tel-30
tel-30
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
లేదు ఉమ గారు . . నేను వ్యక్తిగతం గా నా అనుభవాలతో క్రోడీకరించటం లేదు . . ఏమిటో మన వాళ్ళు అని చురుక్కుమంది . . మీరు చెప్పినవాటిలో నేను చెప్పినవాటిలో కొన్నిటిని ఐనా ఈ సుధీర్ఘ అమెరికా యాత్ర లో అందరు చవి చుసే వుంటాము . : - ) సరే ఈ వాదనలకు ఏమి కాని చాలా చాలా నచ్చిందండి మీ బ్లాగ్ . . సరళమైన శైలి .
వెన్నెల ఉందో లేదో చంద్రుడు ప్రత్యేకంగా చెప్పాలా నమ్ము ప్రియా , నీ ప్రేమ కంటే నిషా విశ్వంలోనే లేదు
ఈ నెల 11న జగ్గంపేటలో లక్షలాది మంది ప్రజల మధ్య జరిగే భారీసభలో జగన్ పార్టీలో చేరబోతున్నట్లు . . . . .
వెచ్చని నిద్ర దుప్పటి కప్పేసుకొని , రాత్రంతా కమ్మని కలలు కన్న తరువాత , బధ్ధకపు పొరలు నెమ్మదిగా విడేలా పాదాలు ఒత్తుతూ , " అమ్మలూ , లేమ్మా . . " అని ఓ మేఘ గంభీరమైన గొంతు లాలనగా మేలుకొలపడం కంటే శుభోదయం ఏముంటుంది ? " ఊ . . " కళ్ళు తెరవకుండా ఇంకో మాట కోసం ఎదురుచూసేదాన్ని . " ఇలా ఆరయ్యే దాకా పడుకుంటే ఎలా ? రేపటి నుంచి ధనుర్మాసం మొదలవుతుంది . నాలుగయ్యేసరికి లేవాలి . ఏం ? " కనురెప్పల వెనుక నెలగంటు ముగ్గు మెరిసి , కళ్ళు తెరిచి చూద్దును కదా . . ! ఊర్ధ్వపుండ్రాలు రూపం దాల్చినంత పవిత్రంగా , చందన తరువులా తాతగారు . ఒక రోజు కాదు , ఒక నెల కాదు . పదిహేను వసంతాలు చిరునవ్వు మేల్కొలిపింది నన్ను . . సూర్యకిరణం కంటే ముందు . కమలా ఫలాలు తిన్నారా ? నాగపుర్ కమలాలని పెద్దగా ఉండేవి . ఆ పండు ముచిక దగ్గర ఓ చిన్న రంధ్రం చేసి , లోపలి తొనలు నెమ్మదిగా వేలితో బయటికి లాగేస్తే , నారింజ రంగు పండు దొన్నె ( cup ) లా మిగిలిపోతుంది . దానిలో మట్టి ప్రమిద నెమ్మదిగా దించి , వత్తి వేసి , నూనె పొసి వెలిగించి ఓ పళ్ళెం లో పెట్టి తాతగారు అందిస్తే , అపురూపంగా తీసుకెళ్ళి ఆ నారింజ వెలుగుల దీపాన్ని వాకిలి కిటికీ లో పెట్టే దాన్ని . వీధి మొత్తానికి నాదే అందమైన కార్తీక దీపం . గాలికి కొండెక్కకుండా తెల్లవార్లూ ప్రభలు విరజిమ్మేది అది . కార్తీక మాసం పూర్తయిందా . . వీధి సద్దుమణిగేది . మా లోగిలి నిద్రలేచేది . ప్రతి మార్గశీర్షాన వేళ తప్పకుండా . . కాత్యాయనీ వ్రతానికి సిధ్ధమయిన గోపకాంతలా . నాలుగో గంటకి లేచి చన్నీళ్ళ స్నానం చేసినా వణుకు ఎందుకు రాదంటే . . ' నూతి నీళ్ళు వెచ్చగా ఉంటాయట ! ' అని నమ్మడం వల్ల . " శ్రీశైలేశ దయాపాత్రం . . " అని తాతగారి గొంతు కంచు గంటలా మ్రోగేసరికి దేవతార్చన సన్నిధి గడపలో ఎందుకు కూర్చోవడం అంటే . . అది భక్తి కాదు , ఆ మాత్రానికి ముక్తి రాదు . అది బధ్ధకం , లాజిక్ అంటని పసితనం కనుక , దానికి నిబధ్ధత మారు పేరు కనుక . ' మనోహరమైన ముప్పై తమిళ పాశురాలతో అర్చించి , గోదాదేవి రంగనాధుడిని భర్తగా పొందిందట . ' అని విని , ఆవిడ అక్కడెక్కడో శ్రీరంగంలో ఓ చక్కని ఇంట్లో , కులాసాగా కాపురం చేసుకుంటూ ఉండేదని నమ్మేదాన్ని . ఫొటోకి , చిత్ర పటానికి తేడా తెలియకపోవడం తెలివితక్కువతనమే కావచ్చు . తలుచుకుంటే నేను నాకే నవ్వుతెప్పించే చిన్నతనం అది . అ , ఆ లు గుర్తున్నంత స్పష్టంగా , ఆ రోజు విన్న ప్రతి పద్యం పొల్లుపోకుండా గుర్తుందంటే , నేను ఏకసంతాగ్రాహిని అని కాదు . తెల్లవారు ఝాము చలిలో , ముడుచుకు కూర్చున్న పదేళ్ళ పిల్లకి చందనపు వాసన , కర్పూర గంధం , చామంతులు , గులాబులు , మరువం , నంది వర్ధనాల సుగంధపు మేళవింపు , ' చలి గాలికి వణుకుతున్నాయేమో ! ' అన్నట్టు సుడులు తిరుగుతూ , సుగంధం విరజిమ్మే అగరు పొగల నడుమ , నిశ్చలంగా వెలిగే దీపశిఖల మధ్య , శేష పర్యంకం మీద ఉజ్వలప్రభలు చిమ్ముతూ వేంచేసిన ఇంటివేలుపుల తీరు , వంట గదిలోంచి వీచే నైవేద్యాల భోగ్యమైన ఘుమ ఘుమల నేపధ్యం లో . . అందమైన శ్లోకాలు . . డెభ్భై వసంతాలొస్తున్నా వన్నె చెదరని ఓ గంభీరమైన , శ్రుతి బధ్ధమైన , స్పష్టమైన , గొంతులో వింటే ఎలా మరిచిపోగలదు ? పంచలో రాతి స్థంభానికే కంఠతా వచ్చేసి ఉంటాయ్ , నేనెంత ? రెండువేళ్ళ సందులోంచి తెల్లటి ముగ్గు వదులుతూ , ముంగిట్లో క్షణాల్లో రంగవల్లికలల్లేసే ఆడపడుచుకి ఏం వరం ఇవ్వాలన్నా లక్ష్మి వెనుకంజ వెయ్యదు గాక వెయ్యదు . ప్రతి రాత్రి వీధిలో పోటీలు పడుతూ , పడుచులు వేసే చుక్కల ముగ్గులు ఒక అందమైతే , నెలగంటు ముగ్గులు ఇంకో విలక్షణమైన చక్కదనం . రెండు గీతలు ఒకే సారి గీస్తూ , ముగ్గు వేసి అమ్మ నన్ను అబ్బురపరిచేస్తే , నాయనమ్మ గుప్పెట్లో ముగ్గుని , వేళ్ళ సందులోంచి అలవోక గా జారుస్తూ , నాలుగేసి గీతలు సృష్టించి నాకు మాయాజాలికురాలిలా కనిపించేది . " ఎలా వేస్తావ్ నాయనమ్మా ? " అని అడిగిన ప్రతి సారీ విసుక్కోకుండా , ముగ్గు పక్కన ఓ గీత విడి గా గీసి చూపించేది . నేను చూసిన చిత్రం నెమరువేసుకొనే లోపు ఆ గీత ఓ చెరుకు గడ గానో , ఓ వెదురు బాణం గానో , ఓ పొంగలి కడవ గానో మారిపోయేది . నవ్వేసి వీధిలో మిగిలిన ముగ్గులు చూసి రావడానికి తుర్రుమనేదాన్ని . ఇంకాస్త పెద్దయ్యాక నాయనమ్మతో పోరాడి జనవరి ఒకటి నాడు రంగుల ముగ్గుకి అనుమతి సాధించేదాన్ని . ముగ్గు వేసేసి , నేస్తాలతో వీధులన్నీ చక్కర్లు కొట్టి వచ్చేలోపు , ఆ ముగ్గు పక్కన ఓ చిన్న ఈనెల ముగ్గు ప్రత్యక్షమయ్యేది . ఓసారి విసుక్కుని ' పోన్లే ' అని నాయనమ్మని క్షమించేసేదాన్ని . చెప్పొద్దూ . . ఒకటో తారీకు మునిమాపు వేళకే , పేడనీళ్ళతో ముంగిలి అలికి , నా వర్ణ కావ్యాన్ని రూపు మాపేసి , వైకుంఠ ద్వారాల ముగ్గు వేసేస్తే కాని దానికి నిద్ర పట్టేది కాదు . ప్రతి ఏడూ జరిగే తంతే అయినా నాయనమ్మ - మనవరాళ్ళ పోరు తప్పేది కాదు ఆ రోజున . తెల్లవారు ఝామున దేవతార్చన పూర్తయ్యాక , నడుముకు చుట్టి ఉన్న పై కండువా తీసి దులిపి , కప్పుకొని బయటకు వస్తూ రేడియో పెట్టేవారు తాతగారు . ముందు రోజు పూలు కట్టించుకొచ్చిన తామరాకులు దాచి , శుభ్రం గా తుడిచి వాటిలో వేడి పొంగలి పెట్టేది నాయనమ్మ . భక్తి రంజనిలో వినిపించే తిరుప్పావై పాశురం , దానిని మృదుమధురం గా వివరించే శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యులు తాతగారి ప్రవచనం వింటూ తింటేనే , పొంగలికి రుచి . అమృతవల్లీ సుందరం పాడే వారు తెలుగు అనువాదాన్ని . " మేలుకో ఓ సిరీ ! శాతోదరీ ! మేలుకో ఓ నీళ ! పరిపుర్ణురాలా ! మేలుకో నవకిసలయాధరా . . కలశోపమపయోధరా . . " అని చెలిని మేల్కొలిపి యమునకి / కావేరికి స్నానానికి తీసుకొని పోయి వచ్చి , కృష్ణుడిని మేల్కొలిపి , పొగిడి , బ్రతిమాలి సాధించారట భామినులు , పర ను , పరమాత్ముడిని కూడా . " అర్ధులమూ . . అనుగులమూ . . అంజలింప వచ్చినాము అడిగిన వరమిడుదువని అనురాగపు గనివనీ . . ఒక అమ కొమరుడవై , వేరొకామ ఒడిలో దాగి . . పరవశమున పాడి పాడి విరహమెల్ల మరతుము , పర వాద్యము కరుణింపుమూ . . పరమానందమొసగుమూ . " పాట గోదాదేవిని కనులకు కట్టిస్తే , ఆ పదాలు గోవిందుని , గోకులాన్ని ఎదుట నిలబెట్టేవి . ఒకరోజు తాతగారడిగారు . " ఈ తెలుగు అనువాదం రాసినదెవరో తెలుసా ? అమ్మలూ ! " " ఎవరు ? " కళ్ళతోనే అడిగా . . నేతి ముద్దలాంటి కూడారు పాయసం గొంతు దిగుతోందాయె అదే క్షణంలో . " మల్లీశ్వరి చూసాం గుర్తుందా ! ఆ సినిమాలో పాటలు రాసినాయనే . కృష్ణ శాస్త్రి గారు . . దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారంటారు . " " కోతి బావకు పెళ్ళంటా . . ఆ సినిమా యేనా ? " నిర్ధారణ కోసం అడిగాను . " ఆ . . మనసున మల్లెల మాలలూగెనే . . " అందించారింకో పాటను . " ఎక్కడుంటారు ఆయన ? వైజాగ్ ? " అదే పెద్ద దూరాన ఉన్న ఊరాయె నాకు అప్పట్లో . పైకి వేలు చూపించి " కీర్తిశేషులయ్యారు " చెప్పారు . " అంటే ? " " ఎప్పుడో ఆయన రాసిన పాటలు విని , ఆయన లేనప్పుడు కూడా మనం మాట్లాడుకుంటూన్నాం చూడూ . అదీ కీర్తిశేషులవడం అంటే . " ' కొత్త పుస్తకాల వాసనకి ఇంచుమించు సరిసాటి కొత్త బట్టలది ' అని నేను ఢంకా మీద దెబ్బ కొట్టి మరీ చెప్పగలను . దర్జీ గుండ్రం గా చుట్టి ఇచ్చిన పరికిణీ తెచ్చి , దులిపి వేసుకుంటే అదీ పండగ . భోగి నాడు భోగిపళ్ళ సంబరాల గురించి , తెలుగు వారు ఎవరికీ ఎవరూ గుర్తుచెయ్యక్కర్లేదు . జ్ఞాపకాల్లో భోగిపళ్ళలో కలిసి జారిన పైసల గలగలలు వినబడని వాళ్ళుండరేమో . సంక్రాంతి నాడు ఉదయం అమ్మతో కలిసి పసుపు , కుంకుమలు పంచిపెట్టడానికి కొత్త బట్టలు వేసుకొని బయలుదేరేవాళ్ళం . పసుపు , కుంకుమ అమ్మ ప్లేట్ లో వేస్తే తాంబూలం అమర్చి పెట్టడం నా వంతు . కనుమ స్నానం , గంగిరెద్దుల వాళ్ళు " అయ్యవారికి శుభోజ్జయం కలగాలి " అని దీవిస్తూ బసవన్న చేత దీవింపచేసి , పాత బట్టలు దాని మూపున వేయించుకొని , దక్షిణ పుచ్చుకొని వెళ్ళడం ఎంత సంబరం అసలు ! ' ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహముల ' ని గాలిలో ప్రశ్న వదిలి చేతులు దులిపేసుకోలేను . ' నాకొద్దు ఆ జ్ఞాపకాలు , కాలచక్రాన్ని గిర్రున వెనక్కి తిప్పలేని బాధ నాకొద్దు . ' అనాలనిపించినా అనలేను . మార్పు సహజం , అభిలషణీయం . ఆనాటి బడిపంతులు కొడుకు , ఈనాటి క్షణం తీరిక లేని సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడు మరి ! రోలు , రోకలి , తిరగలి , కొడవలి , గొడ్డలి , సైకిలు . . మాయమయిపోయిన సుఖమైన జీవితాలకు అక్కర్లేని పిండి వంటలు , నేతి పొంగళ్ళు తినాలని కాదు . జిహ్వకి , కంటికి కొత్త రుచులు తప్పనీ కాదు . కొత్త వింతే , కాని నాకు పాత రోత మాత్రం కాదు . క్షణం తీరిక లేని పరుగులో , ఎప్పుడైనా ఆటవిడుపుకి ఆగినప్పుడు . . తెలుగు పద్యం , వేణు గానం , పూర్ణం బూరెలు ఇలాంటి డెలికసీ లని అనుభవించే అభిరుచి పాడయిపోకుండా ఉంటే చాలు . ' పోయినోళ్ళందరూ మంచోళ్ళు . . ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు ' కదా ! నేను తాతగారి తీపి గురుతుని . నా తరువాత , నేను తీపి గురుతులని మిగుల్చుకోవాలంటే ఎంత ప్రయత్నం చెయ్యాలో . . కథలు , రుచులు , కబుర్లు , పాటలు . . ఎన్ని అందించాలో నా విహారి కి . .
అనే పద్యాన్ని ' … తపింతునా , … తలంతునా , … అనుసరింతునా ' అని చదువుతారే తప్ప ' … తపింతు | నాని , లుపు , తలంతు | నాప , గలు , అనుసరింతు | నాయొ , కని … ' అని చదువరు . ఇక్కడ పద్యంలోని ఛందోగణాలేమిటి ? అవి ఎక్కడ విరుగుతాయి ? అనేది చదువరికి ముఖ్యం కాదు . ఎక్కడ ఎట్లా విరిచి చదువుకుంటే భావస్ఫూర్తి కలుగుతుందనేది ముఖ్యం . వచన పద్య పాదం విషయంలోనూ చదువరికి సంబంధించిన ఈ ముఖ్యాంశాన్నే ప్రధానంగా స్వీకరించి అటు కవీ , ఇటు లక్షణ కర్తా సాగవలసి ఉంది . భావగణ విభజన విషయంలో ఈ అంశమే ప్రధానమయినది . ' సిరికిం జెప్పడు , … చేదోయి సంధింపడు మొదలయిన చోట్ల వ్యాకరణ రూపైకత ఉన్న పద సమూహాలున్నాయని , వాటిని వ్యాకరణ గణాలనటానికి వీలుంటుందా ? ఆ పద్యాల నిర్మాణంలో ఛందోగణాలు ప్రధానం కాబట్టి అట్లా అనడానికి వీలులేదు . అట్లాగే వచన పద్యంలో భావప్రాధాన్యం కాబట్టి ఇక్కడా అనటానికి వీలుండగూడదు . అయితే , వచన పద్య నిర్మాణంలో భావస్ఫూర్తి విషయికంగా వాక్యనిర్మాణరీతికీ ప్రవేశం ఉంది కాబట్టి , వ్యాకరణ రూపైకత అక్కడక్కడా భావగణ విభజనలో కనిపించటం సహజమే . అంతమాత్రాన వ్యాకరణ రూపైకత వల్లనే సర్వత్రా భావగణ విభజన జరుగుతుందనటానికి వీలు లేదు .
న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం పాఠకులకి అభిప్రాయాలు తప్ప హక్కులు లేవు ఈ నియమాలకి లోబడే రచయితలకి వెన్నెముకలు లేవు అయినా కథల పోటీలు వర్థిల్లుతూనే వుంటాయేమిటో ! !
ఆ ఆర్టిస్టు యెవరోగానీ , వాయిస్ యెనాలిసిస్ చేసినా పెర్ఫెక్ట్ గా కుదిరే గొంతుకతో , సోనియాని మిమిక్ చేస్తూంది ! హేట్సాఫ్ !
దాదాపు ఒక నెల రోజులనుండి చిన్న పని నిమిత్తం అమ్మ మా ఇంట్లోనే ఉంటోంది . చెప్పేదేముంది అమ్మ ఉంది అంటే మా ఇంట్లో టి వి కి విశ్రాంతి ఉండదు . తెల్లవారు ఝామున 5 గంటలకి దానికి పని అప్పచెబితే , రాత్రి 12 గంటలవరకు శ్రమ అనుకోకుండా ఏ ఛానెల్ కావాలంటే ఆ ఛానెల్ నిరాటంకంగా చూపిస్తుంది ( కరెంట్ మాపై కక్షబూని , మా అమ్మని కరుణిస్తే ) ఈ టి వి చూడడం అనే విషయంలో మా అమ్మ ఎంత ఉద్ధండురాలంటే మేమెవరన్నా పొరపాటున టైం ఎంతయిందో అని ఏ వాల్ క్లాకో , చేతి గడియారమో చూసుకుందామని పసిగట్టిందో ఇహ చెప్పనవసరం లేదు . . ఇప్పుడు చిట్టెమ్మ వస్తోంది కదా . . . టైం ఇంత . . ఇందాకే భగవ్గీత ప్రవచనాలు అయ్యాయి , అప్పుడనగా చెప్పాను ఆ వెధవకి తీసుకురమ్మనమని . . ఇదిగో అదేదో రేకులు సీరియల్ టైం కి తెచ్చాడు . అంటూ తన సీరియల్ భాష అంతా మా మీద ప్రయోగించేస్తుంది . అటొచ్చి . . . . . ఇటొచ్చి లేదా ఒక చుక్క కాఫీ తాగుతూనో , కొన్ని సీరియల్స్‌లో లేదా కొన్ని భక్తి సందేశాలో మా చెవిన అలా అలవోకగా పడ్తూ ఉంటాయి . అలాంటి నేపధ్యంలో ఈరోజు పొద్దున్న నేను విన్న ఈ కథ నాకు చాలా నచ్చిన కథ , ఏ ఆచారాలన్నా దురాచారాలన్నా మనం సృష్టించుకున్నవే , వాటిని పాటించడంవల్ల ఎదుటి వారు ఇబ్బంది పడ్తున్నారు అంటే మార్చుకోడం , మార్పు కోరడం తప్పుకాదు అన్న సందేశం కూడా నాకు చాలా నచ్చింది .
నా బ్లాగులో లేఔట్ ( layout ) బొత్తాము కనిపించడం లేదు . ఏం చెయ్యాలో కాస్త వివరించండి .
జ . " కళ కళ కోసమే " అనే వాదన తలెత్తిందని నేననుకోను . ఈ మధ్య నేను ఎక్కడా వినలేదు . " కళ కళ కోసమే " అనే వాదనా , " కళ సాంఘిక రాజకీయ ప్రయోజనాల కోసం " అనే వాదనా - రెండూ అతి వాదాలే ! ఏదో ఒక ప్రయోజనం లేకుండా ఏదీ వుండదు . ఐతే దేని ప్రయోజనం దానికుంటుంది . ఇది గుర్తించడం ముఖ్యం . ప్రపంచాన్ని అవగాహన చేసికోవటమూ , తద్వారా ప్రపంచంతో అనుభౌతిక అనుసంధానం ( emotional adjustment ) సాధించటమూ - అనాది నుంచీ కళా ప్రయోజనమని అనుకుంటున్నాను .
ఎత్తులో మేము సైతం … తైపీ 101 … బుర్జ్ ఖలీఫా నిర్మాణం పూర్తయ్యేవరకు ఈ నిర్మాణానిదే రికార్డు . 101 ఫ్లోర్లు కలిగి ఉండడంతో దీనికి ఆ పేరు వచ్చింది . కాన్ఫెరెన్స్ హాళ్లు , ఫిట్‌నెస్ సెంటర్లు , లైబ్రరీ , ఆఫీస్ , రెస్టారెంట్ , రిటైల్‌లాంటి ఎన్నో వ్యాపారాలకు ఇందు లో సదుపాయాలున్నాయి . ఈ భవనం యొక్క మరో విశిష్టత ఏమిటంటే వారంలో ఒక్కో రోజు ఒక్కో రంగులో దర్శనమివ్వడం తైపీ 101 ప్రత్యేకత . ప్రతిరోజు ఉదయం ఆరు గం టల నుండి రాత్రి పది గంటల వరకు ప్రతి రోజు వివిధ రం గుల్లో దర్శనమిచ్చే తైపీ 101 … 509 మీటర్ల ఎత్తుతో ప్రపం చంలోనే ఎతె్తైన భవానాల్లో రెండవ స్థానంలో ఉంది .
ఆంధ్ర , తెలంగాణ అనే కాదు . ఈ దేశంలో పెట్టుబడిదారులంతా ఒకే వర్గం . ఎందుకంటే వారు ఏ ప్రాంతంలో ఉన్నా వారి ప్రయోజనాలు ఒక్కటే ప్రభుత్వాలు అనుసరించే విధానాల ద్వారా లబ్ది పొందుతున్నది వీరే . మీరన్నట్లు బై ప్రొడక్టుగా వచ్చే ఉద్యోగాలు ఇతరులు పొందుతున్నారు . ఎగువ మధ్య తరగతి నుండి కూలీల వరకూ వీరు ఎంతో కొంత పెట్టుబడి దారుల శ్రమదోపిడీకి గురవుతున్నారు . అందువలన శ్రమ చేస్తున్న వారంతా వారి ఉమ్మడి ప్రయోజనాల రీత్యా ఒకే వర్గం . వీరి కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా విధానాలు రూపొందించరు . రూపొందిస్తే అవి వారికి వ్యతిరేకంగా వారి శ్రమల్ని పెట్టుబడిదారులు కొల్లగొట్టే విధానాల్నే రూపొందిస్తాయి . ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఇదే తంతు .
తండ్రికి సైతం శత్రువులుగా మారి ఆయన శాపాలకు గుఱైన సంతానం ఎవఱైనా ఉంటే , వారి ఘోర దురదృష్టాన్నీ , మూర్ఖత్వాన్నీ ఏమని వర్ణించేది ? ఒకవేళ తండ్రి తనకు ధర్మవిరుద్ధాలూ , లోకవిరుద్ధాలూ ఐన ఆజ్ఞలిచ్చినా సరే , వాటిని సిద్ధంగా శిరసావహించి ఆయన కోరిక మేఱకు నెఱవేర్చాల్సిందే తప్ప సొంతబుఱ్ఱ ఉపయోగించి " నేను చెయ్యను " అని నిరాకరించకూడదు . ఆయనిచ్చిన ఆజ్ఞలు సరైనవి కాకపోతే ఆయనతో ఎలా వ్యవహరించాలో అది దేవుడు చూసుకుంటాడు . మనకు ఆ పాపపుణ్యాలతో సంబంధం లేదు . అయితే తద్విరుద్ధంగా - తండ్రికి ఇతోఽధికంగా సేవ చేసి , ఆయన అభీష్టాల్ని నెఱవేర్చి ఆయన అనుగ్రహానికీ , ఆశీర్వాదాలకీ పాత్రులైన సంతానం మఱుజన్మలో పైన చెప్పినవాటికి విరుద్ధమైన సత్ఫలితాల్ని పొందుతారు . పితృత్వం అనేది స్వతహాగా పరిపాలక స్థానం ( Ruling position ) కావడం చేత అలాంటివారికి ప్రభుత్వోద్యోగాలూ , ప్రభుత్వంలో ఉన్నత పదవులూ , రాజకీయ నాయకత్వం , రాజకీయ విజయాలూ లభిస్తాయి . స్త్రీలకైనా ఇదే ఫలితం . ప్రపంచంలో తండ్రి సెన్సిబిలిటీస్‌ని పట్టించుకొని , ఆయన మనస్సుకు ఆహ్లాదాన్ని చేకూర్చి ఆయన ఆశీస్సుల్ని పొందే సంతానం అరుదు . అందువల్ల లోకంలో ప్రైవేట్ వ్యాపారులూ , ఉద్యోగులూ ఎక్కువ . పరిపాలకులు ( administrators ) చాలా తక్కువ . దేన్ని ఉపాసిస్తారో అదే అవుతారు .
జలజల పారే నీళ్ళూ … బంగారు పంటలూ … భారీ డ్యాములూ … పరిశ్రమలూ … రైతులూ … కార్మికులూ … ఆనందం వెల్లివిరిసే మొహాలూ … విజన్ 1947 .
" రక్తపు వాసన చూపించకుండా పలకమంటే ఎలా పలుకుతారురా ? ఆకలి అధికంగా వుంది . ఆహారం లేనిదే మాట బయటికి రాదు " ఉన్నట్లుండి వినవచ్చాయి ఆ మాటలు ఆ ఆకారం నోటినించి .
సర్వదేవతలూ శక్తిస్వరూపాలేనని స్పష్టంచేసే గాథలు అనేకం పురాణాల్లో చెప్పబడ్డాయి . పరాశక్తి ' సప్తమాతృకలూగా అవతరించిది . బ్రహ్మ , విష్ణు , శివాది దేవతల శక్తులే సప్తమాతృకలు .
అంతకు ముందువరకూ అతనిమాటల్ని , చేతల్ని నిర్మొహమాటంగా ఆక్షేపిస్తూ వచ్చిన వాసంతి , ఈసారి అటువంటి పని చేయలేదు . ఒక్క ఉదుటున డోర్‌ని తెరిచి , అంబాసిడర్ వెనుక సీటులోకి జంప్ చేసింది . తన హేండ్‌బ్యాగ్‌లో వున్న చిన్న ఫిస్టల్‌ని చేతుల్లోకి తీసుకుంటూ ఊపిరి బిగబట్టి చూసింది .
మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి కలం నుంచి వెలువడ్డ ఆధ్యాత్మిక నవల ఈ పరంజ్యోతి . అనేక ఆధ్యాత్మిక అంశాలతో , కమర్షియల్ నవల లోని ముఖ్యమైన ఎలిమెంట్ అయిన ఉత్కంఠని జత చేసి రాసిన ఈ ఆధ్యత్మిక నవల పరంజ్యోతి లోని చిత్రమైన కథ అన్ని తరహా పాఠకులని సమానంగా అలరిస్తుంది . మరణించిన మనిషి తిరిగి బ్రతుకుతాడా ? అన్నది ఇందులోని ముఖ్యమైన అంశం . చితిదాకా చేరిన మనిషి మళ్ళీ లేచికూచుంటాడా ? అలాంటి మనిషికి సంబంధించిందే ఈ కథ . ఇది ఓ సంస్థానం రాజకుమారుడు విజయ రామరాజు అనే చిన్న రాజావారి కథ . ఇదే ఒక సన్యాసి పరంజ్యోతి కథ కూడా . ఇది ఒక ఆధ్యాత్మిక జీవనానికి చెందిన కథ . నెమలికొండ సంస్థానపు అధిపతి భూపతిరాజు నలుగురి సంతానంలో చివరి వాడుగా అతి గారాబంగా పెరిగి అన్నదమ్ములలో వైషమ్యాలకి కారకుడవుతాడు విజయ రామరాజు . అన్ని దురలవాట్లకు లోనవుతాడు . అతని భార్య అహల్య కూడా అతన్ని భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది . తన సోదరుడు ప్రతాపవర్మ కి తన గోడు వెళ్ళబోసుకుంటుంది . అనేక జబ్బులతో ముదిరిపోయిన రామరాజుని ఇతడు కూడా ద్వేషిస్తూనే ఉంటాడు . రామరాజు సోదరులు , ఇతర ఉద్యోగులు కూడా అతన్ని తట్టుకోలేకపోతారు . తీవ్రమైన జబ్బులతో మంచానపడ్డ అతన్ని ఇంగ్లీష్ వైద్యం కూడా ఏమీ చేయలేదని తేల్చేస్తారు వైద్యులు . అటువంటి సమయంలో అతని మీద విషప్రయోగం జరిగి రామరాజు మరణిస్తాడు . అది విషప్రయోగమనీ తెలియదు , ఎవరు చేసారోకూడా తెలియదు . రామరాజు దహన సంస్కారాలు కూడా జరిగిపోతాయి . ఇది తనకి విషం ఇచ్చి చంపాలని ప్రయత్నించిన వారి మీద ధ్వేషం పెంచుకున్న ఓ వ్యక్తి కథ . " మరణం అంటే నాకు భయంలేదు . ఎందుకంటే నేను జీవించి ఉన్నంతకాలం మరణం నా సమీపంలోకి రాలేదు . అది వచ్చినప్పుడు నేనుండను . ఇంక చావంటే నాకు భయం దేనికి ? " ఓ సందర్భంలో రామరాజు తనతండ్రితో అన్న మాటలివి . కాని మరణం తరువాత కూడా తాను ఉంటాడని , ఆ మాటలు అన్నప్పుడు రామరాజుకి తెలియదు . ఇది సాధ్యమా ? ఆ తరువాత ఎన్నో సంవత్సరాలకి ఓ వ్యక్తి నర్మదా పరిక్రమ లో సన్యాసి పరంజ్యోతి ని చూసి అతను పూర్తిగా రామరాజు పోలికలతో ఉండటంతో ఆశ్చర్యపడి , రామరాజు సోదరి కుముదినీదేవికి తెలియజేస్తాడు . ఆమె ఈ విషయాన్ని తన ఇతర సోదరులకు తెలియజేస్తుంది . వారు ఇతర అధికారులతో చర్చలు జరిపి , చనిపోయి దహనంచేసిన వ్యక్తి తిరిగిరావడం ఎలా జరుగుతుంది , ఇదేదో పొరపాటు అని భావిస్తారు . కాని క్రమంగా అదే సమాచారం చాలామందే పంపటంతో అతనిని వెతికి , వివరాలు తెలుసుకోటానికి ప్రయత్నిస్తారు . ఇక్కడినుంచి , జరిగిన రకరకాల ప్రయత్నాలే కథని అనేక మలుపులు తిప్పి మనల్ని ఏకబిగిన చదివిస్తుంది . ఎన్నోఆధ్యాత్మిక చర్చలు ఈ నవల నిండా ఉన్నాయి . అయినప్పటికీ అది ఇంకా చదవాలి అన్న కోరికని పెంచుతుందే కాని ఎటువంటి నిరాసక్తతను కలిగించదు . కొన్ని చక్కటి ఆధ్యాత్మిక గీతాలు కూడా మనకి ఈ గ్రంధంలో కనిపిస్తాయి . తేలికైన పదాలతో కూర్చిన ఈ పాటలు పాడుకోవాలనిపిస్తుంది . ఈ పాటలొచ్చినప్పుడు మనకే తెలియకుండా మనసులో పాడుకుంటాంకూడా . తమ అనుమానాలు తీర్చుకోటానికి న్యాయస్థానం లో జరిగే అనేక వాదోపవాదాలు కూడా మనకి ఎన్నో కొత్త విషయాలను ఎంతో విపులంగా తెలియ జేస్తాయి . అనేక ఉదాహరణలు కూడా రచయిత మనకి చూపిస్తారు . నర్మద , గోదావరి నదీ తీరాల్లో జరిగే ఈ కథ ఆధ్యాత్మిక పాఠకులని , సాధారణ పాఠకులని సమానంగా ఆకర్షిస్తుంది . ఈ నవలకి ప్రేరణ చాలా సంవత్సరాల క్రితం బెంగాల్ లో జరిగిన ఒక నిజ సంఘటనే . ఇది భారతదేశంలో దీర్ఘకాలం కొనసాగి సంచలనాత్మక తీర్పు నిచ్చిన కేసుగా చాలా ప్రసిద్ధి చెందింది . దీని మీద ఆధారపడి ఎన్నో భాషల్లో సినిమాలు కూడా వచ్చాయి . మే 2010 లో ముద్రించిన ఈ గ్రంధం వెల రూ 100 / - . నవోదయా బుక్ హౌజ్ , సుల్తాన్ బజార్ , హైద్రాబాద్ లో లభిస్తాయి . * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
విక్రమాదిత్యుడి సహాయంతో భేతాళుని వశపరుచుకొని , పిదప అతణ్ణి వెయ్యవ బలిగా కాళికాదేవిని సమర్పించవలెనన్నది జ్ఞాన శీలుని పన్నాగం . దాంతో , మర్నాడు అతడొక సామాన్య సాధు వేషంలో , విక్రమాదిత్యుని సభా భవనానికి వెళ్ళి , మహారాజుకు కానుకగా ఒక దానిమ్మ పండుని సమర్పించాడు . ఒక్క మాటైనా మాట్లాడకుండా , మరుక్షణం అక్కడి నుండి నిష్ర్కమించాడు . కొన్ని రోజుల పాటు నిరంతరాయంగా అదే ప్రకారం చేసాడు . అలాగే . . . ఒక రోజు ఈ సాధువు దానిమ్మ పండు విక్రమాదిత్యునికి సమర్పించి వెళ్ళిపోయాడు . మహారాజు దాన్ని ప్రక్కనే ఉన్న చిన్న బల్లపై ఉంచాడు . సభా భవనాన్ని ఆనుకొని రాజోద్యాన వనం ఉంది . కిటికీ లో నుండి పూదోట కనువిందు చేస్తుంటుంది . ఆ తోటలో చెట్టు కొమ్మమీద కూర్చొన్న కోతి దృష్టిని , ఈ దానిమ్మ పండు ఆకర్షించింది . అది అమాంతం కిటికీ లో నుండి లోపలికి దుమికి , పండు చేతిలోకి తీసుకొని కసుక్కున కొరికింది . ఆశ్చర్యం ! సన్నిని నీటి గొట్టం నుండి నీటి ధార ఎగజిమ్మినట్లు , దానిమ్మ పండులో నుండి కెంపులు జల జలా రాలి క్రింది పడ్డాయి . ఒక్కసారిగా సభలోని వాళ్ళంతా దిగ్ర్భమ చెందారు . విక్రమాదిత్యు మహారాజు , ప్రతీ రోజూ సాధువు యిస్తూ వచ్చిన దానిమ్మ పండ్లను , రాజమందిరంలో ఓ ప్రక్కన ఉంచి పట్టించుకోలేదు . దాంతో విక్రమార్కుడు సేవకులను పిలిచి , ఆ పళ్ళన్నిటినీ తీసుకు రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు . దానిమ్మ పళ్ళను కోస్తే , ఒక్కోపండులో గింజలపేర్చి ఉన్నట్లుగా , మణిమాణిక్యాలున్నాయి ! ఒక దానిలో రత్నాలు , మరో దానిలో మరకతాలు , ఇంకో దానిలో పుష్యరాగాలు , గోమేధీకాలు , తెల్లని మేలి ముత్యాలు . . . ఇలా ! అన్ని పళ్ళనూ కోసేటప్పటికి అక్కడ నవరత్నాలు రాశిగా పడ్డాయి . అదంతా చూసి సభికులూ , రాజూ కూడా ఆశ్చర్య పోయారు . విక్రమాదిత్యుడు ప్రతీ రోజూ తనకు పండ్లని సమర్పిస్తున్న సాధువు గురించి ఆలోచించాడు . తానెప్పుడూ అతడిని ఆదరించి పలకరించనందుకు చింతించాడు . ఒక్క మాట కూడా మాట్లాడ కుండా , తన పలకరింపును ఆశించకుండా , పండు సమర్పించి వెళ్ళిపోయే సాధువు పట్ల రాజుకు ఆశ్చర్యం గౌరవం కలిగాయి . మరునాడు కూడా ఆ సాధువు సభలోకి వచ్చి , రాజుకు పండు సమర్పించాడు . విక్రమాదిత్యుడు అతణ్ణి ఆపి , ఆదరంగా పలకరించి , సుఖాసీనుణ్ణి చేసాడు . అతిధి మర్యాదలన్నీ చేసి , గౌరవంగా , " ఓ తపస్వీ ! నా నుండి మీరు ఏం ఆశిస్తున్నారు ? ఎందుకిలా మమ్మల్ని బహుకరిస్తున్నారు ? నేను మీకు చెయ్యగల కార్యమేదైనా ఉంటే సెలవియ్యండి . తప్పక నెరవేరుస్తాను " అన్నాడు . సామాన్య సాధు వేషంలో ఉన్న జ్ఞానశీలుడు , " ఓ రాజోత్తమా ! చాలా రోజులుగా నాకొక ఆకాంక్ష ఉన్నది . అది నెరవేర్చగలనని నీవు నాకు ప్రమాణం చేస్తేనే , నేను నీకది వివరించగలను . " అన్నాడు . విక్రమాదిత్యుడు చిరునవ్వుతో " మీరు కోరినట్లే చేయగలను " అన్నాడు . అంతట జ్ఞానశీలుడు " ఓ రాజేంద్రా ! నా పేరు జ్ఞానశీలుడు . ఇక్కడికి దాపుల నున్న బృహదారణ్యంలోని కాళికా దేవి ఆలయంలో నేనొక యాగం నిర్వహిస్తున్నాను . రానున్న అమావాస్యకు ముందు రోజు , దయ ఉంచి నీవక్కడికి వచ్చినట్లయితే , అప్పుడు నీవు నాకు చేయగల ఉపకారం గురించి చెబుతాను . నీవు నాకై అది నెరవేర్చాలి . దాంతో నా యాగం పరి సమాప్తి కాగలదు " అన్నాడు అభ్యర్ధనగా ! విక్రమాదిత్యుడు ఆనందంగా అంగీకరించాడు . రాజిచ్చిన హామీతో జ్ఞాన శీలుడక్కడి నుండి వీడ్కొలు తీసుకున్నాడు . అమావాస్యకు ముందు రోజు , విక్రమాదిత్యుడు బృహదారణ్యంలోని కాళీ మాత గుడికి వెళ్ళాడు . జ్ఞాన శీలుడు అత్యంత సంతోషంతో రాజుని ఆహ్వానించాడు . విక్రమాదిత్యుడు చెప్పమన్నట్లు చూశాడు . జ్ఞాన శీలుడు " ఓ మహారాజా ! నీవు సత్యవాక్పరిపాలకుడవు . ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఇచ్చటికి వచ్చావు . నేను నిన్నిక్కడికు ఎందుకు పిలిచానంటే - ఇక్కడకు అరామడ దూరంలో ఓ గొప్ప మోదుగ వృక్ష ముంది . శవ రూపంలో భేతాళుడు ఆ చెట్టు కొమ్మకు తల్లక్రిందులుగా వ్రేళ్ళాడుతుంటాడు . అతడెవ్వరికీ వశువు కాడు . అతణ్ణి వశపరుచుకోగల వాడవు నీవే ! ఏ దోక విధంగా అతడిని నీవిక్కడకు తీసుకు రావాలి . ఇదే నీవు నాకోసం నిర్వర్తింపవలసిన కార్యం ! " అన్నాడు . విక్రమాదిత్యుడందుకు సమ్మతించి , భేతాళుడి కోసం బయలు దేరాడు . జ్ఞాన శీలుడందుకెంతో సంతోషించి , యాగాన్ని పూర్తి చేసేందుకు కావలసిన ఇతర ఏర్పాట్లు చేసుకోవడంలో మునిగి పోయాడు . అసలిందుకే అతడు విక్రమాదిత్యుడిని వెయ్యవ బలిగా ఎంపిక చేసుకొంది ! విక్రమాదిత్యుడు మోదుగ వృక్షాన్ని చేరి , దాని మీది శవాన్ని నిశవంగా గమనించాడు . చుట్టూ చీకటి ! శ్మశానాన్ని తలపించే వాతావరణం , నిశ్శబ్ధం ! రాజు కివన్నీ పట్టలేదు . చెట్టెక్కి శవాన్ని దించి భుజన వేసుకొని , కాళీ మాత ఆలయం వైపు అడుగులు వేశాడు . శవంలోని భేతాళుడు విక్రమాదిత్యుణ్ణి పరిశీలించాడు . భేతాళుడు " రాజా ! ఎందుకు నన్ను మోసుకెళ్తున్నావు ? నేనెవవ్వరికీ లొంగను . నేను నీకు వశుడను కావలెనంటే ఒక షరతు ఉంది . నేను నీకొక కథ చెబుతాను . ముగింపులో కథను గురించి ఒక ప్రశ్న అడుగుతాను . దానికి నీవు సరైన సమాధానం చెప్పాలి . అయితే నా ప్రశ్నకు జవాబు చెప్పేందుకు నీవు మౌనం వీడితే , మరుక్షణం నేను నీ భుజంపై అదృశ్యమై చెట్టుపై నుంటాను . అలాగని జవాబు తెలిసీ చెప్పకుండా మౌనాన్ని పాటిస్తే , నీతల వెయ్యి వక్కలౌతుంది . ఇదీ నియమం " అన్నాడు . విక్రమాదిత్యుడందుకు అంగీకార సూచకంగా తలాండించాడు . మౌనాన్ని వీడక చిరునవ్వు నవ్వాడు . భేతాళుడు మొదటి కథ ప్రారంభించాడు . [ ఇక్కడ ఆసక్తి కరమైన అంశం ఏమిటంటే - కథ ద్వారా భేతాళుడిచ్చే ప్రవల్లిక ( పజిల్ వంటి ప్రశ్నని ) ని విక్రమాదిత్యుడు పరిష్కరించాలి . కానీ , విక్రమాదిత్యుడు మౌనభంగం చేసి ప్రశ్నకు జవాబిచ్చాడో . . . భేతాళుడు తిరిగి చెట్టెక్కేస్తాడు . తెలిసీ జవాబు చెప్పక పోతే . . . తల వెయ్యి వక్కలౌతుంది . విక్రమాదిత్యుడు సకల శాస్త్ర పారంగతుడు గనక , అతడు ఎలాంటి ప్రశ్నకైనా జవాబు చెప్పగలడు . దాంతో మౌనభంగమౌతుంది . అప్పుడు భేతాళుడు వశుడు కాడు . ' భేతాళుడి ప్రశ్నకు విక్రమాదిత్యుడికి సమాధానం తెలియక పోవటం ' మాత్రమే దీనికి పరిష్కారం అవుతుంది . ఎప్పుడైనా , ఎక్కడైనా , జ్ఞానం కలిగి ఉండటం అనుకూలాంశం ( Advantage ) అవుతుంది . ఇక్కడ అది ప్రతికూలాంశం ( Disadvantage ) గా ఉంటుంది . అదే గమ్మత్తు ! ] ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~
talkandhra 10 : 54 am | ఒబామా గారి ఇంటర్వ్యూవిలేఖరి : మీ నుండి ప్రజలు మార్పును కోరుతున్నారని మీ ఎన్నిక ద్వారా తెలుస్తుంది . మరి మీ మొదటి ఆలోచన ఏమిటి ? ఒబామా : వైట్ హౌస్ కు ఏ కలర్ పెయింట్ వెయ్యాలా అని … . విలేఖరి : ఆ ! ! ! / / …
@ sunita : ఆరోగ్యానికి మంచిది , రుచి కూడా బాగుంటుంది . మీకు " దూట " దొరికితే తప్పక ప్రయత్నించి చూడంది . Thankyou .
నిద్రకు ఉపక్రమించడం , నిద్రలేవడం మరియు రోజును గడిపే విధానాల గూర్చి మన సంప్రదాయం ఎన్నో విషయాలను వెల్లడిచేస్తుంది . మనం ఉదయాన నిద్రలేచే విధానం రోజులో మనం చురుకుగా లేదా మందకోండిగా వుండటంపై ప్రభావాన్ని చూపుతుందని మన పాతతరం వారు విశ్వసించేవారు .
@ కత్తి మహేశ్ కుమార్ గారూ , నమస్తే . ఎన్నాళ్ళగానో చూద్దామనుకుంటున్న సినిమా చూడడం కుదరకపోయినా , చూడడానికి అందుబాటులో లేకపోయినా సినీ జీవులకు ఊపిరాడనంత ఇబ్బంది . ఆ సంగతి నాకూ అనుభవమే . మదరాస పట్టిణం విషయంలో మీ కన్నా ముందు నాకు అవకాశం దొరికిందన్న మాట . ఈ టపాను మీరు నవతరంగంలో వాడడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు . ధన్యవాదాలు .
ఈ విధంగా యూజ్‌నెట్ న్యూస్ గ్రూపులు అందరూ కలిసి చర్చించే అభౌతిక చర్చావేదికలుగా అమిత ప్రాచుర్యం చెందాయి . యూజ్‌నెట్ న్యూస్ గ్రూపులు ఒకరకంగా ఈనాటి గూగుల్ గ్రూపులు , యాహూ గ్రూపులు , వెబ్ చర్చావేదికల్లాంటివే . అయితే నేటి చర్చావేదికలకు ఆనాటి న్యూస్ గ్రూపులకు రెండు ప్రధానమైన భేదాలు ఉన్నాయి . 1 . నేటి గూగుల్ గ్రూపులను గూగుల్ కంపనీ , యాహూ గ్రూపులకు యాహూ కంపెనీ కేంద్ర స్థానాలు . యాహూ గ్రూపుకి కానీ , గూగుల్ గ్రూపుకి కానీ పోస్టు పంపేమొదట్లో ఈ ఈ న్యూస్ ముందు మనం యాహూ లేదా గూగుల్ నియమనిబంధనలకి లోబడి ఉంటామని అంగీకరించాలి . 2 . పోస్టులన్నీ ( మనకి ఈ మెయిల్‌లో వచ్చినా ) యాహూ లేదా గూగుల్ సర్వర్లలో మాత్రమే నిక్షిప్తం చేయబడతాయి . ఆ యా న్యూస్ గ్రూపులకి యాహూ లేదా గూగుల్ కేంద్ర స్థానం అవుతుంది . కానీ , యూజ్‌నెట్ న్యూస్ గ్రూపుల వ్యవస్థను నడిపించే సంస్థగానీ కేంద్రం కాని ఏదీ లేదు . ఇంటర్నెట్టుకు కనెక్ట్ అయిన ప్రతి యూజ్‌నెట్ సర్వరూ స్వయం ప్రతిపత్తి గలదే . యూజ్‌నెట్ సర్వర్లు మరొక సర్వర్‌తో పోస్టులు సహకార పద్ధతిలో ఇచ్చి పుచ్చుకోవడం వల్ల ఏ ఒక్క సర్వర్ యొక్క సంస్థ యూజ్‌నెట్ మీద గుత్తాధిపత్యం చలాయించలేదు . ఈ విధంగా యూజ్‌నెట్ వ్యవస్థ రెండు దశాబ్దాలకు పైగా విరాజిల్లింది . ఈ యూజ్‌నెట్ వ్యవస్థ చూసి ముగ్ధులైన కొంతమంది సిద్ధాంతకర్తలు , ఏ రకమైన ప్రభుత్వంలేని రాజకీయ వ్యవస్థను ప్రతిపాదించడం కూడా జరిగింది . నామ్ చౌమ్స్కీ ( Noam Chomsky ) ప్రతిపాదించిన " Anarchism : Cooperation without restraint " ఈ కోవలోకి చెందిన సిద్ధాంతమేనని నా అభిప్రాయం .
కత శానా బాగుందండీ రాజుగారు . అర్జెంట్ గా స్వాతి పుస్తకానికి కి పంపేయండి . . ఎంతైనా మన ప . గో . జి . . ప . గో . జీ నే సుమండి .
అప్పట్లో జనవరిలో కొత్త కాలెండర్ వచ్చిన వెంటనే ముందుగా నా పుట్టిన రోజు ఏ రోజు వచ్చేదో చూసుకునేదాన్ని . ఆదివారం కాకపోతే పండగే . మరి ఆ రోజు పుట్టినరోజు వస్తే ఫ్రెండ్స్ ముందు పుట్టినరోజు ఫోజ్ కొట్టడానికి అవ్వదు కదా . . . కొద్ది కొద్ది గా కాలం గడుస్తుంది . మనకి ఎక్కాలన్నీ వచ్చేసాయి . అర్దం కాని లెక్కలు కూడా చేసేయవలసి వచ్చింది . ఎన్ని సూత్రాలని గుర్తు ఉంచుకుంటాం ? ? మనకి కాలం కలసి రాక కాలం , దూరం లెక్కలు వచ్చాయి . మామూలు వడ్డీ లెక్కలే అర్దం కావడం లేదంటే చక్రవడ్డీ , బారు వడ్డీ లెక్కలు కూడా వచ్చాయి . వీటి తర్వాత కాలెండర్ లెక్కలు వచ్చాయి . వీటిలో మాత్రం మనమే ఫస్ట్ . చిన్నప్పటి నుండి నా పుట్టిన రోజు కోసం కాలెండర్ చూసి . . . చూసి . . . ఒక విషయం తెల్సుకున్నా . . అదేమిటంటే . . ఈ సంవత్సరంలో సెప్టెంబర్ 23 లక్ష్మి వారం వస్తే తర్వాతి సంవత్సరానికి ఒక్క రోజు కలుపుకుని శుక్ర వారం వస్తుంది . అదే తర్వాతి సంవత్సరం లీపు సంవత్సరం అయితే రెండు రోజులు కలపాలి అప్పుడు శనివారం పుట్టిన రోజు వస్తుంది . ఎలాంటి సూత్రాలు లేకుండా నేను ఈ విషయం తెల్సుకున్నాను . కానీ ఈ విషయం చెప్పడానికి మా స్కూల్ లో రెండు క్లాసులు తీసుకున్నారు . ఎప్పుడూ లానే కొందరికే అర్దం అయ్యింది . ఆ కొందరి లో నేను లేను ఎందుకంటే మనకి సూత్రాలు గుర్తు ఉంచుకోవడం కష్టమయ్యేది . కాలం అలా భారంగా గడిచిపోతుంది . ఈ లెక్కలు నన్ను విడిచి పోను అంటున్నాయి . మొత్తానికి పి . జి . ఎంట్రన్స్ ఎగ్జామ్ వ్రాయడానికి ప్రిప్రరేషన్ కి ఒక కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యా . . అక్కడ షార్ట్ కట్ లో లెక్కలు చెప్పేవారు . ఎంత పెద్ద లెక్క అయినా ఒకటి , రెండు స్టెప్పుల్లో అయిపోయేది . ఈ కాలం , దూరం లెక్కలు , వడ్డీల లెక్కలు అప్పుడే నేర్చుకున్నా కొంచెం లో కొంచెం . . కానీ ఇక్కడ కూడా ఆ కాలెండర్ లెక్కలు బాగా చెప్పలేదు . అయినా మనకి ప్రోబ్లం లేదు . . . కాలెండర్ లెక్కల్లో మనం గుడ్ కదా . . . .
ఈ శ్లోకంలో ఆఖరిపదం ఒక్కటే సంస్కృతం ; మిగిలిన 24 పదాలూ 24 శబ్దసముదాయాలు . వీటిలో ప్రతి శబ్దసముదాయం ఒక అంకెని కానీ సంఖ్యని కానీ సూచిస్తుంది . ఆ అంకెలన్ని " జ్యా " అనే రేఖాగణిత భావాన్ని నిర్వచించడానికి ఉపయోగపడతాయి . మనం ఈ రోజులలో " ట్రిగొనామెట్రీ " లో వాడే " సైను " యొక్క నిర్వచనం ఈ శ్లోకంలో గూఢమైన పద్ధతిలో నిబిడీకృతమై ఉంది . ఈ పద్ధతి కూడ ఆర్యభట్టు ప్రవేశపెట్టినదే అయి ఉండవచ్చు .
సర్వహారా అన్న హిందీ పదం ఇంగ్లీషులో ప్రోలేటేరియట్‌కి సమానార్ధకం . సర్వహారా అంటే , సర్వమూ కోల్పోయిన వాడు . కమ్యూనిస్ట్ మానిఫెస్టో సృజనకర్తలు " వర్కర్స్ ఆఫ్ ది వర్ల్డ్ యునైట్ ! యు హావ్ నథింగ్ టు లూజ్ " అంటారు . అక్కడినించి వచ్చిన పదం ఇది - శ్రమ శక్తి మినహా సర్వమూ కోల్పోయిన వాళ్ళు . వాళ్ళని అంటే ఆ మిగిలిన శ్రమ శక్తిని నమిలి మింగేసి జీర్ణించుకుని వొళ్ళు పెంచుకుంటుంది పెట్టుబడి దారీ వ్యవస్థ . విప్లవం వస్తే , మార్పు వస్తే , అట్లా శ్రమశక్తి మినహా అన్నీ కోల్పోయిన వాళ్ళ నించే వస్తుంది . ( ఈ విషయం పెట్టుబడిదారీ వ్యవస్థకీ తెలుసు కాబట్టే , వాస్తవంలో అంత పూర్తిగా శ్రమ శక్తి తప్ప మరేమీ లేని ప్రజల సంఖ్య సమతూకంలో ఉంచుకోవడానికే అది ప్రయత్నిస్తూంటుంది అనచ్చు అనుకోండి , అది వేరే విషయం . )
అవసరమే - బీసీ నాయకులు విడుదల చేసిన వివరాల్ని బట్టి చూస్తే . ఎన్ని రాజ్యాంగ కబుర్లు చెప్పినా ఈ రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగాలు రెండు ఎస్సీ కులాలకూ , రాజకీయాలు మూడు అగ్రకులాలకూ పరిమితమై కూర్చున్నాయి . ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది కఠోరవాస్తవం . వీళ్ళల్లో ఒక అగ్రకులం తమని కూడా బీసీల్లో చేర్చాలనీ తమక్కూడా రిజర్వేషన్లు కావాలని చాలాకాలం నుంచి డిమాండు కూడా చేస్తున్నది . వాళ్ళు చిరంజీవిని రంగంలోకి దించాలని చాలా కాలం నుంచి విశ్వప్రయత్నం చేస్తున్నారు . ఇది బీసీలకు మంటెత్తిస్తోంది . బీసీలు పార్టీ పెట్టాలని నిర్ణయించుకోవడానికి ఇదొక తక్షణ కారణం . సదరు అగ్రకులం డిమాండ్లు ఎలా ఉన్నప్పటికీ వాళ్ళ గుఱించి మిగతా సమాజంలో అభిప్రాయం మాత్రం వేరుగా ఉంది . అందువల్ల ఆ డిమాండ్లని ఇంతదాకా ఎవరూ పట్టించుకోవడం జరగలేదు . నిజంగా వెనకబడి ఉన్న కులాల వైపు మనం దృష్టి సారించాలనడంలో విప్రతిపత్తి లేదు . బీసీలు అలాంటివాళ్ళే .
శ్రీ ముళ్ళపూడి వేంకటరమణ గారి రచనలు మనకు మార్గదర్శకం అవుతాయి »
శంకర్ కోటు తొడుక్కుని రిసీవింగ్ స్టేషన్ కి పరిగెత్తాడు . అప్పటికే నర్సులూ , డాక్టర్లూ , ఆర్డర్లీలూ వస్తున్న పది మందినీ రిసీవ్ చేసుకునేందుకు సిధ్ధపడుతున్నారు . రానే వచ్చాయి ఆంబులెన్సులు , గుండెలు పగిలే శోకంతో మొరపెడుతున్న సైరన్ల అరుపులతో . చకచకా పేషెంట్లని గర్నీల మీద కెక్కించటం , శరవేగంగా పరీక్ష చెయ్యటం , ఎవరికెంత గాయాలు తగిలాయో … దానికి తగిన చికిత్స పురమాయించటం . ఒక నడివయసు టీచరూ … మిగతా తొమ్మిది మందీ పిల్లలూ . శంకర్ నలుగురు పిల్లల్ని చెక్ చేశాడు . ఎవరికీ ప్రాణాపాయం లేదు కానీ , అందరూ షాక్ లో వున్నారు . రక్తం చాలా పోయింది . తను చూసిన నాలుగో పేషెంటుకి రక్తం ఎక్కించమని శంకర్ నర్సుకి చెప్తుండగా అవతలి టేబుల్నించి ఇంకో డక్టర్ పిలిచాడు ,
" అదేమిటి - స్కాట్ ఇలా చెప్పా పెట్టకుండా వెళిపోతే , ఎలాగ ? అయినా స్టీవ్ ఏం చేస్తున్నాడు ? వచ్చే వారం రిలీజు ఉంటే , వెకేషన్ ఎలా ఇచ్చాడు ? " స్టీవ్ స్కాట్ మేనేజరు . అతను క్వాలిటీ విభాగం చూస్తాడు . నేను ఇంజనీరింగ్ మేనేజర్ని ! మా గ్రూప్ తరపున క్వాలిటీ రిప్రజెంటేటివ్ గా రవి పనిచేస్తాడు .
ప్రియమైన శ్రీ మన్మోహన్‌సింగ్ గారు , నేను ఇటీవల కొన్ని రోజుల పాటు హైదరాబాద్‌లో గడిపాను . ఆంధ్రప్రదేశ్ రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర పరిస్థితులను నేను గమనించాను . భారీ , అతిభారీ వర్షాల కారణంగా చేతికందే పంటలకు అపార నష్టం వాటిల్లింది . కనీసం 20 లక్షల ఎకరాల్లో వరి , కనీసం పది లక్షల ఎకరాల్లో పత్తి పంటలకు నష్టం వాటిల్లింది . వీటితో పాటు ఇతర వాణిజ్య పంటలకు వర్ష ప్రభావానికి గురయ్యాయి .
అనేకవేలమంది మనుజులలో ఏ ఒకానొకడో మోక్షసిద్ధికై యత్నించుచున్నాడు . అట్లు యత్నించువారైన అనేకమందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవముగ తెలిసికొనగల్గుచున్నాడు .
లక్శ్మీదేవి కటాక్షము , విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ అందరికీ సుఖ , శాంతులను ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగు గ్రీటింగ్స్ దీపావళి శుభాకాంక్షలు అందిస్తోంది . దీపావళి శుభాకాంక్షలకోసం తెలుగు గ్రీటింగ్స్ ఒక ప్రత్యేక సైటు రూపొందించి సమర్పిస్తోంది
స్తబ్ధ శబ్ద గ్రహద్వయుడు సంవేష్టితో త్తాలవాలుండు కరాళవజ్ర కర్కశ దంష్ట్రా క్రకచ భయంకర మహా విస్తృత వక్త్రుండు విపుల దీర్ఘ పటుతర కహకహ స్ఫుట చటు వికటాట్ట హాస నిర్దళిత వేదాండభాండు డాలోక కాలానలాభీల విస్ఫుర న్నేత్రుండు ఖడ్గసన్నిభ నిశాత
రామ ఈ నవల చదివిన ప్రతిసారీ , నా మనసు " అన్నా " ని ప్రాధేయపడుతుంది , చనిపోవొద్దని , ప్రేమని చంపేయొద్దని . అన్నా కూడా వొక ఊహే కదా , ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం టాలస్టాయ్ మనసులో ప్రాణం పోసుకున్న కలే కద . కానీ ఈ రోజు నాకనుపిస్తుంది , అన్నానా నేను ప్రాదేయపడుతున్నాను , లేక నన్ను నెనే ప్రాధేయపడుతున్నానా ? So much of love between Anna … , and Vronsky … , how could she punish him with her death . How could she do that knowing that it will ruin him physically and emotionally . మన మనసుల్లో అంత శక్తి వుందా ? మనం ప్రేమించే మనిషిని , హింసించి , శిక్షించగలిగే శక్తి . ఇంత ప్రేమని దాచుకోగలగే మన మనసులో , ఇంత కౄరత్వం కూడా దాగుందా ? నా సీతని శిక్షించేంత కోపం , కసి , కౄరత్వం , నాలో వున్నాయా ? నే వేసిన శిక్ష వేరెవరికి తెలీకపోవచ్చు , నాకు తేలీదా . తన మనసుకి తేలీదా ? నా కోపం , నా కసి , నా అరుపులు , నా నిర్లిప్తత . నా నిర్లిప్తత , తన పట్ల , తన ప్రేమ పట్ల , నిర్లిప్తత , నిర్లక్షం తననెంత బాధపెట్టేయో , నన్నెంత బాధ పెట్టేయో . అర్థం పర్థం లేని తగవులు మామద్య ఎంతదూరాన్ని పెంచాయో . ఇద్దరం సంఘంలో పైకెదిగేం , కానీ వొకరి మనసులో వొకరం పాతాళానికి జారిపొయ్యాం . ఈ మెటీరియల్ rat చేజ్ లో ఐతే విజయం సాధించాంగానీ , ఆ విజయంలో జారిపోయిన జీవితాన్ని గమనించలేకపోయాం .
వరుణ్‌సందేశ్ , అస్మితాసూద్ జంటగా ఈశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ' బ్రహ్మిగాడికథ ' చిత్రం ప్రేక్షకాదరణ పొందుతోందని చిత్ర నిర్మాతల్లో . . ఇంకా
హైదరాబాద్ : అసెంబ్లీలో బ్రహ్మణీ స్టీల్స్ , ఓఎంసీలపై చర్చ జరపడానికే కాంగ్రెస్ , టీడీపీలు ప్రయత్నిస్తున్నాతే తప్ప , ప్రస్తుతం ప్రజల మౌలిక వసతులపై చర్చ జరగడంలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు . ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సభలో నిజాయితీగా చర్చ జరగాలన్నారు . ప్రజల ఎజెండా సభలో ఉండాలి తప్ప , పార్టీల ఎజెండా కాదని కిషన్‌రెడ్డి అన్నారు .
రావ్ గారు థాంక్యూ . నా వృత్తికి ఒచ్చిన ఇబ్బంది , చిక్కులు ఏమీ లేదండి . ఆ అమ్మాయిని ఈ సంగతి ఎవరికి చెప్పకు అని అడిగే ప్రశ్నే లేదు . అపాత్ర దానమనికూడా అనిపించలేదు . అప్పుడు ఆ అమ్మాయి ఉన్న మానసిక పరిస్థితి నా కళ్ళకు ప్రత్యక్షంగా కనిపించింది . అంతకుముందు సెమిస్టర్ ఎక్షాంస్ బాగా రాసి పాస్ అయింది . చదువురాని అమ్మాయి కాదు . ఆ అమ్మాయి ఏమీ తినకుండా ఒచ్చింది . తన గురించిన ఆలోచనలో చాలా బాధలో ఉంది . ఏమీ ఆలోచించే స్థితిలో లేదు . ఇవన్నీ గమనించే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను . ఈ విషయం మీ అందరికి తెలియ చేయటం లో మీరిచ్చే సలహాలు నాకు తోడ్పడతాయనే నా ఉద్దేశ్యం . మధురవాణి గారు ధన్యవాదాలు . ఏమోనండి , ఆ సమయంలో ఆ అమ్మాయి విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఉద్దేశ్యంతోనే ఆ పని చేసాను . ఇంక అనాధాశ్రమంలో ఆ అమ్మాయి కష్టపడనవసరం లేదు . మా కాలేజ్ హాస్టల్లో త్వరలోనే చేరబోతుంది . ఈ విషయం ఆ అమ్మాయిఉండే సంస్థకి కూడా తెలియచేసారు . నేను తప్పు చేసినప్పటికీ , ఇప్పుడు నాకాభావం లేదు . ఎంతో సంతోషంగా ఉంది .
మా క్లయింటుది జపాను . ఒక సారి వాళ్ళకు ఒక రోజు సెలవు . . తరువాతి రోజు మాకు సెలవు . . అప్పుడు వాడు పంపిన మెస్సేజ్ చూసి నవ్వీ నవ్వీ చచ్చాం . ఆ మెస్సేజ్ : ' today india is holiday , tomorrow japan is holiday ' . . ఇల్లాంటివి ఇంకా చాలా . . . : ) మీ పోష్టు చాలా బావుంది .
అది విన్న రాజుగారు ఎగిరి గంతేసేరు . వారు వేసుకున్న పథకం అదేనాయె ! మబ్బుల పాడులో తన గానాన్ని ఎవరూ ఎలాగూ పట్టించుకోవటం లేదు . కనీసం పెద్ద పాలెంలో నైనా స్టేజి ఎక్కి పాడాలనే తమ చిరకాలవాంఛ నెరవేరబోతోందని ఆనందించేరు వారు .
