tel-39
tel-39
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
టైమ్స్ అండ్ విండ్స్ : ఈ మధ్య ఎక్కడ పట్టినా సినీ విమర్శకుల నోట బాగా నలుగుతున్న ఒక టర్కిష్ సినిమాని మన తెలుగు వాళ్లకీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ నెల సినిమా శీర్షికలో పరిచయం చేయబోతున్న రెండో సినిమా ' టైమ్ అండ్ విండ్స్ '
ఎప్పుడు చూసినా నా ఫ్రెండ్ కార్లో ఈ పాట మోత మోగుతూ ఉండేది . ఏదో సినిమా పేరు చెప్పాడు గాని మనకి తమిళం అస్సలు రాదు కాబట్టి , ఏ సినిమా అయితే ఏం అని పాటని ఎంచక్కా ఎంజాయ్ చేసేవాడిని . పాట ట్యూన్ చాలా కేచీ గా ఉండేది . ఆ తరువాతెప్పుడో యు ట్యూబ్ లో ఏదో వెతుకుతూ ఉంటే ఆ పాట నా కంట పడింది . వినటానికే కాదు చూడటానికి కూడా చాలా బాగుంది . మంచి కోరియోగ్రఫీ , కేమెరా , అన్నిటికీ మించి చలాగ్గా , చిలిపిగా మీరా జాస్మిన్ . . . మీరా జాస్మిన్ మంచి నటి అని తెలుసుగాని ఆమె సినిమాలు పెద్దగా చూసిన గుర్తు లేదు . ఈపాట లో మాత్రం తెగ నచ్చేసింది నాకు . పాట సాహిత్యం కూడా బాగుండొచ్చేమో అని అనుకుంటున్నాను . ( ఈ పాటని బ్లాగర్ లో embed చేయటానికి అనుమతి ఉన్నట్టు లేదు . Watch on YouTube మీద క్లిక్ చేస్తే ఓపెన్ కావచ్చు . )
వారందరి ఆత్మశాంతికై ప్రార్ధిస్తూ . . . . అడగకుండా ఉండలేకున్నాను . . YS గారితో పాటు మరణించిన మిగతావారి File ఫోటోలుకూడ లేవా మీడియావారి దగ్గర ? పదవికేనా విలువ ? ప్రాణానికి లేదా ?
ప్రపంచంలో చాలా మంది ప్రముఖ గణిత శాస్త్రవేత్తల కష్టాలకు కారణమైన భూమి యొక్క ఆకారాన్ని గోళాకారంగా ఆనాడే తన గోళాధ్యాయలో నిర్వచించాడు . అంతేకాదు మన గ్రహాల యొక్క ప్రకాశం స్వయంప్రకాశం కానే కాదని , అది కేవలం సూర్యకాంతి పరివర్తన వలన అని చెప్పాడు . సూర్య గ్రహణాలను ఖచ్చితంగా లెక్క కట్టాడు .
ఇంకా , ఒకవేళ అంతర్జాతీయ ధరలకు అనుగుణం గా దేశీయ చిల్లర ధరల్ని పెంచాల్సి వస్తే , ఈ సాధికార సంఘం విడతలవారీగా పెంచొచ్చుట !
ఇంకా అస్సాంలో సైనికుడిగా పనిచేసే కొడుకు ఉత్తరం గురించి ఎదురు చూసే ముసలి అవ్వకి తొందరగా ఉత్తరం తీసుకెళ్ళి ఇవ్వమంటారు తిలక్ . కొడగట్టిపోతున్న ఆమె జీవితానికి వెలుగు నిమ్మంటారు . ముడతలు పడిన మొహం మీద ఆనందాన్ని చూడమంటారు .
కొద్ది సేపటి క్రితం యు . కె లొ సినిమా ప్రీమియర్ షో ముగిసింది . సినిమా చూసిన కొందరు ప్ప్రేక్షకులు చెప్పారు అని చెబుతూ ఒక విషయంవెలుగులోకి వచ్చింది . అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా రజనీ కెరీర్ లొ బిగ్గెస్ట్ ఫ్లాప్ అని అపుడే పుకార్లు షికార్లు చేస్తున్నాయి . అత్యంత కృత్రిమంగా చిత్రం లొ సన్నివేశాలు ఉన్నాయని . . . మొదటి రెండుపాటల తర్వాత చాలా బోరింగ్ అనిపించింది అని యు . కె . ప్రేక్షకులు చెప్పినట్టు సదరు పుకారు సమాచారం . కధ , కధనాలు నాటకాన్ని తలపించాయి అన్నది రిపోర్ట్ . . . . . . . . . . . . . . . . . . . . . . ఆట . ఇపతి దాకా చిత్ర నిర్మాణం , వ్యయం విషయంలో సంచలనాలు సృష్టించిన రోబో ఇక ముందు నిర్మాతలు , పంపిణీదారుల నష్టాలతో సంచలనాలు సృష్టించబోతుంది అని టాక్ . మరి పై విషయం లొ నిజానిజాలు మనం రేపు గానీ తెలుసుకోలేము : ) ఒక వేళ సినిమా హిట్ అయితే అపుడు రజనీ అభిమానులు నా మీదకి వస్తే . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
నా జీవిత పాఠాలు నాతోనే ముగిసిపోకుండా , మీకూ పనిచేస్తాయన్న ఉద్దేశ్యముతో ఈ బ్లాగ్ ని మీకోసం వ్రాయడం . ఏఒక్కరికైనా ఈ బ్లాగ్ లోని సమాచారం ఉపయోగపడిందంటే - ఈ బ్లాగ్ లక్ష్యం నెరవేరినట్లే . . దయచేసి మీ అభిప్రాయాలను తెలియచేయ ప్రార్థన .
" అయ్యయ్యో … ఆ అయ్యోరి చేతులు విరిగిపోనూ … గొడ్డును బాదినట్టు బాదేశాడు . అసలు వాడికి అంత ధైర్యం ఎక్కడినించి వచ్చింది ? " వెన్నముద్దలో ఏదో ఆకు పసరు కలిపి మాధవుడి వంటి మీది వాతలకు అంటిస్తూ వాపోయింది చిలకమ్మ .
రాజేంద్ర కుమార్ గారు , అమ్మయ్య , సుహాసిని ముక్కుతో హావభావాలు పలికిస్తుందని భావించేవారిలో నేను కాక మీరూ ఉన్నారన్నమాట ! ఈ మాటంటే అందరూ దెబ్బలాడతారు . . . నవ్వు అనే పదార్థం సుహాసినితోనే పుట్టిందని వాదిస్తారు ! ' నారాయణ మూర్తి మొహం ఒక్కదానితోనే నటిస్తున్నట్టు . . . ' టాప్ ! అన్నట్టు రమ్య గారు రాసిన సినిమా పేరు కరక్టే ! కదలి వచ్చిన కనక దుర్గ సినిమా వేరు ! ఈ నుంచే అమ్మవారు బుల్లి లంగా జాకెట్టు వేసుకుని చిన్న పిల్ల రూపం లో రావడం మొదలైందనుకుంటా ! ఆ తర్వాత టివి సీరియల్స్ కూడా ఇదే వేషం వేసుకొస్తోంది ఆవిడ !
కామము , క్రోధము , లోభము అను నీ మూడును మూడువిధములగు నరక ద్వారములు . ఇవి తనకు ( జీవునకు ) నాశము కలుగజేయును - కాబట్టి ఈ మూడిటిని విడనాడవలెను . ( లేక , కామము , క్రోధము , లోభము అను మూడు విధములగు ఈ అసురసంపద నరకమునకు ద్వారము - అనియు చెప్పవచ్చును ) .
@ శ్రీనివాస్ బ్లైండ్ గర్ల్ కి అనువాదం గుడ్డి అమ్మాయి అని కాదా ? అంధురాలు అని వాడివుంటే బావుండేదంటారా ? గుడ్డితనం అనడం ఇప్పుడు పొరపాటుగా పరిగణిస్తున్నారా ? అంధత్వం అని మాత్రమే ఇప్పుడు వాడుకలో వుందా ? తెలియక అడుగుతున్నాను .
ముందుగా మీ శుభాకాంక్షలకి మా శిరీష తరఫున ధన్యవాదాలు . మనవారి ప్రభావం మొదలైనట్లే కనిపిస్తోంది .
ఇలా మ్రుందుకు వచ్చిన వాళ్ళలో నాకు చాలా బాగానచ్చే వాళ్లలో ఒకడైన లారీ ఎలిసన్ కూడా ఉన్నారు . ఈయన స్వతహాగా ప్రపంచం అంతా ఎడ్డెం అంటే వీరు తెడ్డెం అంటారని అందరూ అంటారు . కానీ కొన్ని విషయాలలో ఇలా ప్రపంచానికి ఎదురీదటం మంచిదే అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది . ఇది నిజం కాకపోతే . . ప్రపంచంలోని అన్ని పర్సనల్ కంప్యూటర్లు దాదాపు ఒకే రకమైన ప్రోససర్ మరియు మదర్ బోర్డ్ వంటి నిర్మాణంపై ఏకాభిప్రాయానికి వచ్చి ఆ వైపు అడుగులు వేస్తుంటే , వీరందరినీ కాదని తనదంటూ ఒక హార్డ్‍వేర్ ఆర్కిటెక్చర్ తయ్యారు చేసుకుని , ఈరోజుల్లో ఐఫోన్ దగ్గర్నుంచి మాక్ కంప్యూటర్ వరకూ తనదైన శైలిలో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న మాక్ అధిపతి స్టీవ్ జాబ్స్ ఆలోచన కూడా నిజంకాదు .
మనిషి చదువొక్కటే చాలదు . సంస్కారం కూడా కావాలి . అది మనుషుల మధ్య జీవితం ఇస్తుంది . ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఈ కథలో చాలా కనిపిస్తాయి . పోలింగ్ బూత్ ఇక మూసేయండని నాగేశ్వర్రావు అంటే " ఇంకా మూడు నిమిషాలుంది కదా సార్ ! కూలికి వెళ్ళేవాళ్ళు . మనలాగా తీరికుండద్దూ . చీట్లిచ్చి అయిదు దాటినా పోలింగ్ జరపండి సార్ ! " అని పంకజం అనడం దానికొక ఉదాహరణ . ఇలా ప్రతీ చిన్న అంశాన్నీ ఎంతో పకడ్బందీగా చెప్పిన కథిది . చదివే కొద్దీ కథ కనిపించదు . మనుషులు కనిపిస్తారు . మనలో చాలామందికి ఏమాత్రమూ పరిచయం లేని జీవితం కనిపిస్తుంది .
ఆ మాటలు వినగానే నా కాళ్ళ కింద భూమి కంపించలేదు . నా ఎదురుగా ఉన్న మానిటర్‍ని బద్దలుగొట్టాలనిపించలేదు . నా గుండె పగిలిపోలేదు . " నిన్ను చంపేస్తాన్రోయ్య్ " అని వాడి కాలర్ పట్టుకోవాలనిపించలేదు . ఇప్పటికీ , నేను " కాఫ్కా " అననగానే , వాడు నన్ను చూసి వెక్కిరిస్తున్నట్టు నవ్వుతాడు . అందుకని " నువ్వు నా స్నేహితుడివి కావు ! " అని చెప్పాలనిపించలేదు .
ఇది పురాణాలొని విషయం , రామాయణంలొ అరణ్యకాండ లొ చెప్పబడింది . శ్రీ రాముడు అరణ్యవాసం చేస్తూ అగస్త్యుడు ఉండే ఆశ్రమం జాడ సుతీష్ణుడు అనే ఋషి వల్ల కనుగొంటాడు . సీతారామ లక్ష్మణులు అగస్త్యుడి ఆశ్రమాన్ని వెదుకు కుంటూ వెళ్తంటే ఒక పెద్ద బూడిద గుట్ట , ఎముకల గుట్ట కనిపిస్తుంది . అప్పుడు రాముడు సీత లక్ష్మణులను చూసి ఆక్కడ పూర్వం జరిగిన వృత్తాంత్తాన్ని చెబుతాడు .
ఐఐటి లో ఇంజనీరింగ్ జాయినైన ముగ్గురు కుర్రాళ్ళు . ఒకడు బాగా రిచ్ బ్యాక్ గ్రౌండ్ , ఒకడు యావరేజ్ మిడిల్ క్లాస్ , ఒకడు లోయర్ మిడిల్ క్లాస్ . ఐఐటి లో సీట్ వచ్చిందంటే ముగ్గురూ బాగా తెలివైన , చురుకైన కుర్రాళ్ళే . అయితే ఐఐటి లో సీట్ వచ్చాక వాళ్ళు ముగ్గురూ తమ చదువుల్ని ఖరాబు చేసుకోవడం , ఒకడు తమ ప్రొఫెసర్ కూతురు అయిన అమ్మాయిని లవ్ చేయడం , ఒకానొక టైం లో ఐఐటి లో పరీక్ష పేపర్ దొంగిలించడానికి ప్రయత్నించి దొరికి పోవడం , జీవితం నాశనమైందన్న బాధ తో ఒకబ్బాయి ఆత్మహత్యాయత్నం చేయడం దాకా వెళ్ళడం . . చివరలో మళ్ళీ గాడి లో పడి అన్నీ సెట్ అవడం . . ఇదీ స్థూలంగా కథ . అయితే ఇందులో పాఠకుల్ని ముగ్ధుల్ని చేసేది కథ కాదు . . దాన్ని నడిపిన తీరు . . నవల ఆసాంతం ఒక రకమైన wit , humour తో కొన్ని ఎక్సలెంట్ సెటైర్స్ తో కథని నడపడం . అసలు బిగినింగే - ఒక ప్రొఫెసర్ క్లాస్ కి వచ్చి ' Machine ' కి డెఫినిషన్ ఇవ్వమని స్టూడెంట్స్ ని అడిగితే స్టూడెంట్స్ అందరూ వాళ్ళకి తోచిన డెఫినిషన్స్ చెప్తూంటే ఆయన అన్ని నిర్వచనాలకీ వంకలు పెట్టి ఒక సింపుల్ మరియు ఎక్సలెంట్ డెఫినిషన్ చెప్పడం . . ఒక స్టుడెంట్ ఆ డెఫినిషన్ ని చీల్చి చెండాడి దశాబ్దాల ఎక్స్ పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ ఇగోనే చావుదెబ్బతీసే ఇంటెర్స్టింగ్ సీన్ తో బిగిన్ అవుతుంది .
పరిషత్తు వారు చాలా ధనము కర్చుపెట్టి చాలా శ్రమపడి వ్యావహారిక భాషాభ్యాసమువల్ల సారస్వతము నశించి దేశమునకు ఉపద్రవము కలుగుతుందని ప్రజలను , ప్రభుత్వమువారిని , విద్యాధికారులను నమ్మించుటకై చెప్పిన మాటలన్నీ యధార్థమైనవి కావనిన్నీ , దురభిమానముచేత తాము మోసపోయి లోకమును మోసపుచ్చినారనిన్నీ ఈ వ్యాసము నందు ఋజువు చేస్తాను .
దయచేసి మీ బ్లాగులలో సాగదీసిన ( జస్టిఫై చేసిన ) వచనాన్ని వాడకండి . జ్వాలా జంబూకము ( ఫైరుఫాక్స్ ) ఉపయోగించే నాలాంటి చదువరులకు అక్షరము మరియు ఒత్తులు ఒకదానికొకటి బారెడు దూరము జరిగి చదవడానికి ఎంతో చికాకు పెడుతుంది . జ్వాలా జంబూకములో యూనీకోడుకు మద్దతు ఇంకా పరిపుష్టమవలేదు . జంబూక మేస్త్రీలకు బుద్ధొచ్చి అది సరిచేసేలోపు మనకీ ఇక్కట్లు తప్పవు . ఎంతైనా వీళ్లు సఫారీ నుండి నేర్చుకోవలసింది చాలా ఉంది . వర్డ్‌ప్రెస్లో డీఫాల్టుగా వచ్చే బ్లాగు తొడుగుతో కూడా ఇదే సమస్య . ఈ మధ్యే నేను తెలుగు వికీలోని కొన్ని మూసలలో కూడా ఇది గమనించి సాగదీసిన వచనాన్ని సరిచేశా . ఫైరుఫాక్సు వాడే జనాలు కూడా మీ బ్లాగు చదవాలంటే ఒక సారి మీ బ్లాగుని అందులో పరీక్షించుకోండి . వీలైనంతగా సాగదీసిన వచనాన్ని వాడటము తగ్గించాలని నా విన్నపము
మా బాగా చెప్పారు . ఒకప్పుడు కన్నడిగులు ఇట్లాంటి తీర్మానమే చేస్తే ఇదే మనవాళ్ళు వాళ్ళతో తగువేసుకున్నారు . పరభాషా సినిమాలు విడుదల చెయ్యరాదనేది అప్పటి వాళ్ళ గోడు , పాపం . ఇప్పుడు వీళ్ళది మరీ దారుణం . . డబ్బింగులు కూడదట ! వీళ్ళు మంచి సినిమాలు తీస్తే ఆ డబ్బింగు గోల చూడాల్సిన ఖర్మ మనకేంటి ?
పేరు కోసం , పదవి కోసం అడ్డదారిన వచ్చిపడే కలిమి కోసం బలిమి కోసం తమ స్వార్థ యజ్ఞపు హోమగుండంలో తల్లినైనా సమిధ లాగా వ్రేల్చగలిగిన కుటిల జీవుల , రాజకీయుల గెలుపు కోసం జరుగుతున్న ఈ బందును నిరసిస్తున్నా జనం కోసం , బతుకు కోసం నిజాయితీగా ఉద్యమించే వారి కోసం నిరీక్షిస్తున్నా ఈ మదోన్మాదుల , పదవోన్మత్తుల కొంగ జపాలు , నక్కజిత్తులు తేటతెల్లమయ్యే రోజు కోసం , వీళ్ళ బతుకులు నడిబజార్లో బట్టబయలయ్యే రోజుకోసం , నడమంత్రపు సిరి కోసం అమ్మనైనా తిట్టగలిగిన వీళ్ళ నోళ్ళు పడిపొయ్యే రోజు కోసం నిరీక్షిస్తున్నా మెరుపును చూపించి దీపంగా నమ్మించి , ఎండమావుల వెంట పరిగెత్తించే నికృష్ట రాజకీయులారా వేరు కుంపటి ఉపయోగపడేది కాకున్నా , అడిగే హక్కు మీకుంది . కానీ . . అందుకోసం అమ్మను తిట్టడం ఘోరపాపం తల్లిని నిందించిన మీ పాపం ఊరక పోదు అది మిమ్మల్ని కట్టి కుడిపే రోజు రాకపోదు
అతని సలహాను లక్ష్యపెట్టకుండా సైనికుడు ముందుకెళ్ళి పోయాడు . ఎలాగోలా మిత్రుని చేరుకోగలిగాడు . అతన్ని తన భుజం మీదకు ఎత్తుకుని వాళ్ళు దాక్కున్న కందకం వైపుకి తీసుకొచ్చాడు . ఇద్దరూ వచ్చి అక్కడ పడిపోగానే ఆ ఆఫీసరు దెబ్బతిని పడి ఉన్న సైనికుణ్ణి పరీక్షించాడు . అతను అప్పటికే చనిపోయి ఉన్నాడు . అతన్ని మోసుకు వచ్చిన మిత్రుడి వైపు జాలిగా చూశాడు .
రాధిక గారు , అన్నట్టు కవితలను పేటెంట్ చేసే అవకాశం వుందా ? అలాగయితే మీ కవితలు పేటెంట్ చేసే అవకాశం నాకివ్వండి . రవి
1948 లో జైలు కెళ్ళి విడుదలైన ఆరుట్ల కమలాదేవి 1952 లో ఆలేరు అసెంబ్లి నుంచి MLA గా ఎన్నికై 1967 వరకు ఆ పదవి లో కొనసాగారు . ప్రజభిమానం పెట్టని కోటవలే పెంచుకున్న కమలదేవి శాసన సభ లోమహిళా ప్రతిపక్ష నాయకు రాలిగా అందరి మన్ననలు పోందారు . దేశంనే ప్ర ప్రథమ ప్రతిపక్ష నాయకు ఉరాలి గా ఆమెకీర్తికెక్కారు . 1955 కమ్యునిస్టు దేశాలైనా బల్గెరియా , జెకొస్లెవియా , ఆస్ట్రేలియాలు పర్యటించిన కమలదేవి 1983 లో రామచంద్రారెడ్డి తో కలసి సోవియట్ యూనియన్ వెళ్లారు 1973 లో ఆంద్రప్రదేశ్ మహిళ సమాఖ్య కార్యదర్శి గా పని చేసారు . 65 సంత్సరాల సుదీర్గ క్రీయశీల రాజకీయ ప్రస్థానం లో ఎన్నో కీర్తి శిఖరాలను అధిరొహించిన ఆమె స్వచ్చందంగా విశ్రమించి రాజకీయాలకు కొత్త వొరవడిని సృష్టించారు .
ఏం మాట్లాడకుండా తాగాడు . అనవసరంగా ఒక దగ్గు దగ్గి " బయట రోడ్డు మీద ట్రాఫిక్ శబ్దాలు వినిపిస్తున్నాయా ? " అని అడిగాను . అవునంటూ తలూపాడు అర్థం కానట్టు పెట్టిన మొహంతోటే . " ఆ కుండీలో చేమంతి మొక్క ఉంది చూడు ! " అటు తిరిగి చూశాడు .
ఏ కల్లంలో గింజలు అక్కడే తూర్పార పట్టాలి అని నేనకుంటాను .
వైజ్ఞానికదశకు ముందుండిన పరిస్థితిని పిల్లల మనోవికాసం ద్వారానూ , నమోదైన సమాజచరిత్ర ద్వారానూ తెలుసుకోవచ్చు . యదార్థప్రపంచాన్ని అవగాహన చేసుకునే గుర్తింపు ఆదిమదశలో పిల్లల మనోవికాసంలాగే ఎదిగింది . దీన్ని గురించి నమోదైన దాఖలాలు కొద్దిగానే ఉన్నాయి . సోక్రటీస్‌కు మునుపటి సమాజ చరిత్రలోని భౌతికవిజ్ఞానం మొదలైన విషయాలన్నీ ఏడుపది సంవత్సరాల వయసుగల పిల్లల గ్రహణశక్తికి సమానంగా అనిపిస్తాయి . ఈ పోలికల వివరణ ఈ పుస్తకంలో లభిస్తుంది .
ఎన్నడో మర్చిపోయిన మంచి పాటని గుర్తు చేసారు . . థ్యాంక్స్ చిన్ని గారు . .
అవును నమ్ముతే అన్నీనూ , నమ్మకుంటే ఏదీలేదు . మన బుఱ్ఱ చాలా విచిత్రమైనది సుమా !
అనిల్‌గారూ , నేను కూడా మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను . ఎవరికోసమో ఎప్పుడూ ఎదురుచూడకూడదు . " మనం తెలుగులో రాయడం ఇంగ్లీషు మీద ద్వేషంతో కాదు , మన తెలుగు ప్రేమికత్వం ప్రతిచర్య ( reaction ) కాదు , చర్య ( action ) మాత్రమే " అని అర్థం చేసుకోగలవారు మొదట్లో తక్కువగా ఉంటారు . మా వాడు ఇంగ్లీషు మీడియంలోనే చదువుతున్నాడు . కాని నేను బళ్ళో వాడికి తెలుగు ఐచ్ఛికంగా ఇప్పించాను . పైగా నేను ప్రతి ఆదివారమూ పిల్లల బొమ్మల రామాయణం , భారతం చదివించాను . వేసవి సెలవుల్లో సుమతీ శతకం పద్యాలు ఒక పాతిక దాకా బట్టీ పట్టించాను . నేను వాడి చదువు పట్ల చూపించిన శ్రద్ధ తక్కువే గాని , ఆ కొంచెమే అంది పుచ్చుకుని వాడు ఈరోజు ఈనాడు పేపరు కూడా చదివేస్తున్నాడు . మా అపార్ట్‌మెంట్ భవనంలో నేను కార్యదర్శిని అవ్వకముందు నోటీసులన్నీ ఇంగ్లీషులోనే ఉండేవి . నేను తెలుగు కూడా ప్రవేశపెట్టాను . నేను గమనించిన విషయం - ఇంగ్లీషు క్షుణ్ణంగా వచ్చినవారికంటే , అది రానివారికీ , అరకొరగా వచ్చినవారికే ఆ వ్యామోహం ఎక్కువ అని .
తంజావూరిని అచ్యుతప్ప నాయకుడు 1565 నుండి 1614 వరకూ పాలించాడు . అతని తరువాత అతని కొడుకు , రఘునాధ నాయకుడుకి రాజ్యాధికారం వచ్చింది . ఇతను సాహితీ పిపాసీ , సంగీత ప్రియుడూ ! ఇతని కాలంలో సంగీత సాహిత్యాలు ఓ వెలుగు వెలిగాయి . ముస్లిములతోనూ , ఫ్రెంచి వాళ్ళతోనూ , పొరుగున్న మధురై నాయక రాజులతోనూ తరచు యుద్ధాలు చేసినా , సంస్కృతీ , కళల్ని మాత్రం విడిచిపెట్టలేదు . నాటకాలూ , యక్షగానాలూ ఒకటేమిటి అని కళలూ విలసిల్లాయి . మామూలుగానే మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే మధుర నాయకులకీ , తంజావూరు నాయకులకీ 1673 లో అతి పెద్ద యుద్ధం జరిగింది . తంజావూరు తెలుగు నాయకులు ఓడిపోయారు . రాజ వంశీకులందరూ మరణించారు .
పిల్ల , అవ్వ చివరి లైన్లలో పెట్టారు . సన్యాసిని , దిసమొల వాడిని మధ్య లైన్లో పెట్టారు . ఎందుకూ ! ? వాటిని కూడా చివర వాక్యాల్లోనే పెట్టొచ్చుగా ! ?
