tel-24
tel-24
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
జేమ్స్ కామోరోన్ నిర్మించి దర్సకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 18 న విడుదల అయ్యింది . గొప్ప విషయం ఏంటంటే ఈ హోల్లీవుడ్ చిత్రం మన భారతీయ ఇతిహాసాలనుండి ప్రేరణ పొందిన కధ . మానవుడు ప్రకృతిని తన చేత్తో తానే నాశనం చేస్తున్నాడు . ప్రకృతి ఉత్తమ గురువు , బందువు అని చెప్పడం చిత్ర ఉద్దేశం . ప్రకృతి మనిషిని ఎంత జాగ్రతగా కాపాడుతుందో . . అలాగే మనిషి ఎంత అజాగ్రత్త గా వ్యవహరిస్తున్నాడో కొన్ని కొన్ని సన్నివేశాలు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి . చిత్రం నిండా రంగులు , అద్భుతాలు , వింతలూ కళ్ళు తిప్పుకోకుండా చేస్తాయి . . ఇంకా మాక్ అప్ , ఆర్ట్ వర్క్ , కెమెరా , నేపధ్య సంగీతం అన్నీ ఒకదాన్ని ఒకటి మించి పోయాయి . కధానాయకుని పాత్ర మలచిన తీరు ఆకట్టుకుంటుంది . అబ్బుర పరిచే పోరాట సన్నివేశాలు ఈ చిత్రం సొత్తు . నిర్మాతలు పెట్టిన ( పోసిన ) డబ్బులు ప్రతి frame లో కనపడతాయి . నన్ను మెప్పించిన విషయం ఏంటంటే ఇందులో , ప్రేమ , action , sentiment , excitement , moral values వంటి ఎన్నో విషయాలు దర్శకులు చెప్పగలిగారు . Body paintngs ఉండడం వల్ల ఈ సినిమా కి U / A రేటింగ్ ఇవ్వడం జరిగింది కాబోలు . 13 ఏళ్ళు నిండిన పిల్లలు నిరబ్యంతరం గా చూడొచ్చు . ఈ మధ్య కాలంలో నేను చూసిన ఉత్తమ చిత్రం అవతార్ . చూస్తే ( అవకాశం ఉంటే ) ఈ చిత్రం 3D లో చూడండి . మీకు వినోదం రెండింతలు కలుగుతుంది .
ఇది రెండు రోజుల క్రితం ఈనాడు లో వచ్చిన వార్త . ఆంధ్ర దోపిడీ దారులు , దొంగలు అంటూ నిరంతరం తెలంగాణ యువకులని రెచ్చగొట్టి అమాయకులైన చాలా మంది విద్యార్ధుల ప్రాణాలు పోవటానికి ఏకైక కారణం kcr / trs . వాళ్ళు మాట్లాడే ప్రతి మాట విద్యార్ధులను , నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగానే ఉంటుంది . ఇక ఉద్యమం లో ఇంతమంది విద్యార్ధులు బలిదానం చేసుకుంటే TRS నాయకుడు ఒక్కడికి కూడా ఏమీ కాలేదు . హాయిగా పండగ చేసుకుంటున్నారు . మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ప్రజలు TRS నే నమ్మి వాళ్ళకు పట్టం కట్టారు . ఇక group 1 విషయం లో కూడా విద్యార్ధులను రెచ్చగొట్టి వాళ్లని విధ్వంసాలకు ఉసిగొల్పుతూ ఈ KCR మహానుభావుడు వెనకాల చేస్తుందేoటయ్యా అంటే వాళ్లకి HCA మీద పట్టు కావాలంట . ఉద్యమం ఇంత ఉధృతంగా నడుస్తూ పిల్లలు బలిదానాలు ఇస్తుంటే వీళ్ళు చేసే పని ఇది . రాష్ట్రం లో చిచ్చు పెట్టి నీ పని నువ్వు సమ్మగా చేసుకుపోతున్నందుకు నీకు వందనాలు KCR .
పూరీ దేవాలయం రధయాత్రకు ప్రసిద్ధి . ప్రతియేడాది ఆషాఢ శుద్ధ విదియనాడు ఈ రధ యాత్ర జరుగుతుంది . కులమత భేదాలు లేకుండా అందరూ ఇందులో పాల్గొంటారు .
జూన్ 2010న ప్రారంభించిన నా తెలుగిల్లు . వర్డ్‌ప్రెస్ . కాం బ్లాగుకు ఇప్పటికి బాలారిష్టాలు తీరినట్లనిపిస్తోంది . బ్లాగు ప్రారంభం తప్ప మరే విషయమూ తెలియని నేను కుంచెం కుంచెం నేర్చుకుంటూ ఇప్పుడు నా మానసిక విన్యాసాలకు ఎప్పటికప్పుడు అక్షరరూపమిచ్చి పోస్ట్ చేయగలుగుతున్నాను . రోజూ ఒకరిద్దరయినా నా విన్యాసాలు చూసి స్పందించటం నన్ను ఉత్సాహపరుత్సోంది . ముఖ్యంగా మిత్రుడు జయదేవ్ గారు రోజూ తన భావాలను పంచుకోవటాన్ని స్వాగతిస్తూ , వినమ్రంగా కృతజ్ఞతలు , ధన్యవాదాలు తెలుపుతున్నాను . మా ( ఈదుమూడి ) ఊరి ఫొటోను బ్లాగులో [ . . . ]
ఎప్పుడైనా సూపర్ బజారు కెళ్ళి నప్పుడు ఈ విషయం గమనించండి ! సబ్బులు , బిస్కెట్లు , చిప్స్ లాంటి దగ్గర మరీ జాగ్రత్తగా చూడాలి ఈ విశేషం . మొదటి వరుసలలో ఉండేవి పాత సరుకు . మీరు కాస్త ఓపికతో మొదటి వరుస తప్పించుకొని వెనుక వరుసలో చూడండి వాటిని తాయారు చేసిన తారీకు . తాజా సరుకు చాల సార్లు వెనుకే ఉంటుంది . అలా సర్దటం షాప్ వాడి వ్యాపార ధర్మమైతే , తాజా సరుకు కావాలనుకోవడం కోనేవాడి హక్కు . ఇదండీ " చరిత్ర ముందుకి - వర్తమానం వెనక్కి " టపా !
బంగాలదుంపలు - 1 / 2 kg బ్రెడ్ స్లైసెస్ - 4 జీలకర్ర - 1 / 2 tsp పసుపు - చిటికెడు కారం - 1 tsp గరం మసాలా - 1 tsp సన్నగా తరిగిన కొత్తిమిర - 3 tbsp ఉప్పు - తగినంత వేయించడానికి నూనె బంగాలదుంపలు మెత్తగా ఉడికించి , పొట్టు తీసి ఒక వెడల్పాటి గిన్నెలో వేయాలి . అది చల్లారాక మెత్తగా పొడిలా చేసుకోవాలి . అందులో పసుపు , ఉప్పు , కారం , కొత్తిమిర , గరంమసాలా , జీలకర్ర , నీళ్ళలో నానబెట్టి తీసిన బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి . ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వెడల్పుగా వత్తుకుని నాన్ స్టిక్ పై నిదానంగా , కొద్దిపాటి నూనె వేస్తూ రెండువైపులా ఎర్రగా అయ్యేలా వేయించాలి . ఇది వేడిగా సాస్ తో వడ్డించండి . .
ఈ త్యాగరాజ శిష్య పరంపరకి చెందిన వాడే పట్నం సుబ్రమణ్య అయ్యర్ . త్యాగరాజు ప్రధాన శిష్యుళ్ళలో ఒకడైన మానాంబుచావడి వెంకట సుబ్బయ్యర్ శిష్యుడే ఇతను . త్యాగరాజు అత్తయ్య కొడుకు మానాంబుచావడి వేంకట సుబ్బయ్యర్ . ఇతను త్యాగరాజు కన్నా పదిహేనేళ్ళు చిన్నవాడు . చాలాకాలం త్యాగరాజు వద్ద సంగీతం విద్య నభ్యసించాడు . కొంతకాలమయ్యాక తంజావూరు దగ్గర్లో ఉన్న ఇతని సొంతూరు మానాంబుచావడిలో స్థిరపడ్డాడు . పల్లవి శేషయ్యర్ , పట్నం సుబ్రమణ్య అయ్యర్ ఈయనకి ప్రధాన శిష్యులు .
కేసు - 1 బిడ్డింగుకు వెళ్ళడానికి కారణాలలో తొలుత ప్రతిపాదించిన విధంగా 2012 - 13 నుండి విద్యుత్తును పొందాలనుకోవటం కారణం కాదనేది కూడా స్పష్టం . 25 , 000 మె . వా . సామర్ధ్యంతో నెలకొల్పాలని ప్రతిపాదించిన లేదా అమలులో ఉన్న ప్రాజెక్టులతో పిపిఎలు చేసుకునేందుకు కారణం గత జనవరి 5వ తేదీతో పిపిఎలు చేసుకోవటం ద్వారా విద్యుత్ కొనుగోలుకు ఏర్పాటు చేసుకునే విధానానికి గడువు ముగియటం . ఆ తేదీ తరువాత ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల నుండి విద్యుత్ కొనుగోలు చేయడానికి కూడా పోటీ బిడ్డింగు ప్రక్రియనే పాటించాలని కేంద్ర విద్యుత్ ఛార్జీల విధానం నిర్దేశిస్తున్నది . అందువల్ల , 25 , 000 మె . వా . సామర్ధ్యం గల ప్రాజెక్టులతో ఆ తేదీ లోగానే పిపిఎలు చేసుకున్నామని , వాటిలో అన్నీ అమలు కాకపోవచ్చునని కృష్ణబాబు వివరించారు . అదే సమయంలో ప్రస్తుత కేసు ఒకటి బిడ్డింగులో పాల్గొన్న ప్రాజెక్టులన్నీ కూడా అమలు కాకపోవచ్చునని ఆయన అంగీకరించారు . వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నెలకొల్పేందుకు డెవలపర్లు ప్రయత్నాలు చేస్తున్నందున అవి అమలు కావని భావించటానికి ఆస్కారం లేదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు . ఒకవేళ అలాంటి పరిస్థితిలో కొరత ఉంటే తరువాత మళ్ళీ కేసు ఒకటి బిడ్డింగుకు వెళతామని చెప్పారు . పిపిఎలు చేసుకున్న బిపిఎల్ రామగుండం ప్రాజెక్టు హిందూజా ప్రాజెక్టు వంటివి కూడా దాదాపు 16 - 18 ఏళ్ళుగా అమలు కాలేదు . ఇంకా అలా ఏళ్ళ తరబడి అమలు కాని ప్రతిపాదిత ప్రైవేటు ప్రాజెక్టులు మరికొన్ని కూడా ఉన్నాయి .
ఈ స్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా మాజీ మంత్రి తమ్మి నేని సీతారాం , టీడీపీలో ఇటీవల చేరిన దువ్వాడ శ్రీనివాస్ వారివారి అనుచరులతో పవర్‌ప్లాంట్ వ్యతిరేక పోరాటాలను ఉదృతం చేశారు . అయితే టెక్కలి నియోజకవర్గానికి చెందిన ముఖ్య దేశం నాయకులు పవర్‌ప్లాంట్ నిర్మాణానికి అనుకూలంగా వ్యవహ రించడంతో . . .
భూమిక November 2009 1980 - 81 మధ్యకాలం . నేను పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లో గుమాస్తాగా పనిచేస్తున్న రోజులు . దిల్‌సుక్‌నగర్‌లో రూ . 150 లకు అద్దె ఇంట్లో వుంటూ రోజూ ఓ కిలోమీటర్ నడిచి , బస్సు డిపోకి వచ్చి , ఓ అరగంట క్యూలో నిలబడి , ఆర్‌టిసి బస్సులో సీటు సంపాదించి ఆఫీసుకెళ్ళేదాన్ని . ఓ రోజు విశాలాంధ్ర పుస్తకాల షాపుకెళ్ళి కొ . కు పుస్తకాలు కొన్నాను . ఆ సంకలనంలోని ఓ చిన్న గల్పిక నా మీద పెను ప్రభావాన్ని చూపింది . దాని పేరేమిటో నాకిపుడు గుర్తు లేదు . అందులో ఆఫీసులకి బస్సుల మీద వెళ్లే వాళ్ళ మీద ఆయన ఇలా రాస్తారు . " పది పదిహేను నిమిషాల బస్సు ప్రయాణానికి సీటు కోసం ఈ ఉద్యోగస్తులు అరగంట ముందొచ్చి క్యూలో నిలబడతారు . అదో అలవాటుగా చేసేస్తారు గాని , ఆ అరగంట బస్సులో నిలబడిపోదామని ఆలోచించరు . పడీ పడీ , ఇంట్లో వాళ్ళని తొందర పెట్టి వచ్చి క్యూలో నిలబడతారు . కాళ్ళు పీక్కుతున్నా క్యూలోంచి కదలరు " . ఆ గల్పికలో ఇలా అర్ధం వచ్చేట్టు వుంటుంది . ఈ చిన్న గల్పిక చదివిన తర్వాత నేను ఏ రోజూ క్యూలో నిలబడలేదు . ఆ మూసని తోసిరాజని రద్దీ బస్సుల్లో ఎక్కడంటే అక్కడ , ఆఖరికి ఫుట్‌బోర్డింగు కూడా చేసేదాన్ని . మనుష్యులు ఒక యాంత్రికతకి ఎలా అలవాటు పడిపోయారో , కొత్త దారుల్ని వెతక్కుండా ఎలా దానిలోనే కొట్టుకు పోతుంటారో ఈ బుల్లి గల్పికలో చెప్పిన కొకు రచనల్ని ఎంతో ఇష్టంగా , ప్రేమగా చదవడం మొదలుపెట్టాను . కొ . కు శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన మీద ప్రత్యేక సంచిక తేవాలనే ఆలోచన మొదలైన దగ్గర నుండి ఈ గల్పిక నాకు పదే పదే గుర్తుకు రాసాగింది . ఈ ప్రత్యేక సంచికకు బీజం పడింది శ్రీకాకుళంలో . ఆగష్టు పదహారున కేంద్ర సాహిత్య అకాడమీ , కథానిలయం సంయుక్తంగా కొ . కు రచనల మీద సమావేశం ఏర్పాటు చేసారు . ఆ సమయంలో నేను వైజాగులో వున్నాను . నాయుడుపేట నుంచి ప్రతిమ ఫోన్ చేసి శ్రీకాకుళం మీటింగుకి వెళుతున్నావా అని అడగడం , ఆవిషయం నాకు తెలియదని చెప్పడంతో , తనే వివరాలన్నీ చెప్పింది . శ్రీకాకుళం వెళ్ళాలనే తపన మొదలైంది . అప్పటికీి టైమ్ ఎనిమిది . మీటింగు 10 కి . నేనేమో ఒక అవసరమైన వ్యక్తిగత పని మీద వైజాగులో వున్నాను . ఇంకేమీ ఆలోచించలేదు . టాక్సీి తెప్పించుకుని అప్పటికప్పుడు బయలుదేరి ఆ సమావేశానికి వెళ్ళాను . సింగమనేని నారాయణగారు , కాళీపట్నం రామారావు మాస్టారు , చాగంటి తులసి ఇంకా ఎందరినో కలిసాను . రామమోహనరాయ్‌గారు ' కొ . కు చారిత్రక దృక్పధం " మీద అద్భుతమైన ప్రసంగం చేసారు . నేను టాక్సీ మీద ఖర్చు చేసిన రెండున్న వేలు ఈ సమావేశంలో పాల్గొన్న ఆనందం ముందు ఎందుకూ కొరగానివయ్యాయి . అంతే కాదు కొ . కు మీద నేనెందుకు భూమిక ప్రత్యేక సంచిక వెయ్యకూడదు . వేసి తీరాలి అనే నిర్ణయానికి రావడం జరిగింది . హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఉదయమే శాంతసుందరిగారికి ఫోన్ చేసి , కొ . కు గారి ప్రత్యేక సంచిక తీసుకొద్దాం . మీరు సహసంపాదకురాలిగా బాధ్యత తీసుకుంటారా ? అని అడిగిందే తడవు ఆవిడ ఒప్పుకోవడం , ప్రత్యేక సంచికకి రూపకల్పనా జరిగిపోయాయి . ఆవిడ వెంటనే రచనల సేకరణ పని మొదలు పెట్టేసారు . నిజానికి ఈ ప్రత్యేక సంచిక వెనుక కృషింతా శాంతగారిదే . అందరికీ ఫోన్‌లు చేసి మాట్లాడటం , వాళ్ళ వెంటబడి రచనలు రప్పించడం అంతా ఆవిడే చేసారు . ఆవిడ ఒప్పుకోక పోయి వుంటే అసలు ఈ ప్రత్యేక సంచిక సాధ్యమయ్యేది కాదు . ఆవిడకి ' థాంక్స్ ' లాంటి పడికట్టు పదాలతో కృతజ్ఞతలు తెలపడం నా కిష్టం లేదు . స్నేహంలో ఇలాంటి పదాలు ఇమడవు . ఇక కొ . కు . గారి రచనలకు సంబంధించి వివిధ కోణాలు ఈ సంచికలో ఆవిషృతమయ్యాయనే నేను భావిస్తున్నాను . ఈ అన్ని కోణాలను ఒకేసారి చదివే ' అదృష్టం ' ( దీనికేదైనా ప్రత్యామ్నాయ పదం వెదకాలి ) నాకు కలగడం నన్ను ఆనందోద్వేగాల్లో ముంచేసింది . వందేళ్ళ క్రితం పుట్టిన ఈ మనిషికి ఇంత విశాల దృక్పధం , శాస్త్రీయ భావజాలం అన్నింటిని మించి స్త్రీ సమస్య మీద ఇంత సంస్కారవంతమైన ఆలోచనలు ఎలా వంటబడ్డాయి ? అక్టోబరు 28న అంటే నేను ఈ ఎడిటోరియల్ రాస్తున్న రోజుకు సరిగ్గా వందేళ్ళ ముందు ఆయన పుట్టారు . " ఇరవయ్యో శతాబ్దంలో వచ్చిన తెలుగు సాహిత్య పరిణామం విషయంలో కొ . కు కొంత కాలం ద్రష్టగాను , ఆ తరువాత స్రష్టగాను కూడా పని చేసారు . ముఖ్యంగా రాయప్రోలు అభినవ కవితకు , కృష్ణశాస్త్రి భావకవితకు కొ . కు ద్రష్ట . శ్రీ శ్రీ కంటే కాస్త ముందు పుట్టినా కొ . కు భావ కవితా ప్రవాహంలో దూకలేదు . శ్రీ శ్రీ దూకి తిరిగి ఒడ్డుకెక్కి తన త్రోవ తాను చూసుకొంటున్న కాలందాకా కొ . కు ప్రపంచాన్ని చూస్తూ , తెలుసుకుంటూ , చదువు , ఆలోచించుకుంటూ వచ్చాడు . చలం సాహిత్యం కొ . కును ఎంతగానో ఆలోచనలకు , కలవరానికి గురి చేసింది . " అంటుంది కాత్యాయనీ విద్మహే కొ . కు వాజ్మయ జీవితం గురించిన వ్యాసంలో . గురజాడ , శ్రీశ్రీ , చలం , వీరేశలింగంలాంటి వారి ఆలోచనాధోరణి యువకుడైన కొ . కు మీద బలంగానే వుండింది . ఆ తరువాత దాస్ కాపిటల్ చదవడంతో కొ . కు కు మార్కి ్సస్టు ప్రాపంచిక దృక్పధం ఏర్పడడం , అభ్యుదయ రచయితల సంఘంలో భాగస్వామి కావడం జరిగాయి . ఉద్యోగాల వేటలో ఊళ్ళు తిరుగుతూ , వివిధ ఉద్యోగాలు చేయడంతో విస్తృతమైన జీవితానుభవం సంపాదించాడు . భిన్నమైన అనుభవాలను పొందాడు . ఈ అనుభవాలన్నింటిని విశ్లేషించుకుంటూ వాటినన్నింటిని తన రచనల్లో పొందుపరిచాడు . అసంఖ్యాకంగా వ్యాసాలు , కథలూ రాస్తూ పోయాడు . నిజానికి ఒక్క కవిత్వం తప్ప ఆయన రాయని ఆధునిక సాహితీ ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు . ఆయన రచనల్లోని సూటిదనం , వ్యంగ్యం , నిర్మోహమాటం పాఠకుల గుండెలకు నేరుగా తాకుతాయి . మారదలుచుకున్న వాళ్ళకు చుక్కానిలాగా పనిచేస్తాయి . బండబారిన వాళ్ళకు కొరడా దెబ్బల్లా తాకుతాయి . మన సాహిత్యం అనే వ్యాసంలో " ఆత్మగౌరవం కల జాతి తన కళలను ఎంతో అభిమానంతో చూసుకుంటుంది . మన కళల మీద మనకున్న అభిమానం చూస్తే మనకు ఆత్మగౌరవం ఏమీ లేదని స్పష్టమౌతుంది " అంటారు . స్త్రీల మానసిక సంఘర్షణలను , ఆనాటి సమాజంలో స్త్రీలు పడుతున్న ఆగచాట్లను చాలా ఆర్తితో , గుండెలోతుల్లోంచి కొ . కు . రాయడం కన్పిస్తుంది . ' ఆడజన్మ ' నవల్లో " నువ్వు మా జీతం లేని నౌకరువు . నీది ఇరవై నాలుగ్గంటల నౌకరీ , శలవుల్లేవు నీకు , ఫిించను లేదు . నువ్వు చేతులు మారినా నీ నౌకరీ మారదు . " అంటారు . ఇంకోచోట " నీకు ఆత్మజ్ఞానం లేకుండా , చదువూ విజ్ఞానమూ లేకుండా చేసి ఉంచింది దేనికనుకున్నావు . నీకు అడుగడుగునా అంకుశాలు దేనికనుకున్నావు ? నిన్ను అబలగాను నీ కీర్తి లేత తమలపాకులకంటే సుకుమారంగానూ , నీ మార్గం కంటక భూయిష్టంగాను , నీ జీవితం ఒక అంతులేని అగ్ని పరీక్షగాను ఉంచింది దేనికనుకున్నావు " అంటారు కోపస్వరంతో . అలాగే సౖౖెరంధ్రి కథలో జానకి పాత్ర చిత్రణ , ఆ పాత్రను మలిచిన తీరు అమోఘం . " నాలుగేళ్ళ భరించాను . ఇక చాలనిపించింది . ఒక రోజు చెప్పేసాను . నన్ను మీరు మెదడులేని ఆడగాడిద అనుకుంటున్నారో , ఊరందరితోను రంకు పోగల సాహసికురాలిననుకుంటున్నారో నాకు తెలియడం లేదు . నేను చిన్నతనంలో కుర్రాళ్ళతో మొగుడూ , పెళ్ళాం ఆటలు ఆడినదాన్నే " అంటూ మొగుడి ముఖంతోపాటు సమాజ ముఖాన్ని ఫెెడేల్మని తన్నినట్లు సమాధానం చెప్పింది . ' యావజ్జీవ స్నేహం ' అనే అందమైన వాక్యాన్ని ఈ కధలోనే రాసారు . అలాగే 1955 లో రాసిన ' దాలిగుంటలో కుక్కలు ' ఆశయాలు వల్లిస్తూ , తనవరకు వస్తే ఆచరణలో ముఖం చాటేసే వాళ్ళ గురించిన కథ . సమ్మె చేస్తున్న ఒక కథలోని కూలీల పట్ల సానుభూతి వర్షం కురిపించి " యజమానులను చంపినా పాపం లేదు " అంటూ రంకెలు పెట్టె మనుష్యులు , తమ బంధువుల పొలంలో పనిచేసే కూలీలు సమ్మె కడితే " కూలీ లంజా కొడుకులు సమ్మె చేస్తున్నారు . " అంటూ విరుచుకు పడుతూ " పోలీసుల్ని పిలిపించి , పికెటింగు చేసేవాళ్ళని మిల్లు ముందు నుంచి వెళ్ళగొట్టించి , కొత్త కూలీల్ని తెచ్చుకోలేకపోయావా " అంటూ సలహాలిస్తారు . ఒకటిన్నర పేజీల ఈ కథలో ఆశయాలకి , ఆచరణకి మధ్య వున్న అగాధాన్ని , మనుష్యులు ఎంత తేలికగా ఆశయాలు వల్లించి తనదాకా వస్తే ఎలా జారిపోతారో అద్భుతంగా ఆవిష్కరించిన కథ ఇది . చివరగా ' ఆడ బ్రతుకే మధురం ' కధలోని ఓ పదునైన వాక్యంతో నేను ముగిస్తాను . 1947లో రాసిన ఈ చిన్న కథ ఆనాటి స్త్రీలకే కాదు ఈనాటి స్త్రీలకి కర్తవ్య బోధ చేయడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం . " నేను పెద్దదాన్నయితే కొట్టే మొగుణ్ని మాత్రం చేసుకోను . పుణ్యం లేకపోతే పీడాపాయే . ఎవరు పడతారమ్మా దెబ్బలూ , తిట్లూను . " చిన్నపిల్ల అంతరంగంలోంచి వుబికి వచ్చిన ఈ మాటలు , తిట్లూ , తన్నులూ తింటూ హింసాయుత జీవితాల్లో మగ్గుతున్న ఈనాటి స్త్రీల చెవిన పడితే ఎంత బావుండు . ఆత్మగౌరవాన్ని ప్రోది చేసే , ఆత్మవిశ్వాసాన్ని అంతరంగం నిండా నింపే కొ . కు రచనలు ఈనాటి సమాజానికి ఎంత అవసరమో ఆయన రచనల్ని మళ్ళీ చదువుతున్నపుడు మరింతగా అర్ధమైంది . కొ . కు ప్రత్యేక సంచికను తేవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది . మా ప్రయత్నాన్ని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ , ఈ సంచిక రూపకల్పనలో , రచనలు సేకరణలో సహకరించిన సహసంపాదకురాలు శాంతసుందరికి అభినందనలు చెబుతూ అలాగే విరసం ప్రచురించిన సంకలనాల్లోంచి కొన్ని రచనలను పునర్ముృదించుకోవడానికి అంగీకరించిన కృష్ణాబాయిగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను . అలాగే విశాలాంధ్ర పబ్లిషింగు హౌస్‌వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రత్యేక సంచికపై స్పందించాల్సిందిగా పాఠకుల్ని అభ్యర్ధిస్తూ …
79 . ఋతుపవన భూములలో ప్రధానమైన పంట వరి . గోధుమ , జొన్న చిరుధాన్యలు వంటి ఆహార పంటలు పండిస్తారు . తేయాకు , జనుము వంటి వాణిజ్య పంటలు కూడా ఇక్కడ పండిస్తారు .
కొత్తపాళీగారూ బావుంది . గమనిస్తే , అనేక తత్వ వేత్తలు , సైనికులనూ సైన్యాన్ని విమర్శిస్తారు . కానీ , వారి త్యాగాలే మనల్ని రక్షిస్తాయి . వాళ్ళు పశువులయి , మానవత్వం మరచి శతృవును చంపటం వల్లనే మనం భద్రంగా ఇళ్ళలో వుండగలుగుతున్నాము . అందుకే ప్రాణాలర్పించిన సైనికులకంత మర్యాద . ఏ మేరె వతన్ కే లోగో అన్న పాటలో ' జబ్ హం బైఠేథె ఘరోమె వో ఝేల్ రహేథే గోలీ ' అని వస్తుంది . ఇదే భావం !
౦౩ . హీరోయిన్లు : బజారు స్థాయికి దిగ జారారు . ఇది దర్శకుల అభిరుచికి పరాకాష్ట . ప్రేక్షకులు అలా కోరుకుంటున్నారనే వాడిని చెప్పుచ్చుకు కొట్టొచ్చు . వీరి పాత్రలకు కమెడియన్ కు ఉండే ప్రాధాన్యత కూడా ఉండదు . వస్తారు … హీరో వెనక పడతారు ( కొన్ని సినిమాలలో అయినా విపరీతమైన కోరికలు , వికారమైన పాటలతో ) … నాలుగు పాటలు … . కట్ అయిపోయింది వీరి పాత్ర . తెర బయట కూడా వీరి జీవితాలు కుక్క జీవితం . సార్ అని ఎవరినైనా పిలవకపోతే ఇంటికే … . నాకు తెలిసిన ఒక అసిస్టెంటు కెమరామన్ చెప్పిన ప్రకారం అయితే మనసున్న ( ఆత్మాభిమానం ) మనిషి ఎవరూ తెలుగు సినిమాలో హీరోయిన్ గా చెయ్యలేరు . అందుకే ఇందులో తెలుగు హీరోయిన్లు అతి కొద్దిగా ఉన్నారు .
హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు , బుర్రకథ నాసర్‌గారు మన గ్రామవాసులే ! వారిని ఆదర్శంగా స్వీకరించి ఎందరో కళాకారులు ఆకళారాధన చేస్తున్నారు నేడు . బుర్రకథ కేవలం ముగ్గురు కళాకారులతో నవరసాలొలికించే కథా విధానంలో రసరమ్యంగా సాగేది .
శాంతింపుండని రాయబాయ మవురా ! శాంతింపకేమున్న ద శ్రాంత ప్రస్మయ దస్మదీయ కవితాచండాసి ఖండీకృతా హంతాదంతుర కాకవిప్రతివచఃప్రారంభ రంభాకురు ట్కాంతారమ్ములు సగ్గి మ్రగ్గి యసదై కంపట్టు నిప్పట్టునన్
కొంచెం గాలి పీల్చుకొంటూ , కారిడార్లలో నడుస్తూ , అసలు " గుడి " ని చేరతాం .
ఇంతలో సుజాత వచ్చింది . ఎలావుంది నా డ్రెస్ అన్నట్లుగా హరి కేసి చూసింది . " బ్యూటిఫుల్ ! " తన విస్మయాన్ని ఆపుకోలేకపోయాడు . సుజాత పెట్టుకున్న డైమండ్ నెక్లెస్ ధగ ధగా మెరిసిపోతోంది .
విద్యుత్ సరఫరా చేయని కారణంగా పంట దెబ్బతిన్న ఓ రైతుకు రూ . 50 వేల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ . రిలయన్స్ సంస్థ అధీనంలోని బీఎస్ఈఎస్ కంపెనీని ఆదేశించింది . విద్యుత్ సరఫరాకు అవసరమైన స్కిరల్ కండక్టర్ అనే విద్యుత్ తీగ అపహరణకు గురైనట్టుగా సంబంధిత రైతు ఫిర్యాదు చేసినందున , కొత్తగా ఆ కండక్టర్‌ను తెచ్చి వేసి విద్యుత్‌ను సరఫరా చేయాల్సిన బాధ్యత బీఎస్ఈఎస్‌పై ఉందని కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ జేడీ కపూర్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు . ఇందర్‌సింగ్ గహలౌట్ 8 నెలలుగా విద్యుత్ సరఫరా లేక చాలా ఇబ్బందులు పడ్డాడని , తనకు సరఫరా జరగడం లేదని ఫిర్యాదు చేసినా కంపెనీ పట్టించుకోలేదని , అందువల్ల కంపెనీ తన సేవల్లో లోపం జరిపిందని కమిషన్ తీర్మానించింది .
జోల పాటలకి మన సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది . సాధారణంగా తల్లి తన పాపాయికోసం పాడే ఈ పాటలు ఎంతో ప్రేమతో నిండి ఉంటాయి . సినిమా పాటల్లో కూడా ఎన్నో మంచి జోల పాటలున్నాయి . " రామా లాలీ మేఘ శ్యామా లాలీ " దగ్గర్నించి , " వటపత్ర శాయికీ వరహాల లాలీ " వరకు అనేక పాటల గురించి చెప్పుకోవచ్చు . అయితే , సినిమాల్లో కధను బట్టి వివిధ సందర్భాలేర్పడుతూ ఉంటాయి గనుక , వాటిలో తల్లి తన పిల్లలకోసమే కాకుండా , ఎవరు ఎవరికోసమైనా జోల పాటలు పాడే అవకాశం ఉంది . తండ్రి పాడే జోలపాటలకి " ధర్మ దాత " సినిమా కోసం సముద్రాల రాసిన " జో లాలీ జో లాలీ " ఒక చక్కటి ఉదాహరణ . " చిరునవ్వు కిరణాలు చిందించు మోము కన్నీరు , మున్నీరు గా చూడ లేను " అని సాగే ఈ పాటలో కేవలం ట్యూను వల్లనే కాకుండా , పదాల కూర్పు ద్వారా ఏర్పడిన ఒక లయ ఉంది . ఈ లయ ఒక ఊయల ఊపును సూచించే విధంగా ఉంటుంది .
