tel-15
tel-15
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
అలాగే గ్రాంధిక భాష , సంప్రదాయ సాహిత్యంలోని కవిసమయాలు అప్పట్లో కనిపిస్తే ( " ఓ జాబిలి , ఓ వెన్నెల , ఓ మలయానిలమా ! ప్రియురాలికి విరహాగ్నిని పెంపుసేయరే ! " అనేది ప్రబంధ భావాలకి పాట రూపమే కదా ! ) మెల్లమెల్లగా బజార్లో మాట్లాడుకునే భాష , వర్తమాన సమాజ ప్రతీకలు ( " వలపు తేనె పాట , తొలివయసు పూలతోట , పరువాల తిన్నెల సయ్యాట " నుంచి " యమహో ! నీ యమా యమా అందం , చెలరేగింది ఎడాపెడా తాపం , పోజుల్లో నేను యముడంటి వాణ్ణి , మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి " అంటూ అంతకు కొద్దికాలం ముందే వచ్చిన యముడికిమొగుడు అనే సినిమాకి " రిఫరెన్స్ " ఇవ్వటం లాటివి ) పాటల్లో ప్రబలమైనాయని చెప్పుకోవచ్చు .
" ఈ విషయాన్నే గత ముప్పై సంవత్సరాలుగా రక రకాలుగా పథక రచన చేసి ప్రజలను పని చేయించి రాజ్యాన్ని డవలప్పు చేసినాను , కానీ ఇప్పుడు మాత్రం అందరూ సుఖపడట మొదలెట్టి కష్టపడటం మానేసినారు " అంటూ తన మనసులోని బాధ చివరకు చెప్పుకున్నాడు .
5 . తెలుగు పనికిమాలిన భాషా ? దెబ్బ తగిలితే మమ్మీ అని కాకుండ అమ్మా అని ఎందు కరుస్తారు ? వచ్చీరాని ఇంగ్లీషు నడమంత్రపు సిరిలాంటిది . బాల్యంలో తీరని కోరికల్ని యవ్వనంలోనైనా తీర్చుకోవాలి గానీ ఆంగ్ల ప్రావీణ్యం అనే యవ్వన గర్వంతో బాల్యాన్ని మరిచి , తల్లిభాషను అధోగతికి దిగజార్చటం ఏరుదాటాక తెప్ప తగలేసే లక్షణం .
ఇంకో రెండు చారులు కూడా లిస్ట్లో కలుపుకోండి ! ! ! బీట్రూట్ తో చారు చేస్తారు ఇక్కడ బెంగళూర్లో . నేను ఒకసారి ఇస్కాన్ టెంపల్ లో టేస్ట్ చేశాను . చూడగానే గులాబ్ జల్ లా ఎర్రటి రంగులో చాలా బాగుంది . ఎలా చెయ్యాలో తెలీదు మరి నెట్లో వెతకాలేమో . ఇకరెండోది , పన్నీరు చారు . బెంగళూర్ లో పెళ్ళిళ్ళలో చేస్తారు . . . పన్నీర్ అంటే పాలతో అనుకునేరు . . . అస్సలు కాదు . . గులాబీ పన్నీరు . చాలా బాగుంటుంది . రెండిట్లో కామన్ ఏంటంటే పప్పు ఉండదు , థిక్ గా అస్సలు ఉండదు . చాలా తేలిగ్గా ఉంటాయి . ఉల్లి , వెల్లుల్లి లేవుగానీ , రెండిట్లో ను అల్లం పరిమళం అయితే వచ్చింది మరి .
* కోర్సు పూర్తయిన తరవాత ప్రయివేటు రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . ఈ మధ్యనే మన రాష్ట్రం బిందు సేద్యానికి ప్రాధాన్యతనిస్తూ వేయి కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టుకు కేటాయించింది .
( కుల , మత , ప్రాంత , వర్గ , వర్ణ , దేశ , భాష , కలిమి , లేమి , సజ్జన , దుర్జన , స్వ , పర , తరతమ భేద భావనలు లేకుండా గణనాయకుడు కాపాడగలడనే నమ్మకంతో ప్రార్థనలు చేసే ఆయా జానపద కళాకారుల సహృదయతకు నమస్కరిస్తూ … . )
స్వామి కీర్తి ప్రకటనమున తనువులోని అణువణువూ తుషారములు చిలికించిన మాణిక్య సదనము
సంస్కృతంలోనైనా , తెలుగులోనైనా , నామవాచకాలు , సర్వనామాలూ వగైరాలు వున్నాయి . నామ వాచకమంటే , ఓ వ్యక్తి , వస్తువు లకు వ్యవహరింపబడే పేర్లు . సర్వనామాలంటే , ఆ నామవాచకాలని మళ్లీ మళ్లీ చెప్పవలసిన అవసరం లేకుండా , ప్రత్యామ్నాయంగా వాడే పదాలు .
మీ కవిత చదివితే కన్నీరు అది మీ పాలిట పన్నీరు ఇప్పటికి నూట యాభై సార్లు రాసారు ఎన్నో ఫోటోలు వేసారు అయినా మీ ఫోటో వెయ్యడానికి ఎందుకు బేజారు ? ఎప్పటికి తగ్గ కూడదు మీ జోరు సాగ నివ్వండి మీ ఫోరు జనం మాత్రం కామెంట్ పెట్టకుండా వుర్కోరు .
కొట్టి కొట్టి ఆయాసం వచ్చేసింది ప్రధానాచార్యుల వారికి . చెమటతో మొఖం తడితడి అయిపోయింది .
" ముందు ఈ కాన్ఫరెన్స్ కామ్‌గా నడిచేట్లు చూడాలి . ఎక్కడెక్కడి దేశాల వారూ వచ్చి ఉన్నారు . లక్కీగా ఈ మీటింగ్ అంతా డాక్టర్ చాంగ్ ఆధ్వర్యంలో నడుస్తున్నది . నేను అక్కడ అప్పుడప్పుడు కనిపిస్తే చాలు . నెల్సన్ స్పీకర్ కాదు . అది ఒక మేలు . ఇప్పుడు ఇంటర్నేషనల్ సెలెబ్రిటీ పేషెంట్లు చాలా మందికి మన సెంటర్లో వైద్యం నడుస్తూ ఉంది . నాకు తెలుసు ఎవరెవరు ఉన్నదీనూ . వీరెవరూ ఆందోళన పడకుండానూ , ఏ గందరగోళం సృష్టించకుండానూ జాగ్రత్త పడాలి . "
ప్రకృతి సౌందర్యంలో అందాల నంది విగ్రహం మూడంతస్తుల శివాలయం , ఎదురుగా నంది సాయిబాబా దేవాలయం అయ్యప్ప దేవాలయం అయ్యప్ప దేవాలయం పై అంతస్తు దేవాలయం ముందు హరి హరుడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి 20 కి . మీ . ల దూరంలో ద్రాక్షారామం వెళ్ళే తోవలో వున్న ఈ ఊళ్ళో 10 సంవత్సరాల క్రింతం కట్టబడిన అయ్యప్ప దేవాలయంతోబాటు , సాయిబాబా , శివాలయాలు కూడా వున్నాయి . విశాలమైన ప్రాంగణంలో వున్న ఈ దేవాలయాలు చూపరులను అమితంగా ఆకర్షిస్తాయి . అయ్యప్ప దేవాలయంలో క్రింది భాగంలో వర్తులాకార హాలులో దుర్గ , సాయిబాబా , రాఘవేంద్ర స్వామి , వివేకానంద , రామకృష్ణ పరమహంస , వేమన వగైరా గురువర్యుల విగ్రహాలు చుట్టూ వున్నాయి . పై అంతస్తులో హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి నిత్య పూజలందుకుంటున్నాడు . అయ్యప్ప స్వామి ఆలయంలోంచి ప్రక్కనే వున్న సాయిబాబా ఆలయానికి త్రోవ వున్నది . బాబా దర్శనమైనాక వెనుక వైపు వెళ్తే శయనించివున్న వెద్ద రంగనాధ స్వామి విగ్రహం కనబడుతుంది . ఆస్వామిని సేవించుకుని బయటకు వస్తే ఆ మార్గం ఎత్తుగా వున్న పెద్ద నందీశ్వరుని దగ్గరకు తీసుకు వెళ్తుంది . నందీశ్వరునికి ఎదురుగా మూడు అతస్తుల శివాలయం వున్నది . ఇక్కడి శివ లింగం చాలా పొడుగ్గా 3 వ అంతస్తు దాకా వుంటుంది . అమ్మవారు అఖిలాండేశ్వరి . శివాలయం ముందు పెద్ద ఆంజనేయస్వామి , నటరాజు విగ్రహాలున్నాయి . అతి విశాలమైన ప్రాంగణంలో ప్రకృతి అందచందాలతో పోటీపడుతూ ఆకర్షణీయంగా వున్న ఈ దేవాలయ సమూహం చూసి తీరవలసినదే .
దేశ భాషలందు తెలుగు లెస్స అన్న రాయలవారి వ్యాఖ్య లోని లెస్స పదము ( ఆంగ్ల సహవాస దోషము వలన ) నామట్టుకు LESSuగా మారి పొతున్నది . మరికొంతకాలమాగితే అ , ఆ లు కూడా మరచిపోతానేమో అన్న భయము నుండి పుట్టినదే ఈ ప్రయత్నము . పరిచయస్తులు , బంధువులు , ( మీలాంటి ) మిత్రులతో , నా ఆలోచనలు , అభిప్రాయములు వాళ్లకు ఇబ్బంది కలగకుండా పంచుకోవటానికి ఇది ఒక చక్కని మార్గము . ఆ విదముగ " నేను సైతము తెలుగు అంతర్జాలకు BLOG నొక్కటి బ్లాగాను " అని కొంచెము గర్వపడవచ్చు . " చంద్రునికొక ఒక చిన్న నూలు పోగులా " నా ఈ ప్రయత్నము తెలుగు భాష ప్రాచుర్యానికి ఉపయోగపడితే నాకు అంత కన్నా కావలసినది ఏముంది ?
అబ్బాయి : ఏంటి నాన్న నేను పది రోజులు ఇంట్లో లేకపోతే నీకు బోర్ కొట్టిందా నాన్న : అవును అబ్బాయి : మామయ్య తిరిగి అమెరికా వెళ్లిపోయాడు , నే వచ్చేశాన్లే . నాన్న : ఊ , ఏమిటి విశేషాలు ? అబ్బాయి : ఏమీ లేవు , నువ్వు చెప్పు . నాన్న : మీ మామయ్య పెళ్లి చేసుకుంటానంటున్నాడా ? అబ్బాయి : అంత సీను లేదు నాన్నా , ఇంకో మాటజెప్పు . నాన్న : ? ? ?
" ఇంకా కొన్ని మహిషాల్ని బలి ఇచ్చి ఇంకోసారి ఆవాహన చేయండి దొరా " నెమ్మదిగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు అతని అనుచరుల్లో ఒకడు .
పరిశీలకులందరినీ ఆందోళన పరిచిన విషయం ఒకటి చెప్పక తప్పదు . గ్రామీణ వాతావరణంలో బహుకష్టాలు పడుతున్న వ్యక్తుల గురించి మాండలికంలో రాస్తూ వీలయినప్పుడల్లా జానపద గీతాల్ని చొప్పిస్తే బహుమతులు వస్తాయి అన్న ఫార్ములా ప్రకారం కొందరు రచయితలు ఈ పోటీలకు నవలలు వండుతున్నారేమో అన్న అనుమానం కొన్ని నవలలను చదువుతున్నప్పుడు వచ్చింది . ఇది నిజం కాదనీ , యాదృచ్ఛికమేననీ ఆశిద్దాం . మంచి నవలలు ఫార్ములాల వల్ల పుడతాయని గానీ , ఏదో ఒక నేపధ్యాన్నుంచే వస్తాయని గానీ మేము అనుకోవటం లేదు . హృదయానికి హత్తుకొనే వస్తువు , పాత్రచిత్రణ , శిల్ప నైపుణ్యం మంచి రచనలన్నిటికీ అవసరమని , రచయితలకు రచనలకు నిజాయితీ ముఖ్యమని , ఫార్ములా దారుల్లో ప్రయాణం మంచి రచనలు తేలేదని మేం మళ్ళీ వేరుగా చెప్పనక్కరలేదు కదా .
ఇందులో నాకు చిత్రంగా అనిపించింది - ఒకటుంది . మన ప్రొఫైల్ పేజిని మనము మాత్రమే కాకుండా . . మనం అంగీకరించే ఎవరైనా మార్పులు / చేర్పులు చేయవచ్చు .
ఆ తర్వాత " రెండు రొమ్ములూ మళ్ళీ తయారు చెయ్య వచ్చు . ఇక్కడ ఎంత గొప్ప సర్జన్లున్నారో దేశమంతా తెలుసు " అంటూ మెచ్చుకోలుగా అంతకు ముందు కొంతమంది సర్జన్లు మాట్లాడిన దిక్కుగా చూసింది . అందరూ పులకించి పోయారు . ఆమె తెలివికి , క్షుణ్ణంగా అంత విప్పి చెప్ప గలిగిన విజ్ఞానానికి , ఆమె ముందు చూపుకి .
kiran గారి అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను . * * * * * * * * * కధ కన్నా ప్రసాద్ గారి విశ్లేషన నాకు బాగా నచ్చింది . కథ లోని ప్రతి పాత్రయొక్క నిజస్వరూపాన్ని కల్లకు కట్టినట్లు వివరించిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు .
ఒక హిరణ్యకశిపుణ్ణో ఒక హిరణ్యాక్షుణ్ణో చంపితే లోకం బాగుపడుతుందనుకున్నప్పుడు విష్ణువు అవతారాలెత్తాడు . ప్రతివాడూ అలాగే తయారైతే ఆయన మాత్రం ఎంతమందినని చంపుతాడు ? వీళ్ళు ఒకరినొకరు చంపుకుంటూ పోయి లోకం నిర్మానుష్యమైతే అప్పుడు బాగుపడుతుందేమో ప్రపంచం !
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ స్పష్టం చేశారు . ప్రతిపక్షాలు సహకరిస్తే బిల్లు ఆమోదింపజేసేందుకు అభ్యతరం లేదన్నారు . 1998 - 2004 మధ్య అధికారంలోఉన్న ఎన్డీయే ప్రభుత్వం లోక్‌పాల్‌బిల్లు ఎందుకు ఆమోదింపజేయలేకపోయిందో తెలియాల్సి ఉందన్నారు . బిల్లు ఆమోదింపజేయడానికి అప్పటి హోంమంత్రి ఎల్‌కే అద్వానీకి అడ్డుపడిన అంశాలు ఏమిటో చెప్పాలన్నారు . కమిటీలో తండ్రీకొడుకులు శాంతిభూషణ్ , ప్రశాంత్ భూషణ్ పేర్లు ఉండడంపై ప్రణబ్ స్పందిస్తూ ఆ విషయం అన్నాహజారేకు సంబంధించిన అంశమని [ . . . ]
గత ఆదివారం ఆంధ్ర జ్యోతిలో మత మార్పిడి వార్త వచ్చింది . మతప్రచారంలో భాగంగా ఈ క్రైస్తవ మిషనరీలు ఎలా పని చేస్తున్నాయో చదివి ఆశ్చర్యపోయాను . గిరిజనుల పేదరికాన్ని , అమాయకత్వాన్ని , చదువులేనితనాన్ని ఆసరాగా చేసుకుని నాగరికులమని చెప్పుకున్నవారు వారి శ్రమను దోచుకోవడం చిరకాలంగా జరుగుతున్నదే . కానీ సేవలో మత విశ్వాసాలను చొప్పించి , గిరిజన సమాజాన్ని ఛిన్నాభిన్నం చెయ్యబూనడం క్రైస్తవ మిషనరీలకే చెల్లింది . క్రైస్తవ మిషనరీల ప్రజాసేవ స్వార్థపూరితమైనదనే విమర్శ ముందునుండీ ఉంది . చదువు చెబుతున్నామని , వైద్యం చేస్తున్నామని సేవల ముసుగేసుకుని మత ప్రచారాలు జరుపుతారు . రగ్గులిచ్చి , దుప్పట్లిచ్చి మత మార్పిడులు నిర్వహించిన చరిత్ర వారికుంది . సేవాసంస్థల ముసుగులో కోట్లాది రూపాయల డబ్బులు బయటి దేశాల నుండి పొందవచ్చనే దుర్బుద్ధితో మతం మార్చుకున్నవారున్నారు . అలా లబ్ది పొంది కోటీశ్వరులు అయినవారు , ఆనక రాజకీయాల్లోకి ప్రవేశించిన వారినీ మనమెరుగుదుము . క్రైస్తవ స్వస్థత కూటములు జరుగుతూ ఉంటాయి , గమనించే ఉంటారు . ( ఈ మధ్య ఇవి విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి వాటిని గమనించకుండా ఉండడం కష్టమే ! ) ఈ కూటముల పేరుతో గిరిజనులను సాంస్కృతికంగా దోచుకుంటున్న విషయం రాసారీ ఆంధ్రజ్యోతి వ్యాసంలో . అది చదివితే విస్తుపోతాం , ఈ మిషనరీల సృజనాత్మకతకు . గిరిజనుల కట్టూ , బొట్టూ , ఆహారపు టలవాట్లను కూడా మార్చారట . వీరి కారణంగా గిరిజనుల మధ్య అంతర్గత కలహాలు కూడా వచ్చాయట . తిరుపతిలో ప్రభుత్వ ఆసుపత్రిలో క్రైస్తవ ప్రచారకులు రోగుల చేత ప్రార్థనలు చేయించిన విషయం మనకు తెలిసిందే . హిందువుల పుణ్యక్షేత్రాలైన తిరుమల , సింహాచలం వంటి వాటిని కూడా వదిలిపెట్ట లేదు . ఈ రెండు చోట్లా క్రైస్తవ మత ప్రచారాలు చేస్తున్న వారిని ప్రజలే పట్టుకుని దేహశుద్ధి చేసారు కూడాను . తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ మీద కూడా ప్రస్తుతం ఒక దుమారం రేగుతోంది ఇలాంటి విషయమ్మీదే ! మత మార్పిడుల రగడ ఎక్కువైపోయిందీ మధ్య . సాక్షాత్తూ పోపు కూడా మతమార్పిడులను అడ్డుకోరాదని మనకో ఉచితసలహా పారేసిన విషయం మనకు తెలుసు . ఇతర మతస్తుల వద్ద తమ మతాన్ని ప్రచారం చేసుకోవడంపై వీరికింత యావ ఎందుకు ? హిందువులను గబగబా మతం మార్చెయ్యాలని ఎందుకో వీరికీ తహతహ ? ఈ మత ప్రచారాన్నీ మత మార్పిడులను ఆపాలి . వీటిని నిషేధిస్తూ చట్టం చెయ్యాల్సిన సమయం వచ్చింది .
నలుపుతెలుపులు అల్లుకున్న ఆ నాలుగు గోడల మధ్య ప్రపంచంలోని నలుపుని దూరంచేయటంకోసం యుగాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి . మానవీయ విలువలకోసం కొలమానాలు నిర్వచింపబడుతున్నాయి . కానీ చీకటి పడితే వెర్రితలలేసుకు విరుచుకుపడే రాక్షసత్వం మానవత్వాన్ని వెక్కిరిస్తూనే ఉంది . యుగాలు మత్తుగా మునగదీసుకుని పుస్తకాల్లో చేరి అల్మరాలో పడుకున్నాయి . నీతి లేని ఈ జాతిని , ఈ జుగుప్సని చూడలేక న్యాయ దేవత కళ్ళకి గంతలు కట్టుకుంది . అమాయకుల ఆర్తనాదాలు ఆమె చెవిన చేరినప్పుడు తను కార్చే కన్నీటిని మాత్రం ఆ గంతలు అడ్డుకోలేక పోతున్నాయి .
రాజశేఖరరెడ్డి అధికారానికి రాకముందు తెలంగాణలో కాంట్రాక్టులూ వ్యాపారాలూ చేసుకుంటున్న బయటివారు ఎక్కువగా కోస్తా జిల్లాలవారే కాగా గత అయిదేళ్ళలో రాయలసీమకు , ప్రత్యేకించి కడప జిల్లాకు చెందిన రెడ్లు పెద్ద సంఖ్యలో ప్రవేశించారు . హైదరాబాద్ సమీపంలోని రోడ్డు పనులే కాదు , ఆదిలాబాద్‌లోని సింగరేణి ఓపెన్‌కాస్ట్ కాం ట్రాక్టులు సహితం వారి చేతులలోకి పోయాయి . మామూలు గా బయటినుంచి వచ్చిన కాంట్రాక్టరు ఏ జిల్లా వాడు అని తెలుసుకునే అవసరంగానీ సందర్భంగానీ ఉండదుగానీ , దేనినీ ఖాతరు చేయని కొత్త కాంట్రాక్టర్ల నడవడిక స్థానికుల లో ఆ కుతూహలాన్ని కలుగజేసింది .
ఈ మధ్య నేను నిశితంగా గమనిస్తున్నవి వివిధ రకాల ప్రకటనలు . నాకీ అలవాటు అమూల్ ప్రకటనల పట్ల ఇష్టంతో మొదలయ్యింది . అమూల్ ప్రకటనలు అత్యంత భారతీయంగా చూడగానే నవ్వొచ్చే సమకాలీన అంశాలను పేరడీ చేస్తూ చాలా బాగుంటాయి . అలా మొదలయ్యిన ఇష్టం అమెరికాలో ప్రకటనలు చూసాకా ఇంకా ఎక్కువయింది . అయితే ఈ మధ్య మన దేశంలో వస్తున్న టీవీ , హోర్డింగుల ప్రకటనలు చూస్తే చాలా బాధగా వుంది . అసలు ఈ ప్రకటనలపై ఒక సెన్సారు బోర్డు వుందా లేదో నాకు తెలియదు కానీ . . . వుంటే బాగుండునేమో అనిపిస్తుంది . కొన్ని యాడ్లు ఆగి చూస్తే గానీ అర్ధం కావు . మరికొన్ని కొన్ని వర్గాలను తీవ్రంగా అవమానిస్తు వుంటాయి . జాగ్రత్తగా అలోచిస్తే గానీ అవి అర్ధం కావు .
అభిప్రాయం స్పష్టంగా లేదేమో అని ఇంకొక్క మాట . మసీదైనా , మందిరమైనా , Golden Temple గురుద్వారా అయినా , ప్రార్థించే ప్రదేశమేదైనా పవిత్రమే , ఎల్లప్పుడూ అందరికీ . మతమేదైనా పవిత్రత ఒక్కటే . కాని ఆ పవిత్రతకు కారణమైన ప్రార్థన , నమాజు అన్నవే లేనప్పుడు వాటిని పూర్వ గౌరవంతో ఆదరించడం ఎంత వరకు సబబు అన్నది కవులు , విజ్ఞులే కాదు మేధావులూ , పౌరులందరూ ఆలోచించి అభిప్రాయాలు పంచుకోవడం ఎంతో ఘర్షణను , రక్తపాతాన్ని నివారించడానికి సహాయం , కాదు - నేటి అవసరం అని కూడా అనుకుంటాను . హింసకు దారితీసిన , తీస్తున్న విషయాలు చర్చలకు దారితీసి వెలుగును వెత్తుక్కోవడం అన్నివిధాల మేలు చేస్తుందని కూడానమ్ముతాను . ________ విధేయుడు - Srinivas
కేక్యుబ్ గారు మీరు అంత ఫీల్ అవ్వాల్సింది లేదులెండి , పాపం గాజుల గారు ఇక్కడే కాదు వేరే బ్లాగులో తమ అమూల్యమైన అభిప్రాయం చెప్పారు . వారు మీ మిత్రులేమో అది నాకు సంభందం లేని విషయం నా విషయం నోరు జారితే ఆయనకి సమాధానం చెప్పే హాక్కు నాకు ఉంది ! మీరు ప్రతిసారి బ్లాగులు పెట్టుబడిదారి దేవుళ్ళు ఏదో దయతలచి ఉచితంగా ఇస్తున్నవని రాస్తారు . వారు శ్రమదోపిడీనుండి పొందిన లాభాలలోంచి విదిలించిన గానుగలో గరిటెడనుకుంటున్నా ఈ సౌకర్యం . . - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ఆ సౌకర్యాన్ని నోటి దురుద తీర్చుకునేందుకు వాడుకుంటే నా సమాధానం అదే !
ఈ గడిచిన వారం రాశి ఫలాల్లో మిత్రసందర్శనం రాసి పెట్టి ఉంది . ఒకటికి రెండు సార్లు ఈ వారంలో పాత మిత్రుల్ని కలుసుకుని ఆప్యాయంగా తీరిగ్గా ముచ్చటించుకునే అవకాశం చిక్కింది . శివరాత్రి సోమవారంనాడు ముగిసినా మా స్థానిక దేవాలయం వారు ఉద్యోగస్తులైన భక్తుల సౌకర్యార్ధం కొన్ని ప్రత్యేక అభిషేకాలు పూజలు ఈ వారాంతంలో నిర్వహించారు . దానిలో భాగంగా స్థానిక నాట్య గురువు శ్రీమతి సుధా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో వారి శిష్యులు పలువురు ఆ నటరాజ మూర్తిని నాట్యాంజలితో మెప్పించారు శనివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో . చూడ ముచ్చటగా ఉంది . పూర్వకాలంలో మన దేవాలయాలు కేవలం పూజకే కాక విద్యకీ సంస్కృతికీ సాంఘిక జీవనానికీ మూలస్థానాలుగా విరాజిల్లుతుండేవి . వేదాధ్యయనమూ , సంగీత నాట్యాది కళలూ దేవాలయాల్లో విలసిల్లుతుండేవి . ఇప్పుడు ఈ ప్రవాస దేశంలో మళ్ళీ హిందూ దేవాలయాలు అటువంటి పాత్ర పోషించవలసి ఉంది ప్రవాస భారతీయ సాంస్కృతిక చైతన్యం విషయమై . చెంచులు గిరిజనులు అని చాలా మంది వినే ఉంటారు . బహుశా పేపర్లలోనో పాఠ్య పుస్తకాల్లోనో చదివుంటారేమో . ఆంత్రొపాలజీ సమాచారాన్ని బట్టి వీళ్ళు అనాదిగా ఈ ఆంధ్ర దేశపు ఆడవుల్లో నివాసముంటున్న ప్రజలని తెలుస్తోంది . కర్నూలు చిత్తూరు జిల్లాల్లో వ్యాపించి ఉన్న నల్లమల అడవుల ప్రాంతమంతా పరుచుకుని ఉన్నారు ప్రస్తుతం . చాలా ముభావమైన స్వభావం వారిది . సాంఘికంగా కలవడానికి ఇష్టపడరు . ఇంచుమించు పసి పిల్లలవంటి అమాయకత్వం కలిగిన మనస్తత్వం వారు . దురదృష్టవశాత్తూ నల్లమల తీవ్రవాద ఉద్యమానికి నెలవు అయిన నేపథ్యంలో అటు పోలీసు వ్యవస్థ నించీ ఇటు ఉద్యమకారుల నించీ రెండు వేపులా దెబ్బలు తింటూ అడకత్తెరలో పోకచెక్క మాదిరి చిన్నాభిన్నం అవుతున్నారు తమది కాని తప్పుకి ప్రాణాలు వొడ్డుతూ . ఈ చెంచుల ఘోషని మనసుకి పట్టించుకుని తన కలంతో వారికి గళాన్నిస్తూ ఒక పాత్రికేయుడు స్వేఛ్ఛకోసం అంటూ కొత్తగా బ్లాగు ప్రారంభించారు . ఈ సందర్భంగా సుబ్బారెడ్డి గారిని స్వాగతిస్తున్నాను . చెంచుల నిజ పరిస్థితిని గురించి వారు చెప్పే మాటలు చదువుదాం . ఏమైనా సహాయం చెయ్యగలిగితే చేద్దాం . ఈ జాలం బలే తమాషా చేస్తుంది . మదిలో ఒకదానికోటి పొంతనలేని ఆలోచనలు ఒకదాని తోకపట్టుకుని ఇంకోటి అలా అనంతమైన గొలుసు కట్టినట్టే . . ఎక్కడో మొదలై ఎక్కడో తేల్తాం . ఇదిలా ఉంటే . . ఈ తెలుగు బ్లాగుజాలం అదో వింత ప్రపంచం , ఎంత చిన్నదో అంత పెద్దదీనూ . ఇంతా చేసి బాగా హడావుడి చేస్తున్నది రెండేళ్ళుగానే . ఇంతలోనే ఎన్నో బ్లాగులు మొదలై ఆగిపోయాయి కూడా . ఎక్కడో ఒక మారుమూల చిన్న బురద గుంటలో ఒక బుల్లి తెల్ల తామర పుడుతుంది , విచ్చుకుంటుంది , గుబాళిస్తుంది . పంకజమిత్రుడు మొహం చాటెయ్యగానే వాలిపోతుంది . కానీ ఒక్కో సారి , ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా మీరు అక్కడ నిలబడితే ఆ పాత పరిమళం మీ ముక్కుపుటాలి గిలి పెడుతుంది . అలాంటి నిన్నటి తెలుగు బ్లాగు పంకజం గుబాళింపిది . అన్నట్టూ కొన్నాళ్ళుగా ఒక ముఖ్యమైన విషయం చెబుదామనుకుంటూ మర్చిపోతున్నా . ఇది ముఖ్యంగా అమెరికాలో నివాసం ఉంటున్న వారికి . ఇదొక రేడీయో ప్రోగ్రాములో విన్నా . ఒకవేళ మీ తప్పేమీ లేకుండా మీ ఉద్యోగము పోయినట్లయితే ( అమంగళము ప్రతిహతమౌగాక ) మీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు కొన్ని సదుపాయాల్ని అందుకోవచ్చు . దీనికి వీసా స్టేటస్ కీ ఏమీ సంబంధం ఉండకపోవచ్చు . ఈ నియమాలు రాష్ట్రాన్నించి రాష్ట్రానికి మారుతుంటాయి . అంచేత మీ రాష్ట్రంలో పరిస్థితి ఏమిటో కనుక్కోండి . ఆరోగ్య బీమా , జీవిత బీమా లాగానే ఈ నిరుద్యోగ సదుపాయం కూడా బీమా చెల్లింపే . అంచేత ఇది తీసుకోవలసి వచ్చినందుకు ఏమీ కించపడనక్కరలేదు కూడాను . ఇదెవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడటం కాదు . కష్టతరమైన సమయములో ఇది వ్యవస్థ ఇస్తున్న ఒక చిన్న చేయూత అని భావించండి . అంతే . అన్ని రకాల రుసరుసలు కసబిసల తరవాత ఈ వారంలో మన బ్లాగరులు హాస్యానికి పెద్దపీట వెయ్యడానికి నిశ్చయించినట్లున్నారు . చదువరిగారు ఇలా తెరతియ్యగా , బ్లాగాడిస్తా రవి గారు ఆగాగు ఆచార్యదేవా అంటూ సుయోధనుడితో తెలంగాణా స్లోగన్లు పలికించారు . ఇక బ్లాగరులంతా యథాశక్తి హాస్యవృష్టి కురిపిస్తారని ఆశిస్తాను . పనిలో పనిగా జల్లెడవారు కొత్త డిజైను వెలయించారు . ఓ లుక్కెయ్యండి .
" డాం డాం డాం " ( " మా అమ్మ చెప్పిన కతలు " , పేజీలు - 29 నించి 32 వరకూ ) అన్న కథ చూడండి . ఈ కథ సరదాగా మొదలవుతుంది . చిన్నప్పుడు విన్న కోతీ - ముల్లూ కథ ఇది . నవ్వుతూ చదువుతూ వుంటే , " దొమ్మరోళ్ళు ఆ పిల్లకు గెడెక్కేది నేర్పిస్తూ వుంటే కింద పడి చచ్చిపోతుంది . " ( " మా అమ్మ చెప్పిన కతలు " , పేజీ - 31 ) . ప్రాణం వుసూరు మంటుంది చదవగానే . ఈ కథలో ఆ పిల్ల చచ్చిపోవాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు . అదీగాక చిన్నప్పుడు మేం నేర్చుకున్న కోతీ - ముల్లూ కథలో ఈ చావు లేదు . నామినికి చావులు అంటే చాలా మామూలు విషయం అయిపోయింది . చిన్న పిల్లల కథలో కావాలా , అక్కరలేదా అన్న ఆలోచన లేకుండా చావులు గుప్పించెయ్యడం ! " పాపిష్టి పిల్లి " కథలో గూడా చెడ్డ పిల్లి చచ్చిపోతుంది లెండి . మంచి జంతువులకీ , మంచి మనుషులకే దిక్కు లేదు . ఇంక చెడ్డ జంతువులూ , చెడ్డ మనుషులూ చచ్చిపోతే ఏ పిల్లలు పట్టించుకుంటారు లెండి .
