదు . గొల్లుమంటూనే ఉంటాడు . వాడి స్థాయి అది . నాలుగు తగిలించినా ఏడుస్తునే ఉంటాడు . అప్పుడు మనం ఏం చేస్తాం ? దాంతో మనం చాక్లెట్లు ఇచ్చేస్తాం . వాడి కోరిక తీరాక , అప్పుడు కౌన్సిల్ చేస్తాం . చాక్లెట్లు ఎక్కువ తింటే పళ్ళు పుచ్చుతాయనీ , అనారోగ్యం వస్తుందనీ మెల్లిగా నచ్చజెపుతాం . మెల్లిగా వాడి మనస్సులో మార్పు తెస్తాం . ఇది ఆధునిక మానసిక వైద్యులూ ఒప్పుకునే విధానమే . అదే ఇతిహాసాల్లోని శృంగార వర్ణనలూ , గుడుల్లోని శిల్పాలూ చేసేవి . అదీగాక ఒకప్పుడు గుడులే సర్వవిద్యా కేంద్రాలు ; లైంగిక విద్యతో సహా ! విద్యనీ , జీవన కళనీ నేర్పేది కూడా అప్పట్లో మతం ఒక్కటే ! కాబట్టే , అన్నమయ్య , క్షేత్రయ్య , జయదేవుడి వంటి భక్త కవులు కొందరు భగవంతుడి పేరిట శృంగార కీర్తనలు వ్రాసి పాడారు . అలాంటి వాటి పట్ల కూడా ఎవరి స్పందన వారిది ! అదీ ఆయా వ్యక్తుల స్థాయిని బట్టి , దృక్పధాన్ని బట్టి ఉంటుంది . హిందూమతంలోని ప్రతికోణం ఎంతో పరిణతితో కూడినది అనటానికి ఒక ఉదాహరణ చెబుతాను . మనం గుడికి వెళ్ళినప్పుడు గుడి ప్రాకారాల నుండి మూల విరాట్టు దగ్గరికి వెళ్ళే సరికి చాలా దూరం ఉంటుంది . అది క్యూ లైను అవ్వచ్చు , లేదా గుడి పెద్దదిగా ఉండటం చేత అవ్వచ్చు . అలా ఉండటం ఎందుకంటే ఎంతటి వారికైనా తమ దైనందిక చర్యల తాలూకూ ఆలోచనలు దైవందర్శనం అప్పుడు చుట్టుముట్టకుండా , ప్రాకారం నుండి మూలవిరాట్టు దగ్గరికి వచ్చేసరికి దైవం చుట్టే ఆలోచనలు ఉండేటట్లు , ఏకాగ్రత కుదిరేటట్లు చేయటం కోసం . అంత పెద్ద గుళ్ళు ఉండేవి . ప్రాకారం నుండి దైవం దగ్గరికి వచ్చేసరికి క్రమంగా ఆలోచనలు దైవం చుట్టే తిరుగుతాయి . చిన్న గుడుల్లో అయినా ప్రదక్షిణానంతరమే దైవ దర్శనం చేసుకోవటంలో కూడా ఉన్నది ఈ అంతస్సూత్రమే . అంతగా మనిషి ఆలోచనా సరళి బట్టి , మనిషిని ఎలా దైవం దగ్గరికి తీసుకెళ్ళటమా అని ఆలోచించి తీర్చిదిద్దబడింది హిందూమతం . సరే , ఇదంతా పక్కన బెడదాం . హిందూమతంలో , ఇతిహాసాలలో శృంగార వర్ణనలూ , అసంబద్ద పాత్రలూ ఉన్నాయనుకుందాం . అయితే అవొక్కటే ఉన్నాయా ? మరింకే మంచి విషయాలూ లేవా ? అదీ హిందూమతంలో మాత్రమే ఉన్నాయా ? అయినా మంచి ఎక్కడ ఉన్నా గ్రహించటం , చెడు ఎక్కడున్నా విస్మరించటం విజ్ఞల లక్షణం అంటారు . అటువంటప్పుడు హిందూ ఇతిహాసాల్లోని చెడు [ ఉంటే ] వదిలేసి , మంచినే గ్రహిస్తే గొడవే లేదు కదా ! అది వదిలేసి " ఇంత అంగాంగ వర్ణనలున్నాయి , ఇంత చెత్త ఉందీ ! " అంటూ పనిగట్టుకుని మరీ గగ్గోలు చేయటం దేనికి ? దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం డాక్టర్ సి . ఆనందారామం వ్రాసిన ఇంద్రసింహాసనం ' అనే నవల చదివాను . అందులో నహుషుడు ఇంద్రపదవి చేపట్టటం , ఇంద్రాణి అయిన శచీదేవిని వాంఛించటం , ఆ క్లిష్ట స్థితిలో శచీ దేవి సమస్యలని ఎదుర్కొన్న తీరు , దానికి సమాంతరంగా అజ్ఞాతవాసంలో ద్రౌపదీ దేవి విరటుని అంతఃపురందాసిగా వ్యవహరిస్తూ ఇతరులలో స్ఫూర్తి నింపటం వగైరాలతో , భారత కథని ఆధునిక సామాజిక స్థితులకి అనువర్తిస్తూ రచయిత్రి చిత్రించింది . అందులో శచీదేవి పాత్ర , ఎమర్జన్సీ అనంతర ఓటమి నాటి రోజుల్లోని ఇందిరాగాంధీ సంఘర్షణని కొంత వరకూ ప్రతిబింబించిందన్న మాట కూడా ఆ రోజులలో విన్నాను . అలాంటి రచనల గురించి పెద్దగా చప్పుడూ ఉండదు . మెల్లిగా అలాంటి రచయిత / రచయిత్రులూ పెన్ డౌన్ అయిపోతారు . అదొక విచిత్రం ఇక్కడ . ఇలాంటి కుయుక్తుల గురించీ , కుట్రల గురించీ , దౌష్ట్యపు వాదనల గురించీ , నా ఆంగ్లబ్లాగు Coups On World లోని Coups on Hindu Epics లో సుదీర్ఘమైన , సంపూర్ణమైన వివరణ వ్రాసాను . ఆంగ్లంలో వ్రాయటానికే నాకు చాలా సమయం పట్టింది . తెలుగులోకి అనువదించేందుకు సమయం దొరకటం లేదు . ఇక ఈ టపా ముగించే ముందు మీతో నా సంతోషాన్ని పంచుకోవాలని వ్రాస్తున్నాను . ఇటీవల రంగనాయకమ్మ వారసుల వంటి కొందరు రచయితలు భారతంలోని పాత్రల మీద నవలలు రచించారు . అలాంటి వారిలో ఓ రచయితకి ఇటీవల కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది . ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నవారు భారతీయ సంస్కృతీ , దేశీయతల మీద కుట్రలు జరుపుతున్న వారికి అనుచరులు కావటాన , ఇలాంటి వారికే అవార్డులు రావటం అన్నది సహజ పరిణామం . ఈ నేపధ్యంలో మరోసారి అలాంటి రచనలకి సంచలనం అంటుకుంది . ఆ మీదట విమర్శలూ , సమర్ధింపులూ పత్రికల్లోనూ , బ్లాగుల్లోనూ కూడా వచ్చాయి . ఎటూ మీడియా హిందూమత సమర్ధకులకి ఎక్కువ కవరేజ్ ఇవ్వదు గదా ! అయితే బ్లాగ్లోకంలో కొందరు బ్లాగరులు , హిందూమత గ్రంధాలపై బురద చల్లే కుటిల యత్నాలని ఎదుర్కున్న తీరు నాకు చాలా నచ్చింది . 7 వ తరగతి పిల్లలకి హిందీలో ఓ పద్యం [ దోహా ] ఉంటుంది . వసంత ఋతువు కోకిల గానం చేస్తుంటుంది . తర్వాత వర్షాకాలం వస్తుంది . అప్పుడు కోకిల మౌనం వహిస్తుంది . వర్షాలకి నీళ్ళు నిండగా చెఱువులూ , దొరువుల్లో కప్పలు చేరి బెకబెక మంటూ దరువులు వేస్తుంటాయి . కోకిల మౌనం దాల్చినందునే కప్పలు గానం ప్రారంభించాయంటాడు కవి . అలాగే మేధావులు / మంచివారు మౌనం దాల్చగా మూర్ఖులూ / చెడ్డవారు తమ వాదనలతో సమాజాన్ని కాలుష్య పూరితం చేస్తారని పోలిక చెబుతాడు . అందరూ చెడునీ , చెడు వాదనలని చూసి , " అశుద్దం మీద రాయి వేస్తే చింది మనమీదే పడుతుంది . ఎందుకొచ్చిన గొడవ ? తప్పుకు పోతే సరి " అనుకుంటేనే . . . నిర్లిప్తత వహించి " ఎవరి పాపాన వాళ్ళే పోతారు " అనుకుంటూ ఉపేక్షిస్తేనే . . . పరిస్థితి ఇంత వరకూ వచ్చింది . హిందూమతం మీద బురద చల్లే హక్కు , మీడియా సాక్షిగా , చాలామందే పుచ్చుకున్నారు . మీడియా మైకు నివ్వక పోయినా , కనీసం ఈ బ్లాగ్లోకంలోనైనా అలాంటి కుటిల యత్నాలని కొందరు బ్లాగరులు ఎదుర్కున్న తీరు హర్షణీయంగా ఉంది . అలా ఎదుర్కున్న వారిలో నా కంటే పెద్దవారికి నా నమస్కృతులు . నా కంటే చిన్న వారికి నా ఆశీస్సులు . ఈ దృశ్యం ఎవరి స్థాయిలో వారు యుద్దం చేస్తుంటే చూస్తున్నట్లుగా ఉంది . యతో ధర్మ తతో జయః అనిపిస్తోంది . అందరికీ మా జేజేలు ! అయితే ఒక చిన్న సవరణ ! మనం సమస్యని గాక , సమస్య మూలాలని నాశనం చేయాలి . అప్పుడే యుద్దం సరైన రీతిలో ఉంటుంది . కాబట్టి హిందూఇతిహాసిక పాత్రలని తమ ఇష్టమొచ్చిన రీతిలో , తమ అరిషడ్వర్గాల సహితంగా చిత్రీకరిస్తూ ఆధునిక పోకడలు పోతున్న అపర ఆచార్యులనీ , రంగనాయకమ్మ వారసుల వంటి వారినీ , అలాంటి రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రదానం చేసిన వారినీ , చేయింపించిన వారినీ లక్ష్యంగా ఎంచుకోవటం మంచిది . అంతేగానీ ఆయా రచనలనీ , రచయితలనీ సమర్ధించే లేదా పొగిడే తోటి బ్లాగర్లతో వివాదాలు పడటం , మాటల తూటాలు పేల్చుకోవటం అనవసరం . వైషమ్యాలు పెరగటం మినహా ఒరిగేదేం ఉండదు . అది బ్లాగ్లోకంలో ఒకరికొకరు జాతర బొమ్మలు / జంటపీతలుగా తయారవటమే అవుతుంది . యుద్దంలో శస్త్రాన్ని సంధించేటప్పుడు లక్ష్యాన్ని కూడా సరిగా నిర్ణయించుకోవడం ముఖ్యం కదా ! తోటి బ్లాగర్లని విమర్శించటం ద్వారా , పరిధి కుదించుకుపోతుంది . అంతేకాదు మన విలువైన శక్తి , సమయం , ఆవేశం కూడా వృధా అవుతాయి . ఎవరైతే ఇటువంటి కుటిల రచనలని గొప్ప సాహిత్యలుగా బహుమతులు కట్టబెట్టారో , కట్టబెట్టించారో వాళ్ళని లక్ష్యంగా చేసుకోవటం ద్వారా , మన అభిప్రాయాన్ని చెప్పినట్లవుతుంది . బ్లాగుల ద్వారా మన గళాన్ని వినిపించినట్లవుతుంది . అలాగాక , తోటి బ్లాగర్లని కెలుక్కోవటంలో ఆనందం ఉందంటే , అది వారి ఇచ్ఛ . మరిన్ని విషయాలతో తదుపరి టపా . అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి . సర్వేజనా సుఖినో భవంతు !
భాషని , మాండలికాన్నీ కలగాపులగం చెయ్యాల్సిన అవసరం లేదు . ' తెలుగు ' అనే పదాన్ని హాయిగా , స్వేచ్ఛగా వాడుకోలేని పరిస్థితే నిజంగా దాపురించి ఉంటే ఇందుకు కారకులయిన భాషా సాహిత్య ' బాల్‌ధాక్రే ' లు ఎవరో కూడా నిగ్గు తేల్చాల్సి ఉంది . అతి సాధారణీకరించిన సూత్రీకరణల మూలంగా ఒరిగేది ఏముంటుంది - నీరసమూ , నిట్టూర్పులూ తప్ప .
పక్కనే పడి ఉన్న జింకపిల్ల పకపకా నవ్వినట్టయింది . నరిసిగాడు దానివైపు చూశాడు . జింకపిల్ల నరిసిగాడి వైపు ఒక్క క్షణం జాలిగా చూసి మెల్లగా నవ్వింది . తరువాత మెల్లగా తల వాల్చేసింది . *
మహాభారతంలో పాండవులు మహాప్రస్థానానికి వెళ్ళినప్పుడు వారివెంట వెళ్ళిందెవరు ?
ఒకపక్క మేరేజ్ సర్టిఫికెట్ తగలబెట్టేసి యిక మనకేం సంబంధం లేదంటాడు . మరో పక్క హనీమూన్ కంటిన్యూ చేద్దాం రమ్మంటాడు . ఎలాటి మనిషితను ?
( నేను అడపాదడపా ఈ సంస్థల గురించి హెచ్చరిస్తూనే వున్నాను ! మన దేశం లో కాంగ్రెస్ కూడా పుట్టక ముందు నించీ ఇవి " బిజినెస్ " చేస్తున్నామని చెప్పుకొంటున్నాయి ! యేం బిజినెస్ అని నన్నడక్కండి - - యెందుకంటే మన రిజర్వ్ బ్యాంకు తో సహా మనమెవరూ పుట్టలేదు అప్పటికి ! మరి ఇప్పుడు , గత రెండేళ్లుగా - - పత్రికల్లో మొదటి పేజీలలో ఓ మూల చిన్న ప్రకటన వేసే స్థాయి నుంచి ఇప్పుడు సినీ యాక్టర్లతో ఓ పావుపేజీ ప్రకటనలు ఇచ్చే , టీవీల్లో వార్తలు కూడా " స్పాన్సర్ " చేసే స్థాయికి యెలా యెదిగాయో , అనేక బ్రాంచీలని యెలా యేర్పాటు చేసుకొని , వ్యాపారాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకున్నాయో - - యెవరికీ తెలియదు , యెవరూ పట్టించుకో లేదు ! )
ఈరోజు ఆఫీసులో పని చేసుకుంటూ . . ఆమధ్య ఎప్పుడో " సఖీ " షూటింగ్‌లో పరిచయమైన బ్లాగరితో చాటింగ్ చేసాను . చాలా విలువైన సమాచార విజ్ఞానం కలిగిన చాటింగ్ అని చెప్పొచ్చు . ప్రేమ , ఆకర్షణ , పెళ్ళి , బంధం వెరసి జీవితం గురించి కాసేపు చర్చించుకున్నాము . బాగుంది , కొన్ని పదాలు నచ్చాయి . ఎవరితోను " తీవ్రమైన స్నేహాన్ని " ఆశించవద్దు అన్న సలహా నచ్చింది . " నేను నా ప్రాజెక్ట్ పనిలోనో లేకపోతే ఇంకేదన్నా దీక్షగా పనిచేసుకుంటేనో ఎంతటి విలువైన విషయమైనా . . . అప్పుడు లీనమై చేసే ఆ పని ముందు దిగదుడుపే . పనిని అంతగా ఇష్టపడతాను . . " అన్న మాటలు మంచి ప్రభావాన్ని చూపాయని చెప్పొచ్చు . రాత్రి " ఆట " ( టి వి డాన్స్ ప్రోగ్రాం ) చూస్తూ భోజనాలు చేస్తుంటే ఆ చిన్ని చిన్ని పిల్లలు ఐటం సాంగ్స్ చెస్తున్నారు . అది చూసి బాబు అన్నాడు . . " అమ్మా ఇలా చేస్తారు , రెపొద్దున్న వీళ్ళకి సినిమా చాన్స్ లు వస్తే ఇంక వీళ్ళు ఆడుకోగలరా ? మాలా ఫ్రీ గా ఉండగలరా ? " . . . ఊ . . ఇదేదో ఆలోచించతగ్గ విషయమే కదా . . . కాని నేనేమి చెప్తాను మా బాబు కొచ్చిన ఆలోచన వాళ్ళ సంబంధీకులకి రాకుండా ఉండదని ఎందుకనుకుంటాము . . . డబ్బే లోకమనుకుంటే మనం చేయగలిగేది ఏమి లేదు కదా . . * * * * * * * *
@ శ్రావ్య : జునాఘడ్ లో మనం కాశ్మీర్ లాజిక్ ని కాదన్నామని మర్చిపోకండి . ఇరువైపులా తప్పులు జరిగాయి . కాకపోతే అవి చారిత్రాత్మక పరిణామక్రమంలో భాగాలు . బాంగ్లాదేశ్ ఏర్పాటు మన దేశ సుస్థిరతకు అవసరమని మనం నమ్మాం కాబట్టి సహాయం చేసాం . అంతేతప్ప బాంగ్లాదేశీయులపైన ప్రేమ పుట్టుకొచ్చి కాదు . అదొక రాజకీయ - భౌగోళిక అవసరం . @ నాగప్రసాద్ : పాకిస్తాన్ లోని సాధారణ ప్రజలకూ ఈ ఉగ్రవాదానికీ మీకూ నాకూ ఎంత సంబంధముందో అంతే ఉంది . మొత్తం పాకిస్తానీ ప్రజల్ని ఒకేకోవలో కట్టకండి . ఇలాంటివాటిల్లో అపోహలేతప్ప నిజాలశాతం తక్కువే అని మనం గ్రహిస్తే మంచిది . పాకిస్తాన్ ఆర్మీ , ISI ఉసుక్కుమంటే చైనా ఈ తీవ్రవాదులకు సహాయం చెయ్యడానికి తయారుగా ఉంటే చందాలు వసూలు చెయ్యడం వీళ్ళకి అవసరమంటారా ? అవన్నీ స్థానికంగా వున్న ముల్లాలు తమ పబ్బంగడుపుకోవడానికో లేక easy money కోసమో అని మనం ఎందుకనుకోకూడదు . మనం మాత్రం anti - Pakistan slogans తో రాజకీయ పబ్బాలు గడుపుకోవట్లేదూ ! ?
ఏ కాలంలోనైనా , ఎప్పుడైనా , ఎక్కడైనా , అప్పుడప్పుడు అడుగబడుతుండే ఒకే ఒక ప్రశ్న " దేవుడనేవాడున్నాడా అని ? ! ఒకవేళ ఉంటే ఆయన్ని చూడగలమా అని ? ! '
ఊపిరి చందం గడపదాటి పొలంచేరే మా అమ్మలాంటి స్త్రీలకు తలవొంచి నమస్కరిస్తాను . సౌందర్య క్రీముల్లో ముంచిన నాజూకు వేళ్ళకంటే చెమటా చుక్కల్లో తడిసి అరిగిన మొరటు వేళ్ళంటేనే ఇష్టం మొక్కలు నటే పల్లెచేతులకు నమస్కరిస్తాను విత్తనాలు చల్లే చేతివేళ్ళకు దండం పెడతాను మట్టిని ముద్దాడే పాదాలకు ప్రణమిల్లుతాను బతుకును ఒక్కచేత్తో ఎత్తుకుని ఒంటారి దుఃఖ సముద్రాన్ని దాటడమే యోధుడి లక్షణం కన్నీటి పాయలు కొండచిలువై వెంటాడుతున్నా కాళ్ళకింద ఇసుకదుప్పటి కసిదీరా ఎవరో లాగేస్తున్నా అడుగుల్ని నేలలోకి గుచ్చిమరీ ప్రవాహానికి ఎదురీదడమే శ్రమజీవి పాఠం వడ్లరాశిని ఎగదోసుకున్నట్టు ఎవడి ప్రాణాల్ని వాడే ఎగదోసుకోవాలి చిక్కని చీకటి బురదలో విత్తనాల చిరుదీపాల మొలక వత్తుల్ని సరిచేస్తున్న మొరటు మనుషులకు మోకరిల్లుతాను దుఃఖం ఇంకా పాయలు పాయలుగా విస్తరిస్తూనే వుంది …
4 ) వర్ణన డాక్టర్‌యెర్రమిల్లి దుర్గ గారు వర్ణనాంశం అమెరికా లో పెరిగిన ఒక తెలుగు అమ్మాయి , ఇండియాలో పెరిగిన ఒక తెలుగు అమ్మాయి లండన్‌లో కలిస్తే . .
( మణికుమార్ ) నేను 08 . 10 . 1980 న ఉదయం 10 . 00 లకు గ్రామం : సేకూరు , తెనాలి దగ్గర , గుంటూరు జిల్లా లొ జన్మిన్చాను . దయ చేసి నా జాతకం ఇప్పుడు ఎలా ఉందో చెప్పగలరు . నాకు మంచి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది ? నేను జీవితములొ ఎప్పుడు set అవుతాను . పెళ్ళి ఎప్పుదు జరుజుతుంది . వివరములు తెలుప గలరు
అదిరింది . ఆదెక్కడా అంతమెక్కడ ? మీ బ్లాగులలో కనపడని కొత్త కోణం కనపడింది .
బాగుంది . కాని అది విరహమా , వ్యామోహమా , వైరాగ్యమా , విరక్తా , ప్రేమా , పారవశ్యమా లేక యీ అన్ని భావనలు కలబోసుకున్న అయోమయమా అన్నది మాత్రం తెలియడంలేదు . కవిత్వం లోతయిన భావాలను సరళతరం చేయాలని నా అభిప్రాయం .
మూడు నెలలు అనుకున్నది అలా అలా జరిగి జరిగి ఏడు నెలలయింది . టికెట్ దొరక్క కొన్నాళ్ళు , దొరికితే సరైన తోడు దొరకక కొన్నాళ్ళు , సంధ్య పని మీద ప్రయాణాలు వెళ్ళవలసి కొన్నాళ్ళు , ఇలా మొత్తం మీద నిజంగానే పాప పాకడం నుంచి తప్పటడుగులు వేసేటప్పటికి గాని లక్ష్మి ప్రయాణం కుదర్లేదు .
ఎమ్ . ఆర్ . ఐ చేసిన తరువాత తెలిసింది రాధికకు స్పైనల్ ఫ్రాక్చరు అని . అదీ మెడ వెనుక భాగంలోని వెన్నెముక ఫ్రాక్చరు కావటంవల్ల , ఆమె రెండు చేతులూ , రెండు కాళ్ళూ కూడా కదిలించలేక పోతోంది .
శనివారం సిఎల్‌పి కార్యాలయంలో విలేకరులతో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి , కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై బొత్స ఘాటుగా స్పందిం చారు . కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా శుక్రవారం వెల్లడైన ఎన్నికల ఫలితాలు కొంత సంతోషం , కొంత ఇబ్బందికరంగా ఉన్నాయని తాను భావిస్తున్నానని బొత్స అన్నారు . దేశం మొత్తంమీద కొన్ని రాష్ట్రాలతో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నాయకత్వాన యుపిఎ భాగస్వామ్య పక్షాలతో కలిసి విజయం సాధించటం సంతోషం కలిగించినా , రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేకపోవటం ఇబ్బందికర విషయమని అన్నారు . గెలుపు కారణాలను విశ్లేషించుకున్నట్లుగానే ఓటమికి గల కారణాలను కూడా విశ్లేషించుకోవాలని సూచించారు .
