tel-35
tel-35
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
శివాజీ కథానాయకునిగా కిరణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి ' గురుడు ' పేరు నిర్ణయించారు . చందన్ మూవీస్ పతాకంపై సీడీ నాగేంద్ర నిర్మిస్తున్నారు . నిర్మాత వివరిస్తూ . . . కథాంశానికి తగిన టైటిల్ ఇది . తాడిని తన్నేవాడుంటే , తలను తన్నేవాడు ఉంటాడని పెద్దలు చెబుతారు . ఈ సినిమాలో శివాజీ పాత్ర చిత్రణ అలాగే ఉంటుంది . తలపండిన కోటశ్రీనివాసరావును ఎదిరించి తన కార్యాన్ని పూర్తిచేయగలిగే పాత్ర శివాజీది . సరికొత్త నేపథ్యంలో స్క్రీన్‌ప్లేతో థ్రిల్లింగ్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది ' అన్నారు . దర్శకుడు మాట్లాడుతూ , శివాజీది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్ర . ఆయన సరసన రీతూకౌర్ నటిస్తోంది . 10తో టాకీ పూర్తవుతుంది . నెలాఖరులోగా పాటల చిత్రీకరణ పూర్తి చేస్తాం ' అన్నారు . కెమెరా : ఎస్ . మురళీమోహన్‌రెడ్డి , సంగీతం : రాజ్‌కిరణ్ .
అన్న పేరున అనేక గ్రంథాలుగా అనువాదం చేశాడు . ఇతనికి మన ఆంద్రదేశంలోని స్వయంగా పండితులు , పండిత పోషకులైన విజయ నగర మహారాజా ఆనందగజపతి ఆర్థిక సహాయాన్ని అందించారు . మాక్స్ ముల్లర్ 1868లో తన భార్యకు వ్రాసిన ఉత్తరంలో ' ' ఒ ఠుూ | ఒ ఠశ ౌnఠ షఠశష ూుసీ శnd ౌ | | - ుnుn - | d షఠశష షఠుషగఠ ఒ ఠశ nుష ు | షు | | ష , ా | ష షఠ శddషుn ుౌ ఫ | శnd షసశnశెషుn ుౌ ు | dశ ూ ఠ | స | శౌష | స ష | శ గస | శష | షశnష ుn షఠ | ౌశష | ుౌ ఒndశ , శnd ుn షఠ | గసుూఠ ుౌ పుn ుౌ ుష n షఠ - ుషnషసా ' ' అని వ్రాసాడు .
ఆదివారం ఆంధ్రజ్యోతిలో అదృష్ట రత్న జ్యోతి శీర్షికలో ప్రిడిక్షన్సు చెప్తూ ఉంటారు . మీరు చెప్పిన verifiability / falsifiability కి సరిపోయే విధంగా ఈవారం ( 3 / ఆగస్టు / 2008 ) చాలా ఖచ్చితమైన ఫలితాలు చెప్పారు . ఆఖరికి జాతకుడు ఎప్పుడు మరణిస్తాడో కూడా చెప్పేశారు . అయినాసరే మీరు జ్యోతిషం తప్పంటారా ? పైగా ఇది కేవలం జాతకం చూసి చెప్పినది మాత్రమే . జ్యోతిష్కుడికి సమాచారం లీకయ్యే అవకాశం లేదు కదా .
1986లో , CBS ప్రధాన సమయంలో ప్రసారం చేసిందిCarnegie Hall : The Grand Reopening , ఇది వాణిజ్య నెట్వర్క్ స్టేషన్‌కు అసాధారణమైన చర్యగా ఉంది , ఎందుకంటే చాలా వరకూ ప్రధాన సమయపు మహోన్నతమైన సంగీత ప్రత్యేక కార్యక్రమాలు PBS మరియు A & Eకు అందించబడినాయి . ఈ కార్యక్రమాన్ని కార్నేజీ హాలు నవీకరణ మరమ్మత్తులు జరిగిన సందర్బంగా ఏర్పాటు చేయబడింది . ఇందులో ప్రముఖ కళాకారులు లెనార్డ్ బెర్న్‌స్టీన్ వంటివారు అలానే ప్రజాదరణ పొందిన సంగీత కళాకారులు ఫ్రాంక్ సినట్రా వంటివారు కనిపించారు .
బిజెపి నేతృత్వంలో జరిగిన కుంభ కోణా లు : కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయి .
అయ్యా … ఇయ్యాల భూక్ హర్తాల్ చేసినా సర్కార్ ఏమి చేస్తలేదు . కాని గా కాలంల కరువచ్చినపుడు సామలు , సజ్జలు ( కుండె జొన్నలు ) , బుర్కలు ( మంచుతో పండేవి కూడ ఉంటయి ) కొర్రలు 3 నెలలకే పంట వస్తుంది . కరువులో అవి మమ్ములను ఆదుకునేటివి . గుడ్డి సర్కారు గడ్డి తింటున్నది గని మా వ్యవసాయం మా జీవి గంజి అవుతున్నది . కాని గీ కాలంల అవి సుక మాకు దొరుకత లేవు . అని సకాలం పోయి అకాల పరిస్థితులు ఎట్లా దాపురించినవో , ప్రభుత్వం , కాలం మధ్య విభజన రేఖ ఎట్లా ఉన్నదో బండారి భోజరెడ్డి ఆవేదనగా మాట్లాడటం ఈనాటి భూక్ హర్తాల్ ' బేకార్ హర్తాల్ ' గా మారడం చాలా బాధగా అనిపిస్తున్నది . పెద్ద మనుషులు తమ అనుభవము ఒక్కొక్కటి నెమరు వేస్తున్నపుడు చాలా ఆసక్తికర విషయాలు తెలిసినయి . పెసర్లు , మినుము లాంటి ధాన్యాలు పండించడం తగ్గినది . తగ్గడంతో ఈ ధాన్యాలతో వంటలు లేకపోవడం ఒక లోటుగా మారినది . పెసర్లలో తీగ పెసర్లు , పచ్చ పెసర్లు ఉన్నయి . తీగ పెసర్లు జొన్నలో వేస్తారు . ఇవి కనిపియ్యడం లేదు . వ్యవసాయం సమృద్ధి ఎప్పుడవుతుంది . రైతు ఆదాయ వ్యయాలు సరిగ్గా ఉన్నప్పుడు . కాని నేడు వ్యవయం విపరీతమైనది . మొదట పత్తి పండించినపుడు చిన్న పత్తి , పెద్ద పత్తి ( పెద్ద బుగ్గ కల్గినవి ) పండించేవారు . చిన్న పత్తినే ' కాటోల్ ' పత్తి అందురు . పెద్ద పత్తి పెద్ద చెట్టయితది . అయితే కాటోల్ పత్తి చిన్న బుగ్గ ఉండును . అధికంగానే దిగుబడి వచ్చేది . దక్కన్ , గుజరాత్‌కు సంబంధించిన పత్తి రకాలు ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచినవి . అటువంటిది ఆంగ్లేయులు యంత్రాలకు తగిన విధంగా ఉండడానికి పొడవు పింజగల పత్తిని ప్రవేశపెట్టి ఇక్కడి కాల పరిస్థితులకు తట్టుకునేవి కాకపోవడం వల్ల వాటి పై అధిక పెట్టుబడి పెట్టడంవల్ల రైతు పరిస్థితి నేటికి మారలేదు . అప్పటి కాలంలో తక్కల్లు ( షేరు ) దూది దూదేకులకు ఇస్తే ఏకులు చేసి ఇచ్చేవారు . రాట్నంతోటి దారం తీసిన ' కండెలు ' శాలొల్లకు ఇస్తే ' పసడాలు ' ఇచ్చేవారు . ( ఇవి తెల్లగా ఉండి ఎంతో వెచ్చగా ఉండును ) . ఈ రోజు వ్యవసాయ వృత్తి సంబంధాలు కరువై పోవడం వల్ల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది . విత్తనం స్వంతంగా సంరక్షించుకునే రైతు హక్కు నేడు ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు ధారదత్తం చేయడం వల్ల రైతు బతుకులతో ఆడుకుంటున్నది . పత్తి గింజలకు పెండరాసి విత్తుకునేవారు . విత్తనం తరతరాల సంస్కృతికి చిహ్నం , సంస్కృతి వారసత్వం కావున విత్తనాలకు రైతే హక్కుదారుగా ఉంటడు . విత్తనం రైతు జీవితంలో భాగం . య్యవుసం , జీవితం అయిన రైతు గొప్ప ' టెక్నాలజిస్ట్ ' అని ప్రపంచానికి తెలుసు .
అని గుడ్లు తిప్పుకుంటూ పాడుతుంటే అఖిల , రోహణ్ సోఫాల్లోని దిళ్ళు నేలమీద వేసి పొర్లి పొర్లి నవ్వుకుంటూ " ఇత్థనం ? What does ఇత్థనం mean ? " అని వాడ్ని కిర్రెక్కిస్తున్నారు . " Can Peace sleep with us mom ? Please Please , , , , ? Pretty please ? " అని ముచ్చటగా బతిమాలుకున్నారు . రోహణ్ ని అఖిల గదిలోనే పడుకోబెట్టి మేక్ పీస్ కి అక్కడే పక్క వేసింది . రోహణ్ గాడు ఉద్రేకంగా " I put బాణం in your బొజ్జా and you have to die ! " అని ఆజ్ఞాపిస్తుంటే మేక్ పీస్ " అమ్మా బాణం ! బాణం ! ! సచ్చిపోయేన్రా నాయినా ! ! " అని కేకలేస్తుంటే పది నిమిషాల్లోనే వాళ్ళ కేరింతలు ఆగిపోయేయి .
మాటూర్ ఖంజామల్‌పూర్ ఇట్కేపల్లి పంపాడ్ సిరూర్ మహబత్‌పూర్ షాపూర్ నాగ్‌వార్ కుష్నూర్ హుల్గెర షమ్షుద్దీన్‌పూర్ అల్లాపూర్ రైకోడ్ జంగా ( ఖుర్ద్ ) మాదాపూర్ దౌలతాబాద్ పీపల్‌పల్లి మోరట్‌గ మామిడిపల్లి ఇందూర్ ముస్తఫాపూర్ ( రైకోడ్ మండలం ) కర్చల్ మొహమ్మదాపూర్ నల్లంపల్లి ధర్మాపూర్ యూసుఫ్‌పూర్ సింగీతం రాయిపల్లి ( పట్టి కర్చల్ ) నాగన్‌పల్లి హస్నాబాద్ కోడూర్ ఔరంగానగర్ ( పట్టి హస్నాబాద్ ) ఎంకేపల్లి సంగాపూర్
మనకున్న చిరంజీవులలో ఆంజనేయస్వామి ఒకరని మనకు తెలుసు . అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది శివుడే . ఆ కథ ప్రకారం ,
ఎట్లాగో - ఒక ఆంగ్ల కవితతో పదం పలికింది . ఇక ఒక ఆంద్ర కవితతో యీ ప్రసంగాన్ని ముగిద్దాం . అసుకవి సహబాధితుడు - అజంతా - అభిశప్త జీవుల Muffled drum beater ! ఆంద్రప్రభ దినపత్రికలో తేదీ లేకుండా వ్రాసిన శిలాఫలకం మీద చెరిగిపోని శాసనం .
ఆ ఆర్టిస్టు యెవరోగానీ , వాయిస్ యెనాలిసిస్ చేసినా పెర్ఫెక్ట్ గా కుదిరే గొంతుకతో , సోనియాని మిమిక్ చేస్తూంది ! హేట్సాఫ్ !
మా కుటుంబానికి ఎంతో ఆత్మీయుడు . నాన్నగారితో సుదీర్ఘ అనుబంధం కొనసాగించారాయన . నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని తీశారు . పరిశ్రమలో అందరికీ ఆప్తుడుగా , మనసున్న వ్యక్తిగా అందరి హృదయాలను గెలుచుకున్నారు . ఆయన మరణం బాధాకరం .
So adorable . No words could match the beauty of this flower . నిన్న రాత్రి ఈ బ్రహ్మ కమలం ప్రస్తావన వచ్చిందండి . తెలిసిన వారికి ఎవరో ఇచ్చారట ఈ మొక్క . పోయినేడు పూలు పూసాయని చెప్తుంటే , ఎలా వుంటుందోనని వెదికాను , మీ టప దొరికింది . నిజంగానే ముందుగా తెలుసుంటే నా " వెదురుపువ్వు రేకువిచ్చి నవ్వింది " కవితలో మరొక ప్రతీకగా వాడుకునేదాన్ని . Thanks for sharing .
" అనియద్గ్రామ్యం హి యత్వపభ్రశః " [ 13 ] అని కొందరనగలరు . ఆ మాటకు వస్తే , నియమం లేని భాషే వుండదు . వొక వేళ వుండుననుకున్నా , గ్రామ్య భాషకు వొక నియమం చేసుకుంటే , గ్రామ్యత పోవలెను . యీ కారిక రాసిన వైయాకరణుడు అయితేనేమి , అహోబల పండితుడైతేనేమి , సంస్కృత లక్షణానుసారంగా , తెనుగుకు లక్షణం కల్పించకోరి , అసందర్భములు కల్పించుకున్నారు .
1 . 4 ముగింపు : ముస్లిం స్త్రీవాదం గురించి మాట్లాడుతూ డా / / ఎండ్లూరి సుధాకర్ ఇలా అన్నారు . " ముస్లిం స్త్రీవాద కవిత్వం అంటే ముస్లిం స్త్రీలు రాసిందే అవుతుంది . ఇక్కడ సానుభూతికి తావులేదు . ముస్లిం స్త్రీ పుట్టుక ముస్లిం స్త్రీ ఉనికిని నిర్ధారిస్తుంది . " ( ముల్కీ 2005 - 95 ) ఈ అభిప్రాయం ప్రకారం చూస్తే ముస్లిం స్త్రీవాదం గురించి ముస్లిం స్త్రీల రచనలనే ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి . ఇతరుల రచనలను తీసుకున్న ముస్లిం స్త్రీలు రాసినదానికున్నంత ప్రాధాన్యతను ఇవ్వవలసిన అవసరం లేదని గుర్తించాలి . అంతే తప్ప ఇతరులు రాయకూడదని కాదు . ఈ పత్రంలో ముస్లిం స్త్రీలు రాసిన కవిత్వాన్నే ప్రధానంగా తీసుకొని విశ్లేషించడం జరిగింది . ముస్లిం స్త్రీలు రాసిన కవిత్వంలో వారి బాధలు వెల్లడవుతున్నాయి . ఇతర మతాలు , వర్ణాలలో కంటే ముస్లిం స్త్రీ ఇస్లాం మతంలో మరింత పీడనకు గురవుతుందని ముస్లిం స్త్రీవాదం వల్ల స్పష్టమవుతుంది . వస్తువులో వచ్చిన నవ్యత శిల్పంలో కూడా ప్రవేశించి తెలుగు సాహిత్యానికి మరింత సొగసుని అందించిందని చెప్పుకోవచ్చు . ముస్లిం సాహిత్యం రాస్తున్న కొద్దిమందిలో స్త్రీవాద దృక్పథంతో రాస్తున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు . వారిలోను శక్తివంతంగా రాసే కవయిత్రిగా నిలుస్తున్నారు . ఈ విధంగా విశ్లేషించుకున్నపుడు ముస్లిం స్త్రీవాదం షాజహానా చుట్టూ తిరుగుతుందని చెప్పవచ్చు . ముస్లిం సమస్యలు మరిన్ని బయటకు రావాలంటే ముస్లిం మహిళలు మరింత మంది చదువుకోవలసిన అవసరం ఉంది . అప్పుడు మాత్రమే ఇస్లాం మతంలోని కొన్ని లోపాలు స్త్రీ పాలిట శాపాలుగా వక్రీకరించని పరిస్థితి నెలకొంటుంది . ఆధార గ్రంథాలు :
ముళ్ళపూడివారి మహాభినిష్క్రమణం హాస్యానికి వీడ్కోలు పలికింది . సినీ చరిత్రలో బాపు - రమణ గొప్ప ద్వయం . ఇన్నాళ్ళు వారు కలిసి ఉండటం అంతకన్నా గొప్ప విషయం . తెలుగుబాషకు ఎంతో సేవ చేశారు . వాటిని మర్చిపోలేం . వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను .
నీకంటూ కట్టుకున్న నీ ఊహలోకం , నన్నల్లుకున్న నీ ప్రణయ ప్రపంచం
ఈనాడు కథల్ని దళిత కథలని , స్త్రీవాద కథలని ప్రాంతీయ కథలని విభజిస్తున్నారు . సలీం రచించిన కథలు అలాంటి విభజనకు లొంగవు . ఈనాడు మన సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని తన దృక్కోణంలోంచి విశ్లేషించే ప్రయత్నం చేశాడు రచయిత . ఇతను ఎన్నుకున్న ఇతివృత్తంలోనూ , కథాకథనంలోనూ కొత్తదనం ఉంది . పాఠకులను తన వెంట తీసుకెళ్ళగల్గే చక్కని శైలి ఈ రచయితకుంది . ఎలాంటి డొంక తిరుగుళ్ళు లేకుండా సూటిగా కథనంలోకి ప్రవేశించడం ఈ రచయిత ప్రత్యేకత . పాఠకులకు శాస్త్రీయ దృక్పథాన్ని , అభ్యుదయ దృక్పథాన్ని కల్గించాలన్న అభినివేశంకూడా ఈ రచయితకుంది . - ఆదివారం ఆంధ్రభూమి
3 . Situation 2 : స్వార్ధము లేని ప్రభుత్వమే ప్రజల సౌకర్యార్ధం పరిశ్రమ పెట్టిందనుకోండి . పరిశ్రమ నడుస్తోంది అంతా బాగానే ఉంది . శ్రామికులకి బాధగా ఉంది . పొద్దున్న నుండీ సాయంత్రం రోజూ పని చేసినా ఎదుగూ బొదుగూ లేదు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది . ఈ పరిశ్రమ మా మూలాన నడుస్తోంది అంటే మాదే . మేము రోజూ పనికి రావాల్సిన అవసరమేమిటి ? అంటారు . ప్రభుత్వము ఏమి చెయ్యాలి ? పరిశ్రమ మూసేయ్యాలా లేక వారు చెప్పినట్లు వినాలా ?
నేనయితే చక్కగా ఎత్తిన పుస్తకం దించకుండా చదువుకుందును . చూడాలనుకున్న సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్ ఆక్కౌంటు తెరిచేసి రోజుకు రెండు చొప్పున చూసేద్దును . ఎప్పొడొచ్చి చూసేస్తుందో అని దొంగచాటుగా కూడలి చూడక్కర లేకుండా బహిరంగంగా చదువేద్దును . ఒక్కరోజు వండిందే వారం రోజులు తినేద్దును . - - ప్రసాద్ http : / / blog . charasala . com
$ భాస్కర్ గారు షరా మామూలు ఆయితే తాత మనవడికి చెప్పాలి . . మరిక్కడ అది తిరగబడింది . తరం మరి : ) . బావున్నాయి మీ తాతయ్య కబుర్లు . . ఆ . . లేదు . . ఇవి మనవడి కబుర్లు ; ) # బయాస్డ్ గా చదివితే జర్మనులను కనీసం స్పృశించను కూడా స్పృశించలేము . వారు చేసిన దమనకాండకు వారితో కనీసం మాట్లాడలేము . సో , చరిత్రని చూసేప్పుడు యూదుల కళ్ళద్దాలు పెట్టుకు చూస్తే చరిత్ర చదవగలమా ? వడ్డించేవాడు మనోడవ్వాలి కానీ . . అన్నచందంలో ఒకవైపు వాపు - మరో వైపే బలుపు అన్నట్లుగా ఈ పశ్చిమదేశ చరిత్రకారులు రాసుకుంటూ వెళ్లారు . గణాంకాలు పెంచుకుంటూ . . తమకు అవసరమైనప్పుడల్లా . . పోయారు . # . . ఒక్కశాతానికి పడిపొయ్యారు నేటివ్ అమెరికన్స్ . . అసలా ఒక్కశాతమైనా ఉన్నారా లేక ఏ ఆఫ్రికాకొ తోసేసారా ? # వెయ్యేళ్ళనాడు మాపై దండెత్తిన ఛంఘీజ్ ఖాన్ సంతతి ఎన్ని తలలను . . హ్మ్ . . లెక్కలు ఉన్నాయిగానీ అన్నీ అరకొరగా !
ఇక సోవియట్ యూనియన్ కమ్యూనిస్టుపార్టీకీ , చైనా కమ్యూనిస్టు పార్టీకీ గ్రేట్ డిబేట్ జరిగి , అది అంతర్జాతీయ ప్రకంపనాలు సృష్టించి , భారతదేశంలో కూడ నక్సల్బరీ పంథా ఆ ప్రభావానికి లోనయిన తర్వాత , చైనా కమ్యూనిస్టుపార్టీ అధికారికంగా నక్సల్బరీ పంథాను సమర్థించిన తర్వాత చైనా ప్రభావం విస్తృతమయింది . నక్సల్బరీ ప్రజ్వలనను చైనా కమ్యూనిస్టుపార్టీ అధికారపత్రిక పీపుల్స్ డైలీ ' వసంతమేఘ గర్జన ' గా అభివర్ణించింది . చైనా పట్ల భారత విప్లవోద్యమపు మైత్రి చైనా చైర్మన్ మన చైర్మన్ అనే అతివాద నినాదం దాకా విస్తరించింది . అప్పటి లిబరేషన్ పత్రికలోనూ , అప్పుడు వెలువడిన అనేక పుస్తకాల మీద రేడియో పెకింగ్ ఇంగ్లిషు , హిందీ ప్రసారాల వేళలు ప్రచురించారంటే ఆ ప్రభావం ఎంత పెద్ద ఎత్తున ఉందో అర్థమవుతుంది . ఈ పూర్వరంగంలో చైనా సాహిత్య అధ్యయనం , అనువాదం , ప్రచారం 1960ల చివరినుంచీ , 1980ల మొదటి దాకా విపరీతంగా సాగాయి . మొత్తం పుస్తకాలలో మూడు వంతులు ఆ పది పన్నెండు సంవత్సరాలలోనే వెలువడి ఉంటాయి .
నీడల్లె నా వెంట ఉన్నా నిను పోల్చుకోలేదు ప్రతి సారి నువ్విప్పుడేచోట ఉన్నా కనిపించవా నాకు ఓ సారి | | నీడల్లె | | | | 2 | | నవ్వుతూ కవ్విస్తావు ఉత్తరం పంపిస్తావు మెల్లగా మాయ చేసి ఇంతలో మిస్సవుతావు | | 2 | | ఆణువణువు నే వెతుకుతున్నా నె చేరలేనా నీ దారి | | నీడల్లె | | | | 2 | | హంసల్ని రప్పిస్తాను వెతికెందుకొప్పిస్తాను నిన్ను చేరె దాక ఊరూరు పంపిస్తాను | | 2 | | నువ్వెంత తప్పించుకున్నా నను దాటి పోలేవు ఈ సారి
ఈ అవకాశాలు లిమిటెడ్‌గా ఉంటాయి . కానీ ప్రస్తుతానికి డిమాండు బాగానే ఉంది . ఇతర దేశాలు మనదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి కాబట్టి దీని డిమాండ్ పెరిగే అవకాశం ఉంది . ఇతర దేశాల్లో మంచి అవకాశాలు ఉండడం వల్ల ప్రస్తుతానికి డిమాండ్ బాగానే ఉంది .
మీకసలు బొత్తిగా భయం లేకుండా పోతుందీ మధ్య ! పండగ ముందు రోజు పరమ వీర చక్ర చూస్తారా ? హన్నా ! : - ) )
ఈ కృతిని ఎక్కడి నుండి తీసుకువచ్చారు ? ( దయచేసి కింద ఇచ్చిన లింకులలో ఒక దానిని నొక్కండి )
మీ పత్రిక క్రమం తప్పకుండా చదువుతున్నాను . బాగుంటున్నది . నా కథ మీద దార్లగారు రాసిన వ్యాసం పెట్టారు . థ్యాంక్స్ . ఆలస్యంగా ప్రతిస్పందిస్తున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను .
పుస్తకప్రచురణ నళినీకుమార్ వృత్తి కాదు . ప్రవృత్తిరీత్యా అతనూ కవే . 1957 జూన్‌లో నళీనీకుమార్ రాసిన పణవిపణి అనే గేయకావ్యం క్రౌన్ సైజులో పూర్తి ఆర్టుపేపర్‌పైన కాలికోబైండుతో ప్రచురితమయ్యింది . సోమసుందర్ లెక్క ప్రకారం , పణవిపణి గేయచ్ఛందస్సులో తెలుగులో వెలువడిన ప్రప్రథమ సంపూర్ణ గేయకావ్యం . ప్రతులన్నీ మిత్రులకూ , అభిమానులకూ అందినా పణవిపణి మాత్రం విపణివీధికి చేరలేదట . కాలక్రమేణా మరుగున పడ్డ ఈ కావ్యాన్ని ఇన్నాళ్ళ తర్వాత అభ్యుదయ రచయితల సంఘం పునర్ముద్రించింది .
తాతగారు పెద్ద సింహం చిన్న సింహప్పిల్లను చూసినట్లు ఆప్యాయంగా మనవడిని చూసుకుని , నిసి వంక చూసి , " చాలా మంది ఆడవాళ్ళ కొంప ముంచుతాడు వీడు , నాకు తెలుసు . " అన్నాడు .
సోనియా : పదేళ్ళ పాటు భారత పౌరసత్వం తీసుకోమని అత్త ఇందిర ప్రాధేయపడినా ససేమిరా అన్న ఘనత సొంతం . భర్తను ఇటలీ పోదాం బాబో అని పోరెట్టిన ఘనత కూడా వుంది . చివరికి తనను కాస్తయినా గుర్తించేది భారత్ లోనే అని ఈ మధ్యనే అర్ధం అయి పౌరసత్వం స్వీకరించి , ఆ తర్వాతే హిందీ నేర్చుకున్న ఘనత . ఈమెను మన దేశ నాయకులు ఇంట్లో భార్యకు ఇచ్చే విలువ కంటే ఒక పది రెట్లు ఎక్కువ గానే ఇస్తారు . తెలంగాణా ఇవ్వాలన్నా ఆమె , విమానం ఎగరాలన్నా ఆమెనే . దేశ ప్లానింగ్ కమీషన్ కే ఆమె చైర్ పర్సన్ .
అనుచా సుందరి నన్ను గాఢతరమౌ నాశ్లేషబంధంబుచే ననురాగోద్ధురచిత్తవృత్తి కలన న్నానందదుగ్ధాబ్ధిలో మునుగంజేయుచునుండ వాణికృపచేఁ బూర్వాకృతుల్మారి చ క్కని రాయంచల రూపము ల్గలిగె మాకవ్వేళ బల్వింతగన్ .
మాలా కుమార్ గారూ జన్మదిన శుభాకాంక్షలు . మరిన్ని సుందరమైన జన్మదినాలు జరుపుకుంటూ మా అందరినీ వైవిధ్యమైన వ్యాసాల పరంపరలతో అలరించాలని కోరుకుంటుంన్నాను . ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ వ్రాస్తే ఇక్కడ అసందర్భ ప్రేలాపీ అని తిట్టుకొనే ప్రమాదం వుంది కదా . . అందుకని మరొక్కసారి మళ్ళీ " హ్యాపీ బర్త్ డే టు యు "
ఫ్రాన్స్ ప్రధాన భూభాగంమూస : Convert / LonAoffDbSoff , [ 26 ] యూరోపియన్ సమాఖ్య సభ్యులందరిలో అత్యధిక భూభాగాన్ని మరియు స్పెయిన్ కంటే కొద్దిగా ఎక్కువ భాగాన్ని కలిగిఉంది . ఫ్రాన్స్ , ఉత్తరం మరియు పశ్చిమాల్లో సముద్రతీర చదును భూముల నుండి ఆగ్నేయంలో ఆల్ప్స్ పర్వతశ్రేణులు , దక్షిణ - మధ్య భాగంలో మాసిఫ్ సెంట్రల్ మరియు నైరుతిలో పైరినీస్ వంటి విభిన్న భూస్వరూపాలను కలిగిఉంది . 4 , 807 metres ( 15 , 771 ft ) సముద్ర మట్టానికంటే ఎక్కువ ఎత్తులో , పశ్చిమ ఐరోపాలోనే అత్యంత ఎత్తైన మోంట్ బ్లాంక్ , ఆల్ప్స్ పర్వతాలలో ఫ్రాన్స్ మరియు ఇటలీల సరిహద్దులో ఉంది . [ 27 ] ఫ్రాన్స్ ప్రధానభూభాగం విస్తృతమైన నదీ వ్యవస్థలను కలిగిఉంది , లోయిర్ , గరోన్నే , సీన్ రెనే , మాసిఫ్ సెంట్రల్ ను ఆల్ప్స్ నుండి విభజించి [ [ కామర్గ్యూ వద్ద మధ్యధరా సముద్రంలోనికి ప్రవహిస్తుంది , ఇది ఫ్రాన్స్ లో సముద్రమట్టం కంటే ) లోతైన ప్రదేశం . | కామర్గ్యూ వద్ద మధ్యధరా సముద్రంలోనికి ప్రవహిస్తుంది , ఇది ఫ్రాన్స్ లో మూస : Convert / LoffAonDsSoff సముద్రమట్టం కంటే ) లోతైన ప్రదేశం . [ 27 ] ] ] కోర్సికా మధ్యధరా తీరానికి అవతలి ప్రక్కన ఉంది .
వీటన్నింటినీ మించినది హవాలా కుంభ కోణం . విదేశీ మారకం కావల్సిన వారు చట్టబద్దంగా కాకుండా బ్లాక్ మార్కెట్లలో రూపాయలను విదేశీ ధనంలోకి మార్చడానికి సంబంధించిన హవాలా కుంభకోణంలో అనేక మంది కేంద్ర మంత్రులకు సంబంధం ఉన్నట్లు విచారణలో తెలింది . 1991 మార్చి 25వ తేదీన వెలుగులోకి వచ్చిన ఈకుంభకోణంలో జైన్ సోదరులు ప్రధాన పాత్ర వహించగా భారత మాజీ ప్రధాని పి . వి నరసింహారావు తోపాటు రాజీవ్‌గాంధీ , భజన్‌లాల్ , ఎల్‌కె అద్వా నీ , మదన్‌లాల్ ఖురానా , ఆర్‌కె ధావన్‌ల తోపాటు మెజారిటీ కేంద్ర మంత్రులకు ఈ కుంభకోణంలో ముడుపులు ముట్టినట్లు వెల్లడైంది . ఈశాన్య భారతదేశంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమంలో రూ . 63 వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగినట్లు బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ సాక్ష్యాలతో సహా ప్రభు త్వం దృష్టికి తెచ్చాడు . ఆరుణాచల్ ప్రదేశ్‌లో రూ . 4 లక్షల కోట్లు విలువైన పేరులేని జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులిచ్చి అక్కడి కాంగ్రెస్ నేతలు లబ్దిపొందారు .
చాలా చదివేస్తున్నారన్నమాట . నాకు కూడా " వెంటనే ఇవి చదువమ్మాయ్ " అని కొన్ని పుస్తకాలు చెప్పకూడదూ . అవును , వైభవం కలకాలం నిలవాలి . ఎన్నో తరాలు తరించాలి .