ఆ ఊహ మెదిలింది మొదలు కమలాబాయి గుండెల్లో సన్నని అదిరిపాటు ప్రారంభమైంది .
wow interesting ! ! ఆయన ఓ అద్భుతమైన నటుడిగా మాత్రమే తెలుసు కానీ వ్యక్తిగతమైన వివరాలు పెద్దగా తెలియవు . తను తమిళియన్ అనుకుంటున్నాను . ఇంతకీ " నడ్డిమీఛ్చంపేస్తాను " అనే అన్నయ్య వీరేనా : - )
హైదరాబాద్ , మేజర్‌న్యూస్ : రైతాంగ సమస్యలపై అందరూ అనుకున్నట్లే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారు . ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సానుకూలంగా స్పందిస్తారో లేదో . . ఆరోగ్యం సహకరిస్తుందో లేదో ఈ వయస్సులో దీక్ష చేపట్టడంపై పునరాలోచించుకోండంటూ పార్టీ శ్రేణులు చేసిన విజ్ఞప్తిని ఆయన సున్నితంగా తిరస్కరించారు . గురువారం శాసనసభ సమావేశాలు ముగిశాక నిరవధిక దీక్ష చేపట్టే అంశంపై పార్టీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , సీనియర్ నేతలతో అసెంబ్లీ కమిటీ హాలులో చంద్రబాబు సుదీర్ఘంగా సమాలోచన చేశారు . అనంతరం సమావేశం వివరాలను టీడీ ఎల్పీలో సీనియర్లు కే . యర్రన్నాయుడు , వేణుగోపాలాచారిఎల్ . రమణ , దాడి వీరభద్రరావు , పల్లె రఘు నాథరెడ్డిలు విలేకరులకు వెల్లడించారు . శుక్రవారం సచివాలయం సమీపంలో ఉన్న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చంద్రబాబు సహా పలువురు సీనియర్ నేతలు ఉదయం 10 . 30 గంటలకు నిరవధిక నిరహార దీక్ష చేపడతారన్నారు . మిగిలిన నేతలు రోజుకు కొందరు చొప్పున దశల వారీగా దీక్షలో చేరుతారన్నారు . చంద్రబాబుకు సంఘీభావంగా జిల్లాల్లోనూ పార్టీ శ్రేణులు నిరవధిక నిరాహార దీక్షలకు కూర్చుంటారని యర్రన్నాయుడు తెలియజేశారు . దీక్ష కూర్చోడానికి ముందుగా చంద్రబాబు తొలుత అసెంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రహానికి , ట్యాంక్‌బండ్ వద్ద నున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పిస్తారని , అక్కడి నుండి హుస్సేన్ సాగర్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకు ఆయన శ్రద్ధాంజలి ఘటించి అక్కడి నుండి నేరుగా ఆదర్శ్‌నగర్లో ఉన్న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు చేరుకుని నిరవధిక నిరాహార దీక్షను చేపడతారని యర్రన్నాయుడు వెల్లడించారు .
ఈ సంస్కృతకవులు వర్ణనలు చెయ్యలేదా ? . విరివిగా చేశారు . వృత్తాల్లోనే చేశారు కూడా . వాళ్ళ వర్ణనలు నిర్దిష్టంగా , క్లుప్తంగా ముగించారు . తక్కువ మాటల్లో పదునుగా చెప్పి , మిగిలినది పాఠకుల ఊహకి వదిలేసారు . పెద్ద వృత్తాల్తో వర్ణనలు చేసి పెద్దపేరు తెచ్చుకున్నవాళ్ళు ఉన్నారు . భవభూతి వాళ్ళలో ఒకడు . శిఖరిణీ వృత్తం అనగానే గుర్తొస్తాడు . పెద్దవి వ్రాసినా , అద్భుతమైన నాదంతో వ్రాసాడు . అందుకే గుర్తుండి పోయాడు . ( మన తెలుగువాడు అనే వాదముంది కూడ ! )
శబ్దాలంకారాలు పుష్కలంగా ఉండి చెవికింపుగా హాయిగా వినిపించే ఈ పాట అర్థాన్ని అడివికి తోలేసి శబ్దాన్ని చంకనెత్తుకోవటానికి ఒక మంచి ఉదాహరణ కూడ . నర్తకి రకరకాల స్థలాల్లో రకరకాల సన్నివేశాల్ని అభినయించి చూపుతుంది కనక ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేని విషయాలు స్పృశించటం జరిగిందని వాదించొచ్చు కాని అది తర్కానికి నిలబడేది కాదు . ఐతే ఈ పాటలోనూ సంప్రదాయ భావాలు గుప్పుమంటున్నాయి . ఇందులో ఉన్న " స్వరస " అన్న పదానికి అర్థం ఏదైనా వుంటే అది ఆ రాసినవారికే తెలియాలి - నిఘంటువుల్లో ఎక్కడా ఈ పదం కనిపించదు !
ఎటు పోతున్నాం . . మనం ఎటుపోతున్నాం ? ప్రకృతి ప్రళయ తాండవం ఓ వైపు , ప్రజా ఉద్యమాల ఉన్మాదాలు మరో వైపు , రెచ్చగొట్టే ప్రసంగాలు ఓ వైపు , ఆవేశంతో రెచ్చిపోతున్న యువత మరో వైపు , ఆవేశంలో ఆలోచన నశించి పోగా , పరిస్థితులను కాష్ చేసుకుంటున్న నాయకులు అన్నివైపులా … ఇవి , అభివృద్ది వైపు పరుగులా ? వినాశనం వైపు ఉరుకులా ? ఎటు పోతున్నాం . . మనం … Continue reading →
అంటే ఈ మొత్తం విశ్లేషణలో కవి నేడు ఎదుర్కొంటున్న పెను సవాళ్ల గురించి కొద్దిగా చర్చించటం జరిగింది . అయితే ప్రగతి కాముక నిబద్ధకవులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ముందుకుపోయే ప్రయత్నమూ చేస్తున్నారు . సామాజిక ఆర్థిక వొత్తిడులు ఈ రకమైన వాతావరణాన్ని సృష్టిస్తూ దాడి చేస్తున్నప్పుడు కవి ఇంకా ఎంతో అప్రమత్తంగా వుండాలి . అంతేకాదు కవిత్వాదరణకు , కవిత్వానికి అవసరమైన సామూహిక భావావేశాలు కలిగిన సామాజిక ఉద్యమాల నిర్మాణంలోనూ పాలుపంచుకోవాలి . జీవితాలను జీవిత సంఘర్షణలనూ పరిశీలించాలి . ప్రజల జీవద్భాషను పట్టుకోవాలి . సామూహికతలలోంచి వచ్చిన భావ చిత్రాలను ఉపయోగించాలి . నిత్య నూతనమైన సాధారణ ప్రజల జీవితం కవిత్వ వస్తువుగా మారాలి . సమాజంలో జరుగుతున్న దానికి కవులు సాక్షులుగా మాత్రమే నిలువొద్దు , కేవలం ఆశిస్తూ కూర్చోవద్దు . క్రియాశీలమైన సాహితీకారులుగా మారాలి . సామూహిక మానవానుభూతుల నుండే సత్యాన్వేషణ సాగుతుంది , అదే కవి చెయ్యాల్సింది . అప్పుడే మన కవిత్వాన్ని సాహిత్యాన్ని అందరూ తమదిగా భావిస్తారు .
కోరుకున్నవి చెయ్యిదాటిపోతే వెళ్ళిపొనిలే . . బాదపడ్డం బెంగ పడిపొడం మనకి రాదసలే . . మగాడా నచ్చిన మొనగాడా . . నీకాడ ఎదో ఉన్నదిరా . . చూపులుతోనే చున్నీనే లాగే జాదు నువ్వేరా . .
కానీ తనెప్పుడూ చెబుతూ ఉంటుంది . నేనేరా నీ నిజమైన నేస్తాన్ని అని . నేనెప్పుడూ నిన్ను వదిలి ఉండలేదు , ఉండను అని . నాకు కూడా తెలుసు అదే నిజమని . కానీ ఆ నిజాన్ని అంగీకరిస్తే అమ్మో ఆ భయంకర భావాల్ని నేను భరించలేనేమో ? అలా అని పూర్తిగా తనని వదిలి ఎప్పుడూ నేను కూడా ఉండలేదు . నా అవసరాల్లో , భాదల్లో తననే ఆశ్రయిస్తా . ఆనందాల్లో మాత్రం తనని మరిచిపోతా . అయినా ఇంతకాలం ఎప్పుడూ చిన్నబుచ్చుకోలేదు . నేను పట్టించుకోకపోయినా నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది . తనతో అవసరంపడి తనకోసం చూడగానే అర్ధం చేసుకుని వచ్చి వాలిపోతుంది . బయటకి ఎప్పుడూ చెప్పకపోయినా తనంటే నాకు చాలా ఇష్టం .
మన శాసనపాఠాల్ని జాగ్రత్తగా చదివితే వాటిల్లో ఎక్కడో ఒక మూల తప్పనిసరిగా ఇలాంటి గద్య ( paragraph ) ఒకటి దర్శనమిస్తుంది . ఇవి తప్పులు చేసేవాళ్ళ సౌలభ్యార్థం ఉద్దేశపూర్వకంగా చొప్పించిన సేఫ్టీవాల్వులేమోనని మనం అనుమానించడానికి అవకాశం లేదు . ఎందుకంటే ఖచ్చితంగా అవి అవే ! మన చట్టాలన్నీ ( రాజ్యాంగంతో సహా ) ఇలాంటి రహస్యమార్గాలతోను , కొన్ని వర్గాల కోసం ఉద్దేశించిన ప్రత్యేకమైన Emergency Exit లతోను నిండిపోయాయి . ఈ మినహాయింపులు మన ఉమ్మడి న్యాయబుద్ధి ( collective sense of justice ) నీ సమానత్వ సూత్రాన్నీ పరిహాస భాజనంగా మార్చాయి . నిజానికి ఈ దేశంలో సమైక్యమూ , సమానత్వమూ , న్యాయమూ అనేవి ఎవరికీ అవసరం లేదు . తన కులమూ , అందులో భాగంగా తానూ బావుంటే చాలు . అదే సమైక్యం . తన కులానికి కొన్ని చట్టబద్ధమైన ప్రత్యేకింపులు ( reservations ) ఉంటే చాలు . అదే సమానత్వం . అదే న్యాయం . ఈ సంకుచితత్వానికి సామాజిక న్యాయం అని పేరు కూడా పెట్టారు . న్యాయమంటూ ఉంటే అది ఇలా మనిషికో రకంగా , కులానికో రకంగా ఉండదు . కుటుంబన్యాయం , సామాజిక న్యాయం రాజకీయన్యాయం , మతన్యాయం అంటూ ఇన్ని రకాల న్యాయాలు లేవు . ఒకవేళ ఉంటే అది న్యాయమే కాదు . కాని ఈ విషయం ఈరోజు ఇక్కడ ఎవరికీ అవసరం లేదు . ప్రపంచచరిత్రలో ఇప్పటి దాకా జఱిగిందేమిటంటే - ఒకఱి కోసం ఉద్దేశించిన సౌలభ్యాల్ని ఇంకొకఱు వాడుకోవడం . " చీమలు పెట్టిన పుట్టలు పాముల కిఱవైన యట్లు " . మన మీటకాలు ( keyboards ) నిజానికి గ్రుడ్డివారి కోసం ఉద్దేశించినవి . కాని వాటిని వాడేవాళ్ళంతా కళ్ళున్నవాళ్ళే . అలాగే సంసార బాధితుల కోసమూ విధుర వితంతువుల కోసమూ ఏర్పఱచిన విడాకుల్నీ , మాఱుమనువు వెసులుబాటునీ చాలావరకూ ఆ బాధలేమీ లేనివాళ్ళే ఎడాపెడా వాడేసుకోవడాన్ని మనం గమనిస్తున్నాం . అలాగే వ్యవసాయరంగంలో బడుగుల కోసం ఉద్దేశించిన ఆదాయంపన్ను మినహాయింపుని కూడా పిడుగుల్లాంటివాళ్ళే వాడుకోవడం జఱిగింది . అలా వాడుకోబడుతుందని ఆ మినహాయింపు ఇచ్చినవాళ్ళకు తెలియదా ? అంటే , ఎందుకు తెలియదు ? భేషుగ్గా తెలుసు . స్వప్రయోజనాల రీత్యా చాలా దూరదృష్టితో చేసిన పని ఇది . ఇందులో ఉన్న కరటక నీతి ఇది - 1 . మనం ( మినహాయింపు ఇచ్చిన పెద్దమనుషులు ) సమీప భవిష్యత్తులో ఆర్థిక అద్భుతాలేమీ సాధించబోవడం లేదు . కాని ఈ లోగా మనకు వోట్లూ సీట్లూ కావాలి . 2 . ఆ వోట్లూ , సీట్లూ మనకే శాశ్వతంగా దఖలైపోవాలి . ఎట్టి పరిస్థితుల్లోను రెండోవాడికి అవకాశం ఉండకూడదు . అంటే మనకొక శాశ్వత వోట్‌బ్యాంక్ ఏర్పడాలి . అందఱికీ మేలు చేస్తామంటే అది ఏర్పడదు . కమ్యూనిస్టులు ఏదైతే చేస్తామంటున్నారో అది మనమే చేసేసి అధికారంలో సుస్థిరంగా పాతుకుపోవాలి . 3 . మెజారిటీ అంటే అధిక జనాభా . మన జనాభాలో ఎక్కువమంది రైతులు . మనమూ రైతులమే . కాబట్టి వారికి పనికొచ్చేదేమైనా చేస్తే చాలు . మిగతా దేశమంతా ఏ దిబ్బలో కొట్టుకుపోయినా ఫర్వాలేదు . 4 . రైతు సమస్యల మీద గతంలో బ్రిటీషువారి మీద ఉద్యమించి అప్పటి ప్రొవిన్షియల్ ప్రభుత్వాల్లో స్థానం సంపాదించాం . ఆ సమస్యల్లో ముఖ్యమైనది పంటల మీద అధిక పన్ను . కాబట్టి ఇప్పుడు కూడా అదే మంత్రం పఠిద్దాం . 5 . పన్ను తగ్గిద్దామా ? వద్దు . అలా చేస్తే మనకంటే ఇంకా తగ్గిస్తామనేవాళ్ళు మనకు పోటీవస్తారు . అసలు ఏకమొత్తంగా పన్నే ఎత్తేద్దాం . అప్పుడు రైతాంగంలో మన ప్రభంజనానికి తిరుగుండదు . 6 . పనిలో పనిగా మనకూ పన్నుండదు . మన నల్లడబ్బంతా రాజమార్గంలో తెల్లబఱచుకోవడానికి ఇది లెస్సగా ఉపకరిస్తుంది . తద్ద్వారా మనకు ఎన్నికల్లో తోడ్పడే జమీందార్లూ , భూస్వాములూ కూడా మనకే శాశ్వతంగా జై కొడతారు . ఈ రకంగా వ్యవసాయం మీద పన్ను లేకపోవడం అనే ఆర్థిక రుగ్మత స్వాతంత్ర్యానంతరం వచ్చిపడ్డదే తప్ప భారతదేశ చరిత్రలో కొన్ని వేల సంవత్సరాలుగా వ్యవసాయం మీద పన్ను ఉంటూనే వచ్చింది . రాజులు బలి - షడ్‌భాగమనే పేరుతో పంటలో ఆఱో వంతుని రైతుల నుంచి వసూలు చేసేవారు . బ్రిటీషువారి పాలనలో ఆ పన్ను శాతం అమానుషమైన స్థాయి ( 40 - 60 శాతం ) కి పెఱిగిపోవడాన్ని కాంగ్రెస్‌పార్టీ స్వాతంత్ర్య పోరాటకాలంలోను , ఆ తరువాతా కూడా పైన చెప్పిన విధంగా తన కనుకూలంగా మలచుకుంది . కాని వ్యవసాయం మీద ఎంతో కొంత పన్నువెయ్యకుండా మనం గ్రామాల్ని అభివృద్ధి చెయ్యలేము . కాబట్టి గ్రామీణ యువకులు ఉగ్రవాదులు కాకుండా నిరోధించనూ లేము . రైతులక్కూడా ఏ సహాయమూ చెయ్యలేము . ప్రీమియమ్ చెల్లించకుండా బీమా ప్రయోజనాన్ని అందించగలమా ? ఇప్పుడు రైతుల పేరు చెబితేనే బ్యాంకుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి - వసూలు కాని వేలాదికోట్ల అప్పులు గుర్తొచ్చి . దానికి తోడు శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తూండడంతో శేఖర్‌దాదా రైతుల అప్పులు మాఫీచెయ్యాలంటూ పాతపల్లవి ఎత్తుకున్నాడు . ఎంతకాలమిలా అప్పులు మాఫీ చేస్తారు ? ఎంతకాలమిలా రైతుల్ని దేశానికి గుదిబండలుగా మారుస్తారు ? ఎంతకాలమిలా రైతుల్ని దేశపు ఆర్థిక వనర్ల పాలిట దోపిడీదార్లుగా రూపొందిస్తారు ? వ్యావసాయిక ఆదాయం మీద పన్ను సరికొత్త ప్రతిపాదన కాదు . గతంలో బలరామ్ జాఖడ్ అనే లోక్‌సభ స్పీకరు ఈ విషయమై పదే పదే ప్రస్తావించి స్పందన లేకపోవడంతో ఊరుకున్నాడు . మన నాయకుల స్వార్థమూ , రైతుల అజ్ఞానమూ పట్టణ ప్రజల ఉదాసీనత్వమూ , ఆర్థికవేత్తల మూర్ఖత్వమూ , ఎఱ్ఱజెండాల ప్రచారమూ - వెఱసి ఈ సంక్షోభానికి కారణం . ఈ రోజు ఇలాంటి ప్రతిపాదనలు చేసేవాళ్ళు రైతుల పాలిట శత్రువులుగా చూడబడతారు . కాని పట్టణ ప్రజల శాతం పెఱిగే కొద్దీ భూమి విలువ అధికమయ్యే కొద్దీ ప్రభుత్వానికి రాజస్వపు ( revenue ) అవసరాలు హెచ్చేకొద్దీ దీని అవసరాన్ని తప్పకుండా అందఱూ అర్థం చేసుకుంటారు . అది 20ఏళ్ళకు కావచ్చు . 40ఏళ్ళకూ కావచ్చు . అయితే వినాయకుడి బొడ్డులో తేలుందనీ , అది కుట్టడం మూలానే మనకు నొప్పిగా ఉందనే నగ్నసత్యాన్ని ఎవఱో ఒకఱు బయటపడి వెల్లడించక తప్పదు .
@ శివ గారికి , @ సుభద్ర గారికి , @ డా . శ్రీను గారికి , @ వికటకవి గారికి , @ పరిమళం గారికి , @ జీడిపప్పు గారికి , టపా చదివి వదిలేయకుండా సమయం వెచ్చించి మీ అభిప్రాయాన్ని వెలిబుచ్చినందుకు చాలా థాంక్సండి . మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది . @ సూర౦పూడి ఆన౦ద్ గారికి , మీ కామెంట్ చదివిన తర్వాత మనసు ములగ చెట్టెక్కి దిగనని తెగ మారాం చేస్తుందండి . > > ఇ౦త ఆలోచన ఏ మూల ను౦చి తెచ్చార౦డీ బాబూ ? నిజానికి ఈ ఐడియా వారాంతం కదా అని తీరిగ్గా తలకు షాంపూ చేసుకుంటుంటే వచ్చిందండి . ఎన్నాళ్ళ నుండి దాగుందో పేను లాగ తెలీదు గాని , ఆ టైం లో కింద పడింది . ఇంక చేతులు ఊరికే ఉరుకోవుకదండి . > > వ్య౦గ౦లో మీది మహబాగు బ్లాగులె౦డి . నిజానికి ఈ టపా రాస్తున్నప్పుడు ఎవరినో దృష్టిలో పెట్టుకుని రాయలేదండి . ఒక సరదా ఆలోచనని అంతే సరదాగా తోటి బ్లాగు మిత్రులతో పంచుకోవాలనిపించింది . వ్యంగంగా రాసేంత రచనా నైపుణ్యం కూడా నాకు ఉందని నేను అనుకోవటంలేదు . ఎంతో అభిమానంతో కామెంట్ రాసినందుకు మీకు కృతజ్ఞతలు .
సత్తెన్న గొంతు సవరించుకుని " యువరానర్ జాఫర్ శ్రీనివాస్ ఇద్దరూ చెప్పిందానితో నేను ఏకీభవిస్తున్నాను . ఇది విప్లవ కారులమని చెప్పుకుంటున్న వాళ్ళు చెప్పినందుకే కోవర్టును వాళ్ళు చంపారంటున్నారు . మరిక్కడ ప్రభుత్వం ఎక్కడినుండొచ్చింది ? ప్రభుత్వానికి అసలు వీళ్ళిద్దరూ తెలియదు . ప్రభుత్వాన్ని ప్రస్తుతం మాతో పాటుగా ప్రతివాదులుగా పేర్కొనబడ్డ వీళ్ళిద్దరూ గుర్తించరు . మరి మేం కలిసి లింగమ్మ కొడుకు చావుకు కారణమయ్యే ప్రసక్తే రాదు కదా " అన్నడు .
నిజమే . . . . కాకతీయ రుద్రమ దేవి పెళ్లి చేసుకున్నది నిడదవోలు వ్యక్తిని . దేశ భాష లందు తెలుగు లెస్స అని చాటిన శ్రీ కృష్ణ దేవరాయలు కన్నడ వ్యక్తి . చెన్నై ఏర్పడింది , అలనాడు చెన్నయ్ ప్రాంతాన్ని పాలించిన తెలుగు రాజు చెన్నడి పేరు మీద ( చెన్న పట్నం ) . ఒకప్పుడు . . . . పాకిస్తాన్ ఏం ఖర్మ ఆఫ్ఘనిస్తాన్ , టిబెట్ , బర్మా , బాంగ్లా దేశ్ , శ్రీలంక , కాంబోడియా అన్నీ భారత దేశం లో అంతర్భాగం గా వుండేవి . ఇప్పుడవన్నీ అనుకుని ఏం లాభం ? గతజల సేతు బంధనం ! ! ఆంధ్ర తెలంగాణా విడిపోతేనే అలనాటి ఆత్మీయతలు , అనుబంధాలు మళ్లీ చిగురిస్తాయి .
ఇక్కడ మరొక విషయం ప్రస్తావించాలి . నేనూ చాలా సేపు eతెలుగు స్టాల్ దగ్గర నుంచొని వచ్చే పోయ్యే వారితో సంభాషిస్తూ చాలా సేపు నిలబడే ఉన్నాను . కానీ నుంచోని నుంచొని కాళ్ళు నొప్పి పుడుతూ ఉండడం వల్ల కొంత సేపు లోపల కుర్చీలలో కూలబడే వాడిని లేదా బయట నుంచొని eతెలుగు స్టాల్ ని చూస్తూ మన తెలుగు బ్లాగర్లతో ముచ్చట్లేశే వాడిని . కానీ మన హీరో గారైతే కూర్చోగా నేను చూడ లేదనే చెప్పవచ్చు . ఒక వేళ కూర్చొన్నారేమో ఎవ్వరైనా చూస్తే స్పందించండి . ముందుగా చెప్పినట్లుగా " అలుపెరుగని యుధ వీరుడు " అనే బిరుదు వీరికి అన్ని విధాలుగా సరిపోతుంది అనడానికి ఇదొక మరొ కారణం .
mspaintని మనం అసలు వాడతామో లేదా తెలియదు కానీ , ఈ క్రింది వీడియో చూస్తే దానిలో కూడా మంచి మంచి బొమ్మలు గీయొచ్చేమో అని అనిపించక మానదు .
నోట్ : గొర్తి బ్రహ్మానందం గారూ మీరు త్యాగరాజ కీర్తనలని గురించి మరికొంచెం విస్తరించి రాసి దాన్ని పుస్తకంగా తీసుకుని రండి . బాగుంటుంది . ప్రతీదాన్నీ ఇలా ఈమాట ఎలక్ట్రానిక్ పేజీల్లోంచే ఎంతకని చదువుకోగలరూ ఎవరైనా ? ? అన్ని సార్లూ అలా కుదరదు కదా ? ? అందుకు . ఐతే తెలుగులో మంచి పుస్తకాలకి పబ్లిషర్లు ఉండరు చాలాసార్లు . పెర్సొనాలిటీ డెవెలొప్మెట్ పుస్తకాలకి తప్ప . [ తెలుగులు బుక్స్ చదివి గానీ తమతమ పెర్సొనాలిటీలని డెవెలొప్ చేసుకోలేకపోతున్నట్టున్నారు మరి . ప్చ్ ఏం కాలం ! ! ] . గనకనే మీరు బహుశా మీ వ్యాసాలని పుస్తకంగా తీసుకుని రాలేకపోయి ఉండొచ్చు . అంతేనా లేదా ఇంకేమన్నా కారణమా ? ?
కొత్తపాళీ గారూ ! నమస్కారం . మీరు చెప్పినట్లు ' నివాళి ' అనే పదానికి నిఘంటు అర్థం ' ఆరతి ' అనే మాటే ! కానీ వాడుకలో అనేక పదాల అర్థాలు , ప్రయోగాలు కాలానుగుణంగా మారటం కూడా సహజమైన ప్రక్రియే ! ' నివాళి ' అనే పదం చాలాకాలంగా మీరు ఉదాహరించిన అర్థంలో వాడటం జరుగుతోంది . ఇది నిన్న మొన్న ప్రారంభమైనది కాదు . ప్రముఖ రచయితలూ , పండితులు కూడా ఇదే అర్థంలో వాడటం నాకు తెలుసు . భాషపై పట్టున్న ప్రముఖులు సంపాదకులుగా వున్న పత్రికలలో కూడా ఈ ప్రయోగం చాలాకాలంగా జరుగుతోంది . నేను భాషా పండితుణ్ణి కాను గానీ ఒక విషయం చెప్పదలచుకున్నాను . ' నివాళి ' అనే మాటకు చనిపోయిన వాళ్ళ విషయంలో ప్రయోగించడం వల్ల అర్థం మారిపోతొందని నాకనిపించడం లేదు . ఆ పద ప్రయోగ పరిధిని మరింత విస్తృతం చేసి మరణించిన వారి పట్ల గౌరవాన్ని , భక్తిని చాటుకునేందుకు వాడుతున్నారని నేననుకుంటాను . చనిపోయిన వారిని దేవుడితో సమానంగా భావించడం , వారికి పూజలు జరపడం మన సంసృతిలో భాగం కదా ! సాయిబాబా , ఊరూరా వెలిసిన గ్రామదేవతలు దీనికి ఉదాహరణలు . అంతెందుకు ? మీ టపాలో ' టీవీ9 వాళ్ళు దేవులపల్లికి పట్టిన నీరాజనం రెండు భాగాలు . . . ' అన్న దాంట్లో ' నీరాజనం ' అనే పదానికి కూడా నిఘంటు అర్థం ' ఆరతి ' . ఆ అర్థంలోనే వాడితే దేవులపల్లి వారికి వాడకూడదేమో ! కానీ ఆ అర్థ పరిధిని విస్తృతం చేసినపుడు ఆ ప్రయోగం తప్పు కాదు . ' అంజలి ' ప్రయోగానికి కూడా ఇదే వర్తిస్తుందేమో ! ' సుస్వాగతం ' అనే పదం తెలుగు నిఘంటువులలో కనిపించదు . ఆ పదం ఆబ్దిక మంత్రాలలో పితృదేవతలను ఆహ్వానించే సందర్భంలో వాడతారు . కానీ ప్రస్తుతం ఆ పదాన్ని ఏ అర్థంలో వాడుతున్నామో చెప్పనక్కర్లేదనుకుంటాను . వ్యవహారికంలో విస్తృతంగా వుండే పద ప్రయోగాల గురించి పరిజ్ఞానమే తప్ప భాష మీద అధికారమున్న వాణ్ని కాదు . . . కానీ నేను కూడా ' నివాళి ' అనే పదాన్ని అందరిలాగే ఈ అర్థంలోనే వాడుతున్న బ్లాగరుని కాబట్టి భుజాలు తడుముకున్నాను . నొప్పించివుంటే మన్నించండి .
" సుమంగళి " అపజయం పాలైనా లెక్క చేయకుండా తర్వాత చిత్రం " దేవత " ( 1941 ) ప్లాన్ చేయడం మొదలు పెట్టారు . " దేవత " కథ క్లుప్తంగా " ఉన్నత విద్యావంతుడైన కథానాయకుడు ( నాగయ్య ) కాలుజారి ఒక పెళ్ళికాని అమ్మాయిని ( కుమారి ) అనుభవించడం , తనవారిని ( మాలతి , సూర్యకుమారి ) కూడా మోసగించడం , మరల జ్ఞానోదయమై తిరిగి ఇల్లు చేరడం " . చాలామంది ఆ కథ విని కన్నెర్ర చేశారు . చివరకు అత్యంత సన్నిహితుడైన రామ్‌నాథ్ కూడా వద్దని హెచ్చరించినా బి . ఎన్ . లెక్కచేయలేదు . 11 . 09 . 1941 న విడుదలైన " దేవత " అనూహ్యంగా జయభేరి మోగించింది ! కేరళ రాష్ట్రంలో కూడా చాలా కాలం ఆడడం గమనించదగ్గ విషయం . ముఖ్యంగా ఖాళీ అయిన " వాహినీ " ఖజానా మరల నిండింది .
చూశారా తీగ లాగితే డొంకంతా కదిల్నట్టు మీలాటి ముందుచూపున్న ప్రొడ్యూసర్లు ఒక్క ముక్కంటే నాలాంటి మేధావికెడ్ డైరెక్టర్ చేతులో అదో ఎవార్డ్‌సిన్మాగా తర్జుమా అయిందా లేదా ? అందుకే నాతో మాట్టాడ్డవే ఓ ఎడ్యుకేషన్ అన్నాడెవడో ! అబ్బే , అదెవడో వాడి గురించి అనుకున్నది కాదు , ఎవడో నా గురించి , అంటే నేనే నా గురించి అన్నది లెండి . అరె , ఏవిటలా మా కాబోయి మానేసిన మావగారిలా ధువధువలూ చిటపటలూనూ ! కొంపదీసి మీగ్గూడా ఎవరేనా యంగ్‌బ్యూటిఫుల్‌విడోతో యంగండ్ రెస్ట్‌లెస్ ఎంగేజ్‌మెంట్‌ఉందా ఏవిటి ? నేనూ అందాకా వస్తా పదండి ఎంతైనా ఈ విషయాల్లో చెయ్యిదిరిగిన చెయ్యి గదా మన్ది ! ఏవిటీ ఈ పూట ఎంతమాత్రం తవ కార్లో మరొకరు రావటానికి వీలుపడదంటారా ! నన్నిలా ఒక్కణ్ణే ఈ మాల్లో ఒదిలేసి మీరు వెళిపోవడం చూశారూ , ఇది బేస్ బార్బేరియస్ ! మరో సారి ఆలోచించుకోటం మంచిది నామాట విని . .
ఎవడో మల్టీపిన్ ప్లగ్ సాకెట్ తీసుకొచ్చినట్టున్నాడు . ఒకేదాన్లో ఐదు చార్జర్లు పెట్టేసి చార్చింగ్ ఒకపక్క జరుగుతుంది . ఒకడు చార్జింగ్ పెడుతూనే ఫోన్ మాట్లాడుకుంటూ నవ్వేసుకుంటున్నాడు , అన్నీ వెతగ్గా ఒక చార్జర్ కి తోకలాగా వైరు వుంది కానీ . . దానికి వేళాడుతూ ఫోను కనబడలేకపోయేసరికి ఆశ్చర్యంవేసింది కిరణ్ కి . . చార్జరుకున్న వైరును కళ్ళతో వెంబండించి చూడగా తెలిసిందేంటంటే . . ఎవడో మహానుభావుడు నార్మల్ చార్జర్ కి ఒక వైరుముక్క అతికి ఎక్స్టెండ్ చేసుకుని ఫోను చేత్తో పట్టుకుని బాత్రూంలోకి పట్టుకువెళ్ళి డోరు వేసేసుకున్నాడని . ఆహా . . ఏమి ఐడియారా . . ఇలాంటి చావు తెలివితేటలు ఎలా వస్తాయో . . అది కూడా ఒక కళే . . అనుకున్నాడు కిరణ్ .
మూడు రోజులు జరిగే కార్యక్రమం కనక వీడియో తియ్యడం సాధ్యపడదేమో . ఆడియో కుదురుతుందేమో ప్రయత్నిస్తాను .