ఎయిర్ ఇండియాకు ఈ ఏడాది చివరి కల్లా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలను అందచేస్తామని బోయింగ్ ఇండియా అధ్యక్షులు దినేష్‌కెస్కర్ తెలిపారు . 2008 మే నెలలోనే తాము బోయింగ్ 787 ఎయిర్‌క్రాప్టు కోసం ఎయిరిండియా నుంచి ఆర్డర్‌ను తీసుకున్నామన్నారు . డ్రీమ్‌లైనర్‌కు సంబంధించిన పైలెట్ ట్రైనింగ్‌ను వచ్చే నెలలో ఎయిరిండియా ఇస్తుందన్నారు . అయితే మొత్తం 67 విమానాలను ఎప్పటిలోపు ఇస్తామన్నది చెప్పలేదు . జెట్ ఎయిర్‌వేస్‌కు కావల్సిన పది బోయింగ్ 787 విమానాలను , 2014 కల్లా అందచేస్తామన్నారు .
నిజానికి వేధింపులన్నీ పండుగలకు , పబ్బాలకు విలువయిన కానుకలు ఇవ్వలేదని , తాము చేసే వ్యాపారాలకు పెట్టుబడులు , తమ విలాస వంత మయిన జీవితానికి సదుపాయాలు కల్పించలేదని జరిగేవే . జై భోలో సర్వోత్తమ న్యాయస్థానానికి . . . . . జై
మాత్ర పడిన కూసేపటికే పిల్లది కునుకు తీసింది . ముత్తమ్మకు కూడా అలసటనిపించింది . ఆకలేసినా పెట్టుక తినేంత ఓపిక లేక , ముంతెడు నీళ్ళు తాగి పిల్ల పక్కనే వొరిగింది .
ఆటో మూసీ బ్రిడ్జ్ దాటింది . ఎందుకో అక్కడి వాతావరణం లో తేడాగా అనిపిస్తూ ఉంది . రోడ్డు పై జనం హడావిడిగా , కంగారుగా , భయం భయంగా వెళుతునట్టనిపించింది . ఇంకాస్త ముందుకెళ్ళేసరికి అర్ధమైపోయింది . షాపులు మూసేస్తున్నారు . రోడ్డుపై పోలీసులు కొన్ని వెహికిల్స్ తనిఖీ చేస్తూ , కొందరిని త్వరగా వెళ్ళ మని హెచ్చరిస్తూ ఉన్నారు . " అరె క్యా హువా భాయ్ ? " పక్కనే వెళుతున్న మరో ఆటోలోకి కేకేస్తూ అడిగాడు డ్రైవర్ . " క్యా హోతా హై ! కిసినే కిసికో మార్ డాలా ! " చెపుతూ మా ఆటో ని దాటి వెళ్ళి పోయాడు . " యే అల్లా ఫిర్ షురూ హోగయా ! " స్వగతంలా అన్నాడు డ్రైవర్ . " మైగాడ్ ! ఈడియట్ కారుని రోజూ చెక్ చేసి ఉంచాలని చెపుతూనే ఉంటాను . బుర్రలేని వెదవ ఉందిలేరా నీకీరోజ . " అతన్ని రోడ్డున వదిలేసిన అతని కారు డ్రైవర్ ని కాబోలు తిట్టుకుంటున్నాడు సూటు . " ఉదయం ప్రశాంతంగానే ఉంది మరి ఇంతలో ఏమయ్యిందో . " అన్నాను బైటకి చూస్తూ . " ఈడ ఎప్పుడైనా ఎట్లయినా ఐతది మన జాగ్రత్తల మనం ఉండాలె . " సంచీ దగగ్గరకు లాక్కుంటూ ఇదంతా మామూలేనన్నట్లు నాకేసి చూస్తూ చెప్పాడు రైతు .
ఇదే కోవలో వల్లూరు శివప్రసాద్ రాసిన ' గిట్టుబాటు ' కథలో దుర్భర దారిద్య్రంతో మరోమార్గం లేక ఒక పత్తిరైతు తన మూత్రపిండాన్ని అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుని భార్యకు చూపిస్తూ
అప్పట్లోకళ్ళలో స్వప్న మాలికలు . గుండెలో భావుకత్వపు డోలికలు . బ్రతుకొక పాటగాక్షణమొక కవితగాకాలం కలస్వ …
అమెరికా సామ్రాజ్యవాద రక్కసి నేడు తీవ్రంగా గాయపడి మరణవేదన పడుతోంది . దొరికిన ఏ గడ్డిపోచనైనా అది పట్టుకుని , లోతైన అగాధం నుంచి బయటపడ చూస్తోంది . ఈ మొత్తం ఈ క్రమంలోనే , దానికి ఎటుచూసినా తన చుట్టూరా శత్రువులు ఉన్నారన్న భ్రాంతి ఏర్పడుతోంది . తన , దివాళాకోరుతనానికీ , పతనానికి కారణాలను అమెరికా నేడు గమనించుకోలేకపోతోంది . తన స్వంత వ్యవస్థ తాలూకు అపరిష్కృత వైరుధ్యాలే తనకు మరణ శాసనం కానున్నాయని అమెరికా పాలకులు మరచిపోతున్నారు . కాబట్టి , ఈ ఉన్మత్త ప్రేలాపనల సంధి స్థితిలోని సామ్రాజ్యవాద వ్యవస్థ బారినుంచి , మొత్తంగా ప్రపంచాన్ని మరో ప్రపంచ యుద్ధం తాలూకు వినాశనం నుంచి కాపాడుకునే కర్తవ్యం , బాధ్యత నేడు మానవాళి అంతటిలోపైనా ఉంది . వామపక్ష , ప్రగతిశీల శక్తులపై అది మరింతగా ఉంది .
నూటికి 95 మంథి ప్రజలు ప్రత్యేక తెలంగాణను కోరుతున్నారని అంత కచ్చితంగా చెప్పగలిగిన ఆ ప్రజానాయకుడు మరి ఆ ప్రజల అభిమతాన్ని మార్చటానికి ఎంత దృఢంగా నిలబడ్డాడు ? తెలంగాణ గుండె చప్పుడును వినగలిగింది , తెలంగాణ వేరుగా ఉండాలని కోరుకున్నది మామా అల్లుళ్లు ఇద్దరు మాత్రమే కాదు . ఫజలాలీ కమిషన్ సిఫారసులు వెలువడగానే తెలంగాణ అంతటా ప్రత్యేక రాష్ట్రం డిమాండు ముమ్మరమైంది . తెలంగాణలోని 10 కాంగ్రెసు కమిటీల్లో 7 తెలంగాణ రాష్ట్రం కావాలని తీర్మానించాయి . తెలంగాణలోని 105 మంది కాంగ్రెసు డెలిగేట్లలో 73 మంది , తెలంగాణ ప్రాంతానికి చెందిన 10 మంది పార్లమెంటు సభ్యులు అదే మాటమీద ఉన్నారు . తెలంగాణలో నూటికి 90 మంది ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని శాశ్వతంగా ఆకాంక్షిస్తున్నట్టు అఖిలపక్ష తెలంగాణ మహాసభ తీర్మానించింది . ఆ సమయాన రాజమండ్రిలో జరపదలిచిన విశాలాంధ్ర మహాసభకు హైదరాబాద్ కాంగ్రెసు వాదులెవరూ హాజరుకారాదని హైదరాబాద్ పి . సి . సి . నిషేధించింది . దాంతో ఆ మహాసభనే వాయిదా వేసుకోవలసి వచ్చింది . ఫజలాలీ నివేదిక అందాక రాష్ట్రాల పునర్విభజన సమస్యను పరిశీలించడంకోసం కాంగ్రెస్ అధ్యక్షుడు ధేబర్ , ప్రధాని నెహ్రూ , హోంమంత్రి పంత్ , వౌలానా ఆజాద్‌లతో 1955 నవంబరులో ఒక సబ్ కమిటీ ఏర్పాటైంది . నెహ్రూ , పాటిల్ , కట్జు , లాల్‌బహదూర్‌శాస్ర్తీ వంటి అగ్ర నాయకులు 1955 డిసెంబరు , 1956 జనవరి నెలల్లో తెలంగాణలో పర్యటించారు . అప్పటిదాకా హైదరాబాద్ రాష్ట్రాన్ని విడగొట్టకూడదని వాదిస్తూ వచ్చిన నెహ్రూ కూడా ప్రజాభిప్రాయం గమనించాక ఎస్సార్సీ నివేదిక సామంజస్యాన్ని గ్రహించాడు . అయితే - అది హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు చెక్కలుగా విడగొట్టాలన్న ఎస్సార్సీ సిఫారసు వరకే ! అలా విడగొట్టాక తెలంగాణ చెక్కను మాత్రం పొరుగు ఆంధ్ర రాష్ట్రంలో వెంటనే కలపకూడదు ; ఐదేళ్లపాటు విడిగా ఉండనివ్వాలి - అన్న ఎస్సార్సీ సిఫారసు రెండో భాగం మాత్రం నెహ్రూకి ఎందుకో నచ్చలేదు . విడగొట్టటమంటూ జరిగాక ఐదేళ్లు ఆగటమెందుకు , వెంటనే తెలంగాణను ఆంధ్రలో కలపటమే మేలని ఆయన భావించినట్టుంది . దీనికి తగ్గట్టు విశాలాంధ్రకు అనుకూలంగా ఇరు ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున కదలిక మొదలైంది . ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసేటట్లయితే అందుకు నిరసనగా తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా ఇచ్చి , ప్రజలముందుకు వెళ్లగలమని పీపుల్స్ డెమాక్రటిక్ ఫ్రంట్ ( పి . డి . ఎఫ్ . ) నాయకులు బెదిరించారు . పి . డి . ఎఫ్ . , సి . పి . ఐ , కిసాన్ సభ నాయకులు హైదరాబాద్ ముఖ్యమంత్రిని కలిసి వెంటనే విశాలాంధ్ర ఏర్పరచాలని డిమాండు చేశారు . తెలంగాణలోని విశాలాంధ్రవాదులు 1955 నవంబర్ 3న మీర్ అహ్మద్ అలీఖాన్ అధ్యక్షతన హైదరాబాదులో సమావేశమై విశాలాంధ్ర కావాలని తీర్మానించారు . గతంలో హైదరాబాదును విడగొట్టరాదని వాదించిన వారిలో పలువురు విశాలాంధ్రను బలపరిచారు . తెలంగాణ వివిధ ప్రాంతాల్లో విశాలాంధ్ర మహాసభలు జరగసాగాయి . విశాలాంధ్ర మహాసభ , తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ , ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీల పనుపున ప్రతినిధి వర్గాలు ఢిల్లీకి వెళ్లి నెహ్రూకు , ఇతర కేంద్ర నాయకులకు విశాలాంధ్ర వాదాన్ని గట్టిగా వినిపించాయి . ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ ఎస్ . ఆర్ . సి . నివేదికపై ఆధికారిక తీర్మానాన్ని 1955 నవంబరు 25నుంచి డిసెంబరు 3వరకు చర్చించింది . సభలో స్పీకర్ కాక మొత్తం సభ్యులు 174 మందిలో 147 మంది తమ అభిప్రాయాలను తెలిపారు . వారిలో 103 మంది విశాలాంధ్రను సమర్థించారు . 29 మంది తెలంగాణకు అనుకూలత తెలిపారు . 15 మంది తటస్థంగా ఉన్నారు . ఇక్కడో సంగతి గమనించాలి . పైన పేర్కొన్నది మరట్వాడా , కర్నాటక సభ్యులు సైతం కలిసి ఉన్న హైదరాబాద్ అసెంబ్లీలో చర్చ వివరాలను . కేవలం తెలంగాణ సభ్యులవరకే చూస్తే అసెంబ్లీలో మొత్తం సభ్యులు 85 మంది . వారిలో 59 మంది విశాలాంధ్ర వైపు మొగ్గారు . 25 మంది ప్రత్యేక తెలంగాణను బలపరిచారు . ఒకరు తటస్థంగా ఉన్నారు . అంటే హైదరాబాద్ స్టేటు మొత్తంగా చూసినా , అందులో తెలంగాణ సభ్యులవరకే లెక్కచూసినా లెజిస్లేటర్లలో అత్యధికులు విశాలాంధ్రను సమర్థించారు . అసెంబ్లీ చర్చ సరళినిబట్టి తెలంగాణ లెజిస్లేటర్లలో నూటికి 70 మంది ప్రత్యేక రాష్ట్రం వద్దు ; విశాలాంధ్రే కావాలి అని కోరుతున్నారు . కె . వి . రంగారెడ్డిగారేమో తెలంగాణ ప్రజల్లో నూటికి 95 మంది ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నట్టు చెబుతున్నారు . ఆయనలాంటివారు వక్కాణిస్తున్న ప్రజాభిప్రాయానికీ , ప్రజాప్రతినిధుల అభిమతానికి విపరీత వ్యత్యాసం కనపడటంతో ఏమిచేయాలో పాలుపోక తెలంగాణ విషయం ఎటూ తేల్చకుండా అధిష్ఠానం పక్కన పెట్టింది . తెలంగాణను ఆంధ్రతో కలపడాన్ని వౌలానా అబుల్‌కలాం ఆజాద్ మొదటినుంచీ గట్టిగా వ్యతిరేకిస్తుండటంవల్ల , ఏకాభిప్రాయానికి రావటం హైకమాండుకూ కష్టమవటం కూడా ఈ సాచివేతకు కారణమై ఉండవచ్చు . అప్పటికే ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ తెలంగాణతో తక్షణ విలీనాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది . ఆంధ్రలోనూ , తెలంగాణలోనూ , ఢిల్లీలోనూ విశాలాంధ్రవాదుల ముమ్మర ప్రచార ప్రభావంవల్లే కావచ్చు . మనకు తెలియని ఇతర కారణాలవల్లా కావచ్చు . నెహ్రూగారికి మనసులో విశాల ఆంధ్ర రాష్ట్రం వెంటనే ఇచ్చేయటం మేలన్న అభిప్రాయం నాటుకుంది . ఐనా - తమ రహస్య అభిప్రాయ సేకరణల్లో తెలంగాణ జనం ప్రత్యేక రాష్ట్రం వైపు మొగ్గుతున్నట్టు తేలింది కనుక ఏమిచేస్తే ఏమి తంటానోనన్న సంకోచంతో అధిష్ఠానం తుది నిర్ణయాన్ని వాయిదావేసి ఉండవచ్చు . ఇదీ 1956 ఆరంభంలో ఉన్న స్థితి . తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలనుకుంటున్న వారందరూ గట్టిగా ఒక పట్టుపట్టి అధిష్ఠానాన్ని ఒత్తిడి పెడితే తప్ప ఫలితం దక్కదు . లక్ష్యం సాధించటానికి అటువంటి అదను మళ్లీరాదు . మరి - నాటి తెలంగాణ అగ్రనాయకుడు , నూటికి 95 మంది ప్రజలు ప్రత్యేక తెలంగాణను కోరుతున్నారని ప్రధాని నెహ్రూ మొహంమీదే చెప్పగలిగినవాడూ , కులబలం , అంగబలం , అర్థ బలం దండిగా ఉన్నవాడూ అయిన కొండావారు ఏమిచేశారు ? ఎస్సార్సీ చెప్పినదాన్ని మన్నించి తెలంగాణను విడిగా ఉండనివ్వాల్సిందేనని పంతం పట్టారా ? నెహ్రూను తన దారికి తెచ్చుకోవడానికి ప్రజల పక్షాన సర్వశక్తులూ ఒడ్డారా ? లేదు . తానే నెహ్రూ దారికి ఎలా వెళ్లగలనా అని బుర్రబద్దలు కొట్టుకున్నారు . ఏమిచేస్తే తెలంగాణ మడికి మడి ; విశాలాంధ్ర సుఖానికి సుఖం దక్కగలదా అని తీవ్రంగా యోచించారు . ఆలోచించి చించి చివరికి కావలసిన కిటుకు కనుక్కున్నారు . అదేమిటో వచ్చేవారం . *
ఇవాళ తెలుగు సాహిత్యంలో ముస్లింవాదం గురించి సర్వత్రా చర్చ నెలకొని ఉంది . ముస్లింవాదం అంటే అస్సలు గిట్టనివారు సైతం ప్రస్తావించక తప్పని పరిస్థితి ఏర్పడింది . కాని ఈమధ్య జరిగిన కొన్ని పరిణామాల వల్ల బయటే కాక లోపలా కొన్ని ప్రశ్నలూ కొంత అయోమయం నెలకొంది .
ఈ లెక్కన చాలా ముఖ్యమైనది , నేను ఇందాక మరచినది , బేంకులు . బేంకులో ఉపయోగించే వివిధ ఫారాలకీ , అలాగే ప్రభుత్వ కార్యాలయాల ఫారాలకీ , దరఖాస్తులకీ తెలుగు నమూనాలు తయారు చేసి మన గూట్లో ఉంచాలి , జనాలు ప్రింటు తీసుకో గలిగేట్టు . అలాగే , ఇంకా కొన్ని మూస దరఖాస్తులు , అర్జీలు కూడా రాసి వాటి నమూనాలు ఉంచాలి . యువతని ఆకట్టుకోవాలని గోపాల్ చేసిన సూచన బాగానే ఉంది కానీ కేవలం పోటీల వల్ల కాదు . అందులో రెండు లొసుగులు ఉన్నై . ఒకటి - గెల్చేవారు అప్పటికే తెలుగు వాడకం బాగా వచ్చిన వారై ఉంటారు . రెండు - ఇదేదో ఒక వారం జరుగుతుంది , మళ్ళి యధా ప్రకారం మామూలే . కొంచెం దీర్ఘకాల ప్రభావం చూపే దిశగా ఆలోచించాలి . నాకు ఒకటి అనిపిస్తోంది . తెలుగు మాట్లాడ్డం , రాయడం కూడా స్టైలిష్ అనే భావన కలిగించాలి , స్కూల్లోనూ కాలేజిలోనూ . అదెలాగో ఆలోచిస్తే బాగుంటుంది .
అనగా అనగా . . . . . ఛత్రపతి శివాజీ జీవితంలోని ఈ సంఘటన . . . . ఓ రోజు శివాజీ కొలువు తీరి ఉండగా , సభలోనికి ఓ అనుచరుడు ఓ అందమైన యువతిని వెంటబెట్టుకొని వచ్చాడు . అతడు వినయము , అతృతా నిండిన గొంతుతో " మహారాజా ! ముస్లింల నివాస ప్రాంతంలో ఈ అందమైన ముస్లిం యువతిని పట్టుకున్నాను . ఈమెను మీకు కానుకగా ఇవ్వాలని తెచ్చాను " అన్నాడు . ఆరోజుల్లో , ముస్లిం రాజ్యాల్లో , ఆ ముస్లిం రాజుల అనుచరులు అందమైన హిందూ యువతుల్ని నిర్భందించి తీసుకుపోవటం , ముస్లిం రాజులకీ , వారి రాజోద్యోగులకీ కానుకలుగా సమర్పించటం చేస్తుండేవాళ్ళు . బదులుగా రాజుల నుండీ , రాజోద్యోగుల నుండి ప్రయోజనాలు పొందుతుండేవాళ్ళు . [ అంటే ప్రమోషన్లూ , అవార్డులూ , రివార్డులూ లేదా కేరీర్ లాంటివన్న మాట ] ఒక్కోసారి వాళ్ళు ముస్లిం స్త్రీలనీ విడిచి పెట్టేవాళ్ళు కాదు . తమ స్వార్ధం , స్వసుఖవిషయంలో వాళ్ళకి మానవత్వం లేదు , మతం , కులం , పేదరికం , పాపం పుణ్యం - ఏవీ పట్టవు . శివాజీ ముస్లిం రాజులకీ , ముస్లిం చక్రవర్తి ఔరంగజేబుకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు గనుక ఆయనకి ముస్లిం లంటే ద్వేషం ఉంటుందని ఆ అనుచరుడు అనుకొన్నాడు . ముస్లిం రాజులు హిందూ స్త్రీల మీద అత్యాచారాలు చేస్తున్నారు , అవమానిస్తున్నారు గనుక ప్రతీకారంగా శివాజీ కూడా ముస్లిం స్త్రీలని అవమానిస్తాడు , అనుకొన్నాడు . అందుచేత అలాంటి చర్య తీసికున్నాడు . అలాంటి ముస్లిం యువతిని తెచ్చినందుకు తనను సత్కరిస్తాడని కూడా ఆశించాడు . ఈ సంఘటనతో ఒక్కసారిగా సభమొత్తం నిశ్శబ్థం ఆవరించింది . సభికులంతా ఆశ్చర్యం తోనూ , ఉత్కంఠతోనూ చూస్తున్నారు . శివాజీ ఏమంటాడో నన్న కుతుహలం వాళ్ళందరిలోనూ ఉంది . ఆ ముస్లిం యువతి భయంతో వణుకుతోంది . శివాజీ ఆమె వైపు తిరిగి " అమ్మా ! భయపడకు ! " అన్నాడు . సభికుల వైపు తిరిగి " నిజంగానే ఈమె ఎంతో అందంగా ఉంది . ఈమె కడుపున నేను జన్మించి ఉంటే ఎంత అదృష్టవంతుడయ్యేవాడినో కదా ! నా తల్లి కూడా ఈమెంతటి సౌందర్యవతి అయితే , నేను మరింత అందంగా ఉండి ఉండేవాడిని . ఈమె నా తల్లి జిజియా బాయి లాగే నాకు పూజ్యనీయురాలు " అన్నాడు . చివరిగా తన అనుచరుడి వైపు చూచి " స్త్రీలని ఎలా గౌరవించాలో నేర్చుకో ! పరస్త్రీలందరూ మనకు మాతృసమానులు . సగౌరవంగా ఈమెను , ఈమె ఇంట దిగవిడిచిరా ! " అని ఆఙ్ఞాపించాడు . శివాజీ ఆమెకు బహుమతులిచ్చి , రాచమర్యాదలతో ఆమెను స్వగృహానికి పంపించాడు . అదీ ఆయన నిబద్దత - ధర్మంపట్లా , నైతికత పట్లా , మానవతా విలువల పట్లా ! వాస్తవానికి ధర్మం , నీతి , మానవీయ విలువలూ ఎప్పటికీ కులమత రాజకీయాలకూ , స్థలకాలమానాలకు అతీతమైనవి . వీటినే హిందూ ధర్మం చెప్తుంది . దానిని ఆచరించటమే నిజమైన హిందువు [ మనిషి ] చేయవలసినది . ఇలాంటిదే మరో సంఘటన ! ఒకసారి శివాజీ మాతృశ్రీ జిజియాబాయి ఆయన్ని సింహఘడ్ ను గెలుచుకొని తనకు కానుకగా ఇమ్మని చెప్పింది . ఆయనీ కార్యాన్ని సాధించే పనిని తన అనుచరుడైన తానాజీకి అప్పగించాడు . తానాజీ శివాజీకి ఆప్తమిత్రుడు , అనుంగు అనుచరుడూ , మహా యోధుడు . ఈ వర్తమానం అందుకొనేటప్పటికి తానాజీ తన కుమారుడి వివాహానంతర విందు వినోద కార్యక్రమాల్లో ఉన్నాడు . అయితే వర్తమానం అందుకున్న మరుక్షణమే తానాజీ సింహఘడ్ మీదకి దాడికి సేనాసమేతుడై వెళ్ళాడు . తీవ్రపోరాటంతో సింహఘడ్ ని స్వాధీనం చేసుకొన్నాడు . అయితే ఆ పోరాటంలో తన ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు . దుర్గాన్ని గెలుచుకొన్న తర్వాత , విజయచిహ్నంగా ఫిరంగి మ్రోగింపబడింది . ఫిరంగి శబ్థం విన్న శివాజీ సింహఘడ్ కి చేరుకొన్నాడు . కోట గుమ్మం దగ్గర శివాజీకి విజయ స్వాగతం ఇవ్వబడింది . కానీ శివాజీ మరుక్షణమే తానాజీ అక్కడ లేకపోవడాన్ని , ఆయన నిర్జీవ శరీరాన్ని గమనించాడు . ఇంతలో ఓ సైనికుడు సంతోషం , గర్వం నిండిన గొంతుతో " మహారాజా ! మీరు సింహఘడ్ ని గెలుచుకొన్నారు " అన్నాడు . [ బహుశః విజయవార్తని చెప్పినందుకు శివాజీ మహారాజు నుండి బహుమానాన్ని అతడు ఆశించి ఉండవచ్చు . ] శివాజీ అతడి వైపు వాడి చూపు చూసి , తీవ్రస్వరంతో " ఘడ్ తో ఆయా , లేకిన్ సింహ్ చలాయా ! " అన్నాడు . [ దుర్గం వచ్చింది కానీ సింహాన్ని కోల్పోయాను ] అదీ శివాజీ భావవాద దృక్పధం , ఆలోచనా సరళి ! సింహఘడ్ దుర్గాన్ని గెలిచిన ఆనందం కన్నా , తన ప్రియమిత్రుడూ , మహా యోధుడు అయిన తానాజీ మరణంపట్ల దుఃఖమే ఆయన హృదయాన్ని తాకింది . ప్రతి విషయాన్ని , అనుభూతినీ రూపాయల్లోకి తర్జుమా చేసుకుంటున్న నేటి సమాజంలో ఈ ' భావం ' ఎందరికి అర్ధమౌతుందో భగవానుని కెఱుక .