ఆయ్య నా పెరు స్రీనివస్ నా జనం దినం 10 , అగస్తి , 1981 . జతకం చెపాగలరు నాసొమవారం రాత్రి 10 : 30 - 11 మధ్యలొ పుతింది ఖమామ లోని గుదిమల్లా అనే గ్రమం
బాల్యము , విద్యాభ్యాసము నందమూరి తారక రామారావు 1923 , మే 28 వ తేదీన , సాయంత్రం 4 : 32కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా , పామర్రు మండలంలోని , నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి , వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు . మొదట కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ , మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు . తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది . పాఠశాల విద్య విజయవాడ మునిసిపలు హైస్కూలులో చదివాడు . తరువాత విజయవాడ ఎస్ . ఆర్ . ఆర్ . కాలేజీలో చేరాడు . ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి . ఒకసారి రామారావును ఒక నాటకములో ఆడవేషం వేయమన్నాడు . అయితే రామారావు తన మీసాలు తీయటానికి ' ససేమిరా ' అన్నాడు . మీసాలతోటే నటించడం వలన ఆయనకు " మీసాల నాగమ్మ " అనే పేరు తగిలించారు . 1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకంను పెళ్ళి చేసుకున్నాడు . వివాహో విద్యానాశాయ అన్నట్లు పెళ్ళయిన తరువాత పరీక్షల్లో రెండుసార్లు తప్పాడు . తర్వాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరాడు . అక్కడకూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు . ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ ( NAT ) అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య , ముక్కామల , నాగభూషణం , కె . వి . ఎస్ . శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు ఆడాడు . తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది . ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా . రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో ఆయనకు బహుమతి కూడా లభించింది . సుభాష్ చంద్రబోసు విజయవాడ వచ్చినప్పుడు ఎన్టీఆర్ బోసు బొమ్మను చిత్రించి ఆయనకు కానుకగా ఇచ్చాడు . చలనచిత్ర జీవితం రామారావు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్నికారణాల వల్ల హరించుకుపోయింది . అప్పుడు యుక్తవయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేసాడు . కొన్ని రోజులు పాల వ్యాపారం , తరువాత కిరాణా కొట్టు , ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు . ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు . రామారావు 1947లో పట్టభద్రుడయ్యాడు . తదనంతరం ఆయన మద్రాసు సర్వీసు కమీషను పరీక్ష రాసాడు . పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు . అప్పుడు ఆయనకు మంగళగిరిలో సబ్ - రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది . అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు . ప్రముఖ నిర్మాత బి . ఏ . సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి , వెంటనే ఆయనను మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసాడు . దీనికి గాను రామారావుకు వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించింది . వెంటనే ఆయన తన సబ్ - రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు . కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు . ఈలోగా మనదేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు . అంచేత ఆయన మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా మనదేశం అయింది . 1949లో వచ్చిన ఆ సినిమాలో ఆయన ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్ పాత్ర పోషించాడు . 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది . అదే సంవత్సరం ఎల్వీ ప్రసాదు షావుకారు కూడా విడుదలైంది . ఈ రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చివేశాడు . థౌజండ్ లైట్స్ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవాడు . ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ ( తరువాతి కాలంలో నిర్మాత అయ్యాడు ) కూడా ఉండేవాడు . 1951లో కె . వి . రెడ్డి పాతాళభైరవి , దాని తరువాత అదే సంవత్సరం బి . ఎన్ . రెడ్డి మల్లీశ్వరి , 1952లో ఎల్వీ ప్రసాదు పెళ్ళిచేసి చూడు , ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్ర హారం ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి . ఈ సినిమాలన్నీ విజయావారివే . ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం మరియు 5000 రూపాయిల పారితోషికమూ ఇచ్చారు . పాతాళభైరవి 34 కేంద్రాలలో 100 రోజులు ఆడి అప్పట్లో సంచలనం సృష్టించింది . తన ఉంగరాల జుట్టుతో , స్ఫురద్రూపంతో , వెలుగులు విరజిమ్మే నవ్వుతో ఆంధ్రదేశ ప్రజలను ఆకట్టుకుని వారి మనసుల్లో నిలిచిపోయాడు . 1956లో విడుదలైన మాయాబజార్‌లో ఆయన తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అపట్లో అత్యధికం అని భావిస్తారు . 1959లో ఎవిఎమ్ వారు నిర్మించి , విడుదల చేసిన భూకైలాస్ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేసాడు . 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయం సాధించింది . శ్రీమద్విరాటపర్వములో ఆయన ఐదు పాత్రలు పోషించాడు . ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు . సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు . 1963లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది . ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు ఆయన పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది . 1972నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది . ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం . ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని " నేషనల్ ఆర్టు ప్రొడక్షన్సు " పతాకంపై విడుదల చేసాడు . 1977లో విడుదలైన దాన వీర శూర కర్ణలో ఆయన మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసాడు . 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా ఆయన దర్శకత్వం వహించాడు . ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు , యమగోల గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి . 1991 ఎన్నికల ప్రచారం కోసం ఆయన నటించి , దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర 1990లో విడుదలైంది . ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా కచ్చితంగా ఉండేవాడు . గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచిలో అభ్యాసం చేసేవాడు . నర్తనశాల సినిమా కోసం ఆయన వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నాడు . వృత్తిపట్ల ఆయన నిబద్ధత అటువంటిది . కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతూంటారు , ఎందుకంటే ఆయన డైలాగులను ముందుగానే కంఠతా పట్టేసేవాడు . రాజకీయ ప్రవేశం1978లో ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారానికి వచ్చిన కాంగ్రేసు పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలయ్యింది . తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు . ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు . ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి , రాష్ట్రంలో శాసనసభ్యులచేత నామకార్థం ఎన్నిక చేయించేవారు . ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రదిష్ట పాలయింది . 1981లో ఊటీలో సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగు విరామసమయంలో ఒక విలేఖరి , మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా , మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా ? ఆని అడిగాడు . దానికి జవాబుగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను . తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు . వారికి నేనెంతో రుణపడి ఉన్నాను . కాబట్టి నా తరువాతి పుట్టిన రోజునుంచి నా వంతుగా ప్రతీనెలలో 15రోజులు తెలుగుప్రజల సేవకోసం కేటాయిస్తాను అని చెప్పాడు . ఆయన చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం . అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వరత్వరగా పూర్తి చేసాడు . 1982 మార్చి 21 న హైదరాబాదు వచ్చినప్పుడు అభిమానులు ఆయనకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు . 1982 మార్చి 29 సాయంత్రము 2 : 30లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పాడు . ఆసమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి , ప్రకటించాడు . పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెటు వ్యానును బాగు చేయించి , దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించాడు . దానిపై నుండే ఆయన తన ప్రసంగాలు చేసేవాడు . దానిని ఆయన " చైతన్యరథం " అని అన్నాడు . ఆ రథంపై " తెలుగుదేశం పిలుస్తోంది , రా ! కదలి రా ! ! " అనే నినాదం రాయించాడు . ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్యరథమే స్ఫూర్తి . ప్రచార ప్రభంజనం నందమూరి తారక రామారావు రామారావు ప్రచార ర్యాలీ . ఎన్టీఆర్ ప్రజలను చైతన్య పరుస్తూ చైతన్యరథంపై ఆంధ్ర ప్రదేశ్ నలుమూలలకూ ప్రచార యాత్రను సాగించాడు . చైతన్యరథమే ప్రచార వేదికగా , నివాసంగా మారిపోయింది . ఒక శ్రామికుడివలె ఖాకీ దుస్తులు ధరించి , నిరంతరం ప్రయాణిస్తూ , ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నాడు . ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసాడు . కాంగ్రెసు అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించివేసిన ప్రచార ప్రభంజనమది . ఎన్టీఆర్ ప్రసంగాలు ఉద్వేగభరితంగా , ఉద్రేకపూరితంగా ఉండి , ప్రజలను ఎంతో ఆకట్టుకునేవి . ముఖ్యమంత్రులను తరచూ మార్చడం . . , అదీ ఢిల్లీ పెద్దల నిర్ణయం ప్రకారమే తప్ప , శాసనసభ్యుల మాటకు విలువ లేకపోవడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని తన ప్రసంగాలను మలచుకున్నాడు . కాంగ్రెసు నాయకులు కుక్కమూతి పిందెలనీ , కొజ్జాలనీ , దగాకోరులనీ , దగుల్బాజీలని , అధిష్టానం చేతిలో కీలుబొమ్మలనీ తీవ్రపదజాలంతో విమర్శించాడు . కాంగ్రెసు పార్టీ కారణంగా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదనీ , దాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారనీ విమర్శిస్తూ , ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పాడు . కాంగ్రెసు నిర్వాకానికి అప్పటికే విసుగు చెందిన , ప్రజలు ఆయన నినాదం పట్ల ఆకర్షితులయ్యారు . 1983 జనవరి 7 న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు . తెలుగుదేశం 199 , కాంగ్రెసు 60 , సిపిఐ 4 , సిపిఎం 5 , బిజెపి 3 సీట్లు గెలుచుకున్నాయి . 97 ఎళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది . ఆయన విజయానికి అప్పటి దినపత్రికలు - ముఖ్యంగా ఈనాడు - ఎంతో తోడ్పడ్డాయి . రాజకీయ ఉత్థాన పతనాలు1970లలో ఎదుర్కొన్న చిన్నపాటి ఒడిదొడుకులు తప్పించి , ఎన్టీఆర్ సినిమా జీవితం విజయవంతంగా , అప్రతిహతంగా సాగిపోయింది . అయితే ఆయన రాజకీయ జీవితం అలా - నల్లేరుపై నడకలా సాగలేదు . అద్భుతమైన విజయాలకూ , అవమానకరమైన అపజయాలకూ మధ్య తూగుటూయలలా సాగింది . ఎన్నికల ప్రచారసమయంలో ఎన్టీఆర్ కాంగ్రెసు నాయకులపై చేసిన ఆరోపణల కారణంగానూ , ఎన్నికల్లో తెలుగుదేశం చేతిలో కాంగ్రెసు పొందిన దారుణ పరాభవం వల్లనూ , ఆ రెండు పార్టీల మధ్య వైరి భావం పెరిగింది . రాజకీయపార్టీల మధ్య ఉండే ప్రత్యర్థి భావన కాక శతృత్వ భావన నెలకొంది . ఇది తెలుగుదేశం పాలిత ఆంధ్ర ప్రదేశ్ కు కాంగ్రెసు పాలిత కేంద్రానికీ మధ్య వివాదంగా మారే వరకు వెళ్ళింది . కేంద్రం మిథ్య అనేంతవరకు ఎన్టీఆర్ వెళ్ళాడు . 1983 శాసనసభ ఎన్నికల్లో ఆయన సాధించిన అపూర్వ విజయం ఆయన రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం . అధికారం చేపట్టిన తరువాత , అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు . ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ తగ్గింపు వీటిలో ప్రధానమైనది . ఈ నిర్ణయాల కారణంగా చాలా వేగంగా ప్రజాభిమానం కోల్పోసాగాడు . 1984 ఆగష్టు 16 న నాదెండ్ల భాస్కరరావు , అప్పటి గవర్నరు రాంలాల్ , ప్రధానమంత్రి ఇందిరా గాంధీల లోపాయికారీ సహకారంతో రామారావును అధికారం నుండి తొలగించి , తాను దొడ్డిదారిన గద్దెనెక్కడంతో తిరిగి రామారావు ప్రజల్లోకి వెళ్ళాడు . జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు . ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో మిత్రపక్షాలు ఆయనకు ఎంతో సహాయం చేసాయి . ఫలితంగా సెప్టెంబర్ 16 న రామారావును తిరిగి ముఖ్యమంత్రిగా ప్రతిష్టించడం కేంద్రప్రభుత్వానికి తప్పింది కాదు . నెలరోజుల్లోనే , ఆయన ప్రభ తిరిగి శిఖరాగ్రానికి చేరిన సందర్భమిది . ఆంద్ర ప్రదేశ్ లో మొదటి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు . 1984లో సినిమారంగంలో " స్లాబ్ విధానము " ను అమలుపరిచాడు . ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకూ పనికిరాదని శాసనమండలిని రద్దు చేసాడు ( 1985 జూన్ 1 న అధికారికంగా మండలి రద్దయింది ) . హైదరాబాదు లోని హుస్సేన్‌సాగర్ కట్టపై ( ట్యాంకుబండ్ నందు ) సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు నెలకొల్పాడు . నాదెండ్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సంపాదించే ఉద్దేశ్యంతో మార్చి 1985లో ప్రజలతీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాడు . ఆ ఎన్నికలలో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చాడు . 1985 - 89 మధ్య కాలంలో తన ఏకస్వామ్యపాలన వలన ఎన్టీఆర్ ఎంతో అప్రదిష్ట పాలయ్యాడు . పార్టీలోను , ప్రభుత్వంలోను అన్నీ తానే అయి నడిపించాడు . ప్రజల్లో నిరసన భావం కలగడానికి ఇది ప్రధాన కారణమైంది . 1989లో ఎన్నికలకు కొద్ది నెలల ముందు మొత్తం మంత్రివర్గాన్ని ఏకపక్షంగా రద్దుపరచి కొత్త మంత్రుల్ని తీసుకున్నాడు . ఈ కాలంలో జరిగిన కొన్ని కులఘర్షణలు కూడా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసాయి . 1989 ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపింది . కాంగ్రెసు తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించి తిరిగి అధికారానికి వచ్చింది . ఎన్నికల్లో ఓడిపోయినా భారత దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ , కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రేసుకు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేయటంలో ఎన్టీఆర్ విజయం సాధించాడు . 1991 లో నంద్యాల లోక్‌సభ ఉప ఎన్నికలలో కాంగ్రెసు తరపున అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పి . వి . నరసింహారావు నిలబడగా , ప్రధానమంత్రి అయిన ఒక తెలుగువాడికి గౌరవ సూచకంగా ఎన్టీఆర్ ఎవరినీ పోటీగా నిలబెట్టలేదు . 1989 - 94 మధ్యకాలం ఎన్టీఆర్ రాజకీయ చరిత్రలో అత్యంత నిమ్నదశగా చెప్పవచ్చు . ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అధికార కాంగ్రెసు పార్టీచేతిలో అవమానాలు పొందాడు . శాసనసభలో అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ ఏస్థాయిలో ఉండేదంటే - ఈ కాలంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులను 9 సార్లు సభనుండి బహిష్కరించారు . ఈ కాలంలో నాలుగు సినిమాలలో నటించాడు కూడా . తన జీవితకథ రాస్తున్న లక్ష్మీపార్వతిని 1993 సెప్టెంబర్‌లో పెళ్ళి చేసుకున్నాడు . రామారావు వ్యక్తిగత జీవితంలో ఇదో కీలకమైన మలుపు . ఆయన వ్యక్తిగత జీవితం , కుటుంబ సభ్యులతో ఆయన సంబంధాలపై ఈ పెళ్ళి కారణంగా నీడలు కమ్ముకున్నట్లు కనిపించాయి . 1994లో కిలో బియ్యం రెండు రూపాయలు , సంపూర్ణ మద్య నిషేధం , వంటి హామీలతో , మునుపెన్నడూ ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు . ప్రభుత్వ ఖజానాకు ఎంత భారంపడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచాడు . అయితే ఆయన రెండవ భార్య లక్ష్మీపార్వతి పార్టీ , ప్రభుత్వ విషయాలలో విపరీతంగా కలుగజేసుకోవటం వలన ఆయన చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చింది . పార్టీలో ప్రముఖులు అభద్రతా భావాన్ని ఎదుర్కొన్నారు . పార్టీలో ముదిరిన సంక్షోభానికి పరాకాష్టగా ఆయన అల్లుడు , ఆనాటి మంత్రీ అయిన నారా చంద్రబాబునాయుడు తిరుగుబాటు చేసాడు . అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది . అనతికాలంలోనే , 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించాడు . ముప్పైమూడేళ్ళ తెర జీవితంలోను , పదమూడేళ్ళ రాజకీయ జీవితంలోను నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు . ఆయన మరణించినపుడు ఈనాడు పత్రికలో శ్రీధర్ వేసిన ఈ కార్టూను ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ పట్ల ఉన్న అభిమానానికి అద్దం పడుతుంది . [ మార్చు ] ఎన్టీఆర్ జాతీయ పురస్కారం భారత ప్రభుత్వం వారిచే విడుదల చేయబడిన స్టాంపు ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1996 లో నెలకొల్పింది . 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తరువాత నిలిపివేసింది . ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా 2006 జనవరి 18 న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది . ఎన్టీఆర్ విశిష్టత సిసలైన ప్రజానాయకుడు ఎన్టీఆర్ . ఆంధ్ర ప్రదేశ్ లో , ఆయన సమకాలికుల్లో ఆయనంతటి ప్రజానాయకుడు మరొకరు లేరు . వటవృక్షంలాంటి కాంగ్రెసు పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో దీటైన ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టిన గొప్పదనం పూర్తిగా ఎన్టీఆర్‌దే . పట్టుదలకూ , క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి ఆయన . ఈ కారణాలవల్లనే కాంగ్రెసు పార్టీని ఎదుర్కొని స్థిరమైన ప్రభుత్వాన్నీ , ప్రభావవంతమైన ప్రతిపక్షాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగాడు . తెలుగుజాతికీ , తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ . స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావుదే . బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్ళు కట్టించిన గొప్పతనం ఆయనకు దక్కింది . రెండు రూపాయలకే కిలో బియ్యం వాగ్దానం చేసి , ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు ఓర్చి , తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు . తెలుగుగంగ ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత కూడా ఎన్టీఆర్‌దే . దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చిన నేత ఆయన . ఎందరో కొత్తవారిని , బాగా చదువుకున్నవారిని రాజకీయాలకు పరిచయం చేసి , ఒంటిచేత్తో వారిని గెలిపించిన ప్రజానాయకుడు ఆయన . దేవేందర్ గౌడ్ , కె . చంద్రశేఖరరావు మొదలైన నేతలు ఆయన పరిచయం చేసినవారే . 40వ దశకం మన దేశం ( 1949 ) 50వ దశకం షావుకారు ( 1950 ) పల్లెటూరిపిల్ల ( 1950 ) మాయరంభ ( 1950 ) సంసారం ( 1950 ) మాయరంభ ( 1950 ) ( తమిళము ) పాతాళభైరవి ( 1951 ) పాతాళభైరవి ( 1951 ) ( తమిళము ) పాతాళభైరవి ( 1951 ) ( హిందీ ) మల్లీశ్వరి ( 1951 ) పెళ్ళిచేసిచూడు ( 1952 ) దాసి ( 1952 ) పల్లెటూరు ( 1952 ) కళ్యాణంపన్నిప్పర్ ( 1952 ) ( తమిళము ) వెలైకరిమగల్ ( 1952 ) ( తమిళము ) అమ్మలక్కలు ( 1953 ) మరుముగల్ ( 1953 ) ( తమిళము ) పిచ్చి పుల్లయ్య ( 1953 ) చండీరాణి ( 1953 ) చండీరాణీ ( 1953 ) ( తమిళము ) చండీరాణీ ( 1953 ) ( హిందీ ) చంద్రహారం ( 1954 ) చంద్రహారం ( 1954 ) ( తమిళము ) వద్దంటే డబ్బు ( 1954 ) తోడుదొంగలు ( 1954 ) రేచుక్క ( 1954 ) రాజు పేద ( 1954 ) సంఘం ( 1954 ) సంఘం ( 1954 ) ( తమిళము ) అగ్గిరాముడు ( 1954 ) పరివర్తన ( 1954 ) ఇద్దరుపెళ్ళాలు ( 1954 ) మిస్సమ్మ ( 1955 ) విజయగౌరి ( 1955 ) చెరపకురా చెడేవు ( 1955 ) జయసింహ ( 1955 ) కన్యాశుల్కం ( 1955 ) సంతోషం ( 1955 ) నయాఆద్మి ( 1956 ) ( హిందీ ) తెనాలి రామకృష్ణ ( 1956 ) తెనాలి రామకృష్ణన్ ( 1956 ) ( తమిళము ) చింతామణి ( 1956 ) జయంమనదే ( 1956 ) సొంతవూరు ( 1956 ) ఉమాసుందరి ( 1956 ) చిరంజీవులు ( 1956 ) శ్రీగౌరి మహాత్మ్యం ( 1956 ) పెంకి పెళ్ళాం ( 1956 ) మర్మవీరన్ ( 1956 ) ( తమిళము ) చరణదాసి ( 1956 ) భాగ్యరేఖ ( 1957 ) మాయాబజార్ ( 1957 ) మయాబజార్ ( 1957 ) ( తమిళము ) వీరకంకణం ( 1957 ) సంకల్పం ( 1957 ) వినాయకచవితి ( 1957 ) భలే అమ్మాయిలు ( 1957 ) సతి అనసూయ ( 1957 ) సారంగధర ( 1957 ) కుటుంబగౌరవం ( 1957 ) పాండురంగ మహత్యం ( 1957 ) అన్నాతమ్ముడు ( 1958 ) భూకైలాస్ ( 1958 ) శోభ ( 1958 ) రాజనందిని ( 1958 ) మంచిమనసుకుమంచిరోజు ( 1958 ) కార్తవరాయని కథ ( 1958 ) ఇంటిగుట్టు ( 1958 ) సంపూర్ణరామాయణం ( 1958 ) ( తమిళము ) అప్పుచేసి పప్పుకూడు ( 1959 ) రాజసేవై ( 1959 ) ( తమిళము ) రేచుక్క - పగటిచుక్క ( 1959 ) శభాష్ రాముడు ( 1959 ) దైవబలం ( 1959 ) బాలనాగమ్మ ( 1959 ) వచ్చిన కోడలు నచ్చింది ( 1959 ) బండరాముడు ( 1959 ) 60వ దశకం శ్రీవెంకటేశ్వరమహత్యం ( 1960 ) రాజమకుటం ( 1960 ) రాజమకుటం ( 1960 ) ( తమిళము ) రాణి రత్నప్రభ ( 1960 ) దేవాంతకుడు ( 1960 ) విమల ( 1960 ) దీపావళి ( 1960 ) భట్టివిక్రమార్క ( 1960 ) కాడెద్దులు ఎకరంనేల ( 1960 ) భక్తరఘునాథ్ ( 1960 ) ( గుజరాతి ) సీతారామకళ్యాణం ( 1961 ) ఇంటికిదీపంఇల్లాలే ( 1961 ) సతీసులోచన ( 1961 ) పెండ్లిపిలుపు ( 1961 ) శాంత ( 1961 ) జగదేకవీరునికథ ( 1961 ) కలిసిఉంటేకలదుసుఖం ( 1961 ) టాక్సీరాముడు ( 1961 ) గులేబకావలికధ ( 1962 ) గాలిమేడలు ( 1962 ) టైగర్ రాముడు ( 1962 ) భీష్మ ( 1962 ) దక్షయజ్ఞం ( 1962 ) గుండమ్మకథ ( 1962 ) మహామంత్రి తిమ్మరుసు ( 1962 ) స్వర్ణమంజరి ( 1962 ) రక్తసంబంధం ( 1962 ) ఆత్మబందువు ( 1962 ) శ్రీకృష్ణార్జునయుద్దం ( 1963 ) ఇరుగుపొరుగు ( 1963 ) పెంపుడుకూతురు ( 1963 ) వాల్మీకి ( 1963 ) సవతికొడుకు ( 1963 ) లవకుశ ( 1963 ) లవకుశ ( 1963 ) ( తమిళము ) లవకుశ ( 1963 ) ( హిందీ ) పరువూప్రతిష్ట ( 1963 ) ఆప్తమిత్రులు ( 1963 ) బందిపోటు ( 1963 ) లక్షాధికారి ( 1963 ) తిరుపతమ్మకథ ( 1963 ) నర్తనశాల ( 1963 ) మంచిచెడు ( 1963 ) కర్ణ ( 1964 ) కర్ణన్ ( 1964 ) ( తమిళము ) కర్ణ ( 1964 ) ( హిందీ ) గుడిగంటలు ( 1964 ) మర్మయోగి ( 1964 ) కలవారికోడలు ( 1964 ) దేశద్రోహులు ( 1964 ) రాముడు భీముడు ( 1964 ) సత్యనారాయణమహత్యం ( 1964 ) అగ్గిపిడుగు ( 1964 ) దాగుడుమూతలు ( 1964 ) శభాష్ సూరి ( 1964 ) బభ్రువాహన ( 1964 ) వివాహబంధం ( 1964 ) మంచిమనిషి ( 1964 ) వారసత్వం ( 1964 ) బొబ్బిలియుద్దం ( 1964 ) భక్తరామదాసు ( 1964 ) ( తమిళము ) భక్తరామదాస్ ( 1964 ) ( గుజరాతి ) నాదీఆడజన్మే ( 1965 ) పాండవవనవాసం ( 1965 ) దొరికితేదొంగలు ( 1965 ) మంగమ్మశపధం ( 1965 ) సత్యహరిశ్చంద్ర ( 1965 ) తోడూనీడ ( 1965 ) ప్రమీలార్జునీయం ( 1965 ) దేవత ( 1965 ) వీరాభిమన్యు ( 1965 ) విశాలహృదయాలు ( 1965 ) సిఐడి ( 1965 ) ఆడబ్రతుకు ( 1965 ) శ్రీకృష్ణపాండవీయం ( 1966 ) పల్నాటియుద్దం ( 1966 ) శకుంతల ( 1966 ) పరమానందయ్యశిష్యులకధ ( 1966 ) మంగళసూత్రం ( 1966 ) అగ్గిబరాట ( 1966 ) సంగీతలక్ష్మి ( 1966 ) శ్రీకృష్ణతులాభారం ( 1966 ) పిడుగురాముడు ( 1966 ) అడుగుజాడలు ( 1966 ) డాక్టర్ ఆనంద్ ( 1966 ) గోపాలుడు భూపాలుడు ( 1967 ) నిర్దోషి ( 1967 ) కంచుకోట ( 1967 ) భువనసుందరికథ ( 1967 ) ఉమ్మడికుటుంబం ( 1967 ) భామావిజయం ( 1967 ) నిండుమనసులు ( 1967 ) స్త్రీజన్మ ( 1967 ) శ్రీకృష్ణావతారం ( 1967 ) పుణ్యవతి ( 1967 ) ఆడపడుచు ( 1967 ) చిక్కడు - దొరకడు ( 1967 ) ఉమచండీగౌరీశంకరులకథ ( 1968 ) నిలువుదోపిడీ ( 1968 ) తల్లిప్రేమ ( 1968 ) తిక్కశంకరయ్య ( 1968 ) రాము ( 1968 ) కలిసొచ్చిన అదృష్టం ( 1968 ) నిన్నే పెళ్ళాడుతా ( 1968 ) భాగ్యచక్రం ( 1968 ) నేనేమొనగాన్ని ( 1968 ) బాగ్దాద్ గజదొంగ ( 1968 ) నిండుసంసారం ( 1968 ) వరకట్నం ( 1969 ) కథానాయకుడు ( 1969 ) భలేమాస్టారు ( 1969 ) గండికోటరహస్యం ( 1969 ) విచిత్రకుటుంబం ( 1969 ) కదలడు వదలడు ( 1969 ) నిండుహృదయాలు ( 1969 ) భలే తమ్ముడు ( 1969 ) అగ్గివీరుడు ( 1969 ) మాతృదేవత ( 1969 ) ఏకవీర ( 1969 ) 70వ దశకం తల్లాపెళ్ళామా ( 1970 ) లక్ష్మీకటాక్షం ( 1970 ) ఆలీబాబా 40 దొంగలు ( 1970 ) పెత్తందారులు ( 1970 ) విజయంమనదే ( 1970 ) చిట్టిచెల్లెలు ( 1970 ) మాయనిమాట ( 1970 ) మారినమనిషి ( 1970 ) కోడలుదిద్దినకాపురం ( 1970 ) ఒకేకుటుంబం ( 1970 ) తిరుదత్తతిరుడన్ ( 1970 ) ( తమిళము ) కన్నన్ వరువన్ ( 1970 ) ( తమిళము ) శ్రీకృష్ణవిజయం ( 1971 ) నిండుదంపతులు ( 1971 ) రాజకోటరహస్యం ( 1971 ) జీవితచక్రం ( 1971 ) రైతుబిడ్డ ( 1971 ) అదృస్టజాతకుడు ( 1971 ) చిన్ననాటిస్నేహితుడు ( 1971 ) పవిత్రహృదయాలు ( 1971 ) శ్రీకృష్ణసత్య ( 1971 ) శ్రీకృష్ణార్జునయుద్ధం ( 1972 ) కులగౌరవం ( 1972 ) బడిపంతులు ( 1972 ) ఎర్రకోటవీరుడు ( 1973 ) డబ్బుకు లోకం దాసోహం ( 1973 ) దేశోద్దారకుడు ( 1973 ) ధనమా దైవమా ( 1973 ) దేవుడుచేసినమనుషులు ( 1973 ) వాడేవీడు ( 1973 ) పల్లెటూరిచిన్నోడు ( 1974 ) అమ్మాయిపెళ్ళి ( 1974 ) మనుషుల్లోదేవుడు ( 1974 ) తాతమ్మకల ( 1974 ) నిప్పులాంటిమనిషి ( 1974 ) దీక్ష ( 1974 ) శ్రీరామాంజనేయయుద్దం ( 1975 ) కథానాయకునికథ ( 1975 ) సంసారం ( 1975 ) రామునిమించినరాముడు ( 1975 ) అన్నదమ్ముల అనుబంధం ( 1975 ) మాయామశ్చీంద్ర ( 1975 ) తీర్పు ( 1975 ) ఎదురులేనిమనిషి ( 1975 ) వేములవాడ భీమ కవి ( 1976 ) ఆరాధన ( 1976 ) మనుషులంతాఒక్కటే ( 1976 ) మగాడు ( 1976 ) నేరంనాదికాదు ఆకలిది ( 1976 ) బంగారుమనిషి ( 1976 ) మాదైవం ( 1976 ) మంచికిమారోపేరు ( 1976 ) దానవీరశూరకర్ణ ( 1977 ) అడవిరాముడు ( 1977 ) ఎదురీత ( 1977 ) చాణక్య చంద్రగుప్త ( 1977 ) మాఇద్దరికథ ( 1977 ) యమగోల ( 1977 ) సతీసావిత్రి ( 1978 ) మేలుకొలుపు ( 1978 ) అక్బర్ సలీమ్ అనార్కలి ( 1978 ) రామకృష్ణులు ( 1978 ) యుగపురుషుడు ( 1978 ) రాజపుత్రరహస్యం ( 1978 ) సింహబలుడు ( 1978 ) శ్రీరామపట్టాభిషేకం ( 1978 ) సాహసవంతుడు ( 1978 ) లాయర్ విశ్వనాథ్ ( 1978 ) కెడినంబర్ 1 ( K . D . No . 1 ) ( 1978 ) డ్రైవర్ రాముడు ( 1979 ) మావారి మంచితనం ( 1979 ) శ్రీమద్విరాటపర్వం ( 1979 ) వేటగాడు ( 1979 ) టైగర్ ( 1979 ) శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం ( 1979 ) శృంగారరాముడు ( 1979 ) యుగంధర్ ( 1979 ) 80వ దశకం చాలెంజ్ రాముడు ( 1980 ) సర్కస్ రాముడు ( 1980 ) ఆటగాడు ( 1980 ) సూపర్ మాన్ ( 1980 ) రౌడీ రాముడు కొంటె కృష్ణుడు ( 1980 ) సర్దార్ పాపారాయుడు ( 1980 ) సరదారాముడు ( 1980 ) ప్రేమసింహాసనం ( 1981 ) గజదొంగ ( 1981 ) ఎవరుదేవుడు ( 1981 ) తిరుగులేనిమనిషి ( 1981 ) సత్యంశివం ( 1981 ) విశ్వరూపం ( 1981 ) అగిరవ్వ ( 1981 ) కొండవీటిసింహం ( 1982 ) మహాపురుషుడు ( 1981 ) అనురాగదేవత ( 1982 ) కలియుగరాముడు ( 1982 ) జస్టిస్ చౌదరి ( 1982 ) బొబ్బిలిపులి ( 1982 ) వయ్యారిభామలు వగలమారిభర్తలు ( 1982 ) నాదేశం ( 1982 ) సింహం నవ్వింది ( 1983 ) చండశాసనుడు ( 1983 ) శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ( 1984 ) 90వ దశకం బ్రహ్మర్షి విశ్వామిత్ర ( 1991 ) సామ్రాట్ అశోక ( 1992 ) మేజర్ చంద్రకాంత్ ( 1993 ) శ్రీనాథకవిసార్వభౌమ ( 1993 )
" అంటే - ఎవరికైనా వారి పుట్టుకతో వచ్చిన ముఖం నచ్చకపోతే , వాళ్ళకిష్టమైన రీతిలో వాళ్ళ ముఖం మళ్ళీ చెక్కి సరిచేసే డాక్టరన్నమాట . "
కరెక్టే నవీను ! ! మాజా తాగేకన్నా బ్లాగడంలోనే ఉంది సిసలైన మజా …
@ ఉషగారు మీరన్నదానితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను . . ఎందుకంటే . . నార్త్ సైడు లేక ఇతరప్రాంతాల్లో చదివినవాళ్ళ గురించి వదిలేయండి . . నాకు తెలిసినవాళ్ళలోనే చాలా మంది తెలుగు చదవటంరానివారున్నారు . . నాకు మొట్టమొదట తెలుగులో రాయాలనిపించినప్పుడు నా కొలీగ్స్ కి నేను బ్లాగులు రాస్తాను అంటే . . ఎదీ ఒకటి చదివి వినిపించు అని అడిగారు . తెలుగు మరి . మీకు అర్ధంకాదు . . అని ఇంగ్లీషులో మార్చి వ్రాసి వాళ్ళకు పంపించడం జరిగింది . . , వాళ్ళకు ఒకమాదిరిగా అది నచ్చింది . . కానీ . . నాకు వున్న ఇంగ్లీషు జ్ఞానం తక్కువండీ . . విషయాన్ని చెప్పగలనుగానీ తెలుగులోవున్నంత అందంగా వర్ణించి రాయలేను అని నేను తెలుసుకున్నాను , అందుకే ఆ ప్రయత్నం ఎప్పుడూ చేయలేదండీ . . మీరన్నది నేను ఇలాంటి అందరికీ ఉపయోగపడతాయనుకున్న వాటికి అన్వయించుకుంటె . . అవి ప్రయత్నిస్తాను ఇంగ్లీషులో రాయటానికి . . ఎందుకంటే అందులో విషయమేగా ముఖ్యం వర్ణనకన్నా . . మీ చక్కటి సలహాకు ధన్యవాదములు . .
