tel-33
tel-33
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
@ వల్లూరి గారు నెనర్లు . @ నాగరాజు గారు : అలవాట్లో పొరపాటు అండి అది అలా రెండు మూడు చుక్కలు పెట్టడం . మనసులో వున్న ఆలోచనని అలా కీబోర్డ్ మీద పెట్టేస్తాను వీటి గురించి ఆలొచించలేదు ఎప్పుడు . మీకు చాల థాంక్స్ అండీ . ఇప్పుడు మార్చాను చూడండి . మీ మొదటి సూచన పాటించాను . ఇక మీ రెండో సూచన , అసలు నాకు ఎలా ఆ ఇంచెస్ మారుస్తారో తెలీదు . టాంప్లెట్ మార్చడం కొంచం కష్టమే , ఇది నాకు చాల నచ్చిన టాంప్లెట్ లైట్ కలర్ , సొ . . సారి అండీ , ఎవరన్నా హెల్ప్ చేస్తాను అంటే నొ ప్రాబ్లం .
1 . 3 . 1 మతాంతరీకరణ - భాషా సమస్య : వివిధ పాలన , సాంఘిక , మతకారణాల వల్ల కొన్ని సామాజిక వర్ణాల వాళ్ళు ముస్లింలుగా మతాంతరీకరణ చెందడం వల్ల భాష , ఆచార వ్యవహారాల్లో కలిగే ఇబ్బందులను కూడా ముస్లిం స్త్రీలు కవిత్వీకరిస్తున్నారు . ఉదాహరణకు కొన్ని కవితా ఖండికలను చూస్తే ముస్లిం స్త్రీ వాదం ఎలా ఉందో తెలుస్తుంది . ముస్లిం స్త్రీ పరంగా వారి మనోభావాలను వర్ణించడంలో చేయి తిరిగిన రచయిత్రి షాజాహానా . ఆమె " లద్దాఫ్ని " పేరుతో రాసిన కవితలో ముస్లింలలో ' లద్దాఫ్ ' స్త్రీ మానసిక జీవితాన్ని చిత్రించారు . వచ్చీ రాని ఉర్దూ పదాలతో మాట్లాడుతుంటే ఎదురయ్యే ఇబ్బందులు , వాటిని అధిగమించడం కోసం ఉర్దూ నేర్చుకోవాలనే వారి ప్రయత్నం , ఆ భాష రాక , తన మాతృ భాషలోనే మాట్లడితే వచ్చే నష్టమేమిటనే ప్రతిఘటన స్వరాన్ని కూడా వినిపించగలిగారు కవయిత్రి . ' భాష ' భావాభివ్యక్తికి బలమైన వాహిక మాత్రమే తప్ప . ఫలానా భాషలోనే మాట్లాడాలనే నియమం లేదని ఒక శాస్త్రీయమైన ఆలోచనను ప్రతిఘటన స్వరంతో ప్రతిధ్వనిస్తూ … " వచ్చోరాదో - నా ఉర్దూ పరిజ్ఞానం మీద వాళ్ళ కుతూహల ప్రావీణ్య ప్రదర్శన జరిగి " నప్పుడు - " తెగించి - బయటకు రాలేని మొహమాటపు నీటి చుక్కలు కంటె కొనల్లో ఇరుక్కొని అచ్చం నాలాగే అల్లాడతాయ " ని వర్ణించారు . ముస్లిం స్త్రీ ఈ పరిస్థితిని ఎదుర్కొనే స్థితిని వర్ణిస్తూ - " వాళ్ళ ఉరుదూ జరీ చీరల సమూహాల గల గలల మెరుపుల ముందు నా గొంతు కాటన్ చీరై బిక్కు బిక్కుమంటూ ఒంటరిగా ముడుచుకుంటుంది . " అని ఆ పరిస్థితిని జరీ చీరల మధ్య కాటన్ చీర తెల్లబోయిన దృశ్యాలతో పోల్చారు కవయిత్రి . జరీ చీరలను ముస్లింల లోని ఉన్నత వర్గానికి , కాటం చీరను కింది వర్గానికి ప్రతీక చేసి వర్ణించారు కవయిత్రి . దీని ద్వారా ముస్లింలలోని వర్గ సమస్యను కూడా చెప్పినట్లయింది . అవమానాల నుండి ఆత్మ గౌరవాన్ని ప్రదర్శిస్తూ - " నీ దూదేకుల తనాన్ని షోహర్ ఆపాదించుకోనప్పుడు అస్లీ ముస్లిం ముద్రని మాత్రం నేనెందుకు భరించాలి ? " అంటుంది కవయిత్రి " లదాహీ రహూంగీ " అంటూ కవితను ముగించారు .
దేవుళ్ళని నమ్మే వారు దీనినే అదృష్టము అంటారు . మీరు అద్రుష్టవంతులవ్వడము మా అదృష్టము . ఎన్నో వందనాలు మీ అభిమానానికి !
" చిన్న భూషయ్యగారి పంచభుజికి ఏ సంబంధము లేదని మీతో మనవి చేస్తున్నాను ! " అన్నారు . నాకయితే వెంటనే తట్టలేదు . తర్వాత George Bush Jr . కీ Pentagon కీ సంబంధించిందని ఊహించాను . ఈమాట లో రెండు మూడు సార్లు ఈ చిన్న భూషయ్య పేరు చూశాను . సాహిత్యం సంగతెలా ఉన్నా , సైన్సు వ్యాసాల్లో , విమర్శించొచ్చు కాని , పేరుని వక్రీకరీంచకూడదేమో .
వెనుకటి పాశురము న స్వ ధర్మ నిరతులగు గోపాలుర వంశమున జన్మించిన యామెమేల్కొలుపబడినది . శరీరము కర్మచేయుతకు వీలుగా నుండునట్లు సృజింపబడినది . ఒక్క క్షణము మైనను కర్మచేయకుండా ఎవరు ఉండలేరు . అందుచే శరీరియయిన ప్రతీ వ్యక్తికి స్వధర్మము కర్మ ; పరధర్మము జ్ఞానము . స్వధర్మము జ్ఞానమునకు భగవద్భక్తికి ప్రతిబంధకముగా నుండు పాపములను తొలగించును . అందుకుగాను " యజ్ఞము , దానము , తపస్సు మున్నగున్నవి క్రియా కల్లాపమును విడువరాదు . ఆచరిచితీరాలి . యజ్ఞము , దానము , తపస్సు మనస్సులోని మాలిన్యమును తొలగించి ఙానము , తద్వారా భక్తి కలుగుటకు సాయపడును . కర్మను విడుచుట యనగా కర్మలను మానుట కాదు . కర్మ చేయుటయందు కర్తృత్వాభిమానమును , ఫలమునందాశను , సంగమును [ . . . ]
ఇన్నాళ్లుగ నీ రాతల్లో నువ్వొదిలిన ఫన్నీలన్నీ ఇపుడు నువ్వు లేవంటూంటే కన్నీళ్లు ఒక్కుదుటన ధారలవుతున్నాయి విన్నావా ముళ్ళపూడి వెంకట రమణా అటు చూడు " హన్నా " అంటూ బెదిరించే బుడుగు బేలగా ఏడుస్తున్నాడు " ప్రైవేట్ " చెప్పేందుకు ఎవరూ లేక బాబాయ్ భోరుమంటున్నాడు " సెగట్రీ " నీ ఆర్డర్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు " అరుణ " ' అప్పు ' డే ఋణం తీర్చుకోద్దంటోంది " రాధా గోపాళం " రావా రమణా అని పిలుస్తున్నారు సర్లే ఇవన్నీ వదిలేయి . అటు చూడు బాపు కళ్ళలో . . . తన మనసు నీకు తెలీదని కాదు కానీ నువ్వు లేని బాపు ని చూస్తే ఆత్మ లేని శరీరాన్ని చూసినట్టు లేదూ ? అయినా నీ ఆత్మ బాపులో బాపు ఆత్మ నీలో ఉన్నప్పుడు తన అనుమతి లేకుండా పరమాత్మను చేరే హక్కు నీ కెక్కడ రమణా ?
తేజస్వి గారు . నా కామెంట్ మిమ్మల్ని కాని లేక కైకాల గురించి కాని కాదు . నా కామెంట్ లో సరైన వివరణ లేదు అది నా పొరబాటే . పైన వ్రాసిన కొందరి కామెంట్స్ మీద నా కామెంట్ రాసాను . ఎస్వీ ఆర్ గారి మీద నాకేమి వ్యక్తిగతపరమైన వ్యతిరేకత లేదు , కళకారులను కేవలం కళా పిపాసన దృష్టిలోనే చూసి కామెంట్ పెట్టాను . అంతే గాని నాకంటూ సొంత అజెండాలు ఏవి లేవండి తేజశ్వి గారు . కేవలం చదవమని మాత్రమే చెప్పాను కాని నేర్చుకోమని నేనెక్కడా చెప్పలేదు . . ! అయినా అది మీకు చెప్పలేదులేండి . . పొరబాటు నాదే నా కామెంట్‌లో సరైన వివరణలేదు .
వాళ్ల వూళ్లో రోజు విడిచి రోజే కరెంటు వుంటుంది . అదీ పగలు వుండదు . అందుకని వాళ్లు ఎల్ పీ జీ తో పనిచేసే గీజరు పెట్టుకొన్నారు . దాంతో వాళ్ల అమ్మాయి వేడి చేసి వుంచిన నీళ్లతో మా స్నానాలకి యేర్పాట్లు చేసేశారు . ఇల్లంతా నీట్ గా సర్ది వుంది . పాపం మా చెల్లెలు పిల్లలూ , వాళ్ల నాన్నా యెంత కష్టపడ్డారో ! వాళ్లకి మేము తెచ్చిన కానుకలు అందించేశాము - - యెంత సంతోష పడ్డారో - - ఆ చిరు కానుకలకే !
పదేళ్ళ కిందట విన్నకోట రవిశంకర్ కవితాసంకలనం " కుండీలో మర్రిచెట్టు " ను గురించి రాస్తూ అతన్ని అరుదైన కవిగా గుర్తిస్తూ ఈ పై మాటలు చెప్పాను .
1975వ సంవత్సరం , ఆ తరవాతా , దేశంలో యమర్జెన్సీ అమల్లో వుండగా , మాలో ఓ జోక్ బయలుదేరింది . ఆ సమయంలో , ఇతర పార్టీల నాయకులందర్నీ కటకటాల వెనక్కి తోసేశారు ! పత్రికలమీద సెన్సార్ షిప్ విధించబడింది ! దానికి నిరసనగా , పత్రికలు తమ సంపాదకీయాల్తో సహా , సెన్సారు చేయబడ్డ మేటర్ స్థానంలో యేమీ ముద్రించకుండా , తెల్లగా వదిలేసేవి ! అది చూసి , మరో ప్రభుత్వ ఉత్తర్వు - పత్రికల్లో యెక్కడా ఖాళీలు వుంచకుండా తప్పనిసరిగా అచ్చుతో నింపాలని ! అలా వుండేది ! అప్పటి కాంగీ - ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ( ఐ - అంటే ఇందిర ! ) నినాదం " దేశ్ కీ నేతా - ఇందిరా గాంధీ ! యువాఓంకా నేతా - సంజయ్ గాంధీ ! " అని వుండేది . అప్పట్లోనే , రాజీవ్ గాంధీ కి కొడుకు పుట్టేడు . అప్పుడు మేము పుట్టించాం - ' బచ్చోం కే నేతా - రాహుల్ గాంధీ ' అని కూడా కలుపుతారు ! ఆని . ఆ బచ్చా , ఈ రోజు యువా అవనే అయ్యాడు ! అప్పట్లో సంజయ్ వెనకాల , వయో వృద్ధ నాయకులు కూడా , వాడి చెప్పులు మోస్తూ తిరిగారు ! తరవాత , రాజీవ్ వృద్ధ నాయకుల్ని గెంటేసి , పార్టీని వశం చేసుకున్నాడు - ఇదంతా చరిత్ర . ఇప్పుడీ యువ ( పిల్లకాకి ) పేలుతున్నాడు ! మావంశంలోవాళ్ళు అధికారంలో వుంటే బాబ్రీ మసీదు కూలేదేకాదు … … వగైరా వగైరా ! ( వీళ్ళ వంశం నిర్వాకాలు యెవరికీ తెలియవనుకుంటున్నాడు … . . పాపం ) సరే , అవన్నీ అటుంచండి . మొన్న టీవీ వార్తల క్లిప్పింగుల్లో ' మా నాన్న హత్య జరిగి ఇన్నేళ్ళయినా - నాకింకా న్యాయం జరగలేదు ' అని బుక్కు బుక్కుమంటూంటె , ఆహా , తన వంశంవారి ఆధ్వర్యంలో నడుస్తున్న పాలనని విమర్శించేంత దమ్ము వచ్చిందా అని ఆశ్చర్య పోయారు జనం ! తరవాత తెలిసింది - సందర్భమూ , అసలు విమర్శా యేమిటని ! యెవరో ఓ విద్యార్థి ' అఫ్జల్ గురుని గవర్నమెంటు ఇంకా యెందుకు ఉరి తియ్యలేదు ? ' అని అడిగినందుకట ఈ కోపం ! యెవరి మీద అని ఆయనే వివరణ ఇచ్చాడు - - - మన న్యాయ వ్యవస్థ చాలా నెమ్మది - - - కాబట్టే నాకింకా న్యాయం జరగలేదు - - - అని . అవాకులూ , చెవాకులూ కాకపొతే యేమిటి ? అఫ్జల్ గురు విషయంలో న్యాయ వ్యవస్థ చెయ్యవలసినది చేసి ( ఉరి శిక్ష వేసి ) యేళ్ళు గడుస్తున్నాయనీ , అమలు పరచనిది ఈ చేతగాని ప్రభుత్వమేననీ , దానికి వేరే కారణాలు కూడా వున్నాయని మరిచిపోయాడా ? మీ నాన్న విషయంలో నువ్వు నిరీక్షిస్తున్న న్యాయం యేమిటి ? నీయక్క జైలుకి వెళ్ళి మరీ నళినిని పరామర్శించి , తిరిగొచ్చాక ' ఆడ కూతురు - చంటిపిల్లతో వుంది - విడుదల చేసెయ్యచ్చుకదా ' అని వాపోయిందే ? థాను కూడా ఈ రొజు బ్రతికే వుండి , నళిని వున్న స్థితిలోనే వున్నా , ఇదే మాట అనగలిగేదా ? నీ అక్కది వేరే న్యాయం , నీది వేరే న్యాయమా ? - అని యెవరైనా అడిగారా ? యెందుకైనా మంచిది - ఏ ఫారిన్ నిపుణుడిచేతో వీడికి కౌన్సెలింగ్ చేయిస్తే మంచిదేమో ఆలోచించండి ! లేకపోతే - ' ప్రధాని కావడానికి అన్ని లక్షణాలూ వున్నాయి ' అనే ముసలీ , ముతకా , మధ్య వయస్సు నాయకులూ , నాయకురాళ్ళ పుణ్యమా అని వీడు ప్రధాని అయితే ( పాపము శమించుగాక ) - మనలాంటి వాళ్ళ గతి - మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనలో ఢిల్లీ నించి దేవగిరికీ , దేవగిరి నించి ఢిల్లీ కి ప్రయాణాలు చేస్తూ , లక్షల్లో చచ్చిన వాళ్ళలా - పడుతుందేమో !
తలమే బ్రహ్మకునైన యీ నగమహత్వ్తంబెన్న నే నియ్యడం గల చోద్యంబులు రేపు కన్గొనియెదం గాకేమి నేడేగెదన్ నళినీబాంధవ భాను తప్త రవికాంత స్యంది నీహార కం దళ చూత్కారపరంపరల్ పయిపయిన్ మధ్యాహ్నముం దెల్పెడున్
చూశారా ! ఇన్ని రోజులు మాకు చూపించనే లేదు . బుజ్జులు పెద్దగై పోయింది . బాగానే అల్లరి చేస్తోంది . అందుకేనా ఖయూ ని కూడా తోడు తెచ్చారు . ఇంక మీ పనయినట్లే : ) పాపం ఎందుకండి అలా కట్టేసారు . ఇంక అక్కా చెళ్ళెళ్ళు ఎలా ఆడుకోవాలి .
గట్టివాడొకడు ఒక పని సాధించటానికి మార్గం కనుక్కుని చెప్తే , వాడంటే ఈర్య్ష ఉన్న మరొకడు దానికి వ్యతిరేకంగా చెప్తాడు . అక్కడ ఎవరి వైపూ వెళ్లకుండా , ఆ తర్వాత మాత్రం మొదటివాడు చెప్పినట్టు చెయ్యి .
ఆగ్నేయాసియా ప్రాంతంలో అనేక ప్రభావవంతమైన సామ్రాజ్యాలకు జావా కేంద్రంగా ఉంది , [ 20 ] దీని ఫలితంగా , జావానీస్ రచయితలు అనేక సాహిత్య గ్రంథాలు రాశారు . కెన్ అరోక్ మరియు కెన్ డెడెస్ వీటిలో ఒకటి , ఇది పురాతన జావానీస్ సామ్రాజ్యంలో ఒక అనాథ తన రాజును గద్దెదించి రాణిని వివాహం చేసుకున్న కథను వివరిస్తుంది ; రామాయణం మరియు మహాభారత ఇతిహాసాల అనువాదాలు కూడా ఉన్నాయి . ప్రమోద్య అనంత టోయెర్ ఒక ప్రఖ్యాత సమకాలీన ఇండోనేషియా రచయిత , జావాలో పెరిగిన ఆయన తన అనుభవాలపై అనేక కథలు రాశారు , ఆయన కథల్లో జావా జానపద గాథలు మరియు చారిత్రక దిగ్గజాల నుంచి అనేక అంశాలను గుర్తించవచ్చు .
2 ) వ్రేళ్ళకు తాడు / రిబ్బను / దారమును తగిలించుకుని , " చిన్న మ్యాజిక్కును " చూపిస్తున్నాడు అబ్బాయి . ఈ వీడియోను , చూసి , ఇంచక్కా మీరూ కొన్ని చిట్కాలను నేర్చుకుని , మీ స్నేహితుల దగ్గర ప్రయోగించి , అందరినీ వినోదమును చేకూరుస్తారు కదూ !
సాలూరిలోని సంగీతదర్శక ప్రతిభను కూడా గుర్తించిన రామబ్రహ్మం " ఇల్లాలు " లో కొన్ని పాటలు చేసే అవకాశం కల్పించారు . రాజేశ్వరరావు కట్టిన వరసలు రామబ్రహ్మం చిత్రాలకు సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న బి . ఎన్ . ఆర్ . కు ( భీమవరపు నరసింహారావు , మాలపిల్ల 38 , రైతుబిడ్డ 39 ) అమితంగా నచ్చడంతో ఆయన పక్కకు తొలిగి సాలూరినే అన్ని పాటలు చేయమని కోరారు . ఆ చిత్రం ఆర్ధికంగా విజయవంతం కాకపోయినా ఆయన చేసిన పాటలు పలువురి ప్రశంసలనందుకొన్నాయి .
నేను మీ ఆర్టికల్స్ చాల చదివాను . . ఇండియా టుడే , ఈనాడు లో . . మీరు Phd నీ తీసుకొన్నందుకు నా అభినందనలు . . నాకు ఎందుకో మీరు బాల కృష్ణ కుటుంబానికి వ్యతిరేకమని పిస్తుంది . . బాగోని సినిమా బాలేదు అని రాయ వచ్చు . . . కాని మీరు బృందావనం బాలేదు అని రాసి ఆరంజ్ బావుంది అని రాసారు . రామ్ చరణ్ తేజ్ లో మీరు ఒక హీరో నీ చూడగలిగిన నప్పుడు మీరు బాల కృష్ణ నీ అంత గా ఎక్కిరించ అవసరం లేదు అని నా ఉద్దేశం ఇది ఏమి ఐన . . . ఆరంజ్ మీకు నచ్చింది జనాలకి నచ్చలేదు . . బృందావనం మీకు నచ్చలేదు జనాలకి నచ్చింది మీరు మిమ్మలిని ఒకసారి రివ్యూ చేసుకోవాలి ఏమో . . ఒక్కసారి ఆలోచించండి పెద్ద వారు ఇలా పక్షపాతం చూపించ వచ్చు అంటారా ? ఇంకా మీ ఇష్టం . .
లలిత అన్న మాటకి జవాబు ఏమి చెప్పాలో తెలియక తికమకపడుతున్న వాసుని ఆ ఇబ్బందిలోనుండి బయట పడేస్తూ - " సినిమాలు ఎప్పుడూ చూసేవేగా ! ఏదైనా పబ్‌కి వెళదాం " అంటూ ప్రపోజ్ చేసింది . వాసు ఇంతవరకు పబ్‌కి ఎప్పుడూ వెళ్లలేదు కాబట్టి సందిగ్ధంలో పడ్డాడు .
రచయితకి ధన్యవాదాలు . ఈసినిమా వచ్చి చాలా కాలంఅయినా , మా చిన్నతనంలో అంటే 60 దశకాల్లో ఆ సినిమా గురించి చెప్పుకునె వాళ్ళు . నేను సినిమా చూడ్టం జరిగింది . కాని ఏమి అర్ధం కాలేదు . అప్ప టికే నలుపు తెలుపు సినిమా క్లియర్ గా లేదు . ఇన్నేళ్ళ తరువాత ఆ సినిమా గురించి విపులంగా తెలిసింది . నాకు నచ్చిన సినిమా ఇది .
నేను ఆరేళ్ళ వయసులో వున్నప్పుడు బాగా జబ్బు చేస్తే మదనపల్లి గౌషాస్పటల్ ( MLL hospital ) అడ్మిట్ చేసినారు .
నేను ఎవరికి వేసానంటారా ? అమ్మో నాకు తెలివి వచ్చెసిందండి . ఏ పార్టీ నెగ్గితే ఆదే నా పార్టి .
ఇది జరిగిన నెల రోజులకి పవన్ కోలుకుని పట్టు వదలని పప్పూ మరలా పరీక్షలు రాసినట్టుగా పెళ్ళిచూపులకి మరోసారి సిద్దపడ్డాడు . శనివారం కలిసి రాలేదని ఆదివారం ఫోన్ చేసి బయలుదేరాడు . కూకట్ పల్లి నుండి ఎర్రగడ్డ వరకు ప్రశాంతంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా ఉరిమింది . పిడుగులతో కూడిన వర్షం . వరదగా వచ్చిన నీటిలో పవన్ బైకు కొట్టుకుపోయి ఒక మేన్ హోల్ లొ ఇరుక్కుంది . ఈతరాని పవన్ ని భద్రతాదళాలు కాపాడాయన్న వార్తని బావర్చి లో ఇస్మాయిల్ తో మాటాడుతూ బిరియాని తింటూ ఉన్న హాసిని కి టి . వి . చూస్తే గాని తెలియలేదు . ( అమ్మతోడు సదరు ఇస్మాయిల్ ఎవరో నాకే కాదు హాసినికి కూడా అప్పటి వరకు తెలియదు )
పీ సీ వో ల్లో ఎస్ టీ డీ మాట్లాడి , డబ్బులిచ్చి , వాడిచ్చిన కాగితమ్ముక్కని పట్టుకొని బయటికి వచ్చి , ' బిల్లెంతయ్యిందో చూడండి ' అని ఓ పది మందిని అడిగి , 29 రూపాయల 24 పైసలు అని అందరూ చెప్పగానే , " ముఫ్ఫై రూపాయలు దొబ్బేశాడు . . . . నా . . . ంల్లిగాడు " అని గోల చేసేవాళ్ళని యెందర్ని చూడడం లేదు మనం ?
దిగ్విజయం ఆచార్య ఫణీంద్ర విరచిత సింగిల్ సెంటెన్స్ డి లైట్స్ ఆంగ్ల గ్రంధావిష్కరణ సభ
( మనకి హర్షద్ మెహతా కుంభకోణం తరవాతో , కేతన్ పరేఖ్ కుంభకోణం ముందో కొన్ని వేల " లీజింగ్ & ఫైనాన్స్ " కంపెనీలు పుట్టుకొచ్చాయి దేశ వ్యాప్తం గా - - రెండు మూడేళ్లలో వాటా దారులనీ , ప్రజల్నీ మోసగించి , బోర్డులు తిప్పేశాయి ! ఇంకా కొన్ని అదేపని చేస్తున్నాయి - - వీటి సంగతి క్రమం లో . )
హై డ్రామా ( మొదలు పెట్టడం " శుక్లాంబరధరం … … " అనీ , " ఆచమ్యా … . కేశవాయస్వాహా … . " అనీ , " పవిత్రం ధృత్వా … . . " అనీ , మళ్లీ " ప్రాచీనావీతి " అంటూ జంధ్యం మార్పించి , ఆ తరవాత ' పవిత్రాన్నీ ' , ' జంధ్యాన్నీ ' మరిచిపోయారు ! ) 9 - 25 కి " ఆవు పంచకం " , పేడ , పాలు , పెరుగు , నెయ్యి " కలిపి " అందులో " దర్భ " ముంచి , … . . చల్లిస్తూ … . మంత్రాలు చదివారు ( ట ) . రాముడు - భీముడు సినిమాలో అనుకుంటా - రమణారెడ్డి హోటల్లో పేపరు చదువుతూ , " రోజుకి 8 లీటర్లు పాలిచ్చే ఆవు " అని చదివి , " పాలా … . పంచితమా ! " అంటూ వెక్కిరిస్తాడు . తెలుగువాళ్లెవరూ ఆ డైలాగ్ నీ , పంచితం అనే మాటనీ మరిచిపోరు . మరి " పంచకం " యెక్కడనించి వచ్చిందో ! మామూలు వ్యవహారంలో దీన్ని " పంచ గవ్య ప్రాశనం " అంటారు . అంటే , " గో పంచితం ( మూత్రం ) , గోమయం ( పేడ ) , గోక్షీరం ( పాలు ) , గోదధి ( పెరుగు ) , గోఘృతం ( నెయ్యి ) " - వీటిని " విడివిడిగా " - ప్రాశనం ( అన్నప్రాశనం తెలుసుగా ? ) - తినిపించడం ! నిజానికి ఈ " ప్రాశనం " ఇప్పుడు యెవరైనా చేస్తున్నారోలేదోగాని , ప్రతీ పూజా కార్యక్రమం లోనూ , వేదపఠన కార్యక్రమంలోనూ , బ్రహ్మోత్సవాలు మొదలైనవాటిలోనూ , ఇదో " ప్రముఖ " కార్యక్రమంగా ప్రకటించబడుతుంది . ( ఓ నలభై యేళ్ల క్రితం , నరసాపురంలో " సరిపల్లివారి " ఇంటిలోనూ , తూర్పు గోదావరి జిల్లా ( " వెల్ల " అనుకుంటా ) లోనూ , " పచ్చ కామెర్లు " నివారణకి , " అరుకు " మందు ఇచ్చేవారు . బత్తిన సోదరుల " వుబ్బసానికి చేప మందు " లా . వాటి రహస్యం వాళ్ల కొంతమంది కుటుంబ సభ్యులకే తెలుసు ! ) ఇక , పార్థివ దేహాలకి , పంచగవ్యాలతో " సంప్రోక్షణ " చేస్తారు . అక్కడ వేదమంత్రాలు చదవరు ! 9 - 45 కి … . . " పుణ్యపురుషులకి నాభికి పై భాగం నుంచే ఆత్మ గాల్లో కలుస్తుందన్నది విశ్వాసం . ఈ మేరకు నవ రంధ్ర , నవరత్న చేదనం జరిపించారు . ఇందులో భాగంగా నవరత్నాలను సాయి నోటిలో పోశారు " … … . ఇదీ వార్త ! నవరంధ్రాలు అంటే ( వివరించక తప్పడంలేదు ) - 2 నయన ( కళ్లు ) + 2 నాసికా ( ముక్కు ) + 2 శ్రవణ ( చెవి ) + 1 గ్రహణ ( నోరు ) + 1 మూత్ర + 1 పురీష ( చివరి రెండింటికీ తెలుగు అఖ్ఖర్లేదు అనుకుంటా ) = 9 రంధ్రాలు . ఇవి కాకుండా , కంటికి కనిపించని దశమ రంధ్రం , " బ్రహ్మ రంధ్రం " - అంటే , కపాలం పై " మాడు " అనబడే స్థానం . వీటిలో యేదో ఒక రంధ్రం నుంచి జీవుడు " తుది శ్వాస " రూపం లో నిష్క్రమిస్తాడు . మహాయోగులూ , సన్యాసులూ తమ దేహ పరిత్యాగ సమయాన్ని ముందుగానే తెలుసుకొని , సమాధిని నిర్మింపచేసుకొని , అందులో తపో దీక్షలో వుంటూ , బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణ త్యాగం చేసేవారట . అదీ వారి " సమాధి స్థితి " . నాకు తెలిసి , యోగి వేమన ఒక్కడే అలా సమాధి అయినవాడు . ( షిర్డీ సాయి కూడా అలాగే అంటారు కొంతమంది వీర భక్తులు . ) అనంతపురం జిల్లాలో , రాయదుర్గం లాంటి వూళ్లలో , అలాంటి యోగులు కొంతమంది వుండేవారనీ , వాళ్లు అలాగే సమాధి స్థితిని చేరారనీ ప్రతీతి . వాళ్ల " యిళ్లని " గుళ్లుగా నిర్మించి వాళ్లని ఆరాధిస్తూంటారు , జాతరలు జరుపుతుంటారు . చాలా కొద్ది కాలం క్రితం " భం భం బాబా " ( పేపర్లలో అనేక కథనాలు వచ్చాయి ఈయన గురించి అప్పట్లో ) తాను తపస్సు చేసిన కొండ గుహలోనే అలా సమాధి అయ్యారని అక్కడి ప్రజల విశ్వాసం ! ఈ దశమ రంధ్రాన్ని ప్రక్కనపెడితే , " నవరంధ్ర ఛేదనం " యేమిటీ ? దేహాన్ని యేదో ఓ రంధ్రంలోచి వదలిన జీవుడు , మళ్లీ యేదో ఒక రంధ్రం ద్వారా దేహాన్ని చేరడానికి ప్రయత్నిస్తాడట . మన " మిషన్ " అల్లా , ఆ జీవుడిని కనీసం భువర్లోకానికి పంపించడమే ! అందుకని ఆ నవరంధ్రాలనీ మూసెయ్యాలి . మామూలుగా మనకి వీలు కాదు . పైగా , ఆ రంధ్రాలని మేలిమి రత్నాలు ( రాళ్లతో ) మూసేస్తే , వచ్చే జన్మలో " ఫలానా " రంధ్రం ద్వారా జన్మిస్తే , వుత్తమ జన్మ వస్తుంది అని ఓ నమ్మకం ! దాంతో , ముత్యము , వజ్రము , పగడము , నీలము , కెంపు , మరకతము , మాణిక్యము , గోమేధికము , పుష్యరాగము అనబడే నవరత్నాలతోనూ నవరంధ్రాలనీ మూసెయ్యడానికి ప్రయత్నిస్తాము . ( సాధారణంగా శవాన్ని భూశయనం చేస్తారుకాబట్టి , పురీష రంధ్రాన్ని ముయ్యడం జరగదు . ఆ రత్నాన్ని కూడా ఇంకెక్కడో వేసేస్తారు . ) మరి నవరత్నాలనీ " నోటిలో " పోసేస్తారా ? పోయించేస్తారా ? అదీ సంగతి . 9 - 55 కి … … దేహాన్ని వుంచారు … … బంధువులు … … మృత్తికను … . . వేశారు . … . ముఖ్యులు … . . భక్తులు … . . భస్మాన్ని చల్లారు … … . పుష్పాలతో అలంకరించారు . ఇదీ వార్త . ఇవెవ్వరూ ( సామాన్య ప్రజలు ) చూడలేదు . ఈనాడు కెమేరాలు కూడా చూడలేదు . వొళ్లంతా చెవులు చేసుకొంటే వినిపించిన ఆడియో ప్రకారం … . " పచ్చ కర్పూరం చల్లండి … . . పచ్చకర్పూరం మాత్రమే … … ఇప్పుడు మృత్తిక వేయండి … … ఇంక మిగిలిన మట్టితో పూడ్చండి … . . " ఇదీ జరిగింది . సేవాసమితి వారు మళ్లీ బయటి మట్టిని సంచులతో , బేసిన్లతో మోసుకురావడం కనిపించింది . తెర తీశాక , అందరూ యెగబడి మట్టినో , భస్మాన్నో చల్లడం ఇదివరకే వ్రాశాను . పుష్పాలంకరణ యెప్పుడు జరిగిందో నాకు తెలీదు . ప్రజల సమాధి దర్శనానికి మళ్లీ కెమేరాలు అమర్చేముందు జరిగి వుంటుంది బహుశా . అదీ ఆ ప్రహసనం అనే " ఫార్స్ " . ( రత్నాకర్ " నిత్య విధి " చేస్తున్నాడా ? దశదిన కర్మలూ జరుగుతాయా ? " సపిండీకరణం " వగైరా వుంటాయా ? తరవాత , సమాధి వెనకున్న గణపతి విగ్రహాన్ని తొలగించి , సాయి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారా ? లెక , సమాధి పై మట్టీ , పువ్వులూ తొలగించి , పాలరాతి తిన్నె నిర్మించి , దానిమీద షిరిడి లెవెల్లో సాయి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారా ? ఆయనకి యే వారం ప్రత్యేకిస్తారు ? . . . . . . మిగతా కథ " వెండి తెరపై " ! ) … … అందుకే అన్నది … . . యెవరి పాట్లు వారివి … . . అని ! … … ఇంకోసారి .