అప్పుడే వర్షం పడి తగ్గింది . . చల్లగా వుంది వాతావరణం . . అంతా బురద . . . నీళ్ళు . . విపరీతంగా రద్దీగా ఉంది రోడ్డు . . ఎదురుగా వచ్చిన కారు హెడ్డు లైటు మొహం మీద పడుతోంటే చెమట , అలసట తో నిండిన తన మొహం దాచేసుకుంటున్నాడు అతను . . చుట్టూ పక్కల చూసుకుంటూ వస్తున్నాడు . . ఎవరో తనను గమనించకూడదన్నట్టు ఉంది అతని నడక . . ఇంకా చూపు కూడా . . అక్కడే ఓ టాక్సీ మాట్లాడు కున్నాడు . . చేతి రుమాలుతో మొహం కప్పేస్తూ ఎక్కి కూర్చున్నాడు . . మాటి మాటికీ చేతికున్న వాచీ చూస్కుంటున్నాడు . . ఒళ్ళో పెట్టిన ఆ సూట్కేసు గట్టిగా పట్టుకున్నాడు . . శివాజీ నగర్కి వెళ్ళడానికి ఇంకా ఎంత సేపు పడుతుంది బాబు . . అడిగాడు . . ముప్పావు గంట అయినా పడుతుందండీ . . అన్నాడా టాక్సి మనిషి . . కాస్త త్వరగా వెళ్ళ రాదూ ఓ పది రూపాయలు ఎక్కువిస్తా . . . ? లేదు సార్ ట్రాఫిక్ ఎక్కువుంది . . పైగా వర్షం పడి తగ్గిందిగా . . ! కాస్త కష్టమే . . ! అడిగినంత ఇస్తా ముందు వేగంగా పోనీ నాకు చాలా పనులున్నై . . . " సరే నండి అడ్డదారి లో తీస్కు పోతా . . " కారు వేగం పెరిగింది . . జేబు లోంచి పర్సు తీసి చూస్కుంటున్నాడు . . విసిటింగ్ కార్డు పైన కే . అనంతం LIC agent అని రాసుంది . . కారు అద్దాల్లోంచి వచ్చే వెలుగు లో స్పష్టం గా తెలుస్తూంది . . ఆ పర్సు బాగా పాత బడి వుంది . . అక్కడక్కడా చిరుగులు . . ఓ 5 రూపాయల గాడి ఉంది అందులో . అతను ఆ నాణెం తీసి చూస్కుంటున్నాడు . . బహుశా ఆ నాణెం తో అతని పరిచయం ఇప్పటిది కాదేమో . . ఇక్కడ దారిలో మంచి హోటలు ఎక్కడుంది . . ? " చాలా ఉన్నాయి సార్ " " మంచి ఆంధ్రా భోజనం తినాలని ఉంది . . " మధ్యలో ఓ చోట ఆపి భోజనం పార్సెల్ చేయించుకున్నాడు అతను . . ఇచ్చిన వెయ్యి రూపాయల నోటు కు మిగిలిన డబ్బులు తిరిగి ఇవ్వబోయాడు డ్రైవరు . . కొత్త ఐదు వందల రూపాయల నోటు మెరుస్తూంది . . ఇంకా మద్యలో వేరే నోట్లు . . " ఉంచుకో పర్లేదు " డ్రైవరు మారు మాట్లాడలేదు . . ఎక్కి కారు పోనివ్వడం మొదలు పెట్టాడు . మందు ఏమైనా తీస్కుంటారా సార్ . . ? " వైన్ తాగాలనుంది . . " కాక పోతే కొంచెం కర్చు అవ్వుద్ది సార్ పర్లేదా . . ? " నీ దగ్గర రెడీ గా ఉందా . . ? " ఎప్పుడూ ఒకటి రెండు స్టాకు పెట్టుకుంటానండీ " నీ పనే బాగుందయ్యా డబల్ బిసినెస్సు . . సిగరెట్టూ ఉండే ఉంటుంది . . ఓ పాకెటు ఇవ్వు . . " పెట్టెలోంచి ఓ పెద్ద నోటు తీసి యిచ్చాడు . . అనంతం . . ఇదంతా మిర్రర్ వ్యూ లో చూస్తున్నాడు డ్రైవరు . . కారులోనే తాగడం మొదలు పెట్టాడు . . కాసేపయ్యాక అడిగాడు . . నువ్వూ కొంచెం తీకుంటావా . . . ? వద్దండి . . డ్రైవింగ్ చేయాలిగా . . " నేనేమీ నీకులాగ డబ్బులడగను . . " - నవ్వేసాడు . . " అయినా తాగితే . . పెద్దనష్టం ఏం లేదులే . . ఇదిగో తీస్కో . . " శివాజీ నగర్ వచ్చేసింది సార్ . . ఎక్కడికి వెళ్ళాలి . . ? " మూడోవీధిలో చివరి ఇల్లు . . " వీధి చివరన కారు ఆగింది . . అంతా నిర్మానుష్యంగా ఉంది . . స్ట్రీట్ లైట్ వెలుగుకు కూడా చాలా దూరం గా ఉందా ఇల్లు . . మత్తులో ఎంత డబ్బులిచ్చాడో కూడా చూస్కోకుండా కారు దిగి లోపలి వెళ్లి పోయాడు అనంతం . . అటువంటి స్థితిలో కూడా అతని చేయి ఆ సూట్ కేసుని బలంగా పట్టుకునే ఉంది . . జాగ్రత్తగా లోపలి వెళ్ళాడు . . ఆ పెట్టెని తన మంచం మీద పడేసి . . ఆ కారు డ్రైవర్ వెళ్ళిపోయాడో . . లేదో . . అన్నది కిటికిలోంచి చూస్తున్నాడు . . అనుమానమే ఓ మత్తు . . ఇది మత్తులో అనుమానం . . . అతని కళ్ళు వాలి పోతున్నై . . తలుపు గట్టిగా గడియ పెట్టాడు . . వెళ్లి మొహం కడుక్కొచ్చాడు . . పక్కనున్న కవర్ లోంచి తీసి పార్సెల్ తెచ్చిన హోటల్ బోజనాన్ని తింటున్నాడు . . అతని కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నై . . ఆ కన్నీళ్ళ మధ్యలోంచి అస్పష్టంగా ఆ పెట్టెని చూస్తున్నాడు అనంతం . . చాలా రోజుల తరువాత నాలుగు వేళ్ళూ నోట్లోకెల్తున్నై . . జీవితంలో తను చేసిన మొదటి దొంగతనం కళ్ళ ముందే కనపడుతోంది . . కడుపు నిండుతున్న ఆనందం ఓ పక్కన , తరుముతున్న తప్పు చేసానేమో నన్న భావన ఓ పక్క . . శరీరం బాగా బరువుగా అనిపిస్తోంది . . . తింటున్న అన్నం మధ్యలోనే వదిలేసాడు . . . తిన్న చేతిని సరిగ్గా కూడా కడుక్కోకుండా నిద్రపోతున్నాడు . - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - మొత్తం చీకటి అయిపోయింది . . ఉన్నట్టుండి తనలో ఓ చీలిక . . . తను రెండుగా అయిపోవడం గమనిస్తున్నాడు . . అవి రెండూ తనలో జరిగే అంతర్యుద్దపు ప్రతిబింబాలుగా తెలుసుకున్నాడు . . చెడు : హ హ హ . . . ఈ రోజుతో నీ కష్టాలు తీరి పోయాయి . . ఈ పెట్టె నిండా డబ్బులు . . ఇంతకు ముందు ఎప్పుడూ చూడని డబ్బులు . . ఇకమీదట అంతా విలాసాలలో నీ జీవితం తేలిపోతుంది . . కావలసిన సౌకర్యాలు . . దండం పెట్టి పని చేసే వాళ్ళు . . చిటికెలో పూర్తయ్యే వ్యవహారాలూ . . శ్రమ మర్చి పోవచ్చు . . మార్పు వచ్చినట్టే . . . మంచి : అవును మార్పు వచ్చినట్టే . . అవసరానికి మించి ఆశలకు ఆజ్యం పోసినట్టే . . వచ్చినట్టే . . మార్పు వచ్చినట్టే ఇంతకు ముందెప్పుడూ చూడని డబ్బులు . . నిజమే . . అవి నీవి కాని డబ్బులు . . అవినీతి డబ్బులు . . అయినా నువ్వు వదిలినా ఈ పెట్టె నిన్ను వదలదు చెడు : బ్రతకడం వచ్చినతరువాత ఆ భయమెందుకు . . ? మంచి : అవును . . వేరొకరి బ్రతుకుల మీద బ్రతకడానికి భయమెందుకు ? మానసిక వికలాంగుడిగా రేపు నిన్ను తయారు చేసేందుకిది మొదటి శిక్షణ మాత్రమే . . ఇంత కాలం నీ సమస్య బయట జీవించడం ఎలాగనే . . కానీ . . రేపటినుండీ నీలో నువ్వు జీవించడానికి కష్టమయిపోతుంది . . ఈ చర్చే దానికి ఆధారం . . చెడు : నలుగురు నడిచేదే దారి . . చెప్పేదే ధర్మం . . నీకు తెలిసిన వాళ్ళలో నలుగురిని తప్పు చెయ్యని వాళ్ళని . చూపించు . . ? అది నీవల్ల కాని పని . . ఎందుకంటే . . ఆ నలుగురే ఈ సంఘం . . ఆ నలుగురే అసలైన నువ్వు . . మంచి : కాదు . . . ఆ నలుగురు కేవలం ప్రలోభ పడ్డవారు , ప్రలోభ పెట్టబడ్డ వారు మాత్రమే . అసలు మనం చెప్పుకునే ఆ చరిత్ర నలుగురిలో గెలిచిన వాడి చరిత్రే . . కానీ కనపడేది మాత్రం మిగిలిన ముగ్గురే . . చెడు : అయినా చరిత్ర ఎవడికి కావాలి ? సుఖం గా బ్రతకడం కావాలి . . అంతే . . చేతకాని కబుర్లు కడుపుకింత కూడు పెట్టవు . . నిన్న నువ్వేంటో చూడని వాళ్ళు , రేపూ నిన్ను చూడరు . ఎవరి బతుకు వారిదే . . ఎవరిగురించో నీకు పట్టింపు ఎందుకు . . ? మంచి : ఇక్కడ నువ్వు చెప్పే సుఖం వెనుక భయముంటుంది . . ఆనందముండదు . కేవలం మత్తు ఉంటుంది నిద్ర ఉండదు . . చెడు : అవును . . ఆ భయం ఎక్కడనుండి వస్తుంది . . ? వేరొకరి గురించి ఆలోచించినపుడే వస్తుంది . . ! ఆలోచించు . . పోలీసులు . . కోర్టులు లేవంటే . . అందరూ దొంగలే . . ! ఓ చెడ్డ పని చేయడం నుండి నిన్ను ఆపేది కేవలం అవి ఉన్నాయనే భయమే . . చెడ్డ పనులు చేయడం . . . పరాన్న జీవిగా బ్రతకడమే నీ అసలైన ప్రవృత్తి . . అయినా నలుగురికి తప్పు కాని పని నీకెలా తప్పవుతుంది . . ? మంచి : ఎప్పుడూ నలుగురి చర్చ కొనసాగుతూనే ఉంటుంది లోపల . . కాని ఆ నలుగురిలో మనం ఎక్కడున్నామనేదే చర్చకు ముగింపు . . మనలో లేనిది మనం చూడలేము . . మరి ఏది మనకి ఎక్కువ కనపడుతోందో మనం అలాంటి ఆలోచనా పరిధి లోనే తిరుగురుతున్నామని అర్థం . . నీవొకరి కష్టాన్ని దోచుకుంటే వేరొకరు నీకష్టాన్ని దోచుకుంటారు . . ఇది ఒక ఆవృతి . . దీనినుండి బయట పడడం అసాధ్యమౌతుంది . . ఇలాంటి తీయని విషాలకు లొంగకు . . రేపు ఉండదు నీకు . . సంజాయిషీ చెప్పుకునే అవకాసం కూడా దొరకదు . . బ్రతుకూ బ్రతకనీ . . ఇదే పరమ సత్యం . . ! ఒక్క నిజం గుర్తుంచుకో ఎవరి కథకు వారే కథానాయకులు . నీకధలో పాత్రధారిగా మిగిలిపోతావో . . ? లేక నాయకుడివవుతావో నీదే నిర్ణయం . . - - - - - - - ఇప్పుడిక ఎవరూ మాట్లాడడం లేదు . . ఈ మౌనాన్ని భరించడం చాలా ఇబ్బందిగా ఉంది . ఇక మిగిలింది తను చేయాల్సిందే . చెడు రంగు రంగులుగా ఉంది . . మంచి తెల్లని శాంతి పావురంలా . . ప్రశాంత వదనం చిందిస్తోంది . . ఇన్నాళ్ళూ తను డబ్బుకు ఇబ్బంది పడ్డాడు కానీ ఎప్పుడూ మనఃశ్సాంతి కరువయిన వాడిలా బ్రతకలేదు . . తన స్వంతమయిన లక్షణాలను తనను తాను వదులుకోలేదు . . ఇక మీదట కూడా అలాగే ఉండదలిచాడు . . తన మనస్సుని మరింత దృడ పరచాడు . . మంచి వైపే తన మార్గాన్ని ఎంచుకున్నాడు . . చివరికి . . . తనలో ఉన్న చెడును తను జయించాడు . . . ఊపిరాడని సంతోషం అకస్మాత్తుగా . . అతనికి నిజం గానే ఊపిరాడడం లేదు . . గుండెల మీద విపరీతమైన బరువు పెట్టి నొక్కినట్టుంది . . కాళ్ళూ చేతులూ చల్లబడిపోతున్నాయి . . గించుకునే ప్రయత్నాన్ని ఎవరో బలవంతం గా పట్టి ఆపేస్తున్నారు . . కాని ఈ సారి తను ఓడిపోయాడు . . అనంతం . . అనంతంలో కలిసి పోయాడు . . అదే విషయం ద్రువీకరించుకుని . . టాక్సీ డ్రైవర్ ఆ పెట్టెని తీస్కుని వెళ్లి పోయాడు . . . . . - కల్పితం
Let ' s take a listen . మనమూ తెలుక్కి ఒక వీరతాళ్ళ సంఘం ఏర్పరిస్తే ఎలాగుంటుంది ? ఆచార్య వేమూరి గారి వీరతాళ్ళ కార్యక్రమం ఆగకుండా కొనసాగుతుంటే బాగుండేది . హీబ్రూ సంఘానికి రోజుకి ముప్ఫైకి పైన విచారణలొస్తాయిట , ఫలాని చోట ఏ మాట వాడాలి , ఈ పదానికి అర్ధమేవిటీ , ఇలాగని ! ' nuff said .
దేవవ్వ గుండె కలుక్కుమంది . ధర్మయ్య ఇనరానట్టే ఉన్నాడు . " జీతమున్ననని వీడు చెప్పింది చయ్యన్నట . రేపు నాలుగు ఇండ్లు దోసుకరమ్మంటే దోసుకురావాలె గద " అంటున్నాడు తనను తాను బలపరుచుకున్నట్టు .
అప్పుడు అలఘువ్రతుడు మళ్ళీ అడిగాడామెని " ఈ స్వభావుడనే సిద్ధుడెవరు ? అతను మణిని , శరచాపాల్ని కళాపూర్ణుడికి ఎందుకిచ్చాడు ? " అని . దానికి ఆ బాలిక ఇలా అంది " ఆ స్వభావుడనే సిద్ధుడు సుముఖాసత్తికి తండ్రి . ఆమె పుట్టిన తర్వాత అతను దేశాంతరాలకు పోయి తిరుగుతూ మాహురీపురం చేరాడు . అక్కడ అన్ని యోగరహస్యాలూ తెలిసిన దత్తాత్రేయుడిని తన తపస్సుతో ప్రసన్నుడిని చేసుకున్నాడు . సకల యోగాలు తెలుసుకున్నాడు " అంటూ యోగవిద్య గురించి విస్తరంగా వివరించింది .
అభిరాం సింగ్ కాళ్లు మెయిన్ రోడ్డుకి దూరంగావున్న ఒక చెట్ల తోపువైపు కదిలాయి వాటంతట అవే .
గోదాదేవిని మొట్టమొదటిసారి ' పరమయోగివిలాసం ' గా తాళ్ళపాక చిన్నన్న , ' ఆముక్తమాల్యదగా ' శ్రీకృష్ణదేవరాయలు తెలుగులోకి తెచ్చారు . అంతేకాదు . తిరుప్పావై కావ్యానికి లక్ష్మణయతీంద్రులు తెలుగులో భావానువాదం చేశారు . దేవులపల్లి కృష్ణశాస్త్రి ' శ్రీ ఆండాళ్ళు తిరుప్పావు కీర్తనలు ' అన్న పేరుతో అనువదించారు .
" ఒరేయ్ అబ్బాయ్ . . ఆకలేస్తే హాయిగా తిండి తింటాము … అంతేగానీ … తిండిని ఫొటో తీసి దానిని చూసి మనలని మనం ఊరించుకొంటూ తృప్తి పడంకదా . . నువ్వు చేస్తున్న పని అలాంటిదే . . తిండి తినటం అన్నది భౌతికావసరం . . కానీ నువ్వు చేస్తున్నదాంట్లో మానసికమైన వ్యసనం చాలా ఉన్నది బాబూ . . ఎవరో ఒక అమ్మాయిని చూసుకో . . "
మంచికథ , కథనం లేకుండా ఎవరెంత చేసినా వృధా ప్రయాసేనని ఈ చిత్రం విషయంలో కూడా మరోసారి రుజువయ్యింది . సాంకేతికంగా ఎంతబాగున్నా , మంచి స్క్రీన్ ప్ . . .
ఎన్టీఆర్ అన్నా ఒకసారి దివినుంచి భువికి దిగిరావా ఇక్కడి రాజకీయాలను , అరాచకీయాలను పరికించి పోవా ? నీ వారసులు వారసులమని చెప్పుకునే నేతల విన్యాసాలను బడా నేతలుగా మారిన నీ అనుచరుల కార్యకలాపాలను చూసి పోవా ? ? నాటి నీ పధకాలు ఇప్పుడు ఎలా అమలు అవుతున్నాయో ? సారా నిషేధం ఎలా నీరు గారిందో ? సామాజిక న్యాయం ఎలా వుందో ? నీ స్ఫూర్తి తో రాజకీయాల్లో కొచ్చామని చెప్పుకునే వారు ఎవరికి మద్దతు ఇస్తున్నారో గమనించి పోవా ? ? ఆంధ్రుల ఆత్మ గౌరవం యే స్థితి లో వుందో తిలకించి పోవా ? ? ? ఎన్టీఆర్ అన్నా ఒకసారి దివినుంచి భువికి దిగిరావా
@ కొత్త పాళీ : నాకు తెలుగులో టైపు చేయటం కొంచెం కొత్తగా కొంచెం కష్టంగా ఉంది . ఆయినా కూడా ఇంకా మెరుగుగా టైపు చేయటానికి ప్రయత్నిస్తాను . ఛాలా క్రుతజ్ఞతలు .
" ఛీ ! నీకు బుధ్ధి లేదురా ! అంత ఇదిగా నేనడిగినప్పుడయినా నిజం చెప్పొచ్చుగదా ? ఇక నిన్ను జన్మలో నమ్మగలమా ? " అంతకంటే ఏం తిట్టాలో కూడా తెలియలేదతనికి .
అధికార పార్టీపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా టీడీపీ మీనవేషాలు లెక్కపెడుతోందన్నారు . గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ అనంతపురం జిల్లాలో అధికార పార్టీతో కుమ్మక్కైం దని ఆరోపించారు . ఇలా అనేక అన్యాయాలు జరుగుతున్నాయని , వీటన్నింటినీ దేవుడు చూస్తున్నాడన్నారు . చేనేత కార్మికులకు ప్రముఖ స్థానం కల్పించాలన్న ఉద్దేశంతోనే ధర్మవరం పట్టణానికిచెందిన గిర్రాజు నగేష్‌కు పార్టీలో కీలక పదవి ఇచ్చామన్నారు . వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ , టీడీపీలకు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు . అవసరం కోసం మాట ఇచ్చి తరువాత వాటిని మరచే నీచ రాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడుతోందన్నారు .
" అనగనగా కాసారపురం అనే పట్టణంలో కళాపూర్ణుడనే రాజు . అతనికి గొప్ప సంపదలున్నాయి . అతను తన కళల్తో లోకంలో ఉన్న రాజులందర్నీ జయించాడు . అతను పుట్టగానే స్వభావుడనే సిద్ధుడొకడు ఒక కొత్త మణిని , గొప్ప విల్లుని , మెరిసే బాణాల్ని అతనికిచ్చాడు . ఆ మణి అద్భుతమైన ఎరుపు రంగుతో ప్రకాశిస్తోంది ! ఆ బాణాలు ఎప్పటికీ తరిగిపోయేవి కావు ! ఆ విల్లు అతని విజయాలన్నిటికీ కారణం ! వాటిని అతను ఎప్పుడూ ధరించే ఉంటాడు ! తర్వాత మదాశయుడనే రాజొకడు రూపానుభూతి అనే భార్యతో , ధీరభావుడనే మంత్రితో వచ్చి ఆ చుట్టుపక్కల తారాడుతుంటే కళాపూర్ణుడు తన విల్లెక్కుపెట్టి ధీరభావుణ్ణి దూరంగా తరిమేశాడు ! మదాశయుడు శరణు కోరటంతో అతన్నీ అతని భార్యనీ తనకి సేవకుల్ని చేసుకున్నాడు !
ఈ వ్యాసాలు సినీరంగానికి సంబంధించినవి . ఈనాటి యువతలాగే నేనూ నాకాలంలో చాలా సినిమాలే చూశాను . నేను సైతం పథేర్ పాంచాలీ , బైసికిల్ థీఫ్‌లాటి సినిమాలు చూశాను . అయితే , ఈ నాటియువతకి భిన్నంగా , సాంకేతికపరిజ్ఞానం సంబంధించినంతవరకూ మాత్రం నేను చాలా వెనకబడి ఉన్నాననే చెప్పాలి . ఏ సినిమాకి ఎవరు దర్శకుడు , ఏ ఛాయాగ్రాహకుడు ఎక్కడ తన ప్రతిభ చూపేడు లాటి ఆలోచనలు నాకెప్పుడూ రాలేదు . మల్లీశ్వరి పెద్ద హిట్టయేవరకూ నాకు బి . యన్ . రెఢ్డి అని ఒక దర్శకుడున్నాడనే తెలీదు . టెన్ కమాండ్మెంట్స్ చూసినప్పుడు మాత్రం ఫొటోగ్రఫీ అద్భుతంగా ఉంది అనుకున్నట్టే గుర్తు ! ఈమధ్యనే ఇలాటివిషయాల్లో కూడా కొంత ఆసక్తి నాకు మొదలయింది . ఒక కారణం మాఅమ్మాయి హాలివుడ్ నటులజాబితాలో చేరడం . రెండోది సౌమ్య ఈ అనువాదాలు ప్రారంభించినప్పట్నించీ , నన్ను తరుచూ సలహాలు అడగడం .
మహాభారత యుద్ధం లో శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అన్నాడు . " ఏమయ్యా ! అనవసరమయిన బెంగలు పెట్టుకోక నన్నే నమ్ముకుని ఉండు . నీ పనులన్నీ నేనే చేస్తాను . " అని . తమిళనాడు ముఖ్యమంత్రిగారు దాదాపు అలాంటి హామీనే తమిళ ప్రజలకు ఇచ్చారు . " మీరేమీ అందోళనలు పడక నాకే ఓటు వెయ్యండి . మీ అవసరాలన్నీ నేను తీరుస్తాను . " అని . ఫ్రజలు ఆయనకు ఓటు వేశాక ఆయన ఇటీవలే పదేళ్ళ లోపు పిల్లలందరికీ ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేశారు . ఆపని కోసం ప్రభుత్వ సిబ్బంది నానా హైరానా పడుతూ కృషి చేస్తున్నారు . కొందరు గిన్నెలు , గరిటెలు , మూకుళ్ళు , విస్తళ్ళు , కొనే పని మీద వున్నారు . కొందరు పిల్లలు కూర్చోడానికి షెడ్లు కడుతున్నారు . మరికొందరు ఆవాలు , ధనియాలు , పప్పులు కొనుక్కొచ్చే హైరానాలో వున్నారు . తల్లిదండ్రులు తమ పిల్లల వయస్సులు సరిగ్గా లెక్కవేసుకొని అక్కడ భోజనాల బంతుల్లో పిల్లల్ని కుర్చోపెట్టే హడావుడిలో ఉన్నారు . ఇదిలా ఉండగా మరొక ఉచిత సౌకర్యం ముఖ్యమంత్రిగారు చేస్తున్నారు - అక్టోబరు రెండవ తేదీ నుంచి పిల్లలందరికి పళ్ళపొడి ఉచితంగా ఇస్తారు . దీని కోసం 48 లక్షలు ఖర్చు చేస్తున్నారు . తల్లిదండ్రులు ఈ ఉచిత పళ్ళపొడి దక్కడానికి పిల్లల పళ్ళు త్వరగా ఊడిపోకుండా జాగ్రత్త పడతారు . అందరూ పళ్ళు తోముకుని - ముఖ్యమంత్రిగారు రాగానే చిరునవ్వుల్తో కనిపిస్తారని నా నమ్మకం . మా ఆవిడ ఈ వార్త చదివి , " ఉచితంగా పెద్దలకి వక్కపొడి ఇస్తే బాగుణ్ణు " అంది . అప్పుడు నాకనిపించింది - రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగారు ఆయా వయస్సుల వాళ్ళకి వక్క , కారబ్బూంది , సున్నుండలు , మిరపకాయబజ్జీలు , కోడి పలావు , చివరగా ఉచిత బ్రాంది సదుపాయాలు చేస్తారని ఆనంద పడ్డాను . అయితే మంచి వెనుక ఏదో ఒక లోపమో చెడో జరగవచ్చు . దాన్ని ఎవరు ఆపలేరు . అప్పుడే పప్పుధాన్యాలు దొంగతనంగా అమ్ముకుంటున్న ఒక మనిషి అరెస్టయ్యాడట . ఆబాధ భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడట . ఏపనీ చెయ్యకుండా మందుకొట్టి మొదట్లో కూర్చున్న పిల్లల తండ్రి రెండు పూట్లా ఈ సంతర్పణలకి పిల్లల్ని పంపి ఇంటి దగ్గర చిన్న సైజు " అన్న దుకాణం " తెరిచినా ఆశ్చర్యం లేదు . అన్నీ ఉచితంగా దొరికిన పేద వాళ్ళు ఏంచేయాలో తెలీక సరదాగా చిల్లర దొంగతనాలూ , సరదా హత్యలూ , చిన్న చిన్న దోపిడీలు చేసినా తప్పులేదు . సుఖం మనిషికి ధైర్యాన్నిస్తుంది . నిరుద్యోగులకి బోనస్ లు లభించే స్కీము ఆధారం చేసుకుని - చిన్న సైజు గుండాయిజం నీగ్రోలు వుంటున్న ప్రాంతాల్లో అమెరికాలో ప్రారంభమయిందని మనం చదువుకున్నాం . రాత్రి పదిగంటలకి మద్రాసు నగరంలో కొన్ని ప్రాంతాల్లో నడవడం కూడా కష్టమని అస్మదాదులకి తెలుసు . మనిషికి ఏదో ఒకటి సాధించడం అన్నది తృప్తినిస్తుంది . సాధించాలన్న కృషే జీవితం . ఏం సాధించాలో తెలీని సందర్భంలో ఎంతో సంపన్నమైన స్థితిలో వున్నవారు ఆత్మహత్య చేసుకోవడం మనం వింటున్నాం . పేదవారిని పేదగా వుంచడం ఎవరి వుద్దేశ్యం కాదు కాని , ప్రతి వ్యక్తి కష్టపడే అవకాశం , కష్టపడితే ఫలితం దక్కే అవకాశం ప్రభుత్వం కలిపిస్తే , ఏదో ఒక పని చేయాలన్న తపన . చేసిన ప్రతిఫలం సమాజానికీ , దేశానికీ దక్కుతుంది . లేదా ముఖ్యమంత్రుల్ని ఎన్నుకుంటే - ఉచితంగా భోజనం , పళ్ళపొడి , గావంచా , సినిమా టిక్కెట్లు - లభిస్తాయన్న అలసత్వంలో ప్రజలు పడితే - వాళ్ళు తిరుగువాటు కాలాన్ని ఏం చెయ్యాలో తెలీక జేబులు కొట్టడం ప్రారంభిస్తారు . * * * - ఇది శ్రీ గొల్లపూడి మారుతీ రావు 27 యేళ్ళ క్రితం , అంటే 10 - 9 - 1982 న , " ఆంధ్ర జ్యోతి " లో ' జీవనకాలం ' అనే శీర్షిక క్రింద వ్రాసిన వ్యాసం ! మరి అప్పటికీ ఇప్పటికీ యేమైనా మార్పు వచ్చిందా ? రాలేదంటే దానికి బాధ్యులెవరు ? మనమేమీ చెయ్యలేమా ? ఇవాళ టివీల్లో ప్రసారమైన జయప్రకాష్ నారాయణ్ ప్రసంగ పాఠాన్ని వినండి ! సత్తా జనాస్సుఖినోభవంతు !
నాడీజంఘుని శరీరభాగాలు ఒకచోటచేర్చి దహనసంస్కారాలు యథావిధి కర్మకాండ చెశాడు విరూపాక్షుడు . విధాత తన ప్రియమిత్రుని మరణవార్త విని వెంటనే కామధేనువును నాడీజంఘుని బ్రతికించమని ఆజ్ఞాపించాడు . గోక్షీరములోని అమృతశక్తి ప్రభావముతో నాడీజంఘుడు పునర్జీవితుడైనాడు . బ్రతికిన మిత్రుని చూసి ఎంతో సంతోషించి ఆలింగనము చేసుకొని జరిగినదంతా వివరించాడు విరూపాక్షుడు .
ప్రమాదాలను గుర్తించి సమాచారమిస్తారు . ఇటీవల రైల్వే పరిధిలో 45 రోజుల్లో 58 ప్రమాదాలు గుర్తించి , వాటి నివారించగలిగారంటే వీరి అవసరం ఆ శాఖకు ఎంత ముఖ్యమో చెప్పనక్కర్లేదు . రైల్వే ప్రమాదాల నివారణలో వీరి కృషి ఎంతో వుంది . రాత్రనకా , పగలనకా ట్రాక్‌ల వెంబడి వెళ్తుంటారు . మండే ఎండల్లోనైనా , ఎముకలు కొరికే చలిలోనైనా , హోరు వానలోనైనా విధులు నిర్వహించాల్సిందే . అయితే విస్తరించిన మార్గాలకు , పెరిగిన రైల్వేలైన్లకు అవసరమైనంత మేరకు సిబ్బంది లేకపోవడంవల్ల ఉన్నవారికే ఎక్కువ పని అప్పగిస్తున్నారు . వాస్తవంగా ఏ ఉద్యోగికైనా ఎనిమిదిగంటల పనివిధానం ఉంటుంది . కానీ వీరు రోజూ పన్నెండుగంటలు చేస్తున్నారు . అంటే . . . నాలుగ్గంటలు అదనపు భారం వీరిపై పడుతోంది . అందుకుగాను వీరికి ప్రత్యేక సౌకర్యాలూ , అలవెన్సులూ ఏవీ చెల్లించట్లేదు . ఏళ్ల తరబడిగా పనిచేస్తన్నా ప్రమోషన్లులేవు . ఎఐఆర్‌ఎఫ్ డిమాండ్‌వల్ల ప్రమోషన్లూ , అలవెన్సుల విషయంలో పరిశీలించేందుకు రైల్వేబోర్డు జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది . అయితే తమకు గ్రేడ్ పే రూ . 2400 నిర్ణయించాలని , రిస్క్ అలవెన్సులు కూడా ఇవ్వాలని కోరుతున్నారు .
12 ఆపృచ్ఛస్వ ప్రియసఖ మముం తుఙ్గ మాలిఙ్య్గ శైలం వన్య్దైః పుంసాం రఘుపతిపదై రఙ్కితం మేఖలాసు కాలే కాలే భవతి భవతా యస్య సంయోగ మేత్య స్నేహవ్యక్తి శ్చిరవిరహజం ముఞ్చతో బాష్ప ముష్ణమ్
స్వామిగారి చిరుమందహాసం కొంచెం మందగించింది ఆ ప్రశ్న విని . పక్కనే ఉండి ఆయన కంటే కొంచెం చిన్న కమండలం పట్టుకున్న రెండో నెంబరు స్వామి శివరాంకేసి తీవ్రంగా చూస్తుండగా మందగించిన మందహాసాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చేసుకుని , " అదే నాయనా ఎంతో విలువైన మంత్రాక్షరం , అందులోనే ఉన్నది పెన్నిధి " అని శివరాంకి తత్వబోధన చేసి భక్తుల చేత మడిగా , విడివిడిగా కాళ్ళకి దణ్ణం పెట్టించుకోడానికి తరలి వెళ్ళారు .
ఈనాడు మనం పాటిస్తున్న కథ , కవిత అనే భేదం కూడా పూర్వీకులలో లేదు . ' ' కావ్యాలు పద్యకావ్యాలు , గద్యకావ్యాలు అని రెండు విధాలు ' ' అంటూ పద్య గద్యాలను రెండింటినీ కావ్యాలుగానే పరిగణించారు . పద్యానికీ , గద్యానికీ సమాన ప్రతిపత్తినే ఇచ్చారు . సాహిత్య పరంగా వారు వాల్మీకి రామాయణానికి ఎంత పెద్ద పీటవేశారో , గుణాఢ్యుని బృహత్కథకూ అంతే పెద్ద పీటవేశారు . అంతేకాదు . పైన చెప్పినట్టు వారు కావ్యాల పరిమాణాన్ని కూడా లెక్కలోకి తీసుకోలేదు . మరికొందరైతే నేడు మనం ' ' మినీ కవితలు ' ' అని చెప్పుకుంటున్న వాటికి పూర్వరూప మనదగిన శాలివాహన గాథాసప్తశతిలోని ఒక్కొక్కగాథనూ ఒక్కొక్క కావ్యంగా పరిగణించవచ్చును అన్నారు . వాక్యం రసాత్మకం కావ్యం అన్న ఒక మాటతో .
మనకు మనం మిగలనీయక మనని మనకి పరాయిని చేసేదే ప్రేమ . మనవారికోసం వేదనపడమని వెక్కిరించేదే ప్రేమ మరి . ప్రేమించటానికి అందుకే సహనం , తెగువ కావాలి .
తెలంగాణ సాంఘిక సాంస్కృతిక జీవితాన్ని , దొరల నిరంకుశ పీడనకు , దోపిడీకి గురవుతున్న ఒక గ్రామాన్ని , ఆ దొరల కబంధ హస్తాల నుంచి విముక్తం చేసిన , ఒక గాంధేయవాది కథ ' ' నిరుడు కురిసిన కల ' ' ( బి . మురళీధర్ )
మధురవాణి గారూ అను ఇన్విటేషన్ డిజైన్స్ . . క్లిప్ఆర్ట్స్ వగైరా వివరాలకు మీరు ఆన్‌లైన్ ద్వారా ఈ www . anufonts . com చిరునామాకు వెళితే సరిపోతుంది . వీటిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు .
శ్రీ కోవెల సంపత్కుమారాచార్య జననం వరంగల్లులో . ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు , హిందీ భాషలలో ఎం . ఏ . , ఆపై కాకతీయ విశ్వవిద్యాలయం నుండి 1978లో ' తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శ : సంప్రదాయము ' అనే సిద్ధాంత గ్రంథంతో డాక్టరేట్ డిగ్రీలు . అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ - లక్షణ దీపిక , తెలుగు ఛందోవికాసము , మధుర గాథలు , తదితర గ్రంథాలు ; ఆముక్త , చేతనావర్తం కవితా కావ్యాలు ; విశ్వనాథ కవిత్వ విమర్శ , కన్యాశుల్క నాటక విమర్శ , వచన పద్య లక్షణంపై చేరాతో చర్చ , అనేక తదితర సాహిత్య వ్యాసాలు - తెలుగు సాహిత్యాన్ని ఎంతగానో పరిపుష్టం చేసిన పండితుడు , కవి , విమర్శకుడు , నిగర్వి , స్నేహశీలి , ఒక మామంచి మనిషీయన . కోవెల సంపత్కుమారాచార్య సాహితీప్రస్థానంపై డా . యు . ఎ . నరసింహమూర్తి సమగ్ర పరిచయాత్మక ప్రత్యేక వ్యాసం విశిష్ట విమర్శకుడు : సంపత్కుమార సహితంగా ఆ పండితుని స్మరణలో ఈ సంచికను కోవెల సంపత్కుమార స్మారక సంచికగా మీ ముందుకు తెస్తున్నాం . మా ఈ ప్రయత్నం పై మీ అభిప్రాయాలు తప్పక తెలియజేయండి .
ఇంటరులో మా కెమిస్ట్రీ మేస్టారికి ఆంగ్లం మీద కూడా మంచి పట్టుండేది . నోట్సు చెబుతూ మధ్యమధ్య క్లిష్టమైన పదాల స్పెల్లింగు కూడా చెబుతుండేవారు . ఒక సారి ఈక్విలిబ్రియం కి స్పెల్లింగు రెండు ఎల్లులతో చెప్పారు . ఒక్క ఎల్లేనండీ అన్నా నేను . తన ఇంగ్లీషు మీద ఆయనకీ అంత నమ్మకం . . నే చెప్పింది నమ్మలేక పోయారు . అప్పటికప్పుడు డిక్షనరీ తెప్పించి చూశారు ! మహానుభావులు కాబట్టి పెద్దమనసుతో నా దుడుకుతనాన్ని క్షమించి తప్పు ఒప్పుకున్నారు . కొన్ని కొన్ని అపోహలతోనే జీవితం గడిచిపోతుంటుంది ! @ సుగాత్రి - మీరు చెప్పకపోయుంటే నేను భీభత్సంగానే ముందుకుపోతుండేవాణ్ణి . ధన్యవాదాలు ! ఐతే . . మీరన్నట్టు ఇక్కడ అదికూడా ఒక వ్యంగ్యంలా ఉంది కాబట్టి మార్చబోవట్లేదు .
విశృంఖలత్వం : తత్వ దర్శన ప్రస్థానంలో ప్రతి కళాకారుడూ ఐహిక , లౌకిక జీవితాలలోని విలువలు , ఆదర్శాలు రూపొందిన క్రమాన్ని , వాటిలోని వైరుధ్యాలను గ్రహిస్తాడు . ఆయా సిద్ధాంతాల , ఆదర్శాలలోని గుణదోషాలను , ఆచరణలోని సాఫల్య వైఫల్యాలను వెంటవెంటనే గ్రహించగలుగుతారు . దీనివల్ల కొందరు వ్యక్తిగత జీవితంలోని ' విశ్వాసాల ' ను విడువకుండానే శూన్యవాద , నిరీశ్వరవాద ఛాయలలో పయనిస్తుంటారు .
ఏడుపులు , పెడ బొబ్బలు నేపధ్యంలో విమానం ద్వీపం మీద దిగింది . అందరూ దేవుడా ఇక్కడ ఎలా జీవితం గడపాలిరా బాబు అని ఇటూ అటూ చూడటం మొదలుపెట్టారు .