/ ఇలాంటి వాటిని ప్రభుత్వం మన్నిస్తూ పోతే , / ఏమంత నీచమైన , హేయమైన , నికృష్టమైన కోర్కెలు కోరాడని మీకు అనిపించిందా ? అవినీతిని అరికట్టమని అడగడమే అతిహేయమైన చర్యలా మీకనిపించిందా ? ! ! అవినీతిని రాజ్యాంగబద్ధమైన హక్కుగా సవరణ చేసేసుకుంటే పోలా ? హజారెని , రాందేవ్ , కిరణ్ , కేజివాలాలను మక్కెలిరిచి తిహార్ జైల్లో తొంగోపెట్టాలి , కని మొళి , రాజా , కల్మాడీలకు భారత రత్న ఇచ్చి సత్కరించాలి . 60ఏళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వముంటోంది , అవును మరి ఇప్పటికప్పుడు అవినీతి మీద చర్యలు తీసుకోండి అనడం అతి హేయమైన తప్పు . శిక్షించాల్సిందే ! - - - ఆచంగ గారు , మీరు మరీ అలా ప్రశ్నిస్తే ఎలా ? కాషాయం కట్టుకుంటే ఆ పైన ఎవరికో కార్పొరేట్ ఆసుపత్రిలో ఫ్రీగా ట్రీట్మెంట్ అందివ్వాలట ! ఫ్రీగా ఎవడన్నా పెట్టకుంటే వారికి అవినీతిపరుల్ని ప్రశ్నించే హక్కు ఆటోమేటీక్‌గా రద్దయిపోవాల్సిందే మరి ! : ) ) ఓవైసీ ఆసుపత్రిలో ఫ్రీగా కనీసం వాడేసిన బాండేజీ గుడ్డైనా వీళ్ళకి ఇస్తారేమో కనుక్కోవాలి వీళ్ళకి . ఫ్రీ మేతకు అలవాటుపడిన బ్రతుకులు .
ennela మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను "
కేంబ్రిడ్జ్ : భారత సంతతికి చెందిన అబ్దుల్ అరైన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ 108వ కులపతి పదవికి పోటీపడుతున్నారు . కేంబ్రిడ్జ్ వర్సిటీ కులపతి పదవికి ఎన్నికల్లో పాల్గొననున్న నలుగురిలో ' అల్ అమీన్ ' కిరాణా దుకాణం యజమాని అరైన్ కూడా ఒకరు . 802 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వర్సిటీ కులపతి ఎన్నికలు అక్టోబరు 14 , 15 తేదీల్లో జరగనున్నాయి . అరైన్ ( 46 ) కెన్యాలో జన్మించారు . ఆయన కుటుంబం మూలాలు జలంధర్‌లో ఉన్నాయి . ' ' కేంబ్ర . . .
గీతిక గారు , కరక్టే అండి , " యోగ్యతాపత్రం " లో కదా , సరి చేసినందుకు కృతజ్ఞతలు . మీ బ్లాగ్ చూసాను , చాలా బావుంది . ఇంకా పూర్తిగా చదవాలి .
నీతి వర్ధనుడు తన దేశాటన విశేషాలన్నిటినీ వివరించాడు . వర్తక శ్రేష్ఠితో స్నేహం , సముద్ర ప్రయాణం , తుపానులో దారి తప్పి కనీవినీ ఎరగని దీవికి చేరటం , అక్కడి ఆలయం , అందులోని అపురూప సుందరి గురించీ … ఏదీ దాచకుండా పూసగుచ్చినట్లు వర్ణించాడు . రాజు వంశమార్గుడికి ఆ దీవిని చూడాలనే కోరిక కలిగింది . ఓ రోజు , నీతి వర్ధనుణ్ణి వెంటబెట్టుకుని , తగిన సిబ్బందితో నౌకా ప్రయాణం ప్రారంభించి , గతంలో నీతి వర్ధనుడు చేరిన దీవికి ప్రయాణమయ్యారు . కొన్నిరోజుల తర్వాత ఆ దీవికి చేరారు . రాజు పరివారంతో గుడిలోకి ప్రవేశించాడు . అద్భుతమైన శిల్పాలతో అలరారుతున్న కోవెల అది . ఆవరణలో చెట్టు క్రింద నిదురిస్తున్న లావణ్య రాశిని చూశాడు రాజు . ఆమె చాలా అందంగా ఉంది . రాజుకి ఆమె పట్ల అనురాగం కలిగింది . అలికిడికి నిద్ర లేచిన ఆ యువతి , రాజుని చూసి ఆశ్చర్య పోయింది . రాజు వంశమార్గుడు తీయని మాటలతో తన ప్రేమను ఆమెకు తెలిపాడు . అతడి మాట తీరుకు , గంభీరమైన అతడి రూపానికీ ఆమె ముగ్ధురాలైంది . అంగీకార సూచకంగా ఆమె కళ్ళు మెరిసాయి . తనలో ' ఇతడు గొప్ప చక్రవర్తై ఉంటాడు . ఇతడి రూపురేఖ మన్మధుణ్ణి , రాచఠీవి దేవేంద్రుణ్ణి తలపిస్తున్నాయి ' అనుకొంది . మెల్లిగా తలెత్తి " ఓ రాజా ! నీవు రాజులలో ఇంద్రుడి వలె ఉన్నావు . నేను నీ ప్రేమని తిరస్కరించినట్లయితే , ఇంత అందమైన శరీరం కలిగి ఉండీ నిరర్ధకమే ! అయితే , నీవు కొంత సమయం వేచి ఉండక తప్పదు . రానున్న అష్టమి లేదా అమావాస్య వరకూ వేచి ఉండగలవు " అంది . అప్పటి వరకూ రాజు తన పరివారంతో కోవెలలోని దుర్గామాతని ఆరాధిస్తూ , ఆ యువతితో తీయని కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసాడు . అష్టమి రానే వచ్చింది . ఆమె కోవెలలో ఒక వత్రమాచరింప ప్రారంభించింది . అందుకోసం గుడి ఆవరణలోని పవిత్ర పుష్కరిణిలో స్నానానికి వెళ్ళింది . ఆ కోనేటిలో కలువలూ , తామరలూ ఉన్నాయి . నీరు స్వచ్ఛంగా ఉంది . సన్నని అలలతో మనోహరంగా ఉంది . రాజు " నీటిలో పసిబిడ్డని ఒంటరిగా విడిచి పెట్టరాదు . అదే విధంగా … అందమైన యువతినీ ఏ వేళలోనూ ఒంటరిగా ఉంచరాదు " అనుకొని , కత్తి చేతబూని , ఆమెకు కనబడకుండా ఆమెకి రక్షణగా ఉన్నాడు . అంతలో … భీకరమైన శబ్దం వచ్చింది . అదేమిటో గమనించే లోగానే , ఓ భీకరాకారుడైన రాక్షసుడు వచ్చాడు . అమాంతం ఆమెని ఎత్తి నోట్లో పెట్టుకు మింగేసాడు . ఒక్కక్షణం రాజు వంశమార్గుడు నివ్వెర పడ్డాడు . మరుక్షణం , ఆ రాక్షసుడి ముందుకు దూకి , ఒక్క ఉదుటున కత్తితో వాడి పొట్ట చీల్చాడు . అందులో నుండి ఆ యువతి సురక్షితంగా బయటపడింది . ఆశ్చర్యంగా చూస్తున్న రాజుతో ఆమె " ఓ రాజా ! నేను మృగాంకుడి పెద్ద కుమార్తెను . నా తండ్రి దేవసభలో ఇంద్రుడికి ప్రీతిపాత్రుడైన పండితుడు . నా పేరు మృగనయని ( జింక కన్నుల వంటి కన్నులు కలది అని ఆ పేరుకు అర్ధం . ) నా తర్వాత నా తండ్రికి నూరుగురు కొడుకులున్నారు . నా సోదరులందరి కంటే నా తండ్రికి నేనంటే అమిత ప్రేమ . ఏనాడూ నన్నూ చూడకుండా ఉండలేడు , నేను లేనిది భోజనమైనా చేయడు . ఆ రోజులలో ఓ అష్టమినాడు , నేను గౌరీ వ్రతాన్ని ప్రారంభించాను . దాంతో గుడిలో పూజాది కార్యక్రమాలు ఆలస్యం కావటంతో , ఆ రోజు భోజనానికి చాలా సమయం గడిచినా ఇంటికి వెళ్ళలేక పోయాను . నా తండ్రి నాకోసం చాలా సేపు వేచి ఉన్నాడు . అలసిపోయి , ఆకలితో ఎదురు చూస్తుండగా , నేను ఇల్లు చేరుకున్నాను . ఆకలితో వివశుడై ఉన్న నా తండ్రి కోపం పట్టలేక , నిగ్రహం కోల్పోయి , ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో , నన్ను " నీవు రాక్షసుడి చేత మ్రింగ బడెదవు గాక ! " అని శపించాడు . నేను కొయ్యబారి పోయాను . ఉత్తర క్షణం ఆయన కాళ్ళ మీద పడి విలపించాను . నా తప్పేమీ లేదనీ , ఆలయంలో పూజ ఆలస్యమైందనీ విన్నవించాను . శాపాన్ని ఉపసంహరించమని వినయంతో అర్ధించాను . దుఃఖాతిశయంతో వణుకుతున్న నన్ను చూసి , నా తండ్రికి తెలివి వచ్చింది . అప్పటి వరకూ దయ్యంలా ఆయన్ని పట్టి ఉంచిన క్రోధం ఒక్కసారిగా చల్లారింది . తానేం చేసాడో స్పృహ కలిగింది . నాకంటే వ్యగ్రంగా ఆయన దుఃఖించాడు . నన్ను దగ్గరికి తీసుకొని తల నిమురుతూ " నా చిట్టి తల్లి ! రాక్షసుణ్ణి చంపి నిన్ను కాపాడి ప్రేమించగల సాహసి నీకు తారసపడి నప్పుడు ఈ శాపం ముగుస్తుంది . అప్పటి వరకూ ఆ పార్వతీ దేవినే సేవించు . అయితే ప్రతీ అష్టమి , అమావాస్యలనాడు రాక్షసుడు వచ్చి నిన్ను మ్రింగుతూనే ఉంటాడు . మరునాడు రాక్షసుడు నిన్ను బయటకు కక్కుతాడు " అని శాప విమోచనం అనుగ్రహించాడు . ఆనాటి నుండీ , నేనీ ఆలయంలో దేవిని సేవిస్తూ , ఇక్కడే ఉంటున్నాను . ప్రతీ అష్టమికీ , అమావాస్యకీ రాక్షసుడి చేత మ్రింగబడుతూ , మర్నాడు విడుదల అవుతూ , నన్ను ఉద్దరించగల సాహస వీరుడి కోసం ఎదురు చూస్తూ గడుపుతున్నాను . ఇన్నాళ్ళకి నా పుణ్యం ఫలించి , నీవు వచ్చి రాక్షసుణ్ణి సంహరించి , నన్ను ఉద్దరించావు . ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉంది . ఓ రాజా ! నేను నీ సొత్తుని . నీవు నన్ను వివాహం చేసుకొని జీవితాన్ని ఆనందించ వచ్చు " అన్నది . ఆమె మాటలకు వంశమార్గుడెంతో ఆనందించాడు . మృగనయని నిష్టగా తన గౌరీ వ్రతాన్ని పూర్తి చేసింది . కోవెలలోని దుర్గామాత ఎదుట వారిద్దరూ వివాహం చేసుకున్నారు . మృగనయనితో కలిసి రాజు వంశమార్గుడు , మంత్రి నీతి వర్ధనుణ్ణి , ఇతర పరివారాన్ని వెంట బెట్టుకుని తిరిగి వారణావతం చేరుకున్నారు . రాణి చంద్రవదన నూతన వధూవరులకు స్వాగత సత్కారాలు చేసింది . నగరానికి చేరిన మరునాడు మంత్రి నీతి వర్ధనుడు ఉరిపోసుకుని చనిపోయాడు . ఇదీ కథ ! అని చెప్పిన భేతాళుదు " ఓ విక్రమాదిత్య మహారాజా ! ఇప్పుడు చెప్పు . నీతి వర్ధనుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ? మృగనయనిని పొందిన రాజుని చూచి ఈర్ష్య చెందాడా ? " అని అడిగాడు . విక్రమాదిత్యుడు అడ్డంగా తల నాడిస్తూ " భేతాళా ! నీతి వర్ధనుడికి రాజు పట్ల గానీ , అతడి అదృష్టం పట్ల గానీ ఈర్ష్యాసూయల వంటివి ఉన్నట్లుగా తోచదు . బహుశః అతడు ఇలా ఆలోచించి ఉండవచ్చు . ' చెడ్డవాడైన వ్యక్తికి నీతులు బోధించ రాదు . అది వ్యర్ధమైన పని . అదే విధంగా మిఠాయిలు ఇష్టపడే బాలుడికి మరిన్ని తీపి వస్తువులు ఈయరాదు . అది ఆ బాలుడి ఆరోగ్యానికి చేటు తెస్తుంది . అయితే నేను … ' అసలుకే స్త్రీ సౌందర్యం పట్ల మితిలేని మోహం గల వంశమార్గుడి ' కి , ఉన్న పట్టమహిషి చాలదన్నట్లు మరొక సుందరిని కట్టబెట్టాను . ఇప్పుడు ఖచ్చితంగా రాజు మరింతగా సుఖ భోగాలలో తేలియాడతాడే తప్ప రాజ్య వ్యవహారాలు చూడడు . దీనంతటికీ కారకుడను నేను గనుక ప్రజలు మళ్ళీ నన్ను నిందించక మానరు . ఇవేవీ ఆలోచించకుండా రాజుకు నేను ఏకాంత ద్వీపం గురించీ , అందులోని అందమైన యువతి మృగనయని గురించీ చెప్పి , రాజామెను వివాహమాడే పరిస్థితులు తెచ్చాను . ప్రజానింద భరింప శక్యం కానిది ' అనుకొన్నవాడై ఆత్మహత్యకు పాల్పడ్డాడు " అన్నాడు . భేతాళుడు " భళా విక్రమాదిత్యా భళా ! నీ సునిశిత మేధావిత్వానికి ఇవే నా జోతలు " అంటూ ప్రశంసిస్తూనే చప్పున మాయమై పోయాడు . చిరునవ్వు నవ్వుతూ విక్రమాదిత్యుడు మోదుగ చెట్టు వైపుకు దారి తీసాడు . కథా విశ్లేషణ : ఈ కథలో విక్రమాదిత్యుడు … ' మంత్రి నీతి వర్తనుడు ఎందుకు ఆత్మహత్య చేసుకోగలడు ? ' అనే ప్రశ్నకు సునిశితమైన ఆలోచనతో జవాబిస్తాడు . ఒక వ్యక్తి ఒక పనిని నిర్వహించడానికి ఏయే ' మోటివ్స్ ' ఉండగలవో , వాటి గురించి ఎలా ఆలోచించాలో పిల్లలకి నేర్పే కథ ఇది ! దాదాపుగా ఇప్పుడు మన ఆధునిక నేరపరిశోధక విభాగాలు పనిచేసే తీరు ఇది ! ఒక సంఘటన , ఓ దోపిడి , ఓ హత్య , ఓ నేరం … ఏది జరిగినా … ఎవరికి ఏ మోటివ్ ఉంది ? ఏ పరిస్థితి ఇందుకు దారి తీసింది ? - అనే కార్యకారణ సంబంధాన్ని ఛేదించే ఆలోచనా విధానం ఇది ! ఇలాంటి కథలు పిల్లలకి , ఆడుతూ పాడుతూ , చదువుతూ , వింటూనే , వాళ్ళకి తెలియకుండానే వారిలో సునిశిత ఆలోచనా శక్తిని ప్రేరేపిస్తాయి . ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~
గురువుగారు , మీ మొదటి సీసపద్యం నా బ్లాగుకోసం రాసినందుకు ధన్యవాదములు . మీ పద్యం సూపర్ . మీరు కాస్త రాయడం తగ్గించి అంటే వారానికి ఒక టపా బదులు ఒక పద్యమో లేక మంచి సినిమా పాటో వినిపించండి . అంతే . .
నిజం చెప్పొద్దూ ! ఇప్పటికీ ఈ దేశంలో పేపరు కొనడం దండగే అని అనిపిస్తుంటుంది , రంగనాధానికి . దానికి కారణాలు వేరే ఉన్నాయనుకోండి - కానీ , ఇప్పటికీ ప్రతిరోజూ పేపరు తెప్పించడం , పేజీలు అన్నీ యధావిధిగా తిప్పి బాధపడుతూనే ఆ పేపర్ని చెత్త బుట్టలో పారెయ్యడం మానలేదు .
కల్పవృక్షం అంటే మళ్ళీ రామాయణ కల్పవృక్షం అనుకుంటున్నారా ఏంటి ? కాదు , ఇది వేరే కల్పవృక్షం . అదేమిటో తెలియాలంటే ఈ పద్యం చదవండి : పత్రపత్రంబునకు మంచిఫలముగల్గి కవుల దనుపుచు నర్థసంగ్రహణబుద్ధి రోసి డస్సినవారల గాసిదీర్చు గల్పవృక్షంబుగాదె నిఘంటువరయ ! ఇది శ్రీ పాలూరి శంకరనారాయణగారు వ్రాసిన పద్యం . పత్రం అంటే రెండర్థాలు . ఒకటి ఆకు . రెండు కాగితం . అలాగే ఫలము అంటే పండు , ప్రయోజనము . పత్ర పత్రానికి మంచి ఫలం ఉండేది కల్పవృక్షం . కోరిన కోరికలన్నిటినీ ఫలింప జేసేది కాబట్టి . అలాగే ప్రతి కాగితమూ ప్రయోజనవంతంగా ఉండే పుస్తకం ఒకటుంది . అది కవులని తృప్తిపరుస్తూ ఉంటుంది . అర్థాలు తెలుసుకొనే ప్రయత్నంలో అలసిపోయేవారికి చెట్టులా సేదదీరుస్తుంది కూడా . అర్థవంతమైన కవిత్వాన్ని వ్రాసేందుకు కవులకూ , ఆ కవిత్వాన్ని అర్థం చేసుకునేందుకు పాఠకులకూ కూడా ఉపయోగపడుతుందన్న మాట ! అవును అదే నిఘంటువు . ఇప్పుడు చాలామంది తెలుగువాళ్ళకు దాని అర్థం తెలియాలంటే దాన్నే ఆశ్రయించాలేమో ! తేలిక భాషలో చెప్పాలంటే డిక్షనరీ . సరే మరి ఆకుల్లేకుండా పళ్ళు మాత్రమే ఉన్న చెట్లెక్కడైనా ఉంటాయా ? మనిషి టెక్నేంద్రజాలానికి ఆ మాత్రం సాధ్యం కాకుండా పోతుందా ! జంతర్ మంతర్ అంతర్జాలంలో ఉన్న డిక్షనరీలన్నీ " అపర్ణలే " ( అంటే కాగితాలు లేనివే ) కదా . తెలుగులో ఇప్పటికే బ్రౌన్ డిక్షనరీ అంతర్జాలంలో ఉన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది . కనీసం నా బ్లాగులో పద్యాలు చదివేవాళ్ళు , నేను పొద్దులో ఇచ్చే గడితో కుస్తీ పట్టేవారు ఈ బ్రౌణ్యాన్ని ఉపయోగించే ఉంటారు . ఇప్పుడు వీళ్ళందరికీ దొరికిన మరో వరం ఆంధ్రభారతి నందనవనంలో కొత్తగా వెలసిన నిఘంటు కల్పవృక్షం . ఇందులో బ్రౌణ్యమే కాకుండా , శబ్దరత్నాకరం , మరి రెండు ఇంగ్లీషు - తెలుగు నిఘంటువులు కూడా కలిపి ఉన్నాయి ! ఈ నిఘంటువుల నుండి విడివిడిగా కాని అన్నిట్లో కలిపి కానీ కావలసిన పదాలను వెతుక్కోవచ్చు . ఆ వెతుకులాట పదాలలో ( ఆరోపాలలో ) కాని , మొత్తం వాటి అర్థాలలో ఎక్కడైనా కాని చేసుకోవచ్చు . శొధన ( అదే , తెలుగు భాషలో చెప్పాలంటే సెర్చి ) సులువు చేసుకోడానికి మరెన్నో వెసలుబాట్లు కూడా ఉన్నాయక్కడ . ఇంకెందు కాలస్యం , వెంటనే ఆ ఫలాలని ఆరగించడం మొదలుపెట్టండి ! అన్నట్టు మరో విషయం . ఇది ఇంకా ఎదుగుతున్న చెట్టు . అంటే ఇందులో మరెన్నో నిఘంటువులు చేరబోతున్నాయన్న మాట ! బ్రౌను డిక్షనరీ ఒక యూనివర్సిటీ వాళ్ళ కృషి ఫలితమైతే , ఈ కొత్త నిఘంటువు కేవలం ఇద్దరి కృషి ఫలితం . వారు శ్రీ వాడపల్లి శేషతల్ప శాయిగారు , శ్రీ కాలెపు నాగభూషణ రావుగారు . వారి వెనక అజ్ఞాతంగా మరెవరైనా ఉన్నారేమో తెలియదు . తెలుగు మీద అభిమానమున్న వాళ్ళందరూ వారి కృషికి జోహార్లు చెప్పాల్సిందే . మన వంతు సహాయం కూడా చెయ్యవచ్చు . ఎలాగో అక్కడున్న Aboutలో ఇచ్చిన్న వివరాలని చూడండి . పూర్తిగా చదవండి . . .
అప్పటిదాకా అరవిరిసినట్లున్న దొరసాబ్ వదనం అవి చెవినబడగానే ఆముదం తాగినట్లయింది .
- మొరాకో . రాజధాని రాబాత్ . పెద్ద్ద పట్టణం కాసా బ్లాంకా
పబ్లిష్ అయిన ఐదు నెలెలకి ప్రియ లింకిస్తున్నది . అనుకుంటున్నారా ? హేం చేస్తాం ! నాకసలే బద్ధకం . ఇంతకు ముందు చెప్పా కదా . . . నేనొక తింగిరి అని . ( మీరన్నారంటే ఊరుకోను . Grrrrrrrrrrrrrrrr ) ; - )
రెండుకు సంబంధించిన పదాలను ఇతర భాషలలో పరిశీలిస్తే , మనకు ఇరు / ఈరు / ఇరంటు అన్నది మూలధాతువని గ్రహించవచ్చు . ప్రాచీన తమిళంలో మళయాళంలోనూ ఇరంటు , రంటు అంటే రెండు . కన్నడలో ఎరడు . బ్రాహుయీలో ఇరట్ , గోండిలో రండ్ , నాయకీలో ఎరండి .
శ్రీరాములుని ఆదర్శంగా భావించడంలో ముఖ్యమైన సూత్రం ఈ భజనలో గోచరిస్తుంది . శ్రీరాములవారు పతిత పావనుడు అంటే అతి సామాన్యుడిని కూడా ఉద్ధరించగలిగే ' ' రాజారాముడు ' ' ! రాజుల ముఖ్య కర్తవ్యం ( సామాన్యుణ్ణి వేధించి , పన్నులు వేసి , దోచుకోవడం , సంపన్నులనే కాపాడి , సామాన్యులను విస్మరించడం అనేది కానేకాదు ) సామాన్యుడు సైతం అన్నవస్త్రాలకీ , గూడుకీ లోటులేకుండా సుఖజీవనం గడపడం , దానికి తగిన పరిపాలన చేయడం ! ! పరిపాలకులలో సామాజిక న్యాయం , సాంఘిక ధర్మం నిలబెట్టే ఆలోచనే వుండాలి తప్ప - జాతి , మత , కుల , వర్ణ , వర్గ , పేద , ధనిక విభేదాలూ , పక్షపాతాలూ ఉండకూడదు . అదే రామరాజ్యంలో కీలకాంశం ! అదే మహాత్మాగాంధీకి ప్రీతిపాత్రమైన సందేశం ! ప్రపంచ దేశాలకు ఈ సందేశాన్నందించి ఈనాటికీ మహాత్మునిగా చెరగని ముద్రవేసుకున్న గాంధీ ధన్యజీవి ! భారత దేశ చరిత్రలో మైలురాయిగా నిల్చిపోయే మహోన్నత వ్యక్తిత్వం ఆయనది !
@ శ్రీనివాస్ పప్పు గారు : మీరు చెప్పినది కరెక్టేనండీ . . . . నేను పోస్ట్ ఓన్ గా రాసేయడమే తప్ప ఎవరిని సంప్రదించను . . అందుకే ఆ చిన్న మిస్టేక్ . . . . ఆ మిస్టేక్ పొరపాటున రాసింది కాదు . Half knowledge తో రాసింది మాత్రమే . . మీరు చెప్పిన ఆ ఉప్పు కళిక తీసేసి పంచదార గుళిక వేసాను చూడండీ . . . . మీ సలహా చాలా అమూల్యమైనది . . . అందుకే ఇలాంటి సలహాలు నాకు చాలా అవసరం . . మిస్టేక్స్ వచ్చినప్పుడు కష్టమనుకోకుండా చెబుతూ ఉండండీ . . మీ కామెంట్ పబ్లిష్ చేయడం లేదు ( అర్ధం చేసుకోగలరు ) . మీరు వేరే కామెంట్ ఇస్తే హేపీ గా పబ్లిష్ చేస్తా
లికిన ప్రతి అక్షరమూ గతంలోకి జాఱుకుంటుంది . ఇహ వాటి సమ్మేళనాలకి ( పదాలకి ) అర్థమేంటి ? ప్రతి పదమూ ఒక గడిచిపోయిన అనుభూతికి సంకేతం . మఱి అవి నవనవోన్మేష వర్తమానానికెలా పనికొస్తాయి ? ప్రతి వ్యక్తీకరణా ఇతరుల నుంచి అఱువు తెచ్చుకున్నదే . అటువంటప్పుడు మనదంటూ వాటిల్లో ఏముంది ? ఏ అనుభూతీ మన స్వోపజ్ఞం కాదు , యాదృచ్ఛికమే తప్ప . దాన్ని వ్యక్తీకరిస్తే మాత్రం స్వంతం చేసుకోగలమా ? ఆలోచనలకి మాటలు అచ్చమైన ప్రతిబింబాలే అయితే చెప్పినంత మాత్రాన అవతలివారికి అవి ఎందుకు అందడం లేదు ? వారెందుకు మారడం లేదు ? ఆలోచన అనే ప్రతి ఎండ్రకాయ పదసంతానాన్ని కన్నవెంటనే ఎందుకు మరణిస్తోంది ప్రసవ వేదనలో ? అనుభూతులు వాటి ననుభవించనివారి ముందు వ్యక్తీకరిస్తే బూతులుగానే మిగుల్తున్నాయెందుచేత ? మాటల వల్ల చెలరేఁగే ఘర్షణల్నీ , అంతస్సంఘర్షణల్నీ ఆ మాటలతోనే ఉపశమింప జేయాలనుకోవడం తెలివైన పనేనా ? మాటలు రాజ్యమేలడం మానేస్తే యుద్ధభూములు చర్చించుకుంటాయా ? మాటలకి మనం వేసిన నెమలి సింహాసనాల్ని ఏ నాదిర్‌షా అయినా దాడిచేసి ఎత్తుకుపోతే బావుండును . మాట మారితే మతం మారుతోంది . మాట మారితే రాజకీయం మారుతోంది . మాట మారితే మనసు మారుతోంది . మాట మారితే మంచీ చెడూ తాఱుమాఱవుతున్నాయి . అనుభూతుల నుంచి మాటలు పుట్టడం మానేసి అవే అనుభూతుల్ని కలిగించే స్థాయికొచ్చేశాయి . అలా మన మాటలు ఉన్నవాటికి ప్రాతినిధ్యం వహించడం మానేసి లేనివాటిని అపర విధాతలై సృజిస్తున్నాయి . అవి వరమిచ్చిన శివుణ్ణే భస్మం చెయ్యబోయిన భస్మాసురుణ్ణి తలపిస్తున్నాయి . మాటలు సృష్టించిన ఒక వితథ్య ప్రపంచం ( virtual world ) లో మనం శతాబ్దాల తరబడి జీవించాం , కంప్యూటర్‌లు పుట్టకముందే ! ఇప్పటికీ అలా జీవిస్తూనే ఉన్నాం . మనం బాగా ప్రవర్తించడం మానేసి బాగా మాటలాడడం నేర్చుకున్నాం . మనం మంచి ఆలోచనల్ని అభ్యసించడం మానేసి మంచిమాటల్ని మాత్రం దిట్టంగా భట్టీయం పట్టుతున్నాం . ఈ మాటల పిచ్చాసుపత్రిలోని రోగులతో వ్యవహరించడం కోసం అందఱమూ మాటల సైకియాట్రీ నేర్చుకుంటున్నాం . అలా కొత్తదనం లేని , ఒకదాన్నొకటి ప్రతిఫలించే పాత మాటలనే కళాయి వెలిసిన అద్దాల మధ్య కాపరం చేస్తున్నాం . మన నీడలతోనే మనం నేస్తం చేస్తున్నాం . మాటల మంచుని కఱిగించి నీరవ నిశ్శబ్దపు టెండలో వస్తువుల్ని వస్తువులుగా , ఘటనల్ని ఘటనలుగా , మనుషుల్ని మనుషులుగా నిర్మలంగా , నిరాడంబరంగా చూసే రోజు తనంతట తానొస్తుందా ? మనమే ప్రయత్నం చేసి రప్పించుకోవాలా ? మాడు పగిలినా సరే , మానవ మనస్సు సత్యాన్ని కనుగొనడానికే తపిస్తుంది . సత్యాలు సైతం మాటల అద్దాల్లో రంగుమారి , పల్చబడి , బక్కచిక్కి అసత్యాల్లా కనిపిస్తాయి . శక్తి నిస్తాయనుకొని మాటల్నీ , పేర్లనీ , బిరుదాల్నీ నాశ్రయించాక అవి కొంతకాలానికి మనకి శక్తి నివ్వడం మానేసి అవే మనకన్నా శక్తిమంతమైపోతే ? మనం మనం కావడం మానేసి అవే మనమైపోతే ? వాక్కులు మనల్ని అవాక్కు కావిస్తే ? అద్భుతదీపంలోని రాక్షసుడు అల్లాఉద్దీన్‌మాట వినకుండా అతన్నే ఎదిఱిస్తే ? సమాజం నేర్పిన మాటలనే విదేశీ సైన్యాలు మనస్సుని దురాక్రమించక ముందు నిశ్శబ్ద ఊహలపై నర్తించిన యోచన యొక్క నిరంజన కేవలస్థితి మళ్ళీ కావాలి . మధుర స్మృతులన్నీ మాటలు లేకుండా అనుభవించిన స్థితులే కాదా ? మాటలు బాహ్యపరిసరాలకి మాత్రమే పరిమితమై లోపల్నుంచి వాటి ప్రతిధ్వనులు వినిపించడం నిల్చిపోయినప్పుడు ఏర్పడే ఆ ఏకాగ్రత కావాలి . మాటల్ని మఱచినప్పుడు మనస్సు కూడా తనంతట తానే మఱుగున పడుతుంది . దాన్తో పాటే దాని ప్రేమలూ , ద్వేషాలూ అన్నీ ! ఆ ప్రశాంతిని , ఆనందాన్ని మనిషి కనుగొనాలి . ఎందుకంటే ప్రశాంతికీ , ఆనందానికి నిజమైన అర్థం ఏకాగ్రతే . మనం మనుషులతో మాట్లాడ్డం మానేస్తే ప్రకృతి మనతో నేరుగా మాట్లాడ్డం మొదలుపెడుతుంది .
ఇన్నయ్య గారు , మీవల్ల మాకు రేఖామాత్రంగా తెలిసిన వారి గురించి చాలా విషయాలు విశదంగా తెలుస్తున్నాయి . కానీ అచ్చుతప్పులు ఇబ్బంది పెడుతున్నాయి . అప్పటిలాగా ఇవ్వాళ సాహితీవాతావరణం ఎందుకు లేదో ఒక్కటపాలో రాయగలరా ? ?
ఆ కోరిక తీరటానికి పదిహేనేళ్లు పట్టింది . ఉద్యోగ రీత్యా అమెరికా వచ్చాక ఈ దేశంలో నేను చూసిన మొట్టమొదటి పర్యాటక స్థలం యూనివర్శల్ స్టుడియోస్ . డ్రైవింగ్ సరిగా వచ్చీ రాక ముందే బే ఏరియా నుండి హాలీవుడ్ వరకూ - రమారమి ఆరొందల యాభై కిలో మీటర్లు - కారేసుకెళ్లి మరీ చూసొచ్చాను . మారుతీరావు గారు వర్ణించిన కొన్ని ఆకర్షణలు నేను చూసేనాటికి ఎత్తివేయబడి , వాటి స్థానంలో కొత్తవి చోటు చేసుకున్నాయి . స్టుడియో టూర్ , స్పెషల్ ఎఫెక్ట్స్ స్టేజెస్ వంటి కొన్ని ' నిత్యాకుపచ్చ ' ఆకర్షణలు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి . మొదటిసారిగా అవి చూస్తుంటే ఆయన వర్ణనే నా కళ్ల ముందు మెదిలింది . ఆ తర్వాత , గత పదేళ్లలో , మరో ఆరు సార్లు యూనివర్సల్ స్టుడియోస్ సందర్శించాను నేను ( మారుతీరావు గారు నా పేరు చెప్పి యూనివర్సల్ వాళ్ల దగ్గర రిఫరల్ ఫీజు వసూలు చెయ్యొచ్చు ) . వెళ్లిన ప్రతిసారీ నాకు మొదటిసారి చూసినప్పటి అనుభూతే కలుగుతుంది .