నేను బ్లాగులోకంలో అడుగుపెట్టినప్పటికీ ఇప్పటికీ జాలంలో తెలుగు సమాచారం చాలా పెరిగింది . పెరుగుదల రేటు కూడా గణణీయంగానే ఉంది . ఏదైనా విషయం గురించి తెలుసుకోవాల్సివచ్చినప్పుడు , నేను ముందుగా తెలుగులో గూగిలిస్తున్నాను . మొన్నామధ్య హెపటైటిస్ బీ గురించి తెసుకుందామని సందేహిస్తూనే ( అనగా , నేరుగా ఇంగ్లీషు వికీపీడియాకి వెళ్ళకుండా ) తెలుగులో వెతికాను . నాక్కావలసిన సమాచారం తెవికీలో దొరికింది . కానీ ఇంకా చాలా విషయాల్లో తెలుగులో సమాచారం అందుబాటులో ఉండాలనుకుంటున్నాను . వివిధ రంగాల వారీగా చూద్దాం :
కర్ణాటక సంగీత ప్రియులూ , భారతీయులూ గర్వించదగ్గ వ్యక్తి పట్టమ్మాళ్ . కర్ణాటక సంగీతంలో మహిళలకీ ప్రత్యేక స్థానం కల్పించిన విలక్షణమయిన వ్యక్తి పట్టమ్మాళ్ . భౌతికంగా ఆమె దూరమయినా ఆమె పాట మాత్రం మన చెవుల్నంటి బెట్టుకునే వుంటుంది . నిస్సందేహంగా కర్ణాటక సంగీతానికి కర్ణాభరణం పట్టమ్మాళ్ .
మీరు పైకి చెఫ్ఫేరు . కొంత మంది లోలోపలే కుమిలిపోతారు . అన్ని ఉద్యోగాల్లోనూ వుండే సమస్యలే ఇవి . వదిలేసేరుగదా , ఇదొక మజిలీ అనుకోవడమే . కొత్త స్థానం నూతన తేజాన్ని ఇవ్వాలని ఆశిస్తాను .
ఇంత మంద్మి మంచిగున్నందంటే మళ్ళమళ్ళ ఇన్పియ్యాలని ! ! ఎన్కిట రానారె సారు మంచిగున్నదంటె అప్పటిసంది పాడకనె బాయె
" పంచరత్నా " ల్లో రామకృష్ణయ్యకు రత్నాల వంటి ఐదుగురు కొడుకులు . తన కొడుకులు తనలాగా బతకలేని బడిపంతులుగా కాకూడదని , వాళ్లను " పందెం గుర్రాల్లా " పోటీ చదువులు చదివిస్తారు . ఒక్కొక్కడూ డాక్టరు , లాయరు , ఇంజనీరులుగా స్థిరపడతారు - కానీ ఒక్క కొడుకూ - తమ తండ్రి జాగ్రత్తవల్లే మేమింత వాళ్లమయ్యామని అనుకోకపోగా - ఆయన చెప్పినట్లు వింటే - మేం ఆయన లాగానే తయారయ్యే వాళ్లమంటారు .
ముందుగా - మిగతావాళ్ళవి శ్రీరంగనీతులనే ఈ మార్తాండ ఎలాంటివాడొ తెలియడానికి ముందు ఈ లింక్ చూడండి
" అదేంటి ? ఉష కి పెళ్ళి కాలేదు కదా ! భర్తేమిటి ? " ఇదే విషయం ఉండ బట్టలేక అడిగాను .
మహిళ : అపార్దం కాకపోతే మరి ఏమిటిది . . సంవత్సరానికి ఒక్క సారే నిర్వహించే తద్దినంలా , ఈ మహిళా దినం ఏమిటి ?
నాకు యీప్పుదు శని కాలం నడుస్తోంది నేను యెప్పుదు జివిథమ్ లొ సెటిల్ ఔతాను 22 / 9 / 1988
137 . శ్రీరంగస్వామి . టి వరంగల్ జిల్లాలో ఉంటున్న వీరు సజీవ చిత్రాలు అనే కథా సంపుటిని వెలువరించారు . ఇందులో ఐదు కథలున్నాయి . ఇవి ఊహించి రాసిన కథలు కావు . తను చూసిన , అనుభవించిన విషయాల్ని కథలుగా మలిచారు . వేరు , భయం . లాలస , ఆవిష్కరణ , మేడి పండు కథలు నిష్టుర సత్యాలు .
అన్నింటినీ సర్దుకుపోవడం కూడా మంచిదికాదు . అవసరమైతే సంఘర్షణ పడినా , ఆ సంఘర్షణలోనూ ఆనందం ఉంటుంది . సంఘర్షణ వల్ల వెంటనే ఫలితాలు రాకపోవచ్చు కానీ , భవిష్యత్తు తరాలు స్వేచ్చగా , ఆత్మగౌరవంతో సుఖ సంతోషాలతో అన్ని వర్గాల వారూ జీవించడానికి కొన్ని సంఘర్షణలు కూడా తప్పవు . ' సంఘర్షణ ' వల్ల కొన్ని జీవితాలు అశాంతికీ , ఒంటరి తనానికీ కూడా గురై , త్యాగాలకు సిద్ధం కావలసి వస్తుంది . వీటి నేపథ్యంగానే స్త్రీ ఉన్నత చదువు , వివాహ వయస్సు , కుటుంబం , లైంగికత్వం , ఆర్ధిక స్వాతంత్ర్యం , ఉద్యోగ నిర్వహణ వంటి అంశాలు ప్రాధాన్యతను వహిస్తుంటాయి . ఇలాగే నవలలో వివిధ పాత్రలు ఒదిగిపోయాయి .
అనిల్ గాడు వెళ్ళి ఇంతవరకు ఆ అమ్మాయి ఆడుకున్న ఆకు తీసి దాచుకో రేపు పెళ్ళయ్యాక తనకి చూపిస్తే ఎంత ఆనందపడుతుంది అని చెప్పాడు . చెప్పాగా మనోడు అసలే అతి రెచ్చిపోయి వెళ్ళి ఆకు తెచ్చేసుకొన్నాడు . దానిమీద వున్నది చదివి మనోడి ఆనందానికి అవధులు లేవు . కాలేజి అయిపోగానే అందర్ని పిలిచి పండగ చేసి పార్టీ ఇచ్చేసాడు . " నన్నే చూస్తూ రాసింది . " అనే గుడ్డి నమ్మకం వాడిది . మరసటి రోజు పద్మ ఒంటరి గా కాలేజి నుంచి ఇంటికి వెళ్ళే దారి లో కలిసి , " నువ్వు మన జీవితం గురించి అస్సలు టెన్షన్లు పెట్టుకోకు . మా నాన్నగారు త్వరలో వాలంటరీ రిటైర్ అయిపోతారు జాబ్ నాకు వచ్చేస్తుంది . మనం హాయిగా ఉండొచ్చు . మీ ఇంట్లో వాళ్ళతో కూడా నేనే మాట్లాడతా " అని చెప్పేసి సిగ్గుపడుతూ వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసాడు . పాపం పద్మకి జార్జిబుష్ తెలంగాణా యాస లో తెలుగుపాట పాడినట్టు ఏమీ అర్ధం కాలేదు . అర్ధమయ్యేటప్పటికి న్యూటన్ కి చెట్టు ఎక్కకుండానే ఆపిల్ దొరికినట్టు , పద్మకి మంచి అవకాశం " రాఖీ పౌర్ణమి " రూపం లో దొరికింది . రాఖీ పౌర్ణమి రోజున పద్మ రాఖీ తొ రక్తసంభందం లో సావిత్రి లా వచ్చేసింది . సునామీ విషయం ముందేతెలిసిన వాతావరణ కేంద్రం డైరెక్టర్ అనౌన్స్ కూడా చేయకుండా వాడే ముందు పారిపోయినట్టు , విషయం ముందే పసిగట్టిన కిషోర్ గాడు చెప్పాపెట్టకుండా పారిపోయాడు . మేము వదులుతామా వెళ్ళి ప్రిన్సిపల్ ని ఆడిగితే M . P . C నుంచి Bi . P . C కి మారిపోయాడు అని చెఫ్ఫారు . అంతే వాడి వెనక మేము , మా వెనక పద్మ సినిమాల్లో చూపించిన రేంజ్ లో చేజింగు . వాడి ఖర్మకి వాడు మేడపైకి పరిగెట్టాడు . పైకి వెళ్ళిన తరువాత పారిపోవటనికి లేదు . అప్పుడు వాడికి ఉన్నవి రెండు అవకాశాలు ఒకటి దిగివచ్చి రాఖీ కట్టించుకోవాలి లేదా దూకి చావాలి . మొదటి దే బెటర్ అని వచ్చి రాఖీ కట్టించుకున్నాడు . ఎలాగు రాఖీ కట్టేసింది కదా నేను మరలా MPC కి వెళ్ళిపోతా అని ప్రిన్సిపల్ అని అడిగాడు . ఈ సారి చెంపలు బొబ్బట్లయ్యాయి . ఆవిధంగా కిషోర్ గాడు మా చేతిలో ఎన్నోసార్లు బకరా అయ్యాడు . అన్నట్టు చెప్పటం మరిచాను మా మాట విని ఒకసారి పద్మ దగ్గరకి వెళ్ళి " పద్మావతి పద్మావతి నీ ఎర్రనిమూతి చూడగానే పోయింది నా మతి నామనస్సు అయ్యింది కోతి " " క్లాసులో నువ్వంటే అందరికీ మంట ఎందుకు వారి తో తంటా నేనుంటాగా నీ వెంట . " ( ఈ కట్టింగు అక్షరాలా మందే ) ఇలాంటి కవితలు చెప్పి అడ్డమైన తిట్లు తిన్నాడు .
@ నేస్తం గారు , మల్లెపందిరి ఉందంటే చాలండీ . . పిచ్చుకలు ఇక వాటి లోపల దూరి ఒకటే అల్లరి చేసేస్తాయి . . . మీ నాన్న గారు వాటికి ధాన్యం కొని మరీ ప్రత్యేకంగా ట్రీట్ చేయటం గ్రేట్ . . . ఇక సెల్ ఫోన్ వాడకం అంటారా . . దాన్ని ఎంత తక్కువ వాడదామకుకుంటే అంత అవసరం పడుతుంది ఎవరికైనా . . . థాంక్యూ . .
ధరలు అదుపులోకి రాలేదు . సరికదా కళ్ళేలు తెంచుకొని ఏ తరగతికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాయి .
" వంద శాతం చేరాక ఇక్కడ దార్ ఏ సలాం అంటే శాంతి వుంటుంది " - సరిగ్గా ఇలాంటి శాంతి కోసమే మన దేశంలో లౌకికవాదులంతా కలిసికట్టుగా ప్రయత్నిస్తున్నారు . మనమేమో పాపం వాళ్ళ శాంతికాముకత్వాన్ని అర్థం చేసుకోకుండా ఆడిపోసుకుంటున్నాం . ఈ టపాని " పురచేతి " వాళ్ళకో , లేక " అరచేతి " వాళ్ళకో పంపించండి . వందశాతం చేసి శాంతి నెలకొల్పటానికి ఇంకా ఏమేం చెయ్యాలో తెలుస్తుంది .
- " ఆర్బిట్రరీగా రూపొందిన లక్ష్యాల్ని పరిశీలించి , వర్గీకరణాదులు చేసి , సామాన్య లక్షణాలను గమనించి , వీలయినంత అనువుగా పొసగే పాదవ్యవస్థాదులను నిరూపించే లక్షణాలను - సూత్రాలను నిష్పన్న పరచవలసి ఉంటుంది . అట్లా నిష్పన్న లక్షణాలననుసరించి లక్ష్యాలు మళ్ళీ విరివిగా వచ్చింతరువాత ఈ లక్షణాలకూ - లక్ష్యాలకూ అవినాభావ సంబంధం సుప్రతిష్ఠితమవుతుంది . అప్పుడు , సాంప్రదాయికంగా అనువర్తిస్తున్న పద్యాల గూర్చి మనకీనాడు కలుగుతున్న ప్రామాణ్యమూ , సులువూ వచన పద్యాల విషయంలో కలుగుతుంది . వచన పద్య ప్రయోక్తకూ - పరిశీలకునికీ సమాన ప్రమాణం ఉండటం వంటివి అప్పుడు కుదురుతయి . "
దీర్ఘకవితైనా , మినీకవితైనా , సరళమైనా , గ్రాంధికమైనా , వచనమైనా , పద్యమైనా , ఏ మాండలికంలో వ్రాసినా హృదయాన్ని తాకే కవిత్వం పదికాలాలు నిలబడుతుంది .
కలహంసల్ సను వాయుమార్గముల రేఖల్ పర్వతాగ్రంబునన్ కల వాత్రోవల దక్షిణోత్తర దిశాగ్రవ్యాప్తముల్ ప్రోన్నతం బులు నీకున్ చనకాదు నిచ్చలు నిలింపుల్ గుంపులై రాకపో కలు గావించెడు వెండికొండ వెరవుల్ కన్పట్టు నైమూలగన్
మొదటి ప్రశ్న : ఇక్కడ కొన్ని జంతువులను ఇచ్చి వాటిని మీకు నచ్చిన వరుసక్రమంలో పెట్టమన్నాను . అవి మీ ప్రాముఖ్యతలు వరుస క్రమం అని అన్వయించుకోండి
వీళ్లందరినీ బతిమాలే బదులు , భా జ పా తో ఓ చిన్న అవగాహనకి వస్తే - - వచ్చే వందేళ్లపాటు అధికారం మనదే కదా అని ఆలోచిస్తూందట - - రాజమాత !
అసత్యమైన ప్రతిదాన్ని చూసి జాగ్రత్త పడు . సత్యాన్ని అంటిపెట్టుకొని వుండు . ఆలస్యమైనా మనం తప్పక జయించి తీరుతాం .
గిరి భయపడ్డట్టు నాన్నగారికి చెప్పలేదు . చెప్పుంటే " హోరి ! వెర్రి కక్కగట్టా ! " అనుండేవారు .
( 2005 తానా సావనీర్ " తెలుగు పలుకు " లోని ఆంగ్ల వ్యాసానికి స్వేచ్చానువాదం . ఉషా ఆరి గారి స్వస్థలము హైదరాబాదు . మొదట పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చదువుకున్నారు . తర్వాత మిచిగన్ యూనివర్సిటీ నుండి సోషల్ వర్క్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు . మానసిక ఆరోగ్యరంగం లో సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నారు . )
చైనా విప్లవ 60 వ వార్షికోత్సవ సందర్భంగా ఆ మహా విప్లవ ఘనవిజయాలలో కొన్నింటిని జ్నప్తికి తెచ్చుకుందాం ! న్యాయదృష్టి , సమత్వ దృష్టితో ఉత్తేజితులైననాడు మనిషి ముందు అవతరించగల మహదవకాశాలను చేపెట్టిన విజయాలవి . మార్క్సిజం - లెనినిజం జనబాహుళ్యం లోకి చొచ్చుకుపోయిననాడు అది చోదక శక్తి కాగలుగుతుందనే దానికి సజీవ నిదర్శనం చైనా విప్లవం ! ఈ మహత్తర ప్రయోగంలో స్వర్గాలు ఒక్కసారిగా తలక్రిందులైనాయి ! ' అనంతులు ' , ' అవినాశులు ' అనిపించుకునే దేవతలంతా కట్టకట్టుకు భూమిపై వాలారు ! పాతుకుపోయిన విలువలు , సాంప్రదాయాలనేవన్నీ పెకళించబడి బూడిదయ్యాయి ! తలక్రిందులుగావ్రేళ్ళాడుతుండిన ఆర్థిక , రాజకీయాల్ని వాటి కాళ్ళపై సవ్యంగా నిలబెట్టడం జరిగింది . ఇలాంటి ఈమహాకల్లోలం ద్వారా , ఈ తీవ్ర అవ్యవస్థ ద్వారా ఒక సముజ్వల నూతన వ్యవస్థకి అంకురార్పన జరిగింది . అదే సోషలిస్టు వ్యవస్థ . ఒక నూతన మానవ సృష్టికి పిండోత్పత్తి ప్రారంభమైంది . ఆమనిషే కమ్యూనిస్టు !
తూర్పు మరియు పశ్చిమ కూడలిలోనున్న లిడ్డర్ నదికి ఇరువైపులనున్న పట్టణాలు ఏవి ?
కిరణ్ గారూ ఇవాళే మీ బ్లాగ్ చూడడం . చాలా ఆనందంగా ఉంది . మేరు పర్వతం గురించి అత్యద్భుతంగా వివరించారు . దీని మీద మీకున్న జిజ్ఞాసకి శతకోటి వందనాలు . మేరు పర్వతం ఎత్తు గురించి , దానిని మనవ అంతరంగంతోను , గుడి గోపురంతోను , బౌద్ధ స్థూపాలతోను చాలా చక్కగా పోల్చారు . మీరేమీ అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా . ఇది నా మనవి మాత్రమే సుమా ! మీరు ఎత్తుని పోల్చినట్టే లోతుని ( 16 , 000 యోజనాలు ) కూడా చక్కగా పోల్చి వర్ణిస్తే చదవాలని ఉంది . ధన్యవాదములు
తేదీ మరియు సమయం : ఆదివారం , జూలై 19 , 2009 సాయంత్రం 3 గంటల నుండి 5 వరకు .
హైదరాబాద్ అభివృద్ధి పేరు మీద చేపట్టిన రోడ్ల నిర్మాణం , రోడ్ల విస్తరణ , విమానాశ్రయం ప్రాజెక్టులు , సెజ్ వంటి కార్యక్రమాల వల్ల తెలంగాణ ప్రజలు భూములు , నీళ్లు కోల్పోయారు . అందుకు ప్రజలకు నష్టపరిహారం ఏమీ లభించలేదు . హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్న ఆంద్ర , రాయలసీమ పెద్దలు వారి కోసం చేసుకున్నారే తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదు .
Shadnagar లో అమ్మకానికి రెసిడెన్షియల్ లాండ్ భూమి & ప్లాట్లు
భార్య చెప్పే మాట లింకేవీ శంకర్ కి వినబళ్ళేదు . కొడుకు క్షేమంగా వున్నాడని తెలిశాక గుండెని పిండేస్తున్న ఉక్కు పిడికిలేదో ఒక్కసారిగా పట్టు సడలించినట్టు , బలంగా ఊపిరి పీల్చుకున్నాడు .
సిరిసిరి మువ్వ పద్యాలు రాసేనాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం రాలేదు . బ్రిటీష్ పరిపాలన తుది దశలో ఉంది . బ్రిటీష్ హయాంలొనే నామమాత్రపు ఎన్నికలు జరిపించే వారు . పేరుకు ప్రజాప్రతినిధులుగా భారతీయులుండేవారు . అపుడే ఎన్నికలు ఎలా ప్రహసనంలా జరిగేవో శ్రీశ్రీ గమనించాడు .
బాబా పిలుపు వస్తేనే షిరిడీ వెళ్ళే అవకాశం , వీలు కలుగుతుందని భక్తుల నమ్మకం . బాబా కృప వల్ల ఆ పిలుపు మాకు మళ్ళీ మరోసారి వచ్చింది . నేను " అవసరం " అనుకున్న ప read more »
96 నిముషాల నిడివి గల ఈ సినిమాలో 92 నిముషాలపాటు 16 అడుగుల వెడల్పు 24 అడుగుల పొడవు గల ఒక చిన్న జ్యూరీరూం లో చిత్రీకరించారు . హత్య జరిగిన ప్రదేశాన్ని కానీ ఆ సన్నివేశాలను కానీ ఎక్కడా మనకు చూపించడు . సినిమా మొత్తం కేవలం సంభాషణలు అభినయంతోనే నింపేశారు కానీ ఎక్కడా ఒక్క నిముషంపాటు కూడా మీకు బోర్ కొట్టక పోగా ఒక్కోక్కరి వాదన వినేకొద్దీ అరే ఇది మనం ఎందుకు ఆలోచించలేదు ఇలా కూడా జరిగి ఉండవచ్చు కదా అని రెట్టించిన ఉత్సాహంతో సినిమా చూస్తాం . ఈ పన్నెండు ముఖ్యమైన పాత్రలు తప్ప మిగిలిన వారెవరూ కనపడకపోగా పాత్రలపేర్లు కూడా మనకి తెలియవు సినిమా చివర్లో కోర్ట్ బయట హెన్రీఫోండా పాత్రపేరు డేవిస్ అని జ్యూరర్ నం 9 పేరు మెక్ కార్డిల్ అనీ మాత్రమే పరిచయం చేస్తారు . జ్యూరీ రూంలో వాళ్ళ వాళ్ల సామాజిక నేపథ్యాన్ని , వృత్తిని బట్టి మాత్రమే వ్యవహరిస్తారు .
రాజీనామాలు ఆమోదం పొందకపోవడం కుట్ర కాంగ్రెస్‌పై బిజెపి ఆరోపణ July 12th , 2011 న్యూస్9 న్యూఢిల్లీ , జూలై 11 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఆప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిథులు చేసిన రాజీనామాలను ఆమోదించ కుండాతాత్సారం చేయడానికి గల కారణాలేమిటో సభాపతులు , ప్రజలకు తెలియచేయాలని బిజెపి డిమాండ్ చేసింది . ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి వారం దాటిపోయినప్పటికీ ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవటం అనేక అనుమానాలకు దారితీస్తోందని పార్టీ అధికార ప్రతినిధి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు . సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం చేపట్టిన ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకుందని అభిప్రాయపడ్డారు . ప్రజల అభిమతానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు రాజీనామా పత్రాలు డిప్యూటీ స్పీకర్‌కు వ్యక్తిగతంగా కలసి అందచేశారని ఆయన అన్నారు . తాము స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారని నడ్డా గుర్తుచేశారు . ఈ ప్రక్రియ జరిగి వారమైపోయినప్పటికీ రాజీనామాలను ఆమోదించకపోవటం విడ్డూరంగా ఉందని ఆయన చెప్పారు . తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు . రాజీనామాలకు సభాధిపతుల ఆమోదం పడకపోవటం వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు . వాజపేయి సారధ్యంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వల్ల మూడుకొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని ఆయన గుర్తుచేశారు . = = = = = = = = = = = = = = = = ఏరాసు , టీజీ ప్రకటనలను స్వాగతించిన విహెచ్ న్యూఢిల్లీ , జూలై 11 : రాష్ట్రంలో మూడు రాజధానులను అభివృద్ధి చేసిన తరువాతే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై దృష్టిపెట్టాలని రాయలసీమ మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి , టీజీ వెంకటేష్ చేసిన ప్రకటనను రాజ్యసభ సభ్యుడు వి . హనుమంతరావు స్వాగతించారు . రాష్ట్రాన్ని విభజించాలని కోరుకుంటున్నవారు , రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటై అవి అభివృద్ధి జరిగిన తరువాతే ప్రత్యేక తెలంగాణ కోరితే సీమాంధ్ర వాసులు బలపరచటానికి సిద్ధంగా ఉంటారని వారు చెప్పటం అభిలషణీయమని విహెచ్ అభిప్రాయపడ్డారు . తెలంగాణ విషయంలో సీమాంధ్రనాయకుల ధోరణిలో మార్పు వస్తోందని అన్నారు .
" మీరు ఇంటికెళ్ళండి . ఆ ప్రిస్క్రిప్షన్ ఇటివ్వండి . నేను పట్టుకొస్తా మందులు . చాలా నీరసంగా వున్నారు . ఎక్కడైనా పడిపోతారు . "
సిక్కిం అధికారిక భాష నేపాలీ . రాజధాని గాంగ్టక్ అన్నింటికంటే పెద్ద పట్టణం . హిందూమతము , వజ్రయాన బౌద్ధము ప్రధానమైన మతాలు . చిన్నదే అయినా సిక్కింలో పలువిధాలైన భూభౌతిక ప్రాంతాలన్నాయి . దక్షిణ ప్రాతం ఉష్ణమండల అరణ్యాలను పోలి ఉంటుంది . ఉత్తర ప్రాంతం టుండ్రాలలాగా ఉంటుంది ప్రపంచంలో 3వ ఎత్తైన శిఖరంగల కాంచనగంగ పర్వతం సిక్కిం , నేపాల్లలో విస్తరించి ఉంది . ఎంతో ప్రకృతి సౌందర్యాలను ఒనగట్టుకొన్నందువల్లా , ప్రశాంత రాజకీయ స్థిరత్వం వల్లా సిక్కిం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది .
ఎమె . అవునూ , కాదూ ! ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సాంఘిక సంక్షేమ పథకాలూ , ఉచిత వైద్య వసతుల వల్ల ఈ తెగలు అంతరించి పోకుండా ఉన్నాయి . కానీ ఈ తెగలవారి పిల్లలు అందరిలానే నూతన విద్యావిధానాలలో ప్రవేశించడంతో , వారి సొంత భాషల్ని క్రమేణా కోల్పోతున్నారు . ఎవరూ వాటి రక్షణ గురించి శ్రద్ధ చూపలేదు . ఈ మధ్యనే శ్రీ పేరి భాస్కరరావు చాలా శ్రమతో ఈ భాషల్ని కంప్యూటరైజ్ చేస్తున్నారని విన్నాను .
అవునా మిగతాది కూడా చదివితే మీకు అవునో కాదో తెలుస్తాది .
" మీ నాన్న కోసమా ? " రాజు మనసులో ఏవేవో జ్ఞాపకాలు మెదిలాయి . ఒక్క క్షణం గొంతు పూడుకుపోయినట్టయింది . ఎలాగో సంబాళించుకుని , " ఫర్వాలేదులే . షాపు వాళ్ళు అమ్మరని మీ నాన్నకి చెప్పు , " అన్నాడు .
Object / objective అంటే ఏమిటి ? ఆలోచించే , ఊహించే మనసుకు బాహ్యమైనది ; భౌతికమైనది ; లక్షణాలను , విశేషాలను ఆపాదించవచ్చును ; ఆరోపించవచ్చును . ఉదా : - కాయితంపై చిత్రకారుడు వేసిన ఒక బొమ్మ . చిత్రకారుని ఆలోచనలకు , ఊహలకు బాహ్యరూపం . ఇంకా , చెట్లు , పుట్టలు , కొండ , నీరు , పక్షి , మొదలైనవి .
మల్లికార్జున రాయలును , అతని పినతండ్రి కొడుకును విరూపాక్షరాయలు , ఇతనిని ఇతని పెద్ద కొడుకు , ఈ పెద్ద కొడుకును తమ్ముడు ప్రౌఢ రాయలు , ఇతనిని సాళువ నరస నాయకుడూ చంపి రాజ్యధికారాలను హస్తగతం చేసుకున్నాడు . ఈ రక్త చరిత్రను అన్నమయ్య చూశాడు . అధికారం కోసం , అందలం కోసం హత్యలకూ వెనుకాడని రాజుల దుర్మార్గాలను సహించలేదు అన్నమయ్య .
ఇలా లోపలికి తీసుకెళ్ళిన సారాయి మన కళ్ళముందే దేవుడికి పట్టిస్తారు . లోపల దేవుడి నోటి దగ్గర చిన్న చీలక వుంటుంది . అందులో ఒక ప్లేటు లాంటిది పెట్టి సారాయి ( నీటే . . ! ) పోస్తారు . మన పానకాల స్వామిలాగ ఈయన మందు మొత్తం లోపలికి తీసుకుంటాడు . ( మన పానకాల స్వామి కొంచెం వెనక్కి ఇస్తాడని ప్రతీతి . ఇక్కడ అదీ లేదు . పోసేటప్పుడే కొంచెం మిగిల్చి తీర్థంగా తిరిగిస్తారు )
@ జయ @ ఉష ధన్యవాదాలు నా ఆవేదన పంచుకున్నందుకు . @ పవన్ మీ నవ్వు నాకు అర్ధం కాలేదు . . మేక్ఇట్ క్లియర్ @ భా . రా . రే నేనొప్పుకోను నో కామెంట్ అంటే . . హమ్మ యెంత ' ధైర్యం ' నా బ్లాగ్ లోకి వచ్చి చదివి వురకనే వెళ్ళిపోతారా . . - : )
ఇంట్రస్ట్ అని కూడా కాదు గానీ అవి మిగతావాళ్ళకు చెబుతుంటే సరదాగా ఉండేది . వాళ్ళు ఇంప్రెస్ అయిపోతున్నట్టు వాళ్ళ మొహాల్లో తెలుస్తుండేది .
జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కున్దప్రసూనాయితాః । స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితా యా ఇన్ద్రనీలాయితాః ముక్తాస్తాశ్శుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః । । జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః న్యస్తాః రాఘవమస్తకే చ విలసత్ కున్దప్రసూనాయితాః స్రస్తాః శ్యామలకాయకాన్తికలితాః యాః ఇన్ద్రనీలాయితాః ముక్తాః తాః శుభదాః భవన్తు భవతామ్ శ్రీరామవైవాహికాః జానకి యొక్క కమలములవలె అమలములైన దోసిళ్లలో ఏవైతే పద్మరాగాలైనాయో , రాఘవుని మస్తకమునందు ఉంచబడినవై ఏవి కుందప్రసూనాలలాగ విలసిల్లాయో , తలపైనుండి జారి ఆ రాముని శ్యామలకాయకాంతితో కలిసినవై ఏవి ఇంద్రనీలాలయ్యాయో , ఆ శ్రీరామవైవాహికములైన ముత్యాలు మీకు శుభాలని ఇచ్చేవి అగుగాక . న్యస్తాః + రాఘవమస్తకే = న్యస్తా రాఘవమస్తకే స్రస్తాః + శ్యామలకాయకాన్తికలితాః = స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితాః కలితాః + యాః = కలితా యాః యాః + ఇన్ద్రనీలాయితాః = యా ఇన్ద్రనీలాయితాః ముక్తాః + తాః = ముక్తాస్తాః తాః + శుభదాః = తాశ్శుభదాః శుభదాః + భవన్తు = శుభదా భవన్తు
ధర్మరాజు " పితామహా ! నాకు దానము దాని మహిమ గురించి వివరించండి " అనీడిగాడు . భీష్ముడు " ధర్మనందనా ! మంచి పాలిచ్చే పాడి ఆవును ఒక సందబ్రాహ్మణుడికి దానంగా ఇస్తే ఆ ఆవుకు ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తారు . అతడికి అటు ఏడుతరాలు ఇటు ఏడు తరాలు సద్గతులు పొందుతారు . గోదానము కాక ఇతరదానములు కూడా చెయ్య వచ్చు . కన్యాదానము , భూదానము , గృహదానము , కనకదానము , అన్నదానము , జలదానము , వస్త్రదానము , శయ్యాదానము , ఆసనదానము , వాహనదానము మొదలైనవి సద్బ్రాహ్మణులకు దానంగా ఇస్తే ఇహ లోకములోను , పర లోకములోను సుఖములు అనుభవిస్తాడు . కాని ధర్మనందనా ఎవరైతే దానము కొరకు తన వద్దకు వచ్చినప్పుడు అతని మనోరధము ఎరిగి అతడికి కావలసినది దానంగా ఇస్తే అది అత్య్త్తమ దానము ఔతుంది . భయంతో ఉన్న వాడికి అభయం ఇవ్వడం అన్నింటికంటే శ్రేష్టమైనది . యుద్ధములో ప్రాణములు దానంగా ఇవ్వడం ఉత్తమోత్తమం . శత్రువు ఎటువంటి వాడైనా అతడు శరణు కోరినప్పుడు ప్రసన్నమైన మనసుతో అతడి కోరిక తీర్చిన వాడు పురుషోత్తముడు అని అంటారు . భార్యా బిడ్డలను పోషించ లేక బాధపడుతున్న వాడికి సాయం చెయ్యడం అతడి దుఃఖాన్ని పోగొట్టడం అత్యంత గొప్ప గుణం . తన భార్యను తప్ప అన్య కాంతలను యజ్ఞ యాగములు చెయ్యడంలో ఆసక్తి కల వారు , అటువంటి సద్బ్రాహ్మణులను వెతికి వారికి దానం చెసిన వాడు మూడు లోకములలో పూజ నీయుడు " అని భీష్ముడు చెప్పాడు .
నా చిన్నప్పుడు మా ఇంట్లో ప్రభ వచ్చేది . నాకు భూమి ఇష్టం లేదు కాని కేవలం మల్లిక్ గారి చిట్టి కోసం చదివేవాడిని లైబ్రరీలో . అదే తరహాలో ఇప్పుడు ఈనాడు ఆదివారంలో బాలల పేజీలో వచ్చే కార్టూన్ కూడా బాగుంటుంది . సోవియట్ భూమి కాగితాన్ని దీపావళికి సిసింద్రీలు తయారు చేయడానికి వాడేవాళ్ళం . నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం పుస్తకం గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు . ఆ పుస్తకాన్ని చాలాసార్లు చదివాను .