~ ~ ~ * * * ~ ~ ~ కొందరి నైజంలో ఎంతసేపూ ఇంకొకరిని బాధించే తత్వమే కనిపిస్తుంది . ఆత్మశోధన , అంత : కరణము జీర్ణించుకున్న సంప్రదాయంలో ముందు మన వాడు ఏమి తప్పు చేసాడా అనే ఆలోచన ముందు కలుగుతుంది . ఆ తరువాత ఒక నిర్వచనానికి వస్తారు . ఈ ప్రక్రియ పారలౌకికమైన , పరమార్థిక చింతనకు దోహద పడేది కానీ లౌకికమైన వ్యవహారానికి , దైనందిన శాసనానికి సరైనది కాదు . దాని ప్రతిఫలం భారతదేశం కొన్ని శతాబ్దాలుగా అనుభవిస్తూ వస్తోంది …
ఆ సరే సరే ! మళ్ళీ మనసు మార్చుకునే లోపల ఘట్టిగా చెప్పాలిగా !
human anatomy as discovered by Vesalius made things easy for medical treatment William Harvey made turning point through finding of circulation of blood Wilhelm Roentgen who revolutionised through x - ray discovery Alexander Fleming who discovered anasthesia to save surgical treatment humans are gradually revealed through jenome and DNA anatomy started medical revolution శాస్త్రీయ పరిసొధనలు చేసి ప్రపంచానికి తెలియజేసి ఉత్తమ సేవ చేసిన , చేస్తున్న రంగం వైద్యం . ఇందులో మలుపులు తిప్పిన పరిశీలనలు వున్నాయి . 1 . అనాటమీ మానవ శరీరంలో వివరాలు బాగాతెలిస్తే వైద్యం చేయడం అనుకూలమౌతుంది . ఆందుకు ప్రధమం గా ఉపయోగపడినది శరీరవిభాగాల శాస్త్రం . ముందు జంతువులను తురువాత మనుషుల శవాలను కోసి అనాతమి వివరాలు గ్రహించారు . అది నిరంతరంగా సాగుతున్న పరిషోధన . ఎందరో మహానుభావులు వున్నా వెసాలియస్స్ కు తొలి ధన్యవాదాలు చెప్పవచ్చు . 2 . రక్త ప్రసరణ గురుంచి గ్రహించడంలో విలియం హార్వె ను ప్రధము దు గా చెప్పాలి . ఇతరులు వున్నా మౌలికంగా హార్వె కీలక పాత్ర వహించాడు . వైద్యం బాగా ముందుకు సాగడానికి ఇది పెద్ద మలుపు అయింది . 3 లెవిన్ హూక్ అనె వ్యక్తి తొలుత సూక్ష్మ జీవులున్నాయని లోకానికి చెప్పినతరువాత వైద్యవిధానంలో తిరుగులేని మార్పులు వచాయి . 4 . ఎడ్వర్ద్ జెన్నర్ శాస్త్రగ్నుడు టీకాల పధతి చూపడంతో చిరకాలం గావస్తున్న మశూచి వంతి మారణ రోగాలకు అడ్డుకట్ట పదింది . ఆ రంగం వుత్తరోత్తరా చాలా మార్పులకు లోనై మానవాళి ని కాపాడుతున్నది . 5 . క్రా ఫర్డ్ లాంగ్ వలన అనస్తీషియా కనుగొనగా శస్త్ర చికిచ్చ తేలిక అయి , బాధ లేకుండా చేయడం కుదిరింది . ఆందులో నేడు చాలా వుత్తమ మార్గాలు ప్రవేస పెట్టారు . 6 . సైన్శ్ ప్రగతిలో గొప్ప విప్లవం తెచ్చిన ఎక్ష్ రె , వైద్యానికి కీలక మలుపులు తిప్పుతున్నది . రోట్ గెన్ ప్రారంబించిన ఈ విధానం లో క్రమీణా హాని , దోషాలు తొలగిస్తూ పోతున్నారు . 7 . రొస్ హారిసన్ వలన టిస్స్యు కల్చర్ పరిసీలన వైరస్ రంగాన్ని ఎప్పటి కప్పుడు గ్రహించడానికి రోగ నిర్ధారణకు ఉపకరిస్తున్నది . 8 . నికొలై అనిచ్ కొవ్ వలన రక్తంలో కొలిస్త్రాల్ గ్రహించడం మొదలైంది . ముఖ్యంగా గుండె జబ్బులకు , తదితర రుగ్మతలకు ఈ రంగం సేవ చేస్తున్నది . 9 . అలెక్షాండర్ ఫ్లెమింగ్ వలన యాంటి బయటిక్స్ రాగా నేడది రోగాల పట్ల అనూహ్య శరణ్యం గా మారింది . 10 ఇక జీవన రంగాన్ని సమూలంగా అవగాన చెసుకోడానికి ది ఎన్ ఎ కనుగొనడం ప్రధాన కారణమైంది . క్రమేణా జన్యు సాస్త్రానికి దారి తీసింది . వివరాలకు పోతే చాలా ఆసక్తి కరమైన సంగతులు వున్నాయి . వైద్య చరిత్రలో కీలక పాత్ర వహించిన పరిషొధనలు 10
ఎస్వీయూ క్యాంపస్ : సమైక్యాంధ్ర పరిరక్షణకు మేధావులు , విద్యార్థులు సంయుక్తంగా కృషిచేసి అన్ని రంగాల ప్రజల్ని చైతన్యం చేయాల్సిన ఆవశ్యకత వుందని పలువురు వక్తలు ఆభిప్రాయపడ్డారు . గురువారం ఎస్వీయూనివర్సిటీ ఆర్ట్స్ ఆడిటోరియంలో ' సమైక్యాంధ్రప్రదేశ్ - ఆవశ్యకత ' అనే అంశంపై చర్చాగోష్టిని ఎస్వీయూ అధ్యాపక సంఘం నిర్వహిం చింది . సమాజశాస్త్ర ఆచార్యు డి . వెంక టేశ్వర్లు అధ్యక్షత వహించారు . ముఖ్య ఉపన్యాసకులుగా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఐ . గురుస్వామి , కావలి డిగ్రీ కళాశాల అధ్యాపకుడు అన్నదాత మణి పాల్గొన్నారు .
సెప్టెంబర్ 14 … సైనిక చర్యకు నేతృత్వం వహిస్తున్న మేజర్ జనరల్ చౌదరి తూర్పున ఉన్న రాజసుర్‌కు తన సైన్యాన్ని చేర్చే వ్యూహం పన్నారు . కొండల నడుమ నుంచి సాగే ఈ ప్రయాణం దుర్భేద్యంగా ఉండడంతో ఆయన వాయుసేన సహకారం తీసుకున్నారు . ట్యాంకులు రంగ ప్రవేశం చేశాయి . ఇదే సమయంలో మేజర్ జనరల్ డీఎస్ బ్రార్ సైన్యం ఔరంగాబాద్ వైపు నుంచి చొచ్చుకు రావడం మొదలెట్టింది . ఇక్కడి ప్రతిఘటనలో నిజాం సైన్యం పోరాడి చేతులెత్తేసింది .
ప్రతిష్టాత్మకంగా రంగంపేట పోటీలు … చిత్తూరు జిల్లాలోని రంగం పేట ఎద్దుల పోటీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి . ఈ పోటీలకు ప్రతిఏటా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది . ఓ వెైపు వేలల్లో పాట . . ఎద్దుల పందేలాట అనే నానుడి ఇక్కడే ఆవిర్భవించిందేమో అన్నట్లు ఇక్కడ జరిగే పోటీలు కనువిందు చే స్తాయి . ప్రాణాలను సైతం పణంగా పెట్టి యువకులు . . కొత్త అల్లుళ్లు సైతం ఎద్దుల మెడలు ఒంచేందుకు ఉరకులు , పరుగులు పెట్టి ముందుకు దూకుతుంటారు . సంక్రాంతి సంబరాల్లో కనుమ పండుగ రోజు జరిగే ఈ ఎద్దుల పోటీలకు జిల్లానుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో సందర్శకులు హాజరు అవుతారు .
రచన : : శ్రీనివాసరాజు సమయం : 5 : 33 ఉ 5 ఆభిప్రాయాలు మీ అభిప్రాయం చెప్పండి
అంబికానాథుడు దీపకుని అసమాన గురుభక్తి మెచ్చి " వత్సా ! నీ అనన్య గురుసేవా దీక్షను మెచ్చినాను . ఏమి వరము కావాలో కోరుకో " అని అన్నాడు . గుణనిధి అయిన దీపకుడు " స్వామి ! నాకు ఈ లోకములో గురుసేవ తప్ప ఏదీ తెలియదు . వారి అభీష్టమేమో కనుక్కొని చెప్తాను " అని అన్నాడు దీపకుడు . గురువుగారికీ విషయం చెప్పి " గురుదేవా ! మీకు స్వస్థత కోరుతాను " అని అన్నాడు . వేదధర్యుడు " నాయనా ! ఎవరు చేసిన పాపాలకు ఫలితం వారు అనుభవిస్తేనే పోతాయి " అని చెప్పాడు .
@ రాజ మల్లేశ్వర్ గారు మీరు పరిమళం గారు అన్నట్లే మేము చాల జోక్స్ వేసుకున్నాం . . . . కాబట్టే బ్లాగ్ మిత్రులతో సరదా గా పంచుకోవాలని
కాని అంతర్జాలం ( ఇంటర్నెట్ ) ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చేసింది . ఇంతవరకు ఆ కుగ్రామంలో ఏ పని చేయాలన్నా ఇంగ్లీషు మాత్రమే ఉపయోగింపబడేది . కాని ఇది ఒకప్పటి మాట . ఇప్పుడు ఇంటర్నేట్‌లో తెలుగు విస్తృతంగా వ్యాపించింది అని గర్వంగా చెప్పుకోగలం . తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించింది అని మురిసిపోయాం , గర్వపడ్డాం . సాంకేతిక పరిజ్ఞానం త్వరితగతిని అభివృద్ధి చెందుతున్న కారణంగా తెలుగుకు ఆధునిక హోదా లభించింది అని ఘంటాపదంగా చెప్పుకోవచ్చు . ఎటువంటి ఉద్యమాలు , నినాదాలు లేకుండానే నేడు వెబ్ ప్రపంచంలో తెలుగు వెలిగిపోతుంది .
చాలా రోజులుగా గీత నేను కలిసి ఓ రోజంతా హాయిగా గడపాలని ప్లాన్ చేస్తున్నాం . మేము కలిసి గడపడమంటే సినిమాలకో , షాపింగులకో తిరగడం కాదు . భూతాల్లాంటి బడా మాల్స్ కెళ్ళి అడ్డమైన చెత్త కొనుక్కోవడం కాదు . మా ఇద్దరికీ ఇష్టమైన కొన్ని ప్రాంతాలు మేమే కనిపెట్టుకున్నవి , జనాలు ఎక్కువగా తిరగని ప్రశాంతమైన ప్రదేశాలు కొన్ని వెతికి పట్టుకున్నాం . ఒకటి రామంతాపూర్లోని సంపెంగ వనం . ఇంకోటి యమ రష్ గా ఉండే లుంబిని వనం పక్కనుండే ( పార్కింగ్ ప్లేస్ ) తారామండల పూల వనం . ఆకాశ మల్లెలని తారామండల పూలంటారని నాకు ఇటీవలే తెలిసింది . మా ఊర్లో అయితే కారప్పూలని ( కారం వాసనేస్తాయి కదా ) కాడమల్లెపూలని అంటారు . సరే . శనివారం చల్లటి మబ్బులు పట్టి , చిరుజల్లులు కురిసే వేళ మేమిద్దరం తారామండల పూల వనంలో ప్రవేశించాం . ఎవరి కళాత్మక హృదయ స్పందనో కానీ బోలెడన్ని కాడమల్లి పూల చెట్లు నాటి , వాటి చుట్టూ చక్కగా రచ్చబండలు కట్టించారు . మేము ప్రతి సంవత్సరం ఈ తోటలోకి వెళతాము . హాయిగా ఓ రచ్చబండ మీద కూర్చుంటే ఆయాచితంగా , ఎంతో ఆత్మీయంగా మీ మీద ఆకాశమల్లెల జడివాన కురుస్తుంది . సువాసనలు వెదజల్లుతూ అలా మన మీద పూలు కురుస్తుంటే , పక్కన ప్రియ నేస్తం కబుర్లు చెబుతుంటే ఓహ్ ! అదెంత అద్భుతమైన అనుభవమో , ఒక్క సారి ఆ చెట్లకింద కూర్చుంటేనే అర్ధమౌతుంది . నేను ఇటీవల ఇంటికి తెచ్చుకున్న కుండీలో విరగబూసే హైబ్రిడ్ సంపెంగ మొక్క కోసం వెతికి నా నేస్తానికి ఓ మొక్కని కానుకగా కొనిచ్చి నేను మా ఇంటి వేపు కారు తిప్పాను . కొన్ని గంటల్ని నాకోసం , కేవలం నాకోసం కేటాయించుకుని ఇలా గడపడం నాకు చాలా ఇష్టం . ఇలా గడిపాక నా పనులన్నింటినీ ఎంతో ప్రేమగా , హాయిగా , ఎలాంటి ఒత్తిడి లేకుండా చేసుకుంటాను . గీత లాంటి నేస్తం ఉంటేనే ఇలా గడపడం సాధ్యమౌతుంది . మా పరిచయమై పన్నెండేళ్ళు గడిచినా మా స్నేహం నిత్య నూతనంగా , ఫ్రెష్ గా ఉండడానికి ఇదే కారణం .
కొన్నిసార్లు గంజాయి ను బట్టి ( కెనబిస్ సెటైవా ) ఒక ముఖ్యమైన పానీయము తండై ను తయారుచేస్తారు . తడిగా రంగుల కొరకు , పలాష్ పుష్పములు రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంతవరకు ఉంచుతారు , అది ఔషధ లక్షణాలు కలగి ఉంటుంది . దురదృష్టకరంగా కొందరి వ్యాపార లాభాల కోసం పెరుగుతున్న రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారయ్యింది .
" పట్టిన గ్రహణం విడిచి నీ బ్రతుకున పున్నమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు " - లాస్ట్ కి మళ్ళీ ఓ ఓదార్పు ! అతని లాంటి తెలిసీ తెలియని మనిషి మాట్లాడితే , ఇలాంటి వాక్యాల్లో ఎంత అమాయకత్వం కనిపిస్తుందో , " వస్తుందా ఆ నాడు చూస్తాడా ఆ పైవాడు " - అని ఆమె నిరాశగా అన్నప్పుడు ఆమె నిస్సహాయతా , ఆమె పడుతున్న వేదనా అంత స్పష్టంగా తెలుస్తోంది …
హిందీమూలం : సూర్యబాల అనువాదం . ఆర్ శాంతసుందరి మా పెద్దమ్మ చనిపోయి ఇప్పటికి ముఫ్ఫె ఐదేళ్ళు . పోయేటప్పుడు ఆవిడ వయసు ఏ డెబ్భై ఐదో ఎనభైయో ఉండి ఉంటాయనుకుంటా . అయినా ఇప్పటికీ ఒక్క రోజు కూడా నేను ఆవిడని తలుచుకోకుండా ఉండలేను ! అది నాకెంతో అవసరం . స్త్రీవాదం ఊపందుకున్న ఈ వాతావరణంలో ఒక్కోసారి ఎటు పోవాలో ఏం చెయ్యాలో తెలీని సందర్భాలు ఎదురవుతుంటాయి . అలాటి కటిక చీకటి క్షణాల్లో ఆవిడ గురించిన ఆలోచనలు కాగడాలాగ నాకు దారి చూపిస్తాయి . జీవితాంతం [ . . . ]
అదనంగా మీ పోస్ట్ లపై పాఠకులు ఎవరన్నా వ్యాఖ్యలు సమర్పించినంతనే మీకు ( బ్లాగర్ ప్రోగ్రామ్ ) ఈ - టపా ద్వారా తెలియ పరచబడే ఏర్పాటు చేసుకోవచ్చు . ఈ ఈ - టపా చిరునామాను మీరు వ్యాఖ్యలు మట్టుపరచడానికి ( సంబంధించిన అమరికను ) సశక్త పరచే సమయంలో , సంబంధిత అక్షర పేటికలో చేర్చవలసి వుంటుంది .
నిన్న మొన్న , మా ఆవిడ ' బియ్యం అయిపోతున్నాయి , తెప్పించండి ' అంటే , మా దగ్గరలో వున్న షావుకారుకి ఫోనుచేసి , బియ్యం రేటు యెలా వుంది అనడిగితే , ' సోనా మసూరి బస్తా 850 / - వుందండి ' అన్నాడు . అబ్బా ! కేజీ 8 - 50 కి తగ్గిందే ! అని ఆశ్చర్యపోయి , ఓ పది కేజీలు పంపించమంటే , 340 / - రూపాయలు బిల్లు వేశాడు ! ( బస్తా అంటే ఇప్పుడు లెక్క 25 కేజీలు అని ఆ తరవాత నాకు తెలిసింది ! )
అందరూ లంచ్ నుంచి తిరిగి వచ్చాక జరిగిన విషయం అంతా అందరి ముందు చెప్పాడు మోహన్ . ఇలాటి విషయాలు దాచి ప్రయోజనం లేదని మోహన్‌కి బాగా తెలుసు . ఎలాగైనా బయటకు రావడం తప్పదు . నమ్మలేనట్లుగా చూసారు అందరూ . ఒకరిద్దరు వాళ్ళు కూడ ఇలాటి కథలు విన్నట్లు చెప్పారు . చైనీస్ వాళ్ళలో ఇలాటి సంఘటనలు చాల జరిగాయని ఒకరు చెప్పారు . బహుశా ప్రతి కొత్త ఇమిగ్రెంట్ గ్రూప్ ఇలాటి అనుభవాల్ని కొత్తగా ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలేమో అన్నారొకరు . అరేంజ్డ్ మేరేజెస్ , ఎమిగ్రేషన్ కలిసినప్పుడు కలిగే ఒక సైడ్ ఎఫెక్ట్ ఇది అన్నారు మరొకరు . అసలు ఏసియన్ రేసుల్లో ఈ గుణం వున్నదా అని ఒకతను అనుమానం వెలిబుచ్చి , అందరి చూపులు కోపంగా అతని మీద పడడంతో నాలిక్కరుచుకున్నాడు . చర్చ ప్రేమలు , పెళ్ళిళ్ళ మీదికి తిరిగింది .
బసంత్ అనే హిందూస్తానీ రాగం పంతువరాళిని పోలినది . దీనిని ఏ మాత్రమూ పోలని బహార్ రాగం కాస్త ( కర్ణాటక ) కానడలాగా అనిపిస్తుంది . ఈ రెండు పోలికలూ ఉజ్జాయింపువే . ఇవి రెండూ వసంత రుతువుకు సంబంధించినవి కనక రెంటిలోనూ వచ్చే శుద్ధమధ్యమం ఆధారంగా రెంటినీ కలిపి పాడుతూ ఉంటారు . విడిగా రెండూ గొప్ప రాగాలైనప్పటికీ బసంత్ బహార్ అనేది మటుకు అంత ముఖ్యమైనది కాదు . ఇంతకీ ఈ మిశ్రమ రాగం హాయిహాయిగా పాటలో వాడబడనేలేదు .
పాత్రల చేత పేజీలు పేజీలు మాట్లాడించటంతో వచ్చే మరో చిక్కేమిటంటే రచయితకు ఆ పాత్ర ద్వారా అనవసరమైన , అసందర్భమైన వ్యాఖ్యానాలు చేయ్యటానికి అవకాశం లభించటం . పై కథలో , " వాళ్ళిద్దరూ సాఫ్ట్ వేర్ ఎంజినీర్లేనా " అని అడుగుతాడు కథానాయకుడు . వాళ్ళిద్దరూ అంటే ఫ్లోరిడాలో చదువుతున్న అమ్మాయి , చికాగోలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయి . అవును అంటారు వాళ్ళు . దానికి జవాబుగా ఈ పాత్ర మాట్లాడిన మూడు పేజీల్లో ఇలా అంటాడు : " పరిధులుదాటి పెరుగుతున్న జిం కల్చర్ లో క్రమంగా మనయువకుల దేహదారుఢ్యం పెరుగుతూ ఉంటే , మనో వైశాల్యం తగ్గుతూ వస్తుంది . ఆపైన ఇన్ఫర్మేషన్టెక్నాలజీ , కమ్యూనికేషన్నెట్వర్క్ , వారి మనిష్కాలమీద పెరుగుతున్న వత్తిడి వారు దానికి తట్టుకోగలిగే స్థాయిలను దాటి మించిపోతూ ఉంది . ఈ వ్యాఖ్యానాలకూ కథకూ ఎలాంటి సంబంధమూ లేదు . సాఫ్ట్వేర్ఇంజినీర్ల మనో వైశాల్యం తగ్గుతుందని చెప్పిన కథా నాయకుడు , " మనకంటే మన తర్వాతి తరంలో నిజాయితీ ఎక్కువ , " అంటాడు . సాఫ్ట్వేర్ఇంజినీర్ల మనోవైశాల్యం తగ్గుతుందనటానికి నిదర్శనం ఏంటో , మనో వైశాల్యం తగ్గటానికీ నిజాయితీ పెరగటానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో , అసలు వీటికీ కథకూ సంబంధం ఏమిటో నాకైతే అర్ధం కాలేదు .
కొత్తపాళీ గారు అదిలించడంతో గ్లోబలు వార్మింగు పట్ల నేనూ కాస్త హడావుడి పడదామని త్వరపడ్డాను . నిజం చెప్పొద్దూ . . ఈ దీపాలార్పడంలో ( ప్రతిపదార్థంలోనే తీసుకోండి సుమా ! ) నాకంత నమ్మకం లేదండీ . కానీ ప్రజల్లో అవగాహన కలిగించడం దీని ముఖ్య ఉద్దేశ్యం అని తెలిసాక , ఇలా అవగాహన కలిగించడం కోసం నేనూ ఏదైనా చెయ్యాలని తలపోసాను . పోసాక , ఏం చెయ్యాలో నిశ్చయించుకున్నాను . కున్నాక , పని మొదలెట్టాను . ఇక్కడో ముక్క చెప్పాలి : గ్లోబలు వార్మింగు గురించి చెప్పడమే నా పని , చేసేదేమీ లేదు అని నేను అనుకున్నాను . అసలు నన్ను కర్తవ్యోన్ముఖుణ్ణి చేసిందే ఇది . ముందుగా ఆఫీసులో జనాన్ని ఒకచోట కూలేసి , క్లాసు తీసుకున్నాను . " చూడండీ , మీ పిల్లలకు ఆహార భద్రత , పర్యావరణ భద్రత , ఆరోగ్య భద్రత , వగైరాలను ఎలా ఇస్తారూ ? " అని అడిగాను . వాళ్ళ తెల్లమొహాలను తనివితీరా చూసుకున్నాక , గ్లోబలు వార్మింగు గురించి చెప్పి " మీరూ లైట్లు ఆర్పండి , ఈ సంగతిని మీరు మరో పదిమందికి చెప్పండి . నేను కూడా మా అపార్టుమెంటులో పన్నెండు మందికి చెబుతున్నాను . " అని అన్నాను .
అతిథులుఫేస్‌బుక్ అన్నది ఓ వ్యామోహం . అది అంటుకుంటే వదలడం కష్టం . ప్రపంచం అంతా వ్యాపించిన ఈ సోషల్ నెట్ వర్క్ కారణంగా కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి .
( నెట్‌డెస్క్ ) : దీర్ఘకాలిక మనోభీష్టమైన ప్రత్యేక తెలంగాణాను తెలంగాణా వాసులు వాంఛిస్తున్నారని వారి కోరికను గౌరవించాల్సిన బాధ్యత మాజీ ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబునాయుడిపై ఉందని తెలంగాణా డెవలప్‌మెంట్ ఫోరమ్ పేర్కొంది . ఆయన న్యూజెర్సీ పర్యటనపై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది .
మలక్‌పేట్ లో అమ్మకానికి 4 బెడ్ రూమ్ హౌస్ ఇళ్ళు , ఫ్లాట్లు అమ్మకాలు
ప్రేమాభిషేకం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు . అప్పట్లోనే 30కేంద్రాలలో వందరోజుల పండుగ జరుపుకున్న సినిమా . . 10 కేంద్రాలలో మూడువందల రోజులు ఆడిన సినిమా కడప లాంటి చిన్న సెంటర్ లో కూడా ఒక ఏడది పాటూ ఆడిన సినిమా ( ఆ సినిమా తర్వాత కడపలో ఏడాదిపాటూ ఆడింది 2001 లొ " నువ్వే కావాలి " ) అంత గొప్ప సినిమాను ప్రస్తుత నటులతో రీమేక్ చేస్తే నటీనటులుగా ఎవరు సూట్ అవుతారనే ఒక చిన్న ఆలోచనతో రాస్తున్నదే ఈవ్యాసం [ . . . ]
సీతాకోకచిలుకలు అనే టైటిలుతో . . నేను స్వప్నించటం మరిచిపోయినప్పుడల్లా నా కళ్ళపై దయగా వచ్చి వాలుతుందొక సీతాకోకచిలుక . ఒక కలని , కాసింత కవిత్వాన్ని కానుకగా ఇచ్చిపోతుంది . . అనే పంక్తులతో మొదలై . . 87 పేజీల తరవాత భూమిహీన బ్రెజిల్ కార్మికుడి నాగలిపై నక్ష్త్రంలా బొలీవియన్ నీటియుద్ధాన విరిసిన ఇంద్రధనుస్సులా వెరపెరుగని వెనిజువెలా సవాలులా మెక్సికో జపటిస్తా జనగర్జనలా అర్జెంటీనా , చిలీ , పెరూ , కొలంబియా నికరాగువాల్ని చుట్టి ఏ అమెజాన్ అడవుల వెన్నెలై కాసావ్ నీ సుందర హృదయం నా కన్నుల నిండగ నేనేమైనా , నేనేమైనా , అలసి ఆగినా ఓ నా ప్యారీ జాన్ నువ్వొక అద్భుత మురిపెం నాకు . . అనే పంక్తులతో , ఓనా ప్యారీ జాన్ అనే టైటిల్తో ముగిసింది . ముఖ చిత్రమ్మీద జపనీయుడు కట్సుషికా రంగులద్దిన అల మీద ఒక సీతాకోకచిలుక ఎగుర్తున్న దృశ్యం . పేరు మృగన రచన విమల ఉపోద్ఘాతాలూ పరిచయాలూ విశ్లేషణలూ ఏం లేవ్ . ఉన్నదల్లా కవిత్వమే . ఎర్రటి కవిత్వం , చిక్కటి కవిత్వం . ప్రతి పద్యానికీ ఒక చిన్న చిత్రీకరణ మోహన్ గీతల్లో మృదు గంభీరంగా . ప్రతులు విశాలాంధ్రలో . . యాభై రూపాయలే !
అంతటితో ఆగకుండా నాకు విద్యా బుద్దులు నేర్పిన గురువులను చులకనగా ప్రస్తావించడం ఏమాత్రమూ మెచ్చుకోదగినది కాదు . ఇది ఒక విధంగా గురు ధూషణే అని నా అభిప్రాయం . మరి దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటని ఆలోచిస్తే , భహిరంగంగా చేసిన తప్పుని ఒప్పుకోక తప్పదని నా మనసుకు అనిపించింది . తత్ ఫలితమే ఈ పుట . అందుకని సభా పూర్వకంగా , బ్లాగు ముఖంగా . .
ప్రసహ్య న హరంత్యమీ పరధనౌఘ మన్యాయతో వదంతి న మృషావచో విరచయంతి వస్త్వద్భుతం యధావిధి కృతాగసాం విదధతి స్వయం దండనం గుణా నవగుణా కరేష్వపి గృహాణ హూణే ష్వమూన్ ( 414 )
ఈ docLock ఫ్రీ లైసెన్స్ ఆఫర్ గెలుపొందడానికి మీకు ఇంకా మిగిలి ఉన్న టైమ్ : మన కంప్యూటర్లో ఉన్న ముఖ్యమైన ఫ్లైళ్లనీ , ఫోల్డర్లనీ ఇతరులు ఓపెన్ చేయకుండా లాక్ చేయడానికి అనేక సాఫ్ట్ వేర్లు ఉన్నా సక్రమంగా పనిచేసేవి తక్కువే . LargeSoftware సంస్థ రిలీజ్ చేసిన docLock అనే సాఫ్ట్ వేర్ అద్భుతమైన ఎన్ క్రిష్షన్ సదుపాయాలతో చాలా శక్తివంతంగా పనిచేస్తోంది . దీన్ని ఎలా వాడాలో ఈ క్రింది వీడియోలో " కంప్యూటర్ ఎరా " తెలుగు మేగజైన్ ఎడిటర్ [ . . . ]
దాంతో ద్రవ్యోల్బణం పెరగడం , సెన్సెక్స్ 8000 పాయింట్లు ఛేదించడం , అది 16000 వేలకి ' అనతికాలం లోనే ' చేరుతుందని ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించడం , అదీ నెరవేరడం , మళ్లీ 8000 కి పడి పోవడం - - ఇదంతా పాత కథ . అలాగే , వడ్డీలు పెరుగుతున్నాయి , పెరుగుతున్నాయి అనీ , మళ్లీ తగ్గుతున్నాయి , తగ్గుతున్నాయి అనీ , అలాగే ద్రవ్యోల్బణం విషయం లో కూడా , విచారించడాలూ , ఆనందించడాలూ జరగడం కూడా ఓ ప్రహసనం గా మారింది - - అవన్నీ వేరే సంగతులు .
శ్లో | | దశాంజ్గం గుగ్గులోపేతం సుగన్ధిం సుమనోహరం | ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ | | శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ధూపమాగ్రాపయామి ( దశాంజ్గము , గుగ్గులము నిప్పులపై వేసి పొగ చూపవలెను . లేదా , అగరువత్తి వెలిగించవలెను ) శ్లో | | సాజ్యం త్రివర్తి సమ్యుక్తం వహ్నినా ద్యోతితం మయా | గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే | | శ్రీవరసిద్ధి వినాయకాయ దీపం దర్శయామి ( దీపమును చూపాలి ) శ్లో | | సుగంధాన్ సుకృతాన్ చైవ మోదకాన్ ఘృతపాచితాన్ | నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ | | శ్లో | | భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోప్యం పానీయమేవచ | ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక | | శ్రీ వరసిద్ధి వినాయకాయ మహానైవేద్యం సమర్పయామి ( పిండి వంటలు మొదలైన వానితో కూడిన మహా నివేదన చేయవలెను ) శ్లో | | పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం | కర్పూర చూర్ణ సమ్యుక్తం తాంబూరం ప్రతిగృహ్యతాం | | శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి ( వక్క , పచ్చకర్పూరము ఉంచి తాంబూలం సమర్పించవలెను ) శ్లో | | సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ | భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుప్య వినాయక | | శ్రీ వరసిద్ధి వినాయకాయ సువర్ణ పుష్పం సమర్పయామి ( పుష్పములు సమర్పించవలెను . ) శ్లో | | ఘృతవర్తిసహస్త్రైశ్చ కర్పూర శకలైస్తథా | నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ | | శ్రీ వరసిద్ధి వినాయకాయ నీరాజనం దర్శయామి ( కర్పూరము వెలిగించవలెను ) నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి ( నీటిని సమర్పించవలెను )
జై శ్రీరామ్ , శ్రీ రామదూతం శిరసా నమామి ! సురాసురుల మధ్య తగవు తీర్చడానికీ , సురలకు అమృతాన్ని ఇవ్వడానికి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు ఆడిన వింత నాటకమే మోహినీ అవతారం . ఈ అవతారం మరొక ప్రయోజనం మణికంఠ స్వామి జననం . మోహినీ రూపం దాల్చిన ఆ పరంజ్యోతిని శంకరుడు అనుసరిస్తే అదే " రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్ ! " అయ్యింది . పరమాత్మ అనుగ్రహంతో ఒకటి రాసిన తర్వాత శంకరుడినే మోహింపజేయగల మోహినీదేవి అవతారం లోకాన్ని కదిలించదా అనిపించింది ( అనిపించేది ఎవరికి , అనిపింపచేసేది ఎవరు ? ) . అలా ఆ స్వామి రాయించినవి మిగతావి . వీటికి చంధో బద్దత లేదు , కానీ మనో నిబద్దత ఉంది వాక్యశుద్ధి లేకపోవచ్చు , కానీ అంతఃకరణ శుద్ధి ఉంది . పురుషుడూ , ప్రకృతీ అన్నీ తానే అయ్యి ఆటలాడే ఆ నిర్గుణ పరబ్రహ్మ ని శబ్దం ద్వారా స్పర్శించాలనీ , దర్శించాలనీ చేసిన చిన్న ప్రయత్నం . అంతే తప్ప శారదా పుత్రుల్ని గేళి చేయడానికి మాత్రం కాదు . సలహాలిస్తే చంధస్సులు నేర్చుకొని ఆ పరమాత్మ గుణగణాలను గాన చెయ్యాలని కోరిక . నాగారివాహన నారాయణుండు , అసు రగణమచ్చెరువొంద , సుర రక్షణకై ముద ముగ మోహినిగాగ , భామయైన బావనుగని రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్ | గగన మండలమ్మంత కాంత మేని ఛాయ ముప్పిరిగొనంగ , సురగ ణాంగనలంబరవీధి చేరి కన్నులింతగ చేసి లోకోత్తర సౌందర్యమున్ చూ డగ రాగ , భువనభాండముల్ గుసగుసలాడుచుండ , భామయైన బావనుగని రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్ | వజ్రముల్ విసుగెత్తి పలికె , తమకేది అంతటి వన్నె యని , వైఢూర్యముల్ వదలక వదరుచుండె , ఇది ఎచ్చటి వెలుగని , మౌక్తికముల్ మారు మాటాడక యుండె , మునుపెన్నడు ఇది గనమని , నవరత్నముల్ నోరాడక యుండె , ఇక తమనెవ్వరు తలపరని , అన్ని రత్నముల కాంతిని , అన్ని లోకముల శాంతినపహరింపనొప్పు వెన్నుడు మోహిని గాగ , జూచి రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్ ! సృష్టి ధర్మముగ దివా సంధ్యా నివర్తకుండైన రవిని వ్యష్టిపరచగ , ముల్లోకమ్ముల తిమిరమ్మును నష్టపరచ , లోకమ్ముల దీపించుచున్న మోహిని గని రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్ ! జగత్ప్రళయమో , త్రిశంకు స్వర్గ చంద్రబింబమో యటంచు నగరాజాధిపు యల్లుడి జటన చేరి సోముడు చాటుగ దాగి చూడగ , చంద్రబింబ సమభాసమునొప్పు మోహిని గని , రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్ ! ముక్కెరకాంతులు మూడు లోకమ్ముల ముప్పిరిగొనంగ , ఎక్కడివీ కాంతులనుచు మూడు లోకమ్ముల జనులు మ్రాన్పడగ , రక్కసులనుండి సుధను , మూడు లోకమ్ముల గావగ దిగిన కాంతను గని , రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్ ! శుభములు దేవాళికిన్ శుభకరముగనిచ్చు విభుడు మోహిని గాగ , శుభములు మానవాళికిచ్చు , శుభగుడు శోభనమొప్ప మోహిని గాగ , శుభముగ సుధను , సురలకీయ ఖగరాజపతి వేగ మోహిని గాగ , రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్ ! విరిచూపుల అరివీరుల యశమును వ్యర్ధము గావించుచు , తరగని తమకమునభినయించి తామసుల దరి జేరుచు , కరివాహనగణమున్ అమరుల జేయ సుధనిచ్చునువిధగని , రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్ !