1 . అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా ? అమెరికా రావటం మాత్రమే కాకుండా " అమెరికా నా దేశం " అని విశ్వసించి ఇక్కడ జీవితం గడిపే అందరి తెలుగువారి జీవితాల్లో జీవితం పట్ల మార్పు వస్తుంది ! ప్రతి వ్యక్తికి కొత్తవి , గొప్పవి అయిన అనుభవాలు కలిగినప్పుడల్లా జీవితం పట్ల దృష్టి మారుతూనే ఉంటుంది . నా విషయంలో కూడా అంతే ! అమెరికా రాక ముందు ఎనిమిదేళ్ళు ముంబాయిలో గడిపిన నా జీవితం కొన్ని మార్పులకు గురి కావటం ఒక అధ్యాయం అనుకుంటే అమెరికా జీవితం మరొక పెద్ద అధ్యాయం . అయితే మామూలుగా మనకి పరిచయమైన ఒక సమాజంలోని అనుభవాల వల్ల జీవితం పట్ల కలిగే మార్పుల కన్నా మరొక దేశం రావటం , పరిచయం లేని ఒక కొత్త సంస్కృతి పరిచయం కావటం వల్ల కలిగే అనుభవాలు తప్పకుండా జీవిత గమనాన్ని మారుస్తాయి . ఈ మార్పు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కోలా ఉండొచ్చు . రచయితకి తన రచనల్లో ప్రేరణకి జీవితమే ముడి సరుకు అయినప్పుడు అమెరికా జీవితం ఎంతో పెద్ద ముడి సరుకు . ఇది అమెరికా పెద్ద దేశం , ఒక సూపర్ పవర్ కావటం వల్లనే కాదు . ఇక్కడి జీవితం ఎంతో వైవిధ్యమైనది . అనేక సంస్కృతుల కలబోత ఇక్కడి జీవితం . నిశిత దృష్టితో చూడగలిగే వారికి చెప్పాలనుకునే విశేషాలు ఎన్నో ! అందరికీ తేలికగా కనపడే వస్తుపరమైన ఇక్కడి సమాజం వెనుక పైపైకి బులబులాగ్గా కనపడని జీవితం - అందుకు సంబంధించిన ఎన్నో మానవతా విలువలు ఈ సంస్కృతిలో దాగి ఉన్నాయి . ఒక తెలుగువాడిగా ఇతర తెలుగు వారితో మాత్రమే పరిచయాలు పెంచుకొని చూస్తే అమెరికా జీవితాన్ని విశాలంగా చూడలేము . అటువంటి విశాలమైన జీవితాన్ని చూడటం కోసం నేను ప్రత్యేకంగా కొన్ని ప్రయత్నాలు చేసాను . ఆ ప్రయత్నాల వల్లే జీవితం పట్ల నా దృష్టి మారిందని నేను అనుకుంటాను . 2 . ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తం అయ్యింది ? ఒకటి రెండు ఉదాహరణలు ఇవ్వగలరా ? మొదటి విషయం . నేను ఎక్కువగా రాసిన వ్యక్తిని కాదు . నా రచనలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు . ఐతే గత పాతికేళ్ళుగా అమెరికాలో గడిపిన జీవితం వల్ల నా అనుభవాలు అమెరికన్ తెలుగు మిత్రుల అనుభవాల్లాగే వైవిధ్యం ఉన్నవి . అందుకు తోడు అమెరికా నుంచి మూడేళ్ళ కోసం వృత్తి రీత్యా కుటుంబంతో కలిసి ఫ్రాన్స్ బదిలీ అవటం వల్ల పాశ్చాత్య జీవితాన్ని కొంచెం లోతుగా చూసే అవకాశం వచ్చింది . అవి నా రచనల్లో ఒకటీ , రెండు చోట్ల అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం చేసాను . మొదటి ఉదాహరణ : ఈ ఆలోచనలతో మిత్రులతో కలిసి పన్నెండేళ్ళ క్రితం ప్రారంభించిన ఈ - పత్రిక " ఈమాట " . ఈ ఈ - పత్రిక ఒక ధ్యేయం అమెరికాలో తెలుగు రచయితలు ఇక్కడి జీవితంపై తమ అభిప్రాయాలను సాహిత్యపరంగా ఎలా ప్రకటిస్తారో తెలుసుకోవాలన్న తపన . ఈ విషయమై నేను స్వయంగా ఎక్కువ రచనలు చెయ్యకపోవచ్చు కాని , నా మిత్రులతో పాటు నా ఉత్సాహం మాత్రం ఈ దిశలోనే ఉండేది . ఉంది . అప్పుడప్పుడు నేను రాసిన కొన్ని ఈమాటలోని నా రచనలు ఈ అంశాన్ని స్పృశించాయనే అనుకొంటున్నా . రెండవ ఉదాహరణ : " నా ఫ్రాన్స్ అనుభవాలు " అన్న పేరుతో కొంచెం విపులంగానే నా ఒక్క అనుభవాలే కాక నా భార్యా పిల్లలు కలిపి పొందిన అనుభవాలను అమెరికాలో ఒక వెబ్ పత్రికలో ప్రచురించారు . కొన్ని మార్పులతో అవే అనుభవాలను " ఆల్ప్స్ అంచున మూడేళ్ళు " అన్న పేరుతో ఆంధ్రాలో ఒక ప్రముఖ పత్రికలో ప్రచురించబడ్దది . ఇక్కడ ముఖ్యాంశం ఏమిటంటే అంధ్రదేశంలో పుట్టి పెరిగిన నా వంటి ఒక తెలుగువాడు ఇరవై సంవత్సరాలు అమెరికాలో జీవితం గడిపి ఫ్రాన్స్ లో ఉన్న జీవితాన్ని ఎలా చూస్తాడో తెలుగులో చెప్ప ప్రయత్నించాను . చిత్రమైన విషయం ఏమిటంటే అమెరికా జీవితపు మూలాలు నాకు నా ఫ్రాన్స్ జీవితంలో అనుభవం అవటం ఎక్కువైంది . ఇవి చదువుదామనుకున్న వారు ఈ లింక్ నొక్కండి . ( http : / / www . eemaata . com / em / issues / 200709 / 1142 . html ? allinonepage = 1 ) . 3 . ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు మీరు ఆంధ్రాలో ఉండగా చేసిన రచనకి ఏ విధంగా భిన్నమైనవి ? నేను ఆంధ్రాలో ఉండగా ఏమీ రచనలు చెయ్యలేదు . కాకపోతే అక్కడ విసృతంగా పుస్తకాలు చదివేవాడిని . ఇతరులతో చర్చించేవాడిని . నిజానికి అమెరికా వచ్చాకే తెలుగులో రాయాలని ( వేరే భాషలు , సంస్కృతుల పరిచయాలు కలిగినప్పుడు వారు తమ తమ భాషలను , సంస్కృతులను నిలుపుకోటానికి చేసే ప్రయత్నాలు నాకు ఈ దిశగా ప్రేరకాలు ) బలమైన కోరిక మొదలైంది . 23 ఏళ్ళ వయస్సులో ఆంధ్రదేశాన్ని వదలటం జరిగింది . అప్పటి దాకా చదువులు , పరీక్షలతోనే కాలం సరిపోయింది . సాహిత్యం పట్ల మక్కువ ఉన్నా రచనా వ్యాసాంగాన్ని మాత్రం మొదలెట్టలేదు . అసలు తెలుగులో రాయాలని అప్పట్లో నాకు అనిపించలేదు . తెలుగు భాష విలువ కూడా అప్పటి వరకు అందరి కుర్రకారు లాగే నాకూ తెలియ లేదు . 4 . అమెరికాలో ఉన్న తెలుగు రచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలేమిటి ? అమెరికా జీవితాన్ని తెలుపుతూ వచ్చే రచనలు చెయ్యాలని ఒక పెద్ద తాపత్రయం . అందుకు ఒక ముఖ్య కారణం ఇప్పటి వరకూ ఈ విషయంలొ చెప్పుకో తగ్గ రచనలు రాసిలోనూ వాసిలోనూ రాలేదనే చెప్పాలి . అలా అని ఈ దిశగా పెద్ద ప్రయత్నాలు జరగలేదని కాదు . అయినా తగినంతగా అమెరికా తెలుగు సాహిత్యం పెరగలేదనే చెప్పాలి . అంతో , ఇంతో రాయగలిగిన వ్యక్తులు కొద్ది మంది మాత్రమే ఉన్నారు . ఎక్కువగా యువ రచయితలు , రచయిత్రులు కనపట్టం లేదు . ఎప్పుడైనా సాహితీ సదస్సులకి వెడితే కనపడేవి తెలిసిన ఈ కొన్ని మొహాలు మాత్రమే ! అసలు ప్రశ్న ! అమెరికా తెలుగు రచయిత ఎవరు ? అమెరికాలో ఉండి ఏ విషయం మీద అయినా తెలుగులో రచనలు చేసేవారు అని అర్ధం చెప్పుకుంటే భవిష్యత్తు గురించి నా అలోచనలు ఇలా ఉన్నాయి . అమెరికాలో తెలుగులో రచనలు చేస్తున్నవారు రెండు రకాలు . చాలా కాలం క్రితమే , అంటే దాదాపు పదేళ్ళ క్రితమే , అమెరికా వలస వచ్చి కుటుంబంగా ఇక్కడ స్థిరపడిన తెలుగు రచయితలు చాలా కాలంగా తెలుగులో రచనలు చేస్తున్నారు . వీరి సంఖ్య ఎక్కువ లేకపోయినా ( నా ఉద్దేశ్యంలో వీరి సంఖ్య 30 , 40 కి మించదు ) క్రమం తప్పకుండా వీరి రచనలు ఈ - పత్రికలు , బ్లాగులు మాత్రమే కాక అచ్చు మాధ్యమంలో ప్రచురించబడే సావనీర్లు , అమెరికా తెలుగు సాంస్కృతిక సంఘాల ప్రచురణల్లో కనపడతాయి . ఇక రెండో వర్గం కొత్తగా వలస వచ్చిన , వస్తున్న యువతరం . వీరిలో కొన్ని పేర్లు నాకు పరిచయమైనా వీరి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తోచదు . నిజానికి అమెరికా తెలుగు రచయితల భవిష్యత్తు నిర్ణయించేది ఈ 20 , 30 సంవత్సరాల వయస్సులో ఉన్న ఈ యువతరం మాత్రమే . వీరి ఆలోచనలు పాతతరం కన్న కొత్తగా ఉండటమే కాకుండా పాతతరం అలవాటు పడ్డ ధోరణి మూసలోంచి బయటకు లాగగలిగే శక్తి ఉన్నది ఈ యువతరానికి . వ్యక్తిగా , ఒక తెలుగు రచయితగా ఈ యువతని ప్రోత్సాహపరిస్తే భవిష్యత్తు బాగుంటుంది అని తోస్తుంది నాకు . మరి ఇది సాధించటం ఎలా ? సాహిత్య సభల వల్ల , సత్కారాల వల్ల ఇది సాధ్యం అవుతుందని నేను అనుకోను . అలాగే ఈ - పత్రికలు , బ్లాగులు మొదలైన అంతర్జాల మాధ్యమాలు ఇందుకు సాయపడచ్చేమో గాని ఈ విషయంలో దిశానిర్ధారణ చేయ్యగలవని నేను అనుకోను . ఈ విషయంలో మిత్రుల ఆలోచనలు , సూచనలు తెలుసుకోటం మంచిది .
మరొక గడిని కంటున్నది తెలంగాణ . కూలిపోయిన గడి మళ్లీ మొలుస్తున్నది . గడి కోటగోడలు బద్దలు కొట్టింది తెలంగాణ . అరవై ఏళ్ల కిందటి మాట . తట్టు ఆరామ్ కుర్సీ . . తక్తు బల్ల . . కండ్లద్దాలల్ల నుంచి కిందకి మీదికి చూసే పట్వారీ , పటేల్‌లు . మీసం మెలేసే దొరల గడీలు కూల్చింది తెలంగాణ . వీర తెలంగాణ విప్లవ పోరాటం . వేల మంది ప్రాణాలను బలిచ్చిన తెలంగాణ . గడిని నేలమట్టం చేసింది . కానీ . . తెలంగాణలో ప్రజారాజ్యం రాలేదు . తెలంగాణ వెతుకులాడిన ఆత్మ దొరకలేదు .
కామ్రేడ్ సుబ్బరాజు క్యూబా విప్లవ 50వ వార్షికోత్సవం సందర్భంగా అభినందన తీర్మానం ప్రవేశపెట్టారు . ఇప్పటికింకా అసంరా క్యూబాపట్ల ఆర్థిక దిగ్భంధనం కొనసాగిస్తూందని , దీన్ని ఆపాలని ఆ తీర్మానంలో కోరారు . క్యూబా రాయబారి కార్యాలయం అధికారి దీనిపై స్పందిస్తూ ఇస్కఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు . అన్ని దేశాలతోనూ క్యూబాకు మంచి సంబంధాలున్నాయనీ , తాము అంతర్జాతీయతా వాదులమనీ , ఆఫ్రికాలోని చాలా దేశాల్లో తన డాక్టర్లు ఉచిత సేవలందిస్తున్నారనీ , అమెరికా విధానాలు ఏ ఒక్క వ్యక్తి చేతిలో లేవనీ అన్నారు . తమకు సంఘీభావం తెలిసిన ఇస్కఫ్ బాధ్యులకు ధన్యవాదాలు తెలిపినారు .
ఒకటి కాదు , రెండు కాదు . . ! కాగితం . . మొత్తం కలలన్నిటినీ అక్షరాల రూపంలో తాగేసింది . . ఊహలు పుట్టినప్పటినుండీ పెరుగుతున్నంత కాలం కూడా ఇదే జరుగుతోంది . . సిరా చుక్కలుగా రూపాంతరం చెందడం అదే పుస్తకంలో కలిసిపోవడం . . వాటి చరిత్రను అక్కడే రాసుకోవడం . . అప్పుడప్పుడూ తెరచి చదువుకోవడం . . ఒక్కోసారి ఆశ్చర్యపోతుంటాను ఈ పుస్తకం ఎంత పెద్దదో . . ! నిండదు ఎన్నటికీ . . అని కానీ . . ఇప్పుడు భయపడుతున్నాను కారణం . . ? చోటు చాలక . . నా కొత్త ఆశలు పదాలు పెనవేసుకోవడంలో తడపడుతున్నాయి అందుకే అంతగా తనలో ఏం నింపుకుందో అనుకుంటూ . . . ! ఓ సారి స్వప్నావలోకనం చేసుకోవడం మొదలు పెట్టాను ఎంత అందంగా ఉన్నదో అక్కడ ? అద్దం లాగ . . ఎలాంటి శబ్దరాహిత్యతన ఉన్నదో అక్కడ ? స్పష్టంగా వినగలిగేటట్టు . . ఎలాంటి అనుభూతి ఉన్నదో అక్కడ ? ఆనందమే తన్మయంచెందేట్టు . . అంతా ఒక అధ్బుతమే దర్సించినట్టయింది కానీ . . అక్కడే మొరొకటి చూస్తాననుకోలేదు . . ఏళ్ళ నుండీ ఏవో ఆలోచనలు ఆయువు పోసుకుని ఇక్కడే ఇల్లు కట్టుకు నివసిస్తున్నాయి . . నిజానికి వాటికి ఉనికి లేదు . . వాటి ఉనికిని నేనే ! అందుకే నా కలాన్ని కదలనీయక కాలాన్ని కట్టేద్దామని చూస్తున్నాయి . . అవసరం లేనివి . . అవసరానికి రానివి . . ఎన్నో ? కలవనివి . . ' కల్ల ' అనేవి . . ఎన్నో ? వ్యక్తిత్వం లేనివి . . వ్యక్తీకరించాలేనివి . . ఎన్నో ? నిజానికి దూరంగా . . నిస్సిగ్గుగా . . ఎన్నో ? ఎన్నో ? తమ అస్తిత్వం కోసం దాగివున్నవి . . అన్నీ ఆ కాగితాలలోనే . . ! * picture credit goes to original photographer and source . It will be removed in case of any objections .
సెప్టెంబరు 11 ఘోరం జరిగిపోయాక అప్పుడు మేల్కొన్న అమెరికా ప్రభుత్వ యంత్రాంగం నానా హడావుడీ చేసింది . విమానాశ్రయాలన్నిటిలో విపరీతమైన నిఘా పెంచింది . అలాగే ఇప్పుడు హైదరాబాదు పేలుళ్ళతో మేల్కొన్న మన కేంద్ర రాష్ట్ర యంత్రాంగాలూ హడావుడి చేస్తున్నై - తిరుమలలో రెడ్ ఎలర్టు - ట . ఇంకెక్కడో రెడ్ ఎలర్టు . అసలు రాష్ట్రమంతా రెడ్ ఎలర్టే . ఒక ఘోరం జరిగాక అయినా ఇతర జన సమ్మర్ద ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోక పోతే అది అవివేకమవుతుంది కానీ జాగ్రత్తలు తీసుకోవడం గొప్ప వివేకానికి సూచన కాదు . పోలీసుల్ని వాళ్ళ పని వాళ్ళని చేసుకోనియ్యకుండా దుర్ఘటన జరిగిన స్థలాల్లో పని లేని రాజకీయుల పర్యటనలు . ఇంకొక పనిలేని రాజకీయుడు అసలేం పట్టనట్టు హాయిగా కొడుకు పెళ్ళి చేయిస్తూ - ఐతే అతివృష్టీ లేకపోతే అనావృష్టీ అన్నట్టుగా ఉంది ఈ రాజకీయుల వ్యవహారం . అసలు అధికార యంత్రాంగం ఏం చేస్తోంది ? ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసేందుకు ఎవరు బాధ్యులు ? దేశంలో జరుగుతున్న అరాచక విధ్వంస చర్యల వెనుక దారులు కొన్ని హైదరాబాదులో అప్పుడెప్పుడోనే తేలినై . మసీదు పేలుళ్ళ వెనుక బాగోతం ఇంతవరకూ బయట పళ్ళేదు . ఆ పరిశోధన ఏమైంది - మీడియాతో పాటు అధికారులు కూడా ఆ విషయం అప్పుడే మరిచిపోయారా ? ఇప్పుడు మాత్రం ఏమౌతుంది - రాజకీయులు నిప్పులు చెరుగుతారు , అటూ ఇటూ వేళ్ళు చూపిస్తారు . అధికారులు తగుమాత్రంగా మొహాలు వేళ్ళాడేసుకుని మేం చెయ్యగలిగిందంతా చేస్తున్నాం అంటారు . ఒక వారం తిరిగేప్పటికి మీడీయా ఈ విషయం మరిచిపోతుంది . దాంతో మనమూ మరిచిపోతాం . అప్పుడే బలిపశువుల్ని సిద్ధం చేసే యజ్ఞం మొదలైనట్టుంది . ఆంధ్రజ్యోతిలో చదివిన వార్త : రాజకీయుల వత్తిడి వల్ల గోకుల్ చాట్‌కి చట్టవిరుద్ధంగా లైసెన్సిలిచ్చిన బల్దియా అధికారులదే తప్పుట . ఎట్లా ఉందంటే ఇంటో దొంగలు పడ్డారు మహాప్రభో అని మొరపెట్టుకుంటే - నీ ఇంటి ప్లాను ఎప్రూవైందా , అసలు ఇల్లెందుకు కట్టావు అని నిలదీసినట్టు . ఈ పేలుళ్ళ గురించి అత్యంత భీతి గొలిపే విషయం ఏవిటంటే ఆ చోటులో నేనైనా మీరైనా ఉండి ఉండవచ్చు . ఇదివరలో , దాడులు చేసింది ఎవరైనా , దాడికి గురయ్యేది ఏ ప్రముఖ వ్యక్తులో , ఏ రాజకీయ నాయకులో అయి ఉండేవారు . మనది ప్రజా ప్రభుత్వమే అయినా ప్రజలూ ప్రభుత్వమూ ఒకటేనని ఇటు ప్రజలూ అనుకోలేదు , అటు ప్రభుత్వమూ ఎప్పుడూ అనుకోలేదు . కానీ ఈ నాడు ఆ హద్దులు చెరిగి పోయాయి . ఎవడికో ఎవరిమీదో ఎక్కడో కాలితే - ఎటూ సంబంధంలేని 42 మంది జీవితాలు దగ్ధమవటం . మనల్ని కాదులే అనుకుని చూపు తిప్పేసుకోలేం . మన గొడవ కాదులే అని మనమింక విడిగా ఉండలేం . ప్రజల గుండె చప్పుడుతో కలిసి వినబడాలి ప్రభుత్వ స్పందన . ప్రజల గొంతుతో మాట్లాడాలి ప్రభుత్వం నోరు . మనవి కాని గొంతుల్ని అరువు తెచ్చుకోనియ్యకండి . ఈ దేశం మనది , ఈ ప్రజలు మనవాళ్ళు , ఈ ప్రభుత్వం మనది - సాధికారతని సార్వభౌమత్వాన్ని స్వాధీనం చేసుకుందాం .
వాన వచ్చింది , కురిసింది , వెళ్ళిపోయింది అన్న గొలుసును కవి అనుసరించినట్టు తెలుస్తోంది . ఆ గొలుసును పేనడానికి గతాన్ని , జ్ఞాపకాల్ని , తన అనుభూతుల్ని చెప్పడం జరిగింది . అయితే ఇక్కడ కవి చెప్పదల్చుకొన్న అసలు విషయమేమంటే వానని చూడగానే పాత పాట సలుపుతున్న గాయం గురించి . ఆ విషయం " నీపాట కూడా అంతే " అన్న చోటనే ఆగిపోతుంది . మిగిలిన రెండు స్తాంజాలు నే ఇందాక చెప్పిన గొలుసును కొనసాగించే ప్రయత్నమే .
వసంతాగమనంతో ప్రకృతిలో జరిగే మార్పులు అలా ఉండగా , అమెరికను సాంఘిక జీవనంలో ఈ సమయానికి ప్రతి యేడూ కొన్ని కొన్ని విశేషాలు జరుగుతూ ఉంటాయ్ . బడులకి స్ప్రింగ్ బ్రేక్ శలవలు ( దాంతోబాటే ఉద్యోగస్తులైన తలిదండ్రులు వారంరోజులు శలవతీసుకోవడమూ ) , ఈస్టరు పండగా , తత్సంబంధమైన గుడ్ల వేట , ఈస్టరు కుందేళ్ళ దర్శనాలు , బహుమతులు , ప్రార్ధనలు , గట్రా . ఇలాగే ప్రతియేడూ క్రమం తప్పకుండా ఈ సమయంలో వారం రోజుల పాటు జరిగే తమాషా నేషనల్ పబ్లిక్ రేడియో వారి భిక్షాటన సప్తాహం . అమెరికావాసులు కానివారికి ఈ టూకీ పరిచయం . ఇక్కడ టివీ ఛానెళ్ళూ , రేడియో స్టేషనులూ అన్నీ ప్రైవేటు సంస్థలవే . అవి ప్రకటనల అమ్మకంద్వారా డబ్బు సంపాదిస్తాయి . వీటికి భిన్నంగా , వ్యాపార ప్రకటనలు లేకుండా రేడియోలో నేషనల్ పబ్లిక్ రేడియో ( NPR ) అనీ , టీవీలో పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ( PBS ) అనీ సంస్థలు ఉన్నాయి . ఈ రెండూ లాభాపేక్ష లేని ( non - profit ) సంస్థలు . ఇలాంటివే మరికొన్ని ఉన్నాయి , PRI , APM , ఇలాగ , కానీ ఈ రెండూ పెద్దవీ , ముఖ్యమైనవీనూ . వీటిని నడిపేందుకు అవసరమైన ఆర్ధిక మదుపు ఎక్కువభాగం ప్రజల చందాల ద్వారా సమకూరుతుంది . వాణిజ్య సంస్థలుకూడా చందాలు ఇస్తుంటాయి , తమ ఎండోమెంట్ ఫౌండేషన్ల ద్వారా . కార్పొరేషన్ ఫర్ పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ అనే సంస్థ ద్వారా అమెరికను ప్రభుత్వం కొంత డబ్బు వీటికి ఇస్తుంది . వీళ్ళకి వచ్చే ఆదాయంలో సింహభాగం సాధారణ ప్రజలు కట్టే చందాల వల్ల కాబట్టి ఆయా పబ్లిక్ రేడియో స్టేషన్ల వాళ్ళు మార్చి - ఏప్రిల్ నెలల్లో ఒక వారం రోజులపాటు రేడియోమీద అతి దర్జాగా భిక్షాటనం చేస్తారు . ఇప్పుడు మళ్ళీ అసలు కథకొద్దాం . కొన్ని నెలలకిందట యువాన్ విలియంస్ అనే సీనియర్ విశ్లేషకుడి కాంట్రాక్టుని అథాట్టుగా రద్దుచేసి NPR తానే వార్త అయి కూర్చున్నది . ఆ సందర్భంలో విలియంస్ గారి ప్రవర్తన వివేచనారహితంగా ఉన్నదా అన్న ప్రశ్న పక్కన పెడితే , విలియంస్‌ని వదిలించుకున్న పద్ధతిలో NPR తప్పులో కాలువేసిందనే పబ్లిగ్గా అనుకున్నారు . అదలా ఉండగా , మొన్నటి మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికను పార్టీ ఢంకా బజాయించి కాంగ్రెసు పగ్గాల్ని చేబట్టిందిగదా . అసలుకి NPR ఎప్పుడూ లిబరల్ ఎజెండాని సమర్ధిస్తూ ఉంటుంది , తమ కన్సర్వేటివ్ ఎజెండాని చిన్న చూపు చూస్తుంది అని రిపబ్లికన్ల గునుపు . దాంతో ఈ సంవత్సరపు కాంగ్రెసు సెషన్లలో దీన్ని ఒక పట్టుపట్టక తప్పదని వాళ్ళు తర్జనభర్జన పడుతున్న సమయంలోనే మూలిగే నక్కమీద తాటికాయ పడినట్టు NPR మీద జేమ్స్ ఓకీఫ్ పడ్డాడు . ఈ దెబ్బతో NPR సీయీవో రాజీనామా చేశారు . జేమ్స్ ఓకీఫ్ బయలుపరచిన విడియోతో నసాళం అంటిన కాంగ్రెస్ రిపబ్లికన్లు అమెరికను ప్రభుత్వాన్నించి NPRకి అందే నిధుల్ని పూర్తిగా అరికట్టాలను బిల్లు ఆమోదించారు . రిపబ్లికన్ల కసరత్తు సాగుతుండగానే , వసంతకాలపు భిక్షాటన సప్తాహం మొదలైంది . ఈ సంచలన సంఘటనల నేపథ్యంలో సాధారణ ప్రజలు ఇచ్చే చందా మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది . అంతే కాదు , NPRవార్తా ప్రసారాల్లో తరచూ వినిపించే కొందరు ప్రముఖ విలేఖరులు , విశ్లేషకులు - ఎందుకు అమెరికను రాజకీయ సాంఘిక చైతన్యంలో NPR ముఖ్యమైనదో - తమమాటల్లో చెబుతూ వస్తున్నారు . అంటే , మీరెన్నుకున్న ప్రభుత్వం మా ఫండింగ్‌ని కత్తిరించింది , మేం చేస్తున్న పని మీ తరపునే కాబట్టి మీరే ఇంకాస్త ఆర్ధిక సహాయం చెయ్యాలని చెప్పకనే చెప్పినట్టయింది . మామూలుగా నాకు ఈ భిక్షాటన వారంరోజులూ NPRవినడం ఇష్టం ఉండదు , వాళ్ళ దీనాలాపాలు వినలేక . కానీ ఈ సారి మాత్రం - ఘటోత్కచుడు అన్నట్టు - ఆర్తనాదములు శ్రవణానందకరముగా నున్నవి . ప్రతిరోజూ , వీలు దొరికినప్పుడల్లా రేడియో పెట్టుకుని మరీ వింటున్నా !
కొత్త ప్రభుత్వ పోకడలు - రైెతుల ఆత్మహత్యలపై మీ మాట
మెదిలింది ఒక చిలిపి ఊహ కన్నులముందు అది అయ్యింది మనసులోతుల్లో మరువలేని తీపిగురుతు అసలిలాంటి ఊహ వొస్తుందా అనుకున్నా కాని వొచ్చింది గా నాకు అనుకుంటే కలిగింది చిరు దరహాసం పెదవిపైన గల గల గోదారి లా పరవళ్ళు తొక్కి బిర బిర కృష్ణమ్మా లా పరుగులిడి చేరింది నా దరి మరి ఏమా ఊహ అని అడిగింది నెచ్చెలి ఎలా చెప్పాలా అనుకుని కాసేపు ఏమని చెప్పాలా అని ఇంకాసేపు మౌనం లో నేనుంటే నా చెలికి వొచ్చింది చిరు కినుక ఆ కినుక లోని చెలి అలుక మోము చూసి చెప్పాలని అనుకుని చెప్పాను చెవిలో ఒ చెలి నువ్వే నా ప్రియురాలివి జవరాలివి ఐతే ఎలా ఉండునో అని ఆలోచిస్తున్నా అంటే నేనేన్దుకవుతా నీకు ప్రియురాలను నేనెప్పుడు నీ ప్రియసఖినే ఆని అంటూ నేను అవుతాను మరుజన్మలో నీ ప్రానసఖిని అంటూ మెల్లగా జారిపోయింది నా అంతరంగం లోకి ఇంతకి ఎవరో ఆ నెచ్చెలి అనుకుంటున్నారా నా అంతరంగమే నా నెచ్చెలి
మా ఊరు తణుకు సమీపంలో మండపాక అనే గ్రామంలో యల్లారమ్మ గుడి వుంది . అమ్మవారి విగ్రహం చాలా చక్కగా సాలగ్రామ శిలతో అందంగా ఆకర్షణీయంగా వుంటుంది అమ్మవారి ముందరి కుడి చేతిలో ఖడ్గము , వెనుక కుడి చెతిలో ఢమరుకము , ముందరి ఎడమ చేతిలో పాయసపాత్ర , వెనుక ఎడమ చేతిలో త్రిశూలము తో అలరారుతూ వుంటుంది . భక్తులు సహస్రనామార్చన చేయించుకున్న తరువాత మహర్నివేదన జరిగాక , శ్రీ అమ్మవారి కిరీటము పై పుష్పములుంచి దండకము చదువుతారు , ఆ దండకము చదివేటప్పుడు ఆ భక్తుల కోర్కెలు సఫలమయెసూచనగా ఆ కిరీటమునుండి పుష్పములు ప్రసాదించును . ఆ దృశ్యం కనులవిందుగా వుండి శరీరమంతా ఝల్లుమని పులకిస్తుంది . భక్తుల శ్రద్ద యందు కాని మ్రొక్కుబడులలో కాని లోపమున్న యెడల ఒక్క పుష్పం కూడా కిందకి జారక అలాగే వేళ్ళాడుతూ వుంటుంది . కొంతసేపటికి ఆ లోపాన్ని పలికించి , అధర్మ , అనైతిక కోరికల్ని , కాకుండా సరిదిద్దుకునేలా చేసి పుష్పములని ప్రసాదించే చల్లనితల్లి . ఎల్లలు లేని యల్లారమ్మ . మా అమ్మ .
న దారే ఒఫ్ బర్త్ 5 - 1 - 1969 న జథకము చెప్పండి
అయ్యో గని ఇది నా మాట కాదు బాసు . చాల రివ్యూస్ ఇలాగే ఉన్నాయి . ఎస్ . జే సూర్య అసలు సీన్ సీన్ కి పొంతన లేకుండా తీశాడు . . . . అండ్ బాలయ్య ని బీట్ చేసే సన్నివేశాలు పెట్టాడు అని .
ఈ ఐదు ప్లేటో ఘనస్వరూపాల ఆకారాలను శాస్త్రములో , యాంత్రిక విజ్ఞానములో , భవన నిర్మాణములో , చివరకు తినుబండారాలలో కూడ చూడ గలిగాము . నూతన సంవత్సరము ఆరంభమవ బోతుంది . ఇంతవరకు ఈ వ్యాసాన్ని మీరు చదివారంటే మీకు ఒక బహుమతిని ఇవ్వాలి . ద్వాదశముఖికి 12 ఉపరితలాలు ఉన్నాయి . ఆ 12 ఉపరితలాలపై సంవత్సరములోని 12 నెలల వారములను , తేదులను తెలిపే క్రీస్తు శకము 2008 సంవత్సరపు కాలెండర్‌ను మీకు అందజేస్తున్నాను . ఇందులో జనవరినుండి మే నెల వరకు గల ఆరు నెలల క్యాలెండర్‌ను ఆరు కలువబడిన పంచభుజములలో , అదే విధముగా జూన్ నెల నుండి డిశంబర్ నెలవరకు గల క్యాలెండర్‌ను ఆరు కలువబడిన పంచభుజాలలో ఇచ్చినాను . వాటిని పంచభుజములుగ కత్తిరించి ఒక దాని కొకటి చేరిస్తే రెండు బుట్టలు మీకు దొరుకుతాయి . వాటి రెంటిని చేరిస్తే 12 నెలల మొత్తము క్యాలెండర్ ( చిత్రము 6 ) దొరుకుతుంది . మీ బల్లపై దానిని ఉంచుకొని ఆనందించండి !