కాలం చాలా గడిచిపోయింది . రక్తమొలికిన నేల మీద సుఖాలకోసం దేబిరించే రోజులొచ్చాయి రఘోత్తంగారూ . . ఈ లోకం మీ ' లక్ష్మణ రేఖ ' ను దాటలేదు . ' అమ్మ ' ప్రేమలో సైతం మీరు చూసిన లోచూపును ఈ అంధ ప్రపంచం చూడలేదు . చూడకూడదని మనసా , వాచా , కర్మణా నిర్ణయించుకుంది . మీ ' మౌఖిక ' వేదన వినే మనుషులు లేకపోయిన కాలంలో , మీ ' సత్య ప్రకటన ' ను ఎగతాళి చేసే రోజుల్లో మీరు మాట్లాడితే శాపనార్థాలు పెట్టక ఏం చేస్తుంది చెప్పండి ? మన ఇంట్లో తిట్లు అయిపోతే పొరుగింట్లో నుంచో , ఆంగ్ల గ్రంథాలనుంచో అరువు తెచ్చుకునైనా తిట్టదలుచుకున్నదీ లోకం … విలువల గురించి మాట్లాడితే లోకం వింటుందా రఘోత్తంగారూ . . చక్రాలబళ్ల ఊహలకూ తార్రోడ్డు సుఖాలకూ మరిగిన కాలమిది . నాలుగ్గోడలను ; నడమంత్రపు సిరితో ఆకాశహర్మ్యాలో , అందాల భవంతులో నిర్మిస్తున్న రోజులివి .
సమాజంలోని అన్నిరంగాలల్లోనూ నిరాఘాటంగా చెలామణి అవుతోన్న పురుషుల అధికార స్వభావాన్ని ప్రశ్నిస్తూ … దాన్ని మార్చే దిశగా ఆడవాళ్ళనీ … మగవాళ్ళనీ కూడా చైతన్యవంతులని చేసి ఒక మంచి మానవ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా నడవాలన్నదే అంతిమంగా ఫెమినిజం ఆశయం !
ఈనాడు బలంలో చాలా రకాలున్నాయి . లోకంలో అన్ని బలాలూ పురుష శరీరం తరహా ఉపోద్ఘాతప్రాయ ( rudimentary level ) బలాలు కావు . మనుషులు శారీరిక బలం కంటేనూ విద్యాబలం , పరిజ్ఞానబలం , నైతికబలం , అర్ధబలం , అంగబలం , అధికారబలం , చట్టబలం , సంప్రదాయబలం , సాంఘికబలం , స్థానబలం మొదలైన హంగుబలాల వల్ల ఎక్కువ బలవంతులవుతారు . అంటే బలం అనేది నీ మర్మాంగం ఏంటనేదాని మీద కాక నువ్వు పుట్టిన కుటుంబం ఏ వర్గానికి చెందినదనేదాని మీద , నీ సర్కిల్ ఏంటనేదాని మీదా ఆధారపడి ఉంటుంది . దురదృష్టవశాత్తూ ఆధునిక కాలంలో వట్టి శారీరిక బలం మోటుపశువు అనిపించుకోవడానికి తప్ప ఇహ దేనికీ ఉపయోగపడదు . ఒక పురుషుడు శారీరిక బలం , విద్యాబలం , పరిజ్ఞాన బలం , నైతిక బలం లాంటివి మాత్రమే కలిగి ఉండి అతని భార్యకు అర్ధబలం , అంగబలం , సాంఘికబలం కూడా ఉన్నప్పుడు ఆమె ముందు అతను బలహీనుడే అవుతాడు . ఆమె అతనితో యథేచ్ఛగా ఫుట్‌బాల్ ఆడుకోగలదు . అతనికి ఆమె నుంచి చట్టపరమైన రక్షణ అవసరం . ఒకవేళ పైన చెప్పిన బలాలన్నీ అతనికి ఉన్నప్పటికీ చట్టం దగ్గఱ అతనికి బలం లేకపోతే అతను ఆడదానికంటే బలహీనుడవుతాడు . వాస్తవానికి ఇప్పుడు మగవాళ్ళందఱి పరిస్థితి ఇదే . వారంతా చట్టపరంగా మిక్కిలి బలహీనులు . ఆడవాళ్ళతో పోలిస్తే ఏ విధమైన హక్కులూ , మద్దతూ లేనివాళ్ళు . ఫెమినిస్టు చట్టాల దృష్టిలో మగవాళ్ళు అసలు మనుషులే కారు . వారు ఆడవాళ్ళ బరువుబాధ్యతలు మోయడానికి మాత్రమే పుట్టిన కూలీ - చీమలూ , గానుగెద్దులూను . మానవీయమైన ఏ మన్నన ( treatment ) కూ వారు తగరు . వారిని ఎంత అమానుషంగా హింసిస్తే ఆడవాళ్ళకు అంత ఘనంగా న్యాయం జఱిగినట్లు . అలా చట్టపరమైన రాజ్యహింస ( legitimized State violence ) కు బలికాకుండా ఉండాలంటే ఆ మగవాడు ఒక ఆడదాన్నుంచి " మంచివాడు " అనే సర్టిఫికేట్ సంపాదించుకోవాలి . ఒకవేళ ఆమె మీద అతనికి ఫిర్యాదులుంటే వాటిని వినిపించుకునే వ్యవస్థే లేదు . ఆ విధంగా sub - human sex గా మార్చబడ్డ మగవాళ్ళ పని అల్లా - ఈ పురుష వ్యతిరేక ప్రభుత్వాలకు నోరు మూసుకొని వోట్లెయ్యడం , ఠంచనుగా వాటికి పన్నులు కట్టడం , చెమటోడ్చి , ఒళ్ళు హూనం చేసుకొని , దేవుడికీ , సమాజానికీ , అంతరాత్మకీ కూడా చీడపురుగులుగా మారి ఆడవాళ్ళకు ఆదాయాల్నీ , ఆస్తుల్నీ దోచిపెట్టడం , వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయడం , చేసుకోవడం , వాళ్ళకు కోపమొచ్చినప్పుడల్లా ఫెమినిస్టు చట్టాల ప్రకారం బుద్ధిగా జైలుకెళ్ళడం , వాళ్ళకు బట్టలూ , నగలూ , ఇహ ఏది కావాలంటే అదల్లా కావాల్సినప్పుడు సవినయంగా కొనిపెట్టడం . . పెట్టడం . . . పెట్టడం . . . అంతే !
ఆమె రోషంతో " బోర్డ్ కేసి కొంచెం చూడు సోదరా ! చూసినా అర్ధం ఐతే గదా . నేనే గెలిచాను . " అంది .
3 . ఇలాటి డామినేషను అనేది వారి వారి నైపుణ్యం వల్లనూ , జాతి గొప్పతనం వల్ల కాకుండా కేవలం అదృష్టం వల్ల , అడవిలో చక్కని పంటలు ఉండుటం వల్ల , వారికి ఆవు , గుర్రం గొర్రెలు వంటి జంతువులు పెంచడానికి వీలవడంవల్ల మాత్రమే జరిగినది . అంతే కానీ ఒక జాతి మరో జాతి కన్నా గొప్పది ఎట్టి పరిస్తితిలోనూ కాదు అని రచయత చెపుతారు .
చివరగా , పాశ్చాత్య పత్రికల్లో లాగా మరణ వార్తలో వయసు ఇవ్వడం మనకు ఆనవాయితీ కాదు లాగుంది . స్మైల్ మరణం గురించి నాలుగయిదు చోట్ల చదివాను . ఎక్కడా ఆయన వయసు ఇవ్వలేదు . " బంగారు కథలు " ప్రకారం స్మైల్ పుట్టింది 1942లో . పండు వయసు రాకమునుపే ముగిసిన జీవితం .
అవును అధ్యక్షా ఈ విషయంలో ప్రతిపక్షాల వాళ్ళు మొత్తం తమ స్వార్దం కోసరం ఆటో కోతులతో ఉన్నా ప్రజలమైన మేము మాత్రం డిజిటల్ మీటర్లవైపే ఉన్నామని మనవి చేసుకుంటున్నాము
రంగస్థలమనగా వేదిక అని అర్థం . పూర్వం జరిగిన వృత్తాంతాన్ని గాని , ప్రస్తుతం జరుగుచున్న విషయాలను గాని , జరుగబోవు విషయాలనుగాని ఆట - పాట ద్వారా ప్రేక్షకుల మనోఫలకంపై చెరగని ముద్రవేయు కళారంగ ప్రదేశమే రంగస్థలం . ప్రదర్శన విషయం సాంఘిక , ఆర్థిక , చారిత్రక , పౌరాణిక , రాజకీయ తదితరాలలో ఏదైనా కావచ్చును . విషయానికి తగినట్టు వేదిక అలంకరణ ఉండాలి . ఆహార్యం , అభినయం , సంగీత వాద్యాలు , స్పష్టమైన వాచికం ఉండాలి . అప్పుడే ఆ కళ రక్తిగడుతుంది . పాశ్చాత్యులకు ఏ మాత్రం తీసిపోని విధంగా మన పూర్వులు వివిధ కళలను సృష్టించి పోషించారు . సర్వకళల సృష్టికర్తలు పోషకులు నాడు నేడు రేపటికి కూడా జానపదులే . ఉన్నత వర్గాల వారు కళలను విని చూచి తరిస్తారు . మధ్య తరగతి , పేదవారు కళలను అనుసరించి , కళలలో జీవించి తమ జీవితాలను కళలకే అంకితం చేస్తున్నారు . వీరిని స్థూలంగా జానపదులు అనవచ్చు .
మొన్నామధ్య మర్ఫీస్ లా బోర్లా పడచ్చని ఒక సంఘటన ద్వారా అనుభవమైంది . దాంతో మా నాన్నగారు రివర్స్ మర్ఫీస్ లా ( దాన్ని సత్యసాయీస్ లా అందాం ) సూత్రీకరించారు . " సత్యసాయీ ' స్ లా " ఏమిటంటే , ఒకవేళ ఏదైనా సక్రమంగా జరిగేందుకు అవకాశం పెద్దగా లేకపోయినా , అది సక్రమంగా జరగవచ్చు . ఎలా అంటే … ఈ కథ చదవండి .
ఇపుడు మీరు చెప్పకముందు , సూర్యప్రకాశ్ గారి వ్యాఖ్య చూసి ఆంధ్రభూమిలో వ్యాసం చదవకముందు నాకు వడలి మందేశ్వరరావుగారి గుఱించి తెలియదండీ . ఊఁ , ఒక తరం వెళ్లిపోతోంది . ప్చ్ ! ఇక శిశిరానన్తరవసంతం గుఱించి . . . ఒకరే చదివి విశ్లేషిస్తే అది ఒకరి వ్యాఖ్యానమే ఔతుంది . కనీసం ఇద్దరు ముగ్గురు కలిసి చదివి విశ్లేషిస్తే అది కొంతైనా సమగ్రంగా ఉంటుంది . మనతరంలో మనమే పూనుకోవాలి .
ఇంతైనా నేను ఆడదాన్ని , బాబుల్లారా , నేనాడదాన్ని . మీరంతా నన్నూ నా ఒంటినీ రవరవ్వా సూసేశారు , కళ్ళు కల్లుముంతలంత సేసుకుని . నా మానం అభిమానం మీ కళ్ళలో కలిపేసుకున్నారు . నేను బతికేటికి ? ఇంక నేను బతికేటికి ?
> > ఈ ఒంటరి తనం తో నేను నడిచిన క్షణాలన్ని యుగాలై ఇంకా నా వెనుక నీడ లానే వున్నాయి > > ప్రేమ నమ్మకం సడలిపోయాయి నీ భావనలోని గాఢతకి ఈ రెండు కొలమానాలు చాలు . ఇక్కడ రెండు మనసుల సంఘర్షణ . ఈ మాటలు యండమూరి పాత్రవి " విడివడటం ద్వారా మీరు సంతోషంగా వుంటారన్న గ్యారంటీ మీకుంటే , మీరు లేని ఆమె భవిష్యత్తు మిమ్మల్ని మానసికంగా బాధపెట్టదన్న నమ్మకం మీకుంటే . . " అలాగే ఇక్కడ రాధి , కృష్ణ పరస్పరం ఆ అనురాగ లేమిని ఫీలవుతున్నారు . మనిషికి సధనచేత అలవడే దైవత్వం క్షమ . ఇక రాజీ అన్నది , విరోధం అన్నది ఆ సాధన తలపడాల్సిన వైరి బలగాలు . ఒక్కోసారి రాజీ కూడా కాల్చుకుతింటుంది . మనసు ఒక విహంగం . మనం దాని నీడలం . ఒక్కోసారి దానికన్నా సాగి పెద్దగా , ఒక్కోసారి అసలు లేనట్లే మనని మనం కనుమాయ చేసుకుంటూ , మరోసారి సాక్షాత్కారం చేసుకుంటూ . . . రాధి , కృష్ణ రెండు వైరుధ్యాల ప్రతీకలు . ఆ గీతల కలయిక కాలానికి వదిలేస్తూ . .
క్రితం ఏడాది ఆగస్టు నెలలో సిలికాన్ వేలీ ( అమెరికాలో ) మేడసాని మోహన్ గారి శతావధానం ఒకటి మేమూ నిర్వహించాం . పాతికమంది పృచ్ఛకులు నాలుగు దఫాలుగా ప్రశ్నలడిగారు . అష్టావధానంలో ఉన్న అన్ని అంశాలూ , అప్రస్తుతంతో సహా , ఉంచడానికి అవధాని గారు అంగీకరించారు . సుమారు 7 గంటలసేపు ఎంతో రమణీయంగా సాగింది . పూరణలన్నీ చక్కగా చేసినా సమయాభావం వల్ల ధారణ చెయ్య లేదు . కొన్ని సమస్యలకి అత్యద్భుతమైన పూరణిచ్చారు . అందులీ ఇచ్చిన కొన్ని సమస్యలు . వీలయితే మీరూ పూరించండి . అవధానిగారి సమాధానాలు తర్వాత చెబుతాను . 1 ) షడ్జమ రాగాలు ఏల షందకు రతిలో 2 ) తెలుగు ఘనులకాంగ్ల తెగులు పుట్టె 3 ) సాహెబ్బీబీల కొడుకు సంధ్యలువార్చెన్ సంస్య్చ్చినతసేపు పట్టలేదు పూరణ ఇవ్వడానికి . అతివేగంగా ఆయన చెబుతూంటే పృచ్ఛకులే రాసుకోడానికి నానాయాతనా పడ్డారు . - సాయి బ్రహ్మానందం
కానీ ఇలాంటి రాజేశ్వరికి చలం జత కూర్చిన ఆ అమీర్ మాత్రం అహంభావి , మతద్వేషి . కాఫిర్లంటూ రాజేశ్వరి తరఫు వాళ్ళను దుయ్యబట్టినవాడు . తన మాట ప్రకారం అబార్షన్ చేయించుకోనని అన్నందుకు రాజేశ్వరిని కర్ర తీసుకుని కసిగా బాదగలిగినవాడు . ముందూ వెనకా చూడకుండా కడుపుతో ఉన్న రాజేశ్వరి డొక్కలో తన్నకలిగిన వాడు . ఎక్కడికి వెడుతున్నది కూడా చెప్పకుండా వానలో చీకట్లో అర్థరాత్రివేళ రాజేశ్వరిని ఆమె ఖర్మకి వదిలిపెట్టి వెళ్ళిపోగలిగినవాడు .
సంతోషం . . కాని వట్టి చేతులతో రావొద్దు . పెళ్ళీ , రిసెప్షన్ చిత్రాలతో రావాలి . లెకపోతే బాగోదు మరి .
ఈ సంచికలో మరొక ముఖ్యమైన విశేషం , శంఖవరం పాణిని గారు ఈ సంచికనుంచీ ఈమాట సంపాదక వర్గంలో భాగస్వామి అయ్యారు . పాణిని వృత్తి రీత్యా బయోకెమిస్ట్ . ఎమరీ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ లో ప్రొఫెసర్ . ప్రవృత్తి రీత్యా , తెలుగు సాహిత్యం , సంగీతం , - రెండింటిలోనూ ద్రష్టే అని చెప్పచ్చు . యాహూ గ్రూపు " రచ్చబండ " మోడరేటర్లలో ఒకరుగా , అంతకు ముందు తెలుసా ( తెలుగు సాహిత్యం ) గ్రూపు లో క్రియాశీలక సభ్యులుగా , " ghantasAla . info " వ్యవస్థాపకులలలో ఒకరిగా ఇంటర్నెట్టులో చిరపరిచితులు . పాణినిగారు ఈమాటలో భాగస్వామి కావడం మాకెంతో సంతోషం కలిగిస్తోంది , వారికి ఈమాట స్వాగతం పలుకుతోంది .
యాత్ర కొనసాగుతోంది అవునండీ , యాత్ర కొనసాగుతోంది . ఇది చెప్పటానికి ఇంత ఆలస్యమయిన కారణం కేవలం నా అనారోగ్యమే . సెప్టెంబరు నెలాఖరు లోపల యాత్ర కొనసాగించాలా వద్దా అనే పోస్టు చూసిన నా శ్రేయోభిలాషులు 600 మంది పైనే అనే విషయమే నా బ్లాగుకి విలువనిచ్చింది . 10 - 10 - 2009 ఈనాడులోవచ్చిన మహిళా బ్లాగుల అభివృధ్ధి వ్యాసంలో నా బ్లాగు గురించి కూడా చెప్పబడింది . ఆ వ్యాసం ద్వారా నా బ్లాగుకి విచ్చేసిన యాత్రీకులు 700 పైనే . కొత్త ప్రదేశాలను గురించి తెలుసుకోవటానికి వచ్చే ఇంతమందిని నిరాశపరచటం ఇష్టంలేకపోయింది . అందుకే వ్యక్తిగత కోపతాపాలు పక్కన పెట్టి , ఆ భగవంతుడు శక్తి ఇచ్చినంతమటుకూ తిరిగి నా బ్లాగు ద్వారా మిమ్మల్ని యాత్రలకి తీసుకెళ్ళాలని నిశ్చయించుకున్నాను . ఎందరో శ్రేయోభిలాషులు ఈ పని ఇదివరకే చెయ్యమని నా బ్లాగులో , మైల్ లో కామెంట్ల ద్వారా ప్రోత్సహించారు . అందరికీ ధన్యవాదాలు . ఏ బ్లాగరయినా , ఏ కారణం వల్లనయినా కొంచెం వెనుకడుగు వేసేటప్పుడు ఇలాంటి ధైర్యం వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది . అందుకే విడప్పుడు కామెంటు చేసినా చెయ్యకపోయినా ఇలాంటి సమయాల్లోమాత్రం తప్పనిసరిగా మీ విలువైన అభిప్రాయాలను తెలియచెయ్యండి . బ్లాగులో టెక్నికల్ గడబిడలవల్ల ఫాలోయర్స్ అందరికీ కోపం వచ్చి వెళ్ళిపోయారు . కానీ మళ్ళీ కొందరు కొత్తగా వచ్చారు . వారి ప్రోత్సాహానికి శతకోటి వందనాలు .
అయ్యో మీరు MTV - Roadies చూడలేదా ? Bindass అనే ఛానల్ గురించే తెలియదా ?
చంచల - సుగంధివృత్తమునకు చివర ఒక లఘువును అదనముగా నుంచితే మనకు చంచల లేక చిత్రశోభ అను వృత్తము లభించును . ఇందులో పాదమునకు ఎనిమిది గ - లములు . తెలుగులో ఈ లక్షణములతో నుండు పద్యము తురగవల్గన రగడలోని ఒక విధము . సంస్కృతములో యతి లేదు కనుక చంచలకు అంత్యప్రాస ఉంచితే తురగవల్గనరగడ అవుతుంది . ఈ వృత్తమును శివపంచాక్షర నక్షత్రమాలాస్తోత్రములలో శంకరులు వాడినారు . శంకరుడు దక్షిణదేశవాసి , అతనికి తమిళ కన్నడములు తెలిసియుండవచ్చును . ద్రావిడ భాషలలో ప్రాస నియతము . సంస్కృతములో అవసరము లేదు . శివపంచాక్షర నక్షత్రమాలాస్తోత్రములో గల 27 పద్యాలకు ద్వితీయాక్షరప్రాసను వాడినారు . క్రింద చంచలవృత్తమునకు ఒక ఉదాహరణ -
హాస్పిటల్ సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టాయి . వెంటనే కొంతమందిని ఎయిర్‌పోర్టుకి పంపించారు వాళ్లు . ఎందుకైనా మంచిదన్న ముందు జాగ్రత్తతో , చీఫ్ గైనకాలజిస్టు పసివాడిని రత్తాలుకి అప్పగించమని ఆయాచేత పంపించింది . కాని రత్తాలు ఆ బిడ్డను అందుకోలేదు .
ఆమె తన సూట్ కేస్ తెరిచి , గదిలో బీరువాల్లోనూ , డ్రెస్సరు సొరుగుల్లోనూ చకచకా తన బట్టలు సర్దేసింది . ఫ్రిజ్ లోనుండి మంచినీళ్ళ సీసా తీసుకుని తాగుతూ మంచం అంచున కూర్చుని , ఆ ఊళ్ళో వింతలు విశేషాలు చెప్పే గైడ్ చూసుకుంది . ఆమెను ఆకర్షించిన విషయం - ఆ రాత్రి ఆ ఊళ్ళో కవుల సమావేశం ఉంది . ఆ జరిగే సమయం , అడ్రెస్ ఉన్నాయి .
రైతుల భూములు పోతే ఆ భూముల్లో కూలిచేసుకుని బతికే భూమిలేని కూలీల జీవనం కూడా పోతుంది . సాగుభూములేకాక గ్రామం కూడా ఖాళీ చేయవలసి వస్తే గ్రామంలో చాకలి , మంగలి , కమ్మరి మొదలైన వృత్తులు చేసుకొని బతికే పేదల జీవనమూ పోతుంది . రైతుల భూములు , డిఫారం పట్టా భూములు , పట్టాలేకుండా ఎవరో ఒకరు సాగుచేసుకుంటున్న భూములే కాక సాగులో లేని ప్రభుత్వ బంజర్లను కూడా ప్రాజెక్టులకు , పరిశ్రమలకు అప్పగించడం జరుగుతుంటుంది . ఆ భూములతో తాడిచెట్ల , ఈతచెట్ల కల్లు తీసి బతికే గీత కార్మికుల జీవనం పోతుంది . రాళ్ళు కొట్టి అమ్ముకొని బతికే పడ్డెరల జీవనం పోతుంది . ఆ భూములలో వాగులు ఉంటే వాటిలో చేపల వేట చేసుకొని బతికే మత్య్సకారుల జీవనం పోతుంది .
మాలా గారు నా మాటని వాడేసుకుని చెప్తారా ! ! ! నిజం గా భలే ఆనందం వేసింది మీ థాంక్ యు ను చూడగానే . . . నాకు బోల్డు ఇష్టం కాకరగాయ కూర అంటే
ఎలా పనిచేస్తుంది ? 1 . పరిస్థితులన్నీ బావుంటే మొదడునుంచి వచ్చే కామసంకేతాలు అంగంలో సైక్లిక్ అనే రసాయనం విడుదలయ్యేట్టు చేస్తాయి . దీనివలన అంగస్తంభన కణజాలాలు రిలాక్స్ అయి వాటిలో ధమనులు వ్యాకోచిస్తాయి . 2 . రక్తం అంగస్తంభన కణాల్లోకి వచ్చి అంగం గట్టిపడనారంభిస్తుంది . రక్తాన్ని బయటకు తీసుకెళ్ళే సిరలు మూసుకుపోయి అంగం గట్టిగా వుండడానికి దోహదపడ్తుంది . అంగస్తంభమ సమస్య కలవారిలో సైక్లిక్ ఏః తక్కువై సిరలను గట్టిగా నొక్కేంతగా వ్యాకోచాన్ని అంగంలోని కణజాలాలు పొందలేవు . 3 . వయాగ్రా సైక్లిక్ ఏః మీద పనిచేస్తుంది . అంగస్తంభన కలిగేట్టు చేస్తుంది . జీన్ థెరపీలపై కూడా పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి . ఈ మందులన్నీ మార్కెట్లో సంచలనం కల్గిస్తున్నాయి . ఇవి వచ్చాక అనేక వేలమంది నిర్భయంగా చికిత్సకొస్తున్నారు . వయాగ్రా పరిశోధనలకు 400 మిలియన్ డాలర్లు ఖర్చు అయింది . డిప్రెషన్ కు , స్థౌల్యానికి మందులు సంచలనం సృష్టించాయి . ఈ రెండూ కెమికల్స్ తో తగ్గించవచ్చు అన్నది నిరూపణయ్యాక అంగస్తంభన సమస్య కూడా కెమికల్స్ తో తగ్గించవచ్చు అన్నది నిరూపించబడింది . వయాగ్రా వాడిన వారిలో ఆరుగురు మృతి చెందినట్లు వచ్చినవార్త గొప్ప సంచలనం సృష్టించింది . మరణం వయాగ్రా వలన కల్గిందని ఇంకా నిర్థారించబడలేదని తెలియజేసింది . అయినప్పటికీ మరణానికి కారణాలను ఫైజర్ కంపెనీ అన్వేషిస్తుంది . 10 లక్షల మంది కంటే ఎక్కువమంది ఈ మందువాడారు . అందులో చాలామంది మధ్యవయస్కులే . ఈ మందు సురక్షితమైనది . ఈ మందు లేబెల్ పై గుండె జబ్బులు కలవారు , నైట్రో గ్లిజరిన్ లేదా తక్కిన నైట్రేట్స్ తో కలిపి వాడరాదని సూచించడం జరిగింది . ఈ మరణాలు డ్రగ్ , డ్రగ్ ఇంటర్ యాక్షన్ వలన కలిగాయా ? లేదా అసలు వయాగ్రాకు సంబంధంలేనివా అన్న విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయి . మందు పరిశోధన దశలో 3000 మందిలో ఇది వాడారు . వాడిన వారిలో 8 మంది మరణించారు . మందు వాడినందువలన ఎవరిలోనూ మరణం సంభవించలేదని రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి . వయాగ్రాని నైట్రోగ్లిజరిన్ తో కలిపి వాడినప్పుడు బ్లడ్ ప్రెజర్ బాగా పడిపోయి ప్రమాదం సంభవిస్తుంది . వయాగ్రాని గుండె జబ్బులతో వాడే మందులతో కలిపి ఇవ్వనప్పటికీ పారామెడికల్స్ ఇస్తున్నారు . అంతేకాకుండా రతిక్రియలో ఉద్రేకం వలన ఎక్కువసేపు శృంగారం చేసినందు వలన గుండె జబ్బులు కలవాళ్ళకు ఒక్కొక్కసారి ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయని కంపెనీ తెలియచేస్తుంది .
గమనిక : ఈ కోర్సులను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నేరుగా నిర్వహించదు . దీని అనుమతితో ప్రయివేటు సంస్థలు మాత్రమే నిర్వహిస్తాయి . సాంకేతిక విద్యాశాఖ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుంది . అందుకని కోర్సులో చేరేటప్పుడే సంస్థలో సదుపాయాలున్నాయా , సరయిన బోధకులున్నారా ? అనే విషయాలను తెలుసుకుని చేరాలి .
ఈ రోజు పూర్తిగా అమ్మ తో చెల్లి వాళ్ళందరితో పాటు గడపాలనుకున్న కాని నాకున్న భాద్యతలతో అవకాశం లేకపోయింది . . చిరు జల్లుల్లో మసక చీకట్లో అందరికంటే ముందే నేనే అభినందనలు చెప్పివచ్చాను . . . . అమ్మకి ఎప్పుడు ఇచ్చే గులాభి గుత్తులు మాత్రం ఇవ్వలేకపోయాను . . . .
నందకాంశ సంభూతుడు , పదకవితా పితామహుడు , సంకీర్తనాచార్యుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు అవతారం చాలించి తన ఇష్టదైవంలో లీనమైన పుణ్య దినం . తన పదాలతో షోడశకళానిధికి షోడశోపచారములూ జరిపించి , ఆ వైభవమూర్తిని వేనోళ్ళ కొనియాడి , అంగజ జనకుని దివ్య శృంగార తారకల్ని వెలయించి , సంసారజలధిలో పడి దిక్కుతోచక కొట్టుకుంటున్న జీవాళికి మోక్షమార్గము చూపిన మహనీయుడు చిరస్మరణీయుడు . సుమారు ముప్ఫై రెండు వేల సంకీర్తనలు ( ఆయన 90 ఏళ్ళు బతికాడనుకుంటే , బతికున్న ప్రతిరోజూ ఒక కొత్త పాట రాసినట్టు ! ) మనకిచ్చి చివరికి - వేనామాల వెన్నుడా , నిన్ను వినుతించ నెంత వాడ ? కానిమ్మని నాకీ పుణ్యము గట్టితివీవే , అయ్యా ! అని ఆ పుణ్యం కాస్తా స్వామికే ఇచ్చేశాడు . అవును నిజమే , ఆ స్వామే తనవాడైనప్పుడు ఇంక ఈ పుణ్యమెందుకు , భుజాల మీద బరువుగాక ! సుపుత్రుడు పెదతిరుమలాచార్యుడు తండ్రి తిథినాడు ఆ మహాత్ముని ఆహ్వానిస్తున్నాడు విందారగించమని . రాళ్ళని కరగించే శ్రీరాగంలో స్వరపరిచిన ఈ కీర్తననీ , ఈ పుణ్యతిథినీ గుర్తు చేసినందుకు శ్రీ డివిఎన్ శ్రావణ కుమార్ గారికి శతకోటి వందనాలు .
హమ్మయ్య ! మొత్తానికి తెలిసింది కదా . . ఇక మీరు ప్రశాంతంగా నా స్నేహితులు - 2 రాసేయొచ్చు అనుకుంటా . .
తీరా చూస్తే , మనది ఇంజను ప్రక్క బోగీ ! అంటే ప్లాట్ ఫామ్ కి ఓ చివర - - ముష్టివాళ్లు పడుక్కొని విశ్రాంతి తీసుకొనేచోట ఆగుతుంది . వెనక్కి నడుచుకొంటూ వెళితే , ఓ అర ఫర్లాంగు దూరం లో " కిసాన్ " వాళ్ల స్టాల్ . ఇంకో ప్రక్క ఓ బండీ , దానిమీద అరటిపళ్లూ . ఆకు పచ్చ అరటిపళ్లు తగ్గాయి ఈ మధ్య యెందుకో . అలాంటివే పసుపుపచ్చవి వస్తున్నాయి .
రక్షన్వ్తక్షుణ్ణహేమోపలపటలమలం లాఘవాదుత్పతన్తః పాతఙ్గాః పన్వ్గవజ్ఞాజితపవనజవా వాజినస్తే జగన్తి యేషాం వీతాన్యచిహ్నోన్నయమపి వహతాం మార్గమాఖ్యాతి మేరా వుద్యన్నుద్దామదీప్తిర్య్దుమణిమణిశిలావేదికాజాతవేదాః 44
కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం . . కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం . .
' ' ఆట ఒప్పించుకొనే దాకా మా కాళ్ళో కడుపో పట్టుకొంటారు . తాంబూలమిచ్చినాంక పరదాగుడ్డలనీ , మెరుగు ఆముదమనీ , కాల్ల కింద చెక్కలనీ , దీపాలనీ , కోడిపిల్ల అనీ , సారాయి సీసాలనీ … . మా పానాల్దీస్తరు … . మీ సావాసమొద్దు నాయనా ! ఊరున్నమ్ముకొని ఒచ్చినందుకు … . అంతో ఇంతో కూలిబాటు ఇస్తాం … . తీసుకొని మీ దావన మీరు బోండి … . ' ' చెప్పారు కొందరు ముసలాళ్ళు .
అప్పు డార్లింగ్ . . . చాల చాలా బాగా రాసావు . . . కొన్ని మచ్చు తునకలు . . . " శిజ్జినకా శిజ్జినకా అంటారు . . నాకయితే జజ్జినకా జజ్జినకా అన్నట్టు వినిపిస్తుంది " " అలా బస్ ఎంత పాస్ట్ గా వెలుతుందో అంత కన్న స్పీడ్ గా ఒకరి డప్పు ఒకరు కొట్టేసుకుంటున్నాము " " అయినా అందరూ పెళ్ళి చేసుకునే వయసులో పెళ్ళే చేసుకుంటారు కాని నాకు లా భారసాల చేయించుకునే బంపర్ ఆఫర్ ఎవరికో గాని రాదు . . " అవును శివ . . మా టీవీ లో శివ రంజని సీరియల్ వస్తుంది . . . ఆ టైటిల్ వినగానే నాకు నువ్వే గుర్తుకు వస్తావు . . . ఎంత అందమయిన పేరు నచ్చలేదు అంటావా ? ? ? ? మరి ఇంతకి నీ బారసాలకు ( పెళ్లి ? ? ) మమ్ముల్ని పిలుస్తున్నావా , లేదా ? ? ?