ఇంకొకాయన అన్నట్టు జన్య రాగం ముందు ఉండి జనక రాగం తర్వాత పుట్టడం లో అసంబద్ధత ఏమీ లేదు . ఉన్న రాగాల్ని categorize చెయ్యడానికి , అర్థం చేసుకోటానికి మనం కల్పించుకున్న formulaలు జనక రాగాలు . జగమెరిగిన సత్యాల్ని science కోడీకరించినట్లు .
ఆరు నెలలపాటు సాగిన తీవ్ర వాదోపవాదాల మధ్య ఈ గ్రూప్ ఏర్పాటు పై ఆగస్ట్ 7 , 1992 నాడు వోటింగ్ ముగిసింది . 338 మంది అనుకూలంగా వోటు వేస్తే , 103 మంది వ్యతిరేకించారు . ఆగస్ట్ 15 , 1992 నాడు తెలుగు న్యూస్‌గ్రూపుగా soc . culture . indian . telugu ఆవిర్భవించింది .
హామీలు మరచిన సర్కారు నేడు గ్రామ సేవకుల కలెక్టరెట్ల్ ముట్టడి
పాపం రాత్రంతా దగ్గుతూనే ఉందామె . ఇంటి పనులని పనిమనిషి చేత చేయించుకోమని ఎన్నో సార్లు భార్యతో అన్నాడు బిషన్‌సింగ్ . ' పనామె రోజుకి రెండు సార్లు వస్తుంది . ఆమేమీ ఊరికే పనిచేయడం లేదు కదా , జీతం తీసుకుంటోంది కదా ! కాని సుఖవంతికి ఇవేవి పట్టవు . ఎప్పుడూ చలిగాలిలోనే ఉంటుంది . నీళ్ళు పడుతుంది , గిన్నెలు సర్దుతుంది , తడిగుడ్డతో ఇల్లు తుడుస్తుంది , లేదంటే బట్టలు ఉతుకుతూ కూర్చుంటుంది . ఇదివరకులా కాదు కదా , వయసైపోయింది . ముసలితనం మీద పడుతోంది . తొందరగా జలుబు చేసేస్తోంది . కాని ఈవిడ మాట వినదు … ' అంటూ భార్య గురించి తనలో తానే మాట్లాడుకున్నాడు బిషన్ సింగ్ .
రచయిత , పత్రికా సంపాదకుడు , సాహితీ విమర్శకుడు తాపీ ధర్మారావు . వెంకటకవి విజయవిలాసానికి హృదయోల్లాసమైన వ్యాఖ్యను రాసి తెలుగు సాహిత్యంలో విశిష్టతను సాధించిన తాపీ వారి వాణి . ( 1ని . 56సె )
వుత్తరాంధ్ర , కోస్తా ఆంధ్ర , రాయల సీమ ప్రజలకూ … ఆత్మ , గౌరవం వుంటుందికదా . వారికీ న్యాయబద్ధమైన కోరికలు సమైఖ్య రాష్ట్ర పౌరులుగా వారి హక్కులు ఎవరూ కాదన లేనివికదా ! . సమైక్య రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వుండాలన్న వారి కోరికలో న్యాయబద్ధ కారణాలు అనేకం వారూ చెప్ప వచ్చు కదా ?
కానీ ఈ పాటా , దీనిలోని ఫిలాసఫీ చాలా డిఫరెంట్ . ( తెలుగుభాషలో వేరే పదాలు వాడటం నచ్చనివారికి మినహా ఇస్తే , ఈ పాట నిజానికి చాలా బావుంది . భావం చాలా బావుంది . తెలుగు పదాలనే వాడాలను కోవటం , మడి ఆచారం లాంటిది . తడిగుడ్డలతో కంటే పరిశుభ్రంగానూ , ఆందంగానూ ఉండి దేవుడిని ఆరాధించొచ్చు . పూర్వ కాలంలో అది శుభ్రతేమో కానీ , ఇవాల్టి రోజు , అలా పాటించే ఇల్లే అపరిశుభ్రంగా ఉంటున్నాయి నాకు . )
కష్టం కాలం సుఖం కన్నీరు ఉప్పెనలా ఉప్పొంగి , ఈ క్షణాన్ని ముంచెత్తింది , కొట్టుకుపోతున్న సమస్తంలో , మరో క్షణం కలిసిపోయింది . శిధిలాల నడుమ , కాలం ఒంటరిగా మిగిలింది , కొనప్రాణం మిగిలి ఉన్న సెకను ముళ్ళు , దేకుతూ పాకుతూ , నిమిషాల ముళ్ళును నెట్టింది , నెమ్మదిగా కదిలిన నిమిషం , మెలమెల్లగా సత్తువను కూడగట్టుకుని , గంటల ముళ్ళుతో జతకట్టింది . ఇక అంతే , సెకను వెనుక నిమిషం , నిమిషం వెనుక గంటలు , పరుగులు పెడుతూనే ఉన్నాయి . కష్టం , కాలం , సుఖం … Continue reading →
' సంస్కృతం మృతభాష కాదు సంజీవని ' అని నిరూపించారు నేటి అధునాతన మహిళలు . నేడు హైటెక్ నగరంలో వీకెండ్స్‌లో మందుకొట్టే వాళ్లు కొందరైతే , సంస్కృతాన్ని నేర్చుకుందాం , సంస్కృతిని కాపాడుదాం అని కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగినులు . . . ఇంకా చదవండి
విప్లవంలో సాహిత్యం విప్లవకారుల చేతుల్లో ఆయుధంగా ఉండాలి అనే స్పష్టమైన వైఖరి కొ . కు . విరసం దశాబ్దంలోనే తీసుకున్నారు . కొ . కు . సాహిత్య విమర్శలో 1970 ముందూ , తర్వాతా చాలా మార్పు ఉంది . విరసానికి పూర్వం కొ . కు . సాహిత్య విమర్శ కొ . కు . సాహిత్యానికి విమర్శ వంటిదే . విరసం దశాబ్దిలో కొ . కు . సాహిత్య విమర్శ మార్క్సిస్టు సాహిత్య విమర్శగా స్పష్టంగా ఉంది . విరసం తెలుగు సాహిత్య విమర్శలో సాధించిన మార్గదర్శక సూత్రాల్ని నిర్మించింది కుటుంబరావే …
* ఇన్నయ్య గారి నమ్మకాలకీ వారి కుమారుడి నమ్మకాలకూ లంకె కలిపి అడగటం ఎక్కడి సహేతుకమో నాకు అర్థం కాని విషయం . ఈ విషయంలో ప్రవీణ్ కూ వీళ్ళకూ పెద్ద తేడా కనిపించడం లేదు . * దీనికి వేంకటరమణ గారు సమాధానం ఇచ్చెశారు . కాని మీరు ప్రవీణ్ ను వీరిద్దరి తొ కాదు పోల్చవలసినది ప్రఖ్యాత హేతువాదులతో వాదులతో పొల్చి ఉండవలసింది . వీరిద్దరు ఇలాగె మొండిగా వాదిస్తారు . మహేష్ ఊరికినె టైంపాస్ కొరకు ఇక్కడ చర్చ కి రాలేదు అందరు . వీరు చేపట్టె పనులు వాదనల స్థాయి దాటి కుల వృత్తులు చేసుకొనేవారిని దెబ్బ తీసెవరకు వచ్చాయి . వారిని అందరిలో తెలివి లేని దద్దమ్మలు గా చిత్రికరించటాన్ని బట్టి వీరికి ఇతరూల మీద ఎంత అసహనం ఉందొ తెలుస్తుంది . కాని వీరు దానికి పేట్టుకున్న పేరు మానవతా వాదం .
ఒక విషయం చెప్పండి ! 9వ శతాబ్దం దాకా సున్నా అంటే ఏమిటో తెలియకుండానే మనవాళ్ళు జ్యోతిశ్శాస్త్రాలు రాసేశారా ? వేదిక గణితం కనుక్కున్నారా ? యజ్ఞాల కోసం వైదిక రేఖాగణితం కనుక్కున్నారా ? సున్నా అంటే ఏమిటో తెలియకుండానే మన వాళ్ళు రెండేళ్ళ తరువాత రాబోయే గ్రహణాన్ని సెకండ్లతో సహా లెక్కగట్టి తెలుసుకునే పద్ధతి గురించి తెలియజేశారా ? ఎందుకు బాబూ మీరు తెల్లవాళ్ళ కుట్రలో పాలుపంచుకుంటారు , బాబిలోనియా మధ్య ఆసియా అంటూ దిక్కుమాలిన అనాగరిక జాతులకి మన పూర్వీకుల్ని అన్యాయంగా దాసోహం చేస్తారు ?
కామెంటిన అందరికీ నెనరులు . రవిగారికి ఒకటి , రాకేశ్వరగారికి రెండూ వీరతాళ్ళు ! సినిమాపాటలు ఇద్దామనుకున్న వెంటనే గుర్తుకొచ్చింది కన్నెపిల్లవని పాటే . అయితే అందులోనే తననలు ఉన్నాయి కాబట్టి అది మరీ సులువైపోతుందని వదిలేసాను . ఆ వెంటనే గుర్తుకొచ్చింది " తకిట తధిమి " . తర్వాత పాట అదే సినిమాలోది దానంత సులువుగా తెలియనిది ఇద్దామని " వేదం అణువణువున నాదం " పాట ఇచ్చాను . రాకేశ్వరగారు , మీ జానుతెలుగు పలుకులు హాయిగా ఉన్నాయి . మీరు వ్రాసిన రెండు పల్లవులను అసలు పాటల ట్యూనులో పాడుకుని రెండిటిలో ఏది ఎక్కువ బాగుందో , ఎందుకనో , చెప్పండి చూద్దాం ? గ్రాఫుల గురించి : Pattern చూపించడం ముఖ్యమని అక్షరాలని చుక్కలతో గుర్తించ లేదు . ఈమారు పెట్టి చూస్తాను . హిస్టోగ్రాములు మొదట ప్రయత్నించాను కాని అందులో pattern అంత బాగా కళ్ళకి కనిపిస్తున్నట్టు అనిపించ లేదు . మీ వృత్తాల టపా చూసిన గుర్తులేదు కాని తక్కినవన్నీ చదివాను . మీరు x - axisలో పదాలని తీసుకున్నారు . ఈ పద్ధతిలో పరిమితి ఏమిటంటే ఇందులో పద్యాలని ( నిర్మాణ స్థాయిని ) చూపించడమే సాధ్యమవుతుంది . ఛందస్సు ( నిర్వచనం / నమూనా ) చూపించలేము , అందులో పదాల ప్రసక్తి ఉండదు కాబట్టి . అయితే మీరు చూపించిన విధానాన్ని మరో రకంగా వాడుకోవచ్చని ఆలోచిస్తున్నాను . చూడాలి , అది ఎంతవరకూ వీలవుతుందో !
మీ అభిమానం ఎంతంటే . . ఆకాశమంత అంటున్నారు వైఎస్‌ఆర్ అభిమానులు . తమ ప్రియతమ నేతను , జన హృదయ విజేతను నిత్యం స్మరించుకునేలా ఊరి మధ్యలో ఆయన విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారు . ఎవరైనా ఒక రాజకీయ నాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహజంగా ఆ పార్టీకి చెందిన వారు మాత్రమే ముందుకొస్తారు . కానీ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు విరాళాలు పోగుచేసి మహానేత విగ్రహాలు పెట్టుకున్నారు . తమ జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తికిచ్చే నివాళిగా భావించారు . వైఎస్‌ఆర్ వల్ల లబ్ధిపొందిన ప్రతి పల్లె ఆయన విగ్రహాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చింది . ఒకదానిని మించింది మరొకటి . . . ఆ మహానేత నిలువెత్తు రూపాన్ని కళ్లకు కట్టినట్లు రూపొందించిన విగ్రహాలను ఏర్పాటు చేశారు . జిల్లాలో ఏర్పాటు చేసిన వాటిలో ఎత్తయిన విగ్రహాలపై ' న్యూస్‌లైన్ ' కథనం . . న్యూస్‌లైన్ , నెట్‌వర్క్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై జిల్లా ప్రజలు కొండంత అభిమానాన్ని చూపుతున్నారు . ఆరాధ్య దైవంగా భావిస్తూ ఊరూ వాడా విగ్రహాలు ఏర్పాటు చేసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు . కుగ్రామాల్లో సైతం రెండేసి , మూడేసి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు . పీసీపల్లి మండలం నేరేడుపల్లెలో వృద్ధాప్య , వికలాం గ , వితంతువులు తమకు నెలనెలా వచ్చే పింఛన్ల నుంచి కొంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చి వైఎస్‌ఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం గమనార్హం . గిద్దలూరు , మార్కాపురం , ఎరగ్రొండపాలెం , కనిగిరి , దర్శి , అద్దంకి నియోజకవర్గాల్లోని దళితుల కాలనీల్లో చాలాచోట్ల ఏర్పాటు చేసిన విగ్రహాలను కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు . అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు గ్రామంలో కారసాని శివశంకరరెడ్డి , అట్లా చినవెంకటరెడ్డిల ఆధ్వర్యంలో 18 అడుగుల వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు . అదే మండలంలో ఏల్చూరు గ్రామంలో తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు . అద్దంకి ఎన్టీఆర్ నగర్‌లో వడ్డెర సంఘం నేతలు , జిల్లా కాంగ్రెస్‌పార్టీ కార్యదర్శి గుంజి ఏడుకొండలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహాన్ని సుందరంగా తీర్చిదిద్దారు . కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం బసిరెడ్డిపాలెంలో 12 అడుగుల ఎత్తున్న వైఎస్‌ఆర్ ఫైబర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు . మోచర్లలో తొమ్మిది అడుగుల విగ్రహం , లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెంలో తొమ్మిది అడుగులు , ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో 8 అడుగుల ఎత్తున కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేశారు . సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు మండలం గురవారెడ్డిపాలెంలో 12 అడుగుల వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు . సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలో 10 అడుగుల వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు . నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు , నాగులుప్పలపాడు , బి . నిడమానూరు , ఉప్పుగుమండూరు గ్రామాల్లో 9 . 5 అడుగుల ఎత్తున వైఎస్‌ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశారు . ఉప్పుగుండూరులో ఏర్పాటు చేసిన విగ్ర హం చుట్టూ గోపురంలా నిర్మించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు . కొండపి నియోజకవర్గం కట్టుబడిపాలెం బస్టాండు సెంటర్‌లో 12 అడుగుల ఎత్తున వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు . గిద్దలూరు నియోజకవర్గంలో మొత్తం 18 విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు . కంభంలోని కందులాపురం సెంటర్‌లో వైఎస్‌ఆర్ విగ్రహం 11 అడుగుల ఎత్తున ఏర్పాటు చేశారు . రాచర్ల మండలంలోని మేడంవారిపల్లె , పలుగుంటిపల్లె , ఒద్దులవాగుపల్లి , అర్ధవీడు మండలంలోని మొహిద్ధీన్‌పురం , బోగోలు , కాకర్ల - 2 , నాగులవరం , వీరభద్రాపురం , కంభం మండలంలోని హజరత్‌గూడెం , బేస్తవారిపేట గ్రామం , బేస్తవారిపేట జంక్షన్ , కోనపల్లె అడ్డరోడ్డు , చిన్న ఓబినేనిపల్లె గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహాలు 7 . 6 అడుగుల ఎత్తులో ఉన్నాయి . రాచర్ల మండలంలోని పలుగుంటిపల్లెలో విగ్రహం చుట్టూ పెద్ద ఎత్తున అరుగు నిర్మించి వైఎస్‌ఆర్ రచ్చబండగా గ్రామస్తులు నామకరణ చేసుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు . కనిగిరి చెక్ పోస్టు సమీపంలో డీకే రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 . 5 అడుగుల ఎత్తులో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు . దీనికి సంబంధించిన దిమ్మెను కూడా 10 . 5 అడుగుల ఎత్తులో నిర్మించారు . స్థానిక కంభం రోడ్డులో మార్కెట్ యార్డు సమీపంలో రిటైర్డ్ సహాయ సాంఘిక సంక్షేమాధికారి ఆవుల తిరుపతిరెడ్డి వైఎస్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు . అందులో 9 . 5 అడుగుల ఎత్తు ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్మృతివనంగా మార్చారు . వైఎస్ బాల్యం నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయన జ్ఞాపకాలను ఫ్లెక్సీలలో ముద్రించి స్మృతివనంలో ఆకర్షణగా ఏర్పాటు చేశారు . ద ర్శి గడియార స్తంభం సెంటర్‌లో 10 అడుగుల వైఎస్‌ఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు . ముండ్లమూరు మండలం పసుపుగల్లు , ఉల్లగల్లు , తాళ్లూరు వెల్లంపల్లి గ్రామాల్లో 10 అడుగుల విగ్రహాలు ఏర్పాటు చేశారు . దర్శి మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో మందిరాన్ని నిర్మించి అందులో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు . దర్శి పంచాయతీలోని చింతలపాలెంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్ర హం చుట్టూ వనం పెంచడానికి కొంత స్థలం కేటాయించారు . చీరాలలో 10 అడుగల వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని స్థానిక కారంచేడు గేటు సెంటర్‌లో జేఎంజే యూత్ వారు ఏర్పాటు చేశారు . ఇక్కడ ఏర్పాటు చేసిన ఎనిమిది విగ్రహాల్లో జేఎంజే యూత్ ఏర్పాటు చేసిన విగ్రహం పెద్దది . మార్కాపురం , యరగ్రొండపాలెం నియోజకవర్గాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన మహానేత విగ్రహాలను ఈ నెల 9 , 10 తేదీల్లో వైఎస్ జగన్ ఆవిష్కరించారు . మర్కాపురంలోని గడియారం స్తంభం వద్ద వైఎస్‌ఆర్ తొమ్మిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు . 6 అడుగుల ఎత్తులో దిమ్మెను ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు . పూలు , పండ్ల వ్యాపారులు ప్రతిరోజూ ఉదయాన్నే విగ్రహాన్ని శుద్ధిచేసి వివిధ రకాల పూలతో అలంకరిస్తున్నారు . యరగ్రొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలంలోని హనుమాన్ జంక్షన్ ( కుంట ) నాలుగు కూడళ్ల మధ్యలో ప్రతిష్ఠించిన 9 అడుగుల వైఎస్‌ఆర్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . పెద్దదోర్నాలలో 5 అడుగుల దిమ్మెపై తొమ్మిదిన్నర అడుగుల వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు . చింతల ఆగ్రహారంలో వైఎస్‌ఆర్ విగ్రహానికి ప్రత్యేకంగా మండపాన్ని నిర్మించి ఆ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు . యరగ్రొండపాలెం బస్టాండ్ సెంటర్‌లో ఆరున్నర అడుగుల దిమ్మెపై 9 అడుగుల ఎత్తున వైఎస్‌ఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు . త్రిపురాంతకం మండలంలో 8 అడుగుల దిమ్మెపై 9 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు . ఈ విగ్రహానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక లైటింగ్‌తో ఆ ప్రాంతం రాత్రి పూట శోభాయమానంగా కనిపిస్తోంది .
కనుక వ్యతిరేకంగా వోటు వెయ్యకపోయినా , కనీసం అసలు వోటు వెయ్యకుండా ఉండవలసినది !
ప్రధానంగా గ్రాంథిక వ్యవహారిక వాదాల వలన ఇరవయ్యో శతాబ్దంలో తెలుగు భాషకు చాలా మేలు జరిగిందని చెప్పవచ్చు . గురజాడ అప్పారావు గారి ' ఆధునికాంధ్ర రచన ' పానుగంటి వారి ' గ్రామ్యవాద విమర్శనం ' మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గ్రామ్యమా ? గ్రాంథికమా ? మొ | | రచనలు వ్యవహారిక భాషా వాదానికి సహాయకారులుగా నిలిచాయి .
చలం గారి గూర్చి చాల చీప్ గా అర్థం చేసుకొని రాసారండి చలం గారు అమ్మాయిలు అందంగా ఉన్నారంటే , వాళ్ళని కామించారని ఎలా అనుకొంటారు ? ఎంతమంది స్కూల్ పిల్లలని ఆయన సేడ్యుస్ చేసినట్టు మీ దగ్గర రుజువు ఉన్నదండి ? పువ్వు అందముగా ఉన్నదనుకోవటానికి నలిపి వెయ్యలనుకోవటానికి తేడా లేదా ? చలం మందు బాబు అని మీకు ఎవరు చెప్పారు ? ఆయన మధువు ముట్టలేదు . మాంసం మాత్రమే తిన్నారు . ఆయన వద్దకు వచ్చిన స్త్రీ లను , కోరిన స్త్రీలను మాత్రమే ఆయన జీవితం లోకి ఆహ్వానించారు . ఆయన ఎప్పుడూ వ్యభిచరించ లేదు . దానిని ప్రోత్సహించ లేదు . ఆయన దృష్టిలో వ్యభిచారం అంటే ' తాళి కట్టిన భార్య తప్ప వేరే వారితో ఉండటం ' కాదు . మనసు పడని , ప్రేమించని వారితో ఉండటం . అది భార్య కావచ్చు బయట వారు కావచ్చు .
మొన్న 28 వ తారీఖున ( అదే రోజున నేనూ , మా ఇంటావిడా ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటూ 39 ఏళ్ళు పూర్తిచేశాము లెండి ! మమ్మల్ని చూసే బాపుగారు మాకు ఆ కార్టూన్ ఇచ్చారు ! ) . ఎలాగూ ముఖపరిచయం ఉందికాబట్టి , ( ఛస్తారేమిటీ , ఆ బిల్డింగులో పైనే ఉంటుండబట్టి , ప్రతీ రోజూ నా మొహమే చూస్తూంటారు ! ) , అక్కడుండే సేల్స్ గర్ల్స్ నాదగ్గర సంతకం కూడా తీసికోరు . మళ్ళీ అదో స్టైలూ ! ఆ రోజునకూడా , మామూలుగానే , సరుకులు తీసికుని , కార్డిచ్చాను , సరుకులు తీసికుని వచ్చేశాను . మా ఇంటావిడకి తెలియకూడదుగా , అసలే ఖంగారూ .
విజయ్ గారు , మీరు తప్పుగా ఏమీ మాట్లాడలేదు / ప్రస్థావించనూ లేదు . కాకపోతే అర్దం చేసుకునే వారిని మీరు దృష్టిలో ఉంచుకోకుండా , మీకు తెలిసిన విషయాలను నిర్బయంగా తెలియజేయండి . అంతే మనకు కావలసినది .
వీటిల్లో ఏ ఒక్కటైనా గౌతమిలో వుండి వుంటే ఈ ప్రమాదంలో ఇంత మంది చనిపోయేవారా ? ఖచ్చితంగా కాదు . మన అధికారులకు , నాయకులకు ఇలా ఒకన్ని చూసి నేర్చుకునే అలవాటు లేదు . తమకుగా తెలుసుకోరు .
బెంగాల్ కు చెందిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది . ఆయన విద్యా సంపద , దయాగుణం చూసి అచ్చెరువొందని వారు లేరంటే అతిశయోక్తి కాదు . బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ప్రముఖ పాత్ర పోషించారాయన . అప్పట్లో ఆయన బ్రిటీష్ ప్రభుత్వం నిర్వహించే ఒక సంస్కృత కళాశాలలో సంస్కృతం బోధించేవారు . ఒకసారి ఆ సంస్థలో ఒక ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఖాళీ ఏర్పడింది . ఆ ప్రిన్సిపల్ అందుకు విద్యాసాగర్ సరైన వ్యక్తి అని అనుకున్నాడు . కానీ విద్యాసాగర్ అందుకు [ . . . ]
బీదలపాట్లు బీదలవే అన్నట్టు వారిని పట్టించుకునే నాధుడే లేకుండా అయ్యాడు . ప్రతి సంవత్సరం కొంత మంచి , కొంత చెడు జరుగుతాయి , కానీ ఈ సారి ఎటువంటి చెడు జరగకుండా మనమంతా కలిసి మెలిసి ముందుకు సాగాలని , ముందు తరాలవారి కోసం పచ్చదనాన్ని కాపాడుతూ , సాటివారికి కష్టంలో సాయం చేస్తూ , యుద్దాలన్నీ ఆగిపోయి , ప్రపంచ శాంతి అనే మాట వినడమే కానీ నిజంగా ప్రపంచ శాంతి నెలకొనాలని మనసారా కోరుకోవడంలో తప్పు లేదుగా ! అందుకని శ్రీఖర నామ ఉగాది అందరికీ సంతోషాన్నిచ్చి , ఏ సమస్యలు లేకుండా ప్రశాంతంగా గడవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ … … . . దుర్గ
సుధాకర్ గారూ , చక్కగా చెప్పారు . ముందు స్త్రీని గౌరవించడం ఇంటినుండి ప్రారంబించాలి . మహిళా దినోత్సవమని చంకలు గుద్దుకొని , సభలు పెట్టి సత్కరించుకోవడమే తప్ప పల్లెల్లో , బడుగుల్లో దీనంగా విలపిస్తున్న స్త్రీల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు ? ఇప్పటికీ పల్లెల్లో బార్య తన ఆస్తి ( బానిసత్వపు రోజుల్లో బానిస ఆస్తి అయినట్లు ) అని భావించుకొనే ప్రభుద్దులూ , అదే నిజమై నమ్ముతున్న అబలలూ వున్నారు . తాడేపల్లి గారూ ఏ మాట చెప్పినా మీరు విప్లవాత్మకంగా చెబుతారండీ . " స్త్రీలకి రిజర్వేషనిస్తే పురుషులకి నష్టం జరుగుతుందని మర్చిపోవద్దు . " మన ఇంట్లో తండ్రి పెత్తనమున్నందుకు జరగని నష్టం తల్లికి పెత్తనమిస్తే జరుగుతుందంటారా ? " 50 శాతం రిజర్వేషనిస్తే స్త్రీలు బ్రూట్ మెజారిటీతో తమకి అనుకూలంగా నిరంకుశ చట్టాలు చేసుకుంటూంటే మనం గుడ్లప్పగించి చూడాల్సి వస్తుందని తెలుసుకోండి . " ఇప్పుడు మగవాళ్ళు 90శాతం కంటే ఎక్కువ వుండీ పరిపాలిస్తున్నా బ్రూట్‌గా మహిళలు పాలించగలరంటారా ? " ఇప్పటికే 498 - అ డొమెస్టిక్ వయొలెన్స్ చట్టాల మూలంగా అన్యాయంగా కేసుల్లో ఇరుక్కుని లాకోలేక పీక్కోలేక చస్తున్న అభాగ్యుల గురించి మీకు తెలిస్తే మీరు అవాక్కయిపోతారు . " వీటి గురించి తెలుసుకొంటే గానీ తెలవవు . స్త్రీల పట్ల రోజూ జరిగే దురాగతాలు తెలుసుకోవాల్సిన శ్రమ లేకుండానే మనకు రోజుకెన్ని చేరిపోతున్నాయో ! - - ప్రసాద్ http : / / blog . charasala . com
ఈ కేసు తొందరగా వదిలించుకుంటే మంచిదనిపింది మళ్ళీ వారమే సోమవారం మధ్యాహ్నానికి వాయిదా పెట్టినాడు జడ్జీ గారు .
పిట్ట మాటలు వినగానే ఆగుంపులోని కోతికొకదానికి విపరీతమైన కోపం వచ్చింది . " నువ్వా , మాకు చెప్పేది ? ! మేమేం చెయ్యాలో మాకు తెలీదనుకుంటున్నావా ? ! " అని అది పిట్టను వెక్కిరించింది . అంతలోనే అది గబుక్కున దాని మీదికి దూకి , దాన్ని పట్టుకొని , నేలకు కొట్టి చంపేసింది .
శరీరంలోని ఏదో ఒక భాగాన్ని గాయం చేస్తూ విషపు చూపులు గుచ్చుకుంటూనే ఉంటాయి ఒక్కోసారి భయమేసి సుదూర ఆకాశంలోకి శూన్యంలోకి మాయమయి పోవాలనిపిస్తుంది కానీ , పలాయనం పరిష్కారం కాదని విషపు చూపుల నెదుర్కొనే ముళ్ళలాంటి తీక్షణతని కళ్ళకి నేర్పటం మొదలెట్టాను ఇప్పుడు ఆ కళ్ళని వెంటాడటానికి కళ్ళతోనే యుద్ధం చేస్తాను సూటిగా రెండు క్షణాలు కళ్ళలోకి చూడలేని పిరికి చూపులు పాతాళం లోకి పారిపోతాయి
ఆచార్యవర్యులు , కొవ్వలి సత్యసాయి గారు పొద్దు కోసం గతంలో వ్యాసాలు రాసారు . ఇవి ఆయన చెప్పిన పాఠాలన్నమాట . ఇప్పుడు గడిని కూర్చి పొద్దు పాఠకులకు పరీక్ష పెట్టారు . " నారదుడు జనాల మధ్య పెట్టేవి - తెలియక పోతే , బుర్ర తలుపులు తీసి మరీ ఆలోచించండి . " అని అంటున్నారు . రండి , పరీక్ష నెదుర్కోండి .
ఊర్లోనుండి శానామంది జనమొచ్చి నిలబడినారు . వాళ్ళలో శానామంది మమ్మల్ని రక్షిజ్జామని వచ్చే , కొందరు ఈళ్ళు ఎట్ట కొట్టక పోతరో సూజ్జామని వచ్చినవాళ్ళు కూడా ఉండారు . కొందరు తాళ్ళు కట్టుకోని రావడానికి ప్రయత్నం జేచ్చాండరు . సోమయ్య వాళ్ళ ఇళ్ళు మిషన్ కాంపౌండ్‌కు దగ్గర్లో ఉండే దిన్నె మీద ఉంటది . వాళ్ళ నాయనా వాడు ఆ దిన్నె మింద ఉన్నెవాళ్ళు .
అర్థం : ఓ రామరూపా , వరుసగా న - గణము , ఆరు జ - గణాలు , పిదప వ - గణము కవిరాజవిరాజిత వృత్తానికి ఉంటుంది . ఈ కవిరాజవిరాజితాన్ని సంస్కృతములో , కన్నడములో హంసగతి వృత్తము అంటారు . కవిరాజవిరాజిత వృత్తాన్ని ఆదిశంకరులు కూడా వాడారని " శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము " అన్న వ్యాసంలో తెలియజేసాను . తెలుగులో ఎప్పుడు ఎవరు కవిరాజవిరాజితమన్న పేరును పెట్టారో తెలియదు . బహుశా ఒక వేళ కవిరాజశిఖామణియైన నన్నెచోడుడు మొట్టమొదట దీనిని వాడినప్పుడు కవిరాజవిరాజితమన్నాడా ?