మరి ఆ చీర కట్టుకున్న మీ ఫొటో పెడితే మేము అంటాము గా మీరందం గా వున్నారని .
భలే ! ఇంకో ఏడాది గడిచింది . మరో ఏడాది మొదలయింది . ఏం సాధించాం , ఏం సాధించలేదు అనేది మన మీదే ఆధారపడి ఉన్నా ఈ " సంవత్సరం " నాకు బాలేదు అని పాపం సంవత్సరం మీ read more »
మరుసటి రోజు ఇంటర్నెట్ లో వెదికాడు మల్లెపూల గురించి . సమాచారమైతే పోగయిందిగానీ , మధుకు వుపయోగపడే వివరాలు దొరకలేదు . కొన్ని పూల షాపుల సైటు అడ్రెస్ లను బుక్ మార్కుల్లో దాచుకుని , లంచ్ టైం లో , చుట్టూ ఎవరూ లేకుండా చూసుకుని , కొలీగ్ ఏంజెలా దగ్గరకు వెళ్ళాడు మధు . నవ్వుతూ ఆమెను విష్ చేసి , " మల్లెపూలు ఎక్కడ దొరుకుతాయో నీకు తెలుసా ? " అని అడిగేడు . " మల్లెపూలా ఎందుకు " అడిగిందామె . " వూరికే … " అన్నాడు మధు , ఆలోచిస్తూ . " అలాగా . అయితే నాకు తెలియదు " చెప్పిందామె సాలోచనగా . ఓహో అలా వచ్చావా అనుకుని , " వూరికే అంటే వూరికే కాదుగానీ , ఓ చిన్న పనుండి " అన్నాడు . " ఏం పనీ " అడిగింది ఏంజెలా , కొంచెం దీర్ఘం తీస్తూ . ఏ విషయాన్నైనా మనకెందుకులెమ్మని వదిలిపెట్టే రకం కాదు ఏంజెలా . పెళ్ళాం జడలోకని చెబుదామనుకుని , ఆ కాన్సెప్ట్ ఆమె కర్ధమయ్యేలా చెప్పేంత ఓర్పూ , నేర్పూ లేక పూజ కోసమని చెబుదా మనుకున్నాడు . కానీ , " ఏం పూజ , ఏ దేవుడికి పూజ , ఆ దేవుడి పేరును మీ భాషలో ఎలా రాస్తారు , సంస్కృతంలో అయితే ఎలా రాస్తారు , ఆ దేవుడి మహత్తులేమిటి , పుట్టు పూర్వోత్తరాలేమిటి " అంటూ నాన్ స్టాపుగా ఆమె అడగబోయే ప్రశ్నావళి గుర్తొచ్చి భయమేసి ఇంట్లో ఫ్లవర్ వేజ్ లోకని చప్పున చెప్పేడు మధు . " ఫ్లవర్ వేజ్ లోకి మల్లెపూలా ? " అంటూ ఓ రకంగా చూసి , కుర్చీలో రిలాక్స్డ్ గా కూర్చుని , " ఇక ఇప్పుడు చెప్పు … మల్లెపూలను వేజ్ లో ఎలా వుంచుతావో " అడిగింది . అంటే విషయం సమగ్రంగా తనకర్ధమయ్యేంత వరకు వదలదన్న మాట . మధు మాట్లాడకపోయేసరికి , మళ్ళీ తనే అంది " గులాబి పూలో , బంతి పూలో పెట్టుకోవచ్చు కదా ? ప్రత్యేకంగా మల్లెపూలే ఎందుకు పెట్టా లనుకుంటున్నారు " అనడిగింది . తిక్క పుట్టి అందామనుకున్నాడు కానీ బాగోదని , ఓ వెర్రి నవ్వొకటి నవ్వి " మల్లె పూలైతే మంచి వాసనొస్తాయని " చెప్పేడు . " అలాగా … అయిడియా బాగానే వుంది . వాసన కోసమే అయితే , మామూలు పూలేమైనా పెట్టి జాస్మీన్ స్ప్రే చల్లితే సరిపోతుందికదా ? " ఎలావుంది ఈ అయిడియా అన్నట్లు చూసింది . " సరిపోదు . గులాబీలు మల్లెల వాసనేస్తే ఎబ్బెట్టుగా వుండదూ ? " అన్నాడు మధు . " అలాగైతే ప్లాస్టిక్ పూలు లతలతో సహా వాల్ మార్టు స్టోరులో దొరుకుతాయి . వాటిలోంచి పూలున్న మల్లె తీగొకటి కొని , దాన్ని వేజ్ లో వుంచి పైన దట్టంగా జాస్మీన్ స్ప్రే కొట్టెయ్ " అందామె . ఒప్పుకోక పోతే ఇంకెంత సేపు వాయిస్తుందోనని , " అబ్బ ఎంత గొప్ప సొల్యూషన్ . అద్భుతం . ఆహా … ఓహో … చాలా ధాంక్స్ ఏంజెలా " అంటూ మొహంలో సంభ్రమాశ్చర్యాలను ప్రకటించేడు మధు . " ఈ విషయంలో ఇంకేమైనా డౌట్సు వుంటే మొహమాట పడకుండా అడుగు " అందామె నవ్వుతూ . " తప్పకుండా … మళ్ళీ కలుస్తాను " అంటూ తన సీటు దగ్గరకొచ్చేడు . ఛా … ఇల్లాంటి వాళ్ళతో లాభం లేదనుకున్నాడు . మన వాళ్ళనెవరినైనా అడిగితే కాస్తో కూస్తో ముందుకు వెళ్ళొచ్చనుకున్నాడు . సాయంత్రం ఆఫీసునుంచి రాబోయే ముందు , ఈస్టు కోస్టులో వున్న ఫ్రెండు చలపతికి కాల్ చేసేడు , అతనేమైనా ఐడియా ఇస్తాడేమోనని . చలపతి వాళ్ళావిడ సీత ఫోనెత్తింది . " ఆయన బయటకు వెళ్ళారన్నయ్యగారు . ఓ గంటలో వస్తారు . ఏమైనా అర్జంటు పనా " అడిగింది . పూల గురించి చలపతి కంటే వాళ్ళావిడకే ఎక్కువ నాలెడ్జి వుంటుందని , ఆమెనే అడిగేడు " మల్లె పూలు అమెరికా లో దొరుకుతాయా " అని . " ఏమో నండి . నేనైతే ఎక్కడా చూళ్ళేదు . ఇంతకీ వదినేమైనా కావాలని అడుగుతోందా " అంది నవ్వుతూ . " అబ్బే తనకు కాదు . ఈ వీకెండు చిన్న పూజ చేయిస్తున్నాం . దాని కోసం " కాజ్యువల్ గానే అబద్ద మాడేడు . " ఏం పూజన్నయ్య గారూ ? నేనిందాక మాట్లాడినప్పుడు వదిన పూజ గురించి నాతో ఏమీ చెప్పలేదే … నేను మళ్ళీ శైలజకు ఫోను చేసి కనుక్కుంటాను లెండి . ఈయన వచ్చేక మీకు ఫోను చేయమని చెబుతాను " అంటూ ఫోను పెట్టేసింది . మల్లె పూల గురించి ఎన్ని అబద్దాలాడాల్సి వస్తోంది ? ఎవరిగొయ్యి వాళ్ళు తీసుకోడమంటే ఇదే కాబోలు నను కున్నాడు మధు . నిద్ర పోతున్న భార్యను లేపి , అప్పుడెప్పుడో జరిగిన విషయాల్ని ఆవేశంతో గుర్తు చేసి … పైగా మల్లెపూలను గురించిన పాటల్ని వినిపించి … ఛా ఇంకెప్పుడూ ఇల్లాంటి పనులు చేయకూడదు … శబ్దమయ్యేలా చెంపలేసుకున్నాడు మధు . సమయానికి బద్రి వాళ్ళు కూడా లేరాయె ఏదైనా ఉపాయం చెప్పడానికి . ఇంకెవరున్నా రబ్బా కనుక్కోడానికి ఆలోచనలో పడ్డాడు మధు .
అనయము భక్తితత్పరత నా గురువర్యుని దర్శనార్థమై చనియెడు పౌరులా గురుని శ్రావ్యవినూతన ధర్మబోధ వా సనలను దాల్చెనో యన పసందగు తావుల నొప్పు పూవులం గొని యటనుంప నాకుటికిఁ గూడెను గంధకుటీ సునామమున్ .
పుస్తకంలో అచ్చుతప్పులు పరమాన్నంలో పలుకురాళ్ళలా విసిగిస్తూనే వున్నై . ఒక్కో కథా ఒక్కో రకమైన టైప్ సెటింగ్‌లో ఉండటం దీన్ని ఒక సంపూర్ణమైన కృతిలా కాక కొంత అతుకులబొంత లాగా కనిపింప చేస్తున్నది . ఈ విషయాల్లో ఇద్దరు ముగ్గురు ఔత్సాహికులు ముందుకొచ్చి సాయం పడితే పుస్తకం గెటప్ చాలా అభివృద్ధి చెయ్యవచ్చు .
దేశంలో అనేకమంది డాక్టర్ కె . ఎల్ . రావు గంగా - కావేరి పథకం గురించి మాట్లాడుతుంటారు . నిజానికి కె . ఎల్ . రావు పథకమనేది ప్రస్తుతం లేదు . అది అసాధ్యమైనందున అందుకు బదులు కేంద్ర ప్రభుత్వం ' నేషనల్ పెర్‌స్పెక్టివ్ ప్లాన్ ' పేరిట మరొక పథకం రూపొందించింది . నిజానికి అది కూడా మన రాష్ట్రానికి నష్టదాయకమే . అందుకే దానిని రాష్ట్ర ప్రభుత్వం మొదటినుండి వ్యతిరేకిస్తూ వచ్చింది . అటువంటిది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హఠాత్తుగా , ఎవరితోనూ చర్చించకుండా కొత్త వైఖరి ఎందుకు తీసుకొన్నారన్నది జాగ్రత్తగా అర్థం చేసుకోదగిన విషయం .
మా బెజవాడ అందమైన నగరం . సహజసిద్దంగా కొండ కొనలమద్య ఏర్పడింది . ఎంతో ప్రశాంతంగా , ఆహ్లాదంగా సహజ సౌందర్యం తో మా నగరాన్ని చూడటానికి రెండు కళ్ళు చ . . .
సంబంధం లేని విషయం కాదు నాయనా . తమ ప్రాంతంలో రోడ్ల మీద వంటలు చేస్తే ఎవరూ రానప్పుడు తెలంగాణావాళ్ళని విమర్శించడం ఎందుకు ?
సామాన్యుల ఇళ్ళల్లో MAD పూయిస్తున్న ఈ పూలు మరింతమందికి ఉత్ప్రేరకము అవ్వాలని , MADకు మరింత మందిని ఆదుకొనే శక్తి కలగాలని కోరుకుంటూ . .
ఇదివరకు , ప్రతీ ప్లాట్ ఫామ్ మీదా , వేరే వేరే తట్టల్లో ఇడ్లీ , వడా , దోశా , పులిహోర , పెరుగన్నం - - ఇలా అమ్మేవారు . ఓ ఆకులో రెండు ఇడ్లీ , రెండు వడా పెట్టించుకొని , నీళ్ల చట్నీ వేయించుకొని , అది కారిపోకుండా పెట్టెలో తమవాళ్లకి ఇవ్వడానికి యెన్నో ఫీట్లు చెయ్యాల్సి వచ్చేది !
నన్ను పుట్టించిన వాడు ఎందుకు పుట్టించాడో తెలీదు . పుట్టించేసి , ఒక చింపిరి కథలో ఇరికించేసి , తరవాత ఏం చెయ్యాలో తెలియక ఇలా లోకం మీదికి వొదిలేసి పత్తా లేకుండా పారిపొయ్యాడు .
వికర్షించడం అంటే మనందరికీ అర్థం తెలుసు . కానీ ' విశేషంగా ఆకర్షించడం ' అన్న అర్థంలో ఈ పదాన్ని కిరాతార్జునీయంలో వాడడం చూసి ఆశ్చర్యం కలిగింది .
" తన కవిత్వంలో , శబ్దప్రమేయం లేకుండా కాగితం మీద రాసిన అక్షరం తిన్నగా అర్థానికి దారి తీయగల విలక్షణమైన ప్రజ్ఞని ఆయన సంపాదించారు . ఆయనపద్యం చదువుతుంటే మన కంటికి అక్షరాలు కనిపించే మాట నిజమే . కాని ఆ అక్షరసముదాయం శబ్దసముదాయంగా మార్పుచెందక ముందే మన కళ్ళ ముందు ఒక బొమ్మ కనిపిస్తుంది . ఈ బొమ్మ అర్థాలు గీసిన బొమ్మే కాని శబ్దాలు గీసిన బొమ్మ కాదు . భాషకి వున్న శబ్దశక్తిని నిశ్శబ్దంగా వాడుకోగల సామర్య్థాన్ని ఇస్మాయిల్ అపూర్వంగా సాధించారు "
ఈ లక్షణ గ్రంథాల రచయిత లిద్దరూ కూచిమంచి వంశము వారు . తిమ్మన కాలము క్రీ . శ . 1684 - 1757 . ఈ తిమ్మకవిసార్వభౌముని తమ్ముని మనుమని మనుమడే వేంకటరాయడు . లక్షణసారసంగ్రహము క్రీ . శ . 1740లో , సుకవిమనోరంజనము 1872లో ఆ కవులు రాశారు . లక్షణసారసంగ్రహములో మూడు ఆశ్వాసములు ఉన్నాయి . మొదటి ఆశ్వాసములోని భాగములు చతుర్విదాంధ్ర ప్రకరణము , సంజ్ఙా ప్రకరణము , విభక్తి ప్రకరణము , రెండవ ఆశ్వాసములోని భాగములు సమాస , క్రియావిశేష , ప్రాస , యతి , శబ్ద ప్రకరణములు , మూడవ ఆశ్వాసములో రేఫ , శకటరేఫ ప్రకరణములు .
> > ఈ జాబితాలో మాయాబజార్ , మిస్సమ్మ లేకపోవడం నా కాశ్చర్యం కలిగిస్తోంది . ఇవి ఖచ్చితంగా గులేభకావళి కథ , రక్త సంబంధం కన్నా మంచి సినిమాలే . కానీ చిన్నప్పుడు చూసిన గులేభకావళి కథ మాయాబజార్ కన్నా బాగా నచ్చింది . రక్త సంబంధం చివరి సీను నన్ను బాగా కదిలించిన సన్నివేశం . అందుకే దాన్ని చిట్టాలోనుంచి బయటకు తన్నెయ్యటానికి మనసొప్పలేదు . అదీ కాక మీరు చెప్పిన రెండు సినిమాలు ఏక బిగిన పూర్తిగా ఎప్పుడూ చూడలేదు . ఇక మిగతా సినిమాలు అంటారా , వేటికవే సాటి
@ ఇందు గారు కథనం నచ్చినందుకు సంతోషం . : ) మీకు కూడా వంశీ కధల్లాగానే అనిపించిందా . . అందరూ అదే అంటున్నారని . . అసలేమి కలుస్తున్నాయో చూద్దామని . . పట్టుబట్టు మరీ " మా పసలపూడి కధలు " చదువుతున్నాను . . నాకైతే ఒక్క మాండలీకం తప్ప ఏది కలిసినట్టుగా అనిపించలేదు . అందులోనూ అవి తూ . గో . మాటలు . మావి ప . గో మాటలు . . , బయటవారికి అన్నీ ఒకేలాగా వుండొచ్చేమోగానీ రెండిటిలో తేడా చాలానే వుందండో . . వంశీగారి కధల్లోవున్న నుడికారాలు చాలా నేను కొత్తగావిన్నవివున్నాయి . చదవనంతసేపూ బాగానేవుంది . . ఇప్పుడు ఆ కధలు చదివాకా . . ఆ శైలిని అనుకరించకుండా నా శైలిలో రాయటం చాలెంజింగేలావుంది . . : - )
ఉత్తరాంధ్రా టూర్‌కు వచ్చిన మంత్రి శంకర్రావుకు YSR కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి . . .
సునీల్ కథానాయకుడిగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్‌కుమార్ కోనేరు నిర్మిస్తున్న చిత్రం ' కథ , స్క్రీన్‌ప్లే , దర్శకత్వం - అప్పల్రాజు ' . ' పబ్లిసిటీ సినిమా వాళ్ళ ఆక్టివిటి ' అనే పాటతో పాటుగా మొత్తం పనె్నండు పాటలుగల ఆడియో సీడీని శుక్రవారం విడుదల చేశారు . ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ఇప్పటివరకు విడుదల చేసిన అన్ని పాటలు ఒకదానితో మరొకటి పోలిక లేకుండా విభిన్నంగా ఉండి , శ్రోతల నుండి మంచి స్పందన రాబట్టుకున్నాయి .
" మరైతే , స్వామీ ! సీతా రామ లక్ష్మణులు లంకనుంచి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఈ భాగవతం తప్పదా ? " అని అడిగారు , బ్రహ్మాది దేవతలందరూ , ఏక కంఠంతో !
ఠుమ్రీల్లో గాని , ఖయాల్‌లో గాని ఉస్తాద్ బడేగులాం అలీ ఖాన్‌ను పోలగల విద్వాంసులు ఎవరూ లేరు . లలిత సంగీతాన్నీ , సినిమా పాటల్నీ అభిమానించేవారు ఆయన ఠుమ్రీలు వింటే నదులన్నిటికీ జన్మస్థలమైన మానసరోవరం చూసినట్టనిపిస్తుంది . ఆయన పాడిన తిర్‌ఛీ నజరియా ఠుమ్రీ ఒక్కటే పహాడీ రాగంలోని వందలాది హిందీ , తెలుగు , ఇతరభాషల సినీ గీతాలకు మూలం అయింది . లతా పాడిన " మేరీ ఆఁఖోఁమేఁ బస్‌గయా కోయీరే " దానికి నకలు . కాని బడే గులాంను కేవలం ఠుమ్రీ గాయకుడిగా పరిగణించడం పెద్ద పొరబాటు . ఆయన తక్కిన గొప్ప సంగీతకారులనే అబ్బురపరిచిన సంగీత మహాసాగరం .
ఇందూ గారూ , పొద్దున్నే మీ ఇన్విటేషన్ చూసి , అవునా నిజమేనా అని సాఫ్ట్ పిచ్ లో ఒకసారీ హై పిచ్ లో ఇంకొకసారీ గిల్లి గిల్లి మరీ పాడుకున్నాను . మరి మేము అచ్చంగా వస్తామన్నాప్పుడు - సారీ అండీ మేము వేగాస్ వెళుతున్నామూ అనకూడదు మరి . . . కృతజ్ఞతలండీ . సీతయ్యకి ఇప్పుడే ఫొను చేసి చెపుతాను యీ విషయం . సమాహారం , మాలిక మొదలగు వాటికి మెయిలు పంపితిని కానీ గురువర్యా ! నాకు కొన్ని సందేహములు : దీని వలన ఉపయోగమేమి ? నా బ్లాగునందు ఇవి కానరావేల ? నేను లేబుళ్ళు పెట్టుకొనుట యెట్లు ? సమాధానము కోసం సవినయంగా వేచి యుందును . శిశిర గారూ , కృతజ్ఞతలండీ , కానీ చూసారూ , అలాంటి ప్రయత్నం చాన్నాళ్ళుగా చేసీ చేసీ అలసిపోయానండీ . మిస్టర్ పెళ్ళాం లో లాగ డైరెక్షను మారుతుంది కానీ పోసు ( pose ) మాత్రం డిటో డిటో
అలా చెవిలో వినపడిన మాటలని అనుసరించి , ఆడసాగాడు . అప్పటికి ఐదు లక్షలు వచ్చాయి .
… అన్నాడు ఆరుద్ర . మనిషి ఆకాశంలో ఎగిరే పిట్టల్ని చూసి తానూ ఎగరాలని ఉబలాటపడ్డాడు . నిజంగా ఎగరగల అవకాశం కలిగినప్పుడు , అది ఎంత సాహసమో , ఎంత సందేహించవలసి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది . కానీ , ఆ సాహసం లేకపోతే విజ్ఞానం లేదు , అభివృధ్ధి లేదు . అసలు ఆకాశంలోకి ఎగిరి భూమిచుట్టూ తిరగగలమో , లేదో తెలుసుకోవటానికి రష్యా ఒక చిన్న ఉపగ్రహాన్ని 1957 అక్టోబరు , 4 న ప్రయోగించింది . తరువాత ఒక కుక్కని ( లైకా ) పెట్టి పంపించారు . కాని దానిని సజీవంగా తిరిగి తీసుకురాలేకపోయారు . 1960లో రెండుసార్లు కుక్కలతో ప్రయోగంచేశారు . ఒకసారి విఫలమయ్యారు . చివరికి రోదసీయాత్రికుడితో 1961 ఏప్రిల్ 12న ఉపగ్రహాన్ని ప్రయోగించారు . అతడే యూరి గగారిన్ . అప్పట్లో అది ప్రమాదకరమైన ప్రయోగంగా అనిపించింది . మొట్టమొదటగా రష్యా ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపినప్పుడు , అమెరికాకి చెంపదెబ్బ కొట్టినట్లయింది . ఎందుకంటే బైబిలుభక్తుల ప్రభావంవల్ల అమెరికాలో శాస్త్రవిజ్ఞానబోధన కుంటుపడింది . అది హిందువుల ఛాందసత్వాన్ని మించిన మూర్ఖత్వం . సాంకేతిక పరిజ్ఞానంలో రష్యాది పైచేయి అనగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు . తప్పు దిద్దుకున్నారు . కొన్ని ప్రమాదాలు జరిగినా , రోదసీయానం అవకాశానికి మిలియన్ల డాలర్లు ఇవ్వటానికి సిధ్ధపడుతున్నారు .
' అరే ఎడ్లను ఎట్లమ్ముతవు . మన పెండ పొత్తులేదా ? ' అంగట్లకు ఎదురచ్చి యాది జేసాడు సేటు .
కరమరుదగు కీర్తి " గురించిన చాటువు బాగా ప్రసిద్ధమైనదే ! ) . ఇక్కడ రాయలవారు పాండ్యరాజు కీర్తిని హంసతో పోలుస్తున్నారు . హంసతో పోల్చడంలో ఉన్న మరొక ఔచిత్యం , అది దశదిశలా ఎగురుతుంది ( వ్యాపిస్తుంది ) . అలాగే హంస శ్రేష్ఠతకి కూడా సూచకం . ఇంతవరకూ చెప్పి ఊరుకుంటే అతను కృష్ణదేవరాయలే అవ్వడు ! ఆ కీర్తి అనే హంసకి రెండు రెక్కలూ దానం , త్యాగమునట . అంటే నిరంతర దాన త్యాగల వల్లనే ఆయన కీర్తి హంస ఎగురుతోందన్నమాట . దానమంటే నీరు ధారపోసి అడిగినవారికి ఇచ్చేది . త్యాగమంటే అదేమీ లేకుండా తన దగ్గరున్న వస్తువుని ఇచ్చివేయడం . అంచేత దానమనే ఒక రెక్క ఎప్పుడూ తడుస్తూనే ఉందన్న మాట . మామూలుగా పక్షులు తడి రెక్కలతో ఎగరలేవు . అయితే హంస మాత్రం రెండు రెక్కలూ తడిసినా ఎగరగలదు . ఇక్కడ తడుస్తున్నది ఒక రెక్కనే కదా . అంచేత కీర్తి అనే ఆ హంస ఎగరడంలో ఆశ్చర్యమేమీ లేదు అని సమర్థించాడు . ఒక ఊహని రాయలవారు ఎంత సమగ్రంగా ఆలోచిస్తారో అన్న దానికి ఇదొక చక్కని ఉదాహరణ .
ఓ , ఇదేదో బాగుందండి . ఇంతవరకు మనకు ఇలా గుర్తు లేదేమిటి చెప్మా : ( ? > > ఆయనగారికి తెలీకుండా ఆవిడ గారు డబ్బులు దాచుకుందా మనుకుందామనుకోవటం ఎందుకో ? శ్రీవారి దగ్గర డబ్బులెన్నివున్నా , శ్రీమతిగారి బ్లాక్ మనీ మీదే శ్రీవారి కన్నులెందుకో ? మరి ఎందుకో ? ? ? ? ? ఇది అదుర్స్ . . . ఎందుకో అంటే మాకు ఘాట్టి నమ్మకం ఎంతలేదన్నా ఇంటో అక్కడో ఇక్కడో వదిలేసిన డబ్బులు గళ్ళాపెట్టేలో చేరిపోతాయని : )
నేను తెలుగువాడిగా పుట్టాను , తెలుగువాడిగానే వుంటా . స్వప్రయోజనం కోసం తెలంగాణాఅనో ఆంధ్రమనో అడ్డమైన గడ్డికరిచే సన్నాసులను నే లెక్కచేయను .
మహీధర గారూ , ఏ మనిషయినా తన సహజత్వాన్ని కోల్పోకుండా తన్ను తాను ఆవిష్కరించుకుంటే ఆ మనిషి . . , మనుషులందరికీ నచ్చక తప్పదు . నగిషీలు చెక్కడానికీ బలవంతంగా అందరూ మెచ్చుకునేలా చెయ్యడానికీ ఆయన రాసింది రామాయణం కాదు కదా ? రామాయణాన్ని అంతమంది కవులు అన్ని రకాలుగా తిరగ రాసి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుతున్నప్పటికీ రాముడిలో ఉన్న రాముడి లోపాల్ని సరిదిద్దలేకపోయారు . అలాగే నామిని పుస్తకాన్ని తిరగరాసిన కొద్దీ సహజత్వం పోయి చివరికి ఏ కావ్య శిల్పం గానో మిగిలిపోతుంది . అలా మళ్ళీ మళ్ళీ సాపు ప్రతులు రాయలేదు కాబట్టే ఆయన చేసిన పనులు నచ్చినా నచ్చక పోయినా నామిని మాత్రం అందరికీ నచ్చుతాడు . - రాణి
" అయినా ఏమిటి గొడవ " మళ్ళీ ముట్ట మొదటి ప్రశ్న వేశింది సుధ .
ఈ స్తంభం అమెరికా వేపున ఉన్నది . ఆ స్తంభంలో అగాథం కిందికి చేరేందుకు లిఫ్టు ఉంది . ఆ స్తంభం దగ్గర్నించి అగాథంలో " మెయిడ్ ఆఫ్ ది మిస్ట్ " అనే పడవ నడుపుతారు . ఈ పడవలో రెండు జలపాతాల పతన భాగాల దగ్గరికి వెళ్ళి చూడచ్చు . నీటి ఉధృతం , తుంపర వలన మరీ దగ్గరగా వెళ్ళలేము , సుమారు రెండొందల గజాల దూరం నించి చూడచ్చు . ఇటువంటి సదుపాయమే కెనడా వైపున కూడా ఉంది . ఈ బొమ్మ పడవలోనించి తీసినది . స్తంభానికి వెనక పక్క అమెరికన్ ఫాల్స్ కనబడుతున్నాయి . మే 2005 Observation walkway and elevator tower on the American side Niagara Falls May 205
ప్రజలను గతంలో పాలించిన , ఇప్పుడు పాలిస్తున్న అన్ని రాజ్యాలూ , అన్ని అధికారాలు కూడా ప్రాతినిథ్య ప్రభుత్వాలు లేదా సంస్థానాలు ( republics or principalities ) అని రెండు విధాలు . సంస్థానాలు మరలా అనువంశికమైనవి ( hereditary ) లేదా నూతనమైనవి ( new ) అని రెండు విధాలు . అనువంశికమైన సంస్థానాలలో రాజ్యాధికారం రాజు యొక్క కుటుంబం చేతుల్లో చిరకాలంగా కొనసాగుతూ రాజుకి వంశపారంపర్యానుగతంగా సంక్రమిస్తుంది . నూతనమైన సంస్థానం మరలా రెండు రకాలు . మొదటిది పూర్తిగా నూతనమైనది . మిలన్ సంస్థానాన్ని Francesco Sforza పొందడం ఈ విధమైనది . ఇక రెండవ రకం : అప్పటికే సంస్థానాధిపతి అనువంశికంగా కలిగి ఉన్న రాజ్యానికి నూతనమైన సంస్థానాలను సంపాదించి కలపడం . స్పెయిన్ రాజు నేపుల్స్ రాజ్యాన్ని కలుపుకోవడం ఈవిధమైనది . ఈవిధంగా పొందబడిన సంస్థానాలకు సంస్థానాధిపతిని నియమించడమైనా జరుగుతుంది . లేదంటే అవి స్వతంత్రంగానైనా ఉంచబడతాయి . ఈ సంస్థానాలను Prince తన స్వంత సైన్యం ద్వారాగానీ , లేదా ఇతరుల సైన్యం ద్వారాగానీ జయిస్తాడు . అలాగే కాలం కలసి వచ్చి అదృష్టం వలన గానీ , లేదంటే తన శక్తి సామర్ధ్యాల ద్వారాగానీ సాధిస్తాడు .
భూకంపము అంటే సహజంగా గమనించబడిన భుప్రకంనలు అయిన అయివుండవచ్చును లేక మనుషుల ( phenomenon ) చేత సృష్టించబడిన కంపనాలు అయిన అయివుండవచ్చును ( seismic wave ) . భుకంపనలకు కారణాలు అనేకము అవి రాళ్ళు బీటలువారడం వలన ( faults ) , అగ్నిపర్వత చర్యల వలన , పెద్ద పెద్ద బండలు జారి పడటం వలన , ( మైన్లు ) గనులను పేల్చడం వలన మరియు న్యూక్లియర్ ప్రయోగాల వలన . భూకంపానికి కారణమైన మొదటి స్థానాన్ని ఫోకస్ ( focus ) లేదా హైపోసెంటర్ ( hypocenter ) అంటారు . భూమి ఉపరితలమునకు దగ్గరగా జరిగిన విచిన్నాన్నే ఎపిసెంటర్ ( epicenter ) లేదా భూకంపకేంద్రము అంటారు .
కోరుట్ల ప్రజలకు కరీంనగర్తో పాటు నిజామాబాద్ జిల్లాలోని గ్రామాలతో సన్నిహిత సంబంధాలు వుండేవి . జిల్లాల సరిహద్దులు , మానసిక సరిహద్దులుగా అప్పటికింకా రూపుదిద్దుకోలేదు . బంధుత్వాలు గానీ , పని కోసం వెతుకులాట గానీ జిల్లాలు దాటి , రాజ్యాలు దాటి ప్రయాణం చేసేవారు . 1850 నుండి వేలాదిమంది పద్మశాలీలు ఇతర కులాలవాళ్లు బంబాయి రాష్ట్రానికి , ఇతర ప్రాంతాలకు పని వెతుక్కుంటూ వెళ్లేవారు . అలా హెచ్చెస్సీ పాసైన తర్వాత అందె వెంకటరాజం నిజామాబాద్ జిల్లాలోని బిక్కునూర్‌లో ఉపాధ్యాయులుగా చేరారు . అందె వెంకటరాజం మొదట ఉర్దూ మీడియంలో చదువుకున్నారు . తర్వాత తెలుగు భాషా పరీక్షలను రాసి తెలుగు పండితుడు అయ్యాడు . ఆనాటి తెలుగు భాష పాఠ్యగ్రంథాలు గ్రాంథిక భాషలో ఉండేవి . వాటిని చదివి గ్రాంథిక భాషలో కవిత్వం రాయడం నేర్చుకున్నారు . అయినప్పటికీ చిన్నప్పటినుంచి చుట్టూ ప్రజలు పాటలు పాడడం విని తాను ఎన్నో పాటలు కైగట్టాడు . కాని పాటకు పాఠ్యపుస్తకాల్లో సాహిత్య గౌరవం లేకపోవడంతో దాన్ని అలానే వుంచి పద్యం రాయడం నేర్చుకున్నారు . జాషువా లాగే పద్యాలతో తనను తాను గొప్ప కవిగా నిరూపించుకోదల్చుకున్నారు . అయితే డా | | సి . నారాయణరెడ్డి సాహిత్య గురువుగా పరిచయం ప్రారంభమైన తర్వాత సినారె లాగ గేయ కవిత్వం రాయాలని పూనుకున్నారు . అలా రాసిన పద్యాలు మాత్రాఛందస్సు గేయాలతో 1961లో ' నవోదయము ' అనే కవితాసంపుటి ప్రచురించారు . మా పెదనాన్న మిట్టపెల్లి రాజయ్య జగిత్యాలలో ఉండడంవల్ల వారి ద్వారా ఈ పుస్తకాన్ని నా విద్యార్థి దశలోనే చదివాను . అలాంటి మాత్రాఛందస్సు గేయాలు ఎన్నో రాశాను . అలా నాలో గేయకవిత పట్ల అపారమైన ఆసక్తిని కలిగించడానికి సినారె గారి అక్షరాల గవాక్షాలు , అందె వెంకటరాజంగారి ' నవోదయం ' ఎంతో స్ఫూర్తినిచ్చాయి .