చంపకమాల . ఎవఁడు సమస్త భూతముల నెల్లెడలన్ దనరూపమున్ గనున్ వివిధములైన రూపముల విస్తృతమౌ పరమాత్మఁ జూచు , బ్ర హ్మవిదుఁడు బ్రహ్మభావమలరారి విముక్తిని గాంచి , యాతఁడే యవగతమై స్వరూపమున నంతయు నేకగతిన్ గనుంగొనున్ . ౩౦
మెము తిరిగి మా కజిన్ వాళ్ళింటికి వెళ్ళి ఈ సంగతి చెప్తే వాళ్ళుకూడా ఆశ్చర్యపోయారు , ఇంత మంచివాళ్ళింట్లోకి పిల్ల వెళ్తూంది , సుఖపడుతుంది , ? b > అన్నారు . మీరు చాలా అదృష్టవంతులూ అని చెప్పారు .
అట్లని ప్రభుత్వం , న్యాయస్థానం ఆదేశించకున్నా ఆ రెండింటి మెప్పు అవసరమైన సంఘాలు వాళ్ళను మానవహక్కుల అధ్యక్షుని దగ్గరికి , ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకువచ్చినవి . అప్పటికే వాకపల్లి సంఘటనపై హైకోర్టులో పిటిషన్ ఉన్నది కనుక ప్రధానన్యాయమూర్తి పలుకరించలేదుగాని రిజిస్ట్రార్‌ను కలవగలిగారు . తిరిగివెళ్ళగానే దొరికిన న్యాయం ఏమిటంటే వాళ్ళ పురుషులు వాళ్ళను వెలివేసారు . కుల తప్పుపెట్టారు . పాలకోసం ఆకలితో ఏడుస్తున్న పిల్ల లను తల్లుల దగ్గరికి చేరనివ్వలేదు . ఆదివాసుల జీవితాల్లోకి కాఫీ తోట లు , సిల్వర్ ఓక్ తోటలు , బాక్సయిట్ తవ్వకాలు రావడానికన్న చాల ముందుగానే కుల , మతాలు వచ్చినయి . ఆదివాసులు ఆదివాసులే - వాళ్ళకు ఏ కులమూ , మతమూ లేదంటే ఆదివాసులే ఒప్పుకోలేని స్థితి వచ్చింది . లైంగిక అత్యాచారం అబద్ధం అని వైర్‌లెస్ సందేశం అందినట్లు చెప్పిన డిజిపి మాటను శాసనంగా స్వీకరించిన హోంమంత్రి ఆ నిర్ధారణ మీదనే ఉన్నారు .
ధర కెంధూళులు కృష్ణరాయలచమూధాటీగతిన్ వింధ్యగ హ్వరముల్ దూఱఁగఁ జూచి తారచటఁ గాఁపై యుండుటన్ జాల న చ్చెరువై యెఱ్ఱని వింతచీకటులు వచ్చెం జూడరే యంచు వే సొరిదిం జూతురు వీరరుద్రగజరాట్ శుద్ధాంతముగ్ధాంగనల్ .
అన్నారొకసారి మహాకవి తుమ్మల సీతారామ్మూర్తి చౌదరిగారు . వెంకటేశ్వర్లుగారు తన చిన్ననాటి విశేషాలు చెప్పేటప్పుడు " నాన్నా ! బాపట్ల ఊరు ఎలా ఉంటుంది ? " అని అడిగితే " ఎలా ఉంటుంది ? ఇప్పుడే ఎవరో బాంబేసినట్టుంటుంది . " అని చిరాగ్గా సమాధానమిచ్చేవారు . ఆ చిరాకుకి కారణం లేకపోలేదు . బాపట్లలో ఆయన మావయ్యల సంరక్షణలో చదువుకున్నారు . ఆ మావయ్యలు వెంకటేశ్వర్లుగారి అల్లరికి ఆకతాయితనానికి విసిగి తఱచుగా దండిస్తూండేవారు . కనుక ఆ ఊరి పేరు చెబితే ఆయనకి ఆ తన్నులే గుర్తొస్తాయి . ఏదేమైనా ఆ ఊరు ఆయనకి నచ్చలేదు . గుంటూరుజిల్లాలో ఒక ప్రముఖ పట్టణం . లక్ష జనాభా ఉంటుంది . అక్కడ వైద్యకళాశాల తప్ప లేనిదంటూ లేదు . ముఖ్యంగా ఆ ఊరు భావనారాయణస్వామివారి క్షేత్రం మూలాన ప్రసిద్ధికెక్కింది . అలాంటి భావనారాయణస్వామివారి ఆలయం మన రాష్ట్రంలో కాకినాడ నగర శివార్లలో సర్పవరం ప్రాంతంలో కూడా ఉంది . భావనారాయణస్వామివారి పేరుమీద బాపట్లకి " భావపురి " అనే నామాంతరం కూడా ఏర్పడింది . వెంకటేశ్వర్లుగారు మొదట్లో మఱ్ఱిపూడి నుంచి రాష్ట్ర రహదారి ( State Highway ) దాకా నడిచి , అక్కడినుంచి తమ కుటుంబ పొలాల మీదుగా కొంత , ఆ రహదారిమీద కొంత , మొత్తం 8 కిలోమీటర్లు రోజూ నడిచి బాపట్లలో ఉన్న హైస్కూలికి వెళ్లేవారు . ఆ రోజుల్లో లారీలు , లారీల్లా కనపడే అరుదైన బొగ్గుబస్సులు తప్ప వేరే రకాల వాహనాలేమీ లేవు . ఆయన పొలాల్లో పనిచేసే కౌలుదార్లు ( ఆయనకంటే చాలా పెద్దవాళ్ళు ) " అయ్యగారొస్తున్నారు " అంటూ చుట్టలు అవతల పారేసి నిలబడేవారు . ( అదో ఫ్యూడల్ సమాజం కదా ! ) ఇలా ఒక ఆర్నెల్లు నడిచాక " ఇహ నడవలే " ననిపించిం దాయనకి . దాంతో బాపట్లలో మావయ్యల దగ్గర మకాం పెట్టక తప్పలేదు . రెండో ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు బాపట్లలో ప్రధాన మార్గాలకి ఇరువైపులా సైనికుల్ని నిలబెట్టారట . రాత్రిపూట ఎక్కడా నిప్పుకణికైనా మెఱవడానికి వీల్లేదు . దీపాలు వెలిగించుకుంటే ఇంట్లో కిటికీలతో సహా అన్ని తలుపులూ మూసేసుకుని వెలిగించుకోవాల్సిందే . ఎక్కడైనా వెలుగు కనిపిస్తే ఆకాశంలోంచి శత్రు విమానాలు ( జపాన్ వారివి ) పసిగట్టి బాంబుదాడులు ( bombardments ) చేస్తాయని భయం . అప్పట్లో పాకిస్తాన్ బర్మా శ్రీలంక దేశాల్ని సైతం కలుపుకుని వ్యాపించి ఉన్న ఇండియాకి రెండు కాలమండలాలు ( Time - zones ) ఉండేవి . నిజానికి అదే శాస్త్రీయం కూడా ! రెండో ప్రపంచ యుద్ధం రాగానే బ్రిటీషు ప్రభుత్వం ప్రజల కదలికల్ని ఇళ్ళకి పరిమితం చేసి ప్రాణనష్టాన్ని నివారించ జూసింది . అందులో భాగంగా సమయ సూచనా వ్యవస్థల్లో భారీగా మార్పులు చేసింది . తత్ఫలితంగా బ్రిటిష్ ఇండియా మొత్తం ఒకే కాలమండలంగా ప్రకటించబడింది . అంతటితో ఆగకుండా వ్యక్తిగత గడియారాలన్నీ ఒక గంట ముందుకు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేసింది . యుద్ధం తరువాత మళ్ళీ రెండు కాలమండలాల వ్యవస్థ పునరుద్ధరించాలనుకున్నారు . కాని ఎందుకో అలాగే ఇప్పటి దాకా కొనసాగిస్తూ ఉన్నారు . సాయంకాలం ఆరు దాటితే ఎవ్వరూ రోడ్లమీద కనిపించడానికి వీల్లేదు . కనిపిస్తే ఫలానా చోట జనావాసాలున్నట్లు శత్రువులు పైనుంచి చూసి కనిపెడతారు . గడియారాలన్నీ ఒక గంట ముందుకు పెట్టుకునేవారు కాబట్టి నిజానికి ఐదింటికే వీథులు నిర్మానుష్యం . ఆఱున్నఱకే భోజనాలు కానిచ్చి పడుకునేవారట . మద్రాసు మీద బాంబులేస్తారని భయపడి పెద్దపెద్దవాళ్లే పల్లెప్రాంతాలకొచ్చి కొంతకాలం గడిపారట . అలాంటివారిలో టంగుటూరి సూర్యకుమారిగా రొకరు . ఆవిడ ఆంధ్ర రాష్ట్రపు మొదటి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి అన్నకూతురు . చాలా అందగత్తె . ఆ రోజుల్లో Miss Madras గా ఎంపికైంది . " రైతుబిడ్డ " మొదలైన తొలి తరం తెలుగు టాకీల్లో హీరోయిన్‌గా నటించింది . రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆవిడ అప్పికట్ల రైల్వేస్టేషన్ దగ్గర ఇల్లు తీసుకుని కొంతకాలం గడిపిందట . ఆ రోజుల్లో అన్నిటికీ రేషనే . బట్టలు కాయితాలు కూడా ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో రేషనుగా ఇచ్చేవారు . అప్పట్లో గుంటూరు ప్రాంతాలకి మెట్టూర్‌మిల్సు బెన్నీ కంపెనీ బట్టలు తప్ప ఇంకేవీ సరఫరా లేదు . వెంకటేశ్వర్లుగారి చిన్నతనం నాటికి ఇండియా - అందునా ఆంధ్రాలో పరిశ్రమలు అంతగా అభివృద్ధి చెందలేదు . పెన్నులతో సహా అన్నీ ఇంగ్లాడు నుంచి దిగుమతి కావాల్సిందే . వెంకటేశ్వర్లుగారు బాపట్ల హైస్కూల్‌లో చదివే రోజుల్లో ఆ స్కూలికి ఇంగ్లాండు నుంచి పెన్నుల కోటా వచ్చిందట . విద్యార్థులంతా వాటికోసం ఎగబడ్డారట . ఆ కుమ్ములాటలో తొక్కిసలాటలో కొంతమంది గాయపడి ఏడిచారట .
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది . . ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది . . ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది ఏ పువ్వు ఏ తేటిదన్నదో ఏనాడో రాసున్నది . . . . ఏ ముద్దు ఏ మోవిదన్నదో ఏ పొద్దో రాసున్నది . . . . బంధాలయి పెనవేయు వయసుకు అందాలే దాసొహమనగా . . . . మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూదమనగా పరువాలే . . . . ప్రణయాలై . . . స్వప్నాలే . . . . స్వర్గాలై . . ఏన్నెన్నొ శ్రుంగార లీలలు . . కన్నుల్లో రంగేళి అలిగెను ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది . . ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది . . ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తునో ఏ రాగం ఏ గుండె లోతున ఏ గీతం పలికించునో హ్రుదయాలే తెర తీసి తనువుల కలబోసి మరపించమనగ కౌగిలిలో చెర వేసి మదనుని కరిగించి గెలిపించమనగ మొహాలె . . . దాహాలై . . . సరసాలే . . . సరదాలై . . . కాలాన్నే నిలదీసి కలలకు ఇవ్వాలి వెలలేని విలువలు . .
అయితే ఇంత చిన్న వయసులోని శిశువుల హక్కుల పరిరరక్షణకు సరైన చట్టాలు లేని కారణంగా ఇవి సమాజంపై మరింత దీర్ఘ కాలిక ప్రభావం చూపే అవ కాశం ఉందని మెడికో లీగ ల్ నిపుణులు పేర్కొంటున్నారు . ' ఈ శస్త్ర చికిత్సలు వ్యక్తులపై దీర్ఘకాలిక మానసిక సమస్యలకు కారణం కాగలవని , తమకు ఊహ తెలియని సమయంలో తమ అనుమతి లేకుండా వైద్యులు చేసిన లింగ మార్పిడి దానికి గురైన వారికి ఇష్టం లేకపోవచ్చని ముంబైకు చెందిన కౌన్సిలర్ సుచిత్రా ఈనాందార్ తెలిపారు . ప్రజలకు ఈ శ స్త్ర చికిత్సల గురించి అవగాహన కల్పించాలని డాక్టర్ జోషి చెబుతున్నారు .
ఇదంతా ఎక్కడన్నా జరిగేదే కదా ! అంటారా ? నిజమే . కానీ , ఇక్కడ ప్రత్యేకంగా నాకు నచ్చిన అంశాలేమిటి ? అంటే -
అప్పుడు గానీ ముందుగా ఆయన సమాధానం గుర్తు బెట్టుకుని " రాయికి ఈత రాక మునిగిపోయింది " అన్నామనుకో ఇంకా గట్టిగా నవ్వేసేవాడు
" ఇదిగోనండే తాడు . . మువ్వలు . . పైకెక్కేకా గేదిక్కట్టండే . . , ఓ అరగంటాగాకా అదే ఎక్కేత్తాదండే గట్టో . . మీరేం కంగారుపడకండే . . , రోజూ ఇలా ఓ రొండుగంటలు నిద్రోటం అలవాటండే దానికే , అరగంట తర్వాత ఎక్కాపోతే కాత్త అదిలించండి చాలో " , అని చెప్పి ఎల్లిపోయేరు గేదిగలోల్లు .
కానీ చచ్చినోడు ఏమి తిని చచ్చాడు అన్న విషయాన్ని కూడ ప్రచురించి , ఫలానాది తింటే నువ్వు పోతావ్ అన్న విషయాన్ని చెప్పకుండానే చెబుతున్నారు . ఇదిగో ఇక్కడ నాకు కాలింది . బర్నాల్ రాసుకున్నా ఆ మంట వేడి ఉపశమనాన్ని ఇవ్వలేదు . ఇలాంటి విషయాలను గోప్యంగా ఉంచితే బాగుంటుంది అంతే కానీ ఇలా పది మందికీ తెలిసే విధంగా ప్రచురించడం ఎంత వరకూ సబబు . అందునా యాహో లాంటి ఎక్కువ ప్రాచుర్యం ఉన్న వెబ్ సైట్లలో ఇలా ప్రచురించడం ఏ మాత్రం మంచిది కాదు . ఇలాంటి వాట్లిల్ని వ్రాసే వాళ్ళు ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచరో అర్దం కాదు . ఇది చదివి మఱొకరు ఆ మందు కొని ప్రయత్నించరని నమ్మకమేమిటి ?
మూయ నీ కళ్లు నిదురతో రేయిలోన తాటి గుఱ్ఱము నెక్కుటే తగిన పనియు
ఆలోచింపజేసేలా ఉంది మీ పోస్టు ! ముఖ్యంగా శిల్పారామం కార్యక్రమం గురించి బాగా రాశారు . పబ్లిక్ ఫిగర్లు వస్తే జనాలు చూడ్డానికి వస్తారు కదా , మా కార్యక్రమం హిట్టయిందని చెప్పుకోవడానికి ఈ హంగూ , ఆర్భాటమూనూ ! ముఖ్యంగా నిషేధించవలసినవి ప్లాస్టిక్ కారీబాగులు ! ఇదివర్లో కూరలూ తేవాలంటే బుట్ట ఒకటి తీసుకుని వెళ్ళే ఆచారం ఒకటుండేది ! ఇప్పుడు బండి మీద కూరలమ్మే వాడితో సహా రెలయన్స్ ఫ్రెష్ వరకూ వాళ్ళే ప్లాస్టిక్ బ్యాగులు అందిస్తుంటే చేతులూపుకుంటూ వెళ్ళడంలో కంఫర్టే కాని రిస్కేముంది ? అనుకుంటున్నారంతా . . . అసలు రిస్క్ తెలీక , తెలిసినా అలసత్వంతో ! ఈ ప్లాస్టిక్ బ్యాగులు తిని కొన్ని వందల ఆవులు , మేకలు వంటి వీధిలో తిరిగే జంతువులు కాన్సర్ బారినపడుతున్నాయి ! బయటికి వెళ్ళినపుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి మొదలు పెట్టిన డిస్పోజబుల్ డైపర్లు ఇప్పుడు పాల డబ్బాతో సమానంగా అవసరంగా మారాయి . పాత నూలు చీరలు , పంచెలు వాడటం నామోషీ ! ( పైగా ఉతికే పనిమనుషులు దొరకరు కూడానూ , వర్కింగ్ మదర్స్ ఏం చేస్తారు చెప్పండి ) రాష్ వచ్చినా , పుండ్లు పడ్డా . . . నాపీలే వాడాలి ఒక్కోటి ఇరవై ( కనీసం ) రూపాయలు పెట్టి !
బ్యాంకింగ్ , ఇన్షూరెన్సు , రియల్ ఎస్టేట్ , రెటెయిల్ వాణిజ్యం , రవాణా , టెలికమ్యూనికేషన్స్ - ఇవన్నీ జపాన్‌లో ప్రముఖ వ్యాపారాలు లేదా పరిశ్రమలు . ఎలక్ట్రానిక్ పరికరాలు , మోటారు వాహనాలు , యంత్ర భాగాలు , ఉక్కు , లోహాలు , ఓడలు , రసాయనాలు , వస్త్రాలు , ఆహార పదార్ధాలు వీటన్నింటిలోనూ జపాన్ పరిశ్రమలు అంతర్జాతీయంగా అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉన్నాయి . నిర్మాణ రంగం జపాన్‌లో ఎప్పుడూ చాలా ప్రముఖమైన స్థానం కలిగి ఉంది . ఇందుకు పెద్ద పెద్ద ప్రభుత్వ కంట్రాక్టులు ప్రోద్బలాన్ని అందించాయి . సరకుల తయారీ దారులు , ముడి సరకుల సప్లై చేసేవారు , పంపిణీదారులు , బ్యాంకులు - వీరందరి మధ్య బలమైన సహకారం జపాన్ ఉత్పాదక రంగంలో చాలా ముఖ్యమైన అంశం . వారు ఒక సంఘటితమైన బృందంగా పని చేస్తారు . ఇలాంటి బృందాలను అక్కడ కేరిత్సూ అంటారు . పెద్ద పెద్ద కంపెనీలు చాలావరకు తమ ఉద్యోగులకు జీవితకాలం పని హామీ ఇస్తాయి . [ 45 ] ఇటీవలి కాలంలో జపాన్ కంపెనీలు ఈ విధమైన విధానాలను వదలి " లాభసాటి " విధానాలవైపు మళ్ళుతున్నాయి . [ 46 ] ప్రపంచంలో కొన్ని అతిపెద్ద ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీలు , బిజినెస్ గ్రూపులు జపాన్‌లో ఉన్నాయి . - సోనీ , సుమిటోమో , మిత్సుబిషి , టొయోటా వంటివి ప్రపంచ ప్రఖ్యాతమైన బ్రాండ్ పేర్లు . జపాన్ పోస్ట్ బ్యాంకు అస్సెట్ల ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకు .
హైదరాబాద్ , ఫిబ్రవరి26 ( వాస్తవం ) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లును ప్రతిపాదించే వరకు తాము సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అపేది లేదని తెలంగాణ ఉద్యోగులు తేల్చి చెప్పారు . శనివారం తెలంగాణ ఉద్యోగులు సచివాలయం ముందు ధర్నాలో పాల్గొన్నారు . ఈధర్నాలో రాష్ట్ర చేనేత , జౌళి శాఖ మంత్రి శంకరరావు పాల్గొని సంఘీభావం తెలిపారు . సహాయ నిరాకరణ చేస్తున్న తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసిని మంత్రి వర్గ ఉపసంఘం చర్చలకు ఆహ్వానించినప్పటికి వారు చర్చలను బహిష్కరించి సచివాలయం ముందు ధర్నాకు దిగారు .
ప్రభుత్వం మహిళలకు శుభవార్తను అందిస్తూ ఆర్టీసి బస్సు ప్రయాణికులకు చేదు వార్తను అందిస్తోంది . ఆర్టీసి చార్జీలను పెంచడానికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది . కాగా , సబ్సిడీ ఇవ్వడం ద్వారా వంటగ్యాస్ ధరను తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది . ఈ విషయాన్ని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ( పిసిసి ) అధ్యక్షుడు , రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వెల్లడించారు . ఆర్టీసి చార్జీల . . .
ముందు మాట : శ్రీ బొందలపాటి గారు తమ బ్లాగ్ లో ( bondalapati . wordpress . com ) " Spiritual Speculation " అనే శీర్షికన అనేక వ్యాసాలు ఆంగ్లంలో వ్రాసారు . వాటిని చదివిన తరువాత , అందులో వారు సంధించిన ప్రశ్నలు , వెలిబుచ్చిన సందేహాలకు నా వైపు నుంచి , నాకు తెలిసనంతలో , సమాధానాలు రాయాలనుకున్నాను . వారి ప్రశ్నలను క్లుప్తంగా మొదట చెప్పి , తరువాత నా సమాధానాలను చెబుతూ నా బ్లాగ్‍లో వ్యాసాలుగా వ్రాద్దామనుకున్నాను . ఒకరికి తెలిసిన విషయాల్ని , మరొకరికి తెలియచేయటమే దీని సదుద్దేశం . వారు ఆంగ్లంలో శీర్షికకు పెట్టిన పేరును , నేను తెలుగులోకి అనువదించాను .
లలితగారూ అమరావతి కథల గురించి ఎంత అందంగా చెప్పారండీ . ఎన్ని సార్లు చదివినా , మొదటి సారి చదువుతున్న ఫీలింగ్ . ఆ పాత్రల్లో నేను కూడా మమేకమై పోతాను ఎప్పుడూ . మీరన్నట్టు ఎప్పుడూ మూడ్ బాగోకపోయినా పుస్తకం తీసి , కొన్ని కథలు చదివి , దాన్ని అలాగే గుండెల మీద పెట్టుకొని నిద్ర పోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో . . అక్కడ అమరేస్వరుడి గుళ్ళో , పొగడ పూలు ఏరుకుంటూ తిరుగుతున్నట్టు , చిరు గంటలు వింటూ నన్ను నేను మరిచి పోయినట్టూ ఊహించుకుంటాను . నాకు కూడా అమరావతి చూడాలని ఆశ . కానీ అన్నీ మారిపోయి , మళ్ళీ ఈ కథలు చదివినపుడు అసలు వర్ణనలకు బదులు , ఇప్పటి మారిపోయిన పరిసరాలు కళ్ళ ముందు కదులుతాయేమో అని నా భయం . మీకు నిరాశ కలగలేదని ఆశిస్తున్నాను . ఎప్పుడూ షిరిడి వెళ్ళినా , బాబా చరిత్ర లో చెప్పిన ప్రదేశాలు , గుర్తులు వెతుక్కోవాలని , ఇక్కడే kadaa ఇలా జరిగింది , బాబా ఇలా చేసారు అని , గుర్తు పట్టాలని ప్రయత్నిస్తాను . కానీ ఒక్కటి కూడా గుర్తు తెలియక ఏదో లోటుగా అనిపిస్తుంది . అలా అని ఏది మారకుండా , వృద్ధి చెందకుండా దురాశ కాదనుకోండి . పద్మవల్లి
రుచి - అభిరుచి పోలికనే మరికొంత కొనసాగిద్దాం . పాలో కాఫీనో తాగే ముందు తియ్యని మిఠాయి తింటే , ఆ పాలు చప్పగా ఉండడం చాలామందికి అనుభవమయ్యే ఉంటుంది . ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే , ఒక బలమైన రుచి నాలుకకి పట్టేసింది . ఆ రుచి ఇతర రుచులని మరుగు పరిచేస్తోంది . ఇది కవిత్వానికి కూడా వర్తిస్తుంది . మీకు ఒక రకమైన కవిత్వమ్మీద విపరీతమైన అభిమానం ఉందనుకోండి , అప్పుడు ఇతర కవిత్వాలు అంతగా రుచించక పోవచ్చు . అలాగే కవిత్వమంటే ఇదీ అని ఒక నిర్దిష్టమైన అభిప్రాయం బలంగా నాటుకుంటే , ఆ చట్రానికి లోబడని కవిత్వం రుచించదు . అంచేత ఒక కవిత అర్థం కానప్పుడో నచ్చనప్పుడో , ఇలాంటి బలమైన అభిరుచి దానికి కారణమేమో పాఠకుడు ఆలోచించుకోవాలి . అలాంటి అభిరుచి ఉండడంలో తప్పులేదు . కాని అలాంటప్పుడు అన్ని రకాల కవితలు తనకి రుచించకపోవచ్చునన్న స్పృహ పాఠకునికి ఉండాలి . తన అభిరుచిని పక్కకుపెట్టి , కవితని చదవగలగడం చేతనయితే చెయ్యవచ్చు . అది చేతనవ్వని పక్షంలో ఆ కవితని పక్కనపెట్టెయ్యడమే ఉత్తమం .
సరే రమ గారికి కాకపోయినా పాఠక లోకానికి నిజాలందించానన్న తృప్తి నాకు మిగిలింది . " ఈ భూమ్మీద కాసింత చోటిచ్చిన " ఈ మాట సంపాదకులకు కృతజ్ఞతలు .
తెలంగాణా రాష్ట్రం ప్రకటిస్తే కర్నూల్ ను ప్రత్యేక రాజధానిగా చేయాలని మంత్రి టిజీ వెంకటేష్ అన్నారు . ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైఖ్యాంద్రగా ఉంచాలని సోనియా మీద ఒత్తిడి చేస్తామని చెప్పారు . ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కర్నూలును ప్రత్యేక రాజధానిగా గుర్తించాలని మంత్రి టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు . త్వరలోనే సీమాంధ్ర ఎమ్మెల్యేలు , ఎంపీలు కాంగ్రెస్ నాయకులతో కలిసి సోనియాని కలుస్తామని అన్నారు . సోనియాతో పాటు కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులను కూడా కలుస్తామని తెలిపారు .
ఆవెంటనే అమానవకరస్పర్శ దివ్యదేహప్రాప్తి , అలంకరణ జరుగుతాయే ఇది సారూప్యం అవుతుంది .
1 . ఈ అంశాన్ని సిపిఎం పార్లమెంటు సభ్యులు చిత్తవ్రత మజుందార్ , తపన్ సేన్ 2006 డిసెంబర్ 12న తొలిసారి రాజ్యసభలో ప్రస్తావించారు . ఉత్పత్తి 40 నుండి 80 ఎంఎంఎస్ సిఎండికి పెరిగిందని , పెట్టుబడి వ్యయం కూడా 247 కోట్ల డాలర్ల నుండి 884 కోట్ల డాలర్లకు పెరిగిందని రిలయన్స్ ఒక పత్రం అందజేసినట్లు ప్రభుత్వం తెలియజేసింది . ఉత్పత్తి పెరిగితే తలసరి యూనిట్‌కు అయ్యే వ్యయం తగ్గాలి తప్ప పెరగడమేమిటి ? దీనిని బట్టే రిలయన్స్ ఉత్పత్తి వ్యయాన్ని ఎంత అడ్డగోలుగా పెంచేసిందో అర్థమవుతుందని పెట్రోలియం , సహజవాయువుపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడు కూడా అయిన తపన్ సేన్ సంబంధిత శాఖ మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు . ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు .
జ్యోతి గారు కార్టూన్ కి ఎక్కేసారా ! బావుంది : )
నిరంతర విద్యుత్ అంతరాలనుండి విప్లవాత్మక విశ్రాంతి లభించి విద్యుత్ పరికరాల వినియోగం ప్రతి యింటా పెరుగుతుంది . ఆయా గ్రుహవినియోగ విద్యుత్ పరికరాల వుత్పత్తుల తయారీ పరిశ్రమలూ పెరుగుతాయి . . సోలార్ , పవన విద్యుత్ వుత్పాదక పరికరాల కై పరిశోధనాలయాలూ తద్వారా పరిశ్రమలూ , సాంకేతిక పరిగ్నానం రుగుతుంది . వుపాధి అవకాశాలూ పెరుగుతాయి . నిరుద్యోగ సమస్య తగ్గి దేశ ఆర్ధిక పరిస్థితి పురోగమనంలో సాగుతుంది .
అంత వరకూ తమ విలువైన స్పందనలకు ఎదురు చూస్తూ ఉంటాను ,
నేను గత వంద సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్ర గురించే ప్రస్తావించదలచుకున్నాను కాబట్టి , నా నిర్ధారణలు ఆ వంద యేళ్ళకే పరిమితం . పదకొండో శతాబ్దంలోకో , పన్నెండో శతాబ్దంలోకో వెళ్ళి తెలుగు సాహితీ చరిత్ర తరచి చూస్తే నా వివరణ నిలబడక పోవచ్చు . పాట ప్రజలనోటిలో ఉన్నదని నాకు తెలుసు . అయితే , ఆ రోజుల్లో సాహితీ చరిత్ర నిర్దిష్టంగా చెప్పగలిగినప్పుడు , నా definitions సవరించుకుంటాను . ప్రస్తుతానికి గత నూరేళ్ళ పరిథిలోనే ఉండి ప్రజలు ఎవరూ , అన్న ప్రశ్న వేసుకుందాం .
ప్రభావం : దేశవ్యాప్తంగా ఉన్న 22 లక్షల మందికి కొంత ఊరట . అయితే పెరిగిన జీవన వ్యయంతో పోల్చుకుంటే ఇది ఏ మాత్రమూ సరిపోదు . కనీస వేతనం కన్నా ఇది చాలా తక్కువ .
ముక్కు ఎక్కడుందో చూపమంటే , చెయ్యి తల వెనుక తిప్పి చూపెట్టినట్టు ఉంది కదూ . కాని ఇక్కడ రెండు ముఖ్య విషయాలని గమనించాలి . FA సంఖ్యాశాస్త్రాన్ని క్రమబద్ధం చేసేదే కాని , అది సంఖ్యాశాస్త్రం కాదు . అది కేవలం పద బంధాలని కొన్ని కచ్చితమైన సూత్రాల ద్వారా వేరే పద బంధాలుగా మారుస్తుంది . ఈ పద బంధాలని మనం సంఖ్యాశాస్త్రానికి అన్వయించి అర్థం తెలుసుకోవచ్చు , కాని FA కి సంబంధించినంతవరకు , అది పద బంధాలతో సంకేతాలని మారుస్తూ ఆడుకునే ఆట మాత్రమే .
జగన్ ఓదార్పు యాత్రకు కేంద్రం అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్ . . .
హ . . హా . . హా . బాగుంది . చివరిలొ TCS బాగుంది . ఎంతైన Govt లాఅని పేరు పడ్డది కదా .
ఈ రోజుల్లో పిల్లలు , ఆ బధ్ధకం శబ్దాన్ని మార్చేసి స్టైలుగా ' బోరు ' అంటున్నారు . తెలుగులో చెప్పుకోడానికి నామోషీ ! ఏ రాయైతేనేం బుర్ర పగలుకొట్టుకోడానికీ ! చిన్నప్పుడు న్యూస్ పేపరు చదవడం తప్పనిసరైపోయేది . అదే ఓ అలవాటుగా మారింది . అందుకనే మన ఇళ్ళల్లో ఉండే పెద్దవారు , స్కూళ్ళకీ , కాలేజీలకీ వెళ్ళి డిగ్రీలు సంపాదించకపోయినా , న్యూస్ పేపరు చదివే , వారి లోక జ్ఞానం ఇంప్రూవ్ చేసికున్నారు . అందుకే వారికున్న general knowledge ముందర మనం పనికి రాము . ఇప్పుడో , న్యూస్ పేపరు చదవడానికి టైమే ఉండడం లేదూ , ఈ టి . వీ . ల ధర్మమా అని . పైగా , కంప్యూటరు లో ఓ నొక్కు నొక్కగానే , మనకి కావలిసిన సమాచారం వచ్చేస్తోందాయే ! మరి బధ్ధకం పెరిగిపోతుందంటే పెరగదు మరీ ?
ఆసం . . . కాంసెప్టు కొత్తగా బాగుంది . కానీ ఇది ఎంత వరకూ అవసరమో ?
మంచికథ , కథనం లేకుండా ఎవరెంత చేసినా వృధా ప్రయాసేనని ఈ చిత్రం విషయంలో కూడా మరోసారి రుజువయ్యింది . సాంకేతికంగా ఎంతబాగున్నా , మంచి స్క్రీన్ ప్ . . .
రాబోయే టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ను ఎదుర్కోవడానికి ఎదురుదాడే సరైన మంత్రమని భారత బ్యాట్స్మన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు . సిరీస్లో భారత్కు ప్రధానంగా స్వాన్ , ఆండర్సన్ల నుంచే ముప్పుంటుందని ద్రవిడ్ చెప్పాడు . ' ' ఆండర్సన్ బాగా బౌలింగ్ . . .