మీరు ఆశ్చర్య పోతారేమో - - మొన్ననే నేను ఓ ఇన్స్యూరెన్స్ కంపెనీ లో ఓ లక్ష రూపాయలకి పోలసీ కావాలంటే , ' పీ ఎం ఎల్ రూల్స్ ప్రకారం మీకు ఆ అదాయం వచ్చినట్టు ఋజువు చూపించాల్సిందే ' అని తిరస్కరించినంత పని చేశారు !
కథ చాల బాగుంది . నేను అమలాపురంలో నే పెరగడం వల్ల నేమో ఆ పరిసరాలు మనుషులూ కళ్ళకి కట్టినట్టుగా అనిపించింది . కథ లో చెప్పిన ' వామనుడి ' ని పోలిన పెద్దమనుషులు కోనసీమ లో చాల మందే ఉన్నారు .
3 . మనకి , వాళ్ళకి కొన్ని భేదాలున్నాయి . మనం ఎదైనా రాశామంటే , మన రాత మీద రకరకాల ప్రభావాలుండి చివరికి ఆ రాతలన్నీ ఒకే సముద్రంలో కలుస్తాయి . కాని వాళ్ళ వాతావరణం వేరు . " thinking out of box " అంటారే . . అక్కడ జరిగేది అదే !
సరే ! నేనెలాగూ క్రింద ఎంట్రన్స్ గేటు దగ్గరకీ , వెయిటింగురూముకీ మధ్య తిరుగుతూ , అప్పటికే ఓ అర పెట్టి సిగరెట్లు తగలేశాను . ( వెయిటింగు రూములో నిషేధం మరి ! ) క్రిందకి వెళ్లి టాక్సీ ల కోసం చూస్తూ , అప్పుడే వచ్చి యెవరినో దింపిన ఓ టాక్సీ వాణ్ని ( అప్పటికే టాక్సీ స్టాండులో వున్న వాళ్లని అడిగితే , చాలా యెక్కువ డబ్బులు అడుగుతారు ) కుదరగడుతూండగా , మళ్లీ ఫోను .
హి ఎన్రిచెడ్ అవర్ లైవ్స్ . హిజ్ రైటింగ్స్ , మెమోరీస్ విల్ ఎన్ లైటెన్ అజ్ ఫరెవర్ .
చెంగావిరంగు చీర కట్టుకున్న చిన్నది ఓయమ్మో , నా పేరు వాడుకున్నది . " కోకలు దానమిచ్చినమ్మకు మంచి కోడలొస్తుంది " అని సామెత ! ! !
హ హ . మాది సూర్యాపేట ( ఇదివరలో ) . ఆ హైవే దానిమీదుగానే వెళుతుంది కాబట్టి దానిగురించి బాగా తెలుసు . మా ఇల్లు కూడా కొత్త బస్సు స్టాండు ఎదురుగ్గా హైవే పక్కనే వుండేది . ఎన్నడో నాలుగు లేన్ల హైవే కావాల్సింది కానీ వివిధ రాజకీయాల వల్ల అలా అలా పని అవకుండా సా . . గుతూనేవుంది . ఆ హైవే గురించి కొన్ని ప్రజాందోళనలూ జరిగాయి కానీ , జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా వున్నా కానీ ప్రయోజనం మాత్రం శూన్యం . మాకు తెలిసిన వారు కూడా కొద్ది మంది చనిపోయారు . ఎప్పుడన్నా ఇండియా వచ్చినప్పుడు హైదరాబాదు నుండి సూర్యాపేట వెళితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళుతుంటాను .
1 ) అసలు వివాహం అంటే ఓ లైసెన్స్ - చట్టబద్ధంగా , సురక్షితంగా , స్వేచ్చగా , భార్యా భర్తలు లైంగిక సంబంధాన్ని అనుభవించడానికి ! దానికోసం మొదటి మూడు నిద్రలూ జరిపించటం ఓ ముచ్చట ! ఆ తరవాత కూడా , రాత్రి తొమ్మిది అవగానే , భార్యా భర్తలు పడగ్గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నా , ఇంట్లో వాళ్ళు ( పుట్టింట్లో గాని , అత్తింట్లో గాని ) ముసిముసిగా నవ్వుకుంటారేగానీ , వద్దనరు , తప్పు పట్టరు ! ( యెక్కడో కొంతమంది అత్తలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారులెండి ! ) ఇంతే కాకుండా , వాళ్ళమీద ఒక అజ్ఞాత ఒత్తిడి వుంటుంది - వెంటనే ఓ బిడ్డని కనాలని . దీంతోపాటు , ఒక యేడాది తిరిగేసరికల్లా , బిడ్డ పుట్టలేదనుకోండి , ఇంట్లో వాళ్ళూ , వీధిలో వాళ్ళూ , ఇంటికి వచ్చేపోయే బంధువులూ , ఇంటిపనివాళ్ళూ , చివరికి ఆ వీధి ముష్టివాళ్ళు కూడా ఆరా తీస్తారు - ' అమ్మాయి ఇంకా నీళ్ళు పోసుకోలేదా ? ' అంటూ ! దీనివల్ల , ఈ రోజు ఓ వెయ్యి సామూహిక వివాహాలు అయ్యాయనుకోండి , ( వాళ్ళ సరాసరి వయసు పాతిక వుండచ్చు ) 2009 డిసెంబరు 31 లోపల కనీసం 800 నించి 850 శిశువులు పుడతారు ! ( ఇవి కోట్లాదిగా ప్రతీ యేటా జరిగే మామూలు వివాహాలకి అదనంగా , ప్రభుత్వ / మత ప్రోత్సాహంతో జరుగుతున్నవి అని మరిచి పోకండి ) . వాళ్ళలొ , ఓ 5 శాతం దాకా - అంగ వైకల్యంతోనో , మానసిక సమస్యల్తోనో పుట్టడానికి అవకాశం వుంది అని ఆధునిక శాస్త్రం చెబుతోంది ! ఇంకో 10 శాతం దాకా - సరైన ఆహారం లేక , 5 యేళ్ళలోపే మరణిస్తున్నారని కూడా శాస్త్రం చెబుతోంది ! బతికి బట్టకట్టిన వాళ్ళలో , సరైన తిండీ , గుడ్డా లేక , పతితులూ , భ్రష్టులూ , బధా సర్పదష్టులుగా మారుతున్నవాళ్ళూ - ఓ 20 శాతం వుంటారు ! మిగిలిన వాళ్ళలో 50 శాతం - చేతికీ , నోటికీ కష్టం మీద లింకుచేసుకుంటూ బ్రతికే దిగువ మధ్యతరగతికి చెందే అవకాసం వుంది ! ఇక్కడకి మిగిలిన 15 శాతంలో , కొంతమంది ఉద్యోగాల్లోనూ , వ్యాపారాల్లోనూ , ఇతర వృత్తుల్లోనూ చేరి , యెగువ మధ్య తరగతిగా మారతారు ! ఏ 0 . 5 శాతమో కోటీస్వరులు అయినా అస్చర్యం లేదూ ! ఇవన్నీ సామాజిక సమస్యలు . వీటిని అధిగమించడానికి సహజీవనం యెలా తోడ్పడుతుందో - మళ్ళీ చూద్దాం !
పైన చెప్పిన చిట్కాలు ఐహికపరంగా సాధన చేయటానికి బాగా పనికివస్తాయి . అయితే , ఆధ్యాత్మికపరంగా సాధన చేయటంద్వారా ఆనందాన్ని ఎప్పుడు పొందుతూనేవుంటాము . అందుకు మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలి : -
మండే ఎండలు , పిల్లల పరీక్షలు కలిసి వాతావరణం చాలా వేడి వేడిగా వుంది . ఈ మండే ఎండలలో పుస్తక ప్రియులకి ఓ చల్లటి వార్త . విశాలాంధ్ర వారి వార్షిక క్లియరెన్సు అమ్మకం సందర్భంగా కొన్ని పుస్తకాల మీద 10 నుండి 50 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు . విశాలాంధ్ర బ్యాంక్ స్ట్రీట్ బ్రాంచి మరియు యూసఫ్‌గూడా చౌరస్తాలో ఈ తగ్గింపు అమ్మకం ఈ నెల 25 వరకు వుంటుంది . పుస్తకాలు కొనాలనుకునేవారికి ఇదే మరి మంచి తరుణం వదులుకోకండి . జాషువా , ఆరుద్ర , దాశరథి , వాసిరెడ్ది సీతాదేవి , గొల్లపూడి , బాపురెడ్డి మొదలయిన రచయితల పుస్తకాలపై 50 శాతం తగ్గింపు మరియు ఇతర పుస్తకాలపై 10 నుండి 25 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు . మొత్తానికి గాంధీ వాడిన వస్తువుల వేలం రద్దు చేస్తున్నట్తు జేమ్స్ ఓటిస్ ప్రకటించాడు . దేశంలో తొలిసారిగా అంధుల కొరకు Score Foundation అనే సంస్థ ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది . ఇందులో అంధులు , కంటిచూపు తక్కువగా ఉన్నవారి కోసం సమస్త సమాచారాన్ని అందుబాటులో వుంచుతారు . http : / / www . eyeway . org లో అంధుల సమస్యలకు సలహాలు , సూచనలు పొందవచ్చు . తెలుగుదేశం పార్టీ కలర్ టి . వి . వాగ్ధానంతో సామాన్య ఓటర్ల మీదకి ఓ రంగుల వల విసిరింది , చూద్దాం ప్రజలు ఈ వలలో ఎంతవరకు పడతారో ! అంతే కాదు నిరుపేద , పేద , మధ్య తరగతి కుటుంబాలకు ప్రతి నెలా ఠంచనుగా పించను అట ! స్త్రీలు కుటుంబ పెద్దలుగా వుంటే వారికి నెలకు 1500 ఇస్తారట ! ఇక పోతే ప్రజారాజ్యం పార్టీ వాళ్లు మేమేనా తక్కువ తినేది అని వాళ్లు అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రెండున్నరెకరాల మాగాణి లేదా ఐదు ఎకరాల మెట్ట భూమి ఇస్తామని హామీ ఇచ్చేసారు . కాంగ్రెస్సు వారు ఇంకెలాంటి హామీలు గుప్పిస్తారో వేచి చూద్దాం . . . . వచ్చే ఎన్నికలలో పోలింగు బూతుల వద్ద పోలింగు స్లిప్పులను ఇచ్చేందుకు ఎన్నికల సంఘమే ప్రతి కేంద్రం వద్ద ప్రింటర్లను ఏర్పాటు చేస్తుందట . ఇంతకుముందులాగా రాజకీయ పార్టీలు స్లిప్పులు ఇవ్వటానికి అనుమతి లేదు . అమెరికా వెళ్లాలనుకునే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇకనుండి హైదరాబాదులోనే వీసాలు పొందవచ్చు . మార్చి 5 నుండి హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ పూర్తి స్థాయి సేవలు అందిస్తుంది . ప్రస్తుతం రోజుకు 100 వీసాలు ఏప్రిల్ అనంతరం రోజుకు 400 వీసాలు జారీ చేస్తారు . . . .
సామ్రాజ్యవాద విధానాల అత్యున్నత తీవ్రదశ ప్రపంచీకరణ సమాజంలోని వివిధ రంగాలను ఎటువంటి ప్రకంపనలకు గురిచేసింది … . దాని మూలంగా మానవ సంబంధాలు ఎలా విచ్ఛిన్నమైపోయాయి … . మార్కెట్టు మాయాజాలంలో మునిగి శ్లేష్మంలో పడ్డ ఈగల్లాగా కొట్టుకుంటూ మనుషులు ఎలా వాటికి దాసోహమయిపోయారో ఇలా అన్ని విషయాలనూ క్షుణ్ణంగా , చాలా లోతుగా పట్టుకోగలిగింది తెలుగు కథ … .
• అందుకోసం మీరు ప్రత్యేకంగా కృషి చెయ్యవలసి వచ్చిందా ? లేదు . స్కూల్లో అన్ని సబ్జెక్టులకీ చేసినంత కృషే దీనికీ చేసాను . ఇంకా చెప్పాలంటే ఇంగ్లీషు మీడియంలో చదివినా , ఇంగ్లీషు హిందీ ( సోషలు కూడా నండోయ్ ! ) నేర్చుకోడానికి చాలా కృషి చెయ్యాల్సి వచ్చేది .
మొదటి మూడు సూత్రాలు కలిసి యిప్పుడు ప్రమాణాలుగా ఉ్రదంధాలుగా పైకెత్తుకోబడుతున్న కుకవిత్వంలో పదింట తొమ్మిదివంతుల్ని ఏరిపారేస్తాయి . నువ్వూ అదే కుకవితానిర్మాణ నేరం చెయ్యకుండా అడ్డుపడతాయి .
ఈ న్యాయసూత్రం బాగానే ఉందిగానీ వెనకొచ్చిన చట్టమే ఈ ఒప్పందం ముందొచ్చిన చట్టాలకు లోబడి అమలవుతుందని చెప్పినప్పుడు దేనిది పైచేయి అవుతుంది ? ఇవన్నీ వాదనకోసమే గానీ , 123 ఒప్పందాన్ని చిం చి చెత్తబుట్టలో పారేయాలని అమెరికా నిర్ణయించుకున్ననాడు వారికి ఒక చట్టం అవసరమా ? ఒక న్యాయసూత్రం అవసరమా ? ఏ న్యాయసూత్రం చూసుకొని అమెరికా ఇరాక్ ను ధ్వంసం చేసింది ? ఇరాన్‌ను బెదిరిస్తున్నది ? ఉత్తర కొరియాను లోబరచుకుంది ? ఇక్కడే మొదట్లో చెప్పిన విషయానికి తిరిగి వస్తాం . మనం ఎప్పటికీ ఆ స్థితిలో ఉండమని ఈ ఒప్పందాన్ని సమర్థిస్తున్న వారి ధీమా . ఎందుకుండము ? మనం ఇంక ఎప్పటికీ అమెరికాతో గొడవ పెట్టుకోము కాబ ట్టి , నమ్మిన బంటుగానే ఉంటాము కాబట్టి .
శెలవులు దొరికి మొత్తం మీద భారతదేశం వచ్చాను . మూడు రోజుల క్రితం శంషాబాదులో దిగాను . ఓ నెల రోజులపాటు కుటుంబం , చుట్టాలు , పాత మిత్రులు అందరినీ కలవాలని నా ప్లాను . ఈ సారి సరదాగా , నా బ్లాగు మిత్రులని కూడా కలిస్తే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది .
భానూ డిమాండ్ నే నాది కూడా . ఆ వేపుడు ఎందుకో నా పోస్ట్ చదివారు కాబట్టి మీకు తెలిసే వుంటుంది . ఆ రెసెపీల బ్లాగు మొదలుపెట్టండి ఇంక . ఆలస్యం దేనికి ? అప్పుడు మిమ్మల్ని నా శత్రువుల జాబితాలో చేచేస్తాను . @ కృష్ణప్రియ . . . మీరు చెప్పిన విషయాలు వింటే బాధేసింది . ఇక్కడ పబ్లిక్ స్కూల్ల గురించి ఇంకా చాలా మంచి విశేషాలున్నాయి .
ఇక నిఖిలేలో ఎక్కడ లోపముందో నాకు తెలియట్లేదు . నాకు Mac లేదు . Consoleలో ఏమైనా తప్పు సందేశం చూపిస్తుందా ?
అనుభూతి అందరిదీ . కవిత్వం కిరణుది . ఆవేశాలు అనుభవాలయి చచ్చిపోవడం నిజం . మినుకుమినుకు మంటున్న ఆ జ్ఞాపకాలే మిగిలిన బతుకంతా వెలిగిస్తాయి .
ఇలా వ్రాయడానికి సంకోచించడం లేదు కానీ ఇబ్బందిగా ఉంది . నిజం ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటుంది . కాని అది నిజ్జంగా నిజంగానే ఉంటుంది . దానిని అంగీకరించి ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి . అంతటి ధైర్యం నాలో రావాలనే ఈ ప్రయత్నం .
Martingal is defined as జేరుబందు , అనగా సవారి గుర్రపు ముఖపట్టకున్ను టంగువారుకున్ను కట్టేవారు .
మనవాళ్ళు తాము సంపాదించిన ఇటువంటి ఘనతలో కనీసం కొంత భాగాన్ని కూడా తిరిగి మన రాష్ట్రానికీ , రాష్ట్ర ప్రజలకు ఎందుకు అందించలేకపొతున్నారు అనేది నన్ను ఎప్పుడూ తొలిచివేసే విషయం . నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే , మీరే చూడండి …
సంప్రదాయం ప్రకారం మన పూర్వులు పూజా సమయంలో మరియు ఇతర సమయాలలో కుడా తులసీ దళాలను చేవులపై వెనుక భాగంలో ధరించేవారు . దానిలో ఎంతో శాస్త్రీయత ఉందన్న విషయం ఈ రోజు మనం గ్రహించాలి .
దీనంతటికీ కారణం జర్నలిస్ట్ శ్రీశైలం ఒక ప్రత్యామ్నాయ మీడియం ఏర్పాటు చేయడం , ఈ కృషిలో భాగంగా " మూసీ టీవీ " పేరుతో తెలంగాణ జిల్లాలో జరుగుతున్న రాజకీయ , సామాజిక , సాహిత్య కార్యక్రమాలను రికార్డు చేసి జనం ముందు తీసుకొని రావడం . దీనివల్ల తెలంగాణలో జరిగే అనేక అన్యాయాలను , వార్తాంశాలను బయటపెడుతూ , తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేయడంలో శ్రీశైలం నిరంతరం కృషిచేస్తున్నారు . అంతే కాదు తెలంగాణ జర్నలిస్టుల కార్యక్రమాలను , పల్లె పాటలను కూడా మూసీ టీవీ ద్వారా అందిస్తున్నారు . ఒక జర్నలిస్టుగా అనేక అభిప్రాయాలను ఇంటర్నెట్ పత్రిక " మూసీ టీవీ " ద్వారా అందిస్తున్నారు . పాత్రికేయ వృత్తిలో భాగంగా రకరకాల వ్యక్తులను కలవాల్సి ఉంటుంది . మావోయిస్టుల సమాచారాన్ని ప్రజలకు చేరనివ్వకుండా ప్రభుత్వం వివిధ ఆటంకాలను కల్పించాటానికి రకరకాల కథనాలను చెప్తుంటారు . దీనిలో భాగమే జర్నలిస్ట్ శ్రీశైలం పై కొరియర్ అనే ముద్ర వేసి ఆయన్ని అరెస్టు చేయడం . దీన్ని ఇప్పటికే ప్రజాస్వామ్యవాదులంతా ఖండిస్తున్నారు . జర్నలిస్టులు ర్యాలీలు చేస్తున్నారు .