బాగా రాసారు శివగారు > > ఆటోవాడికి ఎక్కేవాడు లోకువ < < హి హి హి : ) : )
హరి దేవన్న గారి అభిప్రాయం అయన వ్రాసారు . స్పందించాల్సిన బాలగోపాల్ గమ్మున వుంటే తమరికెందుకు … … . మీరు పరితపించే ముస్లిం సమాజము నుండి మీకు ఎంత వరకు ప్రశంశలు వచ్చాయో తెలుపగలరా . భారత దేశాన్ని ప్రేమించే , కాశ్మీర్ నుండి కన్యాకుమారి నుండి దేశమంతా ఒక్కటే , అనే ఒక హిందువుగా ( తీవ్రవాదిగా మీదృష్టిలో ) అడుగుతున్నాను . తమరు నిజంగా జర్నలిస్ట్ అయివుంటే ప్రపంచ చరిత్ర , మత , రాజకీయ విశ్లేషణలతో ఉన్న పుస్తకాలని చదివి , వికీపీడియా లేదా ఇతర సమాచారములనుండి దేశాలవారీగా ఎక్కడ ముస్లిం ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు , హిందువుల వలన సమస్యలు ఎక్కడ వున్నాయి , అసలు ఏ మతంలో తీవ్రవాదులు ఉన్నారో సశాశ్రీయంగా ఒక మంచి వ్యాసము వ్రాయండి . నాకు కొంత తెలిసినా మీ అంత గొప్పగా వ్రాయలేను కావున తమరిని అబ్యర్ధిస్తున్నాము .
ఒకానొక సాప్ట్ వేర్ కంపెనీ లో ముగ్గురు ఫ్రెండ్స్ వున్నారు . ఒకరు తెలుగు , ఇంకొకరు తమిళ్ , మరొకరు ఒక సర్దార్ జీ . ముగ్గురూ రోజూ లంచ్ టైం లో కలుసుకునే వారు . ఒకరోజు తెలుగు అతను అన్నాడు చా . . . మా ఆవిడ రోజూ గోంగూర పప్పే వండి కారియర్ లో పెడుతోంది . సరే ఈ రోజు చూస్తాను . రేపు గనక గోంగూర పప్పే కారియర్ లో వుంటే ఈ ఏడో ఫ్లోర్ నుంచి దూకేస్తాను అన్నాడు . తమిళ్ అతను కూడా తన భార్య రోజూ సాంబారే వండుతోందనీ , రేపు గనక సాంబారే ఉంటే కారియర్ లో తను కూడా ఏడో ఫ్లోర్ నుంచి దూకేస్తాననీ అన్నాడు . అలాగే సర్దార్ జీ కూడా రేపు గనక నా కారియర్ లో చపాతీలు ఉంటే నేను కూడా ఏడో ఫ్లోర్ నుంచి దూకేస్తాను అన్నాడు . మరుసటి రోజు ముగ్గురూ లంచ్ కి కలుసుకున్నారు . తెలుగు అతను కారియర్ తెరిచి అన్నాడు చా . . . మా ఆవిడ ఈ రోజు కూడా గోంగూర పప్పే వండింది అని ఏడో ఫ్లోర్ నుంచి దూకేస్తాడు . అలాగే తమిళ్ అతను కూడా సాంబార్ ఉండటం వల్ల , ఏడో ఫ్లోర్ నుంచి దూకేస్తాడు . సర్దార్ జీ కూడా చపాతీలు ఉండటం వల్ల తను కూడా దూకేస్తాడు . ఆ తర్వాత రోజు ముగ్గురు భార్యలూ ( తెలుగు , తమిళ్ , సర్దార్ జీ ల ) కలిసి ఏడూస్తూ వుంటారు . అయ్యో ! ఇలా చనిపోతాడని తెలిస్తే గోంగూర పప్పు చేసేదాన్ని కాదే ? అని తెలుగు అతని భార్య ఏడుస్తూ వుంటుంది . అలాగే తమిళ్ అతని భార్య అయ్యో తెలిస్తే సాంబర్ చేసేదాన్ని కాదే అని ఏడుస్తూ వుంటుంది . కానీ సర్దార్జీ భార్య , నాకేమీ అర్థం కావట్లేదు . ఎందుకు చనిపోయాడో ! ! ! రోజూ తనే వండుకుంటాడు అంది .
చాదర్‌ఘాట్ రైల్వే బ్రిడ్జి కింద గోరీల మధ్యన మట్టిలోంచి సుప్తాస్థికల జననాంతర సౌహృదమేదో మా ఆవరణను అంటి పెట్టుకునే ఉంటుంది .
చాల బాగా వ్రాసారండి . . ఒక రకం గా ఆ రోజోల్లో స్టాండర్డ్స్ బట్టి చూస్తె వాలా కుటుంబం కూడా మరీ అందరూ చెప్పే అంత హీనం గా ఏమీ కాలేదు . జబ్బులు , అకాల మరణాలు ఆ రోజుల్లో మామూలే . మనం మన పెద్ద వాళ్ళని అడిగితె ( మన తాట గారి తండ్రుల కాలం అది ) తెలుస్తూంది ఎంతమంది ఎలా జబ్బున పడ్డారో ఆకాలం గా చని పొయ్యే వారో . రవి చనిపోవటం ఏంటో సహజ మైన మరణం . ఎంతమంది బాల వితన్తువలు లేరు ఆ రోజుల్లో మోడుగా . . శౌ గారు తర్వాతి కాలం లో గొప్ప పేరు సంపాదించారు యోగినిగా . . బతికిన అన్ని నాళ్ళు చలం పిల్లలు ప్రేమతో సంతోషంగా బతికారు . . మన ద్రుష్టి తో వాళ్ళని చూస్తె వాళ్లకు గొప్ప ఆస్తులు లేక పోవచ్చు . . ఏనాడూ కొంత మందికి పెట్టారు గానీ అడుక్కు తిన లేదు .
సీతారాం రెడ్డి గారు ! మీ వ్యాఖ్యలకు సమాధానం చాలా పెద్దది . సిద్ధం చేస్తున్నాను . . దయచేసి వేచి చూడండి . వీలైతే కామెంట్ గాకాక టపాగా అందిస్తాను .
పోస్టాఫీసులో ఓ పదిరూపాయలతో దరఖాస్తు కొనుక్కొని , ఫోటోలూ వగైరాలతో పూర్తిచేసి , ఇంకో రెండువందల నలభై రూపాయలు కట్టి , దాఖలు చేస్తే - - ఓ వారం పదిరోజుల్లో పోస్ట్ మేన్ల ద్వారా చిరునామా నిర్ధారణ చేసుకొని , మనకి ఓ కార్డు ఇస్తారట . అది ఓ సంవత్సరం పాటు చెల్లుతుందట . మళ్లీ నవీకరణకోసం నూట నలభై రూపాయలు కట్టాలట . ఇదోరకం కార్డు !
అనిల్ కుంబ్లే . భారత దేశ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్ విన్నర్ . నిబద్ధతకీ , హుందాతనానికీ నిలువెత్తు నిదర్శనం . అవును మరి . ఆరడుగుల పైన ఎత్తు . భారత దేశనికి captain గానూ సేవలందించి Sidney టెస్టు సందర్భంగా ఒక నాయకుడు అంటే ఎలా ఉండలో మనకి అర్థంఅయ్యేలా చెప్పినవాడు . రిటైర్ అయినప్పుడు ధోనీ భుజాల పైన మోసి మరీ తన అభిమానాన్ని చాటుకున్నాడు . అంతేనా ? ట్రోఫీ ని కుంబ్లేతోనే పంచుకుని , తన గౌరవాన్ని చాటిచెప్పాడు . కుంబ్లే . ద లెజండ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ . సచిన్ కి కూడా సాధ్యపడనన్ని విజయాలని జట్టుకు కట్టబెట్టినా జనంలో అంత పాప్యులారిటీ రాలేదు కానీ ఎనటికీ తరగని గౌరవాన్ని మాత్రం అందుకున్నాడు . ఇప్పుడు Royal Challengers Bangalore ని విజయాల బాట పట్టించి తానెప్పుడూ ఎవర్గ్రీన్ అని చాటాడు . కోట్లకట్టలు విరజిమ్మి పీటర్సెన్ ని కొన్నా , ద్రవిడ్ ని captain గా వద్దన్నా , నిరుడు టెస్ట్ జట్టుని కొన్నాడని విమర్శలు ఎదుర్కొన్నా . . . మాల్యా ఈ సారి చేసిన మంచి పని కుంబ్లేకి captaincy అప్పజెప్పటం . ఫోర్స్ ఇండియా , ఈ ఛాలెంజర్స్ దెబ్బకి విదేశీ మోజు దిగటంతో కాస్త మెదడు ఉపయోగించి సరైన నిర్ణయాలు తీసుకుని కాస్త ఊపిరి పీల్చుకున్నాడు . రాజస్తాన్ పై 5 / 5 తో మొదలెట్టిన కుంబ్లే ఈ IPL లో most successful spinner . ద్రావిడ్ కన్నా గొప్ప captain అయిన కుంబ్లేకి భారత captaincy ఆలస్యంగానే దక్కింది . దానికి తోడు జట్టు కాస్త అలసత్వంతో ఉన్న సమయం అది . తనూ కాస్త ఫామ్ కోల్పోయాడు . ధోనీ మేనియా కూడా ఊపందుకుంటోంది . ఆ సమయామ్లో కూడా తన సంయమనం కోల్పోని ధీరోదాత్తుడు . మన జంబో . ' భారత క్రికెట్ టార్జాన్ ' గా పరిచయం అయిన మహేంద్ర సింగ్ ధోనీ గురించి ఎవరికీ చెప్పనవసరం లేదు . వికెట్‍కీపింగ్ అంత గొప్పగా లేకున్నా తన batting విన్యాసాలతో ఆకట్టుకుని , క్రమంగా టెస్ట్ స్థాయికి ఎదిగన ధోనీ గత టి20 ప్రపంచ కప్ లో నాయకత్వం నెరిపే అవకాశం రావటాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని ముందు వన్డే టీమ్ కి , ఆ తరువాత టెస్ట్ టీమ్ కి captain అయి , ఇప్పుడు IPL లో చెన్నై సూపర్ కింగ్స్ ని సెమీస్ కి చేర్చి , తనలాంటి వాళ్ళకి గురుతుల్యుడైన కుంబ్లేకి ఎదురు నిల్చాడు . ధోనీ కి అచ్చొచ్చిన , కుర్రాళ్ళ ఆట అనే ఈ ఫార్మాట్ లో కుంబ్లే గెలిస్తే భలే మజా . ఓల్డ్ హార్సెస్ ఆర్ మేకింగ్ వేవ్స్ హియర్ ఇన్ దిస్ IPL . ఇది మొదలెట్టి చాలా సేపైనా కరన్ట్ పోయి ఇదిగో ఇప్పుడు స్కోరు RCB 98 / 3 while chasing 147 , అన్న సమయంలో వచ్చింది . ద్రవిడ్ ఔటట . మా బాబాయి కొడుకు చెన్నై అంటున్నాడు . But Heros must win . Kumble is one . So , RCB జైహో . కమాన్ జంబో కమాన్ . కుంబ్లేకి శుభాకాంక్షలు చెప్పండి . నేను మ్యాచ్ చూడటానికి వెళ్తున్నాను . మీరు చూసే సమయానికి ఫలితం తేలి పోతుంది కదా . . . ! : - ) * * * * * * * * * తాజా వార్త : కుంబ్లే టీమ్ విన్స్ . ధోనీ కా ఇలాకా మే కుంబ్లే కా ధమాకా .
" ఆర్యులు భారతదేశంపై దాడి చేసి జయించారనేది అభూత కల్పన . " అని డా ॥ బి . ఆర్ . అంబేద్కర్ వాదన ( శూద్రులెవరు ? అంబేద్కర్ రచనలు ప్రసంగాలు 7 వ సంపుటి , 1992 : 73 ) అంతేకాదు " దాసులు , దస్యులు భారత దేశానికి చెందిన ఆదిమ తెగల వారు అనడం ఖచ్చితంగా తప్పు " [ 3 పే . 73 ] అని కూడా డా ॥ బి . ఆర్ . అంబేద్కర్ ఆర్యజాతి సిద్ధాంతాన్ని పూర్వ పక్షం చేసే ప్రయత్నం చేశారు .
అది 2035 సమచ్చరం . మన దేశానికి ఎన్నికలు జరగనున్నాయి . దేశం అంటే దేశం కాదుగానీ రాష్ట్రం . రాష్ట్రం అంటే రాష్ట్రం కాదుగాని అదో ఇదో తెలియని ఓ ప్రదేశం . అప్పటికి 25 జిల్లాల రాష్ట్రం 50 ముక్కలాయ , ఎవ్వనికి ఏది జిల్లానో , ఏది రాష్ట్రమో ఏది దేశమో , ఏది పెపంచమో గుర్తుండే తెలివి పోనేపోయ్యింది . అప్పటికి ప్రతీ సమచ్చరం ఎలచ్చన్లు జనాలకి అలవాటాయిపొయినియ్ . జనాలు ఇలా అనుకుంటూన్నరు " ఆ కాలంలో ( 1900 , 2000లల్లో ) ఐదు సమచ్చరాలకి ఓ పాలి ఎలచ్చన్లు జరిగినయ్యంటా " అని . సమచ్చరం సమచ్చరానికి కూటములు మారిపోతున్నయ్ . 2034 గెల్చిన కూటామిలో ఉన్న పార్టీలు పభుత్వాన్ని ఇరగనూకి మళ్లీ ఎలచ్చన్ల కోశం ఎగబడుతున్నయ్ . ఈసారి మాలమహానాడు ఏ , బీ , సీ , డీ , మాదిగదండోరా 1 , 2 , 3 , 8 , కాపు 5 , 2 , 9 , 11 , రెడ్డి 1 , 6 , 9 , కుమ్మరి 23 , 45 , వడ్డెర 5 , 12 , రజక 1ఎ , 56డీ , గొల్లలు 23 , 45 బేపనోళ్లు 2 , 3 , 7 ఈళ్లందరూ ఓ కూటమి అయితే , మాలమహానాడు 4 , 5 , 6 , 7 , కమ్మ 3 , 4 , 7ఇ , 8క , రెడ్డి 89 , 78 , ఇంకో కూటమి అయితే , మిగతావోళ్లు ఆళ్లకి చేతనైన కూటముల్లోజేరి ఎలచ్చన్లలో పోటీకి దిగుతున్నరు . ఎలచ్చను కమీషనుకి సానా కష్టంగుండింది ఈతూలి . పార్టీలు పెరిగిపోయ , చాంతాడంతైనై వోటు పత్రాలు . ఎల్ట్రానిక్కు వోటు మిషన్లు పనిజెయ్యటంలా మరి బయిట 61 ఉండిందిగా వేడి . వోటు మిషన్లు ఈ సారికి ఒక్కోటి 50కేజీల బరువు ఉండిందాయా , మరి ఇన్ని పార్టీల గుర్తుల్ని సూపించాలిగా . 2037 సార్వర్త్రిక ఎలచ్చన్లకి స్పీచ్ రికొగ్నీషన్ తెస్తాం అని సెప్తుండే ఎలచ్చను కమీషను . అంటే , వోటేసే బోనులోకి పొయ్యి , నా వోటు పలానోడికి అని సెప్పలి . ఏదో కార్డుముక్క ఇస్తరంట , దానిపైన బారుకోడు ఉటదంట , ఆ వోటేసేబోనులోకెళ్లి యాడనో ఆ కార్డుముక్కనిబెట్టి గీకితే నువ్వు పలానా అనిచెపుద్దంట , నీవోటెవ్వాడికీ అని అడుగుతే పలానోడికి అనాలంట . మూణ్నిమిషాలు టైము , నువ్వు సెప్పకపోతే , అదే రూలింగు పార్టీవోడికే పోద్ది వోటు అనికూడా సెప్పుకుంటున్నరు జనాలు . బీరుబారులు ఇన్నంగానీ బారుకోడేందో ! ! పుచు ! ! కలికాలం ఇసాపట్ణం ! ! నల్గురితోపాటూ నాగలచ్చిమి . సేసేదేముంది . ఈ మరని ఎట్టా ట్యాంపర్ జెయ్యొచ్చు అని పార్టీలు ఆలోచన కూడా మొదలుబెట్టినయి అప్పుడె . టీవీషోలు , పాడ్టీవీ షోలు వీడియోకాస్టుల్లో ఓ అని ఊదరకొడుతున్నరు ఎలచ్చన్లలో నిలబడేటోళ్లు . పతీ కూటమి పలాని కూటమి ఇంకో కూటమికి వోటేయొద్దు ఏసిన్రో ఇంకమీరు జచ్చిన్రే అని చెప్తుండింది . 2034 సమచ్చరం ఎలచ్చన్ల వోటూ శాతం 41 . గెల్చినోడికి 11 . 5 శాతం పడినయ్ వోట్లు . మిగతావి మిగిల్నోళ్లు పంచుకున్నరు . అది ఈ పేరు ఊరు తెలియని దేశ / రాష్ట్ర / ప్రాంత 5సమచ్చరాల వోటు సరిత్రలో రికార్డంట . మరి ఈతూలి ఎట్టుంటదో ? ఎందుకింత వోటు శాతం పడిపోతున్నదీ అని ఓ కమీషన్నేసిన్రంట ఎలచ్చను కమీషనోళ్లు . సదువుకున్న కుఱ్ఱకారంతా ఆఫ్రికాకి , అరబ్బు రష్యా దేశాలకి వలసపోతున్నరని తేలిందంని వార్త . అదేందది , అక్కడకూడా జనాలున్నారుగా అని ఓ తెలివితక్కూవోడు అడుగుతుంటె ఓ తెలివైనోడు మూడో పెపంచ యుద్ధంలో అమెరికా సంకీర్ణసేన ఆదేశాలన్నిట్నీ కొల్లగొట్టిందిగా , ఇంకెవ్వరు మిగిలిన్రక్కడా ? అందుకే మనోళ్లు అక్కడకి జారుకుంటుంన్నరు అని చెప్తుంటే నే ఇన్నా . మరి ఆ పొయ్యేదేదో అమెరికానే పోవచ్చుగా అన్నడింకో తెలివితక్కువోడు . అక్కడేం మిగిలింది న్యూక్లియర్ రేడియేషను తప్ప అంటున్నడూ ఆ తెలివైనోడు . ఏందో అంతా గోలగోలగుండింది బతుకు . ( . . . . . . . . . . . . . . . . . . . అసంపూర్ణం )
అల్ మతన్ ( బోధించిన అసలు విషయం ) " లంచం ఇచ్చేవారు మరియు లంచం పుచ్చుకునే వారిపై నుండి ' అల్లాహ్ యొక్క కరుణ తొలిగి పోవుగాక ' అని మరియు ' అల్లాహ్ యొక్క తిరస్కారం కలుగు గాక అని ' రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం శపించినారు " . ముస్నద్ అహమద్ హదీథ్ గ్రంధం
నరసింహారావుగారూ లోగడ మీరు చెబితేనే శ్రీ వావిలికొలను సుబ్బారావుగారు వ్రాసిన రామాయణాన్నిగుఱించి విన్నాను . ఏతద్రామాయణాన్ని నేను చదవలేదండీ . ఎక్కడ ప్రాప్తిస్తుందో తెలియజేస్తే నేను కూడా తెప్పించుకునే ప్రయత్నం చేస్తాను . మంచి విషయాన్ని పునః గుర్తుజేసినందుకు కృతజ్ఞుణ్ణి . నమస్సులతో భవదీయుడు
మంచి ప్రయత్నం . బ్లాగరులో కూడా పని చేసేట్టు చెయ్యగలుగుతారేమో చూడండి .
పుష్పం నా యది నా పాత్రం ఫలం నేష్ట మథో ముఖం దు : ఖదం తత్సమాఖ్యాతం యథోత్సవం తహర్పణం లక్ష్మీ సరస్వతి పుష్పేషు లక్ష్మీ ర్వ సతి పుష్కరే ప్ష్పాంజతా నతోద్దోష్ : బిల్వ పత్ర మథోముఖం
నాకు నచ్చని విషయం ఇంకొకటి వుంది ఈ కధలో . కొడుకు పెళ్ళి చేసుకోమని తల్లిని సతాయిస్తూ వుంటాడు . అది ఆ కొడుకు దృష్టిలో అభ్యుదయం అనుకోండీ . పెద్దవాళ్ళు ఏ వయసులో నైనా ప్రేమతో పెళ్ళి చేసుకుంటే , దాన్ని సమర్థించడం తప్పకుండా అభ్యుదయమే . పిల్లల్ని కని , వాళ్ళని పెంచి , వాళ్ళ పెళ్ళి చూశాక , తమ జీవితం అయిపోయిందనుకోనక్కర్లేదు . తల్లుల పెళ్ళిళ్ళనీ , తండ్రుల పెళ్ళిళ్లనీ ( అవి ప్రేమతో జరిగినప్పుడు మాత్రం ) పిల్లలు భరించలేకపోతే , అది వాళ్ళ ఖర్మ . అయితే , అలా అభ్యుదయంగా వుండడం కోసం , ఒక కొడుకు , " అమ్మా , పెళ్ళి చేసుకో , పెళ్ళి చేసుకో , పెళ్ళి చేసుకో " అని అనడం చాలా ఎబ్బెట్టుగా , అసహ్యంగా వుంటుంది . నాకు తెలుసున్న ఒక రచయిత అయితే , కొడుకు అడగడాన్ని ఇలా రాస్తాడు , " అమ్మా , ఏంటే ! మళ్ళీ పెళ్ళీ చేసుకోవే ! నా పెళ్ళాంతో నేనుంటే నీకు దిక్కెవరే ? నువ్వు కూడా పెళ్ళి చేసుకోవే . బాగుంటుందే . నీకో తోడుంటుందే ! " అంటూ . ఇలాంటి రాతలు చదవడానికి ఎంత జుగుప్స కలుగుతుందో . పెళ్ళయ్యాక కూడా పెద్దవాళ్ళతో కలిసి వుండేంత వాతావరణం , సంస్కారం , చైతన్యం లేకపోతే ( ఇవి వుండటం ఆదర్శ వంతమే అయినా , ప్రస్తుత కాలంలో ఇవి లేకపోవడం చాలా సహజమైన విషయం గానే వుంది ) , పెద్దవాళ్లకి కొంచెం దూరంగా వుంటూ , వాళ్ళతో సంబంధలో వుంటూ , వాళ్ళ కష్టసుఖాలు కనుక్కుంటూ , పట్టించుకుంటూ వుండొచ్చు . అంతేగానీ వాళ్ళకి ఎలాగో ఒకలాగా పెళ్ళి చేసెయ్యాలని చూడ్డం చాలా అభ్యంతర కరం . పెద్దవాళ్ళు చిన్నవాళ్ళతో వాళ్ళ పెళ్ళి గురించి మాట్టాడ్డం వేరూ , పిల్లలు వాళ్ళ పెద్దవాళ్ళతో ఆ పెద్దవాళ్ళ పెళ్ళి గురించి మాట్టాడ్డం వేరూ . చిన్నంతరం , పెద్దంతరం అంటారే , అలాంటివి ఇటువంటి విషయాల్లోనే పాటించాలి . లేకపోతే , " వరుడు " అనే కొత్త సినిమాలో అల్లు అర్జున్ తల్లి సుహాసినితో ఎలా వెకిలిగా మాట్టాడుతాడో , అలా తయారవుతారు పిల్లలు దరిద్రంగా .
ప్రతీ పాటకీ తప్పనిసరిగా ఇవి ఉండాలి : పాడినవారు , ఏ చిత్రం , రాసింది ఎవరు , సంగీతం ఎవరు , మొట్టమొదటి చరణం ( ఒకవేళ్ల పాటకి ముందు ఇంట్రో ఉంటే అంత్యాక్షరం దానితో మొదలుకావాలి ) . ఇక , పాట మొత్తం అందించగలిగితే భేష్
గురిపెట్టిన నిశ్శబ్దమా మీరిన శోకానందమా పరివేషమా , ప్రేమికులపై చిరు పక్షీ , దయజూపు .
మెచ్చుకున్న వారికి ధన్యవాదాలు . సంతోషం . @ ఉషమ్మ ప్రశ్నలు పుట్టేవే పిల్లల నోళ్లలోంచి . నచ్చిందా ? థాంక్స్ . @ రాజన్ గారు నా ప్రమధ గణాన్ని వదుల్చుకొని ప్రశాంతంగా నేను కంప్యూటర్ తో కాపురం చెయ్యగలిగేది ఒక్క శుక్రవారం రాత్రే . అందుకని .
నేనీమధ్య పాతపుస్తకాల దుమ్ము దులిపి చదువుకుంటున్నాను . బాలనాగమ్మ కథ , ఆంధ్రరాష్ట్రము , మాతృమందిరము మొదలైనవన్నమాట . ఈ చదవడం , రాయడం అనేవి చాలా పెద్దపనులు . పైకి కనిపించినంత , అందఱూ అనుకుంటున్నంత సులభం కాదు . చిన్నప్పుడు ఒక్కరోజులో మూణ్ణాలుగొందల పుటలు అవలీలగా చదివేసిన సందర్భాలున్నాయి . ఆ పఠనవేగం ఇప్పుడు మందగించడానికి ఎన్నో కారణాలుండొచ్చు . ధనసంపాదనా వ్యాపకం , తదితర బాధ్యతలూ భౌతిక కారణాలైతే , లోకానుభవం ( అని మనం అనుకుంటున్నది ) ఏ విషయాన్నీ ఒకపట్టాన ఒప్పుకోనివ్వక పోవడం , అందుమూలంగా ప్రతిదాన్నీ సవిమర్శంగా చదివేటప్పటికి పుణ్యకాలం గతించడం మొదలైనవి మానసిక కారణాలని చెప్పుకోవచ్చు . " పాత పుస్తకాలెందుకు ? బహుకొత్త పుస్తకాలుండగా ? " అని ఎవరైనా అడగొచ్చు . కొత్త పుస్తకాలున్నాయని తెలుసు . కానీ నేను వాటిని దూరంగా పెట్టడానికొక చిత్రమైన కారణం ఉంది . ఎందుకో గానీ కొత్త పుస్తకాల్లో ఊహాశక్తి బాగా తగ్గిపోయింది . అంతా వాస్తవం , వాస్తవం , వాస్తవం , వాస్తవాల మయం . బ్లాగులు కూడా పచ్చి వాస్తవాల భూయిష్ఠం . ఎలాగూ చచ్చినట్లు ప్రతిరోజూ వాస్తవ ప్రపంచంలోనే బతుకుతున్నాం కదా , కాస్తయినా మన ఊహల పల్లకీని ఉఱకలెత్తించే సాహిత్యం వద్దా ? హృదయానికి హత్తుకునే కల్పనలొద్దా ? మనిషి ఎల్లపొద్దులూ సమకాలంలోనే బతికితీఱాలనేముంది ? మానవాత్మ సంకుచిత స్థల , కాలపరిధుల్ని అధిగమించి భూత భవిష్యత్తుల్లోకి శాఖాచంక్రమణం చేస్తే తప్పేముంది ? సర్వదా ఇవే రాజకీయాలు , ఇవే పొట్టకూటి చదువులు . ఇవే ఉద్యోగాలూ , వ్యాపారాలూ , వీటిల్లో కుళ్ళూ , కుత్సితాలూ . రసానందంలో ధ్వని ( suggestivity ) కి చాలా ప్రాధాన్యముంది . అయితే ఆ ధ్వని స్ఫురించాలన్నా , తద్ద్వారా రసానందం కలగాలన్నా చెప్పేవాడితో పాటు వినేవాడిక్కూడా ఊహాశక్తి ఉండాలి . ధ్వని అంటే రచయిత / దర్శకుడు కొంచెం చెప్పి కొంచెం చెప్పకుండా సూచించి వదిలెయ్యాలి . మనం హాస్యాన్ని ఆస్వాదించ గలగడానికి కారణం ఈ ధ్వనే . కొంచెం చెప్పి వదిలెయ్యడంలో ఉన్న మాధుర్యం ఎలా ఉంటుందంటే , ఉదాహరణకి - చాలా సంవత్సరాల క్రితం మీకు రైల్వే స్టేషన్ లో పరిచయమైన వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ కార్యాలయానికొస్తాడు . మీరు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి లేచి చేయందిస్తూ , " మీరు . . . " అని ఒక్కముక్కతో ఆగిపోతారు . ఆ ఒక్క " మీరు . . . " అన్న పదానికే ఆ వ్యక్తికి ఎంతో ఆనందం కలుగుతుంది . రసానందం కూడా అలాంటిదే . ఈ దేశంలో మొదట్నుంచి బాలసాహిత్యం అంటూ ఏమీ లేదు . ఇక్కడ పెద్దల సాహిత్యమే పిల్లలు కూడా చదువుతారు . పెద్దల సాహిత్యమే పిల్లల శైలిలోకి తర్జుమా చేయబడి బాలసాహిత్యంగా చెలామణి అవుతోంది . అలాంటిది , ఇప్పుడు తలెత్తిన సరికొత్త పరిణామమేంటంటే - ఆఖరికి ఆ పెద్దల సాహిత్యం కూడా కఱువైపోవడం . పిల్లల సంగతి సరే సరి ! వాళ్ళిప్పుడు అన్ని రకాల సాహిత్యాలకీ పూర్తిగా దూరమైపోయారు . ముందేమో " తెలుగు మాట్లాడొద్దు , తెలుగు పుస్తకాలు చదవొద్దు " అనేవారు . ఇప్పుడేమో " ఏ పుస్తకాలూ చదవకూడదు , క్లాసు పుస్తకాలు తప్ప ! " అనే పరిస్థితి వచ్చింది . ఏతావతా వాళ్ళు కూడా మనలాగే కటిక వాస్తవ ప్రపంచంలో బతుకుతున్నారు . ఈ కటిక వాస్తవాల వాతావరణంలో ఆదర్శాలూ , ఆశయాలూ వికసించడం దుస్సాధ్యం . చక్కని పరిణత ఊహలతో , కల్పనలతో , నవ్య కథనశైలితో , భాషాసౌందర్యంతో రసాత్మకత్వంతో అలరించి , ఆనందింపజేసే నవలలూ , నాటకాలూ , పద్యకావ్యాలూ విస్తారంగా ఉత్పత్తి కావడంలేదు , కనీసం ఈ పెఱిగిన జనాభా నిష్పత్తిలో ! ఆ ఉన్న కొద్దిపాటి కల్పనా సాహిత్యమూ ఏవో జగన్నాథ రథచక్రాల్లాంటి బరువైన సిద్ధాంతాల మోపు భుజాన వేసుకుని కాయలు కాచిన వ్యవహారం . ఆ విధంగా అలిసిపోయి చెమట తుడుచుకుంటున్న ఆ సాహిత్యంలో అమాయకత్వ పరిమళం లోపించింది . అమాయకత్వం నశించడం ఊహాశక్తికి దెబ్బ . అందుచేత ఇప్పుడు ఎటు చూసినా ఊహకి పనిచెప్పని పుస్తకాలే . ట్రావెలాగులు , లేదా ఎవరికి వారు సుత్తీ , శాణం తీసుకుని తమని తాము చెక్కుకోవాలని చెప్పే వ్యక్తిత్వ వికాస పుస్తకాలూ , ఇంటర్వ్యూ గైడ్లు , డబ్బు సంపాదించడం ఎలా ? జీవితచరిత్రలు , మోనోగ్రాఫులు , ఫలానా కమిటీవారి నిజనిర్ధారణ నివేదిక , విరోధి నామసంవత్సర పంచాంగం ! ముందేమో ( ఛందః ) కవిత్వాలొద్దన్నారు , కవితలు ముద్దన్నారు . ఆ తరువాత కవితలు కూడా వద్దు , నవలలు కావాలన్నారు . ఆ తరువాత నవలలు కూడా వద్దు , చిన్నకథలు చాలన్నారు . ఆ తరువాత అవీ వద్దు , టీవీ సీరియళ్ళు చాలన్నారు . ఈ రోజు టీవీ సీరియళ్ళక్కూడా మంగళం పాడి న్యూస్ ఛానళ్ళు చూస్తున్నారు . పోనీ , ఆ టీవీయే చూద్దామంటే అక్కడ కూడా అన్నీ వాస్తవాలే . అన్నీ న్యూస్ ఛానళ్ళే . మనకిన్ని న్యూస్ ఛానళ్ళెందుకో అర్థంకాదు . ఈ రకమైన ఛానళ్ళు ప్రారంభించడంలో ఉన్న సౌలభ్యం - వీటిల్లో ఏ కార్యక్రమాన్నీ ఊహాశక్తితో రూపొందించే పనుండదు . అన్నీ వాస్తవ సంఘటనలే చూపిస్తారు . మేకప్ లేని వాస్తవ మనుషులే మాట్లాడతారు . సెట్టింగులు కాని వాస్తవ ప్రదేశాలే చూపిస్తారు . సొంతతనం గల కల్పనా కథలతో కూడుకున్న టెలిఫిలిములూ , ధారావాహికలూ ప్రసారం చేసే ఛానళ్లు మనకి చాలా తక్కువ . ఆ ధారావాహికలు కూడా పచ్చి వాస్తవాల మయం . వార్తాపత్రికల నుంచి స్ఫూర్తి పొందినట్లుంటాయి వాటిల్లో సంఘటనలు . ఉదాహరణకి - వాస్తవ ప్రపంచంలో అమ్మాయిల మీద ఆమ్లదాడి ( acid attack ) జఱిగితే వెనువెంటనే టీవీకథలో కూడా ఆమ్లదాడి ఘటనొకటి ప్రవేశపెడతారు . మీ వాస్తవ ముఖ్యమంత్రి భూకబ్జాల మనిషైతే సీరియల్లో మంత్రిగారు కూడా అలాంటివాడే అయ్యుంటాడు . ఇహ కల్పనకి తావేముంది ? రచయిత గొప్పేముంది ? వీటి సంగతే ఇలా ఉంటే ఇంకా కఠోర వాస్తవాల భరితంగా రియాలిటీ షోల పేరుతో ఊహకి స్థానం లేని ప్రత్యక్ష ప్రసారాలొకటి . ఈ పోకడ పధ్నాలుగేళ్ళ క్రితమే మొదలయింది . " ఊహా ! నీ చిఱునామా ఎక్కడ ? " అని ఆర్తనాదం చేస్తూ దేవులాడాల్సిన పరిస్థితి . మన తెలుగు సినిమాల కథలన్నీ ఎక్కణ్ణుంచో ఎత్తుకొచ్చినవనే అపప్రథ ఉండనే ఉంది . కొత్త కథల మీద డబ్బులు పెట్టే దమ్ము మన నిర్మాతలకి లేదనేది అందఱికీ తెలిసినదే . దాన్తో పాటు , ఒక ఊహా , ఉత్ప్రేక్షా , రొమాన్సు ఏమీ లేకుండా ఈ కటిక వాస్తవాల ప్రపంచంలోనే చిన్నప్పట్నుంచి పెఱగడం కూడా మనలో ఊహాశక్తులు వికసించకపోవడానికీ , మనం ఫక్తు కాపీరాయుళ్ళుగా అవతరించడానికీ ఒక కారణం కావచ్చు . మన చుట్టూ ఉన్న సమాజం ఏ భాష మాట్లాడుతుందో ఆ భాష ( మాతృభాష ) లో చదవక పోవడం కూడా ఊహాశక్తికి దెబ్బే . ఊహల్ని కూడా పరాయిభాషా సమాజం నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది . మన చదువులన్నీ విజ్ఞానానికి ( science ) పెద్దపీట వేస్తాయి . ఈ తరహా చదువుల్లో మునిగినవాళ్ళకి అన్నీ చిహ్నాల ( symbols ) లోను , మాటల్లోను ఆలోచించడం అలవాటై వాటికి అందని భావపటలాల్ని అబద్ధాలనుకుంటున్నారు . కేవలం మాటల్ని ఆశ్రయించుకున్నవారి ఆలోచనాశక్తిలో ఏర్పడే లోపమేంటంటే - అటువంటివారు తర్కాలు బాగా సాగదీస్తారు కానీ ఊహాశక్తి లోపించడం చేత , అవతలివారికి Benefit of doubt ఇవ్వడానికి ఇష్టపడరు గనుక , వారు విషయాల్ని ఏకమొత్తంగా కాక ముక్కలు ముక్కలుగా ఆలోచిస్తారు . అందుచేత వారిలో అవగాహనా లోపాలు హెచ్చు . మా చిన్నప్పుడు ఎవరైనా ఏదైనా ఒక విషయం చెబితే మిగతాది మేము ఊహాశక్తితో అల్లుకుపోయేవాళ్ళం . ఈ తరంలో ఆ లక్షణమే కనిపించడం లేదు . " అలా అన్నావు కాబట్టి మిగతాది కూడా నువ్వే చెప్పు " అంటున్నారు . తెలియడమూ , తెలియజెప్పడమూ - ఈ రెండూ వేఱువేఱు విషయాలని వీళ్ళకి తెలియదు . అనుభూతిల్లడమూ , అనుభూతిని వ్యక్తీకరించడమూ - ఇవి విభిన్న అంశాలని వీళ్ళెఱగరు . ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు మిగతాది చెప్పడానికి ఇష్టపడకపోతే , లేదా చెప్పలేకపోతే మీకు తెలియదనే వీళ్ళ లెక్క . దాన్ని తమ ఊఃహాశక్తిలోపం అని కాక అవతలివాళ్ళ తర్కహీనత్వం అనుకుంటున్నారు . భావప్రజ్ఞ ( Emotional intelligence ) అని ఒకటుంది . అంటే విషయాల్ని తర్కం ద్వారా కాక , పరిస్థితుల్ని మనసుకు ఆవహింప జేసుకుని , అనుభూతి చెందడం ద్వారా పసిగట్టి తెలుసుకొని , అర్థం చేసుకునే శక్తి . అది బాగా తగ్గిపోయింది . అది ఆడవాళ్ళకి మగవాళ్ళ కంటే ఒక అంగుళం ఎక్కువ అంటారు . కానీ ఆడవాళ్ళని మగ విద్యావిధానంలోకి తోశాక వాళ్ళలో కూడా అది తగ్గిపోతోందని నా అనుమానం . ఏ ప్రశ్నలూ వెయ్యలేనివాడు ఏ విధంగానైతే ఎద్దుమొద్దు స్వరూపమో , ప్రతీది అడిగి చెప్పించుకునేవాళ్లు కూడా అలాంటి ఎద్దుమొద్దు స్వరూపాలే . ఎటొచ్చీ వాడికి నోరు లేదు . వీళ్ళకి ఉంది , అంతే తేడా . ఊహాశక్తి లోపం మన భాషాశైలి మీద కూడా ప్రభావాన్ని ప్రసరిస్తోంది . తెలుగులో గానీ , ఇంగ్లీషులో గానీ ఒకే భావాన్ని నాలుగు రకాలుగా మార్చి చెప్పడం ఈ తరానికి చేతకావడం లేదు . అలా చెప్పగల ప్రతిభా పాటవాలు అరుదుగా ఎవరికైనా ఉన్నా దాన్ని గుర్తించలేని , మెచ్చుకోలేని రసహీనులుగా తయారయ్యారు . " వాడో పెద్ద బోర్ " అని వ్యాఖ్యానిస్తారు . ఆయా భావాల్ని వాటికి స్వాభావికమైన ఊనికతో , వాటికి సముచితమైన పదజాలంతో , భావోద్వేగంతో వ్యక్తం చెయ్యడానికి ప్రాధాన్యం క్షీణించి అందఱూ గానుగెద్దుల్లా ఒకే మూసలో నిర్మమం ( detached ) గా వ్యక్తీకరించడాన్ని గౌరవప్రదమని తలపోస్తున్నారు . సాధారణంగా జాతకంలో మీనరాశి బావుంటే ఊహాశక్తులు వికసిస్తాయి . కానీ అది బావుండాలంటే మనిషి అంతకుముందుజన్మలో బాగా గురుసేవ చేసి ఉండాలి . " మీ సార్ మీదేమైనా కంప్లెయింట్లు ఉంటే వెంటనే మేనేజ్ మెంట్ కి రిపోర్ట్ చెయ్యండి " అని విద్యార్థుల్ని బహిరంగంగా గురువుల మీదికి ఉసిగొల్పుతున్న రోజుల్లో , ఆ భయంతో దినదినగండంగా గురువులు బతుకుతున్న సమాజంలో అందఱూ గురుద్రోహులూ , గురుశాపాలకి గుఱైనవాళ్ళే ఉంటారు తప్ప మీనరాశి బావున్నవాడు ఒక్కడూ కనిపించే అవకాశం లేదు . ఈ వాతావరణంలో ఊఃహాశక్తి వికసించడం అసాధ్యంలా కనిపిస్తోంది .