హైదరాబాద్ నగరంలో ఇటీవల ముగిసిన రంజాన్ , వినాయక చవితి వేడుకల సందర్భంగా ఇదే తరహాలో మొబైల్ పార్టీలను వినియోగించిన పోలీస్ శాఖ మంచి ఫలితాల్ని రాబట్టింది . మోటార్ బైక్‌లపై ఇద్దరేసి ట్రాఫిక్ పోలీసులు స్టిల్ , వీడియో కెమెరాలు , ఇతర పరికరాలతో సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి , నిబంధనల్ని అతిక్రమించే వ్యక్తులు వాహనాలను ఫోటోలు తీసి అప్పటికప్పుడే కంట్రోల్ రూంలోని కంప్యూటర్లకు పంపించి ఎప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేసి భేష్ అనిపించుకున్నారు .
ఏ ఉద్యోగంలోనూ శాటిస్ ఫాక్షన్ ఉండడంలేదు . రెండేళ్ళలో నాలుగు ఉద్యోగాలు మారా ! అయినా పరిస్థితిలో మార్పులేదు ! ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ! చదివిన చదువుకు చేస్తున్న ఉద్యోగానికి సంబంధంలేదు . ఇండియాలో ఉపాధి కరవైన వేళ , అమెరికాలో జాబనగానే ఎగిరి గంతేసి వచ్చింది నేనే ! మొదటి అయిదేళ్ళు ఆలోచించే తీరిక లేకుండా , అంతా ఆహా ఓహో అన్నట్లు గడిచింది . అక్కణ్ణుంచి ఎన్నాళ్ళిలా అంటూ మొదలై . . . ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనుకుంటూ మరో రెండేళ్ళు , ఇంకా ఒకే కంపెనీలో కూర్చుంటే లాభం లేదని వేట మొడలెట్టా . కంపెనీ మారినా , టైటిల్ మారినా . . . మనిషి మారలేదు , ఆటని . . . అన్నట్లు చేసే పని పెద్దగా మారలేదు . మళ్ళీ వెదుకులాట , మరో కొలువు ! మరో కొలువు . . . మరో కొలువు ! ఉదయం మా పక్కింటావిడ కనిపించి . . . మళ్ళీ ఉద్యోగం మారావటగా కంగ్రాట్సని వూరుకోకుండా , నీకు వెంట వెంటనే భలే ఉద్యోగాలు దొరుకుతున్నాయే అని ఆశ్చర్య పోయింది . ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే అన్న సామెత గుర్తొచ్చింది . పై మెట్టు ఎక్కే స్కిల్స్ , అనుభవం ఉన్నా , అవకాశపు నిచ్చెన అగుపించడంలేదు . ఇదే మాట ఒక ఫ్రెండ్ తో అంటే , నువ్వు కుదురుగా ఒక చోట పనిచేస్తేగా ఎగప్రాకే అవకాశమొచ్చేది అన్నాడు ! ఇంకెవరైనా ఆ మాట చెబితే , నిజమో కాదో కాస్తన్నా ఆలోచించే వాణ్ణి ! మిత్రుడు , ఎనిమిదేళ్ళుగా ఒకే కంపెనీలో . . . మారని జాబ్ టైటిల్ తో పని చేస్తూ ఉన్నాడు . అలా అని నా స్కిల్స్ లోనో , నా ప్రయత్నాల్లోనో లోపం లేదని కాదు ! ఉంటే ఉండొచ్చు అని ఆలోచిస్తూ పోతే , నా కేమి కావాలో నేనే ఇథమిద్దంగా తెలుసుకోక పోవడం ప్రధాన ప్రతిబంధకంగా కనిపించింది , మిగిలిన లోపాలు ఒకటీ అరా ఉన్నా ! ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు , నేనున్న పరిస్థితుల్లో ఇంకా కొందరున్నారనిపించింది . ఈ సమస్యకు పరిష్కారం - ఇండియా వెళ్ళి అక్కడ ఉద్యోగం వెదుక్కోవడమేనని కొందరి అభిప్రాయం ! అదెంత వరకు ఉపయోగిస్తుందీ అని ప్రస్తుతపు నా ఆలోచన !
కొత్త ప్రపంచము గురించి విన్నట్లు , చూస్తున్నట్లు ఉంది . ఈ సమస్య అందరు చదువుకుంటే తప్పక పోతుంది . రాయలసీమ పల్లెల్లో ' కొంతమంది ' మూర్ఖాగ్రేసరులు ఉంటారు . వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే సగము దరిద్రము వదులుతుంది . మీరు చెప్పే విధానము చాలా బాగుంది . కీప్ రైటింగ్ .
భరతఖండం , భారతదేశం , హిందుస్థాన్ మొదలైన అనేకానేక పేర్లతో పరిఢవిల్లుతున్న మన దేశంలో కొన్ని వర్గాలు ఐదుతలల అగ్రవర్ణసర్పాల వేటుకు గురవుతున్నారు . ఆధిపత్యకులాల కుట్రల్లో భాగంగా ఎన్నో విధాల వివక్షలతో పాటూ ఎస్ . సి , ఎస్ . టి , బి . సి , మైనారిటీ స్త్రీలు మరికొన్ని అదనపు సమస్యలను ఎదుర్కొంటున్నారు . పితృస్వామ్య , కుల , కుటుంబ హింసకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల ఫలితాలేవి వీరికి చేరట్లేదు . మొత్తం చదవండి »
మీది ఎంత అందమైన ఆందోళన మీ ఆడపిల్లలూ తోడయిన మొగపిల్లలూ అపురూపమైన అల్లరి చేస్తూంటే తల్లిదండ్రులకూ పెద్దలకూ అన్నలకూ ముద్దే ప్రదర్శించే మీడియాకు ఒళ్లంతా పులకింతలు ప్రతిభ సమాధి అయి భవిష్యత్తు అంధకారమైందని ప్రొటెస్ట్‌గా - చెట్టాపట్టాలేసుకొని యువతీయువకులు పిక్నిక్‌కి పోవడం యారో ఎంత హిరాయిక్‌గా ఉందని ! మెరిట్ పందెంలో మరాథన్ రన్నర్‌లు మీరు తాంబేలుగాళ్లం మీతో పోటీపడగలమా ?
" నాలుగింగ్లీషు ముక్కలు నేర్చుకోంగానే ఏం చేసినా చెల్లిపోతుందనుకుంటున్నావురా నీ అయ్య ! ఒక్కటి పీకితే నియ్యబ్బ అర్నెల్లనాడు తిన్నది కక్కుతావ్ " ఒక్క సారిగా విరుచుకు పడ్డాడు అర్జున్ .
పచ్చని చెట్లు మబ్బులని తాకి నిద్ర మత్తు నేల గుండెల మీద రంగు రంగుల పూలు రాల్చి తడి ముద్దులు కానుకిస్తాయి
సినిమా ఎలా ఉందో తెలియదు కానీ , మీ సమీక్ష బాగుంది . సినిమాని అన్ని కోణాల నుంచి విశ్లేషించారు .
వివిధ వార్తా పత్రికలలో ప్రచురించబడిన వ్యాసాలను కాపీ చేసుకుని సేవ్ చేసుకోవాలనుకుంటే కొన్ని సమస్యలున్నాయి . ఎందుకంటే ఆయా పత్రికల వాళ్ళు వాడే ఫాంట్ , మనం నెట్ లో వాడే యూనికోడ్ వేర్వేరు కాబట్టి . ఆయా పత్రికల ఫాంట్లు దిగుమతి చేసుకుని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటే మనం సులువుగా ఆ తెలుగు లేదా ఏ భాషైనా చదవడానికి అనువుగా ఉంటుంది . ఆ పత్రికలోని వ్యాసం కాపీ చేసుకుని మన బ్లాగులో కాని , నోట్ పాడ్ లో కాని సేవ్ చేసుకుంటే ఇలా అర్ధం కాని లిపి కనిపిస్తుంది . పేపర్లో చదివితే తెలుగులాగే ఉంటుంది . మరి ఇలా ఎందుకు అయినదంటారా ? . . ఫాంట్ సమస్య . . మరి ఏం చేద్దామంటారు . మంటనక్క వాడే వాళ్ళ కోసం ఒక చిన్న ట్రిక్కు ఉంది . అనే ఆడాన్ దించుకుంటే సరి . మన కంప్యూటర్లో పద్మ ఉన్నంత కాలం వివిధ తెలుగు వ్యాసాలను సులువుగా కాపీ చేసుకుని బ్లాగులో కాని నోట్ పాడ్ లో కాని సేవ్ చేసుకోవచ్చు . అంతే చాలా ఈజీ కదా . అలా కాదు మేము మంటనక్క వాడము అంటారా . ఐతే http : / / uni . medhas . org / సైట్ కి వెళ్ళి మీకు కావలసిన పత్రికలను యూనికోడ్ లో చదవండి , కావలసిన వ్యాసాలు హాయిగా కాపీ చేసుకుని సేవ్ చేసుకోండి . ఇక పత్రికలలో వచ్చిన వ్యాసాలు లేదా చిత్రాలను ఎలా సేవ్ చేసుకోవాలంటారా . . epaper లో పత్రికల పేజీలు ఇమేజ్ రూపంలో ఉంటాయి కాబట్టి ఈ ఫాంట్ గొడవ ఉండదు . మరి మనకు కావలసిన వ్యాసాలు ఎలా సేవ్ చేసుకోవాలంటారా . ముందుగా ఆ పత్రికలో మీకంటూ అకౌంట్ క్రియేట్ చేసుకోండి . తర్వాత ఆ పేపర్ తెరిచి మీకు కావలసిన పేజికి వెళ్ళండి . అందులో మీకు కావలసిన వ్యాసం మీద క్లిక్ చేయండి . ఆ వ్యాసం మాత్రమే విడిగా కొత్త పేజిలో ఓపన్ అవుతుంది . అప్పుడు ఆ పేజి మీద రైట్ క్లిక్ చేసి ఇమేజ్ లా మీ సిస్టంలోకి సేవ్ చేస్కొండి . తర్వాత ఆ చిత్రాన్ని మామూలుగా మెయిల్ చేసుకోవచ్చు . బ్లాగులో కూడా పెట్టుకోవచ్చు . మొదట్లో కాస్త తికమకగా ఉంటుంది . ఒకటి రెండు సార్లు చేస్తే అదే ఈజీ అవుతుంది . మరో విషయం . . కొన్ని పత్రికలలో మనకు కావలసిన ఆర్టికల్స్ ఇమేజ్ లా కాకుండా పిడిఎఫ్ వెర్షన్ కూడా సేవ్ చేసుకోవచ్చు . కానీ అన్నింటిలో ముందు మన అకౌంట్ క్రియేట్ చేసుకోవడం తప్పనిసరి . .
అడగక తప్పలేదు . అదే style లో తిప్పుకుంటూ వచ్చింది భామ . ఎంత ప్రయత్నించిన ఏమి
నవ్వాపుకోలేక చచ్చాను ! మరీ ఇలా అన్నిటినీ ఒకేసారి చెప్పేస్తే ఎలా అండి భరించడం ? ఇలాంటివే నాకూ చాలా వున్నాయి . . కానీ అవేవో ఇంకా తెలియదు ! ఆ మద్య పొద్దులో నా బ్లాగుపై సమీక్షలో " శ " ను వాడదగని చోట వాడతానని అన్నారు కానీ నాకు ఎక్కడ తప్పు చేస్తున్నానో ఇంకా తెలియదు ! : ( ఇప్పటికీ నేను " యజ్ఞము " ను " యజ్ఞము " లా చదువుతాను . ఇదేమి చిత్రము , yajnamu అని రాసినా లేఖిని yaj ~ namu " అనే చూపిస్తుంది ! ! ! - - ప్రసాద్ http : / / blog . charasala . com
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( ఎపిఎస్ఆర్టీసి ) మేనేజింగ్ డైరెక్టర్ గా ఎస్ఎస్పీ యాదవ్ గురువారంనాడు పదవీ బాధ్యతలు స్వీకరించారు . దినేష్ రెడ్డి ఆయన ఆ బాధ్యతలు స్వీకరించారు . ఇప్పటి వరకు ఆర్టీసి ఎండిగా ఉన్న దినేష్ రెడ్డి విజిలెన్స్ , ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ గా జనరల్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు . ఈ . . .
idlebrain , వాళ్ళు మగధీర technicians తో స్పెషల్ interviews తీసుకుంటున్నారు . ప్రస్తుతం రెండు ఆర్టికల్స్ రిలీజ్ చేసారు . http : / / idlebrain . com / news / 2000march20 / magadheera - sets - chariot . html http : / / idlebrain . com / news / 2000march20 / magadheera - sets - bridge . html రెండు , ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ తోనే . ఎంతైనా మగధీర సినిమా వల్ల technicians కి మంచి ఫేం అండ్ importance వస్తోంది . అసల మూవీ లో ఒక ఫుల్ పాట వాళ్ళకోసం dedicate చేసి , వాళ్ళను చుబించడం నిజంగా చాలా గొప్ప విషయం . ఎంతైనా రాజమౌళి , రాజమౌలియే కద మరి . ఆ పాటను చూసి , నేను అందులో భాగం అయి ఉంటె బాగుండును అన్న ఫీలింగ్ కలిగింది . అలాంటిది అందులో పనిచేసిన వాళ్ళు వెండి తెర మీద వాళ్ళని వాళ్ళే చూసుకొని ఎంత ఆనంద పడుంటారో ఊహించుకోండి . అరుంధతి కూడా ఈ కోవకు చెందినా మూవీ ఏ . ఇలాంటి మూవీస్ ఇంకా వస్తేనే , వాళ్ళ అసలైన సత్తా బయట పడేది . తెలుగు సినిమాలు తమ పంథాను మార్చుకుంటూ ఇలా పురోగమించడం చాల మంచిది . అండ్ idlebrain వారు దీని గుర్తుంచి వాళ్ళను , వాళ్ళ experiances ని బయటపెట్టడం కూడా చాల మంచి విషయం .
చెప్పాల్నుకున్నది గట్టిగా గొంతెత్తి చెప్తారు సుబ్బమ్మగారు . ఆమె కోసం ఒకసారి ఇక్కడ విజయవాడలో వరకట్న వేధింపుల పైన ఒక సెమినార్ ఏర్పాటు చేసిపెట్టాను నేను అప్పుడు బాగా పరిచయం . తన పేరుమీద ఆవి్డ నాకొక అవార్డుకూడా ఇచ్చారు . విజయవాడ వచ్చినప్పుడల్లా ఫోన్ చేసేవారు . చాలామందికి స్ఫూర్తి ఆవిడ . .
ష్టాలతోకునారిల్లుతున్న అన్ని రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలపై కేంద్ర ప్రభుత్వంమమకారం చూపించింది . ఆధునిక సౌకర్యాల కల్పనకు నిధుల సాయం అందించేందుకుముందుకు వచ్చింది . ఆధునిక సౌకర్యాల కల్పనకు ఆర్టీసీలు చేసే ఖర్చులో సగంకేంద్ర ప్రభుత్వం భరించనుంది . మొదటి విడతగా ఇందుకోసం రూ . 100కోట్లు కేటాయించింది . ఈ నిధులతో ఆన్‌లైన్ టిక్కెట్ల వ్యవస్థను మరింతగా విస్తరించడానికిఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టార . . .
సమైక్యవాదుల సినిమాలను అడ్డుకుంటామని కెసిఆర్ కూతురు కవిత ప్రకటించడంపై టిడిపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది . సినిమాలు అడ్డుకుంటే తెలంగాణా వస్తుందా అని టిడిపి నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు . టిడిపి గ్రేటర్ నాయకులు తీగల కృష్ణారెడ్డి , అరవింద్ కుమార్‌గౌడ్ , సాయన్న , సలీం , కెఎస్ రత్నం , బుగ్గారావుతో కలిసి తలసాని ఎన్టీఆర్ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు . తెలంగాణా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కెసిఆర్ భావిస్తున్నారని కెసిఆర్ , అయన కుటుంబం నుంచే సమస్యలు వస్తున్నాయని అన్నారు . తెలంగాణా విషయంలో టిడిపి అన్ని విధాలా సహకారం అందిస్తోందని , తెలంగాణా కెసిఆర్ కుంటుంబానిది కాదని , అందరిదని అన్నారు . అదుర్స్ సినిమాను అడ్డుకుంటామని ప్రకటించడం తగదని , ఇది తెలంగాణా సంస్కృతి కాదని హితవు పలికారు . విధ్వంసాలు సృష్టిస్తూ ఇతరులను ఇబ్బంది పెడ్తూ తెలంగాణాను సాధించలేరని అన్నారు . టిఆర్‌ఎస్ విధానాలపై కెయు , ఓయు , రాజకీయ జెఎసిలు స్పందించాలని ఆయన కోరారు . తమ సహకారం అవసరమా లేదా జెఎసి నేతలు ఆలోచించాలని తలసాని అన్నారు . నగరంలో భయానక వాతావరణం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు . గ్రేటర్ హైదరాబాద్ ప్రజలతో ఒక కార్యాచరణను రూపొందిస్తామన్నారు . ప్రజల ఆస్తులను విధ్వంసం చేయరాదని అన్నారు . నగరంలో శాంతిర్యాలీ విషయమై గతంలోనే తాము యోచించామని , అయితే తెలంగాణా ఉద్యమానికి ఆటంకం ఉండరాదని విరమించుకున్నట్లు తెలిపారు . పరిస్థితి ఇలాగే ఉంటే రాజకీయాలకతీతంగా నగరంలో శాంతిర్యాలీ నిర్వహించడానికి సహకరిస్తామని తలసాని చెప్పారు . టిఆర్‌ఎస్ విధానాలతో ప్రజలు ఎంతో బాధపడుతున్నారని టిడిపి నగర అధ్యక్షులు తీగల కృష్ణారెడ్డి అన్నారు . తెలంగాణా పేరుతో కెసిఆర్ ఆస్తులను సంపాదిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు . నగరంలో నివసించే అన్ని ప్రాంతాల ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు . ఎన్టీఆర్ మనువడని , ఎన్నికల్లో టిడిపికి ప్రచారం చేశారనే జూనియర్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు . కెసిఆర్ తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు . దౌర్జన్యం , బ్లాక్‌మెయిల్ , బెదిరింపులు ఎన్నాళ్లు చేస్తారని ప్రశ్నించారు . 2009 ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకొని ఎంపి , ఎమ్మెల్యే అభ్యుర్థుల నుండి డబ్బు వసూలు చేసిన కవితకు మాట్లాడే అర్హత లేదని అన్నారు . టిడిపి రంగారెడ్డి జిల్లా అద్యక్షులు మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా అంటే కెసిఆర్ ఆయన కుటుంబ సభ్యులు నల్గురు మాత్రమే కాదని అన్నారు . జెఎసి తీర్మానం చేసిన తర్వాత కూడా టిఆర్‌ఎస్ నాయకులు సినిమాలపై దాడులు చేయడం తగదన్నారు . సినిమాలు అడ్డుకోవడం ఆర్థిక నేరం కిందికి వస్తుందని హెచ్చరించారు . కెసిఆర్ కుటుంబాన్ని అదుపు చేయాలని ఆయన జెఎసి నేతలకు , ప్రజాసంఘాలకు పిలుపునిచ్చారు . మాజీ ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ అదుర్స్ సినిమాను అపమంటే ఏమిటి ? ఉద్యమం నడుపాలని ఉందా , దోచుకోవాలని ఉందా అని నిలదీశారు . టిడిపి నగర ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ ప్రజల హక్కులను ఎవరు హరించినా చట్టపర చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . రాజకీయాలకు అతీతంగా నగరంలో శాంతిర్యాలిని నిర్వహిస్తామని చెప్పారు . ఇందుకోసం కాంగ్రెస్ , బిజెపి , ఎంఐఎం నేతలతో మాట్లాడుతామని , మనసు మార్చుకొని టిఆర్‌ఎస్ పాల్గొంటే మంచిదని అన్నారు .
డోలాయాం సప్తపది లో ఉన్నదనుకుంటున్నానండీ . . రెండింటిలోనూ ఉందా ? ఆమాటకొస్తే ఆయన తెరమీద మన కర్ణాటక సంగీతాన్ని సందార్భానుసారం వాడినంతగా ఇంకెవ్వరూ తాకను కూడా తాకలేక పొయ్యారు . : శ్రుతిలయలు లో రాజశేఖర్ , జయలలిత రైలు లో ఉన్నపుడు , శంఖరాభరణం లో శొమయాజులు , మంజు భార్గవి రైలు దిగేటప్పుడు : ఎంతనేర్చినా , ఎంతజూచినా
సుప్రసిద్ధ చిత్రకారుడు శ్రీ బాలివేసిన బొమ్మలు పుస్తకాన్ని మరింత ఆకర్షణీయంగా చేశాయి . హితబోధలూ , పుస్తక రచనలూ మనుషులలో మార్పు తెస్తాయా అని ఎవరూ సందేహించవలసిన పని లేదు . కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు చేసిన కర్తవ్య బోధ అర్జునుడిని విజయం వైపు నడిపించింది . 1908లో తోల్‌స్టాయ్ రచించిన ` హిందువుకి ఒక లేఖ ' ( A Letter to a Hindu ) వ్యాసం గాంధీజీని అహింసాయుత ఉద్యమం సాగించడానికి ప్రోత్సాహం కలిగించింది . అలాగే ఈ పుస్తకం కూడా కొందరిలోనైనా పరివర్తన తీసుకొని రాగలిగే , కొన్ని కుటుంబాలనైనా కష్టాలనుంచి గట్టెంకించగలిగితే రచయిత్రి ఆశయం నెరవేరినట్లే .
మళ్ళీ వర్షం మొదలై పోయేది . మంచం మీద దుప్పటి కప్పుకుని వాన చప్పుడు వింటూ కళ్ళు మూసుకునే దాన్ని . వర్షం కచేరి చేస్తూ వుంటే వురుములు , మెరుపులు , పిడుగులు పక్క వాయిద్యాలు వాయిస్తున్నట్టు … వింటూ ఎప్పుడో నిద్రలోకి జారుకునే దాన్ని .
వామపక్షాలు 1969లో విశాలాంధ్ర నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించాయి . వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశాయి . ఇప్పుడా పరిస్థితి లేదు . ఇప్పుడూ ఆ పార్టీలు విధాన పరంగా తెలంగాణను వ్యతిరేకిస్తున్నా , పార్లమెంటులో ఆ బిల్లును ప్రతిఘటించడానికి సిద్ధంగా లేవు . యాభైయ్యేళ్ల స్వాతంత్య్రం తర్వాతకూడా తెలంగాణ ఆశించిన ప్రగతిని సాధించలేక పోయిందని వామపక్షాలూ అంగీకరిస్తున్నాయి . తెలంగాణ వెనుకబాటుతనాన్ని గుర్తిస్తూనే , ప్రత్యేక ప్యాకేజీలు కోరుతున్నాయి . ఆ పార్టీలలో కూడా , ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో ప్రత్యే క రాష్ట్ర వాదాన్ని ఆమోదించే వారి సంఖ్య పెరిగింది . ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తాము అడ్డం పడుతున్నామని కాంగ్రెస్ చెప్పడాన్ని వామపక్షాలు అంగీకరించడం లేదు . ' కాంగ్రెస్ మా భుజాలపై తుపాకిని పెట్టి టిఆర్‌ఎస్‌ను కాల్చాలని చూడడం సహించం ' అని సిపిఎం నాయ కులు స్పష్టంగానే చెబుతున్నారు . అందువల్ల 1969నాటి వీధిపోరాటాలు పునరావృతమయ్యే పరిస్థితి ఇప్పుడు లేదు . అయితే తెలంగాణ ఉద్యమకారులు హింసాకాండకు దిగితే వామప క్షాలు ఇప్పుడుకూడా మౌనంగా ఉండకపోవచ్చు . ఉద్యమం శాంతియుతంగా జరిగినంత కాలం వారి నుంచి ప్రతిఘటన ఉండే అవకాశం లేదు .
ఈ నాటకీయ పరిణామాల మధ్య , రాబోయే రోజుల్లో ఏం జరుగబోతుంది ? కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన ఏంటి ? బొత్సను అధ్యక్షుడుగా చేయడం వెనుక రహస్యం ఏంటి ? అధిష్టానం ఆయనకు అప్పగించిన పనిని నెరవేర్చగల సామర్థ్యం వుందా ? ఒకవేళ వున్నా ఆయనను సజావు గా పనిచేయనిస్తారా ? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నినాదం ఒక వైపు , జగన్ సవాళ్లు మరో వైపు బొత్సకు తలనొప్పిగా మారుతాయా ? 2004 ఎన్నికలలో ఓడిపోయి , అంచలంచలుగా , రాజకీయ వ్యూహంలో తన చతురతను ప్రదర్శించుకుంటూ , 2009 ఎన్నికలలో గతంలో కంటే రెట్టింపు స్థానాలను సాధించి , 2014 ఎన్నికలొచ్చేసరికి అధికారం చేజిక్కించుకునే ధీమాతో ముందుకు సాగుతున్న తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడిని ఎదుర్కునేందుకు బొత్స సరిపోతా రా ? ఇవన్నీ రాజకీయ విశ్లేషకుల ముందున్న ప్రశ్నలు .
" నీకు ఏమైనా అడ్వాన్సు ఇస్తే బాగుంటుందని ఆర్ముగం చెప్పాడు . అందుకే మూడువందలు ఇస్తున్నా . డబ్బులు తీసుకుని పని ఎగకొడితే ఎక్కడున్నా పట్టుకుంటా … మక్కెలు విరగకొడతా … " అంటూ అప్పటికప్పుడు మూడువందలు రవిబాబు చేతిలో పెట్టాడు ఆ మనిషి .
" రాత్రి నాకు జ్ఞానోదయమైందిరా . బుద్ధుడికి బోధిచెట్టుకింద అయింది కానీ … నాకు పడగ్గదిలో ఫ్యానుకిందే అయిపోయింది . "
" ఎవ్వరూ నచ్చలేదు " అనే ఓటు వేసే సదుపాయంకూడా మన రాజ్యాంగం కల్పించిందట . మరింత సమాచారం కోసం ఇది చూడండి .
నమస్కారం మహేష్ గారు , చాలా పెద్ద స్తటేమేంట్ ఏమి కాదు , మనం కొంచెం లోతుగా చూస్తే ఎక్కువగా కాదు గాని మన మతం , మన సంస్కృతి కొద్ది కొద్ది గా తెర మరగవుతున్నది .
ఇందోరు దేనికి ప్రసిద్ధి అని ఎవరైనా అడిగితే ఠక్కున చెప్పగలిగేది " సేవ్ " అని ఇక్కడ పిలిచే మన శనగపిండి కారాసు లాంటివి . ఇంకా రత్లామి సేవ్ అనీ , హీంగ్ సేవ్ అని రకరకాల వెరైటీలు కూడా దొరుకుతాయి . ( ఆ మధ్య హైదరాబాద్‌లో ఈస్ట్ మారేడ్‌పల్లి ప్రాంతంలో ఒక చోట ఇందోరి సేవ్ అమ్ముతుండటం చూశాను . . ) అదలా పక్కన పెడితే ఇందోరులో చిరు తిండ్లు కూడా చాలా ప్రసిద్ధి .
రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు రైతు ముఖంలో ఆనందం కనిపిస్తోంది . ఇప్పటి వరకు మందకొడిగా సాగిన ఖరీఫ్ పనులు వర్షాలతో ముమ్మరమయ్యాయి . కొంత మంది ఇప్పటికే విత్తనాలు విత్తారు . పొలాల్లోని మొలకలు ఎండలకు వాడిపోతుండడగా కురుస్తున్న వర్షాలు ప్రాణం పోసినట్లైంది . జులైలో 253 . 4 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది . ఈ వారంలో ఇప్పటి వరకు 172 . 1 మి . మీటర్ల వర్షపాతం నమోదైంది . రెండు రోజులుగా 1342 . 2 మి . మీటర్ల వర్షం కురిసింది . సగటున 25 . 8మి . మీటర్ల వర్షం కురిసింది . జిల్లాలో 6 . 30 లక్షల హెక్టార్ల భూమిలో పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 3 . 30 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు . వర్షాలు లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో విత్తుకోలేదు . వాస్తవంగా ఇప్పటికే 80శాతం విత్తుకోవడం పూర్తి కావాల్సి ఉండగా వర్షాభావం కారణంగా కేవలం 50శాతం మాత్రమే పూర్తయింది . రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మిగిలిపోయిన మరో 3లక్షల హెక్టార్లలో కూడా సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి . మొన్నటి వరకు వర్షాల కోసం ఎదురు చూసిన రైతులు విత్తుకోవడం మొదలు పెట్టారు . రెండు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి . అయితే అన్ని మండలాల్లో ఒకే విధంగా లేదు . కొన్ని మండలాల్లో భారీగా మరికొన్ని మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది . మంగళవారం 14 మండలాల్లో 40 . 5 మి . మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది . మిగతా మండలాల్లో 20మి . మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది . ఇందులో ఇంద్రవెల్లి , ముధోల్ , ఖానాపూర్ , ఉట్నూర్ , తాండూర్ , సిర్పూర్ ( టి ) మండలాల్లో 50మి . మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది . రెబ్బెన , కాగజ్‌నగర్ , వాంకిడి , జన్నారం , సిర్పూర్ ( యు ) , కడెం , నార్నూర్ , జైనథ్ మండలాల్లో 40 . 5 మి . మీటర్ల వర్షం కురిసింది . ఇప్పటి వరకు వరి సాగుకు తగినంత వర్షం లేకపోవడంతో రైతులు ఆ దిశగా ఆలోచించలేదు . రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు వరి సాగుకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంటున్నారు .