నిన్ననే ఈ పద్యమెందుకో గుర్తుకొచ్చింది . మా తెలుగు మాస్టారు ఈ పద్యాలన్నీ భలే చెప్పేవారు ~ సూర్యుడు
ఇన్నాళ్ళకి మీడియాకి అనుభవమైంది పోలీసు రాజ్యం ఎలా ఉంటుందో . ఇందిరాగాంధీ దేశం మీద కప్పిన అత్యవసర పరిస్థితి అనే నల్ల గొంగళీ తొలగినాక పోలీసు భూతం మాంత్రికుడి సీసాలోకి వెళ్ళిపోయినట్టే భ్రమ కల్పించింది ఇన్నాళ్ళూ . ముఖ్యంగా మన రాష్ట్రంలో గత పదేళ్ళలో ఎక్కడా సామాన్య మానవుల్ని భయపెట్టకుండా , సదా మీ సేవలో అంటూ , మీడియా వాళ్లతో మంచిగా ఉంటూ . కానీ భూతం భూతమే మాయ సీసాలో ఉన్నా , మందు సీసాలో ఉన్నా . చంద్రబాబు మీద అలిపిరిలో దాడి జరిగిన దరిమిల నల్లమల అడవుల్లో చెంచుల మీద జరిగిన పోలీసు అత్యాచారాలు ఎవరికి పట్టినాయి ? బాక్సైటు గనుల నెదిరించినందుకు విశాఖ గిరిజనులు తిన్న చావుదెబ్బలు ఎవరికి పట్టినాయి ? అనేక జలయజ్ఞాల్లో ముంపులకి గురై నిరావాసులై సమిధలై పోయిన వారి గొడవలు ఎవరికి పట్టినాయి . 60 లలో తెలంగాణ కావాలని అరిచినందుకు ఆనాడు తెలంగాణ వాసులు బాగానే రుచి చూశారు పోలీసు దెబ్బల్ని . 70 లలో విశాలాంధ్ర కావాలని అరిచినందుకు ఆనాడు విజయవాడ వాసులు బాగానే రుచి చూశారు పోలీసు దెబ్బల్ని . మీడియా అతిరథ మహారథులారా . . మీరూ రుచిచూడండి మరి . ఎందుకంటే , ఈ పోలీసు రాజ్యంలో మీరూ పౌరులే . మీకూ సమాన హక్కులున్నాయి సామాన్యపౌరులతో సమానంగా . . భూతాన్ని సీసాలోకి పంపి బిరడా పెట్టెయ్యగల మంత్రికుడి కోసం చూస్తున్నా ! * * * * * * * * * ఫిబ్రవరి 16 ఆంధ్రజ్యోతి దినపత్రిక నించి : " క్యాసెట్ ఇచ్చేందుకు వెళ్తుండగా . . . : అప్పటిదాకా జరిగిన దాడులు , ప్రతిదాడులను ' బి ' హాస్టల్ ప్రాంతంలో ఉన్న ' ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ' ప్రతినిధి నర్సింగరావు కవర్ చేశారు . రికార్డు చేసిన క్యాసెట్‌ను ఉస్మానియా వర్సిటీ పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న చానల్ లైవ్ వాహనంలోని సిబ్బందికి ఇచ్చేందుకు బైక్‌పై బయలుదేరారు . అంతలో ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో ఆర్ట్స్ కాలేజీ సమీపంలో బైక్‌ను పక్కకు ఆపి మాట్లాడుతున్నారు . ఆ సమయంలో ఇరువైపుల నుంచి రాళ్లు వర్షంలా వచ్చి పడుతుండటంతో ముందుకు కదలబోయారు . అంతలోనే గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లు కొందరు వెనక నుంచి వచ్చి నర్సింగ్ రావును చుట్టుముట్టారు . వచ్చీ రావడంతోనే ఓ కానిస్టేబుల్ లాఠీతో తలపై బలంగా కొట్టాడు . దీంతో నర్సింగ్‌రావు నేలపై పడిపోయారు . తాను మీడియా ప్రతినిధినంటూ గుర్తింపు కార్డును , చేతిలో ఉన్న ' ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ' లోగోను చూపిస్తున్నా గ్రేహౌండ్స్ పోలీసులు పట్టించుకోలేదు . బైక్ మీద నుంచి రోడ్డుపై పడేసి బూటు కాళ్లతో విచక్షణారహితంగా తన్నారు . లాఠీలతో చితకబాదారు . లోగోను నేలపై పడేసి తొక్కారు . ఈ దాడిలో నర్సింగ్‌రావు తల పగిలిపోయింది . వీపు మొత్తం వాతలుతేలాయి . తీవ్ర గాయాలతో పడిపోయిన నర్సింగ్‌రావును పోలీసులు బలవంతంగా లేపారు . విద్యార్థుల వైపు నుంచి వస్తున్న రాళ్ల నుంచి కాచుకునేందుకు నర్సింగ్‌రావును అడ్డుపెట్టుకున్నారు . ' మీరు రాళ్లు రువ్వితే తగిలేది ఇతనికే ' అంటూ . . . నర్సింగ్‌రావును లాఠీలతో కొడుతూ ముందుకు వెళ్లారు . కొన్ని నిమిషాలపాటు ఈ హింస కొనసాగింది . ఇది చూసి చూసి సహనం నశించిన విద్యార్థులు . . . సుమారు 200 మంది ఒక్కసారిగా గ్రేహౌండ్స్ పోలీసులపైకి దూసుకొచ్చారు . దీంతో గ్రేహౌండ్స్ సిబ్బంది నర్సింగ్‌రావును వదిలిపెట్టి వెనక్కి పరుగులు తీశారు . నర్సింగ్‌రావును విద్యార్థులే ఆస్పత్రికి తరలించారు . "
అటు ఇటూ ఎటుచూసినా చెత్త . . ఆ చెత్తను కెలుకుతున్నకుక్కలూ తప్ప స్టేషన్ కనబడనేలేదు . . సిగ్నల్ కోసం ఆపినట్టున్నాడులే అనుకుని . . వాష్ బేషిన్ దగ్గర చూస్తే , పెద్దపులి బొమ్మవున్న తెల్లటీచొక్కా వేసుకుని . . పావుగంటయినా లేవకుండా బేషిన్లో మొత్తం మొహం పెట్టేసి ఎదో కడుగుతున్నాడు ఒక కుర్రోడు . బయటకు ట్యాప్ విప్పిన సౌండుతప్ప ఎమీ వినపడటంలేదు కనపడటంలేదు . . అలా ఒక అరగంటఅయ్యాకా " నోవాటర్ . . " , అని కిరణ్ వైపు తిరిగి పెదవివిరిచాడు . . . అతని వెనుక టీచొక్కాపై పెద్దఅక్షరాలతో రాసున్న " సేవ్ టైగర్ " అన్నది చదివి . . . మనసులో . . ముందు సేవ్ వాటర్ . . తరువాత టైగర్ . . అని మోహాంలో అష్టవంకర్లతో ఎక్స్పెషన్ పలికించి . . అతనివంక . . చూసాడు కిరణ్ , ఆ ఎక్స్పెషన్లో వున్న తిట్లన్నీ అర్ధంచేసుకుని . . ఏమీ మాట్లాడకుండా తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆ కుర్రోడు .
ఆపాతమధురం అనే సమాసం తరచుగా తప్పు అర్ధంలో వాడుతున్నాము . ఈతప్పు వాడుక మనరాతల్లో ఈమధ్యన మరీ ఎక్కువగా కనిపిస్తున్నది . ఈ పదబంధానికి మూలం సంగీత సాహిత్యాల ప్రాశస్త్యాన్ని చెప్పేందుకు ప్రసిద్ధికెక్కిన ఈ శ్లోకశకలం అయుండొచ్చు : ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతం సంగీతం ( చెవిన ) పడినంతనే తియ్యగా అనిపించేది . మిగిలినదయిన సాహిత్యం ఆలోచనతో మధించడం వల్ల అమృతాన్నిస్తుంది అని స్థూలంగా దీని భావం . ఆపాతము అంటే పడినది . ఆపాతమధురం అంటే పడినంతనే , అంటే మనం దాన్ని విన్నంతనే ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది , వేరే ఏమీ కసరత్తు చెయ్యనక్కరలేకుండా . ఈ పదబంధంలో పాత అని అక్షరాల పొందిక చూసిన శ్లేషప్రియులెవరో దీన్ని ఆ " పాత " మధురం అని ప్రయోగించారు , శ్రావ్యమైన పాత సినిమా పాటల్ని గుర్తు చేసుకునేందుకు . బహుశా ఈవాడుక పత్రికల్లో మొదలయి ఉండొచ్చు , చమత్కారభరితమైన శీర్షికల కోసం పాత్రికేయుల వెంపర్లాట తెలియనిదేముంది ? ఏదేమైనా తెలుసుకోవలసిన విషయం ఏమంటే , ఆపాతమధురం అంటే పాత సినిమా పాట కాదు అని . ఈ కింది పదాలకి అర్ధాలు చెప్పండి - జాలంలో , నిఘంటువుల్లో వెతక్కుండా ! ధారాళం చూడామణి చమురు బోలెడు మిసిమి
సామవేద దేవత నల్లకలువ రేకు వలె నిగనిగలాడు నీలశరీరముతో , గుఋఋఅ ము ముఖముతో కుడిచేతిలో అక్షమాలను , ఎడమచేతిలో కుండను ( పూర్ణకుంభమును ) ధరించి యుండును .
మొన్నటి మా యాత్ర ఢిల్లీ లో పడ్డాం అని చెప్పనుకదా . అక్కడనుంచీ వెయిటింగ్ . రెండుగంటలు దాటిపోయింది . మళ్లీ ఫోను చేస్తే , మా చెల్లెలు " ఇక్కడ హైవేలో పొగమంచు వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది . అరగంటనుంచీ వెయిట్ చేస్తున్నాం . కాసేపట్లో క్లియర్ అయ్యేలా వుంది . ఇంకో గంటలో వచ్చేస్తాను " అని చెప్పింది . ఇక్కడ చలిలో మా పాట్లు మేము పడుతూ , ( మగాళ్లం అరగంటకోసారి కాఫీలు తాగుతూ . . . ఆడవాళ్లు నడవలేక , కాఫీలు తాగలేక అపసోపాలు పడుతూ ) నిరీక్షించాము . గంటా గడిచింది . మళ్లీ ఫోను . " ఇంకో అరగంటదాకా క్లియర్ అయ్యేలా లేదు . మీరోపని చెయ్యండి . ఓ టాక్సీ మాట్లాడుకొని మాకు యెదురు వచ్చెయ్యండి ! " అని . సరే ! నేనెలాగూ క్రింద ఎంట్రన్స్ గేటు దగ్గరకీ , వెయిటింగురూముకీ మధ్య తిరుగుతూ , అప్పటికే ఓ అర పెట్టి సిగరెట్లు తగలేశాను . ( వెయిటింగు రూములో నిషేధం మరి ! ) క్రిందకి వెళ్లి టాక్సీ ల కోసం చూస్తూ , అప్పుడే వచ్చి యెవరినో దింపిన ఓ టాక్సీ వాణ్ని ( అప్పటికే టాక్సీ స్టాండులో వున్న వాళ్లని అడిగితే , చాలా యెక్కువ డబ్బులు అడుగుతారు ) కుదరగడుతూండగా , మళ్లీ ఫోను . " మా డ్రైవరు చాకచక్యంగా వేరే దారిలో వచ్చేస్తున్నాడు . ఇంక టాక్సీ వద్దు " అని . యెట్టకేలకి 7 - 45 కి మా చెల్లెలు , వాళ్ల బావగారి అబ్బాయి , డ్రైవరులతో వచ్చి , అందర్నీ వాటేసుకొని , వాళ్లు మాకు పాదాభివందనాలు చేసేసి , భయంకర అనుభవాలు చెపుతూ , ఆలస్యానికి సారీలు చెపుతూ , " మీకేమీ అసౌకర్యం కలగలేదు కదా ? " అని నొచ్చుకొంటూ , సామాను వాళ్ల " బొలేరో " లో వేసి , యెక్కాము అందరూ . పొగమంచు ఇంకా యెక్కువగా వున్నా , ప్రయాణం బాగానే సాగుతూంది హైవేలో - - ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వరకూ . ఇంక " గురుగామ్ " దగ్గరకొచ్చేసరికి , జామ్ ఇంకా క్లియర్ కాలేదు . అడ్డం పడినవి అన్నీ " రెడీమేడ్ కాంక్రీటు " వ్యాన్లే - - ప్రముఖ కంపెనీలవి ! మళ్లీ గురుగామ్ వూళ్లోంచి , అడ్డదారుల్లో వెళుతూ , మళ్లీ ఢిల్లీ ఎంట్రన్సు చేరి , ఇంకో కచ్చా రోడ్డు ద్వారా , మారుతీ ఫేక్టరీ , హీరో హోండా ఫేక్టరీ , అనేక రైల్వే స్టేషన్లూ , యార్డులూ దాటుతూ , # " పటౌడీ " చేరేసరికి 9 - 00 అయిపోయింది . అక్కడనుంచీ , రోడ్డు బాగుంది . వాళ్ల వూరు ఇంక 51 కిలోలే . ( ఇంతాచేసి , ఢిల్లీ నుంచి హర్యాణాలో వున్న వాళ్ల వూరు " షేర్ పూర్ " కేవలం 150 కిలోలు మాత్రమే ! ) 9 - 30 కల్లా వాళ్ల వూరు , వాళ్లింటికి చేరాం . బొలేరో దిగి , ఇంట్లోకి వెళుతూ , అలవాటు చొప్పున బయట చెప్పులు వదిలేసి , ఇంట్లో అడుగుపెట్టానా . . . . . అరికాళ్ల దగ్గరనించి తొడలదాకా " ఫ్రీజ్ " అవడం మొదలెట్టాయి . నా వెనక్కాలే మా ఆవిడ నన్ను ఫాలో అయిపోతుంటే , ఖంగారుగా మా చెల్లి " వొదినా ! చెప్పులు వదలొద్దు ! అన్నయ్యా ! వేసేసుకో ! అప్పుడు లోపలికి రండి ! " అనగానే , మళ్లీ చెప్పులు వేసేసుకొని , ఇంట్లో ప్రవేశించాం . . . . . . . . . . . ఇంకా తరువాయి .
> తిప్పసంద్ర కెళ్ళి కూరగాయలు తీసుకు రావాలి అవును బుధవారం , వారాంతంలో తాజా కూరలు దొరుకుతాయి
విహారి గారు , డిజైను చాలా బాగుంది . మీ బ్లాగు పేరు ( heading ) - ఇంకొంచెం పెద్దదిగా చేస్తే బాగుంటేమో ? అలాగే , రంగుకూడా ? - - నాగరాజు .
> > > " ఆ కాలం కథకి యుగంధరమంత్రి అన్న పేరు కూడా కాస్త వింతగానే అనిపించింది . "
phone చేసినప్పుడు Receive చేసుకోని నీ ముందు నేను ఓడి పోయానుఎలా ఉన్నావు అని SMS చేసినప్పుడు Reply లేని నీ నిర్లక్ష్యం ముందు ఓడిపోయానునీతో మాట్లాడాలనుకున్నప్పుడు నీ మౌనం ముందు ఓడిపోయానునిన్ను కలవాలని ఎదురు చూసి . . ఓడిపోయానుసమస్యలు చుట్టిముట్టినప్పుడు నా అనుకున్న నీతో పంచుకుందాం అనినీకు Phone చేసినప్పుడు Receive చేసుకోని నీ ముందు నేను ఓడి పోయానుఇలా నేను ఓడిపోతూనే ఉన్నాను నీదగ్గర . . . నీవు [ . . . ]
కొత్తపాళీ గారు , చిన్న చిన్న విభేదాలని పక్కన పెడితే అమెరికా లో ముఖ్యం గా రెండు జాతులు , నల్ల వారు , తెల్లవారు . అదేమనకి , తమిళులు , కన్నడిగలు , తెలుగు , హిందీ మాట్లాడే వారు , మరాఠీ లు , బిహారీలు ఇంకా ఎన్నో . వీళ్ళందరి మధ్య సయోధ్య సాధించి నేత గా ఒక్కడు ఎదగడం అనేది కలలో మాట . అసలు మనం నేతల్ని ఎన్నుకొనే విధానమే లోపభూఇష్టం . చిన్న చిన్న పార్టీలు కలసి కూటమి గా ఏర్పడే సందర్భంలో కూడా వాళ్ళ అవకాశవాదమే ప్ర్రాతిపదిక గా ఉంటుందే తప్పితే , జనాభిప్రాయం కాదు . పివి ప్రధానమంత్రి గా ఉన్నప్పుడు , ఆయన రాష్త్ర రాజకీయాలని వదిలి ఎన్నో దశాబ్దాలైనా ఉత్తరాది వాళ్ళకి ఆయన ఇంకా దక్షణాది వాడే . కొసమెరుపేమింటంటే నెను నిన్న విన్న ఒక రేడియో టాక్ షో లొ కొంత మంది తెళ్ళవాళ్ళు ఒబామా పూర్తిగా నల్లవాడు కాదు అని వాదించారు . ఆ టాక్ షో హోస్ట్ దాన్ని ఖండించాడనుకోండి . They still can ' t digest a black guy ruling this country . ఇలాంటి కొద్దిమందిని మినహాయిస్తే మెజారిటీ అమెరికన్లు ఒబామా ని నల్లవాడిగానే చూస్తున్నారు అందుకే అది చారిత్రాత్మక ఎన్నిక అయింది .
అమెరికా కథకి అమెరికా జీవితాన్ని అనుభవించిన వారు కాక , అమెరికన్ ఫ్రెండ్సున్న ఇండియా వాస్తవ్యుల చేత ముందుమాట రాయిస్తే ఎలావుంటుందో ఇది చదివితే స్పష్టంగా తెలుస్తుంది . ముందుమాట రాసిన వారు ఇందులో వచ్చిన కథలన్నీ చదివినట్లుగా అనిపించదు . " ముందుమాట రాయమన్నారు - ఏదో ఒహటి రాయాలి కదా ? " అన్నంత తేలిగ్గా రాసిపడేసినట్లనిపించింది . కథల గురించీ , సమస్యల గురించీ , లేదా అమెరికన్ జీవితం గురించీ ఒక్క వాక్యం లేదు .
నేనా వ్యాసాన్ని నాకు తెలిసిన ప్రాంతపు భాషలో రాశాను . ఆభాషలో ఒత్తులు , దీర్ఘాలు ఉన్నాయి . వాటికి సంబంధించిన నియమాల్ని పాటించడంలో జాగ్రత్త తీసుకోకపోవడం - అందునా ఓ సాహిత్యపత్రికకి రాసేదాంట్లో - నా అజ్ఞానాన్నీ బద్ధకాన్నీ తెలుపుతుంది గానీ , అదేదో అభ్యుదయం అని సమర్థించుకుంటే ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది .
ఇంతకు మ్రుందు చెప్పినట్టుగా ఇది ఒక మాస్ మైల్ లోని అంశానికి సంబందించినది . కాబట్టి దీనిని నేను కనుగొన్నానని మీరు అనుకోవద్దు . ఒక వేళ ఇక్కడ ప్రస్థావించిన విషయాలు ఏమైనా మీ మనోఃభావాలను దెబ్బదీసేవిగా ఉంటే , ఈ ప్రశ్నలను అస్సలు పట్టించుకోవద్దని ప్రార్దన . ఈ ప్రశ్నల ద్వారా నాకు కొన్ని నిజాలు తెలిసాయి అన్నంత మాత్రాన అవి మీకు కూడా వర్తిస్తుందన్న గ్యారెంటీ లేదు కావున ఈ ప్రశ్నలను ఏ మాత్రం కేర్ చెయ్యవద్దని మనవి .
మనలో చాలామందికి అన్ని కష్టాలే . . కానీ ఈ అబ్బాయికి కాళ్ళు లేవు , చేతులు లేవు అలాగే జీవితంలో కష్టాలు కూడా లేవంట . ఎలా అనుకుంటున్నారా . . ఇదిగో ఈ క్రింద చెప్పాడు చూడండి . ఈ పుటని క్రింద చూపిన వీడియోలో ఆడియో లేకుండా చూసాను అయినా కన్నీళ్ళు ఆగలేదు .
అపురూపమైన దృశ్యాలు ఫోటోల ద్వారా చూపించారు చక్కగా వివరించారు ధన్యవాదాలు . ప్రభుత్వం చర్యలు తీసుకొని మన పురాతన దేవాలయాల వైభవం పునరుద్ధరించాలి .
చెరవు చేసితివిగా చెలగి బాడవ క్రింద సద్రాజు లెన్న సముద్రముగను వనము నిల్పితివిగా వర్ణింపరాకుండ వీక నరట్ల కుప్పాక నడుమ మాన్య మిచ్చితివిగా మహిషి మూలంబున శొంఠిసుబ్బయ్యకు క్షుద్రభూమి నా కిచ్చితివి కదా నాలుగైదు వరాలు పేశలగతిని వర్షాశనముగ
చిరు ' విందు - భలే పసందు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో సంచలన పరిణామాలు తిరుపతి - జూన్ 16 ( వాస్తవం ప్రత్యేక ప్రతినిధి ) : టీకప్పులో ' రాజకీయ తుఫాను ' అంటే ఇదేనేమో ! కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనానికి ఎన్నికల కమిషన్ ఆమోదం , ప్రదేశ్ కాంగ్రెస్ నేతగా బొత్సా నియామకం నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి చిత్తూరు జిల్లా విందు రాజకీయం , ఓ రకంగా రాస్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమే అయ్యింది . ముఖ్య మంత్రి కిరణ్ కు బద్ద వ్యతిరేకిగా భావిస్తూ వచ్చిన మాజీ మంత్రి పెద్ది రెడ్డి ఇంట ' చిరు ' విందుకు హజరు కావడమే ఇందుకు కారణం ! బహుశా ఈ పరిణామం కొత్త సమీకరణలకు దారితీయ వచ్చని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు . తిరుపతిలో పెద్దిరెడ్డి స్వగృహంలో చిరంజీవి విందుకు హాజరై సంచలనానికి తెరతీశారు . ఇందులో పెద్ద రాజకీయమే లేదని ఆ ఇద్దరు నేతలు మిడియా ముందు అన్నప్పటికి పరిశిలకులు అంటున్నారు . వై . ఎస్ . హయాంలోనూ , ఆ తర్వాత రోశయ్య కెబినెట్ లోనూ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మంత్రిగా పనిచేశారు . అయితే అందరూ ఊహించినట్లే , కిరణ్ కుమార్ మంత్రివర్గంలో పెద్దిరెడ్డికి చొటు దక్కలేదు . అప్పట్లో ముఖ్యమంత్రి పై పెద్ది రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు . మూడునెలల్లో ముఖ్యమంత్రి ఇంటి ముఖం పట్టడం ఖాయమని కూడా ఘాటైన విమర్శచేశారు . ఆ తర్వాత పరిణామాల్లో ఆయన జగన్ కు దగ్గరయ్యే సూచనలు కనిపిస్తూ వచ్చాయి . ఆ తర్వాత కొంతకాలానికి ముఖ్యమంత్రే తనకు వ్యతిరేకం తప్ప , తాను ఆయనకు వ్యతిరేకిని కానని కూడా స్పష్టం చేశారు . అనంతరం వై . ఎస్ . ఆర్ కాంగ్రెస్ పార్టి ఆవిర్భవించినా , పెద్దిరెడ్డి కాస్తా మెత్త బడినట్లు కనిపించారు . అదే దశలో కార్యక్రమాల్లో కనిపిస్తూ మిధున్ రెడ్డి మాత్రం జగన్ కార్యక్రమాల్లో కనిపిస్తూ తనదైనా సంకేతాలు ఇస్తూ వస్తున్నారు . చిత్తూరు జిల్లాల్లో 14 అసెంబ్లీ స్థానాల్లో 7 చొట్ల కాంగ్రెస్ , ఆరుచోట్ల తెలుగుదేశం , ప్రజారాజ్యం అధినేత చిర్నజీవి తిరుపతికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు . సి . ఎం , మంత్రిని మినహాయిస్తే , మొదట్లో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసమ్మతి వాదులుగా ముద్రపడ్డారు . చిత్తూరు ఎమ్మెల్యే మాత్రమే సి . ఎం . తో స్న్నిహితంగా ఉంటూ వస్తున్నారు . ఇటివల సాగుపోరు కార్యక్రమం కోసం జిల్లాకు వచ్చిన జగన్ కు పూతలపట్టు ఎమ్మెల్యే రవి కాణిపాకంలో కలుసుకోవడం కూడా చర్చనీయాంశం అయ్యింది . ఆయన మినహా మిగతా అసమ్మతి వాదులు , తాజా కాంగ్రెస్ పరిణామాలతో కాస్తా చల్లారినట్లు భావిస్తున్నారు . ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొత్సా నియామకం రాష్ట్ర కాంగ్రెస్ లో పెరిగిన చిరంజీవి ప్రాధాన్యత కూడా జిల్లా రాజకీయాలపై కాంత ప్రభావాన్ని చూపాయి . అందులో భగంగానే చిరంజీవి , పెద్దిరెడ్డి భేటి జరిగింది . ప్రజారాజ్యం అధికారికంగా కాంగ్రెస్ లో విలీనం , మెగాస్టార్ గా చిరంజీవిపై అభిమానంతోనే విందుకు ఆహ్వానించినట్లు పెద్దిరెడ్డి చెప్పుకోచ్చారు . ఇదే భావన స్పురించే విధంగానే చిరంజీవి సైతం సంభాషణ చేశారు . సి . ఎం . కిరణ్ వ్యతిరేకిగా భావిస్తున్న పెద్దిరెడ్డిని కలుసుకోవడం వల్లే ఈ విందు కు ఎక్కడ లేని ప్రాధాన్యత ఏర్పడింది . ముఖ్య మంత్రి అనుమతి తోనే ఈ భేటీ జరిగిందా ? లేదా ఇందుకు అధిష్టానం ప్రోత్సాహం ఉందా ? లేదా కొత్త పిసిసి అధ్యక్షుడి వ్యూహమా ? మరి మించితే బాహటంగానే సి . ఎం . వ్యతిరేకులను చిరంజీవి దగ్గర తీసే ప్రయత్నం చేస్తున్నారా ? లేక స్వచ్చందంగానే కాంగ్రెస్ లో సమైక్యతా గానం వినిపించే ప్రయత్నమా ? ఇలా ఈ విందు పరిశిలకుల మెదళ్ళను తొలిచే అనేక ప్రశ్నలను సంధించింది . అపద్భాందవుడి గా కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నటి నిలచిన మెగాస్టార్ ఆయన వ్యతిరేకులను ప్రోత్సహించే అవకాశమే లేదనే వాదనలూ బలంగా వినిపిస్తున్నాయి . అయితే చిత్తూరు జిల్లాలో ఇది కాంగ్రెస్ కు కలసివచ్చే పరిణామంగానే భావిస్తున్నారు . అసమ్మతిని చల్లార్చే ప్రక్రియగా భావిస్తే జిల్లాలో కాంగ్రెస్ మరింత పటిష్టమయ్యే సూచనలు ఉన్నాయనడంలో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు . ఈ పరిణామం జిల్లా కాంగ్రెస్ లో పెద్దిరెడ్డిని వ్యతిరేకించే చేనేతలను సి . ఎం . కు మరింత దగ్గర చేసే అవకాశాలను సూచిస్తున్నాయి . ఇదిలా ఉంటే ప్రదేశ్ కాంగ్రెస్ అధినేత బొత్సా కూడా ఇటీవల పెద్దిరెడ్డ్తో రహస్య సమాలోచనలు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి . ఇదిలా ఉంటే జిల్లాలో మరోమంత్రి , చంద్రగిరి ఎమ్మెల్యే గల్లా అరుణ కుమారి మాత్రం ఎప్పటిలాగే ఈ వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు . ఇది ఓ రకంగా మంత్రికి లాభంచే పరిణామంగానే చెప్పాలి . నిన్న మొన్ననే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసిన చిరంజీవి ఎవరి ప్రోద్భలం లేననే ఈ చర్యలకు ఉపక్రమించే పరిస్థితి లేదు . అయితే కాంగ్రెస్ పటిష్టతను దృష్టిలో ఉంచుకుంటే ఇదో శుభపరిణామమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు . ఇలా ఉంటే పెద్దిరెడ్డి విషయంలో కాస్తా మెతన్ ధొరణిని అవలంబించాల్సిందిగా సి . ఎం . కిరణ్ కు కూడా అధిష్టానం నుంచి సంకేతాలు అందినట్లు మరికోన్ని ఊహాగానాలు ఇటీవల తెరపైకి వచ్చాయి . సి . ఎం . ను మినహాయిస్తే ప్రస్తుతం జిల్లాలో ఓ సామాజిక వర్గానికే మంత్రి వర్గంలో స్థానం ఉంది . ఆరకమైన సమీకరణలను పరిశిలిస్తే బహుశా విందు రాజకీయం నుంచి ఓ మంత్రి పదవి వికసించి అది పెద్దిరెడ్డి ' చిరునవ్వు ' కు దోహదపడగలదేమో వేచి చూడాలి .
హైదరాబాదులో బాంబు పేలుళ్ళు జరగ్గానే " అన్ని మతాల వాళ్ళూ చనిపోయారు ఒక మతంపై ప్రత్యేకించి చేసిన దాడి కాదు " అని వ్యాఖ్యానాలు వచ్చాయి . సహజంగానే ప్రజలు కూడా ఈ పేలుళ్ళను అలా భావించలేదు . మత పరమైన పర్యవసానాలేమీ లేకుండానే ప్రశాంతంగా గడిచిపోయింది . అయితే బాధితుల్లో అన్ని మతాల వారూ ఉన్నారు . కానీ ఈ ఉగ్రవాదులెవరు ? ఈ సంఘటనకు కారకులు ఎవరో ఇంకా తెలీక పోయినా , గత అనుభవాలను బట్టి ఇస్లామిక ఉగ్రవాదులని అనుమానాలు పోతాయి , సహజంగా . కానీ ఉగ్రవాదులకీ మతానికీ ముడిపెట్టకూడదని ఓ . . . తెగ చెప్పేస్తున్నారు , కొందరు . కానీ అలా కుదురుతుందా ? అసలు ఉగ్రవాద చర్యలను మతంతో ముడి పెట్టకుండా ఎలా చూడాలో తెలీడం లేదు . ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న ఉగ్రవాద చర్యల్లో దాదాపుగా అన్నీ మత ప్రేరితమే - మతాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం కావచ్చు , మత బోధలకు తప్పుడు భాష్యాలు చెప్పడం కావచ్చు , మరోటి కావచ్చు . మన దేశంలో జరుగుతున్న ఉగ్రవాద హింస నుండి మతాన్ని విడదీసి చూడగలమా ? ఈ రెంటికీ సంబంధం లేకపోతే మరి ఈ హింసలకు కారణమేంటి ? మూలమేంటి ? ఈ పనులు చేసేవాళ్ళు తమ ప్రాణాలకు తెగించి మరీ ఎందుకీ పనులు చేస్తున్నారు ? హై . పోలీసు కమిషనరేటు మీద దాడి చేసిన మానవబాంబు ఏమాశించి ఆ పని చేసినట్టు ? మన దేశాన్ని కల్లోలపరచాలనే ఉద్దేశమే దీనికి కారణమంటున్నారు . ఎందుకు కల్లోల పరచడం ? ఉగ్రవాదులకు మనదేశమ్మీద ఎందుకంత ద్వేషం ? మనం అభివృద్ధి పథంలో ఉన్నామని అంట ! మన అభివృద్ధి చూసి కన్నుకుట్టి ఇక్కడి కొచ్చి బాంబులేస్తున్నారట . నవ్వొస్తది నాకా మాట వింటే . మరి మనకంటే డబ్బున్న కొన్ని గల్ఫు దేశాల్లో లేవే ఈ దాడులు ? చైనాలో లేవేఁ ? జపానులో లేవేఁ ? దక్షిణ కొరియాలోను , సింగపూరులో ను జరగవేఁ ? బ్రెజిల్లో లేదే మతవాద తీవ్రవాదం ? ఎందుకంటే . . ఉగ్రవాదులకు స్థానికంగా అక్కడ సాయం దొరకదు . ఇక్కడ అది ఇబ్బడి ముబ్బడిగా దొరుకుద్ది . ఒకవేళ సాయం చేసేవాడెవడన్నా ఉన్నా , ఆయా దేశాల్లో అయితే తోలు దీస్తారు . మరి మన దగ్గర . . మత నాయకులు , రాజకీయనాయకులు , ఎమ్మెల్యేలు , మంత్రులు . . అందరూ అడ్డం పడి పోతారు పోలీసులకు . ఎందుకూ ? పోలీసులు ముస్లిములను పట్టుకోవాల్సే వస్తే , పట్టుకుంటే , అది రాజకీయంగా తెలివైన పని కాదు కాబట్టి . రాజకీయంగా తెలివైన పని కాదు కాబట్టే తస్లీమాపై దాడి చేసినవారిని లోపలెయ్యలేదు , వారు బయట తిరుగుతూనే ఉన్నారు . రాజకీయంగా తెలివైన పనులే చేస్తారు కాబట్టే మసీదులో బాంబుల తరువాత అరెస్టులేమీ జరగలేదు . సాక్షాత్తూ పోలీసు కమిషనరేటు మీద కొందరు స్త్రీలు గుంపుగా దాడి చేస్తే పోలీసులు ఏమీ చెయ్యలేక పోవడానికి కారణమూ ఇదే . మనకిక్కడ ప్రజల ప్రాణాల కంటే రాజకీయాలు , ఓట్లే ముఖ్యం . స్లీపరు సెల్సనీ మరోటనీ వేరు పురుగుల్లా దేశాన్ని నలుచుకు తింటున్నా వీళ్ళకేం పర్లేదు , ఓట్లు క్షేమంగా ఉంటే చాలు . వీళ్ళకు ఓట్లు వస్తాయంటే శిక్ష పడ్డ తీవ్రవాదులను కూడా వదిలిపెడతారు . . ఆ తరవాత వాడు మళ్ళీ గన్నుచ్చుకు మనమీదకే వస్తాడు కూడా . మనకు ఓట్లు పోతాయనుకుంటే ఖరారైన ఉరిని కూడా పక్కన పెడతారు . అనుమానితుల్ని అరెస్టు చేస్తే మన రాష్ట్ర మంత్రివర్గంలోని ఒక మంత్రి స్వయంగా విడిపించిన సందర్భాలున్నాయట . ఆయన స్వయంగా ఓ నిందితుడి ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చాడట . ఇలాంటి రకాలు యథేచ్ఛగా సమాజంలో తిరుగుతూ ఉంటాయి , మనల్నేలుతూ ఉంటాయి . వాళ్ళు కేవలం మత ప్రాతిపదికపైనే ఈ పనులు చెయ్యొచ్చు . మనం మాత్రం మతం గురించి మాట్టాడకూడదు . వేలాదిమంది విదేశీయులు సరైన వీసా కాగితాల్లేకుండా మన ఊళ్ళో ఉన్నారట , నల్గొండలోనూ ఉన్నారట . స్వయానా ఒక ముస్లిము సంస్థే చెబుతోందీ మాటను . ఎలా ఉండగలుగుతున్నారు వాళ్ళు ? ఎవరు వారికి ఆశ్రయమిచ్చింది ? పోలీసులు సరైన చర్యలు తీసుకుంటే అలా ఆశ్రయమిచ్చిన వాళ్ళు పరదేశీ దొంగల్తో సహా పట్టుబడరూ ? అలా చేసి ఉంటే మొన్నటి పేలుళ్ళు జరిగేవి కావేమో ! ! మొన్న జరిగిన సంఘటనలో ముస్లిము తీవ్రవాదుల హస్తం ఉందనే అనుమానాల పట్ల కూడా కొందరు అభ్యంతరం చెబుతున్నారు . ముస్లిము తీవ్రవాదులే కారణమని తేల్చెయ్యడం లేదు కదా . కే్వలం అనుమానిస్తేనే తప్పా ? అనుమానం కూడా ఊరికినే అలా గాల్లోంచి వచ్చిందేమీ కాదు . . . గత అనుభవాలను బట్టే కదా అనుమానించేది ?