వీకెండ్ కావటంతో ఫ్రెండ్స్ అందరం ఎప్పటిలాగానే ఒకరి ఇంట్లో కలవటం . . . పిచ్చాపాటి కబుర్లు . . . జోకులు . . . చెణుకులు మధ్య హాయిగా గడిచిపోయింది . తెలంగాణ బంద్ వల్ల దియేటర్లు , షాపింగ్ సెంటర్లు , గోకార్టింగ్ లాంటి ఎంటర్టైన్మంట్ జోన్స్ మూసెయ్యటం మా ఆనందాల మీద ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది . సాయింత్రం అందరం కలిసి సరదాగా కారులో అంతర్జాతీయ విమానాశ్రయంకి బయలుదేరాం . ఏ ప్లేస్ కి వెళ్ళినా మొదట అక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్లు పై పడటం మా వాళ్ళకు అలవాటు . ఎప్పటిలాగే వినడానికి వింతగా ఉండే అయిటేమ్స్ మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్లో ఆర్డర్ ఇచ్చేసి బాతాఖానీలో పడ్డాం . అయిటెమ్స్ రాగానే మారుమాట్లాడకుండా అందరం మెక్కుతూ కూర్చున్నాం . . . ఇంతలో మా అశ్విన్ గాడు బర్గర్ ని చేతిలోకి తీసుకుని కొంచెం సాస్ పోసి అభిమానంగా " ఏరా శేఖ్ . . . తింటావా " అని నన్ను అడిగాడు . అంతే ఆ దృశ్యం చూసిన అశ్విన్ వాళ్ళావిడ ప్రణవి " తింటావా అని నన్నడకుండా శేఖర్ ని అడుగుతావా " అంటూ అలిగింది . మిగిలిన వాళ్ళకు ఏమీ అర్ధం కాలేదు . " ఎదురుగా నేను కనపడుతుంటే నన్నడకుండా వాడిని అడుగుతావా " అని మరోసారి అంది . అప్పుడువాడు బర్గర్ ని తనకు ఇవ్వబోయాడు . అంతే తను కోపంగా తిరస్కరించింది . నువ్వు ఇంకోబర్గర్ ని తింటావేమో అని నిన్నడగలేదు అని తను ఏదో వివరణ ఇవ్వబోతుండగా " ఎప్పుడైనా నువ్వు తినకుండా నేను తిన్నానా ? ప్రతీసారి మనం షేర్ చేసుకుంటాం కదా " అని అంది . అంతే మా గ్యాంగ్ లోని మిగిలినవాళ్ళు నేను ప్రణవికి సవతిపోరు కలిగించానా అని ఆశ్చర్యంగానూ , వాడు నాకు ఇస్తున్నప్పుడు ప్రణవికి ఇవ్వరా అని వీడెందుకు అనలేదు అన్నట్టు వింతగానూ చూశారు . ప్రణవికి అశ్విన్ మీద పొసెసివ్ నెస్ చాలా ఎక్కువ . తను ఎంత ఎక్కువగా అశ్విన్ ని ఇష్టపడుతుందో అంతే ఇదిగా అశ్విన్ కూడా తనను చూసుకోవాలని అనుకుంటుంది . అయితే అశ్విన్ కూడా తనపై అంతకు రెట్టింపు ప్రేమ చూపిస్తాడు . కానీ చిన్న విషయాలను కూడా ప్రణవి , అశ్విన్ కి తనపై ఉన్న ప్రేమని బేరీజువేసుకోడానికి ఉపయోగించటం వల్ల అశ్విన్ లైఫ్లో ఇలాంటి సంఘటనలు జరగటం మామూలు అయిపోయింది . పొసెసివ్ నెస్ . . . . అంటే ఎదుటివాళ్ళ మీద విపరీతమైన ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళని మనకు నచ్చినట్టు ప్రవర్తించేలా చేసుకోవటం ఏమో అని అనిపిస్తుంటుంది నాకు . నిజానికి పొసెసివ్ నెస్ అనేది నిత్యం మనం చుట్టు ప్రక్కల మనుషుల్లో చూస్తునే ఉంటాం . ఒక తల్లి తన కొడుకు ఎప్పుడూ తనకి అడిగే అన్నీ కొనాలంటుంది . ఎప్పుడైనా వీలుకాక అడిగికొనటం కుదరకపోతే అతను ఏ పరిస్థితిలో తనని అడగలేదు అని ఆలోచించి అర్ధం చేసుకోడానికి ప్రయత్నించదు . తనపై గౌరవమర్యాదలు తగ్గటం వల్లే అలా చేసాడని ఫీలవుతుంది . ఓ భార్య తనను ప్రతీరోజు ఆఫీసు నుండి ఇంటికి తీసుకొచ్చే భర్త ఏరోజైనా " నా చిన్నప్పటి స్నేహితుణ్ణి కలవాలి . . . ఈ రోజు నువ్వు ఆటోలో వెళ్ళు " అని గొంతులో స్నేహితుణ్ణి కలవబోతున్నానన్న ఆనందం చూపి చెబితే అర్ధం చేసుకోకుండా తెగ కోపం తెచ్చుకుంటుంది . పైగా తనకంటే స్నేహితుడే ఎక్కువా అంటూ వాదనకు దిగుతుంది . ఓ పాతికేళ్ళ కుర్రాడు రూంలో ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ బయటకు వెళ్ళిన ప్రతీసారి తనతో ఎక్కడికి వెళుతున్నాడో చెప్పి వెళ్ళాలని ఆశిస్తాడు . ఎప్పుడైనా చెప్పకపోతే స్నేహితుడు మారిపోయాడని అనుకుంటాడు . అంతేగానీ తిరిగి వచ్చిన తర్వాత తనతో విషయాలన్నీ చెబుతాడు అన్న భరోసాతో ఉండడు . ఎదుటివాళ్ళ స్వేచ్చకి భంగం కలగకుండా చూపించే ప్రేమ / అభిమానం అన్ని విధాల మంచింది . ఎప్పుడైతే మనం ప్రేమ / అభిమానం పేరుతో వాళ్లని వాళ్ళుగా ఉండనీకుండా కట్టడి చేస్తామో అప్పుడు వాళ్ళు మనం ప్రేమ పేరుతో విధించిన సంకెళ్ళను తెంచుకోడానికే ప్రయత్నిస్తారు . ముఖ్యంగా పొసెసివ్ నెస్ వల్ల ప్రాక్టికాలిటీనీ మిస్సవుతాం . ఎవరైనా అశ్విన్ లాంటి ఒకలిద్దరు మాత్రం ఆ ప్రేమని అర్ధం చేసుకోడానికి ప్రయత్నం చేస్తారంతే . మిగిలిన వాళ్ళు వారినుండి తప్పించుకోడానికి విషయాలను దాచిపెట్టడం , అబద్దాలతో మేనేజ్ చేసుకోవటం , నస కేసురా బాబు అంటూ వేరొకరిదగ్గర గోడు వెళ్ళబోసుకోవటం లాంటివి చెయ్యాల్సివస్తుంది .
ఏదో కాస్త అలా ఇండియా వెళ్ళొద్దామని , వెళ్తూ వెళ్తూ నాయనలారా నేను తిరిగొచ్చే టైముకి ఈ హెల్తుకేరు బిల్లుని , ఊరకే కారుకారు మని కాకిగోల చెయ్యకుండా , కేరుఫుల్గా పాస్ చెయ్యండ్రా బాబూ అని చిలక్కి చెప్పినట్టు చెప్పి పోతే , తిరిగొచ్చే సమయానికి ఎక్కడి గొంగళీ అక్కడే ఉన్నట్టుంది పరిస్థితి . చివరి నిమిషందాకా లాగి పీకి , చివరికి మంచుతుపానులో సెనేటు భవనాన్ని వదిలి పోయే దోవ లేకుండా దార్లు మూసుకుపోతే అప్పుడు ముక్కి మూల్గి మొత్తానికి నిన్న అర్ధరాత్రి మొదటి వోటు వేశారు . పూర్తిగా పార్టీ చీలిక ప్రకారం నడిచిన ఈ వోటులో ప్రభుత్వ ప్రతిపాదనవేపుగా 60 వోట్లు పడ్డాయి . క్రిస్మసుకి ముందే పూర్తి బిల్లు ఆమోదించబడే అవకాశం ఉండంటున్నారు విశ్లేషకులు . అంతర్జాతీయ వేదిక మీద , క్యోటో తరవాత మళ్ళి అంత పెద్ద జాతర కోపెన్‌హేగెను లో జరుగుతోంది . మాటల హడావుడే తప్ప చేతల పనితనం సున్న అంటున్నారు పరిశీలకులు . అమెరికానించి చైనా దాకా , ఎవరికీ ఈ " డీల్ " అత్యవసరంగా కనబట్టల్లేదు . చివరికి " నో డీల్ " యే మిగిలేలా ఉంది . చర్చల్లో బిగుసుకుపోయి కూరుకుపోయున్న డెలిగేత్లకంటే బయట గడ్డకట్టే చలిలో సంగీతంతో ఆట పాటల్తో నిరసన చూపుతున్న ప్రొటెస్టర్లే ఎక్కువగా ఈ తమాషాని ఎంజాయ్ చేస్తున్నారల్లే ఉంది . ఒబామహాశయుడు నోబెలు స్వీకరణతో సహా ఇంకో మూడు స్పీచిలు దంచికొట్టి వక్తృత్వ నిరూపణ చేసుకుంటున్నాడు గానీ , పరిపాలనా పటుత్వ నిరూపణ ఎక్కడ కనబట్టల్లేదు . నెలపైగా నాన్చినాన్చి మొత్తానికి ముప్ఫై వేల సైన్యాన్ని మంజూరు చేశాడు ఆఫ్ఘనిస్తానుకి . మళ్ళీ వార్తా ఛానళ్ళన్నిటిలోనూ ఆఫ్ఘనిస్తానూ పాకిస్తానూ ప్రముఖంగా వినిపిస్తున్నాయి . 70 - 80లలో సోవియట్ ఆక్రమణ నాటి దృశ్యాలన్నీ పునరావృత్తమవడమే గాక ఈ సారి పశ్చిమ పాకిస్తానులోకి బలంగా చొచ్చుకుని వచ్చే సూచనలున్నాయి . ఈ వార్తా ఛానెళ్ల వీక్షణంలో ఒక పెద్దాయన పాకిస్తాను ప్రభుత్వపు కార్యాచరణ గురించి మాత్లాడుతూ , ఆఫ్ఘనిస్తానులో భారద్దేశం 1 . 2 బిలియన్ల డాలర్ల వరకూ పెట్టుబడి చేసింది అని ఒక మాటన్నాడు . నాకు షాకయింది . ఎక్కడ , ఏ రూపంలో , ఎలా ఈ పెట్టుబడి జరిగింది ? మీలో ఎవరికన్నా ఈ కబురు తెలుసునా ? తెలిస్తే కాస్త విశదీకరించి పుణ్యం కట్టుకోండి . నాకెక్కడా సమాచారం దొరకలా . వస్తూ వస్తూనే నాకు థెర్మల్ షాకు . . బయటి ఉష్ణోగ్రత సున్నా దిగువకి జారిపోతుండగా , కొండల్లో మంచు వానల్లో కారు ప్రయాణం జర్రుబుర్రున జారుకుంటూ , ఇష్టం లేని స్కేటింగులు చేసుకుంటూ . ఎట్లా ఇల్లు చేరానో ఆ భగవంతుడికే తెలియాలి . ఇండియా విషయాలు కబుర్లు విశేషాలు ఇంకా చాలానే చెప్పాలి . అవెలాగూ ఒక్క టపాలో ముగిసేవీ కావు కాబట్టి మెల్లగా వీలెంబడి చెబుతాను . కానీ ఒక్క మాట . . ఏంటో అందరూ ఆహా ఓహో అంటే ఎమిరేట్స్ వారి విమానంలో ప్రయాణించాము . అంత దౌర్భాగ్యపు సర్వీసు నేను ఎక్కడా చూళ్ళేదు . పైగా దుబాయి విమానాశ్రయం , షాపింగుకి గొప్పేమో కానీ , వసతులకి మాత్రం దుర్భరం . హైదరాబాదు పుస్తక ప్రదర్శన రంజు రంజుగా సాగుతోందిగా . రాష్ట్ర విభజన ప్రహసనం ఏ స్థాయిలో ఉందో , తెలుగు పేపర్లు చూసే సాహసం చెయ్యట్లేదు . తెలుగు పేపరంటే గుర్తొచ్చింది . ఇవ్వాళ్ళ ఆంధ్రజ్యోతి వివిధలో పలువురు అమెరికా తెలుగు రచయితలు ఈ సమస్యపై వారివారి అభిప్రాయాలు వెలిబుచ్చారు . పనిలోపనిగా నేనుకూడా ఒక అభిప్రాయం వెలువరించేశా . ఇక్కడ చదవొచ్చు . ఈ పిల్లోడెవరో , పిట్ట కొంచెం కూతఘనం అన్న లెవెల్లో బ్రహ్మాండంగా బొమ్మలేస్తున్నాడు . పనిలో పని మంచి సెన్సాఫ్ హ్యూమరు కూడా . . మీరూ ఓ లుక్కెయ్యండి . అన్వర్ జాగ్రత్త పడటం మంచిది !
బావుందండి . కాసిని సూచనలు : 1 . పదం యొక్క అర్థాల కోసం చూస్తారు కాబట్టి విక్షనరీ కూడా ఉంటే బాగుంటుంది . 2 . Esc నొక్కినపుడు , ఆ పాపప్ పోతే బావుంటుంది . 3 . ఈ వ్యాఖ్య పెట్టెలో రాసిన పదమ్మీద డబుల్‌క్లిక్కినపుడు బ్లాంకును నొక్కితే ఎలా వస్తుందో అలా వస్తోంది . . నొక్కింది పదమ్మీదేనైనా
కానీ ఉద్యోగ భాధ్యతలు వచ్చిన తరువాత నేను చొరవ తీసుకుని ఈ రోజున అక్కడ పని చేసే వారిలో ఔత్సాహికులను ఓ చోట చేర్చి జండా వందన కార్యక్రమం చేసే వాడిని . పోను పోను ఔత్సాహికులు తగ్గిపోవడం వల్ల రిపబ్లిక్ డే అలాగే ఇండిపెండెన్స్ డే ఒక సెలవు రోజుగా మాత్రమే మిగిలిపోయింది కానీ అంతకన్నా ఎక్కువ ఏమీ జరగటం లేదు . కనీసం ఆ నాడైనా బ్లాగర్లు అందరూ ఓ పోస్టు వేస్తే బాగుంటుందని నా ప్రపోజల్ . చదివే వారు ఏమంటారు ?
ఇప్పుడు ఇక్కడ తరచుగా ఒక మాట వినబడుతోంది అది కమ్యూనిటీ స్కూళ్ళు . అమెరికాలో పేదా ధనిక తేడాలేకుండా అందరూ ఒకే స్కూలో చదువుతారట కదా ! అలా చేస్తే సమాజ భాగస్వామ్యం పెరిగి స్కూళ్ళు బాగుపడతాయని మేధావుల ఉవాచ . ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు రానంతవరకూ మన తాతల కాలం నాటినుంచి ఉన్నవి అవే స్కూళ్ళుకదా . ఇంతకు ముందు మనం అందరం అలాంటి బడిలోనే చదివం కదా . గడచిన 30 యేళ్ళుగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి , ప్రభుత్వ బడులు నాశనం చేసారు . ఇప్పుడు మళ్ళీ అమెరికా వల్ల వాటి విలువ తెలిసి వచ్చింది . అయినా ఇదంతా మన బాధ మాత్రమే సార్ ! నిజంగానే మంచి విద్యను అందించాలన్న తపన ప్రభుత్వాలకు ఉంటే కదా .
" ఇష్టమేమిటీ ? అన్నీ చదవాల్సిందే ! దేంట్లోనూ అరమార్కు తగ్గినా ఇంట్లో నాన్న బెత్తంతో బాదేవాడు . " పెద్దగా బాధ ద్వనించని అభావమైన గొంతుతో చెప్పుకుపోతోంది .
పేరు లోనే తింగర వుంది కాబట్టి ఈ తరహా కవి గురించి ఈ దిగువున .
ఊరిడిసి నేపోదునా … ఉరిపోసికొని నే సద్దునా ? గానం : విమల
ఒక చరిత్రను చెప్పేటపుడు జరిగింది జరిగినట్లు చెప్పాలి . అలాగే పురాణ ఇతిహాసాల్ని చెప్పేటప్పుడు , అది మనం చూడలేదు కాబట్టి , ఒక ప్రామాణిక గ్రంథమే దానికి మార్గదర్శకం కావాలి . అందరూ నమ్మే వ్యాస భారతమే భారతానికి ప్రమాణం , అలాగే వాల్మీకి రామాయణమే రామాయణానికి ప్రాణం , ప్రమాణం . ఇవి కాక మరెన్నో గ్రంధాలు వున్నాయి , వాటినెందుకు ఎంచుకోకూడదూ అంటే , అది వితండవాదనే అవుతుంది .
రామాయణమును తెలుగు చేసిన మ . వావిలకొలను సుబ్బారావు పంతులుగారు కూడా ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో గ్రామ్యమును గురించి సరసముగా కొంత ముచ్చటించిరి . " కులటయగు మాత కన్న బతివ్రతయగు మాత యెక్కువ పూజ్యురాలైనట్లు , గ్రామ్య భాష కన్న లాక్షణిక భాషయే ప్రశస్తమని బుద్ధిమంతులెల్ల నంగీకరింతురు . అట్టి సలక్షణ భాష నుపేక్షించినచో గలుగు ననర్ధములు పెక్కులు గలవు . గ్రంథ విస్తర భీతి సంక్షేపించెద . గాని తుదకాంధ్ర పదము నామావశిష్టమగు . "
మొదటిది . . ఎక్కడ ఏది చెయ్యాలో అక్కడ అది చెయ్యకుండా ఏదేదో చేస్తూ మరేదో చేస్తారు . అసలు విషయానికి వద్దాం . ఇక్కడ నీరు సంవృద్దిగా దొరుకుతుంది . అందువల్లన వీరి ప్రకృతి సంపద చాలా బాగుంటుంది . ఎక్కడ చూసినా చక్కటి చెట్లు మంచి రోడ్లు . శీతాకాలం వస్తే మోకాలు ఎత్తుకు మంచు . అన్నీ బాగుంటాయి . అందువల్ల వీరు నీటిని చాలా శుద్ది చేసి వాడుకుంటారు . ఎంత శుద్ది చేసి అంటే , అచ్చంగా కుళాయి నుంచి వచ్చే నీటిని మనం యధావిధిగా త్రాగేయవచ్చన్నంతగా . నీరు ఇంత బాగా దొరుకుతున్నా , అన్ని పనులకు నీటిని వీరు వాడుతున్నా అసలైన చోట మాత్రం వీరు నీటిని వాడరు . ఎక్కడంటారా . . అదే అక్కడికే వస్తున్నా . . అది మల విశర్జన చేసి అశుద్దం అంటిన శరీరాన్ని నీటితో కడగరు సరికదా కాగితంతో తుడుచుకుని బయటకి వచ్చి , * డ్డిని నీటితో కడుక్కోరు కానీ * డ్డిని అంటిన చేతిని మాత్రం నీళ్ళతో కడుక్కుంటారు . అసలు అలాంటి చోట నీళ్ళను ఏర్పాటు చేసుకోరు . ఏమైనా అంటే కాగితంతో తుడుచుకున్నాంగా అంటారు .
శ్రీ బాపుగారు వేసిన బొమ్మల కధలన్నింటిని , ఒక దగ్గర కూర్చి , కొంచెం అటూ ఇటూ 400 పేజిలతో ( 80 పేజీలు రంగులలో ) 1 / 4 డెమీ సైజులో , అతి చక్కని బైండింగుతో ప్రచురిస్తున్నాము .
ది అసోసియేషన్ ఆఫ్ కమ్యూనిటీ ఆక్సెస్ బ్రాడ్‍కాస్టర్స్ ( ACAB ) అనేది పదకొండు న్యూజిలాండ్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ల సమూహం . 1981 మరియు 2000 మధ్య స్థాపించబడి , 1989 నుండీ ప్రభుత్వ నిధులు అందుకొంటున్న ఈ స్టేషన్లు , సముదాయ కార్యక్రమాలను అందిస్తాయి , మరియు వ్యక్తులకు మరియు సముదాయ సమూహాలకు కార్యక్రమం నిర్మించే సౌకర్యాలు , శిక్షణ మరియు ప్రసార సమయాన్ని అందిస్తాయి .
ఈ గొడవ పడలేకే , ఈ టెలికాలర్స్‌కి ఒక నంబర్ , ఫేమిలీ కోసం మరో నంబర్ మైంటైన్ చెయ్యవలసి వస్తుంది . బ్లాగుల్లో కాక మీకూ తగిలిందన్న మాట . ఎవరి గోల వాళ్ళు రాసుకుంటే ఫరవాలేదండీ . పక్కవాడినో లేకపోతే వాళ్ళు అభిమానించే దాన్నో విమర్శిస్తే ఇలాంటి గొడవలు మొదలవుతాయి .