స్వప్న గారూ ! చాలా థాంక్స్ మా " చిన్ని ఆశ " లు తీరాలని కోరుకున్నందుకు . మీకూ చాలా " చిన్ని ఆశ " లు ఉన్నాయన్నారు . మేమూ మనసారా మీ ఆ " చిన్ని ఆశ " ల తోబాటు ఆ ఒక పెద్ద ఆశా త్వరలోనే తీరాలని కోరుకుంటున్నాము .
ఇద్దరు పిల్లలకీ మరీ తక్కువ ఎడం ఉంటే , కొద్దిగా కష్టమే . పెద్దవాళ్ళు ఎప్పుడూ శాంతస్వభావం కలవారే , అని మా ఇంటావిడా , అమ్మాయీ అంటూంటారులెండి . పోనీ ఏదో అనుకుంటున్నారులే అని వదిలేద్దామా అనుకుంటే , దానికి ఓ కొరాలరీ పెడతారు - రెండో వాళ్ళెప్పుడూ రౌడీలే అని ! అదొక్కటే బాగోలెదు . ఔనూ , నోరుందీ , నెగ్గుకొస్తారూ తప్పెమిటీ ? ప్రస్తుతం మా మనవలిద్దరినీ చూస్తున్నాను కదా , మా ఇంటావిడ చెప్పెది నిజమేమో అని ! వాడికి మొన్న ఏడో తారీఖుకి , ఏడాది నిండింది , ఇప్పుడే గ్రౌండ్ ఫ్లోర్ లో రెండూ , బాల్కనీ లో రెండూ పళ్లొచ్చాయి . అదేమిటో ఇన్నాళ్ళూ , మేమిద్దరమూ పళ్ళవిషయంలో , ఒక్కటే అనుకునేవాడిని , కానీ ఈ నాలుగు పళ్ళూ వచ్చేటప్పటికి , అప్పుడప్పుడు కొరుక్కుని , నన్ను rag చేస్తున్నాడేమో అనిపిస్తూంటుంది .
కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరితో పాటు రాష్ట్రంలో మరికొందరు నాయకులు జగన్ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని . . . .
ఈ విధంగా సినిమాలో ప్రతీ పాత్ర దానికై ఒక ప్రాధాన్యతను కలిగి ఉండి , అదే సమయంలో కథలో ఇమిడిపోయి , తనవంతుగా కథనాన్ని రక్తికట్టించడంలో తోడ్పడడంతో ద్వితీయార్థం మొత్తం నవ్వుల జల్లు కురిసి చక్కటి సినిమా చూసిన అనుభూతితో బయటకు వస్తాడు ప్రేక్షకుడు .
320 గుప్తుల కాలము ప్రారంభము . భారత దేశ హిందువుల స్వర్ణ యుగము
ఇంక , నియమం కాదు కానీ పద్యాలకి , అందులోనూ తెలుగు పద్యాలకి ఉండే మరొక ప్రత్యేకమైన లక్షణం ప్రవాహ గుణం , లేక ధార . తెలుగు పద్యానికి అందాన్ని తెచ్చే లక్షణాలలో ఇది ప్రధానమైనది . నన్నయ్య , శ్రీనాధుడు , పోతన , పెద్దన వంటి కవుల పద్యాలు చదివితే ఇదేమిటో అనుభవమవుతుంది . తెలుగు ఛందస్సులోని యతి , భాషాలోని సంధి సమాసాలూ - తెలుగు పద్యానికి యీ గుణాన్నిస్తున్నాయి . తెలుగు ఛందస్సులో యతి సంస్కృతంలోలాగా విరామం కాదు . అక్షరమైత్రిని నియమిస్తుంది . విరామ నియమం పద్యానికొక ప్రత్యేక లయనిస్తే , అది లేకపోవడం వలన పద్యం ప్రవాహంలా సాగే అవకాశం కలుగుతుంది . సంస్కృతంలో లాగా పాదాంతంలో విరామం కూడా తెలుగు పద్యాలకి అవసరం లేదు . తెలుగు కవులు ఈ గుణాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు . అందుకే తెలుగు ఛందస్సు కవి చేతిలో దౌడుతీసే గుఱ్ఱంఅయింది . ఐతే కేవలం విరామ యతి లేకపోయినంత మాత్రాన పద్యం ప్రవాహంలా సాగదు . " సంధి " దీన్ని సమర్ధంగా నిర్వహిస్తుంది . " సారమతిన్ కవీంద్రులు " అని అనాలంటే , " సారమతిన్ " అన్న పదానికీ " కవీంద్రులు " అన్న పదానికి మధ్య కొంత వ్యవధి తప్పదు . అదే " సారమతింగవీంద్రులు " అని సంధి కలిపితే ఉచ్చారణ సులభతరమౌతుంది . వినడానికి కూడా సరళంగా ఉంటుంది . ప్రవాహ గుణం పద్యాలకి ఒక ప్రత్యేక నాదాన్నిస్తుంది . ఈ నాదం తెలుగు భాష సొత్తు . ఇది కేవల శబ్దాలంకారం కాదు . పద్యాన్ని ఛందోనుగుణంగా చదివే ఒడుపు తెలిసిన వాళ్ళకి ఇదేమిటో అనుభవమైన విషయం .
ఇటువంటి ఇన్నింగ్స్ చూస్తున్నప్పుడు ఒక సచిన్ అభిమాని ఎంత ఆనందం పొందుతాడో , తీన్‌మార్ సినిమా చూస్తున్న ప్రతిక్షణం నేను పొందాను .
ముందుగా మన ఇండియా వరకు Web 20 సైట్ ఒకటి తయారు చేయాలి . . అన్ని వివరాలు ( కారణాలు , నివారణ మార్గాలు ) పొందు పరచాలి … దీనిలో ఒక్క బత్తీబంద్ మాత్రమే కాకుండా ఇలాంటివి ఎన్ని కార్యక్రమాలు అయితే గ్లోబల్ వార్మింగ్ నివారణకు తోడ్పడతాయో అన్నీ చెప్పాలి . . ఉతాహం ఉన్నవాళ్లు వాళ్లకు నచ్చిన కార్యక్రమానికి pledge తీసుకునే సౌకర్యం కల్పించాలి . . ఇలాంటి కార్యక్రమాలకు ముందు , తరువాత సాధ్యమైనంత ఎక్కువ వివరాలతో ఈ సైట్ ను అప్ - డేట్ చేస్తూ ఉండాలి … డొనేషన్స్ ఇచ్చే , gift షాప్ లో వీటికి సంబంధించిన వస్తువులు కొనుక్కునే సౌకర్యం ఉండాలి … ప్రతి కాలనీ , పల్లె , నగరం , రాష్ట్రం , కాలేజి , ఆఫీస్ , కర్మాగారం … ఇలా వీలైనంత వైవిధ్యమైన గ్రూప్స్ తయారు చేసుకుని , సభ్యులను చేర్చుకుని , వాళ్లకు నచ్చిన నివారణమార్గాలకు ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం కల్పించాలి - ముఖ్యంగా ఏ కుటుంబాలు , కాలనీలు , పల్లెలు , నగరాలు , రాష్ట్రాలు మొదలగునవి ( వారు ) అయితే దీనికి ఎనలేని కృషి చేశారో , ప్రోత్సాహించారో ఇచ్చారో వారి ( టి ) గురించి ఎక్కువగా ప్రచారం చేయాలి - సాధించిన ప్రగతి , రాబోయే రోజుల్లో జరపబోయే కార్యక్రమాల గురించి SMS / Email subscription వివరాలను పొందటానికి అవకాశం కల్పించాలి - ఉన్న అన్ని నివారణ మార్గాలలో మంచివి ఎన్నుకోవటానికి Digg లాంటి suggestion / recommendation engine ఒకటి ఈ సైట్ లో పొందు పరచాలి .
అలెగ్జాండర్ ద గ్రేట్ కొద్ది సంవత్సరాలలోనే ఆసియా మీద విజయాన్ని సాధించి , అక్కడ తన అధికారం ఇంకా స్థిరపడకముందే మరణించాడు . ఒక కొత్త రాజ్యాన్ని సంరక్షించుకోవడంలో ఉండే కష్టనష్టాలను దృష్టిలో ఉంచుకొని అతడు మరణించటం వలన సామ్రాజ్యం మొత్తం తిరుగుబాటు చేస్తుందని భావించబడింది . కానీ అతని వారసులు దానిని సమర్థవంతంగా సంరక్షించుకోగలిగారు . అలాచేయడంలో వారికి కేవలం తమ దురాశ మూలంగా మరియు ఒకరి యెడల ఒకరు అసూయ చెందడం మూలంగా తలయెత్తిన కష్టం తప్ప మరెటువంటి ఇతర కష్టం ఎదురుకాలేదు . ఇలా జరగటం ఎవరికైనా కొత్తగా అనిపించి కారణం అడిగితే , నేను ఈ విధంగా సమాధానమిస్తాను . మనకు తెలిసిన అన్ని సంస్థానాలూ రెండు వేర్వేరు విధానాలలో పరిపాలింపబడుతున్నాయి . ఒక విధానంలో రాజు మరియు కొంతమంది సేవకుల సమూహం ఉంటుంది . వారంతా ఆ రాజు యొక్క ప్రసన్నత వలన మరియు అనుమతి వలన రాజ్యాన్ని పరిపాలించడంలో అతనికి మంత్రులుగా సహకరిస్తుంటారు . మరో విధానంలో రాజు మరియు కొందరు ప్రభువంశీకులు ఉంటారు . వారు తమ హోదాను రాజు యొక్క దయ వలన కాక అనువంశికంగా కలిగి ఉంటారు . ఈ ప్రభువంశీకులు అందరికీ తమను వారి రాజుగా గుర్తిస్తూ , ఎంతగానో ప్రేమించే ప్రజలతో కూడుకున్న స్వంత రాజ్యాలు ఉంటాయి . రాజు మరియు అతని సేవకులచే పరిపాలింపబడే రాజ్యాలు రాజుకు చాలా ప్రాముఖ్యత కలుగజేస్తాయి . ఎందుకంటే దేశం మొత్తంలో ఇతని కన్నా ఉన్నతుడిగా గుర్తింపు ఉన్న వ్యక్తి మరెవరూ ఉండరు . ఒకవేళ ఇతరులు ఎవరైనా గౌరవాన్ని పొందినా కూడా , రాజు యొక్క మంత్రులుగా , అధికారులుగా వారు గౌరవాన్ని పొందుతారేగానీ వారి యెడల మరేవిధమైన వ్యక్తిగత ప్రేమాభిమానాలు ఉండవు . ఈ రెండు ప్రభుత్వ విధానాలకూ మనకాలంలో మంచి ఉదాహరణలు టర్కీ మరియు ఫ్రాన్స్ . టర్కిష్ సామ్రాజ్యం మొత్తం ఒక్క రాజు చేతనే పాలింపబడుతూ ఉంటుంది . ఇతరులు అందరూ సేవకులుగా ఉంటారు . అతడు రాజ్యాన్ని లు అనబడే విభాగాలుగా విభజించి , వాటన్నింటికి ఒక్కొక పరిపాలనా అధికారిని నియమిస్తాడు . ఆ పరిపాలనా అధికారులను రాజు తన చిత్తానుసారంగా బదిలీ చేస్తుంటాడు . ఒకరి స్థానంలో మరొకరిని నియమిస్తుంటాడు . అయితే ఇందుకు విరుద్ధంగా ఫ్రాన్స్ దేశపు రాజు వంశపారంపర్య అధికారం కలిగిన అనేక మంది ప్రభువంశీకులచే పరివేష్ఠితుడై ఉంటాడు . వారిలో ప్రతి ఒక్కరూ తమ స్వంత ప్రజలనుండి గుర్తింపునూ , ప్రేమాభిమానాలనూ పొందుతుంటారు . ఆ ప్రభువంశీకులంతా కొన్ని ప్రత్యేకాధికారాలను కలిగి ఉంటారు . రాజుకు సైతం వాటిని తొలగించడం కష్టసాధ్యం . ఈ రెండు రాజ్యాల యొక్క వేరువేరు లక్షణాలను పరిశీలించిన వారు టర్కీ రాజ్యాన్ని ఆక్రమించడం కష్టసాధ్యమనే విషయాన్ని గ్రహిస్తారు . అయితే ఒకసారి దానిని జయించడమంటూ జరిగితే ఆ తదుపరి దానిని నిలుపుకోవడం మాత్రం సులభ సాధ్యం . టర్కీని జయించడంలో ఉన్న కష్టాలకు కారణాలు ఏమిటంటే దండెత్తాలని అనుకునేవారికి ఆ రాజ్యంలోని ఏ ప్రభువంశీకుల నుండి కూడా పిలుపు అందదు . అలానే శత్రురాజు యొక్క సహచరులు రాజద్రోహానికి పాల్పడటం ద్వారా తమ దురాక్రమణ ప్రయత్నాలకు ఏదైనా సహాయం మందవచ్చని ఆశించే వీలు కూడా ఉండదు . పైన తెలిపిన కారణాల వలన ఇలా జరిగింది . అవేమంటే రాజు యొక్క మంత్రులు అతనికి కేవలం సేవకులూ మరియు అతని మీద ఆధారపడి బ్రతికే బానిసలు అవడం మూలాన వారు అంత తేలికగా రాజద్రోహానికి పాల్పడరు . ఒకవేళ వారు ద్రోహానికి పాల్పడినా కూడా వారి నుండి అందే సహాయం ఏమీ ఉండదు . ఎందుకంటే ముందే చెప్పినట్లుగా వారు ప్రజలను కూడగట్టలేరు కనుక . కనుక టర్కీని జయించాలనుకునేవారు మొదట తన వారంతా సంఘటితంగా ఉండటం గురించి ఆలోచించాలి . అలానే శతృశిబిరంలోని రాజద్రోహాలమీద కాకుండా తన స్వీయశక్తి మీదే ఆధారపడాలి . అయితే ఒకసారి టర్కీ జయించబడిన తరువాత , అది తన సైన్యాన్ని తిరిగి కూడగట్టలేని విధంగా యుద్ధరంగం నుండి తరిమి వేయబడిన తరువాత ఒక్క రాజకుటుంబానికి తప్ప మరిదేనికీ భయపడవలసిన పనిలేదు . దానిని కూడా తుదముట్టించిన తరువాత ఇక భయపడవలసిన వారు ఒక్కరు కూడా మిగిలి ఉండరు . మిగిలిన వారెవరికీ ప్రజలలో పలుకుబడి ఉండదు కనుక విజేత ఆ రాజ్యాన్ని జయించడానికి పూర్వం వారి మీద ఏ విధంగా ఆధారపడలేదో , అలాగే జయించిన తరువాత వారికి భయపడాల్సిన పని కూడా లేదు . ఫ్రాన్సు వంటి పరిపాలన ఉన్న రాజ్యాలలో ఇందుకు విరుద్ధంగా జరుగుతుంది . అటువంటి చోట్ల అసమ్మతివాదులు , మార్పును అభిలషించేవారూ ఎల్లప్పుడూ ఉంటారు కనుక ఎవరో ఒక ప్రభువంశీకుడి సహాయసహకారాల ద్వారా చాలా సులభంగా ఆ రాజ్యంలో ప్రవేశించవచ్చు . అటువంటి వ్యక్తులు ముందే తెలుపబడిన కారణాలరీత్యా తమ రాజ్యం మీద నీవు దండెత్తడానికి మార్గాన్ని సుగమం చేయడమే కాక నీవు సులువుగా విజయం సాధించడానికి తోడ్పడతారు . అయితే ఆ తదుపరి ఆ రాజ్యాన్ని సంరక్షించుకొనే ప్రయత్నంలో నీచే రాజ్యాన్ని కోల్పోయినవారి నుండే కాక నీకు సహాయం చేసినవారి నుండి కూడా నీవు అంతులేని కష్టాలను ఎదుర్కొంటావు . నీకు వ్యతిరేకంగా జరిగే తదనంతర పరిణామాలన్నింటికీ మిగిలిపోయిన రాజవంశీకులందరూ నాయకత్వం వహిస్తారు కనుక రాజకుటుంబాన్ని ఒక్కదాన్ని మట్టుబెట్టినందువల్ల ప్రయోజనమేమీ ఉండదు . ఈ రాజవంశీకులను నీవు ఇటు సంతృప్తి పరచలేక అటు తుదముట్టించలేక సతమతమవుతూ ఏదో ఒక సమయంలో జయించిన రాజ్యాన్ని తిరిగి కోల్పోతావు . ఇప్పుడు నీవు డేరియస్ ప్రభుత్వ స్వభావాన్ని పరీక్షించినట్లైతే , అది టర్కీ సామ్రాజ్యంతో పోలి ఉన్నట్లుగా తెలుసుకుంటావు . కనుక అలెగ్జాండర్‌కు ముందుగా అతడిని యుద్ధంలో ఓడించి , అటు పిమ్మట అతడి రాజ్యాన్ని సొంతం చేసుకోవలసిన అవసరం ఒక్కటే ఉన్నది . అలా విజయం సాధించిన తరువాత డేరియస్ చంపబడి , పైన తెలిపిన కారణాల వలన ఆ రాజ్యం అలెగ్జాండర్‌కు శాశ్వతంగా స్వంతమైపోయింది . అలెగ్జాండర్ వారసులు సంఘటితంగా ఉన్నట్లైతే ఆ రాజ్యాన్ని చాలా సులువుగా , సురక్షితంగా తమ స్వాధీనంలో ఉంచుకోగలిగేవారు . ఎందుకంటే ఆ రాజ్యంలో మరే ఇతర కల్లోలాలూ చెలరేగలేదు . . వీళ్ళు స్వయంగా సృష్టించుకున్నవి తప్ప . అయితే ఫ్రాన్సును పోలిన ప్రభుత్వ విధానం ఉన్న రాజ్యాలను సంరక్షించుకోవడం ఇంత తేలిక కాదు . స్పెయిన్ , గాల్ మరియు గ్రీసు రాజ్యాలు చిన్న చిన్న సంస్థానాలతో కూడుకున్నవి కనుక అక్కడ రోమన్‌లకు వ్యతిరేకంగా తరచూ తిరుగుబాట్లు చెలరేగుతుండేవి . ఆ సంస్థానాల జ్ఞాపకాలు ఉన్నంతకాలం రోమన్‌ల పెత్తనం ఏనాడూ సురక్షితంగా లేదు . కానీ కాలక్రమంలో రోమన్‌ల అధికారం వలన మరియు వారి పరిపాలన దీర్ఘకాలం కొనసాగటం వలన ఆ పాత జ్ఞాపకాలన్నీ చెరిగిపోయి రోమన్ల పెత్తనం సురక్షితంగా మారింది . తరువాత తమలో తాము కలహించుకున్న సమయంలో తాము అక్కడ కలిగి ఉన్న పలుకుబడిని బట్టి ఆ రాజ్యాలలో కొంత కొంత భాగాన్ని వారిలో ప్రతి ఒకరూ తమతో ఉంచుకోగలిగారు . ఆయాచోట్ల పాత ప్రభువుల యొక్క కుటుంబాలు తుదముట్టించబడటంతో రోమన్‌లు తప్ప వేరెవ్వరూ ప్రభువులుగా గుర్తించబడలేదు . ఈ విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకున్నట్లైతే అలెగ్జాండర్ ఆసియాలోని తన సామ్రాజ్యాన్ని సులువుగా సంరక్షించుకున్న వైనం యెడల , అలాగే పిర్రస్ మరియు అనేకమంది ఇతరులు తాము జయించిన రాజ్యాలను సంరక్షించుకోవడంలో ఎదుర్కున్న కష్టాల యెడల ఆశ్చర్యబోవలసిన అవసరం ఎవరికీ ఉండదు . ఎందువల్లనంటే దీనికి కారణం విజేత బలవంతుడో లేక బలహీనుడో అవటం కాదు . వారు జయించిన రాజ్యాల యొక్క లక్షణాలలోని తేడాలే దీనికి కారణం .
ఒకప్పుడు అమెరికా కి జాబు వీసా దొరికితే బంగారు లోకం లోకి అడుగు పెట్టినట్టే . ఇండియా నుంచి బోల్డు మంది అలా వెళ్లి లబ్డి పొందినవారే . చింతకాయల అని ఇంటి పేరును ముందుకు తగిలించు కున్న వారె . అదంతా గతం లోకి వెళ్లి పోతోంది . అమెరికా లో ఆర్దిక మాంద్యం తెలుగు వారి పాలిట శాపం గ మారినట్టు ఉంది . మొన్న us లో ఉద్యోగం పోయిందని భార్య పిల్లల్ని కదతేర్చి పారిపోఇన సంఘటన మరువక ముందే , ఇంకో అమ్మాయిని కిరాతకంగా చంపేసారు . అసలు ఈ హత్యలకి కారణం ఏంటో కూడా అంతు పట్టడం లేదు . చదువుకునే అమ్మాయిల్ని డబ్బు కోసం హత్య చేసరనలెం . ఇండియా లో కన్నా అద్వాన్నం గా వున్నాయి అక్కడ శాంతి భద్రతలు . భారతీయుల దగ్గర దండి గా డబ్బులున్తయన్న భావనే అక్కడ నల్లజాతి నేరస్తులని ప్రేరేపిస్తున్న ఆం శమా ? తల్లిదండ్రుల్ని భందువుల్ని వదిలి తమ సొంత పేర్లని కూడా వదిలి ఇంటిపేరు ముందుకు తగిలించుకుని నానా కష్టాలు పడుతూ ఎప్పటికైనా ఇండియా కి పొఇ హాయ్ గా బతక క పోతామా అన్నా ఆశ తో వున్నా భారతీయులకి ఈ ఒబామా అన్నా ఆపన్న హస్తం అందిస్తాదేమో చూడాలి . లేక పొతే ఈ అమెరికా అర్దికా మాంద్యం లో సలభాళ్ళ మాడి పోయేది ఆంధ్రులే .
లారీ టైరుతో చేసిన చెప్పులు వేసుకు తిరిగి ( ? ? ? ? ఆయ్ తిరిగి తిరిగి కాళ్ళు అరిగి పోకు౦డాలె౦డి . ) చివరికి ఒక కాలేజీ బాగు౦దనుకున్నా౦ . డబ్బుకట్టి చేరేసా౦ . అప్పుడు తెలీదు నాన్నకి తను పె౦చుకున్నలేడిపిల్లని చిట్టడవిలో వదులుతున్నాడని . ఎ౦దుక౦టే ఆ సమయ౦లో వాళ్ళ చిరునవ్వు వారి నైజానికి తెరగా మారి౦ది . మా పెద్ద మెదడుకి గాల౦ వేసి చిన్న మెదడునే పనిచేసేలా చేసి౦ది .
చాక్లెట్ ప్రపంచము ఏమి చేయకుండా కొన్ని జీవితాలు వెళ్ళిపోతే , ఏదో చేస్తున్నాననుకొంటూ కొన్ని జీవితాలు వెళ్లి పోతాయి , ఏమి చేయనట్లు వుంటూ ఏంటో చేసి సమాజానికి , దేశానికి అర్పించిన జీవితాలు ధ్రువతారలై తర తరాలు ఆకాశ పదాన మెరిసి పోతుంటాయి . అవి ఎందరికో ప్రేరణాత్మకమై ఉత్సాహాన్నిచ్చి ముందుకు నడిపిస్తాయి . వారి సృజనాత్మక శక్తి గురించి విని , చదివి , చూచినప్పుడు ఆశ్చర్యపోతాము . వీరిమున్దు మనమెంత ? మనమేమి చేశాము , ఏమిచేస్తున్నాము అన్న ప్రశ్న రాక మానదు . అప్పుడు తెలుస్తూంది మనమెంత అల్పులమో ! హోమేస్తేడ్ అనే వూరిలో " మిల్టన్ ఎస్ హర్శీస్ " అనేఅయన జన్మించాడు . ఆయన భార్య పేరు " కాతరిన్ హర్శీస్ " హర్శీస్ ఒక పెద్ద చాకలేట్ వరల్డ్ పిల్లలకోసం నిర్మించాడు . దానికి అనుబంధంగా ఎన్నో విభాగాలున్నాయి . దారుణం ఏమిటంటే పిల్లలమీద అంత మక్కువవున్న హర్శీస్ కి పిల్లలు లేరు . ప్రతి మానవునికి ఒక బలీయమైన కోర్కె , అనుబంధం వుంటాయి . భగవంతుడు ఏమిఆలోచిస్తాడో తెలియదుకాని - వాటిని దూరం చేసి ఆవ్యక్తులకి భక్తీ పదం అన్నా చూపిస్తాడు , లేకపోతె సమాజ సేవ చేయడానికి కొత్త ద్వారాలు తెరుస్తాడు . హరీస్ పెట్టిన చాకలేట్ ఇండస్ట్రీలో చాలా లాభాలు వచ్చాయి . హర్శీస్ తన ఆదాయంలో కొంత భాగం వెచ్చించి ౧౯౦౯లొ హర్శీస్ ఇండస్ట్రియల్ స్కూల్ పిల్లలకోసం ప్రారంభించాడు నలుగురు వాళ్ల వూరిలోని బీద పిల్లలతో . అంతవరకు తోడుగా వున్నా భార్యకాతరిన్ హర్శీస్ ౧౯౧౮లొ చనిపోయింది . ఇక హర్శీస్ తన ఆస్తినంతా స్కూల్ అ భి వృద్ధికి , చిరకాలం కొనసాగడానికి ఉపయోగించాడు . కే జి నుండి పన్నెండు క్లాసులదాకా ఆస్కూల్ పెరిగి ఒకవెయ్యి ఎనిమిది వందలమంది అబ్బాయిలు , అమ్మాయిలూ చదువుతున్నారు . యు . ఎస్ లో పుట్టినవారికే ఇందులో ప్రవేశం . ఆదాయం తక్కువగా వుండి , వెనక ఆస్తిపాస్తులు లేనివారి పిల్లలనే ఏరి సీటు ఇస్తారు . కంప్యూటరు , వ్యవసాయము , వాతావరణం , ఆర్ట్స్ , క్రీడలు వీరి సిలబస్ లో వున్నాయి . ఫౌందెర్స్ హాల్ ఎంత అన్డంగావుందో ! అదేస్కూల్ దాని డొమ్ గుండ్రంగావుంది . ఇది దీభ్భాయి అదుగులఎత్తు . ప్రపంచంలో గుండ్రని ఆకారంలో వుడ్ డొమ్ లలో ఇది రెండవది . చాకలేట్ టూర్ రైన్ ఫోరేస్తాల్లోకోకో గిజలు పండుతాయి . సముద్రాలు దాటి స్వీటెస్ట్ ప్లేస్ ఆన్ - హర్శీస్ పెన్సిల్వేనియా ఫాక్టరీ కి చేరతాయి . కోకోలో పాలు పంచదార , కొన్ని విశేష వస్తువులు కలుపుతారు . అచ్చులులా చాకలెట్లు వచ్చి రంగుల కాగితాల వస్త్రాలు చుట్టుకొని మిలమిల మంటూ బైటికి వస్తాయి . కిస్స్ అని చిన్న ఉల్లిపాయల వంటి చాకలెట్లు , బారులు చాకలేట్ సాస్ ల్ ఎన్ని రకాలో తయారవుతాయి . ఫాక్టరీలో తక్కువ ధరకి తాజాగా లభిస్తాయి . ఎన్నిరకాలో చెప్పలేము . చాకలేట్లో కోకో ఎక్కువ వుండి డార్క్ బ్రౌంగా వుంటే వంటికి మంచిదిట , ఈతయారీ అంటావిజిటేర్స్ని రైల్ బండీ లాటి దాంట్లో కూర్చోపెట్టి ఫాక్టరీ మధ్యనుంచి నడిపి చూపిస్తారు . చాక్లెట్ పేస్ట్ డ్రమ్ము లలో చూస్తూంటే , సాస్ సీసాలు పరుగెత్తడం చూస్తె ఎవయసు వారికైనా నోరూరక మానదు . మన టూర్ అయాక ఒక చాకేలేటు తిని విజిటర్లు కాగితాలు పారేస్తారని అడుగడుగికి నాలుగు డస్తే బిన్స్ పెట్టారు . చాక్లెట్ వరల్డ్ దీనికి టికెట్ . వెడితే ఒకగ్లాసులో చాక్లెట్ సాస్ నాలుగురకాల చాకలేట్స్ , మంచినీళ్ళ సీసా , టిష్యూ పేపర్ బాగ్ లో ఇస్తారు . ఒక్కొక్క చాకేలేట్ గురించి చెపుతూ అది తినేటప్పుడు మీనాలికకి ఏమిరుచి తెలుస్తూంది ? అని అడుగుతారు . మనం చెప్పాలి . పిల్లలని స్టేజి మీదకిపిలిచి ప్రస్నాలడుగుతారు . కోకోతోతలు అవి స్క్రీన్ మీద చూపించి చాక్లెట్ల తయారీ గురించి చెప్తారు . వస్తూంటే మాకందరికీ మాస్టర్ డిగ్రీ సర్టిఫికేట్ లు ఇచ్చారు . మనం ఫోటో తిఇయిన్చుకొంటే వెంటనే దాన్ని ప్రింట్ చేసి కాగితంపై అరచేయ్యంత చాక్లెట్ మీద ఆ ఫోటో కాగితం చుట్టి ఇస్తారు . అది తరువాత మనం ఫోతోకట్టించుకోవచ్చు . టూర్లో ఫోటోచాకలేట్ టూర్లో రైల్లో వెళుతూంటే ఫోటోలు తీస్తారు , ఫ్రేమ్కూడా కట్టి ఇస్తారు . ఇరవై డాలర్లు అనుకొంటా . జ్ఞాపకార్ధం ఇలాటివి ఏంటో బాగుంటాయి . కిట్ - కాట్ చాక్లెట్లు వీళ్ళే తయారు చేస్తారు . త్రీ - డి షో దీంట్లో చాకలేట్ కారెక్టర్లు తెరపై గంతులు వేస్తాయి . అన్ని వయసుల వాళ్లు చూచి ఆనందించ వచ్చు . చిల్డ్రన్స్ గార్డెన్ హర్శీస్ ౧౯౩౭ లో మూడున్నర ఎకరాల లో గులాబి తోటలు పెంచి దీనిని ప్రారంభించాడు . అది ఇప్పుడు ఇరవై మూడు ఎకరాల గులాబి తోటఅయింది . ౭ , ౫౦౦ రకాలగులాబిలు వున్నాయిట . సీతాకోకచిలుకల ఇల్లు నిర్మించాడు . ౩౨రకాల గార్డెన్స్ వున్నాయి . రకరకాల చెట్లు , వందల కొద్ది సీతాకోక చిలుకలు . గొంగళి పురుగునుంచి సీతాకోక చిలుక ఎలాతయారవుతుందో చూపిస్తాడు . కేటర్ పిల్లర్ తన్నలు , చాకలేట్ వాసనలు వేసే చెట్లు . మే నుంచి సెప్టెంబర్ దాకాతెరిచి వుంటుంది . వింటర్ లో కొన్ని మూసివేస్తారు . గిఫ్ట్ శాపుల్లోచాకలేట్ వరల్డ్ ముద్రలు వేసి టి , కిచైన్స్ , టోపీలు , బెల్ట్లుఎన్నోఅమ్ముతారు . మదర్స్ డే కి , ఫాదర్స్ డే కి పేరెంట్స్ కి ఫ్రీ . ఆంటిక్ ఆటో మ్యూజియం ఇందులో పాత పాత కార్లు ట్రక్కులు బస్సులు మోటారు సైకిళ్ళు చూపిస్తారు . హర్శీస్ పార్క్ హర్శీస్ పార్క్ లో పదకొండు వరల్డ్ క్లాస్ రోలర్ కోస్టర్లు , ఇరవై కిడ్డి రైడ్స్ , పదకొండు ఎకరాల అమెరికన్ జూ , హోటల్లు , మూడువందలడేభ్భయి ఎనిమిది వేళ గాలన్ల నీరున్న వేవ్ పూల్ , తొమ్మిదిరకాల నీటి ఆటలు , లాకర్ రూం వున్నాయి . మే ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ ఏడు దాకా తెరచి వుంటుంది . ఇక్కడికి వెళ్ళాలంటే బాల్టి మోర్నుంచి తొంభయి నిముషాలు , వాషింగ్ నించి రెండు ఘంటలు , ఫిలడల్ఫియా నుంచి రెండు ఘంటలు , న్యూయార్క్ నుంచి మూడు ఘంటలు పడుతుంది . ఇండియా నుంచి యు . ఎస్ వచ్చి రెండురోజులకే వెళ్లాను . మనవాళ్ళతో కలిసి తిరగాలనే ఆశతో అలసట లెక్క చేయకుండా వెళ్లాను . బాగా ఎంజాయి చేసాము . మీరు తప్పక చూడండి .
43 . మనసా ! మేఘశ్యాముని తలవవో ॥ - త్యాగరాజు కీర్తనలు చదివి ( గమనిక చదివి , పాడి కాదు ) ఆ ప్రేరణతో వ్రాసినది .