" అన్నీ మంచి శకునములే " అని మనసులో పాడుకుంటూ . . . కోర్టు ప్రాంగణంలో అడుగుపెట్టాము . ఎంట్రన్స్‌లోనే ఓ లాయర్ ఏం కావాలమ్మా . . . ! అంటూ ముందుకొచ్చాడు . ఫలానా సార్ . . . అంటూ వివరాలు అవీ చెప్పేసరికి , నాతో రండని తీసుకెళ్లాడు . కోర్టు ఇంకోవైపు ఎంట్రన్స్ వద్ద పాండీబజార్ పోలీస్ స్టేషన్ క్రైం డిపార్ట్‌మెంట్ పోలీసాయన ఉంటే . . అతడివద్దకు తీసుకెళ్లాడు ఆ లాయర్ . వెళ్లగానే ఆ పోలీసాయనను చూస్తూ . . . అందరూ నాదగ్గరే బాగా ఇరుక్కుపోతారండీ అన్నాడు తమిళంలో . దానికో నవ్వు పారేసిన పోలీసాయన కేసు వివరాలను విని , లాయర్ చెప్పినట్లుగా చేయండమ్మా అన్నాడు . అంటూనే . . . కాసేపలా పక్కకు వెళ్లి , మళ్లీ మా దగ్గరకు వచ్చారు . కెమెరా వాల్యూ ఎంత ఉంటుందని ? ప్రశ్నించారు . మేము చాలా రోజులు క్రిందట కొన్నాము కాబట్టి , ఇప్పుడు 3 వేల రూపాయల విలువ చేస్తుందని చెప్పాము . ఇంతలో ఆ లాయర్ ఓస్ అంతేనా ఇంకేం అడుగుతాము . . అంటూ ఓ నిట్టూర్పు విడిచాడు . పోలీసాయన ఏదో పని ఉండి వెళ్తూ ఎలాగోలా చేయవయ్యా . . అని లాయర్‌కు చెప్పేసి వెళ్లిపోయాడు . ఇంక ఆ లాయర్ ఫీజు విషయంలో మాతో బేరాలు మొదలెట్టాడు . ఓ రెండువేలు ఇస్తారా అని అన్నాడు . ఏంటి సార్ . . ! మా కెమెరా 3 వేలు అయితే మీకు రెండువేలు ఇచ్చేయాలా . . ? ఏమైనా న్యాయంగా ఉందాండీ . . . అన్నాన్నేను . ఇంకేం చేయనమ్మా ఇంకా చాలా పనులు చేయాలి . . . మీకు కెమెరా ఊరికినే చేతికి రాదు కదా . . ! అన్నాడు . ఆ లాయర్ మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో . . మా అబ్బాయి ఫ్రెండుకు ఫోన్ చేయమని చెప్పగా అతడు అందుబాటులో లేడు . ఇంకేం చేయాలబ్బా . . . ! అనుకుంటుండగా మా కొలీగ్ ఒకరు గుర్తొచ్చాడు . వెంటనే ఆయనకు ఫోన్ చేసి వివరాలన్నీ చెప్పగా . . . అయ్యో . . ! ముందే నాకు చెప్పి ఉంటే నేను చూసుకుందును కదా . . ! అన్నారు . సరే ఓ పది నిమిషాలు ఆగి ఫోన్ చేయండి నేను ఏమైనా సాయం చేయగలనేమో ప్రయత్నిస్తానని చెప్పారు . ఓ పావుగంట తరువాత ఫోన్ చేయగా . . . ఆయన తన లాయర్ ఫ్రెండు ద్వారా ఆ కోర్టులోనే ఉన్న మరో సీనియర్ లాయర్ వివరాలు , ఫోన్ నెంబరు ఇచ్చి ఆయన వద్దకు వెళ్ళమన్నారు . ఇందాకటి లాయర్‌కు మాకు తెలిసినవారు ఉన్నారండీ . . . మీ సహాయానికి కృతజ్ఞతలంటూ సెలవు తీసుకున్నాము . ఆ సీనియర్ లాయర్‌ను కలువగా . . . ఆయన తెలుగు తెలిసిన తన జూనియర్ లాయర్‌ను పిలిచి కేసు వివరాలు చెప్పి ప్రొసీడ్ కమ్మని చెప్పి పంపించారు . సార్ . . . ఇంక మా కెమెరాను తీసుకెళ్లిపోవచ్చా . . . అని అడిగాను ఆ తెలుగు లాయర్‌ను . అంత ఈజీగా ఎలా తీసుకెళ్తారమ్మా . . . ! ఇంకా చాలా పనులున్నాయని అన్నారు . అప్పుడుగానీ మాకు తెలియదు మా కెమెరా మా చేతికి రావాలంటే ఇంకా మూడు , నాలుగు రోజులు పడుతుందని . . . సరేనండీ . . . ఇప్పుడేం చేయాలి మళ్లీ నేనే అడిగాను . మొదటగా పిటీషన్ ఒకటి తయారు చేయించాలి . ఈ పిటీషన్‌ను జడ్జి కూర్చోకముందే పొద్దుటిపూటే పెట్టేయాలి . ఇప్పుడు ఒంటిగంట అవుతోంది కాబట్టి ఇంక రేపు పొద్దున్నే వేయాలి . ఈరోజేం చేయలేం అన్నాడాయన . ఎంతో ఆశగా కెమెరాను తీసుకెళ్లొచ్చు అనుకుంటుంటే మళ్లీ రేపు కూడా రావాలా . . . ? బాగా నీరసపడిపోయాను . పిటీషన్ తయారీ పనులు గట్రా . . అన్నీ పూర్తి చేసుకుని రేపు పొద్దుటే వస్తామని చెప్పి లాయర్‌కు చెప్పి కోర్టునుండి బయటపడ్డాము . మరుసటిరోజు కోర్టుకెళ్లి జడ్జిముందు హాజరై . . . పిటీషన్ వేసింది తానేనని , కెమెరా నాదేనని చెప్పాను . సరేనమ్మా . . ! ఇప్పుడు మీరు ఇంటికెళ్లిపోయి మూడు రోజుల తరువాత రండి . . . ఆరోజు కెమెరాను మీవెంట తీసుకెళ్లచ్చు అన్నాడు లాయర్ . మూడురోజుల తరువాత మళ్లీ కోర్టుకెళ్లి జడ్జిముందు హాజరవగా . . ఆయన కెమెరాను నాకు హ్యాండోవర్ చేయమంటూ ఆర్డర్స్ పాస్ చేశారు . హమ్మయ్య . . . అనుకుంటుండగా కాసేపు కూర్చొండి ఇదో వస్తానంటూ బయటికెళ్లి తిరిగొచ్చాడు లాయర్ . మీ ఆర్డర్ టైప్ చేసినందుకు , రికార్డ్స్ వెతికిపెట్టినందుకుగానూ వాళ్లు డబ్బులు అడుగుతున్నారు కాబట్టి ఓ రెండొందలు ఇవ్వండని అడిగారు . అన్ని ఖర్చులకుగానూ ఆయనకు అప్పటికే డబ్బులు ముట్టజెప్పేశాను . మళ్లీ ఆయనలా అడిగేసరికి బిత్తరపోయాను . అదేంటండీ అప్పుడే డబ్బులిచ్చేశాను కదా . . ! మళ్లీ అడిగితే నేనెక్కడికి పోను అన్నాను . ఆయనలాగే ఉండిపోయేసరికి మావాడు పక్కకు పిలిచి మనం ఇవ్వకపోతే ఇంకాసేపు లేటవుతుంది , ఎందుకొచ్చిన గొడవ ఇచ్చేద్దామని చెప్పాడు . నేను సరేనన్నాను . డబ్బు ఇవ్వగానే ఆయన ఎవరిదగ్గరకో పోయి , అన్నీ పేపర్లను రెడీ చేయించి పైన ఉండే ప్రాపర్టీ రూంకు తీసుకెళ్లాడు . అక్కడ వివరాలన్నింటినీ రికార్డు చేసే ఆయన . . . చివర్లో డబ్బు డిమాండ్ చేయగా మా లాయర్ నావైపు చూయించాడు . ఏమ్మా మాకు రాసినందుకుగానూ ఎంతో కొంత ఇవ్వాల్సిందేనన్నాడు . మొదట ఇవ్వనని బయటికి వచ్చేశాను . అతను ఊరుకుంటాడా . . ? బయటికి నాదగ్గరికి వచ్చి నేనిప్పుడు జడ్జి దగ్గరకు సంతకం చేయించేందుకు వెళ్లాలి . అతను సంతకం చేస్తేనే మీకు కెమెరా ఇవ్వగలను అని గొణుగుతూ పక్కన నిల్చున్నాడు . నేను ఉండేకొద్దీ లేటవుతుందని చేసేదేం లేక అతనికి కొంత డబ్బు ఇవ్వగానే అతనెళ్లి సంతకం చేయించుకొచ్చి నన్ను లోపలికి పిలిచి కెమెరాను అప్పజెప్పాడు . కెమెరాను నా చేతికి తీసుకుని ప్రాపర్టీ రూం క్లర్క్‌కు థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చి సంతోషంగా మా అబ్బాయి చేతికి కెమెరాను అందించాను . గబగబా కెమెరాను ఓపెన్ చేసి బ్యాగులో ఉన్న సెల్స్ వేసి చూస్తే . . . మంచి కండీషన్లోనే ఉంది . సార్ మనకు చాలా సాయం చేశారంటూ వెంటనే మావాడు లాయర్‌ను ఓ ఫోటో తీశాడు . లాయర్‌కు , సీనియర్ లాయర్‌కు థ్యాంక్స్ చెప్పి కోర్టు నుండి బయటపడ్డాము . ఇదండీ నేను పోగొట్టుకుని ఎట్టకేలకు సాధించుకున్న మా బుల్లి కెమెరా కథ . పోగొట్టుకుని ఎలాగైనా తెచ్చేసుకున్నారు కదా . . . ! అయినా మూడు , నాలుగు రోజులు ఆ కథను ఆపకుండా రాసేయాలా . . ? అనుకుంటున్నారా . . ? ! మీకు చదివేందుకే అంత ఇబ్బందిగా ఉంటే . . . దాదాపు ఓ ఐదారు నెలలపాటు నేను పడ్డ కష్టం ఎలా ఉంటుందో ఆలోచించండి . ఇంతకూ నేను పోగొట్టుకున్న కెమెరా . . . మేం కొన్నప్పటి ధర 10 వేల రూపాయలు కాగా . . . నేను దాన్ని తిరిగీ దక్కించుకునేందుకు మరో 2 వేల రూపాయల దాకా ఖర్చు చేయాల్సి వచ్చింది . అయినా నేను ఈ కథ ద్వారా చెప్పదలచింది మాత్రం ఒక్కటే . . . ! బయటికి వెళ్లేటప్పుడు మన వస్తువులపట్ల తగినంత జాగరూకతతో లేనట్లయితే . . . చాలా తిప్పలు పడాల్సి వస్తుంది . కాబట్టి జాగ్రత్తగా ఉండండి . వస్తువును పోగొట్టుకున్నట్లయితే తిరిగీ దానికోసం ప్రయత్నించకండి . . ఒకవేళ ప్రయత్నిస్తే . . మేం ఎదుర్కొన్న కష్టాలు మీకూ తప్పవు .
బిగ్‌బాస్ విక్టర్ కదలటం అంటూ జరిగితే , కథ అక్కడితో ఆగిపోదు . సుక్కూర్‌ని అరెస్ట్ చేయటంలో ఇన్‌వాల్వ్‌అయిన అధికారికి ఆ సాయంత్రం లోపు అందుతాయి బదిలీ అర్డర్స్ . అతనితోపాటు పనిచేసిన కానిస్టేబుల్స్‌కి పట్టే దుర్గతిని గురించి అసలు చెప్పవలసిన అవసరమే ఉండదు . డ్యూటీలు దిగి ఇళ్ళకు వెళ్లే సమయంలో చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగి కాళ్ళు , చేతులు విరిగిపోవటమో లేక ఏకంగా మొత్తం ప్రాణాలను కోల్పోవటమే తప్పకుండా జరుగుతుంది .
పది రూపాయల మసాల వండే ఏకైక TV చానల్ ఏదో ఒక చెప్పనవసరంలేదు .
అందిన సమాచారం ప్రకారం అదే నిజమని తేలింది . మరోవైపు మహేశ్ తన తదుపరి చిత్రానికి కూడా తమ స్వంత సంస్థలైన " కృష్ణా ప్రొడక్షన్స్ " లేదా " ఇందిరా ప్రొడక్షన్స్ " లలో నటించవచ్చనే సమాచారం అందింది . దాంతో మహేశ్ నటిస్తాడనుకున్న తదుపరి చిత్రాలు " మిర్చి " , " హరే రామ హరే క్రిష్ణ " లు ఇంకా ఆలస్యం జరగవచ్చనే వార్త వినిపిస్తోంది . ఏదేమైనా మహేశ్ లారెన్స్ ద ర్శకత్వంలో నటించడం దాదాపు ఖాయమేనని టాలీవుడ్ సమాచారం . ఇటీవల లారెన్స్ మహేశ్ బాబును కలిసి చెప్పిన కథ అతన్ని బాగా ఇంప్రెస్స్ చేయడంతో దానిని యు . టి . వి . సహకారంతో తమ మాతృ సంస్థలో నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిసింది . ఈ సినిమాను రమేశ్ బాబు కానీ , లేక మంజుల కానీ నిర్మించవచ్చు . అధికారికమైన సమాచారం అతి త్వరలోనే పద్మాలయా స్టూడియోస్ వైపునుంచి అందుతుందని టాలీవుడ్ సమాచారం .
చిన్నప్పటి విషయాలన్నీ అంతర్గతంగా గుర్తుంటాయే తప్ప ప్రత్యక్షపద్ధతిలో అవగాహనకు లోనవవు కనక అవి జ్ఞాపకాలుగా నమోదు కాలేవనే సిద్ధాంతమూ ఒకటి ఉంది . ఈ పరిశీలనలన్నిటిలోనూ 2 నెలల వయసునుంచీ పసిపిల్లలపై ఎన్నో ప్రయోగాలు చేస్తారు . చేతితోనో , కాలితోనో కదిలించగానే రకరకాలుగా తిరిగే బొమ్మలను వారికి అందుబాటులో ఉంచి , వాటిని ఎలా కదిలించవచ్చో పిల్లలకు తెలిసేట్టుగా చూస్తారు . ఒకసారి ఈ ప్రక్రియను వారు తెలుసుకున్నాక కాలం గడుస్తున్న కొద్దీ అటువంటి బొమ్మలను మళ్ళీ వారికి అందించి , పాత విద్యలు గుర్తున్నాయో లేదో పరిశీలిస్తారు . ఇటువంటి సందర్భాల్లో తక్కువ వయసున్న పిల్లలు త్వరగా మరిచిపోతారని తేలింది ; వయసు పెరుగుతున్నకొద్దీ జ్ఞాపకశక్తికూడా పెరిగింది . ఈ ప్రయోగాల్లో పిల్లలను ఎన్నేసి నిమిషాల పాటు బొమ్మలను చూడనివ్వాలో , ఎన్నివారాల తరవాత వారి జ్ఞాపకశక్తిని మళ్ళీ పరీక్షించాలో నిర్ణయిస్తారు . అలాగే రకరకాల బొమ్మలను వివిధ క్రమంలో వారికి చూపడం , ఆ తరవాత వాటిని చూపినప్పుడు వారి స్పందనలను పరీక్షించడం చేస్తారు .
రాష్ట్రం మరోసారి భగ్గుమంటుంది . విధ్యార్థి లోకం అట్టుడికిపోతుంది … కోట్లాది ఆస్థులు ద్వంసమౌతాయి . పరీక్షలు వాయిదా పడతాయి … . భవిష్యత్తు సర్వ నాశనమయిపోతుంది . జరగబోయే ప్రమాదాన్ని ఎలాగైనా ఆపాలి . కాని శరీరమే సహకరించట్లేదు . ఇంకెంత , మరో 5 నిముషాలు వేగంగా పరిగెడితే హాస్టల్ ప్రహరి గోడ వచ్చేస్తుంది .
భలే వుంది . . " ఎందుకో నా పక్కన పిల్ల నన్ను గిల్లుతుందేమోనని అనుమానంగా అనిపించింది . అందుకే ముందుజాగ్రత్తగా నేనే గట్టిగా గిల్లేసాను " కేక : )
ఇంజనీరింజ్‌లో మేము మనాలీ వెళ్ళినప్పుడు తీసిన ఫోటొ . రోతాంగ్ పాస్ వేళ్ళే సమయానికి మంచు ఏక్కువ కురుస్తుందని ఆ దారి మూసేసారు . . . . . చివరికి సోలాంగ్ valleyకు వేళ్ళాం . దారిలో తీసిన క్లిక్కు ఇది . హైదరాబాదులో చిన్న గుట్టలే చూసిన నాకు అంతంత పెద్ద కొండలు చూసేసరికి ఎవరూ కొట్టకుండనే దిమ్మతిరిగి మైండ్ బ్లాకైంది . తెల్లటి మంచుకొండలపైన ఎండపడి వెలిగిపోతుంటే . . . . . . చూడ్డానికి నాలుగు కళ్లు చాలలేదు ( నాకు కళ్ళజోడు ఉందిమరి ) . పెరిగిపోతున్న భూవాతావరణం కారణంగా వీటిపైన ఉండే మంచు త్వరగా ( ఎండాకాలం ముందుగానే ) కరగుతుందంట . ఇలాగే కొనసాగితే మున్ముందు అక్కడ రాళ్లకొండలే ఉంటాయి కాబోలు . టాపా రాస్తుంటే winampలో ' ఓయ్ ! ' సినిమా పాట ప్లే అవుతుంది . . . , " అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం అందంగా ముస్తాబైవుంటుందనీ . . . . " నాకోసం సరే అందంగానే ఉంది . . . . . . కాని వచ్చే తరానికి . . . . . ? వీటి సొగసు రానున్న తరాలు చూడశక్యమా . . . . . .
ఇక చెయ్యవలసిన పనులు , వాటి ప్లానింగ్ వీటిపై దృష్టి పెట్టాలి అనుకుంటూండగానే , ముందు ఈ జీవితానికి అలవాటుపడడానికి ప్రయత్నిస్తున్నాను !
నా మాట మన్నించి కథ గురించి తమ తమ అభిప్రాయాల్ని చెప్పిన అందరికీ సర్వదా ఋణపడి ఉంటాను . ఒక్క విన్నపం . . విమర్శగా ఏదన్నా ఒక్క మాట అనడానికి అందరూ చాలా సంకోచిస్తున్నట్టుగా ఉంది . అంత సంకోచించాల్సిన పనేమి లేదు . సద్విమర్శవల్లనే రచన పదును తేలుతుందని నమ్ముతాన్నేను . ఇప్పుడే కాదు , ఇక మీదట అయినా , నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలు చెప్పొచ్చు . వూకదంపుడు . . విన్నవీకన్నవీ పూర్తిగా మూసినట్టు కాదు . ఆ పరిచయాలు , సమీక్షలు , విశ్లేషణలు కొనసాగుతూనే ఉంటై కొత్తపాళి బ్లాగులోనే . వేరే బ్లాగు అనవసరం అనిపించింది , అంతే . రానారె , వూకదంపుడు . . అమెరికా దేశంలోనే ఒక వంక అతివృష్టీ ఇంకో వంక అనావృష్టీ ఉండడమూ సర్వసాధారణమే . మేము అప్పుడే రాబోయే చలికాలం ఎంత భయంకరంగా ఉంటుందో అని వొణుకుతున్నాం .
" అంపశయ్య " తర్వాత నవీన్ యేం రాశాడు ? " Is he a single novel celebrity ? " అని అడిగే వాళ్లు కొందరున్నారు . అంపశయ్య తర్వాత మీరు 27 నవలలు రాసినా అంపశయ్య నవలకు వచ్చినంత పేరు మరే నవలకు రాలేదెందుకు ? అని నన్ను అడుగుతుంటారు . ఎన్ని రాసినా ఒక రచయిత పేరు ఒకే ఒక రచనతో ముడిపడిపోవడం విశ్వసాహిత్యంలో చాలా మంది రచయితలకు జరిగిందే .
ఈనాడు చెన్నై వారికి ఫోన్ చేసి విషయం చెబితే వారికి అది రాసిన వ్యక్తి పేరు తెలీదని బుకాయించారు . కావాలంటే హైద్రాబాదు ఆఫీసుకి ఫిర్యాదు రాయమని ఓ ఉచిత సలహా పారేసారు . ఇదీ ప్రస్తుత జర్నలిజం తాలూకు విశ్వరూపం . పేరూ వూరూ లేని రాతల్ని వేసుకునే పత్రికలు చెప్పే వార్తల్ని ఎవరు విశ్వసించాలి ?
చాలా బావున్నాయి జయగారూ మీ కేరళ ట్రిప్ కబుర్లు . మున్నార్ చూడాలని కోరిక నాకు మీ ఫొటోస్ చూశాక ఆ కోరిక ఇంకా బలపడింది
పరమాత్మనుని ఆరాధించే మార్గాలు అనేకమున్నాయి . వాటిలో ఉపాసనమోకటి . ఇందులో ఉపాసకుడు . ఉపాస్య దైవము , ఉపాసనా మంత్రములన్న మూడు విభాగాలుంటాయి . వీటికి త్రిపుటియనిపేరు . ఈత్రిపుటి ఒకటి కావడము ఉపాసన యొక్క పదమావధి .
రాత్రి అవుతున్న కొద్దీ చలి కూడా పెరిగింది . ఇప్పుడది ఎముకల్ని నమిలేస్తున్నది .
నా మనసునందు గలుగు తలపు నీ కనులు జూచు కలగా ఓ ముగ్ధ నయన విహారీ నా సంగీతమున చిందు నెందు త్వదీయ శుభాంగ కళాత్మ నా దానవు నా దానవు నా జీవన మరణ విహారీ
నాకు పెళ్ళయిన వెంటనే బెంగుళూరుకు వచ్చేసాను . వచ్చిన వారం లోపే అనుకుంటాను ఒకరోజు ఏమీ తోచక బయట బాల్కనీ లో నిల్చున్నాను . ఆ ఇంట్లో మేము పైన అద్దెకుండేవాళ్ళం కింద ఇల్లుగలవాళ్ళు ఉండేవాళ్ళు . చుట్టూ చూస్తుంటే ఇంచుమించు మా డాబా కి ఆనుకుందా అన్నంత దగ్గర్లో ఉన్న పక్క మేడ మీద గోధుమ రంగులో ఉన్న ఒక కుక్క నా వైపే చూస్తూ తోకాడిస్తోంది ( నేనెవరో తెలీకపోయినా ) . దాన్ని చూడగానే ముద్దొచ్చి లోపలికెళ్ళి దానికి తినటానికి ఒక బిస్కట్టు తెచ్చి పక్క డాబా మీదకు విసిరాను . అది ఆవురావురుమని తినేసింది . ఇంకాకొన్ని విసురుదామంటే ఎవరైనా చూస్తే బాగోదని అనిపించి " ఇలా ఇటురా ఇంకా పెడతాను " అని అంటూ సైగ చేసాను . అలా అన్నానే కానీ నా మొహం దానికేం అర్థమవుతుంది , పైగా తెలుగులో అన్నాను అదేమో కన్నడ కుక్కాయె అని లోపలికెళ్ళాను . అంతలోనే " కుయ్ కుయ్ " మని వినిపిస్తే బయటకెళ్ళి చూద్దును కదా ! పక్క డాబా గోధుమరంగు కుక్క నా ముందుంది . ఒక్కసారి ఆశ్చర్యపోయినా అంతలోనే తేరుకుని దానికి మిగతా బిస్కట్టులు పెట్టి అబ్బో ఇది చాలా తెలివైన కుక్క లా ఉందని అనుకున్నాను . అప్పటినుండీ ఇంక అది నన్ను వదిలిపెడితే ఒట్టు . పక్క డాబా మీది దాని మకాం మా డాబా మీదకి మార్చేసింది . తోకవూపుతూ అది చూపించే ప్రేమకి నేను కూడా కరిగిపోయాను . నేనెందుకో దానికి బాగా నచ్చుంటానని తెగ సంబరపడిపోయాను కూడా . వెర్రిదాన్ని ! నాకేంతెలుసు అది ఎవర్ని చూసినా అలాగే తోకూపుతుందని . సాయంత్రం మా ఆయన రాగానే దాన్ని చూపించాను కదా ! పొద్దున్న చూపించిన ఆప్యాయతంతా అది తన దగ్గర చూపించేసింది . అమ్మో గడుసుదే ఇది అనుకుని ఆ రోజునుంచీ దానికి ఫుల్ మీల్స్ ఇవ్వడమే కాక దానికి " సోనా " అని నామకరణం కూడా చేసేసాను దాని గోధుమ రంగు చూసి . ఒకరోజు పొద్దున్నే మా ఇంటి ఓనరు పైకొచ్చి మా తలుపు దబ దబా బాదాడు . ఏంటా అని చూస్తే మా వారినీ నన్నూ బయటకి రమ్మని చెప్పి " ఇదుగో చూడండి మీరు చేరదీసిన కుక్క ఏంపని చేసిందో " అని ఆయనకొచ్చీరాని తెలుగులో చెప్తున్నాడు . ఆయనకంతకోపమొచ్చేంత పనేంచేసిందా అని చూస్తే అక్కడ ఒక చిరిగిపోయిన ప్లాస్టీక్ సంచీ దాని చుట్టూ ఎముకలూ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి . అది చూసాక నిద్రమత్తు వదిలిపోయింది దెబ్బకి . ఏ పెంటకుప్ప మీంచో ఆ ప్లాస్టీకు సంచీడు ఎముకలు తెచ్చి మా డాబా మీద పెట్టుకుని హాయిగా తిన్నన్ని తిని పారేసినన్ని పారేసిందన్నమాట . అవన్నీ తీసి శుభ్రం చేయమని నిర్మొహమాటంగా మాకు చెప్పి మా ఓనరు వెళ్ళిపోయాడు . మా ఖర్మ కొద్దీ ఆ రోజు మా పనిమనిషి రాకపోవటం వల్ల ఆ పనంతా నేనూ మా ఆయనా కలిసి ముక్కుమూసుకుని చేసాం . ఇంత జరిగినా సోనా మీద కోపం రాలేదు నాకు పోన్లే పాపం ఆకలేస్తే అదేం చేస్తుందనుకుని ఊరుకున్నాను . పైగా దాని ఫుల్ మీల్స్ కేమాత్రం ఢోకా రానివ్వలేదు కూడా . ఏ రోజైనా ఇంట్లో వంట చేయనపుడు బయట తింటే దానికి పార్సిలు కూడా తెచ్చేవాళ్ళం . ఇంతపెట్టినా అది ప్లాస్టీకు సంచీలతో ఎముకలు వగైరా తెస్తూ మా చేత తుడిపిస్తూనే ఉంది . అదేంటో ఆ రోజే విచిత్రంగా మా పనమ్మాయి మానేసేది . మా కర్మ పరిపక్వత చెందటం వల్ల కాబోలు . సోనా కాక మాకు ఇంట్లో పమేరియన్ కుక్క ఉండేది . దాని పేరు ప్రిన్సెస్ . ఒకరోజు ప్రిన్సెస్ ని వాకింగ్ కి తీసుకెళ్ళినపుడు ప్రిన్సెస్ మీదకి ఒక వీధికుక్క వచ్చింది . ఖంగార్లో ఏం చేయాలో పాలుపోలేదు నాకు . ఇంతలో ఎక్కడినుంచొచ్చిందో మరి , సోనా వచ్చి ఆ కుక్క ని తరిమి కొట్టి దాని ధైర్య సాహసాల్ని చాటుకుంది . అప్పటినుంచీ సాధారణంగా మనుషులు గానీ , జంతువులుగానీ ఎవరూ ఒక పట్టాన నచ్చని మా ప్రిన్సెస్ కి ఈ సోనా నచ్చేసింది . మేము వాకింగ్ కి వెళ్ళినపుడల్లా వెనుక సోనా మా బోడీగార్డయిపోయింది .
ఈ రోజు రమణ గారు లేరని తెలిసాక మన తెలుగ బ్లాగర్ల స్పందనలు . . ( బ్లాగుల్లో . . . బజ్జులో . . . . జాల పత్రికల్లో వచ్చినవి ) ఇక్కడ పెడుతున్నాను . అన్నీ ఒక చోట ఉంటే బాగుంటుందన్న ఉద్దేశ్యంతో పెడుతున్నాను . ఎవరికయినా అభ్యంతరం ఉంటే చెప్తే తీసివేయగలను .
చాలా మంది మిత్రులు తెలంగాణ వచ్చినా ఒరిగేదేమీ ఉండదు మళ్లీ పేదలు పేదలు గానే ఉంటారు అంటూ " జీవిత సత్యాలు " బోధిస్తున్నారు . వారందరికీ ఒకటే విన్నపం . మన తాతల నాడు " బ్రిటీష్ వాళ్లు పోయినా ఒరిగేదేమీ ఉండదు , మళ్లీ ఉన్నోడిదే రాజ్యం అవుతుంది " అనే " ముందస్తు జ్ఞానంతో " పోరాడకుండా ఉంటే ఎలా ఉండేది ?
మాక్స్ ( మ్యూచువల్లీ ఐడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ ) క్రింద : 1 . కాంఫెడరేషన్ ఆఫ్ వాలంటీర్స్ అసోసియేషన్ ; 2 . దీపిక మహిళా ; 3 . ఝాన్సీ రాణి మహిళా ; 4 . కాకతీయ మహిళా ; 5 . మదర్ థెరిస్సా మహిళా ; 6 . వాగ్దేవి మహిళా ; 7 . ఇందూరు ఇంటిదీపం ; 8 . పి డబ్ల్యు ఎం ఏ సీ ఎస్
రాజకీయ నేతల అవినీతిని నిర్మూలిస్తే సగానికి పైగా అవినీతి తగ్గినట్టే . మిగతా అవినీతిని వాళ్ళే నిర్మూలిస్తారు . తమకు అవినీతి చేసే అవకాశం లేనపుడు ఇతరులకు ఉండనిస్తారా ? ప్రశ్నే లేదు ! నీచస్వార్థం . . . . నాకు దక్కనిది మరోడికి దక్కనివ్వను పాలసీ ఏ మిగిలిన పని చేయిస్తుందంటారు . . . . బావుంది . ఇన్నాళ్ళూ మనలాంటి సామాన్యులం అవినీతిని భరిస్తూ , కొండొకచో కొద్దోగొప్పో తోడ్పడుతూ , సహిస్తూనే ఉన్నాం . హజారే స్ఫూర్తితో అవినీతి లేని కొత్త సమాజానికి పునరంకితం కావలసిన అవసరం ఉంది . కనీసం మన పిల్లల తరానికయినా మనం ఆదర్శం కావాలి .
ఈ సందర్భంలో శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్య కూడా గుర్తు పెట్టుకోవలసినదే : ' ' ప్రస్తుతం ఒక వింత ప్రవాహంలాగా అతి వేగంగా కొట్టుకు పోతున్న నేటి సినిమా రంగంలో ఎంటర్‌టైన్‌మెంట్ అంటే అసభ్యం , అశ్లీలం , ద్వంద్వార్థాల మాటలు , బూతు మాటలనే అర్థం చెప్పుకుంటున్న ఈ రోజుల్లో నాలాంటి చాదస్తపు కళాకారుడు కొట్టుకు పోగలడే తప్ప ఎదురీదలేడు . ' ' ( 14 - 4 - 1997 ' ' ఈనాడు సినిమా ' ' . )
ఓక సమస్య వచ్చినపుడు అప్పటిదాకా మనం మిత్రులు అనుకోన్నవారు మనకు అండగా వుండక పోవచ్చు అలాగే మనం శత్రువులు గా భావించే వారే మనకు అండగా వుండొచ్చు . సమస్య వచ్చినపుడు గాని మనుషుల అసలు రంగ బయటకు రాదు .
అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఉపేందర్‌రెడ్డి తెలిపారు . గౌరవాధ్యక్షులుగా ఫణుకు శేషగిరిరావు ( ఫణుకు శేషు ) ఎన్నికైనట్లు చెప్పారు . అధ్యక్షులుగా బి . వెంకటేశ్వరరాజు , వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎ . ప్రేమ్‌చంద్ , ఉపాధ్యక్షులుగా ఎంవి . నారాయణరావు , ముజిబ్ బేగ్ , ప్రధాన కార్యదర్శిగా ఎస్‌విఎస్ మస్తానరావు , డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎంఎస్‌ఎస్‌జి . ప్రసాద్ తదితరులు ఎన్నికయ్యారని పేర్కొన్నారు .
' శ్రీ శ్రీ రచనలపై కేవీయార్ ' శీర్షికతో - ఆంధ్రజ్యోతి ఏప్రిల్ 5 - వివిధ పేజీ ( నాలుగో పేజీ ) లో 1985 లో కడియాల రామమోహన రాయి - కేవీయార్ తో చేసిన ఇంటర్వ్యూ వుంది . ఈ పేపర్ ద్వారా PDF డౌన్ లోడ్ చేసుకోవాలంటే రిజిస్టర్ చేసుకోవాలి .
లయస్ఫురణకు , పద , పదాంశ విరామాలు , పదంలో ఊనిక ప్రధానపాత్ర వహిస్తున్నయ్యని పైన నిర్ణయించబడింది . ఇంకా పరిశోధిస్తే కేవలం ఊనికనే లయకు కారణంగా నిరూపించవచ్చు ననుకుంటాను . అయితే ఈ ఊనిక ప్రవర్తన పద , పదాంశ విభాగం మీద ఆధారపడి ఉంటుంది . పద , పదాంశ విభాగ విరామాల పరిజ్ఞానం ఛందశ్శాస్త్రానికి ఎట్లాగూ తప్పవనుకుంటాను .