చక్కని సువాసనతో , అద్భుతమైన రుచితో సీతాఫలాలు పిల్లల్నేకాకుండా పెద్దల్ని సైతం ఆకర్షిస్తుంటాయి . సీతాఫలాన్ని తినాలంటే సీతాదేవిలా సహనం కావాలనీ , అందుకే సీతాఫలానికి ఆ పేరువచ్చిందనీ కొంతమంది భావన .
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » స్టాక్ మార్కెట్ : సెన్సెక్స్ 105 పాయింట్ల వృద్ధి !
పూర్తిపేరు : Dwight Okita ఇతరపేర్లు : సొంత ఊరు : ప్రస్తుత నివాసం : వృత్తి : ఇష్టమైన రచయితలు : హాబీలు : సొంత వెబ్ సైటు : రచయిత గురించి :
గ్లకోమ వ్యాధికి చేసే కొత్త శస్త్ర చికిత్స అందుబాటులోకి వచ్చింది . దీని వల్ల రోగులకు నొప్పి తగ్గడమే కాక త్వరగా కోలుకునే అవకాశముంది . సక్సెస్ రేటు కూడా ఎక్కువే . ' క్లోజ్డ్ ఐ గ్లకొమా సర్జరీ ' దీనిపేరు . చెన్నైలో మొదటిసారిగా వాసన్ ఐకేర్ హాస్పిటల్‌లో ఆపరేషన్ చేశారు . సాంప్రదాయక శస్త్రచికిత్సల కన్నా ఇది మెరుగైనది .
ఇదే సందర్భంలో పక్కనే ఉన్న సహచర పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు కల్పించుకొని అవిశ్వాస తీర్మానం కోసం ఇచ్చిన నోటే స్పీకర్ తనకు తెలియదని బహిరంగంగా చెప్పిన సందర్భాలున్నాయని , అలాంటిది రాజీనామాలు తెలుస్తాయని తాము అనుకోవడంలేదని చమత్కరించారు . నిర్ణయం తీసుకోవాల్సింది సోనియాగాంధీయే తప్ప మరెవరూ కాదని ప్రస్తుత పరిస్థితి తేటతెల్లం చేసిందన్నారు .
ఒక కవిత్వ ప్రేమికుడి ఉద్విగ్న గాథ - ద పోస్ట్ మాన్
నాకు తెలిసి నంత వరకూ గత సంవత్సర కాలంలో పద్మనాభం గారు ఏ ఒక్క హైతెబ్లా ( హైదరాబాదు తెలుగు బ్లాగర్ల ) / eతెలుగు సమావేశాలకు గైరు హాజరవ్వలేదు . మూడు గంటల సమయం లో ప్రారంభం అయ్యేటటువంటి సమావేశాలకు వారు ఒక పావు గంట ముందే వచ్చేవారు . నిజమే ! ! ! పనీ పాడు లేని రిటైర్డ్ మనిషి కదా , ఏ వేళ్ళకి కావాలంటే ఆ వేళకి వస్తారు . . అని అనుకుంటున్నారా . . పనీ పాట ఉన్నా లేక పోయినా ఠంచనుగా అనుకున్న వేళకి అనుకున్న స్థలానికి చక్కగా అనునిత్యం యధైకగా వస్తున్నారా ? ? ? లేదా ? ? అని ఆలోచిస్తే వారి చిత్త శుద్ది మనకు అవగతమౌతుంది . ఇది ఒక్క eతెలుగు సమావేశాలలో మాత్రమే కాదు , పుస్తక ప్రదర్శనలో eతెలుగు వారి స్టాల్ దగ్గర వారి సపోర్ట్ కూడా ఇదే రీతిలో సాగింది . ఎప్పుడూ అందరి కన్నా ముందే చేరుకునే వారు . వీలైనంత చివరి వరకూ ఉండే వారు .
మన దేశంలో , ఓ నలభై యేళ్ల క్రితమే , " ఓజోన్ పొరకి " చిల్లు పేరుతో , అమాయక గిరిజనులు అడివిలో యెండుపుల్లలు యేరుకొస్తూంటే , కేసులు పెట్టేవారు ! " పొగలేని పొయ్యిలని " కనిపెట్టి , ప్రచారం చేసి , సబ్సిడీతో వాటిని ఇచ్చీ , ఇలా చాలా వేషాలు వెయ్యడం మొదలెట్టారు .
శ్రీశ్రీ మహాప్రస్థానం కవితలు రాసి డెబ్భై యేళ్ళు కూడా నిండ లేదు . ఆ కవితలు కూడా నిఘంటువు లేకండా అర్థం చేసుకోవడం , నాబోటిగాళ్ళకి కష్టమే అవుతున్నది .
ఆంధ్రులు మాట్లాడే భాషకు ఆంధ్రము , తెలుగు , తెనుగు అనే పేర్లున్నాయి . ఆంధ్ర , తెలుగు అనేవి రెండు వేర్వేరు జాతులనీ అవి క్రమంగా మిళితమైనాయన్న కొంతమంది అభిప్రాయానికి జన్యు శాస్త్ర పరంగా కానీ భాషాశాస్త్ర పరంగా కానీ గట్టి ఆధారాలు దొరకవు . వైదిక వాఙ్మయం ప్రకారం ఆంధ్రులు సాహసోపేతమైన సంచారజాతి . భాషాశాస్త్ర పరంగా తెలుగు గోదావరి , కృష్ణా నదుల మధ్య నివసిస్తున్న స్థిరనివాసుల భాష . తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్ర రాజులు ముందుగా పరిపాలించడం వల్ల ఆంధ్ర , తెలుగు అన్న పదాలు సమానార్థకాలుగా మారిపోయాయని కొంతమంది ఊహాగానం . 10 వ శతాబ్దపు పారశీక చరిత్రకారుడు అల్ బిరుని తెలుగు భాషను ' ఆంధ్రీ ' యని వర్ణించెను [ 6 ] .
చూడటానికి ఇవేవో న్యాయవ్యవస్తతో పని పడ్డప్పుడు పట్టించుకోవలసిన మాటల్లా కనిపించవచ్చు , కానీ నిజానికి వీటిని గుర్తించకపోవటం ఓపెన్ సోర్సు సాప్ట్వేర్ల అభివ్రుద్దికి ఆటంకమవుతుంది . కొన్ని సమయాల్లో ఫ్రీవేర్లు మరియూ షేర్ వేర్లు , adwareలు లేదా malwareలతో కూడి ఉంటాయి , వీటిని ఓపెన్ సోర్సులగా పొరపాటుపడే కంపెనీలు వీటి వైపు శ్రద్ద వహించవు , చివరకు ఎక్కువ కర్చులు చేస్తూ ఉంటాయి . సధారణ వాడుకరులు కూడా ఇలా మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదముంది , అలాగే షేర్ వేర్లను ఓపెన్ సోర్సులుగా బ్రమపడి సమయం వృదా చేసుకొనే ప్రమాదమూ ఉంది …
మీ టపాలతోనూ జాగ్రత్తగావుండాలండోయ్ . ఇప్పుడే చదువుతుంటే మా కొత్త కొలీగ్ " are you OK ? " అని అడిగివెళ్ళాడు . భలే ఇబ్బందొచ్చిపడింది .
వంగిన సంధ్యాకాశాన్నించి రంగులమాటల్ని తెంపుకుంటో చీలిపోయిన రహదారుల్ని చిరునవ్వుల్తో అతికిస్తో , వీధుల్లో మన అంగలతో విజయద్వారాల్ని సృష్టిస్తో , ఊరంతా తిరుగుతాం .
హైదరాబాద్ , జూలై 7 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు . కాంగ్రెస్ అధిష్ఠానం అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గం చూపిస్తుందని అనుకుంటున్నానని బొత్స బుధవారం విలేఖరుల సమావేశంలో అన్నారు . రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఎవరి మనోభావాలకు ఇబ్బంది కలిగించవద్దని తాను అన్ని ప్రాంతాల వారినీ అభ్యర్థిస్తున్నానని ఆయన తెలిపారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేయకపోవడం గురించి ప్రశ్నించగా , ' కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేస్తే పరిష్కారం లభిస్తుంది కదా ? ' అని అన్నారు . ఏదైనా మీరు సమస్యను జటిలం చేసే విధంగా ప్రశ్నలు వేయవద్దని , సలహాలు ఇవ్వాలని కోరుతున్నానని ఆయన తెలిపారు .
1859 వ సంవత్సరంలో మద్రాసు ( ప్రస్తుతం చెన్నై ) లో సంగీతానికి సంబంధించీ , " సంగీత సర్వార్థ సార సంగ్రహము " అనే ఒక పుస్తకం ప్రచురించారు . అందులో 20 పైగా త్యాగరాజ కృతులు ( స్వరాలు లేకుండా ) ప్రచురించారు . ఇందులో కూడా త్యాగరాజు పేరు మాత్రం ఉంది కానీ , ఆయన గురించి ఒక్క వాక్యమూ లేదు .
నావంటిరసికు డెందము కేవలముగ కరగజేసి కేరుచు మిగులన్ భావభవకేళి దాసుని కావించితి నీకు సాటి కా రేసానుల్
ఇలాంటి పరిసరాల్లో కాళిదాసు వెన్నెల్లో మేడలు కట్టాడు , మామిడిచెట్లు వేసాడు , దిగుడుబావి తవ్వించాడు , తన పరివారాన్ని తీసుకొచ్చి పెట్టాడు . వాళ్ళకి అలంకరణలు చేసాడు . పుష్కలంగా మదిర సరఫరా చేసాడు .
ఇంకో గంటలనో అరగంటలనో దాన్ని పాతి పెడుతున్నామన్న సంగతి ఇమామ్‌ను స్థిరంగా ఉండనీయడం లేదు . లేచి కూర్చున్నాడు , కూర్చోబుద్ధి కాలేదు . ఆందోళనగా లోపలికి వెళ్ళాడు . మక్క గటుకను నిలవ ఉంచే కుండలో చూశాడు . కుండ ఖాళీగా ఉంది . ఉట్టిమీది కుండలో మాత్రం అన్నం ఉంది . ఎలుగు తినే సత్తుపల్లెం కోసం చూశాడు . అది కనిపించలేదు . తాను తినే బొక్క ప్లేటులో రెండు అన్నం పెల్లల్ని పెట్టుకుని మంచం వద్దకు వచ్చాడు ఇమామ్ .
౨ । పెళ్ళికూతురు కావలెను : " ఆస్తి , చదువు , అందం కలిగిన ౨౭ సంవత్సరాల యువకునికి చక్కని వధువు కావలెను , కలము పట్టింపులు లేవు కానీ , టీ వీ సీరియల్లు చూడనివారై ఉండవలెను "
శ్రావ్య అయితే సెలవలని సంతోషపడినంత సేపుకూడా లేవన్నమాట . ఇదే టపా ని చాలామంది పెద్దవాళ్ళు రాసారు . అప్పట్లో మా మా అభిప్రాయాలు రాసాము . కానీ అనుభవిస్తున్న మీ నోటినుండి వింటుంటే మేము మరింత ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది . నిజమే తల్లిదండ్రుల పాత్ర వున్నా ఏమీ చేయలేని పరిస్థితి . అన్ని పాఠశాలలూ ఒకేలా వుంటే మాకు ఎంచుకోడానికి అవకాశం లేకుండా పోతుంది . పళ్ళూడగొట్టుకోవడానికి ఏరాయయినా ఒకటే కదా . కొంతలో కొంత ఆర్ ఎస్ ఎస్ వాళ్ళు నడిపే సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలు మంచివి . అంటే వీళ్ళు గొప్ప అని , బండెడు పుస్తకాలు ఇవ్వరని అనను గానీ , చదువులతోపాటూ ఆటలు , పాటలు , పద్యాలు మొదలయినవి " సదాచారం " పేరుతో నేర్పిస్తారు . మరి హైదరాబాదు వంటి పెద్ద నగరాలలో పరిస్థితి నాకు తెలియదు . ఎవరయినా తెలిస్తే చెప్పగలరు .
ఈ జాడ్యాలన్నింటి వలన లాభపడుతున్నది ఎవరూ ? నోకియా వారిది అగ్ర తాంబూలం … వారి విపణిలో నలభై శాతం ఇండియా లోనే అమ్ముతారంట . తరువాతి స్థానం మొబైలు సర్వీసు ప్రొవైడర్లది . వీళ్ళు కోట్లు ఆర్జిస్తున్నారు . ఒకొక్కరికి ఒక రేటు . బాగా జీతాలొచ్చే వాడికి తక్కువ బిల్లింగు … సెల్ వైపు చూడననుకునే వాడికి రకరకాల జీవిత ప్లానులతో మంగళ సెల్లు మెడకు కట్టెయ్యటం . తరువాత స్థానం టీవీలది . ప్రస్తుతం ఉన్న అతి చెత్త మీడియా ఇదే . పత్రికలలా లేఖలు రాయనివ్వరు , ఈమెయిల్లు ఉండవు . ఏది చెప్పాలన్నా అది SMS మాత్రమే చెయ్యాలి . ఈ SMS ల బిజినెస్ సామాన్య మానవుడుకి ఇంకా అర్ధం కావటం లేదు . అయితే గుండెలు బాదుకుంటాదు . కౌన్ బనేగా కరోడ్ పతి లాంటి కార్యక్రమాలలో విజేతకు ఇచ్చే కోటి రూపాయలు టీవీ వారికి ఒక్క నెలలో SMS ల ద్వారానే వచ్చేస్తాయి . మిగిలినదంతా మనం అమితాబు , షారుక్ ల కోసం ధార పోస్తామన్న మాట .
తలకోన అడవుల్లో కోతుల గుంపు సమావేశమయింది . అవి రెండు వర్గాలు గా చీలిపోయాయి . ఒకటి స్థానిక కోతులగుంపు ఇంకోటి తిరుమల కాందిశీకుల గుంపు . స్థా . కో . గుంపు తి . కాం . గుంపు ని తిడుతున్నాయి . " మీరు రాక ముందు మాకు ఇక్కడ అన్నీ చక్కగా దొరికేవి వున్నంతలో హాయిగా తిని తల్లో పేన్లు ( పేలు ) చూసుకుంటూ చెట్లకు వేలాడు కుంటుండేవాళ్ళం . మీరొచ్చిన తరువాతే మాకు మేత దొరకడం కష్టమయిపోయింది " తి . కో . గుంపు వాటికి సమాధాన మిస్తూ " మేము మీలాగా ఏది దొరికితే అది తినే టైపు కాదు . భక్తులు ఎక్కడెక్కడినుండో తెచ్చిన అరటి పళ్ళు , పులిహోర పట్లాలు , దద్ధోజనాలు తిని ఆరొగ్యంగా పిల్లా పాపలతో కాపురం చేసుకునే వారసులకు చెందిన వాళ్ళం . మేము చాలా నాగరికంగా బతికేవాళ్ళం . మీలా ఎక్కడ పడితే అక్కడ నిద్దర పోయే టైపు కాదు " " చాలు చాల్లే సంబడం . ఎక్కడినుండో వచ్చి ఇక్కడ సెటిలయింది చాలక మళ్ళీ మా బతుకులు మంచివి కావి అంటారా ? ముందు మిమ్మల్నిక్కడినుండి తరిమేస్తే కానీ మీకు బుద్ధి రాదు " . అంతలో తి . కా . గుంపు లోనుండి బాగ వయసు పైబడ్డ ముసలి కోతి రెండు పిల్ల కోతుల సాయంతో లేచి నిలబడి " ఆగండర్రా , మీరు కూడా ఇలా మనుషుళ్ళా పోట్లాడేసుకుంటే ఎలా ? మనం మనిషిగా రూపాంతరం చెందే వయసు అప్పుడే వచ్చినట్టు ఇలా మాట్లాడు కోవడం ఏమీ బాగోలేదు . " స్థా . కో . గుంపు లో మాంచి పొగరు మీదున్న యువ కోతి మాట్లాడుతూ " ఏయ్ ! ముసలి కోతి నీకు తిరుపతి కొండ మీద తిన్న లడ్లూ , వడలూ ఇంకా అరిగినట్లు లేదు . మాకు నీతులు భోధిస్తావా ? చూడు నిన్నేం చేస్తానో " అని మీదికి రాబోయింది . తాతల కాలం లో తి . కాం . కో . గుంపు తో సంబంధాలు కలిసి వున్న స్థా . కో . గుంపు లోని ముసలి కోతి " ఆగవే పిల్ల కోతీ , మనుషుల్లా మాట్లాడక కాస్త కోతిలా ప్రవర్తించు " అని గదమాయించింది . పోగరు కోతి కాస్త చల్ల బడింది . తిరుమల నుండి వచ్చిన ముసలి కోతి చెప్పనారంభించింది . " ఇరవై సంవత్సరాల క్రితం . . మేము ఇక్కడికెందుకు వచ్చామో ఏలా రాబడ్డామో వివరిస్తా . కాస్త ఓపిక తెచ్చుకుని వినండి . అప్పుడు నాకు ఒక సంవత్సరం వయసనుకుంటా . . . . . . " * * * * * * * * * * * * * * * * తిరుమలలో వున్న 8 రేకుల షెడ్డు క్యూ కాంప్లెక్సులన్నీ వచ్చిన భక్తులతో కిట కిట లాడుతున్నాయి . అసలే ఎండా కాలం . చంటి పిల్లలు వేడికి తాళ లేక ఏడుస్తుంటే తల్లులు తమ చీర కొంగులే విసన కర్రలుగా చేసి విసురు తున్నారు . గుండు కొట్టించుకున్న కొంత మంది తండ్రులు తలకు చుట్టుకున్న తువ్వాళ్ళు తీసి పిల్లలకు , పెళ్ళాలకు విసనకర్ర లా వీస్తూ అప్పుడప్పుడూ చెమట పట్టిన గుండు తుడుచుకుంటున్నారు . షెడ్లన్నీ అరుపులు కేకలతో గుయ్యిమని శబ్దం చేస్తున్నాయి . ఒక షెడ్లోని గేటు తియ్యగానే మిగతా షెడ్లోని జనాలు ఆదరా బాదరగా లేచి బుడ్డోళ్ళని భుజాల మీదకి ఎత్తుకొని పరుగులు పెట్టడానికి తయారవుతున్నారు . అప్పుడే చెవులు కుట్టించుకున్న బుడిగిలు కాస్తా భే . . . అంటూ ఏడుపులంఖించు కుంటున్నారు . అప్పటి వరకు షెడ్లోని పై కప్పులకే పరిమిత మయిన కోతుల గుంపులోని ఒక కోతి ఇదే సందుగా భావించి ఆ కదులుతున్న జనాల మీదకు పడి ఒక పల్లెటూరాయన చేతిలోని తువ్వాలు తీసుకుని పైకెగిరి ఆ ఇనుప కమ్మీల మీద కూచుంది . ఆ పల్లెటూరాయన తిట్లు అందుకున్నాడు " థూ . . నీయవ్వ . . ఈ కోతులు . . నిన్నేసేస్తా " అని స్థంభం పట్టుకుని ఎక్క బోయాడు . అంతలో ఓ పెద్దావిడ అడ్డమొచ్చి " చూణ్ణాయనా , నువ్వు దాన్ని పట్టుకోలేవు గానీ , నీ సేతిలో వుండే అరిటి కాయిని దాని మిందకు ఇసిరెయ్ అబ్బుడు ఆ కోతి నీ టవలు కింద పడేస్తుంది " అని చెప్పింది . ఇదేం కిటుకు రా అని ఆ పల్లె టూరాయన చుట్టు పక్కల వున్న షెడ్లు చూశాడు . కొన్ని కోతుల చేతిలో టోపీలు , ఇంకొన్ని కోతుల చేతిలో టవళ్ళు , ఇంకొన్ని కోతుల దగ్గర విసన కర్రలు . పెద్దామె చెప్పింది కదా అని చేతిలో అరటి పండు ఆ కోతి మీదకు వెయ్యగానే టక్కున అరటి పండు పట్టుకొని టవల్ కింద పడేసింది . గుండు కనిపిస్తే కనిపిస్తుందిలెమ్మని ఆ టవల్ ని నడుముకు చుట్టుకున్నాడు ఈ సారి . అరటి పండు తిన్న వెంటనే వేరే బకరా కోసం ఇంకో షెడ్లోకి వెళ్ళి పోయింది ఏడాది వయస్సున్న ఆ కోతి . ఏమాటకామాటే చెప్పుకోవాలి . ఇలాంటి ఎక్స్చెంజ్ ఆఫర్లో నిజాయితీని చూసి కిడ్నాపర్లు ఎంతో నేర్చుకోవాలి . అలా రోజూ భక్తుల దగ్గర నుండి ఏదో ఒకటి కిడ్నాప్ చేసి దానికి ప్రతిగా తమ పొట్ట ( పొట్ట నిండాక దవడ దగ్గర స్టోర్ చేసుకునే సదుపాయం కూడా ) నింపుకుని దిన దిన ప్రవర్ధమానం చెందుతున్న కోతుల బెడదని అరికట్టాలని తి . తి . దే . పాలక వర్గం నిర్ణయించింది . కొత్త క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందే ఈ కోతులని తరిమేస్తే భక్తులకు సౌకర్యంగా ( ? ? ? ) వుంటుందని కోతులను పట్టే వాళ్ళను తీసుకు వచ్చారు . వాళ్ళు దొరికిన కోతిని దొరికినట్లు వ్యాన్లలో కుక్కేసి తిరుపతి చుట్టుపక్కల నున్న తల కోన , పెంచల కోన , భాకరాపేట అడవుల్లో వదిలేసి వచ్చారు . * * * * * * * * * * * * * * * * " అలా నన్నూ ఓ వ్యాన్లో కుక్కేసి ఇక్కడికి తీసుకు వచ్చి పడేశారు . ఇప్పుడు మీరు కూడా మమ్మల్ని వెళ్ళి పోమంటే మేమెక్కడికెళ్తాం . " అని కంట తడి పెట్టుకుంది . " భక్తులకు అసౌకర్య మౌతుందని మిమ్మల్ని ఇక్కడి పంపించేశారు కదా . మీరు ఇప్పుడూ ఆ వేంకటేశ్వర స్వామి దగ్గరకెళ్ళి మీరు ఇక్కడికి వచ్చినందుకు మాకు అసౌకర్యంగా వుందని చెప్పి ఏదయినా ఉపాయముంటే ఆయన్నే సెలవివ్వమని అడగండి " అని తీర్మానించింది స్థా . కో . గుంపు . ఇక చేసేదేమీ లేక ఆ ముసలి కోతి ఇంకో మూడు కోతులను వెంట బెట్టుకుని వేంకటేశ్వర స్వామిని కలుద్దామని తిరుమల చేరుకుంది . క్యూ లైన్ననీ ఖాళీగా కనిపించాయి . అక్కడ గుడి ప్రాకారం తప్ప ఇంకేమీ గుర్తు పట్టలేక పోయింది . పెద్ద పెద్ద క్యూ కాంప్లెక్సులు , కొత్త కాటేజీలు ఎక్కడికో మారిపోయిన కళ్యాణ కట్ట , అందులో ఆడ క్షురకులు , కనిపించని వేయి స్థంభాల మంటపం ఇవన్నీ చూసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి . తను చిన్నప్పుడు పరుగులు పెట్టిన రేకుల షెడ్డు లాంటిది ఒకటి కోనేటి దగ్గర కనిపించగానే కళ్ళ వెంబడి నీళ్ళు జల జల రాలాయి . ఆపసోపాలు పడుతూ ఎలాగోలా ఆ షెడ్డులో కి దూరింది . పాత ఆనవాళ్ళేమీ లేవు ఇప్పుడక్కడ . అలా అంతా పరికించి చూస్తుంటే షెడ్డు లోనుండి విమాన వేంకటేశ్వర స్వామి కనిపించగానే చేతులెత్తి దండం పెట్టింది . అంతలో కింద ఎదో కల కలం మొదలయిందని చూస్తే తి . తి . దే . పని చేసే వాళ్ళు ఈ కోతుల వైపు చూస్తూ ఏదో అరుస్తున్నారు . అప్పుడర్థమయింది తమని తరమడానికి వెంట పడుతున్నారని . మిగతా మూడు కోతులతో కలిసి షెడ్డు పైకప్పు మీదకు ఎక్కి గుడి మహాద్వారం దగ్గర నున్న సహస్ర దీపారాధన భవనం వెనక నక్కి కూచున్నాయి . మళ్ళీ ఏదో అలికిడి అయితే లేచి చూసింది . ఈ సారి తమని తరమట్లేదు , పోలీసులు గుడి ముందున్న జనాలని లాఠీ చార్జ్ చేసి నెట్టి వేస్తున్నారు . గుడి ముందు లాఠీ చార్జేమిటి అని అలోచిస్తూ వుండగా గమనించింది . అభిషేక్ బచ్చన్ , తన సతీమణి ఐశ్వర బచ్చన్ , అమితాబ్ బచ్చన్ , అనిల్ అంబాని , అమర్ సింగ్ అందరూ మహాద్వారం గుండా లోపలికెళ్తున్నారు . క్యూ లైన్లన్నీ ఖాళీగ వుండటానికి కారణం అప్పుడర్థమయింది మన అన్న ఎన్టీయార్ వున్నప్పుడు ముఖ్యమంత్రి , ప్రధాన మంత్రి , రాష్ట్రపతి , గవర్నర్ తప్ప ఎవ్వరూ నేరుగా గుడిలోకి వెళ్ళ కూడదని శాశనం చేశాడు కానీ ఎవ్వరూ పాటించడం లేదు అనుకుంది . ఓ రెండు గంటలయి పోయాక వాళ్ళు చేతులూపుకుంటూ బయటికి వచ్చి వెళ్ళి పోయారు . పగలు వెళితే ఎవరైనా చూస్తారు అని రాత్రి వెళ్ళి దేవుణ్ణి కలుద్దాం అని నిర్ణయించాయి నాలుగు కోతులు కలిసి . అది కూడా గుడీ తలుపులు మూసి వేశాక అని అనుకున్నాయి . రాత్రి ఒంటి గంటప్పుడు చప్పుడు చేయకుండా గుడి ప్రాకారాన్ని దాటి గర్భ గుడిలోకి ప్రవేశిస్తూ వుండగా ఏవో మాటలు వినిపిస్తే బయటే ఆగి పోయాయి . " అదేమిటి స్వామీ మీ భక్తులకు అంతగా ఇబ్బంది కలుగచేస్తూ ఈ ముఖానికి రంగు వేసుకునే వాళ్ళకు గంటలకు గంటలు దర్శనమిస్తున్నారు . ఆ సమయాన్ని ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి మీ దర్శనానికొచ్చిన సామాన్య భక్తులకు కేటాయించొచ్చు కదా ? " అడుగుతోంది పద్మావతీ దేవి . " ఏం చెయ్యమంటావు దేవీ , వీళ్ళు రావడానికి ఓ వారం రోజుల ముందే అనిల్ అంబానీ , అమర్ సింగ్ వాళ్ళ వాళ్ళు వచ్చి నా హుండీ తలో 51 లక్షలు వేశారు " సమాధాన మిస్తున్నాడు శ్రీ వేంకటేశ్వర స్వామి . " అంటే డబ్బులు ఇచ్చిన వారి పక్షమా మీరు ? " " అలా కొప్పడకు దేవీ నీకు తెలుసు కదా మన పెళ్ళికి డబ్బెంత ఖర్చయిందో " " వాళ్ళు డబ్బులిస్తే మిగతా వాళ్ళను అలా పడిగాపులు కాయిస్తారా ? " " ఆ . . ఆ . . అలా కాదు సామాన్య భక్తులు వేచి వుండటం లో ఆనందముందని భావిస్తారు . అందుకే వాళ్ళకు ఇంకొంత ఆనందాని ప్రసాదిస్తున్నాను . " " ఇలా చేస్తున్నందుకు మీకు అపవాదు లొస్తాయని తెలీదా నాదా ? " " అపవాదులు నాకు కాదు . ఈ పాలక మండలి వాళ్ళకి . అప్పుడే ఒక విచారణ కమిటీ కూడా వేశారు ఎందుకు అలా ఒక గంట సేపు సమయాన్ని వాళ్ళకు ఇచ్చావు అని . ఇప్పుడు ఇందులో పాలు పంచుకున్న వాళ్ళందరిని కాపాడటం కూడా నా బాధ్యతే " . " అంటే మీరు సామాన్యుల మొర ఆలకించరా ? " " ఆలకిస్తాను కానీ . . . . . " ఇవన్నీ బయటి నుండి విన్న పండు కోతికి అర్థమయి పోయింది తన విన్నపాలు ఆలకించే స్థితిలో స్వామి లేడని . తన తిప్పలేవో తనే పడుకోవాలి అని మిగతా కోతులతో కలిసి తిరుగు ప్రయాణ మయింది తలకోన అడవులకు .
ఐదు మ్యాచ్‌ల వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లో మొదటి ఎండు మ్యాచ్‌లను గెల్చుకున్న టీమిండియా శనివారం ఇక్కడ జరిగే మూడో వనే్డలోనూ విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్‌ను నమోదు చేయడంపైనే గురిపెట్టింది . రెగ్యులర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతోపాటు సచిన్ తెండూల్కర్ , వీరేందర్ సెవాగ్ , యువరాజ్ సింగ్ , జహీర్ ఖాన్
" వాడు వద్దనా ఉండ . ఉండుమన్నా ఉండ . ఇయ్యల్ల పెండ అమ్మమన్నడు . రేపు రోత తినుమంటడు . పాపపు ముండకొడుకు . " తెగాయింపుగా అన్నాడు ధర్మయ్య .
పై మొదటి అన్నోన్ ! అప్పటి పరిస్థితుల్లో , ఈనాడు " మద్య " ( మొన్నెవరో పాడుతా తీయగాలో " మధ్య " అని పాడదానికి " మద్య " అనిపాడుతుంటే సవరించాడు బాలు ) నిషేధానికి త్రికరణ శుధ్ధిగా కృషి చేసింది . నిషేధింపచేసింది - - ఎన్‌టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యగానే - - ఆయన ఆ ఫైలు మీద " మొదటి " సంతకం చెయ్యడం ద్వారా ! వొళ్లు బలిసినవాళ్లకీ , అది నిత్యావసర వస్తువైన వాళ్లకీ మద్యాన్ని సరఫరా చెయ్యడం ఓ వ్యాపార నీతి . అప్పటి ప్రభుత్వం ( అంటే " సర్వాధికారులూ " ) నిర్ణయించిన " పోలసీ " ప్రకారమే అవి జరిగాయి . దయచేసి " తేడాలు " తెలుసుకోండి . ధన్యవాదాలు .