( ఈ పేజీల్లోని ఒక కార్టూన్ ) ( బొమ్మలో ఒక జడ్జి , ముద్దాయి , లాయరు వున్నారు ) జడ్జి : " నిన్ను ఖడ్గమృగమని తిట్టితే మాత్రం ఐదేళ్ళు గడిచినాకనా ఫిర్యాదు చెయ్యడం ? " ( జవాబు ) " నాకప్పుడు ఖడ్గమృగమంటే ఏమిటో తెలియదు సార్ . నిన్ననేను జూలో చూశాను . "
అది విన్న భాస్కర్ తండ్రి , " అమెరికా స్వర్గానికి బెత్తడు దూరంలో వుంటుంది అంటారు . మరి స్వర్గానికి వెళ్లిన వారు తిరిగి రారు . ఇందిర కూడా ఇక రాదు . మీ నాన్న తన అన్నదమ్ముల నుంచి ఇంకా ఆస్తి పంపకాలు చేసుకోలేదట కదా , ఆ పంపకాలు పూర్తి చేసి , వచ్చిన పొలం , బ్యాంకు బాలెన్సు మా వాడి పేర చేయించమని చెప్పు . మీరు మా అందరి ఎదురుగా వుంటారు . భోగభాగ్యాలు అనుభవిస్తారు . ఈ కాలంలో అన్నదమ్ములను నమ్మితే , రేపొద్దున మీ నాన్నకు ఏమన్నా అయితే , ఆ పొలం వారి సొంతం అవుతుంది . "
రాజు చక్కగా నవ్వసాగినాడు - చాకలివాడి మూటతో ఎదురుగా కర్రకు కట్టిన గడ్డి పరకకు ఆశగా వెళ్తూ దానితో పాటే కదులుతూ ఉన్న గడ్డి పరక అందుకోవాలని ఇంకా ఇంకా ముందుకు వెళ్తూ గాడిద చాకలివాడికి చక్కగా పని చేయసాగినది
frustration లో వుండేసరికి పాముప్రాణాలు తీయక తప్పలేదు . . నన్ను క్షమించు దేవుడా ! !
ఇలా ఉండగా ఒక రోజున , బయట తోటలో నడవడాని కెళ్ళినప్పుడు , ఎవడో దొంగవెధవ నన్ను బలవంతంగా ఎత్తుకొని పరిగెత్తుకొని పారిపోయాడు , వెనక గేటు దూకేసి . " ఫ్లష్ , ఫ్లష్ " అని ఆవిడ గట్టిగా అరిచింది . నేను వాడి చేతుల్లోంచి తప్పించుకొని వెళ్ళగలిగితేగా ? నాకు భలే భయం వేసింది . నాకోసంకాదు , దొరసాని కోసం . ఆ దొంగవెధవని కరుద్దామనుకున్నా . వీలయితేనా ! వాడు నా నోరు గుడ్డతో గట్టిగా నొక్కేసాడు . కాసేపు ఊపిరాడలేదు … . చచ్చిపోతానేమోనని … … భయం …
అలమధుమాసవేళ నరుణాభ వహించి జనించి , యాపయిం బొలుపగు నిండుపచ్చజిగిఁ బూనిన పర్ణములెల్ల నిత్తఱిం దళమగు కుంకుమచ్ఛవిని దాలిచి ధూమఖరోష్ణతీక్ష్ణతల్ గలుగని రమ్యరాగమయకాననవహ్నులఁ గప్పె భూములన్ .
వారందరికీ కళ్ళల్లో ఉద్వేగం , ఉత్సాహం , భక్తిభావనతో మిళితమై కనిపిస్తోంది . ప్రతి విద్యార్థిలో మాతృదర్శణమౌతున్న పవిత్ర భావన కనిపిస్తోంది .
75 తాళ్లూరు శాంతి కాలనీలో 100 బుడుగ జంగాల కుటుంబాలు నివశిస్తున్నాయి . 50 సంవత్సరాల క్రితం వరంగల్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం నుంచి వారు వలస వచ్చారు . కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చివారికి ఇళ్లు నిర్మించారు . దీంతో ఇక్కడ ఓ కాలనీ ఏర్పాటయింది . ఇక్కడే కాక జిల్లాలో నగరం , వెనిగళ్ల , బెల్లంకొండ , గురజాల తదితర ప్రాంతాల్లో ఈ బుడుగ జంగాలు నివసిస్తున్నారు . వారి కులవృత్తి సోది చెప్పడం . అయితే కాలక్రమేణా పురుషులు చిరు వ్యాపారాలు చేసుకుంటుండగా మహిళలు కూలి పనికి వెళ్తూ జీవనం సాగిస్తున్నారు . అయితే ఆడపిల్ల పుట్టిందనీ , భార్య అందగా లేదనీ , ఎప్పుడూ అనారోగ్యంగా ఉంటుందనీ , శస్త్ర చికిత్స చేయాల్సి వస్తోందనే చిన్న కారణాలతో కుల పంచాయితీలు పెట్టి ఆ కుటుంబాల్లోని పురుషులు తమ భార్యలను వదిలేస్తున్నారు . ఒక్క శాంతి కాలనీలోనే భర్తలు వదిలేసిన మహిళలు 15 మంది వరకూ ఉన్నారు . భార్యలు తప్పు చేస్తున్నారని భర్తలు కుల పెద్దలను ఆశ్రయించి పంచాయితీలు పెట్టిస్తారు . ఈ కుల పంచాయితీలు చిన్నవైతే జిల్లాలోని సంఘ పెద్దలు హాజరై పరిష్కరిస్తారు . అవే పెద్ద పంచాయతీలయితే రాష్ట్రంలోని 16 జిల్లాల నుంచీ కుల పెద్దలు హాజరవుతారని శాంతి కాలనీ కుల పెద్ద అచ్చయ్య తెలిపారు . పోలీసులు , చట్టాలు , న్యాయవ్యవస్థ ఉన్న ప్రస్తుత రోజుల్లో వీటితో ఏం సంబంధం లేకుండా కుల పంచాయితీలతో మాత్రమే ఎంతో తేెలికగా వివాహ బంధాలను రద్దు చేస్తూ మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు . ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు . ఒక్కో పంచాయితీకి కుల పెద్దలు ఒకటి నుంచి రెండు లక్షల రూపాయల వరకు వసూలు చేస్తారని బాధిత మహిళల్లో ఒకరైన పి . రూతమ్మ తెలిపారు . ఈ డబ్బులతో కుల పెద్దలు జల్సాలు చేసుకుంటారనీ , డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వారికి అనుకూలంగా తీర్పు ఉంటుందనీ ఆమె తెలిపారు . ఇతర మహిళల వ్యామోహంలో పడ్డ పురుషులు ఎలాగైనా భార్యలను వదిలించుకోవాలనే ఉద్దేశంతో కులపెద్దలను ఆశ్రయించడం ఆనవాయితీగా మారింది . కుల పెద్దలు సైతం ఒకటి నుండి ఏడు పెళ్లిళ్లు చేసుకున్న వారూ ఉన్నారని రూతమ్మ తెలిపింది .
దళిత సాహిత్య విశ్లేషణలో కారంచేడు కేంద్రంగా ఉండటం దాని చారిత్రకతను తెలియజేస్తుంది . కారంచేడు పూర్వాపరాలు దళిత సాహిత్యక్రమం లోని అనేక చలనాలకు , చైతన్యాలకు , వ్యక్తీకరణ రూపాలకు సామాజిక ఉపపత్తిని సమకూర్చాయి . దాని ప్రాధాన్యత అటువంటిది . అట్లా వేంపెంట వైపు నుండి దళిత సాహిత్యాన్ని చూడ్డానికి కనీసం కేసు కొట్టివేత అయినా ఒక సందర్భంగా నిలబడుతుందని నమ్మకం . కారంచేడు , చుండూరు ఘటనల్లోని వ్యక్తాంశాలు దళిత సామాజిక , సాంస్కృతిక జీవనంలోని అవ్యక్తాంశాల దగ్గరికి తీసుకపోయి , ఆ జీవన పునాదిని ప్రతిబింబించడంలో సాహిత్యరంగాన్ని నిర్దేశించింది . అట్లా 1998 తర్వాత దళిత సాహిత్య ప్రయాణం మీద వేంపెంట ఏమైనా ప్రభావం చూపిందా ? సూటిగా ఈ ప్రశ్న వేసుకొంటే కొత్త పరిశీలనలకు ఆస్కారం ఉండొచ్చు .
ఆజం జాహీ మిల్స్ , సిర్పూర్ పేపర్ మిల్స్ వంటి హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పాటైన భారీ పరిశ్రమలన్నీ మూతపడ్డాయి . వేలాది మంది తెలంగాణవారు ఉద్యోగాలు కోల్పోయారు . విశాఖ , విజయవాడ , కాకినాడ , నెల్లూరు , తిరుపతి , కడప వంటి చోట్ల ప్రభుత్వం పలు పరిశ్రమలను స్థాపించారు . విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది .
గౌలిగూడాచమన్ నుంచి కోఠీవైపు నడుస్తూ ( రామ్మందిర్ , ముల్కి ఫోటో స్టూడియో దాటాంక ) చూసాను . 4 రోడ్లు కలిసే జంక్షన్ దగ్గర , మొజంజాహి మార్కెట్ వైపువెళ్ళే దారిని చూపిస్తూ ఠీవిగా నిలబడిన రాతిఫలకంలాంటి సైనేజ్ ను - " తుర్రెబాజ్ ఖాన్ రోడ్ " . మహానుభావుడు - పరపాలన విముక్తికోసం ప్రాణాలర్పించిన వీరుడు . ఇప్పుడా పేరు ఎవరికైనా గుర్తుందా ? ఆ బోర్డింకా అక్కడ్నే ఉన్నదా ? వలసప్రజల తాకిడిలో , కమర్షియల్ కాంప్లెక్సుల పార్కింగ్ ప్లేస్ లో కలిసిపోయిందా ? ? ?
ప్రస్తుత తరంలో బాగా రాసే రచయితలలో సుంకోజి ఒకరు . ఆయన గురించి తెలుసుకోడం బావుంది . నిజ జీవితంలోంచి కథ వస్తువులెన్నుకుంటే సహజంగానే వాటికి జీవం అబ్బి రాణిస్తాయి . ఆయన రాసిన " ఇరుకు మాను " కథ చినుకు మాస పత్రిక ఏప్రిల్ 2008 లో ప్రచురితమైంది . చక్కటి కథ . సుంకోజి గారికి అభినందనలు
వాడు చిల్లర ఇస్తున్నట్టు నటిస్తాడు గానీ చిల్లర ఇవ్వడే . . . బస్సు స్పీడు పెరిగింది . . నాకు టెన్షన్ పెరిగింది . . . వాడు స్లో మోషన్ లో పరిగెడుతున్నాడు . . . రెండు నిమిషాల్లో జరగాల్సింది జరిగిపోయింది . . వాడు రెండు రూపాయల చిల్లర ఎగ్గోట్టేసాడు .
అయినా నా వెఱి కాకపోతే , నేను బ్లాగితే మాత్రం జనాలు మారతారా పెడతారా . . ఆ విషయాని ప్రక్కనపెట్టి అసలు విషయానికి వద్దాం . చదువు ఎగ్గొట్టి జులాయిగా తిరుగుదాం అనుకునే యువతరానికి మఱో ఆయుధం . ఎలాగో కాలేజీ అయ్యిన తరువాత మంచి ఉధ్యోగం వచ్చిందా లేదా అని మనల్ని వేపుకు తినే వాళ్ళు ఎలాగూ ఉంటారు , అదే ఫైల్ అయ్యామనుకోండి అప్పుడూ తిడతారు . అంటే పాస్ అయ్యినా తిట్లే అలాగే ఫైల్ అయ్యినా తిట్లే . . అలాంటప్పుడు చక్కగా ఫైల్ అయ్యి మంచి ఉద్యోగం తెచ్చుకున్నాం అనుకోండి అప్పుడు మనం రిటన్లో వాళ్ళని తిట్టోచ్చు కదా . . అందుకని చదువు సంధ్యా వద్దు . . చక్కగా లైఫ్ ఎంజాయ్ చెయ్యండి . మరి ఉధ్యోగం మాట అంటారా . . అదిగో అక్కడికే వస్తున్నా . .
డయేరియా డయేరియా అంటే నీళ్ళగా విరోచనాలు అవ్వటం . ఇవి 3 సార్లు కంటే ఎక్కువగా జరుగుతాయి . నీళ్ళ నిరోచనాలతో పాటు రక్తం కూడా నిసర్జించబడిన దానిని రక్త విరోచనాలు అంటారు . ఇది పిల్లలకు వచ్చే వ్యాధులలో ప్రాణాంతకరమైనది ఎందుకంటే శరీరం ఎండిపోయి ( నీరు కోల్పోతుంది ) నట్లు అవుతుంది . మరియు కుపోషణకు దారితీస్తుంది . వీటి వలన శరీరంలోని నీరు , సోడియం క్లోరైడ్ , పొటాషియం బైకార్బోనేట్ వంటి లవణాలను కోల్పోవటం జరుగుతుంది . దీని వలన శరీరం నీటిని కోల్పోయి ఎండిపోయినట్లు అవుతుంది . అతిసార వ్యాధి అనేది ఆరు నెలల వయస్సు పిల్లల నుంచి 1 సం . ల వరకు ఎక్కువగా వస్తుంది . మరియు అనుబంధాహారం తనిపించేటప్పుడు అపరిశుభ్రత వలన కూడా రావచ్చు మరియు ఇది కుపోషణతో ఉన్న పిల్లలలో మరియు తక్కువ బరువు ఉన్న పిల్లలలో ఇది ఎక్కువగా ఉంటుంది . డయేరియా అనేది ఇ . కోలై , విబ్రో కలరా మరియు నొర్మొనెల్లా , రోటో వైరస్ , ప్రోటోజోన్స్ వలన వ్యాపిస్తుంది . ఈ బాక్టీరియాలు మానవుని మరియు జంతులు ( శరీరంలో ) పొట్టలో ఉంటాయి . మల విసర్జకాలు గాని ద్వారా , నీటి ద్వారా , మానవునిలోకి ప్రవేశించుట వలన అపరిశుభ్రమైన చేతులు , గోళ్ళు వలన ఈ వ్యాధి వ్యాపిస్తుంది .
ఈ దర్శకుడు 1930 , 40 లలో ఇటలీలో వచ్చిన కొన్ని నియో రియలిస్టిక్ చిత్రాలను , వాటిలోని వైపరీత్యాలను పరిశీలించి చూస్తే ఒక సారి ఈ తోలుబొమ్మలాట వ్యవహారం నుండి బయట పడగలగుతాడు . ఏ పనయినా సమగ్రంగా చేయగలిగితే మంచిది . లేకపోతే గాడ్ ఫాదర్ చిత్రం నుంచి లాక్కున్న కేవలం ఒకరిద్దరి పాత్రల చిత్రీకరణ మిగులుతుంది ( ఈ చిత్రం లో చేసినట్లు ) . అది అతకదు .
" సూపర్ " చిత్రం లో విలక్షణ నటుడు ఉపేంద్ర , నయన తార దీనిలో జంటగా నటించారు .
ఈ సంవత్సరంలో గురుడు మే నెల 8 వరకు తృతీయమున సువర్ణమూర్తి . తర్వాత చతుర్థమున సువర్ణమూర్తి . శని నవంబర్ 14 వరకు భాగ్యమున లోహమూర్తి . తర్వాత రాజ్యమున సువర్ణమూర్తి . రాహుకేతువులు జూన్ 6 వరకు 12 - 6లలో సువర్ణమూర్తులు . తర్వాత 11 - 5లలో తామ్రమూర్తులు . వేధగోచారముచే మే 8 వరకు గురుడు శుభుడు , శని సంవత్సరమంతా శుభుడు . రాహువు జూన్ 6 నుండి , కేతువు సంవత్సరమంతా శుభుడు . ఈ స్థితి వేధగోచారము ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి మీరు తలపెట్టుకున్న పనులన్నీ ఘన విజయాన్ని సాధించిపెట్టగలుగుతాయని చెప్పగల వీలున్నది . నవంబరు వరకు కొన్ని ఊహించని ఖర్చులూ , బాధ్యతలు ఎదురైనా తర్వాత పరిస్థితులు చాలా అనుకూలంగానే ఉంటాయి . విద్యార్థులు తమ పరీక్షలలో తామే ఊహించలేకపోయినంతటి సత్ఫలితాలు సాధించే వీలున్నది . వృత్తి , ఉద్యోగ , వ్యాపారాలలో మంచి గుర్తింపు లభిస్తుంది . స్థిరచరాస్తులను కొనుగోలు చేస్తార . కుటుంబ జీవితం చాలా సుఖవంతంగా ఉంటుంది . ఇంటా బయటా అనేక శుభకార్యాలలో పాల్గొంటూ ఆనందంగా జీవితాన్ని గడపగలుగుతారు . వ్యవసాయదారులకు తొలకరి పంటలో బాగా లాభదాయకంగా ఉంటుంది . ఏ వివాదంలోనూ ఎవ్వరితోనూ తాగాదాలకు దిగకుండా సంయమనంతో వ్యవహరించాలి .
ఎఱ్ఱాప్రెగడ కోకిలగానము ఈ చంపకమాల . ఇది ఉషఃకాలాన్ని వర్ణిస్తుంది . స్ఫురదరుణాంశు రాగరుచిఁ బొంపిరివోయి నిరస్త నీరదా - వరణములై , దళత్కమల వైభవ జృంభణ ముల్లసిల్ల , ను - ద్ధురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ సెలంగఁగాఁ గరము వెలింగె వాసరముఖంబులు శారదవేళఁ జూడగన్ - ఎఱ్ఱాప్రెగడ , భారతము , అరణ్యపర్వము ( 4 . 142 )
మద్దూరు , జూన్ 19 ( వి . వి ) : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే గ్రామీణ ప్రాంతాల్లోని పల్లెలు అభివృద్ధి చెందుతాయని సిపిఐ జనగామ నియోజకవర్గ కన్వీనర్ మంగళపెల్లి జనార్ధన్ ధీమా వ్యక్తం చేశారు . ఆదివారం మండల కేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్ర నాయకులకు తొత్తులుగా మారినా కొందరు తెలంగాణ స్వార్ధ రాజకీయ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పె సమయం ఆసన్నమైందన్నారు . నాటి నుండి నేటి వరకు తెలంగాణ ప్రాంతంలోని పల్లెలు ఎడారులుగా , వల్లకాడులుగా మిగిలిపోయినా తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులకు కళ్ళు మూసుకుపోయి అభివృద్ధి చేయడంలేదన్నారు . రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేర విడుదల చేస్తున్న నిధులను కొల్లగొడుతు విదేశాల్లోని బ్యాంకులో దాచుకుంటూ తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు . అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వివిధ దశల్లో అణచివేస్తు వేలాది మంది విద్యార్ధుల ప్రాణాలను తీసి వేస్తున్నారన్నారు . ఆంధ్ర నాయకులకు మాత్రం రాచమర్యాదలు చేస్తు అక్కడి ప్రాంత అభివృద్ధికి విస్తరంగా నిధులు విడుదల చేస్తున్నారని అన్నారు . నిన్న హైద్రాబాద్‌లోని ఫూట్‌పాత్‌లపై వంటవార్పు చేపడితే పోలీసు అనుమతి పొందాలనడం విడ్డూరంగా ఉందన్నారు . తక్షణమే రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు కళ్ళు తెరచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని , లేనిపక్షంలో కాంగ్రెస్‌కు పుట్టగతులుండవని ఆయన హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో రాజు , భాస్కర్ , కుమార్ తదితరులు పాల్గొన్నారు .
- పసునూరి రవీందర్ ఉద్యమాల పురుటిగడ్డ మీద కథాసాహిత్య ప్రక్రియను మరింత విస్తరించేందుకు తెలంగాణ నవ కథకుల ఆధ్వర్యంలో తెలంగాణ కథా వేదిక ' దస్కత్ ' ఆవిర్భవించింది . తెలంగాణ నేలమీద జరిగిన , జరుగుతున్న పోరాటాల్లో సాహిత్యం తనవంతు పాత్రను క్రియాశీలకంగా పోషించింది . అక్షరాలు దారి చూపే వెలుగు దీపాలైనయ్ . ఈ క్రమంలో జీవితాన్ని సమగ్రంగా ప్రతిబింబించే కథా ప్రక్రియను మరింత విస్తరించాల్సిన అవసరాన్ని ఈ ప్రాంత నవతరం గుర్తించింది .
నేను పూనుకుని వచ్చేవారం నుంచి 50 థియేటర్లలో సినిమాను విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నాను . ఈ సినిమా కచ్చితంగా సూపర్‌హిట్ స్థాయికి చేరుకుంటుంది ' ' అని బెల్లంకొండ సురేష్ చెప్పారు . నూతన తారలతో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ' ఎల్బీడబ్ల్యూ ' ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే . ఈ సినిమా చూసి స్పందించిన బెల్లంకొండ సోమవారం ప్రత్యేకంగా ఈ చిత్రానికి అభినందన సభను ఏర్పాటు చేశారు .
ఈరోజు నన్నిలా ఏకాకి లా మిగిల్చిన ఓ దేవుడా ! ధన్యవాదాలు ! ! ! !
' ఆహార ద్రవ్యోల్బణం ఓ రెండు మూడు నెలల్లో అదుపులోకి వస్తుంది ' అని శరద్ పవార్ చెప్పి ఆ సమయం గడిచిపోయింది అనుకుంటా .
జపనీస్ కవులు ఉన్నఫళాన కవిత్వరచన జరగాలంటారు . రసమయఘడియల్లో ఆలస్యం పనికిరాదంటారు . స్ఫురణ , రచన ఏకకాలంలో జరగాలంటే మాత్రం చాలా సాధన అవసరం . ఎటువంటి సాధన ? అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు . యవ్వనంలో కవితావేశం బలంగా ఉండటం సాధారణమైన విషయం . . కాబట్టి తొలినాళ్ళ కవిత్వాలు ఎక్కువగా మొదటిపంథాకు చెందుతాయి . . తర్వాత కవిపరిపక్వమయేకొద్దీ అంతవరకూ పరిపాలించిన కవితావేశం లుప్తమై పోవచ్చు . పోతే అనుభవవైశాల్యం తోడుగా నిలవవచ్చు . అప్పుడు కవి ఎంచుకునే పంథా రెండవది . తొలినాళ్ళ కవి దర్శనం ద్వారా అనుభవగర్భాన్ని తాకలేడని కాదు . తదుపరి కవి అనుభవ విస్తృతి వల్ల తీక్ష్ణతను కోల్పోతాడని కాదు . ఏది ఏమైనా ఒక కవిలో కాలం తెచ్చేమార్పులు అవశ్యం అధ్యయనం చేయవలసిన విషయాలే . . కవులు ఎవరికి వారు తమపై కాలప్రభావాన్ని గహనంగా చింతించి ఒక అంచనాకు రాగలగాలి .
ఈయన కాలంల మొహర్రం ' లంగర్ ' ఊరేగింపు అతి వైభవంగ జరిగేది . ఊరేగింపు ముందు భాగాన ఉరి తీసే తలారులు సన్నని పొడవైన తల్వారులను పట్టుకొని ఎర్రని దుస్తులతో నడిచేటోళ్ళు . వారి వెనుక ఏనుగు మీద అంబారీల నగర కోత్వాల్ కూచునేటోడు . ఆ ఏనుగును అతి ఆడంబరంగ అలంకరించి దాని మెడకు బంగారు గొలుసును వేసేటోళ్ళు . ఆ నగర కోత్వాల్ వెనుక అనేక విభాగాలకు చెందిన సైనికులు , పోలీసు జవానులు కవాతు చేస్తూ నడిచేటోళ్ళు . వారి వెనుక ఆట , పాటల కళాబృందాలు , సాము గరిడీల పహిల్వానుల బృందాలు విన్యాసాలు చేస్తూ నడిచేవి . ఊరేగింపు చివరి భాగంల ప్రభువు , ఉన్నత వంశాలవారు , పుర ప్రముఖులు ఉండేటోళ్ళు . అనేక పెద్ద పెద్ద ' దేవిడీ ' లు , బంగ్లాల ముందు నుండి ఆ ఊరేగింపు సాగేది . పేష్కార్ దేవిడీ ముందు నుండి వెళ్లుతున్నప్పుడు ఆ పుర ప్రముఖులందరు విధిగా పేష్కారు గారికి గౌరవ వందనం చేసేటోళ్ళు .
" ఇదేమిటమ్మా నువ్వు కూడా నాకు ప్రెజెంట్ ఇస్తున్నావ్ ? " అడిగేడు నవీన్ కవర్ చింపుతూ . లోపల అలాస్కా క్రూయిజ్ కి ఇద్దరికి టిక్కట్లున్నాయి .
అంతా బాగానే వుంది కానీయండి , ఇలా ఒక చోట బ్లాగర్స్ మీటింగ్ వుంది అని ఓ బానర్ కట్టటమో , లేదా గేట్ దగ్గర , టికెట్ కౌంటర్ లో చెప్పటమో , ఏదో వక ఏర్పాటు చేస్తే బాగుండేది . కనీసం అరగంటైనా వెతికాను ఎక్కడా అని . విసుగొచ్చి తిరిగి వెళ్ళిపోదామనుకునేటప్పటికి మీరు కనిపించారు ! అప్పటికీ 3 గంటలకు అంటే 3 . 30 కు వచ్చాను ! ఐనా తిప్పలు తప్పలేదు . ఆర్గనైజర్స్ సరిగ్గా ఏర్పాటు చేస్తే బాగుంటుంది .
కండుకకేళి సల్పెడు ప్రకారమునం బురుషాయితక్రియా తాండవరేఖ చూపెడు విధంబున పామరభామ లేత యీ రెండ ప్రభాతవేళ రచియించె నితంబభరంబు జన్నులున్ కుండలముల్ కురుల్ కదల గోమయపిండము లింటి ముంగిటన్
సభాపతి తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం న్యాయ స్థానాలకు లేకపోయినా , చట్టంలో పొందు పరిచిన నియమ నిబంధనలకు భాష్యం చెప్పే అధికారం , రాజ్యాంగ పరంగా , న్యాయ మూర్తులకు వుంది . తాను ఎన్నికైన రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి , స్వచ్చందంగా పార్టీకి రాజీనామా చేస్తే , సభ్యత్వానికి అనర్హుడవుతాడని చట్టం చెప్పిన దాన్ని విస్తరిస్తూ , సరి కొత్త నిర్వచనం చెప్పింది అత్యున్నత న్యాయ స్థానం . లాంఛనంగా రాజీనామా చేయకుండా , తనకు టికెట్ ఇచ్చిన పార్టీ వ్యతిరేక కార్య కలాపాల్లో పాల్గొనే రీతిలో , స్పష్టమైన వైఖరిలో ప్రవర్తించే చట్ట సభ సభ్యుల విషయంలో కూడా , ఫిరాయింపుల నిబంధనలు వర్తించుతాయని , 1994 లో , సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది . అదే విధంగా , స్వతంత్రుడుగా గెలిచి , ఏదైనా పార్టీలో చేరిన వ్యక్తి కూడా , ఫిరాయింపుల చట్టం పరిధిలోకి వస్తారని చెప్పింది కోర్టు . పార్టీ ఫిరాయింపుల నియమ నిబంధనలను ఉల్లంఘించే సభ్యుల వివరాలు , సభాపతి దృష్టికి తీసుకుని రానంత వరకు , అర్హత - అనర్హతలతో నిమిత్తం లేకుండా , చట్ట సభలలో నిరాటంకంగా సభ్యులుగా కొనసాగడానికి , ఎన్ని రకాల అవకాశాలుండాలో అన్ని రకాల అవకాశాలను చట్టం కలిగించింది . రాజకీయ పార్టీల " అధి నాయకులు " తమకు అనుకూలమని భావించి , సభాపతికి ఫిర్యాదు చేయనంత కాలం , ఫిరాయింపుల చట్టం కాగితాలకే పరిమితం . అలా కాకుండా కొన్ని సత్ సాంప్రదాయాలకు ఎవరో ఒక రాష్ట్రానికి చెందిన శాసన సభ సభాపతి చొరవ తీసుకోవాలి .
జనం కోసమే ఇల్లు , పిల్లలు లాంటివి వదిలిపెట్టి వుద్యమంలో చేరి పని చేస్తున్నారట . అన్నీబాగానే
రజతగిరీశుడు నగజకి దెల్పిన స్వరార్ణవ మర్మములను దెలిసిన త్యాగరాజు వెదజల్లే సుస్వరమాయ పరుచుకోడానికి ముందు ఆలాపన అనే అవలంబన కావాలా ? మీలాగా అంత చక్కని రివ్యూ రాయటానికి ఎంతటి సంగీత / సాహిత్య పరిజ్ఞానం ఉండాలో అనిపించింది .
అందువల్ల మనకా విషయాలలో పెద్దగా అవగాహన ఏమీలేదు . ఇక దేవుడి గురించి నన్నడిగితే నేనేమి చెబుతాను . తొక్కలోది , నాకేం తెలుసని ఈయన నన్ను వ్రాయమంటాడు అని మనసులో అనుకుని . సరిలేండి అలాగే వ్రాస్తా అన్నాను . ఇక మొదలు పెడదాం . ఏంటి మొదలు పెట్ట్టేది . ఇప్పటి వరకూ ఒక్క పది నిమిషాలలో వ్రాసేసాను . ఇదిగో ఇక్కడే గొంతులో వెలక్కాయ పడింది . . . ఓ ఇక్కడ చెప్పడానికి గొంతు అవసరం లేదు కదా . . మరి ఏమని ఉదహరించాలబ్బా ! ! ఆ . . చేతికి సంకెళ్ళేసినట్లైంది . చుద్దాం ఎప్పటికి పూర్తవుతుందో . ఈ విషయం పై వ్రాయమని చెప్పి నాకు మంచి శిక్ష వేశారనిపిస్తోంది . నాయాల్ది , నాకు గాని టైమొస్తేనా . . < < డాష్ . . డాష్ . . > > . ఏదో పెద్దాయన కదా కొంచం సెన్సార్
థాంక్యు శైలు నచ్చినందుకు అంత గొప్పగా లేదేమో ఆ పాటా నాకు చాల ఇష్టం
నాకు తెలిసిన ఒక వామ పక్షమేధావి ఒకసారి ఇలా అన్నాడు . వచన కవిత్వం రావడం మూలంగా కవిత్వం ' డెమాక్రటైజ్ ' అయ్యింది అని . కవిత్వం డెమాక్రటైజ్ అవడం అంటే ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు .
ఐదు గ్రామీ అవార్డులను సోంతం చేసుకోని టాప్ ప్లేస్‌లో నిలచిన పాప్ సింగర్
అద్భుతం ! చినుకులూ , ఆ చినుకుల్లో హాయిగా తడుస్తూ మీతో పాటు మాక్కూడా పంచిన ఈ అనుభూతి . . రెండూ అద్భుతం ! : )
పై విధంగా చేసిన వెంటనే బ్లూ కలర్ ఫిల్ అయ్యి ఈ క్రింద విధంగా కనిపిస్తుంది .
హిందీమూలం : సూర్యబాల అనువాదం . ఆర్ శాంతసుందరి మా పెద్దమ్మ చనిపోయి ఇప్పటికి ముఫ్ఫె ఐదేళ్ళు . పోయేటప్పుడు ఆవిడ వయసు ఏ డెబ్భై ఐదో ఎనభైయో ఉండి ఉంటాయనుకుంటా . అయినా ఇప్పటికీ ఒక్క రోజు కూడా నేను ఆవిడని తలుచుకోకుండా ఉండలేను ! అది నాకెంతో అవసరం . స్త్రీవాదం ఊపందుకున్న ఈ వాతావరణంలో ఒక్కోసారి ఎటు పోవాలో ఏం చెయ్యాలో తెలీని సందర్భాలు ఎదురవుతుంటాయి . అలాటి కటిక చీకటి క్షణాల్లో [ … ]
డెజా వూ అన్న ఫ్రెంచి మాటకు అర్థం - ఇంతకు ముందే చూసినది - అని . ఒక దృశ్యం కానీ , సన్నివేశం కానీ , పరిస్థితుల సంపుటి కానీ ఎదురయినప్పుడు - అది ఇంతకు మునుపే అనుభవంలోకి వచ్చినట్టు అనిపించడమే డెజా వూ . మనోవైజ్ఞానిక శాస్త్ర పరిభాషగా వాడుకలోకి వచ్చిన ఈ మాట , ఇప్పుడు ఇతర శాస్త్ర , కళారంగాల రచనల్లోనూ , సాధారణ వ్యక్తీకరణల్లో కూడా భాగమైంది . రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన జరిగిన 80ల చివర్లో వరవరరావు డెజావూ శీర్షికతో ఒక గొప్ప దీర్ఘ కవిత రాశారు .