రసప్లావితం నిన్న సభలో పానుగంటి వారి సాక్షి వ్యాసాల గురించి చర్చ జరుగుతుండగా ఒక స్నేహితులు అడిగారు - ' రసప్లావితం ' - అంటే ఏవిటని . నేనేదో కొద్దిగా ఆలోచించి సందర్భాన్ని బట్టి , రసంలో మునిగినది , తడిసినది , తద్వారా రసంతో నిండినది - అని వ్యాఖ్యానించాను . ఇంటికొచ్చి ఒక పద్యకావ్యం టీకా తాత్పర్య సహితం చదువుతూ ఉంటే అందులో " సింధు లహరీ ప్లవన " అని వుంది . దానికి నదీ ప్రవాహంలో తేలినట్టి అని అర్థం చెప్పారు . అది చదవంగానో . . ఏ నాడో ఏడో క్లాసులోనో , ఎనిమిదిలోనో చదువుకున్న భౌతిక శాస్త్ర పాఠం గుర్తొచ్చింది - " ప్లవన సూత్రాలు " . . అంటే laws of flotation . తమాషాగా ఉంది కదూ , మన భాషలో వాడుక తప్పిన భావాన్ని పాశ్చాత్య దత్తమైన భౌతిక శాస్త్రం ద్వారా గుర్తు చేసుకోవటం . నాకేవిటో గిలిగింతలు పెట్టినట్టైంది . రసప్లావితం అంటే రసంలో తేలినది . రసంలో మునగడానికీ తేలడానికీ చాలా తేడా వుంది . అది అనుభవైక వేద్యం . ఆ విషయం ఇంకో మాటు . . కానీ . . అసలీ రసమంటే ఏవిటి ? లాక్షణికులు కావ్యం రసమయంగా వుండాలన్నారు . శ్లోకాలు నాకిప్పుడు గుర్తుకి లేవుగానీ , సంగీత నాట్యాల లక్ష్య లక్షణ నిర్దేశం చేసిన భరత ముని ప్రభృతులు రసానికి పెద్ద పీట వేశారు . నవరసాలన్నారు . మరి పూర్వపు విషయాల్ని వదిలి ఇటీవలికొస్తే , శ్రీశ్రీ కూడా పట్టుకుని , " కానీవోయ్ రస నిర్దేశం " అన్నాదు . ఇంకొంచెం ముందుకొస్తే శంకరాభరణం శంకరశాస్త్రి గారు ( వేటూరి కలం బాలూ గళం ద్వారా ) " రసికుల కనురాగమై , రస గంగలో తానమై " అన్నాడు . అంటే మునగమనా ? తేలమనా ? ఈ సమస్య ఎలా ప్లావితమౌతుంది ?
అయ్యో , రోజా రాణి గారు మరణించారా ? ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవారు ! స్వరం కూడా ఎంతో సౌమ్యంగా ఉండేది . మాట్లాడే తీరు కూడా ఎంతో ఆత్మీయంగా ఉండేది . . అవి కేవలం అనౌన్స్ మెంట్లు అయినా కూడా ! శాంతి స్వరూప్ గారికి , పిల్లలకు ప్రగాఢ సంతాపం !
అనగా అనగా . . . . . చంపకవతి అనే పట్టణముండేది . అక్కడ సన్యాసులు చాలా మంది నివసిస్తూ ఉండేవాళ్ళు . వారిలో చూడాకర్ణుడనే సన్యాసి ఒకడుండే వాడు . అతడి కుటీరంలో హిరణ్యకుండనే ఎలుక ఓ కలుగు చేసికొని ఉండేది . ప్రతిరోజూ చూడా కర్ణుడు తాను భోజనం చేశాక మిగిలిన వంటకాలని భిక్షాపాత్రలో పెట్టి చిలుక కొయ్య మిద పెట్టి నిద్ర పోయేవాడు . ఈ ఎలుక చప్పుడు చేయకుండా వచ్చి , చిలుక కొయ్య మేదికెగిరి ఆ వంటకాలని తినేసి పోతూ ఉండేది . ఓ రోజు చూడకర్ణుడు తనస్నేహితుడైన వీణాకర్ణుడనే మరో సన్యాసితో మాట్లాడుతూన్నాడు . కానీ అతడి దృష్టంతా చిలకకొయ్య మీదేఉంది . మాటిమాటికి పైకి చూస్తూ చేతికర్రతో నేలమీద అప్పుడప్పుడూ తట్టూతూ ఎలుకని దడిపించే పనిలో కొంత మునిగి ఉన్నాడు . అది చూసి వీణాకర్ణుడు " చూడాకర్ణుడా ! ఎందుకలా మాటిమాటికి పైకి చూస్తూ నేలమీద కర్రతో తట్టుతున్నావు ? " అని అడిగాడు . చూడాకర్ణుడు " ఒక ఎలుక ప్రతిదినము చిలుకకొయ్య మీదికి ఎగిరి భిక్షా పాత్రలోని పదార్ధాలని తిని పోతున్నది . నాకు దీని బెడద ఎక్కువుగా ఉన్నది " అన్నాడు . అదివిని వీణా కర్ణుడు చిలుక కొయ్యవైపు చూశాడు . అది నేల నుండి సుమారు అయిదారు అడుగుల ఎత్తున ఉంది . " ఎక్కడి ఎలుక ? ఎక్కడి చిలుకకొయ్య ! ఇంత అల్పజంతువునకు అంతఎత్తుకు ఎగిరే బలమెక్కడి నుండి వచ్చినది . మామూలు ఎలుకలు రెండు మూడడుగుల కంటే ఎత్తుకు గెంతలేవే ? ఇది అయిదారడుగులు ఎలా ఎగిరి చిలుకకొయ్యమీది పద్దార్ధాలు మ్రింగగలుగుతోంది ? ఇందులకేదో నిమిత్త ముండి యుండవలయును . ఒకసారి నేనో బ్రాహ్మణుని ఇంట భిక్షకు పోయి ఉంటిని . అదే సమయంలో ఆబ్రాహ్మణుడు తనభార్యను చూచి " రేపు అమావాస్య . బ్రాహ్మాణులకు భోజనము పెట్టవలయుసు . ఏమేమి వంటకాలు చేయగలవు ? " అన్నాడు . దానికావిడ కొంత పెడసరంగా " మగవాళ్ళు వస్తుసంభారాలు తెచ్చి , ఇంటపడేస్తె ఆడవాళ్ళు వండి వార్చుతారు గానీ , మీరు తేనిసరుకులు ఎక్కడి నుండి వస్తాయి ? " అంది . అదివిని అతడు కోపంగా " ఉన్నంతలో జరుపుకోవాలి గానీ , ఆర్భాటం చేయాలని పేరాస పడకూడదు " అన్నాడు . దానికావిడ సౌమ్యంగా " అలాగే కానివ్యండి . రేపటి కార్యక్రమం ఉన్నంతలోనో సరిపెడతాను " అనిచెప్పంది . తర్వాత నువ్వులు కడిగి , దంచి ఎండపోసింది . ఆ రోజు ఎండ తీవ్రంగా ఉండటంతో నేను వారింటి ఎదురు చెట్టునీడలోని అరుగు మీదే విశ్రమించాసు . ఇంతలో ఓ కోడి వచ్చి ఆబ్రాహ్మణి ఆరబోసిన నువ్వులు కాళ్ళతో జీరి చెలిగి పారేసింది . బ్రాహ్మణుడది చూసి , " ఈ నువ్వులు అంటుపడ్డవి . బ్రాహ్మణ భోజనానికి పనికి రావు . కాబట్టి వీటిని మారకం వేయి " అని భార్యకు చెప్పాడు . ఆవిడ సరేనని వాటిని చేట కెత్తింది . ఇంతలో నేను ఆవీధిలోని మరో ఇంటికి భిక్షకు పోయాను . ఆ బ్రాహ్మణి సరిగ్గా ఆ ఇంటికే వచ్చి " వదినా ! ఈ నువ్వు పప్పు పుచ్చుకొని నువ్వులిస్తావా ? " అని ఆఇంటి గృహిణిని అడిగింది . పాపమా ఇల్లాలు ఆనందంగా అంగీకరించి చేటలో నువ్వులు తీసికొని వచ్చి ఈమెతో మాట్లాడుతూ ఉంది . అంతలో ఆమె భర్త వచ్చాడు . " ఏమి బేరమాడు తున్నావు " అన్నాడు . ఆవిడ సంతోషంగా " చేరడు నువ్వులిచ్చి దంచిన నువ్వుపప్పు పుచ్చుకొంటున్నాను " అంది . ఆవిడ భర్త , ఆమాటలు విని " ఓసి వెర్రిదానా ! చేరడు ముడి నువ్వులకు బదులుగా ఎవరయినా దంచిన నువ్వుపప్పులిచ్చెదరా ! ఈమె ఇలా తెచ్చి ఇవ్వడానికి ఏదో రహస్యకారణం ఉండి ఉంటుంది . కాబట్టి ఆ నువ్వుపప్పు పుచ్చుకోకు " అన్నాడు . అలాగే ఈ ఎలుకకు ఇంత బలం ఉండటానికి ఏదో రహస్య కారణం ఉండి ఉంటుంది . కారణం లేకుండా ఏవీ సంభవించవు " అంటూ ముగించాడు వీణా కర్ణుడు . అదివిని సాలోచనగా చూడాకర్ణుడు " చూడగా ఈ ఎలుక ఇక్కడే ఎక్కడో ఓ కలుగు చేసికొని ఉంటున్నట్లుంది . దానికింత బలం ఉండాటానికి నిమిత్తమేది తెలిసినదికాదు . త్రవ్వి చూచెదను గాక " అన్నాడు . ఆ తర్వాత చూడాకర్ణుడు ఒక గునపం తెచ్చి కుటీరమంతా వెదికి ఎలుక కలుగును కనిపెట్టి , తవ్వి పారేసాడు . ఆశ్చర్యం ! మామూలుగా ఎలుక కలుగులో వడ్లూ , బియ్యం , గోధుమలులాంటి ధాన్యమో మరేదైనా తిండితిప్పలో ఉంటాయి గదా ! కాని హిరణ్యకుడి కలుగులో కొన్ని బంగారు , వెండి నాణాలు కూడా ఉన్నాయి . [ నిజంగానే కొన్ని ఎలుకలు బంగారు , వెండి లాంటి మెరిసేవాటిని కలుగుల్లోకి లాక్కెళతాయి తెలుసా ! నా చిన్నప్పుడు మాపిన్ని రెండు వరుసల బంగారు మంగళ సూత్రం గొలుసు పోయింది . ధాన్యం బస్తాలున్న గదిలో ఆవిడా , ఆవిడ భర్తా నిద్రపోయేవాళ్ళు . గొలుసుపోయిన తగాదాలో ఉమ్మడి కుటుంబం కాస్తా వేరు కాపురాలు పడ్డాయి . ఆర్నెల్ల తర్వాత , ధాన్యం బస్తాలు తీసినప్పుడు , బస్తాలు క్రింద ఎలుక కలుగు కనబడింది . తవ్వితే కుంచెడు [ రమారమి రెండు కిలోలు ] వడ్లూ , వాటితో పాటే బంగారు గొలుసు , ఇంకా మెరిసే పట్టు లేసుతాళ్ళు కనబడ్డాయి . శాస్త్రీయ కారణం నాకు తెలీదుగానీ కొన్ని ఎలుకలకి బంగారు రంగు మీద మోజుంటుందని మాత్రం చెప్పగలను . ] చూడాకర్ణుడు ఆనందంగా ఆ వెండి బంగారు నాణాల్ని సంగ్రహించి వీణా కర్ణుణితో " నీవు చెప్పినది నిజమే . ఈ ఎలుక దగ్గర రహస్య సంపద ఉన్నది . అందుకే దానికి మామూలు ఎలుకల కన్నా చాలా ఎక్కువ బలం ఉంది " అని చెప్పాడు . కాబట్టి ప్రతీ అసాధారణ విషయం వెనుకా ఏదో కారణముండి ఉంటుంది . అంటే ప్రతీదాని వెనుకా . . . . ఇందుల కేదో నిమిత్త ముండి యుండవలయును . ఇదీ కథ ! మరో కమ్మని కథ కోసం వేచి చూడండి . ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి , మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి .
ముందుగా ఈ జాప్యానికి క్షంతవ్యురాలను . వృత్తికార్యాలవలన వృత్తీతరకార్యాలవలన సమయం తగినంత మిగలలేదు నిజానికి రవ్వంత కూడా దొరకలేదు . ప్రదీప్ , అవును మౌనంలో వేయి భావనలు , మౌనంగా నవ్వుతూ వేవేల భావనలు తెలుపవచ్చు . మోనాలీసా అందుకొక ఉదాహరణ . మా అమ్మే నాకు మోనాలీసా . తన భాష , భాష్యం నాకు ఇచ్చేసినట్లు ఎంత మౌనంగా వుండేవారో ! మీ వ్యాఖ్యతో తన మౌన వదనం తలపుకొచ్చింది . ఇక మనసు ఆ రాకాసుల సాంగత్యంతో తనలోకి రాకసిని పరకాయ ప్రవేశంగావించికుందనుకోండి మరి . స్వతహాగా లేని తత్వం ఇలా మనలోకి జొరబడగల అవకాశం కూడా వుందిగా ? తప్పక " నవరసాల నరకాసురులు - నవరాత్రులు " గురించి ఆలోచించి మరో కవితగా వ్రాస్తాను . ఇమాయ గారు , మీరెవరో ఇప్పటికి గ్రహించాను . ఇక మన హిమాలయ యాత్ర ఎపుడో సెలవిస్తే ఆ దిశగా మా నానమ్మ ఏమైనా చెప్పిందేమో ఆమె నాకు పంచిన అనుభవసారంలో మళ్ళీ ఒక్కసారి వెతికిచూస్తాను . ఆత్రేయగారు , మీది బహు దొడ్డ కవితా హృదయం . నా కవితకి ఎంతో అపూర్వమైన వ్యాఖ్యనిచ్చారు ? మనసు చెమ్మగిల్లినట్లైంది . తాత మీద కవిత చదివాను . చిన్ని వ్యాఖ్యతో ముగిస్తాను . " ఆ మనిషి వెనుక బుడిబుడి నా అడుగులు కావాలి నాకు మార్గదర్శకాలు " అందరకూ ధన్యవాదాభివందనాలు .
ఇంకొన్ని గంటలలో ఆపిల్ తన సరికొత్త సమ్మోహనాస్త్రాన్ని ప్రపంచం మీద ప్రయోగించబోతోంది . ఐపాడ్ తో ఆపిల్ సాధించిన ఘనత అంతా ఇంతా కాదు . దాదాపు మూసేస్తారేమో అనుకున్న ఆపిల్ కంపనీ ఊపిరి పీల్చుకుని నిలబడటానికి కారణం ఐపాడే . మానవ చరిత్రలో స్వర్ణాక్షరాలతో రాయదగిన సంగీత ఉపకరణం ఐపాడ్ అని చెప్పటంలో అతిశయోక్తి లేదు . ఐపాడ్ విజయంతో ఊపిరి పీల్చుకున్న ఆపిల్ ఇక మిగిలిన అవకాశాల వైపు దృష్టి సారించింది . ఐఫోన్ తో ఇప్పుడు ముందుకొచ్చింది . ఈ ఐఫోన్ మీద జరిగిన హడావిడి ఇంతా అంతా కాదు . ఈ మధ్య ఒక చిత్రానికి జరిగిన హంగామా స్థాయిలోనే ఇది కూడా జరిగింది .
ముంబయి : తాజ్‌హోటల్లో రాత్రినుంచి కొనసాగుతున్న ఆపరేషన్ సైక్లోన్ కార్యక్రమం ఎట్టకేలకు ఈరోజు ఉదయం ముగిసింది . ముగ్గురు తీవ్రవాదులు అంతమయ్యారు . హోటల్ కమెండోల హస్తగతం అయింది . తాజ్ ఫస్ట్‌ఫ్లోర్‌లోని కారిడార్లలో ఈరోజు ఉదయం ఆరుగంటలనుంచి భీకర పోరు కొనసాగింది . కాల్పులు , మంటలతో ఆ ప్రాంతం యుద్ధభూమిని తలపించింది . కమెండోలు అన్ని వైపులనుంచి చుట్టుముట్టి కాల్పులు జరిపారు . ఉదయం 8 గంటల ప్రాంతంలో కమెండోలు ఓ శవాన్ని బయటకు విసిరివేశారు . మరో ఇద్దరు తీవ్రవాదులు కూడా మృతి చెందారని తెలుస్తోంది . [ . . . ]
రాఖీ నటవర్గం : జూనియర్ యన్ . టి . ఆర్ , ఛార్మి , ఇలియానా భాగం1 భాగం2
పతివ్రతలనీ , వాళ్ళను సృష్టించిన హిందూ పురాణ కర్తలను తన కలంతో చీల్చి చెండాడడానికి ఉద్యమించిన చలం తన నవలలో తాను చేసిన పనేమిటి ? సతీ సుమతి కన్నా అధికురాలిని కావాలన్నంత ప్రేమ పాతివ్రత్యంతో రాజేశ్వరి ఎటువైపు నడిచింది ? ఎలాంటి మనిషికోసం రాజేశ్వరి అన్నోటి త్యాగాలను చేసింది ? " ప్రేమ ఉన్నపుడు త్యాగం చెయ్యటం ఎంత సులభమనుకున్నావ్ ? ఊరికే త్యాగానికై పతివ్రతల్ని పొగుడుతారు కానీ , ప్రతి నిమిషం సౌఖ్యాల్నీ , ఆనందాల్నీ అవసరంగానైనా వొదిలేసుకుని ప్రేమబలం స్థిరపరచాలని ఉంటుంది " అంటుంది రాజేశ్వరి .
హిరణ్యలోచనుని పుత్రుడైన ఉత్కచుడు చాలా క్రూరుడు . ఒకసారి అతడు తన స్వాభావికమైన క్రూరత్వముచే లోమశ మహర్షి ఆశ్రములోనున్న వృక్షలతాదులను పెఱికివేశాడు ! ఆతని క్రూరబుద్ధిని చూసి ఆ మహర్షి " ఓరీ ! పాము కుసుసము విడిచినట్టు నీవు ఈ దేహము విడువుము " అని శపించినాడు . పశ్చాత్తాపముతో మహర్షి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు ఉత్కచుడు . " పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు . అయిననూ నీవు చేసిన కర్మకు శిక్ష తప్పదు . ద్వాపరమున శ్రీకృష్ణ పరమాత్మ నిన్ను విధించును . ఆ పురుషోత్తముని పాద స్పర్శతో నీకు శాపవిముక్తి కలుగుతుంది " అని శాపావశానం చెప్పాడు లోమశ మహర్షి . ఆ ఉత్కచుడే శకటాసురుడు .
గవర్రాజు మీసం మెలెడితే సమిశ్రగూడెం ఊరుజనాలంతా గజగజలాడిపోతారంతే . . . ! ! పరగడుపునే లేచి పందుంపుళ్ళ నోట్లోఎట్టుకుని . . . పొలంగట్లన్నీ ఓమారు తిరిగొచ్చేసి . . . పచ్చికోడిగుడ్లు సితక్కొట్టుకుని నోట్లో ఏసుకుని జుర్రేసి . . ఓ పెద్దలోటాడు పొదుక్కాడి పాలు ఎత్తిందించకుండా గేది కుడిత్తాగినట్టుగా తాగేసి . . జబ్బమీదేసుకున్న జరీ కండువాతో మూత్తుడుచుకుని . . మళ్ళా వొన్నమేలకీ కోడిక్కోడీ లాగించేసి . . . పదిమంది తినే తిండితింటా . . కసరత్తులు చేత్తా . . కండలట్టిన సెరీరంతో . . గొర్రిపోతుమీసాలేసుకుని సూసినోడికెవడికైనా సరే ఎన్నులోంచి వొనుకుపుట్టేలా ఉంటాడా మనిషి . ఎపుడో తాతలకాలపు పదెకరాలపొలం పనోల్లనిబెట్టి వెవసాయం చేయిత్తా , పెట్టుబల్లూ కర్సులూ పోగా మిగిలిన నాలుగింజల ధాన్యం ఇంటెనకాల పెద్దగాదెలో పోయించేత్తా . . . అయే ధాన్యం వర్షాకాలమొచ్చేసరికి బియ్యమాడింతా . . పొలంగట్లమీద కాయగూర్లూ , ఆక్కూర్లూ పండింతా . . ఇంటెనకాలా గెదెల సావిట్లో పాలేర్లన్నెట్టించి రెండు జర్సీ ఆవులూ . . . నాలుగు రింగులు తిరిగిన బొబ్బిలి గేదెపెయ్యల్నీమేపిత్తా . . తిండికీ . . వంటకీ . . పాడికీ ఏలోటూరాకండా కాలంగడిపేత్తుంటాడు గవర్రాజు . సిన్నప్పుడే అమ్మాబాబూ గోదార్లో పడవమునిగిపోయిన పెమాదంలో పోటంతో కంటికిరెప్పలాగా సూసుకుంటా . . చానా గారంగా పెంచిపెద్దసేసింది ఆళ్ళ నానమ్మ . ఆ గారంతోనే తినేసి వూరిమీదడి తిరుగుతా . . ఆళ్ళమీదా ఈళ్ళమీదా పందేలుకాత్తా వుంటాడు గవర్రాజు . డి . ముప్పారం . కోరుమావిడీ . . గోపారం . . కోరుపల్లీ . . పెండేలా . . సుట్టుపక్కలూళ్ళలో ఏడాడికోసారి జరిగే కోడిపందేలు , కర్రసాములు , కుత్తీపోటీలూ . . ఎడ్లపందేలేగాకండా , సీజన్ని బట్టి ఆళ్ళూళ్ళో జనాలందర్నీపోగేసి . . ఎరైటీ . . ఎరైటీ పందేలు కట్టండంలోనూ . . అయి గెలిసి మీసం మెలేసి . . తొడల్సరసడంలోనూ గిద్దావోళ్ళ గవర్రాజుకి మించినోడు నిడదోలు సుట్టుపక్కలున్న ఊళ్ళలోనేగాదూ . . పచ్చింగోదారిజిల్లాలోనే లేడు . . అని జనాల్లో మాంచిపేరుసంపాయించేడు . పెద్ద గజ్జెనగాడికి తోకలాగా ఎనకే తిరిగే జనాలుకూడా బాగా గాలికొట్టి వుబ్బేసి గాల్లోకిలేపి గవర్రాజుకి ఫుల్లు సపోర్టింగుగా వుంటుంటారు . అదేవూళ్ళో దిబ్మీదున్న రైసుమిల్లు బుల్లెంకడు కొడుకు పెద్దరావుడికీ . . గవర్రాజుకీ సెనంకూడా పడదూ . . . వాడెడ్డెం అంటే గవర్రాజు తెడ్డెం అనీ . . . ఈళ్ళిద్దరూ ఎపుడూ పందేలుకాసీ . . కొట్టుకుంటా . . పంచాయితీలెడుతుంటారు . ఇద్దరూ బాగా బలిసున్నోళ్ళు కాటంతో . . ఎవర్నీ ఏమన్లేకా . . సద్దిచెప్పిసి . . సిన్నపిలల్నితిట్టినట్టు ఓ నాలుగు సిలకతిట్లు . . తిట్టీ . . చేతుల్దులుపుకుంటారు వూరి పెసిడెంటు రాంబెమ్మంగారు . పెద్దరావుడు ఎన్నిమార్లు గవర్రాజు చేతిలో వాడిపోయినా . . కాసినపందెమేగాసీ . . చేద్దురద తీర్చుకుంటుంటాడు గానీ . . తన బుద్దిమాత్రం మార్సుకోడూ . . . అలాని . . . ఇద్దరూ ఒకల్నొదిలొకరు , ఒకరికంటొకరు పడకుండా తిరుగుతారా ! అంటే . . అదీలేదూ . . , ఎపుడూ . . కొత్తగా బండికట్టిన జోడెద్దుల్లాగా అటుఇటూ లాక్కుంటా పీక్కుంటా కలిసే తిరుగుతుంటారు . . పందాలేసుకుని కొట్టుకుంటొంటారు . . ఈళ్ళిద్దరి పందేలగొడవేమోగానీ . . జనాలకు ఈళ్ళమధ్య పందెముందంటేనే . . తానాలు . . వొన్నాలు . . మానేసి తెగెగబడిబోయి . . ఫ్రీగా ఈదిసినమా సూసినట్టు సూసేత్తా . . ఈళ్ళేసేత్తా తెగ సంబరబడిపోతుంటారు . ఆకాసమంతా మూసేసి ముసురేసేసిని నల్లమేగాలు . . . అప్పుడుదాకా ఉగ్గబెట్టుక్కూచ్చున్నట్టు కూర్సుని . . వొక్కసారిగా కుంబరుష్టి కురిపించేసి . . తెల్లబడిపోయేయి . ఎండిపోయున్న నేల వానసినుకులకి తడిసి తాటిరొట్టికాలుత్తాకి పైనేసిన . . ఎర్రక్కాలిన పిడకముక్కల్లాగా పొగలుకక్కేత్తావుంది . వానకు తడిసి . . బీటల్దీసేసిన నల్లరేగడ్నేల్లోంచీ . . వత్తున్న మట్టివాసన . . తడిసిన సన్నజాజిపూల వాసన్తో కలిసీ ముక్కుపుటాలదిరే సువ్వాసనతో మత్తేక్కిచ్చాంది . . నిద్రగన్నేరు చెట్లమీద వాలిన కాకులు వానదెబ్బకు వొనుకుతా . . కావుకావుమని కల్దిరుగుతా గోల్చేసేత్తున్నాయి . కలుపుతీతకెళ్తున్న జనాలు వానదెబ్బకి ఎక్కడ జాగావుంటే అక్కడ నక్కేసి సీరకొంగులూ . . కండువాలు తలపై ఏసేసుకుని ఆ కాకుల్లాగే మునగలాగేసేరు . . . గవర్రాజు వర్సానికి గేదెల్చావిడి పాకలో పంచెగ్గట్టి పచ్చగడ్డిమోపులపక్కనేసున్న చెక్కకుర్సీపై కూర్సుని . . . లంగకపొగాకు సుట్ట ఎలిగించి పొగొదుల్తావున్నాడు . ఎండకేగిపోయున్న తాటాకుపాక చూరుమీదనుంచి పడతావున్న వానసినుకులు . . . అప్పుడే కొల్లిసత్తిగాడి కాపీహొటల్లో పెట్టిన టీడికాషను రంగులోనూ . . బంగాళాపెంకుటింటి మీదనుండి పేడగుట్టమీద పడి పచ్చరంగుతోనూ . . . ఆపక్కనే గుట్టగాపోసిన ఎర్రకంకరగుట్టమీదనుండి ఎర్రరంగుతోనూ . . వొకసోట కలిసిపోయి . . పంచరంగుల్లో పల్లవేపు పారతా . . పంటకాల్వలో ఎలిపోతున్నాయి . ఇటికిబట్టీల్లో అడుసుతొక్కే ఎడ్లు కసక్ కసక్మని సౌండుతో తొక్కినట్టు కయ్య తొక్కుకుంటా కంగారుకంగారుగా వొచ్చిన పాలేరు ఎంకటేసులు . . " బాబయ్యా . . పెద్దరావుడుగోరో . . మళ్ళా ఏతల పందెంగట్టేరండే . . . ఈ సారి నడుంకాల్వకే . . అదే పన్నెండేతలిత్తానో కాస్కోమంట్నారండే . నిమ్మకాయలెసి నెగ్గడంగాదూ . . . మనూళ్ళో గుడ్డి సూరమ్మేత్తానికి రెడీగావుందే . . . , ఈపాలి కోడ్గులేస్కోమనో అన్నారండే " , అన్జెప్పి తెచ్చిన కోడిగుడ్లట్టని గవర్రాజుకి చూపించేడు . " పదరా . . పన్నెండేంటెహే . . పదిటిల్లోనే ఏద్దాం . . , ఆడికి ఎన్నిసార్లు నాసేతిలోవోడినా సిగ్గుండదెదవకీ . . " , అని ఎగ్గొట్టిన పంచెకొసల్జోడించి బీసముడేసేసి పెద్దపెద్దంగలేసుకుంటా . . . పెద్దీదేపు నడిసేడు గవర్రాజు . . ఎనకాలే కోడిగుడ్లట్ట అట్టుకుని నడిచేడు పాలేరు ఎంకటేసులు . వూరినడిబొడ్నున్న రాములోరి గుడికాన్నించి . . నడుంకాలవగట్టుకి రమారమి రెండుకిలోమీటర్లుంటాది . ఆ వూల్లో అంతకు ముందల చానామంది ఇదే పందెంగట్టి ఓడిపోయేనోళ్ళేగానీ పదేనేతల్లోగూడా నిమ్మకాయగానీ . . నారింజికాయగానీ ఏతెయ్యలేకపోయేరు . . . అదే దూరం నిమ్మకాయతో పన్నెండేతల్లో ఏసీ మీసంమెలెసీ " సెబాష్ . . మగాడంటే ఈడేరా . . " , అనిపించుకున్నోడు గవర్రాజొక్కడే . అసుమంటిది ఇప్పుడు కోడిగుడ్డుల్తో పదేతల్లో ఎలాఏత్తాడోనని వూరిజనాలంతా పనులుమానేసి నోల్లోదిలేసి చూత్తంమొదలెట్టేరు . " బాబయ్యా . . నారింజికాయైతే కాత్తోకూత్తో దొల్లుకుంటా పోతాది . . కోడుగుడ్డేందొల్లుద్దండే . . కాత్త ఆలోసించండే పందెం . . , అదీ . . పదేతల్లోఅంటన్నారో సూసుకోండే . . మనపరుపోద్దండే ఆరిముందో . . " , అంటా ఎంకటేసులు గవర్రాజు సెవిగొలికేసేడు . " ఒరే . . దెవాసాలోడా సెవిలో జోరిగలెక్క గొలక్కేహే . . నువ్వే సూద్దువుగానీ ఎలా ఏత్తానో . . , గుడ్డిసూరమ్మేత్తా దంటా ఎగతాళ్జేత్తాడా నన్నూ . . , మనమేసే పందెమెలావుంటాదో ఆడికి సూపించాలియ్యాలా . . " , అని కసురుకుంటా . . గుడ్డుతీసుకుని ఎంకటేసుల్ని పక్కకినెట్టేసేడు గవర్రాజు . ఎనిమిదేతలకే . . . సూరింగారి దూళ్ళసావిడి దాటేసి . . . గుబ్బలోళ్ళదిబ్బదగ్గరకొచ్చేసినయ్యి . . ఆడ్నుండి సూత్తే నడుంకాలవ కనుసూపుమేర్లో కనిపిత్తానేవుంటాది . . . ఇంకారెండేతలంటే గవర్రాజుఏసేసిలానే వున్నాడని ఎగస్పాట్టీవోళ్ళు గుసగుసలాడేత్తున్నారు . . , ఏం జరుగుద్దోఏంటోనని . . జనాలంతా కంగారడిపోతా ఒకర్నుకరు తొక్కేసుకుంటున్నారు . . కొందరు కుర్రగాళ్ళతే సైకిళ్ళేసుకునిమరీ . . ముందెళ్ళిపోయి . . ఏతకెదురుకాసేత్తున్నారు . . . జనాలడావుడీ . . దూరం సూసుకున్న పెద్దరావుడికి సెవటలట్టేసినియ్యి . . " ఒరే తియ్యిరా . . పదేలు . . ఇంకేసూత్తావుగానీ . . . నాతోనువ్వొక్కపందెంలో గెలువూ నామీసాలు తీయించుకుంటా . . " , అని సేలెంజి సేసి . . . అట్టలోంచి మాంచి వాటమైన డబల్ సొన గుడ్డోటందుకున్నాడు గవర్రాజు . దున్నపోతు దువ్వినట్టుగా . . తడిసిపోయున్న కంకర్నేలమీద కాల్దువ్వి . . క్రిక్కెట్టులో బంతేసేటోడు తోంనట్టుగా కోడిగుడ్డు పంచెకొసకేసి రుద్దీ . . . కిందకంటా కూర్సునిలేసి . . ఒక్కిసురు ఇసరటంతో పెద్దనిద్రగన్నేరు సెట్టు పైనుండెళ్ళి . . అవతలున్న ఏపచేట్టుపైనుండి అవతలకెళ్ళి పడి . . తపుక్కుమంటా సితికిపోయింది కోడిగుడ్డు . . . జనాలంతా కేరింతలు కొట్టేత్తా . . తొమ్మిదేతల్లోనే ఏసేసిన . . గవర్రాజుని ఆకాశానికెత్తేసేరు . పదేలుపోగొట్టుకున్న పెద్దరావుడు ఉడుకుమోత్తనంతో కంగార్లో కాలుతొక్కేసిన పేటలోకుర్రోడ్ని చావబాదేసేడు . అడ్డడి ఆపిన గవర్రాజు సొక్కాకాలరట్టుకుని . . " ఏతలపందేంగాదురా . . వచ్చే సెనివారం కిష్నాష్టమికి . . . నీ మీసాలమీద నిమ్మకాయల్ని నిలబెట్టుసూద్దాం . . , ఇదీ అసలు సేలంజింగు . . నా పందెం ఇరవయ్యేలు . . . , దమ్మున్నమాగాడివైతే కాయి . . అప్పుడు సూస్కుందాం పెతాపం తస్సాదియ్యా . . " అని కస్సుమంటా పంటచేలో తోకమీదడగేసేసిన తాసుపాము లెక్కలేసేడు పెదరావుడు . " సరే . . కాయిరా . . . మీసమ్మీద నిమ్మకాయ నిలబెట్టకపోతే . . నా మీసాలేగీసేత్తానేహే . . ఇదే నా సేలంజీ . . కాస్కో " , అని పెద్దరావుడి కాలరట్టుకున్నాడు గవర్రాజు . . , సరేలే అదీ సూద్దాం . . అని కాలరొదిలేసి . . కంగార్కంగారుగా ఎళ్ళిపోయేడు పెద్దరావుడు . సిర్రెత్తిపోయున్న గవర్రాజు సిమసిమలాడతా ఇంటికిసేరుకున్నాడు . . . బుజానున్న కండువా తీసవతలడేసి . . కోపంగా పడక్కుర్సీలో వాలిపోయేడు . . " ఒరే ఎంకటేసులా . . మంగడికి కబురెట్టరా . . ఇయ్యేలనుండీ ఆడేంసేత్తాడో నాకు తెల్దూ . . నా మీసాలకీ సంపంగినూనే రాత్తాడో . . ఏ సన్నాసినూనే రాత్తాడో . . మొత్తం గట్టిపడిపోవాలా . . పొద్దున్నుంచీ సాయంత్రందాకా ఇక్కడే ఆడికి పనీ అన్జెప్పు . . గాదిలోయి . . నాలుగు బత్తాలు ఆడింటికి తోలూ . . ఈ పందెంలో ఎలాగైనా నేనే గెలిసి సూపిత్తా నా తడాకా . . " , అని రోషంతో మీసాలెగరేసేడు గవర్రాజు . కబురందుకున్న మంగడు సాయంత్రమేలకి రానేవచ్చేడు . . " గవర్రాజుగోరో . . మీరేం కంగారడకండే . . మీ మీసాలకేసంపగినూనే అక్కర్లేందండే . . దమ్మున్నమీసాలియ్యే . . . శాన్సిత్తే . . నిమ్మాకాయలేంటండే . . గొబ్బిరికాయల్నైనా నిలబెట్టెత్తాయండే బాబో . . అయినా నేనున్నానుగదండే . . . , గంటకోమారు కలబందగుజ్జు రాత్తా దువ్వుతుంటే . నాలుగురోజుల్లో నా సామిరంగా . . గుర్రపెంటుకుల్లెక్క నిలబడిపోవో . . " , అని నాలుగుబత్తాలధాన్యం అందుకున్న సంతోషంలో గవర్రాజుకు గాలికొట్టేసేడు . ఆయాల్నించీ మంగడుపొద్దుపొడవకముందే రాటం . . గంటగంటకీ కలబందగుజ్జుతో మీసాలు సవరచేయటం . . ఆఈది కబురూ ఈ ఈదికబురూ సెప్పటంతో . . గవర్రాజు ఇంటిపట్టునే వుండిపోవాల్సొచ్చింది . . జనాలంతా ఇంటికొచ్చి పలకరించెల్లిపోతా పెదరావుడి పార్టీ కబుర్లు మోత్తావున్నారు . నాలుగురోజుల్లో గవర్రాజుమీసంలో సత్తువకొట్టొచ్చినట్టు కనబడిపోతా , మీసం దగాదగా మెరిసిపోతావుంది . . . , తోటలో కోసుకొచ్చిన సిన్న పచ్చనిమ్మకాయల్ని మీసాలమీద నిలబెట్టి . . . ఓసారి ట్రైలేసి గవర్రాజుకు అద్దంలో సూపించేడు మంగడు . అది సూసుకుని మురిసిపోయిన గవర్రాజు . . " ఒరే . . మంగా . . నీ బుర్రేబుర్రరా . . అసలు నువ్విక్కడుండోల్సినోడివి గాదురా . . మీబాబులాగా నువ్వూ రంగమెల్లి అక్కడే తెల్లోల్ల దగ్గర సెటిలై పోవాల్సిందెహే . . " , అని మంగడ్ని పొగడ్తల్తో ముంచేసేడు . " బాబుగారో . . మాకుర్రోడు సేతికందేసేడండే . . , మహా పనోడండోయ్ మావోడో . . . బొంబాయిలో నేర్సుకొచ్చేడండే పనే . . , నాలుగైదేళ్ళు కట్టబడ్డాడండే . . ఆడే అమితాబస్సన్న్ కీ , మిగతా హిందీ ఏక్టర్లకీ . . ఆళ్ళికీ కటింగేసేటోడంటండే . . , అక్కడే బొంబాయిలో షాపెడతానన్నాడండే . . నేనే ససేమిరా . . అని మనూరులాక్కొచ్చి మనపెద్దీదిలో రేపు షాపెట్టిత్తిన్నానండే . . . అందరూ తిడుతుండేవోరండే నన్నో . . మీవోడ్నికూడా ఇదే ఇద్యలోకి లాక్కొత్తునావేంట్రా , సుబ్బరంగా సదివించి ఉద్దోగం సేయించకా . . అనే . . , నేన్నమ్మిందుకటేనండే . . బాబో . . , మా తతలగాలం కానీయ్యండీ . . మాకాలంకానీయండీ . . జనాలమీదసేసే యాపారమే యాపారమండే . . , అయినా సేతిరుత్తిని మించినేపారమేముంటాదండే . . , మిగతాయి ఈరోజుంటే రేపుంటాయోలేదో తెల్దో . . . . " , అని ఏదాంతం బలుకుతా . . గవర్రాజు మీసాలు దువ్వేడు మంగడు . " ఇంతకీ ఇయ్యన్నీ ఎందుకుసెబుతున్నానంటేండే . . , మీరేమనుకోకండా . . రేపొపాలి మా వోడు షాపుకొచ్చి గడ్డంసేయించుకోండే . . , ఎపుడూలేనిది సవరానికి షాపుకాడికి రమ్మంటన్నాడేంటా అనుకోమాంకడే బాబో . . , మీలాంటోల్ల బేరంతో మొదలయితే . . మావోడు యాపారం మూడుపూలు ఆరుకాయలైపోతాదాని ఆసెండే . . " , అని గవర్రాజుని బ్రతిమలాడతా అడిగేడు మంగడు . * * * * * * * * * * * * ఇంకా ఎలుగురాకండానే . . గాదిక్కట్టిన వరికంకెల్ని పొడుత్తా పిచ్చుకలన్నీ గోలసేసేయటం మొదలెట్టేసేయి . . కాసేపటికి . . తెల్లారిపోయి . . పెదరావుడు పందెంకట్టిన సెనివారం రోజు రానే వచ్చింది . అప్పుడికే గవర్రాజుకి నాలుగైదుమార్లు షాపుదగ్గరికి రమ్మని కుర్రాగాళ్ళసేత కబుంరంపించేసేడు మంగడు . పెళ్ళికి మగపెళ్ళోరు ముత్తాబయిఎళ్ళినట్టు ఎనకో పదిమందినేసుకుని బయల్దేరేడు గవర్రాజు . షాపుదగ్గరకొచ్చేసరికి కుర్సీ ఏసేసి కొబ్బరిబొండం కొట్టిచ్చేసి . . కొడుకుసేత దండాలెట్టించేసి మర్యాదసేయించేసేడు మంగడు . " మీరొత్తం ఎక్కడ ఆలసమయ్యిపోద్దోని మావోడు గొడవండే . . మళ్ళా కాసేపాగితే ముహుర్తం దాటేత్తే . . అట్టమి గడియలొచ్చేత్తాయనీ తెక్కంగారుపడిపోతున్నాడండే . . , నేనోపాలి ఇంటికెళ్ళొచ్చేత్తానండే . . మీకోసం ఏదో బహుమానం కట్టుంచేడంటండే . . అదొట్టుకొచ్చేత్తానో మీరు కానియండే . . " అని ఇంటేపు లగెత్తాడు మంగడు . . . , మంగడుకొడుకు . . " రండే . . గవర్రాజుగారో . . " , అంటా మహారాజా కుర్సీపై కుర్సోపెట్టినట్టు గవర్రాజుని కుర్సోపెట్టి మెడసుట్టూ తెల్లగుడ్డేసి గెడ్డంసేయటం మొదలెట్టేడు . గవర్రాజుకుడా వొచ్చిన జనం బయట కుర్సీల్లొకుర్సుని . . బల్లేసి ఎట్టిన సితార , ఆంధ్రజోతి . . సినిమాపత్రికల్లో మొకాలెట్టేసి సదవటంరాపోయినా బొమ్మల్చూసి సొల్లుకార్చేసుకుంటా పెపంచాన్ని మర్సిపోయెరు . సెవులదిరిపోయేలా పెద్దసౌండుతో హిందీపాటలెట్టేసి . . లైట్లేసేసి . . . , ఫ్యానేసి పెనుగాల్లో ప్రేసెంటుకొట్టి . . దగదగామెరిసిపోతావున్న కొత్తసామానుజూపిత్తా . . బొంబాయిలో మేమదిసేసేం ఇదిసేసేం అంటా కబురుల్లోపెట్టేసి . . నైసుగా గెడ్డంగీత్తావుండగా . . జేబులోఅరుత్తావున్నసెల్లు ఫోన్ తీసి . . కాత్త హిందీ పాటలు సౌండు తగ్గించీ . . " ఏప్పుడొత్తున్నారో . . అద్దాల్లేకండా . . షాపోపినింగు అంటే ఎలాగుంటాదీ . . , ఇలాజేత్తేఎలాగా " , అని ఎవడిమీదో కోప్పడిపోయేడు మంగడుకొడుకు . . " సూడండే . . . ఆడేదో గొప్పోడనీ నిడదోల్దాకా ఎళ్ళి ఆడికిత్తే . . . అద్దాలుసూడండే . . పిట్టింగ్ సేయకుండా వొదిలేసేడు . . ఎప్పుడుఫోనుసేసినా ఇదిగో గెంటలోవొచ్చేత్తానో అంటాడండే . . " , అని కిందెట్టేసిన అద్దాలు సూపిత్తా . . మళ్ళా గెడ్డంసేయటంలో మునిగిపోయేడు . . అలా ఐదునిముషాలకోసారి సెల్లుఫోన్లో అరుత్తా . . మళ్ళా గెడ్డంగీత్తా . . అరగంటసేపు కుర్సీలో కుర్సోబెట్టి అటూ ఇటూ గిరగిరా గానుగుతిప్పినట్టుతిప్పేసి ఇకారంతెప్పించేసేడు గవర్రాజుకి . . . అరగంటయ్యాకా . . సల్లగా ఐసుగెడ్డలాగా లాగుతున్నలోషను మొకానికి రాసేసి . . మొకంపైగుడ్డేసి తుడవటంమొదలెట్టేడు . . మళ్ళా మోగుతున్న సెల్లుఫోను తీసి ముసుగేసేసిన గుడ్డ అలాగుంచేసి . . ఫోనట్టుకుని . . బయటకెళ్ళిపోయేడు . . మంగడుకొడుకు . సాయత్రమైపోయింది . . . కిష్నాష్టమికని కట్టిన పెరుగుముంత ఆడ్డంకన్నా . . గవర్రాజు , పెదరావుడు కట్టిన నిమ్మకాయల పందెం సూట్టాంకోసం గుంపులుగుంపులుగా . . జనాలు రాములోరిగుడిదగ్గర సేరుకుంటున్నారు . . . ఎవడిసేతిలోనూ ఓటమంటే ఎరగని గవర్రాజు ఆయేల పందెం వాడిపోయి . . రెండు . . వందనోట్ల కట్టలు పెదరావుడిసేతిలోపెట్టేసి తలదించుకున్నాడు . సెల్లు ఫోను మాటాడతా . . షాపు బయటకెళ్ళిన మంగడుకొడుకు మళ్ళా ఆవూళ్ళో అడుగెట్టలేదు . . రొండేపులా సమానంగా వొత్తేసి పాతసినిమాలో నాగేసర్రావు మీసంలా సన్నగాకాశీతాడులా తయారయ్యున్న మీసాన్ని మొత్తం గీయించేసుకుని . . బోడిమూతిని అద్దంలో సూసుకున్న గవర్రాజు . . ఒక్కసారిగా సల్లబడిపోయేడు . . మీసంతోపాటు పౌరుషంకూడా పోగొట్టుకుని . . ఆఏల్నుండీ . . పందేలు జోలికెళ్ళటమే మానేసేడు . .
టైటిల్ చూసి మీకు ఇప్పటికే అర్దమై ఉంటుంది . దీని కదా ఏంటో అని . . . . గిరిజన తండాలో మురికి వాడలో పెరిగిన ఒక యువకుడు తన బ్లాగు రచనల ద్వారా ఎలా పాపులర్ అయ్యాడు , ప్రపంచపు దృష్టిని ఎలా ఆకర్షించాడు , తద్వారా గూగిల్ , యాహూ లాంటి బడా కంపనీలు అతని బ్లాగులో వ్యాపార ప్రకటనలని చొప్పించడానికి ఎలా పోటీ పడ్డాయి . . . . అవి అతనిని ఎలా మిలేనియర్ని చేసాయి అన్నది చిత్ర కధాంశం .
ముగ్గరం పితక్కా తడిసిపోయేఁవు . బారకాస్ ముందర డ్రైనేజీ స్లాబుల మీద బండి నిలబెట్టి మా నాన్న ఎక్సలేటరు రైజ్ చేస్తూవుంటే నేను కసితీరా కిక్కొడుతూ వుంటే ఎన్ని కిక్కులు కొట్టినా బండి స్టార్టు కాలేదు . ఒక సైకిలు వాడు బెల్లు కొట్టుకుంటూ వెనక్కి చూసుకుంటూ వెళ్తే " కూచో చెప్తాను ! నువ్వు కూచోవే చెప్తాను " అని కసిరేరు . అమ్మవెనక సీట్లోన కూర్చుని కుంకం ముక్కు పుడక మీంచి పాయలు పాయలుగా కారిపోతూవుంటే " కార్బలేటరు మార్పించమన్నాడు భవానీ మార్పించలేదా . . ? " అంటే " నువ్వు కూచోవే ఓ పావురమా ! " అని పాట ఆపకుండా కీ తిప్పి ఎక్సలేటరు రైజ్ చేస్తునారు . ఎన్ని కిక్కులు కొట్టినా స్టార్టవకపోతే " చస్తున్న ఎలకలాగ కీసు కీసు మంటునాదే … " అని కీ తిప్పడం ఆపీసి ఉన్నట్టుండి పగలబడి నవ్వటాలకి దిగేరు . అమ్మ బొట్టంతా కారిపోయి జుట్టు పాయలు పాయలుగా భుజాలమీదికి అంటుకుపోయి నవ్వు మొహం పెట్టుకునే చలికివణికిపోతునాది . నాన్న " బారకాసు గోడ నీడ నిండా ములిగితిమే ఇక నీకీ చలి ఏలే ఒహ్హో … . ఓ … . పావురమా … " అని పాడుతూ వుంటే " సర్కస్ లో బఫూను వెధవ నయం ఎప్పుడు నవ్వాలో ఎప్పుడేడవాలో తెలుసును … " అని వీప్మీద చెళ్ళుమని కొట్టి పక్కలు పుళ్ళయిపోయీలాగ నవ్వుతునాది . ఇట్నుంచోమాటూ అట్నుంచోమాటూ జల్లులు కొడుతూవుంటే నా బుర్ర దాని వొళ్ళోకి లాక్కుని చెంగు చుట్టూ కప్పీసి పక్కలు కదిలిపోయీలాగ నవ్వు పట్టుకోలేకుండా " అమ్హ … . హమ్మ … . తడిసిపోతునాఁవండీ … . మీ నవుతాలు మండిపోనూ మీ సర్కస్ మండా ! ఏదీ … . ? తుప్పల్లో కూకున్నాడే గోంగూరకీ ? " అంటే మానాన్న మెడ కోళ్ళు ఎగరేసుకుంటూ " ఎహ్హెహ్హెహ్హే … " అని విరగబడి నవ్వుకుంటూ ' తనికెళ్ళా సత్యమూ గోంగూరకి ! వోడు తుప్పల్లో కూకున్నాడే గోంగూరకీ ! ! ' అని లైటు చిప్పమీద డప్పులాగ కొట్టుకుంటూ వాన తగ్గీ వరుకూ పాడేరు .
రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న జగన్ ఓదార్పుయాత్రను టీఆర్‌ఎస్ వివాదాస్పదం చేయడం మంచిది కాదని ఏఐసీసీ . . . .
ఆ చానల్ , ఈ చానల్ అని ఏమీ లేదండీ . అన్నీ ఒకటే బాపతు , సాగదీతే లక్ష్యంగా ముందుకెళ్ళిపోతున్నయి . వీక్ డేస్ లో టీవీ చూడకుండా వుండటమే బెటర్ . మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు . ఇక 2000 గురించి , మీరన్నట్టే 0 - 1000 తీసుకున్నంత సమయం పట్టలేదు ఈ సారి : ) .
సరిగ్గా అలాంటి స్థితిలోనే వున్నాడు ' ఐకాస ' కన్వీనర్ కోదండరామ్ - - 1973 లో మాలాంటివాళ్ళు వున్న స్థితిలోనే !
1928 - 29 సంవత్సరాల్లో బెంగాలీ పత్రిక " విచిత్ర " లో సీరియల్‌గా వచ్చిన బిభూతి భూషన్ బందోపాధ్యాయ్ స్వీయ కథాత్మక నవల " పథేర్ పాంచాలి " ను మద్దిపట్ల సూరి దాదాపు నలభై ఏళ్ళ క్రితం తెలుగులోకి అనువదించారు . ఈ తెలుగు అనువాదం పుస్తకం చాలాకాలం తరవాత ఈ మధ్యే ప్రచురణకు మళ్ళీ నోచుకుంది . ఇందులో ముందుమాటలో ఉన్న కొన్ని విషయాలు , సత్యజిత్ రాయ్ స్వయంగా రాసిన " మన సినిమాలు , వాళ్ల సినిమాలు " అన్న పుస్తకంలోని మరికొన్ని విషయాలు కలగలిపి , ఇక్కడ పొందు పరుస్తున్నాను .
ద్విధా భజ్యేయమప్యేవమ్ న నమేయమ్ తు కస్యచిత్ | ఏషా మే సహజో దోష : స్వభావో దురతిక్రమః | |
ఎన్నెల గారు , అయ్యో రామా ఎక్కడండీ కనిపించనేలేదు . ఆ సీరియల్ కూడా ఐపోయిందిట ! టి . వి సీరియలస్ ఇంత తొందరగా ఐపోవటము ఎరుగుదుమానండి ! విడ్డూరం కాకపోతే అవ్వ : ) వర్మ ఐదు రోజుల సినిమాలో ఓ రోజు మా పక్కింటి డాబా మీద తీసాడుట ! నేను ఊరికెళ్ళి వచ్చేసరికి ఈ ఘోరం జరిగిపోయింది ! ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు రిలీజవుతుందా ? అందులో మా పక్కింటి నుంచి మా డాబా కూడా కనిపిస్తుందా లేదా అని ఎదురుచూస్తున్నాను : )
పై లంకెలో xxxxxxxx అనేది మీ బ్లాగు ఐడీ . ( మీరు సృష్టించే ప్రతీ బ్లాగుకీ ఒక ఐడీ ఉంటుంది . మీరు బ్లాగరులోకి లాగిన్ అయి అది మీరు తెలుసుకోవచ్చు . )
> > What they propose as an alternative to the current system is rubbish in my opinion . మహాశయ , మీకు చెత్తగా అనిపిస్తే , వారిని ఏరివేయటానికి ఆ కారణం చాలునా ? మీకు దేశం పై , రాజ్యాంగం పై ఉన్న గౌరవానికి జోహర్లు , కానీ , తమరు కాస్త ఆ రాజ్యాంగ పరిధిలో ఆలోచించగలరు . మావోలు ఎలా రాజ్యాంగాన్ని అగౌరవపరిచారో కాస్త తెలియజేయగలరా ? వారు చెప్తున్నది మీరు ఏ బేస్‌తో అది చెత్త అని , వారు రాజ్యంగాన్ని అగౌరవరిచారు అని డిక్లేర్ చేసిపడేశారు ? అసలు కాస్త రాజ్యాంగబద్దంగా , రాజ్యాంగాన్ని అవమానించడం అంటే ఏంటో తెలియజేయగలరు , మీకు , మీ స్వ విషయాలను పక్కనపెట్టి , మీ మనోభావాలు దెబ్బతిన్నచో దాన్ని రాజ్యాంగం అగౌరవంగా పులమటం ఆపి , నిజం చెప్పగలరు . . మీకు తెలుసునో లేదో , రాజ్యాంగాన్ని అవమానించారు అని మీరు ఆరోపించడం ( అది రాజ్యాంగ పరిధిలో అవమానం కానిచో ) రాజ్యాంగరిత్యా నేరం అని తెలియకపోవడం , శోచనీయం . .
" సింపుల్ గా " అంటూ బంగాళదుంపల వేపుడూ , కొత్తిమీర చారూ ! మళ్లీ మా బావగారు వాళ్ల స్కూలు హాస్టలునించి , ఓ 50 రొట్టెలూ , 2 రకాల సబ్జీలూ ! ఇంకా , చారులోకి అప్పడాలూ , వడియాలూ , పచ్చళ్లూ , వూరగాయలూ . . . . పెరుగూ ! ( మేమక్కడ వున్నన్నాళ్లూ , కేన్లతో పాలు మాత్రం వచ్చేసేవి . పాడి పంటలకి లోటులేదుగా వాళ్లకి ! ప్రతీరోజూ , & పాలు మిగిలిపోతున్నాయి , యేం చేద్దాం ? అనే ప్రశ్నే ! )
ప్రకృతి లేవండో యుష వచ్చెను లేవండోయ్ సుప్రభాతరేఖలఁ దెచ్చెన్ లేవండోయ్ ముద మిచ్చెను లేవండో యెఱ్ఱదమ్మి రేకులు విచ్చెన్ 1
తెలంగాణపై కిషోర్ చంద్రదేవ్ వ్యాఖ్య న్యూఢిల్లీ : తెలంగాణ అంశంపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి , సీనియర్ నాయకుడు కిషోర్ చంద్రదేవ్ చెప్పారు . ఉద్యమాలపై సరైన వేదికపై మాట్లాడుతాగాని , ప్రధానివద్ద , ఇతరత్రా ఒత్తిడి చేయజాలనని ఆయన అన్నారు . అయితే ప్రజలందరికి మేలు కలగాలని కోరుకుంటున్నానని అన్నారు . తనను ఇన్నిసార్లు ఎన్నుకున్న ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు . 1977లో తొలిసారిగా కాంగ్రెస్ తరపున లోక్ సభకు గెలిచిన కిషోర్ చంద్రదేవ్ 1980లో కాంగ్రెస్ యు తరపున , 1984లో కాంగ్రెస్ ఎస్ తరపున గెలిచిన కిషోర్ చంద్రదేవ్ ఆ తర్వాత రాజకీయంగా వెనుకంజ చేశారు . తదుపరి కాంగ్రెస్ ఐలోకి వచ్చారు . ఆయనకు ఒకసారి రాజ్యసభ స్థానాన్ని ఇచ్చారు . తదుపరి 2004లో పార్వతీపురం నుంచి 2009లో అరకు నుంచి లోక్ సభకు ఐదో సారి ఎన్నికయ్యారు . గతంలో 1979లో చరణ్ సింగ్ క్యాబినెట్ లో కొంతకాలం మంత్రిగా ఉన్నారు . కిందటిసారి లోక్ సభ స్పీకరుగా ఎన్నికయ్యే అవకాశం ఉందని భావించినా అది రాలేదు . పార్లమెంటు ఎధిక్స్ కమిటీ ఛైర్మనుగా కూడ పనిచేశారు .
మధురవాణి గారూ , నిజంగా మీకు తెలియని పాటా . వావ్ మీ బ్లాగ్ లొ పాటలు చూసే నేనూ కమ్మటి కల అని పాటల బ్లాగ్ చేసుకున్నాను . థాంక్ యు .
అరే ! కంపూటర్లో తెలుగా ? ఇన్ని రచనలా ?
దబ్బర లేలరా బ్రతుకు దండను చేతురా నీకే వెతురా ! అబ్బుర మౌనురా బ్రతుకు టన్చుల నీ వేలుగింత నిల్పరా ! మబ్బులు లేక నా హృదయ మండలి నిల్వర చందమామ వై దిబ్బెన వడ్డికాసునురా దీవన లీయరా వెంకటేశ్వరా !
ఈ లోకాలలో నిరంతరం ఉండే సర్వేశ్వరుడు ' పర ' అనబడతాడు . సృష్టి చేసే సమయంలో వ్యూహ రూపంలో భగవంతుడు కనబడతాడు . వాసుదేవ , సంకర్షణ , అని రుద్ధ , ప్రద్యుమ్నులనేవి నాలుగు వ్యుహమూర్తులు . వీటిలో పరతత్వానికి వాసుదేవునికీ మధ్య ఎలాంటి బేధం లేదు . మిగిలిన మూడు వ్యూహములుగానే ఉంటాయి . వీనిలో జీవునికి అధిపతి సంకర్షణుడు . మనస్సుకు ప్రద్యుమ్నుడు , అహంకారానికి అనిరుద్ధుడు అధిపతులు . ఈ మూడు భగవంతుని స్వేచ్ఛామూర్తులు . పరమపథాన్ని పొందిన తరువాతే వైకుంఠవాసియైన భగవంతుడు లభిస్తున్నాడు . దివ్యశక్తిని పొందిన తరువాతే క్షీరసాగరంలో నివసించే పరమాత్మ దర్శనమవుతోంది . ఆయనను చేరుకునేందుకు ఎంతో పుణ్యం అవసరం .
టైటిల్ కాపికొట్టుకొచ్చేహేడు కదా అదే స్టోరీని తిరగేసి రాహెత్తాడేమో అనాసరంగా వచ్చేవని గట్టిగా తిట్టేస్కుని కంగారుపడి కంప్యూ టర్ కట్టేకుండా ఓసెణం ఓపిగ్గా ఉంటే మీకు మా సీను గాణ్ణి పరిసియం చేహెత్తాను ఆ తరవాత మనం మనం ఏం మాహాడుకున్నా ఓ లెఖ్క అది ఉంటాది … . ఏవంటారు … . . ఏవంటార్లెండి … … . విషయంలోకొత్తే … . .
- ఒక డిసెంబర్ 31 సాయింత్రం ఆరుగంటలు . . . చిన్న చెడ్డీలో బొడ్డు కనిపించే బనీను వేసుకుని నేను . . . మా రోజక్క బోల్డన్ని ముగ్గుల పుస్తకాలు , పేపర్లో వచ్చే వాటి కటింగ్స్ అన్నీ కుప్పగా ముందేసుకుని కూర్చొనుంది . ఏ ముగ్గు వేద్దామా అని ఆలోచిస్తూ . . . " రోజా ఇది బాగుంది . . " పక్కింటి ఆంటీగారు అప్పుడే వంట పూర్తి చేసుకుని వచ్చారు . " అక్కా ఇది సూపర్ . . " వెనకింటి అమ్మాయి తన నిర్ణయం తెలిపేసింది . " టీచర్ . . దిస్ ఈస్ గుడ్ . . " ట్యూషన్ కుర్రాడి మాటలు . . రోజక్క స్వతహాగా ఆర్టిస్ట్ కావటం వల్ల తను ముగ్గులు చాలా వీజీగా వేసేది . చీకటి పడుతుందనగా ముగ్గులపోటీకి మేం సిద్దం అని సంకేతాలిస్తూ ఒక్కొక్కళ్ళ వాకిళ్ళు పేడనీళ్ళ కళ్ళాపుతో తడిసేవి . . . ఇంటి అటక మీద ముగ్గు దిద్దడానికి ఉంచిన రంగుల పొట్లాలు అన్నీ తీసి ఒక ఇత్తడి పల్లెంలో పెట్టేది అమ్మ . అటకమీద ఎందుకు పెట్టేదంటే మాకు అందినంత ఎత్తులో ఉంటే వాటితో మధ్యాహ్నానికే యాపీ న్యూయియర్ అంటూ ఎక్కడపడితే అక్కడ సొట్ట సొట్టగా రాసిపడేస్తాం కదా . . అందుకన్నమాట . . . చిన్న చిన్న తెరిచిన పొట్లాలలో ఉన్న రంగులు పల్లెంలోనే ఒక ఇంధ్రధనస్సు ఏర్పడిందా అన్నట్టు ఉండేవి . ఇంతలో చమ్కీ పొడి కొనలేదా అంటూ పెద్దక్క హడావిడి . . . " రోజమ్మా . . ఆ ధనలక్ష్మి ( ముగ్గుల్లో అక్క కాంపిటేటర్ ) ఈ సారి నీకంటే పెద్ద ముగ్గేసి అందరు చేత పొగిడించుకోవాలని తెగ ఆరాటం పడుతుంది . . " అని మా పనమ్మాయి చాడీలు ఒక పక్క . . . చీకటి చిక్కగా పరుచుకున్నాక . . . కాలనీలో అందరి వాకిళ్ళో కళ్ళాపు కొంచెం ఆరాక ఒక్కో ఇంటి నుండి ఒక్కొక్కలు వచ్చి ముగ్గుపెట్టడం మొదలెట్టేవారు . చలి బాగా ఉండటం వల్ల పిల్లకాయలం అందరం మొహానికి దొంగోళ్ళలా మంకీ కేప్ లు వేసుకుని , నాన్నమ్మ సాలువానో తాతయ్య సాలువానో కప్పుకుని ముగ్గుల విజిటింగ్ కి వెళ్ళాం . . . . ఒక్కోసేపు ఒక్కో ముగ్గు దగ్గర నిలబడటం . . . చూసిన ముగ్గుని వేరే వాళ్ళు వేసిన దానితో పోల్చి చూసుకోవటం . . ఎవరిది గొప్ప అంటే ఎవరిది గొప్ప అని . . . మా ఎదిరింటి అనసూయమ్మ గారు మాత్రం ఓ అయిదు రెక్కలున్న ముగ్గు తొందరగా వేసేసి వాళ్ళ వాకిట్లో ఉన్న ముద్ద బంతి , చీమ బంతి పూలను రెక్కలు రెక్కలుగా విడగొట్టి వాటిని ముగ్గును నింపడానికి వాడేది . అది చూసి పెద్దవాళ్ళందరూ " అబ్బో . . ఏమి పిసినారితనం " అంటూ బుగ్గలు నొక్కుకుంటుంటే పిల్లలందరూ ఆంటీ మీరు ఎప్పుడూ రంగులతో ఎందుకు ముగ్గు పెట్టరు అని డైరెక్టుగా అడిగేసేవారు . పాపం ఆవిడ ఏమి చెప్పాలో తెలియక పిల్లలను " ఇక్కడ నుండి ఎల్లండెల్లండి . . " అంటూ మొహం మాడ్చుకుని తరిమేసేది . మా ఇంటి ముందు ముగ్గు వేసేసేటప్పుడు చాలా మంది గుమిగూడేవారు . ఎందుకంటే అప్పటికే అక్క వేసిన ముగ్గులు వరసగా మూడు సంవత్సరాలు ఉత్తమ ముగ్గుగా కాలనీ వాళ్ళ ప్రశంసలు పొందాయి . ఈ సారి ఏ ముగ్గు వేస్తుందో చూద్దామని జనాల ఆరాటం . . . . అందరికంటే లేటుగా అక్క ముగ్గు పెట్టడం స్టార్ట్ చేసినా తొందరగా వేసేసేది . అదికూడా ముగ్గురక్కలు రంగులు దిద్దటంలో తలో చెయ్యి వెయ్యటం వల్ల తొందరగానే అయిపోయేది . నేనేమో రంగులు దిద్దుతానని ఒకటే అల్లరి చేసేవాణ్ణి . అమ్మేమో వీడికి చమ్కీలు అద్దే పని ఇవ్వండర్రా అంటూ అక్కలకు నన్ను సిఫారసు చేసేది . కానీ అక్కవాళ్ళు ఆ చాన్స్ కూడా ఇవ్వక హాపీ న్యూ ఇయర్ రాసే అక్షరాలలో ఏ పీ లెటరో వై లెటరో దిద్దమని ఇచ్చేవారు . కనీసం ముగ్గులో ఒక వైపు ఉన్న పువ్వో , ఫలమో , ఆకో రంగులద్దడానికి కావాలి అన్నది నా ప్రధాన డిమాండ్లు . . . ఇవ్వకపోతే ముగ్గు చెరిపేస్తా అంటూ బెదిరించేవాణ్ణి . కానీ చిన్నక్క నా చెయ్యిని గట్టిగా పట్టేసుకుని నాకు చెరిపే అవకాశం ఇచ్చేదికాదు . . అలా ప్రతీసంవత్సరం చెరిపే చాన్స్ మిస్సయ్యేది . తొమ్మిదయితే సగం రంగులు అద్ది అందరూ భోజనాలకి వెళ్ళి పిల్లకాయలను ఆవులు గట్రా ముగ్గును తొక్కకుండా కాపలాగా పెట్టేవారు . మా అక్క అయితే " ఒరేయ్ . . రంగులేమైనా అద్దావో వీపు పగిలిపోద్ది . . " అంటూ హెచ్చరిక జారీ చేసి కాపలా ఉండమంది . నాకేమో రంగులద్దాలని తెగ కోరికగా ఉండేది . చేసేదేంలేక వంటిట్లోకి దొంగలా వెళ్ళి , మైదా పిండిని ఓ చిన్న పేకట్ కట్టుకుని పరిగెత్తాను . ఏ డొంకల్లోనో ఓ చిన్న ప్లేస్ చూసుకుని మూడు చుక్కలు మూడు వరసల ముగ్గేసి , ధనలక్ష్మి ఇంటికెళ్ళి ముగ్గు దగ్గర ఎవ్వరూ లేరని అనుకున్నాక అక్కడ ఉంచిన రంగులు కొంచెం కొంచెం కొట్టేసి పొట్లం చుట్టి తెచ్చుకుని దానికి రంగులు నింపాను . ఓ కళాఖండం రెడీ అయిపోయింది . నా చెడ్డీ దోస్తులకి దాన్ని చూపిద్దామని వాళ్ళని పిలవడానికని వెళ్ళాను . వాళ్ళను వెంటేసుకుని నేను వేసిన ముగ్గు దగ్గరకు వెళ్ళాను . కానీ విచిత్రంగా అక్కడ నా మూడు చుక్కల ముగ్గులేదు కానీ ఆవు పేడ అయితే ఉంది . . ప్చ్ . . నా ముగ్గేమయిందో ! ! . మళ్ళీ వేసుకున్నాను . . కానీ ఈ సారి బ్లాక్ అండ్ వైట్ మూడు చుక్కల ముగ్గుతో సరిపెట్టుకోవలసి వచ్చింది . అందరు ఇళ్ళల్లో ఒంటి గంట రెండు వరకు లైట్లు వెలుగుతూనే ఉండేవి . పాటలు . . ఆటలతో తెగ సందండి . . . మా అక్క చేత వాళ్ళింటి ముందర ముగ్గు పెట్టించుకోడానికి ఓ ఇద్దరు ముగ్గురు మా ఇంటిలో ఉండేవారు . అందరి ముగ్గుల కార్యక్రమం అయ్యాక చూస్తే వీధి లైట్లలో ముగ్గులన్నీ చమ్కీపొడితో ధగ ధగ మెరిసిపోయేవి . కొంత సేపటికి ముగ్గును సన్నటి మంచుతెర కప్పుతుంటే మసకగా మెరిసిపోతూ కన్పించే ముగ్గు చాలా అందంగా ఉండేది . ఆ టైంలో అమ్మ అందరికీ టీ పెట్టి ఇచ్చేది . నాకు ప్రత్యేక గ్లాసులో ఇవ్వక తను కొంచెం తాగి ఇచ్చింది . అప్పుడే అర్ధమైంది . . . తొందరగా పెద్దయిపోవాలి . . లేదంటే ఫుల్ గ్లాసు టీ ఇవ్వరని . ముగ్గులు చూడడానికి పక్క కాలనీవాళ్ళు , మా కాలనీ వాళ్ళు కూడా ఇంటింటికీ తిరిగేవారు . కాలనీ అంతా ఏదో తిరనాళ్ళలా ఉండేది . ఎప్పటిలాగే అందరూ మా ఇంటి ముందున్న ముగ్గు దగ్గర కొంచెం ఎక్కువసేపు ఆగి మా అక్కని మెచ్చుకునేవారు . నేను ఇదిగో ఆంటీ నా ముగ్గు కూడా చూడండి అంటూ నా మూడు చుక్కలు మూడు వరసల ముగ్గు చూపించాను . కానీ ఒక్కరూ మెచ్చుకోలే . . . కనీసం అనసూయమ్మ ముగ్గుకంటే బాగుందని కూడా చెప్పలే . . . గొప్ప కోపం వచ్చింది ఆ టైంలో . . . న్యూఇయర్ అయిపోయాక ప్రతీ వాళ్ళు ఇంటి ముందు కొత్త ముగ్గు వెయ్యక ఓ రెండు రోజులు అదే ముగ్గు ఉంచేవారు . కళ్ళముందు ఎప్పుడైనా చీపురుతో పాతముగ్గును అక్క తుడిచేస్తున్నప్పుడు నాలో ఒక బాల కళాకారుడు జారిపోతున్న చెడ్డీ ఎత్తుకుంటూ లేచేవాడు . చాలా భాద వేసేది . " అందుకేనమ్మా . . నేను అంత కష్టపడి ముగ్గుపెట్టి రంగులద్దను . . . ఎప్పటికైనా తుడిచేయాల్సిందేగా . . " అనసూయమ్మగారు అమ్మతో అనటం సన్నగా వినిపించేది .