అనూ గారూ కృతజ్ఞతలండీ . . అవునండీ ఇంకా చాలా మందిని చెడిపా రవ్వ లడ్డూలు , పకోడీలు , జంతికలు పరిచయం చేసి . . . ఇక్కడికొచ్చాక ఇంకా ఇండియాకి వెళ్ళలేదండీ , ప్రస్తుతానికి చీరలు నగలు బోల్డు ఆర్డెర్స్ ఉన్నాయి . . ప్రామిస్ చేసేసా . . చూడాలి ఎప్పటికి తేగలనో ! సుమ లత గారూ , కృతజ్ఞతలండీ . . మీరు ప్రతి సారీ నన్ను వెన్నెల్లో విహరింపచేస్తారు . థ్యాంక్స్ అండీ . కౌటిల్య గారు , కృతజ్ఞతలండీ . ఆ పిలగాడు - నా పిలగాడే . . షషబిశలు కరకట్టు చేసా , థ్యాంకులు . ఇందూ , కృతజ్ఞతలు . . తప్పకుండా పరిచయం చేస్తా . . . ఇంటికి పిలవమని అడక్కుండా ఉంటే చాలు తనని ! అమ్మో గుంటూరు కారమే . . ఇంకెప్పుడూ మీతో మాట్టాడదు . . .
rama గారూ , సినారె ని వొదిలెయ్యండి . సినారె certification బహుశా అంత విలువ లేనిదయుండొచ్చు . బాలమురళి " వాగ్గేయకారితనం " మీరెందుకు ఒప్పుకోట్లేదో కొంచెం వివరిద్దురూ ? రేపు ఎవరు ఎక్కడుంటారో ఎవరూ చెప్పలేరు . చక్కగా చెప్పేరు . ఇవాళ సంగతి ఏవిటి ?
ప్రపంచ ప్రఖ్యాత తెలుగు శాస్త్రవేత్త స్వర్గీయ యెల్లాప్రగడ సుబ్బారావుగారి పేరు తెలియనివారు లేరు . ఇటీవలి వరకు మానవాళిని పట్టి పీడిస్తూ పీడకలలుగా మారిన ఎన్నో మహమ్మారులకి మందులు కనుగొని చరిత్రలో నిలిచిపోయాడు ఆ మహనీయుడు . ఆయన కనుగొన్న టెట్రాసైక్లిన్ దెబ్బకి ప్లేగువ్యాధి భూమండలం మీదనే లేకుండా అంతరించిపోయింది . బోదకాలు గడగడా వణికిపోయింది . అవి కాక ఇంకా ఈరోజు మనం వాడుతున్న ఇంకెన్నో యాంటిబయోటిక్ మందులు సుబ్బారావుగారి భిక్షే . ఆ విధంగా ఆయన గర్భవతులు మొదలుకొని ప్రమాదాలకి గురైనవాళ్ళ వరకు కోట్లాదిమంది జీవితాలకు ఆయుష్షు ప్రసాదించాడు . ఆ మహా మహితాత్ముడికి ఇప్పుడు మన ఆంధ్ర రాజధానిలో ఒక స్మారక చిహ్నం వెలియబోతోంది . ఈ శుభవార్త గురించి మాటల్లో చదవండి .
అప్పట్లో చూడలేదు . ఇప్పుడూ మళ్ళి చేశారో లేదో చూడలేదు . కానీ ఈ ఐడియా భలే ఉందే ! మళ్ళీ మళ్ళీ చెయ్యొచ్చు .
నిస్వార్ధత , త్యాగం , పవిత్రత , అకుంఠిత దీక్ష కలవారిని ఈ ప్రపంచంలో ఎదిరించగల శక్తి ఏదీలేదని అన్నాహజారే విషయంలో నేడు రుజువయ్యింది . అవినీతిపై శాంతి సమరం సాగించి విజయం సాధించిన ఈ యోధుడ్ణి 2011 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక ఠాగూర్ అంతర్జాతీయ శాంతి బహుమతి వరించింది . విదేశస్థులకు రుణగ్రస్తురాలై లక్షలకోట్ల రూపాయలలో వడ్డీలరూపంలో చెల్లిస్తుందంటే ఇది ఖర్మ భూమిగా పేరుగాంచిన భరత మాత తప్పా ? కానే కాదు ! . 600సంవత్సరాలుగా బానిసబ్రతుకులు బ్రతికి స్వార్ధ పూరిత లక్షణాలతో భరత మాతను వెలుగులోనుంచి చీకటిలోకి నెట్టిన అవినీతి పరులైన రాబందులు నాయకుల రూపంలొ , ప్రభుత్వాధికారుల రూపంలో , పౌరుల రూపంలో , ప్రజాధనాన్ని పందికొక్కుల్లా బొక్కిన అవినీతి రాబందులదే తప్పు . మన దేశ నాయకులు స్విస్‌బ్యాంకుల్లో దాచిన ధనంతో దేశ అప్పు తీరడమేకాక , దేశ ప్రజలకు ఎంతోకొంత ధనం ఇవ్వవచ్చని అనధికార లెక్కలు చెప్తున్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు . నిన్నకాక మొన్న ఒక కేంద్రమంత్రి ఒక లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి , భారత దేశంలో అవినీతిని ఎవరెస్టుని మించిన ఎత్తుకు ఎదిగించాడనడానికి ఇంతకంటే మరో నిదర్శనం అవసరం లేదు . ఇంత అవినీతి పరుల చేతిలో మన భారత దేశం వుంది కాబట్టి , నేడు ఓ సామాన్య పౌరుడు , సామాజిక కార్యకర్త , నీతీ నిజాయితీలకు మారుపేరైన అన్నాహజారే అవినీతిపై పోరాటం సాగించడానికి భారత దేశ రాజధాని ఢిల్లీలో శాంతి సమర శంఖం పూరించవలసి వచ్చింది . నిశ్వార్ధమైన ఆయన దీక్ష అవినీతి పరుల గుండెల్లో సునామీలను సృస్టించింది . ఏడాదిన్నర వయసున్న చిన్నారినుండి 103ఏళ్ళ కురు వృద్దుడి వరకూ జనప్రభంజనం వెల్లువెత్తి ఆ మహనీయునికి బాసటగా నిలిచింది . విషయం గర్హించిన ప్రభుత్వం మెట్టుదిగి తన పంతం వీడి శాంతి సమర యోధుడి ముందు మోకరిల్లింది . అన్నాహజారే డిమాండ్ లన్నింటినీ అంగీకరించి , దీక్ష విరమింపజేసింది . నిశ్వార్ధుడైన అన్నాహజారే ఈ విజయాన్ని భరత జాతి విజయంగా అభివర్ణించి వినమృడై తనకు బాసటగా నిలచిన యావత్ భారత జాతికీ తన కృతజ్ఞతలను తెలిపారు . అవినీతిపై పోరాటానికి ఇది నాందీ అనీ , లోక్‌పాల్ బిల్లు జనలోక్‌పాల్ బిల్లుగా పార్లమెంటులొ ఆగస్ట్ 15లొగా ఆమోదించేవరకూ ఈ ఉధ్యమ స్పూర్తిని ఇలాగే కొనసాగించాలని తెలియజేసిన ఓ శాంతి కామకుడు అన్నాహజారే .
మౌళి గారు , ఎవ్వరు ఎలా ఏవిధంగా ఎవ్వరిని ప్రాతిపధికన తీసుకుని విలువ ఇచ్చినా పాజిటివ్ ఆలోచన ఉన్న వాళ్ళకి అది పాజిటివ్ విలువగానే కనబడుతుంది . ఆ విలువ ఎంత అనేది ప్రతి వ్యక్తిగతం . ఆ విషయాన్ని నేను స్పృజించను . మున్ముందుగా స్పందించినందులకు నెనరులు . ఇకపై కూడా ఇలాగే స్పందిస్తూ ఉండమనవి .
హైదరాబాద్ , జూలై 7 : ఉస్మానియా వర్శిటీలో గురువారం మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి . తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు ఓయూలో విద్యార్ధులు శాంతి ర్యాలీ చేపట్టారు . విద్యార్ధులు ఆర్ట్స్ కాలేజీ నుంచి గన్‌పార్క్ వరకు ర్యాలీగా బయలుదేరారు . అయితే ఎన్‌సీసీ గేట్ వద్ద పోలీసులు విద్యార్ధులను అడ్డుకున్నారు .
దీనికి ముందు ఇది చదివి అప్పుడు ఇది చదవండి . . . . . . . . . . . . . . . . . . అలా మా నాన్నతో పాటు నేను కూడా డాక్టరు గారింటికి వెళ్ళి వాళ్ళ పిల్లలతో పాటు పాఠాలు చెప్పించుకోవటం ఒక డ్యూటీ లాగా అయిపోయింది . ఈ పాఠాలు రోజూ ఉండేవి కావు , వారానికి రెండు మూడు రోజులు ఉండేవి . వెళ్ళిన ప్రతిసారి నాకు ఉక్రోషం తన్నుకొచ్చేది , అయినా ఏం చేయలేం కదా , దేనికైనా కాలం కలిసి రావాలి ! కాలం అలా జరిగిపోతుండగా కాలం కలిసొచ్చి ఒక రోజు ఒక మహత్తర అవకాశం వచ్చింది . ఆ అవకాశం ఎట్టిదనగా . . . . . . . . . . ఇక్కడ ఇంకో పిట్టకథ . . . . . . . . . . . . మాకు జువాలజీకి వచ్చే పంతులు గారికి కాస్తంత నత్తి , ఆ నత్తికి తోడు ఇంకాస్తంత చాదస్తం , వెరసి ఆయన క్లాసులో అసలు పాఠం కన్నా ఊకదంపుడు ఎక్కువగా ఉండేది . ఆర్థ్రోపొడాలో బొద్దింక గురించి పాఠం మొదలుపెట్టి మధ్యలో దోమలు ఎలా పునరుత్పత్తి చేస్తాయో చెపుతూ హఠాత్తుగా ఎంటమీబా , ప్లాస్మోడియుం అంటూ పరాన్నజీవుల దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు , ఏతా వాతా ఆయన ఏ పాఠం పూర్తిగా చెప్పటం అయ్యేది కాదు , పూర్తయినా మాకు అర్థమయ్యేది కాదు ! ఇక పరీక్షలు దగ్గరికొస్తున్నాయనగా ఆదివారాలు స్పెషలు క్లాసులంటూ దుంప తెంచేవాళ్ళు . అదిగో అలాంటి ఓ ఆదివారం నా ఉక్రోషం తీర్చుకునే మహత్తర అవకాశం దొరికింది . . . . . . . . . . . ఓ ఆదివారం అలానే క్లాసుకి వెళ్ళాం , మాస్టారు ఇంకా రాలా , సరే కాసేపు బయట తిరిగొద్దామని బయటకి వచ్చాం , మగపిల్లలు కూడా బయటికి వచ్చి కాంటీను వేపు వెళ్ళారు . బయటకి వచ్చిన మాకు అక్కడున్న మగపిల్లల సైకిళ్ళు కంటబడ్డాయి , అంతే ఇక అటూ ఇటూ చూసి ఎవరూ చూడటంలేదని నిర్థారించుకుని టపుక్కున డాక్టరుగారబ్బాయి సైకిలు గాలి తీసేసా ! ఇక క్లాసు అయిపోయాక తను సైకిలు నడిపించుకుంటూ ఇంటికి వెళుతుంటే నాకెంత ఆనందం వేసిందో ! ! అప్పట్లో దగ్గర్లో ఎక్కడా గాలి కొట్టేవాళ్ళు ఉండేవారు కాదు . కాలేజి నుండి కనీసం ఓ రెండు కిలోమీటర్లు వెళితే కాని గాలి కొట్టించుకోవటం కుదరదు . ఎప్పుడూ కాలేజి నుండి దగ్గరి దారిలో వెళ్ళే మేము ఆ రోజు తన వెనకే నడుచుకుంటూ ఆనందిస్తూ వెళ్ళటం ఇప్పటికి కూడా కళ్ళముందు కనపడుతుంది . అలా వెళుతూ వెళుతూ మిమ్ములిని మా నాన్న సాయంత్రం మా ఇంటికి రమ్మన్నారు పాఠాలు చెప్పించుకోవటానికి అంటూ ఓ కొంటె నవ్వు నవ్వుకుంటూ తనని దాటుకుని వెళ్ళటం నిన్నా మొన్న జరిగినట్లుంది . . . . . . . . . . పాపం తను చాలా బుద్దిమంతుడు . తన చదువేమో తనేమో అన్నట్లు ఉండేవాడు . మరి అలాంటి తనని నేను ఎందుకు టార్గెట్టు చేసుకున్నట్లు ? మా నాన్న మీద ఉక్రోషం తన మీద చూపించానన్నమాట . అది తెలిసి చేయటం కూడా కాదు . ఆ సమయానికి అలా అనిపించింది చేసేసాను . తరువాత ఎప్పుడో జ్ఞానోదయం అయింది మన అకారణ కోపాలు , ద్వేషాలు , ఉక్రోషాలు ఇలా అమాయకుల మీద చూపించేస్తుంటాం అని . మీరు కూడా మీకు తెలియకుండా ఇలాంటివి ప్రదర్శించే ఉంటారు , లేకపోతే మీ మీద ప్రదర్శింపబడి ఉంటాయి , ఒక్కసారి మీ జ్ఞాపకాలని తవ్వుకోండి . అన్నట్లు జ్ఞాపకాలంటే గుర్తుకొచ్చింది . . . . . . . . . అందరిని ఒక్కసారి మన ఊర్లకి తీసుకుపోయే పాట వేణూ శ్రీకాంత్ గారు తన బ్లాగులో వినిపిస్తున్నారు , అక్కడికి వెళ్ళి విని ఒక్కసారి అలా అలా మీ ఊరి పంటచేల గట్ల మీద తిరిగి రండి . . . . . . . . . .
ఈ విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు . ఉజ్వల భవిష్యత్ ఉన్న విద్యార్థులు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు . అలాగే విద్యార్థులు చదివే కళాశాలలో కూడా విషాదచాయలు నెలకొన్నాయి . కళాశాల అధ్యాపకులు కూడా ఆసుపత్రిలో మృతదేహాలను సందర్శించారు .
పది మంచి పదాలతో పోటీని ప్రక్కన పెడితే , మొత్తం పద్యమంతా నాకు చాల బాగా నచ్చింది . అలాగే జేమ్స్ వ్రాసిన కామెంట్ " మదుర మదురమౌ తెనుగు న మాతృ బాష " అనే లైన్ కూడా నచ్చింది .
జగన్ సంపాదించిన అక్రమ ఆస్తులకి ఆధారాలు ఉన్నాయి . ప్రభుత్వం బ్రాహ్మణి స్టీల్స్ కంపెనీకి ఇచ్చిన భూమిని ప్రభుత్వ అనుమతి లేకుండా తనఖా పెట్టి యాక్సిస్ బ్యాంక్ నుంచి ఆ కంపెనీ 350 కోట్లు లోన్ తీసుకుందని ఆధారాలు ఉన్నా బయట పెట్టలేదు . పత్రికలలో వార్తలు వస్తాయని పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ . ఐ . ఆర్ వ్రాయించారు కానీ ఆధారాలు కావాలని సేకరించలేదు . బ్యాంక్ మేనేజర్‌ని పట్టుకుంటే ఆధారాలు దొరుకుతాయని వాళ్ళకి తెలియదా ? ఆ ఆస్తులకి ఎంకంబ్రెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన రిజిస్ట్రార్ ఆఫీస్ వాళ్ళని పట్టుకున్నా ఆధారాలు దొరుకుతాయి .
కానీ తెల్లవాళ్ల ప్రకారం ఆ గొడవ ఇంకా అయిపోలేదు . కొద్ది సేపటికల్లా మోటలంతా సెర్చి లైట్ల వెలుగుతో నిండిపోయింది . ఒక అరడజను పోలీసు కార్లు సైరన్లు మోగించుకుంటూ మా మోటలు ముందు ఆగాయి . ఒక్కో కారు లోంచి ఇద్దరు సైనికులు దిగి కారుకు చెరో వైపు నిలబడ్డారు . ఏదో అల్లరిని ఆపడానికి వచ్చినట్లు ఒక్కొక్కరి దగ్గర తుపాకులు , హెల్మెట్లు , ప్లాస్టిక్ షీల్డులు వున్నాయి . అప్పటికే లౌడ్ స్పీకరు మోగుతోంది : " ఈ వూరి షెరీఫ్ ను మాట్లాడుతున్నాను . దాడులు జరిపినందుకు లోపలవున్న మీ ఇండియన్లను అరెస్టు చెయ్యడానికి వచ్చాను . మీరు లోపల వున్నారని నాకు తెలుసు . తలలమీద చేతులు పెట్టుకుని బయటకు రండి . లేకపోతే మేమే లోపలికి వచ్చి షూట్ చేస్తాం ! " . బార్బ్ ఇంకా ఇతర్లు తమ కిటికీల్లోంచి బయటకు తొంగి చూశారు . తమవైపు గురిపెట్టిన తుపాకులను చూసిన తరువాత బయటకు రావడానికి వాళ్లకు మనస్కరించలేదు . ఇండియన్లను , అందులో ఎ . ఐ . ఎమ్ . సభ్యుల విషయంలో సౌత్ డకోటా పోలీసులు తుపాకులను ఉపయోగించడానికి ఉత్సాహం చూపేవారు . మీన్స్ బ్రదర్స్ లో ఒకతను ఫోనులో ఒక తెల్ల సానుభూతిపరుడిని పిలిచి , లాయరును తీసుకుని వెంటనే తమ గదికి రావాలని పిలిచాడు .
అశ్విన్ , విజ్జు , చంద్రమౌళి ధన్యవాదాలు . చంద్రమౌళి గారూ , నా పొట్టకొట్టేద్దామనే . . మా కంపనీలో మీకు మాత్రం ఉద్యోగం లేదు .
saramana గారు , డిశెంబెర్ ప్రకటన తొందర పాటు చర్య అని చెప్తూ దానికే కట్టుబడి వుండాలని వాదించటమేంటండి ? . ఆ ప్రకటన కొందరికి నచ్చక పోవటం వల్లనే కదా ఇదంతా . నిజాని కేంద్రం ఏ ప్రకటన చేసినా , చెయ్యకపోయినా రాష్ట్ర నాయకులు కలవనంత కాలం ఇలాగే వుంటుంది . మన వాళ్ళతా కలిసి ( అంతా అంటె అంతా అని కాదులేంది ఎక్కువమంది ) మాకిలాగ కావాలని ఒక వాదనే వినిపించండి . పరిష్కారం దానంతట అదే వస్తుంది . ఒకప్పుడు కేంద్రం బలంగా వుండేది . ఇందిర లాగానో , నెహ్రూ లాగానో సంకీర్ణ ప్రభుత్వాలుండలేవు . అందుకే ఏదైనా ఒప్పించి , బుజ్జగించి చెయ్యాల్సిందే . ఆ సందు మన నాయకులెవరైనా ఇస్తున్నారా ? పిడి వాదాలు తప్ప . మిగతా మూడు రాష్ట్రాలు consensus తో ఎర్పడ్డయని గుర్తుంచుకోండి . నిజానికి చిదంబరం ప్రకన అదే . agreement కొచ్చి అసెంబ్లీ నించి తీర్మానం పెట్టి పంపమని ( అఖర్లెదు . . ఫలానా సెక్షన్ ప్రకారం అని చెప్పకండి . . నాకూ తెల్సు . రాజ్యాంగం ప్రకారం మనమందరం ప్రధానమంత్రులం కావొచ్చు , రాష్ట్రపతి గారు తల్చుకుంటె . . కనీసం కొన్ని రోజులపాటైనా . . అని చెప్పి చేసేస్తారా ) . అయితే already అందరూ ఒకటే కోరుకుంటున్నరని కొంచెం తప్పుడు conclusionకొచ్చిన మాట నిజం . అంతవరకు we can blame him . మళ్ళీ . . మన రాష్ట్ర విభజన పరిష్కారం మన నాయకుల దగ్గరుంది . కేంద్రం దగ్గర కాదు . మనం కొట్టుకున్నంత కాలం వాళ్ళు పీకేదేమీ వుండదు . మళ్ళీ అడుగుతున్నాను . . మన రాష్ట్ర నాయకులు ఒక మాట మీద ఉండనంత కాలం . . కేద్రం ఏ నిర్ణయం తీసుకుంటే మనం సుఖ శాంతులతో వుంటామో చెప్పండి . కాస్త analytical గా . I so far never heard anyone providing an amicable solution that everybody likes . SKC is the closest . . but that too was ridiculed or praised as per personal agendaa .
ఎన్ని అవరోధాలు ఎదురైనా , అడ్డంకులు వచ్చిపడినా ' పాదయాత్ర ' నిర్వహించి తీరుతానన్న పట్టుదలతో గ్రేటర్ నొయిడా ( బట్టా పర్సౌల్ ) లో అడ్డుగా ఉన్న ఒక మురికి కాల్వను ఇలా దూకి ఊడిన లేసులు కట్టుకుంటున్న ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ .
క్రితం సంవత్సరం ఇవే రోజుల్లో , ఇంజనీరింగు కాలేజీలకి అనుమతులిచ్చే పెద్దమనిషిని లంచం అడిగాడనే అరెష్ట్ చేశారు . విచారించారు . ఇప్పటిదాకా ఆ కేసు యేమయిందో తెలియదు .
నన్నారు . ఈ జపాశోణసంధ్య ఆ సంధ్యాదేవియే . అర్చిర్గూఢమయిన శబ్దం ఆవిష్కృతం కావాలి . వాక్కుకు అగ్ని అధిష్ఠానదేవత . కవిలోని అగ్ని జీవునివేదన . కార్యకారణాలకు అభేదభావన చేస్తే వాగగ్నులు అభిన్నమయినవి . నిత్యప్రజ్వల జ్జీవుని వేదన వాక్కుగా అభివ్యక్తమవుతుంది . అట్లాంటివాడు కవి . మరి , నిజానికి కావ్యవాక్కు అంటే అది . సాధారణవాక్కు కవి వేదాగ్నిలో పుఠం పెట్టబడి కావ్యవాక్కుగా ప్రజ్వలిస్తుంది . అదట్లా ఉంచి -
రాజు అనేవాడు ఎలా ఉండాలో రాయలవారు ఒక రాజుగా చెప్పడంలో ఏమీ విశేషము లేదు . ఐతే ఆ వర్ణనామాధురి అధ్బుతం . పై మూడు పద్యాల తర్వాత ఇంకా తెలుసుకోవాలంటే . . నీతి సారంలో ప్రతాపరుద్రుడు ఏమంటాడో చూద్దాము .
ఇలాంటి హారర్ ఉదంతాలు టపా చేస్తున్నారేంటి ? ఎవరి సొంత సీమల ( డొమైన్స్ ) లోంచి వారు బ్లాగుకుంటే మంచిదేమో ఇకముందు , ఈ ఆతిథేయ గూళ్ళకు స్వస్తి చెప్పి . కాకపోతే కొంచెం కరుసవుద్ది ! " పయనించే ఓ చిలుకా ! ఎగిరిపో , పాడైపోయెను గూడు . . . " అని పాడుకుంటూ .