నేను సాని కులస్థుణ్ణి . దేవదాసి ఆచారాన్ని నిర్మూలించటానికి మా కులస్థులు , చుట్టాలు పడ్డ ఇక్కట్లు నాకు తెలుసు . జస్టిస్ పార్టీ , తదుపరి ఉమ్మడి కమ్యునిస్టు పార్టీ ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ దేవదాసీ ఆచారాన్ని నిర్మూలించటానికి చేసిన కృషి గొప్పది . ప్రగతి పరమైనది . రచయిత , ఇతర మేధావులు , నాగరత్నమ్మ గారి కళానైపుణ్యాన్ని తప్పుడు సాంఘిక అవగాహన నుండి వేరు చేయాలి . రచయత " . . కొన్ని కులాల వారు ఒక కూతురుని దేవదాసీగా చేసేవారు … " అని రాసారు . చదివేవాళ్ళు ఈ కులస్థులు ఏదో ఉబలాటం కోద్దీ చేస్తారనుకొనే ప్రమాదం ఉంది . వాస్తవం ఏంటంటే , పేదరికం మూలంగా పిల్లల్ని సాకలేక ఈ దేవాలయాలకి అర్పిస్తారు . కొన్ని సందర్బాల్లో అనాధల్ని ఈ వ్యవస్థ లో తోసేవాళ్ళు . ( ప్రతిఘటించేవాళ్ళు ఎవరూ ఉండరు కాబట్టి . )
" అసలెంత కట్టానో తెలుసా ? ఇదేనా నీ మంచితనం ? " అని …
అన్నాహజారే గారు చేసిన పని తప్పని , ఏదో వూపు మీద చేసినంత మాత్రాన అవినీతి పోతుందా అని కొందరి ప్రశ్న . ఎవరైతే అవినీతి చేయటం లేదో వారే ఇందులో పాల్గొనాలి అని కొంతమంది అభిప్రాయం . మీలో ఎవరైతే తప్పు చేయలేదో వారే తప్పు చేసారంటున్న వారి మీద రాయి విసరండి , అని అంటున్నారు . అప్పుడు వేరే దారి లేదు . ఏ పని చేయాలన్నా డబ్బు లేకుండా పని జరగదు కాబట్టి ఇచ్చేస్తే జరిగి పోతుందిలే అనిపించింది , చేసారు , ఈ పద్ధతి మారదు అనే నిరాశలో చేసిన పనులకు ఇప్పుడు అవినీతితో పోరాడే అవకాశం వస్తే వదులుకోవాలా ? ఒక్కసారి ఏ లంచాలు లేకుండా ఏ పని చేయించుకోవడానికి ఏ ఆఫీసుకి వెళ్ళినా టేబుల్ కింద చేతులు పెట్టకుండానే , ఒక్క పైసా ఇవ్వకుండా , ఏ అవకతవకలు లేకుండా పనులయిపోయి ఆఫీసునుండి బయటకు రావడం వూహించండి . తలచుకుంటేనే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది కదా ! అలాంటి సమాజం కోసం అందరం కలిసి పాటు పడదాం రండి అని పిలుపునిస్తే , అయ్యొ ఇంతకుముందు నేను లంచం ఇచ్చాను , నాకు అర్హత లేదు అనుకుని వెనక్కి వెళ్ళాలా ? అప్పుడు బాధ పడ్డ వారంతా , లేదు ఇంక ఇలాంటి పనులు సాగకుండా చేయాలి అని ముందుకి సాగడం ముఖ్యమా , కాదా ? చెప్పండి . ఇండియా అగైంస్ట్ కరప్షన్ వారు కొన్ని ఫోటోలు , వాటితో పాటు కార్టూంస్ పెట్టారు . అందులో ఒకటి , కుటుంబలోని ఒక వ్యక్తిని పోగొట్టుకుని డెత్ సర్టిఫికెట్ కోసం ఆ సంబందిత ఆఫీసుకి వెళితే టేబుల్ కింది నుండి చేతులు జాస్తున్నారు . ఆ డెత్ సర్టిఫికెట్ వస్తే వెళ్ళి భర్త కొచ్చే పెంషన్ తన పేర మార్చుకోవాలని తాపత్రయం . వేరే ఆస్తులు లేక కేవలం ఆ పెన్‌షన్ పైనే బ్రతికే వారి దగ్గర లంచం ఇవ్వడానికి డబ్బులు లేకపోతే ఏం చేస్తారు .
Happy Birthday to you Mala gaaru . జన్మ దిన శుభాకాంక్షలు . ఈ కమల సహస్ర రేకల వికసించి సహస్ర కమలాల మాల గా మారి ఇలానే మా మాల గారు గా కూడా స్నేహ సుగంధాలను అందించాలని కోరుకుంటూన్నా
అదిరిపోయాడు సుక్కూర్ … . కుష్ఠువ్యాధి వచ్చి కాళ్ళు చేతులు నాశనం అయిపోయినవారి ఆకారాలు మనస్సులో మెదిలేసరికి నశించింది అతని ధైర్యం .
అయినా ఈ అభిమానులము అని చెప్పుకునేవారికి కొద్దిగా ఆలోచన ఉండవద్దూ
రాయల కాలంలో కూడా ఇంతకన్నా విశేషమైన జనవినోద సాధనాలుండే అవకాశం లేదు . రాజులూ , సర్దార్లూ , వాళ్ళ ఇండ్లల్లోనో , దర్బారుల్లోనో నృత్యాంగనల నాట్యాలనూ , విద్వాంసుల గానాలనూ ఆనందించేవారేమో గానీ , జనసామాన్యానికి వీధిభాగవతాలే కాలక్షేప సాధనాలు . రామరాజ భూషణుడు విజయనగరం పరిసరాల్లోనూ , పెనుగొండ చుట్టుపక్కల వున్న పల్లెల్లోనూ , ఈ నాటకాలు చూసే వుంటాడు . రాజులూ , రాణుల మనోరంజనం కోసం కోటల్లోనో , అంతఃపురాల్లోనూ ప్రత్యేకంగా వేయించే నాటకాలైనా చూసే వుంటాడు .
వీవెన్ గారి పది అత్యుత్తమ తెలుగు బ్లాగుల ఎంపికకు ఇది నా ఎంట్రీ . కొన్ని మూడవ నిబంధనను అతిక్రమించ వచ్చు అయినా ఇక్కడ లిస్ట్ చేయకుండా వుండలేకపొయాను , నాకు అంత నచ్చాయి మరి .
http : / / ramakantharao . blogspot . com / 2008 / 10 / blog - post_10 . html పోయినేడాది , ఇదే రోజున , అనగా ఆశ్వయుజ శుద్ధ దశమి , శ్రవణా నక్షత్రంలో ఈ పిల్ల పుట్టింది . అనఘ అని పేరు పెట్టాం . అనఘ అనగా అనగనగా , దత్తాత్రేయస్వామి వారి సతి , మరియూ * సిన్లెస్ * అని అర్ధం . అప్పుడే సంవత్సరం అయింది . అన్న అన్నా అంటోంది . ఒరేయ్ ఒరేయ్ అంటోంది . బుడిబుడి అడుగులు వేస్తోంది . మమ్మల్ని ఆనందసాగరంలో ముంచెస్తోంది . విజయదశమి , మాకు జంట ధమాక . అమ్మవారు సకల గుణాలనూ హరించిన వేళ , విజయకేళ ! ! మరియూ పిల్లపుట్టినరోజు వేడుక . ఈరోజు పూజలు పునఃస్కారాలు మరియూ పుట్టినరోజు సంబరాలతో తేలియాడుతాం మేము . మీరూ ఈ విజయదశమి అమ్మవారిని పూజించి ఆనందంతోపాటు అమ్మవారి ఆశీస్సులు పొందాలని శ్రీ విజయదుర్గ కృపకు పాతృలౌవ్వాలనీ కోరుకుంటాం - భాస్కర్ , హరిత , సూర్య మరియూ అనఘ . ఇక మా ఊళ్ళో ఓ పడుచుంది , పాట అంటే ఇష్టమన్నది . నిజం ! ! నిన్న మా ఊళ్ళో సునీత , శ్రీకృష్ణల బృందం వారి సంగీత విభావరి జరిగింది . ఈ కార్యక్రమానికి నేనూ ఓ కార్యకర్తను , స్పాన్సర్ని కూడా . ఆ వివరాలు - ఆల్బనీలోని హిందూ దేవాలయం వారి హిందూ కల్చెరల్ సెంటర్ నందు , ఆల్బనీ తెలుగు సంఘం వారి ఆధ్వర్యంలో నిన్న ( సెప్టెంబర్ 27 ) శ్రీమతి సునీత గారి " సంగీత విభావరి " వీక్షకులకు సంగీత విందునందించింది . మహార్ణవమి మధ్యానం 2 గంటలకు మొదలైన కార్యక్రమం 3 . 30 గంటలపాటు ఆధ్యంతం ఉర్రూతలూగించింది . కేరింతలు కొట్టించింది . పిన్నలనుండి పెద్దలవరకూ అందరిచేతా నాట్యం చేయించింది . కార్యక్రమానికి వేంచేసిన దాదాపు 400 మంది సునీత శ్రీకృష్ణల గానాంమృతపు జడివానలో తడిసిముద్దైయ్యారు . గణేశస్తుతి తో మొదలైన కార్యక్రమం , సునీత పాడిన సోలోలనుండి , శ్రీకృష్ణతో కలిపిన యుగళాగీతాలు , ఆపాత మధురాలు , కొత్తసింగారాలతో కలిసి , ఈవేళలో నీవు ఏంచేస్తు ఉంటావో నుండి తకిటతధిమి తకిటతధిమి థిల్లానా లను తాకుతూ , సిరిసిరిమువ్వ లోని ఘుమ్మంది నాదం నుండి సిరివెన్నెలలోని విధాత తలపున వరకూ , నేటి యమదొంగ నుండి జల్సా , మగధీర చిరుతల నుండి గోదావరి , ఆనంద్ ల వరకూ ప్రేక్షకులకు వీనులకు విందు చేసింది . http : / / albanyandhra . com /
వస్తోంది , వెళుతోంది - ఇటువంటి మాటలు వికారంగా ఉన్నవనీ , అవి కుంటి నడక వ్యత్యస్తపు మాటలనీ అంటారు . " వస్తోంది " అన్న మాట " వస్తున్నది " అని ఉండాలని వీరి ఊహ . వాడుక భాషకు కూడా కొన్ని నిబంధనలేర్పరచి , దాన్ని సంస్కరిద్దామని వారి ఉద్దేశం . ఇదివరకు నన్నయాదుల సంస్కారం వీరు ఒప్పుకోలేదు . ఎందుకనీ ? దానికి సామర్ధ్యం లేదని . అది వికృతంగా ఉన్నదనీ . మరి తాము చేయబోయే సంస్కారానికి ఆ దశ పట్టదూ , కొంత వరకే నాయెను .
13న ఉదయానికి బాబు విజయవాడ చేరుకుని అదే రోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తారు .
రాసిన వాడు విహారి , రాసిన సమయం 11 : 19 PM 15 వ్యాఖ్యానాలు ఈ టపాకి లంకెలు
ఇంకో రెండు ఫర్లాంగులు పోయిన తర్వాత సడెన్‌గా ఒక సందులో అతనికి కనిపించింది ఒక కారు . నడుస్తూ నడుస్తూ ఏదో ట్రబుల్ ఇచ్చింది కాబోలు , బానెట్ ఎత్తి చికాకుగా ఇంజన్‌వంక చూస్తున్నాడు ఓనర్ .
విశ్వనాథ పద్యాలను పైపై అందాల కోసం చదవకూడదు . మహాద్భుతమైన కల్పనల కోసం చదవాలి . అపురూపమైన ఊహల కోసం చదవాలి . కథానిర్వహణ శిల్పంలోని నేర్పు కోసం చదవాలి . తెలుగు పల్లెల్లో , పొలాల్లో , తాపుల్లో చిన్నతనంలో తాను చూసిన సొగసులనూ , అందాలనూ కవిత్వంలో కుప్ప వోసిన తీరు చూడ్డం కోసం చదవాలి . తెలుగిండ్లలోని ఆచారాలనూ , వాడుకలనూ , పలుకుబడులనూ , కథల్లో , పద్యాల్లో పొదిగిన సౌందర్యం కోసం చదవాలి . సంభాషణల్లో వ్యావహార ధోరణికి ఛందస్సుతో సాహచర్యం చేయించిన చాతుర్యాన్ని ఆనందించడం కోసం చదవాలి . పై పద్యం అలాంటిదే . చూశారుగా , ఎంత విచిత్రమైన ఉపమానాలను సృష్టించాడో . అవి పూర్తిగా విశ్వనాథవే , వాల్మీకివి కావు . వాల్మీకి ఈ సందర్భంలో శూర్పణఖను గురించి అనేక విశేషణాలు వాడాడు , అదీ ఆమె ముక్కు చెవులు కోయకముందు - దారుణా , వృద్ధా , భైరవస్వరా , దుర్వృత్తా , అప్రియదర్శినీ , కామమోహితా , ఇవాం విరూపాం , అసతీం , అతిమత్తాం , మహోదరీం , రాక్షసీం - ఇలా . కర్ణ నాసికా ఖండనం తర్వాత శూర్పణఖకు తీసిన ఛాయాచిత్రం - విశ్వనాథ రాసిన పై పద్యం .
అంతలో క్షణంలో పదో వంతులో బార్ తలుపు భళ్ళున తెరుచుకోవటం , అతను గాల్లో తేల్తూ వచ్చి బయటపట్టం జరిగిపోయాయి ! తలెత్తే సరికి అతని ముక్కు నిండా రక్తం . నుదురు చిట్లి నేల ఎరుపెక్కింది . వికారంగా , విషాదంగా ఉన్నాడతను . పైకి లేవటానికి ప్రయత్నిస్తున్నాడు .
అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు . కరుణశ్రీగారి ఉదయశ్రీలో తెలుగు పిల్లలకి వినాయకుని గురించి చెపుతున్న పద్యాలు : ( క్రిందటేడు ఈ పద్యాలని పూర్తిగా వినే తీరిక లేక వెళ్ళిపోయిన వినాయకుడు ఈ ఏడు గుర్తుపెట్టుకుని మరీ వినిపించమని అడిగాడు ! ) ఎలుక గుఱ్ఱము మీద నీరేడు భువనాలు పరువెత్తివచ్చిన పందెకాడు ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు ' నల్ల మామా ' యంచు నారాయణుని పరి యాచకాలాడు మేనల్లు కుఱ్ఱ వడకుగుబ్బలి రాచవారిబిడ్డ భవాని నూఱేండ్లు నోచిన నోముపంట అమరులం దగ్రతాంబూల మందు మేటి ఆఱుమోముల జగజెట్టి అన్నగారు విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె ఆంధ్రవిద్యార్థి లెమ్ము జోహారు లిడగ తిలకమ్ముగా దిద్దితీర్చిన పూప జా బిలి రేక లేత వెన్నెలలు గాయ చిరుబొజ్జ జీరాడు చికిలి కుచ్చెల చెంగు మురిపెంపు పాదాల ముద్దుగొనగ జలతారు పూలకుచ్చుల వల్లెవాటుతో త్రాచు జందెములు దోబూచులాడ కొలుచు ముప్పదిమూడుకోట్ల దేవతలపై చల్లని చూపులు వెల్లివిరియ గౌరికొమరుడు కొలువు సింగారమయ్యె జాగుచేసినచో లేచి సాగునేమొ తమ్ముడా ! రమ్ము స్వామి పాదములు పట్ట చెల్లెలా ! తెమ్ము పువ్వుల పళ్ళెరమ్ము కొలుచువారలకు ముంగొంగు బంగారమ్ము పిలుచువారల కెల్ల ప్రియసఖుండు సేవించువారికి చేతిచింతామణి భావించువారల పట్టుగొమ్మ దాసోహ మనువారి దగ్గర చుట్టమ్ము దోసిలొగ్గినవారి తోడునీడ ఆశ్రయించిన వారి కానంద మందార మర్థించు వారల కమృతలహరి జాలిపేగుల వాడు లోకాల కాది దేవుడే మన పార్వతీదేవి కొడుకు చిట్టెలుక నెక్కి నేడు విచ్చేసినాడు అక్కరో ! అర్ఘ్యపాత్రము నందుకొనవె లడ్డూ జిలేబి హల్వాలె యక్కరలేదు బియ్యపుండ్రాళ్ళకే చెయ్యిచాచు వలిపంపు పట్టుదువ్వలువలే పనిలేదు పసుపు గోచీకె సంబ్రాలుపడును ముడుపు మూటల పెట్టుబడి పట్టుదలలేదు పొట్టిగుంజిళ్ళకే పొంగిపోవు కల్కి తురాయీలకై తగాదా లేదు గరికపూజకె తలకాయ నొగ్గు పంచకల్యాణికై యల్కపాన్పు లేదు ఎలుక తత్తడికే బుజాలెగురవైచు పంచభక్ష్యాలకై మొండిపట్టు లేదు పచ్చి వడపప్పె తిను వట్టి పిచ్చితండ్రి కుడుము లర్పించు పిల్లభక్తులకు నెల్ల యిడుములం దించి కలుము లందించు చేయి పార్వతీదేవి ముద్దులబ్బాయి చేయి తెనుగు బిడ్డల భాగ్యాలు దిద్దు గాక !
మన ఇంటి మహాలక్ష్మికి పెళ్ళిలో ఎన్ని నగలుకొన్నా మనం పెట్టిన పట్టుచీరే అన్నింటికంటే గొప్పది . అత్తవారింట అడుగుపెట్టే కొత్త పెళ్ళికూతురికిచ్చే ముచ్చటైన కానుక చీరే . అత్తమనసు , కోడలి కొత్త కాపురం ఆ చీరతోనే తెలిసిపోతుంది . అన్నయ్యలు అభిమానంగా నిజానికి ఆలికి కూడా తెలియకుండా చెల్లెలికి మురిపెంగా ఇచ్చే బహుమతి చీర . చీర ధర ఇంట్లో తగ్గించి చెప్పే అన్నయ్యలు తెలుసు మరి నాకు . మన ఇంటి శుభాలకి ముత్తైదువులకిచ్చే కానుక చీర . చీర ఒక చిన్న వస్తువు కాదు మన ఇంటి సంప్రదాయం , గౌరవం .
Sceptic గారూ . . . , పాపం నిత్యానంద స్వామి ! ఒక నెల క్రింది వరకూ రాజభోగాలు అనుభవించాడు , ఎందరో భక్తులను కూడ గట్టుకున్నాడు . చక్కగా డబ్బున్న భక్తులనుండి సేకరించిన విరాళాలతో ఎన్నో ఆశ్రమాలను స్తాపించి ఆశ్రమాల ముసుగులో తన ఇహలోక _____________________ఈ రోజు నుంచి నేను బ్లాగుల్లో అధమపక్షం కనీసం వందకు తగ్గకుండా కామెంట్లు వ్రాయాలనుకుంటున్నాను . మరీ ముఖ్యంగా ఈ మధ్య తీరికలేక నేను కామెంట్లు వ్రాయడం మానేసాను . అందుకని
న్యూఢిల్లీ : ( శ్రీశైలం ఆన్ లైన్ టీవీ ) రాష్ట్ర నేతలకు కొంచెంలో ప్రమాదం తప్పిపోయింది . మంత్రులు ప్రయాణిస్తున్న కింగ్‌ఫిషర్ విమానంలో సాంకేతిక లోపాలు ఏర్పడటంతోడంతో . . విమానాన్ని వెనక్కి మళ్లించారు . ఆ సమయంలో రాష్ట్ర ఎంపీలు లగడపాటి రాజగోపాల్ , రాయపాటి సాంబశివరావు , అంజన్‌కుమార్ , అసదుద్దీన్ ఓవైసీ , గజల్ శ్రీనివాస్ విమానంలో ఉన్నారు . తర్వాత వారు వేరే విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు . కింగ్‌ఫిషర్‌కు చెందిన విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన కాసేపటికే కాక్‌పిట్‌లోని ఒక అద్దానికి పగుళ్లు ఏర్పడ్డాయి . దీంతో పైలట్ చాకచక్యంగా విమానాన్ని వెనక్కు తిప్పి ఢిల్లీకి తీసుకువచ్చారు . ా తర్వాత మరొక విమానంలో ప్రయాణికులను హైదరాబాద్‌కు పంపించారు . శుక్రవారం రాత్రి 8 . 30 సమయంలో మంత్రులు , మిగతా ప్ర యాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు . కింగ్‌ఫిషర్ లాంటి విమానాల్లో ఎటువంటి లోపాలు తలెత్తడం ఎంపీ అంజన్‌కుమార్ అసహనం వ్యక్తం చేశారు . పాల్గొన్నారు
ఒక వెబ్ పేజీ ని తగినట్టుగా డిజైన్ చెయ్యడం అంత సులభం కాదు . తగిన రంగులు , ఫాంటులు , టెక్స్ట్ సైజులు వాడకపోతే అసలు నప్పదు .
2వ రకాతు పూర్తి చేసిన తరువాత తషహ్హుద్ ( 2వ లేక 4వ రకాతు చివరిలో కూర్చోవటం ) కొరకు కూర్చుంటాను . ఫజ్ర్ లో చేసే రెండు రకాతుల వంటి నమాజు చేస్తున్నట్లయితే , ఇదే అంతిమ తషహ్హుద్ అవుతుంది . అయితే మగ్రిబ్ లో చేసే మూడు రకాతుల నమాజులో నేను తషహ్హుద్ నుండి లేచి మరల ఇంకో రకాతును పూర్తి చేసి , చివరిగా అంతిమ తషహ్హుద్ కొరకు కూర్చుంటాను . ఇలా మూడు రకాతుల నమాజులో రెండు సార్లు ( 2వ మరియు చివరి మూడో రకాతులలో ) తషహ్హుద్ కొరకు కూర్చుంటాను .
మోనార్క్ . . . అంటే ఆ పదానికి అర్ధం నాకు తెలియదు గాని ఇప్పుడు నేను రాసేది అలాంటి వ్యక్తీ గురించే . . .
సిద్ధార్థ్ ఫుల్ పింక్ డ్రెస్ లో ఉన్న పోస్టర్ చూశాక కూడా మొండితనం కాకపోతే ఎలా వెళ్ళారండీ మీరు ? తగిన శాస్తి జరిగిందన్నమాట . మీకు నా సానుభూతి !
శర్మ చిరునవ్వుతూ నావైపు చూసి కళ్ళజోడు సర్దుకున్నాడు . " అదిగాదు డాట్టరు గారూ , ఈ జైలుసిచ్చలు ఈళ్ళనేదో బాగు సేత్తాయంటారే . ఇట్టాటి ఎదవల్ని ఎన్నాళ్ళుంచినా బాగుపడరు . చూసారుగా మూడంటే మూడ్రోజులు . మళ్ళా తయారు . ఎదవ ! "
ప్రతి గాలివానకు … ఒక ఇంద్ర ధనుస్సు ప్రతి కన్నీటికి … ఒక చిరునవ్వు ప్రతి ఆలోచనకు … ఒక వాగ్దానం ప్రతి కష్టానికి … ఒక ఫలితం ప్రతి సమస్యకు … ఒక పరిష్కారం ప్రతి నిట్టుర్పుకు … ఒక మధురగానం ప్రతి ప్రార్ధనకు … ఒక దీవెన ఆ భగవంతుడు అందరికి ప్రసాదించు గాక .
దళిత నాయకులపై ప్రత్యేక సంచికలు : ప్రజాసాహితి పత్రికలో దళిత సమస్యల గురించి సంపాదకీయాలు రాయడమే కాదు . అప్పుడప్పుడు చారిత్రక సందర్భానుసారంగా డా / / బి . ఆర్ . అంబేద్కర్ , జ్యోతిరావ్ పూలేల గురించి ప్రత్యేక సంచికలను ప్రచురించారు . దళిత కవి గుర్రం జాషువాపై కూడా ప్రత్యేక సంచికను వెలువరించారు . నిజానికి దళితులకు , దళిత సాహిత్యానికి పై ముగ్గురూ సిద్ధాంతకర్తలు వంటివారు . వాళ్ళ గురించి ప్రత్యేక సంచికలు ప్రచురించటమంటే , ప్రజాసాహితి పత్రిక కూడా దళిత మౌలిక సిద్ధాంతాలను , సిద్ధాంతకర్తలను గుర్తించినట్లే ! అయితే ఆ సిద్ధాంతాన్నీ , ఆ సిద్ధాంత కర్తలను వర్గ దృక్పథంతో సమన్వయించటం మరంత గుర్తించదగింది !
హొమ్ » జిల్లాలు » హైదరాబాద్ » రాష్టప్రతి పర్యటన సందర్భంగా
2 . Situation 1 : నేను చిన్న కంప్యూటర్ సెంటర్ పెట్టుకున్నాను . దానికి కావాల్సిన డబ్బు నేనే సమకూర్చు కున్నాను . వ్యాపారం అభి వృద్ది చెందటం తోటి కొందరి ఉద్యోగస్తులను నియమించి పని జరుపుతున్నాను . వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ది చెందు తోంది . నా ఉద్యోగస్తులు , మా మూలాన మీ వ్యాపారం పెరిగింది కనుక లాభాలు సమంగా పంచుకున్దామంటున్నారు . నాది స్వార్ధం నా కోసం పెట్టుకున్న వ్యాపారం . సెంటర్ మూసెయ్య మంటారా లేక వాళ్ళు చెప్పినట్లు వినమంటారా ?
అత్యద్భుతంగా వ్రాసారండీ . మొదటి ఉత్పలమాల మూడవపాదానికి చేరేదాకా పూర్వకాలపు హిమపాత వర్ణ ననుకున్నాను , అక్కడ కారు కనబడడం వల్ల మీ దారి వే రని గమనించాను . మళ్ళీ పదవ పద్యం వరకూ అమెరికా వర్ణనేమో అనుకున్నాను - కానీ మీ దేశం వే రని తెలుసుకున్నాను . ఆరు పాదాల సీసం చదివే సరికి మీరు ఎటు తీసుకుని వెళితే అటు వెళ్ళడానికి సిధ్ధమై కూర్చున్నాను . అంతలోనే మీ పద్యధార ముగియడంతో , ఇదిగో ఇక్కడకొచ్చి పడ్డాను . మీకు నా వందనాలివే .
రత్నానాం మణ్డనాయ ప్రభవతి నియతోద్దేశలబ్ధావకాశం వహ్నేర్దార్వాది దగ్ధుం నిజజడిమతయా కర్తుమానన్దమిన్దోః యచ్చ ్తౖత్రెలోక్యభూషావిధిరఘదహనం హ్లాది వృష్య్టాశు తద్వో బాహుల్యోత్పాద్యకార్యాధికతరమవతాదేకమేవార్కతేజః 30
తోటి నటులతో డేటింగ్ చేస్తే ప్రచారానికి ప్రచారంతో పాటుగా బోలెడెన్ని అవకాశలు , దాని వెంటే కాసిని వాణిజ్య ప్రకటనలు రావడం పరిపాటే .
" ఓర్నీ పిల్ల , ఇన్నాల్లు పట్టిందా నీ బెరుకు పోటానికి ! " అన్నాడు నవ్వుతూనే పాప వంక చూస్తూ . పట్టుకుంటే మాసిపోయే తెల్లటి రంగుతో నిండుగా గాలి ఊదిన రబ్బరు బొమ్మలాగుంది . లేతగోధుమరంగు కళ్ళూ , బంగారపు రంగు జుట్టూ , చేతిలో ఎలుగుబంటి బొమ్మా .
అదీ కాక ఒక్క కారెక్టర్ ని తీసుకుంటే దానికి సంబంధించిన చిన్న చిన్న వివరాలను కూడా ఎంతో జాగ్రత్తగా చెయ్యాల్సుంటుంది . ఉదాహరణకి ఆ కారెక్టర్ నడుస్తున్నప్పుడు జుట్టు ఎగరడం , నవ్వినప్పుడు పెదాలు సాగడం , ముఖ కవళికలు , నడక లో సోయగాలు మొదలయినవి . నమ్మరా ఓ సారి ష్రెక్ లాంటి సినిమా ఒకటి చూడండి . అందుకే నేను ఎప్పుడు ఈ ఆనిమేషన్ సినిమాలు చూసినా అవి నన్ను అబ్బురపరుస్తాయి .
పోలెండ్ లో జననం ( 1923 ) , అందమైన పట్ణం క్రాకో లో నివాసం . చాలాకాలం పాటు సంపాదక బాధ్యతలు చేపట్టింది . నోబెల్ ( 1996 ) తో పాటు ఎన్నో పురస్కారాలు ఈమెను వరించాయి . శిల్పిలా చెక్కుతుంది పదాలను ; అలా అని ఒక మూసలో పడిపోదు . శైలీవైవిధ్యం ఎక్కువ , ఈ కారణంగానే అనువాదాలు కష్టం . ఈమెకు నాగరికత పొడ గిట్టదు , ఈసడిస్తుంది తన కవితల్లో . " పరవశంలొ , నిరాశలో నన్ను గుర్తించగలవు " అని చెప్పుకొంటుంది . అసాధారణ మైనదే కవిత్వం , అందులో ప్రతీ పదానికి తనదైనటు వంటి అర్థం ఔచిత్యం ఉన్నాయని విశ్వసిస్తుంది .
పొద్దున్నే బద్దకాన్ని వదిలించుకుని ఆరోగ్యం కోసం కొందరు , ప్రక్రుతి అందాల్ని ఆస్వాదించడానికి కొందరు , ఆ వంకన బయట కొచ్చి ఇంట్లో మాట్లాడుకోలేని సెల్ ఫ్రెండ్స్ తో సొల్లు కబుర్లకి కొందరు , బతకడం కోసమే నడవడానికి కొందరు ఇలా రక రకాల వ్యక్తులు తారస పడుతుంటారు మార్నింగ్ వాక్ లో . పొద్దున్నే బ్రిడ్జి ముందు సైకిల్ ఆపుకుని తన వుపిరిని అ బుడగల్లో వూది దారాలతో గుత్తులు గా తాయారు చేసుకుని అమ్ము కో డానికి సిద్ద పడే ఆ బక్క బలూన్ అబ్బాయి ఎన్ని బుడగలు అమ్ముకుంటే జేవన పోరాటం లో ఆ రోజుకి సరి పడ సంపా యించ గలుగు తాడో ? అనుకుంటూ ముందుకు సాగి పోతుంటే . దూరం గా నా వైపే నడుచు కుంటూ వచ్చే ఆ అందమైన అమ్మాయి , ఒక చేతి లో కుక్కని పట్టు కున్న గొలుసు , ఇంకో చేతి లో చెవి దగ్గర పట్టు కున్న సెల్ , ఆమె కుక్క ప్రక్రుతి పిలుపు కోసం బయటకోచ్చిందా లేక సెల్ మాట్లాడుకోడానికి ఆ వంక నా బయట కొచ్చిందా ? ఏమో వొర కంట చూసే ఆమెని దాటు కుంటూ ముందుకి పొతే బ్రిడ్జి కింద నుంచి అదే టైం కి దుసుకుంటూ పోయే ap express ఎంతొ మంది ఆశల్ని మోసుకుంటూ మరి కొందరి ఆప్తుల్ని విడ దీస్తూ , నాకు టాటా చెపుతూ వెళ్లి పోతూ వుంటుంది . బ్రిడ్జి దిగ గానే ఒక తండ్రి కూతురు నడిపే టిఫిన్ బండి అక్కడే వేడి వేడి గా పూరిలు తినేసి ఆకు కూరలు అమ్ముకోడానికి తన సైకిల్ మీద హుషారు గా వెళ్లి పోయే కుర్రవాడు . బతుకు పోరాటం లో ప్రతి వాడు పొద్దున్నే తమ వంతూ పోరాటానికి సిద్ద పడుతుంటే , ఆ బ్రిడ్జి పక్క నా ఫుట్ పాత్ మీద రాత్రి తాగిన మందు దిగక అదే ఎండలో పడుకునే ఆ బవిరి గడ్డం విగత జీవి . ఆ పూరిల బండి పక్కనే రోజూ ఆవురావురు మంటూ తినే ముష్టి దాన్ని చూసి మొదటి రోజు నేను ఆ బండి వాడికి ఆమె డబ్బులు ఎంతయ్యిందో చెప్పు ఇచ్చేస్తా అంటే లేదు బాబు నేను రోజు వూరికే ఆమెకి టిఫిన్ పెడతా అంటే అతని దాతృత్వం ముందు నా అహం కారం చిన్న బోయింది . ఆ బండి వరకు వెళ్లి రిటర్న్ అయి పోతా రోజూ . రిటర్న్ లో రోడ్ పక్క నే వున్న అమ్మవారి గుడిలో ఆ టైం కే పూజ చేసే అర్చకుడు , నమస్కరించి ముందుకు వెళితే ముగ్గు వేస్తూ నవ్వుతు చూసే కోడల్ని ఏంటే ఎంతసేపు రోడ్ మీద నీ ముగ్గు ముచట్లు అంటు అరిచే అత్తగారు కంగారు పడుతూ లోపలికి పారి పోయే ఆ కోడలు . ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే జీవితాంతం తిన వలసిన తిండి ని తొందర పడి ముందే తినేసి దాని వల్ల వచ్చిన వుబకాయం తద్వారా పెళ్ళికాని వైనం తో అది తగ్గించు కోడానికి ఆ పార్క్ చుట్టూ ప్రదక్షిణాలు చేసే ఆ లావు పాప , ఆమె కి రక్షణగా ఎప్పుడు మీద పడి కరిచేద్దమా అని చూసే వూర కుక్క లాంటి పెంపుడు కుక్క , అది ఎవర్ని కరవ కుండ దాని మెడకి ఒక dome , దాటుకుని వెళుతుంటే అప్పుడే మంచి నీళ్ళు విప్పటానికి వచ్చే మీసాల వాటర్ వర్క్స్ వుద్యోగి , వీ ల్లన్దర్నీ దాటుకుని ఇంటికి చేరగానే పెరట్లో నా కోసం ఎదురు చూసే మొక్కలు , వాటి మద్య నేను ఆ రోజు కి పుడ్చవలసిన పంది కొక్కు బొక్కలు వెరసి నా నడకలో మిగిల్చిన అనుభూతులు .