అది ప్రాచీన కాలం ! ఈ కథ ప్రాచీన భారత దేశంలో సంభవించింది . ఆ కాలంలో భారత దేశం భూలోక స్వర్గంలా ఉండేది . మూడు దిక్కులా ఆవరించిన సముద్రాలు , ఉత్తర దిక్కున ఠీవిగా నిలిచిన హిమాలయ పర్వతాలతో , వెల లేని రత్నాలూ విలువైన లోహాలూ కలిగి , ఒకేసారి నిండు గర్భిణి లాగానూ , పచ్చి బాలింత లాగానూ ఉండేది . వెండి బంగారు రాగి ఇనుము వంటి లోహాలూ , రత్నాలూ వజ్రలూ ప్రజలకి సునాయసంగా లభ్యమయ్యేవి . చల్లని , సౌకర్యవంతమైన , అందమైన , పచ్చని ప్రకృతి పరచుకొని ఉండేది . ఆ జీవగడ్డపై సంవత్సరమంతా ఎప్పుడు చూసినా , ఎక్కడ చూసినా పచ్చని పైరులు చిరుగాలికి ఊగుతుండేవి . నదీ నదాల గలగలలతో , పశుపక్షుల కిలకిలలతో , అరణ్యాలతో అలరారు తుండేది . అక్కడక్కడా విసిరేసినట్లుగా జనవాసాలు . . . గ్రామాలు , నగరాలు ! పచ్చని ప్రకృతిలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తుండేవాళ్ళు . అలాంటి భారతదేశంలో అది దక్షిణ భూభాగం ! పుడమి తల్లికి నుదుటి సింధూరంలా ధారానగరం అనే పట్టణం ఉండేది . ఆ నగరంలో ఇళ్ళన్నీ మిద్దెలూ మేడలే ! పలు అంతస్ధుల భవనాలతో అందంగా ఉండే నగరం ! అక్కడి ఇళ్ళకు తోరణాలుగా మామిడాకులు గాక , మణులతో చేసిన హారాలు వేలాడుతుండేవి . దొంగభయం లేదు . దోపిడిల భయమూ లేదు . ప్రజలంతా ఎంతో శాంతి సౌఖ్యాలతో ఉండేవాళ్ళు . ధారా నగరం భోజరాజు యొక్క రాజధాని . భోజరాజు ఎంతో మంచివాడు , దయగలవాడు , ధర్మపరుడు . తన ప్రజల పట్ల బాధ్యత కలవాడు . అతడెల్లప్పుడూ తన ప్రజల క్షేమం గురించే ఆలోచించేవాడు . అతడి పన్ను విధానం ప్రజలకి ఏమాత్రం భారంగానూ , బాధ గానూ ఉండేది కాదు . అతడి పాలనా విధానం , పరిపాలనా యంత్రాంగం . . . . ఎల్లప్పుడూ ప్రజలకి సౌకర్యవంతంగా , ప్రజలని రక్షించేవిధంగా ఉండేది . అతడు తన రాజ్యంలోని ప్రజలని ప్రేమించేవాడు , అన్ని విధాలా రక్షించేవాడు . ప్రతిగా ప్రజలూ అతణ్ణి ప్రేమించేవాళ్ళు , గౌరవించేవాళ్ళు . ఒకరోజు భోజరాజు , తన ప్రధానమంత్రి బుద్ది సాగరుణ్ణి పిలిచాడు . బుద్ది సాగరుడు మంచివాడు , మేధావి , వివేకం గలవాడు . బుద్దిసాగరుడు అంటే సాగరము వంటి గొప్పబుద్ది కలవాడు , బుద్దికి సాగరము వంటి వాడు అని అర్ధం ! అతడా పేరుకు తగినవాడు . భోజరాజు " ప్రియమైన ప్రధానమంత్రి , బుద్ది సాగరా ! మన గూఢచారులు తెల్పిన సమాచారం ప్రకారం , మన గ్రామీణులు కౄర , వన్య మృగాల వలన బాధలు పడుతున్నారు . అరణ్యాలు దట్టంగా ఉన్నాయి . వన్య , కౄర మృగాల సంఖ్య బాగా పెరిగిపోయింది . దాంతో అడవి మృగాలు పచ్చని పొలాలని నాశనం చేస్తున్నాయి . కౄర మృగాలు అమాయక గ్రామీణులని , వారి పెంపుడు జంతువులని గాయపరుస్తున్నాయి . ప్రజలని కాపాడటం మన ధర్మం ! అందుచేత రేపటి రోజున వేటకు వెళ్ళాలని నిశ్చయించాను . అందుకు తగిన ఏర్పాట్లు చేయండి . మన సైన్యంలో నుండి కొన్ని దళాలని సమాయత్త పరచండి . నగరంలో ఉత్సాహం గల యువకులని , వేటకు రావలసిందిగా దండోరా వేయించండి " అని అజ్ఞాపించాడు . బుద్దిసాగరుడు చిరునవ్వుతో " చిత్తం మహారాజా ! రేపటి ఉదయానికల్లా వేటకి అన్ని ఏర్పాట్లు చేస్తాను " అన్నాడు . మరునాటి ఉదయానికి భోజరాజు వేట కెళ్ళేందుకు సిద్దమయ్యాడు . ఉత్సాహం గల చాలామంది యువకులు వేటకు తగిన ఆయుధాలు . . . . కత్తులూ , విల్లంబులూ , ఈటెలూ ధరించి , కోట ముందు సమావేశమయ్యారు . వారి కేరింతలతో అక్కడంతా సందడిగా ఉంది . సైనికులూ , యువకులూ కదం తొక్కుతూ , గొంతెత్తి పాడుతున్నారు . సంగీత పరికరాలతో పాటకు అందుకనుగుణంగా తాళం వేస్తున్నారు . వాళ్ళ పాటల రాగాలు శ్రోతల్ని ఉర్రూతలూగిస్తున్నాయి . రజోగుణాన్ని ప్రేరేపిస్తూ రోమాంచితం చేస్తున్నాయి . అక్కడంతా పండగ వాతావరణం వెలిసింది . [ మానవ మనస్తత్వాన్ని భగవద్గీత , మూడు రకాలుగా నిర్వచిస్తుంది . సత్త్వం , రజస్సు , తమోగుణం . మనుషులందరిలో ఈ మూడు గుణాలూ ఉంటాయి . రజస్తమో గుణాల కంటే సత్త్వ గుణం ఎక్కువగా ఉన్నవారిలో . . . . సహనం , జ్ఞానం , శాంత స్వభావం , అహింసాతత్త్వం వంటి లక్షణాలు ఉంటాయి . రజోగుణం ఎక్కువగా ఉన్నవారిలో . . . . ధైర్యసాహసాలు , పోరాటపటిమ , నాయకత్వ స్ఫూర్తి వంటి లక్షణాలు ఉంటాయి . తమోగుణం ఎక్కువగా ఉన్నవారిలో . . . . అవివేకం , వితండవాదం , సోమరితనం , నిద్ర వంటి లక్షణాలు ఉంటాయి . ] ఈ విధంగా రజోగుణ ప్రవర్ధమాన పరిస్థితులలో . . . . భోజరాజు , మంత్రి బుద్దిసాగరుడు , సైనికులూ , యువకులూ వేటకు బయలు దేరారు . అరణ్యప్రాంతం చేరారు . అరణ్య మధ్యంలో విడిదిని ఏర్పాట్లు చేసుకున్నారు . రాత్రివేళల విశ్రాంతికి , విందు వినోదాలకి గుడారాలు నిర్మించుకున్నారు . పగటి వేళల్లో అడవి జంతువుల వేట కొనసాగించారు . డప్పు వంటి వాయిద్యాలని గట్టిగా మోగిస్తూ అరణ్య మృగాలని భయపెట్టారు . భయంతో వాటి ఆవాసాల నుండి బయటికొచ్చి పరుగులు తీస్తున మృగాల వెంటబడి వధించారు . కొందరు సైనికులు , రజోగుణ పూరిత రాగాలు మ్రోగిస్తుండగా . . . . భోజరాజు , అతడి పరివారమూ రణోత్సాహం వంటి హుషారుతో అరణ్యమృగాలని వేటాడారు . ఆ వేట అందర్నీ ఎంతో ఉత్సాహ పరిచింది . అందరూ దాన్ని ఎంతో ఆస్వాదించారు . [ ప్రాచీన కాలంలో పాలకులకి , సంపన్నులకి , ప్రజలకి వేట ఎంతో ప్రీతిపాత్రమైనదై ఉండేది . అప్పట్లో అరణ్యాలు దట్టంగా విస్తారంగా ఉండేవి . అడవి జంతువుల సంఖ్య , ప్రజల కంటే ఎక్కువగా ఉండేది . దాంతో ప్రజల , పెంపుడు జంతువుల ప్రాణాలకు , అడవి జంతువుల నుండి ప్రమాదం ఉండేది . జింకలూ , దుప్పుల వంటి సాధుజంతువులు పొలాల మీద పడి మేసేవి . భల్లూకాలు , కుందేళ్ళు దుంప పంటలని తవ్వి పారేసేవి . ఏనుగుల గుంపులు వంటివి , చెఱకు వంటి పైర్లను పీకి పాకాన పెట్టేవి . వాటిని నియంత్రించటానికి వేట అనివార్యమై ఉండేది . ఇప్పటి స్థితి దీనికి విపర్యయం . ఇప్పుడు అడవుల కంటే అడవి ప్రాణుల కంటే జనాల సంఖ్య ఎక్కువ ! ఇప్పుడు మనిషి నుండి జంతువులకి ప్రమాదం ఏర్పడింది . ఇప్పుడు అడవులని సంరక్షించడం , అడవి జంతువులని సంరక్షించడం అనివార్యమైంది . కాబట్టి ఇప్పుడు వేట నిషిద్దం . అప్పుడు వేట వినోదం ! ]
బాలగోపాల్ ఆకస్మిక మరణం హక్కుల ఉద్యమకారులందరినీ విషాదంలోకి నెట్టివేసింది . బాలగోపాల్ ' ఇక లేడు ' అనే నిస్పృహతోపాటు , ' పౌరసమాజం ' ఒక రకమైన భయానికి , వెలితికి లోనయ్యిందని కొంతమంది అభిప్రాయపడ్డారు . కానీ , ఈ పరిస్థితి తాత్కాలికమే . పురుషోత్తం , ఆజం అలీలను సర్కారీ హంతకముఠాలు కిరాతకంగా హత్య చేసి ఒక భయానక వాతావరణం సృష్టించారు . పౌరహక్కుల సంఘం ఇక పనిచేస్తుందా ? అనే సంశయం , సందేహాలు ఏర్పడ్డాయి . బాలగోపాల్ ఆ సందర్భంలో ' నిస్పృహను , నిస్సహాయతను అధిగమించడానికి కావల్సిన దృఢ సంకల్పం , మానసిక స్థైర్యాన్ని పురుషోత్తం నుండి ఉద్యమాలు , ఉద్యమకారులు , ప్రజలు నేర్చుకోగలిగితే అతని మరణం వృధా కానట్టే ' అని ధైర్యాన్ని యిచ్చాడు . Read the rest of this entry »
ఈ సంస్థ ఏ వ్యక్తికో , వ్యక్తులకో చెందిన వ్యక్తిగత లేదా పబ్లిక్ , ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల లాంటి సంస్థ కాదు . సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం ( Act XXI of 1960 ) కింద విశాలాంధ్ర విజ్ఞాన సమితి ( S . No . 44 of 1956 ) కృష్ణా జిల్లా కేంద్రమైన మసులీపట్నంలో 27 . 12 . 1956న రిజిస్ట్రర్ అయింది . విశాలాంధ్రకు యాజమాని విశాలాంధ్ర విజ్ఞాన సంస్థ . సహాకార చట్టం కింద ఏర్పడిన సంస్థ ద్వారా దిన పత్రికను నిర్వహించటం ఒక అరుదైన ప్రయోగం . రాష్ట్రంలో ఇలాంటి సంస్థ ద్వారా ప్రచురితమవుతున్న తొలి తెలుగు దిన పత్రిక విశాలాంధ్ర . దీని లాభానష్టాలన్ని ప్రజలవి , పాఠకులవి . లాభాలు వస్తే పాఠకులకు పత్రిక మరింత చేరువ కావటానికి అనువుగా , వైవిధ్యమైన శీర్షికలతో మరింత ఆకర్షణీయంగా తాజా వార్తలతో అందించటానికి అవసరమైన సాంకేతిక సదుపాయాలను సమకూర్చటం , విస్తరణకు వినియోగించటం , నష్టాలు వాటిల్లినప్పుడు ప్రజలను , పాఠకులను , శ్రేయోభిలాషులను ఆర్ధించటం ఒక్కటే దీని మార్గం . లాభార్జనే విశాలాంధ్ర ధ్యేయం కాదు . అది ఎంపిక చేసుకున్న సమసమాజ లక్ష్య సాధనే దానికి ప్రధానం . అంతకన్న వేరే స్వార్థం లేదు .
49 ఆరాధ్యైనం శరవణభవం దేవ ముల్లజ్ఘితాధ్వా సిద్ధద్వన్వ్దై ర్జలకణభయా ద్వీణిభి ర్ముక్తమార్గః వ్యాలమ్బేథాః సురభితనయాలమ్భజాం మానయిష్యన్ స్రోతో మూర్య్తా భువి పరిణతాం రన్తిదేవస్య కీర్తిమ్
పెట్రో ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేసినందుకు నిరసనగా విపక్షాలు భారత్ బంద్‌కు పిలుపునివ్వడం దురదృష్టకరమని పీసీసీ పేర్కొంది . ద్రవ్య లోటు తగ్గించి , ఆర్థికాభివృద్ధిని పెంచే లక్ష్యంతోనే యూపీఏ ప్రభుత్వం పెట్రో ధరలను స్వల్పంగా పెంచినట్టు తులసిరెడ్డి ఆదివారం ఓప్రకటనలో పేర్కొన్నారు . వాస్తవాలను విస్మరించి విపక్షాలు భారత్ బందుకు పిలుపునిచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం గర్హనీయమన్నారు .
రాయలసీమలో జలయజ్ఞంలో అత్యధికంగా హంద్రీనీవా , సుజల స్రవంతి ద్వారా 6 , 02 , 000 ఎకరాలకు నీటి పారుదల సౌకర్యం కల్పించబడనుంది .
కానీ లత తెలివికలది కావడంతో అదేమీ పట్టించుకోలేదు . స్వతహాగా ఆమె సంస్కారవంతురాలు కావడంతో చెప్పుడు మాటలు నమ్మి తన ఆడబడుచును తులనాడకుండా ఆ విషయాన్ని అంతటితో వదిలేసింది . ఆడబడుచు తరువాత వచ్చి , ' వదినా ! నువ్వు మీ ఊరెళ్లినపుడు ఏం తోచక కొన్ని బహుమతులు చూశాను ' అని చెప్పింది . లత తన తోడికోడలు చెప్పింది పట్టించుకోకపోవడంవల్ల ఆమెకు , ఆడబడుచుకూ మధ్య స్నేహబంధానికి ఎటువంటి కీడూ వాటిల్లలేదు . అందుకే చెప్పుడు మాటలు వినేవాళ్లదే తప్పంతా అని నా అభిప్రాయం . మరి మీరూ నాతో ఏకీభవిస్తారు కదూ ? !
నిన్న రాత్రి జరిగిన ఫైనల్ లో జహంగీర్ మెహత ఓడిపొయ్యాడు . ఫుడ్ నెట్వర్క్ వారి కిచెన్ స్టేడియం లో ఇద్దరు వంటగాళ్ళు పోటీపడుతుంటారు . ప్రతీ పోటీకి ఒక రహస్య ఇన్గ్రేడియంట్ ఉంటుంది . నిన్న అది బీఫ్ . మనోడు దేశీయుడు . రెండోవాడు లాటినొ . మనోడు ఎంత నేర్చుకున్నా , చిన్నప్పటినుండీ తినని లేక వండేప్పుడు చూడని , చూసి నేర్చుకోని కొన్ని టెక్నిక్ లను మిస్స్ అయ్యాడు . ఆరెండోవాడు పుట్టినప్పటినుండి బీఫ్ తిన్నాడు , ఇంట్లో వండుతుంటే చూసాడు కాబట్టి అది వాడికి ఎడ్వాంటేజ్ అయ్యింది . నేటివ్ ఎడ్వాంటేజ్ వచ్చేలా రహస్య ఇన్గ్రేడియంట్ ని ఎన్నుకోటం కుట్ర . మనోడు పులావు వండివార్చాడు , అందరికీ నచ్చింది . బర్గర్ చేసాడు , అదే అతని కొంప ముంచింది . ఫ్రెంచ్ ఫ్రైస్ చేసాడు ఒక్కోటి చేంతాడంత లావున . ఆరుగ్గురు జడ్జ్ లకు అది నచ్చలేదు . ఒక భారతీయుడు అమెరికా వంటల్లో ఇంత దూరం రాగలగటం గొప్ప . ఫైనల్ లో ఓడినా , నేనేతై , * పో సోదరా గెలిచావ్ * అన్నాను . అతనికి నా మాటలు వినిపించలేదు అఫ్కోర్స్ .
పోయిన చోటే వెతుక్కోమని ఎవడు చెప్పాడో గానీ , అది పాకిస్తాన్ లాంటి మతమౌఢ్యపు నాయకులున్న రాజ్యంలో పనికి రాదని తెలుసుకోవాలి . తివిరి ఇనుమున తైలమ్ము తీయవచ్చేమో గానీ ఈ దేశంలో మాత్రం ప్రజాస్వామ్యం ఒక్క చుక్క కూడా పిండలేం .
కల్యాణి సంపూర్ణ రాగం . అంటే ఆరోహణలోనూ , అవరోహణలోనూ కూడా ఏడు స్వరాలూ ఉపయోగించే రాగం . మూలస్వరాలైన " స " , " ప " లు కాక ఉపయోగించే స్వర స్థానాలు చతిశ్రుతి రిషభం , అంతర గాంధారం , ప్రతి మధ్యమం , చతుశ్రుతి దైవతం , కాకలి నిషాదం . కల్యాణి రాగం ప్రయోగ ప్రసిద్ధి రాగం . ముఖ్యంగా పంచమం ( స్వరం " ప " ) వాడకుండా ఎక్కువ ప్రయోగాలు చెయ్యవచ్చు . అలాగే మూల స్వరాలైన " స " , " ప " లను రెంటినీ విడిచి , " రి గ మ ద ని " స్వరాలతో ప్రయోగాలు చేయ్యవచ్చు . ఆలాపనకి చాలా అవకాశం ఉన్న కల్యాణి రాగం , చాలా elaborateగా పాడి రాగం యొక్క depths చూపించటానికి అవకాశం ఉన్న రాగం ఇది . ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి . అన్ని రాగాలలో creativity చూపించుకోటానికి అవకాశం ఒకే విధంగా ఉండదు ! కొన్ని రాగాలు elaborateగా పాడటానికి వీలుండదు ( గాయకురాలు / గాయకుడు ఎంత సమర్ధురాలైనా / సమర్ధుడైనా ) . కీబోర్డ్‌మీద కాని , మరే వాయిద్యం పైన కాని కల్యాణి రాగం వాయించ ప్రయత్నిస్తే , స్వరస్థానాలు ఈ విధంగా ఉంటాయి .
ఇది నిజం . ఈ మధ్య నేను గూగులమ్మను తెలుగులోనే అడుగుతున్నాను ప్రాంతీయ విషయాలను . మీరన్నట్టు అనవసరమైన చెత్త అంతా లేకుండా కావలిసింది వెంటనే దొరుకుతోంది .
మొట్ట మొదటగా " కంప్యూటర్ " అనే మాటను తెలుగీకరించాలా వద్దా ? తెలుగు చెయ్యాలి అనుకుంటే యదా తథామా ? యధాతథం కానే కాదు అని నా అభిప్రాయం . ఆంగ్లం లోనే ఆ మాట పరిధి దాటిపోయింది ఈ నాటి కంప్యూటర్ . చేసేది ఒక్క కంప్యూటింగ్ మాత్రమె కాదు . కాబట్టి , దీనికి సరిపొయ్యే తెలుగు పదం , లేక కొన్ని పదాల కలయిక ఏమిటి అని ఆలోచించాలి .
మాకు పెళ్ళి కాక ముందు వరకూ నా భార్యది చాలా చిన్న ప్రపంచం అని చెప్పవచ్చు . అందరి ఆడపిల్లలలాగా చాలా గారాబంగా పెరిగింది , చదువుకున్నంత సేపు ఇల్లు కాలేజీ తప్ప మరో ప్రపంచం ఎరగదు . విజయవాడలో వాళ్ళ ఇల్లు ఉన్న ఏరియా , దుర్గాపురం మరియు గాంధీనగర్ లోని శాతావాహన కాలేజీ వైపు తప్ప మరో ప్రదేశం తెలియదు . ఈ రెండు కాకుండ , ఏలూర్ రోడ్డులో విజయటాకీస్ నుంచి కాంగ్రెశ్ ఆఫీస్ రోడ్డు వరకు కొంచం తెలుసు . అంతకు మించి ఏమి తెలియవు . ఓ డొక్కి సైకిల్ తొక్కుకుంటూ బొంగరం తిరిగినట్టు దుర్గాపురంలో ఉన్న వాళ్ళ స్నేహితుల ఇళ్ళకు మాత్రం వెళ్ళి వచ్చేది .
కానానును వేగుచూడటనికి వెళ్ళిన కొందరికివారికి కొన్ని అనుభవాలు ఎదురయ్యాయి . > ఖర్జూరపు గెలలు వారికంటే ఎత్తుగా వుండటం . > అక్కడి కంటబడిన కొందరు బహు బలాడ్యులుగాను , ఎత్తుగాను కనబడటం > వారిని ఎదిరంచలేమేమోనని మనసులో ఆందోళన కలగటం
ఆ నోటీసు ప్రచురించిన తరువాత మీరు అభ్యంతరాలు తెలుపవచ్చు . ఈ హక్కు మీకు భూసేకరణ చట్టంలోని సెక్షన్ 5ఎ ఇస్తుంది . మీరు అన్ని రకాల అభ్యంతరాలూ తెలపవచ్చు . ఆ అవసరం ప్రజావసరమే కాదనవచ్చు . దానికి ఈ భూమి తగినది కాదనవచ్చు . మీకు ఉన్నది ఈ భూమే అయితే అది మొత్తం తీసుకునే బదులు ఎక్కువ భూమి ఉన్నవాళ్ళ ఆస్తిలో ఒక భాగం తీసుకోవడం న్యాయం అనవచ్చు . లేదా ఎవరూ ఉపయోగించని ప్రభుత్వ భూమి ఊరిలో ఉంది కాబట్టి అది తీసుకొమ్మని సూచించవచ్చు . ఈ అభ్యంతరాలు తెలపడానికి మీకు 30 దినాల గడువు ఉంటుంది . అయితే అభ్యంతరాలు కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా తెలపాలి . ఆపైన కలెక్టర్ ముందు హాజరై మీరుగానీ , మీ తరపున వేరే ఎవరైనాగానీ మీ అభ్యంతరాలు సమంజసమైనవని వాదించవచ్చును . కలెక్టర్ మీ వాదనలు విని , అవసరమైతే ఈ విషయంలో మరింత విచారణ జరిపి , తన అభిప్రాయాలూ , సూచనలూ ప్రభుత్వానికి నివేదించాలి . దానిపైన ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకుంటుంది .
ప్రదీపు తీక్షణంగా చూశాడు పార్వతివేపు . " నువ్వు మొదట్నించీ ఇంతే . మీ నాన్నగారు ఏం చెయ్యమంటే అదే . చదువు అంటే చదవడం , లిటరేచరంటే లిటరేచరు . నీకో బుర్ర వుందనీ , దాన్ని నువ్వు ఉపయోగించుకోవచ్చనీ ఎప్పుడయినా తట్టిందా నీకసలు ? " రూక్షణంగా అన్నాడు . కొడుకుమీంచి కళ్లు తిప్పకుండానే .
సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతం ఈ శ్లోకం ఎక్కడిదో గానీ నా విషయంలో చాలా నిజం . అంటే నేనేదో " చంటి " వాణ్ణని మీలో కొంటె పిల్లలు అనుమానించనక్కర్లేదు . నేనంటున్నది ఏంటంటే . . నా జీవతంలో నేను పోగేసుకున్న ఆస్తులు ఈ రెండే - ఒకటి నా పుస్తకాల లైబ్రరీ , రెండోది నా కేసెట్ , సీడీ ల లైబ్రరీ . ఈ రెండూ కాక నాకింకో అభిరుచి కూడా వుంది , పోలిక పై శ్లోకంలో ఇమడక పోయినా . అది సినిమా . ఈ మూడింటిలోనూ . . ఈ మధ్య చదివిన / విన్న / చూసిన వాటి గురించీ , నాకు నచ్చిన / నచ్చని విషయాల గురించీ . . నాకు తోచినట్టు ఇక్కడ రాసుకుందామని ఈ ప్రయత్నం . ఇది నలుగురూ చదివి ఆనందిస్తే . . పదిమందికి ఏవన్నా ఉపయోగ పడితే . . మంచిదే .
సత్యసాయిబాబా మరణించి రెండునెలలు కావొస్తున్న సమయంలో సత్యసాయి అనారోగ్యానికి లోనయినప్పుడు తాళం పెట్టిన ఆయన వ్యక్తిగత గది యజుర్మందిరం తలుపులు నిన్న తెరిచారు . నదులో లక్ష కోట్ల దాకా విలువ చేసే డబ్బూ , బంగారం , వజ్రాలు , టన్నులకొద్దీ వెండీ ఉన్నట్లు తెలుస్తోంది . బాబా మరణం తరువాత ఇప్పటికే ఎంతో బంగారం , డబ్బూ బయటికి తరలించారనేది మరో విషయం . ఇదంతా కేవలం ఆయన వ్యక్తిగతహోదాలో తన మందిరంలో దాచుకున్న సంపద కాగా దేశవిదేశాల్లో ట్రస్టుకు ఇంకెంతో సంపద ఉందనేది తెలిసిందే . బాబా తాగునీటి ప్రాజెక్టులూ , విద్య , హాస్పిటల్ వగైరాలను చూపించి అతని దేవుడి స్టేటస్‌కు జస్టిఫికేషన్ ఇచ్చేవారు సంక్షేమానికి వెచ్చించిన మొత్తం సొమ్ము ఆయన సంపదలో నీటిబిందువంత అని ఒప్పుకోకతప్పదు . అదికూడా సత్యసాయి సంక్షేమానికి డబ్బులు వెచ్చించింది ఆయనమీద అనేక ఆరోపణలు వచ్చినతరువాత ఆరోపణలనుండి బయటపడడానికి మాత్రమే కానీ 1980 ముందు అతను సేవకు పెద్దగా చేసిందేమీ లేదనేది మరొక విషయం . ఇంతకూ సమాజసేవ చేసిన వారంతా దేవుల్లయితే సొంతడబ్బులు సమాజసేవకు వెచ్చించిన పారిశ్రామికవేత్తలనెవరూ దేవుల్లనరు . . ఒక్కరోజు పేపర్లో చదివి ఓహో అలాగా అనడం తప్ప . బిల్‌గేట్స్ , వారెన్ బఫెట్ , స్టీవ్‌వా లాంటి విదేశీయులు వారికి సంబంధం లేని మనదేశంలో సొమ్మును సమాజసేవకు ఖర్చు చేస్తున్నారు . మనదేశంలో అజీంప్రేంజీ , టాటా , నారాయణమూర్తీ లాంటివారు ఎంతో సొమ్ము సమాజసేవకు వెచ్చిస్తున్నారు . ఎవ్వరూ తాము దేవుల్లమని చెప్పుకోరు , వారిని వారి సేవచూసి ఎవరూ దేవుల్లని అనరు . ఇంతకూ సత్యసాయి దేవుడని చెప్పుకున్నందుకు డబ్బులు సంపాదించాడా , డబ్బులు సంపాదించి అందులో కొద్దిమొత్తాన్ని సమాజసేవకు వెచ్చించినందుకు దేవుడయ్యడా అనేది మరో సందేహం . ఒక మామూలు వ్యక్తి ఎంతనిజాయితీగా సమాజసేవ చెయ్యడానికి ముందుకొచ్చినా డబ్బులు పెద్దగా రాలవు , దేవుడని చెప్పుకుంటే మాత్రం దండిగా వస్తాయి . డబ్బులిచ్చినవారిలో అధికభాగం డబ్బును ట్రస్టుకు ఇచ్చారు , ట్రస్టు స్థాపించిన ఉద్దేషం ఎలాగూ సమాజసేవే కనుక డబ్బును ఎందుకు ఇచ్చారో అందుకు అదికూడా అతికొద్ది శాతం ఖర్చు చేస్తే దేవుడెలాగ అయ్యాడో నాకయితే అర్ధం కాదు . ఇక నీసొమ్మేమన్నా అడిగాడా , నువ్వేమన్నా నీడబ్బులు ఇచ్చావ , మరి నువ్వెందుకు అడుగుతున్నావు అంటూ విరుచుకుపడే వితండవాదులగురించి వాదన ఎలాగూ అనవసరం . ఒక రాజకీయనాయకుడు అధికారం అడ్డం పెట్టుకుని లక్షలకోట్లు దోచుకుని ప్రజలసొమ్మును తనసొంతడబ్బులాగా ఉచితపధకాలకు దానం చేసి దేవుడయిపొయాడు . ఒక బాబా దేవుడినని చెప్పుకుని లక్షలకోట్లు సొమ్ముచేసుకుని అందులో ఒక ఫ్రాక్షన్ ప్రజలసొమ్మును ప్రజలకు దానం చేసి దేవుడయిపొయ్యాడు . ఇద్దరిలో పెద్దతేడాలేదు .