జబ్బలు చరిచాం . అమెరికా బ్లాగర్ల సమావేశం జరిపాం . ( ఇది బస్తీమే సవాల్ కు పేరడీ కాదని మనవి ) సమ ఆవేశంతో సమావేశంలో పాల్గొన్నవారు : పద్మ ఇంద్రకంటి , రవి వైజా సత్య , రానారె , ప్రసాద్ చరసాల , ఇస్మాయిల్ , సురేష్ కొలిచెల మరియూ విహారి .
ఐతే టెక్నిక్‌ని కొంచెం పక్కన ఉంచితే , మిగతా కథనంలో అపరిపక్వత , వేర్వేరు విషయాలకు ఇచ్చే తూకంలో అసమతుల్యత , పాత్రల చిత్రణలో అస్పష్టత దీన్లో ఉన్న కొన్ని లోపాలు . ఉదాహరణకి , ఈ కథలో ముఖ్యపాత్ర ఎవరో కూడ స్పష్టంగా అర్థం కాదు . స్థూలస్థాయి ( macroscopic level ) లో బాగున్న టెక్నిక్ సూక్ష్మస్థాయి ( microscopic level ) లో వీగిపోతుంది . అంటే , సంఘటనల్ని చూపించటంలో ఏది ముఖ్యమో ఏది కాదో అన్న విభజన స్పష్టంగా కనిపించదు . చాలాచోట్ల " సంఘటన " రూపం ఓ వస్తువునో స్థలాన్నో వర్ణించటం , అక్కడి వ్యక్తుల మధ్య జరిగే ( కథకి సంబంధం లేని ) సంభాషణని వినిపించటం .
వ్యాఖ్యాతలందరికీ ధన్యవాదాలు మరియూ శుభాకాంక్షలు . రాధా ! ! నా బ్లాక్కి వచ్చి , నా కవిత చదివి , వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు .
ఒకేసారి 11 మందికి ఉరిశిక్ష . . బహుశా దేశంలో ఇదే తొలిసారి కావచ్చు ! వీరితోపాటు మరో 20 మందికి యావజ్జీవ కారాగారశిక్ష విధించింది గుజరాత్‌లోని ప్రత్యేక కోర్టు . తొమ్మిదేళ్ల కిందట 59 మంది సజీవ దహనమైన గోధ్రా రైలు దహనం కేసులో ప్రత్యేక జడ్జి పి . ఆర్ . పటేల్ మంగళవారం ఈ తీర్పు చెప్పారు . సబర్మతి జైలులో చెప్పిన ఈ తీర్పులో . . మొత్తం 31 మంది దోషులకూ ఒక్కొక్కరికి రూ . 17 వేల చొప్పున జరిమానా విధించారు . 2002 ఫిబ్రవరి 27న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో ఎస్ - 6 బోగీకి కొందరు నిప్పు పెట్టడంతో అందులో ఉన్న 59 మంది కరసేవకులు సజీవ దహనమయ్యారు . అనంతరం గుజరాత్‌లో చెలరేగిన అల్లర్లలో 1200 మందికిపైగా మరణించారు ఈ కేసులో ప్రత్యేక కోర్టు . . మొత్తం 94 మంది నిందితులను విచారించింది . ఎస్ - 6 బోగీకి నిప్పు పెట్టడం వెనక కుట్ర ఉందన్న వాదనతో కోర్టు ఏకీభవిస్తూ . . గత నెల 22న 31 మందిని దోషులుగా తేల్చింది . మిగతా 63 మందిని నిర్దోషులుగా పేర్కొంది . దోషులకు మంగళవారం శిక్షలు ఖరారు చేస్తూ . . ఈ కేసు అత్యంత అరుదైనదిగా జడ్జి పి . ఆర్ . పటేల్ అభివర్ణించారు . 11 మందికి మరణశిక్ష విధించారు . వారు మరణించే వరకు ఉరి తీయాలని తీర్పు చెప్పారు . ఇక 20 మందికి విధించిన జీవితఖైదులో . . ఇంతవరకు జైలులో గడిపిన సమయాన్ని మినహాయింపునిచ్చారు . మరణశిక్షను హై కోర్టు ఖరారు చేయాల్సి ఉంది . ఒకేసారి ఇంతమందికి మరణశిక్ష విధించడం దేశం లో ఇదే తొలిసారి కావచ్చని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె . ఎం . పంచాల్ అన్నారు . హైకోర్టుకెళతాం : డిఫెన్స్ న్యాయవాది తీర్పుపై నిందితుల తరఫు న్యాయవాది ఐ . ఎం . మున్షి అసంతృప్తి వ్యక్తంచేశారు . తాము హైకోర్టులో అప్పీలుకు వెళతామన్నారు . ' ఇది మింగుడుపడడం లేదు . మాకు తీర్పు ప్రతి వచ్చే వరకు దానిపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేం . వచ్చాక హైకోర్టుకెళతాం . హైకోర్టు తీర్పును ధ్రువీకరించేవరకు శిక్ష అమలు కాదు ' అని చెప్పారు . నిందితులు . . దోషులు మొత్తం నిందితులు : 134 మంది విచారణ జరిగింది : 94 మందిపైదోషులుగా తేలింది : 31 మంది 134 మందిలో ఆధారాలు లేక 14 మందిని విడిచిపెట్టేశారు . ఐదుగురు బాల నేరస్తులు . మరో ఐదుగురు విచారణా కాలంలో మరణించారు . 16 మంది పరారీలో ఉన్నారు . దీంతో 94 మందిపై మాత్రమే విచారణ జరిగింది . మొత్తం విచారించిన సాక్షులు : 253 కోర్టులో ప్రవేశపెట్టిన డాక్యుమెంటరీ ఆధారాలు : 1500కుపైగా . ఏం జరిగింది ? సంఘటన : 2002 , ఫిబ్రవరి 27న గుజరాత్ గోధ్రాలో సబర్మతి రైలులో ఎస్ - 6 బోగీకి నిప్పు . వీహెచ్‌పీ అయోధ్యలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి భారీస్థాయిలో వెళ్లిన హిందువులు ఈ రైలులో వస్తుండగా కొందరు రైలు చైన్ లాగి రాళ్ల దాడి చేశారు . పెట్రోలు , కిరోసిన్‌తో నిప్పు పెట్టారని ఆరోపణ . మృతులు : 59 మంది కరసేవకులు సజీవ దహనం . వీరిలో 15 మంది మహిళలు . 20 మంది పిల్లలు . కుట్ర : కొందరు ముస్లిం ఛాందసవాదులు పథకం ప్రకారం ముందు రోజే 140 లీటర్లు కొనుగోలు చేసి పెట్టుకుని మరుసటి రోజు దాడికి దిగారన్నది ఆరోపణ . తత్పరిణామం : గుజరాత్ వ్యాప్తంగా చెలరేగిన అల్లర్లలో 1200 మందికిపైగా మరణించారు . వీరిలో అత్యధిక శాతం మంది ముస్లింలు . ఈ అల్లర్లలో చాలా మందిపై అత్యాచారం జరిగినట్లు కూడా వార్తలొచ్చాయి . విచారణ సాగిందిలా . . గోధ్రా మారణహోమాన్ని మొదట్లో అప్పటికప్పుడు చెలరేగిన అల్లర్లుగా భావించారు . గుజరాత్ ' సిట్ ' పోలీసులు అది పక్కా పథకం ప్రకారం జరిగిందని తేల్చారు . ఈ మారణహోమంపై దర్యాప్తునకు 2002 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ షాతో కమిషన్ వేసింది . కొంతకాలం తర్వాత సుప్రీం కోర్టు . . జస్టిస్ నానావతిని ఈ కమిషన్ చైర్మన్‌గా చేసి . . కమిషన్ విచారణ పరిధిని అల్లర్ల కేసులకూ విస్తరించింది . 2003 , నవంబరు 21న గోధ్రా , తదనంతర అల్లర్ల కేసుల దర్యాప్తుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది . దీన్ని 2008లో ఎత్తివేసింది . 2009 ఏప్రిల్‌లో గోధ్రా కేసు విచారణను ప్రత్యేక కోర్టుకు అప్పగించింది . జస్టిస్ నానావతి కమిషన్ 2008 సెప్టెంబరులో నివేదిక సమర్పించింది . గోధ్రా మారణహోమం పథకం ప్రకారం జరిగిందని పరోక్షంగా తేల్చింది . 2005లో రైల్వే శాఖ నియమించిన కమిషన్ . . గోధ్రా మారణహోమాన్ని ప్రమాదంగా నిర్ధారించింది . ఈ విషయంలో రైల్వే శాఖ కమిషన్‌ను నియమించడం చట్టవిరుద్ధమంటూ గోధ్రా హైకోర్టు తేల్చి చెప్పింది . courtesy : sakshi daily
అన్ని రోజులొక్కతీరుండయిగద , అందుకె ఇప్పటిసందే కొందరు , ఆంధ్రల జాగాలు కొనుక్కుంటున్నరు , ఆణ్ణే క్రికెట్ మ్యాచులు ఆడుకుంట పరిస్థితులజూసి స్టూడియోలు పెట్టుకునేటట్టున్నరు . .
మా మధు బాబు గారైతే వెంటనే ఒక పాట లా పాడతారేమో ప్రేమా ఏమిటి ఈ అర్ధం కాని గామా హంగామా , ఎవరికీ అంతుపట్టని ప్రశ్నల డైలమా అని , లేదంటే . . . . . . . . . ఏమిటి అండి బాబు . . . ఈ ప్రశ్నల తోరణాల పూరణాలు . . ఎందుకు మాకీ శిక్ష అంటారేమో . . అవునేమో . . . ఏది అబద్దం కాని ప్రతి సందేహం ఒక అర్ధం లేని ప్రశ్న తో కలుపుతున్నానా ?
చదువరి దృక్పథం , స్థాయి అన్నాను . దానిపై కొంచెం వివరణ అవసరం . ఉదాహరణకి : ఒకనికి భారతం మొత్తం చదిన తరువాతో ( ఇది అందరికీ సాధ్యం కాదనుకోండి ! ) కాస్తో కూస్తో విన్న తరువాతో , భారతం మొత్తం బహుభార్యాత్వం , బహుభర్తృత్వం ప్రోత్సహించే పుస్తకం అన్న నిశ్చితాభిప్రాయం కలగవచ్చు . మరొక చదువరికి , సవాలక్ష పిట్ట కథలతో కలవరపెట్టే పుస్తకం అనే భ్రమ కలగవచ్చు . ఇంకొక శాంతివాది భారతం యుద్ధప్రేరణ పుస్తకంగా తీసి పారెయ్యవచ్చు . " ఇందులో కొత్త ఏముంది ? జ్ఞాతి వైరం లేని సంస్కృతి ఎక్కడ ఉంది ? ఈ పుస్తకం కేవలం జ్ఞాతివైరం ఎంత దుర్భిక్షాన్ని కలిగిస్తుందో చెప్పే నీతి కథ , " అని మరొకరు నిర్ణయించవచ్చు . స్త్రీ వాదులకి భారతాన్ని చడామడా తిట్టటానికి కావలసినంత మేత ఉన్న పుస్తకం , మహాభారతం . వేదాంత గ్రంధంగా , రాజనీతి గ్రంధంగా అనేకరకాల వ్యాఖ్యానాలకీ , ముగింపులకి అనువైన పుస్తకం మహాభారతం . " ధర్మేచ , అర్థేచ , కామేచ , మోక్షేచ భరతర్షభ ! యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్ , " అని సంస్కృత మహాభారతం ఆదిపర్వంలోనే ఉన్నది . అంటే , ఇందులో ఉన్నది మరెక్కడైనా ఉంటుంది కాని , ఇందులో లేనిది మరెక్కడా లేదు అని అర్థం .
విష్ణు సహస్ర నామ స్తోత్రము మహాభారతం లోని అనుశాసనిక పర్వం లో 149వ అధ్యాయంలో ఉన్నది . కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద పండుకొని ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠురు నకు ఉపదేశిస్తాడు . ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ఆ విధమైన విశ్వాసం ఉన్నవారి నమ్మకం . స్తోత్రం ఉత్తర పీఠిక ( ఫలశ్రుతి ) లో ఈ శ్లోకం " ధర్మార్థులకు ధర్మము , అర్థార్థులకు అర్థము , కామార్థులకు కామము , ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును " అని చెప్పబడినది .
భూకంపం వచ్చిందన్నా మరో యుద్ధం రేగిందన్నా తన భార్య కవలల్ని కన్నదన్నా కంగారుపడక కోటు తొడుక్కొని కోటీశ్వరరావు ఆఫీసు కెళతాడు , వస్తాడు
కొత్త డిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రిసర్చ్‌లో తెలుగు అకాడమి ( హైదరాబాదు ) , సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారన్ లాంగ్వేజస్ ( హైదరాబాదు ) వంటి సంస్థల పాలక మండళ్ళలో , అమెరికన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియన్ స్టడీస్ ( కొత్త డిల్లీ ) తాలూకు ఇండియన్ అడ్వైజరీ కమిటీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ( హైదరాబాదు ) భారత ప్రభుత్వపు ప్రణాళికా సంఘంలోని వర్కింగ్ గ్రూప్ అఫ్ లాంగ్వేజస్ లోను వీరు సభ్యులు . తెలుగు ధ్వనుల ఉచ్చారణ గురించి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్‌లో వీరు చేసిన కృషి విశిష్టమయినది . దేశవిదేశాల్లోని అనేక ఉన్నత విద్వత్ సంస్థల నుండి ఇంత గుర్తింపూ ఇన్ని గౌరవాలూ పొందిన వారు కోట్ల మందికి ఒక్కరుండటం అరుదు ! అంతటి మాన్యత నందిన కృష్ణమూర్తిగారి మహత్తర కృషి వారు రచించిన వివిధ గ్రంథాల్లో పరిశోధనా వ్యాసాల్లో ప్రస్ఫుటమవుతుంది .
సుధాకర్ . . . యేమినీ అద్భుత శోధన , అహా యెంత స్పందన , యెందరో కవుల సమ్మేళన , ఇదియే నా ఆవేదన , అందుకో ఒక నమూన !
కవిత్వగడియారపు లోలకం ఆ చివరినించి , ఈ చివరికి ఊగినట్లుందీ మధ్య . భావకవులు వాస్తవాల్ని విస్మరించి , అంతరంగికమైన అనుభూతుల్ని , భావాల్నీ వ్యక్తీకరించటమే పనిగా పెట్టుకున్నారు . ఒకలాంటి పొగమంచు ఆవరించినట్లుంటుంది వారి కవిత్వం . యథార్థ దృశ్యాలు కనిపించవు . ఇప్పుడు లోలకం ఇటు మళ్ళాక , కవిత్వంలో అనుభూతి లోపించి , కవిత్వమంటే పదాలూ , ఆలోచనలూ తప్ప మరేం కాదు అనే అపోహ వ్యాపించినట్లుంది . లోలకాన్ని మళ్ళించినవాడు శ్రీ శ్రీ ఐతే , దాన్ని ఈ కొసకి తీసుకొచ్చినవాళ్ళు బైరాగి , ఆరుద్ర , అజంతా , మోహనప్రసాద్ , శివారెడ్లు . కవిత్వమంటే మాటలుతప్ప మరేంకాదన్న అభిప్రాయం ఈనాటి యువకవుల్లో పాతుకున్నట్లుంది . అనుభవమూ , అనుభూతీ , రెండూ సంయోజిస్తేనే కాని కవిత్వపు విద్యుత్ విస్ఫులింగం పుట్టదనే గ్రహింపు చాలా మంది కవులకు ఉన్నట్లు తోచదు . భావకవిత్వం పూర్తిగా ఆత్మాశ్రయమైతే , ప్రస్తుతకవిత్వం పూర్తిగా వస్త్వాశ్రయమయంఅనవచ్చు . ఐతే , ఈ వస్తువు కూడా వాస్తవమైన జీవితానుభవం కాదు . దానికి నకిలీ ప్రతిగా నిలబడే వట్టి మాటలూ , ఆలోచనలూ , సిద్ధాంతాలూ , నినాదాలూనూ .
ఇప్పటి వరకు తయారు చేసిన రోబోలు మనుషుల లాగా నడవగలుగుతున్నాయి . మరియు పరిగెత్తగలుగుతున్నాయి . కానీ మనుషుల శరీర కదలికలకు చాలా భిన్నంగా ఉన్నాయి . మనుషులను ఏమార్చే విధంగా రోబోలను తయారు చేయాలంటే ఎంతో శక్తిని అధికంగా వాడవలసి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు .
మహాత్మా గాంధీ విజయం సాధించటం కోసం , రాజకీయాలకు ధర్మానికీ ముడి పెట్టటం వల్ల కొన్ని విషయాలలో రాజీ పడాల్సి వచ్చింది . ఇది , అధికారంకోసం ఆయన హైందవులకు అన్యాయం చేస్తున్న భావన కలిగించింది .
అవగాహనశక్తి పరభాషలో కన్నా సొంతభాషలో సులభంగా సాధ్యమౌతుంది . సొంతభాషకు వ్యాకరణం నేర్చుకునే అవసరం ఉండదు ; ఇంగీషువ్యాకరణం నేర్చుకోటం కష్టంకాబట్టి అవగాహన చేసుకోకుండానే బట్టీపెట్టే అలవాటు పిల్లలలో ఎక్కువగా కనిస్తుంది .
మీరు ఉండటానికి స్వంత ఇల్లు లేక ప్రజా నిధుల నుండి ఎలాంటి సహాయం ఆశించకుండా కేవలం మీరు మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే నివసిస్తున్న ఇల్లు , అలాగే మీరు , మీపై ఆధారపడే మీ కుటుంబ సభ్యులు నివసించడానికి తగిన వసతులు కలిగి ఉన్నారని ధృవపర్చే పత్రాలు .
బామ్మా జాగ్రత్తగా తలుపేసుకోవే , నేను ఆఫీసుకెళ్ళొస్తా ? అలాగే , ఇంతకీ ఎక్కడ్రా నీ ఆఫీసు ? టప్పాచబుత్రా తర్వాత చెబుతావా ? ఒరే నీకు నేను బొత్తిగా లెక్కలేకుండాపోయాన్రా , ఆఫీసు ఎక్కడో చెప్పటానికి కూడా అంత బద్దకమట్రా ? తర్వాత చెబుతా అన్లేదే , టప్పాచబుత్రా అన్నానే . టప్పాచబుత్రా ఏంట్రా ? తమాషాగా ఉందట్రా . ఆఫీసు ఎక్కడ అనడిగితే బూతులు మాట్లాడుతున్నావ్ . అది బూతు కాదే బామ్మా , అది ఇక్కడ హైదరాబాదులో ఓ పేట పేరు . నన్ను నమ్ము . అదేం పేర్రా ఎవడ్నో బూతులు తిట్టినట్లుగా ఉంటేనూ . చక్కగా ఏ టప్పాలపల్లో , బుచ్చిపల్లో అని పెట్టుకోవచ్చుగదట్రా . అయినా అసలు ఇదేం ఊర్రా నాయనా . దోమలగూడాట , కాచిగూడాట . . చివరికి అదేదో కాటేసాన్ అని కూడా చదివా ఓ బస్సు మీద . ఎవరు ఎవర్ని కాటేస్తార్ట ? ఛీ ఛీ ఛీ . . . అసలు ఇవేమన్నా నోటితో పలికే పేర్లల్లే ఉన్నాయట్రా . కాటేసాన్ అని పేరు పెట్టటమేమిట్రా దరిద్రం కాకపోతే . అది కాటేసాన్ కాదే బామ్మా , కాటేదాన్ . నీకు కళ్ళు కూడా సరిగా కనపడట్లా . జోడు పెట్టుకు చూడు . అదో పారిశ్రామికవాడ పేరు . అయినా నీకవన్నీ ఎందుకే తల్లీ . కాటేదాన్ అయితే మాత్రం ఏం బాగుందిట . అసలదేమయినా ఎవరితోనైనా చెప్పేట్లుందిట్రా . ఇంకా నయం ఎలకలగూడా , నల్లులగూడాలు లేవు . ఏరా అబ్బాయ్ , ఇన్ని దిక్కుమాలిన పేర్లకి దగ్గర్లో ఉన్న ఈ దిలకుశనగరం నాకు నచ్చలేదు గానీ , అక్కడెక్కడో మన శర్మగారు వాళ్ళుండే ప్రాంతానికి పోదాం పద . అక్కడంతా తెలుగు వాళ్ళేట . ఇదీ తెలుగువాళ్ళుండే చోటేనే బామ్మా . అసలే ఆ పేర్లు అంతంత మాత్రం , నువ్వు వాటిల్ని చీల్చి చెండాడి , విడదీసి అలా దిల్ షుఖ్ నగర్ని దిలకుశనగరం అని , మలక్ పేట్ ని మలకపేట అంటూ పిలిస్తే ఆ మాటలు వినలేక నాకు కడుపులో దేవినట్టుగా ఉందే బామ్మా . నా మాట విని సర్దుకుపోవే , ఈ హైదరాబాదు అంతా ఇంతేనే . ఒరే నాకవన్నీ తెలీదురా ఆనందూ , ఇప్పుడే చెప్తున్నా , నేను నీకు వండిపెట్టాలంటే నన్ను తక్షణం ఇక్కడి నుంచి మన శర్మగారింటి దగ్గర్లో మరో ఇంటికి తీసుకెళ్ళాల్సిందే . ఈ తురక వాతావరణం , ఈ పేర్లు నాకు కంపరంగా ఉన్నాయ్ కాదంటావా నన్ను ఆ నర్సపూరు బండి ఈ రాత్రికే ఎక్కించు .
సీతాలక్ష్మి గారి , కాల్ చేసి థాంక్స్ చెప్పాలని వారం నుండి ప్రయత్నిస్తున్నాను . ఏమనుకుంటారో , ఎలా మాట్లాడుతారో అని సంకోచం ! చివరికి ధైర్యం చేసి , భయపడుతూనే ( ఆవిడ తో మాట్లాడేందుకు , భయము , సంకోచము , ధైర్యం ఎందుకు అంటారా ? అది టాప్ సీక్రెట్ ) ఫోన్ చేసాను . ముందు , ఇద్దరమూ కాస్త మొహమాటం గా మాటలు మొదలుపెట్టాము . ఎలా జరిగిందో కాని , ఆ క్షణం లోనే ఇద్దరికీ దోస్తీ కుదిరిపోయి , బోలెడు , బోలెడు , కబుర్లు చెప్పేసుకున్నాము . వాళ్ళ పాపాయి గురించి ఆవిడ , మా పిల్లల గురించి నేను కాసేపు చెప్పుకున్నాక , పుస్తకాలమీదికి టాపిక్ మళ్ళింది . యద్దనపూడి , సెక్రటరీ ఈ మద్యే కొన్నాను అని ఆవిడంటే , అరే నేనూ ఈ మద్యే కొన్నాను అన్నాను . కాసేపు ' జీవనతరంగాలు ' గురించి , అలా అలా , ఇద్దరికీ నచ్చిన , పుస్తకాలు , పాటలు గురించి , మద్య మద్య చాలా సేపటి నుండి మాట్లాడుతున్నాము అని ఒకరితో ఒకరం అనుకుంటూనే చాలా ముచ్చట్లు చెప్పుకొని , వీలైతే , యద్దనపూడి ని నేను సీతాలక్ష్మి గారికి , రావు బాలసరస్వతి ని ఆవిడ నాకు చూపించే ఒప్పందం చేసుకొని , ఆ రోజుకు కబుర్లు ఆపేసాము . హుర్రే . . . . . ప్రమదావనం లో , సినిమాలు గా వచ్చిన నవల ల గురించి , చర్చజరుగుతోంది . ' చరణదాసి ' గురించి రాద్దామని , రెండు రోజులుగా , ఆ సి . డీ కోసం ఇల్లంతా గాలిస్తున్నాను . దొరకని దాని గురించి ఎందుకు ? ' సెక్రటరీ ' , ' జీవనతరంగాలు ' గురించి వ్రాయచ్చుగా అనుకొని , నా ఎలుకమ్మ ను చేతిలోకి తీసుకున్నాను . నేను , పూణే లో బి . యే ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు , ఓ రోజు ఇంటికి వస్తుండగా , కిరికీ లో ' ఆంధ్ర జ్యోతి ' వీక్లీ చూసాను . ఇంటి కెళ్ళాక బోర్ గా వుంటుంది , ఓ తెలుగు పుస్తకం కనిపించింది , కొనుక్కుందాం అనుకొని , బస్ లోనుండి దిగి , ఆ పుస్తకము కొన్నాను . యాదృచికం గా ఆ సంచిక లోనే యద్దనపూడి వ్రాసిన ' జీవనతరంగాలు ' సీరియల్ మొదలైంది . అలా నా తెలుగు నవలా సాహిత్య పఠనం మొదలైంది . ఆ సినిమా కూడా నచ్చేసింది . ఎంతో ఇష్టం గా చదివిన సెక్రటరీ , సినిమా మటుకు నచ్చలేదు . అదెందుకు నచ్చింది , ఇదెందుకు నచ్చలేదు అంటే , ' ' లో నేను వ్రాసిన వ్యాసం చదివి తెలుసుకోండి . మా పిల్లలు , చిన్నప్పుడు , నచ్చని కూర తినకుండా తప్పించుకోవటాని కి , నచ్చిన కూర తినేసి , ఇక కడుపులో ఖాళీ లేదు , ఇక తినము అని మారాము చేసేవారు ! అప్పుడు మావారు , నచ్చని కూర ముందు తిని , నచ్చిన కూర తరువాత తినమని , అలానే తినిపించేవారు ! అదే పద్దతి అలవాటై , పుస్తకం గా నచ్చి , సినిమా గా నచ్చని సెక్రటరీ గురించి ముందు , పుస్తకం గా , సినిమా గా నచ్చిన జీవనతరంగాలు గురించి తరువాత రాసాను . మరి ఎలా రాసానో మీరూ చదివి చెప్పండి . చిత్రమాలిక టీం వారికి ధన్యవాదాలు .
నేను హైదరాబాదులో పుట్టి పెరిగాను . సందు సందు నాకు కొట్టిన పిండి . గోకుల్ లో కొన్ని వేల సార్లు చాట్ తినాను . కనుక ఇంకా personal గా visualize చేయగలుగుతున్నాను . జరిగినది మామూలు ఘోరం కాదు . మీరు , నేను ఎవరైన ఉండవచ్చు . మనకే ఏదైనా అయ్యి ఉండవచ్చు . అంతకన్నా బాధాకరమైనది , మనకు ఎంతో ఆప్తులైన వాళ్ళను కోల్పోయి ఉండవచ్చు . రాజకీయ రాబందుల చే ప్రేరేరింప బడిన మత కలహాలకు అంతమే లేదా ? కలియుగానికి నాలుగు కాళ్ళు కుంటి అంటే ఎమో అనుకున్నాను . నిజమే సుమా !
కేంద్ర మంత్రి శరద్ పవారుకు పనెక్కువైపోయిందంట , కాస్త రిలీఫు కావాలంట . అవును మరి , బీసీసీఐ , ఐసీసీల్లో పనిచెయ్యడం చేత ఇక్కడ మంత్రిగా పని చెయ్యడానికి టైము దొరకడం లేదు , తీరికా దొరకడం లేదు పాపం . అందుగ్గాను , కేంద్రమంత్రిగా పని తగ్గించాలంట . మంత్రి పదవిని ఈడి బాబు ఈడికి వారసత్వంగా ఇచ్చినట్టు , పన్నులేసుకుని ఈణ్ణి పోషించండని మన నెత్తిన కూచ్చోబెట్టినట్టూ , ఈ పనీ పాటా చెయ్యని సన్నాసికి కంచిగరుడసేవ చేస్తూ పని చేసేందుకు ఇంకోణ్ణి పెట్టుకోవాలంట . ఈడేమో క్రికెట్టు సంఘాల్లో సమావేశాల్లో తలమునకలుగా ఉంటాడు . పని భారం తగ్గించాలంట సారుకు . . పని అంత భారంగా ఉన్నవాడు , బీసీసీఐలోను , ఐసీసీలో పని ఎందుకు నెత్తిన పెట్టుకున్నట్టు ? అది మానెయ్యొచ్చుగా . లేదా ఆ పని అంత ముద్దుగా ఉంటే ఇక్కడ మంత్రి పదవికి రాజీనామా చేసి పారేసి అవతలికి పోవచ్చు . తేరగా ఇక్కడ పదవీ భోగాలు అనుభవిద్దామని కాకపోతే , పదవిని పట్టుకు ఏలాడటం ఎందుకు ? పనులనుండి ఉపశమనం కావాలిగానీ , డబ్బులూ , భోగాలూ మాత్రం వదులుకోడంట . కొంతమంది ముష్టెదవలుంటారండీ , మన చూరు పట్టుకు వేలాడుతూనే ఉంటారు , పొమ్మన్నా పోరు ! మన ఇంటి వాసాలు లెక్కెడుతూనే ఉంటారు . అలాటెదవల్ని ఎన్నుకుంటున్నందుకు మనల్ని మనం చెప్పెట్టుక్కొట్టుకోవాలి . ఏమయ్యా ప్రధానమంత్రీ ! మేం చెప్పెట్టుక్కొట్టుకుంటాం సరే , నువ్వేం చేస్తావ్ ? అసలు కేంద్రమంత్రి పదవంటే అదేమైనా పార్ట్‍టైము ఉద్యోగమా ? ఒక పక్క ఈ పని చేస్తూ అసలు దీనికేమీ సంబంధం లేని మరో పని చెయ్యడమేంటి ? ఆపైన , మంత్రి పని చేసేందుకు తీరిక లేకుండా ఉంది , ఇంకో మంత్రిని వేసి నా భారాన్ని తగ్గించండి అని అడగడమేంటి ? సిగ్గుందా అసలా అడిగినాడికి ? ఆణ్ణి ఇంకా మంత్రిగా ఉంచుకున్న నిన్నేమనుకోవాలసలు ? ఆడికి నీతి లేదు సరే , నీ నీతేమయింది ? నీకేదో నీతీ నిజాయితీ ఉన్నాయంటారే . . ఉన్నాయా , లేక ఉండేవా ? మంత్రిపదవికి సంబంధించిన మరో పనేదైనా అయితే ఆలోచించాల్సిన పనిలేదు . ప్రభుత్వానికి అస లేమాత్రం సంబంధం లేని క్రికెట్లో పనేంటి ? జనం ఆణ్ణి ఎన్నుకున్నదెందుకు ? మంత్రివర్గంలో ఎందుకు చేర్చుకున్నట్టు ? మంత్రిగా భోగాలననుభవిస్తూ , జీతం తీసుకుంటూ , పని మాత్రం క్రికెట్లో చేస్తాడా ? మాడబ్బులు తింటూ , ఎవుడిదగ్గరో పని చేస్తాడా ? నీ దగ్గర పనిచేసే బంట్రోతు ఇంకోడి దగ్గర ఉద్యోగం చేస్తే నియమ నిబంధనల పేరు చెప్పి తీసేస్తావు , మంత్రి కాడికొచ్చేసరికి ఏమయింది ? దర్జాగా క్రికెట్టు సంఘాల్లో చేరిపోయాడు , అదేదో మామూలే నన్నట్టు . సిగ్గూ శరాలేమైనా ఉంటే పదవుల నుంచి తప్పుకోండి . అవి లేకపోతే ఇట్టాంటి వార్తలు బైటికి పొక్కకుండానైనా జాగర్త పడేడవండి . మీరెంత మురికి సన్నాసులో మాకు తెలవకుండానైనా ఉంటది . కనీసం , సిగ్గు నటించండి . మీ కోసం కాకపోయినా , ప్రజలు చూస్తున్నారనైనా కాస్త సిగ్గు నటించండయా !
ప్రతీ రోజూ పట్టమ్మాళ్ ఇంటికి కూరలమ్మే ఒకామె కూతురు పెళ్ళికి పిలిస్తే , పట్టమ్మాళ్ వెళ్ళడమే కాకుండా అక్కడ తన పాటతో పెళ్ళికొచ్చిన పలువురినీ అలరించారట . సంగీతంలోనే కాక ఒక మనిషిగా కూడా ఎంతో ఔన్నత్యం చూపిన వ్యక్తి పట్టమ్మాళ్ .