ఇక , అసలు ఆన్లైన్లో నేనేం చేస్తూ ఉంటానో ఇంట్లో చెప్పను ( వాళ్ళుగా తెలుసుకుంటే వేరే సంగతి ) . కానీ , మా అమ్మా , నాన్నా , తమ్ముడు - ఈ ముగ్గురితో గడిపిన నా జీవితం వల్లే నేను దీన్ని రాసి పూర్తి చేయగలిగాను అని నమ్ముతున్నా కనుకా , ఇప్పుడు నాన్నుంటే ఎంతో సంతోషించి ఉండేవారు అని కూడా నమ్ముతున్నా కానుకా , ఏం అనుకున్నా , అనువాదం చేసాను కాబట్టి లెక్క ప్రకారం ఇదే నా మొదటి పుస్తకం కనుకా ( మీ టైం బాగోకుంటే , భవిష్యత్తులో ఎప్పుడో ఒరిజినల్తోనే దిగబడతా ఏమో , ఎవరికెరుక ! ! ! ) , పుస్తకం వీళ్ళకి అంకితం ఇచ్చుకోవడం నా కనీస హక్కు అని కూడా నమ్మేస్తున్నా !
కొత్తపాళీగారు అది బాలు గొంతు అవునో కాదో నేను పట్టించుకోలేదు . కాని మీరు పెట్టిన రికార్డు వింటుంటే మాత్రం నా చెవుల్లో తుప్పు వదిలిపోయింది . నా చిన్నప్పుడు రోజులు గుర్తుకువచ్చాయి . ఈరోజుల్లో తెలుగు ఎమ్మే చేస్తున్నవాళ‌్లు కూడా ఇలా పాడలేరు , చెప్పలేరు అని అనిపిస్తోంది . పాళీగారు నేను ఈమధ్యనే కొత్త బ్లాగు పెట్టాను . మీకు వీలయితే ొకసారి చదవండి . తెలుగు సాహిత్యంలో నాకున్న పరిజ్ఞానాన్ని , భావాలను కొంచెం ప్రదర్శించాను ఇందులో . www . manognaseema . blogspot . com
" SAMASYA PURANAMU " యుద్ధమూ - శాంతి నా కవితలు నా రాతలు సినిమా సినిమాలు సమస్యాపూరణం సామాజికం సాహిత్యం భక్తి అనుభవాలు అవీ ఇవీ శుభాకాంక్షలు ఆధ్యాత్మికం ఆర్ధికం కబుర్లు కథ కథలు కవిత కవితలు కవిత్వం కీర్తనల గ్రంథము కీర్తనలు రాజకీయం రాజకీయాలు రచనలు తెలంగాణ తెలంగాణా తెలుగు తెలుగు సాహిత్యం తెలుగు బైబిలు హాస్యం పద్యం పాటలు పోరాటాలు పుస్తకం ప్రేమ జీవితం జ్ఞాపకాలు చందమామ చమత్కార పద్యాలు వీడియోలు వ్యాసాలు congress FUN General Issues POLITICS Specials Telugu
ఎందుకో గానీ ఈ మధుర గీతం చాలా మందికి తెలియదు . గానీ ఈ పాట నేను సంవత్సరానికి ఒక్క సారైనా విని తీరుతాను . ఎమ్ . యస్ రామారావు గారి అతి మధురమైన , అదో రకమైన మత్తుతో వుండే గొంతుతో పాడిన లాలి పాటలా వుండే ఈ పాట మీరూ వినండి మరి .
తనకి జీవమిచ్చిన రైతుకి అప్పుడే మొలకెత్తిన గింజ తెలిపే కృతజ్ఞత ఎంత మనోహరమైన దృశ్యమో ఊహించకోగల పాఠకునికే తెలుస్తుంది . ఇలాంటి కవితల్లో అస్పష్టత ఉండదు . సంక్లిష్టత చాలా తక్కువ . పాఠకుడు చెయ్యవలసినదల్లా , కవితలోని పదాల రేఖలతో , వర్ణాలతో , ఆ దృశ్యాన్ని తన మనస్సులో చిత్రించుకోవడమే .
తాడేపల్లి గారూ , మీరు ఎవరికి గురువుగారు అయినా కాకపోయినా నాకు గురువుగారు , మిమ్మల్ని పల్లెత్తు మాటైనా అనలేను - తమలపాకు పక్కనబడెయ్యండి . . . . సాఫ్టువేరు రంగానికి , అందులోనూ సాంకేతికతకు సంబంధించి నేనూ మీలాటివాడినే కాబట్టి ఆ ప్రశ్న . నిజంగానే అడుగుతున్నా - ఒక బ్లూ ప్రింటు సిద్ధం చేస్తే . . . జనాలను తోలుకొచ్చే బాధ్యత నెత్తికెత్తుకోడం కష్టం కాదనే ఇప్పటికీ నా అభిప్రాయం . . . . మరి మీ సైటు ఏమిటో అని అడగవచ్చు మీరు - ఉత్త హెచ్ . టి . ఎం . ఎల్ , పీ . డి . ఎఫ్ లు తప్ప నాకు సాంకేతికంగా అంత ప్రజ్ఞా లేదు . . . . సాఫ్టువేర్లోనే ఉన్నా , నా వేరు వేరు , సాఫ్టుకు సంబంధించింది కాదు . . . . . . . అయ్యా అదీ సంగతి . . . . వంశీ
మొత్తం మీద రాజకీయాల్లోకి వచ్చినా , ఇప్పటి వరకు ఆశించిన విజయాలు దక్కని చిరు మనస్సు మళ్ళీ సినిమాల వైపు మళ్ళుతున్నట్లే ఉంది . రెండు రోజుల ముందు అభిమానుల సమావేశంలోనూ , ఇవాళ రోబో పాటల విడుదలలోనూ ఆయన మాటలు అందుకు నిదర్శనం . అందుకే , " . . . సామాజిక స్పృహనూ , వ్యాపారాత్మకతనూ సమపాళ్ళలో మేళవించగల నేర్పు ఒక్క శంకర్ కే ఉందంటూ " చిరు ప్రశంసల జల్లు కురిపించారు . మళ్ళీ అవకాశం వస్తే శంకర్ దర్శకత్వంలో చేయడానికి సిద్ధమన్న సూచనలు బాహాటంగానే చెప్పేశారు . రోబో ట్రైలర్ భావోద్వేగంతో మాట్లాడుతున్న చిరును చూసి , రజనీ సైతం లేచి నిలబడి చప్పట్లు కొట్టారు . " . . . మీరు సినిమాల్లో మళ్ళీ నటించాలి . ఇది నా అభ్యర్థన . . . " అని కూడా రజనీ మైకులో చెప్పేశారు . అక్కడి దాకా తెచ్చిన చిరు వెంటనే " అంతా భగవంతుడి ఇచ్ఛ . చూద్దాం " అన్న పద్ధతిలో పైకి చూస్తూ , సైగ చేశారు .
హైదరాబాద్ , జూన్ 27 : జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా ఎంటి కృష్ణబాబు బాధ్యతలు చేపట్టాక బదిలీల పర్వానికి తెర లేచింది . ముగ్గురు అదనపు కమిషనర్లకు శాఖలను మారుస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు .
రచన : : శ్రీనివాసరాజు సమయం : 1 : 13 ఉ 12 ఆభిప్రాయాలు మీ అభిప్రాయం చెప్పండి
కుటుంబరావు చిన్నప్పుడు అభ్యాసము కోసం ఎన్నో వ్యాసాలను కథలను రాసి చింపివేసేవారట . వెల్స్ , కానన్ డాయిల్ వంటి వారి రచనలను అప్పట్లో తెనాలిలో చదివారట . పాతతరం వారిది వెనుక చూపు , కొత్త తరం వారిది ముందు చూపని వారి భావన . మూఢ నమ్మకాలు , ఛాందసుల వర్తన కొకుకు అసహ్యం వేసేవి . అన్ని విషయాలలో శాస్త్రీయ పరిజ్ఞానము , దృష్టి ఎక్కువ . భావావేశం తక్కువ . పాటలలో అనవసరంగా స్వరాలను లాగడం , ఆడంగి ధోరణులు పట్టవు . రచనలో నిరంకుశుడైనా వ్యక్తిగతంగా ఎంతో సౌమ్యమూర్తి . నా కథలను ఎంత తొందరగా చదివి అంత తొందరగా అవతల పారేస్తే మంచిది అనేవారట కొకు . ఎస్పెరాంటోను , రష్యన్ భాషలను నేర్చుకొన్నారట కొకు . అభిమానులతో చక్కగా మాట్లాడేవారట కొకు . తన సాహిత్యపు విలువలు తన జీవితంలో ప్రతిఫలించేటట్టుగా నడుచుకున్న మనిషి మా తండ్రి కుటుంబరావు అంటూ రోహిణీప్రసాదు తన ప్రసంగం ముగించారు .
చాలా కాలం పట్టింది . ఇన్నాళ్ళకి కొద్ది కొద్దిగా ధైర్యం వస్తోంది పెద్దలకి కవితలు వినిపించాలంటే ! రమ గారూ ! అర్థం అయింది మీ మాట ! వేలూరిగారూ ! కృతజ్ఞతలు . శారదా పూర్ణ
అదెలాఉన్నా మళ్ళీ చెన్నై వెళ్లాలన్న నా కోరిక తీరుతున్నందుకు చెప్పలేనంత ఉత్సాహంగా ఉంది . హరితో ఇదివరికెన్నో సార్లు ' ఒకసారి వెళ్ళొద్దాం ' అన్నాను . " ఇప్పుడెవరున్నారక్కడ ? ఐనా చూద్దాంలే , " అంటాడు . వాయిదా వెయ్యడమంటే , ' వద్దు ' అని సామరస్యంగా చెప్పడం . ఇప్పుడు ఆఫీస్‌టూర్ కాబట్టి ఏమంటాడో ! వీక్లీ టార్గెట్ పూర్తిచేసి ఇంటికెళ్ళేసరికి తలలో యుద్ధం జరుగుతున్నంత నొప్పి .
ఇపుడు తారా లోకమెంతైన మెరసినది ఇపుడు పాతాళమే యెదయెదకు విచ్చినది ఈవేళ ఏకాదశీ త్రియామ యామినీ ధ్వాంత మీ గొంతులో కొంత అడగినది
వారు పెద్దయ్యాక కూడా ఇంకా వారు పాత పద్యాన్నే నమ్మసాగారు . . .
@ రాజు గారూ , మనకూ ఇండియాలో వున్నంత వరకూ బురదలో వున్న పందికి మల్లే అది బురద అనే తెలియదు . తీరా ఈ దేశాలను చూశాక " అయ్యో మనం ఎప్పుడు ఇలా మారేది " అని అనిపిస్తుంది . ఆ ఆవేదనే ఇదంతా . వీళ్ళ కంపునంతా మనం నేర్చుకుంటున్నాం గానీ వీళ్ళ నుంచీ మంచి మాత్రం నేర్చుకోవట్లేదు .
తన తండ్రి వద్ద తెలుగు , సంస్కృతంతో పాటు శాస్ర్తీయ సంగీతాన్ని కూడా ఈయన అభ్యసించారు . సంగీతంపెై వెలువడిన వెంకటాముఖి సుప్రసిద్ధ గ్రంథం చతుర్‌దండి ప్రకాశికైను అధ్యయనం చేశాడు . కావలసినమేరకు వేదవేదాంగ , పౌరాణిక ధర్మ గ్రంథాలపరమైన జ్ఞానాన్ని కూడా సంపాదించగలిగారీయన . ఒకసారి ఇంటికి అతిధిగా వచ్చిన చిదంబరనాధ యోగి బాలునిగా ఉన్న ముత్తుస్వామి దీక్షితార్‌ను కాశీకి తీసుకెళ్ళారు . అక్కడ ముత్తుస్వామికి ఉపాసనా మార్గాన్ని బోధించారు . వారణాసిలో ఉన్నప్పుడు ముత్తుస్వామి ఉత్తరదేశపు సంగీతమైన హిందూస్తానీని కూడా నేర్చుకున్నారు .
గతమంతా తలపుకి రాగానే ఉద్వేగం ఉప్పెనలా ముంచుకొచ్చింది . ఆపదలో ఆదుకుని , మారు తాళంతో తలుపులు తెరిచి అతనింట్లో జొరబడినా మమ్మల్ని క్షమించి , మేం అతన్ని దూరంగా విసిరి పారేసినట్టుంచినా సరే , ' మనం మనం బరంపురం ' అంటూ , ఏ బంధుత్వం లేకపోయినా మా తమ్ముడి పెళ్ళి బాగా జరగాలని దేవీ పూజ చేసిన వాడూ , ' కష్టాలొస్తాయి అందరికీ , తోడుండాలి ఒక్కరికీ ' అన్న కృష్ణమూర్తి …
ప్రతీ మగువలోనూ ఏదో ఒక శక్తి అంతర్లీనంగా ఉంటుంది . కానీ అందరు మహీళ లోనూ ఉండే ఒకే ఒక్క గొప్పగుణం , స్త్రీ తత్వం . అటువంటి గొప్ప భావాన్ని కాదనుకుంటూ తమ తమ ఉనికిని మరచిపోయి ప్రఘల్బాలు పలికే మహిళలు ఇలాంటి వారిని చూసి ఏమనుకుంటారో ? ?
ఆత్మ చారుత కోరుకొన్నట్టి ప్రియుని యందు సౌభాగ్య ఫలవంతమైన గౌరి వెలుగుమలూరు మొగమ్ముతో చిలిపి నవ్వు చెలగ ముద్దాడె కౌగిట జేర్చి నన్ను
అట్లా చూస్తే మాది ప్రేమవివాహం కూడా కాదేమో . ఇష్టవివాహం అనొచ్చేమో .
" నష్టమంటే నష్టంకాదు కానీ " చెప్పాలా వద్దా అని ఒక్క క్షణం ఆలోచించుకుని మళ్లీ మొదలెట్టింది " బిడ్డ ఇక్కడ పుడితే ఆటోమేటిగ్గా అమెరికన్ సిటిజన్ షిప్ వస్తుంది "
అయితే మత్తేభాలకి , శార్దూలాలకీ , మిగిలిన వాటికీ ప్రతిపదార్థాలు సరిపోతాయి . మరి ఈ " వెర్స్ లిబర్ " కుర్రాళ్ళ సంగతి ? దీనికి వ్యాఖ్యానాలు రాయించాలా ? శ్రీశ్రీ , లేకపోతే , మహాప్రస్తానం విషయంలో ఇంతకు ముందు " మిరియాల కషాయం " పట్టించడానికి ప్రయత్నం జరిగింది కదా ? " ముక్కస్యముక్కానువాదాలు " జరగకుండా చూసుకోవడం చాలా అవసరం .
లక్ష్మి గారూ ! మాది రాజమండ్రి దగ్గర పల్లే . కాని పాపికొండలు చూడలేదు . కళ్ళకు కట్టినట్టు చూపించారు . కృతజ్ఞతలండీ .
( అప్పటికే మన్నవరానికి వై యెస్ ఆర్ పురమని పేరుపెట్టేసి , పరిశ్రమ స్థలం వద్ద బోర్డులు కూడా పెట్టేశారుట . ఈ సంగతి ఆయనకి తెలియదేమో మరి ! )
ఆధునిక జీవితంలో మనిషి సంతోషంగా జీవించాలంటే చాలా సమస్యలను ఎదుర్కోవాలి . వీటిని ముఖ్యంగా మూడు రకాలుగా విభజించవచ్చు . కొన్ని వ్యక్తిగత సమస్యలు , ఇంకొన్ని సామాజిక పరమైన సమస్యలు , మరికొన్ని వృత్తిపరమైన సమస్యలు . అనేకమైన సవాళ్ళు , సమస్యలు ఎదురయ్యే సమాజంలో సంతోషంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి . మనం అనుకున్నట్లు మనచుట్టూ ఉన్న మనుషులు , పరిస్థితులు ఉండవు . వాటికి తగ్గట్టుగా మనల్ని మనం సర్దుబాటు చేసుకోవాలి . ' Ability is something but test is everything ' అన్నారు . test [ . . . ]
నాకు అర్దం అయ్యిందేమిటంటే , ఎవ్వడైనా నా భార్యని ముద్దు పెట్టుకుంటే , నేను వెళ్ళి వాడి బార్యని ముద్దు పెట్టుకుంటే సరి పోతుందన్న మాట . కాకపోతే నేను చేసేటప్పుడు ప్రక్కన ఓ పిల్లవాడిని పెట్టుకుంటే సరిపోతుందన్నమాట .
ఉద్యమాభిమానులు అయినా కాకున్నా ఇప్పుడు సీట్లు పొందినవారు , రేపు గెలిస్తే , టిఆర్‌ఎస్‌తోనే ఉంటారన్న గ్యారంటీ ఏమీ లేదు , ఉద్యమపరమైన అటువంటి ఒత్తిడి ఏదీ టిఆర్‌ఎస్ సృష్టించలేదు . అభ్యర్థిత్వాలు కొనుక్కున్నవారు రేపు విధేయతలను అమ్ముకోరని ఎవరు చెప్పగలరు ? నిన్న కాంగ్రెస్ అసమ్మతిని రగిలించి , ఫిరాయింపులను సాధించినట్టే , రేపు తెలుగుదేశం మాత్రం చేయదని ఎందుకు అనుకోవాలి ? ఇది మహాకూటమి గెలిస్తే సంగతి . అలా కాక , మరోవిధంగా జరిగితే , తెలంగాణవాదం పరిస్థితి ఏమిటి ? తెలుగుదేశం మాత్రం గట్టెక్కి , టిఆర్‌ఎస్ ఓడిపోతే పరిస్థితి ఏమిటి ? తెలంగాణ నాయకత్వం మీద నిస్ప ృహను ఓటర్లు బలంగా వ్యక్తం చేస్తే , తిరిగి ఉద్యమం రాజుకోవడానికి ఎంతకాలం పడుతుంది ?
నల్ల కళ్లజోడు . ఆ రోజు వలెంటైన్ డే ! సూటు , బూటు , నల్ల కళ్లద్దాలు , తలపైన టోపీ , పెట్టుకొని , బయలుదేరాను నేను , యాత్రా విశేషాలు చూద్దామని . అలా వెళ్లడమంటే నాకు చాల ఇష్థం . నన్ను నేను దాచుకొని , ఇతరులని దగ్గరగా చూడ వచ్చని . వాళ్లు నలుగురు_____ ముంబయి మహా నగరం లోని నాలుగు కేంద్రాలనుంచి , తమ తమ ' వలంటైన్ ' లతో సహా , ' గేట్ వే ఆఫ్ ఇండియా ' కి వచ్చారు . వారిలో మూడు జతలు , కొత్తగా పెళ్లైనవారు . మరొక జంట ప్రేమికలు . గేట్ వే ఆఫ్ ఇండియా ' నుంచి ఎలిఫెంటా గుహలు , చూడడానికి 120 రూపాయల టికెట్లు కొనుక్కొని , లాంచిలో బయలు దేరారు . నేను కూడా వాళ్లతో పాటు లాంచి ఎక్కాను . సముద్రం మీద గంట సేపు లాంచిలో ప్రయాణం . జంటలందరూ తోసుకొంటూ , లాంచీలో అంచులకుండే కర్ర బెంచీల మీద కూర్చొనేందుకు పోటీ పడ్డారు . నేను మాత్రం లాంచీ మధ్య భాగంలో వేసిన ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొన్నాను . కర్ర బెంచీల మీద సీటు సంపాదించాక ఆ నాలుగు జంటలూ , కాసేపు సముద్రాన్ని చూసి , ఆ తరువాత ఎవరి ధోరణిలో వారు పడ్డారు . భర్తల చేతులు , భార్యల నడుములు మీద , భార్యల చేతులు భర్తల భుజాల మీద , ఎదురెదురుగా కూర్చొని , ఒకరి కళ్లల్లో ఒకరు చూసుకొంటూ , నాలుగు కళ్లూ రెండు , రెండు మనసులు ఒకటిగా చేసుకొనే ప్రయత్నంలో ఏవేవే స్వీట్ నథింక్స్ చెప్పుకొంటున్నారు . ఇక ప్రేమికుల జంట సరే సరి ! వాళ్లు పెళ్లయిన వారిని మించి పోయారు . ఒకరినొకరు కలుసు కోవడానికి వచ్చిన అరుదైన అవకాశం వృధా కాకూడదనే , తొందరలో ఉన్నారు వాళ్లు . ప్రియురాలు ప్రియుని ఒడిలోనే ఒరిగింది . అతడామె పయ్యెద చాటున దాచిన అందాల్ని , తన సొంతం చేసుకోవాలని , తనకేసి , అదుము కొంటూ , లోకాన్ని మరచి కూర్చొన్నారు . నేను కుర్చీలో కూర్చొని వాళ్ల ప్రణయ చేష్టలని కుతూహాలంతో చూస్తున్నాను ! ఆ రోజు ప్రేమికుల దినం ! విహార యాత్రకని వచ్చిన జంటలందరిదీ అదే కార్యక్రమం ! చాల రొమాంటిక్ గా , హంసలా సాగుతున్న ఆ పడవ , మెల్లగా ఎలిఫెంటాస్ చేరింది . అక్కడ చిన్న రైలుబండి ఉంది . దానికి రెండు వైపులా ఇంజను , మధ్యలో బోగీలు ఉన్నాయి . ఒక్కొక్క బోగీలో ఆరుగురు మనుషులు ఎదురెదురుగా కూర్చొనేందుకు సీట్లు ఉన్నాయి . కొండ మీద గుహలు చూసేందుకు వచ్చిన వారిని , ఆ కొండ దిగువకి చేర్చే రైలుబండి అది రాను పోను టికెట్టు పది రూపాయలు . దాదాపు 300 గజాల దూరం తీసుకెళ్తుంది . నా పరిశీలనలో ఉన్న నాలుగు జంటలూ , రెండు కూపేలలో కూర్చొన్నారు . నేను వాళ్లలో ఒకనిలా ప్రక్కనే కూర్చొన్నాను . రైలు ప్రయాణంలో వాళ్లలో వాళ్లు మాట్లాడుకోవడం వల్ల అందరూ తెలుగు వాళ్లేనని అర్థమయింది . ఒక జంట మటుంగా నుంచి , ఇంకొక జంట డొంబివిలీ నుంచి , మరొక జంట పరేల్ నుంచి వచ్చారు . ఇక ప్రేమికుల జంట నవీ ముంబయి లోని వాశి నుంచి వచ్చారు . ప్రవాసంలో ఒక తెలుగు వాడు , ఇంకొక తెలుగు సోదరుణ్ని , చూస్తే చెప్పలేనంత ఆనందం , ఆత్మీయత , కలుగుతాయి . అందుకే కాబోలు ఆ నాలుగు జంటలూ రైలు దిగీ దిగగానే కలిసి పోయారు నాకు కూడ కుతూహలం పెరిగి వాళ్ల వెనకాలే నడవ సాగాను . కొండ ఎక్కడానికి మెట్లు ఉన్నాయి . మెట్ల రెండు వైపులా దుకాణాలు ఉన్నాయి . ఆ దుకాణాలలో అన్నీ ఫేషన్ సామాన్లే ! సౌందర్య సాధనాలు , గాజులు , పూసల దండలు , బొమ్మలు , చిత్రాలు , బేగులు , టీ_షర్టులు , జీన్స్ దుస్తులు , 20 రూపాయల దగ్గర నుండి 2000 రూపాయల వరకు విలువ చేసే వస్తువులు అమర్చి ఉన్నాయి . చూసేవారికి కనువిందు చేస్తున్నాయి . కొందామని ధర అడిగిన వారికి మాత్రం ఎలక్ట్రిక్ షాక్ ఇస్తున్నాయి . అక్కడ ఎక్కువ అమ్మకం అయ్యేవి తినుబండారాలే ! చిప్స్ , చాట్స్ , అరటి పళ్లు , రేగు పళ్లు , చింత పండు బొట్టలు , కారం అద్దిన మామిడి కాయ ముక్కలు , ఉప్పద్దిన దోసకాయ ముక్కలు , బఠానీలు , సెనగలు , వేరు శెనగ పప్పు పొట్లాలు , ఇంకా వాటర్ బాటిల్ లు . నాలుగు జంటలు , అక్కడ ఆగి , తెగ పోటీ పడి కొన్నారు వాటిని . మెట్లమీద నుంచి నడుస్తూ , కబుర్లు చెప్పుకొంటూ , ఒక అమ్మాయి చిప్స్ పేకెట్ తీసింది . అంతే ! ఎక్కడ నుంచి చూసిందో , ఒక కోతి వచ్చి చిప్స్ పాకెట్టుని ఎత్తుకు పోయింది . " హేయ్ ! హఠ్ , హఠ్ " అంటూ విదిలించిన మరొక అమ్మాయి చేతిలోని అరటి పండుని ఇంకో కోతి ఎత్తుకు పోయింది . అంతే తినుబండారాలన్నీ , బేగులలో చేరి పోయాయి అంత వరకూ నవ్వుతూ కేరింతలు కొడుతూ మెట్లు ఎక్కుతున్న వారందరూ సీరియస్ గా ఆ కార్యక్రమాన్ని కొనసాగించారు . మోత్తం మీద 163 మెట్లు ఎక్కి , కొండ మీదకి వచ్చారు . అక్కడ ఎంట్రన్స్ టికెట్లు 5 రూపాయలు ఇచ్చి కొని , గుహల వైపు చూడడానికి వెళ్లారు . నేను కొంత దూరంలో వాళ్ల మాటలు వింటూ , మౌనంగా ఎంజాయ్ చేస్తూ , వెనకాలే వెళ్లున్నాను . మొదటి గుహలో మహేశ మూర్తి ఉంది . ఆ ఒక్క గుహలోనే మూర్తులున్నాయి . ఇంకా అర్థనారీశ్వర దుర్గ మూర్తులు ఉన్నాయి . జంట లన్నీ అక్కడ నుండి కదిలి , బయటి కొచ్చారు . ఇంకా రెండవ గుహ , మూడవ గుహ దగ్గరకి వచ్చారు . బయట మొదటి గుహ దగ్గర ఏదో అలజడి వినిపించింది . ఆ జంటల లోని ప్రేమికుడు , తన దగ్గరున్న బైనాక్యులర్ తీసి అటువైపు చూసాడు . " ఏంటండీ ! ఏమయింది ? " " ఏం జరుగుతోంది అక్కడ ? " " ఏదయినా గొడవ జరుగుతోందా ? " ప్రశ్నల వర్షం కురిసింది . నింపాదిగా జవాబిచ్చాడతను . " సైనికులు గొడవ చేస్తున్నారు . అయితే ఈ సారి వయలెన్స్ లేదు . వాళ్ళలో ప్రతీ ఒక్కరికీ అర్థమయింది . సైనికులని పిలువబఢేవారు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు ! వలైంటైన్ డే భారతీయ సంస్కృతికీ , సాంప్రదాయానికీ విరుద్ధమని ఆ రాజకీయ పార్టీ నాయకుల అభిప్రాయం ! దానికి నిరశన ప్రదర్శించేందుకు వారు వారి పార్టీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు . ఆ సైనికులు మొదట్లో దౌర్జన్యం ( వయలెన్స్ ) చేసే వారు , ప్రేమికుల మీద రాళ్లు విసిరే వారు , లాఠీ ఛార్జ్ చేసేవారు , బస్సులు , బళ్లు తగుల బెట్టేవారు . అయితే ఈ మధ్య కోర్టులు ఇటువంటి వయలెన్స్ నిరశనలకి , తిరుగుబాట్లకి విరుద్ధంగా తీర్పులివ్వడంతో , వాళ్లు మధ్యే మార్గంగా నిరశన తెలియ జేస్తున్నారు . " వాళ్లు ఏం చేస్తున్నారు ? " జంట లందరి ముఖాల్లోనూ టెన్షన్ కనిపించింది . " నల్లని రంగు ముఖాలకి రాస్తున్నారు . " అన్నాడతను . బైనాక్యులర్ని వదిలి . " ఇప్పుడేం చేయాలి ? వాళ్లు ఇటు వైపే వస్తారు . ఈ కొండ చరియల్లో పారిపోవడానికి కూడా దారి లేదే ! " " ఏం చేయాలి ? " ఎక్కడికి పోవాలి ? " " ఏది దారి ? ! " ఆ ప్రేమికుడు షడన్ గా అన్నాడు , " ఒక ఉపాయం ఉంది ! ఇప్పటి కిప్పుడే అమలు చెయ్యాలి . " " ఏం చేయాలి ! ! " అతను తన బైనాక్యులరుకి ఉన్న ఎర్రటి తాడు విప్పేసి దాన్ని నాలుగు ముక్కలు చేసాడు . " అమ్మాయి లందరూ ఈ తాళ్లు తీసుకొని అబ్బాయిల చేతికి రాఖీ లాగ కట్టాలి . " అన్నాడతను . " రాఖీ కట్టాలా ? ! అదెలా ? ? " అమ్మాయిలందరికీ సందేహం కలిగింది . " ఇందులో వీలు కాని దేముంది ! మాటుంగా అమ్మాయి డొంబివిలీ అబ్బాయికి , డొంబివిలీ అమ్మాయి మాటుంగా అబ్బాయికి , అలాగే పరేల్ అమ్మాయి వాశి అబ్బాయికి , వాశి అమ్మాయి , పరేల్ అబ్బాయికి , రాఖీ కడితే సరి పోతుంది కదా ? " అతని పథకం వెంటనే అమలు జరిగింది . అమ్మాయిలు రాఖీలు కడుతూ ఉండగా , సైనికులు వచ్చేసారు ! " క్యా హోరహా హై ఇథర్ ! " చూసారు వాళ్లు . " అరే ! రక్షా బంధన్ ! ఆజ్ కా దిన్ క్యోం ? " " అరే భయ్యా ! హమ్ లోగ్ భాయి బహన్ హై ! ఏ బాత్ ఆప్ లోగ్ కైసే సమఝేంగే ? " " ఠీక్ హై ! భాయిసాబ్ ! " అంటూ వెళ్లి పోయారు వాళ్లు . సైనికులు వెళ్లి పోగానే వాళ్ల ముఖాలలో ఆనందం తాండవించింది . పెద్ద అవమాన భారం నుండి తప్పించుకొన్నామన్న ఆనందం ! వాళ్లలో ఒకతను కాస్త దూరంలో నిల్చొని చూస్తున్న నన్ను పిలిచాడు . " ఏం కావాలి ? " తెలుగు లోనే ప్రశ్నించాను , వాళ్లు ఆనందించారు . " మా ఫొటో ఒకటి తీయండి . " ఒక కెమేరా నా చేతికిస్తూ , అన్నాడతను . నల్ల కళ్లజోడు తీసి జేబులో పెట్టుకొని , ఫొటో తీయడానికి , కెమేరాలోంచి చూసాను . ఎంత చక్కగా ఉన్నారీ జంటలు ! ఇది వరకు ఇలా కనిపించ లేదు ! అనుకొంటూ . " వాళ్లు అందరూ ఇప్పుడు స్పష్టంగా కనిపించడానికి , ఇంతకు ముందు కనిపించక పోవడానికి , కారణం నా మనసుకి కమ్మిన నల్ల పొరేనని , తెలిసాక నన్ను నేను దాచుకోవాల్సిన అవసరం కనబడలేదు ! నా ' కళ్ల జోడు తీసి జేబులోనే ఉంచేసాను . * * * * * * * * * * * * * * * * *
" నువ్వు తప్పితే నేనింకెవ్వరితోనూ ఆ పరీక్ష చేయించుకోనమ్మా . చదువుకోని మా మాటలు ఎక్కువ చదూకున్న వాళ్ళు పట్టించుకోకూడదు . రేడిఏషన్ ఇవ్వాల్సినా నువ్విస్తేనే నే వస్తా ఇక్కడకు . ఏం చెయ్యమంటావో చెప్పు . ఈ బల్లెక్కాలా . ఈ చొక్కా ఎక్కడ పెట్టమంటావు . పాంటు సాంతం ఊడదియ్యాలా ? "
మన దేశం లోనే మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ రైలు ' కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ' పట్టాలు తప్పిందిట ! కేవలం 18 మందే మరణించారట ! యెందుకంటే , అప్పుడు అది గంటకి 60 కి . మీ . వేగంతోనే వెళుతోందట ! మరి దాని పూర్తి వేగం ( గంటకి 120 కి . మీ . తో మొదలు పెట్టారు - ఇప్పుడు 140 కి . మీ . కి పెంచినట్టున్నారు ) తో వెళుతూ వుండగా ( అమంగళము ప్రతిహతమగుగాక ! ) అయితే అని అడగద్దు . మన రైల్వేలకే ప్రతిష్ఠాత్మకమైన కోరమండల్ ప్రవేశపెట్టగానే - అతి తక్కువ స్టేషనులలో ఆగుతూ , మధ్య స్టేషనులలో ఆగకుండా వెళ్ళిపోతుంటే జనం నోరు వెళ్ళబెట్టి ' అబ్బా ! కోరమాండల్ ' అంటూ చూసేవారు ! ( వెంటనే మనసులో ప్రశ్న - అంత స్పీడులో అది గానీ … … … అనుకొని చెంపలు వేసుకునేవారు పాడు ఆలోచన వచ్చినందుకు ) . ఇప్పటివరకూ యెప్పుడూ జరగరానిది జరగలేదు ! మరి ఇప్పుడెందుకు - అంటే సమాధానం - లాలూగారి కక్కుర్తీ , మన బ్యూరాక్రసీ ! దాదాపు 50 యేళ్ళుగా యెప్పుడూ వినని ' పట్టాలు విరిగిపోవడం ' గురించి 21వ శతాబ్దం మొదట్లో విని , ఆశ్చర్య పోయేవాడిని ! చిన్నప్పుడు సైన్సు లో లోహాల సంకోచ వ్యాకోచ లక్షణాల గురించి చెపుతూ , ' రైలు పట్టాల్కి ఒక దానికీ , ఇంకోదానికీ యెడం వుంచుతారు యెందుకు - అవి వ్యాకోచించి , ఒకదాని నొకటి గుద్దుకొని ప్రమాదాలు జరుగుతాయని ' అని చెప్పేవారు మా మేష్టారు ! కొత్త టెక్నాలజీ అంటూ , పట్టాలని వెల్డింగ్ చేయడం మొదలు పెట్టారట - అందుకని పట్టాలు విరిగి పోవడం మొదలు పెట్టాయి ! మరి ఆ టెక్నాలజీని యెక్కడ సంపాదించారో , దాని మీద సరైన అధ్యయనం జరిగిందో లేదో మన బ్యూరాక్రసీయే చెప్పాలి . అక్కడనించీ , కోకొల్లలుగా ' త్రుటిలో తప్పిన ' రైలు ప్రమాదాలూ , గ్యాంగుమన్ సమయ స్పూర్తి వల్ల తప్పిన రైలు ప్రమాదాలూ , లైన్మెన్ కి అవార్డులు ప్రకటించడాలూ లాంటి వార్తలు పేపర్లలో చదువుతూనే వున్నాము . వీళ్ళ కక్కుర్తికి పరాకాష్ట - ' సైడ్ మిడిల్ బెర్త్ లు ' బిగించడం ! ఒక రైలు పెట్టెలో , తొమ్మిది ' సెల్స్ ' గా , ఒక్కోదాంట్లో అడ్డంగా యెదురెదురుగా మూడేసి చొప్పున ఆరూ , నిలువుగా రెండూ కలిపి , యెనిమిది బెర్తులతో మొత్తం 72 బెర్తులూ , యేదో ఒక పక్క మరో మూడు బెర్తులూ కలిపి , పెట్టెకి 75 చొప్పున బెర్తులు వుంటాయి . ఇప్పుడు , తొమ్మిది సెల్స్ లో ఒక్కొక్కటి చొప్పున 9 సైడ్ మిడిల్ బెర్తులు బిగించడంవల్ల - తొమ్మిది మంది మనుషులు - ఒక్కొక్కరూ సగటున 50 కే జీల బరువున్నా , దాదాపు అర టన్నూ , బెర్తుల , వాటి గొలుసుల , బరువూ , వాళ్ళ లగేజీ బరువూ కలుపుకుంటే , కనీసం ఒక టన్ను బరువు పెరుగుతుంది కదా ? మరి చక్రాలూ , ఇరుసులూ , బ్రేకులూ - వాటి పై యెంత భారం పడుతోంది - అని అధ్యయనం చేశారా ? అదీ మన బ్యూరాక్రసీయే చెప్పాలి . బొగ్గు ఇంజన్లతో రైళ్ళు నడిచేటప్పుడు మామూలు ఇంజన్లతో నడిచే రైళ్ళకి గరిష్ఠంగా యేడు లేక ఏనిమిది పెట్టెలు వుండేవి ! కెనడా ఇంజను తో నడిచే మెయిలూ , జీటీ , సర్కార్ లాంటి రైళ్ళకి గరిష్ఠంగా పది / పన్నెండు పెట్టెలు వుండేవి . అప్పట్లో చక్రాల క్రింద నిప్పురవ్వలు రావడం , చూడడం చాలా అరుదు ! అది కూడా మెయిలూ అవీ రాత్రి పూట పూర్తి వేగంతో వెళుతున్నప్పుడు - యెవరోగానీ చూసేవారు కాదు . ఇప్పుడు చిన్న రైలుకి కూడా 18 పెట్టెలూ , పెద్దవాటికి 23 నించి 27 వరకూ తగిలిస్తున్నారు . వాటిల్లో కనీసం 9 నించి 14 వరకూ స్లీపరు క్లాస్ పెట్టెలూ , రెండైనా ఏ సీ ( III ) పెట్టెలూ వుంటున్నాయి . అంటే , కనీసం 15 నించి 20 టన్నులు బరువు పెరుగుతోంది ఈ సైడ్ మిడిల్ బెర్త్ ల వల్ల . మరి పట్టాల లో యేమైనా మెరుగుదల వుందా ? కాంట్రాక్టర్ల అధికారుల అవినీతి తో బల్లాస్ట్ గా వాడే కంకర దగ్గరనించీ , ఒకచోట వేసిన దానినే బిల్లు తినేశాక ఇంకో చోటు కి తరలించి బిల్లులు పెట్టుకోవడం లాంటి లీలలతో నానాటికి తీసికట్టు నాగంభొట్టు అన్నట్టుంది వాటి స్థితి . చక్రాలనించి నిప్పు రవ్వలు వచ్చినప్పుడు , పట్టాల వెల్డింగ్ కి ఉపయోగించిన లోహం కరిగిపోయి , చక్రాలకి చుట్టుకుని చక్కగా మండుతూ , బోగీలని అంటించేస్తోంది ! అందుకే స్లీపర్ క్లాస్ లో మొదటి లేదా చివరి బోగీలకీ , వాటి పక్కనే ఏ సీ బోగీలకీ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి - - బ్రేకులు వేసినప్పుడు వాటి చక్రాలకే వత్తిడి యెక్కువగా వుండి , నిప్పులు బాగా యెక్కువగా వచ్చి ! ట్యూటికోరిన్ లో తనకు బహూకరించిన మేకపిల్లని ఢిల్లీలో తన మనవడికి ఇచ్చి , అది మళ్ళీ తల్లికోసం బెంగ పెట్టుకుందని ఆ తల్లిని వెతికించి , దాన్ని మళ్ళీ ప్రత్యేక ఏ సీ బోగీలో ఢిల్లీ కి పంపించిన మన మేనేజిమెంటు గురు లాంటి వాళ్ళ నడ్డి విరగదన్నాలా వద్దా . ఆలోచించండి !