నానక్ చెప్పిన ప్రకారం దేవుడు రూపం లేనివాడు ( నిరంకార్ ) , శాశ్వతమైన వాడు ( అకల్ ) , అనిర్వచనీయమైన వాడు ( అలఖ్ ) , సర్వవ్యాపి ( సరచ్ వియాపక్ ) . ఇంటువంటి లక్షణాలుగల భగవతుండిని తెలుసు కోవడానికీ , చేరుకోవడానికీ మానవులకు ఎంతో దయతో పలు అవకాశాలను భగవంతుడే కల్పించాడు . అయితే మానవుడు స్వభావరీత్యా భగవంతుడిని తెలుసుకోడానికి నిరాకరిస్తాడు . మానవులు తమ చుట్టూ ఉన్న దేవుడిని చూడలేని గుడ్డివాళ్లు . హిందువులు దేవాలయాల్లో చేసే పూజలుగానీ , ముస్లింలు మసీదుల్లో చేసే నమాజ్‌లు గానీ దేవుడిని చేరుకో డానికి తొడ్పడతాయని వారు నమ్ముతారు . ఇలాం టివి ఎందుకూ పనికిరావు . నిజానికి ఈ పూజలూ , నమాజ్‌లూ మానవులను చావు పుట్టుకల చక్రభ్రమణంలోనే మగ్గిపోయేలా చేస్తాయి తప్ప దానిని దాటి దేవుడిని చేరుకోడా నికి దోహద పడవు .
కుమార్ గారూ , మీరు , " తాను ప్రొఫెసర్ గానే కొనసాగి , గణితం లోనే పరిశోధనలు సాగించి ఉంటే భారత దేశానికి ఆ రంగంలో నోబెల్ తెచ్చేవార౦ట , అంతటి మేధావిని ఇంత తొందరగా కోల్పోవడం మనందరి దురదృష్టం . " అని రాశారు . మీరు ఇన్ని విషయాలు ఇంత అభివృద్ధికరంగా రాస్తూ , " నోబెల్ " మీదా , " భారత దేశానికి తేవటం " మీదా ఇటువంటి భ్రమలు వుండటం ఎంతో విచారకరం . ఈ పెట్టుబడి దారీ వ్యవస్థలో అటువంటి బహుమతులూ , అవి దేశానికి తేవడంలో వున్న గొప్పా లాంటి చెత్త విషయాలు మీకు తెలియవనే అనుకోవాలా ? మామూలు వాళ్ళు ఇలాంటివి రాస్తే పట్టించుకోనక్కర్లేదు . మీలాంటి వాళ్ళు రాస్తేనే , చదవడానికి కష్టంగా వుంటుంది . అవి కుహనా విలువలని ప్రోత్సహిస్తాయి కాబట్టీ .
౦౩ . " Save " బటన్ నొక్కండి . అంతే మీరు మీ అభిమాన బ్లాగును నామినేట్ చెయ్యటం అయిపోయింది .
బద్దకంగా వుండి ఈ రోజు ఎటు వెళ్ళలేదు . . . మధ్యాహ్నం భోజనం చేసి హాల్లో నేల మీద పడుకుని కనిపించిన వార పత్రిక తిరగేస్తూ తెలీకుండానే మాగన్ను నిద్ర పోయాను . . . ఇంతలో వేసవి ఎండకి చెలరేగిన ఎదురుగాలికి తెరచి వుంచిన తలుపులు టపటప కొట్టుకున్నాయి . . . ఆ చప్పుడుకి మన పగటి నిద్రకి అంతరాయం కలిగి లేచి తలుపులు దగ్గరకి వేద్దామని ఉత్తర గుమ్మం వైపు వెళ్లాను . . . . అక్కడ కొంతమంది ఉల్లాసంగా - ఉత్సాహంగా ( రెండు ఒకటేనా ? ) మాట్లాడతూకనిపించారు . . . నన్ను చూడలేదు . . . పక్కకి వచ్చి తలుపు ప్రక్కనే నిలబడి ఏమి మాట్లాడుకుంటూన్నారా అని ఆలకించాను . . . . టాపిక్ రసవంతంగా నడుస్తుంది . . . ఒకటే కువకువలు . . . వుండుండి గంభీరంగా ఒక గొంతు . . . గాలికి ఎగిరిపడుతున్న తమ పయటకొంగుకూడా సరిచేసుకోకుండా ఒకరిమీద ఒకరు పడిఒకటే నవ్వులు .
మేము వొక జాతి తలెత్తుకొని నిలబడుతున్న అద్భుత క్షణాల్ని బి - 52 బాంబర్లకందని గుండెల్లోపల పొదువుకుంటాం వూరేగింపులన్నీ సద్దుమణిగి కొట్లు నిర్భయంగా తెరిచాక కూడా యిసుక రేణువుల్లో ఆరని పౌరుషాగ్నిని ప్రేమిస్తుంటాం
మా రూములో మొత్తం నలుగురుం వుండే వారం . ఓనరు గారు కూడా పక్క ఇంట్లోనే వుండేవారు . మాతో బాటు ఓనర్ అంకుల్ గారి బంధువులబ్బాయి కూడా ఒకతను వుండేవాడు . ఈ కధలో బాధితుడు అతడే . పేరు రావు . ఇతడు కొద్దిగా ' అతి ' మనిషి . ఆశు కోతత్వం అనే విద్య ఒంట బట్టిన వాడు . కోసే కోతలకు అంతే వుండేది కాదు . ఒకప్పుడు తను వైరస్ ప్రోగ్రామర్ అని చెప్పుకునే వాడు . మా ఫ్రెండ్ ఒకడికి అప్పట్లో ఎలా అయినా జీవితంలో ఒక వైరస్ రాద్దామనే చెత్త కోరిక వుండేది . IBM వారు ప్రచురించిన ఒక పెద్ద పుస్తకం " DOS Interrupts " ని పట్టి తెగ చదివేస్తూ వుండేవాడు . Interrupts తో ప్రోగ్రామింగ్ చెయ్యటమంటే దాదాపు కంప్యూటర్ జీవితంతో చెలగాటం ఆడుకోవటమన్నట్లే … రాసిన కోడ్ వల్ల కంప్యూటర్ ఎప్పటికీ పనికి రాకుండా పోవచ్చు .
వ్యక్తిగతంగా సంగీతరావుగారు నిరాడంబరుడనీ , బిడియం ఉన్నట్టుగా ప్రవర్తిస్తాడనీ తెలిసినవారికి ఆయనకు రావలసినంత పేరు రాలేదని అనిపించడం సహజం . ఎటువంటి సామర్య్థమూ లేని అల్పులు స్వంత డబ్బా కొట్టుకుంటూ ఉండడం ఎన్నో ఏళ్ళనుంచీ జరుగుతున్నదే . అలాంటప్పుడు దగ్గరికి వెళ్ళి పలకరించితే తప్ప అపారమైన తన సంగీతజ్ఞానాన్నీ , అనుభవాన్నీ వివరించని సంగీతరావుగారివంటి ప్రతిభావంతుల గురించి అందరికీ తెలియదంటే ఆశ్చర్యం లేదు . తెలిసినవారు మాత్రం ఆయన ప్రతిభను కొంతవరకూ వెలికితీశారు . ఆయన మాటల్లోనే చెప్పాలంటే " జీవితారోహణంలో ఎన్ని మెలికలు తిరిగినా , ఎన్ని గతుకులు దాటినా ( ఆయనను ) సూటిగా నడిపించినది సప్తస్వరార్చనమే " .
ఈ ప్రశ్నలు " ధర్మ సమ్మతములు కావని " చెప్పేసి ఇంతటి ప్రజాస్వామ్యవాదీ తటాలున గొంతు మార్చి ఒక్కసారిగా నియంతృత్వ ధోరణిలోకి దూకెయ్యగలరు . సరిగ్గా ఈ ద్వంద్వ నీతిని బట్టబయలు చేయడానికే , ఇలా రెండు నాలుకలతో మాట్లాడే మనునీతిపరుల గుట్టురట్టు చేయడానికే , వీరు సృష్టించిన ఛాందస ఆచారాలు స్త్రీల అభివృద్ధికీ , ఆత్మానందానికీ , సౌఖ్యానికీ ఎంతగా అవరోధాలయ్యాయో చూపించడానికే ఒక హరివిల్లుల మైదానాన్ని సృష్టించి అందులో రాజేశ్వరిని ప్రతిష్టించారు చలం .
ఎలాగోలా వాణ్ణి వోదార్చి బయట పడ్డా . బయట పడగానే , అప్పటిదాకా కంట్రోల్ చేసుకొన్న కన్నీళ్ళు కళ్ళవెంట బొటబొటా రాలినై .
oremuna : ఏంటో మాస్టారూ , నాకు తెలుగే అంతంత మాత్రం . మీరేమో సంస్కృతంలో ఇలా . .
నిజంగా అంతంత సైజు పిడకలు వేస్తారు . అంతేకాదు . . . . . వాటిని ఒకదానిమీదొకటి వరుసలుగా పేర్చి , రక రకాల ఇళ్ల ( ఎస్కిమోల ఇగ్లూలు , డాబాలు , కుతుబ్షాహీ సమాధులూ వగైరా ) అకారాల్లో నిలబెట్టి , అవి పూర్తవగానే వాటి మీద మట్టి మెత్తేసి , వర్షాలొచ్చినా పాడవకుండా కాపాడతారు . దానికి అదేదో " ఆర్ట్ " అనే పేరుంది . పెళ్లి సంబంధాలు మాట్లాడేటప్పుడు ఆడపిల్లకి ఆ ఆర్ట్ లో యెంత ప్రవేశం వుందో పరీక్షిస్తారట !
మరి ఎస్ బ్యాండుకి సంబంధించి , ఓ రెండు లక్షల కోట్లట ! ఆ శాఖకి మంత్రి ఆయనేనట ! 2005 నించో యెప్పటినించో ఆ వ్యవహారం జరుగుతుంటే , ఇప్పుడింకా ఆ వొప్పందాన్ని రద్దు చెయ్యాలా వద్దా అని కమిటీలు వెయ్యడం లోనే వున్నారు . పైగా కాంట్రాక్టు రద్దు చేస్తే వాళ్లకి నష్టపరిహారం ఇచ్చుకోవద్దూ ? అని ఓ వాదన !
మీ రచన అమొఘం . . మీరు రచయితే … కాని ఆ రాయి పక్కన పడేయండి . .
దళిత స్త్రీ అనుభవాలకు కళాత్మక అభివ్యక్తి విప్లవ , దళిత ఉద్యమ నాయకత్వ విశ్లేషణ
నువొచ్చే వేళైంది చివాల్న ట్యూబ్లైట్ల ఇంజక్షను మొదలైంది పట్టణం నరాల్లోకి కాంతులు ప్రవహించాయి కట్టకడకు కిటికీలు కళ్ళుతెరిచాయి మెల్లగా మెట్లపై నీ బూట్ల చప్పుడు తెల్ల జీవకణంలా ప్రవేశిస్తావప్పుడు .
ఇవి బ్లాగ్ వనభోజనాలు కదండీ . తప్పదు మరి నచ్చినందుకు థాంక్యూ రామక్రిష్ణ గారూ
మన శరీరాలు బతికున్నంత కాలమూ రకరకాల పద్ధతుల్లో పనిచేస్తూనే ఉంటాయి . వీటిలో నడవడం , మాట్లాడడం మొదలైనవన్నీ ప్రయత్నపూర్వకంగా చేస్తాం ; శ్వాసపీల్చడం , తిన్నది అరిగించుకోవడం వంటివన్నీ అప్రయత్నంగానే జరిగిపోతూ ఉంటాయి . ఈ కార్యకలాపాలన్నిటినీ మెదడు నియంత్రిస్తుంది . మెదడునుంచి తక్కిన శరీరభాగాలకు అందే సంకేతాలు గంటకు 200 మైళ్ళను మించిన వేగంతో ప్రసారమవుతాయి . మెదడు మనిషి పిండదశలో ఉన్నప్పుడే రూపొంది , పెరగనారంభిస్తుంది . మెదడు ఎదుగుదలలో జన్యువుల పాత్ర ఎంతో ముఖ్యమైనది .
పురిటి నొప్పుల మీది బెదురు ఈ పద్యాలలో ఉన్నా , పిల్లాడిని పెంచటంలో ఉండే బాధ్యత శిరసావహించటం మీదే దృష్టి ఎక్కువగా ఉంది ! కొండేపూడి నిర్మల లేబర్‌రూం కవితలో పిల్లల్ని కని పెంచటం గురించిన మాట ఏదీ లేదు . ప్రసవ బాధలో ఆడవాళ్ళ శారీరక స్థితి ఎలాంటిదో … ఎంత కష్టమైనదో మాత్రమే చెబుతుంది నిర్మల పద్యమైనా !
హైదరాబాద్ , జూలై 8 : మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 62 జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం గాంధీభవన్‌లో ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి , పీసీసీ చీఫ్ పుష్పగుచ్చాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు . రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మంత్రులు , ఎమ్మెలు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .
ఓహ్ . . ఈ సారి ఘంటసాల వంతు కదూ . . యమునా తీరమున సంధ్యా సమయమున యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధ వేచి యున్నది కాదా ! బాస చేసి రావేల మదన గోపాలా . . ! బాస చేసి రావేల మదన గోపాలా . . ! నీవు లేని జీవితము తావి లేని పూవు కదా యమునా తీరమున సంధ్యా సమయమున యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధ వేచి యున్నది కాదా ! యమునా తీరమునా . . . . . పూపొదలో దాగనేల పో పోరా సామి ఇంతసేపు ఏ ఇంతికి వంత పాడినావో దాని చెంతకె పోరాదో రానంత సేపు విరహమా నేను రాగానే కలహమా రాగానే కలహమా నీ మేన సరసాల చిన్నెలు అవి ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ దోబూచులాడితి నీతోనే ఇవి ఈ కొమ్మ గురుతులు కాబోలు ఈ కొమ్మ గురుతులు కాబోలు నేను నమ్మనులే నేను నమ్మనులే నీ మాటలు అవి కమ్మని పన్నీటి మూటలు నా మాట నమ్మవే రాధికా ఈ మాధవుడు నీ వాడే గా రాధికా . . . . . మాధవా . . . . . . . . . చిత్రం : జయభేరి గాత్రం : ఘంటసాల సంగీతం : పెండ్యాల రచన : ఆరుద్ర
అండ్ చల్లగాలి వేల్యూ ఈ summer లో తప్పితే మనకి ఎప్పుడూ అర్ధం కాదు . . . . అందుకే అంటారేమో . . మనకు ఒక థింగ్ విలువ తెలుసుకోవాలి అని ఉంటే దానిని వదిలి కొన్ని రోజులు ఉండాలి అని . . . : )
పునః ప్రయత్నాల వల్ల విక్రమాదిత్యుడు అలసిపోలేదు . సరికదా , రెట్టించిన ఉత్సాహంతో , భేతాళుడు చెప్పే కథల పట్ల ఆసక్తితో . . . మరోసారి మోదుగ చెట్టెక్కి , శవాన్ని దించి భుజాన వేసుకొని , బృహదారణ్యం కేసి నడవసాగాడు . భేతాళుడూ అలిసి పోలేదు . మరో కథ , పద్దెనిమిదో కథ చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు . " ఓ రాజోత్తమా ! పరాక్రమ శాలీ ! ధైర్యశీలీ ! విను . . . " అంటూ ఇలా కొనసాగించాడు . ఒకప్పుడు గోపాలపురం అనే నగరం ఉండేది . అదెంతో సువిశాలమైనది , సుందరమైనది . దానికి రాజు కార్తికేయుడు . అతడా నగరాన్ని నిజాయితీగా పరిపాలిస్తుండేవాడు . దాంతో అతడు ప్రజల కెంతో ప్రీతిపాత్రుడయ్యాడు . అతడికొక కుమార్తె ఉంది . ఆమె పేరు భగవతి . ఆమె యుక్తవయస్సులో ఉంది . సౌందర్యంతో శోభిల్లుతూ ఉంది . ప్రజలామెని గని ' అందాల గని ' అని పొగుడుతూ ఉండేవాళ్ళు . ఆటపాటల్లో సంగీత సాహిత్యాల్లో ఆమెది అందె వేసిన చెయ్యి . ఓనాటి సాయం సంధ్య వేళ . . . . భగవతి తలారా స్నానం చేసి , తన పొడవాటి అందమైన కురులని ఆర్చుకుంటున్నది . వేళ్ళతో అలవోకగా చిక్కులు తీస్తూ సంజ కెంజాయ రంగులని ఆస్వాదిస్తున్నది . పిల్లగాలికి ఆ పిల్ల కురులూగుతూ హొయలొలికిస్తున్నాయి . ఆ సమయంలో . . . . రాజవీధిలో ఓ బ్రాహ్మణ యువకుడు పోతున్నాడు . అతడి పేరు ధనస్వామి . అతడెంతో అందంగా ఉన్నాడు . గిరజాల జుట్టు , కోరమీసం , తెల్లని దేహచ్ఛాయ . . . మూర్తీభవించిన మన్మధుడిలా ఉన్నాడు . యధాలాపంగా అతడు భగవతిని చూసాడు . సౌందర్యాధిదేవతలా ఉన్న యువరాణిని చూసి అతడు అబ్బురపడ్డాడు . సరిగ్గా ఆ క్షణమే . . . . భగవతీ అతణ్ణి చూసింది . ఆమె కళ్ళు ఒక్కసారిగా తళుక్కుమన్నాయి . ఇద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు . ఒకరొకరిపై చూపుల తూపులు విసురు కున్నారు . ఒకరిపై మరొకరికి ప్రేమ ఉదయించిందని ఇద్దరికీ అర్ధమైంది . కానీ ఎలా కలుసుకోగలరు ? భగవతి రాచకన్య . ధనస్వామి సాధారణ బ్రాహ్మణ యువకుడు . అలాంటి చోట , ధనస్వామి యువరాణినెలా కలుసుకోగలడు ? దాంతో ఇద్దరూ భారమైన హృదయాలతో , దీనంగా చూస్తూ ఊర్కున్నారు . అయితే ధనస్వామి ఇంటికి వెళ్ళినా క్షణం కుదురుగా ఉండలేకపోయాడు . నిద్రాహారాలు పట్టలేదు . ప్రతీక్షణం , పగలూ రాత్రి , అదే థ్యాసగా యువరాణి భగవతిని ఎలా కలుసుకోవాలా అని ఆలోచించసాగాడు . చివరికి అతడో నిర్ణయానికి వచ్చాడు . ఆ ప్రకారం ధనస్వామి , తన మిత్రుడైన లోకదేవుణ్ణి కలుసుకున్నాడు . లోకదేవుడు చాలా తెలివైన వాడు . యుక్తి పరుడు . నేర్పరి . ధనస్వామి లోకదేవుడికి విషయమంతా చెప్పి ' యువరాణిని కలుసుకునేందుకు ఉపాయమేదైనా చెప్పి పుణ్యం కట్టుకో ' మన్నాడు . లోకదేవుడు మిత్రుడి కోరిక విని మ్రాన్పడి పోయాడు . తేరుకున్నాక " మిత్రమా , ధనస్వామి ? నీకేమైనా పిచ్చి పట్టిందా ? ఏమి మాట్లాడుతున్నావు ? ఎక్కడ నీవు ? ఎక్కడ యువరాణి ? తేడా వస్తే కుత్తుకలు తెగిపోగలవు సుమా ! " అని హెచ్చరించాడు . దాంతో ఖిన్నుడైన ధనస్వామి ముఖం చూసి లోకదేవుడికి జాలి కలిగింది . మిత్రుడి యందు ప్రేమాతిశయంతో . . . . సాహసానికి పూనుకున్నవాడై " ప్రియమిత్రుడా ! నీ కోరిక తీర్చుట కష్టసాధ్యం . ప్రమాదభరితం కూడా ! అయినా నీవు నా ప్రాణసఖుడవు . నీ కోసం నేను పూనుకుంటున్నాను . నీకో ఉపాయం చెబుతాను . నువ్వు చింతించకు " అన్నాడు . దాంతో ధనస్వామికి ఎంతో ఊరట కలిగింది . బాగా ఆలోచించి లోకదేవుడు ఓ ఉపాయం చెప్పాడు . ఆ ప్రకారం , లోకదేవుడు ఓ మునిలా వేషం ధరించాడు . ధనస్వామికి అందమైన యువతి వేషం వేసాడు . ఇద్దరూ రాజు కార్తికేయుడి సభకు వెళ్ళారు . లోకదేవుడు రాజుకు నమస్కరించి " మహారాజా ! నీకు సర్వసుఖాలూ కలుగుగాక ! భగవంతుడు నీకు ఆయురారోగ్య భోగభాగ్యాలూ ఇచ్చుగాక ! " అని దీవించాడు . రాజతణ్ణి గౌరవించి , అతిధి సత్కారాలు ఆచరించాడు . లోకదేవుడు " రాజోత్తమా ! నేను కాశీ యాత్రకు పోవుచున్నాను . ఇదిగో ఈ పిల్ల నా కుమార్తె సుకేశిని . ( అందమైన మంచి శిరోజాలు కలది అని ఆ పేరుకు అర్ధం . ) తల్లి లేని ఈ బిడ్డని అల్లారు ముద్దుగా పెంచాను . ఇప్పుడు ఈ అందమైన యవ్వనవతిని వెంటబెట్టుకుని , కాశీ యాత్ర వంటి దూరప్రయాణం చెయ్యలేను . అది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు . కాబట్టి నిన్ను సాయమర్ధించ వచ్చాను . నేను తిరిగి వచ్చు వరకూ , నాబిడ్డను నీకు అప్పగిస్తాను . ఆమె రక్షణ భారం వహించవలసిందిగా నా ప్రార్ధన " అన్నారు . రాజందుకు సంతోషంగా సమ్మతించాడు . సుకేశిని రూపంలో ఉన్నది స్త్రీ కాదనీ , పురుషుడనీ తెలియని రాజు , ఆమెని తన కుమార్తె భగవతి మందిరానికి పంపించాడు . సమ వయస్కులవ్వటం చేత , ఇద్దరూ స్నేహంగా మెలగ గలరని అతడనుకున్నాడు . భగవతి మందిరం చేరిన సుకేశిని వేషధారణలో ఉన్న ధన స్వామి , యువరాణితో ఏకాంత సమయం కోసం వేచి ఉన్నాడు . ఓ రోజు ఎవరూ లేకుండా చూసుకుని , ధనస్వామి ' తాను స్త్రీ కాదనీ , సుకేశినిగా ఉన్న తాను పురుషుడననీ , తన పేరు ధనస్వామి అనీ ' వివరించాడు . అది విని భగవతి ఆశ్చర్యంతో కొయ్యబారి పోయింది . ఆమెకతడి మీద ప్రేమ ఉప్పొంగింది . కానీ అది పైకి కనబడనివ్వకుండా , కోపం నటిస్తూ " ఏమిటీ ? ఎంత ధైర్యం నీకు , ఈ విధంగా రాజమందిరంలోకి రావటానికి ? నేనంత చులకనగా తోచానా నీకు ? ఇదంతా మా తండ్రికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా ? చూడు , నేను నిన్ను ఏం చేస్తానో ? " అంది . అయితే బ్రాహ్మణ యువకుడు ధనస్వామి అందుకు బెదరలేదు . చెదరని చిరునవ్వుతో " ప్రేయసీ ! నీ మీది ప్రేమకొద్దీ నేనిలా ప్రాణాలకు తెగించాను , అంతే తప్ప మరిక దేని కోసమూ కాదు . తొలి చూపులోనే నీవూ నాపై వలపు కలిగి ఉన్నావని నాకు తెలుసు . కాబట్టి నన్ను బెదిరించ ప్రయత్నించకు . అది వృధా . ప్రేమతో నన్ను అంగీకరించు . ఎందుకిదంతా మీ తండ్రికి చెప్పేందుకు ఆతృత చూపిస్తావు ? నీవు నన్ను రక్షించగలవు . నన్ను కాపాడేందుకు నీవే సమర్ధరాలవు . నేను ప్రాణాధికంగా నిన్ను ప్రేమిస్తున్నాను . కాబట్టి నిన్ను చేరేందుకు ఇంత ప్రమాదానికైనా పాలుపడ్డాను . ఇక ఇప్పుడు నన్ను రక్షిస్తావో లేక శిక్షిస్తావో నీదే నిర్ణయం . నీవేది చేసినా నాకు ఇష్టమే ! నీ ప్రేమ పొందలేనప్పుడు రాజు చేతిలో మరణం పొందడమైనా నాకు ఆనందమే ! " అన్నాడు . ధనస్వామి తన కొరకు అంత సాహసానికి పూనుకోవటం , ప్రాణాలకు తెగించటం . . . . భగవతికి ఎంతో ఆనందం కలిగించింది . ఆపైన అతడి తీయని మాటలకీ తెగింపుకీ మరింత ముగ్దురాలైంది . కిలకిలా నవ్వుతూ " ప్రియా ! నేను చేయగలిగింది ఇదే ! " అంటూ అతడి చెక్కిలిపై ముద్దు పెట్టుకుంది . ధనస్వామి పరవశించి పోయాడు . అది మొదలు ఏకాంతంగా ఇద్దరూ ఒండొకరి సాన్నిహిత్యాన్ని ఆనందించ సాగారు . ఇది ఇతరులెవరు కనిపెట్ట లేక పోయారు .