ఎంతటి ఘోర అపరాధం చేసినప్పటికిన్నీ స్త్రీలని థర్డ్ డిగ్రీ పద్ధతుల్లో హింసించడం పనికిరాదు . చంపడమైతే పూర్తిగా నిషిద్ధం . తప్పు చేస్తే సందర్భోచితంగా కొంచెం దండించడమూ , పనిగట్టుకుని క్రూరంగా హింసించడమూ - ఈ రెండూ ఒకటి కావు . పురుషుల్లో ఉన్నట్లే స్త్రీలలో కూడా సంస్కారరీత్యా ఉత్తమ , మధ్యమ , అధమ శ్రేణులు ఉన్న మాట నిజమే . కొన్నిసార్లు పురుషులు కూడా చెయ్యడానికి ఇష్టపడని నేరాలకి కొందఱు స్త్రీలు అలవోకగా పాల్పడతారనేదీ నిజమే . అయినా వారు భౌతికంగా హింసించబడ్డానికి తగిన జాతి కాదు . పురుషులతో పోలిస్తే భౌతికంగా వారి శరీరాల్లో అన్నీ తక్కువే . అందుచేత వారి శక్తికి మించిన శిక్షల్ని వారికి విధించకూడదు . ఇలా అన్నాం కదా అని ఆడవాళ్ళని హింసించడానికి ఆడవాళ్ళనే నియమించడాన్ని ఈరోజుల్లో గమనించవచ్చు . కాని ఇక్కడ ధర్మసూత్రమేంటంటే , మగవాళ్ళే కాదు , ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళని హింసించకూడదు . అలానే , స్త్రీలు పురుషుల్ని హింసించడం కూడా నిషిద్ధమే . పురుష హింస పరమాత్మని హింసించడంతో సమానం కనుక వారు మరుజన్మలో తమ భర్తల చేతుల్లో దారుణ హింసకి - కొండొకచో హత్యకి సైతం గురవుతారు . కాబట్టి స్త్రీపురుషులు ఒండొరుల పట్ల పాటించాల్సిన లోక మర్యాదల్ని , లింగ మర్యాదల్నీ ( gender protocols ) తు . చ . తప్పకుండా పాటించడమే వారికి కాలక్రమంలో మంచిది . శత్రురాజ్యాల స్త్రీల పట్ల దయగా వ్యవహరించవలసిందంటూ రాయచూరు యుద్ధానికి ముందు శ్రీకృష్ణదేవరాయలు తన సైన్యాలకిచ్చిన ఉపన్యాసాన్ని ఇక్కడ స్మరించాలి . స్త్రీహింస , స్త్రీహత్య మహాపాపాలు . వాటికి క్షమాపణ గాని ప్రాయశ్చిత్తం గాని ధర్మశాస్త్రాల్లో చెప్పబడలేదు . వాటికి పాల్పడే వారికి తక్షణ నరకమూ , పిశాచ , బ్రహ్మరాక్షస జన్మలే తప్ప పుట్టగతులుండవు . స్త్రీలు దేవుడి ఎస్టేట్ లు . వాళ్ళు ఆయన వర్క్ షాపులు . తాను పండించదల్చుకున్నవీ , నిర్మించదల్చుకున్నవీ ఆయన అక్కడే చేస్తూంటాడు . కనుక స్త్రీతత్త్వం మీద దాడులు చేసేవారిని ప్రకృతి క్షమించడం జఱగదు . ఆ కారణం చేత వారు మళ్ళీ జన్మించడానికి స్త్రీగర్భాలు దొఱక్కుండా చెయ్యడం ఆవిడ లీల . దీనికే సాంప్రదాయిక పరిభాషలో పుట్టగతులు లేకపోవడం అని పేరు . లోకవ్యవహారంలో చూస్తే , ఎక్కువ శాతం స్త్రీలు పురుషుల మీద ఆధారపడే జాతి ( dependent sex ) . వారి బాధ్యత పురుషులకు తప్పించుకోరానిది . అందుచేత తమ చెప్పుచేతల్లో , అదుపాజ్ఞలలో ఉండే స్త్రీజాతి పట్ల పురుషులు దయగా , నాగరికంగా వ్యవహరించడం , వారిని తమ నమ్మిన బంట్లుగా , విధేయురాళ్ళుగా చేసుకోవడం తమకే శ్రేయస్కరం . స్త్రీల పట్ల దయ చూపించడం మహాపురుష లక్షణం . వారిలో అభద్రతా భావాన్ని కలిగిస్తే అది " స్త్రీ బుద్ధిః ప్రళయాంతకః " అన్నట్లు పరిణమించి అనేక వికృత సంఘటనలకి దారితీస్తుంది . చర్యకి ప్రతిచర్య ప్రకృతి సూత్రం కనుక స్త్రీల పట్ల కటువైన ధోరణి అవలంబిస్తే క్రమంగా వారిలోని సౌకుమార్యం దెబ్బదింటుంది . అందుచేత స్త్రీల మీద ఎక్కువ భారాలు మోపకుండా , వారిని మఱీ ఎక్కువగా బయటి ప్రపంచపు మొఱటుదనానికి గుఱి చెయ్యకుండా సంరక్షించుకోవలసిందని పూర్వీకులు సూచించారు . పూర్వకాలపు మగవాళ్ళు కూడా ఆ అనుదేశానుసారం నడుచుకుంటూ , తమ బయటి జీవితపు కశ్మలాల్ని గుమ్మం దగ్గరే వదిలేసి లోపలికి వచ్చేవారు . ఆ వాసనలు ఇంట్లోని ఆడవాళ్ళకి సోకకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు . మఱి ఒక స్త్రీ అదుపాజ్ఞలలో ఉన్న ప్రభుత్వం ఆ స్త్రీ ఆదేశాల మీద ఇంకొక స్త్రీని ఉగ్రవాద ఆరోపణల మీద నిర్బంధించి , బట్టలూడదీసి , తలకిందులుగా వ్రేలాడదీసి చావగొట్టించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ? ఇది ఈ దేశపు తరతరాల సంప్రదాయానికి అనుగుణంగా లేదే ! అయినా మన పిచ్చి గాని ఇటాలియన్ స్త్రీలకి హిందూస్త్రీల మర్యాద నిలపడం అంత ముఖ్యమైన విషయమా ? అయితే ఈ దురంతానికి వ్యతిరేకంగా దేశం మొత్తం మీద ఒక్క ఫెమినిస్టు కూడా నోరెత్తకపోవడానికీ , " ఇది అన్యాయం , అక్రమం " అని ఎలుగెత్తడానికీ ముందుకు రావడం లేదేం ? ఆ రాజ్యహింసా బాధితురాలు అందఱిలాంటి స్త్రీ కాదా ? లేదా వీళ్ళు స్త్రీలు కారా ? లేదా ఆమెకి అండగా నిలబడితే సదరు ఇటాలియన్ స్త్రీ తమని కూడా బట్టలూడదీసి తలకిందులుగా వేళ్ళాడదీసి చావగొట్టిస్తుందని భయమా ? మఱి ప్రతివిషయానికీ మగజాతి మీద ఒంటికాలిపై లేచే ఈ ఫెమినిస్టులు ఇప్పుడు భయపడుతున్నది ఎవరికి ? మగవాడికా ? ఆడదానికా ? ధన - రాజకీయ - అధికారానికా ? మగతనానికా ? ఏదేమైనా , సమానత్వం పేరుతోనో , నేర విచారణల పేరుతోనో పురుషుల్ని పురుషులు హింసించినట్లుగానే అనుమానిత స్త్రీలని కూడా అదే స్థాయిలో హింసించడాన్ని అందఱమూ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించక తప్పదు .
2011 వ సంవత్సరం మీకూ , మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ , జయప్రదంగానూ , ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను .
" ఆగండాగండ్సార్ . . జనాలు నవ్వినా చూస్తారు . ద్రౌపది నవ్విందనేకదా దుర్యోదనుడు అంత ఫీలయింది . ఇదీ అంతే . ఇకపోతే హీరో లైఫ్ అంతా అనకాపల్లి సైడే , కాకపోతే మధ్యలో ఓ రెండేళ్ళు వీడు ఏదో పొడుస్తాడని పల్నాడులో ఇంటర్ రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పిస్తారు వాడి అమ్మానాన్నలు . ఆ తాలూకు ఎఫెక్ట్ ఆ నలగామరాజు / బ్రహ్మనాయుడు డైలాగులు సార్ . అయినా అసలు నా ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం హీరో , విలన్లు కారణం లేకుండా కొట్టుకు చస్తార్సార్ . ఏదో మీరు మరీ ఫీలవుతారని ఈ సీన్ కలిపా . అదీకాక మనం జనాలకి ఓ మంచి సందేశం కూడా ఇచ్చినట్లే … రోడ్డు మీద ఎవడన్నా చెత్త పారేస్తే వాడికి పిండం గ్యారంటీ అని "
చాలా చక్కని వ్యాసం . నిజంగా భాషాశాస్త్రాన్ని గురించి ఇంత చక్కగా వివరించిన వారిని ఇంతవరుకు చూడలేదు . ధన్యవాదాలు . స్వరూప్ కృష్ణ
జ్వాలాతోరణంలో , " ప్రదీప్తి కీలా ప్రవాళ మాలా ప్రపంచ వేలా ప్రసారములలో మిహిరవాజితతి ! మఖవధనుర్ద్యుతి . . " అని .
Beautiful మురళి గారు . . ఎలా దొరుకుతాయండీ మీకు అలాంటి పదాలు , వాక్యాలూ ? మనసులో మాటాడుకునేవన్నీ ఇలా బయటపెట్టేస్తే ఎలా చెప్పండీ . . ? : )
అనుకున్న ప్రకారం నెక్లస్ రోడ్ లో జరుగుతున్న పుస్తక ప్రదర్శన లో సాయంత్రం 6 గంటలకి మిగతా బ్లాగ్ మిత్రులు కలుస్తారన్న ఉద్దేశం తో వెళ్ళా . నే వెళ్ళేటప్పటికే దుర్వాసుల గారు , తాడేపల్లి , శ్రీధర్ , వివేన్ ఇతర మిత్రులు స్టేజి మీద ప్రదర్శనకి సిద్దమవుతూ కని పించారు . ఒక పది కుర్చీలు మాత్రమే వున్నాయి స్టేజి కి ముందు . వచ్చిన బ్లాగేర్స్ ముందు గా ఈ తెలుగు స్టాల్ కి వెళ్ళడం చేత అందరికి ఈ తెలుగు రిబ్బోన్ badge పెట్టడం జరిగింది . అందువల్ల బ్లాగర్స్ ఎవరో కని పెట్టడం సులభం అయ్యి వారిని పరిచయం చేసుకోవడం సులభమయ్యిన్డి . అలా అక్కడ కొత్త గా పరిచయమయిన బ్లాగర్స్ రమణి , వాళ్ళ అక్క వేద , నేను లక్ష్మి , పూర్ణిమ . వీళ్ళు కాక మిగతా బ్లాగేర్స్ అరుణ , జ్యోతి , కత్తి , అనిల్ , కశ్యప్ . కుర్చీలు ఎక్కువ లేకనో , ఆ సమయం లో జనం పల్చగా వుండడం చేతనో ఆశించినంత మంది తిలకించ లేదేమో అని పించింది . ప్రెస్ బానే వచ్చారు . మరి coverage సంగతి రేపే తెలుస్తుంది . కానీ కంప్యూటర్ లో తెలుగు వాడె విధానం బ్లాగ్స్ ఎలా సృష్టించాలి వంటి విషయాలు డిస్ప్లే చేస్తూ చూపడం జరిగింది . ఆశించినంత స్పందన లేక పాయినా కంప్యూటర్ లో తెలుగు వాడకం దిశగా కొన్ని అడుగులు పడ్డాయని చేపోచ్చు . స్టాల్ దగ్గర కూడా జనాలుఈనాడు tv9 కి మద్యన sandwich అయి నలిగిన మన స్టాల్ ని ఒక సారి తల పంకించి ముందుకు సాగి పోతున్నారు . నది దూసుకు పోతున్న నావను ఆపండి రేవు బావురు మంటోందని నావకు చెప్పండి అంటు ముత్యాల ముగ్గు లో నిదురించే తోటలోకి పాట గట్టి గా పాడాలని పించింది . కానీ స్టాల్ అంతా బ్లాగేర్స్ తో నిండి సందడి గా అనిపించింది . పూర్ణిమ , తాడేపల్లి గారు తమ కెమెరాల్లో భందించిన ఆ మధుర క్షణాల్ని మనకోసం బ్లాగ్ లో పెడతారని , అది చూసి మరింత మంది బ్లాగేర్స్ కలుస్తారని తమ తెలుగు రచనలతో వెలుగులు నింపుతారని ఆశిస్తూ పదండి ముందుకు పదండి తోసుకు .
సుజాత గారు , భారతీయ కుటుంబ వ్యవస్థపై మీకున్న గౌరవానికి చాలా సంతోషంగా ఉంది . నా ఉద్దేశ్యం కూడా ఇదే . నా అభిప్రాయంలో నాకు ఇలాంటి మల్టిపుల్ రిలేషన్స్ అంటేనే చికాకు . అలాంటిది వీళ్ళు అదేదో పెద్ద గొప్పగా నాకు ఇంతకు మ్రుందు ఇద్దరు పెళ్ళాలు ఇప్పుడు నలుగురు పిల్లలు ఒకరు మొదటి భార్యకు పుడితే ఒకరు ఇప్పుడున్న భార్యకు పుట్టగా మరొకరు ఇప్పుడున్న భార్యకి మొదటి మొగుడుకి పుట్టిన వాడైతే ఆఖరి వాడు మొదటి భార్య మొదటి మొగుడు సంతానం అని చెబుతుంటే కంపరం పుడుతుంది . ఏది ఏమైనా స్పందించినందులకు నెనరులు
చాలా వివరంగా అర్ధమయేల్లా చెప్తున్నారండీ . నేనింకా ఇవన్నీ సినిమా వాళ్ళ పైత్యపు కబుర్లనుకున్నా . కానీ ఇవన్నీ నిజాలని తెలిస్తే చాలా జాలిగా వుంది . I am ashamed of my ignorance ! ఇదే విషయాన్ని కసి అని ఇంకో సీరియాల్ లో రాస్తున్నారొక బ్లాగరి . ఇక మీద పరిస్థితులు మార్చేందుకు , ఇలాటి అమాయకుల్ని ఫాక్షన్ లీడర్ల బారి నించి రక్షించేందుకు ఏమి చేయాలంటారు ? శారద
మహిందర కిందటాదివారం పరిచిన జంబకానాలు అలాగే వున్నాయి . బచ్చానాకొళ్ళు ఒక్కొక్కలే పుస్తకాలు ఇస్తిరాకుల్లాగ ముందరేస్సుకోని బోయనాలకి బంతిస్తళ్ళు కూకున్నట్టు కూకుంటే నీను కుమారీ దుక్కు నాగలష్మీ దుక్కు సూసి టూటీఫూటి పుల్లతోటి తాగినట్టిగ ఏక్సన్ చేస్తుంటే ఆలు కిసకిసామనీసి నవ్వుతుంటె . సిమింటుబస్తాలు పోగా మీఁవు కూకోగా ఉన్న ఈరికముక్కలోనే మేడం తెల్ల ప్లాష్టిక్కుర్చీలోన కూలబడిపోయి , ఫేనేయించుకోని కూడా పంజాబీడ్రెస్స వోనీతోటి ఇసురుకుంటంది ' ఇస్సో ' మని . " ఏంటఱ్ఱా . . ? ఏంటి ఫన్నీగా వున్నానా ? ఎందుకే నవ్వుతున్నారూ . . ? " అనీసి సిలకలాగ తియ్యట తియ్యట మాటలు మాటాడుతుంటే ఆపగాడు , బేకోజి , సిరీషా గుంట్నాకొళ్ళందరు కిసకిసకిసాలమనీసి నవ్వుల్నవ్వుల్నవ్వులే . ఆపగాడు ఉట్టుట్టికె పల్లకోలేక " మేడం వీల్లకి టూటీఫ్రూటీ కావాలంట మేడం ! " అన్నాడు పెద్ద పోటుగాణ్ణాగ . విల్లా నెంబర సిక్సోల బాబుకి భర్తడే పార్టీ చేసిన్రోజు సుడాల ఆపనాకొడుకు కుక్కుకోని కుక్కుకోని ఎన్ని కేకుముక్కలు తిన్నాడో , సెక్రూరిటీవోలు సూడకుంట కడుపుబ్బరించుకోని ఎన్ని కోకులు తాగేడో !
అవును ఆ కాలం చెత్తగా ఉంటుంది . ఈ వయసులోనూ తన శరీర దారుఢ్యాన్ని కాపాడుకుంటున్నందుకు మాత్రం మెచ్చుకోవాలి . రాజుల కొలువుమీద ఏదో పద్యం ఉంది - అది గుర్తుంచుకుని మెలగాలి పెద్దవాళ్ల వద్ద పనిచేసేప్పుడు .
సూర్యుడు గారు , ముందుగా మీ తల తిరగడానికి కారణమైనందుకు నన్ను క్షమించండి , ఇది కావాలని చేసింది కాదు : - ) అయినా సంయమనంతో ప్రశ్నలు వేసినందుకు ధన్యవాదాలు . " నాకైతే " తమిళులైనా , ఆంధ్రులైనా , కన్నడిగులైనా , మొదట భారతీయులు . " అని చదవంగానే తమిళనాడు , ఆంధ్రప్రదేశ్ మరియు కర్నాటక ప్రజలు అని అర్ధమయ్యింది . నా ఉద్దేశ్యం రవి గారు అలా అనుకుని వ్రాసారని , నేను తప్పుగా అనుకొని ఉండొచ్చు . " రవిగారి అభిప్రాయం స్పష్టమయ్యిందనుకుంటాను . తమిళనాడులో ఉన్న ప్రజలు మాత్రమే తమిళులు కాదు . తమిళభాష మాట్లాడేవాళ్ళు తమిళులు . " భారత దేశం ఏ ప్రాతిపదికిన ఏర్పాటయ్యింది ? " భారత దేశం కేవలం రాజకీయ వెసలుబాటు కోసం , రాజకీయ అంగీకారం ప్రకారం , భౌగోళికంగా నిర్దేశింపబడి ఏర్పాటయ్యింది . " భారత దేశ భావననే ప్రశ్నిస్తున్నారని నా ఉద్దేశ్యం , పొరపాటు పడిండొచ్చు ; ) " భారత దేశ పౌరుడిగా , ఈ దేశ రాజ్యాంగం పట్ల గౌరవం బాధ్యతా నాకున్నాయి . అంతే , అంతకుమించి మరొకటి లేదు . మరేదైనా ఉంది అనుకుంటే అది మిథ్యే నని నా సొంత అనుభవం ద్వారా తెలిసింది . తార్కికంగా జాగ్రత్తగా ఆలోచించినా ఇది నిజమని గ్రహించవచ్చు . " అంటే మీ ఉద్దేశ్యంలో ఎల్‌టిటిఇ కి వచ్చే ధనమంతా తెల్ల ధనమంటారు ? " నేను అలా అనలేదు . రవిగారు చెప్పిన విషయానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని మాత్రమే అడిగాను . " ఇది మరీ విచిత్రం . ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం చదువులకి వస్తున్న ( సాఫ్ట్‌వేర్ ) ఉద్యోగాలు మన రాజకీయనాయకులు వల్ల వచ్చినవా ? విదేశాల్లో మొదలైన ఇంటర్నెట్ ఆధారిత వాణిజ్యం ప్రభుత్వాలు , అక్కడ రాజకీయనాయకులు తీసుకొచ్చారా ? " దీనిగురించి నా తెలుగువీరలేవరా బ్లాగులోని టపాని చదవండి . " మనిషి మనుగడకి భాష అవసరమా ? లేక భాష మనుగడకోసం మనిషి బ్రతకాలా ? " " మనుషుల " మనుగడకి భాష అవసరం . అందికే భాష మనుగడకోసం మనిషి ప్రయత్నించాలి . " మీరు ఎల్‌టిటిఇ ని సమర్ధిస్తూ మాట్లాడడం అసలు మింగుడు పడలేదు , అయినా ఇది అప్రస్తుతం , నాకనవసరమైనది ; ) " రవిగారు కూడా మీలా పొరబడ్డారేమో నాకు తెలియదు కాని , నేను LTTEని సమర్థిస్తూ మాట్లాడలేదు . మీరూ , రవిగారికీ ఒక ప్రశ్న : LTTE సంస్థ ఉగ్రవాదానికి పూనుకోకుండా , శాంతియుతంగా తమ హక్కుల కోసం ఉద్యమించి ఉంటే మీరు దాన్ని సమర్థించే వారా , కాదా ? నేను ఒప్పుకోని విషయాలు ఇవి : 1 . తమిళులది భాషా దురభిమానం అనడం . 2 . భాషాభిమానం ఉద్యమానికి దారితియ్య కూడాదు అనడం . నేను చెప్పదలచుకున్న విషయాలు : 1 . మనుషులని కట్టి ఉంచడంలో భాషకున్న శక్తి గొప్పది . దాన్ని తెలుగువాళ్ళు గుర్తించాలి . లేకపోతే తెలుగువాళ్ళు అనే జాతి , అంతరించిపోయే జాతులలో ముందుంటుంది . " అయితే నాకు వచ్చే నష్టమేవిటి ? " అని అడిగితే , " నాకు తెలియదు " అనే నా సమాధానం .
సాయంత్రం బల్ల అయిపోయింది . జగదీష్‌కు లైఫ్ పడిందన్న వార్త అందరినీ విషాదంలో ముంచింది . జగదీష్ అందరినీ బెదిరించుకు తింటాడన్న పేరున్నా నర్మదా బ్యారక్ మొత్తం చలించిపోయింది . లాకప్ సమయం దగ్గర పడుతున్నది . బైట చెట్ల దగ్గర నేను , చిచ్చా , రఘునాథ్ , డూమోర్ కూర్చున్నాం . రోజూలాగే చిచ్చా ' అకేలే హై చలే ఆవో జావో హో తుమ్ ' లత పాట పాడాడు . పూర్తిగా చదవండి »
మొదటి భాగం ఎరగాన్ లో - కథా పరిచయం , కొంత నేపథ్యం ఉంటాయి . ఎరగాన్ డ్రాగన్ రైడర్ అయ్యాక , కొన్ని ప్రాథమిక శక్తుల్ని సంపాదించుకుని క్రూరుడైన రాజు తాలూకా సైన్యంతో యుద్ధం చేస్తూ , చాలా శక్తివంతుడైన మాంత్రికుణ్ని అంతం చేసి ప్రజలందరి గౌరవాభిమానాలను పొందడంతో ముగుస్తుంది . రెండో భాగంలో ఎరగాన్ elves అనబడు జాతివారితో ఉంటూ , అక్కడే శస్త్ర విద్యల్లో కఠోర శిక్షణ పొంది , చివరకు మరో యుద్ధానికి సిద్ధమౌతాడు . ఆ యుద్ధం ముగుస్తున్నప్పుడే అనూహ్య సంఘటన ఒకటి జరిగి , ఒకప్పటి మిత్రుడు శత్రువయ్యాడన్న విషయం గ్రహిస్తాడు . మూడో భాగం లో ఎరగాన్ కజిన్ రోరాన్ కూడా అతన్ని కలిసి , అందరూ రాజును అంతమొందించడానికి ముందుకెళ్ళడంతో కొనసా . . గుతోంది .
తెలంగాణా విషయంలో పార్లమెంటరీ వామపక్షాలతో సహా , వివిధ జాతీయ , ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఎటువంటి రాజకీయ అవకాశవాదాన్ని ప్రదర్శిస్తున్నాయో గమనిద్దాం . సి . పి . యం . పార్టీ భాషా ప్రయుక్తత సిద్ధాంతం పేరుతో సమైక్య వాదానికి కట్టుబడి ఉన్నది . కనీసంగా వనరుల పంపిణీలో జరుగుతున్న అన్యాయాలను కూడా ప్రతిఘటించడం లేదు . సిపిఐ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తున్నా ఆ అంశంపై కొట్లాటకు దిగడానికి సిద్ధంగా లేదు . బిల్లు ప్రవేశ పెడితే అనుకూలంగా ఓటు వేయడానికి నిర్ణయించింది . రాజశేఖర్ రెడ్డి ఆధిపత్యం ఉన్నంత కాలం కాంగ్రెసు పార్టీ తెలంగాణ పై నిర్ణయం తీసుకోలేదు .
నామినేషన్ల పర్వం ముగిసింది . ప్రచార సమరం ఏనాడో మొదలైంది . కానీ , మధ్యలో తెలంగాణ లొల్లి గల్లంతైంది . మహాకూటమిలో టీఆర్‌ఎస్ చేరుతుందా ? చేరదా ? అన్న సంశయం నివృత్తి కావడానికే ఎన్నో రోజులు గడిచాయి . సీట్ల సంఖ్య తేలడానికి మరో పక్షం రోజులు గడిచిపోయాయి . మహా కూటమిలోని వివాదాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి . కానీ టీడీపీ , కాంగ్రెస్ , పీఆర్పీ ప్రచార వ్యూహంలో తెలంగాణ కనిపించకుండాపోయింది .
" ఏక " కానిది " అనేక " కనుక చాలా రోజులు " అనేక దంతం భక్తానాం " అంటేఎక్కువ దంతాలు ( పళ్ళు ) ఉన్న మనలాంటి భక్తులు అనుకునే వాడిని . కాదుట !
అంటే , వారు చేస్తోన్న మారన కాండ ఆ గ్రంధాన్ని తప్పుగా అర్ధం చేసుకొని కాదు , సరిగ్గా అర్ధం చేసుకొనే . నిజానికి వారే అసలైన ముస్లిములు .
వేరే గతి ఉండదు అవే అప్పులు తీర్చడం కోసం కొన్ని తీసుకోవడం తప్పదు అనేవాళ్ళిద్దరూ .
ఇప్పుడు దైవం లేదనుకుందాం . దైవమే లేదనుకుంటే , దైవానికి విలువకూడా లేనట్టే కదా , అందువలన Z = Zero + Y , కాబట్టి
కిలారి ఆనంద్ పాల్ : " ఎన్నికలప్పుడు రాజశేఖరరెడ్డి నన్ను 5 మిలియను డాలర్లు డబ్బులడిగాడు . నేనివ్వనన్నాను . అంచేత నాపై పగబట్టి ఆయనా సోనియాగాంధీ కలిసి నా గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ కు దేశంలో అనుమతి రద్దు చేసారు . " మూడేళ్ళ తరవాత ఆయనకీ సంగతి హఠాత్తుగా గుర్తొచ్చి , ఈ ముక్క పత్రికల వాళ్ళ దగ్గర బైటపెడితే , ముఖ్యమంత్రి ఫక్కున నవ్వేసాడు . ( అంటే ఏదో ఉందన్నమాటే ! ) అసలు పాల్ కు రాజకీయ నాయకులతో పనేంటి ? కూటములు పెట్టి ప్రజలకు స్వస్థత ప్రసాదించే దైవజనుడు రాజకీయులతో అంత పూసుకు తిరగాల్సిన అవసరం ఏంటి ? 108 దేశాల్లో తిరిగాను , 60 , 70 మంది ప్రభుత్వ , దేశాధినేతలతో ప్రత్యక్షంగా పరిచయం ఉంది . ఇరాక్ లో నా శాంతి ప్రయత్నాలు విజయం సాధించే దశలో , అసూయతో బుష్షు అడ్డం పడి యుద్ధానికి వెళ్ళాడు . బుష్షూ రైసూ కలిసి సోనియా గాంధీతో కుమ్మక్కై నా సంస్థకు అనుమతులు రాకుండా చేసారు . . ఇలా ఆయన చెప్పుకు పోతుంటే మనకూ నవ్వొచ్చింది . ఆ రాత్రి టీవీ9 వాడి ఫోనాఫోనీ కార్యక్రమంలో చూడాలి అయ్యవారి తీరు . . అబ్బో . . ! టీవీ 9 వాడి ఫోనాఫోనీ ఎంతో రంజుగా మంచి ఆరోగ్య కరమైన హాస్యాన్ని అందిస్తూ సాగింది . పైన చెప్పినవి కాక కొన్ని జోకులు చూడండి . . పాల్ ఆయన ఎదురుగా ఉన్న ఫైలు లేపి చూపిస్తూ మంత్రి మారెప్ప , రోశయ్య , నట్వర్ సింగు , ఇలా ఎందరో ఉత్తరాలు ఇచ్చారు . ఇందులో అందరి ఉత్తరాలు ఉన్నాయి . సమయం వచ్చినపుడు బయట పెడతాను అంటూ చెప్పినవాడు , టీవీ 9 రజనీకాంత్ " ఏదీ చూపించండి " అంటే వెతికాడు కానీ కనిపించలేదు . ఈ లోగా మంత్రి మారెప్ప లైను లోకి వచ్చాడు . . పాల్ ఉత్సాహంగా ఆ మారెప్ప గారూ చెప్పండి అన్నాడు . మారెప్ప ఆయన్ని నిరాశ పరుస్తూ ఈ పాల్ చెప్పేవన్నీ అబద్ధాలు . నేను ఆయన తమ్ముడికి ఉత్తరం ఇచ్చిన మాట వాస్తవం అని అన్నాడు . వెంటనే పాల్ , ' ఇదుగో మీరు రాసిన ఉత్తరం నా దగ్గరే ఉంది . అసలు అందులో మీరేం రాసారో చెప్పండి ' , అని అడిగాడు . అప్పుడు " మంత్రి " మారెప్ప అద్భుతమైన డవిలాగు చెప్పాడు " అబ్బే నేనేం రాయలేదు , తెల్ల కాగితమ్మీద సంతకం పెట్టిచ్చాను " . ( ముఖ్యమంత్రి గారు ఫైలు చూడకుండానే సంతకం పెట్టానని చెప్పుకున్నాడు . వారి దర్బారులో మంత్రేమో తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టి ఇచ్చేస్తున్నాడు . శభాష్ ! ) మతి పోయిన రజనీకాంత్ తేరుకుని " అలా తెల్ల కాగితమ్మీద సంతకం ఎలా పెట్టారండి " అనడిగితే ఈయన దైవజనుడు కదా అని పెట్టాను అని అన్నాడు . అన్నిటి కంటే గొప్ప జోకు ఏంటంటే , పాల్ గారు పదే పదే చెప్పిన ఓ మాట . . " నా సంస్థను ఇలా అడ్డుకోవడం వలన వీళ్ళెంత తప్పు చేస్తున్నారో తెలుసుకోవడం లేదు . . ఎంతో మంది విధవరాండ్రకు అన్యాయం జరుగుతోంది . ప్రపంచంలోని వేలాది విధవరాండ్రకు ( ముందు లక్షలాది అని అన్నాడు ) నేను మేలు చేస్తున్నాను " ఇలా పదే పదే విధవరాండ్రు అని ఆయన అంటూ ఉంటే , నాకు గురజాడ వారి గిరీశమే గుర్తుకొచ్చాడు . ఇహ జోకులాపి విషయానికొస్తే . . మూడేళ్ళ కిందట వీళ్ళు డబ్బులడిగారని పాల్ గారు చెబుతున్నారు . అది దిగ్భ్రాంతి కలిగించేంత , నమ్మలేనంత విషయమేమీ కాదు . అడిగే ఉంటారు ! కానీ . .
ఎవరైతే సామాజిక ఉత్పత్తి సాధనాల్ని స్వాధీనం చేసుకున్నారో వారే జీవితానికి సంబంధించిన సమస్త విషయాల్ని శాసించారు . ఆర్ధిక ప్రయోజనాల్ని బట్టే , సారస్వతం , తాత్వికసూత్రాలు , మతనియమాలు , లలితకళలు నిర్వచించబడి పోషింపబడతాయి . వీటినే " సంప్రదాయం " క్రింద పెద్దలు ప్రచారం చేస్తారు .
90 . కాలిఫోర్నియా రాష్ట్రంలో సిగల్ - హిల్ వద్ద ప్రపంచంలో అతి దట్టమైన పెట్రోలియం క్షేత్రాలు వున్నాయి .
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ డ్యాం పనులకు 1964లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు . నిర్మాణ వ్యయం ( 2005 నాటికి ) రు . 2 , 900 కోట్లు . ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తి నిలువ సామర్థ్యం ( ఎఫ్‌ఆర్‌ఎల్ ) 1091 అడుగులుగా నిర్దేశిస్తూ మహారాష్ట్ర , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య 1975 , అక్టోబర్ 6న ఒక అంగీకారం కుదిరింది . ఈమేరకు మహారాష్ట్ర గోదావరిపై పైథాన్ డ్యాం స్థలం వరకూ , పూర్ణా నదిపై సిద్ధేశ్వర డ్యాం వరకూ నీటిని ఉపయోగించుకోవచ్చును . గోదావరి బేసిన్‌లో గోదావరిపై పైథాన్ డ్యాం స్థలానికి దిగువనా , పూర్ణానదిపై సిద్ధేశ్వర డ్యాంకు దిగువనా , మంజీరా నదిపై నిజాంసాగర్ డ్యాంకు దిగువనా , గోదావరిపై పోచంపాడు ( శ్రీరాంసాగర్ ) డ్యాం వరకూ మహారాష్ట్ర 60 టి . ఎం . సి . ల నీటి వినియోగం వరకు కొత్త ప్రాజెక్ట్‌లు నిర్మించుకోవచ్చు . ఆంధ్రప్రదేశ్ 1091 ఎఫ్ . ఆర్ . ఎల్ . , 1093 ఎం . డబ్ల్యూ . ఎల్ . తో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మించుకొని , డ్యాంవద్ద లభ్యమయ్యే మిగులు నీటిని యథేచ్ఛగా వినియో గించుకోవచ్చు . పోచంపాడు ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే భూమి , కట్టడాల స్వాధీనతకు మహారాష్ట్ర తగు చర్యలు తీసుకోవాలి . అలా స్వాధీన పరుచుకున్న ఆస్తులకు ఆంధ్రప్రదేశ్ నష్టపరిహారాన్ని చెల్లించాలి . ఈ ఒప్పందానికి అనుగుణంగా మహారాష్ట్ర జయక్వాడి ( పైథాన్ ) డ్యాం నుంచి శ్రీరాంసాగర్‌కు ఎగువగా ఐదు ప్రాజెక్ట్‌లను నిర్మించింది .