హైదరాబద్ పై " పోలీసు చర్య " జరిగి ఈ సెప్తెంబర్ 17కు 60 యేళ్ళు నిండుతున్నాయి . ఈ " పోలీసు చర్య " ను విమోచన , విలీనం , విముక్తి , ఆక్రమణ , దాడి , దండయాత్ర పేరిట చరిత్రకారులు , విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు . ఈ భిన్నభిప్రాయలు ఒక్క దగ్గరకు తీసుక వచ్చి పాఠకులు తమ అవగాహనను పెంచుకునేందుకు వీలుగా " తెలంగాణ హిస్టరీ సొసైటీ " " 17 సెప్టెంబర్ , 1948 : బిన్న దృక్కోణాలు " అనే పుస్తకాన్ని ప్రచురించింది . ఈ అంశంపై ఇటివల వెలుగు చూసిన వాస్తవాలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి దీనిపై విస్తృత స్థాయిలో చర్చ జరగాలని " తెలంగాణ హిస్టరీ సొసైటీ " భావిస్తున్నది . ఈ సందర్భంగా " తెలంగాణ విద్యావంతుల వేదిక ( టి . వి . వి ) " " తెలంగాణ హిస్టరీ సొసైటీ ( టి . హెచ్ . ఎస్ ) " ఒక పుస్తక పరిచయ - చర్చ సదస్సును మన వరంగల్ లో నిర్వహిస్తున్నాం . మా ఈ ప్రయత్నంలో భాగస్వాములు కావాల్సిందిగా మిమ్మల్నందరిని కోరుతున్నాం .
నాకెందుకో నా ఊహలలో , ఎదురింటి , పక్కింటి , వెనకింటి వార్ల పిన్నిగార్లు , ఆంటిగార్లు అందరు వంటి నిండా నగలతో మావారికి బోల్డూ థాంక్స్ చెప్పేస్తున్నట్లుగా . .
@ ఫణి ప్రసన్న కుమార్ గారు లక్ష్మణుడి పూరణ అదిరింది . రెండో పాదం లో యతి చూడండి . అరిహరి ? నాకర్ధం కాలేదండి . అరి కి తాటకి కి అన్వయమా కామేశ్వరరావు గారు , ఒకటి మీరిచిన్న సమస్య ఐతే , రెండవది ఫణి గారు ఇరికించి పూరించారు మొదటి పాదం లో : " పూతన కనెన్ దామోదరున్ " అని - కనెన్ పన్ చేసాననుకున్నాను , పన్ డలేదని మీరు చెప్పిన తర్వాత అర్ధం అయ్యింది . పూరణ కోసం సమస్యలు ఇచ్చి ఇచ్చి అలవాటై మీరు అలవోక గా వ్యాఖ్యలలో గూడా సమస్యలు సృష్టిస్తున్నారు . నేనిప్పుడు 2x2 = 6 చూడవలిసిన అవసరమేర్పడింది . భవదీయుడు ఊకదంపుడు
" నేను తీసుకొస్తాను . . వొదిన చెయ్యగలనంటే … అన్నయ్య లిద్దరూ వాళ్ళ దగ్గర కుదరదన్నారు … "
ఈరోజు పరశురాముడు జయంతి . జమదగ్ని , రేణుకాదేవి ల చివరి కొడుకు పరశురాముడు . జమదగ్ని చాలా కోపం గలవాడు . అతని భార్య రేణుక తనపతిభక్తితో రోజు నదికి వెళ్ళి తనే స్వయంగా మట్టి కుండచేసి ఇంటికి నీళ్ళుతెచ్చేది . ఒకరోజు రేణుకాదేవి చిత్రరధుడనే రాజును చూసింది . ఆరోజు ఆమె నీళ్ళుతేవటానికి కుండ తయారు చేసినా కుండ తయారుకాలేదు . నీళ్ళు తేలేకపోయింది . ఏమి జరిగింది అని దివ్యదృష్టితోచూడగా రేణుక చిత్రరధుని చూడటంవల్లే పాత్రతయారుకాలేదని గ్రహించి తనపుతృలును పిలిచి తల్లిని నరకమన్నాడు . వారందరు తమవల్లకాదన్నారు . [ . . . ]
ఈ నెల 20 , 21 తేదీలలో పులివెందులలో కాంగ్రెస్ యువనేత జగన్మోహన్ రెడ్డి . . .
సన్యా ఊఁ హుఁ ! ప్లెజరంటే నిజఁవే లెండి గానీ … . అక్కడలవాటయిపోయేక ఇక్కడ కష్టం లెండి …
శ్యామశాస్త్రి , త్యాగరాజు మంచి స్నేహితులని సాంబమూర్తి గారు ' ది గ్రేట్ కంపోజర్స్ ' లో రాస్తూ ఓ కథ చెప్పారు . శ్యామశాస్త్రికి తాంబూలం అలవాటు ఎక్కువగా ఉండేది . అస్తమానూ ఉమ్మి వేయడానికి కూర్చున్న చోటునుండి లేచి బయటకు వెళ్ళేవాడు . త్యాగరాజుకి ఎంతో శుభ్రతా నియమాలున్నా శ్యామశాస్త్రి వచ్చినప్పుడు మాత్రం ఆయనకు మినహాయింపుండేదని చెబుతూ కథలా రాసారు . ఇలాంటి కథలకి ఆధారాలేమిటో తెలీదు . శ్యామశాస్త్రి ఆలయ అర్చకుడు . అలా పదిమంది ముందూ తాంబూలం నమిలినా , అక్కడే ఉమ్మి వేసే ప్రవర్తనుంటుందని ఎవరూ భావించరు . ఇలాంటి కథలు పదిమందికీ చెప్పడంలో ఆంతర్యమేమిటో తెలీదు . ఈ కథ ఇద్దరు వాగ్గేయకారుల్నీ ఓ మెట్టు క్రిందకే దింపుతుందని నా అభిప్రాయం . ఈ ఒక్క సంఘటనా తప్ప , సంగీత పరంగా వేరే సంఘటనలు ఎవరూ ఉటంకించలేదు . త్యాగరాజు చరిత్ర రాసిన వెంకటరమణ భాగవతార్ కానీ , ఆయన కొడుకు కృష్ణ భాగవతార్ కానీ , మిగతా శిష్యులు కానీ ఎవరూ శ్యామశాస్త్రి గురించి రాయలేదు .
సం . క్రౌ . అంబరగంగా చుంబితపాదః పదతలవిదలిత గురుతరశకటః కాలియనాగశ్వేలనిహంతా సరసిజనవదలవికసితనయనః కాలఘనాలీ కర్బురకాయః శరశతశకలితరిపుశతనివహః సంతతమస్మాన్ పాతు మురారిః సతతగసమజవఖగపతినిరతః
మిత్రులు ప్రేమ స్వరూప్ వివరాలు " కలం స్నేహితులు " శీర్షికన ఏ పత్రికలో వచ్చిందో గుర్తులేదు .
మా బెజవాడ అందమైన నగరం . సహజసిద్దంగా కొండ కొనలమద్య ఏర్పడింది . ఎంతో ప్రశాంతంగా , ఆహ్లాదంగా సహజ సౌందర్యం తో మా నగరాన్ని చూడటానికి రెండు కళ్ళు చ . . .
ఆ విధంగా వర్ణాంతర వివాహం జరిగి భాస్కర్ అరుణ ఒకటవుతారు . కాని తన జాత్యాహకారం తో తన సంసారాన్ని అరుణ పాడు చేసుకుంటుంది . అయితే అరుణకి కనువిప్పు కలిగే విధంగా ఆవిడగారి కజిన్ సిస్టర్ అమల మతాంతర వివాహం చేసుకుని కూడా చక్కగా సంసారం సాగిస్తుంది . అమల వుద్యోగం మాని ఇంట పట్టున వుంటు అందరి మంచి చెడ్డ చూస్తు , వ్రతాలు నోములు చేసుకోవడం రంగనాయకమ్మ గారికి నచ్చలేదు . ఆర్ధిక స్వాతంత్రం ప్రతీ ఒక్కరికి అవసరమని చెబుతారు . ఒక సంధర్బంలో అరుణ అమలని " నువ్వు బొట్టు పెట్టుకోవడం మీ ఆయనకి ఇష్టం లేకపోతె ఏమి చేస్తావు " అని అడుగుతుంది . దానికి అమల ద్వారా చాల గొప్ప సమాధానం చెప్పిస్తున్నాను అనుకుని రంగనాయకమ్మ గారు ఇలా అనిపించినందుకు బాధపడ్డారు . " మానెస్తాను అక్కా ! ఒకరికి ఒకరు అనుగుణంగా వుంటేనె కదా , సంసారం నడిచేది " . అనుగుణంగా వుండడం అంటే భర్త మతానికి భార్య మతం బానిస అవ్వడమా అని ప్రశ్నిస్తారు . బహుశా అమలకి తన మత విశ్వాసాల కంటె భర్త మీద వున్న ప్రేమానురాగాలు ఎక్కువ అని అనుకోవచ్చు కదా ? ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మతాంతర , వర్ణాంతర వివాహం చేసుకునే ముందే ఇటువంటి విషయాలు ముందుగా మాట్లాడుకోవాలని ఆవిడ సూచిస్తారు . కాకపోతె నాకు ఒక అనుమానం . కమ్యూనుజం పై రంగ నాయకమ్మ గారి అభిప్రాయాలు మారినట్టె , మతం పైన వ్యక్తుల అభిప్రాయం మారవచ్చు కదా ! పెళ్లికి ముందు మాట ఇచ్చినట్టు పెళ్లి తరువాత మాట నిలుపుకోవడం అవుతుందా ? ఒక ఉదాహరణ . పెళ్లి అయిన జంటలో భర్తకి తాగుడో , పేకాటో లేక సిగరెట్లో అలవాటు అయ్యింది అనుకోండి , భార్య మానమని అడగడం , ఇంకా చెప్పాలంటె అతడి ఆరొగ్యం కోసం పోరు పెడితే ఇది " నా స్వవిషయం , ఇలా పోరు పెట్టడం నా స్వేచ్చకి భంగం కలిగించడమే ! నీ పెత్తందారితనం కి నా నమస్కారం " అని అతడు విడిపోతానంటె ఎవరైనా సమర్ధిస్తారా ? మతం కూడా ఒక మత్తు లాంటిదే కదా ! దానిని మానమని ఒకరికి ఒకరు చెబితే అది మంచికే అని ఆలోచించాలా లేక ఇది నా వ్యక్తిగత స్వేచ్చకి సంబందించిన విషయం అని వాదనకి దిగాలా ? నాకు తెలిసి కమ్యూనిష్టులు మతానికి వ్యతిరేకం కదా ! మరి రంగ నాయకమ్మ గారి అబిప్రాయం ఏమయ్యి వుంటుంది ? ముందుగానె చెప్పినట్టు ఈ ప్రశ్నలన్ని నాకు తెలియక అడుగుతున్నవే గాని , విమర్శిద్దామని కాదు , తెలిసిన వారు తెలియబరిస్తే సంతోషిస్తాను .
కలగలేదు . రాజకీయాలతో మనకేం సంబంధం అని మామూలుగానే తన పని తాను
వొచ్చే జన్మంటూ వుంటే నేను తన హృదయాన్నై పుట్టాలని కోరుకునే వాడిని . తన మనసులో , శరీరంలో భాగవైపోడానికి . నిజవే గుండె రక్తాన్ని పంప్ చెయ్యడం తప్ప మరేదైనా చేస్తుందనుకోవడం నిజంగ పిచ్చితనవే . మెదడు ఇంకా మనసుకి కొచం దగ్గరేవో . కానీ మెదడు కూడా , వొక జీవకణ సమూహవే . వొక భౌతికవైన అస్థిత్వం కలదే , మనసులా చేతికి దొరకంది కాదు , కళ్ళకి కనపడనిది కాదు , ఊహలో మాత్రవే వుండేది కాదు . Brain may be the engine behind it … , but mind is conscious of itself .
" కట్నవాఁ ? అది తీసుకోని వాణ్ణే చేసుకుంటానని మా నాన్నకి తెగేసి చెప్పేసాను . నాకీ కట్నాలూ అవీ అంటేనే అసయ్యం . కట్నం వద్దన్న వాణ్ణే పెళ్ళి చేసుకోవాలనుకున్నాను . అంతే ! మావయ్యగారికి నేను చేసింది నచ్చుతుంది . కదండీ ? " అంటూ నా వైపు తిరిగి అంది .
వేణు శ్రీకాంత్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు ! ఈ పెళ్లి అయిన వాళ్ళందరికీ కుళ్ళు మేమే ఎందుకు బాధలు పడాలి అని అందరిని ఆ సాలె గూడు లోకి లాగటానికి ట్రై చేస్తుంటారు మీరేమాత్రం కంగారు పడద్దు , take your own time : ) @ భాస్కర్ గారు ఏమిటి అల్బని నుంచి న్యూయార్క్ జంప్ చేసారా ?
ఇటీవల వెలుగులోకి వచ్చినవి … డిసెంబర్ 4 , 2007వ సంవత్సరంలో … ఈ గుహాసముదాయంలో క్రీస్తుశకారంభానికి చెందినదిగా బావిస్తున్న ఒక బ్రహ్మలిపితో ఉన్న శాసనం లభ్యమైంది . ఈ శాసనం ద్వారా పలు చారిత్రక సంఘటనలు వెలుగు చూశాయి . నాడు తెలుగులో నూతనంగా రూపొందుతున్న తెలుగు నుడికారాలు , గుణింతాల రూపాలను ఈ చలువరాతి ఫలకం ఆవిష్కరించినది . ప్రసిద్ద బౌద్దాచార్యుడైన మిడిలకుడు అనే బౌద్ద సన్యా సి ఈ ఫలకాన్ని గుంటుపల్లి గుహలలో నివసించే బౌద్ద బిక్షులకు దానం చేసిన ట్లు చెబుతున్న ఈ శిలాఫలకంలో ప్రాృత భాషలో ఉన్నది . కేంద్ర పురావస్తు శాఖ ఆంధ్ర రాష్ట్ర విభాగం ఈ శిలా శాసనాన్ని వెలుగులోకి తెచ్చింది .
ఇక ఇప్పుడు తెలుగు దేశం పార్టీ మొన్న ఫ్యాబ్ సిటీ ఎం . వొ . యూ . గురించి విడుదల చేసిన కొన్ని వివరాలు మళ్లీ IMG స్టోరీ నే గుర్తుచేస్తున్నాయి . ఫ్యాబ్ సిటీ కోసం ఎన్నో నగరాలు పోటి పడితే చివరికి హైదరాబాద్ ఎంపిక అయ్యిందనీ , దాదాపు 13 , 500 కోట్ల రూపాయల పెట్టుబడి తో వచ్చే ఈ ఫ్యాబ్ సిటీ వల్ల 5 - 10 , 000 మందికి ప్రత్యక్షంగా , పది లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని 2005 ఫిబ్రవరి లో సెం ఇండియా అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు పత్రికలు రాశాయి . సెం ఇండియా ప్రమోటర్ వినోద్ అగర్వాల్ శక్తి సామర్ధ్యాల గురించి అనేక మంది అనుమానాలు వెలిబుచ్చినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు . సెం ఇండియా లో సాక్షాత్తూ చిప్ మేకర్ AMD పెట్టుబడి పెట్టనుందని వార్తా పత్రికలు రాశాయి . ఫ్యాబ్ సిటీ వచ్చేస్తుందని రియల్ ఎస్టేటు కంపెనీలు భూముల ధరలు ఆకాశానికి పెంచేశాయి .
ఇక మన తెలుగు కవులందరూ బిన్ లాడెన్ గుణగణ కీర్తనాలోలురవుతారు కాబోలు . : ) )
మీ ఆర్టికల్ పూర్తిగా చదవలేదు కాని పరిస్తితి అర్దం అయ్యింది . కొన్ని సంవత్సరాల కిందట నేను రిలయన్స్ విల్ల్ , టాటా ఇండికామ్ విల్ పోన్లు ఇంటర్నెట్ కోసం వాడేవాడిని . అవి రెండూ ఇలానే డబ్బులు గుంజేవి . చాలా స్లో . వాటి బిల్ల్ సిస్టం తప్పుల తడక . మీరు బిల్ల్ కట్టకుండా , డిటైల్డ్ బిల్ల్ ఇవ్వమని అడగండి . వాల్లు మీకు డిటైల్డ్ బిల్ల్ ఇవ్వలేరు . ఇస్తే దొరికిపొతారని . డిటైల్ద్ బిల్ల్ ఇస్తేనే అని భీష్మించుకుంటే సరి . ఒకవేల వాల్లు బిల్ల్ ఇచ్చినా అందులో చాలా తప్పులు ఉంటాయి . ఉదా ఒక నిమిషంలో ఐదు సార్లు కనెక్ట్ అయినట్టు వస్తుంది . ఒక నిమిసానికి ఐదు నిమిషాల బిల్ వెస్తారు ఈ టాటా / రిలయన్స్ లు బియస్యన్నెల్ విల్ల్ కార్డ్ తీసుకోండి . 250అన్‌లిమిటెడ్ నెలకు . అదే ఉత్తమమైన వైర్ లెస్
యేమైనా , జాజిపూల సువాసనల్తో మమ్మల్ని వూపిరాడకుండా చేసి యింకా యే పరిమళాల్తో సిద్దంగా వున్నారు .
ఈ దెబ్బతో బీసీ వోట్లన్నీ ఆయనకే . . ఆయన పార్టీకే ఏసేత్తారని అమ్మగారు సా సెడ్డ నమ్మకంతో ఈజీగా కుర్సీలో సారగిలబడ్డారని తేలుతోంది . మరి మా వోడు అలాపింటిలాపింటి ప్లాన్లేత్తాడనుకున్నారేటి . . ఈ దెబ్బతో ఎగస్పార్టీవోల్లందర్నీవోల్ మొత్తం సాపలో సుట్టేసి మా పెదచెరువులో ఇసిరేత్తాడు సూడండి …
ఈ జ్వాలాతోరణోత్సవాన్ని దర్శించడంతో పాటూ కార్తీక పూర్ణిమ నాడు " దీపదానోత్సవం " చేయవలెను . కార్తీక పూర్ణిమనాడు ప్రదోష సమయంలో శివాలయంలో గాని , వైష్ణవాలయంలో గాని దీపాలు వెలిగించాలి . అలయ గోపురద్వారం వద్ద గాని , దేవుడి సన్నిదిలో గాని , ఆలయ ప్రాంగణంలో గాని దీపాలను వెలిగించాలనీ … అలా వెలిగించిన వారి జన్మజన్మల పాపాలు హరింపబడి ఇహంలో సౌఖ్యం పరంలో మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రవచనం . ఇతరలు వెలిగించిన దీపాలు ఆరిపోకుండా చూడడం కూడా విశేష ఫలితాలనిస్తుంది . కాగా ఆవునెయ్యితో దీపాలు వెలిగించడం ఉత్తమం . అలా కుదర నప్పుడు నువ్వెలనూనెతో గాని , కొబ్బరి నూనెతో గాని , విప్పనూనెతో గాని వెలిగించవచ్చు . ఇవేవీ వీలుకాకుంటే ఆముదంతోనైనా దీపం వెలిగించవచ్చు . ఈ రోజు ఉసిరికాయ పైన ఆవు నెయ్యితో తడిపిన వత్తులను వుంచి దీపమును వెలిగించడం అత్యంత శ్రేష్ఠం . అరటి దొప్పలోగానీ , అకుమీద గానీ దీపం వుంచి నదులలో వదలడం కూడా పుణ్య ప్రదమే !
ఎవడో పనికిమాలినోడు వసున్నాడు అంటే , అంతకంటే పనికిమాలిన దొర & కంపెనీ రమ్మంటే వచ్చి రాళ్లేసె వాళ్లు మీకు " భావి భారత భవిష్యత్ నిర్దేషకులు " , భేష్ మా బాగా చెప్పారు . మౌలిక లోపం తీరనంతవరకూ 2010 అయిన , 2030 అయినా ఇలాగే ఉంటుంది . " ఆ లోపం తీరాలంటే ఏమి చేయాలంటారు , దొర కూతురుకు , కొడుకుకూ , అల్లుడు కు కూడా కాలమొక్కుతునాం 2010 లో , ఇంకెతమందికి కాల్మొక్కితే లోపం తీరుతుందో చెప్తారా ?
సంక్షేమ వసతి గృహాల్లో వార్డెన్ల చేతివాటం వల్ల విద్యార్దులకు పౌష్టికాహారం అందటం లేదు . బోగస్ విద్యార్దులను అదికంగా చూపించటం వల్ల ప్రబుత్వ ఖజానాకు గండిపడుతుంది . మెనూ సక్రమంగా పాటించటం , ఇతర సామాగ్రి అందేలా చూస్తే వసతి గృహాల్లో అవినీతిని అడ్డుకోవచ్చు . ప్రతి బోర్డరు మెస్ చార్జీలు , మెనూ , ప్రబుత్వం నుంచి తమకు దక్కాల్సిన సామాగ్రి గురించి లుసుకోవాల్సిన అవసరముంది . : స్పెషల్ హాస్టల్ విద్యార్దులకు ప్రతిరోజు రూ : 17 . 25 చొప్పున నెలకు రూ : 535 / - , సాధారణ విద్యార్దులకు ప్రతిరోజు రూ : 15 . 32 చొప్పున నెలకు రూ : 475 / - చొప్పున ప్రబుత్వం విడుదల చేస్తోంది . ప్రతి రోజు ఉదయం ఉపాహారం ( టిపిన్ ) , రెండు పూటలా బోజనం ఇవ్వాలి . వీటితో పాటు ప్రతి రోజు స్నాక్స్ , రెండు రోజులు పండ్లు , నెలలో రెండు సార్లు చికెన్ , వారంలో ఐదు రోజులు గుడ్లు , రోజు మజ్జిగ , ఆదివారం స్వీట్ ఇవ్వాలి . అదనంగా సబ్బుల బిల్లు కింద అబ్బాయిలకు నెలకు రూ : 50 / - , హేర్ కటింగ్ చార్జీలు రూ : 12 / - , మరియు అమ్మాయిలకు స్పెషల్ హాస్టల్ వారికి రూ : 75 + 15 / - , ఇతరులకు రూ : 75 / - ఇవ్వాలి . ప్రతి యేటా ప్రతి విద్యార్దికి నాలుగు జతల దుస్తులు , బెడ్ షీట్ , కార్పెట్ ఒక్కోటి చొప్పున ఇవ్వాలి . ఇంకా నోట్ బుక్స్ , స్టడీ మెటీరియల్ , క్వశ్చన్ బ్యాంక్ ( మాబడి , పాఠశాల ) ఇవ్వాలి . కొత్తగా చేరే విధ్యార్దులకు ప్లేటు , గ్లాసు అదనం . స్పెషల్ హాస్టళ్ళలో ఏడాది పొడవునా నలుగురు ట్యూటర్లను నియమించాలి . : సాంఘీఖ సంక్షేమ హాస్టళ్ళు - 70 % ఎస్సీ , 12 % హెచ్ సీ , 9 % బీసీ , 5 % ఎస్టీ , 4 % ఓసీ . గిరిజన సంక్షేమ హాస్టళ్ళు : - 70 % ఎస్టీ , 10 % బీసీ , 10 % ఎస్సీ , 5 % హెచ్ సీ , 5 % ఓసీ . : - ఎస్టీ హాస్టళ్ళలో ఈ బెడద ఎక్కువ . 300 కు పైగా బోర్డర్లున్న హాస్టళ్ళు ఎన్నో ఉన్నాయి . వీటిలో విద్యార్దుల సంఖ్యను అదికంగా చూపి వార్డెన్లు మెస్ చార్జీలు కాజేస్తున్నారనేది ప్రధాన ఆరోపన్ణ్ . నిర్నీత సంఖ్యలో విధ్యార్దులు హాస్టళ్ళలో ఉండకపోతే బోజన వేలలో అటెండెన్స్ పరిశీలించటం ద్వారా నిర్ధారించుకోవచ్చు . లేదా యస్ . టి . ఓ కార్యాలయాల్లో వార్డెన్లు సమర్పించే బిల్లు పత్రాలలో 1టు4 బ్యాలన్స్ షీట్ పత్రాలను సమాచార హక్కు చట్టం ద్వారా తీసు కునే వీలుంది . తద్వారా హాస్టళ్ళలో అక్రమాలకు బ్రేకులు వేయవచ్చు .