గణేష్ చాలీసా జయ గణపతి సద్గుణ సదన - కవివర బదన క్రుపాలా విఘ్న హరణ మంగళ కరణ - జయజయ గిరిజాలాలా జయజయజయ గణపతి రాజా - మంగళ భరణ కరణ శుభకాజూ జయ గజ బదన సదన సుఖదాతా - విశ్వ వినాయక బుద్ది ప్రదాతా వక్రతుండ శుచి శుభ్ర సుహావన - తిలక త్రిపుండ భాల మన భావన రాజిత మని ముక్తా వర మాలా - స్వర్ణ ముకుట శిర నయన విశాలా పుస్తక పాణి కుఠార త్రిశూలం - మోదక భోగ సుగంధిత ఫూలం సుందర పీతాంబర తన సాజిత - చరణ పాదుకా ముని మన రాజిత దని శివ సువన షడా నన భ్రాతా - గౌరీ లాలన విశ్వ విధాతా రిద్ది , సిద్ది తవ చరణ సిదారే - మూషక వాహన సోహత ద్వారే కహౌన జనం సుధా కథా తుమ్హారీ - అతి శుచి పావన మంగలకారీ ఏక సమయ గిరి రాజ కుమారీ - పుత్ర హేతు తప కీన్హా భారీ భయో యగ్య జబ పూర్ణ అనూపా - తబ్ పహుంచ్యో తుం ధరి ద్విజ రూపా అతిథి జానికే గౌరీ సుఖారీ - బహు విధి సేవా కరీతుమ్హారీ అతి ప్రసన్న హవై తుం వర దీనా - మాటు పుత్ర హిత జో తప కీన్హా మిల్లీ పుత్ర తుహి బుద్ది విశాలా - బినా గర్భ ధారణ యహి కాలా గుణ నాయక గుణ గ్యాన నిధానా - పూజిత ప్రధమ రూప భాగావానా ఆస కహి అంతర్ధాన రూప హాయ్ - పాలనా పర బాలక స్వరూప హాయ్ బని శిశు రుదన జబ హాయ్ తుం దానా - లఖి ముఖ సుఖ నహి గౌరీ సమాన శంభు ఉమా బహు దాన లుటావహి - సుర ముని జన సుత దేఖనా ఆవహి లఖి అతి ఆనంద మంగళ సాజా - దేఖనా భీ ఆయే శని రాజా నిజ అవగున గని శని మన మాహీ - బాలక దేఖనా చాహత నాహీ గిరజా కచు మన బెద బధాఏ - ఉత్స్వవ మారణ శని తుహి భాయో కహనా లగేషని మన సకుచాయీ - కాకరిహా ! శిశు మొర దిఖాయే నహి విశ్వాస ఉమా కర భయవూ - శని సో బాలక దేఖనా కహివు పడతహి శని ద్రుగా కోన ప్రకాశా - బాలక శిర ఉడి గయో ఆకాశా గిరిజా గిరీ వికల హాయ్ ధరణీ - సో దుఃఖ దశా గయో నహి బరనీ హాహాకార మచ్యో కైలాశా - శని కీన్యా లఖి సుత కో నాసా తురత గరుడ చడి విష్ణు సిదాయే - కాటి చక్ర సో గజ శిర లాయే బాల్ కే దడ ఊపర్ దార్యో - ప్రాణ మంత్ర పఢ శంకర దారాయో నామ గణేష్ శంభు తబ కీన్హా - పృథ్వీ కీ ప్రదక్షిణా లీన్హీ చలే స్డానన భరణి భులాయే - రబీ బైట్ తుమి బుద్ది ఉపాయా చరణ మాతు , పితు కే ధర లీన్హే - తినకే సాత్ ప్రదక్షిణ కీన్హే దని నగేష్ కహి శివ హియ హరషే - నభ తే సురన సుమన బహు బరసే తుమ్హారీ మహిమా బుద్ది బఢాయె - శేష సహస ముఖ సకి న గాయే మయి మతి హీన మాలిన దుఖారీ - కరహున కోన బిది బినయ తుమ్హారీ భజత రామ సుందర ప్రభు దాసా - లఖ ప్రయాగ కకారా దుర్వాసా అబ ప్రభు దయా కీన ప్రభు కీజై - అపనీ శక్తి భక్తీ కుఛ దీజై సమాప్తము
మీ జీవిత లక్ష్యం ఏమిటి ? అని ఎవరైనా అడిగితే సంతోషంగా ఉండటమనో , దేనికి లోటు లేకుండా ఉండాలనో , ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతేచాలనో , లాంటి సమాధానం చెప్తారు . మరి కొంత మంది ఒక ఇంజనీర్ కావాలనో , వ్యాపారవేత్త కావాలనో , చెప్తారు . కొంత మంది లక్ష్యమా ! - అదెందుకు ? , పూర్వం విజయాలు సాధించినవారంతా ఇలా లక్ష్యాలు అవి వ్రాసుకోలేదే అనొచ్చు ! పోనీ అలా వ్రాసుకుంటున్న వాళ్ళందరూ విజయం సాధిస్తారని మీరు గ్యారంటి ఇస్తారా ? అని అనవచ్చు . తప్పకుండా వీరి వాదంలో నిజం ఉందని నేను చెప్పగలను . చాలా మంది జీవితంలో బిజీగా ఉంటారు కాని , ఎటు వెళ్తున్నారో , ఎందుకు వెళ్తున్నారో తెలియకుండా పరుగు పెడుతుంటారు . ప్రపంచం మొత్తం మీద ఈ లక్ష్యం అన్న విషయంపై కొన్ని వేల పుస్తకాలు వచ్చాయి . అయినా ఇప్పటికి కేవలం 5 శాతం కంటే తక్కువ మంది మాత్రమే సరైన లక్ష్యాలను ఎర్పరచుకొంటున్నారు . మన సమాజంలో కేవలం 3 శాతం కన్నా తక్కువ మంది మాత్రమే జీవితంలో వారికి కావలసినట్టుగా బ్రతగ్గలుగుతున్నారు . లక్ష్యం విషయంలో కొంతమంది ఒక్కొక్కసారి కావలసినది పొందుతున్నారు . మరొకసారి లేదు . అంటే లక్ష్యం ఏర్పరచుకుంటే మంచిదా లేక జీవితం ఎలా నడిస్తే అలా గడిపేయడం ఉత్తమమా అని ఎవరికైనా సందేహం కలగక మానదు . నాకు ఈ సందేహమే కలిగింది . ఎందుకంటే నేను నేర్చుకున్న వ్యక్తిత్వ వికాస శిక్షణ వల్ల ఒక 5 సంవత్సరాలు ఎనలేని లాభం పొందాను . నేను పెట్టుకున్న ప్రతి లక్ష్యం నెరవేరింది . ప్రతి వస్తువూ పొందగలిగాను . అయితే ఆ తరువాత వ్యతిరేక ఫలితాలు వచ్చాయి . ఇలా ఎందుకు జరుగుతుందో అర్ధమవలేదు . జయాపజయాలు సర్వసాధారణం . అందులో సందేహం లేదు . కాని ఒక ఎత్తుకు వెళ్ళాక క్రిందకు పడడం కొంచెం నొప్పిగానే ఉంటుంది . అదీ ఆర్ధిక విషయాల్లో , అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే , ఎంతో ఉత్సాహంతో , చిన్న వయసులోనే విజయం సాధించిన యువత మరీ ఇలా ఎదురు దెబ్బలు తినడం , ఎన్నో ఒత్తిడిలకు గురౌడం నాలో ఆలోచన రేకెత్తించింది . కొంతమంది తమ లక్ష్య సాధనకు ఎంతో కష్టపడుతుంటారు . ఒక లక్ష్యం తరువాత మరొక లక్ష్యం సాధించడంలో నిమగ్నమౌతుంటారు . అయితే వీరిలో చాలా మందికి అంతిమ లక్ష్యం ఏమిలో అవగాహన ఉండదు . ఊహించండి . రైల్వే స్టేషన్ లో మీరు ఎక్కాల్సిన రైలు బయలుదేరి పోవడం గమనించి , పరుగుపెట్టి , ఎంతో శ్రమ పడి ఆ రైలును అందుకున్నాక , మీరు ఎక్కింది తప్పు రైలు అని తెలిస్తే ఎలా ఉంటుంది ? ఈ రోజు పరుగులు తీస్తున్న వారిలో ఎంతమంది , నిజంగా విజయం వైపు వెళ్తున్నారు ? లేదా విజయం వైపు అనుకొని విజయానికి వ్యతిరేక దిశలో పరిగెడుతున్నారా అన్నది తెలుసుకోవలసిన విషయం . స్వయంగా ఆచరించి ప్రయోగించిన ఎన్నో ముఖ్యమైన విషయాలను ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది . వీటిలో కొన్ని ప్రత్యక్షంగా చెప్పినా , మరికొన్ని పరోక్షంగా చెప్పడం జరిగింది . ఆసాంతం చదివినవారికి ఈ పుస్తకంలో ఉన్న అక్షరాలే కాక మరెన్నో అర్దమవుతాయి 1 . 1 . . విజయమంటే ప్రయాణం , గమ్యం కాదు . 1953 లో యేలే యూనివర్శిటి వారు ఫైనల్ ఇయర్ విదార్దులచే వారి జీవిత లక్ష్యం గురించి ప్రశ్నాపత్రం సేకరించడం జరిగిందట . అందులో కేవలం 3 శాతం మంది మాత్రమే తమ జీవితంలో ఆశయం గురించి స్పష్టంగా వ్రాసారు . 20 సంవత్సరాల తరువాత అదే తరగతి వారిని కలిసిన తరువాత ఈ యూనివర్శిటి వారు తెలుసుకున్నది ఈ 3 శాతం వ్యక్తులు సంపాదించిన ఆస్తులు , మిగతా 97 శాతం సంపాదించిన ఆస్తుల కన్నా చాలా ఎక్కువట . అంటే దీనర్ధం మిగతా వారు ప్రయత్నించలేదని కాదు . వారూ ఎన్నో వ్యాపారాలు , ఉద్యోగాలూ చేసినా దేనిలోనూ అగ్రస్థానానికి చేరలేక పోయారు . ఇలాంటి ఎన్నో పరిశోధనలు తెలియచేసే సత్యం , జీవితం పట్ల స్పష్టమైన అవగాహనతో పని చేస్తే విజయం వరిస్తుందని . ఈ ఉదాహరణ ఇంచుమించు ప్రతి పర్సనాలిటి బుక్ లోనూ , కోర్సు లోనూ చెబుతారు . లక్ష్యం అవసరం అని బోధపడుతుంది . కాని తన స్వభావానికి , ప్రతిభకు , విలువలకు అనుగుణంగా ఏ రకంగా ప్రణాళిక వేసుకోవాలనేది తెలియదు . భారత దేశానికి ఉన్న ఘన చరిత్ర బహుశా ప్రపంచంలో ఏ నాగరికతకూ ఉండకపోవచ్చు . ఎన్నో లక్షల సంవత్సరాల క్రితమే నాగరికంగా జీవించిన భరతఖండం ఎంతో మంది గొప్పవారికి జన్మభూమి . ఆర్యభట్ట నుండి అబ్దుల్ కలాం వరకూ ప్రపంచం విస్మయం చెందే మేధావులు పుట్టిన ఈ దేశ యువత తెలివితేటలూ , నైపుణ్యం గుర్తించి వారిని ఈ దిశగా ప్రోత్సహించే విద్యావిధానం మనకు లేకపోవడం బాధాకరం . ఎంచుకున్న ఉద్యోగం / వ్యాపారం తన స్వభావానికి , సామర్ధ్యానికి , విలువలకు అనుగుణంగా లేకపోతే ఎంత కష్ట పడినా సుడిగుండంలో పడిన నౌక లాగా వేగంగా తిరిగినా , ఆయాసం మిగులుతుంది కాని ఆశయం ఫలించదు . ఎంతో కష్టపడి విజయం అనే నిచ్చెన ఎక్కినా తరువాత , ఎక్కినది తప్పు గోడ అని తెలిస్తే , సమయం వృధా కాదు . ఒక జీవితమే వృధా . మీ శక్తియుక్తులు తెలుసుకుని , మీ జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చో , మీ ప్రవృత్తిని గుర్తించి వృత్తిగా ఎలా మార్చుకోవచ్చో తెలియచేసేదే ఈ పుస్తకం ' ది సీక్రెట్ ' గురించి వేణు భగవాన్ గారి తొలిమాట . . . . ఒకటే జీవితం ! మరోటి ఉందో లోదో తెలియదు ! ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి . ఇంకెంతకాలం ? ఏం చేస్తే జీవితం మారుతుంది ? ఎప్పటికి యిలా బ్రతకాల్సిందేనా ? ఇలాంటి ప్రశ్నలు మీ మనసుకు ఎప్పుడైనా వచ్చాయా ? బహుశా వచ్చే ఉంటాయి . లేకపోతే ఈ పుస్తకం మీ చేతిలో ఉండదు . మీరు కష్టపడి కొంత విజయం సాధించి ఉండవచ్చు . కాని దేనిని ఫణంగా పెట్టి ? మీ కుటుంబం ? ఆరోగ్యం ? మనశ్శాంతి ? సంతోషం ? . . . మనలో ఉన్న ప్రతిభను గుర్తించడమెలా ? జీవితానికి ఒక ప్రయోజనం కల్పించుకోవడమెలా ? జీవిత లక్ష్యం ఏర్పరచుకోవడం ఎలా ? ధనవంతులు కావడం ఎలా ? అనుకున్నది సాధించడం ఎలా ? లాంటి ప్రశ్నలకు సమాధానం కాగలదని విశ్వసిస్తున్నాను . ఈ చాప్టర్ వ్రాస్తున్నప్పుడు ఒక యువకుడు వచ్చి ఈ పుస్తకం ఎవరు చదువుతారు ? చదివి ఎవరైనా ఆచరిస్తారా ? ఎవరికైనా ఉపయోగపడుతుందా ? అని అడిగాడు . నిజమే చాలా మందికి చదివే అలవాటు లేక పోవచ్చు . చదివే అలవాటున్నవారు వేరే పుస్తకంతో పోల్చవచ్చు . కాని నేను ఈ పుస్తకంలో వ్రాసిన ' ది సీక్రెట్ ' అనే భావప్రపంచం ఆధారంగా , ఇది చేరవలసిన వారికి ఖచ్చితంగా చేరుతుంది . ఎంతమంది కావాలి , చరిత్ర సృష్టించడానికి ? ఆ కొద్దిమందికి ఈ పుస్తకం సింహబలాన్ని ఇస్తుంది . అది మీరే కావొచ్చు . ఈ పుస్తకంలో ఇమిడి ఉన్న ఎన్నో విషయాలు మీ విజయానికి అత్యంత కీలకమని నేను నమ్ముతున్నాను . ప్రత్యేకంగా లక్ష్య సాధన వెనుక ఉండే ఒక భావప్రపంచం గురించిన విషయాలు మీ ఆలోచనా దృక్పదాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధాలు . మీరు విజయానికి అత్యంత చేరువలో ఉన్నారు . దానికి సాక్ష్యం ఈ పుస్తకం మీ చేతిలో ఉండడమే .
" ఏయ్ ! ఏం చేస్తున్నారిక్కడ ? " వీళ్ళని చూడగానే లాఠీ ఝళిపిస్తూ , మాటలతో ఝాడించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉన్నాడతను . ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు .
చాలా మంది ఆశించినట్టుగానూ , కొంతమంది ఊహించినట్టుగానూ స్లండాగ్ మిలియనేర్ ఆస్కార్ల పంట పండించిఉకుంది . ఐతే ఇందులో కొన్ని తమాషాలు లేకపోలేదు . ఉత్తమ దర్శకుడిగా డేనీబాయిల్ మాత్రమే అవార్డు స్వీకరించాడు . కోడైరెక్టరు అని పేరు నమోదు చెయ్యబడిన లవలీన్ సింగ్ కి ఉత్తచేతులే మిగిలాయి . ఇదేమి తిరకాసు ? లవలీన్ సింగ్ పని నటీనటుల్ని ఎంపిక చెయ్యడం మాత్రమే . ఆ పనిలో ఆమె చూపిన ప్రతిభకీ , అటుపైన ముంబాయిలో లొకేషన్లు సంపాయించడమూ , ఇతరత్రా వెసులుబాట్లు కలిపించడమూ . . ఈ పనులన్నిటిలో ఆమె చూపిన చొరవకి కృతజ్ఞతగా దర్శకుడూ డేనీబాయ్ల్ ఆమె పేరుని కోడైరెక్టరుగా పెట్టించాడు . అంతేగానీ ఆమె నిజంగా డైరెక్షను చెయ్యలేదు . సరే ఇదంతా ఇలా ఉండగా , యెకాడెమీ వారు డైరెక్టరు స్థానానికి ఒక్క పేరే ఉండాలి అని మెలిక పెట్టారు . సినిమా చరిత్రలో జంట దర్శకులు లేక పోలేదు . ఇటీవలే అవార్డు గెల్చుకున్న కోయెన్ సోడరులు ఉండనే ఉన్నారు . అంచేత సినిమా వారే మా టీము లిస్టు ఇది , ఫలానా లవలీన్ సింగు కోడైరెక్టరు అని చెబుతుంటే అది స్వీకరించి తదనుగుణంగా నామినేషన్లు ఉంచాల్సిన బాధ్యత యెకాడెమీది . పండిన ఎనిమిది యెవార్డుల పంటలోనూ , రహమాన్ రెండు సంగీత యెవార్డులూ గెల్చుకోగా సౌండ్ మిక్సింగుకి మరొక భారతీయుడు రెసూల్ పూక్కుట్టి గెల్చుకున్నారు . ఇదివరలో గాంధీ సినిమాకి కాస్ట్యూములకు గాను గెల్చిన భాను అథాయా తో కలిపి ఆస్కార్లు గెలిచింది వీరు ముగ్గురే . . అభినందనలు . ఇంత జరిగినాక ఒక్క మాట చెప్పకుండా ఉండలేక పోతున్నా . మనం చెయ్యలేని పని ఇంకోడు చేసి చూపించాడే అనుకునేప్పటికి ఎక్కడో కుడుతుంది జనాలకి . ఈ సినిమా గురించి చర్చల్లో పెద్దలూ పిన్నలూ కూడా చాలా అభిప్రాయాలు వెలిబుచ్చారు . . భారద్దేశాన్ని చులకనగా చూపించారు అన్నారు . తెల్లోడి కండ కావరం అన్నారు . బాలీవుడు వీరులైతే మేమూ మంచి సినిమాలే తీస్తున్నాం కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు అని గునిశారు . మధ్యలో సత్యజిత్ రే పేరెత్తారు . బీదరికాన్ని కళ్ళు బద్దలయ్యేలా చూపిస్తేనే అవార్డులొస్తాయి అన్నారు . ఇంకా ఏంటేంటో చాలా అన్నారు . ఈ సినిమా ముఖ్య ఉద్దేశాన్ని మిస్సవుతున్నాయి ఈ అభిప్రాయాలన్నీ , నా ఉద్దేశంలో . ఈ సినిమా బీదరికం గురించి కాదు . ముంబాయి మురికివాడల గురించి కాదు . భారద్దేశపు దౌర్భాగ్యం గురించి అసలే కాదు . ఇది వాస్తవిక సినిమా కానే కాదు . దీన జనోద్ధరణ ప్రపంచం బాగుపడాలి మెసేజి సినిమా అస్సలు కానే కాదు . మరి ఏంటయ్యా ఈ సినిమా ? జమాల్ అనే ఒక గొప్ప ఆశా జీవి కథ ఈ సినిమా . విధి ఎన్ని సార్లు తనని పల్టీ కొట్టించినా , ఆ పల్టీలోని శక్తినే పూంజుకుని నింగికెగబాకే తారాజువ్వ కథ ఈ సినిమా . ఇదేదీ నిజ జీవితంలో జరగదు . వాస్తవికంగా లేదు . ఇదొక ఫేంటసీ సినిమా . అందుకే చాలా మంచి సినిమా . గొప్ప సినిమా కాక పోవచ్చు . . మంచి సినిమా . అవునూ , ముంబాయి మురికి వాడల్లో , మూడూ నాలుగు క్లాసు పిల్లకాయలకి త్రీ మస్కిటీర్స్ కథ ఏ బళ్ళొ చెబుతారు ?
సృజనశీలి యంత్రం కాదు . కాని అతని అంతరంగంలో ఒక కంప్యూటరు వంటి మెదడు , ఆ పైన ఒక ఆదిమ వానరం అనదగిన జాంతవ ప్రకృతి , ఆ పైన నాగరికుడు , మర్యాదస్తుడు , సంస్కారి అనదగిన ఒక మనిషి - వీళ్ళు ముగ్గురూ ఉన్నారు .
ఇక సినిమా సంగతికి వస్తె … … ఇంజనీరింగు మొదటి సంవత్సరం తో మొదటి భాగం మొత్తం సాగింది ( బాగా సాగతీసాడు శేఖర్ ) . మొదటి రోజు కాలేజీ అనుభావలని చక్కగానే చూపించాడు . కొత్త కొత్త స్నేహాలు , ఇంజనీరింగు చేరామనే గర్వం , సీనియర్ల తో చిన్న చిన్న గొడవలు , మొదటి సారి అమ్మయి తాకిన అనుభూతి , మొదటి ప్రేమకోసం తపించడం , అప్పుడు కలిగే ఆకర్షణ , అందమైన టీచరు మీద కలిగే చిలిపి భావనా వంటివి . ఇంటర్వెల్ కి ముందు మాత్రం హడావుడిగా మొదటి సంవత్సరాన్ని పరీక్షలు రాసేసాం అని ఒక్క ముక్కలో చెప్పి ముగించాడు . వాస్తవం లో కూడ మొదటి సంవత్సరం రాగింగ్ హడావుడితో త్వరగానే ముగుస్తుంది . ఇక రెండో భాగం మొత్తం అంతా తమ తమ అమ్మాయిలను పొందడమే పరమావధిగా సాగింది .
మా ఇంటావిడకు ఆ ఏడాది అంతా పూణే - ముంబై లమధ్య తిరగడంతోటే సరిపోయింది . మనవరాలి మొదటి పుట్టినరోజు అవగానే మా అమ్మాయికి మూడు నెలల పాటు యూ . ఎస్ . వెళ్ళవలసివచ్చింది . మనవరాలిని మేము తెచ్చేసుకున్నాము . అల్లుడు ప్రతీ శుక్రవారం , తన బైక్కు మీద పూణే వచ్చేసి , పాపని తీసికొని , వాళ్ళ పేరెంట్స్ ఇంటికీ వేళ్ళేవాడు . 1998 కే మా అల్లుడి పేరెంట్స్ ఢిల్లీ నుండి పూణే కి మకాం మార్చేశారు . ఆదివారం సాయంత్రం పాపని మా దగ్గర వదిలెసి , తిరిగి ముంబై వెళ్ళిపోయేవాడు . వారం లో మా అబ్బాయి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పాపం వాళ్ళే మా మనవరాలిని ఆడించేవాళ్ళు .
ఆర్థిక సంస్కరణల ఫలితంగా ప్రజాస్వామ్య వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి గురౌతోంది . అసంతృ ప్తిని అదుపు చేయాలంటే దానికి రెండు మార్గాలు . ఒకటి సమస్యలను పరిష్కరించాలి . లేదా సమస్యల మీద నోరెత్తకుండా అణిచివేయా లి . ప్రస్తుతం రెండో దానివైపే యుపిఎ అడుగులు వేస్తున్నది . ఇటీవల కొత్తగా వచ్చిన చాలా చట్టాలు , బిల్లులు పరిశీలిస్తే అన్యాయానికి గురైన వారు ఏవైనా ఆరోపణలు చేస్తే వాటిని పరిష్క రించడానికి బదులు ఆరోపణలు చేసినవారిపైనే ఎదురు కేసులు పెట్టి వేధించే ప్రక్రియ ఒకటి మనకు కనిపిస్తుంది . బయోటెక్నాలజీ బిల్లు , తాజా లోక్‌పాల్ బిల్లు , ఉపాధ్యాయుల నైతిక పరిరక్షణాబిల్లు వగైరాల్లో ఈ అంశం మనకు కనిపిస్తుంది . అలాగే ఉద్యమించే ప్రజలపై ప్రభుత్వం అణచివేత చర్యలకు దిగుతున్నది . జైతాపూర్ అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపై కాల్పులు తాజా ఉదాహరణ . గతంలో ఆంధ్రప్రదేశ్ సహా ఒడిషా , మహారాష్ట్ర , ఉత్తరప్రదేశ్ , హర్యానా , రాజస్థాన్ మొదలైన రాష్ట్రాల్లో నిర్భంధానికి దిగింది . పోలీసు కాల్పులు సర్వసాధారణమయ్యాయి .
హ హ హ మీ బ్లాగు ఇప్పటివరకీ చూసినట్లు లేను . చాలా బాగుంది , నచ్చినవన్నీ పేస్టే చేయట్లేదు లెండి నేనిక్కడ పెద్దదయిపోతుంది : - ) ) - నోటి దురద ఆపుకోలేక జోకొకటి పేలుద్దామనుకొని మీరా జోక్ చెప్పి తీరాల్సిందే , మాకు : - ) - - యే లోకంలో సహనం , గుట్టుగా ఉండడం చవలాయ్ తనం గాను , భావ దారిద్ర్యం / రాహిత్యం గాను పరిగణించబడవో , Awesome .
ధ్రదేశంలో స్వలింగసంపర్కం ( homosex ) కంటే , వావిడికం ( incest ) కంటే అత్యంత నిషిద్ధమైన ప్రస్తావన ( taboo topic ) ఒకటుంది . దాని పేరు భాషాభిమానం . ఈ రాష్ట్రంలో భాషాభిమానం ప్రదర్శించడం తప్పు . భాషాభిమానం ఉండాలని చెప్పడం తప్పు . తెలుగుభాషకి స్థానం కల్పించమని అడగడం తప్పు . టోకుగా భాషకి సంబంధించిన ఏ టాపిక్కైనా తప్పే , తప్పున్నఱే . ఇక్కడ సర్వకాల సర్వావస్థల్లోను భాష గుఱించి అందునా తెలుగుభాష గుఱించి మాట్లాడ్డం చాలా అసందర్భంగా భావించబడుతుంది . అలాగని ఇదేమైనా బహుభాషారాష్ట్రమా ? అంటే కానేకాదు . అన్నిచోట్లా ఉన్నంతే ఇక్కడా భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలు కొన్నున్నాయి . తెలుగువాళ్ళు తమ మాతృభాషని నీచంగా చూడ్డం గమనించి వాళ్ళు కూడా తమ మైనారిటీ హోదా మర్చిపోయి తెలుగుని నీచంగా చూడ్డం అలవాటు చేసుకున్నారు , మఱోపక్క తమ మైనారిటీ భాషల్ని మనసారా ప్రేమిస్తూ ! విచిత్రంగా ఇక్కడ నూటికి తొంభై అయిదుశాతం మంది అంతా తెలుగువాళ్ళే , తెలుగు రాయడమూ , చదవడమూ అందఱికీ వచ్చినా రాకపోయినా ! మఱి తెలుగుభాష ఇక్కడ ఇలా నిషిద్ధ ప్రస్తావనగా మారిపోవడానికి కారణమేంటి ? ఏదైనా ఒక విషయం ఇలా నిషిద్ధ ప్రస్తావనగా దానంతట అది మారదు . దాన్నలా మార్చేందుకు ఆద్యులైనవాళ్ళు కొందఱుంటారు . వాళ్ళు సమకాలీన సమాజంలో బహు శక్తిమంతులై ఉంటారు . దాన్నలా మార్చడంలో వాళ్ళకి భారీయెత్తున స్వప్రయోజనాలుంటాయి , శాశ్వత ప్రయోజనాలుంటాయి . అవేంటో వాళ్ళు బయటపడి అందఱితోనూ వెల్లడించరు . తాము అనుకున్నదాన్ని నిషిద్ధవిషయంగా మార్చేస్తారంతే ! వాళ్ళని బట్టి మఱికొందఱు , వాళ్ళని బట్టి ఇంకొందఱు - అలా క్రమంగా అందఱికీ ఆ విషయాన్ని నిషిద్ధ ప్రస్తావనగా చూడ్డం అలవాటైపోతుంది . పాపం , ఈ అలవాటైనవాళ్ళలో చాలామందికి అందులో ఏ స్వప్రయోజనమూ ఉండదు , గుడ్డిగా ఒకడి తోక పట్టుకొని ఒకడు గోతిలోకి దిగడమే తప్ప ! " అది ఎందుకు నిషిద్ధప్రస్తావన ? " అనడిగితే మనకి సరైన సమాధానం రాదు . వాళ్ళు విశదీకరించి చెప్పలేరు . ఎందుకంటే వాళ్ళకే తెలీదు . అదొక అలవాటుగా మారిపోయిందంతే . అందఱూ తెలుగువాళ్ళే ఉంటున్న అపార్ట్ మెంట్ భవనంలో / కార్యాలయంలో ఇంగ్లీషులో ఎందుకు నోటీసులు అంటిస్తున్నారని / పంపిస్తున్నారని ఒకసారి అడిగిచూడండి , మిమ్మల్ని ఎలా చూస్తారో ! అసలు తాము చేస్తున్నది ఒక బుద్ధిలేని పని కాగా మీకే బుద్ధిలేనట్లు మొహం పెడతారు . అలాంటిదే జాతీయ రహదారుల మీద Speed thrills , but kills మొదలైనవి రాయడం కూడా . లారీలవాళ్ళక్కూడా మనలా ఇంగ్లిషొస్తే వాళ్ళు లారీలెందుకు తోల్తారు ? ఏమైనా నిరంకుశత్వం తర్కాన్ని పట్టించుకోదు . ఎందుకంటే దాని పేరే నిరంకుశత్వం కనుక . మన రాష్ట్రంలో ఇంగ్లీషు ఆధిపత్యం వెనక ఉన్నది ఇలాంటి మొండి , బండ , చండ నిరంకుశత్వం ఒకటే . దాని వెనక ఏ విధమైన తర్కమూ లేదు . ఇంగ్లీషుని కొన్ని దేశాల్లో మాట్లాడ్డానికీ , జనం మీద స్థానికంగా అమలవుతున్న ఈ విధమైన బలవంతపు భాషరుద్దుడు / భాషబాదుడు కార్యక్రమానికీ ఏ విధమైన తార్కిక సంబంధమూ లేదు . ఉన్నదల్లా ఆ పేరుతో చెలామణీ అవుతున్న ఒక విదేశీ భాషాపశుత్వం . ఒకఱికో , ఇద్దఱికో ఇలాంటి నిర్హేతుకమైన అలవాట్లుంటే సరే , పోనివ్వండి ! అసలు మొత్తం జాతికే అదొక జాడ్యంలా పట్టుకుంటే ? సరే ! ఇలా ఒక విషయాన్ని నిషిద్ధాంశంగా మార్చేశాక ఏం జఱుగుతుంది ? పైప్రశ్నకి సమాధానాన్ని వెతికేముందు ఇలాంటి ప్రశ్నే ఇంకొకటి - సుపరిచితమైనది వేసుకుందాం . స్త్రీల సమస్యల్ని సమాజమంతటా నిషిద్ధాంశం ( taboo topic ) గా మారిస్తే - వాటిమీద ఎవరూ రాయకూడదనీ , మాట్లాడకూడదనీ శాసిస్తే ఏం జఱుగుతుంది ? స్త్రీలు తమ బాధల్ని మనసులోనే దిగమింగుకోవాలనీ , పుట్టింటివారితో కూడా చెప్పకూడదనీ , తమ బాధలకి కారణమైనవాళ్ళని దేవుళ్ళలా పూజించాలనీ , వాళ్ళు తమని చంపేసినా ఆ చావు వరప్రసాదం అనుకొని ఆనందంగా చచ్చిపోవాలనీ , లేకపోతే ద్రోహమనీ , పాపమనీ , బాధల్ని మౌనంగా భరిస్తే మహాపుణ్యమనీ , ఏదైనా జఱగనీ , మొత్తమ్మీద స్త్రీలు బయటపడకూడదనీ , బయటపడితే పరువు పోతుందనీ చెబితే ఎలా ఉంటుంది ? పర్యవసానంగా - స్త్రీలు దారుణాతి దారుణమైన హింసలకి బలైపోతారు . స్వంత ఇళ్లల్లోనే మానభంగాలకి గుఱవుతారు . బయటివాళ్ళకి అమ్మివేయబడతారు . కట్టుకున్న భర్త దగ్గఱ కూడా వాళ్ళ స్థితి పనిమనిషి కన్నా కనాకష్టమైన స్థాయికి దిగజాఱిపోతుంది . మగవాడికి ఉన్న నానా రకాల ఉంపుడుగత్తెల్లో , వేశ్యల్లో ఒకరుగా మారిపోతారు . వారికి అంతిమంగా సామూహిక ఆత్మహత్యలే తప్ప వేఱు గత్యంతరం ఉండదు . అలాగే కార్మికుల సమస్యల్ని సమాజమంతటా నిషిద్ధాంశంగా మారిస్తే - వాటిమీద ఎవరూ మాట్లాడకూడదనే ఆచారాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది ? ఇహ అప్పుడు , వారిచేత రోజుకు పద్ధెనిమిది గంటలపాటు పని చేయించుకునేవాళ్ళు బయల్దేఱతారు . వాళ్ళు ఏ కారణం చేతనైనా ఒకరోజు పనిలోకి రాకపోతే వాళ్ళ భార్యల్నో , పిల్లలనో పనిలోకి పంపమంటారు . వాళ్ళమీద అనుమానమొస్తే చెట్టుక్కట్టేసి చచ్చేదాకా చావగొడతారు . వాళ్ళ మూలంగా ఏదైనా నష్టమొస్తే ఆ నష్టం పూడేదాకా జీతం , బత్తెం లేకుండా వెట్టిచాకిరీ చెయ్యమంటారు . ఈ బాధలకి తాళలేక కార్మికులు చికిత్సాతీతమైన అస్వస్థతలకి లోనై అల్పాయుష్కులుగా చనిపోతారు . వాళ్ళేదో అంతకుముందు బాకీ ఉన్నారని అబద్ధాలు చెప్పి యజమానులు వాళ్ళ వారసుల్ని శాశ్వత బానిసలుగా మార్చుకుంటారు . ఇదంతా ఎందుకు జఱుగుతుంది ? ఒక విషయాన్ని ఎవరూ మాట్లాడకూడదని శాసించడం వల్ల ! దాన్ని అలా వెలివేయడం వల్ల ! దాని లోతుపాతుల్ని విచారించే అవకాశాలన్నింటినీ నిర్మూలించడం వల్ల ! దాన్ని సాకల్యంగా , కూలంకషంగా అర్థం చేసుకోవడానికి వీలుకల్పించే అన్ని దారుల్నీ ధ్వంసం చెయ్యడం వల్ల ! దానిమీద సమాజంలో ఆత్మశోధనకీ , ఆత్మపరిశీలనకీ ఉన్న ద్వారాల్ని మూసిపారెయ్యడం వల్ల ! అలాగే తెలుగుభాష , తెలుగుభాషాభిమానమూ అనేవి ఈ రాష్ట్రంలో నిషిద్ధాంశాలుగా మార్చబడ్డాక జఱుగుతున్నది ఏమైనా భిన్నంగా ఉన్నదా ?
' ' ఔరో … . ఇప్పుడో కొత్త కానూను వచ్చిందట . అడవి జంతువులను సంపినా పట్టుకున్నా జైలేనట ' ' సుంకరి అన్నాడు .
మంచి పట్టే పట్టారు . తేజ మాట అవడం వల్ల వచ్చింది కాదది , నా పొరబాటే . ఆంగ్లంలో ఆలోచించి తెలుగులో రాయడం వల్ల వచ్చిన తిప్పలు .