" నా జీవితంలో దేవుడిని ఎన్నడూ తలచుకోలేదు . దేవుడనేవాడుంటే . నాదేశస్తులు అనుభవిస్తున్న కష్టనష్టాలను చూస్తూ వూరుకుంటున్నందుకు కొన్నిసార్లు ఆ దేవుణ్ని నిందించానుకూడా . ఈ చివరిక్షణంలో మృత్యువుకు యెదుట నిలచి దైవాన్ని ప్రార్ధిస్తే అతడు నన్ను పిరికిపంద ఆత్మవంచకుడు అనుకుంటాడు . నన్ను ఇప్పుడున్న విధంగానే ఈ లోకంనుంచి వెళ్ళనివ్వండి . ఏ ఒక్కరుకూడా భగత్ సింగ్ చావునుచూసి భయపడిన పిరికిపంద అని నిందించకూడదు . "
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ దివంగత వైఎస్ హయాంలో ప్రారంభించిన సంక్షేమ పధకాలలో కొన్నింటిని నిలిపివేస్తాన్నరంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు . వైఎస్ హయాంలో ప్రవేశపెట్టిన కొన్ని పధకాలు నిధుల కొరత సమస్య వల్ల తాత్కాలికంగా ఆగుతున్నాయని అన్నారు . కొందరు రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి వైఎస్ పధకాలకు గండికొడుతున్నారంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు . ఉపాధి పధకంలో వంద రోజులు తగ్గకుండా పని కల్పిస్తామన్నారు . ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేటుకూరి శివ , పులపర్తి అంజిబాబు , తహశీల్దార్ జి వసంత్‌కుమార్ , ఎండిఓ జి పద్మ , ఎంపిపి నేలపాటి సుశీల , గ్రామ కార్యదర్శి వెంకటరత్నం , చేబోలు రామకృష్ణ , కె . గోపాలకృష్ణంరాజు , కలిదిండి రామకృష్ణంరాజు , బైరెడ్డి మాధవ , మందా ప్రభుదాస్ , కె ఎన్ సత్యనారాయణ , పాండు రంగారావు తదితరులు పాల్గొన్నారు .
కాలాన్ని నా రథం పై విహార , విజ్ఞాన , వికాస యాత్ర చేయిస్తాను . నా మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాను . ' కాలరథమ్ము మీదనె జగత్పతి నిత్యము స్వారి చేయునో ? కాలరథమ్ము చక్రముల ఘట్టన పుట్టుచు రాలుచుండు కెం థూళి కణమ్ములే అగునొ తోచెడి ఈ సకల ప్రజాళియున్ ? ' కాల రహసమున్ తెలియగల్గుటె పుట్టుకకున్ ఫలమ్మొకో ? ( బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు )
బూల్ ఇవి సాగిస్తూనే ఖాళీ సమయాల్లో సొంతంగా గణిత శాస్త్రాన్ని అభ్యసించసాగాడు . 1838లో , ఇరవై మూడేళ్ళ వయసులో , బూల్ గణితశాస్త్రంలో మొదటి పేపర్ ప్రచురించాడు . డంకన్ గ్రెగరీ ( Duncan Gregory ) అనే గణితశాస్త్రవేత్త " కేంబ్రిడ్జ్ జర్నల్ " అన్న గణితశాస్త్ర జర్నల్‌కి సంపాదకుడిగా ఉండేవాడు . బూల్ మట్టిలో ఉన్న మాణిక్యమని గ్రెగరీ గ్రహించాడు . గ్రెగరీ బూల్‌కి పేపర్లు ఎలా రాయాలో సలహా లిచ్చాడు . తద్వారా బూల్ కి గణిత ప్రపంచంతో సంబంధాలేర్పడ్డాయి . గ్రెగరీ బూల్‌ని తను సొంతంగా చదివిన చదువు చాలదనీ , గణితశాస్త్రంలో పట్టా పొందమనీ ప్రోత్సహించాడు . కానీ , బూల్ తల్లిదండ్రులని వదిలి వెళ్ళలేక , బడిమీద వచ్చే ఆదాయాన్ని వదులుకునే ఆర్థిక స్వాతంత్ర్యం లేక నిస్సహాయుడై యూనివర్సిటీకి వెళ్ళలేకపోయాడు . ( ప్రపంచ ప్రఖ్యాత భారతదేశ గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ కూడా ఏ డిగ్రీలూ లేకుండా స్వతహాగా నేర్చుకొని ప్రతిభ కనబరచాడు . హార్డీ చొరవ తీసుకొని రామానుజన్‌ని ప్రోత్సహించి కేంబ్రిడ్జికి తీసుకురాకపోతే రామానుజన్ పేరు గణితశాస్త్ర చరిత్రలో ఉండేది కాదేమో ! ) కానీ , బూల్ క్రుంగిపోకుండా సొంత పరిశోధనలమీద దృష్టి కేంద్రీకరించాడు . సాధ్యమైనంత వరకు గణిత శాస్త్రవేత్తలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగించాడు . 1844లో ప్రచురించిన " On a General Method in Analysis " అన్న పేపరుకి రాయల్ సొసైటీ వాళ్ళు బంగారు పతకాన్నివ్వడంతో బూల్ కి గణిత ప్రపంచంలో పేరొచ్చింది . 1847లో బూల్ " The Mathematical Analysis of Logic , being an Essay Towards a Calculus , " అన్న చిన్న పుస్తకాన్ని ప్రచురించాడు . ఇది గణితంలో విప్లవాత్మకమైన మార్పులని తీసుకొచ్చింది . అయితే , దీనిని తొందరపడి రాశానని బూల్ తరవాత భావించాడు . ఆ భావాలనే మళ్ళీ 1854లో విపులంగా ప్రచురించాడు . వాటి లోతుల్లోకి వెళ్ళే ముందు బూల్ జీవితంలో వచ్చిన మరికొన్ని మార్పులని చూద్దాం .
" కన్నీటి జాడలా ? " అడిగాను నేను . ఇంతలో అతని బస్సు వచ్చేసింది . నన్ను " కన్నీటి జాడలు " ( Trail of Tears ) అనే ఆ మాట నాతో ఉండిపోయింది . చెరోకీల గురించి తెలుసుకోవాలన్న కోరిక నాలో బలంగా నాటుకొంది . యూరోపియన్లు రాక మునుపు చెరోకీ తెగ ప్రజలు ప్రస్తుత జార్జియా , ఉత్తర మరియు దక్షిణ కరోలినా , టన్నెస్సీ రాష్ట్రాలలో 200 కు పైగా గ్రామాల్లో నివసిస్తుండే వారు . ఉత్సవాల్లో యుద్ధాల్లో పాల్గొనడానికి ఈ 200 గ్రామాల్లోని వారంతా ఒక దగ్గర చేరడానికి ప్రయత్నించేవారు . కానీ మిగిలిన దైనందిన విషయాల్లో ఏ ఊరి నిర్ణయాలు ఆ ఊరు వారు తీసుకునే వారు .
రాశి చక్రానికి ప్రారంభ బిందువు ఎక్కడ అన్నదొక వివాదం . ప్రతీ సంవత్సరం సూర్యుడు భూమధ్య రేఖ పైకి వచ్చే బిందువుని వసంత విషువద్బిందువు ( Vernal Equinox ) అని అంటారు . అది సుమారుగా మార్చి 21వ తేదీన జరుగుతుంది . ఆరోజు భూమధ్య రేఖమీద పగలు , రాత్రి సమానంగా ఉంటాయి . ఈ బిందువే రాశి చక్రానికి ప్రారంభ బిందువు అని ఒక సాంప్రదాయం . ఇలా లెక్కపెట్టే రాశిచక్రాన్ని సాయన రాశిచక్రం అంటారు . కానీ భూమి తనచుట్టూ తాను తిరగడమే కాక బొంగరంలా ధృవాల దగ్గర అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది . ఈ ఊగే చలనం ఫలితంగా ప్రతి ఏడాదీ సూర్యుడు భూమధ్య రేఖ మీదకి వచ్చే బిందువు కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ( Precession of the Equinoxes ) .
ఐతే చివరలో మాత్రం సామాజిక సంఘర్షణలు నివారించడానికి , స్తానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారం అప్పగించాలని సీతారాం గారు ఒక చక్కటి అభినందనీయమైన సలహాను / సూచనను చేశారు . ఆ సలహా మనమంతా సంతోషించదగిన , మెచ్చదగిన విషయం .
ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది . రింగ్ టోన్ బట్టి ఎవరో చాలాకాలం నుంచి ఫోన్ చెయ్యని వాళ్ళు చేస్తున్నారని అర్థమైంది .
అదెలా అంటే కటపయాది సూత్రం ప్రకారం " య " వర్గం లో " రా " రెండవ అక్షరం కాగా " ప " వర్గం లో " మ " ఐదవ అక్షరం రెండు * ఐదు = పది కదా , దీనిని బట్టి ఒక సారి రామ అంటే పది సంఖ్య కు సంకేతం . ఇక మూడు సార్లు జపిస్తే 10 * 10 * 10 = 1000 కి సమానమవుతుంది . అందుకే పరమశివుడు అలా నిర్వచించాడు అని .
ధన్యవాదాలు లలితగారూ . : ) ఇందుమూలముగా యావన్మందికీ తెలియజేయడమేమనగా : ) . . . జరుగుతున్నది కబడ్డీ పోటీ కాగా , కుస్తీ బాగా సాధనచేసి వచ్చాడట ఒకడు . బరిలో దిగడం ఆలస్యం ఔట్ అయిపోయాడు . అలా నా కథ కూడా మెడ పట్టి బయటకు నెట్టబడింది . మన సచివాలయం ఎదురుగా ఆర్భాటంగా పైకెగసిన ఫ్లైఓవరును తలపింపజేసే నా కథను సమయం చూసుకొని సక్రమంగా సరయిన చోట దించాలి .
( ఏమైనా మిగిలిపోతే గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ చెప్పేస్తాడు ) సూత్రధారులూ కుట్రదారులూ దొరకరు కాబట్టి వారికి సహకరించిన స్థానికులు అన్న పేరు మీద అరెస్టులు మొదలుపెడతారు . మళ్లీ ఇంకొక చోట బాంబుపేలుళ్లు జరిగితే ఆ రాష్ట్ర పోలీసు లు ఇదే తంతు మొదలు పెడతారు . వారి జాబితా వారు ప్రకటిస్తారు . ఈ సూత్రధారులు , కుట్రదారులు ఒక ఘటనకు పరిమితమా అంటే కాదు . అహమ్మదాబాద్ , బెంగుళూరు , సూరత్ , ఢిల్లీ , హైదరాబాద్ అంటూ దండకం చదవాల్సిందే . కానీ ఒక రాష్ట్ర పోలీసుల సూత్రధారులు ఇంకొక రాష్ట్రానికి పనికిరారు .
తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ - సేవ అమలు చేసేందుకు ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటుచేయాలని టిటిడి అధికారులకు ముఖ్యమంత్రి కె . రోశయ్య సూచించారు . దీన్ని సాధారణ భక్తులకు ఉపయుక్తంగా అమలు చేయాలని సూచించారు . ఆదివారం బెంగళూరు వెళ్లడానికి ముందుగా దేవాదాయశాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి , టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ జె . సత్యనారాయణ , సభ్యులు ఐవైఆర్ కృష్ణారావు , నాగిరెడ్డిలతో ముఖ్యమంత్రి చర్చించారు . బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడం పట్ల రోశయ్య సంతృప్తి వ్యక్తం చేశారు . స్పెసిఫైడ్ అథారిటీ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని అభినందించారు . శ్రీ - సేవ భాగుందని , దీనిని ఇతర ప్రాంతాలకు , పథకాలకు రోల్‌మోడల్‌గా అమలుచేయాలని సూచించారు . త్వరగా దర్శనం కల్పించేందుకు , భక్తులకు లడ్డు ప్రసాదం కొరత లేకుండా చూసేందుకు చర్యలు చేపట్టాలని కూడా సూచించారు . ఇప్పటివరకు దాదాపు 40 లక్షల మందికి శీఘ్ర దర్శనం కల్పించామని , అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు . శీఘ్ర దర్శనాన్ని ప్రత్యేక ప్రవేశ దర్శనంగా పేరు మార్చేందుకు , ప్రత్యేకంగా లఘు దర్శనాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు . నవంబర్ ఒకటి నుండి మంగళ , బుధవారాల్లో లఘు దర్శనాన్ని అమలు చేస్తామని తెలిపారు . టిటిడిలో వివిధ పోస్టులకు పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించామని ఈఓ కృష్ణారావు ముఖ్యమంత్రికి తెలిపారు . జమ్ములోని వైష్ణోదేవి ఆలయంలో కంచి కామకోటి పీఠం నిర్వహించే యజ్ఞానికి దేవస్థానం తరఫున 8 . 2 లక్షలను అందించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని కూడా అధికారులు వివరించారు .
తెలుగు పై కన్నడ లా సమానంగా ఇచ్చి పుచ్చుకునే భాషలు చాల తక్కువ . తెలుగు పై ఆధిపత్యం చేసిన భాషలే ఎక్కువ , తెలుగు లో మనం వాడె పదాల్లో సంసృతం , పార్సీ పదాలు చాలా ఉన్నాయి . ఆ భాషలు , తెలుగు నుంచి తీసుకున్న దేమీ లేదనుకుంటాను . తెలుగు భాష పై - - భాష పైనే కాదు అన్నిటిపై - - ఇంగ్లీషు ఆధిక్యత పెరుగుతోనే ఉంటుంది , అది తప్పదు . అది వద్దు , ఆపాలి అనే వాదన తెలంగాణా వాదం లా ఉంటుంది .
త్వా మాదౌ గణయంతి మూఢగణనా ప్రస్తావనా యాం జనా స్తే మూఢా మహి మావిద స్తవ న తే మృష్యామి తాం వాచ్యతాం స స్యోత్పత్తి నిదాన మ స్యథ హవి ర్మూలం సురాణా మసి బ్రూమః కిం బహు కాసరేంద్ర జగతా మాధారతాం గా హసే .
ఇక మాడరన్ ట్రెండ్ అంటే , దుబాయ్ వాళ్ళ ట్యూనులని దిగుమతి చేసుకొని , పాడే వాళ్ళ గొంతుల్ని నొక్కేసి , అదేదో సీనారేకు మీద దువ్వెన్న తో గీకితే వచ్చే కీచు గొంతుకలా రికార్డు చెయ్యడం , అన్నిభాషలనీ మిక్స్ చేసేసి , యేదో పాడించేసి , వెనకాల సోఁయ్ సోఁయ్ , అనో , డోఁయ్ , డోఁయ్ అనో , ఈఁ ఈఁ ఈఁ అనో , ఊఁ ఊఁ ఊఁ అనో మోతెత్తించడం .
అరుంధతీదేవినే తలచుకుంటూ వసిష్ఠుడు తాను తప్పు చేశాననీ , ఇక శాశ్వతంగా అరుంధతీదేవికి దూరమవ్వాలని అనుకుంటుంటాడు . తన తపస్సు వ్యర్థమనుకుంటాడు . అది ఇసుక తుఫానులో చేసిన తపస్సులాంటిదని అనుకుంటాడు . తనకి మరణమే శరణ్యమనుకుంటాడు .
ఈ మాటలు చదువుతుంటే ఒకటి స్పష్టమవుతుంది : నండూరివారి పాటలు కేవలం గదిలో కూర్చొని చదవటానికి కాదు . పాడు కొనటానికి , వినటానికి . మళ్ళీ శాస్త్రిగారు " ఈ పాటలన్నచో పండిత పామర సాధారణముగా నెల్లవారికిని యే మాత్రపు భావనాశక్తి యున్నను , అందుకొనుటకు , ఆనందించి తవిసి తరింప చేయుటకును వీలైనట్టివి . నిక్కమగు ప్రేమను , దాంపత్యభావమును , ధర్మపరతమును , యెట్టి యాదర్శములను కలిగి యుండునోయను విషయమును ఈ పాటలంత తేట తెల్లముగా … సాధారణ జనమున కంతటికిని తెల్పగల గేయములివి " . అంటే , అంతటి ప్రేమను , ధర్మము , దర్శనము రంగరింపయిన ప్రేమను , సామాన్యుడి అనుభవపరంగా పలికి , అతనితో పలికించి , అతని నోట పలికేలా చెయ్యగలిగిన మాధుర్యం , దివ్యశక్తి యీ పాటలకున్నయ్ , మరొక్కసారి శాస్త్రిగారు : " సుబ్బారావు పంతులుగారు గానము చేసిన ఈ పాటలలో భావము కంటెను ముందుగ భాషయును , భాషకంటే మున్ముందుగ భావమును , సహామహమికతో బర్వు లెత్తుచుండెను . " ప్రముఖ ఆంగ్ల కవి T . S . Eliot చెప్పినట్లు , You are the music / while the music lasts .
ఎక్జిబిటర్ల నాయకుడు విజేందర్ రెడ్డి ' నిర్మాతలు ఖర్చులు తగ్గించుకోవాలి , వాళ్ళు ఈ పని చెయ్యాలి , ఆ పని చెయ్యాలి ' అంటూ సలహాలు ఇచ్చాడు . సినిమా హాళ్ళ వాళ్ళు మాత్రం టిక్కెట్ల రేట్లు పెంచాలని కోరబోతున్నట్టు చెప్పాడు . బెంగాలు , కర్ణాటక , తమిళనాడు , . . వగైరా చోట్ల రేట్లు మనకంటే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు . ఇక , ఆ తరవాత మాట్టాడినవాళ్ళు ఆయన్ను విమర్శించారు . ఈమధ్యే రేట్లు పెంచారు మళ్ళీ ఎందుకు పెంచాలి అని ప్రశ్నించాడొకాయన . అసలు రేట్లు పెంచాల్సిన అవసరం మీకేముంది అన్నాడొకాయన . సినిమా విడుదలైన మొదటి రెండు వారాల్లో టిక్కెట్లను పెంచే జీవోను ఎక్జిబిటర్లే తెచ్చారని ఎవరో అన్నారు . విజేందర్ రెడ్డి అబ్బే , అది అడిగింది నిర్మాతలేగానీ , మేం కాదని చెప్పాడు . ఛాంబర్లో నిర్మాతలే కాదు మీరూ ఉన్నారు అంటూ ఎదురు వాదన వచ్చింది . ఇలా కాసేపు వాళ్ళ వాదన సాగింది .
Click on photo to enlarge Durban Sign 1989 : జాతి వివక్ష Courtesy : Wikimedia Commons రంగుటద్దాలలో జాతి వైషమ్యం ఆఫ్రికాలో జాతి విచక్షణ సర్వసాధారణమైపోయింది . పేరుకు దక్షిణాఫ్రికాను వేలెత్తి చూపడమేగాని , ఆచరణలో ఆఫ్రికా అంతటా యీ జాడ్యం అమలులో వున్నది . టునీషియా , ఈజిప్టు , లిబియా , అల్జీరియా మొరాకోలో యూదులను బలవంతంగా వెళ్ళగొట్టి మిగిలిన కొద్దిమందిని అంటరానివారుగా దూరం పెట్టారు . ఇది ఎప్పుడోకాదు 20వ శతాబ్దం రెండో భాగంలో , 1950 , 1960లో 10 లక్షల మంది యూదులను తరిమేశారు . టాంజనియా రిపబ్లిక్ నుండి అరబ్బులను 1960లో దేశ బహిష్కరణ చేసి , యింకా మిగిలిన వారికి సమాన హక్కులు లేకుండా చేశారు . తూర్పు మధ్య ఆఫ్రికా దేశాలలో 1970 తరువాత కూడా ఆసియావాసులను వెళ్ళగొట్టారు . 1982 ఆసియా వారిని వెళ్ళిపొమ్మని కీన్యా ఆదేశించింది . 1972లో అమీన్ నాయకత్వాన ఉగాండాలో ఆసియా వారిని తరిమేశారు . ఆఫ్రికా అంతటా ఆసియావాసులపై దాడులకు , వెళ్ళగొట్టడానికి అక్కడి పత్రికలు కూడా తోడ్పడుతున్నాయి . ఆసియా డాక్టర్లు ఆఫ్రికాలో నల్లవారిని చంపేస్తున్నారనేటంత వరకూ ప్రచారం వున్నది . ఆదివాసుల ముఠాల మధ్య కలహాలు తరచు పరస్పరం హత్యలు చేసుకునేటంత వరకూ పోతున్నది . దక్షిణాఫ్రికా మాత్రం కొటోచ్చినట్లుగా జాతి విచక్షణ పాటించింది . ప్రపంచ దేశాల వ్యతిరేకతను ఖాతరు చేయకుండా దక్షిణాఫ్రికా యీ రంగు భేదాన్ని ఆచరించడానికి , వారి ఆర్థిక భద్రత చాలా వరకూ తోడ్పడుతున్నది . దక్షిణాఫ్రికాలో తెల్లవారు తక్కువ సంఖ్యలో వుంటూ అధిక సంఖ్యాకులైన నీగ్రోలపై పెత్తనం చేశారు . ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో వారు 38 లక్షల మంది వుండగా , నీగ్రోలు 1 కోటి 50 లక్షలున్నారు . మిగిలిన వారు 36 లక్షలున్నారు . దక్షిణాఫ్రికా జాతి విచక్షణలో రాక్షసకృత్యాలకు నాయకత్వం వహించినవారు స్మట్స్ , వెర్ హార్డ్ , బోతా 1911లోనే నల్లవారి సమ్మెలు చట్టవిరుద్దమని పేర్కొంటూ , కొన్ని రకాల ఉద్యోగాలు తెల్లవారికి మాత్రమే పరిమితం చేశారు . అంతేగాక తెల్లవారు , నల్లవారు వుండే ప్రాంతాలను పేర్కొంటూ 1913లో చట్టం చేశారు . ఆ తరువాత తరచు చేస్తూపోయిన చట్టాలన్నీ జాతి విచక్షణను పాటించినవే జీతాలలో ఉద్యోగాలలో , వివాహాలలో యీ విచక్షణ చూపారు . స్మట్స్ ఆధ్వర్వాన 1921లో మూకుమ్మడి హత్యాకాండ ఆరంభమైంది . ఆఫ్రికాలోని ఇజ్రాయిల్ తెగను తెగనరికించాడు . 1922లో నీగ్రో తిరుగుబాటు దార్లలో 700 మందిని రాండ్లో చంపేశారు . ద్వితీయ ప్రపంచ యుద్ధం సందర్భంగా స్మట్స్ తన దహనకొండను ఉధృతం చేశాడు . భారతీయులు తెల్లవారి నివాస ప్రాంతాలకు రాకూడదన్నారు . ప్రత్యేక ప్రాతినిధ్యపు చట్టం తెచ్చారు 1951లో . తెల్లవారికీ , నల్లవారికి మధ్య వెళ్ళిళ్లు నిషేధిస్తూ 1949లో చట్టం చేశారు . షాపులు , నివాసాలు ఎవరికి వారే వుండేటట్లు వేరుపరచారు . దీనికి గాను అనేక చోట్ల బుల్ డోజర్లు పెట్టి ఇళ్లను , షాపులను నేల మట్టం చేశారు . 1950లో కమ్యూనిజం అణచివేత చట్టం తెచ్చారు . 1950లో వెర్ వోర్డ్ దేశీయ వ్యవహారాల మంత్రిగా రావడంతో హింసాకాండ యింకా హెచ్చు పెరిగి పోయింది . 1958లో యితడు దక్షిణాఫ్రికా ప్రథాని అయ్యాడు . ఈయన విద్యారంగంలో జాతి విచక్షణ ప్రవేశపెట్టి పాఠ్య ప్రణాళికను , స్కూళ్ళను వేరు పరచాడు సంస్కృతి ఆటలు , దేవాలయాలతో సహా అన్ని రంగాలకూ విచక్షణను వెర్ వోర్డ్ విస్తరించాడు . 1959 నాటికి ఈ కార్యక్రమం పూర్తి అయింది . 1960లో 69 నీగ్రోలను కాల్చి చంపారు . ఎప్పటికప్పుడు జాతి విచక్షణను సమర్ధించుకుంటున్న దక్షిణాఫ్రికా కామన్వెల్త్ నుండి వైదొలగింది . 1973లో సైతం 44885 నీగ్రో కుటుంబాలను , బలవంతంగా తెల్లవారి ప్రాంతాల నుండి తొలగించారు . 1513 తెల్లవారి కుటుంబాలను నీగ్రోలకు దూరం చేశారు . ప్రపంచమంతా నిరసిస్తున్నా దక్షిణాఫ్రికా జాతి విచక్షణ పాటిస్తూ , నీగ్రోలను దారుణంగా చంపించింది బోతా దీనికి ఆధ్వర్యం వహించాడు . విదేశీ పత్రికలు , రేడియో , టి . వి . లపై నిషేధం పెట్టారు . దక్షిణాఫ్రికా ఆర్ధిక వ్యవస్థబాగా వున్నందువలన బోతా తన కిరాతక చర్యల్ని నిరాఘాటంగా సాగించాడు . దక్షిణాఫ్రికా పోరాటంలో తోడ్పడుతూ , గెరిల్లా పోరాటాలు చేస్తున్న వారిపై సరిహద్దు ప్రాంతాలలో తరచు దండయాత్ర చేసి చంపారు . సుకర్నో విలాసవంత దారుణాలు ఇండోనీషియా ఆధిపతిగా సుకర్నో విలాస జీవితం గడిపాడు . నగ్నసుందరులతో మాట్లాడుతున్న ఆయన్ను చూచి రష్యా అధినేత కృశ్చేవ్ ఆశ్చర్యపోయాడు . సుకర్నో ఎప్పటికప్పుడు కొత్త నినాదాలిస్తూ , జీవితాంతం తానే ఆధ్యక్షుడుగా వుండాలనే అధికారాన్ని సంక్రమింపచేసుకున్నాడు . అలీన దేశాల సమావేశం బాండుంగ్ లో జరిగినప్పుడు సుకర్నో అధ్యక్షత వహించాడు . దేశంలో పార్టీలు లేకుండా చేసిన సుకర్నో మార్గదర్శక ప్రజాస్వామ్యం , ఆర్థిక వ్యవస్థ అంటూ కొత్త నినాదాలిచ్చాడు దేశంలోని సమస్యల నుండి దృష్టి మళ్ళించడానికి విదేశీ విధానంపై కొత్త ఆకర్షణీయ ప్రసంగాలు చేస్తుండేవాడు , తటస్త విధానాం కావాలనేవాడు . ఇండో చైనాలో వున్న చైనీయులను , నానా హింసలు పాలు చేసి సుకర్నో జకార్తా - నాంపే , జీజింగ్ , పై నోగియాంగ్ సమైక్యత అంటుండేవాడు . తన దేశంలో వున్న అంతర్జాతీయ బారస్కేట్ ఉద్యమంపై దాడి చేశాడు . మలేషియాను అణచివేయాలనే దురాక్రమణ నినాదాన్ని యిచ్చిన సుకర్నో 1963లో మలేషియాను ఆక్రమించుకోవడంలో విఫలుడయ్యాడు . కాని అంతకుముందు సంవత్సరం పశ్చిమ ఇరియాను , కబళించి , విజయోత్సవం జరుపుకున్నాడు . బహుభార్యలతో , ఉంపుడు గత్తెలతో కులుకుతూ కాలం గడిపిన సుకర్నో సెక్స్ జీవితాన్ని చైనీయులు సినిమా తీశారు . రాను రాను ఇండోనీషియా ఆర్ధిక జీవనం దుర్బరంగా తయారైంది దేశ ఆర్ధిక వ్యవస్థలో కీలకపాత్ర వహించిన చైనీయుల్ని సుకర్నో హతమార్చాడు . విదేశీయులెవ్వరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు . 1965 నాటికి ఏమి చేయలేక తన నిస్సహాయతను బయటపెట్టుకోడానికి ఇష్టం లేని సుకర్నో ఇండోనీషియా కమ్యూనిస్టు పార్టీని కుట్ర చేయమని సైగ చేశాడు . 1963 - 64 రష్యా సహాయంతో మలేషియాపై దాడి చేసినప్పుడే సుకర్నో కుయుక్తులు కమ్యూనిస్టులకు తెలిసి వుండాలి . ఈసారి పెకింగ్ అనుకూల కమ్యూనిస్టు పార్టీ సహాయంతో సైనిక ప్రాబల్యాన్ని కొట్టేయాలని సుకర్నో తలపెట్టాడు . కమ్యూనిస్టులు అదే అదను అనుకొని కొన్ని జిల్లాలను కైవశం చేసుకున్నారు . 1965 అక్టోబరు 18న కమ్యూనిస్టులు , సైన్యాధిపతి జనరల్ అబ్దుల్ యానీని , మరో ఇరువుర్ని కాల్చి చంపారు . రక్షణ మంత్రి కుమార్తెను చంపారు . ముగ్గురు జనరల్స్ ను చిత్ర హింసచేసి చంపారు . చిత్రహింస అంటే ఇండోనేషియా పద్దతిలో కమ్యూనిస్టు స్ర్తీలు , వారి పిల్లలూ కలిసి , కళ్ళుపీకి , మర్మావయాలు కోసి , దేహాన్ని మొసళ్ళకు వేశారు . కమ్యూనిస్టులు చేసిన యీ కిరాతక కృత్యాలన్నీ క్రమంగా వెల్లడయ్యాయి . జనరల్ సుహార్తో నాయకత్వాన సైన్యం కమ్యూనిస్టుల కుట్రను ఎదిరించి భగ్నం చేయగలిగింది . వారు పగ తీర్చుకున్నారు . 1965 అక్టోబరు 3న పగ సాధింపు ప్రారంభమైంది . ఒక క్రమ పద్దతిలో కమ్యూనిస్టులను వూచకోతకు గురిచేశారు . మొత్తం 3 లక్షల మంది కమ్యూనిస్టులను చంపారు . సుకర్నో నిస్సహాయుడై , తన స్వయంకృతాపరాధాలకు పరిహారం అనుభవిస్తూ , నిర్బంధానికి గురైనాడు . తరువాత సుహార్తో రాజ్యాధిపతి అయ్యాడు . 20వ శతాబ్దంలో ఇంతమంది కమ్యూనిస్టులను చంపుతుంటే , కమ్యూనిస్టు అగ్ర రాజ్యాలు సైతం ఏమీ చేయలేక పోయాయి .
బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న పోటి దృష్ట్యా బ్యాంకులు వివిధ సేవలను అందిస్తున్నాయి . అందులో బాగంగా మొబైల్ బ్యాంకింగ్ సర్వీసును స్టేట్ బ్యాంక్ విజయవంతంగా నడుపుతుంది . ఇది చాల సులభం . దీనికి మొదట జీ . పీ . ఆర్ . ఎస్ / సపోర్టు చేసె మొబైల్ కావాలి . క్రింద ఈ సర్వీసు వాడుకోవడానికి చేయవలసిన పనులను దశల వారిగా వివరిస్తాను . . . . . 1 ) మొదట మన మొబైల్ నుండి అని టైపు చేసి 567676 కి ఎస్ . ఎం . ఎస్ చేయాలి . వెంటనే మనకు " యూజర్ ఐడి " మరియు " " లు మెసేజ్ రూపంలో వస్తాయి . 2 ) మన మొబైల్ కి పై రెండింటి తో పాటు మొబైల్ బ్యాంకింగ్ సర్వీసుకు సంబందించిన సాఫ్టువేర్ లింకు కూడా వస్తుంది . సాఫ్టువేర్ ను మొబైల్ లోకి డైరెక్టుగా కాని , లేక కంప్యూటర్ లోనికి గాని , డౌన్ లోడ్ చేసుకుని మొబైల్ లోకి వేసుకుని ఇనిస్టాల్ చేసుకోవాలి . అప్లికేషన్ సాఫ్టువేర్ ను కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేసుకోవడానికి లింక్ : http : / / mobile . . com / / . 3 ) సాఫ్టువేర్ మొబైల్ లోనికి వచ్చిన తరువాత మనకు మొదట వచ్చిన యూజర్ ఐడి తో లాగిన్ అవ్వాలి . తరువాత Settings ను ఎంపిక చెసుకుని " Change Channel > GPRS " ను సెలెక్టు చేసుకోవాలి . ఇపుడు మొదట మెసేజ్ ద్వారా వచ్చిన default ను ఎంటర్ చేయ్యాలి . కనెక్టు అవడానికి మన అనుమతిని అడుగుతుంది YES ను సెలెక్టు చెయ్యాలి . కొద్ది సేపటి తరువాత మల్లీ ను ఎంటర్ చెయ్యమని అడుతుంది . రెండవ సారి ఎంటర్ చెయ్యగానే మన మొబైల్ నుండి ఒక మెసేజ్ పంపుతుంది . దీని ద్వారా మనం download చేసుకున్న అప్లికేషన్ ద్వారా లావాదేవీలు జరపడానికి సిద్దంగా ఉంటుంది . " Your transactions over successful " అనే మెసేజ్ మన మొబైల్ కు వస్తుంది . 4 ) ఈ దశలో మన మొబైల్ హ్యాండ్ సెట్ వాలిడేట్ చెయ్యబడుతుంది . ఇప్పుడు అప్లికేషన్ లొ settings లోనికి వెల్లి , Change సెలెక్టు చేసుకోవాలి . ఇప్పుడు మన పాత default ను ఎంటర్ చేసి దాని కింద కేటాయించిన స్థలంలొ రెండుసార్లు మనకు నచ్చిన ఆరంకెల ( 6 అంకెలు తప్పనిసరి ) కొత్త సెలెక్టు చేసుకొవాలి . ఇది మనం జరిపే లావాదేవీలన్నింటికి అవసరమవుతుంది . ఇప్పుడు మన మొబైల్ కు " Your Handset validation successful " అనే సందేశం వస్తుంది . 5 ) ఇది చివరి దశ . ఇప్పుదు ATM సెంటర్ కు వెల్లి మన అకౌంట్ ను మన మొబైల్ కి జత చెయ్యాలి . ATM దగ్గరకు వెళ్లి కార్డును పెట్టగానే " Mobile Registration " అనే లింకు కనబడుతుంది . దాన్ని సెలెక్టు చేసుకుని " మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ " ద్వారా మన మొబైల్ నెంబర్ ను రిజిస్టర్ చెయ్యాలి . రిజిస్ట్రేషన్ పూర్తి చెయ్యగానే మనకు " Mobile banking registration successful " అని ఉన్న స్లిప్ వస్తుంది . వెంటనే మన మొబైల్ కు మన ఎకౌంటు నెంబర్ తో పాటు mobile రిజిస్ట్రేషన్ అయినట్లు conformation మెసేజ్ వస్తుంది . దీనితో మన మొబైల్ లోనికి బ్యాంకు వచ్చి చేరినట్లే . దీనిద్వారా ఏ మొబైల్ కయినా recharge చేసుకోవచ్చు ( select " Mobile Topup " ) . ఎవరి ఎకౌంటు లోకైనా మన మొబైల్ నుండే డబ్బులు పంపవచ్చు ( Fund transfer > register payee ) . మన ఎకౌంటు లోని బాలన్సు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలుసుకోవచ్చు ( Enquiry sevices > Balance Enquiry or Mini Statement ) . మీరే వాడి చూడండి . . . . . .