అంటే FA లో పదబంధాల గురించి FA లోనే , పరోక్షంగానయినా ఖండితంగా , మాట్లాడవచ్చన్నమాట . ఇది చాలా కీలకమైన విషయం . దీనిని ఇంకాస్త జటిలమైన వాటికి , ఫార్ములాల వరస ( sequence of formulas ) కి , అన్వయిద్దాం .
ఒక రె౦డు టేబుల్ స్పూన్ల నెయ్యి బాణలిలో వేసి కాగాక అరకేజీ బొ౦బాయి రవ్వ వేయి౦చి పక్కన పెట్టాలి . పచ్చి కొబ్బరి తురిమి నేతిలో వేయి౦చాలి . జీడిపప్పు , కిస్ మిస్ లు కూడా నేతిలో వేయి౦చాలి . యాలకులు , ప౦చదార మెత్తగా పొడిచేసుకోవాలి గ్రై౦డర్ లో . వేయి౦చిన కొబ్బరి తురుము , వేయి౦చిన జీడిపప్పు , కిస్మిస్ లు ప౦చదారపొడి రవ్వలో కలిపి , మిగిలిన వేడినెయ్యి , మరియు వేడి పాలు పోసి బాగా కలిపి వేడిమీదే లడ్డులు చుట్టుకోవాలి . పాలు కాని పక్ష౦లో వేడి నీళ్ళు కూడా కలుపుకోవచ్చు . ఇవి పదిహేను రోజుల పాటు
ప్రధాన జాగ్రత్తలు మరియు సెట్టింగ్స్ : ఫైర్‌వాల్‌ను వాడుకలో ఉంచడము ఎంత ముఖ్యమో దానిని ఎప్పటికప్పుడు సరిచేసుకోవడం అంతే ముఖ్యం . ఫైర్‌వాల్‌లో మన వాడుకను బట్టి భద్రతను కల్పించడం జరుగుతుంది . వాటిని ' ' ట్రస్ట్ లెవల్ ' ' అంటారు . మనకు తెలియని వెబ్‌సైట్లు ఓపెన్ చేయనున్నప్పుడు అధిక రక్షణ కల్పించేలా అమర్చడం . అలాగే ఎప్పుడూ చూసేవే అయినపుడు ఆ భద్రతను తగ్గించుకోవడం ద్వారా కంప్యూటర్‌కు నిరంతర రక్షణను ఇవ్వవచ్చు . ఈ మధ్యకాలంలో సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను వాడుతున్నప్పటికీ ఇంకా కొన్ని సైట్లు తక్కువ పరిజ్ఞానం ద్వారా భద్రతను పాటించలేకపోతోంది . అటువంటి సైట్లను ఓపెన్ చేసేటప్పుడు ఫైర్‌వార్ ఉపయోగ పడుతుంది . అలాగే ఇంటర్‌నెట్‌లో సైట్లను జోన్ల రూపంలో ఉపయోగిస్తారు . అటువంటి వాటిలో పెరీమీటర్ నెట్‌వర్క్ వెబ్‌సైట్లను కొంతవరకు నమ్మవచ్చు . ఇటువంటి వాటిపై అవగాహన లేనివారు అధిక భద్రతా సెట్టింగ్ ఉంచడం ద్వారా సులువుగా ఉంటుంది .
సమైక్యవాదానికి కట్టుబడి మున్సిపల్ ఛైర్మన్ పదవికి రాజీనామచేసి సంబంధిత అధికారులకు పంపించా . స్వార్ధప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చడానికి జరుగుతున్న స్వార్థ కుట్రరాజకీయాలకు భయపడేదిలేదు . సమైక్యవాదం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం .
@ ప్రవీణ్ , @ radhika , @ ప్రసాద్ నా ఫొటోలు మీకు నచ్చినండుకు నాకు చాలా ఆనందంగా ఉంది . ధన్యవాదాలు . . . @ ramanadha reddy మీరు చెప్పినది నిజమే , కానీ నా మనసుకు తోచినది రాయడమంటే కొంచెం కష్టం . కాకపోతే ఆ ఫొటోలను వివరిస్తూ ఇంకొంచెం సమాచారాన్ని అందిస్తాను .
చంద్రమోహన్ గారు , మీరు తలుచుకున్నది మొదటి హల్లు : - ) ( అన్నట్టు చెప్పడం మరిచాను , తెలుగులో " క్ష " విడి అక్షరంగా లెక్క వేస్తారు " ళ క్ష ఱ " . అంచేత " క " తలుచుకున్నప్పుడు " క్ష " ని లెక్కించకూడదు . నేనిది చెప్పకపోయినా మీరు సరిగ్గా లెక్కవేసారు ! ) .
అని గాలిబ్ గుర్తొచ్చాడు . ప్రతీ పూల మొగ్గ , రక్త కణంగా కనిపిస్తున్నదట , ఎర్రగా కనపడుతున్న ప్రతీ కుసుమ ముకుళం ప్రియురాలి రాగ రంజితమయిన వ్రేలి వలె ఉందిట . పూమొగ్గలు ఎరుపు రంగద్దిన కోమలమయిన అంగులికతో పోల్చిన గాలిబ్ . . . . . . .
నా అంతరాల్లోని చీకట్లోంచి ఎగిరి పోతాను పారదర్శకమౌతాను వొక వెలుతురు నీడనౌతాను జీవన వృక్షం మీంచి పాడుతున్న కలల పక్షినౌతాను !
మీ వ్యాసము నన్ను నలభై యేళ్ళకు పైగా భూతకాలములోకి తీసికొని వెళ్ళింది . నేను భారతీయ విజ్ఞాన సంస్థలో డాక్టరేట్ చేసేటప్పుడు HALలో ఉండే Eliot 803B కంప్యూటర్్ను వాడేవాళ్ళము . దానికి డేటా కాగితపు టేపులో పంచ్ చేయాలి . మధ్యలో తప్పు దొర్లితే దానిని కరెక్ట్ చేయడం అంత ప్రయాస ! దానికి మెమరీ 4000 మాత్రమే ! ఒక ఆపరేషన్కంటే ఎక్కువ ప్రోగ్రాంలో రాయడానికి వీలుపడదు . a = a + b + c అంటే కంప్యూటర్ ఒప్పుకోదు . a = a + b , a = a + c అని రాయాలి . పెద్ద పెద్ద ప్రాబ్లంస్ ఉంటే బొంబాయిలో TIFRలో CDC 3600 ఉపయోగించాలి . అక్కడకు వెళ్ళడానికి III class ticketకు మాత్రమే డబ్బు ఇచ్చేవారు . అక్కడకు వెళ్ళి ఎవరి గదిలోనైనా బలవంత బ్రాహ్మణార్థానికి వెళ్ళాలి . కార్డులలో పంచ్ చయాలి డేటాను . ఒకప్పుడు బొంబాయి వర్షాలలో ఆ రబ్బర్ బ్యాండ్ కాస్త తెగి కార్డులంతా ( పెద్ద పెట్టె ) కిందపడి నీళ్ళలో తడిశాయి . అది బైనరీ కూడా ! నేను చదివిన ప్రోగ్రామింగ్ పుస్తకము రాసింది McCracken . నేను మదురైలో పని చేసేటప్పుడు 300్ మైళ్ళ దూరము ఉండే మదరాసు IIT కి వెళ్ళి కంప్యూటర్ వాడే వాళ్ళము . 1980లో ఇక్కడ కూడ ( Purdueలో ) కంప్యూటర్కు టైము బుక్ చేయాలి . అరగంటకు పైగా ఉపయోగించరాదు . ఎవ్వరు లేని సమయాలలో సాయంకాలము , రాత్రిళ్ళు వాడేవాళ్ళము . ఆ కాలాన్ని నెమరు వేస్తే ఇప్పటి వాళ్ళు ఎంత అదృష్టవంతులో అనిపిస్తుంది .
" పేపర్ కొన్నది నువ్వు చదవడానికి కాదు . . ! " ఈ మాటలన్నది నేను కాదు . . ! నా కుడివైపు కూర్చున్న రుబ్బుడు పొత్రం లాంటి వ్యక్తి . . ! అతను కూడా నా పేపర్లోకే చూస్తున్నాడు . నేనతని వైపు చూడగానే ఒక వెర్రినవ్వు నవ్వాడు . . " చూసావా నీ బదులు నేనన్నాను . . " అన్నట్లు
వరుస ప్రభుత్వాలు తాము అభివృద్ధి చేశామనే మాటల్లో ఏ మాత్రం నిజం లేదు . హైదరాబాద్ చుట్టుపక్కల పలు ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి యూనిట్లను తెరిచారు . దీనివల్ల పటాన్ చెరు , కాటేదాన్ , బాలానగర్ , బొల్లారం వంటి ప్రాంతాల్లో నీరు , గాలి కలుషితమై పోయింది . ఈ కంపెనీల్లో పనిచేస్తున్నవారిలో 90 శాతం మంది ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే .
బాలెన్స్ తప్పి ముందుకు పడిపోయాడా వ్యక్తి . పడిన వెంటనే పైకి లేవటానికి ప్రయత్నించేలోపల , మెరుపువేగంతో అతన్ని సమీపించి , చేతికర్రతో భుజాలమీద బలంగా మోదాడు శ్యామ్‌సుందర్ .
ఇంకొక ముఖ్యమైన తేడా ఏమిటి అంటే … ఈ పాశ్చాత్య దేశాలలో చాలా వరకు , నిన్న మొన్నటి వరకు ఎక్కువ మంది self - centered ( దీనికి చాలా వరకు ఆయా దేశాలలో కఠినంగా అమలు చేసే నియమాలు , ప్రభుత్వ పధకాలు , పెన్షన్ సౌకర్యాలు , ఆధునిక జీవనశైలి మొదలగునవి అయితే అయ్యుండొచ్చు గాక ) అంటే నా అనే భావం తప్ప , మనము అనుకోవటం , సమాజం ఇలాంటివి వీరికి తెలియవు . . ఇప్పుడిప్పుడే వీళ్ల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తూ ఉంది కనుక . . అదీనూ ఇది ప్రాధమిక దశను దాటి టీనేజ్ దశకు ఇప్పుడే వచ్చింది కనుక ఆ ఉత్సాహంతో వీళ్లు ఇలాంటి వాటిపై సహజంగానే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు .
వరుసలో మూడవ వారు , అలుపెరగని యుధ వీరుడు . . eతెలుగు కోశాధికారి , మన వెంకట రమణ . అందరి కన్నా పొడుగేమో . . ఏమాత్రం తగ్గేది లేదంటూ ఇరగ దీసాడనుకోండి . ఏమి చేసాడంటారా . . వస్తున్నా . . ఆ మాటకే వస్తున్నా . ఇంతక ముందు చెప్పినట్లుగా నేను eతెలుగు స్టాల్ దగ్గర నుంచొని వచ్చే పోయ్యే వాళ్ళకు ' అంతర్జాలంలో తెలుగుని ఎలా . . ? ' అనే విషయమై డిసైడ్ అయ్యాను అని చెప్పాగా . ఆ పనిలో eతెలుగు వాళ్ళు ఇచ్చిన కర పత్రాలు పంచుతూ అడిగిన వాళ్ళకి తెలిసిన సమాధానం ఇచ్చే పనిలో ఉన్నాను . ఇక్కడ చెప్పొచ్చిన / గమనించ తగ్గ విషయమేమిటంటే . . eతెలుగు స్టాల్ ముందు నుంచి వెళ్ళుతున్న వారందరికీ నేను కర పత్రాలు పంచటం లేదు . నా దగ్గరకు వచ్చి నిలబడి , ఏమిటిది ? అని అడిగిన వాళ్ళకు మాత్రమే పంచుతున్నాను . నా వరకూ నాకు ఒక్క కరపత్రమైనా వ్యయం క్రింద లెక్కే . ఎంత వరకూ వృధా అవకుండా చూద్దామా అన ఆలోచనతో , మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతో కొంత ఉత్సూకత ఉన్న వాళ్ళే అయ్యి ఉంటారు . కాబట్టి నా శ్రమ కొంచం తగ్గినట్లే అనుకుంటూ వచ్చే పోయే వారిని గమనిస్తూ ఉండి పోయ్యాను . అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్లు , " అవసరం ఉన్న వాళ్ళకే సహాయం చెయ్యాలి . . " , మన దగ్గరకు వచ్చిన వాడికే మన సమాచారం ఇద్దాం అని డిసైడ్ అయ్యాను . అందు వల్ల చాలా తక్కువ కర పత్రాలు మాత్రమే పంచానని చెప్పుకోవచ్చు .
తరువాత నేను పనిచేసిన research బిల్డింగ్ కి బయల్దేరాను . చూచాయగా గుర్తుంది ఎక్కడుంటుందో . అది ప్రత్యేకం George Von Bekesy కోసం కట్టించింది . Fish , ఏ విధంగా శబ్దాన్ని గ్రహిస్తాయో పరిశోధనలు చెయ్యటానికి ఆయన్ని హార్వార్డ్ నుండి ఇక్కడకు తీసుకు వచ్చారు . Bekesy గారికి మన చెవి ఎల్లా పనిచేస్తుందో తెలుసుకున్నందుకు " నోబెల్ " వచ్చింది . మా ప్రొఫెసర్ పేరు L . H . Piette , ఆయన కాన్సెర్ మీద పరిశోధనలు చేస్తారు . Bekesy ఎప్పుడోపోయారు , Piette అయిదేళ్ళ క్రిందట కాన్సెర్ తో పోయారుట . కనీసం ఆ బిల్డింగ్ చూద్దామనుకున్నా వెతికి పట్టుకోలేక పోయాను . ఇవ్వాళ అన్నీ నిరాశలే .
మరో కీలకమైన మార్పు వీరప్ప మొయిలీని న్యాయ శాఖ నుంచి తప్పించి ఆ శాఖను జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న సల్మాన్ ఖుర్షీద్‌కు కేటాయించడం . మొయిలీకి పెద్దగా గుర్తింపులేని కార్పొరేట్ వ్యవహారాల శాఖను కేటాయించారు . ఈ శాఖను ఇప్పటివరకు మురళీ దేవ్‌రా నిర్వహించారు . సల్మాన్ నిర్వహించిన జలవనరుల శాఖను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్ కుమార్ బన్సల్ నిర్వహిస్తారు . మమతా బెనర్జీ స్థానంలో రైల్వే మంత్రి పదవిని తృణమూల్‌కు చెందిన దినేష్ త్రివేదీకి కేటాయించారు .
నీతి కథలు చెప్పే తల్లులు , రామాయణం , మహాభారతం విడమర్చి చెప్పే తాతలు , తాతమ్మల స్థానే వెకిలి వేషాల పోగో చానళ్ళు తయారయ్యాయి ఇప్పుడు . పిల్లలు తప్పు చేస్తుంటే మందలించడం అటుంచి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించే తీరిక తగ్గిపోతోంది ఈ నాటి తల్లితండ్రులలో .