నవీన్ గారూ , మీరు నిజంగానే ఎదురు చూస్తున్నారేమోనని - ఏమయిందో నాకూ తెలియదు . అయినా మీకు సుఖాంతాలే ఇష్టమని తోస్తుంది కనక ఈ కింది రెండింట్లో ఒకటి ఎన్నుకోవచ్చు . 1 . వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుని , వేరెవరినో మళ్ళీ పెళ్ళి చేసుకుని హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు . 2 . ఎలాగో రాజీ పడి , తమ కాపురాన్ని చక్కదిద్దుకున్నారు . ఇది కల్పితమే . కాకపోతే కొంతయినా ఎప్పుడో ఎక్కడో నిజం అయీ ఉండొచ్చు .
చం . ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద , బై బొదలు మిణుంగురుంబురువు పోలిక వెల్గుచునున్న దివ్వె , ఆ ముదముడిపోయినన్ సమసిపోవుట లేదిది , దీపమందు మా హృదయము సుమ్మి ! నిల్పి చనియెన్ గత పుత్రిక యే యభాగ్యయో
బావుందండీ మంచిపోస్టు . కానీ ఆలోచిస్తే కొంచెం భయంగానే ఉంది . మీ వ్యాఖ్య నచ్చింది . మిగిలిన రెండు భాగాలు కూడా త్వరగా రాసేయండి మరి
మంత్రి ఎవరిని ఆశ్రయించుకుంటే మేలు జరుగుతుందో చాలాకాలం గ్రహించుకోలేకపోయానంటూ మంత్రి వాపోతూ అంటున్నాడు .
క్రమేపీ పేరు ఒక్కటే వాడితే ఎవరు ఎవరో తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదురయాయి . ఈ పరిస్థితి మన దేశానికేమీ ప్రత్యేకం కాదు . ఉదాహరణకి , నార్మనులు క్రీ . శ . 1066 లో దండెత్తి ఇంగ్లండుని ఆక్రమించిన తర్వాత అక్కడ ఇంటి పేర్ల వాడకం వ్యాప్తి లోకి వచ్చింది . ఉదాహరణకి , ఎలైజా అనే పేరింటిగత్తెలు ఎంతో మంది ఉండొచ్చు . ఫలానా ఎలైజాని గురించి ఎలా వాకబు చెయ్యడం ? బద్ధకిష్టి ఎలైజా అనో , తినమరిగిన ఎలైజా అనో , పనిదొంగ ఎలైజా అనో చెప్పాలి కదా . కనుక ఇంగ్లీషులో " ఎలైజా డు లిటిల్ " అని అని ఉంటారు . అదే క్రమేపీ ఎలైజా డులిటిల్‌గా మారింది .
అతనేమంటున్నదీ ఎవరికీ అర్థం కాలేదు ముందు . అర్థం కావటం తోనే అప్పటి దాకా ఆరిపోయి వున్న ఉత్సాహం మళ్ళీ రాజుకుంది . ఒక్కసారిగా ఊపిరి లేచివచ్చింది . మిగిలిన నావలన్నిటికీ కూడ వార్త పంపాం . అందరూ ఆనందంగా తీరానికి బయల్దేరారు .
పొద్దున్నే లేసినాడు బ్లాగరయ్యా వాడు కూడలి జల్లెడ తెరిచినాడు బ్లాగరయ్యా కూడలి - జల్లెడ తెరిచినాడు బ్లాగరయ్యా వాడు వేడి టపా జదివినాడు బ్లాగరయ్యా వేడి టపా జదివినాడు బ్లాగరయ్యా వాడు దొంగనేము బెట్టినాడు బ్లాగరయ్యా దొంగనేము బెట్టినాడు బ్లాగరయ్యా వాడు బ్లాగు బంకసూసినాడు బ్లాగరయ్యా బ్లాగు బంకసూసినాడు బ్లాగరయ్యా వాడు కవితల్ దోవ బట్టినాడు బ్లాగరయ్యా కవితల్ దోవ బట్టినాడు బ్లాగరయ్యా వాడు భావుకత లేక బేర్మనె బ్లాగరయ్యా భావుకత లేక బేర్మనె బ్లాగరయ్యా వాడు బుడ్డ బ్లాగు బట్టినాడు బ్లాగరయ్యా బుడ్డ బ్లాగు బట్టినాడు బ్లాగరయ్యా వాడు తేనెగూళ్ళో బణ్ణాడు బ్లాగరయ్యా తేనెగూళ్ళో బణ్ణాడు బ్లాగరయ్యా వాడు తేన్టపాలు జూసినాడు బ్లాగరయ్యా తేన్టపాలు కాంచినాడు బ్లాగరయ్యా వాడు కాపీచేసి బ్లాగ్లోబెట్టె బ్లాగరయ్యా కాపీ చేసి బ్లాగ్లోబెట్టె బ్లాగరయ్యా వాణ్ణి బ్లాగ్గుంపు కేకలు బెట్టె బ్లాగరయ్యా బ్లాగ్గుంపు కేకలు బెట్టె బ్లాగరయ్యా వాడు గూగుల్ దవ్తాడనుకుండె బ్లాగరయ్య గూగుల్ గాదు ఫ్రూగుల్ గాదు బ్లాగరయ్య వాణ్ణి బ్లాగు ముయ్యమనే బ్లాగరయ్యా బ్లాగు ముయ్యమనే బ్లాగరయ్యా వాడు హిట్లు జాస్తాడనుకునే బ్లాగరయ్యా హిట్లు గాదు ఫట్లు గాదు బ్లాగరయ్యా వాణ్ణి ఫ్లాగ్ గుంజకు యాలదీసె బ్లాగరయ్యా ఫ్లాగ్ గుంజకు యాలదీసె బ్లాగరయ్యా వాడు గూగులయ్య రాంకన్కుండే బ్లాగరయ్యా ర్యాంకూ కాదు బ్యాంకూ గాదు బ్లాగరయ్యా వాడు చీదరింపులు దెచ్చినాడు బ్లాగరయ్యా చీదరింపులు దెచ్చినాడు బ్లాగరయ్యా వాడు యాడ్లు తెస్తాడనుకుండే బ్లాగరయ్యా యాడ్లు గాదు గీడ్లు గాదు బ్లాగరయ్యా వాణ్ణి రాతలు గీతలు మాన్మనే బ్లాగరయ్యా రాతల్ గీతల్ మాన్మనె బ్లాగరయ్యా వాడు దిగులు పట్టి వురికినాడు బ్లాగరయ్యా దిగులు పట్టి వురికినాడు బ్లాగరయ్యా . . . . అంతర్జాలమొదిలి వురికినాడు బ్లాగరయ్యా . . . . రాయల సీమ పల్లెల్లో పాడుకునే అసలు సిసలు జానపద కాదరయ్య పాట : పొద్దున్నే లేసినాడు కాదరయ్యా వాడు కాళ్ళూ - మొగం గడిగినాడు కాదరయ్యా కాళ్ళూ - మొగం గడిగినాడు కాదరయ్యా వాడు సద్ది సంగటి దిన్నాడు కాదరయ్యా సద్ది సంగటి దిన్నాడు కాదరయ్యా వాడు పంగనామం బెట్టినాడు కాదరయ్య పంగనామం బెట్టినాడు కాదరయ్యా వాడు బుట్ట సంకనేసినాడు కాదరయ్యా బుట్ట సంకనేసినాడు కాదరయ్యా వాడు పల్లే దోవ బట్టినాడు కాదరయ్యా పల్లే దోవ బట్టినాడు కాదరయ్యా వాణ్ణి పల్లె కుక్క భౌ మనె కాదరయ్యా పల్లె కుక్క భౌ మనె కాదరయ్యా వాడు అడ్డ దోవ బట్టినాడు కాదరయ్యా అడ్డ దోవ బట్టినాడు కాదరయ్యా వాడు జొన్నసేలో బణ్ణాడు కాదరయ్యా జొన్నసేలో బణ్ణాడు కాదరయ్యా వాడు జొన్నకంకులు జూసినాడు కాదరయ్యా జొన్నకంకులు తుంచినాడు కాదరయ్యా వాడు యిరిసిరిసి బుట్లోబెట్టె కాదరయ్యా యిరిసిరిసి బుట్లోబెట్టె కాదరయ్యా వాణ్ణి సేన్రెడ్డి కేకలుబెట్టె కాదరయ్యా సేన్రెడ్డి కేకలుబెట్టె కాదరయ్యా వాడు గువ్వల దోల్తాండనుకొండె కాదరయ్యా గువ్వల్ గాదు గివ్వల్ గాదు కాదరయ్యా వాణ్ణి జుట్టుబట్టి వొంగదీసె కాదరయ్యా జుట్టుబట్టి వొంగదీసె కాదరయ్యా వాడు పేండ్లు జూస్తాడనుకొండె కాదరయ్యా పేండ్లుగాదు గీండ్లుగాదు కాదరయ్యా వాణ్ణి మంచె గుంజకు యాలదీసె కాదరయ్యా మంచె గుంజకు యాలదీసె కాదరయ్యా వాడు ఉయ్యాలూప్తాడనుకొండె కాదరయ్యా ఉయ్యాల్గాదు గియ్యాల్గాదు కాదరయ్యా చింతమల్లెలు దెచ్చినాడు కాదరయ్యా చింతమల్లెలు దెచ్చినాడు కాదరయ్యా వాడు పెండ్లి జేస్తాడనుకొండె కాదరయ్యా పెండ్లిగాదు గిండ్లిగాదు కాదరయ్యా వాణ్ణి వాతల్ వాతలు పెరికినాడు కాదరయ్యా వాతల్ వాతలు పెరికినాడు కాదరయ్యా వాడూ దోవల్ దోవలు ఉరికినాడు కాదరయ్యా దోవల్ దోవలు ఉరికినాడు కాదరయ్యా . . . దోవల్ దోవలు ఉరికినాడు కాదరయ్యా . . .
నా యొక్క మొదటి బ్లాగ్ ని నేను నా బ్లాగ్ కు పెట్టుకున్న నది పేరు మీదే వ్రాయాలని అనుకున్నాను . అందుకే నాకు తెలిసినంతలో వివరాలు వ్రాసాను . గోదావరి అన్నా ఆ గాలి అన్నా నాకు చాలా ఇష్టం . చిన్నతనంలొ నేను నా స్నేహితులు గోదావరిలొ ఈత కొట్టిన ఆనంద క్షణాలు గుర్తుస్తుంటాయి . అందుకే ఈ బ్లాగ్ .
ఈ వ్యాసంలో నేను ప్రస్తావించని విషయాలు చాలా ఉన్నై . వచన పద్యం చారిత్రక పరిణామాన్ని గురించి విమర్శకుల్లో చాలా అభిప్రాయాలున్నై . కొందరు దీనిని సమాజ పరిమాణంతో ఉన్న సంబంధాన్ని నిరూపించటానికి ప్రయత్నించారు . దాన్ని గురించి ఈ వ్యాసంలో ప్రస్తావించను . వచన గేయం ఒక ఉద్యమమని కుందుర్తి ఆంజనేయులు ( నవత - 2 ) ప్రకటించారు . ఈ విషయంలో నేను రమణారెడ్డితో ( 1967 ) ఏకీభవిస్తాను . అయినా అందుకు కారణాలు ఈ వ్యాసంలో ప్రస్తావించను . వచన పద్యంలో కథాకావ్యాలు రావాలని కుందుర్తి ఆంజనేయులు , శీలా వీర్రాజు , కోవెల సుప్రసన్నాచార్యులు వంటివారు అభిప్రాయపడ్డారు . కీ . శే . బాలగంగాధర తిలక్ ఇందుకు వ్యతిరేకులు . ఈ విషయంలో నాది అలీన విధానం .
వీక్షణం ( రాజకీయార్ధిక సామాజిక మాస పత్రిక ) ఏప్రిల్ సంచిక సంపాదకీయం ఎన్నికలు ఏం సాధిస్తాయి ? ఈ సంపాదకీయం మీరు చదువుతున్న సమయానికి రాష్ట్రంలో శాసనసభకూ , లోక్సభకూ మొదటి విడత అభ్యుర్ధులు ఖరారయిపోయి నామినేషన్లు ఘట్టం ముగిసిపోయి ముమ్మరంగా ప్రచారం మొదలయి ఉంటుంది . రానున్న రెండు మూడు వారాలలో రెండు విడతల ఎన్నికలు కూడా ముగిసిపోయి ఫలితాల కోసం నెలరోజుల నిరీక్షణ మొదలవుతుంది . ఈ మొత్తం క్రమంలో అటు చట్టసభల అభ్యర్ధిత్వం ఆశించేవారు , అంతిమంగా పోటీ చేసేవారు , వారి అనుచరగణం , ప్రభుత్వ యంత్రాంగం , ప్రచార మాధ్యమాలు చేసే హడావుడే కనబడుతోంది వినబడుతోంది . ఈ సంరంభంలో ప్రజల పాత్రగాని , ప్రజలకు అవసరమైనది గాని , ప్రజలకు దక్కేది గాని ఏమైనా ఉన్నదా అని చూస్తే చేదు నిజాలు బయటపడుతున్నాయి . ప్రజల పేరు మీద , తమ ప్రతినిధులను ఎన్నుకునే ప్రజల హక్కు పేరు మీద , వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తూ జరుగుతున్న ఈ ఎన్నికల ప్రహసనంలో ప్రజల పాత్ర నామమాత్రమే . రెండు వారాల పాటు శ్రోతలుగానూ , ప్రేక్షకులుగానూ , ఎన్నికల రోజున కొన్ని గంటలు క్యూలో నిలబడి , రెండు నిమిషాల్లో బేలట్ పై తమ ముద్ర కొట్టేవారిగానూ తప్ప అంతకన్నా ఎక్కువ పాత్ర ప్రజలకు లేదు . ఎవరి పేరు మీద ఈ నాటకం నడుస్తున్నదో వారికి ఆ నాటకంలో ఇంత తక్కువ పాత్ర ఉండడం హాస్యాస్పదమైన శోచనీయమైన విషయమని కూడ ఎవరికీ అనిపిస్తున్నట్టు లేదు . ప్రజల పాత్ర లేదంటే ప్రజల ప్రస్తావన లేదని కాదు . నిజానికి జరిగే తంతంతా ప్రజలు , ప్రజలు , ప్రజలు అనే మంత్రం జపిస్తూనే జరుగుతున్నది . కానీ ప్రజలంటే ఎవరు ? వారి జీవితం ఎలా గడుస్తున్నది ? ఆ జీవితాన్ని మెరుగు పరచడానికి ఏమి చేయవలసి ఉన్నది ? తమ చేతికి అందబోతున్న విధాన నిర్ణ్యాధికారాన్ని , విధానాల అమలు అధికారాన్ని ఆ ప్రజాజీవితాన్ని మెరుగుపరచడానికి ఏ విధంగా ఉపయోగించబోతాము , తీవ్రమైన అంతరాలు ఉన్న సమాజంలో కనీస రాజ్యాంగ లక్ష్యాలనైనా నెరవేర్చడానికి ఎటువంటి చర్యలు చేపట్టబోతాము అనే మౌలిక ప్రశ్నలైనా ఈ ప్రజానామ జపంలో వినబడడం లేదు . అన్ని రాజకీయ పక్షాలు పేరుకు ఏవో కొన్ని వాగ్దానాలతో ఎన్నికల ప్రణాళికలు ప్రకటిస్తాయి . ఆ వాగ్దానాలను అమలు చేయనక్కరలేదనీ , చేయవలసిన బాధ్యత ఏమీలేదనీ , కేవలం ప్రజలను ఆకర్షించేందుకే ఆ వాగ్దానాలు చేస్తున్నామనీ అన్ని రాజకీయ పక్షాలకూ చాలా స్పష్టంగా తెలుసు . రాజకీయార్ధిక సామాజిక వ్యవస్థలో మౌలికమైన మాపు జరగకుండా కేవలం ఒకరి చేతినించి మరొకరికి అధికారం మారినంత మాత్రాన ప్రజాజీవితంలో ఎటువంటి మార్పూ రాదనే వాస్తవాన్ని ప్రజలు గ్రహించకుండా చూడడానికే ఈ ఎన్నికల తతంగం నడుస్తోంది . ఏదో మార్పు జరగబోతున్నదనో , జరిగే అవకాశం ఉన్నదనో ప్రజలను మోసపుచ్చేందుకే ఐదేళ్ళకోసారి ఈ ఎనికల తతంగం నడుస్తోంది . వ్యవస్థ మౌలికంగా మారాలని కోరుకునే ప్రజలకు గానీ , రాజకీయ పక్షాలకు గానీ ఈ ఎన్నికల క్రీడలో పాల్గొనే అవకాశమే లేదు . ఒకవేళ ఉన్నచోట గూడ నామమాత్రంగానైనా ప్రదర్శన వస్తువుగానైనా రాజ్యాంగం హామీ ఇచ్చిన ఆ సమాన భాగస్వామ్య అవకాశాన్ని వాడూకుని అధికారానికి వచ్చిన ప్రభుత్వాలు చేయగలిగిందేమీ లేదని చరిత్రలో అనేకసార్లు రుజువైంది . అటువంట్ ప్రభుత్వాలేర్పడి ప్రజల పట్ల నిబద్ధతతో , చిత్తశుద్ధితో ప్రవర్తించగలిగిన వ్యక్తులో , శక్తులో ఉన్నా వారిని ఎక్కువకాలం పనిచెయ్యనివ్వనంత బలమన స్వార్ధ ప్రయోజన శక్తులు , పాలకవర్గాలు ఉన్నాయి . అందువల్ల దీర్ఘకాలికంగా ఎన్నికలతో సాధించగలిగింది ఏమీలేదనే అవగాహనను కలిగి ఉంటూనే స్వల్పకాలిక ప్రయోజనాల కొరకు ఎన్నికలు ప్రజలకు ఉపయోగపడతాయా ఆలోచించాలి . ఈ సందర్భంగానయినా ప్రజలు రాజకీయ పక్షాలను అభ్యర్ధులను నిలదీయవచ్చు , ప్రశ్నించవచ్చు . వ్యవస్థ ఎవరి ప్రయోజనాల కొరకు పనిచేస్తున్నదో ఎండగట్టవచ్చు , ప్రజానామజపం బదులుగా , నిజంగా ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కొరకు ఎవరు ఏమి చేస్తారో , ఎట్లా చేస్తారో అడగవచ్చు . తమ గత ప్రజావ్యతిరేక చరిత్రకు ఎలా పశ్చాత్తాపం ప్రకటిస్తారో నిలదీయవచ్చు . ప్రశ్నించడమే ప్రజలకు మిగిలి ఉన్న ఏకైక మార్గం . ప్రతులకు : veekshanam2003 at gmail dot com reachcdrc at yahoo dot com 040 - 6684 3495
నేను చిన్న తనంలోనే ఇంగ్లీషు నేర్చుకోవడం ప్రారంభించాను . మధ్యలో వదిలేసినా , ఉదయశంకర్ సందర్శనం తరువాత మళ్ళీ ప్రారంభించాను . ఆయన నృత్య ప్రదర్శన సందర్భంగా వచ్చిన భారతీయులలో ఒకతేలుగు వ్యక్తి నాకు పరిచయమయ్యారు . ఆయన పేరు బాలకృష్ణశర్మ . 19వ యేటనే ఇంగ్లండు వెళ్ళి కొన్ని సంవత్సరాలపాటు అక్కడ ఉండి చక్కని ఇంగ్లీషు నేర్చుకున్నారు . ఆయన అభ్యుదయవాది శాస్ర్తీయంగా , ఆసంకేతికంగా ఇండియా పాశ్చాత్య ప్రపంచంతో పాటు పురోగమించాలని ఆయన ఉద్దేశ్యం . నాకు అప్పుడు 13 సంవత్సరాలు . బాలకృష్ణ తటపటాయించి నన్ను ఇండియా క్లబ్బుకు తీసుకువెళ్ళారు . ఈ క్లబ్బును విఠల్ భాయ్ పటేల్ , సుభాష్ చంద్రబోస్ 1933లో స్థాపించారు . ఇందులో డాక్టర్లు , విద్యార్థులు , రోగులు సభ్యులుగా వుండేవారు . నేను క్లబ్బులో సభ్యుణ్ణి అయిన తర్వాత చాలా ఉత్సాహం చూపాను . అందరిలోకి నేను చిన్నవాడిని . వారి మధ్య నేను మసలుతూ ఇండియాను గురించి , భారతీయ సంస్కృతిని గురించి తెలుసుకున్నాను . క్లబ్ లైబ్రరీలో పుస్తకాలు చదువుతూ , అక్కడికి వచ్చే భారతీయ వార్తా పత్రికలన్నీ చూసేవాడిని . జర్మనీలో వైద్యం చదువవలసిన భారతీయ విద్యార్థులు తప్పనిసరిగా జర్మన్ భాష నేర్చుకోవలసి వచ్చేది . దీనికోసం వేరే ట్యూషన్ కావాలంటే చాలా ఖర్చుయ్యేది . ఆ అవకాశం తీసుకొని భారతీయులకు నేను జర్మన్ భాష నేర్పేవాడిని . వారి వద్ద సంస్కృతం , హిందీ , ఉర్ధూ , బెంగాలీ నేర్చుకున్నాను . శాంతినికేతన్ విద్యార్థిని సుచిత్ర చౌదరి సంగీతం నేర్చుకోడానికి వచ్చినాకు బెంగాలీ నేర్చింది . ఆ విధంగా నేను బెంగాలీ నెర్చుకుని టాగూర్ సంప్రదాయాలను తెలుసుకున్నాను . డాక్టర్ కేసరవాణి నాకు సంస్కృతం నేర్పారు . 1937లో అక్టోబరు 2న మహాత్మాగాంధీ జన్మదినోత్సవం సందర్భంగా హోటల్ ఫ్రాన్స్ లో జరిగిన ఒక ఉత్సవంలో నేను భగవద్గీతలో కొంత భాగం చదివాను . అది నా 14వ యేట మరునాడు వియన్నా పత్రికలు నన్ను పొగుడుతూ వ్రాశాయి . వియన్నా విశ్వవిద్యాలయంలో సుప్రసిద్ధ ప్రొఫెసర్ ప్రావాల్ సర్ సంస్కృతం , ప్రాచీన భారతీయ విషయాలు చెప్పేవారు . ఆయన అనుమతితో క్లాసులో కూర్చొని అనేక విషయాలు నేర్చుకున్నాను . నెహ్రూతో ఒకసారి 1938లో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వియన్నా వచ్చారు . అప్పటికి గాంధీపేరు చాలా మందికి తెలుసుగాని , నెహ్రూ యింకా అంతగా ప్రచారంలోకి రాలేదు . ఇండియా క్లబ్ అధ్యక్షుడు నన్ను రమ్మని ఆహ్వానిస్తే హోటల్ ఫ్రాన్స్ లో 114వ గదిలో వుంటున్న నెహ్రూను చూడడానికి వెళ్ళాం . బహుశా నా గురించి అప్పటికే ఆయనకు చెప్పారేమో తెలియదు . నన్ను చూడగానే కుర్చీ చూపి కూర్చోమన్నారు . నా ఉర్దూ విని ఆశ్చర్యపోయారు . అప్పుడే వెలువడిన తన పుస్తకం చదివారా అనీ . అందులో అర్థం కానిదేమైనా వుంటే నిర్మోహమాటంగా అడగమన్నారు . ఇండియాలో మంచి పత్రికలేవని అడిగాను . దానికి సమాధానంగా ఆయన భారతీయ పత్రికలపై ఒక చిన్న వుపన్యాసమిచ్చారు . భాయీ సచ్చిదానంద1939 ఏప్రిల్ 20న సచ్చిదానంద యూరప్ పర్యటిస్తూ వియన్నా వచ్చారు . ఉదయం 8 గంటలకు ఇండియన్ క్లబ్ కు వచ్చారు . నన్ను హిందువులలో చేర్చుకొమ్మని ఆయననడిగాను . వేద ప్రమాణాన్ని అంగీకరించిన వారెవరైనా హిందువులు కావచ్చునని ఆయన ఉద్దేశ్యం . ఆవు పాలు , ఆవు మజ్జిగ , ఆవు వెన్న , గోమూత్రం , గోపంచకం అనేవి హిందువు స్వీకరించాలని , అయితే గోమాంస భక్షణ మాత్రం కూడదని భాయీ సచ్చిదానంద చెప్పారు . అక్కడే నాకు మొట్టమొదటిసారిగా రామచంద్ర అని నామకరణం చేశారు . భాయీ సచ్చిదానంద పెట్టిన పేరే చాలకాలం స్థిరపడింది . అంతటితో నేను హిందువుగా మారాను . ఈ బాల్యదశ విషయం ముగించే ముందు మరికొన్ని వివరాలు చెప్పి అంతటితో పూర్వాశ్రమానికి స్వస్తి పలుకుతాను . మా తండ్రి మొదటి ప్రపంచ యుద్ధంలోను , ఆ తరువాత విమానదశంలోనూ కెప్టెన్ గా పనిచేశారు . ఆయన పోలో ఆడేవారు . మా తల్లి బాగా చదువుకున్నది . తమ పూర్వీకులంతా రాజవంశానికి చెందినవారనేది . ఆమె నోరు మంచిది కాదు . ఆ బాధలన్నీ మా తండ్రే పడేవారు . మా న్నానకు పుస్తకాలంటే అయిష్టం . ఆయన మా చిన్నతనంలో ఒకసారి నాకు విస్కీ యిచ్చారు . అదేదో షర్బత్తు అనుకొని గటగటా తాగేశాను . అంతటితో నాకు విస్కీపై విరక్తి పుట్టి దాని జోలికిపోలేదు . కోరికలు ఏవైనా వుంటే నిస్సందేహంగా తీర్చుకోవాలని మా తల్లి బోధించేది . ఇది లైంగిక విషయాలతో కూడినదని భావించి , స్ర్తీ జోలికి పోకూడదని నేను నిశ్చయించుకున్నాను . కాని , ఆ మాట మీద పూర్తిగా నిలబడలేదు . గ్రామర్ స్కూల్లో లాటిన్ చదువుకున్నాను . మతపరమైన విద్య కూడ కఠినంగా నేర్పేవారు . నా చిన్న తనంలో ఆర్య సేవకురాండ్రు హిట్లర్ ప్రోత్సాహంతో తమ యూదు యజమానురాండ్రను వీధుల్లోకి లాక్కొచ్చి కాలిబాటను తుడిపించే వారు . ఇలాంటి భయంకరమైన దృశ్యాలు సర్వసాధారణంగా వుండేవి . నాజీ విద్య వలన నాలో నియంతృత్వ వాదంపై వ్యతిరేకత ప్రబలింది . భాయీ సచ్చిదానంద వలన హిందువుగా మారిన నేరు జీవితాన్ని ప్రారంభించాను . తమ పూర్వీకులంతా రాజవంశానికి చెందినవారనేది . ఆమె నోరు మంచిది కాదు . ఆ బాధలన్నీ మా తండ్రే పడేవారు . మా న్నానకు పుస్తకాలంటే అయిష్టం . ఆయన మా చిన్నతనంలో ఒకసారి నాకు విస్కీ యిచ్చారు . అదేదో షర్బత్తు అనుకొని గటగటా తాగేశాను . అంతటితో నాకు విస్కీపై విరక్తి పుట్టి దాని జోలికిపోలేదు . కోరికలు ఏవైనా వుంటే నిస్సందేహంగా తీర్చుకోవాలని మా తల్లి బోధించేది . ఇది లైంగిక విషయాలతో కూడినదని భావించి , స్ర్తీ జోలికి పోకూడదని నేను నిశ్చయించుకున్నాను . కాని , ఆ మాట మీద పూర్తిగా నిలబడలేదు . గ్రామర్ స్కూల్లో లాటిన్ చదువుకున్నాను . మతపరమైన విద్య కూడ కఠినంగా నేర్పేవారు . నా చిన్న తనంలో ఆర్య సేవకురాండ్రు హిట్లర్ ప్రోత్సాహంతో తమ యూదు యజమానురాండ్రను వీధుల్లోకి లాక్కొచ్చి కాలిబాటను తుడిపించే వారు . ఇలాంటి భయంకరమైన దృశ్యాలు సర్వసాధారణంగా వుండేవి . నాజీ విద్య వలన నాలో నియంతృత్వ వాదంపై వ్యతిరేకత ప్రబలింది . భాయీ సచ్చిదానంద వలన హిందువుగా మారిన నేరు జీవితాన్ని ప్రారంభించాను .
Download XML • Download text