[ మీ సలహా ప్రకారం తగువిధంగా పాఠకులకు సూచనలలో మార్పులు చేశాము . - సం ]
పిసినివాని ఇంట పీనుగు వెడలిన కట్టెకోలలకును కాసులిచ్చి వెచ్చమాయె ననుచు లెక్కలెక్కేడ్చురా
చెప్పొచ్చేదేమిటంటే , మనం ఇంగ్లీషు వాళ్లమూ కాదు , భారతీయులమూ కాదు , తెలుగు వాళ్లమూ కాదు - - ఓ ప్రత్యేక జాతి !
" నాకీ చికాగో వెదర్ పడేలా లేదు , న్యూయార్కు వచ్చెయ్యకూడదూ " ఆమె అంది .
5 . మిర్డాల్ నుంచి బెర్గెన్ వెనక్కి రావడానికి ఎక్కే చోట , స్టేషన్ లో స్టాఫ్ కి నా గోడు వెళ్ళబోసుకున్నా - తిండిలేక శుష్కిస్తున్నా పొద్దున్నుంచి అని . ఒక మఫిన్ , మామూలు చిప్స్ , కాఫీ - కొనుక్కోగలిగా వాళ్ళ పుణ్యమా అని ) ఈసరికే నేను తూలడం మొదలుపెట్టా . ట్రెయినుకేదో సమస్య వచ్చి Voss అన్న ఊరిలో ఆగిపోయింది . అక్కణ్ణుంచి బస్సు . మళ్ళీ నదీ తీరం వెంబడి ప్రయాణం . నిద్ర నదిలో మునిగిపోయింది
ఏడేడు శిఖరాల మే నడువలేము ( బస్సుల్లో / ట్రైన్లో కూడా రాలేము ) వెంకన్న పాదాలు దర్శించలేము . మేము వివరించి మా బాధ వినిపించలేము ( ఈ బంగారు భోగ శ్రీనివాసుడి దర్శనం దొరకడం కష్టమని ) నడిరేయి ఏ ఝాములో . . స్వామీ నిను చేర దిగి వత్తునో . . . తిరుమల శిఖరాలు దిగివత్తునో . . అని తిరుపతిలో అమ్మవారిని దర్శించుకొని , ఆవిడ గడ్డం పట్టుకొని బతిమాలల్సిందే ఇహ .
4 . విద్యార్థులకి నిద్రించడానికి డార్మెటరీల్లాంటి యేర్పాటు యేమైనా వుందా ? నేలమీదే నిద్రిస్తున్నారా ?
అతనుండేది చాలా పెద్ద ఎపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ లో . అందువల్ల అక్కడ రెంటల్ ఆఫీసుకి అతను ఎప్పుడోగాని వెళ్ళడని , పైగా అక్కడ పనిచేసే వాళ్ళు చాలా విషయాలు చూడాల్సుంటుంది గనక ప్రతి విషయాన్నీ లాగీ పీకీ చూడకుండా చకచకా నిర్ణయాలు తీసుకుంటారనీ ఊహించింది అంజన . ఆమె ఊహ నిజమే అయ్యింది ! ధైర్యంగా ఆ ఆఫీసుకి వెళ్ళి నగేష్ తన భర్తనీ , రెండు రోజుల క్రితమే తను ఇండియా నుంచి వచ్చానని వాళ్ళకి చెప్పింది . తనక్కూడా ఎపార్ట్‌మెంట్‌కీ , మెయిల్ బాక్స్‌కీ తాళాలు కావాలని అడిగింది . వాళ్ళకి అనుమానం కలక్కుండా తన పెళ్ళి ఫోటోలు కొన్ని చూపించింది . ఆ ఫోటోల మీదున్న డేట్ కూడా చూపించింది కావాలనే . అది ఇరవై రోజుల క్రితంది !
ఇంతకాలం వరకూ పుట్టపర్తి సాయిబాబపై నాకు ఎటువంటి అభిప్రాయం లేదు . కానీ ఇవ్వాళ సత్యసాయి ట్రస్ట్ సభ్యులు వెల్లడించిన వివరాలు నాలో విస్మయాన్ని కలిగించాయి . అవి నాకు మింగుడు పడటం లేదు . సత్యసాయి బాబాను దైవంగా కొలిచే వారికి ఎటువంటి విషయమైనా అది దైవీక పరంగా కనబడుతుంది , అలా చూడని వారికి ప్రతీ చిన్న విషయం పెద్ద వివాదంగా కనబడుతుంది . అలా నేను వివాదస్పదమైనటువంటి భావనను కలిగించుకోవటం లేదు కానీ ఇంత ఆస్తిని కలిగి ఉండటం వెనుక ఉన్న వివరం నాకు అర్దం కావటం లేదు . అసలు విషయం లోకి వెళ్ళే ముందు పత్రికలలో వచ్చిన నిజాల గురించి ఒకసారి అవలోకనం చేసుకుంటే . .
( ప్రాణహిత మే 2008 సంచిక తరువాయి ) మారియోకు నెరూడా ఏమి చెప్పదలచుకున్నాడో అర్థమయింది . " వారెవ్వా , నాకూ కవి కావాలని ఉంది " అన్నాడు . " తెలుసా , చిలీలో ప్రతివాడూ కవే ! కవి కానిదెవడులే ? అయినా పోస్ట్ మన్ ఉద్యోగమంటే కవిత్వం వస్తుందన్నమాటే . ఒక్కటే తేడా , నీకు నడక ఎక్కువగా ఉంటుంది . అంత తొందరగా లావెక్కవు . చిలీలో మా కవులందరికీ బాన పొట్టలున్నాయి . " మొత్తం చదవండి »
* కరువు కాటకాలు , వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్కువ వడ్డీకి , ఎక్కువ వాయిదాలలో తీర్చే విధంగా రైతులకు ప్రభుత్వం ' తక్కావి ' రుణాలను అందజేసింది .
తెలంగాణా సాధన కోసం కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ టి . నేతలు నిర్ణయించారు . 48 గంటల పాటు నిరసన దీక్షలు చేపట్టాలని తీర్మానించారు . బుధ , గురువారం సాగే ఈ దీక్షల్లో ముఖ్య నాయకులు పాల్గొనాలని భావించారు . తెలంగాణా కాంగ్రెస్ నేతల విస్తృత స్థాయి సమావేశం నాంపల్లి ఎగ్జిబీషన్ గ్రౌండ్‌లో సోమవారం జరిగింది . దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ భేటీలో ముగ్గురు మంత్రులు , ఏడుగురు ఎంపిలు , ఎనిమిది మంది ఎమ్మెల్సేలు పలువురు ఎమ్మెల్సీలు , జెడ్పీ ఛైర్మన్లు , సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఐదు తీర్మానాలు చేశారు . అనంతరం భేటీ వివరాలను టి . నేతలు మీడియాకు వివరించారు . ఐదు తీర్మానాలు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి మాట్లాడు తూ , సమావేశం మొత్తం ఐదు తీర్మానాలు చేసిందని తెలిపారు . రాజీనామాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గేది లేదన్న ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు . కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు బుధ , గురువా రాల్లో 48 గంటలపాటు దీక్షలు చేపట్టబోతున్నట్టు తెలిపారు . ఎ గ్జిబిషన్ గ్రౌండ్‌లో ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే దీక్షల్లో రాజీనామాలు చేసిన నేతలు పాల్గొంటారని వివరించారు . 18వ తేదీన మండల కేంద్రాల్లో ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు . తెలంగాణా కోసం విద్యార్థులు , యువకులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సమావేశం కోరినట్టు పేర్కొన్నారు . ప్రత్యేక రాష్ట్ర సాధనకు అవసరమైతే తామే త్యాగాలు చేస్తామన్న సందేశాన్ని ఇస్తున్నట్టు చెప్పారు . తెలంగాణా ఉద్యమాన్ని కించపరచేలా వ్యవహరిస్తున్న సీమాంధ్ర మీడియా పద్ధతి మార్చుకోవాలని కోరారు . తెలంగాణా భావజాలంతో పనిచేస్తున్న ప్రజా సంఘాలు , పార్టీలతో కలిసి పనిచేసే అవసరాన్ని సమావేశం గుర్తించిం దన్నారు . అయితే జెఎసితో కలిసి పనిచేసే అంశంపై ఇప్పుడే సమాధానం చెప్పలేమని తెలిపారు . ' ఉద్యమ ఎత్తుగడలు … పరిస్థితులను బట్టి నిర్ణయాలుంటాయి ' అని బదులిచ్చారు . నాయ కత్వాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా కో - ఆర్డి నేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు . మండిపడ్డ జానా తెలంగాణా కాంగ్రెస్ నేతలపై అతస్య ప్రచారం చేస్తున్నారని మంత్రి జానారెడ్డి మీడియాపై మండిపడ్డారు . వార్తలు రాసే విధానంపై విలేకరుల ఎదుటే క్లాస్ పీకారు . ' అవహేళన , అసత్య ప్రచారం చేస్తే మీరే అవహేళన పాలయ్యే పరిస్థితి ఉందని ' మీడియాను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు . తమలో చీలికలున్నాయని , పార్టీ వీడుతున్నామనే ప్రచారాలు సరికాదని హితవు పలికారు . ఈ సందర్భంగా ఆయన ఉద్వేగంగా మాట్లాడుతూ ' మేం కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు . పార్టీ ప్రతిష్టను తగ్గనిచ్చేదే లేదు ' అని పేర్కొన్నారు . పార్టీలో ఉంటూనే తెలంగాణా కోసం ఉద్యమిస్తామని ప్రకటించారు . అన్ని విషయాలు , అన్ని సందర్భాల్లోనూ వెల్లడించడం సరికాదు ' అంటూ జానా అసహనం ప్రదర్శించారు . సంధాన కర్త జైపాల్ : గుత్తా తెలంగాణా సాధనకు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించాలని ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు . తెలంగాణా కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను కేంద్రానికి తెలిపేందుకు చొరవచూపాలన్నారు . రాజీనా మాలను ఆమోదించడమో , ప్రత్యేక రాష్ట్రం సాధించ డమో ఏదో ఒకటి జరిగేవరకూ పోరాడతామని వెల్లడించారు .
ఈ సమావేశంలో ఎం . ఎల్ . ఎ . వెల్లంపల్లి శ్రీనివాస్ , నాయకులు కొలనుకొండ శివాజీ , నరహరిశెట్టి నరసింహారావు , తదితరులు పాల్గొన్నారు .
గుంటూరులో : కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తూర్పారపడుతూ కొనసాగిన సమ్మె గుంటూరు జిల్లాలో విజయవంతమైంది . కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు మంగళవారం జిల్లావ్యాప్తంగా కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నారు . జిల్లాలోని ప్రధాన పట్టణాలలో కార్మికులు నినాదాలు చేస్తూ ప్రదర్శనలు నిర్వహించారు . వేలాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు . సమ్మెను ప్రభుత్వాలు తేెలికగా తీసుకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని నాయకులు హెచ్చరించారు . ముఖ్యంగా దేశంలో అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్న నిత్యావసర సరకుల ధరలు నియంత్రించాలని నినదించారు . ప్రజాపంపిణీ వ్యవస్ధను పటిష్టపరచాలని డిమాండ్ చేశారు . కార్మిక హక్కులపై తరచూ జరుగుతున్న దాడులను నిలువరించి , సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు . లాభాలబాటలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధలలో పెట్టుబడులను ఉపసంహరించుకునే విధానానికి స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు . నగరంలో జరిగిన ఆందోళనలకు ఎఐటియుసి జిల్లా అధ్యక్ష , ప్రధానకార్యదర్శులు చల్లా చినఆంజనేయులు , వెలుగూరి రాధాకృష్ణమూర్తి , నగర కార్యదర్శి జి . సురేష్ నాయకత్వం వహించారు . ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు జివి కృష్ణారావు , సిపిఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు , నగర కార్యదర్శి జంగాల అజరుకుమార్ , మునిసిపల్ వర్కర్స్ Ê ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కోటా మాల్యాద్రి , బందెల రవికుమార్ , బోడపాటి వెంకటసుబ్బయ్య , మల్లెబోయిన పిచ్చయ్య , ఆలా గంగాధర్ , సుధీర్‌బాబు , కొత్తా శివారెడ్డి , జల్లెపల్లి ముసలయ్య , శ్యామ్ , బి . మురళీ , టి . బాబు , టి . శివయ్య , మైలా ఏడుకొండలు తదితరులు నాయకత్వం వహించారు .
యాలాల , నవంబర్ 3 ( ఆన్‌లైన్ ) : తినడానికి తిండిలేక చేనేత కార్మికుడు తనువు చాలించిన సంఘటన మండల కేంద్రమైన యాలాలలో బుధవారం రాత్రి జరిగింది . స్థానికంగా ఉంటున్న వెంకట్రాములు ( 65 ) చేనేత పనులు చే స్తూ ఒకప్పుడు దర్జాగా బతికాడు . మగ్గాలు మూత పడడంతో , పనిలేక వెంకట్రాములుకు పూట గడవం కూడా కష్టమైంది . వెంకట్రాములు గత కొన్ని రోజులుగా పస్తులతోనే కాలం వెళ్లదీశాడు . దీంతో ఆరోగ్యం బాగా క్షీణించి , వారం రోజులుగా బియ్యం కొనేందుకుగాని , ఆస్పత్రికి వెళ్లేందుకుగాని డబ్బులు లేక బుధవారం రాత్రి ఆకలి చావుతో మృతిచెందినట్లు స్థానికులు తెలిపార
హైదరాబాద్ , ఆంధ్రప్రభ ప్రతినిధి : తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్ అక్రమ ఆస్తులు సంపాదించారని దాఖలైన పిటీషన్‌పై రెండువారాల్లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ ( సిబిఐ ) ని ఆదేశించింది . జగన్‌పై దాఖలైన పిటీషన్‌లో ఏ మేరకు విచారించదగ్గ అంశాలున్నాయో వివరిస్తూ సీల్డ్ కవర్‌లో అందించాలని హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి నిసార్ అహ్మద్ కక్రూ , న్యాయమూర్తి బిలాస్ అఫ్జల్ పుర్కార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది . తన తండ్రి వైఎస్ అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమ మార్గాల్లో పెద్దఎత్తున ఆర్జించి వాటిని తన కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టుకొని లబ్ధి పొందారన్న ఆరోపణలతో జగన్‌పై హైకోర్టుకు మంత్రి శంకర్‌రావు లేఖ రాసిన విషయం తెలిసిందే . ఈ లేఖనే హైకోర్టు పిటీషన్‌గా భావించి విచారణకు స్వీకరిం చింది . అలాగే ఆరే ళ్ళ వైఎస్ పాలనలో జగన్ వేలాదికోట్ల రూపా యలు అక్రమంగా ఆర్జించారని , దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ కూడా మరో పిటీషన్‌ను దాఖలు చేసింది . ఈ పిటీషన్లను పరిశీలించిన హైకోర్టు ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సిందిగా సిబిఐని ఆదేశిస్తూ , ఈ నివేదిక రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత శాఖల అధికారులు సహకరించాలని కూడా కోర్టు ఆదేశించింది . తెలుగుదేశం పార్టీ తరఫున షేర్వాని దాఖలు చేసిన పిటీషన్‌లో జగన్‌పై అనేక ఆరోపణలు చేస్తూ దానికి సంబం ధించిన డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది . దీనికి సంబంధించి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలకు , లబ్ధిపొందిన కంపెనీ లతో సహా 50 మంది ప్రతివాదులతో పాటు జగన్మో హన్‌రెడ్డికి ఇప్పటికే హైకోర్టు నోటీసులు జారీ చేసింది . ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు చేసిన వారంతా సిబిఐకి సాక్ష్యాధా రాలతో కూడిన డాక్యుమెంట్లను అందించా ల్సిందిగా హైకోర్టు రిజిస్ట్రార్ ఆదేశించారు . సిబిఐ ప్రాథమిక విచారణలో ఫిర్యాదు దారుల నుంచి , సంబంధిత అధికారుల నుంచి సమాచారం సేకరిం చాల్సిందిగా సిబిఐకి హైకోర్టు సూచించింది . విచారణలో అందరూ సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది . ఇదిలాఉండగా , జగన్‌పై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని , వీటిని రాజకీయపరంగా ప్రత్యర్థులు దురుద్దేశ్యంతో ఆపాదించారని ఆయన తరఫు న్యాయ వాదులు కోర్టు దృష్టికి తెచ్చారు . సిబిఐచే విచారణ జరిపిస్తే సందూర్ పవర్ , జగతి పబ్లికేషన్స్ , భారతీ సిమెంట్స్ లాంటి కంపెనీలపై దుష్ప్రభావం చూపే ప్రమాద ముందని , ఇది స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపనుందని వాదించారు . మంత్రిగా ఉన్న శంకర్‌రావు కోర్టుకు లేఖ రాసే బదులు జగన్ కంపెనీల్లో అవకత వకలుంటే ప్రభుత్వప రంగా చర్యలు తీసుకో వచ్చునని వారు కోర్టు దృష్టికి తెచ్చారు . రాజకీయ కక్ష సాధింపుతోనే తెలుగుదేశం వారు జగన్‌పై ఆరోపణలు చేస్తూ పిటీషన్ వేశారని , వీటిని పట్టించుకోవలసిన అవసరం లేదంటూ జగన్ తరఫున్యాయవాదులు వాదించారు . జగన్ తరఫున ఎలాంటి తప్పులులేకుంటే విచారణ చేస్తే భయమెందుకని కోర్టు ప్రశ్నించింది .
19 స్థిత్వా తస్మి న్వనచరవధూభుక్త కుఞ్జే ముహూర్తం తోయోత్సర్గద్రుతతరగతి స్తత్పరం వర్మ్త తీర్ణః రేవాం ద్రక్ష్య స్యుపలవిషమే విన్య్ధపాదే విశీర్ణాం భక్తిచ్ఛేదైరివ విరచితాం భూతి మఙ్గే గజస్య
అదనపు పెట్టుబడుల వల్ల ఉత్పత్తి రెట్టింపు అయితే రెట్టింపైన ఆదాయం వల్ల ఎవరికి ఏమేరకు ప్రయోజనం కలిగింది అని ప్రశ్నించుకుంటే దీనివల్ల 750 కోట్ల డాలర్ల ఆదాయం లభించింది . ఇందులో రిలయెన్స్ 550 కోట్ల డాలర్ల మేర ప్రయోజనం పొందుతుంది . ప్రభుత్వానికి లభించేది 200 కోట్ల డాలర్లు మాత్రమే . ఉత్పత్తిని కేవలం రెట్టింపు చేసేందుకు పెట్టుబడి వ్యయాన్ని నాలుగు రెట్లు పెంచడం ఎవరికైనా అనుమానాలు రేకెత్తిస్తుంది . ఉత్పత్తి సామర్ధ్యాన్ని రెట్టింపు చేసేందుకు ఇంత ఖర్చు పెట్టడం అవసరమా , అది యుక్తమనిపించుకుంటుందా అనే అనుమానాలు ఎవరికైనా కలుగుతాయి . ఉత్పత్తి సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తే పెట్టుబడి వ్యయం సాధారణంగా ఒకటి , ఒకటిన్నర రెట్లు మించి పెరగదు . రిలయెన్స్ పెట్టుబడి వ్యయం 240 కోట్ల డాలర్ల నుండి 520 కోట్ల డాలర్లకు పెంచింది . ఉత్పత్తి సామర్ధ్యం ఏమీపెరగలేదు . అసలు ఈ తతంగం అంతా చూస్తుంటే అసలు బిడ్డింగ్ ప్రక్రియ అగమ్యగోచరంగా ఉంది . పెట్టుబడి వ్యయం పెరిగితే అన్నిటిలో చోటుచేసుకునే మార్పులు గందరగోళం కలిగించేవిగా ఉన్నాయి . కాంట్రాక్టు నిబంధనలను సైతం ఉల్లంఘించేవిగా ఉన్నాయి . వాస్తవానికి పెట్టుబడి వ్యయం పెంపును హైడ్రోకార్బన్స్ డైరెక్టరేట్ జనరల్ ఆమోదించకుండా ఉండాల్సింది . ఆయన చాలా తొందరపాటుతో రిలయెన్స్‌కు అనుమతి ఇచ్చేశారు . 53 రోజుల్లోనే 630 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడి వ్యయం పెరిగింది . 2009 సంవత్సరానికి సంబంధించిన పద్దులపై చేసే ఆడిట్‌లో ఈ విషయాలన్నిటినీ కూలంకుషంగా పరిశీలిస్తామని కాగ్ పేర్కొంది . ఈ విషయంలో హైడ్రోకార్బన్స్ మాజీ డైరెక్టర్ వికె సిబాల్ తన అధికారాలను దుర్వినియోగం చేశారని కాగ్ స్పష్టంగా పేర్కొంది . ఈ విషయాన్ని పెట్రోలియం శాఖ , సివిసిలకు అది నివేదించింది . సిబాల్ , రిలయెన్స్ మధ్య అనేక సంబంధాలున్న విషయం కూడా కాగ్ పరిశీలనలో బయటపడింది .
అభివృద్ధిలో వెనకబడి పోయామని , మాకు అన్యాయం జరిగిందనీ , జరుగుతోందనీ చెబుతూ ప్రత్యేక రాష్ట్రం ఉంటే తప్ప లాభంలేదని తె . వాదులు డిమాండు చేస్తూ వచ్చారు . తరవాత్తరవాత వీళ్ళ గొంతు కాస్త మారి , ' ఆంద్రోళ్ళు ' మమ్మల్ని అణగదొక్కారంటూ రాష్ట్ర విభజన భజన చేసేవారు . ఇప్పుడవన్నీ పక్కకు నెట్టి ఆత్మగౌరవం కోసం తెలంగాణ , స్వపరిపాలన కోసం తెలంగాణ అంటూ కొత్త కారణాలు చెబుతున్నారు . ఈ కారణాల్లో న్యాయం ఉందా లేదా చెప్పండి అంటూ తెలివితక్కువ వాదనలు చేస్తున్నారు . అభివృద్ధి లేదన్న మాట మాత్రం ఇప్పుడు వీళ్ళ నాలుకల మీద కనబడదు . ఆ వాదనలో పసలేదని తేలిపోయింది . తె . వాదులు చెప్పే అభివృద్ధిలో - మేం - వెనకబడ్డాం - ఆంద్రోళ్ళు - ముందుబడ్డారు అనే వాదన శుద్ధ తప్పని తేలిపోయింది కాబట్టి , వాళ్ళు చెప్పే లెక్కలన్నీ కాకిలెక్కలని తేలిపోయింది కాబట్టి వాళ్ళకు వాదన మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది . అంచేత మార్చారు . అయితే ఈ అబద్ధాలను ఇంకా చెప్పుకుంటూ తిరుగుతున్న తె . వాదులు కొందరు అక్కడక్కడ లేకపోలేదు . ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్న మరో పాత అబద్ధం గురించి మాట్టాడుకుందాం .
హైదరాబాద్ , జూలై 10 : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా లక్మె ఫ్యాషన్ వీక్ / ఫెస్టివ్ 2011కి గ్రాండ్ ఫినాలేగా వ్యవహరిస్తున్నట్లు లక్మె సంస్థ తెలిపింది .
మాతృ భాషల వాడకాన్ని రకరకాల సందర్భాలలో తగ్గించుకొంటూ పోవడం , ఆంగ్లాన్ని విరివిగా ఉపయోగించే సామాజిక , రాజకీయ , ఆర్థిక పరిస్థితులు ఉండటం ' గ్లోబిష్ ' కు కలిసివచ్చే అంశాలు . అందువల్లే అది త్వరితగతిన ప్రపంచమంతా వ్యాపించగలుగుతోంది . ఆంగ్ల భాషలో ప్రాచుర్యంగా వాడుకలో ఉన్న 1500 పదాలు మాత్రమే గ్లోబిష్ లో ఉంటాయి . ఈ పదాలలోని వర్ణ క్రమానికి చేసుకొన్న కృతకమైన మార్పులు , అటువంటి పదాలతో ఏర్పడే చిన్న చిన్న వాక్యాలతో వ్యవహారం జరుగుతుంది . వాక్య నిర్మాణంలో ఇంగ్లీష్ వాక్య నిర్మాణాన్ని పోలి ఉండటం వల్ల ఆంగ్ల వ్యాకరణ పద్ధతి ' గ్లోబిష్ ' లో కనిపిస్తుంది . కాబట్టి ఆంగ్లంలో కొద్దిపాటి పరిచయం ఉన్నా గ్లోబిష్ త్వరితగతిన నేర్చుకొనే వీలుందని నెరియె వాదం . గ్లోబిష్ వ్యాపార భాష ( నెరియె కాదంటున్నా ) . 15 వ శతాబ్ది నుంచి యూరోపియన్ భాషలు ఇతర ఖండాలకు వ్యాప్తి చెందాయి . పోర్చుగీసు భాష అమెరికా , చైనా , ఆఫ్రికా , ఆస్ట్రేలియా - వంటి ప్రాంతాలలోని స్థానిక భాషలలో కలిసి అనేక వ్యాపార భాషలు ఏర్పడ్డాయి . ఇలా ఏర్పడ్డ వ్యాపార భాషలు ఎవరికీ మాతృ భాషలు కావు . ' గ్లోబిష్ ' కూడా ఇటువంటిదే . అది ప్రపంచంలోని ఏ భాషా వ్యవహర్తకు మాతృ భాష కాదు . కానీ , ఆర్థిక వ్యవస్థ కేంద్రీకృత సమాజాలను , దేశాలను మాత్రం గ్లోబిష్ విపరీతంగా ప్రభావితం చేయగలదు . ఎందుకంటే అది అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకొంటోంది .
నోరి నరసింహశాస్త్రిగారి ఇతర సాహిత్యసంపద , నవలలూ , సమీక్షలూ , మొదలైనవి avkf . org లో దొరుకుతాయి .
ప్రసీద గారూ . . పోస్ట్ చాలా బాగా వ్రాశారండీ . . ! మీకు అభ్యంతరం లేకపొతే నా పోస్ట్ లో ఈ లింక్ జత చేద్దామనుకుంటున్నాను . ! మీ అనుమతికోసం ఎదురు చూస్తూ . . అభినందనలతో . . - రాధేశ్యాం
లోపలకి అడుగు పెట్టగానే వైకుంఠంలో పరమశివుడు కొలువు తీరినట్టుగా ఒక సాహిత్యగోష్ఠి . గరళకంఠునిలా ఆయన సభ మధ్యలో కూర్చుంటే చెరో పక్క వేణుగారు , వీణాపాణిగారు కూర్చున్నారు . వాళ్ళని పరిచయం చేస్తూ నా శంఖుచక్రాలు అని చెప్పారు . వేణుగారు వెంటనే శివునిచేతి శంఖుచక్రాలం అని చమత్కరించారు . ఇక ఆయన చుట్టూ ప్రమదగణాల్లా మేము కూర్చున్నాం . కాసేపు ముచ్చట్లు సాగాయి . ముచ్చట్లను ముగిస్తూ భరణిగారు తను వ్రాసిన పరికిణీ కవితను వేణుగారి కంజీర సహాయంతో రాగయుక్తంగా మొదలుపెట్టారు .
తమిళంల చాత్తాద అనగ విసర్జించినవారు అని అర్థం . కాలక్రమంల వీరిని చాత్తాద వైష్ణవులుగ మిగిలినవారిని శ్రీవైష్ణవులుగ ముద్రవేసినారు . ఈ చాత్తాద అన్న పదం తెలంగాణాల సాతానిగ , అయ్యవార్లుగ మారి ఒక కులానికి సంకేతంగ నిలిచింది . ఈ సాతాని అయ్యవార్లు శూద్రులకు పూజార్లుగ మిగిలిపోయినారు . ప్రజలల్ల వైష్ణవాన్ని విరివిగా ప్రచారం చేయటం కోసం విద్యను , వైద్యాన్ని ఒక వృత్తిగ ఎంచుకున్నరు . తెలంగాణాలో ఖానిగీ ( ప్రైవేట్ ) వీధి బడులన్నీ ఈ సాతాని అయ్యగార్లవే .
నమస్తె Anajali . కాలము నియమము తప్పిన్ది అనలేదు మన రాతే ఎలా జరగాలని ఉన్నా జరగక మానదు అని నా అభిప్రాయము మీ బాధ తీరుతున్దొ లేదొ తెలిదు కాని మీరెదొ బాధలొఉన్నారని మాత్రము అనిపిస్తున్ది నిజము అవ్వొచ్చు కాకపొవచ్చు . Thanks Usha
" ఇక్కడి వాళ్ళందరూ స్వర్గానికే వెడతారన్న భరోసా ఏమిటి ? " సందేహం లేవనెత్తారు మరో భక్తుడు .