" సరేరా . . ఉంటాను . . బస్సు బయలుదేరేలా ఉంది . . అందరినీ అడిగినట్లు చెప్పరా . . పోన్ చేస్తాలే . . , " అని వెళుతున్న బస్సుతోపాటు వడివడిగా అడుగులు వేస్తూ స్నేహితుడిని సాగనంపాడు శంకర్ . అతనికి సెలవు దొరకలేదు . ఎప్పుడు సెలవు అడిగినా ఆఫీసులో కొత్త వర్కు చెబుతుంటాడు వాళ్ళ మేనేజరు . తెలిసినవాళ్ళందరికీ సెలవులు దొరికాయి . ఇంటికి వెళ్ళిపోయారు . " రూమ్లో ఒంటరిగా ఉండాలిరా దేవుడా ఐదురోజులు . చచ్చాం " , అని మనసులో అనుకున్నాడు . రాత్రి పదకొండు కావస్తుంది . ఏంటిరా బాబు ఇంత ఆకలిగా ఉంది . మధ్యాహ్నమే కదా కడుపునిండుగా తిన్నాం . మళ్ళీ ఆకలి మొదలు … ఇంకా ఇక్కడ ఏ టైముకైనా ఏది కావాలంటే అది దొరుకుతుంది కాబట్టి సాగుతుంది మనకు . . ఒకవారం తిండిదొరకని చోట ఉంటే తెలిసొస్తుంది . సరే ఏదైనా హోటల్ లో బిరియానీ తిని ఇంటికి పోదాం అనుకుని రోడ్డుదాటాడు . హైదరాబాద్ హౌస్ బిరియానీ సెంటర్ కు చేరుకున్నాడు . రెస్టారెంటు కనిపించేంత దూరంనుండే గాలిలో కలిసి వస్తున్న బిరియానీ వాసనలను పట్టుకున్నాడు . ముక్కుకి అందిన బిరియానీ వాసనలతో కాస్త ఓపిక వచ్చినట్లుగా అడుగులు వేగంగా పడసాగాయి . ఎల్లవొచ్చిగోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో … రింగ్ టోన్ తో జేబులో ఉన్నా ఫోన్ మ్రోగింది . ఈ టైములో ఎవరబ్బా అనుకుంటూ పోన్ తీసాడు . కిరణ్ గాడా . . వీడికేమయ్యింది ఈటైములో . . అనుకుంటూ అన్సర్ బటన్ నొక్కి . . " చెప్పరా . . ఏంటి . . " , అన్నాడు శంకర్ . " ఒరే నేను ట్రైన్లో ఉన్నారా . . ఇంటికి బయలుదేరారా . . మావాడు లాస్ట్ మూమెంట్లో ఇచ్చాడు లీవ్ … వాడిసంగతి తెలిసిందే కదా … నీకు చెబ్దామని చేసా . మళ్ళీ ఇంటికెళ్ళకా చేస్తారా బై " , అని పెట్టేసాడు . . " హూ . . వీడికి కూడా లీవ్ దొరికేసింది . వీడి మేనేజర్ ప్రకాష్ రాజ్ కేరెక్టర్ లా కాస్త ఏడిపించినా , మంచివాడిలానే ఉన్నాడు " . ఫోన్ తిరిగి జేబులో పెట్టుకుంటూ అలవాటు ప్రకారం ఫ్యాంటు వెనుకజేబుతడుముకున్నాడు . ఎత్తుగా ఉండే పర్సు లేకపోయేసరికి గుండెజల్లుమంది . కంగారుగా అన్నీ జేబులు వెతుక్కున్నాడు . ఫొను తప్ప జేబుల్లో ఏమీలేవు . నైట్ ప్యాంటు వేసుకోవడం వలన అన్నీ రూమ్లో పెట్టేసినట్లున్నాను అని తెలిసొచ్చిన తరువాత కాస్త మనసుకుదుటపడింది . కానీ రూమ్ తాళంచెవి కోసం వెతుక్కున్నాడు . ఎక్కడా దొరకలేదు . " ఓరిబాబోయ్ … ! ! ! ఈ వెంకట్ గాడు వేసినట్లున్నాడు తాళం , కూడా తాళంచెవి తీసుకెళ్ళిపోయాడు , నా తాళం రూమ్లో ఉండిపోయింది . ఇప్పుడెలా " , అని గట్టిగా అరిచినంత పనిచేసాడు . ఒక్కసారిగా వీధిలైట్లు ఆరిపోయి చీకటైపోయినట్టుగా కళ్ళు బైర్లు కమ్మాయి . " ఇప్పుడేంచేయ్యాలి … టైముకూడా పన్నెండు కావస్తుంది . ఎక్కడికెళ్ళగలం ఇంత అర్దరాత్రి , అయినా తెలిసినవాళ్ళంతా ఊరెళ్ళిపోయారే … ఎలారా . . " , అనుకుంటూ అలోచించసాగాడు . బాస్కర్ గాడి రూమ్ దగ్గర్లోనే ఉంది కానీ వాడికి మనకు మొన్నగొడవయ్యింది . . ఇప్పుడు ఇలా వెళితే కాస్త కటింగులిస్తాడు . . వాడికాచాన్స్ ఇప్వకూడదు . ఇక డూప్లికేట్ కీ అయితే ఓనర్ దగ్గరుంది అక్కడివెళ్ళివచ్చేసరికి కనీసం అరగంట పడుతుంది . . అవును డబ్బులు కూడాలేనట్టున్నాయి అని వెతకగా . . ఒక ఏబైరూపాయలనోటు , అయిదురూపాయల చిల్లర పైజేబులో కనపడింది . హమ్మయ్యా . . ఇదన్నా ఉంది ప్రస్తుతానికి … ఓనర్ ని చేరుకున్నా అర్ధరాత్రి లేపడం మంచిదికాదు . రేపువెళ్ళితీసుకోవాలి . . . అవును తాళాలు తీసేవడిని తీసుకొస్తే … ఇప్పుడు దొరుకుతాడా ? , ఒకవేళదొరికినా , ఈ టైమ్ లో తాళాలు బద్దలగొడితే . . దొంగనుకునేరు ఎవరన్నా . సరేలే ఎదవగొడవంతా ఎందుకు . . ఈ రాత్రి ఎలాగోలా గడిపేస్తే సరిపోతుంది . . అసలంతా ఈ వెంకట్ గాడివల్లే … పదిన్నర బస్సుకోసం . . . పదింటివరకూ . . కదల్లేదు . . , ఇక నన్నుకంగారు పెట్టి . . ఈ పరిస్ధితి తీసుకొచ్చాడు . వీడికి ఫోన్ చేసి నాలుగుతిట్లు పెట్టాలి … అని కోపంగా పోన్ తీసాడు . . డయల్ చేసిన నెంబరు కట్ చేసేసి . . ఎందుకులే . . మళ్ళీ ఈ జర్నిలో అంతా నిద్రలేకుండా అలోచిస్తాడు మనశ్సాంతిలేకుండా . . మనకెలాగు ఉండదు నిద్ర ఈరోజు ఇక వాడినిద్రపాడుచేయడందేనికిలే ఊరినుండి వచ్చాకా చెప్తా వాడిపని … ప్రస్తుతం ఏంచేయాలబ్బా అని ఆలోచించాడు . బుర్రంతా నిండిన అలోచనలు కడుపులో ఆకలిని డామినేట్ చేసేసాయి . ఎదన్నా తినాలి అన్న ఆలోచన కూడా రావడంలేదు మనసులోకి . ఇక ఈ రాత్రికి రూమ్ ప్రక్కనున్న పార్క్ లో బెంచ్ పైన పడుకుని . రేపు పొద్దున్నే ఓనర్ దగ్గరకు వెళ్ళి తాళంచెవి తెచ్చుకుని ఆఫీసుకు వెళ్ళాలి . . అని నిర్ణయం తీసుకున్నాడు . జేబులో ఉన్న డబ్బులతో బిరియానీ వచ్చేలా లేదు . అంతా ఖర్చుపెట్టేస్తే రేపు తిరగడానికి డబ్బులు అవసరం అని . . ప్రక్కనే ఉన్న సమోసా బండి దగ్గరకు వెళ్ళి పార్సల్ కట్టించుకున్నాడు . వెన్నెల్లో చాలా అందంగా కనపడుతున్నాయి పూలమొక్కలు . పార్కులోకి అడుగుపెట్టగానే వచ్చిన పూలవాసనతో అతనికి మంచి ఆనందాన్నిచ్చింది . ఒక్కసారిగా టెన్నస్స్ అన్నీ మరచిపోయాడు . మంచి బెంచ్ ఒకటి చూసుకుని కూర్చున్నాడు . చందమామను చూస్తూ తిందామని సమోసా పొట్లం విప్పబోతూ అనిపించింది . డబ్బులులేకపోతే . . క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయ్ … అదీకాకపోతే ఇంత పెద్దనగరంలో ఎంతో మంది స్నేహితులున్నారు . . అయినా ఈ గతిఏంటినాకు . ఖర్మకాకపోతే ఎంటిది ? , నేను పర్సుమర్చిపోవడమేంటి ? . . . వాడు తాళంచెవి మర్చిపోవడమేమిటి ? , స్నేహితులంతా ఒకేసారి కట్టకట్టుకుని ఇళ్ళకుపోవడమేమిటి . . ? . . . బిరియానీ తినవలసినవాడిని , ఈ సమోసాలు తినడమేమిటీ . . అంతే మన టైం బాగాలేదు . . ఈరోజుకు ఏదోలా సర్దుకుందాం . . అని అనుకుని సమోసాల పొట్లంవిప్పాడు . ఒక్కసారిగా చెడువాసన వచ్చింది . . చీ . . ఇదేంటి . . అని . . ముక్కుమూసుకున్నాడు కొంతసేపు . ఏంటి ఎక్కడిదీ చెడువాసన . . అబ్బా . . ! ! , అనుకుని పొట్లం కాస్త దగ్గరగా పెట్టుకుని వాసన చూసాడు బాగానే ఉందే . . ? మరి ఎక్కడనుండి వస్తుంది అని లేచినిలబడి చుట్టూ చూసాడు . ఏదో కాగితాలు కదులుతున్న చప్పుడు కూడా వినపడింది . కొన్ని అడుగులు వేసాడు . చప్పడు వినపడ్డవైపుగా . పార్కుకి పెన్సువేసిఉంది . . అదే ప్రక్కగా రోడ్డు , దగ్గర్లో వీధిదీపానికి కాస్త అటువైపుగా ఒక చెత్తకుండీ ఉంది . ఎవో కుక్కలు అనుకుంట అవి కదుపుతుండడం వల్ల చెడువాసన వస్తుంది అని తెలుసుకున్నాడు . వెనక్కుతిరిగివస్తుండగా అక్కడపాకుతున్నది కుక్కలా కాకుండా మనిషిలా అనిపించింది కాస్త మసక చీకటిలో , సరిగ్గా చూడగా ఎవరో మనిషి కనిపించాడు . కొంపదీసి దొంగేమో . . అయినా దొంగ చెత్తకుండీదగ్గర ఏంచేస్తాడు . వీధి కుక్కలుకూడా కూడానే ఉన్నాయి . దొంగకాదు ఎవడో పిచ్చివాడుఅయ్యివుంటాడు . . దగ్గరగా చూద్దామనుకుని కాస్తముందుకు నడిచాడు . . . పెద్దశబ్ధంతో గూర్ఖావేసిన విజిల్ వినపడి ఉలిక్కిపడి చతికిలపడ్డాడు . అమ్మో ఈ చీకట్లో నేను దొరికినా దొంగనే అవుతాను . అసలే ఈ సిటీలో ఇటువంటి కార్యకలాపాలు ఎక్కువ . . అనుకుని కదలకుండా మెదలకుండా కూర్చున్నాడు . భయంతో . . . కొంత సమయం గడిచాకా లేచి చెత్తకుండీవైపు చూసాడు . ఒకతను మాసిన బట్టలతో , మట్టితో ఉండలు కట్టిన జుట్టుతో , గడ్డంతో , చెత్తకుండిలో కాగితాల మధ్య ఉన్న మెతుకులు వెతుకుతున్నాడు . ఏరిన పదార్దాలను చిన్న కాగితంపై పోగుచేస్తున్నాడు . ప్రక్కనే ఉన్న కుక్కలు అతన్నిదాటి వెళ్ళకుండా , ఆజ్ఞాపించినట్టుగా అక్కడే నిలబడి చూస్తున్నాయి . శంకర్ కి ఆశ్చర్యంవేసింది . . అదిచూసి ఒక విషయం అతనికి అర్ధమయ్యింది . అతనెన్నిరోజులుగా ఆకలిభాదను అనుభవిస్తున్నాడో . . పాపం . నా టెన్సన్ నా ఆకలిబాధను కొంత సమయం డామినేట్ చేసేసింది . అదే బాధ ఎక్కువైతే చుట్టూ ఉన్న చెత్తని , చెడువాసనని , రుచిని డామినేట్ చేస్తే ఏమవుతుందో అతని కళ్ళముందు ప్రత్యక్షమయ్యింది ఇప్పుడు . అయినా అదే తినాలా ? , అడుక్కుంటే ఎవరన్నాపెట్టకపోతారా ? , ఏమోలే ఎద్దులా ఉన్నావ్ పనిచేసుకుని బ్రతకొచ్చుకదా ? అన్న మాటలుకూడా విన్నాం . . చెప్పలేం . . పడ్డవానికే కదా తెలిసేది . . పాపం పిచ్చివాడేమో . . ఎమో తెలియక చేస్తున్నాడేమో . . ఎవరికైనా తప్పదు కదా ఈ ఆకలి బాధ . నా దగ్గరున్న సమోసాలు ఇచ్చేయడం మంచిది . ఒకరోజు నేను తినక పోతే నష్టంలేదు . . నాకు ఒక్కరోజు ఆకలిబాధఅంటే ఎంటో తెలుసొస్తుంది కూడాను . చిన్న ఈగో , దోమో పడింది అని గిన్నెడు అన్నాన్ని పడేసిన రోజులు ఉన్నాయి . . హోటల్లో తిన్నది ఎక్కువై , తీసుకెళడానికి నామోషీ వచ్చి వెయిటర్ కి చెప్పి తీసేయమని పడేసిన రోజులూ ఉన్నాయి . . నాలాంటివాడికి ఆకలిబాధ ఒక్కరోజు తెలియడమే మంచిదే . . సరే సరే . . ఇప్పుడు మన ఆలోచనలకన్నా అతని ఆకలి ముఖ్యం అతను అది తినకముందే ఇవ్వడం మేలు అనుకుని , పార్కు బయటకొచ్చి . . చెత్తకుండి దగ్గరకు చేరుకుని . . అతనిని పిలిచి సమోసాల పొట్లం చేతికిచ్చాడు శంకర్ . అది తీసుకున్న ఆ వ్వక్తి . మళ్ళీ చెత్తకుండీ వైపు నడిచాడు . . ఏంటిది . . మళ్ళీ ఇటువైపు వెళుతున్నాడు అని పార్కులోకి వెళుతూనే అతని వంక చూసాడు శంకర్ . . అక్కడ పోగుచేసిన పదార్ధాలను కుక్కలకు తినమన్నట్లుగా వాటి దగ్గరకు లాగి వీధిదీపం ఆవలికి వెళ్ళి కూర్చుని సమోసాలు తినసాగాడు . ఇదంతా చూస్తూనే శంకర్ తన బెంచ్ పైకి వచ్చి కూర్చున్నాడు . మళ్ళీ ఆలోచనలు వెంటాడాయి . బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా | | ఇది చిన్నప్పుడు భగవద్గీతలో నేర్చుకున్న పద్యం అవును ఈరోజే తెలిసింది పడేసిన ఆహారం కూడా ఇలా ఉపయోగపడుతుందన్నమాట . . కానీ మనంతినగా మిగిలింది , వేరొకరికి … మనుషులే తినలేనిది జంతువులకు , జంతువులు తినలేనిది క్రిమికీటకాలకూ చేరాలన్నమాట … ఏంటి ప్రతీరోజు ఇలాంటివి ఎన్నో చూస్తున్నా నాకు తెలియలేదు . . దానిగురించి ఆలోచించనూలేదు … ఈ రోజు నేను ఈ పరిస్ధితిలో ఉన్నా కాబట్టి ఆలోచిస్తున్నానా ? , ఏమోలే … ఎవరో చెప్పినట్లు … ఒక సంవత్సరకాలం విలువ తెలియాలి అంటే . . పరీక్షలలో తప్పిన విధ్యార్దిని అడుగు తెలుస్తుంది , ఒక నెల యొక్క విలువ తెలియాలి అంటే నెలలు నిండకుండానే జన్మనిచ్చిన తల్లిని అడుగు , ఒక నిముషం విలువ తెలియాలి అంటే తను వెళ్ళవలసిన రైలును దాటిపోతే తలపట్టుకున్న వ్వక్తిని అడుగు , ఒకసెకను కాలం విలువ తెలియాలి అంటే తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్న వ్వక్తిని కనుక్కో , ఒక్క మిల్లీసెకను విలువతెలియాలి అంటే ఒలింపిక్స్లో రజతపతకాన్ని పొందిన వాడినడుగు … అని . ఎదుటి వాడి ఆకలి బాధతెలియాలి అంటే ఒక్కరోజు ఆకలితో గడపాలి . . , దూరమైనప్పుడే దేని విలువ అయినా తెలిసేది . . . అని అప్పుడే తెలుసుకున్నాడు . ఇలా శంకర్ ఆలోచిస్తూ ఉండగానే తెల్లారిపోయింది .
భావుకతా ! . . . నా అభౌతిక ప్రపంచం లోకి నువ్వు అనుకోని అతిధివి . నీ స్పర్శ తో భావస్పందన లేని నా మనసు శిల సరససామ్రాజ్ని మోహిని గా మారింది . ఇప్పుడు తనకి ఎంతటి సున్నితత్వము , ఎన్ని కేరింతలు , ఏమి లావణ్యము ! . . . నీ కళ్ళతో ఆ అమ్మాయిని చూశాను . తను నవ్వింది . నువ్వు నా హృదయతంత్రి ని మీటావు . నా గుండె రాగాలు పలికింది . స్నేహం విత్తు మొక్క అయ్యింది . ఆ మొక్కకి ' ప్రేమ ' అనే భావం మొగ్గ తొడిగింది . తన స్పర్శ కి నువ్వు అర్థాలు చెప్పావు . పెదవుల ఆట గురించి అడిగితే ' తనకు నువ్వంటే పిచ్చి ఇష్టం ' అన్నావు . కౌగిలి దిగ్బంధనాన్ని ' నువ్వు లేకుండా నేనుండలేను ' అని తర్జుమా చెప్పావు . ప్రేమ నా హృదయగిరిని దట్టమైన మేఘంలా కమ్మేసింది . ఆ అనుభూతి వర్షంలో నేను తడిసి ముద్దయ్యాను . కొన్నాళ్ళకి కాలం నా వెర్రితనాన్ని ఆవిష్కరించింది . ' Be spontaneous yaar ' అంటూ తను నన్ను విడిచిపోయింది . నా పల్లెటూరి ప్రేమని తన పట్నం ప్రేమ ఎగతాళి చేసిపోయింది . మొట్టమొదటిసారిగా నువ్వు నన్ను మోసం చేశావు . భయంకరంగా దెబ్బ తీశావు . కక్షతో నిన్ను నా మనసు నుంచి వెలివేద్డామనుకున్నాను . కానీ నువ్వు దుఖంలో కూడా దాగివున్న అందాన్ని చూపించావు . నేను మరింత పరిణితి పొందాను . నిన్ను మరింతగా గుండెలకి హత్తుకున్నాను .
మొత్తం మీద తన మొండి వైఖరి వల్ల నయ్యర్ పెద్ద రచయితలతోనూ , సంస్థలతోనూ పనిచెయ్యలేదు . తన సామర్య్థాన్నే నమ్ముకుని , తన జీవితాన్ని ఇతరులెవరూ శాసించకుండా చూసుకున్నాడు . అతను టైము విషయంలో చండశాసనుడే . సమయానికి రికార్డింగ్‌కు హాజరు కాలేదని అతను రామ్ నారాయణ్ ( సారంగీ ) , రయీస్‌ఖాన్ ( సితార్ ) మొదలైన పెద్ద విద్వాంసులను కూడా వెనక్కి పంపేవాడు . అనవసర జాప్యం వల్ల ప్రొడ్యూసర్లకు నష్టం రాకూడదని అతని ఉద్దేశం . చివరికి ఇది మహమ్మద్ రఫీ విషయంలో కూడా జరిగి అతను కొన్నేళ్ళ పాటు రఫీని పిలవలేదు . అపస్వరాలు పాడతాడని తెలిసినప్పటికీ మొండిగా మహేంద్ర కపూర్ చేత పాడించాడు . అలాగే ముకేశ్ పాడిన " చల్ అకేలా " బాగా పేరు పొందింది .
కార్తీకపున్నమి రోజున తొలిసూర్యకిరణాలు ఈ స్వామి వారిపై పడటం ఒక గొప్పవిశేషం . కేదారేశ్వరుడి ద్వారం బయట కుడివైపున గణపతి , ఎడమవైపున పార్వతీదేవి ఇటీవల ప్రతిష్టమై ఉన్నారు . రెండు శివాలయాల్లోనూ నందీశ్వరులున్నారు . శ్రీవీరభద్ర , శ్రీ భద్రకాళీ , అర్ధనారీశ్వర , కేదారేశ్వరులకు గర్భగుడులపై గోపురాలు ఉన్నాయి . దేవాలయంలో ఈశాన్య దిశలో నవగ్రహ విగ్రహములు ఉన్నాయి . ఆ గుడిపై కూడా చిన్న గోపురం ఉంది . వాయువ్య దిశలో బావి ఉంది . స్వామి వారి దేవాలయానికి బయట స్వామికి ఎదురుగా ద్వజ స్ధంభం , దాని వెనుక నందీశ్వరుడి గుడి , దేవాలయం ముఖద్వారంపై గాలి గోపురం ఉన్నాయి . దేవాలయం బయట ఈశాన్య దిశలో కోనేరు , వాయువ్య దిశన ఆస్థాన మండపం ఉన్నాయి . శ్రీ స్వామివారి ఉత్సవమూర్తి మహాశివరాత్రి సందర్భంగా ఈ మండపంలో కొలువు తీరుతారు .
ఒక విసనకర్రతో అతనికి విసురుతూ ఇలా చెప్పింది మధురలాలస " ఇతను ఇదివరకు మహారాష్ట్ర దేశం ఏలే సుగ్రహుడనే రాజు . మా తల్లి రూపానుభూతి ఇతనికి అక్క . ఇతనికి పిల్ల నివ్వాలని ఎంతోమంది రాజులు పత్రికలు పంపారు . ఐతే వాళ్ళలో ఎవరితో సంబంధం చేసుకోవాలో తేల్చుకోలేక చాలా కాలం గడిపితే వాళ్ళు కోపగించి తలా ఓ నెపం పెట్టుకుని ఇతని మీదకు దండయాత్రలు చేశారు . రాజ్యం విడిచి వెళ్ళి బయటనుంచి వాళ్ళని జయిద్దామని ఇతను అడవిలోకి పారిపోయాడు . ఆ రాజులు మాత్రం " రాజు లేని రాజ్యాన్ని ఆక్రమించటంలో గొప్ప ఏమిటి ? " అనుకుని ఆ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయారు .
రామునికి హౄదయం ఆంజనేయుడు . ఆంజనేయునికి హౄదయం రాముడు . మనిషి నుంచి హౄదయాన్ని ఎలా వేరుచేయలేమో , రాముణ్ణే ఆంజనేయుని అలాగే వేరుచేయలేం .
ఇంక ఆ థియరీని పొడిగించి చూస్తే " టెక్నాలజీ " వాడకం కవిత్వాన్నీ లేదా ఇతర సృజనాత్మక కళలనీ ఏమన్నా ప్రభావితం చేస్తుందా అన్నది చర్చనీయాంశం కావాలి . భావకవిత్వం కాలంలో ఏకాంతం కవికీ పాఠకుడికీ ఒక వెసులుబాటు కల్పించిందన్న ఊహకి కొనసాగింపుగా ! ! అది ఇవాళ " ఇంటరాక్టివ్ టెలివిజన్ " ఇంకా ఓట్లు అడిగి వారి వారి కళలకి ఆయా కళాకారులు గుర్తింపు తెచ్చుకునే పరిస్థితి లాంటిది . దానిని కవిత్వానికి అన్వయించి చూడాలి . అప్పుడు కవితాసందర్భం ఎలా మారుతుందీ అన్నది . మీరంతా ఈ విషయంలో నిష్ణాతులే గనక ఊహించండి . ఇన్ని లక్షల " బైట్స్ " కారణంగా ఇన్ని అభిప్రాయాలని మీరు ఇబ్బంది లేకుండా అచ్చువేసేస్తున్నారు . స్పేస్ కావలసినంత ఉంది గనక . ప్రింట్ మీడియాకి పాపం ఆ వీలు లేదు గనక వాళ్ళు ఈ విషయం లో " పొదుపు " గా ఉండాలి . మీకు ఆ పొదుపు అవసరం ఇంకా పడలేదు . గనక పస ఉన్నా లేకపోయినా రాసేవాళ్ళ అన్ని అభిప్రాయాలనీ పొందుపరుచుకుపోతున్నారు .
" ఇది నా జీవితమే " అని పాఠకురాళ్ళు ఎంతోమంది అనుకోగలిగారంటే దానికి కారణం రంగనాయకమ్మ గారు ప్రతిభావంతంగా రాయడమే కాదు , సమాజం నిండా జానకిలు ఉండటమే ! ఈ జానకిలందరూ కూడా తమ సమస్యలను వ్యక్తిగతంగా భావించి వాటిలోంచి బయటపడాలని ఆశిస్తారే గానీ పుస్తకం సైట్లో ప్రసాద్ గారు రాసినట్టు " సమాజంలోని మార్పులన్నీ పూర్తయ్యేదాకా " ఏదో ఒక తాత్కాలిక పరిష్కారం తో సరిపెట్టుకుందామనీ , చివరికి మార్క్సిజం సహకారంతో స్త్రీల జీవితాలు ఒక పది వేల యేళ్ళ తర్వాత ( అప్పటికి సమాజంలో మార్పులన్నీ పూర్తవుతాయని అనుకుంటే ) బాగుపడి సుఖ శాంతులతో ఉంటాయనీ తృప్తి పడరు .
ఇంతకముందు చేసిన అశోక్ , నరసింహుడు , జై చిరంజీవా చిత్రాలతో ఫ్లాపుల హ్యాట్రిక్ కొట్టడంతో తెలుగు లో మరెవరూ ఆమెను తీసుకోవడానికి ధైర్యం చేయడం లేదు .
ఇది నిఘంటువు కాకపోయినా , ఇక్కడున్న తెలుగు పదాల్ని వాడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం . ఇక్కడ పోగయ్యే పదసంపద అంతా అందరికీ ఉచితంగానే అందుబాటులో ఉంటుంది . ఈ ప్రయత్నంలో మిమ్మల్నికూడా పాలుపంచుకోమని ఆహ్వానిస్తున్నాం .
రాష్ట్రాల్లో లోకాయుక్తను , జిల్లాలు లేదా స్థానికంగా అంబుడ్స్‌మెన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు . అలా చేయని పక్షంలో రాష్ట్రాల్లో జరిగే అవినీతిపై చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని , దీంతో అవినీతి నిర్మూలన సాధ్యం కాదని జేపీ అభిప్రాయపడ్డారు . ఈ బిల్లును ఆషామాషీగా తీసుకుంటే దేశానికి తీరనినష్టం అని వ్యాఖ్యానించారు . ముఖ్యమంత్రిని లోకాయుక్త పరిధిలోకి తెచ్చినంత మాత్రాన జరిగే నష్టం ఏమీ ఉండదన్నారు .
మీద చాలా మంచి అభిప్రాయం , గౌరవం , అలాగే బావవన్న అభిమానం
మురళి పుట్టినరోజు పొద్దున్నే లేచి ఇంటిల్లిపాదిమీ మురళీ వాళ్ళింటికి వెళ్ళాము కేకూ , గిఫ్ట్‌లూ మోసుకుంటూ . మమ్మల్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు మురళి . కానీ బాగా సంతోషించాడు కూడా .
Download XML • Download text