పైన పేర్కొన్న నాలుగు కారణాలు ఇస్లామిస్ తీవ్ర వాదులకు మన దేశం , ముఖ్యంగా హైదరాబాదు లాంటి నగరాలు పెట్టని కోటగా మారుస్తున్నాయి . హైదరాబాద్ లో ఇప్పటికి పాత నగరం కానీ , ఇతర ప్రాంతాలలో చిన్న రోడ్డు ప్రమాదం జరిగితే , ఆ చేసిన వాడు పారిపోవాలి , లేక పోతే వాడిని నడి రోడ్డులో చంపేసినా చంపేస్తారు . వాహనాలు తగలబెడతారు . ఈ కార్యక్రమంలో సాక్షాత్తు ఆ ప్రాంతపు ఎమ్మెల్యేనో , ఎంపీనో పాల్గొంటారు . భాగ్యనగరంలో అయితే పాత తరపు రజాకర్ల పార్టీలు ఇంకా ఆ ప్రాంతాలను ఏలుతున్నాయి . ఒక అభివృద్ది వుండదు . అసెంబ్లీలో వారినుంచి ఒక్క ప్రశ్న వుండదు . ఎవరూ ఏ తనిఖీకి పాతనగరం వెళ్ళలేరు . వెళ్తే వస్తారో రారో చెప్పలేం . ఇలా వుంది పరిస్థితి . దీనిని సరి చెయ్యటానికి ఏ పెద్ద పార్టీ కూడా ప్రయత్నించదు . ఎందుకంటే మైనారిటీలు రాజకీయపరంగా చైతన్యం పొందితే వారికి చాలా ప్రమాదం . ప్రస్తుతానికి వారికి కావలిసింది మాస్ వోటింగు సరళి . అంటే ఏదో ఒక తెగ నాయకుడిని మంచి చేసుకుంతే , ఆ తెగ అందరూ ఆ పెద్ద చెప్పినట్లు వోట్ వెయ్యటం లాంటిదన్నమాట . ఆ రకంగానే మైనారిటీ వోట్లు ఈ రాజకీయ పార్టీలకు కావాలి . అంతే కానీ వారి అభివృద్ధి గానీ , విద్య గానీ అస్సలు పట్టదు .
మలయసమీరుఁ డత్తఱిని మంజులచందనగంధసంపదా కలితుఁడు నయ్యు నంతికవికస్వరకైరవగంధసంపదన్ బలిమి హరించుచు న్మలసె ; ప్రాప్తిలునే పరితృప్తి సంపదా కలితుల కంతకంత కధికంబగు సంపద లొందకుండినన్ ?
నైజాం రూ . 4 . 10 కోట్లు , రాయలసీమ రూ . 2 . 81 కోట్లు , వైజాగ్ రూ . 85 లక్షలు , ఈస్ట్ గోదావరి రూ . 66 లక్షలు , వెస్ట్ గోదావరి రూ . 70 లక్షలు , క్రిష్ణ రూ . 92 లక్షలు , గుంటూరు రూ . 95 లక్షలు , నెల్లూరు రూ . 58 లక్షలు . చాలా రోజుల తర్వాత వచ్చిన ఈ విజయంతో ఎన్ . టి . ఆర్ . చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిసింది .
వర్ణనలూ , ఉపమానాలూ లేకుండా సూటిగా చెప్పే శైలిలో రాసిన వాళ్ళలో ప్రముఖుడు కుటుంబరావు . సాహిత్య ప్రయోజనం గురించి ఆయన అన్న మాటలు ఇందుకు ఓ తార్కాణం : " జీవితాన్ని విమర్శించడం , అలంకరించడం , సాహిత్యం చెయ్యగల ఉత్తమకార్యాలు . ఇదే సాహిత్యం యొక్క ఉత్కృష్ట ప్రయోజనం . " మరి జీవితం అనేది విస్తృతంగానూ రకరకాలుగానూ ఉంది . కుటుంబరావు దాన్నెంతవరకు స్పృశించాడో కొంతైనా చూపెట్టాలని ఈవ్యాసం ఉద్దేశం .
ధనంజయ్ తెల్లబోయి చూస్తున్నాడు చారుమతి వైపు . అతను ఊహించని జవాబులు చెప్పింది చారుమతి . సఖి వాళ్ళు చారుమతి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసారు . ఆమె ఫోటోలు తీసుకున్నారు . అప్పుడు చెప్పింది చారుమతి తను డొమెస్టిక్ వయొలెన్స్ విభాగం నుండి వచ్చినట్టు . " మీరు పోస్ట్ చేయకుండా చెత్త కుండీలో పడేసిన చారుమతి ఉత్తరం ఆధారంగా మా సంస్థలో మీ మీద కంప్లెయింట్ రిజిస్టర్ అయింది . మీరు చారుమతిని మాతో పంపాలి లేదా ఇండియా పంపే ఏర్పాట్లు చేయాలి వెంటనే . పరిస్థితి మా చెయ్యి దాటితే పోలీస్‌ని ఇన్వాల్వ్ చేయాల్సొస్తుంది . ఇండియాలో మీ మీద ఫ్యామిలీ కోర్టులో హెరాస్‌మెంట్ కేస్ రిజిస్టర్ ఔతుంది . తర్వాత మీ ఇష్టం " కూల్‌గా చెప్పింది మధుబని . అప్పుడు అర్థమైంది ధనంజయకి వాళ్ళు ఎవరో , తన మీద ఎంత బలమైన ఆధారాలతో వచ్చారో . చాలసేపు నోట మాట రాక నిలబడిపోయాడు . తర్వాత గబగబా లాభనష్టాలు లెక్కవేసాడు . ఇండియాలో తెలిస్తే పెద్ద గొదవ అవుతుంది . పొలం , తోట , ఇల్లు అన్నీ పోగొట్టుకోవాల్సి ఉంటుంది . ఇక్కడ పోలీసులకు తెలిస్తే ఉద్యోగానికి ప్రమాదం . అందుకని ఈ అమ్మాయిల్ని మానెజ్ చేయాలి . " నా వల్ల తప్పై పోయింది . ఇక మీద చారుమతికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను " అన్నాడు ధనంజయ్ . చారుమతి ఏడ్చేసింది మధుబని చేయి పట్టుకుని . " చారుమతి మా ప్రొటెక్షన్‌లో ఉంటుంది కొంతకాలం . ఈ పేపర్స్ సైన్ చేయండి " అంటూ సఖి అగ్రిమెంట్ అతని చేతిలో పెట్టింది . " మీరు రోజూ సాయంత్రం మా కౌన్సిలింగ్ వింగ్ కి రావాల్సి వుంటుంది " చెప్పింది మధుబని .
పద్మావతి మునులందరూ వేచి చూస్తున్నారు గామోసు . వాళ్ళకేం కావాలో చూడాలి . అందర్నీ రమ్మనండి .
" నశ్వరము దేహ మాత్మ యనశ్వరంబు , పుణ్యవతి యామె పల్కులపొలఁతిఁ గూడె దేహముండఁగనే కాన దీలుపడక శారదాదేవి శరణంబుఁ గోరుకొనుము !
తనను తాను అధికుడుగా , ప్రత్యేకమైనవాడిగా వ్యక్త్తీకరించుకొనడం మనిషికి సహజమైన గుణమేమో . అసలు భాష పుట్టకే ఆ విధంగా జరిగిందట . ఇప్పుడు టెక్నాలజి కూడా అంతె . మనిషి ఉనికి మనిషికి బరువుగా మారింది . సహజీవనం మరిచి పోతున్నారు . మనిషి తనను తాను వ్యక్తీకరించుకొనె అవకాశము కాదు , మనుగడనే ప్రమాదంలోకి నెట్టె విధంగా టెక్నాలజిని ఉపయొగించుకుంటున్నాడు . ప్రపంచంలొ ఇప్పడివరకు కరువు అనేది నిజంగా ఎక్కడ రాలేదంటారు . జరిగినదేందంటె ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమే . wait for more
చాలా బాగా రాశారు . ఆయన మనసు గురించి చిన్న చిన్న పదాలతో ఎంతో లోతైన భావం చెప్తారనడాని ఈ మాటలే ఉదాహరణ " మనసా ఎందుకె కన్నీరు మన కోసం ఎవరున్నారు కలగనమని ఎవరన్నారు కరిగితె ఎవరేం చేస్తారు "
రబ్బీఉల్ అవ్వల్ నెల ఆరంభంలో ఆయనకు నొప్పి కలిగినది , ఆ తరువాత జ్వరం వచ్చినది . వ్యాధి అధికమవటం వలన , ప్రజలను నమాజు చదివించమని ఆయన అబూ బకర్ సిద్ధీఖ్ రదియల్లాహు అన్హుకు ఆదేశమిచ్చినారు . ఇలా ఆయన అమానతును నిజాయితీగా వాపసు చేసి , అల్లాహ్ యొక్క సందేశాన్ని ప్రజలకు అందజేసి మరియు ప్రపంచ పట రూపురేఖల్ని మార్చివేసి , హిజ్రీ 11వ సంవత్సరం రబ్బీఉల్ అవ్వల్ నెల పన్నెండవ తేదీన మరణించినారు .
CBS మ్యూజికల్ ఇంస్ట్రుమెంట్స్ విభాగంను ఏర్పరుస్తూ , సంస్థ స్టీన్వే పియానోలు , గెమీన్‌హార్డట్ పిల్లనగ్రోవులు , లయన్ & హీలే తంత్రీ వాద్యాలు , రోడ్జర్స్ ( సంస్థాపరమైన ) ఆర్గన్స్ , గుల్బ్రాన్ సేన్ హోం ఆర్గాన్స్ , ఎలెక్ట్రో - మ్యూజిక్ ఇంక్ . ( లెస్లీ స్పీకర్లు ) , మరియు రోజర్స్ తబలాలను స్వాధీనపరచుకుంది . ఇది చివరిసారి 1981లో అప్పుడు దివాలాలో ఉన్న ARP ఇంస్ట్రుమెంట్స్ ఆస్తులను కొనుగోలు చేసింది , ఇది ఎలక్ట్రానిక్ సింథసైజర్ల డెవలపర్‌గా ఉంది .
లక్ష్మణ్ , మనం కట్టుబడి ఉండాల్సింది ఆశావాదానికే . నిరాశతో సాధించగలిగినది ఏదీ లేదు . అన్ని కల్మషాలతో కుళ్ళిపోయిన ఈ లోకం నుంచి ప్రేమ పవిత్రతలతో నిండిన మరో ప్రపంచంకు అందరూ వెళ్ళలన్న ఉద్దేశంతో అలా వ్రాశాను . ఇక్కడ " నేను " అంటే ప్రతి ఒక్క మనిషి . . ఎవరికి వారు అని . అలా మరో ప్రపంచం చేరుకోవాలంటే . . . ఎవరికి వారు పరివర్తన చెందాలి . ఆ పరివర్తన ఒక్క రోజులో వచ్చేసేది కాదు . అది నిరంతర ప్రయాణం . ఆ ప్రయాణాన్నే ఇక్కడ పరుగుగా పేర్కొన్నాను . : )
రాము గారు . . మా నాన్నను గుర్తు చేశారు . ఇప్పుడు ఆయన లేరు . ఆయన జ్ఞాపకం మాత్రమే మిగిలింది . నాన్న పెద్దకొడుకైన నాకోసం ఎంత చేశారో తలచుకుంటే . . కన్నీరుబుకుతోంది . మానాన్న లారీ డ్రైవర్‌గా ఉంటూ . అప్పట్లో అంటే 1988 . . నన్ను పాలిటెక్నికల్ చదివించారు . ఒక డ్రైవర్ కొడుకు పాలిటెక్నికల్ చదువుకుంటున్నారని ఊరంతా చెప్పుకునేవారు . ఏలూరులో హాస్టల్‌లో ఉంచి ఆ రోజుల్లో నేను పాలిటెక్నికల్ చదివడానికి నా గురించి నాన్న ఎంత కష్టపడ్డారో ( శ్రమపడ్డారో ) . . . చెప్పలేను . అందుకే నాన్నకు జేజేలు . . మా నాన్నకు నివాళులు
అస్సల టైటిల్ SFS గురించి చెప్పకుండా ఏదేదో చెప్పాను . పాటకులు మన్నించాలి . అలా వుంది మరి నా ఫేట్ .
చివరగా చెప్పేదేమిటంటే బేరసారాలు చేసేవాళ్ళు జీవితాన్ని కూలంకషంగా పరిశీలించి , బ్రతుకుతెరువు తెలిసినవాళ్ళు . మిగిలిన నాలాటి వాళ్ళంతా " గుడ్ ఫర్ నథింగ్ " రకం ! ! సర్వేజనా సుఖినోభవంతూ ! !
యోని వదులుగా అనిపిస్తున్నప్పుడు ఎక్సర్ సైజ్ లు కాకుండా కొన్ని రకాల …
చెట్టులెక్కి నిలిచినప్పుడో గుట్ట లెక్కి అలసినప్పుడో పుట్ట చూసి కలత చెందినప్పుడో కట్టముకట్టి పట్టె చేరరాదురా
నేను మార్పు అంటే భయపడ్డాను … … గొంగళి పురుగే అందమైన సీతాకోకచిలుకలాగా మారగలదని తెలిసే వరకు !
1 ) అల్లు అర్జున్ బ్యాడి ఎక్సపొజింగ్ స్టిల్స్ 2 ) అల్లు అర్జున్ డాన్స్ తో కూడిన ట్రైలర్స్ 3 ) వి . వి . వినాయక్ ను హైలట్ చేస్తూ కొన్ని స్టిల్స్ 4 ) హిరోయిన్ ఎక్సపొజింగ్ స్టిల్స్
@ శ్రీకర్ , " వెంకట రమణ గారు , ఎంత మంది ఇన్నయ గారిని సమాధానం అడిగిన చెప్పటం లేదు . " సమాధాన౦ చెప్పన౦త వరకు ఇన్నయ్యగారు నిజమైన హేతువాది కాదు అని వోట్లు చెబుతున్నాయి . అది ఇన్నయ్య గారి కళ్ళకు కూడా కనబడుతు౦ది . సమాధానాలు ఎ౦దుకు చెప్పడ౦ లేదు అని కూడా అడిగాము . దానికి కూడా నోరు మెదపడ౦లేదు అ౦టే మరి ఆయన " హేతువాది " అన్న ముద్రకోసమే ఇ౦తగా తాపత్రయ పడుతున్నారు , కానీ నిజమైన హేతువాది కాదు అని ఆయన మనసుకు తెలుసు . ఆ రహస్య౦ చెబితే ఇన్ని స౦వత్సరాల ఇమేజ్ గ౦గలో ఒక్కసారిగా పోతు౦ది , అది అతను జీర్ణి౦చుకోలేడనుకు౦టా . ఎ౦తైనా నిజ౦ నిప్పులా౦టిది , మరియు నిష్ఠూర౦గా ఉ౦టు౦ది కదా ! నిజ౦ చెప్పడనికైనా , ఒప్పుకోవడానికైనా , హేతువు దొరకని మనోధైర్య౦ కావాలి . అది గౌరవనీయులైన ఇన్నయ్య గారికి లేదనుకు౦టా ! పాప౦ ఆయనకు పుట్టుకతో వచ్చిన ధైర్య౦ చాలక పె౦చుకు౦దామనుకు౦టే అదేమో ఎక్కడ వెతికినా కనబడదాయే ! ధైర్య౦ మీరు గనక ఆయన కళ్ళకు చూపి౦చ౦డి , వె౦టనే మనమడిగిన ప్రశ్నలకు సమాధానాలు అవ్వడానికి ప్రయత్నిస్తాడు , లేదా ఎ౦దుకు చెప్పడ౦ లేదో వివరిస్తాడు .
ట్రాఫిక్‌లో అంబులెన్స్ ముందుకు వెళ్ళలేక ఆగింది . సత్తెమ్మ ఏడుపూ , ఊపిరి కూడా . పసిబిడ్డ ఇంకా పాలుత్రాగే ప్రయత్నం చేస్తూనే ఉంది . అనసూయమ్మ అ పసిబిడ్డని అందుకుంది . ఈ వయస్సులో ఒక ఆడపిల్లని పెంచే భాద్యతను భుజాలకెత్తుకుంది .
మన దేశపు సినిమాల్లో చాలా గొప్ప వాద్యకళాకారులు తమ సంగీతాన్ని వినిపించారు . జెమినీ సంస్థలో సంగీతదర్శకుడుగా పనిచేశాక ఈమని శంకరశాస్త్రిగారు సీతారామకల్యాణం , వెంకటేశ్వర మహత్యం మొదలైన సినిమాల్లో వీణ వాయించారు . సీతారామకల్యాణంలో రావణుడు తన పేగులనే తంత్రులుగా వీణ వాయించే సన్నివేశానికి ఆయనే వాయించారు .
" Man is a social Animal " దానికి మనమేం చేస్తాం ! " అంది కోతి గంభీరంగా . " అక్కడికి మనమంతా science జంతువులమైనట్లు . . . " అంది నక్క ఎకసెక్కంగా . " జోకులొద్దు . . . matter Serious . . . మాటిమాటికి మాటమాటకు మనిషి మనతో compare ఎందుకు చేసుకుంటాడో అర్ధం కాకుండా ఉంది . ఎవడైనా కొద్దిగా బుద్ధి తక్కువ పని చేస్తే చాలు " గాడిద కొడకా ! " అని తిడుతాడే ! గాడిదలకు మెదడు అంత తక్కువ అని అతగాడి ఉద్దేశమా ? అంది గార్ధభం కోపంగా . " మరే . . . వాడికెవరైనా సరే సరిపడక పోతే తెగ తిట్లకు దిగుతాడు . కొండవీటి చాంతాండంత కవిత్వాలు రాస్తున్నారని కవులను . . . ' వాడలవాడలందిరిగి వచ్చెడువారలు గోడల గొందులలో వొదిగి కూయుచుండెడి ' వారు అంటూ వారిని గాడిదలతో పోల్చాడు ! గాడిదయితే మాత్రం కైతలు రాకూడదని రూలుందా ! " అనింకా ఎక్కించింది నక్క . " అందుకేగా . . . వీడా నా కొడుకని , కందంలో ఈ గాడిద కూడా అంత అందంగానూ ఏడ్చిందీ ! గాడిద కనుక కాస్తోకూస్తో దీనికి కవిత్వ మొచ్చు . మొరగటమే తప్ప మరేమీ ఎరగని ఈ పిచ్చికుక్కేం చేసింది . . . పాపం ఊరకుక్కలు బోరకుక్కలని అన్ని పార్టీలవాళ్ళు అలా ఒకళ్ళనొకళ్ళు తిట్టి పోసుకోడానికి ! " అంది కోడి కాళ్ళు గీరుకుంటూ . " అట్లాగే మా పేర్లు పెట్టి కూడా ముట్టె పొగరని మనిషి ఎప్పుడూ తిడుతూ ఉంటాడు కదా ! " అంది పంది కూడా బాధగా . " దున్నపోతులాగా మా చేత పని చేయించుకుంటూ ఒళ్ళొంగని వాళ్ళని మళ్ళా దున్నపోతులని దులిపేస్తాడు . . అదేందో " అందో ఆంబోతు ఆవేదనగా . " అందరు నందరే మరియు నందరు నందరే అంటూ సభలోని వాళ్ళందరినీ కలగలిపి కుక్కలూ , కోతులూ , పందులూ , దున్నలూ , గాడిదలంటూ శ్రీనాధసార్వభౌములవారు తిట్టిపోయటం గుర్తొచ్చి గట్టిగా నిట్టూర్చు కొన్నాయి అభయారణ్యంలో సభతీరిన ఆ జంతువులన్నీ . " మనిషి తీరుతో పడ లేకుండా వున్నాను . నాలుగుగింజలు ఇలా రాల్చి నాచేత నానా చాకిరీ చేయించుకుంటున్నాడు . నాకు వాడి నుంచి విముక్తి కలిగించండి అంటూ పావురాయి అడివికొచ్చి కన్నీళ్ళు పెట్టుకోవటం చేత ఇలా సభ మొదలయింది . " మనవాడి తీరే అంత . . . మన మనవడని చెప్పుకోవటానికే సిగ్గేస్తోంది " అని పక్క కోతితో చెప్పుకుని బాధపడిందో పాతకాలం కోతి . " వాడొక్కడికే దేవుడు పెద్ద బుర్రిచ్చాడన్న పొగరు కాబోలు ! వెళ్ళిఆ దేవుణ్ణే అడుగుదాం పదండి ! " అంది జంబూకం . జిత్తులన్నీ తానే ప్రదర్శిస్తూ ' జాకాల్ ' అన్న తన పేరుని బద్నామ్ చేస్తున్నాడని ఆ నక్క అక్కసు . విషయం అంత ఓపికగా విన్నాడు దేవుడు . జంతు లోకం ఆక్రోశం చూసి గాఢంగా నిట్టూర్చాడు . మడిసి మిడిసిపాటు తనకూ కొత్తకాదు . ఒళ్ళు మండినప్పుడు వాడూ తనని విడిచిపెట్టింది లేదు . " తిరిపమునకిద్దరాండ్రా . . . పరమేశా ! గంగ విడుము . . . పార్వతి చాలున్ ! " అని తనను కూడా దులిపి పారేయడం గుర్తుకొచ్చింది . అయినా దేవుడి role లో ఉన్నప్పుడు సర్ది చెప్పడం తన భాద్యత కనుక " మనిషి మహాశయుడ తీరంతే ! తెగనాడేటప్పుడు గాడి తప్పటంలో వాడు మహా ప్రవీణుడు ! అదంతా ఓ రాజకీయం . పాలిటిక్సన్నాక ఇలాంటి హాట్హాట్ లు అప్పుడప్పుడు తప్పవు . వాడికి ఎన్నికలంటే పోలింగు ' బూతులు ' . ' నబూతో నభవిష్యత్త ' ని నమ్మే సజ్జు రాజకీయాల్లో రోజురోజుకు ఎక్కువౌతోంది . అశ్లీలమే వాళ్ళసలైన శీలమైపోయింది . అట్లాంటి వాళ్ళ తిట్లనట్లా పట్టించుకొంటే నిద్ర పట్టదు . . థూ . . . నా బొడ్డనుకోవాలి " అన్నాడు దేవుడు . " వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళ నొకళ్ళు మెంటలనో , శుంఠలనో ఎంత అన్ ప్రిన్ టబుల్ గా తిట్టుకున్నా పర్వాలేదు కానీ మహాప్రభో ! . . . మధ్యలో మా కుక్కలనీ , పందులనీ . . . లాక్కు రావటమెందుకు ? ! . . . ఈ వానర వారసుడి వరుస చూస్తే మీరింకో అర్జెంటు అవతారమెత్తాల్సిన అవసరమున్నట్లుంది " అని జంతువులన్నీ మోరెత్తి మరీ మొరపెట్టుకొన్నాయి . " సరే . . ముందసలు సందర్భమేంటో కనుక్కుందాం . మానవుడి వాదనా విందాం . . ' రమ్మ ' నమ " ని కాకి చేత కబురంపించాడు దేవుడు . " ఎక్కడి టైమూ యాత్రలకే చాలటం లేదు నా తరపున చిలకను పంపిస్తున్నా చర్చించుకోండి ! ' అన్నాడు మనిషి . చిలక వచ్చి మనిషి పలుకులు పలకటం మొదలు పెట్టింది . " కుక్కంటే మాకూ మక్కువ ఎక్కువే . డాగనగా తిరగేసిన గాడ్ కిందే కదా లెక్క ! ( DOG - GOD ) . కనుకనే శునకాన్ని భైరవుడిగా కొలుస్తుంటాం . దాన్ని గ్రామసింహమమని గౌరవిస్తుంటాం . ధర్మరాజు తమ్ముళ్ళందరినీ వదిలేసి , ఒక్క కుక్కనే సరాసరి స్వర్గానికి తీసుకెళ్ళిండి అందుకే ! కుక్క పిల్లా . . . అగ్గిపుల్లా . . . కాదేదీ మా కవుల కనర్హం . ఆ మాటకొస్తే మేము ఏ జంతువునీ తక్కువ చేసి చూసింది లేదు . చివరికి పావురాయిని కూడా . మేము దశావతారాల్లో జంతువులన్నింటికీ దేవుడి హోదా కల్పించలేదా ? ! గాడిదైనా మా దృష్టిలోగాడ్ ది గ్రేటే ! . పేపరు వాళ్ళు , టివీల వాళ్ళు మా ఉపన్యాసాలు పూర్తిగా వినకుండా వాళ్ళకి నచ్చినట్లు రాసుకుంటే మాదా తప్పు ! ఇన్ని నిజాలు చెప్పిన తర్వాత కూడా ఇంకా భుజాలు తడుముకుంటామంటే మీ భుజాలు . . మీ ఇష్టం " అని మనిషి మాటలు వప్పచేప్పింది చిలక . . చిలుక పలుకులకు పాము ఫ్లాటయి పోయింది . మనిషినపార్ధం చేసుకున్నందుకు గార్ధభం కుమిలి పోయింది . మొసలి కూడా కన్నీరు కార్చింది . కానీ నక్కే . . . ' ఈ మనిషి జిత్తులు నాకు కొత్తా ! మనిషిని పనిష్ చేయాల్సిందే ! ' అని వాదనకు దిగింది . ఉడుంది కూడా అదే పట్టు . " మనిషితో మాది రక్త సంబంధం మాట పోతుంద " ని దోమ తెలివిగా తప్పుకుంది . " మురుగు లేనిదే మాకు మనుగడలేదు . నరుడే మా గురుడ ' ని ఈగలూ , నల్లులూ , పేలు లాంటి కీటకాలు ప్రకటించేసాయి . కోడికి మాత్రం కోపం తగ్గ లేదు . " నేను కూయటం మానేస్తాను . ఘడియ ఘడియకు కూయించుకొని ఆకలేసినప్పుడు కూరగా దోరగా వేయించుకొని తింటాడు " అంది కసిగా . " బోడి కోడి లేకపోతే తెల్లవారదా ఏంది ? మనిషికి బోలెడన్ని గడియారాలున్నాయి " అంది మనిషి తరపున చిలుక . " నేనూ దున్నటం మానేస్తాను . తిండిగింజలు లేక చస్తాడ " ని కాడి కింద పడేసింది దున్నపోతు . " నీ సాయం లేకపోతే వ్యయసాయం సాగదా ! . మిషన్లతో పనులు నిమిషాల్లో అయిపోతాయి " అంది మళ్ళీ చిలుక . మనిషిని శిక్షించే విషయంలో అడవి నడిమికి చీలింది . గోవులూ , గుర్రాలూ , చిలుకలూ , ఎలుకలూ , నెమళ్ళూ , తేళ్ళూ లాంటివి ఒకవైపు . కాకీ , నక్క , గద్ద , గబ్బిలం లాంటివింకోవైపు . పులులూ , గొరిల్లాలు చర్చల్ని బహిష్కరించాయి . మనిషి కనపడితే వేసేయటమే మా పాలసీ అని ప్రకటించేసాయి . కప్పమాత్రం గంటకో వైపుకి గెంతుతోంది . గోడమీదున్న పిల్లికెటుదూకాలో పాలుపోవటం లేదు . ఎన్నికలు తప్ప లేదు . ఒక్క కుక్క ఓటు మీదే గెలుపోటములు తేలిపోయే పరిస్థితులొచ్చి పడిందిప్పుడు . " మనిషి నీ master . . . మాకే నీ ఓటం " టూ చిలక పార్టీ ఒకవైపు , " . మాస్టర్ కాదు . . వాడొట్టి monster . . మాకే నీ ఓటం " టూ నక్క ఊళింకోవైపు . అందుకే అంటారు . . . ప్రతి కుక్కకూ ఓరోజొస్తుందని . పోలింగు రోజు రానేవచ్చింది . ముగిసింది . ఒక్క ఓటు మెజార్టీతో మనిషి ఘనవిజయం సాధించినట్లు ప్రకటించాడు దేవుడు . అంటే అ ఒక్క ఓటు కుక్కదే నన్నమాటే గదా ! " ఛీ . . . కుక్క కుక్కబుద్ధి పోనిచ్చుకున్నది కాదు . . . కనకపు సింహాసనమ్మీద కూర్చోబెడతామన్నా వెనుకటి బుద్ధి ఎలా పోతుంది ! అని చీదరించుకొంది కాకి & కో లోకులు పలుకాకులు . ' ఈ శునకం ఓటెలాగూ మనిషికే వేస్తుంది . గెలిచే పక్షంలో వుండటమే తెలివయిన పని అని నేనూ అటు దూకేసాను ! ' అని సంబర పడింపోయింది మార్జాలం . " నువ్వటు దూకటం చూసి నేనూ అటే గంతేసాలే ఆఖరి నిమిషం లో ! " అంది కప్ప నాలిక అదోలాచప్పరిస్తూ . . ' " ఎదయితేని . . మనిషి గెలిచాడు . గెలిచిన వాడితో సంధి చేసుకోవటం ఓడిన పక్షానికి శ్రేయస్కరం . ఎందుకు చెపుతున్నానో అర్ధం చేసుకోండి ! " అని ఓ సలహా పారేసి చక్కా పోయాడు దేవుడు . దేవుడి మాట మేరకు పావురయిని రాయబారానికి పంపాయి . పోయిన పావురాయెంతకూ తిరిగిరాలేదు . పావురాయికి పాపం ఏమయినట్లు ? ! రెండు రోజుల తరువాత మనిషి దగ్గరనుంచి చిలక కబురు తెచ్చింది . " డబుల్ థేంక్స్ ! ఒకటి గెలిపించినదుకు . రెండు పావురాయిని గిఫ్ట్ గా పంపించినందుకు ! మీ gift మహా taste గా ఉంది " అంటూ . . ' మనిషెంత దుర్మార్గుడు ! ! ! . . . మన అడవిలో కూడా మరీ ఇంత అన్యాయం లేదు . ' అనుకున్నాయి అన్ని జంతువులు . " అందుకే నేను వాడికి ఓటు వెయ్యనిది . . ఒట్టు . . . నన్ను నమ్మండి " అని గోల పెట్టింది శునకం . మరి మనిషి గెలవటానికి సాయపడిన ఆ ఒక్క ఓటూ ఎవరిది ? ! ఆ దేవుడికే తెలియాలి . చివరికి ఆ దేవుడే సస్పెన్స్ తేల్చేయాల్సోచ్చింది . ' ఇదంతా ఆ వరహవతరంగారి పుణ్యఫలమే ! ' అని తేలిపోయింది . " మామనిషికి గనుక ఓటెయ్యకపోతే వచ్చే జన్మలో నువ్వూ మనిషివయి పుట్టటమే కాదు రాజకీయాల్లోకూడా పడతావని చిలక చాటుగా బెదిరించి పోయింది బాబోయ్ ! అందుకే . అదిరిపోయి అటే ఓటు వెయ్యాల్సి వచ్చింది " అంటూ బురదలో మొహం దాచుకొని మరీ మధన పడటం మొదలు పెట్టింది పాపం ఆ వరాహమిప్పుడు . నీతి : ఇకనయినా మనం , మనుషులం కనీసం జంతువులయినా అసహ్యించుకునే స్థాయి దాక రాజకీయాలను దిగాజర్చుకోకుండా వుండటం మంచిది కదా ! - - కర్లపాలెం హనుమంతరావు ( ఈ ప్రకరణము ప్రమీలా రాణి ( నా స్నేహితురాలు ) చే సేకరించబడింది . ) - అని అంటున్నారు శ్రీవిద్య గారు This article was posted by srividya garu at 7 : 54 PM | 33 comments . in her blog . Tuesday , March 07 , 2006Name : srividya Location : Gudivada , Andhra pradesh , India PS : ఇది నా రచనే . ' ఈనాడు ' కోసం ఎప్పుడో రాసింది . ఈ మధ్య కొత్తగా బ్లాగ్ మొదలు పెట్టి ఏమి రాయాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఇంటర్నెట్ బ్రౌజింగ్ లో శ్రీవిద్య గారి బ్లాగ్ లో కనిపించింది . ఈనాడు లో ఎలాగూవచ్చిందే కదా అని ఇప్పటి చదువరుల కోసం మళ్ళి నా బ్లాగ్ లో పెడుతున్నాను . బాగుంటే తెలపగలరు . మరిన్ని ఇలాంటి వ్యంగ్య రచనలు నా దగ్గర వున్నవి ప్రచురించ గలను - ఇలాగే నా రచనలు ఎవరయినా వుపయోగించుకుని వుంటే తెలుపగలరు . తిరిగి నా బ్లాగు లో ప్రచురించుకోవటానికి సహకరించమని మనవి - కర్లపాలెం హనుమంత రావు
భాషల నన్ని మాటల , " శభాష్ " అని అర్ధము నిచ్చి , హెచ్చు సం తోషము దెల్పు వాని , రస తుందిలతన్ యొకచోట చూచు చి త్తేష గలింగె నేని , యవి యెల్లయు మీ ఘన వ్యాస వీధులన్ భేషుగ దోచు ; కోశముల వేమరు చూడగ బోవ డెవ్వడున్
ఏదో కొంచం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నందున నేనున్నా అంటూ నేను ఓ దూకు దూకా ! ! దూకే ముందు ప్రక్కనున్న అమ్మాయికి నా ఐ ఫోన్ ఇచ్చి నన్ను ఫొటో తియ్యమంటే , అలాగే కూర్చున్న అమ్మాయిలని ఓ పది తీసింది . . ఇదిగో ఇలా
" విద్యా బోధనా పద్దతులు , విద్యా బోధనల ప్రాంతీయ భాషల వాడకం " మీద ఆ రోజు ధర్నాకు ' విద్యార్థి సంఘం ' పిలుపునిచ్చిందని తివారీ చెప్పిండు . హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్‌ల రాత్రి తొమ్మిది గంట్లకు స్టేట్ లెవెల్ మీటింగ్ ఉందని , వరంగల్ చౌరస్త నుంచి బైల్దేరి హన్మకొండల మీటింగుకి ఒద్దామనుకుంటుంటె కత మొత్తం అడ్డం తిర్గిందన్నడు .