తలచిన యంతనె బ్రతుకు దారుల పూవుల మేడ గట్టుచును కొలచిన యంతనె వెలుగు కొండగా చెంతకు వచ్చి నిలచుచున్ పిలిచినా యంతనె మురిసి పెంచిన తండ్రిగా చేయి జాచుచున్ కలతలు తీర్చు దేవుడవు కన్నుల దాతురా వెంకటేశ్వరా !
ఏ యూదులనైతే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా నుండి వెళ్ళగొట్టినారో , వారు మదీనా పై దాడి చేయమని ఖురైషులను పురిగొల్పిటం వలన ఖురైషులు భారీ సైన్యాన్ని తయారు చేసినారు . ఇటు ముస్లింలు తమ రక్షణ కొరకు మదీనా చుట్టూ కందకం త్రవ్వుకున్నారు . ఖురైషులు మదీనా పై దాడి చేయటానికి ఎంతగా ప్రయత్నించినా , వారు లోపలికే ప్రవేశించలేకపోయారు . అల్లాహ్ వారిపై భయంకరమైన పెనుగాలులు మరియు తూఫాను పంపటం వలన వారు తమ ప్రయత్నంలో సఫలీకృతులు కాలేక , వెనుదిరిగి పోయారు .
ముంబై వాసుల మంచినీటీ అవసరాలు తీర్చడానికి భాత్సా కాకుండా ఆరు సరసులు ఉన్నాయి . అవి వరసగా విహార్ , వైతర్ణా , ఉప్పర్ వైతర్ణా , తుసి , తాన్సా మరియు పొవాయ్ . త్ల్సి , విహార్ సరసులు బొరివిలి నేషనల్ పార్క్‌లో నగర సరిహద్దులో ఉన్నాయి . నగర సరిహద్దులో ఉన్న పొవాయ్ నీటిని పరిశ్రమలకు సరఫరా చేస్తారు . దహిసర్ , పొఇన్‌సర్ మరియు ఒహివారా అనే మూడు నదులు ఉన్నాయి . తుల్సి నుండి ప్రవహించే మిథి నది విహారు మరియు పొవాయ్ సరసులు పొంగి పొరలుతున్నపుడు వచ్చేనీటిని చేర్చుకుని ప్రవహిస్తుంది . పడమటి సముద్ర తీరం సెలఏర్లు నీటిమడుగులు ఉన్నాయి . పడమటి సముద్ర తీరం ఇసుక మరియు రాళ్ళతో నిండి ఉంటుంది .
రంగారెడ్డి : రాజీవ్ ఆరోగ్యశ్రీ క్రింద జూలై మాసంలో జిల్లాలోని 24 మండలాల్లో 27 వైద్య శిభిరాలను నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ యం . దానకిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు . ఆరోగ్యశ్రీ వైద్య శిభిరాలను ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు , సబ్ సెంటర్లలో , కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో , పట్టణ హెల్త్ సెంటర్లలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు . జూలై 2న దారూర్ మండలం నాగారంలో , జూలై 3న శామీర్‌పేట మండలం ఉద్దమర్రిలో , 5న శంకర్‌పల్లి మండలం అనంతప్పగూడలో , 6న శంషాబాద్ మండలం [ . . . ]
గతశతాబ్దపు సాహిత్యకారుల్లో ప్రముఖుడిగా పేరెన్నిక గన్న కొడవటిగంటి కుటుంబరావు గారి ( అక్టోబర్ 28 , 1909 - ఆగస్ట్ 17 , 1980 ) శతజయంతిని పురస్కరించుకొని ఈ ఈమాటను కొ . కు స్మారక ప్రత్యేక సంచికగా మీకు సమర్పిస్తున్నాం . కొడవటిగంటి ఉత్తరాలు , విమర్శకుడు రా . రా , మహీధరల వ్యాసాలు , భారతి పత్రికలో బుర్రా సుబ్రహ్మణ్యం విమర్శ కొడవటిగంటి ప్రతివిమర్శా , పాలగుమ్మితో రేడియో చర్చ , అలాగే కొడవటిగంటి రోహిణీప్రసాద్ , విష్ణుభొట్ల లక్ష్మన్న , కొడవళ్ళ హనుమంతరావుల కొత్త వ్యాసాలు ఈ సంచిక ప్రత్యేకం .
అశోకవనంలో దుఃఖంలో మునిగిపోయున్న సీతని గమనించాడు హనుమంతుడు . రావణుడు ఆమె ముందుకి వచ్చి ఎడాపెడా పేలడాన్నీ చూశాడు చెట్టుమీద సూక్ష్మరూపంలో దాక్కుని . రాక్షస స్త్రీలు నయానా భయానా సీత మనసు మార్చ ప్రయత్నించడమూ గమనించాడు . రావణుడు నిష్క్రమించాక , రాక్షస స్త్రీలు నిద్రకి పడ్డాక . . ఆలోచించాడు . నేనిప్పుడు ఏ రూపంతో ఎదుటబడినా సీత నన్ను రామదూతగా నమ్మదు అని గ్రహించాడు . ఎలా ఆమెని నమ్మించడం . ఆమెకి అత్యంత ప్రీతి పాత్రమైన రామకథని గానం చెయ్యడం ఆరంభించాడు . కథాగానం పూర్తయినాక ఆమె ముందు తన నిజ రూపంతోనే నిలబడ్డాడు . తనని తాను పరిచయం చేసుకున్నాడు . రామ సుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు . తన రామభక్తిని చెప్పుకున్నాడు . ఇంత చెప్పినా అతను అనుమానించినట్టే సీత నమ్మలేదు . చివరికి తల్లీ నన్ను నమ్మవమ్మా అని ఆక్రోశించాడు . అప్పటికి గానీ అతనికి రామ ముద్రిక సంగతి గుర్తు రాలేదు . సీత హనుమంతుని గుర్తించిన తరవాత . . అదింకో సంగతి . రాముడు నీయందు ఎంతో ఆర్తితో ఉన్నాడన్నాడు . రాముడి వెనక అఖండమైన వానర సైన్యం ఉందన్నాడు . నేనీవార్త వెనక్కి తీసుకు వెళ్ళగానే రాముడు ఆ సైన్యంతో లంక మీద దండెత్తుతాడన్నాడు . రావణుణ్ణి వధించి తీరుతాడు , నిన్ను చెర విడిపిస్తాడన్నాడు . సీత సహజంగానే ఈ మాటలూ నమ్మలేదు . ఈ సారి ఆమెని నమ్మించేందుకు అతని దగ్గర ముద్రిక ఏదీ లేదు . చేసి చూపించాడు . తన నమ్మకం నిలుపుకున్నాడు . మాటలు చెప్పడం తేలికే . చేసి చూపించడం కష్టం . కానీ నమ్మకం నిలుపుకునేందుకు అంతకు మించిన మార్గం మరోటి లేదు .
కానీ నా జబ్బు ఎంపిక వెనుకనున్నవి యిలాంటి రొమాంటిక్ కారణాలు కావు . కాస్త ప్రాక్టికల్ కారణాలు . నాకు రచయితల రచనల్నే గాక , వాళ్ల జీవిత చరిత్రల్నీ పట్టించుకునే అలవాటుంది . నాకు తెలిసిన పాశ్చాత్య రచయితల్లో చాలామంది ట్యుబర్క్యులోసిస్ ( క్షయ ) వ్యాధితోనే మరణించారు . కాఫ్కా , చెకోవ్ , శామ్యూల్ జాన్సన్ , కామూ , జాన్ రస్కిన్ , రూసో , గోర్కీ , మపాసా , డి . హెచ్ . లారెన్స్ , జార్జి ఆర్వెల్ , సోమర్సెట్ మామ్ . . . యిలా ఒకరు కాదు యిద్దరు కాదు ! బుద్ది పుట్టి వెతికితే వికీపీడియాలో పెద్ద జాబితానే కనిపించింది . మొదట్లో నేను అభిమానించే కాఫ్కా , చెకోవ్ లు నలభయ్యో పడిలోనే చనిపోవడం గురించి బాధపడుతూ " ఈ దరిద్రగొట్టు జబ్బు పొట్టనపెట్టుకోకపోతే యింకెన్ని రచనలు చేసేవారో " అనుకునేవాణ్ణి . కానీ ఇపుడిపుడే ఏమనిపిస్తోందంటే , వాళ్లు అసలంటూ రచనా వ్యాసంగాన్ని నిబద్ధంగా అంటిపెట్టుకు వుండటానికి ఈ జబ్బు కూడా కొంత కారణమేమోనని . దీని కారణంగానే కాఫ్కా ఉద్యోగం నుంచి విరివిగా సెలవలు తీసుకుని ఎక్కువకాలం శానిటోరియాల్లో గడపాల్సి వచ్చింది , తత్ఫలితంగా బోలెడంత ఖాళీ దొరికింది . నిజంగా రచనలు చేయడానికి ఆ ఖాళీని ఎంతవరకూ ఉపయోగించుకున్నాడన్నది అప్రస్తుతం . తన చుట్టూ మధ్యతరగతిలాగా మామూలు వృత్తి సంసార జీవితాల్లో యింకిపోకుండా , ప్రపంచాన్ని బయటి నుండే సావకాశంగా పరికించే అవకాశం దొరికింది ఈ జబ్బు వల్ల . శామ్యూల్ జాన్సన్ , డి . హెచ్ . లారెన్స్ ల విషయంలోనూ ఇంతే . ఈ జబ్బే లేకుంటే కామూ రాతల జోలికి పోకుండా ఎంచక్కా పుట్బాల్ ఆటగాడిగా కుదురుకునేవాడు . రచనా వ్యాసంగానికి ఒకరకంగా ఆదర్శ స్థితి అనదగ్గ సంరంభరహితమైన సన్యాసి తరహా జీవితాన్ని వీళ్లలో చాలామందికి తప్పనిసరి చేసింది ఈ జబ్బు .
ఇది ఏ గ్రంధం లోనిదో నాకు తెలియదు . మీకు తెలిసిన యెడల నాకు తెలియజేయండి .
వ్యాసం చివర్లో రచయిత ప్రస్తావించిన విషయం కూడా ముఖ్యమైనదే . ఒకప్పుడు తెలుగులో ముద్రణాసౌకర్యం ఏర్పడడం ఎంతటి మార్పుకు కారణమయిందో , గత 20 , 25 ఏళ్ళలో ఇంటర్నెట్ మీద తెలుగు చదవడం , రాయగలగడం అనేవి కూడా ఎన్నో పరిణామాలకు దారితీశాయి . ఈ ప్రయత్నాల్లో పాల్గొన్న ఔత్సాహికులు ఇంకా మన మధ్యనే ఉన్నారు కనక వారి కృషినీ , అనుభవాలనూ వివరిస్తూ లక్ష్మన్నవంటివారు వ్యాసాలుగా రాస్తే బావుంటుంది . యూనికోడ్ విషయంలో ఈమాట సంపాదకవర్గం చేసిన కృషి కూడా చెప్పుకోదగ్గదే . వీరందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడంలో భవిష్యత్తులో తప్పులు జరగకుండా ఉండాలంటే ఈ సమీపచరిత్ర అంతా వెంటనే నమోదు కావాలని నా ఉద్దేశం .
( అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రచురించాను కానీ యీ మొత్తమూ నేను గతంలో ఆర్కుట్‌లోని ఒక కూటమిలో ఆంగ్లాంధ్రాలు కలిపి వ్రాసిన ఒక వ్యాసపరంపర - దానినిప్పుడు తెనిగించాను . )
ఊగిపోవు మది ఉయ్యాలగా . . జంపాలగా … | | హాయి హాయిగా … | | సారినీస ధని నీసారి సరిసనిసనిధ … మధని ధరిస ధనిధ మధమగ గమగ మధమ ధరిసనిరిసనిధమగరిస . .
" దేశం అనేది ఒక ఆదర్శానికి ఆచరణాత్మక ప్రత్యామ్నాయం " ఏవి చెప్పావు రాకేశ్వరా ! వేసుకో వీరతాడు . . సుమారు ఏడాదిన్నర క్రితం తెలుగు బ్లాగు మొదలెట్టినప్పటికీ ఇప్పటికీ తెలుగు మీద నువ్వు సాధించిన పట్టు చూస్తే ముచ్చటేస్తోంది .
పన్నులు సంబంధించి పెట్టుబడిదారీ ప్రభు త్వాలు అనుసరించే ప్రత్యక్ష , పరోక్ష పన్నుల విధానాన్నీ , దానిలోని అన్యాయాన్ని బెబెల్ విపు లంగా వివరిస్తాడు . ఇది చదువుతుంటే మనం ఇప్పుడు మన దేశంలోని పన్నుల విధాన్ని చర్చిస్తు న్నట్లే వుంటుంది .
పరవళ్ళు - ఉరకలు పరుగులతో , వేగంగా సాగిపోయే , పరవళ్ళు తొక్కింది గోదావరి అంటారు కదా . పొదుగు - దీనికి రెండు అర్థాలున్నాయి . ఒకటీ పాల " పొదుగు " ఇంకోటి పొదగడం అంటే అమర్చిపెట్టడం , వజ్రాలు పొదగడం అంటారుగా . అనువు - కలిసివచ్చే అంశం , " అనువుగాని చోట అధికులమనరాదు " వేకువ - తెల్లవారుఝాము , " వేకువనే లేచి " అని వాడుకలో ఉంది . " పెందరాళే " అని ఇంకో పదం కూడా ఉంది . మేలము - దీనికి అర్థం తెలీదు , కానీ ఊహిస్తున్నా . . . . " మంచి " అయినా అయ్యుండాలి లేదా " ఎత్తైనది " , " పైన " అయినా అయ్యుండాలి .
క్రిష్ణ ఇప్పుడు తీసుకుంటే ముందుకి బోల్డు ధరొస్తుంది … . అయామ్ లైక్ యువర్ సన్ అనుక్కోండి అన్నాను . అంటే ఉన్నట్టుండి నా చేతులు రెండూ పట్టుకుని భోరుమని ఏడ్చీసింది . ' నాకు బిడ్డ సంచీ తీసీసేరు . నాకింక పిల్లలు పుట్టరు … . . నాకు పిల్లడ్ని కన్నంత అదృష్టం కూడానా … . నువ్వు అంత మాటన్నావు … … అదే చాలు … . . ' అని . చీకట్లో ఎడ్వాన్సివ్వకూడదు కరంటొచ్చేవరుకూ ఆగమంటే ఆవిడ కొట్టిన సుత్తంతా వింటూ కూచున్నాను … … .
కొత్తపాళీ , నాగరాజ , ఒరెమూనా గార్లకౌ , ధ . వా . నెట్టిజెన్ గారు , మీరేటి నా కంప్యూటర్ను గానీ హ్యాకింగు చేసేసారేటి ? నా అవిడియాలు ఇలా బయట పెట్టీస్తున్నారు . విహారి గారు , 99 అయ్యాయి . ఇంక వందే మిగిలింది . అది త్వరలోనే . అదురుతుందో లేక అదిచూసి బ్లాగులోకం బెదురుతుందో చూడాలి . - - విహారి
విమానం అరేబియా సముద్రం దాటి అరేబియా దేశం మీదకి వచ్చే సరికి కొరివి దయ్యాలలా ఎక్కడ చూసినా మంటలే . వైజాగు లో కాల్‌టెక్స్ వారి నూనె శుద్ధి కర్మాగారం వద్ద ఇటువంటి " ఫ్లేర్ " ఒకటి చూసేను కనుక అవి కొరివి దయ్యాలనుకుని భయపడ లేదు . కాని అన్ని ఫ్లేర్‌లని ఇంతకు ముందెప్పుడు చూడ లేదు . మెల్లిగా మంటలు దూరం అయిపోయాయి . కైరో మరొక రెండు గంటలలో చేరుకుంటామని పైలట్ చెప్పేడు .
ఈ శైలికి బేతవోలు వారు - పద్యకవితాపరిచయం అని పేరు పెట్టారు . మీరు తలచుకోవటం వల్ల మాకు జాలంలో పద్యకవితాపరిచయం , ధన్యోస్మి .
చాల బాగా చెప్పారు రవి ! సృష్టి లో సర్వఅంతర్యామి ని , చిమలను చాల చక్క చెప్పారు
తండ్రి కన్నీరింకి పోవగ తానుతెచ్చిన కట్నకానుక లిరుగు పొరుగుకు చూపిమురిసే ఆడదెన్నడు బాగుపడునోయ్ .
బాగుందండీ . అన్నట్లు నాకూ కళ్ళజోడుంది . చిన్నప్పుడు నేనూ మీలాగే కళ్ళజోడున్నవాళ్ళంతా మేధావులే అన్న ఫీలింగుతో వుండేవాడిని . ఎనిమిదోతరగతినించీ కళ్ళజోడు తెచ్చుకోటానికి ప్రయత్నిస్తే M . C . A ఆఖరి సంవత్సరంలో వచ్చింది : ( పెట్టుకున్నాక అంకులని మాత్రం ఎవ్వరూ అన్లేదులేండి కొంతలో కొంత నయం , హి హి హి !
చాలా బాగా చెప్పారు . కళ్ళ ముందు నా చిన్న తనం మళ్ళి కదిలిందీ . ఒక్కసారి గుర్తుతూ వచ్చాయీ .
ఈ కాలంలో ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున అసంతృప్తి పెరిగింది . ముఖ్యంగా ప్రధాని మన్మో హన్ సింగ్‌ను కేంద్రంగా చేసుకొని యుపిఎ ప్రతిష్టను పెంచుకోవాలనుకున్న కాంగ్రెస్ వ్యూ హం దెబ్బతిన్నది . యుపిఎ1 పరిపాలనతో పోల్చుకుంటే మన్మోహన్ సింగ్ ప్రతిష్ట ఈ కాలంలో దారుణంగా పడిపోయింది . సంస్కరణ ల భాషలో చెప్పాలంటే మన్మోహన్ రేటింగ్ ' బి ' గ్రేడుకు చేరింది . తదుపరి ర్యాంకుకు దిగితే దివాళానే . ముఖ్యంగా అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇందులో ప్రత్యక్షంగానో , పరోక్షంగా నో మన్మోహన్ పాత్ర కూడా వున్నట్లు రుజువు కావడంతో ఆయన వ్యక్తిత్వం బాగా మసకబారి పోయింది . ఆయనను అడ్డంపెట్టుకొని బలపడా లన్న కాంగ్రెస్ వ్యూహం దెబ్బతిన్నది . దీంతో కాంగ్రెస్ ఆత్మరక్షణ స్థితిలో పడిపోయింది . ఈ స్థితిలో ప్రజలు , ప్రజా ఉద్యమాలపై నిర్భంధానికి తెగబడుతోంది . ప్రజాస్వామ్య హక్కులు హరించ బడుతున్నాయి . నిరంకుశత్వం దిశగా అడుగులే స్తోంది . పెరుగుతున్న రెండో వైరుధ్యం ఇది .
ఆ లోపల పిల్లలు లేచి రావడం , వాళ్ళ పనులు చూడ్డం , మిగిలిన పనులు చూసుకోవడం అయ్యేసరికి సాయంత్రం అయింది . పకోడీకి పిండి కలిపాడు సుందరం .
ఒకమాదిరి వేగంతో వెళ్తున్నా ఆ ట్రక్‌లో వాళ్ళు అక్కడ పార్క్ చోసి వున్న కార్లనన్నిటినీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని అర్ధమైందతనికి . ఇంకా నక్కి కూర్చున్నాడు .
దళితుల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు : వెంకటలక్ష్మి
స్నానం చేయునప్పుడు : - " గం గేచ యమునేచైవ , గోదావరీ సరస్వతీ | నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిమ్ కురు … . . " అనే ఆరు మంత్రములను చదువుచూ , ఓ నదులారా మీకు నమస్కారములు ; పవిత్రమైన మీ నీటిని నేను వినియోగిస్తున్నాను ; సర్వ పుణ్యములను ప్రసాదించండి అని ప్రార్ధన చేయటం జరుగుతుంది .
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - సిగరెట్ కోసం , పదిరూపాయల నోటుమార్చగా తిరిగి వచ్చిన మూడు రూపాయి కాసులు పైజేబులో వేసుకుని బైక్ స్టార్ట్ చేసాడు ఒక యువకుడు . ఆ మూడు రూపాయి కాసులు స్నేహంగా పలకరించుకున్నాయి . ఆప్యాయంగా ఒకరినొకరు హత్తుకుని మనమంతా ఒకటే , మనమే ఈ మనుషులకు ఆధారం అని గర్వపడ్డాయి . అంతా ఇలా ఒకే జేబులో కలవడం మన అదృష్టం అని సంబరపడిపోయాయి . ఏమో ఎలా రాసిపెట్టుందో , మళ్ళీ మనం కలుస్తామో లేదో తెలియదు , ఒకవేళ కలిసినా అప్పటికి మనం ఏ పరిస్ధితిలో ఉంటామో . వయసయ్యినా నిగనిగ తగ్గని వారు కొందరైతే , చిన్న వయసులోనే ఎందరో కష్టాలు తీర్చి అరిగి పోయి గుర్తుపట్టని విధంగా తయారయ్యే వారు కొందరు . . మనల్ని సృష్టించిన ఈ మనిషి ఏం చేస్తాడో చూద్దాం , అని నవ్వుకున్నాయి . బైక్ కుదుపులతో ఊగుతూ ఈలవేస్తూ , పాటలు పాడుకుంటూ శబ్దంచేయసాగాయి . బైక్ ఒక్కసారిగా ఆగిపోవడంతో ఒకరిపై ఒకరు పడి , కళ్ళింతచేసి ఏమయిందో అన్నట్లు చూడసాగాయి . " ఛ ! , పెట్రోల్ ఆయిపోయింది , ఇప్పుడెలా ! " , అన్న యువకుడి మాటలువిని కాస్త భయపడసాగాయి . . అయితే మనం విడిపోబోతున్నాం , అని అందులో ఒక రూపాయి ఏడ్వసాగింది . ఊరుకో . . అలా ఏం కాదులే . . పెట్రోల్ అంటే మన ముగ్గురితో అయ్యే పనికాదు , కాబట్టి ఏ వందనోటో మారకతప్పదు . . అంటే ఇంకా మన స్నేహితులు కొందరు రావొచ్చేమో చూద్దాం . అని ఓదార్చింది అందులో ఒక రూపాయి . బైక్ ను కొంతదూరం చెమటలుపట్టేలా తోసుకుంటూ వెళ్ళాడు ఆ యువకుడు . అలసిపోయి అడుగులవేగం తగ్గిందతనిలో , బైక్ ని రోడ్డుపక్కగా పార్క్ చేసి లాక్ చేసాడు . . జేబులో నుండి నిశ్శబ్దంగా యువకుడి గుండె సవ్వడిని గమనిస్తున్న రూపాయి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి . ఏం జరగబోతుందోనని ఆతృతగా ఎదురుచూస్తున్నాయి . దారినపోయేవాళ్ళను లిప్ట్ అడిగి దగ్గరలో ఉన్న పెట్రోల్ పంపుకు చేరుకున్నాడు ఆ యువకుడు ఏబైరూపాయలకి పెట్రోల్ కావాలి . నా దగ్గర బాటిల్ లాంటిది ఏదీలేదు అన్నాడు ఆ యువకుడు పెట్రోల్ పంపువాడితో . ఏభైరూపాయలు అని వినపడగానే . . హమ్మయ్య , మనకేం పర్వాలేదు అనుకుని కాస్త ఊపిరిపీల్చుకున్నాయి ఆ రూపాయి కాసులు . అక్కడ బాటిల్ దొరికుతుంది అని ప్రక్కనే కూర్చున్న ఒక చిన్న పిల్లవాడ్ని చూపించాడు ఆ పెట్రోల్ పంపువాడు . అనుకోనివిధంగా ఒక రూపాయి స్నేహితులని విడిచి వెళ్ళాల్సొచ్చింది . బాటిల్ ఇచ్చిన పిల్లవానికి ఒక రూపాయి ఇచ్చేసాడు ఆ యువకుడు . సాయంత్రమయ్యేసరికి ముగ్గురు స్నేహితులు ఒకరినొకరు వీడి బెంగపెట్టుకున్నాయి . కొత్తస్నేహితులను చేరుకున్నా మాట్లాడక మౌనంగానే ఉండిపోయాయి . ఒకవేళ కొత్తవాళ్ళతో స్నేహం చేసుకున్నా అది ఎంతసేపు నిలువనిస్తాడు ఈ మానవుడు అని మనసులో మానుషుల్నందర్ని తిట్టుకున్నాయి . * * * * * * * * * * * * * * * * * * * కష్టపడి ఎండలో కూర్చుని బాటిల్స్ అమ్ముతూ సాయంత్రానికి పది రూపాయి కాసులు సంపాదించాడు ఆ పిల్లాడు . ఆనందంగా చేతిలో డబ్బులు చూసుకుంటూ ఇంటికి పరుగుతీసాడు . ఆ పరుగుతో ఒకరాయిని తన్నుకుని ఎగిరి కిందపడ్డాడు . . రూపాయి కాసులన్నీ భయంతో కేకలు వేస్తూ చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి . కారుతున్న రక్తాన్ని , తగిలిన దెబ్బను లెక్కచేయకుండా , కిందపడిన రూపాయి కాసులను కంగారుగా ఏరసాగాడు ఆ పిల్లవాడు . . దొరికిన రూపాయినల్లా ముద్దాడుతూ జేబులోవేసుకోసాగాడు . రూపాయి తనపై చూపించిన ప్రేమకి పొంగిపోయింది , మళ్ళీ తన మోముపై చిరునవ్వులు చిందించింది . తనని కష్టపడి సంపాదించినందుకు , క్రిందపడిపోతే ప్రేమగా దగ్గరకు తీసుకున్నందుకు … సంతోషపడింది . నన్ను సృష్టించిన నిన్నే తిట్టుకున్నా ఓ మనిషీ , క్షమించు అని చెంపలేసుకుంది . ఈ సారి తన స్నేహితుల్ని సంతోషంగా వదిలి ఆ పిల్లాడి ఆకలిని తీర్చి రుణం తీర్చుకుంది ఆ రూపాయి . * * * * * * * * * * * * * * * * * * * కాలం గడిచింది . ఒకప్పుడు కలుసుకున్న రూపాయి కాసుల కోరిక తీరనేలేదు . మళ్ళీ ఒకరినొకరు కలుసుకోలేకపోయాయి . ఎవరికైనా నేనిక్కడున్నా అని చెప్పి కబురుపంపే వీలులేని చోట చిక్కుకుపోయాయి . మనిషిచేత సృష్టించబడి ఆ మనిషికి కష్టంలో సాయపడి అతనిని ఆనందపరచి , అతని మూఢనమ్మకాలకు భలైపోయి మట్టిలో కలిసిపోయిందొక రూపాయి అయితే . గంగమ్మతల్లీ నన్ను చల్లగా చూడు , ఇదిగో ఈ రూపాయినీకు అర్పిస్తా అని జాలిలేని మనిషిని వదలి , కడలి ఒడిని చేరుకుంది వేరొక రూపాయి . చిలిపి పనుల చిన్నారుల చేతిలో ఆటవస్తువుగా మారి , కళ్ళను తెరచి భయమును మరచి , రైలుపట్టాపై పవలించి సత్తురేకై , తనరూపాన్ని కోల్పోయింది మరొక రూపాయి .
అబ్బో బాగా రాసారండి : ) హా హా హసిని హసిని హసిని : )
వెంపర్లాడరు . వాళ్ళకు సమసమాజమే ధ్యేయమవుతుంది , ఇక ముందు . ముందు చెప్పినట్టు వాళ్ళ
ఆ ఏడు బానలూ మాయమయ్యాయి . ప్రజాధనం అలాగేవుంది . తనతప్పు తెల్సుకున్న ధనవర్మ ఆ ధనాన్నంతా ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేసి , ప్రజాహితకార్య క్రమాలన్నీ యధప్రకారం కొనసాగించి , తనతప్పులన్నీ సరిదిద్దుకుని , దురాశాపిశాచాని తరిమేసి , తల్లి తండ్రులనూ ప్రజలనూ
కురువంశీయుడవగు ఓ అర్జునా ! తమోగుణము అభివృద్ధి నొందినదగుచుండగా మనుజునియందు అవివేకము ( బుద్ధిమాంద్యము ) , సోమరితనము , అజాగ్రత , అజ్ఞానము , మూఢత్వము , ( లేక , విపరీత జ్ఞానము ) అను నివి కలుగుచున్నవి .
చాలా కాలానికి రాసినా . . . . , చాలా చక్కని కవిత రాశారు . మీరు మీ ఊరు వెళ్ల బట్ట్టే . . . . మీ ఊహలకు ఊపిరొచ్చింది ఈ కవితగా రూపుదాల్చింది . ప్రశంసలు : )
ఒక వనాన్ని పొడి చేయగల వడ్రంగి పిట్ట ముక్కంత బలంగా ఒక జీవితాన్ని పొడుచుకుంటూ పోయుంటుంది ఈ ముల్లు గర్ర .
ఇంటిపేరు , పెట్టినపేరు ఏ వరుసలో రాస్తే వచ్చే నష్టం ఏమిటోనని విచారిస్తూ కొంచెం దారి తప్పేం . నష్టమో , కష్టమో సోదాహరణంగా మనవి చేసుకుంటాను . చిత్తగించండి . ఆ మధ్య పనిమీద పొరుగూరు వెళ్ళేను . ఆ ఊళ్ళో నా చిరకాల మిత్రుడు పిల్లలమర్రి శివరామకృష్ణ ఉన్నాడు . ఉన్నాడన్న విషయం ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత జ్ఞాపకం వచ్చింది . టెలిఫోను నంబరు కావాలి . డైరక్టరీలో ఎక్కడని వెతకను ? పిల్లలమర్రి లో లేదు . శివరామకృష్ణ లో లేదు . రామకృష్ణ లో లేదు . మహానుభావుడు పేరుని కత్తిరించేడుట . శివ ఆర్ . పీ . కృష్ణ అని వేయించేట్ట పుస్తకంలో . తర్వాత తెలిసింది . మొదటి నామధేయం శివ ట , కడపటి పేరు కృష్ణ ట . కూతురు పేరు రేఖ కృష్ణ ట . కొడుకు పేరు ప్రవీణ్ కృష్ణ ట . ఈ కత్తిరింపులు , సవరింపులలో పిల్లలమర్రి అన్న చిలక లాంటి ఇంటిపేరు , పంచాంగంలో తిథిలా , ఏష్యం అయి పోయింది .
అధికారుల ఆటవిక దాడిపై జనం ఆగ్రహించారు . ఎదురు తిరిగారు . తమ భూములు ఇచ్చేది లేదన్నారు . కంచెలు తొలగించారు . స్తంభాలను విరిచేశారు . ఆధిపత్యం కోసం అధికారుల ప్రయత్నం … బతుకు బాట కోసం సామాన్యుల పోరాటం … వెరసి ఆ దృశ్యం చిన్నసైజు సమరాన్ని తలపించింది . కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ కోసం చేపట్టిన భూ స్వాధీనం కోసం సర్కారు చేపట్టిన ' నిర్బంధ కాండ ' ప్రస్తుతానికి విఫలమైంది .
సమాజంలో సామాన్య మానవుడు నేను ఒక సామాన్య మానవుడిని . మరీ తెలివైన వాడినీ కాదు , అలాగని తెలివి తక్కువ వాడినీ కాదు . నా చుట్టూ జరుగుతున్న విషయాలు కూలంకుశంగా నాకు తెలీదు , కానే సారాంశం మాత్రం తెలుసు . ముఖ్యమంత్రి ఎవరో , ప్రదానమంత్రి ఎవరో , Home minister ఎవరో నాకు తెలుసు . ఏ మంత్రి ఏ జిల్లా నుంచీ … Continue reading →
ఆత్మ ప్రదక్షణాలతో అలసి వొళ్ళు విరుచుకున్నట్లుంది నేల . జుట్టు విరబోసుకున్న మంత్రగత్తెలా ఊగుతోంది వేపచెట్టు . దూరంగా ధ్వంసమైన వంతెనకటు వైపు ఏముందో కనిపించడంలేదు . చుట్టూ శిధిల చిహ్నాలు . అంతటా కప్పేసిన ధూళి మేఘం . చంద్రుడి జాడ లేదు . సూర్యుడు ఏ పరాయి ఊరు పారిపోయాడో ఆచూకీ లేదు . తారలు ఏ తెరల చాటున దాగున్నాయో తెలియదు .
@ సుజాత , మీరు మరీనండీ . సెక్రెటరీ రాజశేఖరమూ , మీనా కృష్ణ నాకు బెస్టు ఫ్రెండ్సయితేనూ ! : ) @ చైతన్య . . నిజం . @ మాల . . దయచేసి ఇక మీద వ్యాఖ్యలు తెలుగులో రాయండి .
ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలేచి చూసేసరికి మాఇంటి వరండాలో అంతా హడావిడిగా ఉంది . అమ్మ , నాన్న , ఇందిరత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి . ఆ నిమ్మకాయల మధ్యలో మిరపకాయలు కూడ కలిపి కట్టాలి అని ఇందిరత్త అమ్మకి డైరెక్షన్స్ ఇస్తుంది . బయటకెళ్ళి కళ్ళు నులుముకొని చూస్తే కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ బజాజ్ కబ్ స్కూటర్ వరండాలో కనిపించింది . అమ్మని అడిగాను ఎవరిది ఈ స్కూటర్ అని ? ఎవరిదో అయితే మన వరండాలో ఎందుకు ఉంటుందే పిచ్చి మొహమా ! మనదే . నాన్న ఈరోజే గోదావరిఖని వెళ్ళి కొనుక్కొచ్చారు అని స్కూటర్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టడంలో బిజి అయిపోంది . ఎందుకో ఆ స్కూటర్ మాదే అంటే నమ్మబుధ్ధి కాలేదు నాకు చాలాసేపటివరకు . అప్పట్లో మా కాలనీలో చాలామందికి లూనాలు ఉండేవి . ఒకరిద్దరికి మాత్రం స్కూటర్ ఉండేది . అప్పట్లో అసలు లూనా ఉండటమే గొప్ప . ఇక స్కూటర్ ఉందంటే అబ్బో ఇహ వాళ్ళ గురించి చెప్పనే అఖ్ఖర్లేదు . మొదటిసారి స్కూటర్ మీద బయటికెళ్ళినప్పుడు నేను ఎంత గర్వంగా ఫీల్ అయ్యానో ! మా నాన్న నన్ను ఎత్తుకొని ముందుసీటుకి , హ్యాండిల్ కి మధ్య ఉన్న కాసింత స్థలంలో నిల్చోబెట్టి హ్యాండిల్ మీద రెండు చేతులు పెట్టించి గట్టిగా పట్టుకోవాలి అని చెప్పి స్కూటర్ స్టార్ట్ చేసారు . అలా వెళ్ళేటప్పుడు నాకు రోడ్డు కనిపిందలేదు , అప్పుడు నేనింకా బుడంకాయనన్నమాట . మానాన్న చేతి సందుల్లోంచి అటుఇటు రోడ్డుమీద ఉన్నవాళ్ళకి చేతులూపి తెగ సంబరపడిపోయాను . మావీధిలో ఆచివర్నుండి ఈచివరికి తిప్పి ఇంటికి తీసుకొచ్చారు . స్కూటర్ దిగింతరవాత కూడ ఎక్కడో తేలిపోతున్న అనుభూతి . ఓహ్ ! స్కూటర్ మీద వెళ్తే ఇంత మజాగా ఉంటుందా అని అనుకున్నాను . ఇక అప్పట్నుంచి మా నాన్న అప్పుడప్పుడు నన్ను స్కూటర్ మీద బజార్ కి తీసుకెళ్ళేవాళ్ళు , స్కూల్ లో దింపేవాళ్ళు , వర్షం పడుతున్నప్పుడు వరండాలో ఉన్న స్కూటర్ పైన కూర్చొని వర్షం చినుకులతో ఆడుకోవడం , ఎంత ఆటలో మునిగిపోయి ఉన్నాకాని వీధి చివర్లో మానాన్న స్కూటర్ కనిపించగానే నేను పరిగెత్తుకొని ఎదురెళ్ళి అక్కడ్నుండి స్కూటర్ ఎక్కి ఇంటికి రావటం ఇవన్ని ఇంకా నిన్నమొన్న జరిగినట్టే నాకళ్ళ ముందు కదలాడుతున్నాయి . అసలు ఆ స్కూటర్ మీద నేను ఎన్ని రకాల ఆటలు ఆడానో ! కొన్నాళ్ళకి మానాన్న కొలీగ్ వాళ్ళబ్బాయి , నవీన్ గాడు మా స్కూటర్ సీట్లన్ని బ్లేడుతో ఇష్టమొచ్చినట్టు కోసిపడేసాడు . మానాన్న చాలా భాదపడ్డారు . నాకయితే వాడిమీద పీకలదాక కోపమొచ్చింది . సీట్లు మార్పించాలంటే బోలెడంత ఖర్చు ! అప్పట్లో అన్నింటికి పంచవర్ష ప్రణాళికలు రూపొందింపబడేవి కదా ! కాని అలా వదిలేస్తే చూడటానికి బాగోలేదు . అప్పుడు మాఅమ్మ నల్ల సెల్లో టేప్ తెచ్చి ఎక్కడా చిరుగులు కనిపించకుండా అతికించింది . ఆ తరవాత చాలారోజులకి సీట్లు మార్పించారు . నేను పదోతరగతికి వచ్చేసరికల్లా నాకు స్కూటర్ వెనక సీట్ కి ప్రమోషన్ వచ్చింది . అప్పట్లో మాకాలనీలో చాలానే స్కూటర్లు కనిపించేవి . కాకపోతే బజాజ్ కబ్ లు తక్కువే ! ఎందుకంటే కబ్ చాలా బరువుంటుందంట . ఎక్కువమంది చేతక్ , LML వెస్పా నడిపేవారు . ఇక ఇప్పుడంటారా , అన్ని స్ప్లెండర్లు పల్సర్లే కదా ! అసలిప్పుడు రోడ్లమీద స్కూటర్ కనిపించడం చాలా అరుదు . మానాన్నతో పాటు స్కూటర్లు కొన్నవాళ్ళంతా ఎప్పుడో వాటిని అమ్మేసి మోటర్ సైకిళ్ళని కొనుక్కున్నారు . మానాన్న మాత్రం ఇంకా ఆ స్కూటర్ నే నడిపిస్తున్నారు . ట్రాన్స్ ఫర్ అయిన ప్రతిచోటికి స్కూటర్ ని కూడ తీసుకొని వెళ్తారు . ఎండయినా , వానయినా దాని మీదే ఆఫీసుకెళ్తారు . మొన్నామధ్య మాటల సందర్భంగా నాన్నని " మీతోపాటు కొన్న వాళ్ళందరి స్కూటర్లు తుక్కు తుక్కు అయిపోయి మెకానిక్ షెడ్డులు చేరాయి , మరి మీ స్కూటరేమో ఇంకా ఆరోగ్యంగా ఉంది . ఏంటి రహస్యం " అని అడిగాను . దానికి నాన్న ఒక చిరునవ్వు నవ్వి " నాకు బావమరుదులు కాని , కొడుకులు కాని లేకపోవటమే ! " అని అన్నారు . ఆమాటలు గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొస్తుంది నాకు . ఇప్పుడు కార్లయినా , మోటర్ సైకిళ్ళయినా లోన్లమీద కొనెయ్యటం , కొత్త మోజు పోయేవరకు లేదా బోరుకొట్టేవరకు వాడటం తరవాత మార్కెట్ లో వచ్చిన ఇంకో మోడల్ బండి కొనేసి ఉన్న బండిని అమ్మేయడం , అన్ని చకచకా జరిగిపోతున్నాయి . మహా అంటే పదేళ్ళకి మించి ఎవ్వరు వాడటం లేదు . మానాన్న లాంటి కొందరు మాత్రమే ఇలా ఒకే బండిని సంవత్సరాలు సంవత్సరాలు వాడుతుంటారు . ఇది అమ్మేసి కొత్త బండి కొనుక్కోడి నాన్న అంటే అది కేవలం స్కూటర్ అయితే అమ్మేసేవాడ్నే కాని అందులో నా ఇరవయ్యేళ్ళ జీవితం ఉంది . బుడిబుడి నడకల నా పిల్లల ఆటలు , వాళ్ళ సరదాలు ఇంకా ఆ స్కూటర్ మీద నాకు కనిపిస్తున్నాయి . నా జ్ఞాపకాల్ని నేను అమ్మలేను అని చెప్పారు . ఇప్పటికి ఇంటికెళ్తే వరండాలోనే ఎదురొచ్చి పలకరిస్తుంది మా నాన్న స్కూటర్ . కాదు కాదు హమార బజాజ్ !
రోజంతా ఎవరిని అడిగినా లింగమ్మ దగ్గర ఒక చిన్న చేతి సంచీ తప్ప మరొకటి , ఆఖరికి మెళ్ళో నల్లపూసలు కూడా కనిపించక ఏ లాయరూ ఆవిడతో పెద్దగా మాట్లాడింది లేదు . సాయంత్రం కోర్టు వదిలాక ప్రొద్దంతా ఏదో పని చేసి అలిసినట్టు వచ్చిన లాయర్ల గుంపును చూసి ఆశగా అడిగింది .
ఎంతసేపు అలా గోడ పక్కన నిలబడి కళ్ళే చేతులుగా చేసుకుని వెతికాడో కూడా గమనించలేదు విశ్వనాధ్ . కాలు చివరంటా లేచి దిండు అవతల తొంగిచూసాడు . తను వేసిన పసుపు రంగు అట్ట . . పుస్తకం కనిపించిన ఉత్సాహంలో సుజాత తలుపు తీసి లోపలికి వచ్చేచప్పుడు కూడా వినపడలేదు విశ్వనాధ్‌కి . ఆ పుస్తకం తనదేనని నిర్ధారణగా చూస్తూ ఉన్నంతలోనే , హఠాత్తుగా సుజాత , పైట కొంగు తీస్తూ , చీర మార్చుకోడానికి కాబోలు , పడక గదిలోకి అడుగు పెట్టడం కనుచివర్లో కనిపించి గబుక్కున వంగున్నాడు విశ్వనాధ్ . అప్పటికే ఆలస్యమైపోయింది . కదలకుండా అలాగే కూర్చున్నాడు కాసేపు . ఈ విడ్డూరాన్ని పూర్తిగా గమనించిన కోడలు మాత్రం నిర్ఘాంతపోయింది . ఈ వయస్సులో ఇదేం బుద్ధీ !
ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి , శ్రీశైలం , శ్రీ కాళహస్తి , సింహాచలము , అన్నవరం , యాదగిరి గుట్ట , వేములవాడ , మహానంది , కానిపాకం మొదలైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి . తిరుపతి లోని తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచములోకెల్లా ఐశ్వర్యవంతమైన హిందూ దేవాలయము . వరంగల్ నగరమునందలి వేయిస్తంభాల దేవాలయము , రామప్ప దేవాలయము కాకతీయుల కాలమునాటి శిల్పకళకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక అభివృద్ధి సంస్థ రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తోంది . పర్యాటక ప్రదేశాలలో విశాఖపట్నం ఒకటి చెప్పుకొదగినది .
సత్యవతి గారూ , అడొ పెద్ద కళ అండి . ఇప్పటికీ మీరు వుత్తరాలు వ్రాస్తున్నందుకు సంతోషం . మీలాంటి స్నేహితురాలున్నందుకు మీ స్నేహితులు అదృష్టవంతులు . మీ అలవాటును కొనసాగించండి .
వచన పద్యానికి లక్షణ సమాకలనం చేస్తూ హనుమకొండ ( వరంగల్ ) లో మిత్రమండలి వార్షికోత్సవాల సందర్భాన ( 1965 ) ' వచన పద్యం ' గూర్చి ఒక వ్యాసం చదివినాను . అందులోనే ఈ పాదవిభాజకసూత్రాన్ని మొదటిసారిగా ప్రతిపాదించటం జరిగింది . ఆ సమావేశాలకు వచ్చివున్న తిలక్ నా ప్రతిపాదనను హర్షించి , పాద విభజన విషయంలో వచన పద్య ప్రయోక్తలు నిర్దిష్టమయిన దృక్పథంతో రచన సాగించాలన్న నాతో ఏకీభవించినారు . ఆ సమావేశాలకు వచ్చి ఉండిన కుందుర్తి కూడా నా ప్రతిపాదనలను పలుచోట్ల బలపరుస్తూ ఉండినారు .
సీరియల్ కథ ముగిసింది . చనువున్న మిత్రులు కోప్పడ్డారు , ఈ సీరియల్ ఏంటి , అంతా ఒకేసారి పెట్టొచ్చుగా అని . ఒకరైతే ఏకంగా నాలుగు భాగాల్నీ క్రోడీకరించి పీడీఎఫ్ చేసి scribDలోకెక్కించి ఆ కోడ్ కూడా పంపించారు . వారి అభిమానానికి నమస్తే ! ఏంటి కథచదివిన భక్తజనులెవరూ మాట్లాడ్డం లేదు ? మరీ షాకిచ్చేంత ఘోరంగాలేదనే నేననుకున్నా . బాగుందనో , లేక ఫలాని పార్టు నప్పలేదనో ఒక ముక్క చెబితే చాలా సంతోషిస్తా . ఇది కామెంట్లు దండుకునే ట్రిక్కు కాదు , నిజంగా పాఠకుల అభిప్రాయం తెలుసుకునేందుకే . తోచీ తోచనమ్మ తోటికోడలు పుట్టింటికెళ్ళిందని సామెత . శ్రావణమాసంలో ఆడాళ్లందరూ ఇంచక్కా శుక్కురార పేరంటాలకీ , ఆడా మొగా కలిసి పెళ్ళిళ్ళకీ హాజరైపోతూ ఉంటే , ఇక్కడ ప్రవాసంలో ఏ సంబరాలూ లేకుండా కూచున్న నేను , శనారం పొద్దున్నే లేచి కూచుని , ఏమీ తోచక , నా బ్లాగుల్నే పాత టపాలన్నీ ఒకసారి తిరగేస్తూ ఉంటే . . ఏంటో నా రివ్యూల బ్లాగుని చూస్కుని కడుపు తరుక్కు పోయింది . నాకిష్టమైన వ్యాపకాలు , సంగీత శ్రవణం , పుస్తక పఠనం , సినిమా వీక్షణం . . వీటిని గురించి రాసుకోడానికి పెట్టుకున్న బ్లాగది . సినిమాలు చూసేస్తున్నాను గానీ ఏవీ రాయట్లేదు . పుస్తకాలు చదివేస్తున్నాను గానీ ఏవీ రాయట్లేదు . సంగీతం . . హమ్మ్ , నా జీవితంలో అకస్మాత్తుగా ఏర్పడిన సంగీత లేమిని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది . ఇంతోటి రాయనిదానికి మళ్ళీ వీటికోసం వేరేగా ఇంకో బ్లాగెందుకు , ఈ ఖాళీ బ్లాగుని చూసినప్పుడల్లా కడుపు ఇంకాస్త తరుక్కు పోడానికి కాకపోతే నని . . విన్నవీకన్నవీ బ్లాగుని ఆపేస్తున్నా ఇవ్వాళ్టితో . ముందు జాగ్రత్తగా అందులోని టపాలన్నీ ఈ బ్లాగులోకి ఎక్కించేశా కామెంటుల్తో సహా . మొన్ననే ఈ పుటల్లో నమ్మకం గురించి మాట్లాడుకున్నాం . ఒక్కోసారి అవతలి వాళ్ళకి మనమీదున్న నమ్మకం భలే పట్టి కుదిపేస్తుంది . ఒక స్నేహితుణ్ణి అతను బసచేసిన చోటినించి కారెక్కించుకుని ఇంకోచోటికి తీసుకు వెళ్ళల్సొచ్చింది . ఆయనకి పొద్దుటే కాల్చేసి ఫలాని సమయానికి అక్కడ ఉంటాను అన్నా . మళ్ళీ ఎందుకన్నా మంచిది అని ఇంటో బయల్దేరేముందు కాల్చేస్తానన్నా . మొదట చెప్పిన సమయానికి గంట ఆలస్యంగా చేరాను ఆయన ఉన్న చోటికి . ఆయన కనబడుతూనే , ఏమైందంటే . . అని మొదలెట్టాను . చెయ్యెత్తి నన్ను ఆగమన్నట్టు సైగచేసి , మీరేం చెప్పక్కర్లేదు , మీరు లేటయ్యారంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అన్నారాయన . డంగైపోయా . పోయిన శనారం ఇలాగే పొద్దున్నే లేచి డాన్సు క్లాసుకెళ్ళాలి . అస్సలు లేవబుద్ధి కాలా . మా గురువుగారికి కాల్చేసి , చేతికందినంత నిద్రని గొంతులో నింపుకుని , రాలేనండీ అన్నా . ఆవిడ ఎంతో హుందాగా , పోనీలే ఇంకోపూట కలుద్దాం అన్నారు . నాకే కొంచెం కూట్టి , ఏమైందంటే . . అని మొదలెట్టా . ఆవిడ వెంటనే , ఏం పర్లేదోయ్ , ఇంకో పూట కలుస్తాముగా ! అన్నారు . మళ్ళీ అవాక్కయ్యా . మొన్ననే చెప్పుకున్నట్టు , నమ్మకం నిలబెట్టుకోడం అంత సులభం కాదు . పొద్దుణ్ణించీ ముసురు , సన్నగా వాన . ఇవ్వాళ్టికి వొదిలేలా లేదు . ఏంటో అసలీ సంవత్సరం వేసవి వచ్చినట్టే లేదు . పట్టుమని ఒక్క రోజు కూడా తొంభై డిగ్రీలు దాటిన పాపాన పోలా . మళ్ళి చూస్తూ చూస్తుండగానే ఆకురాలు కాలం వచ్చేస్తుంది . ఇవ్వాళ్ళ సొన్యా సొటొమయోర్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు . తొలి లటీనో మహిళ . వారికి అభినందనలు . ఆవిణ్ణి ఈ పదవికి ధృవపరిచే తతంగం వ్యక్తిగత కంకాళాల బీభత్స దృశ్యాలేవీ బయటపడకుండా జరిగినందుకు హమ్మయ్య అనుకున్నా . ఈ మధ్యన కొత్తవీ పాతవీ అన్నీ కలిపి చాలా తెలుగు కథల పుస్తకాలు చదివా . కథకులుగా కొమ్ములు తిరిగిన వాళ్ళవీ , పేర్గాంచిన వాళ్ళవీ , అభ్యుదయులవీ , విప్లవులవీ , ఇంకా ఎదుగుతున్న వాళ్ళవీ . . కానీ చాలా వెల్తిగా అనిపించింది . ఏంటీ చెత్త కథలు అనికూడా అనిపించింది చాలా సార్లు . ఇంతలో మొన్న నవోదయ నించి వచ్చిన బంగీలో పాలగుమ్మి పద్మరాజు గారి కథల సంపుటం బయటపడింది . ఈయన్ని గురించి గాలివాన , పడవప్రయాణం కథలు తప్ప వేరేమీ తెలీదు ఇప్పటిదాకా . ఓ ఉదయంపూట టీ చప్పరిస్తూ , కొత్త బ్లాగులేం కనబడక యధాలాపంగా పుస్తకం మధ్యలోకి తెరిచి ఒక కథ చదివాను . ఆ పూట ఆఫీసుకెళ్ళడం ఆలస్యమయింది . అదీ సంగతి ప్రస్తుతానికి . మళ్ళీ కలుద్దాం
సీ యం గారు అర్థనిమీలిత నేత్రులై ఆలోచించారు ( పూర్తిగా నిమీలితులైతే నిద్రపోతున్నారనుకుంటారని ) . ఉల్ఫెన్ సన్ గారి సలహా తీసుకుందామా అనుకుని , ఛ ! ఛ ! డబ్బుతో సంబంధం లేని యీవిషయంలో గూడ ఆయన్నెందుకు సంప్రదించడం … . నేనే నిర్ణయిస్తా అని డిసైడ్ చేసుకుని , ఒక్క నిముషం యోగా లోకి దూకారు . ఫ్లాష్ వెలిగింది . మెల్లగా కళ్లు పూర్తిగా విప్పి , చిరునవ్వుతో అందర్నీ గమనించారు , గొంతు సవరించుకున్నారు , " ఈ చిన్న విషయం గురించి యింతలా టైం వేస్టు చెయ్యడం అనవసరం . ఆ పాట ఎప్పుడో వ్రాసింది ప్రస్తుతం వున్న తెలుగు తల్లిని గురించి కదా ! సెంటిమెంటు ఉన్నవాళ్లు కొందరైనా వుంటారు . వాళ్ళుగూడా బాధపడకుండా , క్రొత్త తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో , ముందుగా పాత తెలుగు తల్లి విగ్రహానికి మల్లెపూల దండలు వేసి , దండతో పాటు విగ్రహాన్నీ తొలగిస్తాం . అప్పుడు క్రొత్త విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం . సరేనా ! " .
అమ్మాయిల మనస్సుల్లా పక్కవాడి ఆట అర్థం కావడం లేదు అరకు రాణీ వెక్కిరిస్తూ అవతలవాడి చేతిలో చిక్కింది .
బైదవే . . ప్రస్తుతం నేను వమెరికాలో ఉన్నాను కదా . . ఈరోజు అమెరికన్స్ జరుపునే స్వాతంత్ర దినోత్సవం . హాపీ ఇండిపెండెన్స్ డే టు అమెరికా
సుడిగాలిలా విశ్వమంతా చెలరేగిపోవాలని చూడకు . . . కాలుష్యపు తెరలలో నీ శరీరం చిక్కకుండా చూడు . . . అంతరిక్షంలోకి రాకెట్టులా దూసుకుపోవాలని ఆరాటపడకు . . . రసాయనాల రోదసిలో నీదశ ఏదిశకు చేరుతుందో చూడు . . . నీటిమడుగున ఈల్ చేపలా ఈదులాడాలని సంబరపడకు . . . ఘనీభవించిన కలుషిత నీరు నిను కదలనిస్తుందేమో చూడు . . . జ్వలించే కాంక్షలతో లోకాన్నే జయించాలని ఆశపడకు . . . మంచుకొండల్నే మండిచే నిప్పుకణాలు నిను దహించకుండా చూడు . . . ధరిత్రి రూపురేఖలు మార్చి కొత్త చరిత్రను సృష్టించాలనుకోకు . . . ఆకుపచ్చని నేలపై కార్బన్ మరకల నీ కాలిగుర్తులు చూడు . . . పంచభూతాలను అదుపుచేస్తున్నానని మిడిసిపడకు . . . నీ విఙ్ఞానమే నీ వినాశనానికి చేయూతనిస్తుంది చూడు . . . 5th June . . . WORLD ENVIRONMENT DAY . . . !
1 . పుస్తకం చదవకుండానే పేరాలు కోట్ చెయ్యడానికి నేనేమీ స్వాములవారిని కాదుగదా ! మీరు చదివినంత లోతుగా నేను చదివుండకపోవచ్చు . మీదృష్టీ నాదృష్టీ ఉత్తర దక్షిణ ధ్రువాలు కావచ్చు .
గౌతం ఘోష్ నిర్మించిన ఆధునిక దృశ్యకావ్యం యాత్రా ఈ సినిమా చూసేసి అప్పుడే రెండు వారాలు కావస్తోంది . చూసిన రాత్రే ఈ సమీక్ష రాయడం మొదలు పెట్టాను . మనసులో ఎన్నో ఆలోచనలు సుడిగాలుల్లా . వాటిని ఒక రూపంలోకి కుదించడానికి చాలా కష్టమైంది . ఈ సినిమా ఎన్నో తలాలలో పని చేస్తుంది . ( It works in many different planes ) . ఆలోచింపచేసే సినిమాలు చూసే ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ సినిమా తప్పక చూడాలి . సరదాగా టైంపాస్ గా చూసే సినిమా కాదు . యాభయ్యవ పడిలో ఉన్న ముఖ్యపాత్రలతో ఉన్న ఒక తెలుగు సినిమా చెప్పండి ? పోనీ కన్నడ , తమిళం , హిందీ - భారతీయ సినిమా ఏదైనా సరే ? గబుక్కుని ఏవీ గుర్తుకి రావట్లేదు కదూ ? ప్రపంచంలో ట్వెంటీ సంథింగ్‌లు తప్ప ఇంకెవరూ లేనట్టూ , నలభై యాభై వయస్కులు ఈ ట్వెంటీ సంథింగ్‌లకి అపార్ధం చేసుకునే తలిదండ్రులుగానో , అర్ధం కాకపోయినా వెన్నుతట్టి ప్రోత్సహించే అంకుల్ ఆంటీలుగానో తప్ప వాళ్ళకి వేరే అస్తిత్వం వ్యక్తిత్వం లేనట్టు ఉంటాయి మన సినిమా పాత్రలు . ఈ నేపథ్యంలో నడివయసు ముఖ్యపాత్రలతో గౌతం ఘోష్ నిర్మించిన యాత్రా కనీసం ఈ విషయంలో విభిన్నమైనది . ఇంకా చాలా విషయాల్లో కూడా . ఒక రచనే కల్పన అయినప్పుడు అందులో నిజం ఏది , కల్పన ఏది ? ఈ కథ ఇలా జరిగింది అని రచయిత చెబుతున్నాడు కదా . . రచయిత గొంతు నించి వస్తే నిజమూ , పాత్ర గొంతు నించి వస్తే కల్పనా అవుతుందా ? మరి రచయిత కూడా కథలో పాత్ర అయినప్పుడు ? నిజానికీ కల్పనకీ మధ్య ఉన్న అస్పష్టమైన విభజన రేఖ మరింత అస్తవ్యస్తమై చెరిగి పోతుంటే ? స్వాప్నిక జగత్తులో ఊహించినది నేడు నిజమై నిజ జీవితంలోకి ప్రవహిస్తుంటే ? నేను నేనేనా ? లేక నా కథలోనే నేనొక పాత్రనా ? హిందీ నవలా రచయిత దశరథ్ జోగ్లేకర్ ( నానా పటేకర్ ) కొత్త నవల " జనాజా " గొప్ప సంచలనం సృష్టించింది . ఒక పెద్ద స్టీలు కంపెనీ సౌజన్యంతో జాతీయ సాహితీ పురస్కారం అతనికిస్తున్నామని ప్రకటించారు . తన కుటుంబంతో ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళి అక్కడి దృశ్యాలు చూడ్డంతోనే కొత్త నవల " బాజార్ " కి నాంది పలుకుతాడు . పురస్కారం అందుకోవడానికి ఒంటరిగా హైదరాబాదు నించి ఢిల్లీకి ప్రయాణమయ్యాడు . అతని ఆరోగ్యం గురించి భార్య స్మిత ( దీప్తి నావల్ ) ఒకటే తల్లడిల్లుతోంది . రైల్లో కొత్త నవల రాసుకుందామని ప్రయత్నిస్తాడు కానీ సహ ప్రయాణికుడు మోహన్ అనే యువ చిత్ర దర్శకుడి సంభాషణతో జనాజా కథని వ్యాఖ్యానిస్తుంటాడు . ఆ వ్యాఖ్యానాలు అతన్నీ , మనల్నీ గతంలోకి తీసుకెళ్ళిపోతాయి . ఆదిలాబాద్ జిల్లాలో ఒక దొర ఉంచుకున్న నర్తకి లాజవంతి ( రేఖ ) ఒక రాత్రి తన నాట్యంతో ఆ దొర అతిథుల్ని అలరిస్తుండగా అతిథులు అసభ్యంగా ప్రవర్తిస్తే , ఉంచుకున్నవాడే తనని వాళ్ళకి తారుస్తుంటే భరించలేక అక్కణ్ణించి పారిపోయింది . దొర మనుషులు ఆమెని చెరువు వొడ్డున పట్టుకుని దారుణంగా హింసించి అక్కడే వొదిలేసి వెళ్ళిపోయారు . తెల్లవారి బడికి వెళుతున్న పంతులు సతీశ్ శర్మ ఆమెని చూసి తన ఇంట్లో ఆశ్రయమిచ్చాడు . దొర మనుషులు తనకోసం మళ్ళీ వెతుకుతున్నారని తెలిసి , తన రక్షకుని కుటుంబానికి ఆపద రావటం ఇష్టం లేక , సతీశ్ సహాయంతో లాజవంతి హైదరాబాదు చేరుకుని పాత బస్తీలో సెటిలైంది . సతీశ్ అప్పుడప్పుడూ ఆమెని చూసి వస్తుంటాడు . జనాజా నవల ఎలా ముగిసిందో మనకి ( సినిమా ప్రేక్షకులకి ) తెలీదు . రచయిత దశరథ్ మాత్రం ముగిసిన నవలని మరిచి పోయి కొత్త నవల మీద దృష్టి కేంద్రీకరించాలి అనుకుంటూ ఉంటాడు . కథ వింటున్న మోహన్ అంటాడు " మీ భ్రమే కానీ , ఒక సారి సృష్టించిన పాత్రలు అంత తొందరగా మిమ్మల్ని విడిచి పోవు " . అంతేనా ? రచయితకి ఆ మాత్రం స్వేఛ్ఛ లేదా ? ఏమో ! ఈ సినిమా చూస్తుండగా ఇలాంటి ప్రశ్నలు చాలానే తలెత్తుతాయి . చూడ్డం ఐపోయాక దేనికీ సరైన సమాధానం దొరక్కపోగా ఇంకొన్ని కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తాయి . అందుకే ఈ సినిమాని వొళ్ళు దగ్గరపెట్టుకుని శ్రద్ధగా చూడాలి . కథనంలో చిత్రీకరణలో దర్శకుడు కొన్ని అమోఘమైన పద్ధతులు ఉపయోగించాడు . కొన్ని కొన్ని దృశ్యాలు సినిమా ఐపోయిన తరవాత కూడా మన కంటి రెప్పల్ని అంటి పెట్టుకుని పదే పదే కళ్ళముందు మెదుల్తుంటాయి . మూడు ముఖ్య పాత్రలకీ నటులు అతికినట్టు సరిపోయారు . నానా పాటేకర్ మరీను . . నాకు విపరీతంగా నచ్చేశాడు . కొన్ని కొన్ని డైలాగులు అతను చెప్పిన పద్ధతి సింప్లీ మార్వలస్ . రేఖని గురించి చెప్పేదేముంది . . ఎనభైల్లో రేఖని ఉమ్రావ్ జాన్ గా చూసిన వాళ్ళకి ఆ జ్ఞాపకాలు రాక మానవు . ఆ చిత్రానికి సంగితం సమకూర్చిన ఖయ్యాం ఈ చిత్రానికి కూడా కొన్ని పాటలు స్వరపరిచారు . పాటలు విడిగా వింటే బాగున్నట్టు ఉన్నాయి , సినిమాలో సందర్భోచితంగానూ ఉన్నాయి , కానీ పాడిన గాయనీ మణుల గొంతులు రేఖకి నప్పలేదు . నాకున్న ఒక్క ముఖ్యమైన ఫిర్యాదు . . చివరి పదిహేను నిమిషాలు లేకుండా ఉంటే సినిమా ఇంకా బలంగా ఉండేదని . నా దృష్టిలో ఇది దర్శకుడి పైత్యం .
e - తెలుగు కంప్యూటర్లు మరియు జాలంలో తెలుగుకై మాత్రమే పాటుపడుతుందని అనుకున్నాం . అసలు తెలుగు వాడకమే కనుమరుగైపోతే , ఇక కంప్యూటర్లలోనూ దాని అవసరం ఉండదు . అప్పుడు మనం ప్రత్యేకంగా చేసేదీ ఏమీ ఉండదు .
తనకంటూ ఒక రూపము , ఆకారము రావటానికి స్త్రీ మీద ఆధారపడిన పురుషుడు స్త్ర్యాధిపత్యాన్ని - ఈ పదం కూడా క్రొత్తగా పుట్టించవలసి వచ్చినంతగా - ఎందుకు తట్టుకోలేడు ? తనలోని ప్రతి అంగము , ఆలోచనా రూపు దిద్దుకున్నది స్త్రీ వలననే అన్న విషయమెలా మఱచిపోగలడు ? ఏమిటి మగతనం గొప్ప ? 46 క్రోమోజోముల్లో ఒకే ఒక్క క్రోమోజోము వేఱుగా ఉండటమా ? ! అయినా మగవాడైనంత మాత్రాన యేమిటి లాభం ? కనీసం తనకి వచ్చిన భావోద్వేగాన్ని సంపూర్తిగా వ్యక్తపఱచలేనంతటి అశక్తుడు యీనాటి మగవాడు ! మగవాడి ఆధిపత్యం సహజసిద్ధంగా వర్తిల్లటంలేదు , ఆడవాళ్ళు ఆధిపత్యం కోసం పట్టుబట్టక వదిలిపెట్టడం వలన మగవాడికి మిగిలిన " ఘనత " అది . ప్రతి పురుషుడి విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుందంటారు . ఆ స్త్రీ తన తల్లి కావచ్చు , భార్య కావచ్చు , మఱో బంధువు కావచ్చు - వాళ్ళకి ఏదో రకంగా దాసోహమన్న పౌరుషాన్ని గుఱించి మనమింతగా గుండెలు పొంగించుకోవాలా ? స్త్రీలకు రిజర్వేషన్లు " ఇవ్వటం " , స్వేచ్ఛని " ఇవ్వటం " - ఈ యివ్వటమేంటి అసలు ? ! ఒకరికి స్వేచ్ఛనిచ్చే " హక్కు " , " అధికారం " ఎవఱికున్నాయి ? ! వాళ్ళకి " ఉండవలసిన " స్వేచ్ఛని పరిహరిస్తున్నది పురుషాధిక్య సమాజం కాదా ? ! ( ఒకప్పుడు మన దేశంలో మహారాజ్ఞులు , శక్తిస్వరూపిణులు లేరా ? హుఁ , ఉంటే మాత్రమేం లాభం ? వాళ్ళ వాళ్ళ కాలాల్లో వాళ్ళూ యిబ్బందుల నెదుర్కొన్నవాళ్ళే కదా ! ) స్త్రీత్వంలోని సహజ హృదయవైశాల్యం వలన సమానత్వాన్ని అయినా , మఱొకరి ఆధిక్యాన్ని అయినా అత్యంత సహజమైన విషయంగా పరిగణించి చిఱునవ్వుతో ఆమోదిస్తుంది . ఆధిపత్య యుద్ధం తప్పించినందుకు కృతజ్ఞులమై ఉండక స్త్రీల మంచితనాన్ని చేతగానితనంగా చూసే మూర్ఖత్వానికి ముందు తరాలలోనైనా స్వస్తి చెబితే మేలు . అందుకు స్త్రీలని మెచ్చి మేకతోలు కప్పనక్కఱలేదు , కనీసం మనుషులుగా వాళ్ళని గౌరవించటం మొదటి మెట్టు కాగలదు !