" సరె నాకు గడ్డాలు లేవు కాని సాయంత్రం వస్తానన్నా కదా ! నువ్వు ఫొన్ పెట్టేలా లేవు కాని నేనే పెట్టెస్తున్నా ! సాయంత్రం కలుస్తాను . "
కామేశ్వర్రావుగారూ , చాలా బాగా చెప్పారు . రవి గారికి ఒక సూచన . రామాయణ కావ్యాన్ని ( నేపథ్యాన్నీ , పాత్రల్నీ , సంఘటనల్నీ ) భక్తి గౌరవం అన్న ప్రస్తావనే ళేకుండా పూర్తిగా మార్క్సిస్టు గతితార్కిక భౌతిక వాద దృష్టితో విశ్లేషించిన రామాయణ విషవృక్షం చదవొచ్చు , మీకు ఓపికా టైమూ ఉంటే . చదవాల్సిన పుస్తకమే . మీ సందేహాలేమైనా నివృత్తి అవుతాయేమో ! అందులో ఐనా సీతని అడవికి పంపడం ఉండదు , అది ఉత్తరరామాయణం . కానీ మిగతా ధర్మ సందేహాలన్నీ ఉన్నాయి . రాముడు ఒక ఆదర్శ పురుషుడు . ఎటొచ్చీ ఆయన ఎందుకు ఆదర్శపురుషుడైనాడు అని రామాయణ కావ్యం చెప్పే సంఘటనలు మనకిప్పుడు రుచించవు . అంచేత ఆ ఋజువుల్ని బట్టి ఆయన నాకు ఆదర్శం కాదు అనుకోవచ్చు , లేదా ఆదర్శం అనేదే ఒక ప్రతీక అని అంగీకరించ వచ్చు . భగవంతునిగా పూజింపబడే రాముడు ఇలాగే ఇంకో ప్రతీక .
రాధిక గారి అభిప్రాయంతో ఏకీభవించకుండా ఉండలేకున్నాను . చిరు కోసం తప్పకుండా కథని కథనాన్ని కొంతలో కొంతయినా మారుస్తారు . మార్చటం అవసరమని కూడా నేను అనుకుంటున్నా . నాక్కూడా శంకర్ దాదా కంటే మున్నాభాయ్ బాగా నచ్చింది . చిరు అభిమానిని కాబట్టి శంకర్ దాదా రిలీజ్ అయ్యేంత వరకూ ఎన్ని అవకాశాలు వచ్చినా మున్నాభాయ్ చూడలేదు . శంకర్ దాదా రెండు సార్లు చూశాకే అది చూశా . మెగాస్టార్ కామెడీ టైమింగ్ మాత్రం సంజయ్ దత్ కంటె ఎన్నో రెట్లు మెరుగని నా అభిప్రాయం .
1943 - 44 నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ప్రొవిన్షియల్ అజాద్ హిందు హుకూమత్ మరియు భారత జాతీయ సైన్యం ( Indian national army ) ఏర్పాటు చేసారు , బెంగాల్ లొ చిన్న కరువు
అప్పటికి మా కొత్తకాపురం మొదలై కొన్ని నెలలే అయింది . . నేను మావారి ఆధ్వర్యములో వంట నేర్చుకుంటున్నాననే భ్రమలో మావారు ఉన్నరోజులవి . ఇద్దరమూ ఉదయమే 8 గంటలకల్లా కాలేజీ లకు వెళ్ళిపోయేవాళ్లం . మళ్ళీ ఒంటిగంటకల్లా వచ్చేసేవాళ్ళము . వచ్చాకా వంట చేసుకోవచ్చు , కుక్కర్ లో అన్నం , పప్పు ఎంతలో వుడుకుతాయి , రాగానే వండుకుంటే వేడిగా తినొచ్చు అనే మా వారి అభిప్రాయంతో ఏకీభవించి వచ్చాక వంట మొదలు పెట్టేదాన్ని . పెళ్లైన కొత్తగదా మొగుడి మాట జవదాటకూడదు అనుకునే అమాయకపు అమ్మాయిని మరి . . అది అప్పట్లో … మా అత్తగారు ఇంట్లోకి రాకూడని మూడు రోజులు మా వారే వండేవారట . ఆ అనుభవం తో నా వెనక చేరి , ఇంకాస్త ఉప్పేయ్ , కొంచం నీళ్ళు పోయ్ అంటూ సలహాలిస్తూ , ఆ తరువాత తినలేక ఇంత ఉప్పేసావేమిటి ? నేను చెప్పినట్లు చేయలేదు అని గొణుగుతూ వుండేవారు . కాని ఇప్పటికీ వినేవాళ్ళుంటే మా ఆవిడకి నేనే వంట నేర్పాను అంటూ ఎంత సేపైనా చెపుతారులెండి . ఏం నేర్పారండీ అంటే ఆమ్లెట్ నేర్పానా ? టీ పెట్టటము నేర్పానా అంటూ లిస్ట్ మొదలుపెడుతారు . తమ గొప్పలు చెప్పుకోవడం ఎవరికి మాత్రం ఇష్టముండదు . చెప్పొద్దు . . ఆ ఆమ్లెట్ కొసం ఎంత గోలని ? ( అసలు అది తినేదెవరు ఆయన తప్ప ) అయినా ఈ అబ్బాయిలకి అమ్మ వెనుకెనకే తిరుగుతూ , కొద్దో గొప్పో వంట నేర్చేసుకొవటం ఏమి పాడు అలవాటో ? . ఆ తరువాత వాళ్ల భార్యల పాట్లు భగవంతుడికే తెలుసు . ప్రతీదాంట్లో వేలెట్టి తప్పులు ఎత్తి చూపిస్తారు . ఏ యింతి కథ చూసినా ఇంతే కదా
నేను కుప్పకూలడం చూడాలనుకున్నవ్ కదా వంచిన తలతో - వాలిన కళ్లతో కన్నీటి చుక్కల్లా రాలిపోయే భుజాలతో దయనీయమైన ఏడ్పులతో సొమ్మసిల్లిపోయి -
ఆమె అందం ఆనోట ఈనోట పాకి దేశదేశాల రాజులే ఆమెను పెళ్ళి చేసుకోవటానికి పోటీపడేవారు . అదే ఊరిలో ఉంటున్న ఒక పేదరైతు కొడుకు కూడా ఆమె అందం గురించి విని తనని ప్రేమించాడు . కేవలం తాను విన్న గుర్తులను బట్టి ఒక చిత్రం గీసి రోజూ దానిని చూస్తూ గడిపేవాడు . ఆమె తండ్రి ఈ పెళ్ళికొడుకుల తాకిడి తట్టుకోలేక స్వయంవరం ప్రకటించాడు . తన కూతురికి అత్యంత విలువైన బహుమానం తెచ్చినవాడికి తన కూతురినిచ్చి వివాహం చేస్తా అని ప్రకటించాడు . రాజులంతా మేనాలతో , ఏనుగులతో , ఒంటెలతో బహుమానాలు మోసుకొచ్చారు . పేదరైతు కొడుకు ఏంచెయ్యాలో పాలుపోక గుడికి వెళ్ళి లక్ష్మిదేవిని పూజించి వేడుకున్నాడు . దేవి వచ్చి అంతవిలువకానిది ఒక పొడవైన వస్త్రం ఇచ్చింది . ఆమెని తన నగలన్నీ తీసి ఈ వస్త్రం వేసుకోమని చెప్పు అని దేవి మాయమైంది .
ఆ అబ్బాయి ఆనందముతో ఆ చెట్టుని కోసి ఒక మంచి పడవ చేసుకొని , అన్ని ఊర్లూ తిరిగి ఆనందించాడు .
మంత్రాలనేవి ' కర్మలు ' చెయ్యడానికి మాత్రమే వుద్దేశించబడ్డాయి ! ( అవి ' బ్రహ్మ ' కర్మలైనా , ' అపర ' కర్మలైనా ! ) యెవరికి వారు మంత్రాలన్నీ నేర్చుకొని సరిగ్గా ఆ కర్మలు నిర్వహించుకోలేరని , పురోహితులు వాటిని నేర్చుకొని , ప్రజలచేత చేయిస్తారు . చెయ్యవలసిన కర్మ యేమిటో , యెందుకు చేస్తున్నామో ' సంకల్పం ' చెప్పుకుంటారు ముందు . అదే పురోహితులు చెప్పి , మధ్యలో కర్మిష్టుల్ని ' మమ ' అనుకోమంటారు అందుకే ! ఇక మంత్రాలని ' చదవ కూడదు ' ' జపించాలి ' లేదా , ' అనుష్టించాలి ' . గాయత్రి విషయానికొస్తే , అది వూరికే చదివేది కాదు . యెందుకంటే - శిశువు జన్మించినప్పటినించీ ( ఆడైనా , మగైనా ) కొన్ని ' జాతక కర్మలు ' నిర్దేశించారు - బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్యులకి - వీటిలో కొన్ని ఆడ శిశువులకీ , కొన్ని మగ శిశువులకీ ప్రత్యేకం . ఇక మగ పిల్లలకి ' గర్భాష్టమం ' లో చేసే జాతక కర్మ పేరు - వుపనయనం . ( దాన్నే ' ఒడుగు ' అంటారు ) ఇది యెందుకు చేస్తారంటే - శిశువుకి 8 సంవత్సరాలు వయసు ( తల్లి గర్భం లో వున్న 9 నెలలతో సహా - అంటే పుట్టిన 7 సంవత్సరాల 3 నెలలు ) నిండేసరికి ఙ్ఞానార్జనకి సమయం అయినట్టు . అంతే కాకుండా , బాలారిష్టలన్నీ గడిచి , ఒక ధీమా వస్తుంది - అందుకని , ఆ ఒడుగు లో పుట్టినప్పటి నించీ చేసిన జాతక కర్మలని అదే క్రమం లో మళ్ళీ జరిపిస్తారు - అంతకు ముందు యేవైనా సరిగ్గా జరగకపోయినా వాటి ప్రభావం పిల్లవాడి మీద వుండకుండా ! ఇక ఙ్ఞానార్జనకి మూలం ' విద్య ' . దాన్ని ఆర్జించాలంటే వాక్శుద్ధి లాంటివి కావాలి - వాటికోసం , ఒడుగు లోనే ' బ్రహ్మోపదేశం ' చేయిస్తారు - తండ్రి చేతగానీ , ఆ అర్హత వున్నవాళ్ళ చేత గానీ . ఆ ఉపదేశం లో భాగంగానే , యఙ్ఞోపవీత ధారణ చేయించి , గాయత్రి ని ఉపదేశిస్తారు ! అక్కడితో , విద్యార్జనకి అర్హత లభించినట్టే ! అక్కడి నించి , అనుష్టానాలు మొదలు అవుతాయి - ఇరు సంధ్యలా సంధ్యా వందనం మొదలైనవి ! టూకీగా అదీ సంగతి . ఇక ' భూర్భువహ్ స్వహ్ ' అంటే , మన భూమికి పైన వుండే మొదటి మూడు లోకాలు . వాటి పైన ఇంకో 4 లోకాలు వుంటాయంటారు . అలా భూమికి పైన 7 , భూతలం కింద 7 మొత్తం 14 లోకాలు వుంటాయంటారు . పైనుండేవి క్రమం గా 1 . భూ లోకం , 2 . భువర్లోకం , 3 . స్వర్లోకం , 4 . మహర్లోకం , 5 . జనలోకం , 6 . తపోలోకం , 7 . సత్యలోకం ( ఈ లోకం లోనే బ్రహ్మ వుంటాడుట ) . వీటిని మంత్ర రూపంలో - ' ఓం భూ : ఓం భువ : ఓం స్వ : ఓం మహ : ఓం జన : ఓం తప : ఓం ~ సత్యం ' అని చెప్పి ' ఓం తత్సవితుర్వరేణ్యం … … . ' ఇలా సాగుతుంది . గాయత్రిలో మనకి ముఖ్యమైన 3 లోకాలనే చెప్పాడు . అవి భూలోకం ( అంటే మనం వున్నది - ఇది అందరికీ తెలిసిందే ) భువ : + లోకము = భువర్లోకం అంటే , మేఘాల క్రింది అంచువరకూ వ్యాపించినది . ఇక స్వ : + లోకము = స్వర్లోకం అంటే , మేఘాలకి పైన వున్నది . ( దీన్నే పొరపాటుగా ' స్వర్గం ' అని వ్యవహరిస్తున్నారు - నిజానికి స్వర్గము అంటే స్వర్లోకానికి గమించడం అంటే వెళ్ళడం ) మనిషి చనిపోయాక , జీవుడు ( అంటే ఆత్మ ) ఇక్కడవరకూ చేరడమే కష్టం . ఆతరవాత ' ఆటోమేటిక్ ప్రమోషన్లు ' - ఒక్కో లోకం లో నిర్దేశింపబడిన కాలం తీరేక ! స్వర్లోకం చేరిన వాళ్ళకి పునర్జన్మ వుండదంటారు ! అదిగో - అదీ గాయత్రి వుద్దేశ్యం ! విశ్వామితృడు త్రిశంకుణ్ణి బొందితో స్వర్లోకానికి పంపలేకపోయినా , ఇతర జీవులు బొందిలేకుండానైనా స్వర్లోకాన్ని చేరడాన్ని సులభతరం చేశాడు ఈ మంత్రం తో ! ఇక ' మంత్రాలకి చింతకాయలు రాల్తాయా ' అనకుండా వాటిని విశ్వసించేవారికి , వాటి మహిమపై నమ్మకం వుంటే , ఆ మంత్రాన్ని జపించకుండా వూరికే చదివితే ' సైడ్ ఎఫెక్టు ' లూ , బెడిసికొట్టడాలూ కూడా వుంటాయని నమ్మాలికదా మరి ? ఇంకొక మాట - ఇవన్నీ నమ్మినా , నమ్మకపోయినా - నేను ముందే చెప్పినట్టు ఇవన్నీ మన ప్రాచీన సంస్కృతిలో భాగాలు . కాబట్టి నిశ్చయం గా నిర్దేశించబడినట్టు ఆచరించవలసిందే ! యేమంటారు ? ( ఇందులో కొంత పదార్థం ( మేటర్ ) నా ' హేతువాదం ' బ్లాగులో రావలసింది - సందర్భం వచ్చింది కాబట్టి ఇందులోనే పోస్ట్ చేశాను . )
అయినా , రవి సంగీతంలో బీతే హువే లమ్హోంకి కసక్ సాథ్ తొ హోగీ , దిల్కీ యె ఆర్జూ థి కొయీ లాంటి పాటలు అద్భుతంగా పాడాడు . కానీ నాకు , ఇన్సాన్ కీ హర్ షైకా ఇత్నాహీ ఫసానా హై / ఎక్ ధుంద్ సే ఆనాహై , ఎక్ ధుంద్ మే జానా హై / చాలా చాలా చాలా నచ్చుతుంది . సాహిర్ రచనలోని తాత్వికత , లోతయిన భావాల గనులను మన అనుభూతికి తెస్తాదీపాటలో తన స్వరంతో . ఎంతో గంభీరంగా , భారంగా ఒకో పదాన్ని స్పష్టంగా . అనుభవిస్తూ పలుకుతూంటే , కళ్ళముందు పొగ మంచు కమ్మినట్టుంటుంటుంది . నిజం , మనమంతా పోగ మంచులోంచే వస్తాము . పొగ మంచులోకే పోతాము . ఎటునుంచి వస్తామో తెలియదు . ఎతు పోతామో తెలియదు . వెళ్ళిన వారూ చెప్పలేరు . ఇప్పుడా పోగమంచులోకే అదృశ్యమయ్యాడు మహేంద్ర కపూర్ . కానీ తన స్వరంద్వారా ఆయన సృజించిన మధుర గేయాల మధుర భావాలు జీవితాంతం మనలని రంజింప చేస్తూనే వుంటాయి . తర తరాలకు సున్నిత భావనలను నేర్పుతూనే వుంటాయి .
అసలు పద్యాలన్నిటికీ లయ ననుసరించే లక్షణం చెప్పాలని కీ . శే . గిడుగు సీతాపతిగారి వాదం . అంటే , ఛందో విభాగమంతా మాత్రాబద్ధంగా ఉండాలని వారి వాద సారాంశము . అయితే , ఉన్న పద్యాలన్నిటికి మాత్రా పద్ధతిలో లక్షణం చెప్పటం కుదరదు . లయ నిర్దేశించని పద్యాల్లో గతి వైవిధ్యానికి అవకాశం ఉంది . మాత్రా ఛందస్సుల్లో గతిని మార్చటమంటే పద్యాన్ని మార్చటమే అవుతుంది . అయితే , ఆధునిక కవులు ఒకే గతి ఉండాల్సిన పద్యాల్లో భిన్న పాదాల్లో భిన్న గతులు పాటించిన ఘట్టాలున్నై . ఉదాహరణకు 10 మాత్రల బాహ్య పరిమితి గల పద్యాల్లో కొన్ని చోట్ల ఖండగతిని ( 5 + 5 ) , కొన్ని చోట్ల మిశ్రగతిని ( 3 + 4 + 3 ) పాటించారు . 12 మాత్రల బాహ్య పరిమితి గల కొన్ని చోట్ల త్రిశ్రగతిని ( 3 + 3 + 3 + 3 ) , కొన్ని చోట్ల చతురస్రగతినీ ( 4 + 4 + 4 ) పాటించారు . ముత్యాలసరాన్ని మాత్రం 3 + 4 + 3 + 4 క్రమంలోనే నడిపారు . వీటన్నిటిలోనూ పాటించిన ఒక సాధారణ సూత్రం ఉంది . సరిమాత్రా సంఖ్య బాహ్య పరిమితిగా గల మాత్రా పద్యాలు రెండర్థభాగాలుగా విరుగుతై . 14 మాత్రలను 6 + 8 మాత్రల గణాలుగా విభక్తమయ్యేట్లు శ్రీశ్రీ రాసిన పద్యాలు కొన్ని ఉన్నై . ఇవన్నీ చాలామందికి తెలిసినవే కాబట్టి ప్రత్యేకంగా ఉదాహరణలు చూపించటం లేదు . ఒకే పద్యంలో భిన్నగతులతో పద్యపాదాలు ఉన్నప్పుడు వాటిని విషమచ్ఛందోభేదాలుగా పరిగణించాల్సి ఉంటుందనుకుంటాను .
పెద అదేనూ ! కిందటి మాటు మీ తాతయ్యేటివిళ్ళకి మాఁవయ్యొచ్చినప్పుడు వీడియా టేపు పెట్టేడు కాడూ ? రవీంద్ర భారతి లోన ఎవరెవరో పెద్దలందరూ ఉపన్యాసాలకొచ్చి ' ఇతనివంటి ఇంటలెక్చువు ఇంతకు ముందు లేడు ఇహమీట రాడూ ! ' అన్నారు … మీ అత్తనడిగితే ఆయన గారి ఠీకూ ఠాకూ నాకు తెలీవు ఆయన్నే అడగండి పొమ్మన్నాది ! అయితే గాంధీ గార్లాగ గొప్పవాడు గావోలనుకున్నాను .
అంతేకాక , సన్మానాలు అంటే నాకు అంతగా కిట్టవు . బిరుదులూ సన్మానాలూ మోయలేని బలహీనుణ్ణి . మరిన్నీ పదిమందిలో కూర్చోబెట్టి , పొగిడేస్తుంటే , మొగం ఎలాగ పెట్టాలో , దానిమీద ఎట్టి మందహాసం పొదిగి వుంచాలో , ఎట్టి తీయని వినయం చూపింఛాలో , ఆ pose ఎంతసేపు అలాగ నిలిపి ఉంచాలో , ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా తెలియదు . అయితే , దొంగను కాను . పొగుడుతుంటే లోపలలోపల నాకూ చక్కిలిగింతలు పెట్టినట్లే ఉంటుంది . అయినా , కీర్తికయినా , డబ్బుకయినా , పదవి కయినా ఒక హద్దూ పద్దూ ఉండడం మంచిదేమో ! " అగ్గలమగు తృష్ణ ఎవ్వనికి , గాఢ దరిద్రుడు వాడు " , " సతుభవతు దరిద్రో యస్య తృష్ణా విశాలా " అన్నాడు కదా భర్తృహరి . సన్మానాల కోసం దండలకోసం , అదే పనిగా ఒంటె లాగున మెడ చాపి ఉంచడం ఇబ్బందండీ ! అవే వెతుక్కుని వస్తే , అంత ఫరవాలేదు . ఎందుకు రావు ? కవికుల గురువు చెప్పినట్లు రత్నం వెతుక్కుంటూ పోనక్కరలేదు , దానినే వెతుక్కుంటూ వస్తారు అందరూ .
" మధ్యతరగతి ఆలోచనలన్నీ గజిబిజిగా ఉంటాయి . అక్కడ తర్కం , సంప్రదాయం , త్యాగం , ప్రేమ , ఆత్మీయత వగైరాలన్నీ ఉన్నట్లే ఉంటాయి . ఉండవు . స్వార్ధం , అసూయ , ద్వేషం , అసహనం , మూఢనమ్మకం లేనట్లే అనిపిస్తాయి . కాని ఉంటాయి . కృష్ణను నువ్వు ప్రేమిస్తున్నవనుకొంటున్నావు . అదీ భ్రమే ! " అన్నాడు శివరావు .
శాయి ప్రవీణ్ ! నా బ్లాగ్ వీక్షించినందుకు థాంక్స్ . తీరిగ్గా మీ బ్లాగ్ చూస్తాను . తరచూ కలుద్దాం .
ఓమ్మోయ్ , జీవితసభ్యత్వం కావాలి . నా ఒక్కడికెంతవుద్ది ? నాకూ మా ఆవిడకూ ఎంతవుద్ధి ? నాకూ , మా ఆవిడకూ , మా మామగారికీ , బామ్మర్దికి కలిపి ఎంతవుద్ది ? వాళ్ళందరిని చేర్పించి , నేను డ్రాప్ అయితే కన్షేశన్ ఏమైనా వుందా ?
మీబోటి వారి ప్రోత్సాహమే మాకు ఉత్సాహాన్నిచ్చే మంచి టానిక్కు . ధన్యవాదాలు శంకర్ గారూ !
ఉదయాన్నే తెలిసిన వార్త మనసుని పిండేసింది . చదువుల వత్తిడి తట్టుకోలేక ఒక చిన్నారి బలవంతంగా ప్రాణం తీసుకుంది . మా నైబర్స్ కి క్లోజ్ ఫ్రెండ్ కూతురు . ఎంత అందంగా ఉంటుందో లతా . దాన్ని అలా చూసి తట్టుకోలేక పోయాను అన్నారావిడ . ఎప్పుడూ ఆ అమ్మాయిని చూడకపోయినా నాకే చాలా బాధ వేసింది ఏ తల్లి శోకమైనా ఒకటే కదా .
@ మీను , ఇక మీరు రాస్తున్నరని మమ్మల్ని రాయొద్దనట౦ భావ్యమా ? ఐనా నీకు పోటీ వచ్చే౦త రాయలేనులే . రె౦టికే ఇలా బెదిరి పోయావ్ మూడోది ఏ౦ రాస్తా౦ చెప్పు . ఇక మళ్ళీ కవితలే రాసుకు౦టాలే . హ హ హ ఏదో సరదాకి అన్నా అప్పుడప్పుడు దాడులు చేస్తు౦ట జాగ్రత్త . @ కత్తి మహేష్ కుమార్ గారు , ' నా కాలేజీ జీవితం ' నేను చదివాన౦డి . చాలా బాగు౦ది . నెనర్లు . @ వేణూ శ్రీకాంత్ గారు , ssreddyr గారు , ప్రతాప్ గారు , నెనర్లు . @ శ్రీ గారు , అది పూరీ జగన్ డైరెక్శన్ , ప్రభాస్ యాక్శన్ . కానీ ఇక్కడ అన్నీ మనమే . @ sunil , అ౦దుకే బావా అన్నీ రాయలేదు .
జోతి : అమ్మా ! రేపెక్కడికే అయ్యా , నీవు పోవడం వెంకటదాసు : ఎక్కడకా ? దేవుడి దగ్గరకు జో : దేవుడు తన దగ్గరకి మిమ్ములని రానిస్తాడా ? మాలక్ష్మి : ఆ , ఆ . దేవుడు రానిస్తాడు . జో : ఇక్కడి దేవుడి గుడిలోకి మనలను రానీయరేమి ? మా : రానీయకపోతే వాళ్ళే చెడ్డారులే ! మీ అన్న మనకు దేవుడి గుడి కట్టిస్తున్నాడుగా జో : మన గుడిలోకి వస్తాడా దేవుడు ? మా : ఆహా ! ఎవరు కట్టించుకున్నా వస్తాడు . ఆయనకంటు లేదు . రామదాసు : పెద్దదేవుడు మనలోనే ఉంటే ఈ రాతి దేవుళ్ళెందుకు ? రాళ్ళు దేవుళ్ళైతే రాసులు మింగవా ? అన్నారు . వెం : నీదంతా అద్వయితం . అంతా నీవంత వాండ్లయితే దేవుడి గుళ్ళక్కరలేదు . మేమంతా ముక్కులు మూసుకుని కూర్చుంటామా ఏమి ?
బ్లాగుల్లో ఇతరులు వాడే శైలికీ , నేను వాడే శైలికీ చాలా తేడా ఉందని నాకు తెలుసు . నా శైలి కొంత అర్థం కాదని కొందఱు ఫిర్యాదు చేయడం విన్నాను . ఇది నా చిన్నప్పట్నుంచీ అలవాటు చేసుకున్నటువంటిది . ఇది నా మట్టుకు నాకు సహజమే . ఇది ప్రధానంగా నా నేపథ్యానికి ( background ) సంబంధించినది . ఇప్పుడు దీన్ని నేను మార్చుకోలేను . మార్చుకోవడం ఇష్టం కూడా లేదు . ఎందుకంటే ఇది నా బహుదశాబ్దాల అభ్యాస - అధ్యయన - ఆలోచనల పర్యవసానరూపం . ఎవఱి శైలిమీదైనా వారి కుటుంబ నేపథ్యమూ , ప్రాంతీయ పూర్వరంగమూ మొదలైనవాటి ముద్ర తప్పకుండా ఉంటుంది . విద్యావంతుల మధ్య పుట్టి పెఱిగినవారి శైలి అందుకు తగ్గట్టే ఉంటుంది . ఇందుకు నేను కూడా మినహాయింపు కాదు . నా సమకాలీనులకు నా శైలిలో కష్టమేమీ తోచదు . ఎందుకంటే మా తరానిది మృదుమధురమైన తెలుగుమాధ్యమం . మా వయోవర్గానికి ( age - group ) చెందిన మంత్రులూ , డాక్టర్లూ , ఎంజినీర్లూ , బ్యాంకాఫీసర్లూ , అయ్యేయెస్‌లూ , ఐపీయెస్‌లూ , ఎన్నారైలతో సహా అందఱూ తెలుగుమీడియమే . అదీ మా వాతావరణం . అందుచేత మా చిన్నప్పుడు మేము దేన్నయితే గ్రాంథికం అనుకున్నామో అదిప్పుడు దురదృష్టవశాత్తూ పఠనపాఠనాల్లోంచి తొలగించబడింది . అప్పుడు మేము దేన్నయితే శిష్ట వ్యావహారికం అనుకున్నామో , ఏ శైలిలోనైతే మాట్లాడడానికీ , వ్రాయడానికీ అలవాటుపడ్డామో అదిప్పుడు గ్రాంథికమై కూర్చుంది , ఈ తరానికి ! అది నా తప్పు కాదు గదా ! మన పాఠశాలల్లో తెలుగు బోధనాప్రమాణాలు అలా క్షీణించి పోయాయి . నిజానికి అందఱూ కోరాల్సింది , వాటిని ఇతోఽధికంగా మెఱుగుపఱచాలని ! అంతేతప్ప సరిగా వ్రాసేవాడు దిగజాఱాలని కాదు . అయినా జనానికి అర్థం కావడం కోసం నేను చాలా దిగజాఱాను . ఒక వాక్యానికి నాలుగు వాక్యాలు వ్రాయాల్సి వస్తోంది . నేను వ్యావహారిక రచయితను కాను . ఒక రకంగా గ్రాంథికమే నా మాతృభాష . నాకు ఆ తెలుగు తప్ప ఇంకే తెలుగూ నచ్చదు . నాకు ఆ శైలిలో వ్రాసుకుంటేనే తృప్తిగా ఉంటుంది . వ్యావహారిక రచన నాకు అసౌకర్యంగా ఉంటుంది . కానీ జాల పాఠకుల కోసం నేను వ్యావహారిక రచయితగా అవతారమెత్తాను . ఇది తాత్కాలికమే . త్వరలో నా మాతృభాషకు తిరిగి వెళతాను .
' ' రేపటి సెలవు రోజు నాది కదా ' ' అంటూ రాబోయే ఆఫ్ ని తలచుకుంటూ , ఆ రోజు చేయవలసిన పనులు లిస్టు చెబుతుంటే నాకు అసలు అర్ధం అయ్యేది కాదు ఇంతల సెలవురో . . .
అట్లాంటి పార్వతి . . నారాయణకు వైరల్ ఫీవర్ వచ్చి జ్వరం తీయకుండా వుంటే మరింత కంగారు పడదా ? అయితే అప్పటికి నారాయణ పెద్దవాడై పెళ్లికూడా చేసుకుంటాడు . నారాయణ వైఖరిలో మార్పు ఆమె గ్రహిస్తుంది . అందువల్లే భయపడూతూనే పలకరిస్తుంది రెండు సార్లు . దాన్ని వాడు అర్ధం చేసుకున్న తీరు . . ఆమె కించపడేటట్టు . . జబ్బుగా వున్న వాడిని న్యూసెన్స్ చెయ్యకూడదు . చీటికి మాటికి వచ్చి ఎట్లా వుందీ తలనొప్పా ! దాహంగా వుందా ? మంచినీళ్లివ్వనా ! ఏమన్నా తాగుతావా ! ధారకం లేకుండా ఎట్లా వుంటావూ ! కాళ్లతీపులా ! ఈ విధంగా తగులుకుంటే ఎట్లా వుంటుంది అని పరోక్షంగా ఎద్దేవాగా మాట్లాడుతాడూ . ఆమె మాటలకు నొచ్చుకుంటుంది . నారాయణ పెద్ద వాడై ఇంగిత జ్ఞానం సంపాదించాడు . పార్వతి మాత్రం వాడి చుట్టూనే తిరుగుతో గాను గెద్దులాగా ఉంటుంది . మరి ఆమెకెట్లా జ్ఞానం వస్తుందీ .
' ముత్యాలు రాలాయి ' అని పెద్దగా నవ్వి పేపరులో ప్రకటన ఇచ్చే ముందు నాకో మాట చెప్పవచ్చు కదా ! అయినా ఇప్పుడూ మించిపోయిందేమీలేదు , నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు . రంగనాధం అని , మన వాడే మనకు బాగా కావలసినవాడు . ఇంటర్య్వూలు ఆరంభమయ్యే సమయానికి వస్తాడు . కాస్త చూడు . రంగనాథం ఈ అభ్యుదయ సంఘం వాడే . దాంతో మనకు గొడవలు కూడా తగ్గుతాయి . వివేకానంద ముఖంలోకి పరీక్షగా చూస్తూ అన్నాడు దశరథ రామయ్య .
చాలా దుఃఖం తో చదివాను మరోసారి శర్మిల గారి పరిస్థితి గురించి . ప్రజాస్వామ్యయుతంగా ప్రశాంతం గా ఆమె చేస్తున్న పోరాటం ఇలా ముగియబోతుందా . . ? విజ్ఞులంతా ఆమె వెంటున్నా , న్యాయం ఆమెకు దూరం గా నే ఉన్నదన్న వాస్తవం , పై నుంచి ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి . . ప్చ్ .