దీన్ని కూడా శోధించు : పర్వత ప్రాంతాలు , తమిళనాడు , నీలగిరి పర్వతాలు , ఊటీ , క్వీన్ ఆఫ్ హిల్స్టేషన్ , బొటానికల్ గార్డెన్ , లేక్ , దొడ్డబెట్ట శిఖరం
తేటగీతి . కన్నుఁ గానని తమకమ్ము గ్రమ్ముకొని మ హోగ్ర కర్మకు వెనుదీయ కుంద్రు విషయ భోగలాలసులౌచు బాగోగు లేక జగతికి నరిష్టమున్ గూర్పదగుదు రెపుడు . ౮
ఈ పద్యంలో ప్రస్తావించిన చంద్రకాంతిలా ( తో ) తెల్లగా వెలుగుతున్న శరీరము , లలాటము చిందే కాంతులు , కైలాసము నుండి విచ్చేయడము - ఇవన్నీ కైలాసం నుండి స్వయంగా శివుడే వచ్చాడా అన్న భావాన్ని స్ఫురింపజేస్తాయి . ఇంతకుముందు పద్యంలో లాగానే ఇందులో కూడా శ్లేష లేదు . ఇక్కడ ఉన్నది ధ్వని ! ఇలా వర్ణనలలో సూక్ష్మంగా అంతరార్థాన్ని ధ్వనింప జేసే సందర్భాలు మరికొన్ని ఉన్నాయి . నేను తెలుసుకోలేక పోయినవి ఇంకా చాలానే ఉండి ఉంటాయి ! దురదృష్టవశాత్తూ యీ కావ్యానికి విపుల వ్యాఖ్యానమేమీ వచ్చినట్టు లేదు . మల్లంపల్లి శరభయ్యగారు చేసేరని విన్నాను కాని , అది నాకు దొరకలేదు .
హీనుఁడైననన్నుఁదెచ్చి యింతగా మన్నించితివి దానవారి నీవు సేసే తగ విట్టిదయ్యా
అలాంటి ఓ అరుదైన సాహితీమూర్తి అస్తమించాడు . ఆయనే ముద్దసాని రాంరెడ్డి ! !
అమెరికాలో మోసాలు చేసి జేమ్స్ రాండీకి పట్టుబడి , గుట్టు బట్టబయలు కాగా పారిపోయిన అలెక్స్ ఆర్బిటో ఫిలిప్పిన్స్ నుండి వచ్చిన సైకిక్ సర్జరీ మాయగాడు . ఆ మధ్య ఆయన హైదరాబాదు వచ్చినప్పుడు స్టార్ హోటల్లో సంపన్నులకు సైకిక్ సర్జరీ చేశాడు . బి . ఎన్ . రెడ్డి , శైలజ ( రామోజీరావు కోడలు ) ప్రభృతుల సమక్షంలో మీడియా పబ్లిసిటీ ఇవ్వగా , బాగా డబ్బు గుంజి , నయం చేశాననే వార్త వ్యాపింప చేశాడు . అప్పటికే ఇతడి వ్యవహారం తెలిసిన మేము మరునాడే ప్రెస్ క్లబ్బులో ప్రదర్శన పూర్వకంగా అసలు విషయం బయట పెట్టాం . హేతువాద మానవ వాద సంఘం పక్షాన మెజీషియన్ విక్రమ్ తో ప్రెస్ సమక్షంలో ప్రదర్శన చేసి చూపాం . ఈనాడు పత్రిక , టి . వి . ఛానల్స్ బాగా ఈ విషయాన్ని తెలియపరిచాయి . అంతటితో అలెక్స్ అర్బిటో బెంగుళూరు పారిపోగా అక్కడ కూడా మా హేతువాదులు వెంటబడి విషయం వెల్లడించారు . అతడు అరెస్టు కాకుండా తప్పించుకు పోయాడు . భవిష్యత్తులో సైకిక్ సర్జరీ మోసాలకు ఎవరూ లోను కాకూడదని విక్రమ్ ద్వారా తెనాలి మొదలైన చోట్ల ప్రదర్శనలు చేశాం . ఎలా చేస్తారంటే ఒక మనిషిని బల్లమీద పడుకోబెడతాం . అతడి పొట్టలోకి ఐదు వేళ్ళు లోనికి గుచ్చుతున్నట్లు చూపిస్తాం . అలా నొక్కినప్పుడు వేళ్ళు ముడిచి ఉంచుతాం . ఒక వేలి గోరులో కృత్రిమంగా దాచిన ఎర్రని రంగు నీరు బయటికి వస్తుంది . అది తుడిచివేయటానికి దూదిని లేదా బట్టను వినియోగిస్తాము . ముందుగానే ఆ బట్టలో ఉన్న పేగు ముక్కలు దాచి ఉంచుతారు . అవి పొట్ట లోంచి తీసినట్లు చూపుతారు . లోన ఉన్న దోషం పోయినట్లు అందరికీ చాటుతారు . నిజమేకాబోలని రోగి భ్రమిస్తాడు . శరీరంలో ఇతర భాగాల్లోంచి ఇలాగే చేస్తాడు . ఈ వైద్యం ఫిలిప్పిన్స్ లో బహుళ ప్రచారంలో ఉన్నది . అమెరికా సంపన్నులు వెళ్లి చికిత్స చేసుకుని తాత్కాలికంగ తగ్గినట్లు భావించి ఇంటికొచ్చి ఆస్పత్రిపాలవుతారు .
నాకు మా బామ్మంటే చాలా ఇష్టం , బామ్మకి నేనంటే ఇంకా ఇష్టం . ఎందుకంటే నేను పుట్టాకే అందరూ బామ్మకి ఆ పేరు పెట్టారని బామ్మే నాతో చెప్పింది . అదేమాట అమ్మతో చెప్తే . . ఒప్పుకోకపోగా నా బుగ్గన గాట్టిగా ఓ ముద్దుపెట్టి , వీడు ఉత్త బామ్మకూచి అంటుంది . నాన్నతో చెప్తే బుగ్గన ఓ చిటికేసి ఆడుకోపో అంటారు . అవును , నేను బామ్మకూచినే . అయితే ఏంటంట . రోజంతా అల్లరి చేసినా బామ్మలా ముద్దు చెయ్యకపోగా అందరూ అనేవాళ్ళే నన్నూ బామ్మని . అందుకే చిన్నప్పుడే చిన్నిభీముడులా నేనూ ఓ ప్రతిజ్ణ చేసేసా . వీళ్ళంతా నన్ను బామ్మలా ముద్దు చేసేదాకా రోజుకో వస్తువు పగలకొడ్తూనే ఉంటా అని . కానీ అదేమో మూడేళ్ళప్పుడు చేసిన ప్రతిజ్ణ కదా , అది వీళ్ళెవ్వళ్ళకీ అర్ధంకాలేదుట . నాకు అయిదేళ్ళొచ్చి వీళ్ళకర్ధమయ్యేట్లు మళ్ళీ చెప్పేలోగా బోలెడు వస్తువులు పగిలిపోయాయి . ఈ రెండేళ్ళల్లో నాన్న , అమ్మ ఇంకా అందరూ కలిసి నా నిజాయితీ గుర్తించకపోగా , నా తప్పేమీ లేకపోయినా నాకు బోలెడేసి శిక్షలు విధించేసారు . అర్ధం చేసుకోటం రానివాళ్ళు బామ్మలా నన్ను ముద్దు చెయ్యాలేగానీ , శిక్షలు విధిస్తారా ? అందుకే వీళ్ళ జట్టులో నేను ఎప్పుడూ లేను . అలా అలా కుంచెం కుంచెం నేనూ , బామ్మ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట . ఇంట్లో అందరూ బామ్మ పెద్దగా చదువుకోలేదంటారు . నేనామాటే అడిగేసా బామ్మని , నాకేం భయం . అవున్రా భడవా , అది నిజమే అని బామ్మ చెప్పింది . అయితేనేం చదువుకోపోయినా బామ్మకి బోలెడంత తెలివి ఉంది , ఎంతంటే మా ఇంట్లో ఇంకెవ్వరికీ లేనంత . అప్పుడే మళ్ళీ ఓ ప్రతిజ్ణ చేసా , బామ్మ కన్నా ఎక్కువ చదువు చదువుకోనని . కానీ ఇప్పుడు కుంచెం పెద్దాణ్ణి కదా , ఈ ప్రతిజ్ణ అందరికీ అర్ధమైపోయింది . నాన్న కూడా నన్ను పెద్ద ఇంజనీరుని చేస్తా అని ఇంకా పెద్ద ప్రతిజ్ణ చేసి , నా వీపు విమానం మోత మోగించి బళ్ళోకి తోలేసారు . అప్పట్నుంచి ప్రతిజ్ణలు చెయ్యటం మానేసా . ఓ రోజు ఏడవకుండానే బామ్మకి నాన్న టీవీ కొనిచ్చాడు , ఏడిస్తే నాకూ కొనిచ్చాడు ఓ బొమ్మ టీవీ . అది బొమ్మ టీవీ అని తెలిసాక దాన్ని ముక్కలు ముక్కలుగా విరగ్గొట్టి , బామ్మ గదిలో దూరి నిజం టీవీలో బొమ్మలు ఎంచక్కా చూస్తూ ఉండేవాణ్ణి . కానీ బామ్మ ఎప్పుడూ అందులో దూరదర్శను వాడి కార్యక్రమాలు చూస్తూ ఉంటుంది . కానీ హాల్లో ఉన్న పెద్ద టీవీలో అదితప్ప అందరూ అన్నీ చూస్తారు . ఎందుకో తెలిసేది కాదు నాకు . ఓ రోజు ఎప్పుడూ వచ్చే ఆ బట్టతలబ్బాయి బామ్మ టీవీలో కనపడి రేపు బాగా మబ్బులు , జోరున వానలు అని చెప్పాడు . నాకు బోల్డు భయమేసింది . కానీ బామ్మేమో అమ్మని పిలిచి ఒడియాలకి పిండి కలుపవే , ఎండబెట్టాలి , రేపు బాగా ఎండకాస్తుంది అని చెప్పింది . నాకేమో ఏమీ అర్ధం కాలా . మరుసటిరోజు రోజు బామ్మ చెప్పినట్లే నిజ్జంగా అస్సలు వానే లేదు . నిజంగా మా బామ్మకి ఎంత తెలివో . మా బామ్మని మోసం చేద్దామనుకున్న ఆ బట్టతలబ్బాయంటే ఆ రోజు నుంచి నాకు బోలెడంత కోపం . కానీ బామ్మ తెలివి ఏమిటో వాడికి తెలిస్తే కదా . ఆ రోజు నుంచి వాడెప్పుడు టీవీలో కనిపించినా , టీవీ కట్టేస్తూ ఉంటా . మళ్ళీ ఓ రోజు నన్ను మోసం చెయ్యటానికి దొంగ జుట్టు పెట్టుకుని వచ్చాడు ఆ బట్టతలబ్బాయ్ . అయితేనేం బామ్మ తెలివే నాకూ వచ్చింది . వాడిని గుర్తుపట్టి టీవీ కట్టేసా . ఎందుకంటే మోసం చెయ్యటం నేరం , మోసగాళ్ళ మాటలు వినకూడదని అని బామ్మే చెప్పింది కాబట్టి . ఓ రోజు బామ్మకి , అమ్మకి గొడవొచ్చింది . ఎలాగంటే , మా అక్కమో వాళ్ళ బుక్కులో వృద్ధనారీ పతివ్రత , వృద్ధనారీ పతివ్రత . . . అంటూ ఏదో పద్యం చదువుతోందిట . బామ్మకి అది నచ్చి మళ్ళీమళ్ళీ గట్టిగా చదివించుకుందిట , కానీ అమ్మకేమో అది నచ్చలేదుట . అమ్మకి కోపం వచ్చింది . నాకేమీ అర్ధం కాలా . మా కిట్టుమామయ్య దగ్గరికెళ్ళి అడిగా , వృద్ధనారీ పతివ్రత అంటే ఏంటి మామయ్యా అని . అప్పుడు కిట్టు మామయ్య అన్నాడు , దాని అర్ధం బామ్మలాంటి వాళ్ళు పనిమంతులు అని . అదా సంగతి , అందుకా అమ్మకి కోపం వచ్చింది . . . అమ్మ కూడా బోలెడు పనిచేస్తుంది రోజూ . కానీ బామ్మంత కాదు . అసలు నన్నడిగితే , మా బామ్మకన్నా ఈ ప్రపంచంలో ఎక్కువ పని చేసే వాళ్ళుండనే ఉండరు . కిట్టుమామయ్య మాట నిజమో కాదో తేల్చుకుందామని వెంటనే పక్క గోడ దగ్గరికెళ్ళి నా ఫ్రెండ్ సుబ్బలక్ష్మిని పిలిచా . సుబ్బి , సుబ్బి . . నీకో చెగోడీ ఇస్తా , నాకో పని చేస్తావా అనడిగా . అదేమో నువ్వు ముందు చెగోడీ ఇస్తే చేస్తా అంది . సరే అని చెగోడీ ఇస్తే . . దొంగ సుబ్బి , చెగోడీ తినేసి పారిపోయింది . నాకు బోలెడు కోపం వచ్చేసింది . కిట్టుమామయ్య నిజం చెప్పాడు , బామ్మలే పతివ్రతలు , మిగతా చిన్నినారులు , కుర్రనారులు అసలు పతివ్రతలు కానేకారు . బామ్మ పాటలు పాడటంలో కూడా ఫస్టే . నన్నెవరన్నా కోప్పడినప్పుడల్లా బామ్మ ఒళ్ళో అలా వెళ్ళి పడుకుంటే , లాలీ లాలీ అంటూ జోలపాట పాడటం ఆలస్యం క్షణంలో నిద్రపట్టేసేది . అమ్మకేమో పాటలు పాడటం రాదు . ఎప్పుడూ ఆ స్వాతిముత్యం సినిమాలో లాలీ లాలీ పాటపెట్టి ఆ బుల్లిబాబులా పడుకోమంటుంది , నన్ను వీపుకి కట్టుకోకుండా . ఇంక నాకు నిద్రేమొస్తుంది . అయినా అమ్మకేం తెల్సు , బామ్మ పాటవింటే నాకే కాదు , ఆ స్వాతిముత్యంలో బుల్లిబాబు , బుల్లిబాబు వాళ్ళమ్మ కూడా టక్కున బజ్జోవాల్సిందే అని . బామ్మ నన్ను పది పేర్లతో పిలుస్తుంది . నాకందులో నచ్చినవి సిసీంద్రీ . ఎందుకంటే . దీపావళి టపాకాయల్లో నాకు సిసీంద్రీ అంటే ఇష్టం కాబట్టి . ఇంకా దేవాంతకుడు అని కూడా పిలుస్తుంది అప్పుడప్పుడూ . కానీ నాకది ఇష్టం లేదు , ఎందుకంటే నాకు చిరంజీవి అంటే ఇష్టం లేదు కాబట్టి . నేను పోకిరి అని పిలుచుకోమన్నాగానీ బామ్మకేమో మహేష్ బాబు ఇష్టం లేదుట . అసలు వాడెవడు అంది . ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ వచ్చి బామ్మ మీద యుద్ధం ప్రకటించేసారు . నేనే అందర్నీ ఆపి , బామ్మకి మహేష్ బాబు గురించి నేను చెప్తా అని పంపించేసి బామ్మని రక్షించా . అంతా వెళ్ళాక , బామ్మ నన్నడిగింది ఏరా నాన్నా , ఇంతకీ మహేష్ బాబు ఎవడ్రా అని ? అప్పుడు నేను చెప్పా " ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాకవుతుందో వాడే మహేష్ బాబు " . భయమేసిందో ఏమో పాపం , ఆ రోజు నుంచి బామ్మ నన్ను అప్పుడప్పుడూ పోకిరి అనేది .
ఇప్పుడు ఓ మంత్రీ , అతని ప్రియురాలూ , లలిత్ మోడీ అనే ఐ పీ ఎల్ అధ్యక్షుడూ - - ఇలా వొకళ్ళ గుట్టు వొకళ్ళు బయటపెట్టుకుంటుంటే , ' అయ్యబాబోయ్ ! మనీ లాండరింగ్ ' జరిగిపోయింది అని గుండెలు బాదుకుంటున్నారు .
25 . ఒద్దిరాజు సీతారామచంద్ర రావు వీరు రాఘవ రంగారావు గారి సోదరులు . ఒద్దిరాజు సోదరులు ఉర్దూ , పార్సీ , సంస్కృతం , ఇంగ్లీషు భాషలు తెలిసినవారు . సంగీత , సాహిత్యాల్లో నిష్ణాతులు . వీరి రక్తమూల్యము అనే కథ ప్రసిద్ధి చెందినది . భాష , కథనం , వస్తువు సనాతనమైనవి . ఈయన ఇంకా అదృశ్య వ్యక్తి , నటి మొదలైన కథలు రాశారు .
The Song written by KCR for Jai Bolo Telangana Film : గారడి చేస్తుండ్రు గడిబిడి చేస్తుండ్రు తొండికి దిగుతుండ్రు హాయ్ మొండికి పోతుండ్రు . . . బేమాన్ నాయకులు భేతాళ మాంత్రికులు బాజారున దూకిండ్రు భాగోతం ఆడిండ్రు ఏయ్ . . . ఇరవై యేండ్ల యుద్ధంలోనా పొద్దుపొడిస్తేను ఆయ్ . . . అర్దుమ రాతిరి తెలంగాణా ముద్దుగ వస్తేను నోటికాడికి వచ్చిన ముద్దకు అడ్డం పడుతుండ్రు అరెరె నాతి ముచ్చుల నాటకాలకు పరదా తీస్తుండ్రు గారడి చేస్తుండ్రు . . . . ఈ క్రింది లింక్ లో వినండి : Garadi
మాది మరణాంతక జీవన సమరం గానీ మీ ఉద్యమం నిజంగా గొప్పింటి పెళ్ళిలాగే ఉంది మీరలిగితే పెళ్ళి అలకలాగుంది మీరు ఫర్నిచరో పాలకేంద్రమో తగులబెడితే బాణాసంచా కాల్చినట్టున్నది మీరు ' బంద్ ' చేస్తే దొరఇంట్లో పెళ్ళి ఊరికంతా పెళ్ళిలాగున్నది
థీం ప్రకారం నిజానికి ఇది spirit of cricket పాట కానీ cheerup song to India కాదు . అయినా కొన్ని cheerup song అంశాలు చొప్పించడం జరిగింది లిరిక్‌లో . " ఈ సారి అయినా వరల్డ్ కప్ సొంతమవ్వాలి , నవతా యువతా ఉన్న మన జట్టు చరిత్ర సృష్టిస్తుంది " అని రాసిన వాక్యాలు ఈ రోజు నిజమవ్వడం మంచి అనుభూతిని మిగిల్చింది . టైం లేకపోవడం వల్ల 3 - 4 గంటల్లో రాసిన ఈ పాట లిరికల్‌గా గొప్పది కాకపోయినా 2011 world cup విజయం వల్ల నాకు కొంత ప్రత్యేకమైనది . భారత్ క్రికెట్ జట్టుకి , యావద్భారత క్రికెట్ అభిమానులకీ అభినందనలు .
ఇన్బం కడల్మట్రు క్కామం అక్తడుంగాల్ తున్బం అదనిఱ్ పెరిదు ( 1166 )
మండలంలో ఇటీవల స్థాఁక ఎంఎల్‌ఏ జోక్యంతో పాత డీలర్లను తొలగించి రేషన్‌షాపులను కొత్తవారికి అప్పగించారు . ఇంతవరకూ పేదలకఁ అందుబాటులో ఉన్న రేషన్‌షాపును ప్రస్తుత డీలర్లు తమ స్వగృహాల్లో ఏర్పాటుచేశారు . దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . తహశీల్దార్ చౌడప్ప దుకాణాలను అందరికీ అందుబాటులో ఉండేలా చూడడంలో విఫలం చెందారనే విమర్శలున్నాయి . ప్రధానంగా రేషన్‌షాపు - 2 పరిధిలోకి మూడు వార్డులు వస్తాయి . గతంలో సరుకఁలు అందజేసిన ఈ వార్డులకఁ కేంద్రంగా ఉండే విధంగా అందుబాటులో ఏర్పాటు చేశారు . ప్రస్తుత డీలర్ సి . వి . సురేంద్ర దుకాణాఁ్న తన ఇంటికి సమీపంలో ఏర్పాటు చేశారు . దీంతో పేదలు సుమారు అరకిలో మీటరు వరకఁ వెళ్లి సరుకఁలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది . ప్రధానంగా మహిళలు , వృద్ధులు దుకాణాలకఁ వెళ్తుంటారు . షాపు నుంచి సరుకఁలు తీసుకెళ్లాలంటే ఆటో బాడుగలు చెల్లించాల్సి ఉంది . దీఁపై తహశీల్దార్‌కఁ ఫిర్యాదు చేయగా ఆయన పట్టీపట్టనట్లుగా వ్యవహరించారు . డీలర్ షాపు బాధ్యత ఆర్‌ఐ చూసుకఁంటారఁ తెలిపారు . ఆయనా డీలర్‌కఁ ఏలాంటి సూచనలు ఇవ్వకపోవడం గమనార్హం . దీంతో లబ్ధిదారులు నేరుగా డీలర్‌నే ప్రశ్నించారు . అందరికీ అందుబాటులో షాపును ఏర్పాటు చేయాలఁ వాదనకఁ దిగారు . ఇందుకఁ స్పందించిన ఆయన తాను బజాజ్ మోటర్‌సైకిల్ డీలర్ అఁ , రేషన్ అమ్ముకఁఁ జీవించాల్సిన పరిస్థితి లేదఁ లబ్దిదారులకఁ సమాధానమించారు . రేషన్‌షాపును మార్చే ప్రసక్తే లేదఁ తెగేసి చెప్పారు . దీంతో లబ్ధిదారులు తహశీల్దార్ వద్ద తేల్చుకఁంటామఁ ఆయనకఁ చెప్పారు . ఁరుద్యోగులకఁ డీలర్‌షిప్ ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ధనవంతుఁ ఇవ్వడం విడ్డూరంగా ఉందఁ స్థాఁకఁలు పేర్కొన్నారు . దీఁపై ఆర్డీఓ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి .
మొదట మేఘం - తరువాత మెరుపు - ఇది కథ . మొదట మెరుపు - తరువాత మేఘం - ఇది కవిత .
" ట్రై చేస్తాను అంకుల్ ! ఒకవేళ కుదరకపోతే సుజాతకి డెలివరీ అయిన వారానికల్లా వస్తాను . లేదంటే దివ్యని పంపిస్తాను . . " ఏం తోచని పరిస్థితి , హరిది .
భవిష్యత్తులో వీటిని ఇతర ప్రాంతాలకి కూడా విస్తరిస్తారట . ఇంకో 12 అదనపు కంట్రోలు రూముల్ని యేర్పరుస్తారట . ఇంకా 5 మొబైల్ వీడియో కెమేరాలని కూడా యేర్పాటు చేసుకొని , ( టీవీ వాళ్లలా ) సంఘటనల్ని చిత్రీకరిస్తారట !
తగవుకు ఫలితం అనుభవించారా ? ఈ సీను యధా తధంగా కట్ చేసి ఏదైనా సినిమాలో పెట్టెయ్యాలండీ రిషీ ! ఇంకా నవ్వాగడం లేదు నాకు !
రాష్ట్ర విభజనపై హెచ్చెమ్ టీవీ వాళ్ళు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ జరుపుతున్న సమావేశాల వరసలోని మరో సమావేశం విజయవాడలో జరిగింది . జనవరి 17 ఆదివారం సాయంత్రం నుండి అర్థరాత్రి దాకా జరిగిన ఈ సమావేశంలో మొత్తమ్మీద ఎక్కువమంది సమైక్యాంధ్రనే బలపరచారు . ఇద్దరు ముగ్గురు మాత్రం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలన్నారు .
దొరలనీకు కనుల నీరు దొరల దీ లొకం మగ దొరల దీ లొకం
తిక్కనగారు నిర్వచనోత్తర రామాయణంలో రావణుడు ఎంతోమంది స్త్రీలను చెరపట్టి , వాళ్లని పుస్పకంలో ఎక్కించుని పోతున్నప్పుడు , వాళ్ల అవస్తఎలా ఉందో వర్ణిస్తూ చెప్పిన పద్యం : తట్టికివచ్చి యిట్టట్టు వోనేరని లేళ్ళవిధంబున లీలయెడలి వలజిక్కి యెక్కడ మెలగంగనేరని చిలుకలచాడ్పున జెన్నుదరిగి మాపున జొరబడి యావలజనలేని మీలచందంబున జాలగుంది యురులలోబడి యెందునరుగంగజాలని నెమిళుల తెరగున గొమరుదక్కి కలయ జూచుచు బలుకంగ నెలగురాక నలగుమేనులతో నెరిదలలు వీడి వెగడుపడి వెల్లనై కడువిన్నబోయి పుష్పకంబుననున్న యప్పొలతులెల్ల " ఈ పద్యంలో చక్కటి శిల్పం ఉంది . సీసపద్యం నాలుగు పాదాలలోనూ వరుసగా లేళ్ళనూ , చిలకలనూ , చేపలనూ , నెమిళ్ళనూ చెప్పారు . తేటగీతిలో చూచుచు , పలుకంగ , ఎలుగురాక , నలగుమేనులతో , నెరితలలు వీడి అనే క్రియలు వాడారు . ఆడువాళ్ల కళ్ళు లేడికళ్ళు , పలుకులు చిలక పలుకులు , మేనికాంతి బేడిసలలాగ మిలమిల లాడుతుంది , శిఖలు నెమిలిపింఛాలు . ఎటూ పోలేని లేళ్ళలాగ బెదురుచూపులు చూస్తూ , వలలో చిక్కిన చిలుకలలాగ నోట మాటరాక , చెపలలాగ తప్పించుకోలేని మేనులతో , పింఛాలు వాలిన నెమిళ్ళలాగ ఆ జవరాళ్ళు ఉన్నారనడంలో మంచి కల్పన ఉంది . కవి సమయానికి కట్టుబడుతూ సందర్భోచితంగా వర్ణించడం జరిగింది - తిక్కనా , మరి మజాకా ? ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో ఉంది ఈ పద్యం .
బాగుంది మీ ట్రిప్ . . . పెళ్ళికొడుకు ని గైడ్ గా భలేగా కుదిర్చారే . : ) ఫోటోలు కూడా బాగా వచ్చాయి .
అని ఆయన అన్నరు . కాళోజీ ఆధ్వర్యంల వరంగల్లుల తెలంగాణా విమోచనోద్యమ సమితి సదస్సు జరిగింది . ఆ సదస్సు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని , రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని తీర్మానాలు చేసింది . మరునాడు వరంగల్ , నిజామాబాద్‌లల్ల పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినై . వరంగల్లుల ఆంధ్రా ప్రాంతంవారి దుకాణాలను , మిల్లులను ప్రజలు అగ్నికి ఆహుతిచ్చినారు . గ్రామాలల్ల వారి క్యాంపులపై దాడులు జరిగినై . 1956 విలీనానికి ముందే ఎక్కువగా వలసలు జరిగిన జిల్లాలు ఇవే .
ముందుగా కోస్తా ప్రాంతం నుండి వచ్చిన ఎమ్ . సి . దాస్ , ( విజిటింగ్ ప్రొఫెసరు , కృష్ణా యూనివర్సిటీ ) మాట్టాడాడు . ఆయన చరిత్ర గురించి మాట్టాడాడు . తెలంగాణ సాయుధ పోరాటం నిజాము వ్యతిరేకంగా మాత్రమే కాదు , జాతి ఏకీకరణ కోసం కూడానని ఆయన చెప్పినపుడు సభ్యులు గోల చేసి ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు . రామచంద్రమూర్తి జోక్యం చేసుకుని శాంతపరచేందుకు ప్రయత్నం చేసాడు . తిరుపతిలో ప్రకాష్ గారిని , విశాఖలో హరగోపాలును , విజయవాడలో వేణుగోపాలును అడ్డుకోలేదు . ఇక్కడ మనం అడ్డుకుంటే , ఆయా ప్రాంతాల ప్రజలు మన గురించి ఏమనుకుంటారు ? అని అడిగాడు .
నిత్యం ప్రజలతో మమేకమవుతూ , వారి సమస్యలకు పరిష్కారం చూపే దిశలో తీరిక లేకపోయినప్పటికీ ఈ రాజకీయ సాహితీవేత్తలు విలువైన సాహిత్యాన్ని కథ , నవల , కవిత్వం , పాటలు , బుర్రకథలు రూపంలో సృజించారు . చాలా సందర్భాల్లో ప్రజా , రాజకీయ సంబంధాలు వారి సాహిత్యాన్ని మెరుగు పరిచాయంటే అతిశయోక్తి కాదు . తెలంగాణ సాహిత్యానికి తమ రచనల ద్వారా విశిష్టమైన స్థానాన్ని కల్పించిన బూర్గుల రామకృష్ణారావు , సురవరం ఇద్దరూ తొలి శాసనసభకు మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఎన్నికయ్యారు . కృష్ణ శతకము , కరుణాలహరి , లక్ష్మీలహరి , పండిత రాజ పంచామృతమ్ లాంటి ఎన్నో పుస్తకాలను బూర్గుల వెలువరించారు .
నా పేరు : లలిత . నా e - mail : lalithag @ rocketmail . com లేదా lalithag . godavari @ gmail . com ఊరు : New Jersey వ్యవసాయం : ఒకప్పుడు Software Engineer . ఇప్పుడు గృహిణిని . interests : చదవడం , రాయడం , పాటలు , సంగీతం వినడం . ఈ ఇష్టాలలో ప్రస్తుతం చదవడం , రాయడం ఎక్కువ సాగుతోంది . నేను చదివేది కూడ ప్రస్తుతం కూడలి చుట్టూనే ఉంటొంది . ఇక్కడ జరిగే చర్చలు , విషయాలని బట్టి కొన్ని పుస్తకాలను ఎంచుకొని నేను చదివే పరిధిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను . మా వారు software లోనే ఉన్నారు . ఆయన ప్రోత్సాహం తోనే నాకు అతి ఇష్టమైన పనికి మంచి రూపు ఇవ్వగలుగుతున్నాను . తెలుగు4కిడ్స్ కి పేరు చూచించడం , website ని మొదలు పెట్టి , మొట్ట మొదటి పరిచయం రాసి ఇవ్వడం ఆయనే చేసారు . http : / / www . telugu4kids . com / అంతకు ముందు కూడా నేను చేసిన projects ఆయనకి నచ్చడం వల్లే నాకు నమ్మకం పెరిగింది . తన సొంత website లో నాకు స్థలం ఇచ్చి telugu4kids ఏర్పడక ముందే కొన్ని నెలలు నా projects ని అంతర్జాలానికి పరిచయం చేసారు . నాకు ఈ విషయంలో కావలిసిన సాంకేతిక సహాయమే కాక ఇతరత్రా సూచనలు కూడా ఇస్తుంటారు . ఉదాహరణకి " తార " పేరు కూడా ఆయన సూచనే . కొన్ని విషయాలను ఒక చిన్న అమ్మాయి పాత్ర ద్వారా ఒక series లా పరిచయం చేద్దామనుకుని పేరు సూచించమంటే ఆయన " తార " ను సూచించారు .
శివరంజని పేరు బాగానే వుంది కదా , ఏమైంది ? ఐనా ఈ కాలం పిల్లలకి అమ్మానాన్నలను ఏదైనా అనక పోతే తోచదు సుమీ .