కావ్యానికి బదులు శాస్త్రం అని మార్చాను . ' సంతః - మూఢః ' అన్న పదాలు ఈరోజుల్లో వాడతగినవి కావు కాబట్టి వాటిల్ని ' ఆసక్తీ , ఓపికా ఉన్నవాళ్ళు ' , ' అవి లేనివాళ్ళు ' అని అర్థం చేసుకోవచ్చనుకుంటా . వ్యాసం చదివి మీ అభిప్రాయాల్ని తెలియజేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు .
అమెరికా లో కార్మిక సంఘాలు ( United States Federation of organized trade and labor unions ) ఇచ్చిన పిలుపు మేరకు కార్మికులు ఎనిమిది గంటల పని దినం కోసం మే 1 , 1886 లో సమ్మె మొదలు పెట్టేరు . మే 3 తారీఖున మెఖార్మిక్ రీపర్ వర్క్స్ ( Mccormik Reaper Works ) ఫ్యాక్టరీ దగ్గర పోలీసులు నిరాయుధులుగా ఉన్న కార్మికులపై నిర్ధాక్షిణ్యం జరిగిన కాల్పుల్లో ఆరుగురు కార్మికులు అమరులయ్యారు .
ఇది నాకు సరిపడదు . నేను కనీసం ఇంకా 10 కేజీల బరువు పెరగాలి అదేలగో చెప్పండి ప్లీజ్
నా పేరుకొచ్చిన సినిమా కష్టాల జాబితా చాలా పెద్దది . నేను పుట్టక ముందే మొదలయ్యింది ముసళ్ల పండగ . మా కుటుంబం లో ఆఖరి మగ నలుసు కావడం నేను చేసుకున్న పాపం . మా పెదనాన్నలు ఎవరూ వాళ్ల మగపిల్లలకి మా తాతగారి పెట్టుకోకపోవడం నాకు మూఢింది . మా తాతగారికి అట్టాంటి ఇట్టంటి పేరు వుండనేలా ? వుండింది ఫో ! అది నా కోసమే రిజర్వ్ చేయబడనేలా ? చెయ్యబడింది ఫో ! మా తల్లిదండ్రులు దానికి కట్టుబడనేలా ? నాకిలా మూఢడం ఏలా ? అంతా మన ఖర్మ ఇంతకీ మనకి ప్రాప్తించిన నామధేయం ఏమనగా … . టట్టడొయీ . . " కృష్ణమూర్తి " పుట్టినప్పుడు మనకేమి తెలుస్తాది ఈ పేరు తో పుర ప్రజలు మనలని ఎలా ఆడుకుంటారో ? ? గమ్మున ఊరుకున్నాను . ( ఊరుకోక అప్పుడు మటుకు చేసెదేమి లేదు కదా ) నెమ్మదిగా స్లో మోషన్లో పెద్దవ్వసాగాను . నా తో పాటె నా కష్టాలు పెద్దవయ్యాయి . చింకి లాగులు వేసుకుని చీమిడి ముక్కుతో ఆడుకునే రోజులలోనె పరిచయం వున్న ప్రతి దారిని పోయె దానయ్యా . . " ఏరా బాబూ నీ పేరెంటిరా ? " అని అడగడం … ముద్దు ముద్దుగా నేను కిత్నమూతి అనడం … … భళ్లున అద్దం పగిలినట్టు నేను జడుసుకునేటట్టు " హహహ్హాహ్హా ఏంటి కుక్కమూతా ? " అంటూ నన్ను ఆటపట్టించేవారు ఏమి చేస్తాను , ఆహ అసలు ఏమి చెయ్యగలను చెప్పండి , బుంగ మూతి పెట్టుకుని ఇంటికి పరిగెట్టడం తప్ప ? ఈ నా సినిమా కష్టాలు మా ఇంటివారు కి తెలిసి సరెలే పిల్లాడు తెగ ఇదయిపోతున్నాడు అని పేరు మార్చేసారు అప్పటి మన గవర్నర్ పేరు కృష్ణకాంత్ అని . హమ్మయ్యా అనుకున్నా నా కష్టాలు ఇక తీరిపోయాయని . నాకేమి తెలుసు అభీ పిక్చర్ బాకీ హై దోస్తు అని ? ? ?
ఈ రోజుల్లో చాలా ఇళ్ళల్లో వినే మాట ఏమిటంటే , ' ఏమిటోనండి , మా చిన్నప్పుడు , మాకేది ఇష్టమో తెలిసికోకుండా , మా తల్లితండ్రులు చెప్పిందే చదివి , వాళ్ళబలవంతం మీదే ఇంజనీరింగూ , మెడిసినూ చదవవలసి వొచ్చిందీ , మాకు దేంట్లో ఇంటరెస్టుందీ చెప్పుకోడానికి కూడా స్వతంత్రం లేదూ , అందువలన మా పిల్లలకి అలాటి పరిస్థితి రాకుండా , We treat them as our friends ' , అనడం ఓ ఫాషనైపోయింది . వినడానికి బాగానే ఉంటుంది ఎవరికీ ఈ నవతరంలోని తల్లితండ్రులకి . అస్తమానూ , వాళ్ళ తల్లితండ్రులేదో , వాళ్ళని [ . . . ]
ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాల్లు " జనాలకు కూడా చరిత్ర గురించి తెలుసు " అన్న నిజాన్ని ఎలా మర్చిపోతారో అర్థం కాదు . మన దేశములో మత కలహాలు ఈ దేశానికి ముస్లిములూ , క్రిష్టియనులు రాకముందు నుండే వున్నాయి . బౌద్దులకి హిందువులకి జరిగిన యుద్దాల గురించి చదవలేదా ? ఇక ముస్లిముల దండయాత్రల అనతరం అవి మరింతగా పెరిగిపోయాయి .
స్వతహాగా మా పాఠశాల నిభందనల ప్రకారం ఆకు పచ్చ లాగు అలాగే తెల్ల చొక్కా వేసుకుని వెళ్ళేవాళ్ళం . అలాగే నాట్యాభ్యాసానికి తెల్ల పైజామా పై తెల్ల కుర్తా వేసుకుని వెళ్ళే వాడిని . కానీ ఒక్క రిపబ్లిక్ డే నాడు మాత్రం చక్కగా ఉదయం నుంచి సాయంత్రం దాకా వైట్ అండ్ వైట్ అన్న మాట . అలా తెల్ల డ్రస్ వేసుకుని చాలా మంది వచ్చే వాళ్ళు కానీ నేను మాత్రం తళతళ మని మెరుస్తూ ఉండే వాడిని . ఎందుకంటారా . . తెల్ల లాల్చి కుర్తా డ్రస్‍పై మా అమ్మ చాలా శ్రద్ద తీసుకునేది . ఎందుకంటే ఇది భరతనాట్యం నేర్చుకునేటప్పుడు వేసుకునే డ్రస్ కదా అందుకన్నమాట . మా అమ్మకు నాట్యం అంటే ఎందుకో తెలియని అభిమానం . అందువల్ల స్కూల్ విధ్యార్దులందరిలో నేను కొంచం స్పెషల్‍గా కనబడే వాడిని . అలా మెరుస్తూ ఉండటం వల్ల మా హెడ్ మాస్టారు గారు ఆ నాటి ప్రతిజ్ఞని నా చేత చదివించే వారు . అలా అలవాటైన ప్రతిజ్ఞా కార్యక్రమం ఇంటర్ మీడియట్ కాలేజీ రోజుల్లో కొనసాగినా , డిగ్రీ రోజుల్లో సాగలేదు . అందుకు కారణం నేను చదువుకున్నది ముస్లిం కాలేజీ . అక్కడ ఇలాంటివి పాటించేవారు కాదు .
రాసిన వాడు విహారి , రాసిన సమయం 12 : 37 PM 5 వ్యాఖ్యానాలు ఈ టపాకి లంకెలు
> అలాగే బాబాలు బాంబులు ఎలా తయారు చేస్తారో చెప్పగలరు మీరే ఎన్నుకోండి ఒక సమాధానం - 1 . చాలా తేలికగా . 2 . మధ్యలో ఒక సున్నా పెట్టి రెండో " బా " లో దీర్ఘం తీసి కొమ్ము పెట్టడం ద్వారా . 3 . ఎవరికీ కనపడకుండా , పేలినా వినపడకుండా , దెబ్బలు పైకి తెలియకుండా
అదేవిటోగానీ , కాఫీ మానమని నన్ను పోరిన వారే గానీ కాఫీ గొప్పతనాన్ని గుర్తించిన వారు లేరు . గొప్ప గొప్ప వాళ్ళంతా కాఫీ లు తాగి బుర్ర పదును చేసుకున్నవాళ్ళే కదా . ఆ మాట కొస్తే ఈ సోదంతా రాయటానికి నాకు ఓపికనిచ్చిన టానిక్ కూడా కాఫీనే . ఆఖరుగా ఒక మాట చెప్పాలి ఎంతమంది చెప్పినా ఒక్క పూట కూడా కాఫీ మానని నేను మా అమ్మ కి బాగోనపుడు మా అమ్మ కి నయమవ్వాలని బాబా కి మొక్కుకుని నెల రోజులు కాఫీ మానేసాను .
మా రామయ్య పెద్దమ్మకి ఒక కూతురూ , ఒక కొడుకూ వుండేవారు . కూతురు కొంచం కచ్చదానిలా వుండేది . ఆమెని నాగయ్య అనే అతనికి ఇస్తే , అతను నాటుబాంబులు చుడుతూ , పొరపాట్న అవి పేలి ఆసుపత్రి పాలయి , ఆ తర్వాత జైలు పాలయ్యాడు . అందువల్ల కూతురు నాకు తెలిసి ఎప్పుడూ వీళ్ళ దగ్గరే వుండేది . ఆ కూతురికి ఒకే కూతురు , పేరు నాగ రత్నం . నాకంటే మూడు నాలుగేళ్ళు పెద్దదేమొ . చిన్నప్పుడు వీధుల్లో వెన్నెల్ల్లో ఆదుకునే పిల్లల గుంపులకు ఆమే నాయకత్వం వహించేది . మాట కొంచం కరుకు , రంగు బాగా నలుపు . అయినా మంచి మెరుపు వుండేది . వున్నంతలో నాగరత్నం అల్లారుముద్దుగానే పెరిగింది . నాగరత్నాన్ని ములకల చెరువు దగ్గర ఎవరికో ఇచ్చి పెళ్ళి చేశారు .
మా భూములు మాకు గావాలె మా నీళ్లు మాకు గావాలె మా కరెంటు మాకు గావాలె మా బొగ్గు మాకు గావాలె మా చదువులు మాకు గావాలె మా ఉద్యోగాలు మాకు గావాలె
బ్లాగేశ్వరా , ఊదం గారి సూచన మేరకు , ఈ రెండో పాదం పరిశీలించండి : " కందను మించు దురదగల కరము నిలుచునే " ఊదం గారూ , ఓ సందేహం . . ప్రాసాక్షరానికే గదా ఆ నియమం , నాలుగు పాదాల్లోని మొదటక్షరాలు అన్నీ గురువులో , అన్నీ లఘువులో ఉంటే చాలు కదా ?
చాలా రోజుల తర్వాత ఈవేళ సాయంత్రం నేనూ గీత కలిసి ఇందిరా పార్క్ కి వెళ్ళేం . ఓ నాలుగైదేళ్ళ క్రితం రోజూ ఉదయం వాకింగ్ కి వెళ్ళేదాన్ని . అలా వెళ్ళే క్రమం లోనే మొగలి పూలమ్మే ఓ అమ్మాయితో పరిచయమైంది . ఇందిరా పార్క్ లో బోలెడన్ని మొగలి పొదలున్న విషయం చాలా మందికి తెలుసనుకుంటాను . ఆ పిల్లతో సాన్నిహిత్యం పెరిగి సీజన్ లో రోజూ మొగలి పువ్వు కొనేదాన్ని . చాలా సార్లు చల్లటి ఉదయపు వేళ మొగలి సువాసనల్ని మోసుకుంటూ గీత దగ్గరికెళ్ళేదాన్ని . తనకి మొగలి పూలంటే చాలా ఇష్టం . ఆ పూల పిల్ల మీద నేను " మొగలి పూల పిల్ల " అనే కధ కూడా రాసాను . అది నా కధల సంపుటి " ఆమె కల " లొ ఉంది . ఈ రోజు నేనూ గీత ఆ పార్క్ కి వెళ్ళి చాలా సేపు కూర్చుని బోలెడన్ని కబుర్లు కలబోసుకున్నం . పూలమ్మే అమ్మాయి గుర్తొచ్చింది కాని ఎక్కడా కనబడలేదు . మొగలి పూల మీదకి మనసు మళ్ళింది . పొదల చుట్టూ ప్రదక్షిణ చేసాం కాని ఒక్క పువ్వూ కనబడలేదు . ఎలాగైనా పూలు సంపాదించాలని చిప్స్ అమ్ముకునె అతన్ని అడిగాం మొగలి పూలు దొరుకుతాయా అని . అతను తన బుట్ట మా దగ్గరే పెట్టి ఇప్పుడే వస్తానంటూ వెళ్ళి పూలు కోసే మనిషిని పట్టుకొచ్చాడు . వీళ్ళు కోస్తారని చెప్పి తన బుట్ట తీసుకుని వెళ్ళిపోయాడు . మీరు ఇక్కడే కూర్చోండి మేము పూలు కోసుకొస్తాం అని ఆ పొదల్లో మాయమయ్యారు . ఓ అరగంట తర్వాత గోధుమ రంగు తాచుల్లా మెరుస్తూ సువాసనలు వెదజల్లుతున్న మొగలి పూలతో ప్రత్యక్షమయ్యారు . అప్పటి మా సంతోషాన్ని వెల కట్టలేం కాని వాళ్ళు చెప్పిన వెలకి మా కళ్ళు బైర్లు కమ్మాయి . కేవలం రెండు వందలడిగారు . హమ్మో మరీ అంతా అంటే మీ ఇష్టం మీరు అడిగారనే వెదికి కోసుకొచ్చాం అన్నారు . పువ్వుల్ని వదలాలంపిచడం లేదు . రెండు వందలు చాలా ఎక్కువ . సరే బేరం చేస్తే 100 కిచ్చాడు . ఆ పువ్వులు మా చేతుల్లోకి వచ్చాక ఆ మత్తు వాసనకి గమ్మత్తుగా చిత్తై పోయాం . ఆకాశం నిండా కమ్ముకున్న నల్లని మబ్బులు . తుంపర తుంపరగా కురుస్తున్న చిరు జల్లుల్లో నేనూ గీత మొగలిపూల సువాసనల్ని వెదజల్లుకుంటూ కైనటిక్ మీద రయ్ మంటూ దూసుకెళ్ళిపోవడం తో మా ఇందిరా పార్క్ విహార యాత్ర ముగిసింది . మొగలి పూల పిల్ల కనబడలేదు కానీ మొగలి పూలు మాత్రం మా చేతుల్లోకి వచ్చి మా ఇద్దరికి మహదానందం కలిగించాయి .
2 అభిప్రాయాలు » అనువాదాలు , ద పోస్ట్ మాన్ , ప్రపంచ సాహిత్యం
చల్లగాలి , అందమైన ఆకాశం , ఎక్కడ నుంచో వస్తున్న మల్లెపూల సుగంధం అన్నీ కలగలిపిన అందమైన వేసవి సాయంత్రాన్ని ఆస్వాదిస్తూ , నెమ్మదిగా నడుస్తుంది కీర్తి . రోడ్డుకి అవతల పక్కన కీర్తికి సమాంతరంగా ఒకబ్బాయి నడుస్తున్నాడు . ఫాలో చేస్తున్నట్టు అనిపించింది . ముందు ఈ అబ్బాయిలంతా ఇంతే , ఒంటరిగా వున్న అమ్మాయిని అల్లరి పెట్టాలి అనిపిస్తుంది అని అనుకోగానే బోలెడంత కోపం వచ్చేసింది . మొహం చాలా చిరాగ్గా పెట్టి , నిప్పులు కక్కే చూపులతో ఆ అబ్బాయిని కాల్చేసేలా చూసింది . అయినా ఆ అబ్బాయి అదేమీ పట్టనట్టు అలానే వస్తున్నాడు . చూపుల చురకలు పనిచెయ్యకపోయేసరికి విపరీతమైన భయం వేసింది . దాంతో వడిగా వడిగా నడవటం మొదలుపెట్టింది . అవతలి మనిషి అడుగుల వేగం పెరగలేదు . వెనక్కి తిరిగి చూసింది . నడుస్తూ నిద్రపోతున్నాడో , నిద్రలో నడుస్తున్నాడో అతనికే తెలియనంత పరధ్యానంగా నడుస్తూ , ఆ అబ్బాయి లోకంలో అతను వున్నాడు .
అవును సుధా , ' B ' option బావు౦ది . కాకపొతే caption లో వున్న ఆ tomorrow ఎప్పటికైనా వస్తే బాగానే వు౦టు౦ది . లేకపోతే మన మ౦త్రివర్గ౦ పనులు ' mission ' - tomorrow . . కదా , పనులు రేపు చూద్దా౦ అని ప్రతిరోజు అనుకొ౦టే అ౦తే స౦గతులు . : )
గట్టిగా అరవాలనిపించింది వేణుకు . ఏమీ పట్టనట్టు ట్రాఫిక్ ! కరెంట్‌పోల్ ఖాళీగా నిలబడుకొని వుంది . ఎండిన చెట్టు ఏమరుపాటుగా తననే గమనిస్తున్నట్టనిపించింది వేణుకు . " ఏమిటా రోడ్డు దాటడం ? ? " బైకు సడన్‌బ్రేకు వేసుకొని గుర్రుగా చూస్తూ ప్రశ్నించిందో భారీ శాల్తీ . అవేవీ పట్టించుకొనే స్థితిలో లేడు వేణు . తనపాటి తాను రోడ్డు దాటాడు . పార్కులో పిల్లలు పెద్ద మోత చేస్తూ ఊయల ఊగుతున్నారు . " వీళ్ళదే హాయి " నిర్వేదంగా నవ్వుకొన్నాడు . ఊరు వెళ్ళాలని లేదు .
ECNR ఇచ్చేది పాస్ పోర్ట్ కార్యాలయం వాళ్ళే . నేను కొంత కాలం బెంగుళూరు లో ఉద్యోగం చెయ్యడం వల్ల అక్కడే పాస్ పోర్ట్ తెచ్చుకున్నా . ECNR కావాలంటే అక్కడికే వెళ్ళాలి . సరే అని దానికి దరఖాస్తు బరికేసి పాస్ పోర్ట్ కార్యాలయం లో ఇచ్చేసి రెండు పెద్ద సూట్ కేసులు కోనే కార్యక్రమంలో ( ఏ సాధారణ భారతీయుడైన గర్విస్తూ చేసే పని ) భాగంగా బజార్ల మీద పడ్డా .
కత్తి మహేష్ కుమార్ ద్వారా , 5 మార్చి 2010 10 : 32 ఉ వద్ద
అథ రవి రవద న్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః
తెల్లవారు జామున ఏడు గంటలకు అనుకుంటా తలుపు ఎవరో చాలా వైల్డ్ గా బాదుతున్నారు . బద్ధకంగా అటు ఇటూ దొర్లుతున్న నేను " ఇది కల … ఇది కలే కదా " అని కోట శ్రీనివాసరావు టైపులో అనుకుంటుండగా , అలా అనుకోలేని నా స్నేహితుడు వెళ్లి తలుపు తీసేశాడు . అప్పుడు తీసిన తలుపు మరలా తియ్యటానికి మాకు మధ్యాహ్నం రెండు వరకూ కుదరలేదు . . ఎందుకో తెలియాలంటే మొత్తం చదవాలి మరి .
నిజానికి శ్రీలంకలో తమిళజాతి జీవన్మరణ సమస్యలను ఎదుర్కోవడం ఇప్పుడే ప్రారంభం కాలేదు . " తమిళుల సమస్యలకు ఎల్ టి టి ఇ నే కారణం " అని ఇవాళ చచ్చిన పాము మీద మరొక రాయి విసరడానికి ప్రణబ్ ముఖర్జీ ఉత్సాహపడవచ్చుగాని , సింహళ పాలకవర్గాల చేతిలో శ్రీలంక తమిళులు అనుభవించిన దోపిడీ , పీడన , వివక్షల గురించి లక్షలాది అనుభవాలు , వేలాది పేజీల్లో నమోదయ్యే ఉన్నాయి . బ్రిటిష్ వలసవాదులు వెళ్లిపోయి , శ్రీలంక సింహళ జాతికి దేశాధికారం దక్కిన 1948 కన్న చాల ముందు నుంచీ కూడ , పరాయిపాలనలో కూడ సింహళ జాతీయులు సోదర తమిళులను అవమానాలపాలు చేశారనీ , పీడించారనీ , చిన్నచూపు చూశారనీ ఎన్నో ఆధారాలున్నాయి .
అందరి గురించి ఒకే వ్యాసంలో చెప్పడానికి కుదరదు కాబట్టి , ఈ రెండు సంప్రదాయలలోని ముఖ్యమైన నలుగురి గురించి - బాఖ్ - అన్నమయ్య , మోజార్ట్ - త్యాగయ్య , బీతోవెన్ - దీక్షితార్ , వాగ్నెర్ - శ్యామశాస్త్రి ల గురించి ఈ వ్యాసంలో పరిచయం చేసుకొందాం . వీరి వ్యక్తిత్వాలు , జీవితాలు , సాధించిన విజయాలు , అధిరోహించిన శిఖరాలు , అనుభవించిన కష్టాలు చూస్తే - ఇక్కడ తనువు చాలించి , అక్కడ అవతారమెత్తేరేమో అనిపించేటంత సారూప్యత ఉంది ఈ మహానుభావుల చరిత్రల్లో .
ETV వారు నిర్వహిస్తున్న సంగీత కార్యక్రమాలలో శీర్షికలో తెలియజేసిన పేరు మీద ఒక కార్యక్రమం ప్రతీ శని వారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రసారమౌతోంది . దీని ప్రత్యేకత ఏమిటంటే , పాడే వాళ్ళంతా అంధులే . ఆఖరికి వీరిని మరియు వీరి ప్రతిభా పాఠవాలని బేరీజు వేసే న్యాయ నిర్ణేతలలో ఒక్కరు కూడా అంధులే అంటే నమ్ముతారా . ఇక అసలు విషయానికి వస్తాను .
ఇంజనీరింగు రెండు జిల్లాల అవతల , పట్నంలో చదువుతున్నమాటే కానీ వీలుదొరికితే చాలు
ఆ . వె . అమ్మ జోలపాట , అమ్మ చల్లని చూపు , అమ్మ మృదుల స్పర్శ , అమ్మ మాట , అమ్మ చేతి బువ్వ అమృతపు నిలయముల్ . అమ్మ అమృతమూర్తి , అమృత మమ్మ . కం . నవమాసంబులు కడుపున నివసంబును , పోషణమును , నిర్భీతస్థితిన్ , పవమానపంచకము , ధా తువుల నిడు జననిని దలతు తొలి దైవముగా . తే . గీ . అమ్మ ! నిను మించు దైవత మవనిలోన లేదు , వాత్సల్యమున నీకు లేదు సాటి , ఋణము నేమిచ్చి తీర్తును ? తీర్చలేను , చేతులెత్తి వందనములు సేతునమ్మ . మధ్యాక్కర . కాయువును , శతమాన సౌభాగ్యములను , నిరతము నారోగ్యంబును , ననితరమౌ నీ భక్తి , ముక్తి కరుణను మా యమ్మకిచ్చి కాపాడు కలకాల మీవు కరధృతకోదండమూర్తి ! కమనీయ కళ్యాణరామ ! * _______
తమకు సంబంధించని వైషమ్యాలలో , తమకు తెలియని సమాజం జరిపిన దాడిలో , తమకు తెలిసేలోపే అమాయకంగా ప్రాణాలు పోగొట్టుకున్న మన సమాజ పౌరులకు సిగ్గుతో తలవంచుకుని శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను .
ఈ నిరాకరణతో మరింత రెచ్చిపోయిన వికీలీక్స్ మద్దతుదారులు ఆయా కంపెనీల మీద సైబర్ దాదులతో విరుచుకు పడ్డారు . వారి దెబ్బకు ఈ వుదయం Master Card కార్యకలాపాలు స్థంబించాయని వార్త !
కౌలుల ప్రయోజనమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెస్తోన్న కౌలు రైతుల చట్టాన్ని నేడు ముఖ్యమంత్రి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో లాంఛనంగా ప్రారం భించనున్నారని రెవెన్యూ మంత్రి రఘు వీరారెడ్డి తెలిపారు . శనివారం ఆయన సచివాలయంలో కౌలు దారీ రైతుల చట్టం అమలు , గుర్తించిన అర్హుల వివరాలపై విలేకరుల పమావేశం నిర్వహించారు . మంగళవారం ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించి గుర్తించిన అర్హులైన 66 , 716 మంది కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలను అందజేయనున్నారని ఆయన వెల్లడించారు . ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో ఈ చట్టం అమలులోకి వచ్చిన నాటి నుంచి పటిష్ట ప్రచారంతో కౌలు రైతులను చైతన్యం చేశామని ఆయన అన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 28 , 215 గ్రామ సభలను జరిపి అర్హులైన కౌలు రైతులను గుర్తించామని ఆయన తెలిపారు . కాగా కౌలు రైతుల గుర్తింపుకు ఇప్పటివరకు 7 లక్షల 38వేల 650 దరఖాస్తులు రాగా అందులో 5 లక్షల 54వేల 478 మందిని కౌలు రైతులుగా , 1 , 57 , 178 మందిని అనర్హులుగా గుర్తించామని ఆయన అన్నారు . ఇంకా 27 , 204 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు . ఈ ఖరీఫ్‌లోనే కౌలు రైతులకు రుణాలు , ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని ఆదేశించా మన్నారు . బ్యాంకర్లు ఎటువంటి ఆటంకాలు కల్పించకుండా వారికి అన్ని అనుమానాలు నివృత్తి చేశామని ఆయన అన్నారు . ఇప్పటికే పలు దఫాలు బ్యాంకర్లతో జరిపిన చర్చల మేరకు ఈ సీజన్‌లోనే కౌలు రైతులకు రుణా లు అందించేలా ఒప్పందం జరిగిందన్నారు . ఈ చట్టం అమలు ఈయేడు కొత్త కావడం , కొంత జాప్యంతో కొంతమేర అయోమయం చోటుచేసు కున్న విషయం వాస్తవమేనని ఆయన అంగీకరిస్తూ వచ్చే యేడు మార్చి , ఏప్రిల్‌లలోనే చట్టం అమలుకు చర్యలు చేపట్టి రైతులకు మరింత మేలు కల్గజేస్తా మని ఆయన స్పష్టం చేశారు . ఈ చట్టం అమలులో నెలకొన్న అన్ని అనుమానాలను పటాపంచలు చేసి కౌలు రైతుల పరిరక్షణతో పాటు , భూ యజమా నుల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెల్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు . ప్రస్థుత తరుణంలో రాజకీయాల గురించి మాట్టాడనంటూ ఆయన రాష్ట్ర రాజకీయ రంగంలో నెలకొన్న స్థబ్దతపై దాట వేత దోరణి ప్రదర్షించారు . నేటి నుంచి కౌలు రైతు ల రుణ అర్హత కార్డుల పంపిణీలో ఎంపి , ఎమ్మె ల్యేలు , ఎమ్మెల్పీలు , జిల్లా పరిషత్ చైర్మెన్‌లను భాగస్వాములను చేయనున్నామన్నారు . 11వ తేదీ నుంచి అన్ని డివిజన్ కేంద్రాలలో ఆయా ప్రజా ప్రతినిధులు పాల్గొని కౌలు రైతులకు కార్డులను అంధజేయాలని ఆయన నిర్ణయించామని తెలిపా రు . తెలంగాణ జిల్లాల్లో ప్రజా ప్రతినిధుల రాజీనా మాలతో నెలకొన్న అయోమయంతో ప్రభుత్వం ఈ పథకం అమలుపై మల్లగుల్లా పడుతోంది . ఇప్పటికే రైతల సంక్షేమం కోసం ముందుండి నడవాల్సిన నాయకులు నిరాకరణ లోపం కారణంగా ప్రభు త్వం దిగాలు పడుతోంది . ఈ రుణ అర్హత కార్డుల తయారీలో తీసుకున్న చర్యలను ప్రత్యేకంగా ఆయన చెప్పారు . ఈ పథకం ప్రారంభం మొదటి రోజున కనీసం 5 గురు రైతులకు పంట రుణాలు మంజూరీ చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు . కౌలు రైతులు తమ పెట్టుబడికి రుణా లతో పాటు ప్రభుత్వ విత్తనాలు , ఇతర సబ్సిడీలను వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు .
అదొక లాటి నిశ్శబ్దం వాళ్ళింట్లో . రేడియో చప్పుడో , టీవీ చప్పుడో , వంటగదిలోంచి వచ్చే చప్పుడో , ఆఖరికి పేపరు కదులుతున్న చపుడు కూడా వచ్చేది కాదు . అసలు వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కూడా చూడలేదు నేను నెలరోజుల్లో . ఇద్దరు భార్యా భర్తలూ ఒంటరి ద్వీపాల్లా అనిపించేవారు . ఆ కారణమేమిటో తెలియకపోవడంతో నాకు పంట్లో ఏదో ఇరికితే కలిగేలాటి అసౌకర్యం కలిగింది .
ఇలాటిదే మరో ఉదాహరణ టూకీగా చూద్దాం . అదే అవధానం లోది ఈ దత్తపది కూడ .
మరో రామబ్రహ్మం చిత్రానికి ( అపవాదు 41 , " కోయిలొకసారొచ్చి కూసిపోయింది [ * ] " లాంటి సుమధుర గీతాలతో ) పని చేసిన అనంతరం మంచి ఆఫర్ రావడంతో " జెమిని " సంస్థలో చేరి , " జీవన్ముక్తి " ( 1942 ) నుంచి " మంగళ " ( 1951 ) వరకు , ఆ సంస్థకు " ఆస్థాన సంగీతదర్శకుడిగా " పనిచేశారు . " జెమినీ " వారి " బాలనాగమ్మ " కు ( 1942 ) నేపథ్య సంగీతంలో అందులోని భయానక కరుణరస సన్నివేశాలకు అనుగుణంగా మనవారికి నచ్చేరీతిని పాశ్చాత్య స్వరమేళ ఫణితుల్ని అవలీలగా కల్పించి ప్రయోగించారు . అదే సమయంలో , " జెమినీ " వారి చిత్రానికి పోటీగా తయారయిన " వసుంధర " వారి " శాంత బాలనాగమ్మ " లో ( 42 ) " బాలవర్ధి రాజు " పాత్ర ధరిస్తూ ఆ చిత్రానికి సంగీతాన్ని అందివ్వడం , కొన్ని పాటలు పాడడం ( ప్రియజననీ వరదాయని , సుఖదాయి సుఖదాయి ) వింతైన విషయం .
ఎమె . కృష్ణమూర్తి తెలుగు భాషపై పరిశోధన చేయడానికై పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో చేరాడు . కానీ అక్కడ ద్రవిడ భాషలు తెలిసినవారు ఎవరూ లేకపోవడంచేత అతని సిద్ధాంత వ్యాసానికి పర్యవేక్షకుడిగా ఉండమని నన్ను కోరారు . నాకు భాషాశాస్త్రం తెలిసినా తెలుగు అంతగా రాదు , మరి అతనేమో తెలుగులో ఉద్దండుడు . అలా మా జంట సరిగ్గా కలిసింది . చాల మంచి పరిశోధనలు చేశాం మేమిద్దరమూ కలిసి . అతను , చాలా మంచి మనిషి . గొప్ప శాస్త్రజ్ఞుడు మాత్రమే కాదు , గొప్ప అధ్యాపకుడూ , పరిపాలనాదక్షుడు కూడా . ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర విభాగాన్ని ఎంత వృద్ధిలోకి తెచ్చాడో ! అతను హైదరాబాదు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడుగా ఉన్నప్పుడు , నాకొక గౌరవ డాక్టరేటు ఇచ్చారు . నాకు చేయబడిన అన్ని సన్మానాల్లోనూ ఇదంటే నాకు చాలా గర్వమూ , మక్కువానూ . నా ప్రియ శిష్యుడిచ్చింది కదా ! ( గర్వంగా అ పట్టాని చూపించారు . అది , వారు ఎక్కువ సమయం గడిపే ముందుగదిలో కొట్టవచ్చినట్లుగా కనబడేటట్టు అలంకరించారు )
Download XML • Download text