" ఏం కొడకా ఎప్పుడు చూసినా కొత్త బట్టలు వేసుకుని తిరగడమేనా ? మాకేమైనా ఇచ్చేదుందా ? " అన్న మాటలతో ఉలిక్కిపడి తిరిగి చూశా . ఎదురుగా కట్టెల మోపు దించి , గోడకు ఆనించి , ఆయాసంతో రొప్పుతూ నిల్చోనుంది ఆదెమ్మక్క . " అబ్బా . . . నువ్వా అక్కా . . ఎవరో అనుకుని కంగారు పడ్డాను అంటూ . . . " చేతికి నీళ్ల చెంబు అందించాను . గడగడా నీళ్లు తాగేసి . . " ఇదిగో తల్లీ . . అమ్మ కట్టెలు తెమ్మని డబ్బు ఇచ్చింది . తెచ్చేశాను . ఇక వెళ్ళేదా అంటూ . . . ఏమ్మా . . . ఈసారైనా నా కూతురుకు ఓ పావడా గుడ్డ ఇచ్చేది ఉందా ? లేదా ? " అంది . " లేదక్కా . . ఈసారి తప్పకుండా ఇస్తాను . రాత్రి అమ్మ ఇంటికి రాగానే అడిగి తీసుకుంటాను . రేపు ఇంటికి రా . . " అని చెప్పి పంపించేశాను . ఆదెక్క ఓ దళిత మహిళ . ఆమె మా ఊర్లో అందరికీ బాగా తెలిసిన వ్యక్తి . ఎక్కడ్నించి , ఎలా వచ్చిందో ఏమో . . చిన్న వయసులోనే మా ఊరికి వచ్చేసింది . నా అనే వారు ఎవరూ లేకపోయినా , ఊర్లో వాళ్లు ఇచ్చే పావలా , అర్ధ సాయంతోనే పెరిగి పెద్దదైంది . ఇక ఆమె యుక్తవయసులోకి వచ్చేటప్పటికి , ఊర్లోని మగరాయుళ్లు . . . చూడ్డానికి ఓ మోస్తరుగా వయసులో ఉన్న ఆడది , ఏ ఆసరా లేనిది అయిన ఆమెను ఎలా చూడాలో అలాగే చూశారు . ఇది తప్పు అని ఆమెకు చెప్పేవాళ్లు లేకపోవడంతో ఆమె కూడా అలాగే కొనసాగింది . కొన్ని రోజుల తరువాత . . ఏ తోడులేని ఒక వయసు మళ్లిన పెద్దాయన ఆదెమ్మను చేరదీసి పెళ్లి చేసుకున్నాడు . ఊర్లోనే ఓ ఇంట్లో వాళ్ళు కాపురం పెట్టారు . ఇకమీదట బుద్ధిగా ఉండాలని నిర్ణయించుకున్న ఆమె కూలీ , నాలీ చేసుకుంటూ భర్తతో ఉండసాగింది . అయితే , ఆమెను తమ కామానికి వాడుకున్న మగరాయుళ్ళు మాత్రం తమ వద్దకు రావాలంటూ వేధించేవాళ్ళు . ఆ ముసలాడు నిన్నేం సుఖపెడతాడంటూ వాళ్ళు చేసే హేళనలకు , వెక్కిరింతలకు కొదవే లేదు . అన్నింటినీ ఆమె ఓర్చుకుంటూ తన దారిన సాగిపోయింది . ఓ సంవత్సరం తరువాత ఆ ముసలాయన ద్వారా ఆదెమ్మ ఓ పాపకు జన్మనిచ్చింది . తన పాపకు ఆమె గిరిజ అని పేరు పెట్టుకుని ఉన్నంతలో అపురూపంగా చూసుకుంది . ఇప్పుడు ఆ అమ్మాయి కోసమే . . . నన్ను ఓ పావడా గుడ్డను ఇవ్వమని ఆదెక్క అడిగింది . గిరిజ పెరిగి పెద్దదయ్యేకొద్దీ , గతంలో తనను చూసిన మగరాయుళ్లు అవే ఆకలి కళ్లతో తన కూతుర్ని కూడా చూడటాన్ని ఆదెమ్మ సహించలేక పోయేది . తన జీవితంలా కూతురి జీవితం పాడు కాకూడదని ఆమె బలంగా అనుకునేది . ఎవడైనా తమ ఇంటివద్దకు వచ్చి తోక జాడిస్తే . . . నోటితోనే కాకుండా , చేతితో కూడా ఆమె సమాధానం చెప్పేది . ఎప్పుడూ ఆదెమ్మ చుట్టుప్రక్కల ఇళ్లవారితో . . " నా బ్రతుకు నా కూతురికి రాకూడదు . కూతురిని కాపాడుకునేందుకు చావనైనా చస్తానుగానీ , ఆ రొంపిలోకి దింపనని " చాలా సార్లు అంటుండేది కూడా . . . ! అదలా ఉంచితే . . . మరుసటిరోజు బోరింగ్ కాడికి మంచినీళ్లకోసం వచ్చింది ఆదెక్క . నేను కూడా అక్కడే ఉండటంతో . . . " అక్కా ఓసారి ఇంటికి వచ్చిపో . . . " అనేసి బిందె నింపుకుని ఇంటికెళ్లాను . నా వెనకే ఆమె కూడా వచ్చింది . " నీకు నచ్చితే తీసుకో , లేకుంటే ఈసారి కొత్త బట్టల జతే ఇస్తాను అని చెప్పి " ఓ కవర్ ఆమె చేతిలో పెట్టాను . కవర్లో ఉన్న లంగా , జాకెట్ , పైట సెట్టును చూసి సంతోషంతో . . . " బాగున్నాయి కొడకా . . . నా కూతురుకు ఇవి బాగుంటాయి కదా . . . ! చల్లగా ఉండు తల్లీ . . ! " అనేసి వెళ్లిపోయింది . నేను కొన్నిరోజులపాటు వాడిన బట్టలను కూడా అంత ఆనందంగా కూతురు కోసం పట్టుకెళ్తోన్న ఆమె కంటే , ఆమెలోని అమ్మతనం నన్ను బాగా కదిలించి సన్నని నీటితెర నా కళ్లను కమ్మేసింది . కొన్ని రోజుల తరువాత . . మా ఊర్లో గంగమ్మ తిరనాల జరుగుతోంది . ఆ తిరనాల సమయంలో ఒక రాత్రి , ఒక పగలు ఊరంతా కోలాహలంగా ఉంటుంది . ఆ రోజు కూడా ఎప్పట్లా రాత్రి గడచిపోయి , పొద్దున్నే తెల్లవారింది . ఏటిదాకా ఫ్రెండ్స్‌తో వెళ్ళిన మా తమ్ముళ్ళు గాబరాగా పరుగెత్తుకుంటూ వస్తున్నారు . ఏమయ్యిందిరా అంటే . . " ఆదెమ్మక్కను ఎవరో చంపేసి నీళ్లలో పడేసారు " అని చెప్పారు . అమ్మా , నాన్న రావద్దని వారిస్తున్నా వినకుండా అందరితో పాటు ఆదెక్కను చూసేందుకు వెళ్ళాను . ఏటి ఒడ్డున పొలాల్లో , ఓ నీటిమడుగులో బొక్కాబోర్లా పడిపోయి ఉందామె . కాస్త పక్కగా ఆమె కట్టుకున్న చీర . . . పువ్వులు . . . పగిలిపోయిన గాజు ముక్కలు . . . పెనుగులాడిన గుర్తులు స్పష్టంగా తెలుస్తున్నాయి . ఎప్పుడు చూసినా అరే , కొడకా , తల్లీ అంటూ ప్రేమగా పిలిచే ఆదెమ్మక్కను అలా చూడగానే నాకు ఏడుపు ఆగలేదు . భోరుమని ఏడ్చేశాను . అన్నింటికంటే అప్పటికీ , ఇప్పటికీ , ఎప్పటికీ బాధించేది ఏంటంటే . . . ఆరోజు ఆదెమ్మక్క శవంగా తేలాడుతున్నప్పుడు ఒంటిపైనుండే జాకెట్ , చీర లోపల కట్టుకున్న పావడా . . . " ఆమె నా దగ్గర కొట్లాడి మరీ కూతురు కోసం తీసుకుంది కదా . . అవే బట్టలతో ఆమెనలా చూడాల్సి రావడం . . . " ఇవన్నీ తల్చుకుంటే మనసు కలుక్కుమంటుంది . పోలీసులు రావడం , పోస్ట్‌మార్టం చేసి ఆదెక్క శవాన్ని ఇవ్వడం జరిగిపోయాయి . అయితే చేతిలో చిల్లిగవ్వలేని ఆదెక్క భర్త , కూతురు ఏం చేస్తారు . ఊరి చివర గానుగ చింతమాను వద్ద శవాన్ని పెట్టుకుని ఏడుస్తూ కూర్చున్నారు . ఆమె బ్రతికుండగా , ఆమె చేత ఎన్నో పనులు చేయించుకున్న ఊరి జనాలంతా . . . చూసి అయ్యో అన్నారే తప్ప . . ఆమె దహన సంస్కారాల కోసం పావలా సాయం కూడా చేయలేదు . మా అమ్మా వాళ్లకు కూడా అప్పట్లో అంత స్తోమత లేదు . నేనేమో చిన్నదాన్ని చూస్తూ ఏడ్వటం తప్ప ఏమీ చేయలేకపోయాను . చివరకు పంచాయితీ వాళ్లే ఆదెక్క శవాన్ని పూడ్చిపెట్టారు . ఊర్లో వాళ్ళంతా తలా ఐదో , పదో వేసుకుని ఉంటే . . . ఆమె దహన సంస్కారాలు అయినా జరిగి ఉండేవి , ఆమె ఆత్మ శాంతించేది కదా . . . ! కన్నీళ్లను కార్చిన జనాలకు కాస్తంత కనికరం కూడా లేకపోయిందే అని అనుకోని రోజు లేదంటే నమ్మండి . ఆ తరువాత కాలంతో పాటు కదిలిపోయిన నేను . . . ఈ మధ్యనే మా ఊరికి వెళ్ళాను . ఎందుకోగానీ ఆదెక్క గుర్తొచ్చి , " అమ్మా . . . గిరిజ ఏమయ్యింది ? " అని అడిగాను . " ఆ అమ్మాయి చేసుకున్న పుణ్యమో , ఆదెమ్మ చేసిన పుణ్యమోగానీ . . ఇద్దరు పిల్లలు , భర్తతో హాయిగా కాపురం చేసుకుంటోంది " అని అమ్మ చెప్పింది . ఆదెక్కను ఎందుకు చంపేశారో ఇప్పటికీ తెలియకపోయినా , కూతురి గురించి ఎవరైనా ఏమైనా అన్నప్పుడు తిరగబడి ఉంటుంది . దాన్ని మనసులో పెట్టుకునే ఆమెను హత్య చేసి ఉంటారని అప్పట్లో ఊరంతా అనుకునేవారు . చివరకు ఆమె ఎప్పుడూ చెప్పేటట్లుగానే కూతురి కోసం తన ప్రాణాలనే వదిలేసి మాట నిలబెట్టుకుంది . ఈ సంఘటన జరిగి ఇప్పటికి ఇంచుమించు 15 సంవత్సరాలు కావస్తున్నా . . . ఇప్పటికీ ఆదెక్క మరణం నన్ను కలచి వేస్తుంటుంది . కూతురి బ్రతుకు తనలాగా కాకూడదని కోరుకున్న ఆమె కన్న కలలు నిజమయ్యాయి . భర్త , పిల్లలతో సంతోషంగా ఉంటోన్న కూతురి కాపురాన్ని పైనుంచి చూస్తూ . . ఆమె కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది . ఏం కొడకా . . . మాకేమైనా ఇచ్చేదుందా ? ఆదెక్క తన జీవితంలో చాలాసార్లు అడిగిన ప్రశ్న ఇది . ఆదెక్కలు , ఇలాంటి తల్లుల కూతుళ్లు లెక్కలేనంతమందే ఉన్నారు మన మధ్యలో . . నిజంగా . . మనం వాళ్లకేమయినా ఇచ్చేదుందా . . . ? !
@ SRRao గారూ ధన్యవాదాలు . వారి పేరున ఖర్చవుతున్న వేల కోట్ల రూపాయలు వృధా అవుతున్న క్రమంలో వారి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న పాలకవర్గాల కుట్రకు ఎందరో మంగన్నలు బలవుతున్నారు . ప్రవీణ్ డాంబరు రోడ్లకు దగ్గరైన అడవులు నాశనమయినా , కొంతమేర మిగిలి వుంది . అలాగే సవర గూడలు నేటికీ అలానే వున్నాయి . మైదానాలకు దగ్గరవున్న వారికే కొంత మేర వేషబాషలు మారాయి . కురుపాం , గుమ్మలక్ష్మిపురం మండలాలలో యింకా అలానే వున్నారు . యిప్పటికీ టెంకపిండి అంబలి తింటున్నారు .
మోహనరావుకి చాలా స్పష్టమైన రాజకీయ అవగాహన వుంది , సామాజిక బాధ్యత వుంది . తన మూలాలు ఎన్నడూ మర్చిపోలేదు . మార్పులు ఒక ప్రాంతానికే పరిమితంగావు . అంతటినీ ఆవరించి అన్నింటినీ కబళిస్తాయి . తను పాత్రికేయుడు . పాత్రికేయ దృష్టి వేరు ; అన్నింటికీ అతి దగ్గరగా వుంచటానికీ , అన్నింటినీ అతి సమీపంలో వుండి గమనించటానికీ అవకాశం వుంది . తన వృత్తిధర్మం చేస్తూనే , సమస్యల మూలాల్ని , కారణాల్ని అన్వేషించే , విశ్లేషించే నేర్పు పాత్రికేయులకుంటుంది . కవిగాబట్టి ఆ చూపు , ఆ విశ్లేషణ అక్కడితోనే ఆగదు - సృజనలోకి ప్రవహిస్తుంది . తన విశ్లేషణలకీ , అంచనాలకీ , వ్యక్తీకరణ లకీ కవిత్వం మాధ్యమమవుతుంది .
ప్ర . మీ " చిలకలు వాలిన చెట్టు " కవితా సంకలనంలో " కవిత్వం " అనే ఖండిక ఉంది . అందులో సుందరి ఇచ్చిన విత్తనాన్ని నాటితే పుట్టిన మొక్క మహావృక్షమైతే ఆ వృక్షమెక్కి మళ్ళీ అదే సుందరిని అన్వేషించినట్లు రాశారు . " కళ కళ కోసం " అన్న భావంతో అలా రాశారా ?
నేనేమి సునీతా కృష్ణన్ కాను . కానీ సునీతా కృష్ణన్ శతృవులలో నేను ఒకడినే . ఇంత వరకూ నేను అచేతనంగానే ఉన్నాను . సునీత నన్ను ఏదో పెద్ద సహాయం చెయ్యమనలేదు కానీ నా ఈ మౌనాన్ని విడనాడమంది . ఇద్దరికి ఈ విషయాన్ని చెప్పమంది . అదే చేద్దామనే ప్రయత్నమే ఈ పోస్టు . నాకు ఉన్న స్టాటిస్టికల్స్ ప్రకారం నా ప్రతీ పోస్టు దాదాపు ఓ వంద మంది చదువుతారు , కానీ అందులోంచి చాలా ( చాలా చాలా , బహు చాలా ) కొద్ది మంది మాత్రమే స్పందిస్తారు . దీని వెనుక కారణం నా ప్రచురణలో సరైన అంశం లేకపోవడం అంతే కాకుండా నేను వ్రాసే విషయాలు పూర్తిగా స్వవిషయం అయ్యి ఉండడమే .
నేను మీకు చెబుతానని మీరు ఇది చదవడం మొదలు పెట్టారు అంటే … మీకు బొత్తిగా బ్లాగ్లోకపు జ్ఞానం లేనట్టే ! ఆ చిట్కాలు అవసరం నాకు వున్నంతగా బహుశా ఇంకెవరికి వుండదేమో ! అంత కోపం నాకు . ఆ కోపం వలన ఎదుటి వారికి ఇబ్బంది వుండవచ్చు గాక ! కానీ ఎక్కువ నష్టపోయెది నేనె ! అసలు బ్లాగింగ్ చేసెది ఎందుకు ? కాలక్షేపానికి కొంతమంది , తమ రచనా పాటవాన్ని ప్రదర్శించడానికి కొంతమంది , సినిమాలకి రాయడంకి ప్రాక్టీసు చేసెవారు కొంతమంది [ . . . ]
మా US కొలీగ్ ఒకతని పేరు QIN అని చూసి క్విన్ అని పిలిచా , వెంటనే అతను క్విన్ కాదు చిన్ అని పలకాలని చెప్పాడు . మరి chin అనే రాసుకోవచ్చు కదా అని అడిగితే , అలా ఎందుకు పిలవాలో తెలుసుకోవడానికి ఈ వెబ్సైటుని చూడమన్నాడు . అది చూసిన తరువాత మా కొలీగ్ ఒకతను ఫిష్ స్పెల్లింగుకు ఈ గతి పట్టించాడు . - F - I - S - H ; - ఇది మనందరికీ గుర్తుకొచ్చే స్పెల్లింగు . - G - H - T - I - O ; GH as in రఫ్ ( rough ) , TIO as in నేషన్ ( NATION ) - - మరి మీకు కూడా ఇలాంటివి ఇంకేమన్నా తెలుసా . . .
మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కను చూపులో కరుణ చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి
ఖీ ప్రపంచంలో అన్ని కీటకాలకీ మీసాలు ఉంటాయి . అవి వాటి సెన్సార్లుగా ఉపయోగించుకుంటాయి . కానీ సాలె పురుగులకు అవి ఉండవు .
నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం . సొంత భాష లో అభిప్రాయాలను వ్యక్తపరచటం సులభం . " లేఖిని " వంటి software సహాయం తో తెలుగు లో బ్లాగ్ తయారుచేయటం నల్లేరు పై నడక అయిపోయింది . ఆందుకు వారికి ఎంతయినా ఋణపడి వుంటాను .
మన రాష్ట్రం లో కూడా ఈ విధంగా ఉత్సవాలు జరిపితే , ముస్లింలు వ్యతి రేకిస్తారని వారి ఓట్లు మనకు రావని ప్రభుత్వ పక్షం అనుకో వడం , ముస్లిం ప్రజల జాతీయతను , దేశభక్తిని , మతసామ రస్య కాంక్షను శంకించడమే అవుతుంది . సెక్యులరిజం అంటే ముస్లింల అప్రకటిత భావాలకు కూడా తలొగ్గడం అనే చెడ్డపేరు రాకుండా ఉండాలంటే , ఈ అరవై ఏళ్ల సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సంవత్సరం పొడుగునా జరుపుకోవడమే మంచిది .
hhaaahaa ! ! ! మాకు నవ్వుల్ని పండించటానికి ప్రతీ రోజూ మీకు ఇలాంటి పిల్ల కష్టాలు ఎదురవ్వాలి అని కోరుకుంటున్నాను ; - )
ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం పరిశ్రమకి సపోర్టు చెయ్యాలి అనీ , పైరసీ ని నిరోధించి , కోట్లలో నిర్మాతలకి వస్తున్న నష్టాన్ని నివారించాలి అనీ కోరితే , మన ము . మం . గారు , ' అలాగే , అలాగే , అలాగలాగే ' అన్నారట .
సుమారు మూడేళ్ళకి సమాధి చుట్టూ ఓ చిన్న ప్రాకారం కట్టారు . దాదాపు పదమూడేళ్ళ వరకూ ప్రతీ ఏటా నాగరత్నమ్మ తిరువయ్యారు వెళ్ళొచ్చేది . 1939లో త్యాగరాజు సమాధి మందిరం నిర్మించాలన్న ఆశయమొచ్చింది . సమాధి కెదురుగా వున్న తోట భూములు తంజావూరు రాజబంధువులైన రాజారాం సాహిబ్ విరాళంగా ఇచ్చారు . ఒక కార్య వర్గాన్ని నియమించి సమాధి మందిరాన్ని కడదామనుకుంది . సమాధిపై రామ విగ్రహం పెట్టాలా ? త్యాగరాజు విగ్రహం పెట్టాలా ? అన్న సందేహం వచ్చి పదిమందినీ సంప్రదిస్తే , త్యాగరాజు విగ్రహం పెడితే బాగుంటుందనీ తీర్మానించారు . ఈలోగా తిల్లైస్థానం వర్గానికీ , ఉమైయాల్పురం వర్గానికీ మరలా గొడవలొచ్చాయి . నాగరత్నమ్మ ప్రవేశంతో ఇద్దరి మధ్యా గొడవలు సమసిపోయి అందరూ కలిసిగట్టుగా సమాధి మందిర నిర్మాణానికీ , త్యాగరాజు విగ్రహ స్థాపనకీ కృషి చేద్దామని నిశ్చయించుకున్నారు . ఆ విధంగా 1939లో త్యాగరాజు విగ్రహ స్థాపన జరిగింది .
హమ్మయ్య ! ! మీ గుండుగొమ్ముల అనుమానమ్ ఇప్పటికైనా తీరీ తీరక తీరినందుకు ఆనందం కలిగింది . సృజనని గురించిన చర్చ సృజన కాదు గనక చర్చకి లోబడని సంగతులు సైతం ఉంటాయి … అని మీ గురువులు మీకు బోధించడం ముదావహం ! ! అంతర్లీనంగా ఉన్న దుఖం సహజమైనదీ . . స్వచ్చమైనదీనూ ! ! ఎవరెంత చెప్పినా చెప్పకపోయినా సృజనకి ప్రేరణ అదే ! ! నామినికైనా ఇంకొకరికైనా కూడా ! ! ఇక మిగిలినవన్నీ రకరకాల ఆర్భాటాలే ! ! పిడికిలి విప్పితే ఏముంటుంది కనక ప్రసాద్ గారూ ? ? ఆస్వాదనకి ప్రమాణమ్ ఆస్వాదన మాత్రమే ! ! మీరు ఆస్వాదించలేనిది మీకు కావలసిన అక్షరం కాదు . బహుశా అది మరొకరికి ఆనందాన్నివ్వవచ్చును . నారాయణరావు గారు చెప్పింది ఇదే ! !
హైదరాబాద్ , మార్చి 11 ( ఆన్‌లైన్ ) : " పార్టీలను మార్చే అలవాటున్న ఉప్పునూతల నేను రాజీనామా చేయాలంటూ సవాల్ చేయడం అర్థరహితం . నేనెందుకు రాజీనామా చేయాలి " - అని మంత్రి దామోదర్‌రెడ్డి అన్నారు . తెలంగాణ అంశాన్ని సోనియా చేతుల్లో పెట్టామని , ఆమె ఇవ్వచ్చు , ఇవ్వకపోవచ్చు , క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని , రాజీనామాలు చేయబోమని స్పష్టం చేశారు . కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు .
ఆస్తికత్వం దృష్టి తో చూసినా , నాస్తికత్వ దృష్టి తో చూసినా , మనం ఒక కారణం లేని మూలానికి వెళ్ళ వలసి వస్తోంది . కాబట్టీ , " ఈ విశ్వం పుట్టుక ( లేక దేవుడు ) కి కారణం లేదు " , అనటం హేతుబధ్ధమే !
పూలతో యెంకి నే పూజింప బోతి యెంకి నిలువున మెరిసె యెవ్వరో రాణి
ఇంకా అలా ఇష్ట పడుతూనే ఉన్నాం ! మరి కొన్ని తరాల నష్టాల కోసం ! ! మరికొన్ని కాలాల తర్వాత వాళ్ళు అచ్చం ఇలాగే . . ఇప్పుడు అందరూ వగచినట్లే ఇలాగే వగచాలని ! ! .
ప్రపంచం చాలా ఫాస్టుగా అభివృద్ది చెందుతుంది అనడంలో ఎటువంటి సందేహాం లేదు . రోజు రోజు ఎన్నో కొత్త టెక్నాలజీలను మొబైల్ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నార . . . టౌన్ హాల్ ట్విట్టర్‌లో ' ఆస్క్ ఒబామా ' లో ఒబామా కౌంటింగ్ మొదలైంది , ఫేస్‌బుక్ యూజర్లు 750 మిలియన్లు
హైదరాబాద్ : భారత మార్కెట్లోకి 5 రకాల రైస్ వెరైటీలను అందిస్తున్నట్టు బెస్ట్ ఫుడ్స్ ప్రకటించింది . కిలో 60 నుంచి 200 రూపాయల రేంజ్‌లో ఇవి వుంటాయని , ఏ విధంగా ఉపయోగించినా , చక్కటి సువాసనతో అన్ని రకాల వంటకాలతూ నప్పేలా వుంటాయని సంస్థ బిజినెస్ డైరెక్టర్ డాక్టర్ ఆయుష్మాన్ గుప్తా వ్యాఖ్యానించారు . బ్రౌన్ రైస్ , ఆర్గానిక్ రైస్‌తో పాటు ప్రీమియం , సెలక్ట్ , స్పెషల్ వేరియంట్లను విడుదల చేశామన్నారు . గడచిన ఆర్థిక సంవత్సరం 1322 కోట్ల రూపాయల టర్నోవర్‌ను నమోదు చేశామని , ఈ సంవత్సరం 25 నుంచి 30 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు . ప్రస్తుతం భారత్‌లో సాలీనా 90 మిలియన్ టన్నుల వరి దిగుబడి అవుతోందని , ఇందులో నాలుగు వేల రకాల గింజలున్నాయని ఆయన తెలిపారు . భారత్ నుంచి రెండవ అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా నిలిచిన సంస్థ నెలకు 45 వేల టన్నుల తయారీ సామర్థ్యాన్ని కలిగిన ప్లాంట్లను నిర్వహిస్తోందని తెలిపారు . రాష్ట్రంలో నెలకు 4 నుంచి 5 వేల టన్నుల బాస్మతీ బియ్యాన్ని వాడుతున్నారని , వీటిల్లో 11 రకాల వెరైటీలున్నాయని వివరిస్తూ , వచ్చే సంవత్సరం ముగిసేలోగా , దేశీయ మార్కెట్లో నెంబర్‌వన్ స్థానాన్ని సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు తెలిపారు .
తియానన్మెం ఊచకోతను మరిచిపోలేం . కాని ఆ అన్రెస్ట్ వెనక అమెరికా వాడి సపోర్ట్ లేదంటారా ? దానిని ఖండిస్తూనే మరి మన దేశంలో ఇందిర హత్య ముందు తరువాత శిక్కుల ఊచకోత , శ్రీలంకలో శాంతిపరిరక్షణ పేరుతో తమిళులపై దాడి , గుజరాత్ లో మంస్లిముల ఊచకోత ఇది గెనోసైడ్ కాదా , ఒక జాతినే నిర్మూలించే కార్యక్రమాలు , అంతెందుకు విజయవాడలో రంగా హత్య తరువాత జరిగిన ప్రాణ - ఆస్తి నష్టాలు , సి . ఎం . మార్పుకొరకు సృష్టింపబడ్డ మతకలహాల మారణహోమం , నేడు మావోఇస్టుల నిర్మూలణ పేరుతో దండకారణ్యంలో జరుగుతున్న ఆదివాసీ మారణకాండ మన ప్రజాస్వామ్య స్వేచ్చా స్వాతంత్ర్యాలకు గుర్తులా ? ప్రశ్నించే వాడిని ఏదో ఒక విధంగా అణచే చీకటి చట్టాలు మన విధ్వంసకర అభివృద్ధి నమూనాలు , సెజ్ లు , ప్రాజెక్ట్ ల పేరుతో నిర్వాసితులను చేస్తున్నా నోరుమెదపని ( లేనితనం ) దేనికి చిహ్నాలు . ఇదికాదా నియంతృత్వం .
వచ్చానా అని నీరసం వచ్చిందతనికి . అర్జంటుగా ఓ ఫ్రెండ్‌తో కలవాల్సిన పనుందని చెప్పి
ఒక తెలుగమ్మాయి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారా . . ? ఎవరికీ తెలిఅయదు అనుకుంటా ఈ విషయం . . ! ఒక మంచి సమాచారం అందించారు దన్యవాదాలు .
సీఐటీయూ జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ నేత కార్మికులకి పూర్తిస్థాయిలో పని ఉండేలా చూడాలి . పవర్‌లూం పరిశ్రమకు కూడా ఆప్కో వంటి సంస్థలను ఏర్పాటు చేయాలి .
మాలమాదిగల మధ్య అంతరాలను , అనాదిగా వస్తున్న పంతాలను , ఆసరాగా చేసుకుని తమ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం అగ్రవర్ణాల వారు ఉపయోగించుకోడం మామూలు కథే అయినప్పటికీ ఏభై ఏళ్ళ కాలాన్ని నవలలో ఇనుమడింపచేస్తూనే గత పదేళ్ళ కాలంలో గ్రామాల్లో చోటుచేసుకున్న పరిణామాలను రికార్డు చేసింది . ( ఎస్ . వెంకట రామిరెడ్డి ) ' ' కాడి ' ' నవల .
ఇప్పుడు కోటేశ్వర్రావు గారి ఊహల్లో ఉన్నారుగా ఇక కధ ఆయనే చెబుతారు .
అంతలో సారా వాళ్ళమ్మొచ్చింది " ఈజ్ షీ బాదరింగ్ యూ ? " అంటూ . లేదనీ , తన మావగారికి కంపెనీ ఇస్తుందనీ చెప్పింది కోడలు .
ఆ j2ee button తీసేద్దురు . చక్కటి కవితల మధ్య పానకంలో పుడకలాగ అది ఎందుకండీ ?
మనవడు : ఒక్క నిమిషం ఆగు . హాల్లో ! ! కిషన్ గంజ్ లోని కాంతీలాల్ గోడ్ బోలే ఎవ్వరికైనా తెలుసా ! !
ఆ పుస్తకాలు ఆయనకి ఏదో అమ్ముడుపోక కాదు , ఏదో తన ఆనందాన్ని ప్రకటించడం కోసం మాత్రమే . అలాగని అక్కడకు వచ్చిన వారందరినీ కొనమనడం లేదు ఆయన . మేము శ్రీ రమణ గారిని కలుసుకొన్నప్పుడు ఆయన సంతకం చేసి ఆయన రచించిన " శ్రీ రామాయణం " ( మూల్యం 116 రూపాయలు ) మాకు జ్ఞాపిక గా ఇచ్చారు . అలాగే శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారు ఆవిడ వ్రాసిన " ఆలింగనం " పుస్తకం సంతకం చేసి ఇచ్చారు . ఆ పుస్తకాలు , మేము వారితో గడిపిన మధుర క్షణాలకి తీపి గుర్తుగా ఉంటాయి .
గజ్వేల్ , జూలై 4 : జిల్లాలోని మెజార్టీ ఎమ్మెల్యేలు పదవులు వదులు కున్నప్పటికి డిప్యూటీ సిఎంతోపాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి , ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్‌లు రాజీనామా చేయకపోవడాన్ని టీఆర్‌ఎస్ శ్రేణులు
అమీరి బరాకా అంటే దట్టించిన ఫిరంగి . అతని కవిత్వంలోని ప్రతీ పంక్తీ వొక రాజకీయ ప్రకటన , వొక ధిక్కార కవితాగ్రహం . ఈ కాలంలో కవిత్వాన్ని అంత బలంగా అంత ఆవేశంగా అంత పొగరుగా రాసిన వాళ్ళు అరుదు . ఇప్పుడు మీరు చదవబోతున్న కవిత అమీరి బరాక అంటే ఏమిటో బలంగా చెబుతుంది . వొక కవి గట్టిగా నిలబడి స్పష్టంగా గొంతు విప్పితే అది ఎంత రాజుకొని నలుదిక్కులూ అంటు కుంటాయో అనుభవంలోకి తెచ్చిన కవిత ఇది . ఈ కవిత అచ్చయాక అమెరికా కంటి మీద కొన్నాళ్ళు కునుకు కరువయింది . ఇవి ఆ దీర్ఘ కవితలోని కొన్ని పంక్తులు మాత్రమె . 1934 లో అమెరికాలోని న్యూ జర్సీ నూవార్క్ లో పుట్టిన బరాక తన కవిత్వం నిండా విప్లవ గాలులని పోత్తంగా వూదిన వాడు . ఎక్కడ విప్లవాగ్నులు రగిలితే అక్కడికి అతని కవిత్వ వాక్యాలు ప్రయాణించాయి . మొత్తం చదవండి »
మాస్టారు , వీటిల్లొ బేంకు , బ్యాంకు , బెంకు , బేంకు ఏది సరైనది . దీనికి ప్రత్యాయామ్న తెలుగు పదం ఉందా ?
1 . జరిగాయి అని ఆరోపించబడిన సంఘటనల పూర్వాపరాలు . అసలు యేమి జరిగింది అన్నదాని గురించి ఆయన యేమనుకుంటున్నాడో ఈవోగారిని ప్రశ్నించి , ఆయన సమాధానాన్ని క్లిప్పింగు చూపించకపోవడం .
పక్కన వొకే వొక కప్పులో మిగిలిపోయిన చాయ్ అతను తాగకుండానే మిగిలిపోయానే అని క్షోభిస్తూ . మంచానికి అటూ ఇటూ సగంలో మూతపడిన వొకట్రెండు పుస్తకాలు రాత్రి ఆ కాస్త సేపూ మేలుకొని వుండి అతనే చదివేసి వుంటే బాగుండు కదా అని లోచదువుకుంటూ . హ్యాంగర్లకి నిశ్శబ్దంగా వేలాడుతున్న మూడు నాలుగు చొక్కాలూ ప్యాంట్లూ తిరిగొచ్చి ఆ దేహం తనలో దూరుతుందా లేదా అన్న ప్రశ్నమొహాలతో - నీ కోసం అంటూ ఎప్పుడో వొక సారికిగాని మోగని గొంతుతో చీకటి మొహంతో నిర్లక్ష్యంగా పడి వున్న సెల్ . ఇంకా అతని శరీరపు అన్ని భాషలూ తెలిసిన కుర్చీ అప్పుడప్పుడూ అతని వొంటరి తలని తన కడుపులో దాచుకున్న టేబులు అతని మణికట్టుని వదిలేసిన గడియారం ఈ రాత్రికి అతను వేసుకొని తీరాల్సిన బీపీ టాబ్లెట్ కంప్యూటరు చుట్టూ పసుపు పచ్చ స్టీకి నోట్ల మీద ఇదే ఆఖరి రోజు అని ముందే తెలియక ఎవరూ చెప్పే వాళ్ళు లేక అతను రాసుకున్న కొన్ని కలలూ కలలలాంటి పనులూ అతని నిశ్శబ్దం చుట్టే తారట్లాడుతున్న అనేక అనాథ ఊహలూ తన చివరి క్షణం ఎలా వుండాలో అతనెప్పుడూ వూహించనే లేదు ఇంత దట్టమయిన ఏకాంతంలో అతనికంటూ వొక్క క్షణం ఎప్పుడూ దొరకనే లేదు . దొరికి వుంటే , ఏమో ఈ ఏకాకి గదిని ఇంకాస్త శుభ్రంగా వూడ్చి పెట్టుకునే వాడేమో ! కనీసం ఆ సగం తిన్న పండు మీదా తన మీదా ఈగలు ముసురుకోకుండా అయినా చూసుకుని వుండే వాడు . కానీ , మరణానికి అంత తీరిక లేదు అదీ ఏకాంతంతోనే విసిగి వుంది విసిగి విసిగీ అదీ హడావుడిగానే వచ్చిందీ , వెళ్లిపోయింది అతని తోడుగా . ఇంకో కంటికి కూడా తెలీకుండా .
అనిమేషస్థితిమాన్పె బిత్తరపుచూ పస్వేదతావృత్తి మా న్పె నవస్వేదసమృద్ధి బోధకళమాన్పెన్ మోహవిభ్రాంతి తో డనె గీర్వాణవధూటికిన్ భ్రమరకీటన్యాయ మొప్పన్ మను ష్యుని భావించుట మానుషత్వము మెయింజూపెట్టెనా నత్తరిన్
వికలాంగుల్ని అవమాన పర్చినా , వారి హక్కులకు భంగం కల్గించినా , అవకాశాలు దక్కపోయినా న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయించవచ్చు . తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తూ పోలీసులకు ఫిర్యాదు రూపంలో చెప్పొచ్చు . అయితే చాలా మంది ఫిర్యాదు చేసేందుకే సాహసించడం లేదు . ఒకవేళ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు . చట్టం ప్రకారం చర్య తీసుకోవాలంటే తమ శాఖ నుంచి ప్రత్యేకమైన ఆదేశాలు ఉండాలంటున్నారు . వికలాంగుల చట్టంపై పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది .
ఈ వేడుకలకు వూహించని విధంగా ప్రతిస్పందన లభించి మిన్నెసొటా రాజధాని మిన్నియాపొలిస్ మరియు ఆ పరిసర ప్రాంతాల నుండి విశేష సంఖ్యలో తెలుగు వారు హాజరయ్యారు . వేడుకలు జరిగిన ఆడిటోరీయం లో వెయ్యి మంది మాత్రమే కూర్చునే వీలుంది . కాని వెయ్యి మందికి పైగ అహూతులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసారు . మిన్నెసోటా తెలుగు అసోసియేషన్ ( TEAM ) మిన్నెసోటా లోని తెలుగు సంఘాల్లొ అతి ముఖ్యమైనది . అమెరికా లోని మిన్నెసోటా రాష్ట్రం లో తెలుగు ప్రజలకు భారతీయ సాంప్రదాయలు ముఖ్యం గా తెలుగు సంస్కృతిని దూరం కాకుండ విశేష కృషి చేస్తూ TEAM అతి ప్రాచుర్యాన్ని పొందింది . ఈ వేడుక తెలుగు సాంప్రదాయ అహ్వాన గీతిక తొ , తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలతో తొ మరియు ఉగాది పచ్చడి తో అత్యంత సాంప్రదాయ బద్దంగా ప్రారంభమైంది . సోషల్ అవర్ నోరూరించే ఫలహారాలతో , అల్పాహార విందుతో ప్రారంభమైంది . వేదిక వద్ద ఎంతో మంది వెండర్లు స్టాల్సును పెట్టి తమ తమ ప్రోడక్త్లను ప్రదర్శించారు . ఆ సందర్భంగా TEAM ఒక చక్కటి పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా వెండర్ల వ్యాపార ప్రకటనలను , డ్రీం మ్యూజిక్ గ్రూప్ కంపోజ్ చేసిన చక్కటి మెలోడి పాటల ను కలిపి ప్రదర్శించారు .
తనకు తెలువకుండనే అన్నీ మర్చిపోయి " బాపూ ! " అని గట్టిగ అరిచిండు స్వామి . ఆయన దిగ్గున స్వామి దిక్కు చూసి ఆనందంతోటి కొడుకును కావలించుకుని వలవల ఏడ్చిసినాడు .