మీ టపాని / ఇక్కడి వ్యాఖ్యలని అర్థంచేసుకునే ప్రయత్నంలో కొన్ని ప్రశ్నలు : పాత సినిమాలలో ఎంత శాతం అసభ్యత , హింస ఉంది ? ఇప్పటి సినిమాలలో ఎంత ఉంది ? వినోదం అంటే ఏమిటి ? ప్రజలను ఆకర్షించే so called formula తో తీసే సినిమాలలో ఎన్ని విజయ వంతం ( వ్యాపార దృష్ట్యా ) అవుతున్నాయి ? మార్పు సహజమే . మార్పు అభ్యంతరకరం అయితే మాట్లాడ కూడదా ? కళా పోషణ అంటే ప్రతి ఒక్కరూ కూచిపూడికి వెళ్ళి కూచిపూడి నృత్యం నేర్చుకోవడమా ? ఈ మాసు అంటే ఏమిటి ? వారిని ఎవరు define చేశారు ? వారి అభిరుచులని ఎవరు సేకరించారు ? హిట్టయిన సినిమాలో ఉన్న level of అసభ్యత మరియు హింసయా వారి అభిరుచి కొల మానాలు ? చిన్న పిల్లలు candies ఇష్ట పడతారు . దానికి మోతాదు నిర్ణయించక్కర లేదా ? ఎక్కువ తింటే పళ్ళు పాడయి పోవా ? ఈ ప్రశ్నలు నా ఆలోచనలకు పదును పెట్టుకోవడానికి , నాణేనికి రెండో వైపు చూడడానికి చేసే ప్రయత్నం అని అర్థం చేసుకోగలరు .
నా అన్ని బ్లాగుల్లోనూ చాలామందిని ' వాడు , వీడు ' అన్నాను . వీడి వ్యాఖ్య లో క్లారిటీ కోసం , ' వెధవలు ' అనికూడా తిట్టాను . అయినా వెర్రివాగుడు వాగాడుగానీ , సమాధానం లేదు . నదిలో దూకాలనే అనిపించిందని వొప్పుకున్నాడంటే , యెంత డిప్రెషన్లో వున్నాడో చూడండి !
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో రాయలసీమ శాసనసభ్యులు రాజధాని విషయంలో శ్రీబాగ్ ఒడంబడిక ను పాటించాలని కోరారు . ఆచార్య రంగా నాయకత్వంలోని కృషిక్ లోక్‌పార్టీ తిరుపతిని ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా చేయాలని కోరారు . కమ్యూనిష్టులు విజయవాడను రాజధానిగా చేయాలని కోరారు . చివరకు కర్నూలును ఆంధ్ర రాష్ట్ర తాత్కాలిక రాజధానిగా అందరూ ఒప్పుకున్నారు .
పత్రికల్లో పాఠకుల జీవిత సమస్యలకి సమాధానాలిచ్చే పెద్ద జోతిష్కులెవరైనా ఈ వ్యాసాలు చదివి చర్చ జరిపితే బాగుంటుంది .
ఎన్నో అవరోధాల్ని ఎదుర్కొని , విజయ శిఖరాల్ని అధిరోహించిన నటీనటులు గానీ , సాంకేతిక నిపుణులు గానీ తమ వారసుల్ని ప్రమోట్ చేసుకొంటున్నారే తప్ప ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పటు దిశగా ఎటువంటి ప్రయత్నం గానీ , ప్రభుత్వం పై ఒత్తిడీ గానీ తీసుకురావడం జరగలేదు .
సతీష్ చెప్పింది రైటే ; రిజర్వేషన్ ఇంకా చాలా కాలం ఉండాలి . కాకపోతే : 1 . ఈ రిజవ్వేషన్ శాతం పెరిగి పోతూ ఉంటే , ప్రతిభ కి మిగిలిన రిజర్వ్ తగ్గుతుంది . దాని వల్ల మళ్ళా ఇంబాలెన్స్ వస్తుంది . రిజర్వేషన్లు అమలులో ఉండే చోట , ప్రతిభ తగ్గిపోయే అవకాశమున్నందున్న , అలా జరగకుండా ఉండే విధంగా కొన్ని ఆలోచనలు చేయాలి ; జాగ్రత్తలు తీసుకోవాలి ( ప్రభుత్వలే లెండి ) 2 . నిజానికి ప్రతిభకి కావాల్సింది మరిన్ని అవకాశాలు - ప్రతిభ నిరూపించుకోవాడానికి , సంపాదించుకోవడానికి , ఎదగటానికి - ఇక్కడ కూడా ఇంబాలెన్స్ ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు . ప్రభుత్వాలు రిజవ్వేషన్ లు పెంచినంత వేగంగా ప్రతిభ కి అవకాశాలు పెంచలేదు . దీని వల్లే వేరే రకమైన ఫ్రస్ట్రేషన్ అభివృద్ది చెందుతుంది . ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నది . చాలా అవకాసాలు ఉన్నాయి ; కానీ , మన విద్యావిధనంలోని లోపల వల్ల , బోళ్డు సేల్స్ జాబ్స్ పుట్టాయి , అంతే ! పాశ్చాత్యంలో కూడా అంతేటలెండి ; నిజానికి మనంత చదువు కూడా అబ్బక , వాళ్ళకి ఉద్యోగాలు చాలా కష్టం ( క్రింద / మధ్య వర్గాల్లో ) . 3 . ఏది ఏమైనా , వెనక బడ్డ వాళ్ళని ముందుకు తీసుకు రావటం అంటే అర్ధం , ముందున్న వాళ్ళన్ని ఎదగనీకుండా ఆపటం , లేక వాళ్ళని వెనక్కి తోసేయడం కాదన్నది క్లియర్ గా స్టేట్ చేసుకొని ఆలోచిస్తే అభివృద్ధి మెరుగుగా ఉంటుంది . రిజర్వేషన్లు ఓ రెండు తరాలకో , ఓ తరానికో పొందిన వాళ్ళు స్వచ్చందంగా దాన్ని వదులుకొని మిగిలిన తమ వర్గం వారికి చేయూతనివ్వాలని కోరుకున్న వ్యక్తులూ నాకు తెలుసు . ఇలాంటి వాలంటరీ నెస్ ని కనీసం గుర్తించి , అభినందించటం చేయాలి . మన లెక్కల్లో సైతం , ఇలా వదులుకుంటున్నది ఇంత మంది అనేది పరిగణలో ఉంచుకోవాలి . లేకపోతే , ప్రతిభలో పోటీ పడుతున్న మనుషులు ఎక్కువ ఔతుంటారు ; రిజర్వేషన్లో మనుషుల నాణ్యత - ఆయా వర్గాలకి న్యాయం చేయడం అటుంచి , మొత్తం వ్యవస్థకే చేటు ఔతుంది . ఎందుకంటే , అప్పుడు పరిస్థితి " ప్రతిభ లేని వారికే పట్టం తొందరగా వస్తుంది " అనిపించవచ్చు . ఇప్పుడు ఆ పరిస్థితి ఇంకా రాలేదు ; కానీ వచ్చింది అని తెలుసుకోవటానికి , రిజర్వేషన్ ల వాడకం , స్వచ్చందగా వదులుకొంటున్న వారి గణనం అవసరమేమో అని నా అభిప్రాయం . ప్రభుత్వంలో ప్రతిభ ఉంది అనేది కూడా లెక్కల్లో తెలియటం అవసరం - ఈ వాక్యం అర్ధం " రిజర్వేషన్ లో వచ్చిన వారికి ప్రతిభ ఉండదు " అని కాదు . అలా వచ్చిన వారు , మేమిప్పుడు ప్రతిభావంతలము - మమ్మల్ని అలా గుర్తించండి అనే ఆత్మవిశ్వాసాన్ని , పనిలోనూ , లెక్కల్లోనూ చూపించడం . అందుకని స్వచ్చంద విరమణలని లెక్కపెట్టుకోవాలి . ఏది ప్రతిభ అనేది చాలా పెద్ద ప్రశ్న . దానికంటే , రిజర్వేషన్ ఉంచుకోవటం చాలా ఈజీ ! ప్రతిభకి పట్టం కట్టే ప్రైవేటు రంగంలో దేన్ని ప్రతిభ అంటారో మీకు తెలుసా ! ?
యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నేతలను పంచెలూడేదాక పరిగెత్తించాలని , రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా తరిమి తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు . కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ రాజ్యం - దొంగల రాజ్యం , ప్రతి కాంగ్రెస్ నాయకుడికీ దుర్మార్గపు క్రిమినల్ చరిత్ర ఉంది . . దోచుకుతింటున్నారు . . ఎంతకాలం ఈ దోపిడీని చూస్తూ ఉంటాం . . అంటూ వారిపై తీవ్ర పద జాలంతో విరుచుకుపడ్డారు . ' యువజనులతో ఉత్తమ సమాజ నిర్మాణం ' పేరిట మంగళవారం ధర్నాచౌక్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు . వైఎస్ హావభావాల్ని అభినయిస్తూ ఆవేశపూరితంగా మాట్లాడారు . భీమ్‌రావుబాడలో ఇళ్ల కూల్చివేత ను నిరసిస్తూ , కాంగ్రెస్ ప్రభుత్వంలో పెరిగిపోతున్న అవినీతిని వ్యతిరేకిస్తూ మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు . గొంతెత్తలేని వారిపై దాడి చేయడం . . వాళ్ల ఆస్తులను దోచుకోవడమే కాంగ్రెస్ వారిపని . . బీదలను రోడ్డున పడేసి మానవహారం చేస్తారు . . రైతుబంధు ప్రభుత్వమట . . సెజ్‌లు పెట్టి తిండికి కూడా లేకుండా చేసి రైతులను రోడ్డున పడేశారు . . వీరి దోపిడీని ఎన్నాళ్లు చూస్తాం . . మనం తిరగబడితే పంచెలూడిపోయేలా రాష్ట్రం నుంచి దేశం నుంచే పారిపోతారు . . ' అంటూ ఆయన ఆవేశంగా ప్రసంగించారు . ' భీమ్‌రావుబాడలో ఇళ్ళు కూల్చివేసిన మరుసటి రోజు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మానవహారంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ నవ్వుతూ పాల్గొనడం సిగ్గుచేటు . దేశసమైక్యత కోసం గానీ , ఉగ్రవాద నిర్మూలన కోసం గానీ ఈ మానవహారం నిర్వహించలేదు . జైపాల్‌రెడ్డి సామాన్యులకు అర్థంకాని ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతూ ఢిల్లీలో వైస్‌ను తిడుతూనే అవినీతిలో చేతులు కలుపుతారు . వక్ఫ్‌బోర్డు భూములను అమ్మి ముస్లింలను రోడ్డు పాలు చేసిన ఘనత షబ్బీర్ అలీకే దక్కుతుంది . ఈయన బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి . . . దేశంలో బాంబుపేలుళ్లు జరిపిన ఐఎస్‌ఐ తీవ్రవాది ఇంటికి వెళ్ళి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు . ఇక టి . సుబ్బిరామిరెడ్డి భక్తుడు . నిత్యం వైజాగ్ బీచ్‌లో ఓం నమః శివాయ సర్వేజనా సుఖినోభవంతు అంటూ బాహాటంగా ప్రార్థనలు చేస్తూనే . . . సర్వేజనా దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఉండటం సిగ్గుచేటు . ఈ విధంగా చెప్పుకుంటే పోతే ప్రతి కాంగ్రెస్ నాయకుడికీ దేశద్రోహ చరిత్ర ఉంది ' అంటూ మండిపడ్డారు . కాంగ్రెస్ పార్టీ వద్ద వేలకోట్ల రూపాయలు , వేల ఎకరాల స్థలం ఉన్నప్పటికీ . . . అనేక సంవత్సరాలుగా పేదలు నివసించే భీంరావుబాడను పార్టీ కార్యాలయం కోసం కబ్జా చేశారని విమర్శించారు . ' వైఎస్ ఎన్నికల ముందు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు . అధికారంలోకి వచ్చాక సెజ్‌ల పేరుతో రైతుల నుంచి భూములు లాక్కొని వారికి అన్యాయం చేస్తున్నారు . తెలంగాణ ఇస్తామని చెప్పి . . . నాలుగున్నరేళ్లుగా అదిగో , ఇదిగో అంటూ తెలంగాణకు వెన్నుపోటు పొడిచారు . శాంతి చర్చల పేరిట పిలిచి 80 మంది నక్సలైట్లను ఎన్‌కౌంటర్ చేశారు ' అని విమర్శించారు . ఈ ప్రభుత్వ దౌర్జన్యాన్ని ప్రరాపా కార్యకర్తలు వాడవాడలా వివరించాలి . కాంగ్రెస్‌ను గద్దె దించేంతరకూ పనిచేయాలి . సుస్థిర పాలనకోసం చిరంజీవిని గెలిపించాలి అంటూ ప్రజలను కోరారు .
మనం దేన్ని వదిలేయాలో దాన్నే ఎక్కువ పట్టుకుని వేళాడుతాం . " అంటరానితనం అమానుషం . " కానీ ఈ మటలని చిన్నప్పుడు బళ్ళో చెప్పిన అయ్యోరే తన ఇంటికి అంటరాని పిల్లలని రానీరు . రానిస్తే అంటు సోకుతుందని భయం .
తనను సింహాసనం మీదినించి కిందికి లాగే మొనగాడు ఒకడు భూమి మీద వున్నాడని తెలిసిన మరుక్షణం చక్రవర్తి మొఖంలో ఎలాంటి మార్పు వస్తుందో ఊహించుకునేసరికి పచ్చని వేపాకులు కొన్ని నమిలినట్టు పరమ చేదుగా తయారయింది వార్షికుడి నోరు .
పుస్తకం లో కూడా బోల్డు రాజకీయాలున్నాయి ! అందుకేనేమో తన్ హాయీ మీద బ్లాగర్ భాను రాసిన వ్యాసాన్ని ప్రచురించి , వెంటనే తొలగించారు . ప్రచురిస్తున్న సంగతీ , తొలగిస్తున్న సంగతీ కనీసం సీరియల్ రచయిత్రికి తెలుసో తెలిపారో లేదో మరి ! వాళ్లకెప్పుడూ మెచ్చుకోలు సమీక్షలే కావాలి . విమర్శ జోలికెళితే వచ్చే కామెంట్లను తట్టుకునే దమ్ము లేదు . ఇంతకు ముందు కూడా ఇది రుజువైంది . అందుకే సమీక్ష అనకౌండా పరిచయాలు , అనుభవాలు , దృక్కోణాలు అంటూ వాళ్ల వ్యాసాలకు బహు నామాలు ఆపాదించారు . దేన్ని ఏమనాలో క్లారిటీ లేక !
ఇదొక మెసేజ్ ఓరియంటెడ్ రియల్ లైఫ్ కామెడి ట్రాజెడి థ్రిల్లర్ మూవి . మీకు ఇలాంటి సినిమాలు నచ్చకపోతే మీ బ్యాడ్ లక్ నేనేమి చేయలేను . అవి మేము పవర్ పులిని చూసి వాతలు పెట్టించుకున్న రోజులు . అందుకు ఎలాగైనా పగ ప్రతీకారం తిర్చుకోవాలని , పోగొట్టుకున్నచోటే వెతుక్కొవాలని తహతహలాడిపోతున్న రోజులు . సరిగ్గా అదే సమయంలో ఒకానొక రోజు తలైవార్ రజిని సినిమా వస్తుందని తెలిసి మంచి ఛాన్స్ వచ్చిందని మా ఫ్రెండ్స్ దగ్గర డిస్కషన్ మొదలుపెట్టా . .
ఏనికవంటి సానువు గణేశుని నున్నని బొజ్జ మీద కా లూనగలేదు తుమ్మెద తదుజ్వ్జల శిల్ప మఖండ తుంగభ ద్రానది కప్పగించుకొని దద్దమలైన తెలుంగువారి వి ద్యానగరాన చిందుమొక యశ్రుకణంబు నుపాయనంబుగన్
ఈ వివరాలన్నీ నేను రాసే పద్ధతిని గురించి . కాని పద్ధతులన్నీ ఏదో ఒక గమ్యం కోసం వేసుకున్న తోవలు . నా పద్ధతులకి గమ్యం , నా రాతలకి పరమార్ధం ఏమిటి ? ఈ చిక్కు ప్రశ్నకి సమాధానం చెప్పటానికి ప్రయత్నం చేస్తాను . ముందుగా , రచయితగా నా జీవిత కాలం డబ్భై ఒక్క సంవత్సరాలు . చరిత్రలోనే మిక్కిలి పొడుగైన సాహితీ వ్యాసంగం నాది . ఈ డబ్భయ్యొక్క సంవత్సరాల్లోనూ పధ్నాలుగు పుస్తకాలు రాసేను , ఇంగ్లీష్ లోనూ , బెంగాలీ లోనూ . ఇంకా , వందలకొద్దీ వ్యాసాలు , రేడియో ప్రసంగాలూ రాసేను . రచయిత కంటే ఎక్కువగా పాత్రికేయుణ్ణా అనీ అనిపిస్తుంది . ఇదంతా ఎందుకు ? ఏ ప్రయోజనం కోసం ? నా దేశ ప్రజలు ఈ ప్రశ్నకి వాళ్ళ సమాధానం ఏమిటో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పనే చెప్పేరు . వాళ్ళ దృష్టిలో నేను , జీవితంలో ఓడిపోయి , నిరాశ పడి , ఆ దేశం మీద కక్ష కట్టి , వాళ్ళనీ , వాళ్ళ జీవితాల్నీ , సంస్కృతినీ , నాగరికతనీ వెక్కిరించటం కోసమే రచనలు చేసేను . ఈ మాటే రక రకాలుగా అన్నారు . వాళ్ళు అన్న ముక్క నేనెప్పుడూ వాచా ఖండించలేదు .
తయ్యబ్ మెహతా , రజా , సౌజా , సతీష్ గుజ్రాల్ లాంటి దిగ్గజాల సరసన చేరిన హుస్సేన్ ఇంటికి తిరిగి రాలేక ఎక్కడో తనువు చాలించడం భారతీయులకు విచారకరమైన విషయమే . ఆయనకు నివాళిగా కొన్ని చిత్రాలు ముద్రిస్తున్నాం .
నమస్తే ! తెలుగు వార్తా ప్రపంచంలో ఎన్నో పత్రికలు , ఎన్నో చానల్స్ , ఎన్నో వెబ్ సైట్స్ , కేబుల్ నెట్ వర్క్స్ , ప్రసార , ప్రచార సాధనాలున్నాయి . అయితే యివన్నీ ఒక్కో రంగానికి సంబంధించి ఒక్కొక్కటి ఎంచుకొని , అందుకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి . ఐతే ఈ సేవ కు అన్ని రంగాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో సకల సేవలు అందించాలన్నదే లక్ష్యం . ప్రధానంగా " సేవ " లో రాజకీయ , విద్య , వైద్య , విజ్ఞాన , వాణిజ్య , ఆధ్యాత్మిక , క్రీడా , సాహిత్య , సాంస్కృతిక , కళా , సినీ , మహిళా రంగాలకు సంబంధించి వివిధ సేవలు అందించాలనుకున్నాం . ఆ బాటలోనే సేవ పయినిస్తుంది . ఇందు లో భాగమే మహిళా సేవ . పదండి ముందుకు . . పదండి ముందు . . నేను సైతం నారీనై . . అంటూ ముందడుగు వేసాం . మహిళాసేవ లోను , మా ( మీ ) సేవ లైవ్ లోను మీకు ఎలాంటి సేవలుండాలో చెపితే వాటిని అందించడానికి కృషిచేస్తాం . మార్పులు ఏమేమి చేయాలి , ఎలాంటివి వుండాలి … మీరు ఈ సేవ లో ఏమి కోరుకుంటున్నారో తెలియజేయండి . మంచి ఆలోచనకు " సేవ " ఎల్ల వేళలా శ్రీకారం చుడుతూనే వుంటుంది . మీ అమూల్య అభిప్రాయాలే ' సేవ ' కు స్వాతి ముత్యాలు … . అవే అమూల్య కానుకలు . ఆదరించండి … ఆశీర్వదించండి … మీ ఆదరాభిమానాలను కోరుకొంటూ … . సదా సేవలో … మీ సంపాదకులు , మహిళాసేవ విభాగం , " సేవ " తెలుగు పత్రిక . sevaonlive @ gmail . com తంతి : 9492666660 మహిళాసేవ విభాగం : mahilaseva @ hotmail . com
ఈ ఉపోధ్ఘాతం వల్ల మీరు గమనించ వలసినది ఏమిటంటే , నాకు , ప్రబుత్వ విధ్యాలయాలకీ అవినాభావ సంభంధం ఉంది అని . అందువల్ల , ప్రభుత్వ విధ్యాలయాల మీద ఒకింత ఎక్కువ గౌరవం ఉందనే చెప్పవచ్చు . ఎందరో అనుకునేటట్లు , " ప్రభుత్వ విధ్యాలయాలలో చదువు " , వానాకాలం చదువులా కాకుండా , చదువుకునే వాడి . . చదువు కొనే వాడికి ఉన్నంత తేడా ఉంటుందనేది నా అభిప్రాయం . ప్రభుత్వాలు మనకు అన్ని వసతులూ కల్పిస్తున్నాయి , కానీ మనమే వాటిని ఉపయోగించు కోవటం లేదు అని నా అభిప్రాయం . ఇక్కడ ప్రభుత్వం అంటే , కాంగ్రేస్ అనో . . తెలుగు దేశం అనో . . లేక మరోక పార్టీ అని కాదు నా అభిప్రాయం . పార్టీ ఏదైనా , మౌళిక సదుపాయాలు సమకూర్చే యంత్రాంగం అని నా అభిప్రాయం .
కవిత్వంలో సెంటిమెంటాలిటీ ఉండకూడదనే విషయంలో ఆయనకి పట్టుదల ఎక్కువ . ఇదికొంత భిన్నమైన ధోరణి . ఎందుకంటే , సెంటిమెంటనేది మన సాహిత్యంలో చాలా కీలకమైన అంశమైపోయింది . మన కధలు , నవలలు , నాటకాలు , సినిమాలు వీటన్నింటిలోనూ సెంటిమెంటొక జనరంజక సాధనం . విప్లవ కవిత్వంలో మృతవీరుల సంస్మరణార్థం రాసే పద్యాలలో కూడా కొన్ని సార్లు ఇది చోటుచేసుకొవటం కద్దు . కాని ఇస్మాయిల్ గారు సెంటిమెంటు నంగీకరించరు . కవిత్వం ఇంకా పబలపష షపలషబదబlబసబపషకి థవవపథl చెయ్యాలనేది ఆయన ఉద్దేశ్యం కావచ్చు .
ఏ రాగానికైనా ఆరొహణలోకాని , అవరోహణలో కాని కనీసం ఐదు స్వరాలకి తక్కువ కాకుండా రాగాన్ని నిర్వచిస్తారు . అయితే , సంగీతంలో భావం లేకుండా , స్వరాలు మాత్రం నిర్దుష్టంగా పలికించినంత మాత్రాన రాగ స్వరూపాన్ని తెలియ చెప్పలేరు . అందుకే , రాగం యొక్క భావాన్ని నరనరాల్లోనూ జీర్ణించుకొంటే తప్ప , రాగ స్వరూపం అర్ధం కాదు . కొత్తగా సంగీతం మీద అభిరుచి పెంచుకొనేవారికి అందుకే రాగం అర్ధం కావటానికి సమయం పడుతుంది . సంగీతంపై అభిమానం , అభిరుచి ఉన్నవారు , వీలు కలగ జేసుకొని ప్రఖ్యాత సంగీత విద్వాంసుల కచ్చేరీకి వెళ్ళి వినటం చూస్తే , సంగీతం గురించి తెలియని వారికి అదొక వేలం వెర్రిలా అనిపిస్తుంది కానీ సంగీత ప్రియులకి ఇలా వినటం ఒక అవసరం .
( మూడు పువ్వులు ఆరు కాయలు అనే దానికి ప్రేమికుల ఆపాదన . )
బల్లమీద సీసాలు సర్దుతున్నా సకల చూపులు మాత్రం అడివిలోంచి జనం సంతలోకచ్చే కాలిబాటమీదే ఉన్నాయి .
అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్ళకు చాలు పప్పుబెల్లాలు . . . బ్రంహాండమంతటికీ విజయదశమి శుభాకాంక్షలు . . . భాస్కర్ , హరిత , సూర్యా మరియూ ఓ ( ఈరోజో రేపో విడుదల - అబ్బాయో అమ్మాయో ఇంకా తెలియదు )
కమలాదాస్ రాసిన విషయాలు ఆనాటి మళయాళీ సమాజాన్ని ఓ కుదుపు కుదిపాయి . నిర్భయంగా ఆమె వెల్లడించిన అంశాలను చూసి గగ్గోలు పెట్టే సమాజాన్ని మరింత ఏడిపించాలనే అల్లరి ఆలోచనలు కూడా ఆమె చేసిందా అన్పించేలా ఆమె ఆత్మకథలో ఒక్కో చాప్టర్ కి ఆమె పెట్టిన శీర్షికలు వున్నాయి . బహుశా ఆమె ఆత్మకథను సీరియలైజ్ చేసిన పత్రిక కూడా రెచ్చగొట్టే విధంగ శీర్షికలు పెట్టినట్టు అన్పిస్తుంది . ఎందుకంటే ఆ తర్వాత కాలంలో అవన్నీ ఉత్తుత్తి సంఘటనలే అని ప్రకటించింది కూడా !
రాజకీయ కుటుంబం లో పుట్టటం వరం . చిన్ననాటే తల్లి తండ్రుల పూర్తి ప్రేమకు నోచుకోక పోవటం దురదృష్టం . తల్లి అంత ఆరోగ్యవంతు రాలు కాదు . తండ్రి నిత్యం స్వాతంత్ర్య పోరాటంలో క్షణం తీరక లేకుండా గడిపే మనిషి . . ఇంటినిండా బంధు బలగం , నౌకర్లు చాకర్లు దండిగా ఉన్నా మానసికంగా వంటరి బాల్యాన్ని గడిపిన ఇందిరా ప్రియదర్శిని సహజంగా బిడియస్తురాలు లాగానే ఎదిగినా , అంతులేని ఐశ్వర్య భోగాల మధ్య పెరిగిన కారణంగా ఒక రకమయిన మంకు పట్టు మనస్తత్వం కూడా పెంపొందిచుకుంది అంటారు . ఇందిర జీవితమంతా ఇలా వైవిధ్యాల మధ్య సాగటమే ఒక విచిత్రం .
కామెంట్ గూడా మీ లాగా రాయలంటే కష్టం కానీ . . . మీరు బాగా రాశారు . బాగా చెప్పారు . . . వెతలున్న చోటే కతలుంటాయి .
చెన్నై , బెంగళూరు , మదనపల్లి , తిరుపతుల్లో బాగా తిరిగాము . " పుస్తకం . నెట్ పనులూ . . " అనగానే ఎగాదిగా చూసిన ఇంట్లోవాళ్ళూ , స్నేహితులూ ఇప్పుడు , " సరే . . ఇదో రకం పిచ్చి " అననుకొని " క్షేమంగా వెళ్ళి , లాభంగా రా ! " అంటున్నారు . కొందరేమో , మా బాగోగుల కన్నా , మేం కలవబోయే వారి బాగోగుల గురించి కలవరపడుతూ ఉంటారనుకోండి . ఏ ఊరెళ్ళినా కడుపునిండా తిండి పెట్టి , హాయిగా నిద్రపోవటానికి వీలుగా ఏర్పాట్లు చేయడమే కాక , మా ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని ఎవరెవర్ని కలిస్తే బాగుంటుందో , ఏయే ప్రదేశాలకు వెళ్ళాలో సూచించేవాళ్ళూ … అదృష్టం కాకపోతే ఏమిటిది ?
శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టతో బీడుబారిన ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా సస్యశ్యామలమైపో . ంది . ఆ నాటి శ్రీరాముని పరమపావన పాద స్పర్శతో శిల స్త్రీగా మారితే ఈనాడు ఈ వజ్రకాయుని దివ్య ప్రతిష్టంతో ప్రకృతి పులకించిపచ్చని సిరులతో సొగసుపోయగాల్ని సంతరించుకుంది . ఒకనాడు ఎటుచూసినా బీడుబారి ముళ్లు , రాళ్లతో నిండిన ఈ ప్రదేశం స్వామి రాకతో పచ్చని పంటపొలాలతో , కూరగాయల తోటలతో , పండ్లు , ఫలాల సముదాయంతో మెట్ట ప్రాంతానికి వారధిగా ధనరాశులకు కొలువుగా విలసిల్లుతోంది . అంతేకాదు ఎందరో స్వాతంత్య్రసమర యోధులకు , నాయకులకు , విద్యావంతులకు ప్రసిద్దులకు పుట్టినిల్లుగా మారి భాసిల్లుతోంది . స్వామి ఆంజనేయా నీ పవిత్ర పాద స్పర్శతో పుడమితల్లిని పూలకింపజేసి వికసితమధురదరస్మితను చేశావు . మాకు బుద్ది బలాన్ని , ఆయురారోగ్యాల్ని మనోధైర్యాన్ని ఇచ్చి ఐశ్వర్యవంతుల్ని చేశావు . నీవు ప్రసాదించిన ఆత్మసైర్యమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుందంటూ జంక్షన్ లో భక్తులంతా స్వామి వారిని నిత్యం భక్తి ప్రపత్తులతో కొలుస్తుండటం ఇక్కడ గొప్ప విశేషం .
ఏది సకలాగమాంత పదమై , శుద్ధ ప్రకాశమై , చిద్వేద్యమై , హృద్యమై , శ్రీ భూదేవులకు యింటివెలుగై శోభిల్లుతోందో , అటువంటి " పెంజీకటికవ్వల వెలుగుచున్న " దైవీభూతమ్మగు దానిని ( శ్రీహరిని ) ప్రీతితో దేవతలు వీక్షిస్తున్నారు అని కవి సమయం అయ్యుండచ్చు . . . ( లేదా ) అటువంటి శ్రీహరి ఆశీస్సులు పుష్కలంగా ఉంటే ఈ శతావధానం లో రసజ్ఞత / అనుభూతి " దైవీభూతమ్మగు ! ! " అని ఆశ్వాసన కూడా అయి ఉండవచ్చు . . . . ఏదేమైనా మంచి సమస్యకి తృప్తికరమైన పూరణ . . . . . కామేశ్వరరావు గారూ . . . దోగ్ధ్రీ ధేనువు గురించి పాతపుస్తకాలు వెతికితే ఒకే పద్యం లో రెండు విషయాలు పరిష్కారమయ్యాయి . ( 1 ) ' దోగ్ధ్రీ ధేనువు ' అన్న పదం మాత్రమే ఉందేమో అనుకున్నా . . . కాదు . మొత్తం పాదం కూడా ముమ్మూర్తులా అదే . ( 2 ) ' ర్భ ' కి ' ర్బ ' పొసుగుతుందా అన్న ప్రశ్న కి సమాధానం . గరికపాటి వారే ' దోగ్ధ్రీ ధేనువు ' కి " దృగ్ద్రాక్షా " , " వాగ్ద్రూణంబుల్ " అని వాడారు . శా ! ! దృగ్ద్రాక్షారస మాధురుల్ గుఱియు వాగ్దేవీ ప్రసాదంబదే వాగ్ద్రూణంబులు కుట్టినంత జననీ పాదమ్మె మందౌనుగా , దిగ్ధ్రా ప్రాసము దుష్కరమ్మె కనుమాంధ్రీమాత సంతానమున్ దోగ్ధ్రీధేనువు గర్భమందు పులికందుల్ పుట్టె నుగ్రాకృతిన్ పృచ్చకులు వి . వి . ఆర్ . ఎల్ . నృసింహం గారు అయితే ఆ పూరణా , ఇప్పటి పూరణా ఒకటో కాదో మీరు చెప్పాలి .
8 . తెలుగు4కిడ్స్ - ఇదైతే లలితగారు పిల్లలకోసం రూపొందించారు . నా బ్లాగు లో చక్కటి వ్యాఖ్యల ద్వారా పరిచయమై కనుమరుగైన బ్లాగరు .
" బాబూ … నిన్నటినుంచీ చెబుతున్నాను కదా నాకే గిఫ్ట్ వద్దని . ఎందుకిలా పద్దాకా విసిగిస్తావు ? " అంది శైలజ చిరాకు ధ్వనించే స్వరంతో . ఆపిన వాక్యాన్ని మళ్ళీ అందుకోకపోతే ఎలా వుండేదో కానీ , ఆ వెంటనే " అయినా గిఫ్ట్ లనేవి అడిగితే తెచ్చిచ్చేవి కావు . అడక్కుండానే ప్రేమతో ఇవ్వాల్సినవి " అంది కొంచెం ఆవేశం మేళవించి .
Download XML • Download text