పారిస్ ఒప్పందం ( 1856 ) అనంతరం , బెస్సర్బియకు చెందిన మూడు కౌంటీలు - కహుల్ , బోల్గ్రాడ్ , ఇస్మాయిల్ - తిరిగి మోల్దేవియా కలిశాయి . కాని బెర్లిన్ ఒప్పొంధం ( 1878 ) ప్రకారం , రోమేనియా రాజ్యం వీటిని రష్యన్ రాజ్యానికి తిరిగి ఇచ్చేసింది . 19వ శతాబ్ద సమయములో , రష్యన్ అధికారులు [ 10 ] కొన్ని ప్రాంతాలలో ఇతర ప్రాంత వాసులు ఆక్రమించి స్థిరపడే విధముగా ప్రోత్సాహించారు . ముఖ్యంగా ఉక్రైనియన్ లు , లిపోవన్ లు , కొస్సాక్ లు , బల్గేరియన్ లు , [ 11 ] జర్మన్ లు , [ 12 ] గగుజ్ లు ఈ విధముగా ఈ ప్రాంతములో స్థిరపడ్డారు . యూదులు ఇక్కడ స్థిరపడటానికి కూడా అనుమతించారు ; దీని వల్ల మోల్దోవన్ ల జనాభా 1816లో 86 % [ 13 ] నుండి 1905లో 52 % [ 14 ] కు తగ్గింది .
వస్తే ఓకె . . కానీ లేకుంటే ఈ చిత్రం తో తన కెరీర్ కి మంగళం పాడటం ఖాయం …
విదేశాంధ్రుల జీవితానుభవాల్ని ఒకరితో ఒకరు పంచుకునే అవకాశం కలిగించటం ఈ పత్రిక ప్రధానోద్దేశ్యం అని పదేపదే వివరించనక్కర లేదు . లక్షల సంఖ్యల్లో అమెరికా , యూరప్ , ఆస్ట్రేలియా , మధ్యప్రాచ్య దేశాల్లో వుంటూ కేవలం కొద్దిమందే వారి అనుభవాల్ని పంచుకోవాలనుకోవటం ఆంధ్రులకున్న హ్రస్వదృష్టిని సూచిస్తుంది .
@ ఇంద్రసేనా మీదగ్గర రాజ్యాంగం అంతా ఉంది కానీ దాన్ని సరిగ్గా అర్ధం చేసుకున్నట్లు లేరు . ఆర్టికల్ 2 ప్రకారాం రాష్ట్రాలను పునర్విభజించే హక్కు పార్లమెంటుకు ఉంది . దానికి పార్లమెంటులో బిల్లు సరిపోతుంది . బిల్లు పాసయిన తరువాత ఆటోమేటిగ్గా కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన సమాచారం రాజ్యాంగంలో అమెండ్ చేస్తారు . ఇది రాజ్యాంగ సవరన కాదు . ఎండీయే మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు , ఇతర కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఆ సమాచారం రాజ్యాంగంలో అమెండ్ చెయ్యబడింది కానీ రాజ్యాంగానికి సవరణ రాలేదు . మీరు చెప్పిందే నిజమయితే ఆర్టికల్ 2 self contradictory కావాలి . అందుకే అందరూ పార్లమెంటులో బిల్లు పెట్టమని అడిగేది . అబద్దాలు ఎవరు ప్రచారం చేస్తున్నారో ఇప్పుడు అర్ధమయింది అనుకుంటా . నేణిక్కడ ఉద్యమం చెయ్యట్లేదు , నాభిప్రాయం చెబుతున్నాను . మీకు నచ్చకపోతే ఊరుకోండి , మీరు అబద్దాలు చెబుతూ ఇతరులను నిందించొద్దు . అబద్దాలు ఎలాగుంటాయో తెలుసు కదా . . మొదటి ఫేజు ఎలక్షన్లలో తెలంగాణకు మేం కట్టుబడి ఉన్నామని చెబుతూ మొదటి ఫేజు ముగియగానే మనం హైదరాబాదు వెల్లాలంటే వీసాలు తీసుకోవాలా అని చెప్పే దుర్గుణాలు మావొల్లకు లేవు . విశ్వసనీయత గురించి నరహంతకులూ , ముఖ్యమంత్రులను దింపేయడానికి అల్లర్లు సృష్టించేవారు , ముఠాతత్వాన్ని పెంచి పోషించేవారు మాట్లాడడం మన దురదృష్టం . చర్చను విషయం మీద చెయ్యగలిగితే చెయ్యండి , లేదా ఊరుకోండి . . మీరు మమ్మల్ని అనడం తరువాత మేము మీ జగన్ను , వైఎస్సార్ను తిట్టడం ఇవన్నీ పిల్లచేష్తలు అని నాఉద్దేషం .
" భూలోకంలో ఉన్న ఒక గాడిద , తన ఫోటో భజన తీసిందని తెలిసి ఆత్మహత్య చేసుకుని ఆ మహాపాపం వలన నరకానికి వచ్చింది ప్రభూ ! "
ఆనందంబు ఘటించు ; అర్థచయ మాహ్లాదింపగా నందు ; ధీ ధ్యానాసక్తి పదానురక్తి కవితా ధర్మైక దీక్షాతప శ్శ్రీనవ్యత్వము దివ్య కావ్య విలసచ్ఛ్రీరమ్య రమ్యార్ద్ర హా సానిం గొల్చిన వాని కబ్బును కదా సౌశీల్య సౌభాగ్యముల్
. ఇక్కడ " ఆనంద్ అవుట్ డోర్ సినీ సర్వీస్ " లేనందున బ్లాగోళ జంభ టపా కోసం బేస్‌మెంట్ లోనే చిన్న సెట్టింగ్ వేసి షూటింగ్ చెయ్యడం జరిగింది . సమయం దొరికినప్పుడల్లా కిందకెళ్ళిపోయి దాని ప్రొడక్షన్ సీన్లు చూసే వాడిని . ఈ షూటింగ్ కి లైట్ బాయ్ నుండి తోట తరణి , పి . సి . శ్రీరాం , మణి రత్నం , రామా నాయుడు వరకు నేనే . అప్పుడప్పుడూ అడిగినప్పుడు మా ఆవిడ కాఫీ నో , టీనో తెచ్చి ఇచ్చేది . అలా వచ్చినప్పుడు అక్కడే హ్యంగర్స్ కు వేళాడుతున్న డ్రస్సులు చూసి " మొత్తానికి బేస్‌మెంట్ ను ఒక డ్రామా కంపెనీ లాగా మార్చేశావ్ " అంది . " మరి నువ్వు మాత్రం కాచి టీ పెట్టుకొని రమ్మంటే , మైక్రోవేవ్ లో పెట్టి బ్రూ కాఫీ తీసుకొచ్చేసి అదే టీ అన్నట్టు డ్రామా లెయ్యడం లేదా " అని సగటు మగవాడిలా అనబోయి తమాయించుకొని " అప్పుడే ఏమయింది ఇంకా చూస్తూ వుండు ఎన్ని చేస్తానో " అన్నా రాబోయే ఉపద్రవాన్ని పసి గట్టకుండా . " ఆ . . చాల్లే సంబడం . ఇంటి వెనకాల గడ్డి పీకడానికి టైము లేదు గానీ వీటికంతా వుంటుంది . తొందరగ ముగించుకోని రా " అంది . తను అలా వెళ్ళగానే బుడ్డోళ్ళిద్దరూ నా యూనిట్ లో నాన్ - వర్కింగ్ సభ్యులయిపోయి నన్ను నాట్ వర్కింగ్ ఆర్టిస్టును చేసేవాళ్ళు . " గుండయితే అయ్యింది కానీ లడ్డు మాత్రం దొరికింది " అన్నంత ఆనందం తో ' భ్లాగోళ జంభ " డబ్బా బ్లాగులోకి వెళ్ళింది . ఇక ట్రైపాడు ఇతర వస్త్రా లంకరణ సామాగ్రి అంతా పైకి తెచ్చే పని మా ఆవిడది . " హమ్మయ్యా , కాఫీలు మోసుకెళ్ళే బాధ తప్పింది " అని అన్నీ తీసుకొచ్చి పైన బడేసింది . ఆఫీసు నుండి రాగానే కూచుని టి . వి . చూస్తూ " నా తోడు గా నీవుండగా … . . చక్ర వాకం … . చక్ర వాకం " అని వింటుంటే ఎక్కడి నుండో " భ్లాగోళ జంభ … భ్లాగోళ జంభ … " అనే సౌండు టి . వి . కన్నా ఎక్కువ వస్తోంది . మా ఆవిడే లేచి వెళ్ళి లివింగ్ రూములో నుండి ఒక చేత్తో ట్రైపాడూ ఇంకో చేత్తో హ్యాటూ తీసుకొని వచ్చింది . ఆ వెనకనే మా పెద్ద బుడ్డోడు " అమ్మా ! నేను , తెలుగు బ్లాగు గేము ఆడుకుంటా . నా కివ్వు " అంటూ వెంట పడుతున్నాడు . వాడిని పిలిచి " ఈ గేమేంట్రా " అనడిగితే . " అదే , నువ్వూ . . బేస్‌మెంట్లో . . భ్లాగోళ జంభ చేస్తున్నావు కదా . . . అది " " నీకు ట్రైపాడ్ , హ్యాటు ఎందుకు ? " " నాకు కావాలి . నేను తెలుగు బ్లాగు ఆడుకుంటా " నేను నవ్వుకుంటా వాడిని దగ్గరకు తీసుకున్నానో లేదో అంత వరకు అక్కడే లివింగ్ రూములో ఆడుకుంటున్న సంవత్సరం కూడా నిండని చిన బుడ్డోడు బుడి బుడి అడుగులు వేసుకుంటూ చేతులతో చప్పట్లు కొట్టుకుంటూ " భ్లా . . . భ్లా . . . భ్లా . . . " అని వస్తున్నాడు . .
మైదానం నవలలో రాజేశ్వరి తన శృంగారానుభవాన్నీ , అందులోని ఔన్నత్యాన్నీ అనేక సార్లు ప్రస్తావిస్తుంది . పురుష సమాజంలో ఆడది తన శృంగారానుభవాన్ని చెబితే అది ఘోర తప్పిదం కింద లెక్క . " బరి " తెగించిన దాని కింద లెక్క . శృంగారానుభవపు విశిష్టితను మాట్లాడిన స్త్రీలు సాహిత్యంలో లేకపోలేదు . శరీర సుఖాన్ని ఆనంద బ్రహ్మంగా కీర్తించిన వరూధిని మానవకాంత కాదు కనక నాయికగా చెలామణీ అయింది . పైగా ఆవిడ గంధర్వ కన్య కనక మానవ సమాజపు విలువలు పట్టవు . ఇంక రంగాజమ్మా , ముద్దు పళనీ తమ కవిత్వాల్లో శృంగారాన్ని రాసినా వాళ్ళు వివాహ వ్యవస్థకు బయటి వర్గం లోని స్త్రీలే కావటం వల్ల " మగ " సమాజానికి అభ్యంతరం కాలేదు సరి కదా ఆనందాన్ని కూడా కలిగించాయి వారి రచనలు .
ఈ సంభాషణ నచ్చనట్టు మధ్య లో దూరాడు వినయ్ . . " అవున్రా ఎవడో కన్సల్టెంట్ కి లక్షలు తగలబెట్టే బదులు మనమే ఓ కన్సల్టెన్సీ మొదలెడితే పోలా ? " తనకొచ్చిన చచ్చు ఐడియా వెంటనే చెప్పాడు . " పోకేం , అంతా పోద్ది . అందరూ బోర్డులు తిరగేస్తుంటే ఇప్పుడొచ్చిందండి వీడికి ఐడియా " ఫేసదోలా పెట్టి అన్నాడు కిరణ్ " ఏరా కిరణ్ ఈ వారం లో ఊరికెళ్తానన్నావ్ ఎప్పుడెళ్ల బోతున్నావ్ ? " అడిగాడు వర్మ " అదే ఆలోచిస్తున్నాన్రా , వెళ్లాలా వొద్దాని " " ప్రాబ్లం ఏందిరా ? " బహుశా చార్జీకి లేక అడగడానికి ఫీలవుతున్నాడేమోనని అడిగాడు ప్రసాద్ " వెళ్లడానికి నాకేమి ప్రాబ్లం లేదురా . కాక పోతే ఊరులో వాళ్లే ! నేను వెళ్లినప్పటినుంచి తిరిగొచ్చే వరకు వాళ్లకు నాదే హాట్ టాపిక్ " " నీదే కాదురా బాబు , నా పరిస్థితీ అంతే . లాస్ట్ టైం నేనూరెళ్లినప్పుడే డిసైడై పోయా జాబ్ వొచ్చేదాకా ఊరెళ్ల కూడదని " వినయ్ మాటలకడ్డుతగిలాడు వర్మ " మంచి డెసిషన్ రా ఇంకీ జన్మలో నువ్వూరెళ్లే పనిలేదు " " ఏడిచావులేగాని … " అంటూ మొదలెట్టాడు " నిజంగా ఊర్లో వాళ్లకి పనేమీ ఉండదేమోరా ! ఎవరేం చేస్తే వాళ్లకెందుకు , కనపడ్డ ప్రతి ఒక్కడూ అడిగే వాడే ఏంచేస్తున్నావ్ అని . తెలిసికూడ కావాలని అడుగుతార్రా బాబు ! బజార్లో కనిపించినప్పుడు నన్నడుగుతారు . తరవాత మళ్ళీ ఇంటికొచ్చి అదే విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పి ఎవరో జాబ్ చేసే వాణ్ణి ఎగ్జాంపుల్ గా చెప్పి నామీద జాలి చూపిస్తుంటే బాప్‌రే నిజంగా ఆ పరిస్థితి తలచుకుంటేనే భయమేస్తుంది రా . ఇంతకీ వాళ్ళకెందుకురా నేనేం చేస్తుంటే ? వాడినేమైనా నేను పిల్లనివ్వమని అడిగానా చెప్పు ? ఊర్లో పనిలేని ప్రతి పోసుకోలోడికి మనదే రా టాపిక్ " " అది తల్చుకునే ఇంటికెళ్లాలా వొద్దాని ఆలోచిస్తున్నా " " అరే ! వాళ్లందరిని పోసుకోలోళ్లన్నావే , ఊర్నుంచి నెల నెల వచ్చే డి . డి లతోనే గత ఐదారేళ్లుగా కాలం గడుపుతున్న మనల్నేమనాలి ? " కొంచెం సేపాలోచించి చురకవేశాడు ప్రసాద్ " ఆ . . నువ్వూ పెద్ద మాట్లాడేవాడివే లేరా , నువ్వొచ్చినప్పుడు మన రూమ్ ఓనర్ కూతురుకి సరిగ్గా మాటలే రాలేదని నువ్వే చెప్పావు . ఇప్పుడా పిల్ల పైటేసుకు తిరుగుతుంది . నీకు బొజ్జ పెరుగుతుంది గాని బుద్ధి పెరగడంలేదు రా " " అరే ఇంతకీ ఈ పూట తిండి పరిస్థితేంది ? " గడియారం వైపు చూస్తూ అడిగాడు ప్రసాద్ . అప్పటికి టైం రాత్రి 11 దాటింది . " అవును కదా , ఈ రోజు చేయాల్సిందొకటి మిగిలి పోయింది " వర్మ " రూంలో బియ్యం లేవు " చావు కబురు చల్లగా చెప్పాడు కిరణ్ " నిజమా ? మరి ఉదయమే ఎందుకు చెప్పలేదురా ? " ఈ రోజు పస్తు పడుకోవాల్సొస్తుందేమో అన్న బాధ వినయ్ ఫేసులో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది . " ఇప్పటికైనా చెప్పాడు కదా ముందా పని చూడు " వర్మ " రైసుకు డబ్బులివ్వండి , కొట్లుంటయ్యో లేదో " గొనుక్కుంటూ అడిగాడు వినయ్ " అవిలేకే ఎవడికి వాడు కాం గా కూర్చున్నారు " చెప్పాడు
నేటి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం తాలూకా , నాడు కృష్ణాజిల్లా లోనిది . భీమవరంకు ఆరు మైళ్ళ దూరంలో మోగల్లు అనే గ్రామం వుంది . ఆ గ్రామమే రామరాజు స్వగ్రామం . సీతారామరాజు ముత్తాత గోపాల కృష్ణం రాజు . తాత వెంకట కృష్ణం రాజు . సూర్యనారాయణమ్మ పూర్వీకులు అనకాపల్లి దగ్గర " పాండ్రంకి " లో స్థిరపడిపోయారు . 1902 లో వారి కుటుంబం రాజమహేంద్రవరంలో స్థిరపడిపోయింది . ఫోటోగ్రాఫర్ గా వెంకట రామరాజుగారికి మంచి పేరు వచ్చింది . ఆదాయం కూడా క్రమంగా పెరుగ సాగింది . ఫోటోలు తీసేవారు చాలా తక్కువమంది కావడం చేత ఆయనకు చేతినిండా పనివుండేది . రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ఫోటోలను ఆయనే తీసేవారు . అప్పుడే తిలక్ , లాలాలజపతిరాయ్ వంటి ప్రముఖుల ఫోటోలను తీయడం జరిగింది . 1905 లో వంగ రాష్ట్రవిభజన జరిగింది . స్వదేశీ ఉద్యమం ప్రారంభమయింది . వెంకట రామరాజుని కూడా ఈ ఉద్యమం ఆకర్షించినా ఆయన పాల్గొనలేదు . దేశభక్తి ఆయనను ఆవరించినా కుటుంబ పోషణభారం వల్ల ఆయన స్టూడియోలోనే ఉండేందుకు నిర్ణయించుకొన్నాడు . కానీ జాతీయ భావంతో కూడిన నినాదాలు ఇంటిలో చేస్తూనే , " వందేమాతరం " అని పాడుతూనే ఉండేవాడు .
మహిళ : అవునండీ . . నేనూ చూస్తున్నాను . పాపం . . అవన్నీ స్వయంకృతాపరాధాలు . . ఇలాంటి అత్యాచారాలు చేసే అబ్బాయిలను ఎలా గుర్తించాలి వాళ్ళనుండి ఎలా తప్పించు కోవాలి అనే విషయాలను ఈ తరం అమ్మాయిలు నేర్చుకోవాలి . ఆ పధాంలో ఇవ్వాళ సాక్షి ఆదివారం స్పెషల్ లో మన హైదరాబాద్ అమ్మాయి సానియా మిర్జా ఇంటర్వూని ప్రతీ అమ్మాయి చదవాలి . అందులో ఓ నూతన సంవత్సరం నాడు సానియాకు జరిగిన సంఘటన లో ప్రతీ అమ్మాయికి ఓ మంచి చిట్కా దాగి ఉంది .
వేలూరి గారి వ్యాసం రాయకపోయినా ఇలాంటివి కనిపిస్తే రాస్తాను . మీకందరికీ తప్పులేదనిపించింది . సంతోషం .
అనంత కరుణామయుడూ , అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో … బిస్మిల్లా హిర్రహ్మా
" ఒక నవల సమకాలీన సమాజాన్నిగురించి ఎన్ని విధాలుగా , ఎన్ని స్వరాలలో మాట్లాడుతుందో అర్థమైంది . సమాజం చీలుదారుల్లో నిలబడిన రచయిత ఎన్ని విషయాలు చూడగలడో , వాటికి ఎంత లోతయిన భాష్యం ఇవ్వగలడో అర్థమైంది " - భిన్నస్వర సమాజబీజాల ప్రాణశక్తి లో మొలకలెత్తిన రచన గూర్చి తెలిపినందుకు , అపుడెపుడో విన్నదీ ఉర్దూ భాషేతర అంశం - ఆ తరహా ఒక రచయితని ప్రస్తావనకి తెచ్చినందుకు కృతజ్నతలు .
Suse , Ubuntu లాగ Unix / Linux టెక్నాలజీతో డెవెలప్ చేసిన అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ UTF - 8 ఎంకోడింగ్ ని సపోర్ట్ చేస్తాయి . తేడా వస్తే ఫాంట్స్ లో తేడా రావచ్చు . ఇందులో డౌట్ అవసరం లేదు . విండోస్ కంటే లైనక్స్ లో యూనికోడ్ ఫాంట్స్ క్లియర్ గా కనిపిస్తాయి కాబట్టి నేను లైనక్స్ నే ఎక్కువగా రికమెండ్ చేస్తాను .
ఆఖరుగా చెప్పొచ్చినదేమిటంటే , " సంబంధం " అనేది " అవసరం ఉంటేనే " అని మాత్రమే వీరి అభిప్రాయము అనిపిస్తోంది . నేను తప్పుకావచ్చు . చదువరులు అచ్చు తప్పులెక్కడ ఉంటే అక్కడ ఎలాంటి పదం ఉంటే బాగుంటుందే తెలియ జేస్తారని తలుస్తాను . మరో పుటలో " అనుబంధం " గురించి వ్రాయడానికి ప్రయత్నిస్తాను . అంత వరకూ
. . నా హ్యాపీ డేస్ కి ముగింపు కార్డు పడిపోయింది ఇప్పట్లో రాదనుకున్న ఉద్యోగం వెంటబడి మరీ వెతుక్కుంటూ వచ్చింది . నిద్రపోతున్న నా జీవితం ఈ రోజు ఉదయాన్నే ఏడుగంటలకు నిద్ర లేచింది . టైం అవుతోంది కన్నా . . రెడీ అవుతున్నావా ? అమ్మ ఓ పక్కన అరుస్తోంది . . . నేను : " ఆ రెడీ అయీ అర్ధగంట అవుతోంది . . కొత్త బట్టలకు పసుపు పెట్టి ఇస్తానన్నావు ? " అమ్మ : ఇదిగో వస్తున్నా . . . . అమ్మ తెచ్చిన ఆ చొక్కా చూసి ఒక్క సారి కరెంటు షాక్ కొట్టిన " బాబూ మోహన్ " లా అయిపోయాను . ( మీ అవకాశాన్ని బట్టి " బాబూ మోహన్ " పదాలు interchange కూడా చేస్కోవచ్చు ) ఐదున్నర ఏళ్ళు వెనక్కెల్తే . . 10th క్లాసు సెలవులు తణుకు పక్కన , దువ్వ అనే పల్లెటూరిలో ఓ మంగళవారం సంత . . . " అమ్మా . . నేనేం అడిగినా నాన్నారు కొనిపెట్టట్లేదే . . అయినా ఓ సైకిలేగా అడిగింది . . నీలాగా రోజూ వంట చేయమన్నానా " " పెద్దవాళ్ళ విషయాలు నీకేం తెలీదు ఊరుకో . . అయినా ఇదంతా నీక్కాక ఎవరికి కన్నా . . కొనిపెడతారులే నువ్వైతే బాగా చదువుకో . . " నేను : 7th class అప్పుడూ ఇదే చెప్పారు అమ్మ : " నాన్న మాట మార్చే మనిషి కాదులే " . . . అయినా నీకేం తెలీదు ఊరుకో . . . నేను : ! ! ! ! ! ? ? ? " లేదే . . మొన్నటికి మొన్న . . . " అని నేనేదో చెప్పబోయేంతలో అమ్మ ఆ నీలం చొక్కా వైపు చూసింది . . పైన అమ్మ చెప్పినట్టు పెద్దగా తెలీని నేను . . కూడా . . ప్రపంచంలో ఇంత వరకూ చూసిన అతి నికృష్టమైన చొక్కా అదే . . నీలం రంగు . . పసుపు చారలు . . అక్కడక్కడా అ ద్ది న పూ లు . + 10 - 10 సైటు ఉన్న వాడు కూడా దీన్ని వేసుకోడు చూస్తే . . ఓ పక్క అమ్మ కళ్ళు మిల మిలా మెరుస్తున్నాయి . . వెంటనే నన్ను చూసింది . . . నేను . . చొక్కా . . చొక్కా . . నేనూ . . నేను . . చొక్కా . . చొక్కా . . నేనూ . . కెమెరాలో ఫ్లాష్ అవుతున్నాము . , . కొంపతీసి ఈ చొక్కా నాక్కానీ కొనిపెట్టేస్తుందేమో . . ? నాలో భయం మొదలయింది . . కెమెరా ఫ్లాష్ అవుతూనే వుంది . . అమ్మా . . " అర్జెంటు . . వెళ్ళాలి . . " రెండు వేళ్ళు చూపిస్తూ అరిచా . . " అందుకే చెప్పాను మీ నాన్న పెట్టిన రేగి వడియాలు ఎక్కువ తినొద్దని . . వింటేనా . . అవి అజీర్తిచేసినోళ్ళకి విరోచనాల మాత్రల్లా పని చేస్తాయి తప్ప ఉత్తినే తినడానికి పనికి రావు . మొన్న పక్కింటావిడ కూడా వాళ్లాయనకు రెండు రోజులు సెలవులొచ్చాయని ఓ నాలుగు వడియాలు తీసుకెళ్ళింది . . పక్కనే వెంకన్న మామయ్య ఇల్లుందిగా . . పరిగెత్తు " అని కొట్టు వాడి వైపు తిరిగింది . అమ్మ : బాబూ ఈ చొక్కా ఎంత ? కొట్టు వాడు : 150 రూపాయలు అమ్మ : 30రూపాయలకిస్తావా ? నేను : అమ్మా " అర్జెంటు . . వెళ్ళాలి . . " కొట్టు వాడు : కుట్టడానిక్కూడా 30 కంటే ఎక్కువ తీస్కుంటారమ్మా . . . . . . . నేను : అమ్మా " అర్జెంటు . . వెళ్ళాలి . . " అమ్మ : చెప్పావు లేవయ్యా . . . . . . . . . . . . . . . . . . . . . . . . వాదోప వాదాలు ముగిసిన తరువాత . . కేవలం అయిదు రూపాయల తేడాలో అమ్మ ఆ చొక్కా కొనకుండా వచ్చేసింది . . ఆరోజు ఎంత ఆనందమేసిందంటే . . " మామయ్య ఇంటికి వెళ్ళకుండా పని అయిపోయినంత " ప్రపంచంలో నాకు నచ్చని ఒకే ఒక్క చొక్కా . . " నీలం రంగు . . పసుపు చారలు . . అక్కడక్కడా అద్దిన పూలు . . " ఇప్పుడు . . మోహన్ బాబు తేరుకున్నాడు . . కాని అదెలా ఇక్కడికొచ్చింది . . నేను . . : అమ్మా ఈ చొక్కా . . ? అమ్మ : మొన్న తిరనాళ్ళ కెళ్ళినప్పుడు అదే ముప్పై రూపయలకిచ్చాడు లేరా . . నేను చెప్పానా నువ్వు అదృష్టవంతుడివని . . ఆ మెత్తటి . . వెచ్చటి . . నీలం చొక్కా . . . . అంటూ మురిసిపోతుంటే . . ఏడిచినట్టే ఉంది నా అదృష్టం . . . నాలుగేళ్ల పాటు అమ్ముడు కాని ఆ చొక్కా నా కోసమే పుట్టిందని మా అమ్మా చెపుతుంటే . . బాలకృష్ణ సినిమా బ్లాకు లో కొని చూసిన అనుభూతి కలిగింది . . చొక్కా వేసుకున్నాకా ఆ అనుభూతి " ఇంతింతై వటుడింతై " అన్నట్టయ్యింది . . వొళ్ళంతా పట్టేసింది . . . అటూ ఇటూ కదిలితే చిరిగి పోతుందేమో అన్న భయం . . ఎలాగొలా ఆఫీసు చేరాను . . ఓ పావుగంట ఎదురు చూపుల తరువాత . . లిఫ్టు సిటి బస్సులా నిండుగా వచ్చింది . . నాకు ఫుడ్బోర్డ్ లో నుంచునే అవకాసం ఇచ్చారు . ఇంతలో కాలికి ఏదో మెత్తగా తగిలింది . . ఓ అమ్మాయి కాలు నాకు తగిలింది . . ఆమె : " సారీ . . చూస్కోలేదు " నేను : " its మై pleasure యు ఆర్ వెల్కం " ఆమె . . . : ఓ రకమైన చూపు చూసింది " మీ చొక్కా చాల బాగుంది ఎక్కడ కొన్నారు " నేను : ( ఏమనలేదు ) మళ్ళీ సీన్ రిపీట్ . . కాలుని ఏదో బలంగా తొక్కింది . . . ఓ మగాడు నా కాలు మీద నుంచున్నాడు . . ఆ మగాడు : " సారీ . . తప్పైపోయింది " నేను : ఏ కళ్ళు నెత్తికెక్కాయా . . ? సాటి మగాడు : పోనీలెండి . . తప్పైపోయింది అంటున్నారుగా నేను : ఏ నీక్కూడా కళ్ళు నెత్తికెక్కాయా . . ? వాడి రెండో కాలు నీ కాలు మీదే ఉంది . . చూస్కో . . సాటి మగాడు : ( ఏమనలేదు ) ట్రైనింగ్ రూం లో అడుగు పెట్టాను . . అందరూ ఎవరో పోయినట్టు మౌనం గా వున్నారు . . HR Manager దైవాదీనం ఏదో మాట్లాడుతున్నారు . . ఈ కంపనీ లో చేరడం మీ అదృష్టం . . మనమంతా కుటుంబ సభ్యులం . . . ఇక్కడ జీతం కాదు , పని ముఖ్యం . . . అని ఏవేవో చెపుతున్నారు . . ఇంతలో కమలారావు వచ్చి మైకు లాక్కున్నాడు . . . దైవాదీనం అందరివైపూ ఒక సారి జాలిగా చూసారు . . . ఎందుకో అర్ధం కాలేదు ఇందాక లిఫ్టులో కాలు తొక్కిన ఆ " ఒక్క మగాడు " ఈ కమలారావే . . ఈ కంపనీ మేనేజర్ . . నన్ను గుర్తు పట్టాడు . . చూసావా చేరక ముందే నిన్నెలా తోక్కేసానో అనే రావుగోపాలరావు చూపు వేస్కుని . . . తన ప్రసంగం మొదలు పెట్టాడు . . క్రిస్టమస్ కేకును . . వేసవి సెలవుల దాక దాచుకు తినే మొఖం వాడూను . . నేను అంత . . నేను ఇంత . . . అంటూ , పక్కింటి ఆవిడ . . . వాళ్ళాయన గురించి చెప్పినట్టు చెప్పుకుంటున్నాడు . . కంపనీని నా భుజాలపై మోసాను అని చెపుతుంటే . . నా పక్కన " సోముగాడు " వంగిన కమలా రావు నడుము చూసి అవును నిజమే అన్నట్టు తల ఊపుతున్నాడు . . పైన అర్ధం కానిది ఇప్పుడు అర్ధం అయ్యింది . మండబెట్టినట్టే ఉంది వీడి తెలివి . . . . అనుకున్నాను . . సమయం 2 గంటలయ్యింది ఇంతలో జైల్లో కైదీలను బోజనాలకు పిలిచినట్టు . . . బోజనాలకు పిలిచారు . . బోలెడన్ని వేరైటీలున్నై అక్కడ . . " చారు . . పప్పు . . పప్పు చారు . . " నీళ్ళను మరిగించి రెండు కరివేపాకు రెబ్బలను తగిలించి కాస్త ఉప్పు కారం జల్లి ఒక గొప్ప వంటకం చేసారు . . దాని పేరే " చారు " దాన్నే వేరే గిన్నెలో పోసి " పప్పు " అనే పేరు కూడా రాసారు . . మనక్కావలసింది వేసుకోవచ్చు " పప్పు " లేక " చారు " . . బోజనాల్లయ్యాక అందరూ నిద్ర మబ్బు మొకాలేసుకుని ఒకరి మొహం ఒకరు చూస్కుంటున్నారు . . ఇంతలో కమలారావు వచ్చి " సైలెన్స్ " అన్నాడు . . . . ఆ అరుపుకి , ఒకావిడ కళ్ళు తిరిగి పడిపోయింది . . ఆవిడని తీస్కుని వేరొకావిడ బయటకు వెళ్లి పోయింది . . చాల సేపు ఏదో చెప్పాడు . . తరువాత ఓ రెండు మూడు గంటలయినట్లు ఉంది . . ఉన్నట్టుండి చెప్పడం ఆపేసి . . " ఎవరైనా ఎమన్నా అడగాలనుకుంటున్నారా ? " అన్నాడు . నేను వెంటనే ఆర్ . నారాయణ మూర్తిలా ఆవేశంగా లేచి వొళ్ళు విరుచుకుంటూ . . చెయ్యి ఎత్తాను . . దెబ్బకి నా నీలం చొక్కా కాస్తా . . ఎక్కడికక్కడ కుట్లు ఊడి పోయింది . . " కళ్ళు తిరిగి పడిపోతే ఆడాళ్ళనేనా మగాళ్ళను కూడా పంపేస్తారా . . ? " అని అడిగాను . . సమాధానం చెప్పలేదు కాని . . నన్నూ బయటకి పంపేసారు . .
Download XML • Download text