బట్ట తల నివారణకై నీలి వర్ణోదకమును వాడి , అద్భుత ఫలితాలను పరిశోధకులు వెల్లడించారు . నీలం రంగు సీసాల్లో నీళ్ళు పోసి , సూర్యరశ్మిలో ఉంచాలి . అలాంటి నీలి వర్ణోదకమును రెడీ చేసుకోవాలి . బట్ట తలకు ఆలివ్ ఆయిలును పట్టించి ఆ తరువాత నీలి వర్ణోదకమును వెంట్రుకల కుదుళ్ళకు మర్దన చేస్తూ , వాడిన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని ప్రకటించారు .
యూజ్‌నెట్‌ని ఒక వాక్యంలో నిర్వచించడం కష్టం . యూజ్‌నెట్ అంటే ఏ ఒక్క వ్యక్తి , సంస్థ యొక్క అధికారంలో లేని అతి పెద్ద ఆన్లైన్ చర్చావేదికల సమూహం అని చెప్పవచ్చు . ఈమెయిలు , ఫైళ్ళ మార్పిడి వ్యవస్థలు ( ఉదా : FTP ) , గోఫర్ ( Gopher ) లాంటి అప్లికేషన్లన్నీ ఆనాటి ఇంటర్నెట్ కి గల పార్శ్వాలనుకుంటే , యూజ్‌నెట్ ఆత్మలాంటిది . బ్లాగింగు , సోషల్ నెట్‌వర్కింగ్ , వెబ్ ఫోరంలవంటి వేదికలు ఏర్పడకముందు , దాదాపు పదేళ్ల క్రితం వరకూ కంప్యుటర్ సైన్సుకి సంబంధించిన అనేక పరిశోధనాంశాలు ముందు యూజ్‌నెట్‌లోనే ప్రతిపాదించబడ్డాయి , చర్చించబడ్డాయి . యూజ్‌నెట్ కంప్యూటర్ సైన్సుకి మాత్రమే పరిమితం కాలేదు . అనేక సామాజిక , సాంస్కృతిక , రాజకీయపరమైన చర్చలు యూజ్‌నెట్‌లో జరిగేవి . అనేక చారిత్రక సంఘటనలకి యూజ్‌నెట్ సాక్షిగా నిలిచింది . 1989 లో శాన్‌ఫ్రాన్‌సిస్కోలో భూకంపం వచ్చిన తరవాత ప్రపంచం నలుమూలలకీ సమాచారం చేరవేయడానికి యూజ్‌నెట్‌లో ఒక న్యూస్‌గ్రూప్ స్థాపించబడింది . కంప్యూటర్ సైన్స్ విషయపరంగా చూస్తే , వెబ్ ప్రవేశానికి పూర్వం యూజ్‌నెట్ లో జరిగినంత అద్భుతమైన , లోతైన , గాఢమైన చర్చా పరంపరలు వెబ్ ప్రవేశానంతరం నాకెక్కువగా కనిపించలేదనే చెప్పాలి . దీనికి కారణం వెబ్ 2 . 0 ఆవిర్భావంతో జరిగిన చర్చావేదికల వికేంద్రీకరణ అని నాకనిపిస్తుంది .
సుధాకర్ రాసే తెలుగు బ్లాగు శోధన 2006లో ఇండిబ్లాగర్స్ నిర్వహించిన పోటీల్లో , 2005లో భాషా ఇండియా వారు నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ తెలుగు బ్లాగుగా ఎంపికైంది . ఆయనదే మరో బ్లాగు Savvybytes ఆంగ్లంలో అత్యధికులు చదివే బ్లాగు . వీటిలో శోధనలో ఆయన ఆలోచనల్లోని పదును తెలుస్తుంది . Savvybytes సాంకేతికోపకరణాలు , సాంకేతికాంశాలకు సంబంధించినది . coolclicks ఆయన ఫోటో బ్లాగు . ఇవికాక ఆయన తక్కువ తరచుగా రాసే బ్లాగులు ఇంకో రెండున్నాయి . పొద్దులో సుధాకర్ నిర్వహిస్తున్న శీర్షిక వివిధ .
ఇలా శుద్ధ సంస్కృతమో , శుద్ధ వ్యావహారికమో / గ్రామ్యమో ఏదైనా సరే వాటివే ఐన రంగు , రుచి , వాసనా ఉంటాయి . తెలుగు కవితలో వీలైనన్ని తెలుగు పదాలు ఉంటేనే బావుంటుందని నా అభిప్రాయం .
చాలా మంచి విషయాలు చెప్పారు సోదరా . . చిక్ పీస్ అంటే మన బండ శనగలేనా అవి హైబ్రిడ్ అనీ వాటిలో గ్రోత్ హార్మోన్స్ ఉంటాయనీ మనకి అంత మంచిది కాదనీ చాన్నాళ్ళ క్రితం ఎపుడో ఎవరో అనగా విన్నాను . దీని గురించి నిజా నిజాలు ఏమైనా తెలుసా మీకు ?
గత శనివారం ఓ వ్యక్తిగత పని మీద తమిళనాడులోని నైవేలి వెళ్ళాల్సి వచ్చింది . చెన్నై నుంచి దక్షిణంగా సుమారు 200 కి . మీ దూరంలో ఉంటుంది . ఇక్కడ లిగ్నైట్ విస్తారంగా దొరుకుతుంది . లిగ్నైట్ అంటే పూర్తి స్థాయి బొగ్గుగా మారకుముందు రూపమన్న మాట . ఇందులో బొగ్గు కన్నా తేమ స్థాయి ఎక్కువగా ఉంటుంది . తమిళనాడులో ఉత్పత్తి అయ్యే థర్మల్ విద్యుత్ లో సగభాగం ( సుమారు 2500 మెగావాట్లు ) ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుందట .
కడప ఎంపీ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ఓదార్పు యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పడుతున్నారు . . .
శ్లో | | అస్యాం తిథౌ క్షయ ముపైతి హుతం న దత్తం తేనాఽక్షయేతి కథితా మునిభిస్తృతీయా | ఉద్దిశ్య య త్సురపిత్రూన్ క్రియతే మనుష్యైః తచ్చాఽక్ష్యయం భరత భారత సర్వమేవ | |
స్టెప్ 3 : వెంటనే క్రింది చిత్రంలోని విధంగా ఆ వీడియో నుండి ఆడియో సంగ్రహించబడుతుంది .
అట్టి శిశువుని కన్న అమ్మ కన్నా భాగ్యవంతులెవరిక ? ఆ అమ్మ లోని నిధులు వెదుక్కోవటానికి , అమెలో దాగున్న సాగరాల మధనం చేయటానికే కదా ఆ జననము , ఆ ఆగమనమూను . ఎంతడి అద్భుతమీచిత్రీకరణ , శిశుపరంగా మాతృమూర్తిని వున్నతంగా అన్యాపదేశంగా వర్ణించటం .
ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు తాము కట్టుబడి ఉన్నామని సిఎం చెప్పారు . చనిపోయిన వైఎస్ఆర్ ని వ్యక్తిగతంగా విమర్శించవద్దన్నారు . తాము కూడా ఎన్టీఆర్ ని వ్యక్తిగతంగా విమర్శించం అని చెప్పారు .
ఏప్రిల్ 2009 నాటికి ఈ నగర జనాభా 1 , 301 , 394 . 1971లో జనాభా ఉచ్చానికి చేరినప్పటి నుండి , నగర జనాభా సుమారు మూడవవంతు తగ్గింది . గత మూడు దశాబ్దాలుగా పారిశ్రామికీకరణం తగ్గుతూ ఉన్నందున జనము నగరపరిసర ప్రాంతాలకు తరలిపోవటమే దీనికి ముఖ్య కారణము . మిలన్ నగర ప్రాంతము , నగర పరిపాలక ప్రావిన్స్ రెండు దాదాపు ఒకటే . ఇది 4 . 3 మిలియను జనాభా కలిగి E . U . లోనే ఐదవ పెద్ద నగర ప్రాంతముగా ఉంది . నగరము యొక్క పరిసర ప్రాంతాలు అభివృద్ది చెందటము , 1950 - 60ల నాటి ఆర్ధిక పెరుగుదల తరువాత నగరము చుట్టూ ఏర్పడిన స్థావరాలు వంటి కారణాలు మిలన్ మెట్రోపాలిటన్ ప్రాంతం యొక్క జనాభా తీరు మారడానికి కారాణాలు . జనాభా మార్పుల బట్టి , నగరము యొక్క సామాజిక మరియు ఆర్ధిక సంబంధాలు నగర పరిధిని దాటి విస్తరించాయని అర్ధం అవుతుంది . ప్రస్తుతం మిలన్ మెట్రోపాలిటన్ ప్రాంతం యొక్క జనాభా 7 . 4 మిలియనుకు పెరిగి లంబార్ది ప్రాంతపు నడుమ భాగములోనికి విస్తరించింది . [ 49 ] [ 50 ] మిలన్ మెట్రోపాలిటన్ ప్రాంతం , ఐరోపా లోని అత్యధిక జనాభా మరియు పరిశ్రమలు కలిగి ఉన్న బ్లూ బనానా అని పిలవబడుతున్న ప్రాంతములోని భాగము అని చెప్పబడుతుంది . [ 51 ]
బస్సు నెమ్మదిగా కదిలింది . . భద్రాచలం వైపు . రోడ్డు ఎంత నున్నగా ఉంది ! పైన సూర్య తాపం కూడా అంతగా లేదు . అబ్బ ! ముందు కూర్చున్నాయన ఒకటే కదులుతున్నాడు . ఆ తల అటూ ఇటూ తిప్పుతూ ఉంటే మా చెడ్డ చిరాగ్గా ఉంది - అనుకున్నాడు శివం . ఇటు పక్కనాయన పేపర్లో మునిగాడు . శివానికి బస్సు లో అవతలి వైపు కనిపించడం లేదు . దానితో చేసేదేం లేక మళ్ళీ కిటికీ ని ఆశ్రయించాడు శివం . ప్రకృతి ఆరాధన మొదలు మళ్ళీ .
పోనీ , మరి చెట్లు వివరించగలవా ఆగని వాటి గుసగుసలను ఈగాలిక్కూడా తెలుసేమో కానీ , అంతా రహస్యంగా వుంది
1 . పరమ భాగవత మౌని వర శశి విభా - కర సనక సనందన 2 . దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు 3 . పవన సూను బాల చంద్ర ధర శుక సరోజ భవ భూ - సుర వరులు 4 . పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక ( యెందరో )
ఇప్పుడు కడుపులో నొప్పికి కారణాలు , వాటిని ఎలా ఎందువలన వచ్చిందని నిర్థారిస్తారో తెలుసుకుందాం . పొట్ట ( కడుపు ) ని సమభాగాలుగా విభజిస్తాం .
రోడ్డుకి అటూ ఇటూ లెక్కలెనన్ని టూ వీలర్సూ . దాన్ని నడిపేవాడు , పని అయిపోగానే , సీట్ మీద కూర్చొని , ఇంక వెనక్కాల ఏముందో చూసుకోకుండా ఝూం అని రోడ్డుమీదకు గాడీని లాగేస్తాడు . దాని " పాత్ " లో మనం ఉన్నామా అంతే సంగతులు ! ! కాలుకి కొట్టుకోవచ్చు , ఏదైనా అవొచ్చు . ఏమీ అనడానికి వీలులేదు . వీళ్ళు కాకుండా సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని , అటూ ఇటూ దిక్కులు చూస్తూ నడిపే ప్రభుధ్ధులు కొంతమందుంటారు , వాళ్ళలోకంలో వాళ్ళుంటారు . రోడ్డుమీద నడిచేవాళ్ళు వాడి దయా ధర్మాలమీద బ్రతకాలి . ఇంకో రకం చూశాను , క్రికెట్లో మన వాళ్ళు చూడండి , రాత్రైనా , పగలైనా డార్క్ గ్లాసెస్ పెట్టుకుని ఆడడం , ఓ స్టైలు గా చేశారు . అలాగే రాజమండ్రీలో కొందరు రాత్రిళ్ళు కూడా డార్క్ గ్లాసెస్స్ పెట్టుకొని మరీ టూ వీలర్స్ డ్రైవ్ చేయడం . " ఏమిటో ఈ మాయా వెన్నెల రాజా " అంటూ మిస్సమ్మలో పాట గుర్తొస్తుంది ! ! సిరబ్బ లెదుకానీ చీడ అబ్బిందిట . ఇంత గొడవ జరుగుతూన్నా ట్రాఫిక్ పోలీసు అనబడే ప్రాణి కూతవేటు దూరంలో ఎక్కడా కనిపించడు . కనిపిస్తే మళ్ళీఏం గొడవో అని ! !
నా వందో పోస్టులో నేను రాసేది కూడా బాపు రమణ లను నేను కలుసుకున్న అపురూప క్షణాల గురించే . కాకపోతే మేము అసలు వెళ్ళింది రమణ గారిని కలుసుకుందామని అయినా కాస్సేపు మాట్లాడాక బాపు గారు మమ్మల్ని ఆయన స్టూడియో కి తీసుకెళ్ళారు ( కింద ఫ్లోరే ) . ఉదయం పదిగంటలకు వెళ్ళిన మేము ( నేను , నా శ్రీమతి ) మధ్యాన్నం రెండున్నరకి ఆ ఇల్లు వదల్లేక వదల్లేక అదీ ట్రైన్ టైం అయిపోతోంది కాబటి బయటకి వచ్చాం . ఈ అనుభవాలనే పోస్ట్ గా పెట్టబోతున్నా .
వళ్ళంతా ట్యూబ్‌లతో , నిస్సహాయంగా పడుకుని ఉన్న రాధికను చూస్తే వంశీ గుండె తరుక్కుపోతోంది . ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితి . ఆప్తులెవరూ దగ్గరలేని పరాయి దేశంలో తన ప్రాణానికి ప్రాణమయిన రాధికను ఆ పరిస్థితిలో చూస్తూ ఉంటే వంశీకి మతిపోతోంది . ఇరవై నాలుగు గంటలూ ఆమె దగ్గరే గడుపుతున్నాడు . ఇంత జరిగినా ఇంటికి ఫోన్‌చేసి చెప్పలేక పోయాడు . అంతదూరంలో ఉన్నవాళ్ళు భయపడి బాధపడటం తప్ప చేయగలిగిందేమీ లేదు . రాధిక కొంచెం కోలుకున్నాకే నెమ్మదిగా చెప్పవచ్చని అనుకున్నాడు . హాస్పిటలు స్టాఫ్ అంతా ఎంతో శ్రద్ధగా ఉన్నారు . వంశీకి అన్ని విషయాలూ వివరంగా చెబుతున్నారు .
ఇంతలో పురోహితులు వచ్చారు . లెక్కలు కట్టారు . పంచాంగాలు తిరగేశారు . వాదించుకున్నారు . వివరించుకున్నారు . పదిరోజుల్లో దివ్యమైన ముహూర్తం వుందని తేల్చారు .
ఆ రోజుల్లో ఇప్పటి కుటుంబాలలాగ ఉండేవి కాదుగా . ఇంటికి కనీసం అయిదు లేక ఆరుగురు పిల్లలుండేవారు . అందరికీ పుట్టినరోజులు చేసుకోవడం అంటే ఆర్ధికంగా మధ్య తరగతి వాళ్ళమైన మన లాంటి వారికి సాధ్యం అయ్యేది కాదు . ఏదో ఏడాదికి మూడు సార్లు పండగలకీ , ఒకసారి పుట్టినరోజుకీ ( తిథుల ప్రకారమే ) కొత్త బట్టలు . ఖర్మ కాలి , పుట్టినరోజూ , ఇంకేదైనా పండగా ఒకేసారి వచ్చేయంటే , ఓ జత బట్టలు మిస్ అయేవారం . ఆ రెండూ ఒకే వారం లో వచ్చినా ఇంతే సంగతులు . పాపం మా ఇంటావిడకి దసరాల్లో సప్తమి నాడు పుట్టిన రోజూ , అందువలన వాళ్ళ చెల్లెళ్ళ లాగ తనకి దసరా బట్టలు ఉండేవి కావుట . ఒక్కొక్కళ్ళ అదృష్టం అలా ఉండేది . నాకైతే డిశంబర్ లో వచ్చే అమావాస్య . ఆ చుట్టుపక్కల ఎక్కడా ఏ అమావాస్యకీ ఏ పండగా ఉండేదికాదు ! !
మిత్రులారా జీవని సభ్యుల సమావేశం ఈ సాయంత్రం SRIT corporate officeలో జరిగింది .
శ్రీ బాపుగారు వేసిన బొమ్మల కధలన్నింటిని , ఒక దగ్గర కూర్చి , కొంచెం అటూ ఇటూ 400 పేజిలతో ( 80 పేజీలు రంగులలో ) 1 / 4 డెమీ సైజులో , అతి చక్కని బైండింగుతో ప్రచురిస్తున్నాము .
ఆటలో గెలుపు , ఓటములు సర్వ సాధారణం . అందులో ఒక రోజు క్రికెట్టు అనేది శకుని జూదం లాంటింది . ఒక మేఘం కూడా ఆటలో భాగం కావచ్చు . గంటకు దాదాపు 135 మైళ్ల వేగంతో దూసుకు వచ్చే బంతి బ్యాటును తాకే మధ్య సమయం దాదాపు 2 సెకండ్లు మాత్రమే . అంత తక్కువ సమయంలో కూడా బంతి తాలుకా వాలు , వేగం , పిచ్ స్వభావం అంచనా వేస్తూ , క్రికెట్లో వున్న పదకొండు రకాల షాట్లలో ఏది ఆడాలో నిర్ణయించుకుని ఆటగాడు సిద్ధం కావాలి . ఇదంతా ఆటగాడి నాడీ వ్యవస్థ పైన , మెదడు , రక్త ప్రసరణ పైన అత్యంత విపరీతమైన వత్తిడికి గురిచేస్తుంది … ప్రతీ బంతికి కూడా … అది కూడా కోట్ల అభిమానుల ఆశల మధ్య . ఇవన్నీ చాలక ఇప్పుడు మన అభిమానం వెర్రిగా మారితే అది మరింత ఒత్తిడిని పెంచి , స్థైర్యతను దెబ్బతీయక మానదు . కంగారూలు జగజ్జేతలవటానికి కారణం ఇదే … ఆసీయులు క్రికెట్ ని అభిమానిస్తారే తప్ప … . శాసించరు . ఇళ్ల మీద దాడి చెయ్యరు .
త్యాగయ్య సంగీతం - రాగ స్వభావానికెలా నిర్వచనమో , మోజర్ట్ సంగీతాన్ని - ఈస్తటిక్ - అనుభూతికి నిర్వచనంగా పాశ్చాత్యులు చెప్పుకొంటారు . బాఖ్ మెదలెట్టిన కౌంటర్ - పాయంట్ , పోలిఫోని పద్దతులు , ఆ తరువాతి కాలంలో హార్మొని గా ఎదిగితే , హార్మొనీని పరకాష్ట స్తితికి తీసుకెళ్ళిన వాడు మోజార్ట్ . సొనాటా అనే సంగీత రూపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ద్డిన ఘనత మోజార్ట్ దే . ఒప్రా ( సంగీత నృత్య రూపకం ) అనే సంగీత రీతి కూడా - మోజార్ట్ చేతిలో పెరిగి పెద్దదయ్యింది , వాగ్నెర్ చేతిలో విశ్వరూపాన్ని సంతరించుకొంది . త్యాగయ్య సంగీతానికి పంచరత్నాలెలాటివో , మోజార్ట్ సంగీతానికి - మెరెజ్ ఆఫ్ ఫిగారొ , డాన్ - గియావని , మాజిక్ - ఫ్లూట్ అనే మూడు ఒప్రాలు అలాటివి .
ఇంతకాలంగా " చందమామ రావే . . . జాబిల్లి రావే " అని పాడుకునేవాళ్లం . ఇక ఇప్పుడూ చందమామ ఆగు మేమే నీ దగ్గరకు వస్తున్నాము అని చెప్పుకోవచ్చు . జై భారత్ . . లక్ష్మిగారు అభినందనలు .
అయితే , ఈ శాస్త్రం ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు . క్రీస్తు పూర్వం నుండే భారత , గ్రీక్ దేశాల్లో దీన్ని ఆచరణలో ఉంది . అయితే , కొద్దికాలం మనదేశంలో కన్నా పాశ్చాత్యదేశాల్లోనే దీన్ని బాగా వినియోగంలో ఉంది . ఇప్పుడు దేశాల మధ్య ఎల్లలు చెరిగి పోవడంతో ఈ శాస్త్రం మన దేశంలో కూడా బాగా వ్యాప్తిలోకి వచ్చింది .
కాకపోతే పల్లెల్లోనూ , చిన్న చిన్న పట్టణాల్లోనూ నాటకం ఉంది . కానీ కొత్త గానూ , గొప్పగానూ లేదు . ఇంతకు ముందెలాంటి స్థితిలో ఉందో ఇప్పుడూ అలాగే ఉంది . నాటకాలు వేస్తున్నారు . ఎవరూ కాదనరు . కానీ నాటకాన్ని వేరే మెట్టుపైకి తీసుకెళ్ళే ప్రయత్నం జరగడం లేదు . ఇంతకు ముందు ప్రస్థావించినట్లుగా నాటకాలకి పెట్టుబడి పెట్టే నాధుళ్ళు కరువయ్యారు . చందాల మీదే ఆయా ఊళ్ళల్లో నాటం బ్రతుకుతోందని కొందరి అభిప్రాయం . ఏదైతేనే నాటకాన్ని అద్భుత స్థాయికి తీసుకెళ్ళలేని పరిస్థితిలోనే కూలబడింది నేటి నాటక రంగం . కాకపోతే నాటకరంగంలో ఉన్న ఏ ఒక్కరూ ఈ విషయాన్ని అంగీకరించరు . అది వేరే విషయం .
పుస్తకం కొనుగోలు , పఠనానుభవం - బాగున్నాయి . పైగా , లీగల్ గా కొంటున్నాం కనుక , ఆత్మసంతృప్తి కూడానూ ! బయటి రాష్ట్రాల్లో , దేశాల్లో ఉండేవారికి ఇది ఉపయోగకరమే . అయితే , ఈ పుస్తకం కొనుగోలు చేయడం లో ఉన్న తతంగం అంతా సామాన్య ప్రజలకి అంత తేలిగ్గా అర్థం కాదేమో అని నా అనుమానం .
కప్ గెలిచాక కుడా చూసాను కాని మరి నేను వినలేదు . తరువాత పేపర్లో కుడా చూసినట్లు గుర్తు లేదు అందుకే నిన్న టపా రాసాను మళ్ళి . . . . దానికి ఒక అజ్ఞాత గారు మీరు న్యూస్ ఫాలో అవరా కప్ తీసుకోగానే చెప్పాడు అని చెప్పారు అందుకే నా టపా ని మళ్ళి ఎడిట్ చేసాను . . . . వంశి గారు
కొత్తపాళిగారు , నేను ఈ కథను పోటీకి బహుమతికి అనే ఉద్దేశ్యంతో రాయలేదండి . నా రచనలను మెరుగులు దిద్దుకుందామనే ఈ ప్రయత్నం . ఇక ముగింపు అనేది , ఒక మంచి మంత్రి ఇలా చెయకూడదా ? అని అలా ఇచ్చాను . అందరు మంత్రులు ఒకేలా ఉండరు కదా . తన కొడుకును రక్షించిన వారికి ఆ మాత్రం సాయం చేయకుండ ఉంటాడా అనుకున్నా . విజేతలకు అభినందనలు .
ఈమధ్య బ్లాగుల్లో ఒక కొత్త ధోరణి వచ్చింది - మనకు నచ్చని విషయం ఎక్కడైనా కనిపించిందనుకోండి . . వెంటనే మన బ్లాగుకు వెళ్ళిపోయి దాన్ని విమర్శిస్తూ ఒక కవిత రాసిపడెయ్యడమన్నమాట ! ఏదైనా కవితను కాపీకొట్టైనా సరే . . నేనూ ఒక కవిత రాసెయ్యాల్సిందే అనుకున్నాను . కత్తిలాంటి బ్లాగు , మహేష్ కుమార్ గారి పర్ణశాల అందుబాటులో ఉందిగదా . . అందులోని దళిత తీవ్రవాదం అనే టపాను ఎంచుకున్నాను .
తప్పకుండా . . మనం కొట్టుకుందాం . . . నిజం , ధర్మం తెలిసిన వాడు ఎక్కువ సేపు నిలబడ గలడు . . నువ్వు బయటి నుండి చూస్తూ సమస్య పై రాల్లెస్తున్నావ్ . . మేము బాధ పడుతున్న వాళ్ళం . . నీదెం పోతది . . అందరు నీలా ఉండరు కదా దొంగ వికటకవి
1996 లో సాగర తీరం వద్ద హోరు గాలిలో ఆరుగురు వ్యతుల ట్యాగ్ టీం మ్యాచ్ లో ది అవుట్ సైడర్స్ ( కెవిన్ నాష్ మరియు స్కోట్ హాల్ ) ను WCW లోయలిస్ట్ లు ఓడిస్తున్న సమయంలో హొగన్ , నాష్ మరియు హాల్ తరుపున జోక్యం చేసుకుని రాండి సవేజ్ పై దాడి చేసాడు , ఫలితంగా గడచిన పది సంవత్సరాలలో అతను మొదటి సారిగా మడమ తిప్పాడు . [ 2 ] [ 42 ] [ 72 ] మ్యాచ్ తరువాత తన నైపుణ్యాన్ని మరియు శక్తిని తక్కువ అంచనా వేసినందుకు అభిమానులు మరియు WCW ను ఉద్దేశించి హొగన్ ఒక ప్రకటన చేసాడు మరియు న్యూ వరల్డ్ ఆర్డర్ ( nWo ) స్థాపనను ప్రకటించాడు . [ 72 ] ఈ నూతన సంస్థ తరువాత వారాలు మరియు నెలలలో గుర్తింపు పొందింది . [ 5 ] [ 17 ] [ 72 ] [ 73 ] హొగన్ చాలా ప్రసిద్ది చెందినా తన మీసంతో పాటుగా గెడ్డాన్ని కూడా పెంచాడు మరియు వాటికి నలుపు రంగు వేయించుకున్నాడు , తన ఎరుపు అరియు పసుపు వస్త్రాలను నలుపు మరియు తెలుపు వాటి కోసం విడిచిపెట్టాడు , వాటికి తరచుగా మెరుస్తున్న గుండీలను వాడేవాడు మరియు తన పేరును హాలీవుడ్ హొగన్ గా మార్చుకున్నాడు . హొగన్ తాను మడమ త్రిప్పిన ఎనిమిది రోజుల తరువాత WCW కార్యక్రమానికి తిరిగి వచ్చాడు . [ 2 ]
' నీరు లేన్ని గంధం ఎలా ఉంటుంది ? నీరు జారిపోయినా తనలో దాచుకుని నేను ఇదిగో అంటోంది ఈ నేలగంధం ! చూశావా పిన్నీ ? '
ఆ రాస్కెల్ గురించి తను ఆలోచించడమే తప్పు . క్లబ్ లొ సందడిగా వుంది . ఆమె స్విమ్మింగ్ పూల్ దగ్గరికి నడిచి ఓ కుర్చీలో కూర్చుంది . అస్థవ్యస్థమైన ఆలోచనలు … కార్చిచ్చులా ఆమెని దహించి వేస్తున్నాయి . ఒంటరితనం ఎంత భయంకరమైనది . తను ఓ భర్త వుండీ ఒంటరిదే . పిల్లలు లేరు . ఆ భర్తవల్ల పిల్లల్ని పొందలేదు . ఇక ఈ ఒంటరి బ్రతుకింతేనా ! అందమైన జీవితం పొందే యోగం తనకి లేదు . దానికి కారణం కిరణే ! వాడితో పరిచయం కలిగి వుండకపోతే తను మరోలా వుండేదేమో ! " రాస్కెల్ " ఉద్రేకంతో ఆమె పెదవులు వంకర్లు తిరిగాయి . " హలో " తలెత్తి చూసింది . ఆరడుగుల ఎత్తైన విగ్రహం . పెదాలపై చిరునవ్వు , వుంగరాల జుత్తు , విశాలమైన నుదురు , మోటైన పెదవులు . మళ్ళీ ఒకసారి చూడాలనిపించే ఆకర్షణీయ ముఖం . సభ్యత కోసం " హలో " అంది . అతనెవరో తెలీకపోయినా . " మీ ఏకాంతాన్ని భగ్నం చేసానా ? " అడిగాడతను . " నథింగ్ , మీరు … ? " అంది అర్దోక్తిగా . " అయాం మిస్టర్ విజయ్ … ఆటోమొబైల్ ఇంజనీర్ని " చెప్పాడతను . " ఐ . సీ . " అంది . " ఇక వేరే మీ గురించి నాకు చెప్పనవసరం లేదు . మీరు మిసెస్ జి . కె . అని చాలామందికి తెలుసు … బైదిబై , నేను మీ కంపెనీలోనే పనిచేస్తున్నాను " అన్నాడు . " కూర్చోండి " అంది ప్రక్క కుర్చీ చూపిస్తూ . క్లబ్బుల్లోనూ , పబ్లిక్ ఫంక్షన్ లోనూ సాధారణంగా పరిచయాలు కలుగుతాయి . " ఒంటరిగా వచ్చారా ? " అడిగాడు . ఆ కళ్ళలో ఆకర్షణకి తట్టుకోలేకపోతోంది . ఆమె చురుగ్గా చూసింది . " అవును " " బాస్ ? " " జ్వరంగా వుంది … అయినా ఆయన ఎక్కడికీ వెళ్ళరు " విజయ్ ఐస్ క్రీమ్ తెప్పించాడు .
SRrao garu ముందుగా మీ కుటుంబ సభ్యులతోపాటు నా జన్మదినాన్ని కలిపినందుకు ధన్యవాదాలు . పాపకి నా శుభాకాంక్షలు తెలియజేయండి . మీ కుటుంభ సభ్యులందరికీ పండుగ శుభాకాంక్షలు . అన్నట్లు ఈ రోజు నా ' మానసపుత్రుడు " . . ( చెల్లి కొడుకు ) పుట్టినరోజు కూడాను : )
ఆ రోజుల్లో ధర్మా రావు గారు " ప్రజాబంధు " లో వ్యాసాలు విమర్శలు రాస్తున్నాడు . ఈయన గురించి కుతూహలం కలగడానికి అదొక కారణం . కొంతకాలానికి రంగారెడ్డిగారు రంగారెడ్డి గారు ధర్మా రావు తన నలభయ్యో జన్మదినం నాడు అచ్చువేసి స్నేహితులకు పంచిపెట్టిన కరపత్రమొకటి పంపించాడు . తన గత జీవితాన్ని విశ్లేషిస్తూ , తన ఆదర్శాలు గుర్తు చేసుకుంటూ , తను ఇంతవరకు సాధించిన ఫలితాల్ని బేరీజు వేసుకుంటూ రాసుకున్న ఆత్మపరిక్ష . ఇది చదివాక ఈ మనిషిపై నాకు ఆసక్తి పెరిగింది .
34 . వీధి భాగోతము : దీనినే వీధి నాటకమని కూడా అంటారు . యక్షగానం లక్షణాలు ఇందులో చాలా ఉన్నాయి . వివిధ పురాణ పాత్రలను నటులు ధరిస్తారు . నాటకం రాత్రి పది గంటలకు ప్రారంభమై సూర్యోదయం వరకు నడుస్తుంది . ఇందులో పాత్రలు అనేకం . వాద్య , గాత్ర , వాచిక , అభినయము ఇందులో ప్రధానం . భుజకీర్తులు , హారాలు , కర్ణాభరణాలు , కత్తి , డాలు , ఖడ్గం , గద మొదలగు వానిని ధరిస్తారు . వాటిలో అమర్చిన అద్దాల వలన అవి ధగధగ మెరిసిపోతాయి . పాత్రధారులు ఇందులో నటించడం కంటే జీవిస్తారు . ద్రౌపది వస్త్రాపహరణము నాటకంలో భీముని ఉగ్రరూపాన్ని అదుపు చేయుటకు తాళ్ళతో కట్టిపట్టుకుంటారు . వీరి వేషధారణ అచ్చం రాజుల లాగానే ఉంటుంది . పాటలు , పద్యాలు , హాస్యప్రసంగాలతో బాటు నవరసాలు పోషించబడతాయి . శాస్త్రసాంకేతిక రంగం ఎంతగా అభివృద్ధి చెందినను , చలనచిత్ర రంగములో వచ్చిన సాంకేతికాభివృద్ధిని కూడా తట్టుకొని నిలబడిన జానపదకళ వీధి భాగవతం ఒక్కటే .
Download XML • Download text