మిలన్ లో అంబ్రోషియన్ రైట్ ( ఇటలీ యన్ భాషలో : రైటో అంబ్రోషియానో ) అనే ఒక చారిత్రాత్మక కాథలిక్ ఆచారాన్ని పాటిస్తున్నారు . ఇది ఒక కాథలిక్ ఆచారానికంటే ( ఇతర అన్ని పశ్చిమ ప్రాంతాలలో పాటించబడుతున్న రోమన్ పద్దతి ) కొద్దిగా భిన్నంగా ఉంటుంది . ప్రార్ధనా పద్దతి లోను సమాహిక ఉత్సవాలలోను కాలెండర్ లోను కొద్దిగా తేడాలు ఉన్నాయి ( ఉదాహరణకు సాధారణ తేదికి కొద్ది రోజులు తరువాత లెంట్ ప్రారంభ తేది ఉంటుంది . అందువల్ల కార్నివల్ తేది మారుతుంది ) . లోమ్బార్డి లోని ఇతర పరిసర ప్రాంతాలలోను మరియు టిసినో లోని స్విస్ తాలూకా లోను ఈ అమ్బ్రోషియన్ ఆచారము పాటించబడుతుంది .
" అయ్యో మర్చేపోయాను చూశారా . ఇవాళ మధ్యానం పడుకున్నప్పుడు ఎవరో చేసారు . బాబిగాడున్నాడా ? అని అడిగారు . లేరూ , ఆఫీసుకెళ్ళారు అని చెప్పాను . లంచికి రాడా , కారీరు పట్టుకుపోతాడా ? అని అడిగారు . అవునన్నాను . అయితే వచ్చాకా వాణ్ణే చెయ్యమను అని నెంబరిచ్చారు . " అంది .
" పోనీ లేవయ్యా ప్రణవ్ , నువ్వు పంపద్దులే వీళ్ళైనా రాసి పంపనీ … "
మరి ఎస్ బ్యాండుకి సంబంధించి , ఓ రెండు లక్షల కోట్లట ! ఆ శాఖకి మంత్రి ఆయనేనట ! 2005 నించో యెప్పటినించో ఆ వ్యవహారం జరుగుతుంటే , ఇప్పుడింకా ఆ వొప్పందాన్ని రద్దు చెయ్యాలా వద్దా అని కమిటీలు వెయ్యడం లోనే వున్నారు . పైగా కాంట్రాక్టు రద్దు చేస్తే వాళ్లకి నష్టపరిహారం ఇచ్చుకోవద్దూ ? అని ఓ వాదన !
రతిలో ఎక్కువకాలం పాల్గొనక పోవడం వల్ల మానసిక అశాంతి కలిగే …
@ మహేష్ గారు హిందూ మత ప్రచారం జరగడం లేదని ఎవరు అన్నారు ? జరుగుతుంది . . కానీ హిందూ మతంలోకి మార్పిడి చేసే ప్రచారం జరగడం లేదు . రెండిటికీ తేడా కనబడటం లేదా మీకు ? మతాన్ని తీసుకెళ్ళి సైన్సుతో ముడి పెట్టి తేడా ఉండకూడదు అనడం ఈ టపాలో లేవనెత్తిన సమస్య మీద చర్చని తప్పుదారి పట్టించడమే అవుతుంది . మతం అనేది విశ్వాసాలమీద నిర్మితమవుతుంది . . . సైన్సు మౌళికంగా విశ్వాసాన్ని ఎద్దేవా చేసి భౌతికమైన కొన్ని నిజాన్ని చాటడానికి ప్రయత్నిస్తుంది . బౌతికమైన ఆ నిజాన్ని కనుక్కోడానికి చర్చ , వాదన అవసరం . ఒక్కోసారి అదే నిజాన్ని కనుక్కోవడానికి చాలా మార్గాలు వుండవచ్చు . . . మతం అనేది బౌతికమైనది కాదు . ఎవరి విశ్వాసాలు వారివి , ఎవరి మతం వారిది . ఇక్కడ ఎద్దేవా చెయ్యడం , disprove చెయ్యడం అనేదాన్ని ప్రోత్సహించడమే రోతగా ఉంది వినడానికి . మీరేమైనా ప్రపంచానికి ఒకే మతం ఉండాలి అనే లక్ష్యాన్నేమైనా ఎంచుకున్నారా ? ఎంత సమన్వ్యయపరుచుకుందామన్నా , అసలు మీరు ఈ వ్యాఖ్య ఈ టపాకి ఎందుకు రాసారో అర్ధం కావడం లేదు . అసలు అవసరం లేదేమో అని కూడా అనిపిస్తుంది . అజ్ఞాత గారన్నట్టు ప్రతీ మతం లోను వర్గాల మధ్య రక్తపాతం జరిగింది జరుగుతుంది . . ఇస్లాంలో షియాలు సున్నీల మధ్య , వివిధ తెగల మధ్య . . , సిక్కు మతంలోనూ జరుగుతున్నాయి . . .
జ్యోత్స్నాంశాకర్షపాణ్డుద్యుతి తిమిరమషీశేషకల్మాషమీష జ్జృమ్భోద్భూతేన పిఙ్గం సరసిజరజసా సంధ్యయా శోణశోచిః ప్రాతఃప్రారమ్భకాలే సకలమపి జగచ్చిత్రమున్మీలయన్తీ కాన్తిస్తీక్ష్ణత్విషోక్ష్ణాం ముదముపనయతాత్తూలికేవాతులాం వః 26
నా అభిమాన సంగీత దర్శకుడు రెహమాన్ కి ఆస్కార్ రావడం సంతోషంగానే ఉన్నప్పటికీ మనవాళ్ళు చేస్తున్న హడావిడి చూస్తే చిరాకేస్తుంది . ఆ వచ్చిన ఆస్కారేదో మన భారతీయ సినిమాకి వచ్చినంత సంబరపడడం బాలేదు ( నచ్చలేదు ) . నిజానికి ఇప్పుడు అవార్డందుకున్న " జైహో " పాట కన్నా , అత్యుత్తమమైన గీతాలెన్నో రెహమాన్ స్వరపరిచాడు . ఈ గీతానికి అవార్డొచ్చిందని వినగానే , అంతర్జాలంలో వెదికి మరీ విన్నాను . ఫరవాలేదు బాగుందనిపించినా , ఆస్కార్ పరిశీలకుల బృందాన్ని తలచుకుంటే జాలేసింది . దీనికే ఆస్కార్ ఇస్తే మరి తను స్వరపరిచిన రోజా నుంచి ఘజిని వరకు వినిపిస్తే , ఎన్ని ఆస్కార్ లు ఇచ్చెవాల్లో , లేదంటే ఆస్కార్ కన్నా పెద్దదైన అవార్డేదైనా కనిపెట్టి ఇచ్చేవారేమోనని నవ్వొచ్చింది .
నాగరత్నమ్మ కన్నడ దేశములో పుట్టి తన మాతృభాషయైన కన్నడమును మాత్రమే కాక సంస్కృత , తెలుగు , తమిళ భాషలలో ప్రావీణ్యమును గడించినది . ఈ భాషలలో గల పుస్తకాలను కూడ చదివింది . ఆమెకు తెలుగంటే చాల ప్రీతి . ఆమె నోటినుండి వచ్చిన పలుకులు ఇవి - " నేను చిన్ననాటనుండియు సంగీత విద్యతోబాటుగా సాహిత్యవిద్యయందు గూడ కొంచెము పరిశ్రమ చేయుచు మా దేశభాషయగు కన్నడములోను , తెలుగులోను పెక్కు గ్రంథములు చదివితిని . తరువాత బెంగళూరినుండి యీ చెన్నపట్టణమునకు వచ్చినది మొదలుగా నరవములో కూడ ననేకగ్రంథములు చదువుచుంటిని . అయినను నా కాంధ్రభాషా గ్రంథములయందు గల యభిరుచి పై భాషలలో నంతగా లేకపోయినది . ఇట్లుండగా వేలాంవెర్రి అను సామెతగా చాల దినములనుండి తెలుగు బాసలో కవిత్వము చెప్పవలయునను కుతూహలము కూడ కలిగి పట్టుదలతో మరల భారతాదిగ నాంధ్ర గ్రంథములు చదివితిని . " తిరుపతి వేంకటేశ్వరకవులు రచించిన శ్రవణానందము అనే పుస్తకములో రాధికాసాంత్వనపు ప్రసక్తిని చదివి ఆ పుస్తకమును కొని చదువగా అందులోని తప్పులను చూచి చాల బాధ పడింది . సి పి బ్రౌన్‌దొరవంటి వారికి కూడ ఈ గ్రంథము ప్రియతమమైనదే . వేంకటనరసు దీనిని 1887లో ప్రచురించాడు , కాని అవతారికను , కొన్ని పద్యాలను పుస్తకమునుండి తొలగించాడు . ఆమె స్నేహితులొకరు తన ప్రతిని పంపగా దానిని చదివిన పిదప ముద్రిత ప్రతికి దీనికి గల భేదములను గమనించింది . అచ్చు ప్రతిలో కొన్ని పద్యాలే లేవు . ఆంధ్రకవుల చరిత్రలో రాధికాసాంత్వనము గురించి వీరేశలింగము పంతులు తప్పు తప్పుగా వ్రాసినది ఈమె గమనించింది . పళని తల్లి పేరు ముత్యాలు అని వీరేశలింగం అనుకొన్నారు . ముత్యాలు అన్నది తండ్రి పేరు . అదీగాక పంతులుగారు " గ్రంథములోని భాగము లనేకములు స్త్రీలు వినదగినవియు , స్త్రీనోటినుండి రాదగినవియు గాక దూష్యములైయున్నవి " అని రాశారు . హంసవింశతి , వైజయంతీవిలాసము , తారాశశాంకము మున్నగు పుస్తకాలలో కూడ " దూష్యములగు " పద్యాలున్నాయి . అంతకంటె ఎక్కువ రాధికాసాంత్వనములో లేదు . కాని వాటిని రాసిన కవులు పురుషులు , అయితే దీనిని రాసింది ఒక స్త్రీ , అందులో ఒక దేవదాసి కూడ . పంతులుగారి " రసికజనమనోరంజనములోని బూతులకన్నను నిందు పచ్చి బూతులు కంబట్టుచున్నదా " అని నాగరత్నమ్మ ప్రశ్నించింది . " ఈ గ్రంథము రస మొల్కుచుండుటచేతను , ఇది రచించినది స్త్రీయేగాక మాజాతిలో పుట్టిన దగుటచేతను దీనిని మంచి ప్రతిగా ముద్రింప వలయునను తలంపుతో వ్రాతప్రతిని ముద్రిత పుస్తకమును సరిచూచి నా మనసున కింపైన పాఠమునుంచి యొక ప్రతి పని బూని వ్రాసితిని " అని ప్రస్తావనలో మార్చి 9 , 1910 ( సౌమ్య సంవత్సర మహాశివరాత్రి ) నాగరత్నము పలికింది . దీనిని వావిళ్ళ వారు ప్రచురించారు . జనుల శీలానికి , ధార్మిక వ్యవస్థకు ఈ పుస్తకములోని బూతు పద్యాలు అడ్డు తగులుతాయని 1911 లో పోలీస్ కమిషనర్ కన్నింగ్‌హాం ప్రతులను జప్తు చేయగా , వావిళ్ళ సంస్థను బూతు పుస్తకము ప్రచురించారని ప్రభుత్వము అభియోగము చేసింది . ప్రసిద్ధులైన కవులు , పండితులు , న్యాయవాదులు వావిళ్ళ వారి తరఫున అర్జీ పెట్టుకొన్నారు . అయినా బ్రిటిష్ ప్రభుత్వము తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నది . వావిళ్ళ దుకాణాలపై దాడి 1927లో జరిగింది . ఈ కేసును గురించిన వివరాలను వావిళ్ళవారి రాధికాసాంత్వన ప్రతి చివర గల అనుబంధములో చదువ వీలగును . చివరకు భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చిన తరువాత టంగుటూరు ప్రకాశం పంతులు మదరాసు రాజధాని ముఖ్యమంత్రి అయ్యారు . అప్పుడు , అంటే సుమారు 36 సంవత్సరాలకు పిదప ఈ బహిష్కారము తొలగించబడినది . ఆ సమయానికి నాగరత్నమ్మ తిరువైయ్యారులో ఒక యోగినిగా మారింది . మచ్చుకు కింద రాధికాసాంత్వనమునందలి నిషేధించబడిన ఒక పద్యము -
ఇదేదో తోడికోడళ్ళు సినిమాలో పాటగురించి వ్యాఖ్యానం అనుకోకండేం . ఈ పాట పాడుకోవడం కోసం , సావిత్రి , నాగేశ్వర్రావు లాగ పొలాల్లోనే పనిచేయఖ్ఖర్లేదు . మామూలుగా ఇంట్లో కూడా పనిచేస్తూ పాడుకోవచ్చు . మనసుండాలంతే . ఇంట్లో ప్రతీ పనీ పెళ్ళామే చెయ్యాలంటే కుదరదుగా మరి . ఈ మధ్య ఓ నాలుగురోజులు , మా ఇంట్లోనే ఉండవలసొచ్చిందని వ్రాశానుగా , ఆ సందర్భంలో ప్రతీ రోజూ మా నవ్య స్కూలు బస్సెక్కేటప్పుడు , నేను కూడా వెళ్ళేవాడిని . తనకి బై చెప్పినట్లుంటుందీ , అదే బస్సులో వచ్చే మా తాన్యా , ఆదిత్య లను చూసినట్లుంటుందీ అని .
> > మిమ్మల్ని సమర్ధించారని అర్థం చేసుకోవాలి కళ్ళు తెరిపించారు బాబూ తెరిపించారు : D
మీరిచ్చిన లంకె కూడా మైన్‍ఫీల్డ్ నే ఇన్స్టాల్ చేస్తుందే ? నేనదే వాడుతున్నా ఇంతకు ముందు కూడా . మీరిచ్చిన లంకె నుంచి ఇన్స్టాల్ చేసినది కూడా మైన్‍ఫీల్డ్ నే ఇన్స్టాల్ చేసింది , అందులోనూ నాకు తెలుగు సరిగా కనిపించట్లేదు .
పశ్చిమ బెంగాల్ లో కటిక పేదఱికం తాండవిస్తుందని నాకు తెలుసు . కాని మఱీ ఇలా మనిషిని మనిషే పీక్కుతినేటంత స్థాయికొచ్చిందా ? అని నా సందేహం . ఆ రాష్ట్రాన్ని నేను ౧౯౮౨ లో సందర్శించాను . అక్కడ అడుక్కునేవాళ్ళ తాకిడికి పుంజాలు తెంపుకుని పరిగెత్తాల్సి వచ్చింది . ఆ రాష్ట్రపు భౌగోళిక విస్తీర్ణం మన రాయలసీమంత ఉంటుంది . కానీ దరిదాపుగా ఆంధ్రప్రదేశ్ తో సమానమైన జనాభా ఉంది . అయితే అక్కడున్నవి రాయలసీమలా నాలుగు జిల్లాలు కావు . చాలా జిల్లాలున్నాయి . ఒక్కొక్క జిల్లాలోను కనీస జనాభా పరిమాణం కోటికి తగ్గదు . అంత జనాభా ఉన్నచోట పేదఱికం సహజం . అంత పేదఱికం ఉన్నచోట సమష్టి ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదు . కాని రాజకీయాల అభివృద్ధికి మాత్రం ఢోకా ఉండదు . ముఖ్యంగా చల్లని , చీకటి , ముఱికి ప్రదేశాల్లో ఎలుకలూ , బొద్దింకలూ పెంపొందినట్లుగా పేదఱికం ఉన్నచోట కొన్ని సిద్ధాంతాలు ఏపుగా వర్ధిల్లుతాయి . హిట్లర్ లాగే వాళ్ళు కూడా పేదఱికాన్ని , ఆర్థిక సంక్షోభాల్ని సాకుగా చూపించి అధికారంలోకొస్తారు . ఆ తరువాత అదే అధికారం కోసం ఆ పేదఱికాన్ని నిరవధికంగా కొనసాగిస్తారు . పశ్చిమ బెంగాల్ లో దశాబ్దాలుగా జరుగుతూ వచ్చింది ఇదే .
ఏదో పాపం పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారని వదిలేయక ఇలా వాళ్ళ గురించి రాస్తారా ? ఆయ్ . . .
ధర్మా రావు గారు జీవితపు అభివ్యక్తులన్నింటి ఎడా సరి సమానమైన అభిరుచి పెంచుకున్నాడు . ధర్మ కాటాలా సమతుల్యంగా నిలిచాడు . ఏ ఒక్కవేపుకీ మొగ్గిపోలేదు . జీవితం బహుముఖమైనది . అన్నీ అనుభావ్యాలే . సాహిత్యం , సంగీతం నాటకం , రాజకీయాలు , సాంఘికోద్దరణ , మిత్రులతో స్నేహం , చతుర సంభాషణ - జీవితం అందించే ఏ చషకమూ తిరస్కరణీయం కాదు , అన్నీ అనుభోగ్యాలే . ధర్మారావు గారు జీవితాన్ని ఒక కళగా పరిపూర్ణంగా జీవించడం నేఏర్చుకున్నారు .
ప్రత్యేక సాంకేతిక అంశాల్లో ప్రవేశించాలనుకునేవారు సంబంధిత శిక్షణ పొందాల్సివుంటుంది . విద్యాసంస్థలే కాకుండా కొన్ని పెద్ద ఆస్పత్రులు కూడా శిక్షణ సంస్థలను నడుపుతుంటాయి . భౌతిక , రసాయనశాస్త్రాలను ఐచ్ఛిక సబ్జెక్టులుగా చదివేవారికి ఆరోగ్యరంగంలో విస్త్రత అవకాశాలుంటాయి . ఇంటర్మీడియట్ / గ్రాడ్యుయేషన్ / డిప్లొమాలు పూర్తిచేసినవారు ఆసక్తి , సేవాదృక్పథం ఉంటే స్థానిక ఆస్పత్రి , క్లినిక్ , ఆరోగ్యశాఖలో స్వచ్ఛందంగా పనిచేయవచ్చు . ఈ అనుభవం భవిశ్యత్తుకు సోపానంగా మారుతుంది .
" రామరాజు రమాకాంతరావు " మా స్వర్గీయ నాన్న గారి పేరు . ఆయన ఒక టీచరు . యెందరికో మార్గదర్శకులు , యెందరికో విద్య అనే వెలుగుని ప్రసాదించినవారు . ఒక లెక్కల మాష్టారు ( School Asst ) గా చాలా ఖ్యాతి గడించారు . ఆయన మొట్టమొదట దాచేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో లెక్కల బి . ఇడి గా , అటుతర్వాత పిడుగురాళ్ళ , మోర్జంపాడు , సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలల్లో లెక్కల బి . ఇడి గా పని చేసారు . చివరిగా నిడమర్రు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల కి ప్రధానోపాధ్యాయుడు గా పని చేసి , 2000 లో స్వచ్ఛెంద పదవీవిరమణ చేసారు . 2005 ఆగష్టు లో పరమపదించారు . ఒక ఉపాధ్యాయుడుగానేకాకా ఒక విశాల ధృక్పదంగల వ్యక్తిగా ఆయన కమ్యునిజం వైపు మొగ్గుచూపి కమ్మ్యునిష్టు పార్టీ అనుభందసంస్థ ఐన United Teachers Fedaration లో చేరి ఉపాధ్యాయ కులానికి సేవలు చేసారు . యెన్నో ఉపాధ్యాయ పోరాటాల్లో పాల్గొన్నారు . ఆయన నాకు తండ్రి , గురువు , దైవం . ఈ బ్లాగు మా నాన్నగారికి అంకితం
కానీ దశరథ రామయ్య పక్కా వ్యాపారి . వివేకానంద కుటుంబానికున్న ఆదర్శాలు , ఉత్తమ ఆలోచనలు , ఉన్నత లక్ష్యాలు అతనికి లేవు . దాంతో నెమ్మదిగా తరతరాలుగా వస్తున్న పద్దతులను ఒక్కటొక్కటిగా మార్చి తనకు లాభకారిగా తోచిన పద్దతులను ప్రవేశపెట్టసాగాడు . వివేకానంద , రామకృష్ణలు పట్టణంలో చదువుకోవటంతో , సరోజినమ్మ అన్నయ్యను ధైర్యంగా వ్యతిరేకించలేకపోవటంతో దశరథ రామయ్యకు అడ్డుపెట్టేవారు లేకపోయారు . దాదాపుగా ఇరవై ఏళ్ళు ఆప్రతిహతంగా ఆయన హయాం సాగటంతో పాఠశాల రూపురేఖలు మారిపోయాయి . ' విద్యా భారతి ' పేరు తప్ప దాన్లో పాతది అన్నదేదీ మిగలలేదు .
మా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా , చెయ్యేరు అగ్రహారంలో ఏప్రిల్ 9 వతేదీన మానాన్న గారి జ్ఞాపకార్ధ కూటమి జరిగింది . ఈ సందర్భంగా నలుగురు ఫాస్టర్స్ జ్ఞాపకార్ధ కూటమి లో పాల్గొన్నారు . బైబిల్ వాక్యాన్ని వివరిస్తున్న ఒక ఫాస్టరు గారు .
మా నాయన బెండకాయలు కోసి , తమేటాలు , బెండకాయ ముక్కలు , పచ్చి మిరపకాయలు , ఉల్లిగడ్డలు ఓ కుండలో బేసి ఇన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టినాడు . ఇంతలోపల బియ్యం కుతకుతమని ఉడికి అన్నమయితాంది . గంటె తీసుకోని అన్నంలో పెట్టి కెర్లగిచ్చి . కొత్తబియ్యమయిందాన ఒక్కరవ్వ ఎసురు ఎక్కువయిందాన్నేమో అన్నం గంజి గంజి అయింది . మా నాయనకు జూపిచ్చే కాసేపుంటే ఇగురతదిలే అని పొయిమిందనించినాడు .
ఆధునిక కాలంలో పద్యానికి సమాంతరంగా స్వేచ్ఛా కవిత్వం లేదా వచన కవిత్వం ఈరోజుల్లో బాగా వ్యాప్తిలో ఉంది . ఎంతో విస్తృతిని పొందింది . ఈ ప్రక్రియ సమాజంలో అన్ని తరగతులకు చెందిన వారినీ వయోభేదం లేకుండా స్వేచ్ఛా పథంలో కవితా రచనకు ప్రేరేపిస్తూంది . దీని అస్తితకు సంబంధించిన ప్రధానమైన లక్షణాన్ని సమాలోచనానికి ఉపకరించే పద్ధతిలో ఒక ప్రణాళిక అవసరం . ఇది ఈ ప్రక్రియ గురించి అభిమానులకూ , అభిలాషులకూ అవగాహనకు తోడ్పడుతుంది . ఇది నిస్సందేహంగా సమాలోచనా ప్రక్రియను సమృద్ధం చేస్తుంది . స్వేచ్ఛా కవిత్వానికి సంబంధించిన సమాలోచనా ప్రణాళికలో మొదట పేర్కోదగింది , సృజన క్రియలో ' ్భవస్థానం ' వౌలికమైంది . ఆరంభ మనోదశకు చెందింది . దీనికి ఆలంబనం సమాజం . కవి ముందున్న సమాజ స్థితిగతులూ ఎదుర్కొనే జీవిత సమస్యలూ వ్యక్తి వికాసం విశ్వభావన రూపాలూ ప్రేరణ భూమికలుగా పనిచేస్తాయి . వీటికి సంబంధించిన ఆవిష్కారాలతో భావస్థానం ప్రత్యేకతను కలిగింది . దీనికి సంబంధించిన భావ ప్రసారం భావ ప్రకాశం రచనకు జీవశక్తినిస్తూంది . ఈ భావ ప్రపంచంలో ఒక విధం భావనల్లో దేనికది ప్రత్యేకతను కలిగి ఉండడం . విషయం సూత్ర రూపంలో ఉంటుంది . ఇది సూచనగానో అంతర్నిహితంగానో అదృశ్యంగా ఉండడంవల్ల పాఠకులకు అందని స్థితి ఏర్పడుతుంది . అస్పష్టత అనిపిస్తుంది . మరోవిధం వివిధ భావనలు పరంపరగా ఏర్పడతాయి . ఒకదాని తరువాత మరొకటి సూక్ష్మమైన సంబంధం కలిగి ఉంటాయి . ఈ విషయంపై దృష్టి పడకపోవడంవల్ల పాఠకులకు అన్వయ లోపంగా కనిపిస్తుంది . ఈ రెండు విధాలూ భావపరంగా లోపాలుగా ఎత్తి చూడడం జరుగుతుంది . అయితే ఈ పద్ధతి పరిచయంలో కవి ఉద్దేశాన్ని గ్రహించడం కష్టమేమీ కాదు . ఇది అభివ్యక్తితోనూ సంబంధం కలిగింది . రచనలో సంక్లిష్టత గుప్తత వ్యంజకత చేతనే కవిత్వం ఉత్తమస్థాయిని పొందుతుంది . ఇంకా వివిధ భావనలు ఒకదానితో మరొకటి కూడుకుని ఒక దానిలో మరొకటి చొచ్చుకుని విరామం లేని ' ్భవ సంశ్లిష్టత ' లోను క్లిష్టతకవకాశం ఉంది . ఇది సృజన క్రియలో అత్యంత వేగ తీవ్రతవల్ల ఏర్పడుతుంది . సంయమనంతో వివేచనంతో దీన్ని నియతం చేయవచ్చు . ఇవి ఈనాడు స్వేచ్ఛా కవిత్వం ఎదుర్కొనే సమస్యలు . మరో విషయమేమంటే ఈ ప్రక్రియలో నియమ నిబంధనలు లేని కారణంగా విస్తరణం చోటు చేసుకునే అవకాశం కలుగుతుంది . అందువల్ల కవి రచనా సందర్భంలో చాలా మెలకువతో వర్తించవలసి ఉంటుంది . దీనికి సంయమనంతో కూడిన ' శిల్ప దృష్టి ' అవసరం . కొన్ని సందర్భాల్లో అనుకోకుండా సహజంగా సృజన రూపంలో భాగమయి కవి ప్రతిభ చేత దానికది శిల్పవంతంగా సిద్ధిస్తుంది . కొన్ని సందర్భాల్లో కవి నిపుణత చేత రాబోయే స్థితిని కనిపెట్టి శిల్పత్వాన్ని సాధించడమూ జరుగుతూంది . ఏదయినా భావ స్థానాన్ని ఆశ్రయించి మాత్రమే జరుగుతుంది . దృశ్యానికీ సన్నివేశానికీ దారి తీస్తుంది . వర్ణనతో , చిత్రణతో , వివరణతో , ప్రకటనతో ఆవిష్కృతమవుతుంది . ప్రతిభచేత స్థాయి భేదం సిద్ధిస్తుంది . ఇది విశ్వజనీన మైంది . ఏభాషలోనయినా అనువాదానికి వీలైంది . ఈ భావ ప్రసార ప్రకాశ రూపాలు వీటికివిగా ఆకర్షిస్తాయి అలరిస్తాయి . రెండోది ' అభివ్యక్తి విశేషం ' . ఇది భావ ప్రపంచాన్ని వహించే భాషలో శబ్ద శక్తికి సంబంధించింది . దీనిపాత్ర ప్రత్యక్షంగా అమేయమైంది . భాషా విషయంలో జాగ్రత్తగా లేకపోతే స్వేచ్ఛా కవిత్వంలో విస్తరణ రూపం పెరుగుతుంది . ప్రకటన గుణం అధికమవుతుంది . సంక్లిష్టత గుప్తత వ్యంజకతకు క్షతి ఏర్పడుతుంది . కవిత్వంలో స్థాయి క్రింది జారుతుంది . శబ్దశక్తిమయమయి భాష కవిత్వానికి ప్రవేశ ద్వారం . ఇది దాటగానే లోపలనున్న అర్థ నిలయంతో పరిచయ మేర్పడుతుంది . అభివ్యక్తి సుందరత ఒక కళ . అభివ్యక్తి ప్రత్యేకత ఒక నిపుణత . ఇది సృజన రూపానికి ఆకర్షణీయతను ఇస్తుంది . దీనికొక స్థిర రూపమంటూ లేదు . స్వేచ్ఛా కవిత్వంలో కవి కళాత్మక దృష్టిపై ఆధారపడింది . ఒక్కొక్క కవిలో ఒక్కొక్క విధమయిన అభివ్యక్తి విశేషం . సమాలోచనంలో కనిపిస్తుంది . ఏ కవి కృతీ మరొకరి కృతిలా ఉండదు . ఒక కవి కవిత్వ వెనుక నుండి ఎన్నో విషయాలతో కూడిన సృజన శక్తి పని చేస్తుంది . ఈ అంశాలన్నీ మరో కవిలో సమకూరడం జరగదు . పైగా ఏ నియమ నిబంధనల్ని ఆశ్రయించని స్వేచ్ఛా కవిత్వంలో ప్రతి కవి రచన ఒక స్వతంత్ర రూపం భావస్థానంలో అమూర్తంనుండి మూర్తానికి పరిణమింపచేసే అభివ్యక్తి విశేషం రచనలో కళాత్మకమయిన పూర్ణతకు దోహదం చేస్తుంది . ఇందులో విషయం వివరణంతో సంభాషణతో వర్ణనతో చిత్రణలో ప్రకటనలో ప్రత్యేక గుణంతో అలరిస్తుంది . ఈ సమాలోచనం సూక్ష్మస్థాయికి చెందింది . దీనికి మరో సందర్భం అవసరమవుతుంది . మూడోది ' సామాజిక రాజకీయ సాంస్కృతిక దార్శనికత ' కు చెందింది . ఇది ఎంతో విశాలమయిన నేపథ్యంగా ఉపయోగపడుతూంది . స్వేచ్ఛా కవిత్వంలో జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ స్థానీయ భూమికల్ని ఈనాడు వస్తున్న రచనల్లో స్పష్టంగా గుర్తించవచ్చు . ప్రజాస్వామ్య వ్యవస్థలో లభిచే అవకాశాలు కారణంగా వైవిధ్యం ఏర్పడుతూంది . వివిధ వాదాలూ అభిప్రాయాలూ పార్టీల వైఖరులు సిద్ధాంతాలు విరివిగా కనిపిస్తాయి . ఈ లక్షణంలో కొందరిలో నిబద్ధత , కొందరిలో తటస్థం , కొందరిలో మద్దతు , కొందరిలో సానుభూతితో వివిధ స్థాయిల్లో పాత్రలు , ఈ కవిత్వంలో చలన శీలతను నిలుపుతున్నాయి . ఇది కవుల ప్రత్యక్ష సంబంధం మొదలుకుని ఆదర్శాల ప్రకటనం వరకూ వ్యాప్తమైంది . ప్రజాస్వామ్య ప్రక్రియకు అనుబంధంగా మానవ హక్కుల వేదికలూ పౌర సంఘాలూ సంస్కరణ ప్రగతి సమితులూ స్వేచ్ఛా కవిత్వంలో పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ మలుపులకు కారణమైనాయి . సామాజిక , రాజకీయ , సాంస్కృతిక , దార్శనికత స్వేచ్ఛా కవిత్వాన్ని కొత్త ప్రభావ శక్తితో నడిపించింది . నాలుగోది ' ' జీవిత వాస్తవం - మానవీయ భావన ' స్వేచ్ఛా కవిత్వంలో విశిష్టమయిన స్థానాన్ని కలిగింది . స్వేచ్ఛా కవిత్వం అస్తిత్వానికి కీలకమైంది . వస్తు విషయాల గౌరవంతో శిఖరాయమాణమయింది . ఇందులో లౌకిక జీవితంలో వాస్తవ స్థితులకు ప్రాధాన్యం ఉంటుంది . వ్యక్తి వికాసంతోపాటు సమాజ ప్రగతిగుణం ఉంటుంది . విశ్వ హృదయంతో మానవీయ భావన వివిధ స్థాయిల్లో వర్తిస్తుంది . ఈ లక్షణంలో జీవిత గమనంలో తాత్త్విక ద ర్శనం విశ్వమయంగా ఉంటుంది . మానవ చరిత్ర పరిణామం వికాసం - పురోగమనం స్థానాలపై వెలుగు ప్రసరించడం జరుగుతుంది . 1 వ్యక్తిస్థాయినుండి సమాజ స్థాయి వరకూ 2 . ప్రాక్ జీవనంనుండి ఆధునిక జీవితం వరకూ 3 . జీవితంలో మానవీయమయిన స్థూల సూక్ష్మ భేదాల వివేచనమూ 4 . హేతువూ వివేకమూ జోడించిన ఆలోచనతో వ్యక్తి జీవితమూ మానవ స్వరూపమూ కవిత్వంలో చోటు చేసుకుంటాయి . పద్యంనుండి వేరయిన అస్తిత్వాన్ని భావింపచేసేవిగా , ఈ నాలుగు లక్షణాలూ ఒక్కొక్క విధంగా స్వేచ్ఛా కవిత్వంలో పరిశీలనకందుతాయి . 1 . ్భవస్థానం 2 . అభివ్యక్తి విశేషం , 3 . సామాజిక రాజకీయ సాంస్కృతిక దార్శనికత , 4 . జీవిత వాస్తవం - మానవీయ భావనతో ఏర్పడిన ప్రణాళిక ఈ సమాలోచనా ప్రక్రియను సమృద్ధం చేసేందుకు మాత్రమే సిద్ధం చేయబడింది .
Download XML • Download text